Activities calendar

15 May 2016

21:32 - May 15, 2016

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు ఆరు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1 నాటికి కేరళకు చేరుకోవాల్సిన రుతుపవనాలు ఏడో తేదీన తాకే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా వర్షాలు ఆలస్యమవనున్నాయి. గత 11ఏళ్లుగా నైరుతి ఆగమనాన్ని వాతావరణ శాఖ సరిగ్గా అంచనా వేస్తోంది. ఈ కొద్ది రోజులు ఆలస్యమవడం పెద్ద విషయమేమీ కాదని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ తెలిపారు. రానున్న రోజుల్లో దక్షిణ భారత దేశంలో మరిన్ని వర్షాలు కురిసి ప్రజలకు వేడిమి నుంచి కొంచెం ఉపశమనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంలో కేరళ, తమిళనాడు, కర్నాటకలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాథోర్ వెల్లడించారు.

21:30 - May 15, 2016

ఢిల్లీ : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల తరపున అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు. రెండు నెలలకు పైగా నేతల ప్రచార హోరుతో వేడెక్కిన తమిళనాడులో ప్రచారం ముగియనుండడంతో మైకులు మూగబోయాయి. ఇక్కడ ద్రవిడ పార్టీలు ఏఐఏడీఎంకే, డీఎంకే కూటమిలతో పాటు డీడబ్ల్యూఎఫ్, డీఎంకే, టీఎంసీల మధ్య ప్రధాన పోటీనెలకొనగా...బీజీపీ కూటమి, పీఎంకేలు కూడా బరిలో నిలిచాయి. తమిళనాడులో 234 స్థానాలకు గాను ఎన్నికల బరిలో 3,776 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ఏకంగా 320 మంది మహిళా అభ్యర్థులే పోటీపడుతుండడం విశేషం. మొత్తం 5కోట్ల, 83లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడు ఎన్నికల బరిలో నలుగురు సీఎం అభ్యర్థులు జయలలిత, కరుణానిధి, విజయ్‌కాంత్‌, అన్భుమణి రాందాస్‌లు తలపడుతున్నారు.

తెలంగాణలో...
ఇక కేరళలో ఎల్‌డీఎఫ్‌ పాలక యూడీఎఫ్‌లు హోరాహోరిగా తలపడుతుండగా..అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టాలని బీజేపి ఆశలు పెంచుకుంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 109 మంది మహిళా అభ్యర్థులు సహా 1203 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. మొత్తం 2కోట్ల 61 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 21,644 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు.  అలాగే పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాల్లో 344 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోటీలో 21 మంది మహిళా అభ్యర్థులున్నారు. మొత్తం 9లక్షల 42వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 30 స్థానాలకు జరిగే ఎన్నికలకు మొత్తం 930 పోలింగ్‌ బూత్‌లను అధికారులు సిద్ధం చేశారు.  మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకు పాలేరులో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పాలేరు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సహా కాంగ్రెస్‌, సీపీఎం బరిలోకి దిగాయి. టీఆర్‌ఎస్‌ తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలువగా...కాంగ్రెస్‌ నుంచి దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డి పోటీపడుతున్నారు. ఇక సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌ బరిలో నిలిచారు.
అన్ని ఏర్పాట్లు..
మొత్తం మీద సోమవారం 3 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర పారామిలటరీ దళాలతో గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. నాటి పోలింగ్‌కు అనంతరం మే 19న ఫలితాలు వెలువడనున్నాయి. మే 19న ఈ మూడు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్‌, అస్సాం రాష్ట్ర ఫలితంతో పాటు పాలేరు ఉప ఎన్నిక ఫలితం కూడా కూడా వెలువడనుంది. 

నేటి నుండి జగన్ జలదీక్ష..

కర్నూలు : నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి చేపట్టనున్న జలదీక్షకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. కర్నూలు నగరం నుంచి నంద్యాల వెళ్లే రోడ్డులో చెక్‌పోస్ట్ సమీపంలోని పొలాల్లో భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. 

జూరాలకు కర్నాటక నీరు విడుదల..

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎగువనున్న నారాయణపూర్ జలాశయం పరిధిలోని గూడూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు కర్ణాటక ప్రభుత్వం ఆదివారం ఒక టీఎంసీ కృష్ణా జలాలను విడుదల చేసింది. ఎల్లుండి కల్లా మహబూబ్‌నగర్‌ జిల్లాకు కృష్ణా జలాలు చేరుకోనున్నాయి.

మే 17 నుండి జీహెచ్ఎంసీ జాబ్ మేళా..

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌ జాబ్‌ మేళా నిర్వహిస్తోంది. సీటీ కాలేజీ, హైకోర్టు రోడ్డు సమీపంలో మే 17 నుంచి మే 18 వరకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు సంయుక్తంగా ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారికి వెంటనే ఆఫర్‌ లెటర్‌ ఇవ్వనున్నట్టు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

మూడు రాష్ట్రాల్లో సోమవారం ఎన్నికలు..

ఢిల్లీ : తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో 233 స్థానాల్లో పోలింగ్‌ జరుగనుంది. అయితే తమిళనాడులో ఒకచోట ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో వాయిదా వేసినట్టు తెలిసింది. 

విజయవాడలో సీపీఎం నేతల నిరసన కార్యక్రమాలు..

విజయవాడ : కార్పొరేటర్ల తీరుపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. నగర పాలక సంస్థ సమీపంలో గాంధీ విగ్రహం దగ్గర సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. 

21:23 - May 15, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఇంజనీరింగ్‌, మధ్యాహ్నం జరిగిన మెడిసిన్‌ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు లక్షల్లో హాజరయ్యారు. ఈసారి కూడా వన్ మినిట్‌ కండీషన్‌ విద్యార్థులను ఉరుకులు పరుగులు పెట్టించింది. కొంతమంది సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేక.. పరీక్ష మిస్ అయి.. కన్నీటి పర్యంతమయ్యారు. మొత్తం 2,46,522 అభ్యర్థుల్లో ఇంజనీరింగ్‌లో 1,43,524 మంది, అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగం నుంచి 1,002,12 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 276 సెంటర్లు, అగ్రికల్చర్‌, మెడికల్‌ కోసం 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్‌, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 5-30గంటల వరకు మెడికల్‌ పరీక్షలు జరిగాయి.

ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష..
ఉదయం జరిగిన ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు లక్షా 43వేల 524 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు క్యూసెట్‌ కోడ్‌ను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష జరిగింది. పరీక్ష ప్రారంభానికి ముందు.. విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎంసెట్‌లో తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేశారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా నిమిషం నిబంధనను అధికారులు పక్కాగా అమలు చేశారు. పలు సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేక.. పరీక్ష మిస్‌ అయిన విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం మెడికల్...
ఇక మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష జరిగింది. దీనికి ఎస్ సెట్ ప్రశ్నా పత్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎంపిక చేశారు. ఈ పరీక్ష కోసం లక్షా 983 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష కోసం 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలన్నింటిని ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఏర్పాటు చేశారు. ఏపీలో కూడా నాలుగు కేంద్రాల్లో తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో వైద్య పరీక్షకు 47 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మినహా అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఆయూష్‌, ఫార్మా, హోమియోపతి తదితర వైద్య కోర్సులకు పరీక్ష నిర్వహించారు. మెడికల్‌ పరీక్షను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఇందుకోసం కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో రెండు, ఓయూలో ఒకటి, వరంగల్‌ ఎన్‌ఐటీలో ఒకటి వంతున నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 536 మంది హాజరయ్యారు. ఈనెల 27లోగా ఎంసెట్‌ ఫలితాల్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్వీనర్ ఎన్‌.వి.రమణారావు తెలిపారు. 

21:20 - May 15, 2016

ఖమ్మం : టీఆర్‌ఎస్ పార్టీ ఓటమి భయంతోనే సీపీఎంపై అసత్య ప్రచారం చేస్తోందని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్‌ విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం, తెల్దార్‌పల్లి మొదటి నుంచే కమ్యూనిస్టుల కంచుకోటగా ఉందని తెలిపారు. అది సహించలేక టీఆర్ఎస్ దిగుజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీపీఎం పై చేసిన విమర్శలన్నీ నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు 20 రోజులు తిష్ట వేశారని, ఓడిపోతామనే భయం.. ప్రజల వ్యతిరేకత గమనించాక టిఆర్ఎస్ కోట్ల రూపాయల పంపిణీ చేస్తోందన్నారు. ఒక్కో ఓటుకు మూడు వేల రూపాయలు పంచడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అధికారులు, పోలీసుల అండతో పాలేరు ఓటర్లను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని, టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

21:18 - May 15, 2016

ఆదిలాబాద్ : రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎకరానికీ సాగునీరు అందిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ నియోజకవర్గంలో హరీష్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలపై కాంగ్రెస్ కు ప్రేమ ఉంటే మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నోళ్లు మూయించే ప్రయత్నం చేయాలని, ప్రాజెక్టులను అడ్డుకుంటే టిడిపి గతి ఏమయిందో అందిరికీ తెలిసిందేనన్నారు. 

మోడీతో మాట్లాడిన గాంధీ మనువడు..

ఢిల్లీ : ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న మహాత్మాగాంధీ మనువడు కనుభాయ్ ని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ కలిశారు. వృద్ధాశ్రమంలో ఆయన తన భార్యతో కలిసి కటిక పేదరికంలో జీవితం గడుపుతున్న విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కన్ను భాయ్ మాట్లాడారు. 

21:00 - May 15, 2016

వెంకట్ ది హత్య..ఆత్మహత్య..? వెంకట్ ది సహజ మరణం కాదని డిటెక్టివ్ బృందం అనుమానిస్తోంది. అతని బాడీలో ఆర్సెనిక్ అనే విషపదార్థం ఉందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ విషపదార్థం ఇతని బాడిలో ఎలా కలిసింది ?. 27 ఏళ్లున్న వెంకట్ గుండెపోటుతో చనిపోయాడని ప్రాథమికంగా నిర్ణయించుకున్నా తరువాత అసలు నిజం తెలిసింది. కానీ వెంకట్ మృతి చెందినా అతని భార్యకు ఫోన్ కాల్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి. నా భర్తను చంపుకున్నా..అని ఏడ్చింది. తనకు ఒకతను వేధించే వాడని పేర్కొంది. కానీ ఆ వేధించిన వ్యక్తి కూడా మృతి చెందాడని డిటెక్టివ్ పరిశోధనలో తేలింది. మరి వెంకట్ ను ఎవరు హత్య చేశారు? తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి. 

హైదరాబాద్ చేతిలో పంజాబ్ చిత్తు..

మొహాలీ : ఐపీఎల్ 9 సీజన్ లో హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 19.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 

కాన్పూర్ లో పెళ్లి వేడుకల్లో అపశృతి..

కాన్పూర్ : ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కొంతమంది ఓ బిల్డింగ్ పై నుండి పెళ్లి వేడుకలను చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ రెండంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఈఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. 

ఏఐఏడీఎంకే, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ..

చెన్నై : కోయంబత్తూరులో ఏఐఏడీఎంకే, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 9మందికి గాయాలయ్యాయి. 

20:08 - May 15, 2016

చలాకీ చంటి...జబర్ధస్త్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కమెడియన్. ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అన్ని వర్గాలనూ ఆకట్టుకోవడంలో చలకీ చంటీ ఎప్పుడూ ముందుంటాడు.. ఆరోగ్యకరమైన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఆయన ఇంకా బేచిలర్ గా ఉండటంపై కూడా ఈ ప్రోగ్రామ్ లో అనేకసార్లు సెటైర్లు పేలాయి. ఈ సందర్భంగా టెన్ టివితో చలాకి చంటి ముచ్చటించాడు. పలు విషయాలు..అభిప్రాయాలు తెలిపాడు. అంతేగాక చంటితో పలువురు కమెడియన్లు కూడా మాట్లాడారు. ఆ విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

పాలేరు సర్పంచ్ ఇంట్లో డబ్బు పంపిణీ..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శలు చెలరేగుతున్నాయి. పాలేరు ఓట్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలేరు సర్పంచ్ ఇంట్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. 

ప్రధాని నివాసంలో మోడీ తల్లి..

న్యూఢిల్లీ : ఢిల్లీ రేస్ కోర్స్ రోడ్‌లోని ప్రధాని అధికారిక నివాసానికి నరేంద్ర మోడీ తల్లి తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా తల్లి హీరాబేన్‌తో ప్రధాని మోడీ ముచ్చటించారు. 

సీఎం సంగ్మా సతీమణికి ఈసీ నోటీసులు..

మేఘాలయ : రాష్ట్ర సీఎం ముకుల్ సంగ్మా భార్య దిక్కంచిడీ శిరకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దిక్కంచి కాంగ్రెస్ తరుపున లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలో పోటీ చేస్తోంది. ఎన్నికల నియామళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఆమెకు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.

 

19:48 - May 15, 2016

సినిమలో భజన కావాలి అంటూ చలాకీ చంటీ వ్యాఖ్యానించారు. టెన్ టివితో 'చలాకీ చంటి' ముచ్చటించాడు. సినిమాలో ఎదుటొడిని పొగడుతూ ఉండాలని, నా వల్ల కాదని పేర్కొన్నారు. తాను స్ట్రేట్ ఫార్వర్డ్ అని, అందుకే నాకు సినిమా ఛాన్స్ లు ఇవ్వరని తెలిపారు. 'చంటి టైం కు రాడు..చంటి డబ్బులు ఎక్కువగా అడుగుతాడు. సెట్ లో సరిగ్గా ఉండడు' అని పేర్కొంటారని తెలిపారు. తనతో పని చేసిన వారికి తానేమిటో తెలుసని, సెట్ లో తాను ఉంటే ఎలా ఉంటుందో చూస్తే తెలుస్తుందన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 02.30 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలు సాఫీగా జరిగాయి.

 

జర్నలిస్టు రాజ్ దేవ్ హత్య కేసులో పోలీసుల అదుపులో ఇద్దరు..

బీహార్ : జర్నలిస్టు రాజ్ దేవ్ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లోని 'హిందూస్థాన్' అనే హిందీ దినపత్రికలో బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు రాజ్ దేవ్ ను సివాన్ జిల్లాలోని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డారు. 

