Activities calendar

29 April 2016

22:06 - April 29, 2016

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో క్రికెటర్‌ విరాట్ కోహ్లి సందడి చేశారు.. సుజన ఫోరం మాల్‌లో ఓ షోరూంను ప్రారంభించారు.. ఫొటోలకు ఫోజులిస్తూ అభిమానుల్ని అలరించారు. ఫ్యాషన్‌ లో హైదరాబాదీలు ఎప్పుడు ముందుంటారని కోహ్లీ కితాబిచ్చాడు. 

22:03 - April 29, 2016

నల్లగొండ : జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ డ్రైవర్‌ ప్రాణాపాయ స్థితిలోనూ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులకు అపాయం కలగకుండా చేయగలిగాడు. తొర్రూరు నుంచి జగద్గిరి గుట్ట వస్తుండగా... ఆత్మకూరు మండలం రైల్‌ఖాన్ దగ్గర వడదెబ్బకు స్టీరింగ్‌పైనే డ్రైవర్‌ కుప్పకూలిపోయాడు. అలాంటి పరిస్థితిలోనూ రోడ్డు పక్కన బస్సు ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగాడు. బస్సులో 56 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. 

 

22:00 - April 29, 2016

ఢిల్లీ : కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతికి ఊరట లభించింది.. 14ఏళ్లక్రితం ఆడిటర్‌ రాధాకృష్ణన్‌పై దాడి కేసులో జయేంద్ర సరస్వతితోపాటు.. మరో ఎనిమిదిమంది నిర్దోషులని చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.. 2002 సెప్టెంబర్‌ 20 శంకరమఠం ఆడిటర్‌గా ఉన్న రాధాకృష్ణన్, ఆయన భార్య జయశ్రీ, అసిస్టెంట్‌ కృష్ణన్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.. ఆ తర్వాత కాంచీపురంలోని వరదరాజపెరుమాల్‌ ఆలయంలో శంకరమఠం విమర్శకుడు శంకర రామన్‌ హత్యకు గురయ్యారు.. ఈ కేసులతో సంబంధాలున్నాయంటూ జయేంద్ర సరస్వతిని 2004లో పోలీసులు అరెస్ట్ చేశారు.. 

 

21:59 - April 29, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కొనుగోళ్ల విషయంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాజీ ఐఏఎఫ్ చీఫ్ ఎస్పీ త్యాగికి సమన్లు జారీ చేసింది. ఈ స్కాంలో త్యాగి, ఆయన బంధువులు కూడా ఇటలీ కంపెనీ నుంచి ముడుపులు అందుకున్నట్టు ఆరోపణలు రావడంతో.. సమన్లు జారీ చేసింది. త్యాగీని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. అయితే త్యాగీ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. నిబంధనల ప్రకారమే అగస్టా హెలికాఫర్ల కొనుగోలుకు అంగీకరించామన్నారు. 

 

21:54 - April 29, 2016

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తామని వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధన బాధ్యత పూర్తిగా టీడీపీ దేనని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు.. తమ పార్టీ ఎమ్మెల్యేను ఎలా చేర్చుకోవాలన్న అంశంపైనే తిరుగుతున్నాయని మండిపడ్డారు.

21:51 - April 29, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపు విషయంలో రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. కేంద్రం విభజన హామీలు నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ ఎంపీ జేడి శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టంపై కెవిపి ఇచ్చిన ప్రైవేట్ మెంబర్‌ బిల్లుపై సభలో చర్చ జరిగింది. అయితే కోరం లేకపోవడంతో సభను వాయిదా వేశారు. 
ఎపి విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ : జేడీ శీలం
ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం ఫైరయ్యారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లైనా ఇంతవరకు ఏపీ సమస్యలు పరిష్కరించలేదని... నిధులు కేటాయించడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరిగింది. ప్రధానంగా జేడీ శీలం కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.  
బిజెపి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు : జేడీ శీలం 
రాష్ట్ర విభజన వేళ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, నాడు స్పెషల్ స్టేటస్ అంశాన్ని బలపరిచిన బిజెపి ఇప్పుడు కనీసం ఆ ఊసే ఎత్తడం లేదని జేడీ శీలం అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని చట్టంలో ఉన్నా ఇంతవరకు నిధులు కేటాయించలేదని గుర్తుచేశారు. విభజన జరిగాక అనేక ఆర్థిక సంస్థలను తెలంగాణకు కోల్పోయామని వాటిని ఏపీలో ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలు కేటాయిస్తే అది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. 700 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన ఐఐటికి 40 కోట్లు కేటాయించడం సబబేనా అని అన్నారు. ఇలా ఎన్నో సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదంటూ ఆ వివరాలు ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానిని అడిగేందుకు టిడిపి ఎంపీలు భయపడొద్దని సూచించారు. 
కాంగ్రెస్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హతే లేదు : సీఎం రమేష్ 
రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించిన కాంగ్రెస్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హతే లేదని టిడిపి ఎంపీ సిఎం రమేష్‌ విమర్శించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ తాము పదేపదే అడుగుతున్నామన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి హరిభాయి చౌధరి సమాధానమిస్తూ ఏపీకి తమ ప్రభుత్వం ఇప్పటికే చాలా నిధులు కేటాయించిందని ఇంకా కేటాయిస్తామని అన్నారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఏయే సంస్థలను నెలకొల్పుతున్నదో ఆ వివరాలు వెల్లడించారు. మంత్రి ఇన్ని చెప్పినా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదని జేడీ శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హరిభాయి వివరణ ఇస్తూ ఏపీకి ప్రత్యేక హోదాపై నీతి అయోగ్‌ అంగీకరించలేదని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించిందని అన్నారు. నీతి అయోగ్ సూచన మేరకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. 
బిల్లుపై చర్చ జరుగుతుండగా గందరగోళం
అయితే బిల్లుపై చర్చ జరుగుతుండగా కోరం లేకపోవడంతో సభలో కాసేపు గందరగోళం కొనసాగింది. సభలో సభ్యులు లేనందున అవసరమైతే సభను వాయిదా వేసి తర్వాత బిల్లుపై చర్చ జరిపించండని కెవిపి కోరారు. చివరకు కోరం లేనందున అధ్యక్ష స్థానంలో ఉన్న విపి సింగ్ సభను మే 2కు వాయిదా వేశారు. 

21:43 - April 29, 2016

ఎపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి పలు విషయాలను తెలిపారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలనేదే సీఎం చంద్రబాబు కోరిక అన్నారు. నదుల అనుసంధానం చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్.. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిందన్నారు. జగన్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా సభలో అడ్డుపడ్డాడని ఆరోపించారు. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులు, చెక్ డ్యాంల మరమ్మతులు చేపడతామని చెప్పారు. దీంతో మైనర్ఇరిగేషన్ పెరుగుతోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:17 - April 29, 2016

ఏది చీకటి.. ? ఏది వెలుతురు..? ఏది జీవితమేది మృత్యువు..? ఏది పుణ్యం..? ఏది పాపం..? ఏది నరకం ఏదనరకం..? ఏది సత్యసం ఏదసత్యం..? ఏదనిత్యం...? ఏది నిత్యం..? ఏది ఏకం..? ఏదనేకం..? ఏది కారణమేది కార్యం...? ఓ మహాత్మా...! ఓ మహర్షీ...! శ్రీశ్రీపై ఈరోజు ప్రత్యేకం కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

21:03 - April 29, 2016

బద్దశత్రువుల కలిపిన కేసీఆర్.. పాలేరు గడ్డమీద సురువైంది వార్, అకాలవర్షంతోటి ఆగమైన అన్నదాత.. అస్సలాదుకుంటలేడంట ఏ ఒక్క నేత, నీళ్ల కోసం బుడ్డపోరగాండ్ల ఫైటింగ్.. సడాక్ మీద పెద్దొళ్లంతా వెయిటింగ్, అమ్మలక్కల బాధలినరంట నాయకులు... ఎంపీ కవితక్కను బతిమిలాడిన కార్మికురాలు, ఆంధ్రాల అమ్ముడుపోతలేవంట బీర్లు.. సితం తాగుతుండ్రంట జనం క్వార్టర్లు, మూన్నెలల్ల కుదిరిన ఫేస్ బుక్ పెళ్లి.... అచ్చంతలేద్దాంపాండ్రి మనం కూడా ఎల్లి... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:51 - April 29, 2016

ట్రైమెక్స్..! వేలకోట్ల ప్రజాధనం అప్పనంగా దోచుకున్న సంస్థ..! సాక్షాత్తు అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీయే నిగ్గు తేల్చిన వాస్తవం. ఇది జరిగి నాలుగు నెలలు కావస్తోంది. కానీ ట్రైమెక్స్‌ దోపిడిని అడ్డుకున్న నాథుడు లేడు.. సంస్థపై చర్యలను ప్రతిపాదించిన అధికారే లేడు. ట్రైమెక్స్ పై చర్యలను అడ్డుకుంటున్నదెవరు..? సంస్థతో మిలాఖత్‌ అయిన అధికారులా..? లేక అధికారులను శాసిస్తోన్న ప్రభుత్వ పెద్దలా..? 
ట్రైమెక్స్ సంస్థ జేబుల్లోకి ప్రజాధనం  
సముద్రతీరంలోని ఖరీదైన ఖనిజాన్ని కొల్లగొట్టినట్లు చాలా కాలంగా ఆరోపణలున్నాయి. అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ నివేదిక ఈ ఆరోపణలు నిజమని తేల్చింది. వేలకోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వానికి కాకుండా.. ట్రైమెక్స్ సంస్థ జేబుల్లోకి మళ్లిపోయిందని పీఏసీ నిర్ధారించింది. 
అవినీతిపై విచారణే జరగలేదు 
సాధారణంగా ఇంత భారీ కుంబకోణం బయటపడ్డాక.. విచారణ, దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం ఆనవాయితీ. కానీ, ట్రైమెక్స్ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. తీవ్ర ఒత్తిడి కారణంగా.. ప్లాంట్ పనులు ఆగిపోయాయి తప్ప.. వేల కోట్ల అవినీతిపై విచారణే జరగలేదు. అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ విచారణలో.. ట్రైమెక్స్ సంస్థ.. సముద్ర తీరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సంస్థ లూటీ చేసిందని పీఏసీ వెల్లడించింది. మైనింగ్ ఇతర శాఖల అధికారుల తీరుపై మండిపడింది. తక్షణమే ట్రైమెక్స్ మైనింగ్‌ను నిలిపివేయించాలని ఆదేశించింది. అంతేకాదు అటవీ భూముల్లో సైతం మైనింగ్‌కు అనుమతులు ఇచ్చినందుకు బాధ్యులుగా రెవెన్యూ, మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ ట్రైమేక్స్ అక్రమాలను బహిర్గతం చేసిన తరువాత.. ఈ అంశంపై ఏపీ శాసనసభలో రెండుసార్లు సుదీర్ఘమైన చర్చ జరిగింది. సమగ్ర విచారణ జరపాలని పి.ఏ.సి సభ్యులతో పాటు, మిగిలిన ఎమ్మెల్యేలూ కోరారు. అయితే ప్రభుత్వ స్థాయిలో అలాంటి విచారణకు ఆదేశాలివ్వలేదు. దీని ఆంతర్యం ఏంటి..? తెరవెనుక మంత్రాంగం ఫలితమా..? మరేదైనా కారణమా..? ప్రజా సంఘాలు సంధిస్తోన్న ప్రశ్నలివి. 
2004 నుంచి పనిచేస్తోన్న ట్రైమెక్స్
శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస వద్ద ట్రైమెక్స్ సంస్థ 2004 నుంచి పనిచేస్తోంది. ఇక్కడి సముద్రతీరంలోని ఇసుకను తవ్వి అందులోని ఇలిమినైట్‌, రూటైల్‌, గార్నేట్‌, సిలిమినైట్‌, జిర్కాన్‌ లాంటి ఖనిజాలను వేరుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఖనిజాల తవ్వకాల్లోనూ.. విదేశాలకు తరలించే విషయంలోనూ ట్రైమెక్స్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ దీన్ని తనిఖీ చేసి అక్రమాలరె బయటపెట్టింది. తన గుట్టు రట్టుకావడంతో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ట్రైమెక్స్ సంస్థ సరికొత్త ఎత్తును వేసింది. సంస్థలో కార్మికులను పావులుగా వాడుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. రిలే నిరాహార దీక్షల పేరిట.. కార్మికులతో నిరసనలకు శ్రీకారం చుట్టింది. ట్రైమెక్స్ ట్రిక్స్ ను జిల్లా కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 
ట్రైమెక్స్ తీరు పట్ల స్థానికుల ఆగ్రహం 
దాదాపు పన్నెండు సంవత్సరాలుగా బీచ్ శాండ్ మైనింగ్ జరుపుతున్న ట్రైమెక్స్ తీరు పట్ల స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సర్వే నంబర్ 216, 217 భూమి వివాదం,  ఇసుకను త్రవ్విన చోట రీ-ఫిల్లింగ్ చెయ్యకపోవడం లాంటి విషయాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. 

నార్వేలో కూలిన హెలికాప్టర్‌

ఢిల్లీ : నార్వేలో 14 మందితో వెళ్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. నార్వే పశ్చిమ తీరంలోని బెర్జెన్‌ నగరం సమీపంలో సముద్రంలో కుప్పకూలింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మంది క్షేమ సమాచారం గురించి తెలియాల్సి ఉంది.

మే 5 నుంచి కేయూ పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు గతంలో ప్రకటించినట్లుగా మే 5 నుంచి జరుగుతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు ప్రొ.కె.పురుషోత్తం, డాక్టర్ వి.రాంచంద్రం తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి మే 12 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బీహార్‌లో పేలుడు.. ఐదుగురికి గాయాలు

పాట్నా : బీహార్‌లో పేలుడు జరిగింది. ఆరాలోని ఎన్ఎస్ షాపింగ్ మాల్‌లో పేలుడు జరిగింది. ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు ఎలా జరిగింది, కారణమెవరు అనే విషయాన్ని నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

ఆస్తులు ప్రకటించిన శ్రీశాంత్...

