Activities calendar

09 May 2016

21:33 - May 9, 2016

ఢిల్లీ : వైద్య విద్యకు నీట్‌ తప్పనిసరి అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. నీట్‌ పరీక్ష నిర్వహణపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై ఎటువంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 28వ తేదీన ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మే 1న నీట్‌ మొదటి దశ పరీక్ష రాసిన వారు జులై 24న పరీక్ష రాయవచ్చని ఆర్‌.ఎమ్‌ లోధా నీట్‌ పరీక్షా విధానాన్ని పర్యవేక్షిస్తారని తెలిపింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలు ఉన్నాయనడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

21:31 - May 9, 2016

పాలేరు : బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్‌ పాకులాడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. లౌకికతత్వానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కూతురికి కేంద్రమంత్రి పదవి కోసం బీజేపీతో జత కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాలేరు సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ తరుపున తమ్మినేని ప్రచారం నిర్వహించారు. 

21:18 - May 9, 2016

విశాఖ : ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. వైద్య విద్యకు నీట్‌ పరీక్ష తప్పనిసరి అని సుప్రీం కోర్టు చెప్పడంతో.. ఎంసెట్‌ మెడికల్‌ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. గత నెల 29న పరీక్ష జరిగితే ఈ నెల 9వ తేదీన ఫలితాలు విడుదల చేయడం రికార్డని గంటా చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇంజినీరింగ్‌లో పదిశాతం ఉత్తీర్ణత తగ్గిందన్నారు. ఈసారి టాప్‌ టెన్‌ ర్యాంకులను అబ్బాయిలే సొంత చేసుకున్నారు. అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ మే 27న సర్టిఫికేట్ల వేరిఫికేషన్‌ జూన్‌ 6న, జూన్‌ 9 నుంచి 18 వరకు ఆఫ్షన్ల నమోదు ఉంటుందని.. జూన్‌ 22న సీట్ల కేటాయింపు, జూన్‌ 27వ తేదీన తరగతుల ప్రారంభం ఉంటుందని గంటా చెప్పారు. నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత మెడికల్‌ ఫలితాల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి కామినేని తెలిపారు. అవసరమైతే మళ్లీ అప్పీల్‌ చేసుకునే అవకాశాలనూ పరిశీలిస్తామని చెప్పారు. 

తెలంగాణ కాలేజీల్లో కొనసాగుతున్న తనిఖీలు...

హైదరాబాద్: తెలంగాణ లో రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా కాలేజీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. విజిలెన్స్,విద్యా శాఖ అధికారులు రంగంలోకి దిగి అనుమానమున్న కాలేజీలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అర్హతలు లేని ప్రొఫెసర్లు, నిబంధనలకు భిన్నంగా నడుస్తున్న సంస్థలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

20:33 - May 9, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హల్ చల్ చేశారు. థమ్సప్ థండర్ ఛాలెంజ్ లో విజేతలను బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు కలసి అభినందించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ తనకు ప్యారడైజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని అన్నారు. థమ్సస్ థండర్ ఛాలెంజ్ అనేది గొప్ప కార్యక్రమమన్నారు మహేష్. తుఫానీ స్టార్లతో పాటుగా అభిమానులను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. 

ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల విడుదల

విశాఖ : ఏపీ ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. నీట్ పై సుప్రీం తీర్పు నేపథ్యంలో మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

20:07 - May 9, 2016

ఏశకాళ్లంత.. ఇగ పాలేరుల దిగిండ్రు.. ఓ ఒక్క హామీగాదు.. ఒక్క నాట్కం గాదు.. ఒక్కలెక్కగాదు.. అన్ని పార్టీలు.. పబ్లీకు ఓట్లకోసం బిచ్చగాళ్లలెక్క దిర్గుతున్న ఇదానం జూస్తుంటే.. పాలేరు ఓటర్లు పక్కున నవ్వుతున్నయ్.. వాస్తవానికి ఆ పాలేరు ఓట్లు గూడ.. అన్ని పార్టీలకు ఇజ్జత్ కే సవాల్ తయ్యారైనయనుకో.. ఆ ఇజ్జత్ నిలవెట్టుకునెతందుకు తక్వ తన్లాటనా..? తక్వ కథ..?

తానొకటి దలిస్తె దైవం ఇంకోటి దల్చినట్టు...

తానొకటి దలిస్తె దైవం ఇంకోటి దల్చినట్టు పాడుగాను.. మన ఆలేరు ఆణిముత్యం గొంగిడి సునితమ్మ ఒకటనుకుంటే.. ఇంకోటైతున్నది.. మొన్న ఆలేరు పెద్దవాగుల బూడ్ది గుమ్మడికాయ గొట్టెనా..? ఎందుకు తెలంగాణకు వట్టిన దిష్టివోవాలె.. పెద్దవాగు పరవళ్లు దొక్కాలె.. ప్రాతం సస్యశ్యామలం గావాలె అని.. కని సూడుండ్రి ఏమైందో పెద్దవాగు..

ఆ ఆడియోల ఉన్న మాటలు.. వాళ్లిద్దరియి కానేకావాట..

ఎల్భీ నగర్ కార్పోరేటర్కు టీఆరెస్సు ఇంచార్జీ రామ్మోహన్ గౌడ్ పోన్ జేశి బెదిరిచ్చిండని వాట్సప్పుల వొక ఆడియో వొచ్చింది గదా.. అగో ఆ ఆడియోల ఉన్న మాటలు.. వాళ్లిద్దరియి కానేకావాట.. అదంత మమ్ముల జూస్తె వోర్వనోల్లు బట్టగాల్శి మీదేశి బద్నాం జేస్తున్నరు అంటున్నరు. మరి ఎవ్వలయి గావచ్చు ఆ వాయిసులు సూద్దాం..

శ్రీమంతుడు శీన్మల అసొంటి క్యారక్టర్ ఏశి..

శ్రీమంతుడు ఎవ్వలు అంటే బుడ్డ పోరన్ని అడ్గినా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటడు ఎందుకు అంటే.. శ్రీమంతుడు శీన్మల అసొంటి క్యారక్టర్ ఏశి.. అంత మెప్పిచ్చిండు జనాన్ని.. ఔ.. ఆ ముచ్చట అందర్కి ఎర్కున్నదే ఇప్పుడు ఎందుకు జెప్తున్నవ్ అంటరా... ఎందుకంటే ఇగో ఇందుకు..

ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన మాటలు వినాలనుకుంటే ఈ వీడీయోను క్లిక్ చేయండి..

జాతీయ స్థాయిలో వైద్య విద్య పరీక్ష ఒకటే ఉండాలి: సుప్రీం

ఢిల్లీ : నీట్ పై తీర్పు కాపీని వెబ్ సైట్లో సుప్రీం కోర్టు అప్ లోడ్ చేసింది. జాతీయ స్థాయిలో వైద్య విద్య పరీక్ష ఒకటే ఉండాలని సుప్రీం కోర్టు తెలిపింది. రాష్ట్రాలకు వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించే అర్హత లేదని పేర్కొంది. నీట్ పరీక్ష పై రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలుండవని, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై ఎటువంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ పై ఏప్రిల్ 28న తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చేసింది.

19:54 - May 9, 2016

నల్గొండ : జిల్లాలోని దేవరకొండలో విషాదం నెలకొంది. టెట్ లో అర్హత సాధించడం లేదని మనస్థాపంతో ప్రమీల అనే విద్యార్థిని ఈనెల 5వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. టెట్ లో బయాలజీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, టెట్ లో మ్యాథ్స్కు 30 మార్కులు కేటాయించడంతో ఎమ్మెస్సీ బయోసైన్స్ చదివిన నాలాంటి వారు స్కోర్ చేయలేకపోతున్నారని సీఎం కేసీఆర్ చివరి లేఖ రాసింది. మ్యాథ్స్ కు బదులు మెంట్ ఎబిలిటీ ప్రశ్నలు పొందుపరచాలని.. నా విజ్ఞప్తిని అమలు చేస్తే తెలంగాణ బిడ్డగా సంతోషిస్తానని సీఎం రాసిన లేఖలో పేర్కొంది.

19:37 - May 9, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ గా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ... ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటమే నా విధి అని స్పష్టం చేశారు. పిఏసీ పదవి రాలేదని వైసీపీని పార్టీ వీడారు అనేది అవాస్తవమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో చెక్ అండ్ బ్యాలెన్స్ చేయడమే అని పేర్కొన్నారు. పార్టీ అధినేత జగన్ తన పై పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్ : రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.

ముగిసిన తెలంగాణ అసెంబ్లీ పీఏసీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ పీఏసీ సమావేశం ముగిసింది. అనంతరం పీఏసీ ఛైర్మన్ గీతా రెడ్డి మాట్లాడుతూ.. 20న మరోసారి భేటీ అవనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల ఆడిట్లు డిసెంబర్ లోగా పూర్తి చేయాలని, 20న జరిగే పీఏసీ భేటీలో మున్సిపల్, టూరిజం శాఖలపై ప్రధానంగా చర్చిస్తామని స్పష్టం చేశారు. గతంలో పీఏసీ చేసిన ఆకస్మిక తనిఖీలు, వాటి వివరాలను పూర్తిగా పరిశీలిస్తామన్నారు. 

కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది: మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్ నగర్ : ఆర్డీఎస్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఆర్డీఎస్ ఎందుకు పట్టించుకోలదని ప్రశ్నించారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఆర్డీఎస్ పై కర్ణాటక తో సయోధ్య కుదుర్చుకున్నామని తెలిపారు. పనులు ప్రారంభించే సమయంలో దీక్షలు చేసి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని మండి పడ్డారు.

అందుకే ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించారు:కేసీఆర్

హైదరాబాద్ :దళితుల కోసం ప్రాజెక్టులు కడుతుంటే టిడీపీ, వైసీపీలు ధర్నాలు, దీక్షలతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అందుకే ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. నీటి పంపిణీలో వివక్షత వల్లే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినటల్లు తెలిపారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేసీఆర్ సూచించారు.

17:36 - May 9, 2016

విజయవాడ: ఏపీలో ఎంసెట్ ఫలితాల విడుదలపై గందరగోళం నెలకొంది. గంటలో ఎంసెట్ రిజల్ట్స్ విడుదల చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రేపు ఉదయానికల్లా ఎంసెట్ ఫలితాలు వెల్లడవుతాయని ఆందోళన వద్దని మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రకటించారు. రిజల్ట్స్ విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే సుప్రీంకోర్టు తీర్పును చదివిన తరువాత ఫలితాలు వెల్లడిస్తామని కామినేని చెప్పారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ఫలితాలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు. మెడికల్ అండ్ అగ్రికల్చరల్ ఫలితాల వల్లే సందిగ్ధత నెలకొందని అన్నారు. నీట్ పై తీర్పు ఎంసెట్ ఫలితాల వెల్లడి ఆధారపడుతుందని అన్నారు. నీట్ ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంతీర్పునిస్తే మెడికల్ ఫలితాలు వాయిదా వేయాలని భావించాలని అన్నారు. నీట్ తీర్పు నెట్ లో సుప్రీం కోర్టు అప్ లోడ్ చేస్తుందని, అది అప్ లోడ్ అయిన తరువాత ఫలితాలు వెల్లడిచేస్తామని ఆయన తెలిపారు.

ఆందోళన వద్దు : గంటా

గంట కావచ్చు.. రెండు గంటలు కావచ్చు... లేదా రేపు ఉదయానికల్లా ఎంసెట్ ఫలితాలు వెల్లడవుతాయని ఆందోళన వద్దని మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రకటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. నీట్, ఎంసెట్ అర్హతపై స్పష్టత రాగానే ఫలితాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఎంసెట్ నిర్వహణపై సుప్రీంకోర్టు అభ్యంతరం లేవనెత్తితే, దానిపై స్పష్టతనిచ్చి, ఇంజనీరింగ్ ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. దీనిపై అధికారులతో చర్చిస్తున్నామని, కాసేపట్లో దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. 

ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్...

హైదరాబాద్: నగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల విజువల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన బంగారు నగలు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరు పాత నేరస్థులేనని పోలీసులు తెలిపారు.

17:00 - May 9, 2016

విజయవాడ : ఎర్రచందన స్మగ్లర్లందరినీ దాదాపుగా అరెస్ట్ చేయడం వల్ల స్మగ్లింగ్ చాలా వరకు అరికట్టగలిగామని ఏపీ డిజిపి రాముడు స్పష్టం చేశారు. తిరుమల భద్రత కోసం... అలిపిరి చెక్ పాయింట్ వద్ద అధునాతన స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డిజిపి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటిలో సైబర్ క్రైం-పరిశోధనలో మెళకువలు అన్న అంశంపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎర్రచందన చెట్ల అక్రమ నరికివేత, రవాణా కేసుల్లో ఆరెస్టైన వారికి శిక్షలు చాలా తక్కువగా ఉంటున్నాయని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు.

 

16:59 - May 9, 2016

నల్గొండ : మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు,విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ బాలుడి నిండు ప్రాణం బలైంది. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మిషన్‌ భగీరథ పనుల కోసం గుంతులు తీయడంతో సింగిల్ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎర్త్‌వైర్‌ బయటపడింది. అయితే దీనిని మట్టిలో పూడ్చకుండా విద్యుత్‌ అధికారులు అలాగే వదిలేశారు. దీంతో ఆడుకుంటున్న బాలుడు కేశవ్‌కి ఈ వైర్‌ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆగ్రహనికి గురైన బంధువులు ప్రధాన రహదారిపై బాలుడి శవంతో ఆందోళన చేపట్టారు.

16:57 - May 9, 2016

కడప : రైల్వేకోడూరులో రాత్రి పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అన్ని గ్రామాల్లో అరటి, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతినాయి. ఇంకొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుందనగా.. వర్షం రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

16:56 - May 9, 2016

కడప : ప్రతిపక్ష నేత జగన్‌ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. కడప జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షాలకు అరటి పంట నేలకొరగడంతో రైతులను జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో 600 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసం అయ్యాయని తక్షణమే ప్రభుత్వం స్పందించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. 

16:52 - May 9, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చంపేస్తామని పాండిచ్చేరి కాంగ్రెస్‌ కార్యాలయానికి బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై అప్రమత్తమైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆనంద్‌శర్మ, అహ్మద్‌ పటేల్‌ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకున్నారు. రాహుల్‌గాంధీకి ప్రత్యేక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రేపు పాండిచ్చేరిలో జరిగే బహిరంగసభలో రాహుల్‌ పాల్గోనున్న నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ రావడం కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపింది. ఈ లేఖ తమిళ భాషలో రాసి ఉంది.

16:51 - May 9, 2016

ఢిల్లీ : ఆదివారం మదర్స్‌డే సందర్భంగా జెఎన్‌యు విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. మాతృ సంరక్షణలో మేము మా చదువులను పూర్తి చేయాలనుకుంటున్నామని తెలిపారు. పోలీసుల లాఠీల మధ్య ఉపవాసాలు ఉంటూ చదువును ఎలా కొనసాగిస్తామని లేఖలో ప్రశ్నించారు. ఎలా జెఎన్‌యు విద్యార్థులు తన సొంత పిల్లల్లాంటి వారని ఇటీవల స్మృతి ప్రకటించిన నేపథ్యంలో కన్హయ్య వ్యంగ్యంగా ఈ లేఖ రాశారు. భారత్‌ లాంటి దేశంలో ఏ మాతృమూర్తి కూడా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పురిగొల్పేలా ప్రవర్తించదని రోహిత్‌ ఆత్మహత్యను దృష్టిలో పెట్టుకుని అన్నారు. విద్యార్థుల తరపున ఆమెకు కన్హయ్య శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉత్తరాఖండ్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. 61 మంది విశాస పరీక్షలో పాల్గొననున్నారు. స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని కోర్టు తేల్చి చెప్పింది.

16:46 - May 9, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోది డిగ్రీకి సంబంధించి బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు చూపిన పట్టాలు ఫేక్‌వని ఆప్‌ ఆరోపించింది. బిఏ, ఎంఏ డిగ్రీలలో ఆయన పేరు తేడా ఉందని ఆప్‌ నేత ఆశుతోష్‌ తెలిపారు. ఒకవేళ సర్టిఫికేట్‌లో పేరు తప్పుగా ఉంటే అఫిడవిట్‌ ద్వారా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. మార్క్‌షీట్‌లో 1977 ఉంటే డిగ్రీ మాత్రం 1978లో చేసినట్లు ఉందన్నారు. మార్కుల షీట్‌పై నరేంద్ర కుమార్‌ దామోదర్‌ దాస్‌ మోది ఉంటే బిఏ డిగ్రీ పట్టాపై నరేంద్ర దామోదర్‌ దాస్ మోది ఉందని ఆధారాలతో చూపారు. అమిత్‌షా, జైట్లీ ప్రధాని మోదిని రక్షించేందుకు యత్నిస్తున్నారని ఆశుతోష్‌ ఆరోపించారు.   

16:43 - May 9, 2016

విజయవాడ : నగరంలో మొగల్‌రాజ్‌పురంలో వీధి రౌడీలు రెచ్చిపోయారు. బందెల దొడ్డి సెంటర్‌లో బుల్లెబ్బాయి అనే కూలీపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. పాకలపాటి సురేష్, గోపయ్య, కనికల అమర్, బేతంపూడి కళ్యాణ్ వచ్చి 200 రూపాయలు అడిగారని... లేవన్నందునే తనను కర్రలతో కొట్టారని బుల్లెబ్బాయి ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. సిసిటీవీ పుటేజ్ ఆధారంగా నిధితులను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు. కొండపైన ఉండే తమకు రక్షణ లేకుండా పోయిందని.. వీధి రౌడీలు ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

16:41 - May 9, 2016

ఢిల్లీ : నీట్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. నీట్ పరీక్ష నిర్వహణపై వాదనలు విన్న సుప్రీం.. మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని కాసేపట్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనుంది. ఈ ఏడాదికి ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు ధర్మాసనం అంగీకరించింది. ప్రాంతీయ భాషల్లో నీట్-2 నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఎస్సీ తెలిపింది. 

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 460 పాయింట్లు లాభపడి 25,689 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 7,866 పాయింట్ల వద్ద ముగిసింది. 

15:53 - May 9, 2016

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అనంతపురంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం దీక్షలో కూర్చున్న సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న చలసాని షుగర్ లెవెల్స్ పడిపోయాయి. బీపీ కూడా తగ్గింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైద్యుల సూచనతో రంగప్రవేశం చేసిన పోలీసులు చలసానిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ అనంతపురంలో పోరు ఉధృతమైంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ముట్టడికి వామపక్షాల నేతలు, కార్యకర్తలు యత్నించారు. లోపలికి చొచ్చుకొళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వామపక్ష నేతలు సాయంత్రం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

15:51 - May 9, 2016

విజయవాడ: ఈ నెల 13న రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవిపీ రామచంద్రరావు ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లుకు రాష్ట్ర ఎంపీలంతా సహకరించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కోరారు. దేశంలోని పార్లమెంటు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనాలని, ప్రైవేటు బిల్లు ఆమోదం పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇప్పటికే బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం, సీపీఐ, జేడీయూ, ఎన్‌సీపీ, ఎస్పీ సభ్యులు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

15:47 - May 9, 2016

విజయవాడ: రాష్ట్ర విభజన పూర్తయి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ విభజన చట్టంలోని ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కనీసం ఈ మిగిలిన మూడేళ్లలో అయినా హామీలు పూర్తిచేయాలంటూ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం అయ్యిందని రామకృష్ణ పేర్కొన్నారు. 

15:46 - May 9, 2016

హైదరాబాద్ : వైద్యుల తీరుపై పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ మండిపడ్డారు. చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం కంటే చనిపోవడం మేలు ఘాటు విమర్శలు చేశారు. డాక్టర్లు నుంచి నర్సుల వరకు ఉన్న నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోందంటూ ట్వీట్ చేశారు. సైకిల్‌ మీద నుంచి పడి గాయాలైన తన తనయుడు అకీరాను పుణెలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా..వైద్యులు సరిగ్గా స్పందించలేదని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. 

15:44 - May 9, 2016

ఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోది విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లను బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాకు వెల్లడించారు. మోదికి చెందిన ఎంఏ, బిఏ డిగ్రీల పట్టా సర్టిఫికేట్‌ను బహిరంగం చేశారు. ప్రధాని క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లను బహిరంగ పర్చాలని ఆప్‌ సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు లేఖ రాసింది. ప్రధాని మోదీ డిగ్రీ పట్టాపై ఢిల్లీ యూనివర్సిటీ వీసీకి సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ విషయంలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ మోది పరువు తీసేలా ప్రవర్తించారని, ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. మోది 1983లో దూర విద్యా విధానంలో గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. రాజనీతి శాస్త్రంలో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారని తెలిపారు

15:42 - May 9, 2016

ఢిల్లీ :రాజ్యసభలో ఉత్తరాఖండ్‌ బడ్జెట్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అజెండాలో మధ్యాహ్నం పోస్టు చేసిన ఈ అంశాన్ని ముందుగానే చేపట్టాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తూ... సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో వాయిదే వేస్తూ రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైన ఎంతో సేపు జరలేదు. 

15:41 - May 9, 2016

యానిమేషన్ మాయతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. త్రీడీ ఇంద్రజాలంతో మరో కొత్త లోకానికి తీసుకెళ్తోంది... ఈపాటికే ఆ సినిమా పేరు మీ నోళ్లలో నానుతోంది కదూ.....అవునండీ... అదే జంగిల్‌బుక్ ... ఇప్పటిదాకా ఇండియాలో విడుదలైన హాలివుడ్‌ చిత్రాల్లోకెల్లా.. అత్యధిక వసూళ్లు రాబడుతోన్న మూవీగా సంచలనం సృష్టిస్తోన్న జంగిల్‌బుక్ పై ప్రత్యేక కథనం.

వసూళ్ల చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'జంగిల్‌బుక్'......

ఓడలో సాగిన ప్రేమకథతో ప్రపంచాన్ని ఊపేసిన టైటానిక్‌ను, యానిమేషన్‌తో కొత్త చరిత్ర సృష్టించిన అవతార్ ను తలదన్నేలా జంగిల్‌బుక్ మన దేశంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హాలివుడ్‌ యాక్షన్ మూవీలకు కూడా సాధ్యం కాని రికార్డులను ఇండియాలో సృష్టిస్తోంది. జాన్‌ ఫారో దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హాలివుడ్‌ సూపర్ స్టార్లు లేకపోయినా మంచి కథుంటే చిన్నపిల్లాడైనా సూపర్ స్టారేనని నిరూపిస్తోందీ చిత్రం.

ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించి అగ్రస్థానంలో నిలిచిన 'జంగిల్‌బుక్'.....

భారత్‌లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగానే కాకుండా ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించి అగ్రస్థానంలో నిలిచింది.. జంగిల్‌బుక్‌. ఇప్పటి వరకు సుమారు 250 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిందీ చిత్రం. సినీ విమర్శకులు సైతం వసూళ్లను చూసి ముక్కుమీద వేళ్లు పెట్టుకుంటున్నారు. గతంలో చిన్నపిల్లల సీరియల్‌ గా ' మోగ్లీ' ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ప్రతివారం టీవీల్లో ప్రసారమైన మోగ్లీ పిల్లలతో పాటు పెద్దలనూ అలరించింది. అన్ని సార్లు చూసినా, అదే కథను ఏమాత్రం మార్పు లేకుండా తెరకెక్కించినా, ప్రేక్షకులు జంగిల్‌బుక్‌ను ఆదరించడం విశేషం.

కథ విషయానికి వస్తే...

