Activities calendar

22 April 2016

సీఎం చంద్రబాబుతో ముగిసిన టీటీడీపీ నేతల భేటీ

విజయవాడ : సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ ముగిసింది. పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంపై చర్చలు ఓ కొలిక్కిరాలేదు. రేపు మరోమారు బాబుతో నేతలు భేటీ కానున్నారు. 

పుణె విజయలక్ష్యం 186 పరుగులు

హైదరాబాద్ : ఐపీఎల్-9లో భాగంగా బెంగుళూరు రాయల్ చాలెంజర్స్, పుణె జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగుళూరు రాయల్ నిర్ణీత 20 వోవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185పరుగులు చేసింది. పుణె విజయలక్ష్యం 186 పరుగులుగా ఉంది. 

ఇంటర్ పాస్ కాలేదని ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం... ఒకరి మృతి

హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్ లో పాస్ కాలేదనే మనస్థాపంతో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు ఫ్యాన్‌ కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకోగా మరొకరు గొంతుకోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాలోని భువనగిరి మండలం అర్భన్‌ గ్రామానికి చెందిన శృతి హైదరాబాద్ తార్నాకలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఇవాళ విడదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఆమె ఓ సబ్జెక్టు ఫెయిల్‌ అయింది. దీంతో మనస్థాపం చెందిన శృతి మధ్యాహ్నం భువనరిగిలోని తన ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
మరో సంఘటనలో... 

21:47 - April 22, 2016

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఉత్తరాఖండ్‌లో మళ్లీ రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఏప్రిల్‌ 27 వరకు రాష్ట్రంలో యథాస్థితి కొనసాగనుంది. విచారణ సందర్భంగా రాష్ట్రపతి నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించజాలదని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హరీష్‌ రావత్‌ సర్కార్‌ మెజారిటీ కోల్పోయినందున రాష్ట్రపతి పాలన విధించడం తప్పనిసరని పిటిషన్‌లో పేర్కొంది.  హైకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి పదవిని మళ్లీ చేపట్టిన హరీష్‌రావత్‌ సుప్రీం తీర్పుతో మళ్లీ మాజీ అయిపోయారు. హరీష్‌రావత్ గతరాత్రి కాబినెట్‌ సమావేశం నిర్వహించి11 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొన్న సమయంలో కాబినెట్‌ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని గవర్నర్ కెకె పాల్‌ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 

 

21:43 - April 22, 2016

భూమి వేడెక్కుతోంది..!! మంచుకొండలు కరుగుతున్నాయి..!! సముద్రాలు ఉప్పొంగుతున్నాయి..!! రుతువులు గతి తప్పుతున్నాయి...!!, మంచుకొండలు కరుగుతున్నాయి..!! భూమిపై పెరుగతున్న ఊష్ణతాపంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

ఒడిశాలో వడదెబ్బకు 72 మంది మృతి

భువనేశ్వర్ :ఒడిశాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడ దెబ్బ తాళలేక ఇవాళ ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృతి చెందారు. టిట్లాగఢ్‌లో 47.5, సుబర్ణపూర్‌లో 46.3, బాలంగీర్‌, సుందర్‌గఢ్‌లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఒడిశాలోని 15 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.

రేపు గవర్నర్ నరసింహన్ తో జగన్ భేటీ

హైదరాబాద్‌ : వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను ఉదయం 11 గంటలకు కలిసి ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని జగన్ కోరనున్నారు.

క్వార్టర్‌ ఫైనల్లో సింధు పరాజయం..

హైదరాబాద్‌ : చైనా మాస్టర్స్‌ గ్రాండ్‌ ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగి ప్రిక్వార్టర్స్‌లో అద్భుత విజయం సాధించిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు జోరుకు తెరపడింది. థాయ్‌ షట్లర్‌ పార్న్‌టిప్‌తో 38 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 21-17, 21-19తో పరాజయం పాలైంది.

21:24 - April 22, 2016

అన్నపూర్ణస్టూడియోలో నడిచిన డ్రామా..సినిమోళ్ల మీద కేసీఆర్ వల్లమాలిన ప్రేమ, ఉప ఎన్నికల ఊప మీదున్న పాలేరు... ఆపవశంగాకున్నది లీడర్లందరి జోరు, బొక్కలిరుస్తా అని జెప్పిన బొడిగ శోభక్క... మైక్ పట్టుకోని రేషంగా మాట్లాడింది పక్క, కరువుతోని అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలు.. ఎన్నడుదీర్తయొయేమో జనం కష్టాలు, తిరుమల కొండ మీద సినిమా క్లైమాక్సులు.. పుస్తెలతాడుకట్టినంక అంతా రిలాక్స్.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:08 - April 22, 2016

ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజులను నియంత్రించాలని ప్రజలు కోరారు. ఫీ'జులుం'పై విజయవాడలో టెన్ టివి డిబేట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు. విద్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విద్యను డెవలప్ చేయడం లేదని విమర్శించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో లేవన్నారు. ఫీజులపై నియంత్రణ లేదని.. విద్యను వ్యాపార కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. ఆర్థికస్థితి పెరగనంతకాలం అభివృద్ధి జరగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:59 - April 22, 2016

హైదరాబాద్‌ : ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల తరహాలో హైదరాబాద్‌లో మూడు పెద్దాసుపత్రులను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వైద్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లోనూ మొదటి దశలో పెద్దాసుపత్రులను నిర్మించాలని కేసీఆర్‌ సూచించారు. ఒక్కో ఆస్పత్రి 760 పడకల సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. రెండేళ్లలో ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు.  

 

20:57 - April 22, 2016

విశాఖ : 20 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విశాఖ జిల్లాలో కరువు పరిస్థితులపై అధికారులతో యనమల సమీక్ష నిర్వహించారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తామని చెప్పారు. తిరుపతి, గుంటూరు, కాకినాడ, వైజాగ్‌ కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కరువు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

 

20:53 - April 22, 2016

కృష్ణా : ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమర్థంగా వినియోగించాలని సీఎం చంద్రబాబు అన్నారు. సూరంపల్లిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్ట్స్ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేయాలని సూచించారు. కంపోస్టు ఎరువుల తయారీని కేంద్రం ప్రోత్సహిస్తోందని బాబు తెలిపారు. ఫార్మా ఎడ్యుకేషన్‌ రీసెర్చ్ సెంటర్‌ నిట్‌తో సమానమని ఆయన తెలిపారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమర్థంగా వినియోగించాలని కోరారు. ఉద్యోగ అవకాశాలున్న కోర్సులకు విద్యార్థులు ప్రాధాన్యమివ్వాలని, ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌లో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. ప్లాస్టిక్‌ పార్కుకు మల్లవల్లిలో 250 ఎకరాలు కేటాయించామని చంద్రబాబు అన్నారు. 

 

20:47 - April 22, 2016

హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాదం తప్పింది. సాంకేతికలోపంతో ఆఫీసులోని లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్‌ ఫ్లోర్‌కి జారిపడింది. ఈ సమయంలో లిఫ్ట్ లో కేంద్రమంత్రి జేపీ నడ్డా, ఎమ్మెల్యే ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్‌, ఎమ్మెల్యే రాంచందర్‌రావు ఉన్నారు. వీరు లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

 

ఈ నెల 25న ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవానికి భూమిపూజ

హైదరాబాద్ : ఈ నెల 25న ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవానికి మహూర్తం ఖరారైంది.  ఉదయం 4 గంటల 01 నిమిషానికి తాత్కాలిక సచివాలయం భవనానికి పూజలు చేయనున్నారు. ఆరు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో.. ముందుగానే పూజలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.  

20:28 - April 22, 2016

హైదరాబాద్ : ఈ నెల 25న ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవానికి మహూర్తం ఖరారైంది.  ఉదయం 4 గంటల 01 నిమిషానికి తాత్కాలిక సచివాలయం భవనానికి పూజలు చేయనున్నారు. ఆరు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో.. ముందుగానే పూజలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.  

ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ

ఢిల్లీ : ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ అయింది. ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అంశంపై చర్చించారు. ప్రజాస్వామ్యం ఖూనీ, ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై నిర్వహించనున్న ర్యాలీ తేదీలపై కూడా చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు సీనియర్‌ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయం : వైసీపీ

ఖమ్మం : జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని వైఎస్‌ఆర్‌ సీపీ నిర్ణయించింది. రాంరెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మద్దతు ఇవ్వాలని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ కలిసి పాలేరులో మద్దతివ్వాలని కోరారు. దీనిపై స్పందించిన జగన్‌.. పాలేరులో రాంరెడ్డి కుటుంబ సభ్యులు పోటీచేస్తే వైఎస్‌ఆర్‌ సీపీ పోటీచేయదని పేర్కొన్నట్లు సమాచారం

దళిత మహిళ కిడ్నాప్...రేప్

పంజాబ్‍ : సినిమా తరహా ఘటన, తలచుకుంటేనే ఒళ్ళు జలదరించేలా ఉన్న ఘటన, చివరికి సినిమాలో లాగానే చుట్టుపక్కల ఎవరు స్పందించని ఘటన. ఒక మహిళ ఉద్యోగిని ఆఫీసు నుండి అందరి ముందు నుండి లాక్కొని వెళ్ళి కిడ్నాప్ చేసి, కిరాతకంగా రేప్ చేసిన ఘటన పంజాబ్‍లోని ముక్తసర్ పట్టణంలో జరిగింది. మార్చి 25న జరిగిన ఈ సంఘటనలో 24 సంవత్సరాల ఆ ఉద్యోగి సహాయం కోసం గగ్గొలు పెట్టిన మనుషులు(?) ఎవరు స్పందించలేదు.
సిసి కెమెరాలలో ఆ ఉన్మాది ఆ ఉద్యోగిని ఎత్తుకెళ్ళటం కనిపిస్తుండగా, ఆమెకు సహాయంగా ఎవరు రాకపోవడం కూడా జరగలేదు. ఎత్తుకెళ్ళిన కిరాతకుడు తన ఫాం హౌజ్ లో రేప్ చేసి మరుసటి ఉదయం ఆ మహిళను వదిలి వేశాడు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పూణే

హైదరాబాద్‌ : ఐపీఎల్ 9లో భాగంగా పుణె వేదికగా కాసేపట్లో రైజింగ్ పుణె సూప‌ర్‌జైంట్స్, రాయ‌ల్‌ఛాలెంజ‌ర్స్‌ బెంగ‌ళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. టాస్‌ గెలిచి పూణే ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

19:48 - April 22, 2016

హైదరాబాద్ : నందమూరి నట వారసుడు బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' షూటింగ్ అట్టహాసంగా మొదలైంది. అతిరథ మహారథుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి సీఎం కేసీఆర్‌ క్లాప్‌ కొట్టి ప్రారంభించడం విశేషం. 
ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన సీఎం కేసీఆర్  
బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన అతిరథ మహారధులు తరలివచ్చారు. అన్నపూర్ణ స్టుడియోలో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, తలసాని , సినీ రంగానికి చెందిన చిరంజీవి, దాసరి నారాయణరావు,  కె.రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. వీరందరికీ బాలకృష్ణ స్వయంగా ఆహ్వానం పలికారు. ముహుర్తపు సన్నివేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టారు. గౌరవ దర్శకత్వం దాసరి నారాయణరావు వహించగా నటులు చిరంజీవి, వెంకటేశ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఎన్టీఆర్‌ గుర్తులను ఎన్నటికీ చెరపం : కేసీఆర్
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తనకు అత్యంత ఇష్టమైన మహానటుడు నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ వందో చిత్రం ప్రారంభోత్సవానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒక శకానికి నాంది పలికిన యుగపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి అని కొనియాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ను తమ ప్రభుత్వం తొలగించడానికి ప్రయత్నిస్తోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... తెలుగు జాతికి గర్వకారణమైన ఎన్టీఆర్‌ గుర్తులను తాము ఎన్నటికీ చెరపబోమన్నారు. 
ఈ కాంబినేషనే సినిమా విజయానికి తొలి మెట్టు : చిరంజీవి
అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ క్రిష్‌ లాంటి దర్శకుడి చేతిలో ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కడం ఖాయమని, ఈ కాంబినేషనే సినిమా విజయానికి తొలి మెట్టు అన్నారు. 
యుగపురుషుడు శాతకర్ణి : దర్శకరత్న
తెలుగుజాతికి ఉగాదిని అందించిన యుగపురుషుడు శాతకర్ణి అని అలాంటి చిత్ర కథాంశం ఎంపిక చేసుకొని బాలకృష్ణ విజయం సాధించాడని దర్శక రత్న దాసరి అన్నారు. 
ఈ చిత్రం నాకు మైలురాయిగా నిలిచిపోతుంది : బాలకృష్ణ  
తెలుగుజాతికి గర్వకారణమైన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తన వందో సినిమాగా తెరకెక్కించడం తన అదృష్టమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు వేసిన తనకు ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. తన 99 చిత్రాల నడకలో అడుగులు వేసిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రాన్ని అంకితం చేస్తామన్నారు. బాలకృష్ణ చేస్తున్న సెంచరీ సినిమా కావడంతో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ వర్గాలు, అభిమానులు, పెద్ద ఎత్తున్న హాజరయ్యారు.  

 

19:38 - April 22, 2016

హైదరాబాద్ : ఎపిలో పార్టీ పిరాయింపులు ఆగడం లేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీకి మరో షాక్ తగలనుంది. కదిరి వైసీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీలో చేరనున్నారు. రేపు విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో చాంద్ బాషా టీడీపీలో చేరనున్నారు.  

