Activities calendar

23 April 2016

22:49 - April 23, 2016

ఢిల్లీ : గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఏకమయ్యాయి. పారిస్‌లో కుదిరిన చరిత్రాత్మక ఒప్పందంపై భారత్‌తో పాటు 175 దేశాలు సంతకాలు చేశాయి. ఇది చరిత్రలో మరపురాని క్షణమని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ అన్నారు. పారిస్‌లో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు. యుఎన్‌వో వేదికగా ఇజ్రాయిల్‌ దురాక్రమణను పాలస్తీనా ప్రపంచ దేశాల దృష్టికి తెచ్చింది.
ఉద్గారాలను తగ్గిస్తున్న 15 చిన్న దేశాలు 
గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల తగ్గింపు దిశగా కీలక ముందడుగు పడింది. శుక్రవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ సాధారణ సభలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి గత ఏడాది డిసెంబర్‌లో పారిస్‌లో కుదిరిన చారిత్రత్మాక ఒప్పందంపై 175 దేశాలు సంతకాలు చేశాయి. భారత్‌ తరపున పర్యావరణ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ అన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఒప్పందంపై సంతకాలు చేశారని కొనియాడారు.
ఒకేరోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి
ఏదైనా అంతర్జాతీయ ఒప్పందానికి సంబంధించి ఒకేరోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు సముద్రజలాలకు సంబంధించిన చట్టంపై 1982లో 119 దేశాలు సంతకాలు చేశాయి.  సంతకాలు పూర్తయిన నేపథ్యంలో... కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు అన్ని దేశాలు జాతీయ ప్రణాళికలను అమలుచేయనున్నాయి. ఈ ఒప్పందంతో గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాల స్థాయిని 55 శాతం వరకూ తగ్గించే బాధ్యత కనీసం 55 దేశాలపై ఉండనుంది. చిన్న చిన్న ద్వీపాలుగా ఉన్న దాదాపు 15 దేశాలు ఇప్పటికే గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గిస్తున్నాయి. ఉద్గారాల విడుదలలో అమెరికా, చైనాలు ముందు వరుసలో ఉన్నాయి. గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించేందుకు అమెరికా, చైనాలు తమకు తాముగా ఆమోద ప్రక్రియపై సంతకం చేయడం గమనార్హం. పునరుద్ధరించడానికి వీలయ్యే ఇంధన ఉత్పత్తి కార్యక్రమాలను అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలను ప్రోత్సహించాలే తప్ప... వాటికి మోకాలడ్డకూడదని భారత్‌ సూచించింది. సౌర విద్యుత్తు సంస్థలతో తాము కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రపంచ వాణిజ్యసంస్థ ఇటీవల వ్యతిరేకించడాన్ని దురదృష్టకరంగా వ్యాఖ్యానించింది.
ఒప్పందంపై పాలస్తీనా, ఇజ్రాయిల్‌ కూడా సంతకం  
గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించే ఒప్పందంపై పాలస్తీనా, ఇజ్రాయిల్‌ కూడా సంతకం చేశాయి. అయితే ఇజ్రాయిల్‌ తమ భూభాగాన్ని ఆక్రమించడం ద్వారా పాలస్తీనాలో పర్యావరణానికి ముప్పు వాటిల్లిందని ఆ దేశ అధ్యక్షుడు మహమౌద్‌ అబ్బాస్‌ అన్నారు. యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో 60 దేశాల నేతలు పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయిల్‌ తీరుపై తీవ్రంగా మండిపడ్డాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్- ముందు పాలస్తీనా ఉగ్రవాదాన్ని ఆపాలన్నారు. అంతర్జాతీయ వేదికపై అబ్బాస్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

22:38 - April 23, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌కు డబ్బు తప్ప మరేమీ కనిపించడంలేదని... ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆయన నియంతృత్వ వైఖరి భరించలేకనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు.. జగన్‌కు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. జగన్‌ ఒక పార్ట్ టైం పొలిటీషియన్‌ అని ఎద్దేవా చేశారు. 

 

22:34 - April 23, 2016

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే  హైదరాబాద్ పోలిసుల కొత్త పనిష్ మెంట్ , కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం జూ.ఎన్ టిఆర్ రూ.10.5 లక్షల వేలం, డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులో కొత్త శిక్ష, బహిరంగ మూత్ర విసర్జన నివారణకు కాన్పూర్ పోలీసుల వినూత్న ప్రయోగం, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇంట్లో మరుగుదొడ్డి తప్పనిసరి... వంటి పలు క్రేజీన్యూస్ లను వీడియోలో చూద్దాం..

21:59 - April 23, 2016

హైదరాబాద్ : నగరానికి మణిహారంలా దుర్గం చెరువు ఫ్లైఓవర్ నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్భిట్‌మాల్ వరకు 184 కోట్ల వ్యయంతో టూవే బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు. అధికారులతో చెరువును సందర్శించారు. చెరువు చుట్టు వాకింగ్ ట్రాక్, బైస్కింగ్ ట్రాక్‌లతో అండీ థియేటర్‌ను సైతం ఏర్పాటు  చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

 

21:51 - April 23, 2016

రచ్చబండ చర్చా కార్యక్రమంలో చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. గన్ మెన్ ఎండి ఉస్మాన్ మాట్లాడారు. ఆనాటి పలు అసక్తికర విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటట్లోనే....
'నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు నిజాం నవాబ్ దగ్గర గన్ మెన్ గా పని చేశాను. నాకు 32రెండు రూపాయల ఆటాన.. జీతం ఉండేది. నిజాం కాలంలో వెండి పైసలు ఉండేది. కింగ్ కోఠీలో రాజు ఉండేవాడు..
టెలీఫోన్ వాడే వాడు. ప్రజలను బాగా చూసిండు. రజాకారు అంటే వాలంటీరు. నిజాం లేచిన తర్వాత ముందు నమాజ్...చేసేవాడు. అనంతరం నీళ్లు తాగేవాడు. తర్వాత బాదం, కాజు, మిస్త్రీ కలిపిన గ్లాసు పాలు తాగేవారు. గంట తర్వాత సాదా అన్నం తింటుండే వారు. వారంలో ఒకసారి.. బిర్యాని తినేవారు. అప్పుడు సిటీలో మొత్తం కార్లు నిజాం నావాబువే. జర్మనీ, జపాన్, అమెరికా దేశాల నుంచి కార్లను తెప్పించాడు. నిజాం సర్కారుకు 52 మంది భార్యలు ఉండేవారు. ఒక భార్య దగ్గర ఇద్దరు పోలీసులు ఉండేవారు. నాలుగు చెరువులు, చార్మినార్, ఉస్మానియా, నిమ్స్ దవఖానాలను కట్టించాడు. కింగ్ కోఠిలోని తల్లి సమాధి వద్ద ఆయన సమాధి కట్టాలని చెప్పాడు. 22 ఫిబ్రవరి 1966 లో నిజాం నావాబు చనిపోయిండు. ఇప్పుడు తిండి మంచిగా లేదు. సిగరెట్, తాగుడు, ఆడోళ్ల సోకు ఎక్కువైంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

21:17 - April 23, 2016

హైదరాబాద్ : 104  సేవలు కార్పొరేట్ సంస్థకు అప్పజెప్పే విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. వివాదాస్పద సంస్థకు టెండరు ఖరారు చేయడంపై ఉన్నతాధికారుల స్వప్రయోజనాలు దాగి ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయం హైకోర్టుకు చేరడం.. ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వడంతో ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది.
వివాదాస్పద కంపెనీకి 104  సేవల టెండర్లు 
ఏపీ సర్కార్ అర్భాటంగా ప్రారంభించిన చంద్రన్న సంచార 104  సేవల టెండర్లను వివాదాస్పద కంపెనీకి అప్పజెప్పింది. 104 సేవల నిర్వహణ బాధ్యతలు పిరామల్ స్వస్థ మేనేజ్ మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీకి టెండర్లు ఖరారు చేయడంపై ఇప్పుడు  సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్దల స్వప్రయోజనాలున్నాయన్న విమర్శలు
275 వాహనాల మెయింటెనెన్స్.. వీటిలో పనిచేస్తున్న 1670 మంది ఉద్యోగుల బాధ్యత పిరామిల్ సంస్థ చేతికి వెళ్లనున్నాయి. ఈ నిర్ణయం వెనక ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పెద్దల స్వప్రయోజనాలు దాగి ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే సంస్థ హెచ్ఎంఆర్ పేరుతో 104 వాహనాలు నడిపింది. వాహనాల నిర్వహణలో కోట్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కంపెనీ సిబ్బంది సైతం 111 రోజులు సమ్మె కూడా చేశారు. 2010లో సంస్థను రోశయ్య ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. తాజాగా ఇదే సంస్థకు టెండర్లు ఖరారు చేయడం జరిగింది.
టెండర్ల ప్రక్రియలో సంస్థ తీరుపై ఆరోపణలు
ఒకసారి వివాదంలో చిక్కుకుని బ్లాక్ లిస్టులో ఉంచబడిన సంస్థకు టెండర్లు ఖరారు చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై టెండర్ల ప్రక్రియలో అగ్రస్థానంలో ఉన్న మరో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హెచ్ఎంఆర్ సంస్థ తన పేరును మార్చుకుని పిరామిల్ సంస్థగా మారిందని.. తాను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిన విషయాన్ని దాచిపెట్టిందని  కోర్టుకు తెలపింది  సంస్థ. దీంతో  వైద్యఆరోగ్య శాఖ తీరును తప్పుబడుతూ 104 సేవల అప్పగింతపై స్టే విధించింది కోర్టు. 
ప్రభుత్వ ఖర్చుతో వాహనాల మరమ్మతులు 
104 వాహనాలను చంద్రన్న సంచార వైద్యసేవల పేరుతో హడావుడిగా ప్రారంభించిన ఏపీ సర్కార్..వాహనాల మరమ్మతులు ప్రభుత్వ ఖర్చుతో చేయించి మరీ ప్రైవేట్ సంస్థకు అప్పగించడం వెనక అంతరార్ధం ఏంటో బాబుకే తెలియాలి. దీనిపై కోర్టు స్టే ఇవ్వడంతో జూన్ వరకు ఈ చంద్రన్న సంచార వైద్య సేవల పథకం ఆగిపోనుంది.

21:06 - April 23, 2016

హైదరాబాద్ : వైసీపీ మునిగిపోయే నావని.. భవిష్యత్తులో జగన్ తప్ప ఆ పార్టీలో ఇంకెవరు ఉండరని  మంత్రి రావెల కిషోర్ బాబు ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణలో ప్రాంతీయ వాదం ఎక్కువగా ఉండడం వల్లే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో అభివృద్ధి వాదం ఎక్కువ కాబట్టే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సమస్యలపై మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

ఉత్తరప్రదేశ్ లో స్కూల్ ప్రిన్సిపల్ దారుణ హత్య....

ఉత్తరప్రదేశ్‌ : భాగ్‌పట్‌ నగరంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ను దారుణంగా హత్య చేశారు. శనివారం ముగ్గురు గుర్తుతెలియని దుండగులు సత్య ప్రకాశ్‌ శర్మ(47) అనే ప్రైమరీ స్కూల్‌ ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోతుండగా గ్రామస్థులకు ఒక నిందితుడు వారికి దొరగ్గా మిగతా ఇద్దరు తప్పించుకున్నారు. గ్రామస్థులకు దొరికిన వ్యక్తిని అందరూ కలిసి చితకబాదడంతో అతన్ని  పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అతడు మృతిచెందాడని ఎస్పీ రవిశంకర్‌ చావి తెలిపారు. దీనికి కుటుంబకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో కేసునమోదు చేశారు.

20:51 - April 23, 2016

హైదరాబాద్ : హఠాత్తుగా తమ అభిమాన నటులు కళ్ల ముందు ప్రత్యక్షం అయితే చూసేవాళ్లకు పండుగే. జూనియర్ ఎన్టీఆర్, అఖిల్...  ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యక్షమై అందరినీ అశ్యర్యపరిచారు. తన బీఎండబ్ల్యూ కారుకు ఫ్యాన్సీ నెంబర్‌ TS 09 EL 9999 అనే దాని కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ రికార్డ్‌ స్థాయిలో 10 లక్షల 50 వేల రూపాయలు చెల్లించగా, అఖిల్ తన బెంజ్‌ కారు కోసం 41,500 రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్‌ TS 09 EL 9669 ను సొంతం చేసుకున్నాడు. 

20:46 - April 23, 2016

హైదరాబాద్ : కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షకు తెలంగాణ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 24న జరగబోయే పరీక్ష నిర్వహణకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు.. గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని...నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు.. 
రేపు మధ్యాహ్నం 2.30గంటలకు పరీక్ష
తెలంగాణ పోలీసు విభాగంలో కానిస్టేబుళ్ల నియామకానికి ఆదివారం ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. మాస్‌ కాపీయింగ్ లాంటివి జగరకుండా అత్యంత పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో పరీక్షలు నిర్వహించబోతున్నారు.. గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు.. ఆ సమయంలోనే హాల్‌ టికెట్‌ పరిశీలన, అభ్యర్థి వేలిముద్రల సేకరణ, ఫొటోలు తీసుకోవడం పూర్తిచేస్తారు.. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షాకేంద్రాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించారు.. యాండ్రాయిడ్ మొబైల్‌ లేకపోతే హాల్‌ టికెట్‌ నెంబర్‌గానీ, దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ నెంబరును గానీ 9222 273310 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేసి సెంటర్‌ కనుక్కోవచ్చని అధికారులు తెలిపారు.. పరీక్షా కేంద్రానికి ఒకరోజు ముందేవెళ్లి సెంటర్‌ను చూసుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు..
యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రాల వివరాలు
యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రాలతోపాటు సమీపంలోని రెస్టారెంట్లు, లాడ్జీలు, ఏటీఎంల వివరాలు తెలిసేలా పోలీసులు చర్యలు చేపట్టారు.. ఈ పరీక్షకు పోలీసుల సేవల్నికూడా ఉపయోగించుకుంటున్నారు.. సెంటర్‌కు దారి చూపించేందుకు బస్టాండ్లు, కూడళ్ల దగ్గర పోలీసులకు డ్యూటీలు వేశారు.. గతంలో ఎన్నడూలేని విధంగా పోటీ భారీగా ఉండడంతో పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు..
9,281 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష 
9వేల 281 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఈ రాత పరీక్ష జరగబోతోంది.. ఈ పోస్టులకు దాదాపు 5 లక్షల 30వేలమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 11వందల 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని జీపీఎస్‌తో అనుసంధానం చేశారు. నిమిషం ఆలస్యం నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా పరీక్షా కేంద్రాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

 

20:41 - April 23, 2016

కృష్ణా : విజయవాడలో వైసీపీ మహా ప్రదర్శన నిర్వహించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతూ గాంధీ నగర్‌నుంచి అలంకార్‌ సెంటర్‌వరకూ నేతలు ర్యాలీ చేపట్టారు.. ఈ నిరసనలో వైసీపీ నేతలు కొడాలి నాని, కల్పన. పార్థసారధి, రమేశ్, గౌతం రెడ్డి పాల్గొన్నారు.

