Activities calendar

11 May 2016

ముంబయి విజయలక్ష్యం 152 పరుగులు

విశాఖ : ఐపీఎల్‌9 లో భాగంగా విశాఖపట్టణం వేదికగా బెంగుళూరు, ముంబాయిల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగుళూరు నిర్ణీత 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ముంబయి విజయలక్ష్యం 152 పరుగులుగా ఉంది. 

ఢిల్లీ వాసులకు శుభవార్త....

హైదరాబాద్‌ : ఢిల్లీ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు వ్యాట్ ను 12.5 శాతం విధిస్తుండగా, ఇకపై 5 శాతం విధించాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీలో భారీగా ధరలు తగ్గనున్నాయి. దుస్తులు, బూట్లు, ఈ రిక్షాలు, హైబ్రిడ్ కార్లు, బ్యాటరీతో నడిచే వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లోలా అదనపు ట్యాక్సులు ఉండకపోవడంతో కొన్ని వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి.

21:46 - May 11, 2016

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్‌లో మూడో రోజు కూడా విచారణ జరుగుతోంది. నీటి కేటాయింపులపై తెలంగాణ తన వాదనలు వినిపించింది. ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు జరపాలని విభజన చట్టంలో ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. కర్ణాటక ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచినప్పుడు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పోరాడకపోవడం వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని వాదించింది. కృష్ణా నది తెలంగాణలో 12 శాతం భూభాగంలో ప్రవహిస్తున్నా  రాష్ట్రానికి 6 శాతం నీరు కూడా రావడం లేదని వివరించింది. 

 

21:43 - May 11, 2016

ఢిల్లీ : కాల్‌డ్రాప్‌ పరిహారంపై సుప్రీంకోర్టులో ట్రాయ్‌కు చుక్కెదురైంది. కాల్‌డ్రాప్‌కు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాల్‌డ్రాప్‌కు పరిహారం చెల్లించాలన్న ట్రాయ్‌ ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాల్‌డ్రాప్‌ అయిన ప్రతిసారి సంబంధిత టెలికాం ఆపరేటర్లు- వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ట్రాయ్‌ గతేడాది అక్టోబర్‌ 16న ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు మూడు కాల్‌డ్రాప్‌లకు ఒక రూపాయి చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.  ట్రాయ్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. టెలికాం ఆపరేటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. 

 

21:41 - May 11, 2016

ఢిల్లీ : లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈనెల 13వ తేదీ వరకు జరగాల్సిన సభ రెండు రోజుల ముందుగానే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వాయిదా వేశారు. రేపు రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రైవేటు బిల్లు ఈ నెల 13న రాజ్యసభకు రానుండగా.. ముందుగానే ఎన్డీయే సర్కార్‌ సభను వాయిదా వేస్తోంది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణకు మద్దతు కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. సీఎం చంద్రబాబుకు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఇప్పటికే లేఖలు రాశారు. విపక్షాల మద్దతు సైతం కూడగడుతున్నారు. మరోవైపు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణకు టీడీపీ సైతం పట్టుబడుతుండటంతో ఎన్డీయే సర్కార్‌ వ్యూహాత్మకంగా సభను ముందుగానే వాయిదా వేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి సమావేశాల్లోనూ ఏపీకి ప్రత్యేక హోదా రాదని.. కేంద్రం మొండి చేయి చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

ఉత్తరప్రదేశ్‌లో వింత సంఘటన

డెహ్రాడూన్ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 పాములు ప్రవేశించాయి. పాములు బుసలు కొట్టడంతో భయంతో  పరుగు పరుగున ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి పక్కింట్లో తలదాచుకున్నామని జితేందర్ మిశ్రా తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడి వచ్చి పాములను జాగ్రత్తగా పట్టించారు. ఇంటి బేస్‌మెంట్‌ నుంచి కింద భాగంలో ఉన్న రంధ్రం ద్వారా పాములు లోపలికి వెళ్లినట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కె రాయ్‌ తెలిపారు. ఇంట్లో నుంచి మొత్తం 184 పాములు పట్టుకున్నట్లు చెప్పారు.

ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...

హైదరాబాద్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కరువును ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రధానికి వివరించారు. పథకాల సమగ్ర అమలు ద్వారా భవిష్యత్తులో రైతులకు, సామాన్యులకు కలిగే ప్రయోజనాలను వివరించి వీటికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాల్సిందిగా సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

కర్నూలులో అగ్నిప్రమాదం

కర్నూలు : జిల్లా పరిషత్‌లోని ఫర్నిచర్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో గోడౌన్‌లో వున్న ఫర్నిచర్‌, ఫైళ్లు తగలబడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.

తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇళంగోవన్ పై గవర్నర్ రోశయ్య పరువు నష్టం దావా

చెన్నై : తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పై గవర్నర్ రోశయ్య మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ తెలియజేశారు. వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి సీఎం జయలలిత ఇచ్చిన ముడుపులను రోశయ్య తీసుకున్నారని గత నెలలో ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇళంగోవన్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని, ముఖ్యమంత్రికి, గవర్నర్ కు అపకీర్తి తెచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై పరువు నష్టం దావా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

ప్రముఖ సినీ డైరెక్టర్ విక్రమ్ గాంధీ మృతి..

హైదరాబాద్ : ప్రముఖ సినీ డైరెక్టర్ విక్రమ్ గాంధీ ఇవాళ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న 45 ఏళ్ల విక్రమ్ గన్నవరం (కృష్ణా జిల్లా)లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విక్రమ్ గాంధీ వేణుమాధవ్ హీరోగా నటించిన ప్రేమాభిషేకం మూవీని డైరెక్ట్ చేశారు. వందకు పైగా సినిమాలకు ఆయన కో-డైరెక్టర్‌గా పనిచేశారు. విక్రమ్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

పాలేరులో రూ.5 లక్షల నగదు సీజ్

ఖమ్మం : జిల్లాలోని పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు బుధవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాలలో సుమారు రూ.5 లక్షల నగదును సీజ్ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు కోదాడ-ఖమ్మం మార్గంలో వెంకటగిరి వద్ద వాహనాలను తనిఖీ చేయగా రూ.2.5 లక్షల నగదు పట్టుబడింది. అలాగే, వరంగల్-ఖమ్మం మార్గంలో కాకిరాజుగూడెం వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.5 లక్షల నగదు వెలుగు చూసింది. ఈ రెండు ఘటనల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

21:05 - May 11, 2016

సిరిసిల్ల నియోజకవర్గంల బాత్ రూం బాధలు... మంత్రి మాటలకు ఘోరిగట్టిన అధికారులు, పాలమూరి మీద వానదేవుడి గావురం... వద్దంటే వచ్చిపడుతున్న గాలిదుమారం, వరకట్న వేధింపులజిక్కిన కళ్యాణలక్ష్మీ... పథకం పరువుదీస్తున్న ఆఫీసర్లు -దొంగలు, మనోజ్ గా మారిపోయిన మానసనే పిల్ల.. పదకొండేండ్ల తర్వాత గుర్తువట్టిన అవ్వఅయ్యా, 70 ఏండ్లకు బిడ్డనుగన్న ముసలామె...అమ్మైనంకనే మురుస్తున్నదామే, సర్కార్ దావఖాన్ల శాంతబాయి డ్యాన్సులు, మహారాష్ట్రల ఆడిపాడిన నర్సులు, పిల్లలు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:37 - May 11, 2016

నెల్లూరు : కృష్టపట్నం పోర్టు ఆయిల్ ప్యాక్టరీల వద్ద మెయిన్‌ పైపు లైను నుంచి పామాయిల్‌ను చోరీ చేసే ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. అక్రమార్కుల భరతం పట్టారు. మాఫియా ముఠాలో బొందు నారాయణ, అతని అనుచరులైన సిద్దు శంకర్, శ్రీధర్ రెడ్డి, చింతకాయల శ్రీను, నల్లబాబు, రమణ, రాందాసు, చక్రధర్ అలియాస్ శెట్టి సహా 13 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 ఆయిల్ ట్యాంకర్ లారీలు, రెండు కార్లు, ఒక మహేంద్ర ట్రక్కు ఆయిల్ చోరీ చేసేందుకు వాడే మోటారును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మాఫియా ముఠాను జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మాఫియాలో ప్రధాన సూత్రదారులుగా ఉన్న చింతకాయల శ్రీను, బొందు నారాయణల మధ్య మనస్పర్ధలు, పరస్పరం దాడులు జరిగాయని ఇందులో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంతో మొత్తం మాఫియా డొంక కదిలిందని ఎస్సీ తెలిపారు.

 

20:34 - May 11, 2016

ఢిల్లీ : దేశంలోని ప్రధాన నదుల్లోని నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌ సభలో పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి నదీ జలాల్లో అత్యధిక భాగం సముద్రంలోకి వృధాగా పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నదుల్లోని నీటిని సద్వినియోగ పరుచుకునే వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటేనే కరవు పరిస్థితుల నుంచి బయటపడొచ్చని కవిత పేర్కొన్నారు.    

20:29 - May 11, 2016

చిత్తూరు : ఆరు బ్యాంకుల్లో ఖాతాలు...ఏ ఖాతాలో చూసినా కోట్ల రూపాయలే...60 రోజుల్లోనే పది కోట్లకు పైగా టర్నోవర్...ఇది ఓ బిజినెస్‌మెన్‌కు సాధ్యం..కాని ఎయిర్‌హోస్టెస్‌ చేసింది...ఆమె ఎవరో కాదు..సంగీత చటర్జీ...ఇంత డబ్బు ఎలా చేసిందనుకుంటున్నారా...ఆమె చేసేది ఉద్యోగమే అయినా ప్రవృత్తి మాత్రం స్మగ్లింగ్... ఈ చందన సుందరిని చిత్తూరుకు తరలించేందుకు కోల్‌కతాలో మన పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు..
స్మగ్లర్లతో నిత్యం సంబంధాలు..
ఎయిర్‌హోస్టెస్‌ సంగీత చటర్జీ... విమానాల్లో విధులు నిర్వహించాల్సిన చటర్జీ తప్పటడుగులు వేసింది..డబ్బు సంపాదించడం కోసం అడ్డదారుల్లో నడిచింది... అంతర్జాతీయస్థాయి స్మగ్లర్లతో లింకులు పెట్టుకున్న సంగీత కోట్ల రూపాయలు సంపాదించింది...అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌ భార్య.. ఎయిర్‌హోస్టెస్‌ అయిన సంగీత చటర్జీని చిత్తూరు జిల్లా పోలీసులు కోల్‌కతాలో అరెస్ట్‌ చేశారు...లక్ష్మణ్‌ అరెస్ట్‌ తర్వాత స్మగ్లింగ్‌ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు.. మయన్మార్‌ నుంచి వస్తున్న హవాలా నగదును స్మగ్లర్లకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు...
రెండు మూడు నెలల్లోనే పదికోట్ల టర్నోవర్...
ఆన్‌లైన్‌ ద్వారానే సంగీత దాదాపు 10 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం. పక్కా ఆధారాలు సేకరించి వారెంట్‌తో కోల్‌కతా వెళ్లిన చిత్తూరు పోలీసులు.. సంగీతను అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సెట్‌ వారెంట్‌తో చిత్తూరు తీసుకురావాలని.. పోలీసులు భావించారు. కానీ.. ఆమె బెయిల్‌ కోసం 25 మంది లాయర్లు ప్రయత్నించారు. కోర్టు కూడా వెంటనే ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమెను తిరిగి అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆరు బ్యాంకు ఖాతాలు సీజ్..
ఎన్నో కేసులున్న సంగీతకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసిన పోలీసులు...ఆమె ఖాతాలను నిలువచేశారు... చిత్తూరు కోర్టుకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు...

 

 

20:24 - May 11, 2016

గుంటూరు : కార్మికులను కలవడానికి వెళితే లాఠీలతో కొడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి వెళితే వీపులు పగలగొడుతున్నారు. న్యాయం కోసం నిలదీస్తే నిర్బంధమే సమాధానం. సెక్షన్లు మీద సెక్షన్లు విధించి ప్రజాస్వామ్యాన్నే పరిహాసం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలో పోలీసులు దౌర్జన్య కాండ కొనసాగుతూనే ఉంది. ప్రశ్నించడాన్ని సహించలేని సర్కారు వారి నైజం బయట పడుతూనే ఉంది. అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలో నిర్బంధమే రాజ్యమేలుతోంది. అక్కడ అంతా పోలీసుల పహారాలోనే నడుస్తోంది. ఎవరూ వెళ్లడానికి పర్మిషన్‌ లేదు. ఏం జరుగుతోందని ప్రశ్నించే చాన్స్‌ అసలే లేదు. వెలగపూడి ప్రాంతంలో ఇప్పుడు 144 సెక్షన్‌ కొనసాగుతోంది.
నిర్మాణ పనుల్లో అపశృతి
నిర్మాణ పనుల్లో మంగళవారం నాడు అపశృతి చోటుచేసుకుంది. కాంక్రీట్‌ మిక్సర్‌లో పడి దేవేందర్‌ కుమార్‌ అనే కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనపై తోటి కార్మికులు భగ్గుమన్నారు. భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. నిర్మాణ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. కార్మికుల ఆందోళనలకు సీపీఎం మద్దతు తెలిపింది. కార్మికులతో పాటు నిరసన చేపట్టింది. ఆందోళన చేస్తున్న సీపీఎం నేతల, కార్యకర్తలపై పోలీసులు విచ్చలవిడిగా లాఠీఛార్జ్ చేశారు. తీవ్ర గాయాలైనా పట్టించుకోకుండా ఈడ్చుకెళ్లారు. నేతలను అరెస్ట్ చేసి అమరావతి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఎం నేతలు పీఎస్‌లోనే ఆందోళనలు కొనసాగించారు.
సీపీఎం నేతలు నిరసన
బుధవారం కూడా సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ప్రజా సంఘాలతో కలిసి.. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో ... రాజధాని వరకూ వామ పక్ష నేతలు భారీ యాత్ర చేపట్టాయి. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని నినదించారు. ఐతే పోలీసులు వారిని మందడం దగ్గరే అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున వెళ్లడానికి వీలులేదని సీపీఎం నేతలను అక్కడే ఆపేశారు. అంతేకాకుండా వామపక్ష నేతలపై విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేశారు. అనంతరం.. అఖిల పక్ష నేతలనూ అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చివరికి ఎమ్మెల్సీల బృందాన్ని కూడా వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
ప్రభుత్వం, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
ప్రభుత్వం, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి మీడియాను కూడా లోపలికి అనుమతించకపోవడాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి.

 

20:16 - May 11, 2016

గుంటూరు : రాజధాని ప్రాంతంలో మృతి చెందిన కార్మికుడికి మద్దతుగా నిలిచినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని నిరసిస్తూ సీఆర్డీఏ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా కార్యక్రమం చేపట్టింది. కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని, ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నారు. రాజధాని ప్రాంతంలో కార్మిక చట్టాలు అమలుచేయాలని, వారి హక్కుల కోసం పోరాడతామని సీపీఎం నేతలు రఘు, కాశీనాధ్ తెలిపారు.

