Activities calendar

30 April 2016

21:33 - April 30, 2016

హర్యాన : ఉత్తరాదిలో సంబరాల్లో భాగంగా తుపాకులను గాల్లోకి పేల్చే సంస్కృతి కాస్తా విషాదానికి దారి తీస్తోంది. తాజాగా హరియాణాలో జరిగిన వివాహ సంబరాల కాల్పుల్లో ఏకంగా వరుడే గాయపడ్డాడు. హిసార్‌ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కొడుకుని మండపానికి తీసుకొస్తూ సంబరాలు చేశారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దురదృష్టవశాత్తూ ఆ బుల్లెట్‌ వచ్చి పెళ్లి కొడుక్కే తగిలింది. అప్పటివరకు స్నేహితులు, బంధువులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరుడు తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

21:31 - April 30, 2016

ఉత్తరాఖండ్ : మండుటెండల కారణంగా ఉత్తరాఖండ్‌ అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. 13 జిల్లాల్లోని అడవుల్లో మంటలు వ్యాపించాయి. సుమారు 15 వందల గ్రామాలకు ముప్పు పొంచివుండడంతో ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కేంద్రం ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 3 టీమ్‌లను ఉత్తరాఖండ్‌కు పంపింది. పర్వత ప్రాంతాల్లో రిస్క్యు ఆపరేషన్‌ ప్రారంభించింది.ఎన్డీఆర్ ఎఫ్ కు చెందిన 135 మంది సభ్యులు వివిధ జిల్లాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన 6 వేల మంది ఉద్యోగులు కూడా మంటలు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. సుమారు 19 వందల హెక్టార్ల అడవి బుగ్గిపాలైంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు పర్వత ప్రాంతాల్లో 922 అగ్నిప్రమాదాలు సంభవించాయని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.

21:30 - April 30, 2016

హైదరాబాద్ : కేరళలో అధికార యుడిఎఫ్‌ అవినీతి పాలనపై విసుగు చెందిన ప్రజలు- ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టనున్నారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళలో త్వరలోనే ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఏర్పడనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మద్యపానం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున రాష్ట్రంలో లిక్కర్ నిషేధంపై దశలవారిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్డీఎఫ్‌ తరపున ఎన్నికల ప్రచారం కోసం ఏచూరి కేరళకు వచ్చారు. కేరళలో మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

 

21:28 - April 30, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదాపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి స్టెప్‌ వేయబోతున్నారు.? కేంద్రమేమో ప్రత్యేక హోదా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. బీజేపీ, టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఏ సంగతీ తేల్చలేదంటూ దాగుడు మూతలాడుతున్నారు. కేంద్రం తీరుపై ప‌వ‌న్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ స్టార్‌గా నిలిచిన గబ్బర్‌ సింగ్‌ స్పెషల్‌ స్టేటస్‌పై.. రోడ్డుపైకొస్తాడా..? కేంద్రాన్ని నిలదీస్తాడా..??

స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వలేమని చెప్పిన మంత్రి....

ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వలేమని కేంద్ర హోం శాఖ స‌హయ మంత్రి హెచ్‌బి చౌద‌రి రాజ్యసభలో తేల్చేశారు. ఈ నేప‌ధ్యంలో ప‌వ‌న్ మ‌రోసారి ప్రత్యేక హోదా విష‌యంపై ట్విట్టర్‌ వేదిక‌గా స్పందించారు. స‌రిగ్గా రెండేళ్ల క్రింతం కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్ర ఎంపీల‌ని త‌న్ని, పార్లమెంట్‌ నుంచి బ‌య‌టికి గెంటి, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడ‌గొట్టార‌ని ప‌వ‌న్ విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని విభ‌జించి కాంగ్రెస్ ఘోర‌మైన త‌ప్పు చేసింద‌ని, ఆరోజు సీమాంధ్రకు జ‌రిగిన అవ‌మానం ఎవ‌రూ మ‌ర్చిపోలేదు, మ‌ర్చిపోరు కూడా అని ప‌వ‌న్‌ అన్నారు. ఈ రోజు ప్రత్యేక హోదా విష‌యంలో ఇచ్చిన మాట మీద వెన‌క్కి త‌గ్గి సీమాంధ్ర ప్రజ‌ల న‌మ్మకం మీద కొట్టి బీజేపీ కూడా ఆలాంటి త‌ప్పు వైపు ఆడుగులు వెయ్యకూడ‌ద‌ని కోరుకుంటున్నట్లు ప‌వ‌న్‌ ట్వీట్‌ చేశారు. ప్రత్యేక హోదా విష‌యంపై ప్రజ‌లు రోడ్లమీద‌కు వ‌చ్చి ఉద్యమించే లోపు అధికార పార్టీ ఎంపీలు, ప్రతిప‌క్షాల‌ని క‌లుపుకొని పార్లమెంట్‌లో పోరాటం చేయాల‌ని సీమాంధ్ర ప్రజ‌ల త‌రుపున విన్నపం చేస్తున్నాన‌న్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్ధతు.....

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్ధతిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ఇక ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీలు ఊదరగొట్టాయి. హామీలు విస్మరిస్తే తాను ప్రశ్నిస్తానని పవన్‌ కల్యాణ్‌ గ్యారెంటీ ఇచ్చారు. రెండు ప్రభుత్వాలు ఏర్పాటై రెండు సంవ‌త్సరాలు కావస్తోంది. ఇంతవరకూ ఎలాంటి హామీలూ అమలు కాలేదు. ఇక ప్రత్యేక హోదాపై ఇన్నాళ్లు ఆశలు రేపిన కేంద్రం... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

హోదాపై బీజేపీ స్వరం మారుతున్ననేపథ్యంలో ...

హోదాపై బీజేపీ స్వరం మారుతున్ననేపథ్యంలో బీజేపీ విజయం కోసం కృషి చేసిన గబ్బర్‌ సింగ్‌...ఎలాంటి లెక్కలతో ప్రధాని మోడీ ముందుకెళ్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని ప్రశ్నించగలరా? అందివచ్చిన అవకాశంతో జనసేనను బలోపేతం చేయడానికి ఉద్యమిస్తాడా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతోంది. పవన్‌ ఎలాంటి స్టెప్‌ వేస్తారోనని అటు ఆయన అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి, ప్రత్యేకహోదాపై పవన్‌ దారేది..? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

21:24 - April 30, 2016

విశాఖ : ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించి అన్యాయం చేసిందని అన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్ర అభివృద్ధి గురించి.. సాయం గురించి కేంద్రానికి విన్నవిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో కలసి రాకుండా విపక్ష నేతలు విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

 

21:22 - April 30, 2016

మహబూబ్ నగర్: ఆంధ్రా పార్టీలు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పాలమూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని పెద్ద చెరువును పరశీలించారు. అనంతరం జగన్‌,చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. పాలమూరు ఎత్తిపోతల ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా జగన్‌ దీక్ష చేస్తాననడం దుర్మార్గమన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు.

లక్నో లో భారీ అగ్ని ప్రమాదం : 500 ఇళ్లు దగ్ధం.

ఉత్తరప్రదేశ్ :లక్నోలోని బల్లాడి మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 500 ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. దీంతో ఇక్కడి ప్రజలు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. అయితే ఇక్కడివారిలో చాలామంది ఫర్నీచర్ తయారు చేసి లక్నో నగరంలో విక్రయిస్తుంటారు. దాంతోపాటుగా అక్రమంగా కిరోసిన్ అమ్మకాలు నిర్వహిస్తుంటారు. తొలుత అక్రమ కిరోసిన్ డిపోల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ మంటలు కాస్తా ఫర్నీచర్ షాపులకు వ్యాపించాయి. దీంతో మురికివాడ అంతా కాలి బూడిదైపోయింది.

20:47 - April 30, 2016

హైదరాబాద్ : మనం ఇపుడు ఏ యుగంలో ఉన్నాం. మన చేసే ప్రతి పనిని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు. మనిషి తన కంటికి కనిపించని శక్తుల కన్నా.. అదృశ్య శక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అటువంటి శక్తులకే ఎక్కువగా భయపడతాడు కూడా. ఆశక్తులకే దైవం, దెయ్యం అని పేర్లు పెట్టుకున్నారు. దేవుడు లేడని, దెయ్యం అనే మాట ఉట్టి అభూత కల్పన అని నమ్మే నాస్తికులు కూడా మన మధ్యనే కొందరు ఉన్నారు. నిజంగా ఈ ఆత్మలు, దయ్యాలు ఉన్నాయనుకుంటే మనం ఎన్నో కోళ్లను, మేకలను మన ఆనందం కోసం వాటి ప్రాణాలను బలి చేస్తున్నాం. మనలానే వాటిది కూడా ప్రాణమే గా... మనలానే వాటికి కూడా ఆత్మలు ఉండి ఉంటే మనిషి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తాడు ఒక నాస్తికుడు. ప్రతి మనిషికి మనస్సు, ఆత్మ ఉంటాయ్. మనిషి చనిపోయాక ఆత్మ గాలిలో కలిసి పోతుందని, కోరికలు తీరిన ఆత్మ స్వర్గానికో.. నరకానికో వెళుతుందని, ఆత్మ ప్రేతాత్మలుగా మారి తన కోరిక్కెలు తీర్చుకోవడం కోసం బ్రతికున్న మనిషిని ఆవహించి తద్వారా తమ కోర్కెలు తీర్చుకోవడం జరుగుతుందని, ఆ ఆత్మలకు ఎవరి మీదైన పగలు, ప్రతికారాలు వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తాయని ఎవరో చెబితేవిన్నాం. పాడుపడ్డ గుహల్లో విహరిస్తూ.. వింత శబ్ధాలు చేస్తూ మనిషిని భయపెడతాయని కొన్ని కథలో చదివాం. భయంకర ఆకారాలను ధరించి చీకట్లో వెళ్తున్న మనుషులను వెంబడించి వాటి పీకలు కొరికి రక్తం తాగుతాయని సినిమాల్లో చూశాం. ఆమెరికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఈ దెయ్యాలు తమ విసృంకలతను చాటుకుంటున్నాయి. అంటే అలా నమ్ముతున్నారు వాళ్లు. వైట్ హౌస్ లో 13వ రూం లాక్ చేసింది ఉంటుంది. 13 అనే అంకెను వారు దృరదృష్టంగా భావిస్తారు. అందుకే లిప్టులో కూడా 13వ నెంబర్ బ్యాన్. ఇలా చెపుకుంటూ పోతే ఇన్సుడెంట్స్ ఎన్నో. అదే ఆ పాడుబడ్డ ఇంట్లో ఓ దెయ్యం ఉందట. ఏ పుట్టలో ఏ పాము వుందో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:11 - April 30, 2016

హైదరాబాద్ : ఎంపీలకు చాలటలేట జీతాలు...డబుల్ పెంచాలట వేతనాలు, హైదరాబాద్ కానే కాదట డల్లాస్...జీహెచ్ ఎంసీలో వచ్చిందట లాస్, వలసెల్లి పోతున్న పాలమూరు...తప్పక ముడతది లీడర్లకు ఉసురు, సరికొత్తరకం దొంగతనం..అస్సలు చూసిండరు జనం, ఆడోళ్లను కొడుతున్న పోలీసోళ్లు...ఆడ ఒక్కళ్లు లేరట ఆపేటోళ్లు, పచ్చటి పందిట్లో ముదిరిన లొల్లి...ఐస్ క్రీం కోసం ఆగిన పెళ్లి ఇత్యాది అంశాలతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న చెప్పిన ముచ్చటైన మాటలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

తెలంగాణ ద్రోహులు కీలక పదవుల్లో ఉన్నారు : చెరుకు సుధాకర్

హైదరాబాద్ : ఓయూ ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో చెరుకు సుధాకర్, యెన్న శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహించి... తెలంగాణ లో రాజ్యాంగ వ్యతిరేకమైన పాలన కొనసాగుతోందని తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్ తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడటం కోసం అన్ని శక్తులను ఏకం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ద్రోహులు కీలక పదవుల్లో ఉన్నారని, దగా పడుతున్న ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం అన్ని ప్రజాసంఘాలు కలిసి రావాలని చెరుకు సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

విజయవాడలో ముగిసిన జేఏసీ సమావేశం...

