Activities calendar

27 April 2016

21:32 - April 27, 2016

విజయవాడ : ఒకపక్క సేవ్ డెమోక్రసీ పేరుతో జగన్‌ ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలను కలుస్తుండగానే.. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సైకిలెక్కేశారు. దీంతో జగన్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన వారి సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం టిడిపిలో ఎంత మంది చేరారు అనే దానికన్నా వైసీపీలో ఇంకెన్ని వికెట్లు పడతాయి... అనే విషయంపైనే చర్చ సాగుతోంది.

సైకిలెక్కిన గొట్టిపాటి...

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీని వీడి సైకిలెక్కేశారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో గొట్టిపాటి రవి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. గొట్టిపాటితోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పలువురు నేతలు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. గొట్టిపాటి చేరికతో వైసిపి నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 14కు చేరుకుంది. సిఎం చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి పనులను చూసే పార్టీలో చేరుతున్నామని రవికుమార్‌ అన్నారు. చంద్రబాబు బాటలో నవ్యాంధ్ర సాధన కోసం కష్టపడతానని అన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చికొనే దుష్ట సంస్కృతి టిడిపిలో లేదని కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వైసిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. జైలుకెళ్ళివచ్చిన నేతలు కూడా తనపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తా...

రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తైతే ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలన్నీ సస్యశ్యామలమవుతాయని చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఒకటి, రెండు నెలల్లో అభివృద్ధిచేసిన ప్లాట్లను అందజేస్తామన్నారు. ఇష్టానుసారంగా రాష్ట్ర విభజన చేయడం ద్వారా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, సమస్యలన్నిటినీ అధిగమిస్తూ అభివృద్ధి సాధించుకోవాలని, అందుకు అందరూ సహకరించాలని చంద్రబాబు కోరారు. 

21:30 - April 27, 2016

హైదరాబాద్ : బంగారు తెలంగాణను సాధించినదాకా నిద్రపోనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కలలు కనడమే కాదు ఆ కలలను సాకారం చేసుకున్నప్పుడే అందరిచేత గుర్తింపు పొందుతామని కెసిఆర్ ఖమ్మం బహిరంగ సభలో అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని ప్రజలు.. ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిగా ఉండాలన్నారు. మే ఆఖరు నాటికి కార్యకర్తలకు దాదాపు 4 వేల పదవులు రాబోతున్నాయని చెప్పారు.

5 వేల మంది ప్రతినిధులు..

టిఆర్‌ఎస్ ప్లీనరీతో ఖమ్మం నగరం గులాబి తోటలా విరబూసినట్లైంది. 5 వేల మంది ప్రతినిధులు, కార్యకర్తల రాకతో నగరం కళకళలాడింది. యావత్ టిఆర్ఎస్‌ పార్టీ అంతా ఒక్కచోట చేరిందా అన్నట్లు ఖమ్మం శోభిల్లింది. వేలాది మంది అతిథులు.., వివిధ అంశాలపై ప్రసంగాలు, రకరకాల వంటలతో భోజనాలు., ఇలా ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది టీఆర్ఎస్‌ ప్లీనరీ సమావేశం.

నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో ...

నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో తెలంగాణ రాష్ట్రసమితి ప్లీనరీ ప్రారంభ సూచికగా.. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం కెసిఆర్‌...రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పడ్డ కష్టాలను సాధించాల్సిన లక్ష్యాలను గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ధీరులుగా వ్యవహరించిన ఘనులు లక్షలాది మంది కార్యకర్తలేనన్నారు. ఇవాళ సొంత రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరామని గుర్తుచేశారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌ ఎన్నికల్లో 99 స్థానాలు ...

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచామని ఇంతటి అసాధారణ తీర్పు గతంలో ఎప్పుడూ చూడలేదని కెసిఆర్ అన్నారు. ప్రజల ఆదరణ పొందేలా పనితీరు ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని ప్రజలు.. ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిగా ఉండాలని కోరారు. సంక్షేమ రంగానికి 35 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలంగాణను మాగాణం చేసుకునేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నామని వివరించారు. మే ఆఖరు నాటికి కార్యకర్తలకు దాదాపు 4 వేల పదవులు రాబోతున్నాయని చెప్పారు. సాధించిన విజయాలతోనే ఆగక బంగారు తెలంగాణ సాధించేదాకా అవిశ్రాంతంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణకు జలకళ తేవడం కోసమే ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌ చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాను సాధించుకుని.. అన్ని ఎకరాలకూ నీటిని పారిస్తామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని లాంటిదని దీని ద్వారా 5 జిల్లాలు సస్యశ్యామలం కాబోతున్నాయన్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచనగరంగా..

హైదరాబాద్‌ను ప్రపంచనగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్న సీఎం కలలను నిజం చెయ్యాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమగ్రమైన ప్రణాళికతో నగరాభివృద్ధిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేద్దామని కెటిఆర్ పిలుపునిచ్చారు.

15 తీర్మానాలు ఆమోదం..

ఈ ప్లీనరీలో 15 తీర్మానాలను చర్చించి ఆమోదించారు. అతిథులకు ఏకంగా 50 రకాల ఆహార పదార్థాలతో నిర్వాహకులు మృష్టాన్న భోజనం వడ్డించారు. సమావేశంలో ఆహూతులకు ఎండల వేడి నుంచి రక్షణ కల్పించేందుకు ఎయిర్ ఫాగింగ్ యంత్రాలను అమర్చి చల్లదనాన్ని కల్పించారు. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ప్లీనరీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. 

తిరుపతిలో పోలీసుల కూంబింగ్

తిరుపతి : గరంలోని భూపాల్‌ హౌసింగ్‌ కాలనీ దగ్గర అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్మగ్లర్లలో ఇద్దరు స్థానికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి 20 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

20:46 - April 27, 2016

రాకెట్ ఎగరేయడమే కాదు, మనిషికి ఊపిరి కూడా పోస్తామంటున్నారు! అంతరిక్షం అంచును చూడడమే కాదు, గుప్పెడంత గుండెను మార్చడం చేస్తామని చెప్తున్నారు. అవయవాలను మార్చడం కొత్త విషయం ఏమీ కాదు, కళ్లు, కాళ్లు, కిడ్నీలు, లివర్, ఆఖరికి మనిషి గుండె కాయను కూడా ఎడాపెడా మార్చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకనాటి అసాధ్యాలు ఎన్నో నేడు సుసాధ్యాలు అని తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నే వాడు ఉన్నట్లు ఏకంగా గుండెకాయనే తయారు చేస్తామని అంటున్నారు. అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్ లో సంచలనం కలిగిస్తున్న అంశం ఇది. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:20 - April 27, 2016

ఖమ్మం : కలలు కనే సాహసం ఉండాలని, కలలను సాకారం చేసుకునే శక్తి ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో టిఆర్ ఎస్ ప్లీనరీ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ' విద్యుత్ ఛార్జీల బాదుడు బషీర్ బాగ్ కాల్పుల తర్వాత కల చెందా, 2001లో ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా, చాలా మంది ఉద్యమంలో పాల్గొని తర్వాత పదవులకుఅ మ్ముడుపోయారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ తెచ్చిన గొప్పతనం ముందుఈ సీఎం పదవి నాకు గొప్ప కాదు, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మరొకరికి అప్పగిస్తే మళ్లీ మోసపోయే అవకాశం ఉంటుందని ఆ బాధ్యతను నేను తీసుకున్నా. ఇంటింటికీ మంచినీరు అందించకపోతే మళ్లీ ఓట్లు అడగమని చెప్పిన పార్టీ దేశంలోనే లేదు. ఆనాడు మన నినాదం నీరు, నిధులు, నియామకం. తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నియామకాల బాధ తీరింది.సాగునీటి బాధ ఒక్కటే తీర్చాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు వచ్చే ప్రాజెక్టు ను ప్రారంభించినట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో టిఆర్ ఎస్ అభ్యర్థి తుమ్మలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బం గారు తెలంగాణ సాధన కోసం ప్లీనరీ సందర్భంగా సమరంఖితం చేసుకుంటామని హామీ ఇచ్చారు.

19:13 - April 27, 2016

ఖమ్మం: కేసీఆర్ ఇరిగేషన్ ప్రజెంటేషన్ ను దేశం ప్రసంసించిందని అన్నారు హరీష్ రావు . రానున్నరోజుల్లో ఉత్తర తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు హరీష్ రావు . మేం నీళ్లందిస్తే ప్రతిపక్షాలను ప్రజలు మర్చిపోతారని భయపడుతున్నారన్నారు. దేవాదుల రీ డిజైనింగ్ ద్వారా 5 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయన్నారు హరీష్ రావు. మహబూబ్ నగర్ జిల్లాలో రివర్స్ మైగ్రేషన్ జరగాలన్నదే సీఎం కల అన్నారు హరీష్ రావు. వలసలు వెళ్లిన వారు తిరిగి రావాలని ఆకాంక్షించారు. తనకు ఇరిగేషన్ శాఖ ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం గారికి జీవితాంతం రుణపడి ఉంటాననిఅన్నారు హరీష్ రావు.  

పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష 'కీ' విడుదల

హైదరాబాద్ : హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ప్రాథమిక ‘కీ’ని WWW.TSLPRB.IN వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను ఈ నెల 30 సాయంత్రం 5 గంటల లోపు మెయిల్ చేయవచ్చు. అభ్యంతరాలను KEYOBJECTIONS_PC@TSLPRB.IN మెయిల్‌కు పంపాలి.

ముగిసిన టిఆర్ఎస్ ప్లీనరీ

ఖమ్మం: టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ముగిసింది. ప్లీనరీలో అన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ పది కాలాల పాటు ఉండాలని, పార్టీ పటిష్టత కోసం తోచినంత విరాళం ఇవ్వాలని టిఆర్ ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తలసానికి ప్రాధాన్యం తగ్గిచామనడం సరికాదన్నారు. తలసాని ప్రజా నాయకుడని, తలసానికి పని ఎక్కువగా ఉండే శాఖలు కేటాయించామన్నారు. వాణిజ్య పన్నుల శాఖతో ప్రజలకు సంబంధం ఉండదని,శాఖ మార్పుపై తలసానితో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మున్సిపల్ శాఖపై చంద్రబాబు సమీక్ష

విజయవాడ : మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత, కుక్కల నివారణ, మంచినీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్వహణపై సమీక్ష చేశారు.

18:27 - April 27, 2016

విశాఖ : గాజువాక ఇండస్ట్రియల్‌ సెజ్ లోని బయోమాస్ ఫ్యాక్టరీ పేలుడుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే తరచుగా విశాఖ జిల్లాలోని పలు పరిశ్రమలలో ప్రమాదాలు జరుగుతున్నాయని విశాఖ నగర సీపీఎం కార్యదర్శి గంగారం ఆరోపించారు. వారం క్రితమే దివీస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారని..ఇప్పుడు బయో మాస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు ఆయన. 

మైనింగ్ లీజుల కోసమే మైసూరా టీడిపిలోకి : పెద్దిరెడ్డి

ఢిల్లీ : మైనింగ్ లీజుల కోసమే మైసూరా టీడీపీలో చేరుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన

గుంటూరు : మంగళగిరిలో దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పరీక్ష రాయలేకపోయామని కళాశాల ఎదుట 50 మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఫ్రీ కోచింగ్ పేరుతో తమను ఇతర ప్రాంతాలకు తరలించి పరీక్షా కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించలేదని వారు ఆరోపిస్తున్నారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్...

హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుగున్న ముఠాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పాతబస్తీ షాహినాద్ గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘోడేకి ఖబర్ సమీపంలో గురువారం దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 75 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మరో వ్యక్తి పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

18:07 - April 27, 2016

విశాఖ : దువ్వాడ సెజ్‌లో అగ్నీకీలలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి... మంటలతో 12 ట్యాంకర్లు కాలిపోయాయి.. మిగిలిన ట్యాంకర్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.. ఫోమ్‌ పైరింజన్లద్వారా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. నేవీ హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. మంటలు సాయంత్రానికి అదుపులోకి వచ్చే అవకాశముందని కలెక్టర్‌ యువరాజ్ చెప్పారు.. ఇప్పటివరకూ దాదాపు 200 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.. 

'తుని నిందుతులను త్వరలో అరెస్ట్ చేస్తాం'

విజయవాడ: తుని ఘటనలో విచారణ పూర్తి చేశామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డీజీపీ రాముడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ అప్పా తరహాలో అమరావతిలో 2, 200 ఎకరాలలో పోలీసు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. కొత్త ఐపీఎస్‌ల కోసం కేంద్రానికి నివేదిక పంపామని, మంజూరు కాగానే అమరావతి కమిషనరేట్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు ఆయుధ కర్మాగారాన్ని మంగళగిరికి తరలిస్తామని ఆయన తెలిపారు.

17:36 - April 27, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. బిజెపి రాష్ట్ర ప్రతినిధులతో కలిసి లక్ష్మణ్‌... చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌శర్మతో భేటీ అయ్యారు. రాష్ట్ర కరువు పరిస్థితులపై వివరించి ప్రజలను ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరారు. 

17:34 - April 27, 2016

హైదరాబాద్ : గుడుంబా, పేకాట రహిత సమాజం, శాంతిభద్రతల అంశంపై టిఆర్ఎస్ ప్లీనరీలో డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. 

17:27 - April 27, 2016

ఢిల్లీ : ఉత్త‌రాఖండ్‌లో రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగించాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. శాస‌న‌స‌భ‌లో ఈనెల‌ 29న బ‌ల నిరూప‌ణ లేద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ కేంద్రం వేసిన పిటిష‌న్‌పై ఈరోజు వాద‌న‌ల‌ను విన్న సుప్రీం రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌కుముందు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపు అంశంపై కేంద్రంపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ఈ కేసుతో ఉత్తరాఖండ్ సీఎస్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి ఒక కారణం అయ్యిందా..? అంటూ సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. 

దువ్వాడ సెజ్‌లో ఇంకా అదుపులోకి రాని మంటలు

విశాఖ : దువ్వాడ సెజ్‌లో అగ్నీకీలలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి... మంటలతో 12 ట్యాంకర్లు కాలిపోయాయి.. మిగిలిన ట్యాంకర్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.. ఫోమ్‌ పైరింజన్లద్వారా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. నేవీ హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. మంటలు సాయంత్రానికి అదుపులోకి వచ్చే అవకాశముందని కలెక్టర్‌ యువరాజ్ చెప్పారు.. ఇప్పటివరకూ దాదాపు 200 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.. 

విశాఖలో మూడు ఐపీఎల్ మ్యాచ్ లు

విశాఖపట్నం: ఉక్కు నగరం విశాఖలో మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 10,17,21 తేదీల్లో విశాఖలో మ్యాచ్‌లు జరుగుతాయి. విశాఖను హోం గ్రౌండ్‌గా పుణె జట్టు ఎంచుకుంది.

17:19 - April 27, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. హెలిక్యాప్టర్ల కొనుగోళ్లకు సంబంధించి ఇటలీ కంపెనీ అగస్టా వెస్ట్‌లాండ్‌తో తానెలాంటి తప్పుడు పనులు చేయలేదని తెలిపారు. దీనిపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని సోనియా పేర్కొన్నారు. ఏవైనా తప్పులు జరిగితే రెండేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్టీయే ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిజాన్ని బయట పెట్టాలని ఆమె స్పష్టం చేశారు.  

17:18 - April 27, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ పై రాజ్యసభ్యలో దుమారం చెలరేగింది. ఆగస్టా కుంభకోణంపై ఎన్డీయే తరుపున నూతనంగా రాజ్యసభ సభ్యత్వం పొందిన సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆరోపణలు చేశారు. అగస్టాకు సంబంధించి సోనియా పేరు ఉన్నట్లు మధ్యవర్తి క్రిశ్చన్‌ మిశేల్‌ ఇటలీ కోర్టులో రాత పూర్వకంగా ఇచ్చారని స్వామి ఆరోపంచారు. సోనియా పేరు తీసుకోవడంతో కాంగ్రెస్ ఎంపీలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. సోనియా సభలో లేనందున, అగస్టా కుంభకోణంలో ఆమె పేరును ఊటంకించరాదని డిప్యూటీ చైర్మెన్ పీజీ కురియన్ రాజ్యసభలో సూచించారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది.

17:16 - April 27, 2016

ఢిల్లీ : వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన జగన్ వరుసగా జాతీయ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అరుణ్‌జైట్లీతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకరస్థితిలో ఉందని మీరు కల్పించుకుని డెమోక్రసీని కాపాడాలని కోరారు. 

17:13 - April 27, 2016

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రెండు లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం లోపే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ కాస్ట్ రూ. ఐదు లక్షల నాలుగు వేలు. పట్టణ ప్రాంతాల్లో యూనిట్ కాస్ట్ రూ.ఐదు లక్షల ముప్పైం వేలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో యూనిట్ కాస్ట్ 7 లక్షలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మౌలిక వసతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.లక్షా 25వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

17:11 - April 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని.. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఆయన12 సూచనలతో రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ దృష్టికి తీసుకువచ్చి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. అన్నిమండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. కరువు గుర్తించడానికి ఉపయోగిస్తున్న ప్రమాణాలను సవరించాలి. అన్ని గ్రామాల్లో రెయిన్ గాజిల్ పరికరాలు ఉండాలి. పంటనష్టానికి ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలి. కరువు ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పశువులకు నీరు, మేత అందుబాటులో ఉండాలి, ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగే చూడాలని, బకాయి ఉన్న కూలీ వేతనాలు చెల్లించాలని, మిడ్డే మీల్స్ ను ఆసరా లేని వృద్ధులకు, పిల్లలు, వికాలంగుకు అందజేయాలి, ఒంటరి మహిళల కు సహాయం అందించాలని, అందరి రైతుల వద్ద నుండి బ్యాంకులు ఇన్సూరెన్స్ లు తిరిగి చెల్లించాలని లేదా పంట నష్టపరిహాం ఇవ్వాలని, కృష్ణా, గోదావరి నదులను చెరువులతో అనుసంధానం చేయాలి, పంటకు ముందుగానే ధరనిర్ణయించాలని, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపించాలని, చెరుకు పంట విస్తకరణ చేయాలని, రుణమాఫీని ఒకే విడత లో చెల్లించాలని సీఎస్ తెలియజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశించినట్లు పేర్కొన్నారు. ఈ నివేదికను ఇతర ప్రజాసంఘాలతో కలిసి చర్చించనున్నట్లు తెలిపారు. డిమాండ్ల రూపకల్పనలో ఉమ్మడి కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేడు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 56.82 పాయింట్లు లాభపడి 26,064.12 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17.25పాయింట్లు లాభపడి 7,979.90 పాయింట్ల వద్దకు చేరింది.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు : సుప్రీం

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన మే3 వరకు కొనసాగుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈనెల 29న అసెంబ్లీలో బలపరీక్ష ఉండదని, ఉత్తరాఖండ్ సంక్షోభంపై తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసినట్లు సుప్రీం తెలిపింది.

