Activities calendar

17 May 2016

బాగ్దాద్ బాంబు పేలుళ్లు...69 మంది దుర్మరణం

బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ వరుస పేలుళ్లతో వణికిపోయింది. ఆత్మాహుతి దాడులు, కారు బాంబులతో దద్దరిల్లింది. వరుసగా జరిగిన నాలుగు భారీ పేలుళ్లలో 69 మంది దుర్మరణం పాలయ్యారు. షియా ముస్లింలు ఎక్కువగా ఉండే షాబ్ ప్రాంతంలో మొదటి బాంబు, సదర్ సిటీలో మరొకటి, రషీద్‌లోని షాపింగ్ ప్రాంతంలో మరో రెండు బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో వంద మందికి పైగా గాయపడ్డారు. షాబ్‌లో దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. షాబ్‌లో ఆత్మాహుతి దాడి జరగ్గా, సదర్ సిటీలో కారు బాంబు పేలింది. హబిబియా జిల్లాలోని ఓ రెస్టారెంట్ వద్ద ఆత్మహుతి బాంబర్ పేల్చేసుకుంది.

21:58 - May 17, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఏపీ కోలుకోలేదని ప్రధానికి చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరానని చెప్పారు. నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు.

ప్రధానితో బాబు భేటీ.....
పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను ముఖ్యమంత్రి.. మోడీ దృష్టికి తీసుకెళ్లారు. సుమారు గంటసేపు కరవుపై చర్చించారు. ఆంధప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం విభజన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

ప్రధానికి చంద్రబాబు సూచన....
రాష్ట్రంలో కరవు సహాయక చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కరవును ఎదుర్కొనేందుకు 2 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు తయారుచేశామని చెప్పారు. జాతీయ స్థాయిలో నదులను అనుసంధానం చేయాలని ప్రధానికి సూచించానని బాబు అన్నారు. కరవును ఎదుర్కొనేందుకు కేంద్రం సహాయం తక్కువుగా ఉందని ప్రధానికి తెలిపానన్నారు.

విభజన సమస్యలపై ప్రధానితో చర్చించా : బాబు

విభజన సమస్యలపై ప్రధానితో చర్చించానని బాబు తెలిపారు. ఐదేళ్ల తర్వాత కూడా ఏపీకి ఆర్థిక లోటు ఉంటుందని సీఎం అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఏపీ కోలుకోలేదని ప్రధానితో చెప్పానన్న చంద్రబాబు..హోదా ఇచ్చినా ప్రాజెక్టులు ఇవ్వకపోతే రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటి వరకూ బాగుపడలేదని చెప్పుకొచ్చారు.

జల వివాదాలను పరిష్కరించే బాధ్యత కేంద్రానిదే-బాబు
నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ అనుమతి ఉంటేనే ప్రాజెక్టులు కట్టాలన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు చంద్రబాబు.

ఎపి నేతలపై తెలంగాణ మంత్రి తలసాని

హైదరాబాద్ : ఎపి నేతలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులను... ఇప్పుడు తాము కడుతున్నామని తెలిపారు. ఎపిలో ఇద్దరి రాజకీయ పోరాటంలో తెలంగాణను లాగొద్దన్నారు. తెలంగాణ ఎడారి కావడానికి కారణం చంద్రబాబే అని ఆరోపించారు. ఎపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమనిన్నారు. చిల్లర రాజకీయాల్లోకి తమను లాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జగన్ కు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 

21:36 - May 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు. కరవు బారిన పడిన ప్రజలను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గాంధీభవన్‌లో టీ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.

గడ్డిట్రాక్టర్‌ బోల్తా, ఒకరు మృతి.....

ప.గోదావరి : జిల్లాలోని పాలకోడేరు మండలం గరగపర్రు దగ్గర యనమదుర్రు డ్రైన్‌లో గడ్డిట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో సంఘటన స్థలంలోనే ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ముజఫర్ నగర్ లో కాల్పులు.. ఇద్దరు మృతి

బీహార్ : ముజఫర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు యువకులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.

ఏపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం

హైదరాబాద్‌ : ఏపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్‌ ఎత్తు పెంచవద్దని లేఖ రాయటం సరికాదని ఆయన అన్నారు. ఆర్డీఎస్‌పై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. అమలు చేయించే బాధ్యత చంద్రబాబుదేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆర్డీఎస్‌పై 15 రోజులుగా మంత్రి దేవినేనికి ఫోన్‌ చేస్తున్నా మాట్లాడుకుందామని చెప్పి దాటవేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ఆక్షేపించారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 10 కోట్ల విలువచేసే 2 కేజీల కొకైన్‌ పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మహిళ వద్ద కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాల కవర్ల ద్వారా మహిళ అక్రమంగా కొకైన్‌ సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో కొకైన్ తో మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది.

20:55 - May 17, 2016

కెరీర్ లో కీలక సమయం.. అంతులేని గందరగోళం..!! ప్రిపేరైన సిలబస్ ఒకటి.. రాయాల్సిన పరీక్ష మరొకటనే సందేహం.. ఈ పరీక్షతో ఒరిగేదేంటి? పోయేదేంటి అనే ప్రశ్నలు. ఇన్నాళ్లూ చదివింది రాసింది.. వదిలేసి కొత్తగా మరో తంతంగం ఏమిటనే అభిప్రాయం.. ఇలా అంతులేని సందేహాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు..!! రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెసులుబాటు ఇవ్వాలనే విజ్ఞప్తులు. మరో పక్క నీట్ వ్యాపారంలో మునిగి తేలుతున్నకోచింగ్ సెంటర్లు.

నీట్ వల్ల తెలుగు విద్యార్ధులకు లాభమా..? నష్టమా..?
ఇదీ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న సీన్. మరి నీట్ వల్ల తెలుగు విద్యార్ధులకు లాభమా..? నష్టమా..? ఏమిటీ నీట్ కథ.. ఈ రోజు వైడాంగిల్ స్టోరీలో చూద్దాం..!! నీట్.. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఒకటే చర్చలో ఉన్న విషయం. దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో అనే ఆందోళన చాలా మంది విద్యార్ధుల్లో నెలకొంది. తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు పెద్ద ప్రభావం చూపదని కొందరు వాదిస్తుంటే, మరికొందరు విద్యార్ధులకు నష్టమే అంటూ వాదనలు వినిపిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతోంది?
ఇన్ని రోజులు ఎంసెట్ కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు.. పరీక్షాకాలం ముగుస్తుందనగా సీన్ రివర్సయింది. ఎంసెట్ కాదు.. నీట్ అని తేలింది. ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు ఇబ్బందికరంగా పరిణమించబోతోందా? సిలబస్ లో చెప్పుకోదగ్గ మార్పులున్నాయా? నీట్ కి ఎంసెట్ ఎగ్జామ్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతోంది?

కోచింగ్ సెంటర్ల దందా....

ఎవరి గందరగోళంలో వారుంటే, కోచింగ్ సెంటర్లు తమ దందాను ఓ రేంజ్ లో నడిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంసెట్ వందల కోట్ల కోచింగ్ గా మారితే.. దానికి అదనంగా నీట్ వచ్చి చేరింది. ఇది విద్యార్ధుల తల్లిదండ్రులకు భారంగా మారితే, కోచింగ్ సెంటర్ల పంట పండిస్తోంది.

నీట్ హీట్ లో విద్యార్ధులు...
నీట్ హీట్ విద్యార్ధి లోకంలో వ్యాపించింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సీట్లు నష్టపోయే ప్రమాదం ఉందా? లేదంటే కొత్త సీట్లు వచ్చే అవశాశం ఉందా? నీట్ తో ప్రైవేట్ మెడికల్ కాలేజీల దందాకు తెరపడే అవకాశాలున్నాయా?

ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి...
కొన్ని ప్లస్ పాయింట్స్ .. మరికొన్ని మైనస్ పాయింట్స్..ఏది ఏమైనా.. దేశమంతటా ఒకే ప్రవేశ పరీక్ష ఉండటం ఆహ్వానించదగ్గ విషయమే. అదే సమయంలో ఒకే సిలబస్ కూడా ఉండాలి. అయితే, అలాంటి ఏర్పాట్లు చేయకుండా.. చివరి నిమిషంలో ఇప్పటివరకు ప్రిపేర్ అవుతున్న పరీక్షను కాదని, కొత్త ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలనటం విద్యార్ధులకు కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఈ అంశంపై ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

20:38 - May 17, 2016

ఆగమైతున్న హరికథ, బుర్రకథలు, కళాకారులను ఆగం చేసిన సిన్మాలు. మల్లన్న సాగర్ మట్టి బిడ్డల కోత కోత. కేసీఆర్ చెప్పింది ఇది గాదొస.ఇంట్ల 20 ఫీట్ల బొక్క తవ్విన తల్లీ బిడ్డలు,కాళీమాతకు బీర్లతో ధూపదీపాలు, బోరులోకి జారిపడ్డ ఎంపీ పూనమ్ మేడమ్...అడ్డుకోబోయి అందులోనే బడ్డ ఆడోల్లు. పాలేరులో ఉప ఎన్నికల్లో ఓట్లు ఈవీఎంలో వచ్చిపడ్డయ్.మళ్లీ వచ్చే ఓట్ల దాకా ప్రజలకు పట్టించుకునే పనే లేదు. మనదేశంలో ఏక్ నిరంజన్ ఎవరు చెప్పురి? ఇంకెవరు మన ప్రధాని మోడీ సారే కదా..కొడుకు ఏం తిన్నడో? ఏంటో ..కొడుకు ఎప్పుడు చూసినా దేశాలు పట్టుకోని తిరుగుతుంటడనీ...మోదీ సారోల్లమ్మ కొడుకిని చూసి పోదామని వచ్చిందంట. ఇక సార్ కు అమ్మను చూడంగనే అన్ని బాధలు మర్చింపోయిండు మోడీ తల్లిని ఇరుకుల కుర్సీలో కూర్చుండబెట్టి తోటలో తిప్పిండు...మరి గిటువంటి మస్తు విషయాలు చెప్పనీకి మన మల్లన్న రెడీగున్నడు జర ఈ వీడియోకేసి ఓ లుక్కేయండి...

టీడీపీ నుండి బీజేపీ అభ్యర్థిగా నిర్మలకు ఎంపీ దక్కేనా?

ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. కాగా ఈరోజు మధ్యహ్నాం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాజ్యసభ స్థానం కేటాయింపుపై బాబుతో ఆమె చర్చించారు. మోదీ భేటీలో రాజ్యసభ స్థానం కేటాయింపుపై బీజేపీ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదని చంద్రబాబు ఎటువంటి చర్చా జరుగలేదని నిర్మలా సీతారామన్ కు బాబు తెలిపారు. బీజేపీ అభ్యర్థికి రాజ్యసభ స్థానం లేదని బాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

19:58 - May 17, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు, కాజల్ తో హీరోయిన్ సమంత యాంకర్ గా వ్యవహరిస్తూ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు, కాజల్ లు బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:49 - May 17, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ మహిళ వద్ద భారీగా కొకైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద 1.99కిలోల కొకైన్ డ్రగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.10కోట్లు వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

19:38 - May 17, 2016

తూ.గోదావరి : ఏపీ ఎంపీ తోట నర్శింహంపై కేసు నమోదయ్యింది. ఓ బాలికను వేధించి వీడియోలు యూట్యూబ్ లో పెడతామని బెదిరిస్తున్నారని బాలల హక్కుల కమిషన్ కు రవి అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ, హోంకార్యదర్శికి జాతీయ బాలల హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈకేసు విషయంలో జూన్ 16లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. భూమి విషయంలో వచ్చిన తగాదాలతో ఎంపీ బాలిక బంధువులను బెదిరించినట్లు తెలుస్తోంది. బాలిక న్యాయవాది సంరక్షణలో వున్నట్లు సమాచారం. కాగా బాలిక తల్లిదండ్రులు ఈ కేసు విషయంలో స్పందించకపోవటం గమనార్హం.

