Activities calendar

17 April 2016

21:23 - April 17, 2016

విజయవాడ : పేదలకు ఇచ్చే రాయితీలను కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో తగ్గించేస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌ విమర్శించారు. పేదల పొట్టకొట్టి బడా కొర్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సరళీకరణ పేరుతో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలోని ఐవి ప్యాలెస్‌లో మాకినేని బసవపున్నయ్య వర్థంతి సభ జరిగింది. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌ హాజరయ్యి స్మారక ఉపన్యాసం చేశారు. 25 సంవత్సరాల సరళీకరణ విధానాలు - ఫలితాలు అనే అంశం పై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.రాఘవులు, సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు.

సంస్కరణలు దెబ్బతీస్తున్నాయి..
దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలు దెబ్బతీస్తున్నాయని కారత్‌ అన్నారు. దేశంలోని అన్ని వనరులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇదే విధానాన్ని సర్కారు కొనసాగిస్తే భవిష్యత్‌లో అన్ని రంగాలు విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పులు చేస్తోందని, చంద్రబాబు మొదటి నుండి కార్పొరేట్ల పక్షమేనని కారత్‌ అన్నారు. దేశ ఆర్థిక విధానాలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు సోషలిజం అవసరమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. చంద్రబాబు కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. బసవపున్నయ్య రచనలను కరత్‌ ఆవిష్కరించారు. గతంలో రెండు సంపుటిలను ఆవిష్కరించగా.. ఇప్పుడు మరో రెండు సంపుటిలను పుస్తక రూపంలో విడుదల చేశారు. 

21:19 - April 17, 2016

విశాఖపట్టణం : విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించేవరకూ పోరాటం ఆపబోమని వైసీపీ ప్రకటించింది. దీక్షకు అందరూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నా బీజేపీ, టీడీపీ మాత్రం దూరంగా ఉంటోందని, ఎంత దొంగాట ఆడుతున్నాయో ప్రజలు గమనించాలని రోజా సూచించారు. రైల్వే జోన్‌కోసం గుడివాడ అమర్‌నాథ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో చలనంలేదని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విభజన చట్టంలోని అంశాన్ని నెరవేర్చరా? అని ప్రశ్నించారు. ఈ నెల 20 అమర్‌నాథ్ దీక్షా శిబిరానికి వైఎస్‌ జగన్‌ వస్తారని బొత్స ప్రకటించారు. రైల్వే జోన్ అనేది రాష్ట్ర ప్రజలకు చెందిన ముఖ్య అంశమని బోత్స పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

21:16 - April 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటయిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఎస్సై పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. ప్రాథమిక పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 321 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. హాజరు కోసం తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 539 ఎస్సై పోస్టుల కోసం సుమారు 2లక్షల మంది పోటీ పడ్డారు. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ రాత పరీక్షకు తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేశారు. పరీక్షకు గంట ముందే అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో పలువురు అభ్యర్ధులు నిరాశతో తిరిగి వెళ్ళిపోయారు. మొదటిసారిగా ఓఎంఆర్‌ ఆన్సర్ షీట్ డూప్లికేట్ కాపీని అభ్యర్థులకు ఇచ్చారు. జేఎన్‌టీయూతో కలిసి రాష్ట్ర పోలీసు నియామక మండలి ఈ పరీక్షను నిర్వహించింది.
ఎస్సై సివిల్ తో పాటు పలు విభాగాలకు చెందిన పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఈ పరీక్షకు 95.5 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్ఐ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 .30 నిమిషాల వరకు జరిగింది . ఎస్సై ప్రాథమిక పరీక్షలు ప్రశాంతంగా పూర్తి కావడంతో .. పోలీసు ఉన్నతాధికారులు ఊపీరి పీల్చుకున్నారు. 

21:14 - April 17, 2016

హైదరాబాద్ : కొన్ని రోజులుగా ఎండ వేడిమితో తల్లడిల్లుతున్న జంటనగర వాసులకు కొంత ఉపశమనం లభించింది. రోజు చెమటతో తడిసిముద్దవుతున్న నగర వాసులను ఈరోజు చిరుజల్లులు తడిపేశాయి. వర్షం రాకతో.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా చోట్ల ప్రజలు వర్షంలో చిందులు వేసి తమ హర్షాన్ని ప్రకటించారు.  మధ్యాహ్నం వరకూ చండ ప్రచండంగా భానుడు నిప్పులు కురిపించాడు. అంతలోనే ఒక్కసారిగా కమ్ముకొచ్చిన కరిమబ్బులతో.. వాతావరణం చల్లబడింది. వడగాలుల స్థానే శీతల పవనాలు వీచాయి. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వాతావరణంలో మార్పు కారణంగా.. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. ఉక్కబోతతో తల్లడిల్లిన నగర ప్రజలు.. ముఖ్యంగా పిల్లలు.. వర్షంలో తడిసి సేదదీరారు. బోడుప్పల్, ఉప్పల్, రామాంతాపూర్, హబ్సిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్ ప్రాంతాలలోనూ భారీ వర్షం కురిసింది. దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్, శివారు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. చేవెళ్లలో ఓ మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలనూ చిరుజల్లులు పలకరించాయి. కొద్ది రోజులుగా పెరిగిన ఎండలతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న జనం.. ఒక్కసారిగా చిరుజల్లులతో పాటు పలుకరించిన చల్లటి గాలులతో వారాంతాన్ని ఆస్వాదించారు.  ఇదిలా ఉంటే.. ఎల్బీనగర్ లో ఈదురు గాలులకు పలు చోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. వేగంగా వీచిన ఈదురుగాలులకు కన్ స్ర్టక్షన్ లో ఉన్న సెంట్రింగ్ కర్రలు విరిగి కారు ధ్వంసమైంది.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి..

రంగారెడ్డి: హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో వానలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. కాగా పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో యువకుడు..కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం యశ్వంత్‌రావుపేటలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.

20:59 - April 17, 2016

అమితంగా ప్రేమించే భార్య కనిపించకపోవడంతో భర్త విలవిలలాడిపోయాడు..ఆమె కనిపించకపోవడం..అదే తరుణంలో అడవిలో ఎవరిదో శవం కాలిపోయి కనిపించింది. ఈ మృతదేహం సునీల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇతను వసుంధరను ప్రేమించి వేధించిన వ్యక్తి.. కానీ ఇతను చనిపోలేదని..ఇంట్లోనే ఉన్నాడని సునీల్ సోదరుడు పేర్కొన్నాడు..మరి ఆమెను ఎవరు చంపారు ? హంతకుడు ఎవరు ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

పుణెపై గెలిచిన కింగ్స్ పంజాబ్..

మొహాలీ : ఐపీఎల్ సీజన్ 9లో వరసుగా రెండు ఓటములతో అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చిరస్మరణీయమైన విజయంతో బోణీ కొట్టింది. మొహాలీ వేదికగా పుణె సూపర్ జైంట్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో 153 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 153/4 గెలుపొందింది. 

20:48 - April 17, 2016

హైదరాబాద్ : థాయ్..! ఈ పేరు వింటే చాలు.. జీహెచ్ఎంసీ పరిధిలోని చిరు వ్యాపారులు వణికి పోతున్నారు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని కాంట్రాక్టర్లు తీర్చిదిద్దుకున్న అక్రమార్జన మార్గమే థాయ్..! కచ్చితంగా చెప్పాలంటే కాంట్రాక్టర్లు రౌడీ మామూళ్ల వసూళ్లకు పెట్టుకున్న పేరే థాయ్! ఆదాయం పెంపుపైనే దృష్టి పెట్టిన అధికారులు ఆ వంకన ఎవరు ఎంత దోచుకుంటున్నారో గుర్తించడం లేదు. ఫలితంగా కాంట్రాక్టర్లు అక్రమార్జనకు తెగబడుతున్నారు. బల్దియాలో బరి తెగించిన థాయ్ దందాపై టెన్ టివి ప్రత్యేక కథనం. జీహెచ్ఎంసీ దృష్టంతా ఆదాయం పెంపుపైనే. అభివృద్ధి కోసం నిధులంటూ.. జీహెచ్ఎంసీ అధికారులు సరికొత్త విధానాలను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో చిరు వ్యాపారుల నుంచి రోజువారీ రుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన స్ట్రీట్ వెండర్‌ పాలసీనీ పక్కకు నెట్టేశారు. థాయ్ బజార్ పేరిట కాంట్రాక్టర్లకు ఏరియాలను కట్టబెట్టేశారు.

రంగంలోకి కాంట్రాక్టర్లు..
గ్రేటర్ లోని ఉప్పల్, కాప్రా సర్కిళ్లలో వ్యాపారుల నుంచి రోజు వారీ పన్ను వసూళ్లకు బల్దియా అధికారులు, కొందరు కాంట్రాక్టర్లను రంగంలోకి దించారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండానే ఉప్పల్ పరిధిలో 35 లక్షల 65 వేలకు, కాప్రా పరిధిలో 19 లక్షలకు థాయ్ బజార్ వసూళ్లకు టెండర్లను ఫైనలైజ్ చేశారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న వారి అనుచరులు చిరు వ్యాపారులపై విరుచుకు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన ధరలను బేఖతారు చేసి ఇష్టానుసారంగా ఎంత పడితే అంత వసూలు చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఒక్కో వ్యాపారి దగ్గర 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. థాయ్ బజార్‌లో రుసుము వసూళ్లకు టెండర్ల ఖరారు ప్రక్రియపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి.. ఆశ్రితులకు కాంట్రాక్టు కట్టబెట్టేశారన్న ఆరోపణలున్నాయి. థాయ్‌ కాంట్రాక్టర్లలో అత్యధికులు కార్పొరేటర్ల అనుచరులేనని సమాచారం. వీరంతా తమకు ఎంత తోస్తే అంత మొత్తాన్ని రసీదులపై ముద్రించి చిరు వ్యాపారుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏం చేస్తారు ? 
గ్రేటర్ పరిధిలో ఎక్కడా లేని విధంగా కొన్ని సర్కిళ్లలో మాత్రమే థాయ్ బజార్ విధానం అమల్లోకి తేవడం విశేషం. జీహెచ్ఎంసీ ఒక విధానాన్ని ప్రవేశపెడితే అన్ని ప్రాంతాలకూ వర్తింప చేయాలి కానీ ఇలా ఒకటి రెండు సర్కిళ్లకే పరిమితం చేయడమేంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టే.. థాయ్ బజార్.. అక్రమ దందాగా రూఢీ అవుతోందంటున్నారు. అధికారులు ఇకనైనా కాంట్రాక్టర్ల అక్రమాలపై దృష్టి సారించి.. తమను థాయ్ దందా నుంచి విముక్తులను చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. మరి వీరి మొరను అధికారులు వింటారో లేక అంగ, అర్థ బలానికి తలొగ్గి.. పేదలకు అన్యాయమే చేస్తారో వేచి చూడాలి. 

