Activities calendar

25 April 2016

21:30 - April 25, 2016

ఢిల్లీ : విజయ్ మాల్యా రాజ్యసభ పదవికి ఎసరొచ్చింది. రాజ్యసభ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో...వివరణ ఇవ్వాలని మాల్యాకు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నోటీసు జారీచేసింది. మాల్యా రాజ్యసభ సభ్యత్వం రాబోయే జూన్‌ నెలతో ముగియనుంది. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో ప్రశ్నిస్తూ జారీ చేసిన నోటీసుకు వారంలోపు సమాధానమివ్వాలంది. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా ఎథిక్స్ కమిటీ ఒక నిర్ణయానికొచ్చిందని కమిటీ చైర్మన్‌ కరణ్‌ సింగ్ అన్నారు. నోటీసుకు మాల్యా ఇచ్చే సమాధానాన్ని బట్టి సభ్యత్వం రద్దుపై రాజ్యసభకు కమిటీ రికమెండేషన్ చేస్తుంది. 

21:29 - April 25, 2016

ఢిల్లీ : చట్టాన్ని కాపాడాల్సిన ఎంపీలే చట్టాన్ని ఉల్లంఘించారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో పార్లమెంటుకు బయలుదేరిన పలువురు ఎంపీలకు సరి-బేసి షాక్ తగిలింది. సరి-బేసిని ఉల్లంఘించి బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ తన వాహనంలో దర్జాగా పార్లమెంటుకు వచ్చారు. తాను చాలా పొరపాటు చేశానని పరేష్‌ రావల్‌ ట్విట్టర్‌ ద్వారా కేజ్రీవాల్‌కు, ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఢిల్లీలో సరి-బేసి సంఖ్యల కారణంగా ఇతర ఎంపీలూ ఇబ్బంది పడ్డారు. సరి-బేసి నిబంధన నుంచి ఎంపీలను మినహాయించాలని, తాము ట్యాక్సీల్లో పార్లమెంటుకు రాలేమని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. దీనిపై ఎస్పీ ఎంపీ నరేష్‌ అగర్వాల్‌ కూడా ఫిర్యాదు చేశారు. ఢిల్లీ ప్రభుత్వంతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ హామీ ఇచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ట్రాఫిక్ నియంత్రించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనాల నంబర్ ప్లేట్ల ఆధారంగా సరి-బేసి నిబంధనను అమలు చేస్తోంది.

20:48 - April 25, 2016

హైదరాబాద్ : ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేదు.. ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేదు.. ప్రతి ప్రాంతంలోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ హడలెత్తిస్తున్నాడు. విపరీతమైన ఎండల ధాటికి గాలి వేడెక్కి తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉండబోతున్నాయి..

గత ఏడాదితో పోలిస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు ...

సోమవారం పలు జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని రామగుండంలో ఇప్పటికే 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై గత రికార్డును బద్దలు కొట్టింది. అదికూడా ఏప్రిల్‌ నెలలో కావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‌ నగరాల్లో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హన్మకొండలో 44, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో 43 డిగ్రీల మేర టెంపరేచర్‌ నమోదైంది.

ఏపీలోనూ విజృంభిస్తున్న ఎండలు...

తెలంగాణలో పరిస్థితులు ఇలా ఉంటే ఏపీలోనూ ఎండలు మరింత విజృంభిస్తున్నాయి. తిరుపతి, జంగమహేశ్వరపురంలలో అత్యధికంగా 46 డిగ్రీలు, నంద్యాల, నెల్లూరులలో 45, కర్నూలు, కడప, నందిగామలో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉక్కపోతలు ఎక్కువగా ఉండే కోస్తాలో సిచ్యుయేషన్‌ క్రిటికల్‌గా ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ మార్తాండుడు చుక్కలు చూపిస్తుండగా విశాఖపట్నంలో మాత్రం తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రానున్న రోజుల్లో వడగాడ్పుల తీవ్రత మరింత పెరనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మేలో దాదాపుగా చాలా జిల్లాలో 50 డిగ్రీలకు అటూ ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందంటున్నారు. థండర్ స్ట్రోమ్స్ ప్రభావంతో వేడిగాలులు కోస్తా ఆంధ్రాకు వ్యాపించాయని చెబుతున్నారు.

వడదెబ్బతో మృతిచెందుతున్న వారి సంఖ్య......

విపరీతమైన ఉష్ణోగ్రతల మూలంగా వడదెబ్బతో మృతిచెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే జలాశయాలు, నీటి వనరులు ఎండిపోవడంతో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. వడగాడ్పులు విజృంభించనున్న నేపథ్యంలో ప్రజలు బయటకొచ్చేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

20:46 - April 25, 2016

హైదరాబాద్ : ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలనం రేపిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల పుత్రరత్నం కేసు క్లోజయింది... క్వాష్‌ పిటిషన్‌ వేసుకున్న రావెల సుశీల్‌ తప్పు చేసినట్లు పోలీసులు కూడా ఎక్కడా నిరూపించలేకపోయారు..సరైన సాక్ష్యాధారాలు సేకరించలేకపోయారు..దీంతో ఇరువర్గాల మధ్య అవగాహన ఒప్పందంతో కేసు క్లోజయింది...తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసు ఎన్నో కీలకమలుపులు తిరిగి చివరకు కోర్టు ఆదేశాలతో కొట్టివేయబడింది..

తుస్సుమన్న సంచలనం రేపిన కేసు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంత్రి రావెల కిషోర్ కుమార్ పుత్రరత్నం రావెల సుశీల్‌ కేసు ఒక్కసారి తుస్సుమంది...ఈ కేసు ఇక పర్మినెంట్‌గా పుల్ స్టాప్ పడింది...ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నిందితుడిగా నమోదయిన కేసులో తనకు ఎలాంటి సంబందం లేదని వేసిన క్వాష్‌ పిటిషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది...తన పట్ల అసభ్యంగా ప్రవర్తించింది ఏవరో తెలియదని మరోవైపు బాధితురాలు అఫిడవిట్ దాఖలు చేసింది..దీంతో ఉన్నత న్యాయస్థానం బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును కోట్టివేసింది... పిర్యాదు చేసినప్పటి నుంచి ఎన్నో మలుపు తిరిగిన రావెల కేసులో అసలు ఏం జరిగిందనే విషయంలో అంతా గందరగోళం ఏర్పడి చివరకు కేసు కొట్టివేయబడింది...

ఇది పోలీసుల వైఫల్యమా...

మార్చి3వ తేదీన బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 13లో ఎమ్మెల్యే కారు స్టిక్కర్ ఉన్న పార్ఛునర్ లో ఉన్న వ్యక్తులు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అరోపణ.. అమె చెయి పట్టుకున్నారని స్థానికులు చితకబాది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది...అయితే అప్పటికే టీడీపీ చెందిన కీలకమైన నాయకుడు రంగంలోకి దిగి వెస్ట్ జోన్ పోలీస్ అధికారులతో మాట్లాడి.. కారులో ఉన్న మంత్రి కొడుకును డ్రైవర్ ను పంపించారు..అయితే మార్చి 5న మీడియాకు విషయం తెలియడంతో వెలుగులోకి వచ్చింది...దీంతో మంత్రి కొడుకు వ్యవహారం పై మీడియా ముందు బాధితురాలు మొర పెట్టుకోవడంతో పోలీసులు సి.సి. కెమెరా అధారంగా మంత్రి కుమారుడు సుశీల్ కుమార్ ను డ్రైవర్ రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

నిర్భయ చట్టం కింద కేసు...

ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సి.సి. కెమెరాలను పరిశీలించారు. కారు నెంబర్ తో సహా అందులో డ్రైవర్ వచ్చేలా సి.సి. ఫోటోజీ ఉంది. అయితే రావెల సుశీల్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. స్థానికులు చితకబాధిన వద్ద సి.సి.కెమెరాలు లేవని పోలీసులు చేతులు దులుపుకున్నారు. వారం రోజుల పాటు జైల్లో ఉన్న ఇద్దరికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజురు చేయడంతో బయటకు వచ్చారు...

పోలీసులు ఇరికించారంటూ పిటిషన్..

పది రోజుల క్రితం సుశీల్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు... పోలీసులు తనను కావాలని ఇరికించారని అందులో విన్నవించు కున్నారు...ఆసలు కారులో తాను లేనని చెప్పుకొచ్చారు...బాధితురాలు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినవారు వారు కాదంటూ అఫిడవిట్ దాఖలు చేసింది...ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చారంటూ పిటిషనర్ తరుపు న్యాయవాది జితేందర్ రెడ్డి వాదనలు వినిపించారు..క్వాష్ పిటిషన్ లో పోలీసులు, ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో జస్టిస్ రాజా ఎలోంగా బెంచ్ సుశీల్ ,రమేష్ పై నమోదయిన కేసును కోట్టివేస్తు ఉత్తర్వులు జారీ చేశారు...

20:41 - April 25, 2016

ముంబై : 2006 మాలేగావ్ పేలుళ్ల కేసులో అరెస్ట్‌ అయిన తొమ్మిదిమంది నిందితులను ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు మృతి చెందారు. వీరంతా అయిదేళ్ల శిక్షను అనుభవించారు. 2006లో జరిగిన పేలుళ్లలో 37 మంది మృతి చెందగా, వందకు పైగా గాయపడ్డారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఎటిఎస్‌- 8 మందిని సిమీ ఉగ్రవాదులుగా అనుమానిస్తూ అదుపులోకి తీసుకుంది. పాక్‌కు చెందిన లష్కరేతో కలిసి పేలుళ్లకు పాల్పడి ఉంటారని తొలుత భావించారు. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. 2008లో మాలేగావ్‌లో రెండోసారి పేలుళ్లు జరిగాయి. ఓ హిందూ సంస్థ ఆ పేలుళ్లకు కారణమని తెలిసింది. సంజౌతా రైలు పేలుడు కేసులో స్వామి అసిమానందాను నిందితుడిగా చేర్చారు. ఇదే కేసులో సునీల్ జోషి అనే వ్యక్తిని విచారించారు. ఆ తర్వాత అతను హత్యకు గురయ్యాడు. 2011లో ఆ కేసును ఎన్‌ఐఏ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ తొలి పేలుడుకు సంబంధించి నివేదిక వెల్లడించింది. ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన 8 మందికి మాలేగావ్ తొలి పేలుళ్లతో సంబంధం లేదని ఎన్‌ఐఏ తేల్చి చెప్పింది.

 

20:06 - April 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌లో ఐదుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. మంత్రి కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. హరీష్ రావు వద్దనున్న మైనింగ్ శాఖను కేటీఆర్ కు అప్పగించారు. వీటితో పాటు పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, మైనింగ్, విదేశీ వ్యవహారాలను కూడా కేటీఆర్ చూడనున్నారు. పోచారానికి అదనంగా సహకార శాఖ దక్కింది. అయితే తలసానికి కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. ఆయన వద్దనున్న వాణిజ్య శాఖను తప్పించి... పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ కేటాయించారు. జూపల్లి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రిగా వ్యవహరించనున్నారు. 

20:05 - April 25, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో అజయ్, హుస్సేన్ టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిద్దరికి సీఎం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిన్ననే పువ్వాడ అజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 

20:03 - April 25, 2016

హైదరాబాద్ : ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు చాంద్ పాషా, సుజయకృష్ణ రంగారావుపై వైసీపీ ఫిర్యాదు చేసింది. వీరిరువురిపైచర్యలు కోరుతూ స్పీకర్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన ఫిర్యాదు చేశారు. 

20:02 - April 25, 2016

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం షూటింగ్ ముహూర్తం ఖరాయ్యింది. ఈ నెల 29, మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీ తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జూన్ చివరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం.

తమిళ హిట్‌ మూవీ కత్తి చిత్రానికి రీమేక్‌..

తమిళ హిట్‌ మూవీ కత్తి చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వివి వినాయక్‌.. కథకు తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేయించారు. మెగాస్టార్‌ 150 చిత్రం నిర్మాతగా ఆయన తనయుడు, ప్రముఖ హీరో రాంచరణ్ వ్యవహరించనున్నారు. ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని ప్రముఖులంతా హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్‌ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సినిమా మొదలవ్వాల్సి ఉన్నా.... చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం కారణంగా సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ హీరోగా చిరంజీవికి చివరి చిత్రం. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మధ్యలో తనయుడు రామ్ చరణ్ మూవీలైన మగధీర, బ్రూస్‌ లీ సినిమాల్లో గెస్ట్ రోల్ లో అభిమానులను అలరించారు.

2008లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు......

2008లో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి..2011 ఫిభ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తరువాత చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి అడుగు పెడుతారని చర్చ ప్రారంభయ్యింది. సినిమాల్లో నటిస్తానని మెగాస్టార్‌ కూడా ప్రకటించారు. దీంతో చిరంజీవి సినిమాపై అభిమానుల్లో సందడి ప్రారంభమైంది. ముహూర్తం ఎప్పుడు కుదురుతుందా అని ఫ్యాన్స్‌ ఎదురు చూశారు. చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా 150వ సినిమా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. చిరంజీవి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులకు నిరాశే ఎదురైంది. పూరీ చెప్పిన ఆటోజానీ కథలో సెకండ్ హాఫ్ తనకు నచ్చలేదని మెగస్టార్‌ చెప్పడం..ఆ తర్వాత తమిళ మూవీ కత్తిపై చర్చలు... డైరెక్షన్ అవకాశం వివి వినాయక్‌కు దక్కడం జరిగిపోయాయి. తాజాగా ముహూర్తం కూడా ఖరారు కావడంతో ఫ్యాన్స్‌లో జోష్‌ మొదలయ్యింది. 

20:01 - April 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ, భవన క్రమబద్దీకరణపై హైకోర్టు మరోసారి చురకలు అంటించింది. ఎలాంటి అక్రమాలను క్రమబద్దీకరిస్తారో స్పష్టం చేయాలని అదేశించింది. పార్కులను కబ్జా చేసినా రెగ్యులరైజ్ చేస్తారా..? అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ తిరగకుండా ప్రదేశం లేకుండానే భవంతులను క్రమబద్దీకరిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. అప్లికేషన్లు తీసుకొని పరిశీలించండే కాని క్రమబద్దీకరించొద్దని అన్నారు. గతంలో ఇచ్చిన తీర్పును కొనసాగిస్తూ వేసవి కాలపు సెలవుల తర్వాత తదుపరి విచారణను వాయిదా వేసింది.

20:00 - April 25, 2016

హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగమంటే యువతకు చాలా క్రేజ్ ఉంటుంది.. ఉద్యోగ భద్రతతోపాటు.. ఏసీ గదుల్లో హాయిగా పనిచేసుకోవచ్చని చాలామంది ఈ జాబ్‌లపై ఆసక్తి చూపుతారు.. పైగా ఈ మధ్య బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.. ఈ ఉద్యోగాలకోసం లక్షలాదిమంది పోటీపడుతున్నారు.. కోచింగ్‌లు తీసుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు..

అభ్యర్థుల పాలిట శాపంగా...

అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పోస్టుల భర్తీలో తెచ్చిన కొత్త రూల్ కొందరు అభ్యర్థుల పాలిట శాపంగా మారింది.. ఎస్‌బిఐ నుంచి ఎడ్యుకేషన్‌ లోన్‌ పొంది తిరిగి చెల్లించలేకపోయినవారు... క్రెడిట్ కార్డులు వాడుకొని ఆ డబ్బును కట్టనిలాంటివారు... ఈ జాబ్‌లకు అనర్హులని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నిబంధన కొందరు అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది.. సాధారణంగా ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌లను పెండింగ్‌లో పెడతారు.. లోన్‌ తీసుకున్న ఏ నిరుద్యోగైనా ఉద్యోగం వచ్చిన తర్వాతే రుణాన్ని చెల్లించడమన్నది సర్వసాధారణం. అంతే కానీ రుణం చెల్లించని అభ్యర్థులకు ఉద్యోగానికి అనర్హులనడం సరైంది కాదు...

బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ...

దీనిపై స్పందించిన బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రాసింది.. ఈ నిబంధన వల్ల అన్ని అర్హతలున్న అభ్యర్థులు నష్టపోతారని తెలిపింది.. ఎస్‌బిఐతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకున్న అభ్యర్థులకు అడ్డుగా ఉన్న ఈ రూల్ తొలిగించి ఉద్యోగం పొందే అర్హత కల్పించాలని విజ్ఞప్తి చేసింది..

19:57 - April 25, 2016

అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో ఏపీరాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సర్కార్ పూనుకుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క అడుగు వేస్తూ.. వేగం పెంచుతూ రాజధాని నిర్మాణానికి కావాల్సిన అన్ని హంగులను ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం, రైతులకు కల్పించే వసతులు.. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు, అంతే కాకుండా 13 జిల్లాలో ఉన్న ప్రజల పరిస్థితి గురించి మున్సిపల్ శాఖ మంత్రి అనే అంశాలు తెలియజేశారు. అసలే లోటు బడ్జెట్...తాత్కాలిక రాజధాని కోసం ఇంత ఖర్చు అవసరమా?ఏపీ రాజధాని కలాపాలు పూర్తి స్థాయిలో ఎప్పటి నుండి ప్రారంభం కానున్నాయి? అమరావతి రాజధాని పూర్తి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి కావచ్చు? రైతులకు ప్లాట్లు ఇవ్వడానికి ఎందుకు లేటు అవుతోంది. కారణం? మాస్టర్ రూపొందించింది సింగపూర్ వాళ్లు.... దానికి జపాన్ వారు ఎందుకు అడ్డు చెప్పారు? మన రాష్ట్రం.. సింగపూర్ మధ్య రాజధాని నిర్మాణానికి మధ్య ఓ అవగాహన కుదిరిందని తెలుస్తోంది.. దానికి సంబంధించి ప్లాన్ ఏంటి? ప్రభుత్వం పాఠశాలల్లో టీచర్లు ఎక్కువ.. పిల్లలు తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించారు...అది ఎంత వరకు సాధ్యం?ప్రభుత్వ కళాశాలల్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సులు పెడితే నారాయణ, చైతన్య కాలేజీలకు ఇబ్బంది కలగదా? అమరావతి రాజధాని నిర్మాణంలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాపులు 2019 వరకు టిడిపితో కలిసి వుంటారా? జిఓ నెం 30 వల్ల కాపులకు రిజర్వేషన్ రాదా? కాపు కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు ఇచ్చారా? ఇత్యాది అంశాలపై మంత్రి నారాయణ ఎలా స్పందించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

టి.మంత్రివర్గంలో మంత్రుల శాఖల్లో మార్పులు

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. సీఎం కేసీఆర్ వద్ద ఉన్న శాఖలతో పాటు వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటి సరఫరా అదనంగా ఉండనున్నాయి. కేటీఆర్‌కు ఐటీ, పురపాలక సహా పరిశ్రమలు, మైనింగ్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు అప్పగించారు. తలసానికి శ్రీనివాస్‌యాదవ్‌కు పశు సంవర్ధక, మత్స్య, డెయిరీ, సినిమాటోగ్రఫీ శాఖలు, జూపల్లి కృష్ణారావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయంతో పాటు సహకార శాఖను అప్పగించారు.

18:56 - April 25, 2016

హైదరాబాద్ : విశాఖ బ్రాండెక్స్ సెజ్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బలవంతంగానైనా కార్మికులను ఫ్యాక్టరీకి రప్పించాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది.. అయితే తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ విధుల్లోకి వచ్చేదిలేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.. తమ వేతనాలు పెంచాలంటూ 15రోజులుగా కార్మికులు పోరాడుతున్నారు.. ఈ నిరసనలతో దిగివచ్చిన యాజమాన్యం ఈ నెల 30వరకూ టైం కావాలని విజ్ఞప్తి చేసింది.. ఇంతలో ఈ అంశంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వం... ఈ ఆందోళన ప్రభావం ఇతర సెజ్‌లపై పడుతుందని భావించింది. ఆందోళనల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.. ఇప్పటికే పదిమంది CITU నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు... కంపెనీ పరిసరప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు కార్మికులపై నిర్బంధాన్ని తొలగించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 

కన్హయ్యకు రూ.10వేలు జరిమానా...

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని జేఎన్ యూ విద్యార్థులపై జేఎన్ యూ పరిపాలనా విభాగం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. జేఎన్వి యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు రూ.10వేల జరిమానా విధించింది. మరో విద్యార్థి ఉమర్ ఖలీద్ ను ఒక సెమిస్టర్ పాటు బహిష్కరించినట్లు వర్శిటీ చర్యలు తీసుకుంది. 

మెగాస్టార్ రీఎంట్రీ ముహూర్తం ఖరారు....

హైదరాబాద్ : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం ఖరారయ్యింది. దర్శకుడిగా వి.వి.వినాయక్,నిర్మాతగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ వ్యవహరించనున్నారు. ఈ నెల 29 మథ్యాహ్నాం ముహూర్తం ఖరారయ్యింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి గత కొన్నాళ్ళుగా సినిమా పరిశ్రమకు దూరంగా వున్న చిరంజీవి మళ్ళీ తన సినీ ప్రస్థానాన్ని తన 150 సినిమాతో  ప్రారంభించనున్నారు. మెగా అభిమానులు ఎన్నో ఏళ్ళనుండి కళ్ళు కాయలు కాసేలా  ఎదురు చూస్తున్న తరుణం అతి చేరువలోకి వచ్చినందుకు మెగా అభిమానులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. కాగా మెగాస్టార్ కు వినాయక్ మరో ఠాగూర్ ఇవ్వనున్నాడో లేదో వేచి చూడాలి.

విద్యుత్ సౌధ ఎదుట టి.ఉద్యోగులు ధర్నా...

హైదరాబాద్ : విద్యుత్ సౌధ ఎదుట టి.ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఏపీలో పనిచేస్తున్న టీ. విద్యుత్ ఉద్యోగులను వెనక్కి రప్పింంచాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో 3 గురు మృతి....

కరీంనగర్ : చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డీసీఎం వ్యాన్ - ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాని స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

3ఏళ్ళలో 3,941మంది కార్మికులు మృతి : కేంద్రమంత్రి దత్తాత్రేయ

ఢిల్లీ : గత మూడేళ్లలో 3,941మంది కార్మికులు చనిపోయినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారుదత్తాత్రేయ లోక్‌సభలో వెల్లడించారు. కార్మికులకు భద్రత కల్పించే అంశంపై దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వద్దున్న గణాంకాల ప్రకారం 2012-2014కాలంలో 3,941 మంది వివిధ కారణాలతో కార్మికులు మరిణించారని తెలిపారు. కేంద్రప్రభుత్వం కార్మికుల భద్రత,ఆరోగ్యం, కార్మికులు పనిచేసే చోట సుహృద్భావ వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటోందని తెలిపారు. తయారీ రంగంలోని కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు తెలిపారు.

కారెక్కిన పువ్వాడ,పారూఖ్....

హైదరాబాద్ : ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పువ్వాడ అజయ్ కాంగ్రెస్ పార్టీకి నిన్ననే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు పార్టీలో పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. మెదక్ జిల్లా సిద్ధిపేట పట్టణానికి చెందిన ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్‌లో పలు పార్టీ పదవులను నిర్వహించారు. 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1986-91 మధ్య సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగారు. పార్టీ పరంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ పదవులు చేపట్టారు.

ఓయూలో వీసీ నియామకానికి కమిటీ ఏర్పాటు....

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ నియామకానికి కమిటీ ఏర్పాటయ్యింది. ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ హెచ్‌పీ దీక్షిత్, ఐఏఎస్ రామకృష్ణారావును నియమించారు. గత రెండేండ్ల నుంచి ఓయూ వీసీ పదవీ ఖాళీగా ఉండటంతో ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

17:45 - April 25, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు కాంగ్రెస్‌ నేతలు, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులు సమయం కోరారు. పాలేరు ఉపఎన్నిక అభ్యర్థిని నిలిపే విషయంపై పునరాలోచించాలని కోరాలని అనుకున్నారు. అయితే కేసీఆర్‌కు సమయం లేదని సీఎం వర్గాలు రిప్లై ఇచ్చాయి. 

కాసేపట్లో గులాబీ గూటికి పువ్వాడ....

హైదరాబాద్ : ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోని వలసల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో  కాసేపట్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీనియర్ నేత జానారెడ్డి పువ్వాడకు నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ ఎస్ పార్టీ ప్లీనం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్ నేతలు మరింతమంది కారెక్కే సూచనలు కనిపించటంతో కాంగ్రెస్ పార్టీ కలవరంపడుతోంది. 

17:44 - April 25, 2016

హైదరాబాద్ : ఖమ్మంజిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ రావు కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతు కోరింది కానీ.. మాకు వామపక్ష ఐక్యతే ముఖ్యం తెలిపారు. ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టిన... టీఆర్ఎస్‌కు పాలేరు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు. పాలేరులో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

17:37 - April 25, 2016

ఖమ్మం : అవినీతి, అవకాశ వాద రాజకీయాలు నడిపి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తెలంగాణ సర్కార్ఎలా విస్మరించిందో ప్రజల ముందు ఉంచుతామని 'టెన్ టివి' తో పాలేరు సీపీఎం పార్టీ అభ్యర్థి పోతినేని సుదర్శనరావు తెలిపారు. ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వం చేస్తున్న పాలనను వివరించడం మొదటి ఎజెండా, అవినీతి, అవకాశవాద రాజకీయాలను బూర్జువా పార్టీల నుంచి ప్రోత్సహించబడుతూ ఉన్నాయ్.. వాటిని ఎదుర్కోవడం ఈ ఎన్నికల్లో రెండో ఎజెండా, ఒక ప్రశ్చామ్యాయ్న రాజకీయాల్ని పాలేరు నియోజకవర్గం ఎన్నికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చూపించాలనే మూడో ఎజెండా. ఈ మూడు జెండాలతో ఈ ఎన్నికల రంగంలోకి వెళుతున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు, తరువాత అనేక రకాల వాగ్ధానాలు చేసింది. ఆనాడు దుమ్మగూడెం ఎజెండాను సీపీఎం తీసుకువచ్చింది. సాగునీటి సాధన మహారైతు యాత్ర చేసి జిల్లా ప్రజల ముందు ఒక ప్రణాళిక ఉంచామని.. దాని ద్వారా మాత్రమే పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం చెబుతున్న పద్దతుల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడానికి పూనుకుని సస్యశ్యామలం చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అని తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలను శాసనసభలో ఎండగట్టే అవకాశం మాకే ఉంది... కాబట్టి తనని శాసనసభకు పంపించాలని పోతినేని పాలేరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు 'షాక్' ఇచ్చిన హైకోర్టు....

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టారని జీడిమెట్ల కార్పొరేటర్ ప్రతాప్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కు చెందిన అక్రమ భవనాన్ని నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రెండు నెలల్లో నివేదిక పంపాలని సంబంధిత అధికారులను న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

బ్రాండిక్స్ కార్మికులపై నిర్భంధం తొలగించాలి : పి.మధు

విజయవాడ : సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ కంపెనీ కార్మికులపై నిర్భంధాన్ని తొలగించాలంటూ మధు డిమాండ్ చేశారు. కనీస వేతనాల కోసం బ్రాండిక్స్ కంపెనీలోని 18వేల మంది కార్మికులు డిమాండ్ చేస్తున్నారనీ…వారికి కనీస వేతనంగా రూ.15వేలు చెల్లించాలనీ...వారిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ లో  పేర్కొన్నారు.

17:21 - April 25, 2016

ఓ డాక్టర్..మంచి మనస్సున వ్యక్తి.. తెలివి తేటలు కలవాడు. ఓ వైద్యురాలితో వివాహం జరిగింది. ఆనందమైన జీవితంలో ఓ అలజడి. ఆ వైద్యుడు కిడ్నాప్ కు గురయ్యాడు. వైద్యుడి కిడ్నాప్ వెనుక ఎవరున్నారు ? అసలు ఏం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేయాలని భార్య ఒత్తిడి ఎందుకు చేసింది ? మరోవైపు తన భర్త క్షేమంగా రావాలని డిటెక్టివ్ బృందాన్ని కోరుతోంది ? ఆ వైద్యుడి మీద పది కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఉంది.
స్వార్థం.మంచి మానవత్వం ఎప్పుడైనా గెలిచేది. శవాల మీద చిల్లర ఏరుకొనే కార్పొరేట్ దూర్తులు ఉన్నంత వరకు ఈ లోకం ఇలాగే ఉంటుంది. వైద్యుడి కిడ్నాప్ కు గురయ్యాడా ? లేడా ? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

బిల్ట్ పేపర్ మిల్లు కార్మికుల నిరసన .....

వరంగల్ : మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ పేపర్ మిల్లు కర్మాగారం కార్మికులు భారీ నిరసన చేపట్టారు. కంపెనీకి చెందిన 600 మంది కాంట్రాక్టు కార్మికులు బిల్ట్ కంపెనీ మెయిన్ గేటు ముందు మానవహారం నిర్వహించారు. 11 నెలలుగా తమకు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కర్మాగారం పునరుద్ధరణకు రాయితీలు ప్రకటించినా... ఇంతవరకు కంపెనీ నుంచి ఎటువంటి స్పందన లేదని కార్మికులు వాపోయారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాము ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

50 కిలోల గంజాయి స్వాధీనం...

ప్రకాశం : గిద్దలూరు పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కారులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనదారుడు రాజశేఖర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

రోడ్డు ప్రమాదంతో ఒకరు మృతి...

గుంటూరు : తెనాలిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న  ద్విచక్ర వాహానాన్ని ఓ లారీ ఢీకొనడంతో ఓ  వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

17:10 - April 25, 2016

ఓ డాక్టర్..మంచి మనస్సున వ్యక్తి. ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా వైద్యురాలే. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు..ప్రైవేటు ఫ్యాకర్టీలు.. ఇంకేముంది చేతుల నిండా సంపాదన. అంతా ఆనందమే. అంతలో కార్పొరేట్ ఆసుపత్రిలో అతడికి ఉద్యోగ అవకాశం వచ్చింది. నెలకు ఏడు లక్షల వేతనం. ఇంకేం ఆ దంపతులకు ఇంకా ఆనందమే..ఇలాంటి సమయంలో ఆ వైద్యుడు కిడ్నాప్ అయ్యాడు. ఎవరు కిడ్నాప్ చేశాడు ? ఆ వైద్యుడు ఎవరు ? తదితర అంశాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారి....