జంగిల్‌బుక్‌ కథ విషయానికి వస్తే... ' మోగ్లీ' అనే కుర్రాడిని, తోడేళ్ల జాతి తమ వాడిగానే చూస్తాయి. మోగ్లీని చిన్నప్పటి నుంచీ తమ సొంత సంతానంగానే భావిస్తాయి. అయితే అడవిలో ఉండే చిరుతపులికి మోగ్లీ అంటే పడదు. మోగ్లీ తండ్రి, చిరుత నుంచి రక్షించుకునే ప్రయత్నంలో నిప్పుతో చిరుత మొహాన్ని కాల్చేయడమే దీనికి కారణం. అప్పటి నుంచి చిరుతకి మానవ జాతంటే పడదు. అదే విషయాన్ని తోడేళ్లకు పదేపదే చెబుతూ, వారితో విభేదిస్తుంది. కాని తోడేళ్లు మాత్రం మోగ్లీ అలాంటి వాడు కాదని వాదిస్తాయి. చిరుతపులి మాత్రం మోగ్లీని చంపే ప్రయత్నంలో, మంటల్లో పడి మరణిస్తుంది. చివరకు మోగ్లీ అడవిలోనే ఉండిపోతాడు తప్ప మానవ ప్రపంచానికి వెళ్లడు. ఇక జంతువులన్నీ తమ జాతిగానే మోగ్లీని భావిస్తూ ఆనందంగా జీవించడంతో కథ ముగుస్తుంది.

' మోగ్లీ' పాత్రలో మెప్పించిన నీల్‌సేథి...

అమెరికాలో కంటే వారం ముందుగానే ది జంగిల్‌బుక్‌ చిత్రం మన దేశంలో విడుదలైంది. 2డీ, 3డీలో రూపొందిన ఈ చిత్రం మోగ్లీ పాత్రలో నీల్‌ సేథి నటించాడు. హిందీ వెర్షన్‌ జంగిల్‌బుక్‌ చిత్రానికి బాలీవుడ్‌ నటులు ప్రియాంకచోప్రా, నానా పటేకర్‌తో పాటు పలువురు నేపథ్య గాత్రాన్ని అందించారు. 

15:34 - May 9, 2016

హైదరాబాద్ : బిడ్డకు జన్మనివ్వడమే మరో జన్మ ఎత్తినట్టే. తొమ్మిది నెలలు తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. అలాంటి శ్రద్ధ తీసుకోవాడానికే మేమున్నామంటున్నారు ’పాంపర్డ్ మామ్స్ అండ్ పాంపర్డ్ కిడ్స్ ‘ నిర్వాహకులు. ఈ సంస్థ అందించే సేవలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.

అమ్మలయ్యే అమ్మాయిలకు....

అమ్మలయ్యే అమ్మాయిలకు మంచి చెడులు చెప్పే వారెవరు? ఏం తినాలో, ఎలా ఉండాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో? వివరంగా వివరించేవారెవ్వరూ? అయితే డాక్టర్ చెప్పాలి. లేదంటే, ఇంట్లో పెద్దలు చెప్పాలి. ఈ ఇద్దరూ కాకుండా, మరొకరు స్నేహితుల్లా ఉంటే ఎంత బాగుంటుది అనుకునే వారికోసమే మొదలైంది ‘పాంపర్డ్‌ మామ్స్‌ అండ్‌ పాంపర్డ్‌ కిడ్స్‌.

మొన్నటి తరంలో అమ్మమ్మ, నిన్నటి తరంలో అమ్మ....

మొన్నటి తరంలో అమ్మమ్మ, నిన్నటి తరంలో అమ్మ, ఈ తరం లో పాంపర్డ్ మామ్స్ .. తరానికి తరానికి మధ్య ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. అవసరాలు వేరవుతున్నాయి. ఎప్పటి అవసరాలు అప్పుడు గుర్తించాలి. వాటిని పరిష్కరించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. అవి అందరికీ ఆమోదయోగ్యం కావాలి. ఈ మాటనే నమ్మిన పవిత్ర తను ఎంచుకున్న దారిలో సక్సెస్ ను సాధించింది. ఎందరికో స్పూర్తిని కలిగిస్తోంది. 

15:29 - May 9, 2016

హైదరాబాద్ : ప్రతి సందర్భానికి కలర్ ఫుల్ గా రెడీ అవాలనుకునే అతివలు స్పెషల్ కలెక్షన్ ను తమ వాడ్రోబ్ లో సిద్ధంగా పెట్టుకుంటారు. అలాంటి వారి కోసం లేటెస్ట్ కోటా కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

12వ తేదీన తెలంగాణ టెన్త్ ఫలితాలు..

హైదరాబాద్ : ఈ నెల 12న టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ సచివాలయం వేదికగా ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించి ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల కోసం RESULTS.NAMASTHETELANGAANA.COM,

NTNIPUNA.COM ను సంప్రదించవచ్చు.

దేవిరెడ్డి మృతి కేసులో భరత్ సింహారెడ్డికి రిమాండ్

హైదరాబాద్ : ఇంజినీరింగ్‌ విద్యార్థిని దేవిరెడ్డి మృతి కేసులో నిందితుడు భరత్‌సింహారెడ్డికి నాంపల్లి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఈనెల 23వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో దేవిరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. సంచలనం కలిగించిన ఈ కేసులో ఆమె స్నేహితుడైన భరత్‌సింహారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఈరోజు అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి... అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరింపులు..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ మేరకు బెదిరింపు లేఖలు వచ్చినట్టు ఆ పార్టీ నాయకులు చెప్పారు. దీంతో ఈ రోజు (సోమవారం) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ తదితరులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలసి రాహుల్ కు భద్రత పెంచాలని విన్నవించనున్నారు. బెదిరింపు ఉత్తరాలు పంపిన ఘటనపై విచారణ చేయించాల్సిందిగా కోరనున్నారు.

 

టి.ఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కు కేబినెట్ స్థాయి హోదా...

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణకు కేబినెట్‌ మంత్రి స్థాయి ప్రొటోకాల్‌ కల్పించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మంత్రులకు సమానంగా భద్రత, నివాసం, రవాణా తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

వ్యానును ఢీకొన్న లారీ :9మంది మృతి

చెన్నై: తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. తూత్తుకుడి సమీపంలో ఆగి ఉన్న వ్యానును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. వ్యానులోని 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి సహా నలుగురు మహిళలు ఉన్నారు. మృతుల వివరాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

చలసాని దీక్ష భగ్నం

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అనంతపురంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం దీక్షలో కూర్చున్న సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న చలసాని షుగర్ లెవెల్స్ పడిపోయాయి. బీపీ కూడా తగ్గింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైద్యుల సూచనతో రంగప్రవేశం చేసిన పోలీసులు చలసానిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

 

మందుపాతర పేలి కానిస్టేబుల్ మృతి

ఖమ్మం : దుమ్ముగూడెం మండలం మారాయిగూడెంలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో సివిల్ కానిస్టేబుల్ మృతి చెందగా, ఓ కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన కార్మికుడు సంజయ్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా మందుపాతర పేలింది. రహదారి పనుల వద్ద కానిస్టేబుల్ భద్రత పర్యవేక్షిస్తున్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ మడకం జోగ మారాయిగూడెం పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు మందుపాతర అమర్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడగా నిఫ్టీ వంద పాయింట్లకు పైగా ట్రేడింగ్ లో కొనసాగుతోంది. 

ఆర్కిటెక్ట్స్ తో మంత్రి నారాయణ భేటీ..

విజయవాడ : అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఇతర నిర్మాణాల డిజైన్లపై చర్చించేందుకు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు, ప్రఖ్యాత ఆర్కిటెక్ట్స్‌ నిర్మాణరంగ సంస్థలతో సమావేశమయ్యారు. విజయవాడ గేట్‌వే హోటల్‌లో ఈ భేటీ జరుగుతోంది.

సంక్షేమ పథకాల్లో అవినీతి - రఘువీరా...

అనంతపురం : సంక్షేమ పథకాల్లో అవినీతి పెరిగిందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రి-నీవా పనులు సరిగా జరగడం లేదని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం రొద్దంలో ఆయన నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. 

లోక్ సభ నుండి కాంగ్రెస్ వాకౌట్..

ఢిల్లీ : లోక్ సభ నుండి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. తమ నాయకురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సభులు బయటకు వెళ్లిపోయారు. 

13:38 - May 9, 2016

ఢిల్లీ : నిరసనలు..కొంతమంది చేపట్టే ఈ నిరసన కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోరూ. కానీ దృష్టిలో పడాలంటే వినూత్నంగా నిరసన వ్యక్తం చేయాలి. ఇదే కోవలో ఏంపీ శివప్రసాద్ ఉన్నారు. నటనలో మంచి ప్రావీణ్యమున్న శివప్రసాద్.. గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో పలుమార్లు విభిన్న వేషాల్లో పార్లమెంటులో నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరూతూ సోమవారం 'అంబేద్కర్' వేషధారణలో వచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.
ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుందా ? బాబుకు ఇన్ని అడ్డంకులా ? ఆనాడు ప్రధాని చేసిన ప్రకటనకు విలువ లేదా ? కాంగ్రెస్ కు బీజేపీ సహకరించలేదా ? పదేళ్లు ఇవ్వాలని కోరిన వ్యక్తి వెంకయ్య కాదా ? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనే అంశం చట్టంలో లేదని పేర్కొనడం సబబు కాదని ఎంపీ శివప్రసాద్ తనదైన శైలిలో పేర్కొన్నారు. 

13:35 - May 9, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో అట్టహాసంగా ప్రారంభించిన ఈ-బోట్లు మూనాళ్ల ముచ్చటగా మారాయి. ప్రారంభించిన తర్వాత వారం తిరక్కుండానే మూలన పడ్డాయి. వీటిని రీచార్జ్‌ చేసుకునే సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా పడివున్నాయి. ఈ-బోట్లు ప్లాస్టిక్‌తో చేసిన తేలికపాటి పడవలు కావడంతో తెడ్ల సాయంతో కూడా నడుపుకునే అవకాశంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగానదిలో పడవలు నడుపుతూ నిషాద్‌ వర్గానికి చెందిన కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. రాజకీయంగా కీలకమైన ఈ వర్గాలను సంతృప్తి పరిచేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ-బోట్లను ప్రవేశపెట్టింది. మొత్తం 3 వేల బోట్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలిదశలో 11 ఈ-బోట్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఈనెల 1న వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ చేతులు మీదుగా కేవలం ఐదు బోట్లు మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. వీటితో కాలుష్యం ఉండదని, డీజిల్‌ ఖర్చు తగ్గుతుందని చెప్పారు.

ఖర్చుతో కూడిన వ్యవహారం..
అయితే పంపణీ చేసిన తర్వాత వారం రోజులు తిరగ్గముందే ఈ బోట్లు మూలన పడ్డాయి. ఈ పడవలకు అమర్చిన ఎలక్ట్రిక్‌ బ్యాటరీలను రీచార్జ్‌ చేసుకునేందుకు అవసరమైన పవర్‌ పాయింట్లను వారణాసిలోని గంగానది ఘాట్లలో ఏర్పాటు చేయలేదు. బ్యాటరీలను విడిగా రీచార్జ్‌ చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఈ-బోట్ల లబ్ధిదారులు చెబుతున్నారు. పడవలపైన సూర్యరశ్మితో రీచార్జ్‌ చేసుకునే సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఎలక్ట్రిక్‌ పడవల యజమానులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తే, వీటి బరువుకు పడవలు సమతుల్యం కోల్పోయే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లబ్ధిదారులు సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుకు వ్యతిరేకిస్తున్న తరుణంలో తదుపరి దశలో పంపిణీకి సిద్ధమవుతున్న ఈ-పడవలను ఏమి చేయాలన్న అంశంపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. గంగానది ఘాట్ల దగ్గర విద్యుత్‌తో రీచార్జ్‌ చేసుకునే పవర్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రధాని పంపిణీ చేసి ఎలక్ట్రిక్‌ పడవలు తేలికపాటి ప్లాస్టిక్‌తో తయారు చేసినవి. దీంతో వీటిని తెడ్ల సాయంతో కూడానడిపే అవకాశంలేదు. దీంతో ఏమిచేయాలో పాలుపోని లబ్ధిదారులు... ప్రధాని మోదీతోపాటు, విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు లేఖలు రాస్తున్నారు. ముందుచూపులేని అధికారుల మందగమనానికి గంగానదిలో ప్రారంభించిన ఎలక్ట్రిక్‌ పడవలే నిదర్శమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

13:26 - May 9, 2016

ఢిల్లీ : రాజ్యసభలో ఉత్తరాఖండ్‌ బడ్జెట్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అజెండాలో మధ్యాహ్నం పోస్టు చేసిన ఈ అంశాన్ని ముందుగానే చేపట్టాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తూ... సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో వాయిదే వేస్తూ రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైన ఎంతో సేపు జరలేదు.

