Activities calendar

06 May 2016

22:18 - May 6, 2016

అతివలు మెచ్చే వెరైటీ శారీస్ ను ఇవాళ్టి సొగసులో చూద్దాం.. పూర్తి వివరాలను వీడియోలో చూడండి... 

22:15 - May 6, 2016

మహిళలు... ఆత్మరక్షణ పద్ధతులను వీడియోలో చూద్దాం...

22:13 - May 6, 2016

మహిళా వార్తల సమామారం మానివి న్యూస్. మహిళలకు సంబంధించిన పలు వార్తలను వీడియోలో చూడండి.. 

ఉప్పల్ స్టేడియంలో క్రికెటర్లకు ఇబ్బంది కలిగించిన పురుగులు

హైదరాబాద్‌ : ఐపీఎల్ 2016లో భాగంగా హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్ కు పురుగులు ఇబ్బందికరంగా పరిణమించాయి. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన జోరు వానతో సాయంత్రానికి పురుగులు భారీ సంఖ్యలో చేరాయి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో అవి స్వైర విహారం చేస్తుండడంతో ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు, అంపెయిర్లు, ప్రేక్షకులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెటర్లు తమ ముఖంపైకి వస్తున్న పురుగులను పక్కకు నెడుతూనే ఆటను కొనసాగిస్తున్నారు.

21:50 - May 6, 2016

ఖమ్మం : హైదరాబాద్‌లో కురిసిన అకాల వర్షంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమీషనర్లతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రోడ్లపై నిలిచిపోయిన వాన నీటిని దాదాపుగా క్లియర్ చేసినట్లు మంత్రికి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. అకాల వర్షానికి సుమారుగా మూడు వందల చెట్లు నేల కూలినట్లు...230 చోట్ల వర్షపు నీరు నిలిచినట్లు మంత్రికి తెలిపారు. నగరంలో కేవలం 7 సెంటీ మీటర్ల వర్షపాతానికే ఇలాంటి పరిస్ధితి వచ్చిందన్న మంత్రి, ఇలాంటి పరిస్ధితి వస్తే వివిధ శాఖల మధ్య సమన్వయంతో ఒక శాశ్వత మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 

21:38 - May 6, 2016

విశాఖ : విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ.. వైసీపీ ఎంపీలు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి వాల్తేరు డివిజన్‌ను వేరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. దేశంలో రైల్వే జోన్ లేని ఏకైక రాష్ట్రం ఏపీయేనని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరినట్టు మేకపాటి తెలిపారు.

21:30 - May 6, 2016

శాపల శెర్వుకు సెక్యూరిటీ, కులం పేరుతోని గుడి కాడ అవుమానం, లాఠీకి పని జెప్పిన సర్కిల్ ఇన్స్ పెక్టర్, తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లు, ఆడామె బట్టలు ఇడ్పిచ్చిన సన్నాసి....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

21:28 - May 6, 2016

'24' సినిమా రిలీజ్ అయిన విజయవంతంగా నుడుస్తోంది. ఈ సందర్భంగా సినీ నటుడు సూర్య,  అజయ్ లు మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సూర్య సినిమా విశేషాలను వివరించారు. చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు. సినిమాను తప్పకుండా చూడాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

 

21:22 - May 6, 2016

ఢిల్లీ : జెఎన్ యూ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. రాష్ట్రపతితో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జెడీయూ, ఎంసీపీ, బీజేడీ ఎంపీలు భేటీ అయ్యారు. కన్హయ్యకుమార్ సహా ఇతర విద్యార్థులపై సస్పెన్షన్, జరిమానా ఎత్తివేసేలా చూడాలని ఎంపీలు కోరారు. విద్యార్థులు 9 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోని వీసీపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, జెడీయూ నుంచి త్యాగిలు భేటీలో పాల్గొన్నారు. 

 

తెలంగాణలో వైసీపీ ఖాళీ...

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షంలో తెలంగాణ వైసీపీ విలీనమైంది. టీఆర్‌ఎస్‌ఎల్పీలో వైసీపీని విలీనం చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ రాయడంతో.. దాన్ని స్పీకర్ మధుసూదనాచారి పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. విలీనానికి సంబంధించిన బులెటిన్‌ను శాసనసభ అధికారులు విడుదల చేశారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు వైసీపీ నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో తెలంగాణలో వైసీపీ ఖాళీ అయింది. 

 

రేపటితో ముగియనున్న ఓయూ సెట్ నోటిఫికేషన్ గడువు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఓయూ సెట్ నోటిఫికేషన్ గడువు ఈ నెల 7తో ముగియనుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 450, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 350లుగా పరీక్ష ఫీజు నిర్ణయించారు. పరీక్ష ఫీజును టీఎస్/ఏపీ ఆన్‌లైన్‌లో లేదా క్రెడిట్/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అపరాధ రుసుము రూ. 500లతో ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి.

మధ్యాహ్న భోజనం వికటించి ఇద్దరు విద్యార్థులు, వర్కర్‌ మృతి

ఆగ్రా : ఆగ్రాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఇద్దరు విద్యార్థులు, వర్కర్‌ మృతి చెందగా, 127 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో ఇచ్చే పాలు విషపూరితమైనట్టు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

19:55 - May 6, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షంలో తెలంగాణ వైసీపీ విలీనమైంది. టీఆర్‌ఎస్‌ఎల్పీలో వైసీపీని విలీనం చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ రాయడంతో.. దాన్ని స్పీకర్ మధుసూదనాచారి పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. విలీనానికి సంబంధించిన బులెటిన్‌ను శాసనసభ అధికారులు విడుదల చేశారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు వైసీపీ నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో తెలంగాణలో వైసీపీ ఖాళీ అయింది. 

 

మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : టీమిండియా టెస్టు కెఫ్టెన్‌ విరాట్ కోహ్లీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లో ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఎవరూ నియంత్రించలేరని చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది క్రికెటర్ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయమని... దానిని గుర్తించడం కష్టమని చెప్పుకొచ్చాడు. జట్టులో ఒక్క ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినంత మాత్రాన జట్టు మొత్తాన్ని నిందించడం సరికాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా ఉండటానికి అథారిటీ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ... క్రికెటర్ ఉండే రూమ్‌లోకి వెళ్లి ఏం జరుగుతుందో చూసేంత అవకాశం ఉండదని కోహ్లీ చెప్పాడు. తాను చేస్తుంది న్యాయమా..

లండన్ కు తొలిసారిగా ముస్లిం మేయర్‌...?

లండన్‌ : లండన్ లో తొలిసారిగా ముస్లిం వ్యక్తి మేయర్‌ పదవిని చేపట్టడానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన సాధిక్‌ ఖాన్‌ మేయర్‌ పదవిని చేపట్టబోతున్నారు. ఈయన జోర్డాన్‌ బ్రౌన్‌ ప్రభుత్వంలో రవాణాశాఖమంత్రిగా పని చేశారు. కాగా హిందూ, ముస్లిం ఓట్లను రాబట్టడానికి ఖాన్‌ మోడీ జపాన్ని అనుసరించారు. ఈయన సాలిసిటర్‌ సాదియా అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. 

ఫంక్షన్లలో నీటి వృథాపై బాంబే హైకోర్టులో పిటిషన్‌

ముంబయి : పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో నీటిని వృథా చేస్తే అట్టి ఫంక్షన్లను ఆపాలని మహారాష్ట్రలోని మరట్వాడా, విదర్బ రీజియన్ల కలెకర్లను బాంబే హైకోర్టు ఆదేశించింది. ఫంక్షన్లలో నీటి వృథాపై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది. మరట్వాడా, విదర్బ ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు....

హైదరాబాద్ : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే దానికి అనుబంధంగా తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెదరాబాద్ వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. ఒకటి,రెండు చోట్ల ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక చోట్ల ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

విద్యార్థిని దేవీ మృతి కేసులో భరత్‌సింహారెడ్డిని విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని దేవీ మృతి కేసులో నిందితుడు భరత్‌సింహారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. భరత్‌సింహారెడ్డిని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. భరత్‌ను పశ్చిమజోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిర్మారెడ్డి విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు దేవి, భరత్ ఫోన్‌కాల్స్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నెట్‌వర్క్ సిగ్నల్స్, ప్రదేశం, కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనాస్థలంలో భరత్ సహా మరో ఇద్దరు ఉండొచ్చన్న అనుమానంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

19:32 - May 6, 2016

చిల్లర డాన్సులు, ఫైట్లు, ఛీప్ కామెడీతో నిండిన సినిమాలు మన ప్రాంతీయ భాషా చిత్రాలను చులకన చేస్తున్నాయి. కానీ వందలో ఒకటిగా వినూత్న ఆలోచనలతో వచ్చే 24లాంటి సినిమాలు మళ్లీ మన గౌరవాన్ని నిలబెడుతున్నాయి. విశ్వ సమస్తానికి కారణ భూతమైన సమయాన్ని ఆపగలిగితే, వెనక్కి, ముందుకు పంపించగలిగితే మనిషి అద్భుతాలు చేయగలడు, చూడగలడు. ఈ అంశాన్ని మూలకథగా ఎంచుకుని దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఒక బ్రిలియెంట్ అండ్ బ్యూటిఫుల్ సినిమాను తెరకెక్కించాడు.
కథ..
24 కథను చూస్తే...శివకుమార్, ఆత్రేయ కవలలు. ఒకరు పేరున్న శాస్త్రవేత్త కాగా..మరొకరు స్వార్థానికి మారుపేరు. శివకుమార్ ఏళ్ల పాటు కష్టపడి ఒక అద్భుతమైన వాచ్ ను తయారుచేస్తాడు. ఆ వాచ్ తో కాలంలో ప్రయాణించవచ్చు. ఈ విషయం తెల్సుకున్న ఆత్రేయ తమ్ముడు శివకుమార్ ను అతని భార్యను చంపి ఆ వాచ్ చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. అన్న క్రూరత్వం తెలిసిన శివకుమార్ తన నెలల కొడుకుతో పాటు వాచ్ ఉంచి వేరే ఒక మహిళకు ఇస్తాడు. భార్యతో సహా శివకుమార్ ను చంపిన ఆత్రేయకు వాచ్ దొరకదు. దీంతో నిరాశపడతాడు. ఆ గొడవలో జరిగిన ప్రమాదంలో ఆత్రేయ గాయాల పాలై కోమాలోకి వెళ్తాడు. వేరే మహిళ చేతికి చేరిన శివకుమార్ కొడుకు పెరిగి హీరో సూర్య అవుతాడు. శివకుమార్ తయారు చేసిన వాచ్ వీళ్లింట్లోనే నిరుపయోగంగా పడి ఉంటుంది. ఒకరోజు ఈ వాచ్ చేసే అద్భుతాన్ని తెల్సుకుంటాడు సూర్య. సమంతను ప్రేమలో పడేసేందుకు వాచ్ ను వాడుకుంటాడు. ఈ లోగా కోమాలోంచి బయటకు వచ్చిన ఆత్రేయ ఆ వాచ్ కోసం మళ్లీ వేట మొదలుపెడతాడు. అది సూర్య దగ్గర ఉందని తెల్సుకుని దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరి ఈ అరుదైన వాచ్ విలన్ చేతికి చిక్కకుండా సూర్య ఎలా కాపాడాడు. తండ్రిని , తల్లిని చంపిన ఆత్రేయపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది మిగిలిన కథ.
విశ్లేషణ...
తన ప్రతి సినిమాను విభిన్నంగా రూపొందించే దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ కథను అరుదైన ఆలోచనతో తెరకెక్కించాడు. కథలో చాలా సంక్లిష్టత ఉన్నా...చాలా క్లారిటీగా స్క్రీన్ ప్లే అల్లాడు. దశాబ్దాల కిందటి వాతావారణాన్ని సహజంగా సృష్టించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రేమ పరిచయమే...., మనసుకే మధువువే అని సాగే పాటలు బాగున్నాయి. ఇక నటనలో సూర్య అరుదైన ప్రతిభను చూపించాడు. సైంటిస్ట్ శివకుమార్, విలన్ ఆత్రేయ, కొడుకు పాత్రల్లో వైవిధ్యంగా నటించాడు. సమంత అప్పీయరెన్స్ ప్లెజంట్ గా ఉంది. ఐతే మనం సినిమాలోలా నటనకు ఎక్కువగా అవకాశం లేని పాత్ర సమంతది. సెకండాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్, సమంత సూర్య మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు తగ్గిస్తే సినిమా ఇంకా బలంగా తయారయేది. ఎక్కువైన సినిమా నిడివి మరో మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఈ లోపాలు వదిలేస్తే 24 కాలదోషం పట్టని సినిమాగా మిగిలిపోతుంది.

ఫ్లస్ పాయింట్స్

సూర్య నటన

అరుదైన కథ

స్క్రీన్ ప్లే

ప్రొడక్షన్ వ్యాల్యూస్

సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ లో కొన్ని సీన్స్

సినిమా నిడివి

టెన్ టివి రేటింగ్... 2.75/5

 

19:15 - May 6, 2016

కృష్ణా : తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే.. కృష్ణా డేల్టా దెబ్బతింటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గన్నవరం సమీపంలోని బ్రహ్మయ్య లింగం చెరువులో పూడికతీత పనులను సీఎం ప్రారంభించారు. నీటి పొదుపు వల్లే భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎక్కడికక్కడ నీటిని ఆపేస్తే చాలా సమస్యలు వస్తాయిని తెలిపారు.

 

19:10 - May 6, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు జంట నగరాల మంచినీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు సరఫరా తగ్గిపోతోంది. దీంతో మంచినీటి ఎద్దడి తీవ్రమవుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన అటు అధికారులు...  ఇటు పాలకుల్లో.. వ్యక్తమవుతోంది. 
దాహంతో పరితపించిపిస్తున్న నగరవాసులు
తెలంగాణలో కరాళ నృత్యం చేస్తున్న కరవు... జంట నగరాల ప్రజలు దాహంతో పరితపించిపోయేలా చేస్తోంది. ఉన్న రెండు చెరువులు... గండిపేట, హిమాయత్‌ సాగర్‌ ఎండిపోయాయి. సింగూరు, మంజీరా నదుల పరిస్థితీ అంతే. జంటనగరాల మంచినీటి అవసరాలకు ప్రధానమైన  ఈ నాలుగు   వనరుల్లో చుక్కనీరు లేకపోవడంతో గొంతెండే పరిస్థితి వచ్చింది. 
జంట నగరాలకు కృష్ణా, గోదావరి జలాలే కీలకం 
జంట నగరాలకు ప్రస్తుతం కృష్ణా, గోదావరి  జలాలే కీలకంగా మారాయి. కృష్ణా మూడు దశల్లో  రోజువారీగా 270 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం  262 మిలియన్‌ గ్యాలన్ల  నీరే అందుతోంది. గోదావరి నుంచి ఎల్లపల్లి జలాయం ద్వారా 172 ఎంజీడీల నీరు అందాల్సి ఉండగా... ప్రస్తుతం 86 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతోంది.  ఈరెండు నదుల నుంచి అందుతున్న నీరు 348 ఎంజీడీలు. గ్రేటర్‌ ప్రజల రోజువారీ అవసరాలకు 450  మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరం. డిమాండ్‌ సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసం 102 ఎంజీడీలు. దీంతో చాలా ప్రాంతాలకు మంచినీరు అందని పరిస్థితి నెలకొంది. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌ వంటి ప్రాంతాలకు  ప్రతిరోజు నీరు సరఫరా చేస్తున్నా... చాలా ప్రాంతాలకు మూడు, నాలుగు రోజులకు ఒకసారి అందిస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని చాలా కాలనీలకు ఇంకా పైపులైను సౌకర్యం లేకపోగా... ఉన్న చోట్ల వారంలో ఒకరోజు  మంచినీరు అందించడం కూడా జలమండలి అధికారులకు గగనమైపోతోంది. 
తగ్గిపోతున్న జలాశయాల్లో నీటిమట్టాలు 
నాగార్జునసాగర్‌తోపాటు, ఎల్లంపల్లి జలాశయాల్లో నీటిమట్టాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. గురుత్వాకర్షణ శక్తితో నీరు ప్రవహించే అవకాశం లేకపోవడంతో... పంపులతో అత్యవసరంగా నీరు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగార్జునసాగర్‌ గరిష్టనీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం ఇది 507 అడుగులకు పడిపోయింది. మరో అడుగు తగ్గిపోతే మోటార్లతో ఎత్తిపోయక తప్పని పరిస్థితి వస్తుంది. దీంతో పుట్టంగండి దగ్గర భారీ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీరు అందించేందుకు అప్రోచ్‌ చానల్‌ తప్పుతున్నారు. ఇది కూడా ఈనెలాఖరు వరకు ఉపయోగపడుతుంది. ఆతర్వాత అత్యవసర పంపింగ్‌ కోసం ఇప్పటి  నుంచే మోటార్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 
భూగర్భ జలమట్టాలు పాతాళానికి 
ఇక జంటనగరాల్లో భూగర్భ జలాల పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. రెండేళ్లుగా కొనసాగుతున్నవర్షాభావంతో... భూగర్భ జలమట్టాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో... వందలు, వేలు పెట్టి ట్యాంకర్లు తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇది కూడా ప్రైవేటు ట్యాంకర్లే. వరుణదేవుడు కరుణించి ముందుగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించకపోతే తమ  కష్టాలు మరింత పెరుగుతాయన్న ఆందోళనలో జనం ఉన్నారు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

