Activities calendar

24 April 2016

21:58 - April 24, 2016

హైదరాబాద్ : కరవు కరాళ నృత్యం చేస్తోంది. జలవనరులన్నీ ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. జలమండలి సరఫరా చేసే నీటికీ  దిక్కులేదు. వెరసి గొంతు తడుపుకునేందుకు గుక్కెడు  నీళ్ల కోసం ప్రజలు పరితపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేదో మారుమూల పల్లెటూరిలో నెలకొన్న పరిస్థితి కాదు.. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న కాప్రాలో నెలకొన్న దుస్థితి. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తున్న కాప్రాలోని మంచినీటి ఎద్దడిపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
నిలిచిపోయిన 165 ఎంజీడీల నీరు 
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావం కారణంగా జంటనగరాలకు మంచినీరు అందించే జలాశయాలన్నీఎండిపోయి మైదానాలను తలపిస్తున్నాయి. మంజీర, సింగూరు నదులు ఎండిపోయాయి. గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాలదీ అదే పరిస్థితి. ఈరెండు ప్రాంతాల నుంచి అందే 165 ఎంజీడీల నీరు పూర్తిగా నిలిచిపోయింది. కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్న నీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. తీవ్ర కరవుతో భూగర్భ జల మట్టాలు  పాతాళానికి పడిపోయాయి. ఒకప్పుడు 60 అడుగుల లోతులో పుష్కలంగా నీరు లభించేంది. ఇప్పుడు 15 వందల నుంచి 2 వేల అడుగుల లోతులో  కూడా పాతాళ గంగ జాడేలేదు. దీంతో బోర్లన్నీ ఎండిపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా మంచినీటి ఎద్దడి ఏర్పడింది. దాహంతో జనం అల్లాడుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
కాప్రా సర్కిల్‌కు 16 నీటి ట్యాంకర్ల కేటాయింపు 
నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఉన్న నీటిని సర్దుబాటుచేసి జనాల గొంతు తడపాల్సిన జలమండలి అధికారులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.  వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కాప్రా సర్కిల్‌కు 16 ట్యాంకులు కేటాయించారు. కానీ ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి కూడా పక్కదారి పడుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. కాప్రా పరిధిలోని ఇందిరానగర్‌లో 21 ఇళ్లకు పది రోజులకు ఒక ట్యాంకర్‌ పంపుతున్నారని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. వేసవిలో  నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. కానీ కాప్రా సర్కిల్‌ అధికారులు ఇంతవరకు ఈ ప్రయత్నమే చేయలేదని వీరి మాటల్లోనే తేలుతోంది. మరోవైపు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోపోతే వాటర్‌ వర్క్స్ సర్కిల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. 
నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి : కాప్రా వాసులు
నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కాప్రా వాసులు కోరుతున్నారు. ఈ ప్రాంతానికి కేటాయించిన ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని కోరుతున్నారు.  

కోల్ కతా విజయలక్ష్యం 161 పరుగులు

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా కొల్‌కతా, పుణెల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పుణె నిర్ణీత 20 వోవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగుల చేసింది. కోల్ కతా విజయలక్ష్యంగా 161 పరుగులుగా ఉంది.  

 

21:43 - April 24, 2016

ఢిల్లీ : క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఈరోజు 43వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. భారత క్రికెట్ కు 22 దశాబ్దాలపాటు అసాధారణ సేవలు అందించిన సచిన్ ప్రస్తుతం రిటైర్మెంట్ జీవితాన్ని కుటుంబానికే అంకితం చేశాడు. క్రికెటేతర క్రీడలు ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్ లాంటి క్రీడలను ప్రోత్సహిస్తూ..రాజ్యసభ్యుడిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండుదశాబ్దాల తన అంతర్జాతీయ క్రికెట్ జీవితంలో సచిన్ డజనకు పైగా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా 200 టెస్టులు ఆడి ..51 సెంచరీలతో పాటు 15 వేల 921 పరుగులతో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఇక..వన్డే క్రికెట్లో అత్యధికంగా  463 మ్యాచ్ లు ఆడి 49 సెంచరీలతో పాటు 18 వేల 426 పరుగులు నమోదు చేసి తనకు తానే సాటిగా నిలిచాడు.
వన్డే క్రికెట్లో పదిహేను, ఓవరాల్ గా 62సార్లు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డులు అందుకొన్న ఒకే ఒక్క క్రికెటర్ మాస్టర్ సచిన్ మాత్రమే. అభినవ బ్రాడ్మన్ సచిన్ కు..ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులతో పాటు...10 టీవీ సైతం జన్మదినశుభాకాంక్షలు చెబుతోంది...

 

21:40 - April 24, 2016

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పితంపురా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టీవీ టవర్‌ సమీపంలోని భవనం నుంచి ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. దాదాపు మూడు అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

 

21:36 - April 24, 2016

హైదరాబాద్ : ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఊపందుకుంది. ఇప్పటికే 13మంది వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోగా..మ‌రి కొంత‌మంది ఎమ్మెల్యేలు ఈ నెలాఖరులోగా టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 27నుండి  మూడు రోజులపాటు మంచి  రోజులు ఉండటంతో..ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ముందుగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇక ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు  పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. 
వలసల జోరు 
ఏపీలో పసుపు గాలి వీస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్‌పై సవారీ చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే  13మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేర‌గా మ‌రికొంద‌రు ఈ నెలాఖ‌రులో పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 27,28,29 తేదీల్లో మంచి రోజులు ఉండటంతో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మార‌డానికి  సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ముందుగా  ప్రకాశం జిల్లా అద్దంకి  ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌ ఈ నెల 27న టీడీపీలో చేరుతున్నారు. ఆ రోజు విజ‌య‌వాడ‌లో సీఎం చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక గొట్టిపాటి ర‌వితో పాటు  అదే రోజు క‌ర్నూల్ జిల్లాకు చెందిన శ్రీ‌శైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా టిడిపిలో చేర‌నున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 28న విశాఖ జిల్లాకు చెందిన అర‌కు ఎమ్మెల్యే స‌ర్వేశ్వరరావు కూడా టిడిపిలో చేరనున్నారు. వీరంతా కూడా ఇప్పటికే టిడిపి నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారు. మే నెల నుండి  మంచి  రోజులు లేక‌పోవ‌డంతో ఈ నెల‌లోనే పార్టీలోకి జంప్‌ అవ్వాలని వీరంతా భావిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీలో చేరిన 13మంది వైసిపి ఎమ్మెల్యేలు 
ఇక వీరే కాక మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు కూడా చినబాబు లోకేష్‌,.ఏపీ టీడీపీ అధ్యక్షుడు క‌ళా  వెంక‌ట్రావుతో ట‌చ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు త్వరలోనే టిడిపిలో చేర‌నున్నట్లు తెలుస్తుంది. ముందుగా ప్రకాశం, క‌ర్నూలు జిల్లాల‌పై టిడిపి దృష్టి సారించింది. ఆ తర్వాత నెల్లూరు, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల‌పై దృష్టిసారించ‌నుంది. వైసిపిలో ఉన్న బ‌ల‌మైన నేత‌ల‌ను పార్టీలోకి తీసుకుని పార్టీని మరింత బ‌లోపేతం చేయాల‌ని చంద్రబాబు ఆలోచిస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు.
లోకేష్‌, కళాతో టచ్‌లో ఉన్న నేతలు 
మొత్తానికి ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్పీడు చూస్తుంటే రానున్న రోజుల్లో చాలా మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే రాబోయే రోజుల్లో వైసిపి మొత్తం ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

21:27 - April 24, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. నిధులు, భూసేకరణ సమస్యలు లేనందున సాగునీటి ప్రాజెక్టుల్ని వేగంగా  పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల పథకంపై ప్రధానంగా చర్చించారు.
పాలమూరు ఎత్తిపోతలపై సర్కార్‌ ఫోకస్‌ 
పాలమూరు ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో..  సీఎం కేసీఆర్‌..పాలమూరు ఎత్తిపోతల పథకంపైనే ప్రధానంగా చర్చించారు. కరవు పీడిత, వలస బాధిత పాలమూరు జిల్లా రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వం మొదటి లక్ష్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తి కావడంతో ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, రంగారెడ్డి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
బడ్జెట్‌లో రూ. 25వేల కోట్లు కేటాయింపు 
బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు ఏకంగా 25వేల కోట్లను కేటాయించామని..మంత్రి హరీష్‌రావు చొరవతో కేంద్రం కూడా దాదాపు 3వేల కోట్లను మంజూరు చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే భూసేకరణ 60శాతం పూర్తయిందని..మిగతా భూసేకరణ కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇన్‌ టేక్‌ వెల్‌, పంప్‌హౌజ్‌లు, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెల్‌ల నిర్మాణం సమాంతరంగా జరగాలన్నారు. వీటికి సంబంధించిన డిజైన్లను కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు. రిజర్వాయర్ల సామర్థ్యాన్ని కూడా నిర్మాణాలకు అనుగుణంగా క్రమంగా పెంచుకుంటూ పోవాలన్నారు. కాలువల నుండి రిజర్వాయర్లకు నీరు పంపే క్రమంలోనే మధ్యలో ఉన్న చెరువులను నింపుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. 
నార్లాపూర్‌ వద్ద పంప్‌హౌజ్‌ 
ఇక నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌తో పాటు కరివెన, వట్టెం, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్లను 24నెలల్లో పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అంతారం రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచి కేవలం రంగారెడ్డి జిల్లాకు మాత్రమే డెడికేటెడ్‌గా దానిద్వారా నీరందించాలన్నారు. రెండున్నరేళ్లలో అన్ని నిర్మాణాలు పూర్తయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు దాదాపు 8లక్షల ఎకరాలకు నీరందుతుందని,.కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులు పూర్తితో మరో 7లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. దీంతో జిల్లాలో వలసలు ఆగిపోతాయని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

అనంతపురం జిల్లాలో అతిపెద్ద సోలార్ పార్క్

అనంతపురం : ఎపిలో సోలార్ వెలుగులు చిమ్మనున్నాయి. జిల్లాలో అతిపెద్ద సోలార్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నారు. కాలుష్య రహిత విద్యుత్ అందుబాటులో రానుంది. ఎంపీకుంటలో 1500 మె.వా. సౌర విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ నెలలో మొదటిదశలో 200 మె.వా. సౌర విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. 

లిఫ్టులో ఊపిరాడక డిగ్రీ విద్యార్థిని మృతి

అనంతపురం : సాయినగర్ ఎస్ వీ డిగ్రీ కాలేజీ హాస్టల్ లో లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. దీంతో లిఫ్టులో ఊపిరాడక డిగ్రీ విద్యార్థిని వాసంతి మృతి చెందారు. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవానికి సహకరించాలన్న సుచరిత

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్ కు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత లేఖ రాశారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు సహకరించాయని, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా సహకరించాలని కోరారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాకు మరువలేని సేవలు చేశారని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పుణె..

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా కొల్‌కతా, పుణెల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో పుణె తొలి వికెట్‌ కోల్పోయింది. ప్లెసిస్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 

 

టిఎంసి ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌పై ప్రకాశ్ కారత్‌ ఫిర్యాదు

ఢిల్లీ : మందిర్‌ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో టిఎంసి ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌పై సిపిఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్‌ ఫిర్యాదు చేశారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి తృణమూల్ కాంగ్రెస్‌ ఫేస్‌బుక్‌లో పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులు పొలాలకు నీరందిచాలన్నారు. నిధులకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పత్తి ధరలు పడిపోతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పత్తిపంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. 

 

20:30 - April 24, 2016

2019వ సంవత్సరంలో వైసీపీదే అధికారమని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.. 'ఎవరి ప్రయోజనాల కోసం వారు పార్టీ మారుతున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ మారడం తప్పుకాదు. కానీ ఎథిక్స్ ఉండాలి. పదవులకు రాజీనామా చేసి.. పార్టీని వీడాలి. పోటీ చేసి మళ్లీ గెలవాలి. వైసీపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు వెళ్లిపోయినా...ఇబ్బందేమీ లేదు. నష్టం జరుగదు. సుజయకృష్ణ రాంగారావు పార్టీ వీడిపోవడానికి నాకు సంబంధం లేదు. రాజకీయాల కంటే ప్రజలు, వ్యవస్థ ముఖ్యం. టీడీపీ తత్వం.. మోసం, దగా. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. అసెంబ్లీలో విలువలు లేవు. అధికార పార్టీ సభ్యులు నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ, ఎన్నికల్లో పోటీ అంశాన్ని ప్రస్తావించగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎన్నికల్లో పాల్గొనవచ్చు అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి...

రంగారెడ్డి : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దురు మృతి చెందారు. జిల్లాలోని సదాశివపేట వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

 

20:14 - April 24, 2016

ఢిల్లీ : మందిర్‌ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో టి.ఎం.సి ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌పై సిపిఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్‌ ఫిర్యాదు చేశారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి తృణమూల్ కాంగ్రెస్‌ ఫేస్‌బుక్‌లో పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

20:04 - April 24, 2016

కాకినాడ : సిఐటియూ తూర్పుగోదావరి జిల్లా మహాసభలు కాకినాడలో ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ  రంగాల కార్మికులు వేలాదిగా పాల్గొన్నారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలతో పాటు గ్రామసేవకులు,  104, 108 మెడికల్ అండ్ హెల్త్ విభాగాలకు చెందిన సంఘటిత, అసంఘటిత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్య మండలి కళాకారుల  చప్పుళ్లు, కోలాటం, డాన్స్ లలో సాంస్కృతిక సంబరాలు మిన్నంటాయి. 

