Activities calendar

18 May 2016

21:32 - May 18, 2016

త్రివేండ్రం : కేరళలో వామపక్ష కూటమికి 85..90 సీట్లు రావడం ఖాయమని కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అవినీతి కాంగ్రెస్, మతతత్వ బీజేపీకి పరాభవం తప్పదన్నారు. మోడీ ప్రచారం చేసినా బీజేపీకి ఒక్క సీటు రాదని ఎద్దేవా చేశారు. సీపీఎం కేంద్రీకృత ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ అని పేర్కొన్నారు. ప్రజలు తాను సీఎం కావాలని కోరుకున్నా.. పార్టీదే అంతిమ నిర్ణయమన్నారు.

విద్యాహక్కు చట్టం-2010 కి ఏపీ సర్కారు సవరణ....

విజయవాడ : ఏపీ విద్యాహక్కు చట్టం-2010 కి సవరణ చేస్తూ ఏపీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు కి.మీటర్ల దూరంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు టీఏ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

21:16 - May 18, 2016

సుందరయ్య. పేరు సామాన్యం . ఆ పేరు ప్రభావం అసామాన్యం. పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అన్న మాటకు అర్థంగా, పరమార్థంగా నిలిచే భరతమాత ముద్దుబిడ్డల్లో సుందరయ్య ఒకరు. తెలుగు గడ్డపై.. ఆమాటకొస్తే యావత్ భారత దేశంలో .. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే పేరెన్నికగన్నమహాపురుషుల్లో ఒకరుగా పుచ్చలపల్లి సుందరయ్య నిలుస్తారు. ఆ పేరు అమరం..ఆ బతుకు అమరం. ఆ గమనం అమరం. ఆ స్మృతి అజరామరం. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా టెన్ టీవీ ప్రత్యేక కథనం..

కార్యశూరుడు సుందరయ్య...
ఆయన అసాధారణ కార్యశూరుడు. అకుంఠిత దీక్షాపరుడు. అవిశ్రాంత యోధుడు. అసమాన త్యాగధనుడు. వినిర్మల హృదయుడు. నిరాడంబరుడు. నిస్వార్థపరుడు. అరుణపతాక సాక్షిగా బతుకు సాగించే వారికే కాదు.. జీవిత గమనంలో అనేక దారుల్లో చీలిపోయిన వారికి కూడా ఆయన ఆదర్శజీవి. ఆ ధన్యజీవి కథలో అడుగడుగూ ఓ ఆదర్శమే. అణువవణువూ కర్తవ్యబోధనా కరచాలనమే. మానవ సేవలో కడతేరిన ఆ సదాశయ సాహసికుని ప్రస్థానం మరువలేనిది. మరపురానిది.

కాలం కన్న కలకు సాకారం సుందరయ్య...
ఇంతకీ ఎవరీ సుందరయ్య? ఏ కన్నతల్లికో ముద్దుబిడ్డ కావచ్చు కాని అదే వ్యక్తి ఒకనాటికి భరతమాత ముద్దుబిడ్డగా ఎలా ఎదిగాడు? ఎక్కడ పుట్టాడు? ఏ సామాజిక అస్తవ్యస్త అంధకారాన్ని బద్దలుకొట్టుకుని ఈ సూర్యుడు ఉదయించాడు? కాలం కన్న ఏ కలకు సాకారంగా మన సుందరయ్య తెలుగునేల మీద ప్రత్యక్షమయ్యాడు? వంద వసంతాల అనంతరం కూడా ఆ వివరాలు మనకు నిత్యనూతనంగానే ఉంటాయి.

అందరయ్యగా సుందరయ్య...
సుందరయ్య అందరయ్యగా ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. ఒకవైపు స్వాతంత్ర్య సమర శంఖారావం దేశాన్ని కుదిపేస్తున్న కాలంలో సుందరయ్య ఆ స్వాతంత్ర్య ఫలాలు కొందరు బలవంతుల గుత్త సొమ్ముగా మారకూడదన్న మహోన్నత ఆశయాన్ని ఆయుధంగా చేసుకుని ముందుకు కదిలాడు. అరుణారుణ పతాకమే ప్రపంచానికి ఏకైక దిక్సూచిగా విశ్వసించి తన ఆశయ సాధనకు నడుం కట్టాడు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో సుందరయ్య నిర్వహించిన పాత్ర అనితర సాధ్యమనే చెప్పాలి. కమ్యునిస్టు ఉద్యమ నిర్మాణంలో విడదీయరాని కామ్రేడ్ పి.ఎస్. ప్రస్థానం గురించి తెలుసుకుని తీరాలి.

జీవితం..ఆశయం..పోరాటాల మేళవింపు సుందరయ్య...
జీవితం..ఆశయం..పోరాటం..కలగలిసి సాగిన సుందరయ్య ప్రస్థానంలో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఓ కీలక ఘట్టం. ఉద్యమమే ఊపిరిగా బతికేవారికి తెలంగాణా పోరాటంలో సుందరయ్య సాగించిన సాహస యాత్ర అనునిత్య స్ఫూర్తి ప్రదాత అంటే అతిశయోక్తి కాదు. నిరక్షరాస్యులను నిజాం వ్యతిరేక పోరుకడలిలోకి దూకించిని సుందరయ్య సమరదీక్ష మరువలేనిది.

సామ్యవాద గ్రంథకర్త సుందరయ్య...
చిన్న వయస్సులోనే ఆర్ధిక వ్యవస్థను అవపోశన పట్టారు సాగునీటి ప్రాజెక్టులపై అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలు చేశారు. సామ్యవాద ఆర్ధిక వ్యవస్థపై అనేక పుస్తకాలు రాశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వీటిలోనే పరిష్కారాలు దొరుకుతాయి. ఇప్పుడు దేశభక్తి, నిరాంబడరత్వం, నీతి, నిజాయితీ వంటి ఉత్తమ లక్షణాలు అపహాస్యమౌతున్న రోజులు దాపురించాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సుందరయ్య జీవితమే ఆదర్శంగా ప్రతిఒక్కరూ ఎర్రబావుటాలై ఎగరాలి. మత ఛాందసవాదం, కార్పొరేట్ల దోపిడీపై తిరగబడాలి. అప్పుడే ఈ కమ్యూనిస్ట్ గాంధీకి అసలైన నివాళి.

శ్రీవారి సేవలో దేవెగౌడ....

తిరుమల: మాజీ ప్రధాని దేవెగౌడ బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్వాగతం పలికారు. అనంతరం పచ్చకర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో దేవెగౌడను వేద పండితులు ఆశీర్వదించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

భారీ వర్షాలతో గుంటూరు-నంద్యాల కొన్ని రైళ్లు రద్దు....

గుంటూరు: భారీ వర్షాల కారణంగా గుంటూరు-నంద్యాల మార్గంలో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు చేసినట్టు పేర్కొంది. రేపు ఉదయం 6 గంటలకు కర్నూల్‌ డోన్‌ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ను రద్దు చేశారు. అదే రోజు రాత్రి 7.45 గంటలకు వెళ్లాల్సిన విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10.30 గంటలకు బయలుదేరనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

పిడుగుపాటు.. బాసర సరస్వతి ఆలయ గోపురానికి పగుళ్లు

ఆదిలాబాద్ : బాసర సరస్వతి ఆలయంలో పిడుగుపాటుకు ప్రధాన గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయి.

డాక్టర్ ఏకే చారి మృతి...

హైదరాబాద్: ప్రముఖ సీనియర్ సర్జన్ డాక్టర్ ఏకే చారి (87) కన్నుమూశారు. ఏకే చారి ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వైద్య వృత్తిలో 60 వేల శస్త్ర చికిత్సలు పూర్తి చేసిన ఏకే చారీ స్వాతంత్య్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించారు.

20:49 - May 18, 2016

హైదరాబాద్ : సివిల్స్ విజేత చేకూరి కీర్తితో 10టీవీ లైవ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా కీర్తి తన అనుభవాలను 10టీవీతో పంచుకున్నారు. సివిల్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయటం అనేది కష్టమే కానీ కష్టపడితే సాధ్యం కాదన్నారు. 14వ ర్యాంక్ ర్యాంక్ వచ్చినందుకు తాను ఆనందపడటంలేదు కానీ దానివల్ల ఐఏఎస్ అవుతున్నందుకు ఆనందంగా వుందన్నారు. ఐఏఎస్ అయితే సవాళ్లు, బాధ్యతలు వుంటాయన్నారు. మన రాష్ట్రంలో చాలా సమస్యలు వున్నాయి. ఉమెన్ ఎంపోరిమెంట్, రైతుల ఆత్మహత్యలు, తుపాను ఇలా వున్న సమస్యలను ఫేస్ చేయటానికి తాను సిద్ధపడుతు న్నానని కీర్తి తెలిపారు. పరీక్షలకు ప్రిపేర్ అయేటప్పుడు తల్లిదండ్రులు, స్నేహితుల సపోర్టు చాలా వుండేదనీ ఆ సపోర్ట్ తోనే తాను ర్యాంక్ సాధించగలిగానని కీర్తీ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

20:38 - May 18, 2016

ఎన్నికల ఫలితాలు..
పదో తర్గతి పరీక్షలు రాశి.. రిజల్ట్ కోసం ఎదురు సూశె పోరగాళ్లకు ఎంత టెన్షన్ ఉంటదో.. గురువారం పొద్దుగాళ్ల ఇడ్దలయ్యె ఓట్ల ఫలితాల మీద గూడ అంతో దగడుతోని ఉన్నరు పోటీల నిలవడ్డోళ్లు.. ఐదు రాష్ట్రాల ఓట్ల పెట్టెలతోపాటే.. మన పాలేరు ఓట్ల పెట్టెలు గూడ ఈ గురువారంనాడే ఇప్పుతున్నరుగావట్టి ఇగ తక్వ టెన్షనున్నదా ఒకలొకలికి..