ఢిల్లీ : క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పొలిటీషియన్‌గా మారిన టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ కేరళలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కమీషన్‌కు శ్రీశాంత్ తన ఆస్తుల అఫిడవిట్‌ను సమర్పించాడు. తన మొత్తం ఆస్తులు 7 కోట్ల 37 లక్షలుగా శ్రీశాంత్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. తన చేతిలో 42వేల ఐదువందల రూపాయలు, తన భార్య చేతిలో 35వేల రూపాయలు ఉన్నాయని శ్రీశాంత్ లెక్కలు చూపించడం విశేషం. తనకు కోటి 18లక్షల విలువ చేసే జాగ్వార్ ఎక్స్‌జెఎల్ కారు, 30వేలు విలువ చేసే ఓ బైక్ ఉందని తెలిపాడు.

టాస్‌ గెలిచి ఫిల్డీంగ్‌ ఎంచుకున్న గుజరాత్‌...

హైదరాబాద్ : ఐపీఎల్ -9 లో భాగంగా నేడు గుజరాత్‌ లయన్స్ వర్సెస్‌ పుణే వరియర్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్‌ లయన్స్ టాస్‌ గెలిచి ఫిల్డీంగ్‌ ఎంచుకుంది. 

ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో పోలీసులు కార్డన్‌సెర్చ్...

హైదరాబాద్ : ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో 200 మంది పోలీసులు సోదాలు చేస్తున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని ఆటో, కారు, 93 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 36 మంది అనుమానితులతో పాటు ఐదుగురు తోళ్ల పరిశ్రమ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

20:26 - April 29, 2016

హైదరాబాద్ : టిడిపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గంలోని ఎస్.ఏ.రావతార్ మసాలా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను యాజమాన్యం విధుల్లో నుంచి తొలగించడం అమానుషమని అన్నారు. కనీస వేతనాలు చెల్లించాలనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.  

 

20:16 - April 29, 2016

తూర్పుగోదావరి : కాకినాడ రాజీవ్ గృహకల్ప సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 150 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు గంటపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధితులను డిప్యూటీ సీఎం చినరాజప్ప పరామర్శించారు. 

20:13 - April 29, 2016

ఢిలీ : విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు అన్ని హామీలు నెరవేరుస్తున్నందున... ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి హెచ్‌పీ చౌదరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఏం కావాలో చట్టంలో ఉందని... వాటినే అమలు చేస్తున్నామన్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో ఆయన ఈ ప్రకటన చేశారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను నీతిఆయోగ్‌ అధ్యయనం చేస్తోందని... ఏపీకి ఆర్థికసాయంపై నీతిఆయోగ్‌ త్వరలో నివేదిక ఇవ్వనుందని మంత్రి తెలిపారు. 

 

20:10 - April 29, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపుల్లో జాప్యంపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ ప్రత్యేక హోదా కేటాయించలేదని, నిధులు కేటాయించకుండా కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ జైరాం రమేష్‌పైనా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విషయంలో కేంద్రం మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఎంపి కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. 

 

19:59 - April 29, 2016

ఖమ్మం : పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ ఉన్నారు. నామినేషన్‌కు ముందు ఖమ్మంలోని మల్లారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో సభ ఏర్పాటు చేశారు. పాలేరు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో పెద్ద పాలేరుగా పనిచేస్తారని పేర్కొన్నారు. 

 

19:57 - April 29, 2016

హైదరాబాద్ : కరవు సహాయజక చర్యలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కరువు పరిస్థితులు, వడగాల్పులు, నీటి ఎద్దడి, వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంట సాగు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సమస్యలను పరిష్కారంతోపాటు... ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని ఆదేశించారు. ఎండ వేడి ఎక్కువగా ఉందని... ఉపాది హామీ పనులు మధ్యాహ్నం చేయొద్దని సూచించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉపాదిహామీ పనులు చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.

19:47 - April 29, 2016

ఇది ష్యూర్ హిట్ అని ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఎవరూ జోస్యం చెప్పలేరు. కథ వినేప్పుడు కలిగే ఆసక్తి...దాన్ని సినిమా మలిచాక...ప్రేక్షకుల్లో  కలగకపోవచ్చు. ఇది కథను సినిమాగా మలిచే అనేక స్థాయిల్లో జరిగే మార్పు. ఈ మార్పులు బాగుంటే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే కౌంటర్ లో టికెట్లపై ఎవరూ చేయి వేయకుండా తయారవుతుంది. రోహిత్ కొత్త సినిమా రాజా చెయ్యి వేస్తే దీన్నే ఫాలో అయ్యింది.
కథ...
సినిమా దర్శకుడు అవుదామనుకుని ప్రయత్నాలు చేస్తుంటాడు నారా రోహిత్.  స్నేహితులతో కలిసి షార్ట్ ఫిలింస్ తీయడం..అవి పట్టుకుని..ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగడం అతని పని. ఓ షార్ట్ ఫిలిం తీస్తుండగా...ఇషా తల్వార్ ను చూసి రోహిత్ లవ్ లో పడిపోతాడు. రోహిత్ ప్రేమలోని నిజాయితీ చూసి తనూ ప్రేమిస్తుంది. మరోవైపు దందాలతో, దౌర్జన్యాలతో ఊరి జనాలను పీడిస్తుంటాడు తారకరత్న. వీడిని హత్య చేయాలని...లేకుంటే ఇషా తల్వార్ ను చంపేస్తామని రోహిత్ కు ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు. వాస్తవానికి ఈ ఫోన్ కాల్ చేయించింది హీరోయినే అన్నది కథలో ట్విస్ట్. ఈ మలుపు వెనుకున్న ప్లాష్ బ్యాక్ ఏంటో తెరపై చూడాలి.
విశ్లేషణ... 
బలమైన హీరోను అడ్డుపెట్టుకుని... హీరోయిన్ తన శత్రువులను సాధించడం అనేది పాత కథే. రాజా చెయ్యి వేస్తే లోనూ ఇదే చూపించారు. ఐతే ఈ తెలిసిన కథను కూడా దర్శకుడు ప్రదీప్ ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు. రోహిత్ ఎప్పటిలాగే పాత్రోచితంగా నటించాడు. తారకరత్న విలనీ ఫర్వాలేదు. ఇషా తల్వార్ లో అందం, నటన రెండూ లేవు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మరోసారి తన పాటలతో ఆకట్టుకున్నాడు. వారాహి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి రాజా పాత కథపైనే చేయి వేశాడు.

ఫ్లస్ పాయింట్స్

సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్

పాత కథ
అనాసక్తిగా సాగే స్క్రీన్ ప్లే
ప్రధాన పాత్రల చిత్రణ
దర్శకత్వం
    
టెన్ టివి రేటింగ్... 1.5/5
    

19:45 - April 29, 2016

రియో ఒలింపిక్స్ హాకీ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లకు క్లిష్టమైన డ్రా వచ్చింది. ఆగస్టు 7 నుంచి జరిగే 2016 ఒలింపిక్స్ హాకీ టోర్నీలో పాల్గొనటానికి భారత మహిళలజట్టు 36 ఏళ్ల విరామం తర్వాత అర్హత సాధించింది. పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్ల డ్రా వివరాలు ఓసారిచూద్దాం....
ఆగస్టు రెండోవారం నుంచి 2016 ఒలింపిక్స్..
బ్రెజిల్ వాణిజ్య రాజధాని రియో నగరం వేదికగా ఆగస్టు రెండోవారం నుంచి జరిగే 2016 ఒలింపిక్స్..పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లకు క్లిష్టమైన డ్రా ఎదురయ్యింది. డ్రా వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించింది.
ఆగస్టు 6 నుంచి 12 వరకూ లీగ్ దశ పోటీలు...
ఆగస్టు 6 నుంచి 12 వరకూ జరిగే లీగ్ దశ పోటీల్లో ...ఎనిమిదిసార్లు చాంపియన్ భారత్ గ్రూప్ - బీ లీగ్ లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీ, యూరోపియన్ చాంపియన్ హాలెండ్, పాన్ అమెరికన్ చాంపియన్ అర్జెంటీనా, కెనడా, ఐర్లాండ్ జట్లతో పోటీపడుతుంది.
గ్రూప్ -ఏ లీగ్ లో జట్లు..
గ్రూప్ -ఏ లీగ్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బెల్జియం, న్యూజిలాండ్, స్పెయిన్, బ్రెజిల్ జట్లు తలపడతాయి. లీగ్ దశ నుంచి నాలుగేసి జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది.
ప్రారంభ గ్రూప్ లీగ్ పోటీ..ఐర్లాండ్ తో భారత్ పోటీ
ఆగస్టు 6న జరిగే ప్రారంభ గ్రూప్ లీగ్ పోటీలో ఐర్లాండ్ తో భారత్ పోటీపడుతుంది. ఆగస్టు 8న డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో, ఆగస్టు 9న అర్జెంటీనాతో భారత్ అమీతుమీ తేల్చుకొంటుంది. ఆగస్టు 11న హాలెండ్ తో, ఆగస్టు 12 కెనడాజట్లతో భారత్ తలపడుతుంది. ఐర్లాండ్, కెనడా జట్లను భారత్ ఓడించినా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరడం ఏమంత కష్టం కాబోదు. మహిళల విభాగంలో సైతం భారత్ కు కష్టాలు తప్పేలా లేదు. ఆగస్టు 7న జరిగే ప్రారంభమ్యాచ్ లో జపాన్ తో భారత్ ఢీ కొంటుంది. ఆగస్టు 8న ఇంగ్లండ్ తో, ఆగస్టు 10న ఆసీస్, ఆగస్టు 11న అమెరికాతో భారత్ పోటీపడుతుంది. ఆగస్టు 13న అర్జెంటీనాతో భారత్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఆగస్టు 14 నుంచి క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ పోటీలు నిర్వహిస్తారు. భారత పురుషులజట్టుకు మిడ్ ఫీల్డర్ సర్దార్ సింగ్, మహిళల జట్టుకు ఫార్వర్డ్ రీతూ రాణి నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

మానసిక వికలాంగుల మృతి.. రాజస్థాన్ సర్కార్ కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ వసతి గృహంలో మానసిక వికలాంగుల మృతిపై నోటీసులు జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రకటించింది. కలుషిత నీరు తాగి ఏడుగురు చిన్నారులు సహా 11 మంది మృతి చెందిన విషయం విదితమే. జందోలిలోని ప్రభుత్వ మానసిక వికలాంగుల వసతిగృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

హైదరాబాద్ లో క్రౌన్ రెసిడెన్సీపై ముంబై ఏసీబీ దాడులు..

హైదరాబాద్ : ఎస్ఆర్‌నగర్‌లో క్రౌన్ రెసిడెన్సీపై ముంబై ఏసీబీ అధికారుల దాడులు చేశారు. ఈ దాడుల్లో ముంబైకి చెందిన కార్పొరేటర్ నుంచి రూ. 25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని థానే మున్పిపల్ కార్పొరేషన్ డిప్యూటి కమిషనర్ శివారెడ్డి తెలిపారు.

ఎపికి స్పెషల్ స్టేటస్ డౌటే..!

హైదరాబాద్ : ఎపికి స్పెషల్ స్టేటస్ లేనట్టే కనిపిస్తోంది. రాజ్యసభ సాక్షిగా కేంద్రప్రభుత్వం తేల్చింది. విశాఖ రైల్వే జోన్ కూడా రాదని స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటనతో టీడీపీ ఇరకాటంలో పడింది. టీడీపీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. బిజెపి, టిడిపి పొత్తు సందిగ్ధంలో పడింది. చంద్రబాబు కేంద్రంపై అసంతృప్త స్వరం పెంచింది. టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ వాగ్బాణాలు సందిస్తుంది. కాంగ్రెస్ లో ఖుషీ, తమ మంత్రాంగం ఫలించదన్న భావనతో ఉంది. వైసీపీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. విభజన హామీలపై పోరు తప్పని పరిస్థితి నెలకొంది. 

19:26 - April 29, 2016

హైదరాబాద్ : ఎపికి స్పెషల్ స్టేటస్ లేనట్టే కనిపిస్తోంది. రాజ్యసభ సాక్షిగా కేంద్రప్రభుత్వం తేల్చింది. విశాఖ రైల్వే జోన్ కూడా రాదని స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటనతో టీడీపీ ఇరకాటంలో పడింది. టీడీపీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. బిజెపి, టిడిపి పొత్తు సందిగ్ధంలో పడింది. చంద్రబాబు కేంద్రంపై అసంతృప్త స్వరం పెంచింది. టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ వాగ్బాణాలు సందిస్తుంది. కాంగ్రెస్ లో ఖుషీ, తమ మంత్రాంగం ఫలించదన్న భావనతో ఉంది. వైసీపీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. విభజన హామీలపై పోరు తప్పని పరిస్థితి నెలకొంది. 