 

20:01 - April 24, 2016

ఢిల్లీ : రాష్ట్ర అభివృద్థిని పట్టించుకోకుండా, పక్క పార్టీనేతలను లాక్కోవడంపైనే ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెడుతున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికే 13మంది వైసీపీ సభ్యులను తీసుకున్న టీడీపీ, మరికొంతమందిని లాక్కోవడానికి చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్నిసమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఇప్పుడున్న అనైతిక చర్యలను ప్రధానికి,రాష్ట్రపతికి వివరిస్తామని తెలిపారు. 

19:59 - April 24, 2016

ఢిల్లీ : ఏపీలో కొత్త హైకోర్టు రాబోతోందని దాన్ని విభిన్నంగా నిర్మించేలా ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని విజ్ఙాన్ భవన్‌లో సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులు సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలు కల్పించే విషయమై సభికుల పట్ల సానుకూలత వ్యక్తమైంది.  

 

19:55 - April 24, 2016

ఢిల్లీ : రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు జరిపేలా చూడాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరినట్లు టిడిపి ఎంపి తోట నరసింహం అన్నారు. విభజన చట్టానికి సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించాలని అన్నారు. ఏపీ అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు తోట నర్సింహం తెలిపారు. 

 

19:52 - April 24, 2016

విజయవాడ : ప్రతిపక్ష నేత జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈమేరకు ఆయన విజయవాడలో వీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తిచేసి 2018కి నీరు వచ్చేలా చూస్తామని చెప్పారు. జగన్ ధోరణి నచ్చక ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని విమర్శించారు. 

 

19:46 - April 24, 2016

రంగారెడ్డి : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దురు మృతి చెందారు. జిల్లాలోని సదాశివపేట వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

 

బెంగుళూరుపై గుజరాత్ విజయం

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా కోల్ కతా, బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగుళూరుపై గుజరాత్ విజయం సాధించింది. బెంగుళూరు నిర్ణీత వోవర్లలో రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గుజరాత్  నిర్ణీత వోవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోహ్లి బెంగుళూరును ఆదుకోలేదు. 

19:29 - April 24, 2016

 ఢిల్లీ : తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా విభజన చట్టంలోని అంశాలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని టిఆర్ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని తాము లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు చెప్పామని ప్రతి విషయంలోనూ రేపు మాపు అంటూ కేంద్రం తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో అమలవుతున్న ఆడ్‌-ఈవెన్ ఫార్ములా నుంచి ఎంపీలకు మినహాయింపు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు జితేందర్ ఢిల్లీలో అన్నారు. 

 

ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

ఖమ్మం : ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరనున్నారు. ఎమ్మెల్యే పువ్వాడతోపాటు ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ బాబు టీఆర్ ఎస్ లో చేరనున్నారు. 

 

హన్మకొండ ఎస్ఆర్‌ ఎడ్యుకేషన్ సెంటర్ లో దారుణం..

వరంగల్ : హన్మకొండ సుబేదార్‌లోని ఎస్ఆర్‌ ఎడ్యుకేషన్ సెంటర్ విద్యార్థి హసన్‌పర్తి సమీపంలోని ఎల్లాపూర్‌ వద్ద అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్‌కు చెందిన మహిపాల్‌గా  గుర్తించారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కాలేజీ ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు. 

 

18:16 - April 24, 2016

కోల్ కతా : ఓట్ల కోసం కోటి విద్యలు ప్రదర్శించడం రాజకీయాల్లో మామాలే. అయితే, పశ్చిమబెంగాల్ సమరంలో విలువలు మరీ దిగజారుతున్నాయి. అబద్ధాలను నిజాలుగా భ్రమింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం తృణమూల్ కాంగ్రెస్ ఫేస్ బుక్ లో పెట్టిన ఫోటోయే. 
బిజెపి, సిపిఎం చేతులు కలిపాయంటూ మమతాబెనర్జీ ఆరోపణలు
చూశారా. ఆశ్చర్యంగా వుంది కదా.  సిపిఎం అగ్ర నేతల్లో ఒకరైన ప్రకాష్ కారత్ కి, బిజెపి ముఖ్యనేతల్లో ఒకరైన కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్  స్వీట్ తినిపిస్తున్నట్టు గా కనిపిస్తున్న ఈ ఫోటో. 
తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫేస్‌ బుక్‌ లో ప్రత్యక్షం
ఈ ఫోటో టీఎంసీ పార్టీ ఫేస్‌ బుక్‌ లో ప్రత్యక్షమైంది.  తనను ఓడించడానికి బిజెపి, సిపిఎం చేతులు కలిపాయంటూ మమతాబెనర్జీ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే ఇలాంటి ఫోటో కనిపించడం ఆసక్తికరమే కదా. అయితే, ఈ ఫోటోను చూసిన బిజెపి, సిపిఎం అసలు సంగతి బయటపెట్టాయి.  అసలు తానెప్పుడూ రాజ్ నాధ్ సింగ్ ను కలవనేలేదన్నారు ప్రకాశ్ కారత్.  ఇది వర్జినల్ ఫోటో కాదంటూ ప్రకటించింది బిజెపి. 
తృణమూల్ కాంగ్రెస్ బుకాయింపు
ఇంటర్నెట్ లో దొరికిందంటూ తృణమూల్ కాంగ్రెస్ బుకాయించింది. బిజెపి నేతలు అసలు ఫోటోను బయటపెట్టారు. స్వీట్ తినిపిస్తున్న నాయకుడు అక్షరాలా రాజ్ నాధ్ సింగే. కాకపోతే, ఆయన స్వీట్ తినిపించింది ప్రకాశ్ కారత్ కి కాదు. నరేంద్ర మోడీకి. ఎప్పుడో మూడేళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండి, బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో 2013  లో నరేంద్రమోడీకి రాజ్ నాధ్ సింగ్ స్వీట్ తినిపించిన ఫోటో అది. దానినే ఇప్పుడు ఇలా తలలు మార్చేసి, మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పెట్టింది త్రుణమూల్ కాంగ్రెస్. అసలు ఫోటో బయటపడడంతో ఇక తప్పదన్నట్టు ఫేస్ బుక్ నుంచి తొలగించిన త్రుణమూల్ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పింది.

18:01 - April 24, 2016

ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 9వ సీజన్‌లో పూణే రైజింగ్‌ జెయింట్స్ జట్టు అతి పెద్ద సవాల్‌కు సిద్ధమయ్యింది. ధనా ధన్‌ ధోనీ నాయకత్వంలోని పూణే టీమ్‌...హోంగ్రౌండ్‌లో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో అమీతుమీకి సిద్ధమైంది. వరుస ఓటములతో ఢీలా పడ్డ జెయింట్స్‌ జట్టు ఈ మ్యాచ్‌తో అయినా సక్సెస్‌ ట్రాక్‌లో పడాలని పట్టుదలతో ఉంది. రాత్రి 8 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది...
వరుస ఓటములతో పూణే జట్టు డైలమా 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 9వ సీజన్‌లో పూణే రైజింగ్‌ జెయింట్స్ జట్టు మరో సమరానికి రెడీ అయింది. హోంగ్రౌండ్‌లో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో పోటీకి ధనా ధన్‌ ధోనీ నాయకత్వంలోని పూణే టీమ్‌ సిద్ధమైంది. వరుస ఓటములతో పూణే జట్టు డైలమాలో పడగా.....మరోవైపు గౌతమ్‌ గంభీర్‌ సారధ్యంలోని నైట్‌రైడర్స్ జట్టు బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో జోరు మీదుంది. 
ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన పూణే  
ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ధోనీ నాయకత్వంలోని రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్ జట్టు... ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. కానీ ఆ తర్వాత వరుసగా గుజరాత్‌, పంజాబ్‌ కింగ్స్ , రాయల్‌ చాలెంజర్స్ బెంగళూర్‌ జట్లను అధిగిమించడంలో విఫలమైంది. రహానే, ఫాఫ్‌ డు ప్లెసి, స్టీవ్‌ స్మిత్‌, ధోనీ, తిసెరా పెరీరా వంటి పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన పూణే జట్టు...ఇప్పటివరకూ ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో చెలరేగింది లేదు. ఓపెనర్‌ ఫాఫ్‌ డు  ప్లెసి, రహానే నిలకడగా రాణిస్తున్నా.....మిగతా బ్యాట్స్‌మెన్‌ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతుండటంతో పూణే జట్టు బ్యాటింగ్‌లో నిలకడలేమితో సతమతమవుతోంది. డాషింగ్‌ బ్యాట్స్ మెన్‌  కెవిన్‌ పీటర్సన్‌ కాలి కండరాల గాయం కారణంగా..... జట్టుకు దూరమవ్వడం పూణే జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇక బౌలింగ్‌లో మురుగన్‌ అశ్విన్‌ ఇప్పటికే 6 వికెట్లు పడగొట్టి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పరుగులివ్వకుండా కట్టడి చేస్తున్నా....వికెట్లు తీయడంలో మాత్రం విఫలమవుతున్నాడు.ఇషాంత్‌, అంకిత్‌లతో కూడిన పూణే పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ సైతం బలహీనంగానే ఉంది. రహానే, స్టీవ్‌ స్మిత్‌లలో ఏ ఒక్కరూ క్రీజ్‌లో పాతుకుపోయినా ఎంతటి విధ్వంసం సృష్టిస్తారో అందరికీ తెలిసిందే. లోయర్‌ ఆర్డర్‌లో ధోనీ తనదైన స్టైల్‌లో చెలరేగితే పూణే జట్టుకు తిరుగుండదు.   
కోల్‌కతా జోరు
ఇక రెండు సార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్రస్తుతం జోరు మీదుంది. ఇప్పటివరకూ ముగిసిన 4 లీగ్‌ మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన నైట్‌రైడర్స్‌ జట్టు  అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్ సూపర్‌ ఫామ్‌లో ఉంటడంతో పాటు....మిగతా బ్యాట్స్‌మెన్‌ సైతం రాణిస్తుండటంతో కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ఇక సునీల్‌ నరైన్‌, మోర్నీ మోర్కెల్‌, ఆండ్రీ రస్సెల్‌, పియూష్‌ చావ్లా, ఉమేష్‌ యాదవ్‌లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ సైతం ధీటుగా ఉంది. మరోసారి సమిష్టిగా రాణించి పూణే రైజింగ్‌ జెయింట్స్ ను చిత్తు చేయాలని కోల్‌కతా జట్టు తహతహలాడుతోంది. 
పూణేలో మ్యాచ్ 
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సమరంలో .....ఏ జట్టు నెగ్గుతుందో చూడాలి. హ్యాట్రిక్‌ ఓటములతో ఢీలా పడ్డ రైజింగ్‌ పూణే జెయింట్స్‌ జట్టు....ఈ మ్యాచ్‌తో అయినా సక్సెస్‌ ట్రాక్‌లో పడాలని పట్టుదలతో ఉంది. 

 

17:51 - April 24, 2016

వరంగల్ : ప్రైవేట్ కళాశాలలు మృత్యు కూపాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలో విద్యార్థుల మరణాలు వరసుగా చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు లాంటి ఘటనలు తరచుగా చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే హన్మకొండ సుబేదార్ లోని ఎస్ ఆర్ ఎడ్యుకేషన్ సెంటర్ లో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థి అదృశ్యమై... అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా సుస్నాబాద్ కు చెందిన మహిపాల్ నాయక్ హన్మకొండ సుబేదార్ లోని ఎస్ ఆర్ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనేపథ్యంలో మహిపాల్ ఇంటర్ లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. దీంతో అతను తీవ్రమనస్తాపం చెందాడు. ఫెయిల్ కావడంతో మహిపాల్ ముబావంగా ఉంటున్నాడు. కాలేజీ యాజమాన్యం అతనికి కౌన్సిలింగ్ కు ఇచ్చింది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే మహిపాల్ కాలేజీ అదృశ్యమయ్యాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ తెలిపాలని కోరుతూ కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇంతలోనే హసన్ పర్తి సమీపంలోని ఎల్లాపూర్ వద్ద రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహం లభ్యమైంది. దీంతో తల్లిదండ్రులో బోరున విలపించారు. ఫలితాల విడుదల తర్వాత తమ కుమారుడితో ఫోన్ లో మాట్లాడామని ఫెయిల్ అయ్యాడని చెప్పాడు. ఒక సబ్జెక్టు పోయిందని తమతో చెప్పాడు. తాము కూడా అధైర్యపడొద్దడని చెప్పామని... తమతో బాగానే మాట్లాడని తల్లిండ్రులు చెబుతున్నారు. ఫెయిల్ కావడంతో కాలేజీ యాజమాన్యమే తమ కుమారున్ని మందలించి ఉంటుందని. యాజమాన్యమే కుమారున్ని హత్యచేసి .. కాలేజీకి చెడ్డపేరు వస్తుందని రైలు పట్టాలపై పడేసి ఉంటారని ఆరోపించారు. యాజమాన్యమే చంపివేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని చెబుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన చేపట్టారు. అయితే ఘటనకు సంబంధించిన ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా బాధితుల పట్ల దుందుడుకుగా ప్రవర్తించారు. వారిని కాలేజీ నుంచి బయటికి గెంటివేశారు. 

గుజరాత్ విజయలక్ష్యం 181 పరుగులు

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా బెంగుళూరు, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగుళూరు నిర్ణీత వోవర్లలో రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గుజరాత్ విజయలక్ష్యం 181 పరుగులుగా ఉంది. విరాట్ కోహ్లీ చివరి బంతికి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ కెరీర్ లో కోహ్లీ తొలి సెంచరీ నమోదు చేశాడు. 

