Activities calendar

02 May 2016

22:30 - May 2, 2016

రంగారెడ్డి : ఎమ్మెల్యే అంటే.. నియోజకవర్గంలోని ప్రజలందరి ప్రతినిధి.. జనంతో అనునిత్యం మమేకం కావాల్సిన వ్యక్తి. నియోజకవర్గ ప్రజలను కడుపులో ఉంచుకుని కాపాడుకోవాల్సిన వ్యక్తి. ఆవిధంగా ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఒకరు.. నియోజకవర్గంలోని ఓ సామాన్య వ్యక్తిపై కన్నెర్ర చేశారు. ఫోన్‌ చేసి.. నానా దుర్భాషలాడుతూ.. నీ సంగతి చూస్తానంటూ బెదిరించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన 'రక్షకుడే భక్షకుడు' అనే వార్తను 
కీసర మండలం దమ్మాయిగూడెంకు చెందిన కాంట్రాక్టర్‌ దుర్గాప్రసాద్‌గౌడ్‌ వాట్సప్ లో షేర్ చేశాడు. దీంతో ఆగ్రహించిన మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అతనిపై ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు. 'ఆ వార్తను వాట్సప్ లో షేర్ ఎలా చేస్తావు.. నీవు పై కేసు పెడతాను.. నీ సంగతి చూస్తానని దుర్గాప్రసాద్ గౌడ్ ను బెదిరించారు'. చిన్నపాటి కాంట్రాక్టర్‌ అయిన అతనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన వార్తను వాట్సాప్‌లో షేర్‌ చేశాడని మండిపడ్డాడు. తాను నిర్దోషినని బాధితుడు చెబుతున్నా ఎమ్మెల్యే కనికరించలేదు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బండబూతులు తిడుతూ అతన్ని బెదిరించాడు. అంతు చూస్తామని బెదిరించాడు. బాధితుడు మూడు రోజులుగా ఇంటికి వెళ్లేందుకూ భయపడుతున్నాడు. ఎమ్మెల్యే బెదిరింపులతో వణికిపోయిన దుర్గాప్రసాద్‌గౌడ్‌ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. 
భాదితుడు దుర్గాప్రసాద్ గౌడ్..
'ఎమ్మెల్యే నన్ను దుర్భాషాలాడారు. ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చిన వార్తను మాత్రమే నేను షేర్ చేశాను. అయితే మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోపానికి కారణం వేరే ఉంది. ఎమ్మెల్యే నుంచి నాకు ప్రాణ హాని ఉందని భావించి.. హెచ్ ఆర్ సీని ఆశ్రయించాను. నాకు రక్షణ కవాలి. ప్రజలకు న్యాయం చేయాలి. దమ్మాయిగూడెం సర్పంచ్, కొంతమంది వార్డులు సభ్యులు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి నన్ను బెదిరించారని' తెలిపారు.  

ఫోన్‌లో బెదిరిస్తున్న వ్యక్తి.. అధికార పార్టీకి చెందిన మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. బాధితుడు.. హైదరాబాద్‌ శివార్లలోని దమ్మాయిగూడకు చెందిన ఓ చిన్నపాటి కాంట్రాక్టర్‌ దుర్గాప్రసాద్‌గౌడ్‌. ఇంతకీ ఎమ్మెల్యేకి దుర్గాప్రసాద్‌పై ఎందుకింత కోపం వచ్చింది..? సుమారు ఓ నెలన్నర క్రితం.. ఓ ప్రముఖ దినపత్రికలో.. ఎమ్మెల్యే కుటుంబపు భూ కబ్జా గురించిన వార్తా కథనం వచ్చింది. దాన్ని దుర్గాప్రసాద్‌ గౌడ్‌ వాట్సాప్‌లో షేర్‌ చేశాడన్నది ఎమ్మెల్యే అభియోగం. నిజంగానే ఈ కారణంతోనే ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌పై విరుచుకు పడ్డారా..?

22:15 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ చేపడుతున్న  సాగునీటి ప్రాజెక్ట్‌లపై కేంద్రానికి లేఖ రాయాలని ఎపి మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలను సమన్వయం చేయాలని కోరుతూ  కేంద్రానికి లేఖ రాయాలని సీఎం చంద్రబాబు  అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. ఏపీ కేబినెట్‌ సమీక్ష సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను చంద్రబాబు వెల్లడించారు.  రాష్ట్రంలో కరవు నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని సీఎం వెల్లడించారు. 850 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. పశుగ్రాసానికి 32 కోట్లు, రైతుల రుణవిముక్తి కింద 23 వేల 150 కోట్లు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. 

 

వ్యాపారిపై దుండగులు కాల్పులు

హైదరాబాద్‌ : కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న నగరంలో కాల్పులు కలకలం రేపాయి. కాటేదాన్‌లోని మనీ ట్రాన్స్ ఫర్‌ ఆఫీస్‌లోకి చొరబడిన దోపిడీ దొంగలు కాల్పులు జరుపుతూ దోపిడీకి యత్నించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యాపారి ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదుచేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

పాలేరు ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఖమ్మం : జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పాలేరు బరిలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ బరిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (టీఆర్‌ఎస్), దివంగత కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి(కాంగ్రెస్), పోతినేని సుదర్శన్‌(సీపీఎం), మరో పది మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.

 

20:51 - May 2, 2016

పవనిజం పంచా ...? ప్రచార స్టంటా..? ట్విట్టర్ కూతేనా..? పొలిటికల్ ఎజెండానా..? ప్రత్యేకహోదాపై పవన్ రగడ.. పవన్ రాజకీయ ఎత్తుగడలపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

20:45 - May 2, 2016

రాజీవ్ ఆరోగ్య శ్రీకి పుట్టెడు జరం... కేసీఆర్ సూదిస్తెనే పోతదంట దూరం, ఉన్నకాడ్కి ఇర్గిపోయిన ప్యాన్ రెక్కలు, మెల్లెగ జారుతున్నరు ఒక్కొక్కళ్లు, కాలేశ్వరంల కేసీఆర్ విగ్రహాన్కి ఏర్పాట్లు..వేరే పనులల్ల అధికారులు పడ్తుండ్రు కూర్పాట్లు, అయ్యో ఎన్మిదేండ్ల పాపకు పెండ్లట... అంత చిన్నవయసుల అదేంతండ్లాట, కొత్త ముచ్చట చెప్పుకొచ్చిన కవితక్క.. వామపక్షాలతోటి పనిలేదంట పక్క, ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లు రెడీ... ప్రకటించిండయ్యో మన మోడీ, కేసీఆర్ ఇంట ఎప్పుడు పెండ్లి బాజ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....
 

వరంగల్ లో రూ.1.40 లక్షలు అపహరణ...

వరంగల్ : నగరంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వరంగల్ చౌరస్తాలో అంకటి సాంబయ్య అనే వ్యక్తి దృష్టి మరల్చి రూ.1.40 లక్షల క్యాష్‌ను అపహరించుకు పోయారు. బాధితుడు వెంటనే ఇంతేజార్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు బాలుడి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలం పామెన గ్రామంలో పిడుగుపాటుకు ఒక బాలుడు మృతి చెందాడు. పామెన గ్రామానికి చెందిన నవీన్‌(15) సోమవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలసి పాలానికి వెళ్లాడు. కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో వాన మొదలైంది. అంతలోనే చేలో ఉన్న బాలుడిపై పిడుగుపడింది. కొద్దిదూరంలోనే ఉన్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే సరికే అతను మరణించాడు.

20:19 - May 2, 2016

స్వార్థ ప్రయోజనాలకోసమే నేతలు పార్టీ ఫిరాంయిపులకు పాల్పడుతున్నారని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్.. ఎస్.వీరయ్య, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీ.తెలుగు యువత ఉపాధ్యక్షులు విద్యాసాగర్ లు పాల్గొని, మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులను వేరొక పార్టీలో చేర్చుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి.. మళ్లీ పోటీ చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

రేపు విజయవాడలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

కృష్ణా : విజయవాడలో రేపు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం కీలకంగా మారింది. ప్రత్యేక హోదాతో పాటు.. టీడీపీ-బీజేపీ సంబంధాల పైనా చర్చ కొనసాగనుంది. మహానాడు నిర్వహణపైనా కూడా సమావేశంలో చర్చ జరగనుంది. ఏపీ తెలంగాణల్లోని కరవు పరిస్థితులపైనా చర్చ చేపట్టనున్నారు. ఏపీ, తెలంగాణ పార్టీ శాఖల మధ్య సమన్వయంపై చర్చ జరుగనుంది. జగన్‌ మూడు రోజుల దీక్ష అంశంపైనా పొలిట్‌బ్యూరో చర్చించనుంది. 

19:43 - May 2, 2016

కృష్ణా : విజయవాడలో రేపు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం కీలకంగా మారింది. ప్రత్యేక హోదాతో పాటు..  టీడీపీ-బీజేపీ సంబంధాల పైనా చర్చ కొనసాగనుంది. మహానాడు నిర్వహణపైనా కూడా సమావేశంలో చర్చ జరగనుంది. ఏపీ తెలంగాణల్లోని కరవు పరిస్థితులపైనా చర్చ చేపట్టనున్నారు. ఏపీ, తెలంగాణ పార్టీ శాఖల మధ్య సమన్వయంపై చర్చ జరుగనుంది. జగన్‌ మూడు రోజుల దీక్ష అంశంపైనా పొలిట్‌బ్యూరో  చర్చించనుంది. 

19:32 - May 2, 2016

కర్నాటక : బెంగళూరులో దుండగులు ఓ యువతిని కిడ్నాప్‌ చేసిన దురాగతం ఆలస్యంగా వెలుగు చూసింది. దక్షిణ బెంగుళూరు కట్రిగుప్పెలో పేయింగ్‌ గెస్ట్ గా ఉంటున్న పాతికేళ్ల యువతిని ఇంటిముందు నుంచి దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లి దుస్సాహసానికి పాల్పడ్డారు. ఈ దుశ్శాసన పర్వం సిసిటివి కెమెరాలో రికార్డయింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఆ యువతిని తీసుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు ఓ గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. అయితే ఆ అమ్మాయి దుండగుడి చేయిని కొరికి తప్పించుకుని వసతి గృహానికి వచ్చినట్లు తెలిపింది. ఆ అమ్మాయి బయట ఫోనులో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు కల్యాణ్‌నగర్‌లోని ఓ బ్యూటి క్లినిక్‌లో పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

వైసిపికి గుడ్ బై చెప్పనున్న పాయం వెంకటేశ్వర్లు

హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. వైసీపీకి గుడ్‌బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సిద్ధమయ్యారు. పొంగులేటి బాటలోనే పయనించేందుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా సిద్ధమవుతున్నారు. ఇవాళ పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ మారాలని పొంగులేటి నిర్ణయించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానని పొంగులేటి స్పష్టం చేశారు. రేపు లేదా ఎల్లుండి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వీళ్లిద్దరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు పొంగులేటిని కలిసిన కేటీఆర్..