 

20:38 - April 23, 2016

పశ్చిమగోదావరి : అంతకు ముందు చంద్రబాబు పోలవరంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనుకున్నట్లుగానే పోలవరం పనులు ముందుకుసాగుతున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని.. పోలవరం రెండు కాల్వల పనులు వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని సీఎం తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంఖస్థాపన చేశారు. పెదవేగి మండలం మొందూరులో 500 కిలోమీటర్ల సీసీరోడ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంగా పైలాన్‌ను, సిమెంట్‌ రోడ్లను ప్రారంభించారు. మొందూరు వద్ద గుండేరుపై నిర్మిస్తున్న ఆక్విడెక్ట్‌ పనులను సీఎం పరిశీలించారు.

 

19:55 - April 23, 2016

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం కరవును గ్రహించడంలో విఫలమైందని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. కరీంగనర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు సంఘం ఆరో మహాసభ సెమినార్‌కు ఆయన ముఖ్యతిధిగా హజరై, మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసి తక్షణ రుణాలు మంజూరు చేయాలని కోరారు. 

 

19:50 - April 23, 2016

కరీంనగర్‌ : పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ కరీంనగర్‌ జిల్లా ప్రైవేటు డాక్టర్ల బృందం ఆందోళనకు దిగింది. జిల్లాలో పలు ప్రైవేటు ఆస్పత్రును మూసివేసి నిరసన తెలిపింది.. డాక్టర్ల అరెస్టులు సరికాదంటూ సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.. ఈ డాక్టర్ల బృందం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమైంది. జగిత్యాలలో అవసరంలేకున్నా ఫీజులు, కమిషన్లకోసం అపెండిక్స్ ఆపరేషన్లు చేశారని ఆరోపణలొచ్చాయి.. ఈ అంశంపై తెలంగాణ అధికారులు బహిరంగ విచారణ చేశారు.. ఇందులో ఆపరేషన్లు చేసింది వాస్తవమేనని తేలడంతో..... పోలీసులు ఇద్దరని అరెస్ట్ చేయటంతో పాటు... రెండు నర్సింగ్ హోంల రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. 

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

హైదరాబాద్ : ఐపిఎల్ 9 లో భాగంగా పంజాబ్, హైదరాబాద్ ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

ముంబైపై ఢిల్లీ డేర్ డెవిల్ గెలుపు

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్, ముంబై ల మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్ విజయం సాధించింది. పది పరుగుల తేడాతో ఢిల్లీ ..ముంబై గెలుపొందింది. 

19:38 - April 23, 2016

ఎక్కడ చూసిన ఎక్కడ చూసిన పతంగ్ పోతుందిరా..? అంటూ.. సంకాంత్రి పండుగకు రాప్ జోడించి అదరగొట్టిన గ్యాంగ్ వాళ్లది.. పక్కా హైద్రాబాద్ పదాలతో..  గల్లీ గల్లీలో లొల్లి వాళ్లది..  రోల్ రైడా మరియు కామ్రాన్ మరో రాప్ సాంగ్ తో సోషల్ మీడియాను క్యాప్చర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.. దిల్ ఖుష్ అంటూ రాప్ ఫ్యాన్స్ దిల్ దోచేస్తున్న రోల్ రైడా మరియు కామ్రాన్ ఇప్పుడు మనతో ఉన్నారు.. వాళ్లతో టెన్ టివి రాప్ చిట్ చాట్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:25 - April 23, 2016

గుంటూరు : సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరు బాధాకరమని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు సలహాలను రోజా పాటిస్తే మంచిదని సూచించారు. సుప్రీం తీర్పును తనకిష్టమైన రీతిలో రోజా అన్వయించుకోవడం సరికాదని డొక్కా హితవు పలికారు. సేవ్‌ డెమొక్రసీ పేరుతో వైసీపీ ర్యాలీలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం స్పీకర్‌దేనని ఆయన స్పష్టం చేశారు.

 

19:06 - April 23, 2016

హైదరాబాద్ : పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినతిప్రతం అందించారు. పార్టీ మారిన జ్యోతుల నెహ్రూ, వరపుల సుబ్బారావు, సునీల్ లపై ఫిర్యాదు చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ పిరాయింపుల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబే స్వయంగా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్దంగా పార్టీ పిరాయింపులను పాల్పడుతున్నారని చెప్పారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. ఇదిలావుంటే జగన్, ఎమ్మెల్యేలు ఢిల్లీ పయనం అవుతున్నారు. పార్టీ పిరాయింపుల వ్యవహారంలో రాష్ట్రపతి, ప్రధాని, ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. పార్టీ పిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. 

 

18:59 - April 23, 2016

రంగారెడ్డి : గగన్ పహాడ్ పారిశ్రామికవాడలోని యాసిడ్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిపిడుతున్నాయి. మంటలు హైటెన్షన్ వైర్లకు అంటుకునే అవకాశముండడంతో ముందస్తుగా అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు.

ఐదు వందల కి.మీ సిమెంట్ రోడ్డు వేశాం : సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి : ఐదు వందల కిలీమీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 43 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. ఎస్ సీ, ఎస్టీ, బీసీలకు సబ్ ప్లాన్ వేశామని పేర్కొన్నారు. మొట్ట మొదటగా కాపులకు బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని.. కాపు కార్పొరేషన్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత టీడీపీదే అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఇస్తామన్న యూపిఎ పట్టింకుకోలేదని విమర్శించారు. రాజధాని లేకుండా ఇబ్బంది పుడుతున్నామని చెప్పారు. తాను సమస్యలను సవాల్ గా తీసుకుంటానని పేర్కొన్నారు. సమస్యలను సవాల్ గా తీసుకుని ఇంట్లో పడుకుంటే పరిష్కారం కావన్నారు.

వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి : సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి : భూగర్భ జలాలను పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలన్నారు. అందరికీ నీరు ప్రాణాధారమని చెప్పారు. జిల్లాలో చాలా వరకు గొలుసుకట్టు చెరువులున్నాయన్నారు. చెరువులను కాపాడుకోవాలని.. భవిష్యత్ లో నీటి కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. చెరువులను అనుసంధానం చేసి కబ్జా కాకుండా చూస్తే.. మంచి ఫలితాలు వస్తాయన్నారు.

18:53 - April 23, 2016

పశ్చిమగోదావరి : భూగర్భ జలాలను పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలన్నారు. అందరికీ నీరు ప్రాణాధారమని చెప్పారు. జిల్లాలో చాలా వరకు గొలుసుకట్టు చెరువులున్నాయన్నారు. చెరువులను కాపాడుకోవాలని.. భవిష్యత్ లో నీటి కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. చెరువులను అనుసంధానం చేసి కబ్జా కాకుండా చూస్తే.. మంచి ఫలితాలు వస్తాయన్నారు. వర్షాభావంతో ఉన్న మెట్ట పంటలకు రెయిన్ గన్ కాన్ సెప్టు ఉపయోగించి నీటిని అందిస్తున్నామని తెలిపారు.
గోదావరి నీటిని కృష్ణా, పెన్నాకు తరలిస్తాం..
గోదావరి నీటిని కృష్ణా, పెన్నాకు తరలిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఐదు వందల కిలీమీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేశామని పేర్కొన్నారు. 43 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. ఎస్ సీ, ఎస్టీ, బీసీలకు సబ్ ప్లాన్ వేశామని పేర్కొన్నారు. మొట్ట మొదటగా కాపులకు బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని.. కాపు కార్పొరేషన్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత టీడీపీదే అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఇస్తామన్న యూపిఎ పట్టింకుకోలేదని విమర్శించారు. రాజధాని లేకుండా ఇబ్బంది పుడుతున్నామని చెప్పారు. తాను సమస్యలను సవాల్ గా తీసుకుంటానని పేర్కొన్నారు. సమస్యలను సవాల్ గా తీసుకుని ఇంట్లో పడుకుంటే పరిష్కారం కావన్నారు. వాటి పరిష్కారం కోసం కష్టపడి చేయాలన్నారు. అందుకోసమే ఎండను లేక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం జిల్లాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు. ప్రజలను చైతన్యం చేస్తున్నానని తెలిపారు. 

 

స్పీకర్ కోడెలకు వినతిప్రతం అందించిన చెవిరెడ్డి

హైదరాబాద్ : పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చెవిరెడ్డి పార్టీ నేత భాస్కర్ రెడ్డి వినతిప్రతం అందించారు. పార్టీ మారిన జ్యోతుల నెహ్రూ, వరపుల సుబ్బారావు, సునీల్ లపై ఫిర్యాదు చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ పిరాయింపుల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం...

రంగారెడ్డి : గగన్ పహాడ్ పారిశ్రామికవాడలోని యాసిడ్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిపిడుతున్నాయి. మంటలు హైటెన్షన్ వైర్లకు అంటుకునే అవకాశముండడంతో ముందస్తుగా అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు.

 

గోదావరి నీటిని కృష్ణా, పెన్నాకు తరలిస్తాం : సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి : గోదావరి నీటిని కృష్ణా, పెన్నాకు తరలిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన  సభలో సీఎం మాట్లాడారు. రెండు నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఐదు వందల కిలీమీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేశామని పేర్కొన్నారు. 43 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. 

 

17:52 - April 23, 2016

వరంగల్ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మిషన్ కాకతీయ కాంట్రాక్టరుపై దాడి చేశారు. జాఫర్ గడ్ మండలం తుమ్మడపల్లిలోని అతనిపై దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. టెండర్ నుంచి వైదొలగాలని కార్యకర్తలు బెదిరించారు. జాఫర్ గడ్ మండలం తుమ్మడపల్లిలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువు మరమ్మతు పనుల కోసం సాయిలు అనే కాంట్రాక్టర్ ఆన్ లైన్ టెండర్ దాఖలు చేశారు. అయితే టెండర్ వేయడానికి కంటే ముందే డీడీ తీసుకోవాలి. డీడీ తీసుకుంటేనే టెండర్ కు ఎలిజబులిటీ ఉంటుంది. టెండర్ వేసేందుకు సాయిలు డీడీ తీసుకున్నాడు. ఈనేపథ్యంలో జాఫర్ గడ్ ప్రాంతానికి చెందిన టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు తుమ్మడపల్లిలోని సాయిలు ఇంటిపై దాడి చేశారు. టెండర్ డీడీ ఇవ్వాలని సాయిలుపై దాడి చేశారు. టెండర్ వేయొద్దని... విరమించుకుంటున్నట్లు లెటర్ ఇవ్వాలని  దాడి చేసినట్లు తెలుస్తోంది. టెండర్ నుంచి వైదొలగాలని టీఆర్ ఎస్ కార్యకర్తలు, నేతలు సాయిలును బెదిరించినట్లు సమాచారం. అడ్డుగా వచ్చిన అతని కుమారునిపై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే తాము దాడి చేయడానికి అతని ఇంటికి వెళ్లలేదు.. మాట్లాడేందుకు వెళ్లామని టీఆర్ ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. డీడీని, టెండర్ లేటర్ వెనక్కి ఇవ్వాలని అడగడంతో వారే గందరగోళం సృష్టిస్తున్నారని నేతలు చెబుతున్నారు. సుబేదార్ పోలీసులకు సమాచారం అందగా వారు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గీయులను పీఎస్ కు తీసుకెళ్లారు. 

 

5గురు దొంగలు అరెస్ట్ ....

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో ఐదుగురు దొంగలను నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కార్లు, 7 తులాల బంగారం, 37 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యూపీఎస్సీ నోటిఫికేషన్-2016 విడుదల వాయిదా....

ఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్-2016 విడుదల వాయిదా పడింది. శనివారం వెలువడాల్సిన సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ తన వెబ్‌సైట్ లో  పేర్కొంది. నోటిఫికేషన్ విడుదల వాయిదాకు గల కారణాలు యూపీఎస్సీ వెల్లడించలేదు. ఖచ్చితమైన తేదీని ప్రకటించకుండా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది.

గగన్‌పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం....

హైదరాబాద్ : గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్రమంగా యాసిడ్ నిల్వ ఉంచిన కంపెనీలో అగ్నిప్రమాదం ఏర్పడటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది.

కేజ్రీ సర్కార్ మరో విన్నూత్న యత్నం...

ఢిల్లీ :  కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీవాసుల కష్టాలు తీరే అవకాశాలు కనబడుతున్నాయి. బస్టాప్ లో, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆఫీసులకు, గమ్యస్థానాలకు  కాలి నడక ద్వారా చేరుకోవటం ప్రయాస, సమయాభావంతో కూడుకున్నదనే విషయం తెలిసిందే. దీంతో ఓపక్క టైమ్ టెన్షన్, మరోపక్క ఆయా సీజన్స్ లో వాతావరణ కారణాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో పర్యాటకులు, ప్రయాణీకులకు సౌకర్యార్థం త్వరలో కేజ్రీ ప్రభుత్వం బైక్ టాక్సీ, రెంట్ ఎ బైక్ పథకాలను ప్రవేశ పెట్టనుంది. ఈ విన్నూత్న ఆలోచనతో వినియోగదారులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

ఆర్టీఏ కార్యాలయంలో సినీ తారల సందడి...

హైదరాబాదు : ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయంలో సినీ తారలు సందడి చేశారు. సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ ఇద్దరూ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొన్న కార్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం వారిద్దరూ ఆర్టీఏ కార్యాలయానికి రావడం విశేషం. ఈ మధ్యే ఎన్టీఆర్ కొన్న బీఎండబ్ల్యూ కారు కోసం టీఎస్ 09 ఈఎల్ 9999 నెంబర్ ను వేలంలో 10.5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అఖిల్ కూడా కొత్త కారు రిజిస్ట్రేషన్ కు వచ్చాడు. దీంతో వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

భారత్ గుడ్ విల్ అంబాసిడర్ గా సల్మాన్ ....

ఢిల్లీ : ఈ ఏడాది బ్రెజిల్ లో జరగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత క్రీడాకారునుద్దేశించి ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు సాధించటానికి కృషి చేయాలన్నారు. భారత్ కు మరింత పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. భారత్ అంబాసిడర్ గా సల్మాన్ ను నియమాకంపై బాక్సర్ మేరీ కోమ్ హర్షం వ్యక్తం చేశారు. 

ఏసీబీ వలలో ఇంజనీర్....

విశాఖపట్నం : ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి లంచం తీసుకుంటూ ఓ ఇంజనీర్ ఏసీబీకి చిక్కాడు. విశాఖపట్నం జిల్లా వి.మాడుగుల మండల ఇంజనీర్‌గా పని చేస్తున్న సీహెచ్.అంబేడ్కర్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.44 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు అదనపు సమాచారం కోసం విచారణ చేపట్టారు.