విశాఖ : రూ.9 వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. అనంతగిరి అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్న సుబ్బారావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

పాక్ గాయకుడి బ్యానర్లు ధ్వంసం చేసిన శివసేన....

హైదరాబాద్ : కళలకు ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు లేవంటారు. అది ఒక భాషకూ, ప్రాంతానికీ, వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది ఎన్నో సందర్భాలలో నిరూపణ అయిందికూడా. భారత్ చెందిన భగవద్గీతను. మహాభారతాన్ని ఇతర దేశస్థులు వారి భాషలలోని అనువాదం చేసుకుని భారత సంస్కృతిని ప్రపంచం నలుమూలలా చాటుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రతీ అంశాన్ని మతంతోనూ, వర్గాలతోనూ ముడిపెడుతూ శివసేన వివాదాన్ని సృష్టిస్తుందనే విషయం కూడా తెలిసిందే.ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన గాయకుడు రహత్ ఫతే ఆలీ ఖాన్ ఇండియాకు రావడాన్ని శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

16:41 - April 25, 2016

విశాఖ : రానున్న రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ విభాగపు శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ రాయలసీమ, తెలంగాణలోనే వేడి గాలులు ఎక్కువగా వీచాయని అన్నారు. అయితే థండర్ స్ర్టోమ్ ప్రభావంతో ఈ వేడిగాలులు కోస్తాంధ్రకు కూడా వ్యాపించాయని అన్నారు. దీంతో రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు..మే లో దాదాపు 50 డిగ్రీల ఉష్టోగ్రత చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందన్నారు. సాయంత్రం కొద్దిగా కోస్తాంధ్రలో చల్లబడే అవకాశం ఉందన్నారు.

16:39 - April 25, 2016

హైదరాబాద్: ఏఎస్ఐ మోహన్‌రెడ్డి ఇంకా బెదిరింపులు ఆపలేదని బాధితుల సంఘం ఆరోపించింది. ఫైనాన్స్‌తో తనకు సంబంధంలేదంటూ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను ఖండించింది. ఆయన అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడింది. మోహన్‌రెడ్డి ఫైనాన్స్‌ వ్యాపారానికి సంబంధించిన ఆధారాలను బాధితులు బయట పెట్టారు. బెదిరింపుల కాల్‌ రికార్డ్‌ను బహిర్గతం చేశారు. పలు పత్రాలను మీడియా ముందు ఉంచారు. 

16:38 - April 25, 2016

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఉత్తమ విమానాశ్రయాల్లోనూ శంషాబాద్ జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ మూడో స్థానంలో నిలిచిందని సి.ఇ.ఓ కిషోర్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా విమానాశ్రయంలో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌ ఈ ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలు సాధించిందని వివరించారు. 

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య....

హైదరాబాద్ : ఆసిఫ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జబీన్ ఫాతిమా(19) అనే యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలతో ఫాతిమా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

16:36 - April 25, 2016

విశాఖ : వైజాగ్‌కు ప్రత్యేక రైల్వేజోన్‌ కోసం ఆందోళనలు ఊపందుకున్నాయి.. విభజన చట్టంలోఉన్న ఈ హామీల అమలుకోసం అఖిలపక్షం నేతలు, ప్రజాసంఘాలు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు.. ఈ సమస్యపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని తీర్మానించారు.. మోడీ అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని ఎంపీ హరిబాబును కలిసి విజ్ఞప్తి చేశారు.. అయితే అపాయింట్‌మెంట్‌పై అఖిలపక్షం కంగుతినే సమాధానం ఇచ్చారు హరిబాబు.. విశాఖ రైల్వేజోన్‌కు.... పార్లమెంట్ సమావేశాలకు, రైల్వే బడ్జెట్‌కు సంబంధంలేదని తేల్చేశారు.. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇప్పించే అవకాశం లేదని స్పష్టం చేశారు..

ఎంపీ సమాధానంతో అఖిలపక్షం నేతలు షాక్ ...

ఎంపీ సమాధానంతో అఖిలపక్షం నేతలు షాక్ తిన్నారు.. ఎన్నికలకుముందు రైల్వేజోన్‌కోసం పోరాడతామని హరిబాబు ఎన్నోసార్లు హామీలిచ్చారని గుర్తుచేశారు.. మరో ఎంపీ సహాయంతో పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధానిని కలుస్తామని చెప్పారు..

రైల్వేజోన్‌పై ఎన్నికలుముందు రాజకీయ పార్టీల హామీలు......

విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ ఇవ్వాలని చాలా ఏళ్లుగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.. ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోన్‌పై హామీలు గుప్పిస్తూనే ఉన్నాయి.. రాష్ట్ర విభజన తర్వాత ఈ విషయాన్ని విభజన చట్టంలో చేర్చింది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. 2014 ఎన్నికలకుముందు రైల్వే జోన్‌పై పదే పదే హామీలిచ్చారు ఎంపీ హరిబాబు.. ఇప్పటివరకూ జరిగిన రెండు బడ్జెట్‌ సమావేశాల్లో రైల్వే జోన్‌ విషయమే ప్రస్తావించలేదు.. అటు విశాఖలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుకూడా రైల్వే జోన్‌ వస్తుందని ప్రకటించారు.. ఈ హామీలపై అడుగుకూడా ముందుకు పడలేదు.. దీంతో రైల్వే జోన్‌కోసం అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పోరుబాట పట్టాయి.. ఈ మధ్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ఆమరణ దీక్ష కూడా చేశారు.. ఈసారి ఎలాగైనా రైల్వే జోన్‌ సాధించాలంటూ వీరంతా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.. 

16:34 - April 25, 2016

ముంబై : మహిళలు వీధుల్లో అడుక్కోవడం కంటే.. డాన్స్ బార్లలో నృత్యం చేయడం ఎంతో నయమని సుప్రీంకోర్టు తెలిపింది. డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంపై కోర్టు మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దని హెచ్చరించింది. డాన్స్ అనేది ఒక వృత్తి అని, అయితే అశ్లీలతకు తావివొవ్వదని పేర్కొంది. ఒకవేళ అందులో అసభ్యత ఉంటే.. అప్పుడు చట్టబద్ధమైన హక్కు కోల్పోతుందని.. అయితే ప్రభుత్వం దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు గానీ నిషేధించకూడదని తెలిపింది. డాన్స్‌ బార్ల 3 ఫీటర్ల ఎత్తున్న స్టేజీపై డాన్స్‌ చేయించాలని, కస్టమర్లకు 5 ఫీట్లు దూరంగా ఉండే చర్యలు తీసుకోవాలని సూచించింది. హోటళ్లు, బార్లు ముందే హెల్త్‌ సర్టిఫికేట్‌ తీసుకుంటున్నందున ప్రత్యేకంగా బిఎంసి నుంచి లైసైన్స్‌ తీసుకోవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

16:33 - April 25, 2016

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌ నాలుగో దశ ఎన్నికల్లో బీజేపీ నేత రూపా గంగూలీ, తృణమూల్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆమె ఓ పోలింగ్‌ బూతు వద్ద తృణమూల్‌ కార్యకర్తలతో వాదులాడటమే కాకుండా ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు కారణమైన రూపా గంగూలీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఒకప్పటి నటి రూపా గంగూలీ హౌరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా 49 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికల కమిషన్‌ పార మిలటరీ దళాలతో భద్రతా చర్యలు చేపట్టింది.

మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు టీ.ప్రభుత్వం షురూ....

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను బ్రిటన్ ప్రతినిధుల బృందం కలిసింది. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ఇండో-యూకో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎఫ్ డీఐలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్ ను బ్రిటన్ బృందం కోరింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో భూమిని కేటాయించేందుకు కేసీఆర్ అంగీకారం తెలిపారు.

16:32 - April 25, 2016

ముంబై : ఆర్ఎస్ఎస్...రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఇందులో పురుషులే సభ్యులుగా ఉంటారా ? మహిళలు ఎందుకు ఉండరు ? అనే ప్రశ్నలు ఉదయించడం సహజం. ఆర్ఎస్ఎస్ లో సభ్యులుగా మహిళలను అనుమతించాలంటూ భూ మాత బ్రిగేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్ డిమాండ్ చేస్తోంది. మహిళల ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని..ఆర్ఎస్ఎస్ కూడా మహిళలను సభ్యులుగా అనుమతించాలని తృప్తి పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ రాయనున్నట్లు చెప్పారు.
తృప్తి దేశాయ్..భూ మాత బ్రిగేడియర్ నాయకురాలు. ఆలయాల్లో మహిళలకు అనుమతించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. విజయం కూడా సాధించారు. ఈమె పోరాటంతో శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తృప్తి డిమాండ్ తో ఆర్ఎస్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

'ఓఎల్ఎక్స్' లో అమ్మకానికి ప్రధాని.......

హైదరాబాద్ : ప్రధాని మోదీపై మిత్రపక్షం శివసేన వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడింది. శివసేన అధ్యక్షుడు  ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. అధికారంలో వచ్చిన మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. అందువల్లే కన్హయ్యకుమార్ వంటి విద్యార్థి నేతలు కూడా ప్రధాని మోదీని 'ఓఎల్ఎక్స్' లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు' అని ఆయన మండిపడ్డారు. ఇది బీజేపీకి మంచికాదనీ సూచించారు.

4వ తరగతి విద్యార్ధి అదృశ్యం....

మహబూబ్ నగర్ : కొత్తకోటలో విద్యార్ధి అదృశ్యం కలకలం రేపింది. జేపీ నారాయణ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న నందన్ (9) అనే విద్యార్ధి అదృశ్యమయ్యాడు.  పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన చెందారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు  పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నందన్ కనిపించకుండా పోయి ఇప్పటికే 20 రోజులు కావటం గమనించగదిగన విషయం.

మత్తుమందు చల్లి దోపిడీ.....

శ్రీకాకుళం : దోపిడీ దొంగల ముఠాల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వేసవికాలం ఈ ముఠా మరింతగా విజృంభిస్తూంటుంది. వేసవికాలం వచ్చిందంటే చాలు వివాహాలు మహాజోరుగా జరుగుతుంటాయి. దీన్ని ఆసరా చేసుకున్న దోపిడి దొంగలు దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలోనే బూర్జ మండలం కె.కె.రాజపురం గ్రామంలో ఇంటిలో ఒంటరిగా వున్న మహిళపై మత్తుమందు చల్లి రూ.1.56 లక్షలతోపాటు ఐదు తులాల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం సీఐ నవీన్, ఎస్సై రవికిశోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో వివరాలు సేకరించారు.

నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు....

హైదరాబాద్ : నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. నిజామాబాద్,మహబూబ్ నగర్ లలో 43 డిగ్రీలు, మెదక్, హైదరాబాద్ 43, ఆదిలాబాద్-42, హకీంపేట-41, తిరుపతి, జంగమహేశ్వరపురంలలో 44, కర్నూలు, కడప, నందిగామలలో 44, నంద్యాల, నెల్లూరులలో 45,అనంతపురం, విజయవాడలలో 43, కావలి ,ఒంగోలు-42,విశాఖ-33 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాలలో ఇప్పటికే వడగాల్పులకు 250 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

మాలెగావ్ పేలుళ్ల కేసులో తీర్పునిచ్చిన కోర్టు...

హైదరాబాద్ : మాలేగావ పేలుళ్ళ కేసులో 8 మంది యువకులను ముంబై కోర్టు నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఇప్పటికే నిందితులు 5 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించారు. మాలేగావ్ లో 2006లో జరిగిన పేలుళ్ళలో 35 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 

15:40 - April 25, 2016

వరంగల్ : జిల్లాలో కరవు కరాళ నృత్యం చేస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. మరోవైపు పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో టెన్ టీవీ కరవు యాత్ర నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి... 

15:37 - April 25, 2016

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభంపై చర్చించాల్సిందే అంటూ లోక్‌సభలో కాంగ్రెస్ పట్టుపడుతోంది. బీజేపి ప్రభుత్వం కావాలనే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని కూల్చిందని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చీల్చి ప్రభుత్వాన్ని కూల్చిందని ఖర్గే ఆవేశంగా స్పందించారు. దీనిపై సభలో చర్చించాల్సిందే అని ఆయన పట్టుపట్టారు. అయితే దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ..ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభానికి కేంద్రానికి..బీజేపీకి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇద్దరు గ్రామస్థులను హతమార్చిన నక్సల్స్ ...

హైదరాబాద్ : మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గడ్చిరోలి జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను నక్సలైట్లు హతమార్చారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే నెపంతో వీరిని హతమార్చినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

15:24 - April 25, 2016

కడప : పోలవరం, హంద్రీ నీవా తదితర ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తిచేసి కడప జిల్లా కరువును పారదోలతామని ఆ జిల్లా పర్యటనలో సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు కలిపి హార్టికల్చర్ హబ్‌గా రూపొందిస్తామని చెప్పారు. కడప కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో సినీ దర్శకులు నీలకంఠ రూపొందించిన రతనాల కడప సీడీని చంద్రబాబు ఆవిష్కరించారు. రాయచోటి నియోజకవర్గంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రైతులతో ముఖాముఖి ...

సిఎం చంద్రబాబు కడప జిల్లాలో బిజీబిజీగా గడిపారు. రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలంలో రామరాజువంక కాలువ పనులను పరిశీలించారు. అనంతరం బిల్లుగుట్ట చెరువులో పూడికతీత పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి వ్యవసాయం, సాగునీరు గురించి మాట్లాడారు.

బిల్లుగుట్ట చెరువు సమీపంలో నిర్వహించిన నీరు-ప్రగతి బహిరంగ సభలో...

బిల్లుగుట్ట చెరువు సమీపంలో నిర్వహించిన నీరు-ప్రగతి బహిరంగ సభలో చంద్రబాబు పలు విషయాలపై ప్రసంగించారు. హంద్రీనీవా నీటితో వెనిగల్లు ప్రాజెక్ట్‌ను నింపి దాని నుంచి ఆయకట్టు చివరి వరకు చెరువులు, కుంటలు నింపుతామని తద్వారా పంటలను కాపాడే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రైతులు తమకు సహకరించి పొలాల్లో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా వర్షపు నీరు వృథా కాకుండా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు నీరందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మాజీ ఎంపి గునిపాటి రామయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శ...

కడప జిల్లా రైల్వే కోడూరులో మాజీ ఎంపి గునిపాటి రామయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఈ నెల 13న రాజంపేట మాజీ ఎంపి గునిపాటి రామయ్య మృతిచెందారు. ఆయన మరణం పట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

రాజ్యసభ రేపటికి వాయిదా...

ఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యులు ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. విపక్షాల ఆందోళన మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభను స్పీకర్  రేపటికి వాయిదా వేశారు.

