Activities calendar

16 May 2016

22:46 - May 16, 2016

ఖమ్మం : జిల్లాలోని కూసుమంచి మండలం గట్టుసింగారంలో ఓటర్లకు ప్రలోభాల పర్వం కలకలం రేగింది. కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓ ఎస్‌ఐ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుండగా అతనితో కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. కోక్యాతండా, సత్తుపల్లిలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం.

22:40 - May 16, 2016

ఖమ్మం : పాలేరులో ఓటర్లు పోటెత్తారు. పోలింగ్‌ బూత్‌లకు వెల్లువలా తరలివచ్చారు. రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పాలేరులో 89.73 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

రికార్డు స్థాయిలో పోలింగ్‌

పాలేరు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యింది. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు క్యూ కట్టారు. దీంతో భారీ స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఇచ్చారు. 1 లక్షా 40 వేల మంది ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు ఎస్‌ఐ ప్రలోభాలు

స్పల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారంలో..కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓ ఎస్‌ఐ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుండం కలకలం రేపింది. ఎస్‌ఐతో కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. కోక్యాతండా, సత్తుపల్లిలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. నేలకొండపల్లి మండలం భైరవానిపల్లె పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు ఆందోళనకు దిగారు. ఈవీఎం మొరాయించడంతో రెండు గంటలుగా అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, పోలింగ్ కేంద్రం అధికారులతో ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. మరో గంటపాటు అదనంగా పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్పడంతో ఓటర్లు శాంతించారు.

భారీగా తరలివచ్చిన ఓటర్లు

మొత్తం 243 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు భారీగా తరలివచ్చారు. మహిళా ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీస్, ఎన్నికల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ప్రతినిధులు పోలింగ్ బూత్‌ల చుట్టూ ఎప్పటికప్పుడు తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు.

 

22:10 - May 16, 2016

కర్నూలు : ఆళ్లగడ్డ మండలంలో దారుణం జరిగింది. ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. సదరు మహిళ పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజు అనే వ్యక్తి గత తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొంతకాలంగా మహిళపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని సమాచారం. దీన్ని వ్యతిరేకిస్తున్న మహిళపై రాజు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా వున్న మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. రాజుని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా దాడికి గురైన మహిళ పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

22:00 - May 16, 2016

ఢిల్లీ : బ్యాంకుల రుణాల చెల్లిపుల విషయంలో అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఎస్‌బిఐతో తాను కొత్త సెటిల్‌మెంట్‌కు సిద్ధమని వ్యాపారవేత్త విజయ్‌మాల్యా చెప్పారు. ముంబైలో శుక్రవారం జరిగిన యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మాల్యా-తన భద్రత, స్వేచ్ఛకు సరైన హామీ లభిస్తే త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నట్టు తెలిపారు. రుణాల చెల్లింపులో బ్యాంకులతో చర్చలు జరపనున్నట్టు మాల్య తమకు హామీ ఇచ్చారని ఇండిపెండెంట్ ప్రతినిధి కిరణ్ మజుందార్ షా తెలిపారు. మాల్యాను అప్పగించడానికి ఇంగ్లాండ్‌ నిరాకరించడంతో ఆయనకు రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఈడీ నిర్ణయించింది. విజయ్‌మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలు చెల్లించాల్సి ఉంది.

21:57 - May 16, 2016

మెదక్‌ : జిల్లాలోని సంగారెడ్డిలో రైతులు రోడెక్కారు. జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసనల్లో భాగంగా కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. నిమ్జ్ కు భూసేకరణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూ సేకరణ చేయడంపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ నిమ్జ్ కు 1206 ఎకాల భూమిని సేకరిస్తున్నారని తెలిపారు.
రైతులతో చర్చలు జరపడం లేదని చెప్పారు. 2013 చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు. మార్కెట్ విలువకు నాలుగు రెట్లు ఇవ్వాలని కోరారు. ఎకరాకు 4 లక్షల ధర పలుకుతుందన్నారు.

 

21:44 - May 16, 2016

ఢిల్లీ : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు తమిళనాడులో 63.7 శాతం, కేరళ-70.4 శాతం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 80 శాతం పోలింగ్ నమోదైంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్‌ ముగిసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఓటింగ్‌ నిర్వహించారు.

వర్షంతో పోలింగ్ ఆలస్యం...
వర్షం కారణంగా తమిళనాడులో ఉదయం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి వేగం పుంజుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, సూపర్‌స్టార్ రజనీకాంత్‌, అజిత్, కమల్‌హాసన్, కాంగ్రెస్ నేత ఖుష్భూ.. సహా పలువురు వీఐపీలు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో మొత్తం 3776 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.

ప్రజాతీర్పు ఎలా వుంటుంది?...
ప్రజాతీర్పు ఎలా ఉండబోతుందో రెండు రోజులు ఓపిక పట్టండని జయలలిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేరళలో ఉదయం నుంచే జనం పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 1203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విపక్ష సీపీఎం నేత 92 ఏళ్ల వీఎస్ అచ్యుతానందన్‌తోపాటు రాష్ట్ర హోంమంత్రి రమేశ్ చెన్నితాల, మాజీ మంత్రి కేఎం మణి, సీపీఎం నేత పినరయి విజయన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్, క్రికెటర్ శ్రీశాంత్ తదితర ప్రముఖులు పోటీచేస్తున్నవారిలో ఉన్నారు.

 

కేరళలో బీజేపీకి స్థానం లేదు...
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కొట్టాయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన విజయం తథ్యమన్న సిఎం- కేరళలో బిజెపికి స్థానం లేదని స్పష్టం చేశారు.

రెండు నియోజకవర్గాల్లో పోలింగ్‌ రద్దు...
తమిళనాడులో ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 కోట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 234 నియోజకవర్గాలకు గాను రెండు నియోజకవర్గాల్లో పోలింగ్‌ రద్దయ్యింది. అరవకురిచి, తంజావూర్‌లలో డబ్బులు పంచుతున్నారన్న కారణంతో అధికారులు పోలింగ్ రద్దు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మే 23 న పోలింగ్‌ జరగనుంది.

21:32 - May 16, 2016

ఢిల్లీ : కేరళ కోటపై ఎర్రజెండా రెపరెపలాడబోతోందా..? ఓటర్లు వామపక్షాలకే మొగ్గు చూపారా..? సీపీఎం నేతృత్వంలో ఎల్ డీఎఫ్ దే విజయమా..? దీనికి అవుననే అంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. తమిళనాడులో అమ్మకు ఎదురుదెబ్బ తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక బెంగాల్‌ ఓటర్లు మమతపైనే మమత చూపిస్తారని సర్వే ఫలితాలు వెల్లడిచేస్తున్నాయి.

కేరళలో హిస్టరీ రిపీట్ ? ....
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర రిపీట్‌ అవుతోంది. అక్కడి అధికార కూటమికి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కు పట్టం కట్టే అవకాశముందని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమికి 88 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశముందని, ఆ పార్టీ క్లియర్‌ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 38 నుంచి 48 సీట్లకు పరిమితం కానుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ కూటమికి మూడు సీట్ల వరకు వచ్చే అవకాశమున్నట్టు సర్వేల ద్వారా తెలుస్తోంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

బెంగాల్‌ దీదీ గెలుపు ఖాయమా?...
పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఏబిపి ఆనంద్ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం టిఎంసికి 178 స్థానాలు దక్కే అవకాశం వుంది. లెఫ్ట్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌ కాంబినేషన్‌ కి 110 సీట్లు దక్కే ఛాన్స్‌ వుంది. బిజెపి ఒక సీటు సాధించి బోణి కొట్టే అవకాశం వుంది. సి ఓటరు, టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం టిఎంసి కి 167 స్థానాలు దక్కుతాయి. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం టిఎంసికి 233 నుంచి 253 సీట్లు వస్తాయంటోంది .

'అమ్మ'కు భంగపాటు తప్పదన్న ఎగ్జిట్ పోల్ ...?
తమిళనాడులో 'అమ్మ'కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కరుణానిధికే ఓటర్లు పట్టం కడతారని తద్వారా చరిత్ర పునరావృతమవుతోందని సర్వేలు చెబుతున్నాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 114-118, అన్నాడీఎంకే 95-99, పీడబ్ల్యూఎఫ్‌ 14, బీజేపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తమిళనాడు న్యూస్ నేషన్ సర్వే వెల్లడించింది. డీఎంకే 124-140, అన్నాడీఎంకే 89-101, బీజేపీ 0-3 సీట్లలో విజయం సాధించే అవకాశముందని తమిళనాడు ఇండియాటుడే అంచనా వేసింది. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని తమిళనాడు యాక్సిస్ ఇండియా సర్వే తెలిపింది.

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, తదితర అంశాలపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.

ప.బెంగాల్ లో ఎగ్జిట్ పోల్..

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో సీఓటర్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. టీఎంసీ 167, సీపీఎం 75, కాంగ్రెస్ 45, బీజేపీ 4, ఇతరులు 3. ఎబిపి-ఆనంద ఎగ్జిట్ పోల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో టీఎంసీ 178, సీపీఎం 110, బీజేపీ 1, ఇతరులకు 5 స్థానాలు రానున్నాయి. ఇండియా టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో టీఎంసీ 167, సీపీఎం 75, కాంగ్రెస్ 45, ఇతరులు 7 స్థానాలు కైవసం చేసుకోనున్నారు.  

 

పాలేరు ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పాలేరులో 90.01 శాతం పోలింగ్  నమోదు అయింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.

 

20:46 - May 16, 2016

ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? 5 రాష్ట్రాలలో ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా?ఈ ఎన్నికల్లో విజయం ఎవరిది? అనే అంశంపై 10టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి (రాజకీయ విశ్లేషకులు), హరగోపాల్ (ప్రముఖ సామాజిక విశ్లేషకులు), ఎస్. వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), వి.శ్రీనివాసరావు (సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు) పాల్గొని, మాట్లాడారు. బెంగాల్ లో పాత సంప్రదాయమే కొనసాగే వాతావారణ కనిపిస్తోందన్నారు. అస్సాంలో కేంద్రంలో ప్రత్యామ్నాయంగా మోడీకి అధికారాన్ని ఎలా ఇచ్చారో అలాగే అస్సాంలో కాంగ్రెస్ తో విసిగిపోయిన ఓటర్లు ప్రత్యామ్నాయంతో బీజేపీకి అవకాస్తారేమో చూడాలన్నారు. కాంగ్రెస్ సాధారణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. బీజేపీకి కేరళలో బేస్ స్థానం వస్తుందనుకోవటం చాలా పొరపాటని అన్నారు. కేరళలో అక్కడ వున్న రాజకీయ సమీకరణతో మారాయన్నారు. బెంగాల్ లో చూస్తే ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో సీపీఎం దృష్టిపెట్టాల్సిన అవుసరముందని తెలిపారు. కార్పొరేట్ మీడియా ఒకప్పుడు కాంగ్రెస్ ని నమ్మింది..ఇప్పుడు మోడీని నమ్ముతోందని చెప్పారు. ఓటరు ఆలోచనా ధోరణి మారుతోందన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వే అనేది అన్నిసమయాల్లోనూ ఒకరకంగా వుండవనీ..సర్వే చేసే కంపెనీలకు పెద్దమొత్తంలో డబ్బులను ఎర చూపితే వాటి ప్రకారమే సర్వేల ఫలితాలనిచ్చే అవకాశం కూడా వుంటుందన్నారు. సీపీఎం కార్యకర్తలను దారుణంగా హింసిస్తూ ప్రజాస్వామ్యాన్ని మమతా సర్కారు కూనీ చేసిందని ఆరోపించారు. కేరళలో సీఎం అవినీతికి పాల్పడ్డారనీ...తాజాగా మెడిసిన్ విద్యార్థినిపై జరిగిన దారుణమైన లైంగిక దాడి కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందన్నారు. ప్రజల్లో అంతర్గతంగా వున్న అల్లర్లను రెచ్చగొడుతూ ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోందన్నారు.

ఆ మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

హైదరాబాద్ : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 69 శాతం, కేరళలో 70.35 శాతం, పుదుచ్చేరిలో 80.17 శాతం పోలింగ్ నమోదు అయింది. తమిళనాడులోని 8 జిల్లాల్లో రాత్రి 7గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. వర్షాల కారణంగా ఈసీ పోలింగ్ సమయాన్ని పొగించింది. పాలేరుతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఈనెల 19న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

 

తమిళనాడులో వర్షాలు...పోలింగ్ సమయం పెంపు

చెన్నై : తమిళనాడులోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఏడు జిల్లాల్లో పోలింగ్  సమయాన్ని పెంచారు. ఈసీ రాత్రి 7 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పెంచింది. తంజావూరు, తిరువళ్లూర్, తిరుచ్చి,మదురై, శివగంగ,దిండిగల్ జిల్లాలో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

 

20:18 - May 16, 2016

ఢిల్లీ : పశ్చిమబెంగాల్‌ మమతాబెనర్జీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. ఏబిపి ఆనంద్ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం టిఎంసికి 178 స్థానాలు దక్కే అవకాశం వుంది. లెఫ్ట్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌ కాంబినేషన్‌ కి 110 సీట్లు దక్కే అవకాశం వుంది. బిజెపి 1 సీటు సాధించి బోణి కొట్టే అవకాశం వుంది. సి ఓటరు, టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం టిఎంసి కి 167 స్థానాలు దక్కుతాయి. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం టిఎంసికి 233 నుంచి 253 సీట్లు వస్తాయంటోంది.

అస్సాం...
అస్సాంలో బిజెపి కాంబినేషన్‌ కే ఆధిక్యత వున్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. బిజెపి 57, కాంగ్రెస్‌ 41, ఏఐయుడిఎఫ్‌ 18, ఇతరులు 10 స్థానాల్లో గెలుస్తారన్నది టౌమ్స్‌ నౌ , సి ఓటరు అంచనా. ఇండియా టుడే సర్వే ప్రకారం 79 నుంచి 93 సీట్లు గెలుచుకునే అవకాశం వుంది. కాంగ్రెస్‌ 26 నుంచి 33 సీట్లకే పరిమితం అవుతుంది. ఏఐయుడిఎఫ్‌ 6 నుంచి 10 స్థానాలు గెల్చుకుంటున్నది ఇండియా టుడే అంచనా.

