Activities calendar

01 May 2016

23:10 - May 1, 2016

జామ ఆకులు పసుపుతో కలిపి నూరి మొటిమలున్న చోట రాస్తే, క్రమంగా మొటిమలు తగ్గడం గమనించవచ్చు. వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం చేత కఫము తగ్గుతుంది. ఆహార పదార్ధాలలో పసుపు కొద్దిగా వాడటం వల్ల రక్తశుద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో నరాలు బెణికిన చోట పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టీ వేయడం వల్ల త్వరగా నయమౌతుంది. చిన్న గ్లాసు నీళ్ళలో ఒక పసుపు కొమ్ము వేసి, రాత్రంతా నానబెట్టి, పొద్దున లేచాక పసుపు కొమ్ము తేసివేసి, ఆ నీళ్ళని స్పూన్ తో బాగా కలియబెట్టి పరగడుపున తాగడం ద్వారా మధుమేహము, రక్తపోటు, కొలస్ట్రాల్ ను సైతం అదుపులోకి తెచ్చుకోవచ్చు. పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవడం ద్వారా తలతిరుగుడు సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. దెబ్బలు తగిలి గాయమైనపుడు జరిగే రక్త స్రావాన్ని ఆపుడంలో పసుపు దోహదపడుతుంది. షాకింగ్ వార్తలు వినడం వల్ల, మానసికంగా కృంగుబాటుకు గురయిన సందర్భాలలో ఒక కప్పు వేడిపాలలో రెండు చెంచాల పసుపు, రెండు చెంచాల నెయ్యి కలిపి తాగిస్తే చాలావరకు తేరుకుంటారు. 

21:27 - May 1, 2016

ప్రిన్స్ మహేశ్‌ బాబు కొత్త మూవీ బ్రహ్మోత్సవం మరో టీజర్ విడుదలైంది.. మధురం, మధురం అనే పాటను సోషల్‌ మీడియా ద్వారా చిత్ర బృందం రిలీజ్ చేసింది.. ఈ మూవీలో మహేశ్ కొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు, ప్రసాద్ వీ పొట్లూరి కలిసి నిర్మిస్తున్నారు.. మిక్కీ జే మేయర్‌, మణిశర్మ సంగీతం అందించారు.. హీరోయిన్లుగా సమంత, కాజల్‌, ప్రణీత నటించారు.. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయబోతున్నారు..  

నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు...

హైదరాబాద్ : సోమవారం నుండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయినున్నాయి. 9 నెలల నుండి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. 

సోమవారం వైసీపీ ధర్నాలు..

గుంటూరు : కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యంపై సోమవారం ధర్నాలు, నిరసనలతో వైసీపీ హోరెత్తించనుంది. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందంటూ ఖాళీ బిందెలతో ఆందోళన చేయాలని పార్టీ అధిష్ఠానం.. నేతలు, కార్యకర్తలను ఆదేశించింది. గుంటూరు జిల్లా మాచెర్లలో చేపట్టబోయే ధర్నాలో జగన్‌తోపాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. 

కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనన్నారు. అనంతరం రేపు ఉదయం కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

21:20 - May 1, 2016

హైదరాబాద్ : బకాయిలను చెల్లించాలని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రైవేటు యాజమాన్యాలు కన్నెర్ర చేశాయి. బకాయిలు చెల్లించకపోతే రేపటి నుండి తెలంగాణలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్‌ ఆస్పత్రుల జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత 9 నెలల బిల్లుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ. 350 కోట్లు బకాయిలున్నట్లు జాక్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. సాధారణ రోగులతో పాటు ఉద్యోగులు ఈ సేవలు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోతే రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

21:17 - May 1, 2016

కరీంనగర్ : కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునాది రాయి వేయనున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ ఎత్తిపోతలు, పంప్‌హౌస్‌లు, కాల్వల నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇక మావోయిస్టు ప్రాబల్యం ఉన్న తూర్పు అటవీ ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో టెన్షన్‌ నెలకొంది. గోదావరిపై మూడు ప్రదేశాల్లో ఆనకట్టలను నిర్మించి రాష్ట్రంలో సాగునీటి అవసరాలు తీర్చాలని సర్కార్‌ యోచిస్తోంది. ఇందుకోసం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్‌ నిర్మించతలపెట్టింది. దీనికోసం ఇప్పటికే నిపుణులచే అన్ని సర్వేలు చేపట్టింది. మేడిగడ్డ ఆనకట్ట నుండి అన్నారం బ్యారేజికి నీటి ఎత్తిపోతలకు రూ.3,524 కోట్లు,.. అన్నారం బ్యారేజి నుండి సుందిళ్ల బ్యారేజి ఎత్తిపోతలకు రూ.2,140 కోట్లు,.. సుందిళ్ల బ్యారేజి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ వరకు నీటిని తరలించేందుకు రూ.2,334 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధులతో మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టును నిర్మించి.. 160 టీఎంసీల నీటిని మళ్లించనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు సర్కార్‌ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది.

భారీ బందోబస్తు..
సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాజెక్ట్‌ పనులకు పునాది రాయి వేయనున్నారు. ఇందుకోసం కేసీఆర్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం హెలికాప్టర్‌ ద్వారా కరీంనగర్‌ నుండి మహదేవ్‌పూర్‌ మండలం కన్నెపల్లికి చేరుకుని మేడిగడ్డ బ్యారేజి పంప్‌హౌస్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం అంబట్‌పల్లిలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ పనులకు పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, ఈటెల, కేటీఆర్‌లతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు.  తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ గోదావరి సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే డీజీపీ అనురాగ్‌శర్మ మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతపై అధికారులతో సమీక్షించారు. తూర్పున ఉన్న అడవుల్లో అడుగడుగున గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులకు పట్టున్న గ్రామాలతో పాటు మాజీలపై నిఘా పెంచారు. ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇక ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 

21:14 - May 1, 2016

ఉత్తర్ ప్రదేశ్ : నిరుపేద కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పేరుతో పిలుస్తున్న ఈ పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియాలో మోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద మూడేళ్లలో ఐదు కోట్ల మంది మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేస్తారు. ఈ ఆర్ధిక సంవతర్సంలో కోటిన్నర వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇస్తారు. స్వాతంత్ర్యానంతరం 60 ఏళ్లలో 13 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తే ఎన్డీఏ సర్కార్‌ మూడేళ్లలోనే 5 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని మోదీ చెప్పారు.   

అధిక ఉష్ణోగ్రతల వల్లే అడవిలో మంటలు - సీఎం వీరభద్ర సింగ్...

ఉత్తరాఖండ్ : అధిక ఉష్ణోగ్రతల వల్లే అడవిలో మంటలు చెలరేగాయని హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అడవిలో మంటలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

నల్గొండలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి..

నల్గొండ : జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. భువనగిరి మంలం బొల్లేపల్లిలో పిడుగుపాటుకు బైక్ పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. మర్రిగూడ (మం) నర్సింహపురంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా కట్టంగూరు (మం) పరడలో పిడుగుపాటుకు రైతుకు గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. 

20:36 - May 1, 2016

నగరం భూత్ బంగ్లాలో దెయ్యం ఉందని ప్రచారం జరిగింది. అక్కడ హత్య జరగడం కలకలం సృష్టించింది. దీనిని చేధించాలని డిటెక్టివ్ బృందం రంగంలోకి దిగింది. మరి ఈ బంగాళలో నిజంగా దెయ్యం ఉందా ? ఎవరు హత్య చేశారు ? ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉంటాయా ? అనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

కాలిపోయిన 43 ఇళ్లు..

విజయనగరం : జిల్లా కొమరాడ మండలం పిల్లిగుడ్డిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 43 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 

పంజాబ్ రెండో విజయం..

~: ఐపీఎల్ సీజన్ 9లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండో విజయం అందుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు సతా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 154 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 155 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

20:04 - May 1, 2016

తెలంగాణ రాష్ట్రంలో గుండెకాయగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రతొక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద మేయర్ గా, ప్రథమ పౌరుడుగా బొంతు రామ్మోహన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నగరంలో ఉన్న సమస్యలు..అభివృద్ధి విషయంలో ఎలాంటి ప్రణాళికలు అనుసరిస్తానే దానిపై టెన్ టివి మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ తో ముచ్చటించింది. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

19:28 - May 1, 2016

హైదరాబాద్ : మొన్నటిదాక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి షాక్ ల మీద షాక్ తగిలాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా షాక్ లు తగులుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామ చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా పొంగులేటి కొనసాగుతున్నారు. కరీంనగర్ లో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పొంగులేటి చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ వైసీపీకి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పొంగులేటి భేటీ కానున్నారని, వారి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశర్లు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

పార్టీ మారనున్న పొంగులేటి ?

ఖమ్మం : వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారనున్నారని తెలుస్తోంది. ఆయన బాటలోనే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నడుస్తారని సమాచారం. రేపు ఉదయం 9గంటలకు వైసీపీ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తల, నేతల అభిప్రాయాలను పొంగులేటి తెలుసుకోనున్నారు. 

19:05 - May 1, 2016

ఉత్తారాఖండ్ : దావానలంతో ఉత్తరాఖండ్‌ అడవులు దహించుకుపోతున్నాయి. 88 రోజుల క్రితం ప్రారంభమైన కార్చిచ్చు ఇంతవరకు ఏడుగురి ప్రాణాలను కబళించింది. మూడువేల ఎకరాల్లో అడవులు ఆహుతయ్యాయి. జంతువులతోపాటు, పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కార్చిచ్చు వెనుక కలప మాఫియా హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వల్పంగా ప్రారంభమైన మంటలు ఇప్పుడు అదుపు చేయలేని స్థాయికి చేరాయి. తొలుత చిన్న మంటలే కదా... వాటంతట అవే ఆరిపోతాయన్న అటవీ శాఖ అధికారుల మితిమీరిన విశ్వాసం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేర్చింది.

ఎనిమిది జిల్లాలో అడవులు సర్వనాశం...
ఫిబ్రవరిలో మంటలను గర్తించినప్పుడే నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. మొదట ఒక ప్రాంతంలో ప్రారంభమైన కార్చిచ్చు 1200 ప్రాంతాలకు విస్తరించింది. ఉత్తరాఖండ్‌ అడవుల్లో ఫిబ్రవరి నుంచి 922 అగ్నిప్రమాదాలను గుర్తించారు. క్రమక్రమంగా విస్తరించిన బడబాగ్ని ఎనిమిది జిల్లాలలోని అడవులను సర్వనాశనం చేసింది. చమోలి, పౌరి, రుద్రప్రయాగ, తెహ్రీ, ఉత్తరకాశీ, అల్మోరా, పితోర్‌గఢ్‌, నైనీటాల్‌ జిల్లాల్లోని వనాలు కార్చిచ్చు ప్రభావానికి గురయ్యాయి.  ఎనభై ఎనిమిది రోజులుగా ప్రజ్వరిల్లుతోన్న దావాగ్నికి వేలాది ఎకరాల అడవులు కాలి బూడిదయ్యాయి. వీటిలోని ఎన్నో ఫల, పుష్ప, వృక్ష, జీవ, జంతు జాతులు నాశనమయ్యాయి. ఆరువేల మంది సిబ్బంది ప్రయత్నిస్తున్నా... కార్చిచ్చు అదుపులోకి రావడంలేదు. వీరిలో మూడు కంపెనీల జాతీయ విపత్తు స్పందన బృందాల సభ్యులు, రాష్ట్ర విపత్తుల స్పందన బృందాల సభ్యులు, సైనికులు కూడా ఉన్నారు. మంటలను ఆర్పేందుకు MI-17 హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. నైనీటాల్‌ సమీపంలోని భీమ్‌టాల్‌, పౌరీ జిల్లాల్లో వీటిని అందుబాటులో ఉంచారు.
మంటలు ఆర్పేందుకు హెలికాప్టర్‌ బృందాలు చేసిన ప్రయత్నం విఫమయ్యింది. దావానలంతో అటవీప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో హెలికాప్టర్ల ద్వారా నీరు వెదజల్లేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పొగల కారణంగా సెగలు రగులుతున్న ప్రదేశాలను గుర్తించడం కష్టం కావడంతో హెలికాప్టర్లు వెనుతిరిగాయి.