ఆర్థిక ఇబ్బందులున్నా రుణా లమాఫీ చేశాం :సీఎం చంద్రబాబు

విజయవాడ : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా వ్యవసాయ, డ్వాక్రా రుణా లమాఫీ చేశాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు బాధ్యత తనదే నని పేర్కొన్నారు. చెక్ డ్యాంలు, పంటకుంటలతో కరువు దూరం చేస్తానన్నారు. రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాల ఇవ్వడం గొప్ప విషయమన్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని విపక్షం ప్రచారం చేయడం దుర్మార్గం అని బాబు మండిపడ్డారు. రాజధాని రైతులకు ఒకటి లేదా రెండు నెలల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు.

ఒడిశా సీఎం ఛాంబర్ లో అగ్ని ప్రమాదం..

భువనేశ్వర్‌: ఒడిశా అసెంబ్లీలో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఛాంబర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపకసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం ఛాంబర్‌లోని టీవీకి ఏర్పాటుచేసిన సెట్‌టాప్‌ బాక్స్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. టీవీ, కొంత ఫర్నిచర్‌ ధ్వంసమైనట్లు చెప్పారు. అయితే ఛాంబర్‌లో ఉన్న డాక్యుమెంట్లు మాత్రం భద్రంగా ఉన్నట్లు బీజేడీ ఎమ్మెల్యే దేవశీష్‌ నాయక్‌ తెలిపారు.

15:24 - April 27, 2016

ఖమ్మం : విశ్వనగరంగా హైదరాబాద్ - రాష్ట్రంలో పట్టణాభివృద్ధి తీర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. ఖమ్మం లో జరుగుతున్న టిఆర్ ఎస్ ప్లీనర్ సమావేశం తెలంగాణ మంత్రి కేటీఆర్ తీరానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజల మనస్సులను టీఆర్‌ఎస్ గెలుచుకుందన్నారు. ఈ తరుణంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గానూ 99 డివిజన్లలో గెలుపొందామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ నగరంలో స్థానికేతరులను ఉండనివ్వరని, పెట్టుబడులు తరలిపోతాయని, ఐటీ పరిశ్రమ కుదేలవుతుందని దుష్ప్రచారం చేశారు.కానీ పెట్టుబడులు అధికంగా వస్తున్నాయన్నారు. స్థానికేతరులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి సంకల్పించామని చెప్పారు. హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం రూ. 20 వేల కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. మూసీ తీరం వెంబడి సిక్స్‌లైన్ స్కైవే నిర్మిస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఇప్పటి వరకు లక్షా 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. గూగుల్, అమెజాన్, ఉబేర్ లాంటి ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రావు బలపరిచారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రెండు లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం లోపే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ కాస్ట్ రూ. ఐదు లక్షల నాలుగు వేలు. పట్టణ ప్రాంతాల్లో యూనిట్ కాస్ట్ రూ.ఐదు లక్షల ముప్పైం వేలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో యూనిట్ కాస్ట్ 7 లక్షలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

14:51 - April 27, 2016

చిత్తూరు : జిల్లా తోటపాలెంలో పాత భవనం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.. భవనం కూలి ఓ వ్యక్తి మృతిచెందగా... ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

14:49 - April 27, 2016

విజయవాడ : ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ టీడీపీలో చేరారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. చంద్రబాబు గొట్టిపాటికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గొట్టిపాటితో పాటు మరికొంత మంది అనుచరులు టీడీపీలో చేరారు.ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ తరపున గొట్టిపాటి రవికుమార్ శాసనసభకు ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి అయిన వెంకటేశ్ కరణం మీద 4,235 ఓట్ల మెజార్టీతో రవికుమార్ గెలుపొందిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ వైఖరి నచ్చకే తాను టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

14:46 - April 27, 2016

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ను టీ కాంగ్రెస్ నేతలు కలిశారు. తీవ్ర కరువు తాండవం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రజలను , పశువులు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు టీ కాంగ్రెస్ నేతలు . ఉపాధి హామీ పనులను కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన తరుణంలో ఎక్కడా కరువు పనులు జరగడం లేదన్నారు ఉత్తమ్ కుమర్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

14:45 - April 27, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో గ్రేటర్ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆ యన 'టెన్ టివి'తో మాట్లాడుతూ.. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాటర్‌ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కేవలం సంపన్న వర్గాలు నివసిస్తున్న ప్రాంతాలకే నీటిని సరఫరా చేయడం దారుణమని నేతలు మండిపడ్డారు. అధికారుల చర్యల వల్లే ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపించారు.

14:42 - April 27, 2016

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. మహా నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చి దిద్దేందుకు గ్రేటర్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నగరాన్ని పరిశుద్ధంగా మలిచేందుకు పలు పద్ధతులను అవలంభిస్తోన్న అధికారులు ఇప్పటికే ఇంటింటికి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. తాజాగా రోడ్లపై చెత్తవేసే వారిని నివారించే పనిలో పడ్డారు. ఇక నుంచి రోడ్లపై చెత్తవేసే వారికి జరిమానా విధించాలని నిర్ణయించింది మహానగరపాలక సంస్థ. మొదటి సారి చెత్త వేస్తే హెచ్చరించాలని, రెండోసారికి నగదు జరిమానా విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేయాలని నిర్ణియించారు.

నగరంలో ప్లాస్టిక్‌ వాడకంపై కూడా దృష్టి....

నగరంలో ప్లాస్టిక్‌ వాడకంపై కూడా దృష్టి పెట్టింది బల్దియా. 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌ల వాడకాన్ని నిషేధించిన జీహెచ్‌ఎంసీ.. దాని అమలుపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. నాలాల్లో పేరుకుపోతున్న చెత్తలో ప్లాస్టిక్‌ కవర్లు పేరుకుపోతుండటంతో కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు. సికింద్రాబాద్‌, మోండా మార్కెట్‌, మెహిదీపట్నం, లక్డికాపూల్‌, అమీర్‌పేట్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు లక్ష రూపాయల వరకు జరిమానాలు విధించారు.

చెత్త కుప్పలను పూర్తిగా తొలగించడానికి ప్రత్యేక ప్రణాళిక...

మరోవైపు నగరంలో గుర్తించిన బహిరంగ చెత్త కుప్పలను పూర్తిగా తొలగించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు గ్రేటర్‌ అధికారులు. గతంలో ప్రమాదభరితంగా ఉన్న 1,116 ఓపెన్‌ చెత్త కేంద్రాలను గుర్తించిన అధికారులు.. వాటిని తగ్గించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. చెత్త సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తే తప్ప, జరిమానాలు విధించడం సాధ్యం కాదన్న వాదనలూ విన్పిస్తున్నాయి. ఏదేమైనా.. హైదరాబాద్‌కు మహర్దశ తీసుకురావడానికి శ్రీకారం చుట్టడం మాత్రం నిజంగా అభినందనీయమన్న అభిప్రాయం వెల్లడవుతోంది. 

14:38 - April 27, 2016

హైదరాబాద్ : ముస్లిం వివాహాల రద్దు చేసుకోవాలంటే ఎలాంటి చట్టాలు ఉన్నాయి. వాటి తీరు తెన్ను ఏవిధంగా ఉంటాయి అనే అంశాలా పై 'మైరైట్' కార్యక్రమంలో న్యాయసమస్యలు, సందేహాలకు అడ్వకేట్ పార్వతి వివరించారు. ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవాలంటే ఎలాంటి చట్టాలు ఉంటాయి? విడాకులు తీసుకోవాలనుకుంటున్న ముస్లిం పురుషులకు ఎలాంటి చట్టాలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

టీడీపీ గూడికి గొట్టిపాటి....

విజయవాడ : సీఎం చంద్రబాబు సమక్షంలో అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కండువా కప్పి బాబు పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వైపీసీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మరొక మెట్టు దిగింది. కొన్ని రోజులుగా గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరతారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పయనించే అవకాశమున్నట్లు సమాచారం.