కేరళ....
140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో అధికార యుడిఎఫ్‌, ప్రతిపక్ష ఎల్‌ డిఎఫ్‌ మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో బిజెపి కూడా వ్యూహాత్మక అడుగులు వేసింది. కేరళలో మ్యాజిక్‌ ఫిగర్‌ 71 కాగా 2011 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీట్లు ఆధిక్యతతో యుడిఎఫ్‌ అధికారంలోకి రావడం విశేషం. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్‌ కి 72 సీట్లు లభించగా, ఎల్‌డిఎఫ్‌ 68 స్థానాలు సాధించింది. 2011లో యుడిఎఫ్‌ కి 45.97 శాతం ఓట్లు సాధించగా, ఎల్‌ డిఎఫ్‌ 44. 43శాతం ఓట్లు సాధించింది. 2014 లోక్‌ సభ ఎన్నికల్లోనూ యుడిఎఫ్‌ 12 ఎంపి సీట్లు గెల్చుకోగా, ఎల్‌డిఎఫ్‌ 8 సీట్లు గెల్చుకుంది. 2011లో 6.07శాతం ఓట్లు సాధించిన బిజెపి 2014 లోక్‌ సభ ఎన్నికల్లో 10.83శాతం ఓట్లు సాధించడం విశేషం.

పశ్చిమబెంగాల్‌...
పశ్చిమబెంగాల్‌ లో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష లెఫ్ట్‌ కాంగ్రెస్‌ కాంబినేషన్‌ మధ్య హోరాహోరి పోరు జరిగింది. బిజెపి కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 148. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ సొంతంగా 184 సీట్లు గెల్చుకుంది. 34 ఏళ్ల పాటు అధికారంలో వున్న లెఫ్ట్‌ ఫ్రంట్‌ 62 సీట్లకే పరిమితమైంది. 2011లో టిఎంసితో పొత్తు పెట్టుకుని 42 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌ ఈసారి లెఫ్ట్‌ ఫ్రంట్‌ తో సయోధ్య కుదుర్చుకుంది. 2011 ఎన్నికల్లో టిఎంసికి 39 శాతం ఓట్లు పోలవ్వగా దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కి 9.3శాతం ఓట్లు పోలయ్యాయి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ కి 39. 2శాతం ఓట్లు పోలయ్యాయి. బిజెపి 4.5 శాతం ఓట్లు సాధించింది.

2014 లోక్‌ సభ ఎన్నికల్లో టిఎంసికి 34 ఎంపి స్థానాలు దక్కగా, సిపిఎంకి 2 స్థానాలొచ్చాయి. బిజెపి 2, కాంగ్రెస్‌ 4 ఎంపి సీట్లు గెల్చుకున్నాయి. 2014 ఎన్నికల్లో టిఎంసికి 39.05 శాతం ఓట్లు పోలవ్వగా, ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ కి 9.58శాతం ఓట్లు, సిపిఎంకు 29.71శాతం ఓట్లు లభించాయి . అనూహ్యంగా పుంజుకున్న బిజెపి 16.80శాతం ఓట్లు సాధించింది

తమిళనాడు...
ఏ పార్టీని వరుసగా రెండో సారి గెలిపించకపోవడం తమిళనాడు ప్రత్యేకత. 1984 నుంచి జయలలిత, కరుణానిధి చెరోసారి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చారు. ఇద్దరూ ఐదేసిసార్లు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈసారి జయలలిత, కరుణానిధితో పాటు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ సారథ్యంలోని పీపుల్స్‌ వెల్ఫేర్‌ ఫ్రంట్‌, రామదాసు నాయకత్వంలోని పిఎంకె ఆకర్షణీయ శక్తులుగా మారాయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సారధ్యంలోని ఏఐఏడిఎంకె సొంతంగా 150 సీట్లు గెల్చుకోగా, పొత్తు పెట్టుకున్న డిఎండికె 29, సిపిఎం 10, సిపిఐ 9 స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి జయలలితకు దూరమైన డిఎండికె, సిపిఎం, సిపిఐ పీపుల్స్‌ ఫ్రంట్‌ గా అవతరించాయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడిఎంకె 38.41శాతం ఓట్లు సాధించగా, డిఎంకె 22.4శాతం ఓట్లు సాధించింది. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో ఏఐఏడిఎంకె 37 స్థానాలు గెలుచుకోగా, బిజెపి 1, దానితో పొత్తు పెట్టుకున్న పిఎంకె 1 స్థానం గెల్చుకున్నాయి. 2014 ఎన్నికల్లో ఏఐఏడిఎంకె 44.3శాతం ఓట్లు సాధించగా, డిఎంకె 26.8 శాతం ఓట్లు సాధించింది.

అస్సాంలో కాంగ్రెస్‌, బిజెపి హోరాహోరి...
అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి హోరాహోరి తలపడ్డాయి. కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయగా, ఏజిపి, బిపిఎఫ్ లతో బిజెపి పొత్తు పెట్టుకుంది. మరోవైపు ముస్లింలలో గట్టి పట్టున్న ఏఐయుడిఎఫ్‌ కూడా రంగంలో వుంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మ్యాజిక్‌ ఫిగర్‌ 64. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 78 స్థానాల్లో విజయం సాధించి, వరుసగా మూడోసారి అధికారంలోకి రాగా 18 స్థానాలు గెలుచుకున్న ఏఐయుడిఎఫ్‌ ప్రతిపక్షంగా అవతరించింది. బిపిఎఫ్‌ 12, ఏజిపి 10 స్థానాల్లో విజయం సాధించాయి . బిజెపి 5 సీట్లతో సరిపెట్టుకుంది. 2011లో కాంగ్రెస్‌ 39.4 శాతం ఓట్లు సాధించింది. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతినగా, బిజెపి అనూహ్యంగా పుంజుకుని సగం సీట్లు గెల్చుకుంది. 2014 ఎన్నికల్లో బిజెపి 36.50 శాతం ఓట్లు సాధించగా, కాంగ్రెస్‌ 29.60శాతం ఓట్లు మాత్రమే సాధించింది.

వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌ నుంచి ఖైదీ పరారీ

వరంగల్‌ : జిల్లాలోని సెంట్రల్‌ జైల్‌ ఖైదీ ఉప్పల సూరి పరారయ్యాడు. జనగామ మండలం యశ్వంత్‌పూర్‌ దగ్గర పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఖైదీని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

 

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ముగిసిన పోలింగ్...

హైదరాబాద్ : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో 6గంటలలోపు ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు. సాయంత్రం 5గంటల వరకు తమిళనాడులో 63.7 శాతం, కేరళ-70.4 శాతం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 80 శాతం పోలింగ్ నమోదైంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

18:48 - May 16, 2016

కరీంనగర్ : జెన్‌కో సంస్థ తమ నుంచి అన్యాయంగా భూములను లాక్కుంటోందని కరీంనగర్‌ జిల్లా తాడిచర్ల గ్రామస్థులు ఆరోపించారు. మంథనిలోని ఆర్డీవో కార్యాలయ ముందు ధర్నా చేపట్టారు. తమ భూములకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని అన్నారు. భూములు కోల్పోతున్న నిర్వాసితుల కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో శ్రీనివాస్‌కు అందజేశారు.

18:44 - May 16, 2016

వరంగల్‌  : సెంట్రల్‌ జైల్‌ నుండి ఓ ఖైదీ పరారయ్యాడు. జనగామ మండలం యశ్వంత్‌పూర్‌ దగ్గర పోలీసుల కళ్లుగప్పి  ఉప్పల సూరి పరారయ్యాడు.  ఖైదీని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

18:41 - May 16, 2016

హైదరాబాద్ : కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులోని 24 జిల్లాలతో పాటు.. బై పోల్ జరుగుతున్న ఖమ్మం జిల్లా పాలేరులోనూ పోలింగ్ ముగిసింది. 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు భారీవర్షాలతో తమిళనాడులోని 8 జిల్లాల్లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ 8 జిల్లాల్లో రాత్రి 7గంటల వరకు సమయం పొడిగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పాలేరులో సాయంత్రం 5గంటల వరకు 85.5 శాతం పోలింగ్ నమోదైంది.

మైనింగ్ పాలసీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మైనింగ్ పాలసీపై మంత్రి కేటీఆర్ సమీక్ష చేశారు. సహజ వనరులు ప్రజల సొత్తన్నారు. సహజ వనరుల ద్వారా వచ్చే అదాయం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని చెప్పారు. మైనింగ్ ఆస్తులు, గనులు, ఖనిజాలు లభించే ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ కు రావాల్సిన రాయల్టీలను వసూలు చేయడంలో చురుగ్గా పని చేయాలన్నారు. మైనింగ్ కార్మికుల రక్షణ విషయంలో రాజీ పడొద్దని సూచించారు.

 
 

అమరావతిలో ఉచిత విద్య అమలు చేయనున్న ఎపి సర్కార్

గుంటూరు : ఎపి నూతన రాజధాని అమరావతిలో ఉచిత విద్య అమలు చేయనున్నారు. ఈమేరకు ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు, భూమిలేని నిరుపేదల పిల్లలకు వర్తిస్తుంది.

 

18:26 - May 16, 2016

హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మాస్ కాపీయింగ్ వ్యవహారం బట్టబయలు అయింది. హయత్ నగర్ లోని నోవా కాలేజీలో విద్యార్థులు జోరుగా మాస్ కాపియింగ్ కు పాల్పడ్డారు. నిఖిల్ రెడ్డి అనే విద్యార్థి ఎగ్జామ్ పేపరును బయటికి తెచ్చి...మరో విద్యార్థితో రాయిస్తుండగా ఎస్ వో టీ పోలీసులు పట్టుకున్నారు.  పోలీసులు  కాలేజీ ప్రిన్సిపల్ వెంకటకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు నిఖిల్ రెడ్డి, భరత్ రెడ్డి, విష్ణులుగా గుర్తించారు.

హయత్ నగర్ నోవా కాలేజీలో జోరుగా మాస్ కాపీయింగ్

హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మాస్ కాపీయింగ్ వ్యవహారం బట్టబయలు అయింది. హయత్ నగర్ లోని నోవా కాలేజీలో విద్యార్థులు జోరుగా మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. నిఖిల్ రెడ్డి అనే విద్యార్థి ఎగ్జామ్ పేపరును బయటికి తెచ్చి...మరో విద్యార్థితో రాయిస్తుండగా ఎస్ వో టీ పోలీసులు పట్టుకున్నారు. నోవా పోలీసులు కాలేజీ ప్రిన్సిపల్ వెంకటకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు నిఖిల్ రెడ్డి, భరత్ రెడ్డి, విష్ణులుగా గుర్తించారు.

 

17:55 - May 16, 2016

విజయవాడ : రాజరాజేశ్వరిపేటలో పేదలు నివాసం ఉంటున్న గుడిసెల్ని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే తమ ఇళ్లను తొలగించవద్దంటూ స్థానిక మహిళలు..ఎంపీ కేశినేని నాని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎంపీ కేశినేని నాని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.

17:49 - May 16, 2016

.గోదావరి : అగ్రిగోల్డ్‌ నిందితులను వెంటనే శిక్షించి, తమకు న్యాయం చెయ్యాలని బాధితులు ధర్నా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ పరివార్ ఏజెంట్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేపట్టారు. జిల్లాలోని సంస్థ ఏజెంట్లు, ఖాతాదారులు ఈ నిరసనలో పెద్దఎత్తున పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి అధికారులు నిందితులపై చార్జ్‌షీట్ తీసుకోకుండా 90 రోజులపాటు కాలయాపన చేశారని బాధితులు ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యకపోతే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు.

17:45 - May 16, 2016

గుంటూరు : జగన్ జల దీక్ష వల్ల రాష్ట్రానికి నష్టమేకాని లాభం లేదని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాదరావు విమర్శించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టకుండా సమస్యను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనల కోసం జగన్ దీక్షను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కృష్ణ నది జలాలలో రాష్టానికి జరగాల్సిన న్యాయం గురించి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, అందరూ సహకరించాలని డొక్కా కోరారు.

17:39 - May 16, 2016

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. కార్మికుల సమస్యలను పరిష్కరించి.. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

17:31 - May 16, 2016

గుజరాత్‌ : 2017లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌నే తక్షణమే మార్చాలని నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమాన్ని హ్యాండిల్‌ చేయడంలో ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ వైఫల్యం చెందారన్న సమాచారం నేపథ్యంలో ఈ మార్పు తథ్యమని తెలుస్తోంది. ఆనందీబెన్‌ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుతం గుజరాత్‌ వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న నితిన్‌భాయ్‌ పటేల్‌ను నియమించాలని బీజేపీ హైకమాండ్‌ దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆనందీబెన్‌ పటేల్‌ను పంజాబ్‌ గవర్నర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.

17:28 - May 16, 2016

ఖమ్మం : పాలేరు నియోజకవర్గంలోని ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం జోరుగా జరుగుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో టీఆర్ ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు ఓటు వేయాలని హరి అనే కానిస్టేబుల్ బహిరంగంగా నమూనాను ఓటర్లకు చూపించాడు. మీడియాను చూసి పక్కకు కానిస్టేబుల్ తప్పుకున్నారు. అంతకముందు మధ్యాహ్నం కూసుమంచి మండలం గట్టు సింగారంలో ఎస్ ఐ టీఆర్ ఎస్ కు ప్రచారం చేశారు. ఎస్ ఐ ప్రచారాన్ని సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్ ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాలేరు బైపోల్ మరో గంటలో ముగియనుంది. ఇప్పటివరకు సుమారు 80 శాతం పోలింగ్ నమోదైంది.