 

19:16 - April 22, 2016

విజయవాడ : పండు వెన్నెల్లో నదిమధ్యలో డిన్నర్ చేస్తూ ఊసులాడుకుంటుంటే ఎలా ఉంటుంది ? నదీ మధ్యలో బర్త్డ్ డే పార్టీలు చేసుకుంటే ఆమజా ఎలా ఉంటుంది? ఇలాంటి ఆనందాలు కావాలంటే సాధారణంగా అందరి ఆలోచనలు కేరళ వైపు వెళ్తుంటాయి. కానీ ఏపీ రాజధానిలో కేరళ తరహా వినోదాన్ని మీరూ ఆస్వాదించవచ్చు...నది మధ్యలో ఇలాంటి విహారాలు మీరూ చేయచ్చు. 
సింగపూర్ లాంటి నదీ పరివాహక రాజధాని
సింగపూర్ లాంటి నదీ పరివాహక రాజధానిని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. నది ఒడ్డున నిర్మించే నగరాలు వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటకంగా కూడా పెద్దఎత్తున ఆదాయాన్ని అందిస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. దీనిలో భాగంగా కృష్ణానదిలో వినూత్న తరహా బోట్లను ప్ర్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి  తెస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానదిలో ఇప్పుడు సరికొత్త వినోదం ప్రజలకు అందుబాటులోకి రానుంది..ఛాంపియన్స్ టీనా పేరుతో నిర్మాణం జరుగుతున్న ఈ బోటు మరికొద్ది రోజుల్లో విజయవాడ, గుంటూరు వాసులకు సరికొత్త వినొదాన్ని పంచబోతోంది.
వినూత్న తరహా బోట్లకు శ్రీకారం 
రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ఈ బోటు బరువు 80 నుంచి 90 టన్నుల వరకు ఉంటుంది. కేరళకు చెందిన సంస్థ  ఆరు నెలలుగా 40 మంది కార్మికులతో దీనిని తయారుచేస్తోంది. మొత్తం మూడు ఏసీ బెడ్రూములు ఈ బోటులో ఉండబోతున్నాయి. బోటు లోపల మొత్తం సెంట్రల్ ఏసీగా నిర్మాణం చేస్తున్నారు. ఈ బోటు నిర్మాణం  కొసం ప్రత్యేకమైన చెక్కను ఉపయోగించడమే కాక కేరళ, పాండిచ్చేరి, గోవా  బోట్లలో ఉపయోగించే చెక్కను వాడుతున్నారు..కృష్ణానది నీటి ఆధారంగా, ఇక్కడి పరస్థితులకు అనువుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీనిని నిర్మిస్తున్నారు. నీటి ప్రవాహం తక్కువ, ఎక్కువగా ఉన్నా బ్యాలెన్స్ చేసుకునే విధంగా దీన్ని తయారుచేస్తున్నారు.  
రెండు కోట్లతో బోటు నిర్మాణం
ఇప్పటికే కృష్ణానది లో రెండుసార్లు ట్రయల్ రన్ నిర్వహించిన ఈ బోటు మరో నెల రోజుల్లో పూర్తి స్ధాయిలో అందరికి అందుబాటులోకి రానుందని బోటు నిర్మాణం చేస్తున్న జ్యోతికుమార్ చెబుతున్నారు. ఇలాంటి మరికొన్ని బోట్లు నిర్మాణం చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని, ఈ బోటు నిర్మాణం పూర్తి కాగానే మరిన్ని బోట్లను ఇక్కడే నిర్మిస్తామని ఆయన అంటున్నారు.  
కృష్ణానదిలో రెండుసార్లు ట్రయల్ రన్ 
ఈ బోటులో ఒకేసారి 400  మంది వరకు పార్టీలు, ఫంక్షన్లు జరుపుకోవచ్చు. కింది భాగంలో రెండు బెడ్రూములు,  పైన ఒక బెడ్రూమును నిర్మిస్తున్నారు. బోటు లోపల 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్ ఏసీ రెస్టారెంట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరైనా మ్యారేజీ ఫంక్షన్లు, బర్త్ డే పార్టీలు చేసుకోవాలంటే  దీనిని ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. 
400 మంది వరకు పార్టీలు, ఫంక్షన్లు జరుపుకునే సౌకర్యం
ఇంత పెద్ద బోటును కృష్ణానదిలో మొదటిసారిగా అందుబాటులోకి తేనున్నారు.  మొన్నటి వరకు భవాని ఐల్యాండ్ లో చిన్నపాటి బోట్లు అందుబాటులో ఉన్నా ఇలాంటి లగ్జరీ బోటు నిర్మాణం జరగలేదు. వినోదం కోసం ఎంతైనా వెచ్చించే వారికి ఈ బోటు కొత్త అనుభూతులను అందించనుంది..

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఈసీ అనుమతి...

హైదరాబాద్ : ఖమ్మంలో ఈనెల 27న నిర్వహించే టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో ప్లీనరీని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రపంచ తెలంగాణ మహాసభలకు టీ.మంత్రులకు ఆహ్వానం

హైదరాబాద్‌ : మంత్రులు కేటీఆర్‌, జూపల్లి కృష్ణారావును ఇవాళ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ ప్రతినిధులు కలిశారు. డల్లాస్‌లో ప్రపంచ తెలంగాణ మహాసభలకు మంత్రులను ఆహ్వానించారు. జూన్‌ 3 నుంచి 5వరకు డల్లాస్‌లో ప్రపంచ తెలంగాణ మహసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు విశ్వేశ్వర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం ఉంటుందన్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వారికోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

 

అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ : అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 29 ఏళ్ల యువతి ఓ అపార్ట్‌మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భోపాల్‌లో అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్ : భోపాల్‌లోని బంజారా బస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. బస్తీలో ఉన్న 12 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సిలిండర్ పేలడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న 20 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధితులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తప్పిన ప్రమాదం..

హైదరాబాద్‌ : నాంపల్లిలోని బిజేపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. కార్యాలయంలోని లిఫ్ట్‌లోకి పరిమితికి మించి నేతలు ఎక్కడంతో అది ఒక్కసారిగా తెగిపడింది. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్‌లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. అయితే వీరంత ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు కార్యలయ సిబ్బంది తెలిపారు.

18:57 - April 22, 2016

వెనకటికి ఎవరో....ఏ కథ చెప్పమన్నా...అనగనగా ఒక ఆవు..దానికి రెండు కొమ్ములు అని మొదలు పెట్టేవారట. చివరకి విమానం గురించి చెప్పమన్నా...ఒకసారి విమానంలో వెళ్తున్నాను...కిందకి చూశాను...ఆవు కనిపించింది..దానికి రెండు కొమ్ములున్నాయి...ఇదీ వరస...ఇలాగే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు దర్శకులు....హీరో ఎవరైనా...అదే కథను తెరకెక్కిస్తున్నారు. హీరోకున్న ఇమేజ్ ఏంటి...ఏ కథలో, ఏ క్యారెక్టర్ లో అతన్ని ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారన్న ఆలోచన చేయడం లేదు. ఊరమాస్ సినిమాల కేరాఫ్ డైరక్టర్ బోయపాటి సరైనోడుతో దీన్ని మరోసారి నిరూపించాడు.
కథ..
సరైనోడు కథను సంక్షిప్తంగా చూస్తే.....రాష్ట్రానికి ఛీప్ సెక్రటరీ కొడుకు అల్లు అర్జున్. తన చుట్టూ ఏ తప్పు జరిగినా సహించని కుర్రాడు. రోజుకు కనీసం రెండు మూడు తగాదాలైనా సెటిల్ చేయనిదే లంచ్ కూడా చేయడు. మరోవైపు సకల అరాచకాలను సృష్టించే ప్రతినాయకుడు స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు ఆది పినిశెట్టి. చాలా గొడవల్లో ఆది మనుషులను దంచేస్తుంటాడు హీరో. చివరకు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విషయంలోనూ హీరోకు అడ్డు పడతాడు విలన్. ఇలా ప్రభుత్వాధినేత వారసుడి దౌర్జన్యాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నదే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ...
సరైనోడు మొత్తంగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. టైటిల్స్ తర్వాత వచ్చే ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ వరకు తానే సినిమా అయ్యాడు. ఈ క్యారెక్టర్ అర్జున్ కెరీర్ లో ఒక బెస్ట్ ఫర్మార్మెన్స్ గా చెప్పుకోవచ్చు. ఐతే ఇది తన ఇమేజ్ కు సరిపోయే కథ కాదు. అర్జున్ నుంచి మంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమాలను ప్రేక్షకులు కోరుకుంటారు. దీనికి భిన్నంగా దర్శకుడు బోయపాటి తనకు వచ్చిన..నచ్చిన ..యాక్షన్ కథలో మన హీరోను పెట్టేశాడు. కథనం సరిగా కుదరలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, పాటల చిత్రీకరణ, హీరో చేసిన డాన్సులు ఆకట్టుకున్నాయి.

ఎక్కువ ఫైట్లు ఉండటం సరైనోడులో పెద్ద మైనస్. ఊపిరి పీల్చుకోకుండా డజను యాక్షన్ సీన్స్ పెట్టేశారు. ఈ పోరాటాలు హెవీ కావడం..మరోవైపు కామెడీ లేకపోవడం...ప్రేక్షకులకు రిలీఫ్ లేకుండా చేస్తాయి. థమన్ ఒకట్రెండు పాటలు బాగా కంపోజ్ చేసినా....బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వేరియేషన్ చూపించలేకపోయాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ సినిమాకు గ్లామర్ జోడించారు.

ఫ్లస్ పాయింట్స్

1. అల్లు అర్జున్ నటన
2. నిర్మాణ విలువలు
3.పాటల చిత్రీకరణ

మైనస్ పాయింట్స్

1. కథా కథనాలు
2. కామెడీ లేకపోవడం
3. తరుచుగా వచ్చే ఫైట్స్

టెన్ టివి రేటింగ్... 1.75/5

 

18:44 - April 22, 2016

నిజామాబాద్‌ : అగ్నిప్రమాదం ఓ వికలాంగుడి ప్రాణం తీసింది. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలోని సీఎస్ ఐ చర్చ్ సమీపంలో పూరి గుడిసెకు నిప్పంటుకుంది. ఎండవేడికి వేగంగా మంటలు వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న శంకర్‌ కాలి బూడిదయ్యాడు. వికలాంగుడు కావడంతో మంటలనుంచి త్వరలో బయటకురాలేక సజీవ దహనమయ్యాడు. ఫైర్‌ ఇంజన్‌ మంటలు ఆర్పివేసేవరకే గుడిసంతా కాలిపోయింది.

 

18:42 - April 22, 2016

కరీంనగర్ : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఎమ్మెల్యే బోడిగ శోభ మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రజాప్రతినిధులమన్న విషయం మరిచి వేదికపైనే ప్రతిపక్ష పార్టీ నేతలను దూషించారు. మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో ఇదంతా జరిగింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో మిషన్ కాకతీయ రెండో దశ కింద కీడి చెరువు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెలతోపాటు ఎమ్మెల్యే బోడిగ శోభ హాజరయ్యారు. ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలంటూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు వేదికముందు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన శోభ.... ఇక్కడ తమ పోలీసులే ఉన్నారని... ఎక్కువ చేస్తే బొక్కలు చూర చూర చేస్తామంటూ రెచ్చిపోయారు. మంత్రి ఎదుటే మైక్‌లో తిట్ల దండకం అందుకున్నారు. ఇలా ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడినా మంత్రి ఈటెల మాత్రం మౌనంగా ఉండిపోయారు.

 

18:33 - April 22, 2016

రంగు రంగుల పూసలను, వెడ్డింగ్ కార్డ్స్ ను ఉపయోగిస్తూ చెవి దిద్దులను తయారు చేయొచ్చంటున్నారు ఒక అతివ. అదెలాగో ఇవాళ్టి సొగసులో చూసి నేర్చుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:30 - April 22, 2016

అనేక రంగాలలో ప్రత్యేకత చాటుతున్న మహిళలు తమ భద్రత కోసం ఆత్మ రక్షణా పద్ధతులను నేర్చుకోవలసిన అవసరం ఉంది. అనుకోకుండా ఎదురైన ఆపదలను ఎదుర్కోవటానికి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను మీకు పరిచయం చేసేందుకు ఇవాళ్టి నిర్భయ మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

18:26 - April 22, 2016

నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటిసారిగా ఒక మహిళ నియమితులయ్యారు. దీంతో నేపాల్ లో మూడు ముఖ్యమైన పదవులను మహిళలే నిర్వహిస్తున్నారు.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ మహిళలకు పురుషులకు సమానంగా అనేక విషయాలలో గౌరవం దక్కట్లేదు. పైగా కొన్ని ప్రదేశాలలో వారికి అనుమతి కూడా లభించట్లేదు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించి సమానత్వం దక్కకపోవటాన్ని తప్పుబట్టింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలలో ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగు చూసాయి. తెలుగు రాష్ట్రాలలోని మహిళలకు క్యాన్సర్ శాపంగా పరిణమిస్తోందని ఈ నివేదిక తేల్చింది.

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అరుదైన ఘనత సాధించింది. జిమ్నాస్టిక్స్ విభాగంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మొదటి వనితగా ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

ఎపి జెన్ కోలో సాంకేతిక లోపం

హైదరాబాద్ : ఎపి జెన్ కోలో సాంకేతిక లోపం ఏర్పడింది. బొగ్గును తొలిచే యంత్రంలో సాంకేతిక లోపం కలిగింది. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. రూ.కోట్లలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

తెలంగాణలో కొనసాగుతోన్న వడగాలుల ప్రభావం

హైదరాబాద్ : తెలంగాణ వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత, మెదక్, నల్లగొండ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.  మహబూబ్ నగర్, హన్మకొండలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. హైదరాబాద్, ఖమ్మంలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 

త్వరలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ : యనమల

విశాఖ : త్వరలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గ్రూప్-1, 2 పోస్టులతో పాటు ఇతర పోస్టులనూ భర్తీ చేస్తామన్నారు. కరవు నివారణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో వైసీపీ చీలిపోతుందని భాష్యం చెప్పారు. తాము ఎవరినీ పార్టీలోకి తీసుకోవడం లేదని.,. వాళ్లే వస్తున్నారని తెలిపారు. 

వైద్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : వైద్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల తరహాలో హైదరాబాద్ లో మరో 3 పెద్ద ఆస్పత్రులను నిర్మించాలన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ మొదటి దశలో పెద్ద ఆస్పత్రులను నిర్మించాలని చెప్పారు. ఒక్కో ఆస్పత్రి 760 పడకల సామర్థ్యం కలిగి ఉండాలని సూచించారు. రెండేళ్లలో ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఆస్పత్రుల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. 

 

17:35 - April 22, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో చెత్త పేరుకుపోయింది. ఏ వీధి చూసినా గుట్టలు  గుట్టలుగా చెత్త పోగుబడింది.  కొద్దికాలంగా బల్దియాలో రవాణా విభాగంలో  చోటుచేసుకుంటున్న మార్పులు, అధికారులు తీసుకుంటున్న చర్యలు  అసలుకే ఎసరు తెస్తున్నాయి. పాత వాహనాలను నిలిపేసిన అధికారులు  కొత్తవాటిని ఏర్పాటు చేయలేదు. దీంతో నగరంలో ఓపెన్ పాయింట్స్ వద్ద చెత్త  భారీ పెరుకుపోతోంది. 
రవాణా విభాగంలో పలు మార్పులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రవాణా విభాగంలో పలు మార్పులు చేసారు అధికారులు. ఇప్పటివరకు 90 పాత వాహనాలను  తీసివేసి వాటి స్థానంలో కొత్తవాహనాలను ఏర్పాటు చేయలేదు. కొన్ని  ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలను ఏర్పాటుచేసినప్పటికి పెద్దగా మార్పురాలేదు.  దీంతో నగరంలో డస్ట్ బిన్స్, ట్రాన్స్ ఫర్ కేంద్రాల వద్ద చెత్త భారీగా  పేరుకుపోయింది.  ప్రతిరోజు నగరంలో 4 వేల టన్నుల చెత్త పేరుకుపోతోంది.  దీనినంతటిని బయటికి పంపే మెకానిజంలో ఇబ్బందులు తలెత్తడంతో చెత్త  సమస్య ఎక్కువైంది. నగరంలోని టాంక్ బండ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ , యూసఫ్  గూడా ట్రాన్స్ ఫర్ స్టేషన్ తో పాటు పలు కేంద్రాల్లో చెత్త గుట్టలుగుట్టలుగా  పేరుకుపోయింది. 
వాహనాల కొరతతో పేరుకుపోతున్న చెత్త 
ఇప్పటివరకు కేంద్రీకృతంగా ఉన్న రిపేర్లను ఆయా జోనల్, సర్కిల్  స్థాయిలో వాహనాలను రిపేర్లు చేసుకోవాలని అవసరమైన మెయింటెనెన్స్  కూడా అక్కడి నుంచి చూసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నలుగురు  సభ్యుల కమిటీ రిపేర్లను ధృవికరిస్తే పనులు చేయాలనే నిబంధనలు పెట్టారు  .దీంతో రిపేర్లకు వెళ్లిన వాహనాలు తిరిగి విధుల్లోకి రావడానికి  ఆలస్యమవుతోంది. బల్దియా పరిధిలో 900 వాహనాలు  24 జోన్లలో పనిచేసేవి. ఇవి ప్రధానంగా స్థానికంగా చెత్తను సేకరించి ట్రాన్స్  పోర్టు స్టేషన్లకు తరలించేవి. అక్కడి నుండి భారీ వాహనాల్లో డంపింగ్  యార్డులకు తరలిస్తారు. అయితే వాహనాల ఇబ్బందుల వల్ల గ్రేటర్  వీధుల్లో...చెత్త కుండీల వద్ద భారీగా చెత్త పోగవుతోంది  
స్వచ్ఛ హైదరాబాద్...శానిటేషన్లో పెద్దగా మార్పు లేదు
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తర్వాత నగరంలో శానిటేషన్లో పెద్దగా మార్పు రాలేదు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఓపెన్ గా చెత్త వేసే 1100 ప్రాంతాలను చెత్త రహిత ప్రాంతాలుగా మారుస్తామన్న మంత్రి కేటీఆర్, అధికారుల మాటలు నీటిమీద రాతలుగా మిగిలిపోయాయి. 