16:56 - April 23, 2016

ఢిల్లీ : భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉన్న కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా మరోవైపు విదేశాల్లో ఆస్తులను బాగానే కూడబెడుతున్నాడు. గత నెల అమెరికాలోని మాన్‌ హట్టన్‌లో ప్రసిద్ధ ట్రంప్‌ ప్లాజాలో 10 మిలియన్ల డాలర్లతో ఓ ఫ్లాట్‌ను బేరం చేశాడు.  2010లో కూతురు తాన్యా పేరిట ప్లాజాలో మాల్యా పెంట్‌ హౌజ్‌తో పాటు మూడు ఫ్లాట్లు  తీసుకున్నాడు. న్యూయార్క్‌ ఆర్థిక విభాగం దస్తావేజుల ప్రకారం మాల్యా ఆ సమయంలో 21 కోట్లు పెట్టి వీటిని ఖరీదు చేశాడు. పెంట్‌ హౌజ్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్‌ ప్లాజా నుంచి మాల్యాకు గత ఏడాది నోటీసు జారీ అయింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాల్యా డబ్బు చెల్లించలేక పెంట్‌ హౌజ్‌ సరెండ్‌ చేసే అవకాశం ఉందని న్యూయార్క్‌లోని రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్ 'ద రియల్‌ డీల్‌ డాట్‌ కామ్‌' తెలిపింది. కింగ్‌ ఫిషర్‌ పేరిట బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్న మాల్యా వాటిని విదేశాలకు తరలిస్తున్నాడన్న ఆరోపణలతో ఈడీ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

 

ఢిల్లీలో అగ్నిప్రమాదం...

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో  ఖాన్ మార్కెట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 11.40 గంటలకు సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని  మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ నుంచి మొదట మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు.

16:53 - April 23, 2016

ఢిల్లీ : దేశంలో నెలకొన్న కరవు మన జలాశయాలను దారుణంగా దెబ్బతీసింది. కరాళనృత్యం చేస్తున్న కరవుతో  మన దేశంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఎండిపోయాయి.  ఒకటికాదు... రెండుకాదు.. దేశవ్యాప్తంగా  91  జలాశయాల్లో నీరు అడుగంటిపోయిందని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.  
దేశంలో కరవు విలయతాండవం
దేశంలో కరవు విలయతాండవం చేస్తోంది. వర్షాభావంతో ఏ నదిలో కూడా నీరు చేరలేదు. ఎల్లప్పుడూ నీరు ప్రవహించే జీవనదులు సైతం ఈసారి ఎండిపోయాయి. దీంతో అందరికీ కష్టకాలం వచ్చిందని స్వయాన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాలను పరిశీలిస్తే ఎవరరైనా నివ్వెర పోక తప్పదు.  గతేడాది ఇదే  కాలంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లోనే నీటి నిల్వలు కొద్దిగా మెరుగైన స్థితిలో ఉన్నాయని కేంద్రం  విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 
హరించుకుపోతున్న నీటి నిల్వలు 
దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు రోజు రోజుకు హరించుకు పోతున్నాయి. మన దేశంలో 91 ప్రధాన జలాశాలున్నాయి. ఈ రిజర్వాయర్ల నీటి నిల్వ  సామర్ధ్యం 157.799 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. కానీ ఈనెల 13 నాటికి 35.839 బీసీఎం నీరు  నిల్వ ఉండేది. మొత్తం నిల్వ సామర్ధ్యంలో ఇది కేలం 23 శాతం మాత్రమే. ఆ తర్వాత ఈ జలాశయాల్లోని నీటి నిల్వలు మరింత తగ్గిపోయాయి. ఈనెల 21 నాటికి 34.082 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు పడిపోయింది. మొత్తం సామర్ధ్యంలో ఇది 21 శాతం మాత్రమే.  గత పదేళ్లలో ఇంతటి దారుణ పరిస్థితులు ఎదురుకాలేదని కేంద్ర జలవనరులు మంత్రిత్వ శాఖ అందోళన వ్యక్తం చేసింది. గతేదాది ఇదేకాలంలో ఈ రిజర్వాయర్లలో 35 శాతం నీటీ నిల్వలు ఉన్నాయి. 
నిలిచిపోయిన జల విద్యుత్‌ ఉత్పత్తి  
దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న  రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్ధ్యం 253.83 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. వీటిలో 60  మెగావాట్ల కంటే అధికంగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేసే జలాశయాలు 37 ఉన్నాయి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో వీటిలో జల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై  ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాలు ఎండిపోవడంతో మంచినీటికి ఇక్కట్టు తప్పని పరిస్థితి ఏర్పడింది. సాగునీటి సంగతి చెప్పాల్సిన పనిలేదు. పంటలు లేకపోవడంతో  వ్యవసాయ అనుబంధరంగాలైన పాడి, కోళ్ల పరిశ్రమలపై ఆ ప్రభావం పడుతోంది. పశువులను మేపేందుక మేత లేకపోవడంతో మూగజీవాలను కబేళాలకు తరలించే పరిస్థితి వచ్చింది. 
ప్రస్తుతం 6.98 బీసీఎం నీరు మాత్రమే నిల్వ 
దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో 31 జలాశయాలు ఉన్నాయి. వీటి నీటి నిల్వ సామర్ధ్యం 51.59 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. కానీ ప్రస్తుతం 6.98 బీసీఎం నీరు మాత్రమే నిల్వ ఉంది. మొత్తం సామర్ధ్యంలో ఇది కేవలం 14 శాతం మాత్రమే. గతేడాది ఇదే కాలంలో దక్షిణాది రిజర్వాయర్లలో 23 శాతం నీటి నిల్వలు ఉన్నాయని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో ఇదే కాలంలో 24 శాతం నీటి నిల్వలు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. 
నీటి నిల్వలపై లెక్కలు ప్రకటించిన కేంద్రం 
తూర్పు, పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వల గణాంకాలను కూడా కేంద్ర జలవనరులు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏ జలాశయంలో నీటి నిల్వల పరిస్థితి చూపినా ఏమున్నది గర్వకారణం... సమస్త రిజర్వాయర్ల చరిత్ర ఎండిపోయిన దయనీయ స్థితి.. అంటూ జలవనరుల శాఖ అధికారులే నిట్టూర్చుకునే పరిస్థితి వచ్చిందంటే.. కరవు రక్కసి ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 

 

వడగాల్పులకు 4గురు మృతి....

నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత 10 సంవత్సరాలలో లేని ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నమోదయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని పలుమార్లు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వడదెబ్బతో జిల్లా వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. చిట్యాల మండలం శివనేనిగూడెంలో బుచ్చమ్మ (65), చిట్యాలలో వెంకులు (65), గుండాల మండలం బ్రాహ్మణపల్లిలో యాదగిరి (60), మిర్యాలగూడ మండలం రాఘవరపురం తండాలో సమ్రి(40) అనే మహిళ వడదెబ్బకు మృతి చెందారు.

పర్యాటక కేంద్రంగా దుర్గం చెరువు : కేటీఆర్

హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్, సంబంధిత అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిదుద్దతామని మంత్రి పేర్కొన్నారు. రోడ్ నంబర్ 45 నుండి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్ మాల్ వరకూ రూ.184 కోట్లతో నాలుగు లైన్లతో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లతో కూడిన  బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరో రూ.20 కోట్లతో హంపి థియేటర్, బోటింగ్ వంటి అంతర్జాతీయ సౌకర్యాలకు టెండర్లు ప్రకటిస్తున్నామని తెలిపారు.

16:37 - April 23, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కరవు నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో జేఏసీ బృందం పర్యటించిందని తెలిపారు. త్వరలోనే కరవు నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. దీంతో పాటు కరవు తీవ్రతపై అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం చేపడతామని చెప్పారు. జూన్ 2న ఉద్యమకారుల ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహిస్తామని కోదండరామ్ పేర్కొన్నారు.

ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్ ....

హైదరాబాద్ : నగరంలోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకేగూడలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కృష్ణ, రాజేశ్ ల నుండి రూ . 4 లక్షల విలువ చేసే 8 బైక్‌లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కృష్ణ పాత నేరస్థుడుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాంట్రాక్టర్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి....

వరంగల్ : జాఫర్ గఢ్ మండలం తమ్మడపల్లిలో మిషన్ కాకతీయ కాంట్రాక్టర్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మిషన్ కాకతీయకు వేసిన టెండర్ల నుండి వైదొలగాలని బెదిరింపులకు పాల్పడ్డారు.

16:20 - April 23, 2016

చెన్నై: డీఎంకే నేత, మాజీ కేంద్ర మంత్రి రాజా కారుపై సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే దాడి చేశారు. కునూరు నియోజకవర్గానికి ఎంపిక చేసిన ఎంబీ ముబారక్ అభ్యర్థిత్వాన్ని డీఎంకే కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదగమండలం అభ్యర్థిని పరిచయం చేసేందుకు శుక్రవారం కోటగిరి చేరుకున్న రాజాపై కొంతమంది కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేశారు. కాసేపు రాజాను ఘోరావ్ చేశారు. పోలీసులు కార్యకర్తలను అదుపు చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తిని పక్కన పెట్టి విజయం కోసం కృషి చేయాలని డిఎంకె అధినేత కరుణానిధి చెప్పిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది.

16:15 - April 23, 2016

ఖమ్మం : పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్య సుచరిత పేరు ఖారారు అయింది. ఇవాళ సాయంత్రం ఆమె పేరును టీపీసీసీ అధికారికంగా ప్రకటించనుంది. పోటీకి సుచరిత మొదట నిరాకరించినా... చివరకు ఒప్పుకుంది. పోటీకి అయ్యే ఖర్చును రాష్ట్ర పార్టీ భరిచంనుంది. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించడంతో పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానంలో ఖాళీ ఏర్పడింది. దీంతో పాలేరుకు ఉప ఎన్నిక జరుగనుంది. 

 

అవుటర్ రింగ్ రోడ్ పై కారు దగ్థం ....

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ అవుటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు అగ్నికి ఆహుతయ్యింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వైపునకు వెళ్తున్న టీఎస్‌ 07 ఎక్స్‌ 8055 బెంజి కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో కారులోంచి డ్రైవర్‌ దూకేశాడు. దీంతో  ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కారు పూర్తిగా దగ్థమయ్యింది.

ఆశారాం బాపు కుమారుడు నారాయణ్‌ కు భారీ జరిమానా.....

హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తగా ప్రచారం చేసుకునే ఆశారాం బాపు కుమారుడు నారాయణ్‌ సాయిపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది. ఈ విషయంపై అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనరల్‌ ముఖేశ్‌ పటేల్‌ మాట్లాడుతూ... ఆశారాం బాపూ, అతని కుమారుడు నారాయణ్ ఇళ్ల మీదా రైడింగ్‌ చేపట్టామని ఆయన తెలిపారు. వారి వద్ద నుండి 42 బ్యాగుల నిండా కోట్ల రూపాయల నగతును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించిన డబ్బు దండుకునంటున్న కారణంగా నారాయణ్ కు రూ.750 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపారు.వారి ఆస్తుల గురించి విచారణ ముమ్మరం చేశామనీ...కమిషనర్ తెలిపారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియన్స్ జట్టు...

హైదరాబాద్ : ఢిల్లీ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్-ఢిల్లీ డేర్ డెవిల్స్‌ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, రాత్రి 8 గంటలకు పంజాబ్‌తో హైదరాబాద్ జట్టు తలపడనుంది.

చెరువులో ఈతకు వెళ్ళి బాలుడు గల్లంతు....

నల్లగొండ : తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకెళ్లిన ఓ బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

తోటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి...

కరీంనగర్ : బెజ్జంగి మండలం తోటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమార్తెలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆనంతరం కేసు నమోదు చేసుకున్నారు.

కర్నాటక మంత్రితో భేటీ కానున్న టీ.ఎస్ మంత్రి ...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ నెల 28న బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎండీ పాటిల్‌తో హరీష్‌రావు భేటీ కానున్నారు. రాష్ర్టానికి ఆర్డీఎస్ నుంచి నీళ్లు రాకపోవడంపై పాటిల్‌తో హరీష్‌రావు చర్చించనున్నారు.

పాలేరు కాంగ్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత?...

ఖమ్మం : పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్య సుచరిత పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈరోజు సాయంత్రం అధికారికంగా పీసీసీ ప్రకటించనుంది. కాగా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానుభూతితో ప్రజల ఓట్లను రాబట్టుకోవటానికి రాంరెడ్డి భార్య సుచరితను కాంగ్రెస్ బరిలోకి దింపుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

శ్రీశైలం రిజర్వాయర్ వద్ద కాంగ్రెస్ ధర్నా ....

కర్నూలు : శ్రీశైలం రిజర్వాయర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్ రఘువీరా, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీనిపై రఘువీరా మాట్లాడారు. టీ.ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో 8 జిల్లాలు ఎడారిగా మారతాయని ఆయన పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవటం లేదని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.

15:25 - April 23, 2016

విజయవాడ : తుని రైలు ఘటనపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సాంకేతిక నిపుణుల ద్వారా వీడియో పుటేజీల నుంచి నిందితుల ఫొటోలను సీఐడీ అధికారులు సేకరించారు. ఘటనకు బాధ్యులైన వారి కాల్ డేటా సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ షీటర్ల వివరాలను అధికారులు సేకరించారు. ఘటన జరిగిన సమయంలో రౌడీ షీటర్ల కదలికలపై ఆరా తీశారు. కొంతమంది రౌడీషీటర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాపులను బీసీలో చేర్చాలని గతంలో కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సభ రసాభాసాగా మారింది. రైలు రోకో చేపట్టారు. ఆ సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుపై పలువురు ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రైలు ఇంజన్ ధ్వంసమైన సంగతి తెలిసిందే. 

కొండచరియలు విరగిపడి ఇద్దరు మృతి...

హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలుచోట్ల కొండ చరియలు విరగిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. శిథిలాల కింద మరి కొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా నిన్న కూడా కొండ చరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

మద్యపాన నిషేధంతో కొత్త జీవితం....

హైదరాబాద్ : బీహార్ లో మద్య నిషేదం నిర్ణయంతో ఒక జంట తమ జీవితాన్ని పున: ప్రాంరంభించింది. బీహార్ ససారాం జిల్లాలోని మొహుద్దీగంజ్‌లో 13 ఏళ్ల క్రితం దంపతులు విడిపోయారు. మద్యానికి బానిసైన భర్త జై గోవింద్ సింగ్ (58) తో విసిగివేసారిపోయిన భార్య వైజంతీ దేవి (50) భర్త నుండి చి భార్య తెగదెంపులు చేసుకుంది. కానీ బీహార్ సీఎం నితీష్‌కుమార్ మద్యం నిషేధించడంతో ఆ దంపతులు తిరిగి ఒక్కటయ్యారు. ఈ దంపతులు విడిపోకముందు పుట్టిన కుమార్తె వారికి వివాహాం జరిపించింది. ఇక నుంచి తన భార్యను వేధింపులకు గురి చేయానని, ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని గోవింద్ తెలిపారు. పూర్తిగా మద్యాన్ని మానేశానని స్పష్టం చేశారు.