20:35 - April 17, 2016

విశాఖపట్టణం : సిరిపురం హెచ్ ఎస్ బిసి వద్ద మ్యాన్ హోల్ లో పడి మృతి చెందిన అప్పల కొండ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జీవీఎంసీ ఎదుట కుటుంబసభ్యులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. ఈ నెల 14న కార్మికుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. సరైన మాస్క్, ఆక్సీజన్ వంటివి సదుపాయాలు కల్పించకపోవడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. అప్పలకొండ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  

20:30 - April 17, 2016

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు.. ఏపీని కేంద్రానికి తాకట్టు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం ఆమరణదీక్ష చేపట్టిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌కు రోజా మద్దతు తెలిపారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపమని విమర్శించారు. విశాఖకు రైల్వేజోన్‌ తీసుకురావడంలో రాష్ట్ర ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. 

20:14 - April 17, 2016

నరేష్...తెలుగు సినీ నటుడు..ప్రముఖ నటి విజయనిర్మల కుమారుడు. అనేక తెలుగు హాస్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి 'నరేష్'తో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు..అనుభవాలు తెలియచేశారు. ఇటీవలే తాను నటించిన 'గుంటూరు టాకీస్' పై క్రిటిక్స్ ఎన్నో తిట్లు తిట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం సకుటుంబ సపరివార సమేత సినిమాలు కావన్నారు. సినిమా ఎలా ఉంది ? అని అడిగితే బ్లూ ఫిల్మ్ తీయలేదని..పిల్లలతో వెళ్లవద్దని..కొత్త ఒరవడి సృష్టించడం జరిగిందన్నారు. క్లియర్ గా ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని, నా కెరీర్ కు ఈ చిత్రం ప్లస్ అయ్యిందని నరేష్ తెలిపారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

20:05 - April 17, 2016

నరేష్..తెలుగు సినిమాలో సీనియర్ నటుడు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనస్సులను చూరగొంటున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల చిత్రాలలో ప్రాధాన్యత పాత్రలు పోషిస్తున్నారు. ఈసందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. 'చిత్రం భళారే విచిత్రం' సినిమా చూసిన కమల్ హాసన్ గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారని, ఈ పాత్ర తాను చేయలేనని..నరేష్ మాత్రమే చేస్తారని..కొన్ని సంవత్సరాల తరువాత చూద్దామని కమల్ పేర్కొన్నారని తెలిపారు. పద్మ, భారతరత్న..ఇతర అవార్డులకన్నా ఆ కాంప్లిమెంట్ తనకు గొప్ప అని నరేష్ తెలిపారు. ఇంకా ఎలాంటి విశేషాలు..అనుభవాలు తెలిపారో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:51 - April 17, 2016

రాజ్‌కోట్ : రవీంద్ర జడేజా పెళ్లి కార్యక్రమంలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు జరుగుతుండగా గుర్తు తెలియని వక్తులు తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియో పుటేజీని పరిశీలిస్తున్నారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంటుందని తెలుస్తోంది. 

19:45 - April 17, 2016

విజయవాడ :సంస్కరణల పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు తగ్గించి.. బడా కార్పొరేట్లకు వేల కోట్లు కేటాయించారని సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రకాష్‌ కారత్‌ ధ్వజమెత్తారు. కామ్రెడ్‌ మాకినేని బసవ పున్నయ్య వర్ధంతి సందర్భంగా విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో స్మారకోపన్యాస కార్యక్రమానికి  ప్రకాష్‌ కరత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్‌ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పులు చేస్తోందని పేర్కొన్నారు.అవినీతికి పాల్పడే వారికి కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమం నుండే సోషలిజం సాధ్యమౌతుందని, విద్యార్థి ఉద్యమాలను కేంద్రం అణివేయడం సరికాదన్నారు. జేఎన్ యూలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని తెలిపారు. అవినీతికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని, విద్యా, ఆరోగ్య రంగాల్లో ప్రైవేటీ కరణ ఉండకూడదన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళలో విజయం తథ్యమని తెలిపారు. 

19:41 - April 17, 2016

అనంతపురం : కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. అనంతపురం జిల్లాలో ముద్రగడ పర్యటిస్తున్నారు. కాపు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చండని అడిగితే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తుని ఘటన నేపథ్యంలో కాపులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఏది ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కాపులను ఐక్యం చేయడంతోపాటు.. రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ముద్రగడ. 13 జిల్లాల్లో ప్రాంతాలు పర్యటిస్తానని, రిజర్వేషన్లు కల్పించేదాక పోరాటం చేస్తామన్నారు. 

19:38 - April 17, 2016

విశాఖపట్టణం : విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించేవరకూ పోరాటం ఆపబోమని వైసీపీ ప్రకటించింది. రైల్వే జోన్‌కోసం అమర్‌నాథ్ దీక్ష ఆరంభం మాత్రమేనని స్పష్టం చేసింది. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, రోజా డిమాండ్ చేశారు. దీక్షకు అందరూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నా బీజేపీ, టీడీపీ మాత్రం దూరంగా ఉంటోందని, ఎంత దొంగాట ఆడుతున్నాయో ప్రజలు గమనించాలని రోజా సూచించారు. రైల్వే జోన్ అనేది రాష్ట్ర ప్రజలకు చెందిన ముఖ్య అంశమని బోత్స పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

19:36 - April 17, 2016

తూర్పు గోదావరి : జిల్లా రాజమండ్రిలో.. ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో వివాహానికి హాజరై.. స్నేహితులతో కలిసి తిరిగి వెళుతుండగా తమపై దుండగులు దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులోని రౌడీ షీటర్‌లు.. రాత్రిళ్లు ఇలా తిరగడం మంచిది కాదని, గమ్యానికి తామే చేరుస్తామంటూ తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకు వెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దాదాపు 14 కిలోమీటర్ల దూరంలోని దివాన్‌ చెరువు ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారని తెలిపింది. అత్యాచారం అనంతరం యువతితో సహా దుండగులు రాజమండ్రికి తిరిగి వస్తుండగా వారి ఆటోను లారీ ఢీకొట్టింది. పోలీసుల రాకతో అత్యాచారం ఘటన వెలుగులోకి చూసింది.

ఆసుపత్రిలో చికిత్స..
ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పోలీసుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది. మూడు రోజుల క్రితం నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌ హంగామా తర్వాత కూడా పోలీసుల్లో చలనం లేదు. భద్రత పెంచాల్సింది పోయి ఇంకా నిద్రమత్తులోనే జోగుతున్నారు. కల్యాణ మండపం ముందు రౌడీ బ్యాచ్‌ తిష్ట వేస్తే పట్టించుకునేవారే కరవయ్యారు. జాతీయ రహదారిపై నిఘా పోలీసుల జాడే లేదు. ఒకవేళ నిఘా పోలీసులు రోడ్లపై తిరుగుతూ ఉంటే.. ఓ యువతిని వెంటేసుకు వెళుతున్న రౌడీషీటర్లను కచ్చితంగా నిలువరించి విచారించే వారని.. ఫలితంగా అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది.

సీసీ కెమెరాలు ఎక్కడ ? 
ఇక సిటీలో కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలేవీ పనిచేయలేదని తెలుస్తోంది. ఫుటేజ్‌ కోసం ప్రయత్నిస్తే ఈ కెమెరాల్లో ఏమీ రికార్డు కాలేదని సమాచారం. ఈ ఒక్క ఘటనే కాదు.. బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ఇటీవలి కాలంలో చిచోరా బ్యాచ్‌లు ఎక్కువయ్యాయి. రోడ్డుపై వెళుతున్న వారిని వేధించడం.. అమ్మాయిలపై అసభ్య కామెంట్లు వేయడం... పిచ్చి పనులు చేయడం సర్వ సాధారణంగా మారింది. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా పోలీసుల వైఖరి మాత్రం మారలేదు. భద్రతను పెంచకపోగా గస్తీని కూడా మరచిపోయారు.

స్పందించిన చినరాజప్ప..
సామూహిక అత్యాచారం ఘటనపై హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు బాధితురాలికి మద్దతుగా మహిళా సంఘాలు ముందుకొచ్చాయి. పోలీసుల తీరును ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

19:30 - April 17, 2016

ఢిల్లీ : వరుస భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. మొన్న ఇండోనేషియా, నిన్న జపాన్‌, ఇవాళ ఈక్వెడార్‌... చిన్నాపెద్దా అన్నీ కలిపి.. ఈ నెలలో ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భూకంపాలు సంభవించాయి. వీటి బారినపడి మరణిస్తున్న వారితోపాటు, క్షతగాత్రుల సంఖ్య కూడా పెరుగుతోందని రికార్డులు చెబుతున్నాయి. ఆదివారం ఈక్వెడార్‌లో సంభవించిన భారీ భూకంపంలో వంద మందికిపైగా మరణించారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా దేశాలు భూకంప ప్రమాదాలను చవిచూశాయి. ఈక్వెడార్‌, జపాన్‌, ఇండోనేషియా, రష్యా, పాకిస్థాన్‌, ఇండియా... ఇలా చాలా దేశాలు భూకంపాల బారినపడ్డాయి. భూప్రకంపనలకు ప్రజలు భయకంపితులవుతున్నారు.

ఈక్వెడార్ లో భూకంపం..
ఆదివారం ఈక్వెడార్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8 గా నమోదయ్యింది. దీంతో ఈక్వెడార్‌ వాసులు వణికిపోయారు. జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు చాలా భవనాలు పేక మేడల్లా కుప్పకులాయి. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మరణించారు. ఈ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. క్షతగాత్రులు కూడా భారీగానే ఉన్నారు. గాయపడ్డవారికి ఈక్వెడార్‌ రాజధాని క్విటోలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలిన భవనాల శిథిలాల కింది చాలామంది చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో యుద్థప్రాదిపదికన శిథిలాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. భూకంపం ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం తర్వాత ఈక్వెడార్‌ తీరప్రాంతంలో సముద్ర జలాలు రెండు మీటర్ల మించి ఎగసిపడటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

జపాన్ లో..
శనివారం జపాన్‌లోని కుమమోటోలో కూడా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదయ్యింది. ఈ ఘటన సంభవించిన కొద్ది గంటల్లోనే 5.4 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు రావడంతో జపాన్‌ వాసులు వణికిపోయారు. కుమమోటో భూకంపంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1500 మంది వరకు గాయపడ్డారు. భూకంప ధాటికి కూలిపోయిన భవన శిథిలాలను తొలగిస్తున్నారు. వందల ఏళ్లనాటి కొన్ని చారిత్రక భవనాలు కూడా కుప్పకూలిపోయాయి. జపాన్‌లోని కుష్యులో గురువారం సంభవించిన భూకంపం కూడా ప్రాణ నష్టానికి దారి తీసింది. రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైన కుష్యు భూకంపం భారీగా ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. కుమమోటో, కుష్యు భూకంపాలకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో కూడా కొందరు ప్రాణాలు కోల్పోయారు.