13:24 - May 9, 2016

ఖమ్మం : టీఆర్‌ఎస్‌కు అమరవీరుల మీద ప్రేమ ఉంటే.. శ్రీకాంత్‌చారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు ? అని కాంగ్రెస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌ వైఖరిని అర్ధం చేసుకోవాలని అన్నారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. వాటిని నెరవేర్చడం లేదన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తుందన్నారు.

 

కరీంనగర్ లో సైకో వీరంగం..

కరీంనగర్ : జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. రాళ్లు చేతబట్టుకుని తనకు కనిపించిన వ్యక్తులు..వాహనాలపైకి దాడికి దిగాడు. ఈ దాడిలో 8 వాహనాలు దెబ్బతినగా పలువురికి గాయాలయ్యాయి. 

13:19 - May 9, 2016

మాస్ రాజా రవితేజ ఇలా తయారయ్యాడేంటి అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలు పెడుతున్నాయట. ఈ స్టార్ హీరో ఎప్పుడు లేని విధంగా ఇలా చేస్తున్నాడేంటి అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇతర స్టార్స్ మాస్ రాజాను ఫాలో కావాలనుకునే వారు. కానీ ప్రస్తుతం మాస్ రాజా ఇతర స్టార్స్ లా అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇంతకీ మాస్ రాజా ఎలా మారాడు ? మాస్ రాజా రవితేజ అంటే హుషారుకు మరో పేరు. తెర మీదే కాదు. బయట కూడా చాలా ఎనర్జీతో ఉంటాడు. ఆయన ఎనర్జీకి తగ్గట్టే శరవేగంగా సినిమాలు చేసేస్తుంటాడు. ఈ జనరేషన్ హీరోలందరూ స్పీడు పెంచడానికి ఒకరకంగా రవితేజానే కారణం. పెద్ద హీరోలందరూ ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేస్తుంటే రవితేజ మాత్రం ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి రెవెన్యూ తెచ్చిపెడుతాడు. అలాంటి మాస్ రాజా సడన్ రూట్ మార్చాడు. ఈ ఏడాదిలో రవితేజ ఖాళీగా గడిపేస్తున్నాడు.

స్లోగా సినిమాలు..
బెంగాల్ టైగర్ సినిమా వచ్చి ఐదు నెలలవుతోంది. అయిన కూడా ఇప్పటి వరకు ఈ స్టార్ హీరో కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకురాలేదు. అవకాశాలు లేవా అంటే అదేం లేదు. రెండు మూడు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కానీ సినిమా మొదలుపెట్టడంలోనే టైం తీసుకుంటున్నాడు. యంగ్ జనరేషన్ హీరోలందరూ రవితేజలా స్పీడ్ పెంచాలనుకుంటారు. కానీ ప్రస్తుతం రవితేజనే చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. గత రెండేళ్లుగా మాస్ రాజా ఎడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టాలెక్కించడానికి మాత్రం మరో నాలుగు నెలలు పట్టొచ్చు అంటున్నారు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే రవితేజ సినిమా సినిమాకి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడనేదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

13:02 - May 9, 2016

సినిమాపై ఉన్న గ్రిపే రాజ్ తరుణ్ కొంపముంచుతోందా అంటే అవునానే సమాధానం వినిపిస్తోంది. ఈ యంగ్ హీరో ఆటిట్యూడ్ తో ఒక్కో క్రేజీ ఛాన్స్ వెనక్కి వెళ్లుతున్నట్లు సమాచారం. లేటేస్ట్ గా రాజ్ తరుణ్ ను రెండు క్రేజీ సినిమాల నుంచి దర్శకనిర్మాతలు తప్పించినట్లు టాక్. ఇంతకీ ఈ యంగ్ హీరోకి సినిమాపై ఉన్న కమాండ్ ఏంటో తన ఆటిట్యూడ్ తో రాజ్ తరుణ్ కథనం..

మూడు హిట్స్..
మంచి స్వీంగ్ ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్. వరుసగా మూడు సూపర్ హిట్స్ సాధించిన ఈ కుర్రాడు రీసెంట్ గా వచ్చిన ఈడోరకం ఆడోరకం మల్టీ స్టారర్ తో కూడా హిట్ కొట్టాడు. దీంతో రాజ్ తరుణ్ మరింత డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వరసగా క్రేజీ చాన్స్ లు వచ్చిపడుతున్నాయి. కానీ రాజ్ తరుణ్ బిహేవియర్ తో వస్తున్న క్రేజీ ఛాన్స్ లు అన్ని కూడా వెనక్కివెళ్లుతున్న సమాచారం. రాజ్ తరుణ్ హీరోగా శతమానం భవతి అనే మూవీని అనౌన్స్ చేశాడు దిల్ రాజు. ఈ ప్రాజెక్ట్ లోంచి ఈ కుర్రాడిని తప్పించి శర్వానంద్ ని తెచ్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఓ సినిమా కోసం ఈ కుర్రహీరోని అనుకున్నాడు. కానీ ఈ యంగ్ హీరో ప్రవర్తన వల్ల మనస్సు మార్చుకున్నాడట. ఇక సినియర్ డైరెక్టర్ వంశీ కూడా రాజ్ తరుణ్ తో ఫ్యాషన్ డిజైనర్ అనే మూవీ చేద్దామనుకుంటే రాజ్ తరుణ్ ఆటిట్యూడ్ చూపించడంతో వేరే హీరోను వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా అయితే అవకాశాలు చేజారుతాయి..
రాజ్ తరుణ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా అనుభవం ఉంది. దీంతో ఆ ఈ యంగ్ హీరో కథ స్క్రీన్ ప్లే పై కాస్త పట్టుంది. ఈ గ్రిప్ వల్లే తను కథ విషయంలో వేలు పెడుతున్నాడట. దీంతో ఈ యంగ్ హీరోతో సినిమా చేయాలనుకున్నవాళ్లకు ఇది చిరాకకు తెప్పిస్తోందని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. ఈ కారణం వల్లే దర్శకుడు మారుతి, రాజ్ తరుణ్ ల ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో ఇలా దర్శకనిర్మాతల విషయాల్లో వేలు పెడుతూ రాజ్ తరుణ్ మంచి ఛాన్స్ లు పొగొట్టుకున్నడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ యంగ్ హీరో ఇప్పటికైనా తన పని తాను చేసుకుపోతే మంచిది. లేకపోతే ఇలాగే వచ్చిన అవకాశాలు చేయిజారుతాయని సినిపెద్దలు చెప్పుకుంటున్నారు. 

సుప్రీంకు ఉత్తరాఖండ్ రెబల్ ఎమ్మెల్యేలు..

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రెబల్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తొమ్మిది మంది రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు అనర్హులంటూ ఆ కోర్టు తీర్పు నిచ్చింది. దాంతో మంగళవారం జరగనున్న విశ్వాసపరీక్షలో పాల్గోనేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆ ఎమ్మెల్యేలు ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఇవాళ మధ్యాహ్నాం రెండు గంటలకు ఆ అంశంపై తీర్పును వెలురించే అవకాశాలున్నాయి.

12:54 - May 9, 2016

నవతరంతో యువతరం..కొందరు యువరచయితలు..కొందరు చిన్నారులు..మరికొందరు సాహితీ ప్రముఖులు..వెరసి ఓ చిన్న ప్రయత్నం..గట్టి సంకల్పం..ప్రజాస్వామిక రచయితల వేదిక..మహిళా చేతన..సంస్కృతి గ్లోబల్ స్కూల్ విశాఖలో సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్త ఒరవడికి పునాది వేసింది. నవతరాన్ని సాహిత్యానికి సమీపంగా తెచ్చే ప్రయత్నంతో పాటు నిర్వాసితులవుతున్న గిరిపుత్రుల పరిస్థితిని అర్థం చేసుకొనే ఉద్దేశ్యంతో సాగింది. ఈ విశేషాలు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:47 - May 9, 2016

మనువు సృష్టించిన నిచ్చెన మెట్ల సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న అవమానాలను, మానసిక సంఘర్షణలను అద్భుత కవిత్వంగా చిత్రిస్తున్న దళిత కవి దార్ల వెంకటేశ్వరావ్. కుల వ్యవస్థలోని వైరుధ్యాలు, వైవిధ్యాలను అంబేద్కర్ దృక్పథంతో కవిత్వంగా ఆవిష్కరిస్తున్న అరుదైన కవి ఆయన. దళితకవి, విమర్శకుడు, పరిశోధకుడైన దార్ల వెంకటేశ్వర్ రావ్ కవిత్వాన్ని, ఆయన సృజనలోని దళిత తాత్వికతను, కవితా నిర్మాణ పద్ధతులను ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. 'దార్ల రాసిన మాదిగ మానిఫెస్టో కవిత మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సరికొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. దండోరా తీసుకొచ్చిన దళితవాదాన్ని గట్టిగా సమర్థిస్తుంది'. అని పేర్కొన్నారు. ఈ దేశంలో వర్ణవ్యవస్థ సృష్టించిన అసమానతలను అన్యాయాలను అధర్మాలను, తన కవిత్వంలో తూర్పారబట్టారు ఈ కవి. ఒక బాలునిగా విద్యార్థిగా పరిశోధకునిగా దళిత విద్యార్థి అనుభవించే కష్టాలను ఆర్ద్రమైన కవితలుగా శిల్పీకరించారు దార్ల వెంకటేశ్వరరావ్. నగర నాగరికత ,తెలుగుభాష,తెలంగాణా కోస్తా దళితుల జీవన చిత్రాలను ఈ కవి చక్కగా కవిత్వీకరించారు. ఇదే విషయం గురించి ప్రస్థావిస్తూ దార్లకవిత్వంలో వస్తు వైవిద్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటారు జి.లక్ష్మీనర్సయ్య.

1973లో జననం..
చాలా మంది దళిత కవులు శిల్పం కోసం ఆరాట పడుతుంటారు. పదచిత్రాల కోసం పలవరిస్తుంటారు. వీరికి వస్తుసాంద్రత, సమస్యతీవ్రత కన్నా శిల్పమే ముఖ్యం. కాని దార్లవెంకటేశ్వరావ్ శిల్పం కోసం కృత్రిమ చిత్రణచేయడని ప్రతి మాట, ప్రతి పదం కవిత్వంతో జవజవలాడాలన్న తపన ఈకవికి లేదంటారు లక్ష్మీనర్సయ్య. ఇక దార్ల వెంకటేశ్వరావ్ జీవిత విశేషాల్లోకి వెళితే ఆయన 1973 లో తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు అగ్రహారం లో పెదనాగమ్మ,లంకయ్య దంపతులకు జన్మించారు. బి.ఎ.స్పెషల్ తెలుగు చదివి హైదరాబద్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేశారు.అదే యూనివర్సిటీలో తెలుగు బోధకునిగా పని చేస్తున్నారు.వెంకటేశ్వరరావ్ కవిత్వం, సాహిత్య విమర్శ, సౌందర్య శాస్త్రం, మాదిగ సాహిత్యం పై విశేష కృషి చేశారు. దళిత తాత్వికుడు, నెమలి కన్నులు కవిత్వంతో పాటు సాహితీ సులోచనం సమీక్షాగ్రంథం, వీచిక సాహితీ విమర్శ, బహుజన సాహిత్య దృక్పథం, సృజనాత్మక రచనలు ఎలా చేయడం, పునర్మూల్యాంకనం, సాహితీ మూర్తులు-స్పూర్తులు మెుదలైన సాహితీవ్యాస సంపుటాలు వెలువరించారు, దార్లవెంకటేశ్వరరావ్ కృషిని గుర్తించి న్యూఢిల్లీ వారు 2007లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పురస్కారంతో సత్కరించారు. ఈయన రాసిన తెలుగు సాహిత్య విమర్శకు 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం లభించింది. భవిష్యత్తులో ఈ సృజనకారుని కలం నుండి మరెన్నో రచనలు వెలువడాలనిఆశిద్దాం.