15:09 - April 23, 2016

నల్గొండ : కరవుపై సీపీఎం పోరాటం ఉధృతం చేసింది. కరవుపై ప్రభుత్వం చర్యను నిరసిస్తూ నల్లగొండ కలెక్టరేట్‌ను సీపీఎం నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. భారీగా చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కరవు కోరల్లో ఉన్న జిల్లాను వెంటనే.. కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు.
ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు..
'కరువుతో నల్గొండ జిల్లా అతలాకుతలం అవుతుంది. నిమ్మతోటలు, బత్తాయి తోటలు ఎండిపోయాయి.  జిల్లాలో 370 మంది రైతులు ఆత్మహ్యలు చేసుకున్నారు. వీరిలో కేవలం 63 మంది కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. మిగిలిన మృతుల కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. మండలాల అభివృద్ధికి ప్రతి మండలానికి రూ.10 కోట్ల రూపాయలు వెచ్చించాలి. తాగునీరు, సాగు నీరు సమస్యలను పరిష్కరించాలి.
జూలకంటి రంగారెడ్డి.. 
ప్రతి గ్రామంలో పనులుల్లేక 20 కుటుంబాలు ఇంటికి తాళాలు వేసి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయారు. 
జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోయాయి. జిల్లాలో పండ్ల తోటలకు ప్రసిద్ధి. సాగునీరు లేక పండ్ల తోటలు ఎండిపోయాయి. ఎండిన పంటపొలాలను కరువు బృందం, అధికారులు పరిశీలించాలి. జిల్లాలో కేవలం 63 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారు. అలా కాకుండా... జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి' అని డిమాండ్ చేశారు.   

రైలు కింద పడి ఓ యువకుడు మృతి....

నల్లగొండ : నార్కెట్‌పల్లి మండలం గోకులాయపల్లి వద్ద రైలు కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టీడీపీ-బీజేపీలకు సమన్వం అవసరం : పురంధేశ్వరి

గుంటూరు : బీజేపీ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. బీజేపీ నేత పురంధేశ్వరి, పలువురు బీజేపీ నేతలు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. కార్యకర్తల స్థాయిలో టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. 2019 నాటికి గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలన్నారు. 

కోఠిలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్....

హైదరాబాద్ : నగరంలోని కోఠి మెడికల్ కళాశాల వద్ద విద్యుత్  ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.  ఎటువంటి ప్రమాదం వాటిల్లకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలే ఎండలతో అల్లాడిపోతున్న సయమంలో ఈ ఘటనతో తమ షాపులకు ఎటువంటి ముప్పు వాటిల్లుతుందోనని కోఠిలోని వ్యాపారరస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

ధన దాహం డాక్టర్లకు కత్తెర వేసిన ఆరోగ్యశాఖ...

కరీంనగర్ : కడుపు కోత ఆపరేషన్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది.  కోరుట్లలోని అయ్యప్ప నర్శింగ్ హోమ్ , జగిత్యాల లోని విజయలక్ష్మీ నర్శింగ్ హోమ్ గుర్తింపులను వైద్యశాఖ అధికారులు రద్దు చేస్తూ జిల్లా వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా కరీంనగర్ జిల్లాలోని అవసరం లేకున్నా విద్యార్థులకు అపెండిసైటిస్ , మహిళలకు గర్భసంచీ శస్తచికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. కాగా నిబంధనలు అతిక్రమించి సర్జరీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి : సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. 

తుని రైలు ఘటనపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

విజయవాడ : తుని రైలు ఘటనపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక నిపుణుల ద్వారా వీడియో పుటేజీల నుంచి నిందితుల ఫొటోలను సీఐడీ అధికారులు సేకరించారు.  ఘటనకు బాధ్యులైన వారి కాల్ డేటా సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ షీటర్ల వివరాలను అధికారుల సేకరించారు. ఘటన జరిగిన సమయంలో రౌడీ షీటర్ల కదలికలపై ఆరా తీస్తున్నారు. కొంతమంది రౌడీషీటర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  

 

ఉమెన్ చాందీపై యువకిశోరం గురి...

హైదరాబాద్ : కేరళ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కొట్టాయం జిల్లా పుట్టుపల్లి నియోజకవర్గం పై అందరి దృష్టి పడింది. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీపై 26 ఏళ్ల యువకుడు థామస్ పోటీ చేయనున్నాడు. గతంలో 10 సార్లు పుట్టుపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఉమెన్ చాందీ గెలుపొందిన విషయం తెలిసిందే. 11వ సారి కూడా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. భారత దేశంలోనే యునైటెడ్ నేషన్స్ అవార్డ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అందుకున్న ఏకైక సీఎం చాందీ. మరోవైపు 26 ఏళ్ల జేక్ సీ థామస్ ను అత్యంత రాజకీయ అనుభవమున్న 73 ఏళ్ల చాందీపై సీపీఎం పోటీకి దింపింది.

13:34 - April 23, 2016

కర్నూలు : కర్నూలు టిడిపి కార్యాలయంపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఎస్సీ వర్గీకరణచేస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ ప్రదర్శనగా వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కర్నూలు టిడిపి ఆఫీసు పై దాడి చేశారు. ఈ దాడిలో 30 నుండి 40 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఆఫీసులో ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న కర్నూలు ఎస్ ఐ సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు రాష్ట్రాలపై సూర్యప్రతాపం...

హైదరాబాద్ : ఖమ్మం, నిజామాబాద్,నల్లగొండ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రామగుండం లలో 44, హైదరాబాద్, హన్మకొండలలో 43,నందిగామ,నెల్లూరు, నంద్యాల, తిరుపతిలలో 44, విజయవాడ,అనంతపురం, కర్నూలులలో 43, కడప-42, ఒంగోలు-40లుగా నమోదయ్యాయి. కాగా ఎండల తాకిడికి ఇరు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాల్పులపై ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సూచిస్తూనే వుంది.

కరవుపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి: ప్రొ.కోదండరాం

హైదరాబాద్ : టీ.జేఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రా వ్యాప్తంగా కరవు నెలకొందననీ...దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవుసరముందని ఆయన పేర్కొన్నారు. దీనిపై త్వరలో అన్ని సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరవుపై అధ్యయం చేసామనీ...దీనిపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. జూన్ 2న ఉద్యమకారుల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహిస్తామన్నారు.

13:25 - April 23, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై బెంజ్ కారు దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరలేదు. వివరాల్లోకి వెళితే...గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు కు వెళ్తున్న సమయంలో హిమాయత్ సాగర్ వద్ద కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంజన్ లో మంటలు వ్యాపించడంతో కారు నడుపుతోన్న మహిళ వెంటనే పక్కకు ఆపి దిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలనుఅదుపు చేస్తున్నారు.


 

13:19 - April 23, 2016

హైదరాబాద్ : వైసీపీకి మరో షాక్ తగలనుంది. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిలెక్కే యోచనలో వున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఈ మేరకు సంతమాగలూరు టీడీపీ నేతలతో రవికుమార్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

13:16 - April 23, 2016

విజయవాడ : రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే టిడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... రాష్ట్రం ఇబ్బందుల్లో వుందని.. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకుండా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. అనంతపురం జిల్లా అంటే ఎక్కువ ప్రీతి పాత్రమైన జిల్లా. పట్టి సీమ ద్వారా అనంతపురం జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీరు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అభివృధ్ధికి ఆటంకాలు ఉండవని స్పష్టం చేశారు. అంతక ముందు పచ్చకండువా కప్పుకున్న చాంద్ బాషా మాట్లాడుతూ..మైనార్టీలకు అండగా ఉంటానని చంద్రబాబు చెప్పారని తెలిపారు.

ఒంటిమిట్టలో ఘనంగా చక్రస్నానం.…

కడప : ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సీతారామ లక్ష్మణులకు చక్రస్నాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య రామతీర్థమనే కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. రామతీర్థంలో సంప్రోక్షణ చేసిన అనంతరం ఉత్సవమూర్తులతో పాటు విష్ణు చక్రానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు ఉత్సవమూర్తులకు చక్రస్నానం నిర్వహించారు.

వైసీపీలో మరో వికెట్ డౌన్ ?....

హైదరాబాద్ : వైసీపీకి మరో షాక్ తగలనుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిలెక్కే యోచనలో వున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి.  సంతమాగలూరు టీడీపీ నేతలతో రవికుమార్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

భారీగా గంజాయి స్వాధీనం...

మెదక్ : జహీరాబాద్ ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరు పరారీ కాగా...మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.

టీడీపీ కార్యాలయంపై ఎమ్మార్పీఎస్ దాడి...

కర్నూలు : టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళన చేపట్టింది. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యాలయంపై ఎమ్పార్పీఎస్ కార్యకర్తలు దాడికి దిగారు.

12:57 - April 23, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్‌కు జగన్‌ వివరించారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని గవర్నర్‌కు వివరించామని జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని.. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు జగన్‌ తెలిపారు. 

12:56 - April 23, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందా ? పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పథకం నీరుగారుతోందా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు చికిత్సలను ఆ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వాలు.. ఆ పథకాన్ని సక్రమంగా నడపలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. అంతేకాకుండా బకాయిలు చెల్లించకపోతే.. సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి.

2005లో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం ...

పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించాలనే ఉన్నత ఆశయంతో 2005లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. మొదట్లో ఈ పథకం సక్రమంగానే నడిచినప్పటికీ అనంతరం నీరుగారిపోయింది. ఇక రాష్ట్ర విభజన అనంతరం.. ఈ పథకం మరింత బలహీనపడింది. అయితే ఏపీలో ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవగా పేరు మార్చినా.. చంద్రబాబు సర్కార్ పెద్దగా నిధులు కేటాయించడం లేదు. ఈ పథకం కింద పేదలకు అరకొరగానే సేవలు అందిస్తున్నారు.

రూ.350 కోట్లు బకాయి చెల్లించాలంటూ ఆందోళన....

ఇక ఆరోగ్యశ్రీ సేవలకు కూడా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. తమకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. ఏపీలో తమకు రావాల్సిన 350 కోట్ల బకాయిలు చెల్లించకపోతే.. వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి. అంతేకాకుండా నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండు రోజులు సేవలు నిలిపివేశాయి. దీనిపై స్పందించిన సర్కార్‌.. ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ఈనెల 25న బకాయిలు మొత్తం చెల్లిస్తామని మంత్రి కామినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

రూ.250 కోట్లు బకాయి చెల్లించాలని డిమాండ్‌...

ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బకాయిలు చెల్లించడం లేదంటూ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. తమకు రావాల్సిన 250 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. లేకపోతే మే 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి. అయితే దీనిపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ఎం.చంద్రశేఖర్‌ స్పందించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బకాయిలు చెల్లించలేకపోయామని.. త్వరలోనే వంద కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. బకాయిలు ఆందోళన చెందవద్దని.. రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలు అందించాలని కోరారు.

ఇప్పటికైన ప్రభుత్వాలు స్పందించాలి...

ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వానికి పెద్ద విషయం కాకపోయినా.. వాటిని చెల్లించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. పేదల ఆరోగ్యానికి సంబంధించిన పథకంపై ప్రభుత్వం చిన్నచూపు చూడడాన్ని ప్రజాసంఘాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ పథకం నిరాటంకంగా కొనసాగేటట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

భారత్ అంబాసిడర్ గా సల్మాన్ ?.....

హైదరాబాద్ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు అరుదైన అవకాశం దక్కింది. రియో ఒలింపిక్స్ లో భారత్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశాన్ని బాలీవుడ్ కండప వీరుడు సల్మాన్ ఖాన్ దక్కించుకున్నట్లు సమాచారం .

12:51 - April 23, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో కరవు సహాయ కార్యక్రమాలు అమలు చేయడంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దీనిపై ఈనెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు పట్టణాల్లో ఆందోళన కార్యక్రమాల చేపట్టాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ఆయన చెప్పారు.

12:49 - April 23, 2016

హైదరాబాద్ : నగరంలో ఒకే రోజు 25 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాలను భాగస్వామ్యం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.

పాలేరు ఎన్నికల్లో సీపీఎం పాల్గొంటుంది : తమ్మినేని

హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నికలలో సీపీఎం పార్టీ పోటీ చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అభ్యర్థి ఎన్నికపై వామపక్ష పార్టీలతో చర్చలు జరిపి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి మృతి చెందటంతో పాలేరు నియోజకవర్గానాకి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ తమను సంప్రదించిందనీ...కానీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరవుపై ఆయన మాట్లాడారు. కరవుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.

12:47 - April 23, 2016

కోల్ కత్తా : పశ్చిమబెంగాల్ లోని హౌరా నార్త్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు జరుగుతోంది. మహాభారత్ ద్రౌపది రూపాగంగూలితో మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా తలపడుతున్నారు.

ఒకరు బుల్లితెరపై.. మరోకరు క్రికెటర్ గా...

బుల్లితెరపై మహాభారత్ సీరియల్లో ద్రౌపదిగా కనిపించిన రూపాగంగూలీ, మూడు వన్డేలతో క్రికెట్ అభిమానులకు పరిచయమైన లక్ష్మీ రతన్ శు క్లా వీరిద్దరూ ప్రత్యర్థులై రంగంలోకి దిగారు. పశ్చిమబెంగాల్ లోని హౌరా నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హోరాహోరి తలపడుతూ అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తున్నారు.

రాజకీయాల్లో వీరిద్దరికీ ఇది ఫస్ట్ ఎక్స్ పీరియన్స్. ..

రాజకీయాల్లో వీరిద్దరికీ ఇది ఫస్ట్ ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ టైమ్ బ్యాలెట్ వార్. మొదటి ఎన్నికల పోరాటం. రూపా గంగూలి బిజెపి నుంచి బరిలోకి దిగితే, శుక్లా టిఎంసి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సంతోష్ పాథక్ వీరి గ్లామర్ ముందు వెలవెలబోతున్నారు.

రూపా గంగూలి మీద చాలా ఆశలు పెట్టుకున్న గంగూలి...

పశ్చిమబెంగాల్ లో బిజెపి రూపా గంగూలి మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఆమెకున్న జనాకర్షక శక్తి, వాక్ చాతుర్యం, ధైర్యంగా మాట్లాడేతీరు ఏదో ఒక రోజు తమకు మేలు చేస్తాయన్నది కమలనాధుల ఆశ. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల కోసం మోటారు సైకిల్ పై ప్రచారం చేసి పలువురు ద్రుష్టిని ఆకర్షించిన రూపా గంగూలి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ప్రచారం సాగిస్తున్నారు.