17:23 - May 16, 2016

బిహార్‌ : ఆదిత్య సచ్‌దేవ్‌ను కాల్చి చంపిన ఘటనలో రాఖీ యాదవ్‌ కజిన్‌ టేనీ యాదవ్‌ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు టేనీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆదిత్యను కాల్చి చంపిన సమయంలో టేనీ కూడా రాఖీతో పాటు ఉన్నాడు. తన కారును ఓవర్‌ టేక్‌ చేసినందుకు నడిరోడ్డుపై ఆదిత్యను రాఖీ యాదవ్‌ కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ మనోరమదేవి కుమారుడు రాఖీయాదవ్‌ తన నేరాన్ని అంగీకరించాడు. ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ మనోరమ బాడీగార్డ్‌ రాకేశ్‌ను ఇదివరకే పోలీసులు అరెస్ట్‌ చేశారు. మనోరమదేవి ముందస్తు బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై మే 19న విచారణ జరగనుంది.

గుజరాత్ సీఎం మార్పు...?

ఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ను మార్చాలని కేంద్రప్రభుత్వం చేయాలని భావిస్తోంది. సీఎం ఆనందిబెన్ పటేల్ ను మార్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి రేసులో నితిన్ భాయ్ పటేల్ ఉన్నాడు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ మంత్రిగా నితిన్ భాయ్ పని చేస్తున్నారు. నితిన్ భాయ్ పటేల్ గుజరాత్ సీఎం చేయాలని కేంద్ర భావిస్తుంది. గుజరాత్ లో పటేల్ ఉద్యమం అణచివేయడంలో ఆనందిబెన్ పటేల్ విఫలమవ్వడం కారణంగానే ఆమెను మార్చుతున్నట్లు కనిపిస్తోంది.

 

17:14 - May 16, 2016

ఢిల్లీ : నీట్ వల్ల తెలుగు రాష్ర్ట విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని దాని నుంచి కనీసం రెండు సంవత్సరాలు మినహాయింపు కావాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీట్ వల్ల ఎదురయ్యే సమస్యలను ఏకరువు పెట్టామని కామినేని తెలిపారు.

ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. కార్మికుల సమస్యలను పరిష్కరించి వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

17:10 - May 16, 2016

ఢిల్లీ : నీట్‌పై రాష్ట్రాలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నీట్‌ పరీక్షపై విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో జేపీ నడ్డా ఢిల్లీలో సమావేశాన్ని నిర్వంచారు. ఈ సమావేశంలో నీట్‌ పరీక్ష నిర్వహించాలని అన్ని రాష్ట్రాల మంత్రులు సూత్రాప్రాయంగా అంగీకరించడం శుభపరిణామన్నారు. పరీక్ష నిర్వహణలో తలెత్తే సమస్యలను సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని నడ్డా స్పష్టం చేశారు.

17:06 - May 16, 2016

తిరుపతి : గంగమ్మ జాతర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వారం రోజుల పాటు జరుగనున్న జాతరతో నగరం సందడిగా మారింది. రకరకాల వేషాలు ధరించే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతి గ్రామ దేవతగా కొనియాడే గంగమ్మ,.కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ది గాంచింది. గత మంగళవారం ప్రారంభమైన జాతర రేపటితో ముగియనుంది.

వందల సంవత్సరాల చరిత్ర....
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరకు విశేష ప్రాధాన్యత ఉంది. ఒక్క చిత్తూరు జిల్లా నుంచే కాక రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ జాతర వేడుకలో పాల్గొంటారు. ఆలయం వద్ద ఉన్న విశ్వరూప స్తూపానికి వడిపాలు కట్టడంతో జాతర ప్రారంభమవుతుంది. తిరుపతి సమీపంలోని అమ్మవారి స్వగ్రామం అయిన అవిలాల నుంచి కైకాల కులస్తులు అమ్మవారికి సాంప్రదాయ బద్దంగా సారె, పసుపు, కుంకుమ సమర్పిస్తారు. జాతర ప్రారంభమైనట్టు అధికారికంగా చాటింపు వేస్తారు. ఊరిలో నివసించే ఎవరూ ఈ వారం రోజులు బయటకు పోకూడదని చాటింపు చేస్తారు. మొత్తం వారం రోజుల పాటు భక్తులు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ దఫా స్వయంగా టిటిడి ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి అమ్మవారికి ఊరేగింపుగా వచ్చి ఈ సాంప్రదాయం అమలుచేశారు.

అమ్మవారిని బూతులు తిట్టడం జాతరలో విశేషం...
జాతర ప్రారంభంతో వేషాల సంబరం మొదలవుతుంది. వరుసగా బైరాగి వేషం, బండవేషం, తోటి వేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం, దొర వేషంతో భక్తులు అమ్మవారి సేవలో తరిస్తారు. వేషం ధరించి స్వయంగా అమ్మవారినే పచ్చి బూతులు తిట్టడం ఈ జాతరకున్న విశేష ప్రాధాన్యత. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అప్పుడే పుట్టిన శిశువు నుంచి ముసలి వారు వరకు ఈ వేషాలు వేస్తారు.

విశ్వరూప దర్శనంతో జాతర ముగింపు...
మంగళవారంతో జాతర సంబరం పూర్తవుతుంది. ఆ రోజు ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి పోతుంది. మంగళవారం అర్థరాత్రి దాటాక మట్టితో చేసిన విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. మొత్తం వారం రోజల పాటు తిరుపతిలో జాతరను ఓ పండుగలా జరుపుకుంటారు.

16:55 - May 16, 2016

సమంత..తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈమెకు అభిమానులు చాలా మందే ఉన్నారు. తెలుగులో ప్రముఖ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాను నటించే చిత్రాలు..ఇతరత్రా వార్తలను సమంత సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉంటోంది. తాజాగా ఓ వీరాభిమాని ట్వీట్ చేసిన ఫొటోను చూసిన సమంత ఉబ్బితబ్బిబయిపోతోందంట. ఆ అభిమాని చేసిన ఫొటోను తిరిగి సమంత ట్వీట్ చేసింది. ఇందులో విశేషమేమిటంటే...పలు చిత్రాలకు సంబంధించిన సమంత చిత్రాలను ఒక దగ్గరిగా చేర్చాడు. మొత్తం 2916 ఫొటోలను ఉపయోగించి ఆమె రూపం వచ్చేలా ఒక ఫొటోను తయారు చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అదండి సంగతి...

16:53 - May 16, 2016

విజయవాడ : అమరావతిలో ఉచిత విద్య అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు, భూమిలేని నిరుపేదల పిల్లలకు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ , వృతివిద్యా కళాశాలలు, యూనివర్సిటీల్లో ఉచిత విద్య అందించనున్నారు. పదేళ్ల పాటు ఉచిత విద్యను వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పాల్వంచ కేటీపీఎస్ 7 వ యూనిట్ లో ఉద్రిక్తత

ఖమ్మం : పాల్వంచ కేటీపీఎస్ 7 వ యూనిట్ లో ఉద్రిక్తత నెలకొంది. క్రేన్ విరిగి మీద పడడంతో కార్మికుడు మోహన్ మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషయా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేసే వరకు మృత దేహాన్ని తరలించేది లేదని కార్మికలు ఆందోళన చేపట్టారు.

 

16:36 - May 16, 2016

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ లో బాలీవుడ్ తారలు తళుక్కుమనడం తెలిసిందే. రెడ్ కార్పెట్ పై నడిచే తారల డ్రెస్సింగ్ వైపు అందరీ చూపు ఉంటుంది. అందాల రాశిగా పేరొందిన 'ఐశ్వర్య రాయ్' కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం కొత్తేమి కాదు. ఏటా కేన్స్ లో రెడ్ కార్పెట్ పై ఐష్ సందడి చేస్తూనే ఉంది. దాదాపు ఏడేళ్లుగా ఇప్పటి వరకూ పాల్గొన్న ఐష్ ఒక్కో మోడల్ డ్రస్ ధరిస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఏడాది కూడా కేన్స్ లో ఐశ్వర్య సందడి కొనసాగింది. ఫ్లవర్ డిజైన్ లో స్పెషల్ గా డిజైన్ చేయించిన గౌన్ ధరించింది. కానీ ఈ ముద్దుగుమ్మ లిప్ స్టిక్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారంట. పర్పుల్ కలర్లో పెదాలను సింగారించింది. లిప్ స్టిక్ వేసుకోవడానికి ఈ రంగే దొరికిందా ? అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏషియన్ పెయింట్ వేసుకుందా ? అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. 

మహిళపై యువకుడు యాసిడ్ దాడి..

కర్నూలు : ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో యాసిడ్ దాడి జరిగింది. ఇంట్లోకి చొరబడి ఓ మహిళపై రవి అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. దీంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడికి పాల్పడ్డ యువకున్ని స్థానికులు చితకబాదారు.

 

16:14 - May 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రానున్న ఖరీఫ్‌కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని అన్నారు. రైతులకు ఏ సమస్యా ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పోచారం తెలిపారు.

15:56 - May 16, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి ఇటీవలే కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే కదా. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కానీ తమిళంలో విజయం సాధించిన 'కత్తి' సినిమాకు రీమెక్. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్, విలన్ తదితర పాత్రల కోసం చిత్ర యూనిట్ అన్వేషనిస్తున్నారంట. ప్రముఖంగా విలన్ గా 'జగపతి బాబు' నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరో బాలయ్యతో పాటు యంగ్ హీరోల సినిమాల్లోని ఆయా పాత్రలని తనదైశ శైలిలో పండిస్తూ సెకెండ్స్ ఇన్నింగ్స్ లో జగపతి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి మాతృక అయిన మురుగదాస్ తెరకెక్కించిన 'కత్తి'లో తోత రాయ్ చౌదరి నటించిన పాత్రలో జగపతి కనపడనున్నారని తెలుస్తోంది. తొలుత ఈ పాత్రకి వేరే వాళ్ళని అనుకున్నా ఈ పాత్రకు జగపతి అయితేనే కరెక్టని చిత్ర బృందం ఫిక్సయ్యారట. సినిమా తెరమీదికొచ్చేలోపు చిరు - జగపతి ఫైట్స్ ఎలా ఉంటాయో చిత్రం రిలీజ్ అయ్యేదాక వేయిట్ చేయాల్సిందే. 

15:56 - May 16, 2016

ఫ్యాషన్ ప్రపంచం ఎన్ని కొత్త పుంతలు తొక్కినప్పటికీ ప్రత్యేక సందర్భాలలో అతివల ఓటు చీరలకే. అలాంటి చీరలలో లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసులో చూడండి.

15:53 - May 16, 2016

సివిల్స్‌ సాధించడం యువతరం స్వప్నం. ఆ స్వపాన్ని సాకారం చేసుకోవడం కోసం శ్రమ, అంకుఠిత దీక్ష కావాలి. అలాంటి కృషి, పట్టుదలలో అమ్మాయిలు కూడా ఏ మాత్రం తీసిపోరని రుజువు చేసారు. అన్ని అంతరాలనీ అధిగమించి సామాజిక దృష్టి కోణం కలిగిన ఈ యువతులు విజయకేతనం ఎగరేసారు. దేశ రాజధాని నుదుట విజయ తిలకం దిద్ది, అందరికన్నా అనేకమంది అమ్మాయిలు ముందు పీఠాన నిలిచారు. ఒకరు మొదటి ప్రయత్నంలో టాప్‌ ర్యాంకును తన ఖాతాలో వేసుకోగా, మిగిలిన వాళ్లంతా రెండు, మూడు ప్రయత్నాలు చేశారు. టార్గెట్‌ పెట్టుకుని, పుస్తకాలను సమగ్రంగా చదివి, తమ కలల్ని సాకారం చేసుకున్నారు. సివిల్స్ లో సత్తా చాటిన అమ్మాయిలకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. ఎందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిస్తోంది.

15:31 - May 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో జగన్ చేపట్టిన దీక్షపై మంత్రి హరీష్‌రావు ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రాజెక్టులను జగన్‌ అడ్డుకోవాలని చూస్తే మానుకోట సంఘటన పునారవృతం కాక తప్పదని హెచ్చరించారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణకు నీళ్లు రాకుండా.. రాయలసీమకు తరలించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అటు చంద్రబాబు,ఇటు జగన్‌ తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విమర్శించారు.

15:24 - May 16, 2016

కేరళ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కొట్టాయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో సిఎం మాట్లాడుతూ...తన విజయం తథ్యమన్న ధీమాను వ్యక్తం చేశారు. కేరళలో బిజెపికి స్థానం లేదని ఊమెన్‌ చాందీ స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ140 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 21 వేల 498 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 52 వేలమంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు.

కారు గుర్తుకు ఓటేయాలని చెప్పిన ఎస్ ఐ

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కూసుమంచి మండలం గట్టుసింగారంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. కారు గుర్తుకు ఓటేయాలని ఎస్ ఐ ఓటర్లకు చెప్పాడు. దీంతో ఎస్ ఐతో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సత్తుపల్లిలో టీఆర్ ఎస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా సీపీఎం కార్యకర్తలు పట్టుకున్నారు.

మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ శాతం..

ఢిల్లీ : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1గంట వరకు తమిళనాడులో 42.1 శాతం, కేరళలో 45 శాతం ఓటింగ్ నమోదైంది. 

మొహాలీలో ఆప్ ఆందోళన..

మొహాలీ : ఆహార ధాన్యాల కుంభకోణంపై పంజాబ్ ప్రభుత్వంపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 

తిరుమలలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల జెండా..

చిత్తూరు : తిరుమలలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల జెండా కనిపించడం కలకలం రేపింది. జూపాలి తీర్థానికి వెళ్లే మార్గంలో జెండా కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది జెండాను తొలగించారు. 