19:24 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. వైసీపీకి గుడ్‌బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సిద్ధమయ్యారు. పొంగులేటి బాటలోనే పయనించేందుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా సిద్ధమవుతున్నారు. ఇవాళ పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ మారాలని పొంగులేటి నిర్ణయించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానని పొంగులేటి స్పష్టం చేశారు. రేపు లేదా ఎల్లుండి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వీళ్లిద్దరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు పొంగులేటిని కలిసిన కేటీఆర్.. తెలంగాణ వైసీపీని.. టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని కోరారు. 

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. హైదరాబాద్ లో డిప్యూడీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ లో 82.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 20న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 9 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

ఎపి కేబినెట్ నిర్ణయాలు..

హైదరాబద్ : ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 శాఖల్లో 400 వందల ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించారు. గతంలో నిర్ణయించిన 20 వేల పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని  కేబినెట్ నిర్ణయించింది. గోదవరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని నిర్ణయించారు.  ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం చేసి నీటి వివాదం లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరనున్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిచాలని నిర్ణయించారు. 

19:15 - May 2, 2016

ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణనగర్‌లో మంచినీళ్ల సరఫరా నిలిచిపోవడంతో సుమారు 200 కుటుంబాలు రోడ్డెక్కాయి. పాల్వంచ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు మంచినీళ్ల కోసం ఎండలో మహిళలు బిందెలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. 

18:46 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. హైదరాబాద్ లో డిప్యూడీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ లో 82.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 20న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 9 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

18:39 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఈనెల 15న ఎంసెట్, 22న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి  తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులు మళ్లీ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి టెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. 
మే 27న ఎంసెట్ ర్యాంకులు ప్రకటించనున్నామని తెలిపారు. జూన్ లో ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుందని, జులైలో క్లాసులు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

 

ఈనెల 15న ఎంసెట్, 22న టెట్ పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో ఈనెల 15న ఎంసెట్, 22న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి  తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

17:58 - May 2, 2016

హైదరాబాద్ : పైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు సఫలం ఆయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ఈనెల 31లోగా ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలు రూ. 200 కోట్లు చెల్లిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి  హామీ ఇచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. మిగిలిన బకాయిలను 20 రోజుల్లో చెల్లిస్తామన్నారు. ఇకపై ఆలస్యం కాకుండా బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి నెల ఆసుపత్రులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. 
 

 

17:48 - May 2, 2016

హైదరాబాద్ : పాలేరు ఎన్నిక ఫలితాలతోనే టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభం అవుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లురవి జోస్యం చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీ వ్యాప్తంగా మెజారిటీ సీట్లు గెలిచిన బీజేపీ, సరిగ్గా ఆరు నెలలు తిరగ్గానే ఆమ్‌ ఆద్మీ చేతిలో చిత్తుగా ఓడిందని గుర్తుచేశారు. ఢిల్లీ ఫలితాలే తెలంగాణలో కూడా పునరావృతం అవుతాయని ఆయన అన్నారు. పాలేరు ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

 

చిన్నారి మృతిపై మంత్రి కామినేని స్పందన..

విజయవాడ : నగరంలోని పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారి మృతిపై మంత్రి కామినేని స్పందించారు. ఉన్నతాధికారులతో లండన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడి చిన్నారి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన హామీనిచ్చారు. 

ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 177 కోట్లు - మంత్రి లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 177 కోట్లు బకాయిలు విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. ఆరోగ్య శ్రీ అమలులో ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. మిగులిన బకాయిలను 20 రోజుల్లో చెల్లిస్తామని, ఇక నుండి ప్రతి నెల ఆసుపత్రులకు డబ్బులు చెల్లించేలా తీసుకుంటామని హామీనిచ్చారు. 

17:40 - May 2, 2016

ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ ఎప్పటికప్పుడూ మారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ రెడీమెడ్ బ్లౌజెస్ ది. డైలీ వేర్ అయినా, పార్టీ వేర్ అయినా ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ దే హవా. అలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:38 - May 2, 2016

సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె. కరాటే మాస్టర్ గా విస్తృతంగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నధీశాలి ఆమె. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి మహిళ ఆత్మ రక్షణా పద్ధతులపై పట్టు సాధించాలనే ఆశయంతో అలుపెరగని కృషి చేస్తున్న కరాటే మాస్టర్ ఆమె. 
మహిళలు..ఆత్మరక్షణా పద్ధతులు
మహిళలపై రోజురోజుకి పెరుగుతున్న అఘాయిత్యాలు వారు ఆత్మరక్షణా పద్ధతులపై పట్టు సాధించాల్సిందిగా గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను నేర్పటమే జీవనోపాధిగా మలుచుకున్న అతివను పరిచయం చేసేందుకు ఈ వారం స్ఫూర్తి మీ ముందుకు వచ్చింది.
పోలీసు ఆఫీసర్లకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగిన లక్ష్మీ
పోలీస్ వృత్తిపై ఉన్న ప్రత్యేక గౌరవంతో పోలీస్ అఫీసర్ అవాలని కలలు కన్న లక్ష్మి డిపార్ట్ మెంట్ లో అనేక స్థాయిలలో ఉన్న ఆఫీసర్ లకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. భవిష్యత్ లో ఆమె మరెంతో మందికి శిక్షణనిస్తూ తను ఎంచుకున్న రంగం లో అద్భుతాలు సాధించాలని, మరెన్నో రికార్డులు సొంతం చేసుకోవాలని మానవి కోరుకుంటోంది.  

 

17:28 - May 2, 2016

హైదరాబద్ : ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 శాఖల్లో 400 వందల ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించారు. గతంలో నిర్ణయించిన 20 వేల పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని  కేబినెట్ నిర్ణయించింది. గోదవరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం చేసి నీటి వివాదం లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరనున్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిచాలని నిర్ణయించారు. 

 

17:19 - May 2, 2016

విశాఖ : బ్రాండెక్స్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ కలెక్టరేట్‌ దగ్గర వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి బ్రాండెక్స్ కార్మికులు భారీగా తరలివచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతోపాటు, ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. కనీస వేతనం 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విధుల నుంచి తొలగించిన కార్మిక వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఇందుకు కారకులైన వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బ్రాండెక్స్ యాజమాన్యం, ప్రభుత్వ వైఖరికి నిరసగా ఈనెల 4న కూడా ఫ్యాక్టరీ ప్రాంతంలో పర్యటించాలని వామపక్ష నేతలు నిర్ణయించారు.

 

17:17 - May 2, 2016

కర్నూలు : జిల్లా నంద్యాలలో ఓ డాక్టర్ రాసలీలల గుట్టు రట్టయ్యింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని సొంత ఇంట్లోనే కాపురం పెట్టడంతో భార్య చేతికి రెడ్ హ్యండ్ గా దొరికిపోయాడు. నంద్యాలలో అర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాఘవరెడ్డి రెండు నెలలుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఏకంగా ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఈ విషయంపై భార్య నిలదీయగా ఆమెను కొట్టి ఇంట్లోంచి తరిమేశాడు. ఇదంతా భరించలేక బాధితురాలు తన బంధువుల సహాయంతో డాక్టర్ ను రెండ్ హ్యండ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. డాక్టర్ తండ్రి, అన్నదమ్ములు సైతం తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు వినితాదేవి రోదించారు. 

ప్రజల ప్రయోజనం కోసమే టీఆర్ఎస్ లో - పొంగులేటి..

ఖమ్మం : ప్రజల ప్రయోజనం కోసమే తాను టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించేందుకు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించినట్లు, అనేక ఇబ్బందులు ఎదురైనా పార్టీలో కొనసాగినట్లు పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. 

17:05 - May 2, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం నెలకొంది. వివాహానికి వెళ్తుండగా వడదెబ్బ తగిలి ఇద్దరు మృతి చెందారు. కిష్టాపురం మండలం లింగపల్లి గ్రామానికి చెందిన లచ్చు అనే గిరిజన మహిళ తన ఇద్దరు పిల్లలు అశోక్ (12), మధు (8)లను వెంటబెట్టుకుని బద్దారం అటవీప్రాంతం నుంచి పక్కనున్న గ్రామాంలో జరిగే వివాహ కార్యక్రమానికి బయల్దేరింది. మార్గంమధ్యలో తన వెంటతీసుకెళ్లిన నీళ్లు అయిపోయాయి. తల్లి వడదెబ్బతో సొమ్మసిల్లిపడిపోయింది. ఇద్దరు కుమారులు అడవిలో నీళ్ల కోసం చెరోదారిన వెళ్లారు. అయితే దారి తప్పిన చిన్నారులు నీటి కోసం వెతికి వెతికి వడ దెబ్బతో మృతి చెందారు. అయితే సాయంత్రం సమయంలో ఆమెకు మెలకువ వచ్చింది. పిల్లలు ఇంటికి వెళ్లిఉంటారని భావించి.. ఆమె ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి కొడుకులు రాకపోవడంతో ఆందోళన చెందారు. మర్నాడు పశువుల కాపరులతో అడవిలో గాలించిగా ఇద్దరు కుమారులు మృతి చెంది పడి ఉన్నారు. దీంతో దల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

16:45 - May 2, 2016

'కబాలి దా' అంటూ రజని చేస్తున్న సందడి సోషల్ నెట్ వర్కింగ్ లో హోరెత్తిపోతోంది. మేడే సందర్భంగా 'కబాలి' టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర తమిళ టీజర్ ను ఇప్పటి వరకు మొత్తం 54 లక్షల మందికి పైగా చూశారు. ఇందుకు గాను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసింది.
తన నటనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని..తన స్టైల్ లో ఏ మాత్రం మార్పు లేదని రజనీ ఈ టీజర్ లో చూపెట్టారు. మొదటే చెప్పినట్లుగానే 'కబాలి' టీజర్.. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మాత కలై పులి ధాను టీజర్‌ విడుదల చేసారు. ఇక ఈ టీజర్... సూపర్ స్టార్ రజనీ మార్కు స్టైలిష్ నడకతో మొదలవుతుంది. అలాగే...ఆ తర్వాత ఓ మీటింగ్ హాల్లో ''మీరెందుకన్నా డాన్ అయ్యారు'' అని అడిగితే.. రజినీ తనదైన స్టయిల్లో నవ్వే సీన్ ఈ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ఇక ఈ టీజర్ చివర్లో రజినీ 80ల్లో మాదిరి యంగ్ గెటప్ లోనూ కనిపించటం మరో హైలెట్. రజినీకాంత్ భార్యగా నటిస్తున్న రాధికా ఆప్టే సంప్రదాయ చీరకట్టులో కనిపించి అలరించింది.

16:43 - May 2, 2016

కృష్ణా : విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి పసికందు బలైంది. ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల విభాగంలో లక్ష్మి అనే మహిళకు నాలుగు రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో అందరూ సంతోషించారు. కానీ సోమవారం తెల్లవారుజామున లేచి చూడగా.. శిశువు ఛాతీ, వీపు భాగాల్లో చీమలు కుట్టి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్పటికే శిశువు మరణించాడు. పిల్లాడిని మొత్తం చీమలు కుట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా వైద్యులు మాత్రం తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని, అందుకే మరణించాడని వైద్యులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఐదున్నర వరకు కూడా బిడ్డ బతికే ఉన్నాడని, తర్వాతే ఇదంతా జరిగిందని బాధితుల బంధువులు అంటున్నారు. రక్త స్రావం జరుగుతుందని వైద్యులకు తెలిపినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. శిశువు జన్మించిన 2 రోజుల వరకు తమకు చూపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఆ తర్వాత బాలుడి తరఫు వాళ్లే అతడిని తీసుకెళ్లారని, అందువల్ల ఈ మరణంతో తమకు సంబంధం లేదని డాక్టర్లు వాదిస్తున్నారు. వార్డులో మిగిలిన పిల్లలను చీమలు ఎందుకు కుట్టలేదని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో వైద్యుల తీరుపై బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులను సీపీఎం నేత బాబురావు, వైసీపీ నేత పార్థసారథి పరామర్శించారు. వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

 

 

పొంగులేటి ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..

