Activities calendar

26 April 2016

21:31 - April 26, 2016

విశాఖ : దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బయోమాక్స్ డీజిల్ కంపెనీలో మూడు డీజిల్ ట్యాంకులు పేలడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి మంటలను అదుపు చేస్తున్నారు. సంఘటన పై జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

21:25 - April 26, 2016

విజయవాడ: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ పదవికి వన్నె తెస్తానని కారెం శివాజీ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు టిడిపి నేతలు, ప్రజా సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఏ ఘటన జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కారెం శివాజీ అన్నారు. 

21:23 - April 26, 2016

అమరావతి : తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబు అధికారులు, విదేశీ ప్రతినిధులతో బిజీబిజీగా గడిపారు. ఛీఫ్ సెక్రటరీ ఎస్.పి టక్కర్, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తో పాటు పలువురు అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం జపాన్ , యుకే కు చెందిన ప్రతినిధుల బృందంతో తన ఛాంబర్ లో సమావేశమైన చంద్రబాబు జైకా ప్రతినిధులతో ఏపీలో మెట్రో ప్రాజెక్టు రుణాలపై చర్చించారు.  

21:21 - April 26, 2016

ఖమ్మం :పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌, ఎస్పీ షానవాజ్‌ ఖాసిం, సహా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నిక తీరుపై ఎన్నికల సంఘానికి మంగళవారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన సీఈసీ... జిల్లాలోని ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బదిలీపీ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసింను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశామన్నారు. 24గంటల్లో కొత్త ఎస్పీని నియమించి పాలేరు ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని ప్రకటించారు. 

ఈసీని కలిసిన టిపీసీసీ...

ఈసీ అదేశాలకు ముందు.. మంగళవారం మధ్యాహ్నం టీపీసీసీ టీమ్ ఢిల్లీలో సీఈసీని కలిసింది. పాలేరు ఉప ఎన్నికలో ఈవీఎంలకు ప్రింట్ ఆప్షన్ లేదా బ్యాలెట్ పేపర్ వాడాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతోందని... అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని... టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఫిర్యాదుచేశారు. 

దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ : దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బయోమాక్స్ డీజిల్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మూడు డీజిల్ ట్యాంకులు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

తిరుమలలో తగలబడుతున్న అడవి

తిరుమల : మొదటి ఘాట్ రోడ్డు 33వ మలుపు సమీపంలో కొండపై అడవి తగలబడుతున్నది. అప్రమత్తమైన టిటిడి అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఖమ్మం కొత్త ఎస్పీగా ప్రకాష్ రెడ్డి!

ఖమ్మం: జిల్లా ఎస్పీ షాహనావాజ్ ఖాసీంను హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేసినట్లు డీజీపీ అనురాగ్ శర్మతెలిపారు. 24 గంటల్లో కొత్త ఎస్పీని నియమించి పాలేరు ఎన్నికలో ప్రశాంత వాతావరణం నెలకల్పుతామని తెలిపారు. ఖమ్మం ఎస్పీ షాహనావాజ్ ఖాసీం స్థానంలో కొత్త ఎస్పీగా ప్రకాష్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం...

కరీంగనర్ : ముస్తాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వరి, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అంతే కాకుండా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలంయలో చలువ పందిళ్లు నేలకొరిగాయి.

సూపర్ కిడ్ శ్రీజ నివాసానికి సీఎంకేసీఆర్

ఖమ్మం: రేపు జరిగే ప్లీనరీలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఖమ్మంకు చేరుకున్నారు. ఖమ్మం చేరుకున్న సీఎం తెలంగాణ సూపర్ కిడ్ శ్రీజ నివాసానికి వెళ్లారు. ఖమ్మం వస్తే శ్రీజ ఇంటికి వస్తానన్న మాట ప్రకారం సీఎం ఆమె ఇంటికి వెళ్లారు. సీఎం తన వ్యక్తిగత ఖాతా నుంచి ఇప్పటికే శ్రీజకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. 

ఉప్పల్ లో వర్షం... నిలిచిన మ్యాచ్

హైదరాబాద్‌: ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రైజింగ్‌ పుణె సూపర్‌ జైంట్‌ మధ్య మ్యాచ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. టాస్‌ గెలిచిన రైజింగ్‌ పుణె కెప్టెన్‌ ధోనీ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు హైదరాబాద్‌ ఓపెనర్లు ధావన్‌, వార్నర్‌ మైదానంలోకి ప్రవేశిస్తుండగానే వర్షం ఆరంభమైంది. దీంతో స్టేడియం సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.

గొట్టిపాటి రాకను వ్యతిరేకిస్తున్న బలరాం వర్గం

ప్రకాశం: టిడిపిలోకి అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే చేరికను కరణం బలరాం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు అనుచరులతో సీఎం చంద్రబాబు కలిశారు. గొట్టిపాటి పార్టీలోకి వస్తే ప్రకాశం జిల్లాలో టిడిపి నష్టపోతుందని బాబుకు తెలిపినట్లు సమాచారం. మరో వైపు గొట్టిపాటకి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి టిడిపిలోకి గొట్టి పాటి చేరన్నుట్లు తెలుస్తోంది.

20:14 - April 26, 2016

హైదరాబాద్ : కన్నంలో దెయ్యాల గోల... గజగజ వణుకుతున్న కొత్త జాల.. నిప్పు పెట్టకుండనే దుకనంలో మంటలు... ఛేదించే పనిలో పడ్డ స్పెషల్ పోలీసులు, మహంకాళి అవతారం ఎత్తిన మాయావతి...అపోజిషన్లకు పడతదంట పోస్టర్ల గతి, ఆ.. వైయ్యస్సార్ పార్టీ ఇంకో ప్యాన్ రెక్క గుడ పుటుక్కున ఇర్గెతట్టున్నది.. ఇర్గుతట్టేంది ఇంచు మించు ఇర్గినట్టే ఈడ్కె.. నట్టుకాడ వొదలయ్యిందట.. కళ్యాణ లక్ష్మీ పథకం గురించి ఎర్కే గదా.. పేదింటిల ఎదిగిన బిడ్డె.. పెండ్లి జెయ్యలేక తల్లిదండ్రులకు ఎంత బాధుంటదో.. తల్లిదండ్రుల కంటే మన కేసీఆర్ సార్కే ఎక్వ ఎర్కుంటది. ముఠామేస్త్రీ శీన్మ జూశిండ్రా అండ్ల గుండెగాడొచ్చి... సారు మేం దీని మీదనే బత్కుతున్నం ఇదే మాకు బత్కుదెర్వు ఇది లేకుంటె బత్కలేమంటున్నరు..ఇలాంటి మరిన్ని ముచ్చట్లతో మల్లన్న మీ ముందుకు వచ్చేశారు. నీ కల్తీకి అగ్గివెట్ట.. తినే తిండి కల్తీ.. కట్టుకునే బట్టకల్తీ.. పెట్టుకునే నగ కల్తీ.. తాగే మందు కల్తీ.. ఆ మందు అంటె యాది కొచ్చిందుల్లా.. మందును గుడ కల్తీ జేస్తున్నరట 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమాన్ని పూర్తిగా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

పిడుగు పాటుకు 32 గొర్రెలు,కాపరి మృతి

కరీంనగర్ : మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి  గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోడ సుత్యనాయక్ (50) పిడుగుపాటుతో మృతిచెందాడు. అతనికి చెందిన 32 గ్రొరెలు కూడా అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 

 

ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం ప్రమాణ స్వీకారం..

విజయవాడ: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కారెం శివాజీ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా తన నియామకం చెల్లదంటూ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై స్పందించిన కారెం తనపై క్రిమినల్ కేసులున్నట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే నియామకం జరుగుతుందన్నారు. జూపూడి, మందకృష్ణ ఇద్దరూ సోదర సమానులేనన్నారు.

సీఈసీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపెట్టు: ఉత్తమ్

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల బదిలీపై సీఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఈసీ నిర్ణయం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదం..

ముంబై : మహారాష్ట్ర సచివాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్థులో ఉన్న రెవెన్యూ విభాగం కారిడార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపకసిబ్బందికి సమాచారమందించారు. రెండు అగ్నిమాపకయంత్రాలతో ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. షాట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు.

263 ఫార్మా కంపెనీలకు నోటీసులు

ఢిల్లీ : మందుల ధరలను పెంచి (2015-16 లో) అమ్మిన 263 ఫార్మాస్యుటికల్‌ సంస్థలకు నేషనల్‌ ఫార్మాస్యుటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ నోటీసులు(ఎన్‌పీపీఏ)జారీ చేసింది. బల్క్‌ డ్రగ్స్‌, ఫార్ములాలు, మందులు ఇతర అంశాలు తప్పకుండా ఎన్‌పీపీఏ నిబంధనలకు లోబడి ఉండాలని మంత్రి అనంత్‌కుమార్‌ సూచించారు. ఈ నిబంధనల్ని పాటించకపోవడం వల్ల 263 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన లోక్ సభలో వెల్లడించారు.

19:35 - April 26, 2016

హైదరాబాద్ : కొత్తగా పరిశ్రమల శాఖ బాధ్యతలను స్వీకరించిన మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పరిశ్రమల శాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలోనే అత్యుత్తమ పద్ధతులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 28న హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌ శాఖలపైనా పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రవాస భారతీయులను NRI శాఖ ద్వారా ఆదుకోవడమే తమ లక్ష్యమని మంత్రి చెప్పారు.

19:33 - April 26, 2016

హైదరాబాద్ : పాలేరు నియోజక వర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో జరిగే పాలేరు ఉప ఎన్నిక పై సీఈసీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మకు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు మరో చోట నియమించాలని, వారి స్థానంలో మరో ముగ్గురు పేర్లను పరిశీలనకు పంపాలని సీఈసీ ఆదేశించింది.

ఏసీబీ వలలో ఏసీటీవో

హైదరాబాద్: సరూర్‌నగర్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) వేణుగోపాల్‌రావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఒక వ్యక్తి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. కాగా, వేణుగోపాల్‌రావు రాష్ట్ర కమర్షియల్ టాక్స్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో రెండు మార్కెట్ కమిటీల ప్రకటన...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మరో రెండు మార్కెట్ కమిటీలను ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా కమర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నర్సయ్య, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా లలితను నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 

కాళేశ్వరరావు మార్కెట్లో అగ్నిప్రమాదం

విజయవాడ: నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్‌లోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్‌ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి మద్యం సీసాలకు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీను బదిలీ చేసిన సీఈసీ

హైదరాబాద్ : పాలేరు నియోజక వర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీ, పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మకు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు మరో చోట నియమించాలని, వారి స్థానంలో మరో ముగ్గురు పేర్లను పరిశీలనకు పంపాలని సీఈసీ ఆదేశించింది.

 

సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు...

హైదరాబాద్ : చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ పోలీసులు మావోయిస్టుల మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ ను చికిత్స నిమిత్తం హెలికాప్టర్ లో రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు.

మసీదులోకి మహిళలకు ప్రవేశం....

హైదరాబాద్ : మహిళలకు దేవాలయాలలో ప్రవేశం కల్పించాలంటూ న్యాయస్థానాలు ఆదేశించటంతో పలు దేవాలయాలకు సంబంధించిన ట్రస్ట్ లు ఆ దిశగా తమ నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. తద్వారా మహిళా నిషేదిత దేవాలయలోకి మహిళలకు ప్రవేశం కల్పించారు. ఇది హిందూ సంప్రదాయాలకు సంబంధించి ఇప్పటివరకూ జరిగింది. కానీ అత్యంత కఠినమైన సంప్రదాయలను పాటించే ఇస్లాం మతంలో కూడా ఈ సడలింపును ఇచ్చి మేము కూడా మహిళలను గౌరవిస్తామని ముందుకొచ్చింది. చరిత్రలో తొలిసారి ఓ మసీదులోకి ప్రవేశానికి మహిళలకు అనుమతి లభించింది. కేరళలోని థాళతంగడిలోగల వెయ్యేండ్ల చరిత్ర ఉన్న ప్రఖ్యాత తాజ్ జుమా మసీదు సందర్శనకు మహిళలకు మసీదు కమిటీ అనుమతి ఇచ్చింది.

17:51 - April 26, 2016

హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నికలో ఈవీఎంలకు ప్రింట్ ఆప్షన్ లేదా బ్యాలెట్ పేపర్ వాడాలని టీపీసీసీ కేంద్ర ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఇవాళ ఢిల్లీలో సీఈసీ నసీం జైదీని కలిసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుందని ఫిర్యాదు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు ఉత్తమ్ వివరించారు. 

17:44 - April 26, 2016

హైదరాబాద్ :అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఆర్‌డిఎ అధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. సీఆర్‌డిఎ పరిధిలోని 85 ఎకరాల విక్రయానికి అనుమతించాలని అధికారులు హైకోర్టును కోరారు. కాగా మిగతా 7 ఆస్తుల పరిస్థితి ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఇక ఈ-వేలం ద్వారా జరిపిన విక్రయాల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కమిటీని ఆదేశించింది. అయితే మొదటి విడత ఈ వేలంలో 7.5 కోట్ల రూపాయలు వచ్చాయన్న కమిటీ తెలిపింది. ఇదిలా ఉండగా నాలుగో విడత అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హాయ్‌లాండ్‌తోపాటు 1500 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వివరాలను సిఐడి కమిటీకి అప్పగించింది. ఇక ఆస్తుల విక్రయాల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఉన్నతాధికారులను తన ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  

అకాల వర్షాలతో రైతుల అగచాట్లు...

కరీంనగర్  : ముస్తాబాద్ మండలంలో భారీ వర్షంతో వరి, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో ఆరుగాలం కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంట చేతికి వచ్చికూడా నాశనమయిపోవటంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. అసలే కరవు పైగా ఈ అకాల వర్షాలతో రైతులకు దిక్కుతోచకుండా అయిపోయింది. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

17:42 - April 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం సీబ్లాక్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వికలాంగుల కోటాలో అధికారులు పెన్షన్ ఇవ్వడం లేదన్న మనస్థాపంతో... సూరారం కాలనీకి చెందిన రాజు.. సచివాలయం మందు.. బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. 