 

18:58 - May 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది. ఆరుగాలం శ్రమించిన  రైతుకు తీరని ఆవేదన మిగిల్చింది. పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలపాలు కాగా.. మామిడి కాయలు రాలిపోయాయి. మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం తడిచి...రైతులకు కడగండ్లను మిగిల్చింది. తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. కరవులోనూ కష్టించి పండించిన పంట నీటపాలు కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. 
కరీంనగర్‌ జిల్లాలో
కరీంనగర్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. 10 వేల క్వింటాళ్ల వరి, వెయ్యి క్వింటాళ్ల పసుపు తడిసిపోయింది. అకాల వర్షంతో భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్ జిల్లా బోదన్‌లో వడగడ్ల వాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నెలకొరిగి అంధకారం నెలకొంది. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో గోడ కూలి 25 మేకలు మృతి చెందాయి. ఆకాల వర్షానికి  జిల్లావ్యాప్తంగా మామిడికాయలు రాలిపోయాయి.. కోతకు వచ్చిన వరిపైరు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 
నల్లగొండ జిల్లాలో
నల్లగొండ జిల్లాలో వర్షం కారణంగా రైతులతో పాటు.. ధాన్యం కొనుగోలు నిర్వాహకులకు భారీ నష్టం వాటిల్లింది. చౌటుప్పల్‌ మార్కెట్‌యార్డులో 900 క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. కోదాడలో ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు కూలిపోయాయి. 
వరంగల్‌ జిల్లాలో  
వరంగల్‌లో భారీ ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఫ్లెక్సీలు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. నర్సింహులపేటలో మామిడికాయలు రాలిపోవడమే కాకుండా.. పలు ప్రాంతాల్లో పంటలు నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండలు భగభగ మండుతుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలు కాస్తా ఊరట చెందినా.. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 
హైదరాబాద్ ను కుదిపేసిన భారీ వర్షం
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం కుదిపేసింది. అర్ధరాత్రి హఠాత్తుగా వర్షం విరుచుకపడడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈదురుగాలులతో కూడిన ఈ వర్షం మూలంగా చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. పెద్దయెత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. 
నగరం బెంబేలెత్తిన
అర్ధరాత్రి వేళ భాగ్యనగరాన్ని భారీ వర్షం కుదిపేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో నగరం బెంబేలెత్తింది. బలమైన ఈదురుగాలులకు చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటితో జంటనగరాల రోడ్లు కాలువల్ని తలపించాయి. నాలాలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.సిటీలో అత్యధికంగా 75.4 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ  ప్రకటించింది.  
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు
రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరడంతో సామాగ్రి వర్షపు నీటిలో మునిగిపోయాయి. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. సిటీలోని ఉప్పల్,  దిల్‌సుఖ్ నగర్, కర్మన్ ఘాట్, మల్కాజ్‌గిరి, బర్కత్ పుర, ఎల్ బీ నగర్, చాంద్రాయణగుట్ట లాంటి ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయయ్యాయి.ఎన్టీఆర్  గార్డెన్, ట్యాంక్‌బండ్ పైన ఉన్న చెట్లు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. చిక్కడపల్లిలోని ప్రైవేటు హస్టల్ బిల్డింగ్‌ పైభాగాన ఉన్న రేకుల షెడ్డులో నివసిస్తున్న విద్యార్థినులపై రేకులు ఊడిపడటంతో పలువురికి గాయాలయ్యాయి. గాలివాన బీభత్సానికి నగరంలో 250కి పైగా  చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రబాద్ ఆల్ఫా హోటల్ సమీపంలో గల 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకొరిగింది. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. ట్రాన్స్ ఫార్మర్లు కూడా పాడైన పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం మూలంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సాయంత్రం కూడా భారీ వర్షం పడే అవకాశం
వర్షం మూలంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన ఇబ్బందుల పరిష్కారానికి జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. శానిటేష‌న్ లో ప‌నిచేస్తున్న వేలాది మంది కార్మికుల‌తోపాటు ...... ఎమ‌ర్జెన్సీ బృందాలు పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి. వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిహెచ్ఎంసి  క‌మిష‌న‌ర్ జ‌నార్ధ రెడ్డి అన్నారు. తమ ప్రాంతాల్లో ఏవైనా సమస్యలుంటే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సాయంత్రం, రాత్రికి కూడా భారీ వ‌ర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. 

 

తెలంగాణలో రిటైల్ పాలసీ ఖరారు

హైదరాబాద్‌ : ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా కొత్త రిటైల్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. తెలంగాణలో రిటైల్ పాలసీ ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ఈ పాలసీ కేబినెట్ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రిటైల్ షాపుల కోసం సింగిల్‌విండో విధానాన్ని ప్రభుత్వం అమలుచేయనుంది. రిటైల్ షాపుల జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనుమతుల కోసం ప్రత్యేక నోడల్ అధికారిని తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది.

18:45 - May 6, 2016

గుంటూరు : జిల్లాలోని పిడుగురాళ్లలో నీటి కోసం మొసళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. గురజాల మండలం పులిపాడు గ్రామంలోకి నిన్న మొసళ్లు వచ్చాయి. నేడు దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామ సమీపంలోని వాగులో నీరు లేకపోవడంతో రెండు మొసళ్లు బయటకు వచ్చాయి. మొసళ్లను చూసిన గ్రామస్తులు భయానికి గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా రాలేదని గ్రామస్తులు ఆరోపించారు.

18:43 - May 6, 2016

కర్నూలు : వైసీపీకి మరో షాక్‌ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతానన్నారు. కర్నూలులో జగన్‌ దీక్ష గురించి తనకు సమాచారంలేదన్నారు.  వైసీపీని వీడేందుకు అనేక కారణాలున్నాయన్నారు. 

 

వైసీపీని వీడనున్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు : వైసీపీకి మరో షాక్‌ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతానన్నారు. కర్నూలులో జగన్‌ దీక్ష గురించి తనకు సమాచారంలేదన్నారు.  వైసీపీని వీడేందుకు అనేక కారణాలున్నాయన్నారు. 

 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఢిల్లీ : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 34 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 25,229 పాయింట్ల వద్ద ముగిసింది. 2 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,733 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,449 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,740గా ఉంది. కిలో వెండి ధర రూ.41,595గా ఉంది.

హైదరాబాద్ లో హైటెక్ మాస్ కాపీయింగ్‌

హైదరాబాద్‌ : చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఓ విద్యార్థి స్క్వాడ్‌కు దొరికాడు. పట్టుబడిన విద్యార్థి షేక్ వసీం అహ్మద్.. నవాబ్ షా ఆలం ఖాన్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. లోదుస్తుల్లో మొబైల్‌ను, బనియన్‌లో ట్రాన్స్‌మీటర్‌లను అమర్చి, చిన్న పరిమాణంలో బ్లూటూత్ పరికరాన్ని చెవిలో పెట్టుకుని ఆన్‌లైన్‌లో పరీక్ష రాస్తుండగా స్క్వాడ్ పట్టుకున్నారు.

సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాజ్యసభ

ఢిల్లీ : ఆగస్టా కుంభకోణంపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ తీవ్రంగా స్పందించింది. తను చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపించడానికి రాజ్యసభ అతనికి సాయంత్రం సాయంత్రం 6 గంటల వరకు గడువిచ్చింది. ఒకవేళ నిరూపించకపోతే స్వామి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.

కాంగ్రెస్, టీడీపీలకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్‌ : కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో గెలవడాన్ని కాంగ్రెస్‌, టీడీపీ ఎప్పుడో మరిచిపోయాయన్నారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పోటీ చేయడాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుందని, శ్రీకాంతాచారి తల్లిపై ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పోటీ చేసినప్పుడు మానవత్వం ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాంరెడ్డి వైద్యానికి రూ.కోటి కేటాయించి.. విదేశీ మందులు తెప్పించిన మానవత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. రాంరెడ్డి మరణాన్ని కాంగ్రెస్‌ రాజకీయాలకు వాడుకుంటోందని, కాంగ్రెస్‌ను పాతరేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

18:12 - May 6, 2016

హైదరాబాద్ : కరవు తీవ్రంగా నెలకొన్నా కూడా... సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణలో కరవు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడా మాట్లాడుతూ అఖిల పక్షం ఏర్పాటు చేసి సమస్యపై చర్చించాలని కోరారు.

17:44 - May 6, 2016

హైదరాబాద్ : ఏపీని ఆదుకునేందుకు విభజన చట్టంలో ఇచ్చిన హమీలన్నీ అమలు చేయాలని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించామన్న కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని గోరంట్ల మండిపడ్డారు. పోలవరంకు నాబార్డ్ నుంచి రుణం మంజూరు చేయిస్తామని చెబుతున్న మోడీ సర్కార్ ఆ అప్పును ఎవరు చెల్లించాలో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు.

 

17:13 - May 6, 2016

చెన్నై: తమిళనాడులో ఈ నెల 16 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫేస్టోను అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత విడుదల చేశారు. అనంతరం తొలి కాపీలను యువనాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఫ్రీ ఆఫర్లు ప్రకటించారు జయలలిత.
పార్టీల హామీల జోరు
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీల హామీల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో  ఏఐఏ డిఎంకే అధినేత్రి జయలలిత  ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదలచేశారు. ఈ సంధర్భంగా  ఓటర్లకు వరాల జల్లు కురిపించారు. 
రైతులకు కోతలు లేని నిరంతర విద్యుత్
రైతులకు కోతలు లేని నిరంతర విద్యుత్.. ప్రతి రెండు నెలలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. రేషన్ కార్డు కలిగినవారికి రూ. 500 తో సంక్రాంతి బహుమతి కూపన్లు ఇవ్వనున్నట్లు మానిఫేస్టోలో తెలిపారు. ద్విచక్రవాహన కొనుగోళ్లలో ఫ్రీ  రైడ్ పేరుతో మహిళలకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
టెన్త్ .. ఇంటర్ విద్యార్థులకు ఉచిత, ఇంటర్నెట్ 
అమ్మ బ్యాంకింగ్ కార్డు పేరిట 2016 -21  మధ్య రైతులకు 40 వేల కోట్ల రుణాలమాఫీ.. రిటైల్ వ్యాపారంలో ఎఫ్‌ డీఐలకు అనుమతి నిరాకరణ వంటి వాటిని కీలకంగా మ్యానిఫేస్టోలో ఉంచారు. టెన్త్ .. ఇంటర్ విద్యార్థులకు ఉచిత, ఇంటర్నెట్ సదుపాయంతో పాటు ల్యాప్ టాప్ లను ఉచితంగా ఇవ్వనున్నారు. గర్భిణీల ప్రసవఖర్చులకు 18 వేలు..మత్స్యకారులకు  ప్రత్యేక గృహాలు, గృహనిర్మాణాల పథకాల కింద 10 లక్షల కొత్త ఇళ్లనిర్మాణానికి జయలలిత హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం తాత్కాలిక హామీలను తెలిపానని .. భవిష్యత్ లో మరిన్ని హామీలు .. పథకాలు ఉంటాయని తెలిపారు జయలలిత. పథకాల పేరుతో  ఓటర్లకు గాలం వేసేందుకు పక్కా ప్లాన్ తో జయలలిత ముందుకు వెళుతోంది.

 

తెలుగు రాష్ట్రాలకు కరవు నిధులు విడుదల..

హైదరాబాద్ : కరవు బారిన పడిన రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. ఏపీ, తెలంగాణతో సహా 12 రాష్ట్రాలకు రూ. 9,367 కోట్లు విడుదలయినట్లు అధికారులు పేర్కొన్నారు. 

17:08 - May 6, 2016

వరంగల్‌ : బాసర ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థిని మృతి కలకలం రేపింది. పైడిపల్లిలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రియాంక అనే విద్యార్థిని ఇంజనీరింగ్‌ ఫోర్త్ ఇయర్‌ చదువుతోంది. కాలేజి హాస్టల్‌లో ఆహారం తిని అనారోగ్యంతో ప్రియాంక నెలరోజుల పాటు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కళాశాల హాస్టల్‌లోని విషతుల్యమైన ఆహారం తినడం వల్లే ప్రియాంక చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.  అయితే ప్రియాంక మృతికి కారణమైన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

కేరళ నిర్భయ కేసులో పోలీసుల అదుపులో 12 మంది..

కేరళ : ఇటీవల న్యాయ విద్యార్థినిని అతికిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో పోలీసులు 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

16:17 - May 6, 2016

ఢిల్లీ : నీట్ పై విచారణ వాయిదా పడింది. విచారణను సుప్రీం కోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. ప్రభుత్వ కళాశాలలకు ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చన్న ఎంసీఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రైవేట్ కళాశాలలకు నీట్‌ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం వివరించగా.. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. శని, ఆదివారాలు చర్చించి సోమవారం కోర్టు దృష్టికి తీసుకొస్తామని సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌కుమార్‌ వివరించారు. రాష్ట్రంలోని వందశాతం సీట్లను తామే భర్తీ చేస్తామని తెలంగాణ తరపున హరీశ్‌రావల్ వాదనలు వినిపించారు. అయితే తొలి విడత నీట్‌ రాసిన విద్యార్థులు రెండోసారి పరీక్ష రాసేందుకు వీల్లేదని సీబీఎస్‌ఈ వాదనలు వినిపించింది.

సుబ్రతా రాయ్ కు పెరోల్..

ఢిల్లీ : సహారా కుంభకోణంలో ప్రధాన నిందితుడు సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు 4 వారాల పెరోల్ మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాయ్ కి అనుమతినిచ్చినట్లు కోర్టు తెలిపింది. మార్కెట్ నిబంధనలు ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు భారీగా నిధులను సమీకరించాయన్న కేసులో గత రెండేళ్ల నుంచి సహారా అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. 

కేంద్ర మంత్రి సురేష్ ప్రభును కలిసిన వైసీపీ ఎంపీలు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సురేష్ ప్రభును వైసీపీ ఎంపీలు కలిశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, ఈస్ట్ కోస్ట్ నుండి వాల్తేరు డివిజన్ ను వేరు చేయాలని విజ్ఞప్తి చేశారు.  

15:31 - May 6, 2016

ధూమపానం హనికరం..అని తెలిసినా చాలా మంది పొగ పీలుస్తూనే ఉంటుంటారు. సిగరేట్, గుట్కా, మద్యానికి బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువగా మైనర్ లుంటున్నారు. దీనిపై అమెరికా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లు సిగరెట్ కొనడం..వారికి అమ్మడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ఆన్ లైన్ ద్వారా సిగరేట్, హుక్కా, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను ఆ దేశ ఆహార, మాదకద్రవ్యాల శాఖ బ్యాన్ చేసింది. మైనర్లు నేరుగా కానీ, ఆన్ లైన్ ద్వారా గానీ సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులను కొంటే శిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. 