ఖమ్మం : వైసీపీ ఎంపీ పొంగులేటి నివాసానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కేటీఆర్ కోరగా త్వరలోనే స్పందిస్తానని ఎంపీ పొంగులేటి పేర్కొన్నారు. 

ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణీ..

మధ్యప్రదేశ్ : ఉల్లిగడ్డలు ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. హోల్ సేల్ మార్కెట్ లో కిలో 50 పైసలు పలుకుతుండడంతో రత్లం ప్రాంతంలో ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. 

ఢిల్లీలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : ఓక్లా సబ్జి మండిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఎనిమిది అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముగిసిన ఏపీ కేబినెట్..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెండు దశల్లో భూసేకరణ..మొదటి దశలో 2వేల ఎకరాల సేకరణ..బందరు పోర్టుకు మొదటి దశలో 6వేల ఎకరాల భూసమీకరణ..ఉద్యాన రైతులకు ఒక్కో కుటుంబానికి..రూ. 50వేల చొప్పున రుణమాఫీకి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 

ఉన్నతాధికారులతో మంత్రి కడియం భేటీ..

హైదరాబాద్ : టెట్, ఎంసెట్, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఉన్నతాధికారులతో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. 

మంత్రి లక్ష్మారెడ్డితో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం భేటీ..

హైదరాబాద్ : మంత్రి లక్ష్మారెడ్డితో ప్రైవేటు యాజమాన్యాల సంఘం భేటీ అయ్యింది. ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

15:48 - May 2, 2016

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. భర్త, అత్తామామల వేధిపులకు ఇద్దరు పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని గుర్రంపోడ్ మండలం జూనుత్లలో యాదమ్మ (29)ను గత కొన్ని రోజులుగా భర్త, అత్తామామలు వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారు. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధమున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో కుటుంబంలో తరుచుగా గొడవలు జరిగేవి. భర్త, అత్తామామల వేధింపులతో మనస్తాపం చెందిన యాదమ్మ తన ఇద్దరు పిల్లలు స్వేత (7), ప్రణీత్ )6)లను ముందుగా బావిలో పడేసింది. ఆ తర్వాత తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృత దేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్తామామలు పరారీలో ఉన్నారు. భర్త పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  

 

15:31 - May 2, 2016

కృష్ణా : విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శిశువుకు వైద్యం అందిస్తున్న నేపథ్యంలో మెటర్నరీ వార్డులో శిశువును చీమలు కుట్టాయి. దీంతో పసికందు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యుల తీరుపట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు ఎప్పుడు ఉంటారో తెలియదు. కనీస సదుపాయాలు కరువు అయ్యాయి. ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా అనేక దారుణమైన సంఘటనలు జరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 

దాహార్తితో ఇద్దరు చిన్నారుల మృతి..

ఆదిలాబాద్ : దాహార్తితో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలో బద్దారం అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. వివాహానికి వెళుతుండగా ఇద్దరు కుమారులు సొమ్మసిల్లి పడిపోయారు. నీళ్లు తీసుకొచ్చేందుకు వెళ్లిన తల్లి వడదెబ్బతో కుప్పకూలింది. అనంతరం కుటుంబసబ్యులు నీళ్లు తెచ్చేలోపే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 

15:18 - May 2, 2016

హైదరాబాద్ : కాళ్వేశ్వరం ఎత్తిపోతల పథకం రీడిజైన్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై రూ. 55 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు. ఈ  రీడిజైనింగ్ కేవలం వైఎస్ ధనదాహానికి కొనసాగింపు చర్యని అన్నారు. 

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య..

నల్గొండ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుర్రంపొడు మండలం జూనుత్లలో చోటు చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపులే కారణమని తెలుస్తోంది. యాదమ్మ (29), శ్వేత (7)ప్రణీత్ (6) మృతులుగా గుర్తించారు. 

ఈడీ ముఖ్య కార్యాలయంలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : ఈడీ ముఖ్య కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ భవంతిలోని ఆరో అంతస్తులో పొగ, మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొంటున్నారు. 

భోపాల్ లో కాంగ్రెస్ ఆందోళన..

మధ్యప్రదేశ్ : చమురు ధరలకు పెంపుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. భోపాల్ లో ద్విచక్రవాహనాలను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. 

14:57 - May 2, 2016

వరంగల్ : ఆరోగ్యశ్రీ ద్వార పెండింగ్‌లో ఉన్న 9నెలల బకాయిలు చెల్లించేంత వ‌ర‌కు వ‌రంగ‌ల్ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవ‌ల్ని నిలిపివేస్తున్నామని ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ విజ‌య్ చెంద‌ర్ రెడ్డి తెలిపారు. గ‌త 9నెల‌లగా 260 కోట్ల రూపాయ‌ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సింది ఉంద‌ని, ఎన్ని సార్లు అడిగినా చెల్లిచ‌క‌పోవ‌డంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అంతే కాకుండా 1997లో ఆరోగ్య శ్రీ సేవల్ని మొద‌లు పెట్టినప్పుడు ఉన్న ధరల్నే ఇప్పటికీ చెల్లిస్తున్నారని ఆరోపించారు. పెరిగిన ధ‌ర‌ల‌కు అనుకూలంగా ఎంవోయూను మార్చాల‌ని.. అప్పటి వ‌ర‌కు ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేస్తామని ఆయన అన్నారు.

 

14:52 - May 2, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపి హెలికాప్టర్ల కుంభకోణంలో సిబిఐ విచారణను వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్.పి.త్యాగిని సీబీఐ విచారిస్తోంది. ఇటాలియన్ కోర్టు గతనెలలో ఇచ్చిన తీర్పు,..అందులో చోటుచేసుకున్న పేర్లు, వెలుగుచూసిన డాక్యుమెంట్లను దృష్టిలో ఉంచుకుని త్యాగిని విచారణకు హాజరు కావాల్సిందిగా సిబిఐ కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న త్యాగి విచారణకు  హాజరయ్యారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా సహకరించారన్న ఆరోపణలను త్యాగి ఎదుర్కొంటున్నారు. 2005 మార్చి 7న వీవీఐపిల కోసం భారత్‌కు సరఫరా చేసే ఛాపర్ల స్పెసిఫికేషన్లలో మార్పుల కోసం సమావేశం జరిగిందని, ఆ సమయంలో త్యాగి ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఉన్నారని సిబిఐ ఆరోపణ. అగస్టా మధ్యవర్తులతో త్యాగి సోదరులు సంజీవ్, రాజీవ్, సందీప్‌లకు చాలాకాలంగా పరిచయాలున్నాయని కూడా సిబిఐ ఆరోపిస్తోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను త్యాగి ఇప్పటికే తోసిపుచ్చారు. సిబిఐ విచారణ ముందుకు గతంలోనూ ఒకసారి హాజరయ్యారు. తాజాగా వెలుగుచూసిన సమాచారంతో మరోసారి త్యాగిని విచారణకు రావాల్సిందిగా సిబిఐ కోరడంతో ఆయన విచారణ ముందుకు వచ్చారు.

 

14:49 - May 2, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపికి చెందిన అనకాపల్లి ఎంపి డిమాండ్‌ చేశారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో యూపీఏ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెనకబడ్డ ప్రాంతాలకు బిజెపి కూడా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. విభజన సందర్భంగా, ఐటి, మౌళిక, విద్యా రంగాల్లో ఏపి తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఆర్ఎస్ఎస్ లీడర్ భౌతికకాయానికి మోడీ నివాళి..

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ బాలరాజ్ మధోక్ మృతిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. 

14:44 - May 2, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు క్లాప్ పడింది. విజయ్ నటించిన 'కత్తి' సినిమాను రీమెక్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి బాటలోనే 'పవన్ కల్యాణ్' వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 'వీరమ్' రీమెక్ అని ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నర క్రితం తమిళంలో 'వీరమ్' చిత్రం విడుదలైంది. అజిత్ హీరోగా నటించారు. కేవలం రూ. 40 కోట్లతో రూపాయిందిన ఈ సినిమా రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసిందంట. ఇది యాక్షన్ బేస్డ్ లవ్ డ్రామా గా తెలుస్తోంది. తెలుగుకు అనుగుణంగా కథంలో మార్పులు..చేర్పులు చేశారని టాక్. వీరమ్ కథనే వర్కవుట్ చేసి ఉంటారా ? లేక వేరే కథ అయి ఉంటుందా ? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు. 

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెండు దశల్లో భూసేకరణ..మొదటి దశలో 2వేల ఎకరాల సేకరణ..బందరు పోర్టుకు మొదటి దశలో 6వేల ఎకరాల భూసమీకరణ..ఉద్యాన రైతులకు ఒక్కో కుటుంబానికి..రూ. 50వేల చొప్పున రుణమాఫీకి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 

సాయంత్రం 5గంటలకు పాలిసెట్ ఫలితాలు..

హైదరాబాద్ : పాలిసెట్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. సచివాలయంలో జరిగే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు.

కార్మికుల మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం..

హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్‌బజార్‌లో నిన్న డ్రైనేజీని శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటనపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. మృతిచెందిన ఇద్దరు కూలీల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.

కేపీహెచ్ బీ పీఎస్ ప్రారంభం..

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో నూతన హంగులతో నిర్మించిన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ భవనాన్ని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాంధీ, కృష్ణారావు, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి - ఎంపీ అవంతి శ్రీనివాసరావు..

ఢిల్లీ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని వెల్లడించారు. 

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి - ఎంపీ అవంతి శ్రీనివాసరావు..

ఢిల్లీ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని వెల్లడించారు. 

ఖాళీ బిందెతో ర్యాలీలో పాల్గొన్న జగన్..

గుంటూరు : జిల్లా మాచర్లలో వైసీపీ చేపట్టిన ధర్నాలో పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీసు నుండి ఖాళీ బిందెలతో వైసీపీ ర్యాలీ చేపట్టింది. 

కార్చిచ్చులో నలుగురు అరెస్టు..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో వేలాది ఎకరాల విలువైన అటవీ భూమిని నాశనం చేసిన కార్చిచ్చు వెనుక మాఫియా హస్తం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. 