 

సుప్రీంకోర్టు ఆదేశాలపై రోజా సంతోషం

హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు. కోర్టులంటే గౌరవముందని.. కోర్టు తీర్పును గౌరవిస్తానని ప్రకటించారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కోర్టు ఆదేశాలను తాను పాటిస్తున్నానని ఇక పాటించాల్సింది అధికార పార్టీ నేతలే అని చెప్పారు. అసెంబ్లీలో టీడీపీ నేతలు తమను బెదిరించారని ఆరోపించారు. తను రెచ్చగొట్టారని, తమపై నిందలు వేశారని తెలిపారు. పేపర్లలో వచ్చిన వార్తలే తాను సభలో చదివానని పేర్కొన్నారు. కాల్‌ మనీని షార్ట్ కట్‌లో 'కామ' అన్నానని తెలిపారు.

17:28 - April 22, 2016

హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు. కోర్టులంటే గౌరవముందని.. కోర్టు తీర్పును గౌరవిస్తానని ప్రకటించారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కోర్టు ఆదేశాలను తాను పాటిస్తున్నానని ఇక పాటించాల్సింది అధికార పార్టీ నేతలే అని చెప్పారు. అసెంబ్లీలో టీడీపీ నేతలు తమను బెదిరించారని ఆరోపించారు. తను రెచ్చగొట్టారని, తమపై నిందలు వేశారని తెలిపారు. పేపర్లలో వచ్చిన వార్తలే తాను సభలో చదివానని పేర్కొన్నారు. కాల్‌ మనీని షార్ట్ కట్‌లో 'కామ' అన్నానని తెలిపారు. తాను ఎవ్వరినీ బాధపెట్టలేదని..ఒక వేళ వాళ్లు బాధపడితే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గనలేకపోవడం బాధ కలిగించిందన్నారు. 

 

17:11 - April 22, 2016

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ సేవలపై ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించాయి. బకాయి పడ్డ రూ. 250కోట్లను మే 2 లోపు చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలపివేస్తామని హెచ్చరించాయి. 

ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వానికి ప్రైవేటు ఆస్పత్రుల డెడ్‌లైన్‌

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ సేవలపై ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించాయి. బకాయి పడ్డ రూ. 250కోట్లను మే 2 లోపు చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలపివేస్తామని హెచ్చరించాయి. 

17:06 - April 22, 2016

హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 2 వరకు నామినేషన్ల ఉస సంహరణకు గడవు ఇచ్చారు. ఈనెల 30 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 16న పోలింగ్, 19 న కౌంటింగ్ జరుగనుంది. 

పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 2 వరకు నామినేషన్ల ఉస సంహరణకు గడవు ఇచ్చారు. ఈనెల 30 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 16న పోలింగ్, 19 న కౌంటింగ్ జరుగనుంది. 

 

16:55 - April 22, 2016

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హరీష్‌ రావత్‌ సర్కార్‌ మెజారిటీ కోల్పోయి మైనారిటీలో పడిపోయినందుకు రాష్ట్రపతి పాలన విధించడం తప్పనిసరని పిటిషన్‌లో పేర్కొంది. ఈరోజు విచారణ జరిపేందుకు వీలుగా రిజిస్ట్రీని కోరాలని సుప్రీం ధర్మాసనాకి అటార్ని జనరల్‌ ముకుల్‌ రోహతగి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి పదవిని మళ్లీ చేపట్టిన హరీష్‌రావత్‌ గతరాత్రి కాబినెట్‌ సమావేశం నిర్వహించారు. 11 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని తక్షణమే అమలు చేయాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొన్న సమయంలో కాబినెట్‌ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని గవర్నర్ కెకె పాల్‌ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేసిందని హైకోర్టు గురువారం మండిపడింది.

ఎపిలో భారీగా ఉష్ణోగ్రతలు

ఎపి : అనంతపురం, జంగమేశ్వరపురంలో అత్యధిక ఉష్ణోగ్రతులు నమోదు అయ్యాయి. అనంతపురం, జంగమేశ్వరపురంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నెల్లూరు, కావలి, ఆరోగ్యవరంలో 41 ఉష్ణోగ్రతలు, విజయవాడ, తునిలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి. మచిలీపట్నం, ఒంగోలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కాకినాడ 37, బాపట్ల 36, నరసాపురం 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

ఎపి రాజధాని నిర్మాణంపై ఎన్ జీటీలో విచారణ

ఢిల్లీ : ఎపి రాజధాని నిర్మాణంపై ఎన్ జీటీలో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఎన్ జీటీ మే 10 కి వాయిదా వేసింది. సీఆర్ డీఏ నుండి ముంపు ప్రాంతాలను తొలగించాలని పిటిషన్ తరపు న్యాయవాది సంజయ్ పారిక్ వాదనలు వినిపించారు. ముంపు ప్రాంతాల గుర్తింపునకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని ఎపి ప్రభుత్వం తెలిపింది. 

16:31 - April 22, 2016

తూర్పుగోదావరి : కడలే వారికి జీవనాధారం. ఆ కడలి కబళిస్తే వారి కుటుంబాలు వీధినపడతాయి. అటువంటి సందర్భాల్లో మంత్రుల ఓదార్పులకు కరువు ఉండదు. నేతల హామీలకు కొదువ ఉండదు. ఆ తర్వాత హామీ ఇచ్చిన నేతలు పత్తా  ఉండరు. అమాత్యుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. చివరకు ఆ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకునే దిక్కూ, దివాణం లేకుండా పోతోంది. కడలిని నమ్ముకుని కష్టాల పాలువుతున్న కాకినాడ మత్స్యకార కుటుంబాల ధీన గాధల 10 టీవీ ప్రత్యేక కథనం. 
కడలిని నమ్ముకున్న మత్స్యకారులు
వీరంతా కడలిని నమ్ముకున్న మత్స్యకారులు. చేపలవేటే జీవనాధారం. ప్రతికూల వాతావరణంలో  సముద్రంలోనే వీరి బతులుకు కడతేరిపోతుంటాయి. గతేడాది జూన్‌లో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. కాకినాగ పగడాల పేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు కెళ్లారు. తుపానుకు సముద్రంలో చిక్కుకుపోయిన వీరిలో  ఒకరు మాత్రమే తిగిగొచ్చారు.  మిగిలినవారంతా గల్లంతవడంతో వీరి కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి.
ఎందరో ఓదార్చారు 
అప్పట్లో వీరి కుటుంబాలను ఎందరో ఓదార్చారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఉన్నారు. అన్ని విధాల ఆదుకుంటామని హామీలు గుప్పించారు. బియ్యం ఇస్తామన్నారు. పెన్షన్‌ ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామనన్నారు. పక్కాఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. నిమ్మకాయల చినరాజప్ప ఈ హామీ ఇచ్చిన కచ్చితంగా పదకొండు నెలలు గడుస్తోంది. కానీ ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడంతో సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లైంతన మత్స్యకార  కుటుంబాల  బతుకులు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే
సముద్రంలో వేటకు వెళ్లిన మత్సకారులు తిరిగి రాకపోవడంతో వీరంతా గల్లంతైనట్టు కేసు నమోదు చేశారు. కానీ వీరిని కడలి మింగేసి ఉంటుంటదని కుటుంబ సభ్యులు అనుమానిస్తూ... అధికారులు మాత్రం ఇంకా మిస్సింగ్‌ కేసుగా కొనసాగిస్తున్నారు. పరామర్శ సమయంలో నేతలు ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడలి కబళించకుండా బతికుంటే... ఏడాది కాలంగా తిరిగిరాకుండా ఉంటారా.... అంటూ వీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేనాథుడులేడు. ఈ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను 11 నెలలుగా నెరవేర్చకపోవడాన్ని సీపీఎం నాయకులు తప్పుపడుతున్నారు. 
హామీలను అమలు చేయాలి 
బాధిత కుటుంబాలను హామీలు ఇచ్చిన మంత్రులుకానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఇంతవరకు వీరివైపు తొంగిచూడలేదు. ఇచ్చిన హామీల్లోకి వచ్చాయా... లేదా... అన్న విషయాలను కూడా పరిశీలించలేదు. పరామర్శలతోనే పనైపోయిందని చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేసి తమను ఆదుకోవాలని ఈ అభాగ్యలు కోరుతున్నారు. పాలకులు, పాలనా యంత్రాంగం ఎంతవరకు స్పందిస్తూందో చూడాలి. 

16:17 - April 22, 2016

చిత్తూరు : తిరుమలలో సినీ ఫక్కీలో వివాహం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన  సుమలత, జనార్థన్ ల వివాహం పెద్దల సమక్షంలో జరుగుతోంది. ఈ సమయంలో వరుడిపై ఓ మహిళా ఫిర్యాదు నేపధ్యంలో జనార్థన్ ను వెంకటగిరి ఎస్సై జలీల్  భాషా వచ్చి ఆరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. బంధువులు ఎస్సై కారును అడ్డుకున్నారు. దీంతో పెళ్లికొడుకు జనార్థన్ కారులోంచి తప్పించుకుని వెళ్లి పెళ్లికూతురు మెడలో తాళికట్టాడు. తన మరదలు పద్మ కావాలనే తనపై కేసు పెట్టిందని పెళ్లికొడుకు ఆరోపిస్తున్నాడు. 

 

విశ్వాస పరీక్షలో సభ విశ్వాసం పొందుతా : సీఎం హరీష్ రావత్

హైదరాబాద్‌ : సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు కేంద్రానికి ఉందని సీఎం హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురు కావడం ఖాయమని తెలిపారు. ఈనెల 29న తాను అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో సభ విశ్వాసం పొందుతానని స్పష్టం చేశారు.

రేపు రాష్ట్రపతి ప్రణబ్ మణిపూర్‌లో పర్యటన

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. అక్కడ ఆయన ఖోంగ్‌జోమ్ దినోత్సవాల్లో పాల్గొననున్నారు. తమ మాతృభూమి కోసం త్యాగాలు చేసిన కర్మపుత్రులను స్మరించుకుంటూ ప్రతీయేటా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. తౌబల్ జిల్లాలో ఖోంగ్‌జోమ్ ఉంది.

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోరుతూ మహిళలు ఆందోళన

హైదరాబాద్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) గ్రూపు మహిళలు సుమారు 100 మంది శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని బస్టాండ్ వద్ద రాస్తారోకోకు పూనుకున్నారు.

15:26 - April 22, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల్లో హాయ్ లాండ్ ను అమ్మాకానికి పెట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాల్లో సీఐడీ హాయ్ లాండ్ పేరును చేర్చారు. హాయ్ లాండ్ విలువ రూ. 600 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నాలుగో విడతలో రూ.1500 కోట్ల ఆస్తుల అమ్మకానికి జ్యుడిషయిల్ కమిటీ సిద్ధం చేసింది. 

 

అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాల్లో హాయ్ లాండ్..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల్లో హాయ్ లాండ్ ను అమ్మాకానికి పెట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాల్లో సీఐడీ హాయ్ లాండ్ పేరును చేర్చారు. హాయ్ లాండ్ విలువ రూ. 600 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నాలుగో విడతలో రూ.1500 కోట్ల ఆస్తుల అమ్మకానికి జ్యుడిషయిల్ కమిటీ సిద్ధం చేసింది. 

 

15:13 - April 22, 2016

చిత్తూరు : అల్లారుమద్దుగా పెంచాల్సిన కుమార్తెను ఓ కన్నతల్లి అమ్మకానికి పెట్టింది. జిల్లాలోని బంగారుపాళ్యంకు చెందిన భానుప్రియ తన మూడేళ్ల కుమార్తెతో చిత్తూరు బజారు వీధికి చేరుకుంది. పాపను విక్రయిస్తానంటూ చుట్టుపక్కల వారితో బేరసారాలు ఆడింది. దీనిని గమనించిన జనం పెద్ద ఎత్తున బజారువీధిలో గుమికూడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బజారు వీధికి చేరుకుని... భానుప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. భానుప్రియకు మతిస్థిమితంలేదని పోలీసులు భావిస్తున్నారు. 

 

14:58 - April 22, 2016

హైదరాబాద్ : రోజా సస్పెన్షన్‌పై సుప్రీంలో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు సస్పెన్షన్‌ వ్యవహారంపై వివరణలేఖను స్పీకర్‌ ను ఉద్దేశించి రాశారు. ఈ లేఖను సుప్రీం కోర్టులో రోజా సమర్పించారు. ఈ సందర్భంగా రోజా ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు వివరణ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపాలని సూచించింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రోజా వివరణ ఇచ్చేందుకు, క్షమాపణ చెప్పేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు నెలాఖరుకు వాయిదా వేసింది.

 

14:55 - April 22, 2016

ఇటానగర్ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి 15 మంది కూలీలు మృతి చెందారు. తవాంగ్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడ్డాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తవాంగ్‌ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న క్యాంపులో నిర్మాణపు పనులు చేస్తున్న  మొత్తం 17 మంది కూలీలు మరణించి ఉంటారని భావిస్తున్నారు. జెసిబిల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికి తీశారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

 

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది. 8 వారాల్లో రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయానికి రోజాను అనుమతించాలని కోర్లు పేర్కొంది. శాసనసభ వ్యవహారాలకూ రోజాను అనుమతించాలని ఆదేశించింది. రోజా లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు మొదటివారానికి వాయిదా పడింది. 

సుప్రీంకు వెళ్లే హక్కు కేంద్రానికి ఉంది - హరీష్ రావత్..

మహారాష్ట్ర : సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు కేంద్రానికి ఉందని సీఎం హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురు కావడం ఖాయమని తెలిపారు. ఈనెల 29న తాను అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో సభ విశ్వాసం పొందుతానని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం మహిళల ఆందోళన..

ఆదిలాబాద్ : ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) గ్రూపు మహిళలు సుమారు 100 మంది శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని బస్టాండ్ వద్ద రాస్తారోకోకు పూనుకున్నారు. 

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు..

కరీంనగర్ : జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. గురువారం అర్థరాత్రి వరకు 70వేల మంది స్వామిని దర్శించుకోగా శుక్రవారం ఉదయం మరో 30 వేల మంది మాలధారులు ఇక్కడికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలకు మరో 70 వేల మంది రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

13:45 - April 22, 2016

ముంబై: వాంఖెడీ స్టేడియం వేదికగా వచ్చే నెలలో జరగాల్సిన నాలుగు ఐపీఎల్ మ్యాచ్ లను జైపూర్, బెంగళూరు నగరాలకు మార్చడంతో...కనీవినీ ఎరుగని కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్రలో లక్షలాది లీటర్ల మంచినీరు ఆదా కానుంది.ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలోని మూడు ప్రధాన వేదికల్లో జరగాల్సిన మ్యాచ్ లను రాష్ట్రం వెలుపల నిర్వహించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించడంతో..అమూల్యమైన నీటిని దాహార్తితో అల్లాడుతున్న ప్రజలకోసం వినియోగించబోతున్నారు. ఐపీఎల్ క్రికెట్ కు వాడాల్సిన ఈ నీటిని ప్రజల కోసం వినియోగించడం ఎంతైనా అభినందనీయమే. మహారాష్ట్రలో తీవ్రదుర్భిక్ష పరిస్థితి నెలకొనడంతో ఏప్రిల్ 30 తర్వాత నాగపూర్, పూణే, ముంబై నగరాలలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను రాష్ట్రం వెలుపల నిర్వహించాలంటూ ముంబై హైకోర్టు ఆదేశించడం ఆశించిన ఫలితాన్ని ఇచ్చినట్లే కనిపిస్తోంది.