సీబీఐ, సెబీలకు సుప్రీం నోటీసులు..

ఢిల్లీ : పనామా పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ, సీబీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై న్యాయవిచారణ ఎందుకు జరిపించలేదో నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

 

12:30 - May 9, 2016

ఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై రాజ్యసభలో రగడ చెలరేగూతనే ఉంది. బీజేపీ - కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. సోమవారం ప్రారంభమైన రాజ్యసభలో తీవ్ర రగడ జరిగింది. ఈ వ్యవహారంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి సంబంధం ఉందని నామినేటెడ్‌ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. దీనికి సంబంధించి తాను ప్రవేశపెట్టిన పత్రాలను సభ ఆమోదించిందని సుబ్రహ్మణ్యస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ సభ్యులు తప్పుపట్టారు. దీనిపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌లోకి వెళ్లి సభా కార్యక్రమలను అడ్డుకున్నారు. అగస్టా వ్యవహారంలో సోనియాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగుతోంది. చివరకు సభను మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ కురియన్ వెల్లడించారు. 

12:22 - May 9, 2016

హైదరాబాద్ : కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కు మరో అవకాశం దక్కింది. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశాడనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఇతడిని దేశానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలోని ఎర్రమంజిల్ కోర్టులో కూడా మాల్యాపై కేసు నమోదైంది. చెక్ బౌన్స్ కేసును జీఎంఆర్ గ్రూపు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరిగింది. మాల్యా ఇచ్చిన చెక్కు బౌన్సయిన కేసులో వాదనలు పూర్తయినా శిక్షను విధించలేమని తేల్చిచెప్పింది. నిందితుడు కోర్టుకు హాజరు కాకుండా శిక్షను ఖరారు చేయలేమని పేర్కొంది. నిందితుడు దేశాలు వదిలి పారిపోయాడు కనుక, అతను లేకపోయినా శిక్ష ఖరారు చేయవచ్చని జీఎంఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు విచారణనను 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాలనే యోచనలో జీఎంఆర్ ఉన్నట్లు సమాచారం. 25వ తేదీపై ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది. 

12:17 - May 9, 2016

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇటీవల 'హోదా' రాదనే విషయాన్ని కేంద్ర మంత్రి సాక్షాత్తూ పార్లమెంట్ లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీలోని విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. అందులో భాగంగా మేధావుల ఫోరం నేత చలసాని ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. రెండో రోజైన సోమవారం దీక్షా శిబిరానికి సినీ నటుడు శివాజీ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. వైద్యులు దీక్షా శిబిరానికి చేరుకున్నారు. నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటైంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమ సెగ చూపించాలనే ఉద్ధేశ్యంతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష నేతలు యత్నించారు. ముందే బందోబస్తులో ఉన్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పలువురు నేతలను అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చలసాని దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. వామపక్ష నేతలు సాయంత్రం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 18వ తేదీన తమ కార్యాచరణను ప్రకటిస్తామని చలసాని ప్రకటించారు. 

రాజ్యసభలో ఆందోళన..వాయిదా..

ఢిల్లీ : ఆగస్టా వెస్ట్ ల్యాండ్ విషయంలో రాజ్యసభలో రగడ చెలరేగుతోంది. దీనిపై సభ్యుడు సుబ్రమణ్య స్వామిపై కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆందోళన సద్దుమణగకపోవడంతో డిప్యూటి ఛైర్మన్ సభను 12.36 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

ప్రత్యేక హోదాపై వామపక్షాల ఆందోళన..

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

పులివెందులలో జగన్ పర్యటన..

కడప : పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటిస్తున్నారు. నల్లపురెడ్డిలో అకాల వర్షాలకు ధ్వంసమైన అరటితోటలను పరిశీలించారు. ప్రభుత్వం ఉద్యానవన రైతులకు అన్యాయం చేస్తోందని, ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతామని హెచ్చరించారు. 

ఎన్నికల సంఘానికి ఉత్తమ్ ఫిర్యాదు..

ఖమ్మం : అధికార పార్టీపై ఎన్నికల సంఘానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ డీఎస్పీ బాలకిషన్, కూసుమంచి సీఐ రూరల్ సీఐ, ఎంపీడీవో శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు.

 

ఖమ్మంలో రూ. 2 కోట్లు స్వాధీనం..

ఖమ్మం : హవేలీ రెస్టారెంట్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు టీఆర్ఎస్ కు చెందినదిగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

 

ఎర్రమంజిల్ లో మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ..

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో విజయ్ మాల్యా కోర్టుకు హాజరు కానందున శిక్ష ఖరారు చేయలేమని ఎర్రమంజిల్ కోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. 

పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..

విజయవాడ : ఏపీ ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్ గా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పదవీ బాధ్యతలు చేపట్టారు. 

రాజ్యసభలో గందరగోళం..

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ విషయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలేమయ్యాయి - తమ్మినేని..

ఖమ్మం : తిరుమలాయపాలెంలో సీపీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి పోతినేని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి హేమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూ పంపిణీ కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రోజుకో పార్టీ మారే నాయకులకు కమ్యూనిస్టులను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. సీపీఎం పోరాటం వల్లే గోదావరి జలాలు పాలేరుకు వచ్చాయని, దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం సీపీఎం పోరాడితే తామే తెచ్చామని తుమ్మల గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 

నీట్ పై సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు..

ఢిల్లీ : నీట్ రెండో విడత పరీక్షకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఆశ్రయించారు. మే 1న హాజరైనా జులై 24న అనుమతించాలని పిటిషన్ లో కోరారు. విద్యార్థుల పిటిషన్ పై మధ్యాహ్నం 2గంటలకు విచారణ జరగనుంది. 

11:21 - May 9, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో లోయలో బస్సు పడిన ఘటనలో ఒకరు మాత్రమే మృతి చెందారు. 8మంది మృతి చెందినట్లుగా..మరికొంతమందికి గాయాలైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..25 మందితో కూడిన ఓ బృందం పుణ్యక్షేత్రాలకు వెళుతోంది. అందులో భాగంగా వీరంతా భద్రాచలంకు వచ్చారు. మంగళవారం రాజమండ్రికి వెళ్లేందుకు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీనితో సి.హెచ్ విజయ అనే వృద్ధురాలి మృతి చెందింది. మరో 17 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎస్పీ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. 

11:13 - May 9, 2016

ఉత్తరాఖండ్ : రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. విశ్వాస పరీక్షలో తమకు ఓటు హక్కు కల్పించాలంటూ వారు వేస్తున్న పిటిషన్ లపై వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. తమపై వేసిన అనర్హత వేటు ఉపసంహరించుకొనేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని 9మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ ను ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం జరగబోయే బలపరీక్షలో వారికి ఓటు వేసే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

9మందిపై వేటు..
మంగళవారం ఉదయం 11 నుండి 01 గంట వరకు బలపరీక్ష నిర్వహించుకోవచ్చని కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీనితో స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. మార్చి 27వ తేదీన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనితో ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిగింది. తమకు సమయం ఇవ్వలేదు..అధికారపక్షంలో ఉంటూ ఎలాంటి చర్యలకు పాల్పడలేదని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును హరీష్ రావత్ స్వాగతించారు. ఈ తీర్పుపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హరీష్ నెగ్గుతారనే ప్రచారం..
విశ్వాస పరీక్షలో ఆరుగురు స్వతంత్ర్య అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. వీరు హరీష్ రావత్ కు మద్దతిస్తారని, పరీక్షలో నెగ్గుతారనే ప్రచారం జరుగుతోంది. 27 మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ కు ఉంది. 28 మంది బీజేపీ వైపు ఉన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిస్తే ఆ సంఖ్య 33 చేరుకొంటుంది. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే మ్యాజిక్ ఫిగర్ 32గా ఉంది. దీనితో హరీష్ రావత్ పరీక్షలో నెగ్గుతారని తెలుస్తోంది. 

ఎమ్మెల్యేల పిటిషన్ కొట్టివేసిన కోర్టు..

ఉత్తరాఖండ్ : సీఎం హరీష్ రావత్ ను విబేధించి బీజేపీ వంచన చేరిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దెబ్బ మీద దబ్బె తగులుతోంది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ నైనిటాల్ లోని ఆ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బలపరీక్షలో ఓటు హక్కు ఉండదని సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే తేల్చిచెప్పింది. 

10:49 - May 9, 2016

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదోసీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో...మరో బిగ్ ఫైట్ కు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఎనిమిదిజట్ల లీగ్ టేబుల్ ఆఖరి రెండుస్థానాల్లో కొట్టిమిట్టాడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ పంజాబ్ అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. ప్లే ఆఫ్ రౌండ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే....ఈ మ్యాచ్ లో రెండు జట్లూ నెగ్గితీరాల్సి ఉండడంతో పోటీ రసపట్టుగా సాగే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన మొదటి ఎనిమిదిరౌండ్ల పోటీల్లో ...బెంగళూరు, పంజాబ్ జట్లకు ఫలితాలు ఒకేవిధంగా ఉన్నాయి. ఎనిమిదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ ఏడోస్థానంలో బెంగళూరు, ఎనిమిదోస్థానంలో పంజాబ్ ఉండటం చూస్తే....రెండుజట్ల ప్రస్థానం ఒకే రీతిలో సాగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మూడు విజయాలు..ఐదు పరాజయాలు..
ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిదిరౌండ్లలో ...బెంగళూరు మూడు విజయాలు, ఐదు పరాజయాల రికార్డుతో ఉంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ, సుడిగాలి ఓపెనర్ క్రిస్ గేల్, ఎడాపెడాబాదుడు స్పెషలిస్ట్ ఏబీ డివిలియర్స్, యంగ్ గన్ రాహుల్ , సర్ఫ్రాజ్ ఖాన్ లాంటి సూపర్ హిట్టర్లతో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉన్నా...బౌలింగ్ ఎటాక్ లో పసలేకపోడం రాయల్ చాలెంజర్స్ ప్రధాన బలహీనతగా మారింది. చైనామన్ బౌలర్ తాబ్రెజ్ షంషీ, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ లతో బౌలింగ్ కు పదును పెట్టుకొన్నా...బెంగళూరు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే పూణే సూపర్ జెయింట్స్ తో ముగిసిన సూపర్ చేజింగ్ మ్యాచ్ లో విజేతగా నిలవడం ద్వారా...రాయల్ చాలెంజర్స్ లో కెప్టెన్ కొహ్లీ సరికొత్త ఉత్సాహాన్ని నింపగలిగాడు. మరోవైపు...లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ ...ఇప్పటి వరకూ ఆడిన తొమ్మిది రౌండ్ల పోటీల్లో...మూడు విజయాలు, ఆరు పరాజయాల రికార్డుతో అట్టడుగు స్థానానికి పడిపోయింది.