చిలీలో..
చిలీలోని అటకామా ప్రాంతంలో కూడా శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదయ్యింది. ఈనెల 14, 16 తేదీల్లో ఇండోనేషియాలోని నియాస్‌, కేపులాన్‌ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అలాగే 13న బొలీవియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌ భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈనెల 11న దక్షిణాఫ్రికాలోని యాప్‌, 12న దక్షిణ ఆస్ట్రేలియాలోని ర్యాట్‌, అలేషియన్‌ ద్వీపాల్లో భూమి కంపించింది. ఇవన్నీ కూడా రిక్టర్‌ స్కేలుపై భూకంప త్రీవత 5కు మించినవి. తీవ్రత 5 లోపు నమోదైన భూకంపాలు చాలా ఉన్నాయి. భూమి పొరల్లో చోటుచేసుకునే మార్పుల కారణంగా భూకంపాలు సంభవిస్తున్నాయని భూ భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం మీద వరుసగా వస్తున్న భూకంపాలు ప్రపంచానికి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

19:25 - April 17, 2016

నల్గొండ : ఇక్కడ వెర్రి తలలు వేస్తున్న దురాచారం. ఒక్క వేటుకే తెగిపడుతున్న మూగ జీవుల తలలు..గాల్లో కలిసిపోతున్న వందలాది దున్నపోతుల ప్రాణాలు..బలి కార్యక్రమే ఘన కార్యంగా.. దశాబ్దాలుగా కొనసాగుతున్న దారుణమైన దురాచారం. జిల్లాలోని.. ఓ గిరిజన తండాలో భక్తుల మూఢ నమ్మకం ముదిరిపోతోంది. మొక్కుల పేరుతో వందలాది మూగ జీవుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బయట ప్రపంచానికి తెలియకుండా ఈ వధ దశాబ్ధాలుగా కొనసాగుతోంది.

102 దున్నపోతులు..
నల్లగొండ జిల్లా పెదవూర మండలం రామన్నగూడెం గిరిజన తండా పరిధిలో ఈ ఘోర దురాచారం అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక్కడ జంతు వధకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కంకాళి భవానీ జాతర పేరుతో దున్నపోతులను వందల సంఖ్యలో బలి ఇస్తున్నారు. శ్రీరామ నవవి తరువాత రోజు వేకువజామునే జాతర మొలవుతుంది. వెంటనే జంతు వధ కూడా జరిగిపోతుంది. ఒక్క వేటుకే తల తెగిపడేలా కత్తులను తయారుచేస్తారు. బలిష్టమైన వ్యక్తులు దున్నపోతులను దేవత ముందు వధిస్తారు. శనివారం నాడు జరిగిన జాతరలో 102 దున్నపోతులను బలి ఇచ్చారు.

80 ఏళ్లుగా..
ఈ దున్నపోతుల తలలను వచ్చే ఏడాది వరకు గుంతలో పూడ్చి ఉంచుతారు. మరుసటి ఏడాది కొత్త తలలు తెగినపుడు పాత తలలను ఆ గుంతల్లో నుంచి తీస్తారు. ఇలా చేస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ మూఢ నమ్మకం గత 80 ఏళ్లుగా కొనసాగుతోంది. లాల్‌సాద్‌ అనే గిరిజనుడు 1944లో కంకాళి భవానీ విగ్రహాన్ని ప్రతిష్టించి గుడిని నిర్మించాడు. పరిసర తండాల్లోని గిరిజనులు ఈ గుడికి వచ్చి పూజించేవారు. క్రమంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి గిరిజనులు రావడం ప్రారంభించారు. శ్రీరామ నవమి మరుసటి రోజున కంకాళి భవానీ జాతర జరుగుతుంది. వధ అనంతరం దున్నపోతుల కళేబారాలను పక్క గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వారు పంచుకుంటారని తెలుస్తోంది. బయట ప్రపంచానికి ఏ మాత్రం తెలియకుండా ఈ వధ గత 80 ఏళ్లుగా కొనసాగుతోంది. 

19:22 - April 17, 2016

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మెట్రో పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణంలోని పిల్లర్‌ హఠాత్తుగా కుప్పకూలడంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్మాణ పనులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు మంత్రి కేటీఆర్‌.. మెట్రో పనుల్లో భ్రదతకు పెద్దపీట వేయాలని సంబంధిత అధికారులకు ఇటీవలే సూచించారు.

కోల్ కతా..లక్నోలో ఘటనలు..
ఫ్లైఓవర్లు, మెట్రో రైల్ పనుల్లో నాణ్యత ఎంత..? దేశ ప్రజల్లో ముఖ్యంగా హైదరాబాద్ వాసులను ఈ ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో మెట్రో రైల్‌ పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్‌కతాలో.. ఏప్రిల్ ఒకటోతేదీన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్పకూలి 30 మంది వరకూ మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. కోల్‌కతా ఘటన మరవక ముందే ఆదివారం.. యూపీలోని లక్నోలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించారు.

కేటీఆర్ అలర్ట్..
కోల్‌కతా, లక్నో ఘటనల నేపథ్యంలో.. హైదరాబాద్‌ మెట్రో పనులపైనా ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే ప్రాజెక్టు భద్రత ఎంత అన్న అనుమానం సగటు నగరజీవికే కాదు.. సాక్షాత్తు మంత్రి కేటీఆర్‌కూ కలిగింది. అందుకే.. ఇటీవల మెట్రో రైల్ ప్రాజెక్టుపై సమీక్షలో.. భద్రత, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. స్వయంగా దగ్గరుండి పనుల్ని పర్యవేక్షించాలని మెట్రో ఎండీకి మంత్రి సూచించారు. నిర్మాణం పూర్తయ్యాక కూడా.. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలకు తావీయకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. 

బాబు ఒక తుప్పు - రోజా..

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు ఒక తుప్పు అని, ఆయన కొడుకు ఒక పప్పు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తుప్పు, పప్పు కలిసి రాష్ట్రాన్ని ముప్పు తెస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దోచుకున్న డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ప్రజా సమస్యలు తీర్చడానికి మాత్రం డబ్బులు లేవని అంటున్నారని తెలిపారు. 

ఢిల్లీకి చేరుకున్న గవర్నర్...

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పాటు గవర్నర్ మకాం వేయనున్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, పలువురు కేంద్ర మంత్రులను గవర్నర్ కలువనున్నారు. 

18:07 - April 17, 2016

నెల్లూరు : ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నారు. ప్రభుత్వం కూడా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండడంతో వీరు ఫీజులను భారీగా పెంచేస్తున్నారు ఈ నేపథ్యంలో ఫీ 'జులుం' పై టెన్ టివి సమర భేరి మోగించింది. ఆంధ్ర..తెలుగు రాష్ట్రాల్లో టెన్ టివి అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తోంది. నెల్లూరులో విద్యావేత్తలు..తల్లిదండ్రుల మనోగతాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేసింది. వాళ్లు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి.

పంజాబ్ జట్టు టార్గెట్ 153 పరుగులు..

ఢిల్లీ : ఐపీఎల్ 9 లో భాగంగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పుణె జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
పుణె బ్యాటింగ్ : డుప్లెసిస్ 67, స్మిత్ 38
పంజాబ్ బౌలింగ్ : మోహిత్ శర్మ 3, సందీప్ 2 వికెట్లు.

సోమవారం గుజరాత్ బంద్..

సూరత్ : సోమవారం గుజరాత్ బంద్ జరగనుంది. పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ ను విడుదల చేయాలంటూ పటేళ్ల వర్గీయులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. దీనితో పీఏఏఎస్ బంద్ కు పిలుపునిచ్చింది. 

వకుళా భరణం కృష్ణ మోహన్ రాజీనామా..

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పదవికి వకుళా భరణం రాజీనామా చేశారు. భజన పరులకే పదవులు ఇస్తున్నారని, జనానికి తెలియని నేతలకు పీసీసీ పదవులిచ్చారని కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఆయన టీఆర్ఎస్ చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

అధ్యక్షుడిగా 22న బాధ్యతలు - లక్ష్మణ్..

ఢిల్లీ : 22వ తేదీన పార్టీ అధ్యక్ష పదవిని చేపడుతానని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని, కేసీఆర్ ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వెల్లడించారు. 

ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత..

గుజరాత్ : ఏప్రిల్ 19 వరకు ఇంటర్నెంట్ సర్వీసులను ఉన్నతాధికారులు నిలిపివేశారు. పటేళ్ల ఆందోళనల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

17:07 - April 17, 2016

హైదరాబాద్ : ఎండ ప్రచండ వేడిమితో..ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఆదివారం సాయంత్రం కొంత ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా వర్షం పడడంతో జనాలు ఆనందం వ్యక్తం చేశారు. బోడుప్పల్, బాగ్ లింగంపల్లి, మేడిపల్లి, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వచ్చాయి. దీనికి తోడు వర్షం కూడ కురిసింది. గత మూడు రోజుల నుండి ఎండ వేడిమికి భరించలేని ప్రజలు కురిసిన వర్షానికి ఊరట చెందారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. గరిష్ట ఉష్ణోగ్రతలు..వడగాలులు వీచడంతో జనాలు బయటకు రావడానికే జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. మే నెల చివరిలో తుఫాన్, అల్పపీడనం లాంటివి చోటు చేసుకుంటే ఎండలు..వడగాలులు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

పరిస్థితి అదుపులో ఉంది - సూరత్ పోలీసు కమిషనర్..

గుజరాత్ : పటేళ్ల ఉద్యకారుడు హార్ధిక్ పటేల్ ను విడుదల చేయాలంటూ పటేళ్ల వర్గీయులు చేపట్టిన ఆందోళనల అనంతరం పరిస్థితి అదుపులో ఉందని సూరత్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. 435 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగా చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. 

పటేళ్ల ఆందోళనలు..

గుజరాత్ : పటేళ్లకు రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ ను విడుదల చేయాలంటూ పటీదార్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కొన్ని వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లు సమాచారం. 

జడేజా పెళ్లి వేడుకలో ఫైరింగ్..

రాజ్ కోట్ : క్రికెటర్ రవీంద్ర జడేజా ఓ ఇంటి వాడయ్యాడు. ఆయన పెళ్లి వేడుకలో ఫైరింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాల్పులు జరిపిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

నారాయణ కాలేజీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న స్థానికులు..

విజయవాడ : భవానీపురం మానవ మందిరం రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నారాయణ కాలేజీకి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు మంజూరు చేసింది. నారాయణ కాలేజీ ప్రారంభోత్సవాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఇరుకు ప్రాంతంలో కళాశాల ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

వెంకయ్య ను కలిసిన లక్ష్మణ్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని వెంకయ్య పేర్కొన్నారు.

నగరంలోని పలు చోట్ల వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొత్తపేట, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. 