ఉన్న కరెంటిని కల్లాస్ జేశిండ్రంటున్నరు జనం..
కొయ్యరా కొయ్యరా పొలిగా అంటే.. టంగుటూరు మిరియాలు.. తాటికాయంత పెద్దగుంటయ్ అన్నడట.. అగో అట్లనే ఉన్నది మన తెలంగాణ సర్కారు పనిగూడ అంటున్నరు హైద్రావాదు పబ్లీకు.. మాకు సర్కారు పెద్దలు జెప్పిన ముచ్చట్లు గూడ.. సేమ్ అట్లనే ఉన్నయ్.. డల్లాస్ డల్లాస్ అని.. ఉన్న కరెంటిని కల్లాస్ జేశిండ్రంటున్నరు జనం..

బాబుబలి 2..
బాహుబలి సీన్మ జూశిండ్రుగదా మీరు అదే ఫస్టు పార్టు.. ప్రబాస్ కొండలెక్కేది.. సూస్తిరిగదా.?  మనం జూశిన సీన్మగదేగని.. ఇంకో సీన్మగూడ అప్పుడే రిలీజ్ అయ్యిందట దాని పేరు బాబు బలి అట.. మనం జూశింది బాహుబలి అయితే.. చంద్రాలు సారు జూశింది బాబు బలట.. అది రెండో పార్టు గూడ రీలీజ్ కావోతుందట.. ట్రైలర్ ఎట్లుంటదో మన జబర్దస్త్ రోజక్క చెప్పవోతున్నది సూస్తరా..? ఏస్కో..
 

పోలీసోళ్లకు దొంగలకు సోపతి

గీ సికింద్రాబాద్ కాడున్న అడ్డగుట్ట బస్తీలనట.. పోలీసోళ్లు దొంగలకు సద్దిగట్టిండ్రట.. ఇది నేనంటున్న ముచ్చటగాదు.. ఆ బస్తీలున్న ఆడోళ్లంత జెప్తున్న ముచ్చట.. మరి పోలీసోళ్లకు దొంగలకు సోపతి ఏడంగ గుదిరింది.. వాళ్లకు వీళ్లెందుకు సద్దిగట్టవాయే..? ఇంతకు యవ్వారం ఏందో అర్సుకొద్దాం పాండ్రి.. మనకు గూడ దెలుస్తది గదా..?
నమో టెల్
అగ్గిపెట్టెలు గొన్నట్టే ఉన్నది సెల్ ఫోన్ల ముచ్చట గూడ.. అరరరరే గింత గింత పోరగాళ్లతాన జూశ్నా సెల్ ఫోన్లు.. అండ్ల మళ్ల కెమేరా పీసులు.. ఇప్పుడు వాట్సప్లు.. ఫేస్ బుక్కులు గూడ.. ఈ పోరగాళ్ల కాయిసు జూశి.. సెల్ ఫోన్ కంపిండ్లోళ్లు అగ్వకు తయ్యారు జేస్తున్నరట.. తొంబై తొమ్మిది రూపాలకు కిల కంది పప్పుగూడ రాదు అసొంటిది మేము ఫోనే ఇస్తమంటున్నరు అదిగూడ స్మార్ట్ ఫోనట.. సూడుండ్రి ఎట్లున్నదో..
అనుష్క ఫోజులు
బాహుబలి సీన్మల గోల్సులతోని ఎటేటో గనిపిచ్చిన అనుష్క శీత్వ పనులు బాగనే జేస్తటున్నది.. ఎప్పుడు సీన్మలు శీన్మలని బిజీగ దిర్గె పొల్ల.. ఇంటోళ్లతోని తీర్వాట్కం జేస్కోని పోట్వలు దిగింది.. ఇంతకు ఈమె అనుష్కనేనా..? కాదా అని డౌటొచ్చెతట్టు ఫోజులు వెట్టింది సూడుండ్రి.. మొదలైన అంశాలపై మల్లన్న సెటైర్స్ వీడియో లో చూడండి.
 

20:22 - May 18, 2016

నెల్లూరు : నైరుతి బంగాఖాతంలో ఏర్పాడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తన దిశను మార్చుకుంది. నెల్లూరుకు 130 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం..దిశను మార్చుకొని ఒడిశా, పశ్చిమ బంగ వైపు పయనిస్తోంది. ఉత్తర దిశగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం ఒడిశా వైపు పయనిస్తోంది. వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. దీంతో మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు శ్రీలంక మీదుగా పయనిస్తూ కేరళ తీరనాన్ని తాకనున్నాయి. వాయుగుండం క్రియాశీలకంగా మారడంతో..ఆ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడి అనుకున్న సమయానికే అంటే జూన్‌ తొలినాటికే రుతుపవనాలు కేరళ తీరన్ని తాకనున్నాయి. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాల్లోని కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.

 

ఎపి విద్యాహక్కు చట్టం 2010కి సవరణలు

విజవాయడ : ఎపి విద్యాహక్కు చట్టం 2010కి సవరణ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు కిమీ దూరంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు టీఏ చెల్లించాలని నిర్ణయించింది.

తెలంగాణలో 24 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్ : తెలంగాణలో 24 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నల్గొండ ఎస్పీగా ఎన్ ప్రకాష్ రెడ్డి, మెదక్ ఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి, రంగారెడ్డి ఎస్పీగా నవీన్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్, నిజామాబాద్ ఎస్పీగా పి.విశ్వప్రసాద్ లను నియమించారు.

రోడ్డుప్రమాదంలో నవ దంపతుల మృతి....

గుంటూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని నవ దంపతులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం చిలకలూరిపేటలో ఉంటున్న బంధువుల ఇంటికి ద్విచర్కవాహనంపై బయలుదేరారు. జాతీయ రహదారిపై ఓబులనాయుడుపాలెం వద్దకు చేరుకోగానే వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పెదబాబు, నీలిమ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలంగాణలో ఐపీఎస్‌ బదిలీలు...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారులు భారీస్థాయిలో బదిలీ అయ్యారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీప్‌ లక్తాసియా, తేజ్‌దీప్‌ కౌర్‌లకు డీజీపీలుగా పదోన్నతి కల్పించారు.

19:54 - May 18, 2016

విశాఖపట్నం : నైరుతి బంగాఖాతంలో ఏర్పాడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తన దిశను మార్చుకుంది. నెల్లూరుకు 130 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం..దిశను మార్చుకొని ఒడిశా, పశ్చిమ బంగ వైపు పయనిస్తోంది. ఉత్తర దిశగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం ఒడిశా వైపు పయనిస్తోంది. వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. దీంతో మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు శ్రీలంక మీదుగా పయనిస్తూ కేరళ తీరనాన్ని తాకనున్నాయి. వాయుగుండం క్రియాశీలకంగా మారడంతో..ఆ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడి అనుకున్న సమయానికే అంటే జూన్‌ తొలినాటికే రుతుపవనాలు కేరళ తీరన్ని తాకనున్నాయి. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాల్లోని కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.

19:48 - May 18, 2016

హైదరాబాద్ : విదేశాల్లో డాలర్‌ డ్రీమ్స్‌ను వదులుకున్నారు. ఐఏఎస్‌ టాపర్‌ అవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కృషి, పట్టుదలతో పక్కా ప్రణాళికాతో చదివి..సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించి తెలుగు వారి సత్తా ఏంటో నిరూపించారు. ఆమే..చేకూరి కీర్తి. ఐఏఎస్‌ కావాలన్న కలను నిజం చేసుకున్న సివిల్స్‌ విజేత చేకూరి కీర్తిపై 10టీవీ స్టోరీ.

సివిల్స్‌ అంటే అంత ఆశామాషి కాదు....
సివిల్స్‌ అంటే అంత ఆశామాషి కాదు..ఇది అందరూ అనే మాటే. కానీ..కృషి, పట్టుదల ఉంటే సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించవచ్చని నిరూపించారు విశాఖపట్టణానికి చెందిన చేకూరి కీర్తి. విదేశాల్లో డాలర్ల కొద్ది సంపాదనను కాదనుకొని సివిల్స్‌లో విజేత కావాలని కలలు కన్నారు. కృషి, పట్టుదలతో చదివి కన్న కలల్ని నిజం చేసుకున్నారు. 2015 సివిల్స్‌ ఫలితాల్లో జాతీయస్థాయిలో 14వ ర్యాంక్‌ సాధించి తెలుగువారి సత్తా ఏంటో చేకూరి కీర్తి నిరూపించారు.

జాతీయ స్థాయిలో 14వ ర్యాంక్‌ సొంతం ....

సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలన్న ఏకైక లక్ష్యంతోనే తాను సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యానని తెలిపారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే సివిల్ సర్వీస్ వైపు 2012లో ఆకర్షితులైనట్లు చెప్పారు. 2013లో తొలి సారిగా సివిల్స్ పరీక్షలకు హాజరై తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్ సెంట్రల్ సర్వీస్‌కు ఎంపికయ్యానన్నారు. 2015లో పట్టుదలతో సివిల్స్‌కు హాజరు కావడం, జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించి ఐఎఎస్‌కు ఎంపిక కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె అన్నారు.

ఐఆర్‌ఎస్‌ సెంట్రల్‌ సర్వీస్‌కు ఎంపిక .....
చేకూరి కీర్తి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. ప్రస్తుతం హైదరాబాద్ సర్వీస్ టాక్స్ కమిషనరేట్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఐఏఎస్‌గా తనను ఏ జిల్లాకు పంపించినా..తన లక్ష్యాన్ని మాత్రం వీడనన్నారు. ప్రభుత్రాసుపత్రుల్లో నిరుపేద రోగులు, ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే పేద కుటుంబాల పిల్లలకు సహాయం చేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తానని చెప్తున్నారు. అదే తనకు తృప్తినిస్తుందన్నారు ఆమె.

19:38 - May 18, 2016

కేరళ: కేరళ కామ్రేడ్స్ కే జై కొట్టినట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఏ పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించకపోవడం కేరళ ప్రత్యేకత. 2016లో కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే, బిజెపి ఎంత శాతం ఓట్లు, సీట్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.

వరుసగా ఏపార్టీకి అధికారం కట్టబెట్టని కేరళ ఓటర్లు....
కేరళలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 140. మ్యాజిక్ ఫిగర్ 71. ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టకపోవడం కేరళ ఓటర్ల స్టయిల్. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం ఒకే ఒక్క సీటు అదనంగా సాధించిన యుడిఎఫ్ అధికారంలోకి వచ్చింది. కేవలం 4 స్థానాలు తగ్గినందున కామ్రేడ్స్ అధికారం కోల్పోయారు. 1982లో యుడిఎఫ్ కి 77 స్థానాలిచ్చిన ఓటర్లు, ఆ మరుసటి ఎన్నికల్లో ఎల్ డిఎఫ్ కి 78 స్థానాలిచ్చి అధికారం అప్పగించారు. ఆ తర్వాత 1991లో యుడిఎఫ్ కి 90 స్థానాల్లో మెజార్టీ కట్టబెట్టిన ఓటర్లు ఆ మరుసటి ఎన్నికల్లో ఎల్ డిఎఫ్ కి 80 స్థానాలిచ్చారు. ఆ తర్వాత 2001 లో యుడిఎఫ్ కి 99 సీట్లొస్తే, 2006లో ఎల్ డిఎఫ్ కి 98 స్థానాలొచ్చాయి. కేరళలో ఎల్ డిఎఫ్, యుడిఎఫ్ మధ్య ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా వుంటుంది. 2011లో అధికారంలోకి వచ్చిన యుడిఎఫ్ 45.97 శాతం ఓట్లు సాధిస్తే, ఎల్ డిఎఫ్ 44.43శాతం ఓట్లు సాధించింది. అరశాతం ఓట్లే తలరాతను మార్చేశాయి. కేరళలో బిజెపి బలం చాలా స్వల్పం. 2011లో ఆ పార్టీ సాధించింది కేవలం 6.07శాతం ఓట్లే.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు.....
దేశమంతా కాంగ్రెస్ కి బలమైన వ్యతిరేక పవనాలు వీచిన 2014 ఎన్నికల్లో కేరళలో యుడిఎఫ్ ఆధిపత్యం నిలబెట్టుకోవడం విశేషం. యుడిఎఫ్ 12 ఎంపి స్థానాలు గెల్చుకుంటే, ఎల్ డిఎఫ్ 8 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో యుడిఎఫ్ కి 80 అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఆధిక్యత లభిస్తే, ఎల్ డిఎఫ్ కి 56, బిజెపికి నాలుగు సెగ్మెంట్ లలో మెజార్టీ దక్కింది. 2011 ఎన్నికలతో పోల్చుకుంటే 2014లో యుడిఎఫ్; ఎల్ డిఎఫ్ చెరో రెండు శాతం ఓట్లు నష్టపోగా, ఆ మేరకు బిజెపి లాభపడింది. బిజెపి ఓట్ల శాతం 10.83కి పెరిగింది. యుడిఎఫ్ కి 42.06శాతం ఓట్లు లభిస్తే, ఎల్ డిఎఫ్ కి 40.17శాతం ఓట్లు దక్కాయి. 2014లో బిజెపి పుంజుకోవడం వల్ల కొన్ని సెగ్మెంట్ లలో ఎల్ డిఎఫ్ దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది.

కామ్రేడ్స్ కి సరికొత్త ఉత్సాహం....
అయితే, 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్ డిఎఫ్ పై చేయి సాధించింది. ఎల్ డిఎఫ్ కి 549 పంచాయితీల్లో ఆధిక్యత లభిస్తే, యుడిఎఫ్ కి 365 పంచాయితీలే దక్కాయి. ఎల్ డిఎఫ్ 48 మున్సిపాల్టీలలో పై చేయి సాధించగా, యుడిఎఫ్ 43 పంచాయితీలతో సరిపెట్టుకుంది. 2015 స్థానిక సంస్థల ఎన్నికలు కామ్రేడ్స్ కి సరికొత్త ఉత్సాహమిచ్చాయి.

19:09 - May 18, 2016

హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. ఓటరు ఎవరిని కరుణిస్తాడా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల్లో నిజమెంత అన్నది కూడా రేపే తేలిపోనుంది.

హోరా హోరీ పోరుకు తెరపడనుంది....
ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి రెండు నెలల పాటు సాగిన హోరా హోరీ పోరుకు సోమవారంతో తెరపడింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమై... మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకు కావలసిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తిం చేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు రాష్ట్రాల్లో ఫలితాలపై దాదాపు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఈవీఎం కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజెట్‌ రూపంలో విడుదల చేస్తారు.

ఓట్ల లెక్కింపుకు వర్షాలు ఆటంకం కానుందా?...
మరోవైపు ఓట్ల లెక్కింపుకు వర్షాలు ఆటంకంగా మారుతాయోమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కౌంటింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. గత రెండు రోజులుగా కేరళలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అస్సాంలో వర్షాల కారణంగా హైలకండి, కరీంగంజ్‌ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గౌహతిలో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజంకానున్నాయా?...
మే 16తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీల భవితవ్యం ఎలా ఉండనుందో ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. కేరళ, తమిళనాడు, అసోంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో డిఎంకె, కేరళలో సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలోకి రానున్నాయని సర్వేలు అంచనా వేశాయి. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిసారిగా బిజెపి అధికారంలోకి రానుందని చెప్పాయి. పశ్చిమబెంగాల్‌లో మమత మళ్లీ అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపాయి. కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో డీఎంకే కూటమితో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే కనిపిస్తోంది.

ఎగ్జిట్‌పోల్స్‌పై పార్టీల స్పందన....
ఎగ్జిట్‌పోల్స్‌పై ఆయా పార్టీలు స్పందించాయి. అస్సాంలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి తరుణ్‌గోగోయ్‌ విశ్వాసంతో ఉన్నారు. అస్సాం ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెబుతున్నారు. అన్నాడిఎంకే నేతలు ఎక్జిట్‌పోల్స్‌ను నమ్మలేమని చెప్పారు. కాగా టిఎంసి, డిఎంకెలు మాత్రం ఎగ్జిట్‌పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశాయి. పశ్చిమబెంగాల్‌లో సిపిఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకాన్ని ఆ పార్టీల నేతలు వ్యక్తం చేశారు. ప్రజలు సంకీర్ణానికే ఓటేశారన్న ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ నిజమౌతాయా? బీహార్‌ మాదిరి తలకిందులౌతాయా? అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

19:05 - May 18, 2016

ఢిల్లీ : కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్ డీఎఫ్) ఖచ్చితంగా విజయం సాధిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. బెంగాల్‌లో హింసాయుత వాతావరణం నెలకొందని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ఎన్నికల కమిషన్‌ తన వంతు కృషిచేసిందని తెలిపారు. మోడీ రెండేళ్ల పాలనకు నిదర్శనంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని విమర్శించారు.

 

18:58 - May 18, 2016

హైదరాబాద్ : టీఎన్జీవో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ పై నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు గైని గంగారాం చేసిన వ్యాఖ్యలపై దేవీ ప్రసాద్ స్పందించారు. మూడుసార్లు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన గంగారాం ఇలా మాట్లాడటం తగదని దేవిప్రసాద్ పేర్కొన్నారు. తాను సంఘానికి సలహాలు, సూచనలు ఇస్తున్నామన్నారు. ఏకపక్షంగా చేసేది గంగారామేనని ఆయన అన్నారు. ఏ సమస్యలొచ్చినా సమిష్టి నాయకత్వంతోనే ముందుకు పోతున్నాం తప్ప ఏక పక్షంగా నేను ఏనాడూ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. సంఘంలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం వుంటుందన్నారు. ఇక్కడ వర్గాలకు తేడాలేదన్నారు. నాపై గంగారాం చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆయన ప్పష్టం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ బాబు

కృష్ణా : మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వాయుగుండం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బాబు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను శిబిరాలకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

దిశను మార్చుకున్న తీవ్ర వాయుగుండం

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకుంది. సముద్ర తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తహశీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలు.... కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ, నంబర్లు

ప్రకాశం : భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ, నంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒంగోలు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నం : 1077, పోలీస్ కార్యాలయ టోల్ ఫ్రీ నంబర్లు 9440627389, 08592231220. చీరాల ఓడరేవులో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షంతో నెల్లూరు అతలాకుతలం....

