Activities calendar

05 May 2016

విశాఖలో ప్రారంభమైన ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలు..

విశాఖ : నగరంలో ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 8న విశాఖ వేదికగా సన్‌రైజర్స్‌తో ముంబై ఢీకొననున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ టికెట్ల ధరలు రూ.400, 500, 750, 1250, 2000 గా ఉన్నాయి. ఈ టికెట్లను విశాఖ జిల్లాలోని గాజువాక, గోపాలపట్నం, జడ్జికోర్టు రోడ్‌, మద్దెలపాలెంలోని సీఎంఆర్‌ మాల్స్‌, ఎంవీఆర్‌ మాల్‌లో టికెట్ల అమ్ముతున్నారు.

జూన్‌ 2 న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల పెంపుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి జూన్‌ 2 న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 10 జిల్లాల స్థానంలో 24 నుంచి 25 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు 40 కొత్త మండలాల ఏర్పాటు కానున్నాయి. ఆగస్టు 15 లేదా దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యాచరణ మొదలు కానుంది. ప్రతి 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్‌ అధికారి నియామించే అవకాశం ఉంది. 

21:56 - May 5, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్రంలో ఆగ్రహం పెల్లుబికుతోంది. కేంద్రం నమ్మక ద్రోహానికి పాల్పడిందని పలు పార్టీల నేతలు ధ్వజమెత్తారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేకపోతే చరిత్ర హీనులుగా మిగులుతారని వైసీపీ విమర్శించింది. అవసరమైతే స్పెషల్‌ స్టేటస్‌పై ప్రతిపక్షాల సాయం తీసుకొని ఆందోళన చేపట్టాలని సీపీఎం సూచించింది. 
ప్రత్యేక హోదాపై మాట మార్చిన ఎన్డీయే ప్రభుత్వం 
ప్రత్యేక హోదాపై ఎన్డీయే ప్రభుత్వం మాట మార్చి..నమ్మకద్రోహానికి పాల్పడిందని ఆంధ్రప్రదేశ్‌లోని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంపై కేంద్రం ప్రవర్తిస్తున్న తీరు ఏం బాగాలేదని పలువురు విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు మేలుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. అవసరమైతే ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌పై ప్రతిపక్షాల సాయం తీసుకుని ఆందోళనకు దిగాలని సూచించారు. 
ప్రజలను మోసం చేసిన బీజేపీ సర్కార్‌  
ప్రత్యేక హోదాపై బీజేపీ సర్కార్‌ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, చంద్రబాబు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విభజన బిల్లులోని అంశాలను అమలు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. సాంకేతిక అంశాలను సాకుగా చూపి ప్రత్యేక హోదాపై తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉమ ధ్వజమెత్తారు. 
చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు...అంబటి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురాకుంటే సీఎం చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని  వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.   రాష్ట్ర ప్రయోజనాల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ది  లేదని అంబటి మండిపడ్డారు. 
రాజ్యసభ సీటు కోసం ఏపీ ప్రయోజనాలు తాకట్టు : రఘువీరా
రాజ్యసభ సీటు కోసం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ హైదరాబాద్ ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. 
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ అనంతపురం నగరంలోని పాతవూరు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన పదవికి రాజీనామా చేయాలని  మాజీ మంత్రి శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. 
ప్రత్యేక హోదాపై మోడీ మాట తప్పారన్న గల్లా 
నీతి మంతుడని చెప్పే మోడీ ప్రత్యేక హోదాపై మాట తప్పారని పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ అన్నారు. గల్లా జయదేవ్ పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయడం సంతోషకరమని .. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు తెలుగు ప్రజలను మోసం చేశాయని కాంగ్రెస్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు విమర్శించారు.  
సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం 
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనంతపురం నగరంలోని టవర్‌ క్లాక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు సీపీఎం కార్యకర్తలు, నేతలు ప్రెస్‌ క్లబ్‌ నుంచి క్లాక్‌ టవర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని సీపీఎం హెచ్చరించింది. 
రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళాలు 
ఏపీ స్టేటస్‌పై అధికార, ప్రతిపక్ష అన్న తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నారు. కేంద్రం వైఖరిని తప్పు పడుతూ ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు.  

21:47 - May 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల పెంపుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి జూన్‌ 2 న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 10 జిల్లాల స్థానంలో 24 నుంచి 25 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు 40 కొత్త మండలాల ఏర్పాటు కానున్నాయి. ఆగస్టు 15 లేదా దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యాచరణ మొదలు కానుంది. ప్రతి 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్‌ అధికారి నియామించే అవకాశం ఉంది. 

21:43 - May 5, 2016

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌ ఆసుపత్రికి హుటా హుటిన పోలీసులు తరలించారు. ఎయిమ్స్ లో కన్హయ్య కుమార్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జేఎన్‌యూలో 8రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేయడంతో ఒక్కసారిగా కన్హయ్య ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే పోలీసులు చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు. అయితే ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్ష విరమించేది లేదని కన్హయ్య కుమార్‌ తెలిపారు. జేఎన్‌యూ ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఫిబ్రవరి 9 ఘటనకు సంబంధించి విద్యార్థులపై సస్పెన్షన్‌, బహిష్కరణ, జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 27న కన్హయ్య కుమార్‌ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.  

 

21:32 - May 5, 2016

ఈ ఇంట్లోనే ఓ యువతి ఉసురు పోసుకున్నారు, అడిగేవాళ్లెవరూ లేరని కామాంధుల్లా రెచ్చిపోయారు. ఏ అండా లేని ఓ అబలను బలితీసుకున్నారు. మానవత్వం వదిలి రాక్షసుల్లా ప్రవర్తించారు... ఇక్కగే ఓ మహిళ ఆర్తనాదాలు చేసింది. కాపాడే వారెవరూ లేరంటూ కన్నీటి సంద్రంలో తడిసిపోయింది. రక్తపు చారికలతో  లోకాన్ని వదిలింది. ఒళ్లు కొవ్వెక్కింది... క్రూరత్వం నిలువెల్లా నిండింది. మానవత్వం మంటగలిసింది. 
కేరళలో చోటుచేసుకున్న మరో నిర్భయ ఘటనపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీయోలో చూద్దాం...

 

21:30 - May 5, 2016

మల్లన్నజెప్పిండట బొమ్మల కథలు.. మస్తు పవర్ ఫులట కార్టూన్ గీతలు, హైదరాబాదుకొస్తలేరంట పారీను తాగువోతులు..కేసీఆర్ చేస్తడ మందు సవలతులు, అన్నముగూర్తానికి కాలే.. సత్తెన్న పెళ్లి.. అన్నవరం గుడిల పెళ్లి పత్రిక లొల్లి, కరీంనగర్లవెరిగిన అవినీతి పరులు..లంచం మరిగిన సర్కారు అధికారులు, బుడ్డ పోరనికి ముప్పైరెండు ఏళ్లు... ఎట్లున్నయోజూడు చేతులు-కాళ్లు, తెలుగు రాష్ట్రాలల గాలి దుమారం.. ఐదొద్దులు సల్లంగుంటదని సమాచారం, వామ్మో ఆ రెస్టారెంట్ కు అలా పోవాలా..? ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:57 - May 5, 2016

తూర్పుగోదావరి : దుడ్డు ఎవడి చేతిలో ఉంటే..దున్న వాడిదే అన్నట్లు.. అక్కడ  భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. కండ బలం.. అండ బలంతో రౌడీలు సామాన్యుల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. ఎక్కడ సెంటు భూమి కనబడితే.. అక్కడ పాగా వేసి..పైసా పైసా కూడబెట్టి సంపాదించిన పేదల భూములను ఆక్రమిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భూ అక్రమార్కుల ఆగడాలపై స్పెషల్‌ స్టోరీ. 
ఖాళీ భూమి కనిపిస్తే చాలు..
ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసేయడం..! భారీ విలువ చేసే ప్లాటు అయితే చాలు.. అక్కడ పాగా వేయడం.. దౌర్జన్యంగా యజమానులను బెదిరించి.. తేరగ ఆస్తుల్ని కొట్టేయడం..!
భూబకాసురుల ఆక్రమణల పర్వం
ఏపీలోని కాకినాడలో జరుగుతున్న భూబకాసురుల ఆక్రమణల పర్వం. ఇటీవల కాకినాడ స్మార్ట్‌సిటీగా ఎంపికైనప్పటి నుంచి అక్కడ భూ కబ్జాలకు అడ్డూఆపూ లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా.. అక్కడ భూ అక్రమణలు సర్వసాధారణంగా మారాయి. పాతికేళ్ల క్రితం నిర్మించిన ఓ భవనాన్ని కూడా.. ఇటీవల కబ్జా చేశారంటే కాకినాడలో భూ ఆక్రమణదారుల ఆటలు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 
ఖాళీ స్థలాలపై కన్ను
నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై కన్నేసిన కొందరు.. దౌర్జన్యకారులు ఒరిజినల్‌ స్థల యజమానులను బెదిరించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారికి ఖాకీలు కూడా వంత పాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ ప్రాంతంలోని గైగోలుపాడు కార్పొరేషన్‌ పరిధిలో గజం భూమికి 18 వేల రూపాయల ధర పలుకుతుంది.  ఇలా భూమి విలువలు పెరగడంతో ఈ ప్రాంతంలో భూ బకాసురులు పెట్రేగిపోతున్నారు. 
భయబ్రాంతులకు గురవుతున్న సామాన్యులు 
ఇటీవల 157 బై 6 సర్వే నెంబర్‌లోని 54 సెంట్ల భూమిని 12 మంది కొనుగోలు చేశారు. గత కొంత కాలంగా అందులోనే కుటుంబాలతో నివసిస్తున్నారు. అయితే ఇప్పుడు భూముల విలువ పెరగడంతో.. స్థిరాస్తి వ్యాపారులు, భూ బకాసురులు వీరి స్థలాలపై కన్నేశారు. అర్ధరాత్రి వేళల్లో ఇళ్లల్లోకి వచ్చి యజమానులను బెదిరిస్తున్నారు. దీంతో సామాన్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 
అధికారి ఇంటిపై అక్రమార్కుల కన్ను
ఇటీవల ఓ మాజీ పోలీస్‌ అధికారి ఇంటిపై కూడా అక్రమార్కుల కన్ను పడింది. ఏకంగా భూ యజమానిపైనే దాడికి దిగారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లు కట్టుకుంటే.. రౌడీలు, అ్రకమార్కులు వాటిని కబ్జా చేస్తున్నారని, వీరి అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయని కాకినాడకు చెందిన ఓ పెద్దాయన ఇదిగో... ఇలా వాపోయాడు.
పూరి గుడిసెపై దాడి చేసిన కబ్జాకోరులు  
ఇటీవల ఓ పూరి గుడిసెపై దాడి చేసిన కబ్జాకోరులు ఇంటి యజమానులను గాయపరిచి భయబ్రాంతులకు గురిచేశారు. పోలీసుల సపోర్ట్ తోనే వారలా చేశారని బాధితురాలు చెబుతోంది. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. ఇకనైనా భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. పైసా పైసా కూడబెట్టి.. నిలువ నీడ సంపాదించుకున్నామని, తమపై దౌర్జన్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. 

 

20:45 - May 5, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంక కొల్లేరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిషిద్ద చేపల చెరువులో ప్రత్తికోళ్ళలంక గ్రామస్థులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ముందుగానే తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు చేపల చెరువు వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రత్తికోళ్ళలంక ప్రజలకు ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు..సంఘటనా స్థలానికి పెద్దఎత్తున బలగాలతో చేరుకున్నారు. దీంతో ప్రత్తికోళ్ళంక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సుమారు రెండు వందల ఎకరాల విస్థీర్ణంలో ఉన్న చేపల చెరువులో కొంత భాగం కొల్లేరు అభయారణ్యానికి చెందింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు కాంటూరు పరిధిలో ఉన్న ఈ చెరువులో చేపలు పెంచడానికి అనుమతి లేదు. అయితే ప్రత్తికోళ్ళలంక గ్రామస్థులు అక్రమంగా నిబంధనలకు విరుద్దంగా చేపలు పెంచడంతో పాటు చేపలు పట్టడాన్ని ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకున్నారు. 

 

స్లో ఓవర్ రేట్ కారణంగా విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్‌కు దూరం

హైదరాబాద్ : టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్‌కు దూరం కాబోతున్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో గెలిచింది రెండు మాత్రమే. మిగిలిన మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రన్ రేట్ కారణంగా జట్టు ఓటమి పాలైంది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు విడతలుగా కోహ్లీకి 36లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. ఈ తాజా నిర్ణయంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. పూణె సూపర్‌గెయింట్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ తలపడనుంది.

 

20:40 - May 5, 2016

రంగారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల పరిశీలన చేపట్టింది. నేడు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కమిటీ పర్యటించింది. జిల్లాలో మూసివేయనున్న 14 పాఠశాలలను గుప్తా, రత్నం, వెంకటేశ్వర్ రావులతో కూడిన సుప్రీం కమిటీ బృందం పరిశీలించింది. సంబంధిత పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, మూసివేతకు గల కారణాలను కమిటీ బృందం ప్రజలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాను వీడియోలో చూద్దాం...

