Activities calendar

03 May 2016

ఢిల్లీ డేర్ డెవిల్ విజయలక్ష్యం 150 పరుగులు...

హైదరాబాద్ : టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన గుజారత్‌ లయన్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ ప్రారంభించిన 24 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో క్రీజులోకి వచ్చిన రైనా, కార్తీక్‌ జట్టు స్కోరు పెంచడానికి ప్రయత్నించారు. కానీ 75 పరుగుల దగ్గర మిశ్రా బౌలింగ్‌ లో రైనా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు పెంచే బాధ్యత కార్తీక్‌, జడేజాలపై పడింది. 10 ఓవర్‌ నుండి మరో వికెట్‌ పడకుండా జట్టు స్కోరు పెంచుతూ పోయారు. నిర్ణీత 20 ఓవర్లగాను 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు శ్రీవారి శ్రీవారి ఉచితద దర్శనానికి 8 గంటలు సమయం పట్టగా నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.86 కోట్లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

 

21:49 - May 3, 2016

గణాంకాలు ఘనం... ఉపాధి శూన్యం, వృద్ధిరేటు ఆకాశంలో... ఉద్యోగాల సంఖ్య పాతాళంలో.., ఏటా పడిపోతున్న ఉపాధి కల్పన..!!, గత ఏడేళ్ల కనిష్టంగా 2015లో ఉద్యోగాలు.., ఉద్యోగాలు తగ్గిపోతున్నాయ్... నో వేకెన్సీ...!! ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేకం కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

21:44 - May 3, 2016

మెదక్ జిల్లాల మల్లన్నసాగర్ ముంపు...జనాలకు తప్పదంట ఇంకోదగ్గరికి జంపు, లొల్లివెట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు... ఒక్కొక్కళ్లకు ఉన్నదంట మస్తు కుళ్లు, పొగడ్తలు నేర్సుకుంటున్న పొంగులేటి.. రారు శ్రీనువాసురెడ్డికి ఎవ్వరు సాటి, హైదరాబాదుల పేరుకుంది అడ్డగోలు సెత్త.. మున్సిపాలిటోళ్లకు ఇదేమన్న కొత్త, ఎములాడ గుడిల పిలగాడు మాయం.. అయ్యవ్వలకు ఐతుంది మస్తు భయం.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

నిజమాబాద్‌ జిల్లా దోమకొండలో గాలివాన బీభత్సం

నిజమాబాద్‌ : జిల్లాలోని దోమకొండలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలు ప్రదేశాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాడు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

21:25 - May 3, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ సర్కార్‌ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయాలని ఎపి మంత్రివర్గం తీర్మానించడంపై తెలంగాణ నేతల మండిపడుతున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తమ వాటా నీటిని వాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు  తెగేసి చెబుతుంటే... తెలంగాణ నిర్మించేవి అక్రమ ప్రాజెక్టులను ఎపి నేతలు వాదిస్తున్నారు. వెరసి తెలుగు నేతల మధ్య విమర్శల యుద్ధం తారా స్థాయికి చేరింది. 
కృష్ణా, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం 
తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వరుసగా శంకుస్థాపనలు చేసుకుంటూ పోతోంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో ఒప్పందాలూ కుదుర్చుకుంటోంది. ప్యాకేజీల వారీగా పనులను విభజించి నిర్దిష్ట కాలావధిలోగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దూకుడుగా వెళుతోంది. ఇప్పుడీ వ్యవహారం.. రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. 
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం -హరీశ్‌రావు 
ప్రాజెక్టుకు శంకుస్థాపనల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వేలెత్తిచూపుతున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా 1350 టీఎంసీల నీటిని వాడుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరు అడ్డుచెప్పినా ఆగబోమని స్పష్టం చేస్తున్నారు.  
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ : ఏపీ కేబినెట్‌ 
తెలంగాణ సర్కార్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌లు విభజన చట్టానికి విరుద్ధమన్న వాదాన్ని ఏపీ నేతలు లేవనెత్తున్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని సోమవారం జరిగిన ఏపీ మంత్రివర్గం తీర్మానించింది. ఈ విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య సమన్వయం కుదిర్చేందుకు కేంద్రం జోక్యాన్ని కోరాలనీ నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఏపీకి చుక్కనీరూ రాదన్నది ఏపీ వాదన. పైగా కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని.. వీటిని ఆపడానికి అవసరమైతే న్యాయపోరాటం చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
తెలంగాణ ప్రాజెక్టులను ఆపితే సహించం -ఇంద్రకరణ్‌రెడ్డి 
ఏపీ మంత్రివర్గం తీర్మానంపై టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు మండిపడుతున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ నీటిని వాడుకుని తీరతామని స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేస్తే సహించబోమని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హెచ్చరించారు. ఏపీ కేబినెట్‌ నిర్ణయం బాధ్యతారాహిత్యమని, పాలమూరు ఎత్తిపోతలకు అన్ని అనుమతులూ ఉన్నాయని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా తమ పక్షాన్నే న్యాయం వస్తుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణకు సాగునీరు రాకుండా ఏపీ సర్కారు, అక్కడి వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు కుట్రలు పన్నుతున్నారని రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు సాగునీరు అందకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం, వైపీసీ, ఏపీ కాంగ్రెస్‌ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ... వీటిని తిప్పికొట్టాలని రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. చంద్రబాబు తీరుతో తెలంగాణ టీపీపీ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని టీఆర్‌ఎస్‌  నేతలు కోరుతున్నారు. 
ఈనెల 16 నుంచి జగన్‌ దీక్ష 
మరోవైపు.. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ.. చంద్రబాబు సర్కారుపై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో జలదీక్ష చేపట్టాలని పార్టీ అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... తెలంగాణ సీఎం.. కేసీఆర్‌కు లొంగిపోయి ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదని వైపీసీ దుయ్యబడుతోంది. జగన్‌ జలదీక్షకు సిద్ధమైన తర్వాత కేంద్రం జోక్యం, కోర్టులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వైపీసీ నేతలు విమర్శిస్తున్నారు. 
మళ్లీ రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు 
రాష్ట్ర విభజన తర్వాత సాగునీటితోపాటు వివిధ అంశాలపై పరస్పరం కత్తలు దూసుకున్న ఏపీ, తెలంగాణ సీఎంలు, మంత్రులు... గవర్నర్‌ చొరవతో కొంతకాలం శాంతించారు. మళ్ళీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల నేతలు పరస్పర విమర్శలకు దిగుతుండడంతో.. మళ్లీ రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 

20:37 - May 3, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో అధికారం దక్కేదెవరికి? పోలీస్ అధికారుల అంచనాలు, ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు మమతాబెనర్జీకి మింగుడుపడడం లేదన్న ప్రచారం జరుగుతోంది. 
బెంగాల్ సంగ్రామంలో ఆఖరి అంకం
పశ్చిమబెంగాల్ లో ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరింది. మే 5న చివరి విడత పోలింగ్ జరగబోతోంది. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ లో అయిదు విడతల్లో 269 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన పాతిక స్థానాలకు గురువారమే ముహూర్తం. ఇప్పటి దాకా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన నేతలు ఈవిఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు కోసం మే 19 దాకా వేచిచూడాల్సిందే.
ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందా? 
పశ్చిమబెంగాల్ సింహాసనం దక్కించుకునేదెవరు? ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందా? మైనార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందా? సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా?  ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? ఇలాంటి అనేక ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మమతా తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనన్న అభిప్రాయం  
పశ్చిమబెంగాల్ లోని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మమతాబెనర్జీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనన్న అభిప్రాయంతో వున్నట్టు తెలుస్తోంది. దాదాపు 50 మంది సిట్టింగ్ లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, త్రుణమూల్ కాంగ్రెస్ కి 130 సీట్లు దాకపోవచ్చని అంచనాతో ఇంటెలిజెన్స్ వర్గాలున్నట్టు సమాచారం.  ఈ టెన్షన్ తోనే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
ఆరు విడతలుగా పోలింగ్ 
పశ్చిమబెంగాల్ లో ఆరు విడతలుగా పోలింగ్ నిర్వహించడం, ఎక్కడికక్కడ కేంద్ర బలగాలను మొహరించడం, టిఎంసీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను, సిఐలను బదిలీ చేయడం లాంటి పరిణామాలు మమతాబెనర్జీకి వ్యతిరేకంగా పరిణమించాయన్న ప్రచారం జరుగుతోంది. వీటికితోడు త్రుణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ సమయంలో ప్రత్యర్థుల మీద దాడులకు తెగబడడం, కొన్ని చోట్ల హత్యలు చేయడం, ఓట్లేయడానికి వెళ్తున్నవారిని అడ్డుకోవడం,  భయానకవాతావరణం స్రుష్టించడం లాంటి పరిణామాలు విద్యాధికవర్గంలో మమతాబెనర్జీకి మైనస్ గా మారాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.    
టీఎంసీ సృష్టించిన భయానక వాతావరణం...
టీఎంసీ సృష్టించిన భయానక వాతావరణమే మమతాబెనర్జీ వ్యతిరేకులను ఏకం చేసిందనీ, ఊహించిన దానికంటే ఎక్కువగా కాంగ్రెస్, వామపక్షాల ఓట్ల ట్రాన్స్ ఫర్ కి దారితీసిందంటున్నారు రాజకీయ పండితులు. అయితే,  పోలీస్ బాస్ ల నివేదికలు ఎలా వున్నా, మమతాబెనర్జీ విజయావకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమబెంగాల్ లో దాదాపు 28శాతం మంది ముస్లిం ఓటర్లున్నారు. 125 నియోజకవర్గాల్లో వీరి ప్రభావం కనిపిస్తుంది. ముస్లిం ఓట్ల మీద మమతాబెనర్జీ  ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అయితే, ముస్లిం ఓట్లు చాలావరకు చీలిపోయాయన్న అంచనాలు టిఎంసీ నేతలను కలవరపెడుతున్నాయి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన విషయంలో తనకు నోటీసిచ్చిన ఎలక్షన్ కమిషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎన్నికల కమిషన్ బదిలీలపై కస్సుబుస్సులాడడం, తనకు ఫేవర్ గా వుండని పోలీస్ ల సంగతి చూస్తానంటూ బెదిరించడం లాంటి సంఘటనలు నష్టం చేస్తాయోమోనన్న భయం టిఎంసీని వెన్నాడుతోంది. 
బెంగాల్ లో మొత్తం 294 సీట్లు 
పశ్చిమబెంగాల్ లో మొత్తం 294 సీట్లున్నాయి. మ్యాజిక్ ఫిగర్  148. గత అసెంబ్లీలో మమతాబెనర్జీకి 184 సీట్లున్నాయి.  ప్రస్తుతం 42 స్థానాలున్న కాంగ్రెస్ కి  మరో ఇరవై, ఇరవై అయిదు సీట్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. వామపక్షాలకు కూడా అదే స్థాయిలో సీట్లు పెరిగే అవకాశం వుందంటున్నారు. అంచనాలకు తగ్గట్టుగా కాంగ్రెస్, వామపక్షాల సీట్లు పెరిగితే, త్రుణమూల్ కాంగ్రెస్ బలం 130 నుంచి 140 స్థానాలకే పరిమితమవుతుందన్నది కొంతమంది విశ్లేషకుల అంచనా.  

20:25 - May 3, 2016

తూర్పుగోదావరి : కాశీ యాత్రకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన ఏడుగురు యాత్రికులు అదృశ్యమయ్యారు. కాకినాడ గొల్లపేటకు చెందిన అప్పల నర్సమ్మ, నారాయణమ్మ, మాణిక్యం, లక్ష్మి, మంగమ్మ, లోవరాజు, అప్పారావు, పేరంటాలు... గత నెల 29న వారణాసి బయలుదేరి వెళ్లారు. అయితే వీరిలో లోవరాజు తప్ప మిగతావారు కనిపించకుండా పోయారు. తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు లోవరాజు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లోవరాజు ప్రస్తుతం వారణాసి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారణాసిలో ఏడుగురు అదృశ్యం కావడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌... వారణాసి పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.

 

కిడ్నాపైన పసికందు ఆచూకీ లభ్యం

కరీంనగర్ : వేములవాడలో ఉదయం కిడ్నాప్ అయిన పసికందు ఆచూకీ లభ్యమైంది. కొడిమ్యాల సమీపంలో పోలీసులు పసికందును గుర్తించారు. పసికందును కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. 

 

20:21 - May 3, 2016

కరీంనగర్ : జిల్లాలోని వేములవాడలో పసికందు కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. కొడిమ్యాల సమీపంలో పసికందును గుర్తించిన పోలీసులు .. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా ఆలేరు మండలం బొందుగుల గ్రామానికి చెందిన కనకవ్వ కుంటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శనం కోసం వేములవాడకు వచ్చారు. దర్శనానంతరం కుటుంబసభ్యులు ఆలయ ఆవరణలో నిద్రించారు. అయితే తెల్లవారుజామున నిద్ర లేచేసరికి బాలుడు కనిపించకపోవడంతో కనకవ్వ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వేములవాడలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆలయం ముందున్న సీసీ కెమెరాలో ఓ మహిళ బాలుడిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో గాలింపు ముమ్మరం చేశారు. చివరకు కొడిమ్యాల సమీపంలో నిందితులు లావణ్య, ఆమె భర్త రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పసికందును ఆమె తల్లికి అప్పగించారు. 

20:10 - May 3, 2016

ఢిల్లీ : జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలికి.. దర్శకులు రాజమౌళి అవార్డును అందుకున్నారు. ఉత్తమ నటీనటులుగా అమితాబ్‌ బచ్చన్‌, కంగనారనౌత్‌లు అవార్డులు అందుకోగా.. ప్రాంతీయ భాషా కేటగిరిలో కంచె సినిమాకు క్రిష్‌ పురస్కారాన్ని అందుకున్నారు.
ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి సినీ ప్రముఖులు, తారాలోకం తరలివచ్చింది. 
బాహుబలికి జాతీయ పురస్కారం
చిత్రంగా తెలుగు సినిమా బాహుబలికి జాతీయ పురస్కారం వరించింది. తెలుగు చిత్రానికి జాతీయ పురస్కారం రావడం ఇదే ప్రథమం. ఈ అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. 
ఉత్తమ ప్రాంతీయ చిత్రం 'కంచె'
ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో 'కంచె' అవార్డును దక్కించుకుంది. క్రిష్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ నటీనటులుగా పీకూ సినిమాకు గాను అమితాబ్‌ బచ్చన్‌, తను వెడ్స్‌ రిటర్న్స్‌ చిత్రానికి గాను కంగనారనౌత్‌లు అవార్డులు అందుకున్నారు. కంగనారనౌత్‌కు ఈ అవార్డు రావడం మూడోసారి. దర్శకత్వ విభాగంలో సంజయ్‌లీలా భన్సాలీ అవార్డును దక్కించుకున్నారు. ఇక అవార్డులు పొందినవారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అభినందనలు తెలిపారు. 