15:23 - April 25, 2016

వంద పూలు వికసించనీ.. వేయి ఆలోచనలు సంఘర్షించనీ ఈ మాటను మనసావాచా నమ్మిన వ్యక్తిత్వం ఆమెది. అందుకే పదేళ్ల వయసులో వెండితెర మీద అద్భుతంగా నటించినా, 8 పదులు నిండినా అక్షర సేద్యం చేస్తున్నా, ఈ రోజుకీ అద్భుతంగా గానం చేస్తున్నా ఆమెకు ఆమె సాటి అని రుజువుచేస్తున్న నంబూరి పరిపూర్ణ మాట, పాటలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.

నమ్మిన విలువలు, ఆశయాల పట్ల నిబద్ధతతో.....

బాల్యంలో ఏర్పడే అభిప్రాయాలు, యవ్వనంలో స్థిరపడే ఆలోచనలు, నడివయసు జీవితం నేర్పే పాఠాలు ఒక మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంత కీలకంగా మారతాయో నంబూరి పరిపూర్ణమ్మ ను చూస్తే అర్థమవుతుంది. నమ్మిన విలువలు, ఆశయాల పట్ల నిబద్ధతతో ఉంటే, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎంత స్థిరంగా, స్థిమితంగా నిలబెడతాయో మరోసారి అవగతమవుతోంది.

 

అనుభవంతో పండిన గతం..

ఎనిమిది పదుల వసంతాలు దాటినా చెరగని చెరునవ్వుతో , అంతకుమించిన ఆత్మవిశ్వాసంతో చైతన్య ప్రవాహమై ముందుకు సాగుతున్నారు నంబూరి పరిపూర్ణ

1931 లోజన్మించిన నంబూరి పరిపూర్ణ....

1931 లో కృష్ణా జిల్లా, గన్నవరం, బండీరగూడెం లో జన్మించిన నంబూరి పరిపూర్ణ.. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, పెద్దన్నయ్య శ్రనివాసరావ్ ప్రభావమే ఎక్కువ అంటారు. విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, మహిళా సంఘంలో ముందుండి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నినదిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చురుకైన నాయకురాలిగా ఎదిగిన ధీశాలి నంబూరి పరిపూర్ణ.

ఆడపిల్లలకు చదువెందుకు అనే కాలంలోనే...

ఆడపిల్లలకు చదువెందుకు అనే కాలంలోనే విజయవంతంగా చదువును కొనసాగించారు నంబూరి పరిపూర్ణ. విద్యార్థుల సమస్యలపై ముందుండి అనేక సమస్యలను పరిష్కారం కోసం కృషి చేసారు. విజయాలు సాధించారు. అనతి కాలంలోనే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు.

సాంస్కృతిక దళంలో భాగస్వాములు..

రెండో ప్రపంచ యుద్ధం, ప్రపంచ దేశాలకు ఎటువంటి అనుభవాలు నేర్పిందో చరిత్ర చెప్తుంది . అలాంటి చారిత్రక యుద్ధం దేశంలోని సామాన్య జనంపై కూడా అనేకానేక ప్రభావాలను చూపింది. యద్ధం ఎవరి కోసం.. ఎవరి ప్రయోజనాలకోసమనే చర్చను పక్కకు పెడితే, అలాంటి యుద్దం కోసం నిధిని సేకరించే పనిలో నంబూరి పరిపూర్ణలాంటి వారు కూడా సాంస్కృతిక దళంలో భాగస్వాములయ్యారు. ఆ ప్రదర్శనే సినిమా అవకాశాన్ని కల్పించదంటారు గతం జ్ఞాపకాలను సింహావలోకనం చేసుకుంటూ ... తన అనుభవాలను మనతో పంచుకుంటూ..

చదువుకు మధ్యలో బ్రేక్ పడినా,...

అనేకానేక కారణాలతో చదువుకు మధ్యలో బ్రేక్ పడినా, పెద్దన్నయ్య చొరవతో తిరిగి చదువును కొనసాగించారు.. మహీధర రామ్మోహన్ రావ్ గారు నేర్పిన రాజకీయ పాఠాలు వర్గ, వర్ణ సమాజాన్ని సరైన కోణంలో, సరైన పంథాలో అర్థం చేసుకునేందుకు దోహదపడిందంటారు..

దాసరి నాగభూషణ్ రావ్ తో జీవితం...

విద్యార్థి, రాజకీయ జీవితంలో చురుగ్గా ఉన్న సమయంలోనే ఆలోచనలు కలిసిన దాసరి నాగభూషణ్ రావ్ తో జీవితాన్ని పంచుకున్నారు పరిపూర్ణమ్మ. ఇద్దరూ రాజకీయ జీవితంలో కలిసి సాగుతున్నా కుటుంబభారాన్ని తన భుజానే వేసుకున్నారు . ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. ఉద్యోగినిగా ఉన్నా మహిళల, పేద ప్రజల పక్షాన నిలవాలని నిర్ణయించుకుని దాన్నే ఆచరణలో రుజువు చేసి చూపించారు.

ఐదు దశాబ్దాలుగా ఆమె సాహిత్య ప్రస్థానం ...

రాజకీయ జీవితం నేర్పిన విలువలు, ఉద్యోగ జీవితంలోని అనుభవాలు, సాహిత్య ప్రముఖుల రచనలు ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసాయి. అందుకే దాదాపు గత ఐదు దశాబ్దాలుగా ఆమె సాహిత్య ప్రస్థానం చురుగ్గా కొనసాగుతూనే ఉంది. ఈ పయనంలో ఎందరెందరో ప్రముఖులు ఆమె స్నేహితులుగా ఉన్నారు. ఆమె రచనలు ప్రోత్సహించారు. ఉంటాయి మాకుషస్సులు, కథా పరిపూర్ణమ్, శిఖరారోహణ ఆమె రచనలుగా వెలువడ్డాయి.

మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ...

పూర్వ స్వాతంత్ర్య పరిస్థితి, స్వాతంత్యనంతర పరిస్థితులను అతి దగ్గరగా చూసిన అనుభవం పరపూర్ణమ్మది. విద్యార్థిగా చురుగ్గా ఉన్న కాలం నుండి, 8 పదులు దాటిన ఈ వయసులోనూ మహిళల సమస్యల పట్ల అదే జాగరూకతతో ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, మహిళల సమస్యల్లో వచ్చిన మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటిని లోతుగా విశ్లేషిస్తున్నారు.

అనేక సామాజిక సమస్యలపై కూడా...

మహిళల సమస్యలపైనే కాదు, అనేక సామాజిక సమస్యలపై కూడా తన స్పందనను వ్యక్తం తెలియచేస్తున్నారు. మారాల్సిన పరిస్థితులు, మార్పు రావాల్సిన స్థితిగతులపైనే తన అభిప్రాయాన్ని సూటిగానే సంధిస్తున్నారు. అన్నింటికీ మించి ఈ వయసులోనూ ఎంతో అద్భుతంగా పాడగలగడం అద్భుతమనే చెప్పాలి. ప్రతిరోజూ సాధన చేస్తూ గాత్రాన్ని కాపాడుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నానికి పరిపూర్ణమ్మకి మనందరం అభినందనలు తెలియచేయాలి.

విభిన్న రంగాల్లో తనదైన ముద్ర...

నటిగా, గాయనిగా, కార్యకర్తగా, ఉద్యోగిగా, రచయితగా ఇలా భిన్న రంగాల్లో తనదైన ముద్రను వేసిన పరిపూర్ణమ్మ కి మానవి వందనాలు తెలియచేస్తోంది. ఈ తరానికి కూడా స్పూర్తిని కలిగిస్తున్న ఆమె అనుభవాలను మరెందరో అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తోంది. 

15:14 - April 25, 2016

హైదరాబాద్ : రంగులద్దే కుంచెలతో ఎన్ని అద్భుతాలైనా చేయోచ్చు. సృజనాత్మక దానికి తోడైతే ఎన్ని కళాఖండాలైనా సృష్టించొచ్చు. ముఖ్యంగా మహిళల చేతుల్లో అందంగా ఒదిగిపోయే బ్యాగ్స్ పై కూడా అంతే చక్కని హ్యాండ్ పెయింటింగ్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ప్లీనరీని విజయవంతం చేద్దాం : ఎంపీ కవిత

హైదరాబాద్ : అందరం కలిసి ఎల్లుండి ఖమ్మంలో జరుగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీని విజయవంతం చేద్దామని ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. చెరుకు, పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పసుపుకు మద్దతు ధర కల్పించి, పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలియజేశారు. చెరుకు రైతుల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలో మంచి నిర్ణయం తీసుకోబోతున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.

85 ఏళ్ళ తరువాత....

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో భానుడి తాకిడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా  వుంటే ...గార్డెన్ సిటీగా పేరు పొందిన బెంగళూరు నగరంపై కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎనభై ఐదేళ్ల తర్వాత బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1931 తర్వాత ఇక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే. 1931 మే 22న బెంగళూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

14:51 - April 25, 2016

ఢిల్లీ : రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 25 నుండి మే 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. సోమవారం నాడు ప్రారంభమైన సమావేశాల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో సరి - బేసి విధానం అమల్లో ఉండడంతో ఎంపీలు కొంత ఇబ్బంది పడ్డారు. సినీ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావెల్ నారింజ పండు రంగు గల కారులో రయ్యి మంటూ పార్లమెంట్ కు వచ్చారు. సరి - బేసి విధానాల ప్రకారం ఢిల్లీలో ఈ రోజు బేసి నెంబర్ గల వాహనాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కానీ పరేష్ రావెల్ (డీఎల్ 9సీఏ 1914) కారులో వచ్చి నిబంధనలు ఉల్లంఘించారు. అహ్మదాబాద్ (ఈస్ట్) స్థానం నుండి లోక్ సభకు ఎంపికైన పరేష్ రావెల్ గత రెండేళ్లుగా ఢిల్లీలోల నివాసం ఉంటుండడం గమనార్హం. చివరకు క్షమాపణలు చెప్పారు. ఎంపీ అనీల్ దావే పార్లమెంట్ కు రావడం అందర్నీ ఆకట్టుకుంది. దర్జాగా ..సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు. కొంతమంది ఎంపీలు మాత్రం బేసి సంఖ్య కార్లలో వచ్చారు. ఎంపీలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ బస్సులను ఆరింటిని సిద్ధం చేసింది. కానీ బీజేపీ ఎంపీలు రంజన్ భట్, హరి ఓం సింగ్ రాథోడ్ మాత్రమే ఈ బస్సును వినియోగించుకున్నారు. 

రూ.10కోట్లు విడుదల చేయాలి : చాడ

రంగారెడ్డి : కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ ధర్నా చేపట్టింది. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలువురునేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చాట మాట్లాడుతూ...రాష్ట్రంలో కరవు తీవ్రస్థాయిలో వుందనీ ... ప్రతి మండలానికి కరవు నిధులు రూ.10 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ కు ఎన్నికలపై వున్న శ్రద్ధ ప్రజలపై లేదని విమర్శించారు.

యాదాద్రి స్వామి సన్నిధిలో నాయిని...

నల్లగొండ్ : యాదగిరి నరసింహస్వామిని మంత్రి నాయిని దర్శించుకున్నారు. బాలాలయంలో గర్భాలయ మూర్తులకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సహజత్వానికి అనుగుణంగా బాలాలయంలో గర్భాలయాన్ని రూపొందించడం అద్భుతమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశించిన రీతిలో త్వరలోనే యాదాద్రి అభివృద్ధి చెందుతుందన్నారు. నాయిని వెంట ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత తదితరులు స్వామిని దర్శించుకున్నారు.

14:40 - April 25, 2016

బిలాస్ పూర్: ఎండవేడికి ఓ ఏనుగు తట్టుకోలేకపోయింది.. గొలుసుల్ని తెంపుకొని పైప్‌ను పగలగొట్టి వేసవితాపాన్ని తీర్చుకుంది.. చాలాసేపు నీటికింద స్నానం చేస్తూ సేద తీరింది.. చత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లోని నేషనల్‌ పార్కులో ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేడిని భరించలేని ఏనుగు.. గొలుసుల్ని లాగేసింది... పరుగు పరుగున పైప్‌ దగ్గరకు చేరింది.. ఆ పైప్‌ను తన్నేసి నీళ్లు బయటకు వచ్చేలా చేసింది.. ఈ నీటిలో శరీరమంతా తడుపుకుంటూ స్నానం చేసింది.. 

14:38 - April 25, 2016

పశ్చిమ గోదావరి: ఏలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది.. సోమరప్పాడు దగ్గర వేగంగా వస్తున్న ట్రాక్టర్‌... బైక్‌ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా... తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. మృతులు పేదవేగి మండలం వేగివాడ మాజీ సర్పంచ్‌ పిల్లలుగా గుర్తించారు.. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఆగిపోవడంతో బైక్‌పై వెళుతున్న రమేశ్‌ను లిఫ్ట్ అడిగారు.. ఈ ముగ్గురిని ఎక్కించుకొని వెళుతుంగా ట్రాక్టర్‌ ఢీ కొట్టింది.. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు..

14:36 - April 25, 2016

రంగారెడ్డి : కరవు నివారణ చర్యలు చేపట్టాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ముందు సీపీఐ ఆందోళనకు దిగింది.. ప్రజలు కరవుతో అల్లాడిపోతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి ఆరోపించారు.. కరవు మండలాలకు నిధులివ్వాలని డిమాండ్ చేశారు..

యాచన కంటే డాన్స్ లే నయం : సుప్రీంకోర్టు

ఢిల్లీ : బార్ డాన్స్ లపై సుప్రీంకోర్టు లో విచారణ కొనసాగింది. ముంబైలో డాన్స్ బార్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించింది. వీధుల్లో యాచిండం కంటే బార్లలో నృత్యాలు చేయడమే మేలు అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. డాన్స్ చేయడం ఓ వృత్తి అని,ఆంక్షల పేరుతో ప్రభుత్వం నృత్యాలను నిషేధించరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విద్యా సంస్థలకు కిలోమీటరు దూరంలోపు డాన్సు బార్లు ఉండరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కాగా ఈ విషయంపై మరోసారి సమీక్షించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు స్పష్టం చేసింది. 

14:32 - April 25, 2016

హైదరాబాద్ : ప్రతి వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఖచ్చితంగా ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో హడ్కో 46వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు హడ్కో అవార్డులు అందజేశారు. పట్టణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తున్నందుకు ఏపీఎస్ ఆర్టీసీ కి హడ్కో అవార్డు వరించింది. ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావుకు వెంకయ్యనాయుడు అవార్డు ప్రదానం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం రెండు విభాగాల్లో హడ్కో అవార్డులు అందుకుంది. పట్టణ పేదలకు గృహ నిర్మాణం చేపట్టినందుకు హౌసింగ్‌బోర్డుకు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లైకి అవార్డులు వచ్చాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, జలమండలి ఎండీ దాన కిషోర్‌ హడ్కో అవార్డులు అందుకున్నారు. 

14:31 - April 25, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ దగ్గర చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ విచిత్ర వేషధారణతో ఆకట్టుకున్నారు. కుచేలుడి వేశంలో ఉన్న శివప్రసాద్‌ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మోదీకి పద్య రూపంలో వివరించారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం ఏమాత్రం సరిపోవడంలేదని అభివర్ణిస్తూ నాటక ప్రదర్శన చేశారు. 