13:33 - May 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో దీక్ష చేయతలపెట్టిన వైసీపీ అధినేత జగన్‌ తీరుకు నిరసనగా ఓయూ జేఏసీ ఆందోళనకు దిగింది. హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ నివాసాన్ని ఓయూ జేఏసీ, తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన ముట్టడించాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

13:29 - May 16, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజులు కింద చేపట్టిన పాదయాత్ర ఈ రోజు సిద్ధిపేటకు చేరుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న తొగుట, కొండపాక మండలాలల్లోని 14 గ్రామాల రైతులకు ప్రభుత్వం సరైన న్యాయం చేయడంలేదని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహ రెడ్డి మండిపడ్డారు. 2013 భూ సేకరణ చట్టం అమలుచేయాలన్నారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన విధానం తెలుసుకోకుండా 51 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకోవడం భూములు తీసుకోవడం సరైంది కాదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భూ నిర్వాసితులకు పునరావసం కల్పించాలని నంద్యాల డిమాండ్ చేశారు.

13:28 - May 16, 2016

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించిన సరిగ్గా ఏడాది అయ్యింది. గత సంవత్సరం మే 16 నుంచి 20 వ తేదీ వరకు స్వచ్ఛ హైదరాబాద్ ప్రారంభించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది తర్వాత తిరిగి చూసుకుంటే స్వచ్ఛ హైదరాబాద్ సాధించిన విజయాలేమిటి? ఇది ఎంత వరకు సక్సెస్ అయ్యింది? హైదరాబాద్ ను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా వుంచడంలో ఎవరి పాత్ర ఎంత? రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసి, పౌరసమాజం రోల్ ఏమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు లోక్ సత్తా హైదరాబాద్ సిటీ కార్యదర్శి సాంబిరెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

మల్కాజ్ గిరిలో టర్కీ కరెన్సీ స్వాధీనం..

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలోని ఓ ఇంటిపై ఎస్ వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. కోటి విలువైన టర్కీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

 

నీట్ నిర్వాహణపై ముగిసిన సమావేశం..

ఢిల్లీ : నీట్ నిర్వాహణపై జరిగిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. నీట్ కు అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని, ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని ఎక్కువ రాష్ట్రాలు కోరాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని, కేంద్ర, రాష్ట్ర సిలబస్ ల మధ్య వ్యత్యాసాన్ని అన్ని రాష్ట్రాలు తెలిపాయన్నారు. ఈ అంశాలను కోర్టు ముందట ఉంచుతామన్నారు. 

13:22 - May 16, 2016

విజయవాడ : రాష్ట్రాభివృద్థిని చూసి ఓర్వలేక జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ జగన్‌పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశామని, త్వరలో పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఆ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేసేంత వరకు న్యాయపోరాటం చేస్తామని దేవినేని స్పష్టం చేశారు. జగన్ చేస్తున్న జల దీక్ష ఓ దొంగ దీక్షని వ్యాఖ్యానించారు.

13:18 - May 16, 2016

ఢిల్లీ : నీట్ వల్ల తెలుగు రాష్ర్ట విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని దాని నుంచి కనీసం రెండు సంవత్సరాలు మినహాయింపు కావాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీట్ వల్ల ఎదురయ్యే సమస్యలను ఏకరువు పెట్టామని కామినేని తెలిపారు.

13:16 - May 16, 2016

గుజరాత్‌ : జామ్ నగర్ మహిళా ఎంపీ మురుగు కాల్వలో పడిపోయారు. పది అడుగుల లోతులో పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. జామ్ నగర్ కు ఎంపీ పూనమ్ మాదమ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోమవారం స్థానికంగా ఉన్న జాలారమ్ నగర్ లో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వెళ్లారు. అక్కడనే ఉన్న ఓ నాలాపై నిలబడి సమస్యలు వింటున్నారు. ఆమెతో పాటు అధికారులు..ఇతరులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా శ్లాబ్ కూలిపోవడంతో ఎంపీతో పాటు పలువురు మురుగు కాల్వలో పడిపోయారు. దీనితో ఎంపీ పూనమ్ తలకు..కాలుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఇతరులు ఆమెను పైకి లాగి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె డ్రైనేజీలో పడిపోవడం వీడియో కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో హల్ చల్ చేస్తోంది. 

13:14 - May 16, 2016

యానాం : పుదుచ్చేరిలో భాగమైన యానాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. యానాంలో మొత్తం 35 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 36 వేల 557 ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 17వేల 544 స్త్రీలు 17వేల 013 మంది ఉన్నారు.

కేరళలో 12గంటల వరకు పోలింగ్ శాతం..

కేరళ : రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.15 గంటల వరకు 12.15 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది.

 

ట్రైబల్ సబ్ ప్లాన్ పై మంత్రి చందూలాల్ సమీక్ష..

హైదరాబాద్ : ట్రైబల్ సబ్‌ప్లాన్‌పై మంత్రి చందూలాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ట్రైబల్ సబ్‌ప్లాన్ అమలు అంశంపై చర్చించారు.

మంత్రి ఈటెలతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ..

హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వేతన సవరణ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా పాల్గొన్నారు.

ప్రధానితో సీఎం ఆనందిబెన్ భేటీ..

గుజరాత్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్ని కరవు పరిస్థులను ప్రధానికి సీఎం ఆనంది బెన్ పటేల్ వివరించినట్లు తెలుస్తోంది. 

గుజరాత్ లో అగ్నిప్రమాదం..

గుజరాత్ : సూరత్ కాక్రపర్ థర్మల్ పవర్ స్టేషన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. 

తమిళనాడులో వర్షం..పోలింగ్ కు ఇబ్బందులు..

చెన్నై : తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాజధాని చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీనితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 

జగన్ దీక్షపై మంత్రి హరీష్ స్పందన..

ఆదిలాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన జలదీక్షపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఏపీ నుండి చుక్క నీటిని కూడా తీసుకోవడం లేదని, జగన్ దీక్షకు దిగడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ కు జగన్ ప్రశ్నలు..

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాలో జలదీక్ష చేపట్టారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా జగన్ మూడు రోజుల పాటు జలదీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు తలపెట్టిందని, ఏపీకి నీళ్లు రావని తెలిసినా తెలంగాణ సర్కార్ అన్యాయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని తెలిపారు. ప్రాజెక్టులు కడితే ఏపీకి నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను ప్రస్తావించారా ? ఇందుకు అనుమతులున్నాయా ? అని ప్రశ్నించారు.

12:38 - May 16, 2016

కర్నూలు :కృష్ణా,గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా బతకాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని ప్రాజెక్టులకు అనుమతి సాధించారో కేసీఆర్ తెలపాలని డిమాండ్ చేశారు. టీ సర్కార్ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు జగన్ చేపట్టిన దీక్ష కర్నూలులో ప్రారంభమైంది. తెలంగాణ ప్రాజెక్టులతో దిగువ ప్రాంతమంతా ఎడారి అవుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు నీరు రాకుంటే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఏంటనేది చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు భయంతోనే ప్రాజెక్టులపై కేసీఆర్‌ను చంద్రబాబు నిలదీయాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ దీక్షపై మంత్రి గంటా ఆగ్రహం..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన జల దీక్షపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జగన్ మూడు రోజుల పాటు జలదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్షను ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకే తెలిదని, రాజకీయాలు, ప్రాజెక్టులపై అనుభవ లేనితనంతోనే జగన్ దీక్షకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. 

వైసీపీ నేత ఎడ్మ కిష్టారెడ్డి రాజీనామా..

కర్నూలు : వైసీపీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా జగన్ మూడు రోజుల పాటు జలదీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ ధర్నాను ఎడ్మ కిష్టారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్లు..అందుకనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

నీట్ పై స్పష్టతనిస్తాం - మంత్రి కడియం..

హైదరాబాద్ : నీట్ పై రానున్న రెండు రోజుల్లో స్పష్టతనిస్తామని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. 370 డి నిబంధనల ప్రకారం ప్రవేశాలు జరగాలని సుప్రీంను కోరుతున్నట్లు, ఇక్కడ విద్యార్థుల కన్నా ఉత్తర భారత విద్యార్థులే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.  

పాలేరు 11గంటల వరకు పోలింగ్ శాతం..

ఖమ్మం : పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.60 శాతం పోలింగ్ నమోదైంది. పాలేరు నియోజకవర్గంలో మొత్తం 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జగన్ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన జలదీక్షపై ఓయూ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ నివాసాన్ని ఓయూ జేఏసీ నేతలు ముట్టడించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్టు చేశారు. 

మురుగు కాల్వలో పడిపోయిన ఎంపీ..

గుజరాత్ : జామ్ నగర్ ఎంపీ కుముద్ బెన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మురుగు నీటి కాల్వపై నిలబడి ఎంపీ కుముద్ మాట్లాడుతున్నారు. దానిపైనే ఎంపీ, ఇతర కార్యకర్తలు నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా శ్లాబ్ కూలిపోవడంతో ఎంపీ కుముద్ మురుగు కాల్వలో పడిపోయారు. ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

11:53 - May 16, 2016

కృష్ణా : జగ్గయ్యపేట మండలం అన్నవరంలో ఆకతాయిలు వికృతచేష్టకు పాల్పడ్డారు. చెట్లపై ఉన్న కోతులను లక్ష్యంగా చేసుకుని కింద ఉన్న పొదలకు నిప్పుబెట్టారు. దీంతో రెండు కోతులు సజీవ దహనమయ్యాయి. సుమారు పది కోతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామ శివార్లలో కోతులు ఈత చెట్లెక్కి సందడి చేస్తుండగా అటుగా వెళ్లిన ఆకతాయిలు చెట్ల కింద నిప్పుబెట్టారు. చాలాకోతులు మంటలకు భయపడి కిందకు రాలేకపోయాయి. చివరకు మండల ధాటికి కిందపడిపోగా రెండు కోతులు సజీవదహనమయ్యాయి. మరికొన్ని కోతులు బూడిదైపోయుంటాయని భావిస్తున్నారు. మంటలు పెట్టినందుకు యువకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

11:50 - May 16, 2016

హైదరాబాద్ : తమిళనాడు, కేరళ, పుద్దేచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం తొమ్మిదిగంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు తమిళనాడులోని ఐదు జిల్లాలో భారీ వర్షం పడుతుంది. దీంతో ఆయా జిల్లాలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఓటు వినియోగించుకున్న ప్రముఖుల్లో రజినీకాంత్,అజిత్,కమల్‌హాసన్,కాంగ్రెస్ నేత ఖుష్భూ... డీఎంకే అధినేత కరుణానిధి,ఏఐడీంకే అధినేత్రి జయలలిత ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తలైవా రజినీకాంత్ ఓటర్లకు పిలుపునిచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 3776 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.

కేరళలో....

కేరళలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం పదిగంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటిదాకా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ,క్రికెటర్ శ్రీశాంత్ ఉన్నారు. 140 స్థానాలకు గాను 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పుదుచ్చేరిలో భారీ వర్షం పడుతుండడంతో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. యానాంలో సైతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల్లో 344 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 9 లక్షల41వేల 935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

11:48 - May 16, 2016

ఢిల్లీ : నీట్ పరీక్ష నిర్వహణపై రాష్ట్రాలతో కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి జేపి నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఏపీ నుంచి మంత్రి కామినేని తెలంగాణ నుంచి హెల్త్ సెక్రటరీ రాజీవ్ తివారి పాల్గొన్నారు.

 

11:46 - May 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో దీక్ష చేయతలపెట్టిన వైసీపీ అధినేత జగన్‌ తీరుకు నిరసనగా ఓయూ జేఏసీ ఆందోళనకు సిద్ధమైంది. హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ నివాసం పై దాడి చేస్తామంటూ ఓయూ జేఏసీ, తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన హెచ్చరించింది. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

ఉదయం 11గంటలకు పోలింగ్ శాతం..

ఢిల్లీ : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు ఉప ఎన్నిక కొనసాగుతోంది. 32 శాతం పోలింగ్ నమోదైంది. 

కోక్యా తండాలో స్థానికేతరుల ప్రచారం..

ఖమ్మం : కోక్యా తండాలో టీఆర్ఎస్ తరపున స్థానికేతరులు ప్రచారం నిర్వహించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలతో టీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల ధర్నా..

మెదక్ : సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీపీఎం నేత నంద్యాల నర్సింహరెడ్డి హాజరయ్యారు.  సీఎం సొంత జిల్లాలో రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకొంటే ప్రజలు ప్రతిఘటిస్తారని, 14 గ్రామాల ప్రజలు ధర్నాలో పాల్గొనడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని నంద్యాల పేర్కొన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ధర్నాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడాన్ని అడ్డుకోవడం తగదని సూచించారు. భాధితులకు సీపీఎం అండగా ఉంటుందని నంద్యాల స్పష్టం చేశారు. 

మరుగుదొడ్లలో గిరిజన మహిళ ప్రసవం..

ఖమ్మం : తూర్పు మన్యం చింతూరు మండలం గౌరిదేవిపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆసుపత్రి మరుగుదొడ్లలో గిరిజన మహిళ ప్రసవించింది. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.

 

ఇన్సూరెన్స్ అధికారులతో మంత్రి పోచారం భేటీ..

హైదరాబాద్ : ఇన్సూరెన్స్ అధికారలతో మంత్రి పోచారం శ్రీనివాస్ భేటీ అయ్యారు. పౌలి హౌస్ ను ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చిస్తున్నారు. 

కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతనలో సమావేశం..

ఢిల్లీ : ఎయిమ్స్ లో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు..కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. నీట్ పరీక్షా నిర్వాహణపై చర్చించనున్నారు. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీవ్ తివారీ ఈ సమావేశానికి హజరయ్యారు. 

కేరళలో బీజేపీ ఓటమి చెందుతుంది - చాందీ..

కేరళ : రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అకౌంట్ ఓపెన్ చేయదని సీఎం ఉమెన్ చాందీ పేర్కొన్నారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 

జగన్ నివాసం వద్ద భారీ భద్రత..

హైదరాబాద్ : వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత చేపట్టారు. లోటస్ పాండ్ పై దాడి చేస్తామని ఓయూ జేఏసీ, నవ నిర్మాణ విద్యార్థి సేన హెచ్చరించింది. 

ఢిల్లీకి చేరుకున్న సంత్ నిరంకారి అధినేత పార్థివ దేహం..