 

19:17 - April 29, 2016

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 9వ సీజన్‌లో రైజింగ్‌ పూణే  జెయింట్స్ జట్టు అతి పెద్ద సవాల్‌కు సిద్ధమయ్యింది.వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుతో ధనా ధన్‌ ధోనీ నాయకత్వంలోని పూణే టీమ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో లయన్స్‌ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పూణే జట్టు పట్టుదలతో ఉంది. రాత్రి 8 గంటలకు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది....
ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 9వ సీజన్‌తో అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ధనా ధన్‌ ధోనీ నాయకత్వంలోని రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్ జట్టు... టేబుల్ టాపర్‌ గుజరాత్‌ యలన్స్ తో కీలక సమరానికి సన్నద్ధమైంది. లయన్స్ జట్టు బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ప్లే ఆఫ్‌ రేస్‌లో ముందు వరుసలో నిలవగా.... వరుస ఓటములతో ఢీలా పడ్డ జెయింట్స్‌ జట్టు సన్‌రైజర్స్‌ను ఓడించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లో పడింది. 
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన పూణే 
ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్ జట్టు...ఆ  తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. రహానే,ఫాఫ్‌ డు ప్లెసి, స్టీవ్‌ స్మిత్‌, ధోనీ, తిసెరా పెరీరా  వంటి పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన పూణే జట్టు......బౌలర్ల వైఫల్యంతో తొలి 5 మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయింది. 
పూణే జట్టు సునాయాస విజయం
హైదరాబాద్‌ జట్టుతో ముగిసిన మ్యాచ్‌లో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పూణే జట్టు సునాయాస విజయాన్ని నమోదు చేయగలిగింది. ఓపెనర్లు రహానే, డు ప్లెసి నిలకడగా రాణిస్తుండటంతో పాటు ...కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సైతం ఫామ్‌లోకి రావడంతో పూణే బ్యాటింగ్ లైనప్‌ బలోపేతమైంది. మిడిలార్డర్‌లో ధోనీ, లోయర్‌ ఆర్డర్‌లో తిసెరా పెరీరా వంటి హార్డ్ హిట్టర్లతో సమతూకంగా ఉన్న పూణే జట్టు...సమిష్టిగా రాణించి గుజరాత్‌ లయన్స్ ను ఓడించాలని పట్టుదలతో ఉంది. బౌలర్లు రాణించినా .....బ్యాట్స్ మెన్‌ భారీ స్కోర్లు నమోదుచేయలేకపోతే పూణే జట్టు కష్టాలు కొనసాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 
గుజరాత్ లయన్స్.. జోరు
సురేష్‌ రైనా నాయకత్వంలోని గుజరాత్ లయన్స్ జట్టు....ప్రస్తుతం జోరు మీదుంది. ఆరంభంలో హ్యాట్రిక్‌ విజయాలతో అందరినీ ఆశ్చర్యపరచిన లయన్స్‌ జట్టు  ...ఆ తర్వాత సన్‌రైజర్స్‌ ఇచ్చిన షాక్‌తో కాస్త తడబడింది. ఆ షాక్‌ నుంచి వెంటనే తేరుకున్న లయన్స్‌ టీమ్ ...వరుసగా బెంగళూర్‌ రాయల్‌ చాలెంజర్స్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్లను ఓడించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లో పడింది.
దుర్భేధ్యంగా లయన్స్ బ్యాటింగ్‌ ఆర్డర్‌
డ్వేన్‌ స్మిత్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌ భీకరమైన ఫామ్‌లో ఉండటంతో లయన్స్ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ దుర్భేధ్యంగా కనిపిస్తోంది. ప్రవీణ్‌ కుమార్‌, ధవళ్‌ కులకర్ణి వంటి పేస్‌ బౌలర్లతో పాటు....రవీందర్ జడేజా, డ్వేన్‌ బ్రావో, జేమ్స్‌ ఫాక్నర్‌ వంటి టాప్‌ క్లాస్‌ ఆల్‌రౌండర్లతో లయన్స్‌ టీమ్‌ అన్ని విభాగాల్లోనూ  పటిష్టంగా ఉంది. డ్వేన్‌ బ్రావో  డెత్‌ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ గుజరాత్‌ లయన్స్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో కెప్టెన్‌ సురేష్‌ రైనా స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే లయన్స్‌ జట్టుకు తిరుగుండదు. 
గుజరాత్‌ సునాయాస విజయం 
ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్లు పోటీపడిన తొలి రౌండ్‌ పోటీలో గుజరాత్‌ జట్టు పూణేపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. దీంతో రైజింగ్‌ పూణే జెయింట్స్ జట్టు ఈ పోటీలో నెగ్గి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో పూణే జట్టు ఓడితే ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి దాదాపుగా దూరమవుతుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సమరంలో ....ఆతిధ్య  రైజింగ్ జెయింట్స్‌ జట్టు, జోరు మీదున్న గుజరాత్‌ లయన్స్‌ జట్టుకు బ్రేక్‌ వేయగలదో లేదో చూడాలి. 

18:59 - April 29, 2016

చెన్నై : తమిళనాడులో అన్ని పార్టీలు మద్యనిషేధం గురించి హామీలిస్తున్నాయి. కానీ, ఈ నెల రోజుల్లోనే అక్కడ మద్యం అమ్మకాలు పెరగడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు లిక్కర్ చుట్టూ తిరుగుతున్నాయి.  పిఎంకె, డిఎంకె, ఏఐఏడిఎంకె  ఈ మూడు పార్టీలు మద్య నిషేధానికి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రాధాన్యతనిచ్చాయి. కానీ ఎన్నికల వేళ తమిళనాడులో మద్యం వ్యాపారం మూడు  సీసాలు ఆరు పెగ్గులు మాదిరిగా వర్ధిల్లుతోంది.  అటు మండుతున్న ఎండలు, ఇటు వేడెక్కుతున్న ప్రచారం  వెరసి తమిళనాడులో మద్యం అమ్మకాలు 20శాతం పెరిగాయి.  ఈ విషయాన్ని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించడం విశేషం.  తమిళనాడులో దాదాపు ఆరు వేల మద్యం దుకాణాలుండగా, 70 లక్షల మంది  మందుబాబులుంటారని అంచనా.   ఎన్నికల సమయంలో వీరంతా  ఏం చక్కా పండుగ చేస్కుంటున్నారు 

 

18:53 - April 29, 2016

హైదరాబాద్ : మెగా అభిమానులకు పండుగ మొదలైంది. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం కత్తిలాంటోడు మూవీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ పాల్గొని సందడి చేసింది. పరుచూరి వెంకటేశ్వరరావు చిరంజీవి నూతన చిత్రానికి క్లాప్‌ కొట్టారు. అల్లు అరవింద్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. చిరంజీవి 150వ చిత్రం కావడం, చాలా కాలం తరువాత ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మెగా అభిమానులు 'కత్తిలాంటోడు' కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

 

18:49 - April 29, 2016

ఫ్యాషన్ ప్రపంచంలో ని లేటెస్ట్ ట్రెండ్స్ ని ఎన్ని ఫాలో అయినా, స్పెషల్ అకేషన్స్ కి మాత్రం ఆడపిల్లలు లంగావోణికే  మొగ్గుచూపుతారు. అందుకే తెలుగు నేలపై లంగావోణీ ఎవర్ గ్రీన్ కాస్ట్యూమ్ గా ఉంటోంది. అలాంటి లంగాఓణీలతో  మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:47 - April 29, 2016

ఆడపిల్లలు అన్ని సందర్భాల్లో  జాగరూకతతో ఉండాల్సిన అవసరముంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా  ధైర్యంగా నిలబడే స్థైర్యం కావాలి. ఎప్పుడు ఎలాంటి దాడి జరిగినా ఎలా అలర్ట్ గా ఉండాలో చెప్తోంది ఇవాళ్టి నిర్భయ. 
ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

18:44 - April 29, 2016

దేవాలయాల్లో మహిళల ప్రవేశానికి వారి శారీరక ధర్మాలను కారణంగా చెప్పటాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగం ఇలాంటి అసమానతలను అనుమతిస్తుందా అంటూ ప్రశ్నించింది.

దేవాలయాలలో మహిళల ప్రవేశం కోసం పోరాటం జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో తొలిసారి ఒక మసీదులోకి మహిళలకు అనుమతి లభించింది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కేరళలోని మసీదులోకి పెద్ద ఎత్తున మహిళలు ప్రవేశిస్తున్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మహిళల్లో ఊబకాయం పెరుగుతున్నట్లు ఈ సర్వే తేల్చింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు నిధులను మంజూరు చేస్తూ ఖర్చులకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అమెరికా అధ్యక్షురాలి బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్ తాను అధికారంలోకి వస్తే మహిళలకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానంటోంది. మహిళల కోసం సాధ్యమైనన్ని చేస్తామని, చట్టాలు, నిబంధనల ద్వారా మహిళల హక్కులు కాపాడడానికి కృషి చేస్తానని హిల్లరీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తున్నారు. 

ముస్లిం సమాజంలో ప్రస్తుతం ఉన్న తలాక్ పద్ధతి కారణంగా అనేక మంది మహిళలు అన్యాయానికి గురవుతున్నట్లు అధ్యయనాలు తెల్పుతున్నాయి. ఈ పద్ధతిలో ఏకపక్ష నిర్ణయాలకే అవకాశం ఉందని ఇందులో మార్పు రావాలని ముస్లిం మహిళలు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని కుల్కచర్ల మండలం రాంపూర్‌ గ్రామం వద్ద పెళ్లి వాహనం ఢీకొన్ని ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే సోమారపు బాధ్యతలు స్వీకరణ...

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా రామగుండం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధత్యలు స్వీకరించిన సోమారపు ఎంజీబీఎస్ ఆధునీకరణ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. బస్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావుతో పాటు సోమారపు అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

పాలేరు ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల దాఖలు గడువు

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికకు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల దాఖల గడువు ముగిసింది. మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మే 2. మే 16న ఎన్నికలు, 19న కౌంటింగ్ జరగనుంది. టీఆర్‌ఎస్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ నుంచి సుచరితా రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ పోటీకి దూరంగా ఉన్నాయి.

కాకినాడలో అగ్నిప్రమాదం.. 100 పూరి గుడిసెలు దగ్ధం

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 100 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది. పూరి గుడిసెల బాధితులు బోరున విలపిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. 

సీపీఎం నేతపై కత్తితో దాడి...

ఖమ్మం : జిల్లాలోని పినపాక మండలంలో సీపీఎం నాయకుడిపై వలస ఆదివాసీలు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో వలస ఆదివాసీలకు నాయకుడు, సీపీఎం మండల కమిటీ సభ్యుడు మడివి రమేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఛత్తీస్‌గఢ్ నంచి వలసవచ్చిన ఆదివాసీలు మండలంలోని జానంపేట పంచాయతీ పరిధిలో సుందరయ్యనగర్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. ఇది పూర్తిగా వలసవచ్చిన ఆదివాసీల కాలనీ. వీరందరికీ మడివి రమేష్ పెద్దదిక్కువగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి గురువారం నలుగురు వ్యక్తులు రమేష్ దగ్గరకు వచ్చి తాము కూడా ఇక్కడే కూలీ పనులు చూసుకుని జీవిస్తామని చెప్పారు.

17:26 - April 29, 2016

హైదరాబాద్ : తనకు సీఎం కేసీఆర్‌ నుంచి ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర పరిధిలోని భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. రేవంత్‌ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారి చేసింది. తర్వాత విచారణను జూన్‌కు వాయిదా వేసింది. 

 

17:19 - April 29, 2016

ఢిల్లీ : కార్మికుల పోరాటం ఫలించింది. కార్మికులకు ఆందోళనలకు కేంద్ర సర్కాచ్ దిగివచ్చింది. పీఎఫ్ వడ్డీరేటు తగ్గింపు నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. వడ్డీరేటును 8.7 నుంచి 8.8కు పెంచుతూ జారీచేసింది. PFపై వడ్డీరేటును 8.7 శాతానికి తగ్గిస్తూ ఇటీవల ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇవాళ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. దీంతో దిగివచ్చిన ఆర్థిక శాఖ... వడ్డీరేటును 8.7శాతం నుంచి 8.8 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. 

 

పీఎఫ్ వడ్డీరేటుపై వెనక్కి తగ్గిన కేంద్రం

ఢిల్లీ : పీఎఫ్ వడ్డీరేటుపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. పీఎఫ్ వడ్డీరేటును 8.7 నుంచి 8.8 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వడ్డీరేటు తగ్గింపుపై కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. కార్మికుల ఆందోలనతో కేంద్రం వెక్కిన తగ్గింది. వడ్డీ రేటు పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

 

కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీ ఖరారు...

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీ ఖరారు అయింది. మే 2న ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 

16:59 - April 29, 2016

ముంబై : ఆదర్శ్‌ బిల్డింగ్‌ను కూల్చి వేయాలని బాంబే హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు పాటించలేదని కోర్టు మండి పడింది. ఆదర్శ్‌ స్కాంలో నేతలు, బడాబాబులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మాజీ సైనికుల కోసం ఆదర్శ భవన్‌ కేటాయించారు.

16:55 - April 29, 2016

మహబూబ్‌ నగర్‌ : సూపర్ స్టార్ మహేశ్ బాబు దత్తత తీసుకున్న మహబూబ్‌ నగర్‌ జిల్లా సిద్దాపూర్‌ గ్రామంలో ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సందడి చేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన మెడికల్‌ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామస్తులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్‌ క్యాంప్ నిర్వహిస్తామని.. స్థానిక సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మంత్రి కేటీఆర్‌తో కలిసి మహేశ్ బాబు గ్రామంలో పర్యటిస్తారని ప్రకటించారు.

 

16:49 - April 29, 2016

నెల్లూరు : ఆటోనగర్‌లోని వినాయక అట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు అస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. సూరి నాయుడు అనే వ్యక్తి గత పదేళ్ల నుంచి ఈ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. శుభకార్యం నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లాల్సి రావడంతో ఫ్యాక్టరీకి సెలవు ప్రకటించారు. ఇంతలో ఉదయం 11 గంటల సమయంలో ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడడంతో, స్థానికులు యజమానికి సమాచారం అందించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. 

 

16:45 - April 29, 2016

గుంటూరు : కరవును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమంలో సీఎం మట్లాడుతూ.. ప్రజల సొమ్ము దళారుల పాలు కాకుండా ప్రతి రూపాయినీ పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పారు. ఉజ్వల భవిష్యత్తుకు నదుల అనుసంధానమే మార్గమన్నారు. వాన నీటిని పరరిక్షించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. అందుకే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానిస్తూ.. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. దీంతోపాటే.. కురిసిన ప్రతి వర్షపు బొట్టును భూగర్భ జలంగా మలచుకోవాలని.. అందుకు ప్రజల సహకారం అవసరమనీ అన్నారు. 

 

అగ్రిగోల్డ్ బాధితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ఖర్చును ఆ సంస్థే భరించాలని హైకోర్టు ఆదేశించింది. వేలం ఖర్చు వివరాలను న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ కోర్టు ముందుంచింది. ఒక వేలానికి 45లక్షల రూపాయల ఖర్చు అవుతుందని కోర్టుకు తెలిపింది. ఈ వివరాలు చూసిన కోర్టు వేలం ఖర్చు మొత్తం అగ్రిగోల్డ్ సంస్థే భరించాలని ఆదేశించింది. వేలంలో అమ్ముడుపోని ఆస్తులకు ప్రత్యామ్నాయ ఆస్తులను చూపాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 17కు వాయిదా వేసింది.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌ వెబ్‌సైట్ హ్యాకింగ్‌ చేసిన బంగ్లా దేశీయులు

చిత్తూరు : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌ వెబ్‌సైట్ హ్యాకింగ్ గురైంది. కొంతమంది బంగ్లా దేశీయులు వెట్ సైట్ ను హ్యాకింగ్‌ చేశారు. తాము ముస్లీములమని.. తీవ్రవాదులం కాదంటూ హ్యాకర్లు పేర్కొన్నారు. 