 

20:37 - May 5, 2016

చెన్నై : తమిళనాడు ప్రజలపై అమ్మ వరాలు కురిపించింది. ఎన్నికల ప్రణాళికలో హామీలు గుప్పించింది.. పెరుందురాయ్‌ ఎన్నికల ప్రచారంలో ఈ మేనిఫెస్టోను ఏఐఏడీఎంకె అధినేత్రి జయలలిత విడుదల చేశారు. తొలి కాపీలను పార్టీ యువ కార్యకర్తలకు అందజేశారు. ప్రతి రెండు నెలలకు వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. మహిళలు కొనుగోలుచేసే స్కూటీలకు 50శాతం రాయితీ ఇస్తామన్నారు. పదోతరగతి, ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గర్భిణీలకు ప్రసవ ఖర్చులకు 18 వేలు ఇస్తామన్నారు.. ఇలా వివిధ రకాల హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. 

 

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన కమర్షియల్ టాక్స్ ఉద్యోగి

హైదరాబాద్‌ : మలక్‌పేట కమర్షియల్ టాక్స్ ఉద్యోగి నరహరి లంచం తీసుకుంటూ నాంపల్లి కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులకు గురువారం చిక్కాడు. వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం లక్ష్మి అనే మహిళ నుంచి రూ.2,500 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో అవినీతి..

చిత్తూరు : తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమాలు జరగకుండా చూడాల్సిన సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నదాన సముదాయం దగ్గర లైసెన్స్‌ లేని హాకర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ విజిలెన్స్‌కు చెందిన ఓ ఉద్యోగి అడ్డంగా 10టీవీ కెమెరాకు చిక్కాడు. ఇక్కడ మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఈ విధంగా హాకర్లు రోజుకు 150 రూపాయలు ఇస్తారు. అయితే.. విజిలెన్స్‌ సిబ్బందే అనుమతి లేని హాకర్లను ప్రోత్సహించి ఈ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

19:48 - May 5, 2016

చిత్తూరు : తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమాలు జరగకుండా చూడాల్సిన సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నదాన సముదాయం దగ్గర లైసెన్స్‌ లేని హాకర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ విజిలెన్స్‌కు చెందిన ఓ ఉద్యోగి అడ్డంగా 10టీవీ కెమెరాకు చిక్కాడు. ఇక్కడ మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఈ విధంగా హాకర్లు రోజుకు 150 రూపాయలు ఇస్తారు. అయితే.. విజిలెన్స్‌ సిబ్బందే అనుమతి లేని హాకర్లను ప్రోత్సహించి ఈ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

విషమిస్తోన్న కన్హయ్యకుమార్ ఆరోగ్యం...

ఢిల్లీ : జెఎన్ యూలో కన్హయ్యకుమార్ ఆరోగ్యం విషమిస్తోంది. అతని బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీక్ష కొనసాగిస్తే ప్రమాదముందని వైద్యులు తెలిపారు. కన్హయ్యకుమార్ 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రేపు దేశ వ్యాప్తంగా 24 గంట నిరాహారదీక్షలకు ఏఐఎస్ ఎఫ్ పిలపునిచ్చింది. జేఎన్ యూలో విద్యార్థులకు ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని ఆ సంఘం తెలిపింది. విద్యార్థుల దీక్ష చేస్తున్నా వీసీ పట్టించుకోవడం లేదని ఎఐఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉజ్జయిని కుంభమేళాలో తొక్కిసలాట

మధ్యప్రదేశ్ : ఉజ్జయిని కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

19:21 - May 5, 2016

కమర్షియల్ కొలతల సినిమాలు ఎప్పుడూ సేఫ్ జోన్ లోనే ఉంటాయి. ఇందులో వైవిధ్యాన్ని వెతికేందుకు చేసే ప్రయత్నాలు వృథాప్రయాసే...ఐతే కొద్ది సేపు వినోదానికి మాత్రం గ్యారెంటీ ఉంటుంది. పటాస్ సినిమాను ఎంటర్ టైనింగ్ తెరకెక్కించిన దర్శకుడు అనిల్..తన రెండో సినిమాకూ ఇదే ఫార్మేట్ ఫాలో అయ్యాడు. పటాస్ కు కార్బన్ కాపీగా సుప్రీమ్ ను రూపొందించాడు.
కథ...
సుప్రీమ్ కథలోకి వెళ్తే...పేదలను ఆదుకుంటున్న జాగృతి ఛారిటీ సంస్థకు వేల ఎకరాల భూములుంటాయి. ఈ ట్రస్టు దాతలు లండన్ లో స్థిరపడి..ఇక్కడ సాయి కుమార్ తో సేవా కార్యక్రమాలు నడిపిస్తుంటారు. పత్రాలు మార్చి కోట్ల విలువైన ఈ ఛారిటీ ఆస్తులను కబ్జా చేస్తాడు విలన్ కబీర్ సింగ్. ట్రస్టు నిర్వాహకులు కోర్టు కెళ్లగా...నిజమైన వారసులు వచ్చి..ఆస్తి డాక్యుమెంట్లు చూపించాలని న్యాయమూర్తి తీర్పుచెబుతాడు. నెల రోజులు గడువిస్తాడు. సాయికుమార్ లండన్ వెళ్లి ట్రస్టు కబ్జా సంగతి దాతల కుటుంబానికి చెబుతాడు. ట్రస్టు ఆస్తుల్ని కాపాడేందుకు ఇండియా బయలుదేరిన ఆ కుటుంబాన్ని చంపిస్తాడు కబీర్ సింగ్. వారసుల కుటుంబంలో ప్రాణాలతో బయటపడ్డ బాలుడిని ఇండియా తీసుకొస్తాడు సాయికుమార్. కబీర్ సింగ్ రౌడీల దాడిలో సాయి కుమార్, ఆ బాలుడు విడిపోతారు. టాక్సీ డ్రైవర్ సాయి ధరమ్ తేజ్ కు ఆ పిల్లాడు దొరుకుతాడు. అనాథగా మిగిలిన ఆ కుర్రాడిని కథానాయకుడు చేరదీస్తాడు. కబ్జా సంగతి తెల్సుకున్న హీరో ట్రస్టు ఆస్తుల్ని ఎలా కాపాడాడన్నది మిగిలిన కథ.
విశ్లేషణ..
సుప్రీమ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకున్నా...కథా కథనాల్లో కొత్తదనమేం లేదు. పటాస్ లాగా మొదటి అర్థ భాగంలోనే కథ ముగియడంతో...దర్శకుడు మళ్లీ కామెడీ క్యారెక్టర్లతో తంటాలు పడాల్సి వచ్చింది. నిడివి కోసం ఊహాతీత పాత్రలు సృష్టించి క్లైమాక్స్ వరకు కథను లాగాడు. కామెడీ సీన్స్ తో ఫస్టాప్ స్పీడ్ గా సాగినా....రెండో అర్థ భాగం ఖాళీగా మారిపోయింది. ఒకట్రెండు అనవసర పాటలు సినిమా నెమ్మందించేలా చేశాయి. సిటిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదు. టాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఎనర్జిటిక్ గా నటించాడు. ఫైట్లు, డాన్సులు బాగా చేశాడు. హీరోయిన్ రాశీ ఖన్నా సినిమాకు గ్లామర్ గా నిలిచింది. ఫృథ్వీ, రఘుబాబు, ప్రభాస్ శీను, పోసాని పాత్రోచిత నటనకు పరిమితమయ్యారు.

ఫ్లస్ పాయింట్స్

 

1. ఫస్టాప్

2. కొన్ని కామెడీ సీన్స్

3. హీరో క్యారెక్టర్

మైనస్ పాయింట్స్

 

1. సెకండాఫ్

2. ఊహాతీత పాత్రలు

3. అనవసరపు పాటలు

టెన్ టివి రేటింగ్..2/5

కులవృత్తుల అభివృద్ధికి చర్యలు : తలసాని

మహబూబ్‌నగర్ : పశుసంవర్థక శాఖ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గొర్రెల కాపరులు, మత్స్యకారులు, పాడిపరిశ్రమాభివృద్ధి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంపీడీసీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తామన్నారు. కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా....

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి ఘాట్‌రోడ్డులోని 22వ మలుపు వద్ద గురువారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

కుమారుడి పెళ్లి కోసం స్కూల్ కు సెలవు....

జమ్మూకాశ్మీర్ : కూమారుడి పెళ్లి సందర్భంగా తాను సెలవు పెట్టుకోవలసింది పోయి ఏకంగా మొత్తం పాఠశాలకే సెలవు ప్రకటించింది. అది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెతో పాటు పాఠశాల సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో చోటుచేసుకుంది. బగ్లా ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సయీదా అంజుమ్‌ కొడుకు పెళ్లి మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పాఠశాలకు సెలవు ప్రకటించింది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం అందించకుండా తన కొడుకు పెళ్లి సందర్భంగా పాఠశాలకు సెలవు ఇస్తున్నట్లు నోటీస్‌ బోర్డులో ఆమె సంతకం చేసి ఉన్న నోటిఫికేషన్‌ పెట్టారు.

18:48 - May 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో రాంకీ రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. నగరంలో శానిటేషన్‌ను రాంకీకి ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ చేసిన జీహెచ్ఎంసీ... కార్మిక సంఘాల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. ముందునుంచి రాంకీని వ్యతిరేకిస్తున్న అధికారపార్టీ రాంకీకి సై అంటుందా? కార్పొరేషన్‌లోని కార్మిక సంఘాలు దీనికి ఒప్పుకుంటాయా? ఇదే అంశం ఇప్పుడు బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది.
వాహనాల సమస్యతో పేరుకుపోతున్న చెత్త
టన్నులకు టన్నులు పేరుకుపోయే చెత్త.. ప్రతి రోజూ 4 వేల మెట్రిక్‌ టన్నుల గార్బేజ్‌.. ఈ చెత్తనంతా నగరం వెలుపలికి తరలించాలి..ఆ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించాలి.. ఇదే లక్ష్యంతో ఇప్పుడు జిహెచ్ఎంసి అధికారులు పావులు కదుపుతున్నారు. పారిశుధ్య కార్మికులు వ్యతిరేకిస్తున్నా రాంకీపైనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అసలు రాంకీతో వచ్చే సమస్య ఏంటి.?
ప్రతి రోజు 4 వేల మెట్రిక్ టన్నుల చెత్త
బల్దియాలో ప్రతి రోజు 4 వేల మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. దీనిని నగరం బయటికి తరలించేందుకు వేలాది మంది కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుండి ట్రాన్స్‌పోర్ట్ కేంద్రాలకు, అక్కడి నుండి డంపింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఈ వ్యవహారమంతా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంటే చూసుకుంటుంది. గతంలో ఈ శాఖలో చేసిన సంస్కరణలపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కాలం చెల్లిన వాహనాలతో సతమతవుతున్నారు కార్మికులు. క్షేత్రస్థాయి సమన్వయ లోపంతో వాహనాలు మరమత్తులకు నోచుకోక షెడ్లకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది.
చెత్త తరలింపును రాంకీకి కట్టబెట్టేందుకు నిర్ణయం
ఈ సమస్య నుండి బయటపడడానికి అధికారులు... రాంకీని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కాప్రాలో రాంకీ నిర్వహించిన పనులను పరిశీలించిన కమిషనర్ సదరు కంపెనీకే చెత్త తరలింపు బాధ్యతలను కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనుకున్నదే తడవుగా ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి జవహర్ నగర్ డంప్ యార్డుకు చెత్తను తరలించేందుకు రాంకీకి అనుమతిచ్చారు. దీంతో కోర్ సిటిలో ఉన్న యూసఫ్‌గూడ, టాంక్ బండ్, ఇమ్లీబన్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుండి రాంకీకి చెందిన వాహనాలు చెత్తను తరలిస్తున్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
2009లో రాంకీ ఎన్వీరో సంస్థతో ఒప్పందం
ఇక అసలు విషయానికొస్తే...2009లో అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలోని చెత్త సేకరించడానికి రాంకీ ఎన్విరో అనే ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టు 25 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని 361 ఎకరాల స్థలంతో పాటు, 3 డంపింగ్ యార్డులను, కార్పొరేషన్ సొంత వాహనాలను రాంకీకి ధారాదత్తం చెయ్యనున్నారు. ఒక్కో మెట్రిక్ టన్నుకు 1431 రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా ఏడాదికి 5శాతం పెంపు ఉంటుందనేది కాంట్రాక్ట్ నిబంధన. అయితే ఇవే పనులను బల్దియా నేరుగా చేపట్టడం వల్ల ఒక మెట్రిక్ టన్నుకు 543 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. దీన్ని బట్టే రాంకీపై జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక ప్రేమ చూపుతున్నారని అర్థమవుతుంది.
హైదరాబాదీలకు అదనపు భారం
మరోవైపు రాంకీకి దీనిని కట్టబెట్టడం వల్ల హైదరాబాదీలకు అదనపు రుసుములు చెల్లించే భారం తప్పదన్న వాదనలున్నాయి. ఈ కాంట్రాక్ట్ ను కార్మిక సంఘాలు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల పొట్టగొట్టే ఒప్పందాన్ని ఒప్పుకునేది లేదని కార్మిక సంఘాలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నాయి. మరి ఈ వివాదం కంటిన్యూ అవుతుందా...లేక పుల్‌స్టాఫ్ పుడుతుందా అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

 

18:38 - May 5, 2016

అనేక జాగ్రత్తలు అనివార్యమైన దశ మాతృత్వం. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు ఈ దశలో తీసుకోవలసిన పోషకాహారం పట్ల అవగాహన కలిగించేందుకు ఇవాళ్లి హెల్త్ కేర్ మీ ముందుకు వచ్చింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:28 - May 5, 2016

నిర్భయ అత్యాచారాన్ని తలపించే దారుణం. కేరళలో 30 ఏళ్ల దళిత మహిళపై అమానుషం. పోలీసులు స్పందన షరామామూలే.. పౌరసమాజమే స్పందించింది. నిందితులకు శిక్ష పడాలని నినదిస్తోంది.

నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో, ఇప్పుడు కేరళలో.. అప్పుడు మెడికల్ స్డూడెంట్, ఇప్పుడు లా స్టూడెంట్. అలాంటి కీచకపర్వమే మళ్లీ జరిగింది. ఇప్పుడు బలైంది, ఓ దళిత మహిళ. ఎవరి అండదండలూ లేకుండా, అమ్మ చాటున పెరుగుతున్న బిడ్డ. అందుకే ఇంత నిర్లక్ష్యమా? ఈ ఆగడాలకు అడ్డుకట్ట ఎప్పుడు?

ఆమ్నేస్టీ నివేదిక ప్రకారం దళితులు, మైనారిటీలు, ఆదివాసీలపై జరుగుతున్న దాడుల్లో కేవలం 5 శాతం మాత్రమే రికార్డవుతున్నాయి. ఇదే నివేదక ప్రకారం పోలీసులు బాధితులను లంచాలు అడుగుతారు. సాక్షులను జడిపిస్తారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారు. భర్తలను, ఇతర కుటుంబ సభ్యులను చితకబాదుతారు. బాధితులు లైంగిక దాడులకే కాదు, చివరికి హత్యకు గురయినా, నేరస్తుల్లో అధిక శాతం మంది శిక్ష తప్పించుకుంటారు.

చట్టం ముందు అందరూ సమానమే అనే మాట చాలాసందర్భాల్లో కాగితాలకే పరమితమవుతోంది. అనేక సందర్బాల్లో దళితులు, ఆదివాసీలు, అణచివేతకు గురవుతున్న కులాలు, మైనారిటీ మహిళలపై పాశవికంగా అత్యాచారాలు జరిగినప్పుడు ఒక దారుణమైన నిశ్శబ్దం పౌరసమాజాన్ని వెంటాడుతుందనే చెప్పాలి. అందుకు తగినట్లుగానే రక్షణ, న్యాయవ్యవస్థల పనితీరు ఉంది. వ్యక్తుల్లో, కుటుంబాల్లో, వ్యవస్థలో సెన్సివిటీ వచ్చినప్పుడే ఈ దాడులకు అడ్డుకట్ట పడుతుంది. మహిళల్ని వివక్ష, అసమానత లేకుండా చూసినప్పుడే ఈ పరిస్థితి మారుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నీట్‌ పరీక్షపై ముగిసిన వాదనలు

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై సుప్రీంకోర్టులో గుజరాత్‌, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ వాదనలు వినిపించాయి. తాజా పరీక్షతో  పలు రాష్ట్రాల్లోని విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని ఆయా రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలంటూ గుజరాత్‌ వాదనలు వినిపించగా, మిగితా రాష్ట్రాలు సైతం ఇదే వాదన వినిపించాయి. అలాగే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు భాషా సంబంధిత ఇబ్బందులు వస్తాయని వాదనలు వినిపించాయి. నీట్‌ నుంచి ఒక ఏడాది మినహాయింపు నివ్వాలని వాదన వినిపించాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు కాలేజీల తరపున కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు.

18:10 - May 5, 2016

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై సుప్రీంకోర్టులో గుజరాత్‌, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ వాదనలు వినిపించాయి. తాజా పరీక్షతో పలు రాష్ట్రాల్లోని విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని ఆయా రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలంటూ గుజరాత్‌ వాదనలు వినిపించగా, మిగితా రాష్ట్రాలు సైతం ఇదే వాదన వినిపించాయి. అలాగే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు భాషా సంబంధిత ఇబ్బందులు వస్తాయని వాదనలు వినిపించాయి. నీట్‌ నుంచి ఒక ఏడాది మినహాయింపు నివ్వాలని వాదన వినిపించాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు కాలేజీల తరపున కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదలాయించాలని సిబాల్‌ తెలిపారు. ఇదిలా ఉంటే వాదనలు పూర్తయిన అనంతరం సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా వేసింది.

 

18:05 - May 5, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని షాపింగ్‌ మాల్స్ లో పఠాన్‌కోట్‌ తరహా దాడులకు కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్న సాజిద్‌ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనుకోకుండా ఆయనుండే భవనంలో బాంబు పేలడంతో సాజిద్‌ అరెస్ట్ అయ్యాడు. బాంబు పేలడంతో అతడి చేయికి గాయం కూడా అయింది. సాజిద్‌తో పాటు మరో ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను పోలీస్‌ కస్టడీకి తరలించారు. కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సాజిద్‌ అహ్మద్‌, పలు టీవీ రియాల్టీల షోల కోసం ఆడిషన్స్ కు కూడా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సాజిద్‌ ఢిల్లీలోని ఎన్‌సిఆర్‌ ప్రాంతం, హిందన్‌ ఎయిర్‌బేస్‌ పై దాడులకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాద సంస్థతో ఇతడికి సంబంధాలున్నాయని భావిస్తున్నారు. పోలీసులు ఢిల్లీలో పలుచోట్ల విస్తృతంగా తనిఖీలు చేసి మరో పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

18:01 - May 5, 2016

కోల్ కతా : పశ్చిమ్‌బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఆరోదశలో భాగంగా ఇవాళ తూర్పు మిడ్నాపోర్‌, కూచ్‌ బిహార్‌ జిల్లాల్లోని 25 నియోజకవర్గాలకు ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 25 నియోజకవర్గాల్లో మొత్తం 170 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 58 లక్షల 4 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6 వేల 774 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 50వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన నందిగ్రామ్‌లో కూడా ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది. కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న నియోజకవర్గంగా నందిగ్రామ్‌కు పేరుంది.

 

17:58 - May 5, 2016

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీష్‌ రావత్‌కు సిబిఐ సమన్లు జారీ చేసింది. రావత్‌పై చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోపై ప్రశ్నించడానికి సీబీఐ ఆయనకు ఈ సమన్లు పంపింది. సోమవారం సిబిఐ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. హరీష్‌ రావత్‌ ఇటీవల ఎమ్మెల్యేల మద్దతు సంపాదించడానికి లంచం ఇవ్వజూపినట్లు స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తనపై వెల్లువెత్తిన ఆరోపణలను రావత్ ఖండించారు. స్టింగ్‌ ఆపరేషన్‌ ఫేక్‌ అని కొట్టి పారేశారు. తానేమైన తప్పులు చేస్తే బహిరంగంగా ఉరి తీయాలన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

 

17:56 - May 5, 2016

గుంటూరు : ఒకప్పుడు పల్నాడు అంటే పౌరుషానికి పేరు. పల్నాడు అనగానే గుర్తుకొచ్చేవి ఫ్యాక్షన్‌ గొడవలు, ముఠా తగువులు ,బాంబులు, కొడవళ్లు. అలాంటి ప్రాంతం ఇప్పుడు కరవుతో కొట్టుమిట్టాడుతోంది. అప్పుడు ప్రత్యర్ధులను మట్టుపెట్టడం కోసం పన్నిన విద్యలన్నీ, ఇప్పుడు బిందెడు నీళ్లు పట్టుకోవడం కోసం ఉపయోగించాల్సిన పరిస్థితి. పక్కనే ఉన్న కృష్ణమ్మ కూడా కరుణించని.. ..పల్నాడులో నీటి కష్టాలపై ప్రత్యేక కథనం....
పల్నాడులో తీవ్ర జలసంక్షోభం
మీరు చూస్తున్న ఈ దృశ్యాలు పల్నాడులోని మాచెర్ల మండలం చింతాడ గ్రామంలోనివి. నాగార్జున సాగర్‌కు సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నాగార్జున సాగర్,తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని లక్షల మంది దాహార్తిని తీర్చి, లక్షల ఎకరాల సాగుకు నీరందించించే అతి పెద్ద ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్‌ పక్కనే ఉన్నా గ్రామస్థులు నీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అవసరమైతే బిందెడు నీరు కోసం బంధువులను కొట్టి , పోలీసు స్టేషన్‌కు వెళుతున్న సందర్భాలున్నాయి. ఈ ప్రాంతంలో వారానికి ఒకటి, రెండుసార్లు వచ్చే నీటికోసం పడుతున్న కష్టాలు అన్ని, ఇన్నీకావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిందెలను వరుస క్రమంలో పెట్టాలి. ఇక ట్యాంకర్లలో నీరు వచ్చిందంటే పరిస్థితంతా మారిపోతుంది. బిందెలో నీరు నిండే వరకూ తోపులాటలు, తన్నులు, గొడవలు షరామామూలే.
నిష్ప్రయోజనంగా 12కు పైగా వాటర్‌పంపులు
చింతాడ గ్రామంలో దాదాపు 700 కుటుంబాలు నివాసముంటున్నాయి. మొత్తం 12కు పైగా వాటర్‌పంపులున్నా అవి పనిచెయ్యడం లేదు. గతంలో పంపులు పాడైతే, అందరూ కలిసి డబ్బులు పెట్టుకొని బాగు చేసుకునే వారు. ప్రస్తుతం పంపులన్నీ పూర్తిగా పాడైపోయాయి. ఇక గ్రామంలో ఉన్న రెండు వాటర్‌ ట్యాంకర్లకు నీరు ఎప్పుడొస్తుందో తెలీదు. నీళ్లు వచ్చాయంటే, గొడవలు జరగాల్సిందే. ముసలి వారు సైతం నీటి కోసం పోరాటం చెయ్యాల్సిందే. ఇంత పోరాటం చేసి సంపాదించుకున్న నీళ్లను దాదాపు 2కిలోమీటర్ల దూరం మోసుకుంటూ తీసుకువెళ్లాల్సిన పరిస్థితి.
అడుగంటుకుపోయిన భూగర్భజలాలు
మరోవైపు గ్రామానికి సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసినా ,అది అందుబాటులో లేదు. భూగర్భజలాలు అడుగంటుకు పోయాయి. పొలాల్లో ,గ్రామాల్లో ఎక్కడ బోర్లు వేసినా నీరు పడడం లేదు. తీవ్రమైన ఎండలతో పాటు , నాగార్జున సాగర్‌లో కూడా నీరు లేకపోవడంతో పల్నాడులో నీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ నీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని పల్నాడు వాసులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

17:52 - May 5, 2016

వరంగల్ : పల్లెల్లోనే కాదు ప్రభుత్వాస్పత్రులపైనా కరువు నీడలు కమ్ముకుంటున్నాయి. సర్కార్ దవాఖానాలు దాహం...దాహం అంటున్నాయి. రోగులు, వారి బంధువులు మండువేసవిలో నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందులేకాదు కాదు చివరకు మంచినీరు కూడా దొరకని పరిస్థితులు తలెత్తాయి. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వాటర్ ప్రాబ్లమ్స్‌పై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ.
వరంగల్ ఎంజీఎంలో తాగునీటి అవస్థలు
ఇదీ వరంగల్‌ జిల్లాలోని అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిలో నీటి కష్టాల తీరు. ఒక్క వరంగల్లేగాక ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాల నుంచి ప్రతినిత్యం ఇక్కడకు వేలాదిమంది రోగులు వస్తుంటారు. ఇంత పెద్దాస్పత్రిలో ప్రభుత్వం కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేకపోతోంది. 
జిల్లావ్యాప్తంగా పెరిగిన  ఉష్ణ్రోగ్రతలు స్ధాయి
ఆస్పత్రికి వచ్చే రోగులు అరకొర సౌకర్యాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో మందులే  కాదు..మంచినీరు కూడా ప్రియమే అయింది. ఒకపక్క జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి.. మరో పక్క ప్రభుత్వాసుపత్రుల్లో తాగునీటి కోసం రోగులు అవస్థలు పడుతున్నారు. సగటున ఒక్కో మనిషికి మధ్యాహ్న సమయంలో 3 నుంచి 4 లీటర్ల దాకా తాగు నీరు అవసరముండగా వేసవిలో మరింత ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోగులు, వారి బంధువులే  కాకుండా ఆస్పత్రి సిబ్బందికి కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. 
పనిచేయని దాతలు ఇచ్చిన కూలర్లు, ఫ్రిజ్‌లు
ఎంజీఎం ఆస్పత్రిలో తాగునీటి సమస్య తాండవమాడడానికి మరో కారణముంది. ఆస్పత్రి నిర్వాహకుల ధన దాహమే ఆ కారణం.. ఎంజీఎం ఆస్పత్రిలో దాతలు ఇచ్చిన కూలర్లు, ఫ్రిజ్‌లు పనిచేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తితో ఎంజీఎం అధికారులు కుమ్మకై నీటి వ్యాపారం చేస్తున్నారని ఇక్కడి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయికి 2 లీటర్లు అంటూ తాగునీటి పథకాన్ని పెట్టినా అధికారులు దాన్ని అమలు చేయడం లేదు. అది పాడై నెలలు గడుస్తున్నా రిపేరు చేయించకుండా బయటి వ్యక్తులకు అధికారులు సహకరిస్తూ నీటి వ్యాపారం చేస్తున్నారంటూ రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితి ఒక్క ఎంజీఎం ఆస్పత్రిలోనే కాదు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రులలోనూ తాగునీటి కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు.   
నిత్యం ఆస్పత్రికి వైద్యం కోసం వందలాది మంది మహిళలు
వరంగల్ జిల్లాలో ఎంజీఎంతో పాటు హన్మకొండలోని ప్రసూతి దవాఖానకు పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో తాగునీరే కాదు....ఇతరత్రా అవసరాలకూ నీరు లభించని దుస్థితి ఏర్పడింది. దీంతో రోగుల బంధువులు లీటరు బాటిల్‌కు 5 రూపాయల చొప్పున నీటి కోసమే రోజుకు 70 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. నీటి ఖర్చులు అదనపు భారంగా మారాయని అంటున్నారు. ఇక జిల్లాల్లోని పీహెచ్‌సీల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హన్మకొండలోని టీబీ ఆస్పత్రిలోనూ తాగునీటి కటకట నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు తాగునీటి సమస్యలను పరిష్కరించాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

17:44 - May 5, 2016

హైదరాబాద్ : కొత్త రాజధానికి తరలింపు విషయంలో తమ సమస్యలు పరిష్కారం కాలేదని.... మరో రెండు వారాల్లోపు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాల నేత మురళీ కృష్ణ అన్నారు. ఇప్పటివరకు తమ పిల్లల అడ్మిషన్లకు సంబంధించి ఆలస్యం అవుతోందని ఆయన అన్నారు. ఒకవేళ రెండు వారాల్లోపు సమస్యను పరిష్కరించకపోతే ఏం చేయాలనే దానిపై ప్రకటిస్తామన్నారు. జూన్‌ 27లోపు ఉద్యోగుల తరలింపుకు ఎలాంటి రూట్‌ మ్యాప్‌ ఖరారు కాలేదన్నారు.

