Activities calendar

21 April 2016

22:12 - April 21, 2016

అనంతపురం : సమస్యలను పరిష్కరించాలని అడిగిన పాపానికి గొడ్డును బాదినట్లు బదారు. రౌడీళ్లా ప్రవర్తించారు. సీఎం సభ, పోలీసుల సాక్షిగా విచక్షణారహితంగా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. చొక్కా చించారు. సీఎం చంద్రబాబు సభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపిన అనంతపురం జిల్లా సీఐటీయూ నేత వెంకట్ నారాయణపై టీడీపీ నేత మన్సూర్ అహ్మద్ తోపాటు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కొడికొండలో నిర్వహించిన సీఎం సభలో వెంకట్ నారాయణ నిరసన తెలిపారు. దీంతో టీడీపీ కార్యక్తర్తలు అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా కవరేజ్ చేస్తున్న కెమెరామెన్ ను సైతం మన్సూర్ అహ్మద్ బెదిరించారు. పోలీసులు మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. ప్రేక్షకపాత్ర వహించారు.
వెంకట్ నారాయణ..
పరిగి ఎస్ ఐ కావాలని అక్కడున్న టీడీపీ కార్యకర్తలను నాపైకి దాడికి ఉసిగొల్పారు. నన్ను తీవ్రంగా కొట్టారు. 
సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్... 
సీఎం సభలో గందరగోళం సృష్టించడానికి వెంకట్ నారాయణ వెళ్లలేదు. సమస్యలు విన్నవించుకోవడానికి వెళ్లాడు. సీఎం చెప్పుకుందామని వెళ్లారు. కానీ అతనిపై టీడీపీ కార్యకర్తల దాడి చాలా దుర్మార్గం. టీడీపీ రౌడీరాజ్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. వెంకట్ నారాయణపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి. అలాగే అరెస్టు చేసిన మహిళలను విడుదల చేయాలి. పరిగి ఎస్ ఐ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నాడు. అతన్ని సస్పెండ్ చేయాలి. కంపెనీ కుక్కల్లా సెక్యూరిటీ గార్డులు వ్యవహరిస్తున్నారు. 

 

21:48 - April 21, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో ప్రత్యేక ఆహ్వానం అందించింది. జూన్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కాలిఫోర్నియా గవర్నర్‌ ఆహ్వానం పంపారు. వాతావరణ మార్పులకు సంబంధించి శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే సమావేశ ఆహ్వాన పత్రికను మంత్రి కేటీఆర్‌కు కాలిఫోర్నియా అసిస్టెంట్ సెక్రటరీ అందజేశారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కాలిఫోర్నియా అధికారులకు మంత్రి వివరించారు. తెలంగాణలోని వ్యాపార అవకాశాలను ఈ భేటీలో చర్చించారు. 

 

21:46 - April 21, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ అంశంపై నాలుగు గంటల పాటు వాదనలు సాగాయి. సభకు క్షమాపణలు చెప్తూ  స్పీకర్‌కు, ప్రివిలేజ్‌ కమిటీకి లేఖ రాయాలనీ సుప్రీంకోర్టు రోజాకు సూచించింది. సస్పెన్షన్‌పై సభదే తుది నిర్ణయమని కోర్టు వ్యాఖ్యానించింది. 
ఏడాది పాటు సస్పెండ్ అయిన రోజా 
గత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తన వ్యవహారశైలి కారణంగా ఏడాది పాటు సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం రాజీ దిశగా ముందుకు వెళ్తోంది. కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించుకోవాలని సూచించింది. రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె వాదించారు. రోజాకు తన వివరణ ఇచ్చే అవకాశం లేకుండా అప్రజాస్వామికంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. సభ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేను తొలగించాలని ఆమె కోరారు. 
ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు 
కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సభ హుందాగా నడవాలని, వ్యక్తిగత దూషణలు లేకుండా చర్చలు జరగాలని సూచించింది.  ఎవరైనా ఒకరిని బాధించేలా మాట్లాడితే మరుక్షణమే క్షమాపణ కోరతారని, ఇది నాగరిక సమాజంలో సహజమని. అయితే రోజా మాత్రం ఇంతవరకు ఎలాంటి క్షమాపణ కోరలేదని, పైగా దూషించడం తన హక్కు అన్నట్టుగా వ్యవహరించారని అసెంబ్లీ తరఫు న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపించారు. రోజా క్షమాపణ కోరుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇస్తూ లేఖ ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. సభలో సామరస్య వాతావరణం ఉండాలని.. శాసన వ్యవస్థలో సభే సుప్రీం అని తెలిపింది.
విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు...
సుదీర్ఘ వాదనలు విన్నకోర్టు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సభ, ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముందు ఎన్నో సవాళ్లున్నాయని, రాష్ట్రం ముందు ఇన్ని సవాళ్లు ఉంటే.. చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చేసుకుంటూ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించింది.  అదే సమయంలో ప్రభుత్వాన్ని ఒప్పించైనా సరే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారించేలా చూడాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి సూచించింది. 
క్షమాపణలా...రాజీనా..? 
వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్న రోజా... సభ తనను మన్నించి సమస్యను ఇంతటితో ముగిస్తారని భావిస్తున్నానన్నారు...ఇప్పటికే అధికార పక్షం క్షమాపణలకు పట్టుబడుతుండటంతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో క్షమాపణలా...రాజీనా అనేది శుక్రవారం తుది తీర్పుతో తేలిపోనుంది. 

 

21:39 - April 21, 2016

చరిత్ర పొడవునా వెలిగించిన కాంతి శిఖరం.. ఎక్కడి దొరికింది.? ఎలా చేతులు మారింది..? కోహినూర్ తిరిగి మనదేశానికి వస్తుందా.? మొగల్ సామ్రాజ్యంలో అంతులేని ప్రకాశం..!!, విక్టోరియా రాణి కిరీటంలో ధగధగలు..!! ఇదే అంశంపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

నిజామాబాద్  : జిల్లాలోని ఆర్మూరు మండలం చేపూర్ శివారుల్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐషర్ వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మంటలు చెలరేగడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

నాలుగో వికెట్ కోల్పయిన గుజరాత్ లయన్

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా గుజరాత్‌ లయన్స్‌, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్‌ లయన్ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

21:30 - April 21, 2016

పాలేరుల ఉప ఎన్నికల లొల్లి.. పెద్ద లీడర్లొచ్చి తిరుగుతరట గల్లీ గల్లీ, కప్పు, సాసర్ కథ చెప్పిన కవితక్క.... చెరువుల మీద చమత్కారం మాటలు, మంచినీళ్ల కోసం ఎనిమిదేండ్లా..?! కుతకుత ఉడుకుతున్న పిడుగురాళ్ల, షాదీముబారక్ పథకానికి షాకింగ్ న్యూస్... పదహారు పెండ్లిళ్లు చేసుకున్న నయా నవాబ్, చిమ్మన చీకట్ల చంద్రునికి గులాబీ రంగు.. అర్ధరాత్రి అట్లెట్ల మార్తడు ఆకాశంల కింగ్, తెలంగాణ క్యాంపు ఆఫీస్ ల సీమసింహం.. కేసీఆర్ చాయనీళ్లిచ్చి తీర్చిండు దాహం.. ఈ అంశాలంపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....
 

జేమ్స్‌బాండ్‌ డైరెక్టర్ హామిల్టన్‌ కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం జేమ్స్‌బాండ్‌ దర్శకుడు హామిల్టన్‌ గురువారం కన్నుమూశారు. స్పెయిన్‌లోని మలోర్కలో ఆయన తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 93 సంవత్సరాలు. జేమ్స్‌బాండ్‌ సిరీస్‌ నుంచి విడుదలైన నాలుగు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

పాలేరు ఉప ఎన్నికలో పోలింగ్ సమయం పొడిగింపు : కలెక్టర్

ఖమ్మం : జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికలో పోలింగ్ సమయాన్ని పొడిగించినట్లు కలెక్టర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఉపఎన్నిక నిర్వహణపై ఆయన వివరాలను వెల్లడించారు. ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల. 29 వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ. 30న నామినేషన్ల పరిశీలన. ఉపసంహరణకు మే 2 తుది గడువు. మే 16న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహణ. వచ్చే నెల 19వ తేదీని ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

ఒమన్ లో భారత వివాహిత దారుణ హత్య

హైదరాబాద్‌ : ఒమన్ లో భారతదేశానికి చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే...కేరళకు చెందిన చిక్కురాబర్ట్ కు నాలుగు నెలల క్రితం వివాహం అయింది. భర్తతో కలిసి ఆమె ఒమన్ లోని దొఫార్ ప్రావిన్స్ లోని సలాలాహ్ నగరంలో గల బదర్ అల్ సమా ఆసుపత్రిలో పని చేస్తోంది. బుధవారం సాయంత్రం పదిగంటల సమయంలో విధుల నుంచి తాము ఉంటున్న అపార్ట్ మెంట్ కు చేరుకున్న ఆమె నేటి ఉదయం విధులకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆసుపత్రికి రావాల్సిన భార్య విధులకు హాజరుకాకపోవడంతో ఇంటికి చేరుకున్న భర్తకు అపార్ట్ మెంట్లో ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసులు దాడి

నల్లగొండ : నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన జిల్లాలోని చర్లపల్లిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి  ఫీల్డింగ్‌ ఎంచుకున్నా సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ లయన్ 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి : కేజ్రీవాల్‌

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై డిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్‌ విమర్శ చేసారు. మోడీ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికర సమయం. ఇకనైనా ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకోకుండా.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలిని అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

20:54 - April 21, 2016

భారత జిమ్నాస్ట్ దీప కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ అర్హత కోసం రియోలో ముగిసిన పోటీల్లో బంగారు పతకం సాధించడంతో పాటు 2016 ఒలింపిక్స్ కు సైతం బెర్త్ ఖాయం చేసుకొంది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళగా రికార్డుల్లో చేరిన త్రిపుర రాష్ట్ర మెరుపుతీగ ,వాల్టింగ్ వండర్ దీప కర్మాకర్ పై...10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్........
రబ్బరు బంతిలా గాల్లో ఎగురుతూ.. 
రబ్బరు బంతిలా గాల్లో ఎగురుతూ, విన్యాసాలు చేస్తూ...స్ర్పింగులా మెలికలు తిరిగిపోతూ సాగే ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ అనగానే.. అమెరికా, రష్యా, ఉక్రెయిన్, చైనా, కొరియా, జపాన్, రుమేనియా లాంటి దేశాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఈ విభాగంలో గత 52 సంవత్సరాలుగా  భారత్ కు చెందిన ఒక్క జిమ్నాస్ట్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేదంటే....ఈ ప్రపంచ క్రీడలో మనపరిస్థితి ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు. 12 దశాబ్దాల ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు చెందిన 11 మంది పురుష జిమ్నాస్ట్ లు మాత్రమే ఒలింపిక్స్ లో పాల్గొన్నట్లుగా గత రికార్డులు చెబుతున్నాయి. 1952 ఒలింపిక్స్ లో ఇద్దరు, 1956 ఒలింపిక్స్ లో ముగ్గురు, 1964 టోక్యో ఒలింపిక్స్ లో ఆరుగురు జిమ్నాస్ట్ లు మాత్రమే పురుషుల విభాగంలో భారత్ కు ప్రాతినిథ్యం వహించారు. 1964 గేమ్స్ తర్వాత..భారత జిమ్నాస్ట్ లు ఒలింపిక్స్ అన్నమాటే మరచిపోయారు. ఇక మహిళల విభాగంలో మాత్రం భారత మహిళలకు ఒలింపిక్స్ బెర్త్ అన్నది ఓ కలగా, అందని ద్రాక్షగానే మిగిలిపోతూ వచ్చింది.
త్రిపురలో దీప జననం...
ఈశాన్య భారతంలోని అతిచిన్నరాష్ట్రాలలో ఒకటైన త్రిపుర రాజధాని అగర్తలలో 22 సంవత్సరాల క్రితం జన్మించిన దీప కర్మాకర్ ఆరేళ్ల చిరుప్రాయంలోనే జిమ్నాస్ట్ గా తన క్రీడాజీవితాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్, రుమేనియా, ఆసియా స్థాయిలో చైనా, జపాన్, కొరియా దేశాల జిమ్నాస్ట్ ల నుంచి అసాధారణ పోటీ ఎదురైనా..దీప ఏమాత్రం నిరాశకు గురికాకుండా తన సాధన కొనసాగించింది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఫ్లోర్ వాల్ట్, అన్ ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఆల్ రౌండ్ విభాగాలలో తన ప్రతిభకు పదును పెట్టుకొంది.
గత పదహారు సంవత్సరాలుగా ప్రస్థానం 
అగర్తల లాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నా.. గత పదహారు సంవత్సరాలుగా అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ లో దీప తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. జల్పాయిగురి వేదికగా 2007లో ముగిసిన జాతీయ జూనియర్ జిమ్నాస్టిక్స్ లో విజేతగా నిలవడం ద్వారా ..దీప కర్మాకర్ తన బంగారు వేట మొదలు పెట్టింది. జాతీయ క్రీడలు, శాఫ్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ క్రీడల్లో పాల్గొంటూ తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకొంటూ వచ్చింది. 
2011 జాతీయక్రీడల్లో దీపకు ఐదు బంగారు పతకాలు 
2011 జాతీయక్రీడల్లో దీప ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ మహిళల వాల్ట్ విభాగంలో దీప కాంస్య పతకం సంపాదించింది. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 4వ స్థానం సాధించడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది. జపాన్ లోని హిరోషిమా వేదికగా జరిగిన 2015 ఆసియా జిమ్నాస్టిక్స్ లో సైతం దీప కంచుమోత మోగించింది. అదే ఏడాది ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించిన తొలి భారత మహిళగా రికార్డుల్లో దీప చోటు సంపాదించింది.
దీప కర్మాకర్ సంచలనం 
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో అత్యంత కష్టమైన, క్లిష్టమైన ప్రుడునోవా వాల్ట్ అనే వినూత్నమైన అంశాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ముగ్గురు ప్రపంచ జిమ్నాస్ట్ ల్లో ఒకరిగా దీప కర్మాకర్ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. బ్రెజిల్ వాణిజ్య నగరం రియో డి జెనీరోలో జరిగే 2016 ఒలింపిక్స్ కు అర్హత కోసం నిర్వహించిన పోటీల్లో దీప ఏకంగా బంగారు పతకం సాధించడంతో పాటు...బెర్త్ ను సైతం ఖాయం చేసుకొంది. వాల్ట్ ఫైనల్స్ లో 14.833 పాయింట్లతో గోల్డెన్ క్వీన్ గా నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్ గా చరిత్ర సృష్టించింది.
దీపపై మోడీ, సచిన్ ప్రశంసలు
దీప ఈ అసాధారణ ఘనతను భారత ప్రధాని నరేంద్ర మోడీ,  క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ప్రముఖంగా ప్రస్తావించడమే కాదు..ప్రశంసల వర్షం కురిపించారు. ఒలింపిక్స్ కు సన్నాహాల కోసం... టాప్ పథకంలో భాగంగా 30 లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని సైతం కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించి తనవంతుగా ప్రోత్సాహించింది. 22 ఏళ్ల జీవితంలో 16 సంవత్సరాలపాటు జిమ్నాస్ట్ గా సాధన చేస్తూ 2009, 2011, 2013, 2014, 2015 ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన దీప కర్మాకర్ ఇప్పటి వరకూ 77 పతకాలు సాధిస్తే..అందులో 67 స్వర్ణపతకాలు ఉండటం విశేషం.
అర్జున పురస్కారానికి దీప ఎంపిక 
భారత్ లో ఏమాత్రం ఆదరణ లేకున్నా..జిమ్నాస్ట్ గా కొనసాగుతూ దేశానికే గర్వకారణంగా నిలిచిన దీపను కేంద్రప్రభుత్వం 2015లో అర్జున పురస్కారానికి ఎంపిక చేసి వెన్నుతట్టి మరీ ప్రోత్సహించింది. భారత మహిళా క్రీడారంగం అంటే కోట్లరూపాయలు ఆర్జిస్తూ... మీడియా దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్ మాత్రమే కాదు...జిమ్నాస్టిక్స్ క్వీన్ దీప కర్మాకర్ కూడా. రియో ఒలింపిక్స్ లో దీప పతకం సాధించినా, సాధించకపోయినా...అర్హత సాధించడమే ఓ గొప్ప ఘనతగా, అసాధారణ విజయంగా మిగిలిపోతుంది.