విజయవాడ : ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక పెన్షనర్ల జేఏసీ సమావేశం ముగిసింది. ఉద్యోగులందరికీ పదవీవిరమణ వయసు 60 ఏళ్లుగా ప్రకటించాలని, ఫీల్డ్ స్టాఫ్ బయోమెట్రిక్ విధానంలో నిబంధనలు సడలించాలని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. మే 15 లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

'ఆర్టీసీ ఎన్నికలకు నేషనల్ మజ్దూర్ యూనియన్ ను అనుమతి'

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎన్ ఎంయూకు అనుమతిస్తూ అడిషనల్ సివిల్ కోర్టు తీర్పు ఆర్టీసీ ఎన్నికలకు నేషనల్ మజ్దూర్ యూనియన్ ను అనుమతించాలని లేబర్ కమిషన్, ఆర్టీసీ జేఎండీలకు ఆదేశించారు. ఎన్ ఎంయూ తెలంగాణ విభాగం ప్రతినిధులుగా ఎం నరేందర్, కమాల్ రెడ్డి, ఈ అశోక్ లను గుర్తించాలని కోర్టు ఆదేశించింది.

19:36 - April 30, 2016

హైదరాబాద్ : పటాస్ ,కిరాక్ ,మా టాకీస్ ,డీ జూనియర్స్ , ఫ్యామిలీ సర్కస్ మొదలయిన టీవీషో లతో చాలా బిజీ గా ఉన్న రాక్ స్టార్ యాంకర్ యాంకర్ తో 'టెన్ టివి' చిట్ చాట్ నిర్వహించింది. కో యాంకర్ ల్యాస్యా తో ఎలాంటి సంబంధం ఉంది? శ్రీముఖితో ఎలాంటి షో చేస్తున్నారు? శ్రీముఖి లైవ్ లో పాల్గొని రవి గురించి ఏఏ అంశాలు తెలియజేశారు? అనసూయ అందాన్ని పొడిగితే ఎలా రియాక్టు అవుతుంది? స్క్రిప్ట్ ఇచ్చి యాంకరింగ్ చేయాలంటే ఎలా వుంటుంది? ఇంకా తనకు ఏఏ అంశాలు, నచ్చుతాయి, ఏఏ అంశాలు నచ్చవో చెప్పాశారు. ఇంకా అనేక అంశాలను చిట్ చాట్ వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.. 

19:25 - April 30, 2016

ఢిల్లీ : అచ్చేదిన్ వచ్చాయంటూ ప్రచారం చేసుకున్న మోదీ వర్గానికి షాకింగ్ న్యూస్. మోదీ రెండేళ్ల పాలనపై ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతోంది. ఢిల్లీకి చెందిన సీఎంఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో కీలక అంశాల్లో మోదీ వెనకబడుతున్నట్టు తెలిపింది. రాబోయే ఐదేళ్లు మోదీయే ప్రధానిగా ఉండాలనుకుంటున్న వారు కేవలం 30 శాతం మంది మాత్రమే ఉన్నారు. అంచనాలు పెంచి పథకాల అమల్లో మోదీ వెనుకంజ వేశారని చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనలో ఆహారం, ఆరోగ్యం, ధరల నియంత్రణ, నిత్యవసరాలు, మందులు, ఉద్యోగ కల్పన, అంతర్గత భద్రత అంశాలపై 48శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

'1477 ఉద్యోగాల భర్తీకి మూడు నోటిఫికేషన్లు విడుదల'

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరోసారి కొలువుల జాతరకు తెరతీసింది. ఇప్పటికే దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) తాజాగా 1477 ఉద్యోగాల భర్తీకి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 1000 వ్యవసాయ విస్తరణాధికారుల భర్తీ ఈ ఉద్యోగాలకు మే 4 నుంచి 19వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రవాణాశాఖలో 137 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రకటన, మే 4 నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.340 ఆబ్కారీ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కి మే 4 నుంచి 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

నగరంలో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. చందానగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కాప్రాలో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడితో అల్లాడుతున్న నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

18:22 - April 30, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఒక రకంగా కేంద్రానికి హెచ్చరిక జారీ చేసినట్లు కూడా ప్రజలు భావిస్తున్నారు. ట్వీట్ల ద్వారా ప్రత్యేక హోదా రాదని, ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేయాలని మరి కొంత సూచిస్తున్నారు. సరిగ్గా రెండేళ్ల కిత్రం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఘోర తప్పిదం చేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తున్నందున ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ చౌదరి శుక్రవారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదని, మరచిపోకూడదన్నారు. ఈ రోజు ‘ప్రత్యేక హోదా’ విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి భాజపా కూడా అలాంటి తప్పువైపే అడుగులు వేయకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేకహోదా గురించి ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పార్లమెంట్‌లో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరపున విన్నవిస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యపై వివిధ జిల్లాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

17:39 - April 30, 2016

మెదక్ : పటాన్ చెరువు వద్ద మూతపడిన అల్విన్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడుతుండడంతో స్ఠానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

16:52 - April 30, 2016

ప్రకాశం : ఒంగోలు రైల్వే స్టేషన్‌లో 11 నెలల చిన్నారి అలేఖ్య అపహరణకు గురైంది. పాల ప్యాకెట్‌ కొనడానికి అలేఖ్య తల్లి షాపుకి వెళ్లగా ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్న పోలీసులు పాత నేరస్థులపై దృష్టి సారించారు. 

విశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభం

ముంబై : నగరంలో సిటీ పోలీస్‌ కమిషనర్‌ నూతన భవనం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, సీపీ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జేవీ రాయుడు, అడిషనల్ డీజీ ఠాకూర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు.

16:43 - April 30, 2016

హైదరాబాద్ :పార్టీ ఫిరాయించిన 16మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసి ఫిర్యాదు చేశారు. స్పీకర్ ను కలిసిన అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారన్నారు. 'సేవ్ డెమొక్రసీ' పేరుతో తమ ఢిల్లీ పర్యటన సందర్భంగా అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును జాతీయ స్థాయి నేతలకు వివరించామని వారు పేర్కొన్నారు.

16:28 - April 30, 2016

మహారాష్ట్ర : ముంబయిలోని కామాటిపురా ప్రాంతంలో ఓ మూడంతస్థుల పాత భవనానికి మరమ్మత్తులు చేస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

పాలేరులో ముగిసిన నామినేషన్ల ప్రకియ

ఖమ్మం: జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇవాళ అధికారులు నామినేషన్లను పరిశీలించారు. రెండు నామినేషన్లను తిరస్కరించినట్టు వెల్లడించారు. బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు.

ముంబైలో కుప్పకూలిన భవనం : ఇద్దరి మృతి

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని కామాటిపురా ప్రాంతంలో ఓ మూడంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

16:11 - April 30, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పును బిజెపి చేయవద్దని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు పవన్ ఒక ట్వీట్ చేశారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ఘోరమైన తప్పిదం చేసిందని, సీమాంధ్ర ఎంపీలను పార్లమెంట్ నుంచి గెంటేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందన్నారు. సీమాంధ్రకు జరిగిన అవమానాన్ని ఎవరూ మరిచిపోలేదుని, మరిచిపోరు కూడా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలి, సీమాంధ్ర ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ముచేయదని ఆశిస్తున్నానని అన్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించేలోపే అధికార, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాలో ప్రత్యేక ఆశక్తి నెలకొంది.

16:04 - April 30, 2016

అనంతపురం: పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌ రామాంజనేయులు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బినామీ ఇళ్లలో ఐదుమంది సీ.ఐ లు ఏకకాలంలో తనిఖీలు చేశారు. పలు కీలక విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. అతని వద్ద నుంచి 8లక్షల 30వేలు నగదు, 30తులాల బంగారం,16 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 

16:01 - April 30, 2016

మహబూబ్ నగర్ : రాబోయే ఐదేళ్లలో పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో హరీశ్‌రావు పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. భారీ బైక్‌ ర్యాలీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించారు. నూతన వ్యవసాయ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావుతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీ ఛైర్మన్‌ బండారి భాస్కర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

15:59 - April 30, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా పల్లె కన్నీరు పెడుతోంది. కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఏ ఊరు వెళ్లినా...ఏ తండా చూసినా గుండె తరుక్కుపోయే దృశ్యాలే కనిపిస్తున్నాయి. కంట నీరు పెట్టించే పరిస్థితులే ఆహ్వానం పలుకుతున్నాయి. పాలకుల మాటలు నీటిమీది రాతలు కాగా.. పాలమూరు పల్లె మళ్లీ వలస బాట పట్టింది. పిల్ల పాపలతో కళకళలాడే ఇళ్లు ఇప్పుడు తాళాలతో వెక్కిరిస్తున్నాయి. కరువు దెబ్బకు గ్రామాలకే గ్రామాలకే వలస బాట పడుతున్నాయి. బతుకు భారమవడంతో.... పొట్ట కూటి కోసం పట్టణాల బాట పడుతున్నాయి

నెర్రెలిచ్చిన చెరువులు....

ఒకవైపు భూములు బీడు వారి పోయాయి. చెరువులు నెర్రలిచ్చాయి. కూలి పనులు లేక పల్లె వాసులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోతున్నాయి. ఏ పల్లె చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంటి పిల్లల్ని, వృద్ధుల్ని ఇంటి దగ్గరే వదిలేసి మిగతా కుటుంబ సభ్యులు వలస బాట పడుతున్నారు. పనుల కోసం పట్టణాల వైపు చూస్తున్నారు.

నిత్యం కరువుతో....

నిత్యం కరవుతో సతమతమయ్యే పాలమూరు నుంచి వలసలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి విరుచుకుపడిన కరవు దెబ్బకు.. ఇంతకుముందెన్నడూ వెళ్లని వారూ వలస బాట పట్టారు. జిల్లాలోని దాదాపు ప్రతి బస్టాండ్‌లోను, ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ వలస కూలీల రద్దీయే. ముంబైకి వెళ్లే బస్సులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి వలసల సంఖ్య బాగా పెరిగిందని ఆర్టీసీ సిబ్బందే చెబుతున్నారు. దాదాపుగా ఐదు నుంచి ఏడు లక్షల మంది జిల్లానుంచి ముంబై వెళ్లినట్లు అంచనా. ప్రస్తుతం జిల్లాలోని ఏ పల్లెలో చూసినా.. పిల్లలు.. వారిని సంరక్షిస్తోన్న వృద్ధులే. ఇక, తాగేందుకు గుక్కెడు నీరు లేక జనాలతో సహా మూగ జీవాలు సైతం అల్లాడుతున్నాయి. పశుగ్రాసం..నీరూ అందించలేక రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. అదీ కుదరకపోతే కేబేళాలకు తరలిస్తున్నారు. ఇక కరువు కాటుకు వ్యవసాయ అనుబంధాలే కాదు..కుల వృత్తులూ కుదేలయ్యాయి. 

15:57 - April 30, 2016

విశాఖ : ఆయనో ఐఏఎస్..ఒక ప్రముఖ సంస్థకు వైస్ ఛైర్మన్ కూడా.. ఆయన ఇంటి ఎదురుగా ఒక పార్క్ ఉంది..మామూలుగా అయితే దానిని ఎవ్వరూ పట్టించుకోరూ..అయితే స్వయంగా ఆయన శాఖ నుంచి నిధులు విదిల్చి పీపీపీ పద్ధతిలో కాలనీ అసోషియేషన్ కు కట్టబేట్టేశారు..ఇలాగే వైజాగ్‌లో మిగతా పార్కులను కూడా మీరు అభివృద్ది చెయొచ్చు కదా అంటే ..అదంతా మా ఇష్టం అంటున్నారు ఆ సార్..

బాబూరావు పాండురంగా పురంలో నివాసం...