 

బీటెక్ విద్యార్థిని దేవి బంధువుల ఆందోళన

హైదరాబాద్ : నగరంలో బీటెక్ విద్యార్థిని దేవి అనుమానాస్పద మృతి కేసులో బంధువులు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టు కాలనీలో ఉన్న బాధితురాలు దేవి ఇంటి నుంచి ఆమె బంధువులు, పెద్ద ఎత్తున మహిళా సంఘాల కార్యకర్తలు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ కు బయల్దేరారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు వారిని మధ్యంలోనే అడ్డుకున్నారు. నిందితుడిగా భావిస్తున్న భరత్ రెడ్డిని అరెస్టు చేయాలని దేవి బంధువులు, మహిళా సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

16:45 - May 5, 2016

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విద్యార్థిని దేవి కేసులో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ కేసులో ఒక్కొక్క అంశాన్ని విశ్లేషిస్తున్న పోలీసులకు ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబీకులు లేవనెత్తిన అనుమానాలు పోలీసులు ప్రాథమిక విచారణలో పలు అంశాలపై దృష్టిసారించారు. ఇదిలా ఉంటే నిందితుడిగా పేర్కొంటున్న భరత్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ మృతురాలు దేవి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధితురాలు దేవి ఇంటి నుంచి ఆమె బంధువులు, మహిళా సంఘాల కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు ర్యాలీగా బయలు దేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

 

 

 

 

 

కాచిగూడ రైల్వే స్టేషన్ లో వైఫై సేవలు ప్రారంభం

హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్ లో వైఫై సేవలు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీ నంచి వైఫై సేవలను రైల్వే మంత్రి ప్రారంభించారు. 

15:59 - May 5, 2016

ఢిల్లీ : నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు సుప్రీంలో గుజరాత్ ప్రభుత్వం వాదనలు తమ వాదనలు వినిపించింది. నీట్ పై విద్యార్థులకు మరింత సమయం కావాలని కోరింది. ప్రైవేట్ కాలేజీల తరపునకపిల్ సిబాల్ వాదించారు. రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదలాయించండని కోరారు. కర్నాటక వాదనలు వినింపించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తమ వాదనలు వినింపించనున్నాయి. వివిధ రాష్ట్రాల అడ్వకేట్లతో కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తీర్పును రిజర్వులో ఉంచే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నుంచే ఎగ్జిమ్షిన్ ఇచ్చే అవకాశం ఉంది. నీట్ మొదటి పరీక్ష మే 1న జరిగింది. రెండో పరీక్ష జూన్ 24 న జరుగనుంది.  

15:53 - May 5, 2016

ఢిల్లీ : జెఎన్ యూలో 8వ రోజు కన్హయ్యకుమార్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కన్హయ్య ఆరోగ్యం క్షీణించింది. చికిత్స నిమిత్తం ఆయన్ను జెఎన్ యూ హెల్త్ సెంటర్ కు తరలించారు. దీక్ష విరమించేది లేదని కన్హయ్య స్పష్టం చేశారు. సస్పెన్షన్, జరిమానాను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 27 నుంచి కన్హయ్య నిరవధిక దీక్ష చేపట్టారు. అయితే కన్హయ్య దీక్ష విరమింప చేసేందుకు వర్సిటీ యాజమాన్యం కానీ, వీసీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వర్సిటీ యాజమాన్యం కన్హయ్య దీక్షను చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జెఎన్ యూ అధ్యాపకులు కన్హయ్య దీక్షకు మద్దతుగా నిలిచారు. విదార్థులు మద్దతు ఇచ్చారు. టీచర్లు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. కన్హయ్యకుమార్ దీక్ష సరైందికాదని వీసీ చెప్పడాన్ని కన్హయ్యతోపాటు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.

 

ఎపికి ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ ప్రకటన

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదాపై లోక్ సభ లో అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. విభజన చట్టం ప్రకారం రూ.6403 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఎపికి తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.2800 కోట్లు ఇచ్చామని తెలిపారు. పోలవరానికి కూడా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వెనక్కి తగ్గబోమని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తామన్నారు. ఎపికి రావాల్సిన ప్రతి పైసా ఇస్తామని తెలిపారు. ఎపికి అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చామని పేర్కొన్నారు. రెవెన్యూ లోటుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. 

 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

నల్గొండ : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం సమీపంలో ఉన్న ఇక్కేరు వాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ యజమానులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

నీట్‌ నుంచి ఏపీకి, తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని వాదనలు

హైదరాబాద్ : నీట్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. నీట్‌ నుంచి ఏపీకి, తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని వాదనలు జరుగుతున్నాయి.

15:12 - May 5, 2016

మహారాష్ట్ర : ముంబైలో ఐదేళ్ల క్రితం ఇద్దరు యువకుల హత్య కేసులో కోర్టు నలుగురికి జీవిత ఖైదు విధించింది. అక్టోబర్‌ 20, 2011లో అంబోలి ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌ ముందు తమ గర్ల్‌ ఫ్రెండ్స్ ను వేధిస్తున్న నలుగురు పోకిరీలను కీనన్‌ సంతోష్, రూబెన్‌ ఫెర్నాండెజ్‌ నచ్చజెప్పే యత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ దుండగులు కొద్ది సేపటికే మరో పదిమందిని వెంటబెట్టుకుని వచ్చారు. అందరూ చూస్తుండగానే కీనన్‌ సంతోష్‌, రూబెన్‌ ఫెర్నాండెజ్‌ను కత్తులతో దారుణంగా పొడచి హత్య చేశారు. కీనన్‌ అదే రోజు మృతి చెందగా..రూబెన్‌ 10 రోజుల తర్వాత చనిపోయాడు. ఈ ఘటన జరుగుతుండగా దాదాపు 50 మంది అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ కూడా ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి సాహసించలేదు. ఆలస్యంగానైనా హంతకులకు జీవితఖైదు శిక్ష పడడంపై బాధిత కుటుంబాలు స్వాగతించాయి.

 

15:00 - May 5, 2016

విశాఖ : క్యూబాలో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న సీఐటీయూ సీనియర్‌ నేత నర్సింగరావు విశాఖకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఐటీయూ, సీపీఎం కార్యకర్తలు ఆయన్ను పుష్పగుచ్చాలతో అభినందించారు. క్యూబాలో జరిగిన మేడే ఉత్సవాలతోపాటు, ప్రపంచ కార్మిక సంఘాల సంఘీభావ సభలోను నర్సింగరావు పాల్గొన్నారు. మనదేశం నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే ఈ అవకాశం లభించగా ఇందులో నర్సింగరావు ఒకరు. క్యూబా పర్యటన అపూర్వ అనుభవాల్ని అందించిందని నర్సింగరావు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాటారు. 

14:51 - May 5, 2016

విజయనగరం : భూగర్భ జలాల నిల్వలు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సంరద్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాటారు. విజయనగరం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. భూగర్భ జలాలు మే నెలలో 4-5 మీటర్ల లోతులో ఉండేట్లు చూసుకోవాలన్నారు. పండ్ల తోటల పెంపకానికి విజయనగరం అనువైన జిల్లా అని పేర్కొన్నారు.

 

విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయనగరం : భూగర్భ జలాల నిల్వలు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సంరద్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాటారు. విజయనగరం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. భూగర్భ జలాలు మే నెలలో 4-5 మీటర్ల లోతులో ఉండేట్లు చూసుకోవాలన్నారు. పండ్ల తోటల పెంపకానికి విజయనగరం అనువైన జిల్లా అని పేర్కొన్నారు.

 

 

13:45 - May 5, 2016

ఖమ్మం : టిఆర్ ఎస్ ప్రజా సేవకన్నా పార్టీ ఫిరాయింపులపై ఆధారపడి పాలేరులో గెలవాలని చూస్తోందని సీపీఎఒ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విరుచుకుపడ్డారు. వామపక్షాలు బలపరిచిన సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ రావు గెలుపు కోసం వామపక్షాల నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'టెన్ టివి'తో రాఘవులు మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. 'పాలేరు ఉప ఎన్నికకు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, టిఆర్ ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు... వామపక్ష పోరాట విధానాలకి మధ్య ఉన్న సంఘర్షణ పాలేరు ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రతిపక్ష పాత పోషించలేక చతికలపడిందని... కాంగ్రెస్ శాసనసభకు వెళ్లినా... వెళ్లకపోయినా పెద్ద మార్పు లేదు. వామపక్షాల అభ్యర్థి సుదర్శన్ శాసనసభకు వెళ్లడమనేది పాలకపార్టీల దుర్మార్గాల్ని, ప్రజా వ్యతిరేక విధానాల్ని అడ్డుకట్ట వేసేందుకు ఉపయోగ పడుతుందని ప్రధానంగా ప్రచారంగా ఉంది. ప్రజలు దీని పట్ల స్పందిస్తున్నారు. టిఆర్ ఎస్ ప్రజా సేవకన్నా పార్టీ ఫిరాయింపులపై ఆధారపడి ప్రతిపక్షాల అభ్యర్థులను ఎరవేసి ఆకర్షించి... దానిపై ఆధారపడి బతకాలని ప్రయత్నం చేస్తోంది. టిఆర్ ఎస్ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలను కొని పాలేరులో డబ్బులు సంచులు తెచ్చి గెలిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవాలి.. దాని కోసం ఎన్నిరకాల పథకాలు వేయాలి... కోట్లు ఖర్చు పెట్టి ఎట్టా గెలవాలన్న వ్యూహం తప్ప.. రాష్ట్రంలో కరువు ఎలా ఉంది.. రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకోకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలనే కార్యక్రమాలకు టిఆర్ ఎస్ విలువ ఇవ్వడంలేదు. అదే ప్రధానమైన ప్రచారాంశంగా ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు,.. వామపక్ష ప్రజా పోరాటలకు మధ్య పాలేరు ఉప ఎన్నిక జరుగుతుందని.. దానికి ప్రజలు వామపక్షాలకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. అందుకే టిఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను డబ్బుల సంచులతో దించి ప్రలోభాలకు లోబరుచుకుని నాయకులను కొని గెలవాలని ప్రయత్నం చేస్తోంది. పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని రాఘవులు పేర్కొన్నారు. కరువును కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. వామపక్షాల పోరాటాలే తమ అభ్యర్థిని గెలిపిస్తుందని చాడ స్పష్టం చేశారు.

స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలోనే స్పైస్‌జెట్‌ విమానం నిలిపివేశారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తిరుపతి వెళ్లాల్సిన 70 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

13:22 - May 5, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురాకుంటే సీఎం చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. .కేంద్రమంత్రి సుజనాచౌదరి మారిషష్ బ్యాంక్ కు రూ.100 కోట్ల ఎగవేసినందుకు ఆరెస్ట్ కాకుండా ఉండేందుకు బీజేపీలో కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అంబటి మండి పడ్డారు. 

13:20 - May 5, 2016

విజయవాడ : ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడిందని సిపిఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు మేల్కొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని అవసరమైతే ప్రతిపక్షాల సాయం తీసుకుని ఆందోళనకు దిగాలని సూచించారు.

 

13:14 - May 5, 2016

ఢిల్లీ : విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తాం, ఏపీకి రావాల్సిన ప్రతి పైసా ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా లోక్ సభలో అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేశారు. ఏపికి చెందిన నిధులపై కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందని, విభజన చట్టం ప్రకారం రూ.6403 కోట్లు, తొలి ఏడాది రెవన్యూ లోటు రూ.2800 కోట్లు, పోలవరానికి నిధులు కేటాయిచామని జైట్లీ తెలిపారు. పోలవరం నిర్మాణంపై కేంద్రం వెనక్కి తగ్గే ప్రశక్తి లేదన్నారు.