మిశ్రమ ఫలితాలు..
సూపర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ను తప్పించి ఓపెనర్ మురళీ విజయ్ చేతికి జట్టు పగ్గాలు అప్పగించినా...మిశ్రమ ఫలితాలు మాత్రమే సాధించగలుగుతోంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ముగిసిన మ్యాచ్ లో 9 పరుగుల విజయంతో...కింగ్స్ పంజాబ్ పుంజుకోగలిగింది. ఆల్ రౌండర్ స్టోయినిస్ ఓపెనర్ గా, ఓపెనింగ్ బౌలర్ గా...పంజాబ్ విజయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. హిషీమ్ ఆమ్లా, గ్లెన్ మాక్స్ వెల్‌, మిల్లర్ సైతం స్థాయికి తగ్గటుగా ఆడితే ఈ మ్యాచ్ లో బెంగళూరుకు గట్టిపోటీ తప్పదు. బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండే మొహాలీ పిచ్ పైన మరోసారి 190 నుంచి 200 పరుగుల స్కోరు వరకూ నమోదయ్యే అవకాశాలున్నాయి. టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడానికే మొగ్గుచూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా...సమానబలం కలిగిన ఈరెండు జట్ల పోటీ హోరాహోరీగా సాగుతుందా? లేక ఏకపక్షంగా ముగిసిపోతుందా? అన్నదే ఇక్కడి అసలుపాయింట్.

10:40 - May 9, 2016

హైదరాబాద్ : రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో చతికిలబడిన వ్యవసాయం మళ్లీ జీవం పోసుకుంటుందనే ఆశలు.. రైతుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఈ యేడు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ముందస్తుగా తీపి కబురు చెప్పడంతో ఈ ఖరీఫ్‌ కలిసివస్తుందని అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు కబురు చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారంతో ఖరీఫ్ సీజన్‌కు అన్నదాతలు, అధికారులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో వరి, పత్తి, సోయాచిక్కుడు,మక్క పంటల సాగుపైనే వ్యవసాయశాఖ ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని తెలియడంతో వరి సాగు సాధారణ విస్తీర్ణం 26 లక్షల ఎకరాలను దాటి 30 లక్షల వరకూ చేరవచ్చని అంచనా వేసింది. ఇందుకోసం అధికారులు విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే, పచ్చరొట్ట, సోయాచిక్కుడు పంటల విత్తనాలకిచ్చే రాయితీ, అమ్మకపు ధరలను వ్యవసాయశాఖ ఖరారు చేసింది.

కోటి 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు..
ఇటీవలే పత్తిసాగుపై సీఎం కేసీఆర్‌ కొన్ని సూచనలు చేశారు. దీంతో ప్రత్యమ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సాహించే దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈసారి పత్తి పంట దిగుబడిని తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ లో సోయా చిక్కుడును రెండు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో దీన్ని ఆరేడు లక్షల ఎకరాలకు పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 3.50 లక్షల క్వింటాళ్ల వరకూ విత్తనాలను సిద్దంగా ఉంచినట్లు సమాచారం. ఈ ఖరీఫ్‌లో మొత్తం కోటీ 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో వరి 30 లక్షలు, బీటీ పత్తి 25 లక్షలు, సోయా 7 లక్షలు, మక్కలు 15 లక్షలు, పప్పుధాన్యాలు 15 లక్షల ఎకరాలలో సాగవుతాయని భావిస్తున్నారు. బీటీ పత్తి నుంచి రైతులను ఇతర పంటలవైపు మళ్లించడంలో వ్యవసాయశాఖ ఏమేరకు సఫలమవుతారోనన్న దానిపైనే మిగతా పంటల సాగు ఆధారపడుతుందంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భూ పరీక్షలు చేపట్టి.. అందుకు తగ్గ పంటలు వేసే దిశగా రైతులను సన్నద్ధం చేయడమనేది ఇప్పటికిప్పుడు కుదిరే పని కాదని రైతు సంఘాలు భావిస్తున్నాయి. భూసారానికి తగ్గ రీతిలో విత్తనాలు ,ఎరువులు అందజేయడం.. పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించడం ప్రభుత్వ బాధ్యత అని.. రైతు సంఘాలు సూచిస్తున్నాయి.మ 

10:36 - May 9, 2016

హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తనదైన ముద్రను వేసుకున్న రాజేశ్వర్‌రావు ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాజేశ్వరరావు స్వస్థలం కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం మరుపాక. ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌.. రాజేశ్వరరావు కుమారుడు. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. రాజేశ్వరరావు సోదరుడు.

సీఎం దిగ్ర్భాంతి..
చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేశ్వరరావు మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. చెన్నమనేని కుటుంబాన్ని ఎంపీ వినోద్‌కుమార్‌ పరామర్శించారు. రాజేశ్వరరావు మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి, ముఖ్యంగా తమ కుటుంబానికి తీరని లోటు అన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి రాజకీయాల్లో అడుగు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆశీస్సులు అందచేశారని తెలిపారు.

స్వాతంత్ర్య పోరాటం..
చెన్నమనేని రాజేశ్వరరావు చిన్నతనంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. వామపక్ష విద్యార్థి సంఘంలో రాజేశ్వరరావు ప్రముఖ పాత్ర వహించారు. అనంతరం భారత కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరి.. స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన సందర్భంలో ఆయన కొన్నాళ్లపాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్ట్‌ పార్టీలో కొనసాగారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి నాయకత్వంలో రాజేశ్వరరావు పని చేశారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా ఆరుసార్లు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రాజేశ్వరరావు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో 1999లో కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా రాజేశ్వరరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధి కోసం ఆయన కేసీఆర్‌కు ఎన్నో సలహాలు, సూచనలు చేశారు.

స్వగృహానికి పార్థివ దేహం..
చెన్నమనేని రాజేశ్వరరావు పార్థివదేహాన్ని యశోదా ఆస్పత్రి నుంచి స్వగృహానికి తరలించారు. రాజేశ్వరరావు మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్తానంలో రాజేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

శ్రీనగర్ లో కాంగ్రెస్ నిరసన..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సైనిక్ కాలనీ విషయంలో నేతలు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. సైనిక్ కాలనీలకు ఎలాంటి స్థలం కేటాయించలేదని మీడియాతో పేర్కొన్నారు. 

ఆగస్టా ఎంపీ ఆనంద్ శర్మ నోటీసు..

ఢిల్లీ : ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాం విషయంలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శుర్మ రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. 267 రూల్ కింద ఈ నోటీసు ఇచ్చారు.

 

మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం కూసుమంచి (మం) గట్టు సింగారంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

రాళ్లు పడి ఇద్దరు మృతి..

పశ్చిమగోదావరి : చింతలపూడి (మం) శివాపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో ఇసుక తవ్వుతుండగా రాళ్లు పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 

కోడ్ ఉల్లంఘించిన మంత్రి తుమ్మల..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల కోడ్ ఉల్లంఘించారు. తనకు ఓటు వేస్తే రాజేశ్వరపురం నుండి పాత కాల్వ ద్వారా తనకు ఓటు వేస్తే రాజేశ్వరపురం నుండి పాత కాల్వ ద్వారా రైతులకు సాగునీరందిస్తానంటూ తుమ్మల రాతపూర్వక హామీనిచ్చారు. 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..

చెన్నై : తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తూత్తుకుడి సమీపంలో ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. బస్సులోని 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

09:51 - May 9, 2016

పిట్టకొంచెం కూత ఘనం అనే నానుడిని నిజం చేస్తోంది ఓ చిన్నారి. వయస్సు నాలుగు ఏండ్లే. కానీ దేశీయ, అంతర్జాతీయ విశేషాలను అవలీలగా చెప్పేస్తోంది. నేతల పేర్లు..జాతీయ పక్షి..ఇలా ఒకటేమింటి అడిగిందే ఆలస్యం ఠక్కున సమాధానం చెబుతూ అందర్నీ అబ్బురపరుస్తోంది. ఆమె ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవాలంటే టెన్ టివి 'వండర్ కిడ్స్' వీడియో క్లిక్ చేయండి. 

09:21 - May 9, 2016

ఒంగోలు : జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం కోసం ఓ వృద్ధురాలిని చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. కలెక్టరేట్ వద్దనున్న ప్రాంతంలో కమలమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. మూడు అంతస్తులున్న ఈ బిల్డింగ్ లో రెండో ఫ్లోర్ లో కమలమ్మ కుమారుడు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అలాగే రాత్రి సమయంలో ఆమెకు తోడుగా ఓ మహిళ ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆదివారం అర్ధరాత్రి ఒంటిరిగా ఉన్న కమలమ్మ నివాసంలో దోపిడి దొంగలు చొరబడ్డారు. ఆమె మెడలోనున్న బంగారు గొలుసు తెంపారు. కమలమ్మ వెంటనే కేకలు వేయడం..దోపిడి దొంగలు దాడి చేయడం జరిగిపోయింది. సృహ కోల్పోయిన కమలమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

08:49 - May 9, 2016

బీహార్ : తమ తండ్రి మంత్రి..ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ కాగానే తాము ఏది చేసినా చెల్లుతుందని వారి కొద్దిమంది తనయులు అనుకున్నట్లు ఉంది. ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. కొందరైతే హత్యలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే గయాలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి తన కారును ఓవర్‌ టేక్‌ చేసినందుకు గానూ 19 ఏండ్ల యువకుడిని అధికార పార్టీ ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు తుపాకి తో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే వ్యాపారవేత్త కుమారుడైన ఆదిత్య సచ్‌దేవ మిత్రుల తో కలిసి తన స్విఫ్ట్‌ కారులో వెళుతూ మనోరమదేవి కుమారుడు రాకీ యాదవ్‌ నడుపుతున్న రేంజ్‌ రోవర్‌ కారును ఓవర్‌టేక్‌ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురయిన రాకీ, అతని సెక్యూరిటీ గార్డుతో కలిసి ఆదిత్యను కారు ఆపాల్సిందిగా గాల్లోకి కాల్పులు జరిపారు. కారు ఆపిన తరువాత వారిని బలవంతంగా బయటికి లాగి వారిపై దాడి చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపారు. ఆదిత్యకు బుల్లెట్‌ తగలడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఆదిత్య అతని మిత్రులు ఈ మధ్యే 12వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్నారు. రాకీ యాదవ్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గార్డుతో పాటు రాకీ తండ్రి బిండి యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రాకీ కోసం గాలిస్తున్నారు.

08:41 - May 9, 2016

విజయవాడ : ఏపీ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వ విద్యాలయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు వీటిని విడుదల చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. గత ఏడాది కన్నా 3,754 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినా తొలుత నిర్ణయించిన తేదీకన్నా వారం రోజుల ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ సీ.హెచ్. సాయిబాబ పేర్కొన్నారు.

08:36 - May 9, 2016

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం. మారేడుపల్లి - చింతూరు ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎనిమిది మంది మృతి చెందారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. టైగర్ క్యాంపు మధ్యలో నున్న దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. మొత్తం బస్సులో 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా ప్రాంతానికి పయనమవుతున్నారు. 

చెన్నమనేని మృతికి సీఎం కేసీఆర్..మంత్రుల సంతాపం..

హైదరాబాద్ : ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ రాజకీయ నాయకులు, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు (93) మృతికి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప నాయకుడిని కోల్పోయామని, మహోన్నత వ్యక్తి అని మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరిలు పేర్కొన్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ రాముడు దర్శించుకున్నారు. త్వరలో పోలీసు శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని, తిరుమల భద్రతకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించాల్సినవసరం ఉందన్నారు. 

08:03 - May 9, 2016

జయాపజయాలతో సంబంధం లేకుండా సునీల్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇతడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'జక్కన్న'. మన్నార్‌ చోప్రా కథానాయిక. ఆర్‌.పి.ఎ. క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌. సుదర్శన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టాకీస్‌ పూర్తయింది. ఈనెల విదేశాల్లో మూడు పాటలను, వైజాగ్‌లో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి జూన్‌ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఆర్‌. సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ '' సునీల్‌ నటించిన మంచి ఎనర్జిటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సునీల్‌ పెర్ఫార్మెన్స్‌ హైలైట్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి జక్కన్న అనే టైటిల్‌ సరిపోతుంది. డైరెక్టర్‌ వంశీ కృష్ణ ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఇందులో కూడా అన్ని ట్విస్టులు ఉంటాయి. ఈనెల 11 నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుతాం'' అని అన్నారు.