ఢిల్లీ : సంత్‌ నిరంకారి సంస్థ అధినేత బాబా హర్‌దేవ్‌ సింగ్‌ పార్థివ దేహం ఢిల్లీకి చేరుకుంది. కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. 

నేడు మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల ధర్నా...

మెదక్ : నేడు సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ధర్నా కార్యక్రమం జరగనుంది. ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధిపేటకు వెళుతున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆరోపించారు. 

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కేటీఆర్ దరఖాస్తు చేసుకున్నారు. 

10:41 - May 16, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు ఇబ్బంది పెడుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం శనగంపాడులోని బూత్ నెంబర్‌ 57లో ఈవీఎం మొరాయించింది. దీంతో పోలింగ్ అధికారులు టెక్నికల్ సిబ్బందిని సంప్రదిస్తున్నారు. నేలకొండపల్లి మండలం బోదులబండలోనూ ఈవిఎం మొరాయించింది. బూత్ నెంబర్‌ 303లో ఈవీఎం పనిచేయకపోవడంతో అధికారులు కాసేపు ఓటింగ్‌ను నిలిపేశారు. టెక్నీషియన్స్‌ వస్తే తప్ప బాగుకాదని అధికారులు చెప్పడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.

ప.గో.జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆళ్ల నాని..

పశ్చిమగోదావరి : జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆళ్ల నానిని పార్టీ నియమించింది. కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపిలో చేరుతారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

పోలీసుల అదుపులో 27 మంది రౌడీషీటర్లు..

హైదరాబాద్ : నగరంలోని ఆసీఫ్ నగర్, గోషా మహల్ డివిజన్లలో రౌడీషీటర్ల ఇళ్లపై పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. 

10:38 - May 16, 2016

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్ను వసూలుపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడాది నుండి ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంటి పన్నును వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో పైరవీలకు చెక్ పెట్టాలని చూస్తోంది ప్రభుత్వం. నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన ఆస్తి పన్నును కింది స్థాయి సిబ్బంది వసూలు చేయడంలేదనే అభిప్రాయంతో వుంది ప్రభుత్వం.

టాక్స్ కంటే తక్కువ వసూలు చేస్తున్న అధికారులు.....

ప్రస్తుతం ఇంటిపన్ను వసూలు చేస్తున్న అధికారులు ఉన్న టాక్స్ కంటే తక్కువ వసూలు చేస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో అలర్టయిన ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఇంటి వైశాల్యం ఎంత? ఎన్ని ఫ్లోర్లున్నాయి ? లాంటి అంశాలను పొందుపరుస్తారు. సంబంధిత ఇంటి వివరాలు ఎంటర్‌ చేయగానే.. ఇంటి పన్ను ఎంత చెల్లించాలో డిస్‌ప్లే అవుతుంది. ఆ ఇంటి యజమాని కంప్యూటర్ లో వచ్చిన బిల్లును ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోను వసూలుకాని ఇంటిపన్నులు.....

రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇంటిపన్ను వసూలు కావడం లేదు. ఇంటి పన్ను వసూలులో 2014-15తో పోల్చుకుంటే 15-16లో అనుకున్న టార్గెట్ కన్నా తక్కువ లక్ష్యాలను సాధించింది Ghmc. మిగతా పట్టాణాల్లో 283 కోట్లు లక్ష్యంగా పెట్టుకొంటే.. 243 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం 99.99 శాతం వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.

మణుగూరు, మెట్‌పల్లి, కరీంనగర్, సిద్దిపేట.....

మణుగూరు, మెట్ పల్లి, కరీంనగర్, సిద్దిపేట,మహబూబ్ నగర్, జనగాం 99 శాతం పైగా పన్ను వసూలులో టాప్ 10 లో ఉన్నాయి. ఇక మిగిలిన నగర పంచాయితీలు, మున్సిపాలిటీల్లో మాత్రం 70 శాతం నుండి 30 శాతం వరకు మాత్రమే వసూలు అయ్యాయి. ఇదే సీన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా రీపీట్ కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త సాప్ట్ వేర్ ను తెరపైకి తెచ్చింది.

కొత్త సాప్ట్ వేర్ తో ఖచ్చితంగా ఇంటిపన్ను వసూలు...

పంచాయతి కార్యక్రమంలో భాగంగానే ఈ కొత్త సాప్ట్ వేర్ ను తీసుకొస్తున్నట్లుగా సెక్రటేరియట్ లో ఐటి అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అనుకున్నప్పటికీ మరికొన్ని రోజుల టైం పట్టే చాన్స్ వుందంటున్నారు. ఏదిఏమైనా ఈ కొత్త సాప్ట్ వేర్ తో ఖచ్చితంగా ఇంటిపన్ను వసూలు చేస్తామంటున్నారు పంచాయతిరాజ్ శాఖ అధికారులు.

10:36 - May 16, 2016

నిజామాబాద్ : ప్రభుత్వ నిబంధనలకు మున్సిపల్ అధికారులు నీళ్లొదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా 6 చోట్ల అక్రమ లేఅవుట్లకు కామారెడ్డి మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. ఒక్కరోజులోనే అనుమతులు మంజూరు అయ్యాయి. డబ్బుంటే చాలు నిబంధనలు అడ్డురావని నిరూపించారు అధికారులు.

కాసులిచ్చికో అనుమతి పుచ్చుకో ...

కాసులిచ్చికో అనుమతి పుచ్చుకో అనే సామెతను నిజం చేశారు నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి మున్సిపల్ అధికారులు. నిబంధనలకు విరుద్దంగా అక్రమ లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేశారు. ప్రభుత్వం ఒక ప్రక్క నిబంధనలకు విరుద్దంగా ఉన్న లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేది లేదని చెబుతున్నా.. అధికారులు మాత్రం 41.33 ఎకరాల్లోని 6 లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయడం విచిత్రంగా ఉంది.

సుమారు అరకోటికి పైగా డబ్బులు చేతులు...

లేఅవుట్‌కు దరఖాస్తు చేసుకున్న తరువాత అధికారులు ప్లాట్లను సందర్శించి నిబంధనలు పాటించారా... లేదా అని విచారణ జరిపి అనుమతులు ఇవ్వాలి.. కానీ, ఇక్కడ అలాంటిదేమి జరగలేదు. ప్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లే అవుట్లో 40 ఫీట్ల రోడ్డు, మురికికాలువల నిర్మాణం విద్యుత్ సౌకర్యంతో పాటు పార్క్ నిర్మించి నీటి సౌకర్యం ఉంటేనే లే అవుట్లకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కాని ఇది జరగలేదు. ఈ వ్యవహారంలో సుమారు అరకోటికి పైగా డబ్బులు చేతులు మారినట్లు విమర్శలున్నాయి.

హౌసింగ్ బోర్డు కాలనీ సర్వే నెంబర్లు 702, 703, 704లో 15 ఎకరాలు......

పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 702, 703 , 704 సర్వే నెంబరులో 15 ఎకరాల లే అవుట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు దళారులు. ఎల్పీ నెంబర్ 43 తో అనుమతి ఇచ్చారు. అదే విధంగా గాంధీనగర్ సర్వే నెంబర్ 54 లో రెండు ఎకరాల స్థలానికి లేఅవుట్ పర్మిషన్ నెంబర్ 303 తో అనుమతులు ఇచ్చారు. అదే కాలనీకి చెందిన మరో వ్యక్తికి 52, 53 సర్వే నెంబర్లలో రెండు ఎకరాల స్థలంలోఎల్పీ నెంబర్ 26 కు సంబంధించి అనుమతులు ఇచ్చారు.

సర్వే నెంబర్ 28లో 8 ఎకరాల స్థలానికి పర్మిషన్...

దీంతో పాటు రామారెడ్డి రోడ్డులోని ఇందిరా నగర్ కాలనీలో సర్వే నెంబర్ 28 లో 8 ఎకరాల స్థలంలో ఎల్పీ నెంబర్ 50 అడ్లూరు రోడ్డులోని 875, 877 878,881,883 సర్వే నెంబర్లకు చెందిన 12 ఎకరాల భూమి ఎల్పీ నెంబర్ 46 తో అనుమతులు ఇచ్చారు. అయితే.. వీటిలో ఎలాంటి నిబంధనలు పాటించకపోయినా అధికారులు అనుమతి ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇంతా జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం నియమ నిబంధనల ప్రకారమే అనుమతులిచ్చామంటున్నారు. కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

10:28 - May 16, 2016

వందలు కాదు..వేలు కాదు..లక్షలు కాదు..ఏకంగా కోట్లు వద్దని అనుకున్నాడా ? ఏంటీ ఆ పిల్లగాడికి ఏమన్నా పిచ్చా ? లేక అంతకన్నా డబ్బులు ఎక్కువున్నాయా ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఈ డబ్బు వెనుక చిన్న కథ ఉంది. ఏంటా కథ ? అంత పెద్ద డబ్బును ఎందుకు వద్దని అనుకున్నాడు ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
న్యూయార్కులోని అలాబామాకు చెందిన 14 ఏండ్ల విద్యార్థి రోసెంతల్ కు బేస్ బాల్ అంటే ఇష్టం. ఈ బేస్ బాల్ ఆటలో ఆడే వారు తరచూ గాయాలపాలయ్యే వారు. ఆ సమయంలో అవసరమైన బ్యాండేజ్ అందుబాటులో లేకపోవడంతో గాయాలతో ఇంటికెళ్లే వారు. ఇదంతా రోసెంతల్ సునిశితంగా గమనించాడు. దీనికి ఏదైనా పరిష్కారం చూపాలని అనుకున్నాడు. ఆలోచించాడు..మదిలో ఓ ఆలోచన తట్టింది. ప్రథమ చికిత్సకు ఉపయోగపడేలా ఓ వెండింగ్ మిషన్ ను రూపొందించాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ పెద్ద కంపెనీ రోసెంతల్ ను సంప్రదించింది. ఐడియాను కొనుగోలు చేసేందుకు బేరమాడింది. 30 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ. 180 కోట్లు) ఆఫర్ చేసింది. దీనిని రోసెంతల్ సునితంగా తిరస్కరించి స్వయంగా మార్కెటింగ్ చేయాలని భావించాడు. లక్ష అమెరికన్ డాలర్ల పెట్టుబడితో మెషీన్లను తయారు చేసి ఒక్కోటి రూ. 5, 500 అమెరికన్ డాలర్లకు అమ్మాడు. అనతికాలంలోనే రోసెంతల్ కంపెనీకి సీఈవోగా, సొంత పేటెంట్ హక్కును పొందాడు. ఈ 14 ఏండ్ల రోసెంతల్ భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేయాలని అందరూ అనుకుంటున్నారు.

హుస్నాబాద్ లో అగ్నిప్రమాదం..

కరీంనగర్ : హుస్నాబాద్ (మం) జిల్లెలగడ్డలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భద్రకాళి జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. రూ. కోటి వరకు ఆస్తి నష్టం కలగి ఉంటుందని అంచనా.

 

టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. నేలకొండపల్లి (మం) సుర్దేపల్లిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

కొనసాగుతున్న ఆటో డ్రైవర్ల సమ్మె..

హైదరాబాద్ : నగరంలో ఆటో డ్రైవర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి నుండి ఆటో డైవర్ల జేఏసీ సమ్మె చేపట్టింది. ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగా ఈ సమ్మె చేపడుతున్నారు.

 

10:13 - May 16, 2016

కాశ్మీర్ : ఈ సమాజంలో చేతులు లేని వాళ్లు కాళ్లతో తమ పనులు తాము చేసుకోవడం, బలపం పట్టి దిద్దడం, పెన్ను పట్టి రాయడం, చదువులో ఫస్ట్ రావడం మనం చూశాం. చూస్తున్నాం. 26 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ వారందరికన్నా ముందున్నారు. రెండు చేతులు భుజాల వరకు లేకున్నా క్రికెట్‌లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కుడికాలు పెకైత్తి ఎంచక్కా బౌలింగ్ వేస్తారు. భుజానికి, గదమకు మధ్య క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తారు. ఆ బ్యాట్‌ను అలాగే పట్టుకొని పరుగులు తీస్తారు. హుస్సేన్ ఎవరి సాయం లేకుండా తన పనులను తానే చేసుకుంటారు. స్నానం చేసి బట్టలు వేసుకోవడం దగ్గరి నుంచి గడ్డం గీసుకోవడం, కాలేజీకెళ్లి చదువుకోవడం. కాలుతో పెన్ను రాయడం లాంటి పనులు తేలిగ్గా చేసుకుంటారు. హుస్సేన్ ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి కట్టెల కోత మిషన్‌లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు రెండు చేతులు తెగిపోయాయి. మిగిలిన చేతుల భాగాలను శస్త్ర చికిత్సలో తీసివేయాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్‌కు ఎంతో ఖర్చయింది. ఆ ఖర్చును భరించేందుకు ఆయన తండ్రి తమకున్న పొలాన్ని అమ్మేయాల్సి వచ్చింది. భుజాల వరకు రెండు చేతులు లేకుండా మనుగడ సాగించడం హుస్సేన్‌కు మొదట్లో కష్టమైంది. చదువుకోవడానికి స్కూల్ కు వెళితే 'నీవు చదువుకు పనికి రావు' అంటూ స్కూల్ నుంచి వెళ్లగొట్టారు. అయినా అందరితోపాటు తాను చదవగలను, రాయగలనని అనతికాలంలోనే కాశ్మీర్‌కు చెందిన ఈ హుస్సేన్ నిరూపించి పాఠశాలలో చేరారు. ప్రస్తుతం కాశ్మీర్ పారా క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యుడయ్యారు. తన ఆట తీరుతో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. బలమైన సంకల్పం, ఎంతటి అకుంఠిత దీక్ష ఉంటే తప్పా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం మానవ స్ఫూర్తికే స్ఫూర్తిగా నిలుస్తున్న హుస్సేన్ వీడియోను ప్రత్యక్షంగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

10:08 - May 16, 2016

అనుష్క...టాలీవుడ్ లో 'అరుంధతి' సినిమా ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బాహుబలి, రుద్రమదేవి తదితర వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనస్సులను చూరగొంది. ఇటీవలే 'సైజ్ జీరో' చిత్రంలో కొత్త ప్రయత్నం చేసింది. ఈ సినిమా కోసం దాదాపు 20 కేజీలు పెరిగిన అనుష్కను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. సన్నగా..నాజుకుగా ఉండే అనుష్క ఇలా అయ్యిదేంటీ అని అందరూ డైలామాలో పడిపోయారు. తాజాగా అనుష్క ఓ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. 'ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ టైమ్..ఈట్ ప్రే లవ్' అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ ఫొటోలో అనుష్కను చూసిన అభిమానులు సంబరపడిపోయారు. అభిమాన హీరోయిన్ మళ్లీ పాత గెటప్ లోకి వచ్చేసిందంటూ ముచ్చటించుకుంటున్నారు. కానీ అనుష్క వెనుక ఒకతను ఉన్నాడు..ఆయన ఎవరా అనే చర్చ జరుగుతోంది. 