20:42 - April 21, 2016

కౌలాలంపూర్ : మలేషియాలో అతిపెద్ద కొండ చిలువ లభించింది. ఈ కొండ చిలువ 26 ఫీట్ల పొడవు, 250 కిలోల బరువున్నట్లు అధికారులు వెల్లడించారు. 8 మీటర్ల పొడవున్న ఈ కొండ చిలువ  పెనాంగ్‌ దీవిలో ఓ చెట్టు మీద నుంచి కిందికి పడి పోయింది. ఓ పిల్లకు జన్మనిచ్చిన తర్వాత కొండ చిలువ మరణించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాలోని మిస్సోరిలో 7.6 మీటర్ల పొడవున్న కొండ చిలువ అత్యంత పొడవైనదిగా గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌లో నమోదైంది. అయితే రికార్డ్‌ అధికారులు మలేషియలోని కొండ చిలువను అధికారికంగా లెక్కించలేదు. మలేషియాకు చెందిన అధికారులు మాత్రం ఈ కొండ చిలువే అత్యంత పొడవైనదిగా భావిస్తున్నారు. ఇది చనిపోవడానికి ముందు ప్రభుత్వ వైల్డ్‌ లైఫ్‌ డిపార్ట్‌మెంట్‌కు తరలించారు.

 

20:36 - April 21, 2016

విశాఖ : సముద్ర రవాణాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ఎస్ ఎస్ ఎల్ విశాఖపట్నం భారీ కంటైనర్‌ షిప్‌ను హరిబాబు ప్రారంభించారు. రానున్న రోజుల్లో కంటైనర్స్ రవాణాకు విశాఖ కీలకం కాబోతుందన్నారు. లాజిస్టిక్‌ హబ్‌గా విశాఖ రూపొందుతోందని ఎంపీ అన్నారు. 

 

20:32 - April 21, 2016

విశాఖ : ప్రభుత్వానికి దమ్ము ఉంటే టీడీపీలో చేరిన వైసీసీ ఎమ్మేల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఓ పిల్ల కాకి అని అతని గురించి మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశం పై కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజులలో ప్రభుత్వ విధానాలపై తాము వరుసగా పోరాటాలు చేస్తామన్నారు. ఈనెల 23న సేవ్ డెమొక్రసీ పేరుతోనూ క్యాండిల్ ర్యాలీని నిర్వహించనున్నామని చెప్పారు బొత్స. మే 2న అన్ని మండల కేంద్రాలలో ఖాళీ బిందేలతో మంచినీటి సమస్య మీద అందోళన చేస్తామన్నారు. 

 

20:26 - April 21, 2016

అనంతపురం : జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. కొడికొండలో ఎలక్ట్రానిక్స్ హబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అనంత జిల్లా అభివృద్ధికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తామని చెప్పారు. జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.  జిల్లా టీడీపీకి కంచుకోట లాంటిదని అభివర్ణించారు. రెండు అసెంబ్లీ సీట్లు తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమి మొత్తం హిందూపురం పరిసర ప్రాంతానికి తరలివస్తుందన్నారు. జిల్లా వాసులు నీతి, నిజాయితీ గల్గినవారని కొనియాడారు. జిల్లాలో అధిక మొత్తంలో పేదలున్నారని తెలిపారు. దేశంలోనే ఒక అగ్ర జిల్లాగా అనంతపురం తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామన్నారు. అల్ట్రా సోలార్ మెగా ప్రాజెక్టు ఇక్కడికి వస్తుందన్నారు. జెఎన్ టీయూ వచ్చిందని... త్వరలో సెంట్రల్ యూనివర్సిటీ రాబోతుందని చెప్పారు. హిందూపురంకు పెద్ద ఎత్తున ఇండస్త్రీలు తరలివస్తాయన్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని, మంచినీరు సరఫరా చేస్తామని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని తెలిపారు. 
విభజనతో చాలా నష్టపోయాం... 
హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. విభజనతో చాలా నష్టపోయామన్నారు. విభజన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. సమస్యలను అవకాశంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా వెనక్కి పోలేదన్నారు. భయపడాల్సిన పని లేదని తెలిపారు. హైదరాబాద్ లాగా హిందూపురంను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

హైదరాబాద్ : సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ కాసపట్లో ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

19:25 - April 21, 2016

అనంతపురం : అనంతపురం జిల్లాను అభివృద్ధి చేస్తామని హీరో, హిందూపురం ఎమ్మెల్యే అన్నారు. కొడికొండలో ఎలక్ట్రానిక్స్ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

 

19:13 - April 21, 2016

ఇంట్లో అందరికీ అన్నీ సమయానికి సమకూర్చే గృహిణులు తమ ఆహారం విషయంలో నిర్లక్ష్యం చూపిస్తుంటారు. ఈ నిర్లక్ష్యాన్ని అధిగమించి వారు ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:09 - April 21, 2016

నిజామాబాద్ : కరవు కాటేస్తోంది., వ్యవసాయ పనులు కరువయ్యాయి. కూలీ పనులు దొరక్క వ్యవసాయ కూలీలు, సాగు లేక రైతన్నలు ఆందొళన  చెందుతున్నారు. ఈ తరుణంలో వీరందరికీ ఉపాధి హమీ పనులే దిక్కయ్యాయి. అయితే పనులు చేసే చోట ఎండల నుంచి రక్షణ సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనకన్నా ముఖ్యంగా.. కూలీ డబ్బులు ఎన్నాళ్లకి వస్తాయోనన్న ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. 
జిల్లాలో రెండేళ్లుగా కరవు
నిజామాబాద్‌ జిల్లాలో వరుసగా రెండేళ్లుగా కరవు తాండవిస్తోంది. దీంతో వ్యవసాయ పనుల్లేక కూలీలు.. సేద్యం భారమై రైతులు సతమతమవుతున్నారు. వీరందరిని జాతీయ ఉపాధి హామీ పథకం కొంతమేరకు ఆదుకుంటోంది. పైగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పని దినాలను కూడా వంద నుంచి నూట యాభై రోజులకి పెంచింది. దీంతో రైతులు, కూలీలు పెద్ద ఎత్తున ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 
రెండున్నర లక్షల మందికి జాబ్‌ కార్డులు
నిజామాబాద్‌ జిల్లాలో సుమారు రెండున్నర లక్షల మందికి జాబ్‌ కార్డులున్నాయి. వీరంతా ఉపాధి కోసం కూలి పనులకు వెళుతున్నారు. అయితే అక్కడ నిబంధనల ప్రకారం ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం వీరిని తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తోంది. కూలి పనులు జరిగే ప్రాంతంలో టెంట్లు కానీ, తాగేందుకు మంచినీటి ట్యాంకులు కానీ, ప్రథమ చికిత్స కిట్లు కానీ ఏవీ ఉండడం లేదు. దీంతో.. విపరీతమైన ఉష్ణోగ్రత, వడగాడ్పుల కారణంగా కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైనా.. స్వాంతన చర్యలే ఉండడం లేదు. సమ్మర్ లో ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా తగిన సౌకర్యాలు కల్పించక పోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
చేసిన పనికి డబ్బులు చెల్లించడం లేదు..
ఎన్నో కష్టాలకోర్చి పనులు చేసేది వేతనం కోసమే. అయితే.. జిల్లా అధికారులు.. గడచిన రెండు నెలలుగా.. కూలీలకు చేసిన పనికి డబ్బులు చెల్లించడం లేదు. సుమారు లక్షా తొంబైవేల మందికి రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలన్నీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. సుమారు పదికోట్ల రూపాయల మేర కూలీలకు అందాల్సి ఉంది. అయితే నిధులు విడుదల కానందుకే చెల్లింపుల్లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 
జీవనోపాధికి ఉపాధి హామీ పనులే దిక్కు
మరోవైపు వరుస కరవుల కారణంగా నిజామాబాద్‌ జిల్లా పల్లెల్లో ఇప్పుడు జీవనోపాధికి ఉపాధి హామీ పనులే దిక్కయ్యాయి. దీంతో జాబ్‌ కార్డ్ హోల్డర్ల నుంచి పనుల కోసం డిమాండ్‌ పెరిగింది. పనుల కల్పనతో పాటు.. వాటిని పూర్తి చేసిన వారంలోపు డబ్బులు చెల్లించేలా చూడాలని కూలీలు అధికారులను కోరుతున్నారు. 

 

19:03 - April 21, 2016

హైదరాబాద్ : విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఆధారే అన్నింటికి ఆధారమన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక నుంచి డిగ్రీ ప్రవేశాల్లో ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. దాంతో పాటు డిగ్రీ కోర్సుల్లో ఛాయిస్‌ బేస్డ్ క్రెడిట్‌ సిస్టమ్‌.. సీబీసీఎస్ ను అమల్లోకి తేనుంది. 
డిగ్రీ విద్యావిధానంలో సమూల మార్పులు 
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. డిగ్రీ విద్యావిధానంలో సమూల మార్పులకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అన్ని యూనివర్శిటీల రిజిస్ట్రార్‌లతో పాటు విద్యాశాఖ అధికారులతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సమీక్ష నిర్వహించారు. డిగ్రీ విద్యలో చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టం సీబీసీఎస్ ను అమల్లోకి తేవాలని నిర్ణయించారు. దీంతో ఇకనుంచి అన్నీ కాలేజీల్లో  సెమిస్టర్‌ పద్ధతిలో డిగ్రీ కోర్సులు కొనసాగనున్నాయి.
అన్ని విశ్వవిద్యాలయాలకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు 
ఇకనుంచి ప్రతి యూనివర్సిటీ ఓ యూనిట్‌గా.. కామన్ క్యాలెండర్ ద్వారా అన్ని విశ్వవిద్యాలయాలకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పొందేందుకు ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయబోతున్నారు. ప్రతి అంశానికీ ఆధార్‌ను అనుసంధానించి.. లోపాలకు ఎక్కడికక్కడ చెక్‌ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. స్కాలర్‌షిప్‌, అడ్మిషన్లు, విద్యార్థుల వివరాలు తదితర అంశాల్లో లోపాలు తలెత్తకుండా ఉండాలంటే ఆధారే అన్నింటికి ఆధారమని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. 
ప్రతీ సెమిస్టర్‌లో కనీసం 90 రోజులు పనిదినాలు
ప్రతీ సెమిస్టర్‌లో కనీసం 90 రోజులు పనిదినాలు ఉండేలా చూడాలని, 75% శాతం హాజరు లేని విద్యార్థులను పరీక్షలకు అనుమతించరాదనీ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి అన్ని డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతీరోజు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇక కాలేజీల పనితీరు, అక్కడ జరిగే అంశాల పరిశీలనకు సీసీ కెమెరాలు  కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అదేవిధంగా విద్యార్థుల పరీక్షలు, ఉత్తీర్ణత వివరాలు, డిటైన్ లాంటి అంశాలను కూడా కంప్యూటరైజ్‌ చేయాలని నిర్ణియించారు. అధ్యాపకులు సైతం డైరీని నిర్వహిస్తూ ప్రతినెలా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నూతన పద్దతిలో బోగస్‌ కాలేజీలు, బోగస్‌ విద్యార్థులకు చెక్‌ పెట్టొచ్చన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు బాగానే ఉన్నప్పటికీ.. అది ఎంత వరకు అమల్లోకి వస్తుందన్నది వేచి చూడాల్సిందే.  

 

18:57 - April 21, 2016

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో ఫుడ్‌ సైన్స్ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ 150 మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. పీజీఆర్ సీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో యూనివర్శిటీలో భారీగా పోలీసులను మోహరించారు. ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 8 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. 

 

18:56 - April 21, 2016

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎఐఎడిఎంకెకు చెందిన ఇద్దరు కార్యకర్తలు వడదెబ్బ తగిలి మృతి చెందారు. జయలలిత సేలంలో నిర్వహించిన భారీ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను 55 ఏళ్ల పచియన్నన్, 62 ఏళ్ల పెరియా స్వామిగా స్థానికులు పేర్కొన్నారు. వారిది సహజ మరణమని, సన్‌ స్ట్రోక్‌తో మరణించినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. అయితే వీరి శవాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జయలలిత పట్టపగలు ఎండలో సభ పెట్టడం వల్లే వారు మరణించినట్లు డిఎంకె నేత ఎంకె స్టాలిన్‌ ఆరోపించారు. సోమవారం జయలలిత కడలూరు జిల్లా విరుదాచలంలో నిర్వహించిన సభలో కూడా ఇద్దరు మరణించారు. సేలం సభలో ఎఐఎడిఎంకె తరపున పోటీ చేస్తున్న 50 మంది అభ్యర్థులు ఒకే వేదికపై కనిపించారు.

 

18:48 - April 21, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యంచేస్తోందని మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు.  దేశంలో విద్యా రంగానికి ఖర్చు పెడుతున్న రాష్ట్రాల జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిందని.... ఈ జాబితాలోతెలంగాణ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తానన్న కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. చుట్టుపక్కల  రాష్ట్రాలన్ని విద్యా రంగంలో ముందుంటే మనం మాత్రం వెనకంజలో ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే విద్యారంగంపై కేసీఆర్ సర్కార్ దృష్టి పెట్టాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. 

 

18:45 - April 21, 2016

విజయవాడ : పొలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్  తేవడంలో రాష్ట్ర ప్రభ్వుత్వానికి చిత్తశుద్ధి లేదని వైసీపీ నేత బొత్స సత్సనారాయణ మండిపడ్డారు. ఎండల వేడికి తాగడానికి మంచినీరు లేదంటే మజ్జిగ ఇస్తామంటూ ప్రభుత్వ పథకాల పేరుతో తమ సంస్థలకు లబ్ధి చేకూర్చుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ నేత అమర్ నాథ్ విశాఖ రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహాణదీక్ష చేస్తుంటే తమ పలుకుబడితో ప్రభుత్వం దీక్షభగ్నం చేసిందన్నారు. భవిష్యత్తులో రైల్వేజోన్ సాధన కోసం ఇతర సమస్యలపై వైసీపీ పోరాటం సాగిస్తుందని బొత్స చెప్పారు.    
 