టీడీపీ నేతల ఇష్టారాజ్యం : రమాదేవి  

టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు మహిళల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహిళల విషయంలో మాట్లాడిన తీరు సిగ్గుచేటన్నారు. ఇప్పుడు ఎంపీ నర్శింహంపై ఇటువంటి కేసులు నమోదవుతున్నాయి. కానీ ఎటువంటి న్యాయం జరిగినట్లు కనిపించలేదని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనల్లో నమోదైన కేసులు న్యాయం జరగటంలేదు కాబట్టి కోర్టు ఇలాంటి కేసులను సుమోటోగా తీసుకోవాలన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

లైంగిక వేధింపులు.. క్రికెట్‌ కోచ్‌ అరెస్ట్

హైదరాబాద్‌ : లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో హైదరాబాద్‌లో క్రికెట్‌ కోచ్‌ని అరెస్ట్ చేశారు. తన దగ్గర కోచింగ్‌ తీసుకుంటున్న పిల్లలతో కొచింగ్‌ అనంతరం తన రూమ్‌కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తిన్నాడని 16 ఏండ్ల బాలుడు చందానగర్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోచ్ పై 377, 511లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కొచ్‌ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

గోవాలో పెట్రోల్ ధరపై వ్యాట్ 2 శాతం తగ్గింపు..

పనాజీ : గోవా ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా పెట్రోల్‌ ధర రూపాయలు 60 దాటకుండా చర్యలు చేపట్టింది. విలువ ఆధారిత పన్ను( వ్యాట్‌)ని 2శాతం తగ్గించింది. 22శాతం ఉన్న వ్యాట్‌ విలువని 20 శాతానికి చేర్చింది. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర 59.70ఉంది. ఇటీవల గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ బడ్జెట్‌లో పెట్రోల్‌పై వ్యాట్‌ పెంచాడు. కానీ ఏట్టిపరిస్థితుల్లోనూ 60 రూపాయలకు పెంచమని హమీ నిచ్చాడు. 2012లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వ్యాట్‌ ని పూర్తిగా తగ్గించి 11రూపాయలకు లీటరు చేసింది. ఈ వ్యాట్‌ ట్యాక్స్ తగ్గించడం వలన గోవా ప్రతి సంవత్సరం 150 కోట్లు నష్టపోతోంది.

 

ఇతర రాష్ట్రాలతోపోలిస్తే ఏపీ ఆదాయం తక్కువ : చంద్రబాబు

ఢిల్లీ : ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది.ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆదాయం తక్కువగా వుందనీ..5 ఏళ్ళ తర్వాత కూడా ఏపీకి ఆర్థిక లోటు వుంటుందని తెలిపామన్నారు.రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరామన్నారు.  పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 850 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.1450 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే తప్ప 3,4 ఏళ్ళకు పూర్తయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు. విభజన సమస్యలపై ప్రధానితో చర్చించామన్నారు.

'పోలవరం' కోసం రూ.1450 కోట్లు ఖర్చు చేశాం : సీఎం చంద్రబాబు

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు కోసం రూ.1450 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.850 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఏటా వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఎపికి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంపై పోరాడుతామని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.  

జాతీయస్థాయిలో నదుల అనుసందానం చేయాలి : సీఎం చంద్రబాబు

ఢిల్లీ : జాతీయ స్థాయిలో నదుల అనుసందానం చేయాలని సూచించామని చెప్పారు. ఐదేళ్ల తర్వాత కూడా ఎపిలో రెవెన్యూలోటు ఉంటుందన్నారు. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు అయినా అర్థికలోటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు కాంగ్రెసే కారణమన్నారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. విభజన కావాలని తాము కోరుకోలేదన్నారు. హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారని పేర్కొన్నారు. 

ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి : సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఎపి సీఎం చంద్రబాబు చెప్పారు. నరేగా నిధులను కరువు సహాయక చర్యలకు వాడుకుంటున్నామని చెప్పారు. రెయిన్ గన్ల ద్వారా 20 లక్షల ఎకరాల్లో పంటను కాపొడొచ్చన్నారు. కరువుపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. కరువు, వ్యవసాయం స్థితిగతులపై గంట సేపు సమావేశం కొనసాగిందని చెప్పారు. ప్రధానితో సమావేశం అయింది.... నిధులు అడగడానికి కాదన్నారు. కరువుకు అదనంగా నిధులు అడగలేదన్నారు. 

కరువుకు మానవ తప్పిదాలే కారణం : సీఎం చంద్రబాబు

ఢిల్లీ : మానవ తప్పిదాల వల్లే కరువు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువును సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 450 లిఫ్టు ఇరిగేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరాకు కృషి చేస్తున్నామని తెలిపారు.

టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై కేసు నమోదు...

తూ.గోదావరి : టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై కేసు నమోదయ్యింది. ఓ బాలికను వేధించి వీడియోలు యూట్యూబ్ లో పెడతామని బెదిరిస్తున్నారని బాలల హక్కుల కమిషన్ కు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. నర్శింహంతో పాటు మరో నలుగురిపై కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

18:47 - May 17, 2016

ఢిల్లీ : మానవ తప్పిదాల వల్లే కరువు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువును సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 450 లిఫ్టు ఇరిగేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరాకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. నరేగా నిధులను కరువు సహాయక చర్యలకు వాడుకుంటున్నామని చెప్పారు. రెయిన్ గన్ల ద్వారా 20 లక్షల ఎకరాల్లో పంటను కాపొడొచ్చన్నారు. కరువుపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. కరువు, వ్యవసాయం స్థితిగతులపై గంట సేపు సమావేశం కొనసాగిందని చెప్పారు. ప్రధానితో సమావేశం అయింది.... నిధులు అడగడానికి కాదన్నారు. కరువుకు అదనంగా నిధులు అడగలేదన్నారు. జాతీయ స్థాయిలో నదుల అనుసందానం చేయాలని సూచించామని చెప్పారు. ఐదేళ్ల తర్వాత కూడా ఎపిలో రెవెన్యూలోటు ఉంటుందన్నారు. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు అయినా అర్థికలోటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు కాంగ్రెసే కారణమన్నారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. విభజన కావాలని తాము కోరుకోలేదన్నారు. హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.1450 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.850 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఏటా వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఎపికి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంపై పోరాడుతామని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.  

 

18:44 - May 17, 2016

విద్యార్ధులకు పోటీ పరీక్షలకు సిద్ధమవతున్న తరుణంలో పరీక్షలకు అటెండ్ అయ్యే విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి? అనే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో జ్యోతిరాజా (ఛైల్డ్ సైకాలజిస్ట్ ), నరేష్ (జ్ఞాన్ విల్లే అకాడమి) , భరత్ (9 ఎడ్యుకేషన్ అకాడమి) పాల్గొని వారి సూచనలు, సలహాలు తెలియజేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ముఖ్యంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వుండాలన్నారు. సరైన పోషకాహారం తీసుకుంటే చదువుకునే సమయంలో అలసట రాకుండా వుంటుందని తెలిపారు. పాఠాలను బట్టీ కొట్టేలా కాకుండా సబ్జెక్ట్ ను అర్థం చేసుకుంటూ ఇష్టంగా చదువుకుంటే మంచిదన్నారు. విదార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకుండా పిల్లలకు రీఫ్రెష్ మెంట్ వుండాలన్నారు.సరైన ప్రణాళికతో చదువుకుంటే మంచి ర్యాంక్ సాధించే అవకాశాలుంటాయని చర్చలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

బంగాళాఖాతంలో వాయుగుండం....

హైదరాబాద్ : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. చెన్నైకు నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో  తమిళనాడు, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ  వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సమాచారం. రాగల 24గంటల్లో చాలాచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

17:57 - May 17, 2016

హైదరాబాద్‌ : స్వచ్ఛ హైదరాబాద్‌.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న ఈ కార్యక్రమం లక్ష్యం నెరవేరిందా..? భాగ్యనగరపు పారిశుద్ధ్యం ఏమైనా మెరుగు పడిందా..? స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం సంకల్పించి ఏడాది కావొస్తున్న సందర్భంగా టెన్‌ టీవీ స్పెషల్‌ ...

గల్లీ గల్లీలోనూ ప్రజాప్రతినిధుల స్వచ్ఛ్ భారత్ ...
విద్యార్థి, ఉద్యోగ, కార్మిక.. ఒకరేమిటి అన్నివర్గాలూ తలో చేయి వేశాయి సాక్షాత్తు గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు గల్లీ గల్లీకి తిరిగి.. వీధులను శుభ్రం చేసిన బృహత్తర కార్యక్రమం ఇది. గతేడాది మే 16న మహోన్నత సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇంతకీ.. స్వచ్ఛ హైదరాబాద్‌ నిర్వహణ ఎలా సాగుతోంది. అసలు దీని నిర్వహణపై నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా..?ఎందుకు లేదూ.. గ్రేటర్‌ను 400 యూనిట్లుగా విభజించి.. 37 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. 7 లక్షలకు పైగా రెసిడెన్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్ ల వారిని భాగస్వాములను చేయాలన్నది అధికారుల ముందస్తు ప్లాన్.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజుల్లో అందరూ అబ్బో అనుకునేలా 50వేల మెట్రిక్‌ టన్నుల చెత్తనూ తొలగించేశారు. 17వేల పాట్‌ హోల్స్‌ని పూడ్చి, 13 వందల మ్యాన్‌హోల్స్‌కి కవర్‌లు వేసేశారు.

ఎన్నో ఆశలతో ప్రారంభమైన కార్యక్రమం....
ఎన్నో ఆశలు రేకెత్తిస్తూ ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడెలా అమలవుతోంది..? అమ్మో ఆ ప్రశ్న మాత్రం అడక్కు అంటున్నారు.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది. అసలు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడే సుమారు తమ 8500 విన్నపాలు ప్రజల నుంచి వచ్చాయి. 729 కోట్ల వ్యయం అవుతోందని అంచనా కూడా వేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పార్కులతో పాటు ప్లే గ్రౌండ్స్‌, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, లైబ్రరీల ఏర్పాటు తదితర అంశాలున్నాయి. మరి అవన్నీ నెరవేరాయా..? 

కుళ్లిన చెత్త చెదారంతో దుర్గంధం....
స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంతో నగరంలో ఏమన్నా మార్పులు వచ్చాయా.. ఈ ప్రశ్నకు నగర వాసుల నుంచి పెదవి విరుపే సమాధానంగా వస్తోంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వర్షం వస్తే చాలు నగరం జలమయమే. కుళ్లిన చెత్త చెదారంతో దుర్గంధం ముక్కు పుటాలను అదరగొట్టింది. ఏ ఉద్దేశంతో అయితే స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. ఇటు చూస్తే నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వర్షాకాలం వస్తుండటంతో భవిష్యత్‌లో నగర రూపురేఖలు ఎలా ఉంటాయోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. 

పర్యవేక్షణ లోపం.....
స్వచ్ఛ హైదరాబాద్‌.. చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నా.. ఈ కార్యక్రమం ఆచరణలో మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది. పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినా... అమలులో సీరియస్‌నెస్‌ లోపించడంతో సగం పనులే పూర్తయ్యాయి. పర్యవేక్షణ లోపం, ఆకస్మిక ఆటంకాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

నగరంలోని జీహెచ్‌ఎంసీ పార్కుల పరిస్థితి ఏంటి...?