నెల్లూరు : నేటి తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. నేటి ఉదయం నుంచి ఇప్పటి వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. బాలాజీనగర్ లో వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చిన సుడిగాలి కేవలం రెండున్న నిమిషాల్లోనే బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్ధంభాలు, చెట్లు, రేకులు షెడ్డుల అంతు చూసింది. స్ధంభాలు, చెట్లను నేలకొరిగేలా చేసిన ఈ సుడిగాలి, రేకుల షెడ్లను అమాంతం ఎత్తుకెళ్లిపోయింది.

అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి ఋతుపవనాలు

ఢిల్లీ : నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. అండమాన్ నుంచి శ్రీలంక మీదుగా త్వరలో కేరళ తీరాన్ని తాకనున్నాయి.

పథకాలన్ని సక్రమంగా అమలు : చంద్రబాబు

రాజమండ్రి : పథకాలన్ని సక్రమంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు  తెలిపారు. ఈమేరకు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రెండేళ్లలో ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలిగామని తెలిపారు. కాపులకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు.

బాసర సరస్వతి ఆలయానికి పగుళ్లు....

ఆదిలాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతి ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పిడుగు పడింది. ఆలయ ప్రాంగణంలోని తూర్పు రాజగోపురంపై పిడుగు పడి పాక్షికంగా ధ్వంసమైంది. పిడుగు పడిన సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఎల్బీ స్టేడియం ఒలింపిక్ భవన్‌లో ఉద్రిక్తత...

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియం ఒలింపిక్ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. భవన్‌కు సంబంధించిన వాటాపై  తెలంగాణకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్బీ స్టేడియం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

కొండచరియలు విరిగిపడి 200 మంది మృతి..?

కొలంబో : శ్రీలంకను వరదలు ముంచెత్తుతున్నాయి. కేగళ్లే జిల్లాలోని సిరిపుర, పల్లేబాగే, ఈలజిపిట్యా గ్రామాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్..

ఢిల్లీ : ఈ నెల 19న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు 16న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభం కానుంది. 12 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయని తెలుస్తోంది. అస్సాం, పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరిగాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, అస్సాంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.

రేపే పాలేరు ఉప ఎన్నిక ఫలితం..

ఖమ్మం : పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం గురువారం తేలనుంది. 16న జరిగిన ఉప ఎన్నికలో 89.73 శాతం పోలింగ్ నమోదైంది. 1,70,800 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

ఎమ్మెల్యే అల్కా లుంబాకు బెయిల్..

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అల్కా లంబాకు ఢిల్లీ కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. గతేడాది ఓ షాపులోకి చొరబడి విధ్వంసానికి పాల్పడిన ఘటనలో అల్కా లంబాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

మరో రెండు రోజుల పాటు వర్షాలు..

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

 

మరో రెండు రోజుల పాటు వర్షాలు..

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

టి.కాంగ్రెస్ జిల్లాల ఇన్ ఛార్జీలు వీరే..

హైదరాబాద్ : గాంధీభవన్‌లో బుధవారం టీపీసీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పటిష్టతకు అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా టీపీసీసీ జిల్లాలకు ఇన్‌ చార్జ్ లను ప్రకటించింది. ఆదిలాబాద్‌-సబితా ఇంద్రారెడ్డి, నిజామాబాద్‌-ప్రసాద్‌కుమార్‌, కరీంనగర్‌-నర్సింహారెడ్డి, మెదక్‌-పొన్నం ప్రభాకర్‌, రంగారెడ్డి-డీకే అరుణ, హైదరాబాద్‌-బలరాంనాయక్‌, కుమార్‌రావు, మహబూబ్‌నగర్‌-మాఘం రంగారెడ్డి, నల్గొండ-మల్లురవి, వరంగల్‌-నంది ఎల్లయ్య, ఖమ్మం-శ్రీధర్‌బాబులను నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

 

రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి మహేందర్ భేటీ..

హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా టీఆర్‌ఎస్‌ నాయకుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చేట్టారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. 

తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి - కలెక్టర్...

కృష్ణా: తుఫాను కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు బస్సులు సిద్ధం చేశామన్నారు. 

17:20 - May 18, 2016

తూ.గోదావరి: ఏపీలో వున్న ఇబ్బందులన్నింటినీ ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లామని సీఎం చంద్రబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడుతూ.. విభజన తరువాత లోటు బడ్జెట్ తో పాలన మొదలు పెట్టిన తరువాత కూడా ప్రజల సహకారంతోనే నిలదొక్కుకున్నామన్నారు. ప్రజలకు న్యాయం చేస్తానని తనను అధికారంలోకి తెచ్చారని పేర్కొన్నారు. తనను నమ్మిన ప్రజలకు సరైన న్యాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాని తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం కట్టుబడువుందన్నారు. హుదూద్ తుపాన్ సందర్భంగా దీపావళి పండుగకు క్రాకర్స్ కాల్చుకోవద్దని పిలుపినిస్తే విశాఖ వాసులు మంచిగా స్పందించి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

సౌకర్యాలు కల్పిస్తే వస్తామన్న ఏపీ మహిళా ఉద్యోగులు..

విజయవాడ : ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే అమరావతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులు వెల్లడించారు. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ భవన సముదాయాలను వారు సందర్శించారు. 

జగన్ జలదీక్ష చేయడం ఏంటీ ? - భూమా..

కర్నూలు : తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులకు వైసీపీ ఎమ్మెల్యేలు సబ్ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తుంటే ప్రజలను మభ్యపెట్టేలా వైసీపీ అధ్యక్షుడు జగన్ జలదీక్ష చేయడం ఏంటనీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. 

17:11 - May 18, 2016

హైదరాబాద్ : ఆర్డీఎస్ పై తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రుల మధ్య సవాళ్ల యుద్ధం సాగుతోంది. ప్రాజెక్టు ఆపాలంటూ కర్నూలు కలెక్టర్‌ ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్‌ జలదీక్ష పేరుతో స్పాన్సర్డ్ దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్డీఎస్‌పై కర్నూలు కలెక్టర్‌ ఏ లేఖా రాయలేదని దేవినేని పేర్కొన్నారు. ఈ విషయంపై మీరించ్చిన రెండురోజుల గడువుకు నేను రెండేళ్లు సమయవిస్తే లేఖ బయటపెట్టమని డిమాండ్ చేశారు.

వామపక్షకూటమికి 85..90 సీట్లు ఖాయం : అచ్యుతానందన్

త్రివేండ్రం : కేరళలో వామపక్ష కూటమికి 85..90 సీట్లు రావడం ఖాయమని ఆ రాష్ట్ర మాజీ సీఎం అచ్యుతానందన్ ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అవినీతి కాంగ్రెస్, మతతత్వ బీజేపీకి పరాభవం తప్పదన్నారు. మోడీ ప్రచారం చేసినా బీజేపీకి ఒక్క సీటు రాదని ఎద్దేవా చేశారు. సీపీఎం కేంద్రీకృత ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ అని తెలిపారు. ప్రజలు తాను సీఎం కావాలని కోరుకున్నా.. పార్టీదే అంతిమ నిర్ణయమని చెప్పారు.

 

16:57 - May 18, 2016

హైదరాబాద్ : ఉపాధ్యాయ ఉద్యమ నేత దాచూరి రామిరెడ్డి సంస్మరణ హైద్రాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.. ఈ కార్యక్రమానికి పలువురు ఉపాధ్యాయ నేతలు, ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు హాజరయ్యారు.. రామిరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.. రామిరెడ్డిలేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదని కొనియాడారు. అతనో శక్తిలా దేశ వ్యాప్తంగా టీచర్ల సమస్యలపై పోరాటాలు చేశారని నివాళులు అర్పించారు.

16:49 - May 18, 2016

గుంటూరు :  కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది.  లేబర్‌సెస్‌ చెల్లించకుండానే పలువురు బిల్డర్లు భవన నిర్మాణాలకు అనుమతి పొందేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ధర్జాగా పర్మిషన్లు తీసేసుకున్నారు. గత నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగుతోంది. కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని అనుమానిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో భారీ కుంభకోణం బయటపడింది. దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలు 10టీవీ దక్కించుకుంది.

గుంటూరు కార్పొరేషన్‌లో అక్రమ వ్యవహారాలు...
గుంటూరులో పయనీర్‌ కన్‌స్ట్రక్షన్‌ సెల్లార్‌ నిర్మాణం సందర్భంగా ఏడుగురు చనిపోయిన ఘటనతో కార్పొరేషన్‌లో సాగుతున్న అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలు పక్కనపెట్టి, కాసులకు కక్కుర్తిపడి భవన నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు మంజూరు చేస్తున్న కార్పొరేషన్‌ అధికారుల భాగోతాలు విస్తుగొలుపుతున్నాయి.