15:47 - April 17, 2016

హైదరాబాద్ : ప్రధాని మోడీ ప్రభుత్వంపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక ఉపన్యాస కార్యక్రమానికి ప్రకాష్‌ కరత్‌ హాజరయ్యారు. దేశంలోని అన్ని వనరులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు మోడీ సర్కార్‌ యత్నిస్తుందన్నారు. అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మోడీ తలుపులు తెరిచారన్నారు. ఇదే విధానాన్ని సర్కార్‌ కొనసాగిస్తే భవిష్యత్‌లో అన్ని రంగాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని కరత్‌ హెచ్చరించారు. 

15:45 - April 17, 2016

తూర్పుగోదావరి : జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేదలు నివసిస్తున్న ఓ ప్రాంతంలో సిలిండర్ పేలిన ఘటనలో 16 పూరిపాకలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు 50లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి ఇళ్లన్ని ఆహుతయ్యాయి. ఇంట్లో సామాను పూర్తిగా దగ్థమవడంతో.. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. రామచంద్రాపురం ఆర్డీవో సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

15:42 - April 17, 2016

చిత్తూరు : తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన టీటీడీ అటవీశాఖ ఉద్యోగి మనోహర్ సరైన వైద్యం అందక మరణించారు. దీంతో టీటీడీ ఉద్యోగులు అత్యవసర విభాగం వద్ద బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఘటనపై విచారించిన అధికారులు ఈ దారుణానికి కారణమైన స్విమ్స్ వైద్యుడిని స్విమ్స్ డీన్ సత్యనారాయణ సస్పెండ్ చేశారు.
ఎనిమిది గంటల ప్రాంతంలో ఆసుపత్రికి రావడం జరిగిందని, అడ్మిట్ చేసుకోవడానికి వైద్యులు నిరాకరించారని మృతుడి బంధువులు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇంటి దగ్గరే ఉన్నాడని, తిరిగి రాత్రి ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు. ఏ రకమైన జబ్బు లేదని పంపించారని, చివరకు ఉదయం ట్రీట్ మెంట్ చేయడం..చనిపోవడం జరిగిపోయిందని వాపోయారు. రాత్రి గనుక వైద్యం అందిస్తే ప్రాణాలు పోయేవి కావన్నారు.

15:38 - April 17, 2016

చిత్తూరు : ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని... దీనిపై తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫీజుల నియంత్రణకు చట్టం ఉన్నా.. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అమలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కూడా మరింత బలోపేతం చేసి.. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో వీడియోలో చూడండి.

15:36 - April 17, 2016

బీహార్ : రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి చిన రాజప్ప స్పందించారు. ప్రమాదంపై ఏపీ హోంమంత్రి చినరాజప్ప అధికారులతో మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రమాదంలో ఏపీకి చెందిన ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలుకు చెందిన వారుగా గుర్తించారు. కొవ్వూరు కు చెందిన పద్మావతి, పవన్‌, మాచవరపు సత్యనారాయణ, నిడదవోలుకు చెందిన అత్తిలి శ్రీరాం, సరస్వతి, రుక్మిణిలు గుర్తించారు. కాశీకి వెళ్లడానికి 9వ తేదీన వెళ్లారని బాధిత కుటుంబం పేర్కొంది. 

బెంగాల్ లో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.28 శాతం పోలింగ్ నమోదైంది. 

15:20 - April 17, 2016

హైదరాబాద్ : పాతబస్తీ మంగళ్ హాట్ లోని ఆదివారం మధ్యాహ్నం ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందవేశారు. మంటలను ఆర్పేందుకు ఎనిమిది శకటాలతో చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. సుమారు మూడు, నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ గోడౌన్ కు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. 

15:17 - April 17, 2016

తూర్పుగోదావరి : 'నన్ను వదిలేయండి..మీ దండం పెడుతా..నన్ను ఏమి చేయవద్దు..ప్లీజ్..మీ కాళ్లు మొక్కుతా' అన్నా ఆ యువతిని వదిలేయలేదు. అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపారు. అంతేగాక తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో చోటు చేసుకోలేదు. ఆర్థిక, సాంఘీక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరమైన 'రాజమహేంద్రవరం'లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో, రాజమండ్రిలో ఎలాంటి భద్రత ఉందో ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
టిటిడి కళ్యాణ మండపంలో జరిగే వివాహానికి ఓ యువతి వచ్చింది. తన స్నేహితులతో కలిసి రాత్రి వెళ్లడం జరిగిందని, అప్పటికే ఓ ప్రాంతం వద్ద నలుగురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని బాధిత యువతి పేర్కొంది. రాత్రి పూట తిరగడం ఏంటీ ? అని వారు ప్రశ్నించారని, చాల ఛండాలంగా వాగారని వాపోయింది. తాను రాజమండ్రిలో పెద్ద రౌడీషీటర్ అని చెప్పి బైక్ కీస్, ఫోన్లు లాక్కొన్నారని తెలిపింది. పీఎస్ కు వెళుదామని తాను చెప్పడంతో దగ్గరకు వచ్చి కొట్టబోయారని, ఎంత రిక్వెస్ట్ చేసినా వదలలేదని పేర్కొంది. ఆర్ట్స్ కళాశాల వైపు వెళ్లండి అని తనను అడ్దదారిలో తీసుకెళ్లారని, కాళ్లు పట్టుకున్నా..బతిమాలినా వదిలి పెట్ట లేదని కొట్టడం మొదలు పెట్టారని వాపోయింది. తనకు ఏమి జరుగుతుందో తెలియలేదని వాపోయింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. యువతిపై సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

మంగళ్ హాట్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : పాతబస్తీ మంగళ్ హాట్ లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. 

ఫీ 'జులుం'పై మంత్రి గంటా స్పందన..

చిత్తూరు : ప్రైవేటు స్కూళ్లలో ఫీ'జులుం' పై టెన్ టివిలో వచ్చిన కథనాలపై విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, తల్లిదండ్రుల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ పాఠశాలలను కూడా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. 

సోషలిజం అవసరం - ప్రకాష్ కారత్..

విజయవాడ : దేశ ఆర్థిక విధానాలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు సోషలిజం అవసరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ తెలిపారు. విద్యార్థుల ఉద్యమం నుండే సోషలిజం సాధ్యమౌతుందని, విద్యార్థి ఉద్యమాలను కేంద్రం అణివేయడం సరికాదన్నారు. జేఎన్ యూలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని తెలిపారు. అవినీతికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని, విద్యా, ఆరోగ్య రంగాల్లో ప్రైవేటీ కరణ ఉండకూడదన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పులు చేస్తోందని, చంద్రబాబు మొదటి నుండి కార్పొరేట్ల పక్షమేనని పేర్కొన్నారు.

శ్రీనగర్ లో కర్ఫ్యూ ఎత్తివేత..

జమ్మూ కాశ్మీర్ : రాజధాని శ్రీనగర్ లో గత నాలుగు రోజులుగా విధించిన కర్ఫ్యూను ఆదివారం ఎత్తివేశారు. ఆందోళన పరిస్థితులు సద్దుమణగడంతో ఆంక్షలు తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. హంద్వారాలో భద్రత సిబ్బంది ఓ బాలికను వేధించారని వచ్చిన పుకార్లతో వందలాది మంది ఆందోళనకారులు సైనిక సిబ్బందిపై రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈకాల్పుల్లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. 

ముగిసిన దాసరి రవీందర్ అంత్యక్రియలు..

కరీంనగర్ : ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి పీఆర్వో, సీనియర్ పాత్రికేయుడు దాసరి రవీందర్ అంత్యక్రియలు ముగిశాయి. గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు రవీందర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ బాల్క సుమన్, కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం..

తూర్పుగోదావరి : రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు. 

అచ్చంపేటలో రాష్ట్ర గిరిజన సంఘం మహాసభలు..

మహబూబ్ నగర్ : అచ్చంపేటలో రెండు రోజుల పాటు రాష్ట్ర గిరిజన సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు త్రిపుర ఎంపీ జితిన్ చౌదరి, మిడియం బాబురావు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. 

కండ్రిగలో దారుణం..

తిరుపతి : వరదయ్యపాళెం (మం) సీఆర్ సీ కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. తల్లిపై దాడికి దిగాడని కోపంతో తనయుడు తండ్రిని రోకలిబండతో హత్య చేశాడు. అతడి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

స్విమ్స్ లో టిటిడి ఉద్యోగి మృతి..

తిరుపతి : స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టిటిడి ఉద్యోగి మనోహర్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని టిటిడి ఉద్యోగులు ఆందోళన చేశారు. ఉద్యోగి మృతికి కారకుడైన డా.ముని శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని స్విమ్స్ ప్రకటించింది. 

రోడ్డు ప్రమాదంపై చిన రాజప్ప ఆదేశాలు...

విజయవాడ : బీహార్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి చినరాజప్ప విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో చిన రాజప్ప మాట్లాడారు. మృతదేహాలను ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

బీహార్ రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం..

విజయవాడ : బీహార్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప.గో జిల్లా కొవ్వూరు, నిడదవోలుకు చెందిన ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులు కొవ్వూరుకు చెందిన పద్మావతి (75), పవన్ (23), మాచవరపు సత్యనారాయణ(53), నిడదవోలు వాసులు అత్తిలి శ్రీరాం(70), సరస్వతి(65) రుక్మిణి (62) ఉన్నారు.

ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమ్యునికేషన్ ఎస్‌ఐ పరీక్ష జరగనుంది. తొలిసారిగా ఎస్‌ఐ పరీక్షకు బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నిర్వహించారు. 

మంగళహాట్ లోని ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : నగరంలోని మంగళహాట్ లోని ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

13:29 - April 17, 2016

హైదరాబాద్ : కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనం లభించడం లేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ...కార్మికుల కనీస వేతనం రూ. 10వేలకు పెంచనున్నామన్నారు. కనీస వేతనాల పెంపు వివరాలను న్యాయశాఖ పరిశీలనకు పంపామన్నారు. బిల్లు ఆమోదం పొందకుండా రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కరువు నివారణకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఖరీఫ్ సాయంపై టి.సర్కార్ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. రక్షణచర్యలలోపం వల్లే బెల్లంపల్లి బొగ్గుగని దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

13:16 - April 17, 2016

హైదరాబాద్ : పశ్చిమ్‌బెంగాల్‌ రెండో దశ పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీర్బమ్‌ జిల్లాలోని దమ్రత్‌ గ్రామంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 8 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరు పార్టీలకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఇక సియన్‌, కంకర్తల గ్రామాల్లోనూ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గీయులు తమ పార్టీ కార్యకర్తలను బెదిరించారని ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతలు ఆరోపించారు.

13:14 - April 17, 2016

తూర్పుగోదావరి :జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనపర్తి మండలం రామవరంలో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో పక్కనే ఉన్న 20 గుడిసెలు దగ్ధమయ్యాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. జిల్లాలో పర్యటిస్తున్న హోం మంత్రి చినరాజప్ప సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయలయ్యాయా, ఎంత ఆస్థి నష్టం జరిగింది అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది.