 

విభజన చట్టంలోని అంశాలు అమలు చేస్తాం: జైట్లీ

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేశారు. ఏపికి చెందిన నిధులపై కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందని, విభజన చట్టం ప్రకారం రూ.6403 కోట్లు, తొలి ఏడాది రెవన్యూ లోటు రూ.2800 కోట్లు, పోలవరానికి నిధులు కేటాయిచామని జైట్లీ తెలిపారు. పోలవరం నిర్మాణంపై కేంద్రం వెనక్కి తగ్గే ప్రశక్తి లేదన్నారు.

 

12:36 - May 5, 2016

విజయనగరం : జిల్లాలో సిఎం చంద్రబాబు పాల్గొనాల్సిన బహిరంగ సభకు భారీ వర్షం మూలంగా అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం, ఈదురు గాలుల మూలంగా సభా స్థలిలో టెంట్లు.. ఇతరత్రా ఏర్పాట్లు ధ్వంసమయ్యాయి. దీంతో చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేయాల్సొచ్చింది. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నీరు చెట్టు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం డెంకాడ మండలం సింగవరంలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. వర్షం కారణంగా సభాస్థలి పాడవడంతో ఉదయం జరగాల్సిన ఈ సమావేశాన్ని మధ్యాహ్నానికి మార్చారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయిస్తున్నారు.

12:33 - May 5, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇద్దరు కలసి వారి స్వంత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆరోపించారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లో గాంధీ భవన్ లో గాంధీవిగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ... రాజ్యసభ సీటు కోసం మోడీ వద్ద సాగిలపడ్డారా అని వెంకయ్యనాయుడు ను ప్రశ్నించారు. ఏపీలో 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలను మంటలను కలుపుతారా అని వెంకయ్యనాయుడును ప్రశ్నించారు. ఓటు కు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళతారని మోడీ కాళ్ల మీద పడి ప్రత్యేక హోదా పై నోరు మెదపడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి హోదా పై ఆందోళన చేయాలని డిమాండ్ చేశారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభంచిందని మాట్లాడుతున్న వారు పార్లమెంట్ జరిగిన ఓటింగ్ లో మీరు ఓటు వేయకపోతే తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఉండేదా అన్ని రఘువీరా ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసి కేంద్రమే నిధులు కేటాయించాలని, విశాఖ- చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయడం, దుగరాజపట్నంలో ఓడరేవు పెట్టాలనడం అడ్డగోలు విభజనా అని ప్రశ్నించారు. 

కేరళ నిర్భయ బాధితురాలి ఒంటిపై 38 కత్తిపోట్లు...

హైదరాబాద్: కేరళలో దారుణ లైంగిక దాడి, అనంతరం హత్యకు గురైన దళిత యువతి ఒంటిపైన..అంతర్భాగాల్లో మొత్తం 38 చిన్నాపెద్ద గాయాలయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఓ న్యాయవిద్యార్థినిపై లైంగికదాడి.. అనంతరం కత్తిపోట్లతో హత్య జరిగిన విషయం తెలిసిందే. లైంగిక దాడికి పాల్పడిన వారు చాలా దారుణంగా వ్యవహరించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు.

రాజకీయ రంగు పులుముకున్న 'కబాలి'

హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి 'కబాలి' చిత్రం టీజర్ రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు తాజాగా తమిళనాడు రాజకీయాల్లో వణుకుపుట్టిస్తోంది. ఈ టీజర్ ను కొద్దిపాటి మార్పులు చేసి కొంతమంది యువకులు ప్రస్తుత రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ మార్పు చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 

మాల్యాను దోషిగా తేల్చిన కోర్టు...

హైదరాబాద్ :హైదరాబాద్‌: పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా చెక్‌బౌన్స్‌ కేసు విచారణను హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టు ఈనెల 7కి వాయిదా వేసింది. జీఎంఆర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. విజయ్‌మాల్యా దేశం విడిచి వెళ్లారు, కోర్టుకు హాజరవుతారనే నమ్మకం లేదన్నారు. 15 చెక్‌ బౌన్స్‌ కేసుల్లో విజయ్‌మాల్యా నిందితుడని, రూ.22.5 కోట్లకు మాల్యా చెక్‌ బౌన్స్‌ అయ్యారని వెల్లడించారు. భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయిపడిన విజయ్‌మాల్యా ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న విషయం తెలిసిందే.

11:51 - May 5, 2016

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంత పొలాల్లో రైతులు హీరో పవన్ కళ్యాణ్ ఫెక్సీలు ఏర్పాటు చేశారు. ఏపీ రాజధాని నగర ప్రాంతమైన ఉండవల్లి, పెనుమాకలలో ప్రభుత్వం రాజధానికి భూసేకరణ జరుపుతుందనే వార్తలతో ఆ ప్రాంత రైతులు ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు.  రాజధానికి అవసరం లేని భూములను రైతుల వద్ద నుండి బలవంతంగా తీసుకుంటే తాను రైతుల తరపున అండగా నిలబడి నిరాహార దీక్ష చేస్తానని గతంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారనీ..ఇప్పుడు ఈ అంశంపై పవన్ స్పందించాలని ఆప్రాంత రైతులు కోరుతున్నారు. మాట ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకుంటారని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

11:30 - May 5, 2016

హైదరాబాద్  : కింగ్‌ఫిషర్‌ అధినేత విజయమాల్యాకు మెడకు మరో ఉచ్చు బిగిసింది. విజయ్‌మాల్యా చెక్‌బౌన్స్ కేసుపై కాసేపట్లో ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించనుంది.కోట్ల బకాయిలపై జీఎంఆర్ సంస్థ11 కేసులు వేసింది. ఈ కేసులో విజయ్‌మాల్యాను ఎర్రమంజిల్ కోర్టు దోషిగా తేల్చింది.

11:21 - May 5, 2016

విజయవాడ : ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వలేని తేల్చి చెప్పినా కేంద్ర మంత్రులుగా టిడిపి వారు కొనసాగడం దురదృష్టకరమని.. వెంటనే కేంద్ర మంత్రులు మంత్రివర్గం నుండి బయటు రావాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన సందర్భంగా వామపక్ష కార్యకర్తల అక్రమ అరెస్టు చేసి తన నిజస్వరూపం చూపించారని మండి పడ్డారు. ఇప్పటికైన చంద్రబాబు వైఖరి మార్చుకుని... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్ర మంత్రి వర్గం నుండి ఉపసంహరించుకోవాలి. లేదా హోదా రాదని చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నమ్మక ద్రోహిగా పురంధ్రేశ్వరిని ముందు పెట్టి బిజెపి ఆడే డ్రామా ఆడుతోందని... ఏపీలో బిజెపికి సమాధి కట్టబోతున్నారని పేర్కొన్నారు.

ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైయివర్...

అనంతపురం : బస్టాండ్ లో ఆర్టీసీ డ్రైవర్ రంగనాయకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగనాయకులు మృతికి ఉరవకొండ డిపో మేనేజర్ వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను కనికరించిన వరుణుడు.....

హైదరాబాద్ : భానుడి భగభగలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు వరుణుడి రాకతో ఊపిరి పీల్చుకోనున్నారు. నాలుగు రోజుల క్రితం వ‌ర‌కు మ‌ధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే జంకిన ప్ర‌జ‌లు ఇప్పుడు చ‌ల్ల‌ని వాతావర‌ణాన్ని చూస్తున్నారు. ఈదురు గాలుల‌తో ప‌డుతోన్న వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు కొన‌సాగుతాయ‌ని, భారీ వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ కేంద్ర అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణ‌లో ఉరుములతో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. ప‌లు జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన‌ వర్షాలు కొన‌సాగుతాయ‌ని చెప్పారు.

ఈదురు గాలులకు 18 మంది మృతి...

హైదరాబాద్ : మయన్మార్‌లో గత కొన్ని రోజులుగా భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. మయన్మార్‌లోని రెండో అతి పెద్ద నగరమైన మాండలేలో ఈదురుగాలుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 18 మంది మృతిచెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈదురుగాలుల ధాటికి 1,417 ఇళ్లు, 61 భవనాలు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మయన్మార్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కెనడాలోని అల్బర్టా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధింపు..

అల్బర్టా : కెనడాలోని అల్బర్టా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. ఫోర్ట్ మెక్‌ముర్రే నగరంలో వ్యాపిస్తున్న దావానం వల్ల సుమారు 88 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరించారు. రానున్న 24 గంటలు కీలకమైనవన్నారు. శరవేగంగా వ్యాపిస్తున్న దావానలం వల్ల ఇప్పటివరకు 1600 ఇండ్లు దగ్ధం అయ్యాయి. అల్బర్టా రాష్ట్రం చరిత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే ప్రథమం.

 

10:39 - May 5, 2016

హైదరాబాద్ : రజనీకాంత్‌ సినిమా అంటే తమిళనాటే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. ఆయన తాజాగా గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించిన చిత్రం ‘కబాలి’. ఈ సినిమా టీజర్‌ ఈ నెల 1న విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ టీజర్‌ రికార్డుల మోతమోగిస్తుంది. ఇప్పటివరకూ కబాలి టీజర్‌ను వీక్షించిన వారి సంఖ్య కోటి దాటేసింది. దటీజ్ ‘రజనీ' అనేలా టీజర్ వుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ చిత్రాల్లో ఏ టీజర్‌కు ఇప్పటివరకూ ఈ స్థాయి స్పందన రాలేద’’ని చిత్ర వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 66 సెకన్ల ఈ టీజర్‌లో వృద్ధ గ్యాంగ్‌స్టర్‌గా రజనీ చెప్పిన డైలాగు ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్‌ చివర్లో యువకుడిగా కనిపించి అలరించారు రజనీ. పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

10:35 - May 5, 2016

ముల్లంగి (ర్యాడిష్) ఆ పేరు వింటేనే మూడు ఆమడల దూరం పరుగెడతారని సామెత. కానీ ఆ ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మన సొంతం. ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును . ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి. ఆ వివరాలు తెలిస్తే, వాటిని ఏదో ఒక రూపంలో తినడానికి ప్రయత్నిస్తాం. జీర్ణశక్తిని వృద్ధి చేస్తూ శరీరంలో నీరు నిలిచేలా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిగ్రస్తులకు ముల్లంగి చక్కని ఔషధమే. మూత్రపిండాలను ఆరోగ్యంగా వుంచమే కాదు శరీర బరువును తగ్గించేందుకు మల్లంగి ఎంతగానో ఉపయోగపడుతంది.

సి విటమిన్, ఫోలిక్ యాసిడ్, యాంథోసియానిక్ లు ముల్లంగిలో ఉన్నందువల్ల తరచూ దీనిని తీసుకుంటే కేన్సర్ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చు.

ముల్లంగి గుజ్జు ముఖానికి మంచి తేజస్సునిస్తుంది.

ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది.

ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండీస్ నివారణకు ఉపయోగిస్తారు.

మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది.

రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.

జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి.

దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అధిక కఫాన్ని నియంత్రిస్తుంది.

రక్తంలోని వ్యర్థాలను తొలగించి... రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది.

ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి.

ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడే వారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.

ముల్లంగి తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగం. విరేచనాలకు విరుగుడులా పని చేస్తుంది.

పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగా రసం చాలా అద్భుతంగా పని చేస్తుంది. 

10:30 - May 5, 2016

కరీంనగర్ :  జిల్లాలలో తాగునీరు లేక జనాలు అల్లాడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో .. ప్రధాన జలవనరులు ఎండిపోవడంతో నీటికి తీవ్రఎద్దడి మొదలైంది. బిందెడు నీళ్ళకోసం కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో పల్లెలు, పట్టణాలు అలమటిస్తున్నాయి.

ఎడారులను తలసిస్తున్న చెరువులు, వాగులు..

అడుగంటిన భూగర్భజలాలు ఇదీ కరీంనగర్ జిల్లా పరిస్థితి. కరీంనగర్ జిల్లా జలవనరులకు, పాడిపంటలకు పెట్టింది పేరు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 38 లక్షల మంది జనాభాకు దాదాపు 51.44 కోట్ల లీటర్ల తాగునీరు అవసరం. గతంలో కంటే జనాభా పెరగడం, ప్రాంతాలు విస్తరించడం... నీటి వినియోగం పెరుగుతుండటంతో.. ప్రజల అవసరాలకు సరిపడా నీరు ప్రస్తుతం దొరికే పరిస్థితి జిల్లాలో లేకుండా పోయింది. జిల్లాలో 2 నగరపాలక, 4 పురపాలక, 5 నగర పంచాయతీలు ఉన్నాయి. పట్టణాలతోపాటు గ్రామాల్లో మంచినీటి సరఫరా జరుగుతోంది. ప్రజలకు సరిపడా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం 20 వేల 327 చేతిపంపులు, 2 వేల 65 గ్రామాల్లో నీటిపథకాలను, 16 సామూహిక రక్షిత మంచినీటి పథకాల ద్వారా నీటిని అందిస్తోంది. అయితే గ్రామస్థాయిలో చెరువులు, కుంటలు, బావుల్లో నీరు అడుగంటిపోవడం, వాగులు, వంకలు ఎండిపోవడంతో తాజాగా కరవుపరిస్థితులు నెలకొన్నాయి.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో అడుగంటిన నీరు .....