15:25 - May 6, 2016

కృష్ణా : విజయవాడలో ఘోరం జరిగింది. మరో సెల్ఫీ సూసైడ్ ఘటన చోటుచేసుకుంది. అత్తంటి వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ భవానీపురంలో షేక్ హుస్మా అనే వివాహిత ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. గత కొంతకాలంగా అత్తమామలు, భర్త ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నారు. వారి వేధింపులతో తీవ్ర మనస్థాపం చెందిన హుస్మా రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుని అత్యంత దారుణంగా చనిపోయింది. భర్త, అత్తామామలు చాలా కాలంగా తనపై వేధింపులకు పాల్పడుతున్నారు.  వారి వేధింపులు తుట్టుకోలేకే చనిపోతున్నానని సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఎవరూ కూడా బాధపడొద్దని తన తల్లిదండ్రులకు తెలిపింది. భర్త, అత్తామామలు పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

నీట్ విచారణ వాయిదా..

ఢిల్లీ : నీట్ పై విచారణ ఈనెల 9కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వ కళాశాలలకు ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చన్న ఎంసీఐ వాదనతో సుప్రీం ఏకీభవించింది. రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేటు కళాశాలలకు పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ సర్కార్ ఈ సందర్భంగా పేర్కొంది. 

వివాహిత ఆత్మహత్య..

విజయవాడ : భవానీపురంలో షేక్ హుస్నా అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ తీసుకున్న అనంతరం ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులే కారణమని తెలుస్తోంది. 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టులో విచారణ

హైదరాబాద్ : పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం, ప్రాజెక్టును నిర్మిస్తుందని ఏపీ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టును ప్రతిపాదించామని టీసర్కార్‌ సమాధానమిచ్చింది. ప్రాజెక్టుపై 4వారాల్లో వివరణాత్మకంగా కౌంటర్‌దాఖలు చెయ్యాలని ఇరురాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.

 

14:52 - May 6, 2016

హైదరాబాద్ : పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం, ప్రాజెక్టును నిర్మిస్తుందని ఏపీ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టును ప్రతిపాదించామని టీసర్కార్‌ సమాధానమిచ్చింది. ప్రాజెక్టుపై 4వారాల్లో వివరణాత్మకంగా కౌంటర్‌దాఖలు చెయ్యాలని ఇరురాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.

 

14:50 - May 6, 2016

ఢిల్లీ : తమపై విధించిన జరిమానా తొలగించాలని డిమాండ్‌ చేస్తూ దీక్ష చేస్తున్న జెఎన్‌యు విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంపై రాజ్యసభలో సిపిఐ, జెడియు ఆందోళన వ్యక్తం చేసింది. జేఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్‌, బహిష్కరణ, జరిమానా విధించడం సరికాదని సిపిఐ సభ్యులు డి.రాజా సభకు తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల దీక్షను విరమింప జేయాలని కోరారు. యువత ఆందోళన చేయడం సహజమేనని, యూనివర్సిటీ ఇలా శిక్ష విధించడం గతంలో ఎప్పుడూ లేదని జెడియు నేత శరద్‌యాదవ్ పేర్కొన్నారు. సభ్యుల విజ్ఞప్తి కేంద్ర హోంమంత్రి, హెచ్‌ఆర్‌డి మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్‌ నక్వీ సభకు తెలిపారు.

14:47 - May 6, 2016

ఢిల్లీ : అగస్టా స్కాంపై లోక్‌సభలో బిజెపి-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్రమంత్రి పారికర్‌ ఇచ్చిన వివరణను కాంగ్రెస్‌ తిప్పి కొట్టింది. హెలిక్యాప్టర్‌ ఎగిరే ఎత్తును 6 వేల మీటర్ల నుంచి 4 వేల 5 వందల మీటర్లకు తగ్గించారన్న నిర్ణయాన్ని 2003లో ఎన్డీయే సర్కార్‌ తీసుకుందని కాంగ్రెస్‌ సభ్యులు జ్యోతిరాదిత్య సింధియా ఎదురు దాడి చేశారు. ఈ స్కాంకు సంబంధించి సోనియా గాంధీ పేరు ఎక్కడా లేదని, ఇటలీ కోర్టులో త్యాగి కుటుంబం పేర్లు మాత్రమే ప్రస్తావనకు వచ్చినట్లు స్పష్టం చేశారు. గాంధీ కుటుంబానికి డబ్బులు ముట్టలేదని కోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు.

 

మే 10న ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు..

విజయవాడ : ఈనెల 10వ తేదీన పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 9న ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తామని, రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందున నీట్ నుండి మినహాయించాలని కోరినట్లు పేర్కొన్నారు

ఆగస్టా కుంభకోణంపై రక్షణ మంత్రి వెల్లడించిన వివరాలు..

ఢిల్లీ : ఆగస్టా కుంభకోణంపై రక్షణ శాఖ మంత్రి పారికర్ పార్లమెంట్ లో వివరాలు వెల్లడించారు. ఆగస్టా కుంభకోణం జరగకుండా 2012లో ఆపి ఉండాల్సిందేనని, కంపెనీపై యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. 

ఈనెల 10న ఉత్తరాఖండ్ ల్ బల పరీక్ష...

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో బిజెపి వ్యూహాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ బలపరీక్ష నిర్వహించేందుకు కేంద్రం సమ్మతించింది. అయితే 9 మంది కాంగ్రెస్ రెబల్స్ ఓటింగ్‌లో పాల్గొనకూడదంటూ సుప్రీంకోర్టు కండీషన్ విధించింది. ఈ నెల 10న బలపరీక్ష నిర్వహించే అవకాశముంది.  

 

14:43 - May 6, 2016

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో బిజెపి వ్యూహాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ బలపరీక్ష నిర్వహించేందుకు కేంద్రం సమ్మతించింది. అయితే 9 మంది కాంగ్రెస్ రెబల్స్ ఓటింగ్‌లో పాల్గొనకూడదంటూ సుప్రీంకోర్టు కండీషన్ విధించింది. ఈ నెల 10న బలపరీక్ష నిర్వహించే అవకాశముంది.  

 

ఏపీపీఎస్సీ కొత్త వైబ్ సైట్ ప్రారంభం..

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన వైబ్ సైట్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్ సైట్ లో నిరుద్యోగుల కోసం వన్ టైం రిజిస్ర్టేషన్ (otr) కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 

పాలమూరుపై సుప్రీ మెట్లు ఎక్కిన ఏపీ రైతులు..

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వ్యవహారంపై రైతులు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ రెండు ప్రాజెక్టులు కట్టడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏపీకి చెందిన రైతులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

కేరళలో 'నిర్భయ' కేసులో సీబీఐ దర్యాప్తు....

హైదరాబాద్ : కేరళలో లా విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. యువతి మృతిచెందిన ఆరురోజుల తర్వాత పోలీసులు విచారణ నిమిత్తం బాధితుల ఇంటికి వెళ్లారు. పౌర సమాజం నిరసనలు తీవ్రంకావడంతో సత్వర దర్యాప్తునకు ఆ రాష్ట్ర సీఎం ఉమెన్‌ఛాందీ పోలీసులను ఆదేశించారు. కాగా విద్యార్థిని మృతిపై కేరళ రాష్ట్రం అట్టుడుకిపోతోంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు.

అప్పన్నపాలెంలో పెట్రోలు బాటిళ్లతో గ్రామస్తులు ఆందోళన ...

తూ.గోదావరి : ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్సైజ్ అధికారులు దాడుల పేరుతో వేదిస్తున్నారని పెట్రోలు బాటిళ్లు చేపపట్టుకుని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 

ఎయిర్ పబ్ యాజమాన్యానికి 6రోజులు జైలుశిక్ష...

హైదరాబాద్ : నగరంలోని ఎయిర్ పబ్ యాజమాన్యానికి ఎర్రమంజిల్ కోర్టు జైలుశిక్షను విధించింది. అర్థరాత్రి వరకూ పబ్ నిర్వహిస్తున్నారనే కారణంతో పబ్ యజమానులు అనిరుథ్, మయాంక్ కు పలుమార్లు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయిన యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందనే కారణంతో యాజమాన్యానికి 6 రోజులు జైలుశిక్ష విధించింది.

13:35 - May 6, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట వైసీపీ ధర్నాలు చేపట్టినట్లు వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన హైదరాబాద్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు చిత్త శుద్ది లేదని వైసీపీ నేత ఆయన ఆరోపించారు. 13 జిల్లాల ప్రజలను తాకట్టు పెట్టి చంద్రబాబు వ్యక్తి గత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి ఎందుకు హామీ ఇచ్చిందని ప్రశ్నించారు. తెలుగు వారి యొక్క పౌరుషాన్ని, నిజాయితీని ఉద్యమాల ద్వారా నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టనుంది.. కాకినాడ కలెక్టరేట్‌ ముందు ధర్నాలో పార్టీ అధినేత జగన్‌ పాల్గొంటారని పార్టీ ప్రకటించింది..

13:28 - May 6, 2016

హైదరాబాద్ : బోయిన్‌పల్లిలోని గోయస్ ల్యాబొరేటరీస్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి ల్యాబ్‌ యాజమాన్య వేధింపులే కారణమని తండ్రి ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై మృతురాలి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మమత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రైవేటు బస్సు-బొలేరో ఢీ ఇద్దరు మృతి....

నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం లింగోతం శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు-బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13:26 - May 6, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ స్కాంకు సంబంధించి రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. 1999లో అత్యాధునిక హెలికాప్టర్ల కొనుగోలుకు ఎన్టీయే సర్కార్‌ నిర్ణయం తీసుకుందని, 2005లో అధికారంలోకి వచ్చిన యూపీఏ - అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు నిబంధనలు సైతం మార్చివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ స్కాంపై 2013లో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, ఎఫ్‌ఐఆర్‌ కాపిని ఈడీకి ఇంతవరకు పంపలేదని పారీకర్‌ లోక్‌సభకు తెలిపారు. 

13:25 - May 6, 2016

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో బలపరీక్షకు కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో బలపరీక్ష జరగనుంది. దీనికి ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఉత్తరాఖండ్ లో రాజకీయ అస్థిరతను ఆసరా చేసుకున్న కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది. ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పుతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కోర్టుల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడంతో కేంద్రం చివరకు మెట్టు దిగక తప్పలేదు. ఉత్తరాఖండ్ లో హారీశ్ రావత్ సర్కారు బల పరీక్షకు సిద్ధమేనని ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్రం... సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో త్వరలోనే ఉత్తరాఖండ్ లో హరీశ్ రావత్ తన బలాన్ని నిరూపించుకునే అవకాశం లభించినట్లైంది. 

రేణిగుంట ఐకేపీ కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో ...

కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం రేణిగుంట ఐకేపీ కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా కరీంనగర్ జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి ఐకేసీ కేంద్రాలలో వుంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయిన సంగతి తెలిసిందే.

దృష్టి మరల్చి రూ.5లక్షలు దోపిడీ...

మెదక్ : సదాశివపేటలో ఓ వ్యక్తి  దృష్టి మరల్చి దుండగులు దోపిడీ పాల్పడ్డారు. ఆంధ్రా బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యక్తిని ఏమార్చి రూ.5లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఇటీవల కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కు ఆంధ్రా బ్యాంక్ నుండి డ్రా చేసుకుని వెళ్తున్న క్రమంలో ఈ దోపిడీ జరిగింది. ఘటన నుండి తేరుకున్న బాధితుడు వెంటనే సదాశివపేట పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

ఉత్తరాఖండ్ లో బల పరీక్షకు సిద్ధపడిన కేంద్రం...

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో బలపరీక్షకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో బలపరీక్షకు కేంద్రం సిద్ధంగా వున్నట్లు అటార్నీ జన్ రల్ కోర్టుకు తెలిపారు. రిటైర్డ్ సీఈసీని పరిశీలకుడిగా నియమించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ నిర్ణయం జరిగింది. కాగా ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే.

మోదీ సర్కార్ పై కాంగ్రెస్ అధిష్టానం విసుర్లు...

ఢిల్లీ : ప్రధాని మోదీ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు ఢిల్లీలో లోక్‌తంత్ బచావో యాత్ర పేరుతో ర్యాలీని చేపట్టింది. అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షను నిర్వహించింది. దీక్షలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా మాట్లాడారు. రోజుకు దేశవ్యాప్తంగా 50 మంది రైతులు ఆత్మహత్య మోదీ అచ్చేదిన్ ఆయేగా అంటే ఇదేనా అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. 40 శాతం భూభాగం కరువుతో అల్లాడుతోందన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేతలను తొలగిస్తున్నారని ఆరోపించారు.

ఏపీ పాలీసెట్‌ -2016 ఫలితాలు విడుదల...

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పాలీసెట్‌ -2016 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలీసెట్‌లో మొత్తం 82.32శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. బాలికలు 87.5శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 82.2శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి గంటా వెల్లడించారు.

వేరు వేరు సంఘటనలో నలుగురు మృతి...

ప్రకాశం: జిల్లాలో వేరు వేరు సంఘటనలో నలుగురు మృతి చెందారు. మార్టూరు మండలం కోనంగి దగ్గర ట్యాంకర్ - లారీ ఢీకొని ఇద్దరు కూలీలు మృతి చెందారు. హైవేపై మొక్కలకు నీళ్లు పెడుతుండగా ఈ ఘటన జరిగింది. మరో ఘటన చీమకుర్తి మండలం ఇలపావులూరు వద్ద  జరిగింది.  చెట్టుకు ఉరివేసుకుని తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. 13 ఏళ్ల కూతురితో కలిసి తల్లి ఉరివేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బీఫ్ తినొచ్చు, గోవధ చేయ్యొద్దు : ముంబై హైకోర్టు..

ముంబై : బీఫ్ వినియోగంపై ముంబై కోర్టు తీర్పునిచ్చింది. గోవధపై మహారాష్ట్రలో నిషేధం కొనసాగుతుందని, కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆవు మాంసాన్ని నిల్వ చేయడం కానీ, తినడం కానీ తప్పుకాదని ఇవాళ ముంబై హైకోర్టు తీర్పును వెలువరించింది. గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గో మాంసాన్ని అమ్మినా లేక గోవధ చేసినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించింది. ఒకవేళ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్లకు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన నిబంధనను ఆ రాష్ట్ర హైకోర్టు పాక్షికంగా రద్దు చేసింది.

12:40 - May 6, 2016

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సేవ్ డెమోక్రసీ అంటూ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈధర్నాలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీలు, కార్యదర్శలు, కార్యకర్తలు పెద్దఎత్తున్న పాల్గోన్నారు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, పార్టీ ఫిరాయింపులు, యూనివర్సిటీలో దాడులు, దేశంలో కరువు పరిస్దితులపై కేంద్రం అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాచేపట్టింది. అనంతరం పార్లమెంట్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు

12:03 - May 6, 2016

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తరవాత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడో ప్రేమకథ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్‌.జె.సూర్య దర్శకుడు. 'ఇదో ఫ్యాక్షనిస్టు ప్రేమకథ' అంటూ చిత్రబృందం కొబ్బరికాయ కొట్టినప్పుడే ఈ సినిమాకి సంబంధించిన క్లూ ఇచ్చింది. 'తీన్‌మార్‌' తరవాత పవన్‌ చేస్తున్న ప్రేమకథ ఇదే. పవన్ కు జోడిగా మలయాళ భామ 'పార్వతీ మీనన్'ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ 'ఉత్తమ విలన్' సినిమాలో ఆయన కూతురి పాత్రలో పార్వతి నటించింది. ఇప్పటికే పార్వతి మీనన్ పై ఫొటో షూట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరో తదితర వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. 

