Activities calendar

14 May 2016

21:39 - May 14, 2016

హైదరాబాద్ : తమిళనాడులోని తిరుపూరు వద్ద ఎన్నికల అధికారులకు పట్టుబడ్డ 570 కోట్ల నగదుపై మిస్టరీ వీడింది. తాము స్వాధీనం చేసుకున్న నగదు ఎస్‌బీఐదిగా గుర్తించామని రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఎస్‌బిఐకి చెందిన డబ్బును 3 కంటైనర్లలో కోయంబత్తూరు నుంచి విజయవాడకు తీసుకెళ్తున్నట్లు ట్రక్కు డ్రైవర్లు చెప్పినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాహనాలను సీజ్‌ చేయలేదని, ట్రక్కులను ఇంతవరకు ఓపెన్‌ చేయలేదని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు. నేటితో తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో అధికారులు పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తుండగా 3 కంటెయినర్లు పట్టుబడ్డ విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడ్డప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు వంద కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీకి మే 16 న ఎన్నికలు జరగనున్నాయి.

21:34 - May 14, 2016

మహబూబ్‌నగర్ : జిల్లా తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వంతో మంత్రి హరీష్‌రావు చేసిన ప్రయత్నం ఫలించింది. గూడూరు డ్యాం నుంచి ఒక్క టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కర్ణాటక జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ అభ్యర్థన పట్ల కర్ణాటక సర్కార్‌ సానుకూలంగా స్పందించినందుకు మంత్రి హరీష్‌ హర్షం వ్యక్తం చేశారు. 

21:33 - May 14, 2016

గుంటూరు : కాంప్లెక్స్ నిర్మాణంలో ప్రమాదం జరిగింది. సెల్లార్‌ తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. కొరశపాడులోని హరిహర మహల్‌సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. మట్టిపెళ్లల కింద ఐదుగురు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ కార్మికుడు మృతదేహాన్ని వెలికితీశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

21:31 - May 14, 2016

కృష్ణా : విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ కార్పొరేషన్‌ కార్యాలయం దగ్గర మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. ధర్నాలో పాల్గొన్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్టైన మహిళా నేతలను విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఆందోళన చేపట్టాయి.  

21:30 - May 14, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా అంశంపై మాటల యుద్ధం.. ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. స్పెషల్ స్టేటస్‌పై కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని ఏపీ సర్కారు చెబుతుంటే.. హోదారాకుంటే పోరు తథ్యమని విపక్షాలు స్పష్టం చేశాయి. అన్ని పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. హోదా సాధన సమితి సూచిస్తోంది..

విపక్షాలు సర్కారుపై ఒత్తిడి...

ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో మాటల తూటాలు పేలుతున్నాయి. స్పెషల్‌ స్టేటస్‌ సాధించాల్సిందేనంటూ విపక్షాలు సర్కారుపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రిని నిలదీయాలంటూ వైసీపీ.. టీడీపీని డిమాండ్ చేసింది. ఏపీకి హోదా ఇవ్వాల్సిన పని లేదని కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వంలో చలనంలేదని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పదవికి రాజీనామా చేయాలని...

ఏపీకి ప్రత్యేక హోదా సాధించకపోతే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పదవికి రాజీనామా చేయాలని సీపీఐ కూడా డిమాండ్‌ చేసింది. అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ... ఇప్పుడు కుంటిసాకుతో తప్పించుకుంటోందని ఆపార్టీ నాయకులు విమర్శించారు..

నోట్ః విజువల్స్ 146లో ఉన్నాయి..

కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేసిందని ...

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేసిందని హోదా సాధన సమితి ఆక్షేపించింది. హోదాతోపాటు రాష్ట్రానికి రావల్సిన ఏ ప్రయోజనాలనూ కల్పించడం లేదని సమితి మండిపడింది. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాల విమర్శలకు అదే స్థాయిలో సమాధానం చెబుతున్నారు పాలక పక్షం నేతలు. హోదా సాధన కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే కాదని, అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామన్నారు...

ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామన్నారు... మంత్రి యనమల.. కేంద్రం వీలైనంతవరకూ డబ్బులు విడుదల చేస్తోందన్నారాయన. మొత్తానికి హోదాపై విమర్శలతో ఏపీ మరోసారి వేడెక్కింది.. కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ.. విపక్షాలు టీడీపీపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ దశలో.. కేంద్రంతో సయోధ్యగా ఉంటూనే కార్యాన్ని సాధించుకుంటామని పాలక పక్షం నేతలు చెబుతున్నారు. ఈ అంశం రానున్న రోజుల్లో ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 

20:38 - May 14, 2016

మనిషి జీవితకాలం వందేళ్లు... అందులో బాల్యం 14 సంవత్సరాలు, యవ్వనం 30 సంవత్సరాలు, నడివయస్సు 45 సంవత్సరాలు.. తరువాత వృద్ధాప్యం. నేటి సమాజంలో మనిషి జీవన రేటు అంతకంతకు పడిపోయి 60కి వచ్చింది. ఈ లోపే కసి, కక్షలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ పగాప్రతీకరాలతో ప్రాణాలు తీసేసుకుంటూ అర్థం లేని ఆశలతో, స్వార్థంతో నిండిన ఆలోచనలతో తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఎన్నో ప్రాణాలను బలి చేస్తున్నారు. నష్టాలు, లాభాలు, ప్రలోభాలు ఎన్నో.... పూర్తి వివరాల కోసం ఈ వీడియోలో చూద్దాం.

విజయవాడకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు

విజయవాడ : టిడిపి కార్పొరేటర్ వెంకటేశ్వర్లు పై 354 సెక్షన్ కింద శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. మహిళ ఫిర్యాదులో కార్పొరేటర్ పై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు విజయవాడకు వెళ్లారు. కార్పొరేటర్ వెంకటేశ్వర్లు ను ప్రశ్నించనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం

విజయవాడ : శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం సంభవించింది. కవిటి, కంచిలి మండలాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సుమారు మూడు సెకెన్ల పాటు భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు కిందపడ్డాయి. పలు సామాన్లు జరిగిపోయాయి. ఇళ్లు ఊగిపోవడంతో ఏం జరుగుతుందో అర్ధం కాని ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తరువాత భూకంపం అని తెలుసుకుని ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోవడం విశేషం. 

గుంటూరు లాడ్జి సెంటర్లో ప్రమాదం

గుంటూరు : నిర్మాణంలోని భవనం మట్టి పెళ్లలు కార్మికులపై పడిన ఘటన శనివారం గుంటూరు లాడ్జి సెంటర్‌లో చోటు చేసుకుంది. దీంతో మట్టి పెళ్లల కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను రక్షించేందుకు యత్నిస్తున్నారు.

రేపు అండమాన్‌ను నైరుతి రుతుపవనాలు!

హైదరాబాద్:రేపు అండమాన్‌ను నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారి, 48 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ అంతటా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. 

19:51 - May 14, 2016

విజయవాడ : అనేక సంచలన ప్రకటనలకు కేంద్ర బిందువుగా మారి అనేక అంశాలను మొహమాటం లేకుండా వెల్లడించే వ్యక్తిగా ముద్ర పడ్డ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తో 'టెన్ టివి' ఫేస్ టు ఫేస్. అటు శాఖా పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా ఉన్న అనేక అంశాల గురించి అనేక ఆసక్తిర అంశాలను వివరించారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

హోదాపై కేంద్రంతో రాజీలేదు : పల్లె

అనంతపురం : హోదాపై కేంద్ర ప్రభుత్వంతో రాజీపడబోమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేన్నారు. ఆంధ్రప్రదేశ విభజన చట్టంలో పొందు పరిచిన ప్రత్యేక హోదా, స్పెషల్‌ ప్యాకేజీ, పన్ను రాయితీలు వంటివి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉందన్నారు.

విజయవాడ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత

కృష్ణా : విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. అధ్యయన యాత్ర పేరుతో కార్పొరేటర్లు జల్సాలు చేశారని వారు ఆరోపించారు. మేయర్‌ ఛాంబర్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సదరు కార్పొరేటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై శంషాబాద్‌ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఉత్తర భారతదేశం పర్యటనకు వెళ్లిన విజయవాడ కార్పొరేటర్లు..పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు.

ముగిసిన ఎన్నికల ప్రచారం...

హైదరాబాద్ : తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజున తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఒక స్థానమైన పాలేరులో ఉప ఎన్నిక జరుగనుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి ఈ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 19న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

17:45 - May 14, 2016

హైదరాబాద్ : ఫేయిర్‌నెస్‌ క్రీమ్‌, ఫేషియల్‌ కిట్స్, ఐలాష్‌, లిప్‌స్టిక్కులు..అందమైన అమ్మాయిల బొమ్మలతో డిజైన్లు..ఆకట్టుకునే క్యాప్షన్లు...వీటిని చూసి ఆకర్షితులవుతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. మీరు కొంటున్న కాస్మోటిక్స్‌ నకిలినో.. ఒరిజినలో ఒకటికి పదిసార్లు పరిశీలించి కొనండి...ప్రముఖ బ్రాండ్ల పేరుతో కనిపిస్తున్నాయని గుడ్డిగా కొనకండి.. ఈ సోర్టీ చూస్తే డూప్లీకేట్‌ గాళ్ల మాయాజాలం ఏంటో తెలుస్తోంది.

పాతబస్తీలో ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్‌ పాతబస్తీలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కాస్మోటిక్స్‌ విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ప్రముఖ బ్రాండ్ల పేరుతో తయారైనట్లుగా నకిలీ చర్మసౌందర్య సాధనాలను మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. హానికారక రసాయనాలతో అడ్డదిడ్డంగా తయారు చేసిన వాటిని ముంబైనుంచి దిగుమతి చేసుకుని మార్కెట్‌లోకి దించేస్తున్నారు కల్తీ కిలాడీలు. మగువల అందం, ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

హెచ్‌ఎల్‌ఎల్‌ ప్రతినిధి నిఘాతో గుట్టురట్టు..

పాతబస్తీ శాలిబండ దేలాకాలనీకి చెందిన అభిషేక్‌ విజయ్‌, కాలపత్తర్‌ తాడ్బండ్‌కు చెందిన సయ్యముస్తఫా అలీ కొన్నాళ్లుగా నకిలీ కాస్మోటిక్స్‌ విక్రయిస్తున్నారు. హిందూస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్‌ పేరుతో ముంబైలో తయారు చేసిన నకిలీ చర్మసౌందర్య సాధనాలను తక్కువ రేటుకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తెస్తున్నారు. ఫేక్‌ కాస్మోటిక్స్‌ను ఎమ్మార్పీ ధరలతో సమానంగా 250 నుంచి 300లకు ఆమాయక మహిళలకు అంటగడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన హిందూస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్‌ ప్రతినిధి రాజేష్‌ కుమార్‌ చార్మినార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌తో కలిసి దాడులు చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఫేక్‌ కాస్మోటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చూశారుగా అమ్మాయిలు నకిలీల లీలలు..తక్కువ ధరకు లభిస్తోందని కల్తీ కాస్మోటిక్స్‌ కొనుగోలు చేశారో అందం మాట దేవుడెరుగు మీ ముఖ సౌందర్యం పాడవడం మాత్రం ఖాయం..    

17:41 - May 14, 2016

ఖమ్మం :పాలేరు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ నేలకొండపల్లిలో రోడ్ షో నిర్వహించారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షో ర్యాలీలో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గోన్నారు. ఓటమి భయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు పాలేరులో మకాం వేశారని పోతినేని టీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయలు పంచుతూ ఓటర్లను బెదిస్తున్నారని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పలు గ్రామాల్లో, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. 

17:39 - May 14, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీరు అందిస్తామని చెప్పారు. పాలేరులో సానుభూతి పేరుతో కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అవినీతిలో కాంగ్రెస్‌ ఒక విశ్వవిద్యాలయం అని ఎద్దేవా చేశారు. 