అనంద్ కాల‌నీ, వెంకటరమణ కాలనీ, పద్మావతీ కాలనీల్లో గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొన్నారు. పార్కుల రక్షణకు.. అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్న వెంకటరమణ కాలనీ పార్కుకు కంచె ఏర్పాటు చేసిన అధికారులు.. దాన్ని అభివృద్ధి మాత్రం చేయలేదు. పద్మావతి కాలనీ పార్కులో గ్రీనరీని ఏర్పాటు చేసిన అధికారులు దాన్ని మెయింటనెన్స్‌ను మాత్రం గాలికొదిలేశారు. దుర్గంధంతో నిత్యం ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పంపిణీ చేసిన చెత్తబుట్టల సంగతేంటి...?
నగరంలో చెత్త సేకరణ కోసం 44 లక్షల చెత్తబుట్టలను పంపిణీ చేశారు. తడి, పొడి చెత్త వేరు చేయకపోవడంతో అవీ నిరుపయోగమయ్యాయి. డంపింగ్‌ యార్డుల్లో పూర్తి స్థాయిలో సదుపాయాలు లేకపోవడం కూడా దీనికి కారణం. మరోవైపు 2500 ఆటో టిప్పర్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు 1750 మాత్రమే పంపిణీ చేశారు. అందులో సగం వరకు మాత్రమే పనిచేస్తున్నాయి.

ఏ యే పనులకు జీహెచ్ఎంసీ ఎంత కేటాయింపులు చేసింది...?
కాలనీలు, బస్తీల్లో సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ 200 కోట్లు కేటాయించింది. 116 బీటీ రోడ్ల నిర్మాణానికి 9కోట్ల 79 లక్షలు, 914 సీసీ రోడ్ల కోసం 46 కోట్ల 71 లక్షలు, 140 ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి 5 కోట్లు, 556 ప్రాంతాల్లో వీధిలైట్ల కోసం 8 కోట్లు, ఓపెన్‌ ల్యాండ్స్‌, నాలాలకు 1797 చోట్ల కంపౌండ్‌ వాల్ నిర్మాణానికి, ఫెన్సింగ్‌కు 6 కోట్లు కేటాయించారు. దీంతో పాటు 702 ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు 21 కోట్లను హైదరాబాద్‌ జలమండలి కేటాయించింది. కానీ ఇందులో సగం పనులు కూడా పూర్తి చేయలేక పోయారు అధికారులు. వారాల కొద్దీ చెత్తను ఎత్తకపోవడంతో కొన్ని ప్రాంతాలు చెత్తతో పేరుకుపోయి ఉన్నాయని సీపీఎం విమర్శిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న మాటల్లో చేస్తున్న పనుల్లో ఏ మాత్రం పొంతన లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్వచ్ఛ హైదరాబాద్‌ అంబాసిడర్లు ఎక్కడ?
స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో గల్లీ నేతల నుంచి.. సినిమా స్టార్స్‌ వరకు అంతా రంగంలోకి దిగారు. చేతుల్లో చీపురు, తట్టా, బుట్టా పట్టి ఐదురోజుల పాటు హడావిడి చేశారు. మొదటి రోజు చీపురు పట్టిన వాళ్లు కనీసం ఏడాదైనా మళ్లీ కనిపించడం లేదు. స్వచ్ఛ హైదరాబాద్‌ అంబాసిడర్లు సైతం మళ్లీ కనిపించిన దాఖలాలు లేవని నేతలు అభిప్రాయపడుతున్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న నాయకులు ఆచరణ లోపం లేకుండా ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేస్తేనే ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించి ప్రజలను పూర్తి స్థాయిలో చైతన్య పరిచినప్పుడే ఏ ప్రణాళికా అయినా విజయవంతం అవుతుంది.

17:47 - May 17, 2016

మహబూబ్‌నగర్ : వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి జలదీక్షను వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో వైసీపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ జెండాను పీకేయడంతో పాటు బోర్డును ధ్వంసం చేశారు. దాడి సమయంలో వైసీపీ కార్యకర్త వాజిద్‌ అడ్డుకోవడానికి ప్రయత్నించగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు అతన్ని తోసేశారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైద్యుల నిర్లక్ష్యంతో మాట పోగొట్టుకున్న మహిళ...

ఖమ్మం : ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళిన ఓ మహిళ నోటి మాట పోగొట్టుకుంది. ఈ ఘటన అశ్వారావుపేటలో జరిగింది. అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళితే ఇంజెక్షన్‌ వికటించి నోటిమాట పడిపోయిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఆస్పత్రిలో జరిగింది. స్థానిక ఫైర్‌ కాలనీకి చెందిన చీకటి వరలక్ష్మీ అనే మహిళ ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. వైద్యం కోసం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. డాక్టర్‌ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. మాట కూడా పడిపోయింది.

గిన్ని బ్యాగుల గోడౌన్‌లో అగ్నిప్రమాదం....

విశాఖ : పాయకరావుపేటలోని ఓ గిన్ని బ్యాగుల గోడౌన్‌లో మంటలంటుకున్నాయి.. మంటలు వేగంగా వ్యాపించి అందులోని బ్యాగులన్నీ కాలి బూడిదయ్యాయి.. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు... దాదాపు 50లక్షలవరకూ ఆస్తి నష్టం జరిగిఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.

ఆర్డీఎస్ పై చర్చకు రావాలని దేవినేనికి హరీష్ రావు ఫోన్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన నాటి నుండి ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రాజుకుంటూనే వుంది. ఈ నేపథ్యంలో ఇరు నేతల మధ్య మాటా తూటాలు పేలుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేనికి తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు. ఆర్టీఎస్ పై చర్చకు రావాలని ఏపీ మంత్రి దేవినేనికి టీ మంత్రి హరీష్ రావు ఫోన్ ద్వారా తెలిపారు. ఆర్టీఎస్ పనులను నిలిపివేయాలని రాయచూర్ కలెక్టర్ కు రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని దేవినేనిని హరీష్ రావు కోరారు.

17:31 - May 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన నాటి నుండి ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రాజుకుంటూనే వుంది. ఈ నేపథ్యంలో ఇరు నేతల మధ్య మాటా తూటాలు పేలుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేనికి తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు. ఆర్టీఎస్ పై చర్చకు రావాలని ఏపీ మంత్రి దేవినేనికి టీ మంత్రి హరీష్ రావు ఫోన్ ద్వారా తెలిపారు. ఆర్టీఎస్ పనులను నిలిపివేయాలని రాయచూర్ కలెక్టర్ కు రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని దేవినేనిని హరీష్ రావు కోరారు. దీనిపై రెండు రోజుల్లో సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణ నుండి ఏపీకి ఎటువంటి సహాయం వుండదని హరీష్ రావు దేవినేనికి హరీష్ రావు స్పష్టం చేశారు.

17:16 - May 17, 2016

కరీంనగర్ : తాటి చెట్టుకు తాటి ముంజలు కాస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్తే తాటి చెట్టుకు కల్లుముంతలు వేలాడుతాయి. కాని కరీంనగర్‌లో తాటి చెట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. రాత్రయిందంటే చాలు తాటి చెట్లు దగదగా మెరిసిపోతాయి. అధికారుల నిర్లక్ష్యం కారుచీకట్లను నింపితే ఓ ప్రజాప్రతినిధి బాధ్యత ఆ కారుచీకట్లను చీల్చి తాటిచెట్లకు కాంతులు తెచ్చాయి.

కరెంటు స్థంభంలాంటి తాటి చెట్లు....
మీరు చూస్తున్నది నిజమే. ఇవి సర్కారు నిర్మించిన కరెంటు స్తంభాలు కావు. ఓ ప్రజాప్రతినిధి తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన కరెంటు స్తంబాలాంటి తాటి చెట్లు.ఇక్కడ విద్యుత్‌ స్తంభాలకు బదులు.. తాటి స్తంభాలు దర్శనమిస్తాయి. విద్యుత్‌ స్తంభాలకు వేలాడాల్సిన వీధి దీపాలు తాటిచెట్లపై నుండి వెలుగులను అందిస్తున్నాయి. ఈ దృశ్యాలన్నీ ఏ మూరుమాల ప్రాంతంలోనివో కాదు. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శివారు కాలనీలో పరిస్థితి ఇది.

విజయదుర్గ కాలనీల్లో కనీస వసతులు కరవు....

కరీంనగర్‌ ప్రాంతంలో గల హరిహరనగర్, విజయ దుర్గ కాలనీలలో కొంతకాలంగా విద్యుత్‌ దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలు ఓ వైపు కరీంనగర్ మండలంలోని రేకుర్తి గ్రామ పంచాయతీ కిందకు, మరో వైపు మున్సిపల్‌ కిందకు రావడంతో వీటిని ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీంతో ఈ కాలనీలు దుర్గంధంతో కంపు కొడుతున్నాయి. కనీసం వీధి దీపాలు కూడా లేక అల్లాడుతున్నాయి.

సొంత ఖర్చుతో వీధి లైట్లు ఏర్పాటు చేసిన వార్డుమెంబర్‌....
కాలనీలలో వీధి లైట్లను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు గ్రామ పంచాయతీకి, మున్సిపల్‌ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కాలనీలకు వెలుగులు అందించాలనే ఉద్దేశ్యంతో వార్డు మెంబర్‌ దుర్గం మనోహర్‌ సొంత ఖర్చులతో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. తాటిమొద్దులను రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసి వాటికి ట్యూబ్‌ లైట్లను బిగించాడు. దీంతో వీధులకు వెలుగులయితే వచ్చాయి కాని కరెంట్‌ స్తంభాలపై ఉండాల్సిన ట్యూబ్‌ లైట్లు తాటిమొద్దులపై వేలాడుతున్నాయి.

ఆందోళనలో గ్రామస్థులు....
అయితే తాటి మొద్దులతో ఏర్పాటు చేసిన స్తంభాలు కూడా గాలికి విరిగిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. భయం భయంగానే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఏ తాటి మొద్దు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనకు గురౌతున్నారు.

16:52 - May 17, 2016

హైదరాబాద్ : బేగంపేట్‌ సమీపంలోని జేసీ బ్రదర్స్‌ జ్యువెలరీ షాపులో గోల్డ్‌స్మిత్‌ సిబ్బంది చేతివాటం బయటపడింది. మరమ్మతుల కోసం వినియోగదారులు ఆభరణాలను తీసుకొస్తే బంగారాన్ని కాజేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. రిపేరు కోసం కస్టమర్ల ఇచ్చిన ఆభరణాల్లో కొంత బంగారాన్ని గోల్డ్‌స్మిత్‌ సిబ్బంది కాజేస్తున్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు నాలుక కింద పెట్టుకుని వెళ్లిపోతున్నారు. గత రెండు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తోంది. వినియోగదారుల ఆభరణాల బరువులో తేడా రావడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సిబ్బందిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 40 తులాల బంగారాన్ని నిందితులు ఎత్తుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు.

16:49 - May 17, 2016

వరంగల్ : ఆదివాసీలను మట్టుబెట్టెందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన గ్రీన్ హంట్ మారణకాండను వెంటనే నిలిపివేయాలని విరసం నేత వరవరరావు అన్నారు. గోదావరి, ప్రాణాహిత నదుల పరివాహక ప్రాంతాల్లో మోహరించిన పారామిలటరీ బలగాలను వెనకకు రప్పించాలని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పారు. ప్రజాస్వామిక హక్కుల రక్షణకై ఈ నెల 24న వరంగల్ పోచమ్మమైదానంలో బహిరంగసభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

పిల్లల్ని సూసైడ్‌ బాంబులుగా వాడుకుంటున్న బోకోహరమ్ తీవ్రవాద సంస్థ

హైదరాబాద్ : నైజీరియా కేంద్రంగా పనిచేసే బోకోహరమ్‌ అనే తీవ్రవాద సంస్థ పిల్లల్ని ఎక్కువగా సూసైడ్‌ బాంబులుగా వాడుకుంటోందట. ప్రతీ 5గురు ఆత్మాహుతి దళ సభ్యులలో ఒకరు పిల్లలేనట. దీనిలో 75 శాతం ఆడపిల్లలేనట. ఈ వివరాలను అమెరికాకకు చెందిన హ్యుమానిటేరియన్ వ్యవహరాల సంస్థ ఈ రోజు  వెల్లడించింది. 2015 నుండి ఇప్పటివరకు 44మంది పిల్లలను ఈ పనికి వాడుకున్నారట. 2014 నుండి 2016 వరకు అత్యధికంగా 21మంది పిల్లలు దీనిలో పాల్గొన్నారు. వీరు ఎక్కువగా సాధారణ ప్రజానీకాన్ని, ఆర్మీ అధికారులు లక్ష్యంగా దాడులకు దిగుతున్నారని హ్యుమానిటేరియన్ సంస్థ వెల్లడించింది.