ఇప్పటికే బిజెపి మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రూపాగంగూలి పదునైన వ్యాఖ్యలతో మమతాబెనర్జీని చెడుగుడు ఆడుకుంటున్నారు. శాంతి భద్రతలు క్షీణించాయంటూ, పోలీసుల ఇష్టా రాజ్యం నడుస్తోందంటూ, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ మమతాబెనర్జీ పాలనపై మాటల తూటాలు పేలుస్తున్నారు రూపాగంగూలి. పశ్చిమబెంగాల్ మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది బుల్లితెర ద్రౌపది. మమతా బెనర్జీని పాలనను చూస్తూ కూడా ఆ పార్టీలో ఎలా చేరావంటూ మాజీ క్రికెటర్ ను ప్రశ్నిస్తున్నారామె.

స్టార్ క్యాంపెయినర్ దూసుకెళ్తోన్న రూపాగంగూలి ...

స్టార్ క్యాంపెయినర్ లక్షణాలతో రూపాగంగూలి దూసుకెళ్తుంటే, శుక్లా లోకల్ కార్డ్ ప్రయోగిస్తున్నారు. శుక్లా హౌరాలో జన్మిస్తే, రూపా గంగూలి కల్యాణిలో జన్మించారు. శుక్లాకు కలిసొచ్చే మరో అంశం హౌరా టిఎంసి సిట్టింగ్ స్థానం కావడం. 2011 ఎన్నికల్లో హౌరా నార్త్ లో టిఎంసీ అభ్యర్థి అశోక్ ఘోష్ సిపిఎం అభ్యర్థిపై దాదాపు 20 వేల మెజార్టీతో గెలిచారు. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ సెగ్మంట్ లో టిఎంసి 12వేల ఆధిక్యత ప్రదర్శించింది. బిజెపి రెండో స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో 15శాతం మంది ముస్లిం ఓటర్లున్నారు. వీటి మీద టిఎంసీ ఆశలు పెట్టుకోగా, హిందీ భాష మాట్లాడేవారి మీద రూపాగంగూలి ఆశలు పెట్టుకుంటున్నారు. హౌరా నార్త్ నియోజకవర్గంలో బెంగాలీ మాట్లాడేవారు 32శాతం మంది కాగా, మిగిలినవారంతా హిందీ మాట్లాడేవారే కావడం విశేషం.  

సిక్కునేత సోరన్ సింగ్ హత్య...

హైదరాబాద్ : పాకిస్థాన్ లోని పెషావర్ లో కైబర్ పక్తున్వ ప్రావిన్స్ ఎమ్మెల్యే, సిక్కు నేత సోరన్ సింగ్ హత్యకు గురయ్యారు. సోరన్ సింగ్  ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన అక్కడి కక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోరన్ సింగ్ వైద్యుడిగా, టీవీ యాంకర్ గా,  రాజకీయ నాయకుడిగానే కాకుండా ఖైబర్ ఫక్త్వవా మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.

గురుకుల పాఠశాలల వెబ్ సైట్ ప్రారంభించనున్న కడియం..

హైదరాబాద్ : గురుకుల పాఠశాలలకు సంబంధించి వెబ్ సైట్ ను మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహ్మమూద్ అలీతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొననున్నారు.

అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : మిషన్ కాకతీయపై అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీటి పారుదల అధికారులతో మంత్రి సమీక్షించనున్నారు. 

11:51 - April 23, 2016

హైదరాబాద్ : పంజాబ్‌లో జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆఫీసులో పని చేస్తున్న ఓ యువతిని అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి బయటకు తీసుకొచ్చాడు. చేయిపట్టుకుని వీధుల్లో లాక్కెళ్లాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నా... ఎవరూ పట్టించుకోలేదు. తనను కాపాడండి... రక్షించండి... అంటూ ఆర్తనాదాలు, ఆహాకారాలు చేసినా అందరూ గుడ్లప్పగించి చూశారేకానీ.... ఎవరు సహాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత యువతి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లిన అతడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రెండో రోజు విడిచిపెట్టాడు. పంజాబ్‌లోని ముక్త్‌సర్‌లో గతనెల 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ఐదు రోజుల క్రితం ఎఫ్ఐఆర్ నమోదైనా.. పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. బాధిత యువతి దళిత మహిళ. దీనిపై జాతీయ SC కమిషన్‌ పంజాబ్‌ పోలీసులకు సమన్లు జారీ చేసింది. 

11:49 - April 23, 2016

కరీంనగర్ : జిల్లాలో కరవు తాండవిస్తోంది. మనుషులే కాదు మూగ జీవాలు సైతం కరవు ధాటికి తల్లడిల్లిపోతున్నాయి. పశుగ్రాసం లేక పశుసంపద కబేళాలకు తరలిపోతోంది. కరవు విలయతాండవం చేస్తుండడంతో మూగ జీవాలకు గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. వాటి గోస చూడలేకపోతున్న రైతులు సంతలో అమ్మకానికి పెడుతున్నారు. జిల్లాలో కరువును తట్టుకోలేక అలమందను అమ్ముకుంటున్న వైనంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

జిల్లాలో నాలుగేళ్లుగా కరవు కాటేయడంతో....

కరీంనగర్‌ జిల్లాలో నాలుగేళ్లుగా కరవు కాటేయడంతో చుక్కనీరు లేక సెంటు భూమి సాగుకు నోచుకోవడంలేదు. వర్షపాతం ఈ ప్రాంతంలో గణనీయంగా తగ్గిపోవడంతో ఎన్నడూ లేని విధంగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. పంటలు పండక స్థానిక రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పశుపోషణ కష్టమైంది. దీంతో పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం మహిళలు పాడిపరిశ్రమను నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిస్థితి ఉంది. పశుగ్రాసం లేక మూగజీవాలు అలమటిస్తున్నాయి.

గ్రామాల్లో నీళ్లులేక... పంటలు పండక పోవడంతో...

కరవు తాండవిస్తుండడంతో గ్రామాల్లో నీళ్లులేక... పంటలు పండక పోవడంతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో పొలంలో ఉండాల్సిన పశువులు అంగట్లో అమ్మకానికి తరలుతున్నాయి. కన్నబిడ్డల్లా పెంచిన పశువులను అమ్మిన రైతులు గుండెలు పగిలెలా రోదిస్తుంటే.. తన యాజమానిని వదిలి కబేళాలకు వెళుతున్న పశువులది అరణ్య రోదనే. వాటి గోస చూడలేని రైతన్నలు 60-70 వేల రూపాయలు విలువ చేసే ఎడ్ల జోడిని 30వేలకే విక్రయిస్తున్నారు.

గడ్డి విత్తనాలను పశుసంవర్ధక శాఖ అంతంత మాత్రంగానే పంపిణీ...

గడ్డి విత్తనాలను పశుసంవర్ధక శాఖ అంతంత మాత్రంగానే పంపిణీ చేస్తోంది. పశువుల పెంపకానికి 75 శాతం రాయితీపై మేలు రకపు గడ్డి విత్తనాలను రైతులకు అందజేయాలి. గడ్డి విత్తనాల పెంపకంపై అవగహన కల్పించి పశు సంతతిని కాపాడుకునేందుకు అధికారులు ఇప్పటి వరకు చర్యలు చేపట్టనే లేదు. జిల్లాలోని కొన్ని మండలాల్లో మాత్రమే విత్తనాలను పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. 60శాతానికి పైగా విత్తన పంపిణీ ఊసే లేకుండా పోయింది.

అవగాహన కల్పించే వారు కరువు....

ప్రభుత్వ పథకాలపై పాడి రైతులకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. అధికారులు కరవుని గుర్తించడంలో విఫలమయ్యారు. ఫలితంగా మూగ జీవాల ఆర్తనాధాలు ఎల్లలు దాటుతున్నాయి. పశుసంపద అభివృద్ధి దిశగా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మూగ జీవాలకు తీవ్ర కరువు వచ్చి పడింది. మూగజీవాలను కాపాడుకునే మార్గం తెలియక రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు.

కరీంనగర్‌ జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి...

కరీంనగర్‌ జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. కరువు ప్రాంతాల్లో ఇంత వరకు ప్రజా ప్రతినిధులు పర్యటించిన దాఖలాలు లేవు. రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన వీహెచ్...

ఢిల్లీ : పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో   ఎంపీ వి. హనుమంతరావు సమావేశమయ్యారు. జూన్ నెలతో తన రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో  కుటుంబ సమేతంగా కలిసి సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

11:45 - April 23, 2016

నల్గొండ : కరవుపై సీపీఎం పోరాటం ఉధృతం చేసింది. కరవుపై ప్రభుత్వం చర్యను నిరసిస్తూ నల్లగొండ కలెక్టరేట్‌ను సీపీఎం నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. భారీగా చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కరవు కోరల్లో ఉన్న జిల్లాను వెంటనే.. కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు .

11:43 - April 23, 2016

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఎమ్మెల్యేల కొనుగోలు, అవినీతిపై జగన్‌ బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని వైసీపీ భావిస్తోంది..ఈ విషయంపై కాస్త ఆలస్యంగా మేల్కొన్న పార్టీ... వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో సవరణలకోసం ఉద్యమానికి సిద్ధమైంది.. 

11:41 - April 23, 2016

విజయవాడ : వైసీపీకి మరో షాక్‌ తగిలింది. కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చాంద్‌బాషాతో పాటు భారీగా వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికే టీడీపీలో 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీగా చేరగా.. చాంద్‌బాషాతో ఆ సంఖ్య 13కు చేరింది. 

బాబుపై చర్యలు తీసుకోండి : జగన్

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో వైసీపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ను ముట్టడించిన సీసీఎం నేతలు...

నల్లగొండ : సీపీఎం నేతలు, కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్ కార్యాలయానికి సీపీఎం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.  కరవుతో అల్లాడిపోతున్న జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

టీడీపీలో గూటికి మరో వైసీపీ ఎమ్మెల్యే....

హైదరాబాద్ : కదిరి వైసీపీ ఎమ్మెల్యే చంద్ భాషా టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బాంద్ బాషా టీడీపీలో చేరారు. ఇప్పటికే ప్రతిపక్షమైన వైసీపీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు  టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే.

వారణాసి కోర్టు లో బాంబు కలకలం...

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్  లోని వారణాసి కోర్టు వద్ద బాంబు కలకలం రేపింది. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి  చేరుకుని హ్యాండ్ గ్రనేడ్ ను నిర్వీర్యం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చంద్రబాబుతోటీ. టీడీపీ నేతలు భేటీ...

హైదరాబాద్ : చంద్రబాబుతో తెలంగాణా టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, ఎల్.రమణ, నామా, సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. పాలేరు అభ్యర్థిపై నేతలు చర్చింనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మిక మృతితో పాలేరులో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

10:56 - April 23, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నేడు పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, పెదవేగి మండలాల్లో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, కుడి కాలువ, ఆక్విడెక్ట్‌ పనులు పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత పెదవేగి మండలంలోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

టీ.జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం...

హైదరాబాద్ : టీ.జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కమిటీ చర్చించనుంది. కరవుపై నివేదికను విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటికే కరవుపై రాష్ట్ర వ్యాప్తంగా టీజాక్ అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే.

10:53 - April 23, 2016

కృష్ణా :పెడనలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. తాగునీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను నారాయణ ఆదేశించారు. మే 1 నుంచి అన్ని పురపాలక సంఘాల్లో ప్రతిరోజు నీటి సరఫరా చేస్తామని నారాయణ తెలిపారు

10:52 - April 23, 2016

హైదరాబాద్ : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టాన్ని రూపొందించాలని పేరెంట్స్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో.. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ మిగిలిన రాష్ట్రాల కన్నా దారుణంగా ఉందని జేఏసీ అభిప్రాయపడింది.

పేరెంట్స్ జేఏసీ హైదరాబాద్‌లో...

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టే అంశంపై.. పేరెంట్స్ జేఏసీ హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, శాంతాసిన్హా , ఎంసిహెచ్ఆర్డీ మేనేజర్ బుల్లయ్యలతో కూడిన జ్యూరీ తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలను సేకరించింది.

ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి ...

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలన్నారు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పేదవారికి 25 శాతం సీట్లను కేటాయించాలన్నారు. అధికఫీజులు వసూలు చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని.. భవిష్యత్తులో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని.. ముందుగానే ఫీజుల నియంత్రణకు ప్రణాళికలు సిద్దం చేయాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ సూచించారు.

ప్రైవేట్ వ్యాపారాన్ని అడ్డుకోవాలంటున్న తల్లిదండ్రులు....

హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో రోజుకు రోజుకు విస్తరిస్తున్న ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. పేరెంట్స్ జేఏసీ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో పాల్గొన్న తల్లిదండ్రులు.. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా.. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని జ్యూరీ ఎదుట వాపోయారు. క్యాపిటేషన్, అడ్మిషన్ పీజు, డొనేషన్ ల పేరుతో విద్యాసంస్థలు తల్లిదండ్రులను జలగల్లా పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని.. ఇకపై తల్లిదండ్రులు.. ఫీజులను చెక్కుల రూపంలో చెల్లించాలన్నారు శాంతా సిన్హా . అదనపు ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం నియంత్రణ విధించాలన్నారు. ఫీజుల కోసం వారు పిల్లల్ని వేధించకుండా చూడాలన్నారు.

సేవకు మారుపేరుగా ఉన్న మిషనరీ పాఠశాలలు ...

ఒకప్పుడు సేవకు మారుపేరుగా ఉన్న మిషనరీ పాఠశాలలు కూడా విద్యను వ్యాపారంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎంసీహెచ్ఆర్డీ మేనేజర్ బుల్లయ్య. అర్హులైన శిక్షణ పొందిన టీచర్లనే ఉపాధ్యాయులుగా నియమించాలన్నారాయన.

10:49 - April 23, 2016

మహబూబ్ నగర్: తెలంగాణ పల్లెలు కరవు కోరలకు చిక్కి విలవిలలాడుతున్నాయి. రెండేళ్లుగా వరుణుడు కరుణించక.. పంటలు పండక.. చేసిన అప్పులు కొండలా పేరుకుపోయి.. రైతన్న కుదేలై పోతున్నాడు. కరవుకు చిరునామాగా చెప్పుకునే మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. తీవ్ర వర్షాభావం కారణంగా ఈఏడాది పంటలు చేతికే రాలేదు. నీళ్లు తాగి కడుపు నింపుకుందామనుకుంటే.. పాతాళ గంగ పైకే రానంటోంది. బిందెడు నీటికోసం కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇక గ్రాసమూ.. నీరూ లేక పశువుల పోషణ దుర్భరంగా మారింది. కరవు దెబ్బకు.. రైతులు... ఉన్న ఊరిని, ఐన వారినీ వదిలేసి.. జానెడు పొట్టను పోషించుకునేందుకు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇదీ వలసల జిల్లా పాలమూరులోని దయనీయ స్థితి.

పాలమూరు సగటు వర్షపాతం 604 మి.మీ....