3 లక్షల లీటర్ల నీళ్లు..
ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో భాగంగా నిర్వహిస్తున్న మొత్తం 60 మ్యాచ్ ల్లో...ఇరవై మ్యాచ్ లను ముంబై, నాగపూర్, పూణే నగరాలు వేదికలుగా నిర్వహించాల్సి ఉంది. ఒక్కో మ్యాచ్ కోసం 3 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారని..కరవుతో అల్లాడుతున్న మహారాష్ట్రలో క్రికెట్ కోసం విలువైన నీటిని దుర్వినియోగం చేయడం తగదంటూ...ముంబై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం, ఏప్రిల్ 30 తర్వాత జరగాల్సిన మ్యాచ్ లను వేరే చోట నిర్వహించాలంటూ ఆదేశించడం జరిగిపోయాయి. దీంతో పూణే వేదికగా జరగాల్సిన మ్యాచ్ లను విశాఖపట్నంలోనూ, ముంబై వాంఖెడీ స్టేడియంలో జరగాల్సిన మూడుమ్యాచ్ లను జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలోనూ నిర్వహించాలని ఫ్రాంచైజీలు నిర్ణయించాయి. ముంబైలో మే 8న హైదరాబాద్ సన్ రైజర్స్, మే 13న పంజాబ్ కింగ్స్ లెవెన్, మే 15 న ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరగాల్సిన మ్యాచ్ లను..జైపూర్ వేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది. ముంబై వేదికగా జరగాల్సిన ఫైనల్స్ ను సైతం బెంగళూరుకు తరలించారు. ఈమ్యాచ్ ల తరలింపుతో మ్యాచ్ ల కోసం ఉపయోగించే 12 లక్షల లీటర్ల నీటితో పాటు...అదనంగా లక్షా 60వేల లీటర్ల విలువైన నీటిని దాహంతో అల్లాడిపోతున్న ప్రజల కోసం వినియోగించవచ్చునని..ముంబై మహానగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

అభినందనీయం..
వాంఖెడీ స్టేడియంలో మ్యాచ్ జరిగే రోజున వాష్ రూమ్ ల కోసమే 40వేల లీటర్ల నీటిని వాడుతున్నారు. ఈ నీటిని ముంబై మహానగరపాలక సంస్థ.. ట్యాంకర్ల ద్వారా ముంబై క్రికెట్ సంఘానికి సరఫరా చేస్తోంది. మొత్తం మీద..ముంబై హైకోర్టు నిర్ణయంతో మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం ..ఐపీఎల్ మ్యాచ్ ల తరలింపు ద్వారా...13 లక్షల 60వేల లీటర్ల నీటిని ఆదా చేసుకోగలుగుతోంది. ఐపీఎల్ క్రికెట్ కు వాడాల్సిన ఈ నీటిని ప్రజల కోసం వినియోగించడం ఎంతైనా అభినందనీయమే.

13:40 - April 22, 2016

కృష్ణా : జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో మైలా జయకృష్ణ మృతదేహం లభ్యమయ్యింది. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. తొలుసూరి నాగరాజు, అరజాల శ్రీకాంత్‌, మత్తిపల్లి పవన్‌కుమార్‌ కోసం గాలిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న అద్దంకి నాంచారమ్మ తిరునాళ్లకు వెళ్లి స్నానం కోసం కృష్ణానదిలో దిగిన ఈ నలుగురు యువకులు మునిగిపోయారు.

13:38 - April 22, 2016

హైదరాబాద్ : ఖమ్మంలో జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. శుక్రవారం ఎన్నికల కమిషన్‌ ప్లీనరీకి అనుమతిచ్చింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణపై సందిగ్థత ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్లీనరీని ఖమ్మంలో నిర్వహించాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నందున అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నేతలు ఈసీని కోరారు. ఈ నేపథ్యంలో.. ప్లీనరీ నిర్వహించుకునేందుకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 27న నిర్వహించే ప్లీనరీని ఈ సంవత్సరం ఖమ్మంలో జరపాలని టీఆర్‌ఎస్‌పార్టీ నిర్ణయించింది. 27న ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం కాలేజీగ్రౌండ్‌లో బహిరంగసభ జరపాలని ఏర్పాట్లు చేసుకుంది. దీనికోసం కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. పదిరోజులుగా పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు ఉపఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఖమ్మం జిల్లాలో ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చాయి. ముందే నిర్ణయించుకున్న సభకు అనుమతి ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అనుమతి ఇవ్వొద్దని ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ వినతిపత్రం అందించింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆగిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 108 వాహనాలకు రాజీవ్‌గాంధీ బొమ్మకు ముసుగు తొడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ పార్టీ కార్యక్రమం కావడంతో అనుమతి ఉంటుందని అధికారపార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాకపోతే ఈ కార్యక్రమానికి పెట్టిన ఖర్చంతా టీఆర్‌ఎస్‌పార్టీ ఎన్నికల ఖర్చులోకి వెళ్లనుంది. టీఆర్‌ఎస్‌ పెట్టుకున్న వినతికి ఎన్నికల కమిషన్‌ స్పందించి పై విధంగా నిర్ణయం చెప్పింది. 

13:33 - April 22, 2016

పంజాబీ ముద్దుగుమ్మ రకూల్ ప్రీత్ సింగ్ గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఈ అమ్మడు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ విజయం సాధించాక వరసగా పలు ప్రాజెక్టులు ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ ఆరంభం చిన్నా చితకా హీరోల సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ రేసులో దూసుకపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన 'సరైనోడు' చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా రకూల్ తో టెన్ టివి ముచ్చటించింది. రకూల్ చిత్రానికి సంబంధించి ఎలాంటి విశేషాలు..వివరాల వెల్లడించిందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

సుప్రీంకు రోజా వివరణపత్రం..

ఢిల్లీ : సుప్రీంకోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా వివరణ పత్రాన్ని సమర్పించింది. వివరణ లేఖను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు సూచించింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. అనంతరం ఆగస్టు మొదటి వారానికి విచారణనను వాయిదా వేసింది. 

టీఆర్ఎస్ ప్లీనరీకి ఈసీ గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీకి ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో సందిగ్ధత నెలకొంది. ప్లీనరీకి టీఆర్ఎస్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్లీనరీ నిర్వహించుకొనేందుకు అనుమతినివ్వాలని టీఆర్ఎస్ కోరింది. 

13:13 - April 22, 2016

ఏ వుడ్ లో నైనా హీరోయిన్స్ ఎక్కువ కాలం మనగరు. దీనితో దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఉద్ధేశ్యంతో బిజినెస్ లోకి అడుగు పెడుతుంటారు. సినిమాలో ఎంత బిజీగా ఉన్నా...ప్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఎలా సంపాదించాలన్న ప్లానింగ్ లో ఉంటున్నారు. ఇప్పుడి ఈ లిస్ట్ లోకి చేరింది రకూల్ ప్రీత్ సింగ్. 'నాన్నకు ప్రేమతో' హిట్ కొట్టిన రకూల్ చేతిలో చాల సినిమాలున్నాయి. అయినా ఈ పంజాబీ కుడి ఇప్పుడు సినిమాలే కాకుండా బిజినెస్ లోకి అడుగుపెట్టింది. F45 పేరిట గచ్చిబౌలిలో ఒక ఫిట్ నెస్ సెంటర్ ను స్టార్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ నటించిన 'సరైనోడు' చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా రకూల్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా బిజినెస్ లోకి ఎందుకు అడుగు పెట్టారని ప్రశ్నించింది. ఆఫర్స్ లేకపోతే ఐరన్ లెగ్ అంటారని, అందుకే దూరదృష్టితో తాను బిజినెస్ ప్రారంభించడం జరిగిందని పేర్కొంది. ఫిట్ నెస్ పై తనకు మక్కువ ఉండడంతో ఫిట్ నెస్ సెంటర్ నెలకొల్పడం జరిగిందని తెలిపింది. 

13:06 - April 22, 2016

అల్లు అర్జున్, రకూల్ ప్రీత్ సింగ్ నటించిన 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర విజయంపై రకూల్ ధీమాగా ఉంది. ఈ సందర్భంగా రకూల్ తో టెన్ టివి ముచ్చటించింది. చిత్ర అనుభవాలను..విశేషాలను వెల్లడించింది. అందులో భాగంగా 'సరైనోడు' స్టోరీ చెప్పాలని కోరగా..''హీరో ఉంటాడు...హీరోయిన్ ఉంటుంది...ఇంకో హీరోయిన్ ఉంటుంది. ఓ ప్లాబ్లం ఎలా సాల్వ్ చేశాడు అనేది చిత్ర కథ' అంటూ తనదైన శైలిలో రకూల్ చెప్పింది. 

13:03 - April 22, 2016

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..రకూల్ ప్రీత్ సింగ్ నటించిన 'సరైనోడు' శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రకూల్ తో టెన్ టివి ముచ్చటించింది. చిత్ర విశేషాలను..అనుభవాలను వెల్లడించింది. 'బన్నీ'లో తనకు నచ్చింది ఫాషన్ అని, బన్నీ అంటే మందుకు తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ ముద్దుగుమ్మ ఎలాంటి విశేషాలు తెలిపిందో వీడియో క్లిక్ చేయండి. 

పాలేరు ఉప ఎన్నికు నోటిఫికేషన్..

ఖమ్మం : జిల్లా పాలేరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 16న పోలింగ్ జరగనుంది. మే 19న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 29 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 30న పరిశీలించనున్నారు. 

శోభాయాత్ర..భారీగా ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ : హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో హనుమాన్ శోభాయాత్ర జరుగుతోంది. గౌలిగూడ నుండి తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగుతున్న శోభాయాత్రలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కర్మన్ ఘాట్ వద్ద చేరుకున్న యాత్రలో డీజేకు అనుమతించలేదు. దీనితో భక్తులు వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ట్రాఫిక్ స్తంభించింది. 

12:38 - April 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క కలిశారు. పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారని, అయితే.. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించామని తమ్మినేని తెలిపారు. అదేవిధంగా అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం లేదని తమ్మినేని వెల్లడించారు. 

12:36 - April 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ,.. మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కృష్ణంరాజుతో పాటు పలువురు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సహకరించాలని,.. లక్ష్మణ్‌కు అందరూ అండగా నిలవాలని వెంకయ్యనాయుడు సూచించారు. 

12:29 - April 22, 2016

రానుంది మే నెల.. మండే ఎండల సీజన్.. కానీ తెలుగు సినీ లవర్స్ కి మాత్రం కూల్ అయిన కన్నుల పండుగ. కారణం.. అగ్ర హీరోల సినిమాలు వరసబెట్టి రిలీజవుతున్నాయి. వచ్చే నెల మాత్రం టాలీవుడ్ వెండితెర క్రేజీ సినిమాలతో ఉక్కిరిబిక్కిరి కాబోతోంది. సూర్య సినిమా '24', సాయి ధరమ్ తేజ 'సుప్రీం', మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం', నితిన్ 'అ..ఆ'.. ఇలా దేనికదే డిఫరెంట్ జానర్స్ లో వస్తున్నాయి .సో.. అలా ఈ సమ్మర్ సమరానికి సిద్ధమౌతున్న సినిమాలపై ప్రత్యేక కథనం..

బ్రహోత్సవం..
ఈ రేస్ లో అన్నిటికన్నా క్రేజీ మూవీ బ్రహ్మోత్సవం . శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కలయిక లో వస్తున్న రెండో సినిమాగా వస్తున్న ఈ మూవీ వీపరీతమైన అంచనాలతో రెడీ అవుతోంది. శ్రీమంతుడు తరువాత అదే జోనర్ లో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుందని చెప్పుకుంటున్నారు. సమంత, ప్రణీత అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు . సమ్మర్ జాబితాలో బ్రహ్మోత్సవం ఓ టాప్ సినిమా. శ్రీమంతుడు సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావటంతో పాటు..శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతా బాగానే ఉంది కానీ..సెంటిమెంట్లను బాగా నమ్మే సినీ పరిశ్రమలో మహేష్ బాబు ఫ్యాన్స్ కు 'మే టెన్షన్' పట్టుకుందట. దీనికి కారణం గత చరిత్రే అంటున్నారు. మేలో విడుదలైన మహేష్ బాబు గత సినిమాలు అన్నీ ఫట్ మన్నాయి. ఇదే ఇప్పుడు వీరిని వెంటాడుతున్న భయం. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన నిజం, నాని సినిమాలు మే నెలలోనే రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే ఆ తరువాత మహేష్, ఏ సినిమాను మే నెలలో రిలీజ్ చేయలేదు. 12 ఏళ్ల తరువాత మరోసారి మే నెలలో సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్నాడు సూపర్ స్టార్. దీనికి తోడు మహేష్ బాబు కెరీర్ లో రెండు వరుస విజయాలు సాధించిన రికార్డ్ లేదు. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన మహేష్, సెంటిమెంట్ ను బ్రేక్ చేసి హిట్ కొడతాడా..? లేక మరోసారి అభిమానులను నిరాశపరుస్తాడా..? అన్నది ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి శ్రీమంతుడు రికార్డ్ లను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణతీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మే 13న విడుదల కాబోతోంది.
స‌మ్మ‌ర్ సీజ‌న్ ను స‌ద్వినియోగం చేసుకోడానికి ముఖ్యంగా మే నెల‌ను టార్గెట్ గా చేయ‌డానికి ఈ చిత్ర‌ యూనిట్ క‌ష్ట‌ప‌డుతోంది. 'బ్ర‌హ్మోత్స‌వం' విడుద‌ల తేదీని ఇప్పుడు ప‌క్కాగా ఫిక్స్ చేసేసారు. మే నెల్లో విడుద‌ల చేస్తార‌న్న స‌మాచారం త‌ప్ప, అధికారికంగా ఈ సినిమా రిలీజ్ ను ఇంత వ‌రుకూ అనౌన్స్ చేయలేదు. మే 6 న కానీ, 24 కానీ లేదా మే 31న కానీ 'బ్ర‌హ్మోత్స‌వం' విడుద‌ల ఉంటుంద‌ని, ఇప్ప‌టివ‌రకూ అంద‌రూ భావించారు. కానీ అనూహ్యంగా మే 13న ఉంటుంద‌ని సూప‌ర్ స్టార్ షాకిచ్చాడు. అంతేకాదు ఆడియో రిలీజ్ డేట్ పై కూడా ఇప్పుడు స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమ‌న్ రిలేష‌న్స్ తో ప‌క్కా కుటుంబ క‌థా చిత్రంగా 'బ్ర‌హ్మోత్స‌వం' సినిమా తెర‌కెక్కింది. ముఖ్యంగా ఈ సినిమాలో తిరుమ‌ల తిరుప‌తి ‘బ్ర‌హ్మోత్స‌వం’ ఎపిసోడ్ హైలైట్ కాబోతోంద‌ని అంటున్నారు. సూప‌ర్ స్టార్ ఖాతాలో ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్టుగా న‌మోద‌వుతుందేమో చూడాలి.