13:12 - April 17, 2016

హైదరాబాద్ : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలుకు చెందినవారుగా గుర్తించారు. కొవ్వూరు కు చెందిన పద్మావతి, పవన్‌, మాచవరపు సత్యనారాయణ, నిడదవోలుకు చెందిన అత్తిలి శ్రీరాం, సరస్వతి, రుక్మిణిలు గుర్తించారు. ప్రమాదంపై ఏపీ హోంమంత్రి చినరాజప్ప అధికారులతో మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

13:04 - April 17, 2016

ఛత్తీస్ గఢ్ : కాంకేర్ జిల్లా కోయబెడలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో కమాండర్ అర్జున్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు కానీ, మావోయిస్టులు ఇంకా నిర్ధారించలేదు.

 

కాంకేర్ జిల్లా కోయబెడలో ఎదురు కాల్పులు

ఛత్తీస్ గఢ్ : కాంకేర్ జిల్లా కోయబెడలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో కమాండర్ అర్జున్ ఉన్నట్లు సమాచారం.

 

బీహార్లో రోడ్డు ప్రమాదం...ప.గో జిల్లా వాసుల మృతి

హైదరాబాద్ : బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప.గో జిల్లా కొవ్వూరు, నిడదవోలుకు చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతులు కొవ్వూరుకు చెందిన పద్మావతి (75), పవన్ (23), మాచవరపు సత్యనారాయణ(53), నిడదవోలు వాసులు అత్తిలి శ్రీరాం(70), సరస్వతి(65) రుక్మిణి (62) ఉన్నారు.

12:52 - April 17, 2016

కరీంనగర్‌ :బోర్లు వేస్తామని రైతులను మోసం చేసిన నలుగురు వ్యక్తులను హుస్నాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం 300 మంది రైతుల నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క రైతు నుంచి 30 వేలు తీసుకుని.. బోర్‌ వేసి మోటార్లు ఇస్తామంటూ నకిలీ సంస్థను సృష్టించిన నిందితులు.. బోర్లు వేసే సమయానికి కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు భరత్‌, మోజస్‌, మలాకి, ప్రసన్నకుమార్‌లను అరెస్ట్‌ చేశారు. మోసానికి పాల్పడిన మరో ఐదుగురిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామంటున్నారు పోలీసులు.

 

12:50 - April 17, 2016

హైదరాబాద్ : దేశంలోని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అన్ని కోర్టుల్లో 5 వేలకు పైగా జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో న్యాయస్థానాల్లో పనిభారం పెరిగి, కోట్లాది కేసులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి పదిలక్షల మంది జనాభాకు 17 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ సంఖ్యను యాభైకి పెంచాలని లా కమిషన్‌ సిఫారసు చేసింది.

కోర్టుల్లో వేలాది జడ్జిల పోస్టులు ఖాళీగా ......

దేశంలోని కోర్టుల్లో వేలాది జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయస్థానాలు అందుబాటులోలేని విషయాన్ని లా కమిషన్‌ నివేదికలు గుర్తు చేస్తున్నాయి. ఉన్న కోర్టుల్లో కూడా భారీగా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటంపై న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిగువ కోర్టులకు మంజూరైన జడ్జి పోస్టులు 20,214.....

దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో జడ్జిల ఖాళీల సంఖ్య ఐదు వేలు దాటిందని లా కమిషన్‌ నివేదిక చెబుతోంది. దిగువ కోర్టుల్లో మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 20,214. కానీ 4,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంజూరైన పోస్టుల్లో ఇది 23 శాతం. అలాగే దేశంలోని 24 హైకోర్టుల్లో 1056 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ 462 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టుల్లో 44 శాతం న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో దిగువ కోర్టులతోపాటు హైకోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 3.10 కోట్లకు చేరినట్టు లా కమిషన్‌ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 25 మందే ఉన్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

10 లక్షల జనాభాకు 11 మంది న్యాయమూర్తులు ఉండాలి......

పెరుగుతున్న జనాభా అవసరాలను అనుగుణంగా కోర్టులతోపాటు, న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని లా కమిషన్‌ సిఫారసు చేస్తోంది. ప్రతి పదిలక్షల మంది జనాభాకు 11 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్‌ చెప్పింది. అప్పటి జనాభాను బట్టి 7,675 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఆ తర్వాత ప్రతి పది లక్షల మంది జనాభాకు 17 మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్‌ సిఫారసు చేసింది. ప్రస్తుతం ఇదే నిష్పత్తిలో న్యాయమూర్తులు ఉన్నారు. దేశంలోని కోర్టుల్లో రోజురోజుకు పెరుగుతున్న అపరిష్కృత కేసులను దృష్టిలో పెట్టుకుని... ప్రతి పది లక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్‌ 120 నివేదికలో సిఫారసు చేశారు. 2014లో లా కమిషన్‌ సమర్పించిన 245వ నివేదికలో కూడా ఇదే అంశాలన్ని నివేదించారు. అయినా పాలకులు ఈ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యమని న్యాయ నిపుణులు పెదవి విరుస్తున్నారు.

అమెరికాలో ప్రతి పది లక్షల మంది జనాభాకు 107 మంది....

అమెరికాలో ప్రతి పది లక్షల మంది జనాభాకు 107 మంది న్యాయమూర్తులు ఉంటే, కెనాడాలో 75, బ్రిటన్‌లో 51, అస్ట్రేలియలో 42 మంది న్యాయమూర్తులు ఉన్నారని లా కమిషన్‌ నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచకపోతే అపరిష్కృత కేసుల సంఖ్య మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

12:46 - April 17, 2016

నెల్లూరు : నగరంలోని పొగతోటలోని సిటీ ఆసుపత్రిలో నర్సు స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి మృతిపై ఆసుపత్రి యాజమాన్య వేధింపులే కారణమంటూ బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా స్వాతి మృతి అనుమానస్పద పరిస్థితుల్లో జరిగింది. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. 

12:45 - April 17, 2016

నిజామాబాద్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన పిల్లలిద్దరూ కవల పిల్లలు, మహిళను కరీంనగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

12:43 - April 17, 2016

విజయవాడ : ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌ మండిపడ్డారు.  కామ్రెడ్‌ మాకినేని బసవ పున్నయ్య వర్ధంతి సందర్భంగా విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో స్మారకోపన్యాస కార్యక్రమానికి  ప్రకాష్‌ కరత్‌ హాజరయ్యారు. బసవపున్నయ్య రచనల ఆధారంగా రూపొందించిన పుస్తకాన్ని బీవీ రాఘవులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కరత్‌ కృతజ్ఞతలు తెలిపారు.అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మోదీ తలుపులు తెరిచారన్నారు. ఇదే విధానాన్ని సర్కార్‌ కొనసాగిస్తే భవిష్యత్‌లో అన్ని రంగాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందన్నారు.

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం లభించడం లేదు: దత్తాత్రేయ

హైదరాబాద్ : కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనం లభించడం లేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. కార్మికుల కనీస వేతనం రూ. 10వేలకు పెంచనున్నామన్నారు. కనీస వేతనాల పెంపు వివరాలను న్యాయశాఖ పరిశీలనకు పంపామన్నారు. బిల్లు ఆమోదం పొందకుండా రాజ్యసభలో ప్రతిపోఆలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కరువు నివారణకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఖరీఫ్ సాయంపై టి.సర్కార్ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. రక్షణచర్యలలోపం వల్లే బెల్లంపల్లి బొగ్గుగని దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్ : బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు విద్యార్థులు అరెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుచేసిన విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులు రిమాండ్ కు తరలించారు.

చౌటుప్పల్లో చైన్ స్నాచింగ్...

నల్లగొండ : జిల్లాలోని చౌటుప్పల్‌లో ఆదివారం ఉదయం గొలుసు దొంగతనం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తునిగాకుల గోదాములో భారీ అగ్నిప్రమాదం

ఆదిలాబాద్‌ : భైంసా పట్టణంలోని రాహుల్‌ జిన్నింగ్‌ మిల్లులో నిల్వ ఉంచిన తునిగాకుల గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.50లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

బసవపున్నయ్య స్మారకోపన్యాం కార్యక్రమం ప్రారంభం...

విజయవాడ : మాకినేని బసవ పున్నయ్య వర్థంతి సందర్భంగా విజయవాడ ఐవీ ప్యాలెస్ లో బసవపున్నయ్య స్మారకోపన్యాం కార్యక్రమం ప్రారంభం అయ్యింది. 25 సంవత్సరాల సరళీకరణ విధానాలు - ఫలితాలు అనే అంశం పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ ప్రసంగిస్తున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల ఆందోళన

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. బెంగళూరు - కొశ్చిన్ ఇండిగో విమానం బోర్డింగ్ తర్వాత వచ్చిన 11 మంది ప్రయాణీకులను వదిలిపెట్టి విమానం వెళ్లి పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు.

10:44 - April 17, 2016

హైదరాబాద్ : జర్మనీలోని గురుద్వారాలో బాంబుపేలుడు సంభవించింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బెర్లిన్‌లోని ఎస్సెన్‌ ప్రాంతంలో గురుద్వారాలో పేలుడు సంభవించినట్లు సమాచారం. కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.   

10:36 - April 17, 2016

యూపీ : లక్నో లో మెట్రో పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. అలంబాగ్‌లోని సర్దారీ ఖేరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

జ్వరంతో బాధపడుతున్న సీఎం కేసీఆర్

మెదక్ : తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఫాంహౌస్ కే పరిమితం కానుదన్న సీఎం కేసీఆర్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా 13 జిల్లాల్లో పర్యటిస్తా : ముద్రగడ

అనంతపురం : బలిక సంఘం నేతలతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మేము తాలిబన్ టెర్రరిస్టులం కాదని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస రాలేదని మాకు ఈ దేశంలో పౌరసత్వం ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన 13 జిల్లాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.

బెంగాల్ లో కొనసాగుతున్న పోలింగ్..

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసనసభ స్థానాలకు రెండో దశ పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. బెంగాల్‌లోని రు ఉత్తర జిల్లాల పరిధిలో ఉనన 56 స్థానాలకు 383 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీర్భూం జిల్లా పరిధిలోని ఏడు స్థానాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ముగియనుంది. బీర్భూం, మాల్దా జిల్లాల పరిధిలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

లక్నోలో మెట్రో పనుల్లో ప్రమాదం

యూపీ : లక్నోలో మెట్రో పనుల్లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో మెట్రో పిల్లర్ కూలి ముగ్గురు కార్మికులకు గాయాల్యయ్యాయి. సమాచారం అందుకు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

09:52 - April 17, 2016

హైదరాబాద్: అమెరికా వెళ్లి చదువుకోవాలని చాలా మంది కలలు కంటూ వుంటారు. అమెరికా వెళ్లడం అందని ద్రాక్షేనా? ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తూ వుంటే సాధ్యమేనా? అక్కడికి వెళ్లిన తరువాత ఎలాంటి ఉద్యోగాలు మనకు అందుబాటులో వుంటాయి. అమెరికా వెళ్లాలంటే ఎలాంటి ఆప్షన్స్ ను మనం ఎంచుకోవాలి? ఈ అంశాలపై 'టెన్ టివి' చర్చను చేపట్టింది. ఈ చర్చలో సాయికుమార్ మేడి, విశాన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, మెగాసిస్ సొల్యూషన్ ఎండీ గాలి రాజు, క్రీడా విశాస్ నుంచి హరీష్, క్యూబ్ 4 కన్సల్టెంట్ నుంచి కుశాల్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:29 - April 17, 2016

విజయవాడ :ఏపీలో నెలకొన్న ప్రజా సమస్యలపై మళ్లీ ఉద్యమ బాట పట్టాలని వైసీపీ నిర్ణయించింది. కరువుతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు వంటి అంశాలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఉద్యమ కార్యాచరణపై ఈనెల 19న సమావేశం జరగనుంది.

