Activities calendar

13 May 2016

మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం

మెదక్ : నంగునూరు మండలం అక్కనపల్లిలో మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం ఎదురయ్యింది. 20 రోజులుగా తాగునీరు అందడం లేదని మంత్రి హరీష్ రావును గ్రామస్థులు నిలదీశారు. అధికారులపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు.

20:10 - May 13, 2016

హైదరాబాద్ : చెవి కమ్మలదాకా చేరిన అమ్మల కథ.. ఈ ముచ్చట రాస్తే రామాయణమే కదా, సర్కారు దావఖానాలు బాగుపడాలనట...ప్రైవేటు ఆసుపత్రుల ఓపెనింగ్ లకు పోయేటోళ్ల మాట, దారం తెగిన సిరిసిల్ల నేతన్న బతుకు..టెక్స్ టైల్ మగ్గాల మీద అతకని చితుకు, ఓపెన్ కాస్ట్ వద్దంటున్న ప్రజలు...తోడుగ కొట్లాడుతమంటున్న ప్రతిపక్షాలు, అన్నం పెట్టిన పాపానికి అనంతలోకాలకు.. నక్సలైట్ ఎజెండాను అమలు చేసిన ఎస్సై, ట్యాంకర్ కొబ్బరి నూనె రోడ్ల పాలు... అందులోకెల్లి 5 లీటర్లు దొరికినా చాలు... ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన మసాల ముచ్చట్లు చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల విభజన పూర్తి

హైదరాబాద్ : ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల విభజన పూర్తి అయ్యింది. ఈ మేరకు డీవోపీటీ తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణకు అదనంగా 41 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించారు. దీంతో తెలంగాణ లో ఐఏఎస్ లసంఖ్య 208కి చేరింది.

18:44 - May 13, 2016

హైదరాబాద్‌ : హైదరాబాద్ అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని ఉప్పల్ స్డేడియం ముందు అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. మే 27 తో పదవీకాలం ముగిసిన హెచ్‌సీఏకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షుడు హర్షద్ అయూబ్ సభ్యుల అనుమతి లేకుండా నిధులు మంజూరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని సభ్యులు ఆరోపించారు. హెచ్‌సీఏలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలపై ఏసీబీ విచారణ జరపాలని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 

18:40 - May 13, 2016

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల దగ్గర.. కార్మికులకు కనీస వసతులు కల్పించాలని గత నాలుగు రోజులుగా వామపక్ష నేతలు, ట్రేడ్‌ యూనియన్లు చేస్తున్న ఆందోళనలకు ఎల్‌అండ్‌ టీ సంస్థ దిగొచ్చింది. యుద్ధ ప్రాతిపదికన కార్మికులకు కనీస వసతులు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులకు మరుగుదొడ్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, రేకుల షెడ్లకు వెంటిలేషన్‌తో పాటు.. లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. సీపీఎం పోరాటం ఫలితంగా తమకు సౌకర్యాలు కల్పిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. 

ఐరన్ లెడ్ పేలి ఆరుగురికి గాయాలు

మహబూబ్ నగర్ : షాద్ నగర్ మండలం ఎల్లికట్ట శివారులోని దేవశ్రీ ఐరన్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. ఐరన్ లెడ్ పేలి ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

18:17 - May 13, 2016

విజయవాడ: ఆంధ్రా ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అధికారికంగా తేల్చేసింది. ఆ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సిద్దార్థనాథ్‌సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం... టీడీపీతో సంబంధాలపై ఆయన ఆచితూచి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న సిద్దార్థనాథ్‌ సింగ్‌..రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించి సాయం చేస్తామని స్పష్టం చేశారు. చట్టంలో లేకపోయినా ప్రత్యేక సాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదే అంశం పై వివిధ పార్టీ ఎలా స్పందించాయో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 30 కంపార్టు మెంట్ లలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు,నడకదారి భక్తుల దర్శనానికి 7గంటల సమయం పడుతుంది. వసతి గదుల కొరతతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

సుప్రీం కోర్టులో ఎంపి మేకపాటి పిటిషన్ దాఖలు

ఢిల్లీ : పార్టీ ఫిరాయించిన 16మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని సుప్రీం కోర్టులో ఎంపి మేకపాటి పిటిషన్ దాఖలు చేశారు.

సీపీఎం పోరాటంతో దిగొచ్చిన ఎల్ అండ్ టీ సంస్థ

గుంటూరు : సీపీఎం, ట్రేడ్ యూనియన్ల పోరాటంతో ఎల్ అండ్ టీ సంస్థ దిగొచ్చింది. తాత్కాలిక సచివాలయం వద్ద కార్మికుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఎల్ అండ్ టీ వసతులు ఏర్పాట్లు చేస్తోంది. మరుగుదొడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్, రేకుల షెడ్లుకు వెంటిలేషన్తో పాటు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కార్మికులకు కనీస వసతులు కల్పించాలని గత నాలుగు రోజులుగా వామపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

మందడంలో అధికారులను నిలదీసిన రైతులు

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతులు అధికారులను నిలదీశారు. భూ సేకరణ - సామాజిక ప్రభావం అంచాన పేరుతో అధికారులు సదస్సును ఏర్పాటు చేశారు. భూసేకరణ పై అధికారులు మాట్లాడడంపై రైతులు మండి పడ్డారు. రాజధానికి భూములు ఇవ్వకపోతే భూసేకరణ చేసి లాక్కుంటారా అని రైతులు అధికారులను నిలదీశారు. దీంతో విస్తుపోయిన అధికారులు సదస్సులో సామాజిక ప్రభావం గురించే మాట్లాడాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు టిడిపి సిద్ధమా:అంబటి

విజయవాడ : ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు టిడిపి సిద్ధమా అని వైసీపీ నేత అంబటి టిడిపి నేతలను ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని బిజెపి మరోసారి స్పష్టం చేసిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కేంద్ర కేబినెట్ లో టిడిపి ఇంకా కొనసాగుతుందా అన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ఎపుడూ ప్రత్యేక హోదా అడగలేదని విజయవాడ సాక్షిగా సిద్ధార్థ నాథ్ సింగ్ అన్నారని... ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలని.. లేని పక్షంలో మేం చేసే పోరాటానికైనా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి దొంగ హామీలు ఇచ్చి దోపిడీ పాలన చేస్తోందని అంబటి మండి పడ్డారు. 

బొగ్గు కేసులో జేఐపీఎల్ డైరెక్టర్లకు మధ్యంతర బెయిల్

ఢిల్లీ : బొగ్గు స్కాం కేసులో జేఐపీఎల్ డైరెక్టర్లకు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. ఆర్ సీ రుంగ్తా, ఆర్ ఎస్ రుంగ్తాలకు జులై 31 వరకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

17:29 - May 13, 2016

హైదరాబాద్ : నగరంలో కార్బైడ్‌ రహిత మామిడిపండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గడ్డి అన్నారం మార్కెట్లో కోట్లాది రూపాయలతో నిర్మించిన ఇథిలీన్‌ చాంబర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకనుంచి గడ్డి అన్నారం మార్కెట్లో స్వచ్చమైన మామిడి పండ్లు లభ్యంకానున్నాయి.

సహజసిద్ధంగా పండిన మామిడిపండ్లు...

హైదరాబాద్ నగరంలో ఇకనుంచి స్వచ్చమైన, ప్రకృతి సహజసిద్ధంగా పండిన మామిడిపండ్లు లభ్యంకానున్నాయి. దీంతో ఈ సీజన్‌లో మామిడి ఫలాలను ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ ప్రేమికులకు కార్భైడ్ భయం తొలగిపోనుంది. ఇకనుంచి ఏ పండైన ప్రకృతి సహజసిద్ధంగా పండిన పండ్లను నిర్భయంగా తినే అవకాశం ఉంది.

హైకోర్టు ఉత్తర్వులతో ...

దశాబ్దాలుగా కార్భైడ్ ఫలాలకు అలవాటు పడిన ప్రజలకు కార్బైడ్ నిషేధించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో తాజా ఫలాలను తినలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇథిలీన్ చాంబర్‌ల ద్వారా పండ్లను పండించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్లో ప్రభుత్వ నిర్వహణలో 60 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంతో 6 చాంబర్లను ఏర్పాటు చేసారు.

కోటి రూపాయల వ్యయంతో 6 చాంబర్ల ఏర్పాటు ...

ఫలాలను పండించే కార్బైడ్ అన్ని రకాల పండ్లకు వాడుతున్నా మామిడి పండ్ల సీజన్ వచ్చేసరికి దీని వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ఇవి తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ప్రజలను కార్బైడ్ భారీ నుండి కాపాడటానికి ఇథిలీన్ చాంబర్లను ఏర్పాట చేసారు. వీటిలో మానవ ఆరోగ్యానికి ఎలాంటి హాని చేకూర్చని ఇథిలిన్‌ను పండ్లను పండించటానికి ఉపయోగిస్తారు. దీని కోసం సుమారు కోటి రూపాయల వ్యయంతో ఆరు చాంబర్లను ఏర్పాటు చేసారు. ముందుగా ఈ చాంబర్లలో వాటి సామర్థ్యం మేరకు మామిడి పండ్లను ట్రేలలో నింపుతారు. ఆ తర్వాత చాంబర్లలో టెంపరేచర్ 25 డిగ్రీలకు తగ్గకుండా ఉండేలా చూస్తారు. వాటిలోకి వదిలే శీతల గాలి ద్వారా ఇథిలీన్‌ను పంపిస్తారు. ఇలా ఇథిలీన్‌ పంపిన మూడు రోజులలో మామిడి కాయలు పక్వానికి వచ్చి పండుతాయి. ఇవి మంచి రుచిగా కూడా ఉంటాయి. మూడు రోజుల తర్వాత వాటిని చాంబర్ నుండి తీసి మార్కెట్‌కు పంపిస్తారు.

అరటి, సపోట, ఇతర కాయలను పండించవచ్చు ...

ప్రతి మూడు రోజులకొకసారి ఇలా చేస్తూ ఎప్పటికప్పుడు మార్కెట్‌కు వచ్చే కాయలను పండ్లుగా మార్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అయితే ఈ చాంబర్‌లను మామిడి కాయలకే కాకుండా అరటి, సపోట వంటి కాయలను కూడా పండించటానికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కాకుండా మార్కెట్‌లో ఉన్న ప్రయివేటు వ్యాపారులు కూడా ఈ చాంబర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆరుకు పైగా ప్రైవేటు వ్యాపారులు ఈ చాంబర్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. వాటిలో రెండు అందుబాటులోకి కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ చాంబర్ల ద్వారా పండించిన పండ్లను కార్బైడ్ లేని మామిడి పండ్లు అని బోర్డులు పెట్టి మరి ప్రజలకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

నగరవాసులు సంతోషం...

మొత్తానికి కార్బైడ్ రహిత పండ్లు అందుబాటులోకి వస్తున్నందుకు నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుతో స్వచ్చమైన పండ్లను తినే భాగ్యం కలుగుతోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

అసోంలో నలుగురు తీవ్ర వాదుల అరెస్టు..

అస్సాం : నలుగురు సాయుధ తీవ్రవాదులను భారత భద్రతా బలగాలు పట్టుకున్నాయి. ముస్లిం టైగర్ ఫోర్స్ ఆఫ్ అస్సాం (ఎంటీఎఫ్ ఏ) దళానికి చెందిన వీరి నుండి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

17:01 - May 13, 2016

ఢిల్లీ : 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న సాధ్వి ప్రాచీపై ఉన్న మోకా చట్టాన్ని ఉపసంహరించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. దీంతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌తో పాటు ఆరుగురికి ఈ కేసులో క్లీన్ చీట్ లభించింది. దీనికిమా సంబంధించి ఎన్‌ఐఏ కోర్టుకు చార్జిషీట్‌ దాఖలు చేయడంతో సాధ్వితో పాటు ఆరుగురికి త్వరలో విముక్తి కలగనుంది. 2008లో మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు మృతి చెందారు. 79 మంది గాయపడ్డారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడ్డారని దీని వెనక హిందూ సంస్థ హస్తం ఉందని భావించిన మహారాష్ట్ర ఎటిఎస్‌ సాధ్వితో పాటు కర్నల్‌ పురోహిత్‌, తదితరులను అరెస్ట్‌ చేసింది. సాధ్వి, పురోహిత్ లతో సహా మరో 12 మందిపై కేసు నమోదైంది. కేంద్రం సూచనమేరకే ఎన్‌ఐఏ సిబిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ ఆరోపించారు. నేరస్థులకు రక్షణ కల్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

16:59 - May 13, 2016

ఢిల్లీ :రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇవాళ 53 మంది సభ్యులు రాజ్యసభ నుంచి రిటైరయ్యారు. పదవీ విరమణ చేస్తున్న ఎంపీల సేవలను ప్రధానితో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు అభినందించారు. ఈ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రధాని మోది ఆందోళన వ్యక్తం చేశారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో అగస్టా స్కాం, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చ జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

16:57 - May 13, 2016

విజయవాడ : ప్రజా రాజధానిగా ఉండాల్సిన అమరావతిని పెట్టుబడుల రాజధానిగా సీఎం చంద్రబాబునాయుడు మార్చేశాడని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి భూములు లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. అమరావతిలో వామపక్ష నాయకులపై లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు. అమరావతి ఓ మాయా ద్వీపంగా మారిందని రామకృష్ణ ఆరోపించారు.

16:55 - May 13, 2016

హైదరాబాద్ : కళ్యాణలక్ష్మి పథకాన్ని బీసీ,ఈబీసీలకు వర్తింపు చేస్తూ వెబ్‌సైట్‌ను మంత్రి జోగురామన్న ప్రారంభించారు. ఏప్రిల్‌ ఒకటి తర్వాత వివాహమైన బీసీ,ఈబీసీ వారు ఇందుకు అర్హులని తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు 58 వేల మందికి లబ్ధి చేకూర్చామని చెప్పారు. 

16:53 - May 13, 2016

హైదరాబాద్‌ : మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని సాలిక్టేట్స్ కెమికల్‌ పరిశ్రమలో మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. 10 ఫైరింజన్ల వరకు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఉదయం ఫ్యాక్టరీలోంచి దట్టమైన పొగలు రావడం.... సిలిండర్లు పేలడంతో... స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

ఇంకా కేబినెట్ లో కొనసాగుతారా - వైసీపీ..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ పేర్కొన్న తరువాత కూడా కేంద్ర కేబినెట్ లో టిడిపి ఇంకా కొనసాగుతుందా అని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక హోదా అడగలేదని విజయవాడ సాక్షిగా సిద్ధార్థ నాథ్ సింగ్ పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలని, లేకపోతే తాము చేసే పోరాటాలకైనా మద్దతివ్వాలని సూచించారు. టిడిపి దొంగ హామీలిచ్చి దోపిడి పాలన చేస్తోందని, ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 

16:52 - May 13, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని బీజేపీ నేత, మాజీ మంత్రి పురందేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించి కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ, 14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని అన్నారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామని కేంద్రం చెబుతోందని ఆమె చెప్పారు. ఇఫ్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని ఆమె తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం బీజేపీ చిత్తశుద్ధితో పని చేసిందని, ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని ఆమె గుర్తు చేశారు. 