 

 

20:13 - May 11, 2016

గుంటూరు : ఎపి సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు పలువురు నేతలు విడుదల అయ్యారు. ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో పని చేస్తున్న కార్మికుడి మృతి చెందాడు. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని, కంపెనీ, ఎపి ప్రభుత్వం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన చేపట్టింది. ఈనేపథ్యంలో పి.మధు, గఫూర్, బాబురావుతోపాటు పలువురిని అరెస్టు చేశారు. పి.మధుతోపాటు పలువురు నేతలను బెయిల్ పై విడుదల చేశారు. విడుదలైన అనంతరం మధు, గఫూర్, బాబురావు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరానలు వారి మాటల్లోనే చూద్దాం...
మధు..
ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న ప్రజా పోరాటాలు, ఆందోళను, నిరసనలకు ఎపి సర్కార్ దే పూర్తి బాధ్యత. రాజధాని నిర్మాణం ప్రాంతంలో కార్మికులు వెట్టి బానిసలుగా పని చేస్తున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కార్మిక చట్టాలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడు. కార్మికులకు రూ. 4700 తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పోటీ కార్మికులు అయితే ఆందోళన చేయరని వారితో పని చేయిస్తున్నారు. మొదట చనిపోయిన కార్మికుడికి ఇప్పటికీ నష్టపరిహరం చెల్లించలేదు. టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు స్వయంగా కార్మిక శాఖను మేనేజ్ మెంట్ శాఖగా మార్చారు. ఎపి సర్కార్ అరాచక ప్రభుత్వంగా మారింది. అనంతపురం జిల్లాలోని రావుతారు, విశాఖ బ్రాండిక్స్ అందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
గఫూర్...
కార్మిక చట్టాలను, హక్కులను సీఎం చంద్రబాబు విస్మరిస్తున్నారు. బయటి రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి.. పని చేయిస్తున్నారు.
బాబురావు...
కార్మికులు, వామపక్షాలు, సీపీఎం పోరాటాలతో ప్రభుత్వం బెంబేలెత్తి పోతుంది. నిజాలను నిగ్గుతేల్చుతున్నారని భయపడుతుంది. ప్రజా రాజధానిలో ప్రజలకు అవకాశం లేదు. సమస్యలను పరిష్కరించాలని అడిగితే పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనలకు ప్రభుత్వం భయపడుతుంది. ప్రమాదాలకు కారణమైన యజమాన్యాలను వదిలేసి.. న్యాయం అడుగుతున్న బాధితులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నారు. మృతికి కారణమైన ఎల్ ఆండ్ టీ కంపెనీపై కేసు లేదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కార్మికచట్టాలను అమలు చేయడం లేదు. కాంట్రాక్టు చేసే బడా కంపెనీలు, అసైన్డ్ భూముల కొన్నవారికి ఉపయోగం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రాజధాని పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న అడ్డగోలు విధానాలను తిప్పికొడుతాము. కార్మికులకు న్యాయం జరగాలి. మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలి. ఓవర్ టైమ్ పని చేసినవారికి జీతాలు ఇవ్వాలి. రాజధానిని అడ్డుకోవడం మా ఉద్దేశంకాదు. మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేశారు. రాజధాని నిర్మాణ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడం ఆపేక్షనీయమని' అన్నారు. 

 

 

ఎస్పీఎఫ్ ఎస్సై ఆదినారాయణ అరెస్టు

హైదరాబాద్ : ఎస్పీఎఫ్ ఎస్సై ఆదినారాయణను పోలీసులు అరెస్టు చేశారు. తనకు మాట ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ముషీరాబాద్ పీఎస్ లో న్యాయవాది శైలజ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదినారాయణను పోలీసులు అరెస్టు చేశారు.

 

సూర్యపేటలో శ్రీచైతన్య టెక్నోస్కూలు టెన్త్ విద్యార్థుల ఫలితాలు నిలిపివేత

నల్గొండ : సూర్యపేటలో శ్రీచైతన్య టెక్నోస్కూలుకు చెందిన 56 మంది విద్యార్థుల ఫలితాలను ఎస్ ఎస్ సీ బోర్డు నిలిపివేసింది. పాఠశాలకు అనుమతి లేకపోవడంతో ఆ స్కూల్ కు చెందిన టెన్త్ విద్యార్థుల ఫలితాలను నిలిపివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.

 

ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో పోలీసుల మోహరింపు

విజయవాడ : ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. రాజధాని ప్రాంతానికి వెళ్లే ప్రజలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ కార్మికుడు మృతి అనంతరం యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్మాణ పనులకు ఎల్ ఆండ్ టీ కంపెనీ కార్మికులు హాజరు కాలేదు. పోలీసు నిర్బంధంలో పనులు చేయించాలని సంస్థ ఒత్తిడి తెస్తోంది. నిర్మాణ సంస్థ కార్మికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పనుల నుంచి వెళ్లిపోవడానికి కార్మికులు సిద్ధమవుతున్నారు.

 

18:47 - May 11, 2016

విజయవాడ : ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. రాజధాని ప్రాంతానికి వెళ్లే ప్రజలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ కార్మికుడు మృతి అనంతరం యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్మాణ పనులకు ఎల్ ఆండ్ టీ కంపెనీ కార్మికులు హాజరు కాలేదు. పోలీసు నిర్బంధంలో పనులు చేయించాలని సంస్థ ఒత్తిడి తెస్తోంది. నిర్మాణ సంస్థ కార్మికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పనుల నుంచి వెళ్లిపోవడానికి కార్మికులు సిద్ధమవుతున్నారు.

 

17:48 - May 11, 2016

స్నేక్ గ్యాంగ్ కేసులో నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించడం హర్షనీయమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్..పొన్నం దేవరాజ్, అడ్వకేట్ సఫియాబేగం పాల్గొని, మాట్లాడారు. కోర్టులో సాక్షులు చెప్పిన సాక్షాన్ని బట్టి కోర్టు తీర్పు చెప్పిందన్నారు. బాధితురాలు తనపై రేప్ జరిగిందని కోర్టుకు చెప్పలేదన్నారు. దీంతో గ్యాంగ్ రేప్ ను అక్యూజ్ చేసి.. మిగిలిన శిక్షలు వేసిందన్నారు. అన్ మ్యారీడ్ గర్ల్ కాబట్టి రేప్ జరిగిందని చెప్పలేకపోయిందని .. ఏ అమ్మాయి అయినా తనపై రేప్ జరిగిందని చెప్పలేదని చెప్పారు. నిందితులు పై కోర్టుకు వెళ్లినా ఈ కేసులో వారికి శిక్ష తగ్గించే అవకాశం లేదన్నారు. ప్రతి పౌరునిలో మార్పు రావాలన్నారు. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు వారంతంట వారు వచ్చి బయటికి చెప్పాలన్నారు. సత్వర న్యాయం జరుగుతుందని భరోసా కల్పించినప్పుడే బాధితులు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తారని చెప్పారు. బాధితురాలికి రక్షణ కల్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఉత్తరాఖండ్ పై సుప్రీం తీర్పును స్వాగతించిన సీపీఎం..

ఢిల్లీ : రాజ్యాంగం, బొమ్మాయి కేసులో తీర్పు ఆధారంగా మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును సీపీఎం పొలిట్ బ్యూరో స్వాగతించింది. 

17:30 - May 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై వైసీపీ పోరాటం చేస్తుండడంతోనే చంద్రబాబులో కదలిక వచ్చిందని ఆ పార్టీ నేత, పీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం 2015లోనే శంకుస్థాపన చేసినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు గత పాలనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, అది మళ్లీ పునరావృతం అవుతోందని బుగ్గన ఆరోపించారు.

 

17:27 - May 11, 2016

హైదరాబాద్ : కందిపప్పు, మినపప్పు ధరల నియంత్రణకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతోంది. ఏపీ సచివాలయంలో మంత్రులు పరిటాల సునీత, పుల్లారావు సమక్షంలో జరిగిన ఉన్నతాధికార్ల సమీక్షలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో మార్క్‌ఫెడ్‌ వద్ద ఉన్న 3వేల టన్నుల కందిపప్పును కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేల మెట్రిక్‌ టన్నుల పప్పును  మార్కెట్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చే 2వేల మెట్రిక్‌ టన్నుల మినపప్పును విడుదల చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఈ పప్పులు బహిరంగ మార్కెట్లోకి వస్తే కంది, మినుము ధరలు తగ్గే అవకాశం ఉందని మంత్రి పరిటాల చెప్పారు. 

17:24 - May 11, 2016

హైదరాబాద్ : కృష్ణపట్నం విద్యుత్‌ను తాము అడిగినా.. ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సముఖత చూపడం లేదని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ ప్లాంట్ల కంటే అధిక ధర చెబుతున్నారని తెలిపారు. ప్రైవేట్‌ ప్లాంట్ల ధరకు ఒక్క పైసా తగ్గించినా విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని చెప్పారు. 

 

17:17 - May 11, 2016

హైదరాబాద్ : స్నేక్‌ గ్యాంగ్‌ దోషులకు సరైన శిక్ష పడిందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అన్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా వ్యవహరించిన ఏ1 నుంచి ఏ7 దోషులకు యావజ్జీవ శిక్ష పడిందని.. 8వ దోషికి 20 నెలల కారాగార శిక్ష పడ్డట్లు చెప్పారు. బాధితులు ధైర్యంగా కోర్టుకు వస్తే న్యాయం జరుగుతుందన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కేసులో 23 మంది సాక్షులకు గానూ 21 మంది సాక్షులను ప్రవేశపెట్టామని తెలిపారు. యావజ్జీవ శిక్ష అంటే 14 ఏళ్ల జైలు శిక్ష అని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత... సభ్య సమాజం తలదించుకునే చర్యలకు నిందితులు పాల్పడ్డారని కోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. బాధితులు ధైర్యంగా కోర్టుకు వస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు.

 

17:02 - May 11, 2016

నల్లగొండ : జిల్లా టీఆర్ ఎస్ లో వర్గపోరు మొదలైంది. హుజూర్ నగర్ లో విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ ఇంచార్జ్ శంకరమ్మ తీరుపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అధ్యక్షుడిని మార్చడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు కలుగ చేసుకుని వారిని వారించారు.

 

దేవీ మృతిలో భరత్ కు పోలీసు కస్టడీ..

హైదరాబాద్ : బీటెక్ విద్యార్థినిని దేవీ మృతి కేసులో భరత్ సింహారెడ్డికి ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీ కోర్టు విధించింది.

కృష్ణా జలాల వివాదం మళ్లీ వాయిదా..

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై విచారణ వాయిదా పడింది. జులై 8,9,14,15 తేదీల్లో విచారణ చేపట్టనుంది. మూడు రోజుల పాటు ట్రిబ్యునల్ వివిధ రాష్ట్రాల వాదనలను విన్నది. రెండు రోజుల పాటు ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలు వినిపించింది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి కేటాయింపులను వివాదంగా చూడొద్దని ట్రిబ్యునల్ ను తెలంగాణ కోరింది. నాలుగు రాష్ట్రాల మధ్య మొదటి నుండి నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ వాదనలు జరిపింది. 

16:54 - May 11, 2016

ఢిల్లీ : ఉత్తరాఖండ్ మాదిరి ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఎపి పరిస్థితులపై రాజ్యసభలో ఆయన మాట్లాడారు. విభజన వల్ల ఎపి నష్టపోయిందన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని తెలిపారు. రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇంకా మంజూరు చేయలేదన్నారు. 

గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలి - డీకే అరుణ..

హైదరాబాద్ : సీసీఎల్ ఏ కమిషనర్ ను కాంగ్రెస్‌ నేత డీకే అరుణ కలిశారు. గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

సహారా చీఫ్ కు పెరోల్ గడువు పెంపు..

ఢిల్లీ : సహారా చీఫ్ సుబ్రతోరాయ్ కు పెరోల్ గడువు కోర్టు పొడిగించింది. జులై 11వ తేదీలోగా సుప్రీంకోర్టులో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.

 

నల్గొండ జిల్లాలో పార్టీ తీరుపై టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన..

నల్గొండ : జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు మొదలైంది. హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంఛార్జీ శంకరమ్మ తీరుపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాధ్యక్షుడిని మార్చడంపై కార్యకర్తలు మండిపడ్డారు. 

రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చ..

ఢిల్లీ : రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతోంది. విభజన బిల్లులో ఏపీకి ఇచ్చిన హామీల అంశాలను రాజ్యసభలో టిడిపి ఎంపీ సీఎం రమేష్ ప్రస్తావించారు. విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని, ఉత్తరాఖండ్ మాదిరి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. విభజన చట్టం హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని, ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఏపీకి ఇచ్చిన అతిముఖ్యమైన హామీల్లో ప్రత్యేక హోదా ఒకటని గుర్తు చేశారు. ప్రస్తుతం సభలో ఉన్న వారి సమక్షంలోనే ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిచ్చారని తెలిపారు. 

హరీష్ తప్పుదోవ పట్టిసున్నారు - డీకే అరుణ..

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత డీకే అరుణ పేర్కొన్నారు. గతంలో ఆర్డీఎస్ వద్ద నిరహార దీక్ష చేసింది తామేనని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఆర్డీఎస్ అంశాన్ని పరిష్కరించకుండా మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. మంత్రులు మాటలు పక్కన పెట్టి చేతల్లో చూపాలని,. ఆర్డీఎస్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 

విజ్ఞప్తికి కర్నాటక సీఎం స్పందించారు - ఉత్తమ్..

హైదరాబాద్ : నిన్న కర్నాటక సీఎంను కలిసి అలంపూర్ రైతులకు సాగునీరు కొరతపై వివరించడం జరిగిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ఆనకట్టపై ప్యాకేజీ - 1 కింద పనులు చేపట్టాలని కోరామని, తమ విజ్ఞప్తికి కర్నాటక సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. నేటి నుండి నారాయణపూర్ డ్యాం నుండి జూరాలకు ఒక టీఎంసీ నీటిని విడుదలకు కర్నాటక సీఎం హామీనిచ్చారని తెలిపారు. 

కేవీపీ ప్రైవేటు బిల్లుకు టిడిపి, బిజెపి మద్దతివ్వాలి - కాంగ్రెస్..

విజయవాడ : ప్రత్యేక హోదాపై ఎంపీ కేవీపీ వేసిన ప్రైవేటు బిల్లుపై టిడిపి, బిజెపి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేత సీ.హెచ్. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బిల్లుకు మద్దతు కోరుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు, రాష్ట్రానికి కేంద్రం ఏమేం ఇచ్చిందో సీఎం చంద్రబాబు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 

డబ్బు పంచకుండా డిపాజిట్ తెచ్చుకోవాలి - తమ్మినేని..

ఖమ్మం : చట్టబద్దంగా... ఓటరుకు ఒక్క రూపాయి పంచకుండా పాలేరు ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలంటూ టీఆర్ఎస్ కు సీపీఎం సవాల్‌ విసిరింది. నిఘా కమిటీలు కూడా ఉండాలని, దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తే మధ్యవర్తులతో ప్రతి మండల, గ్రామస్థాయిలో నిఘా కమిటీలు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. 

15:27 - May 11, 2016

విజయవాడ : ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న అంతరుద్ధ్యం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. చంద్రబాబు మంత్రివర్గంలోని బీజేపీ మంత్రులు సహాయ నిరాకణ పాటిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. మిత్రపక్ష నేతలు, మంత్రుల తీరుపై టీడీపీలో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో కేబినెట్‌లోని బీజేపీ మంత్రులు ఇబ్బందుల్లో పడ్డారా ? అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టకుండా వేరే అవసరాలకు మళ్లిస్తోందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

బీజేపీ నాలుగు స్థానాలు...
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీలో సీట్లు సర్దుబాటు చేసుకున్న బీజేపీ నాలుగు స్థనాలు గెలుచుకున్నది. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి ఎన్నికైన కామినేని శ్రీనివాస్‌, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి విజయం సాధించిన మాణిక్యాలరావుకు మంత్రి పదవులు ఇచ్చారు. కామినేని వైద్యారోగ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తుండగా, మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా తమకు అందుబాటులో ఉండటంలేదని తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాల్సిన బీజేపీ నాయకులు, రాష్ట్ర కేబినెట్‌లోని బీజేపీ మంత్రులు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటపై టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నారు. . టీడీపీని విమర్శించే విషయంలో బీజేపీ మంత్రులు ఒకింత సంయమనం పాటిస్తున్నా.... అన్ని విషయాల్లో సహాయ నిరాకరణ పాటిస్తుండటం తెలుగుదేశం సహచరులకు ఇబ్బందిగా మారింది. దీనిని కూడా టీడీపీ మంత్రులు చాలాసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళితే సర్దిచెప్పినట్టు సమాచారం.