వెలుగులోకి వచ్చిన అక్రమాల భాగోతం....
భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలంటే నిర్మాణ వ్యయంలో ఒక శాతం కార్మిక శాఖకు సెస్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించిన తరువాతనే కార్పొరేషన్‌ అధికారులు బిల్డింగ్‌ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. బిల్డర్లతో కుమ్మక్కైన కార్పొరేషన్‌ అధికారులు కార్మిక శాఖకు లేబర్‌ సెస్‌ చెల్లించకుండానే నకిలీబిల్లులు సృష్టించి వాటితో కార్పొరేషన్‌ బిల్డింగ్‌ అనుమతులు ఎంచక్కా సంపాదించేస్తున్నారు. మరికొందరైతే కట్టాల్సిన దాని కంటే తక్కువ మొత్తంలో చెల్లించి అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన సెల్లార్‌ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతిచెందిన ఘటనలో లేబర్‌ సెస్‌ చెల్లింపుల వ్యవహారంపై కార్మిక శాఖ అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్‌లో జరుగుతున్న అక్రమాల భాగోతం వెలుగులోకి వచ్చింది.

కోట్ల రూపాయల అవినీతి....
మరోవైపు లేబర్‌సెస్‌ స్కామ్‌పై దర్యాప్తు చేపట్టేందుకు విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు కీలకఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. లేబర్‌సెస్‌ చెల్లించినట్లు సృష్టించిన నకిలీ రశీదులు బయటపడటం అందరినీ ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. సుమారుగా గుంటూరు కార్పొరేషన్‌లో నాలుగు కోట్ల రూపాయల మేర స్కామ్‌ జరిగినట్లు తెలుస్తోంది. సీఆర్‌డీఏలో ఇదే తరహాలో సెస్‌ రశీదులతో అనుమతులు పొంది ఉంటారన్న కోణంలో కూడా విజిలెన్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు. 

చుక్కపల్లి రమేష్‌ కనుసన్నల్లోనే వ్యవహారాలు....
గుంటూరులో బిల్డర్ల హవా కొనసాగుతోంది. రాజకీయ నాయకుల అండ దండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు సంపాదించేస్తున్నారు. నగరంలో బిల్డర్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ బిల్డర్ల అసోసియేషన్‌కు నాయకునిగా చలామణి అవుతున్న పయనీర్‌ కన్‌స్ట్రక్షన్‌ అధినేత చుక్కపల్లి రమేష్‌ సారధ్యంలోనే నడుస్తుంటాయి. గుంటూరులో ప్రముఖ వ్యక్తి కావడం, అందరితో పరిచయాలు ఉండడంతో ఇతను చెప్పిందే వేదంగా నడుస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

ఈ స్కామ్ లో విషయంలో స్థానికుల స్పందన :ఈ కుంభకోణంలో బయటపడుతున్న నిజాలకు ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఈ సెస్ స్కామ్ విషయంలో రింగ్ మాస్టర్లగా వుండి అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు పొర్కొంటున్నారు. ఈ స్కామ్ లో దాదాపు10 కోట్లు కుంభకోణం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాంకు ముద్రణలను, అధికారుల సంతకాలను బిల్డర్లు ఫోర్జరీ చేస్తున్నారన్నారు. కార్మికులు మృతి చెందితే ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. అక్రమ లే అవుట్లకు పర్మిషన్ తీసుకుని బిల్డర్లు చుక్కపల్లి రమేష్ అనే నిర్మాణాలను నిర్మిస్తున్నారన్నారు. మాజీ కార్పొరేటర్ కూడా బిల్డర్ గా అవతారమెత్తి అవినీతికి పాల్పడుతున్నారన్నారు.టీడీపీయే కాకుండా అధికారంలో వున్న అన్ని పార్టీలు కూడా అవినీతిదారులకు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమగ్రంగా అవినీతికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు. గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నుండి ఈ అవినీతి పెరిగిపోతోందన్నారు. ఈ కుంభకోణం విషయంలో సీబీఐ విచారణ జరిపించి నిందితులుగా వున్న వారి ఆస్తులను జప్తు చేసి మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు.

16:25 - May 18, 2016

మెగా ఫ్యామిలీ తొలి హీరోయిన్ 'నిహారిక' నటించిన 'ఒక మనసు' ఆడియో వేడుక కార్యక్రమం జరగనుంది. ఈ ఆడియో కార్యక్రమంపై 'నిహరిక' ఆందోళన ఉందని టాక్ వినిపిస్తోంది. ఆడియో కార్యక్రమానికి 'అల్లు అర్జున్' హాజరుపై ఆందోళన చెందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు అతిథిగా 'బన్నీ' కూడా హాజరవుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవలే బన్నీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. పవన్ కళ్యాణ్ పై సెటెర్లు వేసి ఆయన అభిమానులకు బన్నీ తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదంతా టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. బయట జరుగుతున్న వివాదాలపై చాలా కోపంగా ఉన్న బన్నీ 'ఒక మనసు' ఆడియో వేడుకలో బరస్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఒక వేళ అదే జరిగితే తన తొలి సినిమా ఆడియో వేడుక రచ్చరచ్చ అవుతుందనే ఆందోళనలో నిహారిక ఉందట. అసలు ఆడియో ఫంక్షన్ కు అల్లు అర్జున్ హాజరవుతాడా ? లేడా ? మరి ఏం జరుగబోతోందో? కొద్ది గంటలు ఆగితే తెలుస్తుంది. 

అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్న కేసీఆర్ : జగన్

కర్నూలు : తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. జల దీక్ష విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం కాదు కదా... కనీసం మోడీని కలిసి ఫిర్యాదు కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్ కడుతున్న ప్రాజెక్టులకు సీడబ్ల్యుసీ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. 'మా ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకుంటామనడం కేసీఆర్ కు ధర్మమేనా' అని అన్నారు. ఎపికి అన్యాయం జరుగుతోంది కాబట్టే దీక్ష చేపట్టానని స్పష్టం చేశారు.

ట్రాన్స్ ఫార్మర్ పేలి వ్యక్తికి గాయాలు....

హైదరాబాద్ : బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇంటి వద్ద బుధవారం విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలిన సంఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాన్స్ ఫార్మర్ పేలిన సమయంలో శకలాలు చెల్లాచెదురుగా పడటంతో సమీపంలోనే ఉన్న శ్రీనాథ్(18) గాయాల పాలయ్యాడు. ఎనభై శాతం శరీరం కాలిపోయింది. దీంతో, క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుడికి న్యాయం చేయాలంటూ బీజేపీ నేత కిషన్ రెడ్డి భార్య ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పోలీసులు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

పెషావర్ బాంబు పేలుళ్లు, 19 మందికి గాయాలు...

హైదరాబాద్ : పాకిస్థాన్ లోని పెషావర్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం వరుసగా రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఓ పోలీస్ దుర్మరణం పాలైయ్యాడు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని మాత్ర ప్రాంతంలో రహదారిపై వెళ్తున్న పోలీస్ వాహనమే లక్ష్యంగా బాంబు పేలుడు సంభవించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీంతో స్థానికంగా ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ ఏ సంస్థ ప్రకటించకపోవటం విశేషం.

మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం...

ప్రకాశం: ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నాని పాల్పడింది. దీంతో తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

కృష్ణారివర్‌బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ....

హైదరాబాద్ : రాజోలిబండపై కృష్ణారివర్‌బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే దాన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

శ్రీవారి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం....

తిరుమల : శ్రీవారి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు మాడ వీధికి సమీపంలో ఉన్న బాయిలర్స్ వద్ద షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 11 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి చెన్నై వద్ద తీరం దాటే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ ఓడరేవులో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ,గంగవరం పోర్టులో నాలుగో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

నిజామాబాద్ జిల్లా టీఎన్ జీవో కొత్త అధ్యక్షుడిగా కిషన్

నిజామాబాద్ : జిల్లా టీఎన్ జీవో నూతన అధ్యక్షుడిగా కిషన్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా టీఎన్ జీవో అధ్యక్షుడి హోదాలో గైని గంగరాం భూ సెటిల్ మెంట్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దళితుడైన తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని గైని గంగారాం జీర్జించుకోలేకపోతున్నారని కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ జలదీక్ష ముగిసింది....

కర్నూలు : జగన్ మూడవ రోజు జలదీక్ష ఈ రోజుతో ముగిసింది. తెలంగాణ సర్కారు కడుతున్న సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ జగన్ కర్నూలులో మూడు రోజులపాటు జలదీక్ష చేశారు. ఈ సందర్భంగా రైతులు జగన్ తో నిమ్మరసం త్రాగించి దీక్ష విరమింపజేశారు.

ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి....

రంగారెడ్డి : శామీర్ పేట మండటం జవహర్ నగర్ లో ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి. శామీర్ పేట పోలీస్ స్టేషన్ ఆవరణలో తీసిన ఇంకుడు గుంతలో పడిన ఇబ్రహీం (11) అనే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి పోలీసులే కారణమని బాలుడి బంధువులు ఆందోళన చేపట్టారు.

15:35 - May 18, 2016

కర్నూలు : టీసర్కార్ చేపడుతున్న ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు అడ్డుకోలేకపోతున్నాడని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తెలంగాణ సర్కారు కడుతున్న సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో జగన్ మూడు రోజులపాటు జలదీక్ష చేశారు. ఈరోజుతో దీక్ష ముగిసింది. రైతులు జగన్ కు నిమ్మరసం త్రాగించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీసర్కారు నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోమ్ నగరం తగలపబడిపోతుంటే వెనుకటికి రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా బాబు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు సాగునీటికే కాదు త్రాగునీటికి కూడా నానా ఇబ్బందులు పడుతుంటే బాబు మాత్రం టీసర్కారును కనీసం నిలదీయటంలేదని విమర్శించారు.