16:45 - May 17, 2016

విజయవాడ : తెలంగాణ మంత్రి హరీశ్‌రావుపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు.. దిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాల సర్వేలను అడ్డుపెట్టుకొని అనుమతులున్నాయంటూ అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు.. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ అధినేత జగన్... సీఎం కేసీఆర్‌ ఇంటి దగ్గర దీక్ష చేయాలని సూచించారు.

సిక్కింలో విద్యార్థినిపై అత్యాచారం..

గ్యాంగ్ టక్ : ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు పరీక్షలు ముగియడంతో సిక్కిం పర్యటనకు వెళ్లారు. వారు అద్దెకు తీసుకున్న డ్రైవరే వారిలో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే13న కోల్‌కతాకు చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు విహారయాత్రకు సిక్కిం వెళ్లారు. గ్యాంగ్‌టక్‌లో బంధువుల హోటల్‌లో బస చేసిన వారు.. సమీపంలోని ప్రదేశాలను చూసేందుకు ఓ టాక్సీని మాట్లాడుకున్నారు. కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత డ్రైవర్ వారికి చిప్స్, నీళ్లు అందించాడు. ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి వాటిని తీసుకోగా..

16:39 - May 17, 2016

మహబూబ్‌నగర్‌ : హైకోర్టు సీరియస్‌గా ఆదేశాలిచ్చినా మామిడి పళ్లను ఇంకా రసాయలతో పండిస్తూనే ఉన్నారు. తాజాగా అధికారుల తనిఖీల్లో రెండు లారీల మామిడి పండ్లు పట్టుబడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ఎండీ అమీర్‌ జాఫర్‌ గోడౌన్‌పై అధికారులు దాడులు చేశారు.. రసాయనాలతో పండించిన రెండు లారీల మామిడి పళ్లను సీజ్‌ చేశారు.. గోడౌన్‌లో తనిఖీలు చేసి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.. గోడౌన్‌ యజమాని జాఫర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

16:35 - May 17, 2016

విశాఖపట్నం : పాయకరావుపేటలోని ఓ గిన్ని బ్యాగుల గోడౌన్‌లో మంటలంటుకున్నాయి.. మంటలు వేగంగా వ్యాపించి అందులోని బ్యాగులన్నీ కాలి బూడిదయ్యాయి.. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు... దాదాపు 50లక్షలవరకూ ఆస్తి నష్టం జరిగిఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.

16:32 - May 17, 2016

ఖమ్మం : ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళిన ఓ మహిళ నోటి మాట పోగొట్టుకుంది. ఈ ఘటన అశ్వారావుపేటలో జరిగింది. అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళితే ఇంజెక్షన్‌ వికటించి నోటిమాట పడిపోయిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఆస్పత్రిలో జరిగింది. స్థానిక ఫైర్‌ కాలనీకి చెందిన చీకటి వరలక్ష్మీ అనే మహిళ ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. వైద్యం కోసం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. డాక్టర్‌ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. మాట కూడా పడిపోయింది. డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

16:21 - May 17, 2016

గుంటూరు : నాదెండ్ల మండలం చందవరంలో భర్త ఇంటిముందు భార్య మౌన పోరాటానికి దిగింది.. తనకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టింది.. ఈ గ్రామానికి చెందిన షరీఫ్‌కు ఖాశింబితో ఐదేళ్లక్రితం వివాహం జరిగింది.. సంతానం కలగలేదంటూ భర్త తనను ఇంటినుంచి గెంటేశాడని బాధితురాలు ఆరోపించింది.. అన్నదమ్ములతోకలిసి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు పట్టించుకోకపోవడంతో భర్త ఇంటిముందు ఆందోళన చేపట్టింది.

ప్రభుత్వ చలివేంద్రాల్లో మజ్జిగ తాగి 'ఉపాధి' కూలీలకు అస్వస్థత

హైదరాబాద్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో మజ్జిగ తాగి 15 మంది ఉపాధిహామీ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 

16:16 - May 17, 2016

విశాఖపట్నం : జిల్లా నక్కపల్లిలో హెటిరో డ్రగ్స్ కంపెనీ వద్ద ఎస్‌క్యూబీ కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తమను పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం మాట తప్పిందని కార్మికులు ఆరోపించారు. 2013-14లో కొంతమంది కార్మికులను పర్మినెంట్ చేసిన, యాజమాన్యం ఇప్పుడు ఆ అంశాన్నే మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 మంది కార్మికులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. కంపెనీ కనీస వేతనాలు అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

16:13 - May 17, 2016

మెదక్ : జిల్లాలోని మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో సర్వే పనులకు బ్రేక్‌ పడింది. వారం రోజుల పాటు సర్వే నిలిపివేయాలంటూ కలెక్టర్‌ రోనాల్డ్‌ రోజ్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ముంపు గ్రామాల్లోని సమస్యను పరిష్కరించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు మల్లన్న సాగర్ నిర్మాణం జరిగితే తమ గ్రామాలన్నీ ముంపుకు గురవుతాయి కాబట్టి తమకు ప్రత్యామ్నాయం మార్గం చూపేంతవరకూ పనులను జరగనీయమని వారు పేర్కొంటున్నారు. ఈ సమస్యపై సీపీఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ..మల్లన్న సాగర్ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనీ....నష్టపరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయం కల్పించాలని  డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ నిర్వాశితులకు అండగా వుంటుందన్నారు.

తెలంగాణలో పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు

హైదరాబాద్ : తెలంగాణలో కీలక విభాగాల అధిపతుల విదేశీ పర్యటన నేపథ్యంలో పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్థానంలో శివశంకర్ అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది స్థానంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

 

15:50 - May 17, 2016

ఢిల్లీ : ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను వెంటనే తొలిగించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్‌ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. రాజన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నంగా మారుతోందని లేఖలో పేర్కొన్నారు. ఆయన దేశంలో గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ ఉంటున్నారే తప్ప మానసికంగా ఆయన పూర్తి స్థాయిలో భారతీయుడు కాదని అన్నారు. రాజన్‌కు త్వరితగతిన పదవి నుంచి తప్పించి చికాగోకు పంపేయాలని గతవారం స్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. దేశంలో పెట్టుబడులు అందుబాటులో లేకపోవడానికి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజనే కారణమన్నారు. సరైన పెట్టుబడులు లేకనే వాల్‌మార్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో భారత వ్యాపారులు ఢీకొనలేకపోతున్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

15:46 - May 17, 2016

నిజామాబాద్ : గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్ ఆగడాలను నిరసిస్తూ ఉద్యోగుల రక్షణకు ఉద్యమం చేపట్టనున్నట్లు టీఎన్ జీవో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గైని గంగారాం తెలిపారు. అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన టీఎన్ జీవో పేరు మార్పుకు ప్రయత్నిస్తున్నారని, టిజివో, టిఎన్‌జివోల మధ్య ఆధిపత్య పోరుకు దేవిప్రసాదే కారణమని మండిపడ్డారు. గౌరవ అధ్యక్షుడిగా ఉన్న దేవిప్రసాద్ అసలు అధ్యక్షుని కన్నా ఎక్కువగా పెత్తనం చెలాయిస్తున్నారంటున్న గైని గంగారామ్‌ మండిపడ్డారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దేవీప్రసాద్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడనీ టీఎన్ జీవో కార్యాలయం మెట్లు కూడా దేవీప్రసాద్ ని ఎక్కనీయమని ఆయన పేర్కొన్నారు.

15:36 - May 17, 2016

గుంటూరు : ఏడుగురు ప్రాణాలు బలితీసుకున్న గుంటూరు సెల్లార్‌ దుర్ఘటనపై దర్యాప్తు పక్కదారిపడుతుందా... అధికార పార్టీకి చెందిన బిల్డర్‌ను కాపాడేందుకు అధికారులు, ప్రభుత్వం కొమ్ముకాస్తున్నారా ... ఇప్పుడు ఇదే విషయం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

పరిహారం పేరుతో నిజాలను సమాధిచేసే యత్నం...
గుంటూరు జిల్లాలో వాస్తవాలను మరుగున పరిచి, పరిహారం పేరుతో నిజాలను సమాధిచేసే ప్రయత్నంపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది. సెల్లార్ దుర్ఘటన కేసు దర్యాప్తు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్కదారిపట్టించేందుకు తెరవెనుక గూడుపుఠాని జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరిమహల్‌ సెంటర్‌ సమీపంలోని గతంలో వివాదాల్లో ఉన్న సుందరామయ్య భవనాన్ని కొద్దిరోజుల క్రితం అధికారపార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి తెరవెనక చక్రం తిప్పి సెటిల్‌మెంట్‌ చేశాడు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్ధలంలో తన కుటుంబసభ్యులకు మల్టీకాంప్లెక్స్‌ నిర్మించేందుకు సిద్ధమై తన సన్నిహితుడైన ప్రముఖ పయనీర్ కన్‌స్ట్రక్షన్‌ బిల్డర్‌, గతంలో టిడిపి తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన చుక్కపల్లి రమేష్ కు అప్పగించారు.

పనులు త్వరగా పూర్తికావాలనే తొందరలో నిర్మాణాలు....

రాజధాని నేపథ్యంలో తమ పనులు త్వరగా పూర్తికావాలన్న తపనతో నిర్మాణాలు సాగించారు . ఈ తరుణంలోనే మద్యాహ్నం ప్రమాదం సంభవించింది. అయితే ఈ విషయం బయటకు పొక్కితే రాద్ధాంతం అవుతుందని గ్రహించిన బిల్డర్‌.. సాయంత్ర 6గంటల వరకు గోప్యంగా ఉంచాడు. గుట్టుచప్పుడు కాకుండా మట్టి కింద కూరుకుపోయిన మృతదేహాలను బయటకు తరలించాలని ప్రయత్నించారు. కాని అంతలోనే పోలీసులకు, మీడియాకు సమాచారం అందడంతో.. సహాయక చర్యలు చేపట్టారు.

బాధితులకు 20 లక్షలు చెల్లించిన ప్రభుత్వం....
ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతుండగానే రెండో అంకం మొదలైంది. మాజీ మంత్రి ఎలాగోల తన సన్నిహితుడైన బిల్డర్‌ చుక్కపల్లి రమేష్ ను ఈ కేసు నుండి బయటపడేసేందుకు పరిహారం ముసుగుతో కొత్త డ్రామాకు తెరతీశాడు. ఒకవైపు ఒక్కో మృతదేహం బయటపడుతుండగా మరోవైపు పరిహారం పేరుతో బేరసారాలు సాగిస్తూ కేసును మాఫిచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాధితులకు ఒక్కో కుటుంబానికి 20 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే 20లక్షల పరిహారాన్ని బాధితుల చేతుల్లో పెట్టి ఆసుపత్రి నుండి శవాలను సాగనంపారు.

కేసును నీరు గార్చేందుకు భారీగానే ముడుపులు....
ఈ ఘటనలో చోటు చేసుకున్న పరిణామాలపై అందరిలో అనేక అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఏకంగా అధికారులు, పోలీసులకు సైతం ఈ కేసును నీరు గార్చేందుకు భారీగానే ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుంటే ఏమైన చేసినా చెల్లిపోతుందని గుంటూరు సెల్లార్‌ దుర్ఘటనే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈవ్యవహారంలో ఇప్పటికే అధికారులపై చర్యలంటూ హడావుడి చేస్తున్న ఉన్నతస్ధాయి అధికార గణానికి అసలు ఘటనకు కారకుడైన చుక్కపల్లి రమేష్‌ను అరెస్ట్‌ చేయకపోవటం చూస్తే, అసలు కధేంటో ఇట్టే అర్ధమైపోతుంది. ఇప్పటికైనా వాస్తవాలను సమాధి చేయకుండా, అసలు దోషులను శిక్షించాలని ప్రజానికం కోరుతున్నారు.

 

కాసేపట్లో అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ....

