Activities calendar

18 April 2016

21:54 - April 18, 2016

హైదరాబాద్ : టీఎన్ జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాల వ్యవహారం మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈసారి ఈ వ్యవహారం.. మండలి చైర్మన్ స్వామి గౌడ్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జూన్ 8న కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు అదేశించింది. ఇరుకున పెడుతున్న కిరణ్మయి కమిటీ నివేదిక, హైకోర్టు విచారణల నేపథ్యంలో.. మండలి చైర్మన్ స్వామి గౌడ్.. ఎలా స్పందిస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 
తెలంగాణ ఉద్యోగుల హౌజింగ్ సొసైటీకి 160 ఎకరాలు
టీఎన్ జీవో హౌసింగ్ సొసైటీ అంశం.. రాజకీయంగా కలకలం రేపే పరిస్థితి కనిపిస్తోంది. ఈ హౌసింగ్‌ సొసైటీ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని.. అప్పట్లో టీఎన్‌జీఓ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత తెలంగాణ మండలి చైర్మన్‌ స్వామి గౌడ్ పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై హౌసింగ్‌ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్.. స్వామిగౌడ్‌తో పాటు.. తెలంగాణ ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. జూన్ ఎనిమిది నాటికి కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశంపై.. బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుపైనా.. అటు నాంపల్లి కోర్టులోనూ విచారణ జరుగుతోంది..  
2004లో  ఏపీ, తెలంగాణ ఎన్జీవోలకు 477 ఎకరాలు కేటాయింపు     
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. 2004లో.. ఏపీ, తెలంగాణ ఎన్జీవోలకు 477 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో తెలంగాణ ఉద్యోగుల హౌసింగ్ సొసైటికి 160 ఎకరాలు అప్పగించింది. ఈ సొసైటికి.. స్వామిగౌడ్ అధ్యక్షునిగా, ఆర్.రాజన్న కోశాధికారిగా, రాచేల్ డైరెక్టర్‌గా, హుస్సెనీ కార్యదర్శిగా ఉన్నారు. తమకు అప్పగించిన 160 ఎకరాల స్థలంలో.. 19వందల 36 మంది ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయంటూ కొందరు సొసైటీ సభ్యులు 2008లో హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసును విచారించిన న్యాయస్థానం.. ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని అదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ అంశంపై అప్పటి ప్రభుత్వం కిరణ్మయి కమిటీతో దర్యాప్తు చేయించింది. 
240మందిని అనర్హులుగా తేల్చిన కిరణ్మయి కమిటీ
తెలంగాణ ఎన్జీవోల హౌసింగ్ సొసైటీ అక్రమాల ఆరోపణలపై విచారించిన కిరణ్మయి కమిటీ.. ప్లాట్లు పొందిన 240 మంది విచారణకు హాజరు కాలేదని నివేదించింది. వీరంతా అనర్హులేనని స్పష్టం చేసింది. అలాగే డెవలప్‌మెంట్‌ కోసం వసూలు చేసిన డబ్బులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటూ పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఈ అంశం అక్కడితో ఆగిపోయింది.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. దీన్ని పట్టించుకోలేదు. ఈ దశలో.. సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌.. ఈ అంశంపై సీబీఐ విచారణను కోరుతూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అయితే ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలన్న ధర్మాసనం సూచనలతో..... జస్టిస్ సంజయ్‌ కుమార్‌ బెంచ్‌ కేసు విచారణ చేపట్టింది.. 
రూ. 419కోట్లు అక్రమదారి పట్టాయన్న అసోసియేషన్
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ స్కాంలో..  మార్కెట్ విలువ ప్రకారం 419 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపిస్తోంది.. సీబీఐ ద్వారా విచారణ జరిపిస్తే ప్రముఖుల బండారం బయటపడే అవకాశాలున్నాయని చెబుతోంది. మొత్తానికి ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 

 

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయలక్ష్యం 143 పరుగులు

హైదరాబాద్ : ఐపిఎల్-9లో భాగంగా ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 వోవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయలక్ష్యం 143 పరుగులుగా ఉంది. 

 

21:36 - April 18, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు.. మంత్రుల పని తీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. మొదటి ర్యాంకు పీతల సుజాత దక్కించుకోగా..రెండో ర్యాంకు దేవినేని ఉమ, మూడో ర్యాంకు ప్రత్తిపాటి పుల్లారావు, 4వ ర్యాంకు కామినేని శ్రీనివాసరావు, 
5వ ర్యాంకు పరిటాల సునీత, 6వ ర్యాంకు రావెల కిషోర్‌ బాబు, 7వ ర్యాంకు అచ్చెన్నాయుడు, 8వ ర్యాంకు గంటా శ్రీనివాసరావు, 9వ ర్యాంకు కొల్లు రవీంద్ర, 10వ ర్యాంకు అయ్యన్న పాత్రుడు, 11వ ర్యాంకు పల్లె రఘునాథ్‌ రెడ్డి, 12వ ర్యాంకు మాణిక్యాల రావు, 13వ ర్యాంకు కిమిడి మృణాళినికి చివరగా 18వ ర్యాంకును నారాయణకు దక్కింది.
మంత్రుల పని తీరు ఆధారంగా ర్యాంకులు
మొదటి ర్యాంకు: పీతల సుజాత
రెండో ర్యాంకు: దేవినేని ఉమ
మూడో ర్యాంకు: ప్రత్తిపాటి పుల్లారావు
4వ ర్యాంకు: కామినేని శ్రీనివాసరావు 
5వ ర్యాంకు: పరిటాల సునీత
6వ ర్యాంకు: రావెల కిషోర్‌ బాబు
7వ ర్యాంకు: అచ్చెన్నాయుడు
8వ ర్యాంకు: గంటా శ్రీనివాసరావు
9వ ర్యాంకు: కొల్లు రవీంద్ర
10వ ర్యాంకు: అయ్యన్న పాత్రుడు
11వ ర్యాంకు: పల్లె రఘునాథ్‌ రెడ్డి
12వ ర్యాంకు: మాణిక్యాల రావు
13వ ర్యాంకు:  కిమిడి మృణాళిని
18వ ర్యాంకు: నారాయణ

 

21:32 - April 18, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు.. వడగాలుల నేపథ్యంలో.. ఏపీ మంత్రిమండలి తక్షణ ఉపశమన చర్యలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి.. మజ్జిగను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీనికోసం జిల్లాకు మూడు కోట్ల వంతున కేటాయించింది అలాగే.. మూలన పడ్డ తాగునీటి వనరుల మరమ్మతుల కోసం రెండు వందల కోట్లు మంజూరు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. రాష్ట్రంలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడాలని.. ప్రజలను కూడా ఎండ తీవ్రత, తాగునీటి అంశాల్లో అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. 
నీటి ఎద్దడి అంశంపై ప్రధానంగా దృష్టి 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్‌ సమావేశం.. నీటి ఎద్దడి అంశంపై ప్రధానంగా దృష్టి సారించింది. తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా తాగునీటి సమస్యల పరిష్కారం కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రి మండలి సమావేశానంతరం.. మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వేసవి, దాహార్తి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. 
ప్రజలకు తక్షణ ఉపశమన చర్యలు 
రాష్ట్రంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా.. ప్రజలకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంపై కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చింది. వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత చర్యలపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాల ఏర్పాటుకు జిల్లాకు రూ. 3 కోట్లు కేటాయించాలని, అందరికీ ఉచితంగా మజ్జిగను సరఫరా చేయాలని నిర్ణయించింది. 
రాష్ట్రంలో 193 ప్రైమరీ అర్బన్‌ హెల్త్ సెంటర్ల ఏర్పాటు 
రాష్ట్రంలో 193 ప్రైమరీ అర్బన్‌ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  హీరో మోటార్స్‌ నెలకొల్పే ప్లాంట్‌కు 600 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సత్యవేడులో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి 35 ఎకరాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. టూరిజం ప్రాజెక్టుల భూ కేటాయింపులకు సంబంధించిన విధి విధానాలను కేబినెట్‌ ఆమోదించింది. 

 

రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ సమావేశం

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా వీరి సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ర్టాల పరిస్థితులను గవర్నర్ రాష్ట్రపతికి వివరించారు.

ఐదో వికెట్ కోల్పోయిన ముంబయి ఇండియన్స్...

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఐదో వికెట్‌ కోల్పోయింది. 123 పరుగుల వద్ద అంబటిరాయుడు 54 పరుగులు చేసి ఔట్యాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరుౌ17 ఓవర్లు ముగిసేసరికి ఐదో వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.

నేడు ఎస్‌ఐ(సివిల్‌) రాత పరీక్షల 'కీ' విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎస్‌ఐ(సివిల్‌) రాత పరీక్షల 'కీ'ని నేడు విడుదల చేశారు. ఈ ఫలితాలు www.tslprb.in
వెబ్‌సైట్‌లో ఉంచారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబయి ఇండియన్స్...

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి నాలుగో వికెట్‌ కోల్పోయింది. 60 పరుగుల వద్ద జోస్‌ బట్లర్‌ 11 పరుగులు చేసి ఔట్యాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరుౌ11 ఓవర్లు ముగిసేసరికి ఒక నాలుగు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.

21:00 - April 18, 2016

చంద్రాలు పార్టీల లేనేలేరంట మొగొల్లు... జబర్దస్త్ రోజమ్మ బజర్దస్తు సవాళ్లు, కేసీఆర్ సారుకు పుట్టెడు జరం... పాలనకుంటున్నడు దూరం, తెలంగాణల ఆగమైన అన్నదాత... ఆదుకుంటనేలేడంట ఏ ఒక్క నేత, వానముసుర్ల అంటుక్ను తాటి వనం.. మంటలన్ని ఆర్పి ఆగమైన ఊరి జనం, ఖాకీ కలం కింద నలిగిన విలేకరి కలం.. లీడర్ల అండతోనే పోలీసు జులుం, పోలీసోళ్లపై పగబట్టిన దేవుళ్లు, పాముల నుంచి మద్యం... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...
 

20:54 - April 18, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు విజృంభిస్తున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఐనా వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా ప్రకటించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలు నివేదికలు పంపిస్తున్నా మోదీ ప్రభుత్వం మౌనంగానే ఉండిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
వడ దెబ్బ...రోజూ పదుల సంఖ్యలో మృతి 
వడ దెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఐనా కేంద్ర ప్రభుత్వం వడ దెబ్బలను ప్రకృతి విపత్తుగా  ప్రకటించడం లేదు. రాష్ట్రాలు నివేదికలు ఇవ్వడం లేదని కేంద్రం చెబుతోంది. కానీ వాస్తవానికి గత ఏడాది వడదెబ్బలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎప్పుడో నివేదిక  పంపించింది. దానిపై  మోదీ సర్కారు ఇప్పటి వరకు  స్పందించిన దాఖలాలే లేవు. 
ఉత్తరాదిలో చలిగాలులు.. ప్రకృతి విపత్తు
ఉత్తరాదిలో చలిగాలులను కేంద్రం ప్రకృతి విపత్తుగా గుర్తించింది. దక్షిణాదిలో  ప్రచండ వేడి గాలులను మాత్రం జాతీయ విపత్తుగా గుర్తించడం లేదు.ఐనా ఇరు రాష్ట్రాల సీఎంలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వడదెబ్బ మరణాలు తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా  నమోదవుతున్నాయి. వడ గాడ్పులను కేంద్రం విపత్తుల జాబితాలో  చేర్చనందున రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు.  .. 
చలితో మరణించిన వారికి నష్టపరిహారం
చలి కారణంగా మరణించిన వారికి కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి రూ.లక్షన్నర ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నారు. విపత్తుగా గుర్తించినందున యుద్ధ  ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నారు. కాని వడదెబ్బ  మరణాల విషయంలో మాత్రం కేంద్రం స్పందించడం లేదు. వేడి గాలులనూ ప్రకృతి  విపత్తుగా గుర్తించాలని డిమాండ్‌ రావడంతో 2013లో అప్పటి యుపిఎ  ప్రభుత్వం మంత్రుల కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్టు వచ్చేలోపు  ఎన్నికలొచ్చి బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. ఏడాదికేడాది ఎండ వేడి  పెరుగుతున్నా... వడగాల్పులను ప్రకృతి విపత్తుగా ప్రకటించడంలో మోడీ  సర్కార్ మీన మేషాలు లెక్కిస్తోంది. 
వడదెబ్బతో 2015లో దేశవ్యాప్తంగా 2,500 మంది మృతి
2015లో దేశవ్యాప్తంగా వడగాడ్పుల కారణంగా 2 వేల ఐదు వందల మంది చనిపోగా.. అందులో 1735 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా జాతీయ విపత్తుగా గుర్తించమని కేంద్రంపై ఇద్దరు సీఎంలు సరైనరీతిలో ఒత్తిడి  తేవడం లేదు. వడ దెబ్బ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద  రూ.50 వేలు ఇస్తున్నారు. అదీ కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతేనే పరిహారం చెల్లిస్తున్నారు. ఆపద్భంధు పథకంలో చాలా పరిమితులున్నాయి. దరఖాస్తు చేసుకున్న  వారందరికీ సహాయం అందదు. దీంతో మృతి  చెందిన అందరి కుటుంబాలకూ సహాయం అందట్లేదు. అదే కేంద్రం విపత్తుగా ప్రకటిస్తే తక్షణ  సాయం కింద లక్షన్నర అందుతుంది. గతంలో రాష్ట్రం మృతులకు లక్ష  రూపాయిల సాయం ప్రకటించినా.. చాలా మందికి అది అందలేదు. 
విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు 
తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  2015లో ఏపీలో 1636 మంది, తెలంగాణలో 561 మంది వడదెబ్బ వల్ల  మృతి చెందినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు వివరాలు బట్టి తెలుస్తోంది. మనలాగే వాతావరణ పరిస్థితులు ఉండే తమిళనాడు, కర్నాటకల్లో మృతుల  సంఖ్య తక్కువగా ఉండటానికి అక్కడ ప్రభుత్వాల ముందస్తు చర్యలే  కారణమని నిపుణులంటున్నారు. ఐతే వడగాలులు తెలుగు ప్రజల్ని  హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రెండు  తెలుగు రాష్ట్రాలు వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని పలువురు  కోరుతున్నారు.. 

మహారాష్ట్ర సీఎం ఛంగన్ భుజబల్ జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు

ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఛంగన్ భుజబల్ ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఛంగన్ భుజబల్ తీవ్రమైన గుండెనొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను తనిఖీ చేసిన జైలు వైద్యులు, వేంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో అతనిని సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించి, ఐసీయూలో చేర్చారు. పరీక్షలు నిర్వహిచిన వైద్యులు, తీవ్ర మైన గుండెనొప్పి, రక్తపోటుతో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యస్థితి నిలకడకు వచ్చిన తరువాత ఆయనను జేజే ఆసుపత్రికి తరలిస్తామని సెయింట్ జార్జి ఆసుపత్రి అధికార ప్రతినిధి తెలిపారు.