ఓటు వేసిన జయలలిత..

చెన్నై : తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టెలా మారిస్ కాలేజ్ లో జయలలిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎన్నికల అధికారులు..

ఖమ్మం : ముత్తగూడెం, తెల్దార్ పల్లి, జీలచెరువు, మద్దులపల్లి, గట్టు సింగారంలో పోలింగ్ బూత్ లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. 

ఈ ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు...

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. నేలకొండపల్లి (మం) బోదులబండలోని బూత్ నెంబర్ 303లో..కూసుమంచి (మం) గురువాయిగూడెంలోని బూత్ నెంబర్ 147లో...రూరల్ మండలం అరెకోడులో..రామన్నపేట, దారేడులో..నేలకొండపల్లి (మం) సుర్దేపల్లిలో..చింతపల్లిలో.. తిరుమలాయపాలెం (మం) దిండిపోడులో ఈవీఎంలు మొరాయించాయి. 

పోలింగ్ బూత్ లను పరిశీలించిన అభ్యర్థులు..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. గుదిమళ్ల, వెంకటగిరి, వన్నెకల్లులో పోలింగ్ బూత్ లను సీపీఎం అభ్యర్థి పోతినేని పరిశీలించారు. రామన్నపేటలో పోలింగ్ బూత్ ను టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల పరిశీలించారు. 

బలపడిన అల్పపీడనం..

విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది వాయువ్య దిశగా కదిలి సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం పంబన్- నాగపట్నం పరిసరాల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

డీఎంకే విజయం ఖాయం - కరుణానిధి..

చెన్నై : తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత కరుణానిధి ధీమా వ్యక్తం చేశారు. గోపాలపురంలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఉమాభారతి నివాసం వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి ఉమాభారతి నివాసం వద్ద ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తనకు తానే గన్‌తో కాల్చుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. 

యూడీఎఫ్ విజయం ఖాయమన్న ఆంటోనీ..

కేరళ : రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుందని మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోని జోస్యం చెప్పారు. త్రివేండ్రంలోని జగతి ప్రభుత్వ పాఠశాలలో ఆంటోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

పాలేరులో 12 శాతం పోలింగ్..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 9గంటల వరకు 12 శాతం పోలింగ్ నమోదైంది. 

సీపీఎం ప్రధాన కార్యాలయం వద్ద వ్యక్తి మృతదేహం..

ఢిల్లీ : దేశ రాజధానిలోని గోల్ మార్కెట్ లో ఉన్న సీపీఎం ప్రధానా కార్యాలయం వద్ద వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:21 - May 16, 2016

పిండివంటలు, ఇతరత్రా తీపి రుచులకోసం మనం పంచదార, బెల్లం వాడతాం. బెల్లం, పంచదార ఒకే చెరుకు నుంచి తయారుచేసినా పంచదారకు బదులు బెల్లం వాడడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం పంచదార తయారీలో రసాయనాలు ఎక్కువగా వాడడంవల్ల పోషక విలువలు నశించి, తీపి రుచి ఒక్కటే మిగిలిపోతుంది. ఇందులో ఉండే ఎక్కువ కేలరీలు వివిధ ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాయి. బెల్లం తయారీలో వాడే రసాయనాలు తక్కువ. అందువల్ల ఇది ఆరోగ్యంపై అంతగా ప్రతికూల ప్రభావాన్ని చూపదు. దీనిలో ఇనుము, క్యాల్షియం ఎక్కువ మోతాదులోనూ, ఇతర పోషకాలు స్వల్పంగానూ ఉంటాయి. అందువల్ల శరీరానికి అవసరమైన పోషకాలలో కొన్ని బెల్లం ద్వారా మన శరీరానికి అందుతాయి. అయినప్పటికీ తయారీ సమయంలో కలిపే రసాయనాలు ఏదో మేరకు ఆరోగ్యానికి ఇబ్బందులు తెస్తాయి. ఏ రసాయనాలూ వేయని బెల్లం వాడడం అన్ని విధాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనినే రంగు వెయ్యని బెల్లం అంటారు. బెల్లంలో వేసే రసాయనాలు ప్రధానంగా రంగుతోపాటు, ఆకర్షణీయమైన రూపం కోసం వాడతారు. చూడడానికి కంటికి ఇంపుగా కనిపించకపోయినా రంగు వెయ్యని బెల్లం అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిది.

09:19 - May 16, 2016

ప్రతి ఒక్కరిలోనూ మార్చుకోవాలనుకున్న అలవాట్లు కొన్ని ఉంటాయి. కానీ రోజులు గడిచిపోతున్నా... అది సాధ్యం కాదు. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదు. కాస్త ఇబ్బందనిపించినా.. పట్టుదలతో అనుకున్న మార్పుకు ప్రయత్నించవచ్చు. తప్పనిసరిగా రేపట్నుంచి వ్యాయామం ప్రారంభించాలి.. అని చాలా సార్లే అనుకొని ఉంటారు కదూ! అలాంటివే మరి కొన్ని కార్యక్రమాలు.. కానీ ఎప్పటికీ చేయలేం. ఇలాంటప్పుడు రేపటికి వాయిదా వేసే కంటే ఈ రోజు నుంచే మీరనుకున్న పని ప్రారంభించండి. కచ్చితంగా మర్నాడు దాన్ని కొనసాగిస్తారు. అనుకున్న లక్ష్యం చేరాలంటే మొదటి అడుగే ముఖ్యమైనది.
మీరు కోరుకున్న మార్పు లేదా అలవాట్లని ఎందుకు చేసుకోవాలనుకుంటు న్నారో ముందు మీకు తెలియాలి. అప్పుడే మీలో పట్టుదల వస్తుంది. ఉదాహరణకు రోడ్డుపక్కన దొరికే చిరుతిళ్లు మంచివి కావని మనకు తెలుసు. అయినా వాటిని చూసినప్పుడు నోరుకట్టేసుకోలేకపోతాం.అందుకే ఈసారి బయటకు వెళ్లేప్పుడే ముందుగా కొన్ని పండ్ల ముక్కలు తినండి. అతిగా తింటే వచ్చే అనర్థాల గురించి తెలుసుకోండి. మితంగా తినండి. కచ్చితంగా మీరనుకున్న నిర్ణయాన్ని అమలు చేసే శక్తి మీకొస్తుంది.
అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని.. ఖర్చుకి ఖాతా నిర్వహణ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ కంటికి నచ్చిన వస్తువు కనిపించగానే దాన్ని కొనకుండా ఆగలేరు. నెల చివర్లో ఎంత ఖర్చుపెడుతున్నారో కూడా లెక్క తెలియదు. ఈ పరిస్థితి మారి ఖర్చు అదుపులో ఉండాలంటే జీతం చేతికి రాకముందే ఖర్చుల జాబితా సిద్ధమైపోవాలి. షాపింగ్‌కి వెళ్లేప్పుడు డబ్బులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వెంట తీసుకెళ్లకపోవడమే మంచిది. దీనివల్ల ఖర్చు అదుపులో ఉంటుంది. మీకూ ఆర్థిక ప్రణాళిక అలవడుతుంది.

09:17 - May 16, 2016

రాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లు కొన్ని చిట్కాలు పాటించి హాయిగా రాత్రంతా నిద్రపోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ చిట్కాలేమిటో మనమూ తెలుసుకుందామా!
రాత్రి నిద్రపట్టడం కష్టంగా ఉండేవాళ్లు పగటిపూట పడుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా మధ్యాహ్నం మూడు దాటాక అస్సలు నిద్రపోకూడదు. సాయంత్రం ఐదు తర్వాత కాఫీ, టీ, చాక్లెట్లు, శీతల పానీయాల్లాంటి కెఫీన్‌ ఉన్న పదార్థాలు తినకుండా ఉంటే మంచిది.
రాత్రి భోజనానికి, నిద్రకీ మధ్య కనీసం మూడు గంటల సమయం ఉండేట్లు చూసుకోవాలి. రాత్రిపూట మరీ ఎక్కువ కాకుండా మధ్యాహ్నం తిన్నదాంట్లో సగం తింటే చాలు. దాంతో శరీరం తేలిగ్గా ఉంటుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పడుకున్న పదిహేను నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు. అలా కాకుండా ఎక్కువ సమయం పడుతుంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారనో, ఆందోళనలో ఉన్నారనో అర్ధం. కాబట్టి నిద్రపోవడానికి ముందు చికాకు, ఆందోళన కలిగించే విషయాలు మాట్లాడకూడదు. వీలైనంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. పుస్తకం చదవడం, పాటలు వినడం, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వంటివి మనసుకీ, శరీరానికీ హాయి కలిగిస్తాయి.
ఫోన్లను దూరంగా పెట్టేయాలి. వాటి నుంచి వచ్చే రేడియేషన్‌ కూడా నిద్ర పట్టకపో వడానికి కారణం అవుతుంది. అంతేకాదు, కళ్లపై వెలుతురు పడకుండా చూసుకోవాలి. చీకట్లో నిద్ర కలిగించే హార్మోన్లు బాగా పనిచేస్తాయి. వీలైనంత వరకు రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చేయాలి. ఈ క్రమం తప్పినా కొన్నిసార్లు నిద్ర దూరం అవుతుంది.

పలు చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయ్యింది. అయితే పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. వరంగల్ క్రాస్ రోడ్డులోని బూత్ నెం.104లో ఈవీఎం మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. శనగంపాడు బూత్ నెం 57లో ఈవీఎం మొరాయించడంతో ప్రత్యామ్నాయంగా అధికారులు మరో ఈవీఎం ఏర్పాటు చేశారు. నేలకొండపల్లి మండలం బోదులబండలోని బూత్ నెం 303లో, కూసుమంచి మండలం గురువాయిగూడెంలోని బూత్ నెం 147లో, ఖమ్మం రూరల్ మండలం అరెకోడులో ఈవీఎం లు మొరాయించాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే పనిలో మునిగిపోయారు.బారులు తీరిన ఓట్లు మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

వైస్‌ ఎంపీపీ హత్య కేసులో నిందితుల అరెస్ట్...

తూ.గో: పెద్దాపురం వైస్‌ ఎంపీపీ గోపు సతీష్‌రాజా హత్యకేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో దివిలికి చెందిన తండ్రి, ఇద్దరు కొడుకులున్నారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

08:27 - May 16, 2016

నెల్లూరు : వెంకటగిరి మండలం గొట్లగుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలం బావిలో పడి చనిపోయారు. చిన్నారులు హరీష్‌, సిద్దమ్మ నిన్న సాయంత్రం టీవీ చూసేందుకు ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. వాళ్లకోసం గాలిస్తుండగా బావిలో చనిపోయి కనిపించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

08:26 - May 16, 2016

కొచ్చి : కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ స్టేషన్ల వద్ద ప్రజలు బారులు తీరారు. ఈ ఎన్నికల కోసం 52వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేరళలో 140 స్థానాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 109 మంది మహిళ అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల్లో 344 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 9,41,935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

08:23 - May 16, 2016

చెన్నై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు ఓటు వేయడానికి బారులు తీరారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ హీరోలు రజినీకాంత్,అజిత్,కమల్‌హాసన్... డీఎంకే అధినేత కరుణానిధి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 3776 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.

08:22 - May 16, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికలో అక్కడక్కడ ఈవీఎంలు ఇబ్బంది పెడుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం శనగంపాడులోని బూత్ నెం.57లో ఈవీఎం మొరాయించింది. దీంతో పోలింగ్ అధికారులు ఓటర్లను వెనక్కి వెళ్లిపొమ్మంటున్నారు. ఫలితంగా ఓటర్లు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి .

శనగంపాడు లో మొరాయించిన ఈవీఎం

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభం అయ్యింది. ఖమ్మం రూరల్ మండలం శనగంపాడులోని బూత్ నెం 57 లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు నిరుత్సాహంతో ఆందోళనకు దిగారు. మరో వైపు ఈసీ అధికారులు టెక్నీషియన్స్ వచ్చి బాగు చేస్తే తప్ప ఓటు వినియోగించుకునేందుకు అవకాశం లేదని.. ఓటర్లు వెనక్కి వెళ్లాలని తెలిపారు.

యానాంలో కొనసాగుతున్న పోలింగ్...

యానాం : కేంద్ర పాలిత ప్రాంతం యానాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. యానాంలో మొత్తం 35 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 36,557 ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 17,544 స్త్రీలు 17,013 మంది ఉన్నారు. రిటర్నింగ్‌ అధికారి పార్థిబన్‌, సాధారణ ఎన్నికల పరిశీలకుడు కౌషిక్‌ హల్దార్‌ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

భారత శాంతి సైనికులకు ఐరాస పతకాలు..