కేజ్రీ మూవీ 24..
మే నెల్లోనే రాబోతున్న మరో సూపర్ క్రేజీ మూవీ '24'. కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య, వెరైటీ కథల్ని నెరేట్ చేయడంలో చెయి తిరిగిన దర్శకుడు విక్రమ్ కుమార్ కలయికలో వస్తున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ మే 6 న రిలీజ్ కు సిద్ధమౌతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ , కోలీవుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 24. సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. విడుదలకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న 24 టీం ఫైనల్గా మే 6న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ముందుగా ఏప్రిల్ నెలాఖరున సినిమా రిలీజ్కు ప్లాన్ చేసినా టాలీవుడ్లో సరైనోడు రిలీజ్ ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఫైనల్గా సూర్య 24 రిలీజ్ కు మే 6న ముహుర్తం ఖరారు చేశారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు. సూర్య తన సొంత నిర్మాణసంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాడు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్పై చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్య‌కు అభిమానులున్నారు. ఆయ‌న న‌ట‌న‌ను ఆరాధించే వాళ్లున్నారు. ఇప్పుడు 24 సినిమా విష‌యంలో ఇది మరోసారి ప్రూవైంది. సాధార‌ణంగా ఆడియో వేడుక‌లంటే వీకెండ్స్ లో ప్లాన్ చేస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా ఫంక్ష‌నైనా వారాంతంలో పెట్టిన‌పుడే జ‌నం కూడా వ‌స్తారు. అభిమానుల‌కు కూడా అనువుగా ఉంటుంది. కానీ మొన్న సూర్య 24 సినిమా ఆడియో వేడుక ఆ మధ్యజరిగింది. కానీ శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు ఫుల్ క్రౌడ్ వ‌చ్చారు. సూర్యను చూడ్డానికి అభిమానులు ఎగ‌బ‌డ్డారు. పైగా 24 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తెలుగులో అదిరిపోతోంది. ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి మ‌రీ సినిమాను కొనేస్తున్నారు బ‌య్య‌ర్లు. తెలుగులో 20 కోట్ల బిజినెస్ చేస్తోంది ఈ చిత్రం. ఇదంతా సూర్య‌కు ఉన్న క్రేజ్.. విక్ర‌మ్ కే కుమార్ పై ఉన్న న‌మ్మ‌క‌మే. ఓ త‌మిళ సినిమాకు ఇంత స్థాయి మార్కెట్ అంటే చిన్న విష‌య‌మేమీ కాదు. పైగా కొంత‌కాలంగా సూర్య ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇంత జ‌రిగినా.. 24 సినిమాపై మాత్రం ఎక్క‌డ‌లేని ప్రేమ‌ను చూపిస్తున్నారు మ‌న ప్రేక్ష‌కులు. చూడాలిక‌.. సూర్య ఈ న‌మ్మ‌కాన్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టుకుంటాడో..?

అ.ఆ..
ఇక సమ్మర్ సమరానికి సిద్ధపడ్డ మరో సినిమా త్రివిక్రమ్ అ, ఆ. నితిన్ హీరోగా, సమంత, మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ తెచ్చేసుకుంది. త్రివిక్రమ్ బ్రాండ్ వేల్యూతో అ, ఆ మూవీ బ్రహ్మాండమైన బిజినెస్ కూడా చేసేసింది. మే 6 న వస్తున్న ఈ సినిమా గురించి సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వెండి తెరకు అర్ధవంత మైన పదాలను అద్ది ఆ పదాలతో చక్కని సంభాషణలు వ్రాసి అది ఏ ఆర్టిస్ట్ చెబితే సూటిగా ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుందో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తెలిసినంత గా ఎవరికీ తెలియదని తెర ఎరిగిన సత్యం. తను ఏమి చెప్పా లనుకున్నాడో దొంక తిరుగుడు లేకుండా సూటిగా తెరపై పాత్రలు ద్వారా రావలసిన పలితాన్ని రాబట్టి అటు ప్రేక్షకులనే కాదు సినీ పండితులను సైతం ఆలోచించే విధం గా వుంటాయి ఈ మాష్టారి మాటలు. ఇప్పుడు అ ఆ అంటూ మరో ప్రేమ కదా చిత్రం ‘అ ఆ ‘ల కొత్త అర్ధాన్ని చెపుతూ మే 6న ప్రేమికుల హృదయాన్ని వెచ్చగా తట్టబోతున్నాడు త్రివిక్రమ్. అ, ఆ షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఈ సినిమా విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన సమంతా .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. లవ్ .. సెంటిమెంట్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ ఇవన్నీ కూడా త్రివిక్రమ్ సినిమాలో పర్ఫెక్ట్ గా వుంటాయి. ఆడియన్స్ ను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంటాయి .. అనూహ్యమైన విజయాలను అందుకుంటూ వుంటాయి. అదే జాబితాలో ఈ సినిమా కూడా చేరబోతోందంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ అ, ఆ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

మే 6న అ..ఆ..
చిన్నదాన నీకోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాలతో డీలా పడ్డ నితిన్ .. అ, ఆ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు.గతంలో ముగ్గురు స్టార్ హీరోలతో రెండేసి చొప్పున సినిమాలు తీసిన త్రివిక్రమ్ తరువాత హీరో గా నితిన్ ను ఎన్నుకోవడమే ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయింది. ఈ సినిమా తో త్రివిక్రమ్ తన రేంజ్ ను తగ్గించుకొన్నాడని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. అయితే త్రివిక్రమ్ పై నున్న అపారమైన నమ్మకంతో చిన్న హీరో సినిమా అయినా... అ, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి తీరుతుందని అనుకుంటున్నారు. మే లో అన్ని పెద్ద సినిమాలతోనూ పోటీ పడుతూ... అ, ఆ మండే ఎండల సీజన్ ను పండువెన్నెల విందుచేస్తుందని త్రివిక్రమ్ అభిమానులు భావిస్తున్నారు. మరి మే 6న వస్తున్న ఈ సినిమా అందరి అంచనాల్ని ఎలా అందుకుంటుందో చూడాలి.

సుప్రీమ్..
ఇక ఫైనల్ గా ఈ సమ్మర్ లో వస్తున్న మరో హీటెక్కించే మూవీ సుప్రీమ్. సాయిధర్మ్ తేజ హీరోగా పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి మలిచిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో సరైన సినిమాలు తీయలేకపోతున్న దిల్ రాజు సుప్రీమ్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కూడా మే 6 సమరానికి సిద్ధంగా ఉంది.

సుప్రీంపై దిల్ రాజు ఆశలు.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు.. ఈ మధ్య బాగా డల్ అయిపోయాడు. ఆయన బేనర్ స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. గత ఏడాది సుబ్రమణ్యం ఫర్ సేల్.. కేరింత సినిమాలు ఓ మోస్తరుగా ఆడగా.. ఈ ఏడాది ‘కృష్ణాష్టమి’ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో మాంచి హిట్టిచ్చి తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. ఆయన ఆశలన్నీ ‘సుప్రీమ్’ మీదే ఉన్నాయిప్పుడు. ఏప్రిల్ 1నే విడుదలవుతుందని అనుకున్న ఈ సినిమా.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం సుప్రీమ్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సుప్రీమ్ సినిమాను మే 6న విడుదల చేయాలని ఫిక్సయ్యాడు రాజు. ఐతే ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్-నితిన్-సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అ..ఆ’ రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా నెల రోజుల ముందే రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఐతే మే 13న ‘బ్రహ్మోత్సవం’ రిలీజవుతున్న నేపథ్యంలో పోటీ ఉన్నా సరే.. మే 6నే ‘సుప్రీమ్’ రిలీజ్ చేయడం బెటరని ఫిక్సయ్యాడట రాజు. అంతేకాదు అదే రోజున సూర్య 24కి కూడా సుప్రీమ్ పోటీగా బరిలోకి దిగుతోంది. అనిల్ రావిపూడి మిలిచిన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దిల్ రాజు.

రికార్డ్సు బద్దలు కొడుతుందా 
ఇక సుప్రీమ్ కు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ సీజన్ లో రిలీజౌతున్న మిగతా మూడు సినిమాలూ మూడు వేరు వేరు జోనర్స్ లో సినిమాలు. బ్రహ్మోత్సవం పక్కా ఫ్యామిలీ జానర్, 24 పక్కా సెంటిఫిక్ జానర్, ఇక త్రివిక్రమ్ అ, ఆ రొమాంటిక్ లవ్ జానర్ . సుప్రీమ్ మాస్ యాక్షన్ జానర్ . కాబట్టి సమ్మర్ సీజన్ కు మాస్ యాక్షన్ మూవీ అయిన సుప్రీమ్ కు కలెక్షన్స్ బాగా ఉండొచ్చని అంటున్నారు. పైగా పెద్ద సినిమాలైన వాటితో సుప్రీమ్ కు ఏ మాత్రం పోటీ ఉండదని కూడా అంటున్నారు. మొత్తానికి సాయిధర్మ తేజ్ సుప్రీమ్ సరైన టైమ్ చూసుకొని సమ్మర్ బరిలోకి దిగుతున్నాడు. సినిమా ఏ మాత్రం హిట్టు టాక్ తెచ్చుకున్నా సుప్రీమ్ టాక్సీ కి తిరుగే ఉండదు. మే 6 న వస్తున్న సుప్రీమ్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

సమరంలో విజేతలు ఎవరు ? 
ప్రతి సినిమా రిలీజ్‌కి సుమారు రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆయా హీరోల మూవీల రిలీజ్ డేట్స్ మాత్రం పోటాపోటీగా ఉండడం విశేషం. సమ్మర్ హాలిడేస్‌లో మరి ఈ రూల్ వర్తించదు కదా..? అందుకే మే నెల్లో నాలుగు సినిమాలూ అవకాశాన్ని వినియోగం చేసుకోడానికే ట్రై చేస్తున్నాయి. మరి ఈ సమ్మర్ సమరంలో ఎవరు విజేతలో చూడాలి.   

అరుణాచల్ లో విరిగిపడిన కొండచరియలు..

అరుణాచల్ ప్రదేశ్ : తవాంగ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈఘటనలో పది మంది దాక మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు తవాంగ్ కు చేరుకొనేందుకు బయలుదేరాయి. 

తమ్మినేనిని కలిసిన మల్లు భట్టి విక్రమార్క..

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను టిపిసిసి నేత మల్లు భట్టి విక్రమార్క కలిశారు. పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని మల్లు భట్టి విక్రమార్క కోరారని తమ్మినేని వెల్లడించారు. కానీ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిని నిర్ణయించినందున పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయని, కాబట్టి ఎన్నిక ఏకగ్రీవమయ్య అవకాశం లేదన్నారు. 

11:49 - April 22, 2016

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ హీరో వెంకటేశ్ ఈ కార్యక్రమానికి వచ్చారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావులతో పాటు పలువురు రాజకీయ, చలన చిత్ర రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ విశేషాలను వీడియోలో చూడండి. 

11:46 - April 22, 2016

హైదరాబాద్ : 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురించి తెలియకపోవడం తనను బాధించిందని, అందుకే ఈ చిత్రం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సినీ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ముహుర్తపు షాట్ ను కొట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రసంగించారు. హిందూ శకానికి గౌతమిపుత్ర శతకర్ణి చెందిన వాడని, ఈయన గురించి తెలియకపోవడం చాలా బాధ కలిగించిందన్నారు. తెలంగాణలో పాలన మొదలు పెట్టి ఆంధ్రలో రాజధాని ఏర్పాటు చేయడం వంటివి జరిగిందన్నారు. తెలుగు జాతికి ఒకే ఒక చక్రవరి గౌతమిపుత్ర శాతకర్ణి అని తెలిపారు. లొంగిపొండి..లేదా మరణమే అని రెండు కండీషన్స్ తో 33 రాజ్యాలను కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. 43 ఏళ్ల తన ప్రస్థానంలో అపజయాలు ఏమి చేయలేకపోయాయని, 71 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఈ చిత్రం అంకితం చేస్తామని బాలకృష్ణ వెల్లడించారు. 

11:29 - April 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో బాలికలే పై చేయిగా నిలిచారు. శుక్రవారం ఉదయం డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ సంవత్సర పరీక్షకు 4,56,675 మంది హాజరవగా 2,43,503 ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 53.32 శాతంగా ఉంది. ఇందులో బాలికలు 59 శాతం, బాలురు 48 శాతంగా ఉందన్నారు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలో 2,62,245 మంది పాసయ్యారు. బాలికలు 67.64 శాతంగా ఉండగా బాలురు 58 శాతంగా ఉందన్నారు.

గవర్నమెంట్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు..
గవర్నర్ మెంట్ మెరుగైన ఫలితాలు వచ్చాయని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో గవర్నమెంట్ 45 శాతం ఉండగా, ప్రైవేటు 55 శాతంగా ఉందన్నారు. 36 వెబ్ సైట్ లలో ఫలితాలను పొందపర్చడం జరిగిందన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి 31 వరకు జరుగుతాయని తెలిపారు. దరఖాస్తు చేసుకొనేందుకు ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. పొడిగింపు ఉండదన్నారు. రీ కౌంటింగ్, వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 30 లోపున దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ప్రథమ స్థానంలో రంగారెడ్డి..
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రధమ సంవత్సర పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 69 శాతం సాధించి ప్రథమ స్థానంలో నిలవగా హైదరాబాద్ 56 శాతం సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంటర్ రెండో సంవత్సర పరీక్షా ఫలితాల్లో కూడా 76 శాతం సాధించిన రంగారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. 65 శాతం సాధించిన ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 

ఆన్ లైన్ లో 22 రకాల సేవలు..
ప్రస్తుతం బోర్డు 22 రకాల సేవలను అందిస్తోందని, ఈ సేవలను ఆన్ లైన్ చేయడం జరిగిందన్నారు. పైరవీలు చేసుకొనే వారికి ఆస్కారం ఉండడకుండా ఉండేందుకు ఈ విధానం అమలు చేయడం జరిగిందన్నారు. అలాగే బోర్డులో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నిధుల కేటాయింపు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన లైబ్రరీలు, ల్యాబరేటరీలు లేవని దృష్టికి వచ్చిందని, ఇందుకు ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల కోసం పది కోట్ల రూపాయలు, స్పోర్ట్స్ కిడ్స్ కోసం రెండు కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగిందన్నారు. ఉచిత విద్యనే కాకుండా నాణ్యమైన విద్యనందించాలని ముందుకెళుతున్నామని డిప్యూటి సీఎం కడియ శ్రీహరి వెల్లడించారు. 

ఇంటర్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 53.32 శాతం ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం 59 శాతం..బాలుర ఉత్తీర్ణత శాతం 48 శాతంగా ఉంది. ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత శౄతం 63.32 శాతం ఉంది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలదే పై చేయిగా ఉంది. 

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఫలితాలు విడుదల అయ్యాయి. 