13:36 - May 2, 2016

బెంగళూరు : ఈపీఎఫ్‌ వడ్డీపై కేంద్రం వెనక్కు తగ్గడానికి.. బెంగళూరు ఆందోళన ప్రభావం చూపిందా..? ఎస్‌.. అందులో ఏమాత్రం సందేహం లేదంటున్నరు విశ్లేషకులు. కన్నడ కార్మిక లోకం రోడ్లపైకి రావడం.. ఏప్రిల్‌ 18, 19 తేదీల్లో బెంగళూరులో హింస చెలరేగడంతో.. ప్రభుత్వానికి కార్మికుల ఆగ్రహం అర్థమైంది. దీంతో ఈపీఎఫ్‌ వడ్డీపై వెనక్కి తగ్గింది. కానీ దేశం మొత్తానికి వర్తించే ఈపీఎఫ్‌ అంశంపై.. బెంగళూరు కార్మికులే ఎందుకింత తీవ్రంగా స్పందించారు..? వాచ్‌ దిస్ స్టోరీ.

ఏప్రిల్‌18.. 19 తేదీల్లో అట్టుడికిన బెంగళూరు.....

ఏప్రిల్‌18.. 19 తేదీల్లో అట్టుడికిన బెంగళూరు. కార్మికుల ఆగ్రహానికి తగులబడిపోయిన 9 సర్కారీ బస్సులు.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యనిధిపై తీసుకున్న నిర్ణయమే ఈ ఆందోళనకు కారణం. ఈపీఎఫ్‌ అంశం దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల కార్మికులు, ఉద్యోగుల సమస్య. కానీ బెంగళూరు నగర కార్మికలోకమే ఎందుకింత వయొలెంట్‌గా వ్యవహరించింది..?

బెంగళూరులో హింసాత్మక ఘటనపై విచారణ.....

బెంగళూరులో ఏప్రిల్‌ 18, 19 తేదీల్లో జరిగిన హింసాత్మక ఘటనపై విచారణ జరిపిన అధికారులు.. దీనికి కారణం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికంగా పాపులర్‌ అయిన విజయ కర్నాటక దినపత్రిలో.. ఏప్రిల్‌ 16వ తేదీన ప్రచురితమైన వార్త.. ఇంతటి హింసకు కారణమైందని అధికారుల విచారణలో తేలింది. ఏప్రిల్‌ 30వ తేదీలోగా మీ ఈపీఎఫ్‌ మొత్తాన్ని తీసుకోక పోతే.. మే ఒకటి తర్వాత సగం అమౌంటే వస్తుందన్న అర్థం వచ్చేలా.. విజయకర్నాటక పత్రిక వార్తను ప్రచురించింది.

మే ఒకటిలోపు రాజీనామాలు చేయాలని కార్మికుల నిర్ణయం....

లీడింగ్‌ పేపర్‌లో వార్తను చూసిన బెంగళూరు కార్మికలోకం.. ముఖ్యంగా అక్కడి గార్మెంట్‌ సంస్థల్లో పనిచేసే లక్షన్నర మంది మహిళలు.. కంగారు పడిపోయారు. సాధారణంగా ఇక్కడి గార్మెంట్‌ సంస్థల్లో పనిచేసే మహిళలు, చిన్న పెద్ద అవసరాలకు ఈపీఎఫ్‌ మొత్తంపైనే ఆధారపడుతుంటారు. అవసరానికి కొంత కొంత మొత్తాన్ని.. రకరకాల కారణాలు చూపి డ్రా చేసుకుంటుంటారు. ఈ తరుణంలో విజయకర్నాటక పేపర్‌ ప్రచురించిన వార్త వారిలో ఆందోళనను పెంచింది. మే ఒకటోతేదీలోపు ఉద్యోగాలకు రాజీనామా చేస్తే.. ఈపీఎఫ్‌ అమౌంట్‌ మొత్తాన్నీ తీసుకోవచ్చన్న భావనకూ వారు వచ్చారు. గార్మెంట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలంతా పరస్పరం ఫోన్ల ద్వారా సంప్రదించుకొని ఉద్యోగాలు వదిలేయాలని నిర్ణయించుకున్నారు.

ఏప్రిల్‌ 18 మద్దూరు, బొమ్మనహళ్లిలలో ఆందోళన

ఈపీఎఫ్‌ కోసం సిబ్బంది ఉద్యోగాలను వదిలేయాలని నిర్ణయించడం.. అటు గార్మెంట్‌ సంస్థల యజమానులనూ కలవర పరిచింది. దీని ప్రభావం ఉత్పాదనపై పడుతుందని వారు ఆందోళన చెందారు. అందుకే.. ఉద్యోగ సంఘాలు.. రోడ్లెక్కి నిరసనను తెలిపేందుకు వారు పరోక్ష మద్దతును ప్రకటించారు. సంఘాల పిలుపుతో మహిళలూ రోడ్డెక్కారు. తొలిరోజైన ఏప్రిల్‌ 18న.. మద్దూరు, బొమ్మనహళ్లిలలో ఆందోళన సవ్యంగానే సాగింది. కానీ రెండోరోజు.. కర్నాటక సమస్యలపై పోరాడే జయకర్నాటక సంస్థ, అండర్‌వాల్డ్‌ మాజీ డాన్‌ ముత్తప్పరాయ్‌ రంగంలోకి దిగడంతో.. ఆందోళన హింసాత్మకమైంది.

ముగ్గురు మహిళలతోపాటు 116 మంది అరెస్టు....

ఆందోళనకారులు తొమ్మిది ప్రభుత్వ బస్సులను తగులబెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. ముగ్గురు మహిళలు సహా 116 మందిని అరెస్టు చేశారు. పత్రికలు సమాజ హితం కోసమే పాటుపడతాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. అయితే.. కన్నడ పత్రిక విజయ కర్నాటక విషయాన్ని కాస్త ఎగ్జాగరేట్‌ చేసి ప్రచురించిన ఫలితంగా.. బెంగళూరు వయొలెంట్‌గా మారిందని విచారణ అధికారులు అంటున్నారు. మొత్తానికి బెంగళూరు హింసకు ప్రత్యక్షంగా కాకపోయినా.. ఓ పత్రిక పరోక్ష కారణం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

13:33 - May 2, 2016

తిరుమల: చల్లదనానికి పెట్టింది పేరైన తిరుమలలోనూ ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాహన కాలుష్యం పెరిగిపోవడం...తీవ్ర ఎండల నేపథ్యంలో టెంపరేచర్ పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాదరక్షలు లేకుండా నడిచే భక్తులకు కాళ్లు కాలకుండా ఉండేందుకు శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో ట్యాంకర్లు పెట్టి నీళ్లు చల్లిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కార్పెట్లు పరిచి వాటిని నీటితో తడుపుతున్నారు. చలువ పందిళ్లు, మజ్జిగ, మంచినీటి సరఫరా లాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

13:30 - May 2, 2016

మహబూబ్‌నగర్ : కర్ణాటకకు చెందిన వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి బెల్గావ్ వెళ్తున్న ఆర్టీసీ వోల్వో బస్సు మహబూబ్‌నగర్ సమీపంలోని ధర్మాపూర్ వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. హైస్పీడ్‌లో వెళ్తున్న బస్‌ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రహదారి పక్కకు దూసుకుపోయింది. ఈ క్రమంలోనే విద్యుత్తు స్తంభాలను ఢీకొట్టింది. పైన హైటెన్షన్‌ విద్యుత్తు తీగలున్నా ప్రమాద సమయంలో పవర్ సప్లై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యుత్‌ సరఫరా ఉన్నట్లయితే బస్సులో ఉన్న 31 మందికీ ప్రాణాపాయం వాటిల్లేదని మరో పాలెం లాంటి దుర్ఘటన జరిగుండేదని స్థానికులు గుర్తు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి 108 సిబ్బంది చికిత్స అందించారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు ప్రయాణికులను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. 

13:19 - May 2, 2016

గుంటూరు : ఉపాధి హామీ పథకానికి వచ్చిన నిధులను పేదవాడికి ఇవ్వకుండా సీఎం చంద్రబాబు నీరుగారుస్తూ... సిమెంటు రోడ్లకు వాడుకుంటున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కరువుపై మండల కేంద్రాల్లో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరు జిల్లా మాచర్లలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరవు విలయ తాండవం చేస్తుందని ఆరోపించారు. తాగేందుకు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నా..ప్రభుత్వం చోద్యం చేస్తుందని జగన్‌ విమర్శించారు. కరువుపై చంద్రబాబు రివ్యూ కూడా చేయలేదని మండిపడ్డారు. వలసల నివారణకు చంద్రబాబు తీసుకుంటున్న చర్యలే ఏమిటి అన్ని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీరు ఎండి పోతుంటే చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కేసీఆర్ పాలమూరు నుండి లిఫ్ట్ పెట్టి నీరు తోడుకుపోతున్నారని... అయినా ఓటు కు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయి చంద్రబాబు కళ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు.

గుంటూరు జిల్లాకు చేరుకున్న జగన్..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొని ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ధర్నా చేపట్టింది. మాచర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న జగన్ ప్రసంగించారు. 

ఎంపీ పొంగులేటి నివాసానికి మంత్రి కేటీఆర్..

ఖమ్మం : వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి మంత్రి కేటీఆర్ కాసేపట్లో వెళ్లనున్నారు. ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో కేటీఆర్ భేటీ కానున్నారు. 

టీఆర్ఎస్ లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..

హైదరాబాద్: టీఆర్ఎస్ లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరనున్నారు. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. 

12:32 - May 2, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం ఇష్యూతో రాజ్యసభలో రగడ జరిగింది. సభ ప్రారంభమైన దగ్గర్నుంచీ ఎంపీల ఆందోళనతో మార్నింగ్ సెషన్‌ సజావుగా సాగలేదు. ఒకసారి సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైనా ఎంపీల ఆందోళన ఆగకపోవడంతో మరోసారి వాయిదా పడింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి స్లోగన్స్‌ ఇచ్చారు. అన్ని అంశాలను పక్కనబెట్టి ముందుగా అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై చర్చ జరపాలంటూ టిఎంసీ ఎంపీలు నోటీసు ఇచ్చారు. మే నాలుగున ఈ స్కాంకు సంబంధించిన అన్ని వివరాలను పార్లమెంట్ ముందు ఉంచుతామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ఆ స్కాంపై చర్చ జరపాలంటూ టిఎంసీ ఎంపీలు ఆందోళనకు తెరలేపారు. 

12:30 - May 2, 2016

హైదరాబాద్ : నీట్‌పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తీర్పును పునః సమీక్షించాలని విన్నవించాయి. రాష్ట్రాల అభ్యర్థనను రేపు పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. 

ఢిల్లీ పోలీస్ ఇన్స్ పెక్టర్ అరెస్టు..

ఢిల్లీ: పోలీస్ ఇన్స్ పెక్టర్ ఖేర్ సింగ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం జానకిపురంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 40 లక్షల విలువ చేసే ఆస్తుల దస్త్రాలను సీజ్ చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

12:01 - May 2, 2016

బాలీవుడ్..టాలీవుడ్ లకు మధ్య తేడాలున్నాయని నటుడు సుధీర్ పేర్కొన్నారు. బాలీవుడ్ లో ఆయన విలన్ గా నటించిన బాఘీ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా టెన్ టివితో 'సుధీర్' ముచ్చటించారు. బాలీవుడ్ లో బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుందని, దాని వల్ల తెలుగోళ్ల ప్లానింగ్ కన్నా వారు బెటర్ గా ఉంటారని తెలిపారు. ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల ప్లానింగ్ లో కూడా ఎక్కువగా దృష్టి చూపిస్తారని పేర్కొన్నారు. ఒక సినిమాను ఫలానా బడ్జెట్ లో బాలీవుడ్ లో తీస్తే అదే సినిమాను టాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ లో తెలుగు వారు తీస్తారన్నారు. బడ్జెట్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడి వారు బాగా కష్టపడుతారని పేర్కొన్నారు. అక్కడ వంద..రెండు వందల కోట్లు చాలా ఈజీగా టచ్ చేస్తారని..ఇక్కడ మాత్రం టాప్ హీరోలు మాత్రమే వంద కోట్లకు టచ్ అవుతుంటారని తెలిపారు.