ఢిల్లీ : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో కాసేపట్లో ఎపి సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

15:26 - May 17, 2016

హైదరాబాద్ : ఎల్‌బీ నగర్‌ చౌరస్తాలో వైఎస్‌ జగన్‌ దిష్టి బొమ్మను టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. వైసిపి అధినేత జగన్‌ చేస్తున్న జలదీక్షలకు వ్యతిరేకంగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో టిఆర్ఎస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్‌, అతని పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుందని హెచ్చరించారు.

15:24 - May 17, 2016

ఢిల్లీ : ప్రధాని మోడీతో చంద్రబాబు బృందం భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో 12 డిమాండ్లపై ప్రధానితో చర్చించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు...వాటిని ఖర్చు చేసిన వివరాలను అందజేశారు. ప్రత్యేక హోదా విషయం రాజకీయ అంశంగా మారకముందే చర్య తీసుకోవాలని సూచించారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు సర్వే నిలిపివేత

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో వారం రోజులపాటు సర్వే నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అధికారులను ఆదేశించారు. గ్రామ సమస్యలు పరిష్కారం అయ్యాకే మల్లన్న ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. హజ్ టర్మినల్ వద్ద మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

సా. 4 గం.లకు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్

ఢిల్లీ : ఎపి సీఎం చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మోడీతో జరిగిన భేటీ వివరాలను చంద్రబాబు వెల్లడించారు. 

 

ప్రధాని మోడీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

 ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో ఎపి సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. గంటా 40 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. కరవుపై తీసుకుంటున్న చర్యలపై ప్రధానికి చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఎపికి రావాల్సిన కరవు నిధులను విడుదల చేయాలని ప్రధానిని సీఎం కోరారు. 

దేవీప్రసాద్ పై గైని గంగారాం ఆగ్రహం

హైదరాబాద్ : టీఎన్ జీవో గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ పై నిజామాబాద్ టీఎన్ టీవో ప్రెసిడెంట్ గైని గంగారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బైలాలో లేని గౌరవ అధ్యక్ష పదవి నుంచి దేవీప్రసాద్ వెంటనే తప్పుకోవాలన్నారు. టీఎన్ జీవోల బైలాలలో 11ఈ ప్రకారం గెజిట్ లందరిని సంఘం తొలగించాలని చెప్పారు. టీఎన్ జీవోల అధ్యక్షుడు ఎన్నిక ప్రొసిడింగ్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేవీప్రసాద్ అసలు అధ్యక్షుని మాదిరిగా వ్యవహరిస్తూ.. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూసిన వారికి అవార్డులు ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆర్హుల ఎంపికకు మంత్రి చందులాల్ అధ్యక్షతన 11 మందితో కమిటీ వేశారు. 20 రంగాల్లో 50 మందిని ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో ప్రతిభ చూసిన వారికి సన్మానం , రూ.లక్ష నగదు పురస్కారం ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో వివిధ రంగాల ప్రముఖులకు సన్మానం చేయనున్నారు. రూ.51 వేలు నగదు పురస్కారం ఇవ్వనున్నారు. 

 

13:14 - May 17, 2016

నల్గొండ:దేవరకొండ మండలం దుబ్బతండాలో విషాదం చోటుచేసుకుంది. మడమరక వాగులో ఇసుక కోసం తీసిన గోతిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బాలురి మృతితో వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

13:12 - May 17, 2016

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన పిన్నమనేని వెంకటేశ్వరరావును ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పరామర్శించారు. పిన్నమనేని భార్య సాహిత్యవాణి మృతిపట్ల సంతాపం తెలిపారు. పిన్నమనేని సతీమణి సాహిత్యవాణికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. పిన్నమనేని కుటుంబంలో ఇంతటి విషాదాన్ని కలిగించిన సంఘటన తమను కలిచివేసిందని అన్నారు.

13:09 - May 17, 2016

ఖమ్మం : ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ఎదుట తెలంగాణ ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో ఆటో డ్రైవర్లను వేధించొద్దని ఓలా, ఒబేర్ లాంటి క్యాబ్‌లను నిషేధించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనను అడ్డుకున్న పోలీసులు పలువురు కార్మిక సంఘాల నేతలను, ఆటో డ్రైవర్లను బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఏపీ సిఎం చంద్రబాబు... ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతోపాటు మంత్రి యనమల, సిఎస్‌, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు రాధామోహన్‌సింగ్, బీరేంద్ర సింగ్, జితేంద్రసింగ్, పీఎంఓ అధికారులూ ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో కరువు పరిస్థితులు, విభజన హామీలు అమలు కాకపోవడం, పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణానికి సహకారం, బీజేపీ నేతల తీరుపై మోడీతో చర్చించారు.

 

బిజెపి డ్రామాలాడుతోంది : అయ్యన్నపాత్రుడు

విశాఖ: ప్రత్యేక హోదా విషయంలో బిజెపి డ్రాఆమలడుతోందని మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకుంటారో బిజెపి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శ్రీచైతన్య స్కూల్ ఎదుట పీడీఎస్ యూ ఆందోళన

నల్గొండ : సూర్యాపేట శ్రీచైతన్య స్కూల్ ఎదుట పీడీఎస్ యూ ఆందోళన చేపట్టింది. పీడీఎస్ యూతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులూ ధర్నాకు దిగారు. 50 మంది విద్యార్థుల ఫలితాలను విత్ హెల్డ్ లో పెట్టడానికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

6గురు మావోల అరెస్ట్

తూ.గో: మావోయిస్టు శబరి ఏరియా కమిటీకి చెందిన చెందిన ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ మహిళ ఉన్నారు. తొలిసారిగా మందుపాతర పేలుడు వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. వీరిలో మిలీషియా సభ్యులు ఉన్న ట్లు తెలుస్తోందని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. అమాయకులైన గిరిజనులను దళాల్లో చేరుకుంటున్నారని, గిరిజనులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పిన్నమనేనిని పరామర్శించిన స్పీకర్ కోడెల

 హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావును ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ బుద్దాప్రసాద్ పరామర్శించారు. పిన్నమనేని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పిన్నమనేని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత రాత్రి పహాడీషరీఫ్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని భార్య, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేశ్వరరావు గాయపడ్డారు.

 

టి.పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం

హైదరాబాద్: గాంధీభవన్ లో టి.పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు, కుంతియా హాజరయ్యారు. వలసలు, పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్ర 4 గంటలకు టీ.పీసీసీ కోఆర్డినేసన్ కమిటీతో దిగ్విజయ్ భేటీ కానున్నారు. పార్టీ అనుసరించాల్సిన విధానాలు, బలోపేతంపై దిగ్విజయ్ దిశానిర్దేశనం చేయనున్నారు.

11:48 - May 17, 2016

ప్రకాశం : ప్రస్తుత కాలంలో ఎక్కడా చూసిన కల్తీ.. చివరికి మనం తినే తిండి దగ్గర నుంచి వాడే వస్తువుల దాకా అన్నింటిలోనూ కల్తీ.. ఇలాంటి కల్తీ భాగోతమే ఒకటి ప్రకాశం జిల్లా ఒంగోలులో బయటపడింది. కొన్నిరోజులుగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న డీజిల్ కల్తీ దందాపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు.

త్రోవగుంట దగ్గరున్న ఆటోనగర్‌లో....

ఒంగోలుకు అతిసమీపంలో త్రోవగుంట దగ్గరున్న ఆటోనగర్‌లో.. నకిలీ డీజిల్‌ తయారీ దందాలో ఈ ట్యాంకర్లు కీలక భూమిక పోషిస్తున్నాయి.

చెన్నై నుంచి తెచ్చిన డీజిల్‌కు కిరోసిన్‌ను కలిపి.. ఇక్కడ కల్తీ డీజిల్‌ను తయారు చేస్తున్నారు. కల్తీ డీజిల్ కిరోసిన్‌ వాసన రాకుండా, చిక్కదనం తగ్గకుండా.. ఇండస్ట్రియల్‌ గమ్‌ను కలుపుతూ వక్రమార్గంలో డబ్బులు దండుకుంటున్నారు. ఇక్కడ తయారుచేసిన కల్తీ డీజిల్‌ను గుంటూరు,ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

అనుమానం వచ్చి విజిలెన్స్ అధికారులకు సమాచారం...

ఈ మధ్యకాలంలో నకిలీ ముఠా ఆగడాలు ఎక్కువ కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి విజిలెన్స్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగడంతో ఆటోనగర్‌లో కల్తీ డీజిల్‌ వ్యాపారం గుట్టు రట్టుయ్యింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 10 వేల లీటర్ల నకిలీ డీజిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో ఇంకెవరు కల్తీకి పాల్పడాలన్నా భయపడేలా నిందింతులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

11:46 - May 17, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ నియోజకర్గాల పెంపును కేంద్రం అటకెక్కించింది. సొంతపార్టీకి రాజకీయ ప్రయోజనంలేని ఈ అంశాన్ని పక్కకు పెట్టాలని నిర్ణయించింది. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబుల బలాన్ని పెంచే కార్యక్రమాలు తామేందుకు చేపట్టాలనే భావనలో ఉందో ఏమో కాని సాంకేతిక కారణాలు చూపి నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేస్తోంది మోడీ సర్కార్ .

పెంపుపై కేంద్రం అంతగా ఆసక్తి కనబరచడం లేదు...

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం అంతగా ఆసక్తి కనబరచడం లేదు. మొదట్లో పెంపుపై కాస్త సానుకూలంగా ఉన్నా..ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఉన్న 175 సీట్లను 225కు, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 కు పెంచేందుకు చేపట్టిన ప్రయత్నాలను వెనక్కి తీసుకోవడం వెనక బలమైన కారణాలున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో కేంద్రానికి సహాయనిరాకరణ.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి సహకారం అందటం లేదు సరికదా.. ఇద్దరు చంద్రుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ లు ఇద్దరు కొరకరాని కొయ్యలుగా మారారు. ప్రతి పక్ష పార్టీల ఏమ్మెల్యేలను టోకుగా తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఎలాగు నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న ధీమాతో...తమకు టికెట్ ఖాయమనే నమ్మకంతో... అధికార పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్,.. ఏపీలో టీడీపీలు తమ బలం పెంచుకుంటున్నాయి.

కరువు నిధుల పై కేంద్రం నిర్లక్ష్యం చేయడంపై కేసీఆర్ సీరియస్....

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కార్నర్ చేస్తున్నారు. కరువు నిధుల విడుదలతో పాటు వెనకబడ్డ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు తనను విమర్శించడం ఆపి కేంద్రం నుంచి నిబంధనలు రాబట్టాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ఇక ఏపీలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. పేరుకు కేంద్రం, రాష్ట్రంలో పొత్తుల ప్రభుత్వాలు నడుపుతున్నా... ఒకరు వైదొలిగితే ప్రభుత్వాలు కూలే పరిస్థితి లేదు. స్పెషల్ స్టేటస్ విషయంలో రెండు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తే...పోరాడి తెచ్చిన చాంపియన్‌గా వచ్చే ఎన్నికల్లో గెలవొచ్చని.. ఒక వేల ఇవ్వని పక్షంలో బీజేపీని దోషిగా నిలిపి లబ్ది పొందొచ్చని భావిస్తుంది.

నియోజకవర్గాలను పెంచాలంటే రెండే మార్గాలు

నియోజకవర్గాలను పెంచాలంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి... ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ను సవరించాల్సి ఉంది. రాజ్యసభ లో కాంగ్రెస్ సహకరిస్తే తప్ప బిల్లు గట్టెక్కే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ అందుకు రెడీగా లేదు. ఇక నియోజకవర్గాల పెంపును పెంచేందుకు రెండో దారి కూడా ఉంది. దేశ వ్యాప్తంగా 2026 వరకు నియోజక వర్గాలను పెంచోద్దని ఆర్టికల్‌ 170 క్లాజ్‌ 3 స్పష్టం చేస్తుంది. ఈ లోగా చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. అయితే ఈ మార్గంలో వెళ్లేందుకు కేంద్రం సాహసించడం లేదు. అయితే డైరెక్ట్ గా నో చెప్పకుండా ప్రక్రియను కొనసాగిస్తూ సాంకేతిక కారణాలతో వీలైనంత ఆలస్యం చేసేందుకు యత్నిస్తోంది. మొత్తంగా నియోజకవర్గాల పెంపును కేంద్రం రాజకీయ కారణాలతో అటకెక్కించింది. దీంతో టీడీపీ, టీఆర్ఎస్, జంపింగ్ MLA ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. 