 

మంత్రి తుమ్మలకు ఉత్తమ్ కుమార్ సవాల్

హైదరాబాద్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సవాల్ విసిరారు. పాలేరులో తమ్ములకు గెలిచే దమ్ముంటే ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేసి పోటీలో గెలవాలన్నారు. పాలేరులో తెలంగాణద్రోహిని టీఆర్ ఎస్ నిలబెట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ కాలేజీలపై నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తీరుతో విద్యావ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందన్నారు. 

సీబీఐ విచారణలో నిజాలు వెల్లడించిన ఎస్పీ త్యాగి

ఢిల్లీ : సీబీఐ విచారణలో ఎస్పీ త్యాగి నిజాలను వెల్లడించారు. 2005లో ఫిన్ మెకానికా సీఓఓ కలిసినట్లు విచాణలో వెల్లడైంది. 

జీహెచ్ ఎంసీ అధికారులతో మేయర్ బొంతు భేటీ

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ అధికారులతో మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. రోడ్లు, డివైడర్లు, హరితహారంపై సమీక్ష చేశారు. 

63వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ఉత్తమచిత్రాలు, నటీనటులకు రాష్ట్రపతి అవార్టులను ప్రదానం చేస్తున్నారు. 2015లో ఉత్తమచిత్రంగా బాహుబలి ఎంపిక అయింది. 

 

19:43 - May 3, 2016

గుంటూరు : వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో వ్యాయామ శిక్షణా తరగతులు తప్పనిసరి చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో వ్యాయామ విద్య శిక్షణా తరగతులకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యకు మార్కులిచ్చి వెయిటేజీ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2014 డీఎస్ సీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చే జూన్‌ మొదటివారంలో నియామక ఉత్తర్వులు అందిస్తామని ప్రకటించారు..

 

19:39 - May 3, 2016

కర్నూలు : విపక్షాలు అభివృద్ధికి అడ్డుతగులుతున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గంలోని పలువురు ఎంపిటిసిలు, జెడ్ పిటిసిలు, సర్పంచ్‌లు టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఢిల్లీకి వెళ్లి అవినీతి జరిగిందని చెప్పిన నేతలు.. ఏపీకి రావాల్సిన నిధులగురించి ఎందుకు అడగరని ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. 

హార్టికల్చర్ రుణమాఫీకి విధివిధానాలు ఖరారు

హైదరాబాద్ : ఏపీలో హార్టికల్చర్ రుణమాఫీకి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. ఎకరానికి 10వేల రూపాయల చొప్పున రుణమాఫీ అమలు చేయనుంది. కుటుంబానికి గరిష్టంగా రూ.50వేల వరకు వర్తింపు లభిస్తుంది. 2013 డిసెంబర్ 31వరకు మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. 2,20,956 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. 

19:28 - May 3, 2016

హైదరాబాద్ : ఏపీలో హార్టికల్చర్ రుణమాఫీకి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. ఎకరానికి 10వేల రూపాయల చొప్పున రుణమాఫీ అమలు చేయనుంది. కుటుంబానికి గరిష్టంగా రూ.50వేల వరకు వర్తింపు లభిస్తుంది. 2013 డిసెంబర్ 31వరకు మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. 2,20,956 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. 

 

19:08 - May 3, 2016

ఖమ్మం : పాలేరు ఉపఎన్నికలో సీపీఎం దూసుకుపోతోంది. వామపక్షాలు బలపరిచిన సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ నేలకొండపల్లి మండలం మోటాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణం బాధాకరమని సుదర్శన్‌ అన్నారు. పాలేరులో టీఆర్‌ఎస్‌ పోటీ చేయడం అవకాశవాద రాజకీయాలన్నారు. లెఫ్ట్ పార్టీలే ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై పోరాడుతాయని చెప్పారు.

18:54 - May 3, 2016

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇలాంటి మరిన్ని పథకాలు రావాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కేటీఆర్‌ ప్రచారం చేశారు.. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. నేలకొండపల్లి మండలం మోటాపురం, రాజేశ్వరపురం గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు..

 

కర్ణాటకలో పరీక్ష పేపర్‌ లీక్.. నిందితుడు అరెస్టు..

బెంగుళూరు : కర్ణాటకలో పన్నెండో తరగతి రసాయన శాస్త్రం పరీక్ష పేపర్‌ లీక్‌ అయిన కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. కర్ణాటక సీఐడీ అధికారులు సోమవారం రాత్రి బెంగళూరులోని హోసూర్‌ రోడ్‌లో రహస్య ప్రదేశంలో దాక్కున్న కీలక నిందితుడు శివకుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

లంచం డిమాండ్ చేసిన ఎన్‌డీఎంసీ అధికారి అరెస్ట్

ఢిల్లీ : లంచం డిమాండ్ చేసిన ఎన్‌డీఎంసీ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అసిస్టెంట్ కమిషనర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కరోల్ బాగ్ జోన్ పరిధిలో తనను లైసెన్సింగ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించేందుకు ఎన్‌డీఎంసీ కమిషనర్ రూ.50వేలు డిమాండ్ చేశాడని ఓ యువతి సీబీఐని ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ కమిషనర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

తూర్పుగోదావరి : జిల్లాలోని ప్రత్తిపాడు హైవేపై వ్యాన్‌, ట్రాక్టర్‌ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

18:40 - May 3, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ వైసీపీ అధినేత జగన్‌ దీక్షకు సిద్ధమైనందుకే పార్టీ మారాల్సి వచ్చిందని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈమేరకు టెన్ టివితో పొంగులేటి ప్రత్యేకంగా మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. జగన్‌ నిర్ణయాన్ని సామాన్యుడిగా సమర్ధిస్తున్నానని..కానీ తెలంగాణ బిడ్డగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. జగన్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

వేములవాడలో బాలుడి కిడ్నాప్ ఘటనలో దర్యాప్తు ముమ్మరం..

కరీంనగర్ : వేములవాడలో శిశువు కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటోడ్రైవర్ ను పోలీసులు విచారిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో బాలుడిని గాలిస్తున్నారు. 

జిల్లాల్లో వడగళ్ల వాన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. రుద్రారం, తిప్పాక, నారాయణఖేడ్, పటన్ చెరులో వడగళ్ల వాన కురిసింది. కల్హేరు మండలం సిర్గాపూర్ లో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. రాజేంద్రనగర్, శంషాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, కోనరావుపేట, మహదేవ్ పూర్, తిమ్మాపూర్ లలో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. 

17:33 - May 3, 2016

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన అమరవీరుల భారీ స్మారకస్థూపం నిర్మించాలని టీసర్కార్ నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించారు. సాగర్ తీరాన అమరవీరుల స్మారకస్థూపం నిర్మించ తలపెట్టారు. జూన్ 2న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 12 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. స్మృతివనం నిర్మాణ బాధ్యతలు ఆర్ ఆండ్ బి అధికారులకు అప్పగించారు. సెక్రటేరియట్ సమీపంలోని పర్యాటక శాఖ, బుద్ధపూర్ణిమ, విద్యుత్ కార్యాలయాలను తరలించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

 

మేలో షా పర్యటన – లక్ష్మణ్..

హైదరాబాద్ : మే మూడో వారంలో రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ వెల్లడించారు. కేసీఆర్ సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ ప్రజా సమస్యలు గాలికొదిలేశారని, రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే సీఎం కేసీఆర్ సమీక్షలకే పరిమితమౌతున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో కనీస కరవు సహాయక చర్యలు తీసుకోవడం లేదని, టీఆర్ఎస్ తో దోస్తి కట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

16:58 - May 3, 2016

విజయవాడ : ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం అమలు.. నిధుల మళ్లింపు-కూలీల వ్యధలు' అనే అంశంపై విజయవాడలో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్లకు వరంగా మారుతోందని, ప్రభుత్వాల తీరుతో గ్రామాల్లో వలసలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

16:53 - May 3, 2016

నల్గొండ : వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌, సూర్యాపేట మండలాల్లో ఎండిపోయిన పంటలను సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిమ్మ, బత్తాయి తోటలు నీళ్లు లేక ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా సర్కార్‌ స్పందించి మంత్రులను కరవు ప్రాంతాలకు పంపించి.. రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

 

16:48 - May 3, 2016

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ.రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ నెల 13న రాజ్యసభలో విభజన హామీలు అమలు చేయాలన్న బిల్లుపై కాంగ్రెస్‌ పట్టుబడుతుందని చెప్పారు. దానికి టీడీపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. 

 

16:42 - May 3, 2016

హైదరాబాద్ : తన భర్త విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకున్నారంటూ సినీనటి పూజిత సీపీ మహేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేసింది.. తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకొచ్చింది.. 13ఏళ్లక్రితం విజయ్‌ గోపాల్‌తో తనకు వివాహం జరిగిందని పూజిత తెలిపింది.. తమకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పింది.. తాజాగా విజయ్‌ గోపాల్‌... ఐఏఎస్ అధికారిణి రేఖారాణికి పెళ్లిచేసుకున్నాడని ఆరోపించింది.. తనకు విడాకులు ఇవ్వకుండా... కుమారుడిని పట్టించుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని సీపీకి తెలిపింది.. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే తననే బెదిరించారని పూజిత మండిపడుతోంది.

 

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలి - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎ కేసీఆర్ జరిపిన సమీక్ష కొద్దిసేపటి క్రితం ముగిసింది. హుస్సేన్ సాగర్ తీరంలో 12 ఎకరాల స్థలంలో అమరవీరుల స్థూపం, స్మృతి వనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి జూన్ 2వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. స్మృతి వనం బాధ్యతను ఆర్ అండ్ బి శాఖకు అప్పగించారు. స్మృతివనంలోనే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహితి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

16:38 - May 3, 2016

క్రమం తప్పని వ్యాయామంతో అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై మానవి వేదిక చర్చా కార్యక్రమంలో డా.మధుబాబు (సంజీవని నేచర్ క్యూర్ హాస్పిటల్), సుజాత స్టీఫెన్..(న్యూట్రీషనిస్ట్) పాల్గొని, పలు ఆరోగ్య విషయాలు తెలిపారు. పిల్లలకు క్రమం తప్పని వ్యాయామంతోనే ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమన్నారు. క్రమం తప్పని వ్యాయామం ఒత్తిడి నివారణకు మార్గమని చెప్పారు. మహిళలు వారి కోసం వారు సమయం కేటాయించుకోవాలన్నారు. లిఫ్టు వాడాకాన్ని తగ్గించుకుంటూ నడకకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని మహిళల్లోనే ఊబకాయం ఎక్కువని ఆరోగ్య సర్వే తేల్చిందని పేర్కొన్నారు. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో 39.5 శాతం మంది స్థూలకాయులున్నారని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అత్యవసరంగా ల్యాండైన జెట్ లైట్ విమానం..

ఢిల్లీ : జెట్ లైట్ విమానం 4264 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. కోల్ కతా నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానంలో ల్యాండింగ్ గేర్ లో ఇబ్బందులు రావడంతో పైలట్ అత్యవసరంగా కిందకు దించేశాడు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 207 పాయింట్లు నష్టపోయి 25,230 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 7,747 వద్ద ట్రేడ్ అయింది. 

జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఓయూ జేఏసీ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఓయూ జేఏసీ కలిసింది. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంపడుతున్న సీఎం చంద్రబాబు ఇంటికి జీహెచ్ఎంసీ నుంచి ఉన్న సదుపాయాలు నిలిపివేయాలని కోరింది.

 

రాజధానిలో శ్రీవారి ఆలయ నిర్మాణం - టిటిడి ఈవో..

చిత్తూరు : ఏపీ నూతన రాజధానిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టిటిడి ఈవో సాంబశివరావు ప్రకటించారు. కృష్ణా పుష్కరాల్లో శ్రీవారి నమూనా ఆలయం నిర్మిస్తామని పేర్కొన్నారు. 

16:13 - May 3, 2016

ఢిల్లీ : అగస్టా కుంభకోణంపై బిజెపి తనపై చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. బిజెపి పార్లమెంట్‌లో తనను టార్గెట్‌ చేయాలని చూస్తోందని, ఇందుకు తాను ఆనందం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. అగస్టా స్కాంకు సంబంధించి రాహుల్‌గాంధీపై విచారణ జరపాలని బిజెపి ఎంపి కీర్తి సోమయ్య సిబిఐకి లేఖ రాశారు. రాహుల్‌పై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్‌గాంధీ సలహాదారు కనిష్కసింగ్‌ చెప్పారు. అంతకుముందు కేంద్రమంత్రి వికె సింగ్‌ కూడా రాహుల్‌గాంధీని ఈడీ ముందు హాజరు పరచాలని కోరారు.

 

కేరళ 'నిర్భయ' ఘటనపై పెల్లుబికుతున్న నిరసనలు..

కేరళ : ఎర్నాకులంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఎస్డీపీఐ మరియు ఏఐవైఎఫ్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

టెస్టు క్రికేట్ లో ఆసీస్ నెంబర్ 1..

ముంబై : ఐసీసీ టెస్టు మ్యాచ్ ర్యాంకింగ్ లో ఇండియా రెండో స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా మొదటి ర్యాంకుకు ఎగబాకింది.

డీజిల్ టాక్సీ డ్రైవర్ల ప్రతినిధులతో మంత్రి భేటీ..

ఢిల్లీ : రాష్ట్ర సచివాలయంలో డీజిల్ టాక్సీ డ్రైవర్ల ప్రతినిధులతో ట్రాన్స్ పోర్టు మంత్రి గోపాల్ రాయ్ సమావేశమయ్యారు. రాజధాని హస్తినలో డీజిల్ క్యాబ్‌లపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్య స్థాయిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 

 

15:58 - May 3, 2016

ఢిల్లీ : సుప్రీం కోర్టులో నీట్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. దాదాపు 40 నిమిషాల పాటు వాదనలు కొనసాగాయి. నీట్‌ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పడంతో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును మార్చాల్సిన అవసరం ఉందా అని ఎంసీఐని ప్రశ్నించిన జస్టిస్‌ అనిల్‌ ఆర్‌ దవే, ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌ ధర్మాసనం.. రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ఎంసీఐ, కేంద్ర వైఖరిని కోరింది. నీట్‌ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. గురువారం అన్ని రాష్ట్రాల వాదనలతో పాటు ఏపీ, తెలంగాణ వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.

