Activities calendar

07 May 2016

21:58 - May 7, 2016

హైదరాబాద్ : రాష్ట్రావతరణ వేడుకలకు తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్కార్‌ భారీ ఏర్పాట్లే చేస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వీధి వీధిన, వాడ వాడలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపాలని నిర్ణయించారు.
వేడుకల ఏర్పాట్లపై రాజీవ్ శర్మ సమీక్ష..
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తన పాల్గొనేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాల్లో బట్టలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, అంధ విద్యార్థులకు ఉపకరణాలు అందజేయాలని నిర్ణయించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటుతో పాటు... చారిత్రక కట్టడాలను విద్యుత్‌దీపాలతో తీర్చిదిద్దనున్నారు.
అమరవీరుల స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సనం రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ షెడ్యూలు కూడా ఖరారయ్యింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పిస్తారు. తెలంగాణ ఉద్యమంలో అశువులుబాసిన అమరవీరుల స్థూపం నిర్మాణానికి ట్యాంక్‌ సమీపంలో శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సంజీవయ్య పార్క్‌లో అతిపెద్ద జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పరేడ్‌ మైదానంలో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి హాజరవుతారు. ముందుగా జాతీయ పతాకాన్నిఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవవందనం స్వీకరిస్తారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించే అలంకృత శకటాల ప్రదర్శనను తిలకిస్తారు. చివరిగా కళాకారుల ప్రదర్శనలను తిలకిస్తారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్‌ మైదానం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

 

21:51 - May 7, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని శాయంపేటలో నిర్మిస్తున్న ప్రాణహిత అండర్‌ టన్నెల్‌ పనులను మంత్రులు హరీష్‌రావ్‌, ఈటెల పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరంతో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని.. రాబోయే రోజుల్లో జిల్లా కోనసీమను తలపించే విధంగా మారుతుందని హరీష్‌రావు అన్నారు. 

21:34 - May 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రైవేటు యాజమాన్యాల సహకారం లేకుండా నిర్వహిస్తున్న ఈ ఎంసెట్‌ లో.. తొలిసారిగా విద్యార్థుల బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు. గతంలోలాగానే.. ఒక్కనిమిషం లేటు నిబంధనను అమలు చేస్తున్నట్టు ఎంసెట్ నిర్వాహకులు తెలిపారు.
ఎంసెట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణలో ఈనెల 15 నజరిగే ఎంసెట్ పరీక్షకు జేఎన్‌టియు హైద్రాబాద్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ కు కలిపి 2లక్షల46 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కు ఒకలక్ష 44 వేలు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలో లక్షా రెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి. సోమవారం నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా 466 పరీక్షా కేంద్రాలు
ఎంసెట్ కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఇనిస్టిట్యూట్లు, విద్యాసంస్థల్లో 466 సెంటర్లు ఏర్పాటుచేశారు. వీటిలో ఇంజనీరీంగ్ కు 276 సెంటర్లు మెడికల్ అండ్ అగ్రికల్చర్ కు 190 సెంటర్లు కేటాయించారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎట్టిపరిస్థితుల్లో విద్యార్థులను సెంటర్లలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు అనుమతి లేదు
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదని ఎంసెట్ కన్వీనర్ రమణరావు అభ్యర్థులకు సూచించారు. మొట్ట మొదటి సారిగా పరీక్ష హాల్ లో బయోమెట్రిక్ పింగర్ ప్రింట్ తీసుకుంటున్నట్టు వారు తెలిపారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్‌ నిర్వహణ
ఇక హైదరాబాద్, వరంగల్ లో మెడికల్ పరీక్ష ఆన్ లైన్ లో జరగనుంది. ఈసారి ఎంసెట్ పరీక్షను కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో మాత్రమే నిర్వహిస్తున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎంసెట్ నిర్వాహకులు తెలిపారు.

 

 

21:27 - May 7, 2016

తమకు చేతగాని పనులు పూర్తి చేసుకోవడానికి అ ధర్మమైన పనులకు పాల్పడుతున్నారు. తమ కోర్కెలు తీర్చుకోవడానికి మంత్రాలు, తంత్రాలను చేస్తున్నారు. చేతబడి అనే మాట ఇప్పటికీ తరచుగా వినిపిస్తుంటుంది. ఈ అభ్యుదయకాలంలో కూడా చేతబడిని నమ్మేవారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది చేతబడి చేసే వారు.. ఇంకొందరు చేయిస్తున్నవారు... ఇంతకీ అసలు చేతబడి అంటే ఏమిటీ.? అర్ధరాత్రి వేల, అప రాత్రి వేల... మంత్రతంత్రాలతో క్షుద్రశక్తులను పూజిస్తూ వాటి సహాయంతో తమకు గిట్టనివారికి కీడు జరగాలని లేదా వారని అసలు ఈ లోకంలోనే లేకుండా చేయాలని...దురాలోచనతో చేసే క్షుద్ర పూజలన్నమాట. చేతబడికి బాణామతి, చిల్లంగ అంటూ చాచా పేర్లు ఉన్నాయి. ఆ ఊరి జనం సాయంత్రం ఆరవ్వగానే తలుపులు మూసుకుంటున్నారు. తమకు రక్షణగా ఇంటి మొత్తళ్లల్లో 
చీపుర్లు, చెప్పులు వేసి, ఆ అతీత శక్తిని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతికేస్తున్నారు. పూర్తి వివరాలను వీడియోలో 
చూద్దాం....

 

21:00 - May 7, 2016

టెన్ టివి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గాయకులు జయరాజ్, ఏపూరి సోమన్న, బిచ్చునాయక్ లు పాల్గొన్నారు. పలు పాటలు పాడి అహ్లాదపరిచారు. ఉద్యమం, గ్రామాలు, లంబాడి తండాలకు సంబంధించిన పాటలు పాడారు. జయరాజ్ నాన్నపై పాట పాడారు. ఏపూరి సోమన్న జగద్గిరి గుట్టపై పాట పాడారు. బిచ్చునాయక్ బిచ్చు నాయక్ లంబాడీలపై పాటాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తుకు ఈ నెల 25 చివరి తేదీ..

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 చివరి తేదీ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం వెబ్‌సైట్‌లో ఈ-పాస్‌లో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుందని విద్యార్థులకు సూచించింది. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు కూడా రిజిష్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి విభాగం కార్యదర్శి బి.మహేశ్‌దత్త్ ఎక్కా విడుదల చేసిన ఆదేశాలల్లో పేర్కొన్నారు.

20:44 - May 7, 2016

హృతిక్ రోషన్, కంగనారనౌత్ ల మధ్య గొడవ.... కంగనారనౌత్ బ్లాక్ మ్యాజిక్, ఢిల్లీలో పోలీసులు యోగా చేయాలనే కొత్త నిబంధన, బెంగుళూరులో ఇంకో ఐదేళ్లలో బతకడం కష్టమంట.. ఐఐఎస్ వీ.. రిసెర్చ్ వెల్లడి, కత్రినాకైఫే నాకు పోటీఅంటున్న మామిడిపండ్ల వ్యాపారి, నీటిని వృధా చేయొద్దన్న ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, బీహార్ లో 9 నుంచి 6 గంటల వరకు వంట నిషేధం, గచ్చు మీద ఆమ్లేట్ వేసిన మహిళ... సినిమాలో కొత్త హెచ్చరికలు... ఈ అంశాలపై క్రేజీ న్యూస్ ను వీడియోలో చూద్దాం... 

 

20:26 - May 7, 2016

ఫన్నీ ఫణీతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫణీ మాట్లాడుతూ జబర్దస్త్ తనన నిలిబెట్టిందని... లైఫ్ ఇచ్చిందన్నారు. జబర్దస్త్ ప్రోగ్రామ తనను జబర్దస్త్ గా నిలిబెట్టిందని తెలిపారు. సినిమాలు చేయాలని జబర్దస్త్ సమయం ఇవ్వలేకపోతున్నానని... అందుకు ఆ కార్యక్రమంలో కనపడడం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:20 - May 7, 2016

కృష్ణా : విజయవాడలో కార్పొరేషన్, రైల్వే అధికారుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కేఎల్ రావ్ నగర్ లో డ్రైన్ నిర్మాణాన్ని రైల్వే అధికారులు అడ్డుకున్నారు. విసిగిపోయిన మున్సిపల్ అధికారులు.. కోటి రూపాయలు బకాయిలు ఉన్నారంటూ ఆర్పిఎఫ్ పీఎస్ ను కార్పొరేషన్ అధికారులు  సీజ్ చేశారు. 

 

20:15 - May 7, 2016

హైదరాబాద్ : మరుమల్లెలు మురిపిస్తాయ్.. సిరిమల్లెలు చెక్కలిగింతలు పెడతాయ్..గుండు మల్లెలు గిలిగింతలు పెడతాయి.. బొండు మల్లెలు మనసులు దోచేస్తాయి...అందుకే మల్లెలమాసంలో మరుమల్లెల సువాసనలతో పల్లెలు నిండిపోతాయి. మండు వేసవిలో చల్లని మానసిక ఆనందాన్నిచ్చే..ఏకైక సీజనల్ ప్లవర్స్ మల్లెలు. కాని మల్లెలకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు
మల్లెపూలతో పల్లెలు నిండిపోతాయి..
వేసవిలో విచ్చే మల్లెపూలతో పల్లెలు నిండిపోతాయి. పూవులలో అత్యంత పరిమళాలు వెదజల్లే మల్లెల సాగు ఈ ఏడాది ఆశించినంత స్థాయిలో లేదు. నిత్యం మార్కెట్ ఎగుడుదిగుడులతో సాగుదారులకు సమస్యలు తప్పడం లేదు. 
పెళ్లిళ్ల సీజన్ లలో భారీగా ధర పలికే మల్లెలు
పెళ్లిళ్ల సీజన్ లలో భారీగా ధర పలికే మల్లెలు.. ముహూర్తాలు ముగియగానే అమాంతం పడిపోతూ ఉంటాయి. సాగుదారులను చిక్కుల్లో పడేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పూలసాగు  లేకపోవడం విపరీత కరవు కారణంగా మల్లెల వికసించకుండానే వాడిపోతున్నాయి.
నేడు మల్లెలంటేనే దూరం 
ఒకప్పుడు మల్లెలు ఎంత ఖరీదైన పెట్టి కొనుక్కునే వారు నేడు మల్లెలంటేనే దూరంగా ఉంటున్నారు. విపరీత కరవు కారణంగా సాగు లేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు మార్కెట్లకు చేరిన మల్లెపూలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. అసలే మల్లెలసాగు లేక రైతులు తీవ్ర ఇబ్బందులుపడుతుంటే.. మార్కెట్లలో ఉన్న పూలరేట్లకు వ్యాపారులు సైతం కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. కరువు కారణంగా ఈ ఏడాది మల్లెలసాగు దిగుబడి కాస్త తగ్గింది.     

 

20:04 - May 7, 2016

వరంగల్ : విద్యా కేంద్రంగా విలసిల్లుతున్న వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది...  యూపీఎస్సీ నిర్ణయం ఓరుగల్లులో సంతోషాన్ని నింపుతోంది... జేబులకు చిల్లు పడకుండా.. కాలు కదపకుండా మేలు జరగబోతోంది... ఏంటా నిర్ణయం? ఎందుకా ఆనందం అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ
ఇక నుంచి వరంగల్‌లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష  
తెలంగాణలో రెండో అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు అరుదైన అవకాశం లభించింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఇక నుంచి వరంగల్‌లోనూ జరగనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదలైన సివిల్స్ సర్వీసెస్-2016 పరీక్ష నోటీఫికేషన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌లోనే  ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రం ఉండేది. తాజాగా వరంగల్లోనూ ఏర్పాటు చేస్తుండడంతో ఎక్కువ మంది అభ్యర్థులకు సౌకర్యంగా ఉండనుంది. ఆగస్టు 7న దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షను యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాల్లో  హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో నిర్వహించనున్నది. 
ఇప్పటికే వరంగల్‌లో జేఈఈ సెంటర్‌ 
జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ సెంటర్‌ ఇప్పటికే వరంగల్‌లో ఉంది. తాజాగా సివిల్స్ పరీక్ష నిర్వహణ కేంద్రం ఏర్పాటవుతోంది. ఇది ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులకు ఉపయోగపడనుంది. వరంగల్‌లోని పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు సివిల్స్ పరీక్షలకు హాజరవుతుంటారు. నగరంలోనే పరీక్షాకేంద్రం ఏర్పాటు చేయడం వల్ల రవాణా, వసతి ఖర్చులు తగ్గనున్నాయి. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులకు మేలు జరగనుందని సివిల్స్‌ అభ్యర్థులు చెబుతున్నారు. కాకతీయ నగరం ఓరుగల్లులో సివిల్స్‌ ప్రిలిమ్స్ పరీక్షాకేంద్రాన్ని యూపీఎస్సీ ఏర్పాటు చేయడం శుభసూచకమని నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ఉద్యోగుల పరస్పర బదిలీకి ఒప్పందం..

హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్‌ కమిటీ సమావేశం భేటీలో... ఎస్‌వో, ఏఎస్‌వోల విభజనకు అడ్డంకులు తొలగాయి. తెలంగాణ స్థానికత ఉండి ఏపీలో పనిచేస్తున్న 76మంది... ఆంధ్ర స్థానికత ఉండి తెలంగాణలో పనిచేస్తున్న 56 మంది... ఉద్యోగుల పరస్పర బదిలీకి ఒప్పందం కుదిరింది. 

 

19:55 - May 7, 2016

హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్‌ కమిటీ సమావేశం భేటీలో... ఎస్‌వో, ఏఎస్‌వోల విభజనకు అడ్డంకులు తొలగాయి. తెలంగాణ స్థానికత ఉండి ఏపీలో పనిచేస్తున్న 76మంది... ఆంధ్ర స్థానికత ఉండి తెలంగాణలో పనిచేస్తున్న 56 మంది... ఉద్యోగుల పరస్పర బదిలీకి ఒప్పందం కుదిరింది. 

 

19:51 - May 7, 2016

రాయ్పూర్ : చత్తీస్‌ గఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లాలో మార్జూమ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 

 

మూడు వికెట్లు కోల్పోయిన బెంగుళూరు...

హైదరాబాద్‌ : పుణేతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు దూకుడుగా ఆడుతుంది. పుణే విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని చేదించే దిశాగా కోహ్లీ సేనా దూసుకెళ్తుంది. 3 వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు 17 ఓవర్లుకుగాను 152 పరుగులు చేసింది. ఇంకా 18 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో కోహ్లీ (70), హెడ్‌(2) పరుగులతో ఉన్నారు. మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

లింగ వివక్షత వ్యతిరేక పోరాటంలో మహిళ విజయం

బెంగళూరు : లండన్‌లోని విప్రో సంస్థలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఓ మహిళ విజయం సాధించారు. శ్రేయ యుఖిల్‌ అనే మహిళ విప్రోలో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆమె పనిచేస్తున్న సమయంలో కంపెనీ మహిళల పట్ల చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యుఖిల్‌ కోర్టుకెళ్లారు. బ్రిటిష్‌ ట్రిబ్యునల్‌ తాజాగా తీర్పు వెలువరించింది. దీనిపై యుఖిల్‌ స్పందిస్తూ ఈ కేసులో తానే గెలిచానని చెప్పుకున్నారు. ఇకనైనా కంపెనీలో అందరినీ సమానంగా చూస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య...