2013 నుంచి వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోవడంతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా లేకపోవడంతో ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం కనిష్ట స్థాయికిపడిపోయింది. శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, ఎల్ఎండి, ఎల్లంపల్లి, నంది మేడారం చెరువు, ఎల్.మడుగు, ధర్మసముద్రం నుంచి ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుంది. నిత్యం నీటితో కళకళలాడే ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం కళావిహీనంగా తయారై ఎడారులను తలపిస్తున్నాయి.

గ్రామాల్లో 15 - 20 మీటర్ల లోతులో  భూగర్భజలాలు.....

మారిన వాతవరణపరిస్థితుల కారణంగా 20 నుండి 25 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడంతో.. భవిష్యత్తు పై ఆందోళన మొదలైంది. చాలా వరకు గ్రామాల్లో 15 - 20 మీటర్ల వరకు భూగర్భజలాలు పడిపోయాయి. వర్షభావం లేక నీటి వినియోగం పెరగడంతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతలకు భూగర్భజలాలు ఆవిరైపోతున్నాయని జలవనరులశాఖ అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులలో చుక్కనీరు లేకపోవడం..గ్రామాలలో బోరు బావులు అడుగంటడంతో తాగునీటికి తీవ్ర కష్టాలు మొదలయ్యాయి. గెక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

10:23 - May 5, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ లో వంద‌రోజుల ప్రణాళిక నీరుగారుతోందా.. ప‌నుల పురోగ‌తి న‌త్తనడకను త‌ల‌పిస్తుందా..నిత్యం ఉన్నతాధికారులు స‌మీక్షించినా.. వ‌ర్క్స్ స్పిడప్ కావ‌డం లేదా అంటే అవున‌నే అంటున్నాయి జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్ విభాగం చెప్పిన లెక్కలు చూస్తుంటే.

పేరు గొప్ప ఊరు దిబ్బగా గ్రేటర్ ప్రణాళిక.....

నానాటికి గ్రేటర్ పని తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారవుతోంది. గ్రేట‌ర్ లో వంద‌రోజుల్లో పలు పనులను పూర్తి చేయాలని నిర్ణయించి ప్రారంభించారు. కాని వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్క ప‌ని కూడా పూర్తికాలేదు. మొదలుపెట్టిన పనులకు ఇప్పటి వ‌ర‌కు 75 రోజులు పూర్తయ్యాయి. అయినా పనులలో ఏ మార్పు రాలేదు.

ముందుకు సాగని బీటీ రోడ్ వర్క్స్ ....

200 కోట్లతో 569 బీటీ రోడ్ వ‌ర్క్స్ వంద‌రోజుల్లోనే పూర్తి చేయ్యాల‌న్నది మొద‌టి ల‌క్ష్యం. అయితే ఇందులో కేవ‌లం 223 ప‌నులు మాత్రమే ప్రారంభించిన అధికారులు ఏ ఒక్క ప‌నిని పూర్తిచేయలేదు. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం 39 శాతం ప‌నులు పూర్తి అయ్యాయని తెలిపారు. కాని వాస్తవానికి ఏ ఒక్క పని పూర్తికాలేదు. ఇక వ‌ర్షాకాలానికంటే ముందే నగరంలోని అన్ని నాలాల‌ను శుభ్రం చేయాలని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రణాళికలు వేశారు అధికారులు. సిటీలోని 734 కి.మీ మేర ఉన్న నాలాల‌ను 22 కోట్ల 79 ల‌క్షల‌తో 317 నాలాల ప‌నులు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. కాని ఇప్పటి వ‌రకు మొద‌ల‌య్యింది 159 ప‌నులు మాత్రమే. ఇంకా 104 నాలాల ప‌నులు టెండ‌ర్ల దశ‌లోనే ఉన్నాయి. మ‌రో 54 ప‌నుల‌కు ఇప్పటికి టెండ‌ర్లు పిలవ‌నేలేదు.

న‌గ‌రంలో బ‌స్ బేల‌కు కేవలం 15 మాత్రమే ....

న‌గ‌రంలోని 50 ప్రాంతాల్లో బ‌స్ బేల‌ను అభివృద్ది చేయడానికి ప్లాన్ చేశారు. ఇందులో 15 మాత్రమే పూర్తయ్యాయి. వంద‌రోజుల్లో 100 టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. కాని ఎక్కడ అవి ఏర్పాటు కాలేదు. 212 పార్కుల్లో పిల్లల ఆట‌వ‌స్తువుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయిస్తే.. కేవ‌లం 70 పార్కుల్లో మాత్రమే ప‌నులు పూర్తి చేశారు గ్రేట‌ర్ ఇంజ‌నీరింగ్ అధికారులు. కేవ‌లం 30 నుంచి 40 శాతం ప‌నులు 70 రోజుల్లో పూర్తిచేస్తే.. మిగిలిన 25 రోజుల్లో 60 శాతం ప‌నులు పూర్తి చేస్తారా.. లేక 100 రోజుల్లో మొత్తం ప‌నులను అట‌కెక్కిస్తారా అనేది మ‌రో 25 రోజుల్లో తేలిపోనుంది.

10:08 - May 5, 2016

హైదరాబాద్ : ఛత్తీస్ ఘఢ్ మృతుల సంఖ్య పెరిగింది. 15కు పెరిగింది. తెల్లవారుఝామున బర్లంపూర్ వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 35 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 15కుపెరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

జీజీహెచ్ లో 15 మంది సిబ్బందిపై వేటు....

గుంటూరు : ప్రభుత్వా ఆసుపత్రి (జీజీహెచ్) లో 15 మంది సిబ్బందిపై వేటు పడింది. బాలింతల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న పదిహేను మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈమేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆదేశించారు. కాగా, జీజీహెచ్ లో లేబర్ వార్డులో సిబ్బంది ఆగడాలను తట్టుకోలేని 12 మంది బాలింతలు ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడుతున్న వారిపై వేటు పడినట్లు సమాచారం.

బాలికపై ఎమ్మెల్యే లైంగిక దాడి....

హైదరాబాద్ : గోవాలో బాలికపై కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో సెయింట్ క్రూజ్ కు చెందిన అటానాసియో మోన్సిరేట్ అనే ఎమ్మెల్యే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోవా ఎస్పీ ఎస్పీ కార్తిక్ కష్యప్ తెలిపాడు. ఎనిమిదేళ్ల కిందట.. ఈయన కుమారుడు కూడా ఓ జర్మనీకి చెందిన మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా గత ఏడాది ఈయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఆమె ఆరోగ్య పరిస్థతిపై వివరాలు మాత్రం ప్రస్తుతం గోప్యత అవసరం' అని పోలీసులు చెప్పారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు..

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం పలువురు రాజకీయం ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తదితరులతో కలసి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఏఈవో కె.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌సాయిరెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

బాబు విజయనగర పర్యటనలో స్వల్ప మార్పు...

విజయనగరం : డెంకాడ మండలం సింగవరంలో బుధవారం రాత్రి వచ్చిన గాలివానకు సీఎం చంద్రబాబు పాల్గొనాల్సిన బహిరంగ సభా వేదిక దెబ్బతిన్నది. దీంతో ముఖ్యమంత్రి షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పు చోటుచేసుకుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కొత్త చెరువును సందర్శించి తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుధవారం రాత్రి వచ్చిన గాలివానకు సభావేదిక వద్ద ప్రజలు కూర్చునేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లు, టెంట్లు కూలిపోయాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు చేపట్టారు.

09:36 - May 5, 2016

హైదరాబాద్ : తెలంగాణా రాజకీయ ముఖచిత్రంలో వైసీపీది ఇప్పుడు గత చరిత్రే. రాష్ట్రంలో ఆ పార్టీ దుకాణం మూసేసింది. వైసీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు గతంలోనే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫ్యాన్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కేశారు. ఇక మిగిలిన ఒక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా గులాబీ గూటికి చేరుకున్నారు. వీరిద్దరూ బుధవారం కేసీఆర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. స్పాట్...

పాలేరు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని...

ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ ఇటీవల నిర్వహించిన ప్లీనరీలోనే వైసీపీ విలీనం అవుతుందన్న ప్రచారం జరిగినా....అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్లీనరీ తర్వాత ఇద్దరినీ కారెక్కించుకుంది. జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని గులాబి పార్టీ అధినేత వైసీపీ ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ఆ పార్టీ ఇప్పుడు అధికారపార్టీ లో చేరి టిఆర్ఎస్ కు జై కొడుతోంది.

టిఆర్ స్ లో చేరిన అన్ని జిల్లాల నేతలు...

తెలంగాణాలోని అన్ని జిల్లాలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున కారెక్కారు. ఆరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు జడ్పీటీసీలు, పలువురు ఎంపీపీలు, ఇతర నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

టిఆర్ ఎస్ లో చేరిన నేతలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించారు. మొత్తానికి అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ దెబ్బకు తెలంగాణలో వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. 

08:58 - May 5, 2016

ఆ విలువలను పాటిస్తూ మరికొంత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు దర్శకుడు క్రిష్‌. జాతీయ అవార్డుతోపాటు పొందిన నగదును బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కి విరాళంగా ఇచ్చి క్రిష్‌ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' చిత్రం 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన విషయం విదితమే. వీటికి సంబంధించి మంగళవారం అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా క్రిష్‌ జాతీయ అవార్డుని అందుకున్నారు. ఈ అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదుని కూడా అందజేశారు. ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ,'నా తల్లితోపాటు ఎంతో మంది క్యాన్సర్‌ బాధితులకు అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నందుకు అవార్డు నగదును బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కు విరాళంగా ఇచ్చాను' అని అన్నారు. క్రిష్‌ ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'కి దర్శకత్వం వహిస్తున్నారు.

08:56 - May 5, 2016

హైదరాబాద్ : రెసిడెన్షియల్ స్కూళ్లలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న 776 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడెక్కడ స్కూళ్లు ఏర్పాటు చేయాలన్న అంశంపై మార్గదర్శకాలు జారీ చేశారు. అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో, ఇప్పటికీ ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల లేని మండలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 100 రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను విడతల వారీగా ఏర్పాటు చేసేలా కార్యచరణ రూపొందించారు. ఎక్కడెక్కడ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న అంశంపై మార్గదర్శకాలను రూపొందించింది ప్రభుత్వం. ఒక్క రెసిడెన్షియల్ స్కూలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు సీఎం. SC రిజర్వడ్ నియోజకవర్గాల్లో కనీసం 2 నుంచి 3 రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పాలన్నారు.

776 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ కు సీఎం ఆదేశాలు ...

ఇక ఏళ్ల తరబడి రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 776 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, అదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో అడ్మిషన్ల కోసం అధిక డిమాండ్ ఉన్నందున.. ఆయా జిల్లాల్లో తగిన సంఖ్యలో పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. బాలిక పాఠశాలలు పట్టణ ప్రాంతాలకు దగ్గర్లో ఉండాలన్నారు. ఇక డిగ్రీ కాలేజీలను పట్టణాలు,యూనివర్సిటీలకు దగ్గర్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యా ప్రమాణాలు పెంచేందుకు కొత్త పాఠశాలలు ఉపయోగపడతాయి : కేసీఆర్

విద్యా ప్రమాణాలు పెంచేందుకు కొత్త పాఠశాలలు ఉపయోగపడతాయన్నారు సీఎం. అదే సందర్భంలో కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా నెలకొల్పనున్న ఈ పాఠశాలలు..బంగారు తెలంగాణకు బాటలు వేస్తాయని ఆకాక్షించారు కేసీఆర్. 

08:47 - May 5, 2016

హైదరాబాద్  : సర్కార్ బడుల మూసివేతపై సుప్రీంకోర్టు వేసిన జేకే రాజు కమిటి ఇవాళ్టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనుంది. ఇప్పటికే మూసివేతకు దగ్గర్లో వున్న స్కూళ్ల పరిస్థితులపై ఈ కమిటి అధ్యయనం చేయనుంది. నాలుగు వారాల్లో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. అసలు అత్యున్నత న్యాయస్థానమే ఈ కమిటీని వేయడానికి కారణం ఏంటి?

సర్కారీ బడుల్లో ఉన్న పరిస్థితులేంటి...

సర్కార్ బడుల మూతకు తెలుగు ప్రభుత్వాలు రెండు రెడీ అవుతుండడంతో దీనిపై సుప్రీం కోర్టు సీరియస్‌గా ఉంది. మూసివేతపై అసలు నిజాలేంటో తెలుసుకునేందుకు నిజనిర్ధారణ బృందాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు పంపుతోంది. గత నెల 14న తీర్పులో ఈ టీమ్ ఇరు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి నాలుగు వారాల పాటు కమిటీ పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అయితే రెండు రాష్ట్రాల్లో మొత్తం పదివేల వరకు సర్కారీ బడులను మూసివేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణాలో 4వేల 5వందల స్కూల్స్, ఏపిలో 5వేల 200 కు పైగా స్కూళ్లను మూసివేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటికే సుప్రీంలో తెలంగాణా పేరెంట్స్ ఫౌండేషన్ పేరుతో పిటిషన్లు నమోదు అయ్యాయి.మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లు అస్థవ్యస్థంగా ఉన్నాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విద్యాశాఖ లో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని ఈ వాజ్యం లో పేర్కొన్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు లేని పాఠశాలల వివరాలను అసెంబ్లీ సాక్షిగానే ప్రకటించింది. కానీ ఏపీ ఇంతవరకు అటువంటి బడుల వివరాలను బహిర్గత పరచలేదు.

10మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ 3వేలకు పైగా...

తెలంగాణాలో సున్నా నుంచి 10మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ దాదాపుగా 3వేలకు పైగా ఉన్నాయి. 20లోపు మొత్తం 4వేలకు పైగా ఉన్నాయి. ఏపీలో కూడా దాదాపుగా ఇవే లెక్కలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వాలు ఉన్నఫళంగా సర్కారీ బడులను మూసివేసే ప్రయత్నం చేయడంతో సుప్రీం దీనిపై విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి దాదాపు నాలుగు వారాల పాటు ఇరు రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. స్కూళ్ల పరిస్థితులతో పాటుగా తల్లిదండ్రులను కలిసి వివరాలను ఈ బృందాలు సేకరిస్తాయి. 

ఇంటిపై తెగిపడ్డ హైటెన్షన్ విద్యుత్ వైర్లు :6గురు మృతి

పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంటిపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

08:41 - May 5, 2016

హైదరాబాద్ : నెలన్నర రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు కొన్ని చోట్ల అకాల వర్షాలతో ఉపశమనం పొందుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం సతమతమవుతున్నారు. ఉదయం పూట సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే సాయంత్రానికి వరుణుడు విజృంభిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది.ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొన్ని ప్రాంతాల ప్రజలు అకాల వర్షాలతో కాస్తంత ఉపశమనం పొందినా.. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. జంటనగరాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులు బలంగా వీయడంతో ఇంటిపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయాయి. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం వల్ల కొన్ని గ్రామాలు అతలాకుతలంగా మారాయి. మరోవైపు జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో ఎండలు బాగా ఉండడం వల్ల ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. అయితే ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో ధాన్యం మొత్తం నీటిపాలయ్యింది. దీంతో కష్టపడి పండించిన ధాన్యం మొత్తం ఇలా నీటి పాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.తెలంగాణలో విపరీతమైన ఎండలకు తోడు అకాల వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అకాల వర్షాలకు రైతుల నడ్డి విరిగుతోంది. 

నేడు విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయనగరం : సీఎం చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టరు ఎం.ఎం.నాయక్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబు ఉదయం 10.50 డెంకాడ మండలం సింగవరం గ్రామం చేరుకొని ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో భాగంగా పూడికతీత పనులు పరిశీలిస్తారు. అనంతరం జిల్లాలో 351 కిలోమీటర్లు చంద్రన్నబాట పనుల పైలాన్‌ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.45 తరువాత సింగవరం నుంచి బయలుదేరి విజయనగరం పోలీస్‌ బ్యారెక్స్‌కు చేరుకుంటారు.

08:36 - May 5, 2016

హైదరాబాద్ : ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బర్లంపూర్ సమీపంలోని బర్లంపూర్ వద్ద ఓ ప్రయివేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బర్లంపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

08:30 - May 5, 2016

తూ.గోదావరి : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అపచారం జరిగింది. స్వామివారి వివాహ ఆహ్వాన పత్రికలో తప్పులు దొర్లాయి. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా అధికారులు ప్రవర్తించారనీ....ప్రశ్నించినవారిపై అధికారులు నిర్లక్ష్యంతో కూడిన సమాధానాలు చెబుతున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

07:45 - May 5, 2016

హైదరాబాద్ : గత ఏడేళ్లలో మునుపెన్నడూలేనిరీతిలో మన దేశంలో ఉద్యోగ కల్పనా రేటు ఘోరంగా పడిపోయినట్టు గణాంకాలతో వెల్లడించింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ చక్కటి అభివ్రుద్ధిని నమోదు చేస్తున్నా, ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదు? ఉద్యోగ కల్పనా రేటు పడిపోవడానికి కారణం ఏమిటి? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే తక్షణం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావుగారు విజయవాడ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్రంగా సమాచరాం తెలుసుకోండి.

07:39 - May 5, 2016

హైదరాబాద్ : మెట్రో రైలు వస్తే ట్రాఫిక్‌ కష్టం తీరుతుందన్న హైదరాబాదీల ఆశలు అడియాసలే అవుతున్నాయి. మెట్రో సర్వీసు మరోసారి వాయిదా పడింది. జూన్‌ నాటికి మెట్రో సేవలు అందుబాటులోకి తెస్తామన్న ఎల్‌అండ్‌టీ అధికారులు,.. మరోసారి ప్రజలను నిరుత్సాహపరిచారు.

ఆలస్యమవుతున్న మెట్రోపనులు...

ప్రభుత్వంతో ముందుగా కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం మెట్రో రైలు పనులు సాగడం లేదు. ఇప్పటి వరకు మూడు దశల్లో 30 కి.మీ. నిర్మాణం పూర్తిచేసి, మెట్రోను పరుగులు తీయించాల్సి ఉంది. కానీ నాగోల్‌-శిల్పారామం మార్గంలో మెట్టుగూడ వరకు కేవలం 8 కి.మీ. మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈమార్గంలో మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు 10 కి.మీ. మార్గాన్ని 2015 నవంబర్‌ 14 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మియాపూర్‌-ఎల్‌బీ నగర్‌ మార్గంలో... ఎస్‌ఆర్‌ నగర్‌ వరకు 12 కి.మీ. మార్గం 2015 ఆగస్టు 15 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాలేదు. . ఇక మూడో మార్గమైన ఫలక్‌నుమా-జేబీఎస్‌ రూట్‌లో పనులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. పూర్తైన ప్రాంతాల మధ్య మెట్రో రైళ్లు నడిపేందుకు రైల్వే భద్రతా కమిషనర్‌ నుంచి కూడా అనుమతి రాలేదు. వచ్చే జూన్‌ లేదా జులైలో రైల్వే భద్రతా కమిషనర్‌ పూర్తైన మార్గాలను పరిశీలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిని బట్టిచూస్తే జూన్‌లో మెట్రో రన్‌ కష్టమేనని స్పష్టమవుతోంది.

ప్రభుత్వానికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు నిర్మాణ సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందం..

ప్రభుత్వానికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు నిర్మాణ సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2017 జూన్‌ నాటికి మూడు మార్గాల్లో 72 కి.మీ. పూర్తి చేయాల్సి ఉంది. కానీ రైట్‌ ఆఫ్‌ వే... నిర్మాణానికి అవసరమైన భూ సేకరించి ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేసిందన్న కారణంతో నిర్మాణ సంస్థ ఇప్పుడు ఒప్పంద గడువును 2018 డిసెంబర్‌ వరకు పొడిగించాలని కోరుతోంది. మెట్రో నిర్మాణమార్గాల్లో అలైన్‌మెంట్‌ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి, దీనిపై సర్వేలు చేయడం కూడా జాప్యానికి కారణమయ్యిందని ఎల్‌ అండ్‌ టీ సంస్థ అధికారులు చెబుతున్నారు. చారిత్రక కట్టడాలకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంలో మొజాంజాహీ మార్కెట్‌, నాంపల్లి-అసెంబ్లీ, పాతబస్తీ చార్‌మినార్‌, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతాల్లో అలైన్‌మెంట్‌ మార్చాలని ప్రతిపాదించినా.. మళ్లీ పాతమార్గంలోనే పనులు చేపట్టాలని నిర్ణయించడం కూడా జాప్యానికి కారణమయ్యిందని చెబుతున్నారు. అయితే చార్‌మినార్‌ దగ్గర మెట్రోమార్గం మళ్లింపుపై మాత్రం ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో .. తాము పాత ఒప్పందం ప్రకారమే పనులు చేస్తామని ఎల్‌ అండ్‌ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ఎండీగా పనిచేస్తున్న వీఎన్‌ గాడ్గిల్‌ ఈనెలాఖరుతో రిటైర్‌ కానున్నారు. ఈయన స్థానంలో శివానంద నింబర్గే కొత్త ఎండీగా నియమితులయ్యారు. ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని నింబర్గే చెబుతున్నారు. ఒప్పందం పొడిగింపుపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఎల్‌ అండ్‌ టీ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

 

బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

కోల్ కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఆరవ, చివరిదైన ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండు జిల్లాల్లోని 25 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. గత అనుభవాల దృష్ట్యా ఎన్నికల అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు.

అబ్దుల్ కలాం అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం..

హైదరాబాద్ : ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు అబ్దుల్‌ కలాం స్మార ప్రతిభ అవార్డు, ఉపకార వేతనం కోరే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అబ్దుల్‌ కలాం వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు షేక్‌ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. 4నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే గణితం, సైన్స్‌పై పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియం విద్యార్థలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

07:32 - May 5, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రెవెన్యూ లోటు భర్తీ గురించి విభజన చట్టంలో లేదని..ప్రత్యేక హోదా కోసం నిబంధనలు మార్చలేమని జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. నీతి ఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కేంద్రం తీరుపై ఏపీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇవ్వలేదా? వెంకయ్య నాయుడు ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారా? ప్రత్యేక హోదా పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? విభజన చట్టం ప్రత్యేక హోదా లేదని హామీ ఇచ్చే ముందు తెలియదా? కేంద్ర మంత్రి వర్గం నుండి ఏపీ మంత్రులు బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజల మనోభావాలతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి నేత సూర్య ప్రకాశ్, బిజెపి నేత ఎస్ కుమార్, కాంగ్రెస్ నేత రామశర్మ పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

07:30 - May 5, 2016

మూడు దశాబ్దాలు.. 400 సినిమాలు.. ఇది గుణచిత్రనటుడు నాజర్‌ నటప్రస్థానం. కె.బాలచందర్‌ రూపొందించిన ‘కల్యాణ అగాదిగల్‌’ ద్వారా వెండితెరకు పరిచయమైన నాజర్‌ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంగ్ల భాషలోనూ సినిమాలు చేశారు. ప్రస్తుతం నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నాజర్‌కి తాజాగా చెన్నై వేల్స్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఈ నెల 7న నాజర్‌ ఈ గౌరవాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా నాజర్‌ మాట్లాడుతూ ‘ఇదంతా నాకు సర్‌ప్రైజ్‌లా ఉంది. చాలా సంతోషంగానూ, ఉద్వేగభరితంగానూ అనిపిస్తోంది.ఇది నేను ఊహించని గౌరవం. దీనికి నేనెంతవరకు అర్హుడినో తెలియదు. ఇప్పటివరకు నాకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూనే వచ్చాను. బహుశా అదే ఈ గౌరవానికి కారణంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా బాధ్యతలు మరింత పెరిగాయి. ఇకమీదట మరింత జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటాను. మా అమ్మనాన్నలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను’ అని తెలిపారు.

నేటి నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై సేవలు..

హైదరాబాద్ : డిజిటల్ రైల్, డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కాచిగూడ రైల్వేస్టేషన్‌లో నేడు ఉచిత హైస్పీడ్ వైఫైని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 18 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాచిగూడ, విజయవాడ స్టేషన్లు ఉన్నాయి. న్యూఢిల్లీ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభాకర్ ప్రభు నేడు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

07:23 - May 5, 2016

విశాఖ : కొయ్యూరు మండలం మర్రిపాఠవలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు - మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి ఆయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నారు.

07:13 - May 5, 2016

రాను రానంటూనే చిన్నదో అన్న పాట చందాన చేయను చేయను అంటూ మడి కట్టుకు కూర్చున్న నటి రాయ్‌లక్ష్మి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు లెగ్ షేక్ చేయడానికి సిద్ధం అయిపోయారు. ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌లో ఆడి పాడి దుమ్మురేపారు. అయితే ఐటమ్ సాంగ్‌లో నటించమని చాలా అవకాశాలు వచ్చినా ససేమిరా అన్నారు. అలాంటిది తాజాగా రాఘవ లారెన్స్‌తో సింగిల్ సాంగ్‌లో ఇరగదీశారు. ఇంతకు ముందు కాంచన చిత్రంలో ఆయనకు జంటగా నటించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాయ్‌లక్ష్మి కాంచన-2లో కూడా తనకే హీరోయిన్ అవకాశం వస్తుందని ఆశించారు. అయితే అలా జరగలేదు. అలాగే ఆ తరువాత ఆమెకు సరైన హిట్ కూడా రాలేదు. అవకాశాలు కూడా అంతగా లేక పోవడంతో తెలుగులో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌కు రెడీ అన్నారు. ఇక తమిళంలో రాఘవ లారెన్స్ అడగడంతో నో అని చెప్పలేకపోయారట. వీరిద్దరి ఐటమ్ సాంగ్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న మొట్టశివ కెట్టశివ చిత్రంలో చూడబోతున్నామన్న మాట. తెలుగు చిత్రం పటాస్‌కు రీమేక్‌గా తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. సాయిరమణి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లారెన్స్‌కు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ఇకపై రాయ్‌లక్ష్మిని మరిన్ని చిత్రాలలో ఐటమ్‌గాళ్ గా చూసే అవకాశం ఉంటుందని భావించవచ్చంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

07:12 - May 5, 2016

శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు కేంద్ర మధ్యవర్తిత్వంతోనే పరిష్కారమవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించినంత మేర సహాయం అందడంలేదని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

నాగావళి, వంశధార నదులను అనుసంధానం : చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేసి తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తొలుతగా రూరల్ మండలంలోని కిల్లిపాలెం వద్ద పది కోట్ల రూపాయలతో నిర్మించిన సురక్షిత త్రాగునీటి పధకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్, అందరికీ వంట గ్యాస్ అందించడమే రానున్న రోజుల్లో లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.అలాగే సాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి తాగునీరందిస్తామన్నారు. మద్దివలస, తోటపల్లి, వంశధార ప్రాజెక్టులను వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనంతరం సీఎం నీరు - ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటిపారుదలపై జిల్లా రైతుల్లో చైతన్యం రావాలన్నారు. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం అందడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం హామీలు నెరవేర్చకపోయినా కష్టపడి లక్ష్యాలను సాధిస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్నారు. రాత్రి శ్రీకాకుళంలోనే బస చేసి రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 13 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.

