Activities calendar

28 April 2016

తెలంగాణ టెట్, ఎంసెట్ వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ లో టెట్, ఎంసెట్ పరీక్షలను వాయిదా వేసినట్లు సర్కార్ ప్రకటించింది. మే 20 లోగా టెట్, ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

21:34 - April 28, 2016

హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్రమోదిపై సరికొత్త దాడి చేశారు. మోదికి సంబంధించిన విద్యార్హతలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్‌కు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ప్రధాని మోదీకి ఉన్న డిగ్రీలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అసవరముందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ఆయన కోరారు. తన వివరాలను బహిరంగ పరచినట్లే, ప్రధాని వివరాలను కూడా బయటపెట్టాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ స్కాంపై కూడా కేజ్రీవాల్‌ ప్రధానిని టార్గెట్‌ చేశారు. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సోనియాతోపాటు ఇటలీ కోర్టు తీర్పులో పేర్కొన్న వ్యక్తులందరినీ అరెస్టుచేసి, విచారించాలని ఆయన ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు.

21:31 - April 28, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ స్కాంకు సంబంధించి కాంగ్రెస్ నేతలు సోనియా, మన్మోహన్, అహ్మద్ పటేల్‌పై కేసు పెట్టాలని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటలీకోర్టులో తీర్పులో వెల్లడైన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరపాలని పిల్‌లో పేర్కొన్నారు. దీన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు -వచ్చే వారం ఈ కేసును పరిశీలించనుంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనగోలు కోసం 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీతో 3600 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

21:30 - April 28, 2016

ఢిల్లీ : రాజ్యసభలో బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలపై రగడ జరిగింది. సుబ్రమణ్యస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. సుబ్రమణ్యస్వామి పార్లమెంట్‌కు వచ్చి రెండు రోజులే అవుతోంది, ఆయన వాడిన భాషను రెండు సార్లు సభా రికార్డుల నుంచి తొలిగించారు. ఇలా ఎన్ని సార్లు ఆయన మాటల్ని తొలిగిస్తారని కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ ప్రశ్నించారు. వీధుల్లో, సభల్లో వాడే భాషకు ఉన్న ఆంతర్యం స్వామికి తెలియదని గులామ్ నబీ ఆజాద్ విమర్శించారు. స్వామి అనవసరంగా రెచ్చగొడుతున్నారని, ఆయన మాట్లాడింది ఏదీ రికార్డుల్లోకి వెళ్లదని డిప్యూటీ చైర్మన్ పీజీ కురియన్ అన్నారు. అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీపై చర్చ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి- భారత రాజ్యాంగం కన్నా ఇటలీ రాజ్యాంగం కాంగ్రెస్ ఎంపీలకు బాగా తెలుసని ఆరోపించారు.

21:29 - April 28, 2016

ఖమ్మం : రాష్ట్రంలో కరవు విజృంభిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం సభలో కరవుపై నోరెత్తకపోవడం దారుణమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ ప్రజాసమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్న కేసీఆర్‌ నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. పాలేరు ఉప ఎన్నికలో వామపక్షాల అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుకు మద్దతుగా నామినేషన్‌ సభ నిర్వహించారు. ప్రజాసమస్యలపై పోరాడే సత్తా సీపీఎంకే ఉందని, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుని బలపరచాలని ఆయన అన్నారు. 

21:27 - April 28, 2016

హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశీయ జీపీఎస్ వ్యవస్థను సుస్థిరం చేసుకునే దిశగా తుది రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ఎగిరింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉప గ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోది అభినందించారు.

పిఎస్‌ఎల్‌వి ద్వారా ఏడవ నేవిగేషన్‌ శాటిలైట్‌ను ...

అంతరిక్ష పరిశోధనలో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. పిఎస్‌ఎల్‌వి ద్వారా ఏడవ నేవిగేషన్‌ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ...

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిముషాలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి 33 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 జి ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. నిర్దేశించిన సమయంలోనే పీఎస్ఎల్వీ సీ-33 కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో షార్ శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ప్రధాని నరేంద్రమోది అహ్మదాబాద్‌ నుంచి...

ప్రధాని నరేంద్రమోది అహ్మదాబాద్‌ నుంచి రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఏడవ శాటిలైట్‌ ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. ప్రపంచంలోని ఐదుదేశాల సరసన భారత పేరు నిలవడం గర్వకారణమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు భారత ప్రజలకు మంచి బహుమతి అందించారని కొనియాడారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నావిక్(NAVIC)గా నామకరణం చేశారు.

సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఇస్రో...

సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఇస్రో ఇప్పటికే ఆరు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పిఎస్‌ఎల్‌వి ఉప గ్రహ ప్రయోగాలలో ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏడవది. ఐఆర్ఎన్ఎస్ఎస్ ను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా సేవలందిస్తుంది. అంతరిక్షం నుంచి నిర్దేశించిన వ్యక్తులు, వ్యవస్థలకు గోప్యంగా సమాచారం అందిస్తుంది. స్థానిక సమయం, వాతావరణం అంచనా వేస్తుంది ఇదో దిక్సూచీలా పనిచేస్తుంది. నావికులకు ఇదే రూట్ మ్యాప్ ఇస్తుంది.

అమెరికా, రష్యా, యూరోప్, చైనా దేశాల సరసన భారత్...

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా, యూరోప్, చైనా దేశాలు మాత్రమే జీపిఎస్ వ్యవస్థను వాడుతున్నాయి. ఇపుడు ఈ దేశాల సరసన భారత్‌ చేరింది. తొలి సారిగా భారత్ నావిగేషన్ సేవలను పౌర సేవలుగా అందించనుంది. ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో సాంప్రదాయ నావిగేషన్ వ్యవస్థకు ఇక స్వస్తి పలికే ఛాన్సుంది. అతి తక్కువ ఖర్చుతో మెగా ప్రాజెక్టును ఇస్త్రో రూపొందించింది. 

21:24 - April 28, 2016

హైదరాబాద్ : నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌.. నీట్‌ను కచ్చితంగా నిర్వహించి తీరాలన్న సుప్రీం ఆదేశం.. తెలుగు రాష్ట్రాల బైపీసీ విద్యార్థుల్లో గందరగోళాన్ని నింపింది. ఏపీలో శుక్రవారం ఎంసెంట్‌ జరుగనుంది. తెలంగాణలోనూ మే 2న ఎంసెట్‌ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దశలో.. నీట్‌ పరీక్ష తప్పనిసరన్న సుప్రీం తీర్పుతో.. విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. అయితే ఏపీ ప్రభుత్వం ఎంసెట్‌ నిర్వహించి తీరతామని.. సుప్రీం తీర్పుపై న్యాయనిపుణులతో సంప్రదిస్తామని వెల్లడించింది.

ఎంసెంట్‌కు సిద్ధమైన విద్యార్థుల్లో ఉన్నట్టుండి గందరగోళం...

మెడిసిన్‌లో ప్రవేశం కోసం.. ఎంసెంట్‌కు సిద్ధమైన విద్యార్థుల్లో ఉన్నట్టుండి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ ప్రవేశ పరీక్ష నీట్‌ను కంపల్సరీ చేస్తూ.. సుప్రీం గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం జరగనున్న ఏపీ ఎంసెట్‌కు సిద్ధమైన విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తక్షణమే స్పందించిన ఏపీ ప్రభుత్వం.. ఎంసెట్‌ పరీక్ష యథాతథంగానే జరుగుతుందని ప్రకటించింది. విద్యార్థులు గందరగోళానికి గురికావద్దని.. సుప్రీం తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని ప్రకటించింది.

నీట్‌ సమస్య ఇప్పటిది కాదు....

నిజానికి నీట్‌ సమస్య ఇప్పటిది కాదు. దేశంలోని మెడికల్‌ కాలేజీలన్నీ కలిపి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని 2010 లోనే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2011లో డిసెంబర్‌లో ఎంసీఐ ఉమ్మడి జాతీయ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2012లో నీట్‌ పరీక్షను కూడా నిర్వహించింది. దీన్ని అభ్యంతర పెడుతూ.. కొన్ని ప్రైవేటు కాలేజీలు 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నీట్‌ను నిర్వహించే అధికారం ఎంసీఐకి లేదని తీర్పునిచ్చింది. దాంతో నీట్‌ వ్యవహారానికి పుల్‌స్టాప్‌ పడ్డట్లయింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం, ఎంసీఐ మరోసారి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో.. సుప్రీంకోర్టు తాజాగా మళ్లీ విచారణ జరిపింది. అత్యున్నత న్యాయస్థానం 2013 నాటి తీర్పును ఉపసంహరించుకుని.. నీట్‌ను నిర్వహించాల్సిందేనని కరాఖండిగా చెప్పింది.

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో నీట్‌ నిర్వహణకు మార్గం సుగమం....

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో నీట్‌ నిర్వహణకు మార్గం సుగమం అయింది. కానీ విద్యార్థుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. మెరిట్‌ ఆధారంగా నిర్వహించే నీట్‌లో ఇంటర్‌ మార్కులకు ఎలాంటి వెయిటేజీ ఉండదు. అదేవిధంగా నేషనల్ పూల్‌లో జాయిన్‌ అయితే 15 శాతం సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనమే భర్తీ చేసుకుంటున్న 5,500 ఎంబీబీఎస్‌ సీట్లు, 1,910 దంత వైద్య సీట్లను జాతీయ కోటాకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో అదనంగా కేటాయించిన సీట్లలో కూడా 15 శాతం.. అంటే దాదాపు 1,111 సీట్లను జాతీయ కోటాకు వదలిపెట్టాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లాంటి ఎక్కువ సీట్లున్న రాష్ట్రాలు జాతీయ పూల్‌లో చేరితే.. ఆ రాష్ట్ర విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్టికల్‌ 371-డి అమల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌తో పాటు తెలుగు రాష్ట్రాలూ..

వాస్తవానికి ఆర్టికల్‌ 371-డి అమల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌తో పాటు తెలుగు రాష్ట్రాలూ.. నేషనల్‌ పూల్‌లో సీట్లివ్వాల్సిన అవసరం లేదు. కానీ సుప్రీం తాజా తీర్పుతో నేషనల్‌ పూల్‌లో ఏపీ, తెలంగాణలు కూడా చేరాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌, జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షల వల్ల విద్యార్థులపై అధిక భారం పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైగా సిలబస్‌లో కూడా వైరుధ్యం ఉంది. నీట్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ ఉంటే.. ఎంసెట్‌లో రాష్ట్ర సిలబస్‌ ఉంటుంది. రెండు సిలబస్‌లనూ ప్రిపేర్‌ అయ్యే శక్తి సామర్ధ్యాలు విద్యార్థులకు ఉండక, తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రైవేటు కళాశాలల్లో పోలీసుల తనిఖీలపై స్టే

హైదరాబాద్‌: ప్రైవేటు కళాశాలల్లో పోలీసుల తనిఖీలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కళాశాలల్లో పోలీసులు తనిఖీలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఈరోజు విచారించింది. తనిఖీలపై మధ్యంతర స్టే విధిస్తూ... దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

గణపవరం కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

వరంగల్:  గణపురం మండలం చెల్పూరు కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకు కావడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతిక సిబ్బంది మరమ్మత్తు చర్యలను చేపట్టింది.

హెచ్‌సీయూలో అంబేద్కర్ మనుమడు ప్రకాశ్

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. హెచ్‌సీయూలో జరుగుతున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు దివంగత రోహిత్ వేముల తల్లి రాధిక వర్సిటీకి విచ్చేశారు. వర్శిటీలోకి ప్రవేశించకుండా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా హెచ్‌సీయూ ప్రధాన ద్వారం ఎదుట జరుగుతున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. విద్యార్థుల డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు.

20:41 - April 28, 2016

వడ్డించేవాడు మనవాడైతే …. ఎక్కడ కూర్చున్నా నష్టం లేదు.. ఒకప్పుడు అదే ధైర్యం.. కానీ, ఇప్పుడా భరోసా పోతున్న సందర్భం.. అనుకున్నంత ప్రాధాన్యత మాట అటుంచి... అడగడుగునా మొండిచేయి. ఇవ్వాల్సిన నిధులకు అతీగతి లేదు. విభజన చట్టం పట్టింపే లేదు. ఓవరాల్ గా చూస్తే బాబు సర్కారును కేంద్రం లైట్ తీసుకుంటోందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించిందా? అసలు రెండు ప్రభుత్వాలకూ సరైన రోడ్ మ్యాప్ లేదా? ఏపీ ప్రజలను రెండు ప్రభుత్వాలూ వదిలేశాయా? ఏం జరుగుతోంది? ఈ రోజు వైడాంగిల్ లో చూద్దాం..

20:37 - April 28, 2016

పబ్లీకు ఇగ లెవ్వుండ్రి ఇన్నొద్దులంటే.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడిస్తరో ఎప్పుడిస్తరో అని ఎదురు సూస్కుంట గూసున్నరుగదా..? లేవుండ్రిగ ఎంటనే.. ఒక్కటి గాదు రెండు గాదు.. ఏక్ దం రెండు లక్షల ఇండ్లు గట్టిచ్చెతందుకు పైకం ఇడుదల జేశిండట మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. ఎవ్వలెవ్వలికి ఇండ్లు లేవో ఆళ్లు ఆల్చం జేయకుండ్రి.. కాయిదాలు వట్కోని మన ఎమ్మెల్యేలు.. ఎమ్మార్వోలు.. ఎండీవోల తానికి వోండ్రి..

తెలంగాణ తొమ్మిది జిల్లాలల్లనే నీళ్ల కర్వు ఉన్నది.. కేసీఆర్ సారు వోనమాలు దిద్దిన మెదక్ జిల్లాల లేదు అన్కున్నం గని.. ఆడ గుడ నీళ్ల తక్లీవ్ మంచిగనే వున్నది. మల్లా వేరే ఏడెడనో గాదు. కేసీఆర్ సారు భారీ మెజార్టీతోని ఎంఎల్ఏగ గెలుపొందిన గజ్వెల్లి కాడనే..నీళ్లు లేక కుత్కెలెండిపోతున్నయని అమ్మలక్కలంత.. రోడ్ల మీద్కి వొచ్చి ఎర్రటి ఎండల కుత కుత ఉడ్కుతున్నరు.

ఎన్నడెక్కనాయిన.. ఇయ్యాళ గుర్రమెక్కిండుల్లో.. ఇదేదో శాస్త్రముండెగదా..? గది జెప్తున్న అనుకునేరు.. నేను జెప్పింది అస్సల్ వాజీవ్ ముచ్చటనే.. ఎక్కిన మన్షి ఎవ్వలో అల్లాటప్పమన్షిగాదు.. ఎక్కింది గూడ.. సరదా కోసం ఎక్కింది అంతకంటె గాదు.. ఎక్కి ఒకలి ఇజ్జత్ వుచ్చుకోవాలె అని ఓ ఏశం గట్టిండు.. యవ్వారం జర్రంత ఉల్టా అయ్యింది సూడుండ్రి..

ఎవ్వలు తీస్కున్న పొక్కల వాళ్లే వడ్తరు అంటరు సూడు.. అగో పదాన్కి సూటయ్యే అస్సల్ మన్శి దొర్కిండు. ఎవ్వడు దీశ్న పొక్క వాన్కి ఎర్కుంటది గదా... దాన్ని సూశి మరీ ముంగట్కి అడ్గు ఏస్తడు. కని.. ఇదేందంటరా వొగడున్నడు.. వాడు దీస్కున్న పొక్కల వాడే వడ్డడు.. ఇంతకు ఏ పొక్కల వడ్డడు అది పెద్ద గున్నదా శిన్నదా.. ఎవ్వలన్న బైటకు తీశిండ్రా లేకుంటె అండ్లనే సూద్దాం పార్రి

అయ్యయ్యయ్యో.. పసివిల్ల అంత పదేండ్లు గుడ వుంటదో ఉండదో.. అన్యాలంగ జీవి వొయ్యింది.. ఆ బుజ్జీ వుండే ఆడకట్టంత పుట్టెడు దు:ఖంల మున్కింది... ఆ ఊరిల ఏడ నల్గురు జమ గూడినా ఆ బుజ్జి గురించే మాట్లాడుకుంటుకుంటున్నరు.. ఎవ్వలను పల్కరిచ్చినా ఆ బుజ్జి ముచ్చటనే శెప్పుతున్నరు.. ఇంతకు ఆమె ఎవ్వలు ఎందుకు సచ్చిపొయ్యందో సూద్దాం పార్రి.

స్వర్ణాంధ్ర ప్రదేశ్లున్న అనంతపురం జిల్లాల తొవ్వినా కొద్ది బంగారం ఎల్లుతున్నదట.. భూమి తవ్వితే మట్టి పెళ్లలు ఎల్లాలె గని.. ఈ బంగారి బిల్లలు ఎల్లడేందిరో అని.. అందరు పర్షాన్ ఐతున్నరట.. ఇంతకు ఏడ తొవ్వుతున్నరు. శంద్రాలు తొవ్విచ్చే ఇంకుడు గుంతలల్ల బైటవడ్తున్నదేమో అన్కునేరు కాదు కాదు. ఇది వేరే దెగ్గర.. ఇంతకు అది నికాలస్ బంగారమేనా కాదా మనం గుడ వొయ్యి సూద్దాం.

దొంగతనం జేశి దొర్కితెనో..ఆడోళ్లను శిడాయించెతెనో.. ఊరోల్లంత గుమి గూడి మొగోళ్లను దొర్కవట్టి.. గివ్వే శరం దప్పిన పనులురా అని.. కరంటి పోల్ కు కట్టేశి ఇయ్యర మయ్యర జోపంగ సూశి వుంటరు గని.. ఎన్నడన్న ఆడోళ్లను కరంటి పోల్కు కట్టేశి.. కొట్టంగ సూశిండ్రా..? సూడలేదా అయితే మేం సూపెడ్తం.. ఎందుకు కొడ్తున్నరు.. ఏం కత అనేది తెల్వాల్నంటే ఇగో ఈ ముచ్చట సూడాలె..

ఒక కొంగ ఏం జేశిందట.. చెర్వు కట్ట మీద గూసోని సూస్తున్నదట.. కడ్పుల కాలుతున్నా..? చెర్లకు దిగుతలేదట.. చాపలు వడ్తలేదట.. ఆఖరికి ఏమైతదో మీ అందరికి ఎర్కున్నముచ్చటనే గదా..? చెర్వు మీద కొంగ అల్గితె కొంగదే ఎండుతదని.. అగో అసొంటి కథనే అయ్యింద మధ్య ప్రదేశ్ రాష్ట్రంల గూడ.. ఒకామెను తానం జెయ్యనియ్యలేదని.. జీవ సమాధి జేస్కోవొయ్యింది.. ఆ కథ జూడుండ్రి..