 

ఏడు ఇసుక ట్రాక్టర్లు సీజ్...

వరంగల్‌ : జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సోమవారం పట్టుకున్నారు. బంతిని గ్రామం సమీపంలో ట్రాక్టర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ముంబయి ఇండియన్స్...

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరుగుతున్న మధ్య మ్యాచ్‌లో ముంబయి మూడో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగుల వద్ద రోహీత్‌ శర్మ 5 పరుగులు చేసి ఔట్యాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరుౌ7 ఓవర్లు ముగిసేసరికి ఒక మూడు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది.

 

రెండో వికెట్ కోల్పోయిన ముంబయి ఇండియన్స్

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరుగుతున్న మధ్య మ్యాచ్‌లో ముంబయి రెండో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగుల వద్ద పార్ధీవ్‌ పటేల్‌ 10 పరుగులు చేసి ఔట్యాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరుౌ4 ఓవర్లు ముగిసేసరికి ఒక రెండు వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది.

మొదటి వికెట్ కోల్పోయిన ముంబయి ఇండియన్స్...

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరుగుతున్న మధ్య మ్యాచ్‌లో ముంబయి తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి ఓవర్లులో ముంబయి ఇండియన్స్ తొలి వికెట్‌ కోల్పయింది. 2 పరుగులు వద్ద గప్తిల్‌ 2 పరుగుల చేసి ఔట్యాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరుౌ 2 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ కోల్పోయి 10 పరుగులు చేసింది.

 

20:38 - April 18, 2016

ఢిల్లీ : భారత మహిళా జిమ్నాస్టిక్‌ అథ్లెట్‌ దీపా కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్టిక్‌ అథ్లెట్‌గా దీపా కర్మాకర్‌ రికార్డ్‌ నమోదు చేసింది. 22 ఏళ్ల దీపా...2016 రియో ఒలింపిక్స్‌ కోసం నిర్వహించిన క్వాలిఫైయింగ్‌ ఈవెంట్‌లో రికార్డ్‌ లెవల్లో 52.698 పాయింట్లు నమోదు చేసి....ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.అంతే కాదు 52 ఏళ్ల తర్వాత  ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన భారత మహిళా జిమ్నాస్ట్‌గా సైతం దీపా అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది.

 

20:34 - April 18, 2016

హైదరాబాద్ : సికిందరాబాద్‌ అడ్డగుట్టలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కొడారి శంకర్‌, ఇందిర దంపతులకు 16ఏళ్ల కూతురుంది. ఈ బాలికను బొల్లారంకుచెందిన 35ఏళ్ల శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు.. ఈ నెల 21న మహూర్తం పెట్టుకున్నారు.. ఈ సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధికారులు వివాహం ఏర్పాట్లను ఆపేశారు.. మైనర్‌ను బాలికల వసతి గృహానికి తరలించారు.. అయితే బాలికను తీసుకువెళ్లకుండా ఆమె తల్లి కాసేపు హల్‌చల్‌ చేసింది.. జీపుకు అడ్డుపడి హంగామా చేసింది.. పోలీసులు ఆమెను తప్పించి బాలికను అక్కడినుంచి తీసుకువెళ్లారు.. తల్లిదండ్రులకు పోలీసులు గంటసేపు కౌన్సిలింగ్ ఇచ్చారు.. 

 

20:28 - April 18, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో కరువు తాండవం చేస్తోంది. తాగేందు చుక్కనీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షా కాలంలో విపరీత వరదలు రావడం... ఎండాకాలంలో చుక్కనీరు లేకపోవడం వంటి భిన్న పరిస్థితులు జిల్లాలో నెలకొంటున్నాయి. చెలమలు, కుంటలపైనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. చెలమలలో ఉన్న మురికి నీటినే తాగేందుకు .. గృహవసరాలకు వాడుతున్నారు గిరిజనులు. మురికినీటితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇంత దుర్బరంగా ఉన్నా.... అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  

 

వరంగల్‌ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్‌సెల్‌ పై ఆరోపణలు

వరంగల్‌ : జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్‌సెల్‌పై ఆరోపణలొస్తున్నాయి. ఇక్కడ వినతిపత్రం... సమస్య తీర్చాలని అడిగినా పట్టించుకునేవారే కరువయ్యారని జనాలు ఆరోపిస్తున్నాయి. వందల రూపాయలు ఖర్చు చేసి... సుదూర ప్రాంతాల నుంచి వచ్చి... గంటలకొద్దీ ఎండలో నిలబడి వినతిపత్రం ఇచ్చినా తమకు న్యాయం జరగడంలేదని విమర్శిస్తున్నారు. పైగా ఇక్కడ పెద్దస్థాయి అధికారులెవ్వరూ ఉండటం లేదని బాధితులు మండిపడుతున్నారు. అసలు కలెక్టర్‌ ఈ సెల్‌వైపే రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సమస్యపై పదిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకూ పరిష్కారం కాలేదంటున్నారు. అంతమాత్రానికి ఈ సెల్‌ పెట్టడమెందుకు?

20:20 - April 18, 2016

వరంగల్‌ : జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్‌సెల్‌పై ఆరోపణలొస్తున్నాయి. ఇక్కడ వినతిపత్రం... సమస్య తీర్చాలని అడిగినా పట్టించుకునేవారే కరువయ్యారని జనాలు ఆరోపిస్తున్నాయి. వందల రూపాయలు ఖర్చు చేసి... సుదూర ప్రాంతాల నుంచి వచ్చి... గంటలకొద్దీ ఎండలో నిలబడి వినతిపత్రం ఇచ్చినా తమకు న్యాయం జరగడంలేదని విమర్శిస్తున్నారు. పైగా ఇక్కడ పెద్దస్థాయి అధికారులెవ్వరూ ఉండటం లేదని బాధితులు మండిపడుతున్నారు. అసలు కలెక్టర్‌ ఈ సెల్‌వైపే రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సమస్యపై పదిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకూ పరిష్కారం కాలేదంటున్నారు. అంతమాత్రానికి ఈ సెల్‌ పెట్టడమెందుకు? తమని ఇలా ఇబ్బందులకు గురిచేయడమెందుకని ప్రశ్నిస్తున్నారు. ఇక వృద్ధులైతే మంచినీరులాంటి సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. 

 

హైదరాబాద్‌ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ బెయిల్‌పై విడుదల...

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసులో విచారణ అధికారిగా ఉన్న దయాకర్‌రెడ్డిని... విచారణ సందర్భంగా ఓ మహిళను వేధించారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఆయనను కోర్టులో హాజరు పరచగా... న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

దక్షిణ జపాన్‌లో భూకంపం..

హైదరాబాద్‌ : జపాన్‌ దేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా సోమవారం దక్షిణ జపాన్‌లోని కుమమోటో ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. గత వారం సంభవించిన మూడు భూకంపాల కారణంగా 42 మంది మృత్యువాత పడగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

20:07 - April 18, 2016

విజయనగరం : సింహాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తగా కేంద్రమంత్రి విజయనగరం రాజవంశీయులు అయిన అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ధర్మకర్తగా ఉన్న ఆనంద గజపతిరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బాధ్యతలు స్వీకరించారు. ఆయన మరణం తీరని లోటని కంటతడి పెట్టారు.  ఆలయ ఆభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

 

20:04 - April 18, 2016

విజయనగరం : కేంద్రమంత్రి అశోక గజపతిరాజును... బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగరావు, ఆయన సోదరుడు దేబీ నాయిన కలిశారు. వీరిద్దరు త్వరలో టీడీపీలో చేరనున్నారన్న సమాచారం మధ్య ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈనెల 20న టీడీపీలో చేరే అవకాశం ఉంది. 

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

హైదరాబాద్ : ఐపీఎల్ -9లో భాగంగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.    సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

19:51 - April 18, 2016

హైదరాబాద్ : వడదెబ్బ మృతులకు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎండల తీవ్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. నిరుపయోగంగా ఉన్న మంచినీటి పథకాల పునరుద్ధరణకు రూ.200 కోట్లు కేటాయించామని తెలిపారు. బోర్ బావులు డీపింగ్, ప్రెషింగ్...,  హ్యాండ్ పంపు రిపేర్ వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. 
నీరు-చెట్టు పథకం కింద పూడికతీతకు నిధులు
నీరు-చెట్టు పథకం కింద పూడికతీతకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. 563 గ్రామాల నుంచి మంచినీటిని ట్రాన్స్ పోర్టు చేస్తున్నామని చెప్పారు. ఎండలు గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువగా ఉన్నాయన్నారు. అర్బన్ ఏరియాలో తాగునీటి సమస్య లేదని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మంచినీటికి రూ.20 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. రూ. 450 కోట్ల రూపాయలతో లిఫ్టు ఇరిగేషన్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఉపాధీ హామీ చట్టం కింద పనులు పని కల్పిస్తామన్నారు. ప్రస్తుతం 13 లక్షల మంది రోజుకు ఉపాధీ హామీ పని చేస్తున్నారని.. దీన్ని 15 లక్షలకు పెంచాలని సూచించారు. అర్లీ మార్నింగ్, సాయంత్రం పని చేసే వెసులుబాటు కల్పించామని తెలిపారు. 45 రోజులపాటు మజ్జిగ పంపిణీ చేయడానికి జిల్లాకు రూ.3 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 
అందరికీ పూర్తిగా ఉపాధి కల్పిస్తామన్నారు. నీరు-చెట్టు కింద పూడికత పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. 
15 రెయిన్ గన్ లు 
వర్షాభావ పరిస్థితుల సమయంలో 15 రెయిన్ గన్ లు ఉపయోగించి...20 నుంచి 30లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. నీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని తెలిపారు. కరువు రహితంగా రాష్ట్రంగా ఎపిని తయారు చేస్తామన్నారు. తాత్కాలికంగా కరువు ఎదుర్కోవడంతోపాటు శాశ్వతంగా కరువు నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. డెయిరీ, చేపల పెంపకంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. ఆదాయం కూడా వస్తుందని చెప్పారు. భూమలు లేని రైతులు డెయిరీ పై ఆధారపడుతున్నారని తెలిపారు. రైతులకు మెరుగైన ధాన పంపణి చేస్తామన్నారు. అలాగే 5 వేల కిలో మీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రజలకు పని దొరికి ఉపాధీ లభిస్తుందని వివరించారు.   

19:12 - April 18, 2016

తెలుగురాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్ల ఫీజులుంపై టెన్ టీవీ సమరభేరీ కొనసాగుతోంది. ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు, తల్లిదండ్రుల ఆవేదన వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ సమస్యలపై వరంగల్‌లో.. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తమ మనోగతాన్ని టెన్ టివితో చెప్పుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

19:08 - April 18, 2016

నల్లగొండ : రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కరువు జిల్లాలుగా గుర్తించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో కరువుయాత్రను ఆయన ప్రారంభించారు. తిప్పర్తి మండలం ఇందుగులలో ఎండిపోయిన బావులు, బత్తాయి తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం తమ్మినేని టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా.. సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చుని మొక్కుబడి నివేదికలతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. 

 

18:58 - April 18, 2016

ఆదిలాబాద్‌ : నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ కాన్వాయ్‌ను బీడీ కార్మికులు అడ్డుకున్నారు.. బీడీ కట్టలపై పుర్రె గుర్తును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.. వీరి నిరసనపై స్పందించిన మంత్రి.. ఈ విషయంపై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు..

 

ఎండల తీవ్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఎండల తీవ్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వడదెబ్బ మృతులకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న మంచినీటి పథకాల పునరుద్ధరణకు రూ.200 కోట్లు కేటాయించామని తెలిపారు. 

 

విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఏషియా బంపర్‌ ఆఫర్‌...

హైదరాబాద్‌ : విదేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఏషియా బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకే విమానయన సదుపాయం కల్పిస్తూ.... చౌక ధరల యుద్ధానికి తెరతీస్తున్న తరుణంలో ఎయిర్‌ ఏషియా మరోమారు చవకైన ఆఫర్‌ ప్రకటించింది. దేశీయంగా ఉన్న నగరాలకు పన్నులన్నీంటీనీ కలుపుకొని 1000 రూపాయలకు టిక్కెట్‌ అందజేస్తామని ప్రకటించింది. ఇక విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 3000 రూపాయలకే టిక్కెట్లు అందజేస్తామని వెల్లడించింది.

ఉద్యోగం ఇప్పిస్తామని బాలికపై రెండేళ్లుగా అత్యాచారం...

హైదరాబాద్‌ : ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తనపై 113 మంది రెండేళ్లపాటు అత్యాచారం చేశారంటూ ఓ మైనర్‌ బాలిక వాపోతోంది. పశ్చిమ బెంగాల్‌లో కుటుంబంతో నివసిస్తున్న తనని కొందరు వ్యక్తులు ఉద్యోగం పేరిట మహారాష్ట్రాలోని పుణె నగరానికి తీసుకొచ్చి బలవంతంగా తనని వ్యభిచారంలోకి దించారని, అక్కడ కొందరు పోలీసులతో సహా 113 మంది తనపై అత్యాచారం చేశారని చెప్పింది. గత నెలలో అక్కడి నుంచి తప్పించుకుని ఢిల్లీ పారిపోయి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ కేసును తాజాగా పుణెకు బదిలీ చేసి, 113 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో 26 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టుచేశారు.

కేసీఆర్ 22 నెలల పాలన దేశానికే ఆదర్శం : తుమ్మల

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్ 22 నెలల పాలన దేశానికే ఆదర్శమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు కొనియాడారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా జరిగే టీఆర్‌ఎస్‌ ప్లీనరీని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని అన్నారు. ప్లీనరీలో తాగు, సాగు నీరు, విద్యుత్, నియామకాలపై చర్చించామని జిల్లాలో రూ.14,833 కోట్ల పనులు జరుగుతున్నాయని తుమ్మల తెలిపారు. ముంపు గ్రామాల సమస్యలపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

 

మహిళను వేధించిన కేసులో హైదరాబాద్‌ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసులో విచారణ అధికారిగా దయాకర్‌రెడ్డి ఉన్నారు. అయితే విచారణ సందర్భంగా మహిళను వేధించాడని దయాకర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో దయాకర్‌ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ఢిల్లీ : నేటి స్టాక్‌ మార్కెట్‌ను లాభాలతో ముగిసింది. నిఫ్టీ 64పాయింట్ల లాభంతో 7914 పాయింట్లకు, సెన్సెక్స్‌ 189 పాయింట్ల నష్టాలతో 25816 పాయింట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌, ఐడియా సెల్యూలర్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌లు లాభపడ్డాయి. హీరోమోటో కార్ప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐలు నష్టపోయాయి. ఒక్క జర్మనీ స్టాక్‌మార్కెట్‌ ఇండెక్స్‌ డాక్స్‌ తప్పితే మిగిలిన ప్రపంచ మార్కెట్లు అన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నా భారతీయ మార్కెట్లు ర్యాలీ చేయడం గమనార్హం.