11:43 - May 17, 2016

జమ్మూ కాశ్మీర్‌ : షోపియాన్ జిల్లా పహిల్‌ సోరాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, మిగిలిన ఉగ్రవాదులు తప్పించుకున్నారు.. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

11:42 - May 17, 2016

బీహార్‌ : జేడీయు ఎమ్మెల్సీ మనోరమాదేవికి గయా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఆమె కోర్టులో లొంగిపోయారు. ఇంట్లో అక్రమంగా మద్యం నిలువ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. గత వారం రోజులుగా ఆమె తన పలుకుబడి ఉపయోగిస్తూ తప్పించుకుంటూ వచ్చారు. అయితే తాను ఏ నేరమూ చేయలేదని మనోరమ అంటున్నారు. ఈమె కుమారుడు రాకీ యాదవ్‌ ఓ హత్య కేసులో కొద్దిరోజుల క్రితం అరెస్టయ్యారు. తన కారును ఓవర్‌టేక్‌ చేసి వెళ్తున్నాడని ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని రాకీ యాదవ్ కాల్చి చంపాడు. ఆ కేసుకు సంబంధించి రాకీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లగా అక్కడ మద్యం బాటిళ్లు కనిపించాయి. బీహార్‌లో మద్యనిషేధం అమల్లో ఉన్నందున ఆమెపై కేసు నమోదైంది. ఇంట్లో బాల కార్మికులతో పనులు చేయిస్తున్న వ్యవహారంలో మనోరమపై మరో కేసు కూడా ఉంది.

ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. మ.12 గంటలకు ప్రధాని మోదీతో బాబు భేటీ కానున్నారు. వీరి భేటీలో కరువు, ఇతర అంశాలపై ప్రధానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.

కృష్ణా పుష్కరాలను విజయవంత చేస్తాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మహబూబ్ నగర్ : పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద పుష్కర ఘాట్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాలను విజయవంత చేస్తామన్నారు. పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో కృష్ణా పుష్కరాల కోసం 86 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయలు కాల్పిస్తామని, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు, జగన్ లను ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.

పిన్నమనేని సతీమణి మృతికి చంద్రబాబు సంతాపం..

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సత్యవాణి మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న చంద్రబాబు... నేటి ఉదయం ఢిల్లీ బయలుదేరే ముందు సంతాపం తెలిపారు. పిన్నమనేని ఆరోగ్య పరిస్థితిపై ఆయన పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 134.29 పాయింట్లు లాభపడి ప్రస్తుతం 25,787 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 7901 సూచీ వద్ద కొనసాగుతున్నాయి. 

10:32 - May 17, 2016

విజయవాడ : డిఎస్పీ 2014 రిజల్ట్స్ ఫైనల్ షెడ్యూల్ ను ఏపీ రాష్ట్ర మంత్రి గంటా విడుదల చేశారు. 26 వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని గంటా చెప్పారు. 28 వ తేదీన సెలక్షన్ లిస్ట్ ఫైనల్ చేసి 29 న వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. జూన్ 1 వ తేదీన నియామకపత్రాలను అందజేస్తామన్నారు. 

10:31 - May 17, 2016

మెదక్ : తోగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు రోడ్డెక్కారు. సాగర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు చేపట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు గ్రామస్థులు .

ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ధర్నా...

కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ రీడిజైనింగ్ కు ప్లాన్ చేస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై మెదక్ జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరూ.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ధర్నా చేపట్టారు.

మల్లన్న సాగర్ రిజర్వాయర్ రీడిజైనింగ్ కారణంగా ..

మల్లన్న సాగర్ రిజర్వాయర్ రీడిజైనింగ్ కారణంగా .. తాము సర్వం కోల్పోతున్నామని.. భూ నిర్వాసితులు సిద్దిపేట ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. రిజర్వాయర్ ను 1.5 టీఎంసీల నుండి 50 టీఎంసీల కు పెంచడంతో .. రెండు మండలాల పరిధిలోని 14 గ్రామాలు జలసమాధి కానున్నాయని.. నిర్వాసితులకు మార్కెట్ ధర పై 4 రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. 21వేల 441 ఎకరాల భూములు కోల్పోతారని.. భూ సేకరణ చట్టం ద్వారా ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

రైతులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు...

అటు జిల్లాలోని దుబ్బాకలోను రైతులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్దమవుతున్నారు. కిష్టాపూర్, లక్ష్మాపూర్ , బంజేరుపల్లి , రాంపూర్ వేములగుట్ట, ఎర్రవెల్లి తదితర గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున భారీగా తరలివెళ్లారు. తమకు న్యాయం జరిగే వరకు ఇలాంటి ధర్నాలు కొనసాగిస్తామన్నారు. తమ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గుండెపోటుకు గురై రామయ్య అనే వ్యక్తి మృతి ...

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములు సర్వస్వం కోల్పోతున్నామనే ఆవేదనతో వేములగట్టు గ్రామంలోగుండెపోటుకు గురై రామయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలలోని ప్రజలకు న్యాయం జరగకపోతే ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో చూడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బైట్ - బాధిత కుటుంబీకులు ఐడీ 181 లో ఉంది. మల్లన్నసాగర్ రీ డిజైనింగ్ పేరిట వేలాదిమంది ప్రజలను రోడ్డునపడేస్తున్నారని.. వారికి భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. రైతులకు సరైన న్యాయం జరగకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉదృతంచేస్తామంటున్నారు.

డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్...

హైదరాబాద్ : గోల్కొండ పీఎస్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇద్దరు నైజీరియన్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

కామారెడ్డిలో చిట్టీల వ్యాపారీ టోకరా....

నిజామాబాద్ : కామారెడ్డిలో చిట్టీల వ్యాపారీ కృష్ణ రూ.4 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. పెట్టాడు. అప్రమత్తమైన బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

బోనకల్లు వంతెన పై రాకపోకలకు అంతరాయం..

ఖమ్మం : బోనకల్లు వంతెనపై రెండు లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వంతెనపై లారీలు ఇరుక్కుపోవడంతో కొత్తగూడెం, భద్రాచలం, జగ్గయ్యపేట, విజయవాడ వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 4 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.

డీఎస్సీ-2014 ఫైనల్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : డీఎస్సీ-2014 ఫైనల్ షెడ్యూల్ ను మంత్రి గంటా విడుదల చేశారు. ఈనెల 26 నుంచి ధృవపత్రాలపరిశీలన, 29,30,31 వెబ్ కౌన్సిలింగ్ జరగనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు జూన్ 1న నియామక పత్రాల అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

09:35 - May 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో నిర్మించే అంశంపై అనేక విమర్శలతో కేసీఆర్‌ వెనక్కి తగ్గినా.. ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మరో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త సచివాలయం అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

ఎర్రగడ్డ చాతీ వ్యాధుల ఆస్పత్రి స్థలం పరిశీలన ....

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని మర్చాలని ప్రతిపాదించారు. దీనిలో వాస్తు దోషాలు ఉన్నాయంటూ... ఎర్రగడ్డలోని చాతీ వ్యాధుల ఆస్పత్రి స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అప్పట్లో దీనిపై అటు ఆస్పత్రి వైద్యులు, ఇటు ప్రజా సంఘాలు, రాజకీయాల పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతతోపాటు, విమర్శలు ఇచ్చాయి. అయినా ప్రభుత్వం ఆ తర్వాత సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌ పక్కన ఉన్న రక్షణ శాఖ స్థలం బైసన్‌ పోలో గ్రౌండ్‌ను పరిశీలించారు. సచివాలయం కోసం ఈ స్థలాన్ని అప్పగిస్తే... రక్షణ శాఖకు ప్రత్యామ్నాయం చూపిస్తామని ఆ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విన్నవించారు. కానీ దీనిపై రక్షణ శాఖ నుంచి అనుమతిరాకపోవడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

జీఏడీ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన 5 సభ్యుల కమిటీ....

కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసు, ఏఐఎస్‌ అధికారుల క్వార్టర్ల నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించేందుకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షత 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ గతేడాది మార్చి 24న 166వ నంబర్‌ జీవో జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి కోసం ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయం పక్కన కొత్త భవనం నిర్మిస్తున్నారు. దీంతో కొత్త సచివాలయం నిర్మాణం అంశం వెనక్కి పోయిందని భావిస్తున్న తరుణంలో సర్కార్‌ కొత్తగా జీవో 172 జారీ చేసింది. దీంతో కేసీఆర్‌ ప్రభుత్వ మళ్లీ కొత్త సచివాలయం నిర్మాణానికి చర్యలు చేపడుతోందన్న వార్తలు వస్తున్నాయి.

గతనెల 14 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి శంకుస్థాపన .....

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నెల 14న 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి హుస్సేన్‌సాగర్‌ దగ్గర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహాన్ని ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో వివరించారు. బుద్ధుడు మార్గంలో అంబేద్కర్‌, ఆయన నీడలో సచివాలయం నుంచి పాలన అంటూ హితబోధ చేశారు. దీంతో కొత్త సచివాలయం నిర్మాణం లేనట్టేనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమీటీ ఏర్పాటు చేయడంతో మళ్లీ చర్చ ప్రారంభమయ్యింది.

ప్రస్తుతం ఉన్న భవనవాల్లో వాస్తు దోషాలు సరిచేసే యత్నం.....

అయితే కేసీఆర్‌ సర్కార్‌ మాత్రం ప్రస్తుతం ఉన్న సచివాలయ సముదాయంలోనే కొత్త భవనాలను నిర్మించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాల్లో వాసు దోషాలను సరిచేయడంతోపాటు కొన్నికొత్త బ్లాక్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న ఏ, బీ, సీ బ్లాక్‌లను తొలగించి, ఎల్‌ ఆకారంలో పది అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏడు అంతస్తుల్లో ఉన్న ఎల్‌ బ్లాక్‌ కంటే ఎత్తులో కొత్త భవనాన్ని నిర్మిస్తే వాస్తు దోషం ఉండదని భావిస్తున్నారు. భవనాలపై గుడి నీడ పడటం కూడా మంచిదికాదంటున్న కేసీఆర్‌... ఏ, బీ, సీ బ్లాక్‌లను తొలగించాలన్న యోచనలో ఉన్నారు. నల్లపోచమ్మ గుడి పక్కన నుంచి సీఎం కార్యాలయం ఉన్న సమతా బ్లాక్‌ వరకు ఒకే భవనం నిర్మించాలని భావిస్తున్నారు. ఏ, బీ, సీ బ్లాక్‌లను కూల్చివేస్తే వీటిలో ఉన్న కార్యాలయాలను ఎక్కడకు తరలించాలన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు కొత్త కమిటీ ఏర్పాటు చేశారని అంటున్నారు.

ఆర్‌ అండ్‌ బీ అధికారులు, వాస్తు పండితులతో చర్చించిన ప్రణాళిక ...

కేసీఆర్‌ సచివాలయానికి రాకుండా క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్న తరుణంలో సచివాలయంలోని పాత భవనాలను కూల్చివేసినా సీఎం పనులకు ఆటంకం ఉండదు. రోడ్లు భవనాల శాఖ అధికారులతోపాటు.. వాస్తు పండితులతో మరోసారి చర్చించిన తర్వాత సమగ్రా ప్రణాళిక రూపొందిస్తారు. కేసీఆర్‌ ఆమోదించిన మరుక్షణం కొత్త భవనాలు నిర్మిస్తారు. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సచివాలయం ప్రాంగణంలోనే కొత్త భవనాలను నిర్మించాలని ప్రతిపాదించడం ద్వారా... ఇతరితర స్థలాల పరిశీలన అంశాలన్నీ వెనక్కిపోయినట్టేనని భావిస్తున్నారు. 