17:39 - April 26, 2016

ఢిల్లీ : సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటూ ప్రజల స్వరాన్ని తొక్కుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి, విపక్ష నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..ఇంత బ్లాక్ మని ఎక్కడ నుండి వచ్చింది చంద్రబాబు అని అడిగే పరిస్థితి కూడా లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ లోఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయి... ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేయడం సిగ్గు చేటు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ పై అధికారపక్షం1.86 శాతంతో గెలిచారని, 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారింతన మాత్రాన వచ్చే ఇబ్బంది లేదని.. కానీ చంద్రబాబు ప్రజల స్వరాన్ని తొక్కుతున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

పిడుగుపాటు కు మహిళ మృతి....

రంగారెడ్డి : శంషాబాద్ మండలం కవ్వగూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈరోజు మధ్యహ్నాం కురిసిన వర్షాలు కొందరి జీవితంలో విషాదాన్ని నింపింది. చెదురుమదురుగా కురిసిన వర్షంతోపాటు పిడుగు పడి.. ఓ మహిళ మృతిచెందింది. దీంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

జేకేఎల్‌ఎఫ్‌ ఫౌండర్ అమానుల్లా ఖాన్‌ మృతి...

హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) వ్యవస్థాపకుడు అమానుల్లా ఖాన్‌ పాకిస్థాన్ లో కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఖాన్‌ ఇవాళ పాకిస్థాన్‌లోని రావల్పిండిలో మృతిచెందినట్టు ఆయన అల్లుడు సజ్జత్‌ లోనె తెలిపారు. ఖాన్‌ 1934 ఆగస్టు 24న గిల్గిత్‌లో జన్మించారు. 1977లో లిబరేషన్‌ ఫ్రంట్‌ను స్థాపించి... పాక్‌, భారత్‌ల నుంచి కశ్మీర్‌ విముక్తి కోసం ఆయన తీవ్రంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే.

మాల్యాపై మండిపడిన సుప్రీంకోర్టు....

ఢిల్లీ : తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు విజయ్ మాల్యా తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ మాల్యాకు చెందిన విదేశీ ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులనూ కూడా వెల్లడించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించవద్దని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులనుండి రుణాలుగా తీసుకున్న వేలాది కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

అగ్రిగోల్ట్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు...

హైదరాబాద్ : అగ్రిగోల్ట్ , అక్షయగోల్డ్ కేసులపై హైకోర్టులో విచారణ కొనసాగింది.  న్యాయస్థానం ఎదుట సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. సీఆర్డీఏ పరిధిలోని 85 ఎకరాల విక్రయానికి అనుమతినిచ్చామని కోర్టుకు అధికారులు తెలిపారు. ఈ-వేలం ద్వారా జరిపిన విక్రయాల జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో వుంచాలని కమిటీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడత ఈ-వేలం ద్వారా రూ.7.5 కోట్లు వచ్చాయని కమిటీ న్యాయస్థానానికి తెలిపింది. 4వ విడత అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హాయ్ లాండ్ తో పాటు రూ.1500కోట్ల ఆస్తుల వివరాలను సీఐడీ కమిటీకి అప్పగించింది.

గులాబీ ప్లీనరీ లో పసందైన విందు…

ఖమ్మం : బుధవారం ప్రారంభం కానున్న ప్లీనరీ సమావేశాలను టీఆర్ఎస్ బృందం ప్రతిష్టాత్మకంగా తలపెట్టింది. ఖమ్మంలోని చెరుకూరి గార్డెన్స్ లో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్లీనరీకి వచ్చే అతిథుల కోసం తయారుచేసే వంటకాలలో తెలంగాణ సంప్రదాయ వంటలతోపాటు ఆంధ్రా వంటకాలను కూడా వడ్డించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్లుగానే వంటకాలను కూడా సిద్దం చేస్తున్నారు.

ఖమ్మం బయలుదేరిన కేసీఆర్...

హైదరాబాద్ : ఖమ్మంలో రేపటి నుండి టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్లీనరీకి హాజరయ్యేందుకు ఈరోజు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ ఖమ్మం బయలుదేరారు. 

16:51 - April 26, 2016

విశాఖ : నైతికత అనే అంశాన్ని పక్కనబెట్టి సిఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకుంటున్నారని విశాఖపట్నంలో ఆరోపించారు. టిడిపి మిత్రపక్షం బిజెపి కూడా ఇదే మాదిరి వ్యవహరిస్తోందని విమర్శించారు. 

16:49 - April 26, 2016

కృష్ణా : ఓ వైపు.. అపారమైన జలధి.. మరోవైపు బిరబిరా పరుగులు పెట్టే కృష్ణమ్మ. వెరసి గలగల పారే జలసిరుల కేంద్రంగా కృష్ణా జిల్లాకు పేరు. కానీ ఇప్పుడా ప్రాంతమూ కరవు రక్కసి కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. భూగర్భ జలాలు.. ఏటేటా పాతాళానికి పడిపోతున్నాయి. పచ్చని పైర్లతో పరవశించిన కృష్ణాజిల్లా ఇప్పుడు భూతాపానికి గురై.. ఉక్కిరిబిక్కిరవుతోంది. కనీసం తాగునీటికి కూడా నోచుకోక దాహం.. దాహం అంటూ అలమటిస్తోంది.

ఓవైపు సముద్రం, మరోవైపు నదీ ప్రవాహం.. అయినా తీరని దాహం..

ఇదీ... భూమికీ పచ్చని రంగేసినట్టుండే.. కృష్ణా జిల్లాలో కరవు తాండవం. ఎప్పుడూ కృష్ణమ్మ గలగలలతో, నిండు పచ్చదనాన్ని నింపుకుని ఉండే కృష్ణా జిల్లా ఈసారి తాగునీటి సమస్యతో తల్లడిల్లుతోంది. పక్కనే సముద్ర తీరం ఉండటంతో ఉప్పునీటి శాతం పెరిగిపోయి.. మంచినీరు దొరక్క ప్రజలు విలవిల్లాడాటం.. కరవు సమస్యకు అద్దం పడుతోంది. ఎప్పడూ లేనంతగా మూడు మీటర్లకు పైగా భూగర్భ జలాలు అడుగంటి కరవు విజృంభిస్తోంది. అత్యల్ప వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు.. ఈసారి భూమిలోకి ఇంకే నీటిశాతాన్ని కూడా గణనీయంగా తగ్గిపోయేలా చేశాయి.

కృష్ణా నది ఒడ్డునే ఉన్నప్పటికీ..

కృష్ణా నది ఒడ్డునే ఉన్నప్పటికీ.. కరవు తాకిడి నుంచి కృష్ణా తప్పించుకోలేక పోయింది. ప్రకాశం బ్యారేజీ లోతట్టు ప్రాంతం కూడా ఈ సారి కరవు తాకిడికి వట్టిపోయి ఎడారిని తలపిస్తోంది. గుక్కెడు నీటికోసం జిల్లా ప్రజలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో గ్రామంలో ఒక్కో ఇంటికో బిందె కూడా అందని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో అయితే చెలమలను తవ్వి తాగునీటిని తెచ్చుకొంటున్నారు. మురికిగా ఉన్న చెలమల నీటినే తాగి అనారోగ్యం పాలవుతున్నవాళ్లు ఎందరో. కొన్ని గ్రామాల్లో స్నానానికి కూడా నీరు దొరక్క చర్మసంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని కరవు పీడిత ప్రజలు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. చెలిమల నుంచి తెచ్చిన నీటితో.. కనీస అవసరాలు కూడా తీరడం లేదని బాధితులు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా...

పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ప్రతి కుటుంబమూ తాగునీటి కోసం ప్రైవేటు సంస్థలు సరఫరా చేసే వాటర్‌ క్యాన్‌లపైనే ఆధారపడుతున్నారు. ఒక్కో వాటర్‌ క్యాన్‌ను అనివార్య పరిస్థితుల్లో 50 రూపాయలు వెచ్చించి కొంటున్నారు. ఒక్క క్యాన్‌ నీళ్లతోనే ఇంటిళ్లిపాది సర్దుకోవాల్సిన పరిస్థితి. నదీ లోయ ప్రాంతాల్లోని గ్రామాల్లో కూడా నీటి చుక్క దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి తాగునీటి కరవు పట్టి పీడిస్తోందని జనం వాపోతున్నారు. ఎడారిని తలపించే ప్రాంతాల్లో చెలిమలను ఏర్పాటు చేసుకుని మంచినీళ్ల కోసం రోజంతా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని కొన్ని గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

పడిపోయిన భూగర్భ జలాల నీటి మట్టం...

కృష్ణా జిల్లాలో ఊహించని విధంగా భూగర్భ జలాల నీటిమట్టం పడిపోతోంది. సముద్రతీరంలో ఉండే భూముల్లోనూ ఉప్పునీటిశాతం పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే మూడు మీటర్లకు పైగా భూగర్భ జలం అడుగంటింది. ఓవైపు లోటు వర్షపాతం, మరోవైపు భూమిలోకి ఇంకే నీటిశాతం తగ్గిపోవడం లాంటి కారణాలతో జిల్లా వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పరిమితికి మించి భూగర్భజలాలు వాడటం కూడా నీటిమట్టం తీవ్రంగా పడిపోవడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాగునీటికి విపరీతమైన సమస్య...

అసలే ఎండకాలం. ఆపై విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. దీంతో జిల్లాలో తాగునీటికి విపరీతమైన సమస్య వచ్చింది. ఏడాదిలో తొమ్మిది నెలలపాటు కాలువల్లో సాగునీరు ప్రవహించే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నేడు తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడింది. సముద్రతీరంలో జలాలు ఉప్పగా ఉండటంతో ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి నీటిని పంపింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతేడాది వర్షాభావ పరిస్థితులతో నదీ జలాల కొరత...

గతేడాది వర్షాభావ పరిస్థితులతో నదీ జలాల కొరత ఏర్పడింది. దీంతో సాగునీటి కాలువలకు నీటి విడుదల లేకపోవడం, చెరువుల్లోని నీరు కూడా అడుగంటడంతో భూగర్భజలాలపై ఆధారపడాల్సి వచ్చింది. నదీ జలాల లభ్యత తగ్గిపోవడంతో తాగునీరు, సాగునీటికి భూగర్భ జలాలే దిక్కయ్యాయి. ఇలా రోజురోజుకు వినియోగం పెరగడంతో నీటి కొరత ఏర్పడి, భూగర్భజలాలు అనూహ్యంగా పడిపోయాయి. జిల్లాలో ఫిజియో మీటర్ల ద్వారా ప్రతిగంటకోసారి భూగర్భ జలాల తీరును లెక్కిస్తున్నారు. దీంతో ఎక్కడెక్కడ ఎంత నీరు వినియోగిస్తున్నారన్న దానిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించే వీలుంది. మరోవైపు భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి విపరీతంగా..

అటు కృష్ణానదిలోనూ నీటిమట్టం బాగా పడిపోతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి, నీటిమట్టం మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లాలో ఎక్కువ శాతం ప్రజలు నివసించే కొండప్రాంతాలు, నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉంది. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలు అవసరానికి సరిపడా నీరందక కష్టాలు పడుతున్నారు. నీటి ట్యాంకర్ల కోసం పరుగులు పెట్టే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటి ఎద్దడిని తట్టుకునేందుకు బూస్టర్‌ సెట్లను ఏర్పాటు...

నీటి ఎద్దడిని తట్టుకునేందుకు బూస్టర్‌ సెట్లను ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కరవు బాధితులు కోరుతున్నారు. 

దీక్షకు పిలుపునిచ్చిన కన్హయ్య....

ఢిల్లీ : జేఎన్ యూ లో మళ్ళీ అలజడి నెలకొంది. కమిటీ వైఖరికి నిసనగా విద్యార్ధి నేత కన్హయ్య కుమార్ దీక్షకు పిలుపునిచ్చారు. కాగా జేఎన్ యూ పరిపాలనా విభాగం క్రమశిక్షణా చర్యలు తీసుకుని కన్హయ్య కుమార్ కు రూ.10వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. మరొక విద్యార్ధికి సెమిస్టర్ కాలంపాటు బహిష్కరించిన విషయం తెలిసిందే.

16:45 - April 26, 2016

హైదరాబాద్ : ఏపీ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా...కారెం శివాజీ నియామకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శివాజీపై క్రిమినల్ కేసులు ఉన్నాయని... సభ్యులను నియమించకుండానే ఛైర్మన్‌ను నియమించడం చట్ట విరుద్ధమంటూ అడ్వకేట్ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు... ఏపీ ప్రభుత్వానికి, కారెం శివాజీకి నోటీసులు జారీచేసింది. శివాజీకి సంబంధించిన పూర్తి నివేదికను జూన్ 7 లోగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

16:44 - April 26, 2016

కర్నూలు : శ్రీశైలలంలో భ్రమరాంబ వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది . అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలు, రకరకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రాతః కాల పూజల అనంతరం ఆలయ అర్చకులు , వేదపండితులు అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజ, జపపారాయణలతో ఏకాంతంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కుంభోత్సవంలో జంతుబలులు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 

16:42 - April 26, 2016

ఢిల్లీ : భారత-పాకిస్తాన్‌ విదేశాంగ కార్యదర్శులు జైశంకర్‌, ఎజాజ్ అహ్మద్‌ చౌదరి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు అంశాలపై చర్చించాయి. పఠాన్‌కోట్‌ దాడుల ప్రధాన సూత్రధారి జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజహర్‌పై తక్షణమే చర్యలు చేపట్టాలని భారత్‌ పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది. కాగా పాకిస్తాన్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు, కశ్మీర్‌ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి పాకిస్తాన్‌ ప్రకటన చేయడం గమనార్హం. పాక్‌ విదేశాంగ కార్యదర్శి ఎజాజ్ అహ్మద్‌ చౌదరి- ఢిల్లీలో జరుగుతున్న హార్ట్‌ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనెందుకు భారత్‌కు వచ్చారు. పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల కార్యదర్శులు సమావేశం కావడం ఇదే తొలిసారి. 

టీ.ఎస్ సచివాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం సీ-బ్లాక్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సూరారం కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తి బ్లేడ్ తో నాలుక కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పింఛన్ కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు రాజు తెలిపాడు. వెంటనే రాజును సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం...