బీజేపీ నేతల ఫిర్యాదులు...
ఇక పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్‌ల్లో కూడా బీజీపీ నేతల తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని వినిపిస్తోంది. బీజేపీ నాయకులు, మంత్రులను సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని చంద్రబాబు సూచిస్తుండటంతో సర్దుకుపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విషయంలో మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌ స్పందిచకపోవడాన్ని కూడా తెలుగు తమ్ముళ్లు తప్పుపడుతున్నారు. కేంద్రం నుంచి ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను రాబట్టేందుకు కూడా బీజేపీ నాయకులు, మంత్రులు కూడా కృషి చేయాల్సి ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ నాయకులు అడగడాన్ని బీజేపీ నేతలు తప్పుపట్టం సరికాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీపై తాము కూడా విరుచుకుపడితే...రాష్ట్రంలో కమలనాథులు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని ఒకింత హెచ్చిరిక ధోరణిలో టీడీపీ నేతలు చెబుతున్నా... పార్టీ అధినేత చంద్రబాబును చూసి సర్ధుకుపోవాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ-బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న పరిస్థితులు... భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. 

15:10 - May 11, 2016

చిత్తూరు : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌ భార్య, ఎయిర్‌హోస్టెస్‌ సంగీత చటర్జీని చిత్తూరు జిల్లా పోలీసులు కోల్‌కతాలో అరెస్ట్ చేశారు. లక్ష్మణ్‌ అరెస్ట్ తర్వాత స్మగ్లింగ్‌ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు మయన్మార్‌ నుంచి వస్తున్న హవాలా నగదును స్మగ్లర్లకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత రెండు, మూడు నెలల కాలంలో ఆన్‌లైన్‌ ద్వారానే సంగీత దాదాపు 10 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం. పక్కా ఆధారాలు సేకరించి వారెంట్‌తో కోల్‌కతా వెళ్లిన చిత్తూరు పోలీసులు.. సంగీతను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సెట్‌ వారెంట్‌తో చిత్తూరు తీసుకురావాలని.. పోలీసులు భావించారు. కానీ.. ఆమె బెయిల్‌ కోసం 25 మంది లాయర్లు ప్రయత్నించారు. కోర్టు కూడా వెంటనే ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమెను తిరిగి అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

15:07 - May 11, 2016

ఖమ్మం : చట్టబద్దంగా... ఓటరుకు ఒక్క రూపాయి పంచకుండా పాలేరు ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలంటూ టీఆర్ఎస్ కు సీపీఎం సవాల్‌ విసిరింది. నిఘా కమిటీలు కూడా ఉండాలని, దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తే మధ్యవర్తులతో ప్రతి మండల, గ్రామస్థాయిలో నిఘా కమిటీలు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ కమిటీల ఏర్పాటు కోసం ఎప్పుడు.. ఎక్కడ చర్చకన్నా సిద్ధమని ప్రకటించారు.

15:04 - May 11, 2016

ఢిల్లీ : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఆర్ధిక మంత్రి ఈటల రాజేంద్ర, టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ సరిహద్దుల్లోని గడ్చిరోలి లోక్‌సభ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాణహిత-చేవెళ్ల, తుమ్మిడిహట్టి, పెన్‌గంగ, మేడిగడ్డ ప్రాజెక్ట్ లకు సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ లతో మహారాష్ట్రలో ఏ ప్రాంతం కూడా ముంపుకు గురికాదని చెప్పారు. సించాయ్‌ యోజన పథకం కింది సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయించాలని కోరారు. గోదావరినది ప్రాజెక్ట్‌లపై తుది ఒప్పందం చేసుకునేందుకు వచ్చే నెలలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌ హైదరాబాద్‌లో భేటీ అయ్యే అవకాశం ఉందని హరీష్‌రావు చెప్పారు. 

బాగ్దాద్ లో పేలిన కారు బాంబు..

బాగ్దాద్: కారు బాంబుపేలి 12 మంది వ్యక్తులు మృతిచెందారు. 35 మందికి గాయాలైయ్యాయి ఈ ఘటన బాగ్దాద్‌కు ఉత్తరంగా ఉన్న సదర్ సిటీలో గల మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

కానిస్టేబుళ్ల ప్రాథమిక పరీక్ష ఫలితాలు..

హైదరాబాద్ : కానిస్టేబుళ్ల ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగింది. 9,281 కానిస్టేబుల్ పోస్టులకు గానూ 4.92 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను WWW.TSLPRB.IN వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

జూన్ 15 నుండి టెన్త్ అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షలు..

హైదరాబాద్ : టెన్త్ అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15 నుంచి 29 వరకు నిర్వహించబడుతాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తమ పాఠశాలల్లో మే 26 లోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాల్లో 85.63 శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం విదితమే.

14:49 - May 11, 2016

ఢిల్లీ : బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌కు 'పన్ను ఎగవేత' కేసులో మరోసారి చిక్కులు తప్పడం లేదు. అమితాబ్‌పై 2001లో నమోదైన పన్ను ఎగవేత కేసును తిరిగి తెరిచేందుకు ఆదాయపుపన్ను శాఖకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. 2001-02 సంవత్సరంలో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' షో ద్వారా వచ్చిన ఆదాయంపై కోటి 66 లక్షల పన్నును బిగ్‌బీ చెల్లించాలని ఐటి పేర్కొంది. దీనిపై 2001లో ఆయనపై కేసు నమోదైంది. తనను కళాకారుడిగా పరిగణించి.. పన్ను మినహాయించాలని అమితాబ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన బాంబే కోర్టు బిగ్‌బీ ఆదాయంలో 30 శాతం వరకు పన్ను మినహాయింపు నిచ్చింది. బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును తిరిగి విచారించేందుకు అనుమతించింది. కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్‌ యాంకర్‌గా చేశారని.. దాన్ని నటించడం అనలేరని ఐటీశాఖ కోర్టుకు తెలిపింది. 

14:46 - May 11, 2016

2005లో సంవత్సరంలో డొమెస్టిక్ వాయిలెన్స్ చట్టాన్ని రూపొందించారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. టెన్ టివి మానవి 'మై రైట్' కార్యక్రమంలో ఈ చట్టం గురించి విశ్లేషించారు. మహిళలపై ఉన్న హింసా స్వరూపాలపై కూలంకషంగా చర్చించిన తరువాత ఈ చట్టం తీసుకరావడం జరిగిందన్నారు. న్యాయవాదులు, పోలీసుల ప్రమేయం లేకుండానే సివిల్ చట్టంగా రూపొందించడం జరిగిందన్నారు. 498 ఐపీసీ, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే ఐపీసీ సెక్షన్లు మాత్రమే ఉన్నాయని లాయర్ పార్వతి పేర్కొన్నారు. అలాగే న్యాయపరమైన సమస్యలు..సందేహాలను నివృత్తి చేశారు. డొమెస్టిక్ వాయిలెన్స్ చట్టం...ఇతర వివరాలు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:36 - May 11, 2016

ఢిల్లీ : పసుపుకు మద్దతు ధర కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిజమాబాద్‌ ఎంపీ కవిత ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, రైతులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌లో భేటీ అయ్యారు. నిజామాబాద్‌లో పసుపు బోర్టు ఏర్పాటుతోపాటు, మద్దతు ధర అంశంపై చర్చించారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటుపై కూడా చర్చలు జరిపారు. వీటిని పరిశీలిస్తామని రాధామోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. 

14:33 - May 11, 2016

ఉత్తరాఖండ్‌ : రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన బలపరీక్ష ఫలితాలు వెలవడ్డాయి. ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ బలపరీక్షలో నెగ్గినట్టు అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహగ్తీ ప్రకటించారు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన తొలగించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ నివాసం దగ్గర సందడి నెలకొంది. రావత్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాంగ్రెస్‌ తిరుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన బీజేపీ ఇది చెంపెట్టువంటిదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గత మార్చిలో తిరుబాటు చేశారు. ఆ తర్వాత ముగ్గురు మనసు మార్చుకున్నారు. దీంతో ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. దీని నుంచి తప్పించుకునేందుకు వీరు చేసిన ప్రయత్నలు ఫలించలేదు. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో పాల్గొని ఓటు వేసే అవకాశం కల్పించాలని అభ్యర్ధిస్తూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా రెబల్స్ కు చుక్కెదురయ్యింది. కాంగ్రెస్‌కు ఉన్న 27 మంది సభ్యుల్లో చివరి నిమిషంలో రేఖా ఆర్య బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇద్దరు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు, యూకేడీకి చెందిన ఒక సభ్యుడు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో హరీష్‌ రావత్‌ 33 ఓట్లతో బలపరీక్షలో నెగ్గారు. 

14:31 - May 11, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఆందోళన కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయ నిర్మాణ పనుల దగ్గరకు వెళ్లేందుకు యత్నించిన సీపీఎంతో పాటు పలు పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్‌ ఉన్నందున అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కార్‌ నాటకమాడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
సీపీఎం నేతలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను కూడా అడ్డుకున్నారు. ప్రజా రాజధాని నిర్మాణం కాదని, కేవలం వాళ్ల కోసం కడుతున్నట్లుగా ఉందని కాంగ్రెస్ నేత విమర్శించారు. అన్ని పార్టీలను కలుపుకుని తాము ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. రాజధాని చుట్టూ 144 సెక్షన్ అమలు చేయడం దారుణమని, ప్రజా హక్కులు, కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. రాజ్యాంగంలో విలువలు ఇక్కడ ఏమీ కనబడడం లేదని, సొంతంగా వ్యవహరిస్తున్నారే తప్ప ఏమీ ఆలోచించడం లేదని కూచిపూడి సాంబశివరావు పేర్కొన్నారు. మూడు నెలల నుండి వేతనాలు ఇవ్వడం లేదని, ఓ కార్మికుడు మృతి చెందింతే ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినవసరం ఉందన్నారు. పోలీసు రాజ్యం కరెక్టు కాదని, పౌరులను..ప్రజలను..పార్టీలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగించడం సబబు కాదన్నారు. 

14:26 - May 11, 2016

రాజమండ్రి : జైలు నుంచి కరుడు గట్టిన ఖైదీ తప్పించుకున్నాడు. పోలీసుల కన్నుగప్పి జీవిత ఖైదీ శ్రీనివాస్‌ పరారైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్‌ను గుంటూరు కోర్టులో హాజరుపరిచి తిరిగి రాజమండ్రి తీసుకువచ్చారు. బస్సు దిగి ఆటో ఎక్కుతున్న సమయంలో ఎస్కార్ట్‌పై దాడి చేసి శ్రీనివాస్‌ తప్పించుకున్నాడు. అయితే.. కరడు గట్టిన ఖైదీని తీసుకువెళ్లేందుకు జీపును ఇవ్వడంతో పాటు.. ఎస్కార్ట్‌ను పెంచాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని శ్రీనివాస్‌తో ఎస్కార్ట్‌గా వెళ్లిన సిబ్బంది వాపోతున్నారు. 

14:17 - May 11, 2016

హైదరాబాద్ : స్నేక్ గ్యాంగ్ దోషులకు రంగారెడ్డి జిల్లా కోర్టు విధించిన శిక్ష పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఏ 1 నుండి ఏ 7 వరకు యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఏ 8దోషికి 20 నెలల జరిమాన, రూ.5వేల జరిమాన విధించింది. వయస్సు రీత్యా ఏ -8 ఆలీ (65) తక్కువ శిక్ష ఖరారు చేసింది. ఇప్పటికే 20 నెలల శిక్ష ఆలీ అనుభవించాడు. ఈ సందర్భంగా కోర్టు వద్ద మహిళా న్యాయవాది టెన్ టివితో మాట్లాడారు. కోర్టు తీర్పు పట్ల ఆనందంగా ఉందని, మహిళా లోకం మొత్తం ఆనందగా ఉండాల్సిన సమయమన్నారు. స్నేక్ గ్యాంగ్..నిర్భయ లాంటి కేసులు వస్తూనే ఉన్యాయని, ఆలోచించే విధానంలో మార్పు రావాల్సి ఉంటుందని తెలిపారు. అన్యాయం జరిగిన వాళ్లు బయటకు చెప్పాలని, తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు చెప్పలేకపోతోందని తెలిపారు. 

సీపీఎం నేతలకు ఎమ్మెల్సీల పరామర్శ..

గుంటూరు: అమరావతి మందడంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేశారు. మంగళగిరి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో సీపీఎం నేతలను ఎమ్మెల్సీల బృందం పరామర్శించింది. 

జీహెచ్ఎంసీ శానిటరీ ఇన్స్ పెక్టర్ నివాసంపై ఏసీబీ దాడి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ శానిటరీ ఇన్స్ పెక్టర్ కృపాదానం ఇంటిపై ఏసీబీ దాడి జరిపింది. రూ. 5 కోట్ల ఆస్తులను గుర్తించారు. 50తులాల బంగారం, 12 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 3 లక్షల నగదు, 8 ప్లాట్లు, 2 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. 

సీపీఎం నేతలను పరామర్శించిన కాంగ్రెస్, టిడిపి నేతలు..

గుంటూరు : అమరావతి పీఎస్ లో సీపీఎం నేతలను కాంగ్రెస్ నేతలు, జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లిఖార్జునరావు పరామర్శించారు. 

స్నేక్ గ్యాంగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు.....

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా నిర్ధారణ అయిన ఎనిమిది మందిలో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వీరంతా సభ్య సమాజంలో ఉండే అర్హతను కోల్పోయారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ-8గా ఉన్న నిందితుడికి 20 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో 8 మందిని నిందితులుగా కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా 8వ నిందితుడి ఇప్పటికే రెండు సంవత్సరాల జైలు శిక్ష అనువించిన సందర్భంగా అతడిని విడుదల చేసింది.

13:33 - May 11, 2016

హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ లోని 8మందికి రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్షను ఖరారు చేసింది. వీరికి ఏ 1-ఏ 7 వరకు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 8వ దోషికి 20 నెలల కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించింది. అయితే వయస్సురీత్యా ఏ-8 దోషి అలీకి 20 నెలల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే అలీ 20 నెలల శిక్ష అనుభవించడంతో.. త్వరలోనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 
సభ్యసమాజం తలదించుకొనే విధంగా నేరాలు చేశారని, ఈ కేసును తీవ్రంగా పరిగణించడం జరిగిందని తెలిపారు. మంగళవారం ఈ కేసు విచారణ జరిగిన సంగతి తెలిసిందే. 8మంది దోషులుగా నిర్ధారించింది. అనంతరం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. కోర్టు తీర్పు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు పట్ల స్నేక్ గ్యాంగ్ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కిరాతకమైన చర్య అని ఓ మహిళా న్యాయవాది పేర్కొన్నారు. చట్టాలకు ఎవరూ చుట్టాలు కారని ఈ తీర్పు వెలువరిస్తోందన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పెట్టుకోవాలని, కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

2014లో...
2014 జూలై 31వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఫైజల్ దయానీ నేతృత్వంలో 8 మంది సభ్యుల గల ముఠా పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో చేసిన అరాచకాలు ఒక్కసారిగా బయటపడడంతో అప్పట్లో పెద్ద కలకలం రేపింది. పహాడీషరీఫ్ ప్రాంతంలో షాహీన్ నగర్‌లోని ఓ ఫాం హౌస్‌లో కుటుంబం ఉండేది. కుటుంబ సభ్యులందరూ వెళ్లిపోగా పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న స్నేక్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి వాచ్‌మన్‌పై దాడి చేసి జంట ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ వికృతమైన చేష్టలతో ఆ యువతిపై విరుచుకుపడి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాకుండా వీడియోలు తీసి తమ పైశాచికత్వాన్ని బయటపెట్టారు. ఈ జంట ఎంత ప్రాధేయపడినా గ్యాంగ్ వినిపించుకోకుండా యువతిపై అఘాత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి నుంచి రూ.60 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తమకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను బయటపెడతామని బెదిరించారు. ఈ విషయంపై బాధితులు ఫిర్యాదు ఇవ్వడంతో సైబరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారి ఫైజల్ దయానీతో పాటు 8 మంది మీద కేసును నమోదు చేశారు. దయానీ గ్యాంగ్ అడ్డాపై పోలీసులు దాడి చేసి నాలుగు గుర్రాలతో పాటు పలు పాములను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు కూడా నమోదైయ్యాయి. ఈ కేసుతో పాటు గ్యాంగ్ చేసిన మరిన్ని ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.