ఎన్నడెక్కనాయిన.. ఇయ్యాళ గుర్రమెక్కిండుల్లో.. ఇదేదో శాస్త్రముండెగదా..? గది జెప్తున్న అనుకునేరు.. నేను జెప్పింది అస్సల్ వాజీవ్ ముచ్చటనే.. ఎక్కిన మన్షి ఎవ్వలో అల్లాటప్పమన్షిగాదు.. ఎక్కింది గూడ.. సరదా కోసం ఎక్కింది అంతకంటె గాదు.. ఎక్కి ఒకలి ఇజ్జత్ వుచ్చుకోవాలె అని ఓ ఏశం గట్టిండు.. యవ్వారం జర్రంత ఉల్టా అయ్యింది సూడుండ్రి.. ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన మాటలు చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:29 - April 28, 2016

కృష్ణా : విజయవాడలో 'ఉద్యోగ రథం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉచిత సేవలు అందిచడం కోసం వినూత్న ఆలోచనతో 'ఉద్యోగ రథం' కార్యక్రమాన్ని రూపొందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోనే మొదటి మొబైల్ బేస్డ్‌ నియామక సంస్థ ఇదేనని ఆయన తెలిపారు. విశాఖ, తిరుపతితో పాటు ప్రతి జిల్లాలోనూ ఉద్యోగరథాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశానికి యువశక్తి ఓ వరంలాంటిదని, వారి ఆలోచనలతో అద్భుతాలు సాధించవచ్చునని అన్నారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రంలోని యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు.

20:28 - April 28, 2016

హైదరాబాద్ : నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే, విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ ఏడాది వరకు నీట్‌ నుంచి వెసులుబాటు కల్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు విధానం మార్చుకుంటే విద్యార్థులకు నష్టం కలుగుతుందని మంత్రి అన్నారు. ఇప్పటికే ఎంసెట్‌ పరీక్ష తేదీ ఖరారైందని, విద్యార్థులు కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యారని లక్ష్మారెడ్డి వెల్లడించారు. 

జరిమానాను వ్యతిరేకిస్తూ కన్నయ్య ఆమరణ దీక్ష

న్యూఢిల్లీ: తమపై జేఎన్‌యూ విధించిన జరిమానాను వ్యతిరేకిస్తూ.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌ సహా.. 25 మంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గంగా దాబా నుంచి అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్యార్థులు దీక్ష ప్రారంభించారు.

నీట్ కు ఎంసెట్ కు సంబంధం లేదు : మంత్రి గంటా

విజయవాడ : రేపు ఏపీలో జరగాల్సి ఎంసెట్ పరీక్ష యథాతథంగా ఉంటుందని, నీట్ కు ఎంసెట్ కు సంబంధం లేదని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ పరీక్ష జరుగుతుందని, ఉదయం 10 గంటల నుంచి 1గంటల వరకు ఇంజనీరింగ్ పరీక్ష, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 191 పరీక్షా కేంద్రాల్లో 2,92,500 మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నట్లు తెలిపారు.

18:47 - April 28, 2016

విశాఖ : అరుకు మన్యాన్ని వరుణుడు కరుణించాడు. కొన్ని రోజులుగా ఎండలతో మగ్గిపోతున్న అరుకు ప్రజలకు, వర్షం ఉపశమనాన్ని కలిగించింది. కురిసిన జల్లులతో వాతావరణమంతా చల్లగా మారింది. వర్షపు జల్లులతో తడిసిన గిరిజన ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

18:46 - April 28, 2016

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా స్ర్కిప్ట్‌కు అంతర్వేది లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శకుడు వి.వి వినాయక్ స్కిప్ట్‌ను ఆలయంలోకి తీసుకెళ్లగా ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు. 

18:45 - April 28, 2016

గుంటూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. చంద్రబాబు విజన్ ఉన్న నేతని గాదె కొనియాడారు. బాబు నాయకత్వంలో నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. రేపు ఉదయం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని గాదె వెంకటరెడ్డి తెలిపారు. 

18:43 - April 28, 2016

అనంతపురం : నగర శివారులోని ఉప్పరపల్లిలో బంగారు నాణేలు లభిస్తున్నాయి. స్థానిక కురుబ బిల్లే రాముడు పొలంలో ఓ వ్యక్తికి బంగారు నాణేలు దొరికాయి. విషయం కాస్త గ్రామస్థులందరి చెవినా పడటంతో అందరూ నాణేలను వెదికే పనిలోనే ఉన్నారు. ఇక ఇదే అదనుగా బంగారు వ్యాపారులు నాణేలను కొనేందుకు క్యూ కడుతున్నారు. రోజూ 60 నుంచి 70 నాణేలను గ్రామస్థులు అమ్ముతున్నట్లు సమాచారం. ఒక్కో నాణేన్ని 3,500రూపాయలకు వ్యాపారులు కొనుక్కుంటున్నారు. నాణేలపై ఒకవైపు దేవతా ప్రతిమలు, మరోవైపు శాసన లిపి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో రాజులు నివసించేవారని, అందుకే బంగారు నాణేలు దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో, పూర్తి స్థాయిలో విచారణ చేసి మొత్తం నాణేలను రికవరీ చేస్తామని తెలిపారు. 

18:42 - April 28, 2016

తూ.గో : గ్రామపెద్దల తీర్పును వ్యతిరేకించారని ఓ ఇంటిపై దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో నాగరిక ప్రపంచం తలదించుకునేలా ఊరిపెద్దలు వ్యవహరించారు. తమ తీర్పును కాదని వెలివేసిన కుటంబంలోని ఓ వివాహనికి వెళ్లాడని కురుపూడి వీరబాబు అనే వ్యక్తి ఇంటిపై దాడిచేసి వస్తువులను ధ్వంసం చేయడమే కాక భార్యాభర్తలను గాయపర్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.

18:40 - April 28, 2016

విశాఖ : బ్రాండెక్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల నేతలు విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. రాష్ర్టంలో అభివృద్ధి పేరుతో మహిళలను బానిసలుగా చూస్తున్నారని ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుకుంటున్నారే తప్ప కార్మికుల సమస్యలు పట్టట్లేదని మహిళా సంఘాలు విమర్శించాయి. అధికార యంత్రాంగం బ్రాండెక్స్ కంపెనీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఐద్వా కార్యదర్శి రమాదేవి ఆరోపించారు. 

18:38 - April 28, 2016

హైదరాబాద్ : విశాఖ ఏజెన్సీలో మళ్లీ ఆంత్రాక్స్ కలకలం సృష్టిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలోని హుకుంపేట మండలం పనసపొట్టులో... ఆంత్రాక్స్ వెలుగుచూసింది. వైద్యులు అక్కడ పరీక్షలు నిర్వహించగా... 13 కేసులు నమోదయ్యాయి. విశాఖలోని కేజీహెచ్ లో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మహమ్మారికి ఇద్దరి మృతి చెందారు. అయితే ఏజెన్సీలో ఆంత్రాక్స్ ప్రభలిన విషయాన్ని ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచారు.

నీట్ పై సుప్రీం తీర్పును గౌరవిస్తాం : మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : నీట్ పరీక్ష పై సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తీర్పు కాపీ వచ్చాక అధ్యయనం చేసి న్యాయసలహా తీసుకుంటామన్నారు. నీట్ నుండి ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. మే 2న టీఎస్ ఎంసెట్ కు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని పేర్కొన్నారు.

18:23 - April 28, 2016

హైదరాబాద్ : డ్యాన్స్‌ హైదరాబాద్‌ డ్యాన్స్ పేరుతో 10 జిల్లాలతో కూడిన మొట్టమొదటి రియాల్టీ షోని నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి జోగు రామన్న అన్నారు. డ్యాన్స్‌లో తమ ప్రతిభ చూపించాలని ఎదురుచూస్తున్న వారికిది మంచి అవకాశమని తెలిపారు. రియాల్టీ షో ప్రోమోను మంత్రి విడుదల చేశారు. మే1 నుంచి తెలంగాణ జిల్లాల్లో ఆడిషన్సు నిర్వహిస్తామని నిర్వాహకులు సంపత్‌ చెప్పారు. ఫైనల్‌ విన్నర్‌కు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు, ఒక సినిమాకి కొరయోగ్రఫి చేసే అవకాశం ఇప్పిస్తామని తెలిపారు. 

18:20 - April 28, 2016

వరంగల్ : కరువు బారినుంచి రైతులనుఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని జెఎసి నేతలు ప్రొఫెసర్‌ కోదండరామ్, మాజీ జస్టిస్‌ చంద్రకుమార్ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన నేతలు ఏనుమాముల మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు మిర్చి, పసుపు, పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. రైతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట సాగునీరు లేక సగానికి సగం దిగుబడి తగ్గిపోయిందని జెఎసి నేతలు అన్నారు. రైతులు కరువుతో సతమతమవుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కరువు రైతులకు నష్టపరిహారంతోబాటు ఇన్‌పుట్ సబ్సిడీలను అందించాలని డిమాండ్ చేశారు. 

18:18 - April 28, 2016

కరీంనగర్ : జిల్లాలో బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కోనరావుపేట మండలం బావుసాయి పేటలో 18 సంవత్సరాల అబ్బాయి, 16 సంవత్సరాల అమ్మాయికి వివాహాం చేస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు రంగప్రవేశం చేసి వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సింగ్ ఇచ్చారు.

 

18:17 - April 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 17న నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఎస్‌ఐ సివిల్ పరీక్షలో లక్షా 74 వేల 962 మంది హాజరుకాగా 88 వేల 875 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 52 శాతం, మహిళలు 41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్‌ఐ కమ్యూనికేషన్ పరీక్షకు 10వేల 584 మంది హాజరుకాగా కేవలం వెయ్యీ 709 మందే ఉత్తీర్ణత సాధించారు. 

18:15 - April 28, 2016

విజయవాడ :నీట్ ఎగ్జామ్ నిర్వహణపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏపీ విద్యార్థుల్లో కన్‌ఫ్యూజన్ మొదలైంది. రేపు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. అయితే యథావిథిగా ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు నీట్‌పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ సర్కార్‌ న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేపట్టింది. ఆర్టికల్ 371 డి ప్రకారం నీట్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు మినహాయింపు ఉంటుంది. తాజా తీర్పుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైద్యశాలల్లో ప్రవేశాలకు మాత్రమే ఎంసెట్‌ నిర్వహించడం లేదని వెటర్నరీ, డెంటల్‌, అగ్రికల్చర్‌ కోర్సులకూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని మంత్రి కామినేని అన్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతో కష్టపడి సిద్ధమయ్యారని... ఈ దశలో పరీక్ష ఆపడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. తాము న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు ఏపీకి మినహాయింపు కోరుతూ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

 

పోలీసు ఔట్‌పోస్టుపై గ్రైనేడ్ దాడి

హైదరాబాద్ : జమ్ముకశ్మీర్ పోలీసు ఔట్‌పోస్టుపై గ్రైనేడ్ దాడి జరిగింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్‌లో గల శ్రీబాగ్‌లో చోటుచేసుకుంది. బాంబు దాడిలో జవాన్లు ఎవరూ గాయపడలేదు. పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడ్డవారి ఆచూకీ తెలియరాలేదు. సిబ్బంది భద్రతను కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలు చేపట్టింది.

ప్రముఖ కార్టూనిస్ట్ వీటీ థామస్ కన్నుమూత

కొట్టాయం: ప్రముఖ కార్టూనిస్ట్ వీటీ థామస్ కన్నుమూశారు. అస్వస్థతకు లోనైన 87ఏళ్ల థామస్ నిన్న రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. బోబాన్ అండ్ మోలీ పేరుతో థామస్ సృష్టించిన కళారూపాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. థామస్‌కు ఆరుగురు పిల్లలున్నారు. థామస్‌ 1961 లో మళయాళ మనోరమ పత్రిక నుంచి కార్డూనిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించారు. 

ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్, సీఎం కేసీఆర్ అభినందనలు

హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ సీ-33 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1జి ఉప గ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని సాధించిన వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఇస్రో మరిన్ని విజయ శిఖరాలను ఆధిరోహించాలని ఆకాంక్షించారు.

ఫ్రాన్స్ లో భూకంపం..

పారిస్: ఫ్రాన్స్ లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 5.2గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రాన్స్ లోని లా రోచెల్ నగరంలో, సమీప ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. 2014 తర్వాత ఫ్రాన్స్ దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూకంపం ఇదేనని సెంట్రల్ ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. 

'పోలవరం' పిటీషన్ ను కొట్టేసినర సుప్రీం

ఢిల్లీ :పోరలవరం ముంపు బాధితులను ఆదుకోవాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ముంపు నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటూ సామాజిక వేత్త పుల్లారావు పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ముంపు నిర్వాసితులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే పిటీషన్ పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది.

మాల్యాను భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం

ఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశీలకు పారిపోయిన కింగ్ పిషర్ అధినేత విజయమాల్యాను భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు కేంద్రం ముమ్మరం చేసింది. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వానికి మాల్యాను భారత్ కు అప్పగించాలని భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది.

ఈఏడాది ఏపీ, తెలంగాణకు నీట్ పరీక్ష లేనట్లే!

హైదరాబాద్ : ఆర్టికల్ 371(డి) ప్రకారం ఈఏడాది ఏపీ, తెలంగాణకు నీట్ పరీక్ష వర్తించదని తెలుస్తోంది. ఎంసెట్ ద్వారానే మెడికల్ కోర్సులో ప్రవేశాలు ఉంటాయని, ఏపీ, తెలంగాణలతో పాటు జమ్మూకాశ్మీర్ కు నీట్ వర్తించదు.

'ఖమ్మంలో చెల్లని తుమ్మల పాలేరులో ఎలా చెల్లుతాడో'

హైదరాబాద్ : ఖమ్మంలో చెల్లని తుమ్మల పాలేరులో ఎలా చెల్లుతాడో కేసీఆర్ సమాధానం చెప్పాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యల కోసం న్యాయం పోరాటం టీఎస్ సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార ఖర్చు కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయిచింది. 

విశాఖ ఏజెన్సీలో ఆంథ్రాక్స్ కలకలం

విశాఖ : ఏజెన్సీలో ఆంథ్రాక్స్ కలకం రేగింది. హుకుంపేట మండలం పనసపొట్టులో 13 ఆంథ్రాక్స్ కేసలు నమోదు కాగా వారిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచారు.

17:05 - April 28, 2016

హైదరాబాద్ : మనసు, మమత, మాధుర్యాల కలబోత మానవత.... గుప్పెడు గుండె చప్పుడే జీవన మనుగడ.... బంధం, అనుబంధం, సంబంధాల సమ్మేళనమే కుటుంబ సరాగం.. సంసార సాగరం. చిన్న అపశ్రుతి.. క్షణికావేశం.. కట్టుతప్పిన ఆలోచన.. తప్పుదారి పట్టిన అలవాటు బ్రతుకు నావకు చిల్లు పొడిస్తే మునిగిపోతున్న కుటుంబాలెన్నో.. మరుగున పడుతున్న వ్యథార్థ గాథలెన్నెన్నో.. ఈ నిజం దృశ్యం కావాలి. కనువిప్పు తేవాలి. కారుణ్యం కురిపించాలి...ఇది కథ కాదు. యథార్థ గాథల అల్లిక ..నవ చేతనా మాలిక... సగర్వంగా ..సాదృశ్యంగా ..సౌమనస్యంగా ప్రసరించే చీకటి వెలుగుల కొత్త కోణం. ఎస్ ...ఇట్స్ ఎ రియల్ స్టోరీ.. ఈ నిజాలకే నిలువెత్తు పట్టం ..ఆరాధన ,శ్రీకరీ ఉత్తమ కార్యక్రమ పురస్కారం. అశేషంగా ..విశేషంగా ఆదరిస్తున్న 10 టీవీ ప్రేక్షకులకే ఇది సమర్పణం.

ఒ క భావోద్వేగం నిలువెల్లా....

ఒ క భావోద్వేగం నిలువెల్లా కమ్ముకుంటుంది. మాటలు చేతలుగా మారుతాయి. అందుబాటులోని వస్తువులే అస్ర్తాలుగా రూపుదాలుస్తాయి. ఆవేశం చల్లారుతుంది. అక్కడేం మిగులుతుంది. రక్తపాతం. హత్య. తిరిగి చూస్తే కన్నీటి సంద్రంగా మారిన కుటుంబం. చెరసాల ఊచలు లెక్కిస్తున్న ఇంటి పెద్ద. అనాథలైపోయిన చిన్నారులు. ఎందుకిలా? మూలమూలల్లో దాగి ఉన్న అహం...ఆవేశం...అప్పుడప్పుడూ తొంగి చూస్తుంది. రాక్షస ప్రవృత్తిని తట్టి లేపుతుంది. పర్యవసానాలు అగమ్య గోచరం. ఆ క్షణం సృష్టించే ఘోరం. విలయం ..కుటుంబంలోని కల్లోలం కళ్లముందు కదలాడితే ఈ దారుణం దరికే వెళ్లరు. కానీ చిత్తం..చెప్పినట్లు వినదు. పర్యవసానమే ఇది కథ కాదు. అన్ వాన్టెడ్ క్రైమ్ కహానీ .. ఎ రియల్ స్టోరీ.

అల్లారుముద్దుగా పెంచిన చిన్నారిని...

అల్లారుముద్దుగా పెంచిన చిన్నారిని అత్తింటికి పంపుతారు ఆ అమ్మానాన్న. పిల్లాపాపలతో కలకలం వర్ధిల్లమంటూ అప్పగింతలు చెబుతారు. ఆశీర్వదిస్తారు. అత్తామామల అత్యాశ ..బంగారు బాతుగా కోడలిని కాసుల కోసం కాటికి పంపే ఉన్మాదం ఆ పెళ్లి కూతురు ఉసురు తీస్తుంది. ఏడడుగులు నడిచి ఎన్నెన్నో ఆశల సౌధాలు నిర్మించుకున్న ఆ అమాయకురాలి కన్నీటి కాష్టం రగులుతుంది. అత్తామామల ముసుగులోని మానవమురుగాలు రాసిన మరణశాసనం ఆమె పిల్లలకు తీరని శాపమై జీవితాంతం వెన్నాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు బదులేది? చట్టం చెప్పే తీర్పు ..వసి వాడని ఈ బాల్యానికి న్యాయం చేస్తుందా? ఈ కన్నీటి కథ సమాజానికి కనువిప్పు కావాలి. అత్తింటి ఆరళ్లతో వేధించే చాందస ధనపిపాసులకు దండన తప్పదన్న కఠోరవాస్తవం కళ్లముందు నిలవాలి. అందుకే ఇది కథ కాదు... ఏ రియల్ డిజైరబుల్ రిజల్ట్..

విధి నిర్వహణలో సర్వం కోల్పోయి...

విధి నిర్వహణలో సర్వం కోల్పోయాడు. నిబంధనల చట్రం అతనిని చీదరించింది. కనీస సాయాన్నీ నిరాకరించింది. డిపార్టుమెంటుతో డీ కొట్టే సత్తా లేక మానసిక వైకల్యంతో మంచాన పడ్డాడో ఎస్.ఐ. ఆలి కూలీగా మారింది. మనో వ్యధతో బతుకు భారాన్ని మోస్తోంది. ప్రభుత్వానికి పట్టదు. కారుణ్యం మాటే గిట్టదు. దాదాపు యాభైవేల మందితో కూడిన రక్షక భట శాఖలోనే పాపం ఈ అభాగ్యునికి రక్షణ కరవైంది. ఆర్థికంగా అండ మరుగ్యమైంది.. ఇదెక్కడి అన్యాయం అన్న ప్రశ్నే వినిపించదు. నిగ్గదీసి అడిగే ఆ గళమే ఇది కథ కాదు. పరిపాలన లోపాలపై పవర్ పుల్ వెపన్. ఎ రియల్ స్టోరీ...

కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు..

కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు... అంటుంది భారత సాహిత్యం. ఆ కాంతనే కాసుల కోసం వల వేసే కామపిశాచులు రాజ్యం చేస్తున్నారు నిత్యం. తెర కెక్కిన ఈ అతివ గుండె ఘోష ప్రతిధ్వనింప చేసే కాల్ మనీ కథలెన్నో...ప్రేమించి పెళ్లాడిన భర్తకు దూరమై... క్షణం ..క్షణం నరకయాతనతో తనువును తాకట్టు పెట్టి ఆమె అనుభవించిన వ్యథ ఆత్మహత్యగా జలసమాధి అయిపోయింది. అభంశుభం తెలియని అయిదేళ్ల పిల్లాడి అన్వేషణకు,..అమ్మా అన్న పిలుపునకు అక్షరరూపమే ఇది కథ కాదు. వడ్డికాసురుల వికృత విన్యాసాలపై ఎక్కపెట్టిన దృశ్య శస్త్రం ఇది కథ కాదు. ఏ రియల్ రివోల్డ్ ఎగైన్ స్ట్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్..

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ...

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. నాకు నువ్వు నీకు నేను అంటూ ఊసులు చెప్పుకున్నారు. బాసలు చేసుకున్నారు. సంప్రదాయం అడ్డు చెప్పింది.'వైవాహికేతర సంబంధం కాదు కూడదు'అంటూ గ్రామం నిలదీసింది. అప్పటికే ఎదిగొచ్చిన వారి పిల్లలు నోళ్లు వెళ్లబెట్టారు. అటు కట్టుబాట్లు, ఇటు ప్రేమైక భావన ల మధ్య నలిగిపోయారా ప్రేయసీ ప్రియులు. తమను కాదన్న సంఘాన్ని తామే వెలివేస్తున్నామన్నారు. చాటుమాటుగా బతకడం తమ వల్ల కాదని తెగించేశారు. ప్రాణాలు ఉరికొయ్యలకు తాళ్లుగా మారిపోయాయి. పిల్లలు గూడు చెదిరిన గువ్వలై పోయారు. ఇరు కుటుంబాల జీవితం రెక్కలు తెగిన పక్షిలా మారిపోయింది. మానవ సంబంధాల పరిమితులు, పరిధులు, సాంఘిక ఆచారాల సరిహద్దుల్లో ఎదురైన సంకటమే వీరి సమస్య. ఎదురొడ్డి పోరాడే స్థైర్యం సంపాదించలేకపోవడమే బలహీనత. ఇదో పాఠం. ఆకర్షణల వలయంలో అతలాకుతలమయ్యే జీవన చక్రాలకు ప్రతిబింబం. అదే ఇది కథ కాదు. రియల్ సైకలాజికల్ స్ట్రగుల్ .. సొసైటీకి సో సారీ ...రేరెస్ట్ ఆఫ్ ద రేర్ స్టోరీ

బహుముఖ జీవన చిత్రాలు...

బహుముఖ జీవన చిత్రాలు... సామాజిక నడవడికలో క్షణ క్షణం ఎదురయ్యే సమస్యల విషవలయాలు.. భావోద్వేగాలు..బతుకు పాఠాలు. సుఖదు:ఖాల సమతులనం లోపించి అర్ధాంతరంగా ముగిసిపోయిన అభాగ్యుల వెతలు. కన్నీటి కథలు. నేరం ..ఆర్థిక భారం చెట్టాపట్టాలేసుకుని సాగిపోతున్న సాంఘిక వైరుద్ధ్యం. ఈ తీరు మారాలి. విద్యావేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలు, మానసిక నిపుణులు ముందుకు రావాలి. అవగాహన భేరీ మోగించాలి. ఈ రియల్ స్టోరీలు చూసైనా వేన వేల కుటుంబాల్లో ఆలోచన రేకెత్తాలి. అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఈ కథా ప్రస్థానం. ఆరాధన..శ్రీకరి ఉత్తమ కథా పురస్కారం ఇందుకు లభించిన సముచిత గుర్తింపు. సమధికోత్సాహానికి ప్రోత్సాహం. 

17:02 - April 28, 2016

ఢిల్లీ : గుట్టలుగా పేరుకుపోతున్న కేసుల భారాన్ని న్యాయవ్వవస్థపై మోపవద్దంటూ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పెట్టిన కంటతడి మోదీ సర్కార్‌ను కదిలించింది. తక్షణమే రంగంలోకి దిగి.. కార్యాచరణను ప్రారంభించింది. గత నెల ఢిల్లీలో జరిగిన ఫోరం ఫర్ ఫాస్ట్ జస్టిస్‌ చేసిన తీర్మానాలను పరిశీలించింది. అవే తీర్మానాలను రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలు చెప్పాలని కోరింది. కేసులు పేరుకుపోకుండా ఉండాలన్నా.. దేశ ప్రజలకు త్వరతగితిన న్యాయం జరగలన్నా... ఈ తీర్మానాలు అమలయ్యేలా సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని... తూర్పు, పడమర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో వేర్వేరుగా సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని... ప్రతి 10లక్షల మందికి జడ్జిల సంఖ్యను 50కు పెంచాలని ఫోరం ఫర్ ఫాస్ట్ జస్టిస్‌ ప్రతిపాదించింది. రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించుకోవాలని.. హైకోర్టు జడ్జిల రిటైర్‌మెంట్ వయస్సును 62 నుంచి 65కు పెంచాలని తీర్మానించారు. ఏ కేసైనా 3 వాయిదాలకు మించొద్దని సూచించింది. అనవసర పిటిషన్లు వేస్తే జరిమానాలు... తప్పుడు సాక్ష్యాలకు ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలను ప్రతిపాదించింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టుల్లో సాయంత్రమూ విధులు నిర్వహించాలని ఫోరం ఫర్‌ ఫాస్ట్‌ జస్టిస్‌ సూచించింది.

సుప్రీం సీజే ఠాకూర్‌ ఉద్విగ్నతకు గురికావడంతో..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి పెడితే కానీ కేంద్రంలో చలనం రాలేదు. మొన్న ప్రధాని సమక్షంలోనే సుప్రీం సీజే ఠాకూర్‌ ఉద్విగ్నతకు గురికావడంతో.. కేంద్ర ప్రభుత్వం సత్వర న్యాయం దిశగా చర్యలు చేపట్టింది. ఫోరం ఫర్ జస్టిస్ తీర్మానాలు ఇకనైనా అమలు చేసేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తాయో లేదో వేచి చూడాలి..

16:58 - April 28, 2016

కృష్ణా : జిల్లాలో చైనా బృందం పర్యటించింది. నందిగామ మండలం పెద్దవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వం ఏపీఐఐసీ కి కేటాయించిన 1131 ఎకరాల భూములను చైనా బృందం పరిశీలించింది. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలైన విద్యుత్, నీటివసతుల గురించి సబ్ కలెక్టర్ సృజన వివరించారు. జిఐఐసీ సిఇఓ అండ్ వైస్ చైర్మన్ జాంగ్ జో భవన నిర్మాణాలకు సంబంధించిన పరిశ్రమ స్థాపనకు భూములను పరిశీలించారని తహశీల్దార్ ప్రసన్నలక్ష్మి తెలిపారు. 

16:55 - April 28, 2016

ఢిల్లీ : వైద్య వృత్తి ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన నీట్ ఎగ్జామ్‌ నిర్వహణపై సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే నీట్ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఎంబిబిఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించాలంది. రెండు విడతలుగా నీట్ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో మే 1, జులై 24 తేదీల్లో నీట్‌ పరీక్ష నిర్వహణకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఆగస్ట్ 17న నీట్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. మే 1న మొదటి విడతలో 6.5లక్షల మంది, జూలై 24న రెండో విడతలో 2.5లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. సెప్టెంబరు 30కల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అక్టోబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలను అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు వెల్లడించింది. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 461 పాయింట్లు నష్టపోయి 25,603 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 7,847 పాయింట్ల వద్ద ముగిసింది. 

16:28 - April 28, 2016

హైదరాబాద్ : ఆధునికత పేరుతో, అభివృద్ధి పేరుతో, సౌకర్యం పేరుతో ఇంకా అనేకానేక కారణాలతో ఉన్నఊరికి ఎప్పుడో దూరమయ్యాం. ఉరుకుల పరుగుల జీవితంలో, కాంక్రీట్ జనారణ్యంలో మర మనుషుల్లా బతికేస్తున్నాం. గజం జాగా ఉన్నా, కనస్ట్రక్షన్ చేసేసి, కాసులొచ్చే ఫ్యూచర్ ప్లాన్ వేసేస్తున్నాం. కానీ, ఈ పరుగులాటలో ఏం కోల్పోతున్నామో ఆలోచిస్తున్నామా ? ఎలాంటి ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నామనే స్పృహలో ఉన్నామా? భవిష్యత్ తరం ఎంత మూల్యం చెల్లించాలో ఆలోచిస్తున్నామా? లేదు కదా? ఆ దిశగా ఒక్కసారి ఆలోచిద్దాం పదండి.

పెరట్లో కూరగాయలు....

పెరట్లో కూరగాయలు పండించుకునే కాలం, దొడ్లో పండ్ల మొక్కలు చూసికుని మురిసపోయే రోజులు పోయాయి. . రూఫ్ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లను పెంచుకునే కాలమిది. .. అలాంటి రూఫ్ గార్డెన్ ని ఎంతో అందంగా, పద్ధతిగా పెంచుతున్న రఘోత్తమరెడ్డి దంపతులను పలకరిద్దాం రండి.

రూఫ్ గార్డెన్...

రూఫ్ గార్డెన్... చాలా సార్లు విన్నమాటే.. చాలామంది చేస్తున్నదే అని కొట్టిపారేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే, మీ ఇంట్లో ఏ కాస్త స్థలమున్నా, కాస్త మట్టి నింపండి. మొక్కలు నాటండి. కిచెన్ గార్డెన్ మీ సొంతం చేసుకుండి. పచ్చదనాన్ని నింపడి. పర్యావరణాన్ని కాపాడండి.   పూర్తి వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి...   

16:24 - April 28, 2016

హైదరాబాద్ :బాల్యంవీడి, యవ్వనం లోకి అడుగుపెట్టే పిల్లల్లో మానసికంగానూ, శారీరకంగానూ అనేక మార్పులు కనిపిస్తుంటాయి. ఇలాంటి కీలకదశలో టీనేజ్ పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. వారికివ్వాల్సిన హెల్దీ డైట్ ఏమిటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో ప్రముఖ న్యూట్రీషియనిస్టు డాక్టర్ జానకీ తెలియజేశారు. మరి అవేంటో తెలుసకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మారుస్తాం: మంత్రి రావెల

విజయవాడ: సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ప్రగతిపై మంత్రి రావెల కిషోర్‌బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనహాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్పుపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఏడాదిలోగా ఎస్టీ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మారుస్తామని, బాలికల హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రహరీగోడలు నిర్మించాలని అధికారులను రావెల కిషోర్‌బాబు ఆదేశించారు.

16:19 - April 28, 2016

నల్గొండ : ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు-ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు విడతలుగా నీట్ పరీక్ష : సుప్రీం

ఢిల్లీ: 2016-17 సంవత్సరానికి సంబంధించిన దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్యవిద్య ప్రవేశ పరీక్ష(నీట్‌) నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. నీట్‌ పరీక్షను మే 1, జులై 24న రెండు విడతలుగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 17న రెండు పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. సెప్టెంబర్‌ 30 నాటికి కౌన్సిలింగ్‌ పూర్తిచేసి అక్టోబర్‌ 1న తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది.

16:04 - April 28, 2016

హైదరాబాద్ : జేఈఈ మెయిన్‌ 2016 ఫలితాలలో వరుసగా నాలుగోసారి ఆలిండియా ఫస్ట్‌ర్యాంక్‌తో నారాయణ శ్రీచైతన్య విద్యా సంస్థలు రికార్డు సృష్టించాయి. నారాయణ శ్రీ చైతన్య అటు టాప్‌ మార్కులతోను,.ఇటు టోటల్ మార్క్స్‌తోనూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. ఓపెన్‌ కేటగిరిలో 360 మార్క్స్‌గానూ 345 మార్కులతో తాళ్లూరి సాయితేజ ఆలిండియా మొదటి ర్యాంక్‌ సాధించగా 340 మార్కులతో విగ్నేష్‌ రెండో ర్యాంక్‌ సాధించారు. 335 మార్కులతో ప్రశాంత్‌రెడ్డి, సాయి ఆధిత్య మూడో ర్యాంక్‌ సాధించారు. అయితే తాము అందిస్తున్న అనితర సాధ్యమైన శిక్షణ, పటిష్ట ప్రణాళిక వల్లే ఈ ఘనత సాధ్యమని నారాయణ, చైతన్య అకడమిక్‌ డైరెక్టర్లు సింధు నారాయణ, సుష్మా అన్నారు. 

16:03 - April 28, 2016

విజయవాడ : తలసరి ఆదాయంలో చివరి స్థానం ఉన్నప్పటికి భారతదేశంలో అభివద్థిలో మొదటి స్ధానంతో ముందుకు పోతున్న రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 14 వేల లోటు బడ్జేట్ ఉన్నప్పటికి సమస్యలను అధిగమించి రాష్ట్రాభివృద్థి కోసం శ్రమిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ముందున్నామని, రైతులకు 24 వేల కోట్లు, డ్వాక్రా సంఘాలకు 10 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసామని చంద్రబాబు చెప్పారు. 

16:00 - April 28, 2016

కడప : పార్టీ ఫిరాయింపుల చట్టం పూర్తిగా నిర్వీర్యం అవుతోందని ఆ చట్టాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. డబ్బున్న వారికే సీట్లు ఇచ్చి గెలిపించుకున్నందుకు ఇప్పుడు వైసిపి తగిన మూల్యం చెల్లించుకుంటోదంటుని విమర్శించారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు ఎక్కువ కాలం నిలవవని మధు తేల్చి చెప్పారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

15:58 - April 28, 2016

హైదరాబాద్ : నియోజకవర్గం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీలో చేరామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తమది మచ్చలేని కుటుంబమని ఎటువంటి ప్రలోభాలకూ లొంగమని చెబుతున్న బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి...

15:53 - April 28, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో డిఆర్ ఐ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. కస్టమ్ సర్వీస్ ఏజెంట్ నుంచి 3.8కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్యాసింజర్ నుంచి...బంగారం తీసుకొని బయటకు వచ్చిన కస్టమ్ సర్వీస్ ఏజెంట్ ను పార్కింగ్ ఏరియాలో డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు.

 

15:47 - April 28, 2016

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఏకకాలంలో 9చోట్ల దాడులు నిర్వహించారు. విస్తృత స్థాయిలో సోదాలు సాగించి, వందకోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు. హైదరాబాదులోని విలువైన ప్రాంతాల్లో ఖరీదైన ప్లాట్ల దస్తావేజులు లభించాయి. బ్యాంకు లాకర్లు కూడా తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. పురుషులు 52 శాతం, మహిళలు 41శాతం ఉత్తీర్ణులు అయ్యారు. ఏప్రిల్ 17న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. సివిల్ ఎస్ పరీక్షకు 1,74,962 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 88,875 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. కమ్యూనికేషన్ ఎస్సై పరీక్షకు 10,584 మంది హాజరు కాగా, వారిలో 1,709 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3.8కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద  కస్టమ్స్ సర్వీస్ ఏజెంట్ బంగారం తీసుకుని బయటకు వచ్చాడు. దాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు కస్టమ్స్ సర్వీస్ ఏజెంట్ వద్ద నుండి 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఓటు అడిగేహక్కు తుమ్మలకు లేదు:తమ్మినేని

ఖమ్మం: పాలేరు నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగేహక్కు మంత్రి తుమ్మలకు లేదని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్షాలు బలపరిచిన పోతిని సుదర్శన్ రావు నామినేషన్ దాఖలు చేశీరు. ఈ కార్యక్రమానికి హాజరయిన తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ... పాలేరులో వామపక్షాలు పలుమార్లు గెలిచాయని, తుమ్మలకు ఎన్నికలపుడే ప్రజలు గుర్తుకొస్తారు అని ఆరోపించారు. ఎర్రివల్లిలో తప్ప ఎక్కడైనా 2 పడకల ఇళ్లు కట్టించారా అని తమ్మినేని ప్రశ్నించారు.

డీటీసీ ఆస్తులపై ఏసీబీ దాడులు..

తూర్పుగోదావరి: జిల్లా రవాణాశాఖ కమిషనర్ ఎ.మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాకినాడ నగరంలోని గైగోలపాడులోని ఆయన నివాసంతోపాటు తొమ్మిదిచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజమండ్రిలో రూ.2.50 కోట్ల ఆస్తులున్నట్లు తేల్చారు. అలాగే హైదరాబాద్, అనంతపురం, ప్రొద్దుటూరు, బళ్లారి, కడప, నెల్లూరుల్లో గురువారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కు తప్పిన ప్రమాదం

నల్గొండ : వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కారు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే బయటపడగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తుండగా నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

పాలేరు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన పోతినేని

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికకు వామపక్షాల అభ్యర్థిగా పోతినేని సుదర్శన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. కేసీఆర్ కి కరువు కాటకాలు కనిపించడంలేదని, ఎన్నికల ముందు టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

మెదక్‌ జిల్లాలో సీఐటియు ఆధ్వర్యంలో అంబలి కేంద్రాలు

మెదక్ : ఆకలిలో అల్లాడుతున్న సామాన్యుల కడుపు నింపుతోంది సీఐటియు కార్మిక సంఘం. కరువతో సతమతమౌతున్న మెదక్‌ జిల్లాలో అందోల్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో సిఐటియు అంబలి కేంద్రాన్ని ప్రారంభించింది.

వరంగల్‌లో రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

వరంగల్ : మిషన్‌ కాకతీయ పేరిట సర్కారు ఓవైపు చెరువులను పునరుద్ధరిస్తుంటే.. మరోవైపు కబ్జాదారులు ఆ చెరువులే లేకుండా చేసేస్తున్నారు. మానవ మనుగడకు జీవనాధారమైన చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే.. అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనికి వరంగల్‌ జిల్లా పరకాలలోని దామెర చెరువు ఉదాహరణగా నిలుస్తోంది. 

ప్రచార ఆర్భాటంగానే మిగిలిన స్వచ్ఛ హైదరాబాద్

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్‌తో నగరాన్ని సుందరమయంగా చేస్తామన్నారు. డెబ్రిస్, గార్బేజ్‌పై ఇక యుద్ధమే అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200 కోట్లతో పనులు చేపడతామన్నారు. కానీ ఆ మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. వందల కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన చెత్త నిర్మూలన ప్రతిపాదనలు సగం కూడా అమలు కాలేదు. కార్యక్రమం పూర్తిగా ప్రచారార్భాటంగానే మిగిలిపోయింది. 