హైదరాబాద్ : ఈరోజు భాగ్యనగరంలో పలు ప్రాంతాలలో చిరుజల్లులతో వరణుడు పలకరించాడు. భానుడి ప్రతాపానికి చిరుజల్లులు క్షణంలో ఆవిరైపోయాయి. కాగా తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. టీ.ఎస్ లో నిజామాబాద్చ రామగుండంలలో 45, ఆదిలాబాద్,  ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండలలో 44, హైదరాబాద్, హన్మకొండ, మెదక్ లలో 43, ఏపీలోని అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 45,కడప, తిరుపతిలలో 42 , విజయవాడ, కావలి, నందిగామలలో 41 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా వడగాలు తీవ్రత అధికంగా వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

ఉగ్రవాది జైనుల్ అబేదీన్ అరెస్ట్ ....

హైదరాబాద్ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది జైనుల్ అబేదీన్ ను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో జైనుల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అహ్మదాబాద్, ఝావేరీబజార్ , జయ్ పూర్ , బెంగుళూరు పేలుళ్ళలో జైనుల్ అబేదీన్ నిందితుడిగా వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా దిల్ సుక్ నగర్ పేలుళ్ళలో కూడా అబిదీన్ నిందితుడిగా వున్నాడు.

16:03 - April 26, 2016

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై చర్చకు అనుమతించాలని పట్టుబట్టింది. మార్చి 28న అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌కి గవర్నర్‌ సమయమిచ్చారని, అయితే కేంద్రం 24 గంటలు కూడా ఓపిక పట్టకుండా మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించారని ఆజాద్‌ దుయ్యబట్టారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినందువల్లే కేంద్రం నిర్ణయం తీసుకుందని అరుణ్‌ జైట్లీ వివరణ ఇచ్చారు. 35 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్లు రాతపూర్వకంగా తెలియజేశారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ నినాదాలు చేశారు. దీంతో డిప్యూటి ఛైర్మన్‌ కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు.

సీటీవో కార్యాలయంపై ఏసీబీ దాడి....

కృష్ణా : భవానీపురం సీటీవో కార్యాలయంపై ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలలో లెక్కలోకి రాని రూ.లక్ష నగదును, పలు కీలక పత్రాలను సాధీనం చేసుకున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.

కారెం శివాజీ చైర్మన్ పదవిపై హైకోర్టు స్టే...

హైదరాబాద్ : ఏపీ ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా కారెం శివాజీని నియమించటంపై హైకోర్టు స్టే విధించింది. కారెం శివాజీపై క్రిమినల్ కేసుల ఉన్నాయని పిటీషన్ దాఖలు కావటంతో స్టే విధించినట్లు సమాచారం.

15:55 - April 26, 2016

కృష్ణా : విజయవాడలోని యనమలకుదురులో విషాదం నెలకొంది. కాలం చెల్లిన నూడుల్స్ తిని ఆపై కూల్‌ డ్రింక్‌ తాగి ముగ్గురు అక్కచెల్లెళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. వారిలో పెద్ద అమ్మాయి మానస పరిస్థితి విషమించి కన్నుమూసింది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు నూడుల్స్ వండుకుని తింటున్న సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరు. 

15:53 - April 26, 2016

హైదరాబాద్ : ఎండలతో అల్లాడిపోతున్న హైదరాబాద్‌ నగరవాసులను చిరుజల్లులు పలకరించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ముఖ్యంగా ఎల్బీనగర్, చంపాపేట్‌, సైదాబాద్‌ సహా దిల్‌సుఖ్‌నగర్‌, పాతబస్తీ, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. గత కొద్ది రోజులుగా మండే ఎండలతో విలవిలలాడిపోయిన ప్రజలు వాతావరణం చల్లబడటంతో కాస్త వూపిరి పీల్చుకున్నారు.

15:52 - April 26, 2016

హైదరాబాద్ : ఆటో నడుపుతుండగా, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఓ డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించాడు. రాణిగంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతనిని రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే మృతి చెందాడు. ఉప్పుగూడకు చెందిన సురేష్‌గా గుర్తించిన పోలీసులు అతను వడదెబ్బతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. 

బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య...

హైదరాబాద్ : నాగార్జున సాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్యను తెలంగాణా ప్రభుత్వం నియమించింది.త్వరలో లక్ష్మయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

15:51 - April 26, 2016

హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పట్టేందుకు అటవీశాఖ తొలిసారిగా వినూత్న ప్రయత్నం మొదలు పెట్టింది. నేరగాళ్ల చరిత్రను కనుగొనేందుకు మాత్రమే వినియోగిస్తున్న ఫింగర్‌ ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇకనుంచి ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ అమలు చేయనుంది. ఇటీవలే ఎర్రస్మగ్లర్లపై ఇదే తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి సఫలమయ్యారు పోలీసులు. ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా దొంగల గుట్టు విప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. 

15:49 - April 26, 2016

విజయవాడ : దళిత నేత కారెం శివాజీకి ఏపీ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించింది. బుధవారం సాయంత్రం ఆయన ఆ పదవిని స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా శివాజీ 'టెన్ టివి'తో మాట్లాడుతూ...అంబేద్కర్ తమకు కల్పించిన హక్కలు సరిగా అమలు జరగడం లేదని.. దళితులు, గిరిజనులపై అన్యాయాలు.. అకృత్యాలు జరుగుతున్నాయని.. వీటిని రూపుమాపుతానని కారెం శివాజీ స్పష్టం చేశారు. కులవ్యవస్థను కూకటి వేళతో పెకిళించడానికి నావంతు ప్రయత్నం చేస్తానన్నారు ఉద్యమకారుడు ఎపుడూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. మాల మహానాడు ఎపుడూ దళితుల ఐక్యత కోరుకుంటుంది తప్ప విభజన కోరుకోలేదని స్పష్టం చేశారు.మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

15:46 - April 26, 2016

ఖమ్మం : విలువలకు తిలోదకాలు వదిలే నేతలు, వారికి సంబంధించిన పార్టీలకు తాము మద్దతు ఇవ్వలేమని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలన్న కాంగ్రెస్‌ పార్టీ వైఖరిపై తమ్మినేని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన తర్వాత సుచరిత రేపు అదే పార్టీలో ఉంటారా అని ప్రశ్నించారు. 

16 మంది బాలకార్మికులకు విముక్తి....

హైదరాబాద్ : రెయిన్ బజార్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో 16 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. స్థానికులు అందించిన సమాచారంతో దాడులు నిర్వహించామని, 14సంవత్సరాలలోపు పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.

పార్లమెంట్ లో టీ.ఎస్ కరవు బాధలు..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరవుపై లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చింది. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ సభలో కరవుపై మాట్లాడుతూ కేంద్రాన్ని విమర్శించారు. తెలంగాణలో గత మూడేళ్ల నుంచి కరువు పరిస్థితి నెలకొందని తెలిపారు. నీటి కష్టాలతో కటకటలాడుతున్న నూతన రాష్ర్టాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. వెంటనే కరువు నివారణ చర్యలకు సహకరించాలని డిమాండ్ చేశారు.

జైకా ప్రతినిధులతో బాబు భేటీ....

గుంటూరు : జైకా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మెట్రోరైలు అంశంపై జైకా ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

ఢిల్లీ : స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 350 పాయింట్లకు పైగా లాభంలో నెన్సెక్స్, 100 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతోంది.

నూడుల్స్ తిని ముగ్గరికి తీవ్ర అస్వస్థత..ఒకరు మృతి...

విజయవాడ : యనమల కుదరులో విషాదం చోటు చేసుకుంది. కాలం చెల్లిన నూడుల్స్ తిని ముగ్గరు అక్కచెల్లెళ్ళు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ మానస అనే చిన్నారి మృతి చెందింది.

టీటీడీ పాలక మండలి.. కీలక నిర్ణయాలు

తిరుమల : ధర్మకర్తల మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో బోర్డు సభ్యులతోపాటు తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు పాలకమండలి శ్రీకారం చుట్టింది.బంగారు శఠారిల తయారు చేయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.72.75 లక్షలు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నగదును దాతల ద్వారా స్వీకరించాలని నిర్ణయించారు. సర్వభూపాల, ముత్యాల పందిరి వాహనాల తయారీకి రూ.3.86 కోట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు.

14:57 - April 26, 2016

కర్నూలు : ఆరుబయట నిద్రిస్తున్న వారిపై మత్తుమందు చల్లి ఇంట్లో చోరీ చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీరువాలో ఉన్న 80 తులాల బంగారు నగలు.. 5500 రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున ఇంటి తాళాలు పగిలి ఉండడం..బీరువాలోని నగలు కనిపించకయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశామని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ దివాకర్ రెడ్డి తెలిపారు.  

రాంగోపాల్‌పేట పీఎస్ వద్ద ఆటోలో మృతదేహం.....

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మృతదేహం కలకలం రేపింది. పోలీస్‌స్టేషన్ ఎదుట పార్క్ చేసి వున్ ఆటోలో మృతదేహాం కనిపించటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోను పరిశీలించారు. ఆటోలో  మృతదేహాం  వున్న భంగిమను బట్టి అతను ఆటోకి సంబంధించిన డ్రైవర్ గా  పోలీసులు  భావిస్తున్నారు. కాగా అతను వడదెబ్బకు అతను మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

14:53 - April 26, 2016

హైదరాబాద్ : హంగు ఆర్భాటాలతో దేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తామని ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛ్‌ భారత్. దాని స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ స్వచ్ఛ్‌ హైదరాబాద్ , స్వచ్ఛ్‌ తెలంగాణ అన్నారు. కాని గ్రేటర్ రోడ్లపై ఎక్కడ చూసినా దుర్గంధమే. నగరవాసులు బయటకు వస్తే కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్స్ కరువే. దీంతో రోడ్లే టాయిలెట్స్‌గా మారుతున్నాయి. సరైన నిర్వహణ లేక దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని అభివృద్ది చేస్తామని...

అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని అభివృద్ది చేస్తామని చెప్పే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు పట్టించుకోవడం లేదు. పేరు గొప్ప , ఊరు దిబ్బ అన్నట్లుగా మారిపోయింది భాగ్యనగర పరిస్థితి. ఒకవైపు నగరాన్ని స్వచ్చ హైదరాబాద్‌గా మార్చుదామంటున్న ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమవుతోంది.

గ్రీన్ టాయిలెట్స్ పేరిట టాయిలెట్స్ ఏర్పాటు చేసినా...

నగరంలో నివసిస్తున్న కోటి మంది ప్రజల్లో దాదాపు 50 శాతం మంది ప్రతి రోజు ఏదో ఓ పని మీద నగరంలో సంచరిస్తూనే ఉంటారు. ట్రాఫిక్ వలయంలో గంటల తరబడి గడపాల్సి వస్తుండడంతో కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేకపోతున్నారు. బల్దియా యంత్రాంగం ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ టాయిలెట్స్ పేరిట టాయిలెట్స్ ఏర్పాటు చేసినా అవి అలంకార ప్రాయంగానే ఉన్నాయి.

స్వచ్ఛ్‌ భారత్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం.....

స్వచ్ఛ్‌ భారత్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 25 మంది మహిళలకు ఓ టాయిలెట్ .. ప్రతి 50 మంది పురుషులకు ఓ టాయిలెట్ ఉండాలి. దీన్ని తప్పనిసరి చేసింది భారత సర్కార్. కాని హైదరాబాద్ నగరంలో మొత్తం కలిపినా.. 500 టాయిలెట్స్‌కు దాటటం లేదు. నగరం పరిశుభ్రంగా ఉంచాలనుకోవడం మంచి ఉద్దేశమే అయినా అందుకు తీసుకుంటున్న చర్యలేవి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు . ప్రైవేట్‌వి ఉన్నా...వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి.

బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ బీవోటి ప్రాతిపదికన నిర్మించిన టాయిలెట్స్ 129.....

బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ బీవోటి ప్రాతిపదికన నిర్మించిన టాయిలెట్స్ 129 ఉన్నాయి. వీటిని వివిధ ప్రకటనా సంస్థలు నిర్వహిస్తున్నాయి. అలాగే బల్దియా ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తున్న టాయిలెట్స్ మరో 57 ఉన్నాయి. వీటిని నిర్వహిస్తున్న సఫాయి కార్మికులకు నెలకు 6 వేల వేతనం చెల్లిస్తున్నారు. వీటికి ప్రతి ఏటా 40 లక్షలు చెల్లిస్తున్నారు. సులబ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహిస్తున్నవి 50 టాయిలెట్స్ ఉన్నాయి. వీటితో పాటు మెట్రో కాన్ఫరెన్స్ సందర్భంగా 50 బయో టాయిలెట్స్ నిర్మించారు. వీటి నిర్వహణ కోసం 5 మిషన్లు కొనుగోలు చేశారు. అవి మూలనపడ్డాయి. ఈ మధ్యనే ఒక్కో టాయిలెట్ 5 లక్షలు ఖర్చు చేసి 200 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ కొనుగోలు చేశారు. నగరంలో నిర్మిస్తున్న టాయిలెట్స్ వ్యాపార ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నిర్వహణలోపం కారణంగా కోట్లు ఖర్చు చేసి చేపడుతున్న టాయిలెట్స్ నిరుపయోగంగా మారుతున్నాయి. 

14:49 - April 26, 2016

హైదరాబాద్ : సబ్జెక్ట్ పుస్తకాలు లేవా..? ఒకవేళ ఉన్నా కష్టపడి చదవలేకున్నారా..? నో ప్రాబ్లం.. మీ దగ్గర డబ్బుంటే చాలు... టెట్‌కి ఈజీగా క్వాలిఫై అయిపోతారు.. హైదరాబాద్‌లో ఇప్పుడీ సరికొత్త దందా నడుస్తోంది. డబ్బులిస్తే టెట్‌కి క్వాలిఫై చేయిస్తామనే ముఠా దెబ్బకు.. కష్టపడి చదువుకునే అభ్యర్థుల్లో టెన్షన్‌ని పెంచుతోంది.

టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ టెట్...

ఉపాధ్యాయుడిగా స్థిరపడదామనుకునేవారంతా రాయాల్సిన ముఖ్యమైన పరీక్ష టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ టెట్.. సాధారణంగా ఈ పరీక్షకు పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది.. పైగా టెట్‌కు డీఎస్సీలో వెయిటేజీ కూడా ఉంది.. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న టెట్‌లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు అభ్యర్థులంతా రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు.. అయితే.. హైదరాబాద్‌లో కష్టపడకుండానే తేలిగ్గా ఫలితం పొందేలా కొన్ని కోచింగ్ సెంటర్లు దందా సాగిస్తున్నాయి.