16:25 - April 29, 2016

చిత్తూరు : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌ వెబ్‌సైట్ హ్యాకింగ్ గురైంది. కొంతమంది బంగ్లా దేశీయులు వెట్ సైట్ ను హ్యాకింగ్‌ చేశారు. తాము ముస్లీములమని.. తీవ్రవాదులం కాదంటూ హ్యాకర్లు పేర్కొన్నారు. 

 

ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలకు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్ : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సర్కార్‌ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తనిఖీలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.

 

16:09 - April 29, 2016

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందవద్దని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ సూచించారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. 

 

రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా సీఎం చర్యలు : వినోద్

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందవద్దని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ సూచించారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. 

 

15:54 - April 29, 2016

హైదరాబాద్ : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సర్కార్‌ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తనిఖీలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.

 

15:51 - April 29, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో స్వచ్ఛ ఆటో ట్రాలీల అదృశ్యంపై కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. లెక్కతేలని 100 ఆటోలను సాయంత్రంలోగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అదృశ్యమైన ఆటో ట్రాలీల యజమానులపై సాయంత్రంలోగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ఆటో ట్రాలీలను
భాగంగా పంపిణీ చేశారు. 

 

హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు చుక్కెదురు..

హైదరాబాద్ : హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు చుక్కెదురైంది. పోలీసుల తనిఖీలు చేయొద్దంటూ ప్రైవేట్ కాలేజీల పిటిషన్ వేశారు. విద్యాశాఖ ఆదేశాలతో ఒక ఎస్సై, కానిస్టేబుళ్లతో తనిఖీ చేయొచ్చని కోర్టు తెలిపింది. 

రియో ఒలింపిక్స్ గుడ్ విల్ అంబాసిడర్ గా అభినవ్ బింద్రా

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ గుడ్ విల్ అంబాసిడర్ గా అభినవ్ బింద్రా ఎంపికయ్యారు. రియో ఒలింపిక్స్ కు సల్మాన్ ఖాన్ తోపాటు బింద్రా గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. 

నీట్ పై తీర్పును వెనక్కితీసుకున్న సుప్రీంకోర్టు

ఢిల్లీ : నీట్ పై తీర్పును సుప్రీంకోర్టు వెనక్కితీసుకుంది. ఒకే విడతలో నీట్ పరీక్ష నిర్వహించాలన్న  కేంద్రం అభ్యర్థనను సుప్రీం త్రోసిపుచ్చింది. తొలి విడత ప్రవేశ పరీక్ష మే 1వ తేదీనే జరపాలని కోర్టు ఆదేశించింది. మొదట ఇచ్చిన ఆదేశాల ప్రకారమే 1న మొదటి దశ పరీక్ష, జులై 24న రెండో దశ పరీక్ష, ఆగస్టు 17న ఫలితాలు ప్రకటించనున్నారు.

పాలమూరును సస్యశ్యామలం చేస్తాం : మంత్రి హరీష్ రావు

మహబూబ్‌నగర్ : పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని గోపాల్‌పేట మండలం యెదులాపూర్‌లో బహిరంగసభ జరిగింది. సభకు మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు. పాలమూరు పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తుంటే ..టీ.కాంగ్రెస్ నేతలు నోరు మెదపటంలేదని  విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందో..అనుకూలిస్తుందో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ ఎంసెట్ ముగిసింది...

విజయవాడ : ఏపీ ఎంసెట్ పరీక్ష ముగిసింది. మ.2.30గంటలకు నుండి సా.5.30 వరకూ మెడిసిన్ పరీక్ష జరుగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమని ఇప్పటికే అధికారులు పలుమార్లు పేర్కొన్నారు. దీంతో సమయానికి ముందుగానే విద్యార్థులు, వారి బంధువులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. చెదురు మదురు ఘటనల మినహా ఏపీ ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది.

13:34 - April 29, 2016

హైదరాబాద్ : నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోంది. మీకు టిక్కెట్లకు ఇబ్బంది ఉండదు.. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ఎమ్మెల్సీ సంఖ్యను పెంచొచ్చు. ఇది అటు ఏపీ సీఎం చంద్రబాబు ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు.. పార్టీలో చేరుతున్న మిగతా నేతలకు చెబుతున్న మాట. మరి 2019 ఎన్నికల్లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిలిమిటేషన్ సాధ్యమేనా.. కేంద్రం మదిలో ఏముంది.. అనేప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం స్పష్టంగా పేర్కొన్నారు.. అయితే అది 2019 లోపే సాధ్యమా.. సాధ్యమేనంటూ ఇరు రాష్ట్రాల సీఎంలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఒక వేళ డిలిమిటేషన్ జరిగితే ఏపీలో ఇప్పుడున్న 175 స్థానాలు 225కు , అలాగే తెలంగాణలో ఇప్పుడున్న 119 స్థానాలు 153కు పెరుగుతాయనే ప్రచారం ఉంది. అయితే చట్టంలో ఉన్నంత మాత్రాన అది సాధ్యం కాదంటున్నాయి కేంద్ర వర్గాలు. 2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశమే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబుతోంది. అయితే దీనికి భిన్నంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రచారం చేయడంపై తీవ్ర చర్చ
జరుగుతోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా నియోజకవర్గాల పెంపుపై ప్రకటనలు చేయడంతో మరింతగా రక్తి కడుతోంది.

మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రవీంద్ర కుమార్ పాండే 2014 ఆగస్టు 11న ఇదే అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం లో భారత రాజ్యాంగంలోని 82, 170 అధికరణల ప్రకారం 2026 తరువాత తొలి జనాభా లెక్కలు ప్రచురించేంతవరకు పార్లమెంటు నియోజకవర్గాలు గానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ పునర్విభజన చేపట్టే అవకాశం లేదు.  నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని అప్పటి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టతనిచ్చారు. తాజాగా టీడీపీ లోక్‌సభ పక్షనేత తోట నర్సింహం, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డిలకు ఇచ్చిన సమాధానాల్లోనే ఈ విషయాన్ని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

పలు అనుమానాలు..
తాజాగా కేంద్రం ఇచ్చిన వివరణలో.. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సైతం ఇదే విషయాన్ని సభలో ప్రకటించారు.. 2026 తరువాత వచ్చే తొలి జనాభాలెక్కల ప్రచురణ వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం సైతం పునర్విభజనపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన జోలికి వెళ్లొద్దని హోం, న్యాయ శాఖలు ఈసీకి సూచించాయి. ఒకవేళ తమ అభిప్రాయాన్ని మార్చుకోదలిస్తే దీనికి రాజ్యాంగ సవరణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అటు హోం శాఖ ఇటు ఎన్నికల సంఘం అటు కేంద్ర న్యాయ శాఖ ఎవ్వరూ ఇది సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నా.. త్వరలోనే జరిగిపోతుందని కేంద్ర మంత్రి వెంకయ్య, ఇరు రాష్ట్రాల సీఎంలు పదే పదే ప్రస్తావించడం అనుమానాలకు దారి తీస్తోంది.

371 (డి) అమలులో వున్నా నీట్ రాయాల్సిందే : మంత్రి నడ్డా

హైదరాబాద్ : 371 (డి) అమలులో వున్నా ఏపీ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించాల్సిందేనని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. లోక్ సభలో ఎంపీ వినోద్ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు.

టీఎస్.ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు...

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఏర్పాటయ్యింది . జేఏసీ కన్వీనర్ గా రాజిరెడ్డి, జాయింట్ కన్వీనర్ గా వీఎస్ రావు నియమితులయ్యారు. ఆర్టీసీ లో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ... అద్దెబస్సులను వెంటనే రద్దు చేయాలని టీఎస్ ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.ప్రభుత్వ హామీలను అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. సమస్యలపై మే 5న అన్ని డిపోల ముందు ధర్నాలు నిర్వహించి మే 9న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపింది. యాజమాన్యం స్పందించకపోతే మే 16న సమ్మె నోటీసులు ఇస్తామని పేర్కొంది. 

13:19 - April 29, 2016

హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. వచ్చే నెల నుంచి అధికారులతో కలసి జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. లీటర్‌కు నాలుగు రూపాయల ఇన్సెంటివ్‌తో రాష్ట్రంలో పాల దిగుబడి పెరిగిందని దీనిని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

13:15 - April 29, 2016

ఢిల్లీ : వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ ఎయిర్స్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా స్పందించారు. బ్యాంకులతో సెటిల్‌మెంట్‌ చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు మాల్యా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు లండన్‌కు చెందిన ఓ పత్రిక ప్రచురించింది. బ్యాంకులతో తాను తరచూ చర్చలు జరుపుతున్నానని.. న్యాయమైన సెటిల్‌మెంట్లకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాస్‌పోర్టు రద్దు చేసి తనను అరెస్టు చేయడం వల్ల బకాయిలు వసూలు కావని చెప్పారు. తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశం విడిచి వెళ్లానన్నారు. ఇప్పట్లో తనకు ఇంగ్లాండ్‌ను వదిలి వచ్చే ఉద్దేశం లేదన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిజం కాదని మాల్యా పేర్కొన్నారు. అయితే మాల్యా ఇంటర్వ్యూపై మాట్లాండేందుకు యూబీ గ్రూప్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. విజయ్‌ మాల్యా ఎస్‌బిఐతో సహా 17 బ్యాంకులకు దాదాపు 9వేల 5 వందల కోట్ల రుణాలు ఎగవేసి దేశం విడిచివెళ్లిపోయారన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరిత నామినేషన్‌ దాఖలు

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రామిరెడ్డి సుచరితారెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చిన ఆమె ఖమ్మం గ్రామీణ తహశీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుచరితారెడ్డి మాట్లాడుతూ.. దివంగత మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రామిరెడ్డి గోపాల్‌రెడ్డి, నంద్యాల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ....

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. దగ్ధమైన దుకాణాలను శుక్రవారం ఉదయం ఏపీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారాయణ పరిశీలించారు. అగ్నిప్రమాదం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

13:10 - April 29, 2016

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణకు బొగ్గు కుంభకోణం వదలడం లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కాంలో దాసరిపై మరింత ఉచ్చు బిగిసింది. ఈ రోజు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్, మధుకోడాలపై ఛార్జీషీట్ నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అక్రమ మార్గాల్లో బొగ్గు కేటాయింపులు జరిపారంటూ ఆధారాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఛార్జీషీట్ నమోదు చేస్తే దాసరి నారాయణ రావుతో పాటు ఇతరులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలోనే దీనిపై దాసరి స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఛార్జీషీట్ పై దాసరి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

ఈడీ దెబ్బకు దిగివచ్చిన మాల్యా...

ఢిల్లీ : బ్యాంకులతో బకాయిలు సెటిల్ చేసుకోవటానికి తాను సిద్దంగా వున్నాని ఆయన తెలిపారు. కాకపోతే మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి తనకు లేదనీ..కొంత వరకూ చెల్లిస్తానని ఆయన వెల్లడించారు. తన పాస్ పోర్ట్ రద్దు చేయటం వలన బకాయిలు వసూలు కావనీ... తప్పనిసరి పరిస్థితుల్లోనే విదేశాలకు వెళ్లాల్సివచ్చిందని ఆయన తెలిపారు. ఇంగ్లండ్ వదిలి తాను ఎక్కడి వెళ్ళబోవటం లేదని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకుల నుండి వేలాది కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని విదేశాలకు చెక్కేసిన విషయం తెలిసిందే.

గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం...

హైదరాబాద్: గుజరాత్ లో ఆనందీ బెన్ పటేల్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు అంటే నాన్ రిజర్వుడ్ కులాలు చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. గుజరాత్ దివస్ ను పుసర్కరించుకుని మే 1 నుంచి కొత్త రిజర్వేషన్ అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

100 స్వచ్ఛ ఆటో ట్రాలీలు మిస్ ....

హైదరాబాద్: జీహెచ్ ఎంసీలో స్వచ్ఛ ఆటో ట్రాలీలు మిస్ అయ్యాయి. దీనిపై కమిషనర్ జనార్థన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లెక్క తేలని 100 ఆటోలను సాయంత్రంలోగా గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆటో ట్రాలీల యజమానులపై సాయంత్రంలోగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. 

ఎంపీ గల్లా జయదేవ్ కు తప్పిన ప్రమాదం...

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. దీంతో ఆయనకు స్పల్ప గాయాలైనట్టు సమాచారం. గుంటూరు లో ఓ హోటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.

ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం...

నెల్లూరు: వరుస అగ్నిప్రమాదాలతో ఏపీ రాష్ట్రం అట్టుడికిపోతోంది. మొన్న దువ్వాడ సెజ్, నేడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, గుంటూరులో పరుపున ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ప్రజాలకు ఎటువంటి ప్రాణనష్టం లేకపోవటం సంతోషించదగినదే. కానీ కోట్లది రూపాయలు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నాయి. తాజాగా నెల్లూరులోని ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అట్టల ఫ్యాక్టరీలో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భద్రత సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేయటంతో ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని...

సోనియాను అరెస్టు చేయండి చూద్దాం - కేజ్రీ..

ఢిల్లీ : ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీ నేతలను దమ్ముంటే అరెస్టు చేయాలని సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ కేసులో తాను నిందితుడిగా ఉంటే ఇప్పటికే అరెస్టు అయి ఉండేవాడినని, సోనియాను మాత్రం టచ్ చేయడానికి బీజేపీ సర్కార్ జంకుతోందని పేర్కొన్నారు. 