ఢిల్లీ : గత ఏడాది ఐరాస శాంతి పరిరక్షణ చర్యల్లో పాల్గొని, ప్రాణాలర్పించిన నలుగురు భారత శాంతి సైనికులు, ఒక పౌరుడికి ప్రతిష్టాత్మక పతకాలు దక్కనున్నాయి. ఈ డ్యాగ్‌ హామర్‌స్కోల్డ్‌ పతకాన్ని ఈ నెల 29న ఐరాస శాంతిపరిరక్షకుల దినోత్సవం రోజున అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 124 మంది దీనికి ఎంపికయ్యారు. భారత్‌ తరఫున హెడ్‌ కానిస్టేబుల్‌ శుభకరణ్‌ యాదవ్‌, రైఫల్‌మన్‌ మనీశ్‌ మాలిక్‌, హవల్దార్‌ అమల్‌ డేకా, నాయక్‌ రాకేశ్‌ కుమార్‌, గగన్‌ పంజాబీలకు ఈ పతకాలు దక్కనున్నాయి.

 

07:46 - May 16, 2016

హైదరాబాద్ : టిడిపి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అంటే ప్రహసనమే తప్ప మరొక టి కాదు అని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. స్నేహానికి ప్రాధాన్యత ఇస్తున్న టిడిపి.. ప్రత్యేక హోదా పై పోరు చేయగలదా? హోదా పై ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చిందా? మోదీ తో చంద్రబాబు భేటీ లాభం ఉంటుందా? కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకుంటే నష్టం జరుగుతుందా? ఓటు కు నోటు కేసు వల్ల చంద్రబాబు మెతక వైఖరి తీసుకున్నారా? హోదా ఇవ్వమని తేల్చి చెప్పినా చంద్రబాబు 17వ తేదీ కేంద్ర మంత్రులతో భేటీ అయి ఏమి చెప్పబోతున్నారు? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెల్లపల్లి రవితో పాటు కాంగ్రెస్ నేత గౌతమ్ , బిజెపి నేత మాధవ్, టిడిపి నేత రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నేడు ఆర్టీఏ కార్యాలయానికి మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ, పురపా లక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి రానున్నారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకునేందుకు స్వయంగా మంత్రి ఆర్టీఏ కార్యాలయానికి వస్తున్నారని హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా శాఖ కమిషనర్‌ టి.రఘునాథ్‌ తెలిపారు. మంత్రి రానుండడంతో ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్

హైదరాబాద్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ సంప్రదాయ పంచెకట్టులో చెన్నైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన రజనీకాంత్ నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. పోలింగ్ సిబ్బంది వద్ద వేలికి ఇంకు గుర్తును వేయించుకున్న రజనీకాంత్... తన ఓటు హక్కును వినియోగిస్తున్నట్లు సంతకం చేసి ఆ తర్వాత తన ఓటును వేశారు.

ప్రారంభమైన పాలేరు ఉప ఎన్నిక పోలింగ్

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (గంట సమయాన్ని అదనంగా పెంచారు) పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని 243 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది.

06:58 - May 16, 2016

విశాఖ : నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశే ఎదురైంది. 10 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ప్రైవేట్‌ వాతావరణ సంస్థలు ఇచ్చిన ప్రకటనల్లో వాస్తవం లేదని భారతీయ వాతావరణ విభాగం స్పష్టం చేసింది.                                                                                                             
సమయానికి కూడా రావని ఐఎండీ తేల్చిపారేసింది. ...
నైరుతి రుతుపవనాలు ముందుగా కాదు కాదా.. సమయానికి కూడా రావని ఐఎండీ తేల్చిపారేసింది. జూన్‌ 7వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశమంతటా రుతుపవనాల గమనం ఆలస్యమవుతుందని తెలిపింది. సాధారణంగా అయితే.. జూన్‌ 1వ తేదీ నుంచి నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు వస్తాయని.. కానీ.. ఈసారి అందుకు విరుద్ధంగా జూన్‌ 7న రుతుపవనాలు కేరళకు రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆలస్యంగా రావడం అసాధారణమేమీ కాదు...

గత 11 ఏళ్లలో రుతుపవనాల రాకను పరిశీలిస్తే.. గతేడాది మాత్రమే రుతుపవనాలు ఐఎండీ అంచనాలను తారుమారు చేస్తూ ముందస్తుగా వచ్చాయంటున్నారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం అసాధారణమేమీ కాదంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో దక్షిణాదిన వాతావరణం చల్లబడుతుందని.. ఉత్తరాదిన మాత్రం వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి.. మంగళవారం నుంచి తమిళనాడు రాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. దీని ప్రభావంతో తెలంగాణ, కర్ణాటక, కేరళలోనూ వర్షప్రభావం ఉంటుందని తెలిపారు. మొత్తానికి రుతుపవనాలు ముందే వస్తాయని ఆశపడ్డ ప్రజలకు వాతావరణ శాఖ ప్రకటన నిరాశనే మిగిల్చింది.

06:51 - May 16, 2016

గుంటూరు : మట్టి పెళ్లలు పడి.. ఏడుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాధ్యుడిని శిక్షించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రజా సంఘాలు చేసిన ఒత్తిళ్లతో అధికారులు కదిలారు.. బాధిత కుటుంబాలకు పదిలక్షల రూపాయలను అందజేశారు... అలాగే కార్పొరేషన్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. బిల్డర్‌ లైసెన్సును రద్దు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. మరోవైపు.. కార్మిక, ప్రజా సంఘాల పది డిమాండ్‌లపై ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రజాసంఘాలు ఆందోళనలు విరమించాయి.

మట్టి పెళ్లలు కూలిన ఘటనలో ఏడుగురు మృతి...

గుంటూరులోని లక్ష్మీపురంలో.. సెల్లార్‌ తవ్వకం ఏడు నిండు ప్రాణాలను సమాధి చేసింది. అధికారుల అలసత్వం.. బిల్డర్‌ నిర్లక్ష్యం.. నలుగురు విద్యార్థులు సహా ఏడుగురిని మృత్యువుపాలు చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాధితుల పక్షాన.. సీపీఎం సహా 17 వామపక్ష, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఓవైపు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టాయి.

మృతులు ఒక్కొక్కరికి పాతిక లక్షలు...

గుంటూరు ఘటనలో మృతులు ఒక్కొక్కరికి పాతిక లక్షలు చొప్పున.. వారి కుటుంబ సభ్యులకు పరిహారంగా అందించాలని వామపక్ష, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. వీటితో పాటు మొత్తం పది డిమాండ్‌లతో.. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వీరి ధర్నాలతో గుంటూరు జీజీహెచ్‌ ప్రాంగణం దద్దరిల్లింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. మృతుల కుటుంబాలకు 20లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బిల్డర్‌ నుంచి 15 లక్షలు, సర్కారు తరఫున 5 లక్షలు ఇస్తామని వెల్లడించింది. బాధితుల కుటుంబాలకు సహాయంపైనా.. ఈనెల 17న వామపక్ష, ప్రజా సంఘాల ప్రతినిధులతో భేటీ నిర్వహిస్తామని తెలిపింది. దీంతో వామపక్షాలు ఆందోళన విరమించాయి.

సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం....

గుంటూరులో మట్టిపెళ్లలు పడి ఏడుగురు మరణించిన ఘటనను ప్రభుత్వమూ సీరియస్‌గా తీసుకుంది. భవన నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ కార్పొరేషన్‌ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌ సువర్ణకుమార్‌ను సస్పెండ్ చేసింది.. డిప్యూటీ సిటీ ప్లానర్‌ సత్యనారాయణ, సిటీ ప్లానర్‌ ధనుంజయరెడ్డిలకు షోకాజు నోటీసులు పంపింది.. బిల్డర్‌ రమేశ్, టెక్నికల్‌ పర్సన్‌ హరిబాబు లైసెన్సులు రద్దు చేసింది.. అలాగే ఇంజనీర్‌ వీఏ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వర్క్‌ సూపర్‌వైజర్ సాంబశివరావు, మేస్త్రి యుగంధర్‌, కాంట్రాక్టర్‌ వినోద్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు..

మృతుల్లో ముగ్గురు విద్యార్థులు...

మరోవైపు.. ఈ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వేసవి సెలవుల్లో ఇంటికివచ్చిన స్టుడెంట్స్... తల్లిదండ్రులకు సహాయంగా కూలీ పనికి వచ్చి మృత్యువాత పడ్డారు. చేతికి ఎదిగివచ్చిన పిల్లలు ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు..

బాధితులను రాజకీయ ప్రముఖులు...

మరోవైపు.. బాధితులను రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఒక్కో బాధిత కుటుంబానికి పార్టీ తరఫున 50వేల రూపాయలిస్తామని ప్రకటించారు. అంతకుముందు లక్ష్మీనగర్‌ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను మంత్రి చినరాజప్ప, రావెల కిషోర్‌బాబు... పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు..

06:47 - May 16, 2016

హైదరాబాద్ : నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. నాలుగైదు రోజుల పసికందును చెత్తబుట్టలో పడేశారు కసాయి తల్లిదండ్రులు. శిశువు ఏడుపు విన్న స్థానికులు స్పందించారు. 108కి ఫోన్‌ చేసి పాప ప్రాణాలు రక్షించారు. పసికందును చెత్తలో పడేసేందుకు కన్నతల్లికి మనసెలా ఒప్పిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గుక్కపెట్టి ఏడుస్తున్న పసిపాప...........

శిశువు ఏడుపు విని అక్కడకు చేరుకున్న స్థానికులు, వాహనదారులకు కళ్లెదుట దారుణం కనిపించింది. రోడ్డు పక్కన ఉన్న డస్ట్‌బిన్‌ నుంచి శిశువు ఏడుపు వినిపిస్తోంది. ఓ గుడ్డ విప్పి చూస్తే నాలుగైదు రోజుల ఆడశిశువు గుక్కపెట్టి ఏడుస్తోంది.

చంపాపేట పోచమ్మ గుడి వద్ద ఘటన ......

హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలోని చంపాపేట పోచమ్మ గుడి సమీపంలో ఈ ఘటన జరిగింది. చెత్త మధ్యలో పాపను గుర్తించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్‌ చేశారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది పాపకు ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు రక్షించారు. అనంతరం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు.

పలువురు ఆగ్రహం ...

సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. ఆడపిల్లల సంరక్షణ కోసం ఎన్ని పథకాలు చేపట్టినా.. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయని ఆరోపించారు. తల్లిదండ్రులకు పిల్లలను పెంచడం చేతకాకపోతే ఎవరికైనా దత్తతకు ఇవ్వడమో లేకపోతే ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలకు ఇవ్వడమో చేయాలి గానీ.. ఇలాంటి దురాఘతాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బిడ్డను చెత్తలో పడేయడానికి ఆ తల్లికి మనసు ఎలా ఒప్పిందంటున్నారు.

ఆడ శిశువు కావడం వల్లే ఈ దురాఘతానికి ...

అయితే.. కేవలం ఆడ శిశువు కావడం వల్లే ఈ దురాఘతానికి పాల్పడి ఉంటారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి పాప ప్రాణాలైతే దక్కాయి కానీ.. భవిష్యత్‌లో పాప పరిస్థితి ఏంటి ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తిరుపతిలో ఘనంగా గంగమ్మ జాతర

చిత్తూరు : తిరుపతిలో గంగమ్మ జాతర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వారం రోజుల పాటు జరుగనున్న జాతరతో నగరం సందడిగా మారింది. రకరకాల వేషాలు ధరించే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతి గ్రామ దేవతగా కొనియాడే గంగమ్మ,.కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ది గాంచింది. గత మంగళవారం ప్రారంభమైన జాతన సంబరాలు ఈ మంగళవారంతో ముగియనుంది.

స్వచ్ఛ హైదరాబాద్ కు ఏడాది

హైదరాబాద్ : ఐదు రోజుల పాటు సాగిన స్వచ్ఛ హైదరాబాద్ లో 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పొడి, తడి చెత్త విడివిడిగా సేకరిస్తామంటూ 44 లక్షల చెత్త బుట్టలు కొన్నారు. 1750 ఆటో టిప్పర్లు పంపిణీ చేశారు. కానీ, ఎక్కడ చెత్త అక్కడే వుంది. చెత్త సేకరణ, రవాణా విధానంలో ఏ మార్పులూ రాలేదు.

06:42 - May 16, 2016

హైదరాబాద్ : ఐదు రోజుల పాటు సాగిన స్వచ్ఛ హైదరాబాద్ లో 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పొడి, తడి చెత్త విడివిడిగా సేకరిస్తామంటూ 44 లక్షల చెత్త బుట్టలు కొన్నారు. 1750 ఆటో టిప్పర్లు పంపిణీ చేశారు. కానీ, ఎక్కడ చెత్త అక్కడే వుంది. చెత్త సేకరణ, రవాణా విధానంలో ఏ మార్పులూ రాలేదు.

మహాయజ్ణంలా స్వచ్ఛ హైదరాబాద్...

సరిగ్గా ఏడాది క్రితం అయిదు రోజుల పాటు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఓ మహాయజ్ణంలా సాగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనాడు ఓ అబ్బుర ద్రుశ్యం. 400 యూనిట్లుగా విభజితమైన గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 37వేల మంది ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఓ రికార్డు. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ అధికారులు 5 రోజుల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆ అయిదు రోజుల్లోనే 45,753 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. రోడ్ల మీద 16,997 పాట్ హోల్స్ పూడ్చేశారు. 283 ఫుట్ పాత్ లు, 219 వర్షపునీటి నాలాలు రిపేర్లు చేశారు. ఆ అయిదు రోజుల్లో దాదాపు 8 కోట్లు ఖర్చు చేశారు. అయితేనేం, ఆ అయిదు రోజుల పనిని చూసినవారు ఇక హైదరాబాద్ మరింత సుందరనగరంగా మారుపోతుందంటూ ఆశపడ్డారు. తమ ప్రాంత సమస్యలను ఏకరువు పెడుతూ 8562 వినతిపత్రాలు సమర్పించారు. కానీ ఆ తర్వాత ఏమైంది? ఆ అయిదు రోజుల స్పూర్తి ఏమైపోయింది?

ఆకాలనీలు చూస్తే దు:ఖం...