తుకారాంగేట్ బీ2 కాలనీలో ఉద్రిక్తత

హైదరాబాద్ : తుకారాంగేట్ బీ2 కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సెల్ టవర్ ను తొలగించాలని మహిళలు ఆందోళన చేపట్టారు. సెల్ టవర్ ఎక్కి మహిళలు ఆందోళన చేస్తున్నారు. 6 గంటలుగా సెల్ టవర్ పైనే ఆందోళన కొనసాగిస్తున్నారు. కార్పొరేటర్ విజయ్ కుమార్ చెప్పినా.. మహిళలు సెల్ టవర్ పై నుంచి కిందికి దిగలేదు.

ఇంకుడు గుంతలో పడి బాలుడి మృతి

రంగారెడ్డి : జిల్లాలో దారుణం జరిగింది. శామీర్ పేట మండలం జవహర్ నగర్ పోలీసు స్టేషన్ ఆవరణలోని ఇంకుడు గుంతలో పడి ఇబ్రహీం (11) అనే బాలుడు మృతి చెందాడు. పోలీసులు నిర్లక్ష్యమే కారణమంటూ బాలుని బంధువులు ఆందోళన చేపట్టారు.

15:08 - May 18, 2016

బాలీవుడ్ లో ఏ వివాహం జరిగినా అతను పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ఆయనే కండవీరుడు సల్మాన్ ఖాన్. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్లూ భాయ్ త్వరలో పెళ్లి చేసుకుంటాడనే వార్తలు వస్తున్నాయి. తన పుట్టిన రోజైన డిసెంబర్ 27వ తేదీన వివాహం చేసుకుంటాడని టాక్. 51వ ఏట అడుగు పెట్టే క్షణాల్లో తన రొమెనియన్ ప్రియురాలు లులియా వంటూర్ ను పెళ్లాడబోతున్నట్లు బాలీవుడ్ వెబ్ సైట్ పేర్కొంది. ఎన్నో కార్యక్రమాల్లో సల్మాన్..లులియాలు కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరు వివాహం చేసుకుంటారని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. మరి ఇది కూడా నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. 

ముగిసిన జగన్ జల దీక్ష

కర్నూలు : వైసీపీ అధినేత జగన్ దీక్ష ముగిసింది. మూడు రోజులపాటు జగన్ దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయన జలదీక్ష చేపట్టారు.

డీఎస్ స్సీ రద్దుపై అపోహలు వద్దు : మంత్రి కడియం

హైదరాబాద్ : డీఎస్ స్సీ రద్దుపై అపోహలు పెట్టుకోవద్దని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. డీఎస్సీ స్థానంలో టీఎస్ పీ ఎస్సీ వస్తుందన్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ ద్వారా పరీక్షలు ఉంటాయని తెలిపారు.

15:02 - May 18, 2016

హ్యారీ పోటర్ గురించి తెలవని వారుండరు కదా. ఓ అమ్మడు హ్యారీ పోటర్ పుస్తకంలోని మొదటి పేజీని గోడపై రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. వచ్చిందే తడవు..తన పనిని మొదటి పెట్టి విజయవంతంగా పూర్తి చేసింది. మెరిడిత్ మెకార్టిల్ ఇంటి గోడను అందంగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంది. అందుకని హ్యారీ పోటర్ పుస్తకంలోని మొదటి పేజీని స్కాన్ చేసింది. ప్రొజక్టర్ సహాయంతో గోడపై ప్రొజెక్ట్ చేసింది. ఆ అక్షరాలను యథాతథంగా పెన్సిల్ తో రాసింది. ఆ తరువాత పెయింట్ బ్రష్ పట్టుకుని గోడపై అక్షరాలను తానే స్వయంగా రాసింది. ఈ అక్షరాలన్నీ రాయడానికి దాదాపు 60 గంటలు పట్టిందంట. ఎలాగైతైనేం మొత్తానికి సాధించింది. హ్యారీ పోటర్ మీదున్న ప్రేమను ఇలా గోడపై చూపించిందన్నమాట. 

15:01 - May 18, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీని రద్దు చేస్తూ టీ.ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై టీఎస్ పీఎస్ సీ ద్వారానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ పీఎస్ సీ ద్వారా చేస్తేనే పారదర్శకత వుంటుందని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చావా రవి యూటీఎఫ్ నేత మాట్లాడుతూ..టీఎస్ పీఎస్ సీతో రిక్రూట్ చేసినా.. డీఎస్సీతో చేసినా వున్న ఖాళీలను ఎలా భర్తీ చేస్తారన్నది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడివుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 17వేల పోస్టులు ఖాళీగా వున్నాయి. వీటన్నింటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సామాన్యులు చదువుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. ఖాళీగా వున్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా చేసినా..టీఎస్ పీఎస్ సీ ద్వారా చేసినా పారదర్శకంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్ధిష్టమైనటువంటి సమయంలో చేయాలని కోరారు.

14:53 - May 18, 2016

మహిళలకు ఎటువంటి చట్టాలు అందుబాటులో వున్నాయి అనే అంశంపై ఈ నాటి మైరైట్ కార్యక్రమంలో అడ్వకేట్ పార్వతి న్యాయసలహాలను తెలియజేయటానికి మైరైట్ పాల్గొని సలహాలను, సూచనలను తెలియజేశారు. వరకట్న వేధింపుల చట్టం, గృహహింస (498(ఎ) చట్టం రావటంతో మహిళలు అనేక బాధలు అంటే మానసికంగా గానీ, భౌతికంగా గానీ సదరు మహిళ హింసకు గురిచేస్తే గృహహింస చట్టాన్ని ఆశ్రయించవచ్చని అడ్వకేట్ పార్వతిగారు తెలిపారు.మహిళలను ఇంకా ఏమేమి చట్టాల ద్వారా న్యాయం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి.

టీఆర్ఎస్, జేఏసీ ఆందోళన ఉద్రిక్తత..

వరంగల్: మహబూబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ వరంగల్‌లో టీఆర్ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైల్ ట్రాక్‌పై కూర్చుని ఆందోళనకారులు నిరసన తెలిపారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

14:07 - May 18, 2016

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అ ఆ'. విడుదల తేది మార్చినట్లు తెలుస్తోంది. మే నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ నెలకు వాయిదా వేసినట్లు టాక్. 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద విహారీ' అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. పోస్టర్స్, టీజర్స్, వర్కింగ్ స్టిల్స్, ఆడియో సాంగ్ విజువల్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న త్రివిక్రమ్ బృందం... కొసరుగా సాంగ్ మేకింగ్ వీడియోలను ప్రచారాస్త్రాలుగా ఉపయోగిస్తోంది. 'అత్తారింటికి దారేది' మాదిరిగానే ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులోనూ అత్త సెంటిమెంట్‌కు పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు టి.సర్కార్ లేఖ..

హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) పనులకు సహకరించేలా ఆంధ్రప్రదేశ్‌కు సూచించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

ఢిల్లీలో వైద్యుడి కాల్చివేత..

ఢిల్లీ : పలాం గ్రామంలో ఓ వైద్యుడిని దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన గత రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

13:31 - May 18, 2016

హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామ‌కాల కోసం నిర్వ‌హించే డిస్ట్రిక్ట్ సెల‌క్ష‌న్ క‌మిటీ(డీఎస్సీ) ప్ర‌వేశ ప‌రీక్షను తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. ఇక‌పై డీఎస్సీ ద్వారా కాకుండా తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారానే ప్రభుత్వం ఉపాధ్యాయ నిమాకాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఈరోజు ఉత్త‌ర్వులు జారీ చేసింది. డీఎస్సీని తొల‌గించి టీఎస్‌పీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని కొన్ని రోజులుగా క‌స‌రత్తు చేస్తోన్న ప్ర‌భుత్వం చివ‌ర‌కు ఈరోజు త‌మ తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. డీఎస్సీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. తెలంగాణ‌లోని మోడ‌ల్ స్కూల్ల‌లోనూ టీఎస్‌పీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయ‌నుంది. -

టీఎన్జీవో కార్యాలయంలో ముఖ్యనేతల భేటీ..

హైదరాబాద్ : టీఎన్జీవో కార్యాలయంలో ముఖ్యనేతలు భేటీ అయ్యారు. నిజామాబాద్ టీఎన్జీవో అధ్యక్షుడు గైని గంగారాం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని పదవులు అనుభవించాక గంగారం సంఘంపై ఆరోపణలు చేయడం సరికాదని, దేవిప్రసాద్ సలహాలు..సూచనలతో ముందుకెళుతున్నామన్నారు. ఆయన అనుభవాలు సంఘానికి అవసరమని, టీఎన్జీవోలో ఎవరిపైనా చిన్నచూపులేదన్నారు.

 

నాలుగు రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు..

ఢిల్లీ : ఇసుక అక్రమ రవాణాలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. 

డీఎస్సీ రద్దు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ రద్దయ్యింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఖైదీ పారిపోయిన ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెండ్..

వరంగల్ : సెంట్రల్ జైలు ఖైదీ తప్పించుకోపోయిన ఘటనలో ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సీపీ సస్పెండ్ చేశారు. 