18:31 - May 15, 2016

గుంటూరు: మట్టి పెళ్లలు పడి.. ఏడుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాధ్యుడిని శిక్షించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రజా సంఘాలు చేసిన ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం కదిలింది. కార్పొరేషన్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. బిల్డర్‌ లైసెన్సును రద్దు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. మరోవైపు.. కార్మిక, ప్రజా సంఘాల పది డిమాండ్‌లపై ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రాత్రి నుంచీ చేపట్టిన ఆందోళనను ప్రజాసంఘాలు విరమించాయి. లక్ష్మీపురంలో సెల్లార్‌ తవ్వకం ఏడు నిండు ప్రాణాలను సమాధి చేసింది. అధికారుల అలసత్వం.. బిల్డర్‌ నిర్లక్ష్యం.. నలుగురు విద్యార్థులు సహా ఏడుగురిని మృత్యువుపాలు చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాధితుల పక్షాన.. సీపీఎం సహా 17 వామపక్ష, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఓవైపు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టాయి. గుంటూరు ఘటనలో మృతులు ఒక్కొక్కరికి పాతిక లక్షలు చొప్పున.. వారి కుటుంబ సభ్యులకు పరిహారంగా అందించాలని వామపక్ష, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. వీటితో పాటు మొత్తం పది డిమాండ్‌లతో.. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వీరి ధర్నాలతో గుంటూరు జీజీహెచ్‌ ప్రాంగణం దద్దరిల్లింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.

అరెస్టు..
మృతుల కుటుంబాలకు 20లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బిల్డర్‌ నుంచి 15 లక్షలు, సర్కారు తరఫున 5 లక్షలు ఇస్తామని వెల్లడించింది. బాధితుల కుటుంబాలకు సహాయంపైనా.. ఈనెల 17న వామపక్ష, ప్రజా సంఘాల ప్రతినిధులతో భేటీ నిర్వహిస్తామని తెలిపింది. దీంతో వామపక్షాలు ఆందోళన విరమించాయి. గుంటూరులో మట్టిపెళ్లలు పడి ఏడుగురు మరణించిన ఘటనను ప్రభుత్వమూ సీరియస్‌గా తీసుకుంది. భవన నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ కార్పొరేషన్‌ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌ సువర్ణకుమార్‌ను సస్పెండ్ చేసింది.. డిప్యూటీ సిటీ ప్లానర్‌ సత్యనారాయణ, సిటీ ప్లానర్‌ ధనుంజయరెడ్డిలకు షోకాజు నోటీసులు పంపింది.. బిల్డర్‌ రమేశ్, టెక్నికల్‌ పర్సన్‌ హరిబాబు లైసెన్సులు రద్దు చేసింది.. అలాగే ఇంజనీర్‌ వీఏ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వర్క్ సూపర్‌వైజర్ సాంబశివరావు, మేస్త్రి యుగంధర్‌, కాంట్రాక్టర్‌ వినోద్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ప్రజాప్రతినిధుల పరామర్శ..
మరోవైపు.. ఈ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వేసవి సెలవుల్లో ఇంటికివచ్చిన స్టూడెంట్స్... తల్లిదండ్రులకు సహాయంగా కూలీ పనికి వచ్చి మృత్యువాత పడ్డారు. చేతికి ఎదిగివచ్చిన పిల్లలు ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు బాధితులను రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఒక్కో బాధిత కుటుంబానికి పార్టీ తరఫున 50వేల రూపాయలిస్తామని ప్రకటించారు. అంతకుముందు లక్ష్మీనగర్‌ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను మంత్రి చినరాజప్ప, రావెల కిషోర్‌బాబు పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు.

18:26 - May 15, 2016

శ్రీకాకుళం : కాళి మాత చెప్పిందంటూ తల్లీ కూతుళ్లు ఇంట్లోనే ఏకంగా 20 అడుగుల గొయ్యి తవ్వారు. ఇందుకోసం రెండు అల్యూమినియం నిచ్చెనలు కూడా ఉపయోగించారు. మడ్డివీధిలో మెండ రమణమ్మ, ఆమె కూతురు దేవి నివాసం ఉంటున్నారు. అమ్మవారు ఆవహించిందంటూ ఈ తల్లికూతుళ్లిద్దరూ మూడు నెలలనుంచి గొయ్యి తవ్వుతున్నారు. దేవతకు భారీగా బీర్‌ సీసాలను నైవేద్యంగా పెట్టారు. వీరీ ప్రవర్తనచూసి సందేహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి వచ్చిన పోలీసులు అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. ఇంట్లో ఎక్కడచూసినా సొరంగంలా గోతులే కనిపించాయి. ఎవరు తవ్వారంటూ ప్రశ్నిస్తే దేవి పూనకంతో ఊగిపోయింది. దుష్ట శక్తులను తరిమికొట్టేందుకు కాళి మాతే ఈ గొయ్యి తవ్విందంటూ చెప్పింది. లేకపోతే ఇది తవ్వడం తమవల్ల ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. రమణమ్మ మాత్రం తన కూతురుకి పెళ్లి కాలేదని గొయ్యి తవ్వితే వివాహం జరుగుతుందని అమ్మవారు చెప్పిందంటోంది. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:23 - May 15, 2016

కర్నూలు : వైఎస్సార్సీపి అధినేత వైఎస్‌ జగన్‌ మరో దీక్షకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా క‌ర్నూల్‌లో రేపటి నుంచి మూడు రోజుల పాటు జ‌లదీక్షకు సిద్ధమయ్యారు జగ‌న్. ఇప్పటికే దీక్షకు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. జల దీక్ష ద్వారా..అనుమ‌తులు లేని తెలంగాణ ప్రాజెక్టుల‌పై చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తామంటున్నారు వైసిపి నేత‌లు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌పై వైసీపీ నిర‌స‌న గ‌ళం వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మ‌హబూబ్‌న‌గ‌ర్‌లో నిర్మిస్తున్న పాల‌మూరు, దిండి ప్రాజెక్టుల‌కు వ్యతిరేకంగా ఈ నెల 16,17,18 తేదీల్లో క‌ర్నూలు వేదికగా వైఎస్‌ జ‌గ‌న్ దీక్ష చేయ‌బోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల‌ను అక్రమంగా నిర్మిస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెద‌ప‌టం లేద‌ని మండిప‌డుతున్నారు వైసిపి నేత‌లు.

వైసీపీ నేతల్లో ఆందోళన..
మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న క‌ర్నూలును దీక్షకు జగన్‌ ఎంచుకోవడం విశేషం. అయితే కర్నూలు సిటింగ్‌ ఎమ్మెల్యే సహా పలువురు శాసనసభ్యుల ఫిరాయింపుల‌ కారణంగా జ‌గ‌న్ దీక్షను లీడ్‌చేసే నాయ‌కుడు క‌రువ‌య్యార‌న్న ఆందోళ‌న వైసీపీ జిల్లా నేత‌ల్లో క‌నిపిస్తోంది. అయినా దీక్షను విజ‌య‌వంతం చేసే బాధ్యతలను కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బుగ్గన రాజేందర్‌నాథ్‌రెడ్డి భుజనా వేసుకున్నారు. అనుకున్న స్థాయిలో జనసమీకరణ చేయగలుగుతామా అన్న వేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జలదీక్షతో చంద్రబాబును ఇర‌కాటంలో పెట్టాల‌ని భావించిన వైసిపి అధినేత‌.. ఇప్పుడు దీక్షను ఎలా స‌క్సెస్ చేసుకోవాలోన్న అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

ఫిరాయింపులు...
ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటివరకు వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోయారు. మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో జ‌గ‌న్ సతమతమవుతున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్‌ ప్రయ‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక హోదాపై కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలను నిర్వహించారు. ప్రతికూల పరిస్థితుల్లో జ‌గ‌న్ చేయ‌బోతున్న ఈ మూడు రోజుల దీక్ష ఎంత మేరకు విజ‌య‌వంతం అవుతుంద‌నేది చూడాలి. 

18:20 - May 15, 2016

ప్రకాశం : కృష్ణా పుష్కరాల పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ మంత్రి నారాయణ పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. తొలుత రామలింగేశ్వర్ నగర్ ఘాట్ వద్ద నున్న వాటర్ సప్లయ్ స్టోర్, దూరదర్శన్ స్టాఫ్ కోర్టర్స్ వద్ద నున్న పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గరున్న కృష్ణవేణి ప్రాంగణం, ఇంద్రకీలాద్రి దగ్గరున్న దుర్గా ఘాట్, పున్నమి దగ్గరున్న ఘాట్, ఇబ్రహీంపట్నం దగ్గరున్న సంఘమంలను సందర్శించారు. జూన్‌ 30కల్లా పుష్కర ఘాట్ లను పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. పుష్కరాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 

18:18 - May 15, 2016

తూర్పుగోదావరి : జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ శాఖ అధికారుల పనితీరుపై ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పని చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజమండ్రి ఆనంద కళాకేంద్రంలో సర్ ఆర్థర్ కాటన్ 213 జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వం సాగు,తాగు నీటికి వేల కోట్ల రూపాయలను కేటాయిస్తుందన్నారు. అయినా అధికారులు మాత్రం పథకాల పనులను పూర్తి చేయడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రేపు పాలేరు ఉప ఎన్నిక..

ఖమ్మం : పాలేరు అసెంబ్లీ ఉపఎన్నిక కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు 243 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ కు ఓటమి భయం - సీపీఎం..

ఖమ్మం : పాలేరులో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్ పేర్కొన్నారు. అధికారులు, పోలీసుల అండతో పాలేరు ఓటర్లను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని, తెల్తార్ పల్లి మొదటి నుండి కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉందన్నారు. టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

శంషాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్..

రంగారెడ్డి : శంషాబాద్ (మం) ముచ్చింత్ లో దారుణం చోటు చేసుకుంది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో శంషాబాద్ వీఆర్వో కూడా ఉన్నాడు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

గుజరాత్ లో భూ ప్రకంపనాలు..

గుజరాత్ : రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 3.4గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. 

ములాయంతో రాందేవ్ బాబా..

లక్నో : ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. వీరి సమావేశంలో యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ కూడా పాల్గొన్నారు.

 

రేపు తమిళనాడులో పోలింగ్..

చెన్నై : తమిళనాడులో ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 234 స్థానాల్లో 233 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో 5.79 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

17:35 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన సాయిధరమ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన 'సుప్రీమ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లోని పాటలు 'సాయి ధరమ్ తేజ' చిత్రాల్లో రీమెక్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కూడా 'అందం..హిందోలం' అనే పాటను రీమెక్స్ చేశారు. కానీ భవిష్యత్ లో తాను నటించే చిత్రాల్లో చిరంజీవి పాటలు ఉండవని తేల్చిచెప్పారు. టెన్ టివితో 'సుప్రీమ్' చిత్ర యూనిట్ ముచ్చటించింది. హీరో సాయి ధరమ్ తేజ, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను సినీ విశేషాలను వెల్లడించారు. రీమెక్స్ పాటలు చేస్తూ పోతుంటే గలీజుగా ఉంటుందని సాయి ధరమ్ తేజ వ్యాఖ్యానించారు. 

17:20 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరో 'సాయి ధరమ్ తేజ'. ఆయన నటించిన 'సుప్రీమ్' మంచి విజయం నమోదు చేసుకుంది. పటాస్ తరువాత మరో సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అనీల్ రాపూడి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను టెన్ టివికి 'సుప్రీమ్' చిత్ర యూనిట్ తెలియచేసింది. హీరో సాయి ధరమ్ తేజ, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి విశేషాలను తెలియచేశారు. వారు ఎలాంటి విశేషాలు..ఎలా సందడి చేశారో వీడియో క్లిక్ చేయండి. 

17:18 - May 15, 2016

'మెగా' కుటుంబం నుండి వచ్చిన వారికి ఎలాంటి గర్వం ఉండదని నటుడు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. టెన్ టివితో 'సుప్రీమ్' టీంతో ముచ్చటించింది. హీరో సాయి ధరమ్ తేజ, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..కొంతమంది హీరోలతో డిస్టెన్స్ మెంటెన్ చేయాల్సి వస్తుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ మొదటి రోజు నుండే ఫ్రెండ్లీగా మెలుగుతాడని, నేర్చుకుంటాననే ఫీలింగ్ లో ఉంటాడని పృధ్వీ పేర్కొన్నారు. తాను సెట్ లో ఉండే సమయంలో ఫ్లెండ్లీగా ఉండటానికే మొగ్గు చూపుతానని, సీరియస్ గా ఉండటానికి ఇష్టపడనని హీరో సాయి ధరమ్ తేజ పేర్కొన్నారు. 

17:10 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ' నటించిన తాజా చిత్రం 'సుప్రీమ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా టెన్ టివితో 'సుప్రీమ్' యూనిట్ తో ముచ్చటించింది. 'సుప్రీమ్' టైటిల్ పెడుతున్నట్లు చెప్పగానే తొలుత తాను చాలా కంగారు పడ్డానన్నారు. చిరంజీవితో మాట్లాడడం జరిగిందని, ఆయన చాలా సపోర్టు ఇచ్చారని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి. 

టీజేఏసీ కార్యక్రమాల కమిటీ సమావేశం..

హైదరాబాద్ : టీజేసీ కార్యక్రమాల కమిటీ సమావేశం జరిగింది. మూడు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని టీ జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్ పేర్కొన్నారు. సాధికారిక నిపుణుల కమిటీ వేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అమరవీరుల ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. 

రేపటి నుండి ఏపీలో ఫౌండేషన్ కోర్సు..

విజయవాడ : కలెక్టర్ క్యాంపు ఆఫీసులో ఫౌండేషన్ కోర్సుపై ఐదు జిల్లాల అధికారులతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నుండి జూన్ 10 వరకు ఫౌండేషన్ కోర్సు ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఐదు జిల్లాల్లో అమలు కానుందని మంత్రి నారాయణ వెల్లడించారు. 

నలుగురికి కరెంటు షాక్...

మెదక్ : శివంపేట (మం) పాంబండలో 11 కేవీ విద్యుత్ లైన్ వేస్తుండగా నలుగురికి కరెంటు షాక్ తగిలింది. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

 

శ్రీలంక తీరం వద్ద తీవ్ర అల్పపీడనం..

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరం వద్ద తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈనెల 17 కల్లా వాయుగుండంగా మారి నాగపట్టణం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 17న అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తీకనున్నాయి. 