08:01 - May 9, 2016

బాలకృష్ణ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న వందవ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బిబో శ్రీనివాస్‌ సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. నిర్మాతలు మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ వందవ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను నేటి(సోమవారం) నుంచి మొరాకోలో జరుపనున్నాం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన తెలుగు చక్రవర్తి జీవితాన్ని దర్శకుడు క్రిష్‌ వెండితెరపై ఆవిష్కరించ బోతున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎన్నో హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టాప్‌ టెక్నీషియన్లు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. ప్రారంభం నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కోసం, పాత్ర కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే బాలకృష్ణను ఈ సినిమా కోసం లుక్‌ నుంచి ప్రతి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్రిష్‌. మొరాకోలోని అద్భుతమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించబోతున్నాం. ఒకటవ శతాబ్దానికి చెందిన సీన్స్‌ను, రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో హాలీవుడ్‌ ఫైటర్స్‌తో యాక్షన్‌ సీన్స్‌ను షూట్‌ చేయనున్నాం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు' అని అన్నారు.

మేయర్ 'నగరం గుండె చప్పుడు'..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ 'నగరం గుండె చప్పుడు' పేరిట ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎఫ్ఎమ్ రెయిన్ బో ద్వారా ప్రసారం కానుంది. ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. 

తూర్పుగోదావరిలో లోయలో పడిన ప్రైవేటు బస్సు..

తూర్పుగోదావరి : మారేడుపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ముగ్గురు మృతి చెందగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. భద్రాచలం నుండి రంపచోడవరం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

07:51 - May 9, 2016

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంపై పార్లమెంట్ లో సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. ఇతర విషయాలు చర్చకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ప్రజాప్రతినిధుల దుందుడుకు చర్యలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), నాగేందర్ గౌడ్ (టీఆర్ఎస్) రాకేష్ (బీజేపీ), అద్దంకి దయాకర్ రావు(కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

నేటి నుండి ట్రిబ్యునల్ లో వాదనలు..

ఢిల్లీ : కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు వాదనలు జరగనున్నాయి. ఈ సారి తెలంగాణ తన వాదనలు వినిపించే అవకాశమున్నది. నూతన రాష్ట్రమైన తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, కాబట్టి నదీ జలాలలను మొదటి నుంచి పున:పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 

07:41 - May 9, 2016

బాదం నూనెలో ఎ, ఇ విటమిన్లు ఉంటాయి.బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. సమపాళ్లలో బాదం, కొబ్బరినూనె కలిపి నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి.

  • ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌ప్యాక్‌ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.
  • రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.
  • బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా తయారవుతుంది.
  • అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా చేసి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
  • ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.
  • సమపాళ్లలో బాదంనూనె, తేనె మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.
  • చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలిపి, దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.
  • ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది.
  • పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌ప్యాక్‌ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.
  • రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.
07:38 - May 9, 2016

ఏమిటీ మీరీ మధ్య తరచూ మర్చిపోతున్నారా ? ఏ వస్తువు ఎక్కడ పెట్టిందీ గుర్తుకు రావడం లేదా? అయితే బొప్పాయితో దానికి చెక్‌ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ బొప్పాయి పండు తింటే మతిమరుపు ఉష్‌కాకి. బొప్పాయి పాలల్లో ఔషధ గుణాలున్నాయి. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుది. బొప్పాయి పాలకు పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుంది. కాలేయ పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలకు ఉంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. 

నేడు తిరువనంతపురంలో సోనియా పర్యటన..

కేరళ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. అందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరువనంతపురంలోని త్రిస్సూర్ లో పర్యటించనున్నారు. 

అప్పన్న నిజరూపం దర్శనం..

విశాఖపట్టణం : జిల్లా సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో శ్రీ వరహలక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం నేటి తెల్లవారుజాము నుండి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తజనం ఆలయానికి పోటెత్తారు. 

నేడు ఏపీ ఎంసెట్ ఫలితాలు..

విజయవాడ : నేడు ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వ విద్యాలయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస, ప్రత్తిపాటి పుల్లారావు వీటిని విడుదల చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. 

07:17 - May 9, 2016

మేకలు గొర్రెల కాపర్లకు వేసవి కష్టాలు తప్పడం లేదు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని మేకల గొర్రెల కాపరులంతా వలసపోతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? కరవు కాలంలో మేకలు గొర్రెల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మూగజీవాలను సంరక్షించడంలో ఎదురవుతున్న సవాళ్లేమిటి? కరవు కష్టాల నుంచి గట్టెక్కాలంటే మేకల గొర్రెల సంరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మేకల గొర్రెల పెంపకందారుల సంక్షేమానికి ఉద్దేశించిన జీవోలు, చట్టాలు ఎలా అమలవుతున్నాయి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. ఆయన విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:16 - May 9, 2016

అసలే కరవుతో అల్లాడుతున్న మేకల గొర్రెల పెంపకందార్లకు వేసవి కష్టాలు కూడా తోడయ్యాయి. వాటి సంరక్షణ కోసం సుదూర ప్రాంతాలకు వలసవెళ్లాల్సి వస్తోంది. ఒక వైపు రెండేళ్లుగా అనావృష్టి. మరోవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రల్లోనూ కరవు విశ్వరూపం ప్రదర్శిస్తోంది. నీళ్లు లేక, పనులు దొరక్క గ్రామాలు అల్లాడిపోతున్నాయి. మేత లేక, గ్రాసం దొరక్క పశువులు ఎండిన డొక్కలతో మొహం వేళ్లాడేస్తున్నాయి. గడ్డి కొనలేక రైతులు పశువులను సంతలకు తరలిస్తున్నారు. గ్రాసం నీళ్లు లేక మేకల, గొర్రెల కాపర్లు దూరప్రాంతాలకు వలసపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి మేకలు గొర్రెలు భారీగా వలసపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీరంతా తీరప్రాంతాల వైపు పయనిస్తున్నారు. ఎక్కడ కాస్తంత పచ్చిక. నీళ్లు కనిపిస్తే అక్కడకు మేకల గొర్రెల పెంపకందారులు పరుగులు తీస్తున్నారు. పొలాల్లో మేకలు గొర్రెలను పడుకోబెట్టి, అందుకు ప్రతిఫలంగా భూ యజమానుల నుంచి నగదు స్వీకరించడం సర్వసాధారణమే అయినా, ఇప్పటి వలసలకు కరవే కారణం.

ప్రభుత్వాలకు వినతిపత్రాలు...
ఇలాంటి దారుణ పరిస్థితిన ముందే ఊహించిన మేకల గొర్రెల పెంపకందారుల సంఘాలు గత జనవరిలో ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేశాయి. గ్రాసం కొరత నివారణకు, నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి విన్నవించారు. వీటిలో అత్యంత ప్రధానమైనది మేకలు గొర్రెలు పెంచుతున్న ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం, బోర్లు వేయించడం ప్రధానమైనవి. కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అలాంటి ప్రయత్నాలు జరగలేదు. మన రెండు రాష్ట్రాల్లోని దాదాపు 1800 గ్రామాల్లో ప్రభుత్వ బీడు భూములున్నాయి. వీటిల్లో మేకలు, గొర్రెల గ్రాసాన్ని పెంచే చర్యలు తీసుకోవాలన్న సూచనలను పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది వర్షపాతం తక్కువైన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే ఇవాళ మేకల గొర్రెల కాపర్లకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. వాటిని రక్షించుకోవడానికి మండుటెండల్లో ఎక్కడెక్కడకు వలసపోవాల్సిన దుస్థితి దాపురించేది కాదు. 

06:46 - May 9, 2016

ముంబై : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముంబైను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ జట్టు మూడు వికెట్ల నష్టానికి 177 పరుగుల చేసింది. ధావన్‌ 82, వార్నర్‌ 48, యువరాజ్‌ 39 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 92 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. బ్యాటింగ్,బౌలింగ్‌లో ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో హైదరాబాద్‌ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. మూడు వికెట్లు తీసిన రైజర్స్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

06:45 - May 9, 2016

అప్ఘనిస్తాన్ : ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాబూల్-కాందహార్ ప్రధాన రహదారి పై రెండు బస్సులు, ఓ ఆయిల్ ట్యాంకర్లు ఢీకొన్నాయి. సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ గజనీలోని మోకార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 73 మందికి పైగా మృతిచెందారు. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో రెండు బస్సులకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. క్షతగాత్రులను అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని సమాచారం.

06:40 - May 9, 2016

గుంటూరు : తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ప్రిన్స్‌ మహేశ్‌బాబు చెప్పారు. ఆయనీరోజు బుర్రిపాలెం సందర్శించి.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పైలాన్‌నూ ఆవిష్కరించారు. గ్రామంలో విద్య, వైద్య సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్నట్లు మహేశ్‌ చెప్పారు.  సినీ హీరో మహేష్‌బాబు తాను దత్తత తీసుకున్న సొంతూరు బుర్రిపాలెంలో పర్యటించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీ గల్లా జయదేవ్‌ పర్యటనలోపాల్గొన్నారు. బుర్రిపాలెం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడం అంటే రోడ్లు, రంగులు వేయడం మాత్రమే కాదని మహేశ్‌బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ గ్రామానికి వచ్చే వారం వెళ్లనున్నట్లు మహేశ్‌బాబు తెలిపారు.

పైలాన్ ఆవిష్కరణ..
బుర్రిపాలెం గ్రామాన్ని సందర్శించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్‌బాబు అన్నారు. ఇకపై ఈ గ్రామానికి తరచుగా వస్తానని ఆయన ప్రకటించారు. శ్రీమంతుడు సినిమా షూటింగ్‌ సమయంలోనే బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తన బావ, ఎంపీ గల్లా జయదేవ్‌ తనకు సూచించినట్లు మహేశ్‌ తెలిపారు. అయితే శ్రీమంతుడు చిత్ర కథ కూడా ఊరి దత్తతకు సంబంధించినది కావడంతో ప్రచారం కోసమే ఈ పని చేసినట్లు అనుకుంటారని అప్పుడు వెనక్కి తగ్గినట్లు చెప్పారు. బుర్రిపాలెంలో 2.16 కోట్లతో చేపట్టబోయే పనుల పైలాన్‌ను మహేశ్‌బాబు ఆవిష్కరించారు. అంతకు ముందు నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందజేశారు. డ్వాక్రా మహిళలకు కోటి రూపాయల చెక్కును పంపిణీ చేశారు. దేవరకోట అలయానికి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద బాలికకు పత్రం అందజేశారు. బుర్రిపాలెం గ్రామ సర్పంచ్‌కు హెల్త్‌కార్డు అందజేశారు.
మహేశ్‌బాబును చూసేందుకు బుర్రిపాలెం గ్రామస్థులు ఎగబడ్డారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులతో బుర్రిపాలెం పరిసరాలు పోటెత్తాయి. గ్రామంలో తన తండ్రి నివసించిన ఇంటిని మహేశ్‌బాబు సందర్శించి కొద్దిసేపు అక్కడే గడిపారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.