16:57 - April 24, 2016

చిత్తూరు : ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన సినీ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. తాజాగా సరైనోడు చిత్రంలో నటించానని తదుపరి సాయిధరం తేజ్‌తో కలసి సుప్రీం చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. జానియర్ ఎన్‌టీఆర్‌తో కలిసి కొరటాల డైరెక్షన్లో మరో చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. తన కుమారుడు ఆధితో కలసి కూడా చుట్టాలబ్బాయి చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. 

 

16:53 - April 24, 2016

అనంతపురం : సత్యసాయి 5వ ఆరాధనోత్సవాలు ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సత్యసాయి విద్యాజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి విద్య, వైద్యం, తాగునీరు మానవాళికి అందించి ఎంతో సేవ చేశారని వెంకయ్యనాయుడు అన్నారు. సత్యసాయి మానవాళికి ఆద్యాత్మికం పట్ల ప్రేరణ కల్గించి మంచిప్రవర్తన, నడవడిక, సేవాగుణాన్ని నేర్పారన్నారు. సత్యసాయి ట్రస్ట్  విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విలువలతో కూడిన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని వెంకయ్యనాయుడు అన్నారు.  

 

16:50 - April 24, 2016

హైదరాబాద్ : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్ లోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుపెట్టాలని కోరుతూ సిఎం కేసిఆర్‌కు టిటిడిపి శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన ఎన్టీఆర్‌కు కొత్త రాష్ట్రమైన తెలంగాణలో సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రేవంత్ లేఖలో తెలిపారు. గతంలోనే దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీర్మానించిందని గుర్తు చేశారు. తెలుగువారి అందరి అభిమానపాత్రుడైన ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడని ఎన్టీఆర్‌ను ముందు తరాలవారూ గుర్తుంచుకునేలా చేయాలని 

 

టీటీడీపీకి పట్టిన దుస్థితి వైసీపీకి పట్టదు : మేకపాటి

ఢిల్లీ : విభజన చట్టం హామీల అమలు, పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఏపీలో కొత్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. 13 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నారని.. మరికొంతమందిని కొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. టీటీడీపీకి పట్టిన దుస్థితి ఎపిలో వైసీపీకి పట్టదన్నారు. ఎపిలో దుర్బిక్ష పరిస్థితులున్నాయని చెప్పారు. 

విభజన చట్టం హామీలు అమలు పరచాలని కోరాం : ఎంపీ తోట

ఢిల్లీ : విభజన చట్టం హామీలను అమలు పరచాలని కోరామని ఎంపీ తోట నర్సింహ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్నారు. ఏపీ సమస్యలను ప్రస్తావించేందుకు సమయం కోరామని చెప్పారు. 

 

హైకోర్టు విభజనలో తీవ్ర జాప్యం : ఎంపి జితేందర్ రెడ్డి

ఢిల్లీ : దేశ సమస్యలపై పార్లమెంట్ లో చర్చించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ కోరారని టీఆర్ ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి తెలిపారు. విభజన చట్టం హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించడం లేదని స్పీకర్ చెప్పామని పేర్కొన్నారు.  హైకోర్టు విభజన విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని చెప్పారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్ ఏర్పడ్డ నెల రోజుల్లోపే హైకోర్టులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఢిల్లీలో సరి-బేసి విధానం నుంచి ఎంపీలకు మినహాయింపు ఇవ్వాలని స్పీకర్ ను కోరామని పేర్కొన్నారు. 

 

నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు

హైదరాబాద్ : నగరంలో నకిలీ నెయ్యి తయారీ గుట్టు రట్టు అయింది. మూసారాంబాగ్ శాలివాహననగర్ లో శివ ఈశ్వరన్ అనే వ్యక్తి ఏడాది కాలంగా నకిలీ నెయ్యి తయారీ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడి చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 4 వేల లీటర్లకు పైగా నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వహకున్ని పోలీసులు అరెస్టు చేశారు. 

 

16:14 - April 24, 2016

హైదరాబాద్ : నగరంలో నకిలీ నెయ్యి తయారీ గుట్టు రట్టు అయింది. మూసారాంబాగ్ శాలివాహననగర్ లో శివ ఈశ్వరన్ అనే వ్యక్తి ఏడాది కాలంగా నకిలీ నెయ్యి తయారీ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడి చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 4 వేల లీటర్లకు పైగా నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వహకున్ని పోలీసులు అరెస్టు చేశారు. 

 

16:03 - April 24, 2016

త్రివేండ్రం : కేరళలోని ప్రముఖ సున్నీ మసీదులోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని మసీదు పెద్దలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. కొట్టాయంలో గల 8వ శతాబ్దానికి చెందిన ఈ మసీదును చూడడానికి దేశ, విదేశాలనుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం వస్తుంటారు. ఇప్పటి వరకు ఈ మసీదులోకి మహిళలకు ప్రవేశం లేదు. అయితే రెండు రోజులు స్థానికంగా ఉన్న మహిళలకు ప్రవేశం కల్పించాలని మత పెద్దలు నిర్ణయించారు. మతపెద్దలు మే 8న ఇందుకు ముహూర్తం ఖరారు చేశారు.   

సీఎం కేసీఆర్ ఆ హామీ విస్మరించారు : మాజీ ఎపీ వివేక్

హైదరాబాద్‌ : దళితులను తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆ హామీని విస్మరించారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత జి.వివేక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఆదివారం ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగరేణి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రథమ మహాసభలలో పాల్గొన్న సందర్భంగా వివేక్ మాట్లాడారు. కుటుంబ పాలనే తప్ప ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు పట్టవన్నారు. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఫ్యాక్టరీలను మూసి ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారని ఆరోపించారు.

'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం సెట్ అగ్నికి ఆహుతి...

హైదరాబాద్‌ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం సెట్ అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబరు 25లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ పక్కన ఉన్న బూత్ బంగ్లా ఆవరణలో ఈ చిత్రం సెట్ ఉంది. నిన్న సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఎండలు కూడా తీవ్రంగా ఉండటంతో మంటలు బాగా వ్యాపించడంతో సెట్ అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమాచారం అందుకున్న ఫిలింనగర్, సనత్ నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అయినప్పటికీ ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

ఫారెస్టు ఆఫీసర్ల హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గుంటూరు : ఈనెల 5న బొల్లాపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఇద్దరు ఫారెస్టు ఆఫీసర్ల హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 
నిందితులు తులసీనాయక్, నటరాజ్ లను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఫారెస్టు అధికారులు తమను కట్టెలు కొట్టొద్దన్నందుకే హత్య చేసినట్లు నిందతులు తెలిపారు. 

15:18 - April 24, 2016

కృష్ణా : మంచినీటి సరస్సుగా ఖ్యాతిగాంచిన కొల్లేరు, జల సంక్షోభంతో విలవిలలాడుతోంది. నిత్యం నీటితో,మత్స్య సంపదతో కళకళలాడే కొల్లేరు సరస్సు..నీళ్లులేక నిర్జీవమైపోయింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎండిపోయి కనుచూపుమేర ఎడారిని తలపిస్తోంది. స్వదేశీ,విదేశీ పక్షులకు ఆవాసమైన సరస్సు ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది.  
ఎడారిని తలపిస్తోన్న కొల్లేరు సరస్సు 
ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతాన్ని చూస్తుంటే ఏ బీడుభూమిలాగానో కనిపిస్తోంది కదూ..కానీ ఇదే మంచినీటి సరస్సుగా చరిత్రగాంచిన కొల్లేరు సరస్సంటే మీరు నమ్మగలరా? ఇది నిజం...వేసవిలో సైతం పుష్కలంగా నీటితో, మత్స్య సంపదతో, పచ్చనిగడ్డితో కళకళలాడే కొల్లేరు ఎడారిగా మారిపోవడంతో...ఇక్కడ నివసించే ప్రజలే కాదు, విదేశీ అతిథులైన పక్షులు సైతం నీటికోసం కటకటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో విస్తరించివున్న ఈ కొల్లేరు సరస్సు, ఇప్పుడు ఎండిపోయిన కటిక నేలలా కనిపిస్తోంది. 
నీరులేక నేడు వెలవెల 
కానరాని పచ్చగడ్డి
కొల్లేరు అనగానే మంచినీటితోపాటు వెంటనే గుర్తుకొచ్చేది...విదేశీ పక్షుల సందడే. పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశం చూపరులను ఎంతో ఆకర్షిస్తుంది. కానీ ఇప్పుడా పరిస్థితి కొల్లేరులో లేదు. ఎక్కడ చూసినా నీరులేక, సరస్సు ఎండిపోవడంతో విదేశాల నుంచి వచ్చే పక్షులన్నీ వేరే ప్రాంతాలకు వలసపోతున్నాయి. ఇక పశువుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. కొల్లేరులో నీటితోపాటు పచ్చగడ్డి ఎక్కువగా ఈ ప్రాంతంలో దొరికేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో పశువులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 
జీవనోపాధికి గండి
2006లో ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో చేపల చెరువులను ధ్వంసం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొల్లేరు ఇలా ఎండిపోవడంతో బతకడానికి నానా కష్టాలు పడుతున్నారు కొల్లేరు వాసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, నిడమర్రు, భీమడోలు , పెదపాడు, ఏలూరు, మండలాలతోపాటు కృష్ణాజిల్లాలోని కైకలూరు, మండవల్లి మండలాలలోని 122 గ్రామాలలోని ప్రజలు కొల్లేరు ఎండిపోవడంతో జీవనపోరాటం చేస్తున్నారు. నిత్యం కొల్లేరులో చేపలను వేటాడుతూ జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు వేటలేక, ఉపాధి దొరక్క వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీటి కొరతను చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
చేపల వేట ద్వారా వేలకోట్ల టర్నోవర్‌
చేపల వేట ద్వారా వేలకోట్ల టర్నోవర్‌ జరిగే కొల్లేరు, ఎడారిలా మారిపోవడానికి కారణాలేంటనేది ప్రభుత్వం ఆలోచించాలని స్థానికులు కోరుతున్నారు . కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

15:08 - April 24, 2016

విజయవాడ : చంద్రబాబు వైసీపీ నేతలను డబ్బులకు కొనుక్కుంటున్నారని అనడం సబబు కాదని టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వరరావు అన్నారు. గతంలో టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకున్న మీరు ఎంత ఇచ్చి కొన్నారో తెలిపాలన్నారు. పార్టీని ఎంతమంది వీడినా .. పర్వాలేదు అనే ధోరణి మీలో కనిపిస్తుందన్నారు. టీడీపీని విమర్శించాలనేదే జగన్ లక్ష్యంగా కనబడుతుందని చెప్పారు. తెలుగు దేశం పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర జగన్ ది అని విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం జగన్ కుటుంబమే అని ఆరోపించారు. సేవ్ డెమొక్రసీ అంటున్న వైసీపీని షేమ్ డెమొక్రసీ గా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
 

14:57 - April 24, 2016

ఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ అన్నారు. కోర్టుల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌ ఉండడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించాలని న్యాయమూర్తులకు సూచించారు. రాష్ట్రాల్లో న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్నారు. 

14:52 - April 24, 2016

హైదరాబాద్ : వడదెబ్బకు ఓ నవ వరుడు మృతి చెందాడు. హైదరాబాద్‌ చంపాపేటలో నివాసముంటున్న రాఘవేంద్ర (30) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండు నెలల క్రితం వివాహం అయింది. రోజులాగే ఉదయం ఉద్యోగానికి వెళ్లిన రాఘవేంద్ర ఎండలో తిరగడంతో వడదెబ్బ తగిలింది. తీవ్ర అస్వస్థతతో రాత్రి ఇంటికి వచ్చి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాఘవేంద్ర మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబీకులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. 

 

టీఆర్ఎస్ ప్లీనరీని విజయంతం చేయాలి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగసభ విజయంతం చేయాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమౌతున్నాయని, ప్రతిపక్షాలు ఏకమైనా తమ విజయాన్ని అడ్డుకోలేవని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలు రాజకీయంగా చైతన్యం ఉన్నవారని, ఎవరిని గెలిపించాలో వారికి తెలుసన్నారు.

ప్లీనరీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో ఈనెల 27న నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి పెద్ద ఎత్తున ప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అనేక విజయాల తర్వాత ఆరోజు పార్టీ ప్లీనరీని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్లీనరీలో 15 అంశాలపై తీర్మానాలు ఉంటాయని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గెలుపుతో దేశంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. ఖమ్మంలో తొలిసారిగా ప్లీనరీ నిర్వహించుకుంటున్నామని, ఉదయం ప్రతినిధుల సభ సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని వివరించారు.

మరికాసేపట్లో తెలంగాణ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష

హైదరాబాద్ : మరికాసేపట్లో తెలంగాణ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష జరుగునుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. 

ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి - రేవంత్..

హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టాలని టి.టిడిపి శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

'జగన్ అహంకారం వల్లే ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు'..

గుంటూరు : ఎమ్మెల్యేలతో ఏ విధంగా మెలగాలో జగన్ కు తెలియదని, ఆయన అహంకార వైఖరికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని ఏపీ మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యానించారు. 

జగన్ ఒక్కరే మిగులుతారు - రావెల..

గుంటూరు : వైసీపీలో జగన్ ఒక్కరే మిలుగుతారని..అతని నియంత పోకడలే కారణమని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు విమర్శించారు. ఎక్కడ ప్రజా సేవకు అవకాశం ఉందో అక్కడకు ఎమ్మెల్యేలు వెళతారని తెలిపారు. 

గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ జనరల్ మీటింగ్..