17:40 - April 18, 2016

చెన్నై : ఈ వేసవి సెలవుల్లో.. తమిళనాడు విద్యార్ధులకు మంచి ఉపాధి లభిస్తోంది. అంటే అవేవో బహుళజాతి సంస్థలు కల్పిస్తున్న ఉపాధి అనుకునేరు. కానేకాదు.. అలాగే ఈవెంట్ మేనేజర్లకూ భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీన్నిబట్టి అక్కడ పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయని కాదు.. విద్యార్థులకైనా.. ఈవెంట్ మేనేజర్లకైనా.. ఉపాధి కల్పిస్తున్నది.. అక్కడి రాజకీయాలు. నిజం.. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. రాజకీయ పార్టీలు బహిరంగ సభలకు ఈవెంట్ మేనేజర్లపైనా.. వారు విద్యార్థులపైనా ఆధారపడ్డారు. ఎన్నికల చరిత్రలో ఇదో కొత్త ఒరవడిగా భావిస్తున్నారు. 
వచ్చే నెల 16న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే నెల 16న ఎన్నికలు జరుగనున్నాయి. వివిధ సర్వేలు, అంచనాలను పక్కన పెట్టి.. అన్ని రాజకీయ పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వీధి వీధినా ర్యాలీలతో కదం తొక్కుతున్నాయి. ఒకటి కాదు... రెండు కాదు... మూడు ప్రధాన రాజకీయ కూటములు... అందులోని వివిధ రాజకీయ పక్షాలు.. ఇవి కాక, పదికిపైగా చిన్నాచితక రాజకీయ పార్టీలు.. ఎన్నికల బరిలో దిగాయి. అన్ని కూటములు, పార్టీల నేతలు పోటీలు పడి సభలు నిర్వహిస్తున్నా... జనం  పలుచగా ఉంటున్నారు. దీంతో సభలు వెలవెలబోతున్నాయి.
ఈవెంట్‌ మేనేజర్లను ఆశ్రయిస్తున్న రాజకీయ పార్టీలు 
సభలకు జనాన్ని తరలించేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ జిల్లాల కమిటీలకు టార్గెట్లు నిర్ణయించాయి. ఏ సభకు కూడ 20 వేల మందికి తగ్గకుండా జనం హాజరయ్యేలా చూడాలని ఆదేశించాయి. దీంతో తలబాదుకుంటున్న జిల్లా కమిటీల నాయకులు... ఏమిచేయాలో పాలుపోక.. ఈవెంట్‌ మేనేజర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ఈవెంట్‌ ప్లానర్స్‌... విద్యార్ధులకు ఎరవేస్తున్నారు. రానుపోను రవాణ సౌకర్యం కల్పించడంతోపాటు ఆహారం, మంచినీరు అందిస్తూ.... ఒక్కో విద్యార్ధికి 200 రూపాయల నుంచి 1200 రూపాయలు చెల్లించేందుకు ఈవెంట్‌ మేనేజర్లు ముందుకు వస్తున్నారు. దీంతో వేసవి సెలవుల్లో కాస్త డబ్బు సంపాదించ వచ్చని విద్యార్థులు రాజకీయ సభలకు తరలి వెళుతున్నారు. 
కోరుకున్న వారికి మద్యం కూడా సరఫరా 
రాజకీయ పార్టీల సభలకు హాజరైన వారిలో కోరుకున్న వారికి మద్యం కూడా సరఫరా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక విద్యార్థులు కాకుండా.. ఇతరులకు... పురుషులైతే 600 రూపాయలు, మహిళలైతే 800 రూపాయలు చెల్లిస్తున్నారు. రాజకీయ పార్టీల అవసరాన్ని బట్టి ఈ రేటును పెంచేందుకు కూడా  ఈవెంట్‌ మేనేజర్లు వెనుకాడంలేదు. దీనిని బట్టి పరిశీలిస్తే రాజకీయ పార్టీలు ఈవెంట్‌ మేనేజర్లకు ఎంత చెల్లిస్తున్నాయోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. 
పత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చి విద్యార్ధుల సమీకరణ 
ఈవెంట్‌ ప్లానర్లు పత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చి మరీ విద్యార్ధులను సమీకరిస్తున్నారు. విద్యార్ధులు కావాలంటూ పోస్టర్లు, కరపత్రాలు ప్రచురిస్తున్నారు.  ఈవెంట్‌ మేనేజర్లు కూడా రాజకీయ పార్టీల సభలకు  చెన్నైలో అయితే 10 వేల మందిని, చెన్నై వెలుపలైతే 5 వేల మందిని  తరలిస్తున్నాయి.  ఎన్నికల తరుణంలో ఈవెంట్‌ మెనేజర్లకు ఇదో వ్యాపారంగా మారింది.  వీరిని చూసిన  తర్వాత కొన్ని మ్యాన్‌పవర్‌  ఏజెన్సీలు కూడా ఇదే దారిలో పయనిస్తూ.... రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు విద్యార్ధులను సమకూర్చుతామంటూ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. 
పార్టీల నాయకులు, అభ్యర్థులకు తలకుమించిన భారం 
ఈవెంట్‌ ప్లానర్లు జనాన్ని సమకూర్చడం ప్రారంభించిన తర్వాత రాజకీయ పార్టీల బహిరంగ సభలు కూడా కళకళ్లాడుతున్నాయి. ప్రచారం చేస్తున్న నేతల్లో ఇది కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నా.... జిల్లా కమిటీల నాయకులు,  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు మాత్రం తలకు మించిన భారంగా మారుతోంది. మొత్తం మీద బహిరంగ సభల నిర్వహణకు ఈవెంట్ మేనేజర్లను వినియోగించుకునే తమిళనాడు ట్రెండ్.. ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 

 

17:34 - April 18, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ హంద్వారాలో ఆందోళనకారులు నిషేధాజ్ఞలను మళ్లీ ఉల్లంఘించారు. ఆర్మీ డంప్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. హంద్వారాలో తిరిగి కర్ఫ్యూ విధించారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని సిఎం మెహబూబూ ముఫ్తి స్పష్టం చేశారు. హంద్వారాలో  భద్రతాదళాలు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ బాలికను జవాను వేధించాడన్న కారణంతో ఆందోళన మొదలైంది.

 

17:30 - April 18, 2016

ముంబై : మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ శాఖ మంత్రి పంకజా ముండే సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. కరువుతో అల్లాడుతున్న లాతూరు జిల్లాలో ఆదివారం సెల్ఫీ తీసుకుని ట్విటర్ లో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు కరువు, నీళ్లు లేక లాతూర్‌ అల్లాడుతుంటే మంత్రి  సెల్ఫీ తీసుకుంటారా అంటూ ముండేపై  నెటిజన్లు మండిపడ్డారు. లాతూర్‌కు ట్రెయిన్‌ ద్వారా ప్రభుత్వం నీటి సరఫరా చేస్తోంది. ఈ నీటిని ప్రజలకు పంపిణీ చేసేందుకు పైపు లైన్ల నిర్మాణం జరుగుతోంది. లాతూరు జిల్లా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ముండే- అక్కడి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తన సెల్‌ఫోన్‌తో మంత్రి సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మంత్రి తీరు దురదృష్టకరమని శివసేన.... కరువును బీజేపీ వెక్కిరిస్తోందని కాంగ్రెస్ కన్నెర్ర జేసింది.

 

17:25 - April 18, 2016

ఢిల్లీ : కోహినూర్ డైమండ్ కథ కంచికెళ్లినట్లే.. అద్భుతమైన ఆ వజ్రరాజం ఇక భారత్ కు తిరిగి రాదని స్పష్టమైంది. గోల్కొండ రాజ్యంలో దొరికిన అసాధారణ వజ్రం.. ఆంగ్లేయులు దోచుకు వెళ్లారని ఇంతకాలం అందరూ నమ్ముతూ వచ్చారు. అయితే.. దాన్ని మన వాళ్లే ఈస్టిండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని సాక్షాత్తు కేంద్రం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. దాన్ని తిరిగి ఇచ్చేయమని అడిగే అవకాశమే లేదని స్పష్టం చేసింది. దీంతో కోహినూర్ వజ్రం భారత్ సొత్తు కాకుండా పోయినట్లే. 
కోహినూర్‌ వజ్రం పరార్
ఇంతకాలం మనదనుకుంటున్న కోహినూర్‌ వజ్రం పరాయిదైపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డైమండ్ మన చేతికొచ్చే వీల్లేదని తేలిపోయింది. బ్రిటీషువాళ్లు దోచుకు వెళ్లారని ఇంతకాలం భారతీయులు అనుకుంటూ వచ్చారు. అయితే.. ఆ డైమండ్‌ను మనవాళ్లే ఆంగ్లేయులకు కానుకగా ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు.. కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావడం  అసాధ్యమని సుప్రీం కోర్టుకు కేంద్రం వివరించింది. 
ఈస్టిండియా కంపెనీకి కానుకగా కోహినూర్ వజ్రం
కోహినూర్ వజ్రాన్ని ఆంగ్లేయులు దొంగిలించలేదని,  మహారాజా రంజిత్‌ సింగ్‌ దాన్ని ఈస్టిండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకు తెలిపారు. ఆలిండియా హ్యుమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్ ఫ్రంట్‌ వేసిన పిల్‌పై సుప్రీం విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ ఈమేరకు కోర్టుకు తెలియజేశారు. కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు వెనక్కి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై సుప్రీం కేంద్రాన్ని వివరణ కోరింది. ఇందులో భాగంగానే కేంద్రం వివరణ ఇచ్చింది. 1849లో ఆంగ్లో సిక్ యుద్ధం ఓడిన అనంతరం మహారాజా రంజిత్‌సింగ్‌ కోహినూర్‌ను బ్రిటిషర్లకు కానుకగా ఇచ్చారని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. టిప్పు సుల్తాన్‌కు చెందిన ఉంగరం, తల్వార్‌తో పాటు.. బహదూర్‌ షా జాఫర్‌, ఝాన్సీ రాణి, నవాబ్‌ మీర్‌ అహ్మద్‌లకు చెందిన మరిన్ని వస్తువులు, నిధులు భారత్‌కు తెప్పించాలని కూడా పిల్‌లో పేర్కొనడం విశేషం.  
ప్రపంచంలోనే అత్యంత విలువైన పెద్ద వజ్రం కోహినూర్‌ డైమండ్‌
ప్రపంచంలోనే అత్యంత విలువైన పెద్ద వజ్రం కోహినూర్‌ డైమండ్‌. తెలుగు వారి అమూల్య సంపద కూడా. గోల్కొండ రాజ్యంలో దొరికిన ఓ అసాధారణ వజ్రంగా దీన్ని చెప్పుకుంటారు. మొఘల్‌ చక్రవర్తి బాబార్‌ కోహినూర్‌ వజ్రాన్ని వర్ణిస్తూ యావత్‌ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగానికి పైగా కోహినూర్‌ వజ్రం విలువ ఉంటుందని పేర్కొన్నాడు. మల్వా రాజు ఈ వజ్రానికి తొలి యజమానిగా చరిత్రకెక్కాడు. తర్వాత మాల్వాలను జయించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ నుంచి మొఘల్‌ చక్రవర్తి మహ్మద్‌ షా, అతని నుంచి నాదిర్‌ షా కోహినూర్‌ను సొంతం చేసుకున్నారు. ఇలా క్రమంగా చేతులు మారుతూ చివరికి బ్రిటీష్‌ వారి సొంతమైన ఈ వజ్రం ఇప్పటికీ బ్రిటన్‌లోనే ఉంది.
కోహినూర్‌పై సరికొత్త వాదనలు 
కోహినూర్‌పై సరికొత్త వాదనలు తెరపైకి రావడంతో.. దానిపై ఆశలు వదులుకోవడమా...? లేక మరేదైనా మార్గాలున్నాయా..? అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇంతకాలం మనదనుకున్న వజ్రం.. మనది కాకుండా పోయినట్లేనన్న భావన భారతీయుల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. బ్రిటీష్‌ పాలకులు, అధికారులతో భారత్ ప్రభుత్వం చర్చలు జరిపి మన సంపదను మనకు తరలించాలన్న విన్నపాలూ విన్పిపిస్తున్నాయి. 

 

17:06 - April 18, 2016

కృష్ణా : జిల్లాలో దారుణం జరిగింది. చందర్లపాడు మండలం విపరింతలపాడులో దుండగులు ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఏటూరు గ్రామానికి చెందిన బాలికను విపరింతలపాడుకు చెందిన నాగుల్‌ మీరా, జాన్‌పాషా నిన్న మధ్యాహ్నం ఆటోలో ఎత్తుకెళ్లి గ్రామ శివార్లలో అత్యాచారం చేశారు. తర్వాత వేపచెట్టుకు ఉరి వేసి చంపేశారు. తమకేమీ తెలియదన్నట్లుగా తిరుగుతుండగా.. గ్రామస్తులు వారిని పట్టుకుని ప్రశ్నించారు. జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. 

రాజమండ్రి సామూహిక అత్యాచారం కేసు... నలుగురు నిందితుల గుర్తింపు

తూర్పుగోదావరి : రాజమండ్రి సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో సతీశ్, ప్రేమ్‌కుమార్‌లపై రాజమండ్రి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ నమోదై ఉంది. అలాగే మణికంఠ, స్టిక్‌ ప్రమేయంకూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నలుగురికోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

17:00 - April 18, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో సతీశ్, ప్రేమ్‌కుమార్‌లపై రాజమండ్రి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ నమోదై ఉంది. అలాగే మణికంఠ, స్టిక్‌ ప్రమేయంకూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నలుగురికోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

హెచ్‌సీయూ వీసీని తొలగించాలన్న వీ.హెచ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీని తొలగించాలన్న కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూ వీసీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ చట్టం ప్రకారం వీసీని సస్పెండ్‌ చేయాలో తెలపాలని కోర్టు తెలిపింది. 6వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని వీహెచ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాసనం పోడియం వద్దకు వీహెచ్‌ దూసుకెళ్లారు. వీహెచ్‌ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మార్చుకోకపోవడంతో ధర్మాసనం పోలీసులను పిలిపించింది. న్యాయవాదులు వీహెచ్‌ను అడ్డుకుని కోర్టు హాలు నుంచి బయటకు పంపించారు.