48గంటల పాటు వడగాలులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో 48గంటల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 

బాబుకు కేవీపీ లేఖ..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి ఇచ్చిన సమాధానాన్ని లేఖలో ప్రస్తావించారు. ఈనెల 13న మళ్లీ రాజ్యసభలో చర్చ జరుగనుందని, టిడిపి ఎంపీలు హాజరై మద్దతు తెలపాలని కోరారు. 

15:15 - May 3, 2016

హైదరాబాద్ : ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నాడో సినీ కవి. ఓవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు కూరగాయల ధరలు భయపెడుతున్నాయి. ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాక సగటు జీవి అల్లడిపోతున్నాడు. 
కొనాలంటేనే భయపడిపోతున్న జనం
సంచినిండా డబ్బులతో జేబు నిండా కూరగాయలన్న చందంగా ధరలకు రెక్కలొచ్చాయి. టొమాటో, బీన్స్, క్యారెట్‌, కాప్సికం, కాదేది... ధరల పెరుగుదలకనర్హం అన్నట్లుంది కూరగాయల పరిస్థితి. సరఫరా మధ్య సగానికి పైగా అంతరం ఏర్పడటంతో రాష్ట్రంలో కూరగాయల ధరలు  ఒక్కసారిగా పెరిగాయి. హోల్‌సేల్‌ మార్కెట్లో, రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. టోకు మార్కెట్లో కిలో 52 రూపాయలు ఉన్న టొమాటో బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి 60 నుంచి 80 రూపాయల ధరల పలుకుతోంది. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఇలాగే ఉండటంతో వీటిని కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు. 
ఆకాశాన్నంటుతున్న ఆకుకూరల ధరలు
పదిరోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. కిలో వంకాయల ధర 15రూపాయలుండగా ప్రస్తుతం 30 అయ్యింది. బెండకాయ 15 నుంచి 40 రూపాయలకి పెరిగింది. దొండకాయలు  15నుంచి 25 ,బంగాళదుంపలు 30 నుంచి 40 రూపాయలకు  పెరిగాయి. ములక్కాయలైతే పది రూపాయలకి రెండే ఇస్తున్నారు. ఇక కొత్తిమేర, పుదీనాలతో పాటు ఆకుకూరల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నాలుగు రకాల కూరగాయలు కొనడానికి  200 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
కూరగాయలపై కరవు ప్రభావం
రాష్ట్రంలో నెలకొన్న కరవు ప్రభావం కూరగాయలపై పడుతోంది. తీవ్రమైన ఎండలు, వర్షాలు కురవకపోవడం, భగర్భజలాలు అడుగంటుకుపోవడంతో పంటలకు నీరు కరువై దిగుబడి బాగా తగ్గిపోయింది. ఆశించిన స్థాయిలో కూరగాయల సాగు జరగకపోవడం ధరలు పెరగడానికి కారణమవుతోంది. ఏప్రిల్ మొదటివారం వరకు కాస్త అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రధాన  మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ పట్టణాల్లో కూరగాయల ధరలు చూసి సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ధరలు పెరుగుదలపై ప్రజల అసంతృప్తి 
ప్రతి ఏడాది కూరగాయల ధరలు ఇలాగే పెరిగిపోతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో,కూరగాయలపై  వ్యవసాయ శాఖ  ముందే అప్రమత్తమై చర్యలు చేపడితే కొంతవరకు సమస్యను పరిష్కరించవచ్చునని సూచిస్తున్నారు.

15:08 - May 3, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో ఘోరం జరిగింది. ఓ లారీ రోడ్డుపక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గణపవరం వెళుతున్న లారీ..పిప్పర గ్రామంలోకి రాగానే రోడ్డుపక్కన ఉన్న హోటల్‌లోనికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాహనంపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 

 

15:00 - May 3, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌... ఆర్‌.జే హేమంత్‌తో కలిసి రేడియో మిర్చి 98.3 ఎఫ్‌ఎం శ్రోతలతో మాట్లాడారు. నగరంలో నెలకొన్న సమస్యలు.. వాటికి పరిష్కారాలపై సిటిజన్స్ తో మాట్లాడారు. మారుతున్న కాలంలో ప్రచార సాధనాలు విస్తృతంగా పెరిగాయని వాటిని వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించొచ్చని మేయర్ అన్నారు. 

 

నీట్ పై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : నీట్ నిర్వాహణ, రాష్ట్రాల అభ్యంతరాలపై వివరణనివ్వాలని ఎంసీఐ, కేంద్ర ఆరోగ్య శాఖకు సుప్రీంకోర్టు నోటీసుల జారీ చేసింది. నీట్ నిర్వాహణపై అడ్డంకులను అధిగమించాలని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. త్రిసభ్య ధర్మాసనం ఎదుట తమిళనాడు, కర్ణాటక వాదనలు వినిపించాయి. గురువారం లోపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వాదనలను వినిపించనున్నాయి. గురువారం వరకు సుప్రీంకోర్టు వాదనలు విననుంది. 

14:56 - May 3, 2016

విజయవాడ : గోదావరి తీరంలో తెలుగు తమ్ముళ్లు, కమలనాధుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో ఇరుపార్టీలు మిత్రపక్షంగా రెండేళ్ల నుంచి కలహాల కాపురం నెట్టుకొస్తున్నా...ఇక ముందు సాగలేమన్న సంకేతాలిస్తున్నారు. రాజమండ్రి బీజేపి అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలిద్దరూ పార్టీలపై తారాస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు కట్టుబడి నిధులు మంజూరు చేయకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని గోరంట్ల బీజేపిపై ఫైర్‌ అయ్యారు. దీనికి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. 

 

సుప్రీంలో నీట్ పై కొనసాగుతున్న విచారణ..

ఢిల్లీ : నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. నీట్ నుండి మినహాయించాలంటూ ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

నారాయణగిరి వసతి వెనుక మంటలు..

చిత్తూరు : తిరుమల నారాయణగిరి వసతి సముదాయం వెనుక మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అటవీ, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

 

రాష్ట్ర ఆవతరణ వేడుకలపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరగనున్నాయి. 

14:52 - May 3, 2016

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు తీరుతో ఇకనైనా తెలంగాణ టీడీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ప్రాజెక్టులను ఆపాలని ఏపీ సీఎం కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ తెలంగాణ ప్రాజెక్టులపై  వ్యతిరేకంగా జలదీక్ష చేస్తాననడంతో తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఖమ్మం వైసీపీ ఎంపీ  పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు టీఆర్‌ ఎస్‌లో చేరారని బాలరాజ్ తెలిపారు. 

మెట్రో రైలు ఎండీగా శివానంద నింబర్గే..

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త ఎండీగా శివానంద నింబర్గే నియమితులయ్యారు. జూన్ 2న శివానంద నింబర్గే బాధ్యతలు చేపట్టనున్నారు. అదే రోజున వీబీ గాడ్గిల్ రిటైర్ కానున్నారు. 

రాష్ట్ర ఆవతరణ వేడుకలపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరగనున్నాయి. 

14:46 - May 3, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్‌తో ఎపి సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యాడని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులతో ఏపీకి జరిగే నష్టంపై ఆయన  స్పందించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కేసిఆర్ దగ్గర తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. జగన్ జలదీక్ష ప్రకటనతో ఏపీ ప్రభుత్వ కేబినెట్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. 

 

14:41 - May 3, 2016

విజయవాడ : పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్రజలవనరుల కమిటీ అనుమతి లేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతోందని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆరోపించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతులుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ఎగువున ఉన్నామనే కారణంతో, టీ సర్కార్‌ ప్రాజెక్టుల విషయంలో నచ్చినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో మిత్రులుగా ఉంటూ, పక్కనున్న ఏపీని మాత్రం శత్రువులాగా చూస్తోందని అన్నారు.

 

ముంబై ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం..

ముంబై : వాషింగ్ మెషిన్ మోటార్ లో ఉన్న బంగారాన్ని ముంబై ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణీకుడి నుండి 19 గోల్డ్ బిస్కెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 60 లక్షలు ఉంటుందని అంచనా.

ఐఓఏ కోరికను అంగీకరించిన సచిన్..

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ కు భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరికను బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంగీకరించారు.

 

ఆగస్టు 12 నుండి కృష్ణా పుష్కరాలు - మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి..

హైదరాబాద్: ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. జూన్ 30లోగా కృష్ణా పుష్కరాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసిందన్నారు. 

నీట్ పై కాసేపట్లో సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : వైద్య విద్య కోర్సులకు ఏకీకృత ప్రవేశ పరీక్ష నీట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై మరికాసేపట్లో సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. 

13:28 - May 3, 2016

నితిన్..సమంత జంటగా నటించిన 'అ..ఆ' చిత్ర ఆడియో సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 'పవర్ స్టార్' పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. సమంత తన ఫేస్ బుక్ ద్వారా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ లో 'పవన్ కల్యాణ్' ని ప్రస్తావిస్తూ ఓ డైలాగ్ ఉంది. 'రావణాసురుడి మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతే అనుకుంటారు' అని రావు రమేశ్ అంటే 'రావణాసురుడిని వాళ్ల ఆవిడ కూడా పవన్ కల్యాణ్ అనే అనుకుంటది' అనే డైలాగ్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

13:20 - May 3, 2016

విజయవాడ : ఏపీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థాన చలనం కలగనుంది. 10 శాఖలకు చెందిన 15 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్ లను బదిలీ చేసేందుకు సీఎం చంద్రబాబు ఫైల్ పై సంతకం చేసినట్లు సమాచారం. జూన్ లో రెండో విడుతలో మరో 15 మంది అధికారులను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముగిసిన టిడిపి పొలిట్ బ్యూరో..

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. తిరుపతిలో 27,28,29 తేదీల్లో మహనాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

 

13:12 - May 3, 2016

విజయవాడ : ఈ నెల 27,28,29 తేదీల్లో తిరుపతిలో టిడిపి మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. విజయవాడలో సీఎం చంద్రబాబు నివాసం లో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ భేటీలో టిడిపిలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వస్తున్న సమస్యలు, ప్రభుత్వం పార్టీ మధ్య ఉన్న విభేదాలు, రాష్ట్ర వ్యాప్తంగా కరువు పై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కమిటీని నియమించింది. ఈ కమిటీ జిల్లాల వారీ పర్యటనలు చేపట్టాలని.. దీని కోసం ఓ కార్యాచరణ ప్రటించాలని చర్చించారు. మహానాడులో చర్చించాల్సిన అంశాలు, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్ర నుండి నిధులు ఎలా రాబట్టాలో కూడా వీరి భేటీ లో చర్చించనట్లు సమాచారం.

వైసీపీ ధర్నా జరుగుతుంది - భూమన..

హైదరాబాద్ : ఈనెల 16,17,18వ తేదీల్లో వైసీపీ కర్నూలులో ధర్నా చేసి తీరుతుందని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెనక్కి తగ్గేది లేదని, సమస్యలపై గళం విప్పుతున్న కారణంగానే సీఎం బాబు మేల్కొంటున్నారని తెలిపారు. 

కేరళ 'నిర్భయ' ఘటనలో ఇద్దరు అరెస్టు..

కేరళ : ఎర్నాకులంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. 

బెంగళూరులో బీజేపీ ఆందోళన..

బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఆస్తి పన్ను పెంచడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 

కొనసాగుతున్న టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం..

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. కేంద్రంతో అనుసరించాల్సిన విధానం..మహానాడు నిర్వాహణ..తీర్మానాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

కరవుపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదం - మంత్రి కొల్లు రవీంద్ర..

విజయవాడ : కరవుపై వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. జగన్ కరవు యాత్రలు చేపట్టడం శోచనీయమన్నారు. 

12:33 - May 3, 2016

ఢిల్లీ : టీమిండియా టెస్ట్ కెప్టెన్, టీ-20 క్రికెట్ ప్రపంచ నెంబర్ వన్ విరాట్ కొహ్లీ పేరును..దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కు...భారత క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాదికాలంగా వివిధ ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న విరాట్ కొహ్లీ..దేశంలోని కోట్లాదిమంది యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే అర్జున అవార్డు అందుకొన్న కొహ్లీ...రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం సైతం అందుకొంటే..దేశంలోని అత్యున్నత క్రీడాపురస్కారాలన్నీ అందుకొన్నట్లవుతుంది. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రమే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం అందుకొన్న సంగతి తెలిసిందే...

12:32 - May 3, 2016

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంలో విచారణ రేపటికి వాయిదా పడింది. బలనిరూపణపై ఆలోచించాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. విచారణ రేపటికి వాయిదా పడింది.

12:31 - May 3, 2016

హైదరాబాద్ : నగరంలోని కోఠి గవర్నమెంట్‌ మెటర్నటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం ఆమె మృతిచెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె, కడుపులోని బిడ్డ మృతిచెందారని తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

 

12:29 - May 3, 2016

హైదరాబాద్: దిలాబాద్‌ అడవుల్లో అలజడి మొదలైంది. కొన్ని నెలల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న కొండ కోనల్లో కలకలం రేగుతోంది. ఏడాది నుంచి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులకు కంటి మీద కునుకుండడం లేదు. ఆ కలవరానికి కారణం మావోయిస్టులే.. గత వేసవి కాలాల్లో దండకారణ్యం నుంచి బయటకు రాని మావోయిస్టులు ఇప్పుడు డైరెక్ట్‌గా సవాళ్లు విసురుతున్నారు. అసలు అదిలాబాద్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది.? అక్కడ మళ్లీ మావోయిస్టుల ప్రాబల్యం పెరగడానికి గల కారణాలేంటి.?

ఏడాది కాలంగా తమ ఉనికిని చాటుకోవడానికి ...

తెలంగాణలో మళ్లీ మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా తమ ఉనికిని చాటుకోవడానికి యత్నిస్తూనే ఉన్నారు. దండకారణ్యం నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతూ మైదాన ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నారు.

అదిలాబాద్‌ జిల్లాలో వారి ఉనికిని చాటుకుంటున్నారు....

ఒకనాటి మావోయిస్టుల స్థావరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల నుంచి కాకుండా అదిలాబాద్‌ జిల్లాలో వారి ఉనికిని చాటుకుంటున్నారు. గత 15 రోజులుగా జిల్లా సరిహద్దులోకి వచ్చి వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంచిపెడుతున్నారు. ఓపెన్‌ కాస్ట్ మైనింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వద్ద రెక్కీ నిర్వహించడమేగాక ఏకంగా పొక్లెయినర్‌ను కాల్చేశారు. మందమర్రికి దగ్గరల్లోని గూడెంలో 30 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇలా వరుస సంఘటనలతో పోలీసులకు సవాలు విసురుతున్నారు.