కేంద్రం దృష్టి..
రద్రప్రయాగ జాతీయ రహదారి వెంబడి కార్చిచ్చును అదుపు చేసేందుకు ఆర్మీ అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నా... మంటలు అదుపులోకి రావడంలేదు. ఉత్తరాఖండ్‌ అడవుల్లో మంటలు అంతకంతకు విస్తరిస్తుండటంతో కొత్త ప్రాంతాలకు దావానలం వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఉపగ్రహం సహాయంతో అలారాన్ని ప్రారంభించారు. దీని ఆధారంగా ఏయే ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయన్న సమాచారాన్ని సంక్షిప్త సందేశాల ద్వారా సంబంధిత అధికారులకు చేరవేస్తున్నారు. ఉత్తరాఖండ్‌ కార్చిచ్చుపై కేంద్రం దృష్టి సారించింది. ప్రమాద ఘంటికల తీవ్రతను గుర్తించిన పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్‌దేకర్‌... అగ్నిమాపక చర్యలకు 5 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రధాన మంత్రి కార్యాలయంతోపాటు హోంమంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పడు కార్చిచ్చు ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ దావానలం వెనుక టింబర్‌ మాఫియా హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు ముందుగా మంటలను అదుపు చేయడం పైనే దృష్టి పెట్టారు. కార్చిచ్చు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత దీనికి ఎవరు కారకులన్న అంశంపై దృష్టి పెడతామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్‌దేకర్‌ చెప్పారు. అయితే మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయన్న అంశంపై ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. 

ఇరాక్ లో జంట బాంబు పేలుళ్లు..

ఇరాక్ : జంట బాంబు పేలుళ్లలో 33 మంది మృతి చెందగా, మరో 75 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మొదటి పేలుడు సమోవా నగరంలోని ప్రభుత్వం కార్యాలయం వద్ద సంభవించగా, రెండో పేలుడు దానికి కొద్ది దూరంలో ఉన్న బస్టాండ్ వద్ద జరిగింది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందా - సుజనా..

విజయవాడ : రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్నది తమ మిత్రపక్షమని ప్రత్యేక హోదా కోసం కష్టపడుతామన్నారు. 

18:43 - May 1, 2016

గుంటూరు : గట్టిగా రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తే ఆ వాగు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. వరద రూపంలో ఊళ్లపై పోటెత్తి గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయిస్తుంది. అలాంటి వాగులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి.. అందులో విశేషమేముంది అనొచ్చు. కానీ నానా బీభత్సం సృష్టించే ఆ వాగు ఏపీ రాజధాని మధ్యలోంచి ప్రవహిస్తుంది కాబట్టే దానికి ప్రత్యేకత ఏర్పడింది. దాని ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటున్న పాలకుల మాటలు ఆయా గ్రామాల ప్రజలకు భరోసా కల్పించట్లేదు. ఇంతకి ఆ వాగు కథేంటి..? ప్రభుత్వం ఏం చెబుతోంది. వర్షాలు లేక ఎండిపోయి పిల్ల కాలువను తలపిస్తున్న ఈ వాగు అత్యంత ప్రమాదకరమైనది. తుఫాన్ల టైంలో బీభత్సంగా మారిపోయి పదుల సంఖ్యలో గ్రామాలను హడలెత్తిస్తుంది. ఎక్కడో కొండవీటి కొండల్లో పుట్టి వాగులు వంకలతో కలిసి ప్రవహిస్తుంది. ఇది జన్మించిన ప్రాంతాన్ని బట్టే కొండవీటి వాగు అని పేరొచ్చింది. ఏపీ రాజధాని అమరావతి మీదుగా ముందుకు సాగుతూ కృష్ణానదిలో కలుస్తుంది.

చైనా బృందం పరిశీలన..
రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని దాదాపు సగంపైగా గ్రామాల మీదుగా కొండవీటివాగు ప్రవహిస్తుంది. వర్షాకాలం తుఫాన్ల సమయంలో పెద పరిమి గ్రామం నుంచి కృష్ణాయపాలెం గ్రామం దాకా వేల ఎకరాలు ముంపుకు గురవుతాయి. కొండవీటి వాగు ముంపు చాలా తీవ్రమైనదని దానికి శాశ్వత పరిష్కారం చూపకపోతే భవిష్యత్‌లో రాజధానిలో అనేక సమస్యలు వస్తాయని స్థానిక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ముంపు సమస్యను పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా ఏళ్లకేళ్లు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లేది. చాలా సార్లు పలు గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన సందర్భాలున్నాయి. కొండవీటి వాగు ముంపు నివారణకు ఏడాది కాలంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉన్నా ఇప్పటికీ ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించలేకపోయింది. సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌లో కూడా వాగు ముంపు సమస్య పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు చూపలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. చైనాకు చెందిన సంస్థలను ప్రభుత్వం సంప్రదించడంతో చైనా బృందం కూడా గత వారం ఈ వాగును పరిశీలించి వెళ్లింది.

గతంలో పంటలు ఉండడంతో కొండవీటి వాగు పొంగిన ప్రతిసారీ అవి ముంపుకు గురయ్యేవి. ప్రస్తుతం ఈ భూములను ప్రభుత్వం రాజధాని కోసం సేకరించింది. ఇదే సమయంలో రైతులకు ఇచ్చే ప్లాట్లను కూడా వాగు పరీవాహక ప్రాంతంలోనే ఇవ్వబోతున్నారు. దీనికితోడు భారీగా ప్రభుత్వ భవనాలు నిర్మించబోతున్నారు. అయితే ఇప్పటికీ ముంపు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వరదలొచ్చిన ప్రతిసారీ గ్రామస్తుల ప్లాట్లు, భవనాలు ముంపుకు గరయ్యే అవకాశముంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

రెండు ఆలోచనలు..
ముంపు సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం రెండు ఆలోచనలు చేస్తోంది. వాగు లోతు పెంచడం, వాగు ఇరుపక్కలా కరకట్టలు, పెద్ద పెద్ద వరదలొచ్చినా తట్టుకునే విధంగా ఒడ్డులను బలపరచడం, వరద నీటి మొత్తాన్నీ ప్రకాశం బ్యారేజీలో కలపాలనేది ఒక ఆలోచన. వాగును పూర్తిస్థాయిలో ఆధునీకరించడం...వాగుపై రెండు రిజర్వాయర్లు నిర్మించి నీటిని స్టోర్‌ చేయాలని రెండో పరిష్కారంగా భావిస్తోంది. ఆ నీటితో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఆలోచిస్తోంది. అయితే రిజర్వాయర్లు నిర్మించినా పెద్దగా ఫలితముండదని స్థానికులు అంటున్నారు. ఏదేమైనా పక్కా ప్రణాళికతో ముంపు సమస్యను శాశ్వతంగా.. త్వరితంగా పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

18:36 - May 1, 2016

కడప : ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. కడప జిల్లాలో జరిగిన రాయలసీమ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఇది మరోసారి రుజువైంది. రాష్ట్ర సర్కార్‌ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాయలసీమతో పాటు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 250 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా.. తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.. రాయలసీమ సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. 

18:35 - May 1, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ మరో పోరాటానికి సిద్ధమైంది.. సోమవారం కరవుపై ఖాళీ బిందెలతో నిరసనలకు రెడీ అయింది.. ఈ కార్యక్రమంలో జగన్‌ పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. మొన్నటివరకూ పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించిన వైసీపీ ఇప్పుడు ప్రజా సమస్యలపై దృష్టిపెట్టింది. ఏపీలో కరవుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది. సాగు, తాగునీటి సమస్యతోపాటు... పశుగ్రాసం కూడా సరఫరా చేయలేని స్థితిలో సర్కారు ఉందని వైసీపీ మండిపడుతోంది. వేసవి రాకముందే ముందస్తు చర్యలు చేపట్టిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆరోపిస్తోంది. కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యంపై సోమవారం ధర్నాలు, నిరసనలతో వైసీపీ హోరెత్తించనుంది. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందంటూ ఖాళీ బిందెలతో ఆందోళన చేయాలని పార్టీ అధిష్ఠానం.. నేతలు, కార్యకర్తలను ఆదేశించింది.. గుంటూరు జిల్లా మాచెర్లలో చేపట్టబోయే ధర్నాలో జగన్‌తోపాటు.. ముఖ్యనేతలు పాల్గొంటారు. గుంటూరు ధర్నాకు ముందు జగన్‌.. నాగార్జున సాగర్‌ను సందర్శించనున్నారు.. అధికారులను అడిగి సాగర్‌లో నీటి పరిస్థితిని తెలుసుకుంటారని పార్టీ తెలిపింది.

18:33 - May 1, 2016

సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే డైరక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి పవన్‌కల్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదాపై పవన్‌ చేసిన ట్వీట్ కు కౌంటర్‌ ఇస్తూ వర్మ సెటైర్ల ట్వీట్‌లు పోస్ట్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై డైరక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు. పవన్‌ కల్యాణ్‌... ప్రభుత్వాన్ని హెచ్చరించాలి కానీ, బ్రతిమాలడం ఏంటని వర్మ ప్రశ్నించారు. సినిమాల్లో విలన్లకు ఓపెన్‌గా వార్నింగ్‌ ఇచ్చే పవన్‌ రియల్‌లైఫ్‌లో కేవలం విన్నపాలు చేస్తే ఆయన పవర్‌కి అర్థం లేదన్నారు వర్మ. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పవన్‌ చేయాల్సింది విజ్ఞప్తులు కాదని పోరాటాలని వర్మ అభిప్రాయపడ్డారు.

బెగ్గర్ సింగ్..
పార్టీ పెట్టినప్పుడు తాట తీస్తాను అన్న గబ్బర్‌సింగ్‌ మాకు కావాలి కానీ విన్నపాలు చేసే బెగ్గర్‌ సింగ్‌ కాదంటూ వర్మ ట్వీట్‌ చేశారు. పవన్‌ లాంటి నాయకుడు డిమాండ్‌ మాత్రమే చేయాలన్నారు వర్మ. అంతే కాదు అసలు పవన్‌కళ్యాణ్‌ రియల్‌ పవర్‌ స్టార్‌ కాదని అన్నారు. రియల్‌ పవర్‌ స్టార్‌ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అంటూ పొగడ్తలు గుప్పించారు. నిజానికి రామ్‌గోపాల్‌ వర్మ, పవన్‌ కల్యాణ్‌పై ట్విట్టర్‌ వేదికగా రిటార్ట్‌లు ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ కాపు ఉద్యమం సందర్భంగా.. పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వర్మ. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాను జాతీయ స్థాయిలో రిలీజ్‌ చేయడాన్ని తప్పుబడుతూ.. హిందీలో పవన్‌ కల్యాణ్‌ కన్నా ప్రభాసే బిగ్గెస్ట్‌ స్టార్‌గా నిరూపితమవుతుందన్నారు. అదే విధంగా పవన్‌ను, దేవుణ్ణి తాను ప్రేమిస్తానని, అయితే వారి భక్తులను మాత్రం ద్వేషిస్తానంటూ.. పవన్‌ ఫ్యాన్స్‌పైనా విరుచుకు పడ్డారు. అలాగే కాపు ఉద్యమ సమయంలో పవన్‌ పాత్రనూ వర్మ తప్పుబట్టారు. కాపులను పేదవారిగా మార్చేస్తున్నారంటూ వర్మ మండిపడ్డారు. ఇటీవల అల్లు అర్జున్‌ సినిమా సరైనోడు రిలీజ్‌ సందర్భంగా.. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌తో పోల్చి వర్మ సెటైర్‌ వేశారు. మొత్తానికి పవన్‌ కల్యాణ్‌పై రామ్‌గోపాల్‌వర్మ వరుస ట్వీట్లపై.. పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. 

18:31 - May 1, 2016

విజయవాడ : ఏపీలో కార్మికుల సంక్షేమం కోసం.. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. కార్మిక సంఘాలు... కార్మికుల మేలుకోసం పనిచేయాలని ఆయనీ సందర్భంగా సూచించారు. సంఘాలు స్వార్థంకోసం రోడ్డెక్కితే కార్మికులకు నష్టం తప్పదన్నారు. అలాగే యాజమాన్యాలు కూడా కార్మికుల క్షేమం కోసం ఆలోచించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం మేడేని ఘనంగా నిర్వహించింది. కోటి 50 లక్షలమంది అసంఘటిత కార్మికులకు ఈ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు.. కార్మికులు మరణిస్తే 5లక్షల రూపాయల పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. కార్మికులు, యాజమాన్యం కలిసి పనిచేస్తేనే సంస్థ అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు సూచించారు. చంద్రన్న బీమా పథకం.. అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలకు ఆసరా అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
పారిశ్రామికాభివృద్ధికి కార్మికుల సహకారం కావాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. కార్మికులకోసం ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, జలీల్‌ఖాన్‌, బొండా ఉమా పాల్గొన్నారు. 