11:45 - May 6, 2016

రానా మంచి భోజన ప్రియుడు..రాశీఖన్నాకు సెల్ఫీల మోజు..రకుల్ ప్రీత్ కి వర్కౌట్ల పిచ్చి..సమంతా కు సేవాకార్యక్రమాల పై మక్కువ..సోషల్ మీడియా పుణ్యమా అని ఏ రోజు ఏం చేసారో జనానికి తెలియపరుస్తున్నారు..వాళ్ల హాబీలు, అలవాట్లు ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి..ప్రతీ విషయాన్ని పంచుకుంటూ అభిమాని - సెలబ్రిటీ అనుబంధంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న స్టార్స్ పై ప్రత్యేక కథనం..ఇక సోషల్ మీడియాలో ఎక్కువ లైకులతో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీనే. అయితే ఈ హీరో అందరిలా వ్యాయమాలు, వర్కౌట్లు చేసే హీరోకాదు. తన అభిమానుల్ని ఏ రోజు కా రోజు సరికొత్త గా పలకరించే స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్ ఇప్పుడు ఓన్లీ టాలీవుడ్ కే పరిమితం కాదు. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో, ఆ పక్క రాష్ట్రమైన కేరళ, మనకి మరో పక్క రాష్ట్రమైన కర్నాటకలో కూడా ఈ కుర్రోడు చాలా ఫేమస్. బన్నీ నటించిన అన్ని సినిమాలు సౌత్ లో నాలుగు రాష్ట్రాల్లోనూ రిలీజవుతాయి. బోలెడంత క్రేజ్ కూడా. అలాంటి ఈ హీరో మొత్తం సౌత్ అభిమానుల్ని పలకరించేందుకు ఒక అద్భుతమైన మీడియాను ఎంచుకున్నాడు. అదే సోషల్ మీడియా. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఎలాంటి సోషల్ మీడియాలో బన్నీ లాగిన్ అయితే చాలు. అందరు ఫాలోవర్స్ ఆసక్తికరంగా అతడి ట్విట్లను పోస్టుల్ని ఆస్వాదిస్తారు.

బన్నీ ఫస్ట్...
ఫేస్ బుక్ లో కోటికి పైగా లైకులతో దక్షిణాదిలో అందరికంటే ముందున్న వ్యక్తిగా బన్నీ రికార్డు క్రియేట్ చేసాడు. అల్లు అర్జున్ కి ఈ విజయం అభిమానులు ఇచ్చిందే కాబట్టి, తన ఖాతాలో చోటు కూడా ఎక్కువగా అభిమానులకే కేటాయిస్తుంటాడు బన్నీ. అభిమానులతో తాను కలిసి దిగిన ఫోటోలతో పాటు, చిన్నప్పటి ఫోటోలు, తన పాత సినిమాల్లో ఎవరూ చూడని సన్నివేశాలు, కొడుకు అయాన్ కు సంబంధిచిన ఫోటోలే అతడి ఖాతాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా పండగలొచ్చినప్పుడు కుటుంబంతో కలిసి ఒక చక్కటి ఫోటోను పెట్టి శుభాకాంక్షలు తెలియజేయడం అల్లు అర్జున్ కు బాగా అలవాటు. ఇలా ఫోటోలతో అభిమానులకు ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా, వాళ్లపై కొండంత అభిమానంతో ట్వీట్లను కూడా గుప్పిస్తుంటాడు బన్నీ. ముఖ్యంగా తన కొత్త సినిమాల కి సంబంధించిన ఎలాంటి విశేషాన్నైనా సరే ముందుగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం మనోడికి బాగా అలవాటు. కొత్త సినిమా లాంఛింగ్ విశేషాలు, కొత్త సినిమా టీజర్, ట్రైలర్ లాంటివి పోస్ట్ చేసి అభిమానులతో కాంటాక్ట్ లోకి వస్తుంటాడు. అందుకే బన్నీ ఎలాంటి పోస్ట్ పెట్టిన ఎలాంటి ట్వీట్ పెట్టిన భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. మరి అలాంటి హీరోకి కోట్ల కొలదీ లైక్స్ వస్తే ఆశ్చర్యపోవడం ఎందుకు? దీన్ని బట్టి సౌతిండియాలో బన్నీకి ఎందుకింత ఫాలోయింగ్ ఉందో అర్ధమౌతోంది కదా.

రానా...
టాలీవుడ్ టాల్ హ్యాండ్ సమ్ రానా బాహుబలితో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. వాళ్లని పర్సనల్ గా కలిసే అవకాశం లేదు కాబట్టి సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నాడు రానా. రోజూ రకరకాల పోస్టులు పెడుతూ తన అభిరుచుల్ని అభిమానులకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. రానాది భారీ కటౌట్ . అసలు ఆ హైటూ, వెయిటూ చూసే రాజమౌళి బాహుబలి లో అతడ్ని మెయిన్ విలన్ ను చేసాడు. జిమ్ లో గంటల తరబడి వ్యాయామం చేసే అలాంటి బాడీని తెచ్చుకున్నాడు రానా. సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా వ్యాయామం మాత్రం మానడంలేదు. దానికి తోడు మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యసూత్రాల్ని పాటిస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నాడు రానా. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పబ్లిక్ తో ఎక్కువ రిలేషన్స్ మెయిటెయిన్ చేయడం అతడి హాబీ అయిపోయింది. మొత్తం మీద రానా తన యాక్టివిటీస్ కు సరైన వేదికగా సోషల్ మీడియాను ఎక్కువ ఉపయోగించుకుంటున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఎక్కువ చురుగ్గా ఉండే నటుల్లో రానా ముందుంటాడు. అతడి ఫేస్ బుక్ టైమ్ లైన్ ను చేసిన వారికెవరికైనా ఒక విషయం క్లియర్ గా అర్ధమౌతుంది. రానా మంచి భోజన ప్రియుడని. సినిమా విషయాల్ని తప్పిస్తే అతడి పోస్టుల్లో ఎక్కువ వాటా ఆహారం, ఆ తరువాత వ్యాయామానికే దక్కుతుంది. రొటీన్ ను భిన్నంగా ఏ ఆహారం తీసుకున్నా దాన్ని ఫోటోతో సహా పోస్ట్ చేయడం రానాకు అలవాటు. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ తాను తిన్న పదార్ధాల ఫోటోల్ని పెట్టకుండా అసలు ఉండలేడు. మొన్నీ మధ్య జపాన్ వెళ్ళినప్పుడు మూడు రోజుల వ్యవధిలో తాను తిన్న దాదాపు ఇరవై పదార్ధాల తాలూకు ఫోటోల్ని రానా నెట్ లో పెట్టాడు. ఆ తరువాత ఎక్కువ పోస్టులు జిమ్ లోవే ఉంటాయి. ఆ రోజు వర్కౌట్ కు సంబంధించిన చిన్న వీడియో అయినా పెట్టి దానికింద స్ఫూర్తి నిచ్చేలా కొటేషన్ తగిలించడమూ అతడి అలవాటు. ఇలాంటి పోస్టుల్ని చూసి రానాను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువే. ముఖ్యంగా యూత్ రానా చెప్పిన విషయాల్ని ఆసక్తికరంగా ఫాలో అవుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలో చూస్తే రానా ఫాలోయింగ్ అర్ధమౌతుంది.

రకుల్ ప్రీత్ సింగ్...
టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లో తారగా తారాపథాన దూసుకుపోయిన నాజూకు నటీమణి రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడి అందాలకు టాలీవుడ్డేంటి, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో సైతం బోలెడంత మంది అభిమానులున్నారు. ఇప్పుడీ సుందరి కూడా సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంది. తన అందాల్ని ఫేస్ బుక్ లోనూ, తన మాటల్ని ట్విట్టర్ లోనూ బంధిస్తూ... బోలెండత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. నాజూకు నడుమొంపులతో కుర్రకారును వెర్రెత్తిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు బెటర్ ఆప్షన్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించేసి అటు కోలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమా సినిమాకి మరింత అందంగా, గ్లామర్ గా తనను తాను అప్డేట్ చేసుకుంటూ దూసుకుపోతోంది. అసలు అమ్మడు అంత నాజూగ్గా ఎందుకుంటుంది ? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే వెంటనే ఫేస్ బుక్ లోకి లాగిన్ అవ్వాల్సిందే. సినిమా, సినిమాకు మరింత అందంగా తయారవుతూ కుర్రాళ్ల మతులు పోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కు చూడీదార్, చీర, జీన్స్ లాంటి ఎలాంటి దుస్తులైనా సరే అతికినట్టు సరిపోతాయి. ఆమె శరీర తత్వమే అలాంటిదిమరి. అసలు ఇన్నాళ్లూ ఆమె అలా ఫిట్ గా ఎలా ఉండగలుగుతోందో తెలుసుకోవాలంటే ఆమె ఫేస్ బుక్ టైమ్ లోకి వెళ్లాల్సిందే. జిమ్ లో ఎప్పటికప్పుడు ఆమె పడే కష్టానికి సంబంధించిన వీడియోలు పదులు సంఖ్యంలో ఆమె ఖాతాలో కనిపిస్తాయి. బైసెప్స్, స్క్వాట్స్, షోల్డర్స్, అబ్స్ లాంటి అన్ని భాగాలకు సంబంధించి తను చేసే వ్యాయామాల వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. రానాతో పోటీ పడుతూ చేసిన వ్యాయామాలకు సంబంధించి ఆమె పెట్టిన పోస్ట్ అయితే పెద్ద సంచలనమే సృష్టించింది. రెండు మూడు సినిమాల్లో నటించేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చేసుకొని బొద్దుగా తయారైపోతున్నారు. కొంతమంది హీరోయిన్స్. దాని వల్ల కొన్ని సినిమాలకే వాళ్ళు పరిమితమైపోవాల్సి వస్తోంది. తిరిగి నాజూగ్గా తయారయ్యే టైమ్ కి మళ్లీ ఛాన్సెస్ రావడం లేదు. అలాంటి హీరోయిన్స్ అంతా రకుల్ ప్రీత్ సింగ్ ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. మొత్తం మీద రకుల్ నాజూకు సోయగాల కు అడ్డాగా సోషల్ మీడియా మారిపోవడం గొప్ప విశేషం.

సమంతా..
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో సమంతా ఎప్పుడూ ముందువరసలోనే ఉంటుంది. అందాన్ని, అభినయాన్ని సమపాళ్ళ లో రంగరించే అందమైన హీరోయిన్ ఆమె. అయితే ఎప్పుడూ తెరమీద కనిపించే ఆమె తెరకు మరోవైపు అంటే సోషల్ మీడియాలో కూడా తన సత్తా చాటుకుంటోంది. చాలా కొద్ది మంది మాత్రమే చాలా అరుదుగా చేసే ఒక మంచి పనితో ఆమె చాలామందిని ఇన్స్ పైర్ చేస్తోంది. టాలీవుడ్ లోకి అందాల జెస్సీగా అడుగుపెట్టింది సమంతా. స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. గ్రేట్ డైరెక్టర్స్ అందరిదృష్టినీ ఆకర్షించింది. మరీ ముఖ్యంగా తన భాషకాని తెలుగు భాషను అతి తక్కువ టైమ్ లో, అందరి హీరోయిన్స్ కన్నా చాలా ఫాస్ట్ గా నేర్చేసుకుంది. టాలీవుడ్ లో సమంతాది ప్రస్తుతం చాలా ప్రత్యేక స్థానం. అలాంటి హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియా లోకూడా చాలా యాక్టివ్ గా జనంతో మూవ్ అవుతోంది. జిమ్ లో కసరత్తులు చేయడమే కాకుండా, మంచి మంచి పనులతో సేవాకార్యక్రమాల్ని కూడా చేసేస్తోంది సమంతా. మేకప్ లేకుండా హీరోయిన్స్ బైటి ప్రపంచానికి కనిపించడానికి ఇష్టపడరు అనుకుంటారు చాలా మంది. కానీ ఆ సాంప్రదాయానికి భిన్నంగా ఎక్కువ గా మేకప్ లేని వీడియోల్ని, ఫోటోల్ని పోస్ట్ చేస్తుంటుంది సమంతా. ఆమె ఫేస్ బుక్ టైమ్ లైన్ ఇతరులకంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రెండు రకాల పోస్టులకే ఆమె ఖాతాలో ఎక్కువగా చోటుంటుంది. అందులో మొదటిది సేవ అయితే రెండోది వ్యాయామం. చాలా మంది రెండో దానికే ఎక్కువ ప్రధాన్యతనిస్తారు కానీ. సమంతా మాత్రం సేవను తన మొదటి లక్ష్యంగా ఎంచుకుంది. సమంతా నిర్వహిస్తున్న ప్రత్యేష ఫౌండేషన్స్ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు సహాయం అవసరమయ్యే చిన్నారుల వివరాల్నే సమంత ఎక్కువగా పంచుకుంటుంది. ఇంకా జిమ్ లో ఆమె చేసే కఠినమైన కసరత్తులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా ఎక్కువే ఉంటాయి. అబ్బాయిలతో పోటీ పడుతూ వంద కేజీలకు పైగా బరువులు ఎత్తుతున్న వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానులకు బోలెడంత వినోదాన్ని పంచుతోంది సమంతా. సేవను సమంతా అలవాటుగా మార్చుకుంటే, వ్యాయామాన్ని అభిరుచిగా మలుచుకుంది. సో.. దీన్ని బట్టి ఆమె సోషల్ మీడియాలో ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకుందో అర్ధమౌతోంది.

రాశీ ఖన్నా..తమన్నా..
టాలీవుడ్ లో ఇంకా చాలా మంది స్టార్స్ సోషల్ మీడియా లో ఫుల్ బిజీగా యాక్టివ్ అయి ఉన్నారు. ఒకొక్కరు ఒకో అలవాటు తో ఒక ప్రత్యేక మైన హాబీతో చాలా మంది ఫాలోవర్స్ ను, అభిమానుల్ని సంపాదించుకున్నారు.  రాశీఖన్నా గురించి తెలియని వారెవరైనా ఆమె ఫేస్ బుక్ పేజ్ ను చూడగానే అమె సినీ నటి అన్న విషయం అర్ధమైపోతుంది. ఆమె పోస్టుల్లో ఎనభై శాతం ఫోటో షూట్లకి సంబంధించినవే ఉంటాయి. అవి కాకుండా మరో రెండు రకాల ఫోటోల్ని రాశి ఎక్కువగా పెడుతుంటుంది. ఒకటి ఆమె పాల్గొన్న షూటింగ్ సెట్స్ లో దిగిన ఫోటోలు, రెండోవి సెల్ఫీలు. ఏకొత్త ప్రాంతానికి వెళ్లినా అక్కడో సెల్ఫీ దిగి కింద చిన్న వివరణ ఇస్తుంది అందాల రాశి. మిల్కీ బ్యూటీ తమన్నాను క్లోజప్ లో చూడాలనుకొనే వాళ్లు ఎవరైనా ఒక్కసారి ఆమె ఫేస్ బుక్ పేజ్ చూస్తే చాలు. ప్రతీ పది ఫోటోలకు కనీసం ఒక్క క్లోజప్ తీసుకున్న సెల్ఫీ అయినా ఆమె ఖాతాలో కనిపిస్తుంది. కొత్త రకం నగలు పెట్టుకున్నా, కాఫీ తాగుతున్నా, కుక్క పిల్లని ఎత్తుకున్నా, ఆ మాటకొస్తే ఏ పని చేస్తున్నా ఒక మంచి సెల్ఫీ తీసుకొని అప్ లోడ్ చేస్తుంది తమన్నా. ఇక నటుడు నానికైతే సెట్లో దృశ్యాలు, రెజీనాకు మేకప్ లేని ఫోటోలు, ప్రణీతకు అయితే తన సినిమాలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలు ఇలా.. ఒకొక్కరూ ఒక్కో రకమైన విషయాల్నే ఎక్కువగా పోస్ట్ చేస్తూ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎవరి స్టైల్ వారిదే అని నిరూపిస్తున్నారు. అలా స్టార్స్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతూ.. అభిమానులకు మరింత చేరువవుతున్నారు.
సో.. సినిమాల్లో నటించడమే కాదు.. సోషల్ మీడియాలోనూ జీవించాలి అన్నట్టుగా మన టాలీవుడ్ స్టార్స్ అందరూ ఫేస్ బుక్ లోను, ట్విట్టర్ లో ను అభిమానులకు ఒక్క మౌస్ క్లిక్ దూరంలో కనిపిస్తూ , చెయ్యెత్తితే అందేంత దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నారు. అవును నిజమే.. ఎంతో ఎత్తులో ఉన్న వెండితెరకన్నా ఎంతకీ ఎత్తుకాలేని కంప్యూటర్ తెరే అందరికీ దగ్గరగా ఉంటుంది కదా. 