13:29 - May 11, 2016

విజయవాడ : ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే రాజధాని నిర్మాణానికి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చిన కార్మికులను ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన అవసరంముందని వారు సూచించారు. ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో తీవ్ర ఉద్దికత్తల మధ్య సీపీఎం ఎమ్మెల్సీలు ఆ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ..వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా పశువులకంటే హీనంగా వారితో పనిచేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ ద్వారా సర్కారు కార్మికులకు పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులు నివాసం ఉంటున్న షెడ్లు కూడా పశువులు వుంటున్న ప్రదేశంలా వుందనీ వారు పేర్కొన్నారు. రమాదేవి మాట్లాడుతు...ఇంతకుముందే ఒక కార్మికుడు చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన కార్మికుడు వయస్సు 22 సంవత్సరాలున్న ముక్కుపచ్చలారని యువకుడు చనిపోయాడు. ఇలా రాజధాని నిర్మాణంలో ఎంతమందిని బలితీసుకుంటారని ఆమె ప్రశ్నించారు.

13:20 - May 11, 2016

సినీ నటి, బుల్లితెర నటి పూజిత టెన్ టివిలో కన్నీళ్లు పెట్టారు. తన కుమారుడిని ఎవరి దగ్గరో దాచిపెట్టి తాను అండర్ గ్రౌండ్ కు వెళ్లి సాక్ష్యాధారాలు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పూజిత ఆవేదనతో తెలిపారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్నారని, వీరి నుండి తనకు ప్రాణహని ఉందని పూజిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివితో పూజిత మాట్లాడారు. తనను ఎలా మోసం చేశారో ? తాను ఎలాంటి కష్టాలు గురయ్యానో తదితర వివరాలను వెల్లడించారు. భర్త కాకముందు విజయగోపాల్ ఆంధ్రజ్యోతిలో టైపిస్టుగా పనిచేసే వాడని, అక్కడి యాజమాన్యం సినిమా డిపార్ట్ మెంట్ కు వేశారని తెలిపారు. దీనితో అక్కడినుండి స్నేహాలు పెంచుకొనే ప్రయత్నం చేశాడని, అందులో భాగంగా తనతో పరిచయం చేసుకున్నాడని తెలిపారు. తనింట్లో వివాహానికి ఒప్పుకోలేదని, చివరకు ఒప్పించి వివాహం చేసుకున్నానన్నారు. అనంతరం పారిపోయాడని తెలిపింది. అన్ని విషయాలు తెలిసిన ఒక ఐఏఎస్ అధికారిణి ఎలా వివాహం చేసుకుంటారని ప్రశ్నించారు. విజయ గోపాల్ ను మాత్రం శిక్షించే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తనకు ప్రాణహని ఉందని, త్వరలోనే తనను బెదిరిస్తున్న వారి వివరాలు కూడా బయటపెడుతానని పూజిత వివరించారు. ఈ సందర్భంగా ఐద్వా నేత హైమావతి కూడా మాట్లాడారు. పూజిత ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

13:12 - May 11, 2016

తాను వేసిన కేసులో పెద్ద తలకాయలున్నాయని సినీ, బుల్లితెర నటి పూజిత పేర్కొంది. తనకు విడాకులు ఇవ్వకుండానే ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్నారని, వీరి నుండి తనకు ప్రాణహని ఉందని పూజిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పూజ టెన్ టివితో మాట్లాడారు. రాత్రి ఫోన్ లో మాట్లాడుతుండగా ఓ ఫోన్ కాల్ వెయిటింగ్ లో వచ్చిందని తెలిపారు. అనంతరం ఉదయం కూడా ఫోన్ రావడం..మేసేజ్ కూడా వచ్చిందన్నారు. 'ఆంటీ..లేదా..అమ్మ అనుకో..ఆఫీసర్ మెస్ లో నీ భర్తతో ఐఏఎస్ రేఖారాణి అంటే తన కూతురితో వివాహం జరుగుతోంది..ఆపు' అని పెద్దావిడ చెప్పిందని తెలిపిపారు. తన ఇంటిదగ్గరనే ఉండి ఈ ఫోన్ చేశారని, నీవు ఒక్కదానివే ఈ వివాహం ఆపుతావని తనను ఉద్ధేశించి చెప్పారని పూజిత తెలిపారు. కానీ అక్కడకు వెళితే వివాహం జరగడం లేదని పేర్కొన్నారని, ఇందులో చాలా పెద్ద వ్యక్తులున్నారని కొద్ది రోజుల్లో ఆ వివరాలు బయటకు చెబుతానని పూజిత పేర్కొన్నారు. 

13:06 - May 11, 2016

పూజిత.. సినీ, బుల్లితెర నటి. ప్రస్తుతం ఈమె వార్తల్లో నిలిచారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్నారని, వీరి నుండి తనకు ప్రాణహని ఉందని పూజిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం చేయాలని పోరాటం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా పూజిత టెన్ టివితో ముచ్చటించారు. 13 ఏళ్ల క్రితం తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వివాహం జరిగిందని పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం అతను దీనిని సహజీవనం అంటున్నారని పేర్కొన్నారు. అనంతరం పారిపోయాడని, విచారణ చేస్తే విస్సా ఛానెల్ లో పనిచేస్తున్నాడని తెలిసిందన్నారు. తనకు చట్టాలు తెలియదన్నారు. కానీ డైవోర్స్ ఇవ్వకుండానే ఇంకో వివాహం చేసుకున్నాడని తెలిపింది. తాను సంపాదించిన సంపాదనను కరిగివేశాడని పేర్కొంది. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

సీపీఎం నేత మధుతోపాటు 7గురు అరెస్ట్...

గుంటూరు : సీపీఎం నేతలు మధు,  బాబూరావుతోపాటు మరో 7గురు నేతలపై పోలీసులు సెక్షన్ 143,147,188,506,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని మంగళగిరి పీఎస్ కు తరలించారు. 

ఏసీబీ వలలో మరో జీహెచ్ఎంసీ తిమింగలం....

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అవినీతి చేపలు కోకొల్లలుగా బయట పడుతున్నాయి. జీహెచ్ ఎంసీ సర్కిల్ 18 సెక్షన్ ఆఫీసర్ జనార్ధన్ మహేష్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. జీహెచ్ఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ కృపానందం ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణతో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో రూ.5 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 50 తులాల బంగారు ఆభరణాలు, 12 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.3లక్షల నగదు, 8 ప్లాట్లు, ఏసీబీ అధికారులు గుర్తించారు.

10 ఫలితాల్లో వరంగల్ ఫస్ట్, హైదరాబాద్‌ లాస్ట్.....

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది 85.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,55,265 మంది విద్యార్థులు హాజరుకాగా 4,44,828 మంది ఉత్తీర్ణులయ్యారు. 2015లో 77.56 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత 8 శాతం పెరిగింది. బాలురు 84.70 శాతం మంది పాస్‌ కాగా, బాలికలు 86.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 1.87అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2,379 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 10 పాఠశాలలు సున్నా ఫలితాలు సాధించాయి.

12:31 - May 11, 2016

ఉత్తరాఖండ్ : మరోసారి సీఎంగా హరీష్ రావత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం నిర్వహించిన బలపరీక్షలో ఆయన నెగ్గినట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లుగా అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. నిన్న జరిపిన బలపరీక్షలో హరీష్ రావత్ నెగ్గారని సుప్రీంకోర్టుకు తెలిపారు. గత రెండు నెలలుగా రోజులుగా ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం ఈ ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించింది. పలు రాజకీయ పరిణామాల మధ్య ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం బలపరీక్ష జరిగిన తెలిసిందే. ఈ ఫలితాలను సీఎస్ సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు కు అందజేశారు. 

9మంది ఎమ్మెల్యేలు జంప్..
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలకు ఎరవేసి, బీజేపీ తన వైపునకు తిప్పుకున్నది. కాగా పార్టీ ఫిరాయించిన ఈ 9 మందిపై స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ కుంజ్‌వాల్‌ అనర్హత వేటు వేశారు. దీంతో బీజేపీ వ్యూహం విఫలమైంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలుండగా, 9 మందిపై అనర్హత వేటు పడడంతో, 61 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు సొంతంగా 27 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. కాగా కాంగ్రెస్‌కు చెందిన రేఖ ఆర్య అనే ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్‌ చేయడం, బీజేపీకి చెందిన భీంలాల్‌ ఆర్య కాంగ్రెస్‌కు మారడం ఉత్కంఠను కలిగించింది. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. దీంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు హరీష్‌రావత్‌కు లభించింది. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హరీష్‌ను సమర్థించారు.స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ కుంజ్‌వాల్‌ ఓటుతో సహా కాంగ్రెస్‌కు 33 ఓట్ల మద్దతు లభించినట్టు తెలుస్తోంది. బీజేపీ 28 ఓట్లను సంపాదించింది. మార్చి 16న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీకి చెందిన 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి బీజం పడింది. ఈ ఓటింగ్‌ ఆధారంగానే స్పీకర్‌ కుంజ్‌వాల్‌ 9 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందనే సాకుతో కేంద్రం మార్చి 27న రాష్ట్రపతి పాలన విధించింది. పదవీచ్యుతుడైన హరీశ్‌ రావత్‌ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. కాగా రాష్ట్రపతి పాలనను సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే మే 10న హరీశ్‌ రావత్‌కు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

బలపరీక్షలో నెగ్గిన హరీష్ రావత్..

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. నిన్న జరిపిన బలపరీక్షలో హరీష్ రావత్ నెగ్గారని సుప్రీంకోర్టుకు తెలిపారు. 

12:12 - May 11, 2016

విజయవాడ : ఏపీ తాత్కాలిక రాజధానిక వెలగపూడి ప్రాంతంలో వామపక్ష నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. కార్మికులకు మద్దతు తెలపాటానికి వచ్చిన సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, కృష్ణయ్యలను  పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పీఎస్ కు తరలించారు.  చేశారు. ఎల్ అండ్ టీ కార్మికులకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించిన మాపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుండి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. కార్మికుల హక్కులను అణిచివేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని వారు హెచ్చరించారు. వామపక్ష పార్టీల పట్టువున్న ప్రాంతంలో చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలకు పూనుకోవటం సాహసం చేయటమేనని ఆయన సూచించారు. కార్మిక చట్టాలను అమలు పరచాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాలలో బంద్ జరపటానికి సీపీఎం నేతలు పిలుపునిచ్చారు.

స్నేక్ గ్యాంగ్ కు శిక్ష ఖరారు?

హైదరాబాద్ : నగరంలో సంచలనం కలిగించిన స్నేక్ గ్యాంగ్ నిందుతులకు పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ఇప్పటికే  కోర్టు 8 మందిని దోషులుగా నిర్థారించింది. మంగళవారం ఈ కేసుపై విచారించిన కోర్టు బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

11:51 - May 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోలాగానే ఇక్కడ కూడా బాలికలే పై చేయి సాధించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయంలోని డీ బ్లాక్‌లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కడియం మాట్లాడారు. ఉత్తీర్ణత శాతం 85.63 శాతం ఉందన్నారు. 4,44,828 ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఇందులో బాలురు 84.70 శాతం ఉండగా బాలికలు 86.57 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు 15 జూన్ నుండి 29 జూన్ వరకు నిర్వహిస్తామన్నారు. 

2,379 స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.
10 స్కూళ్లలో సున్నా ఫలితాలు..
జిల్లాల వారిగా ఫలితాల శాతం..
వరంగల్ 95.13 శాతం
మహబూబ్ నగర్ 91.19 శాతం.
మెదక్ 90.74 శాతం.
నిజామాబాద్ 90.04 శాతం.
కరీంనగర్ 86.40 శాతం.
ఖమ్మం 84.62 శాతం.
నల్గొండ 83.75 శాతం.
ఆదిలాబాద్ 82.23 శాతం.
రంగారెడ్డి 82.07 శాతం.
హైదరాబాద్ 78.23 శాతం. 

కాల్‌డ్రాప్‌కు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : కాల్‌డ్రాప్‌కు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రాయ్‌ ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాల్‌డ్రాప్‌ అయిన ప్రతిసారి సంబంధిత టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ట్రాయ్‌ గతేడాది అక్టోబర్‌ 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు మూడు కాల్‌డ్రాప్‌లకు ఒక రూపాయి చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ట్రాయ్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. టెలికాం ఆపరేటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ విధంగా తీర్పునిచ్చింది.

తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల....

హైదరాబాద్ : 2016 తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. మొత్తంగా ఉత్తీర్ణత శాతం 85.63 శాతంగా వుంది. దీనిలో బాలురు 84.70 కాగా బాలికలు 86.57 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 2378 స్కూల్స్ లో వంద శాతం ఉత్తీర్ణ త పొందారు. ఉత్తీర్ణతలో వరంగల్ -95.13 శాతం సాధించి మొదటిస్థానంలో వుండగా హైదరాబాద్ 76.23 శాతంతో చివరిస్థానంలో వుంది.

11:33 - May 11, 2016

ఢిల్లీ : జూన్ మొదటి వారంలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరుగునుంది. ఇరు రాష్ట్రాల మధ్య నిర్మించబోయే సాగు నీటి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.

వెలగపూడిలో వామపక్ష ఎమ్మెల్సీల అడ్డుకున్న పోలీసులు..

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం వద్ద వామపక్ష ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ ఉన్నందున కార్మికులను కలిసేందుకు పోలీసులు నిరాకరించారు. 

కాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు..

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. 

ట్రాయ్ ఆదేశాలపై సుప్రీం స్టే..

ఢిల్లీ : ట్రాయ్ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాల్ డ్రాప్ టెలికాం కంపెనీలు పెనాల్టీలు చెల్లించాలన్న ట్రాయ్ ఆదేశాలను నిలుపుదల చేసింది. కాల్ డ్రాప్ మొబైల్ కంపెనీలు తప్పనిసరిగా పరిహారం చెల్లించాల్సినవసరం లేదని కోర్టు పేర్కొంది. 

గురుకుల పాఠశాలలపై మంత్రి కడియం సమీక్ష..

హైదరాబాద్ : గురుకుల పాఠశాలలపై మంత్రి కడియం సమీక్ష నిర్వహించారు. వసతుల కల్పన, ఫ్యాకల్టీ నియామకంపై చర్చించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. 

టిడిపికి ప్రశ్నించే హక్కు లేదు - మంత్రి తలసాని..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్, టిడిపి పార్టీలపై విమర్శలు గుప్పించారు. టిడిపికి ప్రశ్నించే హక్కు లేదని, పాలేరులో చిల్లర పార్టీలన్నీ ఒక్కటయ్యాయని విమర్శించారు. పాలేరు ఉప ఎన్నిక తమ పార్టీకి రిఫరెండం అని పేర్కొన్నారు. 

11:19 - May 11, 2016

విజయవాడ : వెలగపూడి సచివాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. సచివాలయం నిర్మాణ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్ష నేతలు కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఎం నేతలను మంగళవారం నాడు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో సీపీఎం నేతలను  అరెస్ట్ చేసి పోలీసులు  నిర్భంధంలో వుంచారు. వారిని కలవటానికి ఎవ్వరినీ అనుమంతించటంలేదని వారు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో బాబూరావుని మినహా మిగతానేతలతందరినీ విడుదల చేయలేదు. వెలగపూడి ప్రాంతానికి వెళ్ళమని వ్రాతపూర్వకంగా రాసి ఇస్తేనే వారికి విడుదల చేస్తామని పోలీసులు అన్నట్లు సమాచారం. కార్మిక పక్ష నేతలమైన మేము దేనికి భయపడమనీ కార్మికులకు మా మద్ధతు ఎప్పుడూ వుంటుందని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే వెలగపూడి తాత్కాలిక సచివాలయం నిర్మాణం వద్దకు సీపీఎం ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వర్ రావు, శర్మ, ఐద్వా ఏపీ కార్యదర్శి రమాదేవి చేరుకున్నారు. విజయవాడకు చెందిన పలువురు వామపక్ష నేతలు ఈ ప్రాంతానికి కాసేపట్లో చేరుకోబోతున్నారు. 