మంత్రి హరీష్ ను కలిసిన జూరాల ముంపు బాధితులు

హైదరాబాద్: కాంగ్రెస్ నేత డీకే అరుణ ఆధ్వర్యంలో నాగదొడ్డి గ్రామానికి చెందిన జూరాల ముంపు బాధితులు మంత్రి హరీష్ రావును కలిశారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల్లోగా నష్టపరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 270 కుటుంబాలు అన్నీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలోఉన్నాయని ఆమె మంత్రికి వివరించారు.

కంటైనర్ల పై విద్యుత్ తీగలు పడి ఇద్దరు మృతి

ప.గో : చాగల్లు మండలం దారవరంలో సూర్య రైస్ మిల్లులో కంటైనర్ల పై విద్యుత్ తీగలు పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

ఏఆర్ కానిస్టేబుల్ ది ఆత్మహత్యే : ఎస్పీ

ఆదిలాబాద్ : ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ ది ఆత్మహత్యే అని ఎస్పీ తరుణ్ తెలిపారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెల ఇంటి వద్ద తుపాకీతో కాల్పుచుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది ఒత్తిళ్లకు గురి కావొద్దని సూచించారు.

'టీడీపీ, బిజెపి మధ్య కోల్డ్ వార్ అనేది అవాస్తవం'

హైదరాబాద్ : టీడీపీ, బిజెపి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని కొందరు ప్రచారం చేస్తున్నారని మంత్రి యనమల అన్నారు. ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని, కేంద్రం వీలైంనంత సాయం చేస్తూ నే ఉందని యనమల స్పష్టం చేశారు. మేం కేంద్రాన్ని డిమాండ్ చేయడం లేదనేది అవాస్తవం అన్నారు.

 

ఏపీని నట్టేట ముంచడానికే బిజెపి కుట్రలు:నటుడు శివాజీ

హైదరాబాద్ : ఏపీని నట్టేట ముంచడానికే బిజెపి కుట్రలు చేస్తోందని నటుడు శివాజీ ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడతామని, బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం చేస్తామని శివాజీ పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లాలో జనశక్తి వాల్‌పోస్టర్లు కలకలం

కరీంనగర్ : జిల్లాలో జనశక్తి వాల్‌పోస్టర్లు కలకలం రేపాయి. ఇల్లంతుకుంట మండలం పెద్దలింగాపూర్‌లో జనశక్తి వాల్‌పోస్టర్లు వెలిశాయి. మాజీ ఎంపీటీసీ మల్లారెడ్డి, అనిల్ పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, పద్దతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్షిస్తామని జనశక్తి నేతలు పోస్టర్ల ద్వారా హెచ్చరించారు.

మెట్‌పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ : మెట్‌పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. చైతన్యనగర్‌లో ఉండే ఉడుత భవాని (16) శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే కటుంబ సభ్యులు మంటలను ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంటర్‌లో మార్కులు తక్కువ వచ్చాయని ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది. 

లారీ కిందపడి మూడేళ్ల బాలుడు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని కీసర మండలం రాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లారీ కిందపడి మూడేళ్ల బాలుడు అరవింద్ మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మోసాలకు పాల్పడుతన్న 7గురు అరెస్ట్

హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడుగురు పలు మోసాలకు పాల్పడుతున్నందునే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. రెట్టింపు నగదు ఇస్తామంటూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 33 లక్షలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

16:49 - May 14, 2016

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల రైతుల వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలవిహీనంగా మారింది. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలో గల మహరాష్ట్రలో వర్షాలు లేకపోవడంతో డెడ్ స్టోరేజీకి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో ఖరీఫ్ రబీ సీజన్లకు సాగునీరు అందించలేని పరిస్థితికి శ్రీరాంసాగర్ చేరింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:47 - May 14, 2016

తిరుమల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకై రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభంజించడంతో ఏపీ ప్రజలు రోడ్డున పడ్డారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఆయన పర్యటించారు. పట్టణంలో గల విర్డ్ హాస్పిటల్‌లోని రోగులను పరామర్శించారు. విశాఖ జిల్లాలోని భోగాపురంలో నిర్మిస్తున్న విమానశ్రయాన్ని అంతర్జాతీయ విమానశ్రయంగానూ.. అలాగే రాష్ట్రంలోని విమానాశ్రయాలనూ కేంద్రం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు.

 

16:45 - May 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రిని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దార్థనాథ్‌సింగ్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని బొత్స డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులంటూ తెలంగాణ‌ నీళ్లు దోచుకుంటుంటే టీడీపీ ప్ర‌భుత్వం ఎందుకు మాట్లాడ‌డంలేద‌ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నిర్మిస్తోన్న‌ అక్ర‌మ ప్రాజెక్టుల‌పై ప్రభుత్వం వెంట‌నే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను టీడీపీ తుంగ‌లో తొక్కింద‌ని బొత్స‌ విమ‌ర్శించారు. -

16:42 - May 14, 2016

కృష్ణా : విజయవాడ 25వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ వెంకటేశ్వరరావుపై కేసు నమోదయ్యింది. విజయవాడ కార్పొరేషన్ ప్రతిష్టతను మంటగలిపారని, వారిని అనర్హులుగా ప్రకటించి చర్యలు తీసుకోవాలని విజయవాడలో ఐద్వా నేతలు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై శంషాబాద్‌ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఉత్తర భారతదేశం పర్యటనకు వెళ్లిన విజయవాడ కార్పొరేటర్లు..పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. విమానంలో కార్పొరేటర్‌ వెంకటేశ్వరరావు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ మహిళ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి కార్పొరేటర్‌ను ఇంటికి పంపించేశారు. 

టిడిపి పై ఫైర్ అయిన బొత్స

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ అధికార తెలుగుదేశం పార్టీపై మండిప‌డ్డారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులంటూ తెలంగాణ‌ నీళ్లు దోచుకుంటుంటే టీడీపీ ప్ర‌భుత్వం ఎందుకు మాట్లాడ‌డంలేద‌ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నిర్మిస్తోన్న‌ అక్ర‌మ ప్రాజెక్టుల‌పై ప్రభుత్వం వెంట‌నే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను టీడీపీ తుంగ‌లో తొక్కింద‌ని బొత్స‌ విమ‌ర్శించారు. -

ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించిన మంత్రి

హైదరాబాద్ :అమీర్‌పేటలోని ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. వైద్యశాలలో కలియ తిరిగిన మంత్రి వివిధ చికిత్సా విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. యోగా కేంద్రం, మట్టి స్నానపు గది, వ్యాక్యూమ్‌ గది తదితర విభాగాలలో జరుగుతున్న చికిత్స విధానాన్ని మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

15:32 - May 14, 2016

తిరుమల : వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనుహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కంప్లెక్స్‌ వెలుపల నారాయణగిరి ఉద్యాన వనంలో టీటీడీ ఏర్పాటుచేసిన క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మరోవైపు భక్తులకు వసతి గదులు లభ్యం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మరో వైపు పరీక్షల ఫలితాలు రావడం, రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

15:28 - May 14, 2016

గుంటూరు:కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న 63మంది గుంటూరు యాత్రికులు క్షేమంగానే ఉన్నారు. భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుమార్గాలు మూసివేశారు. దీంతో యాత్రికులను అధికారులు.. హెలికాఫ్టర్లలో తరలిస్తున్నారు. అయితే కేవలం 6 హెలికాప్టర్లే అందుబాటులో ఉండటంతో తరలింపులో ఆలస్యం జరుగుతోంది. దీంతో తెలుగుయాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన.. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు... తెలుగువారికి ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా హెలికాఫ్టర్ల ద్వారా తరలించాలని విజ్ఞప్తి చేశారు. 

15:25 - May 14, 2016

హైదరాబాద్ : వేసవి అనగానే గుర్తుకొచ్చే ఫలం మామిడిపండే.. నోరూరించే ఫలరాజు మామిడిని ఎవరు కాదనుకుంటారు. ఎగబడి మరీ కొనుక్కుంటారు. అయితే ఈసారి మామిడి పళ్ల ధర మరింత పెరగనుంది. మామిడి దిగుబడి తగ్గడంతో మార్కెట్లు కళ తప్పాయి. కరవు కారణంగా పళ్ల దిగుబడి తగ్గినట్లు ఉద్యానవన శాఖ చెబుతోంది.

తగ్గిన దిగుబడితో పెరిగిన మామిడి ధరలు....

ఈ ఏడాది మామిడి పళ్ల ధరలు పెరగనున్నాయి. కరవు, తోటల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈసారి దిగుబడి తక్కువగానే ఉంది. దీనికితోడు అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మామిడికాయలు చాలావరకు రాలిపోయాయి. తెలంగాణలో లక్షన్నర ఎకరాల్లో మామిడితోటలున్నాయి. సాధారణంగా ఏడాదికి 8లక్షల టన్నుల వరకూ మామిడి దిగుబడులు రావాలి. కాని అంత దిగుబడి ఈ ఏడాది రాలేదు. గతేడాది టన్ను మామిడి 15వేలనుంచి 35వేల రూపాయల ధరపలికితే , ఈ ఏడాది 30 వేల నుంచి 60వేల రూపాయల వరకు పలుకుతోంది. మరోవైపు హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు భారీగా తగ్గాయి.

కిలో 50 రూపాయల నుంచి 60దాకా ...

హైదరాబాద్‌ గడ్డి అన్నారం మార్కెట్లో మామిడికాయలను కిలో 50 రూపాయల నుంచి 60దాకా కొంటున్నారు. చిల్లర మార్కెట్‌లో 70 రూపాయల నుంచి 90 దాకా అమ్ముతున్నారు. ఇక నాణ్యమైన మామిడి రేటు వంద నుంచి రెండొందల పైమాటే పలుకుతోంది. పళ్ల దుకాణాల్లో నాణ్యమైన పెద్దరసాలు, బంగినపల్లి,అల్ఫోన్సా రకాలు తక్కువగా ఉండటంతో అమ్మకాలు ఎక్కువగా జరగడం లేదు. దీంతో వ్యాపారస్తులు ఎక్కువ ఖరీదు పళ్లను అమ్మడానికి ఆసక్తి చూపడం లేదు. మామిడి ధరల పెరగడంతో ,వాటిని కొనడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. అమ్మకాలు సరిగ్గా జరగక వ్యాపారస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

15:18 - May 14, 2016

విజయవాడ: ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న వారిని కార్పొరేట్‌ అధికారులు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టి.. అధికారులను నిలదీశారు. ఇళ్లను ఖాళీ చేయిస్తే.. ప్రాణాలను సైతం అర్పిస్తామంటున్న విజయవాడ భవానీపురం వాసులకు సీపీఎం, వైసీపీ నేతలు మద్దతు పలికారు. అటు స్థానికుల వ్యతిరేకత.. ఇటు అధికారుల బల ప్రతాపంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తమ ఇళ్లను తొలగించవద్దని ఆందోళన కొనసాగిస్తునే .............

విజయవాడలోని భవానీపురంలో రోడ్డు డైవర్షన్ పేరుతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న దాదాపు 200 ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా స్థానికులు ఇళ్లు ఖాళీ చెయ్యాలని నోటీసులిచ్చారు అధికారులు. అయితే ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమను ఇప్పటికిప్పుడు ఖాళీ చెయ్యమనడం , ఊరి చివర కట్టిన ఇళ్లకు వెళ్లమనడం సరికాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి తమ ఇళ్లను తొలగించవద్దని ఆందోళన కొనసాగిస్తునే ఉన్నారు. లక్షల రూపాయలతో ఇళ్లను నిర్మించుకున్నామని, ఇప్పుడు జక్కంపూడిలోని వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్లమనడంపై తీవ్రంగా మండిపడుతున్నారు స్థానికులు.

నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌

సరైన వసతులు లేని ప్రాంతానికి పిల్లలతో కలిసి ఎలా వెళ్లమంటారని ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తున్నారు భవానీపురంలోని కరకట్ట ప్రాంతవాసులు. మరోవైపు అధికారుల వైఖరిని ప్రతిపక్ష పార్టీనేతలు కూడా ఖండిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా ఉంటున్నవారిని బలంవంతంగా ఖాళీ చెయ్యమనడం అన్యాయమన్నారు. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా పొమ్మనడం సరికాదని మండిపడ్డారు. అందరికీ న్యాయం చేసిన తర్వాతే ఇళ్లను తొలగించాలని, లేకుంటే కరకట్ట ప్రాంత నివాసులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు పార్టీల నేతలు.