మేడే ఉత్సవాల్లో నటుడు కమల్ హాసన్..

చెన్నై : తమిళనాడు సినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సినీ నటుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. 

17:38 - May 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలో తొలి డ్యాన్స్ రియాల్టీ షో ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్సిటీలోని కామర్స్ మేనెజ్‌మెంట్‌ ఆడిటోరియంలో ఆడిషన్స్ మొదలయ్యాయి. గూగీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన ఈ అడిషన్స్ హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కొరియోగ్రాఫర్‌ కపిల్‌, సినీనటుడు నాగరాజులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తొలిరోజు ఆడిషన్‌కు భారీ ఎత్తున డ్యాన్సర్లు హాజరయ్యారని నిర్వాహకులు సంపత్‌ తెలిపారు. నెలరోజుల పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఆడిషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో గెలుపొందే విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు.. ఒక సినిమాకు కొరియోగ్రాఫర్‌గా అవకాశమిస్తామని తెలిపారు. 

17:35 - May 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వామపక్షాలతో పాటు ఆయా పార్టీల ట్రేడ్‌ యూనియన్‌లు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించాయి. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా కార్మికులు మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో కార్మికులు కదం తొక్కారు. మే డే ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. సీపీఎం,సీపీఐ, సీఐటీయూ, టీఆర్‌ఎస్‌తో పాటు అనుబంధ సంఘాలు మే డే వేడుకల్లో పాల్గొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఈ సందర్భంగా పలువురు నేతలు ధ్వజమెత్తారు.

ఖమ్మంలో..
కార్మికుల నినాదాలతో ఖమ్మం జిల్లా భద్రాచలం హోరెత్తింది. ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి, కార్మికులకు వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం గ్రెయిన్‌ మార్కెట్‌లో సభ నిర్వహించి అనంతరం ర్యాలీ తీశారు. పాల్వంచలో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు, కర్షకులు ఎర్ర జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని కొత్తగూడెం డివిజన్‌ సీపీఎం సెక్రటరీ అన్నవరపు సత్యనారాయణ అన్నారు.

మహబూబ్ నగర్ లో..
మహాబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో మేడే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ టౌన్‌హాల్‌ నుంచి బాదం సరోజినిదేవి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయా రంగాలకు చెందిన కార్మికులు పలు విన్యాసాలతో ఆకట్టుకున్నారు.
వనపర్తిలో మే డే వేడుకలు వైభవంగా జరిగాయి. సీఐటీయూ, ఏఐటీవీసీ, టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ర్యాలీ నిర్వహించి, ఎర్ర జెండాలను ఎగురవేశారు. జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూర్‌; తిమ్మాజిపేట మండల కేంద్రాల్లో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఎర్రజెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వాలు ఏ మాత్రం తోడ్పాటునందించడం లేదని నాగర్‌కర్నూల్‌ సీపీఎం నాయకులు రామయ్య విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాలు, గద్వాల పట్టణంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ బండాల పద్మావతి ఈ సందర్భంగా శాంతి కపోతాన్ని ఎగురవేసి కార్మిక లోకానికి విప్లవ వందనం చేశారు.

నల్గొండలో...
నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్‌లో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోశపతి, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి పారేపల్లి శేఖర్‌రావు, సీపీఎం అనుబంధ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తున్నాయని, రానున్న రోజుల్లో కార్మిక చట్టాలు తెచ్చేలా ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఈ సందర్భంగా వక్తలు చెప్పారు.

మెదక్ లో...
మెదక్‌లో మే డే ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేష్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు కార్మికులు పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద జెండా ఎగురవేశారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరులో సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే సంబరాలు నిర్వహించారు. పట్టణంలో బైకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు అనంతరం బస్టాండ్‌ సమీపంలో సభ నిర్వహించారు.

కరీంనగర్ లో..
కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల ఓల్డ్‌ హైస్కూల్‌ దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను సీఐటీయూ జిల్లా కార్యదర్శి జ్యోతి విమర్శించారు. జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల డప్పుచప్పుళ్లు హోరెత్తించాయి. పలువురు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, కార్మికుల ఐక్యతను చాటి చెప్పారు. 

17:32 - May 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మే డే దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మే డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే కార్మికుల దినోత్సవాన్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తే..అధికార పక్షం కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆయా పార్టీల కార్యాలయాల్లో పతాకాన్ని ఎగురవేశారు. సీపీఎం, సీపీఐ, వైసిపి, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.

కాంగ్రెస్ పార్టీ..
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో జరిగిన మే డే వేడుకల్లో ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం జెండాను టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం వారికి అండగా ఉంటామని ప్రకటించారు. కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ..
కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు. మేడే సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ జెండాను ఎగురవేసి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని జగన్‌ అన్నారు. తమ పార్టీ పేరులోనే కార్మికుల సంక్షేమం ఉందని జగన్‌ తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని పార్టీ నేత శివకుమార్‌ గుర్తు చేశారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు.

టి.టిడిపి..
అటు టి టిడిపి కార్యాలయంలో కూడా మే డే దినోత్సవం ఘనంగా జరిగింది. టి-టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్..
టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కూడా మే డే దినోత్సవాన్ని పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపీ కవితతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎంపీ కవిత ఎగురవేసి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కమ్యూనిస్టులకే పెద్ద కమ్యూనిస్ట్‌ అని కవిత అన్నారు. 

17:28 - May 1, 2016

హైదారబాద్ : తెలంగాణలో మినిమమ్‌ వేజ్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్నిచోట్లా కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కార్మికుల ప్రమాద బీమా మొత్తాన్నీ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది... కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నాయిని నర్సింహ్మ రెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్, MLC రాములు నాయక్‌ హాజరయ్యారు.. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు కసరత్తు నడుస్తోందని నాయిని తెలిపారు.. కార్మికశాఖలో పేరు నమోదు చేసుకున్న వారి ప్రమాద బీమాను 5నుంచి 6లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు.
మేడేను పండుగలా కాకుండా దీక్షా దివస్‌గా జరపుకోవాలని మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్ అన్నారు.. ఎనిమిదిగంటల పనిదినాలకోసం పోరాడి నలుగురు కార్మికులు అమరత్వం పొందారంటూ... మేడే చరిత్రను గుర్తు చేశారు.. మేడే సందర్భంగా.. వివిధ కంపెనీలకు బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులను.... కార్మికులకు శ్రమ శక్తి అవార్డులనూ అందించారు. ఆ తర్వాత కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

షిమ్లా అటవీ ప్రాంతంలో మంటలు..

హిమాచల్ ప్రదేశ్ : షిమ్లా రూరల్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. సుమారు 50 హెక్టార్ల ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. 

క్రికెటర్ శ్రీశాంత్ ప్రచారం..

కేరళ : రాష్ట్రంలో అసెంబ్లీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్రికెటర్ శ్రీశాంత్ తిరువంతపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

కోసి నదిలో బాలుడు గల్లంతు..

ఉత్తరాఖండ్ : కోసి నదిలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని రక్షించారు. మరొక బాలుడి కోసం గాలింపులు చేపట్టారు. వీరు ఢిల్లీకి చెందిన వారిగా తెలుస్తోంది. 

వారణాసిలో మోడీ..

ఉత్తర్ ప్రదేశ్ : వారణాసిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. డీఎల్ డబ్ల్యూ గ్రౌండ్ లో ఈ రిక్షాలన ప్రధాని మోడీ పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మోడీ మాట్లాడారు. 

16:24 - May 1, 2016

కెనడా : మహబూబ్ నగర్ చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురయింది. సింథియా జాన్ (24) పీజీ పూర్తిచేసి కెనాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం సాయంత్రం నలుగురు స్నేహితులతో షాపింగ్ కు వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చేందుకు నలుగురు స్నేహితులు కారు ఎక్కుతుండగా.. ఒక్కసారిగా వాళ్లవైపు దూసుకొచ్చిన దుండగుడు తుపాకితో కాల్పులు జరిపాడు. సింథియా స్నేహితుడు, కెనడాకే చెందిన జోసెఫ్ ను టార్గెట్ చేసుకుని దుండగుడు కాల్పులు జరపగా.. అప్పటికే సీట్లో కూర్చున్న సింథియాకు కూడా బుల్లెట్లు తగిలాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న సింథియా, జోసెఫ్ లను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందేలోపే ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సింథియా జాన్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీ. 16 ఏళ్ల కిందటే వారు టొరంటో(కెనడా)కు వలస వెళ్లి స్థిరపడ్డారు.సింథియా హత్యకు గురికావడంతో మహబూబ్ నగర్ లోని ఆమె బంధువుల ఇళ్లల్లో విషాదఛాయలు అలముకున్నాయి. 

16:17 - May 1, 2016

హైదరాబాద్ : మేడే రోజునే కార్మికులు మృతి చెందారు. నగరంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రాంకోఠిలోని తిలక్ నగర్ లో మ్యాన్ హోల్ శుభ్రం చేయడానికి వీరస్వామి, కోటయ్యలు వచ్చారు. ముందుగా కోటయ్య మ్యాన్ హోల్ ను శుభ్రం చేద్దామని ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు కాలుజారి మ్యాన్ హోల్ కి పడిపోయాడు. ఇతడిని రక్షిద్దామని ప్రయత్నించిన వీరస్వామి కూడా అందులో పడిపోయాడు. 11గంటల ప్రాంతంలో మ్యాన్ హోల్ లో రెండు శవాలున్నట్లు పోలీసులకు సమాచారం అదించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరిని ఎవరు పనికి తీసుకొచ్చారో తెలియడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇద్దరు కార్మికుల మృతి..

హైదరాబాద్ : రాంకోఠిలో విషాదం చోటు చేసుకుంది. తిలక్ రోడ్డులో ఉన్న మ్యాన్ హోల్ లో ను శుభ్రం చేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

16:03 - May 1, 2016

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుతూనే ఉంది. మంటలను ఆర్పేందుకు ఎంఐ 17 వైమానిక హెలిక్టాపర్ ను రంగంలోకి దించారు. 11 మంది సభ్యులున్న ఎయిర్ ఫోర్స్ బృందం మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ దట్టంగా పొగలు కమ్ముకోవడం..తగలబడుతున్న అటవీ ప్రాంతం కనిపించకపోవడంతో హెలికాప్టర్ వెను తిరిగింది. 88 రోజులుగా కార్చిచ్చు రగులుతోంది. మూడువేల ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది.

 

ఆక్లాండ్ లో రాష్ట్రపతి ప్రణబ్..

న్యూజిలాండ్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆక్లాండ్ లో పర్యటిస్తున్నారు. ఆక్లాండ్ వార్ మెమోరియల్ మ్యూజియంను ప్రణబ్ సందర్శించారు. 

రజనీ ఫొటోస్ కు పాలాభిషేకం..

చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' చిత్ర టీజర్ విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లో లక్షల్లో వ్యూస్ లభించాయి. ఈ సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో రజనీ చిత్రాపటాలకు పాలాభిషేకం చేశారు. 

15:39 - May 1, 2016

బీహార్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సొంత రాష్ట్రమైన బీహార్ లో పర్యటిస్తున్నారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఓ సభలో కన్హయ్య పాల్గొని ప్రసంగించారు. కానీ కొందరు వ్యక్తులు నల్లజెండాలు ప్రదర్శించారు. సభలో ఉన్న ఇతరులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీనితో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా కన్హయ్య కుమార్ పై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 
దేశద్రోహం ఆరోపణలపై కన్హయ్య కుమార్ ను ఫిబ్రవరి నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ దాడిలో నిందితుడైన అప్ఝల్ గురు ఉరితీతను నిరసిస్తూ జాతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న కన్హయ్య కు జైలు శిక్ష విధించారు. మార్చి నెలలో ఢిల్లీ హైకోర్టు అతడికి ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పై విడుదల తరువాత పలు రాష్ట్రాల్లో పర్యటించారు. మొదటిసారి తన స్వస్థలమైన బీహార్ లోని బెగసరాయ్ కు శనివారం వచ్చారు. బీహార్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ లను వారి నివాసాల్లో కలిశారు. 

15:33 - May 1, 2016

మచిలీపట్నం : బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. మంగనూడిబీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని రక్షించారు. ఇంకా ఇద్దరి కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారు గుడివాడకు చెందిన యువకులుగా తెలుస్తోంది. 