11:33 - May 6, 2016

లవ్‌.. ఇష్క్‌.. మొహబ్బత్‌! పదం ఏదైనా ప్రణయం ఒక్కటే. ఇందుగలదు అందులేదన్న సందేహం లేకుండా ఎందులోనైనా ప్రేమ ఉంటుంది. అది సర్వాంతర్యామి. సినిమాల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే సినిమా ప్రేమ కొత్తగా, విచిత్రంగా ఉంటుంది. ఒకర్నొకరు చూస్తారు. ప్రేమలో పడిపోతారు. పాటేసుకొంటారు. అదీ ఇక్కడ కాదు... ఏ యూరప్‌లోనో, పారిస్‌లోనో. పాటైపోగానే మళ్లీ లగెత్తుకొని ఇటు వచ్చేస్తారు. అసలు ప్రేమలేని సినిమా ఉందా? అన్నది పెద్ద డౌటు. పాటల్లేని సినిమా, ఫైటుల్లేని సినిమా, హీరోయిజం లేని సినిమా ఆఖరికి హీరో లేని సినిమా అయినా ఉంటుంది గానీ, ప్రేమ లేని సినిమా అంటూ ఉండదు. హీరో, హీరోయిన్లు అన్నాక వాళ్లిద్దరూ ప్రేమించుకొని తీరాలి. అది రూలూ, రివాజూ. 'అయితే కొంచెం కొంచెం ప్రేమించుకోవడం ఎందుకులే..' అని పెద్ద మొత్తంలో హోల్‌సేల్‌గా ప్రేమించుకొంటే ఆ కథల్నే మనం 'ప్రేమకథా చిత్రాలు' అంటుంటాం. అవే ఈమధ్య కాస్త తగ్గాయి అని ఫీలవుతున్న తరుణంలో మళ్లీ వాటి జోరు మొదలైపోయింది. స్టార్‌ హీరోలు, కుర్ర కథానాయకులు... ఇలా కొంతమంది ప్రేమకథలవైపు చూస్తున్నారు. పీకల్లోతు ప్యార్‌లో పడిపోయారు.

ప్రేమ కోసమే సినిమా తీయడం..
ప్రేమ అనే ఎమోషన్‌ని ముట్టుకోకుండా ఓ కథని చెప్పడం చాలా కష్టం. అందుకే మాస్‌ కమర్షియల్‌ చిత్రాల్లోనూ ఏదో ఓ రూపంలో ప్రేమ 'మై భీ హూ నా' అంటూ పలకరిస్తుంటుంది. సినిమా మొత్తం ప్రేమే ఉండడం, ప్రేమ కోసమే సినిమా తీయడం... అలాంటి చిత్రాల్లో పేరున్న కథానాయకుడు, నాయిక నటించడం ఈ మధ్య కాస్త పలచబడింది. కాస్తో కూస్తో ఇమేజ్‌ వచ్చిన కథానాయకుడు మాస్‌, యాక్షన్‌ అంటూ పరుగులు పెడుతుంటే, ప్రేమకథా చిత్రాలకు చోటెక్కడుంది? కొత్తగా మెగాఫోన్‌ పట్టే దర్శకుడు ఇదివరకు ప్రేమకథతోనే ప్రయాణం మొదలెట్టేవాడు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మాయమైంది. తానూ మాస్‌, యాక్షన్‌ కథతోనే ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే ప్రేమకథల జోరు తగ్గింది. అయితే ఎంత పెద్ద ఇమేజ్‌ వచ్చినా, మాస్‌ హీరోగా నిలబడిపోయినా ఎప్పుడో ఒకప్పుడు పరిపూర్ణమైన ప్రేమకథ చేయాలి అనిపిస్తుంటుంది. అవి బాగా ఆడితే సరే సరి. ఫలితం రాకపోతే మాత్రం మళ్లీ వాటి జోలికి వెళ్లని ప్రమాదం ఉంది.

పవన్..బన్నీ..అఖిల్..నాగచైతన్య..
'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తరవాత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడో ప్రేమకథ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్‌.జె.సూర్య దర్శకుడు. 'ఇదో ఫ్యాక్షనిస్టు ప్రేమకథ' అంటూ చిత్రబృందం కొబ్బరికాయ కొట్టినప్పుడే ఈ సినిమాకి సంబంధించిన క్లూ ఇచ్చింది. 'తీన్‌మార్‌' తరవాత పవన్‌ చేస్తున్న ప్రేమకథ ఇదే. ఈమధ్య 'సరైనోడు'గా తన కండలు చూపించి మాస్‌ని ఆకట్టుకొన్నాడు అల్లు అర్జున్‌. ఆయన ఈసారి ఓ ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కోసం లింగుసామి ఓ కథ సిద్ధం చేశారట. అది కొత్తతరహా ప్రేమకథ అని సమాచారం. మరోవైపు నాగచైతన్య 'ప్రేమమ్‌' మత్తు మనకీ ఎక్కించడానికి రెడీ అవుతున్నాడు. మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ప్రేమమ్‌’. ఈ సినిమా అంతా ప్రేమే! వివిధ దశల్లో ఓ అబ్బాయి ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడు? అన్న అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. యువ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొన్న కథాంశం ఇది. అందుకే తెలుగులో ఈ చిత్రాన్ని అదే పేరుతో పునః నిర్మిస్తున్నారు. అఖిల్‌ కూడా ప్రేమకథతోనే ఎంట్రీ ఇద్దామనుకొన్నాడు. కానీ కుదర్లేదు. రెండో చిత్రమైనా ప్రేమకథ అయితే బాగుంటుందని అతని ఆలోచన. అందుకు తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్‌. అఖిల్‌ కోసం ఓ ప్రేమకథ సిద్ధమవుతోందని, త్వరలోనే పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. విభిన్నమైన కథల్ని ఎంచుకొంటున్న యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ ఇప్పుడు ‘మిస్టర్‌’గా కనిపించబోతున్నాడు. ఇదీ ప్రేమకథే అని తెలిసింది.

 ప్రేమ విశ్వజనీనమైన అంశం..
‘అ ఆ’ అంటూ... అక్షరాలు దిద్దిస్తున్నారు త్రివిక్రమ్‌. అనసూయ, ఆనంద్‌ల మధ్య నడిచిన ప్రేమకథ ఇది. కుటుంబ బంధాలకు పెద్దపీట వేసే త్రివిక్రమ్‌ ఈ ప్రేమకథకు కుటుంబ నేపథ్యం జోడించినట్టు తెలుస్తోంది. నితిన్‌ చేయబోయే తదుపరి చిత్రం కూడా పక్కా ప్రేమకథే. ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో ఆకట్టుకొన్న విజయ్‌కుమార్‌ కొండా ఈ చిత్రానికి దర్శకుడు. బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్‌, యాక్షన్‌ కథలే గుర్తొస్తాయి. అయితే ఆయన ఖాతాలోనూ ‘భద్ర’ లాంటి ప్రేమకథ ఉంది. ఇప్పుడాయన బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈసారి ఆయన ప్రేమకథని ఎంచుకొన్నారు. ‘భద్ర’ తరవాత నేను చేస్తున్న ప్రేమకథ ఇదే...’ అని బోయపాటి కూడా చెబుతున్నారు. ‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. ప్రేమ విశ్వజనీనమైన అంశం. ఎప్పుడైనా ఎవరైనా ఏ రూపంలో అయినా చెప్పొచ్చు. ప్రేమ కథని కొత్తగా చెప్పాలే గానీ విజయాలకు ఢోకాలేదు’’ అంటున్నారు సినీ విశ్లేషకులు.

11:30 - May 6, 2016

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్, కరీంనగర్ ,వరంగల్, మెదక్, నందిగామ, విజయవాడ, గవన్నవరంలలో లోతట్ట ప్రాంతాలలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. అత్యధికంగా 75.4 మి.మీ వర్షపాతం హైదరాబాద్ లో నమోదు కాగా, అత్యల్పంగా నర్సాపూర్‌లో 4.6 మి.మీ వర్షపాతం నమోదైంది. విదర్భ నుంచి కర్ణాటక, తెలంగాణ రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోపక్క శుక్రవారం సాయంత్రం వరకు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ లో అత్యధికంగా 75.4 మి.మీ వర్షపాతం, ఆదిలాబాద్ 35.2 మి.మీ, నిజామాబాద్ - 34.4 మి.మీ,మెదక్ -53 మి.మీ , నల్లగొండ 28.8 , ఖమ్మం 22.8 మి.మీ, రామగుండ-12.2, హన్మకొండ 15.2 మి.మీ వర్షపాతం, నందిగామ 28.8, రెంటచింతల 9.2 మి.మీ, గన్నవరంలో 8 మి.మీ, నర్సాపూర్ 4.6 మి.మీ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు..

ఏపీలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో హోర్డింగ్‌ కూలి ఒక వ్యక్తి మృతిచెందారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగులో పిడుపాటుకు 15 గొర్రెలు మృతిచెందాయి. కృష్ణా జిల్లా నందిగామలో భారీ వర్షం మూలంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎటు పక్క నుండి ఏ కొండచరియలు విరిగిపడతాయోనన్న భయాందోళల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన చలిగాలులు తోడవడంతో ప్రజలు ఇండ్లలోంచి బయటకు రావాలేంటే బెంబేలెత్తిపోతున్నారు.

తెలంగాణ లో భారీగా నష్టపోయిన రైతులు.....

తెలంగాణలో అకాల వర్షాల మూలంగా రైతులు భారీగా నష్టపోయారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో గోడ కూలి 25 మేకలు మృతిచెందాయి. మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలో భారీ వర్షానికి 5 ఇళ్లు కూలిపోయాయి. నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కరీనంగర్ జిల్లా మెట్‌పల్లి, జగిత్యాల మార్కెట్‌ యార్డుల్లో వర్షం మూలంగా ధాన్యం, పసుపు తడిసి ముద్దయ్యాయి. జగిత్యాల ఐపిఎ మార్కెట్‌లో 10 వేల క్వింటాళ్ల వరి, వెయ్యి క్వింటాళ్ల దాకా పసుపు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల మూలంగా సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

హైదరాబాద్ లో వర్ష బీభత్సం...

హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, నాగారం, కుషాయిగూడ, రామాంతపూర్‌, హబ్సిగూడ, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కొత్తపేలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

కృష్ణానదిలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి...

గుంటూరు : తాడేపల్లి మండలం సీతానగరం వద్ద విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీనారాయణ(45) అనే వ్యక్తి తన ఇద్దరి పిల్లలతో కలిసి కృష్ణానదిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ మృతి చెందారు. పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. తండ్రి మృతితో లక్ష్మీనారాయణ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

యథాతథంగా సీఎం బాబు పర్యటన : మంత్రి దేవినేని

విజయవాడ : గన్నవరం నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా బ్రహ్మలింగయ్య చెరువు వద్ద ఏర్పాటు చేసిన వేదిక ధ్వంసమైంది. దీనిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ... చెరువు వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక ఈదురుగాలులకు స్వల్పంగా ఒరిగింది. సభావేదికను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. దీంతో ఈరోజు సీఎం చంద్రబాబు పాల్గొనే ‘నీరు-చెట్టు’ సభ యథాతథంగా జరుగుతుందని వివరించారు.

గవర్నర్ ను కలిసిన టీ.టీడీపీ నేతలు..

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను శుక్రవారం తెలంగాణ తెదేపా నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు కలిశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిని ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు వివరించారు.

భారీ వర్షానికి అస్తవ్యస్తమయిన భాగ్యనగరం...

హైదరాబాద్ : నగర వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలలో చెట్లు, హోర్డింగ్ లు, విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. దీంతో పలుచోట్ల మౌలిక సదుపాయాలలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ , తాగునీటి సరఫరాలు నిలిచిపోయాయి. దీంతో  జీహెచ్ ఎంసీ , ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్ లో గోడ కూలి 5గురికి గాయాలయ్యాయి. ట్యాంక్ బండ్ పై 20 చెట్లు విరిగి పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  అల్ఫా హోటల్ సమీపంలో వున్న 150 సవంత్సరాల వయస్సు వున్న పురాతన చెట్టు కూలిపోయింది.

ఇరు రాష్ట్రాల వర్షపాత వివరాలు...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలో గురువారం రాత్రి కురిసిన వర్షాలు ఇరు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వర్ష నమోదు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 75.4 మి.మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆదిలాబాద్ -35.2, నిజామాబాద్-34.4, మెదక్-53, నల్లగొండ-28.8, ఖమ్మం-22.8, రామగుండం-12.2, హన్మకొండ -15.2, నందిగామ-36,చెంటచింతల-9.2, గన్నవరం-8, నర్సాపూర్-4.6 మి.మీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుండి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ఆవరించిన వున్న ఉపరితల ద్రోణి కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

10:59 - May 6, 2016

హైద్రావాద్ ముచ్చటొక్కటున్నది. ఈ పట్నం తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లమారిపోయింది శాంతి భత్రల ముచ్చట్ల అంటే..? పంచాయితీలు..జగుడాలు.. కొట్లాటలు ఏం లేవు.. జనం సాధుజీవులై జీవిస్తున్నరని మన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సారు ఎప్పుడు చెప్తాఉంటడు.. వాస్తవానికి గూడ జర్రంత మారినట్టే అనిపిస్తున్నది అనుకునెయాళ్లకు నర్సన్న ఆశయానికి తూట్లు వొడ్సినంత పనైంది. ఓ ఎనిమిది మంది ఇద్దరిపై కలయపడ్డరు. దీనిగురించి చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

'లోక్‌తంత్ర్ బచావో' పేరుతో కాంగ్రెస్ అధిష్టానం యాత్ర ...

ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు ఢిల్లీలో లోక్‌తంత్ర్ బచావో పేరుతో యాత్రను, అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షను చేపట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన దీక్షలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు పాల్గొన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందనీ...ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు.

మీరాలం చెరువు కట్టపై కొండచిలువ కలకలం...

హైదరాబాద్ : జూపార్కు సమీపంలోని మీరాలంచెరువు కట్టపై ఓ కొండచిలువ ప్రత్యక్షమయ్యింది. దీంతో భయపడిన స్థానికులు బహదూ ర్‌పురా పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ హరీష్‌ కౌశిక్‌ ఆధ్వర్యంలో స్నేక్‌ ఫ్రెండ్స్‌ సొసైటీ సభ్యులు చెరువు వద్దకు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. పోలీసుల సహకారంతో జూపార్కు వెటర్నరీ అధికారులకు అప్పగించారు. కొండ చిలువ సుమారు 8 అడుగుల పొడువు, 10 కిలోల బరువు ఉందని, పూర్తిగా ఆరోగ్యంగా ఉందని జూ అధికారులు తెలిపారు.

10:39 - May 6, 2016

తండ్రి ఆర్మీ ఉద్యోగి..కొడుకు కానిస్టేబుల్..కానీ చట్టానికి వ్యతిరేకంగా ఈ కుటుంబం ప్రవర్తించింది..బాల్య వివాహానికి ఆఫీసర్స్ సిద్ధ పడ్డారు.
చట్టాన్ని కాపాడాల్సిన వారు చట్టానికి అతీతులు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సాంఘీక దురాచారాలను అడ్డుకోవాల్సిన వారే తప్పటడుగులు వేస్తున్నారు. బాల్య వివాహాలపై కొరఢా జులిపించాల్సిన వారే ఆ చట్రంలో మునిగిపోతున్నారు. బాధ్యాతయుతమైన వృతిలో ఉన్న పోలీసు బాల్య వివాహానికి యత్నించాడు.
ఆర్థిక సమస్యలు... నిరక్షరాస్యత..ఈ కారణంగానే కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రోత్సాహిస్తున్నారు. ఆడపిల్లలు బరువు అని భావించే తల్లిదండ్రులు తొందర పడుతున్నారు. మరోవైపు చదువుకున్న అక్షరాస్యులు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవాల్సింది పోయి ఆజ్యం పోస్తున్నారు. అంగబలం..అర్థబలం..తో తాము ఏం చేసినా చెల్లుతుందని వారు అనుకుంటున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

గవర్నర్ ను కలువనున్న టీ.టీడీపీ నేతలు...