పనిచెసేదీ విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్ ఛైర్మన్ గా.. బాబూరావు పాండురంగా పురంలో నివాసం ఉంటున్నారు..ఆయన ఇంటికి ఎదురుగా 70 సెంట్ల పార్కు ఉంది..దా దాపు 97 లక్షలతో ఇటీవలే దీనిని అబివృద్ది చెయ్యడం జరిగింది..అత్యంత అధునాతనంగా ఎవెన్యూ, ప్లాంటేషన్, ఫ్లవర్ బెడ్స్, వాటర్ ట్రాక్, శాండ్ ఫిల్లింగ్, గ్రానైట్ బెంచిలు, పిల్లలు అడుకునే సామాగ్రీ, జిమ్, లైబ్రరీ, యోగా సెంటర్ లాంటివి నిర్మించారు. పైగా ఈ పార్క్‌ పాండురాంగాపురం హౌసింగ్ సోసైటీ అధ్వర్యంలో నడుస్తుంది.

వైస్‌ చైర్మన్‌ ఇంటికి ఎదురుగా ఉన్న పార్క్ ను మాత్రం..

ఇంత వరకూ బాగానే ఉన్నా ఈ పార్క్ అభివృద్దికి 64 లక్షలు సొసైటీ పెట్టుకోగా మరో 33 లక్షలు వుడా పెట్టుకుంది..అసలు అభ్యంతరం అంతా ఇక్కడే.. నగరంలో పార్కులు 100కు పైగానే ఉన్నాయి..వీటన్నింటిని వదిలి కేవలం ఉడా వైస్‌ చైర్మన్‌ ఇంటికి ఎదురుగా ఉన్న పార్క్ ను మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై మీడియా ప్రతినిధులు విశాఖ నగరంలో ఉన్న మిగిలిన పార్కులు కూడా ఇలా పీపీపీ పద్ధతిలో అభివృద్ది చెయ్యేచ్చా .అని ప్రశ్నించారు..దీనికి బాబురావు నాయుడు వింత సమాధానాలు ఇచ్చారు.

తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ప్రజాసంఘాలు..

పాండురంగాపురం పార్కుపై ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతున్నాయి..నిజంగా ఉడా వీసీ బాబురావు ఇష్టాను సారంగా వ్యవహరించారని అంటున్నారు. అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగ పరచకుండా ప్రజా ధనాన్ని సక్రమంగా వాడాలని ప్రజాసంఘాలు తెలుపుతున్నాయి. 

15:49 - April 30, 2016

ముంబై : ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బ్రాండ్‌లు, ట్రేడ్‌మార్క్‌లను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో వీటిని వేలం వేయగా.. ఒక్క బిడ్డర్‌ కూడా వేలం పాట పాడలేదు. దీంతో ఎవరూ దక్కించుకోకుండానే వేలం ముగిసింది. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో 17 మంది రుణదాతలు ఈ వేలం నిర్వహించారు. 366 కోట్ల 70 లక్షల ప్రారంభ ధరతో వేలం మొదలైంది. గంటసేపు గడిచినా.. ఒక్క బిడ్డర్‌ కూడా కొనేందుకు ముందుకు రాలేదు. గత నెలలో మాల్యాకు చెందిన ఇంటిని 150 కోట్లతో వేలం జరపగా.. ఎవరూ కొనుగోలు చేయలేదు. 17 బ్యాంకులకు దాదాపు 9వేల 5 వందల కోట్లు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నారు.

 

ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ పరీక్ష తేదీని ప్రకటిస్తా:: పాపిరెడ్డి

హైదరాబాద్: ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మే 15లోపు పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించమని తెలిపారు. నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నం. మిగితా సెట్స్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో సెంటర్లు పడిన విద్యార్థులకు మాత్రమే కొత్త హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పారు.

పెళ్లివాహనం బోల్తా: 10మందికి గాయాలు..

వరంగల్ : తాడ్వాయి మండలం మేడారం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది వరకు గాయాలపాలయ్యారు. మహారాష్ట్ర సిరోంచ పట్టణానికి చెందిన కొందరు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన పెళ్లికి హాజరయ్యారు. తెల్లవారుజామున వారు జీపులో మేడారం వెళ్తుండగా ఆ వాహనం తాడ్వాయి- మేడారం రహదారిలోని మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

14:42 - April 30, 2016

మెదక్‌ : పటాన్‌చెరు మండలం జేపీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్‌ షాపులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సిలిండర్లు పేలుతుండటంతో భయాందోళనకు గురౌతున్నారు. సమాచారం అందుకున్న ఘటనస్థలికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. 

14:41 - April 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా మేనెలలో మూడు రోజుల పాటు దీక్ష చేపడతానని చెప్పారు. కృష్ణా, గోదావరి డెల్టాను కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని జగన్‌ తెలిపారు. 

14:38 - April 30, 2016

హైదరాబాద్ : దేశానికి ప్రధాని మోడీ అయినా... రిమోట్‌ కంట్రోల్‌ ఆర్ ఎస్ ఎస్ చేతిలో ఉందన్నారు... కాంగ్రెస్‌ ఎంపీ వీ హనుమంతరావు.. ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.. మోడీ పీఎం అయ్యాక దేశంలో వచ్చిన మార్పేమీలేదని మండిపడ్డారు..

14:36 - April 30, 2016

కరీంనగర్: గల్ఫ్ లో దళారీల చేతిలో మోసపోయిన కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మహిళ అనురాధ ఎంపీ కవిత సహాయంతో జిల్లాకు చేరింది. 30 వేలు జీతం ఇప్పిస్తానని చెప్పి దుబాయ్ పంపించి.. అక్కడ నుండి మస్కట్ కు అమ్మేసారని.. అనురాధ తెలిపింది. అక్కడ నరకం చూశానని.. తన పాస్ పోర్టు లాగేసుకున్నారని.. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేయడంతో.. ఎంపీ కవిత విదేశాంగ శాఖ సహాయంకోరిందని తెలిపింది. మంత్రి సుష్మాస్వరాజ్ ఒమన్ ఎంబసీతో మాట్లాడి తనను విడిపించారంది. తనను దళారీల భారీ నుండి రక్షించినందుకు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపింది బాధిత మహిళ అనురాధ. 

14:33 - April 30, 2016

హైదరాబాద్ : ఢిల్లీలో డీజిల్‌ టాక్సీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కాలుష్య నియంత్రణలో భాగంగా డీజిల్‌ టాక్సీలను సిఎన్‌జిలోకి మార్చుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 30 వరకు సమయమిచ్చింది. ఆ గడువు ముగియడంతో మే ఒకటి నుంచి దేశ రాజధానిలో డీజిల్‌ టాక్సీలు నడపరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా డీజిల్‌ వాహనాలు సిఎన్‌జిలోకి మార్చుకునే టెక్నాలజీ అందుబాటులో లేదని టాక్సీ ఆపరేటర్లు కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో చాలా సమయం ఇచ్చామని, ప్రత్యామ్యాయంగా ఇతర మార్గాలు వెతక్కోకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అయితే ఢిల్లీ పోలీస్‌ శాఖకు డీజిల్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. వివిఐపిల భద్రత కోసం 2 వేల సిసి ఆ పైవరకు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ప్రత్యేక190 డీజిల్‌ వెహికిల్స్‌కు గ్రీన్‌సిగ్నల్స్‌ ఇచ్చింది. డీజిల్‌తో నడిచే వాటర్‌ ట్యాంకర్‌ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ జల్‌ బోర్డుకు కూడా కోర్టు అనుమతించింది.

14:32 - April 30, 2016

హైదరాబాద్ : కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీశాంత్‌ తన ఆస్తుల అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. తన ఆస్తుల మొత్తం విలువ 7 కోట్ల 73 లక్షలుగా పేర్కొన్నారు. 33 ఏళ్ల శ్రీశాంత్‌ చేతిలో ప్రస్తుతం 42 వేల 5 వందల నగదు, ఆయన సతీమణి వద్ద 35 వేల నగదు ఉన్నట్లు చూపారు. 1 కోటి18 లక్షల విలువ చేసే జాగ్వార్‌ ఎక్స్‌జేఎల్‌ కారు, 30 వేలు విలువ చేసే బైక్‌ ఉన్నట్లు తెలిపారు. ఇవి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుగా గెలిచుకున్న వాహనాలట. 3 లక్షల విలువ చేసే 55 సవర్ల బంగారు ఆభరణం, భార్య వద్ద 82 లక్షల విలువైన 375 సవర్ల బంగారం ఉందని పేర్కొన్నారు. వీటితో పాటు 5 లక్షల విలువ చేసే ప్రపంచకప్‌ పతకం, కోచిలోని ఎడపల్లిలో ఐదున్నర కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని వెల్లడించారు. 

ఐపీఎల్ మహారాష్ట్ర మ్యాచ్ ల రీషెడ్యూల్

హైదరాబాద్ : మహారాష్ట్రలోని ముంబై, నాగపూర్, పూణే నగరాలలో మే ఒకటి తర్వాత జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను...ఇండియన్ ప్రీమియర్ లీగ్ బోర్డ్ రీ షెడ్యూల్ చేసింది. విశాఖపట్నం, కాన్పూర్ నగరాలు వేదికగా మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించింది. ముంబైలో జరగాల్సిన ఫైనల్స్ ను బెంగళూరుకు కేటాయించింది. 

ఐపీఎల్ బిగ్ ఫైట్ కు హైదరాబాద్ రెడీ

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 27వ మ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభయ్యే ఈ కీలక సమరంలో పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో బెంగళూరు, పదునైన బౌలింగ్ ఎటాక్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

గీతారెడ్డి అధ్యక్షతన పిఏసీ భేటీ..

హైదరాబాద్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) భేటీ అయింది. ఇవాళ శాసనసభ కమిటీ హాల్‌లో ఛైర్మన్ గీతారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్పీకర్ మధుసూధనాచారితోపాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు.