కొనసాగనున్న వడగాలులు..వానలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు..వడగాలుల ముప్పు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 48గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

16:14 - May 15, 2016

గుంటూరు : జిల్లా జీజీహెచ్ వద్ద ప్రజా సంఘాలు..బాధిత కుటుంబాలు ఆందోళన విరమించారు. మట్టిపెళ్లలు కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన ఘటనపై ప్రజా సంఘాలు..బాధిత కుటుంబాలు ఆందోళన నిర్వహించాయి. మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఉదయం నుండి చేస్తున్న ఆందోళనపై ఉన్నతాధికారులు స్పందించారు. అధికారుల ఎదుట ప్రజా సంఘాలు పది డిమాండ్లు పెట్టాయి. ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలి...బాధిత కుటుంబాలకు రూ. 30 లక్షలు ఇవ్వాలి..కుటుంబానికి ఐదెకరాల సాగుభూమి ఇవ్వాలి..శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం కల్పించాలి..5.80 లక్షలతో ఇళ్లు నిర్మించాలి..మార్కెట్ షాపింగ్ కాంపెక్లులో 8 షాపులను బాధితులకు కేటాయించాలి..ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలి..అక్రమ కేసులను ఎత్తివేయాలి..అనే డిమాండ్లు ముందుంచారు. దీనిపై చర్చిస్తామని ఉన్నతాధికారి లిఖితపూర్వక హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. 17 సాయంత్రంలోపు నిర్ణయం ప్రకటించాలని, లేనిపక్షంలో 18వ తేదీన బంద్ కు పిలుపునిస్తామని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. 

ఆందోళన విరమించిన ప్రజా సంఘాలు..బాధిత కుటుంబాలు..

గుంటూరు : మట్టిపెళ్లలు కూలిన ఘటనలో ఈనెల 17వ తేదీన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనితో బాధితులు..సీపీఎం నేతలు చేస్తున్న ఆందోళనను విరమించాయి. అధికారుల ఎదుట ప్రజా సంఘాలు పది డిమాండ్లు పెట్టాయి. 17 సాయంత్రంలోపు నిర్ణయం ప్రకటించాలని, లేనిపక్షంలో 18వ తేదీన బంద్ కు పిలుపునిస్తామని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. 

మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు..

గుంటూరు : లక్ష్మీపురంలో ఓ వాణిజ్య భవన సముదాయ నిర్మాణంలో శనివారం మట్టిపెళ్లలు కూలిన ఘటనలో మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించాలని కోరుతూ అఖిలపక్ష నేతలు, బాధితుల బంధువులు గుంటూరు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందనే. దీనిపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని బాధితులు జాయింట్ కలెక్టర్ ను కోరారు. 

వృద్ధాశ్రమంలో గాంధీ మనవడు..

న్యూఢిల్లీ: జాతిపిత, మహాత్మ గాంధీ మనువడు కనుభాయ్ గాంధీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో జీవిస్తున్నారు. ఆయన తన భార్యతో కలిసి కటిక పేదరికంలో జీవితం గడుపుతున్నారు. 

ఉపద్రవంలా జలసంక్షోభం..

నల్గొండ : జల సంక్షోభం ఉప ద్రవంలా ముంచుకొస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో జల సంరక్షణ, ఇంకుడు గుంతలపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జల సంరక్షణ కోసం ప్రతీ పౌరుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

15:43 - May 15, 2016

అమెరికా : అట్లాంటా ఎయిర్‌షోలో అపశృతి జరిగింది. మినీ విమానాలతో విన్యాసాలు చేస్తుండగా ఓ ప్లేన్‌ అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పైలెట్‌ దుర్మరణం చెందాడు. అట్లాంటాలోని డెక్లాబ్‌ పీచ్‌ట్రీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే మంటలు ఆర్పినా పైలెట్‌ను కాపాడలేకపోయారు. ప్లేన్‌ పూర్తిగా దగ్ధమైందని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు. 

15:42 - May 15, 2016

నల్గొండ : అమాయక ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ..నట్టేట ముంచుతున్నారు కొంతమంది ప్రబుద్ధులు. ఇలాంటి మోసాలే నల్లగొండ జిల్లాలో వరుసగా చొటుచేసుకంటున్నాయి. తమ సంస్థలో మెంబరైతే చాలు ఆకర్షనీయమైన ఆఫర్లంటూ చాపకింద నీరులా తమ కపట మోసాన్ని విస్తరిస్తున్నారు. తాజాగా మై స్మార్ట్ పేరుతో లబ్దిదారులను బురిడీ కొట్టించిందో సంస్థ. నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో అనేక అవినీతి-అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎక్కడ ఏం జరిగినా నల్లగొండ జిల్లాతో లింకు ఉండటం గమనార్హం. గత కొంతకాలంగా జిల్లాలో రకరకాల స్కీంల పేరుతో జనం నుంచి వందలు, వేల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మునుగొడు నియోజకవర్గంలోని మర్రిగూడాలో కేవలం 200 రూపాయలు చెల్లించండి బైక్, ఫ్రిజ్, కలర్ టివీ లాంటి గృహపకరణాలను గెలుచుకొండంటూ దాదాపు 3 వేల మంది నుంచి డబ్బు వసూలు చేశారు. నెలరోజులు దాటినా తర్వాత ఎవ్వరికీ ఏ ప్రైజ్ రాలేదు. దీంతో కొంత మంది బాధుతులు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నుంచి ఆ గ్యాంగ్ రాజకీయ నాయకుల అండతో బైటపడింది. సీన్ కట్ చేస్తే ఇలాంటి మోసమే తాజాగా నల్లగొండ పట్టణంలో మరొకటి జరిగింది.

వందలాది మంది లబ్ధిదారులు..
నల్లగొండ జిల్లా కేంద్రంలో మైస్మార్ట్ పేరుతో వందలాది మంది లబ్థిదారులను చేర్చుకుంది ఓ సంస్థ. చందాదారుడిగా మారిన ప్రతి ఒక్కరికీ ఏటీఎం కార్డు మాదిరిగా ఏకంగా ఐడీ కార్డులు సైతం ఇచ్చింది. చందాకోసం వెయ్యి రూపాయలు నుంచి 15 వేల వరకు వసూల్ చేసారు. హైదరాబాద్ కు చెందిన చైతన్యరెడ్డి మై స్మార్ట్ అనే సంస్థను నల్లగొండలో ఏర్పాటు చేసి బ్రాంచ్ కు మేనేజర్, టెక్నికల్ పర్సన్ ని తీసుకొన్నాడు. అదేవిధంగా కమీషన్ చూపి పదుల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకున్నాడు. మా స్మార్ట్ తీసుకుంటే మేము ప్రారంభించబోయే మాల్స్, స్టాల్స్, షాప్ లో ఏదీ కొనుగోలు చేసిన 10 శాతం డిస్కాంటు ఖచ్చితంగా ఉంటుందని నమ్మబలికారు. దీంతో చాలా మంది ఈ స్మార్ట్ కార్డును తీసుకున్నారు. ఇలా కేవలం రెండు నెలల కాలంలోనే దాదాపు 20 లక్షలకు పైగా వసూలు చేసాడు. కొత్తగా షోరూంల ఏర్పాటు కాకపోవడం, స్మార్ట్ కార్డుతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బాధితులు...నల్లగొండ బ్రాంచ్ ను సంప్రదించారు. వారు కూడా చేతులెత్తేయడంతో చైతన్యరెడ్డి మోసం బయటపడింది. మై స్మార్ట్ మోసంతో అందులో డబ్బులు డిపాజిట్ చేసిన కస్టమర్లు లబోదిబోమన్నారు. వందలాది మంది బాధితులు ఈ మై స్మార్ట్ సంస్థలో డబ్బులు కట్టి మోసం పోయారు. కొంత మంది బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధాన సూత్రధారి చైతన్యరెడ్డి పరారీలో ఉన్నారు. 

15:39 - May 15, 2016

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై లక్షల మంది రైతులు పొట్ట చేత పట్టుకుని వలసలు పోతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. కరవు యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లపాలెం గ్రామం చేరుకుని రైతులను పరామర్శించారు. ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో కరవు తాండవిస్తోందని రఘువీరా ఆరోపించారు. కూలీ నెంబర్ 1 అంటూ బాబు స్వతహాగా ప్రకటించుకున్నారని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా అని బాబు పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ పని దొరక్క పొట్ట చేత పట్టుకుని జీవనాధారం కోసం సుదూర ప్రాంతాలకు కూలీలు వలసలు వెళుతున్నారని రఘువీరా తెలిపారు. 

15:38 - May 15, 2016

తూర్పుగోదావరి : ప్రత్యేక హోదా ఉద్యమంలోకి టీడీపీ-బీజేపీ మిత్ర పక్షం జనసేన కూడా చేరింది. ప్రత్యేక హోదా అంధ్రుల హక్కు అంటూ నినదించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జలదీక్షకు దిగారు. విభజన బిల్లులోని హామీలను బీజేపీ అమలు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక నిధుల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని..ప్రత్యేక హోదాతోనే భావితరాల భవిష్యత్ ఆధార పడి ఉందన్నారు. 

15:36 - May 15, 2016

హైదరాబాద్ : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తేనే అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు వీహెచ్‌ అన్నారు. దాని కోసం అతి త్వరలోనే తెలంగాణ, ఏపీలో ఉద్యమం ప్రారంభిస్తానన్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గాడ్ ఫాదర్ లేకున్నా అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో మూడు సార్లు రాజ్యసభకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

 

15:09 - May 15, 2016

విజయవాడ : ఈనెల 17వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలువనున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న మంత్రులు..ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కరవు, హోదా, విభజన హామీలకు సంబంధించిన అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఇటీవలే కేంద్రం ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా లేదని..ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని..ఇప్పటికే పలు నిధులు విడుదల చేసామని బీజేపీ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రధానితో జరిగే భేటీలో బాబు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు పొందపర్చాలని బాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
భేటీ అనంతరం మంత్రి యనమల మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు కలుస్తారని పేర్కొన్నారు. కరవు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రధానికి బాబు వివరిస్తారని తెలిపారు. సోమవారం మరోసారి మంత్రులు..అధికారులతో మరోసారి భేటీ అవుతామన్నారు. 

జూన్ 15కు తాత్కాలిక సచివాలయం రెడీ - మంత్రి నారాయణ..

విజయవాడ : జూన్ 15కు తాత్కాలిక సచివాలయం రెడీ అవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అదే నెల 27 నుండి ఏపీ పాలన మొత్తం అక్కడి నుండే ప్రారంభమౌతుందని తెలిపారు. 

ప్రారంభమైన ఎంసెట్ మెడిసిన్..అగ్రికల్చర్ పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 02.30 గంటల నుండి సాయంత్రం 5.30గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సెట్ ఎస్ కోడ్ ను ఎంపిక చేశారు. 

17న బాబు..మోడీ భేటీ - యనమల..

విజయవాడ : ఈనెల 17వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు కలుస్తారని మంత్రి యనమల పేర్కొన్నారు. కరవు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రధానికి బాబు వివరిస్తారని తెలిపారు. సోమవారం మరోసారి మంత్రులు..అధికారులతో మరోసారి భేటీ అవుతామన్నారు.

 

ఇరాక్ లో ఆత్మాహుతి దాడి..11 మంది మృతి..

ఇరాక్ : రాజధాని బాగ్దాద్ శివారు ప్రాంతం బాంబు పేళుల్లు, కాల్పుల మోతతో దద్దరిల్లింది. తెల్లవారుజామును తాంజీలోని ప్రభుత్వ ఆధీనంలో నడుస్తోన్న ఓ సహజవాయువు నిలువ కేంద్రంపై ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది సైనికులు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం.

14:28 - May 15, 2016

పాటను తూటాలా ప్రజలగుండెల్లో పేల్చిన గేయ రచయితలెందరో ఉన్నారు. సమాజంలోని అనేక అంశాలపై వీరు పాటలు రాశారు. ప్రజా చైతన్యమే వీరి లక్ష్యం. అలాంటి వారిలో ఆర్.ఎ.వాసు ఒకరు. 

రైతుల కష్టాలను, వలసలను, చేనేత పరిశ్రమ దుస్థితిని, పేదపిల్లలు చదువుకునే హాస్టళ్ళ పరిస్థితిని, నిరుపేదలు జానెడు స్థలానికి కూడా నోచుకోని కడు దయనీయ పరిస్థితులను ఈ గేయ కవి తన పాటల్లో హృదయ విదారకంగా వర్ణించాడు. సమస్యలకు పరిష్కారం తిరగబడటమే అంటాడు.. 

ప్రపంచీకరణ సృష్టించిన విధ్వంసాలవల్ల మెట్ట మెదట బలిపశువులైంది  భారతదేశంలోని రైతులు, కులవృత్తులవాళ్లే... అందుకే ఈ కవి రైతుల దైన్యస్థితిని , దుస్థితిని, విషాద పరిస్థితిని  వర్ణిస్తూ... ఊరునిడువ మన్నది కరువు... ఉరితాడై ఉన్నది పరువు.. వ్యవసాయమన్నది రైతుల పాలిట వనవాసమయ్యిందంటూ గేయమై విలపించాడు.

ఒప్పుడు కులవృత్తులతో  హాయిగా బతికే బడుగువర్గాల  ప్రజలు పాలకుల తప్పుడు విధానాల వల్ల నేడు కులవృత్తులను  కోల్పోయారు. దుర్భరంగా బతుకులు వెల్లదీస్తున్నారు . గ్లోబలైజేషన్ కువృత్తుల వారి కడుపులు కొట్టింది. జీవన దృశ్యాలను  చెరిపేసింది . పాలకుల కంటితుడుపు  సంక్షేమ పథకాలు  పేదల కంటనీరు తుడవలేక పోతున్నాయి.. ఈ నేపథ్యంలో కులవృత్తిని నమ్ముకున్న చాకలి వారికి రేవు ..ఒ కప్పుడు జీవనాధారంగా ఉండేది. ఆ రేవు గురించి రేవూ.. నిన్నిడువా జాలనే.. నా సాకీరేవు.. అంటూ ఒక అద్భుత గీతం రాశాడీ గేయ రచయిత.

పక్షులకు గూడు ఉంది.. పశువులకు కొట్టం ఉంది. నిరుపేదలు తల దాచుకోడానికి ఒక గుడిసె ఉండదు. పాలకుల స్వార్థం వల్ల ఈ దేశంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతున్నారు . ఆకాశ హర్మ్యాలలో నివసిస్తున్నారు . పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారిపోతున్నారు .. చివరకు గుడిసె వేసుకోడానికి  కాసింత జాగాను  కూడా పొందలేక పోతున్నారు .ఇదే విషయాన్ని ఈ గేయ కవి ఆర్ద్రస్వరంతో వినిపిస్తాడు....