ఐపీఎల్ పై సుప్రీంకోర్టు తీర్పు...

హైదరాబాద్ : మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ లపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. మే 1 నుంచి మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ లపై నిషేధం అమలవుతుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మహారాష్ట్ర క్రికెట్ బోర్టు,ఐపీఎల బోర్డు సవాల్ చేసింది. దీంతో స్పందించిన ఉన్నత న్యాయస్థానం మహారాష్ట్ర ప్రజలు నీటికోసం అల్లాడుతున్న పరిస్థితుల్లో మ్యాచ్ల నిర్వహణ సాధ్యంకాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లను మరోచోటికి తరలించాలని సూచించింది.

సీఎం నవీన్ పట్నాయక్ కార్యాలయంలో అగ్నిప్రమాదం...

ఒడిశా : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సీఎం భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

 

ప్రధాని తో ఎంపీ గీత భేటీ...

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఈరోజు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఆమె కోరారు. ఆరకు ప్రాంతంలో కాఫీ పంటకు అరకు ప్రాంతంలో రహదారులు, అంతర్జాలం ఏర్పాటుకు నిధులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాగా అరకులో పండే కాఫీ పంటకు ఆర్గానిక్ సరిఫికెట్ లభించిన సంగతి తెలిసిందే.

'తెంగాణ సంక్షేమం- దేశానికే తలమానికం' : ఈటెల

ఖమ్మం : అత్యంత ఘనంగా టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ వేడుకలు కొనసాగుతున్నాయి. ఖమ్మం పట్టణం గులాబీ రంగుతో నిండిపోయింది. సమావేశంలో తీర్మానాల కార్యక్రమం మొదలయ్యింది. మొదటి తీర్మానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. 'తెంగాణ సంక్షేమం- దేశానికే తలమానికం అనే తీర్మానానికి ఆయన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేద విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఏడాదికి రూ.650 కోట్లఖర్చుతో పేద విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు.

అపార్ట్ మెంట్ పై నుండి పడి మహిళ మృతి....

హైదరాబాద్ : అంబర్‌పేట డీడీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తు మహిళ కిందపడింది. తీవ్ర గాయాలపాలైన మహిళను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

గవర్నర్ తో టి.కాంగ్రెస్ నేతలు...

హైదరాబాద్: టీ.కాంగ్రెస్ నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న కరవుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గవర్నర్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ,పొన్నాల పాల్గొన్నారు.

అగస్టా కుంభకోణంపై భయపడను : సోనియా

ఢిల్లీ : రాజ్యసభ్యలో ఇవాళ అగస్టా వెస్ట్‌ల్యాండ్ పై దుమారం చెలరేగింది. వ్యవహారంలో సోనియా గాంధీ కుటుంబీకుల పాత్ర ఉన్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఆరోపించారు. వాస్తవం వెలుగు చూడాలని ఆయన అన్నారు. సోనియా గాంధీతో పాటు అహ్మద్ పటేల్ పేర్లు అగస్టా వ్యవహారంలో ఉన్నట్లు పారికర్ ఆరోపించారు. అగస్టా కుంభకోణంలో అనేక మంది వీఐపీలు ఉన్నట్లు మంత్రి పారికర్ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి స్పందించారు. అగస్టా కుంభకోణం వ్యవహారంలో తాను భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ కుంభకోణంలో అధికార పార్టీ తన పేరును వాడుకున్నా, తనకు భయం లేదన్నారు.

అగస్టా రగడతో రాజ్యసభ వాయిదా...

ఢిల్లీ : రాజ్యసభ్యలో ఇవాళ అగస్టా వెస్ట్‌ల్యాండ్ పై దుమారం చెలరేగింది. ఆ కుంభకోణంపై ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఆరోపణలు గుప్పించారు.దీనిపై కాంగ్రెస్ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకొచ్చారు. ఈ గొడవ మధ్యలోనే సభను వాయిదా వేశారు.

12:53 - April 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ద్వారా కోటి ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తానని అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో హరీష్ రావు ప్రాజెక్టులపై సుదీర్ఘంగా ప్రసంగించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఇరిగేషన్ శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. తెలంగాణ శాసనసభలో కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ ను కీర్తించారని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని అని, 1400 టీఎంసీల నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణకు నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. లోయన్ పెనుగంగ విషయంలో మహారాష్ట్ర సర్కార్ తో చర్చించి టెండర్లు పిలవడం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ తూర్పు జిల్లాలకు చెందిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేసి లక్షల ఎకరాలకు నీళ్లు అందించడానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. పలు జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలను హరీష్ రావు వివరించారు. 

గుర్రమెక్కిన ఎంపీ.....

ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న సరి-బేసి ట్రాఫిక్ నిబంధనలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి నిదర్శనంగా బీజేపీ ఎంపీలు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ గుర్రపు స్వారీ చేసి నిరసన తెలియజేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రామ్ ప్రసాద్ గుర్రంపై పార్లమెంట్ కు విచ్చేశారు. కాలుష్య రహిత వాహనం (పొల్యూషన్ ఫ్రీ వెహికల్) అని ఇంగ్లీష్ రాసిన బోర్డును గుర్రానికి తగిలించటం గమనించగదిన విషయం.

చిన్నారి అదృశ్యంతో కలకలం...

హైదరాబాద్ : నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని పోలీస్ యంత్రాంగం చెబుతోంది. కానీ నగరంలో హత్యలు, కిడ్పాప్ లు, కొనసాగుతూనే వున్నాయి. ఈ క్రమంలో కిడ్నాప్ నగరంలోని చందానగర్ లో ఈరోజు ఉదయం చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంట్లో ఆడుకుంటున్న ఏడు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. చిన్నారి కనిపించడంలేదని గుర్తించిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

12:31 - April 27, 2016

ఆదిలాబాద్‌ : జిల్లా బెజ్జూరు మండలం గూడెం సమీపంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. రోడ్డు పనులు చేస్తున్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. జేసీబీ, టిప్పర్‌, ట్రాక్టర్‌ను తగులబెట్టారు. దాదాపు పదిమంది మావోయిస్టులు ఈ పనిచేశారని స్థానికులు చెబుతున్నారు. మే 4, 5తేదీల్లో మావోయిస్టుల సభలున్నాయని రోడ్డు పనులు చేయొద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. సిబ్బంది దగ్గరున్న సెల్‌ఫోన్లు తీసుకున్న మావోయిస్టులు అక్కడ ఓ కరపత్రాన్ని వదిలి వెళ్లారు. అందులో మైనింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపిస్తూ జిల్లా వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల మాన ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. మే 4, 5 తేదీల్లో బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఈ లేఖలో రాశారు. భూనిర్వాసితులు సమస్యలతోపాటు.. గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఈ లేఖలో పేర్కొన్నారు.

12:23 - April 27, 2016

విశాఖపట్టణం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కత్తి దూశారు. విశాఖలో టిడిపి కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు చేశారు. టిడిపి అవినీతి చేస్తోందని అంటూ వైసీపీ ఓ పుస్తకం ప్రచురించిందని, దమ్ము ధైర్యం ఉంటే ఆస్తులపై ఎక్కడకైనా తాను చర్చకు సిద్ధమన్నారు. దొంగ పేపర్, దొంగ ఛానెల్ తమ దగ్గర లేదని, కార్యకర్తల బలమే తమ బలం అన్నారు. రాయలసీమ బిడ్డ అయి ఉండి పట్టిసీమకు వ్యతిరేకిస్తారా ? అని ప్రశ్నించారు. అమరావతిలో అవినీతి జరిగిందనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆ పుస్తకంలో తన గురించి కూడా రాశారని, 1983 తాను జన్మించడం జరిగిందని, ఆ సమయంలో తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నానని, రెండు సార్లు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
నారా లోకేష్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. ఆ తర్వాత నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో లోకేశ్ భేటీ అయ్యారు.. ఈ కార్యక్రమానికి మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.. 

ఉద్యమాలకు భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం: కేసీఆర్

ఖమ్మం: టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఖమ్మం సమీపంలోని చెరుకూరి గార్డెన్స్‌లో జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పాల్గొని అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాలకు భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 14 ఏళ్ల పాటు నిరంతరంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని తెలిపారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛావాయువుల మధ్య ప్లీనరీ నిర్వహించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

12:15 - April 27, 2016

నిన్న మొన్నటి వరకు జైలు జీవితాన్ని గడిపొచ్చిన బాలీవుడ్‌ ఖల్‌నాయక్‌ సంజయ్‌దత్‌కి బాలీవుడ్‌లో అవకాశాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆయన జీవితం ఆధారంగా దర్శక, నిర్మాత రాజ్‌కుమార్‌ హిరానీ ఓ బయోపిక్‌ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే, సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందించబోయే 'మార్కో' చిత్రంలో దత్‌ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే ఈచిత్రంలో దత్‌ కూతురిగా కృతిసనన్‌ నటిస్తోంది. ఈ నేపథ్యంలో కృతి మాట్లాడుతూ,'దత్‌సాబ్‌కి కూతురిగా నటించడం చాలా చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సిద్ధార్ధ్‌ ఆనంద్‌ చెప్పిన కథ విన్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. స్క్రిప్ట్‌ చాలా బాగా నచ్చింది' అని చెప్పింది. కృతి ఈ చిత్రంతోపాటు సుషాంత్‌సింగ్‌ రాజ్‌ఫుత్‌ సరసన 'రాబ్తా' చిత్రంలోనూ నటిస్తోంది.