16:50 - May 13, 2016

విజయవాడ: ఆంధ్రా ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అధికారికంగా తేల్చేసింది. ఆ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సిద్దార్థనాథ్‌సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం... టీడీపీతో సంబంధాలపై ఆయన ఆచితూచి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న సిద్దార్థనాథ్‌ సింగ్‌..రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించి సాయం చేస్తామని స్పష్టం చేశారు. చట్టంలో లేకపోయినా ప్రత్యేక సాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

కేంద్ర నిధులపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి - సిద్ధార్థ్ నాథ్..

విజయవాడ : ఏపీ అభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జీ సిద్ధార్థ నాథ్ సింగ్ పేర్కొన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని, ఎక్కడ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామో చెప్పాలని సూచించారు. చట్టంలో లేకపోయినా నిధులు కేటాయిస్తున్నామని, కేంద్రం రవాణా శాఖకు రూ. 65వేల కోట్లు ఇచ్చిందన్నారు. రెవెన్యూ లోటు కింద ఏపికి రూ. 22,112 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఏపీకి ఇచ్చిన నిధులే తమ చిత్తశుద్ధిని చెబుతోందని తెలిపారు.

భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్..

ముంబాయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 301 పాయిట్లు నష్టపోయి 25,940 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 7,815 వద్ద ముగిసింది. 

16:30 - May 13, 2016

ఇటీవలే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హాట్ నటి బిపాసాబసు రుసరుసలాడుతోంది. 'నా హనిమూన్ ఎలా చేసుకుంటే మీకెందుకు' అంటూ కోపం ప్రదర్శిస్తోంది. ఎవరి లైఫ్ తో వాళ్లు సంతోషంగా ఉంటే మంచిది కదా అంటూ ఓ సలహా పడేస్తోంది. అసలు ఎందుకు కోపం వచ్చింది ? కరణ్ సింగ్ తో బిపాస బసు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ జంట మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తన పడక గదిలో జరిగే విషయాలను రోజుకో విధంగా కళల రూపంలో ఆమె వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా.. టవల్స్, దుప్పట్లతో చిత్ర విచిత్ర బొమ్మలను తయారుచేసి.. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పోస్ట్ చేసింది. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై బిపాసా ఘాటుగానే స్పందించింది. 'ఇలాంటి కామెంట్లు చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తారో తెలియదు. నేను పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్యూటీఫుల్ టవల్ ఆర్ట్ ను ఎందుకు గుర్తించరు. హౌస్ కీపింగ్ ప్రతిభకు టవల్ ఆర్ట్ అద్దం పడుతోంది. ఏదీ మారాలి. నాకు పెళ్లైంది కాబట్టి టవల్ ఆర్ట్ ను ఇష్టపడకూడదా? ఇది హాస్యాస్పదం.' అంటూ బిపాసా పేర్కొంది. నేను ఎలా ఉన్నా.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. నా హనీమూన్ ఎలా జరిగినా మీకెందుకంటూ నెటిజన్లపై విరుచుకుపడింది. అదండి సంగతి...

16:22 - May 13, 2016

విజయవాడ: ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవనుండడంతో అందుకు తగ్గట్టు ఖరీఫ్ సీజన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారవు. ఏపీ సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రబీ మాదిరిగానే ఖరీఫ్‌లోనూ పంటను ఈ బుకింగ్ చేస్తామని.. దీని ద్వారా కౌలు రైతులకు ఉపయోగకరమని వెల్లడించారు. సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం కోసం జిల్లాకు 3 వేల మంది రైతులను ఎంపిక చేశామని కూడా మంత్రి తెలిపారు. 

16:07 - May 13, 2016

మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'నాని' హీరో గా నటిస్తున్న తాజా చిత్రం 'జెంటిల్ మన్'. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఈ నెల 22 న చిత్ర గీతాలను ఆవిష్కరించనున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో నాని సరసన నివేదితా థామస్, సురభిలు జంటగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో 'నాని' విలన్ ? హీరో ? అనేది తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

15:50 - May 13, 2016

భారీ బ‌డ్జెట్ చిత్రాల్ని తెర‌కెక్కించ‌డంలో అనుభ‌వం ఉన్న మరో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్. బాహుబ‌లి ని ఇన్స్పిరేష‌న్ గా తీసుకొని గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని దాదాపు 70కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించాడు. బాహుబలి అంతటి రేంజ్ లో కాకపోయినా కాస్త భారీగానే ఈ చిత్రాన్ని నిర్మించి బాగానే లాభాల్ని తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో సైతం రుద్రమదేవి చిత్రాన్ని 3డి, 2డి ల్లో విడుదల చేసాడు గుణశేఖర్. ఈ సినిమా తెచ్చిపెట్టిన కాన్ఫిడెన్స్ తో రుద్రమదేవి చిత్రానికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడ్ని నిర్మించబోతున్నాడు. హీరో రేంజ్ ను బట్టి బడ్జెట్ ను ఫిక్స్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కథానాయకుడి కోసం గుణశేఖర్ అన్వేషణలో ఉన్నాడు ప్రభాస్, బన్నీ, మహేష్ బాబు లాంటి హై రేంజ్ హీరోల్లో ఎవరో ఒకిరిని సెలెక్ట్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడు. దీన్ని దాదాపు 100కోట్ల బడ్జెట్ తో నిర్మించే ఆలోచనతో ఉన్నాడు. రుద్రమదేవి కుమార్తె కొడుకు ప్రతాపరుద్రుడు. కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు యుద్దవిద్యల్లో ఆరితేరిన వాడు. ఎన్నో యుద్దాల్లో గెలిచి తన రాజ్యంను గెలిచిన వాడు. ఇంతటి పరాక్రమవంతుడి చరిత్రను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో గుణశేఖర్‌ ఈ ప్రయత్నం మొదలు పెట్టాడు. రుద్రమదేవి’ విడుదల కాగానే ఈ ప్రతాప రుద్రుడు మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. రుద్రమదేవి’కోసం వేసిన సెట్టింగ్స్‌ మరియు ఇతర కాస్ట్యూమ్స్‌ అన్ని కూడా ‘ప్రతాప రుద్రుడు’ సినిమాకు ఉపయోగపడే అవకాశాలున్నాయి. దాంతో బడ్జెట్‌ తగ్గే ఛాన్స్‌ ఉంది. ఇక ఈ ప్రతాప రుద్రుడు పాత్రలో ఏ హీరో నటిస్తాడో అంటూ ఇప్పటి నుండే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

15:50 - May 13, 2016

ఢిల్లీ : తమ సస్పెన్షన్‌, జరిమానా వ్యవహారంపై కన్హయ్యకుమార్‌తో సహా పలువురు జేఎన్‌యూ విద్యార్థులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఉన్నతస్థాయి విచారణ కమిటీ తీసుకున్న చర్యలపై ఈనెల 30లోగా వివరణ ఇవ్వాలని జేఎన్‌యూను ఆదేశించింది. మరోవైపు విద్యార్థుల చేత నిరాహారదీక్ష విరమింపజేయాలని.. అలా అయితేనే విచారణ చేపడతామని కోర్టు కన్హయ్యకుమార్‌కు సూచించింది. తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ... గత 17 రోజులుగా యూనివర్సిటీలో విద్యార్థులు దీక్ష కొనసాగిస్తున్నారు. 

15:47 - May 13, 2016

ఒక సినిమాకి క‌థ రాసుకొని, స్ర్కీన్ ప్లే సెట్ చేసుకొని, కేస్టింగ్ సెలెక్ట్ చేసుకొని దాని ట్రాక్ ఎక్కించ‌డం తో ద‌ర్శ‌కుడి ప‌నైపోలేదు. దాన్ని ప్లాన్డ్ గా మార్కెట్ చేసుకొని, క‌మ‌ర్షియ‌ల్ ప‌ట్టాలెక్కించ‌డం అంత క‌న్నా పెద్ద‌ప‌ని. ఈ ప‌ని ఓ మోస్త‌రు పేరున్న ద‌ర్శ‌కుడెవ‌రైనా చేయ‌గ‌ల‌డు. కానీ ఆ సినిమాతో పెట్టిన పెట్టుబ‌డిని తిరిగి తేవ‌డ‌మే కాకుండా, దానికి ప‌దిరెట్లు లాభాలు తెచ్చిపెట్టే ద‌ర్శ‌కులు టాలీవుడ్ లో వేళ్ల‌మీద ఉన్నారు. ఒక రూపాయి పెట్టుబడిపెడితే దాన్ని ప‌ది మార్గాల్లో ప‌దిరెట్లు చేయ‌డ‌మే ద‌ర్శ‌కుడి టాలెంట్. ఈ సూత్రాన్నిభారీ బ‌డ్జెట్ సినిమాల‌కు కూడా వ‌ర్తింప‌చేసేవాడే ద‌ర్శ‌క ధీరుడు. అలాంటి ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి ముందు వ‌ర‌స‌లో ఉంటాడు. ఈగ సినిమాతో ఈ ఈక్వేష‌న్ ను సెట్ చేసాడు రాజ‌మౌళి. త‌రువాత బాహుబ‌లితో దాన్ని బ‌హుమార్గాల్లోకి మ‌ళ్లించి భారీ లాభాలు ఆర్జించే ప్ర‌ణాళిక‌లు ర‌చించాడు. బాహుబ‌లి చిత్రం అన్నిభాష‌ల్లో క‌లుపుకొని దాదాపు 650 కోట్ల క‌లెక్ష‌న్స్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా రెండో భాగానికి దాన్ని మ‌రింత విస్త‌రించి టార్గెట్ ను 1000 కోట్ల‌కు సెట్ చేసాడని టాక్. మొద‌టి భాగం తెచ్చిపెట్టిన క్రేజ్ తో రెండోభాగం బాగా మార్కెట్ చేసుకుంటోంది. ఈ సినిమాకి కూడా వ‌సూళ్లు అదే రేంజ్ లో ఉండ‌బోతున్నాయని టాక్. చూడాలి మరి ఎలాంటి రేంజ్ ఉండబోతోందో ? 

15:46 - May 13, 2016

ఢిల్లీ : దేశంలో కరవు పరిస్థితులపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధుల లేమి పేరుతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని మండిపడింది. కరవు పరిస్థితులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా కేంద్రం తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవు సహాయక చర్యలను చేపట్టడంలో నిర్లక్ష్యంపై కేంద్రాన్ని నిలదీసింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు ఫుడ్‌ కమిషనర్‌లను నియమించాలని రాష్ట్రాలకు సూచించింది. జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్థిక వనరులు సమకూర్చాలని కేంద్రానికి స్పష్టం చేసింది. 

ప్రత్యేక హోదా కోసం పోరాటాలు - సీపీఐ..

విజయవాడ : ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదిర్శ రామకృష్ణ పిలుపునిచ్చారు. గతంలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన వెంకయ్య నాయుడు ఇప్పుడు పార్లమెంట్ లో దానిపై చర్చ కూడా జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 

చెన్నై థీమ్ పార్కు యజమాని..మేనేజర్ అరెస్టు..

చెన్నై : కిష్కింద థీమ్ పార్కులో డిస్కో డ్యాన్సర్ రైడ్ కూలిన ఘటనలో థీమ్ పార్కు యజమాని, మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ట్రయల్ రన్ సందర్భంగా రైడ్ కూలిపోవడంతో సిబ్బంది ఒకరు మృతి చెందగా మరో 24 మందికి గాయాలయిన సంగతి తెలిసిందే.

 

తెలంగాణపై వడగాలులు..

హైదరాబాద్ : రాగల 72 గంటల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

15:37 - May 13, 2016

కృష్ణా: విజయవాడలోని ఏపీ బీజేపీ కోర్ కమిటీ కీలక సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ బిజెపి ఇన్ ఛార్జ్ సిద్ధార్థ్ నాధ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏపీకి ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన సూచించారు. ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీ అనేవి మానసికమైన భావోద్వేగ సమస్యలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో మాట్లాడి, ప్యాకేజీ, హోదాపై మాట్లాడుతానని ఆయన చెప్పారు ప్రత్యేకహోదాను విభజన చట్టంలో పేర్కొనలేదని ఆయన చెప్పారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ నెరవేరుస్తామని ఆయన చెప్పారు. 6 వేల నాలుగు కోట్ల రూపాయలు చట్టంలో లేని నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదాపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పార్టీ సమవేశాల్లో చర్చించిన అంశాలను అమిత్ షాకు వివరిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ 65 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన అన్నారు. వచ్చేనెల ఏపీలో అమిత్ షా పర్యటిస్తారని, బూత్ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడమే బీజేపీ ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు. 

రాజ్యసభ నిరవధికంగా వాయిదా...

ఢిల్లీ : రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యాయి. మార్చి 23 నుంచి ఉభయసభలకు సెలవులు ప్రకటించారు. మళ్లీ ఏప్రిల్‌ 25న ప్రారంభమైన సమావేశాలు మే 13న ముగుస్తాయని ముందుగా నిర్ణయించారు.

ఏపీలో షా పర్యటన - సిద్ధార్థ నాథ్ సింగ్..

విజయవాడ : జూన్, జులైలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటిస్తారని, అమిత్ షా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఉంటుందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జీ సిద్ధార్థ నాథ్ సింగ్ పేర్కొన్నారు. జూన్ మధ్యలో మరోసారి సమావేశం ఉంటుందని, జూన్ 13వ తేదీలోగా మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బూతు స్థాయిలో పార్టీని విస్తరించాలని, జూన్ లో కడపలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సభకు అమిత్ షా హాజరు కానున్నట్లు వెల్లడించారు. పోలవరానికి వంద శాతం నిధులు కేటాయించాలని, ప్రధానికి కేంద్ర మంత్రి ఉమా భారతి లేఖ రాయడం జరిగిందని తెలిపారు.

రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది..