16:53 - April 18, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీని తొలగించాలన్న కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూ వీసీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ చట్టం ప్రకారం వీసీని సస్పెండ్‌ చేయాలో తెలపాలని కోర్టు తెలిపింది. 6వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని వీహెచ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాసనం పోడియం వద్దకు వీహెచ్‌ దూసుకెళ్లారు. వీహెచ్‌ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మార్చుకోకపోవడంతో ధర్మాసనం పోలీసులను పిలిపించింది. న్యాయవాదులు వీహెచ్‌ను అడ్డుకుని కోర్టు హాలు నుంచి బయటకు పంపించారు. తదుపరి విచారణ జూన్‌ 28కి వాయిదా పడింది. 

 

ముగిసిన ఎపి కేబినెట్ సమావేశం...

కృష్ణా : విజయవాడలో 5గంటలుగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సాగునీటి ఎద్దడి, ఖరీఫ్‌ ప్రణాళికలపై ప్రధానంగా చర్చజరిగినట్టు సమాచారం. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పురోగతి, జన్మభూమి కమిటీల రద్దు, రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కేటాయించాల్సిన ప్లాట్లపైనా కూడా చర్చించారు. 

 

16:44 - April 18, 2016

కృష్ణా : విజయవాడలో 5గంటలుగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సాగునీటి ఎద్దడి, ఖరీఫ్‌ ప్రణాళికలపై ప్రధానంగా చర్చజరిగినట్టు సమాచారం. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పురోగతి, జన్మభూమి కమిటీల రద్దు, రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కేటాయించాల్సిన ప్లాట్లపైనా కూడా చర్చించారు. 

 

16:40 - April 18, 2016

హైదరాబాద్ : ఓ వైపు తాగడానికి నీటిచుక్క లేక జనం అల్లాడుతుంటే.. జలమండలి మాత్రం మంచినీటితో వ్యాపారం చేస్తోంది.  లిక్కర్‌, కోలాతో పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భారీగా నీటిని సరఫరా చేస్తూ.. నగర శివారు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. వాటర్‌ వ్యాపారం విషయంలో గ్రేటర్‌ అధికారులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 
జలమండలి పాత్రపై విమర్శలు
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాలో జలమండలి పాత్ర విమర్శలకు తావిస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాలకు ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్న జలమండలి అధికారులు.. మరికొన్ని ప్రాంతాలకు మాత్రం నీటి సరఫరాలో తీవ్ర వివక్ష చూపుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నా.. కొన్ని బస్తీలు, కాలనీలకు నీటిచుక్క కూడా రావడం లేదు. కానీ.. ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియానికి మాత్రం భారీ ఎత్తున నీటిని సరఫరా చేస్తున్నారు. స్టేడియానికి 50 ఎంఎం కనెక్షన్‌ ఇచ్చి మరీ  నీటిని సరఫరా చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
క్రీడా వినోదం పేరిట లక్షల లీటర్ల నీటి ఉపయోగించడంపై ఆగ్రహం 
పక్కనే బక్కచిక్కిన వారున్న బస్తీలు, కాలనీలకు తాగడానికి చుక్క నీరూ అందడం లేదు. కానీ.. క్రీడా వినోదం పేరిట లక్షల లీటర్ల నీటిని ఉపయోగించడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
ఇక శీతల పానీయాల తయారీ సంస్థలపై అధికారుల ప్రేమ 
ఇక శీతల పానీయాల తయారీ సంస్థలు.. కోకా కోలా, పెప్సీ, సౌత్‌ ఏషియా, క్రౌన్‌బీర్స్‌, యునైటెడ్‌ బ్రేవరీస్‌లపైనా జలమండలి అధికారులు ఎనలేని మక్కువను కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు సరఫరా చేయాల్సిన నీటినీ ఈ సంస్థలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శీతల పానీయాల కంపెనీలకు జనవరిలో 14 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేసిన జలమండలి అధికారులు..  మార్చి నాటికి ఆ కోటాను 17 కోట్ల లీటర్లకు పెంచారు. ఇక ఏప్రిల్, మేలో మరింత పెంచే అవకాశం ఉంది. అయితే.. పేదలు, సామాన్యులు ఉండే  ... బోరబండ, యాకుత్‌పురా, ఆల్వాల్‌, గౌలిపురా, జియాగూడా తదితర  ప్రాంతాలకు మాత్రం చాలా తక్కువ పరిమాణంలోనే నీటిని అందిస్తున్నారు. జలమండలి అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. సామాన్యుల దాహార్తిని తీర్చేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని బస్తీల ప్రజలు కోరుతున్నారు. 

చంద్రబాబు ఎన్నికల హామీలేవీ నెరవేర్చలేదు : జగన్

విశాఖ : ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలేవీ నెరవేర్చలేదని... వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. వైసీపీ నేత అమర్‌నాథ్ దీక్ష విరమించారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ కావాలంటూ అమర్‌నాథ్ ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విశాఖ కెజిహెచ్ ఆస్పత్రిలో అమర్‌నాథ్‌కు ఆ పార్టీ అధినేత జగన్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పారని... ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు కానీ.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని ఎద్దేవా చేశారు.

15:55 - April 18, 2016

విశాఖ : వైసీపీ నేత అమర్‌నాథ్ దీక్ష విరమించారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ కావాలంటూ అమర్‌నాథ్ ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విశాఖ కెజిహెచ్ ఆస్పత్రిలో అమర్‌నాథ్‌కు ఆ పార్టీ అధినేత జగన్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలేవీ నెరవేర్చలేదని... వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పారని... ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు కానీ.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ కావాలంటూ అమర్‌నాథ్ ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 
 

హైదరాబాద్, వరంగల్ లో విద్యాశాఖ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌, వరంగల్‌లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న మాదాపూర్ లోని నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే వరంగల్‌లో కిడ్డి కూప్‌, ఒయాసిన్‌ పాఠశాలల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 

 

15:44 - April 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌, వరంగల్‌లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న మాదాపూర్ లోని నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే వరంగల్‌లో కిడ్డి కూప్‌, ఒయాసిన్‌ పాఠశాలల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 

 

బ్రిట‌న్, దాని మిత్ర దేశాల పోరాటంలో 25 వేల ఉగ్రవాదులు హతం

హైదరాబాద్‌ : ఉగ్ర‌వాదుల‌ను స‌మూలంగా నాశ‌నం చేసే దిశ‌గా బ్రిట‌న్, దాని మిత్ర దేశాలు గ‌త 20 నెల‌లుగా సాగిస్తోన్న పోరాటంలో ఇప్ప‌టి వ‌ర‌కు 25 వేల మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న‌ సిరియా, ఇరాక్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉగ్ర‌వాదుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని చెప్పారు. ఉగ్ర‌వాదాన్ని అంత‌మొందించే దిశ‌గా ఐఎస్ఐఎస్ పై జ‌రుపుతోన్న పోరాటంలో ఉగ్ర‌వాదులు తేరుకోలేని దెబ్బ‌తిన్నార‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు గ‌త కొన్ని నెల‌లుగా అమెరికా, సంకీర్ణ సేనలు జ‌రుపుతోన్న దాడుల్లోనూ 100మంది ఐఎస్ఐఎస్ నేత‌లు హ‌త‌మైన‌ట్లు పేర్కొన్నారు.

బాలికపై అత్యచారం.. ఆపై హత్య

కృష్ణా  : చందర్లపాడు మండలంలోని విభరింతలపాడులో దారుణం చోటుచేసుకుంది. బాలికపై సామూహిక అత్యాచారం చేసి... ఆపై హత్య చేశారు. 14 ఏళ్ల బాలికను జాన్ బాషా, అతని స్నేహితులు ముగ్గురు కలిసి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. పదో తరగతి పరీక్షలు రాసిన సదరు బాలిక, ఈ మధ్యే ఓ కంపెనీలో జాయిన్ అయింది. విధులు నిర్వర్తించి ఇంటికి వస్తున్న బాలికను కిడ్నాప్‌ చేసిన నిందితులు ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అటుగా మనుషులు వస్తున్న అలికిడి కావడంతో ఆమెపై యాసిడ్ పోసి హత్య చేసి, పరారయ్యారు. ఆ తర్వాత అటుగా వచ్చిన గ్రామస్థులు బాలికను గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

15:25 - April 18, 2016

చిత్తూరు : ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి  ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీజ వివాహం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి చిరంజీవి  శ్రీవారిని దర్శించుకున్నారు.

గుంటూరులో బాలుడి కిడ్నాప్-హత్య

గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం దుండగులు ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసి.. అతన్ని అత్యంత కిరాతంగా హత మర్చారు. బాలుడి మృతదేహం ఫిరంగిపురం మండలం తాళ్లూరు వద్ద చెరువులో లభ్యమైంది. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

 

15:09 - April 18, 2016

గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం దుండగులు ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసి.. అతన్ని అత్యంత కిరాతకంగా హత మర్చారు. ఏటీ అగ్రహారానికి చెందిన 11 ఏళ్ల బాలుడు యధిత్యరాజు.. ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా కిడ్నాప్‌ దుండగులు చేశారు. బాలుడి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు వెతుకులాట మొదలుపెట్టారు. ఇంతలో దుండగులు బాలుడి తల్లికి ఫోన్‌ చేసి.. 15 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కిడ్నాప్‌ వ్యవహారం పోలీసులకు తెలిసిందని గ్రహించిన దుండగులు బాలుడిని అత్యంత కిరాతంగా హత్య చేశారు. బాలుడి మృతదేహం ఫిరంగిపురం మండలం తాళ్లూరు వద్ద చెరువులో లభ్యమైంది. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

 

కేవలం రేషన్ సరుకులు కోసమే ఆహార భద్రత కార్డులు..

హైదరాబాద్ : ఆహార భద్రత కార్డులు రేషన్ సరుకులు కోసమే తప్ప మిగతా ప్రభుత్వ పథకాలకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం సివిల్ సప్లై శాఖ నుంచి బీపీఎల్ డేటా సేకరించనుంది. 

వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ దీక్ష విరమణ....

విశాఖ : వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ దీక్ష విరమించారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అమర్ నాథ్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 

కుటుంబ సభ్యులకే అందించాలి : హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాల వివరాలు ఇవ్వాలని పిటిషనర్లను న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ల వివరాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నష్టపోయిన రైతులకు పరిహారం నేరుగా రైతుల కుటుంబ సభ్యులకే అందజేయాలని, మధ్య వర్తులను ప్రోత్సహించకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది.

కోహినూర్ డైమండ్ పై సుప్రీం హెచ్చరికలు...

ఢిల్లీ : అపురూప వజ్రమై  కోహినూర్ డైమండ్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీకి కోహినూర్ డైమండ్‌ను మహారాజ రంజీత్ సింగ్ బహుమతిగా ఇచ్చారు తప్ప...బలవంతంగా తీసుకెళ్ళలేదని సోలిటరీ జనరల్ కోర్టుకు విన్నవించారు. ఆరు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన ఫైల్ దాఖలు చేయాలని కేంద్రానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం తమదే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయరాదని ప్రభుత్వం ఇవాళ కోర్టులో స్పష్టం చేసింది. అయితే ఆ వజ్రం తమదే అని భవిష్యత్తులో ఎవరూ క్లెయిమ్ చేసుకోలేరని సుప్రీంకోర్టు ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేసింది.

బాలికపై హత్యాచారం...

కృష్ణా : చందర్లపాడు మండలం విపరింతలపాడులో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ బాలికపై లైంగిక దాడి చేసి అనంతరం దారుణంగా హత్యకు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

కిడ్నాప్ కు గురయిన బాలుడు హత్య....

గుంటూరు : ఏపీ అగ్రహారంలో బాలుడి హత్య కలకలం సృష్టించింది. తాళ్లూరు చెరువు వద్ద రాజు మృతదేశం లభ్యమయ్యింది. 4 రోజుల క్రితం రాజు అనే బాలుడిని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రూ.15 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్స్ డిమాండ్ చేశారు. కాగా నేడు కిడ్నాప్ కు గురయిన రాజు తాళ్లూరు చెరువు వద్ద విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మండలి చైర్మన్ కు హైకోర్టు నోటీసులు...

హైదరాబాద్ : టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపుల వ్యవహారంలో పెద్ద రూ. 419 కోట్ల అక్రమాలు జరిగాయని దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీఎన్జీవో అధికారుల కాలనీ సం క్షేమ సంఘం ఉపాధ్యక్షుడు జె.రవీందర్‌రెడ్డి తదితరులు ఈ పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం, మండలి చైర్మన్, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 8 కి వాయిదా వేసింది.

13:22 - April 18, 2016

విశాఖపట్టణం : రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీపీఎం, సీపీఐ, వైసీపీ, లోక్‌సత్తా, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రైల్వే జోన్‌ కోసం ప్రభుత్వం ప్రయత్నించకపోగా.. పోరాటం చేస్తున్నవారిని అరెస్ట్ చేయడం దారుణమని నేతలు అభిప్రాయపడ్డారు. రైల్వే జోన్‌ కోసం త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు స్పష్టం చేశారు. 

13:20 - April 18, 2016

హైదరాబాద్ : గోపన్ పల్లి హౌసింగ్ సొసైటీ అక్రమాలపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, మండలి ఛైర్మన్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. రూ. 419 కోట్ల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సోసైటీ అధ్యక్షుడు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 8కు వాయిదా వేసింది. గతంలో టీఎన్జీవోకు 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
వంద కోట్ల స్కాం జరిగిందని, అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మండలి ఛైర్మన్ గా నియమించారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం పేర్కొనడంతో హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. జూన్ 8వ తేదీన ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి. 