12:24 - April 29, 2016

విజయనగరం : సెలయేటి జలధారల నడుమ జీవించే గిరిజనం సైతం.. వేసవి తాపానికి తల్లడిల్లుతోంది. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరక్క కుదేలవుతోంది. విజయనగరం జిల్లాలోని ఓ కుగ్రామం అయితే కేవలం ఊట నీటితోనే కాలం వెళ్లదీస్తోంది. ఎక్కడో కొండల్లో పారే నీటిని వెదురు బొంగుల ద్వారా గ్రామంలోకి మళ్లించి.. వాటినే తాగునీరుగా ఉపయోగిస్తోంది. కొండకోనల నడుమ.. సెలయేటి జలపాతపు సవ్వడుల నడుమ..చల్లని పిల్ల తెమ్మరల హోరుకు...హొయలు పోయే ప్రకృతి శోభలు.. ఈ వర్ణనలు వినగానే ఎవరికైనా ఏజెన్సీ ప్రాంతాలే గుర్తుకొస్తాయి. గిరిజనుల జీవితం పచ్చని ప్రకృతితో మమేకం. అక్కడి జలపాతపు ధారలే... గిరిజనులకు ప్రాణాధారం. కానీ ఇప్పుడా పరిస్థితి కనుమరుగవుతోంది. కొండ కోనల జీవితాల్లోనూ కరవు చిచ్చు పెడుతోంది. వేసవి తాపానికి గిరిజన ప్రాంతాలు మంచినీరు లభించక కుదేలవుతున్నాయి.

కష్టాలకు నిలువెత్తు నిదర్శనంగా పీరుంగూడ....
విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల తాగునీటి కష్టాలకు నిలువెత్తు నిదర్శనమిది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని పీరుంగూడ వాసులు గొంతు తడుపు కొనేందుకు గుక్కెడు మంచినీళ్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు వీరికి తాగునీటి ఇబ్బందులు మొదలవుతాయి. కొండల ప్రాంతం కావడంతో తమకు నీళ్లిచ్చే ఏర్పాట్లూ ప్రభుత్వం చేయడం లేదంటూ గిరిపుత్రులు వాపోతున్నారు. మైదాన ప్రాంతానికి చాలా దూరంగా విసిరేసినట్టుండే పీరుంగూడ గ్రామంలో వేసవికాలం వచ్చిందంటే చాలు.. తాగునీటి కష్టాలు మొదలవుతాయి. గుక్కెడు మంచినీరు కూడా లేక.. కొండకోనల్లో ప్రవహించే వాగులు, వంకలపైనే వారు ఆధారపడుతున్నారు. కొండకోనల్లో నుంచి వచ్చే ఊట నీరే గిరిజనులకు ఆధారంగా నిలుస్తోంది. అయితే సుదూర ప్రాంతంలోని ఈ ఊట నీటిని తెచ్చుకోవడం కష్టం కావడంతో.. గిరిజనులు సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. ఊట నీటిని తమ గూడేనికి తీసుకొచ్చిన వీరి నైపుణ్యం.. ఇంజనీర్లను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

గిరిజనుల వినూత్న యత్నం....
ఎంతో చక్కని నైపుణ్యంతో వెదురు బొగుల ద్వారా నీటిని గ్రామంలోకి మళ్లించారు గిరిజనులు. ఈ వెదురు బొంగుల ద్వారా వచ్చిన నీటినే.. పీరుంగూడ వాసులు తాగుతున్నారు. అయితే ఈ జలం సురక్షితం కాకపోవడంతో.. ప్రజలు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. వేసవి కాలం కావడంతో ఆ ఊటనీటికి కూడా ఇపుడు కరవు ఏర్పడింది. దాంతో వాగులు, వంకల్లో ప్రవహించే పాయల నీటినేతోనే అవసరాలు తీర్చుకుంటున్నారు గిరిజనులు. సమీపంలో చెలమలు ఎండిపోవడంతో కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఊట నీరు పడే చోట కనీసం ఓ కుండీ కూడా లేదు. అక్కడో సిమెంట్‌ ట్యాంక్‌ నిర్మించి, దాన్ని శుద్ధిపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. అధికారులు మంచినీటి ట్యాంక్‌ నిర్మించి ఆదుకోవాలని కొండప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొండలు, రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్లి నీరు తెచ్చుకునే దుస్థితిని తప్పించాలంటూ గిరిజనం చేస్తున్న విజ్ఞప్తి.. పాలకుల చెవికెక్కుతుందో లేదో వేచి చూడాలి. 

12:18 - April 29, 2016

గుజరాత్ : పటేళ్ల ఉద్యమానికి సర్కార్ దిగొచ్చింది. గత కొంతకాలంగా పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి హార్థిక్ పటేల్ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు..తనదైన శైలిలో ఆందోళనలు చేస్తుండడంతో ప్రభుత్వం ఇరకాటలో పడిపోయింది. గుజరాత్ రాష్ట్రం ప్రతిష్టాత్మకం కావడంతో కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యూహాత్మకంగా శుక్రవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి 10 శాతం రిజర్వేషన్ కు నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తించనుంది.
పటేళ్ల ఉద్యమం కొన్ని సందర్భాల్లో తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ ను అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఇతడిని విడుదల చేయాలంటూ తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పటేళ్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

12:11 - April 29, 2016

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై కేంద్రం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోర్టును అటార్నీ జనరల్‌ కోరారు. ఇప్పటికిప్పుడు పరీక్షను హిందీ, ఇంగ్లీషులో రాయడం కష్టమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని మెడికల్ కళాశాల్లో ఎంబీడీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో నీట్ ద్వారానే ఇంకనుండి ప్రవేశాలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ఇండియా, సీబీఎస్ఈలు మే 1న జరిగే పరీక్షను తొలిదశగా పరిగణించాలని, జులై 24న రెండోదశ ఎగ్జామ్ నిర్వహించాలని కోర్టు తెలిపింది. ఆగస్ట్ 17 లోగా నీట్ ఫలితాలు వెల్లడించాలని, సెప్టెంబర్ 30 కల్లా కౌన్సిలింగ్ పూర్తి చేయాలని పేర్కొంది. ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోగా...అంటే అక్టోబర్ 1 నుండి తరగతులు ప్రారంభం కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు, యూపీతోపాటు కర్ణాటక మెడికల్ కళాశాల అసోసియేషన్లు 2013 కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా 400ల మెడికల్ కాలేజీల్లో 52 వేల సీట్లకు ప్రతీ ఏడాది వేర్వేరు పద్ధతుల్లో ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతున్నాయి.

పటేళ్లకు రిజర్వేషన్లు..

గుజరాత్ : పటేళ్ల ఉద్యమంతో గుజరాత్ సర్కార్ దిగొచ్చింది. మే 1 నుండి 10 శాతం రిజర్వేషన్ కు నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తించనుంది. 

12:07 - April 29, 2016

కాకినాడ : కోటి కాదు.. రెండు కోట్లు కాదు..కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి..తనిఖీలు చేస్తున్నకొద్దీ విలువైన ఆస్తులను చూసి అధికారులే నివ్వెరపోయారు...ఇది తూర్పోగోదావరి జిల్లాలోని రవాణా అధికారి అవినీతి భాగోతం... ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగితే తొమ్మిది చోట్ల ఆస్తులున్నట్లు తేలింది..ఇప్పటివరకు 80 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీకి తవ్వినా కొద్ది వందలకోట్ల ఆక్రమాస్తులు బయటపడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ కమిషనర్ ఎ.మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తడంతో కాకినాడ గైగోలపాడులోని ఆయన నివాసంతోపాటు తొమ్మిదిచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

అక్రమాస్తులు..
తనిఖీలు చేసిన కొద్దీ బయటపడ్డ ఆస్తులే గాకుండా ఇంకా ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఏకకాలంలో దాడులు చేయడంతో డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇవిగాక చిత్తూరు, నెల్లూరుల్లో ఇంకా భూములున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీటితోపాటు భారీగా బంగారు, వెండి సామగ్రిని కూడా ఈ తనిఖీల్లో గుర్తించారు. కీలక దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీటీసీ ఆస్తుల విలువ సుమారు రూ. 70 నుంచి 80 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు...అయితే పూర్తి స్థాయిలో గుర్తించాకే లెక్కలేస్తామంటున్నారు ఏసీబీ అధికారులు.

బొగ్గు స్కాంపై ఛార్జీ షీట్ నమోదు చేయాలన్న సీబీఐ కోర్టు..

ఢిల్లీ : బొగ్గు స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావు, మధుకోడాలపై ఛార్జీషీట్ నమోదు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

11:49 - April 29, 2016

హైదరాబాద్ : ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ఇవాళ, రేపు తెలుగురాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. విదర్భ నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణీ ప్రభావంతో తెలంగాణ, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడంతో వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

11:42 - April 29, 2016

హైదరాబాద్ : ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనేమో..తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆవేదనకు పరిష్కారం చూపకుండా కొత్త ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవును నివారించటానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పత్తిపంట వేయటం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కొత్త భాష్యం చెప్పారు. ఆయన ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని సూచించారు. పత్తిపంటకు బదులుగా వేరే పంటలు వేసుకుంటే రైతులు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని సలహా ఇచ్చారు. పత్తిపంట వలన పెట్టుబడులు ఎక్కువై ఆదాయం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ అందుకని వేరే పంటలు వేసుకుంటే రైతులకు ఎలాంటి సమస్యలు వుండవనీ ఆయన సూచనలిచ్చారు. పత్తి పంటకు బదులు ప్రత్యమ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. పత్తి పంట వేసి అనవసరంగా అప్పుల పాలవద్దని కోరారు. కేంద్రం పత్తి ఎగుమతలపై సుంకం పెంచడంతో పత్తి రేటు పడిపోయిందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని తెలిపారు. మంత్రిగారి సూచనలు పాటిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయో ? ఎక్కువ ఆదాయం పొందుతారో వేచి చూడాల్సిందే. 

11:33 - April 29, 2016

అనంతపురం : ఏపీలో నియంతృత్వ రాజ్యం నడుస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. పరిగిలోని రావతార్ మసాలా ఫ్యాక్టరీలో 182 మంది కార్మికులను విధుల నుండి తొలగించిన నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. 10 టీవీతో ఆయన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వం కంటే హీన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 144 సెక్షన్ విధించటన్ని తప్పుపట్టారు. పార్థసారధి అనే ఎమ్మెల్యే ఫాక్టరీ యాజమాన్యానికి మద్దతు పలుకుతున్నారని, ఆయన అండతోనే యాజమాన్యం చెలరేగిపోతోతందని విమర్శించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని గఫూర్ స్పష్టం చేశారు. 

11:26 - April 29, 2016

విజయవాడ : 'ప్లీజ్‌ సార్‌.. దయచేసి అనుమతించండి. దండం పెడతాను. ఈ పరీక్ష కోసం రెండేండ్లుగా కష్టపడుతున్నా. ఇంటి నుంచి రెండు గంటల ముందే బయలుదేరా. ట్రాఫిక్‌ సమస్య వల్ల రావడానికి ఆలస్యమైంది. కష్టపడి చదివాను సార్‌.. పరీక్ష రానివ్వండి.' ఇలా ప్రతీ సంవత్సరం ఎంసెట్‌ పరీక్షా కేంద్రాల విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్న దృశ్యాలు కనపడుతుంటాయి. సమయం మించిపోతుందన్న భయంతో ఎంతోమంది విద్యార్థులు ఉరుకులు, పరుగుల మీద ఎంసెట్‌ కేంద్రాల వద్దకు చేరుకుంటారు. ఇలాంటి ఘటనే మరోసారి పునరావృతమైంది. ఏపీలో శుక్రవారం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఒక్క నిమిషం ఆలస్యమయితే లోనికి అనుమతించమని అధికారులు హెచ్చరించారు. కానీ ఇద్దరు విద్యార్థులు సమయానికి కేంద్రం వద్దకు చేరుకోలేకపోయారు. వీరిని అధికారులు లోనికి అనుమతించలేదు. దూర ప్రాంతం నుండి రావటంతో ఆలస్యం వచ్చినందుకు తమను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైందని తెలిపారు. ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు తీవ్ర వత్తిడికి లోనవుతున్నారనీ....ఈ నిబంధన ఎత్తివేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

నీట్ పై సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం..

ఢిల్లీ : నీట్ పై మరోసారి సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది. ఇప్పటికప్పుడు పరీక్షను హిందీ, ఇంగ్లీషులో రాయడం కష్టమని ఏజీ పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని అటార్నీ జనరల్ కోరారు. కేంద్ర పిటిషన్ పై మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ జరగనుంది. 

జూరాల విద్యుత్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

మహూబూబ్ నగర్ : జూరాల విద్యుత్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీమాంధ్ర ఇంజనీర్లను లోపలికి వెళ్లనీయకుండా తెలంగాణ ఇంజనీర్లు అడ్డుకున్నారు. 

పాలేరులో గెలుపు తథ్యం - కడియం..

ఖమ్మం : పాలేరులో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని డిప్యూటి సీఎం కడియం జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. తుమ్మలను అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్, టిడిపి, వైసీపీ పొత్తు దివాళాకోరుతనమన్నారు. పాలేరులో ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్షాలు చీకటి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. 

కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి..

మహబూబ్ నగర్ : ఆర్టీసీ బస్టాండులో కొత్త బస్సులను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అన్ని జిల్లాలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో రవాణా శాఖకు కొత్త కార్యాలయం ఏర్పాటు..అన్ని డిపోలను ఆధునీకరిస్తామన్నారు. రూ. 50 కోట్లతో కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరుగుతోందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. 

11:00 - April 29, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాసేపట్లో శంకుస్థాపన జరుగనుంది. నార్లాపూర్‌ వద్ద ప్రాజెక్టుకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఖరారు చేశారు. దీనిలో భాగంగా ఆరు ప్యాకేజీ పనులకు నార్లపూర్‌లో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని టీ సర్కార్ చేపట్టింది. రెండున్నరేళ్లలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

10:47 - April 29, 2016

అనంతపురం : జిల్లా పరిగి మండలం ఎస్ఏ రావ్ తార్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల తొలగింపుపై సీపీఎం ఆందోళన చేపట్టింది. గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరికి సంఘీభావంగా సీపీఎం ఆందోళన చేపట్టింది. అందులో భాగంగా నేడు పరిగిలో వామపక్షాలు బహిరంగకు పిలుపునిచ్చాయి. ఈ సభకు సీపీఎం శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు తరలివెళుతున్నారు. వీరిని పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుఉన్నారు. పోలీసుల వైఖరిపై సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ప్రశ్నించింది.