ఢిల్లీ : రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యాయి. మార్చి 23 నుంచి ఉభయసభలకు సెలవులు ప్రకటించారు. మళ్లీ ఏప్రిల్‌ 25న ప్రారంభమైన సమావేశాలు మే 13న ముగుస్తాయని ముందుగా నిర్ణయించారు.

15:14 - May 13, 2016

హైదరాబాద్ : నిర్భయ ఉదంతం తరువాత కేరళ నర్సింగ్ , లా స్టూడెంట్స్ పై జరిగిన లైంగిక దాడి మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. అదే సమయంలో సెల్ఫ్ డిఫెన్స్ అవసరాన్ని తెలియచేస్తోంది. ఈ నేపథ్యంలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో ఇవాళ్టి నిర్భయ మీ ముందుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

కరవు పరిస్థితులపై సుప్రీం లో విచారణ..

ఢిల్లీ : కరవు పరిస్థితులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సహయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంపై కేంద్రంపై అక్షింతలు వేసింది. నిధుల లేమి కారణంతో పథకాలను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తప్పించుకొనే ప్రయత్నాలు చేయవద్దని సూచించింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు విడుదల చేయాలని, ఆహార భద్రత చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

అగ్రిగోల్డ్ లో సంచలన మలుపు..

కర్నాటక : అగ్రిగోల్డ్ కేసులో సంచలన మలుపు తీసుకుంది. అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్లు తనకు రూ.1.5 కోట్లు లంచం ఇవ్వజూపారని ఉడిపి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేశారు. ఉడిపి కోర్టులో విచారణ కొనసాగుతోంది. 

15:11 - May 13, 2016

హైదరాబాద్ : వివాహం లాంటి ప్రత్యేక సందర్భాల కోసం ఒకప్పుడు మహిళలు కంచి పట్టు చీరలకు ప్రాధాన్యతనిచ్చారు. కానీ ఇప్పుడు పట్టు లో అనేక వెరైటీలు మన ముందుకొచ్చాయి. అలాంటి వెరైటీ పట్టు చీరలను పరిచయం చేసేందుకు దిల్ షుక్ నగర్ లో జగదాంబ శారీస్ లో వెరైటీ శారీస్ ను ఇవాళ్టి సొగసులో మీ ముందుకొచ్చింది. మీరూ చూడానుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కేంద్ర మంత్రులను కలిసిన ఆర్.కృష్ణయ్య..

ఢిల్లీ : కేంద్ర మంత్రులను ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కలిశారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని, చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. తినడానికి తిండి లేక బిసీలు ఇబ్బంది పడుతున్నారని, అగ్రకులాలను బీసీ జాబితాలో కలపవద్దన్నారు. మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు తమకు అభ్యంతరం లేదన్నారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం కల్పించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతామని తెలిపారు. 

15:09 - May 13, 2016

హైదరాబాద్ : ప్రత్యామ్నాయ మహిళా కార్యక్రమంగా మహిళల మన్ననలు అందుకుంటున్న మానవి కార్యక్రమం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ నుండి ప్రత్యేక పురస్కారాన్ని అందుకుంది. తన ప్రత్యేకతను సాధించుకుంది.

బాల్యవివాహాల పట్ల తాజా నివేదికలు సానుకూల నివేదికలు వెల్లడించాయి. భారత్ లో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని తెలియచేస్తున్నాయి.

ఇప్పటివరకూ ఒలింపిక్స్ లోని అనేక కేటగిరిల్లో పాల్గొన్న మహిళలు, ఇప్పుడు మరో కేటగిరిలోనూ ప్రవేశం పొందారు. విజేతలుగా నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు.

తెలంగాణా రాష్టంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 33 శాతం కూడా లేదు. తేల్చిన హెచ్ ఆర్ ఎం విశ్లేషణ. పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న కేటాయింపులు.

ఇటీవల విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు తమ హవా కొనసాగించారు. తొలి అత్యుత్తమ ర్యాంకులను తమ ఖాతాలో వేసుకున్నారు.

 

15:03 - May 13, 2016

హైదరాబాద్ : ఫోటో ఎక్స్‌పో కార్యక్రమాల వల్ల నాలెడ్జ్ పెరుగుతుందని సంగీత దర్శకుడు దేవీ ప్రసాద్‌ అన్నారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీలో విలాట్‌ ఫోటో ఎక్స్‌పోను దేవీశ్రీ ప్రసాద్‌ ప్రారంభించారు. ఎంత త్రీజీ టెక్నాలజీ పెరిగినా, ఫోటో ఎక్స్‌పో ప్రత్యేకతే వేరని అభిప్రాయపడ్డారు. 

తమిళనాడులో రూ.100 కోట్లు స్వాధీనం..

తమిళనాడు : రాష్ట్ర వ్యాప్తంగా రూ. 100. 32 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేశ్ లఖోనీ తెలిపారు. సరైన ఆధారాలు చూపించిన నేపథ్యంలో రూ. 37 కోట్లను తిరిగి ఇచ్చేశామని పేర్కొన్నారు.

14:49 - May 13, 2016

న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగి గిన్నిస్ రికార్డు పుటలోకెక్కిన సుసన్నా ముషాత్ జోన్స్ (116) కన్నుమూసింది. గత సంవత్సరం జులై 7వ తేదీన 116వ పుట్టిన రోజులకు కుటుంబ సభ్యులే కాకుండా స్థానిక ప్రముఖులు కూడా హాజరయ్యారు. న్యూయార్క్ సిటీలో సుసన్నా ముషాత్ వృద్ధాప్యంతో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ కు చెందిన ముషాత్ జోన్స్ అనే మహిళ గిన్నిస్ వరల్డ్స్ రికార్డు ప్రకారం జులై 6, 1899లో జన్మించింది. ఆమె చిన్నపిల్లల సంరక్షకురాలిగా, హౌస్ కీపర్ గా పనిచేసింది. ఆరోగ్యంగా ఉండటానికి గల కారణం ఏమిటనీ గతంలో అడిగితే 'వేళకు నిద్రపోవడం..ధూమపానం..మద్యపానాలకు దూరంగా ఉండడం' అని శతాధిక వృద్ధురాలైనా జోన్స్ పేర్కొందనట..

14:41 - May 13, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల్లో విజయం తననే వరిస్తుందని టిఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ 'టెన్ టివి'తో మాట్లాడారు. ఈ ఎన్నిక కోరుకున్న ఎన్నిక కాదు..అనుకోకుండా వచ్చిన ఎన్నిక. రాజకీయ ప్రక్రియలో ఎన్నికలు జరగాలి కాబట్టి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేదలకు మేలు జరుగుతుంది. ఈ నేపథ్యం కేసీఆర్, ఆ పార్టీకి ప్రజాధరణ ఉంది. ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా టిఆర్ ఎస్ ఘన విజయం సాధిస్తుంది అని స్పష్టం చేశారు. విపక్షాలు చేసే ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్తారని తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగాఅ ధికారులను సతాయిస్తున్నారని విలేకరి అడిన ప్రశ్నకు సమాధానం ఇస్తూఎన్నికల కోడ్ ఉన్నపుడు ఏ ఒక్క అధికారికీ ఫోన్ చేయలేద స్ఫష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని.. మెజారిటీ ఎంత వస్తుందనేది ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

మూడు వేల మంది రైతుల ఎంపిక - మంత్రి ప్రత్తిపాటి..

విజయవాడ : ప్రకృతి వ్యవసాయం కోసం జిల్లాకు మూడు వేల మంది చొప్పున రైతులను ఎంపిక చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రబీ మాదిరిగానే ఖరీఫ్ లోనూ పంట ఈ బుకింగ్ చేశామన్నారు. ఈ బుకింగ్ ద్వారా కౌలు రైతులకు ఉపయోగమన్నారు.

నాచారంలో పేలుతున్న కెమికల్ డ్రమ్ములు..

హైదరాబాద్ : నాచారంలో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 8 ఫైరింజన్లతో మంటలను సిబ్బంది ఆర్పుతున్నారు. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.

ఏపీ రాష్ట్ర పరిస్థితులపై సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆరా..

ఢిల్లీ : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నేతల నుండి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జీ సిద్ధార్థ నాథ్ సింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుండి ఇచ్చిన నిధులపై టిడిపి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు. టిడిపి నేతల ఆరోపణలు ధీటుగా ఎదుర్కొనవాలని నేతలకు సిద్ధార్థ్ నాథ్ సింగ్ సూచించారు.

 

బీహార్ లో ఐదుగురు నక్సల్స్ అరెస్టు..

బీహార్ : రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో ఐదుగురు నక్సల్స్ పట్టుబడ్డారు. గయా, జెహనాబాద్ పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

సర్కారీ ఆసుపత్రుల్లో పరీక్షలు ఉచితం..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కోసం బడ్జెట్‌ను రెట్టింపు చేశామన్నారు.

నగరంలో అంగన్ వాడీల ఆందోళన..

హైదరాబాద్ : మహిళా శిశు సంక్షేమ సంచాలకుని కార్యాలయం ఎదుట కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వేతన బకాయిలు, అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

మంత్రి నారాయణతో పోలీసు ఉన్నతాధికారుల భేటీ..

విజయవాడ : ఏపీ పోలీసు ఉన్నతాధికారులు మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. అమరావతిలో పోలీసు ప్రధాన కార్యాలయానికి స్థలం కేటాయించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఒడిశాలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల నిరసన..

ఒడిశా : రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే స్పీకర్ ఛాంబర్ ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని పడుకుని నిరసన తెలిపారు.

14:13 - May 13, 2016

వాపులను తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులు ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి. శరీర పెరుగుదలకు, మెటబాలిజం ప్రక్రియకు థైరాయిడ్‌ గ్రంథులు అత్యంత కీలకమని అందరికీ తెలిసిందే. అయితే వీటి పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది.
శరీరానికి కలిగే నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు సమర్థంగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. పాలిచ్చే తల్లులకు ఒక్కోసారి వక్షోజాలు, నిపుల్స్‌లో నొప్పి, మంట కలుగుతాయి. దీన్ని నివారించాలంటే
కొన్ని క్యాబేజీ ఆకులను రాత్రంతా వాటిపై ఉంచితే చాలు.
శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. తరచూ క్యా బేజీని తీసుకుంటే శరీర పనితీరు మెరుగవుతుంది.
క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మానికి అందాన్నిస్తుంది. వెంట్రుకలను సంరక్షిస్తుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి.
క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగ పడుతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్‌ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.
దంతాలను తెలుపుగా చేయడంలో క్యాబేజీ అమోఘంగా పనిచేస్తుంది. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి.

14:09 - May 13, 2016

చెన్నై : పడవపై షికార్లు చేస్తూ ఓ జంట కనువిందు...బ్రూస్ లీ పంచ్ తింటూ ఓ కుర్రాడు..డైనోసర్ నిప్పులు చిమ్ముతుంటే ఓ చిన్నారి ముందుకు వచ్చి నీళ్లు చిమ్మడం..పుర్రెబొమ్మ నోట్లోకి వెళ్లడానికి మెట్లు..రెండు భాగాలు విడిపోయిన మనిషి...ఇదంతా నిజం అనుకుంటున్నారా ? కాదండి..అంతా 'మాయ'...అవును త్రీడీ మాయ..కళ్లకు కనికట్టు చేసే ఓ అద్భుత ద్వీపం..ఈ వింత లోకం అంతా ఓ గదిలోనే ఉంది. అదే తమిళనాడు రాజధాని చెన్నై లోని ఈసీఆర్ రోడ్డులో ఉన్న వీజీపీ కాంప్లెక్సు లో ఏర్పాటు చేసిన 'త్రీడీ ట్రిక్ ఆర్ట్ మ్యూజియం'. ఇటీవల ప్రారంభమైన ఈ మ్యూజియం సందర్శకులను తెగ ఆకట్టుకొంటోంది. చిన్నారులతో పోటీ పడుతూ సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పేయింటింగ్స్ అని గోడపైనే చిత్రీకరించారు. వీటితో ఫొటోలు దిగితే మనమూ భాగమైనట్లు కనిపించడం. ఈ మ్యూజియంలో ఉన్న చిత్రాలన్నీ కూడా టూ డైమెన్షనల్‌ చిత్రాలే కానీ కంటిచూపును భ్రమ కలిగిస్తూ మూడో డైమెన్షన్‌లో ఇవి కనిపిస్తాయి. సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు అనువుగా వీటిని చిత్రించడం విశేషం. ప్రముఖ చిత్రకళాకారుడు ఏపీ శ్రీధర్‌ ఈ చిత్రాలను గీశాడు. సో...మరి దీని గురించి తెలుసుకోవాలంటే..ఫొటోలు దిగాలంటే చెన్నై వెళ్లాల్సిందే...

ఆప్ఘనిస్తాన్-పాకిస్థాన్ సరిహద్దులో భూకంపం

కాబూల్ : ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5 గా నమోదు అయింది.  

బీసీ, ఈబీసీలకు కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపు

హైదరాబాద్ : కళ్యాణలక్ష్మీ పథకాన్ని బీసీ, ఈబీసీలకు వర్తింప చేస్తూ... మంత్రి జోగు రామన్న వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఏప్రిల్ 1 తర్వాత వివాహమైన బీసీ, ఈబీసీలు అర్హులు అవుతారని చెప్పారు. కళ్యాణలక్ష్మీ పథకానికి బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు 58 వేల మందికి లబ్ధి చేకుర్చామని చెప్పారు. 

ఐసీపీ క్రికెట్ కమిటీ సభ్యులుగా రాహుల్ ద్రావిడ్, జయవర్ధనే

ఢిల్లీ : ఐసీపీ క్రికెట్ కమిటీ సభ్యులుగా రాహుల్ ద్రావిడ్, జయవర్ధనే నియమితులయ్యారు. ఐసీసీ క్రికెట్ చైర్మన్ గా అనిల్ కుంబ్లే పదవీకాలం మూడేళ్లపాటు పొడిగించారు. 

నాచారంలో అగ్నిప్రమాదం... పేలుతున్న కెమికల్ డ్రమ్ములు

హైదరాబాద్ : నాచారంలో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయి. భారీగా  మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్ లు  ఘటనాస్థలిని పరిశీలించారు.  

రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ కరవు యాత్ర

శ్రీకాకుళం : రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ కరవు యాత్ర చేపట్టింది. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఎపిసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. కరవుపై అధ్యయనం చేసి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. 