హైదరాబాద్: తెలంగాణభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ జనరల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

13:11 - April 24, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు షాక్ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపుగా రెండు నెలల నుండి 13 మంది పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి..ఏపీ అభివృద్ధి కోసమే తాము చేరుతున్నట్లు జంప్ జిలానీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. దీనిపై పోరాటం చేసేందుకు వైసీపీ సమాయత్తం అవుతుండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి టిడిపిలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సాయంత్రం జరిగే ఓ సమావేశంలో కీలక ప్రకటన చేస్తారని వార్తలు వెలువడ్డాయి. ఇది ఇలా జరుగుతుండగానే అరకు ఎమ్మెల్యే విశ్వేశ్వరావు కూడా పార్టీ మారుతారని వార్తలు వెలువడుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఈ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టిడిపి వర్గానికి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. నియోజకవర్గ చెందిన నేతలతో సమావేశమై ఓ కీలక ప్రకటన చేయనన్నారు. ఇప్పటికే కీలక నేతలకు సమాచారం అందించారు. ఈ చేరికలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో ? బుజ్జగిస్తుందా ? అనేది చూడాలి. 

టిడిపిలో అరకు వైసీపీ ఎమ్మెల్యే..

విశాఖపట్టణం : అరకు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరావు టిడిపి తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమౌతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సాయంత్రం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

క్షమాపణలు చెప్పిన ఎపంఈ డెరెక్ ఓబ్రెయిన్..

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ ఫొటో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో తృణముల్ కాంగ్రెస్ పెట్టింది. ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ క్షమాపణలు చెప్పారు. 

ప్లీనరీ, బహిరంగసభ విజయంతం చేయాలి - కేటీఆర్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగసభ విజయంతం చేయాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమౌతున్నాయని, ప్రతిపక్షాలు ఏకమైనా తమ విజయాన్ని అడ్డుకోలేవని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలు రాజకీయంగా చైతన్యం ఉన్నవారని, ఎవరిని గెలిపించాలో వారికి తెలుసన్నారు.

ఎదుర్కొనే శక్తి ప్రతిపక్షాలకు లేదు - కేటీఆర్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే శక్తి ప్రతిపక్షాలకు లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒంటరిగా టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి లేక చీకటి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ చీకటిని చీల్చుతూ..ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి ప్రతి ఒక్క కార్పోరేటర్, ఎంఎల్ఏ, ఎంపీలు రావాలని కోరారు. పార్టీ అవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుని..ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పార్టీలు నివ్వరపోయి చూసే విధంగా పాలేరు లో గెలిచి తీరుతామమన్నారు.

 

12:54 - April 24, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే శక్తి ప్రతిపక్షాలకు లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒంటరిగా టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి లేక చీకటి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ చీకటిని చీల్చుతూ..ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి ప్రతి ఒక్క కార్పోరేటర్, ఎంఎల్ఏ, ఎంపీలు రావాలని కోరారు. పార్టీ అవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుని..ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పార్టీలు నివ్వరపోయి చూసే విధంగా పాలేరు లో గెలిచి తీరుతామమన్నారు. 

12:50 - April 24, 2016

విజయవాడ : కేసుల నుంచి బయటపడడానికే 'సేవ్ డెమోక్రసీ' పేరుతో రాష్ట్రపతిని, ఢిల్లీలోని ఇతర నేతలను జగన్ కలవబోతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని అన్నారు. సీఎం చంద్రబాబు ఈ వయస్సులో ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పర్యటనలు చేస్తున్నారని.. ఆయనకున్న తపన, తాపత్రయం జగన్‌కు లేవన్నారు. కేవలం ముఖ్యమంత్రి సీటు కోసమే జగన్ పాకులాడుతున్నారు తప్ప ప్రజల సమస్యల కోసం పోరాడడం లేదని ప్రత్తిపాటి విమర్శించారు. 

12:48 - April 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ మధ్యాహ్నం జరగనున్న కానిస్టేబుల్ పరీక్ష కోసం 'X' సెట్ ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర డీజేపీ అనురాగ్ శర్మ ఎంపిక చేశారు. ఈ పరీక్షకు 5 లక్షల 35 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,133 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లతో అరగంట ముందుగానే పరీక్షకేంద్రానికీ చేరుకోవాలని సూచించారు. నిమిషం లేటైనా లోపలికి అనుమతింబోమని స్పష్టంచేశారు. కూకట్ పల్లి జేఎన్‌టీయూలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఇంచార్జ్ వీసీ శైలజ రామయ్యర్,పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. 

12:46 - April 24, 2016

హైదరాబాద్ : పాలేరు బరి నుంచి టి.టిడిపి తప్పుకుంది. గత సాంప్రదాయాన్ని అనుసరించి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితకు మద్దతు ఇవ్వాలని టి.టిడిపి నిర్ణయించింది. కాంగ్రెస్‌ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ చెప్పారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో అక్కడ ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

తుమ్మల పోటీ..
ఈనెల 22 ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎన్నికల సంఘం జారీ చేసింది. 29న నామినేషన్లు వేసేందుకు చివరితేదీగా నిర్ణయించారు. ఉపసంహరణ గడువు మే 2 వ తేదీ కాగా 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అలాగే మే 16న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణ అంత‌టా విజ‌యం సాధించిన టీఆర్ఎస్ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో బోల్తా కొట్టింది. దీంతో అక్క‌డ బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావును టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి లాక్కొని మంత్రి ప‌ద‌వి ఇచ్చింది. అనంత‌రం అక్క‌డ జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యం సాధించింది. దీంతో అదే జిల్లాల‌కు చెందిన వెంక‌ట్ రెడ్డి మ‌ర‌ణించ‌డంతో ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ త‌మ విజ‌య‌బావుటా ఎగ‌ర‌వేయాల‌ని భావించి మ‌ళ్లి అక్క‌డ తుమ్మ‌ల‌ను పోటీలోకి దింపింది. దీంతో అక్క‌డ రాజ‌కీయ వేడి మొద‌లైంది. ఎలాగైనా తుమ్మ‌ల అనుచ‌ర‌వ‌ర్గ బ‌లంతో పాలేరులోనూ పాగావేయాల‌ని చూస్తుంది. తుమ్మ‌లను గెలిపించుకొని కారు జోరును ఖ‌మ్మం జిల్లాలో వేగంగా ప‌రిగెత్తించాల‌ని గులాబీ బాస్ భావిస్తున్నారు.

ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు..
ఇక ఇదిలా ఉంటే సిట్టింగ్ స్థాన‌మైన పాలేరు స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాల‌ని కాంగ్రెస్ భావించింది. గ‌త సాంప్ర‌దాయం ప్ర‌కారం వెంకట్ రెడ్డి కుటుంబం నుంచి ఒక‌రికి టికెట్ ఇచ్చి పోటీని ఏకగ్రీవం చేయాల‌ని భావించింది. అయితే అధికార‌ పార్టీ, ఇటు ఇతర పార్టీలు ఎన్నికకు సిద్దం కావ‌టంతో ఆ ప్ర‌య‌త్నాలు మానుకొని పోటికి సిద్ద‌మైంది. దీంతో ఏకగ్రీవం కాస్తా ఎన్నికగా మారింది. పోటీ నుండి విరమించుకోవాలని టి.కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 

12:36 - April 24, 2016

ఉత్తర్ ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా వర్సిటీల్లో ఇంకా అలజడి చెలరేగుతోంది. తాజాగా ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. మౌలానా ఆజాద్ లైబ్రరీ వద్ద ఈ ఘర్షణ జరిగింది. విద్యార్థులు యూనివర్సిటీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. వీసీ నివాసం పక్కనే ఉన్న మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీకి చేరుకుని విద్యార్థులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
చిన్న గొడవ కారణంగా విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని సమాచారం. అసలు ఘర్షణకు గల కారణాలు తెలియరాలేదు. ఘర్షణ జరిగితే వర్సిటీ కార్యాలయంపై దాడి..వాహనాలకు నిప్పు ఎందుకు పెట్టారో తెలియడం లేదు. బయట విద్యార్థులు కూడా వర్సిటీలోకి వచ్చి విధ్వంసానికి పూనుకున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

12:31 - April 24, 2016

ఖమ్మం : జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద షాక్ తొలగింది. కొద్ది రోజుల్లో పాలేరు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈలోపున కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పువ్వాడ అజయ్ కలిశారు. దీనితో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారని ఖాయమై పోయింది. సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది. ఈనెల 27వ తేదీన నిర్వహించే ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ లో చేరాలని అజయ్ యోచించినట్లు తెలుస్తోంది. ఆయన తో పాటు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు కూడా గులాబీ కండువాలు కప్పుకోనున్నారు.
ఒక్కసారిగా జరిగిన పరిణామంతో కాంగ్రెస్ షాక్ తగినట్లైంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ లో అసంతృప్తి రాజ్యం ఏలుతోంది. దీనిని అవకాశంగా తీసుకున్న గులాబీ దళం ఆ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేపట్టింది. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ కూడా టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ చేరికపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో ? 

12:24 - April 24, 2016

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ హత్యాయత్నం నుండి తప్పించుకున్నాడు. ఆయనపై మరోసారి దాడి జరిగింది. ఈ ఘటన ముంబై - పుణె విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఏఐఎస్ఎఫ్ నాయకులు దాడి చేసిన వ్యక్తిని అడ్డుకున్నారు. ఘటనపై జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది స్పందించలేదనే విమర్శలున్నాయి. మతతత్వం..వివక్షకు వ్యతిరేకంగా కన్హయ్య కుమార్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ముంబై నుండి ఫుణెకు కన్హయ్య కుమార్ వెళుతున్నారు. ఆయనతో పాటు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు. బహిరంగసభలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతున్న కన్హయ్య కుమార్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న ఇతర నాయకులు దీనిని అడ్డుకున్నారు. ఘటనపై జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది స్పందించలేదని కన్హయ్య ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

బెయిల్ పై విడుదలైన కన్హయ్య..
జాతికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడన్న కారణంతో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ జైలు నుండి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం కన్హయ్య కుమార్ పోరాటం మరింత ఉధృతం చేశారు. మతతత్వం, వివక్ష, బీజేపీ సాగిస్తున్న పాలనపై ఆయన తనదైన శైలిలో బహరింగ సభలలో ప్రసంగిస్తూ తూర్పారబడుతున్నారు. దీనిని సహించలేని కాషాయమూకలు పలుసార్లు దాడికి పాల్పడ్డారు. అంతేగాక చంపేస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా కన్హయ్యపై దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

చాలాసార్లు బెదిరింపు కాల్స్ - ఏఐఎస్ఎఫ్..
ఇప్పటికే తమకు చాలాసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఏఐఎస్ఎఫ్ నేత వలీ ఖాద్రీ టెన్ టివికి తెలిపారు. బెదిరింపులు చేస్తున్న వారే ఈ ఘటనకు పూనుకున్నారని ఆరోపించారు. దాడి సమయంలో తాను కన్హయ్యకు సమీపంలో కూర్చొవడం జరిగిందన్నారు. 

టీఆర్ఎస్ లో చేరనున్న పువ్వాడ అజయ్..

ఖమ్మం : కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. 

కన్హయ్య గొంతు నులిమేందుకు ప్రయత్నం..

ఢిల్లీ : ముంబై - ఫుణె ఫ్లైట్ లో జేఎన్ యూ నేత కన్హయ్య గొంతు నులిమేందుకు ప్రయత్నం జరిగింది. ఘటనపై జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది స్పందించలేదని కన్హయ్య ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

పాలేరులో పోటీ చేయడం లేదు - టి.టిడిపి..

హైదరాబాద్ : పాలేరులో పోటీకి జిల్లా నాయకత్వం ఉత్సాహం చూపిందని టి.టిడిపి నేత ఎల్.రమణ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు పదే పదే కోరడం, చంద్రబాబుకు లేఖ రాశారని తెలిపారు. కాంగ్రెస్ విజ్ఞప్తి మేరకు పోటీ చేయడం లేదని ప్రకటించారు. 

తవాంగ్ మృతులకు మోడీ సంతాపం..

అరుణాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. భారీగా వర్షాలు కురిసి కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురు పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు.

కన్హయ్య కుమార్ పై దాడి..

ముంబై : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ పై మరోసారి దాడి జరిగింది. ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

పాలేరు ఉప ఎన్నికకు టిడిపి దూరం..

ఖమ్మం : జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని టిడిపి నిర్ణయించింది. సాంప్రదాయాలను గౌరవిస్తూ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయించింది. దీనిపై కాసేపట్లో టి.టిడిపి అధికారికంగా ప్రకటన చేయనుంది. 

రాజమండ్రి అత్యాచారం కేసులో నలుగురి అరెస్టు..

రాజమండ్రి : యువతిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

మోడీ అధ్యక్షతన సంయుక్త సమావేశం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సంయుక్త సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. న్యాయవ్యవస్థ పనితీరు, తీసుకరావాల్సిన మార్పులపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 

చీఫ్ మినిస్టర్, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో మోడీ..

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 

10:29 - April 24, 2016

కర్నూలు : వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. అధికార పక్షంలో వీరందరూ చేరుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి..ఏపీ అభివృద్ధి కోసమే తాము టిడిపిలో చేరుతున్నట్లు ఆయా ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. 2014ఎన్నికల్లో వైసీపీకి కర్నూలు జిల్లా కంచుకోటగా ఉంది. అధికారపక్ష పార్టీయైన టిడిపి ఈ జిల్లాపై దృష్టి సారించింది. అందులో భాగంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పచ్చకండువా వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం రాజశేఖరరెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. వేణుకొండూరులో సాయంత్రం 4గంటలకు జరిగే ఈ సమావేశంలో టిడిపి చేరనున్నట్లు రాజశేఖరరెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొంత మందిని పార్టీలో చేరిపించేందుకు కృషి చేస్తానని భూమా టిడిపి అధిష్టానానికి హామీనిచ్చినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నిర్ణయంపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మాల్యా పాస్ పోర్టు రద్దు ?