 

ప్రమాదవశాత్తూ బావిలో పడి దంపతుల మృతి

చిత్తూరు : జిల్లాలోని పుంగనూరు మండలం వేపమాకులపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాద వశాత్తూ బావిలో పడి దంపతులు మృతిచెందారు. మణెమ్మ అనే మహిళ బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలో పడింది. భార్యను కాపాడేందుకు బావిలో దిగి గంగులప్ప మృతి చెందాడు.

మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన మహారాష్ట్ర హోంమంత్రి

హైదరాబాద్‌ : మ‌ధ్య ప్ర‌దేశ్‌లో సీనియ‌ర్ నాయ‌కుడు, హోంమంత్రి బాబూలాల్ గౌర్ ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న అక్క‌డ ఏర్పాటు చేసిన ఓ బస్సులో ప‌లువురు ఎక్కుతున్న స‌మ‌యంలో ఒక మ‌హిళ‌ను ఉద్దేశ పూర్వ‌కంగా చేతుల‌తో తాకారు. చుట్టూ కార్య‌క‌ర్త‌లు ఉండ‌డంతో ఎవ‌రికీ క‌నిపించ‌బోద‌నే ఉద్దేశంతో ఓ మ‌హిళ బ‌స్సు ఎక్కుతుండ‌గా ఆమెను ట‌చ్ చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ఓ కెమెరాలో స‌దరు మంత్రిగారి ఈ నీచ ప్ర‌వ‌ర్త‌న రికార్డయింది.

18:32 - April 21, 2016

హైదరాబాద్ : రామగుండం కార్పొరేషన్ ను ఆదర్శ కార్పొరేషన్ గా తయారు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. పలువురు రామగుండం కార్పొరేటర్లు టీఆర్ ఎస్ లో చేశారు. మంత్రి వారిపై గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో రామగుండం కార్పొరేషన్ కు రూ.3 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటలు బాగు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి.. చెరువులను నింపుతామని పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా టీఆర్ ఎస్ అజేయమైన శక్తిగా ఎదుగతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

18:06 - April 21, 2016

నిరక్ష్యరాస్యత, అవగాహన లేమి, అమాయకత్వం అక్కడి డాక్టర్లకు కనక వర్షం కురిపిస్తున్నాయి. గ్రామీణులలో అనవసరమైన భయాలను కల్పించి సొమ్ము చేసుకుంటున్న వైనం దిగ్భాంతి కలిగిస్తోంది. పాపం, పుణ్యం తెలియని చిన్నారుల కడుపులకు కోతలు చేసి అమాయకులను దండుకుంటున్నారు. మూకుమ్మడిగా పేదల ఆరోగ్యంపై దాడి చేసి లక్షలు కూడబెట్టుకుంటున్నారు. 
కాసులకు కక్కుర్తి పడి...
కాసులకు కక్కుర్తి పడి...కమీషన్లకు ఆశపడ్డ వైద్యులు కడుపు కోతలను మొదలు పెట్టారు. కడుపునొప్పి అంటే చాలు 24 గంటల్లో ఆపరేషన్ చేయాల్సిందే అంటూనే డబ్బులను దండుకున్నారు. గ్రామీణ ప్రజల అమాయాకత్వం...నిరక్షరాస్యత కారణంగా అపెండెక్స్ ఆపరేషన్  పేరుతో వందల మంది పిల్లలకు,పెద్దలకు సర్జరీలను చేసిన వైనం ఇది. మందులతో తగ్గిపోయే నొప్పికి సైతం ఆపరేషన్లు చేసి వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు కరీంనగర్ వైద్యులు. పిల్లలకు వచ్చిన కడుపు నొప్పి తగ్గాలనే తాపత్రయంతో వేలాది రూపాయలను వెచ్చించి ప్రైవేటు వైద్యం చేయించారు. ఒకే మండలంలో వందలాదిగా జరిగిన సర్జరీలతో అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదే అంశంపై మానవి ఈ వారం ఫోకస్
నాణ్యమైన వైద్య సేవల కొరత 
ప్రజలలో అవగాహన లేమిని అవకాశవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి నాణ్యమైన వైద్య సేవల కొరత కారణంగా ప్రజలు ఆర్ ఎంపీ, పిఎంపీ వంటి వారి పై ఆధారపడి ప్రాణాలను పణంగా పెడుతున్నారు.  అనవసరమైన ఖర్చులతో ప్రజలను అప్పుల పాలు చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి, ఈ స్థితి మారాలి, వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలి.  ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మానవి కోరుకుంటోంది.

 

17:46 - April 21, 2016

కరీంనగర్ : మెట్ పల్లి పట్టణంలోని సాయి రామ్ కాలనీ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కారం చల్లుకుంటూ ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు రావడంతో ఇరు వర్గాల వారు అక్కడి నుండి పరారయ్యారు. అయితే భూ వివాదాలే ఘర్షణకు కారణమని పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్ లో సైకో హల్ చల్

హైదరాబాద్ : సికింద్రాబాద్ యూకో బ్యాంక్ లో సైకో హల్ చల్ చేశాడు. బ్యాంకు అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడ్డాడు. సైకోను చూసి కస్టమర్లు, ఉద్యోగులు పరుగులు పెట్టారు. బ్యాంకు సిబ్బంది సైకోను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. 

17:41 - April 21, 2016

హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ దే విజయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని తెలిపారు. ప్లీనరీ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరామని పేర్కొన్నారు. 

రోజా సస్పెన్షన్ పై సభదే తుది నిర్ణయమన్న సుప్రీంకోర్టు...

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. రోజా క్షమాపణలను పరిగణనలోకి తీసుకోవాలని సూచింది. రోజా సస్పెన్షన్ పై సభదే తుది నిర్ణయమని కోర్టు తెలిపింది.

నెల్లూరులో డబ్బు, నగలు చోరీ..

నెల్లూరు : జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.  ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అత్తా, కోడలుపై దాడికి పాల్పడ్డారు. డబ్బు, నగలను చోరీ చేశారు. సతీష్, సుభాషిణి దంపతులు. జిల్లా కేంద్రంలో అత్త ఆదిలక్ష్మీతోపాటు సతీష్, సుభాషిణిలు నివాసముంటున్నారు. సతీష్ ఇంట్లోలేని సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. అత్త ఆదిలక్ష్మీ, భార్య సుభాషిణిపై దాడి చేశారు. దీంతో ఆదిలక్ష్మీ తలకు బలమైన గాయాలయ్యాయి. కోడలు స్పృహ కోల్పోయింది. ఇరవై సవర్ల బంగారం, నగలు, డబ్బు దోచుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

17:25 - April 21, 2016

నెల్లూరు : జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.  ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అత్తా, కోడలుపై దాడికి పాల్పడ్డారు. డబ్బు, నగలను చోరీ చేశారు. సతీష్, సుభాషిణి దంపతులు. జిల్లా కేంద్రంలో అత్త ఆదిలక్ష్మీతోపాటు సతీష్, సుభాషిణిలు నివాసముంటున్నారు. సతీష్ ఇంట్లోలేని సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. అత్త ఆదిలక్ష్మీ, భార్య సుభాషిణిపై దాడి చేశారు. దీంతో ఆదిలక్ష్మీ తలకు బలమైన గాయాలయ్యాయి. కోడలు స్పృహ కోల్పోయింది. ఇరవై సవర్ల బంగారం, నగలు, డబ్బు దోచుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

17:03 - April 21, 2016

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. రోజా క్షమాపణలను పరిగణనలోకి తీసుకోవాలని సూచింది. రోజా సస్పెన్షన్ పై సభదే తుది నిర్ణయమని కోర్టు తెలిపింది. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు వాదనలు జరిగాయి. లిఖితపూర్వక క్షమాపణ పత్రం ఇవ్వాలని రోజాను ఆదేశించారు. రోజా సస్పెన్షన్ పెద్ద సమస్య కాదని.. దీనికి త్వరలో ఫుల్ స్టాప్ పెట్టి.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. నాయకులు వ్యక్తిగత దూషణలకు పోకుండా సభా మర్యాదలను కాపాడాలన్నారు. అధికార, ప్రతిపక్షాలు బాధ్యయుతంగా వ్యవహరించాలని చూచించారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించాలని పేర్కొంది.  

 

బీసీలకు, ఈబీసీలకు కల్యాణ లక్ష్మి వర్తింపు..

హైదరాబాద్ : బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనకబడిన వారికి కల్యాణలక్ష్మి పథకం వర్తింపచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1నుంచి జరిగిన వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది. 

మద్యం మత్తులో న్యాయవాది బీభత్సం..

సికింద్రాబాద్ : బేగంపేటలో న్యాయవాది రంజన్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. తన బొలేరో వాహనంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీకాంత్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రంజన్ ను పోలీసులు అరెస్టు చేశారు

16:43 - April 21, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ యూకో బ్యాంక్ లో సైకో హల్ చల్ చేశాడు. బ్యాంకు అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడ్డాడు. సైకోను చూసి కస్టమర్లు, ఉద్యోగులు పరుగులు పెట్టారు. బ్యాంకు సిబ్బంది సైకోను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. 

16:38 - April 21, 2016

హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ దే విజయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ ఆదేశాల ప్రకారం తాను పోటీలో ఉన్నానని తెలిపారు. గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. 21 నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ప్రజలకు కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదని... ప్రజలకు ఏం కావాలో తమకు తెలుసని పేర్కొన్నారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్ ఎస్ కు పట్టంకడుతున్నారని తెలిపారు. 

 

16:28 - April 21, 2016

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆర్టికల్ 356 ను పక్కన పెట్టింది. రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా హరీష్ రావత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ.. తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి పాలనపై కేంద్రం నిర్ణయాన్ని నైనీటాల్ హైకోర్టు కొట్టివేసింది. డెహ్రాడూన్ లోని హరీష్ రావత్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మెజారిటీ లేదన్న కారణంతో హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత నెలలో కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బిజెపి పంచన చేరారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రశ్నిస్తూ పదవీచ్యుత సీఎం హరీష్‌రావత్‌ వేసిన పిటిషన్‌పై గత మూడు రోజులుగా విచారణ జరపుతున్న ప్రధాన న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌, న్యాయమూర్తి వికె బిస్త్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మనుషులు ఎవరైనా పొరపాట్లు చేయవచ్చునని, రాష్ట్రపతి, న్యాయమూర్తులు అందుకు మినహాయింపు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షంచలేవని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహ్తగీ వాదించగా..రాచరిక పాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడే ఎవరైనా వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

బెంగాల్ లో 03 గంటల వరకు 67.80 శాతం..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. పలు హింసాయుత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం మూడు గంటల వరకు 67.80 శాతం పోలింగ్ నమోదైంది.

కిడ్నాపైన బాలుడి హత్య..

గుంటూరు : రేపల్లే మండలం చోడయపాలెంలో రెండు రోజుల క్రితం అపహరణకు గురైన సాల్మన్ బాబు విగతజీవుడిగా కనిపించాడు. మృతదేహం మోర్తోటకు సమీపంలో లభ్యమైంది. 

టీఆర్ఎస్ లో మాజీ మంత్రి రాములు..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు పి. రాములు టీఆర్‌ఎస్‌లో చేరారు.

పెళ్లి భోజనం వికటించి 170 మందికి అస్వస్థత..

నిజామాబాద్: జిల్లాలోని సదాశివనగర్ మండలం సర్దాపూర్ తండాలో పెళ్లి భోజనం వికటించి 170 మంది అస్వస్థతకు గురయ్యారు.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. రాష్ట్రపతి పాలనపై కేంద్రం నిర్ణయాన్ని నైనీటాల్ కొట్టివేసింది. డెహ్రాడూన్ లోని హరీష్ రావత్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మెజారిటీ లేదన్న కారణంతో హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతనెలలో కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు   ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బిజెపి పంచన చేరారు. 

25 నుండి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు - వెంకయ్య..

ఢిల్లీ : ఈ నెల 25 నుంచి మే 13 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సమావేశాల్లో ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రైల్వే, సాధారణ బడ్జెట్, ఆర్థిక బిల్లులపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. 

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై కోర్టు ఆగ్రహం..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం పట్ల ఆ రాష్ట్ర హైకోర్టు కేంద్రంపై ఫైర్ అయ్యింది. ఆ అంశంలో కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలనను వత్తిడితో అమలు చేయరాదని కోర్టు పేర్కొంది. ఇది ఇద్దరు వ్యక్తల మధ్య సమస్య కాదని, కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న పోరు అని కోర్టు తెలిపింది.

పాలేరులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం - కేటీఆర్..

హైదరాబాద్: పాలేరులో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. వీరు పాలేరు ఉపఎన్నికపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 

పాలేరులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం - కేటీఆర్..

హైదరాబాద్: పాలేరులో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. వీరు పాలేరు ఉపఎన్నికపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 

సీఎం హెలిపాడ్ కోసం వేయి లీటర్ల నీళ్లు..

హర్యానా : దేశంలో కరవు తాండవిస్తుంటే ప్రజాప్రతినిధులు మాత్రం ఏ మాత్రం లెక్క చేయడం లేదనే పలు ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే సీఎం మనోహర్ లాల్ హెలిపాడ్ సిద్ధం చేసేందుకు 100 లీటర్ల నీటిని వాడారు. 

అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ లో హత్యకు గురైన పోలీసు..

గుజరాత్ : అహ్మదాబాద్ లోని క్రైం బ్రాంచీ ఆఫీసులో ఓ పోలీసు హత్యకు గురి కావడం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు క్రైం బ్రాంచీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోనే పోలీసుకు భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా అని కుటుంసభ్యులు ప్రశ్నించారు.

 

బెంగాల్ లో 01 గంట వరకు 56.08 శాతం..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. పలు హింసాయుత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 56.08 శాతం పోలింగ్ నమోదైంది. 

కాశ్మీర్ గేట్ వద్ద అగ్నిప్రమాదం..

ఢిల్లీ : ఐఎస్ బిటి (కాశ్మీర్ గేట్) వద్ద పొదల్లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

14:23 - April 21, 2016

హైదరాబాద్ : ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఫుల్ జోష్‌లో ఉన్న ఏపీ సర్కార్... విభజన వాటాలపై లెక్కలు సిద్ధం చేస్తొంది. 9, 10 షెడ్యూళ్లలో ఆస్తుల వివరాలు, ఏపీకి రావాల్సిన వాటాలపై నివేదికలు రెడీ చేసుకుంటోంది. పంపకాలు జరపాల్సిన కేంద్రం పలాయనం చిత్తగించడంతో కోర్టులోనే తేల్చుకొవాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో బిజెపి ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే బిజేపి కేంద్ర ప్రభుత్వ హోదాలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో మాత్రం తప్పించుకు తిరుగుతోంది. కేంద్రం పరిష్కరించాల్సిన వాటిల్లో ఆస్తుల పంపకం వ్యవహారం కూడా ఉంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన 58 శాతం వాటాలు పొందేందుకు దానికున్న ఏకైక మార్గం కోర్టులే.