ఛత్తీస్‌గఢ్ లో రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ : జగదల్‌పూర్ జిల్లాలోని కుమ్హర్‌సర్దా రైల్వేస్టేషన్‌కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్‌లోని పలు పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. మావోయిస్టుల కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు రైల్వే స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నిమిషం ఆలస్యమైనా అనుమతించం

హైదరాబాద్ : తెలంగాణ లో రేపు జరిగే ఎంసెట్ పరీక్ష నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఆ పరీక్ష కన్వీనర్ రమణారావు శనివారం హైదరాబాద్ లో తెలిపారు. ఈ పరీక్షకు 2.46 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.... అలాగే మెడికల్ పరీక్ష మ.2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

కేదారీనాథ్ లో గుంటూరు వాసులు క్షేమం

గుంటూరు : హిమాలయ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్లి కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన గుంటూరు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో అక్కడి రోడ్డుమార్గాలు మూసివేశారు. దీంతో యాత్రికులను హెలికాప్టర్లలో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా 6 హెలికాప్టర్లే ఉండడంతో యాత్రికుల తరలింపులో ఆలస్యం జరుగుతోంది. దీంతో 63 మంది తెలుగు యాత్రికులు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ ‌రావు ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడి తెలుగువారిని హెలికాప్టర్ల ద్వారా తరలించాలని విజ్ఞప్తి చేశారు.

14:39 - May 14, 2016

వరంగల్‌ : భూపాలపల్లిలోని నేరేడుపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. హెచ్‌పీ గ్యాస్ లీకేజీవల్ల జరిగిన ఈ ప్రమాదంలో 7ఇళ్లు పూర్తిగా ధ్వంసంకాగా, సుమారు 50లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా కలిపోయాయి. ఇంట్లోవున్న గొర్రెలు కూడా చనిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆపుతున్నారు. అగ్ని ప్రమాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

వరంగల్ జిల్లా నేరేడు పల్లిలో అగ్నిప్రమాదం

వరంగల్‌ : భూపాలపల్లిలోని నేరేడుపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. హెచ్‌పీ గ్యాస్ లీకేజీవల్ల జరిగిన ఈ ప్రమాదంలో 7ఇళ్లు పూర్తిగా ధ్వంసంకాగా, సుమారు 50లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా కలిపోయాయి. ఇంట్లోవున్న గొర్రెలు కూడా చనిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆపుతున్నారు. అగ్ని ప్రమాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

14:37 - May 14, 2016

ఆదిలాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ విప్‌ ఓదేలు గన్‌మెన్ గంగాధర్ గన్ మిస్‌ఫైర్ అవడంతో అతడు మృతి చెందాడు. గన్ శుభ్రం చేస్తుండగా గన్‌మిస్‌ఫైర్ అయ్యి గంగాధర్‌కే బుల్లెట్ తగిలింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గన్‌మెన్ గంగాధర్ మృతి చెందాడు. జిల్లాలోని మందమర్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా బెల్లంపల్లి అడిషినల్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

గన్ మిస్ ఫైర్ ..ఏఆర్ కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్ :తెలంగాణ ప్రభుత్వ విప్‌ ఓదేలు గన్‌మెన్ గంగాధర్ గన్ మిస్‌ఫైర్ అవడంతో అతడు మృతి చెందాడు. గన్ శుభ్రం చేస్తుండగా గన్‌మిస్‌ఫైర్ అయ్యి గంగాధర్‌కే బుల్లెట్ తగిలింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గన్‌మెన్ గంగాధర్ మృతి చెందాడు. జిల్లాలోని మందమర్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా బెల్లంపల్లి అడిషినల్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

నేను బిజెపిలోనే కొనసాగుతా: నాగం జనార్థన్ రెడ్డి

హైదరాబాద్ :తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, బిజెపి లోనే కొనసాగనున్నట్లు నాగం జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లోకి లేదా తెరాసలోకి వెళ్లే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదని అన్నారు. తాను ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ వచ్చానని, ఆ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉన్న తాను అదే పార్టీలోకి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. కాగా, కొన్నాళ్లుగా బీజేపీకి నాగం దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయిల్ మాఫియా కేసులో ముగ్గురి అరెస్ట్

నెల్లూరు : జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయిల్ మాఫియా కేసు లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముత్తుకూరు మండలానికి చెందిన గోపాల్‌రెడ్డి, తమ్మారెడ్డి, కాకినాడకు చెందిన షఫీని అదుపులోకి తీసుకున్నారు. ఆయిల్ మాఫియా కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి నుంచి రూ.2కోట్లు విలువ చేసే 5 ట్యాంకర్ లారీలు, రెండు కార్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

జర్నలిస్టుల హత్యను ఖండించిన జైట్లీ

హైదరాబాద్ : బీహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో జరిగిన జర్నలిస్టుల హత్యలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. జర్నలిస్టుల హత్య ఘటనపై వ్యక్తిగత విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుని శిక్ష విధించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం సివాన్‌లో రాజ్‌డియో రంజన్, ఛాత్రా జిల్లాలో అఖిలేష్ ప్రతాప్ సింగ్‌లు హత్యకు గురైన విషయం తెలిసిందే. 

బకెట్లలో 8 మంది శిశువుల మృతదేహాలు...

కర్నూలు : ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. గైనిక్‌ వార్డులోని బకెట్లలో 8 మంది శిశువుల మృతదేహాలు బయటపడ్డాయి. శిశువుల మృతదేహాలను ఖననం చేసేందుకు 120రూపాయలు సరిపోవడం లేదని కాంట్రాక్టర్‌ మృతదేహాలను బకెట్లలోనే ఉంచేశాడు. ఈ వార్త పత్రికలలో రావడంతో జిల్లా ఎస్పీ రవికృష్ణ స్పందించారు. శిశువుల మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 

 

మెదక్ జిల్లాలో ఉద్రిక్తత...

మెదక్ : జిల్లాలో తొగుట మండలం ఏటిగట్టు కిష్టాపురంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు సర్వేకు వచ్చిన ఆర్ డీవో గ్రామస్తులు ఘెరావ్ చేశారు. గ్రామస్తులు, ఆర్డీవో మధ్య తోపులాట జరిగింది. గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. 8 మంది సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

14:21 - May 14, 2016

మెదక్ : జిల్లాలో తొగుట మండలం ఏటిగట్టు కిష్టాపురంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు సర్వేకు వచ్చిన ఆర్ డీవో గ్రామస్తులు ఘెరావ్ చేశారు. గ్రామస్తులు, ఆర్డీవో మధ్య తోపులాట జరిగింది. గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. 8 మంది సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టును 50 టీఎంసీలు పెంచేందుకు సర్కార్ ప్రయత్నిస్తుంది. 15 గ్రామాల ప్రజలు నిర్వాసితులు కానున్నారు. 21వేల ఎకరాలు మునిగిపోనున్నాయి. దీంతో భూముల్విడానికి గ్రామస్తులు నిరాకరిస్తున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే  2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

14:13 - May 14, 2016

కర్నూలు : నగరంలో పెద్దాసుపత్రి.. ఓ కాంట్రాక్టర్‌ కర్కశత్వానికి.. వైద్యాధికారుల నిర్లక్ష్యానికి సాక్షిగా నిలుస్తోంది. ఆసుపత్రి కాంట్రాక్టర్‌ డబ్బు పిచ్చి కారణంగా.. కొన్ని శిశు కళేబరాలు.. ఆరు వారాలుగా ఆసుపత్రిలోనే కుళ్లిపోయాయి. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఎస్పీ రవికృష్ణ.. ఆ మృత శిశువులకు అంత్యక్రియలు జరిపించారు.

తల్లిదండ్రులు ముందుకు రాకుంటే ఆస్పత్రివారు ఖననం...

కడుపులోనే కన్నుమూసిన శిశువులు కొందరు... తల్లి గర్భంనుంచి బయటకు రాగానే ఉసురు ఆగినవారు మరికొందరు.. చూడగానే అయ్యో అనిపించే ఈ మృతదేహాల విషయంలో.. కర్నూలు ప్రభుత్వాస్పత్రి నిర్వాకం... ఓ మహిళా కాంట్రాక్టర్‌ కర్కశత్వం... ఆశ్చర్యాన్నీ.. ఆవేదననూ కలిగించింది.

మృతదేహాలను ఆసుపత్రిలోనే వదిలేసి వెళుతుంటారు....

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో.. మృత శిశువులకు జన్మనిచ్చిన తల్లులు.. అంతిమ సంస్కారాలు జరపలేని పరిస్థితుల్లో.. మృతదేహాలను ఆసుపత్రిలోనే వదిలేసి వెళుతుంటారు. అలాంటి కొన్ని మృతదేహాలు ఆరు వారాలుగా ప్రభుత్వాసుపత్రిలోనే కుళ్లి పోయాయి. ఎందుకిలా అని ఆరా తీస్తే.. ఇలాంటి మృతదేహాలను ఖననం చేసేందుకు నియమించిన కాంట్రాక్టర్‌.. ఆసుపత్రి వారిచ్చే డబ్బు చాలడం లేదంటూ బాధ్యతల నుంచి తప్పుకుందని తేలింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆరు వారాలుగా.. మృత శిశువుల దేహాలను బకెట్లలో దాచి పెడుతూ వచ్చారు.

ఖననం చేసేందుకు అధికారులు ఓ కాంట్రాక్టర్‌ను ...

ప్రభుత్వాసుపత్రిలో తల్లిదండ్రులు వదిలేసి వెళ్లే మృత శిశు కళేబరాలను ఖననం చేసేందుకు అధికారులు ఓ కాంట్రాక్టర్‌ను నియమించారు.

ఒక్కో మృతదేహానికి 125 రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడేళ్ల క్రితం కుదిరిన ఈ అగ్రిమెంట్‌ ప్రకారం 950 మృతదేహాల ఖననం కోసం ఇప్పటిదాకా లక్షా 18వేల రూపాయలనూ చెల్లించారు. కాని ఆసుపత్రి అధికారులిచ్చే డబ్బు చాలడం లేదంటూ కాంట్రాక్టర్‌.. ఆరు వారాలుగా మృతదేహాలను తీసుకు వెళ్లడం మానేసింది.

కాంట్రాక్టర్‌ సహాయ నిరాకరణతో..

కాంట్రాక్టర్‌ సహాయ నిరాకరణతో.. ఆసుపత్రి సిబ్బంది.. మృతదేహాలను ఆపరేషన్‌ థియేటర్‌లలోని బకెట్లలోనే ఉంచుతూ వస్తున్నారు. అవి కుళ్లి కంపుకొడుతున్న విషయాన్ని మీడియా ప్రసారం చేసింది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆస్పత్రిని సందర్శించారు.. బుధవారపేటలోని శ్మశానవాటికలో దగ్గరుండి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేయించారు.. ఎస్పీ రవికృష్ణ చొరవతో ప్రస్తుతానికి కర్నూలు ఆసుపత్రిలో మృతశిశు కళేబరాల సమస్య సమసిపోయినా.. మానవత్వానికి మాయని మచ్చలా నిలిచే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.. 