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో యువకుడు హత్య

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఖాళీ బోగిలో పడేశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు పంపించారు. 

రెండు కార్లు ఢీ: మహిళ మృతి

రంగారెడ్డి: మహేశ్వరం మండలం తుక్కుగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు కార్లు ఢీ కొన్నాయి.ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

కస్టడీకి ఎమ్మెల్సీ మనోరమా దేవి

బీహార్‌ : జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మనోరమా దేవి గయా కోర్టులో లోంగిపోయారు. మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఆమె పోలీసుల ముందు హాజరయ్యారు. ఆ తర్వాత పోలీసులు మనోరమాను కోర్టులో హాజరుపరిచారు. ఆమెను 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. తాను ఏ నేరం చేయలేదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఇంట్లో అక్రమంగా మద్యం నిలువ చేసిన కేసులో ఆమె తప్పించుకు తిరిగారు. రాజకీయంగా తనను టార్గెట్ చేశారని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ మనోరమా కుమారుడు రాకీ యాదవ్ కూడా ఓ హత్య కేసులో పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు.

ఢిల్లీ బయలు దేరిన సీఎం చంద్రబాబు

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయడు మంగళవారం ఉదయం విజయవాడ నుంచి విమానంలో దిల్లీ బయలుదేరారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. కరవు, ఇతర అంశాలపై ప్రధానికి ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.

08:16 - May 17, 2016

హైదరాబాద్ : సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు స్వల్ప అస్వస్ధతకు గురి అయ్యారు. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిపడుతున్న కృష్ణం రాజును కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సీనియర్ డాక్టర్ సోమరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృష్ణం రాజుకు ఐసియూలో చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు కృష్ణం రాజు ఆరోగ్య పరిస్థితులపై పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వాకబు చేస్తున్నారు. ప్రభాస్ కూడా ఇప్పటికే కేర్ ఆసుపత్రి చేరుకొని తన పెద్దనాన్న యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయపడాల్సిన పనేమి లేదని వైద్యులు తెలిపారు. 

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం...

కశ్మీర్ :భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని కొండప్రాంతమైన షోపియాన్ జిల్లాలో గల ఫిలిపోరా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదుల ఆచూకీపై సమాచారం అందుకున్న జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారు. ఇరుపక్షాల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. 

07:58 - May 17, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రా మధ్య ఎలాంటి విభేదాలు వచ్చినా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో సీనియర్ విశ్లేషకులు, ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ సూచించారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ అక్రమ ప్రాజెక్టుల కు వ్యతిరేకంగా కర్నూలులో జగన్ జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను హిట్లర్ తో పోల్చారు. ఈనేపథ్యంలో మానుకోట రిపీట్ అవుతుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మరో వైపు జగన్ దీక్ష.. ఓ దొంగ దీక్ష అని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. జగన్ ప్రతిదీ రాజకీయ కోణంతో ఆలోచిస్తున్నారా? ఆంధ్రా ప్రయోజనాలు, తెలంగాణ ప్రయాజనాల కంటే... తెలుగు బిడ్డల ప్రయోజనం చూడాల్సిన అవసరం లేదా? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్ర మంత్రులు పార్లమెంటులో తేల్చి చెప్పిన నేపథ్యంలో... దీనిపై స్పష్టత గురించి చంద్రబాబు... ప్రధాని మోదీని వివరణ అడిగే అవకాశం ఉందా? కేంద్రంతో గొడవ పడి హోదాపై మాట్లాడేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేష్ తో పాటు వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టిఆర్ఎస్ నేత వకుళాభరణం కృష్ణ మోహన్, టిడిపి నేత నాగూర్ మీరా పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 

07:06 - May 17, 2016

హైదరాబాద్ : గుజరాత్‌ ముఖ్యమంత్రిని మార్చేందుకు రంగం సిద్ధమైంది. కొంతకాలంగా సిఎం ఆనందీబెన్‌ పటేల్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బిజెపి అధినేతలు ఆమెకు ఉద్వాసన పలకేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదితో సిఎం సమావేశం కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

గుజరాత్‌లో బిజెపికి ఓటమి భయం...

కమలానికి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో బిజెపికి ఓటమి భయం పట్టుకుంది కాబోలు... 2017 ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు బిజెపి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గుజరాత్‌ సిఎం ఆనందీబెన్‌ పటేల్‌ను పదవి నుంచి తప్పించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోదితో ఆనందిబెన్ పటేల్‌ సమావేశం ఇందుకు బలం చేకూరుస్తోంది. మే 20 తర్వాత గుజరాత్‌కు కొత్త సిఎంను ప్రకటించే అవకాశముంది. ఇక ఆనందిబెన్‌ పటేల్‌కు గవర్నర్‌ పదవితో కమలనాథులు సంతృప్తి పరచనున్నారు. పటేల్‌ వర్గానికే చెందిన మంత్రి నితిన్‌భాయి పటేల్‌ సిఎం పదవి రేసులో అందరికన్నా ముందు వరుసలో ఉన్నారు.

గుజరాత్‌ పరిస్థితులపై మోది ప్రత్యేక సర్వే ...

గుజరాత్‌ పరిస్థితులపై మోది ప్రత్యేక సర్వే చేయించారు. సర్వే పనిని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓంప్రకాష్‌ మాధుర్‌కు అప్పగించారు. ఆనందిబెన్‌ ప్రభుత్వంపై గత ఏడాదిగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సర్వేలో తేలడంతో ప్రధాని తక్షణ చర్యలు చేపట్టారు. గతవారం బిజెపి చీఫ్‌ అమిత్‌షా, మాధుర్‌లతో ప్రధాని సమావేశమై గుజరాత్‌ పరిస్థితులపై చర్చించి సిఎంను తప్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. వయసురీత్యా కూడా ఆనందిబెన్‌ వయసు 74 ఏళ్లు. 75 ఏళ్లు దాటినవారు మంత్రివర్గంలో ఉండకూడదన్న సాకుతో కూడా ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నారు.

పటేళ్‌ ఆందోళనను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయారన్న ...

మోది ప్రధాని పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో మే 22, 2014లో ఆనందిబెన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఆమె పదవి నుంచి వైదొలగాల్సి వస్తోంది. పటేళ్‌ ఆందోళనను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయారన్న కారణంతోనే ఆమెకు పదవీగండం ఏర్పడిందని విమర్శకుల అభిప్రాయం. 

06:54 - May 17, 2016

హైదరాబాద్ : టిఆర్ఎస్ తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకుంద‌నే విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్‌ ప్రయత్నం చేస్తున్నారు . తెలంగాణా ప్రాజెక్టుల‌కు వ్యతిరేకంగా క‌ర్నూల్ లో చేస్తున్న జలదీక్షలో తొలిసారిగా కేసీఆర్ పై జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎంను హిట్లర్‌తో పోల్చుతూ ఘాటైన విమర్శలు చేశారు.

టీర్ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నా ప‌లెత్తు మాట అనని జ‌గ‌న్ ...

రాష్ట్రం విభ‌జ‌న జ‌రిగిన‌ప్పటీ నుంచి ఏపీ ప్రయోజనాలకు సంబంధించి టీర్ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నా జ‌గ‌న్ ప‌లెత్తు మాట అన‌లేదు. అంతే కాకుండా కొన్ని ఎన్నిక‌ల స‌మ‌యాల్లో బ‌హిరంగంగానే టిఆర్ఎస్ కు మ‌ద్దతు ఇచ్చారు. దీంతో కేసిఆర్ తో జ‌గ‌న్ చీక‌టి ఒప్పందం చేసుకున్నార‌ని విమ‌ర్శలు వెల్లువెత్తాయి. విమర్శలకు తగ్గట్టుగానే జ‌గ‌న్ వ్యవహారశైలి కూడ ఉండ‌టంతో నిజంగానే కేసీఆర్ తో జ‌గ‌న్ అంతర్గత ఒప్పందం చేసుకున్నార‌న్న విమ‌ర్శలకు బ‌లం చేకూరింది. అదీ కాక తెలంగాణ‌లో వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓ ఎంపి గులాబీ గూటికి చేరినా జ‌గ‌న్ టీఆర్ఎస్ నేత‌లను కాని, కేసిఆర్ ను కాని ఏ సందర్భంలోనూ విమర్శించలేదు. ఐతే ఈ విమర్శలకు చెక్ చెప్పాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అందుకు క‌ర్నూల్ లో జ‌ల దీక్షను చేపట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ సీఎం వైఖ‌రితో నీటి యుద్ధాలు వ‌చ్చే అవ‌కాశ‌ం...

కృష్టా న‌దిపై తెలంగాణా ప్రభుత్వం పాల‌మూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌ను అక్రమంగా నిర్మిస్తోందని జ‌గ‌న్ దీక్షకు దిగారు. జ‌ల‌దీక్షలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ను హిట్లర్‌తో పోల్చుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం వైఖ‌రితో నీటి యుద్ధాలు వ‌చ్చే అవ‌కాశ‌ముందన్నారు ఆరోపించారు. త‌న ప్రసంగంలో చంద్రబాబు పెద్దగా పట్టించుకోని జ‌గ‌న్... టీఆర్ఎస్ అధినేత‌ను టార్గెట్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చకు దారి తీసింది.

రాయ‌ల‌సీమ‌లో ప‌ట్టు కొల్పోకూడదనే భావ‌న‌తోనే ....

కేసీఆర్ పై జ‌గ‌న్ వ్యాఖ్యాలపై భిన్నమైన కార‌ణాలు వైసిపిలో వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు వైసీపీనేత‌లేన‌ని టీడీపీ నేత‌లు విమర్శిస్తున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వంతో జ‌గ‌న్ కుమ్మక్కయ్యారనే అంశం ఏపీ ప్రజల్లోకి వెళ్లేలా టిడిపి నేత‌లు ప్రచారం చేస్తున్నారు. దీంతో త‌న‌కు ఏపీ ప్రయోజ‌నాలే ముఖ్యమన్న భావ‌న అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లేలా జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. దీనికి తోడు రాయ‌ల‌సీమ‌లో ప‌ట్టు కొల్పోకూడదనే భావ‌న‌తోనే కేసీఆర్ పై ఆ రేంజ్ లో విమ‌ర్శలు చేసార‌ని పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబే కేసీఆర్ స‌ర్కార్ కు బైండోవ‌ర్ అయ్యార‌ని ప్రజలకు నమ్మకం క‌లిగేలా జ‌గ‌న్ వ్యవహరించారని అంటున్నారు. 

06:50 - May 17, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌శర్శ నేతృత్వంలోని ఓ కమిటీ.. జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పరిశీలిస్తుండగా.. మరో ఇద్దరు అధికారులకు జిల్లాల పునర్విభజన బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రం దూరం ?.....

ఇక కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో... హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రం దూరం ఎంత ? పాలనాపరంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందా ? అనే అంశాలను పరిశీలించాలని కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు సైతం జిల్లా కేంద్రం 60 కి.మీ పరిధిలోపు ఉండేలా... జిల్లా హెడ్‌క్వార్టర్‌ గ్రోత్‌ కారిడార్‌గా ఎదిగేందుకు అనువైన పట్టణంగా ఉంటుందా ? లాంటి స్థిరమైన ప్రమాణాలను పాటించాలని సీఎం సూచించారు. ఈ అంశాల ప్రాతిపదికనే 17 నుంచి 18 సరిహద్దు ముసాయిదా నమూనాలతో తెలంగాణ రాష్ట్ర శాటిలైట్‌ మ్యాప్‌లను కూడా అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇద్దరు ప్రజాప్రతినిధులతో జిల్లాల పునర్విభజన కమిటీ......