మాస్‌ కాపీయింగ్‌కు ప్లాన్ చేసిన కోచింగ్‌ సెంటర్లు.....

హైదరాబాద్‌ కేంద్రంగా కొన్ని కోచింగ్‌ సెంటర్లు మాస్‌ కాపీయింగ్‌కు స్కెచ్ వేశాయి.. నిరుద్యోగులను ఆకర్షించేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి.. కచ్చితంగా పాస్‌ చేయిస్తామంటూ రహస్యంగా బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి... ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిఉంటుంది.. అప్పుడే అభ్యర్థులకు ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుంది.. దరఖాస్తుచేసిన సమయాన్నిబట్టి వరుసగా టెక్నికల్ విభాగం ఐడీ కేటాయిస్తుంది.. ఈ నెంబర్ల ప్రకారమే హాల్‌ టికెట్‌ నెంబర్లు ఇస్తారు.. వీటిని బట్టే పరీక్షా కేంద్రాలు, రూమ్‌ల కేటాయింపు జరుగుతుంది.. దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని కోచింగ్‌ సెంటర్లు కొత్త దందాకు తెరతీశాయి..

అభ్యర్థులందరూ ఒకే సెంటర్‌లో పరీక్ష రాసేలా దరఖాస్తులు అప్‌లోడ్.........

హైదరాబాద్‌లోని కొన్ని కోచింగ్‌ సెంటర్లు తమ అభ్యర్థులందరూ ఒకే సెంటర్‌లో పరీక్ష రాసేలా దరఖాస్తులను ఆప్‌లోడ్ చేయిస్తున్నాయి.. ఉదయం సమయంలో అయితే వరుసగా నెంబర్లు రావని అర్ధరాత్రి అప్లికేషన్ల పని పూర్తిచేస్తున్నాయి.. అలా వరుస క్రమంలో ఐడీ నెంబర్లు, హాల్‌ టికెట్‌ నెంబర్లు జనరేట్‌ అయ్యేలా చేస్తున్నాయి...

అభ్యర్థుల మధ్య ఫ్యాకల్టీ ఉండేలా ప్లాన్......

ఐడీలు క్రియేట్‌ అయ్యాక మార్కులకోసం మరో కొత్త స్కెచ్ వేశాయి కొన్ని కోచింగ్‌ సెంటర్లు.. అభ్యర్థులకు సమాధానాలు చెప్పేలా వారి మధ్య ఉండేలా.. అతనితోనూ టెట్‌కు దరఖాస్తు చేయిస్తున్నాయి... గతంలో కూడా ఇలాగే చేసి కొందరికి ఎక్కువ మార్కులు వచ్చేలా చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.. టెట్‌లో ఎలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు అధికారుల్ని కోరుతున్నారు.. కష్టపడి చదివిన అభ్యర్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. 

14:47 - April 26, 2016

తిరుమల : తిరుమల రాంభగీచ అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.. 384 నెంబర్‌ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు.. మృతులు కోయంబత్తూరుచెందినవారిగా గుర్తించారు.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. 

14:45 - April 26, 2016

హైదరాబాద్ : పాలనా సౌలభ్యం కోసమే మంత్రివర్గంలో కేసీఆర్‌ మార్పులు చేర్పులు చేశారని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. రాంరెడ్డి వెంకట్‌రెట్టి కుటుంబ సభ్యులపై తమకు సానుభూతి ఉంది తప్ప కాంగ్రెస్‌పై ఎటువంటి సానుభూతి లేదని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు పోటీచేశారని కవిత ప్రశ్నించారు. 

14:44 - April 26, 2016

హైదరాబాద్ : కరువు అనేది సమాజంపై ఎంత ప్రభావం చూపుతుంది? అందులోనూ మహిళలపై కరువు ప్రభావం ఎలా చూపుతుంది? నీటి కోసం మహిళలపై మానసిక ఒత్తిడి చూపుతుందా? కరువు కారణంగా మహిళలు వలసపోతున్నారా? వంటి అంశాలపై వేదిక లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సజయ కేర్ సిటిజెన్స్ కలెక్టివ్, ఉషా సిద్ద లక్ష్మి రైతు స్వరాజ్ వేదిక నేతలు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

చిరుజల్లులతో పులకరించిన భాగ్యనగర వాసులు...

హైదరాబాద్‌ : భానుడి భగభగలతో అల్లాడిపోతున్న హైదరాబాద్‌ నగరవాసులను వరుణుడు చిరు జల్లులతో పలకరించాడు. ఈరోజు మధ్యహ్నాం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. చంపాపేట్‌, సైదాబాద్‌ సహా దిల్‌సుఖ్‌నగర్‌, పాతబస్తీ, వనస్థలిపురం, ఉప్పల్  తదితర ప్రాంతాల్లో చిర

14:36 - April 26, 2016

కర్నూలు : నగరంలోని నారాయణ కాలేజీ గాయత్రి ఎస్టేట్‌ క్యాంపస్‌పై ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు దాడి చేశారు. ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. 

13:31 - April 26, 2016

ఢిల్లీ : పార్టీ ఫిరాయింపులను ఖండిస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. 'సేవ్ డెమోక్రసీ' పర్యటనలో భాగంగా జగన్ .. సీతారాం ఏచూరీతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా 'అవినీతికి రారాజు చంద్రబాబు 'అనే పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి డబ్బుతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనీ...దీనిపై పార్లమెంట్ లో చర్చ జరపాలని ఏచూరీని జగన్ కోరారు. దీనిపై ఏచూరీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో ఉత్తరాఖండ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం చర్చ జరుగలేదని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో కంటే ఎక్కువగా ఏపీలో పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది చాలా అవమానకరమైన విషయం అని, అవినీతిని నియంత్రించకపోతే దేశ సమగ్రత దెబ్బతింటుందని తెలిపారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుందన్నారు. పార్లమెంట్ లో అ అంశంపై చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ మాటలను ఏచూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రవేశపెట్టిన సందర్భంగా .. ప్రజాప్రతినిధులు ప్రజల్లో విశ్వాసం పోగొట్టుకుంటే చట్టసభలు కూడా విలువలను కోల్పోతాయని పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైసీపీ అధినేత జగన్ కు కూడా కొన్ని సూచనలు చేశారు. ఏపీ నెలకొన్న పరిస్థితులను బట్టి వైసీపీ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించుకోవాల్సిన అవసరముందని సూచించారు. 

13:17 - April 26, 2016

తిరుమల : తిరుపతి వెంకన్న సన్నిధిలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ నడుం బిగించింది. పవిత్రమైన దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగుల ఇండ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం సృష్టించింది. ఓ వైపు ధర్మకర్తల మండలి సమావేశం జరుగుతుండగానే ఈ సోదాలు జరగడం గమనార్హం. టీటీడీ సూపరిండెంట్ లు నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి , కళ్యాణ కట్ట ఉద్యోగి తంగవేలు ఇళ్ళల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. బ్యాంక్ లాకర్ వివరాలు, ఆస్తి పట్టాలు, ఇంకా మిగిలిన వివరాలకోసం ఏసీబీ ప్రయత్నిస్తోంది. దీనిపై సాయంత్రం లోగా ఏసీబీ అధికారులు ఒక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం.

13:12 - April 26, 2016

విజయవాడ : చాలా రోజులకు జేడీ లక్ష్మీనారాయణ వార్తల్లోకి వచ్చారు. అవును అవినీతి గుండెల్లో గుబులు రేపిన జేడీ బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి తెలుగు రాష్ట్రానికి వస్తున్నారని తెలుస్తోంది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసు..ఇతరత్రా వాటిపై సీబీఐ అధికారిగా జేడీ లక్ష్మీ నారాయణ నిష్పక్షపాతికంగా దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. అనంతరం రాష్ట్రం విడిపోయింది. ఏపీ రాజధాని 'అమరావతి' నిర్మాణాన్ని బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసు కమిషనర్ గా జేడీ లక్ష్మీనారాయణను నియమించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అమరావతికి కమిషనర్ గా నియమించడానికి సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 

12:56 - April 26, 2016

హైదరాబాద్ : తెల్లబంగారానికి గడ్డు కాలం రానుందా? పత్తి పంట సాగు సంక్షోభంలో కూరుకుపోనుందా? పత్తి సాగు చేయొద్దంటూ సాక్షాత్తూ సీఎం ప్రకటించడానికి కారణమేంటి? డబ్ల్యూటీఓ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపనుంది? 10 టీవీ ప్రత్యేక కథనం..ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు పడిపోతున్నాయి.. దేశీయ మార్కెట్లోకూడా ధరలు హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అయినా వీటితో సంబంధంలేకుండా రైతులు కాటన్‌ సాగు చేస్తూనే ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడిపెట్టి సరైన రేటు రాక నష్టపోతున్నారు. అటు తెల్లబంగారం ఎగుమతులపై నైరోబీలో డబ్ల్యూటీఓ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎగుమతి సుంకం పెంచాలన్న తీర్మానంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కూడా సంతకం చేశారు. తెలంగాణలో మొత్తం 55లక్షల 53వేలమంది రైతులున్నారు. ఇందులో దాదాపు 25లక్షల మంది పత్తిని పండిస్తున్నారు. వరిసాగుకు మూడింతలు ఎక్కువగా పత్తి వేస్తున్నారుఎకరా భూమిలో ఈ పంటకు 15నుంచి 30వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. దిగుబడి సరిగా రాకపోయినా పెట్టుబడి ఖర్చయినా మిగులుతుందన్న ఆశతో ఎక్కువమంది పత్తి సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో వాతావరణం, నేలకూడా పత్తికి అనుకూలంగా ఉన్నాయి. విత్తన కంపెనీలూ ప్రచారంతో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నాయి.

జూన్ లో ఖరీఫ్..
సాధారణంగా ఖరీఫ్ సీజన్‌ జూన్‌ నుంచి మొదలవుతుంది. ఈ సారి ఖరీఫ్‌లో పత్తి వేస్తే ఈ పంట చేతికి వచ్చే సమయానికి డబ్ల్యూటీఓ నిబంధన అమల్లోకి వస్తుంది. అప్పటికి ఎగుమతులకు డిమాండ్ తగ్గడం, దేశీయంగా మద్దతు ధర లేక పత్తి పంట సంక్షోభంలో పడే ప్రమాదముంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ పంట వేస్తే నష్టాలు తప్పవని ప్రచారం చేస్తోంది. మన దేశంలో ప్రతి ఏడాది 325 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతోంది. ఇందులో దేశీయ అవసరాలకు 260 లక్షల బేళ్లు వినియోగించినా 65లక్షల బేల్లు ఎగుమతి అవుతాయి.. తాజా నిర్ణయంతో ఎగుమతులు నిలిచిపోయి.. నిల్వలు పెరిగిపోతాయి.. అప్పుడు రేట్లు తగ్గిపోతాయి. ఈ దిగుమతుల్లో ఎక్కువభాగం చైనాకు వెళుతోంది.. ప్రస్తుతం చైనా పత్తి దిగుమతులపై నిషేధం విధించింది. ఇదికూడా మన ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది.

ప్రతికూల పరిస్థితులు..
డబ్ల్యూటీఓ ఒప్పందం ప్రకారం పత్తి ఎగుమతులకు ఇచ్చే పన్ను రాయితీలు రద్దు చేస్తే ప్రతికూల పరిస్థితులుంటాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. తెలంగాణ వ్యవసాయ శాఖ సరిగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శలు వస్తున్నాయి. తాజా పరిస్థితులతో తెలంగాణ వ్యవసాయ శాఖ మరింత సమర్ధవంతంగా పని చేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నాయి. భూసార పరీక్షలు చేసి ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేయాలో సూచించాలని అలాగే మిగతా పంటలకు మద్దతు ధర కల్పిస్తే కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.

12:56 - April 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాలమే సమాధానం చెబుతుందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్ లో జానారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జానారెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యే టీఆర్ ఎస్ లో చేరుతున్న విషయంలో ఆయన వేదాంత ధోరణిలో మాట్లాడారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బలహీనపరచటానికి టీఆర్ ఎస్ కుట్ర పన్నుతోందనీ...ఇది చాలా అన్యాయమని ఆయన అన్నారు. చట్టంలోని నిబంధనలను అతిక్రమిస్తూ ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో కొనసాగటమనేది నైతికంగా దిగజారిపోవటమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించాం కానీ కానీ కేవలం కాంగ్రెస్ ను బలహీన పరచటానికి టీఆర్ఎస్ వలసలను పోత్సహిస్తోందని విమర్శించారు. దీనికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని ఆశాభావాన్ని వెలిబుచ్చారు. 'వినాశకాలే విపరీత బుద్ధి' వినాశకాలం దాపురించటం వల్లనే అధికార పార్టీలు ఇటువంటి విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ బలపుంచుకుంటుందనీ ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎవరికి వారు ఆత్మ వివర్శ చేసుకోవాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులు లేకుండా చట్టాన్ని పటిష్టపరచాల్సిన అవసరముందని జానా అభిప్రాయపడ్డారు. 

12:49 - April 26, 2016

విజయవాడ : వైసీపీ నుంచి జంప్‌ జిలానీలు సైకిల్‌ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. టైమ్‌ చూసి కండువా మార్చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఫ్యాన్‌కు గుడ్‌బై చెప్పి...సైకిల్‌ ఎక్కుతున్నారు. వలసలు ఇంకా కొనసాగుతాయని టీడీపీ నేతలూ పబ్లిక్‌గానే ప్రకటిస్తున్నారు. పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు చెప్పినట్టే వలసలు కొనసాగితే వైసీపీకి రాజ్యసభ సభ సీటు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. సంఖ్యాబలాన్ని బట్టి అధికార పార్టీకి మూడు స్థానాలు దక్కుతాయి. ప్రతిపక్ష పార్టీకి ఒక స్థానం వస్తుంది. ఐతే ఆ ఒక్క స్థానం కూడా వైసీపీకి వెళ్లకుండా ఉండేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి రాజ్యసభ సీటు దక్కాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రతిపక్షానికి మొత్తం 67 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 13 మంది పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు మరో ముగ్గురు లైన్‌లో ఉన్నారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెఢీ అయ్యారు. దీంతో పార్టీ ఫిరాయించిన వారి సంఖ్య 16కు చేరుతుంది. ఈ లెక్కన మొత్తం వైసీపీ సభ్యుల సంఖ్య 51అవుతుంది. వీరిలో పది మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కితే.. ప్రతిపక్ష పార్టీ రాజ్యసభ సీటుకు గండిపడినట్లే. మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అలర్ట్‌ అయ్యింది. ఆ పది మందిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.

విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు..
వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తానని జగన్‌ ఎప్పుడో హామీ ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డి తన సీటు కోసం తానే అవస్థలు పడుతున్నారు. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జగన్‌ మీద ఉన్న ఈడీ కేసులపై విజయ్‌సాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేసే అవకాశముందనే అభిప్రాయం అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను పెద్దల సభలో అడుగు పెట్టనివ్వకూడదని టీడీపీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. మహానాడు నాటికి ప్రతిపక్ష పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను బయటకు లాగేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తోంది. దీంతో వైసీపీ రాజ్యసభ సీటు ఆశలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు విప్‌ వర్తించదు. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై వేటు వేయించే అవకాశం ఉండదు.

12:45 - April 26, 2016

శ్రీకాకుళం : అతని వయస్సు ఏడు పదులు.. కానీ కుర్రాళ్ల కంటే ధీటుగా శరీరం ధృడంగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు ఓ కురు వృద్ధుడు నేటి యువకులకు సాధ్యం కాని సిక్స్ ప్యాక్‌ను సాధించి లేటు వయస్సులోనూ అందరి చేత వావ్ అనిపించుకుంటున్నాడు. శ్రీకాకుళం జిల్లాలోని కండలవృద్ధుడి పేరు పైడి రామారావు. వయస్సు 73 సంవత్సరాలు. జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ వీధిలో నివాసం ఉంటున్నాడు. నేటి యువకులకు సాధ్యం కాని సిక్స్ ప్యాక్ సాధించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. స్థానికంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్‌మెంట్‌లో చిరు ఉద్యోగం చేసిన రామారావు ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా వ్యాయామంపై దృష్టి సారించాడు.

నాగావళి లో ఓనమాలు..
పట్టణంలోని నాగావళి యువజన వ్యాయామశాల వేదికగా చేసుకుని వ్యాయామంలో ఓనమాలు ప్రారంభించాడు. తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పథకాలను రామారావు సొంతం చేసుకున్నాడు. వైజాగ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీలో మూడవ స్థానం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిత్యం వ్యాయామం చేయడం, పూర్తిగా శాఖాహారం తీసుకోవడం వల్లే ఈ వయస్సులోనూ చక్కని ఆరోగ్యంతో ఉన్నానని రామారావు చెబుతున్నాడు.. 70ఏళ్ల వయస్సులోనూ సిక్స్‌ ప్యాక్‌ని సునాయాసంగా సాధించి అందరి చేత ఔరా అనిపించుకున్న రామారావుని నేటి తరం వారు ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్‌లో మరెంతో మంది బాడి బిల్డర్‌లు మన దేశంకు అందే వీలుంది.

ఏచూరిని కలిసిన జగన్..

ఢిల్లీ : ఏపీలో జరుగుతున్న రాజకీయ అవినీతి దేశంలో ఎక్కడా చూడలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి వ్యాఖ్యానించారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్..ఏచూరి కలిశారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ అవినీతిని పార్లమెంట్ లో ప్రస్తావించడం జరుగుతుందని తెలిపారు. 

టిటిడి ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ దాడులు..

తిరుపతి : ముగ్గురు టిటిడి ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సూపరింటెండెంట్ లు నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కళ్యాణకట్ట ఉద్యోగి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

దద్దరిల్లిన రాజ్యసభ..

ఢిల్లీ : విపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభ దద్ధరిల్లింది. జేఎన్ యూ అంశంపై వామపక్షాలు, ఉత్తరాఖండ్ అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కన్హయ్య కుమార్ కు జరిమాన విధించడంపై వామపక్షాలు..బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. 

11:58 - April 26, 2016

ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఎనిమిదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో హ్యాట్రిక్ విజయాల రికార్డు పూర్తి చేసింది. హోంగ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ...సైతం విజయాల హ్యాట్రిక్ కు ఉరకలేస్తోంది. రాత్రి 8 గంటలకు జరిగే కీలక పోటీలో రెయిజింగ్ పూణే జెయింట్స్ పని పట్టడానికి సిద్ధమయ్యింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిసీజన్లో...హైదరాబాద్ సన్ రైజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొమ్మిదోసీజన్లో ఎనిమిదిజట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో...సన్ రైజర్స్ వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. హోంగ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన వన్ సైడెడ్ షోలో ...హైదరాబాద్ సన్ రైజర్స్ 5 వికెట్లతో కింగ్స్ పంజాబ్ ను చిత్తు చేసి...లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ పోటీలో...సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా కీలక టాస్ నెగ్గి..ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ఐదుకు ఐదుమ్యాచ్ ల్లోనూ టాస్ నెగ్గడం విశేషం.

రాణిస్తున్న బౌలర్లు..
హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్, హెన్రికేస్ అద్భుతంగా బౌల్ చేయడంతో పాటు కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి...కింగ్స్ పంజాబ్ ను 20 ఓవర్లలో 143 పరుగుల స్కోరుకే పరిమితం చేశారు. ఓపెనర్ మానన్ ఓరా 25, వన్ డౌన్ షాన్ మార్ష్ 40, మిడిలార్డర్ ఆటగాళ్ళలో నాయక్ 22, అక్షర్ పటేల్ 36 పరుగులు మినహా...మిగిలిన ఆటగాళ్ళు రాణించలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో ముస్తాఫిజుర్ , హెన్రికేస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముస్తాఫిజుర్ 4 ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి..రెండు వికెట్లు సాధించడం ద్వారా ప్రస్తుత సీజన్లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నమోదు చేశాడు. 144 పరుగుల స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఓపెనింగ్ జోడీ డేవిడ్ వార్నర్- శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. శిఖర్ ధావన్ 44 బాల్స్ లో 4 బౌండ్రీలతో 45 పరుగులు చేసి రిషీ ధావన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరోవైపు..సూపర్ ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నర్ 7 బౌండ్రీలు, మూడు సిక్సర్లతో 59 పరుగులు సాధించాడు. గత ఐదు మ్యాచ్ ల్లో వార్నర్ కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు..ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ జరిగిన 18 మ్యాచ్ ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడి ఘనతను వార్నర్ దక్కించుకొన్నాడు. వార్నర్ కేవలం 31 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ సాధించడం మరో రికార్డు. చివరకు..సన్ రైజర్స్ 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి విజయలక్ష్యం పూర్తి చేసింది. హైదరాబాద్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన ఐదురౌండ్లలో సన్ రైజర్స్ మూడో విజయం సాధించడం ద్వారా..లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈనెల 26న రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగే తర్వాతి మ్యాచ్ లో.. రెయిజింగ్ పూణే జెయింట్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ కొంటుంది.

రోడ్డు ప్రమాదాలలో 3గురు మృతి...

నల్లగొండ: జిల్లాలో వేరువేరు ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఒకటి నకిరేకల్ మండలం నోముల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్‌ను ఓ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకటి కట్టంగూరు మండలం ఐటీపాముల వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పార్లమెంట్ లో నూతన ఎంపీల ప్రమాణస్వీకారం...

ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ రెండో రోజు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ హమీద్ అన్సారీ కొత్తగా నియమితులైన రాజ్యసభ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. బాక్సర్ మేరీకోమ్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పార్లమెంట్ నూతన సభ్యులు ఛైర్మన్‌తో కరచాలనం చేసి తమ సీట్లలో ఆసీనులయ్యారు.

11:37 - April 26, 2016

ఢిల్లీ : 'సేవ్ డెమోక్రసీ ' పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం వైకాపా అధినేత జగన్‌ ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ పోరాటానికి మద్దతివాలని ఈ సందర్భంగా జగన్‌ విజ్ఞప్తి చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న చంద్రబాబును ప్రజలు, మీడియా నిలదీయాలని కోరారు.
కేవలం పర్యటనకే పరిమితం కాకుండా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారంటూ వైసీపీ ఓ పుస్తకాన్ని ప్రచురించింది. 'అవినీతికి రారాజు చంద్రబాబు ' అనే పుస్తకాన్ని జాతీయ నేతలందరికీ జగన్ ఇవ్వనున్నారు. 1,34,980 కోట్లు అవినీతికి పాల్పడినట్లుగా ఈ పుస్తకంలో జగన్ పొందుపరిచినట్లు సమాచారం. పార్లమెంట్ ప్రతీ సభ్యుడికీ ఈ పుస్తకాన్ని జగన్ అందజేయనున్నారు. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని జాతీయనాయకులను జగన్ కోరనున్నారు. కాగా ఈరోజు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కూడా మ.12 గంటలకు జగన్ కలవనున్నారు. 

ఎంపర్ ఆఫ్ కరప్షన్ బాబు..వైసీపీ బుక్..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతిపై వైసీపీ 'రాజా ఆఫ్ కరప్షన్' పేరిట బుక్ విడుదల చేసింది. ఈ ప్రత్యేక బుక్ ను జగన్ విడుదల చేశారు. మంత్రి పదవులు ఎరవేస్తూ ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాక్కొంటున్నారని విమర్శించారు. 

పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభకు నూతనంగా నామినేట్ అయిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మహిళా బాక్సర్ మేరీకోమ్, సుబ్రమణ్య స్వామిలు ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. 

పార్లమెంటరీ సమావేశానికి హాజరైన మోడీ..

ఢిల్లీ : కొద్దిసేపటిక్రితం పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, సీనియర్ నాయకులు అద్వానీ తదితరులు హాజరయ్యారు. 

శరద్‌పవార్‌తో జగన్‌ భేటీ...

ఢిల్లీ :  దేశ రాజధానిక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం వైకాపా అధినేత జగన్‌ ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ పోరాటానికి మద్దతివాలని ఈ సందర్భంగా జగన్‌ శరద్ పవార్ ను విజ్ఞప్తి చేశారు. జగన్‌ వెంట పలువురు ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు ఉన్నారు. వైసీపీ పార్టీ నుండి అధికార పక్షమైన టీడీపీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వలస బాట పట్టంతో రాష్ట్రపతి, ప్రధాని మోదీని, ఇంకా జాతీయస్థాయి నాయకులను, కలవటానికి జగన్ ఢిల్లీ బాట పట్టిన విషయం తెలసిందే.

అభ్యర్థిగా తుమ్మలను ప్రకటించడం దుర్మార్గం - వామపక్షాలు..

ఖమ్మం : టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మలను ప్రకటించడం దారుణమని వామపక్ష నేతలు పోతినేని, కూనంనేని సాంబశివరావులు పేర్కొన్నారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబసభ్యులకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికలు..రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యమని పేర్కొన్నారు. 

కిడ్పాప్ గురైన బాలుడు క్షేమం...

కృష్ణా : విజయవాడ సమీపంలోని నున్నలో నెల రోజు క్రితం అపహరణకు గురైన బాలుడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాలుడు ఉమామహేశ్వరావు ఖమ్మంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తాత్కాలిక సచివాలయానికి సీఎం బాబు..

విజయవాడ : సీఎం చంద్రబాబు పేరు మీద బలం ఉందని..తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించడంతో పాటు నిద్ర చేయాలని పండితులు సూచించారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రత కారాణాలతో నిన్న రాలేకపోయారు. దీనితో మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. 

కేంద్ర మంత్రి సుష్మాకు స్వల్ప అస్వస్థత....

ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌ ;ప్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆమెను నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. స్వల్పంగా ఛాతినొప్పి రావడంతో కొన్ని వైద్య పరీక్షలు  నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని ఎయిమ్స్ అధికార ప్రతినిధి అమిత్‌ గుప్త వెల్లడించారు. కాగా సుష్మస్వరాజ్‌ మంగళవారం పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి అజిజ్‌ అహ్మద్‌తో భేటీ కావాల్సి ఉంది.

శరద్ పవార్ తో జగన్ బృందం భేటీ..

ఢిల్లీ : ఎన్సీపీ నేత శరద్ పవార్ తో జగన్ బృందం భేటీ అయ్యింది. సేవ్ డెమోక్రసీ పోరాటానికి మద్దతివ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో జరుగుతున్న పార్టీ పిరాయింపులు..అధికార పక్షం తీరును జగన్ వివరించారు. 

10:30 - April 26, 2016

ఢిల్లీ: ముంబైని గడగడలాండించిన మాఫియా డాన్ ఇప్పుడు కాళ్ళు కూడా కదపలేని దుస్థితిలో వున్నాడు. ముంబై పాలనా యంత్రాంగానికి, పోలీసు వ్యవస్థను తన కనుసన్నలతో భయభ్రాంతులకు గురిచేసిన డాన్ ఇప్పుడు వీల్ చైర్ లో అతి దీనావస్థలో మగ్గిపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చావుకు అతి సమీపంలో వున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం అతడికి కరాచీలోని క్లిఫ్టన్‌ పరిసరాల్లో ఉన్న తన నివాసంలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. .అతడు పూర్తిగా తిరిగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల రక్త సరఫరా కాకపోవడం వల్ల రెండు కాళ్ళు చచ్చుబడిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో గ్యాంగ్రేన్‌(కండరాలకు పుండ్లు సంభవించే వ్యాధి) సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు కాళ్లలోని చాలా వరకూ కండరాలు చచ్చుబడిపోయాయి. వేరే మార్గం లేకపోవడంతో కాళ్ళను తొలగించటం తప్పదని వైద్యులు పేర్కొంటున్నారంట. 
ముంబై వరుస పేలుళ్ళలో ప్రధాన సూత్రధారి దావూద్ ను అరెస్ట్ చేయాటానికి భారత్ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నా అది ఇంతవరకూ నెరవేరలేదు. ఈ బాంబు పేలుళ్ళలో ప్రభావానికి గురైన బాధితులకు ఇప్పటి వరకూ వారు కోలుకోనేలేదు. ఇప్పుడు దావూద్ ఆచూకీ తెలిసినా భారత్ అతన్ని అరెస్ట్ చేయటానికి కూడా ఎటువంటి అవకాశాలు లేనట్లుగా సమాచారం.