13:12 - April 18, 2016

ఢిల్లీ : కోహినూర్ వజ్రాన్ని భారత్ కు వెనక్కి తేవడం అసాధ్యమని కేంద్రం స్పష్టం చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో ఈ అంశంపై విచారణ జరిగింది. అత్యంత విలువైన వజ్రం చోరీకి గురి కాలేదని కేంద్రం పేర్కొంది. కోహినూర్ వజ్రాన్ని నాటి రాజులు ఈస్టిండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. ఆలిండియా హ్యుమన్‌ రైట్స్‌ సోషల్‌ జస్టిస్ ఫ్రంట్‌ వేసిన పిల్‌పై సుప్రీం విచారణ చేపట్టింది. దీనిపై సొలిసేటర్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు వెనక్కి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై సుప్రీం కేంద్రాన్ని వివరణ కోరింది. ఇందులో భాగంగానే కేంద్రం వివరణ ఇచ్చింది. 1849లో ఆంగ్లో సిక్ యుద్ధం ఓడిన అనంతరం రంజిత్‌ సింగ్‌ కోహినూర్‌ను బ్రిటిషర్లకు కానుకగా ఇచ్చారు. ఆరు వారాల్లోగా పూర్తి వివరణ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

13:02 - April 18, 2016

కడప : ఏటీఎం సెంటర్ లలో దోపిడీలకు పాల్పడం ఈ మధ్య సర్వ సాధారణంగా మారిపోయింది. ఏటీఎం మిషన్ల నుండి నగదు దక్కించుకోవటం చాలా కష్టంతో కూడుకున్న పని కావటంతో దుండగులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదేమింటంటారా మీరే చూడండి... పులివెందులలో స్థానికంగా వున్న వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రి సమీపంలో ఎస్ బీఐ బ్యాంక్ ఏటీఎంలో నగదు జమ చేయటానికి టాటా ఇండిక్యాష్ కు సంబంధించిన ఇద్దరు ఉద్యోగులు వచ్చారు. అదే సమయంలో డిస్కవరీ మోటార్ కిల్ పై వచ్చిన దుండగులు ఉద్యోగులపై ఐరన్ రాడ్ తో దాడి చేయటం..కళ్లలో కారం కొట్టారు. వారి దగ్గరున్న ఎస్ బీఐకి చెందిన రూ.53 లక్షల నగదును దుండగులు అపహరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. గాయపడిన సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే అంత పెద్దమొత్తంలో నగదు తీసుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మరి రూ. 53 లక్షల నగదును ఎవరు తస్కరించారు ? దీని వెనుక ఎవరున్నారో పోలీసుల విచారణలో తేలనుంది. 

12:53 - April 18, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని ముఖ్య కార్యదర్శితో గవర్నర్ భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ కావడానికి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అపాయింట్ మెంట్ లభిస్తే ప్రధానిని కలిసే అవకాశం ఉంది. 
ఇటీవల ఇరు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలపై నివేదికను గవర్నర్ కేంద్ర పెద్దలకు అందజేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో నెరవేర్చాల్సిన అంశాలు, పెండింగ్ లో వున్న అంశాలపై గవర్నర్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. 

12:50 - April 18, 2016

నల్లగొండ : జిల్లాలోని బొమ్మల రామాలంలో గట్టుమైసమ్మ జాతరలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి పడటంతో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇద్దరు పూజారులు మృతి చెందారు. ప్రతీ సంవత్సరం సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ జాతర నాలుగవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అందర్నీ కలిచివేసింది. పూజారులు దుర్మరణం చెందడంతో నాలుగవ రోజునే జాతరను నిలిపివేశారు. ప్రభుత్వం తరపునుండి ఎటువంటి సహకారం లేకున్నా...స్థానికులు, పూజారులు పర్యవేక్షిస్తూ ఈ గట్టుమైసమ్మ జాతరను సంప్రదాయబద్దం జరుపుకుంటున్నారు. పూజారుల చేతుల మీదుగా ఈ జాతరను ప్రతి సంవత్సరం నిర్వహించటం అక్కడి ప్రజలు ఆచారంగా భావిస్తుంటారు. విషయం తెలుసుకున్న పూజారుల కుటుంబసభ్యులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి భోరున విలపించారు. ప్రస్తుతం అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. 

గోపన్ పల్లి హౌసింగ్ సొసైటీ అక్రమాలపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : గోపన్ పల్లి హౌసింగ్ సొసైటీ అక్రమాలపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, మండలి ఛైర్మన్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. రూ. 419 కోట్ల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సోసైటీ అధ్యక్షుడు పిటిషన్ వేశారు. తదుపరి విచారణను జూన్ 8కు వాయిదా వేసింది. గతంలో టీఎన్జీవోకు 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 

12:44 - April 18, 2016

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ అదే ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అక్రమంగా బాణా సంచా నిల్వ ఉంచడం వల్ల పలు విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత కూడా పడ్డారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో రాజాం మండలం గురువాంలో బాణాసంచా పేలడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పెంటయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచాడు. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న మూడు సిలిండర్లు పేలడంతో మంటలు పక్కకు వ్యాపించాయి. ఈ ఘటనలో గేదెల పెంటయ్య, లక్ష్మణ రావులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఆరేళ్ల చిన్నారి కూడా మృత్యువాత పడినట్లు సమాచారం. ప్రమాదలో గాయపడిన ఆరుగురిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అక్రమంగా బాణాసంచా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సోదాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. 

12:39 - April 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విషయంపై కోర్టు పలు మార్లు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో పలు ఆదేశాలు జారీ చేసింది. జనవరి వరకు ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో నివేదికలో ఉందని కోర్టు పేర్కొంది. కానీ ఎంత మంది చనిపోయారు ? ఎంతమంది నష్టపరిహారం ఇచ్చారని ప్రశ్నించింది. 80 శాతం చెల్లించినట్లుగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. రూ. 6 లక్షల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇందుకు ఓ కమిటీ కూడా ఉందన్నారు. కానీ పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఇందుకు జూన్ 20వ తేదీ వరకు గడవు విధిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాకు పరిహారం నేరుగా బాధితుల అకౌంట్ లో వేయాలని కోర్టు సూచించింది. జూన్ 20వ తేదీన ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

గురువంలో పేలుడు..ఇద్దరు సజీవ దహనం..

శ్రీకాకుళం : రాజాం (మం) గురువంలో అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచిన ఇంట్లో పేలుడు సంభవించింది. ఈఘటనలో ఇద్దరు సజీవ దహనం కాగా ఆరుగురికి గాయాలయ్యాయి.

 

ప్రధాని ముఖ్య కార్యదర్శితో గవర్నర్..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హస్తినలో బిజిబిజీగా గడుపుతున్నారు. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై వివరించినట్లు సమాచారం. షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించినట్లు సమాచారం. 

ఏటీఎంలో నగదు జమ చేస్తుండగా దాడి రూ.53 లక్షలు చోరీ...

కడప : పులివెందులలో దుండగుల హల్ చల్ సృష్టించారు. ఏటీఎంలో కరెన్సీ అమర్చటానికి వచ్చిన సిబ్బందిపై దుండగులు కారం చల్లి దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ బీఐకి చెందిన రూ.53 లక్షలు అపహరణకు గురయ్యాయి. దాడి నుండి తేరుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

పూరీపై దాడి అవాస్తవం : డిస్ట్రిబ్యూటర్ రాందాసు

హైదరాబాద్ : దర్శకుడు పూరీ జగన్నాథ్ పై తాము ఎటువంటి  దాడి పాల్పడలేదని డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాసు పేర్కొన్నారు. పూరీ కార్యాలయంలో వున్న సీసీ పుటేజ్ పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుందనీ...దాడి చేసినట్లు నిరూపణ అయితే చట్టపరంగా ఎటువంటి శిక్షకైనా తాము సిద్ధమేనని తెలిపారు. 

11:26 - April 18, 2016

హైదరాబాద్ : టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం ముదురుతోంది. మొన్న తనపై దాడి చేశారంటూ పూరి జగన్నాథ్ జూబ్లిహిల్స్ పీఎస్ లో డిస్ట్రిబ్యూటర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  'లోఫర్' సినిమాలో పరాజయం కావడంతో తమకు నష్టపరిహారం చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. దీనిపై కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.పూరీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఫుటేజీల ను పరిశీలించాలని లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూర్ ముత్యాల రాందాసు పేర్కొన్నారు. తాము తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. గతంలో సినిమాలు ఫ్లాప్ అయితే హీరోలు, దర్శకులు డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, వి.వి.వినాయక్ లాంటి వారు డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారని పేర్కొన్నారు. పూరిని కూడా ఇదే విషయం కోరడం జరిగిందన్నారు. కానీ పూరి తమపై అక్రమంగా కేసులు పెట్టారని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. పూరీ జగన్నాథ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. 20 శాతం కమిషన్ ఇస్తారని, పది కోట్లు పెట్టిన సినిమాకు మూడు కోట్లు మాత్రమే వసూలు చేస్తే తాము నష్టపోవాలా అని ప్రశ్నించారు. దర్శకుడు, హీరోలను మినహాయింపు ఇస్తుంటారని అంత అట్టర్ ఫ్లాప్ లు తీస్తారా ? అని ప్రశ్నించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:13 - April 18, 2016

విశాఖపట్నం : జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో మరో ఆందోళన చోటు చేసుకుంది. బహుళ జాతి కంపెని అయిన బ్రాండిక్స్ ఆంధ్రప్రదేశ్ యూనిట్ లో వేతనాలు పెంచాలని..పీఎఫ్ సదుపాయం కల్పించాలని..మూడో యూనిట్‌, క్యాంటమ్‌, సీడ్స్‌ కంపెనీలు సోమవారం కార్మికులు ఆందోళనకు దిగారు. లోపలికి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించిన మహిళా కార్మికులను యాజమాన్యం అడ్డుకుంది. దీంతో ఆగ్రహం చెందిన కార్మికులు వారితో వాగ్వాదానికి దిగారు. వీరి ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలిపింది. 
ఇటీవలే మహిళా కార్మికులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 30 వరకు బ్రాండిక్స్ సంస్థ యాజమాన్యం గడవు కోరింది. స్పష్టమైన ప్రకటన రాకపోతే మళ్లీ ఆందోళనలు చేపడుతామని మహిళా కార్మికులు హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలను సంస్థ యాజమాన్యం సద్దుమణుగుపిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

 

కొనసాగుతున్న గుజరాత్ బంద్..

గుజరాత్ : పటేల్ వర్గీయులు పిలుపు మేరకు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. అహ్మదాబాద్ లో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. దీనితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

11:04 - April 18, 2016

విజయవాడ : వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌తో పాటు అన్ని సెట్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం ఎంసెట్‌ రీజనల్‌ కోఆర్డినేటర్లతో మంత్రి గంటా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ఈనెల 29న ఎంసెట్‌ పరీక్ష నిర్వహించి వచ్చేనెల 9న ఫలితాలు విడుదల చేస్తామని గంటా తెలిపారు. తెలంగాణలోనూ ఎంసెట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసే సెంటర్లలో భద్రత, ఇతర అంశాలపై అక్కడి డీజీపీ, సీఎస్‌తో మాట్లాడతామని చెప్పారు. గతేడాది ఎంసెట్‌ కీలో కొన్ని తప్పులు దొర్లాయని చెప్పారు. ఈ ఏడాది తప్పులు దొర్లకుండా చూస్తామన్నారు.

10:58 - April 18, 2016

కేరళ : రాష్ట్రంలోని కొల్లం పుట్టంగల్‌ దేవి ఆలయ తలుపులను తెరిచారు. ఈనెల 10వ తేదీన ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. దీనితో అప్పటి నుండి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం నుండి దైవ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఏప్రిల్‌ 10 పుట్టంగల్‌ దేవి ఆలయ ప్రాంగణంలో బాణసంచా పేలిన ప్రమాదంలో 114 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 350 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ప్రధాన ఆలయానికి ఎలాంటి నష్టం జరగకపోవటం విశేషం. ఆదివారం మహాసంప్రోక్షణ, సంప్రదాయ పూజలు చేశారు. సోమవారం నుంచి నిత్య వ్రతాలు, కృతులు, నివేదనలను నిర్వహిస్తున్నారు. బాణసంచా పేలుడుకు ఎటువంటి అనుమతి లేదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను ఆలయ అధికారులు నిలిపివేస్తారా ? లేదా ? అనేది వేచి చూడాల్సిందే.

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎంఎస్ సర్వే..ఉచిత ఇసుక, రాజధాని ప్లాట్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, సమస్యలు సృష్టిస్తున్న జన్మభూమి కమిటీలు, మున్సిపల్ ఎన్నికలపై మంత్రాంగం, కరవు, నీటి ఎద్దడిపై ప్రధానంగా చర్చించనున్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి ఫ్యామిలీ..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుమార్తె శ్రీజ దంపతులతో కలిసి చిరంజీవి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. 

10:48 - April 18, 2016

ఈక్వెడార్ : భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 272కి చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఈక్వెడార్ రాజధాని ప్రాంతంలో పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్, రవాణా సవ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. శిథిలాల కింది ఇంకా చాలామంది చిక్కుకుని ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితికి నెలకొనడానికి దాదాపు నెలరోజుల సమయం పడుతుందని అధికారులు పేర్నొన్నారు. బాధితులకు సంబంధిత అధికారులు  ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. భూమి లోపల వుండే భూఫలకాల కదలిక ద్వారా భూకంపాలు సంభవిస్తాయని..సముద్ర తీర ప్రాంతాలలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా నిపుణులు పేర్కొంటున్నారు. పసిఫిక్ తీర ప్రాంతాలల్లో కేంద్రీకృతమైన ఈ భూకంపం మరలా సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

శనివారం రాత్రి ఘటన..
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు ఈక్విడార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 7.8గా తీవ్రత నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. 1979 తర్వాత ఇటువంటి భారీ భూకంపం సంభవించలేదని జియోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొన్నదన్నారు. కాగా, భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల లోపు తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప ధాటికి గుయాక్విల్‌, క్విటో, పెడర్నేల్‌ ప్రాంతాల్లోని నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఈక్విడార్‌లోని 12 ప్రధాన రహదారులు మూతపడ్డాయని ప్రజా రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. సహాయ చర్యల కోసం 4వేల మంది పోలీ సులు, 10వేల మంది ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేసినట్టు ఈక్విడార్‌ విపత్తు నిర్వహాణ ఏజెన్సీ బృందాలు తెలిపాయి.

ఈక్విడార్‌ భూకంపమే ప్రమాదకరమైంది...
జపాన్‌లో సంభవించిన భూకంపం కంటే ఈక్విడార్‌లో సంభవించిన భూకంపమే అత్యంత ప్రమాదకరమైందని లండన్‌ విశ్వవిద్యాలయం ప్లానెటరీ జియోసైన్స్‌ విభాగపు ప్రొఫెసర్‌ డేవిడ్‌ రోథెరీ అభిప్రాయపడ్డారు. ఈ భూకంపంలో 20రెట్ల శక్తి ఉత్పన్నమైందన్నారు.

సుకుమాలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో ఎల్ ఈడీ మందుపాతరను మావోయిస్టులు పేల్చడంతో 74 బెటాలియన్ కు చెందిన ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. 

నల్గొండలో సీపీఎం కరవు యాత్ర ప్రారంభం..

నల్గొండ : ఇందుగులలో సీపీఎం కరవు యాత్ర ప్రారంభమైంది. యాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. మాడుగుల సమీపంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వరద కాల్వను తమ్మినేని, జూలకంటి రంగారెడ్డిలు పరిశీలించారు. 