14:27 - April 25, 2016

విశాఖ : విశాఖ బ్రాండెక్స్ సెజ్ లో సెగ ఆరడం లేదు. వేతనాలు పెంచాలని కోరుతూ విధులు బహిష్కరించి కార్మికులు గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే బలవంతంగా కార్మికులను విధుల్లోకి రప్పించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. వేతనాలు చెల్లిస్తేనే విధుల్లో చేరుతామని కార్మికులు ఖరాకండిగా చెప్పారు. ఈనెల 30 వరకు సమయం కావాలని యాజమాన్యం తెలిపింది. కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. పదిమంది సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీలో 144 సెక్షన్ విధించారు. తమ డిమాండ్లను నెరవర్చే వరకు విధుల్లోకి వచ్చేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 
 

బెంగాల్ 1గంట వరకు 52.22 శాతం పోలింగ్..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాలుగో ఫేజ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1గంట వరకు 52.22 శాతం పోలింగ్ నమోదైంది. 

కాంగ్రెస్ ఆందోళనపై వెంకయ్య ఆశ్చర్యం..

ఢిల్లీ : లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు చేపట్టిన ఆందోళన ఆశ్చర్యం కలుగుతోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ హాయాంలో 91 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తు చేశారు. 

13:57 - April 25, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ మండిపడ్డారు. 'టీడీపీ పార్టీ కొన్ని విలువలకు కట్టుబడి వుందనీ మీతో నీతులు చెప్పించుకునే దుస్థితి మాకు లేదని' ఆయన ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసినప్పుడు కూడా తాము పోటీ నుంచి విరమించుకున్నామని ఆయన గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వర్రావుని, కేసీఆర్ ను చూస్తుంటే ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల్ రావు, అల్లురామలింగయ్యలు గుర్తుకొస్తున్నారని హేళన చేశారు. పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాంరెడ్డి మృతి చెందడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో టీడీపీ పార్టీ పోటీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఓటమికి భయపడే టీడీపీ పోటీ నుండి తప్పుకుందని టీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. ఈనేపథ్యంలో టీఆర్ ఎస్ పై రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. 

 

13:49 - April 25, 2016

ఢిల్లీ : సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై సాయంత్రం రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. సీఎం చంద్రబాబు నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. పెద్ద ఎత్తున ఏపీలో ఉద్యమం చేపట్టింది. పార్లమెంట్ లో కూడా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అమలు చేయాలనే దానిపై గట్టిగా వినిపించాలనుకుంటోంది.    

 

13:47 - April 25, 2016

నెల్లూరు : ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మళ్లీ ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనే నిబంధనలు వున్నా పలు కాళాశాలలో ఈ విష సంస్కృతి కొనసాగుతూనే వుంది. దీంతో ఎందో మంది విద్యార్ధుల జీవితాలు మొగ్గలోనే రాలిపోతున్నాయి. తాజాగా నెల్లూరులో సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలలో మరో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. సీనియర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్లు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పిన పని చేయకుంటే ఉరి వేసి చంపేస్తామని సీనియర్లు బెదిరిస్తున్నారనీ...తమ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి వారి కాళ్ళు పట్టించాలనీ కోరుతున్నారని బాధిత విద్యార్ధులు వాపోయారు. కాగా పాఠశాల స్థాపించిన నాటి నుండి పలు వివాదాల్లో సుబ్బారెడ్డి కళాశాల వుండటం గమనించగదిన విషయం.

క్షమాపణలు చెప్పిన పరేష్ రావెల్..

ఢిల్లీ : సినీ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావెల్ క్షమాపణలు చెప్పారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సరి, బేసి సంఖ్య విధానం నడుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం పరేష్ రావెల్ సరి సంఖ్యకు చెందిన వాహనంలో పార్లమెంట్ కు వచ్చారు. దీనితో ఆయన క్షమాపణలు చెప్పారు. 

ఉత్తరాఖండ్ సంక్షోభంతో తమకు సంబంధం లేదు - రాజ్ నాథ్..

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ సంక్షోభంతో తమకు ఎటువంటి సంబంధంలేదని, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లోక్ సభలో ఉత్తరాఖండ్ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇతర పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేస్తోందని ఖర్గే ఆరోపించారు.

 

ప్రభుత్వాలను కూల్చివేస్తోంది - ఖర్గే..

న్యూఢిల్లీ : లోక్ సభలో ఉత్తరాఖండ్ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇతర పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేస్తోందని ఖర్గే ఆరోపించారు. 

జయలలిత నామినేషన్..

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కే నగర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. జయలలిత నామినేషన్ వేసిన ప్రాంతానికి అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మే 16న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

కరుణానిధి నామినేషన్..

తమిళనాడు: డీఎంకే చీఫ్ కరుణా నిధి తిరువరూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. కరుణానిధి నామినేషన్ వేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు తరలి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు.

సీపీఎం అభ్యర్థిగా పోతినేని..

ఖమ్మం : పాలేరు సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్ రావు ను పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేరును ప్రకటించారు. వామపక్షాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నామని, రేపు సీపీఐ నేతలతో చర్చలు జరుపుతామని తమ్మినేని వెల్లడించారు. 

13:28 - April 25, 2016

ఖమ్మం : పాలేరు సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్‌రావును ఆ పార్టీ ప్రకటించింది. పోతినేని పేరును తెలంగాణ సీపీఎం రాష్ర్టకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. వామపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తమ్మినేని అన్నారు. రేపు సీపీఐ నేతలతో చర్చలు జరుపుతామన్నారు. కాగా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. 

రాజ్యసభ 2గంటలకు వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నిరసిస్తూ విపక్షాలు రాజ్యసభలో ఆందోళన చేపట్టాయి. కేంద్రం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నినాదాలు చేశాయి. దీనితో రాజ్యసభ ఛైర్మన్ హామీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. 

శ్రీసిటీలో క్యాడ్ బరీ ప్లాంట్ ప్రారంభం..

చిత్తూరు : ప్రముఖ చాక్లెట్ తయారీ సంస్థ మోండోలెజ్ (క్యాడ్ బరీ) చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో తన ప్లాంట్ ను ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్ ను ప్రారంభించారు. నాలుగు దశల ప్లాంట్ నిర్మాణంలో తొలి దశ నిర్మాణం పూర్తయ్యింది.

 

13:12 - April 25, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంతి రావెల సుశీల్ కుమార్ కు ఊరట లభించింది. రెండు నెలల క్రితం మంత్రి రావెల కుమారుడు తనను వేధిస్తున్నారని ఓ ముస్లిం మహిళ కొన్ని స్వచ్ఛంద సంస్థల సహాయంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు హైకోర్టులో రావెల సుశీల్ కుమార్ ఎవరో అసలు తనకు తెలియదని సదరు మహిళ అఫిడవిట్ దాఖలు చేయటంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. సీసీ కెమెరాల్లో కూడా సుశీల్ కుమార్ పోలికలు స్పష్టత లేకపోవటంతో కేసు సుశీల్ కుమార్ ను నిర్ధోషిగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ కు, కేసు నమోదు చేసిన సదరు మహిళకు రాజీ కుదిరినందువల్లనే ఈ కేసు కొట్టివేయబడిందని సమాచారం.

13:10 - April 25, 2016

కాపులను బీసీల్లో చేర్చాలని టిడిపి మేనిఫెస్టోలో పెట్టిందని, తాము కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని వైసీపీ నేత బొత్స పేర్కొన్నారు. టెన్ టివి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఆయన పలు అభిప్రాయాలను వెల్లడించారు. కాపులను బీసీల్లో చేర్చడంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఒక కాల పరిమితి పెట్టి చేస్తామని టిడిపి పేర్కొందని ఇందుకు ఆరు నెలల సమయం తీసుకుందని గుర్తు చేశారు. ఇప్పటికీ రెండు సంవత్సరాలైందని, మంజునాథన్ కమిటీ కూడా వేశారని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని తాము సూచించడం జరుగుతోందన్నారు. ఇంకో కేటగిరి పెంచాలని, ఎఫ్ గ్రూప్ పెట్టి అందులో చేర్చుస్తారు తప్పేముంది ? అని ప్రశ్నించారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగినట్లుగా చేస్తే సరిపోలా ? మనస్సుంటే మార్గం ఉంటుందని, చంద్రబాబు నాయుడు తత్వం దగా..మోసం..అని బోత్స మండిపడ్డారు. మారిపోయారని భావించిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

13:01 - April 25, 2016

వైసీపీ పార్టీ నుండి ఒక్కొ ఎమ్మెల్యే జారిపోతున్నారు. అధికార పార్టీయైన టిడిపిలో చేరుతున్నారు. 2019లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారో తెలియడం లేదు. టెన్ టివి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో వైసీపీ నేత బోత్స అభిప్రాయాలు వెల్లడించారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అనేది కాదని, 2014లో వచ్చిన ఓట్ల శాతం కంటే 2019ఎన్నికల్లో ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ ఆలోచనలతో.. ఆయన ఆశీస్సులతో జగన్ నాయకత్వంలో ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 

12:53 - April 25, 2016

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలపై వైసీపీ నేత బోత్స సత్యనారాయణ స్పందించారు. ఆయనతో టెన్ టివి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పలు విషయాలపై మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవలే పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది..పార్టీ పెట్టే హక్కు కూడా ఉందని బోత్స తెలిపారు. ఆ హక్కు..స్వేచ్ఛతో ఆయన మాట్లారని..మాట్లాడని...తప్పేమంది ఆయన పని ఆయన చేసుకుంటారు..అని బోత్స తెలిపారు. 

12:41 - April 25, 2016

హైదరాబాద్ : నగరంలో నానాటికీ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. క్రమేపీ నేరాలను అరికడుతున్నామని పోలీసు యంత్రాంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నా నేరాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. తాజాగా పాతబస్తీ ఛత్రినాకలో దారుణం చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. పాతబస్తీ ఛత్రినాకలో నివాసముంటున్న తల్లీకూతుళ్లు గౌసియా, రుక్సానాలు హత్యగావించబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. గౌసియా భర్త అహ్మద్ ఈ హత్యలు చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అహ్మద్ పరారీలో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

12:40 - April 25, 2016

ఖాట్మాండు : విలయం సృష్టించిన నేపాల్‌ భూకంపానికి నేటికి ఏడాది. గతేడాది ఏప్రిల్‌ 25న సంభవించిన భూకంపం నష్టం నుంచి నేపాల్‌ ఇంకా తేరుకోలేదు. కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులూ  వేల సంఖ్యలోనే ఉన్నారు. భూకంపంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు లక్షల్లోనే ఉన్నారు. నేటికీ నిలువనీడ లేకుండా గుడారాల్లోనే తలదాచుకుంటూ దయనీయ జీవితం గుడపుతున్న నేపాలీ అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు.  
భూకంపం విలయం 
నేపాల్‌ భూకంపానికి ఏడాది పూర్తయ్యింది. గతేడాది ఇదే తేదీన సంభవించిన భూకంపం విలయం సృష్టించింది. దీనిని హిమాలయన్‌ భూకంపంగా పిలుస్తారు. హిమాలయన్‌ ట్రాజడీగా కూడా వ్యవహరిస్తున్నారు. రిక్టర్‌ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం పెను విధ్వంసానికి దారితీసింది. 1905లో ఆగ్రా, 1934లో నేపాల్‌-బీహర్‌ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం తర్వాత నేపాల్‌ రాజధాని ఖాఠ్మండ్‌ కేంద్రంగా నమోదైన భూకంపమే అతిపెద్దదిగా రికార్టుల కెక్కింది. నేపాల్‌లోని లమ్‌జంగ్‌కు ఆగ్నేయంగా 34 కి.మీ. దూరంలో, భూమికి 15 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్‌ భూకంప ప్రభావం భారత్‌, బంగ్లాదేశ్‌, చైనా దేశాల్లో కూడా కనిపించింది. ప్రకృతి ప్రకోపిస్తే ప్రళయం ఎంత తీవ్రంగా ఉంటుందో, విలయం ఎంత భయానకంగా ఉంటుందో నేపాల్‌ భూకంపం రుజువుచేసింది. 
నేపాల్‌ భూకంపం పెను విషాదం
నేపాల్‌ భూకంపం పెను విషాదానికి దారితీసింది. దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో  రెండువేల మంది 10 ఏళ్లులోపు పిల్లలున్నారు.  22 వేల మంది క్షతగాత్రులయ్యారు. ఎనిమిది లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. కళ్లముందు పేక మేడల్లా కూలుతున్న భవనాలు చూసిన జనం కళ్లు బైర్లు కమ్మాయి. భూమి బద్దలవడాన్ని గమనించిన ప్రజల గుండెలు అవిసిపోయాయి. కూలిన భవన శిథిలాల కింద శవాల గుట్టలు. సాయంకోసం ఎదురుచూసే ధీనంగా ఎదురు చూస్తున్న క్షతగ్రాతులను చూసిన వారికి కళ్లు చెమర్చాయి. కానీ ఏమీ చేయలేని ధీనస్థితి. కాళ్లు, చేతులు విరిగిన వారు కొందరు.. శరీరంగా నిండా గాయాలతో రక్తమోడుతున్న వారు మరికొందరు. ఇలాంటి హృదయ విదారక గాథలు ఎన్నో. ఒకరోజు కాదు... రెండు రోజులు కాదు... శిథిలాలు తొలగించడానికే దాదాపు నెల రోజులు పట్టింది. కూలిన భవన శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ శవాలు బయటపడుతుంటే....  సామూహిక దహన  సంస్కారాలు నిర్వహించారు. 
చెక్కుచెదరని పశుపతినాథ ఆలయం 
భూకంపధాటికి నేపాల్‌ రాజధాని కాఠ్మండ్‌ కకావికలమయ్యింది. చారిత్రక కట్టడాలు శిథిలమయ్యాయి. అయితే  ప్రాచీన పశుపతినాథ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. నేపాల్‌లో సంభవించిన భూకంపం పెను విలయం సృష్టించిందని సమాచారం అందుకున్న మనదేశం  ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. నేపాల్‌కు ఆపన్నహస్తం అందించింది. వెంటనే సైన్యాన్ని పంపి సహాయ చర్యల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌తో పాటు, ఇతర దేశాలు తమ బృందాలతో సహాయ సామాగ్రి పంపించాయి. ఆహారం కొరతతో అల్లాడుతున్న నేపాల్‌కు మన దేశం ఆహార పదార్ధాలు చేరవేసింది. తాగేందుకు చుక్కనీరు లేక దాహార్తితో పరితపించిపోతున్న భూకంప బాధితులకు మంచినీరు పంపించి వేలాది మంది ప్రాణాలు కాపాడి మానవతను చాటుకుంది మన దేశం. 
నేపాల్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులు 
నేపాల్‌లో పర్యాటక ప్రదేశాలు ఎక్కువ. ఆ దేశ ఆదాయంలో ఎక్కువ భాగం పర్యాటకరంగం నుంచే వస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో వేలాది మంది పర్యాటకులు  ఆదేశంలో చిక్కుకుపోయారు. వీరిలో అత్యధికులు భారతీయులు. భూకంపం కారణంగా ఖాఠ్మండ్‌ విమానాశ్రయాన్ని మూసివేయడంతో వీరందరినీ భారత్‌కు తరలించడంలో కొంత జాప్యం జరిగింది. విమానాశ్రయాన్ని తిరిగి తెరిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు పంపించి మనవారికి సురక్షింతగా స్వదేశం చేర్చింది.
బాధితులు నేటీకీ గుడారాల్లో 
ఏడాది తర్వాత భూకంప బాధితులు పరిస్థితి ఏ విధంగా  ఉందో పరిశీలిస్తే... వీరి జీవితాల్లో పెద్దగా మార్పులేదు. నిరాశ్రయుల్లో ఎక్కువ  మంది నేటికీ  గుడారాల్లోనేతలదాచుకునే దయనీయ పరిస్థితి. నేపాల్‌ భూకంపం ఎంతో మందిని అనాథలుగా మిగిల్చింది. తల్లులను కోల్పోయిన పిల్లలు, తండ్రులను కోల్పోయిన బాలలు, తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయినవారు... పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు...  ఇలా ఒక్కొక్కరిది ఒక్కోధీనగాథ. చాలా మంది అనాథబాలలు నేటికి  గుడారాల్లోనే తలదాచుకుంటున్నారు. కొందరు వీధిబాలలుగా మిగిలిపోయారు.  నిరాశ్రయుల పరిస్థితీ ఇంతే. భూకంప బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నేపాల్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సహాయ చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలున్నాయి.  భూకంపంలో వికలాంగులైన వారిపరిస్థితి మరీ  దుర్భరంగా మారింది. సరైన వైద్యం అందక బాధపడుతున్నారు. ఖాఠ్మండ్‌లోని సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న  బాధితులకు మంచినీరు అందుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఈ సౌకర్యం కూడా లేదు. చాలా మంది పిల్లలు క్యాన్లు తీసుకెళ్లి సుదూర ప్రాంతాల నుంచి మంచినీరు తెచ్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులున్నాయి. అవి కూడా భూకంప ప్రభావంతో కలుషితమైన భూగర్భల జలాలే ఆధారం. 
ఇటుక బట్టీల్లో రోజుకు 11 గంటల పని 
నేపాల్ భూకంప బాధిత కుటుంబాలకు చెందిన  చాలా మంది పిల్లలు ఉపాధి కోసం ఇటుక బట్టీల్లో పనిచేసే దుస్థితి ఏర్పడింది.  బట్టీల్లోనే వీరి బతుకులు సమిథలుగా మారుతున్నాయి.  ఇటుకల తయారీకి ఉపయోగించే బంకమట్టి కలపడం నుంచి ఇటుకల తయారీ, లారీల్లోకి ఎత్తడం నుంచి దించడం  వరకు అన్ని పనులు ఈ బాలలతోనే చేయిస్తున్నారు.  రోజుకు 11 గంటలు పనిచేసినా పూటగడవని  దయనీయ పరిస్థితి. కాఠ్మండ్‌ వీథుల్లో పీచు మిఠాయి అమ్ముకుని పూటగడుపుకునే భూకంప బాధిత బాలలు ఎందరో ఉన్నారు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న  మహిళల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరిపై లైగింక దాడులు,  వేధింపులు ఎక్కువ అయ్యాయి. భూకంప మృతుల  కుటుంబాలకు రెండు లక్షల రూపాయల  పరిహారం ఇస్తామని నేపాల్‌ ప్రభుత్వం ప్రకటించినా.....ఇంతవరకు  వేలాది కుటుంబాలకు సహాయం అందలేదు. సహాయం పొందేందుకు సవాలక్ష ఆధారాలు చూపాలంటూ  వేధిస్తున్నారు. 
సహాయ, పునరావాస కార్యక్రమాలు గాలికి 
నేపాల్‌ ప్రభుత్వం భూకంప పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు అమలు చేయడానికి పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపించడంలేదు. విపత్తు సంభవించిన కొద్ది నెలలకే కొత్త రాజ్యాంగం రచించడంపై దృష్టిపెట్టడంతో సహాయ, పునవాస కార్యక్రమాలను గాలికొదిలేశారన్న విమర్శలు వచ్చాయి. రాజ్యాంగంలో తమకు సరైన ప్రాధాన్యత  మహిళలు, మైనారిటీలు రొడ్డెక్కడంతో ఆర్ధిక దిగ్బంధానికి కారణమయ్యింది. భారత్‌ నుంచి నేపాల్‌కు దారితీసే మార్గాలను మూసివేయడంతో పెట్రోల్‌, వంటగ్యాస్‌, మందుల రవాణ నిలచిపోయింది. పెట్రోలు కొరతతో టాక్సీలు నడవలేదు.   వంటగ్యాస్‌ కొరతతో  రెస్టారెంట్లను బంద్‌ చేయాల్సి వచ్చింది. భూకంపంతో గాయపడ్డవారికి మందులు అందగ అగచాట్లు పడ్డారు. నేపాల్‌ పాలకులు ముందుచూపులేని మందగమనానికి ఇది నిదర్శనంగా నిలిచింది. కొత్త రాజ్యాంగానికి నేపాల్‌ పార్లమెంటు ఆమోదముద్ర వేసిన తర్వాత ఆదేశ పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. భూకంప పునరావాస కార్యక్రమాల అమలుపై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు. 