9, 10 షెడ్యూల్‌లో పలు సంస్థలు..
విభజన తీరు ఫలితంగా 115 కోట్ల రూపాయల ఉన్నత విద్యా మండలి ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో వివాదం నెలకొంది. ఆ నిధులను 52, 48 నిష్పత్తిలో పంచుకోవాలన్న సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో ఏపి సర్కార్ ఉత్సాహంతో ఉంది. షెడ్యూల్ 9, 10లోని దాదాపు 120 సంస్థలకు కూడా ఇదే తీర్పు వర్తిస్తుందన్న భావనలో ఏపీ అధికార్లు.. హైదరబాద్‌లోని సంస్థల అప్పులు-ఆస్తులపై గణాంకాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోని 9, 10 షెడ్యూల్ సంస్థల్లో ఏపీకి దక్కే ఆస్తుల విలువ సుమారు 70 వేల కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటన్నిటికీ సంబంధించిన వివరాలు రెడీ చేస్తున్నారు. సచివాలయం తరలింపులో భాగంగా ఆగస్టు 30 నాటికి తెలంగాణలో ఏపీకి చెందిన అన్ని కార్యాలయాలను అమరావతికి షిఫ్ట్ చేయనున్నారు. తద్వారా హైదరాబాద్‌లోని ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. అయితే ఈ లోపే ఏపీకి రావాల్సిన వాటాలపై స్పష్టత పొందేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

డిసెంబర్‌తో ముగిసిన షీలాబేడి కమిటీ గడువు..
అస్తులు, అప్పుల విభజన బాధ్యతలను షీలాబేడీ కమిటీకి అప్పగించిన కేంద్రం... ఆ కమిటీ కాలపరిమితి గతేడాది డిసెంబర్‌తో ముగిసినా, ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు 120 సంస్థలకు చెందిన కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లు సుమారు 16 వేల కోట్లు ఉన్నట్లు ఏపి అధికారులు అంటుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 3,600 కోట్లలోపే ఉన్నట్లు చెబుతోందనీ ఏపీ అధికారులు చెప్పుకొస్తున్నారు.

58 శాతం ఆస్తులు దక్కించుకుంటామని ఏపీ ధీమా..
మార్చి నెలలో ఉన్నత విద్యా మండలి నిధులపై సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా చర్చలు జరిపేందుకు..తెలంగాణ అధికారులు ఆసక్తి చూపించకపోవడం..ఏపీని అయోమయానికి గురిచేస్తోంది. దీనిపై రివ్యూ పిటీషన్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అన్ని వాటాల విషయంలోనూ 58 శాతం ఆస్తులు ఖచ్చితంగా సాధిస్తామని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

14:17 - April 21, 2016

హైదరాబాద్ : కరవు ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ కార్యక్రమాల్లో అమల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. దీనికి నిరసనగా వచ్చే నెల 5, 6 తేదీల్లో జాతీయ స్ధాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతోపాటు పని దినాలు పెంచాలని కోరారు. అలాగే రైతులు, వ్యవసాయ కూలీలకు కరవు పెన్షన్లు ఇవ్వాలని సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

14:14 - April 21, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక ఖమ్మం రాజకీయాలను వేడెక్కిస్తోంది. టీఆర్‌ఎస్‌ నుంచి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థిత్వం ఖరారవ్వగా, టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు పాలేరులో టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు. నామా పాలేరు నుంచి పోటీచేయాలంటూ అటు కార్యకర్తలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. 

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి గా సుచరిత..

ఖమ్మం : పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పేరును టీఎస్ పీసీసీ హై కమాండ్ కు పంపింది. సాయంత్రంలోగా సుచరిత పేరును ప్రకటించే అవకాశం ఉంది.  

సుప్రీంలో రోజా సస్పెన్షన్ పై వాదనలు..

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. తదుపరి విచారణనను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది. 

నిద్రిస్తున్న వ్యక్తికి నిప్పు పెట్టిన దుండగులు..

రంగారెడ్డి : గండ్వీడు (మం) కొమ్మారెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై కిరోసిన్ పోసి దుండగులు నిప్పటించారు. 

రాజేంద్రనగర్ వర్సిటీ విద్యార్థుల ధర్నా..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీల్లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఫుడ్ సైన్స్ కోర్టు పేరు మార్చితే ఉద్యోగవకాశాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మద్యం సేవించి మృతి చెందిన ఘటనపై మంత్రి కొల్లు స్పందన..

గుంటూరు : అమరావతి (మం) మునగోడులో విషాదం చోటు చేసుకుంది. బెల్ట్ షాప్ లో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు కాటం రాజు, నీలయ్య మృతులుగా గుర్తించారు. ఈ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఘటనపై ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించడం జరిగిందని, మద్యం బాటిల్స్ లో శాంపిల్స్ తీసి సాయంత్రం ల్యాబ్ కు పంపిలంచడం జరుగుతుందన్నారు. ల్యాబ్ నుండి నివేదిక వచ్చాక తదుపర చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. 

మధ్యాహ్న భోజన పథకాన్ని స్వాగతిస్తున్నాం - కోదండరాం..

హైదరాబాద్ : సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనాన్ని స్వాగతిస్తున్నట్లు, చదువుతో నిమిత్తం లేకుండా నిరుపేదలందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రొ. కొదండరాం పేర్కొన్నారు. పనికి ఆహార పథకం బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీ పనులను వెంటనే చేపట్టాలని కోరారు. 

పరిటాల మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు..

అనంతపురం : రామగిరి మంలం నసనకోటలో పరిటల మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. తిరుమలదేవర దేవస్థానంలో 250 జంటలు ఒక్కటయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశ్వీరదించారు. 

13:23 - April 21, 2016

హైదరాబాద్ : అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వెంకటాపురంలో పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సామూహికవివాహాలు వైభవంగా జరిగాయి. సుమారు 250 జంటలు ఈ సందర్భంగా ఒక్కటయ్యాయి. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన ఈ వివాహాలకు అధికార పార్టీ నేతలు, సీఎం చంద్రబాబు హాజరయ్యి నూతన జంటలను ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...ప్రతి జంటకూ రూ.10వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. పేద ముస్లిం, క్రైస్తవులకు పెళ్లిళ్లు జరిపే కార్యక్రమం చేపడతామన్నారు. హంద్రీనీవా ఎన్టీఆర్ మాస పుత్రిక అని, దానిని పూర్తి చేసి తీరుతానని చెప్పారు. 

12:52 - April 21, 2016

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ పరిధిలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయానికి అనుమతి జాప్యంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. సీఆర్‌డీఏ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూముల విక్రయానికి అనుమతి ఇవ్వకపోవడం కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామంటూ సీరియస్‌ అయ్యింది. తదుపరి విచారణకు న్యాయస్థానం ముందు హాజరు కావాలని సీఆర్‌డీఏ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.   

12:51 - April 21, 2016

తూ.గో : కాకినాడలోని ఓ హస్పటల్ లో రోగి హఠాన్మరణం ఉద్రిక్తతకు దారితీసింది. రోగి బంధువుల ఆందోళనలతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. బాలింత మృతికి ఈ ఆందోళలనలకు కారణంగా మారిది. రామలక్ష్మి అనే మహిళ ప్రసవం కోసం వస్తే డాక్ట్రర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన రోగిని బతికి ఉందంటూ ప్రభుత్వాసుత్రికి రిఫర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికిత్స సరిగా అందించకపోవడమే కాకుండా దుర్మార్గంగా వ్యవహరించారని బంధువులు నిరసన వ్యక్తం చేసారు. మృతురాలి కుటంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

కేంద్ర మంత్రి సదానంద గౌడను కలిసిన ఎంపీ వినోద్..

ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను కరీంనగర్ లోక్‌సభ సభ్యులు వినోద్ కలిశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, హైకోర్టులో తెలంగాణ జడ్జీల వాటా అంశంపై చర్చించారు.

12:49 - April 21, 2016

ఢిల్లీ : పనామా పేపర్స్ వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు అమితా బచ్చన్‌ పాత్ర తవ్విన కొద్దీ బయటపడుతోంది. నిబంధలనకు విరుద్ధంగా విదేశాలకు నిధులు తరలించిన వ్యవహారంలో తనకు, తన కుటుంబానికి సంబంధంలేదని అమితాబ్‌ పదేపదే చెబుతున్నా... రికార్డులు మాత్రం ఆయన పాత్రను విశదీకరిస్తున్నాయి. నాలుగు విదేశీ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించిన అమితాబ్‌.... రెండు కంపెనీల బోర్డు మీటింగ్‌ల్లో ఫోన్‌ ద్వారా బోర్డు మీటింగ్‌ల్లో పాల్గొన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

తాజా మరికొన్ని విషయాలు వెలుగులోకి...

పనామా పేపర్ల వ్యవహారం బాలీవుడ్‌లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు నిధులు తరలించిన వ్యవహారంలోఅబితా బచ్చన్‌ పాత్రపై తాజా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నాలుగు విదేశీ కంపెనీలకు డైరెక్టర్‌.....

పనామా పేపర్స్ వెల్లడించిన అంశాలతో తనకు సంబంధంలేదని అమితాబ్‌ చెబూతూ వచ్చినా.... ఒకటి కాదు.. రెండు కాదు... నాలుగు విదేశీ కంపెనీలకు ఆయన డైరెక్టర్‌గా పనిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయని వార్తలు వచ్చాయి. పనామా పేపర్లు వెల్లడించిన ఏ కంపెనీ కూడా తనకు తెలియదని.... తనను, తన కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే తన పేరు ఇరికించారని అమితాబ్‌ తోసిపుచ్చినా... నాలుగు షిప్పింగ్‌ కంపెనీలకు అమితాబ్‌ డైరెక్టర్‌గా పనిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. సీ బల్క్‌ షిప్పింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, లేడీ షిప్పింగ్‌ లిమిటెడ్‌, ట్రజర్‌ పిప్పిగ్‌ లిమిటెడ్‌, ట్రంప్‌ షిప్పింగ్‌ లిమిటెడ్‌లకు 1993లోనే డైరెక్టర్‌గా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులైనట్టు మొస్సాకా ఫోన్సేకా రికార్డులు చెబుతున్నాయి.

1.75 డాలర్ల నిధులు బదిలీ ......

పనామాకు చెందిన మొస్సాక్‌ ఫొన్సెకా లా కంపెనీ రికార్డుల ప్రకారం అమితాబ్‌... 1993-97 మధ్య నాలుగు విదేశీ షిప్పింగ్‌ కంపెనీలకు డైరెక్టర్‌గా పని చేశారు. 1.75 మిలియన్‌ డాలర్ల లోను నిధులు బదిలీకి సంబంధించి అమితాబ్‌ రెండు కంపెనీల బోర్డు మీటింగ్‌లకు ఫోన్‌ ద్వారా హాజరయ్యారు. బహమాస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ట్రంప్‌ షిపింగ్‌ లిమిటెడ్‌, బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ కేంద్రంగా పని చేస్తున్న సీ బల్క్‌ షిపింగ్‌ కంపెనీకి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్స్‌లో ఆయన పాల్గొన్నారు. 1994 డిసెంబర్‌ 12న జరిగిన ఈ సమావేశాల చిరునామాలు కూడా మొస్సాకా ఫొన్సేకా రికార్డుల్లో ఉన్నాయి. 38/39, ది ఎస్ల్పనేడ్‌, ఎస్‌టీ హెలియర్‌, చానల్‌ ఐలాండ్స్‌, జేఈ4 8 ఎస్‌డీలో మీటింగ్‌ జరిగినట్టు వెల్లడయ్యింది. నిధుల బదిలీకి అనుమతిస్తూ చేసిన తీర్మానాలను కూడా బోర్డు మీటింగుల్లో ఆమోదించిన విషయాన్ని మొస్సాకా ఫొన్సేకా రికార్డులు చెబుతున్నాయి. అమితాబ్‌ డైరెక్టర్‌గా ఉన్న ట్రంప్‌ షిప్పింగ్‌, సీ బల్స్‌ షిప్పింగ్‌ కంపెనీల నుంచి బహమాస్‌ కేంద్రంగా ఉన్న కాన్టిలేషన్‌ షిపింగ్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు నిధుల బదలాయింపు జరిగింది. డల్లాహ్‌ అల్‌బకరా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ.. డైకో ద్వారా ఈ లావాదేవీలన్ని జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. అమితాబ్‌ డైరెక్టర్‌గా ఉన్న నాలుగు కంపెనీలను జెర్సీకి చెందిన ఉమేష్‌ సాహై స్థాపించినట్టు మొస్సాక్‌ ఫోన్సెకా రికార్డులు చెబుతున్నాయి. ఉమేష్‌ సాహై వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు.

12:45 - April 21, 2016

హైదరాబాద్ : ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ అనిస్టన్‌ ను ప్రఖ్యాత పీపుల్స్‌ మేగజైన్‌ ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఎంపిక చేసింది. 2004లో కూడా ఇదే మేగజైన్‌ ఈమెకు ఇదే కిరీటాన్ని అలంకరించింది. పుష్కరకాలం తర్వాత మరోసారి.. అది కూడా నలభైఏడేళ్ల వయసులో ఆ టైటిల్‌ సాధించడంతో జెన్నీ ఉబ్బితబ్బిబ్బవుతోంది. 

బెంగాల్ లో 11 గంటల వరకు 39.76 శాతం..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. పలు హింసాయుత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం 11గంటల వరకు 39.76 శాతం పోలింగ్ నమోదైంది. 

అక్షయ్ గోల్డ్ నిందితుల ఫొటోలను అతికించాలి - హైకోర్టు..

హైదరాబాద్ : అక్షయ్ గోల్డ్ నిందితుల ఫొటోలను గోడలకు అంటించి వారి నిర్వాకంపై ప్రచారం చేయాలని హైకోర్టు సూచించింది. వెంటనే వాంటెడ్ క్రిమినల్స్ గా ప్రకటించాలని ఆదేశించింది. నిందితుల పట్ల పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. 

దిలీప్ కుమార్ డిశ్చార్జ్..

ముంబై : ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కొంతకాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్న దిలీప్ కుమార్ ఆరోగ్యం 16వ తేదీ రాత్రి ఉన్నట్లుండి విషమంగా మారింది. దిలీప్ కుమార్ కు లీలావతి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు.

కంభంపాడులో యువకుడి దారుణ హత్య..

గుంటూరు : మాచర్ల మండలం కంభంపాడులో దారుణం చోటు చేసుకుంది. గ్రామశివారులో అజయ్ కుమార్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడు దాచేపల్లి వాసి అని తెలుస్తోంది. 

రామతీర్థం వద్ద రోడ్డు ప్రమాదం..

ప్రకాశం : చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. 

మెట్ పల్లిలో ఉద్రిక్తత..

కరీంనగర్ : మెట్ పల్లి సాయిరాంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదంలో ఇరువర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నాయి. నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

 

ఆసారాం బాపుకు ఐటీ నోటీసులు...

ఢిల్లీ : ఆసారాం బాపుకు ఐటీ నోటీసులు జారీ చేసింది. రూ. 750 కోట్లు ఐటీ చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులిచ్చింది. ఇందుకు గడువు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

త్రయంబకేశ్వరంలో మహిళలు పూజలు..

మహారాష్ట్ర : నాసిక్ త్రయంబకేశ్వరంలో తొలిసారిగా మహిళలు పూజలు నిర్వహించారు. గర్భగుడిలోకి వెళ్లిన ముగ్గురు మహిళలు పూజలు నిర్వహించారు. 300 ఏళ్ల ఆనవాయితీకి ఆలయ కమిటీ స్వస్తి పలికినట్లైంది. 

ఆదిలాబాద్ లో వడదెబ్బతో ముగ్గురి మృతి..