ఢిల్లీ : కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పాస్ పోర్టును కేంద్రం రద్దు చేసినట్లు తెలుస్తోంది. పలుమార్లు నోటీసులిచ్చినా ఇటీవలే ఈడీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాస్ పోర్టును రద్దు చేయాలని ఈడీ కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. 

తెలంగాణలో భానుడి భగభగలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, భద్రాచలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రామగుండంలలో 44 డిగ్రీలు..హన్మకొండ, హైదరాబాద్ లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

10:14 - April 24, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో నిర్వహించే ప్లీనరీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఈటెల వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామని, స్వరాష్ట్రంలో రెండోసారి ప్లీనరీ జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతోందన్నారు. ఎన్నికల కోడ్, ఎండలు మండుతున్నాయి కాబట్టి కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ను దేశంలోనే నెంబన్ వన్ పార్టీగా తీర్చిదిద్దుతామని, మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేస్తున్నామని మంత్రి ఈటెల తెలిపారు. 

10:12 - April 24, 2016

ఢిల్లీ : రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 నుండి మే 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా నేడు లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల లోక్ సభ పక్ష నేతలు హాజరు కానున్నారు. కీలక బిల్లుల ఆమోదం కోసం సమావేశాలు జరిగేందుకు సహకరించాలని స్పీకర్ సూచించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ ను ఆమోదించే విధంగా ఈ సమావేశాలు జరగనున్నాయి.
దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చించేందుకు పలు రాజకీయ పార్టీలు నోటీసులు ఇచ్చాయి. అలాగే ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. బిల్లుల ఆమోదం కన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై చర్చించాలని విపక్షాలు పట్టుబడనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితిపై వాణి వినిపించాలని ఏపీ, తెలంగాణ ఎంపీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని ఎంపీలు ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు సజావుగా జరుగుతాయా ? లేదా ? అన్నది చూడాలి. 

ఎఎంయూలో ఘర్షణ..విద్యార్థి మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : ఎఎంయూ క్యాంపస్ లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. 

09:57 - April 24, 2016

మరికొద్ది రోజుల్లో ఇంటర్ మీడియట్ విద్యార్థులు 'ఎంసెట్' పరీక్ష రాయబోతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష జరగనుంది. ఈ సమయంలో విద్యార్థులు ప్రిపరేషన్ లో తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో ఎలాంటి సబ్జెక్టులపై దృష్టి కేంద్రీకరించాలి ? ఎక్కువ మార్కులు సాధించడం ఎలా ? ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జే. శ్రీనివాస్ సతీష్ ( శ్రీ చంద్రా జూనియర్ కాలేజీ, మ్యాథ్స్), వరప్రసాద్ (శ్రీ గాయతి జూనియర్ కళాశాల, కెమెస్ట్రీ) పాల్గొని విద్యార్థులకు సలహాలు, సూచనలు అందచేశారు. 

09:31 - April 24, 2016

ప్రజా చైతన్య గీతాలకు తెలంగాణా పెట్టింది పేరు. ఇక్కడి సంస్కృతిలోంచి, పోరాటాల నేపథ్యం నుంచి అనేక పాటలు పుట్టాయి. ఎందరో గేయకవులుగా పేరొందారు. అలా తొలుత కవిత్వం రాసి తర్వాత ప్రజాచైతన్య గేయాలు రాస్తున్న గేయ కవి సుంకర రమేశ్. నల్గొండ జిల్లాకు చెందిన ఈ కవి రైతుల ఆత్మహత్యలు, ధ్వంసమౌతున్న ప్రకృతి వనరులు, విద్యార్ధి ఉద్యమాలపై ఎన్నో గేయాలు రాశారు. ప్రజాకవి సుంకర రమేశ్ పై ప్రత్యేక కథనం. మరిన్న విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:28 - April 24, 2016

మనిషి శ్వాసలో మతం అరాచక సెగ బుసకొడుతున్నది అంటూ కవిత్వం రాసిన అభ్యుదయకవి రఘువీర్ ప్రతాప్. సమాజంలోని ప్రతి అరాచక దృశ్యానికి స్పందించి కవిత్వం రాస్తున్న ఈ కవి అమ్మపై ఒక కవితా సంపుటినే వెలువరించాడు. సాంఘిక రుగ్మతలు, అసమానతలు, మానవసంబంధాల మాధుర్యాలపై కవితలు, నానీలు రాస్తున్న రఘువీర్ ప్రతాప్ పరిచయ కథనం..

09:27 - April 24, 2016

సాహిత్యం సమాజాన్ని పూర్తిగా మార్చలేక పోవచ్చు. కాని మంచి సమాజం ఎలా ఉండాలో దిశానిర్దేశం చేస్తుంది. సృజనకారులు సమున్నత సమాజం కోసం ఎప్పుడూ కలలుగంటూ ఉంటారు. నిరంతరం రచనలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుంటారు. అలాంటి వారిలో ఒడిశాకు చెందిన దళిత కవి హల్దార్ నాగ్ ఒకరు. సాహిత్యం ఒక గొప్ప సృజన ప్రక్రియ. సృజనాత్మక రచనలు చేయడానికి యూనివర్సిటీ డిగ్రీలతో పనిలేదని నిరూపించారు మూడో తరగతి చదివిన హల్దార్ నాగ్. ఒడిశాకు చెందిన ఈ కవి పురాణ ప్రతీకలతో పద్యాలల్లడంలో దిట్ట. కాళ్లకు చెప్పులు కూడా ధరించని ఈ నిరాడంబర కవి ఏకంగా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డునే అందుకున్నారు. పొట్టకూటి కోసం చిన్న వ్యాపారం నిర్వహిస్తూ పద్యరచయితగా కృషిచేసి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హల్దార్ నాగ్ పై ప్రత్యేక కథనం..

దేశంలోనే నెంబన్ వన్ పార్టీగా తీర్చిదిద్దుతాం - ఈటెల..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ను దేశంలోనే నెంబన్ వన్ పార్టీగా తీర్చిదిద్దుతామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామని, స్వరాష్ట్రంలో రెండోసారి ప్లీనరీ జరుపుకుంటున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేస్తున్నామన్నారు. 

స్సైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్సైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం ఏర్పడింది. లోపం గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు.

 

చిన్నారులతో క్రికెట్ ఆడిన సచిన్..

ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 43వ ఏట అడుగు పెట్టాడు. జన్మదిన సందర్బంగా ఆయన ఎం.ఐ.జి క్రికెట్ క్లబ్ లో చిన్నారులతో క్రికెట్ ఆడారు. 

08:51 - April 24, 2016

హీరోగా వంద సినిమాలు. ఇదేమీ చిన్నా చితకా ఫీట్ కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం కూడా కాదు. శతాబ్దాల పాటు హీరోగా నిలబడగలిగితేనే.. శతచిత్ర హీరో అనిపించుకునే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ లో ఈ రికార్డును అందుకున్న వారి సంఖ్య తక్కువే అని చెప్పాలి. వీళ్లంతా ఆ తరంలో రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి వంద చిత్రాలకన్నా ఎక్కువగానే చేసేసారు. ఆ తరువాత తరం హీరోల్లో చిరంజీవి వందో సినిమా ఎప్పుడో పూర్తి చేసేసాడు. ఇక ఇప్పుడు బాలయ్య 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తో వందో చిత్రాన్ని కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో వంద చిత్రాలు పూర్తి చేసుకున్న హీరోలపై ప్రత్యేక కథనం.. ఈ తరం హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఈ లెక్కన వంద పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కానీ తెలుగు సినిమా స్వర్ణయుగంలో మహామహులైన హీరోలంతా సంవత్సరానికి సగటున పది సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను వేగంగా పరిగెట్టించేవారు. రోజుకు మూడు ఫిఫ్టులు పనిచేస్తూ.. ఏ సినిమా షూటింగ్ లో ఉన్నారో కూడా తెలియకుండా నటించేవారు.

ఎన్టీఆర్...
యన్టీఆర్, ఎఎన్నార్ లాంటి అగ్రహీరోలు ఆ రోజుల్లో పోటీ పడుతూ మరీ తమ సినిమాల సంఖ్యపెంచుకుంటూ పోయేవారు. ఇప్పుడైతే వందో సినిమాను ప్రత్యేకంగా చేస్తున్నారు కానీ. వీరిద్దరికి అప్పట్లో తమ వందో సినిమా ఏదో, ఎవరో ఒకరు గుర్తు చేసేవరకూ తెలియదు. చిన్న వయసులోనే ఈ ఇద్దరు హీరోలు వంద సినిమాల మార్క్ ను దాటుకుంటూ ముందుకు దూసుకుపోయారు. లెక్కకు మించిన సినిమాలు చేయడం వల్ల ఏ సినిమా ఎన్నోదనే ఆలోచన అప్పట్లో రాలేదు ఈ హీరోలిద్దరికీ. ఆ తీరికకూడా ఉండేది కాదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం యన్టీఆర్ తో వృత్తి పరంగా పోటీపడడం వల్ల తన వందో సినిమాను ప్రత్యేకంగా తన స్వయంగా నిర్మించుకొన్నారు. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమకి యన్టీఆర్ వరపుత్రుడు. ఆయన రాకతోనే మన తెలుగు తెరకు అద్భుతమైన శోభ చేకూరింది. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలతో తెలుగు వారి వేల్పుగా తారకరాముడు కొలువైయుండి పోయాడు. దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించి ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిండిపోయున్నాడు.

వందో సినిమా నర్తన శాల..
1949 లో మనదేశం చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన యన్టీఆర్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని తన నటనా వైదుష్యంతో మెప్పించి రక్తి కట్టించారు. పాతాళభైరవి తో స్టార్ డమ్ ను తెచ్చుకున్న ఆయన మాస్ జనానికి ఆరాధ్యనటుడయ్యారు. కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా, రావణుడిగా, శివుడిగా. భీష్ముడిగా .. ఇలా ఒకటేంటి.. అన్ని రకాల పౌరాణిక పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. జానపద కథానాయకుడిగా కత్తి తిప్పారు, గుర్రమెక్కారు. చారిత్రక నాయకుడిగా కథం తొక్కారు, సాంఘిక కథానాయకుడిగా అన్ని రకాల పాత్రల్లో జీవించారు. యన్టీఆర్ 44 పౌరాణిక చిత్రాలు, 186 సాంఘిక చిత్రాలు, 55 జానపద చిత్రాలు, 13 చారిత్రకచిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించారు. దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన యన్టీఆర్ , అందులో వందో సినిమాగా నర్తన శాల నిలిచిపోయింది. ఆయనకు ఆ సినిమా వందో సినిమా అని ఎవరో చెబితేనే కానీ తెలియలేకపోవడం విశేషం.

అక్కినేని..
​యన్టీఆర్ తరువాత శతాధిక చిత్రాల్లో నటించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. దాదాపు 256 చిత్రాల్లో నటించారు అక్కినేని. అక్కినేని సాంఘిక చిత్రాలకు రారాజు. కుటుంబ కథాంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ అక్కినేని ఆ తరం ప్రేక్షకుల్ని వైవిధ్యమైన పాత్రలతో ఉర్రూతలూగించారు. కొన్ని కొన్ని సందర్భాల్లో యన్టీఆర్ తో పోటీ పడుతూ తన సత్తా చాటుకునేవారు. ఎఎన్నార్ లో ఒక్కో అక్షరానికి ఆయన నటజీవితానికి ముడిపెట్టి చెబితే... ఎక్టర్ ఆఫ్ నావలిస్టిక్ అండ్ రొమాంటిక్ రోల్స్ అని అభివర్ణిస్తే బావుంటుందేమో. నవ్య నవలానాయకుడిగా వాటిల్లో కూడా శృంగారాత్మక పాత్రలను అమోఘంగా పోషించి శెభాష్ అనిపించిన నటుడిగా ఎఎన్నార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎస్పెషల్లీ... ప్రేమ భగ్నమై... రెండు వేళ్ల మధ్య నలిగే సిగరెట్టు, మరో చేత్తో మందుగ్లాసు, చుట్టూ పొగలు, మనసులో ప్రేమగుబులు... ఈ తరహా పాత్రలు పోషించడంలో ఎఎన్నార్ కి సపరేటు డిగ్రీలున్నాయి. సాంఘీక కథా చిత్రాల నాయకుడిగా ఆయన విశేష నటన కనబరిచారు. సామాన్య మానవుడికి చెందిన అన్ని కోణాలు దాదాపు ఆయన తెరమీద ఆవిష్కరించి నటనంటే నీదే నాగేశ్వర్రావ్ అనిపించేశాడు. ఏడు దశాబ్దాల సినీ జీవితం కాలంలో ఆయన నటించిన చిత్రాలు 256. అక్కినిని కూడా చాలా చిన్న వయసులోనే వంద చిత్రాలు పూర్తి చేసారు. ఇక్కడ ఓ విశేషమేంటంటే.. ఆయన నటించిన వందో చిత్రం ఓ తమిళ్ సినిమా అవడం. అది కూడా అక్కినేనికి గుర్తులేదు. అలా సినిమా ల సంఖ్య గుర్తించుకోకుండా, అసంఖ్యాకంగా సినిమాలు చేసారు అక్కినేని.