తరతరాలుగా నేతపని వాళ్లు మగ్గాలను నమ్ముకునే బతుకుతున్నారు . ఇవాళ హ్యాండ్లూమ్ ల స్థానంలో పవర్ లూమ్స్ వచ్చాయి. చేనేత కార్మికుల పొట్టలు కొట్టాయి. ఒకప్పుడు అగ్గి పెట్టెలో దాచిన చీరలల్లిన చేనేత కార్మికులు... అదే చీరలతో ఉరేసుకుని చస్తున్నారు. మరికొందరు  ఆ కులవృత్తిని వదులుకోలేక వేరే ఆధారం లేక జీవశ్చవాలుగా బతులకు వెళ్లదీస్తున్నారు . అందుకే ఈ కవి  ` మగ్గమా నీ వొడిని వొదిగి ఎదిగానమ్మా.. నిన్నిడిసి నేనెట్ల బతుకీడ్వగలను` అంటూ తానే ఒక నేత కార్మికుడై నేతల గోడును  విషాదస్వరంతో  వినిపిస్తున్నాడు..

చాలామంది బాగుపడే యోగం లేదు..  బాధ పడీ ఫలితంలేదని నిరాశకు గురవుతుంటారు. కాని అట్టడుగు వర్గాలనుండి వచ్చిన కవులు పోరాటమే అన్నింటికీ సమాధానమంటారు. ఈ వ్యవస్థలో దగా పడిన ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయాలి. హక్కులకై  ఉక్కుపిడికిళ్లు బిగించాలి. ఉప్పెనలా ఉద్యమించాలి. ఆధిపత్య సంస్కృతి కోటలు కూలగొట్టాలి. ఇదే విషయాన్ని చెబుతూ ఈ కవి పిడికెలెత్తి నిలబడతా హక్కులకై ఉద్యమిస్తానంటూ ఓ పోరాటగేయమై రగిలిపోతాడు. 

ఇలా సమాజంలోని శ్రమజీవుల పక్షంవహిస్తూ అనేక పాటలు రాసిన ఆర్.ఎ .వాసు రాయలసీమలో కరువుకు నిలయమైన కర్నూల్ జిల్లాలో జన్మించాడు. వామపక్ష భావాలతో ఎదిగాడు. పేదలకోసం కలం పట్టి తన సృజనాత్మకతతో  అనేక గేయాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం  చేస్తున్నారు . భవిష్యత్తులో ఈ గేయకవి కలం నుండి మరెన్నో గేయాలు జాలువారాలని ఆశిద్దాం.

ఢిల్లీలో అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం.

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లోని ముఖర్జీ నగర్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో ఉదయం కార్చిచ్చు చెలరేగింది. అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.

14:23 - May 15, 2016

షాజహానా

        ఈ భూమి మీద నీ పాదమెంతో 
        నా పాదమూ అంతే
        అయినా కాలు బయట పెట్టడానికి 
        నాకు అవకాశమే లేదు
        అలసిన నామనసు  ఆనుకోడానికి
        ఇక్కడ స్థలం లేదు
        మరోగ్రహం ఏదైనా ఉందేమో వెతుక్కోవాలి
అంటూ పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛలేదని.. మనిషిగా జీవించే హక్కు కూడా లేదని వాపోతూ అద్భుత కవిత్వమై ఎగసిపడిన కవయిత్రి షాజహానా.
షాజహానాది ఓ ప్రత్యేకమైన గొంతు.
ముస్లిం అస్థిత్వవాద కవిత్వంలో, కథాసాహిత్యంలో షాజహానాది ఓ ప్రత్యేకమైన గొంతు. సున్నిత సుకుమార భావాలతో పాటు మతం, రాజకీయాలను ఎండగట్టడంలోనూ, తీవ్రవివక్ష, దోపిడీ, అణచివేతలకు గురవుతున్న స్త్రీల తరపున వకాల్తా పుచ్చుకొని కవితలు కథలు రాయడంలోనూ షాజహానా సృజన వేయి పూలుగా  విచ్చుకుంది.

పూలు విసిరినా-కత్తులు విసిరినా 
అక్షరం మొక్కువోదు
హృదయాల తర్జుమా ఆగిపోదు
ఉరుములు మెరుపులు ఏమైనా సరే
మొగ్గలు వికసిస్తాయి
అక్షరాలు తలెత్తుకునే ఉంటాయి..
అంటూ బంగ్లాదేశ్ రచయిత్రీ తస్లీమాకు అంకితమిస్తూ రాసిన ఈ కవితలో అక్షరానికి ముసుగులు తొడగలేను అంటూ నిజాలను నిర్భయంగా కవిత్వీకరించిన కవయిత్రి షాజహానా.

2012 లో దర్దీ కవితా సంకలనం   

షాజహానా రాసిన దర్దీ కవితా సంకలనం 2012 లో వెలువడింది. ఇందులో . ...చమ్కీ, బ్లాక్ హోల్స్, సిద్ధార్థి, అబ్ నార్మల్ పెయిన్, ఆయేషా కోసం, జఖ్ మీ, ఈద్ ముబారక్, పాటగాడు, అన్వేషణ, మృత్యువుకో ప్రేమలేఖ,  దేశాంతరదు:ఖం, మాదిగ బుచ్చమ్మ, ఖఠ్ఠామిఠ్ఠా దోస్తానా, నువ్విప్పుడు నాభూమివి మెుదలైన కవితలు కనిపిస్తాయి. షాజహానా కవితలు భావస్ఫోరకంగా శిల్పశోభితంగా, అభివ్యక్తి నవ్యతతో, సరికొత్త మెటాపర్లతో అలరిస్తాయి. వాటిలో భావాలు ఎంత సున్నితంగా ఉంటాయో.. భాష అంత సరళంగా ఉంటుంది. అభివ్యక్తి ఎంత తీవ్ర భావోద్వేగంతో ఉంటుందో .. ఆవేశం అంత కవితాత్మకంగా పరిమళిస్తుంది..
నువ్వే మంచివాడివి, దేవుడివి
ఉత్తమ పురుషుడివి, పాలకుడివి, అధికారివి
చాలా ఎక్కువగా భర్తవి, తండ్రివి, ప్రేమికుడివి
నేను నీవు చెప్పినట్లు వినే రోబోట్ ని అంతే..
అంటూ సమాజంలోఎన్నిరూపాల్లో పురుషాధిక్యత ఉంటుందో, స్త్రీలు ఎలా రోబోట్ లుగా మర యంత్రాలుగా మిగిలి పోయారో, అనేక కవితల్లో ప్రతీకాత్మకంగా ధ్వనింపజేశారు.

నవ్వుకోవడం, నృత్యించడం, దు:ఖించడం ఏమిచేస్తున్నా నా అవయవాలు మాత్రమే ప్రపంచానికి కనిపిస్తున్నాయి. నేను కనిపించడం లేదు అంటూ, స్త్రీల  అస్తిత్వం గురించి ప్రశ్నిస్తూ కవితా పాదాలుగా విరుచుకు పడతారు... అలాగే హాస్టళ్లలోనో, కాలేజీల్లోనో, పుస్తకాల నీడన సేదదీరే ఆదమరచిన అమాయక ప్రాణాల ఆయేషాల హత్యలకు న్యాయం ఏనాటికీ అందదని ఆవేశపు కవిత్వమై రగిలిపోతారు. అంతేకాదు, 
ప్రేమ ఎప్పుడూ
రెండు హృదయాలలోంచి రావాలనుకునే పసికూన
యాసిడ్లు, కత్తులు, కిడ్నాపులై అహంకారం
జీవితాల్నే మింగేస్తుంటే
బతుకుల్ని మృత్యువుకేసి రకేస్తున్న నీ కర్కశం ముందు
ఇంకే పశుజాతైనా నయమేననిపిస్తుంది..
అంటూ, ప్రేమ పేరుతో యువతులను వంచించి, మోసగించి వారి  జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్న మగాళ్ళకు కనువిప్పు కలిగించేలా కవిత్వం రాశారు.

అంతులేని వస్తు వైవిధ్యంతో కవిత్వం రాసిన షాజహానా, కేవలం కవిత్వమే గాక అద్భుతమైన కథలు కూడా రాసింది. వాటిని లద్దాఫ్ని ముస్లిం స్త్రీ కథలు` పేరుతో ఈ మధ్యే ఆవిష్కరించారు. ఈ కథలన్నీ జీవనోత్సాహాన్ని నింపే కథలని ఓల్గా...,  కవిత్వం వొంపిన తాత్విక వ్యక్తీకరణలని జూపాక సుభద్ర.. కొత్త కథకు పట్టుగొమ్మ అంటూ అంబటి సురేంద్రరాజులు షాజహానా కథలకు కితాబిచ్చారు. 

బిల్లి, కంచెకాకర, మనిషి పగిలిన రాత్రి, దీవారే, సిల్ సిలా మెుదలైన కథల్లోముస్లిం స్త్రీల మానసిక లోకాలు.. మానవత్వపు పార్వ్వాలు, కన్నీటి తడులు, జీవన సంఘర్షణలు, దయనీయ బతుకుచిత్రాలు, అక్షర దృశ్యాలుగా ఆవిష్కరించబడ్డాయి. ఈ కథల్లో పాత్రలు వాతావరణ కల్పన సహజాతి సజహజంగా ఉంటూ మన కళ్లముందు దృశ్యాలు దృశ్యాలుగా కదిలిపోతుంటాయి. మనసులను కదిలిస్తాయి. ఒక్కోచోట కన్నీటి పొరలుగా మిగిలిపోతాయి. కథలు చదివాక మనసంతా ఆర్ద్రతతో నిండిపోతుంది. ఆలోచనలన్నీ వేడి నిట్టూర్పుల సెగలుగా ఎగసిపడతాయి. 

ఇక షాజహానా జీవిత విశేషాల్లో కెళితే ఈమె ఖమ్మం జిల్లా కమలాపురం లో దిలావర్, యాకుబ్బీ దంపతులకు జన్మించారు. నాన్న దిలావర్ నుంచి సాహిత్యాన్ని వారసత్వంగా పొందారు. కవి, ఉద్యమకారుడు స్కైబాబాను సహచరునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ కోఠీ ఉమెన్స్ కళాశాలలో ఎం.ఎ వరకు చదువుకున్నారు. ముస్లిం వాద  కవిత్వం-వస్తు రూప వైవిధ్యం పై ఎం.ఫీల్ చేశారు. తెలుగులో ముస్లింవాద సాహిత్యంపై పిహెచ్ డి చేశారు. అస్మిత, షాహీన్, అన్వేషి లాంటి స్వచ్ఛంద సేవాసంస్థల్లో పనిచేసారు. స్వయంశక్తి సంఘాల ద్వారా మహిళాసాధికారతను పెంచాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెలుగు ప్రాజెక్టులోనూ పనిచేశారు.

2005లో షాజహానా నఖాబ్ ముస్లిం స్త్రీ కవిత్వం, స్కైబాబాతో కలసి చాంద్ తారా మినీ కవిత్వం వెలువరించటంతో పాటు, అలావా పేరుతో వచ్చిన  ముస్లిం సంస్కృతి కవిత్వానికి సంపాదకురాలిగా వ్యవహరించారు. షాజహానా కథలు, కవితలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. భారత ప్రభుత్వం తరపున గౌరవ అతిథిగా జర్మనీ, రష్యాలాంటి దేశాలు పర్యటించి కవితా పఠనం చేశారు. 

షాజహానా సాహితీ కృషికి ఎన్నో అవార్డులు లభించాయి. రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, రంగినేని యల్లమ్మ అవార్డు, రంజని అవార్డు, గుర్రం జాషువా పురస్కారం, రొట్టమాకురేవు కవితా పురస్కారం .. ఇలా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. భవిష్యత్తులో ఈమె కలం నుండి మరెన్నో కథా కవితా సంపుటాలు వెలువడాలని ఆశిద్దాం... 

14:12 - May 15, 2016

గుంటూరు : లక్ష్మీనగర్ లో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్క్ సూపర్ వైజర్ సాంబశివరావు, మేస్త్రీ యుగంధర్, కాంట్రాక్టర్ వినోద్ కుమార్  లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పట్టాభిపురం పోలీసు స్టేషన్ కు తరలించారు. లక్ష్మీపురంలోని హరిహర మహల్  సెంటర్‌లో కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సెల్లార్ తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో  ఏడుగురు కార్మికులు  ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న మరికొంత మంది కార్మికులను రక్షించేందుకు రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

14:04 - May 15, 2016

వాషింగ్టన్ : అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా, మరో 44 మంది గాయాలపాలయ్యారు. దక్షిణ టెక్సాస్ లోని రియో గ్రాండ్ వ్యాలీ నుంచి ఈగల్ పాస్ టౌన్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈగల్ పాస్ టౌన్ లో 50 మందికి పైగా ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. ఓ జంక్షన్ వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఏడు మంది అక్కడికక్కడే మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయాడు.

14:02 - May 15, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విద్యార్థినులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. జాదవ్ పూర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులను ఉద్దేశించి... వాళ్లంతా తక్కువ స్థాయివారని, సిగ్గులేనివారంటూ వ్యాఖ్యానించారు. ఎప్పుడు వాళ్లు అబ్బాయిల తోడు కావాలని వెతుక్కుంటారంటూ చెప్పారు. ఈ వర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏబీవీపీ వారు తమను లైంగిక వేధింపులకు గురి చేశారని వామపక్ష విద్యార్థి సంఘం విద్యార్థినులు ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో కూరుకుపోయారు.

 

మట్టిపెళ్లలు కూలిన ఘటనలో ప్రభుత్వం చర్యలు..

గుంటూరు : మట్టిపెళ్లలు కూలిన ఘటనలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ సువర్ణకుమార్ సస్పెన్షన్ చేశారు. డీసీపీ సత్యనారాయణ, సీపీ ధనుంజయలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. బిల్డర్ రమేష్, టెక్నికల్ పర్సన్ హరిబాబు లైసెన్స్ లు రద్దు చేశారు. ఇంజినీర్ వీఏ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

13:56 - May 15, 2016

విజయవాడ : మట్టిపెళ్లలు కూలిన ఘటనలో కాంట్రాక్టర్, బిల్డర్ లపై చర్యలు తీసుకుంటామని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప ప్రకటించారు. ఆదివారం రాత్రి లక్ష్మీనగర్ లోని హరిహర మహల్ సెంటర్ లో కాంప్లెక్సు నిర్మాణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. దీనితో విదేశాల నుండి తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడిని హోం మంత్రి చిన రాజప్ప కలిశారు. ప్రమాద విషయాలను వెల్లడించారు. భేటీ అనంతరం మంత్రి చిన రాజప్ప మీడియాతో మాట్లాడారు. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు... ప్రభుత్వం నుంచి 5 లక్షలు, బిల్డర్ నుంచి 15 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందిస్తామని తెలిపారు.