ఆదిలాబాద్ : తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. 

11:40 - April 21, 2016

జమ్మూ కాశ్మీర్ : కుప్వారాలో ఉ్రగవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు సాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. కాగా ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.

11:38 - April 21, 2016

గుంటూరు : అమరావతి మండలం మనుగోడులో దారుణం జరిగింది. స్థానిక బెల్టు షాపులో మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వైపు బెల్టు షాపులను నిరోధిస్తామని చెప్తున్నా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హంద్రీనీవా ప్రాజెక్టు కాంట్రాక్టర్లతో సీఎం బాబు సమావేశం..

అనంతపురం : చెర్లోపల్లిలో హంద్రీనీవా ప్రాజెక్టు కాంట్రాక్టర్లతో, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. రెండో దశ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరించారు. 

ఒంటిమిట్ట రథోత్సవంలో పాల్గొన్న జగన్..

కడప : ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ రథోత్సవం కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. 

లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు..

వరంగల్ : విశాఖ - భువనేశ్వర్ వెళుతున్న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. కే.సుముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో బ్రేకులు పట్టేయడంతో మంటలు చెలరేగాయి. స్టేషన్ ఘన్ పూర్ లో రైలును నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.

 

హైకోర్టులో అక్షయ గోల్డ్ కేసు విచారణ..

హైదరాబాద్ : హైకోర్టులో అక్షయ గోల్డ్ కేసు విచారణ జరుగుతోంది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో నివేదిక సమర్పించాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. మొదటి విడత ఆస్తుల అమ్మకంతో రూ. 60 కోట్లు వచ్చాయని, రెండో విడతలో రూ.150 కోట్ల ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమని కమిటీ పేర్కొంది. మూడో విడతలో ఆస్తుల విక్రయంతో రూ. 180కోట్లు వస్తాయని కమిటీ తెలిపింది. అమరావతిలో ఆస్తుల విక్రయానికి ఎందుకు అనుమతినివ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు హాజరు కావాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. 

11:22 - April 21, 2016

హైదరాబాద్ : గులాబీ పార్టీలో నామినేటెడ్‌ పదవులు అందని ద్రాక్షలాగే మారుతున్నాయి. ప్లీనరీ నాటికి పదవుల భర్తీ ఉంటుందని ఆశపడ్డ నేతలకు నిరాశే మిగులుతోంది. నామినేటెడ్‌ పదవుల భర్తీ చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సైతం ప్రకటించినా..అది అమలుకు నోచుకోవడం లేదు. ప్లీనరికి ముందే పదవుల పంపిణీ జరిగితే అసంతృప్తులు పెరుగుతాయని మరో సారి పదవుల పంపకాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

రెండేళ్లుగా ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు...

తెలంగాణాలో గులాబీ పార్టీ నేతలను నామినేటెడ్‌ పదవులు దాదాపు రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. ఇవాళా...రేపు అంటున్న పార్టీ పెద్దలు పదవుల భర్తీకి శ్రీకారం చుట్టకపోవడంతో..పార్టీ నేతల్లో కూడా అసంతృప్తులు రగులుతున్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నామమాత్రంగానే పదవులు పంపిణీ చేసిన అధికార పార్టీ..ఇంకా ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు పెండింగ్‌లోనే ఉంచుతూ వస్తోంది.

మండల, రాష్ట్రాస్థాయి వరకు 4వేల పదవులు......

రాష్ట్ర విభజన తర్వాత పలు కార్పొరేషన్ల విభజనపై స్పష్టత రాకపోవడంతో మొదటి ఏడాది పదవుల భర్తీ జరగలేదని అధికార పార్టీ ఇప్పటివరకు చెప్తూ వచ్చింది. కానీ..మెజార్టీ కార్పొరేషన్‌లలో విభజన సమస్యలు తొలగినా ఇంకా పదవులు భర్తీకి నోచుకోవడం లేదు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దాదాపు 4వేల పదవులు ఉంటాయిని నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ పరంగా దాదాపు ఏడాది క్రితం జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుల ఎన్నికలు అనివార్యం కావడంతో ఆ తంతును పూర్తి చేశారు. ఆ తర్వాత అనుబంధ సంఘాలు, జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యవర్గాలను ఇప్పటి వరకు పార్టీ అధినేత నియమించలేదు. పార్టీకి అత్యున్నత కమిటీగా భావించే పోలిట్ బ్యూరో సభ్యుల నియామకం కూడా జరుగలేదు. దీంతో పార్టీ పదవులు కూడా భారీగానే పెండింగ్‌లో ఉన్నాయి.

దేవాలయ, మార్కెట్‌ కమిటీలు ...

ఇక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే దేవాలయ, మార్కెట్ కమిటీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. పార్టీ అధినేత పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడంతో వారంతా కీలక కార్పొరేషన్లపై ఆశలు పెంచుకున్నారు. ఉద్యమ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు కూడా నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. అయితే అటు ప్రభుత్వంలోనూ ఇటు నామినేటెడ్ పదవుల్లో వలస నేతలకే ప్రాధాన్యత దక్కుతుందనే ఆందోళన వారిని వెంటాడుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్లీనరీకి ముందే పదవుల భర్తీ మరింత అసంతృప్తులకు కారణమవుతుందనే అంచనాతో పదవుల భర్తీని పెండింగ్‌లో ఉంచుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు ఒకేసారి భారీ ఎత్తున పదవులు పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం కూడా ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కీలక పదవులు భర్తీ చేసే చాన్స్ ఉందని పార్టీ కీలక నేతలు చెప్తున్నారు.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలందరూ పదవులపై భారీగానే ఆశలు.....

ఏది ఏమైనప్పటికీ..తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలందరూ పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు తమ అధినేత తమను తప్పక కరుణించి మంచి పదవులనే కట్టబెడతారనే విశ్వాసంతో గులాబీబాస్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరి వీరందరికి గులాబీ బాస్‌ పదవులు కట్టబెట్టి న్యాయం చేస్తారో..లేక వలస నేతలకే ప్రాధాన్యత ఇస్తారో వేచిచూడాలి.  

నామా వైపు మొగ్గు..

ఖమ్మం : టిడిపి అభ్యర్తి నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నామా వైపు అధికాథం నేతలు మొగ్గు చూపుతునన్నట్లు సమాచారం. 

నామా వైపు మొగ్గు..

ఖమ్మం : టిడిపి అభ్యర్తి నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నామా వైపు అధికాథం నేతలు మొగ్గు చూపుతునన్నట్లు సమాచారం. 

కుప్వారలో ముగ్గురు ఉగ్రవాదుల మృతి..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారలో ముగ్గురు ఉగ్రవాదుల మృతి..మ్మూ కాశ్మీర్‌ : కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

కుప్వారలో ముగ్గురు ఉగ్రవాదుల మృతి..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారలో ముగ్గురు ఉగ్రవాదుల మృతి..మ్మూ కాశ్మీర్‌ : కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

కుప్వారలో ముగ్గురు ఉగ్రవాదుల మృతి..

జమ్మూ కాశ్మీర్‌ : కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

కుప్వారలో ముగ్గురు ఉగ్రవాదుల మృతి..

జమ్మూ కాశ్మీర్‌ : కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

బెల్టు షాప్ లో మద్యం తాగి ఇద్దరు మృతి..

గుంటూరు : అమరావతి (మం) మునగోడులో విషాదం చోటు చేసుకుంది. బెల్ట్ షాప్ లో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు కాటం రాజు, నీలయ్య మృతులుగా గుర్తించారు. 

బెల్టు షాప్ లో మద్యం తాగి ఇద్దరు మృతి..

గుంటూరు : అమరావతి (మం) మునగోడులో విషాదం చోటు చేసుకుంది. బెల్ట్ షాప్ లో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు కాటం రాజు, నీలయ్య మృతులుగా గుర్తించారు. 

వచ్చే ఏడాదికి ఒంటిమిట్ట పనులు - బాబు..

కడప : వచ్చే ఏడాది వరకు ఒంటిమిట్ట అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒంటిమిట్ట, పెద్ద దర్గాను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కడపను ఉద్యాన హబ్ గా మారుస్తామని హామీనిచ్చారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. 

భద్రాచలంలో నేటితో ముగియనున్న శ్రీరామ నవమి ఉత్సవాలు..

ఖమ్మం : భద్రాచలంలో స్వామివారి చక్రతీర్థ స్నానం ఘనంగా జరిగింది. దీనితో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. రేపటి నుండి నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. 

భద్రాచలంలో నేటితో ముగియనున్న శ్రీరామ నవమి ఉత్సవాలు..

ఖమ్మం : భద్రాచలంలో స్వామివారి చక్రతీర్థ స్నానం ఘనంగా జరిగింది. దీనితో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. రేపటి నుండి నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. 

టిఎస్ స్పీకర్ భద్రతాధికారి సస్పెండ్...

వరంగల్ : టీఎస్ స్పీకర్ భద్రతాధికారి వెంకటేశ్వరరావు వైపు కేసు నమోదైంది. సెక్షన్ 447, 497 కింద కేసును భూపాలపల్లి పోలీసులు నమోదు చేశారు. స్పీకర్ వద్దకు సాయం కోసం వచ్చిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెంకటేశ్వర్ పై ఆరోపణలు వచ్చాయి. వెంకటేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

హైదరాబాద్ : శుక్రవారం తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. 

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

హైదరాబాద్ : శుక్రవారం తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. 

10:50 - April 21, 2016

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ తొలిసారి విలన్‌గా నటించబోతున్నారు. అది కూడా రెండు చిత్రాల్లో. విలన్‌ పాత్రలతో 'ధూమ్‌', 'రేస్‌' సిరీస్‌లు బాలీవుడ్‌లో పాపులరైన విషయం తెలిసిందే. 'ధూమ్‌' సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం 'ధూమ్‌ 4' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాల్లో జాన్‌ అబ్రహం, హృతిక్‌ రోషన్‌, అమీర్‌ఖాన్‌లు నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటించగా, తాజా సిరీస్‌లో సల్మాన్‌ఖాన్‌ విలన్‌గా నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారని సమాచారం. అయితే 'ధూమ్‌ 3'లో అమిర్‌ ఖాన్‌కు లాభాల్లో వాటా ఇచ్చినట్లుగానే ఈ చిత్ర లాభాల్లో తనకీ వాటా ఇవ్వాలని సల్మాన్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత ఆదిత్య చోప్రాకు, సల్మాన్‌కి మధ్య ప్రస్తుతం సయోధ్య కుదరలేదట. దీంతోపాటు 'రేస్‌' సిరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న 'రేస్‌3'లో కూడా విలన్‌గా నటించేందుకు సల్మాన్‌ ఇప్పటికే అంగీకరించారు. తొలిసారి ప్రతినాయకుడిగా నటించబోతున్న కండలవీరుడు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడో వేచి చూద్దాం. సల్మాన్‌ 'సుల్తాన్‌' ఈద్‌ కానుకగా విడుదలవుతోంది.

10:47 - April 21, 2016

'దిల్‌వాలే', 'ఫ్యాన్‌' వంటి వరుస డిజాస్టర్స్‌ తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ 'తను వెడ్స్‌ మను' దర్శకుడు ఆనంద్‌.ఎల్‌.రాయ్ తో ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. 'స్ట్రేంజర్స్‌', 'రాంజానా', 'తను వెడ్స్‌ మను', 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' వంటి చిత్రాలతో దర్శకుడిగా ఆనంద్‌.ఎల్‌.రాయ్ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా షారూఖ్‌తో ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్‌.ఎల్‌.రాయ్ మాట్లాడుతూ,'షారూఖ్‌తో సినిమా చేయడమనేది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అయితే ఇది నా గొప్పతనం కాదు.. స్క్రిప్ట్‌ గొప్పతనమే. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతున్నాం' అని అన్నారు. ఈ సినిమాలో షారూఖ్‌ మరుగుజ్జుగా నటిస్తున్నారట కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 'ప్రస్తుతం ఈ కథ గురించి లేదా షారూఖ్‌ పాత్ర గురించి మరిన్ని వివరాల్ని తెలియజేయలేను. అయితే షారూఖ్‌ పాత్రకి మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటనేది సినిమాలో చూడాల్సిందేన'ని రాయ్ చెప్పారు. 'విచిత్ర సోదరులు' చిత్రంలో కమల్‌హాసన్‌ మరుగుజ్జుగా నటించిన విషయం విదితమే. సరిగ్గా అటువంటి పాత్రలో షారూఖ్‌ నటిస్తున్నాడని సామాజిక మీడియాలో హల్‌చల్‌ అవుతోంది.

10:45 - April 21, 2016

తేజ దర్శకత్వంలో రూపొందబోయే ఓ చిత్రంలో నటించేందుకు కాజల్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. గతంలో తేజ తెరకెక్కించిన 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంలో కాజల్‌ నటించిన విషయం విదితమే. చాలా గ్యాప్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇందులో కథానాయకుడు రానా సరసన కాజల్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రాన్ని సైతం కాజల్‌ వదిలేసుకోవడం ప్రస్తుతం సామాజిక మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. రానా, కాజల్‌, తేజ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రాన్ని మూవీ మెఘల్‌ రామానాయుడు తనయుడు సురేష్‌బాబు నిర్మించనున్నారట. రానా ప్రస్తుతం 'బాహుబలి2', 'ఘాజీ' చిత్రాల్లో నటిస్తుండగా, మహేష్‌బాబుకి జోడీగా 'బ్రహ్మోత్సవం' చిత్రంలో కాజల్‌ నటిస్తోంది.

10:43 - April 21, 2016

మహారాష్ట్రలో విలయతాండవం చేస్తున్న కరువు కోరల్లోనుంచి ప్రజలను ఆదుకునేందుకు మేము సైతం అంటూ బాలీవుడ్‌ నటులు ముందుకొస్తున్నారు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర ప్రజల సహాయార్థం యాక్షన్‌ హీరో అక్షయ్ కుమార్‌ యాభై లక్షల రూపాయల విరాళాన్ని అందించిన విషయం విదితమే. అంతేకాకుండా కరువు వల్ల ఆత్మహత్య చేసుకున్న 180 రైతు కుటుంబాలకు అక్కీ 90 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. అక్కీతోపాటు నానాపటేకర్‌ సైతం కరువు ప్రజలను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. వీరిద్దరి మాదిరిగానే తాజాగా బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ సైతం ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. 2001లో భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో గల ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న అమీర్‌ఖాన్‌ తాజాగా మహారాష్ట్రలోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని సహాయక చర్యల్ని ప్రారంభించారు. మహారాష్ట్రలో కరువుతో అల్లాడుతున్న గ్రామాల్లో అమీర్‌ ఇటీవల పర్యటించారు. వీటిలో తీవ్రమైన కరువుతో బాధపడుతున్న తల్‌, కోరేగావ్‌ గ్రామాలను ఆయన దత్తత తీసుకున్నారు.

10:36 - April 21, 2016

ఖమ్మం : జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామా పేరును టీడీపీ అధిష్టానం సీరియస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నేడు ఖమ్మం జిల్లా టీడీపీ భేటీ అయి నామా పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. అయితే నామా మాత్రం విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. గత రాత్రి పాలేరు నియోజవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. ఈ క్రమంలో నామాను బరిలోకి దింపాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడనుంది.