కరవు పరిస్థితులపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ : కరవు పరిస్థితులపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. కరువు పరిస్థితులపై కేంద్రం అవలంభిస్తున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు లేవని కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని చెప్పింది. జాతీయ ఉపాధిహామీ పథకం, ఆహార భద్రత చట్టం, జాతీయ విపత్తు నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్థిక వనరులు సమకూర్చాలని చెప్పింది. కేంద్రం ఆలస్యం చేసిన నిధులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. రాష్ట్రాల్లోనూ ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసేందుకు పుడ్ కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

 

వాహనం ఢీకొని వ్యక్తి మృతి....

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తల భాగం నుజ్జునుజ్జు కావటంతో మృతుడు ఎవరన్నది గుర్తుపట్టడం కష్టంగా మారింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ను కాల్చి చంపిన హెడ్ కానిస్టేబుల్...

కేరళ : సెలవు ఇవ్వలేదని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ను హెడ్ కానిస్టేబుల్ కాల్చి చంపాడు. ఈ ఘటన కేరళ కాజికోడ్ జిల్లా వటకరలో గత రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 16న కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించేందుకు బీఎస్ఎఫ్ సిబ్బంది వటకరలోని ఇస్లామిక్ అకాడమీ స్కూల్ వద్ద బస చేశారు. అయితే సెలవు మంజూరు చేసే విషయంలో రాంగోపాల్ మీనాకు, హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ ప్రసాద్ సింగ్ కు మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. సెలవు మంజూరు చేసేందుకు ఇన్స్పెక్టర్ అంగీకరించకపోవటంతో ఆగ్రహించిన ఉమేష్ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపాడని తెలుస్తుంది.

'ఉపాధిహామీ' బకాయి నిధులు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

హైదరాబాద్‌ : ఉపాధిహామీ బకాయి నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఎండాకాలం ముగిసే వరకు మధ్యాహ్న భోజనం అందించాలని పేర్కొంది. పీడీఎస్ అమలు పర్యవేక్షణకు ఫుడ్ కమిషనర్లను నియమించాలని రాష్ర్టాలను కోర్టు ఆదేశించింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌ : రాయపర్తి మండలం కొత్తరాయపర్తి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఎల్లమ్మ, మల్లమ్మగా పోలీసులు గుర్తించారు.

శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై దారి దోపిడీ

హైదరాబాద్‌ : శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగురోడ్డు పై దారి దోపిడీ జరిగింది. మమ్మద్ నియాకత్ అనే వ్యక్తి జహీరాబాద్ నుండి లారీలో ఎద్దులను తీసుకుని ఆద్రప్రదేశ్ నర్సింగ్ పేట్ వెలుతున్నాడు. శంషాబాద్ ఔటర్ రింగురోడ్డు వద్దకు రాగానే బొలేరో కారుపై వచ్చిన గుర్తుతెలియని ఎనిమిది మంది దుండగులు మహమ్మద్ నియాకత్ తో పాటు వున్న నలుగురిని చితకబాది ఎద్దుల లారీని, 40,000 వేల నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల సహాకారంతో బాధితుడు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎపి ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లును తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్

ఢిల్లీ : ఎపి ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లును రాజ్యసభ చైర్మన్ అమీద్ అన్సారీ తిరస్కరించారు. కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ, జేడీ శీలం ఎపి ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించాలని ఎంపీలు పట్టుబట్టారు. అయితే ఈ అంశంపై చర్చకు చైర్మన్ అంగీకరించలేదు. ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లును చైర్మన్ తిరస్కరించారు.

 

13:18 - May 13, 2016

విజయవాడ : తమ పరిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లా గన్నవరం వెటర్నరి కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు కళాశాలకు తాళం వేసి ఆందోళన ధర్నా చేపట్టారు. రేపటి నుంచి ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

 

13:18 - May 13, 2016

కోల్ కతా : ఐటీఐ విద్యార్థిని దారుణంగా కొట్టి చంపిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది కదా ? ఈ కేసులో స్థానిక తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత తపస్ మాలిక్ ను పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లా బమన్ గచ్చిలో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది అరెస్టు చేశారు. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని హరిన్ దంగా ప్రాంతంలో గేదె దొంగతనం చేయడానికి వచ్చినట్లుగా అనుమానించిన కొందరు దుండగులు ఐటీఐ విద్యార్థి కౌశిక్ పుర్కైత్ ను ఇష్టమొచ్చినట్లుగా బాదారు. దెబ్బలకు తాళలేక కౌశిక్ మృతి చెందారు. దీనిపై స్థానికంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులు టీఎంసీ నేత మాలిక్ ఇంటిని దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. కేసును సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కౌశిక్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం తదితర ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

13:16 - May 13, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లును రాజ్యసభ చైర్మన్ అమీద్ అన్సారీ తిరస్కరించారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టానికి సంబంధించిన ఏపీ ప్రత్యేక హోదా బిల్లును కాంగ్రెస్ ఎంపీలు జేడీ శీలం, కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించాలని ఎంపీలు పట్టుపట్టారు. అయితే ఈ అంశంపై చర్చించేందుకు చైర్మన్ అంగీకరించలేదు.

గన్నవరం వెటర్నరీ కాలేజీ విద్యార్థుల ఆందోళన

కృష్ణా : తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ గన్నవరం వెటర్నరీ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీకి తాళం వేసి విద్యార్థులు ధర్నా చేపట్టారు. రేపటి నుంచి ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

 

12:42 - May 13, 2016

హైదరాబాద్ : మల్లాపూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాలికేట్స్ పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ పరిశ్రమ తమ కాలనీ అతి సమీపంలో వుండటంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రమాద స్థలాన్ని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్, మేయర్ బొంత రామ్మోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కొన్ని కుటుంబాలను తరలించామనీ...మరికొన్ని కుటుంబాలను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

12:38 - May 13, 2016

విజయవాడ : బీజేపీ-టీడీపీ నేతలు ఏపీలో సమావేశమయ్యారు. విభజన నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన హామీలపై గతంలో జరిగిన లోక్ సభ సమావేశాలలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటించటంతో ఏపీలో బీజేపీ- టీడీపీ మధ్య పొత్తులు ఎలా వుంటాయనే విషయంపై రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఇరు పార్టీల నేతల సమావేవం ప్రాధాన్యతలను సంతరించుకుంది. రైల్వే జోన్, లోటు బడ్జెట్, వంటి పలు అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాపై వుందని సమావేశానికి హాజరయిన నేతలు పేర్కొన్నారు.

12:23 - May 13, 2016

త్రివిక్రమ్ ది మినిమమ్ గ్యారెంటి బ్రాండ్. త్రివిక్రమ్ తో సినిమా అంటే నిర్మాతలు సేఫ్ బిజినెస్ గా భావిస్తారు. త్రివిక్రమ్ కెమెరాకు రెండు వైపులా పదునుంటుంది. రాత, తీతా ఆయనవే. ఓ సాధారణ సన్నివేశాన్ని తన మాటతో మాయ చేసి ప్రేక్షకులకు గుర్తుండి పోయే సన్నివేశంగా తీర్చిదిద్దడం లో దిట్ట. సినిమా పడిపోతుందన్న సమయంలో తన పెన్ పవర్ తో లేపేస్తాడు. అత్తారింటికి క్లైమాక్స్ ఇందుకో ఉదాహ‌రణ. టాలీవుడ్ సినిమాను 100కోట్ల మార్కు చేర్చిన దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ సినిమాతోనే పాప్యులరయ్యాడు. ఈ దర్శకుడికి కూడా భారీ బడ్జెట్ సినిమాలు తీసే సత్తా ఉంది. ఇప్పుడీ మాటల మాంత్రికుడు, మాంత్రిక దర్శకుడూ కోలీవుడ్ కథానాయకుడు సూర్యతో 100కోట్ల బడ్జెట్ సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. 24 సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన సూర్య, మాటలతో మంత్రం వేసే త్రివిక్రమ్ కలిస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమా బడ్జెట్టే 100 కోట్లు ఉంటే , ఈ సినిమా మార్కెట్ ఎంత చేస్తుందో ఊహించుకోవచ్చు. 24 ఫినిష్ చేసి సూర్య ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అ, ఆ కంప్లీట్ చేసిన అనంతరం త్రివిక్రమ్ టాలీవుడ్ హీరోలతో చేయాలన్నా ప్రస్తుతం ఎవరూ ఖాళీగా లేరు. కాబట్టి త్రివిక్రమ్ సూర్య తో ఈ సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.

కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషి ముప్పాళ్ల వీరరాఘవయ్య కన్నుమూత

హైదరాబాద్ : కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషి ముప్పాళ్ల వీరరాఘవయ్య(95) కన్నుమూశారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వీరరాఘవయ్యకు మృతికి సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు. 

ఏపీ ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లు ఇవాళ లేనట్లే...

ఢిల్లీ : రాజ్యసభలో ఏపీ ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లు ఇవాళ లేనట్లే కనిపిస్తోంది. పదవీకాలం ముగిసిన 53 మంది ఎంపీలకు నేడు వీడ్కోలు పలుకనున్నారు. రాజ్యసభ ఇవాళ నిరవధికంగా వాయిదా పడనుంది. 

 

ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం : విష్ణుకుమార్ రాజు

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని కోరుతామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రత్యేకహోదా, రైల్వే జోన్ పై త్వరలో అధిష్టానాన్ని కలుస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమన్నారు.

 

మంత్రి పత్తిపాటి, ఉన్నతాధికారులతో మంత్రి గంటా భేటీ

హైదరాబాద్ : మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఉన్నతాధికారులతో మంత్రి గంటా శ్రీనివాస్ భేటీ అయ్యారు. నీట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సమావేశం అయ్యారు. అగ్రికల్చర్ పరీక్ష ఫలితాల ప్రకటనపై ప్రధాన చర్చ  చేపట్టారు. సీఎంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. నీట్ కు అనుగుణంగా సిలబస్ రూపొందించే యోచనలో ఉన్నారు. 

11:40 - May 13, 2016

ఢిల్లీ : 53 మంది సభ్యులకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం నాడు ప్రారంభమైన రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. సభలో ప్రతి సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని, ఈ చర్చల వల్ల ఫలితం వస్తుందన్నారు. దీనివల్ల సమస్యల పరిష్కారమే కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగం ఉంటుందని తెలిపారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో అందరి కృషి ఉందని, జీఎస్టీ వల్ల ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే వీలుంటుందని పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రానికి 2, 3వేల కోట్ల రూపాయలు అందే అవకాశం ఉంటుందన్నారు. రాజ్యసభ నుండి వెళుతున్న వారందరికీ శుభాభివందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 23న ప్రారంభం..
గురువారం మృతి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు ప్రవీణ్‌ రాష్ట్రపాల్‌కు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత సభ వాయిదా పడింది. దాంతో గురువారం నాడు చేపట్టాల్సిన అజెండాను శుక్రవారం కొనసాగించారు. కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలు దగ్గర పడడంతో ఉభయ సభలనూ నిర్ణీత గడువుకన్నా రెండు రోజుల ముందే ముగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు లోక్‌సభ బుధవారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. అయితే, 58 మంది సభ్యుల పదవీ కాలం ముగుస్తుండడం వల్ల రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగాల కార్యక్రమం జరగాల్సి ఉన్నందున గురువారం సమావేశాలను ముగించాలని అనుకున్నారు. వీరిలో చాలా మంది మళ్లీ నామినేట్‌ అయ్యారు. అయితే గురువారం ఉదయం గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ మరణించడంతో సభా కార్యక్రమాలను శుక్రవారం వరకు పొడిగించాల్సి వచ్చింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యాయి. మార్చి 23 నుంచి ఉభయసభలకు సెలవులు ప్రకటించారు. మళ్లీ ఏప్రిల్‌ 25న ప్రారంభమైన సమావేశాలు మే 13న ముగుస్తాయని ముందుగా నిర్ణయించారు.

కొనసాగుతున్న బీజేపీ కోర్ కమిటీ సమావేశం

విజయవాడ : బీజేపీ కోర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. బీజేపీ, టీడీపీ పొత్తు, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామకంపై చర్చిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే నిధులపై సమీక్ష చేస్తున్నారు. 

11:29 - May 13, 2016

హైదరాబాద్ : మల్లాపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఉదయం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాలికేట్స్ కెమికల్ మినరల్ ఫ్యాక్టరీలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోలనలకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. ఫ్యాక్టరీ లోపల వున్న 10 డ్రమ్ముల కెమికల్స్ పేలిపోయాయి. పేలుడు ప్రభావంతో భవన శకలాలు మూడు కిలోమీటర్ల వరకు ఎగిసిపడుతున్నాయి. సమాచారం
అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ముందస్తు చర్యలో భాగంగా ఆ రహదారిని మూసివేశారు. సుమారు 50 కుటుంబాలను ఖాళీ చేయించారు. మంటలు అదుపులోకి రావడానికి మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
భారీగా అగ్నికీలలు ఎగిసి పడుతుండడం...పొగ దట్టంగా అలుము కోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. లోపల వున్న మరో 40 కెమికల్ డ్రమ్ములున్నాయి. దీనితో మరింత మంటలు వ్యాపించవచ్చని అధికారులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేయడానికి మరో నాలుగు ఫైరింజన్లు అవసరమవుతాయని తెలుస్తోంది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కారు-బైక్ ఢీ.. ఒకరి మృతి

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిలోని కిషన్‌గూడ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు విస్తృత ప్రచారం

ఖమ్మం : జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విస్తృత ప్రచారం చేస్తోంది. నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం...