12:11 - April 27, 2016

చిరంజీవి 150వ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్తలకు ముహూర్తం రూపంలో చిత్రయూనిట్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు చిరంజీవి 150వ చిత్రం ప్రారంభం కానుంది. విజయ్‌ కథానాయకుడిగా తమిళనాట సంచలన విజయం సాధించిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. షూటింగ్‌ ఎప్పుడు జరుగుతుందా అని ఇప్పటి వరకు ఆలోచిస్తున్న అభిమానులు, ప్రేక్షకుల ఆలోచనలకు ఫుల్‌స్టాప్ట్‌ పెట్టినట్లే, చిరంజీవి సరసన ఏ హీరోయిన్‌ నటిస్తుందనే విషయానికి స్వయంగా నయనతారే ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 'చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్‌ నన్ను సంప్రదించలేదు. గత కొన్ని రోజులుగా మీడియాలో చిరంజీవికి జోడీగా నేను నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వాటిల్లో వాస్తవం లేదు. గతంలో వినాయక్‌ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ', 'యోగి', 'అదుర్స్‌' చిత్రాల్లో నటించాను. ఆయన దర్శకత్వంలో చిరంజీవి సరసన నటించాలని నాకూ ఉంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చేస్తూ డేట్లు సర్దుబాబు చేసే పొజిషన్‌లో లేను' అని ఇటీవల తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార క్లారిటీ ఇచ్చింది.

రోడ్డు ప్రమాదంలో 3గురు మృతి...

నల్లగొండ : కోదాడ బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరు సంవత్సరాల చిన్నారి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. మృతుల్లో ఓ చిన్నారి కూడా వుంది. మృతులంతా జగ్గయ్యపేట ఆలూరుపాడు వాసులుగా గుర్తించారు. 

12:05 - April 27, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, సహ రిటర్నింగ్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉప ఎన్నిక తీరుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. బుధవారం ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కార్యకర్తలు ప్రథమ స్థానంలో నిలుస్తారని, ఈ విషయం పలు పత్రికలు కూడా పేర్కొన్నాయని తెలిపారు. ఎన్నో ఇబ్బందులకు గురయినా తట్టుకుని రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. శాంతియుతంగా, అహింసాయుతంగా ఉద్యమాన్ని కొనసాగించడం జరిగిందని, దేశ రాజకీయ వ్యవస్థను, 36 రాజకీయ పార్టీలను ఒప్పించడం జరిగిందన్నారు. తదనంతరం ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ముందుకు వెళ్లడం జరిగిందని, ఇందులో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని తెలిపారు.

బాధ్యతల నుండి తప్పుకోవాలని సూచనలు..
2014లో రాష్ట్రం ఆవిర్భవించడం జరిగిందని, బాధ్యతల నుండి తప్పుకోవాలని కొందరుసూచనలు చేశారని తెలిపారు. కానీ బాధ్యతల నుండి తప్పుకోవద్దని మేధావులు..ఇతర వర్గాల వారు సూచనల మేరకే ఎన్నికల బరిలో దిగడం జరిగిందన్నారు. కరెంటు కోతలు రావాలని పక్క రాష్ట్రం యత్నించడం జరిగిందని, ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని నిలబడడం జరిగిందన్నారు. అధికారం వచ్చిందని గర్వానికి లోను కాలేదని తెలిపారు.

సమైక్య పాలనలో నిర్లక్ష్యం..
ఖమ్మంలో నది పారుతున్నా కరవు ఎందుకుందని కేసీఆర్ ప్రశ్నించారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వైఖరి వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పదవుల కోసం వెంపర్లాడలేదని, తన వంతు కోసం కార్యకర్తలు వేచి ఉండాలని సూచించారు. పదవుల రాలేదని చిన్నబుచ్చుకోవద్దని తెలిపారు.

త్వరలో పోస్టుల భర్తీ..
శాసనసభా సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీనిపై ఢిల్లీలో ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు. మరో 34 కొత్త ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉందని, అలాగే ఎమ్మెల్సీల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నాలుగు వేల మంది కార్యకర్తలకు త్వరలో పోస్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణకు బాస్ లు ప్రజలేనని, వర్తమానం, భవిష్యత్ పై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని, వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి సాధారణ కార్యకర్త అని పేర్కొన్నారు. 

హాస్టల్లో అగ్నిప్రమాదం...

విజయవాడ : కానూరులోని శ్రీ గాయత్రీ కళాశాల హాస్టల్ లో అగ్నిప్రమాదం ఏర్పడింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. హాస్టల్ భవన్ పైన వున్న టాటా స్కై సెల్ టవర్, హాస్టల్ నాలుగవ అంతస్థులలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 4 ఇంజన్లతో మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో భయాందోళనలకు లోనయిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.

12:00 - April 27, 2016

సినిమా..ఈ రంగంలోకి రావాలని ఎంతో మంది కలలు కంటుంటారు. హీరో, హీరోయిన్ కావాలని ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో కొంతమంది విజయం సాధిస్తే మరికొంత మంది విఫలమవుతుంటుంటారు. ఎలాగైనా ఒక్క సినిమాలో నటించాలని కష్టపడుతుంటారు. ఎన్నో కష్టనష్టాలకు గురవుతుంటారు. ఇలాగే ఓ యువతి సినిమాల్లో నటించాలని కలలు కన్నది.. కానీ అదృష్టం ఆమె తలుపు తట్టలేదు. ఆమెనే 'మిథాలి శర్మ'...ప్రస్తుతం ముంబాయి వీధుల్లో బిచ్చమెత్తుకొంటోంది. హీరోయిన్ అవుతానని ఇంట్లో వాళ్లకు చెప్పడం..తల్లిదండ్రులు వారించడం జరిగింది. తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టి సినిమాల్లోకి వచ్చింది మిథాలి శర్మ. కెరియర్ బిగినింగ్ లో భోజ్ పురి సినిమాలో నటించిన మిథాలి శర్మ. ఆ సినిమా..ఆశించినంతగా ఆడలేదు. దీంతో మిథాలికీ ఆ సినిమా తరువాత ఎక్కడా అవకాశాలు రాలేదు. అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా...ఛాన్స్ లు రాలేదు. దీంతో వేషాల కోసం తిరిగి తిరిగి మతిస్ధితిమితం కోల్పోయింది. ప్రస్తుతం తినడానికి తిండిలేక ముంబాయి వీధుల్లో బిచ్చమెత్తుకొంటోంది. 

బంగారు తెలంగాణ మా లక్ష్యం : ఎమ్మెల్సీ పల్లా

ఖమ్మం : టీఆర్ఎస్ ప్లీనం సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు ఆపార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న టీఆర్‌ఎస్ పార్టీ 15వ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అతిథులకు ఆహ్వానం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ప్రమాదబీహా కల్పించాం. ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారు.

ప్రభత్వానికి ప్రజల మద్ధతు వుంది: కేకే

ఖమ్మం: టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్లీనం సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఆ పార్టీ సెక్రటరీ జనరల్, సీనియర్ నేత కేశవరావు మాట్లాడారు.  టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన తెలిపారు. తమతో పనిచేసేందుకు అన్ని పార్టీల నేతలు కలిసి వస్తున్నరని ఆయన పేర్కొన్నారు.  ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షే పథకాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలదేనన్నారు.అసాధ్యం అనుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించుకున్నామన్నారు.

11:34 - April 27, 2016

హైదరాబాద్ : వైసీపీకి ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. పార్టీనుంచి ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు ఉద్వాసన పలికారు. అదేదారిలో పయనించేందుకు మరికొందరు సిద్ధంగా వున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయ నాయకులతో మొరపెట్టుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. కాగా తాజాగా ఆ పార్టీకి మరో సీనియర్ నేత ఎంవీ మైసురారెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. జగన్ కు ప్రజాసమస్యలు కంటే అధికారంపైనే ఎక్కువగా దృష్టి పెడతారని విమర్శించారు. సీనియర్ నాయకులు చెప్పే సలహాలను కూడా ఆయన ఖాతరు చేయరని తెలిపారు. జగన్‌ది నిలకడలేని మనస్తత్వమనీ.… అనుభవం వున్న నాయకులు చెప్పే సలహాలను కూడా ఆయన పెడచెవిన పెడతారని ఆయన పేర్కొన్నారు. డబ్బు అంశాలకే ఆయన అధికంగా ప్రాధాన్యతనిస్తారనీ ఆయన వెల్లడించారు. ఇదే కొనసాగితే వైసీపీకి ఇబ్బందులు తప్పవని ఆయన సూచించారు.