14:39 - April 28, 2016

గుంటూరు : అమరావతి ఇమేజ్‌ను దెబ్బ తీయడమే వైసీపీ అధినేత జగన్‌ లక్ష్యమన్నారు.. మంత్రి ప్రత్తిపాటి.. చంద్రబాబుపై అవాస్తవాలు, అసత్యాలతో పుస్తకం ప్రచురించారని మండిపడ్డారు.. రాజధానిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని జగన్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. రాజధాని పరిధిలోని ఏ గ్రామానికైనా రావాలని.. ప్రజల మధ్య చర్చకు తాము సిద్ధమని సవాల్‌ విసిరారు.. 

14:33 - April 28, 2016

హైదరాబాద్ : ఏపీలో పార్టీ ఫిరాయింపులపై కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ అధినేత జగన్‌ ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యేలు ఒక పార్టీనుంచి గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరుతున్నారని తెలిపారు.. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని విజ్ఞప్తి చేశారు..

టిడిపిలోకి మాజీ మంత్రి గాదెవెంకటరెడ్డి

గుంటూరు :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. చంద్రబాబు విజన్ ఉన్న నేతని గాదె కొనియాడారు. బాబు నాయకత్వంలో నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. రేపు ఉదయం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని గాదె వెంకటరెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కేంద్రమంత్రి గడ్కరీ

ఢిల్లీ : దేశంలో నానాటికీ విపరీతంగా పెరుగుతున్న రోడ్డుప్రమాదాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ, నిర్వహణలకు చేపట్టే ప్రాజెక్టుల్లో ఒక శాతం మొత్తాన్ని రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ చర్యలకు వినియోగించేలా విధానాన్ని రూపొందించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దేశంలో సగటున ఏడాదికి 5లక్షల రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని... వీటిలో 1.5లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండగా... 3 లక్షల మంది వికలాంగులుగా మారుతున్నారని మంత్రి తెలిపారు.

శేషాచలం అడవుల్లో పోలీసులు కూబింగ్...

తిరుపతి : శెట్టిపల్లి పంచాయితీ సమీపంలోని శేషాచలం అడవుల్లో పోలీసులు కూబింగ్ చేపట్టారు. 22 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కూంబింగ్ లో ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు.

సీఈసీ తో జగన్ భేటీ......

ఢిల్లీ : సీఈసీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. ఏపీలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి జగన్ ఫిర్యాదు చేశారు. 

'షార్' శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు.....

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిజేశారు. ఈరోజు నెల్లూరులోని శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీ సీ-33 రాకెట్ ప్రయోగం విజయంతంగా కావడంతో షార్ శాస్త్రవేత్తలకు మోదీ అభినంతనలు తెలిపారు. ఒకటి తరువాత ఒకటి ఇలా..ఏడు ఉపగ్రహాలను విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం జరిగిందని, జీపీఎస్ సిస్టంలో అంతర్భాగం కావడం జరిగిందన్నారు. రాకెట్ ప్రయోగం వల్ల ఎన్నో ఫలితాలు పొందవచ్చన్నారు. 125 కోట్ల ప్రజలకు కానుక ఇచ్చినట్లైందని, ఉపగ్రహం ప్రయోగం వల్ల భారత్ కు సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటైందని తెలిపారు.

గణేష్ నిమజ్జనంపై హైకోర్టు సూచనలు....

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాగా ఈరోజు ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. సాగర్‌లో కాలుష్యం తగ్గించేందుకు బెంగళూరు తరహా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహాల తయారీలో సహజ రంగులు వాడాలని న్యాయస్థానం సూచించింది. విగ్రహాల ఎత్తు తగ్గింపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఎన్‌క్లోజర్స్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.

13:24 - April 28, 2016

ఢిల్లీ : భారత శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం ఏఆర్ఎన్ ఎస్ -1జీ ని రోదసీలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మోడీ ప్రసంగించారు. ఒకటి తరువాత ఒకటి ఇలా..ఏడు ఉపగ్రహాలను విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం జరిగిందని, జీపీఎస్ సిస్టంలో అంతర్భాగం కావడం జరిగిందన్నారు. రాకెట్ ప్రయోగం వల్ల ఎన్నో ఫలితాలు పొందవచ్చన్నారు. 125 కోట్ల ప్రజలకు కానుక ఇచ్చినట్లైందని, ఉపగ్రహం ప్రయోగం వల్ల భారత్ కు సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటైందని తెలిపారు. ఇక విమానాలు ల్యాండ్ కావడం సులభతరం కానుందని, రైళ్ల రాకపోకలకు నావిగేషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో చంద్రుడు..సూర్యుడు..నక్షత్రాల కదలికలను బట్టి సముద్రంలో పయనించే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన వారిని అభినందిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని, భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. 

టీడీపీ గూటికి కాంగ్ సీనియర్ గాదె.......

హైదరాబాద్ : అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ  వైసీపీ నుండి వలసల పరంపర కొనసాగుతోంది.ఇప్పుడు తాజాగా కాంగ్రెస్  సీనియర్ నేత టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధమయ్యారు. పార్టీలోకి రావటానికి ముందు ఆయన సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. గుంటూరులో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ....సీఎం హోదాలో చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని గాదె అన్నారు. రేపు విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలుస్తానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు సమక్షంలోనే తాను టీడీపీలో చేరతానని కూడా గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు.

13:07 - April 28, 2016

నెల్లూరు : నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం ఏఆర్ఎన్ ఎస్ -1జీ ని రోదసీలోకి దూసుకెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి పయనించింది. మొదటి దశ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఉప గ్రహం బరువు 1425కిలోలుగా ఉంది.
ఈ ఉపగ్రహం ద్వారా పూర్తిస్థాయి పరిజ్ఞానంతో.. నావిగేషన్ వ్యవస్థను వినియోగించుకునేందుకు మార్గం సుగుమం కానుంది. దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిపుష్టం కానుంది. నావిగేషన్ వ్యవస్థలో నింగిలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్ వీ సీ-33 ప్రయోగం చివరిది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై పోలార్ శాటిలైట్ లాంచ్‌ వెహికల్ సి-33 అనుసంధానం పూర్తి చేశారు. శుక్రవారం వాహననౌకలోని శిఖర భాగాన ఉపగ్రహానికి ఉష్ణకవచాన్ని అమర్చారు. ఇప్పటికే రాకెట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 25న రిహార్సల్స్ కూడా పూర్తయ్యింది. ఐఆర్ఎన్ఎస్ -1జీ ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టడం వల్ల ఇస్రో కీలక మైలురాయి చేరింది. 

పీఎస్‌ఎల్వీ సీ-33 విజయవంతం.....

నెల్లూరు : శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి మరో ప్రయోగం విజయవంతమయ్యింది. పీఎస్‌ఎల్వీ సీ-33 రాకెట్ కాసేపట్లో నింగిలోకి దూసుకుపోయింది. ఈరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి రాకెట్‌ను ప్రయోగించారు . ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉప గ్రహాన్ని రాకెట్ తనతోపాటు మోసుకెళ్ళింది. భారతీయ నేవిగేషన్ సిస్టమ్‌లో ఇదే చివరి ప్రయోగం కావటం విశేషం. ఈ ప్రయోగం విజయవంతంతో స్వదేశీ నేవినేవిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ టెక్నాలజీలో ఇది ఏడో ఉప గ్రహం. పీఎస్‌ఎల్వీ సీ-33 ఉప గ్రహం బరువు 1,425 కిలోలు.

నింగిలోకి దూసుకెళ్తున్న సీఎస్ఎల్ వీ -సీ 33 ...

నెల్లూరు : సీఎస్ఎల్ వీ -సీ 33 రాకెట్ ప్రయోగం కొనసాతోంది. ఐఆర్ఎన్ ఎస్ ఎస్ -1 జీ ఉపగ్రహాన్ని సీఎస్ఎల్ వీ -సీ 33 నింగిలోకి మోసుకెళ్తోంది. 

12:51 - April 28, 2016

హైదరాబాద్ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పప్పు ముద్ద అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచకపడ్డారు. 'సేవ్ డెమోక్రసీ' పేరిట వైసీపీ అధ్యక్షుడు జగన్, వైసీపీ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జాతీయ నాయకులను కలిసి చంద్రబాబు చేసిన అవినీతిపై ప్రచురించిన బుక్ లను వారికి అందచేశారు. పర్యటనకు సంబంధించిన విషయాలు..ఇతరత్రా వాటిపై రోజా మీడియాకు వివరించారు. రెండు సంవత్సరాలు పూర్తికాకముందే తండ్రి, కొడుకులు ఎలా దోచుకుంటున్నారో పుస్తక రూపంలో కేంద్ర మంత్రులు, ఎంపీలకు, మిత్రపక్షాలకు ఇవ్వడం జరిగిందన్నారు. బాబు అవినీతిని చూసి నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిపై చర్చ జరుపుతున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. మనవడి చూసే సమయం కన్నా ఎక్కువగా పాలనపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతోందని బాబు పేర్కొంటున్నారని, మరి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బాబు తప్పు చేశారన్న దానిపై తాము ముద్రించిన బుక్ లెట్ పై సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా అని సవాల్ విసిరారు. 'లోకేష్ పప్పు ముద్ద..కేసీఆర్ చర్చకు రావాలంటూ తొడ కొట్టారని..తెలంగాణలో ఏ పరిస్థితి ఉందో గుర్తు చేసుకోవాలి' అంటూ మండిపడ్డారు. లోకేష్ దమ్ము ధైర్యం ఎంటో ప్రజలకు తెలుసన్నారు. చర్చకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారని, దొంగలు..ముద్దాయి..వారితో చర్చ ఏంటీ ?అని ప్రశ్నించారు. సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలని, ఎంక్వయిరీకి ఆదేశాలిస్తే తమదగ్గరున్న ఆధారాలను వారికిస్తామని వెల్లడించారు.

జగన్ పై కక్ష గట్టారు...
జైలుకు వెళ్లిన వారు ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తరువాత జగన్ పై కక్ష గట్టి జైలుకు పంపించారని తెలిపారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని కేసులపై స్టేలు తెచ్చుకున్నారని బాబునుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో బాబు మాట్లాడినట్లు రుజువైందని దీనిపై కోర్టు ఆధ్వర్యంలో విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టిడిపికి ఓట్లు వేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని, టిడిపిలోకి వెళుతున్న నేతల వెంట ప్రజలు కూడా వెళుతారని టిడిపి భావిస్తోందని తెలిపారు. ప్రభుత్వం బలహీన పడుతోందనే దృష్టి మరల్చడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మీడియాతో మ్యాజిక్ లు చేస్తూ ప్రజలు ఏమీ తెలుసుకోకుండా చేస్తున్నారని, సొంత అభివృద్ధితో నేతలు జంప్ లు అవుతున్నారని, పవన్ కల్యాణ్..ఇతర కాళ్లు పట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించారని ఎద్దేవా చేశారు. తమకు టిడిపికి కేవలం ఐదు లక్షల ఓట్లే తేడా అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలవని 'పప్పు'ను సీఎంగా చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఏపీ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చింది వారేనని దుయ్యబట్టారు. 

12:48 - April 28, 2016

బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరులో కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తో సమావేశమయ్యారు. రాజోలి బండ నీటి మళ్లింపు ఎత్తు పథకంపై చర్చించారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపు ఉన్నా ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదని ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కాల్వల ఆధునీకరణ చేపట్టినా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయించాలని టి.ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంత్రి హరీష్ రావు బృందం బెంగళూరుకు వెళ్లింది. ఈ చర్చలు సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి కూడా హరీష్‌రావు వెంట బెంగళూరు వెళుతున్న ప్రతినిధి బృందంలో ఉన్నారు.

పాలమూరు రైతుల కష్టాలు తీరుతాయా ? 
ఆర్డీఎస్‌ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తు 15 సెం.మీ పెంపుదల, లైనింగ్‌ మరమ్మతులకు సంబంధించి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంలో 58 కోట్లు కర్నాటక ప్రభుత్వం దగ్గర డిపాజిట్‌ చేసింది. కర్నాటక ఇరిగేషన్‌ మంత్రి ఎంబీ పాటిల్‌తో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీలో ఈ అంశాన్ని చర్చిస్తారు. ఇవి సఫలమైతే ఆర్డీఎస్‌ పరిధిలోని పాలమూరు రైతుల కష్టాలు చాలావరకు తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

డీటీసీ మోహన్ ఇంటిపై ఏసీబీ దాడి....

తూ.గోదావరి: కాకినాడ డీటీసీ మోహన్ ఇంటిపై ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. దీంట్లో రూ.8.కోట్ల అక్రమాస్తులు వున్నట్లుగా అధికారులు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కేజీ టూ పీజీపై కడియం సమీక్ష...

హైదరాబాద్ : టీ.ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేజీ టూ పీజీ భాగంగా ప్రవేశపెట్టనున్న 250 గురుకులాలపై మంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గురుకులా నిర్మాణానికి సంబంధించిన నివేదికను త్వరలో సీఎంకు అందజేస్తామని కడియం పేర్కొన్నారు.

కర్నాటక మంత్రితో టీ.మంత్రి బృందం భేటీ...

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గురువారం ఉదయం బెంగళూరులో కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం ఎత్తు పెంపుపై చర్చించారు. ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ ఐదారు టీఎంసీలకు మించి రావట్లేదు. కాలువల ఆధునికీకరణ చేపట్టినా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయించడానికి కర్ణాటక మంత్ర పాటిల్ తో  చర్చించారు.

3 ఏళ్ళల్లో 1,433, 549, 2,135 మంది మృతి : మంత్రి సుజనా

హైదరాబాద్ : భానుడి ప్ర‌తాపానికి జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. సాధారణంగా వేస‌వికాలంలో మే నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ మార్తాండుడు మంటలు కురిపిస్తున్నాడు. వడగాల్పులకు ప్రజలు మృతి చెందిన విషయం ఆయా రాష్ట్రాలు అధాకారికంగానే వెల్లడించాయి. తాజాగా లోక్‌స‌భ‌లో శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరి దేశ‌వ్యాప్తంగా భానుడి ప్ర‌తాపానికి మృత్యువాత ప‌డ్డ వారి సంఖ్య‌ను పేర్కొన్నారు. 2013నుంచి ఈ ఏడాది మార్చివ‌ర‌కు 4,204 మంది ప్ర‌జ‌లు ఎండల తీవ్రతకు బ‌లైపోయారని ఆయన తెలిపారు.

12:30 - April 28, 2016

హైదరాబాద్ :  కాంగ్రెస్ లో నిరసన గళాలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ప్రారంభమైన టీ సీఎల్పీ భేటీని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిష్కరించారు. సమావేశానికి పిలిచి అవమానించారని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి విసవిసా బయటకొచ్చేశారు. ఈ ఘటనతో షాక్ కు గురైన టీ పీసీసీ పెద్దలు తేరుకునేలోగానే నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశాన్ని బహిష్కరించారు. ఆరు నెలలుగా నల్లగొండ డీసీసీకి అధ్యక్షుడినే నియమించలేదని నిరసన వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి వాకౌట్ చేశారు. పొంగులేటి వాకౌట్ సందర్భంగా ఆయన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో వాగ్వాదానికి కూడా దిగారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచామని ఉత్తమ్ చెప్పగా... ఆహ్వానం అందితేనే తాను భేటీకి హాజరయ్యానని పొంగులేటి వాదించారు. ఒకేసారి ఇద్దరు కీలక నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేయడంతో అక్కడ కలకలం రేగింది.

12:16 - April 28, 2016

'ప్రిన్స్' మహేష్ బాబు సైకిల్ దిగి బుల్లెట్ ఎక్కారు. 'శ్రీమంతుడు' చిత్రంలో ప్రిన్స్ సైకిల్ ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రంలో బుల్లెట్ ను ఉపయోగించారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ గురువారం విడుదలైంది. తన ట్విటర్ పేజీలో మహేష్ దీనిని పోస్టు చేశారు. డిఫరెంట్ గా డెకరేట్ చేసిన మూడు చక్రాల వైరటీ బుల్లెట్ పై 'ప్రిన్స్' స్టైల్ గా దూసుకపోతున్నట్లుగా చూపించారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న విడుదల చేసి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. 'బ్రహ్మోత్సవం' ఆడియో మే 7న విడుదల చేయనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. 

మంత్రి ఎంబీ పాటిల్ తో టి.మంత్రి హరీష్ చర్చలు..

బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బృందం బెంగళూరుకు చేరుకుంది. అక్కడి రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ తో సమావేశమయ్యారు. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం ఎత్తు పెంపుపై చర్చించారు. హరీష్ రావు వెంట మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అధికారులున్నారు. 

మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి....

ప.గోదావరి: జిల్లా కేంద్రమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డీఈ వీర వెంకట సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారనే సమాచారంతో ఏసీబీ దాడులు చేపట్టింది.

11:46 - April 28, 2016

ఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్..బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్న రాజ్యసభలో బీజేపీకి దాడికి దిగిన సంగతి తెలిసిందే. గురువారం రాజ్యసభలో ఆగస్టా ల్యాండ్ పై చర్చకు కాంగ్రెస్ పార్టీ నోటీసిచ్చింది. ఈ అంశంపై సుబ్రమణ్యస్వామి..డిప్యూటి స్పీకర్ మధ్య కొంత సంవాదం చోటు చేసుకుంది. జీరో అవర్ లో ఏ రూల్ కింద ఇచ్చారని డిప్యూటి స్పీకర్ ప్రశ్నించారు. తాను రూల్ 167 కింద ఇవ్వడం జరిగిందని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. నోటీసు స్పీకర్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, అంతవరకు వేచి ఉండాలని సుబ్రమణ్యస్వామికి సూచించారు. 

అగస్టాపై రాజ్యసభలో రచ్చ.....

ఢిల్లీ : రెండో ద‌శ పార్లమెంట్ బ‌డ్జెట్ సమావేశాలలో భాగంగా నాలుగో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. రాజ్యంగంలోని 267వ నిబంధన కింద రాజ్యసభలో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభ‌కోణం అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నోటీసు ఇచ్చింది. ఈ కుంభకోణంలో రాజ్య‌స‌భ‌లో సోనియా గాంధీపై నిన్న అనగా బుధవారంనాడు అధికార బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈరోజు ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ కుంభకోణంపై దర్యాప్తుని ఎందుకు ముగించలేదని ఆమె ప్రశ్నించారు.

11:39 - April 28, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... మరో మైలు రాయిని చేరుకోబోతుంది. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం ఏఆర్ఎన్ ఎస్ -1జీ ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం ద్వారా పూర్తిస్థాయి పరిజ్ఞానంతో.. నావిగేషన్ వ్యవస్థను వినియోగించుకునేందుకు మార్గం సుగుమం కానుంది. దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిపుష్టం కానుంది. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్ వీ సీ-33 ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. అన్నీ అనుకున్నట్లు సాగితే.. 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై పోలార్ శాటిలైట్ లాంచ్‌ వెహికల్ సి-33 అనుసంధానం పూర్తయ్యింది. శుక్రవారం వాహననౌకలోని శిఖర భాగాన ఉపగ్రహానికి ఉష్ణకవచాన్ని అమర్చారు. ఇప్పటికే రాకెట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 25న రిహార్సల్స్ కూడా పూర్తయ్యింది. ఐఆర్ఎన్ఎస్ -1జీ ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టగలిగితే ఇస్రో కీలక మైలురాయిని చేరినట్లే. 