ఆర్డీఎస్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జూపల్లి..

హైదరాబాద్ : కర్ణాటకలోని రాజోలిబండ దగ్గర రాజోలిబండ డైవర్సన్ స్కీం(ఆర్డీఎస్) ప్రాజెక్టును పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.

అగ్నిప్రమాదం విషాదకరం - ప్రకాశ్ జవదేకర్..

ఢిల్లీ : ఫిక్కీ బిల్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరమని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన నేచురల్ మ్యూజియంను ఆయన ఇవాళ సందర్శించారు. 

ఉప్పుపై పన్ను నేటి నుండి ఆందోళనలు..

అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్పత్తిదారులు నేటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఉప్పు తయారీని, సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్నారు. 

పీఎస్ఎల్ వీ సీ -33 కౌంట్ డౌన్ ప్రారంభం..

నెల్లూరు : శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పీఎస్ ఎల్ వీ సీ - 33 ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 9.20గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఈనెల 28న మధ్యాహ్నం 12.50 గంటలకు ఉప గ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. 

09:28 - April 26, 2016

రంగారెడ్డి : ఈత ముగ్గురు ప్రాణాలు తీసింది. వేసవి సెలవులు కావడం..అందులో ఎండలు విపరీతంగా ఉండడంతో పలువురు సేద తీరడానికి చెరువుల్లో ఈతలు కొడుతున్నారు. ఈతరాని వారు కూడా చెరువుల్లోకి దిగుతుండడంతో ప్రాణ నష్టం సంభవిస్తోంది. జల్ పల్లికి చెందిన చాంద్ ఫాషా, సమీర్, ప్రశాంత్ లు మైలార్ దేవ్ పల్లిలో ఉందాసాగర్ చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. వీరితో పాటు మరో నలుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. సమీర్ తొలుత చెరువులో మునిగిపోతుండడంతో ఇతరుల కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఫాషా, ప్రశాంత్ కూడా మునిగిపోయారు. స్థానికులు గమనించి గల్లంతయిన విద్యార్థుల కోసం గాలింపులు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు...

09:24 - April 26, 2016

విజయవాడ : ఎస్సీ, ఎస్టీల ఐక్యతకు పోరాడుతానని కారెం శివాజీ వెల్లడించారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా శివాజీని ప్రభుత్వం నియమించింది. ఈసందర్భంగా కారెం శివాజీ టెన్ టివితో మాట్లాడారు. 30 ఏళ్ల దళిత ఉద్యమం చేసిన తనను సీఎం గుర్తించి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. తనపై ఎందరో ఆశలు పెట్టుకున్నారని, దళిత, గిరిజనులు తనకు రెండు కళ్ల వారని తెలిపారు. అగ్రకుల దురహంకారం..అంటరానితనం..కుల వివక్షపై దాడులు జరుగుతున్నాయన్నారు. పదునైన చట్టాలు రపొందించినా అమలు చేయడంలో లోపాలు ఉండడం వల్ల కిందిస్థాయిలో న్యాయం జరగడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు..బాలికలపై వేధింపులు జరుగుతున్నాయన్నారు. వీటన్నింటిపై తాను పోరాటం చేయడం జరిగిందని గుర్తు చేశారు. అంబేద్కర్ కల్పించిన హక్కులు సరిగ్గా అమలు కావడం లేదని, దళిత, గిరిజనులపై జరుగుతున్న ఆకృత్యాలపై అలుపెరుగని పోరాటం చేయడం జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ నడుస్తుందని, అంబేద్కర్ సిద్ధాంతాకలకు అనుగుణంగా పని చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఫిక్కి ఆడిటోరియానికి చేరుకున్న ప్రకాష్ జవదేకర్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఫిక్కి ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు. ఇంకా ఆడిటోరియంలో మంటలు అదుపులోకి రాలేదు. సోమవారం రాత్రి ఆడిటోరియంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 37 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. 

పెళ్లి బృందం వ్యాన్ ను ఢీకొన్న వాహనం..

కాకినాడ : తుని (మం) జగన్నాథగిరిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న టాటా ఎస్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

మైలార్ దేవ్ పల్లిలో విషాదం..

రంగారెడ్డి : మైలార్ దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉందాసాగర్ చెరువులో ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. జల్ పల్లికి చెందిన చాంద్ ఫాషా, సమీర్, ప్రశాంత్ లుగా గుర్తించారు. రెండు మృతదేహాలు లభ్యం కాగా మరో మృతదేహం కోసం గాలింపులు చేపట్టారు. 

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

కర్నాటక : రాష్ట్రంలోని కోపాల్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ట్రక్కు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. 

08:32 - April 26, 2016

ఢిల్లీ : దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌లకు యూనివర్శిటీ జరిమానా విధించింది. కన్హయ్యకు 10 వేలు, ఉమర్‌కు 20 వేలు ఫైన్‌ విధించింది. ఉమర్‌ ఖలీద్‌కు సెమిస్టర్‌ పాటు యూనివర్శిటీ నుంచి తొలగిస్తూ జేఎన్‌యూ పానల్‌ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు ముజీబ్‌కు రెండు సెమిస్టర్లు, అనిర్బన్‌ భట్టాచార్యకు జులై 15 వరకు తొలగించారు. కన్హయ్య, ఉమర్‌ జేఎన్‌యూలో పీహెచ్‌డీ విద్యార్థులు. 2013లో ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌గురు వర్థంతి సందర్భంగా గత ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో వీరు జాతివ్యతిరేక నినాదాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో రాజద్రోహం కింద వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు.

 

08:28 - April 26, 2016

రకుల్‌ ప్రీత్‌ సింగే ఇప్పుడు అందరి దర్శకులకు హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో ఎవరికీ లభించని అవకాశాలు ఈమె తలుపుతడుతున్నాయి. మొన్న 'సరైనోడు'లో చేసింది. ఇప్పుడు అదే దర్శకుడు చిత్రంలో మళ్లీ అవకాశం వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా మరో సినిమా చేయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు బోయపాటి. ఈ చిత్రం అభిషేక్‌ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందనుంది. ఈ సినిమాలో రకుల్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె మాత్రం ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. వచ్చే నెల నుంచి 'తని ఒరువన్‌' చిత్రం రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. రామ్‌ చరణ్‌తో చేసే ఈ సినిమా కాకుండా సాయి ధరమ్‌ తేజ్‌తో మరో సినిమా చేయడానికి అంగీకరించింది. ఇటీవల విశాల్‌తో మరో చిత్రం చేసేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. రకుల్‌కు 2015లో అవకాశాలు ఏవిధంగా వచ్చాయో ఈ ఏడాదీ అదే మాదిరిగా వస్తున్నాయి.

08:26 - April 26, 2016

మహేష్‌ బాబు అందరికీ కావాల్సిన వాడైపోయాడు. యువత నుంచి వృద్ధుల వరకూ ఈయనంటనే ఎక్కువగా ఇష్టపడేవారున్నారు. మన తెలుగు చిత్రసీమలో ఉన్న హీరోల్లో ఈ శ్రీమంతుడు అందరివాడయ్యాడు. ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సర్వేలో మహేష్‌ బాబే తమకు అత్యధికంగా కావాల్సిన హీరో అని తేల్చిచెప్పారు. రెండో స్థానాన్ని ఎన్టీఆర్‌కు ఇచ్చారు. ఇటువంటివి నిర్వహించినప్పుడు ఈయన పేరే కనబడేది కాదు గానీ ఈ సారి మాత్రం అభిమానులు, ప్రేక్షకులు ఈయనను ద్వితీయ స్థానంలో నిలబెట్టారు. స్టయిలిస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు మూడో స్థానం లభించింది. విభిన్నతను చూపించే ఈ నటుడికి తృతీయ స్థానంలో నిలబెట్టాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిభను నిరూపించే చిత్రంలో నటించిన ప్రభాస్‌కు మాత్రం నాలుగో స్థానం కల్పించారు. తర్వాత స్థానాల్లో వరుసగా రానా, రామ్‌ చరణ్‌, పవన్‌ కళ్యాణ్‌, నాని, వరుణ్‌ తేజ్‌ ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ 13వ స్థానంలో నిలిచారు.

సంతోషంగా ఉండడమే రహస్యం..
మహేష్‌ బాబుకు రోజు రోజుకూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అత్యధిక మంది ఈయన నటనను ఇష్టపడుతున్నారు. 'మీరు 40 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడులా ఎలా ఉండగలుగుతున్నారని అడిగితే... తాను సంతోషంగా ఉండడమే దానికి కారణమని చెబుతున్నాడు మహేష్‌. ''నిరంతరం ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తుంటాను. ఫిట్‌నెస్‌ కోసం నేను చేసేవన్నీ మిక్సిడ్‌గా ఉంటాయి. ప్రత్యేకంగా ఫలానాది చేయాలని నిబంధన పెట్టుకోను. నా బుర్రలోకి ఏది తోస్తే అది చేసేస్తాను. అంతే. ప్రతి రోజూ ఉడకబెట్టిన కోడిగుడ్లు తెల్లసొన, మొలకలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటాను. చికెన్‌, చేపలు కూడా ఎక్కువగానే తింటాను. ఎక్కువగా తింటా, ఎక్కువగా నిద్రపోతా. దానికి పరిమితులేం లేవు'' అని తెలిపారు. మీరు రిజర్వ్ గా ఉండే వ్యక్తి అని అంటుంటారు ఎందుకలా ఉంటారని అడితే.. సింపుల్‌గా నేనుగా ఉండాలనుకుంటాను అది ఇప్పుడు, ఇంతకముందు కూడా అంతే అని పేర్కొన్నారు మహేష్‌.

08:25 - April 26, 2016

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'రమణ్‌ రాఘవ్‌-2.0'. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ముంబైకి చెందిన రమణ్‌రాఘవన్‌ అనే సీరియల్‌ కిల్లర్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని కశ్యప్‌ రూపొందిస్తున్నారు. ఇందులో రమణ్‌ పాత్రలో నవాజుద్దీన్‌ నటిస్తుండగా, సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా విక్కీకౌశల్‌ నటిస్తున్నారు. 1968లో ముంబై వాసుల్ని సైకో రాఘవ్‌ అలియాస్‌ రమణ్‌ రాఘవ్‌ గడగడలాడించాడు. 23 మందిని అతి క్రూరంగా చంపేశాడు. 1969లో పట్టుబడిన రాఘవ్‌కు ఉన్నత న్యాయస్థానం యావజీవ కారాగార శిక్ష విధించింది. రమణ్‌ రాఘవ్‌పై దర్శక,నిర్మాత శ్రీరామ్‌రాఘవన్‌ 70 నిమిషాల నిడివిగల లఘుచిత్రాన్ని రూపొందించారు. తాజాగా రమణ్‌రాఘవ్‌పై కశ్యప్‌ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించ నున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

బోరుబావిలో పడిన చిన్నారి మృతి..

గుజరాత్ : సురేంద్రనగర్ లో ఏడు నెలల చిన్నారి బోరు బావిలో పడిపోయింది. సోమవారం రాత్రి నుండి సహాయక చర్యలు ప్రారంభించారు. కానీ ఆ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

08:14 - April 26, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ బృందం పర్యటిస్తోంది. ఉదయం 10.30గంటలకు శరద్ పవార్..మధ్యాహ్నం 12గంటలకు ఏచూరి..1గంటకు రాజ్ నాథ్..రాత్రి 7.15 గంటలకు శరద్ యాదవ్ తో జగన్ బృందం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం కార్యాచరణ ప్రారంభించింది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా వివిధ పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ నేతలను వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు బృందం కలవనుంది. సోమవారం ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి చేరుకుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జాతీయస్థాయిలో పోరాటం సాగించడానికి ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి భూమికగా ఉపయోగించుకోనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

08:04 - April 26, 2016

సునీల్‌ హీరోగా, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ నటి మియా జార్జ్ హీరోయిన్‌గా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌.లి పతాకంపై పరుచూరి కిరిటీ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఆ విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, 'ఈ నెల 22న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇది ఈ నెలా ఖరు వరకు జరుగుతుంది. సునీల్‌ చిత్రాల నుంచి ప్రేక్షకుల ఆశించే అన్ని అంశాలతోపాటు క్రాంతి మాధవ్‌ తరహా మేకింగ్‌తో ఈ చిత్రం ఉంటుంది. చక్కని కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సునీల్‌ పాత్ర తీరుతెన్నులు విభిన్నంగా ఉంటాయి. అలాగే ప్రతీ పాత్రకు మంచి ప్రాధాన్యముంటుంది. మా చిత్రానికి జిబ్రాన్‌ సంగీతమందించడం విశేషం. ఆయన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ సర్వేష్‌ మురారి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే వినోదాత్మకం చిత్రమవుతుంది. మా బ్యానర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రాలను అందిస్తామని కచ్చితంగా చెప్పగలను' అని అన్నారు.