15:18 - May 1, 2016

హైదరాబాద్ : సామాజిక న్యాయం జరగకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కార్మిక సంక్షేమని చెబుతున్న కేసీఆర్ సర్కార్ వారి డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఎస్వీకేలో సీఐటీయూ మేడే వేడుకల్లో తమ్మినేని పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బాగుండాలని..సంపద పెరగాలని ఆకాక్షించారు. సామాజిక శక్తులకు న్యాయం జరగకుండా బంగారు తెలంగాణ సాధ్యమా అని ప్రశ్నించారు. ఎస్సీల పట్ల ప్రభుత్ విధానం ఏంటీ ? గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటీ ? అనేది ఆలోచించాలని సూచించారు. బీసీ సబ్ ప్లాన్ కోసం పోరాటం చేస్తున్నామని, చట్టం తీసుకరావడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. 

15:14 - May 1, 2016

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 'కబాలి' టీజర్ వచ్చేసింది. తన నటనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని..తన స్టైల్ లో ఏ మాత్రం మార్పు లేదని రజనీ ఈ టీజర్ లో చూపెట్టారు. మొదటే చెప్పినట్లుగానే 'కబాలి' టీజర్.. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మాత కలై పులి ధాను టీజర్‌ విడుదల చేసారు. ఇక ఈ టీజర్... సూపర్ స్టార్ రజనీ మార్కు స్టైలిష్ నడకతో మొదలవుతుంది. అలాగే...ఆ తర్వాత ఓ మీటింగ్ హాల్లో ''మీరెందుకన్నా డాన్ అయ్యారు'' అని అడిగితే.. రజినీ తనదైన స్టయిల్లో నవ్వే సీన్ ఈ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ఇక ఈ టీజర్ చివర్లో రజినీ 80ల్లో మాదిరి యంగ్ గెటప్ లోనూ కనిపించటం మరో హైలెట్. రజినీకాంత్ భార్యగా నటిస్తున్న రాధికా ఆప్టే సంప్రదాయ చీరకట్టులో కనిపించి అలరించింది. సంతోష్ నారాయణ్ ఎనర్జిటిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో కార్మికుల కీలక పాత్ర - ఎంపీ కవిత..

హైదరాబాద్ : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్బంగా తెలంగాణభవన్‌లో మేడే ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 

ఆర్చరీ ప్రపంచకప్ లో భారత్ కు రజతం..

హైదరాబాద్ : చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో భారత్ రజత పతకంతో సరిపెట్టుకుంది. చైనీస్ తైపీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత క్రీడాకారులు బంగారు పతకాన్ని చేజార్చుకున్నారు. 

జింద్ లో 144 సెక్షన్..

హర్యానా : జింద్ ప్రాంతంలో జాట్ వర్గీయులు జైల భరో యాత్రను చేపట్టారు. జాట్ వర్గీయులకు విద్య, ఉద్యోగవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రెండు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. 

14:56 - May 1, 2016

చికాగో కార్మికుల బలిదానం అంతర్జాతీయ శ్రామిక జీవుల బానిస సంకెళ్లను తెంచింది. 8గంటల పనిదినాన్ని కార్మిక లోకానికి అందించింది. ప్రపంచ కార్మికోద్యమానికి దిశా దశ నిర్ధేశం చేసింది. ఈ చారిత్రాత్మక పోరాటంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా అడుగులు కదిపారు. మహిళలు అన్ని రకాల ఉద్యమాలకు ఊపిరి పోశారు. డిమాండ్ల సాధనలో ముందుకు కదిలారు. మేడే స్పూర్తిని సంబరంగా జరుపుకుంటున్న ఈవేళ మహిళలు సమాన పనికి సమాన వేతనం అందుకుంటున్నారా ? కార్మిక చట్టాలు అమలౌతున్నాయా ? నేటికి మహిళా కార్మికులు అడుగుతున్న ప్రాథమిక డిమాండ్స్ ఏంటీ ? దీనిపై 'మానవి' ప్రత్యేక కథనం. వివరాలకు వీడియో చూడండి. 

14:34 - May 1, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలో సాక్షాత్తూ నిధుల మంజూరు కోసం జడ్పీటీసీ సమావేశాన్ని బహిష్కరించారని, టీఆర్ఎస్ కౌన్సిలర్లు రెండు వర్గాలు విడిపోయి కొట్టుకున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా పరిస్థితులతో వ్యతిరేతక ప్రారంభమైందని చెప్పారు. నిజామాబాద్ లో కేసీఆర్ కు ముందున్నది ముసళ్ల పండుగ అని పేర్కొన్నారు. 

14:28 - May 1, 2016

హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులపై దాడి చేస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలకు కార్మిక హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు.. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలే ఉదాహరణ అన్నారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో జరిగిన మేడే వేడుకల్లో రాఘవులు, తమ్మినేని, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జెండా ఆవిష్కరించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావించారు. ముందుగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వారి హక్కులను హరించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. చివరకు సంస్కృతీ సాంప్రదాయాలనూ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే దిగజారుడు ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఉందని రాఘవులు అన్నారు. కార్మిక హక్కుల గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడడమే తప్ప రాష్ట్రంలో వాటిని అమలు పరుస్తున్నది లేదని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కెసిఆర్ ఎన్నో వాగ్దానాలు చేశారని ఉద్యోగుల పర్మినెంట్, లక్షల ఉద్యోగాలు ఇస్తామని కెసిఆర్ చెప్పినా వాటిని అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల గురించి మాట్లాడే హక్కులేదని తమ్మినేని విమర్శించారు. వాస్తవంగా పేదలను అణచివేసే చర్యలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కార్మిక దినోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పుకుని మిఠాయిలు పంచుకుంటే సరిపోదని కార్మిక సంక్షేమం కోసం పాటుపడాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఉత్తరాఖండ్ కార్చిచిచ్చుపై ఎస్ఎస్ నేగీ స్పందన..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై ఫారెస్టు డీజీ ఎస్ఎస్ నేగీ స్పందించారు. 2012 సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం ఘటనా ప్రదేశానికి చేరుకుందని పేర్కొన్నారు.

వైసీపీని వీడను - ఎమ్మెల్యే గోపిరెడ్డి..

గుంటూరు : వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఖండించారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. 

13:58 - May 1, 2016

కెన్యా : ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల విలువ చేసే ఏనుగు దంతాలవి. ఏకంగా వంద టన్నుల బరువు ఉన్న దంతాలను కెన్యా ప్రభుత్వం దగ్ధం చేసే కార్యక్రమం మొదలు పెట్టింది. కెన్యా రాజధాని నైరోబీలో ఈ కార్యక్రమానికి తెరలేపారు. ఆఫ్రికా ఏనుగులకు నిలయమైన నైరోబీ జాతీయ పార్క్‌లో వేలాది ఏనుగులను హతమార్చి స్మగ్లర్లు వీటిని సేకరించారు. వివిధ సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన స్మగ్లర్ల నుంచి ఈ దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మితే బాగానే డబ్బు సంపాదించే అవకాశమున్నా ప్రభుత్వం విక్రయానికి సిద్ధపడలేదు. ఇది పరోక్షంగా స్మగ్లింగ్‌ను ప్రేరేపించినట్లవుతుందని ఏనుగు దంతాలను కాల్చివేయాలని నిర్ణయించింది. దంతాలు దృఢంగా ఉండడం మూలంగా అవి రోజుల తరబడి దగ్ధమవుతాయి. నిరంతరం పెట్రోల్‌ పోస్తూ వాటిని కాల్చివేసే ప్రక్రియ పూర్తిచేస్తారు. అయితే ప్రభుత్వ చర్యను బోట్స్‌వానా దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అత్యంత విలువైన దంతాలను దగ్ధం చేయడం సరికాదంటోంది. ఆఫ్రికా ఏనుగుల్లో సగం బోట్స్‌వానా దేశంలోనే ఉండడం గమనార్హం. ఒక్క బోట్స్‌వానాయేగాక కెన్యాలోని కన్జర్వేషనలిస్ట్‌లు కూడా దంతాల దగ్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. సుమారు 6 వేల 700 ఏనుగులను హతమార్చి వాటిని స్మగ్లర్లు సేకరించినట్లు తెలుస్తోంది. 

 

13:56 - May 1, 2016

సాహితీ సృజన,  పరిశోధన,   విమర్శల్లో   తమదైన ముద్రవేసిన సుప్రసిద్ధ  సాహితీవేత్త  ఎస్ వీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్.   రీసెర్చ్ చేసిన యూనివర్సిటీకే వీసీగా పనిచేశారాయన. అభివృద్థి చెందిన అందరితో సమానంగా జీవించే స్థాయి, అణగారిన వర్గాలన్నింటికీ రావాలంటారు ఇనాక్.  1950ల నుండి ఆయన సాహిత్యం కవిత్వం, పద్యం, గేయ, వచన సమాహారంగా ఉంది.   ఆశా జ్యోతి, ఆది ఆంధ్రుడు,  భుజంగరాయ చరిత్ర,  షరామామూలే,  ఊరబావి, అస్పృశ్యగంగ   మొదలైన కవితా, కథా సంపుటులు, మరెన్నో నాటకాలను వెరసి దాదాపు వంద పుస్తకాలను వెలువరించారు. త్వరలో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ వారి మూర్తిదేవి అవార్డ్ అందుకోబోతున్న సందర్భంగా కొలకలూరి ఇనాక్ గారితో టెన్ టీవీ అక్షరం ముఖాముఖి చూద్దాం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:55 - May 1, 2016

శ్రీదేవికి మళ్లీ శ్రీమంతం ఏంటీ ? ఆల్ రెడీ ఆమెకు పెళ్లయిపోయింది..ఇద్దరు పిల్లలు..అందులో ఒకరు త్వరలో మేకప్ వేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి...అని ఆశ్చర్యపోతున్నారా ? ఆ శ్రీదేవి కాదండోయ్...ప్రభాస్ సినిమా 'ఈశ్వర్' ద్వారా హీరోయిన్ తెరంగేట్రం చేసిన హీరోయిన్ 'శ్రీదేవి' గుర్తుంది కదా.. ఆమె ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె అని అందరికీ తెలుసిందే. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత రాహుల్ తో 'శ్రీదేవి'కి వివాహం జరిగింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన శ్రీదేవికి శ్రీమంతం నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. అది విషయం..

13:52 - May 1, 2016

నల్లగొండ : జిల్లాలో మేడే వేడకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా ఎర్రజెండాల రెపరెపలాడాయి.  సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్దఎత్తున మేడే వేడుకలో పాల్గోన్నారు. సిపిఎం, సిఐటీయూ  సహ ఇతర కార్మిక సంఘాలు మేడే వేడుకలు నిర్వహించాయి. సీపీఎం జిల్లా  కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మేడే  నాడు ప్రభుత్వ పాలకులు మొక్కబడి ప్రకటనలకే పరిమితమయ్యారని జూలకంటి విమర్శించారు. 

 

13:51 - May 1, 2016

మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత మేకప్ వేసుకుంటున్నారు. 150వ సినిమా 'కత్తిలాంటోడు' కి ఆల్ రెడీ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకాబోతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం విజయం సాధించాలని కోరుతూ చిరంజీవి కోడలు 'ఉపాసన' పూజలు చేశారు. ఉపాసన శనివారం అన్నవరం సత్యదేవుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద పండితులు ఆమెకు స్వాగతం పలికారు. అనివేటి మండపంలో పండితులు ఆమెకు ఆశీస్సులతో పాటు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొణిదెల మూవీస్ పతాకంపై చిరు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

13:50 - May 1, 2016

మెదక్  : మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, కార్మిక చట్టాలను సవరించి కార్మిక  వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అంటున్నారు. మేడే  సందర్భంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న చుక్కా రాములు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.