మహారాష్ట్ర నుంచి నిర్భయంగా జిల్లాలోకి ప్రవేశిస్తూ దాడులకు...

ఎండాకాలంలో మావోయిస్టులు దండకారణ్యం దాటి బయటకు వచ్చేవారు కాదు. తాగునీటి ఇబ్బందులతోపాటు అడవులు పల్చగా మారడం... వేసవిలో కూంబింగ్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉండడంతో దట్టమైన అడవుల్లోనే మకాం వేస్తారు. అలాంటిది ఈసారి మహారాష్ట్ర నుంచి నిర్భయంగా జిల్లాలోకి ప్రవేశిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఒకపక్క పోలీసులు కూంబింగ్ చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బండి ప్రకాశ్ కోసం ఏడాదిగా కూంబింగ్ చేస్తున్నా పట్టుబడడం లేదు. మందమర్రి అడవుల్లో, నెన్నెల్లో రెండు సార్లు జరిగిన ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు. ఇదే సమయంలో వలస కుటుంబాల రూపంలో మావోయిస్టులు అదిలాబాద్‌కు చేరుకుంటూ కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు.

మే 4, 5 తేదీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ...

మే 4, 5 తేదీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో అదిలాబాద్‌ జిల్లాలో పోలీసులు కూబింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. ఏజెన్సీ ఏరియాల్లో బూట్ల చప్పుల్లు పెరిగిపోయాయి. ఎస్పీ తరుణ్ జోషి... జిల్లా ఇన్‌చార్జ్‌ బండి ప్రకాశ్‌ అరెస్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడవులను జల్లడ పట్టిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆదివాసీ గూడేలు వణికిపోతున్నాయి. పోలీసులు మాత్రం మావోయిస్టులను ఏరిపారేయాలని కంకణం కట్టుకుని దండకారణ్యంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. 

కేరళలో నిర్భయ ఘటనపై మహిళల ఆందోళన..

త్రివేండ్రం : కేరళలో 30 ఏళ్ల దళిత మహిళపై జరిగిన అమానుషంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ సచివాలయం ఎదుట మహిళల హక్కుల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. న్యాయ విద్యను అభ్యసించే బాధితురాలిపై ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. 

ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలనపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బలనిరూపణపై ఆలోచించాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. విచారణనను రేపటికి వాయిదా వేసింది. 

ఎస్పీ త్యాగి బంధువుకు ఈడీ సమన్లు..

ఢిల్లీ : ఆగస్టా స్కాంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి బంధువు సంజీవ్ త్యాగీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

భూమా, శిల్పా బ్రదర్స్ మధ్య విబేధాలు లేవు - అచ్చెన్నాయుడు..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడితో కర్నూలు జిల్లా టిడిపి నేతల భేటీ ముగిసింది. భూమా నాగిరెడ్డి, శిల్పా సోదరుల మధ్య విబేధాలు తొలగిపోయాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. భూమా, శిల్పా సోదరులు కలిసి పనిచేస్తారని తెలిపారు. 

ఏపీకి అన్యాయం జరుగుతుందనడం విడ్డూరం - ఎంపీ సీతారాం నాయక్..

ఢిల్లీ : తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందనడం సీఎం చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, వరదనీటిని వాడుకోవాలన్నదే సీఎం ప్రయత్నమన్నారు. తమ వాట నీటిని మాత్రమే వాడుకోవడం జరుగుతుందని, సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే వాటిని అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఇతరుల నీరు తమకవసరం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీరు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఏర్పడిందన్నారు. 

ఖేల్ రత్న రేసులో కొహ్లీ..

ఢిల్లీ : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు కొహ్లీ పేరును బీసీసీఐ సిఫార్సు చేసింది. భారత టెస్ట్ కెప్టెన్ గా కొహ్లీ సేవలందిస్తున్నారు. 2016 టీ 20 ప్రపంచకప్ అత్యుత్తమ ప్లేయర్ గా నిలిచారు. 

జగన్ పై మంత్రి ఉమ విమర్శలు..

పశ్చిమగోదావరి : దొంగలు పడిన ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టు జగన్ తీరు ఉందని, ఉత్తర కుమారిడిలా జగన్ ప్రగల్భాలు పలకడం మానుకోవాలని మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. పేదవేగి మండలం జానంపేట దగ్గర తమ్మిలేరు ఆక్విడెక్ట్‌ పనులను మంత్రి ఉమ పరిశీలించారు. 

11:52 - May 3, 2016

దంపతుల మధ్య గొడవలు..ప్రేమ వ్యవహారం..ఆర్థిక సమస్యలు..మధ్యలోనే ముగిసిపోతున్న నూరేళ్ల జీవితం..
అహం..ఆవేశం..క్షణికానందం..ఇవే మనిషి మనుగడను శాసిస్తున్నాయి..చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేజేతులార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జీవితమంటే పూలపాన్పు కాదన్న నగ్నసత్యం గ్రహించలేకపోతున్నారు. ఎలాంటి వారికైనా ఆటుపోట్లు తప్పవని తెలుసుకోలేక పోతున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇలాగే నల్లగొండ జిల్లాలో తల్లి బిడ్డల ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది. విషాదకరమైన ఈ ఘటనలకు సంబంధించిన వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:51 - May 3, 2016

బెజవాడలో మొదలైన కాల్ మనీ దురాగాతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాధితుల ఆర్తనాదాలు హోరెత్తుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఓ హోం గార్డు ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. కాల్ మనీ వేధింపులకు సాక్షాత్తూ పోలీసులే హఢలెత్తిపోతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. డబ్బులు కట్టినా పత్రాలు ఇవ్వలేదు..తిరిగి కోర్టులో కేసులు వేశారు..3 లక్షలు చెల్లించినా అరాచకం ఆగలేదు.. ఆంజనేయులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోం గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆంజనేయులు తండ్రి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కాలాంతకుల ధనదాహం తీరలేదు. ఈ దిగులుతోనే ఆంజనేయులు తండ్రి ఇటీవలే కన్నుమూశాడు. తనఖా పత్రాలు ఇవ్వకుండా వడ్డీ వ్యాపారులు వేధించడం ప్రారంభించారు. అధిక వడ్డీ చెల్లించాలంటూ పదే పదే ఫోన్లు చేసి విసిగించారు. కోర్టులో కేసులు పెట్టడంతో మూడు లక్షల రూపాయలు చెల్లించాడు. ఇంకా డబ్బులు కావడంతో మనస్థాపానికి గురైన హోం గార్డు ప్రజావాణిలో కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టరేట్ కు వినతిపత్రం ఇచ్చి కుప్పకూలిపోయాడు. పురుగుల మందు సేవించానని చెప్పడంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి. 

11:40 - May 3, 2016

హైదరాబాద్ : పవర్‌ ప్యాకెడ్‌, స్టార్‌ స్టడ్డెడ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ జట్టుకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రాయల్‌ చాలెంజర్స్ జట్టుకు మరో హీరోయిన్‌ ఫిదా అయిపోయింది. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌, కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ శృతి హాసన్‌ కొహ్లీ అండ్‌ కోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

అధిక ధరలకు మద్యం అమ్మితే కఠిన చర్యలు - మంత్రి కొల్లు రవీంద్ర..

విజయవాడ : అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరిపితే ఊరుకొనేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఎమ్మార్పీ ధరలకు అమలు చేయని వైన్ షాపుల లైసెన్స్ లను రద్దు చేస్తామని హెచ్చరించారు. 

11:38 - May 3, 2016

హైదరాబాద్ : ఖమ్మంలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ను వెంటనే నిలిపివేయాలంటూ మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వనరుల్ని దోచిపెడుతూ వాటికి ఊడిగం చేస్తున్నాయంటూ మావోయిస్టులు మండిపడ్డారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న కుటిల రాజకీయాలను వ్యతిరేకిస్తూ మే 4న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా మావోయిస్టు కమిటీ పిలుపునిచ్చింది. 

11:37 - May 3, 2016

హైదరాబాద్‌ : నగర ప్రజలు దాహం దాహం అని అల్లాడుతున్నారు. గొంతు తడిపే నాధుడెవరని ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వాటర్ మాఫియా రెచ్చిపోతోంది. జలగల్లా భూమిలోని నీటిని పీల్చేస్తున్నారు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుంటున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. నగరశివార్లలో విచ్చలవిడిగా ఉన్న బోరుబావుల దందాపై 10టీవీ ప్రత్యేక కథనం..

గత మూడేళ్లుగా లేని వర్షాలు...

గత మూడేళ్లుగా హైదరాబాద్‌లో వానలు లేకపోవడంతో నదులు,చెరువులు,కుంటలు అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క నీటి కోసం ఎంతో కష్టపడాల్సి వస్తోంది. నగర శివార్లలో వారం పదిరోజులకోసారి తాగునీరు అందుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనినే ఆసరాచేసుకుని వాటర్ మాఫియా రెచ్చిపోతోంది. శివారు ప్రాంతంలో పాతాళం లోతులోని జలాలను సైతం తోడేస్తున్నారు. గోల్కొండ నార్సింగ్ పరిథిలో గల వన్ మోర్ నగర్‌ నుంచి నిత్యం వందల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లు ద్వారా లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ కాలనీ దగ్గర్లో నెక్నాంపూర్ చెరువు ఉండడంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే పదుల సంఖ్యలో బోర్లు వేసి నీటిని తోడేస్తుండడంతో చెరువు ఎండిపోతోంది. నగరంలో నీటి కొరత బాగా ఉండడంతో 5వేల లీటర్ల ట్యాంకర్‌కు 1000 రూపాయల నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నారు.

వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి .....

ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు మాత్రం చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి డజన్ల కొద్ది బోర్లు వేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదంటున్నారు స్థానికులు. అయితే ఇందుకు ప్రధాన కారణం రాజకీయ నేతల ఒత్తిళ్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.. స్థానిక ఎమ్మెల్యే అండతోనే బోర్లను యధేచ్ఛగా వేస్తున్నారని సమాచారం. తాము మాత్రం బోర్లు సీజీ చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు.

వాటర్ మాఫియా మాత్రం విచ్చలవిడిగా బోరులు వేసి...

గ్రేటర్‌లో నీరందక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటర్ మాఫియా మాత్రం విచ్చలవిడిగా బోరులు వేసి నీటిని వ్యాపారం చేసుకుంటూ పబ్బం గడుపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం,అధికారులు వెంటనే స్పందించి వాటర్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసి నీటి కష్టాలను తీర్చాలని నగరవాసులు కోరుతున్నారు

11:35 - May 3, 2016

విజయవాడ : సోమవారం కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వర్షం రైతులకు నష్టాన్ని తీసుకొచ్చింది. ఇలా అకాల వర్షాలు రైతుల కంట కన్నీరు తీసుకొచ్చాయి.

అనంతపురంలో వడగళ్ల వర్షం...

సోమవారం కురిసిన అకాల వర్షం అనంతపురం జిల్లాలో బీభత్సం సృష్టించింది. పుట్టపర్తి మండలం వెంగళ్ల చెరువు గ్రామంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో వడగళ్ల వర్షానికి సుమారుగా 200 ఎకరాల్లో చేతికి వచ్చిన పంట తడిసి ముద్దై నెలకోరింది. ఒకవైపు కోసి కుప్పపోసిన వరిధాన్యం, మరోకవైపు కోసి ఆరబెట్టి వరి పైరు మొత్తం వర్షానికి తడిసి ఎందుకుపనికి రాకుండా పోయింది. చేతికి వచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

తంగేడు కుంటలో పిడుగుపాటుకు బాలుడి మృతి.....

అనంతపురం జిల్లాలో జరిగిన మరో ఘటన ఓ కుటుంబలో విషాదం నింపింది. ఓ.డి చెరువు మడంలం తంగేడు కుంట గ్రామంలో పిడుగు పడి అక్బర్ హుస్సెన్ అనే బాలుడు మృతిచెందాడు. మరో వైపు నెల్లూరు జిల్లాలో ఎండల ధాటికి వడగాలులతో పాటు సుడిగాలి తోడయ్యింది. ఆర్.ఎస్.ఆర్ స్కూల్ గ్రౌండ్స్ లో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా సుడిగాలి వచ్చింది. దాదాపు మూడు అంతస్ధుల మేర గాలీ వీస్తూ సుడిగుండంలా తిరిగింది. దీంతో స్ధానికులు కోంత భయాందోళనకు గురయ్యారు. 

11:32 - May 3, 2016

సాఫ్ట్ వేర్ ఉద్యోగం..లండన్ లో జాబ్..ఇదే తనకు అత్యంత అసెట్ అని అనుకున్నాడు. లక్షలకు లక్షలు కట్నం తీసుకోవాలని ఆశ పడ్డాడు. తాను అనుకున్నది నిజం చేసుకోవడానికి ఓ లవ్ స్టోరీ క్రియేట్ చేశాడు. అద్దెకు అమ్మానాన్నలను తీసుకొచ్చి తతంగం అంతా నడిపించాడు. లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసేసుకున్నాడు. మూడు రోజుల ముచ్చట తీర్చుకుని ఫ్లైట్ ఎక్కి చెక్కేశాడు.
లగ్జరీ బిల్డింగ్ చూపించాడు..కోట్ల ఆస్తులున్నట్లు నమ్మించాడు..నకిలీ అమ్మానాన్నలతో బిల్డప్ ఇచ్చాడు...ఆ మోసగాడే శ్రావణ్ కుమార్..ఇతను ఎల్ బినగర్ నివాసి. లండన్ లో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. అప్పటికే పెళ్లి అయి విడాకులు తీసుకున్న వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంతికి మ్యాట్రిమోని వెబ్ సైట్ ద్వారా శ్రావణ్ కుమార్ పరిచయమయ్యాడు. ఈమెను ప్రేమ పేరిట మగ్గులోకి దించాడు. లక్షలకు లక్షలు కట్నం తీసుకున్నాడు. 2015 ఆగస్టు 6వ తేదీన వివాహం చేసుకున్నాడు. అనంతరం ఫ్లైట్ ఎక్కి చెక్కేశాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు రోదిస్తోంది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:32 - May 3, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నాయి.. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. ప్రచారం జాస్తి-పనులు నాస్తి అన్న చందంగా సర్కారు తీరు సాగుతోంది. మజ్జిగ కేంద్రాల ఏర్పాటు అంశం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.