 

12:39 - April 25, 2016

విశాఖ : జిల్లాలోని అచ్యుతాపురం ఎస్‌జిజెడ్‌లోని బ్రాండిక్స్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనను ఉదృతం చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్‌ సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బ్రాండిక్స్‌లోని మూడు యూనిట్ల కార్మికులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో మూడు విభాగాలుగా వున్న కంపెనీలో ఆందోళన ప్రభావం మిగతా కార్మికులపై పడుతుందనే భయంతో యాజమాన్య ఆందోళన చేస్తున్న కార్మికులను బలంతంగానైనా విధులలోకి రప్పించేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కార్మికులు నివాసముంటున్న గ్రామాలకు కార్మికులను తరలించేందుకు యాజమాన్యం వాహనాలను పంపింది. కార్మికులకు మద్ధతునిస్తున్న 10 మంది సీఐటీయూ నేతలను యాజమాన్యం అరెస్ట్ చేయించింది. గత 15 రోజులుగా కార్మికులు ఆందోళన ఉదృతం చేసిన నేపథ్యంలో కంపెనీలో 144 సెక్షన్ విధించింది. దీంతో సమస్యలు పరిష్కరిచంకుండా 144 సెక్షన్ విధించటంపై కార్మికులు మండిపడుతున్నారు.

12:33 - April 25, 2016

గుంటూరు : జిల్లాలోని వెలగపూడిలో ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబుకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 4 గంటల ఒక్క నిమిషానికి.. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి.. కొత్త కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబును పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు శాలువాలతో సత్కరించి.. అభినందనలు తెలిపారు. ఇక ఎల్‌అండ్‌టీ నిర్మిస్తున్న ఈ తాత్కాలిక సచివాలయ భవనంలో మొత్తం ఆరంతస్తులున్నాయి. ఇందులో నాలుగో బ్లాక్‌లో రెండు గదులను సిద్ధం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా విశ్వక్సేన, వాస్తు పూజలు.. గణపతి హోమం నిర్వహించారు. 
ట్రాన్సిషనల్ హెడ్ క్వార్డర్స్ గా నామకరణం
వెలగపూడిలో 4గంటల 1 నిమిషానికి తాత్కాలిక సచివాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ట్రాన్సిషనల్ హెడ్ క్వార్డర్స్ గా నామకరణం చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో  రెండు గదులు ప్రారంభించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరాం.. కాని అవి అమలు కావడం లేదన్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ ఆదాయం 50.6 శాతంగా ఉందని.. ఏపీ ఆదాయం 46.35 గా  ఉందని తెలిపారు.  తాత్కాలిక రాజధాని ప్రారంభోత్సవం చేయడం తనకు గర్వంగా ఉందన్నారు బాబు. మొక్కవోని దీక్షతో ముందుకు వెళుతున్నాని అన్నారు. రెండో విడత రైతు రుణ విముక్తి కోసం తొలి సంతకంచేశానన్నారు.
రైతు రుణమాఫీపై సీఎం తొలి సంతకం 
ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. మొత్తం 3,200 కోట్ల రూపాయల రుణం మాఫీ చేశారు. 
అమరావతి చరిత్ర చాలా గొప్పది - చంద్రబాబు
అమరావతి చరిత్ర ఎంతో గొప్పదని.. అమరావతిని భారతదేశప్రజలు  మరిచిపోతున్నారని బాబు అన్నారు.ఈత తరుణంలో  లండన్ లోని ప్రఖ్యాత మ్యూజియంలో అమరావతికి ప్రత్యేక గాలరీ ఉందని.. ప్రపంచానికి అమరావతి చరిత్రను ఆ గాలరీ చాటి చెబతోందని అన్నారు బాబు. విదేశాలకు శ్రీలంక , చైనా , రష్యా వంటి దేశాలకు అమరావతినుండే వ్యాపారాలు జరిగేవని.. విదేశాలకు ఒక లాజిస్టిక్ అని మ్యూజియం వారు పేర్కోన్నారని.. ఇలాంటి అమరావతి పేరును రాజధానికి పెట్టడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి ప్రపంచానికి అమరావతిని గుర్తు చేసేందుకే ఈప్రయత్నం అన్నారు బాబు . 
అక్కడపంటలు పండితే పేదరికం ఉండదు - చంద్రబాబు
రాజధాని భూములపై చాలా మంది అభ్యంతరాలు తెలిపారని.. కాని ఇదే రకమైన భూమి రాయలసీమ లోను ఉందని.. ఇక్కడే పండించే పంటను..అక్కడ భూములకు  నీళ్లు అందిస్తే రెండు రెట్లు అధికంగా పండించవచ్చని..అన్నారు. అరటి వంటి ఎన్నో రకాలపంటలకు సీమ నిలయమని.. రానున్న రోజుల్లో రాయల సీమ రతనాల సీమగా మారుతుందని అన్నారు. 
రైతులకు మరో 50 స్కేర్ యార్డ్స్ ఇస్తా - చంద్రబాబు
రాజధాని ప్రాంతంలో ఉన్న మెట్టరైతులు ఉన్న భూమి కంటే మరో 50 స్కేర్ యార్డ్స్  కావాలని అడిగారని.. అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు బాబు. దీనిపై రైతుల హర్షం వ్యక్తం చేశారు. రైతులు బాగుండాలనే ఉద్దేశ్యంతో రైతులకు అనుకూలంగానిర్ణయాలు తీసుకుంటున్నానని అన్నారు బాబు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని రైతులకు అన్యాయం  చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని   చంద్రబాబు తెలిపారు.  రానున్న 2029 నాటికి దేశంలోని మూడు గొప్ప నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని తెలిపారు. 
ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం : మంత్రి రావెల  
ఈ ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉందని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. అయితే.. ఈ ప్రాంతం ఈ విధంగా మారుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు రావెల. 
చంద్రబాబు చరిత్రలో నిలుస్తారు : మంత్రి పల్లె 
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజధానిని నిర్మిస్తున్న చంద్రబాబు చరిత్రలో నిలుస్తారాని మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి అన్నారు. ఇంద్రుడు ఆ అమరావతిని నిర్మిస్తే.. ఈ చంద్రుడు ఈ అమరావతి నిర్మిస్తున్నారని మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి అన్నారు. 

బ్రాండెక్స్ లో 144 సెక్షన్..

విశాఖపట్టణం : బ్రాండెక్స్ సెజ్ లో సెగ ఇంకా ఆరలేదు. బలవంతంగా కార్మికులను ఫ్యాక్టరీకి రప్పించాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది. తమ డిమాండ్లు పరిష్కరించందే విధుల్లోకి హాజరయ్యేది లేదని కార్మికులు పేర్కొంటున్నారు. కార్మికులకు మద్దతు తెలుపుతున్న పది మంది సీఐటీయూ నేతలను అరెస్టు చేసిన పోలీసులు అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

పాక్ సింగర్ పోసర్ల చించివేత..

గుజరాత్ : పాక్ సింగర్ రహత్ ఫతే ఆలీ ఖాన్ పోస్టర్లను శివసేన కార్యకర్తలు చించివేశారు. అహ్మదాబాద్ లో ఆయన ప్రదర్శన ఇవ్వనున్నారు. 

హైకోర్టులో రావెల సుశీల్ కు ఊరట..

హైదరాబాద్ : ఏపీ మంత్రి తనయుడు రావెల సుశీల్ కు హైకోర్టులో ఊరట లభించింది. సుశీల్, డ్రైవర్ రమేష్ పై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది. తన పై ఉన్న అభియోగాలపై రావెల సుశీల్ కోర్టుకు వెళ్లాడు. తన పట్ల సుశీల్ అసభ్యకరంగా ప్రవర్తించలేదని బాధితురాలు అఫిడవిట్ దాఖలు చేసింది. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాని సుశీల్ పై ఆరోపణలున్న సంగతి తెలిసిందే.

 

శ్రీకాంత్ నటిస్తున్న సినిమా పేరును మార్చాలన్న హైకోర్టు..

హైదరాబాద్ : సినీ నటుడు శ్రీకాంత్ నటించిన 'మెంటల్ కృష్ణ' సినిమా పేరు మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

పీటీవో ఎస్ఐ పరీక్షకు ప్రశ్నపత్రం ఎంపిక...

హైదరాబాద్ : తెలంగాణ పీటీవో ఎస్ఐ పరీక్షకు ఎల్ కోడ్ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. 2364 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 02.30 గంటల నుండి 05.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.

 

డివైడర్ ను ఢీకొన్న వాహనం..ముగ్గురి మృతి..

అనంతపురం : సింగనమల (మం) లోలూరు వద్ద డివైడర్ ను పెళ్లి బృందంతో వెళుతున్న వాహనం ఢీకొంది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 

ఇద్దరు గ్రామస్తులను కాల్చి చంపిన నక్సల్స్..

ఢిల్లీ : మహారాష్ట్ర - ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని గడ్చిరౌలీ జిల్లాలో ఇద్దరు గ్రామస్తులను నక్సల్స్ కాల్చి చంపారు. పోలీసు ఇన్ఫామర్లుగా భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. 

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : సోమవారం పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉత్తరాఖండ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో సభను మధ్యాహ్నం 12.00గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. 

డివైడర్ ను ఢీకొన్న వాహనం..ముగ్గురి మృతి..

అనంతపురం : సింగనమల (మం) లోలూరు వద్ద డివైడర్ ను పెళ్లి బృందంతో వెళుతున్న వాహనం ఢీకొంది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 

నియమాలను ఉల్లంఘించిన పరేష్ రావెల్..

ఢిల్లీ : సినీ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావెల్ నియమాలను ఉల్లంఘించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సరి, బేసి సంఖ్య విధానం నడుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం పరేష్ రావెల్ సరి సంఖ్యకు చెందిన వాహనంలో పార్లమెంట్ కు వచ్చారు. 

11:34 - April 25, 2016

ఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఆందోళన మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. 

లోక్ సభలో ప్రతిపక్షాల నినాదాలు..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. 'కేంద్ర సర్కార్ హోస్ మే ఆవో' అంటూ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. 

కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు స్పీకర్ కు అందచేసింది. దేశంలో నెలకొన్న కరవు..ఉత్తరాఖండ్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని తీర్మానం ఇచ్చింది. 

11:19 - April 25, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సమావేశాలను ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం  స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన అంశంపై సభలో గందరగోళం ఏర్పడింది. 