13:48 - May 1, 2016

హైదరాబాద్ : కార్మికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని  హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన మేడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని నాయిని అన్నారు. ట్రేడ్‌యూనియన్‌ నాయకులతో మాట్లాడి, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

 

13:45 - May 1, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా అడుక్కుంటే వచ్చేది కాదంటూ పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌పై రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్‌లో సెటైర్లేశారు. ఫ్లాప్ అయినా తమకు గబ్బర్‌సింగే కావాలి కానీ బెగ్గర్ సింగ్ వద్దంటూ చురకలు అంటించారు. తన దృష్టిలో విన్నపాలు బెగ్గింగే అని రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ఇంతేగాక ట్విట్వర్‌లో పవన్‌పై మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఫ్లాప్ అయినా కూడా తమకు గబ్బర్‌సింగే కావాలి..బెగ్గర్ సింగ్ కాదన్నారు. విన్నపాలు బెగ్గింగే అని అన్నారు. సినిమాల్లో ఓపెన్‌గా వార్నింగ్‌లిచ్చి రియల్‌ లైఫ్‌లో విన్నపాలు చేస్తే పవర్‌కి స్టార్‌కి మీనింగ్ ఏంటి.? అని ప్రశ్నించారు. 'మీ అభిమానులమైన మేము మీ నోటి నుంచి వచ్చే హెచ్చరికలు వినాలి కాని విన్నపాలు వినటం కర్ణ కఠోరంగా ఉంది' అన్నారు. 'తాట తీస్తా అనే పవర్ హీరో మాకు కావాలి కానీ విన్నపాలు కోరే పవర్ లేని స్టార్ మాకొద్దు సార్‌' అని వ్యాఖ్యానించారు. 'వీరుడు అడుక్కోకూడదు సార్.. ఏ కాపులైతే మీకు అధికారమిచ్చారో ఆ కాపులను మీ విన్నపాలతో బీదవాళ్లను చేశారని' పేర్కొన్నారు. 

 

హేమామాలికి తప్పిన ప్రమాదం..

ముంబై : సినీ నటీ, బీజేపీ ఎంపీ హేమామాలిని మరోసారి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ వెటర్నరీ యూనివర్సిటి, గావ్ అనుసంధాన కేంద్ర ప్రారంభ కార్యక్రమాలకు హేమా మాలిని వెళుతున్నారు. తన కారు వెనుక వస్తున్న సెక్యూరిటీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో హేమా మాలిని తృటిలో తప్పించుకున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. 

చెరువు పూడికతీత పనుల్లో మంత్రి లక్ష్మారెడ్డి..

మహబూబ్‌నగర్: జిల్లాలో నిర్వహించిన మిషన్ కాకతీయ పనుల్లో ఇవాళ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. బాలానగర్‌లో ఉన్న పెద్ద చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ ప్రతిష్టాత్మకమైన పథకమని పేర్కొన్నారు.

కెనడా తెలంగాణ విద్యార్థిని దారుణ హత్య..

హైదరాబాద్ : తెలంగాణ యువతి దారుణ హత్యకు గురైంది. పై చదువుల కోసం కెనడాకు వెళ్లిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువతి సింథియా జాన్ దుండగుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు.

 

13:39 - May 1, 2016

విజయవాడ : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో కరెంట్ లేక చిన్న, మధ్య తరగతి పరిశ్రము మూతపడ్డాయన్నారు. సీఎం చంద్రబాబు మూడు మాసాల్లో విద్యుత్ సరి చేసి.. 24 గంటలు విద్యుత్ ను ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు కనుసన్నలో తాము కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కార్మిక సంక్షేమ బోర్డు, మండలిలో అరకొరగా నిధులు ఉండేవని.. చంద్రబాబు పాలనలో నిధులు పుష్కలంగా కేటాయించామని చెప్పారు. యాజమాన్యం బాగుంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. యాజమాన్యంకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మాధవరెడ్డి జయంతి..

హైదరాబాద్ : దివంగత హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి జయంతి సభ ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగింది. ఈ సందర్బంగా మాధవరెడ్డి చిత్రపటానికి టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. 

సీఎం తరుణ్ గొగోయ్ కు స్వల్ప అనారోగ్యం...

అసోం : రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు పొత్తి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తెలిపారు. 

మలాలపై శ్రీ శ్రీ రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ముంబై : ఉద్యమకారిణి మలాల యూసఫ్ జాయ్ పై 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల ఆధారంగా పురస్కారాలకు ఎంపికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్ ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్‌కి నోబెల్ పురస్కారం ఇవ్వడంలో రాజకీయాల పాత్ర ఉందని ఆరోపించారు. తాను అటువంటి అవార్డులను అంగీకరించేది లేదన్నారు. గతంలో తనకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇస్తామన్నారని, తాను తిరస్కరించానని తెలిపారు.

ఏపీలో చంద్రన్న బీమా పథకం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. 'చంద్రన్న బీమా పథకం' ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్ లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. 

13:27 - May 1, 2016

హైదరాబాద్ : శ్రామికులకు ఎటువంటి సమస్యలు వచ్చినా.. వైసీపీ తోడుగా ఉంటుందని వైసీపీ అధినేత జగన్ భరోసా ఇచ్చారు. లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. సాక్షాత్తు విశాఖలో సీఎం ఉండగానే..బ్రాండెక్స్ కంపెనీ వద్ద కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ చేశారని తెలిపారు. దాదాపు 20 వేల మంది బ్రాండెక్స్ కంపెనీలో పని చేస్తున్నారని చెప్పారు. ఆడవారని చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. సీఎం దగ్గరుండి కొట్టిస్తున్నారని ఆరోపించారు. అందరం కలిసి ఒక్కటవుదామని చెప్పారు. 

 

13:19 - May 1, 2016

ఆజాదీ.. ఆజాదీ.. అన్న పాట యూట్యూబ్‌ లో హల్‌చల్‌ చేస్తోంది. కేరళకు చెందిన గాయని పుష్పవతి కంపోజ్‌ చేసి పాడిన ఈ పాట.. దేశ సమకాలీన పరిస్థితులపై కలవరపడుతోన్న యువతరం హృదయాలను కదిలిస్తోంది. జెఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌.. జైలు నుంచి విడుదలయ్యాక.. తాము దేని నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నామో.. సవివరంగా తెలిపారు. ఆయన నినాదాలు, ప్రసంగాలతో స్పూర్తి పొందిన గాయని పుష్పవతి.. సొంతంగా ఈ పాటను కంపోజ్ చేశారు. కన్హయ్య నినాదాలనే లిరిక్‌ గా ఎంచుకొని పాటను రూపొందించారు.  ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా వ్యాపిస్తోంది. ఇప్పటికే సుమారు 75వేల హిట్స్ వచ్చాయి. ఆపాట.. 10టీవీ ప్రేక్షకుల కోసం.. 

13:16 - May 1, 2016

విశాఖ : మేడే సందర్భంగా విశాఖపట్టణంలో సిఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.  ప్రజానాట్యమండలి సాంస్కతిక కార్యాక్రమాల మధ్య ర్యాలీ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కార్మిక వ్యతిరేక విధానాలు అలంభిస్తున్నాయని సీఐటియూ నాయకులు మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు నినాదాలు చేసారు.

13:05 - May 1, 2016

హైదరాబాద్ : శ్రమజీవుల కష్టాన్ని బీజేపి ప్రభుత్వం దోచుకుంటుందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. ఎంబీ భవన్లో జరిగిన మే డే వేడుకల్లో ఆయ పాల్గొని, మాట్లాడారు. పేదోళ్ల భూములను కొల్లగొట్టి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న కార్మికుల చట్టాలను బీజేపి ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. 

 

శిధిలాల కింద చిక్కుకున్న వృద్ధుడిని రక్షించిన సిబ్బంది

హైదరాబాద్ : ఏప్రిల్‌ 16న ఈక్వెడార్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో వెనుజులా సిబ్బంది ఇంకా సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. శిధిలాల కింద 14 రోజుల పాటు చిక్కుకుని ఉన్న ఓ వృద్ధుడిని సిబ్బంది రక్షించారు. మనాబి ప్రావిన్స్‌లో సహాయక చర్యలు చేపడుతుండగా స్వల్పంగా కూలిన భవనం నుంచి శబ్దాలు వినిపించాయి. వెంటనే సిబ్బంది శిధిలాలను తొలగించి చూడగా... మాన్యుల్‌ వాస్కేజ్‌ అనే వృద్ధుడు కొనవూపిరితో ఉన్నాడు. వెంటనే అతన్ని  చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

12:58 - May 1, 2016

'ఓ డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం' అని అంటున్నారు దర్శకుడు రాజసింహ తాడినాడ. సందీప్‌ కిషన్‌ హీరోగా, నిత్య మీనన్‌ హీరోయిన్‌గా బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. మిక్కీ జె.మేయర్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ నెల 8న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆడియోను చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ నెలలోనే సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం' అని అన్నారు. 'మిక్కీ జె.మేయర్‌ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. శ్రీమణి, శ్రీశశి జ్యోత్స్య, డా.మీగడ రామలింగశర్మ పాటలు ఆకట్టుకుంటాయి. ఓ డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ చాలా కొత్తగా, స్టయిలీష్‌గా కనిపిస్తారు' అని దర్శకుడు తెలిపారు.

 

12:55 - May 1, 2016

సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత అల్లు అరవింద్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ, 'వరస హిట్లతో జోష్‌ మీదున్న సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా, 'సరైనోడు' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హైదరాబాద్‌, వైజాగ్‌ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. జూన్‌ 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపనున్నాం' అని అన్నారు. 'సాయిధరమ్‌ తేజ్‌, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి మంచి కథ, కథనాలతోపాటు మంచి టీమ్‌ దొరికింది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని నిర్మాతలు తెలిపారు.

12:46 - May 1, 2016

విజయవాడ : మే డే స్ఫూర్తిగా కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. మే డేను స్ఫూర్తి దినోత్సవంగా కార్మికవర్గం భావించి... ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తు పాలకవర్గాలు కూడా మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నాయని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు కార్మికవర్గాన్ని ఒకవైపు అణచివేస్తూ.. మరోవైపు కార్మికులను భ్రమలోకి నెట్టుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికవర్గ పోరాటాలు నిర్మించాలన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే  సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో  ఆ పార్టీ కార్యదర్శి పి.మధు, నేతలు బాబురావు, మహిళలు పాల్గొన్నారు. 

 

12:23 - May 1, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్‌ సెక్టార్ల ప్రైవేటీకరణకు యత్నిస్తోందని ఈ చర్యలను అందరూ వ్యతిరేకించాలని ఆర్‌బిఐ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్ ఐసీ జోనల్ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్ఐసి ఏఐఐఈఏ సభ్యులు, ఆర్‌బిఐ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ఐసి కార్యాలయం నుండి ఆర్‌బిఐ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా బ్యాంకింగ్ సెక్టార్ల నిర్వీర్యీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న నిర్వహించే స్ట్రైక్‌ను విజయవంతం చేయాలని అన్నారు.

 

12:12 - May 1, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రులు, మంత్రులకు కార్మిక సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో జరిగిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పుడుతూ చట్టాలను తుంగలో తొక్కుతున్నాయన్నారు.

 

12:06 - May 1, 2016

విజయవాడ : కార్మికులను పట్టించుకోని, టీడీపీకి మేడేని జరుపుకునే అర్హత లేదని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు  అన్నారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎమ్యెల్యేలు, ఎంపీలకు లక్షల్లో జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, కార్మికుల జీతాలను మాత్రం పెంచడం లేదని వాపోయారు. అంగన్‌వాడీలు, బ్రాండెక్స్ కార్మికులు జీతాల కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను వెంటనే పరష్కరించాలని డిమాండ్‌ చేశారు.

 

11:46 - May 1, 2016

గుంటూరు : ఎపీ రాజధానిలో దందాల పర్వం నడుస్తోంది. కాస్ట్ లీ భూములను కబ్జాచేసేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. గతంలో టిడిపి యువనేత లోకేష్ పేరుతో ఇసుక మాఫియా నడిపించిన వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా హోం మంత్రి చినరాజప్ప బంధువునంటూ మరో వ్యక్తి హల్‌చల్ చేయడమే కాకుండా.. దందాలకు పాల్పడి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు.
ఏపీ రాజధాని పై దందారాయుళ్ల కన్ను 
ఏపీ రాజధాని పై దందారాయుళ్ల కన్నుపడింది. గుంటూరు కేంద్రంగా హోంమంత్రి చినరాజప్ప బందువు పేరుతో ఒక వ్యక్తి తెరపైకి వచ్చాడు.  ఇతడి పేరు అనిల్. ఇతను గత కొంత కాలంగా రాజధాని అమరావతి పై కన్నేశాడు..హోంమంత్రి చినరాజప్ప బందువునంటూ రెండు మూడు హైటెక్ కార్లకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే స్టిక్కర్లు వేసుకుని హల్ చల్ చేస్తున్నాడు. 
హోంత్రి పేరుతో దందాలు 
గత అమరావతిలో పలువురి వద్దకు వెళ్లి డబ్బులకోసం బెదిరింపులు చేయటంతో పోలీసులు నిఘా పెట్టారు..అతని కదలికల పై కన్నేశారు. అయితే హోంత్రి పేరుతో దందాలు చేస్తున్న అనిల్ వివరాలు సేకరించేపనిలో పడ్డారు. అంతేకాదు ఈ కేటుగాడు యువతకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికాడు. అమరావతిలో కొందరిని డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తి... హోంమంత్రి చిన రాజప్ప బంధువని చెప్పుకొని దందాలు చేస్తున్న వ్యక్తి ఒకరే అని నిర్ధారించుకున్న పోలీసులు ఇతనో మోసగాడని తేల్చారు...పక్కా ప్రణాళికతో పట్టుకుని అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి డబ్బులు దండుకోవటం కలకలం రేపుతోంది...పోలీసులు ఇలాంటి కేటుగాళ్లను ముందస్తుగానే గుర్తించి తమకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.. 