భేటీ కానున్న టీ.ఎస్, మహారాష్ట్ర సీఎంలు .....

ఢిల్లీ : జూన్ మొదటి వారంలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరుగునుంది. ఇరు రాష్ట్రాల మధ్య నిర్మించబోయే సాగు నీటి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.

కాసేపట్లో తెలంగాణా టెన్త్ ఫలితాలు....

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణా టెన్త్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు.

10:57 - May 11, 2016

నటిగానే కాకుండా గీత రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా శృతిహాసన్‌ తానేమిటో నిరూపించుకునే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఓపక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ తనకిష్టమైన సంగీతానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంది. తాజాగా బ్రిటీష్‌ ఆల్టర్‌నేటివ్‌ రాక్‌ బ్యాండ్‌ 'డైనోసార్‌ పైల్‌ -అప్‌'తో కలిసి ఓ ఆల్బమ్‌ రూపొందించేందుకు శృతి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసమై రాక్‌బ్యాండ్‌ మెంబర్స్ తో పలుమార్లు చర్చలు జరిపింది. చర్చల ఆనంతరం రాక్‌బ్యాండ్‌ సభ్యులైన మ్యాట్‌ బిగ్‌ల్యాండ్‌ (గిటారిస్ట్), మైక్‌ షీల్స్ (డ్రమ్మర్‌), జిమ్‌ క్రాచ్‌లీ (బేసిస్ట్) తదితరులు శ్రుతి ప్రపోజల్‌కు అంగీకరించారు. త్వరలోనే ఈ సభ్యులందరూ కలిసి ఆల్బమ్‌ రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించనున్నారు. ఈ ఆల్బమ్‌కి సంబంధించి పాటలు, సంగీతాన్ని శృతి సమకూర్చనున్నారు. గతంలోనూ 'ద ఎక్స్ ట్రా మెంటల్స్' పేరుతో శృతి ఓ రాక్‌బ్యాండ్‌ నిర్వహించింది. 2006-2009 వరకు ఈ రాక్‌బ్యాండ్‌ ద్వారా పలు కార్యక్రమాలు జరిగాయి. తర్వాత సినిమాల్లో నటిస్తూ శృతి బిజీ అవ్వడంతో ఈ రాక్‌బ్యాండ్‌ యాక్టీవ్‌గా లేదు. ఇదిలా ఉంటే, శృతి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన 'ప్రేమమ్‌' చిత్రంలోను, హిందీలో 'యారా', తమిళంలో సూర్యకి జోడీగా 'ఎస్‌3' చిత్రాల్లో నటిస్తోంది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబయి: స్టాక్ మార్కెట్లు ఉదయం ప్రారంభం నుంచి నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,406గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 28,430గా ఉంది. కిలో వెండి ధర రూ.40,951గా ఉంది.

కేంద్రమంత్రి మున్స్ రాజ్ తో టీ.ఎస్ మంత్రులు భేటీ...

ఢిల్లీ : కేంద్రమంత్రి మున్స్ రాజ్ తాహిర్ తో తెలంగాణా మంత్రులు హరీష్ రావు, ఈటెల, ఎంపీలు భేటీ అయ్యారు. ఎరువులు,రసాయన శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. 

10:38 - May 11, 2016

మెదక్ : కాస్ట్‌లీ కార్పొరేట్‌ ఆఫీస్‌ను తలపించే భవనం అది. ఆధునిక సొబగులతో అన్ని హంగులతో ముచ్చటగొలిపే భవంతి అది. రోజూ వందలాది మంది రాకతో వచ్చే పోయే అధికారులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అందుకేనేమో ప్రభుత్వాధినేత మెచ్చారు దాన్ని.. దాన్నే మోడల్‌గా తీసుకుని మరిన్ని భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఇంతకు ఏంటా భవనం.. అధినేత ముచ్చటపడిన ఆ బిల్డింగ్ ఎక్కడుంది.? 

రాజభవనమా? ప్రభుత్వ కార్యాలయమా? ....
పచ్చని చెట్ల మధ్య హుందాగా కనిపించే భవనాలు. సకల సదుపాయాల మేళవింపుతో రాజభవనానికి తీసిపోని నిర్మాణాలు. ఇలా శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయానికి పూర్తి భిన్నం ఈ భవంతి. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ ఇది. ఆధునిక హంగులతో కార్పొరేట్‌ ఆఫీస్‌కు దీటుగా గత ప్రభుత్వం నిర్మించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో దీనికి రూపకల్పన చేశారు. 40 కోట్ల రూపాయల ఖర్చుతో 2010లో నిర్మాణం ప్రారంభమైంది. వైఎస్ తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా ప్రారంభోత్సం జరుపుకుంది.

ఆధునిక హంగులతో సంగారెడ్డి కలెక్టరేట్ ....
అన్ని హంగులతో అద్భుతంగా ఉన్న ఈ కలెక్టరేట్‌ సిఎం కేసిఆర్‌ను అమితంగా ఆకర్షిస్తోంది. తెలంగాణలో భవిష్యత్‌లో ఏర్పడే కొత్త జిల్లాలతోపాటు మిగిలిన అన్ని జిల్లాల కలెక్టరేట్‌లను ఇదే తరహాలో నిర్మించాలని కేసిఆర్ సంకల్పించారు. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన పరిశీలక బృందం ఈ భవంతులను పరిశీలించి వెళ్లింది.

రొనాల్డ్ రాస్‌, జిల్లా కలెక్టర్ ...
ప్రజలకు అనుకూలంగా అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడం మూలాన ప్రజలకు సేవలు సత్వరమే అందే అవకాశముంటుందని ఆయన తెలిపారు. ఇకపై నిర్మించే భవనాలను కూడా ఆధునిక హంగులతో నిర్మించాలనే ఆలోచన వుందని ఆయన తెలిపారు.

2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయాలు....
2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ భవన సముదాయంలో 38 శాఖల కార్యాలయాలున్నాయి. మరో 26 శాఖల ఆఫీసులు దీనిలోకి రానున్నాయి. ఇందుకోసం అదనంగా మరో ఫ్లోర్ నిర్మాణానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడం మూలాన ప్రజలకు సేవలు సత్వరమే అందే అవకాశముంటుంది.

అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా ఉన్న భవనాలు....
ఈ భవన సముదాయంలోనే మినీ సమావేశ మందిరాలు, ఆడిటోరియం, క్యాంటిన్‌లాంటి ఏర్పాట్లున్నాయి. అందుకే సిఎం కేసిఆర్‌ నజర్ దీనిపై పడింది. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా మిగిలిన జిల్లాల కలెక్టరేట్‌లనూ ఇదే తరహాలో నిర్మించాలని భావిస్తున్నారు.

కురివిచంద్ లో దారుణం..

రంగారెడ్డి : ముషిరాబాద్ (మం) కురివిచంద్ లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురిపై సురేష్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఎమ్మెల్సీ ఇంట్లో మద్యం బాటిళ్లు..

గయా : ఎమ్మెల్సీ మనోరమా దేవి అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీసుల తనిఖీల్లో మనోరమా ఇంట్లో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. రాష్ట్రంలో మద్యపాన నిషేధ చట్టం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అరెస్టు వారెంట్ జారీ కావడంతో మనోరమ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

 

10:27 - May 11, 2016

ఢిల్లీ : కోట్లది రూపాయలు ఎగ్గొట్టాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు ఇంగ్లండ్ బాసటగా నిలిచింది. మాల్యాను దేశానికి తీసుకరావాలనే భారతదేశ ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. దేశానికి పంపించే తప్పు మాల్యా చేయలేదని, భారత్ కు విచారణలో సహకరిస్తామని లండన్ సంబంధించిన అధికారులు భారత విదేశాంగ అధికారులకు తెలియచేశారు. 1971 ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం పాస్ పోర్టు లేకపోయినా ఫర్వాలేదని ఇంగ్లండ్ అధికారులు పేర్కొన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఆలోచిస్తామని అక్కడి అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈడీ ఇచ్చిన ఆదేశాలకు స్పందన రాకపోవడంతో మాల్యా పాస్ పోర్టును రద్దు చేయడమే కాకుండా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల రుణం తీసుకున్నారని కనుక భారత అభ్యర్థనను మాత్రం పరిశీలిస్తామని పేర్కొన్నారు. మరి మాల్యా భారతదేశానికి వస్తారా ? లేదా ? అన్నది వేచిచూడాలి.

10:19 - May 11, 2016

విజయవాడ : ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఏపీ సర్కారు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఏపీ తాత్కాలిక రాజధాని ప్రాంతంలో దేవేందర్ అనే కార్మికుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుడి మృతిపై సీపీఎం నేతలు స్పందించారు. కార్మికులకు మద్ధతు తెలపాటానికి వచ్చిన నేతలపై పోలీసులు లాఠీ చేశారు. దీంతో సీపీఎం నేత లెనిన్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఆగ్రహించిన నేతలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన కార్యాక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ సర్కారు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. నిషేధిత ప్రాంతంలో ఎటువంటి ర్యాలీలు , ధర్నాలపై చేపట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కార్మికుడి మృతికి నిరసనగా కార్మికులు విధులను బహిష్కరించారు. భాష తెలియని తమకు పనిప్రదేశంలో ఎల్ అండ్ టీ కంపెనీ ఎటువంటి సదుపాయాలను కల్పించలేదని...భోజనం చేయటానికి కూడా అరగంట సమయం మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం త్రాగటానికి మంచినీరు కూడా లేని పరిస్థితులలోతాము పని చేస్తున్నామన్నారు. తమకు రోజు ఇచ్చే వేతనం కూడా రూ. 292లు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఏదైనా ప్రమాదానికి గురైతే కనీస వైద్య సదుపాలయాలు కూడా లేవని వారు తెలిపారు.

పసుపు బోర్డు ఏర్పాటుపై రేపు సమావేశం - ఎంపీ కవిత..

ఢిల్లీ : పుసుపు బోర్డు ఏర్పాటుపై రేపు అధికారులతో సమావేశం ఉంటుందని ఎంపీ కవిత పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో ఎంపీ కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు. పసుపు పంటకు మద్దతు ధరపై అధ్యయనానికి కేంద్ర బృందం పంపిస్తామని కేంద్ర మంత్రి హామీనిచ్చారని పేర్కొన్నారు. న్యూక్లియర్ సీడ్ ప్రొడక్షన్ సెంటర్ ను జగిత్యాలలో ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు. 

10:09 - May 11, 2016

69వ కేన్స్ చలన చిత్రోత్సవ సంబరాలు ఫ్రాన్స్ కేన్స్ నగరంలో బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈనెల 11న ప్రారంభమై 22వ తేదీ వరకు జరిగే ఈ చలన చిత్రోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 వేల మంది సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఆహుతులను అలరించేందుకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. దర్శకుడు జీన్‌ లూక్‌ గోడార్డ్ గౌరవార్థం రూపొందించిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ పోస్టర్‌కు సర్రత్వా ప్రశంసలు లభిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ చిత్రోత్సవాల్లో 20 చిత్రాలు 'గోల్డెన్‌ పామ్‌' అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. వీటిల్లో 'అమెరికన్‌ హనీ' , 'అక్వారిస్‌', 'ఎల్లీ', 'ఫ్రమ్‌ ద ల్యాండ్‌ ఆఫ్‌ ద మూన్‌', 'గ్రాడ్యుయేషన్‌', 'ద హ్యండ్‌మీడెన్‌', 'ఐ డానియెల్‌ బ్లేక్‌', 'ఇట్స్ ఓన్లీ ద ఎండ్‌ ఆఫ్‌ ద వరల్డ్', 'జులియెటా', 'ద లాస్ట్‌ ఫేస్‌', 'లవింగ్‌', 'మా రోసా', 'ద నియోన్‌ డెమన్‌', 'పీటర్సన్‌', 'పర్సనల్‌ షాపర్‌', 'ద సేల్స్‌మెన్‌', 'స్టేయింగ్‌ వర్టికల్‌', 'సైరనెవడా', 'స్టాక్‌ బే', 'టోని ఏర్డ్మన్న్‌', 'ద ఆన్‌నోన్‌ గర్ల్' వంటి చిత్రాలున్నాయి.

విద్యార్థుల లఘు చిత్రాలు..
అలాగే సినీ ఫౌండేషన్‌ షార్ట్‌ఫిల్మ్స్ విభాగంలో విద్యార్థులు రూపొందించిన లఘు చిత్రాలు 2,300 పోటీలో పాల్గొనగా 'ఇన్‌ ద హిల్స్', 'సబ్‌మెరైన్‌', 'ద నోయిస్‌ ఆఫ్‌ లైకింగ్‌', 'ఆల్‌ రివర్స్ రన్‌ టు ద సీ', 'సమ్‌వేర్‌', 'గబ్బర్‌ లవర్‌', 'ద ఆలన్‌ డైమెన్షన్‌', 'ట్రాష్‌', 'ఫైన్‌', 'ద గిల్ట్, ప్రోబబ్లీ', 'ద రీజన్స్ ఇన్‌ ద వరల్డ్', '1 కిలోగ్రామ్‌', 'అరామ్‌', 'నెస్ట్'(సత్యజిత్‌ రే ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌, ఇండియా), 'ద స్లీపింగ్‌ సైంట్‌', 'వాటెవర్‌ ద వెదర్‌', 'అన్నా', 'బిజినెస్‌' వంటి 18 చిత్రాలను ఎంపిక చేశారు. మెయిన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌కి 5,008 రాగా కేవలం పది లఘు చిత్రాలను మాత్రమే ఎంపికయ్యాయి. వాటిలో 'ట లైనె సుర్‌ లె డాస్‌', 'డ్రీమ్‌ల్యాండ్స్', 'టైమ్‌ కోడ్‌', 'ఇమాగో', 'మదర్‌', 'ద గర్ల్ ఉ డాన్స్‌డ్‌ విత్‌ ద డెవిల్‌', 'అప్రెస్‌ సుజన్నె', '4.15పి.ఎం. ఫాస్రిటుల్‌ లుమి', 'ద సైలెన్స్', 'ఫైట్‌ ఆన్‌ ఏ స్వీడిష్‌ బీచ్‌' వంటి లఘు చిత్రాలు అవార్డు కోసం పోటీపడుతున్న వాటిలో ఉన్నాయి.

క్లాసిక్స్ విభాగం...
పోటీతో సంబంధం లేకుండా ప్రదర్శించే చిత్రాల పార్లర్‌ సెక్షన్‌లో కేన్స్ క్లాసిక్స్ విభాగం ఒకటి. జాతి సంపదగా, వారసత్వంగా భావించబడే చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు. అలాగే దేశసమగ్రతను, సినిమా కల్చర్‌ను కాపాడడం, వైవిధ్యత, జీవ కళలను ప్రోత్సహించడమనే నేపథ్యంలో రూపొందిన చిత్రాలను 'టౌస్‌ లెస్‌ సినిమా డు మాండే' విభాగంలో ప్రదర్శిస్తారు. అలాగే విమర్శకుల ప్రశంసలందుకున్న నూతన దర్శకుడి చిత్రాలను 'కెమెరా డి ఓర్‌' విభాగంలోను, మ్యూజిక్‌ విభాగంలో క్లాసికల్‌ చిత్రాలుగా నిలిచిన చిత్రాలను 'సినిమా డి ల ప్లాగె' విభాగంలో ప్రదర్శించనున్నారు. అలాగే డైరెక్టర్స్‌ ఫోర్ట్‌నైట్‌, ఇంటర్నేషనల్‌ క్రిటిక్స్ వీక్‌, అసోసియేషన్‌ ఫర్‌ ఇండిపెండెంట్‌ సినిమా అండ్‌ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్‌ అనే మూడు విభాగాల్లో వివిధ దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.