 

10:34 - April 21, 2016

శరీరంలో ఏ భాగానికి సమస్య ఏర్పడినా కాస్త త్వరగా తగ్గుతాయేమోగాని చర్మానికి సమస్యలొస్తే కొంతమందికి తగ్గనే తగ్గవు. అయితే చర్మ వ్యాధుల బారిన పడినప్పుడు వాటిని తగ్గించుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన నివారణా మార్గాలున్నాయి. 

  • మినుములు చర్మానికి మంచి ఔషధం. వీటిని నానబెట్టి, రుబ్బిన పేస్ట్‌ను శరీరానికి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబొల్లి మచ్చలు పోతాయి.
  • తులసి ఆకు ఒక సహజ సిద్ధమైన మంచి ఔషధం. తులసి ఆకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరిన తరువాత స్నానం చేస్తుంటే శోభి త్వరగా తగ్గుతుంది.
  • తులసి, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా హరించిపోతాయి.
  • తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. దీంతో అతి త్వరగా మచ్చలు పోతాయి.
  • జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెలు హరించిపోతాయి.
  • వామును నిప్పులపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.
  • పసుపు మూడు గ్రాములు, ఉసిరిక పొడి ఆరు గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధికి ఉపయోగపడుతుంది.
  • మారేడు ఆకు ముద్దగా నూరి కడితే శరీరంలో ఇరుక్కున్న ముళ్లు, మేకులు బయటకొస్తాయి.
  • తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి. 
10:33 - April 21, 2016

రంగారెడ్డి : ముచ్చర్ల ఫార్మా భూ నిర్వాసితుల ఆందోళన ప్రారంభమయ్యింది. సీఎం క్యాంపు నివాసాన్ని ముట్టడించేందుకు భూనిర్వాసితులు బయలు దేరారు. భూ నిర్వాసితులకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది. నిర్వాసితుల పక్షాన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'టెన్ టివి'తో తమ్మినేని మాట్లాడుతూ.. దళితులకు, గిరిజనులకు భూముల ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం ఇచ్చిన భూములు తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఒక వేళ భూములు తీసుకున్నా ప్రస్తుతం మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

10:32 - April 21, 2016

ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల ఫేస్‌ ప్యాక్‌లు లభిస్తున్నాయి. వీటిలో ఏది వాడాలో అర్థం కాని పరిస్థితుల్లో కొందరు మహిళలుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే తయారు చేసుకునే సహజమైన ఫేస్‌ ప్యాక్‌లు మీకోసం...
ఒక పాత్రలో రెండు చెంచాల చందనపు పొడి, చెంచా ముల్తానీ మట్టి, కొద్దిగా నిమ్మ రసం, ఐదు బాదం పప్పులతో తయారుచేసిన పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసుకుని ఇందులో రోజ్‌వాటర్‌ కలుపుకుని పేస్ట్‌లా తయారు చేసు కోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు పూయాలి. ఇలా 15-20 నిమిషాల ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. దీంతో మీ చర్మకాంతి మరింత ఇనుమడిస్తుంది.
చెంచా పచ్చిపాలలో, చెంచా బాదంపప్పుల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పూయాలి. బాగా ఎండిపోయిన తర్వాత స్పాంజ్‌ను నీటిలో ముంచి ముఖం, మెడను శుభ్రపరచుకోండి. దీంతో చర్మం బిగుతుగా తయారై నిగనిగలాడుతుంది. చర్మం వదులుగా ఉన్నవారు ఇలాంటి స్కిన్‌ ప్యాక్‌ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

10:30 - April 21, 2016

కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌ మూడవ దశ పోలింగ్‌లో హింస చెలరేగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ముర్షిదాబాద్‌ జిల్లా జితాపూర్‌ గ్రామం డోమ్‌కల్ పోలింగ్‌ బూత్‌ వద్ద సీపీఎం కార్యకర్తలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఒక సీపీఎం కార్యకర్తను బాంబులు వేసి తృణమూల్‌ గూండాలు మట్టుబెట్టారు. పోలింగ్‌ బూత్‌లపై తృణమూల్‌ కార్యకర్తలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. 

కుప్వారలో ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్‌ : కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు సమాచారం. 

బాలాలయంలో విగ్రహ ప్రతిష్టాపన..

నల్గొండ : యాదాద్రిలో బాలాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈవో గీతారెడ్డి, యాడా అధికారులు కూడా పాల్గొన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం: సీఎం చంద్రబాబు

కడప : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ఆదాయం 47 శాతం నుండి 49.35 శాతానికి పెంచామని, తెలంగాణ ఆదాయం 53 శాతం నుండి 5065 శాతానికి పడిపోయిందని చంద్రబాబు తెలిపారు. ఒట్టిమిట్ట రామాలయం, కడప పెదదర్గాను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు.

బైక్ ను ఢీ కొట్టిన కారు :3గురికి గాయాలు..

రంగారెడ్డి : మహేశ్వరం మండలం తుమ్మలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి ఇద్దరు కుమారులకు గాయాలయ్యాయి. పాలిట్ పరీక్షకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

09:46 - April 21, 2016

తూ.గో : కాకినాడలో అక్కినేని నాగార్జున సందడి చేశాడు. సినిమా షూటింగ్‌లో భాగంగా కాకినాడ రూరల్‌ మండలం పండూరుకు నాగార్జున వచ్చాడు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. హీరో శ్రీకాంత్‌ తనయుడు హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్‌' సినిమాకు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కల్యాణ్‌కృష్ణ ఇటీవలే నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా తీసి హిట్‌ ఇచ్చాడు. దీంతో కల్యాణ్‌కృష్ణ కోరిక మేరకు ఈ సినిమాలో నాగార్జున గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నారు. నాగార్జున రావడంతో చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 

09:40 - April 21, 2016

చెన్నై : కరుణానిధి రెండో కుమారుడు అళగిరి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. మే 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతివ్వడం లేదంటూ స్పష్టం చేయడమే కాకుండా, ఏఐఏడిఎంకెకే విజయావకాశాలున్నాయంటూ కామెంట్ చేశారు. అళగిరి రెండేళ్ల క్రితమే డిఎంకె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కరుణానిధికి స్టాలిన్ పెద్ద కుమారుడు కాగా, అళగిరి రెండో కుమారుడు. ఈ అన్నాతమ్ముళ్ల మధ్య సత్సంబంధాలు లేవు. రెండు వర్గాల అనుచరుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే కరుణానిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ ను తెరమీదకు తీసుకురావడం అళగిరికి ఏమాత్రం నచ్చలేదు. తన అసమ్మతిని, అసంత్రుప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో 2014లో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తండ్రిని కూడా కలవకుండా బెంగళూరులో మకాం వేసిన అళగిరి నెల రోజుల క్రితం కరుణానిధి ని కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే, తాను ఏ పార్టీకి మద్దతిచ్చేది లేదంటూ ఆయన తెగేసి చెప్పడంతో ఊహాగానాలకు తెరపడింది. 58 అసెంబ్లీ నియోజకవర్గాలున్న దక్షిణ తమిళనాడు జిల్లాల్లో అళగిరికి మంచి సంబంధాలున్నాయి. దక్షిణ తమిళనాడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన అళగిరి ఒక దశలో ఏఐఏడిఎంకెను గట్టి దెబ్బతీశారు. జయలలితకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో సైతం డిఎంకె జెండా ఎగరేయడంలో కీలకపాత్ర పోషించారు. 2009లో మధురై లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచి, జయలలితకు పెద్ద షాకిచ్చారు. అప్పటి నుంచి 2013 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసిన అళగిరి తండ్రి రాజకీయ వారసత్వం తనకే దక్కాలని ఆశించారు. అందుకు కరుణానిధి అంగీకరించకపోవడంతో కుటుంబ విబేధాలు బజారునపడ్డాయి. 

09:37 - April 21, 2016

విశాఖ : ఎస్ రాయవరం మడలం బంగారమ్మ పాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ మీటర్ల బిగింపులో జరిగిన నిర్లక్ష్యం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అమ్మమ్మ, మనవడు కావడంతో ఈ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొన్ని రోజులుగా బంగారమ్మ పాలెంలో విద్యుత్ మీటర్ల బిగింపు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సింహచలం ఇటీవల కొత్త ఇంటికి బిగించిన మీటర్ నాసిరకంగా ఉండటంతో ప్రవీణ్ కు వాళ్ల అమ్మమ్మకు విద్యుత్ షాక్ తగిలింది...వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందారు. విద్యుత్ అధికారుల వ్యహరించిన తీరుతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ముచ్చర్ల ఫార్మా భూ నిర్వాసితుల ఆందోళన

రంగారెడ్డి : ముచ్చర్ల ఫార్మా భూ నిర్వాసితుల ఆందోళన చేపట్టారు. సీఎం ఇంటి ముట్టడికి భూనిర్వాసితులు బయలు దేరారు. వీరికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు పలికి, నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈసీ ప్రత్యేక పర్యవేక్షకుడిగా సీవీ ఆనంద్

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు మరోసారి అరుదైన గౌరవం లభించింది. వచ్చేనెల 16న ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పుదుచ్చేరిలలో ఆయనను ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షకుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బుధవారం ఓ ప్రకటన చేస్తూ ఈ రెండు రాష్ర్టాల్లో అవినీతి రహిత, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహణ బాధ్యతలను సీవీ ఆనంద్‌కు ఈసీ అప్పగించిందని తెలిపింది. 

తెలంగాణ స్పీకర్ సెక్యూరిటీ అధికారి రాసలీలు

వరంగల్ : తెలంగాణ స్పీకర్ సెక్యూరిటీ అధికారి రాసలీలు బయటపడ్డాయి. భూపాలపల్లి మండలం హున్మాన్ నగర్ లో గత బుధవారం ఓ ఇంట్లో మహిళతో సెక్యూరిటీ అధికారి పట్టుబడ్డాడు. భూపాలపల్లి పీఎస్ లో ఆ అధికారిపై కేసు నమోదు అయ్యింది. సెక్యూరిటీ అధికారిని ఐఎస్ డబ్ల్యూకు సరెండర్ అయ్యారు.

09:02 - April 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా.. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్, మహబూబ్ నగర్, రామగుండం, నల్లగొండల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్,ఖమ్మంలలో 41 డిగ్రీలు ఉష్గోగ్రతలు నమోదయ్యాయి... మిగిలిన ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండే ఎండలకు తోడు.. వడగాలులూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వడగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది మృతి ....

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు ఇదేవిధంగా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వడగాలుల కారణంగా ఇప్పటికే 110 మంది మరణించినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో.. వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రంగా వీస్తున్న వడగాలులు

తెలంగాణ అంతటా ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పగలు పది గంటలకే.. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే.. మేనెల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు కలవరపడుతున్నారు.

09:00 - April 21, 2016

హైదరాబాద్ : మూడున్నర గంటల్లో ధూమ్ ధామ్ గా సాగిపోయే టీ-20 క్రికెట్లో...విజయానికి ఎన్నో సూత్రాలు, మంత్రాలు ఉన్నాయి. టాస్ నెగ్గితే ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలా? లేక ఫీల్డింగ్ ఎంచుకోవాల ? అన్న అంశాలపై..వివిధజట్ల కెప్టెన్లు స్పష్టమైన అవగాహనతో బరిలోకి దిగుతున్నారు.

తొమ్మిదోసీజన్లోని మొదటి 13 మ్యాచ్ ల ఫలితాలను చూస్తే....

ప్రస్తుత ఐపీఎల్ తొమ్మిదోసీజన్లోని మొదటి 13 మ్యాచ్ ల ఫలితాలను చూస్తే....ముందుగా బ్యాటింగ్ కంటే...చేజింగే మేలని, మ్యాచ్ నెగ్గాలంటే చేజింగ్ ను మించిన మంత్రం మరొకటి లేదని గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొనే సాహసానికి ఎక్కువమంది కెప్టెన్లు దూరంగా ఉంటున్నారు. ముంబై ఇండియన్స్- రెయిజింగ్ పూణే జెయింట్స్ జట్ల మధ్య ముంబై వాంఖెడీ స్టేడియంలో జరిగిన ప్రారంభమ్యాచ్ నుంచి...మొహాలీ పంజాబ్ క్రికెట్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ముగిసిన 13వ మ్యాచ్ వరకూ చూస్తే....మొత్తం 13 మ్యాచ్ ల్లో 12 చేజింగ్ విజయాలే ఉన్నాయి.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ....

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ...హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా...రాయల్ చాలెంజర్స్ జట్టు మాత్రమే 45 పరుగుల భారీవిజయం నమోదు చేయగలిగింది. మిగిలిన 12 రౌండ్ల మ్యాచ్ ల్లోనూ రెండోసారి బ్యాటింగ్ కు దిగిన జట్లే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విజయవంతం కాగలిగాయి.

ఆడిన నాలుగు రౌండ్లలో...కోల్ కతా నైట్ రైడర్స్ అత్యధికంగా..

ఇప్పటి వరకూ ఆడిన నాలుగు రౌండ్లలో...కోల్ కతా నైట్ రైడర్స్ అత్యధికంగా మూడు చేజింగ్ విజయాలు నమోదు చేయడం విశేషం. ఢిల్లీ డేర్ డెవిల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, కింగ్స్ పంజాబ్ జట్లపై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించినా...ముంబైజట్టుతో జరిగిన పోటీలో మాత్రం..రోహిత్ శర్మ సూపర్ చేజింగ్ దెబ్బతో ఢీలా పడాల్సి వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన భారీస్కోరింగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ చేజింగ్ విజయం ద్వారా బోణీ కొట్టింది.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై.....

పవర్ ఫుల్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై...ఢిల్లీ డేర్ డెవిల్స్, రెయిజింగ్ పూణే జెయింట్స్ పై కింగ్స్ పంజాబ్ జట్లు సైతం...చేజింగ్ విజయాలే సాధించడం విశేషం. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరుపై ఢిల్లీ ఓపెనర్ క్వింటన్ డీ కాక్ మెరుపు సెంచరీ సాధించడమే కాదు..తనజట్టుకు సూపర్ చేజింగ్ విజయం సైతం అందించాడు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ...

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చాంపియన్ ముంబై ఇండియన్స్ తో ముగిసిన మ్యాచ్ లో ...సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 90 పరుగుల నాటౌట్ స్కోరుతో విజయంలో ప్రధానపాత్ర వహించాడు. ప్రస్తుత సీజన్లో ముగిసిన అత్యధికమ్యాచ్ ల్లో..వివిధజట్ల ఓపెనర్లే ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డులు సొంతం చేసుకొన్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, కోల్ కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ యాండ్రీ రస్సెల్ మాత్రమే తమ బౌలింగ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోడం విశేషం.

గుజరాత్ లయన్స్ స్టార్ ఓపెనర్...

గుజరాత్ లయన్స్ స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్, కోల్ కతా ఓపెనర్ గౌతం గంభీర్, హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ, పంజాబ్ ఓపెనర్ మురళీ విజయ్, బెంగళూరు ఓపెనర్ ఏబీ డివిలియర్స్..ఈ సీజన్లో ఇప్పటి వరకూ అత్యుత్తమ ఫామ్ కనబరిచారు. ఓపెనర్లందరూ 42 సగటుతో 1808 పరుగులు సాధించడం విశేషం. గత ఎనిమిది ఐపీఎల్ టోర్నీలతో పోల్చిచూస్తే...ప్రస్తుత ఐపీఎల్- తొమ్మిదిలో మాత్రమే..ఓపెనర్లతో పాటు చేజింగ్ కు దిగిన జట్లు మాత్రమే విజయవంతంకాగలుగుతున్నాయి. అయితే..మొత్తం అరవై మ్యాచ్ ల ఐపీఎల్ హంగామాలో... ఓపెనర్ల హవా, చేజింగ్ జోరు ఇక ముందు జరిగే మ్యాచ్ ల్లో సైతం కొనసాగుతుందా? అంటే అవునని చెప్పడం సాహసమే అవుతుంది.