11:36 - April 28, 2016

బెంగళూరు : గోదావరినదిపై నిర్మించే ప్రాజెక్ట్‌లపై మహారాష్ట్రలో సయోధ్య కుదర్చుకున్న తెలంగాణ సర్కార్‌ ఇప్పుడు కర్నాటకతో ఇదే విధంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్ట్‌ల విషయంలో కర్నాటక ఇరిగేషన్‌ మంత్రి ఎంబీ పాటిల్‌తో చర్చించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బెంగళూరు వెళుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి కూడా హరీష్‌రావు వెంట బెంగళూరు వెళుతున్న ప్రతినిధి బృందంలో ఉన్నారు. తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో అంతరాష్ట్ర ప్రాజెక్ట్‌గా ఉన్న రాజోలి బండ మళ్లింపు పథకం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణ రైతులకు నీరు అందడంలేదు. ఇదే విషయాన్నిహరీష్‌రావు కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌కు ఫోన్‌ ద్వారా వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని పనులు కూడా మూడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా రైతులు ఆర్టీఎస్‌ దగ్గర ప్రతి సీజన్‌లో ఆందోళనకు దిగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. దీంతో శాంతిభద్రతల సమస్యల తలెత్తుతోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆర్డీఎస్‌ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని హరీష్‌రావు... కర్నాటక మంత్రి ఎంబీ పాటిల్‌కు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కర్నాటక ఇరిగేషన్‌ మంత్రి చర్చలకు రావాలని ఆహ్వానించడంతో హరీష్‌రావు బృందం బెంగళూరు వెళుతోంది.

పాలమూరు రైతుల కష్టాలు తీరుతాయా ? 
ఆర్డీఎస్‌ కర్నాటకలో 40 కి.మీ. ప్రవహించిన తర్వాత తెలంగాణలో ప్రవేశిస్తుంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ఆర్డీఎస్‌ ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాలకు 15.9 టీఎంసీల నీరు కేటాయించారు. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 87,500 ఎకరాల భూమి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఏటా 5 నుంచి 6 టీఎంసీ నీరు కూడా అందడంలేదు. దీంతో సాగు విస్తీర్ణం 20 వేల ఎకరాలకు పడిపోయింది. దీనికి సమైక్యపాలకులు నిర్ణక్ష్యమే కారణమన్నది హరీష్‌రావు వాదన. ఆర్డీఎస్‌ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తు 15 సెం.మీ పెంపుదల, లైనింగ్‌ మరమ్మతులకు సంబంధించి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంలో 58 కోట్లు కర్నాటక ప్రభుత్వం దగ్గర డిపాజిట్‌ చేసింది. కర్నాటక ఇరిగేషన్‌ మంత్రి ఎంబీ పాటిల్‌తో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీలో ఈ అంశాన్ని చర్చిస్తారు. ఇవి సఫలమైతే ఆర్డీఎస్‌ పరిధిలోని పాలమూరు రైతుల కష్టాలు చాలావరకు తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

11:30 - April 28, 2016

విశాఖపట్నం : పరిశ్రమ యాజమాన్యాలతో సెంట్రల్ పొల్యూషన్ బోర్డు అధికారులు నోవాటెల్ హోటల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు హొటల్ ముందు ఆందోళనకు దిగాయి. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలుష్యాన్ని నివారించమని కోరితే అరెస్ట్ లకు పాల్పడటం సరికాదని వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడ్డారు. కాలుష్యాన్ని నివారించటానికి నిర్వహించే సమావేశంలో కేవలం అధికారులే తప్ప సామాన్యులను భాగస్వామ్యం చేయకుండా సమావేశం నిర్వహించటంపై వామపక్ష నేతలు విమర్శించారు. ఓ ప్రజాసంఘంలోని మహిళా నేత మాట్లాడుతూ.. జిల్లా పర్యటనంటూ వచ్చి సీఎం చంద్రబాబు ఏసీ రూముల్లో కూర్చుని సమావేశాలు నిర్వహించిపోతుంటారు తప్ప నగరంలో ఎక్కడ చూసినా మురికి, దీంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు రకరకాల బారిన పడుతున్నారనీ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరితే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

11:20 - April 28, 2016

ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రజల ప‌క్షాన పోరాడే ఆలోచ‌న జ‌గ‌న్‌కు ఏమాత్రం లేద‌ని, జ‌గ‌న్ ఎప్పుడూ డబ్బులకే ప్రాధాన్యత ఇస్తారని మైసూరా లేఖ‌లో పేర్కొన్నారు. తాను ఏ మాన‌వీయ కోణంతో అయితే పార్టీలో చేరానో అలాంటి కోణాలు ఇప్పుడు పార్టీలో మచ్చుకైనా లేవన్నారు. అలాంట‌ప్పుడు తాను పార్టీలో కొన‌సాగ‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకున్నట్లు మైసూరా తెలిపారు. నియోజకవర్గమైన అభివృద్ధి..అక్కడున్న నేతలు..ఇతర ఇబ్బందులు ఒకవైపు మరోవైపు పార్టీ వ్యవహరాలను శాసనసభ్యుడు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. డబ్బుల కోసం ఎమ్మెల్యేలు వెళుతున్నారన ఆధారాలతో సహా చూపిస్తే ఎవరైనా ఒప్పుకుంటారని తెలిపారు. ఎందుకు వెళుతున్నారనే దానిపై చర్చించాలని సూచించారు. ప్రజల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి తీసుకోవడం..ఒక పోగ్రాం తీసుకుని ప్రజలపై, కార్యకర్తలపై రుద్దడం సరికాదన్నారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

11:18 - April 28, 2016

విజయవాడ : ఏపీ ప్రతిపక్షం నుండి అధికారపక్షంలోకి వలసల పర్వం కొనసాగుతోంది. శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ నేడు సీఎం చంద్రబాబు సమక్షం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుడ్డా రాజశేఖర్ చేరికతో వైసీపీలోంచి జంప్ అయిన ఎమ్మెల్యే 15కు చేరారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేరికతో ఆ నియోజకవర్గం నుండి భారీగా జెడ్పీటీసీలు, సర్పంచ్ లు ఇంకా వేలాదిగా క్యాడర్ టీడీలో చేరారు. రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం నుండి దాదాపు 35 వాహనాలలో క్యాడర్ విజయవాడకు తరలివచ్చింది.. కాగా పార్టీ ఫిరాయింపుల అంశంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ జాతీయ నాయకులకు నిన్న జగన్ కలిసిన సంగతి తెలిసిందే. 

11:17 - April 28, 2016

జగన్ లో ఓ అపచరితుడు ఉన్నాడని వైసీపీకి రాజీనామా చేసిన మైసురారెడ్డి సంచలనాత్మక ఆరోపణలు గుప్పించారు. రాజీనామా చేసిన అనంతరం ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఒక నిర్ణయం తీసుకొనే సమయంలో కూలంకుషంగా చర్చించాలని అనంతరం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తాను గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేయడం జరిగిందన్నారు. ఒక సలహా చెప్పిన తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కానీ అలాగే చేయాలని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. జగన్ అపరిచితుడు అనేందుకు చాలా ఉదహారణలు ఉన్నాయన్నారు. 

11:11 - April 28, 2016

అధికారం కోసం పెత్తనం చెలాయించడం కోసం ఇత‌రుల కుటుంబాల్లో చిచ్చు పెట్టే సంస్కృతి ఆనాటి రాచ‌రికాల్లో ఉండేద‌ని, ప్రస్తుతం అది వైసిపిలో కొనసాగుతుందని మైసూరా అన్నారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టెన్ టివితో మైసురా మాట్లాడారు. తన కుటుంబంలో విబేధాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇంకా లోతుపాతుల్లోకి వెళ్లదలచుకోలేదని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. విభజించు..పాలించు అనే విధానం గతంలో ఉండేదని, ప్రస్తుతం అలాంటిది జరుగుతోందని తెలిపారు. ఒక వ్యక్తితో విబేధాలు ఉంటే అతనితోనే మాట్లాడాలి కానీ వెనుక నుండి మాటలు మాట్లాడవద్దని, ఇలాంటి వాటిని రాయలసీమలో వెనుకగోతులు తవ్వడం అంటారని తెలిపారు. కుటుంబంలో విబేధాలు సృష్టించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటివి చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయ‌న్నారు. 

11:04 - April 28, 2016

హైదరాబాద్ : సలహాలు చెప్పినా జగన్ వినిపించుకోరంటూ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మైసురా ఆరోపించారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టెన్ టివితో మైసురా మాట్లాడారు. గ్రేటర్ రాయలసీమ మహాఫోరం పెట్టుకుందామనే అభిప్రాయాలు రావడం జరిగిందని తెలిపారు. ఫోరంలో చేరితే బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగిందన్నారు. తేదీలు ఖరారయిన తరువాత ఎమ్మెల్యేలు వెళ్లవద్దని సూచించారని తెలిపారు. సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తనకు అవమానం జరిగిందని అనుకున్నట్లు తెలిపారు. పార్టీకి సంబంధించిన అంశాల‌పై జ‌గ‌న్ త‌న‌ ఇష్ట ప్రకారం నిర్ణయాలు మారుస్తార‌ని, నిర్ణయాలు మార్చుకునే ముందు క‌నీసం పార్టీలో సీనియ‌ర్లతో చర్చించ‌రని అన్నారు. స‌ల‌హాలు చెప్పినా విన‌ర‌ని మైసూరా ఆరోపించారు. 

11:00 - April 28, 2016

హైదరాబాద్ : పార్టీలో చేరాలని వైసీపీ నుండి తీవ్ర వత్తిళ్లు వచ్చాయని పార్టీకి రాజీనామా చేసిన మైసురారెడ్డి పేర్కొన్నారు. జగన్ కు నాలుగు పేజీల లేఖలో పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో మైసురా మాట్లాడారు. ఈ వయస్సులో పార్టీలు మారడం..బాగుండదని అనుకున్నానని తెలిపారు. రచనా రంగంలోకి వెళుదామని యోచించినట్లు తెలిపారు. అలాంటి సమయంలో గుంటూరు నుండి సీబీఐ ఎంక్వయిరీ కోసం జగన్రావ డం..బ్రేక్ ఫాస్ట్ కు రావాలని పిలవడం జరిగిందని తెలిపారు. బ్రేక్ ఫాస్ట్ కు వెళితే పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు, రాజీనామా చేసి వెళ్లవచ్చు కదా అని ఫోన్ లో ఇతరులు సమాచారం వచ్చిందన్నారు. విశాల హృదయం, మానవతా దృక్పథం లాంటివి కనిపించలేదన్నారు. బ్రేక్ ఫాస్ట్‌కి అని పిలిచి మాట్లాడిన త‌రువాత.. పార్టీ కండువా క‌ప్పేంత వ‌ర‌కూ ఒక‌దాని వెనుక ఒక‌టి అలా చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ని చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరడం పెద్ద తప్పటడుగని అభివర్ణించిన మైసూరా.. దాన్ని వెనక్కి తీసుకుంటే గౌరవ ప్రదంగా ఉంటుందనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. 

10:55 - April 28, 2016

పశ్చిమ బెంగాల్ : ఓ వైపు తండ్రిని కోల్పోయిన దు:ఖం. అంత్యక్రియలు పూర్తి చేసిన మరుసటి రోజే పోలింగ్. అంతటి బాధలోనూ ఆ యువకుడు పోలింగ్ ఏజెంట్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. పశ్చిమబెంగాల్ లో జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇతను పేరు రాజీవ్ మిస్త్రీ. నార్త్ పరగణాల జిల్లాలోని హరోవా ఇతని స్వగ్రామం. తండ్రి సిపిఎం కార్యకర్త. మొన్న సోమవారం ఈ గ్రామంలో పోలింగ్ జరిగింది. అంతకు వారం రోజుల ముందు తండ్రి మీద త్రుణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కుటుంబాన్ని అంతులేని విషాదం చుట్టుముట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాన్న చనిపోయాడు. ఆదివారం తండ్రికి అంత్యక్రియలు చేశారు. సోమవారం పోలింగ్. మనస్సు నిండా తండ్రిని కోల్పోయిన దు:ఖం. అంత బాధలోనూ రాజీవ్ మిస్త్రీ పోలింగ్ ఏజెంట్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. రోజంతా పోలింగ్ కేంద్రంలోనే వుండి దొంగ ఓట్లు పోల్ కాకుండా చూశాడంటూ గ్రామస్తులు కొనియాడుతున్నారు. తండ్రి హంతకుల్లో ఒకరిని పోలీసులకు పట్టిచ్చాడు రాజీవ్ మిస్త్రీ. త్రుణమూల్ గూండాలను అడ్డుకోవాలన్న నాన్న లక్ష్యాన్ని నెరవేర్చానటున్నాడు రాజీవ్ మిస్త్రీ. 

కాలుష్యాన్ని నివారించమంటే అరెస్టు లా? వామపక్షాలు

విశాఖ : పలు  పరిశ్రమ యాజమాన్యాలతో సెంట్రల్ పొల్యూషన్ బోర్డు అధికారులు నోవాటెల్ హోటల్ లో సమావేశమయ్యారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు హొటల్ ముందు ఆందోళనకు దిగాయి. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలుష్యాన్ని నివారించమని కోరితే అరెస్ట్ లకు పాల్పడటం సరికాదని వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడ్డారు.

10:51 - April 28, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయం ఎక్కడ? రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జనవరిలో కొత్తగా మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసి, టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారిని చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఇంతవరకూ ఏపీ మహిళా కమిషన్ కు కార్యాలయమే లేదు. ఆఫీసు కోసం అక్షరాలా చైర్ పర్సనే.. ప్రభుత్వానికి విన్నపాలు చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మహిళ రక్షణ కోసం, హక్కుల పరిరక్షణ కోసం, వారి జీవన ప్రమాణాలను పెంచడం కోసం 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ మహిళా కమిషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన మహిళలైనా తమ కష్టాలు, నష్టాలు, వివక్షతో కూడిన దాడుల గురించి చెప్పుకోవడానికి మహిళా కమిషన్ ఒక పెద్ద దిక్కుగా ఏర్పాటైంది. కొన్ని కేసుల్లో మహిళా కమిషన్ కు సివిల్ కోర్టుతో సమానంగా అధికారాలున్నాయి. అయితే, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని టెంత్ షెడ్యూల్ లో ఉన్నందున అప్పటి మహిళా కమిషన్ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుంది. దాంతో, ప్రత్యేక జీవోతో ఏపీ ప్రభుత్వం గత జనవరిలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసింది.

బుద్ధభవన్ లో కార్యాలయం..
దానికి చైర్ పర్సన్ గా టిడిపి ఫైర్ బ్రాండ్ లీడర్ నన్నపనేని రాజకుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతా బాగానే ఉంది.. కానీ, కమిషన్ కు ఇప్పుడు ఒక కార్యాలయం అంటూ లేని పరిస్థితి. మహిళా కమిషన్ ఏర్పాటై మూడు నెలలు దాటినా ప్రభుత్వం దానికి ఒక కార్యాలయాన్ని కేటాయించలేదు. దాంతో, మహిళా కమిషన్ ఎక్కడ అన్న ప్రశ్న వినిపిస్తోంది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నన్నపనేని రాజకుమారి.. మొదట తనకు హైదరాబాదులోని బుద్ధభవన్ లోనే కార్యాలయాన్ని కేటాయించాలని విజ్ఞప్తులు సమర్పించినట్లు సమాచారం. అయితే, హైదరాబాద్ లో ఏపీ మహిళా కమిషన్ కు కార్యాలయం కేటాయించడం కుదరదని తేల్చి చెప్పడంతో.. ఏపీ మహిళా కమిషన్ కు ఓ అడ్రస్ అంటూ లేకుండా పోయింది. కొత్త రాజధాని ప్రాంతంలో తమకు కార్యాలయం కేటాయించాలని కూడా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ఇంకా స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి.. గుంటూరులోని పాత టిడిపి ఆఫీసులో కూర్చుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. అధికారిక పర్యటనలకు ప్రొటోకాల్‌ ప్రకారం కేటాయించాల్సిన వాహనాన్నీ నన్నపనేనికి ఇవ్వక పోవడం విశేషం.
మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ వంటి ఎంతో కీలకమైన సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన మహిళా కమిషన్ కే దిక్కు లేకపోవడం ఏమిటని రాష్ట్రంలోని వివిధ మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి... మహిళా కమిషన్ కు వీలైనంత త్వరలో ఒక చిరునామా కల్పిస్తుందని ఆశిద్దాం.

కన్హయ్య మరో సంచలనం 'బిహార్ టు తీహార్'...

ఢిల్లీ: రాజధానిలోని జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. ఈ మధ్య కాలంగా కన్హయ్య కు తనకు ఎదురైన అనుభవాలను అక్షర బద్ధం చేయనున్నాడు. తన విద్యాభాసం నుండి తాను ఎదుర్కొంటున్న అనుభవాలను పుస్తక రూపంలో పొందుపరచనున్నాడు. బిహార్ లో గడిచిన స్కూల్ జీవితం, విద్యార్థిగా, విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర,జాతిద్రోహంలో అరెస్ట్, జైలు నుంచి బయటివచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించనున్నాడు. ఈ పుస్తకానికి 'బిహార్ టు తీహార్' అని పేరు పెట్టాడు.

10:38 - April 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో విద్యావ్యవస్థను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా పాలిటెక్నిక్‌లో సంస్కరణలపై సాంకేతిక విద్యాశాఖ దృష్టిసారించింది. విద్యార్థుల కోర్సులు పూర్తికాగానే.. ఉద్యోగం లభించేలా ప్రణాళికలు రచిస్తోంది. అవసరం మేరకు సిలబస్‌తోపాటు కోర్సుల్లోనూ మార్పులు తీసుకురావాలని సాంకేతిక విద్యాశాఖ భావిస్తోంది. పాలిటెక్నిక్‌ విద్యావిధానంలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 10వ తరగతి పాసవ్వగానే విద్యార్థుల లైఫ్ సెటిల్‌ అయ్యేలా మార్పులు తీసుకురానుంది. ఒకప్పుడు ఇంజనీరింగ్‌తో సమానంగా డిమాండ్‌ ఉన్న పాలిటెక్నిక్‌ విద్య.. రానురాను ప్రాధాన్యతను కోల్పోయింది. దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా.. సమూల సంస్కరణల తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్‌, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించింది. 