యూపీ : మోరదాబాద్‌ జిల్లా తీర్థంకర్‌ మహావీర్‌ యూనివర్సిటీలో దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన దీక్షా అగర్వాల్ దంతవైద్య విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. శనివారం ఆమె తన హాస్టల్ గదిలో బెడ్‌ షీట్‌తో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియరాలేదు.

పంజాబ్‌లో అగ్నిప్రమాదం..

పాట్నా : పంజాబ్‌లోని లుధియానాలో ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 11 ఫైరింజన్లు సుమారు ఆరు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. మూడు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

19:25 - May 7, 2016

హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతులనూ ఆన్‌లైన్ చేస్తూ మరింత జవాబుదారీ తనాన్ని తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పాలనలో పారదర్శకతతో పాటు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన టౌన్ ప్లానింగ్‌ విభాగాన్ని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో వచ్చేనెల 1 నుంచి టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన అనుమతులను ఆన్‌లైన్ లో ఉంచేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం జీహెచ్ఎంసీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన
హైదరాబాద్ మహనగరం పాలక సంస్ధలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా టౌన్ ప్లానింగ్ విభాగం సేవలన్ని ఆన్ లైన్ చేస్తూ బల్దియా నిర్ణయం తీసుకుంది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఇక అధికారులతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా అనుమతులు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అధికారులతో పాటు ఆర్కిటెక్ట్స్, బిల్డర్ట్స్ కు సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులకు ప్లాన్
జీహెచ్ఎంసీలో మరింత జవాబుదారితనాన్ని తీసుకొచ్చేందుకు, భవన నిర్మాణ అనుమతులను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ వ్యవస్థను ప్రజలు అందుబాటులోకి తీసుకురానుంది. భవన నిర్మాణాలతో పాటు లేఅవుట్ అనుమతుల దరఖాస్తులను కూడా ఆన్ లైన్ పద్దతిలోనే స్వీకరిస్తారని బల్డియా కమిషనర్ ప్రకటించారు. సులభమైనరీతిలో పాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరణ, అప్రూవల్ విధానాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం పుణేకు చెందిన సాప్టెక్ అనే సాప్ట్‌వేర్ సంస్థ రూపొందించిన ఆన్‌లైన్ అప్రూవల్ సిస్టమ్ విధానం ద్వారా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఆటో డిసిఆర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటో క్యాడ్‌లో ప్లాన్‌ను రూపొందించి సంబంధిత డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవసరం మేరకు అధికారులకు, గుర్తింపు పొందిన ఆర్కిటెక్ట్స్, బిల్డర్లకు జోన్ల వారీగా మరోసారి అవగహాన కార్యక్రమం చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు. జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకున్న లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌లు కూడా ఈ అవగహన కార్యక్రమానికి హజరయ్యారు. ఇప్పటి వరకు బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ విధానం హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది.
అకాడమిక్ స్టాఫ్ ఆఫ్ ఇండియా సహకరంతో డిపిఎంఎస్ అమలు
ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు ఇవ్వటం ద్వారా ప్రజలకు పదేపదే జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని అధికారులు చెబుతున్నారు. అకాడమిక్ స్టాప్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహంతో డిపీఎంఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషిచేస్తామని స్పష్టం చేశారు. అవినీతి లేకుండా పనులు చెయ్యడానికి జీహెచ్ఎంసీ ఇలాంటి కార్యక్రమం చేపట్టిందన్నారు మేయర్ బొంతు రాంమ్మోహన్. అయితే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా జూన్1 లేదా 2 వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయిలో అందుబాటులొకి వచ్చేందుకు ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ విధానం ద్వారానైనా...గ్రేటర్ టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతి పక్షాళన జరుగుతుందో లేదో వేచి చూడాలి.     

18:56 - May 7, 2016

గుంటూరు : జిల్లా కేంద్రంలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. పట్నంబజార్ లో నివాసముంటున్న శివశంకర్‌ రావు, సుభాషిణిలు దంపతులు. వీరికి రేవంత్‌ సాయి కుమారుడు ఉన్నాడు. శివశంకర్‌ రావు, సుభాషిణిలు లాలాపేటలో భవానీ కిడ్స్ ఫ్యాషన్‌ షాప్ నడుపుతున్నారు. శివశంకర్‌ రావు, సుభాషిణిలు కుమారుడు రేవంత్‌ సాయిని తీసుకుని షాప్ కు వెళ్లారు. ఈక్రమంలో రేవంత్ సాయి బాగా ఏడ్సుతున్నారు. దంపతులు ఎంత వారించినా ఏడ్పు ఆపడం లేదు. ఈనేపథ్యంలో ఓ వ్యక్తి షాపులో బట్టలు కొనుగోలు చేసినట్లు నటించాడు. ఏడ్సుతున్న బాలున్ని బైక్ పై తిప్పుతానంటూ బయటికి తీసుకెళ్లాడు. ఎంతకు తిరిగిరాలేదు. బాలుడిని అపహరించి బైక్‌పై తీసుకెళ్లాడు. బాలుడిని బైక్‌పై తీసుకెళుతుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీపీ కెమెరాలను పరిశీలిస్తే.. కిడ్నాపర్ పొన్నూరు వైపు వెళ్లినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

18:42 - May 7, 2016

కర్నూలు : ముందుగా ప్రకటించినట్లుగా కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు... ఎస్వీ మోహన్ రెడ్డికి.. కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో... టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరింది.

 

18:38 - May 7, 2016

వరంగల్‌ : జిల్లాలోని కురవి మండలం మొగిలిచర్లలో గత వారం రోజులుగా వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ మరమ్మతు పనులు చేపట్టిన అధికారులు.. విద్యుత్‌ స్తంభం ఎక్కే పనిని జగాలతండాకు చెందిన రాంలాల్‌కు అప్పగించారు. తాను అంగీకరించనప్పటికీ.. విద్యుత్‌ ప్రసారం కావడం లేదని అధికారులు చెప్పడంతో రాంలాల్‌ స్తంభం ఎక్కాడు. ఒక్కసారిగా విద్యుత్‌ ప్రసారం కావడంతో రాంలాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అధికారులు అక్కడి నుంచి ఉడాయించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ గ్రామస్తులు మృతదేహంతో అయ్యగారిపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

 

18:33 - May 7, 2016

ఖమ్మం : జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీపీఎం ప్రచారంతో హోరెత్తిస్తోంది.. ఆ పార్టీ అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ రావు కాలనీలన్నీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.. తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు..

18:26 - May 7, 2016

చెన్నై: తమిళనాడులో ప్రచారం మరింత ఉధ్రుతమవుతోంది. ఎత్తులు పై ఎత్తులు, విమర్శలు, ప్రతివిమర్శలతో పార్టీలు రక్తికట్టిస్తున్నాయి. జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయ్ కాంత్, ప్రేమలత స్టార్ క్యాంపెయినర్ లుగా వ్యవరిస్తుండగా, సోనియా, రాహుల్, సీతారాం ఏచూరి, అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ జాతీయ స్థాయి నేతలు కూడా తమిళనాడును ఓ చూపు చూస్తున్నారు.
ఈ నెల 16న పోలింగ్
తమిళనాడులో పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఈ నెల 16న పోలింగ్. 14తో ప్రచారం ముగుస్తుంది. ప్రచారానికి ఇక మిగిలింది వారం రోజులే. దీంతో పార్టీలు ఎలక్షన్ ఉధ్రుతం చేశాయి. 2014 లోక్ సభ ఎన్నికల ఫలితాల సరళి చూసినవారు ఈసారి కూడా జయలలిత అధికారంలోకి రావడం ఖాయమని భావించారు. ఎంజిఆర్ శకం ముగిసిన తర్వాత తమిళనాడులో ఎప్పుడూ ఒకేపార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఒకసారి జయలలిత, మరోసారి కరుణానిధి చుట్టూ అధికారం తిరుగుతోంది.   జయలలిత కొత్త రికార్డు స్రుష్టిస్తారన్న అభిప్రాయం బలంగా వుంది.  ఆమె తిరిగి అధికారంలోకి వస్తే అనేక కొత్త రికార్డులు లిఖిస్తారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఘనత కూడా ఆమె సొంతమవుతుంది. అయితే,  అది అంత ఈజీ కాదన్నది లేటెస్ట్ టాక్.
ప్రచారంలో కరుణానిధి కుటుంబం ముందంజ
జయలలితతో పోల్చుకుంటే కరుణానిధి కుటుంబం ప్రచారంలో ముందుంది. ఇప్పటికే స్టాలిన్ రెండుసార్లు రాష్ట్రం చుట్టేసివచ్చారు. కరుణానిధి రోజు కనీసం రెండు సభల్లో పాల్గొంటున్నారు. ప్రత్యర్థుల కంటే  ముందే మ్యానిఫెస్టో విడుదల చేశారు.  కీలకపాత్ర పోషించే కుల సమీకరణల్లోనూ ప్లస్ మార్కులు సాధించారు.  డిఎంకె, కాంగ్రెస్ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ సోనియా, రాహుల్ గాంధీలు పర్యటించడం మరో ప్రత్యేక ఆకర్షణ.
జయలలిత ఒంటరి పోరాటం
కరుణానిధితో పోల్చుకుంటే జయలలితది ఒంటరి పోరాటం. పార్టీలో ఆమె తప్ప మరోస్టార్ క్యాంపెయినర్ లేరు. ఒకేసారి అభ్యర్ధుల జాబితాను విడుదల చేసి ఔరా అనిపించిన జయలలిత ఆ తర్వాత కొంతమంది అభ్యర్థులను మార్చడం రాజకీయ తప్పిదమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండుటెండల్లో ఆమె సభలకు హాజరైన నలుగురు కార్యకర్తలు వడదెబ్బతో చనిపోవడం మరో ఇబ్బందికర పరిణామం. డ్యామేజీ కంట్రోల్ కోసం ఆమె బహిరంగ సభల టైమింగ్స్ మార్చుకోవాల్సి వచ్చింది. రోజుకి ఒకట్రెండు సభలకు మించి ఆమె హాజరుకాలేకపోతున్నారు. ఆలస్యంగా మ్యానిఫెస్టో విడుదల చేసిన జయలలిత ప్రత్యర్థులు ఊహించని రీతిలోఉచితాలు ప్రకటించారు. మహిళలు కొనే స్కూటీలకు యాభై శాతం సబ్సిడీ, రేషన్ కార్డుదారులకు ఉచితంగా సెల్ ఫోన్ లు, వంద యూనిట్ల లోపు వినియోగించేవారికి ఫ్రీ కరెంట్  లాంటి వాగ్ధానాలు చేశారు. ఈ వారం రోజుల్లో ఈ హామీలను ఎంత విస్త్రుతంగా జనంలోకి తీసుకెళ్లగలరన్నది విజయావకాశాలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తమిళనాడులో నెలకు సగటున 22వేల స్కూటర్లు, మోపెడ్ లు అమ్ముడుపోతున్నాయి.  సగం ధరకే స్కూటర్ల నినాదం పట్టణప్రాంత  మహిళా ఓటర్లను ఆకర్షిస్తుందునడంలో సందేహం లేదు. 
ప్రచారంలో దూసుకెళ్తున్న కెప్టెన్ విజయ్ కాంత్ దంపతులు 
జయలలిత, కరుణానిధికి తానే ప్రత్యామ్నాయం అంటున్న కెప్టెన్ విజయ్ కాంత్, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే ఆయన సతీమణి ప్రేమలత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయ్ కాంత్ సారధ్యంలోని డిఎండికె  చేరిన తర్వాత పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.  డిఎండికె, పిఎంకె, విసికె, టిఎంసి, సిపిఎం, సిపిఐ పార్టీలతో  కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ రెండు ద్రవిడపార్టీలకు గుండె దడ పుట్టిస్తోంది. పీపుల్స్ వెల్ఫేర్‌  కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  కూడా ప్రచారంలో పాల్గొనడం విశేషం. 

 

18:04 - May 7, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేకహోదాపై ... రాజ్యసభ ఎంపీ కెవిపి రామచంద్రరావు... వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబుకు లేఖ రాసిన కేవీపీ.. ఇవాళ వెంకయ్య నాయుడును మద్దతు ఇవ్వాలంటూ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు ఎన్డీయే సభ్యులు ఓటు వేసేలా సహకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయం చేయాలని కేవీపీ కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

17:50 - May 7, 2016

పశ్చిమబెంగాల్ : కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సాయంత్రం వర్సిటీలోని వామపక్ష, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తలెత్తింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'బుద్దా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' చిత్ర ప్రదర్శన సందర్భంగా ఈ ఆందోళన చోటుచేసుకుంది. ఆ ఫిల్మ్ లో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించారు. డైరక్టర్ అగ్నిహోత్రకు వ్యతిరేకంగా నల్ల జెండాలను ప్రదర్శించారు. ఫిల్మ్ డైరక్టర్‌ను విద్యార్థులు ఘెరావ్ చేశారు. సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలను వ్యతిరేకిస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. యూనివర్సిటీలో ఫిల్మ్ ప్రదర్శన జరుగుతున్న సమయంలో మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నలుగురిని విద్యార్థులు విసికి అప్పగించారు. ఆ నలుగురు బీజేపీ విద్యార్థులను అరెస్టు చేశారు. వర్సిటీ విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేత రూపా గంగూలీని క్యాంపస్ గేటు వద్దే విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రూప గంగూలీ ఆరోపించారు. ఇవాళ సాయంత్రం విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించే అవకాశం ఉంది.

 

17:47 - May 7, 2016

ఢిల్లీ : నీటికొరతపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్రమోదితో భేటి అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధికారులతో కలిసి అఖిలేశ్‌ పాల్గొన్నారు. బుందేల్‌ ఖండ్‌లోని డ్యామ్‌లలో తగినంత నీరు ఉందని, ఆ నీటిని సప్లయ్‌ చేయడానికి ట్యాంకులు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు అఖిలేష్‌ తెలిపారు. మారుమూల గ్రామాల్లోకి రైలు ద్వారా నీటిని తీసుకుపోయే పరిస్థితి లేదని చెప్పారు. బుందేల్‌ ఖండ్‌కు రైలు ద్వారా నీటిని పంపిణీ చేస్తామన్న కేంద్రం ఇచ్చిన ఆఫర్‌ను యుపి ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌ యాదవ్‌ మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరువు పరిస్థితులు, తీవ్ర నీటికొరతపై చర్చించేందుకు ప్రధాని మహారాష్ట్ర, కర్ణాటక సిఎంలతో కూడా చర్చలు జరపనున్నారు.  