14:09 - May 14, 2016

హైదరాబాద్ : విజ్ఞానయాత్రకు వెళ్లి.. ఉన్న జ్ఞానాన్ని కోల్పోయాడు. విజ్ఞానంతో తిరిగిరావాల్సిన వ్యక్తి అజ్ఞాని అయ్యాడు. తానొక ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని మరిచాడు. సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. మహిళలను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం మరిచాడు. బాధ్యతగా మెలగాల్సిన టీడీపీ కార్పొరేటర్ వెలికి చేష్టలకు పాల్పడ్డాడు. ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళను వేధింపులకు గురి చేశాడు. విజయవాడ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు విజ్ఞానయాత్ర నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. టీడీపీకి చెందిన వెంకటేశ్వర్లుతో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు పూణె రైల్వే స్టేషన్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం తాగి.. రైలులో హల్ చల్ చేశారు. పుణెలో వారిని  పోలీసులు మందలించారు. విజయవాడ మేయర్ జోక్యం చేసుకుని పోలీసులకు సర్ధి చెప్పి... కేసు లేకుండా చేశారు. కార్పొరేట్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా యాత్ర ముగించుకుని కార్పొరేటర్లు తిరుగు ప్రయాణం అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు విమానంలో వస్తున్నారు. ఈనేపథ్యంలో విజయవాడ 25 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు తన పక్క సీటులో కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో దిగాక మహిళ ఎయిర్ పోర్టులో ఫిర్యాదు చేసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు తనపై వేధింపులకు పాల్పడ్డాడనిఆరోపించింది. తనను మానసికంగా వేధించాడని వాపోయింది. దీంతో పోలీసులు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. అయితే.. వెంకటేశ్వర్లుకు పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. వెంకటేశ్వర్లు విజయవాడ వెళ్లాడు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వెంకటేశ్వర్లుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విజయవాడ పంపారని పలువురు అంటున్నారు. ఇదిలా ఉంటే పొరపాటున తన కాలు మహిళకు తాకిందని ... ఆమెకు సారీ చెప్పానని కార్పొరేటర్ వెంకటేశ్వర్లు చెబుతున్నారు. 

 

13:49 - May 14, 2016

అనంతపురం : జిల్లాలో 10 వామపక్ష పార్టీలు బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. పరిగిలోని రావతార్‌ మసాల ఫ్యాక్టరీ నుంచి అక్రమంగా తొలగించిన 150 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. బహిరంగ సభకు కార్మికులు భారీగా హాజరయ్యారు. పోలీసులు భారీగా మోహరించారు. 

గ్రేటర్ లో మూడు కమిషనరేట్లు...

హైదరాబాద్‌ : నగరంలో మూడు కమిషనరేట్‌లు ఏర్పడనున్నాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ రెండుగా విడిపోనుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న కమిషనరేట్లు మూడుగా మారనున్నాయి. దీంతో సైబరాబాద్‌ పోలీసింగ్‌ రూపురేఖలు మారుతాయని అధికారులంటున్నారు. వీటిని నార్త్, సౌత్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వీటి పరిధిలోకి యాదాద్రిని కూడా తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. 

 

13:46 - May 14, 2016

విజయవాడ : అసంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్రం చట్టం చేయాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు అహ్మనుల్లాఖాన్‌ డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌ 2న తలపెట్టిన కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు మద్దతిస్తున్నట్లు విజయవాడలో అహ్మనుల్లాఖాన్‌ తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యల కోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేయనున్నాయి.  దీనికి మద్దతిచ్చిన ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌.. ఇన్సూరెన్స్‌ పాలసీల ద్వారా వచ్చే ఆదాయంపై ఇన్‌కమ్‌ ట్యాక్స్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

13:41 - May 14, 2016

హైదరాబాద్‌ : నగరంలో మూడు కమిషనరేట్‌లు ఏర్పడనున్నాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ రెండుగా విడిపోనుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న కమిషనరేట్లు మూడుగా మారనున్నాయి. దీంతో సైబరాబాద్‌ పోలీసింగ్‌ రూపురేఖలు మారుతాయని అధికారులంటున్నారు. వీటిని నార్త్, సౌత్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వీటి పరిధిలోకి యాదాద్రిని కూడా తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. 

 

13:37 - May 14, 2016

కోల్ కతా : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో కీలక సమరానికి ఈడెన్‌ గార్డెన్స్‌లో  రంగం సిద్ధమైంది.  ప్లే ఆఫ్‌ రేస్‌లో ఉన్న దూసుకుపోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ధనా ధన్‌ ధోనీ నాయకత్వంలోని రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. నైట్‌రైడర్స్‌ టీమ్‌ సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలని తహతహలాడుతుండగా.... ఆఖరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో అయినా నెగ్గి పరువు నిలుపుకోవాలని పూణే జట్టు  పట్టుదలతో ఉంది.
ఈడెన్‌ గార్డెన్స్ లో  కౌంట్‌డౌన్‌ 
ధూమ్‌ ధామ్‌ టీ 20 లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో కీలక పోరుకు....ఈడెన్‌ గార్డెన్స్ లో  కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రెండు సార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు....రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్టుతో అమీతుమీకి సిద్దమైంది. ప్లే ఆఫ్‌ రేస్‌లో దూసుకుపోతున్న నైట్‌రైడర్స్ టీమ్‌, ఈ పోటీలో నెగ్గి సెమీస్‌ బెర్త్ ఖాయం చేసుకోవాలని తహతహలాడుతుండగా.... ఆఖరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో అయినా నెగ్గి పరువు నిలుపుకోవాలని పూణే జట్టు  పట్టుదలతో ఉంది. 

నైట్‌రైడర్స్‌ జట్టు 11 లీగ్‌ మ్యాచ్‌ల్లో 6 విజయాలు

ఇప్పటికే ఫ్లాఫ్‌ షోతో ఢీలా పడిన పూణే జెయింట్స్‌ టీమ్....11 లీగ్‌ మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. మరోవైపు నిలకడకు మారుపేరైన నైట్‌రైడర్స్‌ జట్టు 11 లీగ్‌ మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేసింది. గౌతమ్‌ గంభీర్‌ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ , ఫీల్డింగ్‌...ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోల్‌కతా టీమ్‌...హోంగ్రౌండ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో  ఏ స్థాయిలో చెలరేగుతుందో అందరికీ తెలిసిందే. మిగతా ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా....ప్రతీ మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్న కరీబియన్‌ మిసైల్‌ ఆండ్రీ రస్సెల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు అదనపు బలమనే చెప్పాలి. 

పూణే కు ఏదీ కలిసి రాలేదు 

మరోవైపు రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు ప్రస్తుత సీజన్‌లో ఏదీ కలిసి రాలేదు. వరుస ఓటములతో ఢీలా పడింది. నిలకడలేని బ్యాటింగ్‌ లైనప్‌ ......బౌలర్ల వైఫల్యంతో పూణే జట్టు అసలేమాత్రం ప్రభావం చూపలేకపోయింది. రహానే, తిసెరా పెరీరా, ధోనీ,జార్జ్‌ బెయిలీ, ఉస్మాన్‌ కవాజా వంటి మ్యాచ్‌ విన్నర్లున్నా.....పూణే జట్టు అసలే మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. ప్లే ఆఫ్‌ చేరే అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో పూణే జట్టు...చెలరేగి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమిష్టిగా రాణించి, ప్లే ఆఫ్‌ రేస్‌లో ఉన్న కోల్‌కతా  జట్టు  అవకాశాలు దెబ్బతీయాలని పూణే జట్టు ప్లాన్‌లో ఉంది.

విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు పోటీ పడిన తొలి రౌండ్‌  మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టే విజేతగా నిలిచింది. మరి ఇండియన్‌ క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా జరుగనున్న ఈ కీలక పోరులో పవర్‌ప్యాకెడ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు పూణే జెయింట్స్‌ జట్టు అసలు కనీస పోటీ అయినా ఇవ్వగలదో లేదో చూడాలి. 

కన్నతండ్రి కడతేర్చిన కూతుళ్లు

హైదరాబాద్‌ : పిల్లలను ఇద్దరి కూతురులను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కన్న తండ్రి నిత్యమూ బూతులు తిడుతుంటే, తట్టుకోలేక ఇద్దరి బాలికలు తండ్రిని హత్య చేశారు. మీరట్‌లో ఇద్దరు టీనేజ్‌ అక్కాచెల్లెళ్లు అతి దారుణంగా కన్న తండ్రిని చంపారు. ఈ హత్యను తాము చేసిన్నట్లు నేరాన్ని గురించి చెబుతూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. మీరట్‌లోని మెడికల్‌ కాలేజ్‌ ఏరియా పోలీసు స్టేషన్‌ ఆఫీసర్‌ రవీంద్ర కుమార్‌ తెలిపిన వివరాల పక్రారం.. ఈ బాలికల తండ్రి కరణ్‌ సింగ్‌ నిత్యమూ తాగుతుంటాడు.

బావిలో పడి ఒకరి మృతి

ఖమ్మం : జిల్లాలోని కారేపల్లిలో మద్యం మత్తులో బావిలో పడి ఒకరు మృతి చెందారు. పేరుపల్లి గ్రామానికి చెందిన చెన్నం వెంకటేశ్వర్లు(40) అతిగా మధ్యం సేవించి రోడ్డు పక్కనున్న బావిలో పడి మృతి చెందాడు. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వెంకటేశ్వర్లును బావిలో నుండి వెలికితీసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

13:00 - May 14, 2016

కేన్స్ : అందాల తార ఐశ్వర్యరాయ్‌ బంగారు వర్ణం గౌనులో మెరిసిపోయింది. కేన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సందడి చేసింది. 42ఏళ్ల ఈ బాలీవుడ్‌ బ్యూటీ మిరుమిట్లు గొలిపే గోల్డ్ కేప్‌ గౌన్‌లో మెరిసిపోయింది. ఐష్‌ ధరించిన గౌన్‌ను కువైట్‌కు చెందిన డిజైనర్‌ అలీ యోనిస్‌ డిజైన్‌ చేశాడు. ప్రఖ్యాత కాస్మోటిక్‌ సంస్థ లోరియల్‌ పారిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఐశ్వర్య ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఉత్సవాల్లో పాల్గొనడం ఇది 15వ సారి.

 

12:56 - May 14, 2016

విశాఖ : జీవీఎంసీ అధికారుల తీరుతో మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో ప్రభుత్వ స్థలాలలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై జీవీఎంసీ అధికారులు పెత్తనం చలాయిస్తున్నారు. తాజాగా తగరపువలసలో నిర్మాణాలు కూల్చివేసేందుకు యత్నించడంతో.. కాస్త సమయం ఇస్తే ఖాళీ చేస్తామని వ్యాపారులు తెలిపారు. ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ.. మళ్లీ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన టైర్ల వ్యాపారి కుమార్‌ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. తీవ్రగాయాలైన కుమార్‌ను కేజీహెచ్‌కు తరలించారు. ఇదిలావుంటే జీవీఎంసీ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. 

 

12:47 - May 14, 2016

హైదరాబాద్ : పాతబస్తి సౌత్ జోన్‌లోని హాఫిజ్ బాబా నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేశారు. జంతు కళేబరాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్న పరిశ్రమలపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు 300 మంది పోలీసులు నిర్వహించిన ఈ సెర్చ్ లో 37మంది అనుమానిత రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. పత్రాలులేని 67 బైక్‌లు, 2ఆటోలు, 2కార్లు, 10 మారణాయుధాలు, తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర రాష్ట్రాల  వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రజలే ముందుకు వచ్చి తమ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయమని కోరారని సౌత్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. 

 

12:44 - May 14, 2016

చెన్నై : తమిళనాడు ఎన్నికల అధికారులు రూ. 570 కోట్లతో వెళ్తున్న మూడు కంటెయినర్లను స్వాధీనం చేసుకున్నారు. భారీ డబ్బు కట్టలతో ఆ కంటయినర్లు తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్తు తున్నాయి. ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆఫీసర్ ఆదేశాలతో కంటెయినర్లను తిరుపూర్ జిల్లాలో నిలిపేశారు. అయితే ఇంకా ఆ కంటెయినర్లను తెరువలేదు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే భారీ మొత్తంలో నగదు సొమ్ము రవాణా అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తమిళనాడులో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు గత నాలుగు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. భారీ నగదుతో బయలుదేరిన కంటేయినర్లు హైదరాబాద్‌కు కూడా వస్తున్నట్లు సమాచారం. 