హైదరాబాద్ : నగరంలోని నాచారం- ఉప్పల్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. రసాయనాలకు మంటలు అంటుకుని భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. పారిశ్రామికవాడ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

10:56 - May 13, 2016

ఒంగోలు : కొడుకు చదువు పూర్తయింది.. తమకు ఆసరాగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు శోకమే మిగిలింది.. నీటి ట్యాంకర్‌ రూపంలో వారి కొడుకును మృత్యువు కాటేసింది.. నీటి ట్యాంకర్ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెంగముక్కలపాలెంకు చెందిన రవితేజ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేశాడు.. సర్టిఫికేట్లకు సంబంధించిన పనికోసం ఒంగోలులోని కాలేజీకి వచ్చాడు.. గేటు దగ్గరున్న అతన్ని వేగంగా వస్తున్న నీటి ట్యాంకర్ ఢీ కొట్టింది..రవితేజ టైర్‌కింద పడిపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.. చదువు పూర్తయింది.. ఇక తమకు ఆసరాగా ఉంటాడనుకున్న సమయంలో ఇలా జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు.. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ఇలా జరిగిందంటూ పోలీస్‌ స్టేషన్‌ముందు ఆందోళనకు దిగారు..తమకు న్యాయం చేయాలని పీఎస్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. అటు మృతుని స్నేహితులు కూడా స్టేషన్‌ముందు నిరసన చేపట్టారు.. మృతుడు బీసీ వర్గానికి చెందినవాడు కావటంత బీసీ సంఘాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

10:23 - May 13, 2016

జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? లేదా మెమరీలాస్‌ లేదా ఆల్జీమర్స్‌ వస్తుందేమోనన్న సందేహంలో ఉన్నారా? అయితే ఖర్చులేకుండా మెదడు ఫిట్‌నెస్‌ పెంచే సులువైన మార్గం ఒకటుంది. అదే మెడిటేషన్‌, యోగా. వీటిని రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేయడం వల్ల ఆల్జీమర్స్‌ తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. యోగా, మెడిటేషన్‌వల్ల జ్ఞాపకశక్తి పెరుగుదల ఒకే రీతిలో ఉన్నా... యోగా వల్ల ఇంకా అధిక లాభాలున్నాయని పరిశోధన తేల్చింది. మానసిక ఉద్వేగాలు, స్థిత ప్రజ్ఞత వంటి అధిక ప్రయోజనాలు యోగావల్ల చేకూరుతున్నట్లు ఆల్జీమర్స్‌ డిసీజ్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. 55ఏళ్ల వరకు వయసున్న 25 మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. యోగా, మెడిటేషన్‌ తరువాత వారిలో పరివర్తన మార్పులు, మెదడు యాక్టివిటీని గుర్తించారు.

10:20 - May 13, 2016

భారత క్రికెట్‌ పరుగుల యంత్రం, సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లికి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ సారథ్య పగ్గాలు అందుకోవటంపై మాజీ కెప్టెన్లు భిన్న అభిప్రాయలు వ్యక్తం చేశారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి 2019 వరల్డ్‌కప్‌ దృష్ట్యా సారథ్య బాధ్యతలు అందుకోవాలని సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడగా.. అప్పుడే తొందరేముంది తొలుత టెస్టు కెప్టెన్‌గా ఎదగనీవ్వండి అని సునీల్‌ గవాస్కర్‌ సెలవిచ్చాడు. ' విరాట్‌పై అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం వద్దు. టెస్టు సారథి పాత్రలో అతడిని ఎదగనీయండి. 2019 వరల్డ్‌కప్‌కు ఇంకా ఎంతో సమయం ఉంది' అని గవాస్కర్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లి రెండు సెంచరీలు చేసినా.. ఐపీఎల్‌లో బెంగళూర్‌ వైఫల్యానికి బౌలర్లే కారణమని లిటిల్‌ మాస్టర్‌ పేర్కొన్నాడు. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌లోనూ మహేంద్రసింగ్‌ ధోని నాయకుడిగా చూడలేమని అభిప్రాయపడిన గంగూలీ.. కోహ్లి కెప్టెన్సీకి సమయం ఆసన్నమైందని అన్నాడు.

మాస్టర్‌తో పోల్చొద్దు...
టీమ్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లిని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చటం సరికాదని వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ప్రస్తుత తరంలో ఏబీ డివిలియర్స్‌, వార్నర్‌ వంటి అత్యుత్తమ ఆటగాళ్లున్నా.. విరాట్‌ కోహ్లి సూపర్‌స్టార్‌ అని అభివర్ణించిన వీరూ మాస్టర్‌తో పోలిక మాత్రం సరైనది కాదని తెలిపాడు. ' నన్ను కూడా సచిన్‌తో, రిచర్డ్స్‌తో పోల్చేవారు. కానీ వారు ఆడిన కాలం వేరు..నాది వేరు. ఇప్పుడు కోహ్లి-సచిన్‌ పోలిక సైతం అంతే. ఏ ఇద్దరు ఆటగాళ్లను పోల్చలేము' అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఓ రేడియా కార్యక్రమంలో పాల్గొన్న ఈ మాజీ విధ్వంసక వీరుడు.. పలు విషయాలపై మాట్లాడాడు.

10:14 - May 13, 2016

హైదరాబాద్ : అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అంత్యంత భారీ విమానానికి ఆతిథ్యం ఇచ్చింది. ఉక్రెయిన్ నుండి పెర్త్ వెళ్తున్న మ్రియా విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఈ భారీ విహంగానికి ఎయిర్ పోర్ట్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ భారీ విహంగం పేరు ఆంటోనోవ్‌ ఏఎన్ 225. ఇది  ఆరు టర్బో ఇంజిన్లతో నడుస్తుంది. దీని రెక్కలు కూడా అంత్యంత పొడవైనవి. అంత్యంత పొడవైన, బరువైన విమానం కూడా ఇదే. ఈ విమానం 640 టన్నులు వరకూ బరువును మోసే ఈ విమానం ప్రతీ 4000 కిలో మీటర్ల ప్రయాణానికి ఒకసారి ఇంధనం నింపుకోవాల్సన అవసం వుండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

10:11 - May 13, 2016

ముంబాయి : ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మన్‌ రియో గుడ్‌ విల్‌ అంబాసి డర్‌గా నియామకమయ్యారు. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, అభినవ్‌ బింద్రా, బాలివుడ్‌ స్టార్‌ సల్మాన్‌లు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియామకమయిన సంగతి తెలిసిందే. '' భారత ఒలింపిక్‌ బృందానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియామకాన్ని గొప్ప గౌరవంతో కూడిన బాధ్యతగా భావిస్తున్నాను.'' అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు రెహ్మన్‌. ఐఓఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా మాట్లాడుతూ.. 'రెహ్మాన్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. అతనితో ఒలింపిక్‌ దేశ నలుమూలలా ప్రజలకు చేరువవుతుంది. క్రీడాకారులకు ఇతను స్ఫూర్తిగా నిలుస్తాడని ఆశిస్తున్నామన్నారు'. తొలుత సల్మాన్‌ను అంబాసీడర్‌గా నియమించడంతో అభ్యంతరాలు వ్యక్తమవ్వగా సచిన్‌, బింద్రాను నియమించిన విషయం తెలిసిందే.

10:06 - May 13, 2016

న్యూఢిల్లీ : ఐసీసీ బాస్‌గా శశాంక్‌ మనోహర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే బీసీసీఐకి రాజీనామా చేసిన శశాంక్‌ ఐసీసీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. మే23న ముగియాల్సిన ఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురువారమే ముగిసినట్టు ఎన్నికల అధికారి అద్నాన్‌ జైదీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతీ ఐసీసీ డైరెక్టర్‌ ఒక్కరిని అభ్యర్థిగా ప్రతిపాదించవచ్చు. వారిలో ఇద్దరు డైరెక్టర్లు లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు తెలిపిన అభ్యర్ధి విజయం సాధిస్తాడు. కానీ మనోహర్‌కు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో పాటు అందరూ మద్దతు ప్రకటించారు. దీంతో శశాంక్‌ లాంచన ప్రాయంగా ఎన్నికయినట్టు ఐసీసీ తన ట్విట్టర్‌లో తెలిపింది. ఎన్నికయిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ.. ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దీంతో నాబాధ్యత మరింత పెరిగింది. 'నా సమర్థతను గుర్తించిన ఐసీసీ డైరెక్టర్లకు విదేయుడనయి ఉంటాను. ఇంత గొప్ప అవకాశం కల్పించేందుకు దోహదపడ్డ బీసీసీఐ నా సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో క్రికెట్‌ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. అభిమానుల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తాను' అని శశాంక్‌ మనోహర్‌ అన్నారు.

10:03 - May 13, 2016

ముంబయి : ఆమె 81 యేండ్ల వృద్ధురాలు. కర్రసాయం లేకుండా నడువలేదు. వృద్ధురాలే కదా అని అనుకున్నాడేమో.. ఓ దొంగ మారువేషంలో ఆమె దగ్గరకు చేరుకున్నాడు. తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి ఇవ్వాలని ఆమెను బలవంతం చేశాడు. అసలు సీన్‌ అక్కడే మొదలైంది. ఆ వృద్ధురాలు ధైర్యశాలిలా దొంగపై పోరాడింది. తన చేతికర్రతో దుండగుణ్ని చితకబాది పోలీసులకు అప్పగించింది. వృద్ధురాలు చూపించిన తెగువకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మహిళలకు పోలీసులు సూచించారు. వివరాల్లోకెళ్తే ముంబయిలోని దాదర్‌ ప్రాంతంలో నివాసముండే పుష్పాబెన్‌ దమ్జీ బుధవారం ఉదయం ఇంటికి నుంచి బయటకు వెళ్తున్నారు. ఆమె బలహీనంగా ఉండి కర్రసాయంతో నడుస్తున్నారు. ఇదే అదునుగా భావించిన జప్ఫారి అనే దొంగ ఆమె దగ్గరకు చేరుకున్నాడు. తను క్రైం బ్రాంచ్‌ పోలీసునని వృద్ధురాలితో చెప్పి ఓ గుర్తింపు కార్డును చూపించాడు. 'ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైనది. బంగారు ఆభరణాలు ధరించి ఉంటే దొంగలు దాడి చేస్తారు. చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇవ్వాలని ఆమెను మభ్యపెట్టాడు. దీనికి వృద్ధురాలు ఒప్పుకోలేదు. అయినా ఆమెను వెంబడించిన దొంగ బంగారు గాజులను లాక్కోవడానికి ప్రయత్నించాడు. తన చేతికర్రకు పని చెప్పిన ఆ వృద్ధురాలు దొంగను రక్తమొచ్చేలా చితకబాదింది. దీంతో దొంగ దారికొచ్చి తనను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. ఇంతలో పోలీసులు వచ్చి దుండగుణ్ని అరెస్టు చేశారు. వృద్ధురాలి ధైర్యసాహసాలకు ఆమెను అక్కడున్న వారందరూ అభినందించారు.

09:55 - May 13, 2016

గుంటూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన పలువురు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని కారులో తిరుగుప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో గణపవరం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారీకేడ్లను గమనించకపోవడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కంటెయినర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండా మార్గంమధ్యలో మృతి చెందారు. పోలీసులు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బోర్డుల వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పోలీసుల బాధ్యతారాహిత్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 

 

 

 

 

 

 

09:49 - May 13, 2016

విజయవాడ : అరచేతిలో స్వర్గం చూపారు. "పాకల్లో కాపురమేంటి..? పదండి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు" అంటూ ఊదరగొట్టారు. ఇచ్చిన పొలానికి ప్రతిగా దిమ్మెరపోయేంత ఆర్థిక ప్యాకేజీ ఇస్తామన్నారు. పొలానికి పొలం.. ఇంటికి ఇల్లు.. ఎదిగిన పిల్లలకు లక్షల్లో పరిహారం.. ఇలా ఎన్నెన్నో ఆశలు కల్పించారు. రైతులను నమ్మించారు. సర్కారు హామీలతో మురిసిపోయిన వారికి ఇప్పుడిప్పుడే వాస్తవం అర్థమవుతోంది. సర్కారు మోసం తెలిసొచ్చి.. సొంతగూళ్లకు చేరుతున్నారు. అక్కడి శిథిల గూళ్లలోనే కాపురముండేందుకు సన్నద్ధమవుతున్నారు. పోలవరం నిర్వాసితుల వేదన ఈనాటి స్పెషల్ స్టోరీ.

భూములిస్తే అద్భుతమైన ప్యాకేజీలన్న ప్రభుత్వం ....
అద్భుతమైన ప్యాకేజీలు ఇస్తాం.. కొత్త ఇళ్లు కట్టించి ఇస్తాం.. అంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. నిర్వాసిత కుటుంబానికి రెండు లక్షలు, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల ఉంటే లక్షా 83 వేల రూపాయలు, ఒకవేళ 18 ఏళ్లు నిండిన బాబు ఉంటే లక్షా 70 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేనా.. నిర్వాసిత కుటుంబానికి.. ఐదు సెంట్ల భూమిలో ఒక డబుల్ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇస్తామంది. అన్నింటికన్నా ముఖ్యంగా.. పోలవరం ప్రాజెక్టు కోసం కోల్పోతున్న పొలానికి సరిపడా.. వేరే ప్రాంతంలో భూమి ఇస్తామనీ చెప్పింది. కోల్పోతున్న పొలంలోని చెట్లకూ రేటు కట్టి డబ్బిస్తామన్నారు.

నమ్మి మోసపోయిన ప్రజలు....
సర్కారు మాయమాటలను గుడ్డిగా నమ్మేశారక్కడి ప్రజలు. పొలాన్ని, తామున్న ఇళ్లనూ ప్రభుత్వానికి అప్పజెప్పేశారు. వాటిని స్వాధీనం చేసుకున్న సర్కారు.. తక్షణమే ఆ ఇళ్లను కూలగొట్టేసింది. కళకళలాడిన గ్రామాలను శిథిలసీమలుగా మార్చేసింది.

మౌలిక సదుపాయలు లేని ఇండ్లు....
విఓ 8 : నిర్వాసితుల కోసమంటూ.. కొన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లనూ ప్రభుత్వం నిర్మించింది. అక్కడ ఇళ్లయితే ఉన్నాయి కానీ.. మనిషన్నవాడు నివసించేందుకు వీలుగా ఏ ఒక్క మౌలిక సదుపాయమూ లేదు. తాగేందుకు నీళ్లు లేవు.. కరెంటు దీపాలు వెలగవు.. పశువులను కట్టేందుకు తగిన స్థలమూ లేదు.. ఆఖరుకు మరుగుదొడ్డి లాంటి వసతులూ లేవు. ఏళ్ల తరబడి జీవనం సాగించిన ప్రాంతాన్ని, వదిలేసి వచ్చిన తమకు.... కనీస వసతులు కూడా లేని ఇళ్లను కేటాయించడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ బతుకు సాగించలేక.. సొంతూళ్లకు తిరిగి వచ్చేస్తున్నారు. కూల్చేసిన ఇళ్లల్లోనే కాపురానికి సిద్ధమవుతున్నారు.

రాళ్లు రప్పలున్న భూములిచ్చిందని ఆగ్రహం....
రైతులు కోల్పోయిన భూమికి తగినంత భూమిని వేరే ప్రాంతాల్లో ఇస్తామన్న ప్రభుత్వం.. అక్కడా రైతులను మోసం చేసింది. తమనుంచి సారవంతమైన భూమిని తీసుకున్న ప్రభుత్వం.. నిస్సారము, రాళ్లు రప్పలతో నిండిన కొండ ప్రాంత భూములను కట్టబెట్టిందని పోలవరం నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.

ప్యాకేజీలలో మోసాలు...
ఇక పోలవరం నిర్వాసిత రైతు కుటుంబాలకు ప్రకటించిన ప్యాకేజీల విషయంలోనూ మోసాలే బయటపడుతున్నాయి. ముడుపులు చెల్లించుకున్న వారికే ప్యాకేజీ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.