తీవ్ర కరవుతో మంచినీరు దొరక్క అల్లాడుతున్న జనం....

గతంలో వివిధ ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించిన ప్రతిపక్ష వైసీపీ... ఇప్పుడు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించింది. కరవుతో తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు అండగా నిలిసేందుకు జనంలోకి వెళ్లాని వైసీపీ అధినేత జగన్‌ నిర్ణయించారు. తీవ్ర కరవుతో మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నా... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నది పార్టీ నేతల వాదన. సాగునీరు అందక రైతాంగం కన్నీరు మున్నీరువుతున్నా... పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజలను కలుపుకుని కరవుపై జిల్లా కలెక్టరేట్లు, తహశీల్దార్‌ కార్యాలయాల దగ్గర నిరసనోద్యమానికి రూపకల్పన చేస్తున్నారు. ఈనెల 19న హైదారాబాద్‌లో వైసీపీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని జగన్‌ నిర్ణయించారు.

మహిళలు, విద్యార్ధుల సమస్యలపై పోరాటాలు .........

కరవు తర్వాత.... ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ఉద్యమం చేపట్టాలని వైసీపీ ప్రతిపాదించింది. ఆ తర్వాత విద్యార్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు రూపకల్పన చేస్తారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ నిరాహార దీక్ష చేస్తున్నారు. అమర్‌నాథ్‌కు మద్దతుగా ఈనెల 20 జగన్‌ కూడా దీక్షలో పాల్గొంటారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పార్టీకి ఇది కలిసొస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీవీడి.. అధికార టీడీపీలో చేరుతున్న తరుణంలో... ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జగన్‌.. ఉద్యమాల బాటను ఎంచుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

09:07 - April 17, 2016

హైదరాబాద్ : ఈక్విడార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కి.మీ. లోపు తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. శిధిలాల కింది అనేక వేల మంది చిక్కుకుని వుంటారని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్‌, రవాణా వ్యవస్థలకు అంతరాయమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.


 

ఈక్విడార్ లో భూకంపం:28 మంది మృతి

హైదరాబాద్ : ఈక్విడార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కి.మీ. లోపు తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌, రవాణా వ్యవస్థలకు అంతరాయమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

08:39 - April 17, 2016

హైదరాబాద్ : క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న నందమూరి బాలకృష్ణ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలీవుడ్‌ నటి హేమ మాలిని నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రలో హేమ మాలిని కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక, లొకేషన్ల వేటతో బిజీగా ఉన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రమిది. 2000 సంవత్సరాల కిందట కథ ఇది. అందుకే తగిన లొకేషన్లను అన్వేషించడానికి క్రిష్‌ బృందం యూరప్‌ పయనమైంది. ఈలోగా నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తారు. 

08:25 - April 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ తల్లడిల్లుతోంది. కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఎక్కడ చూసినా ఎండిన బోర్లు.. నెర్రలు చాచిన పంటపొలాలు.. ఎడారిని తలపిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కూడా కురవక పోవడంతో భూగర్భ జలాలు పడిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా అనేక మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 20 నుంచి 40 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తోంది. మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగునీరు దొరకని గడ్డుకాలం దాపురించింది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నీటి చుక్కకు కూడా కరవు ఏర్పడుతోంది. దాంతో రాష్ట్రం మొత్తం మనుషులే కాదు..పశుపక్ష్యాదులు సైతం మలమల మాడిపోతున్నాయి.

చోద్యం చూస్తోన్న ప్రభుత్వాలు...

తెలంగాణలో కరవు కరాళ నృత్యం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్లు చోద్యం చూస్తోంది. హీట్‌వేవ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు చెబుతున్నా.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా ఉందని పరిస్థితులు చెబుతున్నాయి. గత నెల 29 న ఛీప్‌ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత విభాగాల అధికార యంత్రాంగంతో సమీక్ష జరిపి ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అందుకు తగ్గట్లు కార్యరూపంలోకి తేవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. వడగాలులతో జనం పిట్టల్లా రాలిపోతున్నా... రాష్ట్రప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇప్పటికే వందకు పైగా వడదెబ్బతో మృతి చెందారు. అయితే వడదెబ్బ మృతుల విషయంలో కూడా రెవిన్యూ శాఖ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ల మధ్య పొంతన కుదరడం లేదు.

కూలీ పనులు లేక వలస పోతున్న గ్రామాలు....

పశువుల కోసం దాణా సరఫరాతో పాటు భారీ మొత్తంలో వాటర్‌ టబ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో అలాంటి ఆనవాళ్లు కనపడటం లేదన్నది ప్రజల ఆరోపణ. మరోవైపు గ్రామాల్లో కూలీ పనులు లేక గ్రామాలకు గ్రామాలు వలసలు పోతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా చేయాలని, పశువులకు దాణా, నీటి టబ్బులను ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉపాధి కూలీలకు ప్రభుత్వ పథకాల్లో సాయంత్రం వేళల్లో పనులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. 

08:15 - April 17, 2016

హైదరాబాద్ : ఈక్విడార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 7.4గా నమోదైంది. పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలో మీటర్ల లోపు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

ప.బెంగాల్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం

కోల్ కతా: ప.బెంగాల్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 56 స్థానాలకు 383 మంది అభ్యర్థులు భరిలో ఉండగా 1.2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈక్వెడార్ భూకంపం.. సునామీ హెచ్చరికలు..

హైదరాబాద్ : ఈక్వెడార్ భూకంపం వచ్చింది. తీని తీవ్రత7.4గా నమోదయ్యింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 300కి.మీలోపు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

అందుబాటులో కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్లు...

హైదరాబాద్ : పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆదివారం నుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. హాల్‌టికెట్లను ఈ రోజు ఉదయం 7.30 గంటల నుంచి 22వ తేది అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నంబర్, ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్‌చేస్తే హాల్‌టికెట్ ప్రత్యక్ష్యమవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.

ఎస్ఐ రాత పరీక్షకు సెట్ 'జి2 ప్రశ్నాపత్రం ఎంపిక

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న ఎస్‌ఐ రాత పరీక్షకు సెట్ ‘జి’ ప్రశ్నాపత్రాన్ని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఎంపిక చేసింది. 

అజ్లాన్ షా గోల్డ్ కప్ హాకీ విజేత ఆస్ట్రేలియా

హైదరాబాద్: అజ్లాన్ షా గోల్డ్ కప్ హాకీ టైటిల్ ను ఆరోసారి గెలుచుకోడంలో...ఐదుసార్లు చాంపియన్ భారత్ విఫలమయ్యింది. మలేసియాలోని ఇఫో వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో తుదివరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. ఎనిమిదిసార్లు విజేత ఆస్ట్రేలియా 4-0 గోల్స్ తో భారత్ ను అధిగమించింది. రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ ను 5-1 గోల్స్ తో చిత్తు చేసిన కంగారూటీమ్ ...ఫైనల్లో సైతం ఆధిక్యం ప్రదర్శించింది. గత ఏడాది ఇదేటోర్నీలో కాంస్య పతకం సాధించిన భారత్ ఈసారి..మెరుగైన ప్రదర్శనతో రజత పతకం సంపాదించింది.

నేడు బెంగాల్ లో రెండో విడత పోలింగ్...

హైదరాబాద్ : పశ్చిమబెంగాల్ లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఆదివారం పోలింగ్ ఎలా ముగుస్తోందనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఘనంగా శ్రీవారి పట్టాభిషేకం...

ఖమ్మం : భద్రాచలంలో రెండోరోజుకూడా సందడి కొనసాగింది.. సీతమ్మతో కల్యాణం జరిగిన మరుసటిరోజు రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. స్వామివారి కల్యాణానికి సీఎం కేసీఆర్‌ హాజరుకాగా... పట్టాభిషేకానికి గవర్నర్‌ నరసింహన్‌ వచ్చారు..  

06:54 - April 17, 2016

విజయవాడ: ఏపీలో ప్రాథమికోన్నత పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైందా ? రేషనలైజేషన్‌ ముసుగులో పాఠశాలల విలీనానికి ప్రణాళికలు సిద్దమయ్యాయా ? అంటే విద్యాశాఖ అధికార వర్గాలు అవుననే అంటున్నాయి. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే అనేకమంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశముందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.                                                                                                  

మరోసారి రేషనలైజేషన్‌ చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు.....

విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పేద విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న డ్రాప్‌ ఔట్స్‌ను పట్టించుకోని సర్కార్‌.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వేసవిలో మరోసారి రేషనలైజేషన్‌ చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

గతేడాది 4 వేల ప్రాథమిక పాఠశాలలు మూసివేత.........

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో గతేడాది 4 వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేసిన ప్రభుత్వం... ఈ ఏడాది కూడా మరో ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు,.. 4,120 ప్రాథమికోన్నత పాఠశాలలు మూసివేసేందుకు రెడీ అవుతోంది. గతేడాది 30 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయగా.. ప్రస్తుతం 60 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న స్కూళ్లను మూసివేసేందుకు సిద్దమవుతోంది. విద్యాశాఖ నిర్ణయం అమలైతే రాష్ట్రంలోని 17,690 పాఠశాలలు మూతపడనున్నాయి.

50 మంది కంటే తక్కువగా ఉంటే ప్రాథమిక పాఠశాలలు...........

ఇక ప్రాథమికోన్నత పాఠశాలలకు పూర్తిగా మంగళం పాడేసి.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా మార్చనున్నారు. అయితే 6, 7 తరగతుల్లో 50 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలని,.. 60 మందికి పైగా విద్యార్థులుంటేనే ఉన్నత పాఠశాలలుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 19 కంటే తక్కువగా ఉంటే వాటిని ఒక్క టీచర్‌తో నడిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 5,639 ఉన్నాయని అంచనా. ఇక విద్యార్థుల సంఖ్య వంద దాటిన ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం............

మొత్తానికి విద్యా సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పాఠశాలలు మూసివేస్తే అనేకమంది విద్యార్థులు చదువుకు దూరమవుతారంటున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలంటున్నారు. 