 

12:38 - May 14, 2016

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పాలేరు ఉప ఎన్నికకు నేటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో సీపీఎం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అప్రజాస్వమిక ధోరణిని అడ్డుకోవాలన్నారు. పాలేరులో టీఆర్ ఎస్, తుమ్మల నాగేశ్వరరావును ఓడించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం.. పాలేరులో గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రజలను మభ్యపెడుతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా పట్టించుకోని మంత్రులు, ఎమ్మెల్యేలు పాలేరులోనే మకాం వేశారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కరువు పరిస్థితి హృదయ విదారకరంగా ఉందన్నారు. 
పనులు, ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం స్వంత జిల్లా మహబూబ్ నగర్ లో ఉన్న కరువును పట్టించుకోకుండా పాలేరు వచ్చి సారా సోస్తున్నారని, బిర్యానీ పెడుతున్నారని ఆరోపించారు. స్వంత జిల్లాలలో నీరు లేక జనం అల్లాడుతుంటే.. జూపల్లి మాత్రం పాలేరు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారని విమర్శించారు. ఫారెస్టు పెంచాలని కందకాలు తవ్విస్తున్నారని.. గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వందలాది లంబాడీలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యలో ప్రభుత్వం గిరిజన తండాలను ఉద్దరిస్తామంటే ఎలా నమ్మాలన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి... గెలిచి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. 70 ఏండ్ల నుంచి పాలకులు ప్రజలను ఉద్దరిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో దళితులకు ఎన్ని ఎకరాల భూములిచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణలో 90 శాతం ఎస్ సీ, ఎస్ టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలు ఉన్నారని తెలిపారు. వీరు అభివృద్ధి కాకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. బడ్జెట్ లో చేనేత, రజకులకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎంను గెలిపించాలని.. టీఆర్ ఎస్, తుమ్మల నాగేశ్వరరావును ఓడించాలన్నారు.
టీసర్కార్ అధికార దుర్వినియోగం : సాంబశివరావు..
టీసర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సాంబశివరావు విమర్శించారు. టీఆర్ ఎస్ పార్టీ  29 కార్లకు పర్మిషన్ తీసుకున్నారని..కానీ కానీ గ్రామాల్లో వందల కార్లు తిరుగుతున్నాయన్నారు. పోలీసుల సహాయంతో డబ్బు ఊళ్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. టీఆర్ ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  

 

 

11:56 - May 14, 2016

చిత్తూరు : వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల భక్తుల రద్దీతో కిటకటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. అయితే ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 

 

11:52 - May 14, 2016

ఆస్ట్రేలియా పేరు చెబితేనే టక్కును గుర్తుకొచ్చేది కంగారు జంతువు. కానీ అక్కడ కంగారులకు రక్షణ లేకుండా పోతోంది. కంగారులు పర్యావరణానికి ముప్పుగా పరిణమించడంతో ప్రభుత్వం వాటి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. కంగారుల కారణంగా స్థానిక పర్యావరణానికి తీవ్ర ముప్పు కలుగుతోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఆగస్టు ఒకటిన 19 వందల కంగారులను చంపనున్నట్టు ఎబిసి న్యూస్‌ సమాచారం. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో 4 వేల కంగారులను చంపారు.

 

11:48 - May 14, 2016

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ మహానాడు తీర్మానాలు ఖరారయ్యాయి. రెండు రాష్ట్రాలకు విడివిడిగాను.., జాతీయ స్థాయిలోను కలిపి తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులతో కలిపి ఈసారి 30వేల మంది దాకా హాజరయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలో మహానాడుకు ఏర్పాట్లు... 
ఈ నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో టిడిపి మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలను ఫైనల్‌ చేశారు. సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన తీర్మానాల కమిటీ ముమ్మర కసరత్తులు చేసి ప్రాధాన్య అంశాలను గుర్తించింది. 
రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా 6 తీర్మానాలు
జాతీయ స్థాయిలో రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఆరు తీర్మానాలను, ఆంధ్రప్రదేశ్‌కు విడిగా 14, తెలంగాణకు విడిగా 8 తీర్మానాలు మొత్తంగా 30 దాకా తీర్మాన అంశాలను ఎంపిక చేశారు. రెండు రాష్ట్రాలకు కలపి చేసే తీర్మానాలలో ఎన్టీఆర్‌కు నివాళితోపాటు టిడిపి 35ఏళ్ల ప్రస్థానం, కార్యకర్తల సంక్షేమం-శిక్షణ, జాతీయ రాజకీయాలు- తెలుగుదేశం పార్టీ పాత్ర వంటి అంశాలను మహానాడులో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసే తీర్మానాలలో ఆర్థిక అసమానతలు-పేదరిక నిర్మూలన, మ్యానిఫెస్టో అమలు, ప్రతిపక్ష అభివృద్ధి-నిరోధక చర్యలు,  అభివృద్ధి పథంలో వ్యవసాయం-అనుబంధ రంగాలు, పారదర్శక పాలన-ఈ ప్రగతి వంటి అంశాలను చర్చించనున్నారు.
సంక్షోభంలో వ్యవసాయం-రైతుల ఆత్మహత్యలు
తెలంగాణకు సంబంధించి సంక్షోభంలో వ్యవసాయం-రైతుల ఆత్మహత్యలు, కరవు సహాయక చర్యలు-తెరాస ప్రభుత్వ వైఫల్యం, తెరాస ప్రభుత్వంలో కొరవడిన సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాలు-మితిమీరిన అవినీతి, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు.
అన్ని జిల్లాల్లో మినీ మహానాడుల నిర్వహణ
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నేతలందరినీ మహానాడుకు ఆహ్వానించనున్నారు. ఈ ప్రతినిధుల జాబితాపై పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. జాతీయ మహానాడు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల మినీ మహానాడులు కూడా పూర్తిచేయనున్నారు. మహానాడులో ఇరు రాష్ట్రాలకు కలిపి ఒకటే రాజకీయ తీర్మానం ప్రవేశపెడతారు. ఇరు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ మహానాడులో ఆమోదిస్తారు. ఇక తెలంగాణలో ఈ నెల 19 నుంచి ఏపీలో ఈ నెల 22, 24 తేదీల్లో మినీ మహానాడులు జరుగుతాయి. వీటికంటే ముందు 18, 19తేదీల్లో ఏపీలో నియోజకవర్గ సదస్సులు జరగనున్నాయి.

11:44 - May 14, 2016

మహేష్‌బాబు, సమంత, కాజల్‌, ప్రణీత హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పివిపి సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి పతాకాలపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రో ఫుట్‌వేర్‌ను, ఫ్యాషన్‌సెంట్రో. కమ్‌ వెబ్‌సైట్‌ను హీరోయిన్‌ సమంత విడుదల చేశారు. 
శ్రీకాంత్‌ అడ్డాల మార్క్ చిత్రం : కాజల్‌
ఈ సందర్భంగా కాజల్‌ మాట్లాడుతూ, ''బ్రహ్మోత్సవం' ఒక పండుగ లాంటి చిత్రం. ఈ ఉత్సవంలో మేం భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ మహోత్సవం కోసం మేం కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నాం. ఈ చిత్రంలో నేను కాశీ అనే ఎన్నారై అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా, ఛాలెంజింగ్‌గా ఉంటుంది. స్వతంత్య్ర భావాలు కల్గిన అమ్మాయి పాత్ర అది. నా పర్సనల్‌ లైఫ్‌కి కాస్త దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. నా గత సినిమాలతో పోల్చితే ఇందులో పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. డ్రెస్‌ ముఖ్యంగా కాదు, మైండ్‌ సెట్‌ ముఖ్యమనుకునే అమ్మాయి పాత్ర ఇది. 
ముగ్గురు కథానాయికలున్నప్పటికీ ఎవరి పాత్ర వారిదే. నేను ఎవరినీ పోటీగా భావించను. సమంత నటించినంత మాత్రాన ఆమెకు, నాకు పోటీ నెలకొందనే డౌట్‌ అందరికీ వస్తుంది. అటువంటిది ఏమీ లేదు. ఇందులో నాకు, మహేష్‌కి మధ్య లవ్‌స్టోరీ ఒక జర్నీలా ఉంటుంది. ప్రేమ యూనివర్సల్‌. అది ఎక్స్ ప్రెస్‌ చేయలేయమనేది ఈ చిత్రంలో చూపిస్తాం. 'బిజినెస్‌ మేన్‌'లో ఓల్డ్‌ మహేష్‌తో కలిసి నటిస్తే ఈ చిత్రంలో మాత్రం యంగ్‌ మహేష్‌తో నటించినట్లుగా అనిపించింది. సమంతతో రెండోసారి కలిసి నటించాను. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది శ్రీకాంత్‌ అడ్డాల మార్క్‌ చిత్రం. పివిపి వంటి ప్రొఫె˜షనల్‌ బ్యానర్‌లో నటించడం హ్యాపీగా ఉంది. రేవతి, జయసుధ, తులసి వంటి సీనియర్‌ ఆర్టిస్టులతో వర్క్‌ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా' అని అన్నారు. 
ఏడు తరాలను కలుసుకోవాలనిపిస్తుంది: సమంత
'బ్రహ్మోత్సవం' సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏడు తరాల చుట్టాలను కలుసుకోవాలనే ఆత్రుత కల్గుతుంది' అని అంటోంది సమంత. ' 'బ్రహ్మోత్సవం' లాగా ఇదొక ఉత్సవం లాంటి చిత్రం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో ఫ్యామిలీతో కలిసి నటించే సీన్స్‌ లేవు. మహేష్‌తో కూడా చాలా తక్కువ సన్నివేశాలే ఉన్నాయి. ఈ సమ్మర్‌కి కచ్చితంగా పండుగ తెచ్చే చిత్రమవుతుంది. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు తమకు సంబంధించిన ఏడు తరాలను వెతుక్కుంటూ వెళతారు. ఏడు తరాలు అనేదానిపై గతంలో నేను కూడా కొన్ని బుక్స్‌ చదివి తెలుసుకున్నాను. సినిమా చేస్తున్నప్పుడు నాక్కూడా అలా వెళ్ళాలనిపించింది.. కాని నేను ఆంగ్లో ఇండియన్‌ని. అలా వెళితే ఇతర దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. కచ్చితంగా ఈ విషయం మా అమ్మకు చెబుతాను. మహేష్‌ 'దూకుడు' కంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో చాలా బాగా కనిపించారు. ఆ చిత్రం కంటే ఈ సినిమాలో ఇంకా అందంగా కనిపిస్తారు. ఒక పాటలో ఇప్పటి వరకు చూడని మహేష్‌ని చూస్తాం. అందులో 15 ఏండ్ల అబ్బాయిగా కనిపిస్తారు. అలాంటి సాంగ్‌ నాక్కూడా ఉంది. మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాలతో గతంలో కలిసి పనిచేసినప్పటికీ మళ్ళీ చేసిన హీరోతో, దర్శకుడితో చేయడం అవార్డు కంటే ఎక్కువగా భావిస్తాను. ఇదొక పెద్ద గౌరవం. ఫ్యామిలీ బంధాల గురించి తెలిపే చిత్రం కాబట్టి తెలుగు, తమిళం అన్నా తేడా లేదు. పివిపితో 'ఈగ' నుంచి మంచి పరిచయముంది. ఇటీవల 'ఊపిరి'తో మంచి హిట్‌ కొట్టారు. ఈ చిత్రంతో మరో పెద్ద హిట్‌ కొడతారు' అని చెప్పారు.

 

11:39 - May 14, 2016

'ఆషికీ2' సినిమా తర్వాత శ్రద్ధాకపూర్‌కి బాలీవుడ్‌లో మరింత మంచి గుర్తింపు లభించింది. తాజాగా నటించిన 'బాఘీ' చిత్రం కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. దీంతో శ్రద్ధాకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ బయోపిక్‌లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ముంబై అండర్‌వరల్డ్ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం చెల్లెలు హసీనా పార్కర్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు దర్శకుడు అపూర్వ లఖియా సన్నాహాలు చేస్తున్నారు. హసీనా పార్కర్‌ పాత్ర కోసం తొలుత ఆయన సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారు. డేట్లు సర్దుబాటు చేయలేని కారణంగా సోనాక్షి సిన్హా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో చివరిగా శ్రద్ధాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం 'ఏ ఫ్లయింగ్‌ జాట్‌', 'రాక్‌ ఆన్‌2', 'ఓకే జాను' చిత్రాల్లో నటిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో మణిరత్నం రూపొందించిన 'ఓకే బంగారం' చిత్రాన్ని 'ఓకే జాను' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే.