 

12:00 - May 2, 2016

ఎస్.ఎం.ఎస్ సినిమాతో పరిచయమైన 'సుధీర్ బాబు' ప్రేమకథ చిత్రం సినిమాతో సూపర్ హిట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. కానీ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలు అతని ఖాతాలో పడలేదు. అయితే అనుకోని విధంగా బాలీవుడ్ లో బాఘీ సినిమాలో విలన్ రోల్ అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా టెన్ టివితో 'సుధీర్' ముచ్చటించాడు. చిత్ర విశేషాలను తెలిపారు. బాలీవుడ్ కు వెళ్లడం వల్ల తాను కొంత భయపడ్డానని హీరో సుధీర్ బాబు వెల్లడించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారించకుండా బాలీవుడ్ వెళుతున్నారంటీ ? నెగటివ్ వస్తుందోమోనన్న భయం కలిగిందన్నారు. కానీ సినిమా ట్రైలర్ విడుదలైన అనంతరం పాజిటవ్ గా రిసీవ్ తీసుకున్నారని పేర్కొన్నారు. మాములు రోల్ కాదని..కష్టపడితేనే వస్తుందని భావించారని పేర్కొన్నారు. 

నీట్ పై సుప్రీంను ఆశ్రయించిన తెలుగు రాష్ట్రాలు..

ఢిల్లీ : నీట్ తీర్పును పున సమీక్షించాలని సుప్రీంకోర్టును ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. అభ్యర్థనను రేపు పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. రేపు మధ్యాహ్నం 2గంటలకు నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

11:51 - May 2, 2016

విజయవాడ : ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ధడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్‌ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలోని ఐజిఎంసీ స్టేడియంలో ఇంకుడు గుంతల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా 2కే రన్‌ను మంత్రి దేవినేని ఉమ, పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. నీటి కుంటలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోని జల సంరక్షణకు పాటు పడాలని మంత్రి దేవినేని విజ్ఞప్తి చేశారు. 

11:48 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ కింద చేసిన చికిత్సలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నేటి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఇవాల్టి నుంచి బిల్లుల చెల్లింపు ప్రక్రియ మొదలుపెడతామని ప్రభుత్వం చెప్తోంది. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన రావాలని ప్రైవేటు ఆసుపత్రుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నుంచి తమకు 250 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని..వాటిని చెల్లిస్తేనే తిరిగి సేవల్ని ప్రారంభిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హాస్పిటల్స్‌ అండ్ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ నేతలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలవనున్నారు. 

11:47 - May 2, 2016

విజయవాడ: గల్ఫ్‌కెళ్లే ప్రవాసాంద్రులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్‌కెళ్లిన వారిని సురక్షితంగా తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఇప్పటికే లేఖ రాశామన్నారు. 

11:45 - May 2, 2016

తిరుమల : అన్నమయ్య సంకీర్తనలను భావితరాలకు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.. టీటీడీ. మరుగున పడ్డ సంకీర్తనలకు సాధికార బాణీలను సమకూర్చాలని టీటీడీ సంకల్పించింది. ఈ ప్రయత్నం సాకారమైతే.. స్వర రచనకు నోచుకోని వేనవేల అన్నమయ్య కీర్తనలు.. ఇకపై ఆధునిక హంగులతో వీనుల విందు చేయనున్నాయి.

అలతి అలతి పదాలతో...

అలతి అలతి పదాలతో తెలుగు భాష సౌందర్యానికి పట్టం కట్టిన పదకవితా పితామహుడు అన్నమయ్య. తాత్వికత, సామాజిక చేతన, ఆధ్మాత్మికత.. అణువణువూ ఆరాధనా భావం కలిస్తే అన్నమయ్య. తెలుగు తనానికి వెలుగు రూపం.. ఆయన సృష్టించిన సాహితీ సంపద. మరుగున పడిన సృజనాత్మకమైన అన్నమయ్య సంకీర్తనలకు సాధికార బాణీలు సమకూర్చి భావితరాలకు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది.

అన్నమయ్య సాహితీ సర్వస్వంలో 14 వేల కీర్తనలు...

అన్నమయ్య సాహితీ సర్వస్వంలో 14 వేల కీర్తనలు మాత్రమే ఇంతవరకూ లభించాయి. అందులో రెండు వేల కీర్తనలకే బాణీలు సమకూరాయి. ఇంతవరకూ స్వర రచన లేని అన్నమాచార్య గీతాలకు బాణీలు కట్టి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నానికి టీటీడీ నాంది పలికింది. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో సంగీత దర్శకులు కీరవాణి సారథ్యంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకోబోతోంది.

సప్తగిరులకు ప్రతీకలుగా ఏడుగురు సంగీత దర్శకులు...

సప్తగిరులకు ప్రతీకలుగా ఏడుగురు సంగీత దర్శకులు ఈ అన్నమయ్య సంకీర్తనల స్వర రచనలో పాల్గొంటుడటం విశేషం. ప్రేక్షకులకు ఆధ్యాత్మిక ఆనందం కలుగజేయడంతో పాటు తెలుగు పద సాహితీ సంపత్తిని స్వరయుక్తంగా, శాశ్వతంగా పరిరక్షిస్తూ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేయడమే పరమావధిగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు టీటీడీ చెబుతోంది.

11:42 - May 2, 2016

ప్రకాశం : యూటీఎప్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి కన్నుమూశారు. ఆయన భౌతాకకాయాన్ని ఒంగోలు యూటిఎఫ్‌ కార్యాలయంలో రాంరెడ్డి వుంచారు. సిపిఎం నేతలు బీవీ.రాఘవులు, పి.మధు, తమ్మినేని వీరభద్రం, యూటిఎఫ్‌ నేతలు ఐ.వెంకటేశ్వర్లు, చావ రవి, నర్సిరెడ్డి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

 

పార్టీ వీడనున్న వైసీపీ ఎంపీ పొంగులేటి..

ఖమ్మం : వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వీరు మీడియాతో మాట్లాడనున్నారు. 

సుష్మాకు మంత్రి పల్లె లేఖ..

విజయవాడ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లేఖ రాశారు. గల్ఫ్ లో చిక్కుకున్న ఏపీ వాసులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 

యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు దాచూరి రాంరెడ్డి కన్నుమూత..

ఒంగోలు : యూటీఎప్ మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి కన్నుమూశారు. ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో రాంరెడ్డి భౌతికకాయాన్ని ఉంచారు. రాంరెడ్డి మృతి పట్ల సీపీఎం నేతలు బీవీ రాఘవులు, మధు, తమ్మినేని వీరభద్రం, యూటీఎఫ్ నేతలు ఐ.వెంకటేశ్వర్లు, చావ రవి, నర్సిరెడ్డిలు సంతాపం తెలిపారు. 

రాజ్యసభలో గందరగోళం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలూ ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ పై సభ్యులు ఆందోళన చేయడంతో సభ 11.30గంటల వరకు వాయిదా పడింది. 

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై కేంద్రంపై వత్తిడి పెంచడం, నీట్ పరీక్ష, గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టు వల్ల ఏపీకి జరిగే నష్టం..తదితర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. 

రాజ్ నాథ్..వెంకయ్యతో సమావేశం కానున్న మోడీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్ లతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా హాజరు కానున్నారు. 

తాగు..సాగునీరే తమ లక్ష్యం - కేసీఆర్..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో తాగు..సాగునీరు అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్ర‌తి ప‌క్షాలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి అని అన్నారు. జిల్లాలో మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ దంపతులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్ర‌తిప‌క్షాలు పిచ్చి ప్ర‌య‌త్నాలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. తెలంగాణ‌లో 18లక్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు అందించ‌డ‌మే త‌మ‌ ల‌క్ష్యమ‌ని వివ‌రించారు.

కార్చిచ్చుపై దృష్టి - రాజ్ నాథ్ సింగ్...

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో కార్చిచ్చుపై దృష్టి కేంద్రీకరించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, స్థానిక అధికారులతో మాట్లాడడం జరిగిందని ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికార గణం ఘటనా ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. 

10:37 - May 2, 2016

మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌ అనగానే అటు ప్రేక్షకుల్లోను, ఇటు మహేష్‌ అభిమానుల్లోనూ భారీ అంచనాలుంటాయి. తాజాగా మరో సూపర్‌హిట్‌ చిత్రం కోసం ఈ కాంబినేషన్‌ సమాయత్తమవుతోంది. వీరి కాంబినేషన్‌లో రూపొందబోయే మూడో చిత్రానికి 'జనగణమన' అనే టైటిల్‌ నిర్ణయించినట్లు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. 'మహేష్‌బాబు, పూరీ కాంబినేషన్‌లో గతంలో 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌' చిత్రాలొచ్చాయి. 2006లో విడుదలైన 'పోకిరి' తెలుగు చిత్ర పరిశ్రమలోనే రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం వచ్చి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించడం ఆనందంగా ఉంది. అలాగే వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్‌' కూడా భారీ విజయాన్ని సాధించింది. గత చిత్రాల స్థాయి కంటే 'జనగణమన' పెద్ద హిట్‌ అవుతుంది' అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

10:35 - May 2, 2016

ప్రస్తుతం ఒమాంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సరబ్‌జీత్‌' చిత్రంలో నటిస్తున్న ఐశ్వర్యరాయ్‌ తాజాగా అజయ్ దేవగన్‌ సరసన 'బాద్‌షా హో' చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ,'రెయిన్‌ కోట్‌' (2004) తర్వాత అజయ్ దేవగన్‌తో కలిసి నటించనున్న చిత్రమిది. దర్శకుడు మిలన్‌లూథిర చెప్పిన కథెంతో బాగుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికార ప్రకటనను చిత్ర యూనిట్‌ ప్రకటిస్తుంది' అని అన్నారు. ఐశ్వర్య ప్రస్తుతం నటిస్తున్న 'సరబ్‌జీత్‌' చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. అలాగే కరణ్‌జోహార్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంలోనూ ఐశ్వర్య నటిస్తోంది.

10:32 - May 2, 2016

పలు తెలుగు, తమిళ చిత్రాల బిజీతో చిరంజీవి 150వ చిత్రాన్ని తిరస్కరించిన నయనతార తాజాగా లారెన్స్‌ సరసన ఓ తమిళ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఓ పక్క భయపెడుతూనే, మరో పక్క సందేశమిచ్చేలా లారెన్స్‌ సినిమాలుంటాయి. దీనికి 'ముని', 'ముని2', 'గంగ' చిత్రాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ డిఫరెంట్‌ హర్రర్‌ కాన్సెప్ట్‌తో ఉన్న కథను లారెన్స్‌ విని వెంటనే సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారట. ఆయన సరసన నయనతార నటిస్తే బాగుంటుందని సదరు చిత్ర దర్శక, నిర్మాతలు నయనతారని సంప్రదించి, కథ వినిపించారు. కథ తనకెంతో బాగా నచ్చిందని నయనతార కూడా నటించేందుకు అంగీకరించారట. అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుందని తెలుస్తోంది.'మాయ'తో ప్రేక్షకులను భయపెట్టిన నయనతార మళ్లీ భయపెట్టడానికి రెడీ అవుతోంది.