07:57 - April 26, 2016

అందరి జేబుల్లో సెల్ ఫోన్లున్నాయి.. అవ్వి ఎక్కడివి..? నేనే తీసుకొచ్చా..? ఇన్ఫార్మేషన్ టెక్నాలజీని ఇండియాకు పరిచయం జేశిందే నేను..ఇరు రాష్టాల ముఖ్య మంత్రులు జోడు గుర్రాలోలె ఎగవడ్తున్నరు..కేంద్ర ప్రభుత్వంల నరేంద్రమోడీ సారు జేస్తున్న ప్రజా సేవ ఎసొంటిదో ఇంకా పబ్లీకుకు దెలుస్తలేదట..అబ్బబ్బ కాగులేశి కమ్మినట్టు వొక్కటే ఉడ్కపోత. ఏం ఎండలు.. ఏం ఎండలు.. గంటశేపు ప్యాన్ బందువెడ్తె.. శెమ్ట తోని తానం జేసుడే అయితున్నది..వారెవ్వ.. హైద్రావాదులున్న స్వాగత్ గ్రాండ్ హోటలోని మోసం జూశిండ్రా..?మన గ్రేటర్ హైద్రావాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నదిగదా..? అదే.. జీహెచ్ఎంసీ.. ఆ సంస్థల హీరోయిన్ సన్నీలియోన్ ప్రత్యక్షమైంది..అత్తమీద కోపం దుత్తమీద దీశిండు అంటరు సూడు.. అగో గసొంటి పనే జేశింది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు గూడ...దేవుండ్ల గుళ్ల కాడ ఇట్ల ఎందుకు జేస్తరో ఏమో పో.. ఈ అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న' ముచ్చట్లు చెప్పిండు. మరి ఆ ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:41 - April 26, 2016

చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చడంలో ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలు ఎన్నో. వాటిలో కుంకుమ పువ్వు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో చర్మానికి కావలసిన పోషక విలువలు ఎంతో పుష్కలంగా వున్నాయి. ఈ పోషకాలు నేరుగా చర్మం మీద ప్రభావం చూపి చర్మం మెరిసేలా చేస్తాయి. కుంకుమ పువ్వు ద్వారా ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్‌ పొందవచ్చు. ఇది చర్మ సమస్యలతో పాటు పెదవులు, గోళ్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
కుంకుమపువ్వు మేనిఛాయను మెరుగు పరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సింది.... ముందుగా కుంకుమపువ్వును ఒక టేబుల్‌ స్పూన్‌ నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. నీరు ఎరుపుగా మారిన తర్వాత అందులో కొద్దిగా వెన్న వేసి పేస్టులా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే.. చర్మ ఛాయ మెరుగవుతుంది.
కుంకుమ పువ్వు, పసుపు, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే మొటిమలను, మచ్చలను దూరం చేసుకోవచ్చు. చర్మ మృదుత్వం కోసం ఒక స్పూన్‌ కుంకుమ పువ్వు పొడి తీసుకుని అందులో కొన్ని చుక్కలు పాలు వేసి పేస్ట్‌లా కలియబెట్టాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే పసిడి ఛాయ మీ సొంతం అవుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

07:40 - April 26, 2016

జుట్టు నల్లగా లేదని చాలామంది బాధపడుతుంటారు. వాతావరణ ప్రభావ కారణంగా చిన్నవారికి కూడా వెంట్రుకలు తొందరగా తెల్లబడుతున్నాయి. అందుకే జుట్టు నల్లగా ఉండటం కోసం అన్నో రకాల క్రీములను వాడుతుంటాం. కాని ఇవన్ని తాత్కాలికం మాత్రమే. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలో మరీ ఎక్కువగా కనపడుతోంది. దీంతో నల్లని జుట్టు కోసం మార్కెట్లో దొరికిన ప్రతి హెయిర్‌ డైని ప్రయోగిస్తారు. వాటితో అనేక చిక్కులు. ఇవేవీ లేకుండా నిగనిగలాడే నల్లని కురులు పొందాలనుకునేవారికి కొన్ని చిట్కాలు...
అరలీటరు నీటిలో రెండు చెంచాల ఉసిరిపొడి కలపండి. నిమ్మకాయని సగంగా కోసి, ఒక ముక్కలోని రసాన్ని ఆ నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
ఇది మామిడి కాయలు దొరికే సీజన్‌. కాబట్టి మామిడికాయ రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే మంచి ఫలితాన్నిస్తుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
కరివేపాకు, గోరింటాకును బాగా ఎండబెట్టాలి. ఒక పాత్రలో కొబ్బరి నూనె, ఎండబెట్టిన కరివేపాకు, గోరింటాకు వేసి బాగా కాచి వడగట్టాలి. ఈ నూనెను ప్రతిరోజూ తలకి పట్టిస్తే జుట్టు నల్లగా మారుతుంది.
రెండు కప్పుల పెరుగు, ఒక కప్పు ఎండు ఉసిరి తీసుకుని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్ళల్లో మరిగించాలి. ఈ మిశ్రమం ఒక కప్పు వచ్చిన తరువాత ఇందులో రెండు కప్పుల గోరింటాకు పొడి, గుడ్డులోని తెల్ల సొన, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే నల్లని జుట్టు మీ సొంతం.

ఫైర్ సేఫ్టీ పనిచేయడం లేదు - ఫైర్ ఆఫీసర్..

ఢిల్లీ : ఫిక్కి ఆడిటోరియంలో ఫైర్ సేఫ్టీ మెషిన్స్ పనిచేయడం లేదని ఫైర్ ఆఫీసర్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆడిటోరియంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 37 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. గత రెండు గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫైర్ అధికారి పేర్కొన్నారు. 

ఫిక్కి ఆడిటోరియంలో అదుపులో మంటలు..

ఢిల్లీ : ఫిక్కీ ఆడిటోరియంలో మంటలు అదుపులోకి వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి ఆరంతస్తుల బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 37 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. 

07:32 - April 26, 2016

దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌లకు యూనివర్శిటీ జరిమానా విధించింది. కన్హయ్యకు 10 వేలు, ఉమర్‌కు 20 వేలు ఫైన్‌ విధించింది. దీనితో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు డిపెండెంట్ ఎంపీ, ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్‌మాల్యా రాజ్యసభ నుంచి ఉద్వాసనకు గురికానున్నారు. బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టడమే కాకుండా, తన అప్పుల వివరాలను దాచి ఉంచి, విదేశాలకు పారిపోయిన మాల్యాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని రాజ్యసభ నైతిక విలువల కమిటీ సిఫారసు చేయనుంది. రూ.9,400 కోట్లకుపైగా బ్యాంకు రుణాల ఎగవేత, హవాలా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని నైతిక విలువల కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), బి.వెంకట్ (సీపీఎం), రాకేష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి.

నేడు భారత్, పాక్ కార్యదర్శుల భేటీ..

ఢిల్లీ : భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలకు మరో అడుగు ముందుకు పడింది. అనుకోకుండా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీ ఖరారైంది. ఢిల్లీలో జరిగే 'హార్ట్ ఆఫ్ ఏషియా' ప్రాంతీయ భేటీలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చౌదరి మంగళవారం భారత్‌కు రానున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జై శంకర్‌తో భేటీ కానున్నారు.

 

పీఎస్ఎల్ వీ సీ 33 కౌంట్ డౌన్ కు రంగం సిద్ధం..

నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ33 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 9.20 కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. 

ఖమ్మంకు కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రాత్రి మంత్రి తుమ్మల నివాసంలో బస చేయనున్నారు. రేపు టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

లారీ, ప్రైవేటు బస్సు ఢీ..ఒకరు మృతి..

కర్నూలు : జిల్లా నంద్యాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈఘటనలో ఒకరు మృతి చెందారు.

 

07:15 - April 26, 2016

తెలంగాణలో మంచినీటి సమస్య తీవ్రమైంది. ఓ వైపు గుక్కెడు నీళ్ల కోసం జనం అవస్థపడుతుంటే మరోవైపు బీర్లు, కూల్ డ్రింక్ కంపెనీలకు నీళ్ల కేటాయింపులు పెంచుతున్నారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజుల పాటు సిపిఎం చేసిన అధ్యయనంలో తేలింది. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సమస్యకు కారణం ఏమిటి? ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య ప్రకృతి శాపమా? ప్రభుత్వాల వైఫల్యమా? ఓ వైపు జనం మంచినీళ్లు లేక అవస్థపడుతుంటే, లిక్కర్‌, కూల్‌డ్రింక్‌ కంపెనీలకు పుష్కలంగా నీళ్లు సరఫరా చేయడం సమర్ధనీయమా? మంచినీటి సమస్యకు పరిష్కారం ఏమిటి? మండువేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిందేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో సిపిఎం నేత కుమార్‌ విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

07:12 - April 26, 2016

ఓ వైపు ట్యాంకర్ల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. నీళ్లు కొనుక్కోలేక గుడ్లు తేలేస్తున్నారు. మరోవైపు బీర్ల కంపెనీలకు, కూల్ డ్రింక్ కంపెనీలకు ఇష్టమొచ్చినట్టు అడ్డగోలుగా నీళ్లు సరఫరా చేస్తున్నారు. నీళ్లో రామచంద్రా.... తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే వేదన. ఇదే ఆవేదన. ఎక్కడా నీళ్లు లేవు. తాగాలంటే గుక్కెడు మంచినీళ్లు దొరకడం లేదు. బిందెడు నీళ్ల కోసం ఎన్నెన్నో ప్రయాసలు. ఎన్నెన్నో కష్టాలు. అపర భగీరథ ప్రయత్నాలు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సూర్యాపేట, జగిత్యాల, గద్వాల, సంగారెడ్డి ఎక్కడికెళ్లినా ఒకటే దృశ్యం. అదృష్టం బాగుంటే మూడు రోజులకో నాలుగు రోజులకోసారి ఓ అరగంట నీళ్లొస్తాయి. ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేనిచోట పది పదిహేను రోజులు ఎదురుచూడాలి. మంచినీళ్లొస్తాయో, మురికినీళ్లొస్తాయో చెప్పలేం. ఆ పూటకే అదే అమృతం. అవును. ఇవాళ నీళ్లు అమృతతుల్యంగా మారిపోయాయి. జనం తాగడానికి నీళ్లు దొరకడం లేదు. ఎండిపోయిన జలాశయాలను చూపించి, స్థానిక సంస్థలు మంచినీటి సరఫరాను తగ్గిస్తున్నాయి. కానీ, లిక్కర్ కంపెనీలకు, కూల్ డ్రింక్ కంపెనీలకు నీటి సరఫరా పెరుగుతోంది.

బీర్లు, కూల్ డ్రింక్ ల కంపెనీల మీద ఎందుకంత మమకారం? 
క్రౌన్ బీర్ అనే కంపెనీకి జనవరిలో 1 కోటీ 48 లక్షల 80 వేల లీటర్ల నీళ్లు సరఫరా చేస్తే మార్చిలో 2 కోట్ల 2 లక్షల 61 వేల లీటర్ల నీళ్లు సరఫరా చేశారు. జనవరి కంటే మార్చిలో 54 లక్షల లీటర్ల నీళ్లు అధికంగా ఇచ్చారు. సౌత్ ఏసియా బ్రెవరీస్ కి అంతే. జనవరిలో 1 కోటీ 86 లక్షల లీటర్ల నీళ్లు ఇస్తే, మార్చిలో 2 కోట్ల 30 లక్షల లీటర్ల నీళ్లిచ్చారు. పెప్సికోలాకు ఫిబ్రవరిలో 3 కోట్ల 48 లక్షల లీటర్ల నీళ్లిస్తే, 3 కోట్ల 72 లక్షల లీటర్ల నీళ్లిచ్చారు. కోకాకోలాకు నీటి సరఫరా పెరిగింది. ఓ వైపు గొంతులు పిడచకట్టుకుపోయి జనం చస్తుంటే, మరోవైపు బీర్ల కంపెనీలకు, కూల్ డ్రింక్ కంపెనీలకు కోట్ల లీటర్ల నీళ్లు చేరవేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవలేదు. చలికాలంలోనే సమస్య తీవ్రత అర్ధమైంది. ఎండాకాలంలో వర్షాలు పడవన్న సంగతి అందరికీ తెలుసు. అయినా, బీర్ల కంపెనీలకు, కూల్ డ్రింక్ కంపెనీలకు నీటి కేటాయింపులు పెంచడం బాధ్యతారాహిత్యం కాదా? ప్రజల పట్ల బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా, ముందుచూపు వున్న ఏ ప్రభుత్వమైనా ఈ వేసవిలో మంచినీటి సమస్య తప్పదని తెలిసీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య ప్రకృతి శాపమా? జలవనరుల నిర్వహణా వైఫల్యమా? బీర్లు, కూల్ డ్రింక్ ల కంపెనీల మీద ఎందుకంత మమకారం? 

ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి సుష్మా..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని ప్రైవేటు వార్డులో ఉంచి సుష్మాకు వైద్య చికిత్స అందిస్తున్నారు. సుష్మా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 

06:43 - April 26, 2016

చెన్నై : కలంజర్‌.. అమ్మ.. దళపతి.. కెప్టెన్‌.. అయ్యా.. పురట్చి పుయల్‌, మక్కల్‌ దళపతి... ఇవన్నీ తమిళ రాజకీయ నాయకులకు ఆయా పార్టీల కార్యకర్తలు పెట్టిన పేర్లు. నాయకులను ఇదే పేర్లతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. వింటానికి విచిత్రంగా ఉన్నా... ఈ పేర్ల వెనుక ఎంతో సామాజిక, చారిత్రక నేపథ్యం ఉంది. తమిళనాట ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పురస్కాల్లాంటి తమిళ నేతల పేర్లపై 10 టీవీ ప్రత్యేక కథనం.

కరుణానిధి..స్టాలిన్..
డీఎంకే అధినేత కరుణానిధికి తమిళనాడు రాజకీయాల్లో అపరచాణక్యుడుగా పేరు ఉంది. పార్టీ కార్యకర్తలందరూ ఈయన్ను కలంజర్‌ పేరుతో పిలుస్తారు. కరుణానిధి నాటకాల నుంచి వచ్చిన నేత. రచయితగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో మహానేత అన్నాదురై.. డీఎంకే అధినేత కరుణానిధికి కలంజర్‌ అని పేరు పెట్టారు. కలంజర్‌ అంటే కళాకారుడని అర్ధం. ఇప్పటి వరకు కూడా ఇదే పేరుతో వర్ధిల్లుతున్నారు.
ఇక పార్టీని తన కనుసన్నల్లో నడిపించే ఏఐఏడీఎంకే అధినేత జయలలితను పార్టీ నేతలు, కార్యకర్తలు అమ్మగా పిలుచుకుంటున్నారు. జయలలితకు కూడా ఇలా పిలిపించుకోవడమే ఇష్టం. దీంతో అమ్మగా ముద్ర పడ్డారు. పార్టీలో రెండోస్థానంలో ఉన్న డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్‌కు దళపతిగా పేరుంది. దళపతి అంటే నాయకుడు, సైనికుడని అర్ధం. తెలుగు సంతతికి చెందిన నటుడు విజయ్‌కాంత్‌ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కెప్టెన్‌ ప్రభాకర్‌ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో డీఎండీకే అధినేతగా రాజకీయాల్లో కూడా ఆయన ఇదే పేరుతో కొనసాగుతున్నారు. తెలుగు సంతతికే చెందిన మరో నేత వైగో. ఎండీఎంకే పార్టీ అధినేతగా ఉన్న వైగో మొదట్లో డీఎంకేలో ఉండేవారు. అప్పట్లో కరుణానిధి వైగోకు పెట్టిన పేరు పురుట్చి పుయల్‌... అంటే విప్లవ నాయకుడని అర్ధం. ఎండీఎంకే పార్టీ పెట్టిన తర్వాత కూడా వైగో పురుట్చి పుయల్‌ పేరుతోనే కొనసాగుతున్నారు.