06:38 - May 9, 2016

విశాఖపట్టణం : ఆర్కే బీచ్‌లో సరదాగా గడపడానికి వచ్చిన ఐదుగురు రాకాసి అలల ధాటికి గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలేనికి చెందిన 19 మంది స్నేహితులు ఆర్‌కే బీచ్‌ వద్దకు వచ్చారు. వారంతా ఈ మధ్యే టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు రాశారు. స్నేహితులంతా స్నానం చేస్తుండగా భారీ అలవచ్చి వారిలో 8 మందిని నీళ్లలోకి లాగేసింది. వెంటనే తేరుకున్న కమ్యూనిటీ గార్డులు అప్రమత్తమై ఐదుగురిని కాపాడారు. ప్రసాద్, శ్రావణ్‌, శేషు ఆచూకీ తెలియలేదు. ఈ ఘటనకు ముందు ఒడిశా, బీహార్‌లకు చెందిన ముగ్గురు ఆర్‌కే బీచ్‌లో ఈతకొట్టేందుకు దిగారు. అలల ధాటికి ఆ ముగ్గురూ గల్లంతవగా స్థానికులు ఒకరిని రక్షించారు. ఒడిశాలోని కోరాపూట్‌కు చెందిన సీతన, బీహార్‌కు చెందిన బాబర్‌ల ఆచూకీ తెలియరాలేదు. వీరు ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఐస్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. గల్లంతైనవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 

06:36 - May 9, 2016

కరీంనగర్ : ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం నాలుగు గంటలకు సోమాజిగూడలో యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన 1923 ఆగస్టు 31న జన్మించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
పాతతరం కమ్యూనిస్టు నాయకుల్లో చెన్నమనేని రాజేశ్వరరావు ఒకరు. ప్రజల తరపున పోరాడిన మహానేత. జీవితం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజలకే అంకితం చేశారు. చెన్నమనేని అభ్యుదయ భావాలతో పెరిగారు. స్కాలర్స్ డిబెట్ అనే విద్యార్థి సంఘం కార్యదర్శిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. రైతు సంఘం నాయకుడిగా అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో చెన్నమనేని పాల్గొన్నారు. 
ఆగస్టు 15, 1947 హైదరాబాద్ లో జాతీయ జెండా ఎగురవేశారు. హైదరాబాద్ రాజ్య విమోచన అనంతరం కమ్యూనిస్టు పార్టీలో చేరి కమ్యూనిస్టు మరి పీడీఎఫ్ తరపున 5 సార్లు శాసనసభకు ఎంపికయ్యారు. అనంతరం టిడిపి తీర్థం పుచ్చుకున్న ఆయన 2004లో గెలుపొందారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుండి ఆయన తప్పుకున్నారు. ఆయన కుమారుడు చెన్నమనేని రమేష్ కు టికెట్ ఇచ్చి గెలిపించారు. జిల్లాలో వేములవాడ మండలం మారుపాకకు చెందిన చెన్నమనేని మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావుకు స్వయాన సోదరుడు. 

06:32 - May 9, 2016

విశాఖపట్టణం : జిల్లా సింహాచలంలో చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజామునుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి వరాహ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, మంత్రులు మాణిక్యాలరావు, గంటా శ్రీనివాసరావు, ఎంపి గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. మంత్రులు స్వామివారికి చందనాన్ని సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి మాణిక్యాలరావు అన్నారు.

 

06:30 - May 9, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా అంశం.. సోషల్‌ మీడియాలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. చంద్రబాబు సర్కారు నిధుల దుర్వినియోగాన్ని తూర్పార బడుతోన్న ఓ పోస్టు ఆంధ్రా బిజెపి పేరిట హల్‌చల్‌ చేస్తోంది. అదే తరుణంలో.. ప్రత్యేక హోదా రాకుంటే నష్టం ఏంటంటూ మరో పోస్టు పెట్టింది. గడచిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందంటూ.. ఏపీ బీజేపీ పేరిట ఓ పోస్టు ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 50 కోట్లు, నీరు-మీరు కోసం 150 కోట్లు ఖర్చు చేశారని, చంద్రన్న కానుకల పేరిట సంక్రాంతికి 350 కోట్లు, రంజాన్‌కి 50 కోట్లను తెలుగు తమ్ముళ్లు ఊదేశారంటూ పోస్టులో మండిపడ్డారు. హైదరాబాద్‌, విజయవాడల్లోని సీఎం ఇళ్ల రిపేరీలు, సెక్రెటరియేట్‌ రిపేరీకి సుమారు 125 కోట్లు వృథా చేశారంటూ పోస్ట్‌లో తూర్పారబట్టారు.

నాలుగు వేల కోట్లు..
ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టి సీమ కోసం 1350 కోట్లు, పుష్కరాల పేరిట 250 కోట్లు, విదేశీయానాలకు 75 కోట్లు బూడిదలో పోశారని, అమరావతి భూమి పూజకు 50 కోట్లు, శంకుస్థాపనకు 400 కోట్లు వృథా చేశారనీ ఏపీ బీజేపీ పోస్టులో ఆక్షేపించారు. కేసీఆర్‌ని తిట్టేందుకే ఏర్పాటు చేసిన సంకల్ప సభకు 50 కోట్లు తగులబెట్టారని, మొత్తంగా రెండేళ్లలో ఖర్చు చేసిన ఈ నాలుగు వేల కోట్లను సద్వినియోగం చేసుంటే పోలవరం ప్రాజెక్టు సగమైనా పూర్తయి ఉండేదని పోస్టులో పేర్కొన్నారు.

మరోపోస్టు..
ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ తేల్చి చెప్పిన బీజేపీ పేరిట.. సోషల్‌ మీడియాలో ఘాటైన పోస్టు హల్‌చల్‌ చేస్తుంటే.. దానికి పూర్తి విరుద్ధంగా మరో పోస్టూ ప్రచారంలోకి వచ్చింది. బీజేపీని టార్గెట్‌ చేస్తూనే.. తెలుగువాడి సత్తా చాటే తరుణమిదేనంటూ ఆలోచన రేకెత్తించాలన్నదే దీని ప్రయత్నమన్నది స్పష్టమవుతోంది. ఓ పదేళ్ల తర్వాత ఏపీ.. ఏ గుజరాత్‌నో తలదన్నే స్థాయికి వచ్చాక.. అప్పట్లో మోడీ కూడా హోదా ఇచ్చి సాయం చేశాడనే మాట.. ఓ దిష్టి చుక్కలా ఉంటుందని ఈ పోస్టులో, ఆ చుక్క లేకున్నా అందం ఏం తరిగిపోదంటూ ఎద్దేవా చేశారు. చేతిలోని అవకాశాలని స్వయంగా మార్కెట్‌ చేసుకుని ఎదగాలని, మోదీ సాయం చేయలేదంటూ కుమిలిపోవాల్సిన అవసరం లేదని సర్కారు అనుకూల పోస్టులో పేర్కాన్నారు. కేంద్రం ఏమిచ్చిందని అమరావతి కోసం అద్భుతంగా గ్రౌండ్‌ సిద్ధం చేశాం..? మోదీ ఏ సాయం చేశారని 26 దేశాలు ఏపీలో యాక్టివిటీ మొదలు పెట్టాయి..? మోదీ సర్కారు ఏమంత కుమ్మరిస్తే రాష్ట్ర లోటు 8వేల కోట్లకి తగ్గింది అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ దన్ను లేకున్నా ఇండియా, చైనాల్లోని ఫాస్టెస్ట్‌ డెవలపింగ్‌ జోన్స్‌లో ఏపీ ఐదో ప్లేస్‌లో నిలబడిందని వివరించారు.

హాట్ టాపిక్ గా హోదా..
ఇతర దేశాలు ఏపీ గురించి ప్రస్తావిస్తుండడం.. మోదీ ప్రభుత్వాన్ని గుండెలు బాదుకునేలా చేస్తుందన్న వ్యాఖ్యా ఈ పోస్టులో కనిపిస్తోంది. సమ్మెట దెబ్బలు పడే కొద్దీ ఏపీ రాటుదేలుతుందే తప్ప కుంగిపోదని, హోదా రాకపోయినా ఏపీ సూపర్‌ పవర్‌గా ఆవిర్భవిస్తుందని.. చంద్రబాబు సర్కారుకు అనుకూలంగా ఉన్న ఈ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టులను సోషల్‌ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారన్న దానిపై స్పష్టత లేకున్నా.. అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య వాగ్వివాదాలతో హోదా అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. 

చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూత..

కరీంనగర్ : సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమేనేని రాజేశ్వరరావు (93) కన్నుమూశారు. సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా వేములవాడలోని మరుపాక ఆయన స్వస్థలం.

06:22 - May 9, 2016

ఖమ్మం : తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ సెగ రాజుకుంటోంది. పాలేరు ఉపఎన్నిక సాక్షిగా నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. రోజురోజుకు నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. . ఎలాగైనా పాలేరులో పాగా వేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శల బాణాలతో దూసుకుపోతున్నారు. మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌, టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ప్రజాప్రతినిధులు మృతి చెందిన స్థానాల్లో ఆయా పార్టీలు పోటీ చేయలేదా అని కేటిఆర్‌ ప్రశ్నించారు. పాలేరులో తాము ఓడిపోతే నైతక బాధ్యత వహించి రాజీనామా చేస్తానని మంత్రి కేటిఆర్‌ ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ఓడిపోతే ఎవరు రాజీనామా చేస్తారని సవాల్‌ విసిరారు.

స్పందించిన ఉత్తమ్..
పాలేరులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాజీనామా చేయాలన్న కేటీఆర్‌ సవాల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ స్పందించారు. పిల్లకాకి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపడేశారు. శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్సీగా ఎందుకు నామినేట్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి తుమ్మల రాజీనామా చేసి పాలేరు ఉప ఎన్నికలో పోటీచేయాలని కాంగ్రెస్‌ నేత మల్లు రవి విమర్శించారు. గతంలో జీవన్‌ రెడ్డి సైతం కేసీఆర్‌ పై పోటీ చేసినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేశారని మల్లురవి గుర్తు చేశారు.

అధికార దుర్వినియోగం - సీపీఎం..
కరవులో అల్లాడుతున్న ప్రజలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదని, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల్లో పోటీకి దిగడం ఏంటని పాలేరు సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ మండిపడ్డారు. పాలన వదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు పాలేరులో తిరుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. మొత్తానికి సమ్మర్‌లో పాలేరు ఫైట్‌ రాజకీయ వర్గాల్లో మంటలు పుట్టిస్తోంది. అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుతున్నాయి. ఈ మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

టిడిపిలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు ?

విజయవాడ : వైసీపీకి మరో దెబ్బతగలబోతోంది. ఆ పార్టీకి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. 

నేడు అంతరిక్షంలో అద్భుతం..

ఢిల్లీ : అంతరిక్షంలో సోమవారం ఓ అద్భుతం జరగనుంది. సూర్యబింబంపై ఒక వైపు నుండి మరొక వైపుకు బుద్ధగ్రహం ప్రయాణించే అరుదైన దృశ్యం విశ్వంలో ఆవిష్కృతి కానుంది. 

నేడు థాయిలాండ్ పర్యటనకు ఏపీ సీఎం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబంతో కలిసి ఆయన ఈ వ్యక్తిగత పర్యటన చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన మొదట థాయ్ లాండ వెళ్లి ఆ తరువాత అక్కడి నుండి స్విట్జర్లాండ్ చేరుకుంటున్నారు. అనంతరం తిరిగి ఈనెల 15వ తేదీన విజయవాడకు చేరుకోనున్నారు. 

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించనున్నారు.

నేడు పత్తిపాక రిజర్యాయర్ పై లైడార్ సర్వే..

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజవకర్గంలో కొత్తగా ప్రతిపాదిస్తున్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంక ఓసం లైడార్ సర్వే చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సోమవారం లైడార్ సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 

నేటి నుండి విద్యుత్ సౌధాలో దీక్షలు..

హైదరాబాద్ : ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరహార దీక్ష చేపట్టనున్నారు. 

ముంబై జట్టుకు షాక్ ఇచ్చిన సన్ రైజర్..

విశాఖపట్టణం : ఐపీఎల్ 9 సీజన్ లో డిఫెడింగ్ చాంపియన్ ముంబై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 85 పరుగుల తేడాతో ముంబై జట్టుపై ఘన విజయం సాధించింది.
స్కోరు బోర్డు - సన్ రైజర్స్ హైదరాబాద్ : 177/3. ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో 92 ఆలౌట్.

Don't Miss