 

17:43 - May 7, 2016

శ్రీకాకుళం : చింతపండు గిరిపుత్రులకు చింతలే మిగిలుస్తోంది.. అమ్మేందుకు గిట్టుబాటు ధర లేక ..గిరిజన సహకార సంస్థ నిబంధనలతో గిరిరైతులకు ఇబ్బందులే తప్ప, ప్రయోజనం లేకుండా పోతోంది..మరోవైపు శ్రీకాకుళం ఏజెన్సిలో టన్నుల కొద్దీ చింతపండు దళారుల పాలే అవుతోంది కానీ  జి.సి.సి కి చేరడం లేదు.
గిట్టుబాటు ధరలేక ఇబ్బందుల్లో రైతులు
చింతపండు సీజన్ ముగియడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సి సంతలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకూ సీజన్ లో చింతకాయల దిగుబడులు పూర్తవుతాయి. చాలామంది మార్చి, ఏప్రిల్ నెలల్లో అమ్మకాలు చేపడుతుంటారు. ప్రతి ఏడాది ఈ సీజన్ లో 200 టన్నులకు పైగా చింతపండు జిల్లా నుంచి  ఎగుమతులవుతుంటే, కేవలం సీతంపేట ఐ.టి.డి.ఏ పరిధి ఏజెన్సి తొమ్మిది మండలాల్లో 80 టన్నుల వరకు చింతపండు దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చింతపండు పచ్చి రకం 40 రూపాయల వరకూ పలుకుతుంటే.. జి.సి.సి ఇరవై రూపాయలకు, దళారులు ఇరవై అయిదు రూపాయలకు మాత్రమే రైతుల నుంచి  కొనుగోలు చేస్తున్నారు.  ఫలితంగా  గిరి రైతులకు  శ్రమ తప్ప ప్రయోజనం లేకుండా పోతోంది. 
ధరల్లో దళారుల చేతివాటం
దళారులు, జి.సి.సి కన్నా అయిదు రూపాయలు అధికంగా చెల్లిస్తున్నా తూకంలో వ్యత్యాసంతో గిరిజనులు మోసపోతున్నారు. శ్రీకాకుళం ఏజెన్సి సంతల్లో ఎక్కువగా చింతపండు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారం సీతంపేట సంత, ప్రతీ బుధవారం పూతికవలస సంతలలో కావిడలు, బుట్టల ద్వారా చింతపండు అమ్ముతుంటారు. గిరి రైతులు  జి.సి.సిలలో అమ్మకుండా సొంతంగా సంతలలో అమ్ముకుంటున్నా, ధరలవ్యత్యాసం... దళారుల దోపిడి వలన తీవ్రంగా నష్టపోతున్నారు. జి.సి.సి చింతపండుకు మద్దతు ధర ప్రకటించి, గిరి రైతులను పట్టించుకోవాల్సిన అవసరముంది. తగిన చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి...

హైదరాబాద్ : కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ గూటికి చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.

టీ.వైసీపీ అధ్యక్షుడుగా శ్రీకాంత్ రెడ్డి పేరు ఖరారు

హైదరాబాద్ : వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శ్రీకాంత్ రెడ్డి పేరు ఖరారు అయింది. ఒకట్రెండు రోజుల్లో ఆయన పేరును జగన్ అధికారికంగా ప్రకటించనున్నారు 

 

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం...

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, అల్వాల్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, విద్యానగర్ హిమాయత్ నగర్, నాంపల్లి, లక్డికాపూల్ లో వర్షం కురుస్తోంది.

 

17:19 - May 7, 2016

వరంగల్ : ఓరుగల్లు కేంద్రంగా మరో ఉద్యమానికి బీజం పడింది. ప్రత్యేక జిల్లా ఆందోళనలతో జనం పోరుబాట పడుతున్నారు..తెలంగాణ సర్కార్ కొత్త జిల్లాల ప్రతిపాదనతో జిల్లాలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసికట్టుగా ఆందోళన బాట పట్టాయి. అఖిలపక్ష కమిటీలతో కదం తొక్కుతున్నారు ప్రజలు. అధికార పార్టీ నేతలకు కూడా ప్రత్యేక సెగ తగులుతోంది. వరంగల్‌లో కొత్త జిల్లాలపై సాగుతున్న ప్రజల ఆందోళనలపై ప్రత్యేక కథనం....
ప్రత్యేక జిల్లాల కోసం ప్రజల పోరుబాట
ప్రత్యేక తెలంగాణ కోసం ఉవ్వెత్తున కదలిన ఓరుగల్లు ప్రజలు...ఇప్పుడు ప్రత్యేకజిల్లాల కోసం నడుం బిగిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలపై ప్రకటించిన టిఆర్ఎస్..అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోరు షురూ అయింది. కొద్దిరోజుల క్రితం కేబినేట్ లో కొత్త జిల్లాల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆందోళనలు ఊపందుకున్నాయి. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే ప్రతిపాదన రావడంతో..వరంగల్ జిల్లాలో మరో మూడు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల కోసం ఆందోళనలు సాగుతున్నాయి.
జూన్ 2న కొత్త జిల్లాలపై ప్రకటన-సీఎం కేసీఆర్
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త జిల్లాలపై ప్రకటన చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఆగస్టు 15 లేదా దసరా పండుగలోపే కొత్త జిల్లాల నుంచి అధికారిక కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో సర్కార్ ముందడుగు వెయ్యడంతో ఓరుగల్లు అలర్ట్ అవుతోంది. రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 24 లేదా 25 వరకు చేరుతుందని, వీటితో పాటు కొత్తగా మరో 40 మండలాలు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో ప్రత్యేక జిల్లాల డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
మహబూబాబాద్‌లో జిల్లా కేంద్రం కోసం పోరు
వరంగల్ -ఖమ్మం జిల్లాల బోర్డర్‌లో ఉన్న మహబూబాబాద్‌లో జిల్లా కేంద్రం కోసం పోరు ఉధృతమైంది. వరంగల్ జిల్లా కేంద్రానికి 80కిలోమీటర్ల దూరంలో, అనేక తండాలతో కూడిన ఈప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ ఎప్పటినుంచో ఆందోళన జరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా జిల్లాకేంద్రం కోసం స్వరం పెంచాయి. అఖిలపక్షంగా ఏర్పడి పోరు సాగిస్తున్నాయి. మానుకోట పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం కడియం, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఇతర మంత్రులకు కూడా ఇక్కడి ఉద్యమ సెగ తగిలింది.
ములుగును జిల్లా కేంద్రం చేయాలని ఆందోళన
ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న ములుగును జిల్లా కేంద్రంగా చేయాలనే ఆందోళన ఉధృతమైంది. జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండి...పూర్తిగా వెనుకబడిఉన్న ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే ప్రత్యేక జిల్లా కావాల్సిందేనంటున్నారు ఆందోళనకారులు. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా చేసి ములుగును కలిపేకన్నా...ములుగునే జిల్లా కేంద్రం చేస్తే ఏజెన్సీ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయంటున్నారు. ఇక్కడినుంచే మరో డిమాండ్ కూడా వస్తోంది. సమ్మక్క-సారలమ్మ పేరుతో ప్రత్యేక ఆదివాసి జిల్లాను ఏర్పాటుచేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఉద్యమ కార్యాచరణకు మరింత పదును పెట్టాలని ఆదివాసీ సంఘాలు ప్లాన్ చేస్తున్నాయి.
జనగామలో జిల్లా కేంద్రం కోసం పోరు
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉన్న జనగామ లో జిల్లా కేంద్రం కోసం పోరు మొదలైంది. మహబూబాబాద్, ములుగు తరహాలో కాకుండా సేవ్ జనగామ పేరుతో ఒక సంస్థ జిల్లా డిమాండ్ ను తెరమీదకు తెచ్చింది. దీక్షలు, నిరసనలు, రాస్తారోకోలతో మెల్లమెల్లిగా ముందుకు కదులుతోంది. ప్రత్యేక జిల్లాల కోసం సాగుతున్న ఆందోళనలపై పాలకులు స్పందించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.

 

ఉమర్ ఖాలీద్‌ కోల్‌కతా పర్యటనకు అనుమతి

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖాలీద్‌ కోల్‌కతాలో పర్యటించడానికి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉమర్‌ కోల్‌కతాలో పర్యటించనున్నారు. బస్తర్ సాలిడరిటీ నెట్‌వర్క్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి హాజరవుతారు.

ఎపిలో ఈనెల 10న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఎపిలో ఈనెల 10న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు మంత్రి గంటా శ్రీనివాస్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

బస్సులో మహిళపై అత్యాచారం

రాయ్ పూర్ : జార్ఖండ్‌లో దారుణం జరిగింది. బస్సులోనే ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో చోట్టుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోడెర్మా జిల్లా నుంచి బిహార్‌కు శ్రీ ట్రావెల్స్ అనే ప్రయివేటు సంస్థకు చెందిన బస్సులో బయల్దేరింది. ప్రయాణికులలో మిగిలినవాళ్లంతా కోడెర్మా జిల్లాలోని తిలైయ్యా అనే ప్రాంతంలో దిగిపోయారు. తర్వాత డ్రైవర్‌ బస్సును నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. డ్రైవర్‌తో పాటు అతడి అసిస్టెంట్‌ కూడా ఆ మహిళపై అత్యాచారం చేశౄరు. బాధితురాలిని వైద్యపరీక్షలు నిమితం ఆసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించిన్నట్లు పోలీసులు తెలిపారు.

16:58 - May 7, 2016

ఖమ్మం : పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్ధి సుచరితారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమ హయాంలోనే పాలేరు నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్‌ నేతలన్నారు. తోటి శాసనసభ్యుడు మరణిస్తే మానవత్వం మరిచిపోయి టీఆర్‌ఎస్‌ ఎన్నికలో పోటీ చేయడాన్ని వారు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాల్సిన అవసరముందని కాంగ్రెస్‌ నేతలన్నారు. 

 

16:56 - May 7, 2016

ఖమ్మం : పాలేరు నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తరపున మంత్రి మహేందర్‌రెడ్డితో పాలు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఇతర నియోజకవర్గాల్లో గెలిచి పాలేరు అభివృద్ధిపై దృష్టి సారించానని.. ఈసారి పాలేరు నుంచి పోటీ చేసే అదృష్టం వచ్చిందని.. గెలిపిస్తే పాలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. 

16:34 - May 7, 2016

హైదరాబాద్ : కార్పొరేట్‌ ఆసుపత్రుల ధనదాహానికి బలైన ఓ కానిస్టేబుల్ కేసులో నేషనల్‌ కన్జూమర్‌ కమిషన్‌ చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. 2008 మే నెలలో మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన  కానిస్టేబుల్ సదాశివరెడ్డి ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్ల కోమాలోకి జారుకున్నాడు. 2010 అక్టోబర్‌ నెలలో సదాశివరెడ్డి ఆపరేషన్‌ చేసే క్రమంలో తుదిశ్వాస విడిచాడు. దీనిపై బాధితుడి బంధువులు రాష్ట్ర వినియోగదారుల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా రోగి కుటుంబానికి 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. తీర్పును సవాలు చేస్తూ జాతీయ వినియోగదారుల కమిషన్‌ కు వెళ్లింది యశోదా యాజమాన్యం. అయితే ఇక్కడ ఆసుపత్రివర్గాలకు చుక్కెదురైంది.  10 లక్షల జరిమానాను ఏకంగా 47 లక్షలకు పెంచి మొట్టికాయ పెట్టింది. సంచలనం సృష్టిస్తున్న ఈ తీర్పు కార్పోరేట్‌ ఆసుపత్రుల నిజస్వరూపాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. 

 

16:27 - May 7, 2016

ఒట్టావా : కెనడా కార్చిచ్చు మహోగ్రంగా మారుతోంది. దావానం ధాటికి అల్బర్టా రాష్ట్రంలోని ఫోర్ట్ మెక్‌ముర్రే నగరం కకావికలమవుతోంది. అత్యంత భీకరంగా ఎగిసిపడుతున్న అడవి మంటల ప్రభావానికి స్థానికులు పరుగులు తీస్తున్నారు. ఒక్కొక్క ప్రదేశంలో సుమారు 60 మీటర్ల ఎత్తు వరకు అగ్నికిలలు దూసుకొస్తున్నాయి. దాంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. రానున్న 24 గంటల్లో ఆ దావానలం మహాజ్వాలగా మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేల హెక్టార్ల అడవి అగ్నికి నాశనమైపోయింది. సుమారు వెయ్యి మంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. 150 హెలికాప్టర్లు దీనిలో నిమగ్నమయ్యాయి. కెనడా ప్రభుత్వం వీలైనన్ని వసతుల్ని ఏర్పాటు చేస్తోంది. కార్చిచ్చు ధాటికి సుమారు 88 వేల మంది ఫోర్ట్ మెక్‌ముర్రే నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే ఆదివారం 40 శాతం వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులంటున్నారు. వర్షం కురిస్తేనే కార్చిచ్చు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

 

15:44 - May 7, 2016

గుంటూరు : రాజధాని పేరుతో పచ్చని పొలాలు లాక్కున్న పాలకులు... ఆ తర్వాత రైతులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాత్రం ఎక్కడా మాట్లాడట్లేదు. భూమిలిస్తే కోట్లు విలువ చేసే ప్లాట్లు ఇస్తామన్న పాలకులు, ఇప్పుడు ఆ ప్లాట్ల మీద కేంద్రపన్నుల భారం మోపుతున్నారు. 
రైతులకు ఎన్నో ఆఫర్లు
రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి పచ్చని పొలాలు లాండ్ పూలింగ్ పేరుతో సాధించుకున్న... ఏపీ సర్కార్... రైతులకు ఎన్నో ఆఫర్లు ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో సమీకరించిన భూమిని అభివృద్ధి చేసి కొంతభాగం ఇస్తామని.. ఆ భూమి విలువ కోట్లకు చేరుతుందని రైతులకు ఆశలు కల్పించారు. కానీ, లాండ్ పూలింగ్ ద్వారా తమకు లభించిన భూమిని అమ్మాలనుకునే సమయంలో రైతులకు వచ్చే చిక్కుల గురించి ప్రస్తావించలేదు. 
క్యాపిటల్ గెయిన్ టాక్స్
ఆదాయపన్ను చట్టం సెక్షన్ 10 ప్రకారం రాజధానికి భూములు ఇచ్చే రైతులకు వచ్చిన ఆదాయంలో ఏకంగా 20.6 శాతం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. భూ సేకరణ అనంతరం రైతులకు వచ్చే ప్రతి వెయ్యి గజాల భూమి విలువ ఆధారంగా  దానిని విక్రయించే సమయంలో  పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయ పన్ను తప్పనిసరి
ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి తమ భూమి ఇచ్చి.. దాని బదులు అభివృద్ధి చేసిన కొంత భూమి పొందనున్న రైతులు పరోక్షంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహించినట్టే. ఆ తర్వాత ఆ భూమిని రైతులు ఎవరికైనా విక్రయించినా.. లేదా వారసుల పేరుతో బదలాయించినా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
రైతులకు భారంగా ట్యాక్స్ 
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని రైతులు పలుమార్లు ఇదే విషయాన్ని వివరించారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ కూడా ఇచ్చింది. ఇదే విషయంపై కేంద్రానికి రాష్ట్రం లేఖ రాయగా మినహాయింపు ఇచ్చేందుకు కుదరదంటూ తేల్చిచెప్పింది. దీంతో ఆ ట్యాక్స్ ఇప్పుడు రైతులకు భారంగా మారబోతోంది. ఈ పన్నును సర్కార్‌ రద్దు చేయించకపోతే.. ఆందోళన తప్పదని రాజధాని గ్రామవాసులు హెచ్చరిస్తున్నారు.