శోభన్ బాబు..
యన్టీఆర్ , ఎఎన్నార్ ల తరువాత శతాధిక చిత్రాల్లో నటించిన మరో గొప్ప హీరో సోగ్గాడు శోభన్ బాబు. తెలుగు తెర అందాల నటుడుగా కీర్తి గడించిన శోభన్ బాబు దాదాపు 230 చిత్రాల్లో నటించారు. మహిళల ఆరాధ్య కథానాయకుడైన ఆయన తెలుగు చలనచిత్ర సీమకు చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. తెలుగునాట సినీహీరో శోభన్‌బాబు పేరు తెలియనివారుండరు. మా తరంవాళ్ళమంతా ఆయన అభిమానులమే. ఎన్.టి.ఆర్, ఏయెన్నార్‌లకి కాస్త వయసుమళ్ళుతూ ఉన్న దశలో, చిత్రసీమ క్రమక్రమంగా నలుపు-తెలుపు కాలఖండంలోంచి ఈస్ట్‌మన్ కలర్‌కి మారుతూ ఉన్న సంధియుగంలో నాటి యువతరానికి శోభన్‌బాబే ఆదర్శ కథానాయకుడయ్యారు. ఒక సహజ అందగాడుగా, కుటుంబ – ప్రేమకథా చిత్రాల సెంటిమెంటల్ హీరోగా మహిళాప్రేక్షకుల్ని ఆకర్షించగలగడం కూడా ఒక కారణం. అందానికి తగ్గట్టుగా హుందాతనం చెక్కుచెదరకుండా నటించే తన గంభీర మూర్తిమత్త్వం అనేక నవలాధారిత చిత్రాలకి ఆయన్నొక ఆటోమేటిక్ ఎంపికగా మార్చింది. మూడున్నఱ దశాబ్దాల పాటు 230 కి పైగా తెలుగుచిత్రాలలో నటించి “హీరో అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి” అని ప్రజల మనస్సులలో ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పిపోయిన నటభూషణుడు శోభన్ బాబు. ఆయన కూడా వంద చిత్రాలను అతి చిన్న వయసులోనే పూర్తి చేసారు. ఇక శోభన్ బాబు వందో సినిమా కన్నవారి కలలు.

సూపర్ స్టార్ కృష్ణ..
తెలుగు తెరమీద అతి ఎక్కువ సంఖ్యలో చిత్రాలు చేసిన కథానాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణ నిలిచిపోతారు. ఈ హీరో నుంచే తెలుగు హీరోలు తమ సినిమాల్ని లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టారు. కృష్ణ దాదాపు 330 పైచిలుకు చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఆయన వంద, రెండువందలు, మూడొందల చిత్రాలను ప్రత్యేకంగా తెరకెక్కించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ.! సినీరంగంలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న మనసున్న మనిషిగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. కృష్ణ తేనెమనసులు అనే చిత్రంలో నటించి సినీరంగ ప్రవేశం చేసారు. సాహసానికి మారుపేరుగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎందరో తలపెట్టి సాధ్యంకాక వదిలేసిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తన వందో చిత్రంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్ని మరీ నిర్మించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓఅద్భుతమైన హిట్‌ను అందించారు. ఎక్కడో ఆంగ్ల సినిమాల్లో మాత్రమే కనిపించే కౌబోయ్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారాయన. ఆ తరవాతి కాలంలో మరిన్ని కౌబోయ్ చిత్రాలు వచ్చినా అవేమీ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా మించి ఉండకపోవడం గమనార్హం. నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం గురించి పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారాయన. తను నటించే సినిమా భవిష్యత్ గురించి, అది ఆడుతుందా? ఆడదా? కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. ఇక ఆయన రెండు వందలో చిత్రంగా ఈనాడు, మూడు వందలో చిత్రంగా తెలుగు వీర లేవరా తెరకెక్కింది.

రెబల్ స్టార్..
తెలుగు తెరమీద వంద సినిమాలకు పైచిలుకు చిత్రాల్లో నటించిన మరో విశిష్టమైన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు., ఆవేశాన్ని, ఉద్రేకాన్ని కలగలిపి అభినయించడం ఆయన స్టైల్. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి అప్పట్లో కృష్ణంరాజు ఎంతగానో ఆకట్టుకునేవారు. ఆయన కోసం ప్రత్యేకంగా అలాంటి పాత్రల్నే రచయితలు సృష్టించేవారు. తెలుగునాట రెబల్ స్టార్‌గా వెలుగులు విరజిమ్మిన ఘనుడు కృష్ణంరాజు... విలన్ నుండి స్టార్‌గా విజయపథంలో పయనించిన తొలి తెలుగు హీరో కూడా కృష్ణంరాజే. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. నటుడిగా యాభై వసంతాలు చూశారు ... తెలుగునాట ఒకప్పుడు టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకరిగా వెలుగొందారు రెబల్ స్టార్ కృష్ణంరాజు... తెలుగు చిత్రసీమలో కృష్ణంరాజుది అరుదైన ఘనత... హీరోగా వచ్చి, విలన్ గా మారి, మళ్ళీ హీరోగా విజయం చూసిన ఘనుడాయన... తొలుత 'చిలక-గోరింక' చిత్రంలో హీరోగా అడుగు పెట్టిన కృష్ణంరాజు ఆ సినిమా పరాజయంతో పలుచిత్రాల్లో ప్రతినాయకునిగా నటించారు... ఎలాగైనా పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్టు చిత్రసీమనే నమ్ముకొని సాగారు కృష్ణంరాజు... విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా నటించి తనదైన బాణీ పలికించారాయన. దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు వందో చిత్రంగా దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన రంగూన్ రౌడీ చరిత్రలో నిలిచిపోతుంది.

చిరంజీవి..
ఇక యన్టీఆర్, ఎఎన్నార్ తరం తర్వాత వచ్చిన చిరంజీవి, అతి వేగంగా వెండితెరమీద ఎదిగారు. తన ట్రేడ్ మార్క్ డాన్స్ లతో, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకుల పాలిట మెగాస్టార్ అయిన ఆయన వంద చిత్రాలను అతి వేగంగా పూర్తి చేసారు. నిజానికి తెలుగు తెరకు స్పీడ్ ను పరిచయం చేసిన హీరో చిరంజీవే అంటే అతిశయోక్తి లేదు. పునాది రాళ్ళు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ‘మెగాస్టార్’ గా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు చిరంజీవి. ఎన్టీఆర్, ఎన్నార్, శోభన్ బాబు వంటి మహామహులు వెండితెరపై వెలిగిపోతున్న సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి నటన, డ్యాన్స్, ఫైట్లు, కామెడీ అన్ని విభాగాల్లో పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఎన్టీఆర్ తరువాత తెలుగు ప్రేక్షకుల చేత అన్నయ్య అని పిలిపించుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరమీద నెం.1 హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు చిరంజీవి. 150 వ చిత్రానికి ఒకే ఒక్క సినిమా దూరంలో నిలిచిన ఆయన 1988లో వచ్చిన త్రినేత్రుడు చిత్రంతో 100 సినిమాల్ని కంప్లీట్ చేసుకున్నారు. 1978 లో తెలుగు తెరమీద ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కేవలం పది సంవత్సరాల్లోనే 100చిత్రాల్ని కంప్లీట్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆరుపదుల వయసులోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పటికీ అదే గ్రేస్ తో డ్యాన్స్ చేస్తుండడం గొప్ప విశేషం. 2007 తర్వాత సినిమాలకు తాత్కాలికంగా స్వస్థిచెప్పిన మెగాస్టార్ 150 వ సినిమాకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మోహన్ బాబు..శ్రీకాంత్..రాజేంద్రప్రసాద్..
ఇక తెలుగు లో మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ , శ్రీకాంత్ లు ఎప్పుడో వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ అభినయంలో తిరుగులేని హీరోలే. గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకుండానే వీరు ముగ్గురూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మోహన్ బాబు తెలుగు తెరమీద డైలాగ్ కింగ్. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ . విలన్ గా అత్యధిక ప్రజాదరణ పొందిన రెండో తరం నటుడు. మోహన్ బాబు దాదాపు 550 పైచిలుకు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. హీరోగా ఎప్పుడో ఆయన వంద మార్క్ ను క్రాస్ అయిపోయారు. నిర్మాతగానే దాదాపు 50 పై చిలుకు చిత్రాల్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌.. 'స్నేహం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, దాదాపు 200కి పైగా చిత్రాల్లోని భిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఎంతగా నవ్వించ గలరో.. అదే స్థాయిలోనూ ఎడిపించగలరని ఆయన నటించిన చిత్రాలు చెప్పకనే చెబుతాయి. ఎర్రమందారం', 'ఆ నలుగురు' వంటి చిత్రాల్లోని ఉత్తమ నటనకు రెండు సార్లు ఆంధ్రరాష్ట్ర నంది అవార్డులు ఆయన్ని వరించాయి. లేడీస్ టైలర్, అహనా పెళ్లంట, ఏప్రిల్ 1విడుదల, అప్పుల అప్పారావు ఆయన కెరీర్లో మరిచిపోలేని చిత్రాలు. ఇక శ్రీకాంత్ పీపుల్స్ ఎన్ కౌంటర్ తో తెలుగు లో పరిచయమై, మహాత్మ చిత్రంతో వంద చిత్రాల్ని పూర్తి చేసారు. విలన్ గా, కుటుంబ చిత్రాల నాయకుడిగా, లవర్ బాయ్ గా ఎన్నో మరపురాని చిత్రాలు చేసి శ్రీకాంత్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హీరోగా కొనసాగుతునే కేరక్టర్ ఆర్టిస్ట్ గాకూడా తన సత్తా చాటుకుంటున్నాడు శ్రీకాంత్.


బాలకృష్ణ..
ఇక చిరంజీవి తరువాత తెలుగు లో వంద సినిమాలు పూర్తి చేయబోతున్న మరో హీరో నందమూరి బాలకృష్ణ. తనదైన డైలాగ్స్ తో , అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అయ్యింది. ఇప్పటికీ ఇంకా ఆయన తన జోరును కొనసాగిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ తరం అగ్రనటుల్లో నటనలో వాడి, డైలాగ్సలో వేడితో ప్రేక్షకుడిని థియేటర్ వైపు అడుగులు వేయిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు సనీవారసుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమైన బాలకృష్ణ తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకలతో సినిమా రంగ ప్రవేశం చేశారు. తండ్రి ఎన్టీఆర్ నుండి పుణికి పుచ్చుకున్న నటనా వారసత్వంతో కృష్ణార్జున విజయంలో కృష్ణుడిగా, అర్జునుడిగా, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా, పాండురంగడులో పాండురంగడు వంటి పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటి తరం హీరోల్లో పౌరాణిక, భైరవద్వీపం వంటి జానపదం, ఆదిత్య 369 వంటి సోషియో ఫాంటసీ, చారిత్రక, భక్తిరస, సాంఘిక చిత్రాలు...ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించిన ఏకైక హీరో బాలకృష్ణ. సమరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టి తెలుగు నాట ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలికి సింహా, లెజెండ్ సినిమాలతో తనలో డైలాగ్స్ వాడి, వేడి ఏమాత్రం తగ్గలేదని మరోసారి విమర్శకులకు నిరూపించారు. ఇప్పుడు బాలయ్య వందకి ఒక్క సినిమా దూరంలో ఉన్నారు. గౌతమీ పుత్రశాతకర్ణితో వంద సినిమాల్ని పూర్తి చేయబోతున్నారు. ఇక బాలయ్య తరువాత తెలుగు లో వంద సినిమాలు చేసే హీరోలు గా నాగార్జున, వెంకటేష్ మిగిలి ఉన్నారు. కానీ దానికి ఇంకా కాస్త టైమ్ పడుతుంది.
ఇప్పటితరం హీరోలకు వంద సినిమాలు చేసే ఛాన్సేలేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు నేటి కుర్రహీరోలు. ఆ ఫీట్ సాధించాలంటే ఎన్నో సంత్సరాలు ఎదురుచూడాల్సిందే. సో.. తెలుగు లో వంద సినిమాలు పూర్తి చేసిన ఆఖరి హీరోగా వెంకటేష్ నిలిచిపోవచ్చు బహుశా. ఆయన ఇప్పటికి 76 చిత్రాల్లో నటించారు. వంద పూర్తి చేయడం వెంకీకి పెద్ద కష్టమేమీ కాదు. సో.. బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్రలో నిలిచిపోవాలని ఆశిద్దాం.  

08:32 - April 24, 2016

శ్రీకాకుళం : అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌లా మారింది. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి.? తమకు రెగ్యులర్‌గా ఉండే ఓట్లు చీలిపోతాయా, రిజర్వేషన్‌ ఫలితంగా తమ ప్రాతినిధ్యానికే ప్రమాదం వాటిల్లుతుందా అన్న భయాలు కొందరిని హడలెత్తిస్తున్నాయి. సిక్కోలు జిల్లాలో ప్రస్తుతం అలాంటి సిచ్యుయేషనే నెలకొంది. డీ లిమిటేషన్‌లో ఏ మండలాలు ఎటెల్తాయోనన్న ఆలోచనలు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏపీలో నియోజకవర్గాలు పెరుగుతాయనే అంశం రాజకీయ వర్గాల్లో భారీయెత్తున చర్చ జరిగేందుకు కారణమవుతోంది. నియోజకవర్గాలు పెరిగితే లాభమా నష్టమా? అసలు ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి... వాటి తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే డిస్కషన్స్ ఊపందుకుంటున్నాయి. స్టేట్‌లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలను 225కు పెంచాలన్న ప్రతిపాదన చట్టంలోనే ఉంది. కేంద్రం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తే నియోజకవర్గాల పెంపు సాధ్యమవుతుంది.