10:31 - May 2, 2016

కరీంనగర్ : తెలంగాణ వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు భూమి పూజచేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కె. కేశవరావు, ఎంపీ బాల్క సుమన్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు కన్నేపల్లి వద్ద కాళేశ్వరం పంప్ హౌస్‌కు సీఎం భూమి పూజ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మొత్తం ఏడు జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు సమకూర్చాలన్నది లక్ష్యం. 84 వేల కోట్ల వ్యయంతో మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. భూమి పూజ అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ త్వరితగతిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి సమృద్ధిగా నీరందిస్తామని అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 

10:29 - May 2, 2016

సత్యజిత్‌రే.. భారతీయ సినిమా విలువను ప్రపంచవ్యాప్తంగా చాటిన దర్శకుడు. సమాజం.. జీవితమే ఆయన సినిమాలకు కథా వస్తువులు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా, కళాదర్శకుడిగా, పబ్లిషర్‌గా భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన నేటితర మార్గ'దర్శకుడు' సత్యజిత్‌రే జయంతి నేడు (సోమవారం). ఈ నేపథ్యంలో ఆయన సినీ జీవిత ప్రస్థాన విశేషాలు.. భారతీయ సినిమా కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన సత్యజిత్‌ రే పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో (1921, మే 2) జన్మించారు. రే తండ్రి సత్యజిత్‌ సుకుమార్‌, తల్లి సుప్రభ. సుకుమార్‌ నాన్సెన్స్‌ కవిత్వం సృష్టికర్త. మూడేండ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో రే పెంపకం బాధ్యత తల్లి చూసుకున్నారు. అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుటుంబంపై ఉన్న గౌరవంతో 'విశ్వభారతి'లో చేరి ప్రాచ్య కళలు(ఓరియెంటల్‌ ఆర్ట్స్‌) నేర్చుకున్నారు. తొలుత బ్రిటీష్‌ రన్‌ అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఏజెన్సీలో జూనియర్‌ విజువలైజర్‌గా పనిచేశారు. లండన్‌లో ఫ్రెంచ్‌ నిర్మాత జాన్‌ రెన్వాను కలిసి 'బైస్కిల్‌ థీవ్స్‌' ఇటాలియన్‌ సినిమా చూశాక సినిమాలపై ఆసక్తి పెంచు కున్నారు. 1947లో చంద్రదాస్‌ గుప్తాతో కలిసి కోల్‌కతా ఫిల్మ్‌ సొసైటీని ఏర్పాటు చేశారు.

దర్శకుడిగా...
మూడేండ్లు కష్టపడి రూపొందించిన 'పథేర్‌ పాంచాలి' చిత్రంతో దర్శకుడిగా మారారు. 1955లో విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టించింది. బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ జీవితంపై అదే పేరుతో రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బెంగాల్‌ ప్రభుత్వం నిర్మించడం విశేషం. కేన్స్‌ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం 11 ఇంటర్నేషనల్‌ అవార్డులను దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డునందుకుని, భారతీయ గొప్ప చిత్రాల్లో ఒకటిగా స్థానం సంపాదించింది.  తొలి చిత్రంతోనే రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ సినిమాకు ఒక కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేసిన రే ఆ తర్వాత 'అపరంజితో', 'పరాష్‌ పత్తర్‌', 'జల్సాఘర్‌', 'అపుర్‌ సంసార్‌', 'దేవి', 'పోస్ట్‌ మాస్టర్‌', 'రవీంద్రనాథ్‌ ఠాగూర్‌', 'కంచన్‌జంఘా', 'అభిజన్‌', 'చారులత', 'టూ', 'తీన్‌ కన్యా', 'మహానగర్‌', 'నాయక్‌', 'ప్రతిద్వంది', 'సీమబంధా', 'సిక్కిం', 'జన అరణ్య', 'బాల', 'అశాని సంకేత్‌', 'ద ఇన్నర్‌ ఐ', 'సద్గటి', 'ఘారే బైరె', 'గనశత్రు', 'అగంతక్‌' వంటి 36 విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఇందులో పలు డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్మ్స్‌ కూడా ఉన్నాయి. ఇతర దర్శకుల సినిమాలకు కథలతోపాటు సంగీతమందించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి..
నిర్మాతగా 'ద ఎలియన్‌', మ్యూజికల్‌ ఫాంటసీ 'గూపీ గైనె బఘా బైనె', ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీపై 'హిరాక్‌ రాజర్‌ దేశీ' చిత్రాలు రూపొందించారు. నలభై ఏండ్ల సినీ జీవితంలో సామాజిక అంశాలు, గొప్ప వారి జీవితాలు, యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించారు. ఆయన సినిమాల్లో కల్పిత గాథలు, ఫాంటసీ, డిటెక్టీవ్‌గా చిత్రాలున్నాయి. చరిత్ర నేపథ్యంలోనే కాకుండా సమకాలీన సమస్యలను తెరపై ఆవిష్కరించి ప్రజలను, ప్రభుత్వాలను మేల్కొలిపారు. అన్ని రకాల సినిమాలను రూపొందించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. దర్శకుడిగానే కాకుండా ఏక కాలంలో తనలోని భిన్న పార్శ్వాలను ఆవిష్కరించారు. సినిమాలకు కథలు రాసుకోవడంతోపాటు సంగీతం సమకూర్చుకోవడం, ఎడిటింగ్‌ చేసుకోవడం, గ్రాఫిక్‌ డిజైన్స్‌ వంటి అనేక పనులు స్వయంగా చేసుకునేవారు. పలు విభాగాలపై పట్టు సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుని దేశం గర్వించదగ్గ సినీ మేకర్‌గా ఎదిగారు.

1992లో మరణం..
ప్రపంచానికి దర్శకుడిగానే పాపులరైన రే బెంగాలీలో ఎన్నో రచనలు కూడా చేశారు. తాత ఉపేంద్ర కిషోర్‌ రే (రచయిత, తత్త్వవేత్త, బ్రహ్మసమాజం నాయకుడు) ప్రారంభించిన 'సందేశ్‌' చిన్న పిల్లల పత్రిక మధ్యలోనే ఆగిపోతే సత్యజిత్‌రే తిరిగి ప్రారంభించారు. ఇందులో పిల్లల కోసం డిటెక్టీవ్‌ నేపథ్యంలో 35 'ఫెలూదా' నవలలు రాశారు. రేకు 1949లో బిజోయ దాస్‌తో వివాహమైంది. 1983లో తొలిసారి గుండెపోటుకు గురయ్యారు. ఆ తర్వాత 1992లో మరోసారి గుండెపోటు రావడంతో ఏప్రిల్‌ 23న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. రే జ్ఞాపకార్థం ఆయన పేరు మీద ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు.  సత్యజిత్‌ రే మరణాంతరం ఆయనపై భారత ప్రభుత్వ తపాలా శాఖ ఓ స్టాంపును విడుదల చేసింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకుగానూ 1992లో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం భారతరత్నతో సముచితంగా గౌరవించింది. అలాగే 1984లో దాదా సాహెబ్‌ ఫాల్కే, 1976లో పద్మవిభూషణ్‌, 1965లో పద్మభూషణ్‌, 1958లో పద్మ శ్రీతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, డాక్టరేట్లు అందుకున్నారు. 32 జాతీయ అవార్డులను దక్కించుకున్న ఏకైక దర్శకుడు రే. దీంతోపాటు 1991లో అకాడమీ హానరరీ అవార్డుతో రేను ప్రత్యేకంగా గౌరవించారు. భారతీయ సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటి, నేటి తరానికి రే మార్గదర్శకుడయ్యారని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

గుర్ గావ్ ఎక్స్ ప్రెస్ పై భారీ ట్రాఫిక్ జాం..

ఢిల్లీ : గుర్ గావ్ ఎక్ర్ ప్రెస్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. డీజిల్ వెహికల్ యజమానులు ధర్నా చేపట్టారు. రాజధాని హస్తినలో డీజిల్ క్యాబ్‌లపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్య స్థాయిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 

10:17 - May 2, 2016

వేరుశనగ తినడం వల్ల కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు దరిచేరవు. ఉడకపెట్టిన వేరుశనగ పప్పును ప్రతిరోజూ పదిగ్రాముల చొప్పున తీసుకుంటే గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులను రాకుండా నివారించవచ్చంటున్నారు పరిశోధకులు. వేరుశనగపప్పు లోని ఫైబర్‌, యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించడంతో ఆయుష్షును పెంచుతాయట. ఇందులో మాంసకృత్తులతో పాటు.. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్‌, బోరాన్‌లలు పుష్కలంగా ఉంటాయట. వీటిని ఆహారంగా తీసుకోవటంవల్ల విటమిన్‌-ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశనగను మించి ఔషధం లేదు. అదే విధంగా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకూ మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. వీటిలో శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం ఉంటాయి. క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్‌ ముప్పు తొలగుతుంది. కొలెస్ట్రాల్‌ శాతం అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు, ఆర్థరైటిస్‌ నివారణకూ ఉపయోగపడుతుంది. ఇది పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పప్పుతోపాటు వేరుశనగ నూనె కూడా మంచిదే. అయితే ఇందులో కేవలం విటమిన్‌ ఇ మాత్రమే ఉంటుంది. 

10:15 - May 2, 2016

లిప్‌బామ్‌ ని పెదాలకు రాసుకోవాలి. దీనిని పెదాలకి రాసుకోవడం వలన చర్మం పై మృతకణాలు బాగా నాని మెత్తగా అవుతాయి. కొద్దిసేపటి తరువాత మృదువైన పళ్ళు కలిగిన బ్రష్‌తో పెదాలను వలయాకారంలో మసాజ్‌ చేయాలి. ఇప్పుడు గోరు వెచ్చని వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి పెదాలను మృదువుగా తుడుచుకోవాలి. పెదాలు పొడిబారినట్లు అనిపిస్తే పల్చగా లిప్‌బామ్‌ని రాసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి పెదాలు మంచి రంగును సంతరించుకుంటాయి.