13:54 - April 30, 2016

నల్గొండ : బరువు 650 గ్రాములు... సైజ్‌ పిడికెడంత.. సెల్‌ఫోన్‌కంటే కాస్త ఎక్కువ వెయిట్‌ఉన్న పాపకు అరుదైన వైద్యం చేశారు నల్లగొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు.. మూడు నెలలపాటు శ్రమించి పసికందును బతికించారు.. కార్పొరేట్‌ ఆస్పత్రులకంటే మెరుగైన వైద్యం అందించారు.. వైద్యులతోపాటు ఆస్పత్రి సిబ్బంది కన్నబిడ్డలా చూసుకుని శిశువుకు ప్రాణాలు పోశారు. 
పుట్టిన శిశువుకు అరుదైన వైద్యం
అతి తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు అరుదైన వైద్యం చేశారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. కన్న తల్లిదండ్రులకంటే ఎక్కువగా చూసుకుని పాపకు ప్రాణం పోశారు.. నాలుగు నెలలక్రితం మమత, శంకర్‌ దంపతులకు చిన్నారి జన్మించింది.. తల్లికి హైబీపీ రావడంతో ఆరున్నర నెలలకే ఆపరేషన్‌ చేసి ఈ బుజ్జాయిని బయటకు తీశారు.. అప్పుడు శిశువు బరువు 650 గ్రాములు.. పాపను చికిత్సకోసం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు.. చిన్నారి పరిస్థితిచూసిన డాక్టర్లు... హైదరాబాద్‌ తీసుకువెళ్లాలని సూచించారు.. చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు.. నగరంలో చికిత్స ఖర్చు తాము మోయలేమని.. ఇక్కడే ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని వైద్యులను కోరారు.. పాపను ఆస్పత్రిలో చేర్చి కన్నీటితో అక్కడినుంచి వెళ్లిపోయారు.. 
శిశువు శరీరం స్పందన
సాధారణంగా 650 గ్రాముల బరువున్న పిల్లలు జీవించడం కష్టం.. పైగా మిగతా పిల్లల్లాగా వీరు తల్లిపాలు తాగే శక్తి ఉండదు.. అయినా వైద్యులు పాపను బతికించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించారు.. డాక్టర్లు, నర్సులు, మిగతా సిబ్బందీ ఈ పసికందును తమ సొంత బిడ్డలా చూసుకున్నారు.. వీరి కృషితో శిశువు శరీరం స్పందించడం మొదలుపెట్టింది.. వెంటనే మరింత కేర్‌ తీసుకున్న వైద్యులు వివిధ రకాలుగా పాపకు ఆహారం అందించారు.. తల్లిపాలు తాగలేకపోవడంతో అమైనో యాసిడ్స్, లిపిడ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత  తల్లిదండ్రులకు కబురు పంపారు.. తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆస్పత్రిలోనే ఉండేలా చేశారు.. తల్లిపాలు సరిపోకపోతే... ఆస్పత్రిలోని మరికొందరు అమ్మలపాలు పట్టించారు. పసిగుడ్డు కోలుకుంటోందని అనుకుంటున్న సమయంలో మరో పెద్ద సమస్య వచ్చింది.. ఈ బంగారుతల్లికి కంటి చూపు సరిగాలేదని తేలింది.. ఈ విషయంలో మళ్లీ చొరవతీసుకున్న వైద్యులు ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రికి లేఖ రాశారు.. ఈ లెటర్‌పై స్పందించిన డాక్టర్ సుభద్ర జలాలే.. ఆపరేషన్ చేసేందుకు నల్లగొండ ఆస్పత్రికి వచ్చారు.. ఐదుగంటలపాటు కష్టపడి
రెండు కళ్లకు ఆపరేషన్ చేశారు..
సౌండ్‌ స్పా ద్వారా వివిధ రకాల శబ్దాలు
తొమ్మిది నెలలపాటు తల్లికడుపులోఉన్న బిడ్డ ఆ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది.. ఈ పాపకు అలాంటి అవకాశం దక్కలేదు.. దీనికీ మరో డాక్టర్‌ ఎవి శ్రీనివాసరావు మరో ప్రయోగం చేశారు.. సౌండ్‌ స్పా ద్వారా వివిధ రకాల శబ్దాలు వినిపించారు.. అలా బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేశారు.. ఇలా డాక్టర్ల కృషితో పాప బరువు దాదాపు 2 కిలోలకు చేరింది.. ఈ విషయం తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్‌ ఆస్పత్రిని సందర్శించారు.. వైద్యులను అభినందనలతో ముంచెత్తారు.. తన చేతులమీదుగా పసికందును తల్లికి అందించి ఆస్పత్రినుంచి ఇంటికి పంపారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకంటే మరింత మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో దొరుకుతుందని ఈ వైద్యులు నిరూపించారు.. చిన్నారిని బతికించి మానవత్వం చాటుకున్నారు.. 

13:49 - April 30, 2016

నిజామాబాద్ : తెలంగాణలో బీడీ కార్మికులు కదంతొక్కుతున్నారు. పుర్రె గుర్తును 85 శాతం పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని నిజామాబాద్  జిల్లాలో బీడీ కార్మికులు రోడ్డెక్కారు. నెలరోజులుగా ఆందోళన బాట పట్టిన కార్మికులు ఇక నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తం చేయనున్నారు.
బీడీ పరిశ్రమల పరిస్థితి దయనీయం
తెలంగాణలో బీడీ పరిశ్రమల పరిస్థితి దయనీయంగా తయారైంది. బీడీ కట్టలపై పుర్రె గుర్తును 85 శాతానికి కేంద్రం పెంచడంతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో నిజామాబాద్‌ జిల్లాలో బీడీ కార్మికులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న రంగం బీడీ పరిశ్రమ.ఈ పరిశ్రమ ఆధారంగా జిల్లాలో సుమారు 2.5లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వర్ధీ బీడీలు చుట్టే వారు 75-80వేల పైచిలుకు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి బీడీ పరిశ్రమను నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలో సుమారు 30-40 బీడీ కంపెనీలున్నాయి. గతంలో బీడీ కట్టలపై పుర్రె గుర్తును 85 శాతం పెట్టాలని నిర్ణయించడంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో 41శాతం పుర్రె గుర్తు పెట్టడానికి కేంద్రం వెనక్కి తగ్గింది. తాజాగా తిరిగి 85శాతం గుర్తు ఉండాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేయడంతో బీడీకార్మికులు ఆందోళన చెందుతున్నారు. 
పుణె, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో బీడీ పరిశ్రమలు
పుణె, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో బీడీ పరిశ్రమలు ఉన్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన సంస్థలు బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.  గతంలో కన్నా బీడీ పరిశ్రమలో కార్మికులకు కనీస పనిదినాలు కల్పించడం లేదు. నెలకు 20 రోజుల పని కూడా దక్కడం లేదు. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ తరుణంలో పని కల్పించకపోతే కార్మికుల బతుకు దుర్భరంగా మారే అవకాశం ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి. కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా  పుర్రె గుర్తు నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకుని తమకు న్యాయం చేయాలిన పలువురు కార్మికులు కోరుతున్నారు. బీడీ కార్మికుల పొట్టగొట్టడానికి అన్నివిధాలా ప్రయత్నాలు సాగుతున్నాయని వెంటనే పుర్రెపై 85 శాతం గుర్తు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీడీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికులకు పని కల్పిస్తూనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని.. యాజమాన్యాలు పరిశ్రమలను బంద్ చేసి తమను రోడ్డున పడేయొద్దని కార్మికులు విన్నవిస్తున్నారు.

13:45 - April 30, 2016

విజయనగరం : గురజాడ అప్పారావు నిలయాన్ని చారిత్రక సంపదగా తీర్చిదిద్దుతామని సమాచారశాఖ మంత్రి పల్లె రఘనాథ్ రెడ్డి అన్నారు. నగరంలోని గురజాడ ఇంటిని సందర్శించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయనగర సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే విజయనగరం పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా మలుస్తామని చెప్పారు. 

 

13:39 - April 30, 2016

మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌ అనగానే అటు ప్రేక్షకుల్లోను, ఇటు మహేష్‌ అభిమానుల్లోనూ భారీ అంచనాలుంటాయి. తాజాగా మరో సూపర్‌హిట్‌ చిత్రం కోసం ఈ కాంబినేషన్‌ సమాయత్తమవుతోంది. వీరి కాంబినేషన్‌లో రూపొందబోయే మూడో చిత్రానికి 'జనగణమన' అనే టైటిల్‌ నిర్ణయించినట్లు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. 'మహేష్‌బాబు, పూరీ కాంబినేషన్‌లో గతంలో 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌' చిత్రాలొచ్చాయి. 2006లో విడుదలైన 'పోకిరి' తెలుగు చిత్ర పరిశ్రమలోనే రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం వచ్చి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించడం ఆనందంగా ఉంది. అలాగే వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్‌' కూడా భారీ విజయాన్ని సాధించింది. గత చిత్రాల స్థాయి కంటే 'జనగణమన' పెద్ద హిట్‌ అవుతుంది' అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

మహిళకు ఆమెరికా కోర్టు వందేళ్ళ జైలు శిక్ష...

హైదరాబాద్‌ : ఓ మహిళకు ఆమెరికా కోర్టు వందేళ్ళ జైలు శిక్ష విధించింది. ఏడు నెలల గర్భవతి అయిన మిచెల్ విల్సిన్స్ పై దాడి చేసి, ఆమె గర్భంలోని శిశువును చిదిమేసిన ఆమెను.. కోర్టు దోషిగా నిర్థారించింది. హత్యాయత్నంతోపాటు, అశాస్త్రీయ గర్భస్రావానికి పాల్పడినందుకు వ్యతిరేకంగా ఆమెకు వందేళ్ళ జైలు శిక్ష విధించింది. గత మార్చి నెలలో తన ఇంటికి వచ్చిన 27 ఏళ్ళ మిచెల్‌ను దారుణంగా కొట్టిన 35 ఏళ్ళ విల్కిన్ ఆమె గర్భస్రావం చేసి బిడ్డను హత్య చేసింది. ఆశాస్త్రీయ గర్భస్రావంతో పాటు, బిడ్డను హత్య చేయడం, లేన్ అహంకార పూరిత, దుర్మార్గపు ప్రవర్తనకు నిదర్శనమని కోర్టు అభిప్రాయపడింది.

ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్‌ : జిల్లా పర్యటనలో మంత్రి జోగు రామన్న బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ పలుచోట్ల నిర్వహించిన మిషన్ కాకతీయ పనుల్లో జోగు రామన్న పాల్గొన్నారు. జైనథ్ మండలం గిమ్మలో చెరువు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఆదిలాబాద్ మండలం పంథోలి, అంకోలిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అంకోలి జెడ్పీహెచ్‌ఎస్‌లో అదనపు తరగతి గదులకు భూమిపూజ చేశారు.

13:30 - April 30, 2016

హైదరాబాద్ : వారిద్దరూ ఇష్టపడ్డారు..పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు..కాని ఆ పేరెంట్స్ మాత్రం కక్షగట్టారు. ప్రేమికులను విడదీసే ప్రయత్నం చేశారు..ఏ అవకాశం దొరక్కపోవడంతో అమ్మాయిని కిడ్నాప్ చేశారు..తన భార్యను రక్షించాలంటూ ప్రేమికుడు పోలీసులను ఆశ్రయించాడు..
వినయ్‌ బాబు...మమతా దేవి ప్రేమ పెళ్లి..
వినయ్‌ బాబు...మమతా దేవి... హైదరాబాద్‌లోని ప్రయివేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు వినయ్‌...అమ్మాయి తండ్రి రాజస్థాన్‌ జోధ్‌పూర్ చెందినవారు కావడంతో పాటు మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. మమత సోదరి వివాహం తర్వాత 2011లో హైదరాబాద్‌ వచ్చి కుత్బుల్లాపూర్‌లో ఉంటోంది. ఆ తర్వాత లేడీస్‌ హాస్టల్‌లో ఉంటున్న మమతకు వినయ్ పరిచయం..ప్రేమ అన్నీ జరిగిపోయాయి..
పెళ్లికి పెద్దల అడ్డంకులు..
ఇదిలా ఉంటే వినయ్‌కు మమత కుటుంబీకుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి..ఈ క్రమంలోనే మమత ఫ్యామిలీ కోర్టు నుంచి కూడా రక్షణ పొందింది... పనిమీద వినయ్ బయటకు వెళ్లడంతో అప్పటికే మాటువేసిన దుండగులు మమతను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
పోలీసులను ఆశ్రయించిన వినయ్..
భార్య కన్పించకపోవడంతో పాటు కారులో ఎత్తుకెళ్లిన విషయం తెలుసుకున్న వినయ్ వెంటనే అల్వాల్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రేమ పెళ్లి ఇష్టం లేని మమత కుటుంబీకులే ఈ పనిచేసి ఉంటారని అనుమానంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని పంపేందుకు రంగం సిద్ధం చేశారు.