ఏమి జరిగింది. ? 
ఎస్‌ఏ రావతార్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన పరిశ్రమ యజమాన్యం 183 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీనికి నిరసనగా గత కొంతకాలంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పోరాటం చేస్తున్నా కార్మికులను విధుల్లోకి తీసుకోలేదు. ఈ విషయమై సిఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు సిఐటియు నాయకులు, పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని అక్కడున్న పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడికి యత్నించారు. ఈ దాడిని సీపీఎం, పలు ప్రజా సంఘాలు ఖండించాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనతో ప్రభుత్వం, యాజమాన్యం దిగొస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

10:45 - April 29, 2016

అనంతపురం : మసాలా ఫ్యాక్టరీ నుండి తొలగించిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు నగరానికి వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మధుతో పాటు జిల్లా సీపీఎం కార్యదర్శి రాంభూపాల్, న్యూ డెమోక్రసీ నేత ప్రభాకర్ ను కూడా అరెస్ట్ చేసి త్రీటౌన్ పీఎస్ కు తరలించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద, తహశీల్దార్ వద్ద వామపక్ష కార్యకర్తలు ఆందోళనా కార్యక్రమాలను చేపట్టారు. కేవలం తాము కార్మిక కుటుంబాలను పరామర్శింటానికి మాత్రమే వచ్చామని చెప్పినా అరెస్ట్ చేయటంపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మధు మాట్లాడుతూ.. టీడీపీ నిరంకుశ పరిపాలన సాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. అన్ని వామపక్ష పార్టీలను కలుపుకుని ఆందోళనలను చేపడతామని తెలిపారు.

బాబు నీతులు చెప్పడానికే..
సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ టెన్ టివితో మాట్లాడుతూ..చంద్రబాబు నీతులు చెప్పటానికే తప్ప ఆచరణలో ఏమాత్రం చూపించటంలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. విపక్షాలు సభలు పెట్టుకోవటానికి కూడా అనుమతించకుండా అరెస్ట్ లకు పాల్పడటం సరిరైందకాదని ఆయన పేర్కొన్నారు. కేవలం యూనియన్ ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణతో కార్మికులను విధులనుండి బహిష్కరించారనీ..కార్మికులకు మద్ధతు తెలిపిన వారిపై నిరంకుశ చర్యలకు పాల్పడటం పట్ల చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన పేర్కొన్నారు.

10:29 - April 29, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 1గంటల వరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ సెట్‌ కోడ్ జీ-2 ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. కాకినాడలో నిర్వహించిన సెట్ కోడ్‌ ఎంపిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి కామినేని శ్రీనివాస్, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో 2,92,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మెడిసిన్‌ పరీక్ష జరుగుతుంది. ఎగ్జామ్ సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రశాంత వాతావరణం మధ్య ఏపీలో ఎంసెట్ పరీక్ష జరుగుతోంది.

విశాఖలో..
ఎంసెట్ పరీక్షా కేంద్రానికి విద్యార్థులతో పాటు వారి బంధువులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. విశాఖలో దాదాపు 45 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖలోని లంకపల్లి పుల్లయ్య కళాశాలలో పరీక్షా కేంద్రం వద్ద చేరుకున్న విద్యార్థులు..వారి తల్లిదండ్రులతో టెన్ టివి ముచ్చటించింది. అధికారులు బాగా చేశారని విద్యార్థుల కుటుంబసభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాకపోతే విశాఖలో ట్రాఫిక్ సమస్యతో కొంత ఇబ్బంది వుందని వారు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రత కారణంగా అనారోగ్యంతో వున్నవారు కొద్దిపాటి ఇబ్బందులకు లోనవుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే ప్రశాంతంగా జరుగుతున్నాయి. నిమిషం ఆలస్యం నిబంధనను సడలిస్తే బాగుంటుందని ఇరు రాష్ట్రాల విద్యార్థుల బంధువులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ లో..
ఏపీ ఎంసెట్‌ కోసం తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌కు 26 సెంటర్లు, మెడికల్‌కు 26 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎంసెట్ లో కాపీకి పాల్పడితే ఆ విద్యార్థిని మరు సంవత్సరం కూడా పరీక్షకు అనుమతించకుండా వుండేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

మంత్రి కుమార్తె వివాహం కోసం భారీగా నీళ్ల దుర్వినియోగం..

ఛత్తీస్ గఢ్ : దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నా పలువురు ప్రముఖులు పట్టించుకోవడం లేదు. భారీ ఎత్తున్న నీటిని ప్రముఖులు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గఢ్ మంత్రి కుమార్తె వివాహం కోసం ఫంక్షన్ హాల్ వద్ద భూమిని చదును చేసేందుకు భారీ ఎత్తున నీటిని వినియోగించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

గిరిజన మహిళను కిడ్నాప్ చేసిన మావోలు..

ఖమ్మం : చర్ల మండలం సమీపంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళలను గురువారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా అనుమానించి మహిళను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అయితే మావోల వద్ద నుండి ఎటువంటి డిమాండ్లు రాలేదు.

ఏపీలో ప్రారంభమైన ఎంసెట్..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో 2,92,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్‌ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మెడిసిన్‌ పరీక్ష జరుగుతుంది. 

ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్టు..

అనంతపురం : పరిగిలో వామపక్షాల బహిరంగ సభకు వెళుతున్న ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధును తరలిస్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

పాలమూరు ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరణ..

మహూబ్ నగర్ : పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 

09:39 - April 29, 2016

అనంతపురం : పరిగిలో నేడు వామపక్షాలు బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఓ మసాలా ఫ్యాక్టరీలో తొలగింపునకు గురైన 182 మంది కార్మికుల కుటుంబాలను మధు పరామర్శించనున్నారు. మరోవైపు బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వామపక్ష నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

09:33 - April 29, 2016

గుంటూరు : వేసవిలో భానుడి ప్రతాపానికి తోడు ఏపీలో అగ్నిప్రమాదాలు వరుసగా క్రమంలో జరుగుతున్నాయి. మంగళవారం దువ్వాడ సెజ్ ఘటన మరువకముందే గురువారం రాత్రి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మరో ప్రమాదం సంభవించింది. కాగా ఇదేరోజు మంగళగిరి మండలం ఎర్రబాలెంలో అగ్నిప్రమదం సంభవించింది. పరుపుల ఫ్యాక్టరీలో సంభవించిన ఈ ఘటనలో దాదాపు కోటి ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేసవిలో ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఇప్పటికే వాతావరణ శాక పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

09:27 - April 29, 2016

కాకినాడ : చేసేది ప్రభుత్వ ఉద్యోగం..ప్రభుత్వ వేతనం అందుకుంటున్నా కొందరిలో డబ్బు అత్యాశ పెరిగిపోతోంది. చేతివాటం ప్రదర్శిస్తూ లక్షలు..కోట్లు రూపాయలు వెనుకేసుకొంటున్నారు. అవినీతి జలగలపై ఏసీబీ కొరడా ఝులిపిస్తోంది. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. తనిఖీల్లో కోట్ల రూపాయల ఆస్తులు వెలుగు చూస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ డిప్యూటి కమిషనర్ ఆదిమూల మోహన్ ఇంటిపై ఏసీబీ గురువారం దాడులు నిర్వహించింది. ఏకకాలంలో 9 చోట్ల దాడులు చేసిన అధికారులు ఈ రోజు కూడా తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంట్లో విలువైన ఆస్తుల పత్రాలు, పలు దస్తావేజులు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 80 కోట్లు ఉంటుందని అంచనా. మోహన్ ను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది.

09:25 - April 29, 2016

విజయవాడ : ఏపీలో కాసేపట్లో ఎంసెట్ పరీక్ష జరగబోతోంది. నిమిషం ఆలస్యమయినా పరీక్షకు అనుమతించమన్న నిబంధన కారణంగా విద్యార్థులు సమయానికి ముందే పరీక్ష సెంటర్ల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌర్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని ఎస్సై కాళిదాసు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రానికి రావటానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రత్యేక వాహనాల ద్వారా పరీక్ష కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేపట్టామని ఆయన తెలిపారు.

తెలంగాణలో..
ఏపీ ఎంసెట్‌ కోసం తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌కు 26 సెంటర్లు, మెడికల్‌కు 26 సెంటర్లను ఏర్పాటు చేశారు. మెహిదీపట్నం సెంట్ఆన్స్ ఎంసెట్ పరీక్షా కేంద్రం వద్ద సెల్ ఫోన్లు పనిచేయకుండా జామర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కనీసం రిస్ట్ వాచ్ ను కూడా అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించడలేదు. ఎటువంటి మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని అధికారులు చెబుతుండగా దూరప్రాంతం నుండి వచ్చిన వారికి ఎటువంటి సౌకర్యాలు సమకూర్చలేదని విద్యార్థుల బంధువులు పేర్కొనటం విశేషం.

09:02 - April 29, 2016

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ దీక్ష చేపట్టారు. దేశద్రోహం, జాతీ వ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలతో కన్హయ్య కుమార్ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కన్హయ్య కుమార్ తో పాటు మరో 14 మంది విద్యార్థులపై జేఎన్ యూ యాజమాన్యం చర్యలు తీసుకుంది. కన్హయ్య కుమార్ కు రూ.10వేల జరిమానా, ఉమర్ ఖలీద్ అనే విద్యార్థి సంఘం నేతకు ఒక సెమిస్టర్ కాలంపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కన్హయ్య ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కన్హయ్యకు మద్దతుగా మరో 19 మంది విద్యార్థులు నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్ష బుధవారం నుండి హాస్టల్ లో జరుగుతోంది. అయినా యాజమాన్యం ఈ విషయంపై పట్టించుకోలేవటంలేదు. పరీక్షలు సమయం వున్నాకూడా దీక్షను కొనసాగిస్తామని కన్హయ్య బృందం తెలిపింది. కొంతమంది రాజకీయ నాయకులు కన్హయ్యపై తీసుకున్న చర్యల్ని ఖండిస్తున్నారు. ఈ అంశంపై వామపక్షాలు పార్లమెంట్ లో ప్రస్తావించే అవకాశమున్నట్లు సమాచారం.

08:52 - April 29, 2016

చిత్తూరు : ఏపీలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ సెజ్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరువకముందే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేవాలయ ప్రాంతంలో ఉన్న దుకాణాలలో గురువారం రాత్రి సంభవించిన ఈ ప్రమాదంలో దాదాపు 30 దుకాణాలు పూర్తిగా దగ్థమయ్యాయి. దాదాపు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచానా వేస్తున్నారు. దాదాపు మూడు గంటలపాటు నింగికెగసిన అగ్ని కీలల్ని మూడు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తెచ్చారు.
కాగా ప్రమాదం జరగటానికి కారణాలపై పలు అనుమానాలు చోటుచేసుకున్నాయి. ఓ షాపులో వున్న గ్యాస్ సిలిండర్ పేలటంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో షాపులను నష్టపోయిన యజమానులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. దుకాణాల అమ్మకాలతోనే తమ జీవనాధారం ముడిపడి వుందనీ ఈ ప్రమాదంతో తమ ఉపాధి కోల్పోయిందనీ వారు విలపిస్తున్నారు. దీని సమగ్రంగా విచారించేందుకు పోలీసు యాంత్రాంగం సిద్ధమవుతోంది.

08:41 - April 29, 2016

విజయవాడ : నేడు ఏపీలో ఎంసెట్‌ పరీక్ష జరుగుతోంది. ఇంజినీరింగ్ సెట్‌ కోడ్ జీ-2 ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. కాకినాడలో నిర్వహించిన సెట్ కోడ్‌ ఎంపిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి కామినేని శ్రీనివాస్, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో 2,92,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్‌ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మెడిసిన్‌ పరీక్ష జరుగుతుంది. ఇక ఏపీ ఎంసెట్‌ కోసం తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌కు 26 సెంటర్లు, మెడికల్‌కు 26 సెంటర్లను ఏర్పాటుచేశారు. అయితే నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్ష జరుగనుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ అనే అంశం ప్రతీ సంవత్సరం వలనే ఈ ఏడాది కూడా ఈ నిబంధన కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు ఉరుకులు పరుగులతో పరీక్షా సెంటర్లకు చేరుకుంటున్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 355 సెంటర్లు, మెడికల్‌కు 191 సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

కుప్వారలో ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులపై భారత భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. ఉగ్రవాదులు ఎంత మంది ఉంటారనే దానిపై బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. కుప్వార జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

బాధ్యతలు స్వీకరించిన జూపల్లి..

హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రి వర్గంలో పరిశ్రమలు, చేనేత, చక్కెర, జౌళి శాఖల మంత్రిగా జూపల్లి పని చేశారు. ఈ నెల 25న మంత్రి వర్గంలోని పలువురు మంత్రులకు శాఖల మార్పు జరిగిన విషయం విధితమే. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా జూపల్లిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

ఆరుగురు చిన్నారుల సజీదహనం.

ఉత్తర్ ప్రదేశ్ : బారెల్లి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కిలా చావనిలోని ఓ ఇంట్లో క్యాండిల్ పడిపోవడంతో ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. 

బయో మ్యాక్స్ లో ఆగిన మంటలు..

విశాఖపట్టణం : బయో మ్యాక్స్ లో మంటలను ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. 54 గంటల పాటు శ్రమించారు. మంగళవారం రాత్రి కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

దువ్వాడ సెజ్ లో అదుపులోకి వచ్చిన మంటలు...

విశాఖ : దువ్వాడ సెజ్ లోని బయోమ్యాక్ప్ కంపెనీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో సంభవించిన ఈ ఘటనలో మంటలను అదుపు చేసేందుకు ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు భారత నావికా దళం రంగంలోకి దిగినా ఫలితం కనిపించలేదు. దాదాపుగా 54 గంటల పాటు కొనసాగిన సహాయక చర్యలతో నేటి తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో ఇటు అధికారులతో పాటు అటు దువ్వాడ పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనలో దాదాపు రూ.200 కోట్ల నష్ట వాటిల్లినట్లు సమాచారం.