06:50 - April 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఓ రైతు చేసిన ప్రయోగం ఏపీలోని తూర్పుమన్యంలో మరో ఆదివాసీ కర్షకుడికి ప్రేరణనిచ్చింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వచ్చే దిగుబడికి ఛత్తీస్ ఘడ్ లో డిమాండ్ ను తీసుకువచ్చింది. దండకారణ్యంలో సరికొత్త సాగుకు ఊతమిచ్చింది....ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే నానుడికి బలం చేకూర్చేలా ఒక రైతు జీవనగమణాన్ని మలుపుతిప్పిన విశేషమేంటో తెలుసుకోవాలంటే అభయారణ్యంలోకి అడుగుపెట్టాల్సిందే....

తూర్పు మన్యంలో వినూత్న వ్యవసాయం....

తూర్పు మన్యంలో సంప్రదాయ వ్యవసాయమంటే కొండకోనల్లో ప్రాణాలకు తెగించి...ప్రకృతిని నమ్ముకుని తిండిగింజలను పండించుకోవడమే. కొండపోడులో చేతికందిన పప్పుధాన్యాలతో ఏడాది పొడవునా కాలం గడపడమే. ఇందుకు భిన్నంగా అటవీ మైదాన భూభాగంలో ఇతరపంటలను పండించాలంటే వర్షాదారంగానూ,వాగులను అసరాగా చేసుకుని సాగు చేయాలి. వేసవి సీజన్

వచ్చిందంటే వాగుల్లో చుక్కనీటి జాడకూడ ఉండదు. ఇలాంటి ప్రాంతాల్లోను పంటలను పండిస్తున్నాడు ఓ రైతు.

సాగులో వినూత్న పద్ధతి....

భౌగోళికంగా తూర్పుమన్యం అంతా ఇదే పరిస్థితి ఉన్న చింతూరు మండలం వాలుమూరు గొంది అటవీ ఆవాస గ్రామానికి చెందిన సోడే రామిశెట్టి అనే యువరైతు తన భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు వినూత్న పద్దతిని ఎంచుకున్నాడు.. బావిని తవ్వించుకుని కూరగాయల సాగును ప్రారంభించాడు. ఓ దినపత్రిక ఆదివారం అనుభంద పుస్తకంలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు తన పదెకరాల పొలానికి శాశ్వతనీటి వసతి కోసం వాటర్ ట్యాంక్ నిర్మించుకుని పంటలు పండించడం రామిశెట్టిని ఆకర్షించింది.. ఆ తరహాలో కూరగాయలు పండించాలన్న సంకల్పంతో లక్షరూపాయలను వెచ్చించి రెండెకరాల భూమికి నీటి వసతి సమకూరేలా స్టోరేజి ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసాడు..

ప్రకృతి వ్యవసాయంపై సమగ్ర అధ్యయనం.....

వాటర్ ట్యాంక్ నిర్మాణం తర్వాత రామిశెట్టి ప్రకృతి వ్యవసాయానికి సంభందించిన సమాచారాన్ని సమగ్రంగా అధ్యయనం చేశాడు. తన పంటపొలంలోనే డి.ఎ.పి ఎరువుకు బదులుగా నాడెపు కంపోస్ట్ ఎరువును పంటవ్యర్ధాలతో స్వయంగా తయారుచేసుకున్నాడు.. ఎరువు తయారీని పొలంలోనే సిమెంట్ తొట్టెల నిర్మాణం చేసుకుని పంటవ్యర్థాలను కుళ్ళింపచేసి ఎరువుగా మార్చాడు..యూరియా స్ధానంలో స్వయంగా డ్రమ్ములో ఆవు మూత్రంలో ఇతర పదార్ధాలు కలిపి జీవామృతం ను తయారుచేసి కూరగాయల పంటలకు పిచికారీ చేస్తున్నాడు..

వంగ,బెండ,మిరప,ఆనప,బీర,బొబ్బర్లు సాగు ......

దీంతో వంగ,బెండ,మిరప,ఆనప,బీర,బొబ్బర్లు సాగు చేస్తున్నాడు.. .స్వల్పకాల వ్యవధిలో కోతకొచ్చే కూరగాయలను ఎ.పిలోని చింతూరు,

సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ లోని కుంట సంతలో విక్రయిస్తున్నాడు..సహజసిద్ద ఎరువులతో రామిశెట్టి పండించే కూరగాయలకు,

ఆకుకూరలకు ఛత్తీస్ ఘడ్ లోని కుంట వారపు సంతలో మంచి డిమాండ్ ఉండటంతో ఏటా లక్షన్నర ఆదాయం కళ్ళచూస్తున్నాడు..

సరికొత్త సేద్యానికి దారి ......

మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఓ రైతు ప్రయోగం తూర్పుమన్యంలో సరికొత్త సేద్యానికి దారి చూసింది. ఛత్తీస్ ఘడ్ కుమార్కెట్ విస్తరించేలా దోహదపడింది. ఇది నిజంగా ఓ గిరిజన రైతు విజయమే... ఇటువంటి ప్రకృతిక పంటల విధానాన్ని అభివృద్ది చేస్తే కరువు ఛాయల నుంచి అలవోకగా పారద్రోలవచ్చంటున్నారు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

06:46 - April 17, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో వస్తున్న రాజ్యసభ ఎన్నికలతో పాటు మంత్రి వర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రానికి దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఎంపికయ్యే అభ్యర్ధులను బట్టి మంత్రులు మారనున్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

మే నెల్లో మంత్రి వర్గంలో మార్పులు ...

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు ముహుర్తం ఖరారైంది. మే నెల్లో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. హోంమంత్రి నాయినిని తప్పించడం దాదాపు ఖాయమైంది. పార్టీలో అత్యంత సీనియర్ కావడంతో ఆయనను రాజ్యసభకు పంపి తగిన రీతితో గౌరవించాలని యోచిస్తున్నారు కేసీఆర్.

మంత్రి పద్మారావు అవుట్‌ అయ్యే ఛాన్స్‌....

అదే సందర్భంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పై వేటు పడటం ఖాయమంటున్నారు కొందరు గులాబీ నేతలు. అదే సామాజిక వర్గానికి చెందిన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఇక ఉప ముఖ్య మంత్రిగా ఉన్న కడియంను మండలి చైర్ లో కూర్చోబెట్టనున్నారని సమాచారం. చీఫ్ విప్ గా ఉన్న కొప్పులకు అవకాశం కల్పించేందుకు ఆయనను తప్పిస్తున్నట్లు సమాచారం.

మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎర్రబెల్లి ఒత్తిడి ....

ఇక టీడీఎల్ పీ నేతగా ఉన్న ఎర్రబెల్లీ కూడా అధికార పక్షంలో చేరినందున ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. జూపల్లిని తప్పించి ఎర్రబెల్లిని మంత్రిని చేయడమో లేక కొప్పుల ఈశ్వర్ స్థానంలో చీఫ్ వీప్ గా నియమించడమో చేయవచ్చు.

మంత్రి చందూలాల్ పై వేటుకు సిద్ధం....

వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన శాఖ మంత్రి చందులాల్ ను తప్పించడం దాదాపు ఖాయమై పోయింది. ఆయన సంతకాలు ఫోర్జరీ అవడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన్ను తప్పించి...కోవా లక్ష్మికి ఆ బాధ్యతలు అప్పజెప్పనున్నారని సమాచారం. ఇక అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను సైతం తప్పిస్తారని చర్చ సాగుతుంది. 

మంత్రి పోచారంపై వేటు ?

వ్యవసాయ శాఖ మంత్రి పోచారంపై వేటు తప్పదంటున్నారు. అవినీతి ఆరోపణలు, విపక్షాల విమర్శలు.. ఆయనకు పదవి గండం తెచ్చిపెట్టాయని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో మహబూబ్ నగర్ కు చెందిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం.

06:42 - April 17, 2016

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ అసెంబ్లీల బడ్జెట్‌ సమావేశాల తర్వాత మొదటిసారి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్‌ నరసింహన్‌.... తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్రానికి నివేదిస్తారు. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుతెన్నులను ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. పరిపాలనా సంబంధ అంశాలపై కూడా చర్చిస్తారు.                                                                                          

టీఆర్‌ఎస్‌లో చేరుతున్న తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కేంద్రానికి నివేదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీనిపై ఇరు పార్టీలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి. ఏపీలో వైసీపీ శాసనసభ్యులు సైకిల్‌ ఎక్కుతున్నారు. పార్టీ అధినేత జగన్‌ నరసింహన్‌కు కలిసి... ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఈ వ్యవహారాలను ఆయన కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగ్‌ కూడా కాంగ్రెస్‌, టీడీపీలు గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశాయి. ఏపీలో మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణపై వైసీపీ వినతిపత్రం అందచేసింది. ఈ విషయాలను కూడా గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి నివేదించవచ్చని అనుకుంటున్నారు.

కరవు పరిస్థితులు, సహాయ చర్యలు ..................

ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగులు విభజన పురోగతి, హైకోర్టు విభజన అంశాలపై కూడా నరసింహన్‌ కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్థితులు, పాలకులు తీసుకుంటున్న సహాయ చర్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.... తదితర అంశాలపై కూడా కేంద్ర మంత్రుల దృష్టికీ తీసుకెళ్లొచ్చని అనుకుంటున్నారు. అపాయింట్‌మెంట్‌ ఇస్తే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే యోచనలో నరసింహన్‌ ఉన్నారని సమాచారం. మొత్తంమీద ఈసారి గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందనిపిస్తోంది.  

నేడు ఢిల్లీకి గవర్నర్ నర్శింహన్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. 

06:38 - April 17, 2016

అనంతపురం : జిల్లాలో రోజురోజుకు నీటికష్టాలు పెరిగిపోతున్నాయి. శివారు ప్రాంత పేద ప్రజలు తాగునీటికోసం అలమటిస్తున్నారు. కూలి పనులు కావాలంటే నీటిని, నీళ్ళుకావాలంటే పనులను వదులుకోవాల్సిన దుస్థితి. నగరానికి నీటిని సరఫరా చేసే పైపులైనుకు గండికొట్టి, తమ గ్రామపంచాయితీలకు నీటిని మళ్ళించుకున్న నగరశివారు ప్రాంత ప్రజలు, భవిష్యత్తులో జరగబోయే జలయుధ్ధాలకు శంఖమూదుతున్నారు.

నగరశివారుప్రాంతాలు చాలావేగంగా అభివ్రుధ్ధిచెందుతున్నా..

అనంతపురం నగరశివారుప్రాంతాలు చాలావేగంగా అభివ్రుధ్ధిచెందుతున్నా.. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పదిరోజులకు ఒకసారి నీళ్లు వస్తుండడంతో ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. ప్రభుత్వం టాంకర్ల ద్వారా ఉప్పు నీటిని సరఫరా చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటు తాగడానికి పనికిరాని నీటిని సరఫరా చేస్తున్న అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

నేషనల్ హైవే 44 వెళుతుండడంతో ......