కోనసీమలో కేంద్ర బృందం పర్యటన..

తూర్పుగోదావరి : కోనసీమలో కేంద్ర బృందం పర్యటించింది. గోదావరి నది తీరం కోతను బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా స్థానికుల నుండి అభిప్రాయాలు సేకరించింది. 

తుకారంగేట్ లో సెల్ టవర్ ఎక్కిన మహిళలు..

హైదరాబాద్ : తుకారంగేట్ పీఎస్ పరిధిలో మహిళలు సెల్ టవర్ ఎక్కి ఆందోళన నిర్వహిస్తున్నారు. సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

చంద్రన్న బీమా పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష..

హైదరాబాద్ : సచివాలయంలో చంద్రన్న బీమా పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

13:28 - May 18, 2016

హైదరాబాద్ : భారత దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ భారతంలో వర్షాలు.. ఉత్తర భారతంలో వడగాల్పులు వీస్తున్నాయి. మరో 48 గంటల పాటు ఏపీ, తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర భారతదేశంలో ఆరు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మే చివరి వరకు ఉత్తరభారతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

13:26 - May 18, 2016

నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెల్లవారు జాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో పట్టణంలోని రోడ్లన్ని జలమయ్యాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ స్టేషన్‌ ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వాన కురస్తుండడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

13:25 - May 18, 2016

కృష్ణా : విజయవాడ టీడీపీ కార్పొరేటర్‌ వెంకటేశ్వర్లు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఎయిర్‌ ఇండియా విమానంలో యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో వెంకటేశ్వర్లుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

13:24 - May 18, 2016

విశాఖ : ఆంధ్రా యూనివర్శిటీ భూములను కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడాలంటూ ఏయు రిజిస్ట్రార్‌కు విద్యార్థి సంఘాలు వినతిపత్రమిచ్చాయి. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్శిటీకి సుమారు 450 ఎకరాల భూములున్నాయి. ప్రధాన సెంటర్లో ఉన్న ఆ భూములకు విలువ అమాంతం పెరిగిపోవడంతో వాటిపై ప్రభుత్వం కన్నుపడిందని ఏయూ విద్యార్థి, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ భూములను ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ పేరుతో ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. వర్సిటీ భూమలును కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని సహించే ప్రసక్తే లేదని విద్యార్థి, ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన కూడా నిర్వహించాయి. మరోవైపు వర్శిటీ వీసీ నియామకానికి ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ రెండు దఫాలుగా సమావేశమైనా స్క్రూట్నీ ప్రక్రియ పూర్తిచేయలేకపోయింది. తమ వ్యవహారాలను చక్కదిద్దే వ్యక్తిని వీసీగా నియమించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకవైపు వర్షాలు..మరోవైపు వడగాలులు..

ఢిల్లీ : దక్షిణ భారతంలో వర్షాలు కురుస్తుండగా ఉత్తర భారతంలో వడగాలులు వీస్తున్నాయి. దీనితో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఆరు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ఢిల్లీలోఉ దయం 10గంటలకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. మరో 48గంటల పాటు తమిళనాడు, ఏపీలో వర్షాలు కురుస్తాయని, ఉత్తరాది రాష్ట్రాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. 

13:06 - May 18, 2016

సోనూ నిగమ్..సూపర్ సింగర్..ఈయన బిచ్చమెత్తుకోవడం ఏంటీ ? రోడ్డుపై హార్మోనియం పట్టుకుని కూర్చున్న వ్యక్తి ఈయననేనా ? అలా తయారయ్యేడేంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఎందుకో తెలుసుకోవాలంటే చదవండి..
ముంబాయిలో జుహు వీధిలో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వృద్ధుడి వేషధారణలో..చేతిలో హార్మోనియం పెట్టేతో నడిరోడ్డుపై 'సోనూ నిగమ్' కనిపించాడు. తరువాత అనువైన ప్రదేశం చూసుకుని అక్కడ హార్మోనియంతో పాటలు పాడడం మొదలు పెట్టాడు. అందరూ ఎవరి దారిన వారు పోతున్నారే కానీ 'సోనూ నిగమ్'ను గుర్తు పట్టలేదు. కొంతమంది మాత్రం గాత్రాన్ని మెచ్చుకుని డబ్బులు కూడా వేశారు.
సంగీతం గొప్పతనాన్ని మనుషులకు పరిచయం చేసేందుకు బీయింగ్ ఇండియా అనే డిజిటల్ సోషల్ ఎక్స్ పర్ మెంట్స్ పేరుతో ఓ కార్యక్రమం రూపొందించింది. రోడ్ సైడ్ ఉస్తాద్ పేరుతో ఇలా సోనూ నిగమ్ బిచ్చమెత్తుకుంటున్న వీడియో విడుదల చేసింది. బీయింగ్ ఇండియాలో భాగమవడం చాలా సంతోషంగా ఉందని, మేకప్ చాలా బాగా వేశారని సోనూ నిగమ్ పేర్కొన్నారు. 

12:55 - May 18, 2016

బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కేన్స్ లో రెండో రోజు సందడి చేసింది. వైట్‌ డ్రస్‌ గౌన్‌ ధరించి వేడుకల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే తొలిరోజు ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ పై సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. ఓ వైపు వేడుకల్లో ప్రశంసలు దక్కగా, వాటికి భిన్నంగా నెటిజన్లు స్పందించారు. సోనమ్‌ డ్రస్‌ రుమాలీ రోటీని తలపించేలా ఉందంటూ, ఫ్యాషన్‌ విషయంలో ఫెయిల్‌ అయిందంటూ కొందరు ట్వీట్టు పెట్టారు. కేన్స్ లో సోనమ్‌ ప్రదర్శనపై గతంలోనూ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఫ్యాషన్‌ గురించి తెలియదంటూ విమర్శలు వచ్చాయి. అంతేకాదు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి కూడా కామెంట్లు తప్పలేదు. పర్పుల్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకుని రావడంతో 'నేరేడు పళ్ళు తిని కేన్స్ కు వచ్చింద'ని సామాజిక మీడియాలో సోమవారం ట్వీట్ల వర్షం కురిసిన విషయం విదితమే.

మంత్రి హరీష్ కు మంత్రి దేవినేని సవాల్..

పశ్చిమగోదావరి : తెలంగాణ మంత్రి హరీష్ రావుకు ఏపీ మంత్రి దేవినేని సవాల్ విసిరారు. దమ్ముంటే కర్నూలు కలెక్టర్ ఇచ్చిన లేఖను బయటపెట్టాలని, మంత్రి హరీష్, తాను కూర్చొని మాట్లాడుకొనే సమస్య కాదన్నారు. మూడు రాష్ట్రాలకు సంబంధించిన వారు మాట్లాడుకొంటేనే సమస్య తీరుతుందని మంత్రి దేవినేని తెలిపారు. 

గుంటూరు లేబర్ సెస్..టెన్ టివి దగ్గర కీలక ఆధారాలు..

గుంటూరు : కార్పొరేషన్ లేబర్ సెస్ స్కాంకు సంబంధించి టెన్ టివి చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ చలానాలు సృష్టించారని కార్మిక శాఖకు పలు బ్యాంకులు తెలియచేశాయి. చెల్లించాల్సిన దానికంటే తక్కువ సెస్ చెల్లించి రశీదుల్లో ఎక్కువ మొత్తాన్ని బిల్డర్లు చూపించారు. 

ఆన్ లైన్ విధానం సులభతరం - మంత్రి కేటీఆర్...

హైదరాబాద్ : లే అవుట్స్, భవన నిర్మాణం అనుమతులు ఇప్పుడు ఆన్ లైన్ విధానం ద్వారా సులభతరం అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆన్ లైన్ విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామని, హెచ్ఎండీలో అవినీతికి తావు ఉండకూడదన్నారు. త్వరలో జీహెచ్ఎంసీలో ఆన్ లైన్ విధానం ప్రవేశ పెడుతామని, జూన్ కల్లా అన్ని కార్పొరేషన్ లలో ఆన్ లైన్ విధానం ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. 

12:29 - May 18, 2016

హైదరాబాద్: సినీ హీరో తనీష్ తండ్రి వర్థన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు నుంచి వర్ధన్‌ ప్రమాదవశాత్తు కిందపడ్డారని తొలుత అందరూ భావించారు. తీవ్రగాయాలైన వర్ధన్‌ను కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. వర్ధన్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

12:26 - May 18, 2016

గుంటూరు : విజయవాడ, విశాఖను నుంచి కేదర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. కేదర్‌నాథ్‌ యాత్రకు తీసుకెళ్లిన సదరన్‌ ట్రావెల్స్‌ వీరిని రాంపూర్‌లో దింపేసింది. ఇక్కడ నుంచి కేదర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో తీసుకెళ్లలేమని చేతులెత్తేసింది. సదరన్‌ ట్రావెల్స్‌ నిర్వాకంతో విజయవాడ, విశాఖకు చెందిన యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.

12:24 - May 18, 2016

ఢిల్లీ : నగరంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. నీట్‌ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే నీట్‌ వాయిదాకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటికే నీట్ విషయమై కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించింది.

గోవా ఎమ్మెల్యేకు బెయిల్..