మజ్జిగ పథకానికి రూ.40 కోట్ల నిధులు

ఆంధ్రప్రదేశ్‌లో వడగాలులు, ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు తామున్నామని చంద్రబాబు సర్కార్ భరోసా ఇచ్చింది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల దాహం తీర్చేందుకు ప్రతి జిల్లాలోనూ మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చింది. దీనికోసం జిల్లాకు ఓ మూడు కోట్ల రూపాయలు చొప్పున దాదాపు 40 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఈ పథకం అస్మదీయుల జేబులు నింపేందుకే తప్ప.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడడం లేదు. కాకినాడలో మజ్జిగ పథకం అమలు తీరుచూస్తే.. క్షేత్రస్థాయి వాస్తవం తెలుస్తుంది.

కాకినాడలో మజ్జిగ సరఫరా కోసం రూ 3 కోట్లు...

ఇక్కడ చూస్తున్నారు కదా...ఇవన్నీ కాకినాడలో సర్కార్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు.. ఎండల ధాటికి అల్లాడిపోయే వారికి కాస్త గొంతు తడిపే ప్రయత్నంలో భాగంగా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మజ్జిగనూ సరఫరా చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఆచరణలో ఎక్కడా మజ్జిగ కానరాని పరిస్థితి. పోనీ ఆ కాసిన్ని నీళ్లయినా.. అవసరమైన చోట్ల పోస్తున్నారా అంటే అదీ లేదు. కాకినాడ జిల్లా కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి బయట ఒక్క చలివేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదు. జిల్లా పరిషత్ కార్యాలయంలో కూడా చలివేంద్రం కనిపించదు. అన్ని ప్రభుత్వ శాఖలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సర్కారు ఆదేశాలు ఏమేరకు అమలవుతున్నాయో వీటిని బట్టే అర్థమవుతుంది.

చలివేంద్రాల్లోనూ మంచినీళ్లే...

ఇక మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లోనూ మంచినీళ్లే అందిస్తున్నారు. మజ్జిగ ఇవ్వాలి కదా...అని అడిగితే అక్కడున్న సిబ్బంది తమకేమీ తెలియదంటూ సమాధానమిస్తున్నారు. ఇదీ కాకినాడలో సర్కారు మజ్జిగ హామీ అమలు తీరు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా హామీని నిలుపుకుంటుందో లేదో చూడాలి. 

11:29 - May 3, 2016

హైదరాబాద్ : మన భూమిలాగే ఇంకా ఏవైనా గ్రహాలపై జీవ జాలం ఉందా.? ఈ దిశగా శాస్త్రవేత్తలు జరుపుతున్న నిరంతర పరిశోధనలు ఫలించాయి. సూర్య మండలానికి సుదూరంలో ఉన్న ఓ నక్షత్రం చుట్టూ మూడు గ్రహాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి. వాటిపై జీవజాలం మనగలిగే అవకాశాలు సమృద్ధిగా ఉన్నట్లు శాస్త్రజ్ఙులు గుర్తించారు. బెల్జియం దేశానికి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో ఆ మూడు గ్రహాల ఆచూకీ తెలిసింది. ఉష్ణోగ్రత తీవ్రత అంతగా లేని ఓ కుబ్జ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలను గుర్తించడం ఇదే మొదటిసారి. నాసా స్పిట్జర్‌ స్పేస్‌ టెలిస్కోప్ సాయంతో వీటిని తెలుసుకోగలిగారు. వీరి పరిశోధనకు వచ్చే వారం అతిపెద్ద హబుల్‌ టెలిస్కోప్‌ జతకూడుతుంది. ట్రాపిస్ట్ వన్ స్టార్‌గా పిలువబడుతున్న ఆ నక్షత్రం చుట్టూ మొదటి రెండు గ్రహాలు పరిభ్రమించడానికి రెండున్నర రోజుల టైం తీసుకుంటున్నాయి. అయితే భూమితో పోల్చుకుంటే ఆ రెండూ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ గ్రహాలపై మరిన్ని పరిశోధనలు చేసి అక్కడ జీవం ఉందా ఉంటే ఏ రీతిలో ఉంది అనే దిశగా పరిశోధనలు జరపనున్నారు. అయితే ఫ్యూచర్‌లో వాటిపైకి చేరడం అంత సులువేమీ కాదు. భూ మండలానికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహాలు ఉన్నాయి. 

11:25 - May 3, 2016

హైదరాబాద్ : దేశం నిరుద్యోగ భారతంగా మారిపోతోంది. ఇప్పటికే దేశంలో 16 కోట్ల మంది ఉపాధి లేక అలమటిస్తున్నారు. వచ్చే 35 ఏళ్లలో మరో 28 కోట్ల మంది నిరుద్యోగులు తయారు కానున్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో.. యువతరం.. దృక్పథాన్ని మార్చుకుంటోంది. స్వయం ఉపాధి, స్టార్టప్‌ల ఏర్పాటుపై దృష్టి సారిస్తోంది. రిస్కే అయినా.. సొంతకాళ్లపై నిలబడేందుకే యువత ఆసక్తిని కనబరుస్తోంది.

పని చేయగలిగిన వారి సంఖ్య 30 కోట్లు ఉంటే..

దేశ నిరుద్యోగితకు ఈ గణాంకాలే ఉదాహరణ. 1991-2013 సంవత్సరాల మధ్య కాలంలో దేశంలో... పని చేయగలిగిన వారి సంఖ్య 30 కోట్లు ఉంటే.. అందులో 14 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. మిగిలిన 16 కోట్ల మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. వచ్చే 35 ఏళ్లలో దేశంలో పని చేయగలిగిన వారి సంఖ్య మరో 28 కోట్లు పెరగనుంది. ఇందులో ఓ ఎనిమిది కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికినా.. 2050 నాటికి దేశంలో ఎలా చూసుకున్నా.. సుమారు 40 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది సాక్షాత్తు.. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం- యుఎన్‌డిపి వెల్లడించిన కఠిన వాస్తవం.

సంఘటిత రంగంలో పెరగని ఉద్యోగావకాశాలు

కాంట్రాక్ట్‌ సిబ్బందితో ప్రభుత్వ పోస్టుల భర్తీ.....

ప్రస్తుతం దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో ఎక్కడా స్థానికులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి. గడచిన పాతికేళ్లలో సంఘటిత రంగంలో ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం పెరగలేదు. పైగా రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం కూడా చాలా ఉద్యోగాలను కాంట్రాక్ట్‌ సిబ్బందితో నింపేస్తోంది. దీంతో దేశంలో నిరుద్యోగిత గణనీయంగా పెరుగుతూ పోతోంది.

ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి, స్టార్టప్‌ల దిశగా యువత దృష్టి.....

విఓ 3: సర్కారీ కొలువులే కాదు.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్న ప్రస్తుతం తరుణంలో.. యువత స్వయం ఉపాధి, స్టార్టప్‌ల దిశగా దృష్టి సారిస్తోంది. రిస్క్‌ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ నవతరం.. సొంతకాళ్లపై నిలబడ్డమే మేలన్న భావనకు వస్తోంది. ప్రముఖ మ్యూజిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ ఎం-టీవీ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎంటీవీ మెనీ మీ ప్రాజెక్ట్.. దేశంలోని 50 నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. పదమూడేళ్ల నుంచి 25 ఏళ్ల లోపున్న దాదాపు 11వేల మంది యువతీయువకులను ప్రశ్నించగా... 81 శాతం మంది ఏదో ఓ కంపెనీలో కొలువు చేయడం కన్నా.. సొంతంగా ఏదైనా సంస్థను ప్రారంభించడమో.. స్వయం ఉపాధి కల్పించుకోవడమో చేయాలని అభిలషిస్తున్నట్లు చెప్పారు.

2014లో స్టార్టప్‌ల యోచన చేసిన 67 శాతం యువత.....

ఎంటీవీ, 2014లోనూ ఇదే తరహాలో సర్వే నిర్వహించింది. అప్పట్లో 67 శాతం మంది మాత్రమే స్వయం ఉపాధి దిశగా ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా 81 శాతం యువత స్టార్టప్‌ల గురించి ఆలోచిస్తోంది. దీన్ని బట్టి దేశంలో ఉద్యోగావకాశాలు ఏస్థాయిలో తగ్గుతున్నాయో.. అవి యువత ఆలోచన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతోంది. తమకున్న అతి తక్కువ వనరులతోనే.. రిస్క్‌ శాతం అత్యధికమని తెలిసీ యువత, స్వయం ఉపాధి మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి.. యువతకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మాల్యా రాజీనామాపై రాజ్యసభ ఛైర్మన్ దే నిర్ణయం - కరణ్ సింగ్..

ఢిల్లీ : విజయ్ మాల్యా రాజ్యసభకు రాజీనామా చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ కు లెటర్ పంపించారని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ డా.కరణ్ సింగ్ వెల్లడించారు. రాజీనామా ఆమోదంపై రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని, ఇది తన పని కాదని తెలిపారు. 

11:17 - May 3, 2016

బెంగళూరు..భారత దేశపు సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరు ప్రధానంగా అనేక సాఫ్ట్ వేర్ సంస్థలకు నిలయం. ఇక్కడ వివిధ రాష్ట్రాలు..వివిధ దేశాలకు చెందిన వారు ఇక్కడ పనులు చేస్తుంటారు. కానీ ఈ బెంగళూరు పై ఓ సంచలన నివేదిక బహిర్గతమైంది. వచ్చే ఐదు సంవత్సరాల్లో మానవ నివాసానికి వీల్లేని నగరంగా రూపాంతరం చెందుతుందంట. దేశంలోనే బెస్ట్ ఇనిస్టిట్యూట్ గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్పీ)ఈ సంచలన నివేదిక వెలువరించింది. అధ్యయనం ప్రకారం..
గడిచిన 40 సంవత్సరాల్లో బెంగళూరులో నివాస ప్రాంతాలు 525 శాతం పెరిగిపోయాయి.

  • ఒకనాడు గ్రీన్ సిటీగా పేరున్న నగరంలో ఇప్పుడు 78 శాతం వృక్ష జాతి అంతరించింది.
  • చల్లగా ఉండే వాతావరణం రికార్డు స్థాయి వేడికి పెరిగింది.
  • అంతేగాకుండా నగరంలోని నీటి వనరుల్లో 79 శాతం కరిగిపోయాయి.
  • ఇటీవలి కాలం వరకూ సహజ వాయువులతో నిండిన నగరం, ఇప్పుడు విషపూరిత కాలుష్యాలతో నిండిపోయింది.
  • పట్టణీకరణ కారణంగా చెరువులు, చెట్లు కనుమరుగయ్యాయి.
  • 25 ఏళ్లలో నగర జనాభా 40 లక్షల నుండి కోటికి పైగా చేరింది. 

రెండో రోజు త్యాగిని ప్రశ్నించనున్న సీబీఐ..

ఢిల్లీ : మాజీ ఐఏఎఫ్ చీఫ్ ఎస్పీ త్యాగి సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఆయన్ను రెండో రోజు సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. 

ఖమ్మంలో మావోయిస్టుల కలకలం..

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ ను నిలుపుదల చేయాలని, మే 4వ తేదీన బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. 

కోఠి మెటర్నటి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : కోఠి మెటర్నటి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక గర్భిణీ మృతి చెందింది. 

ప్రైవేటు స్కూల్ కు బాంబు బెదిరింపు..

గజియాబాద్ : పటేల్ నగర్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ ప్రదేశంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మధ్యప్రదేశ్ లో లోకాయుక్త పోలీసుల దాడులు..

మధ్యప్రదేశ్ : ఇండోర్ లోని పీడబ్ల్యూడీ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజేంద్ర శర్మ నివాసంపై లోకాయుక్త పోలీసులు దాడులు చేశారు. సోదాలు కొనసాగుతున్నాయి.

పార్లమెంట్ లో ఆగస్టాపై చర్చ..తేదీలు ఖరారు..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో 'ఆగస్టా వెస్ట్ ల్యాండ్' రగడ సృష్టిస్తోంది. దీనిపై చర్చించాలంటూ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. మే 4వ తేదీన రాజ్యసభలో...మే 6వ తేదీన లోక్ సభలో చర్చ ఉంటుందని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ వెల్లడించారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. 180 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

తెలంగాణ ఐకాస అధ్యయన యాత్ర ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన ఉపరిత బొగ్గు గనుల అధ్యయన యాత్ర ప్రారంభమైంది. అల్వాల్ లోని తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహానికి ఐకాస ఛైర్మన్ కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించి యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా శ్రీరాంపూర్ బయలుదేరుతారు. ఉపరితల బొగ్గు గనుల్లో వెలికితీసే విధానాన్ని పరిశీలిస్తారు. అనంతరం మందమర్రి, ఎర్రగుంటపల్లిలో భూ నిర్వాసితులు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధితులను కలిసి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతారు. 