అధ్యాపకుల్లోనూ నైపుణ్యత..
పాలిటెక్నిక్‌ కాలేజీల ప్రమాణాలపై ప్రధానంగా దృష్టి సారించాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ భావిస్తోంది. కాలేజీల్లో ప్రమాణాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎగ్జామినేషన్ సిస్టం వంటి వాటినీ బలోపేతం చేయాలని యోచిస్తోంది. సిలబస్‌ కూడా విద్యార్థి సెటిల్‌ అయ్యే స్థాయిలో మెరుగుపరచాలని నిర్ణయించింది. విద్యార్థులు కఠినంగా భావించే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ల్లో సమూల మార్పులు చేయనున్నారు. అఫిలియేషన్ల ప్రక్రియలోనూ సమూల మార్పులు తీసుకు రావాలని నిర్ణయించింది.  ప్రస్తుతం కోర్సు పూర్తిచేసిన విద్యార్థుల్లో నైపుణ్య లేమి కారణంగా కంపెనీలు ఉద్యోగం ఇవ్వలేక పోతున్నాయని గుర్తించిన సాంకేతిక విద్యాశాఖ.... దాన్ని సరిదిద్దే ప్రయత్నం ప్రారంభించింది. ఈఏడాది నుంచే కాలేజీలను కంపెనీలతో అనుసంధానాన్ని తప్పనిసరి చేయనుంది. విద్యార్థుల్లోనే కాదు అద్యాపకుల్లోనూ నైపుణ్యత పెంచాల్సిన ఆవసరాన్ని సాంకేతిక విద్యాశాఖ గుర్తించింది. 

ఏపీ సర్కారుకు హైకోర్టు 'షాక్'.....

హైదరాబాద్ : ఏపీ సర్కార్ కు హైకోర్టు 'షాక్' ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఏపీ సర్కారుకు చుక్కెదురయ్యింది. కొత్త మద్యం పాలసీ విధానానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రేకులు వేసింది. గతంలో వున్న మద్యం పాలసీలో బార్ అండ్ రెస్టారెంట్లకు ఎక్కువ ధర ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారికే ఎక్కువ అవకాశం చిక్కేది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ వాతావరణం పెరగడంతో సర్కారు ఖజానాకు అనుకున్న దానికంటే మెరుగైన ఆదాయం వచ్చేది. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ విధానాన్ని మార్చేందుకు నడుం బిగించారు. ‘ఫస్ట్ కం... ఫస్ట్ సర్వ్ పేరిట...

10:28 - April 28, 2016

హైదరాబాద్ : రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్డు ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శుభకార్యాలకు వెళ్లి వస్తూ ప్రమాదాల బారినపడి మృత్యు లోకాలకు చేరుతున్నారు. నిత్యకృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృత్యుబాట పడుతున్నారు. బుధవారం రాత్రి తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రక్తమోడాయి. రెండు ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది మృతి చెందగా... పలువురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా దుండిగల్‌ పరిధిలోని గాగిల్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు అంజమ్మ, భీమయ్య, మొగులానా సాబ్‌, నవీన్‌గౌడ్‌, రాజుగౌడ్‌లుగా గుర్తించారు. వీరంతా మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.

విజయనగరం..
ఇక విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం కోమటపల్లి దగ్గర హైవేపై స్కార్పియో చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు విశాఖవాసులుగా పోలీసులు గుర్తించారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో అనేకమంది మృత్యుబాట పడుతున్నారు. నిర్లక్ష్యం, మితిమీరిన వేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. 

3 కిలోల నల్లమందు ను స్వాధీనం...

హైదరాబాద్ : మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి మత్తు పదార్థాలను తరలించి నగరంలో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు కిలోల ఓపియం(నల్లమందు)ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.

బెంగుళూరు చేరుకున్న టీ.మంత్రి హరీష్ రావు....

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు బృందం బెంగుళూరు చేరుకుంది. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌)పై కర్ణాటక జలవనరుల శాఖ మంత్రితో చర్చలు జరపనున్నారు. ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టిఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ ఐదారు టిఎంసీలకు మించి రాని రావటంలేదు. ఈ అంశంపై మంత్రి హరీష్ రావు కర్ణాకట మంత్రితో చర్చలు జరుపనున్నారు.

పాతబస్తీలో పోలీసుల దాడులు....

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెయిన్ బజార్, మొఘల్ పురా, ఫలక్ నుమాలోని  ప్రాంతాల్లోని 200 మంది బృందంతో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 5 మామిడి పండ్ల గోదాంలపై దాడులు చేపట్టారు. రసాయినాలతో మామిడి పండ్లను మగ్గిస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 5 గాజుల తయారీ కేంద్రాలలో పనిచేస్తున్న 30 మంది బాల కార్మికులకు విముక్తిని కల్పించారు.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే బయోమ్యాక్స్ ఘటన?...

విశాఖ : దువ్వాడ సెజ్ లోని బయోమ్యాక్స్ కంపెనీలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. 24 గంటలు గడిచినా అక్కడ ఇంకా అగ్ని కీలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. స్థానిక ఫైర్ సిబ్బందితో పాటు భారత నావికా దళం రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాలేదు. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే కాస్తంత ఫలితమిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నానికి మంటలు అదుపులోకి రావచ్చని అధికారులు పేర్కొంటున్నారున. ఆయిల్ ట్యాంకర్లు ఉన్న ప్రదేశంలో సరైన భద్రతా చర్యలను తీసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని విశాఖ కలెక్టర్ యువరాజ్ అభిప్రాయపడినట్లు సమాచారం.

సైకత శిల్పి సుదర్శన్ ఖాతాలో మరో అవార్డు....

హైదరాబాద్ : మాస్కోలో జరిగిన సైకత శిల్పాల పోటీలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. సుదర్శన్ సైకత శిల్పాల పోటీలో గాంధీజీ అహింసా, శాంతి సందేశాన్ని ఇస్తున్నట్లుగా శిల్పాన్ని తీర్చిదిద్దారు. ప్రపంచ పోటీలను నిర్వహిస్తున్న ఈవెంట్ డైరక్టర్ పావెల్ మినిల్కోవ్ సైకత శిల్పి పట్నాయక్‌కు ట్రోఫీని అందజేశారు. ఇప్పటివరకు సుమారు 50 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న సుదర్శన్ అనేకసార్లు ఆయన్ని పలు అవార్డులు గెలుచుకున్నారు. 2014లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసింది.

వైసీపీకి 'షాక్'ల పరంపర ...

విజయవాడ : ఏపీ లో ప్రతిపక్షం నుండి అధికారపక్షంలోకి వలసల పర్వం కొనసాగుతోంది.  ఈ క్రమంలోనే శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ సీఎం చంద్రబాబు సమక్షం ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. బుడ్డా రాజశేఖర్ చేరికతో వైసీపీలోంచి జంప్ అయిన ఎమ్మెల్యే 15కు చేరారు. కిడారి కూడా చేరితే ఈ సంఖ్య 16కు చేరుతుంది. కాగా ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ 'సేవ్ డెమోక్రసీ ' పేరుతో జగన్ ఢిల్లీ జాతీయ నాయకులకు కలిసిన సంగతి తెలిసిందే.

09:22 - April 28, 2016

పశ్చిమబెంగాల్ : ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ లో ఆసక్తికర పోటీ నెలకొంది. దీదీగా పేరొందిన మమతాబెనర్జీ బౌదీగా పేరుతెచ్చుకున్న దీపాదాస్ మున్షీతో తలపడుతున్నారు. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు కూడా రంగంలో వుండడంతో పోటీ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. భవానీపూర్ లో దీదీకి బౌదీకి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. టిఎంసీ కార్యకర్తలు మమతాబెనర్జీని దీదీగా పిల్చినట్టే, కాంగ్రెస్ కార్యకర్తలు దీపాదాస్ మున్షీని బౌదీగా పిలుస్తారు. దీపాదాస్ మున్షీ ప్రియరంజన్ దాస్ మున్షీ కి సతీమణి. దాంతో ఆమెను కార్యకర్తలు వదిన అని సంబోధించేవారు. తొలి రోజుల్లో మమతాబెనర్జీని రాజకీయాల్లో బాగా ప్రోత్సహించింది ప్రియరంజన్ దాస్ మున్షీయే కావడం విశేషం. అయితే, ఆ తర్వాత వీరిమధ్య విబేధాలొచ్చాయి. ఇప్పుడు మమతా బెనర్జీ పై దీపా దాస్ మున్షీ రంగంలోకి దిగడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. ఇటు దీదీ అటు బౌదీ ఇద్దరూ లోకల్ కార్డు ప్రయోగిస్తుండడం విశేషం.

పోటీ పడలేకపోతున్న బోస్..
మమతా బెనర్జీ 1991 నుంచి దక్షిణ కోల్ కతా నియోజకవర్గం నుంచి ఎంపిగా గెలిచారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో 2011 ఉప ఎన్నికల్లో ఆమె భవానీపూర్ నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇది దక్షిణ కోల్ కతా లోక్ సభ నియోజకవర్గంలో అంతర్భాగం. 1991 నుంచి నన్ను గెలిపిస్తున్నారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను మీ అందరికీ కావల్సినదాణ్ణి అంటూ లోక్ ల్ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారు దీదీ. అటు దీపా దాస్ మున్షీ కూడా ఇదే ట్రంప్ కార్డు ప్రయోగిస్తున్నారు. నేనూ ఇక్కడే పుట్టి పెరిగాను. నేను భవనీపూర్ ఆడపడుచునంటూ గాలం వేస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగిన నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ ప్రచారంలో వీరిద్దరితో పోటీ పడలేకపోతున్నారు. అసలు ఎన్నికల కార్యాలయమే ప్రారంభించలేకపోయారు. మమతాబెనర్జీయే ఆయనకు ఆఫీసు దొరక్కుండా చేశారన్న ప్రచారమూ జరుగుతోంది. దీంతో ఆయన ఇంటినే ఎన్నికల కార్యాలయంగా మార్చుకున్నారు. బెంగాల్ రాష్ట్రంలో త్రుణమూల్ టెర్రర్ నడుస్తోందంటూ ప్రధాని నరేంద్రమోడీ విమర్శించడానికి ఈ వ్యవహారమే కారణమంటున్నారు. కాస్మో మెట్రో పాలిటిన్ కల్చర్ ఎక్కువగా వున్న భవానీపూర్ లో గుజరాతీలు, మార్వాడీలు, సిక్కులు గణనీయ సంఖ్యలో వుండడం విశేషం. 

09:15 - April 28, 2016

విశాఖపట్టణం : దువ్వాడ బయో మ్యాక్స్ లో మంటలు ఇంకా చల్లారలేదు. మూడు రోజుల కింద బయో మ్యాక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 12 చమురు ట్యాంకులు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటలను ఆరప్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. చమరుతో నిండి ఉండడం..ఇంధనానికి మండే గుణం ఉండడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఫోమ్ కూడా అందుబాటులో లేకపోవడం కూడా ఇన్ని రోజులు మంటలు చెలరేగడానికి కారణమని తెలుస్తోంది. మంటలను ఆర్పడానికి చివరకు నేవీ కూడ రంగంలోకి దిగింది. ఫోమ్, ఇసుక సహాయంతో మంటలను అదుపుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయని, మధ్యాహ్నం లోపు పూర్తిగా అదుపు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 

09:13 - April 28, 2016

విశాఖపట్టణం : మళ్లీ బ్రాండిక్స్ కార్మికులు ఆందోళన బాట ఎంచుకున్నారు. తమ వేతనాలు సంగతి ఏంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. ఒప్పందం ప్రకారం వేతనాల సంగతి తేల్చాలని కంపెనీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం ఉదయం అచ్యుతాపురం బ్రాండిక్స్ -3 కంపెనీ దగ్గర వేయి మంది కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బలవంతంగా కార్మికులను విధుల్లోకి రప్పించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. వేతనాలు చెల్లిస్తేనే విధుల్లో చేరుతామని కార్మికులు ఖరాకండిగా చెబుతున్నారు.
గత పది హేను రోజులుగా పదిహేను వేల మంది కార్మికులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈనెల చివరిలోగా వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇతర సెజ్ లో ఉన్న కంపెనీల పై ఆందోళన ప్రభావం పడుతుందని భావించింది. బలవంతంగా విధుల్లోకి చేరిపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా కంపెనీ వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

11 కంపెనీలు..
11 కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులతో ఒక పెద్ద పారిశ్రామిక సంస్థగా వెలుగొందుతోంది. కంపెనీ ఎంత పెద్దదైనా ఉద్యోగుల బతుకుల్లో మాత్రం ఆనందం లేదు. 5 సంవత్సరాల క్రితం రోశయ్య హయాంలో విశాఖ జిల్లా అచ్యుతాపురం వద్ద శ్రీలంకకు చెందిన అండర్ గార్మెంట్స్ కంపెనీ బ్రాండిక్స్ ను ఏర్పాటు చేశారు. ఎకరానికి రూపాయి చొప్పున ప్రభుత్వం బ్రాండిక్స్ కు భూమి లీజుకిచ్చింది. దీనిలో బ్రాండిక్స్ కంపెనీకి చెందిన 4 యూనిట్లతో పాటుగా సీడ్స్ కంపెనీ, క్వాంటమ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిల్లో పనిచేస్తున్న కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉంటారు. అయితే కంపెనీ ప్రారంభమైన దగ్గర్నుంచీ కార్మికులకు కనీస వేతనాలైనా ఇవ్వడం లేదు. దీనికి తోడు ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కవ మంది నాలుగైదు సంవత్సరాలు చేసి పని మానేస్తారు. వారికి పీఎఫ్‌లు ఇవ్వడంలోనూ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో విసిగిపోయిన సిబ్బంది వేతనాలు పెంచాలంటూ ఆందోళనకు దిగారు. బ్రాండిక్స్ పెరల్‌ సిటీలోని 11 కంపెనీలకు చెందిన 15 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
విశాఖ జిల్లా బ్రాండిక్స్ కంపెనీలో నెలకొన్న ఉద్రిక్తతకు ఎప్పుడు బ్రేక్‌ పడుతుందో చూడాలి.

పోలీసు కాల్పుల్లో ఒకరి మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : భాగ్ పట్ ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. ఈఘటనకు కారణమైన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

బెంగళూరుకు పర్యటనకు మంత్రి హరీష్ రావు...

హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈరోజు బెంగళూరు వెళనున్నారు. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌)పై కర్ణాటక జలవనరుల శాఖ మంత్రితో చర్చలు జరపనున్నారు. ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టిఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ ఐదారు టిఎంసీలకు మించి రాని రావటంలేదు. ఈ నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయించడానికి కర్ణాటకతో చర్చలు జరపనున్నారు.

08:34 - April 28, 2016

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, హన్మకొండల్లో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. హైదరాబాద్‌లో బుధవారం గరిష్టంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. వడగాలులు..ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వడదెబ్బతో 48 మంది మృతి..
తెలంగాణ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వడదెబ్బ బారిన పడి 48 మంది మృత్యువాత పడ్డారని అధికారులు పేర్కొన్నారు. 

ఇరు 'చంద్రు'లకు సమన్వయం వుండాలి: రోశయ్య

హైదరాబాద్ : నిన్న గుంటూరు జిల్లాలోని తన సొంతూరు వేమూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తెలుగు నేలలో అభివృద్ధి జరగాలంటే ఇద్దరు ‘చంద్రులు’ మధ్య సమన్వం అవసరమని ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా కొనసాగుతున్న రోశయ్య అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపీ త్వరగా కోలుకోవాలంటే... కేంద్రం సహకారం అవసరమని కూడా ఆయన తెలిపారు. 

వైసీపీకి మరో రెండు 'షాక్ 'లు ?.....

హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షం నుండి అధికారపక్షంలోకి వలసల పర్వం కొనసాగుతోంది. జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి , విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా టీడీపీలో చేరంటం దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ చంద్రబాబు కలవటానికి విజయవాడ బయలుదేరారు. వీరిద్దరి చేరికతో... వైసీపీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరనుంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 50కి పడిపోనుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు వలస బాట పడతుంటే దిక్కుతోచని స్థితిలో జాతీయ నాయకులకు తన గోడు వెళ్ళబోసుకునేందుకు ఆపార్టీ అధినేత జగన్ ఢిల్లీ బాట పట్టిన సంగతి తెలిసందే.

కార్ట్ ఆన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు....

హైదరాబాద్: పాతబస్తీలోని రెయిన్ బజార్‌లో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. 200 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 

07:57 - April 28, 2016

ఒక్కటి గాదు రెండు గాదు.. ఏక్ దం రెండు లక్షల ఇండ్లు గట్టిచ్చెతందుకు పైకం ఇడుదల జేశిండట మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు..తెలంగాణ రాష్ట్ర సమితి.. అంటె టీఆర్ఎస్ పార్టీ పుట్టి సరిగ్గ పదిహేను ఏండ్లైంది..?అబ్బా అబ్బా అబ్బా.. ఖమ్మంకాడైతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. అండ్ల అయ్యిన తీర్మానాలు ఏమోగని.. వంటలు మాత్రం.. ఈసారి దుమ్ములేశిపోయినయ్..పంట ఏశినప్పటి సంది కాంటకు ఏశెదాక గుడ రైతన్నకు కష్టమేనాయే..తెలంగాణ తొమ్మిది జిల్లాలల్లనే నీళ్ల కర్వు ఉన్నది.. కేసీఆర్ సారు వోనమాలు దిద్దిన మెదక్ జిల్లాల లేదు అన్కున్నం గని.. ఆడ గుడ నీళ్ల తక్లీవ్ మంచిగనే వున్నది. ఆళ్ల బిడ్డె కవితమ్మ చిన్నారి మెడలో బంగారు గొలుసు వేసింది..రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు... ఈ అంశాలపై టెన్ టివిలో 'మలన్న ముచ్చట్లు' లో మల్లన్న ముచ్చట్లు చెప్పిండు. ఈ ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

గోరేటి వెంకన్నకు శ్రీశ్రీ పురస్కారం...

హైదరాబాద్ : ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్నకు శ్రీశ్రీ పురస్కారం ప్రధానం చేయనున్నారు. మహాకవి శ్రీశ్రీ 106వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 30న శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం గోరేటి వెంకన్నకు శ్రీశ్రీ సాహితీపురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు కళానిలయం సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఏ.సురేందర్, పుష్పలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. 

ఆలీ దర్గా వద్ద శాంతియుత ఆందోళన - తృప్తి దేశాయ్..

ఢిల్లీ : హజీ ఆలీ దర్గా వద్ద శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని బ్రిగేడ్ సంస్థ నాయకురాలు తృప్తి దేశాయ్ ప్రకటించారు. ఆలయాల్లో మహిళలను అనుమతించాలంటూ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ లో మహిళల ప్రవేశంపై మోహన్ భగవత్ సానుకూలంగా స్పందింస్తుందని ఆశిస్తున్నట్లు తృప్తి దేశాయ్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

హార్డ్‌వేర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం...

మెదక్‌ : కొండపాక మండలం కుకునూరుపల్లి రాజీవ్‌ రహదారి పక్కన ఉన్న ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.నివాసగృహాల మధ్య దుకాణం ఉండటంతో వారు భయాందోళనకు గురవుతున్నారు.

ఆందోళనల మధ్య బ్రాండిక్స్ కంపెనీ....