11:35 - May 14, 2016

మోహన్‌బాబు సినిమాల్లోని పాపులర్‌ డైలాగులతో రూపొందించిన 'డైలాగ్‌ బుక్‌'ను బుధవారం బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆవిష్కరించారు. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు బాబ్‌ బ్లాక్‌మెన్‌, వీరేంద్రశర్మలకు రమేష్‌ గోరిజాల పెయింటింగ్స్ ని మోహన్‌బాబు అందజేశారు. 'పెదరాయుడు' చిత్రంలోని పాపులర్‌ డైలాగ్‌లను మోహన్‌బాబు చెప్పి ఆకట్టుకున్నారు.'నటుడిగా నా తండ్రి ఎన్టీఆర్‌ నాకు స్ఫూర్తి. ఆయన తర్వాత నేను స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి మోహన్‌బాబు' అంటూ ఈ పుస్తకంలో బాలకృష్ణ రాసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. 'ఈ డైలాగ్‌ బుక్‌ని ప్రముఖ వ్యక్తులకు, అభిమానులకు పంపే ప్రయత్నం చేస్తున్నాం. నాన్నగారు 4 దశాబ్దాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌లో వైజాగ్‌లో పెద్ద వేడుక నిర్వహిస్తున్నాం' అని విష్ణు తెలిపారు. 
మనోజ్‌, మంచు లక్ష్మి కూడా ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.

11:33 - May 14, 2016

హైదరాబాద్ : ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ఏపీ వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా గ్రామం యూనిట్‌గా సూక్ష్మ ప్రణాళికలను సిద్ధం చేశారు. గత అనుభవనాలు దృష్టిలో ఉంచుకుని విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
61.28 లక్షల హెక్టార్లలో సాగు
త్వరలోనే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ అలర్ట్‌ అయింది. ఈ ఏడాది బాగా వర్షాలు పడతాయంటూ వాతావరణ విభాగం అంచనాలతో పంటల దిగుబడి పెంచేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌లో 61.28 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరగ్గా ఈ ఏడాది 71.14 లక్షల హెక్టార్లలో పంటల సాగయ్యేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
139.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
గతేడాది 139.68 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఈ ఏడాది 178.60 లక్షల టన్నులకు పెంచాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. లక్ష్యాలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకుంటోంది. 11.15 లక్షల క్వింటాళ్ల మేర వివిధ రకాల విత్తనాలు, 6.24 లక్షల క్వింటాళ్ల మేర వేరుసెనగ విత్తనాలు సిద్ధం చేశారు. విత్తనాల పంపిణీలో అవకతవకలకు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో బయోమెట్రిక్-ఆధార్‌ కార్డులను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఖరీఫ్‌లో 19.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని భావిస్తుండగా అదనంగా 8.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. 
పంట రుణాలు- టర్మ్ రుణాలు రూ.81,644 కోట్లు
రైతులకు పంట రుణాలు-టర్మ్‌ రుణాలను 81,644 కోట్ల రూపాయల మేర ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కేంద్రం ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద పంట బీమా పథకంలో కేవలం 2 శాతం ప్రీమియంగా చెల్లించి జిల్లాల వారీగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. కౌలు రైతులకు మేలు కలిగేలా బీమా పథకాన్ని ఈ-బుకింగ్‌ ద్వారా చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఏదైనా ప్రాంతంలో వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోయినా రెయిన్‌ గన్స్ ను సిద్ధం చేస్తున్నామని చెబుతోంది. 

 

తమిళనాడులో భారీగా నగదు స్వాధీనం...

చెన్నై : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి నేటి సాయత్రంతో తెరపడనుంది. మరో 24గంటల్లో పోలింగ్‌ జరగబోతుండగా తనిఖీలు చేపట్టిన ఎన్నికల అధికారులు భారీగా నగదు గుర్తించారు. తిర్పూరులో 3 కంటైనర్లలో తరలిస్తున్న రూ.570కోట్లు, కోయంబత్తూరు సమీపంలో మరో రెండు కంటైనర్లలో తరలిస్తున్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చెందినదని తరలిస్తున్న వ్యక్తులు చెబుతున్నారు. బ్యాంకులకు చెందిన నగదో కాదో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు.

కన్నడ నటి మైత్రియాగౌడకు రెండేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్‌ : ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నందుకు అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడటమే కాకుండా, చెయ్యి చేసుకున్న కన్నడ నటి మైత్రియా గౌడకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2001లో మైత్రియ తన స్నేహితులు సుప్రియ, రేఖ, రూపలతో కలిసి కారులో వెళ్తూ, డ్రైవింగ్ చేస్తోంది. ఆమె సెల్ ఫోన్ మాట్లాడటాన్ని చూసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ ఆమెను ఆపారు. అప్పుడు వీరు నలుగురూ అతనిపై దాడి చేసి కొట్టారు. కేసును విచారించిన న్యాయస్థానం మైత్రియాకు రెండేళ్లు, మిగిలిన వారికి ఏడాది చొప్పున శిక్ష విధించింది.

పోలీసుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ : సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం పరారైన మహేష్ అనే ఆటోడ్రైవర్ శనివారం మారేడుపల్లి స్మశానవాటికలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివిధ నేరాల కింద విచారణ నిమిత్తం గోపాలపురం పోలీసులు మహేష్‌ను నిన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల వేధింపులు భరించలేకే అతడు స్మశానవాటికలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ ఆనంద్ పర్బాత్ లో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ : ఢిల్లీలోని ఆనంద్‌ పర్బాత్‌ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయించారు.

10:49 - May 14, 2016

హైదరాబాద్ : క‌డుపులో క‌త్తెర్లు. నోట్లో చక్కెర. రెండు తెలుగు రాష్ట్రల‌పై కేంద్రం అమలు చేస్తున్న ఫార్ములా ఇది. ఎన్నిక‌ల‌కు ముందు తీయ‌ని ప‌లుకులు ప‌లికిన  మోడీ, ఇప్పుడు త‌న చేత‌ల‌తో చేదు పుట్టిస్తున్నారు. ఒకవైపు ఏపీ ప్రత్యేక హోదాకు పాతరేశారు. మరోవైపు  రెండు రాష్ట్రాల‌కు రావ‌ల్సిన నిధులకూ కత్తెర వేస్తున్నారు. 
ఏపీ స‌ర్కార్ ఆశ‌ల‌పై నీళ్ళు 
తాము అధికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొచ్చిన మోడీ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్‌డీయే భాగస్వామి అయినా చివరికి చంద్రబాబుకూ తిప్పలు తప్పడం లేదు.ప్రత్యేక హోదాపై చేతులెత్తేసి... ఏపీ స‌ర్కార్  ఆశ‌ల‌పై నీళ్ళు జ‌ల్లింది. వెనుకబడిన రాయ‌ల‌సీమ‌,, ఉత్తరాంధ్రల అభివృద్ధిపై ఊసే లేదు. రాజ‌ధానికి ఇవ్వాల్సిన స‌హాయానికి కూడా గండికొట్టింది. రాజ‌ధాని  అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొద‌టి విడ‌త‌ కింద ల‌క్ష కోట్లు అడిగితే రెండేళ్లకు గాను కేంద్రం  రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. క‌రువు,వరదలు సాయం కింద 5 వేల కోట్లు కోరితే 433 కోట్లతో సరిపెట్టేసింది. 
ఢిల్లీ పెద్దల చెవికి చేర‌ని టిస‌ర్కార్ విన్నపాలు
ఇక తెలంగాణ విష‌యంలో కూడా కేంద్రం ఇదే పద్ధతి అనుసరిస్తోంది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి  ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న‌ బిల్లులో స్పష్టంగా ఉంది. ఇప్పటికీ ఆ దిశగా నిధులు వచ్చిన  దాఖ‌లాలు లేవు. డ్రై పోర్టుల కోసం టి స‌ర్కార్ చేస్తున్న విన్నపాలు ఢిల్లీ పెద్దల చెవికి చేర‌డంలేదు. 3000 కోట్లు క‌రువు సాయం కావాలని అడిగితే.. మోడీ స‌ర్కార్ 791 కోట్లతో సరిపెట్టేసింది.  
రెండు ప్రభుత్వాలతో పొలిటిక‌ల్ గేమ్ 
ఎన్నిక‌ల‌కు ముందు తెలుగు రాష్ట్రాలపై ఎక్కడ లేని ప్రేమ‌ను కురిపించిన మోడీ... ఇప్పుడు రెండు ప్రభుత్వాలతో పొలిటిక‌ల్ గేమ్ ఆడుకుంటున్నారు. రెండు రాష్ట్రల‌లో  అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచుతామ‌ని చెప్పుకొచ్చిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ఏపీ, తెలంగాణ సీఎంలకు చుక్కలు చూపిస్తున్నారు.  కాంగ్రెస్ అడ్డుపెడుతోందంటూ కొంత‌సేపు... రాజ్యాంగంలో సాంకేతిక అంశాల‌ను సాకుగా చూపుతూ... ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై మాట మార్చే ప్రయత్నం కమలనాథులు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ , ఏపీల‌కు ఏం చేయాల‌న్నా లెక్కలేసుకుంటోంది మోదీ ప్రభుత్వం. ఏం చేస్తే త‌న‌కు ఎంత లాభం వ‌స్తుంద‌న్న దానిపై దృష్టి పెట్టిన  మోడి స‌ర్కార్ ..... చేయాల్సింది .. చేయ‌కుండా... ఇవ్వాల్సింది ఇవ్వకుండా  రెండు ప్రభుత్వాలకు  చుక్కలు  చూపిస్తోంది. 

10:40 - May 14, 2016

హైదరాబాద్ : తాత్కాలిక సొంతగడ్డ విశాఖలో ముంబాయి టీం మళ్లీ ఓటమి పాలైంది. అదీ పరాజయాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్‌ చేతిలో.. మొదట పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో ముంబాయి ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగారు. పంజాబ్‌ బౌలర్లలో స్టయినిస్‌ కేవలం 15 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సందీప్‌ 11 పరుగులిచ్చి రెండు వికెట్లు, మోహిన్‌ శర్మ రెండు వికెట్లు కూల్చి ముంబాయి టీంను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఆ టీంలో 27 పరుగులు చేసిన పొలార్డ్ ఒక్కడే టాప్‌ స్కోరర్. అనంతరం 125 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్‌ 17 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ మురళీ విజయ్‌ 52 బంతుల్లో 54, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్ మన్‌ వృద్ధిమాన్‌ సాహా 40 బంతుల్లో 56 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ నిర్మించారు. కాగా పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టయినిస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది. నెట్‌ రన్‌ రేట్‌లో మరింత పడిపోయిన ముంబాయి టీం ప్లే ఆఫ్‌కు చేరాలంటే తర్వాత రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి. 

 

10:37 - May 14, 2016

కరీంనగర్ : జిల్లాలో జనశక్తి వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. ఇల్లంతుకుంట మండలం పెద్దలింగాపూర్ లో జనశక్తి వాల్ పోస్టర్లు వెలిశాయి. జనశక్తి రామోజీపేటలో కరపత్రాలను పంచింది. మాజీ ఎంపీటీసీ మల్లారెడ్డి, అనిల్ అనే వ్యక్తులు పోలీసు ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తూ జనశక్తిలో పనిచేసేవారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. సెటిల్ మెంట్లు, దందాలకు పాల్పడుతూ విందులు చేసుకుంటూ జల్సా చేస్తున్నారని చెప్పారు. వారు పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు.   

తాత్కాలిక సచివాలయ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

గుంటూరు : తాత్కాలిక సచివాలయ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. జూన్ నాటికి తాత్కాలిక నిర్మాణం పూర్తి కాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కార్మికుల సమస్యలు తమ దృష్టికి రాలేదన్నారు. జూన్ 27 నాటికి మొదటి దశ ఉద్యోగుల తరలింపు ప్రారంభం అవుతుందని చెప్పారు. 17న ప్రధానితో చంద్రబాబు భేటీలో ప్రత్యేక హోదాపై శుభవార్త వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 

కరీంనగర్ జిల్లాలో జనశక్తి వాల్ పోస్టర్లు కలకలం

కరీంనగర్ : జిల్లాలో జనశక్తి వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. ఇల్లంతుకుంట మండలం పెద్దలింగాపూర్ లో జనశక్తి వాల్ పోస్టర్లు వెలిశాయి. జనశక్తి రామోజీపేటలో కరపత్రాలను పంచింది. మాజీ ఎంపీటీసీ మల్లారెడ్డి, అనిల్ అనే వ్యక్తులు పోలీసు ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తూ జనశక్తిలో పనిచేసేవారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. వారు పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు. 
  