హైదరాబాద్ : కాసేపట్లో టీ.టీడీపీ నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను  కలువనున్నారు. రాష్ట్ర వ్యాప్తం నెలకొన్న కరవుపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న సుప్రీంకోర్టు కమిటీ బృందం ...

నల్లగొండ : సుప్రీంకోర్టు కమిటీ జిల్లాలో నేడు పర్యటించనుంది. బీరంనగర్,గుండ్లగూడెం,భువనిగిరి, రెడ్డినాయక్ తండా, సనత్ పల్లిలలో కమిటీ బృందం పర్యటించనుంది. జీరో ఎన్ రోల్ మెంట్ పాఠశాలలను ఈ కమిటీ తనిఖీ చేయనుంది.

తాడేపల్లిలో వర్షానికి కూలిన హోర్డింగ్, వ్యక్తి మృతి...

గుంటూరు : రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మందడం,వెలగపూడి,రాయపూడి, తుళ్లూరులలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాడేపల్లి బైపాస్ రోడ్డులోని హోర్డింగ్ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

10:29 - May 6, 2016

పట్టుకొనేందుకు వెళ్లారు..ప్రాణం తీసుకుంటానంటూ బెదిరించాడు..నగర శివారులో పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది..
నేరగాడిని పట్టుకొనేందుకు వెళ్లిన ఖాకీలకు అతని సోదరుడు చుక్కలు చూపించాడు. కత్తితో వీరంగం చేస్తూ కోసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. ఒక్కసారిగా జరిగిన హాఠాత్ పరిణామంతో పోలీసులు ఖంగుతిన్నారు. నగర శివారులో కిడ్నాపర్స్ సోదరుడి హల్ చల్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఆ యువకుడి వీరంగం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఐసీఐసీఐ డైరెక్టరేట్ లో అగ్ని ప్రమాదం...

విశాఖ : ఎంవీపీ కాలనీలోని ఐసీఐసీఐ డైరెక్టరేట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నారు.

వర్షానికి కూలిన గోడ, 5గురికి తీవ్ర గాయాలు...

హైదరాబాద్ : నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితుల్లో ఓ మహిళ ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి...

తూ.గోదావరి : తొండంగి మండలం తమ్మయ్యపేట దగ్గర గుర్తుతెలియని వాహనం ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఏఎన్ యూలో ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన....

గుంటూరు : ఏఎన్‌యూలో గత మూడు రోజులుగా అన్ని జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాయామ ఉపాధ్యాయులు మద్యం తాగి ఓ మహిళా ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

10:10 - May 6, 2016

బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లో సైతం దీపికా పదుకొనెకు పుష్కలంగా అవకాశాలొస్తున్నాయి. దీపికా ఇప్పటికే 'త్రిఫుల్‌ ఎక్స్‌' హాలీవుడ్‌ చిత్రంలో విన్‌ డిజీల్‌ సరసన నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్‌ కెనడాలో జరుగుతోంది. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజుల క్రితం మరో హాలీవుడ్‌ చిత్రం కోసం దీపికా ఆడిషన్స్‌కి వెళ్ళినట్టు సమాచారం. 'మమ్మీ' చిత్ర సిరీస్‌లో భాగంగా తాజాగా రూపొందించబోయే ఈ చిత్రంలో టామ్‌క్రూజ్‌కి జోడీగా దీపికా నటించనున్నట్లు తెలుస్తోంది. 'మమ్మీ' సిరీస్‌లో ఇప్పటివరకు 'మమ్మీ', 'ది మమ్మీ రిటర్స్న్‌', 'ది మమ్మీ : టూంబ్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌ ఎంపరర్‌' తదితర చిత్రాలొచ్చిన విషయం తెలిసిందే. ఏదిఏమైనా హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌క్రూజ్‌ సరసన దీపికా నటించబోతోందనే విషయం ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

10:09 - May 6, 2016

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ అధినేత యశ్‌చోప్రాను స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. యశ్‌చోప్రా తన సినిమాలను స్విట్జర్లాండ్‌లోనే ఎక్కువగా చిత్రీకరించినందుకు ఆయన జ్ఞాపకార్థంగా 250 కిలోల బరువున్న కాంస్య విగ్రహాన్ని అందమైన పర్వతాల మధ్య ఉండే ఇంటర్‌లేకెన్‌ నగరంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని యశ్‌చోప్రా సతీమణి పమేలా, కోడలు రాణీముఖర్జీలు ఆవిష్కరించారు. ఈ విషయాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. బాలీవుడ్‌ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన దర్శక, నిర్మాత యశ్‌చోప్రా అనారోగ్యం కారణంగా 2012 అక్టోబర్‌ 21న కన్నుమూసిన విషయం విదితమే.

10:08 - May 6, 2016

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సినీ అభిమానులు భావించే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందడి ఈనెల 11న అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 12 రోజుల పాటు జరిగే 69వ కేన్స్‌ చలన చిత్రోత్సవానికి ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌రివేరా వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన చిత్రాలతోపాటు లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కేన్స్‌లో ప్రదర్శితమయ్యేందుకు పోటీ పడుతున్నాయి. పోటీలో గెలిచిన ఉత్తమ చిత్రం 'పాల్మా డి ఓర్‌' పురస్కారాన్ని దక్కించుకుంటుంది.

మరుగుదొడ్డి గుంతలో పడి మూడేళ్ల చిన్నారి మృతి ...

నల్గొండ: పెన్‌పహాడ్‌ మండలం దూపాడులో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్డి గుంతలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటనతో చిన్నారి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

10:07 - May 6, 2016

శత్రువును హతమార్చడానికి 'కహానీ' చిత్రంలో గర్భవతిగా నటించాను. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'కహానీ2' చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌ అనంటోంది విద్యాబాలన్‌. సుజోయ్ ఘోష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కహానీ 2'. ప్రస్తుతం షూటింగ్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల 'తీన్‌' సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న విద్యాబాలన్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో 'కహానీ2' సినిమా గురించి చెబుతూ,'ఇదొక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం. కోల్‌కత్తా మెట్రో ట్రైన్‌లో బాంబు పేలుళ్ళకి పాల్పడి వందలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న హంతుకుడ్ని పట్టుకునే క్రమంలో 'కహానీ'లో గర్భవతిగా నటించాను. ఆ తరహాలోనే ఈ సీక్వెల్‌ ఉన్నప్పటికీ నా పాత్ర మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది. అయితే పాత్ర కనిపించే తీరు గురించి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేను' అని అన్నారు.

10:06 - May 6, 2016

'మహేష్‌బాబుతో నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి.. ట్యాగ్‌గా 'ఇదే నా తొలి ట్వీట్‌..' అంటూ కాజల్‌ అభిమానులతో షేర్‌ చేసుకుంది. అభిమానులకు, ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉండాలనే ప్రాసెస్‌లో భాగంగా కాజల్‌ సైతం ట్విట్టర్‌ ఎకౌంట్‌ని ఓపెన్‌ చేశారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ పేజ్‌ ద్వారా కోటికి పైగా అభిమానులను సొంతం చేసుకున్న కాజల్‌ ఇక ట్వీట్స్‌తో సందడి చేయనుంది. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబు సరసన 'బ్రహ్మోత్సవం' చిత్రంతోపాటు తేజ రూపొందించబోయే తాజా చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు.అలాగే బాలీవుడ్‌లో 'దో లఫ్జోమ్‌కి కహాని' చిత్రంలోను, కోలీవుడ్‌లో 'కవాలై వెండమ్‌', 'గరుడ' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఏఎన్‌యూలో నకిలీ నోట్ల కలకలం....

గుంటూరు : ఏఎన్‌యూలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. ఏఎన్‌యూలోని బ్యాంక్‌ ఖాతాలో ఇరాక్‌కు చెందిన విద్యార్థి కరీంసాల్‌ అనే విద్రార్థి రూ.98వేలు జమ చేశారు. రూ.98వేలలో రూ.38వేలు నకిలీనోట్లుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. పెదకాకాని పోలీసులకు బ్యాంక్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో కరీంసాల్‌ యూరివర్శిటీ నుంచి పరారైనాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గాంధీ విగ్రహం వద్ద బైఠాయించిన ఎన్డీయే నేతలు..

ఢిల్లీ : పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ఎన్డీయే నేతలు బైఠాయించారు. కాంగ్రెస్ హాయాంలో జరిగిన అవినీతిపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

09:56 - May 6, 2016

చాలా మందికి నడవడం అంటే చాలా బద్ధకం. అందుకే చిన్న పనికి కూడా ద్విచక్ర వాహనంపై రయ్..రయ్.. అంటూ వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారికి భవిష్యత్‌లో ప్రమాదం పొంచివున్నట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా.. ఉద్యోగులు, గృహిణులు, యువత సైతం ఈ కాలంలో కూర్చోడానికి, విశ్రాంతికోసం ఇంటికి పరిమితం కావడానికి ఇస్తున్న ప్రాధాన్యత నడవడానికి ఇవ్వడం లేదు. ఇంటినుంచి ఆఫీసుకు, తిరిగి ఇంటికి మనిషిని చేర్చటంలో సొంత వాహనాలు మంచి వెసులుబాటును ఇచ్చినప్పటికీ ఈ క్రమంలో నడక గాలికెగిరిపోయి సమస్యలను కోరి ఆహ్వానించినట్టవుతోంది.
ఇంటి నుంచి ఆఫీసుకు పోయాక కుర్చీల్లో కూర్చుని గంటల కొద్దీ పనిచేయటం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ చూడటం, తినటం, చదువుకోవటం, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పటంతోనే కాలం వెళ్లబుచ్చటం వల్ల కండరాలు బిగుసుకుపోవటం అనేది సహజమైపోయింది. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

09:54 - May 6, 2016

సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలకు క్రమేణా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే, తగిన ఆహారం తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుదలను పూర్తిగా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడు చురుకుగా పని చేసేందుకు అవసరమైన శక్తిని గ్లూకోజ్‌ మెదడుకు అందజేస్తుంది. పొద్దున్నే మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ ఈ గ్లూకోజ్‌ శరీరానికి అందుతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌ మానివేసిన మహిళలకైతే ఉద్యోగ జీవితంలో విధుల నిర్వహణలో తెలియని ఒకరకమైన చిరాకు వేధిస్తుంది. అదే చిన్నపిల్లలైతే స్కూల్లో చురుకుదనంతో ఉండరు. కాబట్టి, ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో బీన్స్‌, మొలకెత్తిన గింజలు లాంటివి తీసుకునేవారు చాలా చురుగ్గా ఉంటారు. చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
వీటితోపాటు పాలు కూడా తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఆకుకూరలు లాంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇకపోతే, పొద్దున్నే బేకరీలలో తయారైన వస్తువులను తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ఫాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయకపోవడమే కాకుండా, వీటిలోని క్యాన్సర్‌ కారకాలు శరీరానికి హాని చేస్తాయి.
అలాగే... మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను ప్రతిరోజూ తీసుకుంటే చాలామంచిది. కోడిగుడ్డు నుండి మన శరీరం స్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ను తయారు చేసుకుంటుంది. ఎసెటిల్కోలైన్‌ దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది గనుక శరీరంలో లోపిస్తే ఆల్జిమర్స్‌ వ్యాధి వస్తుంది.
అంతేగాకుండా న్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ మన మేధో శక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పళ్ళు, పచ్చటి కూరలే శరీరాని మిత్రులనే విషయాన్ని ఎన్నడూ మరచిపోవద్దు. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉండటమే గాకుండా, పైబర్‌ అత్యధిక స్థాయిలో ఉంటుంది.
అలాగే పెరుగును కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్లు ఒత్తిడిని తట్టుకునేందుకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. అంతేగాకుండా, న్యూరో ట్రాన్స్‌మీటర్లను ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. పెరుగు మెదడుకే కాక, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీర్ణకోశాన్ని చక్కగా పనిచేసేలా చేస్తుంది. జీవితంలో చురుకుగా ఉంటూ మంచి విజయాలను సొంతం చేసుకోవాలంటే మేధోశక్తి చాలా అవసరం. అలాంటి మేధోశక్తి పైన చెప్పిన ఆహార జాగ్రత్తలను, నియమాలను పాటించడం వల్ల పొందవచ్చు.

కూలిన గోడ..ఐదుగురికి గాయాలు...

హైదరాబాద్: నగరంలో రాత్రి కురిసిన వర్షానికి గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను టీటీడీ అధికారుల శుక్రవారం విడుదల చేస్తారు. అదేరోజు ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో www.ttdseva-online.com వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు.

నేడు పాలిసెట్ ఫలితాలు..

హైదరాబాద్ : పాలిటెక్నిక్ కోర్సు ప్రవేశ పరీక్ష పాలిసెట్-2016 ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ అకడమిక్ సెనెట్ మందిరంలో శుక్రవారం ఉదయం 12 గంటలకు విడుదల చేయనున్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేస్తారు. 

జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్...

హైదరాబాద్ : నగరంలో కురిసిన భారీ వర్షం వల్ల కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌లను తొలగిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి చెప్పారు. నగరంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈదురు గాలులు, వర్షంతో ఇబ్బందులు కలిగితే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌: 212111111కు ఫోన్ చేయవచ్చని కమిషనర్ తెలిపారు. 

హిందాన్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు..

ఉత్తర్ ప్రదేశ్ : ఘజియాబాద్ లోని హిందాన్ ఎయిర్ బేస్ లో కలకలం రేగింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి చొరబడ్డారన్న వార్తలతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు గాలింపులు చేపట్టారు. 

09:36 - May 6, 2016

నల్లగొండ : చౌటుప్పల్‌లో ఘోరం జరిగింది. ఉపాధికోసం వెదుకుతున్న అన్నాచెల్లెళ్లకు విషాదం మిగిలింది. కార్తీక్, శిరీష చిన్నప్పుడే తల్లిదండ్రల్ని కోల్పోయారు. ఉపాధికోసం తిరుగుతూ, హైదరాబాద్‌కు వెళ్దామనుకున్నారు. లారీ ఎక్కి ప్రయాణిస్తుండగా, జాతీయరహదారిపై లారీడ్రైవర్‌ మధ్యలో ఆపి, కార్తీక్‌ను గుట్కాతెమ్మని కిందికి దింపాడు. తిరిగొచ్చేసరికి లారీ లేదు, తన చెల్లెలు కనిపించకపోవడంతో కార్తీక్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. ఎంతవెతికినా తన చెల్లెలు కనిపించకపోవడంతో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

09:31 - May 6, 2016

కరీంనగర్ : భానుడి భగభగలతో అల్లాడిపోయిన తెలంగాణ ప్రజలు  రెండు మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు హాయిగా సేదదీరారు. కానీ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.  వరి ,పసుపు, మామిడి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. వర్షంతోపాటు ఈదురుగాలు కూడా వుండటంతో కోయకుండా వున్న వరి పంటకూడా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మార్కెట్ 900 క్వింటాళ్ళ వరి ధాన్యం పూర్తిగా తడిసిపోవటంతో మార్కెట్ యార్డ్ అధికారులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

09:07 - May 6, 2016

నల్లగొండ : వలిగొండ మండలం టేకులసోమారం సమీపంలో వున్న రైల్వే బ్రిడ్జ్ కి పగుళ్ళు ఏర్పడ్డాయి. నూతనంగా నిర్మించిన రైల్వే ట్రాక్ కు పగుళ్ళు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు నడికుడి-బీబీనగర్ ప్రాంతంలో రైలును అధికారులు నిలిపివేశారు. తెనాలి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న డెల్టా ప్యాసింజర్ మూడు గంటల తర్వాత తిరిగి బయల్దేరింది. నల్లగొండ జిల్లా టేకుల సోమవారం బొల్లేపల్లి గేటు వద్ద రైల్వే ట్రాక్ కు పగుళ్లు ఏర్పడ్డంతో శుక్రవారం ఉదయం 5.30గంటల సమయంలో రైలును నిలిపివేసిన సంగతి తెలిసిందే. గంటన్నర అనంతరం రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించారు. దీంతో దాదాపు మూడు గంటల తర్వాత 8.20గంటల సమయంలో రైలు ముందుకు కదిలింది.