అటు జిల్లాల పునర్విభజన కోసం ఇద్దరు ప్రజాప్రతినిధులతో కేసీఆర్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు,.. రంగారెడ్డి జిల్లాకు మహేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి,.. నల్లగొండ జిల్లాకు జగదీశ్వర్‌రెడ్డి, గాదర కిషోర్‌,.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు నిరంజన్‌రెడ్డి,.. నిజామాబాద్‌ జిల్లాకు ప్రశాంత్‌రెడ్డి, గంప గోవర్ధన్‌,.. కరీంనగర్‌ జిల్లాకు వినోద్‌కుమార్‌,.. కొప్పుల ఈశ్వర్.. ఆదిలాబాద్‌ జిల్లాకు లోకా భూమారెడ్డి, వేణుగోపాలాచారి.. మంచిర్యాలకు పురాణం సతీష్‌, బాల్క సుమన్‌.. మెదక్‌కు శేరి సుభాష్‌రెడ్డి,..మానిక్‌రెడ్డి.. వరంగల్‌కు పెద్ది సుదర్శన్‌రెడ్డి,.. మధుసూదనాచారిలు జిల్లాల పునర్విభజన కమిటీల్లో సభ్యులుగా నియమించారు. గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో పునర్విభజన స్వరూపం ఎలా ఉండాలి ? ప్రాంతాలవారీగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి ? వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పడాలంటే ఏ చర్యలు తీసుకోవాలనే అంశాలపై అధ్యయనం చేసి.. త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీలకు సీఎం సూచించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహర బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. అయితే మెదక్‌ జిల్లాలో మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు పని చేయాలని కేసీఆర్‌ సూచించినట్లు సమాచారం.

ప్రభుత్వానికి 33 ప్రతిపాదనలు.....

ఇక కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో.. ప్రభుత్వానికి 33 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ నుంచి 11 ప్రతిపాదనలు రాగా.. అందులో గద్వాలను జిల్లా చేయాలని 8 ప్రతిపాదనలున్నాయి. అదేవిధంగా జనగామను జిల్లా కేంద్రంగా చేయాలంటూ నాలుగు ప్రతిపాదనలు సీఎస్‌ కమిటీకి అందాయి. కొత్త జిల్లాల కోసం దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు రాగా.. ఒక్క నిజామాబాద్‌ జిల్లా నుంచి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని సమాచారం. అయితే.. ప్రస్తుత అంచనాలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కొత్తగా రెండేసి జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనే కొత్తగా మరో మూడు నుంచి నాలుగు జిల్లాలుగా విడిపోయే అవకాశం ఉంది. ఇందులో ఒక జిల్లాకు గోల్కొండ పేరు పెట్టాలని కేసీఆర్‌ సూచించినట్లు సమాచారం. అదేవిధంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న భువనగిరి, షాద్‌నగర్‌లను జిల్లా హెడ్‌క్వార్టర్స్‌గా చేసి.. హైదరాబాద్‌ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడే జిల్లాల్లో కలపాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పునర్విభజన కమిటీలు జిల్లా నేతలతో సమావేశాలు...

ఇదిలావుంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా పునర్విభజన కమిటీలు జిల్లా నేతలతో సమావేశాలు కూడా ప్రారంభించాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఏది ఏమైనా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. జూన్‌ 2న కొత్త జిల్లాల ప్రకటన చేస్తామని సీఎం ప్రకటించడంతో దీనిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ జిల్లా విడిపోతుంది.. ఏ ప్రాంతం జిల్లా కేంద్రమవుతుందనే చర్చ జోరుగా కొనసాగుతోంది. 

ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కేసీఆర్‌ స్వయంగా ప్రకటించడంతో ఆ ప్రక్రియ మరింత ఊపందుకుంది. రెవెన్యూ అధికారులు వాటికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు జిల్లా కమిటీలను సీఎం నియమించారు. 

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు...

విజయవాడ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ చేరుకునే చంద్రబాబు... మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో భేటీ అవుతారు. కరవుతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను మినహాయింపు వంటి 13 అంశాలపై ప్రధానికి నివేదిస్తారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత రాత్రికి విజయవాడ చేరుకుంటారు. 

06:46 - May 17, 2016

విజయవాడ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ చేరుకునే చంద్రబాబు... మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో భేటీ అవుతారు. కరవుతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను మినహాయింపు వంటి 13 అంశాలపై ప్రధానికి నివేదిస్తారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత రాత్రికి విజయవాడ చేరుకుంటారు.

ఉపాధి హామీ పథకం అమలు తీరు, కేంద్ర సాయంపై చర్చలు ....

ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘ కసరత్తు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీకి అందజేసే నివేదికపై అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం అమలుతీరు, కేంద్ర సాయంపై అధికారులతో చర్చించారు. కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజానాచౌదరి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. కరవు పరిస్థితులు, ప్రత్యేక హోదా, రాయితీలు, పన్ను మినహాయింపు తదితర అంశాలపై ప్రధాని మోదీకి ప్రజెంటేషన్‌ ఇస్తారు. ప్రధానితో జరిగే భేటీలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌ పాల్గొంటారు.

ప్రత్యేక హోదాపై మోదీని వివరణ కోరే అవకాశం ....

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్ర మంత్రులు పార్లమెంటులో తేల్చి చెప్పిన నేపథ్యంలో... దీనిపై స్పష్టత గురించి చంద్రబాబు... ప్రధాని మోదీని వివరణ అడిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ విభజన చట్టం ఆమోదం సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం బీజేపీ పట్టుపట్టి, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రాజ్యసభలో ప్రకటన చేయించిన... బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై తిరకాసుగా వ్యవహరించడాన్ని టీడీపీ నేతలు తప్పుపుడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో... చంద్రబాబు.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ పర్యటన ఉపయోపడుతుందని భావిస్తున్నారు.

ఇంతవరకు 28 సార్లు ఢిల్లీ టూర్‌ .....

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతవరకు 28 సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రతిసారి కూడా ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చమని కోరుతూనే ఉన్నారు. రెవిన్యూ లోటు భర్తీ చేయమని కోరుతున్నా.... కేంద్రం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 16 వేల కోట్ల రూపాయల రెవిన్యూ లోటు భర్తీకి గాను ఇంతవరకు కేవలం 2,800 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక గ్రాంటు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోవడంలేదున్న విమర్శలున్నాయి. ఈ జిల్లాల అభివృద్ధికి 24 వేల కోట్లు అడిగితే... ఇంతవరకు కేవలం 700 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని పాలకులు గుర్తు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు 700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి 1850 కోట్ల రూపాయల మాత్రమే విధిల్చారు. ఈ విషయాలన్నింటినీ చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

చంద్రబాబు చేసే విన్నపాన్ని కేంద్రం మన్నిస్తుందా ?

రాష్ట్రానికి అదుకునేందుకు ఎక్కువసాయం చేయమని చంద్రబాబు కేంద్రాన్ని కోరతారు. ఈ సారైనా చంద్రబాబు చేసే విన్నపాలను కేంద్రం మన్నించి ఎక్కువ సాయం చేస్తుందా ? లేక గతంలో మాదిరిగానే విని ఊరుకుంటుందా ? అన్న అంశాలను పరిశీలించేందుకు వేచి చూడాలి. 

06:43 - May 17, 2016

ఖమ్మం : పాలేరు ఉపఎన్నికలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో.. అధికార పార్టీలో మరింత ధీమా పెరిగింది. ముందునుంచి తాము అనుకున్న వ్యూహం ఫలించిందని గులాబి నేతలు సంబరపడుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 4 వేల ఓట్లు సాధించిన పార్టీ.. ఈ ఎన్నికతో గణనీయంగా పుంజుకుందని గులాబీ నేతలు భావిస్తున్నారు.

అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు...

పాలేరు ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రంగంలోకి దిగింది. అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని వ్యూహాలను అమలు చేసే విధంగా నేతలను మోహరించింది. ఖమ్మం జిల్లాలో పార్టీకి బలం లేదన్న వాదనను ఈ ఎన్నికతో తిప్పి కొట్టే విధంగా వ్యూహం అమలు చేసింది.

ప్లీనరీ నుంచే జిల్లాలో ఎన్నికల వేడి.....

ప్లీనరీ నుంచే ఎన్నికల వేడిని జిల్లాలో రగిలించింది టీఆర్‌ఎస్‌. అదేస్థాయిలో భారీగా నేతలను రంగంలోకి దింపింది. మంత్రివర్గంలోని మెజార్టీ మంత్రులు సహా 40 మందికి పైగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీ పాలేరు ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పావులు కదిపారు. ఇతర జిల్లాల ఇంచార్జ్‌లు కూడా అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. తుమ్మల కోసం భారీగా ప్రచారం చేశారు. గడపగడపకు కారు గుర్తును తీసుకెళ్లే విధంగా ప్రణాళికలను రచించి.. అమలు చేశారు.

తుమ్మలకు 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని అంచనా.....

ఇక పోలింగ్ సరళిని పరిశీలించిన గులాబీ నేతలు తమ విజయంపై పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని మండలాల్లో కూడా భారీ మెజార్టీ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. 50 శాతానికి పైగా ఓట్లు తుమ్మలకే వస్తాయని నేతలు లెక్కలు వేస్తున్నారు. భారీగా పోలింగ్‌ నమోదు కావడం.. తుమ్మలకు భారీ మెజారిటీ వచ్చేందుకు కలిసివస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు. మరి నేతల అంచనాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాలి. 

06:38 - May 17, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల ముహూర్తం దగ్గరకొస్తోంది. ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూన్ 7 నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. కాబట్టి, శ్రావణమాసంలో పుష్కరాల సమయంలో క్రిష్ణానది పరవళ్లు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి, కృష్ణాపుష్కరాలలో పాల్గొనే భక్తులకు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి వుంటుంది. గతంలో 1992, 2004 సంవత్సరాలలో కృష్ణా పుష్కరాలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ 2016లో వస్తున్నాయి. అప్పటి పుష్కరాలకీ ఇప్పటి పుష్కరాలకీ వున్న తేడాలేమిటి? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుస్కరాలకు వున్న ప్రాధాన్యతేమిటి? పుష్కరాల సమయంలో భక్తులకు, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సాధారణంగా ఆగస్టు మాసంలో క్రిష్ణానది ప్రవాహం ఎలా వుంటుంది? ఆగస్టు మాసంలో క్రిష్ణానది పరివాహ ప్రాంతంలో పొంచి వుండే ప్రమాదాలేమిటి? ఇప్పటికే పుష్కర ఘాట్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు చేపడుతున్న పనులు సంత్రుప్తికరంగా వున్నాయా? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు నాగార్జునసాగర్ తో పాటు వివిధ ప్రాజెక్ట్ లలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన కెవి వచ్చారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...

హైదరాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై రూ.83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, రూపాయితో డాలర్‌ మారకం విలువ పెరగడం వంటి కారణాల వల్ల ధరలు పెంచినట్లు పేర్కొంది. ఈ నెల 1న పెట్రోల్‌ రూ.1.06 పైసలు, డీజిల్‌ రూ.2.94 పైసలు పెంచిన సంగతి తెలిసిందే.

06:19 - May 17, 2016

హైదరాబాద్‌: ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణి, కారు డ్రైవర్ దాసు దుర్మరణం చెందగా, పిన్నమనేనికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ఘటన పహాడీషరీఫ్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద సోమవారం 12.30 గంటల ప్రాంతంలో  జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెండు సార్లు బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును శంషాబాద్‌లోని ట్రెజెండ్‌ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పిన్నమనేని కుమారుడు తెలిపారు.  మరో వైపు పిన్నమనేని వెంకటేశ్వరరావు కు ప్రాణాపాయం లేదని, ఈ రోజు ఉదయం 11 గంటలకు డిశ్చార్జి అవుతారని తెలిపారు. 

ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని కారు బోల్తా: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: పహాడీషరీఫ్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద మంగ‌ళ‌వారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సత్యవాణి, కారు డ్రైవర్‌ దాసు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును శంషాబాద్‌లోని ట్రెజెండ్‌ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Don't Miss