విజయవాడ అల్లాపురంలో రైతుల ఆందోళన

విజయవాడ : గన్నవరం మండలం అల్లాపురంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్టు విస్తరణకు భూసేకరను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నాలుగు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖపై రేవంత్ ఫైర్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ రాసిన బహిరంగ లేఖపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ చరిత్రను తెలుసుకోవాలని చురకంటించారు. సాంప్రదాయాలను పెంపోదించేందుకు టిడీపీ పార్టీ నష్టపోయి రాజకీయ విలువల కొసం పనిచేసిందన్నారు. మరణించిన ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్ పార్టీ మా పై పోటీ పెట్టింది కానీ ఏనాడు టీడీపీ పోటీ పెట్టలేదని రేవంత్ తెలిపారు. సాంప్రదాయాలకు ఉల్లంఘించింది కాంగ్రెస్,  టీఆర్ఎస్ పార్టీలేనని ఆయన విమర్శించారు.  

14:58 - May 7, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ రాసిన బహిరంగ లేఖపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ చరిత్రను తెలుసుకోవాలని చురకంటించారు. సాంప్రదాయాలను పెంపోదించేందుకు టిడీపీ పార్టీ నష్టపోయి రాజకీయ విలువల కొసం పనిచేసిందన్నారు. మరణించిన ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్ పార్టీ మా పై పోటీ పెట్టింది కానీ ఏనాడు టీడీపీ పోటీ పెట్టలేదని రేవంత్ తెలిపారు. సాంప్రదాయాలకు ఉల్లంఘించింది కాంగ్రెస్,  టీఆర్ఎస్ పార్టీలేనని ఆయన విమర్శించారు.  

 

పెంచిన ఫీజుల్ని తగ్గించాలి : విద్యార్థుల తల్లిదండ్రులు

హైదరాబాద్‌ : నగరంలోని కార్పొరేట్‌ స్కూళ్లు ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. బంజారాహిల్స్ లోని కల్ప స్కూలు మూడేళ్లలోనే వందశాతం ఫీజుల్ని పెంచిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూలు ఫీజు దోపిడికి వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళన నిర్వహించారు. వెంటనే పెంచిన ఫీజుల్ని తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

14:53 - May 7, 2016

హైదరాబాద్‌ : నగరంలోని కార్పొరేట్‌ స్కూళ్లు ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. బంజారాహిల్స్ లోని కల్ప స్కూలు మూడేళ్లలోనే వందశాతం ఫీజుల్ని పెంచిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూలు ఫీజు దోపిడికి వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళన నిర్వహించారు. వెంటనే పెంచిన ఫీజుల్ని తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

13:52 - May 7, 2016

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని దేవీరెడ్డి కేసులో మిస్టరీ ఎంతకీ వీడటంలేదు. ఈ విషయంగా దేవీరెడ్డి బంధువులు సీపీ మహేందర్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో దేవీరెడ్డి మృతి చెందిందని కమిషనర్ తెలిపారు. ఈకేసుకు సంబంధించినవ వివరాలను కాసేపట్లో సీపీ వెల్లడించనున్నారు.మరోవైపు దేవీ మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవీరెడ్డి పెదనాన్న డిమాండ్ చేశారు.
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఇంజనీరింగ్ స్టూడెంట్‌ దేవిరెడ్డి కేసులో ఎలాంటి పురోగతి కన్పించడం లేదు... దేవిరెడ్డిది ప్రమాదం కాదని..హత్య చేశారంటూ అనుమానాలు పెరిగిన నేపథ్యంలో పోలీసులు భరత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయానికి తరలించి విచారించిన పోలీసుల తర్వాత టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా ప్రశ్నించారు..అయితే భరత్‌ మాత్రం అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదానికి గురయ్యామని చెబుతున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాత్రం ప్రాథమికంగా ప్రమాదమేనంటూ నిర్ధారణకు వస్తున్నారు.

13:41 - May 7, 2016

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల విభజనపై వారు చర్చించారు. ఉద్యోగుల విభజన వ్యవహారంలో 153 ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 120 శాఖల్లో విభజన జరిగింది. ముఖ్యంగా పోలీసులు, సచివాలయ..వివిధ శాఖల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియపై అధికారులు చర్చిస్తున్నారు. వీలైనంత త్వరగా విభజన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పట్టుపడుతోంది. ఈ రోజు జరిగే భేటీలోనైనా పెండింగ్ లో ఉన్న విభజన కొలిక్కి వస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

రోడ్డు ప్రమాదంలోనే దేవిరెడ్డి మృతి - సీపీ..

హైదరాబాద్ : బీటెక్ విద్యార్థిని దేవిరెడ్డిది హత్య కాదని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదంలోనే విద్యార్థిని మృతి చెందిందని నిర్ధారించారు. 

పుల్వామాలో రైలు సర్వీసులు నిలిపివేత..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా జిల్లాలో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఉగ్రవాదుల హతం అనంతరం పుల్వామా జిల్లాలో నిరసనలు మొదలయ్యాయి. 

సీపీ మహేందర్ రెడ్డి తో దేవిరెడ్డి కుటుంసభ్యుల భేటీ..

హైదరాబాద్ : మృతి చెందిన విద్యార్థిని దేవిరెడ్డి కుటుంబసభ్యులు సీపీ కార్యాలయానికి వచ్చారు. సీపీ మహేందర్ రెడ్డితో భేటీ కానున్నారు. ప్రమాదంలో దేవిరెడ్డి మృతి చెందలేదని.ముమ్మాటికి హత్యేనంటూ దేవీ బంధువులు న్యాయం చేయాలంటూ కోరుతున్న సంగతి తెలిసిందే. 

13:35 - May 7, 2016

కడప : రైతు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తమదే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు..మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో రైతులు సాధారణ వ్యవసాయం కన్నా ఉద్యానవన పంటలవైపు మొగ్గు చూపితే 12రెట్ల ఆదాయం వస్తుందన్నారు. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా రైతులకు పంపుసెట్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందనీ...వాటికి ఎటువంటి రిపేర్లు వచ్చినా ఉచితంగా రిపేర్లు చేయిస్తామని రైతులకు బాబు హామీ ఇచ్చారు. రైతుల్ని కష్టాల నుంచి విముక్తి కల్పించడమే థ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రైతు సదస్సులో అన్నారు.

13:31 - May 7, 2016

విశాఖపట్టణం : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ హంగామాకు స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియం సకలహంగులతో ముస్తాబవుతోంది. మే 8 నుంచి 21 వరకూ జరిగే మొత్తం ఆరుమ్యాచ్ ల్లో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లకు రెండో హోంగ్రౌండ్ గా విశాఖ ఎంపికయ్యింది. మహారాష్ట్రలోని తీవ్రకరువు, దుర్భిక్ష పరిస్థితులు ఆంధ్రా క్రికెట్ సంఘం పాలిట వరంగా మారాయి. మహారాష్ట్రలోని పూణే, ముంబై, నాగపూర్ నగరాలలో ఏప్రిల్ 30 తర్వాత జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లపై బాంబే హైకోర్టు నిషేధం విధించడంతో పూణే ఫ్రాంచైజీ మ్యాచ్ ల్లో మూడింటిని విశాఖపట్నంలోని ఏసీఏ – వీడీసీఏ స్టేడియం వేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది.

ఆంధ్రా క్రికెట్ సంఘానికి లాభం..
ఈమ్యాచ్ ల కోసం తొలిసారిగా స్పైడర్ కెమెరాను సైతం విశాఖ స్టేడియంలో ఉపయోగించబోతున్నారు. మే 10న పూణే సూపర్ జెయింట్స్ తో జరిగే పోటీలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఢీ కొంటుంది. మే 17న పూణేజట్టుతో జరిగే పోటీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఢీ కొంటుంది. ఈ రెండుమ్యాచ్ లూ ..రాత్రి 8 గంటలకు ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహిస్తారు. విశాఖ వేదికగా పూణే జెయింట్స్ ఆఖరిమ్యాచ్ మే 21న కింగ్స్ పంజాబ్ జట్టుతో జరుగుతుంది. ఈమ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మూడుమ్యాచ్ లకూ ఆతిథ్యమివ్వడం ద్వారా..ఆంధ్ర క్రికెట్ సంఘానికి కోటీ 80 లక్షల రూపాయల ఆదాయం సమకూరనుంది. ఒక్కో మ్యాచ్ కూ...ఫ్రాంచైజీ 30 లక్షల రూపాయలు, బీసీసీఐ 30 లక్షల రూపాయల చొప్పున ఆంధ్ర క్రికెట్ సంఘానికి చెల్లించనున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ సంఘానికి జరిగిన నష్టం..ఆంధ్రా క్రికెట్ సంఘానికి జరిగిన లాభంగా మారడం నిజంగా..చిత్రమే మరి.

13:25 - May 7, 2016

చిత్తూరు : సుప్రీం చిత్రం టీం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన సుప్రీం చిత్రం విజయవంతమైనందునందుకు ఆనందంగా ఉందని చిత్రం టీం తెలిపింది. చిత్రం విడుదలైన అనంతరం ఆనవాయితీ ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే తాము ఇక్కడకు వచ్చినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. 

13:24 - May 7, 2016

తూ.గోదావరి : జిల్లాలో వరసగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ అవినీతి పరుల భరతం పడుతున్నారు. ఈ మధ్య కాలంలో రవాణా శాఖ కమిషనర్ ఇంట్లో ఏసీబీ దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.80 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.ఈ సంఘటన మరవకముందే జిల్లాలో మరీ అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. రాజమండ్రిలో పంచాయితీ రాజ్ ఏఈ దుర్గాప్రసాద్ ఇంటిపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడనే ఆరోపణతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. దాదాపు రూ.కోటి ఆస్తులను అధికారులు గుర్తించారు. ఏవిధంగా సంపాదించాడనే అంశంపై విచారణ కొనసాగుతోంది. బినామీ పేరుతో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారంతో దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నాయినీ..

హైదరాబాద్ : మహిళలు, చిన్నారుల రక్షణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం ఏర్పాటైంది. సైఫాబాద్ లోని హాకా భవన్ లో తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రారంభించారు. 

సంప్రదాయలను ఉల్లంఘించలేదు - రేవంత్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఉల్లంఘిస్తుందని, టిడిపి మాత్రం సంప్రదాయాలను ఉల్లంఘించలేదని టి.టిడిపి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ విలువలు పెంపొందించడానికే ప్రయత్నం చేస్తోందని, గతంలో జరిగిన ఎన్నికల్లో టిడిపి పోటీ పెట్టలేదన్నారు. టీఆర్ఎస్ ఏకగ్రీవం కోసం వస్తే తాము అందుకు మద్దతిస్తామని పేర్కొన్నారు. 

పంచాయతీ రాజ్ ఈఈపై ఏసీబీ సోదాలు..

తూర్పుగోదావరి : జిల్లా రాజమండ్రి పంచాయతీ రాజ్ ఈఈ నివాసం, కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈఈ దుర్గాప్రసాద్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు మూడు రోజుల క్రితం కేసు నమోదు చేశారు

ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన..

భువనేశ్వర్ : సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నల్లదుస్తులు ధరించి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. 

ఏపీ సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ...

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల సీఎస్ లు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల విభజనపై చర్చించనున్నారు.

12:27 - May 7, 2016

కడప : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. జిల్లాలో ఉద్యానవన పంట రైతులకు ఉపశమన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఉద్యానవన పంటలకు కడప పేరు గాంచిదని, రైతులకు కొత్త పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రతీ ఒక్క రైతు ఆనందంగా వుండాలని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యానవనం పంటలలో దాదాపు 20 రకాల పంటలు పండించి రైతులు అభివృద్ధివైపు పయనిస్తున్నారని, ఉద్యానవన పంటల ద్వారా 12 శాతం ఆదాయం అధికంగా వస్తుందని ఆయన సూచించారు. చేపల పెంపకం, పశువుల పెంపకంతో ఆదాయాలు పెరుగుతాయని, రానున్న రోజుల్లో ఆక్వా హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్ తో వున్నాసరే ఏపీలో రైతులకు విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విమర్శలు చేసిన వారికి రుణమాఫీతో సమాధానం చెప్పామన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి తలసరి ఆదాయం 38 శాతం ఆదాయం తక్కువగా వున్నా కష్టపడి ఆదాయాన్ని పెంచుకుందామని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. 

కోల్ కతా ఎయిర్ పోర్టులో బంగారం సీజ్..

కోల్ కతా : బ్యాంకాక్ కు వెళుతున్న ఓ మహిళ నుండి అక్రమంగా తీసుకెళుతున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 2.1 కిలోలు ఉంది. 

త్వరలో జీజీహెచ్ లో 160 మంది నర్సులు - పూనం మాలకొండయ్య..

గుంటూరు : జీజీహెచ్ లో త్వరలోనే 160 మంది నర్సులను నియమిస్తామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. రెండో రోజు జీజీహెచ్ లో తనిఖీలు కొనసాగించారు. 

కడపలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు..

కడప : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఉద్యానవన పంటలు రైతు రుణ ఉపశమన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా అక్రమాలకు చెక్ పెడుతామని, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇక ఆన్ లైన్ లో ఉంటాయని బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, ఎంపీ సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

కృష్ణలంకలో ఉద్రిక్తత..

విజయవాడ : కృష్ణలంకలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కృష్ణా నదీ కాల్వను ఆనుకుని ఉన్న అభయాంజనేయస్వామి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. స్థానికులు, కమిటీ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరంణం ఏర్పడింది.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుల ఢీ..

ప్రకాశం : జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలో శనివారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. మండలం పరిధిలో శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు, ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొనగా పది మందికి గాయాలు అయ్యాయి.

11:56 - May 7, 2016

హైదరాబాద్ : యూనివర్శిటీలకు వీసీలుగా పోలీసుల అధికారులను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలంగాణలో వున్న ఏ ఒక్క యూనివర్శిటీకి కూడా పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ లేరు. వీసీల నియామకంపై ఇప్పటికే ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించిన సీఎం.. ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

యూనివర్సిటీలకు వీసీలుగా ఐపీఎస్ అధికారులు....
యూనివర్సిటీలకు వీసీలుగా ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇప్పటి వరకు ఛాన్స్ లర్ గా గవర్నర్ కొనసాగారు. ఉపకులపతులుగా ప్రభుత్వం మూడు పేర్లతో గవర్నర్ కి ప్రతిపాదనలు పంపితే.. అందులో నుంచి ఒక పేరును ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపేవారు. కాని యూనివర్శిటి చట్టాల్లో మార్పులు తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఉపకులపతుల ఎంపిక భాధ్యత ప్రభుత్వం చేపట్టడంతో.. తాజాగా వీసీల నియామకం పై సీఎం కేసిఆర్ దృష్ఠి సారించారు.