అకాల వర్షంతో మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యం...

హైదరాబాద్ : ఎండలతో మలమలా మాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు గురువారం రాత్రి కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. కానీ ఈ వర్షంతో పలు ప్రాంతాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ లో 900 క్వింటాళ్ళ ధాన్యం తడిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పునరుద్ధరించిన రైల్వే ట్రాక్, బయలుదేరిని రైలు....

హైదరాబాద్ : తెనాలి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న డెల్టా ప్యాసింజర్ మూడు గంటల తర్వాత తిరిగి బయల్దేరింది. నల్లగొండ జిల్లా టేకుల సోమవారం బొల్లేపల్లి గేటు వద్ద రైల్వే ట్రాక్ కు పగుళ్లు ఏర్పడ్డంతో శుక్రవారం ఉదయం 5.30గంటల సమయంలో రైలును నిలిపివేసిన సంగతి తెలిసిందే. గంటన్నర అనంతరం రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించారు. దీంతో దాదాపు మూడు గంటల తర్వాత 8.20గంటల సమయంలో రైలు ముందుకు కదిలింది.

పత్తికోళ్లలంకలో 144 సెక్షన్ ....

పశ్చిమగోదావరి : పత్తికోళ్లలంకలో మారోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామ పరిధిలోని చేపల చెరువుల హక్కులకు సంబంధించి గ్రామం రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండువర్గాల మధ్య దాడులు కూడా చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఓ వర్గానికి చెందిన 16 మంది వ్యక్తులు వివాదంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు యత్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెండో వర్గం పోలీసులకు సమాచారాన్ని చేరవేసింది. దీంతో మరోమారు రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి....

అనంతపురం : జిల్లాలో కురిసిన భారీ వర్షం వల్ల పంట నష్టం జరిగింది. జిల్లాలోని కంబదూరు మండలం నూతిమడుగులో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. పశ్చిమ కృష్ణాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరులో భారీ వర్షం కురిసింది. నూజివీడు, విస్సన్నపేట, చాట్రాయిలో కురిసిన భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

భారీ వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి...

ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రాంపుర్, రామకృష్ణాపూర్, గోలేటి ఓపోన్ బొగ్గు గనుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దండేపల్లి, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల్లో ఆరు బయట ఉంచిన ధాన్యం తడిసిపోయింది.

రైల్వే బ్రిడ్జ్ కు పగుళ్లు, తప్పిన ప్రమాదం...

నల్లగొండ : వలిగొండ మండలం టేకులసోమారం సమీపంలో వున్న రైల్వే బ్రిడ్జ్ కి పగుళ్ళు ఏర్పడ్డాయి.  రైల్వే ట్రాక్ క్రిందుగా వున్న రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రా ఫిక్ పోలీసు  ఈ ప్రమాదాన్ని  గుర్తించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో తెనాలి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న డెల్టా ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నడికుడి-బీబీనగర్ ప్రాంతంలో రైళ్ళను అధికారులు  నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అకాల వర్షాలతో పంటలకు భారీ నష్టం...

వరంగల్ : గురువారం రాత్రి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అకాల వర్షాలతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది....

తిరుమల : వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,279 మంది భక్తులు దర్శించుకున్నారు.

భారత పటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే రూ. 100 కోట్ల జరిమానా ...

ఢిల్లీ: భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత ‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం ... భారత భౌగోళిక సమాచారాన్ని సేకరించడం, ప్రచురించడం, పంపిణీచే యడానికి ముందు సదరు సంస్థ తప్పని సరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి.

రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి...

హైదరాబాద్ : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి పంచముఖి కాలనీకి చెందిన రాఘపురం గంగాధర్‌ (35) గురువారం ఉదయం రామకృష్ణాపురం-సఫిల్‌గూడ వైపు వస్తున్న రైలులో ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి జేబులో లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా కామారెడ్డి వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉజ్జయిని కుంభమేళాలో7గురు మృతి,90 మందికి గాయాలు..

హైదరాబాద్ : ఉజ్జయిని కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాలో గురువారం రోజు బలమైన ఈదురుగాలు, ఉరుములుమెరుపులతో కూడిన అకాలవర్షం కురియడంతో నదీతీరంలో పెద్దసంఖ్యలో ఏర్పాటుచేసిన భారీ టెంట్లు, స్వాగత తోరణాలు నిలువునా కూలిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 90 మందికి తీవ్రగాయాలయ్యాయని ఉజ్జయిని జిల్లా కలెక్టర్ కవీంద్ర కియావత్ తెలిపారు. కుంభమేళాలో భాగంగా శుక్రవారం వైశాఖ కృష్ణ షాహీ స్నాన్ నిర్వహించనున్న నేపథ్యంలో కుంభమేళాకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఆర్టీఓ పరిధిలో సీజ్ చేసిన వాహనాలు వేలం...

హైదరాబాద్ : ఉప్పల్ ఆర్టీఓ పరిధిలో సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 8న వేలం నిర్వహించనున్నట్లు ఉప్పల్ ఆర్టీఓ వెంకటేశం తెలిపారు. చెంగిచెర్ల, ఉప్పల్ ఆర్టీసీ డిపో, ఆర్టీఓ కార్యాలయాల్లో ఈ వేలం ఉంటుందని చెప్పారు. ఉదయం 9 సాయంత్రం 5 గంటల వరకు వేలం నిర్వహిస్తామని వివరించారు. వాహనాల వివరాలకు WWW. TRANSPO RT. TELANGANA.GOV.IN అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చని ఆయన సూచించారు.

07:29 - May 6, 2016

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్రం యత్నం చేస్తోందని 'న్యూస్ మార్నింగ్ 'చర్చలో నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో మోడీ సర్కార్ ఆటలాడుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఏకరవు పెట్టే సమస్యలను పట్టించుకోకుండా సాంకేతిక కారణాలు చెబుతూ దాటవేస్తోంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోగా.. మరికొంత కారం పోసి సమస్యను జటిలం చేసేందుకు ప్రయత్నిస్తోంది. హూదూద్ సాయం నుంచి నిన్నటి మొన్నటి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గిన తీరును చూస్తే..కేంద్రం ఏపీ మీద ఎంత ప్రేమ కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అటు తెలంగాణకు కరవు సాయం, ఇళ్ల కేటాయింపు నుంచి ఖమ్మం స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని చెప్పే వరకు కేంద్రం సవతి తల్లి ప్రేమ నటిస్తూ..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో చెలగాటం ఆడుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్యతో పాటు బిజెపి నేత ప్రకాష్ రెడ్డి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వర్ల రామయ్య పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

బ్రిడ్జ్ పై నుండి రెండు లారీలు బోల్తా ...

తూ.గోదావరి : తునిలో బ్రిడ్జ్ పై నుండి ప్రమాదవశాత్తు రెండు లారీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

07:14 - May 6, 2016

హైదరాబాద్ : కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జూన్ 2 లోపు అందరిని రెగ్యులర్ చేస్తానని సీఎం హామీ ఇచ్చినా అది అయ్యేలా లేదు. ఇప్పటికి ఏఏ శాఖల్లో ఎంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.. వారిలో ఎంత మంది క్రమబద్దీకరణకు అర్హులు అన్న లెక్కలు తేలడంలేదు. దీంతో క్రమబద్ధీకరణ కలగానే మిగులుతోంది.

క్రమబద్దీకరణ పై లేని స్పష్టత....

కాంట్రాక్ట్ కార్మికుల కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. గడువులు పొడిగిస్తున్నారు తప్పితే వారి క్రమబద్దీకరణ విషయంలో తెలంగాణ సర్కార్ నుండి స్పష్టత రావడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని సీఎం ప్రకటించినా.. దానిపై ఒక్కఅడుగు ముందుకుపడడంలేదు.

సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సీఎస్ రాజీవ్ శర్మ ఆధ్యక్షతన కమిటీ వేసింది. కాంట్రాక్ట్ సిబ్బంది ఎంత మంది ఉన్నారో గుర్తించాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. అదే క్రమంలో 1994 ఏపీ ఉద్యోగుల నియామక చట్టాన్ని సైతం అన్వయించుకుంటూ జీవో జారీచేసింది సర్కార్. జూన్ 2 లోగా రెగ్యులరైజ్ చేస్తామని హామీ సైతం ఇచ్చారు కేసీఆర్.

తాజాగా ఉద్యోగుల నియామకాలపై నీలినీడలు....

కాని ఇప్పుడు తాజాగా దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారి లెక్కలు తేలడం లేదు. కాంట్రాక్ట్ ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. కేవలం కాంట్రాక్ట్ సిబ్బందిని తీసుకుంటే ..2 లక్షల పైగా ఉన్నారు. వీరితోపాటు మానవతా దృక్పథంతో ... అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. వీరందరూ 25 వేల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

నియామకాలు ఆర్థికశాఖ నిబంధనలకు లోబడి జరగాలి

ఈ నియామకాలు ఆర్థికశాఖ నిబంధనలకు లోబడి ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, రోస్టర్ పద్ధతినిపక్కాగా అనుసరించాలి. వారికి కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. అర్హులందరూ.. ఎవరు ఏఏ శాఖల్లో ఎంత మంది ఉన్నారన్న లెక్కలు తేలకపోవడంతో.. ప్రభుత్వం కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోంది.ఈ వ్యవహారం అంతా.. కమల్ నాథన్ కమిటీ తుది నివేదిక వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేలా ఉంది. కాంట్రాక్ట్ సిబ్బంది లెక్కాపత్రాల సేకరణ.. వారి అనారోగ్యకారణాలు పరిధిలోకి తీసుకోవడం కష్టంగా మారుతోంది. దీంతో కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులరైజేషన్ కలగానే మిగిలేలా ఉంది. 

07:11 - May 6, 2016

హైదరాబాద్ : విద్యార్థులు లేరన్న సాకుతో 4వేల స్కూళ్లను మూసేస్తామన్న తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారీ చేతకానితనం వల్లే విద్యార్థులు సర్కారీ స్కూళ్లలో చేరేందుకు ఇష్టపడడంలేదని సుప్రీం న్యాయవాదులు వ్యాఖ్యానించారు. విద్యార్ధులు లేని స్కూళ్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సుప్రీం బృందం తెలంగాణాలో విస్తృతంగా పర్యటిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని పలు స్కూళ్లను సందర్శించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ముచ్చటించింది.

అధ్యయనం చేసేందుకు కమిటీ ...

కేజీ టు పీజి వరకు ఉచిత విద్యంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం...ఊరికో స్కూల్‌కి తాళాలు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ఏ స్కూళ్లనైతే ప్రభుత్వం మూసేస్తామందో ఆ స్కూళ్లను అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని కూడా వేసింది. ఈ కమిటి తెలంగాణలో నెల రోజుల పాటు పర్యటించి జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్‌పై నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

స్కూళ్లను పునరుద్ధరిస్తే పిల్లల్ని చేర్పిస్తామన్న పేరెంట్స్‌ ...

తొలుత రంగారెడ్డి జిల్లాలో కమిటీ పర్యటించింది. అయితే ఈ కమిటికి ప్రతి గ్రామంలోని తల్లిదండ్రుల నుంచి ఒకటే నినాదం వినిపించింది. తమ గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తే పిల్లలను స్కూళ్లలో చదివించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు స్పష్టం చేశారు. అంతేకాకుండా సరైన సౌకర్యాలను కల్పిస్తే..కాస్తా దూరం వెళ్లేందుకు కూడా సిద్ధమేనని వారు తెలిపారు. అయితే ఉన్న స్కూళ్లు మూసేయడానికి ప్రధాన కారణం కేవలం టీచర్లు సరిగ్గా స్కూల్స్‌కి రాకపోవడమేనంటున్నారు. ప్రభుత్వం తరపున పర్యవేక్షణాధికారులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడానికి సిద్దమవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి గ్రామంలో సర్కారీ బడి అన్ని వసతులతో ఉంటే తమకు ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరమే లేదంటున్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 3 కిలోమీటర్‌లకి ఒక పాఠశాల ...

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 3 కిలోమీటర్‌లకి ఒక పాఠశాల ఉండాలి. కానీ తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లు ఉన్నప్పటికీ వాటిని పర్యవేక్షించేందుకు ఎంఈఓలు లేరని అసలు ఉన్న వసతులను వాడుకోవడానికి సిబ్బంది కూడా దిక్కులేరని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో తల్లిదండ్రులు నాణ్యమైన విద్య కోసం ప్రైవేటువైపు అడుగులేస్తున్నారు. అయితే అక్కడ కూడా అరకొర సౌకర్యాలే ఉండడంతో అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ స్కూళ్లల్లోనే ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించాలని తల్లిదండ్రులు సుప్రీం కమిటిని కోరారు.

అనేక సమస్యలను వివరించిన గ్రామస్తులు.

సుప్రీం బృందానికి తమ గ్రామంలోని సర్కారీ బడుల్లో ఉన్న అనేక సమస్యలను వివరించిన గ్రామస్తులు..ప్రభుత్వ పాఠశాలల మూసివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ లంబాడి తండాల్లో ఇప్పుడిప్పుడే విద్యార్ధులు బయటకు వస్తున్నారని తమ పిల్లల్ని విద్యకు దూరం చేయోద్దని వారు విజ్ఞప్తి చేసారు. అంతేకాదు వీరిపిల్లలు కూడా బడిని తెరిచి టీచర్‌ను నియమిస్తే చదువుకుంటామని కమిటిని వేడుకున్నారు.

తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ విద్యను కాపాడాలని విన్నవింపులు...

మొత్తానికి సుప్రీం బృందానికి ప్రతిచోట విద్యార్ధుల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ విద్యను కాపాడాలని విన్నవించారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు అంతా కలిసి ప్రభుత్వ విద్యను కాపాడాలని నినదించారు. దీంతో విద్యార్థులే లేరని మూసివేతకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులా తయారైంది. కనీసం సుప్రీం బృందం రూపొందించిన నివేదికతోనైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందా లేదా అన్నది చూడాలి మరి. 

సన్ రైజర్స్-గుజరాత్ మధ్య నేడు ఐపీఎల్....

హైదరాబాద్ : నేడు సన్ రైజర్స్-గుజరాత్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

07:05 - May 6, 2016

హైదరాబాద్ : ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివెళ్లేందుకు ముహూర్తం ఖరారయ్యింది. వచ్చే నెల 27 వ తేదీ మంచి రోజు కావడంలో ఆరోజు నుంచి వెలగపూడిలో నిర్మాణంలోఉన్న తాత్కాలిక సచివాలయం నుంచి పరిపాలన సాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్త రాజధానికి తరివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా..... తమ సమస్యలే పరిష్కారం కావడంలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

30 శాతం డీఏ కొనసాగించేందుకు ఒప్పుకున్న ప్రభుత్వం .....

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి అమరావతి తరలివెళ్ల నుంచి ఉద్యోగులు, వీరి పిల్లల సమస్యలపై చర్చించారు. హైదరాబాద్‌లో ఇస్తున్న తరహాలోనే అమరావతిలో కూడా 30 శాతం డీఏ కొనసాగించడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే ఆర్ధిక సంబంధమైన ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.... ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో అద్దెలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే నెల 13 నుంచి పాఠశాల పునఃప్రారంభం ....

హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివెళ్లే ఉద్యోగులు పిల్లల సమస్యలపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌తో చర్చించారు. వేసవి సెలవు తర్వాత వచ్చే నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. పిల్లలను స్కూళ్లలో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు వీలుగా గుంటూరు, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరిస్తామిన సీఎస్‌ హామీ ఇచ్చారు. పిల్లల స్థానికతపై ఈనెల 20 నాటికి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని సీఎస్‌ ఉద్యోగ సంఘం నేతల దృష్టికి తెచ్చారు.

రెండు వారాల్లో సమస్య పరిష్కరించకపోతే....

ఉద్యోగుల తరలింపుపై రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని మూడు నెలలుగా కోరుతున్నా ఇంతవరకు ఈ దిశగా చర్యలు తీసకోపోవడం పట్ల ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల్లో సమస్య పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ రూపొందింస్తామని హెచ్చరిస్తున్నారు. 