11:39 - May 1, 2016

విశాఖ : జిల్లాలో బాలుడి కిడ్నాప్ విషాదాంతమైంది. కిడ్నాపైన బాలుడు హత్య గావించబడ్డాడు. అనకాపల్లిలో కిడ్నాపర్లు 8 ఏళ్ల బాలుడు ఉదయ్ ను శుక్రవారం కిడ్నాప్ చేశారు. బాలుడి తల్లిదండ్రులను రూ. లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలుడిని కిడ్నాపర్లు హత్య చేశారు. లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా కొప్పాక ఏలేరు కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి హత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 

లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి...

నెల్లూరు : జిల్లాలోని మనుబోలు క్రాస్‌రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిచక్రవాహనంపై వెళ్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కెనడాలో తెలుగమ్మాయిపై కాల్పులు

హైదరాబాద్ : కెనడాలో ఓ తెలుగమ్మాయిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆమె తీవ్రగాయాలకు గురైంది. హైదరాబాద్‌కు చెందిన తింత్రియాజాన్ అనే మహిళ ఓ షాపింగ్ మాల్‌లో వస్తువులను కొనుగోలు చేస్తుండగా ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆమె తీవ్ర గాయాలకు గురైంది.

విశాఖలో విద్యార్థి కిడ్నాప్.. హత్య

విశాఖ : జిల్లాలోని అనకాపల్లి గవరపాలెంలో అపహరణకు గరైన విద్యార్థి హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఎనిమిదేళ్ల ఉదయ్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. కుటుంబ సభ్యుల నుంచి కిడ్నాపర్లు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. దీంతో ఉదయ్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం అనకాపల్లి మండలం కొప్పాక ఏలేరు కాలువ ఒడ్డున ఉదయ్‌ మృతదేహాన్ని గుర్తించారు. కిడ్నాపర్లు ఉదయ్‌ను హత్యచేసి కాలువ ఒడ్డున పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

నేడు వారణాసిలో మోడీ పర్యటన

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అస్సీ ఘాట్ వద్ద సోలార్ పవర్ బోట్లను ఆయన ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు వెయ్యి ఈ-రిక్షాలను పంపిణీ చేయనున్నారు. సామ్నే ఘాట్ వద్ద జ్ఞాన ప్రవాహ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ కేంద్రంలో పురాతన పుస్తకాలు, అరుదైన కళాకండాలు ఉన్నాయి.

09:33 - May 1, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై నేటి నుంచి డీజిల్ ట్యాక్సీలు కనిపించవు. డీజిల్‌తో నడిచే అద్దె వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. డీజిల్‌ వాహనాలను సిఎన్‌జీలోకి మార్చుకోవాలని ఇచ్చిన గడువు ముగిసిందని, దీన్ని పొడిగించే ప్రసక్తే లేదని సుప్రీం స్పష్టం చేసింది. మరోవైపు వివిఐపిల భద్రత కోసం ఉపయోగించే డీజిల్‌ వాహనాలకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  
డీజిల్‌ టాక్సీ ఆపరేటర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఢిల్లీలో డీజిల్‌ టాక్సీ ఆపరేటర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో మే ఒకటి నుంచి డీజిల్‌ టాక్సీలు నడపరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్‌సిఆర్‌లో కేవలం సిఎన్‌జి టాక్సీలు మాత్రమే తిరగనున్నాయి. ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న ట్యాక్సీలకు సీఎన్‌జీ టెక్నాలజీతో మార్చుకోవడానికి ఏప్రిల్‌ 30 వరకు సుప్రీంకోర్టు గడువిచ్చింది. డీజిల్‌ వాహనాలు సిఎన్‌జిలోకి మార్చుకునే టెక్నాలజీ అందుబాటులో లేదని టాక్సీ ఆపరేటర్లు కోర్టుకు విన్నవించారు. నిషేధం గడువును మరికొంత కాలం పొడిగించాలని ట్యాక్సీ ఓనర్ల సంఘం చేసిన విజ్ఞప్తిని చీఫ్‌ జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పటికే కావాల్సినంత సమయం ఇచ్చామని, మరింత గడువు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.
వివిఐపిల భద్రత కోసం డీజిల్‌ వాహనాలను కొనుగోలుకు అనుమతి 
ఢిల్లీలో పెరిగిపోతోన్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలను సమర్థిస్తూనే... వివిఐపిల భద్రత కోసం డీజిల్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ పోలీస్‌ శాఖకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2 వేల సిసి ఆ పైవరకు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే 190 డీజిల్‌ వెహికిల్స్ కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చింది. డీజిల్‌తో నడిచే వాటర్‌ ట్యాంకర్‌ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ జల్‌ బోర్డుకు కూడా కోర్టు అనుమతించింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు గత ఏడాది లగ్జరీ డీజిల్‌ కార్ల రిజిస్ట్రేషన్లపై ఎపెక్స్ కోర్టు నిషేధం విధించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దాదాపు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీ రోడ్లపై మళ్లీ డీజిల్ వాహనాలు దూసుకుపోనున్నాయి. 

 

09:28 - May 1, 2016

ఢిల్లీ : అచ్ఛేదిన్ అంటూ ఊదరగొట్టిన మోదీ సర్కార్‌పై ప్రజల్లో అప్పుడే అసంతృప్తి పెరిగిపోతోంది. వ్యక్తిగతంగా నిష్కళంకుడన్న కితాబు తప్ప.. మోదీకి దాదాపు అన్ని అంశాల్లోనూ మైనస్‌ మార్కులు బాగా పెరిగాయి. ఢిల్లీకి చెందిన సీఎంఎస్ సంస్థ నిర్వహించిన సర్వే ఈవిషయాన్ని వెల్లడించింది. వచ్చే మూడేళ్లూ ఆయనే ప్రధానిగా కొనసాగాలని.. కేవలం 30శాతం మందే ఆకాంక్షించారు. దీన్ని బట్టి.. ఆయనపై వ్యతిరేకత ఎంతలా పెరుగుతోందో అర్థమవుతోంది. మోదీ పాలనలో ఆహారం, ఆరోగ్యం, ధరల నియంత్రణ, నిత్యవసరాలు, మందులు, ఉద్యోగ కల్పన, అంతర్గత భద్రత అంశాలపై 48 శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
మోడీ రెండేళ్ల పాలనపై చాలా మంది పెదవి విరుపు
దేశంలో నరేంద్రమోడీ రెండేళ్ల పాలనపై చాలా మంది పెదవి విరిచారు. ఎక్కడలేని అంచనాలు పెంచిన మోదీ ప్రభుత్వం పథకాల అమలులో మాత్రం వెనుకంజలో ఉన్నట్లు సీఎంఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మోదీ పాలనలో ఆహారం, ఆరోగ్యం, ధరల నియంత్రణతో పాటు  నిత్యవసరాలు, మందులు, ఉద్యోగ కల్పన, అంతర్గత భద్రత అంశాలపై 48 శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లు మోదీయే ప్రధానిగా ఉండాలనుకుంటున్న వారు కేవలం 30 శాతం మంది మాత్రమే ఉన్నారు.  దేశంలోని 48శాతం మంది ప్రజలు మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సర్వేలో స్పష్టంగా తేల్చారు. 
మోడీ సర్కారులో పెరిగిన అవినీతి 
మోడీని నిష్కళంకుడని.. అవినీతి రహితుడని మెజారిటీ ప్రజలు అంగీకరించారు. వ్యక్తిగతంగా మోడీ పనితీరుపై 62శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. మోడీ సర్కారులో మాత్రం అవినీతి పెరిగిందని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు వల్ల.. ప్రజా జీవితంలో ఎలాంటి మార్పు సంభవించలేదని 49 శాతం మంది వెల్లడించగా,  పేదల పరిస్థితులు ఇంకా దిగజారాయని 15 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. 
సక్రమంగా అమలు కాని ప్రభుత్వ పథకాలు 
మోడీ ఏలుబడిలో.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని భావిస్తున్న వారు 43శాతం మంది ఉన్నారు. ధరల నియంత్రణ, నిరుద్యోగ నిర్మూలన, నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడం.. తదితర అంశాల్లో మోదీ సర్కారు విఫలమైనట్లు చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మోదీ దృష్టంతా విదేశీ వ్యవహారాలపైనే ఉందని, గడిచిన 24 నెలల్లో 40 దేశాలు చుట్టొచ్చారని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే మోడీ విధానాల వల్ల ప్రపంచ దేశాలలో భారత్ పరపతి పెరిగిందని 69శాతం మంది చెప్పారు. 
టాప్‌ పొజిషన్‌లో రైల్వే శాఖ
ఇక మంత్రిత్వ శాఖల పనితీరుపై జరిపిన సర్వేలో.. రైల్వే శాఖ టాప్‌ పొజిషన్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆర్థిక, విదేశాంగశాఖ, హోమంత్రిత్వ శాఖ, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ నిలిచాయి. పట్టణాభివృద్ధి శాఖ 15 వస్థానంలో నిలవగా, చివరి స్థానం కార్మిక శాఖకు దక్కింది. 
ఆశించిన స్థాయిలో పనిచేయని మంత్రిత్వశాఖల్లో కార్మికశాఖ, న్యాయశాఖ, కన్జూమర్‌, సోషల్‌ జస్టిస్‌, వ్యవసాయ శాఖలున్నాయి. 
మంత్రుల పనితీరుపై సర్వే... సుష్మాస్వరాజ్‌ మొదటి స్థానంలో
మీడియాతో సఖ్యత, ఎంపీ ల్యాడ్స్ వినియోగం, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రుల పనితీరుపై చేసిన సర్వేలో  సుష్మాస్వరాజ్‌ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో రాజ్‌నాథ్‌సింగ్‌, సురేష్‌ప్రభు, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌జైట్లీ ఉన్నారు. మంత్రి వెంకయ్యనాయుడు 7వ స్థానంలో ఉండగా, బండారు దత్తాత్రేయ కిందినుంచి రెండో స్థానంలో అంటే 19వ స్థానంలో నిలిచారు. పూర్‌ పర్ఫార్మెన్స్‌తో 20 వ స్థానంలో రామ్‌విలాస్‌ పాశ్వన్‌ నిలిచారు. 
మేక్‌ ఇన్‌ ఇండియాకు 18 శాతం మార్కులే 
ఇక పథకాల పరంగా చూస్తే... ప్రధాని మోడీ మానస పుత్రిక మేక్‌ ఇన్‌ ఇండియాకు కేవలం 18 శాతం మార్కులే లభించాయి. 49 శాతం మార్కులతో జన్‌ధన్‌ యోజన పథకం టాప్‌లో నిలవగా.. స్వచ్ఛభారత్‌ మిషన్‌ 44 శాతం మేక్‌ ఇన్‌ ఇండియా 18 శాతం, డిజిటల్‌ ఇండియా 15 శాతం, పీఎంజీఎస్‌వై 15 శాతంతో వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి. ఉపాధి హామీ పథకం అతి దారుణంగా అమలవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగే, స్మార్ట్‌ సిటీస్‌, ఆహార భద్రత, గోల్డ్‌ లోన్‌ యోజన, పీఎం రోజ్‌గార్‌ యోజన పథకాలు నిరాశాజనక పనితీరును కనబరిచాయి.

 

09:17 - May 1, 2016

నల్గొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆత్మకూరు (ఎస్) మండలం నెమికల్ కు చెందిన పలువురు తెల్లవారుజామున గ్రామానికి సమీపంలో ఉన్న మైసమ్మ దేవాలయం వద్దకు వెళ్లేందుకు ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని తప్పించబోయి రోడ్డు పక్కన నిలిచివున్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారు తీసుకెళ్లిన ఒక్క గొర్రె కూడా చనిపోయింది. మరొకరికి గాయాలయ్యాయి. 