11:18 - April 25, 2016

మెగస్టార్ చిరంజీవి అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందబోతోందంట. చిరంజీవి 150వ సినిమా గురించిన వార్తలు ఏళ్ల తరబడి వినీ వినీ అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు విసుగెత్తి పోయారు. ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో తమిళంలో హిట్టయిన 'కత్తి' రీమేక్ అని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని, చిరంజీవి మళ్లీ మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమా స్టోరీని వివి వినాయక్ పక్కాగా రెడీ చేసినట్లు టాక్. దీనికి 'చిరు' కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కత్తి స్టోరీ లైన్ ను చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా తీర్చిదిద్దారని టాక్. అదే నిజమైతే త్వరలోనే చిరంజీవి 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందంట. 

11:12 - April 25, 2016

హైదరాబాద్ : రానున్న రోజుల్లో పత్తి పంటకు గడ్డుకాలం రానుందా? తెల్ల బంగారం సాగు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోనుందా?... అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రే పత్తి సాగు వద్దని సూచిస్తున్నారు. 
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి-కేసీఆర్‌
రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంలో ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ విషయంపై రైతులకు చేయాల్సిన సూచనలు, ప్రభుత్వ కార్యాచరణ తదితర అంశాలపై ఈ నెల 29న జరిగే కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పత్తి ధరలు పడిపోతున్న తరుణంలో దేశీయ మార్కెట్లో కూడా ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతి సుంకాన్ని కూడా పెంచేలా నిర్ణయం తీసుకుంది. వీటితో సంబంధం లేకుండా రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేస్తున్నారు. అధిక పెట్టుబడి పెట్టి సరైన ధర రాక నష్టపోతున్నారు. 
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి : నిర్మలా సీతారామన్ 
పత్తి ఎగుమతులపై విధించే పన్నులో రాయితీని రద్దు చేసే విషయంలో నైరోబీలో జరిగిన డబ్లూటీవో సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకం కూడా చేశారు. ఈ నేపథ్యంలో సంక్షోభ ప్రభావం తెలంగాణ రైతులపై పడకుండా చూసేందుకు అప్రమత్తం కావాలని సీఎం నిర్ణయించారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

 

 

11:02 - April 25, 2016

సినీ నటుడు నందూరి ఉదయ్ కిరణ్ పై పీడీ యాక్టు నమోదైంది. పలు నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు ఉదయ్ కిరణ్ విఘాతం కలిగిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్టు కింద నమోదు చేశారు. ప్రస్తుతం నందూరి ఉదయ్ కిరణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
గత నెలలో జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ లో వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రవేశం నిరాకరించినందుకు సిబ్బందిపై దాడికి పాల్పడడంతో పాటు డోర్లను పగలగొట్టి హల్ చల్ చేశాడు. గతంలోనూ పలు పీఎస్ పరిధిలో ఇతడిపై కేసులున్నాయి. స్నేహితుడిని బెదిరించి కారు తీసుకెళ్లడం..పబ్ లో జరిగిన గొడవలో ఓ వ్యక్తి పై దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ జైలులోనే ఉన్నాడు. పీడీ యాక్టు ప్రకారం ఏడాది పాటు జైలులో ఉండాల్సి వస్తుంది. 

10:55 - April 25, 2016

ఢిల్లీ :  నేటి నుంచి పార్లమెంట్‌ రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి. మరికాసేపట్లో  సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మే 13 వరకూ కొనసాగనున్నాయి. సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వివిధ అంశాల్లో అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా వున్నాయి. విపక్షాలు మాత్రం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన, యూనివర్శిటీల్లో దాడులు, పఠాన్‌కోట్‌ దర్యాప్తు, దేశంలో కరవు పరిస్థితులపై చర్చించాలని పట్టుపట్టేందుకు ప్రతిపక్షాలు పట్టుపట్టనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని భావిస్తోంది. లోక్‌సభలో రూల్‌ 55 ప్రకారం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై వాయిదా తీర్మానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నిర్ణయించారు. ఇక దేశంలో కరవు పరిస్థితులపై రాజ్యసభలో చర్చించాలని రూల్‌ 177 కింద ఇప్పటికే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బీజేడీ, జేడీయూ, బీఎస్పీలు నిర్ణయించాయి.

10:52 - April 25, 2016

'జంజీర్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రామ్‌ చరణ్‌ మరోసారి బాలీవుడ్‌ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నిర్మిస్తారని తెలుస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 'బాలీవుడ్‌లో నేను నటించబోయే సినిమా నిర్మాణ పరమైన విషయంలో సల్మాన్‌ఖాన్‌ సహకారముంటుంది. అయితే తదుపరి బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ని కచ్చితంగా ఎప్పుడు చేస్తానో తెలియద'ని రామ్‌చరణ్‌ చెప్పారు. సల్మాన్‌ఖాన్‌, రామ్‌చరణ్‌ స్నేహబంధం గురించి వేరే చెప్పక్కల్లేదు. సల్మాన్‌ నటించిన 'ప్రేమ్‌ రథన్‌ ధన్‌ పాయో' చిత్రం తెలుగు వర్షెన్‌కి సల్మాన్‌ పాత్ర కోసం రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ చెప్పిన విషయం విదితమే. చరణ్‌ ప్రస్తుతం తమిళ చిత్రం 'తని ఒరువన్‌' రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే చిరంజీవి 150వ సినిమా నిర్మాణ పనుల్లోనూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సల్మాన్‌ ఖాన్‌ తన బ్యానర్‌లో గతేడాది 'హీరో' అనే చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆయన 'సుల్తాన్‌' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

హడ్కో పురస్కారాన్ని అందుకున్న మంత్రి కేటీఆర్..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హడ్కో అవార్డును అందుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. హడ్కో 46వ వ్యవస్థాపక దినోత్సవం ఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్ లో జరిగింది. 

ప్రతిపక్షాలు సహకరిస్తాయనే నమ్మకం - మోడీ..

ఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు సహకరిస్తాయనే నమ్మకం ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశాలు సజావుగా జరిగే అవకాశం ఉందన్నారు. 

10:44 - April 25, 2016

ప.గోదావరి : సెల్ టవర్ ఎక్కి వారి డిమాండ్లు నెరవేర్చుకోవటమనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. యువత ప్రేవించుకోవడం పెద్దలు నిరాకరించటం మామూలుగా జరిగేదే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తణుకు గ్రామానికి చెందిన కాళిదాసు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెద్దలు ఒప్పుకోకపోవటంతో ఇద్దరు ఊరు వదిలి పారిపోయారు. ఈ క్రమంలో యువతి తరపు బంధువులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. విచారణ ప్రారంభించిన పోలీసులు కాళిదాసు ఎక్కడున్నాడో చెప్పమని పోలీసులు కాళిదాసు సోదరిని వేధించటం ప్రాంరంభించారు. దీంతో మనస్థాపం చెందిన కాళిదాసు సోదరి తణుకులో సెల్ టవర్ ఎక్కి పోలీసులు వేధింపుల నుండి తమను కాపాడమనీ లేకుంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో మున్సిపల్ చైర్మన్ కల్పించుకుని మహిళకు నచ్చచెప్పటంతో ఆమె టవర్ పై నుండి కిందికి దిగింది. పోలీసులతోపాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు..నిఫ్టీ 15 పాయింట్లకు పైగా నష్టపోయాయి. 

నటుడు నందూరి ఉదయ్ కిరణ్ పై పీడీ యాక్టు..

హైదరాబాద్ : సినీ నటుడు నందూరి ఉదయ్ కిరణ్ పై పీడీ యాక్టు నమోదైంది. పలు నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉదయ్ కిరణ్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు పీడీ యాక్టు కింద నమోదు చేశారు. ప్రస్తుతం నందూరి ఉదయ్ కిరణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 

10:39 - April 25, 2016

ఢిల్లీ : న్యాయం కంట కన్నీరొలికింది. దేశంలోని అనేక హైకోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్‌ అన్నారు. జడ్జిలపై భారం పడుతున్న నేపథ్యంలో.. ఆ తప్పంతా న్యాయవ్యవస్థపైనే మోపుతున్నారని తీవ్ర భావోద్వేగంతో అన్నారు. ప్రసంగిస్తుండగా కంటనీరు పెట్టారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే.. తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ కంటతడిపెట్టారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. ప్రధాని మోదీ, ఇతర పెద్దల సమక్షంలోనే సీజే కంటతడి పెట్టడం పలువురిని ఆశ్చర్యం, ఆవేదనకు గురి చేసింది. 
భావోద్వేగానికి లోనయిన చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ 
దేశంలోని న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తుండగా.. సీజే ఠాకూర్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జడ్జీల ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. దీనివల్ల కేసుల పరిష్కారాంలో చాలా జాప్యం జరుగుతుందని.. నిందితులు ఎళ్ల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారన్నారు. సత్వర న్యాయమందక ప్రజలు కష్టాలు పడుతున్నారని సీజే ఠాకూర్‌ అన్నారు. 
ప్రభుత్వానికి ఎన్నో లేఖలు 
జడ్జీల పోస్టుల భర్తీ కోసం తనకంటే ముందున్న సీజేలు ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారని జస్టిస్‌ ఠాకూర్‌ అన్నారు. ఒక సీజే ప్రభుత్వానికి రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. ప్రస్తుతం దేశంలోని హైకోర్టుల్లో 434 మంది న్యాయమూర్తుల ఖాళీలున్నాయని.. వాటి భర్తీ విషయాన్ని కేంద్రాన్ని అడిగితే.. రాష్ట్రాలే భర్తీ చేయాలంటోంది. రాష్ట్రాలేమో కేంద్రమే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటున్నారు. దేశంలో ప్రతి ఏడాది 5 కోట్ల కేసులు నమోదవుతుండగా.. వాటిలో రెండు కోట్ల కేసులనే న్యాయమూర్తులు పరిష్కరించగలుగుతున్నారన్నారు. 
సీజే ఠాకూర్‌ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ 
సీజే ఠాకూర్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి న్యాయమూర్తులు, ప్రభుత్వం సంయుక్తంగా కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామన్నారు. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే కంటతడి పెట్టడం పలువురు ఆశ్చర్యపడేలా చేసింది. మరి కేంద్రం జడ్జి పోస్టుల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

 

10:38 - April 25, 2016

రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఆఫీస్‌లో కూర్చుంటాం. నాన్‌స్టాప్‌ వర్క్‌ కొన్ని సార్లు బోర్‌ కొడ్తుంది. అది తరువాతి వర్క్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితం అవుట్‌పుట్‌ తగ్గుతుంది. బోర్‌ని పక్కకు నెట్టి ఎనర్జిటిక్‌గా అయిపోవడానికి కొన్ని టిప్స్‌ చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూసి మీరు ఫాలో అయిపోండి !
కొందరు బోర్‌ కొట్టినప్పుడు సీట్‌ దగ్గరే కూర్చుని మాటిమాటికి నీళ్లు తాగడం వంటివి చేస్తుంటారు. దానికి బదులుగా మంచి సంగీతం వినండి. ఆ ఎనర్జీతో పనిని మరింత వేగంగా చేయండి.
సిస్టమ్‌ ఉంటుంది. అందులో నెట్‌ ఉంటుంది. కొత్త కొత్త వెబ్‌సైట్స్‌ మీకు జీవితానికి ఉపయోగపడేవి లేదా ఉద్యోగానికి ఉపయోగపడేవి అనేకం ఉంటాయి. వాటిలో కొన్ని మంచివాటిని ఎంచుకుని అప్పుడప్పుడూ చదువుతూ ఉండండి. పనిలోని అలసటను మరిచిపోతారు. నూతనోత్తేజాన్ని పొందుతారు.
కొంతమంది డెస్క్‌ గందరగోళంగా, గజిబిజిగా ఉంటుంది. అది చేసే పనిపైనా ప్రభావం చూపిస్తుంది. ఫలితం కూడా అంతే గందరగోళమవుతుంది. కాబట్టి సమయం దొరికినప్పుడు డెస్క్‌ క్లీన్‌ చేయండి. దానివల్ల మీ పనిని మీరు చేసుకున్న సంతృప్తి మిగులుతుంది. డెస్క్‌ నీట్‌గా మారుతుంది. దాంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలనిపిస్తుంది. నెట్‌ మీముందుంటే ప్రపంచమే మీ చేతుల్లో ఉన్నట్టు. కాబట్టి బోర్‌ కొట్టినప్పుడు కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అందులోని కొత్త కొత్త టూల్స్‌ని ఉపయోగించడం తెలుసుకోండి. మీకు తెలియకపోతే సహౌద్యోగుల సహాయం తీసుకోండి. ఇది మీ ఉద్యోగానికి ఉపయోగపడుతుంది. మీ నైపుణ్యాన్ని పెంచుతుంది.
యూట్యూబ్‌... ఇప్పుడు ఓ పెద్ద మాధ్యమం. అందులో అందుబాటులో ఉండనివి ఏమీ లేవు. కాబట్టి మీ జాబ్‌ ప్రొఫైల్‌కి ఉపయోగపడే వీడియోస్‌ చూడండి. పజిల్స్‌ మెదడుకు మేత. చురుకుగా పనిచేసేలా చేస్తాయి. అవి ఆన్‌లైన్లోనే కాకుండా న్యూస్‌ పేపర్స్‌లో కూడా వస్తున్నాయి. బోర్‌ కొట్టినప్పుడు పజిల్స్‌ను పరిష్కరించడానికి ప్రయత్నించండి. 