క్రికెట్‌ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అరెస్ట్...

హైదరాబాద్ : ఐపిఎల్ క్రికెట్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్‌లో వాళ్లను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో 32 ఏళ్ల సుమన్, 35 ఏళ్ల కిషోర్, 33 ఏళ్ల దశరథ్ ఉన్నారు. ఆ ముగ్గురి నుంచి రూ.87,540 నగదుతో పాటు ఒక కారు, రెండు బైక్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

08:21 - April 21, 2016

నల్గొండ :యాదాద్రిలో బాలాలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు రంగం సిద్ధమైంది. నేడు చిన్నజీయర్ స్వామీ ఆధ్వర్యంలో కవచ మూర్తుల ప్రతిష్టాపన జరగనుంది. యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ప్రధానాలయంలో ఏడాదిపాటు దర్శనాలు నిలిపివేస్తున్నారు. రాత్రి 11.30 గంటలకు చివరి దర్శనం కల్పించిన అనంతరం దర్శనాలు నిలిపివేశారు. అయితే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ ఏడాది పాటు లక్ష్మీ నరసింహస్వామీ వారి ఉత్సవ మూర్తులను దర్శించుకునేందుకు వీలుగా తాత్కలికంగా బాలాలయాన్ని నిర్మించారు.

08:14 - April 21, 2016

హైదరాబాద్ : వంద‌రోజుల ప్రణాళిక‌పై మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ప్రణాళిక అమల్లో ఇంక 40 రోజులే మిగిలి ఉండడంతో టార్గెట్‌ రీచ్‌ అయ్యేలా ప‌నుల్లో స్పీడ్ పెంచాల‌ని మంత్రి అధికారులను ఆదేశించారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, జిహెచ్ఎంసి, జ‌ల‌మండ‌లి, హెచ్ఎండిఎ అధికారులు హాజ‌ర‌య్యారు.

100 రోజుల్లోనే పూర్తిచేయగలిగే పనులు.....

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికపై మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ జిహెచ్‌ఎంసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర పాలక సంస్థలోని అన్ని విభాగాలూ ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు. రెండు నెల‌ల క్రితం హైదరాబాద్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో కెటిఆర్‌ మున్సిపల్ శాఖ బాధ్యతలనూ చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి దృష్ట్యా అన్ని విభాగాల‌కు 100రోజుల్లోనే చేయగలిగిన ప‌నుల‌ను ఫైన‌ల్ చేసి అధికారుల‌కు టార్గెట్ పెట్టారు. ఈ ప్రణాళికలో ఇప్పటికే 60 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప‌లు విభాగాలు చేసిన ప‌నుల పురోగ‌తిపై మంత్రి ఆరా తీశారు. కొన్ని విభాగాలు ఇచ్చిన వివ‌ర‌ణ‌లపై మంత్రి అంస‌తృప్తి వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం.

హైదరాబాద్‌కు సుదూర ప్రాంతాలనుంచి నీరు...........

నగరంలో నెలకొన్న నీటి కొర‌త‌ను అధిగమించేందుకు అధికారులు నిబద్ధతతో ప‌నిచెయ్యాల‌ని కెటిఆర్ జ‌ల‌మండ‌లి అధికారులకు సూచించారు. సుదూర ప్రాంతాల‌నుండి నీరు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నామని కనుక నీటిని పొదుపుగా వాడేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని అదేశించారు. ఇప్పటికే స్లాట‌ర్ హౌజుల నిర్మాణం పూర్తయ్యిందని నాలాల పూడికతీత ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి మంత్రికి వివరించారు. ఇక బిఆర్‌ఎస్‌ పై కోర్టులో కేసు ఉండ‌గా అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ ప‌నులు పూర్తిచేస్తున్నారు. వీటికి సంబంధించి మొత్తం 60వేల ద‌ర‌ఖాస్తులు రాగా హండ్రెడ్ డేస్‌లో 10వేల ద‌ర‌ఖాస్తులు క్లియ‌ర్ చెయ్యాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. సిటీలోని 4 వేల మ‌హిళా పొదుపు గ్రూపుల‌కు వంద కోట్ల రుణం ఇప్పించాల‌ని నిర్ణయించారు. ఇక వివిధ శాఖల్లో కొన్ని ప‌నులు వేగంగా జ‌రుగుతుండగా మ‌రికొన్ని ఆల‌స్యమవుతున్నాయి. అయితే గడువులోగా టార్గెట్ రీచ్ అవుతామని గ్రేట‌ర్ బాస్ జ‌నార్దన్‌రెడ్డి అన్నారు.

ఐటి పార్కులు, పారిశ్రామిక వాడలు....

నగరంలో ఉన్న ఐటిపార్కులు, పారిశ్రామిక వాడలు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్తగా రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రజలతో పాటు సంస్థలతో చర్చించాలన్నారు.

08:10 - April 21, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో సీఎం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారని, మంత్రి హరీశ్‌ రావు అధికారులకు గుర్తు చేశారు. ఇరిగేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు లేకుండా భారీగా నిధులు కేటాయిస్తున్నందున రెట్టింపు ఉత్సాహంతో పనిచెయ్యాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న బీడు భూముల్లో ప్రతి అంగుళం సాగులోకి రావాలని,.అందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులు మరింత బాధ్యతతో పనిచెయ్యాలని సూచించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయినందున పనులను త్వరగా ప్రారంభించాలని తెలిపారు. ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయంలో ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలన్న సీఎం కలలను సాకారం చెయ్యాలని అధికారులను హెచ్చరించారు.

ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలపై మండిపాటు .....

సాగునీటి ప్రాజెక్టుల మీద అనవసర రాద్ధాంతం చేస్తున్న వారిపై మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ఆధారాలుంటే ప్రభుత్వానికి, ప్రజలకు బహిర్గతం చెయ్యాలని డిమాండ్‌ చేశారు. తమ 22 నెలల పాలన తెరచిన పుస్తకమని స్పష్టం చేశారు.రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి ఆరోపణలు ఎదురైనా చిరునవ్వుతో భరిస్తామని అన్నారు.రైతులకు అండగా ఉండటం, హరిత తెలంగాణను సాధించటమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కార్యసిద్ధి తప్ప వేరే ఆలోచన లేకుండా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 

07:35 - April 21, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌..ఎలాగైనా పాలేరులో గులాబీ జెండా ఎగరేయాలని నిర్ణయించింది. ప్రతిపక్షాల ఊహలకు కూడా అందని విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరారావును ఎంపిక చేసి అదే ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరింది. మంత్రి తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఉన్నా..పాలేరులో కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలనే ఉద్దేశ్యంతోనే తుమ్మల ను అభ్యర్థిగా ప్రకటించిందా? ఎన్నికల పేరుతో కరువును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందా? ఆసరా పథకంలో కొత్త నిబంధనలు పెట్టడం వల్ల లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నారా? ప్రైవేటు విద్యా సంస్థలపై టాస్క్ ఫోర్సు దాడులు ఎందుకు? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టి.కాంగ్రెస్ నేత , కైలాస్, టిఆర్ ఎస్ నేత చిలకమర్రి నరసింహ, బిజెపి నేత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఉపాధి వేతనం రూ.194కు పెంచిన టి.సర్కార్..

హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల రోజువారి వేతనాన్ని పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాన్ని రూ.180 నుంచి రూ.194కు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. పెంచిన వేతనం ఏప్రిల్ 1 నుంచి కూలీలకు అందనున్నది.

 

23 నుండి 'టెట్' హాల్‌టికెట్లు

హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష 'టెట్' హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ రెండు రోజులు వాయిదా పడింది. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 8 వేల మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ నిరవధిక బంద్ నేపథ్యంలో టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియను రెండు రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించడంతో టెట్ విభాగం వాయిదా వేసింది. ఈనెల 23 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. కాగా ఒకేసారి ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఫలితాలకు సంబంధించి ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

పాలిసెట్ పరీక్షకు సెట్ 2 ప్రశ్నాపత్రం ఎంపిక

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేడు జర‌గ‌బోయే పాలిసెట్‌ పరీక్షకు సెట్ 2 ప్రశ్నాపత్రం ఎంపికయ్యింది. సెంట‌ర్లు ఇవ్వమంటూ మొండికేసిన ప్రైవేటు విద్యాసంస్ధల జేఏసీ..మంత్రి క‌డీయం శ్రీహ‌రితో చ‌ర్చల అనంత‌రం ప‌రీక్షకు స‌హ‌క‌రిస్తామ‌ని ప్రక‌టించింది. దీంతో పాలీసెట్‌కు లైన్‌క్లియర్‌ కావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ప‌రీక్షకు సంబంధిచిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి ప్రకటించింది. 

జమ్మూకశ్మీర్... లోలాబ్ లో ఎదురుకాల్పులు

జమ్మూకశ్మీర్ : కుప్పావడలోని లోలాబ్ లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. లోలాబ్ గ్రామాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.

ప.బెంగాల్ లో మూడో దశ పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ లో మూడో దశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విడతలో 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ లో ఇప్పటికే రెండు విడతల్లో 105 స్థానాలకు పోలింగ్ ముగిసింది. గురువారంనాడు పోలింగ్ జరిగే 62 నియోజవర్గాలు నాలుగు జిల్లాల్లో విస్తరించి వున్నాయి. ముర్షిదాబాద్ జిల్లాలో 22, నాడియా జిల్లాలో 17, నార్త్ కోల్ కతాలో 7 , బర్ద్వాన్ జిల్లాలో 16 నియోజకవర్గాల్లో పోలింగ్ వుంటుంది.

06:58 - April 21, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఎలాగైనా పాలేరును దక్కించుకోవాన్న ఆలోచనతో ఉన్న గులాబీ బాస్..గెలుపు గుర్రాన్నే ఎంపిక చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అసెంబ్లీకి పంపించి..పాలేరు సత్తా చాటాలని భావిస్తున్నారు.

పాలేరు ఇంచార్జ్‌గా మంత్రి కేటీఆర్‌కు బాధ్యత ...

పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పాలేరు ఉప ఎన్నికల ఇంచార్జ్‌గా మంత్రి కేటీఆర్‌కు బాధ్యత అప్పగించారు.

ప్రతిపక్షాల ఊహలకు కూడా అందని విధంగా ...

పాలేరు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌..ఎలాగైనా పాలేరులో గులాబీ జెండా ఎగరేయాలని నిర్ణయించింది. ప్రతిపక్షాల ఊహలకు కూడా అందని విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరారావును ఎంపిక చేసి అదే ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరింది. అయితే మంత్రి నాగేశ్వరరావును ఎంపిక చేయడంపై గులాబీ బాస్ భారీగానే కసరత్తు చేశారు. మంత్రి తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఉన్నా..పాలేరులో కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలంటే జిల్లాలో పట్టున్న నాయకుడు ఉండాలి. మంత్రిగా తుమ్మలకు ఆ అనుభవం చాలా ఉందని..దాంతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని పోయే సామర్థ్యం తుమ్మలకు ఉంది. దీంతో పాలేరులో సునాయసాంగా విజయం సాధించవచ్చనే నమ్మకంతో తుమ్మలనే అభ్యర్థిగా ఎంపిక చేశారు. అంతే కాకుండా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరుపున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన తుమ్మల ఓడిపోయారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన తర్వాత అదే తుమ్మలను పాలేరులో భారీ మెజార్టీతో గెలిపించాలన్న పట్టుదలతో గులాబీ బాస్‌ వ్యూహం రచించారు.

టీఆర్‌ఎస్‌ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం ...

ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్‌..టీఆర్‌ఎస్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సాంప్రదాయానికి విరుద్ధంగా టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని నేతలు మండిపడుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే అంతకంటే ముందుగానే పాలేరు అభ్యర్థిగా మంత్రి తుమ్మలను ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవానికి సహకరించాలని తాము కోరుతుంటే..మంత్రి తుమ్మలను అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా...అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పాలేరు అభ్యర్థిని అందరికంటే ముందే ప్రకటించడంతో ప్రతిపక్షాల్లో అప్పుడే గుబులు మొదలైంది. మంత్రి తుమ్మలకు ధీటైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో విపక్షాలు వ్యూహరచనలు చేస్తున్నాయి. 

పాలేరు టిఆర్ ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఎలాగైనా పాలేరును దక్కించుకోవాన్న ఆలోచనతో ఉన్న గులాబీ బాస్..గెలుపు గుర్రాన్నే ఎంపిక చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అసెంబ్లీకి పంపించి..పాలేరు సత్తా చాటాలని భావిస్తున్నారు. 

06:53 - April 21, 2016

హైదరాబాద్ : ఈ విద్యా సంవత్సరం నుంచే కేజీ టూ పీజీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. దీని సాధ్యాసాధ్యాలను తక్షణమే అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలన్నారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్‌ పాఠశాలలు లేని మండలాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు.

పాలనపై దృష్టి సారించిన కేసీఆర్‌.....

మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం కుదుటపడడంతో పాలనపై దృష్టి సారించారు. మెదక్‌ జిల్లా ఎర్రవెల్లిని సందర్శించిన సీఎం.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సకాలంలో లబ్దిదారులకు ఇళ్లను అందజేసే విధంగా చూడాలన్నారు కేసీఆర్‌.

కళాశాల యాజమాన్యాల డిమాండ్లను కేసీఆర్‌కు వివరించిన కడియం..........

అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం.. క్యాంప్‌ ఆఫీసులో పలు శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్‌ కళాశాలల వ్యవహారంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కళాశాల యాజమాన్యాల డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. సహేతుకం కాని డిమాండ్లను ఆమోదించవద్దని.. నాణ్యత పాటించని కాలేజీలపై తనిఖీలు కొనసాగించాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. పరీక్షలకు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు అంగీకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

250 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించాలి..........

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా అనుమతిచ్చిన 250 రెసిడెన్షియల్‌ పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. స్థలాలు ఎంపిక చేయడంతో పాటు.. సొంత భవనాలను నిర్మించాలని ఆదేశించారు. మండల కేంద్రాల్లోనే రెసిడెన్షియల్స్‌ ఉండాలన్న నిబంధనను పక్కనపెట్టి.. విద్యార్థులకు అనువుగా ఉండే ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు లేని మండలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం. ఇక మెదక్‌ జిల్లా ములుగులో నెలకొల్పబోయే ఫారెస్ట్‌ కాలేజి నిర్వహణ కోసం 118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త భవనం నిర్మించేలోపు దూలపల్లిలోని ఫారెస్ట్‌ అకాడమీలో తరగతులు నిర్వహించాలని సూచించారు కేసీఆర్‌.

సీఎంను కలిసిన ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం........