09:42 - May 14, 2016

టీడీపీ, బీజేపీ పార్టీలు ఎపికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెడుతున్నాయిని విమర్ి వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, వైసీపీ కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక హోదా తేవాలనే ఆలోచన చంద్రబాబులో కనిపించడం లేదన్నారు. ప్రత్యేకోహోదా తప్పకుండా వస్తుందని చంద్రబాబు చెప్పడం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టీ.సర్కార్ ది అప్రజాస్వామిక ధోరణి : తమ్మినేని

ఖమ్మం : టీ.సర్కార్ అప్రజాస్వామిక ధోరణిని అడ్డుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాస్వామమ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. పాలేరులో టీఆర్ ఎస్, తుమ్మల నాగేశ్వరరావును ఓడించాలని పిలుపునిచ్చారు.

 

ఆర్ పీఎఫ్ జవాన్లపై దుండగులు కాల్పులు... ఒక జవాను మృతి

పాట్నా : బీహార్ లోని రైల్వే భద్రతా సిబ్బంది(ఆర్‌పీఎఫ్)కి చెందిన ఇద్దరు జవాన్లపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ముగల్‌సరాయ్(యూపీ)-బుక్సర్(బీహార్) ప్రయాణికుల రైలులో గత రాత్రి చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన దుండగులు లూటీకి పాల్పడి పారిపోయారు.

 

08:39 - May 14, 2016

హైదరాబాద్ : ఏపీలో నియోజకవర్గాల పెంపుపై నీలినీడలు కమ్ముకున్నాయా...? డీలిమిటేషన్ పై .. కేంద్రం అచితూచి వ్యవహరిస్తొందా...? సీట్లపెంపుదలపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న అధికార పార్టీకీ నిరాశే మిగలబోతోందా... నియోజకవర్గాల పున:ర్విభజనపై అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోంది. నియోజ‌కవర్గాల పునర్విభజన అంశంపై నీలినీడలు కమ్మకుంటున్నాయి. విభజనానంతరం చట్టంలో పేర్కొన్న విధంగా సీట్ల పెంపు అంశం హామీ గానే మిగిలే అవకాశం కనిపిస్తోంది. సీట్ల పెంపుపై ముందునుండి గట్టిగా కృషిచేసిన...టీడీపీ ప్రస్తుత పరిస్థితులు చూసి అందోళన చెందుతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అవుతోంది.
సీట్లు పెంచాలని కేంద్రంపై తెలుగు రాష్ట్రాల ఒత్తిడి 
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో 175 గా ఉన్న శాసనసభ్యుల సంఖ్యను 225 కు పెంచాలని విభజన చట్టం చెపుతోంది. రాజ్యంగం ప్రకారం 2026 వరకూ డీలిమిటేషన్ చేయకూడదని నిబందన ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విభజన చట్టం ప్రకారం...నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ జరగాల్సిఉంది. కాగా నూతనంగా ఏర్పడిన రెండు రాష్ట్రాలు సైతం సీట్లు పెంచాలనీ కేంద్రంపై ఉమ్మడిగానే ఒత్తిడి తెస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుండి వినోద్ కుమార్...ఏపీ నుండి కంభంపాటి రామ్మోహన్ రావు ఇందుకోసం ప్రత్యేకంగా కృషిచేస్తున్నారు. ఒకపక్క ప్రస్తుత పార్టమెంట్ సమావేశాలు ముగిసాయి..కనుక రానున్న వర్షాకాల సమావేశాలలో నైనా సీట్ల సంఖ్య బిల్లు చర్చకు రాకుంటే...ఇక 2019 వరకూ ఈ అంశం తేలకపొవచ్చుననే టిడిపి భావిస్తోంది. 
రామసుబ్బారెడ్డికి కొత్తగా ఏర్పడే నియోజకవర్గం  
సీట్ల సంఖ్యపెరుగుతాయన్న వార్తలతో ... ప్రస్తుత జమ్మలమడుగు నియోజకవర్గం... ఎమ్మెల్యేగా ఉన్న ఆధినాయరాయణ రెడ్డి టీడీపీలో చేరడంతో ..మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి కొత్తగా ఏర్పడే నియోజకవర్గం కేటాయించాలనీ పార్టీ భావించింది. అలాగే అద్దంకి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే గొట్టిపాటిని తీసుకున్నా అక్కడ కూడా కొత్తగా ఏర్పడే నియోజకవర్గాన్ని కరణం వెంకటేష్ కు ఇచ్చి సరిచేయాలనుకున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వచ్చే వర్షాకాల సమావేశంలోనే డిలిమిటేషన్ పై బిల్లు పెట్టించేలా ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు బావిస్తున్నారు. మరీ బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా...ఏపీలో నియోజకవర్గాలు పెరుగుతాయో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 

08:23 - May 14, 2016

గుంటూరు : ఓ పోరాటం... వందల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్న కార్మికుల జీవితాల్లో మార్పుకు కారణమైంది. అమరావతితో... సీపీఎం, ట్రేడ్ యూనియన్ల సంయుక్త పోరాటం...నిర్మాణ కాంట్రాక్టు సంస్థలను దిగొచ్చేలా చేసింది. వందల మందికి కొత్త జీవితాన్నిచ్చింది. 
కాళ్ల బేరానికొచ్చిన ఎల్‌అండ్‌టీ 
సీపీఎం, ట్రేడ్‌ యూనియన్ల పోరాటంతో ఎల్‌అండ్‌టీ సంస్థ కాళ్ల బేరానికి వచ్చింది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద కార్మికులకు కనీస వసతులు లేకపోవడంపై గత నాలుగు రోజులుగా వామపక్ష పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో కార్మికుడు దేవేంద్ర మృతితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కార్మికుల తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు ట్రేడ్‌ యూనియన్లు, వామపక్షాలు, ఇతర రాజకీయ పక్షాల మద్దతుతో అమరావతిలో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. 
సదుపాయాలపై నిగ్గు తేలిన నిజాలు 
దుర్ఘటన అనంతరం ఎమ్మెల్సీల బృందం పర్యటనలో కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలపై నిజాలు నిగ్గు తేలాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు కనీస వసతి సౌకర్యాలు సైతం కల్పించకుండా రేకుల షెడ్డుల్లో చాలీ చాలని వేతనాలతో పనులు చేయిస్తున్న వైనం బయటపడింది. దీంతో కార్మిక చట్టాలు అమలు చేయాలని, బాధితులకు తగిన న్యాయం చేయడంతో పాటు నష్ట పరిహారం చెల్లించాలని నిరసనలు వెల్లువెత్తాయి. అమరావతిలో 144 సెక్షన్‌ పెట్టినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు నిర్మాణ సంస్థలు కార్మికుల డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
కనీస వసతి కల్పించేందుకు ముందుకొచ్చిన యజామాన్యసంస్థలు
గత నాలుగురోజులుగా జరుగుతున్న పోరాటంతో యాజమాన్యసంస్థలు కార్మికులకు కనీస వసతి కల్పించేందుకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా కార్మికులకు మరుగుదొడ్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, రేకుల షెడ్లకు వెంటిలేషన్‌, నీటి సదుపాయం వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. రేకుల షెడ్లలో ఎండవేడిని ఎక్కువగా ఉండడంతో దానిని తట్టుకునే విధంగా తెల్లటి కెమికల్‌ను షెడ్లపై రాస్తున్నారు. రాత్రి వేళల్లో కార్మికులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతాల్లో లైటింగ్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. సీపీఎం, ట్రేడ్‌ యూనియన్లు సాగించిన పోరాటంతోనే తమకు కనీస వసతులు కలిగాయని కార్మికుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

08:17 - May 14, 2016

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని పలు పబ్‌లలో అర్ధరాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు తనీఖిలు నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపి వెంకటేశ్వర్లు ఆదేశాలతో పలు పబ్‌లు, హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. పబ్‌లలో ఏమైనా డ్రగ్స్‌ కలుపుతున్నారా లేక అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా అనే కోణంలో డాగ్ స్కాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అయితే పోలీసుల రాకనూ ముందుగానే గమనించిన కాఫీ సెంటర్లు, హుక్కా సెంటర్లు యాజమానులు కష్టమర్లనూ ముందే బయటకు పంపించారు. 

 

జూబ్లీహిల్స్ పీఎస్‌ పరిధిలోని పబ్‌లలో పోలీసులు తనిఖీలు

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని పలు పబ్‌లలో అర్దరాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు తనీఖిలు నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపి వెంకటేశ్వర్లు ఆదేశాలతో పలు పబ్‌లు, హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. పబ్‌లలో ఏమైనా డ్రగ్స్‌ కలుపుతున్నారా లేక అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా అనే కోణంలో డాగ్ స్కాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అయితే పోలీసుల రాకనూ ముందుగానే గమనించిన కాఫీ సెంటర్లు, హుక్కా సెంటర్లు యాజమానులు కష్టమర్లనూ ముందే బయటకు పంపించారు. 

 

నేడు ద్వారకా తిరుమలలో అశోక్ గజపతిరాజు పర్యటన

ప.గో : నేడు ద్వారకా తిరుమలలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

 

నేడు భీమవరం, అత్తిలిలో హోంమంత్రి చినరాజప్ప పర్యటన

హైదరాబాద్ : నేడు భీమవరం, అత్తిలిలో హోంమంత్రి చినరాజప్ప పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 

నేడు ఎపిలో కాంగ్రెస్ కరవు బృందం పర్యటన

హైదరాబాద్ : నేడు ఎపిలో కాంగ్రెస్ పార్టీ కరవు బృందం పర్యటించనుంది. వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎండిన పంట పొలాలను పరీలించనున్నారు. 

07:56 - May 14, 2016

హైదరాబాద్ : బీసీ, ఈబీసీలకు కూడా కళ్యాణ లక్ష్మిని వర్తింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఆన్ లైన్ వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏప్రిల్ 1 తరువాత పెళ్లి చేసుకున్న యువతులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కళ్యాణ లక్ష్మి పథకంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరించింది.
వెబ్ సైట్‌ ఆవిష్కరణ
ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే వర్తించేలా ఉన్న కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం మరింత మందికి లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బీసీ, ఈబీసీలకు కళ్యాణ లక్ష్మి పథకం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన వెబ్ సైట్‌ను కూడా ఆవిష్కరించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న. ఈ-పాస్ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. 18 ఏళ్లు నిండి ఏప్రిల్ 1 తరువాత పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి జోగురామన్న. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల సంవత్సర ఆదాయం 1.50 లక్షలు అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం మించని వారు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు.  
కళ్యాణలక్ష్మికి నిధులు అంతంత మాత్రమే 
అంతాబాగానే ఉన్నా బీసీలకు కళ్యాణ లక్ష్మి కోసం ప్రభుత్వం మాత్రం నిధుల్ని అంతంత మాత్రమే కేటాయించింది. లక్షల్లో పెళ్లిల్లు అయితే కేవలం 58వేల 820 మందికి సరపడ నిధులు మాత్రమే కేటాయించింది ప్రభత్వం. ఈ నిధుల్ని మరింత పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు బీసీ, ఈబీసీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి జోగు రామన్న వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీలకు రెసిడెన్సియల్ స్కూల్స్ ను ఏర్పాటు  చేస్తామన్నారు. ఇటీవల బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారులకు త్వరలోనే  నిధులు విడుదల చేస్తామన్నారు. బీసీ, ఈబీసీలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేసినందుకు బీసీలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. కళ్యాణలక్ష్మితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను బీసీల అభివృద్ధి కోసం తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

ఈనెల 17, 18 తేదీల్లో తాళ్లచెరువులో వాలీబాల్‌ పోటీలు

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని తాళ్లచెరువు గ్రామంలో ఈనెల 17, 18తేదీలలో జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వి రాజశేఖర్‌, రేపూడి థామస్‌ తెలిపారు. తాళ్లచెరువు గ్రామ నిర్మాత ఫాదర్‌ అరుణానందస్వామి తిరునాళ్ళ ఈనెల 18న జరగనున్న సందర్భంగా ఆర్‌సీఎం పాఠశాలలో పోటీ జరుగుతాయని, మొదటి బహుమతి రూ.6,016, ద్వితీయ బహుమతి రూ.4,016, తృతీయ బహుమతి రూ .2,016లను అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు రేపూడి నల్లయ్య 9014062743 నెంబర్లో సంప్రదించాలన్నారు.