మృతుడి కుటుంబానికి దక్కని పరిహాం....
నిర్వాసితులకు ప్యాకేజీ ప్రకటించేందుకు ఇటీవల రెవిన్యూ అధికారులు ఓ సమావేశం నిర్వహించారు. అదే సమావేశంలో ఓ యవకుడు గుండె ఆగి చనిపోయాడు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారమూ దక్కలేదు. తమ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.

గూడు చెదిరిన పక్షుల్లా విలవిలలాడుతున్న నిర్వాసితులు...
ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. అవసరం తీరాక ఓటి మల్లన్న అన్న చందంగా ప్రభుత్వం తీరు ఉంది. పోలవరం నిర్వాసితులు వెతలపాలై.. శిథిలగ్రామాలకే తిరిగి వస్తున్నా.. వారి ఇబ్బందులేంటని విచారించిన నాథుడు లేకుండా పోయాడు. గూడు చెదిరిన పక్షుల్లా విలవిలలాడుతున్న పోలవరం నిర్వాసితుల కష్టాలు తీర్చకుంటే.. వారి ఆగ్రహాగ్ని ప్రభుత్వాన్ని దహించే రోజులు ఎంతో దూరంలో లేవు. 

దేవాదుల ఎస్ ఆర్ ఎస్ పీ పనులపై మంత్రి హరీశ్ సమీక్ష

వరంగల్ : నర్సంపేటలో దేవాదుల ఎస్ ఆర్ ఎస్ పీ పనులపై అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష చేపట్టారు. 

 

కంటెయినర్-కారు ఢీ... ఇద్దరు మృతి

గుంటూరు : నాదెండ్ల మండలం గణపవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటెయినర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలుకలూరిపేట ఆస్పత్రికి తరలించారు.

 

09:38 - May 13, 2016

అధికారంలో ఉంటే ఒకలా అధికారం లేకపోతే మరోలా వ్యవహరిండం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటైపోయిందని వక్తలు అన్నారు. తాజా రాజకీయాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత సూర్యప్రకాశ్, టీఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ నర్సిమ్మ పాల్గొని, మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. ఇప్పుడే టీడీపీ, బీజేపీ బంధం తెగిపోందని చెప్పలేమని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

దేవాదుల ఎస్ఆర్ఎస్ పీపై మంత్రి హరీష్ సమీక్ష..

వరంగల్ : నర్సంపేటలో దేవాదుల ఎస్ఆర్ఎస్ పీ పనులపై మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నేడు విజయనగరం జిల్లాలో రఘువీరా పర్యటన

విజయనగరం : ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుంక్లాంలో కరువు పరిస్థితులను పరిశీలించి.. బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

నేడు వరంగల్ మాధన్నపేటలో పైలాన్ ఆవిష్కరణ

హన్మకొండ : నేడు వరంగల్ మాధన్నపేటలో పైలాన్ ఆవిష్కరణ జరుగనుంది. మిషన్ కాకతీయ అతిపెద్దపైలాన్ హరీశ్ రావు ఆవిష్కరించనున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 31 కంపార్టుమెంట్టల్లో నిండి వెలుపల ఉన్న క్యూలైన్లలో ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు దర్శనానికి 7 గంటల సమయం పడుతుంది. 

నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పీతల

ప.గో : నేడు లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెంలో నీరు-చెట్టు కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత పాల్గొననున్నారు. 

08:41 - May 13, 2016

హైదరాబాద్ : మైనార్టీలకు రుణాలు మంజూరు చేయటంటో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని తెలంగాణ మైనార్టీ సబ్‌ ప్లాన్‌ సాధన కమిటీ నేత అబ్బాస్‌ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడ్జెట్ లో మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయింస్తోంది ... వాటిని అమలు చేయటంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. గత సంవత్సరం రూ.1100 కేటాయిస్తే కేవలం రూ. 49. కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు చూపెడుతున్నారనీ ఆయన తెలిపారు. కేటాయింపులు ఘనంగా వుంటాయి కానీ ఖర్చు మాత్రం నామమాత్రంగా వుంటున్నాయని విమర్శించారు. 'తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ లో మైనార్టీ సంక్షేమానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే నిధులు కేటాయించారు. అయితే, మైనార్టీ యువత ఉపాధి కోసం రుణాలిస్తామంటూ కెసిఆర్‌ ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి వాటి అమలు తీరు ఎలా వుంది? మైనార్టీ సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు ఎలా అమలవుతున్నాయి? నిధులు సక్రమంగా విడుదలవుతున్నాయా? వాటిని సరైన పద్ధతిలో వినియోగిస్తున్నారా? ఉపాధి కల్పనా పథకాల కోసం అప్లయ్‌ చేసిన మైనార్టీ యువతకు లోన్లు లభిస్తున్నాయా? తెలంగాణలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి?'ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. సమగ్ర వివరాల కోసం ఈ వీడియోను చూడండి.

08:40 - May 13, 2016

ఇప్పటివరకు గ్లామర్‌ పాత్రలతో అలరించిన సమంత తాజాగా అంగీకరించిన చిత్రంలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. కన్నడలో రూపొందిన 'యు టర్న్' చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంత నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. 'ఇటీవల బెంగుళూరు వెళ్ళినప్పుడు 'యు టర్న్' చిత్రాన్ని చూశాను. నాకెంతో బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని రూపొందించిన తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇకపై గ్లామర్‌ పాత్రలతోనే కాకుండా ఈ తరహా పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు కెరీర్‌లో యు-టర్న్ తీసు కోవాలనుకుంటున్నాను' అని చెప్పారు.

08:25 - May 13, 2016

హైదరాబాద్ : విజయ్ దేవరకొండ (ఎవడే సుబ్రమణ్యం ఫేమ్‌), షాలిని హీరోహీరోయిన్లుగా సందీప్‌ దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణరు నిర్మిస్తున్న చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ... 'డిఫరెంట్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నాం. హైదరాబాద్‌, మంగుళూర్‌, డెహ్రడూన్‌, ఢిల్లీతోపాటు ఇటలీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరపడానికి ప్లాన్‌ చేశాం. ఈ చిత్రానికి రథన్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, నగేష్‌ బన్నేల్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ నటించిన 'పెళ్లిచూపులు' చిత్రం త్వరలోనే విడుదల కానుంది' అని అన్నారు.

 

08:20 - May 13, 2016

'దుర్మార్గుడైన భర్త మంచి వాడుగా మారి, కన్నతల్లి విలన్‌గా మారిన ఓ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే 'దమ్ముంటే రా' సినిమా చూడాల్సిందేన'ని అంటున్నారు దర్శకుడు షేరాజ్‌. ఆయన దర్శకత్వంలో రామకృష్ణ, బిందు బార్బీ జంటగా హార్డ్‌వర్క్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రామకృష్ణ నిర్మించిన చిత్రం 'దమ్ముంటే రా'. ఈ చిత్ర దర్శకుడు దర్శకుడు షేరాజ్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఇదొక హర్రర్‌ ఎంటర్‌టైనర్‌. ఇటీవల వస్తున్న దెయ్యాల సినిమాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. హర్రర్‌తోపాటు లవ్‌, కామెడీ, కుటుంబ అంశాల మేళవింపుతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం. హాలీవుడ్‌ తరహా హర్రర్‌ చిత్రమిది. ఇందులో హీరో జర్నలిస్ట్‌గా కనిపిస్తాడు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈచిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరులో ఆడియోను, జులైలో సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

 

08:18 - May 13, 2016

హైదరాబాద్ : మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వందల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నామని గొప్పగా ప్రకటిస్తోంది. కాని వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. నిరుద్యోగ యువతకు సబ్సిడీతో రుణాలిస్తామని ప్రకటించిన సర్కార్‌..ఆచరణలో మొండిచేయి చూపుతోంది.

బ్యాంకుల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు....
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు కేటాయిస్తున్న నిధులు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడటం లేదు. నిరుద్యోగ మైనార్టీ యువతీ యువకుల స్వయం ఉపాధి కోసం యాభై నుంచి ఎనభై శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తామని సర్కార్‌ ప్రకటించింది. దీంతో మైనార్టీ కార్పొరేషన్‌ రుణాల కోసం పది జిల్లాల నుంచి లక్షమందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కాని వారిలో పది శాతం మందికైనా రుణాలివ్వలేదు. మరోవైపు లబ్ధిదారులు కూడా బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది.

రుణాలు మంజూరు చేయని మైనార్టీ కార్పొరేషన్‌....
బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ. 1204 కోట్లు కేటాయించింది. నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల కోసం రూ. 150 కోట్లు కేటాయింపులు చేస్తూ లబ్ధిదారుడు లక్ష నుంచి పది లక్షల వరకు రుణాలు పొంద వచ్చని ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు ప్రతి జిలాల్లో వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఐతే గత బడ్జెట్‌లో కేటాయించిన 150 కోట్లలో ఇరవై కోట్లు మాత్రమే సర్కార్‌ విడుదల చేసింది.ఈ నిధుల్లోంచి ఎవరికి రుణాలు మంజూరు చేయాలో తెలియక మైనార్టీ కార్పొరేషన్‌ రుణ మంజూరు నిలిపివేసింది. మరో వైపు హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ లైసెన్సులు ఉన్న నిరుద్యోగులకు సబ్సిడీతో ఆటోలు ఇస్తామని ప్రకటించిన సర్కారు.. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే మొక్కుబడిగా కేవలం ఐదు వందల మందికి మాత్రమే పంపిణీ చేసింది.

లబ్ధిదారులకు నిధుల కేటాయింపుకు మైనార్టీ సంఘాలు డిమాండ్‌......
బడ్జెట్‌లో మైనార్టీలకు కేటాయించిన నిధులన్నీ లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని మైనార్టీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మండలం ఆధారంగా కాకుండా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని కేటాయింపులు జరపాలని కోరుతున్నాయి. 

నేడు తిరిగి సమావేశం కానున్న రాజ్యసభ..

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సభ్యుడు ప్రవీణ్‌ రాష్ట్రపాల్‌ మృతికి సంతాపంగా రాజ్యసభ నిన్న వాయిదా పడింది. దీంతో పెండింగ్‌లో పడిన కార్యకలాపాలను పూర్తి చేయడానికి సభ నేడు కూడా సమావేశమవుతోంది. లోక్ సభ సమావేశాలను రెండు రోజుల మేర, రాజ్యసభ సమావేశాలను ఒక రోజుకు కుదించాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

08:10 - May 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ సాగు పద్ధతులను ఆధునీకరించే పనిలో పడింది. హైదరాబాద్ తోపాటు అన్ని పట్టణాల్లో డిమాండ్‌కు తగిన కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు కొనుగోలు చెయ్యాలంటే పక్క రాష్ట్ర దిగుమతుల మీడ పడే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లా కేంద్రాల్లో సైతం జనాభాకు సరిపడా కూరగాయలు ఉత్పత్తి తెలంగాణ జిల్లాల్లో లేకపోవడంతో కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు.

హైదరాబాద్ 5 లక్షల టన్నుల కూరగాయలు ....
కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరం కోసం రోజుకు 5 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. కానీ తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌ మొత్తం కలిపి 10 నుంచి 12 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి మాత్రమే అవుతోంది. ఈ మిగతా కాలమంతా పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అందుకోసం 'పంట కాలనీ' ఏర్పాటు చేసి కూరగాయలు, పండ్ల ఉత్పత్తులను పెంచాలని భావిస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాలో క్లస్టర్ లో ఏర్పాటు చేయ్యనుంది.

కూరగాయల సాగుకు 69వేల హెక్టార్ల భూమి గుర్తింపు...
ఇప్పటికే తెలంగాణలోని పది జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు తెలంగాణ ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేకంగా పంట కాలనీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పది జిల్లాల్లో 118 క్రాప్‌కాలనీల్లో కలిపి లక్షా 69వేల హెక్టార్ల విస్తీర్ణాన్ని కూరగాయల సాగు కోసం గుర్తించారు. వీటిలో కూరగాయలు సాగుకు రైతులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వమే అందించనుంది. హైబ్రీడ్ విత్తనాలతోపాటు కొన్ని చోట్ల నాణ్యమైన రెడీమేడ్ మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

మైక్రో ఇరిగేషన్ ద్వారా 41వేల హెక్టార్లలో సాగు ....
ఇందులో పురుగుమందులు లేకుండా సేంద్రీయ పద్దతుల్లో 63వేల హెక్టార్లలో కూరగాయలు సాగు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా 41వేల హెక్టార్లలో సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాలి హౌసెస్‌ ద్వారా సైతం కూరగాయలు, పూల సాగును ప్రోత్సహకాలు అందిస్తున్నారు. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే కూరగాయల సాగు రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం హైబ్రీడ్ కూరగాయ విత్తనాలు 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్నారు.

డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహం....
ఇక డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహంగా ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ, చిన్న, సన్నకారు, బీసీ రైతులకు 90శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. అవసరం మేర కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పంటకాలనీలోని రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కూడా పెంచుతున్నారు.

07:59 - May 13, 2016

విజయవాడ : ఏపీలో పోలీస్‌, రెవెన్యూ శాఖల మధ్య వార్‌ నడుస్తోంది. పోలీసులు పెడుతున్న కేసులపై రెవెన్యూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కాస్తా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దగ్గరకు వెళ్లింది. దీంతో ఈ రెండు శాఖల మధ్య సయోధ్య కుదుర్చేందుకు కేఈ రంగంలోకి దిగారు.

త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తోందంటున్న రెవెన్యూ ఉద్యోగులు...
ఏపీలో పోలీస్‌, రెవెన్యూ శాఖల మ‌ధ్య పొస‌గ‌డం లేదు. క్షేత్రస్థాయిలో రెండు శాఖ‌ల మధ్య ఆధిపత్య పోరు న‌డుస్తోంది.పోలీసు శాఖ త‌మ‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తోంద‌ని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ పంచాయితీని ఉద్యోగులు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు. విధుల్లో భాగంగా ప‌ని చేస్తుంటే త‌మ‌పై పోలీసులు క్రిమినల్‌ కేసులు పెడుతున్నార‌ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత‌లు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు..ఆక్రమణల తొల‌గింపు, ప‌ట్టాదారు పుస్తకాల జారీ త‌దిత‌ర విష‌యాల్లో ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫిర్యాదులు అందితే చాలు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కనీసం విచారణ జరపకుండానే కేసులు పెడుతున్నారని ఉప ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. క‌డ‌ప, విశాఖ, గుంటూరు జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరిగాయని ప్రస్తావించారు.