07:04 - May 6, 2016

హైదరాబాద్ : ఏపీ కి ప్రత్యేక హోదాకోసం వైసీపీ మరోసారి పోరుబాట పట్టింది... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతీరుకు నిరసనగా ఉద్యమానికి సిద్ధమైంది.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది..

ఈ నెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్లముందు ధర్నాలు ...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదంటూ కేంద్రమంత్రులు చేసిన ప్రకటనలు రాష్ట్రంలో దుమారం రేపాయి.. ముందు నుంచీ స్పెషల్‌ స్టేటస్‌కోసం ఉద్యమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రం నిర్ణయంపై భగ్గుమంది.. మరోసారి నిరసనలకు రెడీ అయింది.. ఈ నెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టనుంది.. కాకినాడ కలెక్టరేట్‌ ముందు ధర్నాలో పార్టీ అధినేత జగన్‌ పాల్గొంటారని పార్టీ ప్రకటించింది..

కేంద్రమంత్రులుగా కొనసాగడం సిగ్గుచేటు...

ప్రత్యేక హోదా ఇవ్వరని తేలాకకూడా టీడీపీ నేతలు కేంద్రమంత్రులుగా కొనసాగడం సిగ్గుచేటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.. అటు ఆందోళనలతో హోరెత్తిస్తూనే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు జగన్‌ పార్టీ రంగం సిద్ధం చేసింది.. వరుస విమర్శలతో ఒత్తిడి పెంచింది.. తాము ప్రత్యేక హోదాపై చేసిన పోరాటాలను అవహేళన చేయడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తోంది..

ప్రత్యేక హోదా అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ...

తమ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడంపై కొంతకాలంగా వైసీపీ నేతలు సీరియస్‌గా ఉన్నారు.. ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు కూడా చేశారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని టీడీపీకి చుక్కలు చూపించాలని భావిస్తున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబుకు పార్టీ ఫిరాయింపులపైఉన్న శ్రద్ధ.. ప్రత్యేక హోదాపై లేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు.. చంద్రబాబును నిలదీస్తూనే... ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని జగన్‌ ప్లాన్ చేస్తున్నారు..

హోదా లేదన్న ప్రకటన అస్త్రంగా ...

మొత్తానికి పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న వైసీపీ నేతలకు ప్రత్యేక హోదా లేదన్న ప్రకటన అస్త్రంగా మారింది.. స్పెషల్ స్టేటస్‌కోసం పోరాడుతూ సైకిల్‌ పార్టీని ముప్పుతిప్పలు పెట్టాలని నేతలు ప్రయత్నిస్తున్నారు.. 

పాలమూరు ఎత్తిపోతలపై నేడు సుప్రీంలో విచారణ ...

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీకి చెందిన రైతులు కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు దేశ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగనుంది.

06:57 - May 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పూర్తి స్థాయిలో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీకి లోకల్ లీడర్లతో పంచాయితీ మొదలైంది. స్థానిక నేతలు మంత్రుల ముందే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన ఈ వ్యవహారం ఇతర జిల్లాలకు పాకుతుందన్న ఆందోళన గులాబీ నేతల్లో మొదలైంది.

అధికార పార్టీలో ఇమడలేని పరిస్థితి...

టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటున్న ఇతర పార్టీల గ్రామ, మండల స్థాయి నేతలు అధికార పార్టీలో ఇమడలేని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరుతో కింది స్థాయి నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో అధికారిక సమావేశాల్లోనే ప్రభుత్వంపై తమ అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని వాపోతున్నారు.అధికార పక్షం నేతలే తీవ్ర అసంతృప్తితో సమీక్షా సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో ....

ఆదిలాబాద్ జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. జిల్లా పరిషత్ సమావేశంలో టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన మంత్రులు పార్టీ పెద్దలతో మాట్లాడి ..ఆ జడ్పీటీసీపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేయించారు. ఆదిలాబాద్ మున్సిపాల్టీలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుపై నిరసన గళం వినిపించిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ పైనా ఆ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఐతే స్థానిక సంస్థల ప్రతినిధులపై అధికార పార్టీ చర్యలు తీసుకోవడం గులాబి దళంలో చర్చనీయాంశంగా మారింది. 

06:51 - May 6, 2016

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలతో మోడీ సర్కార్ ఆటలాడుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఏకరవు పెట్టే సమస్యలను పట్టించుకోకుండా సాంకేతిక కారణాలు చెబుతూ దాటవేస్తోంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోగా.. మరికొంత కారం పోసి సమస్యను జటిలం చేసేందుకు ప్రయత్నిస్తోంది. హూదూద్ సాయం నుంచి నిన్నటి మొన్నటి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గిన తీరును చూస్తే..కేంద్రం ఏపీ మీద ఎంత ప్రేమ కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అటు తెలంగాణకు కరవు సాయం, ఇళ్ల కేటాయింపు నుంచి ఖమ్మం స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని చెప్పే వరకు కేంద్రం సవతి తల్లి ప్రేమ నటిస్తూ..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో చెలగాటం ఆడుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

హోదా సాధ్యం కాదన్న జైట్లీ...

ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా సాధ్యం కాదని మొన్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హెచ్‌పీ చౌదరి ప్రకటిస్తే..తాజాగా ఆర్థిక మంత్రి ప్రత్యేక హోదా సాధ్యం కానే కాదు..14 వ ఆర్థిక సంఘం అదే చెప్పిందంటూ బాంబు పేల్చి కేంద్రం తీరును తేల్చేశారు. పై పెచ్చు ప్రత్యేక హోదా ప్రస్తావన చట్టంలోనే లేదు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. అంతటితో ఊరుకోకుండా రెవిన్యూ లోటు భర్తీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో లేదంటూ మరో బాంబు పేల్చేశారు. ఏపీకి జరిగే రెవిన్యూ లోటును ఐదేళ్ల పాటు తీర్చాలని చట్టంలో స్పష్టం చేసినా.. కాగ్ నివేదికలు చెప్పినా కేంద్రం మాత్రం మాట మార్చి అబద్దం చెప్పిందంటే ఏమనుకోవాలి.

ఇళ్ల కేటాయింపుపై వివక్ష ...

ఇక తెలంగాణకు సంబంధించి..కేంద్ర పథకం ద్వారా వచ్చే ఇళ్ల కేటాయింపులపై వివక్ష ప్రదర్శించింది. అలాగే కరవు నిధులు, జిల్లాల విభజన వంటి అంశాలపై కొర్రీలు పెడుతోంది. చట్టంలో పేర్కొన్న ఖమ్మం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కుదరదంటూ తేల్చేసింది. అలాగే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ఏర్పాటు కూడా సాధ్యం కాదంటూ చెప్పేసింది...

రెండు రాష్ట్రాల మధ్య జల జగడం ...

ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా మళ్లీ జల జగడం రగులుకుంటోంది. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు అక్రమమంటూ దీనిపై దృష్టి పెట్టాలంటూ ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీనిపై దీక్షకు సిద్దమవుతున్నారు. దీనిపై అటు తెలంగాణ ప్రభుత్వం..ప్రాజెక్టులన్నీ సక్రమమే..మా నీళ్ల వాటా మేం వాడుకుంటే తప్పేంటంటూ సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హారీష్ వాదిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు అనుమతి లేదంటూ కేంద్ర జల సంఘం కోర్టుకైతే చెప్పింది కానీ..ఈ వివాదం పెద్దది కాకముందే ఇరు రాష్ట్రాల సీఎంలు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సామరస్య పూర్వక వాతావరణాన్ని కల్పించడానికి కేంద్రం ముందుకు రావడం లేదు. ఇలా ఇరు రాష్ట్రాల సమస్యలను తీర్చకపోగా..ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తున్న సమస్యలనూ కేంద్రం పట్టించుకోవడం లేదు. వీటికి తోటు ప్రత్యేక హోదాపై పుండుమీద కారం చల్లినట్లు చేస్తూ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది కేంద్రం.  

కన్హయ్య ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన....

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌ సహా మరో 25 మంది విద్యార్థులు ఏప్రిల్‌ 28న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో కన్నయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు తెలిపారు. కన్నయ్యకు గురువారం ఉదయం ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడంతో జేఎన్‌యూలోని మెడికల్‌ హెల్త్‌ సెంటర్‌కు తరలించినట్లు కన్నయ్య స్నేహితుడు ఉమర్‌ ఖాలిద్‌ తెలిపాడు. ప్రస్తుతం కన్నయ్య పరిస్థితి విషమంగా ఉందని.. అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. అఫ్జల్‌గురు వర్ధంతి సందర్భంగా జేఎన్‌యూ క్యాంపస్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు.

06:48 - May 6, 2016

విజయవాడ : రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు చంద్రబాబు. అవసరమైతే మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రధానికి సమస్యలు వివరిస్తానన్నారు. మరోవైపు ఆర్ధికంగా ఎన్ని క్లిష్ట పరిస్థితులున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని బాబు స్పష్టం చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన...

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు నిర్వాసితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని.. ఇబ్బందులుంటే తెలియజేయాలన్నారు. అయితే.. తమకు రాజధానిలాంటి ప్యాకేజి ఇవ్వడంతో పాటు.. ఫిషింగ్‌ హార్బర్‌, స్థానికులకు ఉపాధి, పోర్టు ఏ ప్రాంతంలోవస్తుందో స్పష్టత ఇవ్వాలని నిర్వాసితులు బాబును కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలోనే పోర్టు వస్తుందన్నారు. అనంతరం చంద్రబాబు అరవసల్లి శ్రీసూర్యదేవాలయాన్ని సందర్శించారు. అరసవెల్లి ఆదిత్యుడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని బాబు హామీ ఇచ్చారు.

విజయనగరంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో చంద్రబాబు...

ఇక విజయనగరంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై అవసరమైతే మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వివరిస్తానన్నారు. అనంతరం డెంకాడ మండలం సింగవరంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. విభజన సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. ప్రాజెక్ట్‌ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లు, అధికారులపై ఫైర్‌ అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

భాగ్యనగరంలో భారీ వర్షం....

హైదరాబాద్:  నగరంలో .మియాపూర్‌, మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  ఈదురు గాలులతో కూడిన భారీ వర్షయం కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

06:43 - May 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నూతనశోభను సంతరించుకోనుంది. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నయా జిల్లాలను ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. దసరా నుంచే కొత్త జిల్లా కేంద్రాల నుంచే పాలన సాగించాలని ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి.

10 జిల్లాలను 24 జిల్లాలుగా.....

హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 24 నుండి 25 జిల్లాలకు పెంచాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కేంద్రాల ఏర్పాటును సీఎస్ అప్పగించిన సీఎం.....

రాష్ట్రంలో ఎక్కడెక్కడ నయా జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న దానిపై విధివిధానాలను ఖరారు చేసే బాధ్యతను సీఎస్ రాజీవ్ శర్మకు అప్పగించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలు విస్తీర్ణంలో పెద్దవిగా ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రాలు ప్రజలకు సుదూరంలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు అభివృద్దికి నోచుకోవడం లేదని సీఎం భావిస్తున్నారు.

జిల్లాల సంఖ్యపై ఆధారపడిన కేంద్ర నిధుల విడుదల అంశం.....

కేంద్రం ఇచ్చే నిధులు కూడా జిల్లాల సంఖ్య మీదే ఆధారపడి ఉంటుంది. దీంతో రాష్ట్రం పెద్దదైనా నిధులు అందడం లేదు. ఈ సమస్యలకు పుల్ స్టాప్ పెట్టాలని.. తక్షణం జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 459 మండలాలకు అదనంగా మరో 40మండలాలను ఏర్పాటు చేయనుంది సర్కార్. ప్రతి 10 మండలాలకు ఒక రెవెన్యూడివిజన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

జూన్ 2న అధికారికంగా ప్రకటించనున్న కేసీఆర్.....

ఈ కొత్త జిల్లాలను రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2న అధికారికంగా ప్రకటించనున్నారు కేసీఆర్. ఆగస్టు లేదా దసరా నుంచే కొత్త జిల్లాలలో పరిపాలన సాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ చుట్టూ అభివృద్ది చెందిన పట్టణాల కేంద్రంగా కొత్త జిల్లాలు రావాల్సిన అవసరం ఉందంటున్నారు కేసీఆర్.జిల్లాల ప్రకటించిన నాటి నుంచే నూతన కార్యాలయాల నిర్మాణం జరగాలన్నారు కేసీఆర్.

కీలక శాఖలు ఒకే ప్రాంగణంలో...

కీలకమైన రెవెన్యూ , విద్య , వైద్య శాంతి భద్రతలు వంటి కీలక శాఖలు ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండేలా భవనాల నిర్మాణం జరగాలని డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల కొరతతో సతమతమవుతున్న తెలంగాణకు కొత్త జిల్లాలలో అధికారులను ఏప్రాతిపదికన నియమిస్తారో వేచి చూడాలి. 

మంత్రి కొల్లు రవీంద్ర కారు బోల్తా....

గుంటూరు : మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ సమీపంలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కారు బోల్తా పడింది. దీంతో మంత్రికి స్వల్ప గాయాలాయ్యాయి. కారు డ్రైయివర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకున్నారు.  గుంటూరులోని మణిపాల్ ఆసుపత్రికి  తరలించి చికిత్సనందిస్తున్నారు. అతివేగం, డ్రైయివర్ నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

06:36 - May 6, 2016

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థుల సస్పెన్షన్‌, బహిష్కరణ, జరిమానాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ చేపట్టిన నిరాహార దీక్ష 9 వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలోనే కన్హయ్య నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది.

క్షీణిస్తున్న కన్హయ్య ఆరోగ్యం.....

గురువారం ఉదయం నుంచే కన్హయ్యకు వాంతులు మొదలయ్యాయి. బీపీ లెవెల్స్‌ కూడా పడిపోయాయి. దాదాపు అపస్మారక స్థితిలో సహచర విద్యార్థులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కన్హయ్య శరీరం లోపలి అవయవాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు భావిస్తున్నారు. ఆహారం తీసుకోకపోతే అంతర్గత రక్తస్రావానికి దారితీయొచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం కన్హయ్యకు ఎయిమ్స్‌ అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. 24 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు చెబుతున్నారు. రక్తపోవడం తగ్గిపోవడం, కడుపునొప్పి, పూర్తిగా నీరసించడంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

దీక్ష కొనసాగుతోందన్న కన్హయ్య....

మరోవైపు ఆరోగ్యం క్షీణిస్తున్నా..నిరాహార దీక్షను విరమించేదిలేదని కన్హయ్య స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగుతోందని ప్రకటించారు. నిరాహార దీక్ష చేస్తున్న మరో విద్యార్థి పార్తీపన్‌ ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. పార్తీపన్‌ దీక్ష విరమించపోతే కామెర్లు సోకే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఐనా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే వర్సిటీ పాలక వర్గం మొండి వైఖరికి నిరసనగా విద్యార్థులు ఆందోళనలు ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అడ్మిషన్‌ బ్లాక్‌ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. 

ఆందోళనలు ఉధృతం చేస్తున్న విద్యార్థులు

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌ ఆసుపత్రికి హుటా హుటిన పోలీసులు తరలించారు. ఎయిమ్స్‌లో కన్హయ్య కుమార్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జేఎన్‌యూలో 8రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేయడంతో ఒక్కసారిగా కన్హయ్య ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే పోలీసులు చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు. అయితే ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్ష విరమించేది లేదని కన్హయ్య కుమార్‌ తెలిపారు. జేఎన్‌యూ ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఫిబ్రవరి 9 ఘటనకు సంబంధించి విద్యార్థులపై సస్పెన్షన్‌, బహిష్కరణ, జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 27న కన్హయ్య కుమార్‌ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

06:33 - May 6, 2016

గుంటూరు : ఏపీ ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్‌గేట్‌ సమీపంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కొల్లు రవీంద్ర విజయవాడ వెళ్లారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

06:30 - May 6, 2016

హైదరాబాద్‌ : నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, నాగారం, కుషాయిగూడ, రామాంతపూర్‌, హబ్సిగూడ, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కొత్తపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

Don't Miss