11:28 - April 27, 2016

మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహార పదార్థాలలో పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్ధాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయసు పెరిగే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి. కనుకనే స్త్రీలు చిన్న వయసు నుంచే పాలను తీసుకోవడం ఎంతైన అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నోటిలో దంతాలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి కూడా కాల్షియం బాగా ఉపకరిస్తుందని వారు తెలుపుతున్నారు.
పాలలో 87 శాతం నీరు, 4 శాతం కొవ్వు పదార్ధాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.
పాలలో లాక్టోజ్‌ అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. అంతేకాక ఇందులో ఏ, బి, సి, డి విటమిన్లు కూడా లభిస్తాయని వారు అంటున్నారు.
చిన్న వయసు అంటే 7-10 వయసు గల అమ్మాయిలు రోజుకు సుమారు 3-4 గ్లాసుల పాలు, పెరిగే వయసులో నాలుగు గ్లాసుల కంటే ఎక్కువ పాలు, పాతికేళ్ళ వయస్సులో 2 గ్లాసుల పాలు రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్‌ క్రీములు, చాక్లేట్లు మొదలైన వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

11:24 - April 27, 2016

విశాఖపట్నం: విశాఖ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 40 ఫైరింజన్లతో 14 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరో పది గంటలు పడుతుందని అధికారులు చెప్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిస్తున్నాయి. బయో డీజిల్ ట్యాంకర్లు పేలడంతో పొగ కాలుష్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఆరా తీశారు. మంగళవారం రాత్రి బయోమాక్స్ కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో మొత్తం 18 ట్యాంకులు ఉండగా..11 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. మిగతా ఆరు ట్యాంకులను సురక్షితంగా ప్రాంతానికి తరలించారు. సుమారు రూ.200 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. నేవీ హెలికాఫ్టర్ తో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు సూచించారు. ఆస్తి నష్టం పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చినరాజప్ప తెలిపారు.

తెలంగాణ సాధించిన ఘనత కార్యకర్తలదే - కేసీఆర్..

ఖమ్మం : తెలంగాణ సాధించిన ఘనత కార్యకర్తలదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కార్యకర్తలు ప్రథమ స్థానంలో నిలుస్తారని, ఈ విషయం పలు పత్రికలు కూడా పేర్కొన్నాయని తెలిపారు. ఎన్నో ఇబ్బందులకు గురయినా తట్టుకని రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. శాంతియుతంగా, అహింసాయుతంగా ఉద్యమాన్ని కొనసాగించడం జరిగిందని, దేశ రాజకీయ వ్యవస్థను, 36 రాజకీయ పార్టీలను ఒప్పించడం జరిగిందన్నారు. 

జేఈఈ మెయిన్స్ మార్కుల విడుదల..

హైదరాబాద్ : జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ పరీక్ష మార్కులను బుధవారం సీబీఎస్ఈ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది ఈ పరీక్షకు హాజరు కాగా తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 1.40 లక్షల మంది పరీక్ష రాశారు. 

11:07 - April 27, 2016

తిరుపతి : తిరుపతిలోని ఇసుకవీధిలో డ్రైనేజీ తవ్వకాలలో పాత ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది ఓ మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  డ్రైనేజీకోసం మున్సిపల్ అధికారులు కాలువలు తవ్వుతుండా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్ వ్యవహారించాడని స్థానికులు పేర్కొంటున్నారు. 

టిడిపి కార్యాలయానికి నారా లోకేష్ శంకుస్థాపన..

విశాఖపట్టణం : నూతన టిడిపి కార్యాలయానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

 

టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం..

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన తలపెట్టిన ప్లీనరీ ప్రారంభమైంది. సభా ప్రాంగణానికి పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్ అమరులకు నివాళి అర్పించారు.

 

ఏ పార్టీలో చేరను - మైసురా..

హైదరాబాద్ : తాను ఏ పార్టీలో చేరననని వైసీపీకి రాజీనామా చేసిన మైసురారెడ్డి పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను జగన్ పంపించారు. 

10:55 - April 27, 2016

చిత్తూరు : ఓ కాంట్రాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. కాల్వలు తవ్వుతుండగా ఓ పాత ఇల్లు కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈఘటన ఇసుక వీధిలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కాల్వల నిర్మాణం కోసం తవ్వకాలు మొదలు పెట్టారు. బుధవారం ఉదయం కాల్వలు తవ్వుతుండగా ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదాన్ని ముందే గ్రహించిన సిబ్బంది మొదటి అంతస్తులో ఉన్న వారిని కిందకు దించే ప్రయత్నం చేశారు. కానీ ఓ ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థి మృతి చెందగా తల్లి సురక్షితంగా బయటపడింది. మరో విద్యార్థిని ఆసుపత్రిలో ప్రాణాలతొ కొట్టుమిట్టాడుతోంది. ఇల్లు కూలిపోవడం వెనుక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

10:53 - April 27, 2016

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే చేజారిపోతున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు ఇప్పటికే అధికారపక్షంలోచేఇరనసం గి తెలిసిందే. తాజాగా పార్టీ నేతల మైసురారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కేంద్ర పెద్దలతో మొరపెట్టుకునేందుకు ఢిల్లీ బాటసైతం పట్టిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ''అధికార పీఠంపైనే జగన్‌కు మక్కువ ఎక్కువ. ప్రజా సమస్యలపై పోరాడలన్న సంకల్పం ఆయనకు లేదు. జగన్‌ది నిలకడలేని మనస్తత్వం. ఇతరులు చేప్పే మాట వినరు. నిత్యం డబ్బు అనే అంశాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు' అని ఆయన పేర్కొన్నారు.

10:50 - April 27, 2016

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరుతో కౌంటర్ పుస్తకాన్ని విడుదల చేసింది వైసీపీ. హస్తిన పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై జాతీయనేతలను కలిసారు. చంద్రబాబు అవినీతి పాలనపై రూపొందించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని పలువురు నేతలకు అందజేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు), కొండ రాఘవరెడ్డి (వైసీపీ), శ్రావణ్ కుమార్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

10:45 - April 27, 2016

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై చర్చకు అనుమతించాలని పట్టుబట్టింది. కాంగ్రెస్‌కు ఎస్పీ, బిఎస్పీ, వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. కాంగ్రెస్‌ సభ్యుల గందరగోళం మధ్య సభ ఈరోజుకు వాయిదా పడింది. ఉత్తరాఖండ్‌ అంశపై కాంగ్రెస్‌ సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. రాజ్యసభ తిరిగి ప్రారంభమయ్యాక-267 నిబంధన కింద ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. ఈ అంశంపై బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా మద్దతు పలకడంతో కాంగ్రెస్‌ సభ్యుల్లో ఉత్సాహం రెట్టింపైంది. రాజకీయ కారణాలతో ఆర్టికల్‌ 356ను దుర్వినియోగం చేయడం పరంపరాగా మారిందని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉపసభాపతి చర్చకు అనుమతించాలని కోరారు.

మూడుసార్లు వాయిదా..
రాజ్యాంగ విరుద్ధంగా ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించారని గులాంనబీ ఆజాద్‌ కేంద్రాన్ని తూర్పారబట్టారు. మార్చి 28న అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌కి గవర్నర్‌ సమయమిచ్చారని, అయితే కేంద్రం 24 గంటలు కూడా ఓపిక పట్టకుండా మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించారని ఆజాద్‌ దుయ్యబట్టారు. అంతకు ముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం సక్రమమేనని రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారు. 67 మంది సభ్యుల్లో 35 మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్నారు. ఆర్థిక బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు 35 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వక లేఖ ఇచ్చారని జైట్లీ తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల గందరగోళంతో 3 గంటల వరకు సభ మూడు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో డిప్యూటి ఛైర్మన్‌ కురియన్ సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే నూతనంగా ఎన్నికైన సభ్యులు మేరీకోమ్‌, సుబ్రమణ్యస్వామిలతో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రమాణం చేయించారు. 

10:43 - April 27, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... మరో మైలు రాయిని చేరుకోబోతుంది. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం ఏఆర్ఎన్ సీ -1G ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం ద్వారా పూర్తిస్థాయి పరిజ్ఞానంతో.. నావిగేషన్ వ్యవస్థను వినియోగించుకునేందుకు మార్గం సుగుమం కానుంది. దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిపుష్టం కానుంది. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్ వీ సీ-33 ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. అన్నీ అనుకున్నట్లు సాగితే.. 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నారు.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై పోలార్ శాటిలైట్ లాంచ్‌ వెహికల్ సి-33 అనుసంధానం పూర్తయ్యింది. శుక్రవారం వాహననౌకలోని శిఖర భాగాన ఉపగ్రహానికి ఉష్ణకవచాన్ని అమర్చారు. ఇప్పటికే రాకెట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 25న రిహార్సల్స్ కూడా పూర్తయ్యింది. ఐఆర్ఎన్ఎస్ -1జీ ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టగలిగితే.. ఇస్రో కీలక మైలురాయిని చేరినట్లే. 