 

13:51 - May 15, 2016

గుంటూరు : మట్టిపెళ్లలు కూలిన ఘటనలో మృతి చెందిన బాధితులకు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పరామర్శించారు. మృతుల కుటుంబాలు చేస్తున్న ఆందోళనకు బొత్స మద్దతు తెలిపారు. ధర్నా శిబిరం వద్దకు చేరుకొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. వెంటనే భవన నిర్మాణ కాంట్రాక్టర్ రమేష్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోని ఆరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ తరపున 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా మృతుల కుటంబాలకు అందిస్తామని బొత్స తెలిపారు. 

 

13:46 - May 15, 2016

కర్నూలు : నగరంలోని లక్ష్మీనగర్ లో లోన్లు ఇప్పిస్తానని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. కార్పొరేషన్ లోన్ల పేరుతో శ్రీకాంత్ అనే వ్యక్తి  మహిళల నుంచి డబ్బులు దండుకున్నాడు. కానీ లోన్లు మాత్రం ఇప్పించలేదు. ముఖం చాటేశాడు. తాజాగా లోన్లు ఇప్పిస్తానని మరో మహిళ వద్ద డబ్బులు వసూలు చేశాడు. అయితే గతంలో డబ్బులు ఇచ్చిన మహిళలు లోన్లు ఎప్పుడు ఇస్తావని నిలదీశారు. శ్రీకాంత్ కు దేహశుద్ధి చేసి.. పోలీసులుకు అప్పగించారు. 

 

కర్నూలులో ఘరానా మోసం

కర్నూలు : నగరంలోని లక్ష్మీనగర్ లో లోన్లు ఇప్పిస్తానని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. కార్పొరేషన్ లోన్ల పేరుతో శ్రీకాంత్ అనే వ్యక్తి మహిళల నుంచి డబ్బులు దండుకున్నాడు. కానీ లోన్లు మాత్రం ఇప్పించలేదు. ముఖం చాటేశారు. తాజాగా లోన్లు ఇప్పిస్తానని మరో మహిళ వద్ద డబ్బులు వసూలు చేశారు. అయితే గతంతో డబ్బులు మహిళలు లోన్లు ఎప్పుడు ఇస్తావని నిలదీశారు. శ్రీకాంత్ కు దేహశుద్ధి చేసి.. పోలీసులుకు అప్పగించారు. 

డిశ్చార్జి అయిన కేంద్ర మంత్రి సుష్మా..

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి నేటి ఉదయం డిశ్చార్జీ అయ్యారు. ఛాతీలో నొప్పి, జ్వరం కారణంగా గత నెల 25న సుష్మా ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సుష్మాను ఆసుపత్రిలోని కార్డియో న్యూరో సెంటర్ లో ఉంచిన వైద్యులు చికిత్స అందించారు.

 

రుతుపవనాలు వారం ఆలస్యం..

హైదరాబాద్ : రుతుపవనాలు రావడానికి మరో వారం రోజులు పడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు జూన్ 7న తాకుతాయని తొలుత వాతావరణశాఖ భావించింది. అయితే మరో వారం రోజులు ఆలస్యం అవుతాయని అధికారులు చెప్పారు.

బైంసా ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి..

ఆదిలాబాద్ : జిల్లా భైంసా మండలం దేగాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరియైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

 

 

ముగిసిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష..

హైదరాబాద్ : ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష 1గంట వరకు కొనసాగింది. ఈ పరీక్ష కోసం 'క్యూ' సెట్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. పరీక్ష నిర్వహణ కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు.

13:30 - May 15, 2016

నరేంద్రమోడీ డిగ్రీపై రచ్చ రచ్చ, రాజస్థాన్ లో 8 వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి జవహర్ లాల్ నెహ్రూ పాఠం తొలగింపు, తమిళనాడులో రాజకీయ నాయకులు.. విచిత్రమైన హామీలు, గుడిపై ఐఎస్ ఐ కన్ను, రామ్ దేవ్ బాబా ఫేషెల్.. ఈ అంశాలపై క్రేజీన్యూస్ ను వీడియోలో చూద్దాం...

 

13:29 - May 15, 2016

వాషింగ్టన్ : శాస్త్ర సాంకేతిక రోజు రోజుకు విస్తరిస్తోంది. శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు ఓ కంప్యూటర్ ను సృష్టించారు. ఐబీఎం కొత్త పరిజ్ఞానాన్ని రూపొందించింది. న్యాయ సమస్యలకు 'రాస్' ను సృష్టించారు. కేసు గురించి చెప్పగానే దీని వాదించేందుకు కావాల్సిన సూచనలు..సలహాలను నిమిషాల వ్యవధిలో అందించనున్నాయి. వాట్సన్ కాగ్నిటివ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో 'రాస్' (కృత్రిమ మేధో న్యాయవాది)ని రూపొందించారు. ఇది ఎలా పనిచేస్తుందని కొందరు న్యాయవాదులు పరిశీలించారు. వివిధ కేసులను ప్రస్తావించి..పరిష్కారం చూపెట్టాలని కోరారు. కొన్ని నిమిషాల వ్యవధిలో వీరి దగ్గరున్న సమాచారంతో పాటు అదనపు సమాచారాన్ని..చట్టంలో సవరణలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

2011లో...
2011లో రాస్ ను రూపొందించినా తరువాతి పదినెలల పాటు దీనికి దివాళా చట్టం (బ్యాంక్ రప్ట్సీ) ను నేర్పించారు. 2014లో పరీక్షించినప్పుడు దీని పనితనం చూసిన న్యూయార్క్ లా ఫర్మ్ 'బేకర్ అండ్ హాస్టెట్లర్' రాస్ కు ఉద్యోగమిచ్చింది. తమ కయింట్లకు మరింత విస్తృతమైన సేవలందిస్తామని ఆ సంస్థ పేర్కొంది. రాస్..ఏదైనా కేసును దీనికి అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్పినా అర్థం చేసుకుంటుంది. తనకున్న పూర్తి సమాచారంతో కేసును విశ్లేషించుకుని పూర్తి వివరణాత్మకంగా పరిష్కారం సూచిస్తుంది. గతంలో జరిగిన ఇలాంటి కేసులేంటీ ? దీనిపై ఎక్కడెక్కడ వాదనలు జరిగాయి ? ఎలాంటి ఆధారాలు రూపొందించారు ? ఏ విధమైన తీర్పులు వెలువడ్డాయి ? అర్థమయ్యేలా చెబుతుంది. సదరు కేసు నడుస్తున్నంత సేపు న్యాయవాద మిత్రుడితో మాట్లాడినట్లుగానే ఉంటుందని దీనిని రూపొందించిన ఐబీఎం సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దివాళా కేసులకు మాత్రమే 'రాస్' సలహాలిస్తుంది.

టి.వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ప్రారంభమైంది. టీ-వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు భేటీయ్యారు. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశంలో నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

తెలంగాణలో ముగిసిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. 

13:03 - May 15, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబుతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవం చిత్రం విశేషాలను ఆయన వివరించారు. తన అనుభవాలను తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.. 
'శ్రీమంతుడు సినిమా చేసేటప్పుడే బ్రహ్మోత్సవం కథ విన్నాను. కథలోని ఎలిమెంట్ల గురించి ఆలోచన చేయను. కథ విన్నప్పుడే కనెక్టు అవుతాను.  కంటెంట్ ను ప్రేక్షకులకు అందించాలి. మంచికథ ఉన్నప్పుడు ఆడియన్స్ ఆదరిస్తారు. శ్రీకాంత్ అడ్డాల మంచి డైరెక్టర్. శ్రీకాంత్ సినిమాలు విలువులతో కూడుకుని ఉంటుంది. శ్రీకాంత్ కు కథమీదే ధ్యాస ఉంటుంది. ఓన్ లైఫ్, తెలిసిన వారి అనుభాలను శ్రీకాంత్ కథ రాసి, సినిమాగా తీస్తారు. ఆయన  సినిమాలన ప్రత్యేకంగా డిజైన్ చేయక్కర్లేదు. బ్రహ్మోత్సవం స్టోరీ చెప్పినప్పుడు నా కళ్లెంట నీళ్లు తిరిగాయి. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్ల ఎలా ఉంటాయో...ట్రెయిలర్ లోనే సగం చెప్పాం. నాకు ఇద్దరు హీరోయిన్లు కాజల్, సమంతలతో కంఫర్టుగానే ఉన్నది. కాజల్, సమంతలతో ఇంతకముండే సినిమాలు చేశాను. కాబట్టి..బ్రహ్మోత్సవంలో వారితో నటించేందుకు ఈజీ అయింది. అయితే వేరే హీరోయిన్స్ అయితే కాస్తా ఇబ్బందిపడేవాన్ని. మిక్కిజే మేయర్ మంచి సంగీతం అందించారు. బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్ అంటే నాకు ఇష్టమని' వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:02 - May 15, 2016

ఏంటీ రైలు మేఘాల నుండి వెళుతుందా ? అక్కడ ఎలా వెళుతుంది ? పట్టాలు ఎక్కడుంటాయి ? ఎలా నిర్మిస్తారు ? అనేగా మీ డౌట్స్..కానీ ఇది నిజం. ఈ రైలు మేఘాల నుండి వెళుతుంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి. దీని కోసం అర్జెంటినా వెళ్లాల్సి ఉంటుంది. సల్జా నగరం నుండి లా పోల్వోరిల్లా అనే ప్రదేశానికి రైలు మేఘాల గుండా వెళుతుంది. సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ రైలు 'ట్రైన్ టు ది క్లౌడ్స్' అని పిలుస్తుంటారు. వంతెనలు..గుహాల గుండా దాదాపు 217 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. స్వచ్ఛమైన గాలి..కాలుష్యం లేని వాతావరణం ఉంటుంది గనుక పర్యాటకులు ఎంచక్కా ఫొటోలు కూడా దిగి అదే రైలులో ప్రయాణం చేస్తుంటారు.

జర్నలిస్టు హత్యపై బీజేపీ నేతల నిరసన...

బీహార్: జర్నలిస్టు రాజ్ దేవ్ రంజన్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సివాన్ పట్టణంలో బీజేపీ నేతలు నిరసన దీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సివాన్ పట్టణంలో జర్నలిస్టు రాజ్‌దేవ్ రంజన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

ప్రత్యేక హోదా ఇవాల్సిందే - మంత్రి చిన రాజప్ప...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... కేంద్రం హోదా ఇవ్వలేమనడం సరికాదన్నారు.

సీఎం బాబును కలిసిన మంత్రి కామినేని...

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం కలిసారు. ఈ సందర్బంగా రేపు ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భేటీ, అలాగే నీట్‌పై చర్చ జరిగింది.

వైసీపీకి కొత్తపల్లి సుబ్బారాయుడు గుడ్ బై ?

విజయవాడ : వైసీపీ మరో గట్టి షాక్ తగలబోతుందా ? ఆ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ వేత్త, పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపిలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఈనెల 19వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టిడిపి కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

 

బైంసా బాధితులను ఆదుకుంటాం - హరీష్..

ఆదిలాబాద్ : జిల్లా బైంసా మండలం దేగాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రమాదంలో గాయపడి బైంసా ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు పరామర్శించారు.

వరంగల్ లో ఎక్సైజ్ పోలీసుల దాడులు...

వరంగల్ : జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఆదివారం ఉదయం ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఖానాపూర్ మండలం నాజీతాండాలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 10 క్వింటాళ్ల బెల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

 

ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడ : వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.  ఎపికి ప్రత్యేకహోదాపై ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్న నేపథ్యంలో కేంద్రం చేసిన సాయం, బీజేపీ నాయకత్వ ప్రకటనలపై చర్చించనున్నారు.

12:44 - May 15, 2016

విజయవాడ : వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఎపికి ప్రత్యేకహోదాపై ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్న నేపథ్యంలో కేంద్రం చేసిన సాయం, బీజేపీ నాయకత్వ ప్రకటనలపై చర్చించనున్నారు. అయితే రాజ్యసభలో ఇటీవలే ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వలేమని బిజెపి ఎంపీలు ప్రకటించిన విషయం విధితమే. 

 

12:41 - May 15, 2016

హంగేరి : ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న 'కృతి సనన్' గాయపడింది. ఈ ఘటన హంగేరి బుడాపెస్ట్ లో చోటు చేసుకుంది. సుషాంత్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న 'రాబ్తా' చిత్రంలో 'కృతి సనన్' జంటగా నటిస్తోంది. ఈచిత్ర షూటింగ్ బుడా పెస్ట్ లో జరుగుతోంది. ఓ భవనంపైకి ఎక్కి పరుగెత్తే సన్నివేశంలో కృతి చేయాల్సి ఉంది. చిత్రీకరణ సమయంలో కృతి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. కాలికి స్వల్పగాయాలయ్యాయని..రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చికిత్స అందించిన వైద్యులు సూచించారు. ఈ చిత్రానికి దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్నారు.

12:37 - May 15, 2016

కళ్ల అందాన్ని వర్ణించని కవులు ఉంటారా... మగువ కళ్లకు అంతటి ప్రాధాన్యత ఉంది మరి. ఆ కళ్లకి కాటుక పెట్టుకుంటే... ఆ అందమే వేరు... అందుకే మహిళలు కాటుక పెట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే మీ అందమైన కళ్లకు కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని మెళకువలు పాటించాలి. అవేంటో చూద్దాం!
జిడ్డు చర్మం ఉన్నవారు ఐస్‌ ముక్కలతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడం తగ్గుతుంది. తద్వారా కాటుక చెరిగిపోకుండా ఉంటుంది.
ఫేస్‌ పౌడర్‌ వాడటం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా ఉంటుంది. కళ్ల చుట్టూ కొద్దిగా ఫేస్‌ పౌడర్‌ రాసుకోవాలి. అక్కడి చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్‌ పీల్చుకోవడం వల్ల కళ్లు కాంతిలీనుతాయి.
కాటుక పెట్టుకోవడానికి ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి. తర్వాతే కాటుక పెట్టుకోవాలి. చాలా మంది కనురెప్పల చివర భాగంలో కాటుక పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల చెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కనురెప్పల మధ్యభాగంలో మాత్రమే కాటుక పెట్టుకోవాలి.
నేత్రాలకు కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్‌ కలర్‌ ఐషాడోని బేస్‌గా వేసుకోవాలి. ఆ తర్వాత కళ్లకి కాటుక పెట్టుకోవాలి. మందంగా, చక్కగాపడే సన్నని కాటుక పెన్సిల్‌ని ఎంచుకోవడం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా చూసుకోవచ్చు.