13:22 - April 30, 2016

గుంటూరు : ఒకప్పుడు పచ్చని పైర్లతో ఆహ్లాదంగా ఉన్న ప్రాంతం.. భగభగ ఎండలు మండినా.. పంట పొలాల నుంచి వీచే చల్లని గాలులకు ఆ బాధే తెలిసేది కాదు. కానీ.. కాలం మారింది. పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఉదయం, సాయంత్రం చల్లగాలులకు రచ్చబండ దగ్గర హాయిగా కబుర్లు చెప్పుకునే ఆ గ్రామాల ప్రజలు నేడు మాట్లాడుదామన్నా కనిపించకపోవడం విశేషం. మండే ఎండలకు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాల్లో ప్రజలకు అల్లాడిపోతున్నారు. 
బయటకు రావాలంటే బయపడుతున్న ప్రజలు 
పచ్చని పొలాలు.. చల్లని గాలులు.. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నా.. పంట పొలాల నుంచి వీచే గాలులతో అక్కడ వాతావరణం చల్లగా ఉండేది. ఇదంతా గతం.. ప్రస్తుతం నవ్యాంధ్ర రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల్లో పరిస్థితి మారిపోయింది. వ్యవసాయం లేకపోవడంతో చల్లని గాలులు మాయమాయ్యాయి. దీంతో భానుడు విజృంభిస్తున్నాడు. ఉదయం 10 గంటలు దాటితే చాలు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఏ పని ఉన్నా ఉదయం.. సాయంత్రం వేళల్లోనే చేసుకోవాల్సి వస్తోంది. 
ఇబ్బందులు పడుతున్న కూలీలు 
మరోవైపు ఈ ప్రాంతంలో.. రోడ్లన్నీ కొత్తగా వేయడంతో వేడి పొగలు సెగలు కక్కుతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రజలంతా ముఖానికి ఖర్చీఫ్‌లు కట్టుకొని, నెత్తిపై గుడ్డలు వేసుకుని వెళ్తున్నారు. గతంలో పొలం పనులు చేసుకుని హ్యాపీగా గడిపిన కూలీలు.. నేడు తాపీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే.. అప్పట్లో ఎండలు ఉన్నా.. పొలాలు ఉండడంతో తెలిసేదీ కాదని.. ప్రస్తుతం పొలాలు లేకపోవడంతో ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామంటున్నారు. 
మూగజీవుల పరిస్థితి మరింత దారుణం 
ఇక ఈ గ్రామాల్లో మూగజీవుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఓవైపు మండే ఎండలు.. మరోవైపు మేత లేకపోవడంతో పశువులు అల్లాడిపోతున్నాయి. ఎండలకు తట్టుకోలేక చెట్ల చెంతకు చేరుతున్నాయి. చిన్న చెరువులు, కుంటలు కనిపిస్తే అందులోనే సేద తీరుతున్నాయి. 
నష్టాలు వస్తున్నాయని ఆవేదన 
మరోవైపు ఎండల కారణంగా రోడ్లపై వ్యాపారం చేసుకునే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలులకు తట్టుకోలేక వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామంటున్నారు. ఇక వేడికి తెచ్చిన పండ్లు త్వరగా పాడైపోయి.. భారీగా నష్టాలు వస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. 
ఎండ వేడిమికి విలవిల
మొత్తానికి ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన ప్రాంతం నేడు.. ఎండ వేడిమికి విలవిలలాడుతోంది. ఓవైపు నవ్యాంధ్ర రాజధాని పేరుతో అభివృద్ధి జరుగుతున్నా.. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడే ఇలా వుంటే.. భవిష్యత్‌లో పరిస్థితి ఎలా వుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 

13:16 - April 30, 2016

ఢిల్లీ : నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఎస్ ఈ సిలబస్ ఉంది కనుక పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని విద్యార్థులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. విద్యార్థుల పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మే1 న తొలి దశ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. జూన్ 4న రెండో దశ పరీక్ష జరుగనుంది. ఆగస్టు 7 న నీట్ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి.

నీట్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు....

ఢిల్లీ : నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఎస్ ఈ సిలబస్ ఉంది కనుక పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని విద్యార్థులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. విద్యార్థుల పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మే1 న తొలి దశ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. జూన్ 4న రెండో దశ పరీక్ష జరుగనుంది. ఆగస్టు 7 న నీట్ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి.
 

 

వరంగల్ లో విషాదం...

వరంగల్‌ : జిల్లాలో విషాదం నెలకొంది. తాటిచెట్టుకూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం శ్రీపూర్‌లో తల్లి రాణమ్మతోపాటు కొడుకు శ్రీకాంత్, కూతురు అశ్విని ఆరు బయట నిద్రిస్తున్నారు. గాలి దుమారం రావడంతో ఇంటి  ఆవరణంలో ఉన్న తాటి చెట్టు విరిగి వారిపై పడింది. దీంతో తల్లి, కూతరు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్ కు  తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి 
తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముగ్గురి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. రాణి భర్త గత సంవత్సరమే మృతి చెందాడు. 

13:00 - April 30, 2016

కర్నాటక : బెంగళూరులో మొట్టమొదటి భూగర్భ మెట్రో రైల్ 'నమ్మ మెట్రో' త్వరలోనే నగర వాసులకు అందుబాటులోకి రానుంది. కోట్లాది రూపాయలతో ప్రారంభించిన ఆ మెగా ప్రాజెక్టులోని భూగర్భ విభాగాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.
తీరిపోనున్న బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలు 
బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి. అండర్‌గ్రౌండ్‌ మెట్రో రైలు ప్రాజెక్టు లోని భూగర్భ సొరంగ మార్గాన్ని శుక్రవారం ప్రారంభించారు. 42 కిలోమీటర్ల లైన్ లో 5 కిలోమీటర్ల పొడవు భూగర్భంలో... విధాన సభతోపాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలగుండా ఈ లైన్ కొనసాగుతుంది. 
మెట్రో  స్టేషన్‌ కు ప్రత్యేక ఏర్పాటు 
బెంగళూరు విధానసౌధలో పనిచేసే వేల మంది సిబ్బంది సౌకర్యం కోసం ఓ మెట్రో  స్టేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నారు. కొత్త భూగర్భ రైలు మార్గం వినియోగంలోకి రావడం వల్ల..  బెంగళూరు పశ్చిమాన ఉన్న  మైసూర్ రోడ్ నుంచి తూర్పున బైప్పనహళ్లి  వరకు సుమారు 18 కిలోమీటర్ల ప్రయాణానికి 33 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పటివరకూ ఈ మార్గంలో రోడ్డు మార్గాన గంటలకొద్దీ సమయం పట్టేది. కొత్త భూగర్భ మెట్రో రైళ్లు.. ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 వరకూ ప్రతి పది నిమిషాలకు ఈ మార్గంలో రైళ్ళు నడుస్తుంటాయి.
భూగర్భంలోని రాతిని తొలిచి సొరంగ రైలు మార్గం ఏర్పాటు 
భూగర్భంలోని రాతిని తొలిచి ఈ సొరంగ రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5 కిలోమీటర్ల పొడవున తవ్వాల్సిన ఈ నూతన రైలు మార్గానికి జపాన్ యంత్రాలు హెలెన్, మార్గరీటాలను వినియోగించారు. ఈ యంత్రాలతో సొరంగం తవ్వడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. ఈ కొత్త భూగర్భ రైల్ విషయంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంశం ఓ సమస్యగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు. నగరంలోని ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్లకు కూడ సరైన కనెక్టివిటీ లేకపోవడం కూడా లోపంగా చెబుతున్నారు. 

 

12:56 - April 30, 2016

ఆదిలాబాద్ : కొత్త తరానికి బొమ్మల్లో చూపించడమే తప్ప మరెక్కడా కనిపించని పక్షిరాజం అది. జీవ వైవిధ్యం పతనావస్థకు సూచికలవి.. ఒకప్పుడు ఊరిచివర గుంపులుగా కనిపించిన ఈ పక్షులు అంతరించిపోతున్న జీవాలుగా మారాయి. అవి మరేంటోకావు.. రాబందులు. ప్రపంచంలోనే అరుదైన పక్షిజాతిగా పేరొందిన రాబందులు ఆదిలాబాద్‌ దట్టమైన అటవిలో ప్రత్యక్షమయ్యాయి. రాతి గుట్టల్లో నివాసం ఏర్పర్చుకున్న ఈ పక్షులపై టెన్ టివి ఎక్స్ క్లూజీవ్‌గా కెమెరాలతో బంధించింది.
రాబందులు..
అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న జీవులు రాబందులు.  గతంలో గ్రామాల పొలిమేరల్లో గుంపులు గుంపులుగా దర్శనమిచ్చే రాబందులు మానవ తప్పిదాలతో దాదాపు కొనమరుగయ్యాయి. 
దేశంలో మొత్తం తొమ్మిది రాబందు జాతులు 
దేశంలో మొత్తం తొమ్మిది రాబందు జాతులుంటే అందులో రెండు జాతులు, వీటిలో పొడుగు ముక్కు రాబందు జాతి మనుగడ ప్రమాదంలో పడినట్లు అంతర్జాతీయ ప్రకృతి -సహజవనరుల పరిరక్షణ సంస్థ ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ఈ రాబందులు కనుమరుగయినట్లు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి  ప్రకటించిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ అడవుల్లో వీటి ఉనికిని కనుగొనడడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు ఇక్కడ 30 రాబందులున్నట్లు స్థానిక అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతరించి పోయాయనుకున్న రాబందులు రాష్ట్రంలో తిరిగి కనిపించడం శుభ పరిణామం...
క్రమంగా పెరుగుతున్న రాబందుల సంఖ్య 
దేశంలో వేగంగా అంతరించి పోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు రాబందుల సంరక్షణ ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. గతేడాది 19 పెద్ద రాబందులు, ఎనిమిది చిన్న రాబందులున్నట్లు గుర్తించిన అధికారులు, ఈ ఏడాది పెద్ద రాబందుల సంఖ్య 30 వరకు పెరిగినట్లు తేల్చారు. చిన్నవి ఆరు ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు అంతరించి పోతున్నాయి. ఈ విధంగా జాతులు అంతరించిపోతే జీవం మనుగడే ప్రమాద మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించడం గమనార్హం. 

 

12:50 - April 30, 2016

వరంగల్‌ : జిల్లాలో విషాదం నెలకొంది. తాటిచెట్టుకూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం శ్రీపూర్‌లో తల్లి రాణమ్మతోపాటు కొడుకు శ్రీకాంత్, కూతురు అశ్విని ఆరు బయట నిద్రిస్తున్నారు. గాలి దుమారం రావడంతో ఇంటి  ఆవరణంలో ఉన్న తాటి చెట్టు విరిగి వారిపై పడింది. దీంతో తల్లి, కూతరు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్ కు  తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి 
తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముగ్గురి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. రాణి భర్త గత సంవత్సరమే మృతి చెందాడు. 

అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీ దగ్గర ఉద్రిక్తత

విశాఖ : జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కంపెనీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంపెనీ దగ్గర మహిళా కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికుల వేతన పెంపు గడువు నేటితో ముగిసింది. అయితే వేతనాలు పెంచేది లేదని యాజమాన్యం తేల్చి చెప్పడంతో మహిళా కార్మికులు కంపెనీ దగ్గర నిరసనకు దిగారు. ఉదయం నుంచే మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు.

12:34 - April 30, 2016

నెల్లూరు : జిల్లాలోని కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారిపై లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళగిరి నుంచి తిరుమల వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. 

12:29 - April 30, 2016

విశాఖ : జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కంపెనీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంపెనీ దగ్గర మహిళా కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికుల వేతన పెంపు గడువు నేటితో ముగిసింది. అయితే వేతనాలు పెంచేది లేదని యాజమాన్యం తేల్చి చెప్పడంతో మహిళా కార్మికులు కంపెనీ దగ్గర నిరసనకు దిగారు. ఉదయం నుంచే మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు.
మహిళలు..
పోలీసులు దౌర్జన్యం చాలా దుర్మార్గంగా ఉంది. ప్రజా ప్రతినిధులు, పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తే.. విధుల్లోకి వచ్చే విధంగా చేస్తున్నారు. కంపెనీలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. బ్రాండెక్స్ లోకి వెళ్లనీయడం లేదు. పోలీసులు రౌడీలుగా వ్యవహరిస్తున్నారు. కొవ్వు ఎక్కి మహిళలు ధర్నా చేస్తున్నారని పోలీసులు దుర్భాషలాడుతున్నారని అంటున్నారు. లాఠీ చార్జీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు 144 విధించారని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఆందోళనకు విరమించాలని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే దాకా ఆందోళన విరమించబోమని చెబుతున్నారు. 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

12:21 - April 30, 2016

విశాఖ : అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ కంపెనీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వేతనాలు పెంచాలని కార్మికులు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. వేతనాలు పెంచేది లేదని యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు వేతనాల పెంపు కార్మికులు భారీ ఎత్తున ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అత్యంత దమనకాండ ప్రదర్శిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్తున్నారు. అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా మహిళలను వ్యాన్ లో ఎక్కిస్తున్నారు.
మహిళలు..
పోలీసులు దౌర్జన్యం చాలా దుర్మార్గంగా ఉంది. ప్రజా ప్రతినిధులు, పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తే.. విధుల్లోకి వచ్చే విధంగా చేస్తున్నారు. కంపెనీలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. బ్రాండెక్స్ లోకి వెళ్లనీయడం లేదు. పోలీసులు రౌడీలుగా వ్యవహరిస్తున్నారు. కొవ్వు ఎక్కి మహిళలు ధర్నా చేస్తున్నారని పోలీసులు దుర్భాషలాడుతున్నారని అంటున్నారు. లాఠీ చార్జీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు 144 విధించారని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఆందోళనకు విరమించాలని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే దాకా ఆందోళన విరమించబోమని చెబుతున్నారు. 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు : జగన్

హైదరాబాద్ : ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుందన్నారు. ప్రజలు కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రత్యేకహోదాపై ప్రశ్నించేవారు లేరని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లుగా కేంద్రమంత్రి మాట్లాడుతున్నారని చెప్పారు. సమస్యను మరింత పెద్ద చేసిదీగా ఉందన్నారు. ఎపికి ప్రత్యేకహోదా వస్తుందా...? రాదా... ? అనే సందిగ్ధంగా ఉందన్నారు. 