తారల సందడి..
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ల్లో రెడ్‌కార్పెట్‌పై తారలు చేసే సందడి హైలైట్‌గా నిలువనుంది. ప్రపంచ సుందరాంగులందరూ ఫ్యాషన్‌ డ్రెస్‌లతో రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్‌ చేస్తూ సందడి చేస్తారు. వారి అందాలను బంధించేందుకు కెమెరా ఫ్లాష్‌లు పోటీపడుతుంటాయి. ప్రపంచ దేశాల కథానాయికలతోపాటు మన దేశానికి చెందిన కథానాయికలు కూడా సందడి చేస్తుంటారు. బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఇప్పటి వరకు 14సార్లు రెడ్‌కార్పెట్‌పై వాక్‌ చేసి అలరించారు. అలాగే కత్రీనా కైఫ్‌, మల్లీకా షెరావత్‌, సోనమ్‌ కపూర్‌లు కూడా గతేడాది వేడుకల్లో రెడ్‌కార్పెట్‌పై హల్‌చల్‌ చేశారు. ఈసారి ఐశ్వర్యరాయ్ తోపాటు సోనమ్‌ కపూర్‌ రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోనున్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో ఐశ్వర్యరాయ్, 15, 16 తేదీల్లో సోనమ్‌ కపూర్‌ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. 'క్లాష్‌' (ఈజిప్ట్), 'కేఫ్‌ సొసైటీ' (యుఎస్‌), 'ఇన్‌ బెడ్‌ విత్‌ విక్టోరియా' (ఫ్రాన్స్), 'స్వీట్‌ డ్రీమ్స్' (ఇటలీ-ఫ్రాన్స్) వంటి చిత్రాలు ఓపెనింగ్‌ సెర్మనీలో ప్రదర్శితం కానుండగా, 'స్మైల్‌' (ఫ్రాన్స్), 'ఎన్‌ మోయి' (ఫ్రాన్స్), 'కిట్టీ' (యుఎస్‌), 'డాగ్‌ ఈట్‌ డాగ్‌' (యుఎస్‌) చిత్రాలు క్లోజింగ్‌ సెర్మనీలో ప్రదర్శితమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ యేడాది రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి', అనురాగ్‌ కశ్యప్‌ తెరకెక్కించిన 'రమణ్‌ రాఘవన్‌ 2.0' చిత్రాలు ఈ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితం కానున్నాయి. వీటితోపాటు 'ద టేక్‌ ఓవర్‌' డాక్యుమెంటరీ కూడా ప్రదర్శితం కానుంది. పోటీలో భారతదేశం తరఫున ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. గతేడాది 'మసాన్‌' చిత్రం రెండు అవార్డులను దక్కించుకున్న విషయం విదితమే.

10:02 - May 11, 2016

ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే కాల్షియం గల ఆహారాల్ని అధికంగా తీసుకోవాలి. శరీరంలో కాల్షియంతో పాటు విటమిన్‌- డి తగ్గిపోవటం, థైరాయిడ్‌ గ్రంథి క్రియలో అతిగా స్పందించడం, మధుమేహం బారిన పడినవారు, వయసుమీరిన వారికి ఎముకల్లో సమస్యలు ఏర్పడుతుంటాయి. అందుచేత ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్‌ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా ఇవి పాటించండి...
కప్పు వేడిపాలలో టీ స్పూన్‌ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు గట్టిపడతాయి.
గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీ స్పూన్‌ చొప్పున కలిపి తాగాలి.
కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకుని తింటే ఎముకలు బలపడతాయి.
మునగ కాయలతో పులుసు చేసుకుని తింటే ఎముకలకు బలం చేకూర్చిన వారవుతారు.
ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిపై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలతో తాగాలి.

10:00 - May 11, 2016

గర్భం ధరిస్తే చాలు కుటుంబ సభ్యులు మొదలుకొని బంధువులు, స్నేహితులు అనునిత్యం అది తినూ ఇది తినూ అంటూ ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. అయితే గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా తీసుకోవల్సిన ఆహారం ఏంటి? ఇంకేముంటుంది... పోషకాలు మెండుగా ఉండే పండ్లు తదితర ఆహారాన్ని తీసుకోవాలంటారా? అయితే అది నిజమే. ఆ ఆహారం తప్పనిసరే. కానీ దాంతోపాటు డార్క్ కలర్‌ చాకొలేట్స్ కూడా తినాలట. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అవును, ఇది నిజమే. గర్భిణీ మహిళలు డార్క్ కలర్‌ చాకొలేట్స్ ను రోజుకొకటి చొప్పున మొదటి మూడు నెలల పాటు తగిన మోతాదులో తింటే వారికి పుట్టబోయే పిల్లలు అత్యంత సంతోషంగా ఉంటారట. పలువురు వైద్య నిపుణులు తాజాగా చేసిన పరిశోదనల్లో ఈ విషయం వెల్లడైంది. అందుకే గర్భిణీ మహిళలు డార్క్ చాకొలేట్స్ ను నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..

  • గర్భం దాల్చిన మహిళలు డార్క్ కలర్‌ చాకొలేట్స్ ను తింటే మంచిదని పైన చెప్పాం కదా! అయితే వాటిని తినబోయే ముందు గర్భిణీలు డయాబెటిస్‌ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే చాకొలేట్స్ తినడం వల్ల డయాబెటిస్‌ పెరిగి పోయి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
  • గర్భిణీ మహిళలకు తొలినాళ్లలో సాధారణంగా ప్రి-ఎక్లేంప్సియా అనే ఓ కండిషన్‌ వస్తుంటుంది. దీని వల్ల తల్లితోపాటు ఆమె కడుపులో ఉన్నబిడ్డకు కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఇది ఇద్దరికీ ప్రమాదమే. అయితే మొదటి మూడు నెలల పాటు డార్క్‌ కలర్‌ చాకొలేట్స్‌ను తింటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.
  • గర్భిణీ మహిళలకు థియోబ్రోమిన్‌ అనే పోషకం అత్యంత అవసరం. ఇది బీపీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. ఈ క్రమంలో డార్క్ చాకొలేట్స్ తినడం వల్ల థియోబ్రోమిన్‌ సరిగ్గా అంది అది బిడ్డతోపాటు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
  • గర్భిణీలకు సాధారణ మహిళలతో పోలిస్తే రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. ఈ క్రమంలో డార్క్‌ కలర్‌ చాకొలేట్స్‌ను తింటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు బిడ్డతోపాటు తల్లి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
  • డార్క్ కలర్‌ చాకొలేట్స్ లో ఐరన్‌, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గర్భిణీ మహిళలకు, కడుపులో ఉన్న బిడ్డలకు అత్యంత అవసరమైనవిగా వైద్యులు చెబుతారు.
  • గర్భం దాల్చిన మహిళలు సహజంగానే నిత్యం ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో వారు డార్క్ కలర్‌ చాకొలేట్స్ ను తింటే అది వారి మూడ్‌ను నియంత్రించి ఒత్తిడి తగ్గేలా చేస్తుంది. 
09:59 - May 11, 2016

అస్సాం :  కౌంటింగ్ తేదీ సమీపిస్తున్నా కొద్ది అస్సాంలో ఉత్కంఠ పెరుగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మరో గేమ్ మొదలుపెట్టాయి. ఒకవేళ హంగ్ ఏర్పడితే అధికారం చేజిక్కించుకునే మార్గాల గురించి అన్వేషిస్తున్నాయి. అప్పుడే బేరసారాలు ఊపందుకుంటున్నాయి.

నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్-బీజేపీ....

అస్సాంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు తలపడ్డ కాంగ్రెస్, బిజెపి ఊపిరిబిగబట్టి ఓటరు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఏప్రిల్ 4, 11 తేదీలలో రెండు విడతలుగా పోలింగ్ ముగిసిన్నప్పటికీ కౌంటింగ్ జరగలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాతే మే 19న అస్సాం ఓట్లను లెక్కిస్తారు. దీంతో మరో వారం రోజుల పాటు అస్సాం నేతలకు టెన్షన్ తప్పదు.

పార్టీల అగ్రనేతలకు గుండెల్లో గుబులు....

పోలింగ్ ముగిసిన తర్వాత అస్సాం రాజకీయాలు ఆసక్తికర మలుపులో నిల్చున్నాయి. ప్రజలకు ఎవరికి ఓట్లేశారో తెలియదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు. కానీ, అప్పుడే అక్కడ బేరసారాలు మొదలయ్యాయి. దీంతో పార్టీల అగ్రనేతలకు గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుండా, హంగ్ ఏర్పడితే తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక చిన్నా చితకా పార్టీలు అప్పుడే తలలు పట్టుకుంటున్నాయి.

బీజేపీకి దడపుట్టిస్తున్న మిత్రపక్షాలు....
అస్సాంలో బిజెపి మరికొన్ని పార్టీలతో జతకట్టింది. ఏజీపీ, బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, బిజెపితో కలిసి పోటీ చేశాయి. కౌంటింగ్ పూర్తయిన తర్వాత, రిజల్ట్స్ కు అనుగుణంగా ఫ్రెండ్ షిప్ మార్చాలన్న వ్యూహంతో ఈ పార్టీలుండడం బిజెపిని కలవరపెడుతోంది. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మ్యాజిక్ ఫిగర్ 63. కాంగ్రెస్ అన్ని స్థానాలకు పోటీ చేయగా బిజెపి కేవలం 88 స్థానాల్లోనే పోటీ చేసింది. ఎంతో బలమైన గాలి వీస్తే తప్ప ఇందులో 63 గెల్చుకోవడం కష్టం. కాబట్టి, బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ ల మీద ఆధారపడక తప్పదు. ఆ పార్టీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నాయి. ఈ పార్టీల ముఖ్యనేతలతో అస్సాం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగాయ్ టచ్ లో వుండడం బిజెపిని కలవరపెడుతోంది.

కౌంటింగ్ తర్వాత మిత్రపక్షాల పునరాలోచన....
ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏజిపి, బీపీఎఫ్ లతో పాటు ఏఐయుడిఎఫ్ కూడా కీలకంగా మారే అవకాశం వుంది. పెర్ ఫ్యూమ్ వ్యాపారి బబ్రుద్దీన్ అజ్మల్ సారథ్యంలోని ఏఐయుడిఎఫ్ కింగ్ మేకర్ గా అవతరిస్తానన్న ఆశ తో వుంది. బిజెపిని నిరోధించేందుకు బీహార్ తరహాలో మహాకూటమి ఏర్పాటు చేయాలంటూ బబ్రుద్దీన్ అజ్మల్ ప్రయత్నించారు. ఈ ప్రతిపాదనను తరుణ్ గొగాయ్ తోసిపుచ్చడంతో అజ్మల్ ఒంటరిగా బరిలో దిగారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు గెల్చుకున్న ఏఐయుడిఎఫ్ ఈసారి 71 స్థానాల్లో పోటీ చేసింది. 2011 కంటే తమ ఓట్లు సీట్లు పెరుగుతాయన్న అంచనాతో బబ్రుద్దీన్ అజ్మల్ వున్నారు. తాను ఊహిస్తున్నట్టుగా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎమ్మెల్యేలందరినీ విదేశాలకు తరలించి, అక్కడ క్యాంప్ రాజకీయం నడపాలన్న ఆలోచనతో వున్న అజ్మల్ ఆ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అస్సాంలో హంగు ఏర్పడితే ఏఐయుడిఎఫ్, ఏజీపీ, బీపీఎఫ్ ఎమ్మెల్యేలకు మంచి డిమాండ్ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో సొంత పార్టీ అభ్యర్థుల కదలికల మీద అగ్రనాయకత్వాలు నిఘా వేసి, ఓ కంట గమనిస్తున్నాయి.

09:52 - May 11, 2016

విజయవాడ :  ఏపీకి ఆర్థిక సాయంపై కేంద్రం చేసిన ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు బయటకు తీస్తోంది. ఇప్పటివరకు ఎంతో చేశామని కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవంగా మరింత సాయం చేయాల్సి ఉందంటుంది ఏపీ సర్కార్. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే నిధుల సమీకరణకు పోరాడాలని నిర్ణయించింది.

కేంద్ర మంత్రుల ప్రకటనలపై ఆచితూచి అడుగులేస్తున్న ఏపీ సర్కార్ ...
ఏపీ కి ప్రత్యేక హోదా , పన్ను రాయితీల విషయంలో కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనలపై ఏపీ సర్కార్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే కేంద్రంలో ఎలాంటి విభేధాలు వద్దనేది రాష్ట్రం వాదన. ఓ ప్రక్క ఆర్థిక సాయం విషయంలో కేంద్ర ప్రకటలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో గొడవలు పెట్టుకోకూడదని .. ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోడీకి ప్రత్యేక హోదా రాయితీల పూర్తి వివరాలతో లేఖ రాసేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ఏపీకి ఇప్పటి వరకు 70 వేల కోట్లకు పైగా కేంద్రనిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి జయంత్ సింహా చేసిన ప్రకటనలు సరైనవేనంటున్నారు ఏపీ ప్రభుత్వ అధికారులు. అసలు కేంద్రం చేసిన ప్రకటన ఏంటి..ఇంతవరకు రాష్ట్రానికి ఏం జరిగిందన్న దానిపై లెక్కలు బయటకు తీస్తున్నారు.

జనాభా ప్రతిపదికన 2015 -16 సంవత్సరాలకు...
జనాభా ప్రతిపదికన 2015 -16 సంవత్సరాలకు పోరుగురాష్ట్రాలైన ఒడిశాకు 26 వేల 567 కోట్లు మహారాష్ట్రకు 31 627 కోట్లు , మధ్యప్రదేశ్ కు 43 వేల కోట్లు బీహార్ కు 55 వేల కోట్లు కేంద్రం విడుదల చేసింది. దేశ జనాభాలో 4 శాతం ఉన్న రాష్ట్రజనాభా ప్రకారం మనకు 43 వేల 467 కోట్లు కేటాయించారని... ప్రత్యేక అవసరాల కోసం ఆశించిన మేర కేంద్రం సహాయం చేయలేదని ప్రభుత్వం భావిస్తోంది.

చేతులు దులుపుకున్న కేంద్రం....
రాష్ట్ర విభజన హామీల మేరకు తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 22వేల 700 కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. రెవెన్యూ లోటుకుగాను 16000 కోట్లు, రాజధాని నిర్మాణానికి 4000 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్దికి 700 కోట్లు , పోలవరం ప్రాజెక్టు కోసం 2000 కోట్లు అందించాలని వేడుకుంది. అయితే కేంద్ర మాత్రం 8వేల 300 కోట్లతో సరిపెట్టింది. 13 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2, 377 కోట్లు, ఆర్థిక లోటుకు 2,300 కోట్లు,రాజధాని నిర్మానికి 1500 కోట్లు పోవలరం కు 250 , గోదావరి పుష్కరాలకు 100 కోట్లు ఇలా మొత్తంగా 8,300 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది కేంద్రం.

కేంద్రంపై ఆశలు పెట్టుకున్న ఏపీ....
ఇక రెండవ ఏడాది 2015 -16 లో సైతం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. మోడీ మాత్రం అభివృద్దికి నిధులు విడుదల చేయకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని బాబు భావిస్తున్నారు. ఈ నివేదికను కేంద్రానికి పంపేందుకు సర్కార్ సన్నద్ధం అవుతోంది. ఏది ఏమైనా కేంద్రంతో సానుకూల వాతావరణం తోనే నిధుల కోసం ప్రయత్నాలు చేయాలని సర్కార్ భావిస్తోంది.