12:35 - May 15, 2016

తనకో పండంటి పాప కావాలని తహతహలాడుతుంది. గర్భం దాల్చిన తరుణంలో కడుపులో పాప కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అవేమిటో ఆ సూచనలు పరిశీలిద్దాం.

  • గర్భం ధరించిన స్త్రీలు బరువైన వస్తువులు మోయకూడదు. ఎప్పుడూ తగిన విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
  • పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్ఠికాహారమైన పాలు, పండ్లు, మాంసం, గుడ్లు తీసుకోవాలి.
  • ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ వారు చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.
  • నెలలు నిండిన స్త్రీలు ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే కుదుపులు లేకుండా చూసుకోవాలి.
  • గర్భిణీ స్త్రీలు ఒత్తిడి, భయానికి లోను కాకూడదు. అది వారి కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతుంది.
  • నెలలు నిండిన స్త్రీలు హైహీల్స్‌ చెప్పులు వాడకపోవడం మంచిది. ఇలా వాడటం వల్ల అదుపుతప్పి పడి పోయినపుడు కడుపులోని బిడ్డకు ప్రమాదం.
  • సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
  • నెలలు నిండాక శృంగారానికి దూరంగా ఉండటం మంచిది.
  • నిద్రపోయేటపుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం శ్రేయస్కరం.
  • అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి చనుబాలే ముఖ్యం. చనుబాలు వల్ల బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
12:34 - May 15, 2016

ఈ మధ్యకాలంలో యుక్త వయసుల్లో ముఖంపై ముడతలు రావడం, వృద్ధాప్య ఛాయలు, చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం.. లాంటి సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొంది, మెరుగైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే.. సహజ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. ప్రకృతి సహజంగా లభించే కొన్ని ఫ్రూట్స్‌, ఇతర పదార్థాల ద్వారా రెమెడీలు చేసుకుని ముఖానికి పట్టిస్తే.. వృద్ధాప్య ఛాయలు పూర్తిగా తొలగిపోయి ముఖవర్ఛస్సు మరింత పెరుగుతుంది.
రోజూ ఓ గ్లాసు క్యారెట్‌, టమోటా జ్యూస్‌ తీసుకోవాల్సిందిగా బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే క్యారెట్‌ జ్యూస్‌లో విటమిన్‌ 'ఎ', ఫైబర్‌ పుష్కలంగా వుంటాయి. వీటిల్లో 'ఫైబర్‌' బౌల్‌ మూమెంట్‌ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. యంగ్‌గా ఉంచుతుంది. ఇక టమోటా జ్యూస్‌ కూడా చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్‌ను వేరు చేసే మూలకం 'పొటాషియం' అధికంగా ఉంటుంది. దీంతోపాటు ఈ జ్యూస్‌లో లైకోపిన్‌ అనే 'లక్షణాలు' కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సేరియస్‌ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్‌ 'సి' అధికంగా ఉండటం వల్ల చర్మానికి కాంతినిస్తుంది.
రెండు క్యారెట్లను ఉడికించి గుజ్జుచేసి అందులో తేనె కలుపుకోండి. దీన్ని ముఖానికి దట్టించండి. ముఖం కింది నుంచి పైకి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక చల్లటి నీటితో కడిగేసినట్టయితే.. ముఖం కాంతివంతంగా మారుతుంది.
రెండు క్యారెట్లు తీసుకొని మెత్తగా పేస్టులా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ఓ చిన్న గిన్నెలో వేసుకోండి. ఇందులో అయిదారు చెంచాల చిక్కటి పచ్చిపాలు కలుపుకోండి. దీనికి ముందు మీ ముఖాన్ని క్లెన్సింగ్‌ మిల్క్‌తో శుభ్రం చేసుకోండి. ఆపై ఆల్మండ్‌ క్రీముతో మర్దన చేయాలి. ఇలా మర్దన చేసేటపుడు సిద్ధంగా ఉన్న క్యారట్‌ ముద్ద, పాలు ఉపయోగించాలి. ముఖానికి ఆ పేస్ట్‌ వాడిన 15 నిమిషాల తర్యాత ముఖం శుభ్రం చేసి ఆవిరిపట్టండి. బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ తీసెయ్యాలి.
ఒక పాత్రలో కొంచెం క్యారెట్‌ గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ లాగా వేసుకోవాలి. పావుగంట అయిన తరువాత ప్యాక్‌ తీసేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా చర్మం నునుపుగా కాంతివంతంగా కనిపిస్తుంది.

12:28 - May 15, 2016

గుంటూరు : గుంటూరు లక్ష్మీనగర్‌లో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలు ప్రభుత్వాస్పత్రి వద్ద చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ... సీపీఎం, పలు ప్రజాసంఘాల నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, బిల్డర్ చెల్లించాల్సిన పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పరిహారం చెల్లించాకే మృతదేహాలు తీసుకెళ్తామని బాధితులు స్పష్టం చేశారు. బిల్డర్‌ ఎలాంటి ప్రమాణాలూ పాటించకపోవడం మూలంగానే ఈ ఘోరం జరిగిందని తక్షణమే అతణ్ని అరెస్ట్ చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వారిలో శేషుబాబు, సునీల్ డిగ్రీ విద్యార్థులు కాగా... ప్రశాంత్ ఇంటర్ చదువుతున్నాడు. 

మృతుల కుటుంబాలు..

మేం ఏం నేరం చేశాము.. మా పిల్లలను పోలీసులు ఎందుకు కొట్టారో చెప్పాలి.. మా పిల్లల శవాలను మేం చూడకూడదా...? కాంట్రాక్టర్ చుక్క రమేష్ ను అరెస్టు చేయాలి. ఈ ఘటన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవరముంది. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి. నిందితులను కస్టడీలోకి తీసుకోవాలి. సీఎం చంద్రబాబు ఘటన ప్రాంతంలో పర్యటించాలి. 

 

 

రోడ్డెక్కిన మృతుల బంధువులు

గుంటూరు : జిల్లాలోని లక్ష్మీపురంలో నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి బంధువులు రోడ్డెక్కారు. నేటి ఉదయం మృతదేహాలకు నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలను తీసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు రూ.20 లక్షల పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బాధితులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతేకాక ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మామడ అటవీ ప్రాంతంలో తనిఖీలు

ఆదిలాబాద్ : జిల్లాలోని మామడ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఇవాళ తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంతువులను వేటాడుతున్న ఆరుగురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాటు తుపాకి,జీపు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

30 కేజీల గంజాయి స్వాధీనం....

విశాఖపట్నం : గంజాయి తరలిస్తూ నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. నైజీరియాకు చెందిన ఇకెచుకువా ఆగస్టీన్(23) అరకులో గంజాయి కొనుగోలు చేసి ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సు దిగాడు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌కు నడిచివెళ్తున్నాడు. సీటీఎఫ్ పోలీసులు, ద్వారకా పోలీసులు కలసి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రెండు బ్యాగులు తనిఖీ చేయగా 30 కేజీల బరువైన 15 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. సరకుతో పాటు అర్బన్ ఎమ్మార్వో ఎదుట హాజరు పరిచారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.

11:52 - May 15, 2016

హైదరాబాద్ : ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ లయన్స్ తో జరిగిన పోటీలో...ఏబీ డివిలియర్స్ తో కలసి రెండో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. కొహ్లీ 55 బాల్స్ లో 5 బౌండ్రీలు, 8 సిక్సర్లతో 109 పరుగులు నమోదు చేస్తే...డివిలియర్స్ కేవలం 52 బాల్స్ లో 10 బౌండ్రీలు, 12 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం ఓ రికార్డు. అంతేకాదు..బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 పరుగుల భారీస్కోరు సాధించి...మరో రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు సాధించడం కూడా మరో రికార్డుగా మిగిలిపోతుంది. కొహ్లీ- డివిలియర్స్ రెండో వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గుజరాత్ లయన్స్ ప్రత్యర్థిగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన ఘనత కూడా కొహ్లీకే దక్కుతుంది...

 

11:46 - May 15, 2016

శ్రీనగర్ : అందాల కశ్మీర్‌ మరోసారి తన ప్రాధాన్యతను చాటుకుంది. ప్రపంచంలోనే రెండో రొమాంటిక్‌ ప్రదేశంగా కశ్మీర్‌ ఘనత వహించింది. ట్రావెల్‌ మ్యాగజైన్‌ లోన్లీ ప్లానెట్‌ ప్రకటించిన ర్యాంకుల్లో భారత్‌లోని కశ్మీర్‌కు ద్వితీయ స్థానం దక్కింది. టూరిస్టులకు కశ్మీర్‌ ఓ స్వర్గధామం లాంటిదని కొనియాడింది. దాల్‌ లేక్‌ సరస్సులో బోటింగ్‌ చేయడం టూరిస్టులకు ఓ చక్కని అనుభూతి. కశ్మీర్‌లోని శిఖర బోట్స్‌ బుకింగ్‌ నాన్‌ స్టాప్‌గా కొనసాగుతోందని లోన్లీ ప్లానెట్‌ పేర్కొంది. కశ్మీర్‌ను రోజుకు 4 వేల మంది టూరిస్టులు సందర్శిస్తున్నారు. రొమాంటిక్‌ ప్రదేశాల్లో తొలి స్థానం స్విట్జర్లాండ్‌కు దక్కింది.  

11:40 - May 15, 2016

పాట్నా : బీహార్‌లో తన కారును ఓవర్‌ టేక్‌ చేసినందుకు నడిరోడ్డుపై ఆదిత్య సచ్‌దేవ్‌ను కాల్చి చంపిన ఘటనలో రాఖీ యాదవ్‌ నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తొలుత తాను నేరం చేయలేదని చెబుతూ వచ్చిన రాఖీ తాజాగా నేరం అంగీకరించాడు. రాఖీ యాదవ్‌ ఎమ్మెల్సీ మనోరమ యాదవ్‌ కుమారుడు. పోలీసులకు లభించిన పిస్తోల్‌ కూడా రాఖీ పేరుమీదే ఉంది. విచారణలో తానే ఆదిత్యను తుపాకీతో కాల్చినట్లు రాఖీ ఒప్పుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ మనోరమ యాదవ్‌ ఇంట్లో మద్యం బాటిళ్లు లభించడంతో ఆమెను పార్టీ నుంచి జెడియు ఆరేళ్లపాటు బహిష్కరించింది. మనోరమదేవి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండడంతో కోర్టు సమన్లు జారీ చేసింది. బిహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే.
 

11:32 - May 15, 2016

హైదరాబాద్ : నగరంలో రాత్రి అరగంట సేపు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతో వర్షం పడడంతో నగరం మొత్తం అల్లకల్లోలంగా మారింది. క్షణాల వ్యవధిలోనే భారీ వృక్షాలు, హోర్డింగ్‌లు, ఇళ్లపైకప్పుల కూలిపోయాయి.
చిన్నపాటి విలయంవారంరోజుల కిందటి వర్ష బీభత్సం నుంచి నగరం ఇంకా తేరుకోకముందే శనివారం రాత్రి హైదరాబాద్ అంతటా గాలివాన చిన్నపాటి విలయాన్ని సృష్టించింది. శనివారం ఉదయం నుంచి ఎండ నిప్పులు కురిపించగా, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 9:30 నుంచి ఉరుములు, మెరుపులతో మొదలై భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి.
రామంతాపూర్‌లో చెట్టుపై పడిన పిడుగు
సచివాలయానికి సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ ముందున్న విద్యుత్‌ స్తంభం రోడ్డుకు అడ్డంగా ఒరిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. రామంతాపూర్‌లోని ఇందిరానగర్ వద్ద ఓ చెట్టుపై పిడుగుపడి సగానికి కాలిపోయింది. సికింద్రాబాద్ నామాలగుండు వద్ద చెట్లు కూలి విద్యుత్ స్తంభంపై పడడంతో ట్రాన్స్ ఫార్మర్‌ నుంచి మంటలు లేచాయి. ఇక ఎల్‌బీనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, ఈసీఐఎల్, తార్నాక, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్ , జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, అమీర్‌పేట్,కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి,తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది.
లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు
రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వంద ఫీడర్ల పరిధిలో కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శనివారం వీకెండ్ కావడంతో కాలక్షేపం కోసం బయటకు వెళ్లిన న గరవాసులు తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బాగ్‌లింగంపల్లిలో ఓ ఇల్లు కూలి మహిళ మృతిచెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

 