చంద్రబాబుపై జగన్ ఫైర్

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విమర్శల వర్షం కురిపించారు. ప్రత్యేకహోదా అంశంపై బాబు తీరును జగన్ ఎండగట్టారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మేశారని జగన్ విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా అంశాన్ని సీఎం నీరుగార్చరని ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఫణంగా పెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయలేకపోతున్నారని అడిగారు. ఎన్నికల ముందు ప్రత్యేకహోదాపై చంద్రబాబు, మోడీ ఎన్నో ఉపన్యాసాలు చేశారు.

12:02 - April 30, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విమర్శల వర్షం కురిపించారు. ప్రత్యేకహోదా అంశంపై బాబు తీరును జగన్ ఎండగట్టారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మేశారని జగన్ విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా అంశాన్ని సీఎం నీరుగార్చరని ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఫణంగా పెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయలేకపోతున్నారని అడిగారు. ఎన్నికల ముందు ప్రత్యేకహోదాపై చంద్రబాబు, మోడీ ఎన్నో ఉపన్యాసాలు చేశారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మ్యానిఫెస్టోలో పొందుపర్చారని పేర్కొన్నారు. 
ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు 
రాష్ట్రంలో కరువు తాండవిస్తుందన్నారు. ప్రజలు కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రత్యేకహోదాపై ప్రశ్నించేవారు లేరని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లుగా కేంద్రమంత్రి మాట్లాడుతున్నారని చెప్పారు. సమస్యను మరింత పెద్ద చేసిదీగా ఉందన్నారు. ఎపికి ప్రత్యేకహోదా వస్తుందా...? రాదా... ? అనే సందిగ్ధంగా ఉందన్నారు. 

11:53 - April 30, 2016

తిరుమల : బాకరాపేట అటవీప్రాంతంలో టాస్క్ ఫోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఒకరిని అరెస్టు చేశారు. 73 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

 

బాకరాపేట అటవీప్రాంతంలో టాస్క్ ఫోలీసులు కూంబింగ్

తిరుమల : బాకరాపేట అటవీప్రాంతంలో టాస్క్ ఫోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఒకరిని అరెస్టు చేశారు. 73 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

 

క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ఎస్వోటీ దాడులు

హైదరాబాద్ : సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ లలితాటవర్ వద్ద క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లతోపాటు రూ.5.30 లక్షల నగదు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి వాహనం బోల్తా..10 మందికి గాయాలు

వరంగల్‌ : జిల్లాలోని తాడ్వాయిలో తెల్లవారుజామున పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివాహం అనంతరం మహరాష్ట్రకు తిరిగివెళ్లే క్రమంలో తాడ్వాయి మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెళ్లికొడుకు తల్లి, బందువులకు తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరిచించి చికిత్స అందించారు.

 

10:39 - April 30, 2016

అనంతపురం : పుట్టపర్తి ఉడా వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై ఎసిబి దాడులకు పాల్పడింది. రూ.1.30 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. రెండు కార్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్, బెంగుళూరు, 
అనంతపురం, హిందూపురంలలో రామాంజనేయులపై అక్రమాస్తులు కలగివున్నట్లు సమాచారం..

పుట్టపర్తి ఉడా వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై ఎసిబి దాడులు

అనంతపురం : పుట్టపర్తి ఉడా వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై ఎసిబి దాడులకు పాల్పడింది. రూ.1.30 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. రెండు కార్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్, బెంగుళూరు, అనంతపురం, హిందూపురంలలో రామాంజనేయులపై అక్రమాస్తులు కలగివున్నట్లు సమాచారం..

 

10:23 - April 30, 2016

ఇండియన్ ప్రీమియర్ లీగ్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 27వ మ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఇవాళ  రాత్రి 8 గంటలకు ప్రారంభయ్యే ఈ కీలక సమరంలో పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో బెంగళూరు, పదునైన బౌలింగ్ ఎటాక్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.......
హాట్ హాట్ గా ఐపీఎల్ తొమ్మిదోసీజన్ సమరం 
అరవై మ్యాచ్ లో ఐపీఎల్ తొమ్మిదోసీజన్ సమరం హాట్ హాట్ గా మారింది. ప్రారంభమ్యాచ్ లు ముగిసే కొద్దీ.. దేశంలోని సమ్మర్ హీట్ తో సమానంగా...ఐపీఎల్ మ్యాచ్ లు సైతం వేడెక్కుతున్నాయి. ప్రస్తుత సీజన్ మొదటి 25 మ్యాచ్ లూ ముగిసే సమయానికి...హైదరాబాద్ సన్ రైజర్స్ ఆరు రౌండ్లు ఆడి మూడు విజయాలు, మూడు పరాజయాలతో...లీగ్ టేబుల్ ఐదోస్థానంలో కొనసాగుతోంది.
బెంగుళూరు... పేరు గొప్ప ఊరు దిబ్బ 
మరోవైపు...విరాట్ కొహ్లీ, గ్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ లాంటి హేమాహేమీలతో కూడిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పరిస్థితి మాత్రం...పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారయ్యింది. ఇప్పటి వరకూ ఆడిన ఐదురౌండ్లలో రెండు విజయాలు, మూడు పరాజయాలతో రాయల్ చాలెంజర్స్....లీగ్ టేబుల్ ఏడోస్థానానికి పడిపోయింది. డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలింగ్ లో పటిష్టంగా ఉంటే....విరాట్ కొహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ లో అమేయంగా ఉంది. బౌలింగ్ బలహీనంతో బెంగళూరు, బ్యాటింగ్ లో నిలకడలేమితో హైదరాబాద్ సతమతమవుతున్నాయి. కీలకమ్యాచ్ ల్లో చతికిలపడుతూ అయోమయంలో చిక్కుకొన్నాయి.
బెంగళూరు కు భంగపాటు తప్పడం లేదు
180కి పైగా భారీస్కోర్లు సాధిస్తున్నా...బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు భంగపాటు తప్పడంలేదు. అపారఅనుభవం ఉన్న వాట్సన్ తో సహా ప్రధానబౌలర్లు ఎవ్వరూ తమజట్టుకు అండగా నిలువలేకపోతున్నారు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ క్రిస్ట్ జోర్డాన్ రాకతో...బెంగళూరు బౌలింగ్ పదును తేలే అవకాశాలు లేకపోలేదు. హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, బ్యాటింగ్ లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ ల పైన మాత్రమే పూర్తిగా ఆధారపడటం...ఆజట్టు కొంపముంచుతోంది. హోంగ్రౌండ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పూణే సూపర్ జెయింట్స్ తో ముగిసిన పోటీలో ఘోరపరాజయం పొందిన సన్ రైజర్స్...ఇప్పుడు బెంగళూరుతో డూ ఆర్ డై సమరానికి సిద్ధమయ్యింది. ఇక...ఈ బిగ్ ఫైట్ కోసం హైదరాబాద్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్ , వాట్సన్ లాంటి మేటి క్రికెటర్ల విన్యాసాలు చూడాలని తహతహలాడుతున్నారు. రాజీవ్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 38 వేలు కాగా...అభిమానుల కోసం అందుబాటులో ఉంచిన ఈ మ్యాచ్ టికెట్లన్నీ కొద్దిరోజుల క్రితమే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
కీలకం కానున్న టాస్ 
బౌలింగ్ కు అత్యంత అనువుగా ఉండే రాజీవ్ స్టేడియం పిచ్ పై 170కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. మరోసారి టాస్ సైతం కీలకం కానుంది. ఇప్పటి వరకూ ఆడిన ఆరురౌండ్లలో ఐదుసార్లు టాస్ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్..ఆరోసారి టాస్ నెగ్గితే...మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజేతగా నిలవాలంటే వార్నర్ తో పాటు..మోర్గాన్, శిఖర్ ధావన్, హెన్రికేస్, నమన్ ఓజా , దీపక్ హుడా లాంటి ప్రధాన ఆటగాళ్లు తమవంతు పాత్ర నిర్వర్తించక తప్పదు. అదే...బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మ్యాచ్ విన్నర్ గా నిలవాలంటే మాత్రం..బ్యాటింగ్ తో సమానంగా బౌలింగ్ లోనూ నిలకడగా రాణించక తప్పదు. అభిమానులంతా ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈమ్యాచ్...హోరాహోరీనా లేక..ఏకపక్షమా తెలుసుకోవాలంటే మాత్రం...శనివారం రాత్రి వరకూ వేచిచూడక తప్పదు.

09:42 - April 30, 2016

రాజస్థాన్ : కలుషిత మంచినీరు రాజస్థాన్‌లో 11 మందిని కబళించింది. జైపూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న  వికలాంగుల వసతిగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏడుగురు  15 ఏళ్లలోపు వయసు బాలలే. 
రాజస్థాన్‌లో తీవ్ర మంచినీటి ఎద్దడి 
కరవు తాండవిస్తున్న రాజస్థాన్‌లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. రాష్ట్ర రాజధాని జైపూర్‌ సహా  19 జిల్లాలు దుర్భిక్షం బారిన పడ్డాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కలుషిత తాగునీరే జనానికి దిక్కయ్యింది. ఈ నీటిని తాగుతున్న ప్రజలు అనార్యోగ్యంతో మృత్యువాత పడుతున్నారు. జైపూర్‌లో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. 
11 మంది మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వీరంతా మానసిక, శారీరక వికలాంగులు. జైపూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతిగృహంలో ఉంటున్నారు. ఈ హాస్టల్‌లో సరైన మంచినీటి వసతిలేదు. దీంతో బోరునీరే ఆధారం. అవికూడా కులుషితమైపోయాయి. ఈ నీటిని తాగిన హాస్టల్‌లోని వికలాంగులు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రాజస్థాన్‌  ముఖ్యమంత్రి వసుంధరరాజే విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించారు. 
ఒడిశాలో కలుషిత నీటికి ఇద్దరు బలి 
రాజస్థాన్‌లోనే కాదు... దేశంలోని  చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలోని కియోంజ్‌హార్‌ జిల్లాలో కూడా కలుషిత నీరు తాగి ఈనెల 20న  ఇద్దరు మరణించారు. ఇలా వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని మాత్రమే.  బయటకు పొక్కనవి చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆహార, నీటి సంబంధమైన వ్యాధులతో  ఏటా మనదేశంలో ఐదేళ్లలోపు బాలలు 1.25 లక్షల మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు ఇలాంటి ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

 