  • తేనెలో సగం చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ని పెదాలకు వేసుకుని 15 నిమిషాలపాటు ఉంచుకోవాలి. తరువాత మెత్తటి వస్త్రంతో పెదాలను తుడుచుకుని, మాయిశ్చరైజర్‌ ని పెదాలకు రాసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడంవల్ల పింక్‌ లిప్స్‌ మీ సొంతమవుతాయి.
  • పంచదార, ఆలివ్‌ ఆయిల్‌ రెండిటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకి రాసుకొని వలయాకారంలో మసాజ్‌ చేసుకోవాలి. కొద్దిసేపటి తరువాత మెత్తటి బట్టతో పెదాలను తుడుచుకోవాలి. ఆరిన పెదాలకు లిప్‌బామ్‌ రాసుకోవాలి.
  • అలోవెరా జెల్‌ని తీసి ఒక కంటైనర్‌లో నిల్వచేయాలి. ప్రతిరోజూ లిప్‌బామ్‌ లాగా ఈ జెల్‌ని రాసుకోవాలి. రోజులో ఒకసారి కాకుండా వీలుకుదిరినప్పుడల్లా రాసుకోవడం వల్ల మృదువైన పెదాలను పొందుతారు. అలోవెరాలో మంచి ఔషద గుణాలు ఉన్నాయి. అందువల్ల పగిలిన పెదాలను బాగుచేస్తుంది. కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తుంది.
  • దానిమ్మ గింజలను మిక్సీలో వేసి జ్యూస్‌ చేసుకోవాలి. వచ్చిన మిశ్రమాన్ని వడకట్టి పప్పుని వేరుచేసుకోవాలి. దానిమ్మ జ్యూస్‌లో దూదిని ముంచి పెదాలకు రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన మంచి రంగుని పొందుతారు.
  • పాలల్లో గులాబీ రేకులను రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. వచ్చిన పేస్ట్‌లో కొన్ని చుక్కలు పాలు కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇలా వలన పాలలో బ్లీచింగ్‌ గుణాలు, గులాబీ రేకులలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పెదాలను కాంతివంతంగా చేసి సహజమైన రంగుని అందిస్తాయి. 
10:13 - May 2, 2016

ఆడవాళ్లు అధికంగా ఎదుర్కొనే సమస్య రక్త హీనత. డాక్టర్లు ఎన్నిసార్లు సూచించినా దానిమీద శ్రద్ధ చూపించరు. ఇంట్లో ఆడవాళ్లు అనారోగ్యం పాలైతే ఆ ప్రభావం ఇంటిల్లిపాది మీదా ఉంటుంది. కాబట్టి కేవలం మీ ఆరోగ్యమే కాదు... మీ ఇంటిల్లిపాది ఆనందం కోసం కూడా ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలి. పోషకాహారంతో ఈ రక్తహీనతను ఎదుర్కోవచ్చు. రక్తం ఎక్కువగా వచ్చే ఆ పోషకాహారాలేంటో తెలుసుకోండి. మీ రెగ్యులర్‌ డైట్‌లో వీటిని చేర్చుకుని ఆరోగ్యంగా ఉండండి.
ఆకుకూరలు రక్తహీనత నివారణకు సులభమైన ఉపాయం ఇనుము. ఇది ఎక్కువగా వుండి, సులభంగా, చవకగా దొరికేవి ఆకుకూరలు. తాజా తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం చేయొచ్చు. బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌, ఎండు ఖర్జూర, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా ఇనుము అధికంగా ఉంటుంది. వీటితోపాటు మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్‌ సి ఎక్కువగా వుండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్త హీనత రాకుండా చూసుకోవచ్చు. తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, టమోటాలలోనూ, అరటిపండు, యాపిల్‌, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్‌ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్‌ ఆసిడ్‌, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఉపయోగపడతాయి. భోజనం చేసిన వెంటనే కాఫీ, టీ తాగడం మానెయ్యాలి. ఇవి ఇనుమును గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ..

కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అంతకు ముందు కన్నెపల్లి వద్ద కాళేశ్వరం పంప్ హౌజ్‌కు సీఎం భూమి పూజ చేశారు. కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కె. కేశవరావు, ఎంపీ బాల్క సుమన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. 

సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న ఎస్పీ త్యాగి..

ఢిల్లీ : మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్పీ త్యాగి సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ అంశంపై సీబీఐ అధికారులు త్యాగిని ప్రశ్నించనున్నారు.

 

10:02 - May 2, 2016

చెన్నై :తమిళనాడులోని ఆర్ కె నగర్ లో ఆసక్తికర పోరు జరుగుతోంది. ముఖ్యమంత్రి జయలలిత మీద ఓ తెలుగు బిడ్డ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆర్ నగర్. తమిళనాడులో తెలుగు భాష మాట్లాడే ఓటర్లు ఎక్కువగా వున్న నియోజకవర్గమిది. ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేస్తున్న నియోజకవర్గం. దీంతో స్సెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ నియోజకవర్గంలో లక్షా ముప్పై వేల మంది తెలుగు ఓటర్లుండగా, తమిళిలు, ఇతరులు కలిసి అంత కంటే తక్కువగా లక్షా 20 వేల మంది వుంటారు. ఏఐఏడిఎంకె అభ్యర్థిగా ముఖ్యమంత్రి జయలలిత నామినేషన్ దాఖలు చేయగా, డిఎంకె నుంచి సిమ్లా, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ నుంచి వాసంతీిదేవి పోటీ చేస్తున్నారు. తెలుగు యువశక్తి నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తెలుగు ఓటర్ల మీదే నమ్మకం పెట్టుకున్నారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రాజకీయాలకు కొత్త. ఆయన తెలుగు ఓటర్లను ఎంత వరకు ఆకర్షించగలరన్నది ప్రశ్నార్ధకమే. 

బెంగాల్ లో పేలుడు నలుగురు మృతి..

వెస్ట్ బెంగాల్ : మాల్దా జిల్లాలోని జనిపూర్ గ్రామంలో క్రూడ్ బాంబు పేలింది. ఈఘటనలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 

నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 1.20 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య విడుదల చేయనున్నారు. 

నేడు టెట్, ఎంసెట్ తేదీల ఖరారు..

హైదరాబాద్ : వాయిదా పడిన టెట్, ఎంసెట్ తేదీలను ప్రభుత్వం సోమవారం ఖరారు చేయనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఏన్ వీ రమణారావు తదితరులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో భేటీ కానున్నారు. 

నేడు, రేపు వర్ష సూచన..

విశాఖపట్టణం : మహారాష్ట్రలోని విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీ, తెలంగాణల్లో అక్కడక్కడ ఉరుమలతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

09:50 - May 2, 2016

నిజామాబాద్ : ఎడపల్లి మండలం శివారులోని శ్రీలక్ష్మినర్సింహస్వామి దర్శనానికి వచ్చి ఇద్దరు పిల్లలతో సహ ఓ వృద్ధురాలు అష్టముఖి కోనేరులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నవతేజ్, అరుణ్ కుమార్ కోనేటిలో పడగా వారిని రక్షించేందుకు ప్రయత్నించిన రాజమణి సైతం కోనేరు పడి మునిగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల బోరున విలపించారు. 

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది. 

తెలంగాణలో నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు !

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందంటూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని ఆదివారం సాయంత్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న కార్చిచ్చు..

ఉత్తరాఖండ్ : అటవీ ప్రాంతంలో కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. సుమారు 2270 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. ఐదు జిల్లాలపై ఈ ప్రభావం పడుతోంది. 

కాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల సమావేశం..

ఢిల్లీ : రాజ్యసభకు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాసేపట్లో సమావేశం కానున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. ఉదయం పది గంటలకు పార్లమెంట్ లో ఈ సమావేశం జరగనుంది. 

కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ కేబినెట్

విజయవాడ : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సి నిధులు రాబట్టడంతో పాటు, కేంద్రం పై తేవాల్సి ఒత్తిడి, నీట్, గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టుల వల్ల, ఏపీ కి జరిగే నష్టం, కృష్ణా పుష్కరాల పై ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

08:49 - May 2, 2016

నల్గొండ : జిల్లాలో అకాల వర్షాల కారణంగా పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందారు. భువనగిరి మండలం బొల్లేపల్లిలో పిడుగుపాటు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా మృతులు నర్సింహ, శ్రీశైలంగా గుర్తించారు. ఇక మర్రిగుడు మండలం నర్సింహపురంలో ఒకరు మృతి చెందారు. అలాగే కట్టంగూరు మండలం పరడలో పిడుగుపాటుకు ఒక రైతు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. 

08:46 - May 2, 2016

ఆహ్లాదాన్నిచ్చే అందం మందార పూల సొంతం. పూలే కాదు ఆకులూ, వేళ్లూ.. ఇలా అన్నింటిలోనూ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందాన్ని మెరుగుపరిచే సుగుణాలూ అధికమే. వయసుపైబడే లక్షణాలను నిలువరించే శక్తిమంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్‌ ప్లాంట్‌ అనికూడా పిలుస్తారు. చర్మానికి సాగే గుణాన్ని అందించి యవ్వనశోభతో మెరిసిపోయేలా చేసే లక్షణాలెన్నో ఈ మొక్కలో ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని యాంటీ-యాక్సిడెంట్‌లు దుమ్మూధూళీ, అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. మందార పువ్వు రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో ముఖం కడుక్కుంటే అలసిన చర్మానికి ఉపశమనం ఉంటుంది.
మందార ఆకులు జుట్టు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. పొడిబారిన వెంట్రుకలకు తగిన పోషణనందించి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. మందార ఆకుల్ని మెత్తగా నూరి దానికి బాగా మగ్గిన అరటిపండునున చేర్చి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుని చూడండి. జుట్టు పట్టులా మెరిసిపోతుంది.
రెండు టేబుల్‌స్పూన్ల మందారపొడికి చెంచా తేనె, కాసిని పాలు కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తుంది. అలానే మందారంలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. గాయాల తాలూకు మచ్చలు కూడా త్వరగా పోతాయి. కొన్ని మందార ఆకుల్ని పావుకిలో కొబ్బరినూనెలో వేసి చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో మూడు నుంచి ఆరువారాల పాటు ఉంచాలి. ఆ తరవాత ఆకులు తీసేసి ఆ నూనెతో తలకు మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. మందార ఆకులతో పాటు కాసిని కరివేపాకు ఆకుల్నీ చేర్చి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలపడి శిరోజాలు ఆరోగ్యంగా మారతాయి.

08:42 - May 2, 2016

హైదరాబాద్ : బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా... వైట్‌హౌజ్‌లో సందడి చేశారు.. అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిషెల్‌తో కలిసి డిన్నర్ చేశారు.. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.. అధ్యక్ష దంపతులతో కలిసి విందులో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందని తెలిపారు.. 

08:39 - May 2, 2016

హైదరాబాద్ : పర్సు చోరీకి ప్రయత్నించిన ఓ దొంగకు చైనా మహిళ చుక్కలు చూపించింది.. బ్యాగ్‌లోనుంచి పర్స్ కొట్టేస్తుండగా వెంటనే అతని చేయి పట్టేసుకుంది.. చేయి మెలిపెడుతూ దొంగను బయటకు లాగి కుమ్మేసింది.... మళ్లీ జీవితంలో దొంగతనం చేయకుండా బుద్దిచెప్పింది.. ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది..