07:05 - May 5, 2016

 రాకెట్‌ చేతబట్టి ఏస్‌లు సంధించే భారత టెన్నిస్‌ స్టార్‌ సాని యా మీర్జా ఇప్పుడు కలం పట్టింది. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమించిన సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా సహకారంతో సానియా ఈ స్వీయచరిత్ర రాస్తోంది. 'ఏస్‌ ఎగైనెస్ట్‌ ఆడ్స్‌' పేరుతో ఈ పుస్తకాన్ని జులైలో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని ప్రచు రణకర్త హార్పర్‌ కొలిన్స్‌ బుధవారం తెలిపారు. ‘సానియా కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించింది. ఆమె ఆటో బయోగ్రఫీ యువతకు ప్రేరణగా నిలుస్తుంది. ఆమెతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నామ’ని అన్నారు. ఇక త్వరలో విడుదల కానున్న తన పుస్తకంపై సానియా స్పందిస్తూ.. ‘భారతలోని తర్వాతి తరం టెన్నిస్‌ ప్లేయర్లకు ఈ పుస్తకం రోడ్‌ మ్యాప్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాని, నా కథ స్ఫూర్తితో కనీసం ఒక్కరైనా గ్రాండ్‌స్లామ్‌ గెలిస్తే సంతోషిస్తాన’ని తెలిపింది. హార్పర్‌ కాలిన్స్‌ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తుంది. ప్రస్తుత ప్రపంచ డబుల్స్‌ ర్యాంక్‌ల్లో నంబర్‌వన్‌స్థానంలో ఉన్న సానియా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ స్థానానికి చేరుకుంది. 16వ ఏటనే వింబుల్డన్‌ టోర్నిలో బాలికల డబుల్స్‌ టైటిల్‌ను గెలుచు కుని అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది. తరువాత కొద్దికాలంలోనే భారత్‌ సింగిల్స్‌, డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. 2012లో సింగిల్స్‌కు వీడ్కోలు పలికిన సానియా డబుల్స్‌పైనే దృష్టిపెట్టి ఈ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకుంది. ముఖ్యంగా 2015 ఆగష్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకూ సానియా అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోయింది. మార్టిన్‌ హింగీస్‌తో కలిసి వరసగా 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సానియా తన కెరీర్‌లో 8 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. 2010, 2012లో గాయాల బారీన పడ్డా కోలుకుని రాణించింది. విజయా లతో పాటు వివాదాలను ఎదుర్కొంది. ఆమెకు దేశభక్తి లేదని కొంతమంది విమర్శించారు. వీటికి తన ఆటతోనే సానియా జవాబు చెప్పింది. క్రీడాకారిణిగా తాను ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు, వ్యక్తిగత విషయాలను ఈ పుస్తకంలో సానియా పొందుపర్చనుంది. 'భారత్‌లో రాబోయే టెన్నిస్‌ క్రీడాకారులకు ఈ పుస్తకం ఒక గైడ్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నా కథతో స్పూర్తి పోంది కనీసం ఒక్క క్రీడాకారుడైన భవిష్యత్‌లో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను' అని 29 ఏళ్ల సానియా తెలిపింది. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010లో మీర్జా వివాహం చేసుకుంది. దేశంలో టెన్నిస్‌కు కొత్త గుర్తింపు తెచ్చిన సానియాకు అర్జున (2004), పద్మశ్రీ (2006), పద్మ భూషణ్‌ (2016) అవార్డులు లభించాయి. అలాగే భారత్‌లో అత్యున్నత క్రీడాపురాస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డును సానియా గత ఏడాదిలో అందుకుంది.

07:04 - May 5, 2016

శ్రీకాకుళం : ఇటీవల సెటైర్ లు రివర్స్ ఎటాక్ ల తర్వాత ఇప్పుడిప్పుడే కలుస్తున్న ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్థం మొదలైంది. పడుకున్న పులిని లేపొద్దంటూ కేసీఆర్.. నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దంటూ చంద్రబాబు మాటల తూటాలు పేల్చారు.                                                              

ప్రాజెక్టు విషయంలో రాద్దాంం చేస్తే ఊరుకోం: కేసీఆర్

తమకు పక్క రాష్ట్రాలతో కలిసి ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ ప్రాజెక్టుల విషయంలో రాద్ధాంతం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నప్పుడు, తమకు తీసుకునే అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నేతలకు అభ్యంతరం ఏమిటో తెలియడం లేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణపై యుద్ధం ప్రకటించారని కేసీఆర్‌ ఆరోపించారు. మేము మాత్రమే బతకాలి.. మీరు బతకొద్దు అనే ఉద్దేశంతో ఏపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాలు ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు, జగన్‌కు తెలియడం లేదన్నారు. కూర్చున్న బెబ్బులిని తట్టి లేపితే.. మీరే భంగపడతారని హెచ్చరించారు కేసీఆర్. జీవో ప్రకారమే గోదావరి, కృష్ణా జలాల వినియోగానికి ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేశారు. ఆరునూరైనా సరే.. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని ఉద్ఘాటించారు.

దిగువన ఉన్న తమకు నీటి లభ్యత కూడా తక్కువగానే ఉంటుందని.. ఎట్టిపరిస్థితుల్లోను దామాషా ప్రకారం నీటిని ఒడిసి పట్టుకుంటామని స్పష్టం చేశారు బాబు.

కేసీఆర్‌ ఇష్టానుసారంగా మాట్లాడటం తగదు : చంద్రబాబు

ఏపీ పై కేసీఆర్‌ ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాలు దామాషా ప్రకారం నీటిని పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

ఇప్పుడిప్పుడే మాటలు కలుస్తున్న తరుణంలో ఇరు రాష్ట్రాల సీఎం మద్య చిచ్చు రగులుతోంది. జగన్ పెట్టిన కుంపటి ఇద్దరు సీఎంలకు తాకింది. దీంతో సానుకూలంగా ముందుకు వెళ్తున్న వారి మద్య మరోసారి అగ్ని రాజుకుంది.

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం 12 మంది మృతి...

ఖమ్మం : బర్లంపూర్ -అంబికాపూర్ ఎన్ హెచ్ సమీపంలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి. 35 మందికి గాయాలయ్యాయి.

06:40 - May 5, 2016

ఎండలు మండే కాలంలో సూర్య ప్రతాపానికి చర్మం నల్లగా మారిపోవడం సహజం. దీన్నే టాన్‌ అంటారు. ఎండకు జిడ్డు పేరుకుపోయి.. చర్మం కాంతి విహీనంగా మారుతుంది. మరి ఈ సమస్య పోవాలంటే మనకు అందుబాటులో ఉన్నవాటితోనే పరిష్కారం ఉంటుంది అంటున్నారు నిపుణులు..

టమాటా

రెండు టమాటాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసి అరగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. టమాటాల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మం మీద నలుపును దూరం చేస్తాయి. మృతకణాల్నీ తొలగిస్తాయి. ఈ టమాటా గుజ్జు సన్‌స్క్రీన్‌ లోషన్‌లాగా పనిచేస్తుంది.

కీర దోస

కీరదోస రసానికి గ్లిజరిన్‌, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే టాన్‌ పోవడమే కాక.. చర్మం రంగు మెరుగవుతుంది కూడా.

కలబంద

నిమ్మరసంలో కొద్దిగా కలబంద గుజ్జును కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా వేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగి, ఆ తర్వాత ఐస్‌ క్యూబ్స్‌తో సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల కమిలిన చర్మానికి పునరుజ్జీవం వస్తుంది. కొన్నిరోజులు ఇలా చేస్తుంటే నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.

బంగాళాదుంప

బంగాళాదుంపల్ని మెత్తని గుజ్జులా చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ, చేతులు మసాజ్‌ చేసుకోవాలి. ఆరిపోయాక కడిగేసుకోవాలి. బంగాళాదుంపలోని టాన్‌ తగ్గించే గుణాలు మిన్న. దీనివల్ల చర్మాన్ని శుభ్రం చేసి మురికిని దూరం చేస్తాయి.

శెనగపిండి

రెండు చెంచాల శెనగపిండిలో చెంచా పసుపు, కొంచెం పాలు, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలపాలి. దీనితో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పసుపు ముఖం మీద మురికిని తొలగిస్తే, శెనగపిండి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. రెండురోజులకు ఒకసారి ఈ ప్యాక్‌ని వేస్తే టాన్‌ పూర్తిగా తొలగిపోతుంది.

గంధం

రోజ్‌వాటర్‌లో, రెండు చెంచాల గంధం పొడి కలిపి, ఎండలోంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. గంధం చర్మానికి తేమను అందించి, వేడిని బయటకు పంపుతుంది. దీంతో చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

ఓట్‌ మీల్‌

కొద్దిగా చిక్కని మజ్జిగ తీసుకుని, అందులో మూడు చెంచాల ఓట్స్‌ వేయాలి. కాసేపు నానిన తర్వాత ఈ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. మజ్జిగ చర్మానికి చల్లదనాన్నీ, తేమనీ అందిస్తే, ఓట్స్‌ మృతకణజాలాన్ని, టాన్‌నీ పోగొడుతుంది.

కొబ్బరి నీళ్లు....

మురికిని పోగొట్టుకోవడానికి మరో సులవైన పద్ధతి.. కొబ్బరి నీళ్లు. ముఖాన్నీ, చేతుల్నీ కొబ్బరినీళ్లతో కడుక్కుంటే నలుపుదనం పోతుంది. చర్మం మృదువుగా మారుతుంది.

ముల్తానీ మట్టి

రెండు చెంచాల కలబంద గుజ్జును తీసుకుని, అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలపాలి. ఈ పేస్టును కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. అరగంటయ్యాక చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

06:31 - May 5, 2016

వేసవిలో తీవ్రమైన ఎండ వేడిని తట్టుకునేందుకు శరీరం అదనంగా శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి తోడు వేడిని తట్టుకునేందుకుగాను నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం సక్రమంగా అందదు. ఇలాంటి కారణాలన్నీ వెరసి రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి ఎంత తగ్గితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో డీ హైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. డీ హైడ్రేషన్‌కు తక్షణం స్పందించకపోతే నేరుగా ప్రాణాపాయం సంభవించే అవకాశంతో పాటు శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో వైద్యం అందకపోతే దీని ఫలితమూ మరణానికి దారితీయవచ్చు. డీ హైడ్రేషన్‌కు గురైన వారిలో కిడ్నీల్లోనూ, లివర్‌లోనూ రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. కిడ్నీలో రక్తం గడ్డ కడితే యూరియా, క్రియాటిన్‌ స్థాయిలు పెరిగి కిడ్నీలు పనిచేయవు. సకాలంలో వైద్యం అందకపోతే రీనల్‌ ఫెయిల్యూర్‌ సంభవించి, చివరకు డయాలసిస్‌కు దారి తీస్తుంది. లివర్‌లో రక్తం గడ్డకడితే కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్లల్లోనూ, ముఖంలోనూ నీరు చేరి వాపులు వస్తాయి. ఈ క్రమం చివరకు లివర్‌ ఫెయిల్యూర్‌ వరకూ వెళ్లవచ్చు. తక్షణం సంబంధిత వైద్యం అందకపోతే లివర్‌ మార్పిడికి, కొన్ని సందర్భాలలో, మరణానికి దారితీయవచ్చు. వడదెబ్బ తగిలితే నీళ్లు తాగితే సరిపోతుంది అని తేలిగ్గా తీసుకోకుండా డీ హైడ్రేషన్‌కు గురికాకుండా నిత్యం జాగ్రత్తగా ఉండడం అవసరం. మధుమేహం ఉన్నవారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నందున, వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

'అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదు'

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వేస్తున్నారా? అన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పార్లమెంట్‌ సమాధానమిస్తూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన రాలేదు. ఒక వేళ వస్తే, అన్ని వనరులు సహకరిస్తే, అవసరమైతే రాజధాని ఎక్స్‌ప్రెస్‌పై ఆలోచిస్తామన్నారు.

నేడు బెంగాల్లో తుది విడత పోలింగ్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో గురువారం చిట్టచివరిదైన ఆరవ దశ పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. రెండు జిల్లాలు తూర్పు మిడ్నపూర్‌, కూబ్‌ బిహార్‌ల్లోని 25 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. 58లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. 

Don't Miss