ప్రధానమైన యూనివర్శిటీలకు వీసీ గా గవర్నర్ ....
అయితే తెలంగాణ లోని ప్రధానమైన యూనివర్శిటీలైన ఉస్మానియా, హైద్రాబాద్ జేఎన్టీయు లకు చాన్స్ లర్ గా గవర్నర్ నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఎస్సీ గురుకులాలను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ని ఓయు కి వీసీ గా నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ హాస్టల్స్ లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సేవలను గుర్తించి... ఇప్పటికే ఇంటర్ వరకు వున్న గురుకుల విద్యకు డీగ్రీని కూడా తోడు చేసారు. తాజాగా ఓయూ కి వీసీగా నియమించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మిగిలిన యూనివర్శిటీలకు కూడా ఐపీఎస్ అధికారులను నియమించే విషయం పై కూడా చర్చ జరుగుతోంది. జూన్ చివరి నాటికి అన్నీ నియమకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. వీసిల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు ఒక నివేదిక అందజేసింది. జూన్ చివరి కల్లా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓయు కి ఐపీఎస్ అధికారిని అనుకున్నప్పటికీ మిగితా యూనివర్శిటీలకు ఇంతవరకు తేలలేదు. ప్రభుత్వం నోటిఫికేషన్ పుణ్యమా అని కుప్పల తెప్పలుగా దరఖాస్తులయితే వచ్చాయి. ఇందులో విద్యారంగంతో పాటు వివిధ రంగాల్లోని మాజీలు అనేక మంది దరఖాస్తులు చేసుకోవడంతో వీసీలుగా ఎవరిని నియమిస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐపీఎస్ లకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

కావలి ఘటనపై సీఎం బాబు ఆగ్రహం..

నెల్లూరు : కావలి మున్సిపల్ ఛైర్మన్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ నేతలతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. 

11:48 - May 7, 2016

విజయవాడ  : ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి చర్చ అయినా జరుగుతోందా? మాస్టర్ డెవలెపర్‌ గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? 2017 కల్లా రాజధాని మొదటి దశ పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? జూన్ 6వ తేదీకీ ఏడాది పూర్తి చేసుకుంటున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై ప్రత్యేక కథనం..గత సంవత్సరం జూన్ 6న సీఎం చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా ఏపీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రెండేళ్లలో మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆచరణలో మాత్రం రాజధాని పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. దీంతో మొదటి దశ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

రెండేళ్లలో మొదటిదశ నిర్మాణం పూర్తిచేస్తామని బాబు హామీ...
మొదటి దశ నిర్మాణానికి ఎన్నిరోజులు పడుతుందో అనే అనుమానాలువ్యక్తమవతున్నాయి. రాజధానికి శంకుస్థాపన జరిగిన రోజు నుంచి మాస్టర్ డెవలెపర్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయినా ఇంత వరకు ఎవరు రాజధాని నిర్మాణం చేపడతారనే అంశంపై క్లారిటీ లేదు. సింగపూర్,జపాన్,చైనా తదితర దేశాలు నిర్మాణంలో భాగం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత వేరే సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. కానీ ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి అధ్యయనం చేయడం కోసం మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కొంత మంది మంత్రులతో హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విధి విధానాలు ఖరారు చేసి సీఆర్డీఏకు నివేదికను ఇవ్వనుంది.

రైతులకు ప్లాట్లకు జరగని కేటాయింపులు....
మరోవైపు రాజధాని ప్రాంతంలో రైతులకు ఇంకా ప్లాట్ల కేటాయింపు జరగలేదు. దీనిపై కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెలఖారు కల్లా రైతులందరికీ ప్లాట్ల అలైన్‌మెంట్ జరగనుందని ప్రభుత్వం తెలుపుతోంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో రాజధాని మొదటి దశ నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. 

11:36 - May 7, 2016

ఢిల్లీ : అగస్టా కుంభకోణం పార్లమెంట్ నుండి ఢిల్లీ వీధుల్లోకి వచ్చింది. అగస్టా కుంభకోణంలో జరిగిన అవినీతిపై దోషులను కఠినంగా శిక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆప్ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన అధికారపక్షంపై నిప్పులు చెరిగారు. సోనియా అంటే ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అగస్టా కుంభకోణం యూపీఏ హయాంలో జరిగిందని చెప్తున్న మోడీ ప్రభుత్వం సోనియాగాంధీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అధికారపక్షాన్ని ఆయన నిలదీశారు. ఎన్డీయే ప్రభుత్వానికి దమ్ముంటే సోనియాను అరెస్ట్ చేయాలని, రెండు రోజులు విచారణ జరిపితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కుంభకోణంలో దోషులను కఠినంగా శిక్షించి ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన పాల్గొన్న ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

11:26 - May 7, 2016

తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలు మరోసారి రెచ్చిపోయారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్మగ్లింగ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తునే వున్నారు. మరోసారి ఎర్రచందన స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది శేషాచలం అడవుల్లో శుక్రవారం కూబింగ్ చేపట్టింది. పోలీసుల రాకతో దొంగలు రాళ్ళు రువ్వి పరారయ్యారు. సంఘటనా స్థలంలో దాదాపు రూ. 50లక్షలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఓ గొడ్డలిని కూడా విసిరారని పోలీసు అధికారి తెలిపారు. కాగా కూంబింగ్ నిర్వహించిన స్థలంలో గతంలో దాదాపు 9 మంది స్మగ్లర్లు మృతి చెందిన విషయం తెలిసిందే.

11:24 - May 7, 2016

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం'. ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మరోసారి మహేష్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో నేడు విడుదల కానుంది. ఈ ఆడియో వేడుకకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'రాజకుమారుడు' చిత్రం ఆడియోకి నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ ఎంట్రీ చిత్రం 'అఖిల్' చిత్రం ఆడియోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పివిపి బ్యానర్‌పై వస్తున్నఈ చిత్రంలో సీనియర్ నటి జయసుధ, రేవతి, ప్రముఖ నటుడు సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 20న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.

కరవు సాయం చేయాలన్న ముఖ్యమంత్రులు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. కరవుపై సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. రూ.10,600 కోట్ల కరవు సాయం ఇవ్వాలని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కోరారు. అంతేగాకుండా పది వేల ట్యాంకర్ల నీటిని పంపించాలని కోరారు. 

ఏఎస్ రావ్ నగర్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : కుషాయిగూడ ఏఎస్ రావ్ నగర్ లోని ఓ షాపులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

 

24 ఎర్రచందనం దుంగల స్వాధీనం..

తిరుమల : శేషాచలం అటవీ ప్రాంతంలోని గంజిబండలు వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పరారయ్యారు.

 

10:35 - May 7, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కరవు సహాయక చర్యలు చేపట్టాలని సర్కార్‌పై విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. రాష్ట్రాన్ని కరవు పీడిత ప్రాంతంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌, సీఎస్‌లను కలిసి విజ్ఞప్తి చేశాయి. కరవు సహాయ నిధుల కోసం అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

కరవు విషయంలో సర్కార్‌ తీరుపై విపక్షాల ఆగ్రహం....

తెలంగాణలో కరవు పరిస్థితిని అధిగమించేందుకు సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. కరవు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని వివరించేందుకు .. సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విపక్ష నేతలు ప్రభుత్వం పెద్దలను కలిసి తాము సిద్దం చేసిన నివేదికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ బృందం గవర్నర్‌ నరసింహన్‌ను కలవగా.. సీపీఐ ప్రతినిధులు సీఎస్‌ రాజీవ్‌శర్మతో భేటీ అయ్యారు. కేవలం 231 మండలాలకే కరవు పరిమితం చేయకుండా.. రాష్ట్రాన్నంతా కరవు ప్రాంతంగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతాంగానికి కనీసం 20 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలని కోరారు.

కూలీ రేట్లను 50 శాతం పెంచాలని సీపీఐ డిమాండ్‌.....

కరవు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కింద పని దినాలను పెంచడంతో పాటు.. కూలీ రేట్లను 50 శాతం మేర పెంచాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. పని చేయలేని వారికి కరవు పెన్షన్‌ అందజేయాలని.. ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు,.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 10 లక్షల పరిహారం అందజేయాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పలువురు డిమాండ్‌ చేశారు.

ఏకపక్షం సరికాదంటున్న విపక్షాలు....

ఇంత కరవు ఉన్నా కేసీఆర్‌ విపక్షాలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం ప్రతిపక్షాల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకు సాగడం సరికాదని నేతలు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరవుపై వాస్తవ పరిస్థితులు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.

లుథియానాలో అగ్నిప్రమాదం..ముగ్గురి మృతి..

పంజాబ్ : లుథియానాలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. 

ఆగస్టా స్కాంపై ఆప్ ఆందోళన..

ఢిల్లీ : ఆగస్టా కుంభకోణంపై ఆప్ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆప్ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ కార్యకర్తలు..పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

10:17 - May 7, 2016

వినడానికే ఆశ్చర్యం వేస్తుంది కదూ..కానీ ఇది నిజం కేవలం 'ఐదు' పైసల కోసం ఆయన 40 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇందుకు ఆయన ఖర్చు ఎంత చేశారో తెలుసా ? 'లక్షల' రూపాయలు ఖర్చు పెట్టారు. వివరాల్లోకి వెళితే..1973లో ఢిల్లీ ఆర్టీసీ లో 'రణవీర్ సింగ్ యాదవ్ (73)' కండక్టర్ గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళా ప్రయాణీకురాలు 15 పైసలు ఇచ్చి 10 పైసల టికెట్ కొనుగోలు చేసిందని..అందులో 'ఐదు' పైసలు రణవీర్ సింగ్ జేబులో వేసుకున్నాడని ఆరోపణలున్నాయి. ఢిల్లీ ఆర్టీసీ అధికారులు రణవీర్ సింగ్ ను విచారించారు. 1975లో దోషిగా నిర్ధారించి ఉద్యోగం లో నుండి తొలగించారు. దీనిపై రణవీర్ సింగ్ కోర్టులో కేసు వేశారు. 1990లో రణవీర్ సింగ్ విజయం కూడా సాధించారు. ఉద్యోగం నుండి తొలగించడం చట్టవిరుద్ధమని అక్కడి లేబర్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ హైకోర్టుకు వెళ్లింది. అప్పటి నుండి ఈ కేసులో రణ్ వీర్ సింగ్ రూ. 47వేలు ఖర్చు పెట్టారు. చివరకు హైకోర్టు ఇటీవల ఈ కేసును కొట్టివేసింది. రణవీర్ కు రూ. 30వేల నష్టపరిహారం చెల్లించాలని, గ్రాట్యూటీ రూ. 1.28 లక్షలు..సీపీఎఫ్ కింద రూ.1.37 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై మరోకోర్టులో మే 26వ తేదీన విచారణ ఉంది. మరి ఈ విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. '5' పైసలు చలామణిలో లేకుండా పోయి దశాబ్దాలు దాటుతున్నా కోర్టులో కేసు నడుస్తుండడంపై గమనార్హం.

10:17 - May 7, 2016

ఆదిలాబాద్ : సిరిపూర్ మండలం హిరాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అల్లుడిని మామ దారుణంగా హత్య చేశాడు. మామా అల్లుళ్ల మధ్య 30 ఎకరాల భూమి విషయంలో శుక్రవారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో నిద్రిస్తున్న అల్లుడిపై  మామ గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతుడికి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వర్థన్నపేటలో 8 ఇసుక టాక్టర్లు సీజ్ ....

వరంగల్: ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.  వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం పంథినిలో ఆలేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఇసుకను స్వాధీనం చేసుకున్న పోలీసులు ట్రాక్టర్లను పోలీస్‌స్టేసన్‌కు తరలించారు.

నూనె దుకాణంలో అగ్నిప్రమాదం...

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సంతమార్కెట్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ నూనె దుకాణంలో విద్యుదాఘాతం జరిగి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.15లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది.

09:45 - May 7, 2016

హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థిని దేవిరెడ్డి డెత్‌ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అరోపణలు..అనుమానాలకు కారణమైన దేవి స్నేహితుడు భరత్‌ను విచారిస్తున్న పోలీసులకు ఎటువంటి ఆధారాలు  దొరకలేదు. అతిగా మద్యం సేవించడం వల్లేనంటూ భరత్ చెప్పినదాంట్లోనూ... ప్రమాదం జరిగిన తీరుపై వస్తున్న రిపోర్టుల ఆధారంగా అనుమానాలు బయటపడొచ్చని భావిస్తున్నారు.. ప్రమాదం కాదు హత్యేనంటూ దేవి బంధువులు న్యాయం చేయాలంటూ కోరుతూనే ఉన్నారు..

భరత్‌ విచారణలో బయటపడని వాస్తవాలు..
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఇంజనీరింగ్ స్టూడెంట్‌ దేవిరెడ్డి కేసులో ఎలాంటి పురోగతి కన్పించడం లేదు... దేవిరెడ్డిది ప్రమాదం కాదని..హత్య చేశారంటూ అనుమానాలు పెరిగిన నేపథ్యంలో పోలీసులు భరత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయానికి తరలించి విచారించిన పోలీసుల తర్వాత టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా ప్రశ్నించారు..అయితే భరత్‌ మాత్రం అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదానికి గురయ్యామని చెబుతున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాత్రం ప్రాథమికంగా ప్రమాదమేనంటూ నిర్ధారణకు వస్తున్నారు.

దేవిరెడ్డి,భరత్‌సింహారెడ్డిల కాల్‌డేటా..మెసేజ్‌లు పరిశీలన...
ఇదిలా ఉంటే భరత్ చెప్పే విషయాలు గాకుండా పోలీసులు దేవిరెడ్డి,భరత్‌సింహారెడ్డిల కాల్‌డేటా..మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు.. ఇక ఆ రోజు రాత్రి సమయంలో ఏయే కాల్‌ ఎటు వెళ్లింది..నెట్‌వర్క్ ఏరియా ఎక్కడ చూపిస్తున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు.. అయితే ఇది పక్కా ప్లాన్ మర్డర్ అంటూ దేవిరెడ్డి కుటుంబీకులు..స్నేహితులు బలమైన ఆరోపణలు చేస్తుండడంతో వారు చెప్పే విషయాలపై కూడా విచారిస్తున్నారు.

పోస్టుమార్టం వైద్యుల సలహాలు తీసుకుంటున్న పోలీసులు...
మరోవైపు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా పోలీసులు దేవిరెడ్డి దేహంలో అంతర్గత గాయాలపై వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు.. ప్రమాదం జరిగిన తీరు..గాయాలు ఏర్పడే అవకాశాలను తెలుసుకుంటున్నారు..దేవిరెడ్డి దేహంలో అంతర్గతంగా ఉన్న గాయాలపై పూర్తిగా ఆరా తీస్తున్నారు..వైద్యులు చెప్పేదాన్ని బట్టి గాయాలతోనైనా ఏదైనా ఆధారాలు దొరుకుతాయని పోలీసుల భావిస్తున్నారు.