మే 9న ఎంసెట్ ఫలితాలు..

విజయవాడ : మే 9న ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎంసెట్ నిర్వాహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. 29న ఎంసెట్ నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది ఎంసెట్ కీలో తప్పులున్నాయని, ఈ ఏడాది తప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది నుండి ఆన్ లైన్ లో ఎంసెట్ నిర్వాహణ ఉంటుందన్నారు. 

విశాఖకు బయలుదేరిన జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. కేజీహెచ్ లో వైసీపీ నేత అమర్ నాథ్ ను జగన్ పరామర్శించనున్నారు. రైల్వే జోన్ ప్రకటించాలని దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. 

వాటర్ గ్రిడ్ పనుల ఆలస్యంపై మంత్రి కడియం ఆగ్రహం..

వరంగల్ : చేర్యాల మండలంలో మిషన్ కాకతీయ వాటర్ గ్రిడ్ పనులను మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. వాటర్ గ్రిడ్ పనుల ఆలస్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బ్రాండిక్స్ లో మరో ఆందోళన..

విశాఖపట్టణం : అ చ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లో మరో ఆందోళన చోటు చేసుకుంది. క్వాంటమ్, సీడ్స్ కంపెనీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచాలని, సదుపాయాలు కల్పించాలని మూడో యూనిట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 

09:26 - April 18, 2016

గుజరాత్ : తమకు రిజర్వేషేన్లు కల్పించాలని గత కొంత కాలంగా పటేళ్లు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ ఆందోళన హింసాయుత్మకంగా మారింది. తమకు రిజర్వేషన్లు కల్పించాలని, గత ఏడాది నుండి జైలులో ఉన్న ఉద్యమసారధి హార్ధిక్ పటేల్ ను విడుదల చేయాలని పటేల్ వర్గీయులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా పటేల్ వర్గీయులు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల వైఖరికి నిరసనగా పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి సోమవారం బంద్ కు పిలుపునిచ్చింది. మెహసానా, అహ్మదాబాద్ లలో 144 సెక్షన్ అమలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గత రెండు దశాబ్ధాలుగా పటేళ్లు ఉన్నత వర్గాలకు చెందిన వారని, ఇలాంటి వారికి రిజర్వేషన్లు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. కానీ హార్ధిక్ పటేల్ ఉద్యమం చేపట్టడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సర్కార్ యోచిస్తోంది. కానీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించలేరని, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంద్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

09:23 - April 18, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. రాష్ట్రంలో కరవు తాండవిస్తుండడం..నీటి ఎద్దడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. కరవుపై కేంద్ర ప్రభుత్వం నుండి సరైన సహాయం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ నిధులు సక్రమంగా జరగడం లేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా అనుసరించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయింపులో జాప్యం జరుగుతోంది. జనవరి నాటికి ప్లాట్లు ఇస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ వాయిదాలు పడుతుండడంతో విపక్షాలు విమర్శలు..ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకొనే ఉంది. మరోవైపు రాష్ట్రంలో స్కూళ్లను మూసివేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉపాధ్యాయుల కొరతను ఎలా ఎదుర్కొవాలి ? ఎలాంటి యాక్షన్ ప్లాన్ అనుసరించాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. ఇంగ్లీషు మీడియం డిమాండ్ పై కూడా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 12 నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ వ్యూహం అనుసరించాలో దానిపై చర్చించనుంది. ఇక జన్మభూమి కమిటీలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ఎజెండాలో భాగంగా కమిటీల్లో ఎలాంటి మార్పులు..చేర్పులు చేయాలా ? కమిటీలను రద్దు చేయాలనే దానిపై కీలక నిర్ణయం కేబినెట్ తీసుకోనుంది. ఇక కీలక అంశంగా మారిన సీఎంఎస్ సర్వేపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. మంత్రుల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రులను బాబు మందిలించే అవకాశం ఉంది. మరి కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొననుందో వేచి చూడాలి. 

కాసేపట్లో ఏపీ కేబినెట్..

విజయవాడ : ఏపీ కేబినెట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎంఎస్ సర్వే..ఉచిత ఇసుక, రాజధాని ప్లాట్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, సమస్యలు సృష్టిస్తున్న జన్మభూమి కమిటీలు, మున్సిపల్ ఎన్నికలపై మంత్రాంగం, కరవు, నీటి ఎద్దడిపై ప్రధానంగా చర్చించనున్నారు.

 

గట్టుమైసమ్మ ఉత్సవాల్లో అపశృతి..

నల్గొండ : గట్టుమైసమ్మ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. దీనితో ఉత్సవాలను నిలిపివేశారు. బొమ్మలరామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

రెండో రోజు ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ పర్యటన..

ఢిల్లీ : నేడు రెండో రోజు గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. రాష్ట్రపతి, ప్రధాని లను నరసింహన్ కలువనున్నారు. 

ఆదిలాబాద్ లో మంత్రి జోగురామన్న..

ఆదిలాబాద్ : నేడు జిల్లాలో మంత్రి జోగు రామన్న పర్యటించనున్నారు. బెల్లంపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించనున్నారు. 

ప్రైవేటు విద్యా సంస్థల బంద్..

హైదరాబాద్ : నేడు రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల బంద్ జరగనుంది. ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ పిలుపునిచ్చింది. కాలేజీల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించాలనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. 

హైదరాబాద్ - ముంబై జట్ల మధ్య నేడు మ్యాచ్..

హైదరాబాద్: ఐపీఎల్ 9లో భాగంగా హైదరాబాద్ - ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్ జరగనుంది. 

08:33 - April 18, 2016

భువనేశ్వర్‌: ఒడిషాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దేవ్‌ఘడ్‌ జిల్లాలోని జార్జ్ వ్యాలీకి సమీపంలో కళాకారులు వెళుతున్న బస్సు అదుపు తప్పి 250 అడుగుల లోతున్న లోయలో పడింది. దుర్ఘటనలో భారతి గాన నాట్య సమితికి చెందిన కళాకారులు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవ్‌ఘడ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దేవ్‌ఘడ్‌ నుంచి బార్గాడ్‌ జిల్లా రెంతా ప్రాంతానికి వెళుతున్న ఈ వాహనంలో దాదాపు 40 మంది ప్రయాణీకులు ఉన్నారు.

08:31 - April 18, 2016

అహ్మదాబాద్‌: గుజరాత్‌ మెహసానా జిల్లాలో ఆదివారం పటేల్‌ సామాజికవర్గ నిరసనకారులు చేపట్టిన జైల్‌ భరో కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. అరెస్టయిన తమ నాయకుడు హార్ధిక్‌ పటేల్‌ విడుదల చేయలంటూ సర్ధార్‌ పటేల్‌ గ్రూపు ఆధ్వర్యంలో మొదెరా క్రాస్‌ రోడ్డు నుంచి నిరసనకారులు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరగా పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిలో 12మంది గాయపడ్డారు. దీంతో నిరసనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హోంమంత్రి ఇంటివద్ద వారు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పరిస్థితిని ఆదుపులోకి తెచ్చేందుకు అధికారులు మొబైల్‌ ఫోన్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతోపాటు జిల్లాలో కర్ఫ్యూ విధించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తమపై కావాలనే పోలీసులు దాడి చేశారని సర్ధార్‌ పటేల్‌ గ్రూపు వారు తెలుపగా తమపై రాళ్లు విసిరినందుకే లాఠీచార్జి చేశామని పోలీసులు చెబుతున్నారు. సోమవారం సర్ధార్‌ పటేల్‌ గ్రూపు గుజరాత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.

08:19 - April 18, 2016

హైదరాబాద్ : నగరంలో జరిగిన ఓ అగ్నిప్రమాదం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంగళ్ హాట్ పీఎస్ పరిధిలోని సీతారాంబాగ్, ద్రౌపతి గార్డెన్ సమీపంలో గల ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనా స్థలిని పరిశీలించారు. సిబ్బంది మంటలు అదుపులోకి వచ్చే ప్రయత్నాలను చేస్తున్నారని నగర మేయర్ పేర్కొన్నారు. సమీపంలో ఉన్న 30-40 నివాసాలను ఖాళీ చేయించడం జరిగిందని తెలిపారు.

ఆదివారం ఉదయం ఘటన..
ఆదివారం ఉదయం ఐదంతస్తుల భవనంలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులను ఐదు అంతస్తుల్లో నిల్వ చేయడంతో మంటలు బాగా వ్యాపించాయి. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. సంఘటనా స్థలిని డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. షట్టర్ లేపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఒక్కసారిగా మొదటి, రెండో అంతస్తుకు వ్యాపించాయి. దీనితో భవనం గోడలు బీటలు వారాయి. రెండు జేసీబీలు తెప్పించి భవనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. జలమండలి అధికారులు నీటి సరఫరా చేసి మంటలను ఆర్పేందుకు సహాయం చేస్తోంది.

ఇరుకు సందు..
నివాస గృహాల మధ్య ఈ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమీపంలో ఇళ్లు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరుకుగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గోడౌన్ లో నలుగురు పార్టనర్స్ గా ఉన్నారని తెలుస్తోంది. 

07:55 - April 18, 2016

తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండ వేడిమి భరించలేక..ఉక్కపోత భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే వడదెబ్బ కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. వడదెబ్బ ను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవడంపై పలు విమర్శలు రేగుతున్నాయి. మరోవైపు రైల్వే జోన్ పై వైసీపీ పోరు విజృంభించింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), విజయ్ కుమార్ (టిడిపి), తులసీరెడ్డి (కాంగ్రెస్), ఆల్జాపూర్ శ్రీనివాస్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

07:51 - April 18, 2016

విశాల్‌, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా, ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న 'రాయుడు' చిత్రాన్ని విశాల్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ,'నా కెరీర్‌లోనే ఇది ఓ డిఫరెంట్‌ చిత్రమవుతుంది. పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. ''కొంబన్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయడం ఒక విశేషమైతే, ధనుష్‌ హీరోగా వచ్చిన 'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన వేల్‌రాజ్‌ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందించడం మరో విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. మే మొదటి వారంలోనే ఆడియోను రిలీజ్‌ చేసి, మే 20న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత జి.హరి చెప్పారు.

07:49 - April 18, 2016

వంగవీటిపై ఓ సినిమా, 'కిల్లింగ్‌ వీరప్పన్‌'పై బాలీవుడ్‌లో మరో సినిమా చేస్తున్న రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్‌ ముత్తప్ప రాయ్‌ జీవితం ఆధారంగా 'రాయ్‌' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించ బోతున్నట్లు వర్మ శనివారం ట్విట్టర్‌లో తెలిపారు. ''రాయ్‌'గా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ టైటిల్‌ రోల్‌ పోషించనున్నారు. డాన్‌ నుంచి కార్యకర్తగా మారిన ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కే ఈ చిత్రాన్ని సీఆర్‌ మనోహర్‌ నిర్మించనున్నారు. ముత్తప్ప రాయ్‌ పుట్టిన రోజైన మే 1న ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అదే రోజున ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడానికి ముత్తప్ప రాయ్‌ అంగీకరించారు. హిందీతోపాటు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో రూపొందబోయే ఈ చిత్రాన్ని మంగళూర్‌, బెంగుళూర్‌, ముంబై, దుబాయ్‌, లండన్‌లో చిత్రీకరణ జరుపనున్నాం' అని ట్వీట్‌ చేశారు వర్మ.

07:46 - April 18, 2016

తాజాగా నటించిన 'ఫ్యాన్‌' చిత్రానికి జాతీయ పురస్కారం రాకపోతే ఏడ్చేస్తా.. లేదంటే నేనే ఆ అవార్డుని దొంగిలిస్తాన'ని అంటున్నాడు బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌. 'ఫ్యాన్‌' చిత్రం గత శుక్రవారం విడుదలైంది. షారూఖ్‌ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది. ఇంతవరకు షారూఖ్‌ చేసిన సినిమాలన్ని ఓ ఎత్తయితే, 'ఫ్యాన్‌' మరో ఎత్తు. ఎందుకంటే ఎప్పుడూ చేయని రీతిలో రెండు పాత్రల్లో నటించి ఈ చిత్రానికి ప్రాణం పోశాడు. ఈ నేపథ్యంలో 'ఫ్యాన్‌' గురించి తన అభిప్రాయాలను మీడియాతో షారూఖ్‌ పంచుకుంటూ సరదాగా పై విధంగా స్పందించారు. షారూఖ్‌ ప్రస్తుతం 'రెయీస్‌' చిత్రంలో నటిస్తున్నారు.

07:36 - April 18, 2016

కాపర్‌ శరీరానికి అత్యంత ముఖ్యమైన మినరల్‌. రాత్రంతా రాగి పాత్రలో నీటిని ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పురాతన కాలం నుంచి మన ఇండియన్స్ పాటిస్తున్న అద్భుతమైన చిట్కా. కనీసం ఎనిమిది గంటలపాటు రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కాపర్‌ నీటిని ప్యూరిఫై చేసి.. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే ఆ నీళ్లు సహజంగా శుద్ధి అయినట్టు.
థైరాయిడ్‌ సంబంధిత సమస్యలకు కాపర్‌ డెఫిసియెన్సీ ప్రధాన కారణం. కాబట్టి రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్‌ సమస్యలు నివారించవచ్చు.

  • కాపర్‌లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది జాయింట్‌ పెయిన్స్‌ నివారించడంలో సహాయపడుతుంది.
  • కాపర్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. అలాగే కొత్త కణాలు ఉత్పత్తి చేయడంలో సహకరిస్తాయి. కాబట్టి రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఎలాంటి గాయాలైనా త్వరగా తగ్గిపోతాయి.
  • మెదడులో అనేక రకాల ఎంజైమ్స్‌ పనిచేయడానికి కాపర్‌ చాలా అవసరం. అలాగే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు రాకుండా నివారించి చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
  • రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల శరీరానికి కావాల్సిన కాపర్‌ అంది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. రాగి పాత్రల్లో నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఈ పద్ధతి పాటిస్తారు.
  • గర్భధారణ సమయంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి రాగి పాత్రలో నీళ్లు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్, అనారోగ్య సమస్యలు రాకుండా హెల్దీగా, యాక్టివ్‌గా ఉంటారు.
  • కాపర్‌ శరీరానికి కావల్సిమైన చాలా ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్‌ ప్రాపర్టీస్‌ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది.
  • చర్మంపై ముడతలు, గీతలు, ప్యాచ్‌లను నివారించి చర్మం నవ యవ్వనంగా కనిపించడానికి కాపర్‌ ఉపయోగపడుతుంది.
  • రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిపోతాయి. ఇది బరువు తగ్గడానికి, అల్సర్‌ నివారణకు సహాయపడుతుంది. అల్సర్‌కు కారణం అయ్యే బ్యాక్టీరియాను డైజెస్టివ్‌ ట్రాక్‌ నుంచి తొలగిస్తుంది.
  • అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ ప్రకారం రక్తపోటు, హార్ట్ రేట్‌ నియంత్రించడానికి రాగి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలు తగ్గిస్తుంది. గుండెకు రక్తం సజావుగా అందడానికి సహాయపడుతుంది. 
07:32 - April 18, 2016

మీకు ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కావాలనుకుంటున్నారా ? అయితే మీకు ఈ ప్రణాళిక కచ్చితంగా సరిపోతుంది. సాంప్రదాయక ఆహర పదార్ధాలతో కూడిన ఈ ఆహార నియమాలను పాటించడం ద్వారా గుండె, క్యాన్సర్‌ వలన వచ్చే మరణాలను తగ్గించవచ్చు. అంతేకాక మతిమరుపును, నరాల బలహీనతలను కూడా తగ్గిస్తుందని అనేక పరిశోధకులు తెలుపుతున్నాయి.