హాట్ టాపిక్...
అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన అంశం ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో హాట్‌ టాపిక్‌లా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న పది అసెంబ్లీ స్థానాలకు తోడుగా మరో రెండు పెరిగే అవకాశం ఉంది. పన్నెండు సంవత్సరాల క్రితం పన్నెండు అసెంబ్లీ స్థానాలున్న శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, హరిశ్చంద్రపురం సెగ్మెంట్లను నియోజకవర్గాల పునర్విభజనలో తొలగించి పదికి పరిమితం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న జనాభా, భౌగోళిక స్వరూపం, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా మరో మూడు సెగ్మెంట్లు పెంచాలని నేతలు కోరుతున్నారు. త్వరితగతిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు నేపథ్యంలో త్వరలో పునర్విభజన ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో పలువురు నేతల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఎక్కడ తమ నియోజకవర్గంలోని మండలాలు పక్కకు వెళతాయో, కొత్తగా ఏవొచ్చి చేరతాయో అన్న సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతోపాటు రిజర్వేషన్లు, పార్టీ బలాబలాలు తదితర అంశాల దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో తాము గెలుస్తామో లేదో అని గుబులు చెందుతున్నారు. ఏదేమైనా నియోజకవర్గాల పునర్విభజన జరిగేదాకా ఆయా నేతల్లో టెన్షన్ కొనసాగేలా కనిపిస్తోంది. 

ఈక్వెడార్ భూకంప మృతులు 650...

కానోవా : పెను భూకంపం ధాటికి కుదేలైపోయిన ఈక్వెడార్ లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈక్వెడార్ భూకంప మృతుల సంఖ్య 650కి చేరింది. 58 మంది ఆచూకి తెలియడం లేదని తెలుస్తోంది. 

08:23 - April 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య పీజీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిసారిగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించబోతోంది. ఇవాల్టి నుంచి 26వ తేదీ వరకు విద్యార్ధులకు నిర్దేశించిన కేంద్రాలలో విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాల్సి వుంటుంది. తెలంగాణా లో వైద్య విద్య పీజి సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఏర్పాటు తరువాత మొదటిసారిగా కైన్సెలింగ్ నిర్వహించేదుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. ఈనెల 24 నుంచి 26వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించబోతోంది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవగానే అందులో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు సిద్ధమైంది యూనివర్శిటీ. అంతేకాదు మే 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
రెండు రాష్ట్రాల్లోని పీజీ సీట్లకు పోటీ పడే అభ్యర్థులు వేర్వేరుగా ఆయా రాష్ట్రాల్లోని కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కాగా పీజీ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించే వెబ్‌ కౌన్సెలింగ్‌ వివరాలను కాళోజి నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశలోని పీజీ వైద్య సీట్ల భర్తీ కోసం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందన్నారు. ఏపీలోని 15 శాతం అన్‌రిజర్వేడ్ సీట్లకు తెలంగాణ విద్యార్థులు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని, ఇందుకోసం జేఎన్‌టీయూలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వీసి తెలిపారు.

08:07 - April 24, 2016

విశాఖపట్టణం : తలపాక ట్రాన్స్ కో విద్యుత్ ఉప కేంద్రంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీనితో నాలుగు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం తలపాకలోని 440 కెవీ సబ్ స్టేషన్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీనితో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉదయం 4గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దువ్వాడ - పలాస రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న విద్యుత్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విద్యుత్ ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉదయం 6.30 గంటలకు విద్యుత్ ప్రారంభమైంది. భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని విద్యుత్ అధికారులు వెల్లడించారు. 

సూరత్ లో నీటి ఎద్దడి..

గుజరాత్ : సూరత్ లో నీటి ఎద్దడి తీవ్రంగా నెలకొంది. పలు ప్రాంతాల్లో నీటి కోసం మహిళలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో నీటి కోసం మహిళలు పడిగాపులు పడుతున్నారు. 

07:52 - April 24, 2016

చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్...ఈయనకు గన్ మెన్ గా ఎండి ఉస్మాన్ వ్యవహరించారు. ఆయనతో 'మల్లన్న' టెన్ టివి 'రచ్చబండ' కార్యక్రమంలో ముచ్చట్లు పెట్టిండు. ఈ సందర్భంగా ఉస్మాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను 18వ ఏట నుండి 30 ఏట వరకు నవాబ్ దగ్గర గన్ మెన్ గా ఉన్నట్లు తెలిపిండు. నిజాం సర్కార్ కు 52 మంది భార్యలుండేవారని పేర్కొన్నాడు. ఒక భార్య దగ్గర ఇద్దరు పోలీసోళ్లు ఉండేవారని తెలిపాడు. మరిన్ని ఆసక్తికర విషయాలను వీడియోలో చూడండి. 

07:30 - April 24, 2016

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్ ని ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్‌ ఫాల్కే' పురస్కారం వరించింది. ఇటీవల నటించిన 'అలిగర్‌' చిత్రానికి గానూ క్రిటిక్‌ ఛాయిస్‌ విభాగంలో ఈ అవార్డుకి ఆయన్ని ఎంపిక చేశారు. శనివారం పుట్టిన రోజు జరుపుకున్న మనోజ్‌కి సినిమా విభాగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం లభించడాన్ని బర్త్ డే గిఫ్ట్ గా సినీ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. అలిగర్‌ ముస్లీం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రామచంద్ర సిరాస్‌కు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు మనోజ్‌ ప్రకటించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడు హన్సల్‌ మెహతా, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. 'వెల కట్టలేని ప్రేమ, ప్రశంసలను అందిస్తున్న వారందరికి థ్యాంక్స్. ఈ అవార్డు రావడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్‌ చేశారు మనోజ్‌. ఇండియన్‌ లింగ్విస్ట్, రచయిత, అలిగర్‌ ముస్లీం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రామచంద్ర సిరాస్‌ జీవితం ఆధారంగా దర్శకుడు హన్సల్‌ మెహతా 'అలిగర్‌' చిత్రాన్ని రూపొందించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు మంచి ప్రేక్షకాదరణ పొందింది. బీహార్‌కి చెందిన మనోజ్‌ బాజ్‌పాయ్ 'డ్రోహ కాల్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'బండిట్‌ క్విన్‌', 'సత్య', 'కౌన్‌', 'శూల్‌', 'ఆక్స్', 'రోడ్‌', 'పింజర్‌', 'రాజ్‌నీతి', 'గ్యాంగ్‌ ఆఫ్‌ వస్సేపూర్‌', 'చక్రవ్యూహ', 'స్పెషల్‌ 26' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 'సత్య' చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా, 'పింజర్‌' చిత్రానికి ప్రత్యేక జ్యూరీ విభాగంలో మరో జాతీయ అవార్డుని అందుకున్నారు. 'హ్యాపీ', 'ప్రేమ కథ', 'పులి', 'వేదమ్‌' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాజ్‌పాయ్ బాగా సుపరిచితులయ్యారు.

07:27 - April 24, 2016

ఏడిద నాగేశ్వరరావు... అపురూప చిత్రాల నిర్మాణంతో తెలుగు సినిమా సత్తా ఏమిటో విశ్వవాప్తంగా తెలియజేసిన అభిరుచిగల నిర్మాత. 'శంకరా భరణం', 'స్వయంకృషి', 'సిరి సిరి మువ్వ', 'స్వాతిముత్యం', 'ఆపద్బాంధవుడు', 'సాగర సంగమం', 'సీతాకోక చిలుక', 'సితార' వంటి తదితర ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ప్రేక్షకుల విశేష ఆదరణతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలను దక్కించుకున్నాయి. ఉత్తమాభిరుచిగల నిర్మాతగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఏడిద నాగేశ్వరరావు జయంతి జయంతి నేడు.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన సత్తిరాజు నాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్‌ 24న ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. నాటక రంగమంటే చిన్నప్పట్నుంచీ ఎనలేని ప్రేమ, గౌరవం. సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాల నేపథ్యంలో ఆయన సినిమాల్ని నిర్మించడానికి పునాది నాటక రంగమేనని ఎన్నో సందర్భాల్లో నాగేశ్వరరావు చెప్పారు.
1978లో పూర్ణోదయా ఆర్ట్‌ క్రియేషన్స్ సంస్థను ప్రారంభించి తొలుత 19 మంది భాగస్వాములతో కలిసి 'సిరి సిరి మువ్వు' చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కెరీర్‌ని స్టార్ట్‌ చేశారు. ఆ తర్వాత 'తాయారమ్మ బంగారయ్య' సినిమాతో సోలో నిర్మాతగా మారారు.
30 ఏండ్ల కెరీర్‌లో నిర్మాతగా 'శంకరాభరణం', 'స్వయంకృషి', 'స్వాతిముత్యం', 'సాగర సంగమం', 'సీతాకోక చిలుక', 'సితార', 'ఆపద్బాంధవుడు' వంటి పది అద్భుత కళాఖండాలను నిర్మించారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'శంకరాభరణం' చిత్రం తెలుగునాట నూతన ఒరవడికి నాంది పలికింది. ప్రపంచవ్యాప్తంగా ఎనలేని కీర్తినీ తెచ్చిపెట్టింది.
కె.విశ్వనాథ్‌, నాగేశ్వరరావు కాంబినేషన్‌లో రూపొందిన దాదాపు ఐదు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మరపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి. 'శంకరాభరణం', 'సాగర సంగమం', 'స్వాతిముత్యం', 'సితార' వంటి చిత్రాలకు జాతీయ పురస్కారాలు లభించగా, ఈ చిత్రాలన్ని రష్యన్‌ భాషలో అనువాదమై అక్కడి ప్రేక్షకులనూ అలరించాయి.
తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచిన 'శంకరాభరణం', 'స్వయంకృషి', 'సిరి సిరి మువ్వు', 'స్వాతిముత్యం' తదితర చిత్రాలు ఆ రోజుల్లోనే మాస్కో ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో వరుసగా ప్రదర్శితమై ప్రపంచ ప్రేక్షకుల ప్రశంసల్ని సైతం పొందాయి.
కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ఆయన నిర్మించిన 'స్వాతిముత్యం' చిత్రం ఆస్కార్‌ అవార్డుల ఎంట్రీ వరకు వెళ్ళిన తొలి దక్షిణాది చిత్రం కావడం విశేషం.
నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, నిర్మాణ సంస్థ అధినేతగా అంచెలంచెలుగా ఎదిగిన నాగేశ్వరరావు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా, జాతీయ పురస్కారాల కమిటీ సభ్యుడిగా కూడా ఆయన విశిష్ట సేవలందించారు. జీవిత సాఫల్య పురస్కారంతో సంగం అకాడమీ ఆయన్ని సముచితంగా గౌరవించింది.

07:25 - April 24, 2016

బాహుబలి', 'భజరంగీ భాయిజాన్‌' చిత్రాల ఘనవిజయంతో బాలీవుడ్‌లో విజయేంద్రప్రసాద్‌కి మరింత మంచి గుర్తింపు లభించింది. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన 'రాజన్న' చిత్రాన్ని బాలీవుడ్‌లో 'మేరా భారత్‌ మహాన్‌'గా రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'రాజన్న' నేపథ్యాన్ని మాత్రమే తీసుకుని బాలీవుడ్‌కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. సన్నీడియోల్‌ కథానాయకుడిగా నటించే ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఏకధాటిగా జరుగుతోంది.

 

07:23 - April 24, 2016

'అరుంధతి', 'రుద్రమదేవి', 'బాహుబలి' వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అనుష్క తాజాగా మరో పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రంలో బాలకృష్ణ సరసన నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. బాలకృష్ణ వందవ చిత్రమైన 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. బాలకృష్ణకి జోడీగా తొలుత నయనతారని అనుకున్నప్పటికీ డేట్ల సర్దుబాటు కారణంగా కాజల్‌ని అనుకున్నారు. అయితే రానా సరసన నటించే చిత్రం సెట్స్‌పైకి వెళ్తుండటంతో కాజల్‌ కూడా బిజీగా ఉంది. ఈనేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఫైనల్‌గా అనుష్కని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అనుష్క ప్రస్తుతం తెలుగులో 'బాహుబలి 2'లోను, తమిళంలో సూర్య సరసన 'ఎస్‌3' చిత్రంలోనూ నటిస్తోంది.

07:21 - April 24, 2016

చెంచా తేనెలో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె, చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచుకోండి. దీన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తే, చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక స్పూను గంధంలో స్పూను పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పావుకప్పు బంగాళాదుంప తురుము, రెండు టేబుల్‌ స్పూన్ల గ్రీన్‌టీ ఆకులు, చెంచా నువ్వుల నూనె తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. రాత్రిపూట ఈ మిశ్రమాన్ని కళ్ల కింద నల్లని వలయాలపై పూతలా వేసి, మర్నాడు కడిగేసుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా నల్లని వలయాలు మాయమైపోతాయి. అంతేకాదు, బాదం నూనెను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కళ్ల కింద రాసి మర్దన చేసినా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
చేతులు, చేతిగోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే... కనీసం నెలకోసారి మెనిక్యూర్‌ చేయించుకోవాలి. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలపాలి. ఆ నీటిలో చేతివేళ్లను కాసేపు ఉంచితే ఎంతో అందంగా కనిపిస్తాయి.
చర్మానికి ప్రోటీన్‌ లాంటి పోషణ అందించాలంటే, కోడిగుడ్డు పచ్చసొనలో పావుకప్పు పాలు, కొద్దిగా కొబ్బరినూనె కలిపి రాసుకోవాలి. అంతేకాక, పావుకప్పు వెన్నలేని పాలల్లో మూడు స్పూన్ల ఆలివ్‌నూనె, కాసిని గులాబీరేకలు వేసి, మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. సహజసిద్ధమైన ఈ క్రీంను ప్రతిరోజూ ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. మరింత తాజాగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు.
నెలకోసారి కొబ్బరి పాలతో శిరోజాలను తడిపి గంటయ్యాక షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు చిట్లడం అదుపులో ఉంటుంది. రోజుకి ఒకటి లేదా రెండు అరటిపండ్లు తీసుకుంటే దానిలోని పోషకాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.