09:32 - May 7, 2016

జమ్మూ కాశ్మీర్ : మళ్లీ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కలకలం రేగింది. సరిహద్దులో నుండి దేశంలోకి ప్రవేశించాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వీరి ప్రయత్నాలను భారత భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా పుల్వామాలోని అవంతిపురాలో హిజ్బుల్ ముజాహిదిన్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది. రంగంలోకి దిగిన భారత భద్రతా దళాలు గాలింపులు చేపట్టాయి. ఆర్మీ, భధ్రతాదళాలు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. కాల్పులను భారత భద్రతాదళాలు తిప్పికొట్టాయి. మృతి చెందిన ఉగ్రవాదుల నుండి భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

09:24 - May 7, 2016

హైదరాబాద్ : రానున్నది వర్షాకాలం..నగరంలో చిన్నపాటి వర్షం కురిస్తే ఇబ్బందులు చెప్పతరం కాదు. దీనితో ముందుగానే జీహెచ్ఎంసీ మేల్కొంది. కీలకంగా ఉన్న నాలాల శుభ్రం చేయడానికి నడుం బిగించింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ స్వయంగా నాలాల పరిశుభ్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ మాట్లాడారు. వర్షాలు కురిసే సందర్భంలో నాలాలో నీరు నిలిచిపోతోందని, అందుకే ఆధునిక టెక్నాలజీ ద్వారా శుభ్రం చేయడం జరుగుతోందన్నారు. నగరంలో చిన్న వర్షం కురిసినా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నాలాలను కబ్జాలు చేశారని పేర్కొన్నారు. కబ్జా చేసిన వారికి పేదలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, పెద్దవారైతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

మూసాపేటలో బోల్తా పడిన బీరు లారీ.....

హైదరాబాద్: మూసాపేట ఫ్లై ఓవర్ పై బీరు లారీ బోల్తా పడింది. శుక్రవారం అర్థరాత్రి సయమంలో అదుపు తప్పిన లారీ బోల్తా పడింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఫ్లై ఓవర్ పై లారీని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇదే అదునుగా భావించిన స్థానికులు బీరు బాటిల్స్ ను భారీగా ఎత్తుకుపోయారు. 

భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న నాయిని...

హైదరాబాద్ : ప్రమాదంలో ఉన్న మహిళలు, పిల్లల భద్రతకు పూర్తి భరోసానిచ్చే విధంగా నగర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని నేడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించనున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ పాల్గొననున్నారు.

08:22 - May 7, 2016

నేరం ఎలా చేయాలో స్టడీ చేశాడు..పోలీసుల దర్యాప్తు తీరును గమనించాడు..ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకున్నాడు..అనుభవానికి అక్షర రూపమిచ్చాడు..
విలాసాల కోసం ఓ చోరీ చేశాడు. ఆ తరువాత మళ్లీ చేస్తూనే ఉన్నాడు. జైయిల్ కూడా వెళ్లి వచ్చాడు. ఏడేళ్ల అనుభవాన్ని అక్షర రూపమిస్తూ ఏకంగా నేరగాళ్ల కోసం పుస్తకాని రాశాడు. కొత్తవారికి రూటు చూపిస్తూ పాత వారికి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియచేశాడు. పోలీసుల మనస్తత్వంపై కూడా ఎన్నో కథలు రాశాడు చోరి.. రైటర్ తిరుపతిరావు. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

విద్యుత్ షాక్ తో తండ్రీ కుమారుడు మృతి...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం తీరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. మృతులు యాదయ్య(60), రాజు(22)లుగా గుర్తింపు. తండ్రీ కుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

మే 9న దర్శనమివ్వనున్న ఖగోళ అద్భుతం...

హైదరాబాద్ : మే నెల 9న ఓ ఖగోళ అద్భుతం దర్శనమివ్వనుంది. దీన్ని మళ్లీ చూడాలంటే 2032 నవంబరు 13న మాత్రమే సాధ్యమవతుంది. వందేళ్లలో 13-14సార్లు మే, నవంబరు నెలల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యం తిరిగి 2019 నవంబరు 11న సంభవించనుంది. సూర్యగోళపు ఒక చివరనుంచి మరో చివరకు తెల్లని కాంతిమీద బుధుడు ‘నల్లని చుక్క’లా పాకుతూ సాక్షాత్కరించడమే ఈ అద్భుతం. అయితే, ఒట్టి కళ్లతో ఈ దృశ్యాన్ని ఆస్వాదించాలని ప్రయత్నించవద్దంటూ కేంద్ర భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఇందుకోసం వెల్డింగ్‌ అద్దం(నం.14) వంటి ఫిల్టర్లను ఉపయోగించాలని సూచించింది.

కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు తప్పిన ప్రమాదం...

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారు ప్రమాదానికి గురైంది. నగర శివారులో జరిగిన ఈ ప్రమాదంలో సుప్రియోకు చేయి, ఛాతీపై స్వల్ప గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన ఆయన భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. మంత్రికి అయిన గాయాలు చిన్నవేనని పేర్కొన్న అక్కడి వైద్యులు సుప్రియో ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ప్రకటించారు.

నేడు సీఎంలతో పీఎం మోడీ సమావేశం..

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. నీటికొరత తదితర అంశాలపై చర్చించనున్నారు. 

07:57 - May 7, 2016

హైదరాబాద్ : కొన్ని రోజుల్లో పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక బరిలో సీపీఎం ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ సందర్బంగా ఈ అంశంపై 10టీవీ నిర్వహించిన చర్చా వేదికలో పోతినేని సుదర్శన్ (సీపీఎం అభ్యర్థి) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్) బెల్లం నాయక్ (కాంగ్రెస్ ) పాల్గొని వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి. 

07:57 - May 7, 2016

భరత్ విచారణలో బయటపడని వాస్తవాలు..నిజాలు దాస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు..ప్రమాదం జరిగిందని చెబుతున్న భరత్..అతిగా మద్యం సేవించడం వల్లేనన్నాడు..లోతుగా విచారస్తున్న కాప్స్..ఇంజనీరింగ్ విద్యార్థిని దేవిరెడ్డి డెత్ మిస్టరీ కొనసాగుతోంది. ఆరోపణలు..అనుమానాలకు కారణమైన దేవి స్నేహితుడు భరత్ ను విచారిస్తున్న పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. అధికంగా మద్యం సేవించడం వల్లేనంటూ భరత్ చెప్పిన దానిలో ప్రమాదం జరిగిన తీరుపై వస్తున్న రిపోర్ల ఆధారంగా అనుమానాలు బయటపడుతాయని భావిస్తున్నారు. ప్రమాదం కాదు..ముమ్మాటికి హత్యేనంటూ దేవీ బంధువులు న్యాయం చేయాలంటూ కోరుతూనే ఉన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:47 - May 7, 2016

విజయవాడ : ఎగువ రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులతో కృష్ణా డెల్టా ప్రమాదంలో పడనుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాను కాపాడుతోందని అన్నారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన నీరు ప్రగతి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన బాబు...

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. చిక్కవరంలో పంట సంజీవని కింద తవ్విన కుంటను పరిశీలించారు. బ్రహ్మయ్యలింగం చెరువులో నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఇంకుడుగుంతను ప్రారంభించారు.

చెరువులో మట్టి తవ్వకాలకు వెళ్లేముందు అటవీశాఖ, నీటిపారుదల బిందు సేద్యం, సౌర విద్యుత్తు, డ్వామా శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం మట్టి కట్టల పనులు పరిశీలించి బహిరంగ సభలో పాల్గొన్నారు. కృష్ణా డెల్టాను కాపాడేందుకు, పంటలకు నీరు అందించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని చంద్రబాబు అన్నారు.

ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు: సీఎం

ఎగువ రాష్ట్రాలు కృష్ణా నీటిపై ఇష్టారీతిన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఫలితంగా కృష్ణా డెల్టా ఆయకట్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. తీర ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉండటం వరమని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు కేవలం ప్రాజెక్టులపై ఆధారపడకుండా పంట కుంటలు, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సైతం సాగునీరు అందుబాటులో తెచ్చుకోవచ్చని అన్నారు.

నీరు-ప్రగతి కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు...

అనంతరం సీఎం చంద్రబాబు నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎనర్జీ సేవింగ్‌ పంప్‌ సెట్లను పంపిణీ చేస్తామని, వీటి రిపేరింగ్‌ తో సహా పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు. భూగర్భ జలాలను పెంచడం ద్వారానే సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. వ్యవసాయం ఖర్చు తగ్గించి, ఆదాయం పెంచే మార్గాలను ప్రభుత్వం సూచిస్తుందని తెలిపారు. అలాగే సాంకేతికతను జోడించి రైతుకు లాభాలు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. 

ముగ్గురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలోని అవంతిపురాలో హిజ్బుల్ ముజాహిదిన్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయి.

 

07:37 - May 7, 2016

సమాజం వెక్కిరించినా పట్టించుకోలేదు..కన్నవారి బెదిరింపులకు లొంగలేదు..కడ వరకు తోడుంటానన్నాడు..ఏడడుగులు నడుస్తానని ఏడేళ్లుగా ప్రేమ..వికలాంగురాలి జీవితంలో చీకట్లు నింపిన నయవంచకుడు..
ఆమె వికలాంగురాలు..తన పరిస్థితిని చూసుకుని బాధ పడేది. కానీ నేనున్నా అంటూ ఓ యువకుడు తోడుగా ఉన్నాడు. పై చదువుల కోసం సహకరించాడు. ఏడడుగులు నడుద్దామని ఎన్నో బాసలు చేసిన ఆ ప్రేమికుడు ఏడేళ్లుగా నమ్మించాడు. తీరా పెళ్లి చేసుకోమంటే పారిపోయడు. మరో అభాగ్యురాలు ప్రేమికుడి ఇంటి ఎదుట పోరాటం చేస్తోంది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:31 - May 7, 2016

ఓ స్పెషల్‌ సాంగ్‌ రూపంలో కథానాయిక రెజీనా అరుదైన అవకాశాన్ని దక్కించుకుందని సమాచారం. చిరంజీవి 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో చిరంజీవి సరసన నయనతార లేదా అనుష్క నటిస్తారనే వార్తలు ఇప్పటికీ వినిపిస్తున్నప్పటికీ ఈ చిత్రంలోని ఓ స్పెషల్‌సాంగ్‌లో చిరంజీవికి జోడీగా రెజీనాను చిత్రయూనిట్‌ సెలెక్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. అధికారికంగా చిత్ర యూనిట్‌ ఇంకా ప్రకటించ నప్పటికీ సామాజిక మీడియాలో మాత్రం రెజీనా లక్కీగర్ల్‌ అంటూ నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. 'ఎస్‌.ఎం.ఎస్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా ఆ తర్వాత 'రొటీన్‌ లవ్‌స్టోరీ', 'కొత్త జంట', 'పవర్‌', 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సౌఖ్యం', 'శౌర్య' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం 'జో అచ్యుతానంద' చిత్రంతోపాటు తమిళంలో 3 చిత్రాల్లో నటిస్తోంది.

07:30 - May 7, 2016

ఆచార్య ఆత్రేయ... తెలుగు సినిమా పాటల్లోనే కాదు శ్రోతల మదిలో పదిలంగా నిలిచిన 'మనసు' కవి. నాటక రచయితగా కెరీర్‌ ప్రారంభించి నటుడిగా మారిన వైనం, నాటకాల నుంచి సినిమా రంగానికి వచ్చిన తీరు, గీత రచయితగా ఆత్రేయ ప్రస్థానం నేటితరానికి స్ఫూర్తిదాయకం. పాటల్లో స్వీయ అనుభవాలను అక్షరాలుగా మలిచిన ఘనుడు. మాటలు, పాటల రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఆచార్య ఆత్రేయ జయంతి నేడు (శనివారం). ఈ సందర్భంగా 'మనసుకవి' ఆత్రేయ సినీ జీవిత ప్రస్థానం..

నాటకాలతో ప్రసిద్ధి..
1921న నెల్లురు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో మంగళంపాడు గ్రామంలో జన్మించారు. పూర్తి పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. చిన్నప్పట్నుంచి నాటకాలంటే ఇష్టం. మధ్యతరగతి కుటుంబ సమస్యల ఆధారంగా నాటకాలను రాసేవారు. తల్లి సీతమ్మ చిన్నప్పుడే కన్నుమూసింది. ఆ తర్వాత మేనమామ దగ్గర పెరిగిన ఆయన తొలుత 40రూపాయల జీతంతో గుమస్తాగా పనిచేశారు. పెళ్లైయ్యక ఉద్యోగం వదిలేసి నాటకాలపై దృష్టి సారించారు. ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేకపోవడంతో టీచర్‌గా కొంత కాలం, నెల్లూరు మున్సిప్‌ కోర్టులో కొంతకాలం, 'జమీన్‌ రైతు', 'స్వర్గ సీమ' పత్రికల్లో కొంత కాలం పనిచేశారు. అయినప్పటికీ నాటకాలను వదులుకోలేదు. 'ప్రవర్తన', 'ఎన్‌.జి.వో' నాటకాలతో ఆంధ్ర నాటక కళా పరిషత్‌ అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 'కప్పలు' అనే నాటకం బాగా ప్రాచూర్యం పొందింది. అప్పట్లో రాయలసీమ కరువు పరిస్థితులను వివరిస్తూ ప్రదర్శించిన 'మాయ', విశ్వశాంతిని కాంక్షిస్తూ 'విశ్వశాంతి', హిందూ, ముస్లింల హింసాకాండను ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన 'ఈనాడు' నాటకాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. నాటకాలు రాయడంతోపాటు నటుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. 'సామ్రాట్‌ అశోక్‌', 'గౌతమ బుద్ధ', 'భయం' వంటి భిన్న నాటకాలను రాశారు. ఈ క్రమంలో సినిమాల్లోనూ సంభాషణలు రాసే అవకాశాలను దక్కించుకున్నారు.

సినీ పాటల ప్రస్థానం..
'దీక్ష' (1950) చిత్రానికి తొలిసారి ఆయన పాటలు రాశారు. 'పోరా బాబు పో..' అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో ఇండిస్టీకి తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన 'సంసారం' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. 'అర్థాంగి' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', 'తోడి కోడళ్ళు' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి.', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా..', 'మంచి మనసులు'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు..', 'మూగ మనసులు' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో..' 'డాక్టర్‌ చక్రవర్తి'లో 'నీవులేక వీణ ..', 'అంతస్తులు'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము..', 'ప్రేమ్‌నగర్‌'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది..', 'మరోచరిత్ర'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో..', 'ఇంద్రధనస్సు'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి..', 'అంతులేని కథ'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు', 'మరోచరిత్ర'లో 'విధి చేయు వింతలన్నీ..', 'ఇది కథ కాదు'లో 'సరిగమలు గలగలలు', 'స్వాతిముత్యం'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య' తోపాటు 'తేనే మనసులు', 'ప్రైవేట్‌ మాస్టర్‌', 'బ్రహ్మాచారి', 'మట్టిలో మాణిక్యం', 'బడి పంతులు', 'పాపం పసివాడు', 'భక్త తుకారం', 'బాబు', 'జ్యోతి', 'అందమైన అనుబంధం', 'గుప్పెడు మనసు', 'ఆకలి రాజ్యం', 'అభిలాష', 'కోకిలమ్మ', 'అభినందన', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు.