లారీ-బైక్ ఢీ..ఇద్దరు మృతి....

ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్యలు పాటించకపోవటం ఒక కారణమయితే... డ్రైవర్ల నిర్లక్ష్యంతో కొన్ని జరుగుతున్నాయి. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈరోజు ఖమ్మం బైపాస్‌పై రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నేటి నుండి జేఈఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్..

హైదరాబాద్ : జేఈఈ మెయిన్ లో ఉత్తీర్ణులై అడ్వాన్స్ డ్ పరీక్షకు అర్హత సాధించిన వారు శుక్రవారం నుండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈనెల 29వ తేదీ ఉదయం 10 నుండి మే 4వ తేదీన సాయంత్రం 5గంటల వరకు పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 

తెలంగాణకు నేడు వర్ష సూచన..

హైదరాబాద్ : తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుండి మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం వల్ల వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. 

07:33 - April 29, 2016

తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతో అందరికీ సుపరిచితురాలైన అమలాపాల్‌ తాజాగా కన్నడ చిత్ర సీమలోకి కూడా అడుగిడుతోంది. 'హెబ్బులి' పేరుతో రూపొందనున్న కన్నడ చిత్రంలో సుదీప్‌ సరసన నటించేందుకు అమలాపాల్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమలాపాల్‌ స్పందిస్తూ, 'చాలా కాలంగా కన్నడ సినిమాలో నటించాలనుకుంటున్నాను. ఆ కోరిక 'హెబ్బులి'తో తీరుతోంది. ఈ చిత్ర కథ, కథనం చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా నాపాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది' అని చెప్పింది. 'నాయక్‌', 'ఇద్దరమ్మాయిలతో', 'జెండా పై కపిరాజు' చిత్రాలతో తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్‌ ప్రస్తుతం తమిళంలో 'అమ్మ కనక్కు' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.

07:31 - April 29, 2016

అల్లు శిరీష్‌ హీరోగా ఎం.వి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్‌ పతాకంపై ఎస్‌.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌ రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న నిర్మిస్తున్న కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌నివ్వగా శ్రీనువైట్ల కెమెరా స్విచాన్‌ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ, 'దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. ఇదొక పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. కామెడీతోపాటు యాక్షన్‌ ఎపిసోడ్స్ ఉంటాయి. జులై మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపనున్నాం' అని అన్నారు. 'ఇదొక లవ్‌ ఎంటర్‌టైనర్‌. 700ఏండ్ల క్రితం జరిగిన కథతో, అప్పటికీ, ప్రస్తుతానికి లింక్‌ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. ఇతర ఆర్టిస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. నన్ను ప్రోత్సహిస్తున్న అల్లు శిరీష్‌, నాకీ ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు' అని దర్శకుడు ఎం.వి.ఎన్‌.రెడ్డి తెలిపారు. నిర్మాత శైలేంద్రబాబు మాట్లాడుతూ, ''సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చిత్రం తర్వాత మా బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రమిది. స్క్రిప్టు నచ్చడంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం' అని చెప్పారు. 'అల్లు శిరీష్‌ని ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపిస్తారు' అని శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

07:28 - April 29, 2016

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్‌, మెడిసిన్‌, అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష--- ఎంసెట్‌ వాయిదా పడ్డాయి. వచ్చే నెల 1న టెట్‌, 2న ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలకు ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ వీటి యాజమాన్యాలు బంద్‌ పాటిస్తున్నాయి. మరోవైపు కరవు పరిస్థితులపై టీజేఏసీ సమరశంఖం పూరించింది. మౌన దీక్షలు చేపడుతామని పేర్కొంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), సుందర రామశర్మ (ఏపీ కాంగ్రెస్), రాకేష్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:23 - April 29, 2016

కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ నూతన చిత్రం 'మిస్టర్‌' గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీనువైట్ల దర్శకుడిగా బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్‌ క్లాప్‌నివ్వగా, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నా. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో పాటు ఎన్నో ప్రత్యేకతలు ఈ చిత్రంలో ఉంటాయి. వరుణ్‌ తేజ్‌ చేసిన గత చిత్రాలకిది పూర్తి భిన్నంగా ఉంటుంది. యూనివర్సిటీ టాపర్‌గా వరుణ్‌ కనిపిస్తాడు. అతని సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ స్పెయిన్‌, తదుపరి షెడ్యూల్‌ బ్రెజిల్‌, ఆ తర్వాత కర్నాటక బార్డర్‌లో షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు. 'మంచి కథతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి మంచి టీమ్‌ కూడా కుదిరింది' అని వరుణ్‌ తేజ్‌ తెలిపారు. లావణ్యత్రిపాఠి మాట్లాడుతూ, 'మంచి కథాబలమున్న చిత్రంలో నటించే ఛాన్స్‌ ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు' అని చెప్పారు.

07:07 - April 29, 2016

హైదరాబాద్ : ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. పాలేరు ఉప ఎన్నిక‌, రాష్ట్రంలో నెల‌కొన్న క‌రవుపై సీఎల్పీ సమావేశం చర్చించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై న్యాయ‌పోరాటం ఉధృతం చేయాల‌ని నిర్ణయించింది. ఐతే సమావేశంలో కొందరు నేతల అలకలు, ఆగ్రహాలతో మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. ఉద‌యం ప‌ద‌కొండు గంట‌లకు మొద‌లైన మీటింగ్ సాయంత్రం వ‌ర‌కు హాట్ హాట్ గా సాగింది. రాష్ట్రంలో క‌ర‌వు తాండ‌విస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని స‌మావేశం అభిప్రాయం ప‌డింది. ఈ విషయంలో స‌ర్కార్ క‌ళ్లు తెరిపించే విధంగా క్షేత్రస్థాయి నుండి కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని నిర్ణయించింది.

పార్టీ మారనన్న జానా..
అనంతరం పాలేరు ఉప ఎన్నిక‌పై చ‌ర్చించిన నేత‌లు... ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు... ఒక నెల వేత‌నాన్ని ఎన్నిక‌ల ఖ‌ర్చుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. మ‌రోవైపు సోనియాపై అగస్టా స్కాం ఆరోపణలను ఏకగ్రీవంగా సీఎల్సీ ఖండించింది. ఇక నేత‌ల వ‌ల‌స‌ల‌పై స‌మావేశంలో వాడి వేడి చ‌ర్చ జ‌రిగింది. మొన్న పార్టీ మారిన రామ్మోహ‌న్ రెడ్డి త‌మ‌ను కూడా టీఆర్ఎస్ లోకి రావాల‌ని కోరారని.. ఎమ్మెల్యేలు సంప‌త్ , వంశీచందర్ రెడ్డి అనగా... ఈ విష‌యాన్ని ముందే ఎందుకు నాయ‌క‌త్వానికి చెప్పలేదని డికేఅరుణ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎల్పీ నేత జానారెడ్డిని పార్టీ మారనున్నారని వార్తలొస్తున్నట్టు కొందరు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఐతే కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జానా ఆవేదన వ్యక్తం చేశారు. మిగ‌తా ఎమ్మెల్యేలు ఆయ‌న నాయ‌కత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

పొంగులేటి ఆగ్రహం..
వ‌చ్చే నెల 9న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని ఆర్డీఎస్ దగ్గర ప‌దివేల మందితో దీక్ష చేయాల‌ని సమావేశం నిర్ణయించింది. స‌మావేశానికి హాజ‌రైన ఎమ్మెల్సీ పొంగులేటికి ఆహ్వానం లేద‌న‌డంతో ఆయన అగ్గిమీద‌ గుగ్గిలం అయ్యారు. పార్టీలో సీనియ‌ర్స్‌కు గౌరవం లేకుండా పోతోంద‌ని ఆగ్రహం వ‌్యక్తం చేయ‌గా.. సీఎల్పీ నేత జానా జోక్యం చేసుకొని పొంగులేటిని బుజ్జగించారు. ఇదిలా వుంటే ఈమ‌ధ్య పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కోమ‌టి రెడ్డి భేటీకి హ‌జరయ్యారు. పీసీసీ ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ ముందుకెళ్ళే ప‌రిస్థితి లేద‌ని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.మొత్తానికి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల త‌ర్వాత జ‌రిగిన సీఎల్పీ మీటింగ్ ఆద్యంతం వాడి వేడిగా సాగింది.

07:07 - April 29, 2016

బరువు తగ్గాలంటే ఆహారానికి రుచిని అందించే పదార్థాలను మానేయాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి పదార్థాల ద్వారా కొవ్వు సులభంగా కరుగుతుందట. మరింకెందుకు ఆలస్యం? ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!

కరివేపాకు: నిత్యం కొన్ని కరివేపాకు ఆకులను నమిలితే కొవ్వు దానంతట అదే కరుగుతుంది. ఎందుకంటే కొవ్వును కరిగించే ఔషధ గుణాలు కరివేపాకులో పుష్కలంగా ఉన్నాయంటున్నారు వైద్యులు.
గరం మసాలా పొడి: లవంగాలు, జీలకర్ర తదితరాలు కలిపి తయారు చేసిన గరం మసాలా పొడిని నిత్యం ఒక టీస్పూన్‌ మోతాదులో ఆహారంతోపాటు తీసుకున్నా సులభంగా బరువు తగ్గవచ్చట. అయితే అంతకు మించితే మాత్రం ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఎర్ర మిరపకాయల కారం: ఘాటు మాట ఎలా ఉన్నా కారం తినడం వల్ల కూడా బరువు తగ్గవచ్చట. ఎందుకంటే క్యాప్సేసిన్‌ అనే ఓ రసాయనం ఈ కారం పొడిలో ఉంటుంది. అది శరీర మెటబాలిక్‌ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పసుపు: పసుపులో కర్క్యుమిన్‌ అనే ఓ రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా చూస్తుంది. కాబట్టి నిత్యం మన ఆహారంలో పసుపును భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చు.
జీలకర్ర: జీర్ణ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించడంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరిగి కొవ్వు కూడా కరుగుతుందట.

07:05 - April 29, 2016

నవ్వు బాధను మరిపిస్తుంది. విచారాన్ని పోగొడుతుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. వీటన్నింటితో పాటు మంచి ఔషధంగానూ పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించి దాని మూలంగా తలెత్తే దుష్ప్రభావాల నుంచి కూడా కాపాడుతుంది. అధ్యయనం ఒకటి ఈ విషయాన్ని మరింత బలపరుస్తోంది కూడా. ఒత్తిడి హార్మోన్‌ అయిన 'కార్టిజోల్‌' వల్ల మెదడు దెబ్బతినటాన్ని నవ్వు తగ్గిస్తున్నట్టు... ఫలితంగా వయసుతో పాటు వచ్చే మతిమరుపు తగ్గటానికి దోహదం చేస్తున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం.
మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మెదడులోని నాడీకణాలను దెబ్బతీసే అవకాశముంది. ఒత్తిడి మూలంగా వృద్ధుల్లో జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం తగ్గుతున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. నవ్వు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి కార్టిజోల్‌ ప్రభావంతో మెదడు దెబ్బతినటాన్ని నవ్వు తగ్గిస్తుందా? లేదా? అనేది తెలుసుకోవడానికి లోమా లిండా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.
కొందరు వృద్ధులకు 20 నిమిషాల సేపు హాస్యభరిత వీడియోలను చూపించి జ్ఞాపకశక్తిని పరీక్షించగా... వీరిలో కార్టిజోల్‌ మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటం, నేర్చుకునే సామర్ధ్యం, ప్రదేశాలను గుర్తించడటం వంటివి మెరుగుపడ్డాయి. మధుమేహ వృద్ధుల్లో ఈ ఫలితాలు మరింత ఎక్కువగా కనబడటం విశేషం. కార్టిజోల్‌ వంటి హార్మోన్ల దుష్ప్రభావాలను తగ్గించటంతోపాటు రక్తపోటు తగ్గటానికి, రక్తసరఫరా మెరుగుపడటానికి, ఉత్సాహాన్ని పెంపొందించటానికి నవ్వు తోడ్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
నవ్వటం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, డోపమైన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సంతోషాన్ని, హుషారును తెచ్చిపెట్టటమే కాదు. గామా తరంగ ఫ్రీక్వెన్సినీ మెరుగుపరుస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి కూడా పుంజుకుంటుంది. సొంతంగా తమ పనులను తాము చేసుకోవటానికి, హాయిగా జీవించటానికి వృద్ధులకు జ్ఞాపకశక్తి చాలా కీలకం. కాబట్టి వీరికి ఇతర చికిత్సలతో పాటు నవ్వు చికిత్సలనూ జోడించటం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. 

07:01 - April 29, 2016

హైదరాబాద్ : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో వర్గ వివక్ష కొనసాగటం సిగ్గుచేటయిన విషయం. నేటికీ ఈ వివక్ష కొనసాగుతూనే వుంది. రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేద్కర్ 125 జయంతి వేడుకలు ఇటీవల దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాష్ట్రానికే తలమానికమైనది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన వర్శిటీ అంబేద్కర్ మనుమడిపై వివక్ష చూపింది. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌ను హెచ్ సీయూలోకి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. యూనివర్సిటీలో జరుగుతున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. లోనికి అనుమతించకపోవడంతో గేటు ముందు బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేసారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకోవద్దని, హెచ్ సీయూలో సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రకాశ్ అంబేద్కర్ డిమాండ్ చేశారు.