09:37 - May 11, 2016

చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లింగ్ నివారించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మరో స్మగ్లర్ పోలీసులకు చిక్కారు. ఈ స్మగ్లర్ మహిళ కావడం విశేషం. ఈమె మోడల్ కాక ఎయిర్ హోస్టెస్ కావడం గమనార్హం. ఇటీవలే అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మణ్ పోలీసుల చేతికి చిక్కాడు. ఇచ్చిన సమాచారం మేరకు అతని రెండో భార్య సంగీత ఛటర్జీపై నిఘా పెట్టారు. కోల్ కతాలో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా పోలీసులు కోల్ కతాకు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈమెపై నాలుగు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయి. అదుపులోకి తీసుకొనే సమయంలో పెద్ద సంఖ్యలో ఆమె తరపు లాయర్లు అడ్డుకుని హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్మగ్లర్లతో ఛటర్జీకి సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈమె ద్వారా ఇతర స్మగ్లర్లను అరెస్టు చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమెను అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకొచ్చేందుకు జిల్లా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తో ఎంపీ కవిత భేటీ..

ఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో ఎంపీ కవిత భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల సమస్యలను కేంద్ర మంత్రికి ఎంపీ కవిత వివరించారు. పసుపుకు మద్దతు ధర కల్పించాలని విన్నవించారు. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, రైతులు పాల్గొన్నారు.

 

హంద్వాడాలో ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్ : హంద్వాడాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో భారత జవాను వీరమరణం పొందాడు. నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు భారత బలగాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మాల్యాను అప్పగించేందుకు ఇంగ్లండ్ నిరాకరణ..

ఢిల్లీ : కింగ్ ఫిషర్ ఎయిర్స్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాను అప్పగించేందుకు ఇంగ్లండ్ నిరాకరించింది. దేశంను పంపించే తప్పు మాల్యా చేయలేదని, భారత్ కు విచారణలో సహకరిస్తామని ఇంగ్లండ్ పేర్కొంది. 

ఎర్రచందనం మహిళా స్మగ్లర్ అరెస్టు..

చిత్తూరు : ఎర్రచందనం మహిళా స్మగ్లర్ సంగీత ఛటర్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఈమె అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మణ్ సతీమణి. రెండు రోజుల క్రితం కోల్ కతాలో సంగీత ఛటర్జీని పోలీసులు అరెస్టు చేశారు. 

కొనసాగుతున్న అమరావతి పోలీసుల అత్యుత్సాహం..

గుంటూరు : అమరావతి పోలీసులు అత్యుత్సాహం కొనసాగుతోంది. ఇంకా స్టేషన్ లోనే నేతలు ఉన్నారు. ఒక్క బాబురావును మాత్రమే విడిచిపెట్టారు.

సీకేఎం ఆసుపత్రిపై టెన్ టివి కథనానికి స్పందన..

వరంగల్ : సీకేఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై టెన్ టివి ప్రసారం చేసిన కథనంపై జిల్లా కలెక్టర్ కరుణ స్పందించారు. పురిటినొప్పులతో ఆసుపత్రికి వచ్చిన సుజాత అనే గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశంతో ఆసుపత్రి యాజమాన్యం దిగొచ్చింది. 

ఖానాపూర్ లో ప్రమాదం..ఇద్దరు మృతి..

ఆదిలాబాద్ : ఖానాపూర్ (మం) మండపల్లి సమీపంలో డివైడర్ ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు కరీంనగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. 

09:27 - May 11, 2016

వరంగల్ : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమయ్యింది. అధికారులు..మంత్రులు చెబుతున్న మాటలు ఉట్టివేనని తేలిపోతున్నాయి. మానవత్వం కూడా లేకుండా ప్రదర్శిస్తున్న ఆసుపత్రి భాగోతం బయటపడింది. ఈ ఘటనపై టెన్ టివి కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..వరంగల్ పట్టణంలోని సీకేఎం ఆసుపత్రికి సుజాత అనే నిండు గర్భిణీ వచ్చింది. కానీ ఆసుపత్రి సిబ్బంది సుజాతను అడ్మిట్ చేసుకోవటానికి నిరాకరించారు. దీంతో ఉదయం నుండి ఆసుపత్రి ఆరు బయటనే పురిటినొప్పులతో అల్లాడిపోయింది. ఆమె పడుతున్న బాధలు అందరూ చూస్తున్నారే కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ టెన్ టివి మాత్రం స్పందించింది. ఆమె పడుతున్న బాధలను ప్రసారం చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ కరుణ స్పందించి సుజాతను వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసుకుని వైద్యం అందించాలని  ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుజాతను వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. కొద్దిగంటల్లోనే సుజాతకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారు. సుజాత కుటుంబ సభ్యులు 10టీవీకి ధన్యవాదాలు తెలియజేశారు. 

09:16 - May 11, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 40 మంది ప్రయాణీలు ఆందోళన చేపట్టారు.పరిమితికి మించి  విమాన  టిక్కెట్లు కేటాయించటంతో గందరగోళ పరిస్థితితులు ఏర్పడ్డాయి. దీంతో  ప్రయాణీకలను ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. ఈరోజు ఉదయం 7.30 గంటల నుండి ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రయాణీకుల డిమాండ్ పై ఎయిర్ లైన్స్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

08:35 - May 11, 2016

విశాఖపట్నం : చలి చీమలొక్కటై విష భుజంగాన్ని చంపినట్లు.. గడ్డిపోచలన్నీ ప్రోది చేసి మదపుటేనుగును బంధించినట్లు.. కార్మికులంతా సంఘటితమై తమ సమస్యలపై సమరశంఖం పూరించారు. ఏ యూనియన్‌ అండదండలు లేకుండానే.. ఏ నాయకుడి ప్రసంగాలకు ఆకర్షితం కాకుండానే ఉక్కుపిడికిలి బిగించి ఉద్యమాన్ని నడిపారు. ప్రలోభాలెన్ని చూపినా.. వాటికి లొంగకుండా.. ఒక్క ఉదుటునా పెల్లుబికిన ఉద్యమంతో దూసుకుపోయారు. శ్రామిక శక్తి సంఘటితమైతే..ఎవరైనా బలదూరేనని నిరూపించారు. బ్రాండెక్స్‌ కార్మికుల పోరుబాటపై టెన్‌టీవీ స్పెషల్‌ ఫోకస్‌....

ఉద్యమమే ఊపిరిగా సాగుతున్న బ్రాండిక్స్ కార్మికులు...

ఏ అభ్యుదయ పదాలు వారి చెవిన పడలేదు. ఏ కార్మిక నాయకుడూ వాళ్లను రెచ్చగొట్టలేదు. ఏ సంఘం వాళ్లను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమించాలని చెప్పలేదు.. కానీ వాళ్లంతా కదం తొక్కారు. తమ సమస్యలపై గళమెత్తి ప్రశ్నించారు. లాఠీలు, తూటాలా మాకు అడ్డంకి.. అంటూ నిప్పురవ్వల్లా ఉద్యమించారు. ఇదీ విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న బ్రాండెక్స్‌ ఇండియా అప్పెరల్‌ సిటీలో కార్మికుల మెరుపు సమ్మె తీరు. అసలింతకీ.. అక్కడి అసంఘటిత కార్మికులంతా ఏకమై తిరుగుబాటు చేసే పరిస్థితి ఎందుకొచ్చింది..?

కష్టానికి తగిన ఫలితం లేదు....

రెక్కలు ముక్కలు చేసుకుని అహర్నిశలు కష్టపడితే.. కష్టానికి తగిన ఫలితం ఉండదు. కార్మిక హక్కుల ప్రకారం.. కనీస వేతనాలూ ఇవ్వరు. చాలీ చాలని జీతాలు చెల్లిస్తూ...శ్రమదోపిడీ చేస్తున్న యాజమాన్యం ఎన్నిసార్లు విన్నవించినా వేతనాలు పెంచదు. పని పూర్తిచేయాలని టార్గెట్ల వేధింపులు. పోనీ అంతకష్టపడ్డా పూర్తి వేతనం వస్తుందా అంటే అదీ లేదు. నెలాఖరున జీతాల్లో కోతలు షరామామూలే...! కనీసం టాయిలెట్లకు వెళ్లాలన్నా యాజమాన్యం ఆంక్షలు. దీంతో కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

నిర్బంధాల మధ్య గత్యంతరం లేని స్థితి పనిచేస్తున్న కార్మికులు...

నిర్బంధాల మధ్య గత్యంతరం లేని స్థితిలో ఉద్యమబాట పట్టారు అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండెక్స్‌ కార్మికులు. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తమ భూముల్ని దారపోసిన అచ్యుతాపురం గ్రామస్తులు.. ప్రతిఫలంగా బ్రాండెక్స్‌ కంపెనీలో కార్మికులుగా చేరారు. పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం లాంటి ప్రాంతాల నుంచి దాదాపు 15 వేల మంది కార్మికులు బ్రాండెక్స్‌లో పనిచేస్తున్నారు. ఇంతకాలం సొంత పొలాలను సాగు చేసుకుంటూ సాగిన వీరి జీవితాల్లో ఒక్కసారిగా నిర్బంధం మొదలైంది. మహిళా కార్మికులని కూడా చూడకుండా యాజమాన్యం తీవ్ర వేధింపులకు గురిచేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కార్మికులను అవమానించేలా ప్రవర్తించడం, మహిళలకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధించడం లాంటి ఇబ్బందులకు గురి చేస్తోంది.

2005 నుంచి పెంచని వేతనాలు...

బ్రాండెక్స్‌ యాజమాన్యం 2005 నుంచి వేతనాలూ పెంచడం లేదు. అంతేకాక ప్రతి ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లను కూడా ఇవ్వడం లేదు. నిరంతరం శ్రమదోపిడికి గురి చేస్తూ కట్టుబానిసలుగా చూస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉద్యోగం మానేసిన కార్మికులకు రావాల్సిన అలవెన్సులను కూడా చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో కార్మికులు సంఘటితమై ఆందోళనకు పిలుపునిచ్చారు. కొన్ని రోజులుగా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేశారు. చివరకు పోలీసులు నిర్బంధకాండ కొనసాగించినా ఏ మాత్రం వెరవకుండా కార్మిక శక్తి ఏంటో యాజమాన్యానికి రుచి చూపారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల ఆందోళన.....

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 40 మంది ప్రయాణీలు ఆందోళన చేపట్టారు. నియమితంగా వున్న సీట్ల మించి టిక్కెట్లు కేటాయించటంతో ప్రయాణీకలను ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో బుధవారం ఉదయం 7.30 గంటల  నుండి ఎయిర్ పోర్ట్ లోనే ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

సీకేఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం...

వరంగల్ : సీకేఎం లో ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోగులు నానాఅగచాట్లు పడుతున్నారు. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన సుజాత మహిళను అడ్మిట్ చేయించుకోకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించారు.దీంతో సుజాత ఆరు బయటే ఇబ్బందులు పడుతోంది. దీనిపై ఎటువంటి స్పందన లేదు. దీంతో పురిటి నొప్పులతో సుజాత అల్లాడిపోతోంది. వైద్యుడిని ఫోన్‌లో సంప్రదించగా... తన ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యం చేస్తానని చెప్పారంటూ గర్భిణిల బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం వస్తే పట్టించుకోరా? అంటూ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు.

72 ఏళ్ల వయస్సులో తల్లయిన మహిళ...

ఢిల్లీ: సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇటువంటి అద్భుతం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇది మహిళల విషయంలో మరింత ఆసక్తిగా మారుతుంది. సాధారణంగా మెనోసాజ్ వయస్సు వచ్చిన మహిళలు గర్భం దాల్చడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారి 72 ఏండ్ల వృద్ధురాలు టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనిచ్చింది. అమృత్‌సర్‌కు చెందిన మోహిందర్‌సింగ్ గిల్, దల్జిందర్ కౌర్ దంపతులకు టెస్ట్ ట్యూబ్ ప్రక్రియద్వారా మగపిల్లాడు పుట్టాడు. 46ఏండ్ల వైవాహిక జీవితం, మోనోపాజ్ దశ దాటి 20 ఏండ్ల అయినప్పటికీ సంతానం కావాలన్న ఆ దంపతుల ఆశ 72 ఏండ్లకు నెరవేరింది.

07:58 - May 11, 2016

ఢిల్లీ: సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇటువంటి అద్భుతం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. సాధారణంగా మెనోసాజ్ వయస్సు వచ్చిన మహిళలు గర్భం దాల్చడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారి 72 ఏండ్ల వృద్ధురాలు టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనిచ్చింది. అమృత్‌సర్‌కు చెందిన మోహిందర్‌సింగ్ గిల్, దల్జిందర్ కౌర్ దంపతులకు టెస్ట్ ట్యూబ్ ప్రక్రియద్వారా మగపిల్లాడు పుట్టాడు. 46ఏండ్ల వైవాహిక జీవితం, మోనోపాజ్ దశ దాటి 20 ఏండ్ల అయినప్పటికీ సంతానం కావాలన్న ఆ దంపతుల ఆశ 72 ఏండ్లకు నెరవేరింది. ఏప్రిల్ 19న ఈ జంట మగపిల్లాడికి జన్మనిచ్చింది. 2013 నుంచి రెండుసార్లు విఫలమవగా, మూడో సారి విజయం సాధించారు. ఇంతకు ముందు 70 ఏండ్ల వృద్ధురాలు ఆడపిల్లకు జన్మనిచ్చిన రికార్డు నమోదయింది.

టీడీపీ నేత ఎల్ రమణ కారెక్కనున్నారా?......

హైదరాబాద్ : టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కొద్ది రోజుల్లోనే గులాబీ కండువా కప్పుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని సమాచారం. టీడీపీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేరికకు కూడా ముహూర్తం కుదిరిందని విశ్వనీయవర్గాలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతల తో పాటు పలువురు నాయకులు టీడీపీ జంప్ అవుతారని కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజా పరిణామాలు ఈ ప్రచారాన్ని మరింత బలపరిచేవిగా వున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలావుంటే తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థం కానుంది.

తాటిమట్లలో మహిళ దారుణ హత్య....

నల్గొండ : మోత్కూరు మండలం తాటిమట్ల గ్రామంలో పట్నూరు సావిత్రమ్మ(48) అనే మహిళ బుధవారం ఉదయం దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా వున్న సావత్రమ్మపై గుర్తుతెలియని దుండగులు బుధవారం వేకువజామున ఆమె ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో పొడిచి హత్యచేశారు. గమనించిన స్థానికులు సావిత్రమ్మ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. ఫలితాల విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు పరీక్షలు జరగగా మొత్తం 32 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తున్నట్లు సంచాలకుడు ఆర్‌.సురేందర్‌రెడ్డి చెప్పారు. గతేడాది 38 రోజుల తర్వాత ఫలితాలు ప్రకటించామని తెలిపారు. పరీక్షలకు దాదాపు 5.6 లక్షల మంది హాజరయ్యారు.

07:34 - May 11, 2016

హైదరాబాద్ : ఏపీలో తాత్కాలిక రాజధాని వెలగపూడిలో కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన అంశంపై ఈనాటి న్యూస్ మార్నింగ్ లో చర్చించారు. ఈ చర్చలో రామశర్మ (ఏపీ లీగల్ సెల్ చైర్మన్ ) శ్రావణ్ కుమార్ (టీడీపీ నేత) విజయవాడ నుండి ఫోన్ లైన్లో రమాదేవి ( ఐద్వా నేత) పాల్గొన్నారు. లీగల్ సెల్ చైర్మన్ మాట్లాడుతూ...కార్మిక చట్టాను ఏమాత్రం పాటించకుండా అక్కడ కార్మికులతో పనులు చేయించుకుంటున్నారని ఆయన అన్నారు. రమాదేవి మాట్లాడుతూ..తాత్కాలిక రాజధాని ప్రాంతంలో కార్మికులతో పశువులకంటే హీనంగా పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్చలోని మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి....