 

08:35 - May 1, 2016

ఢిల్లీ : వాహనదారులకు మరోసారి పెట్రో వాత తగిలింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై రూపాయి ఆరు పైసలు,.. డీజిల్‌పై 2 రూపాయల 94 పైసలు పెంచారు. పెట్రోల్‌, డీజిలు ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

సన్‌రైజర్స్‌ మరో విజయం

హైదరాబాద్‌ : సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ మరో విజయం సాధించింది. స్టార్స్‌తో కూడిన బెంగళూర్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన హైదరాబాద్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు వార్నర్‌ దూకుడు ఇన్నింగ్స్ తో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 6 వికెట్ల కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో బెంగళూరు పై హైదరాబాద్‌ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపోందింది. 50 బంతుల్లో 92 పరుగులు చేసిన వార్నర్‌కు మ్యాన్‌ అఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

నేడు షాబాద్ లో మంత్రులు హరీశ్, మహేందర్ రెడ్డి పర్యటన

రంగారెడ్డి : జిల్లాలోని షాబాద్‌ మండలంలో ఇద్దరు మంత్రులు పర్యటించనున్నారని ఎంపీడీవో పద్మవతి తెలిపారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హారీ్‌షరావు, రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు షాబాద్‌ మండలం అంతారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్‌ భగీరథ పనులకు శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. వారితో పాటు చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి వస్తున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ బస్సు-టిప్పర్‌ ఢీ.. ఒకరి మృతి

కృష్ణా : జిల్లాలోని కంకిపాడు మండలం ప్రొద్దుటూరు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంకిపాడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు కంకిపాడు నుంచి ఉయ్యూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

08:25 - May 1, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ ప్రాజెక్టు పనులకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునాది రాయి వేయనున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ ఎత్తిపోతలు, పంప్‌హౌస్‌లు, కాల్వల నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇక మావోయిస్టు ప్రాబల్యం ఉన్న తూర్పు అటవీ ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో టెన్షన్‌ నెలకొంది. 
గోదావరిపై మూడు ప్రదేశాల్లో ఆనకట్టలు
టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. గోదావరిపై మూడు ప్రదేశాల్లో ఆనకట్టలను నిర్మించి రాష్ట్రంలో సాగునీటి అవసరాలు తీర్చాలని సర్కార్‌ యోచిస్తోంది. ఇందుకోసం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్‌ నిర్మించతలపెట్టింది. దీనికోసం ఇప్పటికే నిపుణులచే అన్ని సర్వేలు చేపట్టింది. మేడిగడ్డ ఆనకట్ట నుండి అన్నారం బ్యారేజికి నీటి ఎత్తిపోతలకు రూ.3,524 కోట్లు,.. అన్నారం బ్యారేజి నుండి సుందిళ్ల బ్యారేజి ఎత్తిపోతలకు  రూ.2,140 కోట్లు,.. సుందిళ్ల బ్యారేజి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ వరకు నీటిని తరలించేందుకు రూ.2,334 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధులతో మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టును నిర్మించి.. 160 టీఎంసీల నీటిని మళ్లించనున్నారు.  ఇక ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు సర్కార్‌ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. 
నేడు సాయంత్రం కరీంనగర్‌ కు కేసీఆర్ 
సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాజెక్ట్ పనులకు పునాది రాయి వేయనున్నారు. ఇందుకోసం కేసీఆర్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం హెలికాప్టర్‌ ద్వారా కరీంనగర్‌ నుండి మహదేవ్‌పూర్‌ మండలం కన్నెపల్లికి చేరుకుని మేడిగడ్డ బ్యారేజి పంప్‌హౌస్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం అంబట్‌పల్లిలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ పనులకు పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, ఈటెల, కేటీఆర్‌లతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. 
భారీ బందోబస్తు
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ గోదావరి సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే డీజీపీ అనురాగ్‌శర్మ మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతపై అధికారులతో సమీక్షించారు. తూర్పున ఉన్న అడవుల్లో అడుగడుగున గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులకు పట్టున్న గ్రామాలతో పాటు మాజీలపై నిఘా పెంచారు. ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇక ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 

 

08:15 - May 1, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ మరో దీక్షకు సిద్ధమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిర‌స‌న‌గా ఆయనీసారి దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన పాల‌మూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌ను వ్యతిరేకిస్తున్నట్లు జ‌గ‌న్‌ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు చేప‌డుతున్నా చంద్రబాబు ప్రశ్నించ‌క‌పోవ‌డానికి నిర‌స‌న‌గా మే 16 నుంచి మూడు రోజుల పాటు క‌ర్నూలులో దీక్ష చేస్తున్నట్లు జ‌గ‌న్‌ ప్రక‌టించారు. 
ఆ...ప్రాజెక్టుల‌కు వ్యతిరేక‌మ‌న్న జ‌గ‌న్‌
నీటి ప్రాజెక్టుల విష‌యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుస‌రిస్తున్న తీరును.. ఏపీ ప్రతిప‌క్ష నేత వైఎస్‌ జ‌గ‌న్ ఆక్షేపించారు. కృష్టా న‌దిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాల‌మూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోత‌ల ప్రాజెక్టుల‌కు వైసీపీ వ్యతిరేక‌మ‌ని జ‌గ‌న్‌ ప్రక‌టించారు. తెలంగాణ ప్రభుత్వం క‌డుతున్న ప్రాజెక్టుల వల్ల కృష్టా, గోదావ‌రి డెల్టాకు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. కృష్ణా డెల్టా అంటే కేవ‌లం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాద‌ని తెలంగాణలో ఖ‌మ్మం, న‌ల్లగొండ జిల్లాల‌కు కృష్ణా జ‌లాలు అంద‌ని పరిస్థితి వస్తుందని తెలిపారు. 
చంద్రబాబు ఎందుకు స్పందించ‌డంలేద‌న్న జ‌గ‌న్‌ 
కృష్టా న‌దిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా చంద్రబాబు ఎందుకు స్పందించ‌డంలేద‌ని జ‌గ‌న్‌ ప్రశ్నించారు. పోల‌వ‌రాన్ని కూడా చంద్రబాబు స్కాంల ప్రాజెక్టుగా మార్చార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ప‌ట్టిసీమ వ‌ల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందో.. న‌ష్టం వాటిల్లుతుందో చంద్రబాబు గుండెల‌పై చెయ్యి వేసుకుని చెప్పాల‌న్నారు. ఈ ప్రాజెక్టుల వ‌ల్ల తెలుగు రాష్ట్రాల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని, ఇరు రాష్ట్రాల‌తో పాటు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు వ‌చ్చే నెల 16, 17, 18 తేదీల్లో క‌ర్నూలులో దీక్ష చేస్తున్నట్లు జ‌గ‌న్ ప్రక‌టించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగారుస్తున్న చంద్రబాబు : జ‌గ‌న్
ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ఓ ప‌ద్ధతి ప్రకారమే నీరుగారుస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా అవ‌స‌రంలేదు అనేలా చంద్రబాబు ప‌దే ప‌దే మాట్లాడ‌టం వ‌ల్లే హోదాపై కేంద్రం దాటవేస్తోందని జ‌గ‌న్‌ అభిప్రాయ‌ప‌డ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోవ‌డంవ‌ల్లే ప్రత్యేక హోదా అడిగే ధైర్యం చెయ్యడంలేద‌ని జ‌గ‌న్ అన్నారు. హోదా విష‌యంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ప‌ణంగా పెట్టార‌ని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వం అని కేంద్ర మంత్రులు చెబుతున్నా కేంద్ర మంత్రి వ‌ర్గం నుండి త‌మ మంత్రుల‌ను ఎందుకు ఉప‌సంహరించుకోవ‌డంలేద‌ని చంద్రబాబును జ‌గ‌న్ ప్రశ్నించారు. ఒకప‌క్క మే 2న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తున్న వైసీపి..నెల మ‌ధ్యలో దీక్షకు సిద్ధమ‌వుతోంది. సమ్మర్‌లో ఈ దీక్ష జగన్‌కు ఏమేరకు ఉపకరిస్తుందో చూడాలి.

 

08:00 - May 1, 2016

హైదరాబాద్ : గోదావరి, కృష్ణ జలాలతో తెలంగాణ నేలంత చిత్తడిగా మారి, ఎర్రని నేలల్లో ఎర్రలు తిరిగి కదలాడి బంగారు పంటలు పండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీటిని అందించడానికి ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గోదావరి జలాలను పారించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.
ఇంజినీర్లతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు హాజరు
నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాల తరలింపుపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సమావేశానికి ఇంజినీర్లతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా రెండు నియోజకవర్గాలకు గోదారి జలాల తరలింపుపై సీఎం స్పందిస్తూ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రాజర్వాయర్లకు కొమరెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని తీసుకునే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. 
తొలిదశలో ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాల సేకరణ
ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీటిని అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తీసుకోవాలి. ఎల్లంపల్లి రిజర్వాయర్ చేరుకున్న జలాలు అక్కడి నుంచి మిడ్ మానేరు తర్వాత అనంతగిరికి, ఇమాంబాద్‌కు అక్కడి నుంచి కొమురవెల్లి మల్లన్న సాగర్ వరకు ఎత్తిపోతల ద్వారా నీటిని పంపిణీ చేయాలి. మల్లన్న సాగర్ నుంచి కుడెల్లి వాగు ద్వారా అప్పర్ మానేరు డ్యాం వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలి. అక్కడి నుంచి సర్వే అనంతరం లిఫ్ట్ ద్వారా కామారెడ్డి నియోజకవర్గంలోని మూడు రిజర్వాయర్లను నింపాలి.
ఎల్లారెడ్డి, కామారెడ్డిలలో మూడు లక్షల ఎకరాలకు నీరు 
సర్వే అనంతరం ఎంపిక చేసిన రిజర్వాయర్ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాటేవాడి డ్యాం, మోతె రిజర్వాయర్, అమర్లబండ రిజర్వాయర్లకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించాలి. నల్లగొండ జిల్లా ఆలేరు, భవనగిరి నియోజకవర్గాల్లోని గందమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. అప్పర్ మానేరు నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీటి తరలింపు కోసం లిఫ్టులు, కాలువల నిర్మాణాలకు సంబంధించిన సర్వేను సత్వరమే చేపట్టి పూర్తి చేయాలి. ఈ రిజర్వాయర్ల ద్వారా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం పేర్కొన్నారు.

07:51 - May 1, 2016

ఢిల్లీ : ఎంబీబీఎస్, బీడీఎస్‌లో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ తొలి విడత  పరీక్ష అన్ని అడ్డంకులను దాటుకుని నేడు జరగనుంది. ఈ పరీక్షను ఆపాలని, తేదీలు మార్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. పరీక్ష సజావుగా జరిగేలా అందరూ సహకరించాలి అని ఆదేశించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, కర్ణాటకతో పాటు సీఎంసీ, వెల్లూరు మైనారిటీ సంస్థలు తాము వ్యక్తిగతంగా నీట్ నిర్వహించుకుంటామన్నా తిరస్కరించింది. ఇక ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 6.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకోని వారికి జూన్‌ 24 మరోసారి నీట్‌ నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల ఫలితాలను ఆగస్టు 17న విడుదల చేసి.. సెప్టెంబర్‌ 30లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. 

 

నేడు కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిన

కరీంనగర్ : నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నింది వెలుపల ఉన్న క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందన్నారు.  నడకదారి భక్తులకు 9 గంటల సమయం పడుతుంది.

 

ఐపీఎల్ లో నేటి మ్యాచులు..

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా నేడు గుజరాత్, పంజాబ్ ఢీ కొననున్నాయి. రాజ్ కోట్ వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పుణే వేదికగా రాత్రి 8 గంటలకు ముంబై, పుణె మధ్య మ్యాచ్ జరుగనుంది. 