11:04 - April 22, 2016

హైదరాబాద్ : సినీ నటుడు బాలకృష్ణకు వందో చిత్రం కేక్ వాక్ లాంటిదని మెగస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. అన్నపూర్ణ స్టూడియోలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ ముహూర్తపు షాట్ కొట్టారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు. ఈ సినిమాకు సరైన దర్శకుడు క్రిష్ అని కొనియాడారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో 'కంచె'ను క్రిష్ రూపొందించడం అభినందనీయమన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రను పోషించడం బాలయ్యకు అవలీలగా ఉంటుందని..కేక్ వాక్..అని అభివర్ణించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు, బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 

10:52 - April 22, 2016

హైదరాబాద్ : సినీ నటుడు బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం రెండొందుల రోజులు ఆడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణ చిత్ర షూటింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముహూర్తపు క్లాప్ కొట్టారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. వందో చిత్రంగా 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఎంచుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. తెలుగుతనాన్ని ప్రపంచానికి తెలియచేసేందుకు ఆయన పూనుకోవడం గర్వించదగిందన్నారు. తనకు ఎన్టీఆర్ అభిమాన హీరో అని, అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఓ దుష్ర్పచారం జరిగిందన్నారు. చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్ అక్కడే ఉంటుందన్నారు. తెలుగు జాతి గర్వించదగిన నటుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు సినీ చరిత్రలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణను కేసీఆర్ ఓ కోరిక కోరారు. తనకు..ఇక్కడున్న వారందరికీ మొదటి ఆటను చూపించాలని కోరుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

బాలకృష్ణ సినిమా 200 రోజులు ఆడాలి - కేసీఆర్..

హైదరాబాద్ : సినీ నటుడు బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం రెండొందుల రోజులు ఆడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. బాలకృష్ణ చిత్ర షూటింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 

ఎల్.రమణకు ఉత్తమ్ ఫోన్..

హైదరాబాద్ : టి.టిడిపి నేత ఎల్.రమణకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో మద్దతు ప్రకటించాలని కోరారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళుతామని రమణ పేర్కొన్నారు. 

అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నపూర్ణ స్టూడియోకు విచ్చేశారు. బాలకృష్ణ నటిస్తున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ కార్యక్రమం జరుగుతోంది. 

అన్నపూర్ణ స్టూడియోలో గౌతమి పుత్ర శాతకర్ణి..

హైదరాబాద్ : సినీ నటుడు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షూటింగ్ కార్యక్రమానికి మెగస్టార్ చిరంజీవి, ఇతర ముఖ్య నటులు హాజరయ్యారు. 

ఆత్రేయ సతీమణి కన్నుమూత..

ఏలూరు: ప్రముఖ కవి, రచయిత ఆచార్య ఆత్రేయ సతీమణి కేవీ పద్మావతి (80) కన్నుమూశారు. తాడేపల్లిగూడెం మండలం ముదునూరుపాడులోని ఆమె సోదరి నివాసంలో తుదిశ్వాస విడిచారు. 

కాసేపట్లో ఉత్తరాఖండ్ కేబినెట్ సమావేశం..

ఉత్తరాఖండ్ : కాసేపట్లో హరీష్ రావత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగనుంది. గురువారం రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

హౌసింగ్ ఏఈ ఇంటిపై ఏసీబీ దాడి..

విజయనగరం : రామభద్రాపురం హౌసింగ్ ఏఈ వేణుగోపాల నాయుడి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. బొబ్బిలిలోని వేణుగోపాల్ ఇంట్లో..బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈక్వెడార్ లో మళ్లీ భూకంపం..

ఈక్వెడార్ : మళ్లీ ఈక్వెడార్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6గా నమోదైంది. ఇటీవలే వచ్చిన భూకంపం ధాటికి 235 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 

పదవీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

09:10 - April 22, 2016

హైదరాబాద్ : భానుడు తన ప్రతాపాన్ని ఆర్టీసీ సిబ్బంది మీద చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక సిబ్బంది నానా ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లు,కండక్టర్లు ఎండ బారిన పడుతున్నారు. కనీసం మంచినీరైనా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం. గ్రేటర్ పరిధిలో 3800 సిటీ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. 90 లక్షల మంది ప్రయాణీకులను వారి వారి గమ్యాలకు చేరుస్తోంది. సిటీ ఆర్టీసిలో దాదాపు 24 వేల మంది కార్మికులు, అధికారులు పనిచేస్తున్నారు. పదిరోజుల నుంచి ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఆర్టీసీకీ ఆదాయమూ తగ్గింది. మధ్యాహ్నం వేళల్లో పని చేస్తున్న కార్మికులు ఎండవేడిమికి తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో వివిధ రూట్లలో అందుబాటులో మంచినీరు లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది వడదెబ్బకు గురవుతున్నారు.. పగలంతా విధులకు హాజరై రాత్రి అస్వస్థతకు గురైతే ఉదయం లీవులు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు కార్మికులు.

మృతి చెందిన కార్మికుడు..
ఇటీవల ఎండలో డ్యూటీ చేయడం వల్ల వడదెబ్బకు గురై ఓ కార్మికుడు మరణించాడు. ఓ వైపు ఎండల దృష్ట్యా పని ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంచినీరు, మందులు లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆర్టీసిలో మాత్రం అవేమీ అమలు కావడం లేదు. కేవలం డిపోల్లోనే నీటి సౌకర్యం కల్పించారు. బస్టాండ్లలో నీరు ఉండటం లేదంటున్నారు కార్మికులు. ప్రభుత్వం,ఆర్టీసీ యాజమాన్యం ప్రధాన సెంటర్లలోని బస్టాప్‌ల దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఎయిడ్ కిట్ బాక్స్ లు ఎక్కడ ? 
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తరపున ఉచితంగా పంపిణీ చేస్తున్న ఓఆర్ఎస్ ప్యాకెట్లను విధులకు వెళ్లే ముందు అందిస్తే కొంత ఉపశమనం లభించే అవకాశముందని కార్మికులు చెబుతున్నారు. అనేక బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్‌లూ కనిపించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్ బయలు దేరే ముందే క్యాన్ల ద్వారా మంచి నీటిని అందజేయాలని సిబ్బంది కోరుతున్నారు.

కృష్ణా నదిలో నలుగురు యువకుల గల్లంతు..

కోడూరు : మండలం విశ్వనాథ పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు గల్లంతయ్యారు. 

08:41 - April 22, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించింది. అందుకనుగుణంగా సదుపాయాల కల్పన కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు అధికారులు. అయితే ఇందుకోసం భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. లక్ష్యం బారెడు, ఆదాయం మూరెడు అన్న చందంగా ఉంది బల్దియా పరిస్థితి. కేటీఆర్‌ మున్సిపల్‌ శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరాభివృద్ధికి అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భాగ్యనగరంలో నెలకొన్న అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రణాళిలు సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో జీహెచ్ ఎంసీతో పాటు, వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఎలో పౌరసేవలను మెరుగుపరిచేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ప్రధానంగా హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన, స్కైవేలు,ఎక్స్‌ప్రెస్‌ వేలు,బెంగుళూరు తరహా సమగ్రమైన రోడ్ల నిర్మాణం,గ్రీనరీ డెవలప్‌మెంట్ అంశాలపై దృష్టి పెట్టారు. నగర శివారు ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్ డ్రైనేజి సదుపాయం, మంచినీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించే చర్యలు చేపడుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ ప్రభుత్వంపై ఆధారపడకుండానే స్వంతంగా మనుగడ సాగిస్తోంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకాలకు నిధులలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పనులన్నీ పూర్తి కావాలంటే వేలాది కోట్ల రూపాయల నిధులు అవసరం. సమగ్రాభివృద్ధికి 26 వేల కోట్లు, హుస్సేన్‌ సాగర్ ప్రక్షాళనకు 500 కోట్లు,మూసీనది సుందరీకరణకు మూడువేలకోట్లు, మూసీపై 6లైన్ల రోడ్ల నిర్మాణానికి 6,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కార్పొరేషన్ కు అంత రేటింగ్ వస్తుందా ? 
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరాభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం అనేక పద్ధతుల్లో ముందుకెళ్లేందుకు మార్గాలు వెతుకుతోంది జీహెచ్‌ఎంసీ. ఇందుకోసం అప్పులు చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. కార్పొరేషన్‌ బాండ్స్ విక్రయించి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే క్రిసిల్‌ అనే ఎకనామిక్‌ రేటింగ్ సంస్థ ద్వారా కార్పొరేషన్‌ రేటింగ్‌ను నిర్ణయించే పనిలో పడింది బల్దియా యంత్రాంగం. అయితే ఈ సంస్థ ఇచ్చే రేటింగ్స్ పై బాండ్‌ విలువ ఆధారపడి ఉంటుంది. కార్పొరేషన్‌ కు అంత రేటింగ్ వస్తుందా,లేదా అని అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. గతేడాది బడ్జెట్ లో బాండ్ల అమ్మకం ద్వారా వెయ్యి కోట్లు సేకరిస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈసారైనా ప్లాన్‌ ఫలించి, పథకాలు పూర్తవుతాయా అనేది వేచి చూడాలి.

ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్య ప్రవర్తన..

ముంబై : కోల్ కతా - ముంబై విమానంలో ఇండిగో ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు ప్రయాణీకులను ముంబై ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని మాత్రమే అరెస్టు చేయడం జరిగిందని, మిగతా ఇద్దరికి ఈఘటనతో సంబంధం లేదని ఇన్స్ పెక్టర్ ఇర్ఫాన్ షేక్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు .

08:11 - April 22, 2016

మంచి కథ దొరికితే సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధమేన'ని అంటున్నారు బాలీవుడ్‌ సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌. మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా తానేమిటో నిరూపించుకున్న మాధురీ ప్రస్తుతం కొన్ని టీవీ షోస్‌కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. 2014లో 'గులాబ్‌ గ్యాంగ్‌'లో నటించిన మాధురీ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఇటీవల మీడియాలో పేర్కొన్నారు. 'నటించడమంటే నాకెంతో ఇష్టం. డ్యాన్స్ కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం. ప్రస్తుతం డాన్స్ షోలకు జడ్జిగా ఉంటూ బిజీగా ఉన్నాను. కాని కథలు నచ్చితే సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. కుటుంబ బాధ్యతలతో సినిమాలకు దూరంగా ఉన్నాను. పక్కా ప్రణాళికలు వేసుకుని షోస్‌తోపాటు సినిమాల్ని కూడా మేనేజ్‌ చేయాలను కుంటున్నాను' అని మాధురీ తెలిపారు. 

08:10 - April 22, 2016

టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న తమన్నా అప్పుడప్పుడు స్పెషల్‌సాంగ్స్‌లోనూ మెరుస్తున్న విషయం విదితమే. తాజాగా ఎన్టీఆర్‌ సరసన ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించేందుకు తమన్నా గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా తమన్నా ఓ స్పెషల్‌సాంగ్‌లో ప్రేక్షకుల్ని అలరించనున్నట్లు సమాచారం. ఇటీవల నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు సాయిశ్రీనివాస్‌ నటించిన 'అల్లుడుశీను', 'స్పీడున్నోడు' చిత్రాల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు స్పెషల్‌సాంగ్స్‌లో నర్తించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 'బాహుబలి2'తోపాటు ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న త్రిభాషా హర్రర్‌ చిత్రం 'అభినేత్రి'లోను, తమిళంలో 'ధర్మ దురై' చిత్రంలోనూ తమన్నా నటిస్తోంది. తాజాగా రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందబోయే బాలీవుడ్‌ చిత్రంలోనూ నటించేందుకు అంగీకరించింది.

08:09 - April 22, 2016

'కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దక్షిణాదిలో మంచి నటుడిగా ఫ్రూవ్‌ చేసుకోవాలను కుంటున్నాన'ని అల్లు అర్జున్‌ చెప్పారు. ఆయన హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మించిన 'సరైనోడు' చిత్రం నేడు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం బెంగుళూరులో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, 'ప్రపంచ వ్యాప్తంగా నాకు అభిమానులున్నప్పటికీ తెలుగు తర్వాత కన్నడ అభిమానులే ప్రత్యేకం. నా చిత్రాలను కన్నడ నాట విశేషంగా ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. కన్నడ చిత్రాలంటే నాక్కూడా అమితమైన గౌరవం. కన్నడ సినిమాలను రెగ్యులర్‌గా ఫాలో అవుతాను. గత మూడు సంవత్సరాలుగా కన్నడ చిత్రాల్లో ఎంతో పురోగతి కనిపిస్తోంది. చాలా మంచి సినిమాలొస్తున్నాయి. హీరోల్లో రాజ్‌ కుమార్‌ ఫ్యామిలీ అంటే ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా. త్వరలోనే తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాను. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. 'సరైనోడు' పూర్తి స్థాయి మాస్‌, ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. దర్శకుడు బోయపాటి శ్రీను అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది' అని చెప్పారు.

08:06 - April 22, 2016

ఆయువును పెంచి ఆరోగ్యకర జీవితాన్నిచ్చేది గాఢ నిద్ర. దానికి భంగం వాటిల్లితే ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ప్రశాంత నిద్రకు అవరోధం కలిగించేది గురక. ఈ సమస్య ఉన్న వారు అనేక రుగ్మతలు చవిచూడాల్సి వస్తుంది. గురకను బట్టి ఆరోగ్య సమస్యను తెలుసుకోవచ్చు. తద్వారా దీనిని నివారించుకోవచ్చు.
నోరు మూసుకుని గురక పెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని అర్థం.
నోరు తెరచి గురకపెడితే మీ గొంతులోని మృదువైన కణజాల సమస్య ఉందని గుర్తించాలి.
వెల్లకిలా పడుకుని గురకపెడితే ఆరోగ్యానికి ప్రధాన సమస్యగా గుర్తించాలి.
ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుందంటే తీవ్ర సమస్యగా గుర్తించాలి.
ఇంటి చిట్కాలు..

  • ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.
  • కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.
  • అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి.
  • ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
07:57 - April 22, 2016

వేసవిలో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. చెమట రూపంలో ఎక్కువగా శరీరంలోని నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా ద్రవహారం తీసుకోవాలి. వీటి వల్ల విటమిన్లు సమృద్ధిగా అందుతాయి. ఎండ దెబ్బకు వచ్చే నీరసాన్ని చిటికెలో నివారించే వీలు చిక్కుతుంది. దీనికితోడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటి తిండ్లకు దూరంగా ఉంటే వేసవిలో అనారోగ్య సమస్యలు రాకుండా గట్టెక్కొచ్చు. ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకూడదు.. తాగకూడదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? 

మజ్జిగ : వేసవికాలంలో తీసుకోవాల్సిన బెస్ట్‌ ఫుడ్స్‌లో మజ్జిగ ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. అంతేకాదు... శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది.

పుదీనా: ఇది మనకు చాలా సులభంగా దొరుకు తుంది. చౌకైనది కూడా. ఇదొక హెల్దీ హెర్బ్‌. పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు . పుదీనాతో మంచి ఫ్లేవరబుల్‌ చట్నీలు చేసుకోవచ్చు . ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో గ్రేట్‌ గా సహాయపడుతుంది.

ఉల్లిపాయలు: ఉల్లిపాయలో అమేజింగ్‌ కూలింగ్‌ ప్రొపర్టీస్‌ ఉన్నాయి . అందుకే వీటిని రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవాలి. కర్రీస్‌, సలాడ్స్, రైతాలు, చట్నీస్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మార్చుతుంది . ఎర్ర ఉల్లిపాయల్లో క్విర్సిటిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్‌ యాంటీ అలర్జిన్‌ . వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.

పుచ్చకాయ : వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్‌ ఫుడ్‌ పుచ్చకాయ. ఈ రెడ్‌ కలర్‌ జ్యూస్‌ ఫ్రూట్‌ లో 90శాతం నీళ్లు, 10శాతం ఫ్లెష్‌ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది.