07:20 - April 24, 2016

జీవితం అంటే పొద్దున్నే ఆరాటంగా లేవటం..మన వాళ్లకోసం హాడావుడిగా పరుగులు పెట్టడం కానే కాదు. ఇలా చేసేవారు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. కాని మనం నిద్ర లేచిన పద్దతిబట్టే ఆ రోజు ఆధారపడి ఉంటుందట. ఆదరాబాదరగా రోజును మొదలుపెడితే చేయబోయే పనులపై ఆ ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. రోజూ మన జీవితంలోకి తూర్పు కిరణాలతో సూర్యుడు ఉత్సాహంగా గుడ్‌ మార్నింగ్‌ చెప్పినట్టుగా మనమూ అంతే ఉత్సాహంగా ఉండాలి. మరి దానికోసం ఇలా చేసి ఉత్సాహవంతమైన వెలుగునే మీ మనసులో నింపుకోండి.

  • పొద్దున్నే మేల్కోగానే ఫోన్లలో మాట్లాడడం, ఇమెయిల్స్ చెక్‌ చేయకండి. ఇవి కొన్ని సందర్భాల్లో మీ మూడ్‌ని పాడుచేస్తాయి.
  • నిద్రలేవగానే ఓ జోక్‌ చదవడం, అద్దంలో మీ ముఖం చూసుకొని బలవంతంగానైనా 20 సెకన్లు నవ్వండి.
  • లేవగానే మీ ఇంట్లో వారికి గుడ్‌ మార్నింగ్‌ చెప్పడం వంటివి చెయ్యండి.
  • నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.
  • రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది.
  • పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శరీరాన్ని స్ట్రాంగ్‌ అండ్‌ ఫిట్‌ గా ఉంచుతాయి. మనకు కొండంత ఎనర్జీని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.
  • ప్రతీ రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది.
  • నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం మీ అలవాట్లో లేకపోతే, ఆ అలవాటును అలవరుచుకోండి.
  • రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మెలోడీ లేదా మీకు నచ్చిన సంగీతం వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది.? అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. 

తలపాక ట్రాన్స్ కో లో సాంకేతిక లోపం..

విశాఖపట్టణం : తలపాక ట్రాన్స్ కో విద్యుత్ ఉప కేంద్రంలో సాంకేతిక లోపంతో నాలుగు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉదయం 4గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దువ్వాడ - పలాస రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

 

బర్దమాన్ లో అదుపులోకి వచ్చిన మంటలు.

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లోని బర్దమాన్ జిల్లాలోని మురికవాడలో జరిగిన అగ్నిప్రమాదంలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం 12.30గంటలకు చోటు చేసుకుంది. 

లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన నేడు ఆల్ పార్టీ మీటింగ్..

ఢిల్లీ : నేడు ఉదయం 11.30గంటలకు లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగనుంది.

 

06:28 - April 24, 2016

ఖమ్మం : తెలంగాణాలో ఉప ఎన్నికలను ఎదుర్కొంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీఆర్‌ఎస్, అధికార పార్టీగా అవతరించినా..ఉప ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకుంటోంది. తెలంగాణా ఏర్పాటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ వస్తోంది. గత 22 నెలల్లో మెదక్, వరంగల్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు నారాయణఖేడ్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువగా మెజార్టీ సాధించింది. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కూడా అదే ఫలితాన్ని రాబట్టేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మంలో పార్టీని బలపరిచేందుకు కారెక్కించుకుని, మంత్రి పదవిని కట్టబెట్టిన తుమ్మల నాగేశ్వర్‌రావునే పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దించింది టీఆర్‌ఎస్. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానమైనా... ఖమ్మంలో పార్టీ బలంగా ఎదిగిందనే సంకేతాలు ఇచ్చేందుకు గులాబి దళపతి పాలేరు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

ప్రచార పర్వం..
ఇప్పటికే మంత్రి తుమ్మల, నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని మొదలు పెట్టారు. ప్లీనరీ అనంతరం ఇతర జిల్లాల నేతలు ఇక్కడ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ఒక్కో మంత్రిని ఇన్‌చార్జి గా నియమించడంతో పాటు ఒక ఎమ్మెల్యేకి, ఇంకొక ఎమ్మెల్సీకి కూడా మండల బాధ్యతలను అప్పగించాలని గులాబి దళపతి నిర్ణయించినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జి గా మంత్రి కేటీఆర్‌ను నియమించింది టీఆర్‌ఎస్‌ పార్టీ. మెదక్, వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు, నారాయణఖేడ్‌ ఉపఎన్నికతో పాటు బల్దియా ఎన్నికల్లోను సత్తా చాటింది టీఆర్‌ఎస్‌. ఇక ఖమ్మం జిల్లాలో జరిగే పాలమూరు ఉప ఎన్నికలో గెలిచి, తమకు అక్కడా తిరుగు లేదని తేల్చిచెప్పేందుకు సిద్ధమవుతోంది.

06:26 - April 24, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పాలేరును దక్కించుకునేందుకు అటు అధికార పార్టీ...ఇటు ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పాలేరును ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా ప్రయత్నిస్తుంటే..అధికార పక్షం మాత్రం పోటీకి సై అని ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది పోటీకి సై అంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక అభ్యర్థిగా రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య సుచరితారెడ్డి పేరును టి పిసిసి ఖరారు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని ఏఐసిసికి కూడా పంపించింది. ఈ సందర్భంగా పాలేరును ఏకగ్రీవం చేయాలని..అందుకు తమ అభ్యర్థి సుచరితారెడ్డికి మద్దతివ్వాలని టి పిసిసి కార్యవర్గం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే వైసిపి పోటీనుంచి తప్పుకొని కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్ధతును ప్రకటించింది. ఇక మిగిలింది టిడిపి, వామపక్షాలు. వామపక్షాల్లో సీపీఎం తాము కూడా పాలేరు బరిలో నిలుస్తామని చెప్పింది. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. దీనిపై నేడో, రేపో స్పష్టత ఇస్తామని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

ఉక్కిరిబిక్కిరవుతున్న టిడిపి..
ఇక సందట్లో సడేమియా అన్నట్లుగా ఎన్నికల మీద ఎన్నికలు వచ్చి తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రతిసారీ తమ బలాన్ని, బలగాన్ని కోల్పోతున్నట్లు ఎన్నికల్లో రుజువు అవుతుండడంతో..పాలేరులో పోటీకి దిగాలా వద్దా టి టిడిపి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో వీరిపరిస్థితి ఇప్పుడు ముందు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్నచందంగా తయారైంది. ఇప్పటికే పాలేరు అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బరిలోకి దింపే అవకాశాలు కన్పిస్తున్నా ఇంకా ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఒక దఫా టిడిపి నేతలతో చర్చలు జరిపి తమకు మద్దతివ్వాలని కోరారు. మరణించిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్యకే తాము టికెట్‌ ఇస్తున్నామని..గతంలో ఉన్న సాంప్రదాయాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో టిడిపి మళ్లీ పునరాలోచనలో పడింది. ఈ అంశంపై టిడిపి నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. అయితే నిర్ణయాన్ని చంద్రబాబు టి టిడిపి నేతలకే వదిలేశారు. నామాతో పాటు చంద్రబాబుతో ఖమ్మం జిల్లా నేతలు సంప్రదింపులు జరిపారు. పోటీచేస్తే నామా ఉంటారని లేకుంటే కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పాలేరు ఉప ఎన్నికకు రెండో రోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల పర్వం ఈనెల 22న ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాకపోవడంతో నామినేషన్లు రావడంలేదని తెలుస్తోంది. అయితే సోమవారం నాడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అకాశాలు కన్పిస్తున్నాయి. 

06:23 - April 24, 2016

హైదరాబాద్ : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్ఆర్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించింది. చంద్రబాబు పరిపాలనలో ప్రజాస్వామ్య విలువ దిగజారిపోతోందని వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. పార్టీలు మారే నేతలు ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని ఆరోపించారు. ఒక పార్టీ నుంచి మరోపార్టీకి మారే విష సంస్కృతిని నిరసిస్తూ తాము ఈ ర్యాలీని నిర్వహించినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పౌరసమాజం ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కోట జంక్షన్‌ వద్ద ర్యాలీని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు సాంబశివరాజు ప్రారంభించారు. ప్రజాస్వామ్యానికి అర్ధం మార్చే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి విమర్శించారు. ప్రజల యొక్క, ప్రజల చేత , ప్రజల కొరకు అని ప్రజాస్వామ్యం గురించి విద్యార్ధులు నిన్నటి వరకు చదువుకున్నారని, నేడు ప్రతిపక్షాన్ని కొనుగోలు చెయ్యడమే ప్రజాస్వామ్యంగా మారిందని మండిపడ్డారు. జిల్లాలో ఒక ఎమ్మెల్యే వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ మొత్తం ఖాళీ అయిపోయినట్లు కాదని తెలిపారు. వైసీపీ సత్తా ఎలా ఉంటుందో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చూస్తుందని అన్నారు.

వెన్నుపోటు రాజకీయాలన్న జగన్..
ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. జగన్‌ను ఏమీ చెయ్యలేక జగన్‌పార్టీలోని ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నిర్వహించారు. వినాయకుని గుడి నుంచి క్లాక్‌టవర్‌ వరకు కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతో సంతలో పశువుల్లా రాష్ర్ట ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సేవ్ డెమోక్రసీ పేరుతో వైసీపీ నేతలు విశాఖలో భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వానికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు దిగాలని వైసీపీ నేతలు సవాలు విసిరారు.

06:21 - April 24, 2016

హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్న టీడీపీ తీరుకు నిరసనగా పోరాటానికి దిగింది. గవర్నర్‌ను కలిసిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌.. ఏపీలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పెద్దలను కలిసేందుకు రెడీ అవుతున్నారు. అధికార టీడీపీతో అమితుమి తేల్చుకునేందుకు జగన్‌ పార్టీ సమర శంఖం పూరించింది. ఒక్కొక్కరుగా తమ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో పోరుబాట పట్టింది. తమ ఎమ్మెల్యేలను అనైతికంగా టీడీపీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ ఫిరాయింపులతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటన్న రాజకీయ పరిస్థితులను గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన జగన్‌ పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.

రాజీనామా చేయాలి..
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని.. పట్టిసీమ ప్రాజెక్టు పనులను 22 శాతం ఎక్సెస్ రేటుకు కట్టబెట్టారని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. ఇసుక మాఫియాలో వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్‌ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని సంతలో గొర్రెల మాదిరిగా విపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా స్వామ్యంపై గౌరవం ఉన్నట్లయితే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు జగన్‌ సవాల్‌ విసిరారు. ప్రజలు మళ్లీ ఎవర్ని ఎన్నుకుంటారో తేల్చుకుందామని చాలెంజ్‌ చేశారు. చంద్రబాబు తీరుకు నిరసనగా సేవ్ డెమోక్రసీ పేరుతో మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కంప్లైంట్ చేయాలని నిర్ణయించింది జగన్‌ పార్టీ. 

06:19 - April 24, 2016

హైదరాబాద్ : ఏపీలో అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతిపక్ష వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా.. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో.. ఆ పార్టీలో చేరారు. ఇదే బాటలో మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ అధికార టీడీపీలో చేరారు. తాజాగా చాంద్‌బాషా చేరికతో ఆ సంఖ్య 13 కు చేరింది.

గొట్టిపాటి రవికుమార్..
మరోవైపు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కూడా సైకిలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ మారే విషయమై ఆయన ఇప్పటికే కార్యకర్తలతో చర్చించినట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరలోనే టీడీపీలో చేరాలని రవికుమార్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదరితే ఈనెల 27వ తేదీనే ముహార్తం ఖరారు చేసినట్లు సమాచారం.  ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటంతో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నాడని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాడని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. 

రేణిగుంటలో అగ్నిప్రమాదం...

చిత్తూరు : జిల్లా రేణిగుంట రైలు బోగీల మరమ్మత్తు కేంద్రంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 

ముంబై ఇండియన్స్ పరాజయం..

ఢిల్లీ : ముంబై ఇండియన్స్ జట్లు గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడింది. ఢిల్లీ కుర్రజట్టు చివరిలో ముంబై కొమ్ములు విరిచి ఈ సీజన్ లో మూడో విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు పోరాడిన ఢిల్లీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్కోరు బోర్డు : ఢిల్లీ డేర్ డెవిల్స్ : 164/4..
                 ముంబై ఇండియన్స్ : 154/7. 

ఐపీఎల్ లో నేడు...

కోల్ కతా : ఐపీఎల్ 9లో నేడు గుజరాత్ - బెంగళూరు జట్లు ఢీకొననున్నాయి. సాయంత్రం 4గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్ లో పుణె - కోల్ కతా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

సోమవారం మోడల్ టెట్..

హైదరాబాద్ : విద్యార్థుల సౌకర్యార్థం ఈనెల 25వ తేదీన మోడల్ టెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ పండిత పరిషత్తు ప్రకటించింది. ఈ మోడల్ పరీక్షలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవిత హాజరవుతున్నట్లు పరిషత్తు నిర్వాహకులు వెల్లడించారు. 

నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష..

హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటిసారిగా పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికకు నిర్వహిస్తున్న ప్రాథమిక రాత పరీక్షకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్ఏఆర్/టీఎస్ఎస్పీ), ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ (పురుషులు), ఫైర్ మెన్ పోస్టులకు ఆదివారం పది జిల్లాల్లో, 1,132 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9,281 పోస్టులకు గాను 5,36,046 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం విజ్ఞాన్ భవన్ లో జరిగే ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. 

Don't Miss