09:36 - April 30, 2016

హైదరాబాద్ : కోల్‌ స్కాంలో దాసరి నారాయణరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో దాసరి, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాతో పాటు 13 మందిపై చార్జిషీటు దాఖలు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. దాసరి, మధుకోడా ముడుపులు అందుకున్నారని చార్జిషీటులో సిబిఐ పేర్కొంది.
కోల్‌ స్కాంపై సీబీఐ ప్రత్యేకకోర్టులో విచారణ 
కోల్‌ స్కాంపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, మాజీ సిఎం మధుకోడా, మాజీ బొగ్గు కార్యదర్శి హెచ్‌సి గుప్తాలతో పాటు 13 మందిపై అభియోగాలు నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
క్విడ్‌ప్రోకో కింద 2కోట్ల నగదు బదిలీ 
దాసరి బొగ్గుశాఖ సహాయమంత్రిగా ఉన్న సమయంలో జార్ఖండ్‌లోని అమర్‌కొండా, మురగదంగల్ కోల్‌బ్లాక్‌ను జిందాల్ కంపెనీకి అక్రమంగా కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. జిందాల్ కంపెనీ నుంచి దాసరికి చెందిన కంపెనీకి 2కోట్ల నగదు క్విడ్‌ప్రోకో కింద బదిలీ జరిగినట్లు ఆధారాలను సీబీఐ సేకరించింది.  
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అక్రమాలు
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ గత ఏడాది ఏప్రిల్‌లో జిందాల్‌, మధుకోడా, దాసరి, హెచ్‌సి గుప్తాలోతో పాటు మరో ఆరుగురిపై సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆరుగురు సభ్యుల్లో దాసరికి చెందిన సౌభాగ్యమీడియా లిమిటెడ్ ఎండీ కె.రామకృష్ణప్రసాద్, చార్టెడ్‌ అకౌంటెంట్‌ జ్ఞానస్వరూప్ కూడా ఉన్నారు. మరో నలుగురు ఢిల్లీకి చెందిన డైరెక్టర్లు సురేష్ సింగాల్, రాజీవ్‌జైన్, గిరీష్‌ కుమార్‌ జునేజా, ఆర్‌కె సరఫ్‌ ఉన్నారు. ఐదు ప్రయవేటు కంపెనీల్లో నాలుగు ఢిల్లీవి ఒకటి హైదరాబాద్‌కు చెందింది.
మన్మోహన్‌సింగ్‌కు క్లీన్‌ చిట్‌
రాజ్యసభ మాజీ ఎంపీ దాసరి నారాయణరావు 2006-09 మధ్యకాలంలో మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చి గనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కేటాయింపులపై మాజీ ప్రధాని మన్మోహనే తుది నిర్ణయం తీసుకున్నారని దాసరి సిబిఐ కోర్టుకు తెలిపారు. కోల్‌ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదని, జిందాల్‌ గ్రూప్‌లకు బొగ్గు క్షేత్రాలు కేటాయించింది మన్మోహనేని దాసరి పేర్కొన్నారు. అయితే సిబిఐ కోర్టు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

09:17 - April 30, 2016

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏం ప్యాకేజీలు ఇవ్వదలచుకున్నారో చెప్పాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, బిజెపి నేత అల్జాపూర్ శ్రీనివాస్, టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కేంద్రం నుంచి ఆందాల్సినంత సహాయం అందడం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:09 - April 30, 2016

ఖమ్మం : జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ ఎన్నికకు 16 మంది అభ్యర్థులు 25 సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. చివరిరోజైన శుక్రవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా తుమ్మల, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సుచరితారెడ్డి, వామపక్షాల అభ్యర్ధిగా సీపీఎం నేత పోతినేని సుదర్శన్‌లు నామినేషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. ఈరోజు నామినేషన్లను పరిశీలించనున్నారు. మే 2వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మే 16న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికకు పోలింగ్‌ సమయాన్ని పెంచాలని ఈసీ నిర్ణయించింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ఇక ఈ ఎన్నిక ఫలితం మే 19న వెల్లడికానుంది.

 

08:52 - April 30, 2016

గుంటూరు : ఎయిమ్స్ రాకతో మంగళగిరికి మహర్ధశ పడుతుందని ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ప్రజలను నమ్మించేందుకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన పనిలేదంటూ అరచేతిలో వైకుంఠం చూపించినంత పనిచేశారు. కానీ ఇంతవరకు టెండర్లే పిలవకపోవడంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు నీలినీడలు అలముకుంటున్నాయన్న అనుమానాలను గుంటూరు జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపనకే పరిమితమైన మంగళగిరి ఎయిమ్స్ పై 10 టీవీ ప్రత్యేక కథనం. 
గతేడాది డిసెంబర్‌ 19న శంకుస్థాపన
ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ.. ఎయిమ్స్ తరహా ఆస్పత్రులను అన్ని రాష్ట్రాలలో నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. దీనిలో భాగంగా ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. గతంలో ఉన్న టీబీ ఆస్పత్రి స్థలాన్ని ఎయిమ్స్‌ కోసం ఇచ్చారు. దీని నిర్మాణానికి గతేడాది డిసెంబర్‌ 19న ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. 
టెండర్లే పిలువలేదు..
మంగళగిరి ఎయిమ్స్‌కు శంకుస్థాపన వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే దీని పురోగతిపై అతీగతీ లేదు. శిలాఫలకం వేసి నాలుగు నెలలు గడచినా... కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దీనికి టెండర్లు కూడా పిలువలేదు. మొదటి నాలుగేళ్లలో దీనిని పూర్తి చేయాలనుకున్నారు. కానీ అలా అయితే ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో ఏడాదిన్నర లేదా రెండేళ్లలోనే అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. ఎయిమ్స్‌ బోధనా ఆస్పత్రి కావడంతో...  వైద్య విద్యా కోర్సులు, చికిత్సా విభాగాలను ముందుగా ప్రారంభించాలనుకున్నారు.  కానీ ఇంతవరకు టెండర్ల ప్రక్రియే ప్రారంభం కాకపోవడంతో మంగళగిరి ఎయిమ్స్‌ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి నెలకొందని జనం నిట్టూరుస్తున్నారు. 
స్థల వివాదంతో కొంత కాలం జాప్యం 
మంగళగిరి ఎయిమ్స్‌కు ఆది నుంచి అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. స్థల వివాదంతో కొంత జాప్యం జరిగింది. ఈ సమస్య పరిష్కారమైనా  గుంటూరు, కృష్ణా జిల్లా రాజకీయ నాయకుల మధ్య ప్రాంతీయ విబేధాలతో మరికొంత కాలం ఆలస్యమయ్యింది. అన్ని అవాంతరాలను అధిగమించి శంకుస్థాపన చేసిన తర్వాత కూడా నిర్మాణాలు ప్రారంభం కాపోవడంతో ఎయిమ్స్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. మంగళగిరి ఎయిమ్స్‌ కోసం 198 ఎకరాలు కేటాయించారు. 1620 కోట్ల రూపాయల వ్యయంతో 900 పడకల  బోధనా ఆస్పత్రి నిర్మించాలనుకున్నారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం పట్ల ప్రజలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతికి అతిసమీపంలో ఉన్న మంగళగిరిలో ఎయిమ్స్ పూర్తైతే ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆశించారు. పేదలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అనుకున్నారు. కానీ  నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో సంజీవని లాంటి ఎయిమ్స్‌ ఎప్పుడు వస్తుందా.. అంటూ ఎదురు చూడమే మినహా... చేసేదేమీలేదంటూ నిట్టూరుస్తున్నారు. రాష్ట్ర పాలకులు ... కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎయిమ్స్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

08:44 - April 30, 2016

హైదరాబాద్ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంత్రివర్గంలో చేరితే కేబినెట్‌ బలోపేతం అవుతుందని అందరూ భావించారు. ఆయనకు ఐటీ, యువజన సర్వీసుల శాఖ అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే 2019 వరకు మంత్రివర్గంలో చేరే ఉద్దేశంలేదని లోకేష్‌ చెబుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం నీరుకారిపోయినట్టు అయిందని భావిస్తున్నారు. యువనేత లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏపీకి చెందిన చాలా మంది టీడీపీ నేతలు కోరారు. ఒకరిద్దరైతే ఆయన కోసం పదవీ త్యాగానికి కూడా ముందుకొచ్చారు. ఇలాంటి వారిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందున్నారు. మంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన అన్ని అర్హతలు లోకేష్‌కు ఉన్నాయని ఊదరగొట్టారు.
మంత్రిపదవిపై జరుగుతున్న ప్రచారమంతా మీడియా సృష్టే
నేతల ప్రచారం ఎలావున్నా లోకేష్‌కు మాత్రం ఇప్పుడే మంత్రివర్గంలో చేరే ఉద్దేశంలేనట్టు కనిపిస్తోంది. ఇటీవల మీడియా ప్రతినిధులు లోకేష్‌ దగ్గర ఇదే విషయం ప్రస్తావించినప్పుడు సున్నితంగా తిరస్కరించారు. మంత్రిపదవిపై జరుగుతున్న ప్రచారమంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. టీడీపీ నేతలు చేసిన బహిరంగ ప్రకటనలు గురించిన ప్రస్తావించినప్పుడు.. అదంతా అభిమానమేనంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీనిని బట్టిపరిశీలిస్తే లోకేష్‌కు ఇప్పుడే మంత్రివర్గంలో చేరే ఉద్దేశంలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తండ్రిబాటలోనే నడవాలనుకుంటున్న లోకేష్‌
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌ ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి వ్యవహారాలు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. దీనివలన పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబధాలు పెరగడంతోపాటు.. వీరి కష్టసుఖాలను నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తోంది. కార్యకర్తలే పార్టీకి కీలకం కావడంతో ఎప్పటికప్పుడు వీర సంక్షేమం కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు. నిరుపేద కార్యకర్తల కుటుంబ సభ్యుల వివాహాలకు మంగళ సూత్రాలు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో లోకేష్‌ ప్రతిష్ట మరింత పెరిగే అవకాశ ఉందని భావిస్తుంది. మంత్రివర్గంలో చేరే కంటే ముందుగా పార్టీపై పట్టు సాధించాలనే యోచనలో ఉన్నారు. టీడీపీలో చేరిన తొలినాళ్లలో 1985-89 మధ్య చంద్రబాబు కూడా పార్టీ కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ తర్వాతే ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు లోకేష్‌ కూడా తండ్రిబాటలోనే నడవాలనుకుంటున్నారు. పైగా ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల వలసల విషయంలో లోకేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రాకతో అలకపాన్పు వహిస్తున్న పార్టీ నేతలకు సర్ది చెప్పడంతోపాటు... రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలు తీసుకున్నారు.
మంత్రి పదవి తీసుకుంటే ఏపీకే పరిమితం
రాజకీయంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని లోకేష్‌ భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ కష్టకాలంలో ఉన్న తరుణంలో మంత్రిపదవి తీసుకుని ఏపీకే పరిమితమైతే.. ఆ ప్రభావం పొరుగురాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పడుతుందన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో వేచిచూసే ధోరణలో యువనేత ఉన్నారని అంటున్నారు. మొత్తంమీద మంత్రిపదవి విషయంలో లోకేష్‌ అంతరంగం బయటపడటంతో నిన్న మొన్నటి వరకు ఈ విషయంలో పోటీపడి ప్రకటనలు చేసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు మిన్నకుండిపోతున్నారు.