అనంతపురం మీదుగా నేషనల్ హైవే 44 వెళుతుండడంతో.. ఈ పరిసర ప్రాంతాల్లో, కొందరు అక్రమ నివాసాలేర్పరుచుకున్నారు . పేరుకేమో అనంతపురం శివారు ప్రాంతమే అయినప్పటికీ, ఈ కాలనీలు మాత్రం అటు నగర కార్పొరేషన్ పరిధిలోకి రావు. మరోవైపున, గ్రామపంచాయితీలు కూడా వీరిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండీ వచ్చిన వీరందరూ దినకూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి సమస్యలకు తోడుగా,వేసవిలో తాగునీటి సమస్యకూడా అదనంగా వచ్చిచేరింది. పాపంపేట పంచాయితీ, వడ్డేకాలనీ, విద్యారణ్యనగర్ లతో పాటుగా మరికొన్ని

8 డివిజన్లలో నీటికొరత....

తమ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా, ఫలితంమాత్రం శూన్యం.. ఈ నేపథ్యంలోనే,అనంతపురం నగరానికి నీరుసరఫరా చేసే పైపులైనుకు గండికొట్టి, తమపంచాయితీలకు నీటిని మళ్ళించారు కొందరు. పైపులైనుకు గండికొట్టడంతో,నగరంలోని పాతఊరు,ఇతర 8డివిజన్లలో నీటికొరత మొదలైంది. తాగడానికి నీళ్ళు దొరక్క, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పాతఊరు,రాణినగర్,ఇతరప్రాంతాల్లో నీటికి తీవ్ర ఎద్దడి....

అనంతపురంలోని పాతఊరు,రాణినగర్,ఇతరప్రాంతాల్లో తీవ్రతాగునీటిఎద్దడి వుంది. నిర్దేశించిన సమయం కంటే,మూడు నెలలకు ముందే హెచ్చెల్సీ కెనాల్ కు నీరు విడుదలచేయడం ఆపేశారు. దీంతో,స్టోరేజ్ కెపాసిటీ తగ్గింది. .పాతఊరిలో పూలవ్యాపారులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండలకు తమ పూలు వాడిపోతే, వ్యాపారం దెబ్బతింటుంది. తమ వ్యాపారం కోసం, రోజుకు 150 రూపాయలు ఖర్చుపెట్టికొన్న మినరల్ వాటర్ తో పూలను తడుపుతున్నామంటున్నారు.

ఉప్పు నీటిని పంపుతున్నఅధికారుల తీరుపైనా...

తాగు నీటి కోసం ఉప్పు నీటిని పంపుతున్నఅధికారుల తీరుపైనా... మండిపడుతున్న స్థానికులు ఉన్న నీటిని పట్టుకునేందుకు సిగపట్లు పడుతున్నారు. నీళ్లు తాగాలంటే.. పని మానేయాల్సిన పరిస్థితి నెలకొంది.

 

06:35 - April 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం నేతలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కరువు తాండవిస్తుండడంతో అక్కడి ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గ్రామాల్లో సాగుకు,తాగడానికి నీరు లేక....

గ్రామాల్లో సాగుకు,తాగడానికి నీరు లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారని... పశుగ్రాసం లేక పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు . పంటకు నష్టం రావడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ... దీనిపై ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వంలో కదలిక తీసుకురావడానికే ఈ నెల 18 నుంచి వారం రోజులపాటు తాము జిల్లాల్లో కరువు పర్యటనలు నిర్వహించబోతున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

వాస్తవ పరిస్థితులపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు-రావుల....

జిల్లాలలో కరువు పర్యటనల కోసం టీడీపీ పార్టీ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ జిల్లాలోని తాజా పరిస్థితులపై ఆధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నేతలు. జిల్లాకు ముగ్గురు చొప్పున 30 మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితుపై నివేదికలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు సమర్పించే దిశగా కార్యచరణ రూపొందిస్తున్నారు. ఆ నివేదికలను టీడీపీ ఎంపీల చేత పార్లమెంట్‌లో లేవనెత్తే విధంగా వ్యూహాలు రచిస్తోంది. కరువు పరిస్థితులపై కేంద్ర మంత్రులకు విన్నవించాలనుకుంటున్నారు నేతలు.

కరువుపై ఉద్యమించనున్న టీ టీడీపీ

హైదరాబాద్ : రాష్ట్రంలో తాండవిస్తున్న కరువుపై తెలంగాణ టీడీపీ నేతలు ఉద్యమించనున్నారు. ఈ నెల 18 నుంచి వారం రోజులపాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. గ్రామాల్లో నెలకొన్న కరువు పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నారు. 

06:33 - April 17, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికార పార్టీ వ్యూహాత్మకంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని ఎంచుకుంది. పార్టీ బలోపేతానికి అవసరమయ్యే విధంగా ప్లీనరీ, బహిరంగ సభల ద్వారా సంకేతాలను ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టిన టీఆర్ఎస్ ......

తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టిన అధికార పార్టీ ప్లీనరీ ద్వారా పార్టీ కార్యకర్తలపై బాధ్యతలను ఉంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉంచాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికీ పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు ఎలాంటి పదవులు లేకపోవడంతో ప్లీనరీ నాటికి పదవులు భర్తీ చేసేందుకు కూడా గులాబి దళపతి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు పార్టీ పదవులు, మరో వైపు ప్రభుత్వ పదవులు భారీ ఎత్తున ఒకే సారి వెల్లడించాలనే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

నెల 27 ఖమ్మంలో ఘనంగా ప్లీనర్ నిర్వహించేందుకు ప్లాన్

27 వ తేదీన ఖమ్మంలో జరిగే ప్లీనరీకి తెలంగాణ వ్యాప్తంగా 3 వేల మంది కార్యకర్తలను ప్రతినిధుల సభకు ఆహ్వానించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉదయం ప్రతినిధుల సభ నిర్వహించి అదే రోజు సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ప్రతినిధుల సభలో చేయాల్సిన తీర్మానాలపై పార్టీ అధినేత నియమించిన కమిటీ కసరత్తు కూడా చేస్తోంది. 12 నుంచి 15 తీర్మానాలు ఉండే చాన్స్ ఉందని కమిటీ సభ్యులు అంటున్నారు.

పార్టీ నేతలకు మాత్రం ప్లీనరీ నాటికి పదవులు అందుతాయా....

పార్టీ నేతలకు మాత్రం ప్లీనరీ నాటికి పదవులు అందుతాయా....లేదా అన్న అనుమానాలు కూడా వెంటాడుతున్నాయి. ఏది ఏమైనా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన నేతలకు పదవులు దక్కనుండడంతో పోటీపడి మరీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వేడుకలు ఉపయోగపడనున్నాయి.

06:29 - April 17, 2016

హైదరాబాద్ : పోలీస్ నియమకాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వెరిఫికేషన్‌తో పాటు క్రిమినల్స్‌ను అవలీలగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. పోలీసులు శారీరక, మానసిక ఆరోగ్యవంతులై ఉండాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నారు అధికారులు. మరోవైపు ఆదివారం జరగబోయే పరీక్షకు నిమిషం ఆలస్యమైనా...అనుమతి లేదని చెబుతున్నారు.

539 ఎస్సై పోస్టులకు 2 లక్షల మంది దరఖాస్తు .....

పోలీసు నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌ ద్వారా 539 ఎస్సై పోస్టులకు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 321 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజల క్రితం అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక యాప్‌ను ఫైండ్ మీ పేరుతో డీజీపీ ప్రారంభించారు. దీంతో పరీక్ష సెంటర్‌కు గూగుల్ మ్యాప్ ద్వారా దారి వెతుక్కోవచ్చు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై యాప్ లో తెలుసుకోవచ్చు. అయితే 2 లక్షల మందిలో క్రిమినల్ కేసులు ఉన్న వారు 487 మందిని గుర్తించారు. గతంలో ఉద్యోగం వచ్చిన తర్వాత క్రిమినల్ కేసుల గురించి దర్యాప్తు చేసేవారు. కానీ తెలంగాణ పోలీసులు ఈ వెరిఫికేషన్ ద్వారా.. వాల్యుపిటేక్ అనే సంస్థతో కలిసి 19 వేల కోర్టుల్లోని దాదాపు 12 కోట్ల కోర్టు రికార్డులను పరిశీలించారు. 487 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేల్చారు. దీంతో పోలీస్ ఉద్యోగానికి క్రిమినల్స్ వచ్చే అవకాశం మొగ్గలోనే తుంచివేసినట్లయింది.

అభ్యర్థులను క్షుణ్ణంగా వడపోసి ఎంపిక ......

ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో 348 మంది అభ్యర్దులు సబ్ మిట్ బటన్ నొక్కలేదు. దీంతో వారికి కూడా అవకాశం ఇస్తూ హాల్ టికెట్లను ఆన్ లైన్ లో జారీ చేశారు. 310 మంది సివిల్, కమ్యూనికేషన్స్ పరీక్షలకు అప్లై చేసుకున్నారు. కొందరు రెండు పరీక్షలు రాస్తున్నందున వారికి ఎలాంటి నష్టం కలగకుండా రెండు పరీక్షలకు ఒకే సెంటర్‌ని కేటాయించారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందు చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల బయోమెట్రిక్‌ స్కాన్‌ కూడా ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే అభ్యర్థులను క్షుణ్ణంగా వడపోసి ఎంపిక చేస్తున్నారు అధికారులు.

పోలీస్ శాఖలో గతంలో పోలీసులు నేరాలకు .....

అయితే పోలీస్ శాఖలో గతంలో పోలీసులు నేరాలకు పాల్పడటం.. ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా సంస్కరణలు చేపట్టారు. ఐదు కిలోమీటర్ల పరుగు పందాన్ని ప్రాథమిక పరీక్ష నుంచి తీసేసి... ప్రాథమిక పరీక్షలో 200 మార్కులను ప్రవేశపెట్టారు. ఇందులో 70 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారికి శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. సివిల్స్ లో 5 శారీరక పరీక్షల్లో 3 పాస్ అయిన తర్వాత ప్రధాన పరీక్షకు అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా...అతి జాగ్రత్తల వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఆన్ లైన్ హాల్ టికెట్స్ పై గెజిటెడ్ అధికారి సంతకం కావాలని షరతులు పెట్టడంతో అభ్యర్థులు నానా హైరానా పడుతున్నారు. వరుస సెలవులు రావడంతో గెజిటెడ్‌ సంతకాలు పెట్టే వాళ్లు దొరక్క అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

 

ఎస్ఐ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి...

హైదరాబాద్ : పోలీస్ నియమకాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వెరిఫికేషన్‌తో పాటు క్రిమినల్స్‌ను అవలీలగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. పోలీసులు శారీరక, మానసిక ఆరోగ్యవంతులై ఉండాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నారు అధికారులు. మరోవైపు ఆదివారం జరగబోయే పరీక్షకు నిమిషం ఆలస్యమైనా...అనుమతి లేదని చెబుతున్నారు. 

Don't Miss