10:38 - April 27, 2016

విజయవాడ : ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. నిరంతరం కూంబింగ్‌ జరుపుతూ వారి చర్యలను అడ్డుకుంటున్నారు. అయినా స్మగ్లింగ్ ఆగడం లేదు. ఒకసారి నేరం చేసిన వాళ్లు మళ్లీ మళ్లీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రాంతాలు మార్చి పంజా విసురుతున్నారు. అటవీ అధికారుల దగ్గర వారి నేరచరిత్ర ఉండకపోవడంతో ఇన్నాళ్లు రెచ్చిపోయారు. ఇకపై వారి ఆట కట్టించేందుకు వేస్తున్న సరికొత్త వ్యూహం స్మగ్లర్లకు పద్మవ్యూహమే. అత్యాధునిక సాంకేతికతో చందనం స్మంగ్లింగ్‌కు అడ్డుకట్టవేసేందుకు కార్యాచరణ రూపొందించింది. నేరగాళ్ల పాలిట అటవీశాఖ విభాగం సింహస్వప్నంలా నిలిచేందుకు సరికొత్త అస్త్రాన్ని వారికి అందజేసింది. దేశంలోనే ప్రప్రథమంగా ఎర్ర చందనం స్మగ్లర్ల ఫింగర్ ప్రింట్స్ డేటాను తయారు చేసేందుకు నూతన సాఫ్ట్ వేర్ను సిద్ధం చేసింది.

స్మగ్లర్ల ఫింగర్ ప్రింట్..
ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూనో.. చెట్లను నరుకుతూనే పట్టుబడిన దుండగుల పూర్వపరాలు తెలుసుకోవడం అటవీ అధికారులకు కష్టంగా ఉండేది. పాత నేరస్తులా, వారిపై స్మగ్లింగ్‌ కేసులున్నాయా? నిందితులు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత ఇలా ఏది తెలుసుకోవాలన్న వారు చెప్పే వివరాల ఆధారంగానే విచారణ జరిగేది. చాలా ఘటనల్లో నిందితులు తమ పేరు, చిరునామా, వ్యక్తిగత వివరాలు తప్పుగా చెబుతున్నారు. లోతుగా పరిశీలన జరిపితే తప్పా నిజానిజాలు తెలియవు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు అటవీశాఖ అధికారులు స్మగ్లర్ల ఫింగర్‌ ప్రింట్స్‌ డేటాను రూపొందిస్తున్నారు. ఈ విధానం ద్వారా నేరగాళ్ల వేలిముద్రలు సేకరిస్తారు. గతంలో వారు చేసిన నేరాలు, కేసుల చిట్టాను డేటాలో పొందుపరుస్తారు. ఈ ఫింగర్‌ ప్రింట్‌ డేటాను జాతీయ స్థాయి నేరవిభాగంతో అనుసంధానం చేస్తారు. దుండగులు ఎక్కడ పట్టుబడినా.. బయోమెట్రిక్‌ యంత్రం ద్వారా వేలిముద్రలు పరిశీలిస్తారు. దీంతో నేరాగాళ్ల పుట్టుపుర్వోత్తరాలు, నేరచరిత్ర క్షణాల్లో బయటపడనుంది. అంతేకాదు ఇతర రాష్ట్రాల పోలీసులు, అటవీ అధికారులకు స్మగ్లింగ్‌ కేసుల పరిష్కారానికి మార్గం చూపనుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో పట్టుబడి పదే పదే బెయిల్‌ పొందే వారికి కూడా ఫింగర్‌ ప్రింట్స్ సాఫ్ట్‌వేర్‌ చెక్‌ పెట్టనుంది. ఏపీలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న సాఫ్ట్‌వేర్‌ సక్సెస్‌ అయితే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. 

10:34 - April 27, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం పురోగతిపై హైకోర్టులో విచారణ జరిగింది. వేలంలో ఆశించిన ఫలితాలు రావడంలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వేలంకు అగ్రిగోల్డ్‌ కంపెనీతోపాటు సీఐడీ అధికారులు పూర్తిగా సహకరించడంలేదన్న విషయాన్ని ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కమిటీ కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇద్దరు సహకరించాలని ఆదేశించింది. ఆస్తుల వేలానికి సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని హైకోర్టు చెప్పింది. అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులు ఫిర్యాదులు, వారు చెల్లించిన సొమ్ము వివరాలను కూడా వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. మొదటి విడత నిర్వహించిన వేలంలో 7.5 కోట్ల రూపాయలను బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. రెండో దఫా దాదాపు 40 కోట్ల రూపాయల మేర ఆస్తులకు వేలం వేస్తే వీటిలో చాలా వరకు వివాదాల్లో ఉన్నాయి. మూడో విడత వెయ్యి కోట్ల రూపాయల ఆస్తుల వేలానికి చర్యలు చేపడుతున్నారు.

పలు ప్రశ్నలు..
విజయవాడ సమీపంలోని కీసరలో సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న 85 ఎకరాల భూమి అమ్మకానికి అనుమతి లభించిన విషయాన్ని అధికారులు కోర్టుకు నివేదించారు. మరో 7 ఆస్తుల అమ్మకానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఎంఎస్‌టీసీ యాజమాన్యాన్ని కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అమ్మకంకాని ఆస్తులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని అగ్రిగోల్డ్‌ తరుపు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అప్పటికీ డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బులు చాలకపోతే చివరల్లో ఈ ఆస్తులను కూడా వేలంలో అమ్ముకోవచ్చని విన్నవించారు. అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కలిపి ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలన్న అగ్రిగోల్డ్‌ విన్నపాన్ని కోర్టు మన్నించలేదు. మరోవైపు అక్షయగోల్డ్, అగ్రిగోల్డ్ నిందితులు ఒకరేనని సీఐడీ అధికారులు కోర్టుకు నివేదించారు. రెండు కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో ఒకరని అరెస్టు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మరో ఇద్దిర్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని వివరించారు. సంస్థ వ్యవస్థాపకుడు బోగి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

10:32 - April 27, 2016

విజయవాడ : ఏపీలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య వార్ నడుస్తోంది. జగన్ పై గతంలో ఖైదీ నెంబర్ పేరుతో టీడీపీ పుస్తకం ముద్రిస్తే... ఇప్పుడు వైసీపీ కూడా అదే బాట ఎంచుకుంది. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరుతో కౌంటర్ పుస్తకాన్ని విడుదల చేసింది వైసీపీ. హస్తిన పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై జాతీయనేతలను కలిసారు. చంద్రబాబు అవినీతి పాలనపై రూపొందించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని పలువురు నేతలకు అందజేశారు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంలో ఇసుక మాఫియా మొదలు రాజధాని నిర్మాణం, వివిధ పథకాల్లో లక్షకోట్లకు పైగా అవినీతి జరిగిందని జీవోలతో సహ ప్రచురించారు. తాను కలిసిన జాతీయ నేతలు, కేంద్రమంత్రులకు జగన్ ఈ పుస్తకాన్ని అందించారు.

ఖైదీ నెంబర్ 6093..
గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఖైదీ నెంబర్ 6093 పేరుతో పుస్తకాన్ని విడుదల చేసింది టీడీపీ. వైఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన అవినీతిపై రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో ముద్రించారు దేశం నేతలు. వైఎస్ హయాంలో అవినీతి జరుగుతోందని జాతీయ స్థాయిలో చెప్పేందుకు ఈ ఆపుస్తకం బాగా ఉపయోగపడిందని టీడీపీ నేతలు భావించారు. కొద్దిరోజుల క్రితం ఏపీకి ప్రత్యేక హోదా కోసం మంగళగిరిలో జగన్ దీక్ష చేసారు. ఆ సమయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ రాష్ట్రానికి మోసగాడు పేరుతో పుస్తకాన్ని ముద్రించింది వైసీపీ. అయితే ఈ పుస్తకం కేవలం రాష్ట్రానికి పరిమితమైంది. కానీ ఇప్పుడు గతంలో టీడీపీ అవలంబించిన ఫార్ములానే వైసీపీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అవినీతిని జాతీయస్థాయిలో ఫోకస్ చేయటమే లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పుస్తకాల పాలిటిక్స్ ఆనవాయితీగా మరాయి. దీంతో చంద్రబాబు అవినీతిపై జగన్ విడుదల చేసిన ఈ పుస్తకం స్ట్రాటజీ ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

10:28 - April 27, 2016

ఖమ్మం : టీఆర్ఎస్‌ ప్లీనరీకి ఖమ్మం ముస్తాబైంది. ప్రముఖుల రాకపోకలతో పట్టణం సందడిగా మారింది.. రాష్ట్రం ఏర్పాటయ్యాక జరుగుతున్న రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని నభూతో అన్నరీతిలో జరపాలని టీఆర్ఎస్‌ నిర్ణయించింది. అందులోనూ.. ఇంతకాలం తనకు ఏమాత్రం పట్టులేని ఖమ్మంలో కొత్తగా సమకూరిన బలాన్ని చాటుకోవాలనీ భావిస్తోంది. నగర సమీపంలోని చెరుకూరి గార్డెన్స్‌లో ప్లీనరీ, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో భారీ బహిరంగ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు 3నుంచి 5లక్షలమంది ప్రజలు వస్తారని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి.. ప్లీనరీ, బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చూస్తున్నారు.

సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ..
ఉదయం 10 గంటలకు సిఎం కెసిఆర్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. 10.10కి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అతిథులను వేదిక మీదికి ఆహ్వానిస్తారు. 10.20కి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటిస్తారు. పదిన్నరకు మంత్రి తుమ్మల స్వాగతోపన్యాసం చేస్తారు. 11 గంటలకు పార్టీ ప్రెసిడెంట్‌, సిఎం కెసిఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు. 12 గంటల నుంచి 1.30 వరకు ఆరు తీర్మానాలపై చర్చిస్తారు. ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు భోజన విరామం, 2.30 నుంచి 4.30 వరకు 9 తీర్మానాలపై చర్చిస్తారు. 4.45కు కేసిఆర్ తుది పలుకులతో ప్లీనరీ పూర్తవుతుంది.

భోజనాలు..
సాయంత్రం ఎస్‌ఆర్ అండ్ బిజెఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో మంత్రి తుమ్మల స్వాగతోపన్యాసం ఇస్తారు. 6.10కి మహమూద్ అలీ, 6.20కి కడియం శ్రీహరి ప్రసంగిస్తారు. అనంతరం 6.30కి సిఎం కేసిఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభతో కార్యక్రమాలు పూర్తవుతాయి. ప్లీనరీకి హాజరయ్యేవారికోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు.. ఉదయం 7గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజనాలు అందిస్తారు. ఆహూతుల కోసం 36 రకాల స్పెషల్ వెజ్, నాన్‌ వెజ్‌ వంటకాలను వండివారుస్తున్నారు. 12 నుంచి 15 వేల మందికి సరిపోయేలా వంటలు తయారు చేస్తున్నారు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి పండ్లు... సాయంత్రం స్నాక్స్ అందజేస్తారు.. ఎండలతో ప్రజాప్రతినిధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు.. మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను అందుబాటులో ఉంచుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

10:25 - April 27, 2016

గుంటూరు : భూసమీకరణ కింద ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తిరిగి ప్లాట్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. వివిధ సైజుల్లో నివాస, వాణిజ్య స్థలాలను ఎలా ఇవ్వాలన్న అంశాలను సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఒక రెవిన్యూ గ్రామ పరిధిలో భూములిచ్చిన రైతులకు అదే గ్రామంలో ప్లాట్లు కేటాయించే విధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేశారు. వచ్చే నెలాఖరు నాటికి రైతులకు ప్లాట్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు.
రైతులకిచ్చే లే అవుట్లలో నివాస, వాణిజ్య స్థలాల సైజును ఖరారు చేశారు. నివాస స్థలాల కనిష్ట సైజు 120 గజాలుగా నిర్ణయించారు. గరిష్టంగా 4 వేల గజాల వరకు ఇస్తారు. వాణిజ్య స్థలాల విస్తీర్ణం 30 గజాలతో ప్రారంభమవుతంది. ఆపై 30 గజాల చొప్పున పెంచుకుంటూ పోతారు. వాణిజ్య స్థలాలను కూడా 4 వేల గజాల వరకు కేటాయిస్తారు. మెట్ట రైతులకు అదనంగా మరో 50 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. రైతులకు దక్కాల్సిన ప్లాట్ల కనీస విస్తీర్ణం తక్కువగానూ, నిర్దేశిత విస్తీర్ణం కన్నా ఎక్కువగా ఉంటే... ఇలాంటి వారికి ఉమ్మడి పాట్లు కేటాయిస్తారు. ఉమ్మడి ప్లాట్లు పొందిన రైతులకు వీటిని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తారు. వచ్చిన సొమ్మును దామాషా పద్ధతిలో పంచుతారు. మెట్టభూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతలో, జరీబు భూములిచ్చిన వారికి జరీబు ప్రాంతంలో ప్లాట్లు కేటాయిస్తారు.
ఆయా గ్రామాల్లోని భూసమీకణ కార్యాలయాల ద్వారా ప్లాట్ల కేటాయింపు విధాన నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. తుళ్లూరు మండలం నేలపాడు నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రకటక వచ్చిన 15 రోజుల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి. 9.18A, 9.18B ఫారాలను భూముల యజమానులు దరఖాస్తులుగా ఉపయోగించాల్సి ఉంది. భూయజమానులు తమకు దక్కే వాటాను బట్టి ఒకటి లేదా రెండు అంతకు మించి ప్లాట్లను ఒకేచోట కోరవచ్చు. అలాగే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఉమ్మడిగా ప్లాట్లు అడిగేందుకు కూడా వీలు కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి నిర్మాణానికి భూములిచ్చి... ప్లాట్ల కేటాయింపు కోసం ఎదురు చేస్తున్న రైతులకు ఆశలు ఫలించనున్నాయి. 

10:19 - April 27, 2016

అనంతపురం : నగర శివారులోని ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువైన మద్యం దగ్ధమైనట్లు సమాచారం.

10:14 - April 27, 2016

విశాఖపట్టణం : దువ్వాడ సెజ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బయో మ్యాక్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి నుండి చెలరేగుతున్న మంటలను బుధవారం ఉదయం వరకు అదుపులోకి రాలేదు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చివరకు నేవీ కూడా రంగంలోకి దిగిదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయో మ్యాక్స్ లోని 18 ట్యాంకుల్లో 10 ట్యాంకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ. 200 కోట్ల మేర ఆస్తి నష్టం కలిగిందని తెలుస్తోంది. హెలీకాప్టర్ ద్వారా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమాచారం అందుకున్న హోం మంత్రి చిన రాజప్ప ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
అగ్నిప్రమాదంలో ఐదు డీజిల్‌ ట్యాంకులు పేలిపోగా.. మరికొన్ని ట్యాంకులు చిక్కుకున్నాయి. మండే స్వభావం ఉన్న డీజిల్‌ కావడంతో.. నీటితో కాకుండా ఫోమ్‌తో మంటలు ఆర్పేందుకు అధికారులు యత్నిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి గంటా, కలెక్టర్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ జరగలేదు.

చంద్రబాబు ఆరా..
ఇక సంఘటనాస్థలానికి చేరుకుని మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్‌ పరిస్థితిని సమీక్షించారు. మంటలార్పేందుకు అన్ని రకాలు చర్యలు చేపట్టారు. అయితే.. డీజిల్‌ కావడం.. గాలి విపరీతంగా ఉండడంతో మంటలు ఆర్పేందుకు సమయం పడుతుందన్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు గంటా. సంఘటనాస్థలంలోని పరిస్థితిని గంటా శ్రీనివాసరావు.. సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇక ఈ ప్రమాదం జరిగే సమయానికి ఎవరూ సమీపంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.

 

ఇసుక వీధిలో కూలిన పాత ఇళ్లు..ఒకరి మృతి..

చిత్తూరు : తిరుపతిలో ఇసుక వీధిలో పాత ఇళ్లు కూలింది. ఒకరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 

ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం..

అనంతపురం : నగర శివారులోని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో మద్యం గౌడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువైన మద్యం దగ్ధమైందని తెలుస్తోంది.

 

అమరావతి లో భూ కేటాయింపులు..

గుంటూరు : అమరావతిలో భూ కేటాయింపుల విధానాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళశారం సీఆర్డీఏ సమావేశం జరిగింది. సొంత ఊరిలోనే రాజధాని రైతులకు స్థలాలను కేటాయించారు. ఉమ్మడి ప్లాట్ వద్దని అనుకుంటే ప్లాట్లను అమ్ముకొనే వెసులుబాటు కల్పించింది. భూ సమీకరణలో భాగంగా రైతులకు త్వరలో ప్లాట్లు కేటాయించనున్నారు. నివాస సముదాయంలో ప్లాట్ల విస్తీర్ణం 120 చదరపు గజాలు కేటాయించనున్నారు. వాణిజ్య అవసరాల కోసం వేసే ప్లాట్ విస్తీర్ణం 30 చ.అడుగులు ఉండనుంది. మెట్ట భూములిచ్చిన వారికి మెట్ట భూములు, జరీబు భూములిచిల్చన వారికి జరీబు భూములను కేటాయించనున్నారు.

హైదరాబాద్ జట్టుపై పుణె గెలుపు...

ఢిల్లీ : ఐపీఎల్ 9లో హైదరాబాద్ జట్టు పై పుణె జట్టు గెలుపొందింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
హైదరాబాద్ స్కోరు : 118/8, పుణె స్కోరు : 94/3.

 

ఖమ్మంలో నేడు టీఆర్ఎస్ ప్లీనరీ..

ఖమ్మం : నేడు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. ప్లీనరీకి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్లీనరీ, బహిరంసభ కోసం ఐదు లక్షల మంది హాజరౌతారని అంచనా.

 

దువ్వాడ సెజ్ లో భారీ అగ్నిప్రమాదం..

విశాఖపట్టణం : దువ్వాడ సెజ్ లోని బయో టెక్నికల్ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు డీజిల్ ట్యాంకులు పేలిపోయాయి. 200 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. 

Don't Miss