 

08:36 - April 30, 2016

కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు ముహూర్తం ఖరారైంది. మే 2న సిఎం కేసిఆర్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నారు. 200 టీఎంసీల కెపాసిటీతో మొత్తం 5 బ్యారేజీలుగా నిర్మాణం జరగనుంది. ఇందుకు అవసరమైన పరిపాలనా అనుమతులను సైతం మంజూరు చేసింది. 
కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు రంగం సిద్ధం 
టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్న వివాదాస్పద ప్రాజెక్ట్‌ కూడా ఇదే. మే 2న కేసీఆర్ ప్రాజెక్ట్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రాజశేఖర్‌రెడ్డి హయాంలో తొలుత ప్రాణహిత-చేవెళ్ల పనులకు బీజం 
సిఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో తొలుత ప్రాణహిత-చేవెళ్ల పనులకు బీజం పడింది. అయితే పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అభ్యంతరాలతో అది కొలిక్కి రాలేదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మహారాష్ట్రతో సంప్రదింపులు జరిగినా ఒప్పందాలు మాత్రం జరగలేదు. పైగా కాళేశ్వరం ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మళ్లీ మహారాష్ర్టతో సంప్రదింపులు మొదలుపెట్టారు. స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అవగాహన కుదుర్చుకున్నారు. 
కాళేశ్వరం బ్యారేజీ ఎత్తును తగ్గించేందుకు అంగీకరించిన కేసీఆర్ 
మహారాష్ట్రలో ముంపును తగ్గించే విధంగా కాళేశ్వరం బ్యారేజీ ఎత్తును 104 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించేందుకు కేసిఆర్ అంగీకరించారు. అక్కడ తెలంగాణ కోల్పోతున్న నీటి వాటాను మేడిగడ్డ వద్ద నుంచి తీసుకునేందుకు పొరుగు రాష్ట్రం అంగీకారం తెలిపింది. దీంతో కేసిఆర్ ప్రభుత్వం పాత డిజైన్‌లో కూడా మార్పులు చేపట్టింది. కాళేశ్వరం వద్ద భారీ ప్రాజెక్టుకే పరిమితం కాకుండా.. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ఇలా మొత్తం ఐదు బ్యారేజీలను నిర్మించేందుకు డిజైన్‌ చేశారు. 200 టీఎంసీల నీటిని గోదావరి నుంచి వివిధ జిల్లాలకు తరలించనున్నారు. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా అసెంబ్లీ వేదికగా సిఎం సమాధానమిచ్చారు. 
రూ.70 వేల కోట్ల రూపాయల ఖర్చుతో పనులు 
దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ అంచనాలతో కాళేశ్వరం పనులు ప్రారంభించనున్నారు. ఈ స్కీం పూర్తయితే కరీంనగర్, అదిలాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగు నీరు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతోపాటు ఉత్తర తెలంగాణకు తాగు నీరందించవచ్చని విశ్వసిస్తోంది. ఇక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ వద్ద బ్యారేజీలు, హైడ్రాలిక్‌ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజురు చేసింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తిచేసి హరిత తెలంగాణ నిర్మించాలన్నది టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం.

 

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో ఆటోను తప్పించబోయి మహారాష్ట్రకు చెందిన అంబులెన్స్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు నాందేడ్ నుంచి హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి వస్తుండగా ప్రమాదం సంభవించింది.

ప.బెంగాల్ లో కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్

కోల్కతా : పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఇవాళ ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. 53 నియోజకవర్గాలకు 349 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. ఐదో దశలో కోటి 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికలకు 90 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నెల్లూరు : ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై సర్వాయపాలెం క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కావలిలోని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

విశాఖ బ్రాండిక్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత..

విశాఖ : అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ కంపెనీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వేతనాలు పెంచాలని కార్మికులు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అయితే దీనిపై ఇప్పటివరకు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు వేతనాల పెంపు కార్మికులు భారీ ఎత్తున ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

08:16 - April 30, 2016

ఢిల్లీ : నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహణ తేదీలను మార్చే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాల్లోనూ నీట్‌ నిర్వహించి తీరాలని స్పష్టం చేసింది. గురువారం నాటి తమ ఉత్వర్వుల ప్రకారమే పరీక్షల షెడ్యూల్‌ను అమలు చేయాలని కేంద్రానికి సూచించింది. అటు కేంద్రం కూడా తెలుగు రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌ సహా అన్ని రాష్ట్రాల్లోనూ నీట్‌ నిర్వహిస్తామని లోక్‌సభకు తెలిపింది. 
మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం
గురువారం నాడు తాము వెలువరించిన షెడ్యూల్ ప్రకారమే నీట్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక ఉమ్మడి ప్రవేశ పరీక్షగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహించాల్సిందేనన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై... కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గురువారం నాటి తీర్పును పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. 
కేంద్రం  విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
తొలి విడత నీట్ నిర్వహణ తేదీని మార్చాలన్న కేంద్రం విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మే 1వ తేదీన నిర్వహించే తొలివిడత పరీక్షపై స్టే  విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే ఉత్తర్వుల్లో సవరణలు కోరుతున్న వారినుంచి న్యాయస్థానం అభ్యంతరాలను కోరింది. వీరి నుంచి దరఖాస్తులు అందాక సరైన సమయంలో విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది..
లోక్‌సభలో నీట్ పై చర్చ 
లోక్‌సభలో సైతం నీట్ పై చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ సభలో నీట్ అంశం లేవనెత్తారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ  నడ్డా సుప్రీం కోర్టు తీర్పును అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తామని తెలిపారు. ఏపీ, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ కు 371 డి ఉన్నా నీట్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి నడ్డా చెప్పారు. 

08:11 - April 30, 2016

విశాఖ : అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ కంపెనీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వేతనాలు పెంచాలని కార్మికులు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అయితే దీనిపై ఇప్పటివరకు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు వేతనాల పెంపు కార్మికులు భారీ ఎత్తున ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

08:08 - April 30, 2016

గుంటూరు : స్థానిక పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండదండగా ఉంటుందని.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం వల్ల.. భారీ కార్పొరేట్‌ సంస్థలు కూడా ఏపీకి తరలివస్తున్నాయన్నారు. పరిశ్రమలతో పాటు పర్యాటకాన్నీ తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. 
గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తోన్న ఐటీసీ సంస్థ
గుంటూరులో.. ఐటీసీ సంస్థ నిర్మిస్తోన్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గుంటూరులో ఐటీసీ సంస్ధ ఫైవ్ స్టార్ హోటల్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం శుభపరిణామమన్నారు. భవిష్యత్తులో మరిన్ని హోటల్స్ ఇక్కడ ఏర్పాటై.. పర్యాటక రంగం అభివృద్ది  చెందుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక పారిశ్రామక వేత్తలను తమ ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్తుందన్నారు. 
భూగర్భజలాలను ప్రజలు కాపాడుకోవాలి : చంద్రబాబు
అంతకుముందు.. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ చెరువు పూడిక తీత పనులను పరిశీలించారు. స్వయంగా ప్రొక్లెయినర్‌తో మట్టిని తొలగించారు. నదులను అనుసంధానిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. అందుకే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానిస్తూ.. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు.  దీంతోపాటే.. కురిసిన ప్రతి వర్షపు బొట్టును భూగర్భ జలంగా మలచుకోవాలని.. అందుకు ప్రజల సహకారం అవసరమనీ చంద్రబాబు అన్నారు. కరవును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం  కృతనిశ్చయంతో ఉందన్నారు. మొత్తానికి గుంటూరు జిల్లా పర్యటనలో సీఎం బిజీబిజీగా గడిపారు. 

07:31 - April 30, 2016

హైదరాబాద్ : కరవుతో పాటు ఇతర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ చర్చించారు. హరితహారం, రెసిడెన్షియల్‌ పాఠశాలులు, వ్యవసాయం, మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఆదర్శంగా నిలిచే వారికి హరితమిత్ర అవార్డులను ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే మూడో విడత రుణమాఫీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. 
కరవు, ఇతర అంశాలపై చర్చ 
మొత్తానికి రాష్ట్రంలో కరవు పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ కదిలారు. శుక్రవారం జిల్లాల వారీగా కరవు పరిస్థితులపై కలెక్టర్లతో సమీక్షించారు. మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల కేంద్రంలో కలెక్టర్లు, మంత్రులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సుదీర్ఘంగా సాగిన సమీక్షలో.. కరవుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. కరవును అధిగమించేందుకు తాత్కాలిక చర్యలతో పాటు.. దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కరవు నివారణకు కార్యచరణను రూపొందించారు. ఎండలు, వడగాలులతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆపద్బంధు పథకం ద్వారా ఆదుకోవాలని సీఎం సూచించారు. ప్రజలకు ఓఆర్ ఎస్ ప్యాకెట్లు ఇవ్వడంతో పాటు అవసరమైన మేర చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మంచి నీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.
సంక్షేమ పథకాలపై కలెక్టర్లకు దిశా నిర్ధేశం
ఇక దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, హరితహారం, అందరికీ విద్య వంటి సంక్షేమ పథకాలపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. గతేడాది వర్షాలు సరిగా లేకపోవడం వల్ల హరితహారం అనుకున్న మేర విజయవంతం  కాలేదని.. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో... రాష్ట్రంలో 50 కోట్ల మొక్కలు నాటాలని కలెక్టర్లకు కేసీఆర్‌ సూచించారు. మొక్కల కోసం తీసే గుంతల పనిని ఉపాధి హామీతో అనుసంధానం చేయాలన్నారు. అలాగే హైవేలకు ఇరువైపులా మొక్కలు పెంచాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఆదర్శంగా నిలిచేవారికి హరితమిత్ర అవార్డులను ఇవ్వనున్నట్లు తెలిపారు సీఎం. జిల్లాలవారీగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. 
250 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభం
ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం 250 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వాటికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. సొంత భవనాలు సమకూరే వరకు అద్దె భవనాల్లో తరగతులు నిర్వహించాలన్నారు. ఇక మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇక సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పేదలకే చేరాలన్నారు. అవినీతి, అక్రమాలకు  పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. 
త్వరలో మూడో విడత రుణమాఫీ విడుదల 
ఇక మూడో విడత రుణమాఫీని త్వరలోనే విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. సాఫీగా రుణమాఫీ జరిగేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. రుణమాఫీ పొందే బ్యాంక్‌ ఖాతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆడిటర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే కలెక్టర్ల సమావేశంలో అనేక అంశాలను సీఎం కేసీఆర్‌ చర్చించారు. 

 

మహబూబ్ నగర్ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు రెండోరోజు పర్యటన

మహబూబ్ నగర్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు నేడు రెండో రోజు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

ప.బెంగాల్‌ లో ప్రారంభమైన ఐదో దశ పోలింగ్‌..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలల్లో ఐదో దశ పోలింగ్‌ ప్రారంభం అయింది. మూడు జిల్లాలోని 53 అసెంబ్లీ స్థానాలల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. దక్షిణ 24 పరగణాలు, దక్షిణ కోల్‌కతా, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 349 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో 43 మంది మహిళలు. మొత్తం 14,500 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

నేడు పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలల్లో ఇవాళ ఐదో దశ పోలింగ్‌ జరుగుతుంది. మూడు జిల్లాలోని 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. దక్షిణ 24 పరగణాలు, దక్షిణ కోల్‌కతా, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  మొత్తం 349 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

07:08 - April 30, 2016

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలల్లో ఇవాళ ఐదో దశ పోలింగ్‌ జరుగుతుంది. మూడు జిల్లాలోని 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. దక్షిణ 24 పరగణాలు, దక్షిణ కోల్‌కతా, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  మొత్తం 349 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో 43 మంది మహిళలు. మొత్తం 14,500 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. కోటి 20 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్‌ జరుగుతుంది. మమతపై కాంగ్రెస్‌  తరుపున కేంద్ర మాజీ మంత్రి దీపాదాస్‌ మున్షీ, బీజేపీఅభ్యర్ధిగా నేతాజీ సుభాస్‌చంద్రబోస్‌   మేనల్లుడు చంద్రకుమార్‌ బోస్‌ పోటీ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు నుంచి డబ్బుతీసుకుంటా నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయిన పశ్చిమ బెంగాల్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌, కోల్‌కతా మేయర్‌ సోవెన్‌ ఛటర్జీ  కూడా ఓటర్ల నుంచి పరీక్ష ఎదుర్కొంటున్నారు. మమత మంత్రివర్గంలోని మరో ఐదుగురు మంత్రులు   కూడా  ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీపీఎం ముఖ్య నేతలు రాబిన్‌ దేవ్‌,  కాంతి గంగూలీ, సుజన్‌ చక్రవర్తి ఓటర్ల నుంచి పరీక్ష ఎదుర్కొంటున్నారు. సోలింగ్‌ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

నేడు నల్గొండ జిల్లాలో టీడీపీ కరవు బృందం పర్యటన

నల్గొండ : నేడు నల్గొండ జిల్లాలో టీడీపీ కరవు బృందం పర్యటించనుంది. పంటలను పరిశీలించనున్నారు.

Don't Miss