11:27 - May 15, 2016

మెదక్ : మా భూమి దేనికి ఇవ్వం.. అందుకోసం గ్రామ సభ పెట్టడమే అనవసరం.. బలవంతంగా భూములు తీసుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. పాత సర్వే ప్రకారమే ప్రాజెక్టు కట్టండి అన్నందుకు రైతులపై లాఠీ చార్జ్ జరిగింది. కడుపుమండిన గ్రామస్థులు మా ఊరు మునిగిపోతుంటే.. మమ్మల్నే కొడతారా అంటూ తిరగబడ్డారు. దీంతో గ్రామాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో వెనుదిరిగారు. ఇది మెదక్  జిల్లాలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఆవేదన.
కేసీఆర్ సొంత జిల్లాలోని గ్రామల్లో కష్టకాలం 
మా ఊరు మాకు కావాలే..  మా భూములు ఇచ్చేది లేదు. చావనైన చస్తాం కాని భూములు ఇవ్వం.. బలవంతంగా  భూములు లాక్కుంటే తిరగబడతాం  కబడ్దార్.. లేదంటే. మమ్మల్ని చంపేసి భూములు తీసుకుపోండి.. ఇది మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల మనోగతం. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోని గ్రామల్లో కష్టకాలం వచ్చింది. ఉన్న ఊరు,..నమ్ముకున్న భూమి చెదిరిపోయే పరిస్థితి దాపురించింది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పేరిట రైతన్నల నుండి బలవంతంగా భూములు  లాక్కునేందుకు జరుగుతున్న గ్రామసభపై ప్రజలు తిరగబడ్డారు. ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప ఊరిని వదులుకునేది లేదని ఆర్డీవోకు తెగేసి చెప్పారు గ్రామస్థులు.
ముంపునకు గురవనున్న 14 గ్రామాలు 
ఇక్కడ మనం చూస్తున్న గ్రామాలు మరికొద్ది రోజుల్లో కనుమరుగవనున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద మునిగిపోనున్నాయి. తెలంగాణ సర్కార్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్  ద్వారా కొండపాక ,తొగరు మండలాల పరిధిలో 1.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును 50 టీఎంసీలకు పెంచింది. దీంతో 14 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 21వేల 379 ఎకరాల పంట నీట మునగనుంది. 
రోడ్డున పడనున్న 3,112 ఇండ్లలోని ప్రజలు
ప్రాజెక్టు కింద మొత్తం 3,112 ఇండ్లలోని ప్రజలు రోడ్డున పడనున్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రక్కను నెట్టి జీవో నెం 123, 214 ను ముందుకు తెచ్చి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూమిని కోల్పోయే  మాకు మార్కెట్ ధర కంటే నాలుగురెట్లు అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులను నిలదీశారు గ్రామస్తులు 
తరతరాలుగా నమ్ముకుని జీవిస్తున్న తమను ఉన్నఫలంగా చెట్టుకొకరిని, పుట్టకొకరిగా చేస్తే ఎలా అంటు అధికారులను నిలదీశారు గ్రామస్థులు. తమకు న్యాయం జరిగే వరకు గ్రామాన్ని వదిలిపెట్టిపోమంటున్నారు. గ్రామాలను సర్వే చేస్తున్న ఆర్డీవో ను అడ్డుకుని గ్రామస్తులంతా ఏకమై అడ్డుకున్నారు. తెలంగాణ వస్తే బాగుంటదని ఆశించి ఓటు  వేశామని.. ఇక తమ బాగోగులు చూసేవారు ఉండరని కన్నీటి పర్యంతమవుతున్నారు. 
గ్రామస్తులకు అండగా సీపీఎం 
ఇది ఇలా ఉండగా ప్రభుత్వ తీరుకు నిరసనగా గ్రామస్తులకు అండగా సీపీఎం పార్టీ నిలిచింది. భూ నిర్వాసితులకు న్యాయంజరిగే వరకు పోరాడతామంటూ..ఎర్రవల్లి  నుండి సిద్దిపేట వరకు పాదయాత్ర చేపట్టింది. రైతులు తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ముమ్మాటికి మా గ్రామం మాకు గావాలే అంటున్నారు  గ్రామస్థులు.

 

జీడిమెట్ల రాంరెడ్డి నగర్ లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ : జీడిమెట్ల రాంరెడ్డినగర్‌లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాన్ల తయారీ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎంసెట్ మెడిసిన్‌ పరీక్షకు సెట్‌కోడ్‌ 'ఎస్‌' ఎంపిక...

హైదరాబాద్ : మెడిసిన్‌ పరీక్షకు సెట్‌కోడ్‌ 'ఎస్‌'ను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎంపిక చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మెడిసిన్‌ పరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... నీట్‌ ద్వారానే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. అయితే విద్యార్థులు అనుభవం కోసం ఎంసెట్‌ కూడా రాయవచ్చని తెలిపారు.

 

కల్వర్టును ఢీకొట్టిన కారు... ఒకరి మృతి

వరంగల్ : జిల్లాలోని నర్మెట్ట మండలం మరియాపురం గ్రామం దగ్గర ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

10:36 - May 15, 2016

గుంటూరు : లక్ష్మీనగర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రావెల కిషోర్‌బాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హరిబాబుకు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలోని హరిహర మహల్ సెంటర్‌లో కాంప్లెక్స్ నిర్మాణంలో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్ తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో  ఏడుగురు కార్మికులు  ప్రాణాలు కోల్పోయారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న మరికొంత మంది కార్మికులను రక్షించేందుకు రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఘటనా స్థలంలో ఏపీ హోమంత్రి చిన్న రాజప్ప దగ్గరుండి మరీ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.  

 

10:29 - May 15, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభం అయింది. ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. హైదరాబాద్ లో రాత్రి భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ జాం కావడంతో ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే నిజాం కాలేజీ వద్ద నిమిషం, అర నిమిషం లేటుగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను సెంటర్ లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు బోరున విలిపించారు. తమను లోపలికి అనుమతించాలని కోరారు. తమ కెరీర్ దెబ్బతింటుందని వేడుకున్నారు. అయినా అధికారులు సెంటర్ లోకి అనుమతించలేదు. పాతబస్తీకి చెందిన విద్యార్థి, సైదాబాద్ కు చెందిన బాలిక నిజాం కాలేజీ సెంటర్ కు నిమిషం లేటుగా రావడంతో అధికారులు, పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. సెంటర్ లోకి పంపాలని బాలిక ఎంత వేడుకున్నా.. పోలీసులు అనుమంతిచలేదు.
విశాఖలో.. 
విశాఖపట్నంలో టీఎస్ ఎంసెట్ ప్రశాతంగా జరుగుతోంది. విద్యార్థులు సకాలంలో సెంటర్ కు చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంసెట్ మెడిసిన్ పరీక్ష జరుగనుంది. 
తెలంగాణలో అగ్రికల్చర్‌, మెడికల్‌, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ పరీక్ష జరుగుతోంది. దాదాపు 2లక్షల 46వేలమంది ఈ పరీక్ష రాస్తున్నారు. ఎంసెట్‌కు ఏపీతో పాటు... ఇతర రాష్ట్రాలనుంచి 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10నుంచి ఒంటిగంట వరకూ.... అగ్రికల్చర్‌ అండ్ మెడికల్‌ ఎంట్రన్స్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ నిర్వహించబోతున్నారు.. ఇంజినీరింగ్‌కు లక్షా 43వేలమంది.... అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షకు లక్షమంది... ఈ రెండింటికి వెయ్యి 28మంది రాయబోతున్నారు.. ఇంజనీరింగ్‌కు 276 కేంద్రాలు, మెడికల్‌కు 190పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. 

09:59 - May 15, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ ఆసుపత్రులతో పాటు జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ నడుంబిగించింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్ మెంట్  ఉపయోగించి మౌళిక సదుపాయాలు కల్పించాలని  వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ హయాంలో అన్ని ఆసుపత్రుల్లో తనిఖీలు చేపడుతున్న వైద్యారోగ్యశాఖ మంత్రి..ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నారు.
హాస్పిటల్స్ లో మంత్రి లక్ష్మారెడ్డి వరుస పర్యటనలు
ఇటీవల కాలంలో ఆకస్మిక తనిఖీలు, సమీక్ష సమావేశాలతో వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బిజీబిజీ అయ్యారు. రాజధాని కేంద్రంలో నడుస్తున్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వరుస పర్యటనలు చేస్తున్నారు. తనిఖీల సందర్భంగా వస్తున్న సమస్యలకు అక్కడిక్కడే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా,యునాని , పేట్ల బురుజు హస్పిటల్, నిమ్స్ హాస్పిటల్  లో ఇలా వరుసగా అక్కడ నెలకొన్న ఇబ్బందులు, కావాల్సిన నిధులపై చర్చించారు. 
ఎం ఎన్ జె క్యాన్సర్ హస్పిటల్ పై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష 
ఎం ఎన్ జె క్యాన్సర్ హస్పిటల్ అభివృద్ధిపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. 160 కోట్లతో ఆసుపత్రిని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఎంజె అంకాలజీ, క్యాన్సర్ రీజినల్ హాస్పిటల్ పరిపాలనమండలి ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. సుమారు 10 కోట్లతో కొత్త అంకాలజీ బ్లాక్, 8.5 కోట్లతో గోల్డెన్ జూబ్లీ బ్లాక్ , కోటి రూపాయలతో  పేషెంట్ల కుటుంబసభ్యులకు వసతి, 250 పడకలు ఉన్న ఆసుపత్రిని 450 కి పెంచాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రొఫెసర్ ల నియామకం, జి ఓ 14 ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కిచెన్, ధోబీ ఘాట్ ల ఆధునీకరణ
కిచెన్, ధోబీ ఘాట్‌లను 90 లక్షలతో ఆధునీకరించాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్ఎంజె హాస్పిటల్‌లోని 4, 5 గోల్డెన్ జూబ్లీ బ్లాక్స్ నిర్మించడానికి అనుమతులు తీసుకున్నారు. వివిధ విభాగాల్లో కొత్తగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని కూడా నిమ్స్ బోర్డ్  నిర్ణయించింది. అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని సమావేశం నిర్ణయించింది. జి.ఓ నెంబరు 14 ప్రకారం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 40 శాతం నుంచి 47 శాతం వేతనాలు పెరగనున్నాయి.
1, 160 పోస్టుల భర్తీకి ప్లాన్
వీటితో పాటు ఖాళీ పోస్టుల భర్తీ నిర్ణయంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందులో కొత్తగా బీబీనగర్ లో నిర్మిస్తున్న నిమ్స్ వైద్యశాలలో అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులతో కలిపి మొత్తం వేయి 160 పోస్టులని భర్తీ చేయాలని నిర్ణయించింది నిమ్స్ పాలక మండలి. నిమ్స్ లో టీచింగ్ డాక్టర్స్ నియామకాలకు ఇప్పుడు అమలులో ఉన్న 4  టైర్ సిస్టం ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,  అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే నాలుగు అంచెల పద్దతిని పాటించాలని పాలకమండలి భావించింది. మొత్తానికి అన్ని ప్రభుత్వ హస్పటల్స్ లో వైద్య సేవల మెరుగు పర్చేందుకు తీసుకుంటున్న చర్యలు.. వీలైనంత త్వరగా అమలు చేయాలని అధికారులకు ఆదేశిలిచ్చినప్పటికి..అవి కేవలం వాగ్దనాలకే పరిమితం కాకుండా అమలు చేసి చూపాలని కోరుతున్నారు ప్రజలు.
 

హైదరాబాద్ లో నేటి నుంచి రాష్ట్రస్థాయి క్రికెట్ సెలక్షన్స్...

హైదరాబాద్‌ : రాష్ట్రస్థాయి అండర్‌-15, అండర్‌-19 క్రికెట్‌ సెలెక్షన్స్‌ ఆదివారం నుంచి మూడురోజులపాటు జరుగనున్నాయి. సరూర్‌నగర్‌ క్రికెట్‌ అకాడమీ, ఎస్‌ఏఎఫ్‌-మసాబ్‌ట్యాంక్‌ వేదికలుగా జరిగే ఈ సెలెక్షన్స్‌లో విజేతలు జాతీయ అండర్‌-15, అండర్‌-19 డే అండ్‌ నైట్‌ లీగ్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు. చండీగఢ్‌ వేదికగా ఈ నెల 23 నుంచి 27 వరకు జాతీయ డే అండ్‌ నైట్‌ క్రికెట్‌ జరుగనున్నది. భారత క్రికెట్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో ఆరు అంతర్జాతీయ జట్లతోపాటు 12 రాష్ట్రాల జట్లు పాల్గొననున్నాయి.

హైదరాబాద్ లో నేడు ఆటోల బంద్...

హైదరాబాద్‌ : ఆటో పర్మిట్‌ రద్దును ఉపసంహరించాలని, ఓలా, ఉబర్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి నగరంలో ఆటోల బంద్‌కు తెలంగాణ ఆ టో డ్రైవర్స్‌ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ....ట్రా ఫిక్‌ పోలీస్‌ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేదని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓలా, ఉబర్‌ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే ఆటోపర్మిట్‌ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు.

09:47 - May 15, 2016

'రచయిత, దర్శకుడు వివేక్‌ అగ్రిహోత్రి జీవితం ఆధారంగా రూపొందిన 'బుద్ధ ఇన్‌ ఏ ట్రాఫిక్‌ జామ్‌' చిత్రం నేటి యూనివర్సిటీల పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం' అని అంటున్నారు బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అపపమ్‌ఖేర్‌. సినిమా పూర్తయి మూడేండ్లు అవుతున్నా విడుదలకు నోచుకోలేని ఈ చిత్రం గురించి అనుపమ్‌ మాట్లాడుతూ.. 'బిజినెస్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ పాత్రలో నటించాను. జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులు, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం, ప్రతి విషయంలో పోలీసుల జోక్యం ఉండటం, వీటిపై కోర్టులు, మీడియా స్పందిస్తున్న తీరు..వంటి తదితర అంశాల సమాహారంగా ఈ చిత్రం ఉంటుంది. విద్యార్థుల నేపథ్యంలో రూపొందిన ఈచిత్రాన్ని దర్శకుడు వివేక్‌ పలు యూనివర్సిటీ విద్యార్థులకు చూపించారు. అందరూ ఎంతో బాగుందని ప్రశంసించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్రంలోని అంశాలున్నాయని కొంత మంది కావాలని ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు సహేతుకంగా లేవని స్పష్టంగా చెప్పగలను. సినిమా పూర్తయి కూడా ఇంకా ఈ సినిమాని విడుదల చేయలేకపోయాం. ఈ రోజుల్లో చిన్న సినిమాలను విడుదల చేయాలంటే చాలా కష్టంగా మారింది' అని చెప్పారు. ఈ చిత్రంలో మహీగిల్‌, పల్లవిజోషి, అరుణోదరుసింగ్‌ తదితరులు నటించారు.

 

హైదరాబాద్ లో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్..

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌సహా 8 చోట్ల డ్రంకెన్‌ డ్రైవ్‌ ను శనివారం అర్ధరాత్రి పోలీసులు నిర్వహించారు. ఈ సందర్బంగా మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారిపై మొత్తం 145 కేసులు నమోదు చేయడమేగాక ఆయా వాహనాలను సీజ్ చేశారు. కాగా... ఇటీవల బంజారాహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఇంజినీరింగ్ విద్యార్ధిని దేవిరెడ్డి మృతితో అప్రమత్తమైన పోలీసులు వీకెండ్ పార్టీలపై మరింత అప్రమత్తమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్‌ను పోలీసులు నిర్వహించారు.