అటు ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం నేతలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. గత పాలకుల తప్పుల వల్లే కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నియామకాల్లో అన్యాయం జరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. మానవతా దృక్పథంతో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

06:51 - April 21, 2016

కడప : ఒంటిమిట‌్ట సీతారాముల కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. వెన్నెల రేడు చల్లని కిరణాలు... పుష్పాల సుగంధాల మధ్య కళ్యాణ రాముడు సీతాదేవిని వివాహమాడాడు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

అశేష భక్తజనం తిలకిస్తుండగా......

కోదండ రాముడు కళ్యాణ రాముడయ్యాడు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అశేష భక్తజనం తిలకిస్తుండగా సీతాదేవిని పరిణయమాడాడు. వేలాది మంది కొలువై ఉండగా పున్నమి చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తుండగా దేవదేవుని వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ నరసింహన్...

ఆలయం నుంచి సీతారాములను కళ్యాణ మండపానికి మేళతాళాల మధ్య తీసుకొచ్చారు. పుష్పాలు, విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా ఉన్న కళ్యాణ మండపంలో వివాహ తంతు నిర్వహించారు. తొలుత గవర్నర్ నరసింహన్ పట్టువస్త్రాలు సమర్పించారు.

వివాహ ప్రక్రియ ప్రారంభమయ్యాక సిఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొచ్చారు. అనంతరం వేద పండితులు లయబద్ధమైన మంత్రోచ్ఛారణలు జరుపుతూ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ వివరిస్తూ మాంగళ్య ధారణ చేయించారు.

కన్నుల పండుగగా....

కన్నుల పండుగగా జరిగిన కోదండ రాముని కళ్యాణానికి వేలాదిగా భక్త జనం తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నేపథ్యంలో కళ్యాణోత్సవాన్నీ టిటిడి పకడ్బందీగా నిర్వహించింది. భక్తులకు ముత్యాలతో కూడిన రెండు లక్షల అక్షింతల ప్యాకెట్లను సరఫరా చేసింది. అన్ని ఆలయ సంప్రదాయాలకు భిన్నంగా పౌర్ణమి రోజున జరిగిన కోదండ రాముని కళ్యాణ మహోత్సవాన్ని ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు వీక్షించి ఆనందించారు. 

నేడు యాదాద్రిలో బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమం

నల్గొండ :యాదాద్రిలో బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ జరగనుంది. చినజీయర్ స్వామి నేతృత్వంలో బాలాలయంలోని లక్ష్మీనరసింహస్వామి కవచమూర్తులకు ఉదయం 9 గంటల 58 నిమిషాలకు ప్రతిష్ఠ మహోత్సవాన్ని చేపట్టనున్నారు. దేవాలయ విస్తరణ కారణంగా బాలాలయంలో పూజలు జరగనున్నాయి. నిర్మాణ దశలో దైవదర్శనాలు, మొక్కు పూజలకు ఆటంకం కలగకుండా బాలాలయం ఏర్పాటయ్యింది. పునర్నిర్మాణం దృష్ట్యా శాశ్వత పూజలన్నిటినీ నిలిపివేసినట్లు ఆలయ ఈవో ఎన్‌.గీత తెలిపారు. బాలలయంలో దర్శనాలు, నిత్య ఆర్జిత పూజలు జరుగుతాయని ఆమె అన్నారు. 

06:47 - April 21, 2016

హైదరాబాద్: వైసీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు.. ఓ ఎమ్మెల్సీ టీడీపీలో చేరిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేలు వీరి బాటలోనే నడుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వలస వెళుతున్న వారిని ఆపేందుకు వైసీపీ అధినేత జగన్‌ ప్రయత్నించక పోవడం పార్టీ శ్రేణులను విస్మయ పరుస్తోంది ఇంతకీ వైసీపీలో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్‌ నేతలూ పార్టీపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..?

వైసీపీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితి....

వైసీపీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. గడచిన రెండు మూడు నెలల్లో.. ఒకరి వెంట ఒకరుగా ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరుతుంటే.. వైసీపీ అధినేత జగన్‌ నిరాసక్తంగా ఉండడం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపుగా వారినికో ఎమ్మెల్యే పార్టీని వీడుతుంటే.. ఏ అధ్యక్షుడైనా సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తారు. కానీ జగన్‌ మాత్రం అలా చేయడం లేదు. తాజాగా బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు కూడా సైకిలెక్కేశారు.

వైసీపీ నుంచి మరో పది మంది ఎమ్మల్యేలు వెళతారంటూ ప్రచారం.....

వైసీపీ నుంచి వలసల పర్వం ఇకమీదట కూడా కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయి ప్రసాదరెడ్డి, ఐజయ్య, జయరాములు, నెల్లూరు జిల్లా నుంచి సంజీవయ్య, చిత్తూరు జిల్లాకు చెందిన అమర్‌నాథ్‌, కడప జిల్లా నుంచి రఘురామిరెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన చాంద్‌బాషా, గుంటూరు నుంచి ముస్తఫా, ప్రకాశం జిల్లాకు చెందిన జంకె వెంకటరెడ్డి తప్ప నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలూ టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అసలు వైసీపీలో ఏమి జరుగుతోంది..?....

ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వెలువడుతుంటే.. ఏపార్టీకైనా రాజకీయంగా ఇబ్బందిని కలిగించే అంశమే. ఇలాంటి పరిస్థితుల్లో.. పార్టీ అధ్యక్షుడు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమీక్షలు జరిపి.. వలసలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేయడం సహజం. కానీ జగన్మోహన్‌రెడ్డి ఆదిశగా అడుగులే వేయడం లేదు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేలు వలసెళ్లిపోతున్నా జగన్‌ ఎందుకు స్పందించడం లేదు..?

సీనియర్లతో ఎన్నడూ చర్చించని జగన్‌......

జగన్మోహన్‌రెడ్డి ఒంటెద్దు పోకడే వైసీపీ సీనియర్లలో అసంతృప్తికి కారణమన్న వాదన వినిపిస్తోంది. పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు సీనియర్లతో చర్చించకుండా.. తన సామాజిక వర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారినే జగన్‌ సంప్రదిస్తున్నారు. దీన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. పైగా.. పార్టీ బాధ్యతల విషయంలోనూ.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పార్థసారథి, ధర్మాన ప్రసాదరావు లాంటి అనుభవమున్న వారికి కాకుండా.. రెడ్డి సామాజిక వర్గం నేతలకే జగన్‌ ప్రాధాన్యతనిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.

అవకాశవాదులే పార్టీ మారుతున్నారని జగన్‌ అభిప్రాయం.........

పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలపై జగన్‌ తనదైన భాష్యం చెబుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు.. వైసీపీలో చేరిన అవకాశవాదులే ఇప్పుడు పార్టీ మారుతున్నారని.. వారిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్‌ అంటున్నట్లు సమాచారం. ఎంత మంది నేతలు ఫిరాయించినా.. ప్రజలు తమ వెంటే ఉంటారన్న ధీమాతో జగన్‌ ఉన్నారు. అందుకే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రచారానికి పెట్టాలని, ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలనీ జగన్‌ నిర్ణయించారు.

ఎమ్మెల్యే ఫిరాయింపుల వ్యవహారం వైసీపీలో పెద్ద దుమారమే...

ఎమ్మెల్యే ఫిరాయింపుల వ్యవహారం వైసీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. దానికన్నా కూడా జగన్‌ వైఖరి పార్టీ శ్రేణులను తీవ్ర అయోమయంలో నెడుతోంది. ప్రజలను కదిలించగలిగే నేతలు వలస వెళ్లాక.. ప్రజలంతా పార్టీ వెంటే ఉంటారని భావించడం ఏమేరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల వలస.. సీనియర్ల అసంతృప్తులను జగన్‌ ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. 

పాలీసెట్‌కు లైన్‌క్లియర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు జర‌గ‌బోయే పాలిసెట్‌కు లైన్ క్లీయ‌ర్ అయింది. సెంట‌ర్లు ఇవ్వమంటూ మొండికేసిన ప్రైవేటు విద్యాసంస్ధల జేఏసీ..మంత్రి క‌డీయం శ్రీహ‌రితో చ‌ర్చల అనంత‌రం ప‌రీక్షకు స‌హ‌క‌రిస్తామ‌ని ప్రక‌టించింది. దీంతో పాలీసెట్‌కు లైన్‌క్లియర్‌ కావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ప‌రీక్షకు సంబంధిచిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి ప్రకటించింది. 

06:41 - April 21, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. సంక్షేమ పథకాల ఫలితాలను నేరుగా ప్రజల నుంచే అడిగి తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా టీడీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాగునీటి ప్రాజెక్టుల పనితీరును పరశీలించనున్నారు. అక్కడే రాత్రుల్లు బసచేయడం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చెయ్యడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పలుచోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహంచనున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి లోకల్‌ కార్యకర్తలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రాజెక్టు ల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో మండిపోతున్న ఎండలకు సంబంధించి కూడా జిల్లా పర్యటనల్లో పరామర్శలు చేయనున్నారు.

గతకొంతకాలంగా బాబు జిల్లా యాత్రలకు బ్రేక్ ......

గతకొంత కాలం నుంచి బాబు జిల్లా యాత్రలకు బ్రేక్‌ పడుతోంది. జిల్లా టూర్లు చేసినా కేవలం షెడ్యూల్‌ ప్రకారం పాల్గొనడమే తప్ప జిల్లాల్లో పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం లేదు. ఇకనుంచి రాత్రిపూట కూడా జిల్లాల్లోనే బస చేసేందుకు బాబు రెడీ అవుతున్నారు. సీఎం పర్యటనపై రాష్ట్ర మంత్రి వర్గం అలర్ట్‌ అయ్యింది. జిల్లా పర్యటనలకు అన్ని విధాల ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు టూర్‌ తేదీల విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ వచ్చేవారంలో ప్రారంభం కానుందని సమాచారం. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీ పరంగా జిల్లా పర్యటనలను సక్సెస్‌ చేసుకోవాలని బాబు భావిస్తున్నారు.పార్టీలోకి తరలివస్తున్న వలసలతో ఫుల్‌జోష్‌లో ఉన్న టీడీపీకి చంద్రబాబు టూర్‌ ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.

జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్న సీఎం చంద్రబాబు

విజయవాడ : ఏపీ ప్రభుత్వ పాలనలో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సీఎం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు,తీరుతెన్నులు సమీక్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే వారం నుంచి జిల్లాల పర్యటనలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

06:38 - April 21, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ వివాదం ఇంకా రగులుతూనే వుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షా పేపరులో తప్పిదాలున్నాయంటూ కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. మొత్తం 13 ప్రశ్నల కు సంబంధించిన జవాబుల విషయంలో అభ్యంతరాలు రాగా, వాటిలో 7 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్టు ఏపీపీఎస్సీ అంగీకరించింది. మిగిలిన ఆరు జవాబుల విషయంలోనూ తప్పులున్నాయంటూ కొంతమంది అభ్యర్థులు వాదించారు. ఈ వ్యవహారం మొదట హై కోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లింది. అందరికీ మెయిన్స్ పరీక్ష పెట్టాలని హైకోర్టు ఆదేశించగా, నష్టపోయినవారికి మెయిన్స్ నిర్వహిస్తామంటూ ఏపిపిఎస్సీ అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు ఏపిపిఎస్సీ మీద కోర్టు ధిక్కారం కేసు పెట్టి, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ వివాదం పూర్వాపరాలేమిటి? గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు? గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఏం చెబుతోంది? మళ్లీ పరీక్ష పెట్టాలన్న ప్రతిపాదనను ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో 2011 గ్రూప్ ఇంటర్వ్యూలో సెలక్టయిన అభ్యర్థులు గణేష్, రత్నప్రభ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఎర్రమంజిల్‌ కోర్టులో విజయ్‌మాల్యాపై 11 కేసులు

హైదరాబాద్ : ఎర్రమంజిల్‌ కోర్టులో పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాపై జిఎమ్‌ఆర్‌ సంస్థ 11 కేసులు వేసింది. 22 కోట్ల రూపాయల చెక్‌బౌన్స్‌పై మాల్యాపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులకు సంబంధించి వచ్చే నెల 5న ఎర్రమంజిల్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 

నేడు బెంగాల్ లో 3వ విడుత పోలింగ్

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో మూడో విడత పోలింగ్ కు సర్వంసిద్ధమైంది. మూడో విడతలో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధి పార్టీలైన సిపిఎం, కాంగ్రెస్ ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. సమ ఉజ్జీలుగా వున్న ఇరుపక్షాలు పై చేయి సాధించేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. 

06:32 - April 21, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో గురువారం మూడో విడత పోలింగ్ జరగబోతోంది. ఈ విడతలో 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ లో ఇప్పటికే రెండు విడతల్లో 105 స్థానాలకు పోలింగ్ ముగిసింది. గురువారంనాడు పోలింగ్ జరిగే 62 నియోజవర్గాలు నాలుగు జిల్లాల్లో విస్తరించి వున్నాయి. ముర్షిదాబాద్ జిల్లాలో 22, నాడియా జిల్లాలో 17, నార్త్ కోల్ కతాలో 7 , బర్ద్వాన్ జిల్లాలో 16 నియోజకవర్గాల్లో పోలింగ్ వుంటుంది.

తృణమూల్ కాంగ్రెస్, బిజెపి లు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా....

తృణమూల్ కాంగ్రెస్, బిజెపి లు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, సిపిఎం 38 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 26 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. అయిదు స్థానాల్లో ఆర్ ఎస్ పి, మూడు స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. రాష్ట్ర మంత్రులు శశిపంజా, సాధన్ పాండే, బిజెపి జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా, అయిదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మహ్మద్ సోహ్రబ్, సిపిఎం ఎమ్మెల్యే అనిసుర్ రహ్మన్, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి నజ్రుల్ ఇస్లాం లకు ప్రతిష్టాత్మకంగా మారింది.

33 మంది మహిళలతో సహా మొత్తం 418 మంది అభ్యర్థులు....

33 మంది మహిళలతో సహా మొత్తం 418 మంది అభ్యర్థులు రంగంలో వున్నారు. 54శాతం మంది అభ్యర్థులు యాభై ఏళ్లలోపు వారు కావడం విశేషం. 61 మంది కోటీశ్వరులు కాగా, 80 మంది నేరచరితులున్నారు. గోలా, భరత్ పూర్ నియోజకవర్గాలను అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా భావిస్తున్నారు.

మూడో విడతలో మొత్తం 1,37,42,000 మంది....

మూడో విడతలో మొత్తం 1,37,42,000 మంది కి ఓటు హక్కు వుండగా, వీరిలో 71, 33, 978 మంది పురుషులు. 65,79, 218 మంది స్త్రీలు. 16 461 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ 18,930 ఈవిఎంలను అమరుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ వైఎస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత్ మిశ్రా, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రచారాన్ని రక్తికట్టించారు. గురువారం పోలింగ్ జరిగే 62 నియోజకవర్గాల్లో దాదాపు సగం స్థానాలు టిఎంసి సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. 2011 ఎన్నికల్లో టిఎంసి 29 గెల్చుకోగా, లెఫ్ట్ 17, కాంగ్రెస్ 16 గెల్చుకున్నాయి. 2011లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టిఎంసి 7 స్థానాల్లో 5వేల లోపు మెజార్టీతో నెగ్గడం విశేషం. 

Don't Miss