ముద్దు పేర్లు...
పీఎంకే అధినేత రాందాస్‌ను మరుత్తువర్‌ అయ్యా.. పేరుతో పిలుస్తారు. ఈయన కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌ను చిన్న అయ్యాగా పిలుస్తారు. టీఎంసీ పార్టీ పెట్టిన కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌ను మక్కల్‌ దళపతిగా పిలుస్తారు. అంటే ప్రజా సైన్యాధ్యక్షుడని అర్ధం. ఈయన తండ్రి జీకే మూపనార్‌ను మక్కల్‌ తలైవర్‌గా పిలిపించుకున్నారు. అంటే ప్రజల నేత అని అర్ధం. ఇలా తమిళనాట ఎక్కువ మంది పార్టీ నేతలు ఎదో ఒక ముద్దు పేరుతో కొనసాగుతున్నారు.

06:39 - April 26, 2016

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు సీఆర్డీఏ శ్రీకారం చుట్టనుంది. ప్లాట్ల కేటాయింపు విధానాన్ని ఖరారు చేసిన అధికారులు....ఇందుకు సంబంధించిన సమాచార పత్రాలను విడుదల చేశారు. రాజధాని గ్రామాల్లోని భూసమీకరణ కార్యాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచారు. గ్రామాలకు రాలేనీ రైతులు ఆన్‌లైన్‌లో సమాచార పత్రాలను చదువుకొని పాట్ల ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించారు. భూములిచ్చిన రైతులకు నివాస, వాణిజ్య స్థలాలు ఇస్తారు. రైతులు ఇచ్చిన భూములను బట్టి నివేశన స్థలం 120 గజాల నుంచి 4,800 చదరపు గజాలుగా నిర్ణయించారు. వాణిజ్య స్థలాల కనీస సైజు 30 గజాల నుంచి గరిష్టంగా 4,800 చదరపు గజాలు ఉంటుంది. స్థలాలను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించారు. రైతులు ఎంపిక చేసుకున్న ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్ల కేటాయింపు విధాన ప్రకటన వెలువడిన 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రైతులకు ఇచ్చే ప్లాట్ల విస్తీర్ణాన్ని బట్టి నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. స్థలం 100 మీటర్లకు లోపు ఉటే జీ ప్లస్‌ 3కి భవన నిర్మాణాలకు వీలు కల్పిస్తారు. 300 నుంచి 500 మీటర్ల లోపు ఉంటే జీ ప్లస్‌ 5కు అనుమతి ఇస్తారు. 2 వేల నుంచి 4 వేల చదరపు మీటర్ల లోపు ఉన్న స్థలాల్లో జీ ప్లస్‌ 11 అంతస్థులు నిర్మించుకునే వీలు కల్పిస్తారు. అమరావతి రైతులకు ఇచ్చే ప్లాట్లలో జీ ప్లస్‌ 3, జీ ప్లస్‌ 5 విభాగాల్లో 60 శాతం వరకు ఉంటాయని లెక్క తేల్చారు. మిగిలినవి ఇతర కేటగిరీల్లోకి వస్తాయి. 

06:37 - April 26, 2016

హైదరాబాద్ : సమగ్ర సర్వేకు సన్నద్ధమవుతోంది ఏపీ సర్కార్‌. ఐదు కోట్ల మంది సమాచారాన్ని సేకరించి ఒకే చోట చేర్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. పీపుల్స్ హబ్‌ పేరుతో ప్రజల పూర్తి వివరాలను క్రోడీకరించేందుకు త్వరలోనే ఇంటింటా సర్వే నిర్వహించబోతోంది. సంక్షేమ పథకాలు అందిరికీ అందించేందుకు, అక్రమార్కుల భరతం పట్టేందుకు ఈ సర్వే ఉపయోగపడనుందని ఏపీ సర్కార్‌ భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చేయడంతో పాటు అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతోంది.
ఏపీలో సుమారు ఐదు కోట్ల జనాభా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రేషన్‌ కార్డులున్న వారి సంఖ్య ఆరు కోట్లు. జనాభాకు, రేషన్‌ కార్డులకు ఇంత వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో.. బోగస్‌ కార్డులను ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే గృహనిర్మాణ శాఖలోనూ బోగస్‌కు తావు లేకుండా చూడాలని భావిస్తోంది. ప్రభుత్వ శాఖల్లోని పలు పథకాల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపాలంటే సమగ్ర సర్వే తప్పనిసరని ప్రభుత్వం నిర్ణయించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పీపుల్స్‌ హబ్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పథకాలు, వంటగ్యాస్‌ లబ్దిదారులు, ఏ సామాజిక వర్గంలో ఎంతమంది జనాభా ఉన్నారనే వివరాలను క్రోడీకరించనుంది. ఆధార్‌ అనుసంధానంతో మరింత పారదర్శకతను పెంపొందించాలని సర్కార్‌ యోచిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వాధికారులు వెళ్లి సమాచారాన్ని సేకరించనున్నట్లు సమాచారం. పీపుల్స్‌ హబ్‌ ఏర్పాటుకు ఇప్పటికే ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపడంతో త్వరలోనే ప్రాజెక్టను పట్టాలెకెక్కించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. 

06:32 - April 26, 2016

హైదరాబాద్ : మంత్రివర్గంలోకి ఏరికోరి తెచ్చుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. తలసాని శాఖ మార్పుకు కారణాలేంటి?. ప్రాధాన్యతలేని పశుసంర్ధక, పాడి, మత్స్య పరిశ్రమాల శాఖను తలసానికి అప్పగించడం వెనక ఉన్న ఆంతర్యమేంటి? సామాజిక ప్రసార మాధ్యమాల్లో అనుచరగణం చేసిన అతి ప్రచారమే తలసాని కొంపముంచిందా? ఈ ప్రశ్నలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆదాయ సముపార్జన శాఖల్లో వాణిజ్య పన్నులదే కీలకం. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. నిర్ణీత లక్ష్యంలో 94 శాతానికి చేరుకుంది. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌...ఈ శాఖ బాధ్యతల నుంచి తలసానిని ఎందుకు తప్పించాలన్న అంశం ఎవరికీ అంతుపట్టడంలేదు. అయితే వాణిజ్య పన్నులపై వస్తున్న అవినీతి ఆరోపణలతో తలసానిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారని సమాచారం. తలసానికి వ్యతిరేకంగా నిఘా వర్గాలు రూపొందించిన నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఈయనకు ప్రాధాన్యతలేని పాడి, మత్స్య పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖలు కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

అంటీముట్టనట్లు...
ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను కొందరు బడా బాబులు ఎగవేస్తున్నా... తలసాని అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిఘా వర్గాల నివేదికలో ఇదే విషయం ఉంది. కొందరు అధికారులు, నాయకులు కూడపలుకున్ని ఎగవేతదారులతో లాలూచీపడి అక్రమార్జన చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ విషయంలో తలసాని కూడా చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో ఆయనను వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించారని సమాచారం. కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించిన తలసాని... రాష్ట్రం మొత్తానికి కాకుండా హైదరాబాద్‌కే పరిమితమయ్యారన్న వాదనలున్నాయి. అదికూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజవర్గానికే మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇది నచ్చకపోవడంతోనే ఆయన శాఖ మార్చినట్టు వినిపిస్తోంది.

తరచూ మీడియా సమావేశాలు..
ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా స్పదింస్తూ తలసాని తరచు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. తలసాని పేషీలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిపై కూడా ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. పేషీని ప్రక్షాళన చేయాలని ఆదేశించినా.. పట్టించుకోలేదని వినిపిస్తోంది. పైగా తన అనుచరగణంతో సామాజిక ప్రసార మాధ్యమాల్లో అనుకూలంగా సందేశాలు ఇప్పించుకున్నట్టు కూడా కేసీఆర్‌ దృష్టికి వెళ్లింది. దీంతో శాఖను మార్చితే సెట్‌రైట్‌ అవుతారన్న ఉద్దేశంతో వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తలసానిని తప్పించినట్టు సమాచారం. కేవలం మీడియా కోసమే పనిచేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులకు వార్నింగ్‌ ఇచ్చేందుకు కూడా తలసాని శాఖ మార్పు వ్యవహారం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. 

06:30 - April 26, 2016

హైదరాబాద్ : ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడం చిల్లర మల్లర రాజకీయాలు కాదని.. తెలంగాణ పునరేకీకరణలో భాగమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ దశ, దిశ నిర్దేంచుకునే కీలక సందర్భంలో రాజకీయ పునరేకీకరణ చారిత్రక అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారితో పాటు ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో టిఆర్ఎస్ లో చేరిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్మిక, విద్యార్థి, యువజన విభాగాలకు చెందిన కార్యకర్తలకు సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడం చిల్లర మల్లర రాజకీయాలు కాదని.. తెలంగాణ పునరేకీకరణలో భాగమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు ఈ ఏడాది చివరికల్లా మిషన్ భగీరథ కింద తాగునీటిని సరఫరా చేస్తామన్నారు సీఎం కేసీఆర్. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచు భూమికీ సాగునీరు అందిస్తామన్నారు. తాజా చేరికలతో ఖమ్మం, మెదక్ జిల్లాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయన్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కలిసిరావాలని మరోసారి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు కవిత, నర్సయ్య గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

06:28 - April 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ మంత్రుల శాఖల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మంత్రి వర్గంలో ఐదుగురు మంత్రుల శాఖలు మారాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన తర్వాత తన దగ్గర ఉన్న మున్సిపల్‌ శాఖను కేటీఆర్‌కు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి... పరిశ్రమల శాఖను కట్టబెట్టారు. ఇప్పటి వరకు జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పరిశ్రమల శాఖ ఇప్పడు కేటీఆర్‌ సొంతమయ్యింది. దీనికి బదులుగా కేటీఆర్‌ దగ్గరున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను జూపల్లికి అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు దగ్గర ఉన్న గనులు శాఖను కూడా కేటీఆర్‌కు అప్పగించారు. దీంతో కేటీఆర్‌కు డబుల్‌ ప్రమోషన్‌ కల్పించినట్టు అయ్యింది. గనుల శాఖను తన దగ్గర నుంచి తప్పించాలని హరీష్‌రావు గతంలోనే ముఖ్యమంత్రిని కోరారు. హరీష్‌రావు ఇప్పుడు ఇరిగేషన్‌తోపాటు... మార్కెటింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖలను నిర్వహిస్తారు. కేటీఆర్‌ ఐటీతోపాటు పరిశ్రమలు, మైనింగ్‌ శాఖలను నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌ దగ్గరున్న మిషన్‌ భగీరథను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్నారు. తన స్వీయపర్యవేక్షణలో మిషన్‌ భగీరథను నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించుకుని ఈ మార్పు చేశారు.

త్వరలో ఉద్వాసన ? 
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దగ్గరున్న వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఖజానా నింపే ఈ శాఖపై తలసాని పట్టు సాధించలేకపోవడంతో ఆయన్ను ఈ శాఖ నుంచి తప్పించి పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమల శాఖలు అప్పగించారు. ఇంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దగ్గర ఉన్న ఈ శాఖలను ఇప్పుడు తలసానికి కట్టబెట్టారు. పోచారంకు వ్యవసాయ శాఖకు తోడు సహకార శాఖ అప్పగించారు. మంత్రుల శాఖలను మార్పులకు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపడం, నరసింహన్‌ ఆమోదించిన వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఒకేవిధమైన శాఖలు ఒకే మంత్రి దగ్గర ఉంటే సమన్వయం సాధించడంతోపాటు, మంచి ఫలితాలు సాధించొచ్చన్న ఉద్దేశంతో కేసీఆర్‌ ఆ మార్పులు, చేర్పులు చేశారాని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కేవలం శాఖల మార్పుతోనే సరిపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... వచ్చే నెలలో చేపట్టే మంత్రివర్గ పునర్వస్థీకరణలో కొందరికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

06:23 - April 26, 2016

నెల్లూరు : జిల్లా కావలి మండలం గౌరారం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 15మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి ఓ ఆర్టీసీ బస్సు నెల్లూరు వెళ్తోంది. మొత్తం 45 మంది ప్రయాణీకులున్నారు. గౌరారం వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న వెంకటేశ్వర్లు, రత్నం ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందారు. గాయపడిన 15 మందిని కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించడం..నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

06:19 - April 26, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫిక్కీ ఆడిటోరియంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆరంతస్తులున్న ఈ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 37 అగ్నిమాపక యంత్రాలతో అక్కడకు చేరుకున్నారు. మ్యూజియంలోని పై అంతస్తులో మొదలైన మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపు చేస్తున్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. లుట్యేన్స్ ఢిల్లీలోని తాన్‌సేన్ రోడ్డులో ఉన్న ఈ భవనం పై అంతస్థులో మంటలు ప్రారంభమైనట్లు, అతి తక్కువ సమయంలోనే వేగంగా ఇతర అంతస్థులకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రదర్శన శాల 1978 జూన్ 5 నుంచి పని చేస్తోంది. మ్యూజియంలో ఉన్న పలు విలువైన దస్త్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ప్రమాదం గల కారణాలు తెలియరాలేదు. 

నేడు ఢిల్లీకి టి.కాంగ్రెస్ బృందం..

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను నేతలు కలువనున్నారు. కోడ్ అమలులో ఉన్నా టీఆర్ఎస్ ప్లీనరీకి అనుమతి ఇవ్వడంపై సీఈసీకి ఫిర్యాదు చేయనుంది. 

ఢిల్లీలో వైసీపీ షెడ్యూల్..

ఢిల్లీ : దేశ రాజధానిలో వైసీపీ నేతలు పర్యటిస్తున్నారు. ఉదయం 10.30గంటలకు శరద్ పవార్..మధ్యాహ్నం 12గంటలకు ఏచూరి..1గంటకు రాజ్ నాథ్..రాత్రి 7.15 గంటలకు శరద్ యాదవ్ తో జగన్ బృందం సమావేశం కానుంది. 

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఇద్దరు మృతి..

నెల్లూరు : జిల్లా కావలి మండలం గౌరారం వద్ద సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. 

Don't Miss