10:21 - May 3, 2016

అమితాబ్‌ బచ్చన్‌, విద్యా బాలన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్ర ధారులుగా నటిస్తున్న చిత్రం 'తీన్‌'. రిభు దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మెయిన్‌ క్యారెక్టర్స్‌ ఫస్ట్‌లుక్‌లు విడుదలయ్యాయి. బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ శనివారం తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వీటిని పోస్ట్‌ చేశారు. అమితాబ్‌ స్కూటర్‌ని డ్రైవ్‌ చేస్తుండగా ఒకటి, నవాజుద్దీన్‌ బైక్‌ను డ్రైవ్‌ చేస్తున్నట్లుగా ఇంకొకటి, అమితాబ్‌తో విద్యాబాలన్‌ ముచ్చటిస్తున్నట్టుగా ఈ ఫొటోలున్నాయి. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ప్రచార చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా నవాజుద్దీన్‌ సిద్దిఖీ మాట్లాడుతూ,'సాఫీగా సాగిపోతున్న ఓ ముగ్గురి జీవితాల్ని మార్చేసిన కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది' అని చెప్పారు. కోల్‌కతా నేపథ్యంలో జరిగిన ఓ క్రైమ్‌ కారణంగా ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్‌ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ఈ చిత్రంతోపాటు 'పింక్‌'లో నటిస్తుండగా, విద్యాబాలన్‌ 'ఏక్‌ అల్బెలా', 'కహానీ 2' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 

10:20 - May 3, 2016

''రైట్‌ రైట్‌' నా కెరీర్‌లో ఒక భిన్నమైన చిత్రంగా నిలిచిపోతుంద'ని అంటున్నారు హీరో సుమంత్‌ అశ్విన్‌. ఆయన హీరోగా, పూజా జవేరి హీరోయిన్‌గా మను దర్శకత్వంలో వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'రైట్‌ రైట్‌'. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి హీరో సుమంత్‌ అశ్విన్‌ మాట్లాడుతూ, 'అందరూ స్టయిలిష్‌ సినిమాలకు ప్రాధాన్యమిస్తుంటే నేను సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాను ఎంచుకున్నప్పుడు రిస్క్‌ చేస్తున్నాననిపించింది. 'దృశ్యం', 'ఊపిరి', 'క్షణం' లాంటి డిఫరెంట్‌ జోనర్‌ చిత్రాలు హిట్‌ కావడంతో నా ఎంపిక సరైనదేనన్న నమ్మకం కల్గింది. ఇటీవలే ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా 'అల్లిబిల్లి చెక్కిలి గిల్లి' పాట పూర్తి విడియో సాంగ్‌ను విడుదల చేశాం. సినిమా రిలీజ్‌కు ముందే పూర్తి పాటను యూట్యూబ్‌లో పెట్టడం నిజంగా సాహసమే. పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' పాటలతో దీన్ని పోలుస్తున్నారు. మే 10న మా నాన్న ఎమ్మెస్‌ రాజు బర్త్‌డే సందర్భంగా మరో వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నాం. అందులో మేకింగ్‌ ఆఫ్‌ ది మూవీకి అధిక ప్రాధాన్యముంటుంది. అరకులోయలో ఈ చిత్రం షూటింగ్‌ జరిపాం. 'ఒక్కడు', 'వర్షం', మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి బ్లాక్‌బస్టర్స్‌ తీసిన లొకేషన్స్‌లో షూట్‌ చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 15న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

10:19 - May 3, 2016

'అన్ని సందర్భాల్లోనూ అవార్డులు రావాలని కోరుకోవడం కరెక్ట్‌ కాదు. నా విషయంలో పనే నాకు పెద్ద పురస్కారం..అవార్డుల కోసం జీవించన'ని చెబుతోంది బాలీవుడ్‌ నటి కల్కీ కొచ్లిన్‌. 'దేవ్‌డి' చిత్రంతో నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కల్కీ ఇటీవల 'మార్గరీటా విత్‌ స్ట్రా' చిత్రంలో మానసిక వికలాంగురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాదు స్పెషల్‌ జ్యూరీ విభాగంలో జాతీయ అవార్డుని సైతం దక్కించుకుంది. అవార్డుల గురించి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, 'సినిమాల్లో నటించేటప్పుడు అవార్డుల గురించి ఆలోచించను. ఎందుకంటే నాకు అవార్డులు సంతోషాన్ని, ఆశ్చర్యాన్నివ్వలేవు. నేను నటించిన సినిమాకు లేదా నాకు అవార్డు రాలేదని నిరాశ కూడా పడను. నేను సినిమా కోసం బతుకుతాను. నా పనే నాకు నిజమైన పురస్కారం. సినిమాల కోసం ఎక్కువగా వర్క్‌ చేశానంటే అదే నాకు బిగ్గెస్ట్‌ అవార్డుగా ఫీలవుతాను. నా సినిమా బాగా ఆడి నిర్మాతకు బాగా డబ్బు వస్తే మరింత ఆనంద పడతాను' అని చెప్పారు.

10:18 - May 3, 2016

విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ముగ్గురు కథానాయికలు శృతిహాసన్‌, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఈ చిత్రం టీజర్‌ను నేడు (మంగళవారం) సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో విశాల్‌ మాట్లాడుతూ,''ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో డిఫరెంట్‌ సినిమా అవుతుంది. డైరెక్టర్‌ ముత్తయ్య ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో నేను చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ చిత్రంలో నా గెటప్‌ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజారు చేసే అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి' అని అన్నారు. '
నేడు (మంగళవారం) ఉదయం పదిగంటలకు ముగ్గురు టాప్‌ హీరోయిన్‌లతో టీజర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏకకాలంలో ఓ సినిమా టీజర్‌ను ముగ్గురు స్టార్‌ హీరోయిన్లు సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేయడం ఇదే ప్రథమం. ఇటీవల రిలీజ్‌ చేసిన 'రాయుడు' ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విశాల్‌ కెరీర్‌లోనే చాలా డిఫరెంట్‌ ఫిల్మ్‌ అవుతుందన్న అప్రిషియేషన్‌ లభించింది. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మే 11న ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నాం. మే 20న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి' అని నిర్మాత, పంపిణీదారుడు హరి తెలిపారు.

10:17 - May 3, 2016

వివేక్‌ ఓబెరాయ్ ప్రధాన పాత్రధారిగా దాసరి కిరణ్‌ కుమార్‌ సమర్పణలో సి.ఆర్‌.మనోహర్‌ (ఎం.ఎల్‌.సి) నిర్మిస్తున్న చిత్రం 'రాయ్'. ఈ చిత్రానికి రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మే 1వ తేదీన బెంగుళూరు బిదాడిలో అభిమానుల మధ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనిట్‌ సభ్యులందరికీ ముత్తప్పరాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ''కోర్టులో ఒక్క మర్డర్‌ కేసు తేలడానికి 20 ఏండ్లు పడుతుంది. కానీ 20 మర్డర్‌ కేసుల్లోంచి 21 నెలల్లో బయట పడ్డాడు. 30 రూపాయలతో మొదలు పెట్టి, 30 ఏండ్ల క్రిమినల్‌ కెరీర్‌లో 30 వేల కోట్లు సంపాదించాడు. నేరస్థుడి భవిష్యత్‌ చీకటి అని చరిత్ర చెప్పింది సరైంది కాదని వెయ్యి సూర్యుల వెలుగు అని నిరూపించాడు. ఇన్ని నేరాలు చేసినప్పటికీ కోట్ల మంది అతడిని అభిమానిస్తున్నారు. అతడే 'రాయ్'. రియల్‌ గ్యాంగ్‌స్టర్‌ ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా 55 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రాన్ని లండన్‌, దుబాయ్, ముంబై, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం' అని దర్శక, నిర్మాతలు తెలిపారు.

ఢిల్లీలో డీజిల్ ట్యాక్సీ డ్రైవర్ల ధర్నా..

ఢిల్లీ : దేశ రాజధానిలోని మహిపల్పూర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. డీజిల్ ట్యాక్సీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. రాజధాని హస్తినలో డీజిల్ క్యాబ్‌లపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్య స్థాయిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 

10:10 - May 3, 2016

జుట్టుని ఆరోగ్యంగా ఎదిగేలా చేయడంతో పాటూ తగిన పోషణనందించే హెన్నాతో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. గోరింటాకు వెంట్రుకలకు సహజమైన నలుపుదనాన్ని అందిస్తుంది. రెండు కప్పుల గోరింటాకు పొడిలో అరకప్పు ఉసిరి పొడి, రెండు చెంచాల శీకాయ పొడి, ఒక గుడ్డులోని తెల్లసొన, రెండు చెంచాల నిమ్మరసం, చెంచా చొప్పున తులసి, మందార రేకల పొడీ కలిపి... మరిగించిన టీ డికాక్షన్‌ నీళ్లలో ముందురోజు నానబెట్టాలి. మర్నాడు ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని, గంట తరవాత స్నానం చేయాలి. ఇలాచేస్తే జుట్టుకి తగిన రంగు అంది... కుదుళ్ల నుంచీ వెంట్రుకలు బలంగా ఉండేందుకు వీటిలోని పోషకాలు సాయపడతాయి.
పోషకాల లేమి, కాలుష్యం ఇతర కారణాలతో కొన్నిసార్లు జుట్టు రాలిపోతుంటుంది. దీనికోసం ముందుగా అరకప్పు నువ్వుల నూనె మరిగించాలి. దానిలో ఐదుకప్పుల గోరింటాకు పొడిని వేసి మరో ఐదారు నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తరవాత చల్లారనిచ్చి, సీసాలో తీసుకుని భద్రపరుచుకుని ప్రతిరెండు రోజులకోసారి తలకు పట్టించి గంట తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
జుట్టుకి పోషణ తగ్గినప్పుడు పొడిబారి, కాంతివిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు హెన్నా కండీషనర్‌ ప్యాక్‌ చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం రెండు కప్పుల హెన్నా, అరకప్పు ఉసిరిక పొడి, పావుకప్పు మెంతుల్ని ముందురోజే రాత్రి పెరుగులో నానబెట్టి, మర్నాడు ఉదయం రుబ్బుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంటపాటు తలకు షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. ఆ తరవాత తలస్నానం చెయ్యాలి. జుట్టు మెత్తగా, మెరిసిపోతుంది.

09:57 - May 3, 2016

ఎంటీ 'గాలి'ని అమ్ముతారా ? చివరకు గాలిని కూడా అమ్మేయడానికి సిద్ధపడ్డారా ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. భారత్ లో త్వరలోనే 'కెనడా' గాలిని అమ్మనున్నారు. ఈ నెల చివరి వారంలో అందుబాటులోకి రానున్నట్లు టాక్. 'విటాలిటీ ఎయిర్' అనే ప్రైవేటు సంస్థ సహసిద్ధమైన గాలిని 3లీటర్లు, 8లీటర్ల డబ్బాలో విక్రయించనుంది. మరి ఈ గాలిని ఎలా పీలుస్తారు ? అనేగా మీ డౌట్..దీనికి మాస్క్ కూడా ఇస్తారు. దీని ధర సుమారు రూ. 2100 ఉంటుందని, ప్రతి శ్వాస వ్యయం రూ. 12.50 ఉంటుందని తెలుస్తోంది. ఢిల్లీలోని కెనడా హై కమిషన్ కు ఇప్పటికే వంద సీసాలు వచ్చాయని సమాచారం. అనుమతులన్నీ వచ్చాక ఆన్ లైన్ లో అమ్మకాలు ప్రారంభిస్తారట. అది విషయం. 

09:47 - May 3, 2016

విజయవాడ: ప్రభుత్వాస్పత్రులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. ఆ ప్రాణాలకు గ్యారంటీ లేకుండాపోయింది. చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు మృతి చెందిన విదారకర ఘటన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై కాంగ్రెస్‌, వామపక్ష నేతలు, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చీమలు కుట్టి నాలుగు రోజుల శిశువు మృతి....

విజయవాడ పాముల కాలువకు చెందిన లక్ష్మి.. పురిటి నొప్పులతో గురువారం రాత్రి పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెను చేర్చుకునేందుకు వైద్య సిబ్బంది నిరాకరించారు. చివరకు బ్రతిమిలాడితే ఆస్పత్రిలో చేర్చుకున్నారు. శుక్రవారం ఉదయం సిజేరియన్‌ చేయడంతో.. లక్ష్మి పండంటి బిడ్డను ప్రసవించింది. నాలుగు రోజులు బాగానే ఉన్న శిశువు.. సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. శిశువును చీమలు కుట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇదే విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చనిపోయాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపణ....

ఉదయం వరకు బాగానే ఉన్న శిశువు మృతి చెందడం వెనక సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక వైద్య సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు కాంగ్రెస్‌, వామపక్షాల నేతలతో పాటు.. ప్రజాసంఘాల నేతలు మద్దతిచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సొంత జిల్లా అయిన కృష్ణాజిల్లాలో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు.

అనారోగ్య సమస్యలతోనే చనిపోయాడన్న కలెక్టర్....

ఇదిలావుంటే.. ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్‌ శిశువు అనారోగ్య సమస్యలతోనే చనిపోయాడన్నారు. చీమలు కుట్టలేదని.. చనిపోయిన తర్వాత శిశువు మృతదేహాన్ని అప్పగిస్తే తీసుకెళ్లిన తండ్రి.. తరువాత వచ్చి ఆందోళన చేపట్టారన్నారు. ఆస్పత్రిలో గతంలో లంచాలు తీసుకుని శిక్షకు గురైన సిబ్బందే ఈ ఆందోళన వెనక వున్నారనే సమాచారం ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాస్పతుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఈసమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 

09:42 - May 3, 2016

హైదరాబాద్ : ఓట్ల కోసం డబ్బులు పంచే నాయకులు దొంగల్లా దోచుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నీ హీరో కమల్ హాసన్ ఓటేస్తారా? ఓటేయరా? మే 16న ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎలక్షన్‌ కమిషన్‌ చేసిన ట్వీట్‌ కు ఎలా స్పందించబోతున్నారు? ఇదే ఇప్పుడు సస్పెన్స్‌ గా మారింది.

ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ట్వీటిన ఈసీ....

తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి జయలలిత, కరుణానిధి, కెప్టెన్ విజయ్ కాంత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కమల్ హాసన్ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. శభాష్ నాయుడు సినిమా వ్యవహారాల్లో బిజీగా వుంటున్నారు. మే 16న తమిళనాడులో పోలింగ్ జరగబోతోంది. ఆ టైమ్ లో కమల్ హాసన్ చెన్నైలో వుండడం లేదు. శభాష్ నాయుడు సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నారు. కాబట్టి, ఓటేసే అవకాశం లేదంటూ ఆయన కొద్ది రోజుల క్రితం ఓపెన్ గానే చెప్పారు. అంత పెద్ద సెలబ్రిటీ ఓటేయకపోతే ఎలా అంటూ ఎలక్షన్ కమిషన్ కి బెంగ పట్టుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా కమల్ హాసన్ కి ఎలక్షన్ కమిషన్ అధికారులు అప్పీల్ చేశారు. డియర్ కమల్ హాసన్ మే 16న ఓటు హక్కు వినియోగించుకోండంటూ ఎలక్షన్ కమిషనర్ ట్వీట్ చేయడం విశేషం.

కమల్ హాసన్ కి 2009లో చేదు అనుభవం...

కమల్ హాసన్ కి 2009లో చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో ఓటరు లిస్టులో ఆయన పేరు మిస్సయ్యింది. ఈ విషయాన్ని మీడియాలో వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఆయన పేరును చేర్చి, ఓటరు ఐడీ కార్డు కూడా జారీ చేసింది. 2011, 2014 ఎన్నికల్లోనూ కమల్ హాసన్ ఓటేశారు. గత డిసెంబర్ చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తిన సమయంలో కమల్ హాసన్ ప్రభుత్వంపై ఆగ్రహం పట్టలేకపోయారు. వ్యవస్థ అంతా కొలాప్స్ అయ్యింది. మేం కడుతున్న టాక్స్ అంతా ఎక్కడికి పోతోందంటూ గట్టిగా నిలదీశారు. రెండు రోజుల క్రితమే డబ్బు తీసుకోని ఓటేయద్దంటూ ఓటర్లకు సూచించారు. డబ్బులతో ఓట్లు కొనుక్కునే నాయకులు దేశాన్ని దొంగల్లా దోచేసుకుంటారంటూ హెచ్చరించారు. అలాంటి కమల్ హాసన్ మరిప్పుడు ఓటేస్తారా. ఎలక్షన్ కమిషన్ అప్పీల్ ను మనిస్తారా? ఆ.. రాజకీయాలు నాకెందుకులే అనుకుని సినిమా షూటింగ్ లో గడిపేస్తారా? 