07:34 - May 1, 2016

హైదరాబాద్ : ఆయువునే ఇంధనంగా వాడి బొగ్గును ఉత్పత్తిచేస్తున్నారు.. కొవ్వత్తిలా కరిగిపోతూ ప్రపంచానికి వెలుతురునిస్తున్నారు... కాని వారి జీవితాలే మసి బారుతున్నాయి... అధికారుల నిర్లక్ష్యంతో సిరుల సింగరేణి బొగ్గు బావులు కార్మికుల పాలిట బొందలుగా మారుతున్నాయి. సింగరేణిలో కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైనంపై ప్రత్యేక కథనం
సిరుల మాగాని సింగరేణి 
సిరుల మాగాని సింగరేణి పన్నెండు దశాబ్దాల ఘన చరిత కలిగిన నల్ల బంగారు లోకం.. ప్రపంచానికి సింగరేణి కార్మికులు తమ శ్రమతో వెలుగులు అందిస్తున్నప్పటికీ  వారి జీవితాలు మాత్రం చీకట్లోనే కనుమరుగయిపోతున్నాయి.
ప్రమాదపు అంచుల్లో పనులు 
భూగర్భ బొగ్గు గనుల్లో నిత్యం ప్రమాదపు అంచుల్లో పనులు జరుగుతున్నాయి. ఇటీవల వరుసగా కార్మికులు గనుల్లోనే సజీవ సమాది  అవుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. టెక్నాలజి పెరుగుతున్నా ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. ఈ నెల 13 వ తేదిన శాంతిఖని బొగ్గు బావిలో జరిగన ప్రమాదంలో మరణించిన కార్మికులను పోలీసుల పహారలో కనీసం నివాళి అర్పించడానికి కూడా వీలు లేకుండా శవాలను తరలించారు. దీంతో కార్మికుల హక్కులు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చెస్తున్నారు...
బొగ్గు గనిలో పై కప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి  
బెల్లంపల్లి ఏరియాలోని శాంతి ఖని బొగ్గు గనిలో జంక్షన్ వద్ద పై కప్పు కూలి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదానికి అసలు కారణం సేఫ్టీ ఆఫీసర్, సింగరేణి అధికారులే అని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. తక్షణమే అధికారుల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన జరిగి 48 గంటలు గడిచినా ఒక్క కార్మికుడి శవాన్ని మాత్రమే తీయగలిగారు, మరో ఇద్దరి శవాలను నాలుగు రోజుల తరువాత తీశారు. ఇంతలా సింగరేణిలో ఒక ఘటన జరిగితే కార్మికుల ఓట్లతో గెలిచిన గుర్తింపు సంఘం  సంఘటన జరిగిన గని వద్దకు రాకపోవడం సిగ్గుచేటుగా మారింది. ప్రమాదం జరిగే నెల రోజుల ముందే కార్మికులు గని పై కప్పు కూలుతోందని ఎన్ని సార్లు చెప్పిన ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. సింగరేణి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

 

07:22 - May 1, 2016

హైదరాబాద్ : మేడే సందర్భంగా కార్మికవాడలన్నీ అరుణ పతాకాలతో రెపరెపలాడుతున్నాయి. ఎర్రఎర్రని జెండాలు చేబూనిన కార్మికులు   కదం తొక్కుతున్నారు. 
మే డే రెండే అక్షరాలు. ఆరే ఆల్ఫాబెట్స్. కానీ, ఆ చిన్న పదం విన్న ప్రతిసారీ ఎంత స్ఫూర్తి, ఎంత ఉద్వేగం. మరెంత సమరోత్సాహం. ఈసారి సండేనాడే మేడే   వచ్చినందున ఓ హాలిడే మిస్సయిందంటూ బాధపడేవారికి అది జాలీడే కాదని ఎవరు చెప్పగలరు?
మేడే ఒట్టి టైంపాస్ సెలబ్రేషన్ డే కాదు
మేడే ఒట్టి టైంపాస్ సెలబ్రేషన్ డే కాదు. 130ఏళ్ల క్రితం నాటి రక్తతర్పణను మన కళ్లెదుట నిలిపే ఓ పవిత్ర దినం.  1887 మే 1న షికాగోలో వెల్లువెత్తిన ఉద్యమం, ఆ తర్వాత ఎన్ని సంస్కరణలకు,  మరెన్ని చట్టాలకు దారితీసిందో. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక పని చేసి, జానెడు పొట్ట నింపుకోవడానికి ఎన్ని కష్టాలు. ఎన్ని వేదనలు. ఎన్ని అవమానాలు.  ఎన్ని అదిరింపులు. ఎన్ని చీదరింపులు. వీటన్నింటినీ ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, ఇంకానా ఇక పై సాగవింకా అంటూ గర్జిస్తూ ఉదయించిందే మేడే.  ఆరుగురు వీరుల రక్తతర్పణను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే మేడే. మనిషిని మనిషిగా   బతకనివ్వండంటూ ఎలుగెత్తి చాటే నినాదమే మేడే.  గేట్లకు తాళాలు పెట్టి, చేతిలో దుడ్డుకర్రలు పట్టుకుని, క్షణమైనా కూర్చోనివ్వకుండా రోజుకి 18 గంటలు, 20 గంటలు పనిచేయిస్తూ కనీసం కడుపు నిండా   తిండైనా పెట్టకుండా బాధిస్తుంటే కడుపుమండి కార్మికవర్గం   స్రుష్టించిన తొలి విప్లవమే మేడే.
130 ఏళ్ల క్రితం నాటి పరిస్థితేమిటి? 
130 ఏళ్ల క్రితం నాటి పరిస్థితేమిటి? ఈ కాలంలో మనం సాధించుకున్నదేమిటి? వాటిలో నిలబెట్టుకున్నవేమిటి? పోగొట్టుకుంటున్నవేమిటి? ఇంకా సాధించుకోవాల్సిందేమిటి? ఇలాంటివేవీ ఆలోచించుకోక పోతే మేడే కి అర్ధమే వుండదు. ఓ వైపు జిగ్ జిగేల్ మంటూ మెరిసే సెలబ్రిటీలు చీపురులు పట్టుకుని స్వచ్ఛ భారత్ ను గుండెలకు హత్తుకుంటున్నారు.  మరోవైపు, మురికిరోడ్లను, కాల్వలను శుభ్రం చేసే పనిలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట చనిపోతూనే వున్నారు.  ఒకరికెంత ప్రచారం. మరొకరికెంత కష్టం.
సంస్కరణలు ఎవరికి వరమయ్యాయి..?
మేడ్ ఇన్ ఇండియా  ఒకప్పటి మన ఆంబిషన్. మేక్ ఇన్ ఇండియా ఇప్పటి మన ప్రభువుల అద్భుత ప్రవచనం. అప్పుడు కార్మిక సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు. ఇప్పుడు సంస్కరణలు. సవరణలు.  సంస్కరణల యుగానికి పూర్వం మన దేశ ప్రభుత్వరంగ సంస్థల్లో 19.14 మిలియన్ల మంది కార్మికులండేవారు. 2010 నాటికే వారి సంఖ్య 17.55 మిలయన్లకు పడిపోయింది.  అప్పుడు ప్రయివేట్ రంగంలో 8.51 మిలియన్ల మంది కార్మికులుంటే ఇప్పుడు 11.45కు మిలియన్లకు పెరిగింది. సంస్కరణలు ఎవరికి వరమయ్యో, ఎవరికి శాపమయ్యాయో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే వేరే లెక్కలేమి కావాలి.  
ఆర్థిక వ్యవస్థ పెద్ద కసాయి..
తోటి మనిషిని కుళ్ల బొడిచైనా,  రూపాయిలు కూడబెట్టడం నేర్పే ఆర్థిక వ్యవస్థ పెద్ద కసాయి. కాపిటల్  రిఫార్మ్స్   ప్రవచించే హ్యూమన్ ఫేస్ పెద్ద బడాయి. దాంతో లడాయి పెట్టుకోవడమే  అసలైన మేడే స్పిరిట్. రండి. లాస్ట్ మేడేకి ఈ మేడేకి మధ్య బ్యాలెన్స్ షీట్ చూసుకుందాం. మనం ఏం సాధించుకున్నమో, ఏం కోల్పాయోమో తేలిపోతుంది. 

07:07 - May 1, 2016

హైదరాబాద్ : పెట్టుబడిదారీ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం నినదించిన రోజు మేడే. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. సమాజగతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం. ఆ శ్రమే బండచాకిరీగా మారినపుడు ఏమవుతుంది..? శ్రామికుడు దారుణంగా దోపిడీకి గురైనపుడు ఏం జరుగుతుంది..? కష్టించే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయ్. భూకంపం సృష్టిస్తాయ్. ఉద్యమాలు పుట్టుకొస్తాయి.
మేడే... కార్మికుల పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం...
మేడే... కార్మికుల పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం... కర్షకులు సాధించిన విజయానికి ప్రతీక. నెత్తుటి ధారలు కారుతున్నా... మర ఫిరంగులు మోగుతున్నా... గుండెల్లోకి తూటాలు దూసుకెళుతున్నా... ఎత్తిన జెండా దించకుండా పోరాడిన దినమే మేడే. అందుకే కోట్లాది మంది కార్మిక లోకానికి పండగ రోజు. నిజంగానే మేడే... ప్రజాహితం కోరుకునే వారందరికీ పండగరోజే. మే ఒకటోతేదీ రాగానే కార్మికుడి హృదయం విజయగర్వంతో ఉప్పొంగుతుంది.
130 ఏళ్ల క్రితమే కార్మికోద్యమం
పెట్టుబడిదారీ ప్రపంచానికి పుట్టినిల్లైన అమెరికాలో దాదాపు 130 ఏళ్ల క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమించారు. తరతరాల దోపిడీపై తిరుగుబాటు జరిగినపుడు చిందిన వెచ్చని నెత్తురే కేతనమై ఎగసింది. 
బానిసల్లా శ్రామికులు
1886 మే 1... అమెరికాలోని చికాగో నగరం... కార్మికులు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న రోజులవి. కార్మికులు రోజుకి 18-20 గంటలు పనిచేస్తున్న దోపిడీ కాలమది. పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమించే వారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలకోసం ఆరేడేళ్ళ పిల్లలతోనూ, మహిళలతనూ ఫ్యాక్టరీల్లో, గనుల్లో పనిచేయించారు. కార్మికులు చాకిరీ కొలిమిలో కుతకుతలాడిపోయినా పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. 
1886 మే 1న కార్మికుల ఉద్యమం
ఆ దోపిడీ రాపిడిలోంచి తిరుగుబాటు అగ్గి రాజుకుంది. రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో కార్మికులు 1886 మే 1 ఉద్యమించారు. ఆ రోజు కార్మికవర్గ చైతన్యం వెల్లివిరిసింది. చికాగో నగర వీధుల్లో ఉత్సాహవంతులైన కార్మికులు కదం తొక్కారు. ఆ రోజే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా ప్రసిద్ధి కెక్కింది. 
మే 3న శాంతియుత సమ్మె
అదే ఏడాది మే 3న శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మిక జనసమూహంపై అమెరికన్‌ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా మే 4న హే మార్కెట్‌లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రశాంతంగా సాగుతున్న సభ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. మధ్యలో బాంబు ప్రయోగం కూడా జరిగింది. ఒక పోలీసు సార్జెంట్‌ చనిపోయాడు. అది సాకుగా తీసుకుని పోలీసులు నిరాయుధులైన కార్మికులపై తుపాకులతో స్వైర విహారం చేశారు. ఈ సంఘర్షణలో ఏడుగులు పోలీసులు చనిపోగా నలుగురు కార్మికులు నేలకొరిగారు. హే మార్కెట్‌ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. అక్కడే ఆవిర్భవించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాడి శ్రమజీవుల స్వేచ్ఛా సంకేతమైన అరుణపతాకం. 
నెత్తురుతోనే ఎర్రజెండా పుట్టిన రోజు..
కష్టాలకు కుంగిపోకుండా... కన్నీళ్లకు ఆనకట్ట వేసి... కార్మికుడు పిడికిలి బిగించిన రోజు మేడే. కార్మికులపై పోలీసులు పేల్చిన తూటాలు చిందించిన నెత్తురుతోనే ఎర్రజెండా పుట్టిన రోజు. ఏ దేశంలోనైనా సమాజ మార్పునకు చోదక శక్తి కార్మికవర్గమే. మనలాంటి వెనుకబడిన దేశాల్లో కార్మికులకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్ష పూనాలి. ఆ మహత్తర సంకల్పంతోనే ముందుకుసాగాలి. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ : ఆత్మకూరు (ఎస్) మండలం నెమీకల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది.

మేడే వేడుకల్లో పాల్గొననున్న బివి.రాఘవులు, తమ్మినేని

హైదరాబాద్ : ఉదయం 10 గంటలకు ఎంబీ భవన్ వద్ద జరిగే మే డే వేడుకల్లో సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యుడు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొనున్నారు. 

బంజారాహిల్స్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. 450 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 58 బైకులను సీజ్ చేశారు. 

Don't Miss