పాలమూరు వరుస కరవులతో తల్లడిల్లుతోంది. నదీనదాలున్నా నిర్దిష్టమైన ప్రాజెక్టులు లేక రైతులు సేద్యానికి వర్షంపైనే ఆధారపడ్డారు. రెండేళ్లుగా పాలమూరు జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతోంది. 2015 ఖరీఫ్‌లో 604 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా 383మి.మీలు నమోదైంది. తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాల మట్టం పడిపోవడం వల్ల వేసిన పంటలు వేసినట్లే ఎండిపోయాయి. ఏ పంట కూడా ఆశించిన దిగుబడిని ఇవ్వలేదు. దీంతో అన్నదాత బతుకు అగమ్య గోచరంగా మారింది.

20 మీటర్ల లోతుకి పడిపోయిన భూగర్భ జలాలు......

పంటలు ఎండిపోయి తిండిగింజలకు కరవు ఏర్పడింది. మరోవైపు.. భూగర్భజల మట్టం 20 మీటర్ల లోతుకి పడిపోయి తాగునీటికీ కటకట ఏర్పడింది. ఆరు వందల అడుగుల లోతులో బోర్లు వేస్తున్నా నీరు పడడం లేదు. దాదాపుగా అన్ని బోర్లూ ఎండిపోవడంతో తాగునీరు అందని పరిస్థితి. ఇక రామన్‌పాడు, జూరాల, కోయిల్‌సాగర్‌ ఇలా ఏ ప్రాజెక్టులోనూ నీళ్లు లేవు. దీంతో పాలమూరు నగరానికి తప్ప పల్లెలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి. మున్సిపాలిటీల్లోనూ బిందె నీటిని 3 నుంచి ఐదు రూపాయల వంతున కొనాల్సిన పరిస్థితి. పల్లెల్లోనైతే ట్యాంకర్లు, ప్రైవేటు బోర్ల ద్వారా నీటిని అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. చాలా గ్రామాల్లో నేటికీ మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి.

చెలమల నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు...

కొన్ని చోట్ల చెలమల నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు కూలికి వెళితే.. మరొకరు నీటిని తేవడాన్ని వంతులుగా వేసుకుంటున్న పరిస్థితి. గ్రామాల్లో తాగునీటి ఇక్కట్ల కారణంగా.. ఈ ప్రాంత ప్రజలకు పెళ్లి సంబంధాలూ రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.

జిల్లాలో 9 లక్షల మందికి జాబ్‌ కార్డులు.....

తీవ్ర కరవు పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన ఉపాధి హామీ పథకం.. పాలమూరు జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. పని దినాలను 150 రోజులకు పెంచారు గానీ.. కనీస కూలీ ధరలను మాత్రం పెంచలేదు. జిల్లాలోని 54 వేల శ్రమశక్తి సంఘాల్లో 9 లక్షల మందకి పైగా కూలీలు జాబ్‌కార్డులు పొందారు. ఇందులో ప్రస్తుతం ఉపాధి పనులు చేస్తున్న వారు 2 లక్షల లోపే. కానీ వంద రోజుల పని పూర్తి చేసుకున్న వారి సంఖ్య 35 వేల లోపే. దీన్ని బట్టే ఉపాధి హామీ పనులు ఏమేరకు ఉపయుక్తంగా ఉన్నాయో అర్థమవుతోంది. పైగా చేసిన పనికీ వేతనం అందకపోవడం కూలీల్లో పథకం పట్ల నమ్మకం పోయేలా చేస్తోంది. వీటన్నింటికీ తోడు.. పని చేసే చోట కనీస సౌకర్యాలు కల్పించాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు.

మూగజీవాలపై కరువు....

కరవు ప్రభావం మూగజీవాలపైనా పడింది. పశు సంపదకు పేరొందిన పాలమూరు జిల్లాలో కుంటలు, చెరువులు ఎండిపోవడంతో.. మూగజీవాలకు గడ్డి, నీరూ అందని దుస్థితి. గడ్డిని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పశువులకు రోజుకి కనీసం మూడు కిలోల మేర గ్రాసం అందించాలి. కానీ దుర్భిక్షం కారణంగా గ్రాసాన్ని తెచ్చి, పశువులను పోషించలేని దయనీయ స్థితిలో.. రైతులు వాటిని అయినకాడికి తెగనమ్మేస్తున్నారు. మరికొందరైతే.. ఉన్నవాటిలో ఓ రెండు పశువులను అమ్మి.. మిగిలిన వాటికి గ్రాసాన్ని సమకూరుస్తున్న పరిస్థితీ ఉంది.

పాలమూరు జిల్లా నుంచి 12 లక్షల మంది వలస....

ఉన్న ఊళ్లో పనులు లేక.. ఉన్న పనులు తిండి గింజలను అందించని పరిస్థితుల్లో.. పాలమూరు పల్లెలు వలస బాట పట్టాయి. జిల్లాలోని 43 లక్షల జనాభాలో కనీసం 12 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు అంచనా. ఒంట్లో కొద్దిపాటి సత్తువ ఉన్నవారు కూడా ఉపాధి పనులు వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పిల్లలను.. తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళుతున్నారు.

దువుకుంటే.. వృద్ధులు వారికి కాస్తంత వంట చేసి పెడుతూ..

పుణె, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఏడాదంతా రెక్కలు ముక్కలు చేసుకొని.. ఏడాదిలో ఒకటి రెండు సార్లు ఊరికి తిరిగొచ్చి.. సేద్యానికి చేసిన అప్పులు తీర్చి.. పిల్లలు, తల్లిదండ్రులను పరామర్శించి మళ్లీ తిరిగి వెళుతుంటారు. పల్లెల్లో సత్తువ ఉన్నవారెవరూ కనిపించని దుస్థితి. అంతా వృద్ధులు.. పిల్లలే. ఇంటిపనిని పిల్లలు చేస్తూ.. చదువుకుంటే.. వృద్ధులు వారికి కాస్తంత వంట చేసి పెడుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు.

నష్టం వేయికోట్లుగా అధికారులు సర్కారుకి నివేదిక...

జిల్లాలో కరువు నష్టం వేయికోట్లుగా అధికారులు సర్కారుకి నివేదించారు. ప్రభుత్వం 391కోట్లు మాత్రమే విడుదల చేసింది. జిల్లాకు 750 టన్నుల గ్రాసం అవసరమని కోరితే 200 టన్నులు మాత్రమే పంపారు. ప్రభుత్వ చర్యలు పాలమూరు పల్లెలకు ఏమాత్రం ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. 

10:45 - April 23, 2016

నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే. ఇది బాషా సినిమాలో రజనీకాంత్ చెప్పిన పాపులర్ డైలాగ్. 1996లో జయలలితకు వ్యతిరేకంగా, 2014లో నరేంద్రమోడీకి అనుకూలంగా వ్యవహరించిన రజనీకాంత్ 2016 ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? సూపర్ స్టార్ రజనీకాంత్ పిరికివాడంటూ కెప్టెన్ విజయ్ కాంత్ ఎందుకు కామెంట్ చేశారు? కెప్టెన్ ఆ స్థాయిలో డ్యామేజ్‌ చేసినా సూపర్‌స్టార్‌ మౌనంగా వున్నారెందుకు?

రజనీకాంత్ వైపు చూపులు......

ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పిన్నట్టేనన్న డైలాగ్‌ తమిళనాడు రాజకీయాలకు వర్తించదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ గా చెప్పాల్సిందే. ఈ సూపర్‌ స్టార్‌ తో తమకు అనుకూలంగా ఫ్రెష్‌ స్టేట్‌ మెంట్‌ ఇప్పించుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. తమకు అపాయింట్ మెంట్ ఇచ్చినా, తమతో కలిసి కనీసం టీ తాగినా అదే తమకు పెద్ద ప్రచారం అన్నట్టుగా వ్యవహరిస్తుంటాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన ప్రధాని నరేంద్రమోడీ కూడా స్వయంగా రజనీకాంత్ ఇంటికి వెళ్లడం విశేషం.

రజనీకాంత్ కి విశేషమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ......

తమిళనాడులో రజనీకాంత్ కి విశేషమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది. రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ అభిమాన సంఘాలున్నాయి. రజనీకాంత్ కి 1996 నాటికే 40 వేల అభిమాన సంఘాలుండేవి. ఒక్కొక్క సంఘంలో పాతికమంది సభ్యులుంటారు. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ సంఖ్య 80వేల పై మాటే. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సూపర్ స్టార్ తో వైరం పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరు. కానీ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న డిఎండికె అధినేత విజయ్ కాంత్ మాత్రం రజనీకాంత్ విషయంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఆ మాటలు యథాలాపంగా అన్నారో, వ్యూహాత్మకంగా అన్నారో తెలియదు కానీ రజనీకాంత్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. విజయ్ కాంత్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసేంతవరకు వెళ్లింది వ్యవహారం.

రాజకీయాల్లోకి రావొద్దంటూ విజయ్ కాంత్ బెదిరించారట....

రాజకీయాల్లోకి రావొద్దంటూ కొందరు విజయ్ కాంత్ బెదిరించారట. రజనీకాంత్ కి ఇలాంటి బెదిరింపులే వచ్చేవట. అయితే, రజనీకాంత్ మాదిరిగా తాను పిరికివాడిని కాదు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నది విజయ్ కాంత్ మాటల సారాంశం. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ కి పట్టలేనంత కోపం వచ్చేసింది. చాలాచోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

అపరిపక్వతతో , అమాయకత్వంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ..

విజయ్ కాంత్ తెలిసీ తెలియక, రాజకీయ అపరిపక్వతతో , అమాయకత్వంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేకపోతే రజనీకాంత్ అభిమానులను ముగ్గులోకి లాగడానికి, రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? భార్య ప్రేమలత రాసిచ్చే స్క్రిప్టులు చదివే విజయ్ కాంత్ కి అసలు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసేంత తెలివి వుందా? తమిళనాడులో ఇలాంటి చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన రజనీకాంత్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా...

ఒకటిమాత్రం నిజం. తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన రజనీకాంత్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారతారు. ఆయన ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఎవరికి ఓటు వేయమంటే వారికే ఓటు వేసే అభిమానులు రజనీకాంత్ కి చాలామందే వున్నారు. 1996లో ఆయన చేసిన ఒకే ఒక్క కామెంట్ జయలలితను మట్టికరిపించింది. ఆ ఎన్నికల్లో జయలలిత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. కరుణానిధి మూపనార్ నాయకత్వంలోని తమిళ మణిలా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడు ఆ దేవుడు కూడా రక్షించలేరంటూ రజనీకాంత్ ఒకే ఒక్క పంచ్ డైలాగ్ కొట్టారు. అది బ్రహ్మాండంగా పేలింది. కరుణానిధికి ఓట్ల వర్షం కురిసింది. ఆయన కేక పెట్టారు. జయలలిత కెవ్వుమన్నారు.

రజనీకాంత్ పొత్తు పెట్టుకున్న జయలలిత బిజెపిలకు మద్దతు....

కానీ 2004 లోక్ సభ ఎన్నికల్లో అదే రజనీకాంత్ పొత్తు పెట్టుకున్న జయలలిత బిజెపిలకు మద్దతిచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. 2014 ఎన్నికల్లో కూడా రజనీకాంత్ బిజెపి స్టార్ క్యాంపెయినర్ నరేంద్రమోడీ కి అనుకూల సంకేతాలిచ్చారు. కానీ, తమిళనాడులో మోడీ హవాను నిలువరించిన జయలలిత క్లీన్ స్వీప్ చేశారు. 2015లో 21 రోజుల జైలు జీవితం గడిపి వచ్చిన జయలలితకు గ్రీటింగ్స్ చెప్పిన రజనీకాంత్ ప్రస్తుతానికి సైలెంట్ గా వున్నారు. పోలింగ్ కు ఓ పది రోజుల ముందు రజనీకాంత్ బిజెపికి ప్రచారం చేసి పెడతారన్న టాక్ వినిపిస్తోంది. అయితే, ఎవరిష్ట ప్రకారం వారు ఓట్లేసుకోవాలని అభిమానులకు సూచిస్తున్న రజనీకాంత్ ఎక్కడా ఎవరూ తన పేరు వాడుకోవద్దంటూ చెబుతున్నారట.

రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల చిరకాల కోరిక. ...

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల చిరకాల కోరిక. కరుణానిధి, జయలలితలో ఎవరో ఒకరికి బదులుగా తమ అభిమాన సూపర్ స్టార్ నే సింహాసనం మీద చూడాలన్నది రజనీకాంత్ ఫ్యాన్స్ ముచ్చట. రాజకీయ ప్రవేశంపై 20 ఏళ్ల నుంచి ఊరిస్తున్నా అది తీర్చలేదు. ఇలాంటి సమయంలో రజనీకాంత్ ను పిరికివాడిగా అభివర్ణించడం విశేషం. ఈ వ్యాఖ్య అంతిమంగా విజయ్ కాంత్ కి లాభమవుతుందా? నష్టమవుతుందా?

ఆ ఇద్దరూ తమిళియన్ ఫ్యామల్లీలు కాదు...

రజనీకాంత్, విజయ్ కాంత్ ఇద్దరూ తమిళియన్ ఫ్యామ్లీలలో పుట్టలేదు. విజయ్ కాంత్ మధురైలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మిస్తే, రజనీకాంత్ మైసూరు రాష్ట్రంలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించారు. మధురైలో రైసు మిల్లు నడుపుకుంటున్న రోజుల్లో విజయ్ కాంత్ రజనీకాంత్ కి ఫ్యాన్ గా వుండేవారు. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ అభిమాన సంఘంలో సభ్యుడిగా వుండేవారు. రజనీ స్పూర్తితోనే తాను చెన్నైకి వచ్చినట్టు విజయ్ కాంత్ చెబుతుంటారు. అలాంటి విజయ్ కాంత్ రజనీకాంత్ ను పిరికివాడిగా అభివర్ణించడం వెనక ఆంతర్యం ఏమిటో?  

లారీ -డీసీఎం ఢీ ఒకరు మృతి...

రంగారెడ్డి : తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్‌లోడ్‌తో వెళ్తున్న లారీని  వెనుకునుండి ఓ  డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలైయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని  చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.  క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

09:48 - April 23, 2016

నల్లగొండ : జిల్లాలో కరవు విలయతాండవం చేస్తోంది. ఎన్నడూలేని విధంగా కరవు ఏర్పడడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వర్షాభావంతో నీటి ఎద్దడి ఏర్పడి పంటల సాగు లేకుండా పోయింది. మరోవైపు ప్రభుత్వం మొద్దునిద్ర వీడట్లేదు. కరవు మండలాల్లో కనీస చర్యలు తీసుకోకపోవడంపై సీపీఎం పోరుబాట పట్టింది. నేడు జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది.

జిల్లాలోని 59 మండలాల్లోనూ తీవ్రమైన కరవు ....

నల్లగొండ జిల్లాలోని 59 మండలాల్లోనూ తీవ్రమైన కరవు నెలకొంది. వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. 49 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నాగార్జునసాగర్‌ ఆయకట్టు బీళ్లుగా మారింది. జలాశయంలో కనీస నీటి మట్టం కూడా లేకపోవడంతో ఎడమ కాల్వకు నీరు ఇవ్వలేదు. ఫలితంగా 3.80 లక్షల ఆయకట్టు బీళ్లుగానే ఉంది.