కర్బూజా : వేసవికి మరో బెస్ట్‌ ఫుడ్‌ మస్క్‌ మెలోన్‌ (కర్బూజా). వేసవిలో డైలీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మరో ఆహారం ఇది. ఇందులో ఉండే వాటర్‌ కంటెంట్‌ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది.

జామకాయ: జామకాయలో విటమిన్‌ 'సీ' పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వేసవిలో ఆరోగ్యంగానూ, శక్తిమంతం గానూ ఉంచు తాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి.

కొబ్బరి బోండాం: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పారదోలుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది.

నిమ్మకాయ: శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది.

కీరదోసకాయ: కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమ వుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం. దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.

ఫైనాపిల్‌: ఇందులో నీటితో కూడిన యాంటి ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌ అధికంగా ఉం టుంది. కాబట్టి ఫైనాపిల్‌ తరచూ తీసు కోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

07:54 - April 22, 2016

ప్రస్తుత కాలంలో మహిళలు చర్మాన్ని, అందాన్ని కాపాడుకోవడం కోసం మార్కెట్‌లోకి వచ్చే వివిధ రకాల సౌందర్య సాధనాలు, క్రీములను వాడుతుంటారు. ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మహిళలు వాడే వివిధ రకాల సౌందర్య సాధనాల వల్ల గర్భంలోని శిశువుకు కూడా హాని కలుగుతున్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా వివిధ రకాల క్రీమ్‌లు, పర్ఫ్యూమ్‌లు, వంటి కాస్మొటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది తల్లికే తెలియకుండా గర్భంలోకి వెళ్లి గర్భంలో పెరిగే పసికందుపై ప్రభావం చూపుతుందట.

  • అందులోనూ ముఖ్యంగా తల్లి కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అయితే, ఆ బిడ్డపై ఎక్కువ దుష్ఫలితాలు చూపిస్తున్నాయట. ఎనిమిదో వారం నుంచి 12వ వారం వరకు గల మధ్యకాలంలో గర్భంలో పెరిగే పిండంలో అవయవాల పెరుగుదల కనిపిస్తుందని, ఇలాంటి సమయంలో కొన్ని హార్మోన్లు పిండంపై ప్రభావం చూపడం వల్లే జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి లోపాలు కనిపిస్తాయట. ఇవి ఎక్కువగా మగ పిల్లల్లోనే కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో తల్లి ఉపయోగించే అలంకరణ వస్తువులు బిడ్డ యొక్క హార్మోన్ల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట.
  • టెస్ట్రోస్‌రోన్‌ అనే హార్మోన్‌ మగవారిలో పునరుత్పత్తిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమైంది. దీనిపైనా కూడా ఈ సౌందర్య సాధనాల ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సౌందర్య వస్తువులను మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల పిల్లలకు క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఉందట. అందువల్ల గర్భం దాల్చిన మహిళలు ప్రసవం అయ్యేంత వరకు సౌందర్య క్రీములకు కాస్త దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

నేడు అధికారులతో మంత్రి హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 11 ప్రాజెక్టులు, ఆర్ఆర్ పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నారు.

 

07:33 - April 22, 2016

రోజా సస్పెన్షన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ అంశంపై నాలుగు గంటల పాటు వాదనలు సాగాయి. సభకు క్షమాపణలు చెప్తూ స్పీకర్‌కు, ప్రివిలేజ్‌ కమిటీకి లేఖ రాయాలనీ సుప్రీంకోర్టు రోజాకు సూచించింది. సస్పెన్షన్‌పై సభదే తుది నిర్ణయమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శ్రీనివాస్ యాదవ్ (కాంగ్రెస్), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్) పాల్గొని విశ్లేషించారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

త్రయంబకేశ్వర ఆలయానికి చేరుకున్న తృప్తి దేశాయ్..

మహారాష్ట్ర : భూ మాత బ్రిగేడ్ సంస్థ నిర్వాహకురాలు తృప్తి దేశాయ్ త్రయంబకేశ్వరం ఆలయానికి చేరుకున్నారు. కానీ అక్కడి పోలీసులు ఆమెను ఆలయం వద్ద నిలిపివేశారు. అనంతరం ఆమె లోనికి వెళ్లి పూజలు నిర్వహించారు. 

07:16 - April 22, 2016

తెలుగు సినిమాల్లో తెలుగు కథానాయికలు కనిపించడం అరుదు. పొరుగు భాషల్లో అవకాశాలు అందుకొంటారేమో కానీ... మన తెరపైన మాత్రం వాళ్లకి ఎప్పుడో కానీ చోటివ్వం. అందుకే మన హీరోలు ఎక్కువగా ఉత్తరాది భామలతోనో, లేదంటే కేరళ అందగత్తెలతోనో ఆడిపాడుతుంటారు. తెలుగు తెరను పంచుకొన్నారో ఏంటో తెలియదు కానీ... ఉత్తరాది భామలు కొన్ని రోజులు, కేరళ భామలు కొన్ని రోజుల పాటు హవా చూపుతుంటారు. మొన్నటివరకు ఉత్తరాది కథానాయికల ఆధిపత్యమే కనిపించింది. ఇప్పుడు మాత్రం కేరళ భామలు తెలుగు తెరపై దండయాత్ర చేస్తున్నారు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగుమతి అవుతున్న కేరళ భామల పై ప్రత్యే కథనం. ఒకప్పుడు తెలుగు తెరపై హీరోయిన్స్ కు ముంబై కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఎంతో మంది ఉత్తరాది భామలు టాలీవుడ్ లో అందాలు ఆరబోసి అలరించారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కేరళ నారీమణులు ఆక్రమిస్తున్నారు. గతం కొంత కాలం నుంచి తెలుగు తెరను గ్లామర్ తో నింపేస్తున్నారు మల్లూ భామలు. ఇప్పుడు వాళ్ళ హవా మరీ ఎక్కువైంది.

అచ్చమైన తెలుగమ్మాయిల్లాగే..
కేరళ కూడా దక్షిణాది భారతదేశంలో భాగమే కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన వీళ్లంతా అచ్చమైన తెలుగమ్మాయిల్లాగే తెరపై దర్శనమిచ్చారు. భాష, భావోద్వేగాల విషయంలో ఉత్తరాది భామల కంటే మెరుగ్గా అనిపించారు. దీంతో వీళ్లకి తిరుగులేకుండా పోయింది. ఇప్పటికీ జోరుమీదున్న నయనతార, నిత్యమేనన్‌లే కాకుండా...మరికొంత మంది కేరళ నారికేళాలు టాలీవుడ్లోకి ఎంటర్ అయిపోయారు. యువ హీరోలే కాకుండా, స్టార్ హీరోలు సైతం కేరళ భామలతో ఆడిపాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో కొన్ని సినిమాలు సెట్స్ మీదుండగా, మరికొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీగా ఉన్నాయి.

అనుపమా పరమేశ్వరన్..
కీర్తి సురేష్ తరువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ . మలయాళంలో ఒకే ఒక్క సినిమాతో యువత మనసు దోచేసుకుంది. అందంతో పాటు అభినయం కూడా ఆమె ప్రత్యేకత అవడంతో అమ్మడు టాలీవుడ్ దర్శక, నిర్మాతల్ని కూడా ఇట్టే పడగొట్టేసింది.

మడోన్నా సెబాస్టియన్..
ఇక అనుపమా పరమేశ్వరన్ తో పాటే ప్రేమమ్ లో ఎంట్రీ ఇచ్చిన మరో కేరళ సుందరాంగి మడోన్నా సెబాస్టియన్. మలయాళ ప్రేమమ్ లో ముగ్గరు హీరోయిన్స్ లో రెండో హీరోయిన్ అమ్మడు. ఈ సినిమా తో మడోన్నా కి కూడా మాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక వీరితో పాటు మరికొంత మంది కేరళ ముద్దుగుమ్మలు ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఒక్క గ్లామర్ లోనే కాదు అభినయంలో కూడా ఏ ఒక్కరికీ తీసిపోని విధంగా టాలీవుడ్ తెరమీద చెలరేగుతున్నారు.

మరో రెండేళ్లు..
టాలీవుడ్ లో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన నయనతార, నిత్యామీనన్ లు తెలుగు తెరమీద ఇంకా తమ హవా కొనసాగిస్తునే ఉన్నారు. వీళ్లిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంకో రెండేళ్లల్లో ఈ మల్లూ భామలంతా కలిసి తెలుగు తెరని ఏలే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. అయితే ఉత్తరాది అమ్మాయిలకీ, మలబారు ముద్దుగుమ్మలకీ ధీటుగా కనిపించే తెలుగమ్మాయిల్ని ప్రోత్సహించకపోవడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఏదేమైనా గ్లామర్ తో పాటు అభినయం కూడా ఉంటేనే భాషతో సంబంధం లేకుండా ఎవరైనా రాణించగలుగుతారు. 

07:09 - April 22, 2016

రాజ్ కోట్ : గుజరాత్ లయన్స్ ను వారి సొంతగడ్డపైనే సన్ రైజర్స్ ఖంగు తినిపించారు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అలవోకగా విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేయగలిగింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి లయన్స్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. 29 పరుగులిచ్చిన భువీ ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. గుజరాత్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగిందంటే అది కెప్టెన్‌ రైనా చలవే. 51 బాల్స్ ఆడిన రైనా ఏకంగా 75 పరుగులు చేశాడు. మెక్‌ కల్లమ్‌ 18, జడేజా 14 పరుగులు చేశారు. ఓపెనర్ ఫించ్ డకౌట్ అయ్యాడు. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన సన్‌ రైజర్స్ టీం 14.5 ఓవర్లనే వికెట్లేవీ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ కం ఓపెనర్ డేవిడ్ వార్నర్ 48 బాల్స్‌లో 78 పరుగులు చేశాడు. వరుసగా విఫలమవుతూ వస్తున్న శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో మెరిశాడు. ధావన్‌ 41 బాల్స్ లో 53 రన్స్ చేశాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్‌ రైజర్స్ 2 విజయాలు, 2 పరాజయాలతో ఫోర్త్ ప్లేస్‌కు చేరగా గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో 3 విన్‌ అయి సెకండ్ ప్లేస్‌లో ఉంది. 

07:07 - April 22, 2016

విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఎంసెట్‌ తేదీ దగ్గరకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఈ నెల 29న, తెలంగాణలో వచ్చే నెల 2న ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయివేట్‌ కాలేజీల యాజమాన్యాలు కూడా మే 13న ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణలోనూ వుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ రాసే విద్యార్థుల్లోనూ, వారి పేరెంట్స్ లోనూ టెన్షన్‌ పెరుగుతోంది. ఎంసెట్‌ లో మంచి ర్యాంక్‌ సాధించడం ఎలా? ఈ కొద్ది రోజులు ఎలా చదువుకోవాలి ? ఎగ్జామ్‌ రాసేటప్పుడు విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలేమిటి? మెళుకవలేమిటి? మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు ఇప్పిస్తామంటూ కొంతమంది ఆఫర్లు ఇస్తున్నారు. వీటిని ఎంతవరకు నమ్మవచ్చు ? అసలు మేనేజ్‌మెంట్‌ కోటాలో మెడికల్‌, డెంటల్‌ సీట్లు ఏ ప్రాతిపదికన భర్తీ చేస్తారు? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఫీజులు ఎక్కువగా వుండడానికి కారణం ఏమిటి ? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రయివేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ కొడాలి విజయ రమేష్‌ విశ్లేషించారు. మరి ఆయన ఎలాంటి సూచనలు..సలహాలు అందచేశారో వీడియో క్లిక్ చేయండి. 

06:48 - April 22, 2016

చెన్నై : రజనీకాంత్ పిరికివాడా? అందుకే రాజకీయాల్లోకి రాలేదా..రజనీకాంత్‌కు ఎవరంటే భయం..అసలెందుకు రజనీ భయపడుతున్నారు..ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాష్ట్రమంతటా సంచలనం రేకెత్తిస్తున్నాయి. రజనీ గురించి ఎవరీ వ్యాఖ్యలు చేశారు..తెలుసుకోవాలంటే ఇది చదవండి.రజనీకాంత్‌పై సీనియర్‌ నటుడు, డీఎమ్‌డీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ అన్న మాటలు రాజకీయ రచ్చకు దారితీస్తున్నాయి. విజయ్‌కాంత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలోని విల్లివాక్కంలో ఓట్ల గురించి అభ్యర్ధించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అధికార పక్షం, ఇతర పార్టీలపై విజయ్‌కాంత్‌ విమర్శల వర్షం కురిపించారు. తాను సినిమాల్లో నటించేటపుడు ఓ పార్టీ తనను బెదిరించిందని ,అయినా ధైర్యంగా రాజకీయాల్లోకి వచ్చానని గర్తు చేశారు. ఆ సమయంలోనే ఓ అడుగు ముందుకేసి తానేమి రజనీకాంత్‌లా పిరికివాడిని కాదని నోరుజారేశారు. వెంటనే నాలుక్కరుచుకొని, అబ్చే రజనీసార్‌ మంచి వారు, కాకపోతే ఆయనలా వెనుకంజ వేయటం తనకు నచ్చదని సర్దిచెప్పుకున్నారు.

చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపణ..
అయితే విజయ్‌కాంత్ చేసిన సంచలన వ్యాఖ్యలిప్పుడు, ఇద్దరు వ్యక్తులకు చెందిన అభిమానుల మధ్య నిప్పురాజేశాయి. తమ అభిమాన నాయకుడి గురించి అలాంటి మాటలన్నందుకు రజనీకాంత్‌ అభిమానులు విజయ్‌కాంత్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుచోట్ల రజనీకాంత్‌ అభిమానులు విజయ్‌కాంత్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయగా..మరికొన్ని చోట్ల విజయ్‌కాంత్‌పై ఏకంగా వ్యతిరేక ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో అమ్మపక్షాన చేరి ప్రతిపక్షహోదాను పొందిన విజయ్‌కాంత్‌ ఆ తర్వాత అధికారానికి దూరమై పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ప్రజాసంక్షేమమంటూ, పరోక్షంగా అమ్మకే మద్దతిచ్చే చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నడంటూ ఆరోపిస్తున్నారు. విజయ్‌కాంత్‌ వ్యాఖ్యలపై ఏమాత్రం నోరుమెదప లేదు రజనీకాంత్‌. అయితే అభిమానుల ఒత్తిడితో రజనీకాంత్‌ విజయ్‌కాంత్‌పై విరుచుకుపడతాడా, లేదా అనవసర వ్యాఖ్యలపై దుమారమెందుకని ఊరుకుంటాడో అని ఎదురుచూస్తున్నారు రజనీ అభిమానులు .

06:45 - April 22, 2016

పశ్చిమ బెంగాల్‌ : అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న మూడో విడత పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. ముర్షిదాబాద్‌ జిల్లాలోని డొంకల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో తృణమూల్‌ కార్యకర్తలు బాంబులతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న 35 ఏళ్ల సిపిఎం కార్యకర్త మరణించాడు. మృతుడిని సిపిఎం కార్యకర్త తహిదూర్‌ ఇస్లాంగా గుర్తించారు. ఓ పోలింగ్‌ బూతువద్ద అతడి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు ఎన్నికలకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా 62 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఆరు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

06:40 - April 22, 2016

హైదరాబాద్ : కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తాం.. వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేస్తామని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి వేదికపైనా కుండ బద్దలు కొట్టిమరీ చెబుతోంది. కానీ ఇదే సమయంలో కెసిఆర్ సర్కార్‌కు ఓ అతిపెద్ద సమస్య సవాలు విసురుతోంది. ఆ సమస్యను పరిష్కరించనిదే ఎన్ని ప్రాజెక్టులు కట్టినా అవి నిష్ప్రయోజనమే. ఇంతకు ఏంటా సవాల్‌.. ప్రభుత్వానికి దాన్ని పరిష్కరించే శక్తి ఉందా? గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను విస్మరించాయి.. మేము మాత్రం కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. లక్షల ఎకరాలకు కేవలం ఎత్తిపోతల పథకాల ద్వారానే నీరు అందించాల్సి ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి పెను సవాలే.