తాగునీటి కోసం మహిళల ఆందోళన..

ఖమ్మం : వైరా (మం) పినపాక వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. దీనితో ఖమ్మం - భద్రాచలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. 

09:40 - May 3, 2016

హైదరాబాద్ :అ...ఆ.. మూవీ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌,సమంత జంటగా తొలిసారి నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ నిన్న రాత్రే విడుదలైంది. మిక్కీజేమేయర్‌ మ్యూజిక్‌ అందించిన, ఈ చిత్రం పాటలు కూడా విడుదలయ్యాయి. అ..ఆ...మూవీ ఈనెలలోనే రిలీజ్ కానుంది. 

ఐపీఎల్ లో నేడు..

రాజ్ కోట్ : ఐపీఎల్ 9లో భాగంగా నేడు గుజరాత్ లయన్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు ఢీకొననున్నాయి. రాజ్ కోట్ వేదికగా రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడూ అక్కడక్కడ వర్షాలు..

హైదరాబాద్ : విదర్భ నుండి ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం కూడా ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

బాబు నివాసంలో శిల్పా బ్రదర్స్..

గుంటూరు : ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటి సీఎం కేఈ, మంత్రి అచ్చెన్నాయుడు, శిల్పా బ్రదర్స్ చేరుకున్నారు. కర్నూలు జిల్లా టిడిపిలో నెలకొన్న విబేధాలను బాబు పరిష్కరించనున్నారు.

 

వేములవాడలో బాలుడు అదృశ్యం..

కరీంనగర్ : వేములవాడ ఆలయ సమీపంలో బాలుడు అదృశ్యమయ్యాడు. నల్గొండ జిల్లా ఆలేరు నుండి వేములవాడకు ఓ కుటుంబం వచ్చింది. రాత్రి ఆలయ సమీపంలో బాలుడితో పాటు తల్లిదండ్రులు నిద్రించారు. ఉదయం బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు...

చిత్తూరు : పూతలపట్టు (మం) బండపల్లి రైల్వే గేటు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. 

హోటల్ లోకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు మృతి..

పశ్చిమగోదావరి : గణపవరం (మం) పిప్పర గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ లోకి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. తీవ్రగాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. 

09:06 - May 3, 2016

కరీంనగర్‌ :వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు నెలల బాబును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా ఆలేరు మండలం బొందుగుల గ్రామానికి చెందిన కనకవ్వ సోమవారం కుంటుంబసభ్యులతో కలిసి రాజన్న దర్శనం కోసం వేములవాడకు వచ్చారు. స్వామివారి దర్శనానంతరం కుటుంబసభ్యులు ఆలయ ఆవరణలోని ఓపెన్‌ స్లాబ్‌పై నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచేసరికి బాలుడు కనిపించకపోవడంతో కనకవ్వ కుటుంబసభ్యులు ఆలయంలో గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వేములవాడలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ వృద్ధురాలు తీసుకెలుతున్నట్లు తెలిసింది. ఆ వృద్ధురాలు స్థానికురాలు, వేరే ప్రాంతానికి చెందిన వృద్ధురాలా అనే వివరాలు సేకరిస్తున్నారు.

09:01 - May 3, 2016

హైదరాబాద్ : పాలనలో మార్పులు.. చేర్పులు.. చేసేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు. అందులో భాగంగా మంత్రుల నుంచి అధికారుల వరకు పలు మార్పులు చేయాలని సీఎం భావిస్తున్నారు. పాలేరు ఎన్నికల తర్వాత మంత్రి వర్గాన్ని పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. అదే సందర్భంలో ఉన్నతాధికారుల బదిలీలు సైతం చేపట్టనున్నారు.

రెండేళ్ల కాలంలో పలువురు మంత్రుల శాఖల మార్పు......

కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల మద్యకాలంలో పలువురి మంత్రిత్వశాఖలు మారాయి. అధికారులు కూడా మారారు. అయితే అది పెద్దగా ఉపయోగకరంగా లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో 3 సంవత్సరాలున్నా...ఈ ఏడాది ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది. ఈ ఏడాది పనులు ప్రారంభిస్తేనే వచ్చే సంవత్సరానికి పూర్తి అవుతాయి. అందుకే ఈ ఏడాదిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోంది.

పలువురు మంత్రులపై ఖాయంగా కనిపిస్తున్న వేటు...

అందులో భాగంగా పలువురు మంత్రులపై వేటు ఖాయంగా కనిపిస్తుంది. మొదటగా హోంమంత్రి నాయిని మారుస్తారని సమాచారం. ఆయనను రాజ్య సభకు పంపి..ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డిని మంత్రి వర్గంలోకీ తీసుకుంటారని తెలుస్తోంది. అదే సందర్భంలో జూపల్లి, పద్మారావు, తలసాని, జోగు రామన్న పదవులు ఊడోచ్చంటున్నారు. మరింత సమర్ధంగా మంత్రిత్వ బాధ్యతలను నిర్వర్తించి..ప్రభుత్వానికి మంచి పేరు తేచ్చే సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.

పేషి నుంచి శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు మార్పుకు ప్లాన్

ఇక అధికారులపై బదిలి వేటుపడనుంది. తన పేషి నుంచి శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను మార్చాలని భావిస్తున్నారు. ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టులైన మిషన్ కాకతీయ, భగీరధ, హరిత హరం వంటి సంక్షేమ పథకాలు అనుకున్నంత వేగంగా సాగటం లేదన్నది కేసీఆర్ మనోగతం.

స్మితా సబర్వాల్ , రాజశేఖర్ రెడ్డి పనితీరుపై అసంతృప్తి

సీనియర్ ఐఏఎస్ లను పక్కకు పెట్టి...ప్రయోగాత్మకంగా స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి వంటి వారిని నియమించినా ఆశించిన ఫలితాలు రాలేదని సీఎం భావిస్తున్నారు. అందుకే పేషిలోకి అనుభవజ్ఞులను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

08:55 - May 3, 2016

చెన్నై : తమిళనాడులో ఎన్నికల యుద్ధం తీవ్రమవుతోంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టి వస్తుండగా, ఎన్నికల కమిషన్ కూడా తన వంతు చర్యలు చేపడుతోంది. తళనాడు లో పోలింగ్ ముహూర్తం దగ్గరకొస్తోంది. ప్రచారానికి రెండు వారాల టైమే వుంది. మే 16న పోలింగ్ జరగబోతోంది. దీంతో జయలలిత సారధ్యంలోని ఏఐఏడిఎంకె , కరుణానిధి నాయకత్వంలో డిఎంకె, విజయ్ కాంత్ కెప్టెన్సీలోని పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ప్రచారాన్ని ఉధ్రుతం చేశాయి. ఒంటరిగా బరిలోకి దిగిన బిజెపి, డిఎంకెతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నాయి. ఏఐఏడిఎంకె అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ, అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్, డిఎంకెలు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల కమిషన్ పలువురు అధికారుల మీద బదిలీ వేటు వేసింది . ఏకంగా తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. పలువురు సీనియర్ పోలీసు అధికారులను ట్రాన్సఫర్ చేసింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ మీద కూడా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో అశుతోష్ శుక్లాను నియమించారు. అయితే ప్రతిపక్ష పార్టీల మాటల నమ్మి, ఎలక్షన్ కమిషన్ బదిలీ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు ఏఐఏడిఎంకె నేతలు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేస్తున్నాయంటూ అదికార పార్టీ నేతలు దెప్పిపొడుస్తున్నారు. 

08:43 - May 3, 2016

హైదరాబాద్ : లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీకి మాల్యా లేఖ రాశారు. తన పాస్‌పోర్టు రద్దు చేయడం సరికాదని, పార్లమెంట్‌ పానెల్‌కు తప్పుడు సూచనలిచ్చారని మాల్యా తన లేఖలో పేర్కొన్నారు. 9 వేల 5 వందల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా- ఎంపి పదవికి అనర్హుడని ఎథిక్స్‌ కమిటీ ఇదివరకే సూచించింది. 

07:26 - May 3, 2016

హైదరాబాద్ : పసికందుల పట్ల మృత్యు కుహారాలుగా ప్రభుత్వాసుపత్రుల మారాయని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి పసికందు బలైంది. ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికీ వసతులు ఎందుకు లేవు? ఆసుపత్రుల్లో చిన్న పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? హెల్త్ డిపార్ట్ మెంట్ ఎందుకు కరెప్టడ్ లిస్టులో టాప్ లో ఉంటుంది? ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేస్తోందా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు, మాజీ హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేష్, విజయవాడ నుండి సీపీఎం నేత బాబూరావు, టిడిపి నేత సూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 

07:05 - May 3, 2016

హైదరాబాద్ : పోలీసులు తనిఖీలను వ్యతిరేకిస్తూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల బంద్‌ పాటిస్తుండటంతో వాయిదాపడ్డ తెలంగాణ ఎంసెట్‌, టెట్‌ లకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 1న టెట్‌, 2న ఎంసెట్‌ నిర్వహించాల్సి ఉంది. తాజా షెడ్యూలు ప్రకారం ఈనెల 15న ఎంసెట్‌, 22న సెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఈ విభాగంలో 1,44,501 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్‌, మెడిసిన్‌ పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఎంసెట్‌ హాల్‌ టికెట్లను ఈనెల 12 నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. మే 27న ర్యాంకులు ప్రకటిస్తారు. పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగే ఈ పరీక్షలను సవ్యంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కడియం తెలిపారు.

ఈనెల 13 నుంచి టెట్‌ హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ....

ఈనెల 22న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు 13 నుంచి హాట్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

పాలిసెట్‌కు 1,24,747 మంది హాజరు .....

పాలిటెక్నికల్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలను మంత్రి ప్రకటించారు. మొత్తం 1,24,747 మంది పరీక్షకు హాజరుకాగా 1,03,001 మంది అర్హత సాధించారు. పాలిసెట్‌లో 82.57శాతం క్వాలిఫై అయ్యారు. బాలికలు 85.64 శాతం, బాలురు 80.84 శాతం విజయం సాధించారు. ఈనెలాఖరులోగా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తి చేసి, వచ్చే నెల 9 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈనెల 15న ఎంసెట్‌, 22న టెట్‌

హైదరాబాద్ : తెలంగాణలో వాయిదాపడిన ఎంసెట్‌, టెట్‌ తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 15న ఎంసెట్‌, 22న టెట్‌ నిర్వహిస్తారు. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఈ రెండు పరీక్షలను నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అయితే నీట్‌పై సుప్రీం కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఎంసెట్‌లో మెడిసిన్‌ విభాగం పరీక్ష ఉంటుంది. 

06:51 - May 3, 2016

విజయవాడ :నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. తాము మొదటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, తమకు తగిన ప్రాధాన్యమివ్వాలని శిల్పామోహన్ రెడ్డి సోదరులు చంద్రబాబును కోరారు.

సీఎం క్యాంపు కార్యాలంలో ఎమ్మెల్యేలు...

విజయవాడ క్యాంప్ ఆఫీసులో శిల్పామోహన్ రెడ్డి సోదరులు.. భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వేర్వేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవలే పార్టీలో చేరారు. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు.

పార్టీ మారినప్పుడు ఇలాంటి సహజమేనని....

ఇది ఇలా ఉంటే పార్టీ మారినప్పుడు ఇలాంటి సహజమేనని.. కర్నూలుజిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని భూమా నాగిరెడ్డి తెలిపారు. తాము ఏం చేసినా కార్యకర్తల కోసమేనని.. వారిని అదుకునేందుకు తమ నిర్ణయాలుంటాయని అన్నారు.త్వరలోనే వీటికి పుల్ స్టాప్ పడుతుందని అన్నారు.

ఇరు వర్గాలు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు...

విభేదాలతో ఇరు వర్గాలు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇరువర్గాలను పిలిచి రాజీచేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల వాదనలు విని, కలసి పనిచేయాలని వారికి సూచించారు. 

06:47 - May 3, 2016

హైదరాబాద్ : బిర్లా మందిర్ ముందు ఉన్న ఏజీ ఆఫీస్ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.ఆఫీస్ లోని మూడవ అంతస్తులో ప్రమాదం జరిగింది. పలు ప్రముఖ ఫైల్ లు ఈ ఫ్లోర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది. ఘటనపై ఎంక్వైరీ వేస్తామని అధికారులు చెబుతున్నారు.

06:46 - May 3, 2016

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులపై అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

కొత్త విమానాశ్రాయాల నిర్మాణానికి నిధులు మంజూరు ...

విజయనగరం జిల్లా భోగాపురంతోపాటు నెల్లూరులో కొత్త విమానాశ్రాయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కూడా నిధులు మంజూరుపై చర్చించారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగాలకు మరికొన్ని పోస్టులను జోడించి.. త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి న్యాయం చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు.

కరవుపైనా కేబినేట్‌ సమీక్ష...

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరవుపైనా కేబినేట్‌ సమీక్షించింది. కరవు రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి 200 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చంద్రబాబు తెలిపారు. మున్సిపాలిటీల్లో తాగునీటి కోసం 41 కోట్లు విడుదల చేశామన్నారు. 850 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామన్న చంద్రబాబు... పశుగ్రాసానికి 32 కోట్లు, రైతుల రుణవిముక్తి పథకానికి 23 వేల 150 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

ఉపాధి హామీ రోజువారీ కూలీ పెంపు...

ఉపాధి హామీ రోజువారీ కూలీ మొత్తాన్ని 160 రూపాయల నుంచి 190 రూపాయలకు పెంచినట్లు సీఎం చెప్పారు. ఈ ఏడాది ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరవు నివారణకు నీరు-చెట్టుకు ప్రాదాన్యత ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.  

06:43 - May 3, 2016

హైదరాబాద్: నీట్‌ అన్ని రాష్ట్రాలకు తప్పకుండా వర్తిస్తుందన్న సుప్రీం తీర్పుపై తెలుగు రాష్ట్రాలు ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. నీట్‌ తప్పనిసరన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఏపి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నాయి. తీర్పును మరోసారి పున:సమీక్షాలని తాజాగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. అయితే దీనిపై ఏ విధంగా ముందడగు వేయాలన్న దానిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ నిపుణులతో సవివరంగా చర్చిస్తున్నారు.

ఎంసెట్‌ను యథాతధంగా నిర్వహించాలని రెండు రాష్ట్రాలు నిర్ణయం ...