07:19 - May 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తేమిటి? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన సమాధానం కనిపించడం లేదు. ఓ వైపు సంస్థ నష్టాలు పెరుగుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తోంది. ఇంకోవైపు ప్రయివేట్ వాహనాలు ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ 57వేల మంది ఉద్యోగులున్న పెద్ద వ్యవస్థ. తెలంగాణలో రోజుకి దాదాపు 92 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. 94 డిపోల ద్వారా 9265 గ్రామాలకు ఆర్టీసీ సేవలందుతున్నాయి. 3687 రూట్లలో ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండడం మరో విశేషం. ఇంత విస్తారమైన సేవలందిస్తున్న ఆర్టీసీకి దాదాపు 10, 500 బస్సులుండగా ఇందులో సుమారు 1800 అద్దె బస్సులున్నాయి. సొంత బస్సులు కొనుగోలు చేయకుండా అద్దె బస్సుల సంఖ్యను పెంచుకుంటూ పోవడం సంస్థకు ఎంతమాత్రం క్షేమదాయకం కాదంటున్నాయి కార్మికసంఘాలు.

తెలంగాణ ఆర్టీసీకి నిధుల కొరత...

తెలంగాణ ఆర్టీసీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిధుల కొరత. ప్రతి రోజూ 92 లక్షల మంది ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్ట్ లభించకపోవడం దురదృష్టకరం. గత బడ్జెట్ లో కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. 2015 16 బడ్జెట్ లో 159 కోట్లు కేటాయించగా, 2016 17 బడ్జెట్ లో 40 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఆర్టీసీ పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిన్నచూపునకు ఇంతకంటే వేరే నిదర్శనం ఏముంటుంది?

గతం కంటే 119 కోట్లు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం....

ఓ వైపు ఆర్టీసీకి బడ్జెట్ కేటాయింపుల్లో 119 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. మరోవైపు ఆర్టీసీ వినియోగించే డీజిల్ పై వ్యాట్ బాదుడు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం తగ్గినా, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెస్ లు, వ్యాట్ లు పెంచుతుండడంతో ఆ భారాన్ని ఆర్టీసీ మోయాల్సి వస్తోంది. ఆర్టీసీని వ్యాట్ నుంచి మినహాయిస్తే ఎంతలేదన్నా ఆ సంస్థకు 55 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. మరోవైపు ప్రయివేట్ రవాణ వాహనాల కారణంగా తెలంగాణ ఆర్టీసీ కనీసం వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోతోందన్న అంచనాలున్నాయి. ప్రయివేట్ ఆపరేటర్లను కట్టడి చేసి, వ్యాట్ భారాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ఆర్టీసీ మరిన్ని సొంత బస్సులు సమకూర్చుకోవడమే కాకుండా, సేవలను మరింత విస్తరించే అవకాశం వుంటుంది. కానీ, ఎందుకోగానీ ప్రభుత్వం ప్రయివేట్ ఆపరేటర్లను కట్టడి చేయడం లేదు.

పోరుబాటలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు.....

మరోవైపు ఆర్టీసీ కార్మికుల మీద పనిభారం పెరుగుతోంది. ఇద్దరు చేయాల్సిన పనిని ఒకరే చేయాల్సి వస్తోంది. కొత్త రిక్రూట్ మెంట్స్ నిలిపివేశారు. తక్కువ ఆదాయం వస్తోందంటూ కొన్ని రూట్లలో సర్వీసులు కుదిస్తున్నారు. రద్దు చేస్తున్నారు. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు అవస్థపడుతున్నారు. లేదంటే ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఏరియర్స్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం మాట నిలుపుకోలేదు. ఒప్పందం ప్రకారం 2016 ఉగాదికి చెల్లించాల్సిన ఏరియర్స్ ఇప్పటికీ ఇవ్వలేదు. మరో నాలుగు నెలల డిఏ ఏరియర్స్ బకాయిలున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలన్న డిమాండ్ తోఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఏకమమవుతున్నాయి. జేఏసీ గా ఏర్పడ్డ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

07:08 - May 11, 2016

హైదరాబాద్  : తెలంగాణ ఆర్టీసీ లో సమ్మె తప్పదా? ఈ నెల 16న సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘా ల జెఏసి సమాయత్తమవుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? తెలంగాణ ఆర్టీసీ జెఏసి సమ్మె నోటీసు ఇవ్వాలని ఎందుకు భావిస్తోంది? గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు ఇచ్చిన హామీలేమిటి? అవి ఎంత వరకు అమలవుతున్నాయి? తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో పయనిస్తోందా? మరిన్ని నష్టాల్లో కూరుకుపోతోందా? తెలంగాణ ఆర్టీసీ మరింత సమర్ధవంతంగా సేవలందించాలంటే ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించాలి? ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న వ్రుత్తిపరమైన సమస్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జెఏసీ కన్వీనర్ విఎస్ రావుగారుతో ఈనాటి జనపథంలో ...ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి...

07:03 - May 11, 2016

ఢిల్లీ : ఆల్ ఇండియా సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తాను చాటారు. అత్యధిక మార్కులతో అత్యుత్తమ ర్యాంకుల్ని సాధించి అఖిల భారత స్థాయి సివిల్ సర్వీసుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు తిరుగులేదని నిరూపించారు. దాదాపు 65 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ లో అర్హత సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఫలితాలలో నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కృష్ణ ప్రతిభ కనబర్చాడు.ఆల్ ఇండియా స్థాయిలో 158 వ ర్యాంకును సాధించాడు. ఇంతటి ప్రతిభ కనబర్చిన సాయికృష్ణను పలువురు అభినందించారు.

ప్రతిభ చాటిన ఏపీ విద్యార్థులు ...

సరైన లక్ష్యం, ప్రణాళిక, గురువుల సహకారం సూచనలతో అత్యుత్తమ ర్యాంకు సాధ్యమైందని సాయికృష్ణ అన్నారు. ఇక కర్నూలు జిల్లాలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో వల్లూరి క్రాంతి ఆలిండియా 65 వ ర్యాంకును సాధించింది. తమ కూతురు సివిల్ సర్వీసెస్ లో సెలక్ట్ కావడం సంతోషంగా ఉందన్నారు కుటుంబసభ్యులు. బెజవాడకు చెందిన చిట్కూరి రామకృష్ణ ఆలిండియా సివిల్స్ ఫలితాలలో 84 వ ర్యాంకు సాధించాడు. గతంలోనే IPSకు సెలక్ట్ అయిన రామకృష్ణ తాజాగా విడుదలయిన ఫలితాలలో సివిల్స్ కు సెలక్ట్ అయ్యాడని.. తమ కుమారుడు ఈ ఘనతను సాధించడం సంతోషంగా ఉందన్నారు తల్లిదండ్రులు.

తెలంగాణ విద్యార్థుల సత్తా...

అటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్గొండ జిల్లా విద్యార్థి మహేష్ రావిరాల ఆలిండియా సివిల్స్ ఫలితాలలో 189 వ ర్యాంకును సాధించి ప్రతిభ చాడాడు. తనకు ఈ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నాడు మహేష్ వరంగల్ కు చెందిన జొన్నల గడ్డ స్నేహజ ఆలిండియా సివిల్ సర్వీసెస్ 103 వ ర్యాంకును సాధించింది. సరైన ప్రిపరేషన్ , తరచూ పరీక్షలను రాయడం ద్వారా ఈ ఘనతను సాధించానని.. తమ కుటుంబసభ్యుల సహకారంతోనే ఈ ఘనతను సాధించానని స్నేహజ తెలిపారు. మొత్తం 1164 పోస్టులకు 1078 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మరో 15 రోజుల్లో ఆలిండియా సివిల్ సర్వీసెస్ లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల మార్కులను వెబ్ సైట్ లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.

06:54 - May 11, 2016

ఢిల్లీ : జీరో స్కూల్స్‌పై తెలంగాణ ప్రభుత్వ తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తెలంగాణలోని 400 ప్రభుత్వ పాఠశాలల్లో కనీస విద్యార్థులు లేరని.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. సున్నా ప్రవేశాలున్న పాఠశాలలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది. తెలంగాణలో సున్నా ప్రవేశాలు ఉన్న పాఠశాలలపై కోర్టు ఏర్పాటు చేసిన అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీ సుప్రీం కోర్టుకు ప్రాథమిక నివేదికను సమర్పించింది. సర్కార్‌ స్కూళ్లకు విద్యార్థులను రప్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడేళ్ల లోపు వయసున్న పిల్లలకు సైతం ప్రైవేటు పాఠశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయని, అందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయని అమికస్ క్యూరీ కమిటీ కోర్టుకు వివరించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో చదివించేందుకే ఆసక్తి కనబరుసున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

నాణ్యమైన విద్యను అందించడం యంత్రాంగం బాధ్యత : సుప్రీంకోర్టు

మరోవైపు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా చేయడం వారికి నాణ్యమైన విద్యను అందించడం యంత్రాంగం బాధ్యతేనని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా పనిచేస్తుండగా తెలంగాణలో ఈ దుస్థితికి కారణమేంటని ప్రశ్నించింది. జూలై మొదటివారంలోగా తెలంగాణలోని సున్నా ప్రవేశాలున్న పాఠశాలలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది.

విద్యార్థుల ప్రవేశాల కోసం చర్యలు తీసుకుంటామన్న టీ.ఎస్ ప్రభుత్వం ....

సర్కార్‌ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లలోనే చదివించేందుకు మొగ్గు చుపుతున్నారని.. పంచాయితీ స్ధాయిలో కమిటీలు వేసి ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు చదువుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తామని కడియం తెలిపారు.ఇప్పటికే ఒకసారి గ్రామాల్లో పర్యటించిన అమికస్‌ క్యూరీ కమిటీ మరోసారి తెలంగాణలో పర్యటించి జీరో స్కూల్స్‌ వివరాలు సేకరించనుంది.

06:47 - May 11, 2016

హైదరాబాద్ : పాలేరు ఉపఎన్నిక మంత్రి కేటీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. పార్టీ అధినేత నిర్ణయంతో ఓ మంత్రి పోటీ చేస్తున్న స్థానంలో మరో మంత్రి కేటీఆర్‌ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తుండడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. విజయం విషయం ఎలా ఉన్నా మెజార్టీ ఎంత అనేది గులాబి నేతల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీలో తన పట్టును నిరూపించుకునేందుకు ఉప ఎన్నికల ఫలితంపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది.

భారీ మెజారిటీపై గులాబీ గురి....
ఉప ఎన్నికల పార్టీగా గుర్తింపు పొందిన గులాబీపార్టీ,..ఖమ్మం జిల్లా పాలేరులో కూడా భారీ మెజార్టీపైనే కన్నేసింది. ఆ స్థానం అధికార పార్టీ స్థానం కాకపోయినా అక్కడ పాగా వేసేందుకు గులాబి దళపతి పావులు కదుపుతున్నారు. అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించడంతో పాటు గులాబి దళాలను పాలేరులో మోహరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికకు పార్టీ కీలక నేత మంత్రి కేటీఆర్‌ను ఇంచార్జ్‌గా సీఎం నిర్ణయించారు.

పాలేరు ప్రచారంలో బిజీ బిజీ గా గులాబీ నేతలు...
దాదాపు15 రోజులుగా ఎన్నికల ప్రకియలో బిజీగా గడుపుతున్న నేతలు..గతంలో జరిగిన ఉప ఎన్నికలను బేరీజు వేసుకుంటున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీదే అయినా..ఆ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా మంత్రి హరీష్‌రావు వ్యవహరించారు. ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో కార్యకర్తలను ఎన్నికలను సిద్ధంచేసి అంతా తానై నడిపించారు. అటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోనూ మొదటి సారి గులాబి జెండాను భారీ మెజార్టీతో ఎగుర వేసారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కూడా హరీష్‌రావు ఒక్కరే ఇంచార్జ్ గా ఉండి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. కాని పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌కు ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆ నియోజకవర్గంలో దాదాపు సగం మంత్రులు తిష్ట వేశారు. 30 మంది వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాలేరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికితోడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. యువ నేత ఆశీస్సుల కోసమో...లేదంటే పార్టీ అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుందా అనేది అంతు చిక్కడం లేదు. ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అధికార పార్టీ నేతలు ఈ స్థాయిలో పాలేరులో ప్రచారం నిర్వహిస్తుండం పార్టీలో కూడా చర్చనీయంశంగా మారింది.

కేటీఆర్ మార్క్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చనీయం....
గ్రేటర్‌లో ఏకపక్షంగా ఫలితాలు తేలడంతో సక్సెస్‌ సాధించిన కేటీఆర్‌కు పాలేరు లో వ్యవహరిస్తున్న తీరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. పార్టీ పరంగా ఈ స్థాయిలో ప్రచారం నిర్వహించి అరకొర మెజార్టీ సాధిస్తే..... భవిష్యత్ లో పార్టీలో కేటీఆర్ మార్క్ ఎలా ఉంటుందనేది ఎన్నికల ద్వారా తేలిపోతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే మంత్రి హరీష్ మాత్రం ఇప్పటి వరకు పాలేరులో ప్రచారం కోసం అడుగు పెట్టలేదు.

06:40 - May 11, 2016

హైదరాబాద్ : ఆ దుర్మార్గుల పాపం పండింది...వారు చేసిన కిరాతకాలకు చెక్‌పడింది..ఇక నాలుగుగోడల మధ్య ఉండాల్సిందే.. రెండేళ్లుగా సాగిన వాదోపవాదాలు విన్న న్యాయస్థానం స్నేక్‌గ్యాంగ్‌లో ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది.. మరికొన్ని గంటల్లోనే వారికి శిక్షలు ఖరారు చేయనుంది... ఆడాళ్లలో భయాన్ని సృష్టించిన స్నేక్‌ గ్యాంగ్‌లో సభ్యులను దోషులుగా ప్రకటించడంతో సిటిజన్లలో హర్షం వ్యక్తమవుతోంది..

అకృత్యాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్....

సంచలనంతో పాటు ఆడాళ్లలో భయాన్ని సృష్టించిన స్నేక్ గ్యాంగ్‌లోని తొమ్మిది మందిలో ఎనిమిది మందిని రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది...ఈ కేసులో A9గా ఉన్న సాలం హమ్‌దీ కేసును న్యాయస్థానం కొట్టివేసింది... నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌ కేసులో న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది...దోషులుగా తేల్చినవారికి బుధవారం శిక్షలు ఖరారు చేయనుంది...

ఫాంహౌజ్‌లో స్నేక్‌గ్యాంగ్‌ అకృత్యాలు...

సరిగ్గా రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ నగర శివార్లలోని ఫాంహౌజ్‌లో చొరబడ్డ స్నేక్‌గ్యాంగ్‌ ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది...దీంతోనే ఈ గ్యాంగ్‌ అకృత్యాలు కూడా బయటపడ్డాయి...జరిగిన దారుణాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులపై భారత శిక్షా స్మృతి 376డి, 341, 452, 323, 395, 506, 212, 411 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు...

స్నేక్‌గ్యాంగ్‌ ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయానీ దుర్మార్గం.....

స్నేక్‌గ్యాంగ్‌ ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయానీ అంత క్రూరమైన దుర్మార్గుడు లేడంటే నమ్మశక్యం కాదు.. బాల్యం నుంచే నేరాలు చేయడం ఆరంభించిన దయానీలో దయ,కరుణ,జాలి లేనేలేవు...ఈ విపరీతంతోనే పాతబస్తీలోని కొందరు యువకులను పోగు చేసుకుని గ్యాంగ్ ఏర్పాటు చేసిన దయానీ పాములను యువతులపైకి విసిరి వివస్త్రలను చేయడం..అత్యాచారాలు చేయడం..వాటిని చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేయడం చేస్తుండేవారు.. ఇలా ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతూ సెటిల్‌మెంట్ల పేరుతో ఎందరిపైనో హత్యాయత్నాలు..దాడులు చేసిన గ్యాంగ్‌ కిరాతకాలు బయటపడ్డంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని కేసులు పెట్టారు..వారు బయటకు రాకుండా కట్టడి చేయగలిగారు..రెండేళ్లుగా కొనసాగిన కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది...వారికి శిక్షలు బుధవారం శిక్షలు ఖరారు చేయనుంది.

Don't Miss