విశాఖ: అచ్చుతాపురంలోని బ్రాండిక్స్ -3 కంపెనీ వద్ద 1000 మంది కార్మికులు ఆందోళనకు చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరసనకు దిగారు. గత కొన్ని రోజులు బ్రాండిక్స్ కంపెనీలో వేలాదిమంది కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 

'సీఎం'గా లల్లూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ....

హైదరాబాద్ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు సీఎం కానున్నాడు. బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్... సీఎం కావాలన్న తన కోరికను తీర్చేసుకున్నారు. బీహార్ లో లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవిలు సీఎంలుగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన వరుస కిడ్నాప్ లను ఆధారం చేసుకుని భోజ్ పురిలో ‘అపహరన్ ఉద్యోగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తేజ్ ప్రతాప్ సీఎం పోస్టులో కనిపించనున్నారు. పాత్ర నిడివి తక్కువే అయినా… చిత్రానికి ఇది చాలా కీలకమైనదిగా వుంటుందని సమాచారం.

07:26 - April 28, 2016

ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనంగా జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆగంకాకూడదనే సీఎం పదవి చేపట్టానని, తెలంగాణ తెచ్చిన గొప్పతనం ముందు సీఎం పదవి చిన్నదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత వైసీపీ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాసిన లేఖలో పలు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శ్రీరాములు (టిడిపి), మహేష్ గౌడ్ (టిపిసిసి), కరణం ధర్మశ్రీ (వైసీపీ), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:14 - April 28, 2016

ధనుష్‌, కాజల్‌ జంటగా తమిళంలో విడుదలైన 'మారి' తెలుగులో 'మాస్‌' పేరుతో అనువాదమవుతోంది. వి. ఎం. అర్‌ సమర్పణలో జయప్రద పిక్చర్స్‌ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు అందిస్తున్నారు. 'లవ్‌ ఫెయి ల్యూర్‌' ఫేం బాలాజీ మోహన్‌ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి 'వై దిస్‌ కొలవేరి ఫేం' అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. ధనుష్‌ పెర్ఫార్మెన్స్‌, కాజల్‌ గ్లామర్‌, అనిరుధ్‌ మ్యూజిక్‌, సాహితి అందించిన మాటలు, పాటలు బాలాజీ మోహన్‌ స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్‌తో పాటు క్లాస్‌ ఆడియన్స్‌నూ అమితంగా అలరించే చిత్రమిది. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది'' అన్నారు. విజయ్ ఏసుదాస్‌, రోబో శంకర్‌ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

07:13 - April 28, 2016

నాని కథానాయకుడిగా నటిస్తున్న 'జంటిల్‌మెన్‌' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నానిని కొత్తకోణంలో ఆవిష్కరించే పనిలో వున్నాడు. శ్రీదేవి మూవీస్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథప్రకారం హీరోనా! విలనా! అనేట్లుగా నాని పాత్రవుంటుందనీ, ఇంతవరకు చూడని కొత్తకోణంలో ఈ చిత్రముంటుందని దర్శకుడు తెలియజేస్తున్నాడు. మేలో ఆడియోను విడుదల చేయనున్న ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా, పి.జి. విందా సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.

07:12 - April 28, 2016

నటి అనుష్క ఇటీవలే 'సైజ్‌ జీరో' కోసం బరువు పెరిగి.. మరో సినిమా కోసం బరువు తగ్గింది. 'అరుంధతి' తర్వాత మరలా అలాంటి పాత్రతో సినిమా చేయలేదు. తాజాగా లేడీఓరియెంటెడ్‌ నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తోంది. యువి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం లాంఛనంగా బుధవారంనాడు ప్రారంభమైనట్లు తెలిసింది. 'పిల్లా జమిందార్‌' ఫేమ్‌ అశోక్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర కథను అనుష్కనే చేయగలదని చిత్ర నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఇదిలా వుండగా, మరోవైపు 'బాహుబలి'-2లో ఆమె నటిస్తోంది. ఇందులో అనుష్క అతిలోక సుందరిగా కనిపిస్తుందట. యువ రాణిగా .. మహారాణిగా ఆమె ఈసినిమాలో దర్శనమిస్తుందని అంటున్నారు. 'బాహుబలి' భార్యగా ఆమె పాల్గొనే పోరాట సన్నివేశం ఒకటి ఈ సినిమాలో వుందట. ఈ సన్నివేశం ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందంట. దేవసేనను దక్కించు కోవడానికి బాహుబలికి .. భల్లాల దేవుడికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు కూడా ఒక రేంజ్‌లో ఉంటాయని తెలు స్తోంది. అలాగే తన తల్లి దేవసేన ద్వారా నిజం తెలుసుకున్న శివుడు, భల్లాలదే వుడుతో తలపడే సన్నివేశాలు కూడా థ్రిల్‌ కల్గిస్తాయని చెబుతున్నారు.

07:11 - April 28, 2016

శరీరంలో అత్యంత సున్నితమైనవి కళ్లు అని మనకందరికీ తెలుసు. అయినా మనలో చాలామంది కళ్లని గురించి పెద్దగా పట్టించుకోరు. సున్నితమైన కళ్ల పట్ల నిర్లక్ష్యం వహించడం అనర్ధాలకు దారి తీస్తుంది. వేసవిలోనైతే ప్రత్యేకమైన శ్రద్ధ చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకునే వెళ్లాలి. నాణ్యత కలిగిన అద్దాలు, కంటికి వేడిగాలితగలకుండా కన్ను మొత్తాన్ని కప్పి ఉంచే అద్దాలను ఎంచుకోవాలి. బైక్‌పై ప్రయాణం చేసే వారు హెల్మెట్‌ విధిగా ధరించాలి. సాధారణ వేగంతో మామూలు వాతావరణంలో బైక్‌పై వెళ్లినా గాలి ఒత్తిడికి కళ్లు అలసిపోతాయి. అదే ఎండ తీవ్రంగా ఉన్నపుడు వేడి గాలి కళ్లకు తగలడం మరింతగా కళ్లపై ఒత్తిడి కలిగి కళ్లకు సంబంధించిన సమస్యలు తప్పవు. వెంటనే తీవ్ర పరిణామాలు కలిగినట్టు మనకు తెలియక పోయినా తరువాత కంటి సామర్ధ్యం మందగిస్తుంది. కాల క్రమంలో శుక్లాలు ఏర్పడటం లాంటి రుగ్మతలకు దారితేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండలో హెల్మెట్‌ పెట్టుకుని బైక్‌పై ప్రయాణించినా తరచూ ముఖాన్ని, కళ్లను చల్లటి నీళ్లతో కడగాలి. దీనివల్ల కళ్లు ఒత్తిడినుంచి వెంటనే ఉపశమనం పొందుతాయి.

07:10 - April 28, 2016
  • మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు పట్టిలాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.
  • మాంసాహార, శాకాహార వంటకాల్లో సువాసన కోసం వాడే ''దాల్చిన చెక్క'' మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.
  • గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకొని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది.
  • దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు.
  • కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు.
  • బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావ సమస్య నుండి బయటపడొచ్చు.
  • పది గ్రాముల దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే విపరీతమైన కడుపునొప్పితో బాధపడే వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
  • పది గ్రాముల దాల్చిన చెక్క పొడిని పావు లీటర్‌ వేడి నీటిలో రెండు గంటలపాటు ఉంచి ఆపై దాన్ని వడగట్టి సగ భాగం చొప్పున రోజుకు రెండుసార్లు సేవిస్తే నీళ్ల విరేచనాలను అరికట్టవచ్చు.
  • మొటిమలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాసుకుంటే తగ్గుముఖం పడతాయి. 
07:06 - April 28, 2016

సబా ఇంతియాజ్‌ రాసిన 'కరాచీ : యు ఆర్‌ కిల్లింగ్‌ మి' నవల ఆధారంగా తెరకెక్కబోయే 'నూర్‌' చిత్రంలో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ గా నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఓ మహిళా జర్నలిస్ట్ ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో సబా ఇంతియాజ్‌ 'కరాచీ' నవల రాశారు. 'నూర్‌'గా రూపొందే ఈ చిత్రం ద్వారా సునీల్‌సిప్పి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ,'మహిళా జర్నలిస్ట్ గా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం సబా రాసిన నవలను ఆద్యంతం చదివాను. చాలా ఆసక్తికరంగా ఉంది. మెరుగైన సమాజం కోసం మహిళా జర్నలిస్ట్‌ పాత్ర ఏమిటన్నది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది' అని తెలిపారు. సోనాక్షి ప్రస్తుతం ఈచిత్రంతో పాటు జాన్‌ అబ్రహం సరసన 'ఫోర్స్2' చిత్రంలోను, ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, హిందీ ద్విభాషా చిత్రం 'అకీరా'లోనూ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న 'అకీరా' చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఎయిర్ వేస్ టాయ్ లెట్ లో భారీగా బంగారం....

హైదరాబాద్ : విమానాలలో బంగారాన్ని అక్రమంగా తరలించటం.. కస్టమ్స్ అధికారులు పట్టుకోవటం జరుగుతూంటుంది. ఈ క్రమంలోనే  గోవాలో ల్యాండ్ అయి తిరిగి బయలుదేరటానికి సిద్ధంగా వున్న విమానంలో భారీ మొత్తంలో బంగారాన్ని కనుగొన్నారు. విమానం ల్యాండ్ అయిన తరువాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తరువాత ప్రయాణానికి అన్ని విధాలుగా అధికారులు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేస్తున్న అధికారులకు టాయ్ లెట్ వున్న ఓ బ్యాగ్ వారి కంటపడింది. బ్యాగ్ ను పరిశీలించిన వారికి సుమారు 7.124 కిలోల బంగారం కనిపించింది. దీంతో వారు ఆశ్చర్యపోయారు.

07:05 - April 28, 2016

దర్శకుల్లో కృష్ణవంశీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన సినిమాల టైటిల్స్, పాత్రల తీరుతెన్నులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. తాజాగా 'నక్షత్రం' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పోలీస్‌ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు బుధవారం ఉదయం 9.27 గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌ నిర్మాతలు కె.శ్రీనివాసులు, ఎస్‌. వేణుగోపాల్‌, సజ్జు సంయుక్తంగా ఈ 'నక్షత్రం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'పోలీస్‌ అవ్వాలనే సంకల్పంతో ఉన్న ఓ కుర్రాడి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నేటి నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది' అని చెప్పారు.

07:04 - April 28, 2016

సమంత... పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఓ పక్క నటిస్తూనే మరో పక్క 'ప్రత్యూష ఫౌండేషన్‌' ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలతో మరికొంత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 'ఏం మాయ చేశావే' చిత్రంలోని 'జెస్సీ' పాత్రతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒకేసారి పరిచయమైన సమంత పుట్టిన రోజు నేడు. ఈనేపథ్యంలో ఆమె సినీ జీవిత విశేషాలు...

చెన్నైలో జననం..
చెన్నైలో జన్మించిన సమంత కాలేజీ చదివే రోజుల్లోనే మోడలింగ్‌ పట్ల ఆకర్షితురాలయ్యారు. మోడల్‌గా రాణిస్తున్న తరుణంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రవివర్మ దర్శకత్వం వహించిన 'మాస్కో ఇన్‌ కావేరి' తమిళ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. సమంత తొలిచిత్రం ఇదే అయినప్పటికీ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏం మాయ చేశావే' చిత్రం ముందుగా విడుదలైంది. ఈ చిత్రంలోని 'జెస్సీ' పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించడంతో సమంతకు సినిమాల్లో మరిన్ని అవకాశాలు లభించాయి. అంతేకాకుండా తొలిచిత్రంతోనే ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుతోపాటు నంది అవార్డుని కూడా దక్కించుకున్నారు. నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఈ ఆరు సంవత్సరాల్లో తమిళ, తెలుగు భాషల్లో కలిపి దాదాపు ముప్ఫై చిత్రాల్లో నటించారు. వీటిల్లో 'బృందావనం', 'ఈగ', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది', 'మనం', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి తెలుగు చిత్రాలు సమంతకు మరింత మంచి గుర్తింపు తీసుకురావడంతోపాటు అభిమాన గణాన్ని సైతం పెంచాయి.

మూడు నెలలు ఆసుపత్రిలో..
కెరీర్‌ మంచి ఊపందుకుంటున్న తరుణంలో అనారోగ్య కారణాల రీత్యా దాదాపు మూడు నెలలు సమంత హాస్పిటల్‌ బెడ్‌కే పరిమితమయ్యారు. ఆ సమయంలోనే జీవితమంటే ఏంటో తెలిసిందని, గాలిబుడగ లాంటి జీవితం కోసం వెంపర్లాడకుండా శక్తి మేరకు మానవతా దృక్ఫథంతో ఇతరులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చాలా సందర్భాల్లో సమంత చెప్పారు. ఆపదలో ఉన్న స్త్రీలు, చిన్నపిల్లలకు సేవలు అందించాలని స్నేహితులైన ముగ్గురు డాక్టర్ల సహకారంతో 'ప్రత్యూష ఫౌండేషన్‌' సంస్థను సమంత ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అనాథ పిల్లలను కూడా దత్తత తీసుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. అలాగే అవయవ దానంపై అందరిలోనూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క సినిమాలతోను, మరో పక్క సేవా కార్యక్రమాలతోనూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో సమంత యాక్టీవ్‌గా ఉన్నారు. మహిళలను కించపరిచేలా ఉన్న ఎటువంటి విషయమ్మీదనైనా సరే స్పాంటేనియస్‌గా స్పందిస్తూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల్లో తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం '24', 'అ..ఆ', 'బ్రహ్మోత్సవం', 'జనతా గ్యారేజ్‌', 'రుద్రాక్ష', 'వాడా చెన్నై' వంటి చిత్రాల్లో నటిస్తోంది.

06:50 - April 28, 2016

ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుంటున్నవారికి ఎస్బిఐ పెద్ద షాకిచ్చింది. బ్యాంక్ ఉద్యోగ పరీక్షల విషయంలో కొత్త మెళికలు పెట్టింది. ఎడ్యుకేషన్ లోన్ డిఫాల్టర్స్ బ్యాంక్ ఉద్యోగ పరీక్షలు రాయడానికి అనర్హులంటూ కొత్త నిబంధన పెట్టింది. తాజా నిబంధనపై నిరుద్యోగ, యువజన సంఘాలతో పాటు బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ లోన్ బకాయిదారులను ఉద్యోగ పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడం న్యాయమేనా? అసలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది? ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నవారు డిఫాల్టర్స్ గా ఎందుకు మారుతున్నారు? పోలీస్ కేసులున్నవారు ఉద్యోగ పరీక్షలు రాయడానికి అనర్హులంటూ ఎస్ బిఐ ప్రకటించడాన్ని సమర్ధించవచ్చా? ఈ అంశాలపై జనపథంలో డివైఎఫ్ఐ నేత శ్రీనివాస్‌ విశ్లేషించారు. అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:49 - April 28, 2016

ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలున్న నిరుద్యోగులకు ఎస్ బీఐ షాకిచ్చింది. ఇలాంటి బకాయిలున్నవారు బ్యాంకింగ్ ఎగ్జామ్ రాయడానికి అనర్హులంటూ ఎస్ బిఐ ప్రకటించింది. 17వేల క్లరికల్ స్థాయి బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్బిఐ పోలీస్ కేసులున్నవారూ ఈ పరీక్షకు అనర్హులంటూ స్పష్టం చేసింది. చదువు అత్యంత ఖరీదైన సరకైంది. చదువు చెప్పే బాధ్యత నుంచి ప్రభుత్వాలు దాదాపు తప్పుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వ విద్యాసంస్థలు పెరగడం లేదు. వాటి మీద పర్యవేక్షణా కొరవడుతోంది. దీంతో అనివార్యంగా ప్రయివేట్ విద్యా సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ ఫీజులు మండిపోతున్నాయి. ఇంజనీరింగ్, కంప్యూటర్స్, బిజినెస్, మేనేజ్ మెంట్ లాంటి కోర్సులకు భారీగా డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తోంది. కెరీర్ పరుగు పందెంలో తమ పిల్లలను ముందు వరుసలో నిలబెట్టేందుకు పేరెంట్స్ విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మధ్య తరగతి భరించలేని స్థితికి చదువుల ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉన్నత చదువులకెళ్లే విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ఎంతోకొంత ఊరటనిస్తున్నవి ఎడ్యుకేషన్ లోన్స్. మనదేశంలో పది లక్షల రూపాయల వరకు బ్యాంక్ లు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్నాయి. దాదాపు 34 లక్షల మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా లబ్ధిపొందారు. వివిధ బ్యాంక్ లు 79వేల కోట్ల రూపాయలను ఎడ్యుకేషన్ లోన్ రూపంలో విద్యార్థులకు సమకూర్చిపెట్టాయి. ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడంలో ప్రభుత్వరంగ బ్యాంకులే ముందుంటున్నాయి. ప్రయివేట్ రంగ బ్యాంక్ లు పెద్దగా ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం లేదు. దాదాపు 90శాతం మంది విద్యార్థులు తాము తీసుకున్న లోన్ లు తిరిగి చెల్లిస్తుండగా సుమారు పది శాతం మంది డిఫాల్టర్ లుగా మారుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ లోన్స్ డిఫాల్టర్స్ ఎక్కువగా వున్నట్టు సమాచారం. హైదరాబాద్, గుంటూరు, పూణె నగరాల్లో వీరి సంఖ్య ఎక్కువగా వున్నట్టు వినికిడి.

12 శాతం డిఫాల్టర్స్..
బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ కి అత్యధికంగా 12శాతం మంది డిఫాల్టర్స్ వుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడాకి 8.2శాతం, కెనరా బ్యాంక్ కి 8శాతం మంది డిఫాల్టర్స్ వున్నట్టు సమాచారం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 6.5శాతం, ఎస్ బిఐకి 5శాతం మంది డిఫాల్టర్స్ వున్నారు. అయితే, మొత్తం బకాయిల విలువ 5, 192 కోట్ల రూపాయలు మాత్రమే. ఒక్క కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎగ్గొట్టిన దానితో పోల్చుకుంటే విద్యార్థులు బకాయిపడిన ఎడ్యుకేషన్ లోన్ మొత్తం చాలాచాలా తక్కువ. మన దేశంలో దాదాపు 4 లక్షల రూపాయల మొండి బకాయిలుంటే, అందులో సింహభాగం బడా పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టినవే వున్నాయి. కేవలం పది మంది ఇండస్ట్రియలిస్టులే 50వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. వీరంతా తమను ఎవరూ ఏమీ పీకలేరన్న భావనతో ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టారనడంలో సందేహం లేదు. బడాబాబులు ఎగ్గొడుతున్న బాకీలను వసూలు చేసేందుకు గట్టి ప్రయత్నాలేవీ చేయని ప్రభుత్వాలు, బ్యాంక్ ల యాజమాన్యాలు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు నిరుద్యోగులైన విద్యార్థుల మీద పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ ఎస్ బిఐ బ్యాంక్ ఉద్యోగాల విషయంలో పెట్టిన నిబంధనే. ఎడ్యుకేషన్ లోన్ బకాయిదారులు బ్యాంక్ ఉద్యోగ పరీక్ష రాయడానికి అనర్హులంటూ ఎస్ బిఐ ప్రకటించింది. పారిశ్రామికవేత్తల మాదిరిగా విద్యార్థులు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు కాదు. సరియైన ఉద్యోగం దొరక్క అవస్థపడుతున్నవారే రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారు. ఇలాంటివారిని ఉద్యోగ పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడం వల్ల వారికి మరింత అన్యాయం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ బకాయిలున్నవారిని ఉద్యోగ పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడం ఎస్ బిఐతోనే ఆగిపోదు. ఇది ఆరంభం మాత్రమే. మిగిలిన సంస్థలు కూడా ఇదే బాటపడతాయి. చివరకు తల్లితండ్రులకు, సోదరీ సోదరులకు ఇతర లోన్లు వున్నా అనర్హులుగా ప్రకటించే ప్రమాదాలూ మున్ముందు పొంచివున్నాయి. ఇలాంటి మానసిక ఒత్తిడిలు తట్టుకోలేక మున్ముందు విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడానికే ఇష్టపడకపోవచ్చు. దీనివల్ల ప్రయివేట్ చదువులు కొనుక్కునే ఆర్థిక స్థోమతలేని వారు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాయన్న మంచిపేరు సంపాదించుకున్న ప్రభుత్వరంగ బ్యాంక్ లు ఇలాంటి నిబంధనల విషయంలో మరోసారి ఆలోచించాలి. 