అయితే నీట్‌ తప్పనిసరని సుప్రీంకోర్టు తీర్పుఇచ్చినా..రాష్ట్ర స్థాయిలో మాత్రం ఎంసెట్‌ను యథాతథంగా నిర్వహించాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇప్పటికే ఏపిలో ఎంసెట్ పూర్తయింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు నీట్‌లో పాల్గొనాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో..ఈ నిర్ణయం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అన్న దానిపై న్యాయ సలహ కోసం రెండు రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు నీట్ పరీక్ష ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తుందని కూడా సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్ధులకు నష్టం జరగకూడదనే ఉద్ధేశంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు కూడా సంప్రదింపులు జరపుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉండడంతో 371 డి ప్రకారం నీట్ ఈ సారికి వర్తింపజేయాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే రాష్ట్రంలో నీట్‌ను పాటించినప్పటికీ కేవలం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను మాత్రమే భర్తీ చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్‌ను యథాతధంగా నిర్వహించాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. రెండు రాష్ట్రాల అభ్యర్ధనలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడంతో సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు పున:సమీక్ష పిటీషన్‌పై విచారణ జరుగనుంది. సుప్రీం తీర్పుకోసం రెండు ప్రభుత్వాలతో పాటు అటు గ్రామీణ ప్రాంత విద్యార్ధులు సైతం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

'నీట్' పై సుప్రీంలో విచారణ

హైదరాబాద్ : నీట్‌ కష్టాల నుండి బయటపడేందుకు తెలుగు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. నీట్‌ వల్ల విద్యార్ధులు నష్టపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు..నీట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తీర్పిచ్చిన నేపథ్యంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నీట్‌పై తీర్పును పునఃసమీక్షించాలని తెలుగు రాష్ట్రాలు వేసిన పున:సమీక్ష పిటీషన్‌పై ఇవాళ విచారణ జరుగనుంది. 

06:39 - May 3, 2016

హైదరాబాద్ : మెడికల్ , డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో మొన్న మే 1 తొలి దశ పరీక్ష నిర్వహించారు. జూలై 24 నీట్ 2 నిర్వహించబోతున్నారు. నీట్ ను స్వాగతిస్తున్నట్టు ఎస్ఎఫ్ ఐ కేంద్ర కమిటీ ప్రకటించింది. అయితే, కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నీట్ వల్ల విద్యార్థులకు జరిగే లాభనష్టాలేమిటి? నీట్ అనివార్యమైన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది? నీట్ నిర్వహణ విషయంలో ఎస్ఎఫ్ఐ ఇస్తున్న సూచనలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ పాల్గొన్నారు. ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:38 - May 3, 2016

హైదరాబాద్ : నీట్ అనివార్యమైంది. ఇప్పటికే తొలి పరీక్ష ముగిసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయలు వినేందుకు సుప్రీంకోర్టు సమాయత్తమవుతోంది. అనేక భయసందేహాల మధ్య నీట్ అమలులోకి వచ్చింది. దేశంలోని మెడికల్, డెంటల్ కాలేజీలలో అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో ఒకే ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం నీట్ లక్ష్యం. ఇందులో సాధించిన ర్యాంక్ ల ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఏపి ఎంసెట్, తెలంగాణ ఎంసెట్, ప్రయివేట్ కాలేజీ యాజమాన్యాల ఎంసెట్ తో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా విడివిడిగా సెట్లు నిర్వహిస్తున్నారు. దీంతో వీటన్నింటికీ హాజరుకావడం విద్యార్థులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కొక్కరు కనీసం నాలుగైదు సెట్లు రాయాల్సిన పరిస్థితి. నీట్ అమలులోకి వస్తే ఇక వేర్వేరు సెట్లు రాసే అవసరం, బాధ తప్పుతాయన్నది నీట్ సమర్ధకుల అభిప్రాయం.

ప్రయివేట్ యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేయడానికి నీట్...

వైద్య విద్య అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రయివేట్ కాలేజీల్లోని యాజమాన్య కోట సీట్ల ఖరీదు వింటేనే సామాన్యులకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అనఫిషియల్ గా కనీసం కోటి రూపాయలు గుమ్మరించకుండా డెంటల్ కాలేజీలోనైనా సీటు దొరకని పరిస్థితి. అధికారిక ఫీజులు ఎట్లాగూ చెల్లించకతప్పదు. ప్రయివేట్ యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేయడానికి నీట్ ఉపయోగపడుతుందన్న ఆశలున్నాయి. ప్రయివేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా? లేకపోతే, విద్యార్థుల మీద మరింత ఒత్తిడి పెరుగుతుందా? నీట్ కోచింగ్ అత్యంత కాస్ట్ లీ వ్యవహారంగా మారుతుందా? అన్న ప్రశ్నలకు రాబోయే ఒకట్రెండేళ్లలో సమాధానం దొరుకుతుంది.

ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగని రీతిలో నీట్ ...

అయితే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా సిలబస్ వుండడంతో తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనన్న ఆందోళన కొన్ని రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి భయం ఎక్కువగా వుంది. నీట్ ను క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే ఇస్తున్నందున గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నది మరో వాదన. క్వశ్చన్ పేపర్ ను ప్రాంతీయ భాషల్లో కూడా ఇవ్వడం వల్ల ఈ సమస్యను అధిగమించడం కష్టమేమీ కాదు. కాంపిటేటివ్ యుగంలో జాతీయ స్థాయి పోటీలకు దూరంగా వుండడం, జాతీయ స్థాయి కాంపిటీషన్ చూసి భయపడడం వల్ల ఉపయోగం లేదు. పోటీకి తగ్గట్టుగా సర్వసన్నద్ధులవ్వడమే విద్యార్థుల ముందున్న కర్తవ్యం. నీట్ అనివార్యమైన నేపథ్యంలో జాతీయ స్థాయి పోటీని తట్టుకునేలా విద్యా ప్రమాణాలు, బోధనా ప్రమాణాల మీద ద్రుష్టిసారించాల్సి వుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న తక్షణ కర్తవ్యమిది. గతంలో మాదిరిగా ప్రయివేట్ కాలేజీల, కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి వదిలేయడం ఇక ఎంత మాత్రమూ మంచిదికాదు. ప్రభుత్వ కాలేజీలలలో చదువుకునే విద్యార్థుల బాగోగుల మీద ఉభయ తెలుగు ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. అక్కడ ఉన్న లోపాలను సరిదిద్ధి, సౌకర్యాలను మెరుగుపర్చాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్మీడియట్ విద్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే నీట్ లో చక్కటి ఫలితాలు సాధించే సత్తా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకుంది. ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది విద్యావ్యవస్థలోని లోపాలు సరిదిద్ది, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే. మీకు మేమున్నామన్న భరోసాను అందించడమే. 

06:31 - May 3, 2016

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపిలో పాగా వేసి పూర్వవైభవం తేవడానికి కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బీహార్‌లో నితీష్‌ గెలుపుకు కృషి చేసిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను రాహుల్‌గాంధీ రంగంలోకి దింపారు.

రాహుల్‌ సూచన మేరకు యూపి కాంగ్రెస్‌ నేతలతో ప్రశాంత్‌...

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గట్టెక్కించడానికి ప్రశాంత్‌ గట్టి వ్యూహ రచనే చేస్తున్నారు. రాహుల్‌ సూచన మేరకు యూపి కాంగ్రెస్‌ నేతలతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటి అయ్యారు. వారం రోజుల పాటు కసరత్తు చేసిన ప్రశాంత్‌.. కాంగ్రెస్‌లోని అన్నివర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చే నేత అవసరం ఉందని భావించారు. రాహుల్‌గాంధీకి మొదటి ప్రియారిటీ ఇచ్చారు. రాహుల్‌ కాదంటే సిఎం పదవికి ప్రియాంకా గాంధీ పేరు ప్రకటిస్తే బాగుంటుందని ప్రశాంత్‌ సూచించారు.

తిరస్కరించిన ప్రియాంకా...

అయితే ప్రియాంకా తరపు నుంచి తిరస్కరణే ఎదురైంది. యుపి ఎన్నికల్లో ఓ కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చేందుకు యత్నిస్తున్న ప్రశాంత్‌ కిశోర్- రాహుల్‌గాంధీ తనంతట తాను ముందుకు వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.ఈ విషయంపై మీడియా రాహుల్‌ను ప్రశ్నించగా..తనకేమీ తెలియదన్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ చూస్తోందని, యుపి సిఎం పదవి కోసం ఆయన పేరును ప్రస్తావించడమనడం వట్టి పుకార్లేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల కోసం అప్పుడే కాంగ్రెస్‌ పోస్టర్లు హల్‌ చల్‌ ...

2017లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం అప్పుడే కాంగ్రెస్‌ పోస్టర్లు హల్‌ చల్‌ చేస్తున్నాయి. సింఘం సినిమా హీరో స్టయిల్లో రాహుల్‌గాంధీని పోస్టర్లో చూయించారు. గోరఖ్‌పూర్‌లో అతికించిన ఈ పోస్టర్‌లో ఎస్పీ, బిఎస్పీ, బిజెపిని టార్గెట్‌ చేసినట్లుగా ఉంది. 27 ఏళ్లుగా సాగుతున్న అత్యాచారానికి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లుగా పేర్కొంది. అఖిలేష్‌ సర్కార్‌ను మత ఘర్షణల ప్రభుత్వంగా, బిఎస్పీ చీఫ్‌ మాయావతి అవినీతి, స్కాంలలో కూరుకుపోయారని, బిజెపి అధ్యక్షుడు కేశవ్‌ మౌర్యను మత ఘర్షణల నేరస్థుడిగా, ఓవైసినీ సమాజంలో చీలికలు తెచ్చే నేతగా పోస్టర్లలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

06:28 - May 3, 2016

ప్రకాశం : యూటీఎఫ్‌ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయ సమస్యలపై సమరశంఖం పూరించిన వీరుడు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రాంరెడ్డి మృతిచెందారు. ఒంగోలు లోని ప్రకాశం ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రాంరెడ్డి తుదిశ్వాస విడిచారు. పలువురు వామపక్ష నేతలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రాంరెడ్డికి నివాళులర్పించారు.

దాచూరి రాంరెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలోని పాకాల....

దాచూరి రాంరెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలోని పాకాల. 1938 జనవరి 15న జన్మించిన ఆయన ఉపాధ్యాయ సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారు. పలు సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. యూటీఎఫ్‌ వ్యవస్థాపకుడిగా, ఉపాధ్యాయుల సమస్యలు, విధులు, బాధ్యతలపై అనేక పోరాటాలు నిర్వహించారు. స్టేట్‌ టీచర్స్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా పేరుతో ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటాలు చేసిన ఘనత ఆయనకే దక్కింది.

పీడీఎఫ్‌ నాయకులుగా అనేక ఉద్యమాలు...

పీడీఎఫ్‌ నాయకులుగా అనేక ఉద్యమాలు నిర్వహించిన రాంరెడ్డి, ఉపాధ్యాయుల సమస్యలతో పాటు, కార్మిక సమస్యల పరిష్కారానికీ ఎంతో కృషి చేశారు. 1984, 2007లో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన..పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికోసం అవిరళ కృషి జరిపారు. ప్రజా ఉద్యమాల్లో, ఉపాధ్యాయ ఉద్యమాల్లో హక్కుల కోసం జరిపిన పోరాటాల్లో వామపక్ష భావాలతో నిత్యం ఎందరికో దిక్సూచిగా నిలిచారు. ఆయన మృతి ఉపాధ్యాయ సంఘాలకు తీరని లోటని పలువురు అన్నారు.

ఐక్య ఉపాధ్యాయ సమాఖ్యను స్థాపించిన రాంరెడ్డి, ..

ఐక్య ఉపాధ్యాయ సమాఖ్యను స్థాపించిన రాంరెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా 20 సంవత్సరాలు పనిచేశారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన.. అవినీతి అధికారులకు సింహస్వప్నంలా పనిచేశారు. సన్నిహితులు అతన్ని జీవోల రాంరెడ్డి అని పిలిచేవారంటే.. సమస్యలపై అతని కృషి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి...

14 సంవత్సరాల ఉద్యోగ సర్వీసు మిగిలి ఉండగానే.. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం రాంరెడ్డి చేసిన కృషి మరవలేనిది. సామ్యవాద భావజాలంతో దళిత వాడల్లో వైద్యం, వయోజన విద్య చేపట్టి వారిని అభివృద్ధి పథంలో నడిపించిన యోధుడు రామిరెడ్డి.

సంఘాల ఐక్య వేదికను నిర్మించి దాని అధ్యక్షులుగా...

అన్ని సంఘాల ఐక్య వేదికను నిర్మించి దాని అధ్యక్షులుగా పనిచేసిన రాంరెడ్డి.. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో అన్ని కేడర్ల టీచర్లను మూడు గ్రూపుల్లో విలీనం చేసేలా కృషి చేశారు. భాషా పండితుల పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానంతో.. 1983లో వారికి అప్‌గ్రేడింగ్‌ జీవోను తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఉపాధ్యాయుల సంఘాల తొలి డైరీని రూపొంచిన దాచూరి.. వేలమంది ఉపాధ్యాయులను కార్యకర్తలుగా తీర్చిదిద్ది.. తనతో పాటు నడిచేలా చేశారు. 

నేడు విజయవాడలో టిడిపి పొలిట్ బ్యూరో

కృష్ణా : విజయవాడలో నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం కీలకంగా మారింది. ప్రత్యేక హోదాతో పాటు.. టీడీపీ-బీజేపీ సంబంధాల పైనా చర్చ కొనసాగనుంది. మహానాడు నిర్వహణపైనా కూడా సమావేశంలో చర్చ జరగనుంది. ఏపీ తెలంగాణల్లోని కరవు పరిస్థితులపైనా చర్చ చేపట్టనున్నారు. ఏపీ, తెలంగాణ పార్టీ శాఖల మధ్య సమన్వయంపై చర్చ జరుగనుంది. జగన్‌ మూడు రోజుల దీక్ష అంశంపైనా పొలిట్‌బ్యూరో చర్చించనుంది. 

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం

జకార్తా :ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం సంభవించింది. లాంపంగ్‌ ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదైనట్లు ఇండోనేషియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. టాంగామస్‌ పట్టణం లో 23కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఇండోనేషియా ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఎక్కువ, ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి.

ఖైతరాబాద్ ఏజీ ఆఫీసులో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఏజీ ఆఫీసులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులో మంటలు ఆకస్మాత్తుగా చెలరేగడంతో భారీ ఎత్తునా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు షాట్‌ సర్క్యూట్‌ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Don't Miss