08:25 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వైసీపీ దుకాణం సర్దుకోనుందా..? వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు కూడా కారెక్కెందుకు సిద్ధమయ్యారా..? టీ వైసీపీ నేతలనూ చేర్చుకునేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారా..? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దీనికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ లో వైసీపీ టిఆర్ ఎస్ లో విలీనం కానుందా? కమ్యూనిస్టులు, బిజెపి మినహా అన్ని పార్టీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయా? తెలంగాణ లో టిడిపి, కాంగ్రెస్ కూడా ఖాళీ కానుందా? రాజకీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనా? ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కేంద్రం పై ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు? ప్రత్యేక హోదా పై కేంద్రం వెనకడుగు వేసిందా? బిజెపి వ్యూహానికి టిడిపి వంతపాడిందా? పవన్ ట్వీట్స్ పై వర్మ చూసుకుంటారా? కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం ఏం చేయాలి? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చలో ఆశక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్టు తెలకపల్లిరవి, టిడిపి నేత విజయకుమార్, బిజెపి నేత శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నేతద్రోణం రాజు శ్రీనివాసరాజు, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

దొంగతనం నెంపతో వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు..

రంగారెడ్డి : మహేశ్వరం మండలం పోరండ్లలో దారుణం జరిగింది. దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించిన గ్రామస్థులు పోలీసుల ఎదుట ఆరుగురు గ్రామస్థులు లొంగిపోయారు.

పట్టాలు తప్పిన ఢిల్లీ-ఫైజాబాద్ రైలు..

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో హార్పూర్‌లో ఆదివారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ-ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో తొమ్మిది బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. నాలుగు ఏసీ బోగీలు, మూడు రిజర్వేషన్ బోగీలు, రెండు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని, ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ ఏకే నీరజ్ శర్మ తెలిపారు.

పంప్ హౌజ్ నిర్మాణ కి భూమి పూజ చేసిన కేసీఆర్

కరీంనగర్ : కన్నెపల్లి వద్ద పంప్ హౌజ్ నిర్మాణ స్థలానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, కె. కేశవరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అంతకు ముందు కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07:25 - May 2, 2016

హైదరాబాద్ : ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అయిన గోవా సుందరి ఇలియానా గత నాలుగేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా వుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ అమ్మడు బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలోని కథానాయిక పాత్ర కోసం కొందరు అగ్ర కథానాయికల్ని సంప్రదించారని, డేట్స్ సమస్యల వల్ల వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయారని చెబుతున్నారు. చివరకు చిత్ర బృందం ఇలియానా వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. తెలుగులో తన రీ ఎంట్రీకి సరైన ప్రాజెక్ట్‌గా భావించిన ఇలియానా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

పార్వతీదేవికి బంగారు కిరీటం, పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌ దంపతులు

కరీంనగర్‌ : కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయంలో సోమవారం ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. పార్వతీదేవికి బంగారు కిరీటం, పట్టువస్త్రాలను కేసీఆర్‌ దంపతులు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి కేసీఆర్‌ కన్నెపల్లికి వెళ్లి ప్రాజెక్టు పంపుహౌస్‌కు భూమిపూజ చేస్తారు. మళ్లీ కాళేశ్వరం వచ్చి ఉదయం 9.40కి అంబటిపల్లి చేరుకుంటారు. అక్కడ మేడిగడ్డ బ్యారేజికి శంకుస్థాపన చేస్తారు.

అష్టిముఖి కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

నిజామాబాద్ : ఎడవల్లి మండలం జాన్కంపేటలో విషాదం నెలకొంది. అష్టిముఖి కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు రాజమణి, అరుణ్, నవతేజ్ గా గుర్తించారు. నిజామాబాద్ గాయత్రి నగర్ వాసులుగా గుర్తించారు.

కారు- పాలవ్యాన్‌ ఢీ : ఇద్దరు మృతి

చిత్తూరు: బంగారుపాళ్యం మండలం కారిడివారిపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కారు- పాలవ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

06:48 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది... తెలంగాణలో మినిమమ్‌ వేజ్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్నిచోట్లా కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కార్మికుల ప్రమాద బీమా మొత్తాన్నీ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నాయిని నర్సింహ్మ రెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ హాజరయ్యారు.. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు కసరత్తు నడుస్తోందని నాయిని తెలిపారు.. కార్మికశాఖలో పేరు నమోదు చేసుకున్న వారి ప్రమాద బీమాను 5నుంచి 6లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. మేడేను పండుగలా కాకుండా దీక్షా దివస్‌గా జరపుకోవాలని మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్ అన్నారు.. ఎనిమిదిగంటల పనిదినాలకోసం పోరాడి నలుగురు కార్మికులు అమరత్వం పొందారంటూ... మేడే చరిత్రను గుర్తు చేశారు.. మేడే సందర్భంగా.. వివిధ కంపెనీలకు బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులను.... కార్మికులకు శ్రమ శక్తి అవార్డులనూ అందించారు. ఆ తర్వాత కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.. 

06:46 - May 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వైసీపీ దుకాణం సర్దుకోనుందా..? వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు కూడా కారెక్కెందుకు సిద్ధమయ్యారా..? టీ వైసీపీ నేతలనూ చేర్చుకునేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారా..? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దీనికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో వైసీపీకీ ఉన్న ఎమ్మెల్యేలు ముగ్గురు,ఎంపీ ఒకరు......

వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ కార్యకర్తలతో జరిగే సమావేశంలో పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ మూడు ఎమ్మెల్యే స్థానాలను,ఓ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు,మదన్‌లాల్ ఇప్పటికే గులాబీ గూటీకీ చేరిపోయారు. ప్రస్తుతం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాత్రమే పార్టీలో మిగిలారు. వీరితో గులాబీ నేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. దీనికి తోడు ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దగా పట్టు లేకపోవడంతో ఇతర పార్టీలోని బలమైన నేతలను పార్టీలోకి తీసుకునేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నారు.

తమ డిమాండ్స్‌ ఒప్పుకుంటే టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ- పొంగులేటి.....

తమ డిమాండ్లు ఒప్పుకుంటే టీఆర్ఎస్‌లో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పొంగులేటి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో పార్టీ ముఖ్యనాయకులు,కార్యకర్తలతో ఇవాళ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేయనున్నారు. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి టీఆర్‌ఎస్‌లో చేరితే తెలంగాణలో వైసీపీ పూర్తిగా ఖాళీ కానుంది. మరి ఈ అంశంపై నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.. మరో వైపు ఖమ్మంలో మంచి పట్టు ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఖమ్మం జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు గులాబీ పార్టీ ఉవిళ్లూరుతోంది. 

06:43 - May 2, 2016

విజయవాడ : ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ మరో పోరాటానికి సిద్ధమైంది.. కరవుపై ఖాళీ బిందెలతో నిరసనలకు రెడీ అయింది.. ఈ కార్యక్రమంలో జగన్‌ పాల్గొంటారని పార్టీ ప్రకటించింది..

పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించిన పార్టీ...

మొన్నటివరకూ పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించిన వైసీపీ. ఇప్పుడు ప్రజా సమస్యలపై దృష్టిపెట్టింది. ఏపీలో కరవుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది. సాగు, తాగునీటి సమస్యతోపాటు... పశుగ్రాసం కూడా సరఫరా చేయలేని స్థితిలో సర్కారు ఉందని YCP మండిపడుతోంది.. వేసవి రాకముందే ముందస్తు చర్యలు చేపట్టిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆరోపిస్తోంది..

ధర్నాలు, నిరసనలతో వైసీపీ ....

కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యంపై సోమవారం ధర్నాలు, నిరసనలతో వైసీపీ హోరెత్తించనుంది. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందంటూ ఖాళీ బిందెలతో ఆందోళన చేయాలని పార్టీ అధిష్ఠానం.. నేతలు, కార్యకర్తలను ఆదేశించింది.. గుంటూరు జిల్లా మాచెర్లలో చేపట్టబోయే ధర్నాలో జగన్‌తోపాటు.. ముఖ్యనేతలు పాల్గొంటారు. గుంటూరు ధర్నాకు ముందు జగన్‌.. నాగార్జున సాగర్‌ను సందర్శించనున్నారు.. అధికారులను అడిగి సాగర్‌లో నీటి పరిస్థితిని తెలుసుకుంటారని పార్టీ తెలిపింది.. 

06:39 - May 2, 2016

మెదక్ : జిల్లాలో ఆదివారం రాత్రి విషాదం జరిగింది. పెళ్లి బృందం లారీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఏడుగురు మృతి చెందారు. 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. కంగ్టి మండలం దేగుల్‌వాడి తండాలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డిలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు రాంసింగ్‌ తండాకు చెందిన ధంజిరాం, వినోద్ , శ్రీను, రవి, రాములు, అశోక్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన కిస్కిబాయిని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రుల్ని నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. 
రాంసింగ్ తండాకు చెందిన శివ అనే యువకుడి వివాహం నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం నందివాడ సమీపంలోని ఓ గిరిజన తండాలో జరిగింది. వివాహం అనంతరం లారీలో బంధువులతో కలిసి వరుడి తరపు వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దెగుల్‌వాడీ తండా సమీపంలోకి రాగానే కిందకు వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ వైర్లు లారీకి తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందారు. ప్రమాదంపై మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు హైదరాబాద్‌లోని యశోద, కామినేని ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.

06:37 - May 2, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చివరకు ఆశాభంగమే మిగిలింది. రెగ్యులరైజ్ చేస్తామన్న ఎన్నికల వాగ్ధానం నెరవేరలేదు. పదో పిఆర్ సి అమలు చేయాలన్న డిమాండ్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. మరోవైపు 2500 రూపాయల చొప్పున వేతనాలు పెంచి, మూడు కేటగిరిలుగా విభజించడమూ వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్ట నష్టాల గురించి 'టెన్ టివి' జనపథంలోచ ర్చను చేపట్టింది. ఈచ ర్చలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత ఏవి నాగేశ్వరరావు విజయవాడ స్టూడియోనుండి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాళేశ్వరం బయలుదేరిన సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ నుంచి కాళేశ్వరం బయలుదేరి వెళ్లారు. మేడిగడ్డ వద్ద ఉదయం 9.50 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

లారీకి తగిలిన హైటెన్షన్ విద్యుత్ వైరు :7గురు మృతి

మెదక్ : జిల్లాలోని కంగ్టి మండలం దేగుల్‌వాడిలో ఘోర ప్రమాదం జరిగింది. కామారెడ్డిలో పెళ్లికి వెళ్లివస్తుండగా లారీకి హైటెన్షన్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుత్‌ షాక్‌తో 7గురు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు దేన్య తండా వాసులు ధన్‌రాజ్‌(50), వినోద్‌(25), శ్రీను(20), లవ్‌(22), రాములు(45), అశోక్‌ యాదవ్‌(20), కిస్‌భాయ్‌(20) గా పోలీసులు గుర్తించారు. శివ అనే యువకుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

మేడిగడ్డకు పునాదిరాయి వేయనున్న సీఎం కేసీఆర్

కరీంనగర్ : కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునాది రాయి వేయనున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ ఎత్తిపోతలు, పంప్‌హౌస్‌లు, కాల్వల నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇక మావోయిస్టు ప్రాబల్యం ఉన్న తూర్పు అటవీ ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో టెన్షన్‌ నెలకొంది. గోదావరిపై మూడు ప్రదేశాల్లో ఆనకట్టలను నిర్మించి రాష్ట్రంలో సాగునీటి అవసరాలు తీర్చాలని సర్కార్‌ యోచిస్తోంది. ఇందుకోసం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్‌ నిర్మించతలపెట్టింది. దీనికోసం ఇప్పటికే నిపుణులచే అన్ని సర్వేలు చేపట్టింది.

Don't Miss