నిర్మాణ, నిర్వహణ వ్యయం భారీగా పెరిగే అవకాశం..
తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరి నదుల మట్టానికి ఎత్తులో ఉంది. దీంతో ఆయా నదుల నీటిని వాడుకోవాలంటే ఎత్తిపోతల పథకాలే ఏకైక మార్గం. వాటికి భారీగా విద్యుత్‌ను వినియోగించాల్సొస్తుంది. నాగార్జునసాగర్, శ్రీరాం సాగర్‌, రెండు మూడు మధ్య తరహా ప్రాజెక్ట్‌లు మినహా గ్రావిటీతో నీరందే ప్రాజెక్టులు తెలంగాణలో చాలా తక్కువ. ఇలాంటి నేపథ్యంలో టిఆర్‌ఎస్ సర్కార్‌ రీ డిజైన్ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ లిఫ్టుల ఆధారంగా నిర్మిస్తున్నవే. పాతవి కొత్తవి కలిపి అన్ని పథకాలకు దాదాపు 14వేల మెగా వాట్ల విద్యుత్ అవసరమవుతుంది. దీంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణ వ్యయంతో పాటు నిర్వహణా వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

6,200 మెగావాట్లు..
ఇటీవల రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కింద ప్రతిపాదించిన అదనపు బ్యారేజీలతో పాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల సామర్థ్యం పెంచడంతో ఈ ఒక్క ప్రాజెక్టుకే 6,200 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా. ఇక పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 3,345 మెగావాట్లు, కల్వకుర్తికి 450 మెగావాట్లు, దేవాదులకు 484, ఎస్ఎల్‌బిసికి 84, భీమా ఎత్తిపోతల పథకానికి 96 మెగావాట్లు కావాలి. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 119 మెగావాట్లు, కోయిల్ సాగర్‌కు 30, అలీసాగర్‌కు 25, గుత్పకు 18, ఎల్లంపల్లికి 167 మెగావాట్లు కావాలి. సీతారామ సాగర్ ఎత్తిపోతలకు 450 మెగావాట్లు, భక్తరామదాసు ప్రాజెక్ట్‌కు 200, కాళేశ్వరం ఎత్తిపోతలకు 28 మెగావాట్లు అవసరమవుతాయి. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకానికి 5, డిండి ఇతర ఎత్తిపోతల పథకాలకు 500 మెగావాట్లు అవసరముంది.

చత్తీస్‌ఘడ్‌ నుంచి వెయ్యి మె.వా కొనుగోలు..
రాష్ట్రంలో ప్రస్తుతం థర్మల్, జల విద్యుత్ కేంద్రాల ద్వారా కేవలం 5,700 మెగా వాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది రాష్ట్ర అవసరాలకు సరిపోకపోవడంతో చత్తీస్‌ఘడ్ నుండి వెయ్యి మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి, ప్రతిపాదనలో ఉన్న విద్యుత్ కేంద్రాల ద్వారా 2020 నాటికి 13 వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుంది.

వివిధ ప్రాజెక్టుల డిపిఆర్‌లో వివరాలు నిల్‌..
రానున్న కాలంలో సాధారణ విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. వ్యవసాయానికి, పారిశ్రామిక అవసరాలకే అందుబాటులోకి వచ్చే విద్యుత్ సరిపోతుంది. ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే విద్యుత్‌కు ఇంకెంత డిమాండ్ పెరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల డిపిఆర్‌లో కూడా విద్యుత్ ఎలా సమకూర్చుకుంటారో స్పష్టం చేయలేదు. ఈ విషయమై కేంద్ర జల సంఘం పలుమార్లు గత ప్రస్తుత ప్రభుత్వాలను వివరణ కోరింది.  ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులతో పాటుగా జలవిద్యుత్ కేంద్రాలను నిర్మిస్తేనే ప్రాజెక్టులకు సార్థకత ఉంటుందని నీటిపారుదల రంగం నిపుణులు అంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంత స్వల్పకాలంలో విద్యుత్ ప్రాజెక్టులు పూర్తవుతాయా అనే సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. మరి ఈ అతిపెద్ద సమస్యను కెసిఆర్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. 

06:33 - April 22, 2016

హైదరాబాద్ : యూనివర్సిటీలను కేంద్రం కాషాయమయం చేస్తోందని ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ విమర్శించారు. ఏనాడూ స్వాంతంత్ర్య సంగ్రామంలో పాల్గొనని సంఘ్‌ శక్తులు తమకు అనుకూలంగా చరిత్రను రాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ సుందర్య విజ్ఙాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న మతతత్వ విధానాలపై దేశవ్యాప్తంగా మేథావులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి సర్కార్‌ దేశంలో ఉన్న సమస్యలను మరుగు పర్చేందుకు కుహానా జాతీయ వాదాన్ని తెరపైకి తెస్తోందని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో హైదరాబాద్‌ కలెక్టివ్స్ పేర జరిగిన కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్‌ సాయినాధ్, జేఎన్యూ ప్రొఫెసర్ గోపాల్‌గురు ప్రసంగించారు. విద్యా కాషాయీకరణతో దేశంలో మతతత్వం పెరిగిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

నిరక్షరాస్యులు రాజకీయాలకు దూరం..
తాము పాలిస్తున్న రాజస్థాన్, హర్యానాలో పాఠశాల సిలబస్‌ను బిజెపి పూర్తిగా మార్చివేసిందని సాయినాథ్‌ ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విద్యార్హతలు తీసుకొచ్చారని తద్వారా దళితులు, ఆదివాసీలను రాజ్యాధికారం నుంచి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. నిరక్షరాస్యతను నిర్మూలించాల్సిందిపోయి నిరక్షరాస్యులను రాజకీయాల నుంచి దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇంకా అంటరానితనం కొనసాగింపు..
యూనివర్సిటీల్లో విద్యార్థులపై జరుగుతున్న దాడులను సాయినాథ్, గోపాల్ గురు ఖండించారు. ప్రభుత్వాల తప్పుడు విధానాలను ప్రశ్నించినందుకే రోహిత్ వేముల, కల్బూరి వంటి హేతువాదులను హత్య చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. కులాలవారీగా ఉన్న సరిహద్దులను చెరపకుండా...దేశ సరిహద్దుల గురించి మాట్లాడడం ద్వారా ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని ప్రొఫెసర్ గోపాల్ గురు కేంద్రానికి సూచించారు. స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లు దాటినా ఇంకా అంటరానితనం కొనసాడడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రజా జీవనంపై జరుగున్న మతతత్వ, పెట్టుబడి దారి దాడులను తిప్పికొట్టాలని మేథావులు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలన్నారు. 

06:31 - April 22, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. పాలేరులో పోటీకి దిగేందుకు అన్ని రాజకీయ పక్షాలు సై అంటున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పాలేరు ఉప ఎన్నికపైనే పడింది. అటు పాలేరును కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతుంటే...ఇటు టిడిపి సహా ఇతర పక్షాలు అధికార పార్టీకి చెక్‌పెట్టేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో పాలేరు ఉప ఎన్నిక రాష్ట్రంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పాలేరులో విజయం సాధించి పాగా వేయాలని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ..ఉవ్వీళ్లూరుతుంటే..అటు ప్రతిపక్షాలు సైతం పాలేరును చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టాయి. దీంతో పాలేరులో ఇప్పుడు రాజకీయ కోలాహాలం మొదలైంది.

టిడిపి ఆశలు..
టీడీపీకి మొదటి నుంచి బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గం కావడంతో పార్టీలో కొంతవరకు ఆశాభావంతో ఉన్నారు. ఎన్నికలలో గెలిస్తే పార్టీకి పూర్వవైభవం సిద్ధించే అవకాశముందని భావిస్తున్నారు. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీలోని అంతర్గత వర్గ విభేదాల కారణంగా పాలేరులో కొద్దిపాటి తేడాతో ఓటమి చవిచూసింది. అప్పుడు టీడీపీలో ఉన్న ప్రస్తుత టీఆర్‌ఎస్ పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే అప్పట్లో నామా వర్సెస్‌ తుమ్మల మధ్య ఉన్న విభేదాల కారణంగా, తుమ్మలకు కాకుండా తన వర్గానికి చెందిన స్వర్ణకుమారికి టిక్కెట్టు ఇప్పించుకున్నారు నామా. ఫలితంగా పాలేరులో టీడీపీ ఓటమిపాలైంది.

బరిలో సండ్ర ? 
స్థానిక బలంతోపాటు, ఈ నియోజక వర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్యను బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది. మరోవైపు ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధిగా నామ నాగేశ్వరరావు పేరు చర్చనీయాంశమైంది. క్యాడర్‌ను కాపాడుకొని పరువు నిలబెట్టుకోవాలంటే నామ పోటీకి దిగాల్సిందేనని పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల బరిలోకి దిగకుండా ఉండటమే మంచిదని పార్టీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, విషయం అర్థమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

వామపక్షాలు..
ఇదిలా ఉంటే ఉపఎన్నికలో అధికార పార్టీని ఓడించేందుకు వామపక్షాలు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికలో తుమ్మల వల్ల జరిగిన పరాభావాన్ని ఈసారి తీర్చుకునేందుకు టీడీపీ తన వ్యూహానికి పదును పెడుతోంది. దీంట్లో భాగంగానే..వామపక్షాలు కలిసి పోటీచేస్తే ప్రయోజనం ఉంటుందని టిడిపి భావిస్తోంది. సీపీఎం, సీపీఐ కలిసి పోటీచేస్తే కొంత సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్‌సీపీ పోటీ చేసినా, చెయ్యకపోయినా అధికార టీఆర్‌ఎస్‌ కే లాభమని మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వడం అంత సులువు కాదనే వాదన వినిపిస్తోన్న తరుణంలో, పార్టీలోని భిన్నాభిప్రాయాలతో సతమతమవుతున్న టీడీపీ ఏం చేస్తుందో చూడాలి మరి. 

06:27 - April 22, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ ఆస్తుల మొదటి విడత విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక అకౌంట్లలో జమచేసింది. వచ్చే నెలలో రెండో దఫాగా మరిన్ని ఆస్తులు విక్రయించనున్నారు. మరోవైపు సీఆర్‌డీఏ పరిధిలోని అస్తులను అమ్మేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఉన్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్షయ గోల్డ్‌ కేసులో నిందితులు పరారీలో ఉన్నట్టు సీఐడీ నివేదిక సమర్పించడంతో.. మోస్ట్‌ వాంటెడ్‌గా ప్రకటించి, ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ బాధితుల పిటిషన్ పై ఉమ్మడి హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీతాపతి నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. మొదటి విడతగా ఈనెల 20న ఈ వేలం ద్వారా ఆస్తులు విక్రయించింది. ఇందులో 60 శాతం ఆస్తులు అమ్ముడు పోయాయి. వీటి మొత్తాన్ని హైకోర్టు అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. వచ్చే నెల 11,12 తేదీల్లో రెండో విడతగా 150 కోట్ల విలువ చేసే అస్తులను ఈ- వేలం ద్వారా విక్రయించనున్నారు. దాని కోసం ప్రకటన కూడా విడుదల చేశారు. మూడో విడతగా 180 కోట్ల ఆస్తులను విక్రయించేందుకు జాబితా సిద్ధం చేశారు. అయితే విలువైన భూమికి సీఆర్‌డీఏ అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఏపీ ప్రభుత్వంపై డివిజన్‌ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు నెలల కిత్రం ప్రత్యేక తీర్పు ప్రకటిస్తే.. ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు అధికారులు కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఎందుకు అరెస్టు చేయలేదు ?
మరోవైపు అక్షయ గోల్డ్ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఐడీని ప్రశ్నించింది ధర్మాసనం. నిందితులు దొరకడం లేదని కోర్టుకు తెలపడంతో.. మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించి నిందితుల ఆస్తులను జప్తు చేయాలని సీఐడీకి అదేశాలు జారీ చేసింది ధర్మాసనం. నిందితులపై తీసుకునే చర్యల విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం అదేశించింది. రెండు కేసుల్లో 10 వేల కోట్ల మోసాలు, 45 లక్షల మంది బాధితులు ఉండటంతో.. కేసు విచారణ పై ఆసక్తి నెలకొంది. రెండు కేసులను మంగళవారం మధ్యాహ్ననికి వాయిదా వేసింది ధర్మాసనం.  

06:23 - April 22, 2016

అనంతపురం : జిల్లాను కరువు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమస్యలనే అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తామని చెప్పారు. జిల్లాలో భూగర్భ జల వనరులను పెంచే బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండలో ఎలక్ట్రానిక్‌ హబ్‌తో పాటు లేపాక్షి బయోటెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశారు. కొడికొండలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. అనంతపురం జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చే బాధ్యత తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉన్నందున జిల్లా అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతపురం జిల్లాలో భూగర్భ జలవనరులు పెంచే బాధ్యత తనదేనని సీఎం స్పష్టంచేశారు.
జిల్లా పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. నసనకోటలో పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కదిరి మండలంలో హంద్రీనీవా రిజర్వాయర్‌ పనులను సీఎం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జూన్‌లోగా మొత్తం పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

నేటి నుండి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువైద్య కళాశాలల్లోని పీజీ (డిగ్రీ / డిప్లొమా) సీట్ల ప్రవేశానికి సంబంధించి..విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించే వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. 

గుజరాత్ లయన్స్ పై సన్ రైజర్స్ గెలుపు...

రాజ్ కోట్ : హ్యాట్రిక్ విజయాలతో ఐపీఎల్ లో దూసుకపోతున్న గుజరాత్ లయన్స్ జోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రేకులు వేసింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న వార్న్ సేన..రైనా సారథ్యంలోని లయన్స్ జట్టును చిత్తు చేసి లీగ్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
స్కోరు బోర్డు : గుజరాత్ లయన్స్ : 135/8.
                    సన్ రైజర్స్ హైదరాబాద్ : 14.5 ఓవర్లలో 137/0. 

నేటి నుండి కేరళలో నామినేషన్లు..

తిరువంతనపురం : కేరళ శాసనసభ ఎన్నికలు మే 16న జరగనున్నాయి. శుక్రవారం నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, బీజేపీ మిత్రపక్షాలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న నామినేషన్ల ఘట్టం ఈనెల 29తో ముగియనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మే 2 చివరి తేదీ అని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

నేడు పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్..

ఖమ్మం : జిల్లా పాలేరు ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నుండి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. మే 2 నామినేషన్ల ఉపసంహరణ, మే 16న పోలింగ్, 19న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు

 

నేడు చంద్రుడు చిన్నగా..

ఢిల్లీ : ఎప్పుడూ కనిపించే సైజు కంటే చంద్రుడు 14 శాతం నేడు చిన్నగా కనిపిస్తాడని కోల్ కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ పేర్కొన్నారు. 

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫలితలను శుక్రవారం ఉదయం 11గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో విడుదల చేయనున్నారు. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Don't Miss