పార్శీగుట్ట మెయిన్ రోడ్డు దగ్గరకు వెళ్తే ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాంతం ఇదేనా అన్న అనుమానం బాధ కలుగుతాయి. గవర్నర్ నరసింహన్ పాల్గొన్న ఆనంద్ కాలనీ, వెంకటరమణ కాలనీ, పద్మావతి కాలనీలను ఒక్కసారి చూసొస్తే దు:ఖం వస్తుంది.

ప్రతి ఇంటికి రెండేసి చెత్తబుట్టలు...

జీహెచ్ఎంసి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రతి ఇంటికి రెండేసి చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఒక దానిలో పొడి చెత్త, మరో దానిలో తడి చెత్త సేకరిస్తామన్నారు. కానీ, ఆచరణలో ఏ జరుగుతున్నదో హైదరాబాద్ వాసులకు తెలుసు. చెత్త రవాణాకు 2500 ఆటో టిప్పర్లు సమకూర్చాలన్నది టార్గెట్. 1750 ఆటో టిప్పర్లు సమకూర్చారు. కానీ, ఇందులో పనిచేస్తున్నవి సగమే.

రూ.201 కోట్లు కేటాయించిన జీహెచ్ ఎంసీ.....

ప్రజలు సూచించిన 8562 సమస్యల పరిష్కారానికి 729 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందంటూ అంచనా వేసిన జీహెచ్ఎంసి 201 కోట్లు కేటాయించింది. 5150 పనులు టేకప్ చేసిన జీహెచ్ఎంసి 2000 పనులు పూర్తి చేసింది. వీటికి 85 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో 41 కోట్ల రూపాయలతో 750 పనులు చేస్తుననారు. అంటే నిర్ధేశించుకున్న లక్ష్యంలో సగం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ఇలాగైతే, స్వచ్ఛ హైదరాబాద్ కలను సాకారం చేసుకోవడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో...? గాలి దుమ్ము ధాటికి చెట్లు విరిగిపడుతున్నాయి. కరెంట్ వైరులు తెగిపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి కరెంట్ పోతోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో విద్యుత్ శాఖవారు హైదరాబాద్ రోడ్ల వెంట అడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలు కత్తిరించి, కరెంట్ కష్టాలు రాకుండా చూసేవారు. ఈసారి ఎందుకో ఆ బాధ్యత మరిచారు. స్వచ్ఛ హైదరాబాద్ కల సాకారం కాలేదు. జనం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని నడవాల్సిన పరిస్థితి వచ్చింది.

06:37 - May 16, 2016

విజయవాడ : మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ కార్పొరేటర్ల తీరుపై మహిళలు ఆందోళన ఉధృతం చేశారు. కార్పొరేటర్లపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం ఆగదని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కార్పొరేటర్లకు మేయర్‌ అండగా నిలబడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ నేటి నుంచి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాయి.

మహిళా సంఘాలు ఆగ్రహం...

విజ్ఞానయాత్రకు వెళ్లి..మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే అపఖ్యాతిని మూటగట్టుకుని వచ్చిన విజయవాడ కార్పొరేటర్లపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనలను మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్‌ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టిన మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేయడంపై మండిపడుతున్నాయి.

మరోసారి ఆందోళనకు ...

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోకపోతే మరోసారి ఆందోళనకు సిద్ధమవుతామని ఐద్వా హెచ్చరించింది. కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరితే పోలీసుల చేత మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేయడం దారుణమని ఐద్వా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ....

మరోవైపు విజయవాడ పరువును బజారుకీడ్చిన నగర కార్పొరేటర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం నగరపాలక సంస్థ సమీపంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి. కార్పొరేటర్లకు మద్దతుగా మేయర్‌ మాట్లాడడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. యాత్రల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగంపై చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నీట్ పై ఢిల్లీలో కీలక భేటీ

ఢిల్లీ : నీట్‌పై కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో నీట్‌లో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తారు. కొన్ని రాష్ట్రాలు నీట్‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

06:35 - May 16, 2016

ఢిల్లీ : నీట్‌పై కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో నీట్‌లో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తారు. కొన్ని రాష్ట్రాలు నీట్‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రాల వైద్యారోగ్య శాఖల మంత్రులతో భేటీ

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష.. నీట్‌ను సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. నీట్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు వినిపించిన వాదనలను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఢిల్లీలో రాష్ట్రాల వైద్యారోగ్య శాఖల మంత్రులతో సమావేశం అవుతున్నారు. నీట్‌తో ఎదురయ్యే ఇబ్బందులను ఈ భేటీలో చర్చిస్తారు. ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాదికి నీట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినా... సుప్రీంకోర్టు మాత్రం ఒప్పుకోలేదు. ఇంతకు ముందు ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీలు సొంత ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేవి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడీ అవకాశం లేదు. దీంతో కొంత మంది ఎంపీలు ఈసారికి నీట్‌ను నిలివేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్రాల వైద్యారోగ్య శాఖల మంత్రులు భేటీలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు.

ప్రాంతీయ భాషల్లో బోర్డు పరీక్షలు .....

నీట్‌ను సీబీఎస్‌ఈ మీడియం సిలబస్‌ ఆధారంగా నిర్వహిస్తారు. కానీ రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రాంతీయ భాషల్లో చదివారు. దీంతో నీట్‌ ప్రశ్న పత్రాలను సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా తయారు చేస్తే... రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులు నస్టపోతారన్న వాదనలు వినిపిస్తున్నారు. విద్యార్థులతోపాటు పాటు, వీరి తల్లిదండ్రులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాంతీయ భాషల్లో కూడా నీట్‌ నిర్వహించాలన్నవాదనలు ఉన్నాయి. నీట్‌ను ఇంగ్లీషు, హిందీతోపాటు 7 ప్రాతీయ భాషల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని భారతీయ వైద్య మండలి.. సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ అంశాలను కూడా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు సమావేశంలో చర్చిస్తారు.

06:32 - May 16, 2016

తూ.గో : ఏపీ హోంమంత్రి చినరాజప్ప నియోజకవర్గంలో దారుణం జరిగింది. పెద్దాపురం మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు గోపు సతీష్‌రాజును ఆరుగురు దుండగులు నరికి చంపారు. దీంతో దివిలి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. విషయం తెలుసుకున్న హోంమంత్రి చినరాజప్ప.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా.. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు మంత్రిని ఘోరావ్‌ చేశారు.

06:30 - May 16, 2016

విజయవాడ : ఏపీ కి కేంద్రం నుంచి అందిన సాయం విషయంలో బిజెపి నాయకులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనల్లో వాస్తవం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులపై చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. మోదీ సర్కార్‌ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై నివేదిక రూపొందించింది. అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీకి రావాల్సిన వాటానే ఇచ్చారు కానీ, ప్రత్యేకంగా చేసిన సాయం ఏమీలేదన్నది నివేదిక సారాంశం. రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ వివరాలను కేంద్రానికి అందజేసే అవకాశాలున్నాయి.

టీడీపీ పాలకులు, నేతల వాదనలు మరో విధంగా....

ఏపీ బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో మేలు చేసిందన్నది కమలనాథుల వాదన. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ పాలకులు, నేతల వాదనలు మరో విధంగా ఉన్నాయి. బీజేపీ నాయకులు గోరంతలను కొండంతలుగా చేసి చూపిస్తుందని తెలుగు తముళ్ల విమర్శ. ఈ నేపథ్యంలో రెండేళ్ల కాలంలో కేంద్రం నుంచి ఏపికి అందిన సాయంపై సవివర గణాంకాలతో ఏపీ ప్రభుత్వం నివేదిక రూపొందించింది.

2014-15లో 35 వేల కోట్లు.............

కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదన్న వాదాన్ని టీడీపీ నాయకులు లేవనెత్తున్నారు. కేంద్ర నుంచి ఏపీకి 70 వేల కోట్ల సాయం అందిందన్నది కమలనాథుల వాదన. 2014-15లో 35 వేల కోట్లు, 2015-16లో 43,467 కోట్ల నిధులు అందిన మాట వాస్తవమేనని ఏపీ ప్రభుత్వం నివేదిక చెబుతోంది. అయితే ఇదేమీ ప్రత్యేకంగా చేసిన సాయం కాదు.. 14వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం అన్ని రాష్ట్రాలతో సమానంగా జనాభా నిష్పత్తి ప్రకారం నిధులిచ్చారని లెక్క తేల్చారు. దేశ జనాభాలో 4 శాతం వాటా ఉన్న ఏపీకి అన్ని రాష్ట్రాల మాదిరిగానే పన్నుల్లో వాటా ఇచ్చారు. అదే విధంగా రాష్ట్ర వార్షిక ప్రణాళికకు కేంద్ర మద్దతు లభించింది. విదేశీ ఆర్ధిక సాయం అందిందని నివేదికలో పొందుపరిచారు.

పన్నుల్లో 100 శాతీం రాయితీ కల్పించలేదు .........

విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని విషయాన్ని నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. పన్నుల్లో వందశాతం రాయితీ, విదేశీ ఆర్ధిక సాయంలో 90 శాతం గ్రాంటుల్లాంటి ప్రయోజనాలు కల్పించని అంశాలను పొందుపరిచినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఉంటే కేంద్రం నుంచి 90 శాంత గ్రాంటు లభిస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి అందే రుణాల్లో 90 శాతం గ్రాంటుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా లేకపోతే కేంద్రం ఇచ్చే గ్రాంటు 60 శాతమే. విదేశీ రుణాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని నివేదికలో పొందుపరిచారని తెలుస్తోంది.

15 శాతం అదనపు తరుగుబడి రాయితీ ..........

ఏపీకి ప్రత్యేక సాయంపై బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు చేస్తున్నప్రకటనలు కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 15 శాతం అదనపు తరుగుబడి రాయితీ, 15 శాతం అదనపు పెట్టుబడి రాయితీ వల్ల తక్షణ ప్రయోజనం ఉండదన్న విషయాన్ని నివేదికలో చేర్చారని సమాచారం. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలు లాభాట బాట పట్టినప్పుడు మాత్రమే ఈ రెండు రాయితీలతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. రెవిన్యూ లోటు భర్తీకి కేంద్రం ఇస్తున్న గ్రాంటు కూడా ఏటేటా తగ్గిపోతోంది. మొదటి సంవత్సరం 6,600 కోట్ల రూపాయలుగా ఉన్న ఈ గ్రాంటు రెండో సంవత్సనం 4,600 కోట్లకు తగ్గిన విషయాన్ని నివేదికలో విశదీకరించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం కల్పించిన ఆర్ధిక వెసులుబాటు రెండేళ్లలో 7 వేల కోట్ల రూపాయాలకు మించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

నివేదిక ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే యోచన ..............

చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ వివేదికను ప్రధాని మోదీకి అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం భారీగా సాయం చేసిందని బీజేపీ నాయకులు ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో... వాస్తవాలను మోదీకి నివేదిక రూపంలో వివరించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో... ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి నష్టమేనన్నది చంద్రబాబు వాదన. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇటు టీడీపీ నేతలు, అటు బీజీపీ నాయకుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

06:25 - May 16, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మొత్తం 243 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. మొత్తం లక్ష 90వేల 196మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజక వర్గాన్ని ఎన్నికల అధికారులు 25రూట్‌లుగా విభజించారు. 243మంది ప్రిసైడింగ్ అధికారులను,మరో 243మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులను నియమించారు. వీరుకాకుండా 729మంది పోలీసు అధికారులను విధులకు వినియోగిస్తున్నారు. పోలింగ్‌ కోసం మొత్తం 2698మంది సిబ్బందిని ఎన్నికల అధికారులు వినియోగించుకుంటున్నారు. సిబ్బంది రవాణాకోసం 79 బస్సులను ఉపయోగిస్తున్నారు.

పండగ వాతావరణం ఉట్టిపడేలా పోలింగ్‌ ఏర్పాట్లు-కలెక్టర్ దానకిషోర్...

ప్రజాస్వామ్యంలో ఓటింగ్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఓటింగ్‌ ప్రక్రియను పండగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహిస్తామని కలెక్టర్ దానకిషోర్ అన్నారు. అందుకు వీలుగా 12 పోలింగ్‌ కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోడల్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలను అందంగా తీర్చిదిద్ది, ప్రవేశ ద్వారం వద్ద సంకేత సూచీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఓటర్లు ఎండలో నిలబడకుండా ఏసీ గదుల ఏర్పాటుతోపాటు, మినరల్ వాటర్ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా వీవీప్యాట్‌ల వినియోగం...........

దేశంలోనే మొట్టమొదటిసారిగా పాలేరులో వీవీప్యాట్‌లను వినియోగిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీని ద్వారా ఓటర్లు తాము ఎవరికి ఓటేశారో అప్పటికప్పుడే తెలుసుకునే వీలుంటుందన్నారు. వీవీప్యాట్‌పై ఓటర్లకు అవగాహన కల్పించామని కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో పోలింగ్‌..

హైదరాబాద్ : ఇవాళ జరగనున్న మూడు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

 

పాలేరు పోరుకు సర్వం సిద్ధం...

ఖమ్మం : పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (గంట సమయాన్ని అదనంగా పెంచారు) పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని 243 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది.

రుతుపవనాలు 6 రోజులు ఆలస్యం

విశాఖ : నైరుతి రుతుపవనాలు ఆరు రోజులు ఆలస్యమయ్యేలా ఉన్నాయని భారత వాతావరణశాఖ (ఐ.ఎం.డి.) అంచనా వేస్తోంది. జూన్‌ 1 బదులు 7వ తేదీన ఇవి కేరళ తీరాన్ని తాకవచ్చని ఐ.ఎం.డి. ఆదివారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. 2015 మినహాయిస్తే 2005 నుంచి 2014 వరకు రుతుపవనాల ఆగమనంపై ఐ.ఎం.డి. అంచనాలు కచ్చితంగానే ఉన్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావడం అసాధారణ పరిణామమేమీ కాదని ఐ.ఎం.డి. డైరెక్టర్‌ జనరల్‌ లక్ష్మణ్‌సింగ్‌ రాఠోడ్‌ పేర్కొన్నారు.

Don't Miss