బోరు బావులు తవ్వి వరి సాగు చేస్తే....

బోరు బావులు తవ్వి వరి సాగు చేస్తే నీటి మట్టం అంతకంతకూ తగ్గి పైర్లు పూర్తిగా ఎండిపోయాయి. 3.25 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా కనీసం లక్ష పంపు సెట్లు కూడా రబీ సీజన్‌లో నడవలేదు. నీటి ఎద్దడి, కరెంటు కోతలతో జిల్లాలో లక్ష ఎకరాలకు పైనే వరి పైర్లు ఎండిపోయాయి. వ్యవసాయం దెబ్బతినడంతో జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ఒక్కరికి కూడా పెంచిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలg..

అయితే జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, ప్రజలను కరవు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. జిల్లాలో కరవు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలోఈ నెల 18 నుండి 22వ తేదీ వరకూ సిపిఎం కరవుయాత్ర చేపట్టింది.

400 గ్రామాల్లో కరవు యాత్రలు...

ఐదు రోజుల పాటు జిల్లాలోని 59 మండలాల్లో సుమారు 400 గ్రామాల్లో కరవు యాత్రలు చేపట్టారు సీపీఎం నేతలు. గ్రామాల్లో యాత్రల ద్వారా కరవు పరిస్థితులను అధ్యయనం చేసి, కరవు నివారణకు చేపట్టాల్సిన సహాయక చర్యల్ని అంచనా వేశారు. కరవు సహయక చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది సిపిఎం.

8న తిప్పర్తి మండలం ఇందుగులలో తమ్మినేని పాదయాత్ర....

ఈ నెల 18న తిప్పర్తి మండలం ఇందుగులలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం యాత్రను ప్రారంభించి.. గ్రామ పరిధిలో ఎండిపోయిన తోటలు, పంటలు, బావులను స్వయంగా పరిశీలించారు. రాష్ట్రంలో, జిల్లాలో కరవు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే కరవుయాత్రలు చేపట్టామని తమ్మినేని తెలిపారు.

కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని ...

కలెక్టరేట్ ముట్టడి చేపట్టి కరువు సహాయక చర్యలు ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తామని.. అప్పటికి స్పందించపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తమ్మినేని వీరభధ్రం హెచ్చరించారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

09:42 - April 23, 2016

హైదరాబాద్ : అమెరికా వద్య అందని ద్రాక్షేనా? అమెరికాలో చదవాలనే కోరిక కలగానే మిగలనుందా? అమెరికాలో విద్య- అనుమానాలు, టెన్ టివి ఎడ్యుకేషన్ ప్లస్ లో అమెరికాలో విద్య అనుమానాలు అనే అంశంపై నిపుణుల సలహాలు- సూచినలు మీకు అందించే ప్రత్నం చేసింది టెన్ టివి. ఈ కార్యక్రమంలో సౌర్య కన్సల్టెన్సీ ఎండీ రాధా, మెగాసిస్ ఎండీ గాలిరాజు, క్యూ ఫోర్ డైరెక్టర్ తులసీ కృష్ణ పాల్గొన్నారు. వారు ఎలాంటి సూచలనలు, సలహాలు చేశారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

09:25 - April 23, 2016

హైదరాబాద్ : మోడీ ప్రధానిగా ఉండి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా..ఒక్క ఉద్యోగం కల్పించలేకపోయారని మేధావులు విమర్శించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ కలెక్టివ్స్ నిర్వహించిన సదస్సు రెండో రోజు కొనసాగింది. సభలో,..కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మేధావులు. కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు పనికట్టుకొని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని..అలాంటి మత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే....

ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ ప్రభుత్వం లవ్‌జిహాద్, బీఫ్‌బ్యాన్ వంటి వివాదాస్పద చర్యలకు దిగుతోందని మేధావులు కేంద్రంపై విరుచుకుపడ్డారు. హేతువాదం, విద్యా విధానంపై దాడులకు దిగుతూ కేంద్రం భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేధావులను తీర్చిదిద్దే యూనివర్సిటీలను ధ్వంసం చేసేందుకు అసమర్ధ వైస్‌ఛాన్సులర్లను నియమిస్తోందని ఆరోపించారు. భారతమాత స్లోగన్స్, ముస్లిమ్‌లు దేశ భక్తులు కాదన్న వివాదాస్పద వ్యాఖ్యలు కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు, ఎమ్మెల్యేలు చేస్తోన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

సహజవనరులను కొల్లగొడుతున్న కేంద్రం.....

కేంద్ర ప్రభుత్వం సహజ వనరులను కొల్లగొడుతోందని పరాంజయ్‌ టకుర్తా ఆరోపించారు. ప్రజలకు చెందాల్సిన సహజవాయువు , ఖనిజ సందను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలకులు కేజీబేసిన్ గ్యాస్, ఆంత్రాక్స్ స్పేస్‌ను కారు చౌకగా అమ్మితే, బీజేపీ పాలకులు రైతుల భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానన్న ప్రధాన మోడీ ,ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. దేశంలో లౌకికతత్వాన్ని, సమగ్రతను, భిన్నాత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉందని మేధావులు అన్నారు. అందుకే ఐక్యప్రజా పోరాటాలను కొనసాగించాల్సిన అవసరముందని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కొత్తగూడెంలో బట్ట దుకాణంలో అగ్ని ప్రమాదం...

ఖమ్మం: కొత్తగూడెం గణేష్‌ టెంపుల్‌ రోడ్డులోని ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.ఫైర్‌ సిబ్బంది మంటలార్పారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది.

08:35 - April 23, 2016

విజయవాడ: వైసీపీకి మరోషాక్‌ తగిలింది. అనంతపురం జిల్లా కదిరి వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌ బాషా టీడీపీలో చేరనున్నారు. నేడు విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

08:33 - April 23, 2016

హైదరాబాద్ : ఏపీలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకిచెందిన 12మంది శాసనసభ్యులు అధికార పార్టీ గూటికి చేరారు. మరికొందరు ఇదే బాటలో నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. అయితే ఈ జంపింగ్‌లపై కొంత కాలం వరకూ సైలెంట్‌గాఉన్న వైసీపీ రూట్ మార్చింది.. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయించేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది.. పార్టీ ఫిరాయింపులపై సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వైసీపీ అరోపిస్తోంది.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని భావిస్తున్న వైసీపీ అధిష్ఠానం... ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలంటూ కేంద్రాన్ని కోరనుంది.

ఈ నెల 25న ఢిల్లీకి వెళ్లనున్న వైసీపీ ముఖ్య నేతలు.....

ఈ నెల 25న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.. నాలుగు రోజులపాటు అక్కడే మకాంవేసి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర ఎన్నికల కమిషనర్‌తోపాటు.. జాతీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులను కలవాలని భావిస్తున్నారు.. ముఖ్య నేతల అపాయింట్‌మెంట్‌కోసం ట్రై చేస్తున్నారు.. ఈనెల 25 సాయంత్రం రాష్ట్రప‌తిని, 26, 27 తేదీల్లో ప్రధాని మోడీని, 28న కేంద్ర ఎన్నిక‌ల క‌మిషనర్‌తోపాటు... సిపిఐ, సిపిఎం, జెడియు, స‌మాజ్ వాది పార్టీ, ఎన్‌సిపి, బిఎస్పీ, ఇత‌ర జాతీయ పార్టీల నేత‌ల‌తో భేటీ కావాలని చూస్తున్నారు.. ఈ విషయంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్న తమ డిమాండ్‌కు మద్దతివ్వాలని ఆయా పార్టీలకు విజ్ఞప్తి చేయనున్నారు..

ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీకి నిర్ణయం.....

అటు ఈ అంశంపై ఉద్యమానికి కూడా వైసీపీ సిద్ధమైంది.. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది.. ప్రలోభపెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలకు పసుపు కండువా కప్పుతున్నారని... ఈ విషయాన్ని ర్యాలీ ద్వారా ప్రజలకు చెప్పాలని పార్టీ నేతలను జగన్‌ ఆదేశించారు.. మొత్తానికి పార్టీ ఫిరాయింపులపై సీరియస్‌గాఉన్న వైసీపీ... అధికార పార్టీపై పోరుకు సిద్ధమైంది.. ఎలాగైనా టీడీపీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుదలగా ఉంది..

08:30 - April 23, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు అనైతిక రాజకీయ వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు ఈరోజు 11 గంటలకు వైఎస్‌ జగన్‌.. పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. రెండేళ్ల పాలనలో అవినీతికి పాల్పడి సంపాదించిన సొమ్ముతో పాటు విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు. బాబుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. అదేవిధంగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 'సేవ్‌ డెమొక్రసీ' పేరిట ఆందోళన కార్యక్రమాలకు వైసీపీ శ్రీకారం చుట్టింది. ఇక బాబు చర్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈరోజు సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శని నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. 

08:28 - April 23, 2016

నల్లగొండ : మునగాల మండలం ఆకుపాముల వద్ద లారీ బోల్తా పడింది. టైల్స్‌ లోడుతో వెళ్తున్న లారీ.. ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు మార్బుల్స్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ ఆకుపాముల గంగమ్మ గుడి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నేలచెరువు మండలం రేవూరుకు చెందిన షేక్‌ సైదా(36), నార్ల కొండస్వామి(40), మరొకరు మృతి చెందారు. కప్పలకుంటతండాకు చెందిన వెంకటనర్సయ్య, నందిగామకు చెందిన మరియదాస్‌(డ్రైవర్‌)లకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు మేళ్లచెరువు మండలం రేవూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

07:51 - April 23, 2016

హైదరాబాద్ : కమెడియన్ షకలక శంకర్ ఓ ఇంటివాడయ్యాడు. శ్రీకాకుళం అరసవల్లిలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా శుక్రవారం రాత్రి ఈయన పెళ్లి జరిగింది. శంకర్ తన మేనమామ కూతురు పార్వతిని పెళ్లి చెసుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కమెడియన్.. తండ్రి మొక్కు కారణంగా అరసవల్లిలో పెళ్లి చేసుకున్నానన్నాడు. సహచర నటులెవరినీ ఆహ్వానించలేదన్నారు. సూర్యనారాయణ స్వామి సన్నిధిలో కల్యాణ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం కంటే.. సేవా కార్యక్రమాలపై తన దృష్టి వుందన్నాడు. ఈక్రమంలో పుట్టిన గెడ్డ రుణం తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించాడు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 

07:33 - April 23, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు తప్ప.. ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదని 'న్యూస్ మార్నింగ్ చర్చ'లో పాల్గొన్న సీనియర్ విశ్లేషకులు వినయ్ కుమార్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశంలో కోర్టు విచారణ ఆహ్వానించతగినదేనా? రోజా అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేలను అవమానించేలా వ్యవహరించారా? పార్టీ ఫిరాయింపుల అంశంలో టిడిపికి రెండు విధానాలు అవలంభిస్తోందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో పార్టీ ఫిరాయింపులు పెరిగాయా? భారత్ మాతా కీ జై నినాదం చెయ్యనివారు దేశద్రోహులంటూ వల్లెవేస్తున్న బిజెపి.. దేశంలో మహిళలకు ఆ పార్టీ మంత్రులే ఇస్తున్న గౌరవం చూస్తే సభ్యసమాజాం తలదించుకునేలా ఉంది. మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ ఓ మహిళను అనుచితంగా తాకిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు వినయ్ కుమార్తో పాటు వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టి.టిడిపి నేత రాజారాం పాల్గొన్నారు. వారు ఎలాంటి అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఉప్పల్‌ స్టేడియంలో ఫ్రీ వైఫ్ సేవలు....

హైదరాబాద్ : ఉప్పల్‌ స్టేడియంలో ఫ్రీ వైఫ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్ అభిమానులు మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ వైఫ్ సేవలు పొందుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలో రిలయన్స్ జియో హైస్పీడ్ ఇంటర్నెట్ వైఫై సేవలు అందిస్తోంది. దీనితో క్రికెట్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు ఫోన్‌లో వైఫై సేవలు పొందుతున్నారు. 

టిడిపిలో చేరనున్న కదిరి ఎమ్మెల్యే

అనంతపురం : కదిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంక్షించే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా(వైకాపా) తెలిపారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.

27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఈసి అనుమతి

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి లైన్‌ క్లియర్‌ అయింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన పార్టీ ఆవిర్బావ దినోత్సవానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ..ప్లీనరీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఖమ్మం జిల్లాలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు.  

అగ్రిగోల్డ్ కేసులో బాధితులకు ఊరట

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసులో బాధితులకు ఊరట లభించింది. ప్రభుత్వ పెద్దల ఎత్తులు తారుమారయ్యాయి. ఎట్టకేలకు హాయ్‌లాండ్ అమ్మకానికి రంగం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశంతో సీఐడీ అగ్రిగోల్డ్‌కి సంబంధించిన విలువైన ఆస్తుల వివరాలను జ్యూడీషియల్ కమిటీకీ అందించింది. హాయ్‌లాండ్‌తో పాటు సీఆర్‌డీఏ పరిధిలోని విలువైన ఆస్తుల అమ్మకానికి దారులు తెరుచుకున్నాయి.  

పొత్తులపై దృష్టిపెట్టిన టీ కాంగ్రెస్‌ .....

ఖమ్మం : పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పొత్తుల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దృష్టిసారించింది. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మిక మృతితో వచ్చిన ఉప ఎన్నికల కావడంతో ఈ సీటును ఎలాగైనా కాపాడుకొని పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్‌ పార్టీ..ఎలాగూ సహకరించడంలేదు. ఇప్పటికే మంత్రి తుమ్మలను అభ్యర్థిగా ప్రకటించి పాలేరు పోరులో అందరికంటే ముందుంది టీఆర్‌ఎస్‌.

ఎన్టీఆర్‌ తనకు అత్యంత ఇష్టమైన నటుడు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ తనకు అత్యంత ఇష్టమైన నటుడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ గార్డెన్‌ ఎప్పటికీ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. గౌతమిపుత్ర శాతకర్ణి కథను ఎంచుకుని వందో చిత్రంగా నిర్మించడం అభినందనీయమని కేసీఆర్‌ అన్నారు. 

హైదరాబాద్‌లో మూడు పెద్దాసుపత్రులు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల తరహాలో హైదరాబాద్‌లో మూడు పెద్దాసుపత్రులను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వైద్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లోనూ మొదటి దశలో పెద్దాసుపత్రులను నిర్మించాలని కేసీఆర్‌ సూచించారు. ఒక్కో ఆస్పత్రి 760 పడకల సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. రెండేళ్లలో ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు.  

06:56 - April 23, 2016

కృష్ణా : ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయరంగంలో రాష్ట్రం ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌లో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని సీఎం తెలిపారు.

కృష్ణా జిల్లాలో బిబీ బిజీ పర్యటన....