ఉపయోగించవలసిన ఆహార పదార్ధాలు..
ప్రధానంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, చిక్కుడు జాతి... ఇలాంటి మొక్కల ఆధారిత ఆహార పదార్ధాలు ఆహారంలో ముఖ్యంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నెయ్యి, వెన్న స్థానంలో ఆరోగ్యకర కొవ్వులున్న ఆలివ్‌ ఆయిల్‌ ను ఉపయోగించడం, ఉప్పుకు బదులు సుగంధ ద్రవ్వాలు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు) లాంటివి ఉపయోగించడం వలన రుచికి రుచి..... ఆరోగ్యం కూడా....మాంసాహారం విషయానికి వస్తే మాంసాన్ని నెలలో ఒకటి, రెండు సార్లుకే పరిమితం చేయాలి. చేపలను వారంలో రెండుసార్లు తీసుకున్నా పర్వాలేదు. ఇలాంటి ఆహారంతో పాటు శారీరక వ్యాయామం, కుటుంబానికి, బంధువులకు సమయాన్ని కేటాయించడం వారితో కలిసి భోజనం చేయడం లాంటి పనులకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే జీవితంలో మానసిక, శారీరక ఆనందం... సంతోషం.... కలుగుతుంది. అప్పుడే మొదడు చురుకుగా కూడా పనిచేస్తుంది.

తృణధాన్యాలను కూడా చేర్చండి..
పైన చెప్పిన విధంగానే ప్రతి భోజనంలో కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. భోజనానికి భోజనానికి మధ్యలో స్నాక్స్‌గా తృణధాన్యాలతో తయారు చేసిన బ్రడ్‌, సెరల్స్‌ను ఉపయోగించడం మంచిది. బ్రౌన్‌ రైస్‌, పాస్తాలను కూడా చేర్చుకోవచ్చు. క్యారెట్లు, ఆపిల్‌, అరటిపండ్లతో స్నాక్‌ సంతృప్తికరంగా తయారు చేసుకోవచ్చు. వీటన్నింటి కన్నా పండ్లతో కూడిన సలాడ్‌ ఎంతో ఆద్భుతమైన, ఆరోగ్యకరమైన స్నాక్‌.

నట్స్, మొలకెత్తిన విత్తనాలు..
ఫైబర్‌, ప్రోటీన్‌లు, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉన్న పదార్ధాలు ఇవి. ఎలాంటి స్నాక్స్‌ అందుబాటులో లేనప్పుడు గుర్తుకు వచ్చేవి బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రోట్‌లు. సహజ సిద్ధమైన వేరుశనగపప్పుల బటర్‌తో లేదా వేపిన నువ్వులతో బ్రెడ్‌.. ఇవి కూడా మంచి పోషకాల స్నాక్‌.

వెన్న, డాల్డాలను మరిచిపోండి..
వీటికి బదులు ఆలివ్‌ ఆయిల్‌ను ప్రయత్నించండి. కూరలు చేసేటప్పుడు తక్కువ(పరిమిత) నూనెలను వాడండి. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మసాలా దినుసులు..
రుచికరమైన ఆహారం కోసం మసాలా దినుసులు కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
తక్కువ కొవ్వున్న పాలను మాత్రమే అధిక కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీములను, చీజ్‌లను పరిమితంగా వాడండి. స్కీమ్డ్‌ పాలు, కొవ్వులేని పెరుగు, చీజ్‌లను ఎన్నుకోవడం ఉత్తమం.

06:47 - April 18, 2016

మొహాలీ : టీ ట్వంటీ మ్యాచ్‌ల్లోని అసలు మజా ఏంటో మరోసారి నిన్న రాత్రి జరిగిన బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్‌లో కనిపించింది. క్వింటన్ డికాక్‌ సూపర్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ డేర్‌ డెవిల్స్... రాయల్ చాలెంజర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఐపిఎల్ సీజన్‌లో డికాక్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ 5 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గేల్ పరుగులేవీ చేయకుండానే పెవిలియన్ చేరినా విరాట్ కోహ్లీ చెలరేగి ఆడడం... అతనికి డివిలియర్స్ తోడవడంతో బెంగళూరు భారీ స్కోర్ నమోదు చేసింది. కోహ్లీ 48 బంతుల్లో 79 పరుగులు, డివిలియర్స్ 33 బంతుల్లో 55, వాట్సన్‌ 19 బాల్స్ ఆడి 33 రన్స్‌ చేశారు. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ క్వింటన్‌ డికాక్‌ సూపర్ సెంచరీతో అలవోకగా విజయం సాధించింది. డికాక్‌ 51 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి వీక్షకులకు వినోదాన్ని పంచాడు. డికాక్‌తోపాటు కరుణ్‌ నాయర్ ఫార్టీ టూ బాల్స్ ఆడి 54 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఎటాకింగ్‌ గేమ్‌తో ఢిల్లీ డేర్ డెవిల్స్ 19.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా బెంగళూరుపై 8 మ్యాచ్‌ల తర్వాత ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ఇదే తొలి విజయం.   

06:44 - April 18, 2016

ఢిల్లీ : టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఇంటివాడయ్యాడు. రివా సోలంకితో కలిసి ఏడడుగులేశాడు. ఉత్తర భారతీయ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహం ఆద్యంతం సందడిగా జరిగింది. అయితే పెళ్లి వేడుకల్లో జడేజా బంధువులు తుపాకీ పేల్చడం వివాదాస్పదమైంది. ఎంత పెళ్లి సందడైనా తుపాకీతో కాల్పులు ఎందుకు జరిపారంటూ పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యారు. గత ఫిబ్రవరి మొదటివారంలో రవీంద్ర జడేజా... రివా సోలంకిల ఎంగేజ్‌మెంట్ జరిగింది. అందులో భాగంగా శనివారం నుంచి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి జరిగిన సంగీత్‌లో జడేజా కత్తిపట్టి విన్యాసాలు చేశాడు. కేవలం క్రికెట్‌ బ్యాటే కాదు కత్తినీ అలవోకగా తిప్పగలనంటూ సంగీత్‌లో సందడి చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆదివారం జరిగిన బరాత్‌లో ఫైరింగే వివాదాస్పదమైంది.

శిక్ష పడుతుందా ? 
జడేజా పెళ్లి వేడుకల్లో భాగంగా బంధువులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. నాలుగైదు సార్లు గాల్లోకి కాల్పులు జరిపి హల్‌చల్‌ చేశారు. అది లైసెన్స్‌డు తుపాకే అయినా ఇష్టానుసారంగా కాల్పులు జరపడం చట్ట విరుద్ధమే అవుతుందని బంధువులు తీరిగ్గా తెలుసుకున్నారు. ఫైరింగ్‌ విషయం తెలుసుకున్న లోధిక స్టేషన్ ఎస్‌ఐ బరాత్‌కు వచ్చారు. కాల్పులు జరపడంపై ఆరా తీశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించారు. లైసెన్స్ కలిగిన తుపాకితో కాల్పులు జరిపినా నేరమే అవుతుందని ఎస్‌ఐ తెలిపారు. కేవలం ఆత్మ రక్షణ వేళల్లోనే తుపాకిని కాల్చాలని ఇష్టానుసారంగా ఇలా కాల్పులు జరపడం శిక్షార్హమని అన్నారు. అయితే నేరం రుజువైతే మాత్రం సంబంధిత వ్యక్తికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంటుందని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే వీడియో ఫుటేజీలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో నిందితుడికి శిక్ష పడుతుందా లేక జడేజా తన పరపతితో మేనేజ్ చేస్తాడా అనే చర్చా మొదలైంది. 

06:42 - April 18, 2016

అమెరికా : మిత్రుల మధ్య అగ్గిరాజుకుంది. పరిస్థితి సై అంటే సై అనే వరకు వెళ్లింది. సారభౌమత్వపు అంశం ఇద్దరు మిత్రుల మధ్య తగవుకు కారణమైంది. ఇంతకీ ఏవా రెండు దేశాలు. వారి మధ్య పొడచూపిన వైరమేంటి..? గల్భ్ యుద్ధ కాలం నుంచి బలమైన మిత్రులుగా ఉన్న అమెరికా-సౌదీ అరేబియాల మధ్య అనూహ్యంగా దూరం పెరుగుతోంది. ఇన్నాళ్లు స్నేహితులుగా చెట్టాపట్టాలు వేసుకున్న ఇరుదేశాలు ఇప్పుడు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. 9/11 దాడులకు సంబంధించిన కేసులకు సంబంధించి అమెరికా రూపొందించిన బిల్లు సమస్యకు మూలకారణమైంది. ఈ బిల్లును ఒకవేళ కాంగ్రెస్ ఆమోదిస్తే అమెరికాలో తమకున్న 750 బిలియన్ డాలర్ల ఆస్తులను తెగనమ్ముతామని సౌదీ అరేబియా విదేశాంగశాఖ మంత్రి అబ్దెల్ అల్ జుబీర్ హెచ్చరించారు. అమెరికా కోర్టులు ఆ ఆస్తులను స్తంభింపచేయకముందే ఈ చర్యలకు దిగుతామని తెలిపారు.

జాబితాలో సౌదీ అధికారుల పేర్లు..
అమెరికా కాంగ్రెస్ సభ్యులు కొందరు.. 2001లో జరిగిన సెప్టెంబర్ 11 దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉపకరించేలా ఒక బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఉగ్రవాదులకు సహకరించారనే ఆరోపణపై ఆయా దేశాలకు చెందిన అధికారులను విచారించే అధికారం అమెరికాకు లభిస్తుంది. వీరిలో సౌదీ అరేబియాకు చెందిన అధికారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సౌదీ అరేబియా ఆ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని హెచ్చరిస్తోంది. అలా చేస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, మరో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని వాదిస్తోంది.

ఆస్తులు అమ్ముకుంటే సౌదీకే ప్రమాదం..
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా.. బుధవారం సౌదీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే చర్చల్లో బిల్లు అంశం కూడా చర్చకు రానున్నట్టు సమాచారం. అధికారిక అజెండాలో లేకపోయినా.. చర్చల్లో ఈ అంశమే కీలకం కానుంది. అటు సౌదీ అధికారులు.. 9/11 దాడులతో సౌదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఒకవేళ సౌదీ తమ ఆస్తులు అమ్ముకోవాలని నిర్ణయిస్తే అది ఆ దేశానికే ప్రమాదమంటున్నారు ఆర్థికవేత్తలు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను కూడా దిగజారుస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా... మిత్ర దేశాల మధ్య వాతావరణం మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడం చర్చనీయాంశంగా మారింది. 

06:37 - April 18, 2016

నిజామాబాద్ : వారంతా తీవ్రమైన సమస్యతో బాధపడేవారు. ఆ సమస్యే వారిని సమాజానికి దూరంగా వెలివేసినట్లుగా జీవించేలా చేసింది. అయితేనేం వారే మాత్రం అధైర్యపడలేదు. తమకంటూ ఓ గ్రామాన్ని ఏర్పరచుకున్నారు. మౌలిక వసతులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందకున్నా బాధలన్నింటినీ పక్కన పెట్టి సంతోషంగా జీవిస్తున్నారు. మిగతా టైంలో పట్టించుకోని నాయకులు ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు దండుకోవడానికి వాలిపోతారు. ప్రభుత్వ పరంగా తమకు ఎలాంటి న్యాయం జరగట్లేదన్న ఆ గ్రామస్తులపై టెన్‌ టివి ప్రత్యేక కథనం..

శారీరక సమస్య..
వారంతా అతిపెద్ద శారీరక సమస్యతో బాధపడుతున్నారు..ఆ సమస్య అయినవారి నుంచి దూరం చేసినా బాధను దిగమింగి కాలం గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం.. దేవనగర్ క్యాంపు. దేశంలోని కుఘ్టవ్యాధిగ్రస్తులకు కేరాఫ్ ఆడ్రస్ ఈ గ్రామం. 1990 లో ఇక్కడ ఈ.ఎస్.ఐ. అధ్వర్యంలో ఆస్పత్రి ఉండేది. పక్క జిల్లాల నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి చికిత్స కోసం ఇక్కడికి వచ్చేవారు. వ్యాధి నయం అయిన తరువాత తమ ఇళ్లకు వెళితే చీత్కారాలు, అవమానాలు.. ఇవన్నీ భరించలేక తిరిగి ఇక్కడికే వచ్చేవారు. ఇలా వచ్చిన వారంతా కలిసి ఆసుపత్రి వద్ద ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

కలెక్టరేట్‌ను ముట్టడించి లక్ష్య సాధన..
దేవనగర్ తొలుత అమృతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. అయితే వీరక్కడ ఉండటానికి గ్రామస్తులు నిరాకరించారు. అన్యాయంగా వీరి గుడిసెలను తొలగించారు. ఇంత జరిగినా ఈ బాధితులు ధైర్యం కోల్పోలేదు. అంతా కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించి చివరికి తమ లక్ష్యాన్ని సాధించారు. అప్పటి నుంచి ఈ ఊరు కుఘ్ట వ్యాధిగ్రస్తుల గ్రామంగా మారిపోయింది. ఈ గ్రామం విభిన్న సంస్కృతుల, భాషల నిలయం. వీరి జీవన విధానం విషయానికొస్తే రోడ్డెక్కనిదే పొట్టగడవదు. ఎవరో ఒకరు రూపాయి ఇవ్వకపోతారా అనే ఆశ వీళ్లను బతికిస్తుంది. వచ్చేపోయే వాహనదారుల వద్ద భిక్షాటన చేస్తూ పొట్టనింపుకుంటున్నారు. చేతికి వేళ్లు లేకపొవటంతో ఇప్పటికీ చాలా మందికి ఆధార్ కార్డులు రాలేదు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి. కేవలం 500 రూపాయల పెన్షన్ మాత్రమే నెలనెలా వస్తోంది. ఉన్నత చదువులు చదివిన వారూ ఈ క్యాంపులో ఉన్నారు.