జోరుగా విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్న ఇంజనీరింగ్‌ కాలేజీలు

హైదరాబాద్‌ : ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారుల సాయంతో ఓవైపు ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తున్నా.. కొన్ని కాలేజీలు మాత్రం తమ విద్యా వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో డొనేషన్లు, ట్యూషన్ ఫీజుల రూపంలో ఒక్కో విద్యార్థి నుంచి అక్షరాల రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. యాజమాన్య కోటా సీటు కోరుకునే విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు ఈ మేరకు ఫీజుల మెను చూపిస్తున్నాయి. ఎంసెట్ నిర్వహించనేలేదు.. ఫలితాలు వెలువడనేలేదు. కానీ, అప్పుడే ప్రైవేటు కాలేజీలు బీ సీట్ల భర్తీకి ద్వారాలు తెరిచాయి.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా..

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 17,18 తేదీల్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. హైకోర్టు సమీపంలోని సిటీ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు రాజేంద్రనరగ్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ టి దశరథ్‌ వెల్లడించారు. కనీసం పదవ తరగతి పాస్, ఫెయిల్ అయిన వారితో పాటు ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ (బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఫార్మసీ) యంబీఏ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా అర్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆసక్తిగల వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనాలని సూచించారు.

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.59 కోట్లుగా ఉంది.

 

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

ప.గో : ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద మేఘన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సు అదుపుతప్పి పోలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  

07:30 - May 14, 2016

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌టంతో వైసీపీలో టెన్షన్‌ మొదలైంది. అభ్యర్థి ఖ‌రారు అయిన‌ప్పటికీ  సీటు ద‌క్కుతుందా లేదోన‌న్న ఆందోళ‌న నేతల్లో క‌నిపిస్తోంది. ఫిరాయించే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌రంగా మారింది. అసలు  రాజ్యసభ సీటు పై వైసీపీ నేత‌ల లెక్కలు ఎలా ఉన్నాయి? పెద్దల స‌భ సీటును  దక్కించుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ..?
ఏపీ నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు 
వచ్చే నెల 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వైసీపీకి కంగారు పుట్టిస్తున్నాయి. ఏపీ నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కే అవకాశముంది. కాని ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు జంప్‌ అవుతుండడంతో రాజ్యసభ సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి.
ఐదో అభ్యర్థిని పోటిలోకి దింపితే ఎన్నిక అనివార్యం 
వైసీపీ ఒకరిని, టీడీపీ ముగ్గురు అభ్యర్థులను పోటీకి దింపితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ టీడీపీ కాని, వైసీపీ కాని ఐదో అభ్యర్థిని పోటిలోకి దింపితే ఎన్నిక అనివార్యం కానుంది. శాసనసభ స్థానాల సంఖ్యను బట్టి ఒక్కో అభ్యర్థి గెలుపొందాలంటే 36 మంది ఎమ్మెల్యేలు అవసరమని.. 50 మంది ఎమ్మెల్యేల బ‌లం వుండ‌టంతో తమకు ఖచ్చితంగా ఒక స్థానం దక్కుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 
50కి తగ్గిన వైసీపీ బలం
17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార‌డంతో  వైసీపీ బ‌లం 50కి చేరింది. మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతార‌న్న ప్రచారం ఆ పార్టీ నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. మ‌రో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వైసీపీ రాజ్యసభ సీటు కోల్పేయే ప్రమాదం ఉంది. వైసీపీకి రాజ్యసభ సీటు దక్కకుండా ఉండేందుకే  పార్టీ ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికార పార్టీలో రాజ్యసభ ఆశావాహుల సంఖ్య కూడా భారీగానే ఉంది. దీంతో నాలుగో అభ్యర్థిని టీడీపీ నిల‌బెడితే ఇబ్బందిక‌ర పరిస్థితి ఎదుర‌వుతుంద‌ని వైసిపి నేత‌లు ఆందోళన చెందుతున్నారు. దీంతో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లకుండా వ్యూహాలు ర‌చిస్తున్నారు . 

07:26 - May 14, 2016

ఖమ్మం : పాలేరు ఎన్నిక దగ్గర పడడడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌ సహా..కాంగ్రెస్‌, సీపీఎం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుండడంతో..పాలేరులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తూ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారు.   
తారాస్థాయికి ప్రచారం 
ఈనెల 16న జరిగే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో  ముగియనుండడంతో బరిలో నిలిచిన మూడు పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 
ఇవాళ సాయంత్రంతో ప్రచారానికి తెర 
ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దగా బలం లేదన్న వాదనను పాలేరు ఉప ఎన్నికలతో తిప్పికొట్టేందుకు రెడీ అయింది. పాలేరు స్థానాన్ని తన ఖాతాలో వేసుకొని ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పాలని గులాబీ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. పాలేరును ఎలాగైనా కైవసం చేసుకునేందుకు పార్టీ అభ్యర్థి ఎంపిక నుంచి విపక్ష పార్టీలకంటే దూకుడుగానే వ్యవహరించింది. సీనియర్ నేత..జిల్లాలో తనకంటూ గుర్తింపు ఉన్న మంత్రి తుమ్మలను రంగంలోకి దించింది. దీనికి తోడు చిన్న  పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సుత్రాన్ని ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అమలు చేస్తోంది. 
టీఆర్‌ఎస్‌ దూకుడు 
పాలేరును ఎలాగైనా కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ నేతలు దాదాపు 20 రోజులుగా పాలేరులోనే మకాం వేసి వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారు. పాలేరు ఉప ఎన్నికల ఇంచార్జ్ గా మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగగా..మండలాలు, గ్రామాలకు మంత్రులు, శాసనసభ్యులు ప్రచారబాధ్యతలను నిర్వహిస్తున్నారు. సహచర మంత్రి విజయం కోసం మంత్రివర్గంలోని మెజార్టీ మంత్రులంతా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 24 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీ సభ్యులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో 15 రోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. 
కాంగ్రెస్ ముమ్మర ప్రచారం
ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డి విజయం కోసం కాంగ్రెస్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాలేరులో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందిన మాజీ టి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 
పాలేరును కైవసం చేసుకునేందుకు సీపీఎం తీవ్ర ప్రయత్నం
పాలేరును కైవసం చేసుకునేందుకు వామపక్ష పార్టీ అయిన సీపీఎం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అభ్యర్థి పోతినేని ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు మాటలు చెప్పి పెద్దలకు మూటలు అప్పజెప్పుతోందని పోతినేని సుదర్శన్‌ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా కేసీఆర్‌ మాటలతోనే సరిపెడుతున్నారని మండిపడ్డారు. 
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు 
ఇదిలా ఉండగా మరోవైపు..సోమవారం జరిగే ఎన్నిక కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 1లక్షా 90వేల 351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మొత్తం 243 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 141 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

 

07:12 - May 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఉద్యోగుల విభజన ఒక కొలిక్కి వస్తోంది. సివిల్స్ స్థాయి ఉద్యోగులతోపాటు రాష్ట్ర స్థాయిలో వివిధ కేడర్లలో ఉద్యోగుల విభజనకు డీవోపీటీ ఆమోద ముద్ర వేసింది. విభజన జరిగిన ఉద్యోగుల జాబితాలో పేరు లేని ఉద్యోగులు ప్రస్తుతం వారు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ విభజనలో తెలంగాణకు ఐఎఎస్‌ అధికారులను పెద్ద సంఖ్యలో కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తికాని ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. సివిల్స్ స్థాయి ఉద్యోగులను మొదలుకుని రాష్ట్రస్థాయిలో వివిధ శాఖల ఉద్యోగుల విభజన పూర్తవుతోంది.
తెలంగాణకు తీరనున్న ఐఎఎస్‌ల కొరత
డీఓపీటీ కేటాయింపులతో తెలంగాణకు ఐఎఎస్‌ల కొరత కొంత తీరనుంది. తెలంగాణకు అదనంగా 70 మంది ఐఏఎస్‌లను కేటాయించాలని సిఎం కేసీఆర్‌ కేంద్రాన్ని పలుమార్లు కోరిన నేపథ్యంలో ఇప్పటికి 45 మందిని కేటాయించారు. దీంతో త్వరలో ఏర్పడే కొత్త జిల్లాలకు ఐఏఎస్‌ అధికారుల కొరత తీరిపోతుంది. ప్రస్తుత కేటాయింపులతో తెలంగాణలో ఐఏఎస్‌ల సంఖ్య 208కి చేరుతుంది.
తెలంగాణకు 9 మంది ఆక్టోపస్‌ జూ.అసిస్టెంట్లు
హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆక్టోపస్‌ విభాగంలో మొత్తం జూనియర్‌ అసిస్టెంట్ ఉద్యోగులు 9 మంది ఉండగా అందర్నీ తెలంగాణకు కేటాయించారు. ఇదే విభాగం ఇంటెలిజెన్స్‌ విభాగంలో మొత్తం 270 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు 138 మందిని, మిగిలిన 132 మందిని ఏపీకి కేటాయించారు. ఇంటెలిజెన్స్‌ విభాగం అసిస్టెంట్లను తెలంగాణకు 71 మందిని ఏపీకి 70 మంది చొప్పున విభజించారు.
కార్మిక మంత్రిత్వ శాఖలో 324 మంది ఉద్యోగులు
కార్మిక మంత్రిత్వ శాఖలో 324 మందిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ఇందులో తెలంగాణకు 190 మందిని మిగిలిన 134 మందిని ఏపీకి కేటాయించారు. విభజన జాబితాలో పేర్లు లేనివారు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే పనిచేయాలి. తదుపరి ఉత్తర్వులు డీఓపీటి నుంచి వెలువడేంతవరకు ఇది కొనసాగుతుంది. ఉద్యోగులు ఎవరైనా కోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నట్లైతే ఆ ఉత్తర్వుల్లో సూచించిన మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఆ ఉత్తర్వుల గడువు తీరిపోతే జాబితా ప్రకారం వారిని ఏ రాష్ర్టానికి కేటాయిస్తే ఆ రాష్ట్రంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆయా విభాగాల్లో రెండు రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఏర్పడిన సలహా కమిటీ సిఫారసుల మేరకు ఈ విభజన ప్రక్రియను పూర్తిచేసి వివరాలను తుది జాబితాను ప్రకటించినట్లు డీఓపీటీ స్పష్టం చేసింది.

 

కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్

హైదరాబాద్  : కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేశారు. 

నేటితో ముగియనున్న పాలేరు ఉప ఎన్నిక ప్రచారం

ఖమ్మం : నేటితో పాలేరు ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. ఇప్పటికే పలు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

నేటితో ముగియనున్న తిమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ : నేటితో తిమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారం ముగియనుంది. నిన్నటి వరకు రెండు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలు విస్తృ ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల్లో పార్టీల భవిష్యత్ తేలనుంది. 

నేడు కోల్ కతా, పుణె మధ్య మ్యాచ్

కోల్ కతా : ఐపీఎల్ 9 లో భాగంగా నేడు కోల్ కతా, పుణె మధ్య మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు బెంగుళూరు, గుజరాత్ మధ్య మ్యాచ్

బెంగుళూరు : ఐపీఎల్ 9 లో భాగంగా నేడు బెంగుళూరు, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగుళూరు వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

Don't Miss