జయలలిత, కరుణానిధిలకు ఈసీ నోటీసులు

హైదరాబాద్‌ : తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార హోరుకు నిన్నటితో తెరపడింది. అధికార పార్టీ అన్నాడీఎంకే, విపక్ష పార్టీ డీఎంకేతో పాటు ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడ్డ చిన్న పార్టీల కూటమి ప్రచారంలో పోటీ పడ్డాయి. నిన్న సాయంత్రం ప్రచారం ముగుస్తుందనుకున్న తరుణంలో తమిళ రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీల హోరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం ప్రశ్నించింది. లెక్కలేనన్ని ఉచిత పథకాలకు డబ్బులెక్కడి నుంచి తెస్తారో చెప్పాలంటూ ఆ రెండు పార్టీల చీఫ్ లు జయలలిత, కరుణానిధిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

09:32 - May 15, 2016

త్రిష టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం 'నాయకి'. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహిస్తుండగా రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు విశేషమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా త్రిష పాడిన 'మిడ్‌నైట్‌ సడన్‌గా ఎక్కడో దూరంగా..' పాటకు విడుదలైన గంటలోనే లక్షకు పైగా హిట్స్ వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఈ పాట హల్‌చల్‌ చేస్తోంది. సాయి కార్తీక్‌ అలరించే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని అందించారు. 40నిమిషాల గ్రాఫిక్స్‌ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. త్వరలోనే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసి తెలుగు, తమిళంలో ఒకేరోజున ఈ నెలాఖరున లేదా జూన్‌ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం తమిళ హక్కులను ప్యాన్‌డాల్‌ సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. బిజినెస్‌పరంగా తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి' అని అన్నారు. 'హర్రర్‌ జోనర్‌ చిత్రాలలో కొత్తరకమైన చిత్రమిది. కెరీర్‌లోనే అత్యున్నత నటనను త్రిష ఈ చిత్రంలో ప్రదర్శించింది. ఆమె పాత్రకు విభిన్న కోణాలుంటాయి.

అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవదహనం

నిజామాబాద్ : జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వృద్ధురాలు సజీవదహనం అయింది. జిల్లాలోని దోమకొండ మండలం సంగమేశ్వరనగర్ గ్రామంలో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మూడు పూరి గుడిసెలు దగ్ధం కాగా... ఓ వృద్ధురాలు సజీవదహనం అయింది.

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రచారానికి తెర..

చెన్నై : మూడు రాష్ట్రాల్లో శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెర . తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రేపు జరుగబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. 

09:22 - May 15, 2016

'గబ్బర్‌సింగ్‌' తర్వాత పవన్‌కళ్యాణ్‌, శృతిహాసన్ కాంబినేషన్‌ మరోమారు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం కోసం శ్రుతిహాసన్‌ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'గబ్బర్‌సింగ్‌' చిత్రంలో పవన్‌కళ్యాణ్‌, శ్రుతిహాసన్‌ల జోడీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. మళ్లీ అదే కాంబినేషన్‌ ఈ తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గబ్బర్‌సింగ్‌' తర్వాత పవన్‌ సరసన నటించేందుకు శ్రుతిహాసన్‌ సైతం ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. పవన్‌కళ్యాణ్‌, ఎస్‌.జె.సూర్య కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకుల్లోను, పవన్‌ అభిమానుల్లోనూ భారీగా అంచనాలుంటాయి. వాటికి అనుగుణంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను. మా బ్యానర్‌ నుంచి మరో మంచి చిత్రం వస్తోందని కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, సంభాషణలు : ఆకుల శివ, సంగీతం : అనూప్‌ రూబెన్స్, ఫొటోగ్రఫీ : సౌందర్‌రాజన్‌.

 

09:13 - May 15, 2016

చెన్నై : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. మూడు రాష్ట్రాల్లో రేపు జరుగబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. 
రేపు అసెంబ్లీ ఎన్నికలు
సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల తరపున అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు. రెండు నెలలకుపైగా నేతల ప్రచార హోరుతో వేడెక్కిన తమిళనాడులో ప్రచారం ముగియనుండడంతో మైకులు మూగబోయాయి. ఇక్కడ ద్రవిడ పార్టీలు ఏఐఏడీఎంకే, డీఎంకే కూటమిలతో పాటు డీడుబ్ట్యుఎఫ్-డీఎంకే-టీఎంసీల మధ్య ప్రధాన పోటీనెలకొనగా...బీజీపీ కూటమి, పీఎంకేలు కూడా బరిలో నిలిచాయి. తమిళనాడులో 234 స్థానాలకు గాను ఎన్నికల బరిలో 3,776 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ఏకంగా 320 మంది మహిళా అభ్యర్థులే పోటీపడుతుండడం విశేషం. మొత్తం 5కోట్ల, 83లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడు ఎన్నికల బరిలో నలుగురు సీఎం అభ్యర్థులు జయలలిత, కరుణానిధి, విజయ్‌కాంత్‌, అన్భుమణి రాందాస్‌లు తలపడుతున్నారు. 
కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ల మధ్య ప్రధాన పోటీ 
ఇక కేరళలో ఎల్‌డీఎఫ్‌ పాలక యూడీఎఫ్‌లు హోరాహోరిగా తలపడుతుండగా..అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టాలని బీజేపి ఆశలు పెంచుకుంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 109 మంది మహిళా అభ్యర్థులు సహా 1203 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. మొత్తం 2కోట్ల 61 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 21,644 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 
పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు  
అలాగే పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాల్లో 344 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోటీలో 21 మంది మహిళా అభ్యర్థులున్నారు. మొత్తం 9లక్షల 42వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  30 స్థానాలకు జరిగే ఎన్నికలకు మొత్తం 930 పోలింగ్‌ బూత్‌లను అధికారులు సిద్ధం చేశారు. 
తెలంగాణ పాలేరులో ఉప ఎన్నిక 
మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకు పాలేరులో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పాలేరు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సహా కాంగ్రెస్‌, సీపీఎం బరిలోకి దిగాయి. టీఆర్‌ఎస్‌ తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలువగా...కాంగ్రెస్‌ నుంచి దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డి పోటీపడుతున్నారు. ఇక సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌ బరిలో నిలిచారు. 
అన్ని ఏర్పాట్లు పూర్తి
మొత్తం మీద సోమవారం 3 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర పారామిలటరీ దళాలతో గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. నాటి పోలింగ్‌కు  అనంతరం మే 19న ఫలితాలు వెలువడనున్నాయి. మే 19న ఈ మూడు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్‌, అస్సాం రాష్ట్ర ఫలితంతో పాటు పాలేరు ఉప ఎన్నిక ఫలితం కూడా కూడా వెలువడనుంది. 

 

తెలంగాణలో ఎంసెట్‌ కు సర్వం సిద్ధం

హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ జరిగే ఎంసెట్‌కు అంతా సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 46వేలమంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఎంబిబిఎస్, బీడీఎస్ మినహా మిగతా అన్ని కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.. నిమిషం నిబంధన ఈసారి కూడా అమలవుతుందని... విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

08:45 - May 15, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ జరిగే ఎంసెట్‌కు అంతా సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 46వేలమంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఎంబిబిఎస్, బీడీఎస్ మినహా మిగతా అన్ని కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.. నిమిషం నిబంధన ఈసారి కూడా అమలవుతుందని... విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
దాదాపు 2,46,000మంది ఎంసెట్‌కు దరఖాస్తు
తెలంగాణలో అగ్రికల్చర్‌, మెడికల్‌, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 15న ఎంసెట్‌ జరగబోతోంది. దాదాపు 2లక్షల 46వేలమంది ఈ పరీక్ష రాయబోతున్నారు.. ఎంసెట్‌కు ఏపీతో పాటు... ఇతర రాష్ట్రాలనుంచి 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10నుంచి ఒంటిగంట వరకూ.... అగ్రికల్చర్‌ అండ్ మెడికల్‌ ఎంట్రన్స్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ నిర్వహించబోతున్నారు.. ఇంజినీరింగ్‌కు లక్షా 43వేలమంది.... అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షకు లక్షమంది... ఈ రెండింటికి వెయ్యి 28మంది రాయబోతున్నారు.. ఇంజనీరింగ్‌కు 276 కేంద్రాలు, మెడికల్‌కు 190పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. 
ఎంసెట్‌ నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ లకు మినహాయింపు
నీట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంసెట్‌నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు మినహాయింపు ఇచ్చారు.. ఈ  రెండు కోర్సులు కాకుండా బీఫార్మసీ, బీటెక్ బయో టెక్నాలజీ, ఫార్మా డీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హజ్‌బెండరీ, బీఎఫ్‌ఎస్సీ కోర్సులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈసారి ఎంసెట్‌ కోసం నాలుగు ఆన్‌లైన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 3, వరంగల్‌లో ఒక సెంటర్‌ సిద్ధం చేశారు..
అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి 
విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.. హాల్‌టికెట్లు తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్‌ షీట్, దరఖాస్తు ఫాం పరీక్షా కేంద్రంలో అందజేయాలి.. అటు మాస్‌ కాపీయింగ్ జగరకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.. ప్రతి విద్యార్థిని పూర్తిగా తనిఖీచేసి పరీక్షాకేంద్రంలోకి పంపుతారు.. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకురావొద్దని సూచించారు..  

 

08:29 - May 15, 2016

గుంటూరు : లక్ష్మీపురంలోని హరిహర మహల్  సెంటర్‌లో కాంప్లెక్స్ నిర్మాణంలో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్ తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న మరికొంత మంది కార్మికులను రక్షించేందుకు రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఘటనా స్థలంలో ఏపీ హోమంత్రి చిన్న రాజప్ప దగ్గరుండి మరీ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.  
కార్మికుల మీద పడ్డ మట్టిపెళ్లలు 
అంతా ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేస్తున్నారు.. అంతలోనే వారిపై మట్టిపెళ్లలు పెల్లున విరిగిపడ్డాయి. ఓ భననం నిర్మాణం కోసం సెల్లార్ తవ్వుతుండగా మట్టిపెళ్లలు ఒక్కసారిగా కార్మికుల మీద పడ్డాయి. ఆ తర్వాత క్షణాల్లోనే ప్రక్కనే ఉన్న మరో భవనానికి చెందిన గోడ కూలి మట్టిపెళ్లలు కార్మికులపై పడ్డాయి. దీంతో మట్టి పెల్లల కింద చిక్కుకున్న కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బడా కాంప్లెక్స్ నిర్మాణాల కారణంగా ప్రజల ప్రాణాలకు బరోసా లేకుండా పోతోంది. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలోని హరిహర మహల్ సెంటర్‌లో కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా  సెల్లార్ తవ్వుతుండగా మట్టిపెళ్లలు ఒక్కసారిగా కార్మికులపై పడ్డాయి. ఈ ఘటనలో 7 గురు మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. బహుళ అంతస్థుల కాంప్లెక్స్ నిర్మాణాల కోసం..  గుంటూరులోని లక్ష్మీపురంలో రాడ్ బెండింగ్ పనులు నిర్వహిస్తున్న 18 మందిపై ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. 
ఏడుగురి మృతదేహాల వెలికితీత
ప్రమాదంలో మరణించిన ఏడుగురి మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మృతి చెందిన కార్మికులు పత్తిపాడు మండలం గొట్టిపాడు వాసులుగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరికొంతమంది కార్మికులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది , రెస్య్కూ టీం  ప్రొక్లెయిన్ ద్వారా మట్టిపెళ్లలను తొలగిస్తూ.. కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి 
జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  వెంటనే హోంమంత్రి చినరాజప్పను సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో వెంటనే అమలాపురం నుండి గుంటూరుకు వచ్చి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 
మంత్రి రావెలపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం 
మరో వైపు ప్రమాదం జరగగానే సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి రావెల కిషోర్ బాబుపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు . మంత్రి కారును అడ్డుకుని ధ్వంసం చేశారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల  పరిహారం చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. దాంతో పాటు ఘటనకు కారణమైన భవన యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు.  
ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం : సీపీఎం 
అయితే జరిగిన ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. మృతుల కుటుంబాలకు 25 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలకు భద్రత  కరువైందని.. వెంటనే భవన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
ముమ్మరంగా సహాయక చర్యలు
ప్రమాదం నుండి బయటపడిన క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

08:21 - May 15, 2016

ఆదిలాబాద్ : ఆటో.. వలస కూలీల పాలిట మృత్యుశకటంగా మారింది. మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరిన వారిని శాశ్వతంగా ఈ లోకానికే దూరం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన 15 మందిని పొట్టనబెట్టుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా భైంసా-బాసర ప్రధాన రహదారిలోని దేగాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరంతా దుర్మరణంపాలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఏడుగురు చిన్నపిల్లలు ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర నుంచి వలస వచ్చి నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు. అయితే మొత్తం 18 మంది కుటుంబసభ్యులు ఆటోలో ఆదిలాబాద్‌ జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలో గల అడెల్లి పోచమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరారు. భైంసా మండలం దేగాం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్‌ -ఆటో ఢీకొన్నాయి. దీంతో టిప్పర్‌ ఆటోపై పూర్తిగా పడడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందగా...మరో నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. 
 

 

ఎంసెట్ పరీక్షకు సెట్ 'క్యూ' ఎంపిక

హైదరాబాద్ : నేడు తెలంగాణలో జరుగనున్న ఎంసెట్ పరీక్షకు కోడ్ ను విడుదల చేశారు. సెట్ 'క్యూ'ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళన చెందవద్దని చెప్పారు. 

 

గుంటూరు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

గుంటూరు : గుంటూరు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.  కొరిశపాడులోని హరిహరమహల్ సెంటర్ లో కాంప్లెక్స్ నిర్మాణంలో ప్రమాదం జరిగింది. సెల్లార్ తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఏడుగురు కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. కొన ఊపరితో ఉన్న మరో కార్మికుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు శేషబాబు, సలోమన్ రాజు, రాజేష్, సునీల్, రాకేష్, సుధాకర్, ప్రశాంత్ లుగా గుర్తించారు. 

 

గుంటూరు మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా : రావెల

గుంటూరు : కొరిశపాడులోని హరిహరమహల్ సెంటర్ లో మృతుల కుటుంబాలకు మంత్రి రావెల కిషోర్ బాబు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. 

కాంప్లెక్స్ నిర్మాణం ప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

గుంటూరు : కొరిశపాడులోని హరిహరమహల్ సెంటర్ లో కాంప్లెక్స్ నిర్మాణంలో ప్రమాదం జరిగింది. సెల్లార్ తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఏడుగురు కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. కొన ఊపరితో ఉన్న మరో కార్మికుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు శేషబాబు, సలోమన్ రాజు, రాజేష్, సునీల్, రాకేష్, సుధాకర్, ప్రశాంత్ లుగా గుర్తించారు. 

 

ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

ఆదిలాబాద్ : జిల్లాలోని భైంసా మండలం దేగాం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీప్పర్, ఆటో ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులున్నట్లు సమాచారం. మృతులు మహారాష్ట్రకు చెందిన కార్మికులుగా గుర్తించారు. 

 

Don't Miss