కృష్ణాజిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా పర్యటించారు. కృష్ణా జిల్లా సూరంపల్లిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అనంతకుమార్‌, హన్స్‌రాజ్‌ గంగారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకోవాలని...

ప్రస్తుతం ప్లాస్టిక్‌ ఉపయోగం విపరీతంగా పెరిగిందని సీఎం అన్నారు. మెరుగైన పద్ధతుల్లో ప్లాస్టిక్‌ వాడకానికి సిపెట్‌ కృషి చేస్తుందన్నారు. వ్యవసాయంలో విప్లవం సాధించాలంటే ప్లాస్టిక్‌ అవసరమని చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకోవానలి చంద్రబాబు అన్నారు. ఉద్యోగ అవకాశాలున్న కోర్సులకు విద్యార్థులు ప్రాధాన్యమివ్వాలని, ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌లో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు.

ప్లాస్టిక్‌ను రైతులకు అనుసంధానం చేయాలి....

ప్లాస్టిక్‌ను రైతులకు అనుసంధానం చేయాలని కేంద్రమంత్రి అనంతకుమార్‌ సూచించారు. విజయవాడ సిపెట్‌లో అగ్రి ప్లాస్టిక్‌ఇంజినీర్లు తయారవుతారన్నారు. అనంతపురంలో మరో సిపెట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశంలో యూరియా కొరత లేకుండా చేసిన ఘనత ఎన్‌డీయే ప్రభుత్వానిదే అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

ఏపీలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం...

ఏపీలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి అనంతకుమార్‌ హామీ ఇచ్చారు. విశాఖలో ఫార్మా శిక్షణ సంస్థ నైపర్‌ ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతపురంలో సీపెట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

06:52 - April 23, 2016

పాలేరులో కాంగ్రెస్ పాట్లు...

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో పొత్తుల రాజకీయం ఊపందుకుంది. పాలేరు సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ పడరాని పాట్లు పడుతుంది. టీఆర్‌ఎస్‌ మినహా..ఇతర పార్టీల మద్ధతును కూడగట్టేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పాలేరులో పాగా వేసేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌..ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..దూసుకుపోతుంది.

పొత్తులపై దృష్టిపెట్టిన టీ కాంగ్రెస్‌ .....

ఖమ్మం : పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పొత్తుల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దృష్టిసారించింది. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మిక మృతితో వచ్చిన ఉప ఎన్నికల కావడంతో ఈ సీటును ఎలాగైనా కాపాడుకొని పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్‌ పార్టీ..ఎలాగూ సహకరించడంలేదు. ఇప్పటికే మంత్రి తుమ్మలను అభ్యర్థిగా ప్రకటించి పాలేరు పోరులో అందరికంటే ముందుంది టీఆర్‌ఎస్‌.

పార్టీల మద్దతు కోరేందుకు పడరాని పాట్లు ...

దీంతో ఏమీ చేయాలో తోచక మిగతా పార్టీల మద్దతును కోరేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. పాలేరులో తమకు మద్దతివ్వాలని టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..టి టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణతో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే టిడిపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించేందుకు టిడిపి సిద్ధమవుతోంది. ఇవాలో,.రేపో అభ్యర్థిని ఖరారు చేయబోతుంది. ఈ సమయంలో ఉత్తమ్‌ నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో తమ నాయకుడు చంద్రబాబుతో చర్చించి చెప్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు టి టిడిపి నేతలు విజయవాడకు వెళ్లి మంతనాలు జరిపారు. అయితే చంద్రబాబు బిజీ బిజీగా ఉండడంతో దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ మధ్యాహ్నంకల్లా పోటీపై ఓ స్పష్టత వస్తుందన్నారు.

మద్ధతివ్వాలని తమ్మినేని వీరభద్రంను కలిసిన మల్లు ...

ఇక సీపీఎం మద్ధతును కూడగట్టేందుకు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క కలిశారు. తమకు మద్దతివ్వాలని కోరగా..ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించిందని..టిడిపి కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీంతో తమ పార్టీ కూడా పోటీలో ఉంటుందని..కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వబోమని తమ్మినేని వీరభద్రం మల్లు భట్టి విక్రమార్కకు స్పష్టం చేశారు. సీపీఎంకు పాలేరు బలమైన స్థానమని ఖచ్చితంగా పోటీచేస్తామన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ..కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. మల్లు భట్టి విక్రమార్క..మాజీ విప్‌ అనిల్‌లు వైసిపి అధినేత జగన్‌ను కలిశారు. ఈ భేటీలో వైసిపి తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చనిపోయిన స్థానాల్లో వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసిపి నిర్ణయించిందని పొంగులేటి భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. అందులో భాగంగానే పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ..పాలేరులో మద్దతు ప్రకటించడంపై పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు.

పాలేరు ఉప ఎన్నికతో వేడెక్కి రాష్ట్రరాజకీయం...

మొత్తానికి పాలేరు ఉప ఎన్నిక రాష్ట్రంలో మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. పాలేరును కైవంస చేసుకునేందుకు అటు అధికార పార్టీ...ఇటు ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మరి పాలేరు పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. అయితే పాలేరులో అధికార పార్టీని ఢీకొట్టి ఒంటరిగా గెలవడం కష్టమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 

06:48 - April 23, 2016

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. సస్పెన్షన్ రద్దు కానప్పటికీ అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అవకాశం దొరికింది.. రోజా లేఖపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.. లేకపోతే తామే విచారణ జరుపుతామని ప్రకటించింది.. తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది..

రోజా వివరణ లేఖను కోర్టుకు అందజేసిన లాయర్‌ ఇందిరా జైసింగ్......

సుప్రీంకోర్టులో రోజా కేసుపై రెండోరోజూ వాదనలు కొనసాగాయి... ఈ సందర్భంగా రోజా స్పీకర్‌కు రాసిన లేఖను ఆమె తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు అందజేశారు.. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా వ్యాఖ్యలు చేయలేదని, సభనుగానీ, సభ్యులనుగానీ కించపరచలేదని రోజా లేఖలో స్పష్టం చేశారు.. ఒకవేళ సభను అవమానించినట్లు భావిస్తే... వాటిని ఉపసంహరించుకుంటానని వెల్లడించారు.

లేఖపై అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశం.....

రోజా తరపు లాయర్‌ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ లేఖపై అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది.. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారా? తదుపరి సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారా? అన్నది అసెంబ్లీయే తేల్చుకోవాలని సూచించింది.. ఈ విషయంపై స్పందించకపోతే సస్పెన్షన్‌పై తామే విచారణ జరుపుతామని పేర్కొంది.

రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించడం లేదన్న ఇందిరా జైసింగ్....

గత డిసెంబర్లో సస్పెన్షన్‌ తరువాత రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వడంలేదని ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు.. ఈ అంశంపై కోర్టు సీరియస్‌గా స్పందించింది.. రోజాను సభ ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించింది.. సభ ప్రాంగణంలోకి మాజీ ఎమ్మెల్యేలతోపాటు.. పలువురికి వెళ్లే అవకాశం ఉంటుందని... అలాంటిది ఎమ్మెల్యే అయిన రోజాను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది.. ఒకవేళ అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకపోతే తాము తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.. తరువాతి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది..

కోర్టు ఆదేశాల పై రోజా సంతోషం...

కోర్టు ఆదేశాలపై రోజా సంతోషం వ్యక్తం చేశారు.. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలపై స్పీకర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.. 

06:44 - April 23, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి లైన్‌ క్లియర్‌ అయింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన పార్టీ ఆవిర్బావ దినోత్సవానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ..ప్లీనరీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఖమ్మం జిల్లాలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు.

పాలేరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ....

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికార పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ప్లీనరీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో..అధికార పార్టీ దాదాపు నెల రోజుల క్రితమే ప్లీనరీ, బహిరంగ సభలను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం పాలేరు ఉప ఎన్నికకు షెడ్యుల్ విడుదల చేయడంతో ప్లీనరీ, బహిరంగ సభలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన టిఆర్ఎస్...

పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ప్లీనరీ, బహిరంగ సభలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ప్లీనరికి అనుమతి ఇవ్వొద్దని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందచేసింది. అయితే రెండు లేఖలను రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపింది. చివరకు రెండు లేఖల్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌...టీఆర్‌ఎస్‌ ప్లీనరికి నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో ప్లీనరిని యధాతధంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లలో మునిగిపోయింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 27న జరిగే ప్లీనరిలో ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.

ఈసీ అనుమతితో తొలగిన అనుమానాలు...

టీఆర్‌ఎస్‌ ప్లీనరికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనమతి ఇవ్వడంతో..ఇప్పటివరకున్న అనుమానాలన్నీ తొలగి పోయాయి. అయితే ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో పాలేరు నియోజకవర్గం ఉండడంతో...పలు షరతులను ఎన్నికల కమిషన్ విధించింది. అందుకు లోబడి ప్లీనరీ, బహిరంగ సభలను నిర్వహించుకోవాలని సూచించింది. అధికార పార్టీ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమానికి అధికార యంత్రాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించుకోరాదని తేల్చి చెప్పింది.

06:42 - April 23, 2016

హైదరాబాద్ : ప్రజలతో మమేకమై కలిసి పనిచేస్తేనే సత్ఫలితాలు సాధిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొత్తగా ఎంపికైన ఏఈఈలకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా..యువ ఇంజనీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కష్ఠపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని యువ ఇంజనీర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

124 మంది ఏఈఈలకు నియామక పత్రాలు...

హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లో సీడీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్‌లో కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 124 మంది ఏఈఈలకు నియామక పత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా యువ ఇంజనీర్లకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. కొత్త ఉద్యోగాలు సాదించిన వారికి అభినందనలు తెలిపిన మంత్రి,.ఇష్టపడి ఎంచుకున్న ఉద్యోగంలో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా మున్సిపల్ ప్రాంతాల్లో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్న మంత్రి..ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని వారికి సూచించారు. నగరం, పట్టాణాల్లో శానిటేషన్ విషయంలో మరింత శ్రద్ధ చూపించాలన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు సూచించే సలహాలు స్వీకరించాలి .....

ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు సూచించే సలహాలు సహృదయంతో స్వీకరించాలన్నారు యువ ఇంజినీర్లకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ప్రజల నుంచి వచ్చిన వారికి ప్రజల అవసరాలు ఎక్కువ తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారితో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోతుందని..ప్రభుత్వ ఆలోచన విధానం మేరకు ప్రజా సేవే పరమావధిగా ఉద్యోగం చేయాలని సూచించారు. సమయ పాలన, ప్రజల పట్ల చిత్తశుద్ది, వినూత్న పరిష్కార మార్గాల ద్వారా ఉద్యోగాలు నిర్వర్తించే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ..సరికొత్త దిశలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉన్నదన్న మంత్రి..ఇందుకు అందరు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ....

కొత్త రాష్ట్రం తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలవాలంటే ఇలాంటి యువ ఇంజినీర్లు తమ ప్రతిభకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ యువ ఇంజినీర్లకు సూచించారు. 

06:38 - April 23, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు సుధీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద కేంద్రప్రభుత్వం నిధులు అందించనున్న 11 ప్రాజెక్టులపై చర్చించారు. అందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను, ఈనెలాఖరులోపు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.

జలసంఘం అధికారులతో సమన్వయం చేసుకొని...

పీఎంకేఎస్‌వై పథకం కింద నిధులు అందనున్న ప్రాజెక్టుల స్టేటస్‌పై మంత్రి హరీశ్‌రావు, ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించారు. కేంద్ర జలసంఘం అధికారులతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.ఈ ప్రతిపాదనలను ఓవైపు కేంద్రానికి పంపుతూనే ,మరోవైపు మిషన్‌కాకతీయ రెండోదశ కింద వివిధ పనులను చేపట్టాలని సూచించారు. పీఎంకేఎస్‌వై కింద గతంలో దేవాదుల ప్రాజెక్టు మాత్రమే ఉండగా , తాను జలసమన్వయ కమిటీ సభ్యుడిగా ఉండి కొమరంభీమ్‌, గొల్లవాగు, రెల్లివాగు, మత్తడివాగు జగన్నాధ ప్రాజెక్టు , పాలెంవాగు ప్రాజెక్టులను చేర్చినట్లు మంత్రి గుర్తు చేశారు.

జిల్లా సాగునీటి ప్రణాళికలను వెంటనే పంపించాలని మంత్రి ఆదేశాలు......

జిల్లా సాగునీటి ప్రణాళికలను కూడా వెంటనే తయారు చేసి పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆరు జిల్లాల సాగు నీటి ప్రణాళికలు పూర్తయ్యాయని, మిగతా ఐదు జిల్లాల ప్రణాళికలు పంపించాలని సూచించారు. ఈ 11 ప్రాజెక్టులపై కేంద్ర జలసంఘం ప్రాంతీయ అధికారులు, చీఫ్‌ఇంజనీర్లు కలిసికట్టుగా పనిచేసి అన్ని ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ వచ్చేలా కృషి చెయ్యాలని కోరారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరదకాలువ, దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ రెండోదశ, పాలెంవాగు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు చీఫ్‌ఇంజనీర్లు, కేంద్ర జలసంఘానికి మూడు రోజుల్లో నివేదిక పంపించాలని మంత్రి ఆదేశించారు. పీఎంకేఎస్‌వై కింద చేపట్టనున్న ఈ 11 ప్రాజెక్టులు 2017 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సిన అవసరముందని మంత్రి స్పష్టం చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులపై అధికారులకు ఆదేశాలు......

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఐదు మధ్యతరహా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు, ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి 4 రోజుల్లో కేంద్రానికి నివేదిక పంపించాలని మంత్రి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి మరో వెయ్యి ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులు సత్వరం జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

06:36 - April 23, 2016

విజయవాడ :ఈ నెల 25న ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవానికి మహూర్తం ఖరారైంది. ఉదయం 4 గంటల 01 నిమిషానికి తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఆరు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో.. ముందుగానే సచివాలయాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రినారాయణ తెలిపారు. జూన్ లో 4 వేల మంది, జూలైలో 3 వేల మంది ఉద్యోగులను విజయవాడకు తరలిస్తామని ఆయన తెలిపారు. నగరంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు మే 1 నుంచి ప్రతి రోజు మంచినీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. 

06:33 - April 23, 2016

ఢిల్లీ : రాజ్యసభకు పలు రంగాలకు చెందిన ఆరుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజీత్ సింగ్ సిద్ధూ, మహిళా బాక్సర్ మేరీ కోమ్, మలయాళం నటుడు సురేష్ గోపి, పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా, ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్‌ పేర్లను ప్రభుత్వం రాష్ట్రపతికి పంపించింది. వీరిని రాష్ట్రపతి ఎగువసభకు నామినేట్‌ చేశారు. 

ఆకుపాముల వద్ద లారీ బోల్తా : ముగ్గురి మృతి

నల్గొండ : మునగాల మండలం ఆకుపాముల వద్ద లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు మేళ్ల చెరువు మండలం రేవూరు వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

Don't Miss