కథ, మాటల రచయితగా..
పాటల రచయితగానే కాకుండా సినిమాలకు కథలు, మాటలు కూడా అందించారు. 'ముద్దుల మొగుడు', 'వెలుగు నీడలు', 'మూగమనసులు', 'కన్నతల్లి', 'గుమస్తా', 'అర్థాంగి' వంటి చిత్రాలకు రైటర్‌గా పనిచేయగా, 'తోడి కోడళ్ళు', 'మాంగల్య బలం', 'జయభేరి', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం', 'పెళ్ళి కానుక', 'ఆరాధన', 'వాగ్దానం', 'డాక్టర్‌ చక్రవర్తి', 'జీవన తరంగాలు', 'గుప్పెడు మనసు' వంటి చిత్రాలకు అద్భుతమైన సంభాషణలను సమకూర్చారు. నాటక రచయితగా, నటుడిగా, గీత రచయితగానే కాకుండా 'వాగ్ధానం' చిత్రంతో దర్శక, నిర్మాతగా మరో రెండు బాధ్యతలను నిర్వర్తించారు.

పుస్తక రూపంలో 'ఆత్మకథ'..
అనారోగ్యంతో 1989 సెప్టెంబర్‌ 13న ఆత్రేయ కన్నుమూశారు. ఆత్రేయ పాటలన్ని కలిపి పుస్తక రూపంలో (2007)విడుదల చేశారు. అలాగే తన అనుభవాలను 'ఆత్మ కథ'లో రాసుకున్నారు. పాటలు రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ దర్శక, నిర్మాతలను బాగా ఇబ్బందులు పెట్టారనే విమర్శపై 'వాళ్ళు రాయించుకోవడానికి ఏడుస్తుంటే.. రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎవరికి తెలుసు..' అని ఆత్రేయ ఘాటుగా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రేమపాటలు, భక్తిరస గీతాలు, విషాద పాటలు, అమ్మ పాటలు, బావామరదళ్ళ చిలిపి పాటలు, శృంగార గీతాలు, వ్యంగ్య, సందేశాత్మక పాటల్లో నవరసాలను పలికిస్తూ రాయడంలో ఆత్రేయ తర్వాతే ఎవరైనా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అమ్మతో అనుబంధం..
ఆత్రేయ అమ్మ సీతమ్మ. అమ్మ అంటే అమితమైన ప్రేమ. చిన్నతనంలోనే కన్నుమూసింది. ఆమె మరణానికి విష ప్రయోగమనే అపోహ ఆత్రేయ మనసును గాయపర్చింది. అందుకే అమ్మ పాటలు రాసేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యే వారట. 'అమ్మ వంటిది అంత మంచిది.. అమ్మ ఒక్కటే అయ్యేనా జేజైనా అమ్మ పిమ్మటే.. ' అంటూ 'కలిసిన మనసులు' చిత్రంలో అమ్మను అభివర్ణించిన తీరు, 'అమ్మా చూడాలి. నిన్నూ నాన్నను చూడాలి. నాన్నకు ముద్దు ఇవ్వాలి. నీ ఒడిలో నిద్దురపోవాలి..' అంటూ 'పాపం పసివాడు'లో అమ్మ వియోగంతో కుమిలిపోయే ఆర్థ్రగీతం, 'అమ్మంటే అమ్మ, ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ..' అంటూ 'రామ్‌ రహీమ్‌' చిత్రంలో తల్లి విశిష్టతను తెలియజేస్తూ ఆయన రాసిన పాటలు ఇప్పటికీ శ్రోతల్ని కంటతడి పెట్టిస్తాయి.

మూడు పద్మాల ప్రేమ..
ఆత్రేయ స్కూల్‌కెళ్ళే టైమ్‌లో పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించారు. ఆమె ముద్దు పేరు 'బాణ'. గోత్రాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళు పద్మావతిని తిరస్కరించారు. ఆ తర్వాత ఆత్రేయ 13వ ఏట తన మేన మరదలైన పద్మావతితో వివాహం చేశారు. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పట్నుంచే కలిసి చదువుకున్నారు. తక్కువ వయస్సులో పెళ్ళి చేసుకోవడం వల్ల ఇరువురు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతేకాదు బాణని మర్చిపోలేకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థాలు కూడా తల్లెత్తాయి. ఓ సారి టైఫాయిడ్‌ జ్వరం రావడంతో నెల్లూరులో హాస్పిటల్‌లో చేశారు. అక్కడ ఆత్రేయకు సపర్యాలు చేసిన నర్సు పేరు కూడా పద్మానే. తనకు ఆమె చేసిన సేవలకు ముగ్దుడైన ఆత్రేయ ఆమె ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోవడంతో ఆత్రేయ ఎంతో బాధపడ్డారు. ఇలా ఆయన జీవితంలో రెండు విషాద ప్రేమకథలున్నాయి. దీనివల్లే ఆత్రేయ విఫల ప్రేమ పాటలు బాగా రాయడానికి స్ఫూర్తినిచ్చాయని అంటుంటారు.

07:27 - May 7, 2016

సినిమాల్లోని పాత్రలకు తగ్గట్టు కథానాయకులు శరీరాకృతిని మార్చేస్తుంటారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ల ఆధ్వర్యంలో కఠిన శిక్షణ తీసుకుంటూ పాత్ర డిమాండ్‌ మేరకు శరీర ధృడత్వం కోసం అహర్శిశలు శ్రమిస్తారు. తమని తాము కష్టపెట్టుకున్నా ఆయా పాత్రలతో ప్రేక్షకులకు, అభిమానులకు అలరించడమే కథానాయకుల అంతిమ లక్ష్యం. అటువంటి లక్ష్యంలో భాగంగానే రామ్‌చరణ్‌ సైతం తాజా చిత్రం 'ధృవ'లోని పాత్ర కోసం కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. 'తని ఒరువన్‌' తమిళ రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం విదితమే. సినిమాలోని పాత్రకు తగ్గట్టుగా ఫిట్‌గా, స్ట్రాంగ్‌గా కనిపించడంతోపాటు యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో అద్భుతంగా కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే గుర్రపు స్వారీలో ఆరితేరిప్పటికీ ఎక్స్‌పర్ట్స్‌ ఆధ్వర్యంలో నెక్ట్స్‌ లెవెల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. అలాగే సైక్లింగ్‌ని కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ వివరాల గురించి మరింత డీటైల్డ్‌గా రామ్‌చరణ్‌ అధికార ప్రతినిధి తెలియజేస్తూ,'చరణ్‌ తన తదుపరి చిత్రం కోసం స్వతహాగా ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. పర్సనాలిటీ పరంగా మరింత ధృడంగా కనిపించేందుకు చేయాల్సిన కసరత్తులన్ని చేస్తున్నారు. దీంతోపాటు గుర్రపు స్వారీ చేయడం కోసం బాలీవుడ్‌కు చెందిన ట్రైనర్‌ను ప్రత్యేకంగా పిలిపించారు. ఓ వైపు షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం. ట్రెండ్‌కి అనుగుణంగా సరికొత్త లుక్‌తో కనిపించేందుకు చరణ్‌ బాగా ఇష్టపడటంతోపాటు ఓ ఛాలెంజ్‌గా భావిస్తారు. ప్రస్తుతం ఆయన తదుపరి షెడ్యూల్‌ కోసం ఎగ్జైటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నారు' అని చెప్పారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. చరణ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండగా విలన్‌ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు.

07:26 - May 7, 2016

రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. భావోద్రేకాలు అదుపులో ఉంటాయి.

ఆహారం : పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించు కోవచ్చు. విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్‌ అధికంగా లభించే చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, గింజలు, విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే గుడ్లు, లివర్‌, బిటాకెరోటిన్‌ ఉండే పాలకూర, చిలగడదుంప, క్యారెట్‌ వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించుకోవచ్చు.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన అధిక బరువు తగ్గించుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. వారంలో కనీసం మూడు రోజుల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది.

నీరు: రోజు మొత్తం మీద ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి నీరు మందుగా పని చేస్తుంది.

కాఫీ వద్దు: కాఫీ తాగడం వలన రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని నిపుణులు అంటున్నారు. శరీరం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

07:25 - May 7, 2016

నిమ్మకాయ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు తిరుగుతాయి కదూ..! రుచికి మాత్రం పుల్లగా ఉన్నా ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. మన శరీరానికి ఒక రోజు మొత్తానికి కావాల్సిన సి-విటమిన్‌ను నిమ్మ అందిస్తుంది. అలాంటి నిమ్మ గురించి ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన కొన్ని చిట్కాలు.!

  • నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తాగితే వికారం తగ్గుతుంది.
  • అధిక బరువుతో బాదపడేవాళ్లు పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది.
  • నిమ్మరసం తాగినా... నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా... చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు.
  • తలస్నానం చేసే ముందు నిమ్మరసం కలిపిన నీటితో స్నానం చేస్తే కురులు నల్లగా మెరుస్తాయి.
  • ముల్తానా మట్టిలో నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.
  • నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఎక్కువ కాబట్టి నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖంమీద జిడ్డు తొలగి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.
  • ఎండబెట్టిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.
  • నిమ్మరసాన్ని పెరుగులో కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛాయ పెరుగుతుంది.
  • కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి. 

సూర్యాపేటలో రేషన్ బియ్యం పట్టివేత..

నల్గొండ : సూర్యపేటలో రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. తిరుమల గిరి నుండి కాకినాడకు అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాల శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 

06:57 - May 7, 2016

ఢిల్లీ : అగస్టా స్కాంపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. బిజెపి-కాంగ్రెస్‌ల మాటల తూటాలతో లోక్‌సభ వేడెక్కింది. అగస్టా కంపెనీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్‌ అన్ని విధాలా సహకరించిందని బిజెపి తీవ్రస్థాయిలో ఆరోపించింది. అగస్టా స్కాంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ -కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది.

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌పై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ....

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌పై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అగస్టా స్కాంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారీకర్ మాట్లాడుతూ...2005లో అధికారంలోకి వచ్చిన యూపీఏ - అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు నిబంధనలు సైతం మార్చివేసిందన్నారు. ఒప్పందంలో కుదుర్చుకున్న బెంచ్‌ మార్క్‌ కంటే- కంపెనీ కోసం ధరను ఆరు రెట్లు పెంచడం జరిగిందన్నారు. 12 హెలికాప్టర్ల కోసం కాంగ్రెస్ ఆర్డర్ చేసిందని, ముడుపుల వ్యవహారం బయటపడడంతో ఆ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఎన్డీయే హయాంలోనే హెలికాఫ్టర్ల కొనుగోలు....

వివిఐపిల కోసం అత్యాధునిక హెలిక్యాప్టర్ల కొనుగోలు చేసే ప్రక్రియ 1994లో ఎన్డీయే హయాంలో ప్రారంభమైందని, 1.8 మీటర్ల ఎత్తుకు పెంచాలన్న నిర్ణయం మాత్రం 2005లో యూపిఏ ప్రభుత్వం తీసుకుందని పారీకర్‌ చెప్పారు. హెలిక్యాప్టర్లు భారతీయ వాతావరణానికి అనుకూలంగా లేనందువల్లే- ట్రయల్‌ విదేశాల్లో జరిపారని చెప్పారు. అగస్టా స్కాంపై మార్చి 2013లో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా... డిసెంబర్‌ వరకు ఎఫ్‌ఐఆర్‌ కాపిని ఈడీకి పంపలేదని గుర్తు చేశారు. 2014లో మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద ఈడీ కేసు నమోదు చేసినా విచారణ ముందుకు సాగలేదన్నారు.

కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎదురు దాడి ....

కేంద్రమంత్రి పారికర్‌ ఇచ్చిన వివరణను కాంగ్రెస్‌ తిప్పి కొట్టింది. హెలిక్యాప్టర్‌ ఎగిరే ఎత్తును 6 వేల మీటర్ల నుంచి 4 వేల 5 వందల మీటర్లకు తగ్గించాలన్న నిర్ణయాన్ని 2003లో ఎన్డీయే సర్కార్‌ తీసుకుందని కాంగ్రెస్‌ సభ్యులు జ్యోతిరాదిత్య సింధియా ఎదురు దాడి చేశారు. ఈ స్కాంకు సంబంధించి సోనియా గాంధీ పేరు ఎక్కడా లేదని, బిజెపి నేతలు కావాలనే ఆమె పేరును బయటకు తెస్తున్నారని మండిపడ్డారు. ఇటలీ కోర్టు తీర్పులో కూడా సోనియా పేరు రాలేదని... త్యాగి కుటుంబం పేర్లు మాత్రమే ప్రస్తావనకు వచ్చినట్లు స్పష్టం చేశారు. సోనియా గాంధీని ఆడ సింహంగా సింధియా అభివర్ణించారు.

కాంగ్రెస్ వాకౌట్ ....

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అగస్టా వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రక్షణ మంత్రి పారికర్ ఆరోపణలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. 

06:54 - May 7, 2016

విజయవాడ : నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త సేద తీరారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు తోడు కావడంతో వరి, మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్ట వాటిల్లింది. వాయిస్‌..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలి వానకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. నూజివీడు, ఆగిరిపల్లిలో మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక విజయవాడలో భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లి.. ఇళ్లలోకి చేరాయి. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో, ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులకు వర్షం ఆటంకంగా నిలిచింది. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈదురుగాలులకు అరటి పంట ధ్వంసం....

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కొత్తపల్లి, వివి కండ్రిగ గ్రామాల్లో ఈదురుగాలులకు అరటి పంట ధ్వంసమైంది. ఇంకో 20 రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటుండగా ఇలా జరగడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అనంతలో పిడుగుపాటుకు 16 గొర్రెలు మృతి...

అనంతపురం జిల్లా పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కంబదూరు మండలం నూతిమడుగులో పిడుగుపాటుకు 16 గొర్రెలు మృతి చెందాయి.

ద్వారకాతిరుమలలో భారీ వర్షం.....