06:50 - April 29, 2016

ఖమ్మం : పాలేరు ఉపఎన్నికలో సీపీఐ, వామపక్షాలు బలపర్చిన సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ రావు గురువారం నామినేషన్ వేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య... పార్టీ జిల్లా నేతలు.. భారీ ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం అభ్యర్థి పోతినేని టెన్ టివితో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో సీపీఎం పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ కళారూపాల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అన్ని వామపక్ష పార్టీలు తమకు మద్దతిచ్చాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను వివిధ కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళతామని ఆయన తెలిపారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ..వామపక్ష పార్టీలు బలపరచిన పోతినేని సుదర్శన్ రావు అభ్యర్థి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దీన్ని ప్రజల్లో తీసుకెళతామని ఆయన అన్నారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో ఉపఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

06:42 - April 29, 2016

ఈపిఎఫ్ విషయంలో వరుసగా వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాస్పద నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటుపై కేంద్ర ఆర్థిక శాఖ కోత వేసింది. దీనిపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈపిఎఫ్ విషయంలో కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్స్ ఏమిటి? అసలు ఈపిఎఫ్ వడ్డీ రేటును ఎవరు ఎలా నిర్ణయిస్తారు? ఈ పిఎఫ్ వడ్డీ రేటును తగ్గించడం వల్ల ఉద్యోగులు, కార్మికులు ఎలా నష్టపోతారు? ఉద్యోగుల, కార్మికుల జీవితంలో ఈపిఎఫ్ కున్న ప్రాధాన్యత ఏమిటి? ఈ పిఎఫ్ విషయంలో చట్టాలు ఏం చెబుతున్నాయి? అవి ఎలా అమలవుతున్నాయి? ఈపిఎఫ్ ను ఇతర పొదుపు పథకాలతో పోల్చడం సమర్ధనీయమా? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత ఏ.వి. నాగేశ్వరరావు విశ్లేషించారు. ఆయన అభిప్రాయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:36 - April 29, 2016

విజయవాడ : సేవ్‌ డెమోక్రసీ పేరుతో వైసీపీ అధినేత జగన్‌ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏం సాధించారు ? రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోదీని కలిసి సమస్య తీవ్రతను వివరించాలనుకున్న జగన్‌ లక్ష్యం నెరవేరలేదా? ఇద్దరు కేంద్ర మంత్రులు, కొందరు జాతీయ నేతలతో భేటీలతో ఏం సాధించారు. ముందస్తు వ్యూహం లేకపోవడం వలన జగన్‌ ఢిల్లీ యాత్ర విఫలమయ్యిందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అటు వైసీపీతో పాటు, ఇటు ఇతర పార్టీల నేతల్లో చర్చనీయాంశంగా మారాయి. వైపీసీని వీడి టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేల వలసలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్‌.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, జేడీయూ నేత శరద్‌యాదవ్‌ను కలిసారు. అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తీసుకురావాలని కోరారు.

మొర ఎవరు ఆలంకించారు ? 
ఇంతవరకు బాగానే ఉన్నా జగన్‌ మొర ఎవరు ఆలకించారన్న అంశంపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. జగన్‌ ఢిల్లీ పర్యటనలో ఉండగానే కొందరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు. ఇంతవరకు 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. మరికొందమంది ఇదే బాటలో ఉన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వివిధ పార్టీల నేతలు ఈ అంశాన్ని తప్పుపట్టినా... కేంద్ర మంత్రులు మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నారన్న వాదాన్ని వైసీపీ నేతలే లేవనెత్తుతున్నారు. టీడీపీ ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి. ఏన్డీయేకి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి తెలుగుదేశం మిత్రపక్షం. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీలు చంద్రబాబుపై జగన్‌ ఇచ్చిన ఫిర్యాదు కాపీలను తీసుకుని పరిశీలిస్తామని హామీ ఇవ్వడం వరకు పరిమితమయ్యారు. జగన్‌ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అపాయింట్‌మెంట్‌ కీలకం కాగా... ఈ ఇద్దరు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. దీంతో జగన్‌తోపాటు, ఆయన వెంట ఉన్న వైసీపీ పరివారమంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. మోడీ అపాయింట్‌మెంట్‌ విషయంలో తమపని తాను చేశామని సంతృప్తి చెందాల్సి వచ్చింది.

న్యాయపోరాటం...
అవినీతి సొమ్ముతోనే చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని జగన్‌ జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌... అంటే అవినీతి చక్రవర్తి అనే అర్ధం వచ్చేలా రూపొందించిన ఓ చిన్న పుస్తకాన్ని కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలకు అందజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులు గురించి జగన్‌... వివిధ జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వాలకు అర్హులుగా ప్రకటించే విషయంలో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించారు. అనర్హత అధికారాన్ని స్పీకర్‌ పరిధి నుంచి తొలగించి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించేలా చట్టాన్ని సవరించాలని కోరారు. బీజేపీతో పాటు మిగిలిన ప్రధాన పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తరుణంలో చట్ట సవరణకు ఎన్డీయే సర్కార్‌ ఎంతవరకు ముందుకొస్తుందన్న అంశంపై కూడా వైసీపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని జాతీయ నేతల దృష్ఠికి తీసుకెళ్లిన జగన్‌.. ఇప్పుడు ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. 

06:31 - April 29, 2016

కర్ణాటక : సాగునీటి రంగంలో కర్నాటకతో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని రాజోలిబండ మళ్లింపు పథకం అపరిష్కృత పనులను రెండు నెలల్లో పూర్తి చేయడానికి కర్నాటక అంగీకరించింది. అలాగే తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల గొంతు తడిపేందుకు నారాయణ్‌పూర్‌ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్ట్‌కు 3 టీఎంసీల నీరు విడుదలకు కర్నాటక సుముఖత వ్యక్తం చేసింది. సాగునీటి ప్రాజెక్ట్ లపై కర్నాటకతో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం చేపట్టిన బెంగళూరు పర్యటన విజయవంతమయ్యింది. కర్నాటక ఇరిగేషన్‌ మంత్రి ఎంబీ పాటిల్‌, ఆ శాఖ అధికారులతో హరీష్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం జరిపిన చర్చలు ఫలించాయి.

దేవినేని ఉమతో హరీష్ చర్చలు..
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. తెలంగాణ-కర్నాటక సాగునీటిపారుదల శాఖల మంత్రులు చర్చల దరిమిలా రాజోలిబండ మళ్లింపు పథకం పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు నెలల్లోగా వీటిని పూర్తి చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేయగా, 59 కోట్లు కర్నాటక ప్రభుత్వం దగ్గర డిపాజిట్‌ చేసింది. ఆర్డీఎస్‌ ఆనకట్ట ఎత్తు పెంపుకు చేపట్టిన పనుల్లో ఎనిమిదేళ్లలో 29.1 శాతం పూర్తయ్యాయి. మొత్తం 4 ప్యాకేజీ పనుల్లో నాల్గవ ప్యాకేజీ మాత్రమే పూర్తయ్యింది. ఎప్పుడో కుదుర్చుకున్న ఆర్డీఎస్‌ ఒప్పందం పనులు ఇప్పుడు చేపట్టాలంటే పెరిగిన అంచనా వ్యయాన్ని కూడా భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండో ప్యాకేజీ పనులు 19 కోట్లు కాగా... పెరిగిన అంచనాల ప్రకారం ఇది 50 కోట్లకు చేరిందని లెక్క తేల్చారు. ఈ మొత్తం ఇవ్వడానికి తెలంగాణ అంగీకరించింది. ఆర్డీఎస్‌ పనులు చేపట్టే విషయంలో కర్నూలు జిల్లా రైతులతో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు వచ్చే నేల 4న ఏపీ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో చర్చలు జరపాలని హరీష్‌రావు నిర్ణయించారు. బెంగళూరు నుంచి దేవినేనితో ఫోన్‌లో మాట్లాడి చర్చల తేదీని ఖరారు చేశారు.

పాలమూరు వాసుల దాహార్తి..
తీవ్ర కరవుతో తల్లడిల్లుతూ కనీసం తాగేందుకు గుక్కెడు నీరు లభించక అల్లాడుతున్న పాలమూరు వాసులు దాహార్తిని తీర్చేందుకు కర్నాటక సర్కార్‌ సముఖత వ్యక్తం చేసింది. నారాయణ్‌పూర్‌ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్ట్‌కు 3 టీఎంసీల నీరు విడుదల చేడానికి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ తెలంగాణ ప్రతినిధి బృందం దృష్టికి తెచ్చారు. మొత్తంమీద సాగునీటి రంగంలో ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో తెలంగాణ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

06:28 - April 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్‌, మెడిసిన్‌, అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష--- ఎంసెట్‌ వాయిదా పడ్డాయి. వచ్చే నెల 1న టెట్‌, 2న ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలకు ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ వీటి యాజమాన్యాలు బంద్‌ పాటిస్తున్నాయి. పోటీ పరీక్షలకు తమ విద్యా సంస్థలను ఇవ్వబోమని ప్రకటించాయి. దీంతో టెట్‌, ఎంసెట్‌ను వాయిదా వేయక తప్పలేదు. మే 20 లోగా ఈ రెండు పరీక్షలను ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. టెట్‌, ఎంసెట్‌ వాయిదా పడిన విషయం తెలుసుకున్న విద్యార్ధులు, వీర తల్లిందండ్రలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... వీరికి భరోసా కల్పించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఈ రెండు పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు పర్యవేక్షణలోనే వీటని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు.

బెదిరింపులకు లొంగేది లేదన్న కేసీఆర్..
టెట్‌, ఎంసెట్‌ నిర్వహణకు సహకరించబోమని ప్రైవేటు విద్యాసంస్థల ఐక్య కార్యాచణ సమితి చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులకు లొంగేదిలేదన్నారు. ఈ నిర్ణయం బాధాకరణమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ తీరును ఆక్షేపించారు. టెట్‌, ఎంసెట్‌ నిర్వహణను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించి కట్టడి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విద్యా సంస్థలు ప్రమాణాలు పాటిస్తున్నాయా ? లేదా ? తప్పులు చేస్తున్నాయా ? అన్న విషయాలను పరిశీలించేందుకు తనిఖీలు చేయకపోతే ఎలా తెలుస్తుందన్నారు. విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాకపోతే మరెవరిదని ప్రశ్నించారు. తనిఖీలు వద్దంటూ బంద్‌ పాటించడం ఎంతవరకు సమంజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై మండిపడ్డారు. విజిలెన్స్‌ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతాయని తేల్చిచెప్పారు. దీనిలో బిట్స్‌ పిలానీ, ట్రిపుల్‌ ఐటీ వంటి విద్యా సంస్థలు థర్డ్‌ పార్టీ ఏజెన్సీలుగా ఉంటాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..
టెట్‌, ఎంసెట్‌లకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు విద్యాసంస్థల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెట్‌కు ప్రభుత్వ విద్యాసంస్థల్లో 151, ప్రైవేటు విద్యాసంస్థల్లో 1024 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3,73,495 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్‌ నిర్వణహకు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో కూడా ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి. ఈ పరీక్షకు 2,46,551 దరఖాస్తులు అందాయి. పదివేల రూపాయల అపరాధ రుసుముతో ఇవాళ్టి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎంసెట్‌కు మరికొన్ని దరఖాస్తులు అందే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పోలీసులు తనిఖీలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కళాశాలల్లో పోలీసులు తనిఖీలను సవాల్‌ చేస్తూ ఈ విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించి, తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. 

ఇంజనీరింగ్ పరీక్షకు జీ2 ప్రశ్నపత్రం ఎంపిక..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇంజనీరింగ్ పరీక్షకు జీ2 ప్రశ్నపత్రాన్ని ఏపీ మంత్రి గంటా విడుదల చేశారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసన్ పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతిని నిరాకరించనున్నారు. 

నేడు పాలమూరుకు మంత్రి హరీష్ రావు..

మహబూబ్ నగర్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలిదశ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాకు రానున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. 

నేడు పంచాయతీరాజ్ మంత్రిగా జూపల్లి బాధ్యతలు.

హైదరాబాద్ : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఉదయం 7గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని డి బ్లాక్ మొదటి అంతస్తులోని 251 చాంబర్ లో జూపల్లి బాధ్యతలు స్వీకరిస్తారు.

 

నేడు సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం..

హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, తాగునీటి ఎద్దడి వంటి ప్రధానమైన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఎంసీహెచ్చార్డీ భవనంలో ఈ సమావేశం జరగనుంది. 

నేడు పశుసంవర్ధక, మత్స్యశాఖలతో మంత్రి సమీక్ష..

హైదరాబాద్ : పశుసంవర్థక, మత్స్యశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్ సొసైటీ అధికారులతో ఆ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. రైతులకు ఆర్థిక దన్నుగా నిలిచే పాడిని మరింత ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆయా శాఖల బలోపేతం తదితర అంశాలపై మంత్రి చర్చించనున్నారు. 

బెంగాల్ లో ఐదో దశ ప్రచారానికి తెర...

పశ్చిమబెంగాల్ : అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఐదోదశ పోలింగ్ జరిగే 59 స్థానాల పరిధిలో ప్రచారానికి గురువారం సాయంత్రం తెరపడింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి దీపాదాస్‌మున్షీ, బీజేపీ నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మనుమడు చంద్రకుమార్‌బోస్ తదితరులు పోటీలో ఉన్నారు.

2 నుండి హైకోర్టుకు వేసవి సెలవులు..

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టుకు మే 2 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు. మే 5, 12, 19, 26 తేదీల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయని రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ పేర్కొన్నారు.

సత్తా చాటిన ముంబై..

ముంబై: ముంబై సత్తా చూపించింది. వేల మంది అభిమానుల మద్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కట రైడర్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కట నిర్ణీత 20 ఓవర్లలో 174/5 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ముంబై సునాయసంగా చేధించింది. 

ఏపీలో నేటి ఎంసెట్ యథాతథం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ 'ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఎంసెట్‌-2016)' శుక్రవారం జరగనుంది. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. 'నీట్‌' నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఎంసెట్‌ యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‌ సి.హెచ్‌.సాయిబాబు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 2,92,507 మంది ఏపీ ఎంసెట్‌ రాయనున్నారు. వీరిలో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,89,273 మంది, మెడికల్‌, అగ్రికల్చర్‌ విభాగంలో 1,03,234 మంది ఉన్నారు. 

కరవు పరిస్థితులపై కేంద్ర బృందం పరిశీలన..

ఢిల్లీ : దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులపైఅ ధ్యయనం చేయడానికికేంద్ర బృందం ఈ ఏడాది జూన్ వరకు పర్యటించనుంది. దీర్ఘకాలంలోఅనుసరిం చాల్సిన వ్యూహంపై ప్రణాళిక సిద్ధం చేయనుంది. 

Don't Miss