10:34 - April 25, 2016

వయసు పైబడుతున్న కొద్ది చర్మం మెరుపు తగ్గి వార్థక్యపు ఛాయలు కనిపిస్తాయి. ఇలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..
ఎండ నుంచి చర్మాన్ని కాపాడటంలో సన్‌స్క్రీన్‌ పాత్ర కీలకం. అయితే పొద్దున్నే ఓసారి రాసుకోగానే సరిపోదు. ఎండలో ఉన్నా లేకపోయినా ప్రతి రెండు మూడు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. అప్పుడే ఎండ నుంచి రక్షణ పొందగలుగుతాం.
ముఖంపై అక్కడక్కడా పడే సస్నని ముడతలు, చర్మం సాగినట్టుఉండటం లాంటి సమస్యలు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు విటమిన్‌ 'ఎ' గుణాలున్న నైట్‌క్రీమ్‌లను ఎంచు కోవాలి. ఈ క్రీమ్‌లు చర్మంలో కొలాజిన్‌ ఉత్పత్తిని పెంచుతారు. ముడతలను నివారిస్తాయి. కొన్నిసార్లు ఇలాంటి నైట్‌క్రీమ్‌లు కొందరికి పడకపోవచ్చు. అలాంటప్పుడు ముందుగా మాయిశ్చరైజర్‌ ముఖానికి రాసుకొని, అరగంట తర్వాత క్రీమ్‌ను రాసుకోవాలి.
ఒత్తిడి హార్మోను కార్టిజాల్‌ విడుదల కావడం వల్ల చర్మంలో మలి ఛాయలు త్వరగా మొదలవుతాయి. దానివల్ల మొటిమలు వస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర. అంతేకాదు, ఒమోగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

10:34 - April 25, 2016

హైదరాబాద్ : పాలేరు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ.. ప్రధాన ప్రతిపక్షంతో మైండ్ గేమ్ ఆడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను ఖమ్మం జిల్లాకు విస్తరించి.. ప్రతిపక్షాన్ని ఎన్నికలకు ముందే మానసికంగా దెబ్బతీస్తోంది. విపక్షాలు ఏకమైనా.. విజయం మాదే అన్న ధీమాను అధికార పార్టీ వ్యక్తం చేస్తోంది.
ప్రతిపక్షాలను టార్గెట్‌ చేస్తున్న అధికార పార్టీ 
తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలు పెట్టిన గులాబి పార్టీ ఉపఎన్నికల నేపథ్యంలో దీనికి మరింత పదను పెడుతోంది. ఎన్నికల్లో  విపక్ష పార్టీలు అడుగు వేసే లోపే అధికార పార్టీ ప్రతిపక్షాలను టార్గెట్‌గా చేస్తోంది. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల నేతలనే టార్గెట్‌గా ఎంచుకుంటోంది.
నాలుగైదు నెలలుగా పువ్వాడ అజయ్‌తో చర్చలు
శాసనసభకు జరిగిన ఉపఎన్నికల్లో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నేతలతో పాటు.. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలను పెద్ద ఎత్తున కారెక్కించుకుంది. ఇప్పుడు  పాలేరు ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన పోటీ అని భావించి.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. గత నాలుగైదు నెలలుగా పువ్వాడ అజయ్‌తో చర్చలు జరిపిన అధికార పార్టీ.. కీలక సమయంలో కారెక్కించుకుంటోంది. ముఖ్యమంత్రి సమక్షంలో అజయ్ ఈరోజు గులాబీ గూటికి చేరనున్నారు. 
ప్రతిపక్ష పార్టీపై ప్రభావం 
పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోఉన్న కాంగ్రెస్ శాసనసభ్యుల్లో ఒకరు టీఆర్ ఎస్ లో  చేరుతుండడంతో ఆ ప్రభావం ప్రతిపక్ష పార్టీపై ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలు ఏకమవుతున్న నేపథ్యంలో అజయ్ టీఆర్‌ఎస్‌లో చేరడం చర్చనీయంశమైంది. టీఆర్ ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలు ఏకమైనా.. తమ విజయాన్ని అడ్డుకోలేవని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  
పాలేరు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ ఎస్ 
ఖమ్మంలో పార్టీ బలహీనంగా ఉందన్న విమర్శలను తిప్పికొట్టేందుకు టీఆర్ ఎస్ పాలేరు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అంతేకాకుండా ప్లీనరీ నాటికి మరికొంత మంది ప్రతిపక్ష పార్టీల నేతలను కారెక్కించుకునేందుకు గులాబి పార్టీ పావులు కదుపుతోంది. 

 

10:28 - April 25, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఈరోజు సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్‌ లేదని.. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు అజయ్‌. 

 

నల్లచెరువు పూడికతీత పనులు ప్రారంభం..

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో గల నల్ల చెరువులో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మిషన్ కాకతీయలో భాగంగా నల్లచెరువు పూడికతీత పనులను ఎమ్మెల్యే కృష్ణారావు ప్రారంభించారు. పూడికతీత పనులకు రూ. 10 లక్షలు కేటాయించినట్లు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ తెలిపారు. 

అన్ని అంశాలపై చర్చకు సిద్ధం - వెంకయ్య..

ఢిల్లీ : కరవు సహా అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. నేటి నుండి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. విజయ్‌మాల్యాను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బ్యాంకుల నుంచి విజయ్‌మాల్యా తీసుకున్న రుణం తిరిగి చెల్లించేలా చూస్తామని పేర్కొన్నారు. 

హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ..

ఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరనుంది. అన్ని రాజకీయ పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్లమెంట్ రెండో విడుత సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభ సజావుగా జరిగే నిమిత్తం సభ్యులతో చర్చించేందుకు ఛైర్మన్ అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు.

ఛత్రినాకలో దారుణం..

హైదరాబాద్ : తల్లీకుమార్తె దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటన పాతబస్తీ పరిధిలో గల ఛత్రినాకలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. మృతుల శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. భర్తపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

నేటి నుండి ఖుష్బూ ఎన్నికల ప్రచారం..

చెన్నై : డీఎంకే - కాంగ్రెస్ కూటమికి మద్దతుగా సినీ నటి ఖుష్బూ సోమవారం నుండి ప్రచారం చేయనున్నారు. నగరంలోని రాయపురం నియోజకవర్గం నుండి ఆమె ప్రచారం ప్రారంభించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా ఉన్న ఖుష్బూ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపినా సీటు దక్కలేదు. 

నేడు డయల్ యువర్ ఆర్టీసీ..

హైదరాబాద్ : సోమవారం సాయంత్రం డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ జరగనుంది. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ప్రజలు ఆర్టీసీ బస్సులపై ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చు. డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు అందుబాటులో ఉండనున్నారు.
ఆర్టీసీ హైదరాబాద్ రీజనల్ మేనేజర్ : 99592 26116
ఆర్టీసీ హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ : 99592 26136
ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ : 99599 00808
ఆర్టీసీ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ : 99592 26142
సనత్ నగర్ డివిజనల్ మేనేజర్ : 99592 26148
ఆర్టీసీ చార్మినార్ డివిజనల్ మేనేజర్ : 99592 26129

టీ.కేబినెట్ లో పలు మార్పులు...?

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ లో మార్పులు జరుగనున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు వద్ద ఉన్న పరిశ్రమల శాఖను మంత్రి కేటీఆర్ కు అప్పగించనున్నారు. కేటీఆర్ వద్ద ఉన్న పంచాయతీరాజ్ శాఖను జూపల్లి కృష్ణారావుకు అప్పగించనున్నారు. తలసాని శ్రీనివాస్ వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖను సీఎం కేసీఆర్ తీసుకోనున్నారు. వాణిజ్యపన్నుల శాఖతోపాటు మిషన్ భగీరథను సీఎం తన వద్దే ఉంచుకోనున్నారు. తలసానికి మరేదైనా శాఖను కేటాయించే అవకాశం ఉంది. నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

09:25 - April 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ లో మార్పులు జరుగనున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు వద్ద ఉన్న పరిశ్రమల శాఖను మంత్రి కేటీఆర్ కు అప్పగించనున్నారు. కేటీఆర్ వద్ద ఉన్న పంచాయతీరాజ్ శాఖను జూపల్లి కృష్ణారావుకు అప్పగించనున్నారు. తలసాని శ్రీనివాస్ వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖను సీఎం కేసీఆర్ తీసుకోనున్నారు. వాణిజ్యపన్నుల శాఖతోపాటు మిషన్ భగీరథను సీఎం తన వద్దే ఉంచుకోనున్నారు. తలసానికి మరేదైనా శాఖను కేటాయించే అవకాశం ఉంది. నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

 

09:22 - April 25, 2016

రాజకీయ ఫిరాయింపుల మీద కంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాడితే బాగుంటుందని వక్తలు సూచించారు. ఇదే అంశంపై విశ్లేషకుడు తెలకపల్లి రవి, వైసీపీ నేత మెరుగు నాగార్జున, టీఆర్ ఎస్ నేత వి.కృష్ణమోహన్, టీడీపీ నాయకురాలు అనురాధ పాల్గొని, మాట్లాడారు. ఎపిలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి పోయిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేటి నుంచి స్టాగ్ టేబుల్ టెన్నిస్ శిక్షణా శిబిరం..

హైదరాబాద్‌ : స్టాగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 25 నుంచి మే 31 వరకు శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్టు ని ర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల బాలబాలికలు మల క్‌పేటలోని స్టాగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీని సంప్రదించగలరు. శిక్షణ తో పాటు ఆట తీరుపై సమీక్ష ఉంటుంది. శిక్షణ శిబిరంలో పాల్గొన్న వారు 9849652191 నెంబర్‌కు సంప్రదించగలరు.

09:00 - April 25, 2016

తూర్పుగోదావరి : ఆనందోత్సవాల నడుమ వివాహం జరిగింది. ఘనంగా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లి బృందం అప్పన్న కొండపై పూజలు చేసేందుకు బయలుదేరారు. పెళ్లి బృందాన్ని దురదృష్టం వెంటాడింది. పెళ్లి బృందం కారు అదుపు తప్పి పంటపొలాల్లోకి దూసుకెల్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారులో నవ దంపతులు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాస్రంలో పెళ్లి పూర్తి చేసుకున్న వధూవరులు, వారి బంధువులు పశ్చిమగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయస్వామి వ్రతం చేసేందు అర్ధరాత్రి ఇన్నోవా కారులో బయల్దేరారు. మార్గంమధ్యలో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పంటకాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. వధూవరులతోసహా తొమ్మిది మందికి త్రీవ గాయాలయ్యాయి. వీరిలో రాధాశ్రీను అనే వ్యక్తి త్రీవంగా గాయపడ్డాడు. అతన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మాధవి, కృష్ణ శ్రీ అనే ఇద్దరు చిన్నారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. నూతన దంపతులు రాజు, దేవితో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.  వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

 

రూ.250 కోట్ల రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం : సీఎం చంద్రబాబు

గుంటూరు : తొలి సంతకం రూ.250 కోట్ల రుణమాఫీ ఫైలుపై సంతకం చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో ఎపి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. తెల్లవారుజాము 4.01 గంటలకు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలో ఎపిని ఆదర్శ అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించనన్నారు. ఈ ఏడాది ఎపి రాష్ట్ర ఆదాయం 49.35 శాతం ఉందన్నారు. తక్కువ జనాభా ఉన్నా ఈ ఏడాది తెలంగాణ ఆదాయం 50.65 శాతం ఉందని తెలిపారు. ఎపి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం : సీఎం చంద్రబాబు

గుంటూరు : అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం తెలియజేశారు.  వెలగపూడిలో ఎపి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. తెల్లవారుజాము 4.01 గంటలకు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు భూములు ఇవ్వకపోతే... అమరావతి నిర్మాణం సాధ్యమయ్యేది కాదన్నారు. జూన్ 15 నాటికి తాత్కాలిక సచివాలయం పూర్తి కావాలని తెలిపారు. జూన్ లో మంచి రోజులు లేనందున ముందే ప్రారంభించామన్నారు. రాజధాని నిర్మాణాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. 

 

07:56 - April 25, 2016

గుంటూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా నదుల అనుసంధానం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏడాదిలోపు పట్టిసీమ పూర్తి చేశామని చెప్పారు. పోలవరం పూర్తి చేసుకోవాలన్నారు. వెలగపూడిలో ఎపి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. తెల్లవారుజాము 4.01 గంటలకు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పూర్ణకుంభంతో వేదపండితులు సీఎంకు స్వాగతం పలికారు. అంనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా రాజధాని నిర్మాణం నుంచి పారిపాలన చేస్తే ప్రజలకు నమ్మకం కుదురుతుందన్నారు. నీతివంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని చెప్పారు.
రూ.250 కోట్ల రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం  
తొలి సంతకం రూ.250 కోట్ల రుణమాఫీ ఫైలుపై సంతకం చేశానని తెలిపారు. దేశంలో ఎపిని ఆదర్శ అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించనన్నారు. ఈ ఏడాది ఎపి రాష్ట్ర ఆదాయం 49.35 శాతం ఉందన్నారు. తక్కువ జనాభా ఉన్నా ఈ ఏడాది తెలంగాణ ఆదాయం 50.65 శాతం ఉందని తెలిపారు. ఎపి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం 
రాజధాని నిర్మాణాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం తెలియజేశారు. రైతులు భూములు ఇవ్వకపోతే... అమరావతి నిర్మాణం సాధ్యమయ్యేది కాదన్నారు. జూన్ 15 నాటికి తాత్కాలిక సచివాలయం పూర్తి కావాలని తెలిపారు. జూన్ లో మంచి రోజులు లేనందున ముందే ప్రారంభించామన్నారు. 
ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం 
జులై, ఆగస్టు లోపల ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రూ.149 లకే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామని చెప్పారు. నా సక్సెకు టెక్నాలజే కారణమన్నారు. టెక్నాలజీ వల్ల దళారులు, దోపిడీ దారులను నిర్మూలించామని నిజమైన లబ్ధిదారులకు లాభం చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ తోపాటు గత ప్రభుత్వాలు రాయలసీమను రాళ్ల సీమగా తయారు చేశారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఉద్యావన పంటలకు సీమను హబ్ గా తయారు చేస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం వల్లే 11 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. 2029 నాటికి ఎపిని నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంచుతామని చెప్పారు. ప్రపంచం మొత్తం తమవద్దకే వచ్చేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 

 

ప.బెంగాల్ లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభం

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగుతుంది. 49 అసెంబ్లీ స్థానాలకు బరిలో 345 మంది అభ్యర్థులు ఉన్నారు. 

 

రెండో విడత రుణమాఫీ ఫైల్ పై చంద్రబాబు సంతకం

గుంటూరు : వెలగపూడిలో ఎపి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. తెల్లవారుజాము 4.01 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్ణకుంభంతో వేదపండితులు సీఎంకు స్వాగతం పలికారు. విశ్వక్సేన పూజ, వాస్తుపూజ, గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఎల్ ఆండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో సచివాలయం నిర్మాణం  చేపట్టనుంది. సచివాలయం ప్రాంగణంలో మొత్తం 6 భవనాలను నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం 4వ బ్లాక్ లో రెండు గదులు పూర్తి అయ్యాయి. మే చివరి నాటికి తాత్కాలిక సచివాలయ పూర్తి చేయనున్నారు. రెండో విడత రుణమాఫీ ఫైల్ పై  చంద్రబాబు సంతకం చేశారు. రుణమాఫీకి రూ.3200 కోట్లు విడుదల చేశారు.

07:21 - April 25, 2016

గుంటూరు : వెలగపూడిలో ఎపి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. తెల్లవారుజాము 4.01 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్ణకుంభంతో వేదపండితులు సీఎంకు స్వాగతం పలికారు. విశ్వక్సేన పూజ, వాస్తుపూజ, గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఎల్ ఆండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో సచివాలయం నిర్మాణం  చేపట్టనుంది. సచివాలయం ప్రాంగణంలో మొత్తం 6 భవనాలను నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం 4వ బ్లాక్ లో రెండు గదులు పూర్తి అయ్యాయి. మే చివరి నాటికి తాత్కాలిక సచివాలయ పూర్తి చేయనున్నారు. రెండో విడత రుణమాఫీ ఫైల్ పై  చంద్రబాబు సంతకం చేశారు. రుణమాఫీకి రూ.3200 కోట్లు విడుదల చేశారు. ఈ  కార్యక్రమానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 

 

కారు పంటపొలాల్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

తూర్పుగోదావరి : ఆలమూరు మండలం జొన్నాడలో ఇన్నోవా కారు అదుపు తప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు కారులో నూతన దంపతులున్నారు. రాజమండ్రి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

ఎపి తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు

గుంటూరు : వెలగపూడిలో ఎపి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. తెల్లవారుజాము 4.01 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్ణకుంభంతో వేదపండితులు సీఎంకు స్వాగతం పలికారు. 

Don't Miss