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో భారీ వర్షం కురిసింది. క్యూలైన్లలోకి నీళ్లు చేరడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇదిలావుంటే ఇదే వాతావరణం మరో రెండు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

06:47 - May 7, 2016

హైదరాబాద్ : తెలంగాణా శాసనసభలో ఇప్పటివరకు రెండు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలో విలీనం అయ్యాయి. గత ఎన్నికల్లో 15 స్థానాలు సాధించి బలమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ శాసనసభలో అడుగు పెట్టింది. రెండేళ్లు తిరగక ముందే పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులు కారెక్కడంతో టి.టిడిఎల్పీ గులాబి దండులో కలిసిపోయింది. దీంతో శాసనసభలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోవాల్సి వచ్చింది. వైసీపీ పార్టీ నుంచి తెలంగాణలో ముగ్గురు శాసనసభ్యులతో పాటు ఓ ఎంపీ విజయం సాధించారు. ఏడాది క్రితమే ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ గూటికి చేరారు. తాజాగా ఓ ఎమ్మెల్యే మరో ఎంపీ కూడా కారెక్కక తప్పలేదు. టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు శాసనసభ్యులు మదన్ లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తమను అధికార పార్టీ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ మధుసూధనాచారికి లేఖరాయడంతో..... వారి విజ్ఙప్తిని స్పీకర్ అంగీకరించారు. వచ్చే సమావేశాల నాటికి వారిని అధికార పక్షం సభ్యులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనసభలో వైసీపీ కథ అధికారికంగా ముగిసినట్లయింది. టిడిపి లో చేరుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఏపీలో ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణలో సేమ్ సీన్ రీపిట్ అవుతున్నా సైలెంట్ గా ఉండడం ఎన్నో అనుమానాలు రేపుతోంది. 

06:42 - May 7, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టులో నీట్ పరీక్ష నిర్వహణపై విచారణ మరోసారి వాయిదా పడింది. అన్ని రాష్ట్రాల నుండి నీట్ నిర్వహణపై అభ్యంతరాలను సేకరించిన కేంద్రం రాష్ట్రాలతో మరోసారి చర్చించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. దీంతోపాటు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ వైద్య ,విద్య కళాశాలలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అంగీకరించింది.

వివిధ రాష్ట్రాల అభ్యర్థనను అంగీకరించిన కోర్టు ...
నీట్ నిర్వహణపై రెండోరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణ, అసోం ఎంసీఏ,సీబీఎస్సీ కేంద్రం వాదనలను వినిపించాయి. రాష్ట్రాలలో ఈ సంవత్సరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించుకోవడానికి అంగీకరించింది. ప్రభుత్వ కళాశాలల అసోసియేషన్ ,డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు నీట్ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రాంతీయ భాషా మాద్యమంలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికిప్పుడు నీట్ పరీక్షకు సిద్దమవడం కష్టమవుతుందన్న... వివిధ రాష్ట్రాల అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. నీట్ పరీక్ష నిర్వహణపై ఈ సంవత్సరానికి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.

తామే భర్తీ చేసుకుంటామన్న టీ సర్కార్ వాదనలు....
తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలల సీట్లను తామే భర్తీ చేసుకుంటామని రాష్ట్రం తరపు న్యాయవాది హరీశ్ రావల్ వాదనలు వినిపించారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలు వచ్చాయని వాటిపై శని ఆదివారాల్లో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి కోర్టుకు సమర్పిస్తామని కేంద్రం తరపున వాదనలు వినిపించారు అదనపు సొలిసిటరీ జనరల్ రంజిత్ కుమార్. ఈ ఏడాది వైద్య ,విద్య పరీక్ష నిర్వహించుకోవచ్చన్న జాతీయ వైద్యమండలి అభిప్రాయానికి ధర్మాసనం అంగీకరించింది. మొదటిసారి నిర్వహించిన నీట్ పరీక్షకు హాజరయిన విద్యార్థులను రెండవ విడతలో జరిగే పరీక్షకు అనుమతించకూడదని సీబీఎస్ఈ తరపున వాదించారు. దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కేంద్రం కొంత సమయాన్ని కోరింది. ఈ విజ్ఞప్తిని మన్నించిన కోర్టు తుది వాదనలను ఈనెల 9 వ తేదీకి వాయిదా వేసింది.

06:37 - May 7, 2016

మొహాలీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో ఆసక్తికర సమరానికి మొహాలీలో రంగం సిద్ధమైంది.వరుస ఓటములతో ఢీలా పడిన కింగ్స్‌ పంజాబ్‌ జట్టు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు సవాల్‌ విసురుతోంది. ప్లే ఆఫ్‌ రేస్‌లో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు ఢిల్లీతో అమీతుమీకి సిద్దమైంది. పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ప్రస్తుత టోర్నీలో పూర్తి స్థాయిలో చెలరేగింది లేదు. ఆరంభంలో వరుస ఓటములతో ఢీలా పడిన కింగ్స్‌ పంజాబ్‌ జట్టు గుజరాత్‌పై అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో సంచలన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సునాయాసంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లోనూ ఓడిపోయి ప్లే ఆఫ్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా....బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు నమోదు చేయలేకపోవడంతో పంజాబ్‌ టీమ్‌ అసలే మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. బ్యాటింగ్‌లో మురళీవిజయ్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లో ఉన్నా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మాత్రం రాణించలేకపోతున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఒక్కసారి కూడా చెలరేగిందిలేదు.దీంతో షాన్‌ మార్ష్‌ స్థానంలో జట్టులోకొచ్చిన హషీమ్‌ ఆమ్లాతో ఇన్నింగ్స్‌ ఆరంభించాలని పంజాబ్‌ టీమ్ ప్లాన్‌లో ఉంది.

2 మ్యాచ్ ల్లో పంజాబ్ విజయం...
ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్‌ల్లో పంజాబ్‌ 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. దీంతో ఇకపై పంజాబ్‌ ఆడబోయే ప్రతీ మ్యాచ్‌ నాకౌట్‌ మ్యాచ్‌ లాంటిదే. సందీప్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌ నిలకడగా రాణిస్తూ ప్రత్యర్ధి జట్టు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేస్తున్నారు. బౌలర్ల ప్రదర్శన బాగానే ఉన్న బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు సాధించడంమీదనే పంజాబ్‌ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరో వైపు జహీర్‌ ఖాన్‌ సారధ్యంలోని ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టురెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ప్రస్తుత సీజన్‌లో డేర్‌డెవిల్స్‌ జట్టు ప్రమాదకర జట్టులా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆడిన 8 లీగ్‌ మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేసిందంటే....ఢిల్లీ జట్టు ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తుండటంతో పాటు...క్రిస్‌ మోరిస్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతుండటంతో డేర్‌డెవిల్స్‌ టీమ్‌ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంది.

న్యాయం చేస్తున్న బౌలర్లు..
బౌలర్లందరూ తమ వంతు న్యాయం చేస్తున్నారు.డైనమిక్‌ బ్యాట్స్‌మెన్‌ క్వింటన్‌ డి కాక్‌ ,యువ సంచలనం రిషబ్‌ పంత్‌ , కరుణ్ నాయర్‌, సంజూశాంసన్‌, డుమినీ, బ్రాత్‌వైట్‌లతో కూడిన ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ఇక మ్యాజిక్‌ స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్‌, అమిత్‌ మిశ్రా డేర్‌ డెవిల్స్ జట్టుకు ప్రధాన బలం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ...జోరు మీదున్న డేర్‌డెవిల్స్ జట్టును ఓడించడం పంజాబ్‌ జట్టుకు పెద్ద సవాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ రెండు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం పంజాబ్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 17 సార్లు పోటీపడగా....పంజాబ్‌ టీమ్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరి హోంగ్రౌండ్‌ మొహాలీ వేదికగా జరుగనున్న ఈ సమరంలో ఆతిధ్య కింగ్స్‌ పంజాబ్‌ జట్టు ....ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు ఏ మాత్రం పోటీ ఇవ్వగలదో చూడాలి. 

06:33 - May 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ రిటైల్ పాలసీ ముసాయిదా రెడీ అయింది. సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ముసాయిదా కు జెండా ఊపింది. మంత్రి వర్గ ఆమోదం తెలిపిన తర్వాత ఈ రిటైల్ పాలసీ అమలు కానుంది. రిటైల్ మార్కెట్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో పలు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు నిబంధనలను సరళ తరం చేసింది సర్కార్.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ కింద గోదాముల నిర్మాణం....
ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మానవ వనరులను సంపూర్తిగా వినియోగించుకునే దిశలో రిటైల్ పాలసీని రూపొందించింది ప్రభుత్వం. అర్థరాత్రి సరుకులను దిగుమతి చేసుకోవడంతో .. పాటు గోదాములను సైతం నిర్వహించుకునే వెసులు బాటును కల్పించారు. మహిళలు రాత్రి 10 వరకే పనిచేయాలన్న నిబంధనలను సైతం సరళించారు. బడా పరిశ్రమల మాదిరిగానే సెల్ఫ్ సర్టిఫికేషన్ పత్రాలిచ్చి ఐటీ పన్నలు చెల్లించుతూ.. కార్మిక చట్టాలను అమలు చేసే విధంగా రిటైల్ ఎంటర్ ప్రైసెస్ కు అనుమతులు మంజూరు చేస్తారు.

సింగిల్ విండో విధానం ద్వారా రిటైల్ అనుమతులు....
రిటైల్ మార్కెట్ జోన్లు , కిడ్స్ ఎంటర్ టైన్ మెంట్ జోన్లు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ కింద గోదాముల నిర్మాణం నిర్వహణ వంటి అంశాలు కూడా.. పొందుపరిచారు. సింగిల్ విండో విధానం ద్వారా రిటైల్ అనుమతులకు నోడల్ అధికారిని సైతం నియమించనున్నారు. నిత్యవసర వస్తువుల కేటగిరి కిందకు తెచ్చి స్టాక్ లపై ప్రస్తుతంఉన్న ఆంక్షలను ఎత్తేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఓ ఎంపవర్ కమిటీని నియమించి ఫీడ్ బ్యాక్ ను బట్టి పాలసీలో మార్పులు చేర్పులు చేయనున్నారు అధికారులు . మంత్రి వర్గంలో ఆమోదం తెలిపిన తర్వాత ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. 

06:29 - May 7, 2016

బెంగళూరు : ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 35వ మ్యాచ్ లో పూణే సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకూ ఆడిన 9 రౌండ్లలో మూడు విజయాలు మాత్రమే సాధించిన పూణే సూపర్ జెయింట్స్ లీగ్ టేబుల్ ఆరవస్థానంలో ఉంటే...రాయల్ చాలెంజర్స్ మాత్రం 7 రౌండ్లలో రెండు విజయాలతో ఏడోస్థానంలో నిలిచింది. రెండుజట్లకూ ఈ పోటీ కీలకంగా మారింది. నిలకడలేమితో పూణే సూపర్ జెయింట్స్, పసలేని బౌలింగ్ తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నానాపాట్లు పడుతున్న సంగతి తెలిసిందే.

06:27 - May 7, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. బంగళాల తరహాలో నిర్మాణాలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకే చోట ఉండేలా భవన నిర్మాణం జరగాలని చెప్పారు. కొత్త కలెక్టరేట్లలో పార్కింగ్‌, హెలిపాడ్‌, గార్డెన్‌లు నిర్మించాలని అధికారులకు సూచించారు.

06:23 - May 7, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప,కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని మున్సిపల్ మైదానంలో మధ్యాహ్నం జరిగే ఉద్యాన పంటల రుణమాఫీకి సంబంధించిన రుణవిముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం జిల్లా పర్యటన ముగించుకొని ఒoటిగంటకు కర్నూలు జిల్లా చేరుకుంటారు. ఆలూరు మండలంలో జరిగే నీరు-చెట్టు కార్యక్రమంలో ఇoకుడు గుంతల తవ్వకాలను పరిశీలిస్తారు.అనంతరం కర్నూలు శివారులోని విజైఆర్ కన్వెన్షన్ హల్లో ఏర్పాటు చేసిన జలసంరక్షణ వర్క్ షాప్ లో పాల్గొని, అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న సీఎం పర్యటన...
మరోవైపు సీఎం కర్నూలు జిల్లా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైసిపికీ గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. విపక్ష నేత జగన్ తమ కుటుంబం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడంతో బాధ కలిగి పార్టీని వీడుతున్నట్టు మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తo చేశారు. ఇదిలా ఉంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. ఆలూరు బహిరంగ సభలో జిల్లా ప్రాజెక్ట్ లకు ఎన్ని నిధులు కేటాయిస్తారో సీఎం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు పర్యటన ముగించుకుని సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం మీద రాయలసీమలో సీఎం చంద్రబాబు పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

నేడు కడప..కర్నూలులో సీఎం బాబు పర్యటన..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడప, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

ఐపీఎల్ లో నేడు...

ఢిల్లీ : ఐపీఎల్ 9లో భాగంగా నేడు బెంగళూరు - పుణె జట్లు ఢీకొననున్నాయి. బెంగళూరు వేదికగా సాయంత్రం 4గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్ లో పంజాబ్ తో ఢిల్లీ జట్టు ఢీకొననుంది. మొహలీ వేదికగా రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

సన్ రైజర్స్ మరో విజయం..

హైదరాబాద్ : సొంతగడ్డ ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయం సాధించింది. ఇప్పటిదాక ఆడిన ఆరు మ్యాచ్ ల్లో హైదరాబాద్ కు ఇది నాలుగో విజయం. గుజరాత్ నిర్ధేశించిన 127 పరుగుల లక్ష్య చేధనలో సన్ రైజర్స్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి గెలుపు అందుకుంది.
స్కోరు బోర్డు : గుజరాత్ లయన్స్ : 126/6. సన్ రైజర్స్ 19 ఓవర్లలో 129/5.

నేడు టిడిపిలో చేరనున్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి..

కర్నూలు : జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తన అనుచరులతో టిడిపిలో చేరుతున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 

నేడు కమల్ నాథన్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల విభజనపై కమల నాథన్ కమిటీ శనివారం ఉదయం ఎంసీహెచ్ ఆర్డీలో భేటీ కానున్నది. ఈ భేటీలో సచివాలయ ఉద్యోగుల విభజన దాదాపు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

14న టెన్త్ ఫలితాలు ?

హైదరాబాద్ : పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈనెల 14న విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మార్చి 21 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 

కాళేశ్వరం పంపుహౌజ్ టెండర్లకు నేడు నోటిఫికేషన్..

హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న బ్యారేజీల నిర్మాణాల టెండర్లకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన నీటి పారుదల శాఖ తాజాగా పంపుహౌజ్ ల నిర్మాణానికి శనివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 

నేపాల్ అధ్యక్షురాలి భారత పర్యటన రద్దు..

ఢిల్లీ : నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి భారత పర్యటన రద్దైంది. ఈ మేరకు ఖాట్మండులోని అధికారులు వెల్లడించారు. మే 9వ తేదీన భారత్ పర్యటనకు రావాల్సి ఉంది. పర్యటన ఎందుకు రద్దు చేశారో వివరాలు వెల్లడించలేదు. 

నేటితో ముగియనున్న ఓయూ సెట్ నోటిఫికేషన్ గడవు..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఓయూ సెట్ నోటిఫికేషన్ గడువు ఈ నెల 7తో ముగియనుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 450, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 350లుగా పరీక్ష ఫీజు నిర్ణయించారు. పరీక్ష ఫీజును టీఎస్/ఏపీ ఆన్‌లైన్‌లో లేదా క్రెడిట్/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అపరాధ రుసుము రూ. 500లతో ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి.

Don't Miss