కుటుంబ సభ్యులకు దూరంగా జీవనం..
జీవిత కాలం వేధించే అనారోగ్య సమస్యతో వీరంతా బాధపడుతున్నారు. ఒక్క పెన్షన్‌ తప్పించి ఏ ప్రభుత్వ పథకమూ వీరికి అందట్లేదు. అయితే ఎన్నికల టైంలో నేతలు మాత్రం ఓట్ల కోసం వీరివద్దకు వచ్చి లెక్కలేనన్ని హామీలు ఇచ్చి వెళ్తుంటారు. కానీ వాటిల్లో ఏ ఒక్కటీ అమలు కావట్లేదు. ఇలా ప్రభుత్వ ఆదరణకు నోచుకోక కుటుంబ సభ్యులూ పట్టించుకోక వివిధ రకాల బాధలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆ బాధలు మర్చిపోవడానికన్నట్లు వ్యాధిగ్రస్తులందరూ ఒకే చోట చేరి ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు. అయితే ఏ పనీ చేయలేక రోడ్డు మీద భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీయాల్సి రావడమే వీరిని ఆవేదన కలిగిస్తోంది. ఏ ఉపాధీ లేని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. 

06:33 - April 18, 2016

ఢిల్లీ : తెలంగాణలో అధికార పక్షానికి ప్రత్యమ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకీ పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ జీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన లక్ష్మణ్‌ ఢిల్లీలో వెంకయ్య నాయుడుని కలిశారు. లక్ష్మణ్‌ అనుభవం,సామర్థ్యం గల నాయకుడన్నారు. రాష్ట్రంలో సమస్యలపై పోరాడాలని లక్ష్మణ్‌కు వెంకయ్య సూచించారు. విభజన చట్టం బిల్లుపై కసరత్తు జరుగుతోందని.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపును న్యాయశాఖ పరిశీలిస్తుందన్నారు. దీనిపై ఇప్పటికే హోంమంత్రితో చర్చించామని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో విభజన బిల్లును పార్లమెంట్‌లో తీసుకువస్తామన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తామన్నారు.

06:31 - April 18, 2016

మహబూబ్ నగర్ : రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కుల అమలుకు నిరంతర ఉద్యమాలు చేపడుతున్న గిరిజన సంఘం తొలి మహాసభలు రెండో రోజుకు చేరాయి. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరుగుతున్న ఈ మహాసభల్లో నేతలు పలు అంశాలపై చర్చించారు. ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పలు నిర్ణయాలు చేశారు. గిరిజన సంస్కృతి పరిరక్షణ, స్వయంపాలన హక్కుల కోసం పోరాటం చేస్తోన్న గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా త్రిపుర ఎంపీ జతిన్‌చౌదరి, మిడియం బాబారావు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్‌ హాజరయ్యారు.

కేంద్రంపై త్రిపుర ఎంపీ విమర్శలు...
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని నేతలు ప్రభుత్వాన్ని కోరనున్నారు. 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం అమల్లోకి తేవడం, గిరిజన ప్రాంతాల్లో వలసలను ఆపి, ఉపాధి కల్పనకు కృషి చెయ్యాలని సర్కార్‌ను కోరనున్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడం.. తదితర డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. గిరిజనుల అభివృద్ధికి కట్టబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు చేపట్టడం లేదని త్రిపుర ఎంపీ జతిన్‌చౌదరి విమర్శించారు. ఒకవైపు కరవు ఏర్పడుతుంటే మరోవైపు ప్రభుత్వ పథకాలలో కోతలు విధిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రతిఏటా యువకులకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదిని అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. 

06:28 - April 18, 2016

విజయవాడ : మంత్రిగారి ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు ఎలా ఉండాలి? మిగతా కళాశాలలకు ఆదర్శంగా ఉండాలి.. నిబంధనలు కచ్చితంగా పాటించాలి.. కానీ ఆచరణలో అంతా రివర్స్ అవుతోంది.. విజయవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా నివాసాలమధ్య కాలేజీ స్థాపనకు సిద్ధమైంది నారాయణ యాజమాన్యం. మంత్రిగారి అండతో ముందుకు సాగాలని ప్రయత్నించింది. అయితే స్థానికులు అడ్డుకోవడంతో ఈ ప్రయత్నానికి బ్రేక్‌ పడింది. నారాయణ విద్యా సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. విజయవాడ భవానీపురంలో కనీస వసతులు లేని ఓ అపార్ట్‌మెంట్లో ఈ కాలేజీ ప్రారంభానికి యాజమాన్యం సిద్ధమైంది. రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో ఇరుకిరుకు గదులమధ్య ఎలాంటి ఫైర్‌ సేఫ్టీలేని ప్రదేశంలో కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నించింది. కొందరు విద్యార్థుల్ని కూడా చేర్చుకుంది. ఇంతలో విషయం తెలుసుకున్న స్థానికులు ఇక్కడ కాలేజీ వద్దంటూ ఆందోళనకు దిగారు.

పోరాటం తప్పదంటున్న స్థానికులు..
గతంలో ఇదే అపార్ట్‌మెంట్లో ఓ స్కూల్‌ స్థాపనకు కొందరు ప్రయత్నించారు. స్థానికుల నిరసనతో స్కూల్‌ యాజమాన్యం వెనక్కితగ్గింది. ఇప్పుడు నారాయణ కాలేజీవారు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నివాసాలమధ్య తక్కువ ధరకు రూంలు దొరుకుతాయని ఈ ప్లాన్‌ వేశారు. ఈ విషయం బయటకు రావడంతో మళ్లీ స్థానికులు అడ్డుకున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల పరిస్థితి ఏంటని విద్యాశాఖ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. విశాలమైన స్థలంలో అన్ని సౌకర్యాలమధ్య పాఠాలు చెబితేనే విద్యార్థులు ఆసక్తిగా వినే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంతా నాలుగు గోడలమధ్య బట్టీ విధానంలో చదువు సాగుతోంది. ఇలాంటి వాటికి స్వస్తిచెప్పి మిగతా కాలేజీలకు ఆదర్శంగా నిలవాల్సిందిపోయి మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని కళాశాలలు కూడా ఇదే బాటలో సాగుతున్నాయి. మంత్రిగారి కాలేజీఅని అధికారులుకూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలొస్తున్నాయి. వెంటనే ఈ కాలేజీని మూసివేయించాలని లేకపోతే పోరాటం తప్పవని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 

06:25 - April 18, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్ మరోసారి దుమారం రేపుతోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన శాసనసభ్యులు గులాబి గూటికి చేరుకుంటుండడంతో జిల్లాల్లో పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోతున్నాయి. గత వారం కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో మొదలైన అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల యుద్ధం అంతకంతకూ పెరిగిపోతోంది. ఒక్కసారిగా గులాబీ అధినేత వలసలకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రత్యర్థి పార్టీల్లో కలవరం మొదలైంది. గత వారం మధ్యలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే... స్వయాన మాజీ మంత్రి డికె అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి... టిఆర్‌ఎస్‌లో చేరడంతో టి పాలిటిక్స్‌లో మళ్లీ అలజడి మొదలైంది. టిఆర్‌ఎస్‌లో చేరిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిన్నమొన్నటి వరకు అక్క అడుగు జాడల్లో నడిచారు. అలాంటిది ఆ కుటుంబంపైనా ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావం పడడం కాంగ్రెస్ కూటమిలో హీట్‌ పుట్టిస్తోంది.

వైరి పార్టీ నేతలయిన అక్కా తమ్ముళ్లు..
నిన్నమొన్నటిదాకా ఒకే పార్టీకి చెందిన అక్కా తమ్ముళ్లిద్దరూ ఇప్పుడు పరస్పరం వైరి పార్టీ నేతలయ్యారు. ప్రస్తుతం అధికార టిఆర్‌ఎస్‌... పాలమూరు జిల్లాలో శాసనసభ్యుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఒక సమయంలో డికె అరుణ సహా మరో ఇద్దరు శాసనసభ్యులు గులాబి గూటికి చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటి సమయంలోనే డికె అరుణ సోదరుడు, మక్తల్ శాసనసభ్యుడు అయిన చిట్టెం రామ్మెహన్ రెడ్డి అందరికంటే ముందుగానే కారెక్కేశారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిలో ఒకరు కారెక్కడం రాజకీయంగా కలకలం రేపుతోంది. టిఆర్ఎస్ వ్యవహార ధోరణి... ఆ పార్టీ అధినేత వైఖరిపై మాజీ మంత్రి అరుణ మండిపడుతున్నారు. ప్రభుత్వం అవినీతికి పెద్ద పీట వేస్తోందని జిల్లా సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపణలు ఎక్కుపెట్టారు.

మాటల యుద్ధం..
దీంతో అధికార పార్టీ నేతలు కూడా తామేమీ తక్కువ కాదంటూ మాటల యుద్ధానికి తెరదీస్తున్నారు. ముందు మాజీ మంత్రి అరుణ నిజాయతీ గురించి మాట్లాడడం మానుకోవాలంటూ విమర్శలు అందుకున్నారు. మొత్తం మీద వలసల దుమారం పాలమూరు జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. రేపు ఏ ఎమ్మెల్యే కారెక్కుతారో అంటూ జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. 

06:22 - April 18, 2016

హైదరాబాద్ : కొన్ని రోజులుగా ఎండ వేడిమితో తల్లడిల్లుతున్న జంటనగర వాసులకు కొంత ఉపశమనం లభించింది. రోజు చెమటతో తడిసిముద్దవుతున్న నగర వాసులను సండే సాయంత్రం చిరుజల్లులు తడిపేశాయి. వర్షం రాకతో.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా చోట్ల ప్రజలు వర్షంలో చిందులు వేసి తమ హర్షాన్ని ప్రకటించారు. మధ్యాహ్నం వరకూ.. చండ ప్రచండంగా భానుడు నిప్పులు కురిపించాడు. అంతలోనే ఒక్కసారిగా కమ్ముకొచ్చిన కరిమబ్బులతో.. వాతావరణం చల్లబడింది. వడగాలుల స్థానే శీతల పవనాలు వీచాయి. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వాతావరణంలో మార్పు కారణంగా.. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. ఉక్కబోతతో తల్లడిల్లిన నగర ప్రజలు.. ముఖ్యంగా పిల్లలు.. వర్షంలో తడిసి సేదదీరారు. బోడుప్పల్, ఉప్పల్, రామాంతాపూర్, హబ్సిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్ ప్రాంతాలలోనూ భారీ వర్షం కురిసింది. దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్, శివారు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. చేవెళ్లలో ఓ మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలనూ చిరుజల్లులు పలకరించాయి. కొద్ది రోజులుగా పెరిగిన ఎండలతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న జనం.. ఒక్కసారిగా చిరుజల్లులతో పాటు పలుకరించిన చల్లటి గాలులతో వారాంతాన్ని ఆస్వాదించారు.

నష్టాలు..
ఇదిలా ఉంటే.. ఎల్బీనగర్ లో ఈదురు గాలులకు పలు చోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. వేగంగా వీచిన ఈదురుగాలులకు కన్ స్ర్టక్షన్ లో ఉన్న సెంట్రింగ్ కర్రలు విరిగి కారు ధ్వంసమైంది. మరోవైపు కరీంనగర్‌ జిల్లా లో పిడుగుపాటు, ఈదురుగాలులకు ప్రజలు భయకంపితులయ్యారు. సర్దర్‌పూర్‌ గ్రామంలో పిడుగుపాటుకు ఎకరం పంట పొలం, రెండు ఎకరాల తాటి, ఈత వనం దగ్ధం అయ్యాయి. ఈతవనంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 25 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. దాదాపు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం జిల్లెల్ల గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. స్థానిక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఉపాధి కోల్పోయి, పిడుపాటు వల్ల ఆస్థి కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

06:19 - April 18, 2016

విశాఖపట్టణం : ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షుడు అమర్‌నాథ్‌ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాత్రి గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 20న వైసిపి అధినేత జగన్‌ దీక్షా స్థలికి వస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు దీక్షను భగ్నం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అమర్‌నాథ్‌రెడ్డి బీపీ లెవల్స్ తగ్గిపోయాయని ఆయన ఆరోగ్యం క్షీణించినందునే దీక్ష భగ్నం చేసినట్లు చెబుతున్నారు. 
రైల్వే జోన్ కోసం గత మూడు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

నగరంలో చిరు జల్లులు...

హైదరాబాద్ : సోమవారం తెల్లవారుజామున నగరంలో చిరు జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో బాధ పడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. 

అమర్ నాథ్ దీక్ష భగ్నం..

విశాఖపట్టణం : వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే జోన్ కోసం గత మూడు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అమర్ నాథ్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

లోయలో పడిన బస్సు..25 మంది మృతి..

ఒడిషా : డియోగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి లోయలో బస్సు పడిపోయింది. 25 మంది మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

బెంగళూరు జట్టుపై ఢిల్లీ జట్టు విజయం..

మొహాలీ : ఐపీఎల్ 9లో బెంగళూరు జట్టుపై ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ గెలుపొందింది. బెంగళూరు స్కోర్ 191/5..ఢిల్లీ స్కోర్ 192/3..

నేడు ఎపీ ఎంసెట్ పై మంత్రి గంటా సమీక్ష...

విజయవాడ : నేడు ఏపీ ఎంసెట్ పై మంత్రి గంటా శ్రీనివాస రావు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంసెట్ సమన్వయ కర్తలు హాజరు కానున్నారు. 

నల్గొండలో నేటి నుండి సీపీఎం కరవు యాత్ర...

నల్గొండ : నేటి నుండి 22 వరకు జిల్లాలో సీపీఎం కరవు యాత్ర చేపట్టనుంది. తిప్పర్తి మండలంలో యాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించనున్నారు.

కొత్తపేటలో భవన నిర్మాణంలో ప్రమాదం...

హైదరాబాద్ : చైతన్యపురి పీఎస్ పరిధిలోని కొత్తపేట స్సైసీ హబ్ రెస్టారెంట్ భవన నిర్మాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఐదో ఫ్లోర్ నుండి సెంట్రింగ్ కర్రలు కిందపడడంతో ఐదు కార్లు, ఆటో, రెండు బైక్ లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

కోడుమూరులో టిడిపి - కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ..

కర్నూలు : కోడుమూరు మండలం ఆమరగుంట్లలో టిడిపి - కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

 

Don't Miss