రంగంలోకి దిగిన సీఎం కేఈ కృష్ణమూర్తి.....
రెవెన్యూ,పోలీసు శాఖ మ‌ధ్య వివాదం ముదిరి పోకుండా డిప్యూటీ దిగారు. జిల్లా క‌లెక్టర్‌ ఆదేశాలు లేకుండా రెవెన్యూ ఉద్యోగుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఉన్నాతాధికారులును ఆదేశించారు. త్వరలోనే దీనిపై హోం మంత్రి చిన రాజప్పతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల మ‌ధ్య సయోధ్య కుదర్చాలని నిర్ణయించారు.

07:54 - May 13, 2016

విజయవాడ : ఏపీలో కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. పాలనా పరమైన సౌలభ్యం కోసం కొత్త మండలాల ఏర్పాటు అనివార్యమని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. ప్రధానంగా అర్బన్‌ ఏరియాలో కొత్త మండలాలు ఏర్పాటు చేసేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది. దీంతోపాటే.. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ ఎంతో కాలంగా డిమాండ్‌లో ఉన్న అర్బన్‌ మండలాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి రెవిన్యూ ఉద్యోగులతో జరిగిన చర్చల్లో కొత్త మండలాల ఏర్పాటుపై సుముఖత వ్యక్తం అయింది.

13 జిల్లాల్లో జిల్లాకో అర్బన్‌ మండలాన్ని ఏర్పాటు యోచన....
13 జిల్లాల్లో జిల్లాకో అర్బన్‌ మండలాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నప్పటికీ.. విశాఖ-విజయవాడ-గుంటూరు వంటి జిల్లాల్లో రెండు మండలాలను ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాలనా పరమైన సౌలభ్యం కోసం ప్రతి మూడు లక్షల జనాభాకు ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 19కి పైగా కొత్తగా అర్బన్‌ మండలాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని రెవిన్యూ శాఖ వర్గాల సమాచారం.

ఖాళీగా ఉన్న 4200 పోస్టుల భర్తీకి పావులు కదుపుతోన్న ప్రభుత్వం..
మరోవైపు రెవిన్యూ శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న 4200 పోస్టుల భర్తీకి పావులు కదుపుతోన్న ప్రభుత్వం, కొత్త ఉద్యోగులకు కొత్త నిబంధనలు అమలు చేసే యోచనలో ఉంది. ప్రతి తహసీల్దారు ట్రైబల్‌ ఏజెన్సీ ఏరియాలో పనిచేయాలనే నిబంధనతో పాటు సొంత డివిజన్‌లో పోస్టింగ్‌లు ఇవ్వరాదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక రెవిన్యూ శాఖలో ప్రతి ఉద్యోగికి కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రెవిన్యూశాఖకు ప్రభుత్వం ఇస్తోన్న పెన్షన్ల పంపిణీ బాధ్యతను తొలగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రెవిన్యూశాఖ పనితీరుపై మంత్రి కేఈ అసహనం...
రెవిన్యూశాఖ పనితీరుపై ఇటీవల మంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాఖపై వస్తున్న ఆరోపణలకు సిబ్బంది కొరత, మౌలికసదుపాయాల లేమే కారణమన్న రెవిన్యూ ఉద్యోగుల నివేదికపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

07:42 - May 13, 2016

విజయవాడ : 10వ షెడ్యూల్ ఆస్తులపై ఏపీ ప్రభుత్వం లెక్కలను సిద్ధం చేస్తోంది. నిన్నటి వరకు అధికారుల కొరతతో నెమ్మదిగా సాగిన ఈ లెక్కల ప్రక్రియ నోడల్ అధికారుల నియామకంతో ఊపందుకోనుంది. గతంలో 10వ షెడ్యూల్ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు జనాభా ప్రాతిపదికన ఆస్తులను సుప్రీంకోర్ట్‌లో సాధించుకోవాలని ఏపి ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

సుప్రీం కోర్ట్ లో పోరాటానికి సిద్ధపడుతున్న ఏపి సర్కార్...
రాష్ట్ర విభజన లో ఏపికి జరిగిన అన్యాయం పై సుప్రీం కోర్ట్ లో పోరాటానికి ఏపి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్రం అప్పులను జనాభా ప్రాతిపదికన విభజన చేయగా, ఆస్తులను భౌగోళిక ప్రాతిపదికన విభజిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయం పై మరో మారు సుప్రీం గడప తొక్కనుంది ఏపి ప్రభుత్వం. 10వ షెడ్యూల్ లోని ఉమ్మడి సంస్థల ఆస్తులపై ప్రభుత్వ లెక్కలు సిద్ధం చేస్తోంది. అయితే వేగంగా త్వరిత గతిన లెక్కలు తేల్చాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.

ఆస్తుల సాధించాలనే లక్ష్యంతో సర్కారు యోచన....
గతంలో ఉన్నత విద్యామండలి ఆస్తుల విషయంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో జోష్ మీద ఉన్న ఏపి ప్రభుత్వం ఆ ప్రకారమే 10వ షెడ్యూల్ లోని మిగిలిన ఆస్తులను కూడా పోరాడి సాధించాలనే లక్ష్యంతో ఉంది. దీంతో 10వ షెడ్యూల్ ఆస్తుల లెక్కల విషయంలో నిన్న సచివాలయంలో సంబంధిత అధికారులతో ఏపి సీఎస్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లే ముందు 10వ షెడ్యూల్ లోని సంస్దల ఆస్తులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. అయితే సంస్థల ఆస్తుల సేకరణలో ఇబ్బందులు సీఎస్ దృష్టికి వచ్చాయి. సిబ్బంది కొరత, సమన్వయ లోపం సిఎస్ దృష్టికి తెచ్చారు అధికారులు. దీనిపై నోడల్‌ అధికారులను నియమించగా, ఈ మెత్తం ఆస్తుల సేకరణకు ఈ నెల 20వ తేది వరకు సీఎస్ గడువు ఇచ్చారు.

ఉమ్మడి ఆస్తులపై టీ.ఎస్ సీఎస్ కు ఏపీ లేఖ....
అయితే 10వ షెడ్యూల్ లోని ఉమ్మడి ఆస్తులపై చర్చకు తెలంగాణ సీఎం రాజీవ్ శర్మకు ఏపి సీఎస్ టక్కర్ గతంలోనే లేఖ రాశారు. ఈ లేఖపై స్పందన లేదు. దీంతో సుప్రీం గడప తొక్కనున్నారు. పదో షెడ్యూల్ లో మెత్తం 142 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఆస్తులు, నగదు నిల్వలతో కలిపి 40వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల అంచనా .ఈ మెత్తం ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంచితే ఏపికి 25వేల కోట్ల పైగా నిధులు అందే అవకావం ఉంది. ఈ ఆస్తులలో వాటా వస్తే ఆర్థిక లోటుతో కొట్టు మిట్టాడుతున్న ప్రభుత్వానికి కొంత ఉపసమనం లభించినట్లే.

07:33 - May 13, 2016

హైదరాబాద్ : దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరున ప్రవేశించే అవకాశమున్నదని ప్రైవేటు వాతావరణ సంస్ధ స్కైమెట్‌ ప్రకటించింది. ఈ నెలాఖరును 28-30 తేదీల మధ్య ఒకటి, రెండు రోజులు అటూఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఆ సంస్థ వెల్లడించింది. అధికారికంగా జూన్‌ 1కి రుతు పవనాలు చేరుకోవాలి. 18-20 తేదీల మధ్య అండమాన్‌ నికోబార్‌ దీవులను చేరుకుంటాయని ఆ తరువాత జూన్‌ 7కి గోవా, జులై 1కి ఢిల్లీ చేరుకుంటాయని స్కైమెట్‌ తెలిపింది.

07:29 - May 13, 2016

హైదరాబాద్‌ : మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హజం కేఫ్, జంజీర్ పాన్ షాప్, నరేంధ్ర స్వీట్ షాప్ ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 53 మంది అనుమనితులు, ఏడుగురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు సరైన ధృవపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, 3 కత్తులు, 3 రీఫిల్లింగ్‌ చేస్తున్న సిలిండర్స్‌, 50 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా పోలీసులు సేకరించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ బస్తీల్లో కార్డెన్ సెర్చ్ చేయాలని కోరుతున్నారని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

07:26 - May 13, 2016

విజయాడ : టార్గెట్‌ ఎక్స్‌...!ఇదీ ప్రస్తుతం వైసీపీ లక్ష్యం. పార్టీ ఎమ్మెల్యేలు పాలక టీడీపీలోకి క్యూ కడుతుంటే.. వారి స్థానాలను మాజీ ఎమ్మెల్యేలతో భర్తీ చేయడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను ఫ్యాన్ పార్టీ ఆకర్షించింది. అదే కోవలో.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకూ గాలం వేస్తోంది. ఇంతకీ టార్గెట్‌ ఎక్స్‌.. వెనుక వైసీపీ అధినేత వ్యూహం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ.

మాజీ ఎమ్మెలను టార్గెట్ చేస్తున్న వైసీపీ ...
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యేలను ఆకర్షించడమే లక్ష్యంగా.. వైసీపీ దూసుకు వెళుతోంది. ఎమ్మెల్యేల వలస వెళ్లిన నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతానికి జగన్ కసరత్తు చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలు ఫిరాయించిన చోట్ల.. పార్టీ బాధ్యతలను మాజీలకు అప్పజెప్పాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన క‌ర్నూల్ జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే ముర‌ళీ కృష్ణను పార్టీలో చేర్చుకున్నారు జగన్. రానున్న రోజుల్లో మ‌రికొంత మంది కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులకు వైసీపీ కండువా కప్పాలని ఆయన యోచిస్తున్నారు. ఆ దిశగా ఆకర్షాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు టీజీ వెంక‌టేష్, ఏరాసు ప్రతాప‌రెడ్డి ....
కాంగ్రెస్ మాజీలను పార్టీలో చేర్చుకునే బాధ్యతను సీనియర్ నేత బొత్సకి అప్పగించారు జగన్‌. కాంగ్రెస్ నేత‌ల‌తో ద‌గ్గర సంబంధాలు ఉండ‌టంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా ప‌నిచేసిన‌ అనుభవంతో బొత్స ఈ కార్యాన్ని సవ్యంగా పూర్తి చేస్తారని జగన్‌ నమ్ముతున్నారు. ముఖ్యంగా పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న తూర్పు-ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాల నేత‌ల‌పై ఫోక‌స్ చేయాల‌ని బొత్సకు జ‌గ‌న్ స్పష్టమైన అదేశాలిచ్చార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అలాగే, అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలకు కూడా గాలం వేయాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే క‌ర్నూల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు టీజీ వెంక‌టేష్, ఏరాసు ప్రతాప‌రెడ్డి ఇటీవ‌లే జ‌గ‌న్‌ను క‌ల‌సి త‌మ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రామ‌సుబ్బారెడ్డి, మంతనాలు? ...
భూమా ఫ్యామీలి టీడీపీలోకి వెళ్లడంతో అసంతృప్తిగా ఉన్న.. శిల్పా సోద‌రుల‌తో పాటు అళ్లగ‌డ్డలో గంగుల బ్రద‌ర్స్ తోనూ జ‌గ‌న్ నేరుగా చ‌ర్చలు జ‌రుపుతున్నట్లు స‌మాచారం. క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగులో టీడీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి టిడీపిలో చేర‌టాన్ని బ‌హిరంగంగానే వ్యతిరేకించిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌లరాంతోనూ వైసిపి నేత‌లు ట‌చ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు ఇప్పటికిప్పుడు పార్టీలో చేర‌కపోయినా....వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టికెట్ గ్యారెంటీ అన్న హామీని ఆ నేత‌ల‌కు జగన్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏకైక ప్రతిప‌క్షమైన త‌మ‌ను టీడీపీ అప‌రేష‌న్ అక‌ర్ష్ తో దెబ్బతీస్తోంద‌ని... అయితే అ పార్టీని కూడా అదే సూత్రంతో దెబ్బకొట్టాల‌ని భావిస్తోంది వైసిపి.. మ‌రి జ‌గ‌న్ చేస్తున్న ఈ ప్రయ‌త్నాలు ఎంత మేర‌కు వ‌ర్క్ అవుట్ అవుతాయో వేచి చూడాల్సిందే.

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పలువురు ప్రమాణస్వీకారం...

ఢిల్లీ : సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఎఎన్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, లావు నాగేశ్వరరావు ప్రమాణం చేయనున్నారు.

07:18 - May 13, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతికి వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించనుంది. ఉద్యోగుల అవసరాల నిమిత్తం మూడు రోజుల సాధారణ సెలవులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇంటి వసతి, పిల్లల చదువులకు ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ సెలవులు ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పాటు తరలింపు నిమిత్తం అయ్యే ఖర్చులో 75 శాతం అలవెన్సు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమకున్న ఇతర సమస్యలను ఉద్యోగులు రెండు రోజుల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఉద్యోగుల తరలింపు వేగవంతం చేస్తున్న ఏపీ సర్కారు ...
ఏపీ కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపు అంశంలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది. ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకు కేవలం నెలరోజులు మాత్రమే ఉండటంతో వారికి ఉండే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల సెలవు మంజూరు చేసింది. ఈనెల 15 నుంచి వచ్చే నెల చివరి వరకు ఎప్పుడైనా ఈ సెలవులు వాడుకునే అవ‌కాశం క‌ల్పించింది. కొత్త రాజ‌ధానిలో వ‌స‌తి స‌దుపాయం స‌మ‌కూర్చుకోవ‌డం, పిల్లల చ‌దువుకు సంబంధించి స్కూళ్లు, కాలేజీలు వెతుక్కోవ‌డం ఇలాంటి అవ‌స‌రాల నిమిత్తం ఈ వెసులుబాటు క‌ల్పించింది ప్రభుత్వం. దీనికోసం సాధార‌ణ పరిపాల‌నా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఉద్యోగులు త‌ర‌లింపుకు 75 శాతం అల‌వెన్సు...
ఏపీ ఉద్యోగులు త‌మ త‌ర‌లింపు కోసం చేసే ఖ‌ర్చులో 75 శాతం అల‌వెన్సు రూపంలో ఇవ్వడానికి ప్రభుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది..... హైద్రాబాద్ నుంచి త‌మ సామాన్లు కొత్త రాజ‌ధానికి త‌ర‌లించేందుకు ఖ‌ర్చు వేల‌ల్లో ఉంటుంది. ఇది కొంత ఇబ్బందిక‌ర‌మే.. దీనిని ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఖ‌ర్చులో 75శాతం అల‌వెన్సు రూపంలో ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభ‌మ‌యింది... దీనికి సంబంధించిన ఫైలును సాధారణ పరిపాల‌నా శాఖ నుంచి ఆర్ధిక శాఖ ఆమోదానికి వెళ్లింది.. ఆమోదం ల‌భిస్తే వెంట‌నే ఉత్తర్వులు వెలువడతాయి. ఇక వారానికి ఐదు రోజుల ప‌నిదినాల‌పై కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉంది.. దీనిపై కూడా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది..