మావోల దాడి...వాహనాలకు నిప్పు...

ఆదిలాబాద్ : జిల్లాలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో 30 మంది మావోయిస్టులు నిద్రిస్తున్న కూలీలపై దాడికి పాల్పడ్డారు. కూలీల నుండి 20 సెల్‌ఫోన్లు లాక్కున్నారు. నలుగురు మావోలు వంతెన నిర్మాణ స్థలంలో పార్క్ చేసి వున్న వాహనాలపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తే చంపేస్తామని కూలీలను బెదిరించారు. ఆదిలాబాద్ జిల్లా కమిటీ పేరుతో ఓ లేఖ రాసి సంఘటనాస్థలంలో వదిలివెళ్లారు. వచ్చే నెల 4,5 తేదీల్లో బంద్ పాటించాలనీ... మైన్స్, ఓసీలతో అమాయక ప్రజలు నష్టపోతున్నారని, గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని లేఖ పేర్కొన్నారు.

06:41 - April 28, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు మోడీ సర్కార్‌ అగస్టా వెస్ట్ ల్యాండ్‌ చాపర్‌ స్కాం అస్త్రాన్ని ప్రయోగించింది. సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్‌ టాప్‌ లీడర్స్‌కు ఈ స్కాంతో సంబంధం ఉందని బిజెపి ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభలో వ్యూహాత్మకంగా సోనియాపై దాడికి బిజెపి- సుబ్రహ్మణ్య స్వామిని దింపింది. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సోనియా కొట్టిపారేశారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్‌ స్కాంపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. రాజ్యసభ సభ్యుడిగా మంగళవారం ప్రమాణం చేసిన సుబ్రహ్మణ్య స్వామి ఆగస్టా కుంభకోణాన్ని ప్రస్తావించారు. సోనియాగాంధీకి సంబంధం ఉందని ఆరోపించారు. అగస్టా స్కాంలో సోనియా పేరు ఉన్నట్లు మధ్యవర్తి క్రిశ్చన్‌ మిశేల్‌ ఇటలీ కోర్టులో రాత పూర్వకంగా తెలియజేశారని తెలిపారు.

నిరాధారమన్న సోనియా..
సోనియా పేరును స్వామి ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వెల్‌లోకి దూసుకొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. సోనియా సభలో లేనందున, అగస్టా కుంభకోణంలో ఆమె పేరును ఉటంకించరాదని డిప్యూటీ చైర్మెన్ పీజీ కురియన్ స్వామికి సూచించారు. గందరగోళం మధ్య సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వివిఐపి హెలిక్యాప్టర్ల కొనుగోళ్లకు సంబంధించి ఇటలీ కంపెనీ అగస్టా వెస్ట్‌లాండ్‌తో తానెలాంటి తప్పుడు పనులు చేయలేదని సోనియాగాంధీ స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని సోనియా పేర్కొన్నారు. ఏవైనా తప్పులు జరిగితే రెండేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్టీయే ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిజాన్ని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.  అగస్టా వెస్ట్ ల్యాండ్‌ కంపెనీని కాంగ్రెస్‌ బ్లాక్‌ లిస్టులో పెడితే...మోడీ ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగం కల్పించిందని గులాం నబీ ఆజాద్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆరోపణలను జైట్లీ ఖండించారు. ప్రధాని మోడీ ఇటలీ ప్రధానిల మధ్య ఎలాంటి సమావేశం జరగలేదన్నారు. చాపర్‌ స్కాంకు సంబంధించి కాంగ్రెస్‌ తగిన జవాబిస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ తెలిపారు. ఇటలీకి చెందిన ఫిన్‌మెకానికా సంస్థ అగస్టా హెలికాప్టర్లను తయారు చేస్తుంది. ఆ హెలికాప్టర్ల కోసం 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం 3600 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది.  

06:37 - April 28, 2016

విశాఖపట్టణం : దువ్వాడ సెజ్‌లోని బయోమాక్స్ కంపెనీలో అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 40 గంటలుగా ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలార్పేందుకు ఫోమ్‌ అందుబాటులో లేకపోవడంతో ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు 200 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 10 బయో డీజిల్‌ ట్యాంకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 10 ట్యాంకులను రక్షించారు. రంగంలోకి దిగిన సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 41 ఫైరింజన్లు మంటలార్పేందుకు యత్నిస్తున్నాయి. విశాఖ కాకుండా.. ఇతర జిల్లాల నుంచి ఫైరింజన్లను తీసుకువచ్చారు. ఇక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు సరిపడ ఫోమ్‌ అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమవుతుందని అధికారులంటున్నారు.

కంపెనీ యజమానుల నిర్లక్ష్యం..
ఇదిలావుంటే.. కంపెనీ యజమానుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం ఈ స్థాయికి చేరుకుందని ఫైర్‌ అధికారులు భావిస్తున్నారు. మంటలు చెలరేగినప్పుడు ఫోమ్‌ ద్వారా మంటలు ఆపివుంటే.. ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. చమురు మంటలు నీటితో ఆర్పడం కష్టమని తెలిసినా కూడా.. కంపెనీలు ఫోమ్‌ను అందుబాటులో పెట్టుకోలేదంటున్నారు. మరోవైపు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయంటున్నారు. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్‌ యువరాజ్‌ సంఘటనాస్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇంకా నాలుగైదు గంటల్లో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. 

06:33 - April 28, 2016

హైదరాబాద్ : పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల డిజైన్ ఖరారైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లోలోని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ వరకు మొత్తం ఐదు లిఫ్టుల ద్వారా 120 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. తద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండలోని 12 లక్షల ముప్పై వేల ఏకరాలకు సాగు నీరు అందనుంది. హైద్రాబాద్ దాహార్తి తీర్చేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కరవు జిల్లా పాలమూరులో 7 లక్షల ఎకరాలు.. రంగారెడ్డిలో 5 లక్షలు, నల్గోండ జిల్లా లో 30 వేల ఏకరాలకు సాగు నీరు లభించనుంది. దాంతో పాటు ప్రాజెక్టు, కాలువల పరిసరాల్లోని గ్రామాలతో పాటు, రాజధాని హైద్రాబాద్ కు తాగు నీరు అందనుంది. ఇక పరిశ్రమలకు కూడా పది టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది. మహబుబ్ నగర్ లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 టీఎంసీలను లిఫ్ట్ చేసే విధంగా ఈ ప్రాజెక్టకు రూపకల్పన చేసింది తెలంగాణ సర్కార్.

ప్రాజెక్టు సామర్థ్యం 69.60 టీఎంసీలు..
మొదట శ్రీశైలం నుంచి నీటిని ఎత్తి 8.61 టీఎంసీల కేపాసిటి గల నర్లాపూర్ బాలెన్సింగ్ రిజర్వాయర్ ను నింపుతారు. ఆ తర్వాత 6.55 టీఎంసీ ల సామర్ధ్యం గల ఏదుల బాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఆ తర్వాత 16.58 టీఎంసీల కేపాసిటి గల వట్టెం రిజర్వాయర్ కు నీటిని వదులుతారు. అనంతరం 19.15 టీఎంసీల కేపాసిటి గల కురుమూర్తి రిజర్వాయర్‌కు నీటిని మళ్లిస్తారు. అక్కడ నుంచి 15.91 టీఎంసీల సామార్ధ్యం గల ఉద్దండపురం రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. చివరగా 2.8 టీఎంసీల నీటిని లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ ను నింపుతారు. మొత్తం 5 పంప్ హౌస్ లు, 6 బాలెన్సింగ్ రిజర్వాయర్లు గల ఈ ప్రాజెక్టు సామర్ధ్యం 69.60 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు వల్ల 24 గ్రామాలు, 25 వేల ఏకరాల భూమి ముంపునకు గురికానుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల మహబూబ్ నగర్ లో కరవుతో అల్లాడుతున్న గ్రామాలు సస్యశ్యామలం కానున్నాయి. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సైతం నీరు అందనుంది. 5 వేల కోట్ల భారీ అంచనాలతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. సకాలంలో పనులను పూర్తి చేసేందుకు మట్టి పనుల నుంచి రిజర్వాయర్లు, లిఫ్ట్‌ల నిర్మాణం వరకు మొత్తం 18 ప్యాకేజీలుగా విడగొట్టింది. సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు గత సంవత్సరం శంకుస్థాపన చేయగా టెండర్లు ఖరారయ్యాయి. 

06:28 - April 28, 2016

విజయవాడ : వైసిపికి మరో షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత మైసూరారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ సందర్భంగా జగన్‌కు ఘాటు లేఖ రాశారు. వైసిపిలో ఉంటూ సొంత ప్రాంతానికి ఏమీ చేయలేక.. జగన్‌ చేస్తున్న కార్యక్రమాలకు తలూపలేక.. పార్టీని వీడుతున్నట్లు మైసూరా ప్రకటించారు. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని మైసూరా దుయ్యబట్టారు. అధినేతలో అపరిచితుడి లక్షణాలున్నాయని పోల్చుతూ.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. కొంతకాలంగా మైసూరా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత తీరే తన నిష్క్రమణకు కారణమని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీని వీడేందుకు కారణాలను వివరిస్తూ.. జగన్‌కు ఘాటు లేఖను రాశారు. జ‌గ‌న్ ఆలోచ‌న ఎప్పుడూ అధికార పీఠం చుట్టే తిరిగిందని అందులో విమర్శించారు. అసలు జగన్‌లో మాన‌వీయ కోణం ఏకోశానా లేదని మైసూరా దుయ్యబట్టారు. తాను వైసీపిలో చేరిన‌ప్పుడు త‌న‌కు క‌నీసం ఆలోచించుకునేందుకు కూడా జగన్‌ అవ‌కాశం ఇవ్వలేదని మైసూరా అన్నారు. బ్రేక్ ఫాస్ట్‌కి అని పిలిచి మాట్లాడిన త‌రువాత.. పార్టీ కండువా క‌ప్పేంత వ‌ర‌కూ ఒక‌దాని వెనుక ఒక‌టి అలా చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ని చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరడం పెద్ద తప్పటడుగని అభివర్ణించిన మైసూరా.. దాన్ని వెనక్కి తీసుకుంటే గౌరవ ప్రదంగా ఉంటుందనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఇష్ట ప్రకారం నిర్ణయాలు...
గ్రేట‌ర్ రాయలసీమ ఉద్యమానికి తొలుత సానుకూల‌త వ్యక్తం చేసిన జ‌గ‌న్.. ఆ తర్వాత త‌న నిర్ణయం మార్చుకున్నార‌ని లేఖ‌లో మైసూరా పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన అంశాల‌పై జ‌గ‌న్ త‌న‌ ఇష్ట ప్రకారం నిర్ణయాలు మారుస్తార‌ని, నిర్ణయాలు మార్చుకునే ముందు క‌నీసం పార్టీలో సీనియ‌ర్లతో చర్చించ‌రని అన్నారు. స‌ల‌హాలు చెప్పినా విన‌ర‌ని మైసూరా ఆరోపించారు. అధికారం కోసం పెత్తనం చెలాయించడం కోసం ఇత‌రుల కుటుంబాల్లో చిచ్చు పెట్టే సంస్కృతి ఆనాటి రాచ‌రికాల్లో ఉండేద‌ని, ప్రస్తుతం అది వైసీపీలో కొనసాగుతుందని మైసూరా అన్నారు. ఇలాంటివి చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయ‌న్నారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రజల ప‌క్షాన పోరాడే ఆలోచ‌న జ‌గ‌న్‌కు ఏమాత్రం లేద‌ని, జ‌గ‌న్ ఎప్పుడూ డబ్బులకే ప్రాధాన్యత ఇస్తారని మైసూరా లేఖ‌లో పేర్కొన్నారు. తాను ఏ మాన‌వీయ కోణంతో అయితే పార్టీలో చేరానో అలాంటి కోణాలు ఇప్పుడు పార్టీలో మచ్చుకైనా లేవన్నారు. అలాంట‌ప్పుడు తాను పార్టీలో కొన‌సాగ‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకున్నట్లు మైసూరా తెలిపారు. 

06:23 - April 28, 2016

ఖమ్మం: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని ప్రజలు.. ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిగా ఉండాలన్నారు. మే ఆఖరు నాటికి కార్యకర్తలకు దాదాపు 4 వేల పదవులు రాబోతున్నాయని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్లీనరీతో ఖమ్మం నగరం గులాబి తోటలా విరబూసినట్లైంది. 5 వేల మంది ప్రతినిధులు, కార్యకర్తల రాకతో నగరం కళకళలాడింది. యావత్ టిఆర్ఎస్‌ పార్టీ అంతా ఒక్కచోట చేరిందా అన్నట్లు ఖమ్మం శోభిల్లింది. వేలాది మంది అతిథులు వివిధ అంశాలపై ప్రసంగాలు, రకరకాల వంటలతో భోజనాలు., ఇలా ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది టీఆర్ఎస్‌ ప్లీనరీ సమావేశం. నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో తెలంగాణ రాష్ట్రసమితి ప్లీనరీ ప్రారంభ సూచికగా.. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం కెసిఆర్‌...రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పడ్డ కష్టాలను సాధించాల్సిన లక్ష్యాలను గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ధీరులుగా వ్యవహరించిన ఘనులు లక్షలాది మంది కార్యకర్తలేనన్నారు. ఇవాళ సొంత రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరామని గుర్తుచేశారు.

సంక్షేమరంగానికి రూ. 35వేల కోట్లు..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచామని ఇంతటి అసాధారణ తీర్పు గతంలో ఎప్పుడూ చూడలేదని కెసిఆర్ అన్నారు. ప్రజల ఆదరణ పొందేలా పనితీరు ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని ప్రజలు.. ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిగా ఉండాలని కోరారు. సంక్షేమ రంగానికి 35 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలంగాణను మాగాణం చేసుకునేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నామని వివరించారు. మే ఆఖరు నాటికి కార్యకర్తలకు దాదాపు 4 వేల పదవులు రాబోతున్నాయని చెప్పారు. సాధించిన విజయాలతోనే ఆగక బంగారు తెలంగాణ సాధించేదాకా అవిశ్రాంతంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణకు జలకళ తేవడం కోసమే ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌ చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాను సాధించుకుని.. అన్ని ఎకరాలకూ నీటిని పారిస్తామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని లాంటిదని దీని ద్వారా 5 జిల్లాలు సస్యశ్యామలం కాబోతున్నాయన్నారు.

15 తీర్మానాలు..
హైదరాబాద్‌ను ప్రపంచనగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్న సీఎం కలలను నిజం చెయ్యాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమగ్రమైన ప్రణాళికతో నగరాభివృద్ధిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేద్దామని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్లీనరీలో 15 తీర్మానాలను చర్చించి ఆమోదించారు. అతిథులకు ఏకంగా 50 రకాల ఆహార పదార్థాలతో నిర్వాహకులు మృష్టాన్న భోజనం వడ్డించారు. సమావేశంలో ఆహూతులకు ఎండల వేడి నుంచి రక్షణ కల్పించేందుకు ఎయిర్ ఫాగింగ్ యంత్రాలను అమర్చి చల్లదనాన్ని కల్పించారు. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ప్లీనరీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. 

06:20 - April 28, 2016

ఖమ్మం : పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆగంకాకూడదనే సీఎం పదవి చేపట్టానని, తెలంగాణ తెచ్చిన గొప్పతనం ముందు సీఎం పదవి చిన్నదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ ప్లీనరీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాలేరులో తుమ్మలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.స్వేచ్ఛా వాయువుల మధ్య ప్లీనరీని నిర్వహించామని తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. 2017 డిసెంబర్‌ నాటికి మిషన్‌ భగీరథ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్‌తో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణది అగ్రస్థానమని, రూ.35 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

తుమ్మలను గెలిపించాలి..
రెండు తరాల వరకు సమస్య ఉండొద్దనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లును గొప్ప ఆశయంతో నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇకపై విద్యుత్‌ కోతలు ఉండవని, 2019 ఆఖరునాటికి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తామని సీఎం తెలిపారు. ఖమం జిల్లాను బంగారు గుమ్మంలా మారుస్తానని మరోసారి స్పష్టం చేశారు. పాలేరు నుంచి పోటీచేయాలని తుమ్మల నాగేశ్వరారావును కోరానని, తనకు కుడిభుజం లాంటి వ్యక్తని కొనియాడారు. పాలేరులో తుమ్మలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

బొబ్బిలిలో కారు బోల్తా...

విజయనగరం: జిల్లాలోని బొబ్బిలి మండలం కోమటపల్లి దగ్గర హైవేపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

నేడు ఏడో ఐఆర్ఎన్ఎస్ఎస్ -1 జీ ప్రయోగం..

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ లో చివరిదైన 7వ నావిగేషన్‌ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్ -1జీని గురువారం కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. 

నేడు వడగాల్పులు..

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, హన్మకొండల్లో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. హైదరాబాద్‌లో బుధవారం గరిష్టంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.

రాజోలి బండపై నేడు కర్ణాటకతో చర్చలు..

బెంగళూరు: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) అమలులో నెలకొన్న సమస్యల పరిష్కారంక ఓసం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, ఎంబీ పాటిల్ ఆధ్వర్యంలో గురువారం చర్చలు జరగనున్నాయి. 

గుజరాత్ లయన్స్ విజయం..

న్యూఢిల్లీ : గుజరాత్ లయన్స్ నే అదృష్టం వరించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో కేవలం పరుగు తేడాతో ఢిల్లీపై గెలిచిన గుజరాత్ మళ్లీ టాప్ లోకి దూసుకెళ్లింది.
గుజరాత్ లయన్స్ : 172/6. ఢిల్లీ డేర్ డెవిల్స్ : 171/5..

Don't Miss