బ్యాచిల‌ర్ అకామిడేష‌న్ కావాలంటున్న ఉద్యోగులు...
ఏపీ రాజధాని అమరావతికి త‌ర‌లి వెళ్లే ఉద్యోగులు ప్రధానంగా త‌మ‌కు బ్యాచిల‌ర్ అకామిడేష‌న్ కావాల‌ని కోరుతున్నారు. కొత్త రాజ‌ధానిలో తాము ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలంటున్నారు...కొత్త రాజ‌ధానికి వెళ్లే ఉద్యోగుల‌కు వ‌స‌తి చాలా ఇబ్బందిగా మారుతుంద‌ని దీనికోసం ప్రత్యేకంగా తాత్కాలిక స‌చివాల‌యం ద‌గ్గర‌లో బ్యాచిల‌ర్ అకామిడేష‌న్ కావాల‌ని కోరుతున్నారు. ఉద్యోగులంద‌రికి కొత్త రాజ‌ధానికి వెళితే త‌మపై నెల‌కు ఖ‌చ్చితంగా అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని దీని వ‌ల్ల ఇబ్బందులు ఏర్పడ‌తాయంటున్నారు. ఈ భారం కొంత‌యినా త‌గ్గించేందుకు ప్రభుత్వం కొంత అల‌వెన్సు రూపంలో ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఈ విష‌యాలు త్వర‌లోనే సీఎం దృష్టికి తీసుకెళ‌తామంటున్నారు ఉద్యోగులు.

ఉద్యోగుల త‌ర‌లింపుకు త్వరలో క్లారిటీ....
ఉద్యోగ సంఘాలు త్వరలోనే మంత్రి నారాయ‌ణ‌తో స‌మావేశం కానున్నాయి...బ‌హుశా ఈనెల 16 న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఉద్యోగుల త‌ర‌లింపు ప్రక్రియ కు సంబంధించి ఇదే రోజు పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది. ఏ శాఖ‌లు వెంట‌నే వెళతాయి? ఎంత‌మంది ఉద్యోగులు వెళ‌తారు? అనేది మంత్రి స్పష్టం చేయనున్నారు. మొత్తానికి ఉద్యోగుల త‌ర‌లింపు అంశంలో కౌంట్ డౌన్ మొద‌ల‌ైందని చెప్పవచ్చు.

రెండో రోజు మంత్రి దేవినేని రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన

హైదరాబాద్ : రెండో రోజు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. 

07:03 - May 13, 2016

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో అధికార పార్టీలో ఆశావాహుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. రెండు స్థానాలకు దాదాపు 10మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఎవరికి రాజ్యసభ స్థానం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెండు రాజ్యసభ స్థానాలను ఎవరికి ఇవ్వాలన్న దానిపై టీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.

గులాబీ అభ్యర్థుల పోటీ....
తెలంగాణాలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేందుకు గులాబీపార్టీ అభ్యర్థులు తీవ్రంగా పోటీపడుతున్నారు. రాష్ట్ర శాసనసభను పరిశీలిస్తే తెలంగాణాకు వచ్చిన రెండు స్థానాలు కూడా అధికార పార్టీకే దక్కనున్నాయి. దీంతో పార్టీ అధినేత కరుణిస్తే పదవి దక్కించుకోవచ్చన్న ధీమా సీనియర్లలో కనిపిస్తోంది.

రాజ్యసభ స్థానాలపై సీనియర్ నేతల గురి .....
పార్టీలో సీనియర్ నేతలు రాజ్యసభ స్థానాలపై కన్నేశారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి ఉన్న పలువురు నేతలు తమకు అవకాశం దక్కవచ్చని అంచనా వేసుకుంటున్నారు. పదవులు ఆశిస్తున్న నేతల్లో ప్రధానంగా పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్న దామోదర్‌రావ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు రాజ్యసభ స్థానం ఖరారయ్యే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. ఇక రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కించుకోవాలని మరికొంత మంది నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న డి.శ్రీనివాస్..ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న రామచంద్రుడుల పేర్లు వినిపిస్తున్నాయి. మరో సీనియర్ నేత కెప్టన్ లక్ష్మీకాంత్‌రావ్‌కు కూడా అవకాశం దక్కే చాన్స్ ఉన్నట్లు పార్టీలో జోఉగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కెప్టెన్‌ లక్ష్మీకాంత్‌రావ్ ప్రధాన అభ్యర్థిగా రంగంలో ఉన్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న గుండు సుధారాణి మరో సారి తనకు అవకాశం.

రేసులో డిఎస్‌, రామచంద్రుడు, కెప్టెన్‌ లక్ష్మీకాంత్‌రావు ....
శాసనభలో పార్టీల బలాబలాలను ఓ సారి పరిశీలిస్తే..రాజ్యసభ సభ్యుల ఎన్నికల ఏకగ్రీవం అవడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీ తరపున 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా..ఇతర పార్టీలైన టిడిపి నుంచి 12, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు గులాబీపార్టీలో చేరడంతో మొత్తం సభ్యుల సంఖ్య 87కు పెరుగుతోంది. అయితే ఎన్నికలు ఏకపక్షంగా సాగే అవకాశం ఉండడంతో పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం కూడా గులాబి పార్టీకే మద్దతు తెలిపే అవకాశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ బలం ఏకంగా 94కు చేరుకుంటుంది. 119 స్థానాలకుగాను దాదాపు వంద స్థానాలు ఏకపక్షంగా ఉండడంతో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే అవకాశం కూడా లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా..సామాజిక సమీకరణలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఎవరికి రాజ్యసభ అవకాశం దక్కుతుందనేది పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది.

హైదరాబాద్ పై ఢిల్లీ విజయం

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం సాధించింది.ఏడు వికెట్లతేడాతో గెలుపొందింది. హైదరాబాద్ స్కోర్ : 146/8, ఢిల్లీ స్కోర్ : 150/3.  

06:56 - May 13, 2016

విజయవాడ : రాజ్యస‌భలో ఖాళీ అవుతున్న 57 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుద‌ల అయింది. ఇదే సమయంలో నేతల్లో హ‌డావుడి మొద‌లైంది. ఏ మంత్రాంగమైనా చేసి పెద్దలసభకు వెళ్లాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు... ఖాళీ అవుతుండగా సంఖ్యాపరంగా టీడీపీకి మూడు, వైసిపికి ఒక స్థానం లభించనుంది. అయితే నాలుగో స్థానాన్ని కూడా తామే దక్కించుకునేందుకు టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం వ్యూహాల ఒరలోంచి అస్త్రాలను బయటకు తీస్తున్నారు.

ఏపీ కోటాలో 4 రాజ్యస‌భ స్థానాల‌ భర్తీకి నోటిఫికేష‌న్....
ఏపీ కోటాలో ఖాళీ అవుతున్న 4 రాజ్యస‌భ స్థానాల‌ భర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. దీంతో ఆవి ఎవ‌రికి ద‌క్కుతాయ‌నే విషయంలో రాజ‌కీయ‌వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఎంపీలు నిర్మలా సీతారామన్, సుజ‌నా చౌదరి, జె.డి శీలం, జైరామ్‌ర‌మేష్‌లు రాజ్యస‌భ నుండి రిటైర్ అవుతున్నారు. కాగా ప్రస్తుతం ఏపీలో మూడు సీట్లు గెలుచుకోగల సంఖ్యా బలం టీడీపీకి ఉంది. అయితే వాటిల్లో ఒకటి మిత్రపక్షం బీజేపీకి ఇచ్చే అవకాశముంది.

ఎంపీగా మరోసారి నిర్మలా సీతారామన్ ....
బీజేపీ ఎంపి నిర్మలా సీతారామ‌న్‌కు మళ్లీ అవకాశం ఇవ్వనున్నారు. మిగిలిన రెండు సీట్లలో ఒక‌ దానికి కేంద్రమంత్రి సుజ‌నా చౌదరి పేరు వినిపిస్తోంది. మిగిలిన ఒక్కస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విప‌రీత‌మైన పోటీ ఉంది. దీంతో ఆ ఒక్క స్థానాన్ని ఏపీకి కేటాయించి నాలుగో స్థానంలో పోటీకి దిగి తెలంగాణ నుండి ఒకరికి ఛాన్స్‌ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నాలుగో స్థానాన్ని దక్కించుకునేందుకు టిడిపి కసరత్తు చేస్తోంది.

బాబుకు తప్పని తలనొప్పి....
రాజ్యసభకు వెళ్లేందుకు టీడీపీలో నేతలు భారీగా పోటీపడుతున్నారు. దీంతో ఎవరిని పెద్దల సభకు పంపాలన్న విషయంలో చంద్రబాబుకు త‌ల‌నొప్పి తప్పేట్లు లేదు. ఏపీ కోటాలో సీటు దక్కించుకునేందుకు తెలంగాణ నుంచి కూడా పోటీపడుతుండడంతో చంద్రబాబుకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ‌తంలో గ‌రిక‌పాటికి రాజ్యస‌భ ఇస్తున్న స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి ఆ స్థానం కోసం తీవ్రంగా పోటీప‌డ్డారు. అయితే వ‌చ్చేసారి త‌ప్పకుండా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని అప్పట్లో చంద్రబాబు మోత్కుపల్లికి హమీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని మోత్కుపల్లి ఈ మధ్య చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా రాజ్యస‌భ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. సీనియ‌ర్ నేత కంభంపాటి రామ్మోహ‌న్‌రావు భారీగా మంతనాలు సాగిస్తున్నారు. ఎస్‌సి కోటా నుంచి మాజీ ఎమ్మెల్యే హేమ‌ల‌త‌, సీనియ‌ర్ నేత పుష్పరాజ్ రేసులో ఉన్నారు. మైనారిటీ కోటాలో ఫ‌రూఖ్, పలువురు మీడియా సంస్థల అధిప‌తులు కూడా రేసులో ఉన్నారు.

వైసీపీ కి పెద్దల సీటు దక్కుతుందా?.....
టిడిపి వ్యూహాల ప్రకారం 4 రాజ్యసభ సీట్లు గెలుచుకోవాలంటే వైసిపి నుంచి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాల్సి ఉంటుంది. ఇక రెండ‌వ ప్రాధాన్యత ఓట్లు కూడా కీల‌క భూమిక పోషించ‌నున్నాయి. అయితే ఎన్నికల నాటికి రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఇక వైసిపి నుండి రాజ్యస‌భ‌కు విజ‌య‌సాయిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయ‌న ఓట‌మి త‌ధ్యం అంటున్నాయి టిడిపి వ‌ర్గాలు. ఇక చంద్రబాబు విదేశీ ప‌ర్యట‌న నుంచి రాగానే ఆపరేషన్‌ ఆక‌ర్ష్‌ మరింత వేగవంతం అయ్యే అవ‌కాశం ఉందని టాక్.

వైసీపీ పెద్దల సీటు దక్కకుండా టీడీపీ వ్యూహం...
ఒక్కో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు 44 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌రం అవుతారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ద్వారా వైసిపికి ఈ సంఖ్య లేకుండా చేయాలన్నది టిడిపి వ్యూహంగా ఉంది. మరి టిడిపి వ్యూహాలు ఫలించి నాల్గో స్థానం ఆ పార్టీకి దక్కుతుందో లేదో చూడాలి.

మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. 50 మంది అనుమానితులు, ఏడుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. పత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశారు. 2 ఆటోలు, 3 కత్తులు, 3 సిలిండర్లు, 50 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 

నేడు భారత్ లో పర్యటించనున్న శ్రీలంక అధ్యక్షుడు

ఢిల్లీ : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేడు భారత్ లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో మైత్రిపాల పాల్గొననున్నారు. 

06:43 - May 13, 2016

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 57 స్థానాలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 11న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్‌ ఉంటుంది. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు....

పార్లమెంటు రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారయ్యింది. దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో ఖాళీకానున్న 57 రాజ్యసభ స్థానాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 24న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మే 31కి నామినేషన్లకు చివరి తేదీ కాగా జూన్ 1న దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 11న ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ అదే రోజు ఐదు గంటలకు ఓట్లను లెక్కిస్తుంది. జూన్ 13 లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో పదవీకాలం ముగుస్తున్న ఎంపీలు ...
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పదవీకాలం ముగుస్తున్న ఎంపీల్లో ఏపీ నుంచి నిర్మలా సీతారామన్, సుజానా చౌదరీ, జైరాం రమేశ్, జేడీ శీలం ఉన్నారు. తెలంగాణ నుంచి వి.హనుమంతరావు, గుండు సుధారాణి పదవీ కాలం ముగుస్తోంది. వీరితో పాటు రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న వారిలో ప్రస్తుత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్ ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆస్కార్ ఫెర్నండెజ్ అంబికా సోనీ, ఆనంద్ శర్మ, మొహిసినా కిద్వాయ్ పదవీకాలం కూడా ముగియనుంది. వీరితో సహా శరద్ యాదవ్, రాంజెఠ్మలానీ, కేసీ త్యాగీ , ప్రఫుల్ పటేల్ ఉన్నారు.

రాజ్యసభలో తగ్గనున్న కాంగ్రెస్ బలం....
తాజాగా జరగనున్న ఎన్నికలతో రాజ్యసభలో పార్టీల బలాలు సైతం మారనున్నాయి...కొత్తగా జరగనున్న ఎన్నికలతో రాజ్యసభలో బిజెపికి 5 స్ధానాలు పెరగనున్నాయి...కాంగ్రెస్ కు 8 మంది సభ్యుల బలం తగ్గుతుంది ..ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అయ్యే 4 స్ధానాలలో 3 టిడిపికి, 1 వైసిపికి దక్కనున్నాయి...తెలంగాణా నుండి ఖాళీ అవుతున్న 2 స్ధానాలకు టిఆర్ ఎస్ అభ్యర్థులు రాజ్యసభకు రానున్నారు.

నేడు ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్...

విశాఖ : ఐపీఎల్ 9 లో భాగంగా నేడు ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. విశాఖ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేటి నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 22న పరీక్ష జరుగనుంది. 

Don't Miss