గోవా : మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసులో గోవా ఎమ్మెల్యే అటనాసియో మోన్సరేట్‌కు బెయిల్ లభించింది. కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తుతో పాటు వారానికి ఓమారు స్టేషన్‌లో హాజరు కావాల్సిందిగా షరతు విధించింది. నేపాల్‌కు చెందిన బాలికను కొనుగోలు చేసి మద్యం సేవించి ఆమెపై లైంగికదాడి జరిపిన కేసులో మోన్సరేట్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. 

నిజామాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు...

నిజామాబాద్ : జిల్లాలోని కామారెడ్డిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఉపాధి కూలీలకు పని కల్పించాలి - మంత్రి జూపల్లి..

మహబూబ్‌నగర్ : ఉపాధి కూలీలకు పని కల్పించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. షాద్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో ఆయన పర్యటించారు. లింగారెడ్డిగూడలో డంప్‌ యార్డును మంత్రి పరిశీలించారు. 

సిద్ధివినాయక్ టెంపుల్ లో ఆపిల్ సీఈవో..

ముంబై : ప్రముఖ ఆపిల్ సీఈవో ముంబై చేరుకున్నారు. ముంబైలోని ప్రముఖ ఆలయమైన సిద్ధివినాయక ఆలయాన్ని ఆయన సందర్శించారు. 

కేదర్ నాథ్ లో సదరన్ ట్రావెల్స్ నిర్వాకం..

ఢిల్లీ : కేదర్ నాథ్ దగ్గర రాంపూర్ లో ఏపీ యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేదర్ నాథ్ కు హెలికాప్టర్ లో తీసుకెళ్లలేమని సదర్ ట్రావెల్స్ సంస్థ చేతులేత్తిసింది. కేదర్ నాథ్ దగ్గర రాంపూర్ లో యాత్రికులను దింపివేసింది. దీనితో విజయవాడ, విశాఖకు చెందిన యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. 

12:07 - May 18, 2016

కళ్యాణ మండపాలే ఆమె టార్గెట్..పెళ్లి మండపాల్లో హడావుడి చేస్తుంది..ఆప్యాయంగా పలకరిస్తుంది...ఏమార్చి దోచేస్తుంది..

పిలవని పేరంటానికి వెళుతుంది. పెళ్లిళ్లలో హడావుడి చేస్తుంది. అందర్నీ కలుపుకపోతుంది. అన్నీ తానై వ్యవహరిస్తుంది. కానీ అక్కడున్న వారికి మాత్రం ఆమె ఎవరో తెలియదు. అదను చూసి అందినకాడికి దోచేస్తుంది. కానీ ఆమె ప్లాన్ వర్కవుట్ అయినా పోలీసుల డేగ కన్ను నుండి మాత్రం తప్పించుకోలేకపోయింది. కడప జిల్లాలో లేడీ కిలాడి హల్ చల్ గురించి తెలుసుకోవాలంటే వీడియోలో చూడండి. 

12:05 - May 18, 2016

పిల్లలు కలగలేదని వెళ్లగొట్టాడు..ఏడాదిగా పోలీసుల చుట్టూ ప్రదిక్షణలు..ఇంట్లో సామాగ్రితో బయటపడేసిన దుర్మార్గులు..భర్త ఇంటి ముందు ఇల్లాలి దీక్ష..ఒంటరిగానే న్యాయపోరాటం..

కాపురం చక్కగా ఉండాలంటే కాసులు కాదు కావాల్సింది. ఆలుమగల మధ్య అనురాగం. ఇది రానురాను కనుమరుగైపోతోంది. ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. భార్య భర్తల మధ్య సఖ్యత పోతోంది. దీనితోనే ఆ నాలుగు గోడల మధ్య చెలరేగుతున్న గొడవలు చివరకు వారి కుటుంబాలను ప్రశ్నార్థకంగా మార్చివేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో చంద్రవరంలో ఓ భర్త పిల్లలు కలగలేదని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వెళ్లగొట్టాడు. దీనితో భర్త ఇంటి ముందు ఇల్లాలు దీక్షకు దిగింది. మరో ఘటనలో వ్యసనాలకు బానిసై ఇల్లాలిపై హత్యాప్రయత్నం..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:04 - May 18, 2016

పుత్ర సంతానం కోసం పైశాచికం..తాళిని ఎగతాళి చేస్తున్న దుర్మార్గుడు..కొడుకు కోసం మూడు పెళ్లిళ్లు..ఆడపిల్లలు పుట్టడంతో భార్యలకు విడాకులు..భర్త కోసం దుబాయ్ లో మొదటి భార్య వేట..నాన్నను చూడాలని ఆడపిల్లల ఆరాటం..అమ్మ ఎప్పుడొస్తుందోనని ఆరాటం..

కంటి పాపలా చూసుకోవాల్సిన 'నాన్న' బాధ్యత మరిచిపోయాడు. కూతుళ్లు పుట్టారని భార్య బిడ్డలను వదిలేసి వెళ్లిపోయాడు. అర్ధాకలితో అలమటిస్తూ 'నాన్న'ను చూడాలని ఆ ఆడబిడ్డలు ప్రతి నిత్యం గడప వైపే చూస్తున్నారు. నాలుగేళ్లుగా కనిపించని భర్త కోసం కువైట్ వెళ్లిన ఇళ్లాలు వెతుకుతూనే ఉంది. కానీ ఆ మొగుడు మాత్రం కొడుకు కోసం మరో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లలకు జన్మనిస్తూనే ఉన్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఇతనికి ముచ్చట తీరలేదు. మగ పిల్లాడి కోసం పెళ్లిళ్ల మీదు పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లలను అనాథలు చేస్తున్నాడు. ఇదంతా కడపలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

హీరో తండ్రిది ఆత్మహత్యే..

హైదరాబాద్ : సినీ హీరో తనీష్ తండ్రి వర్ధన్ ది ఆత్మహత్య అని తేలింది. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. అర్ధరాత్రి మద్యం సేవించి ఆరో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

సీఎస్ తో మంత్రి కడియం భేటీ..

హైదరాబాద్ : సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మతో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. విద్యాశాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చిస్తున్నారు. 

తప్పు చేయలేదు - టిడిపి కార్పొరేటర్...

విజయవాడ : తాను ఏ తప్పు చేయలేదని టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరారవు పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు విచారణకు పిలిచిన మాట వాస్తవమేనని, రెండు రోజుల్లో లాయర్ ను తీసుకుని విచారణకు వెళుతానని తెలిపారు. తాను తప్పు చేసుంటే సీసీ టీవీల్లో రికార్డయి ఉంటుందన్నారు. 

తూర్పుగోదావరిలో నేడు సీఎం బాబు పర్యటన..

తూగో : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. బొమ్మూరులో ఏర్పాటు చేసిన గిరిజన యువత శిక్షణా కేంద్రాన్ని, దవళేశ్వరంలో నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను ప్రారంభిస్తారు.

చెన్నైలో అత్యధిక వర్షపాతం..

తమిళనాడు : వాయుగుండం ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో ఆరేళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ఒక్క రోజులో 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది

గవర్నర్ ను కలిసిన కేబినెట్ సబ్ కమిటీ..

హైదరాబాద్ : హోంమంత్రి నాయిని ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌ను కమిటీ ఆహ్వానించింది

పాతబస్తీలో భారీగా పోలీసుల మోహరింపు..

హైదరాబాద్ : మక్కా మసీదు బాంబు పేలుళ్లకు 9ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాతబస్తీలో భారీగా పోలీసులు మోహరించారు. 2వేల మంది పోలీసులతో పాటు 30 ప్లాటున్ల ప్రత్యేక పోలీసులు భద్రతను చేపట్టారు. రెండు కంపెనీల ఆర్ఏఎఫ్ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. భద్రతను జాయింట్ సీపీ స్వాతిలక్రా భద్రతను పర్యవేక్షిస్తున్నారు

11:21 - May 18, 2016

విజయవాడ : మహిళను వేధించిన కేసులో టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావును అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు విజయవాడకు చేరుకున్నారు. కాసేపట్లో ఉమ్మడి వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లనున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చే విమానంలో తనను వేధించాడని రెండు రోజుల క్రితం మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

11:19 - May 18, 2016

గుంటూరు : నగర కార్పొరేషన్‌లో లేబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఒక శాతం లేబర్ సెస్‌ డబ్బులు చెల్లించకుండానే నకిలీ రశీదులతో బిల్డర్లు భవనాలకు అనుమతులు పొందుతున్నారు. నాలుగేళ్లుగా 4 కోట్ల రూపాయల మేర స్కాం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురు మృతి చెందిన ఘటనతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దర్యాప్తు చేపట్టగా అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.

టిడిపి కార్పొరేటర్ అరెస్టుకు రంగం సిద్ధం..

విజయవాడ : మహిళను వేధించిన కేసులో టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావును అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు విజయవాడకు చేరుకున్నారు. కాసేపట్లో ఉమ్మడి వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లనున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చే విమానంలో తనను వేధించాడని రెండు రోజుల క్రితం మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

లింగంపల్లిలో ట్రాక్టర్ బోల్తా...

ఆదిలాబాద్ : దండేపల్లి (మం) లింగంపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభాల లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు.

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల..

అనంతపురం : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్ణత శౄతం 96.53 శాతంగా ఉంది. బాలురు 96.20 శాతం ఉండగా, బాలికలు 98.05 గా ఉంది.

అక్కపాలెం సర్పంచి దారుణ హత్య..

కృష్ణా : జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం సర్పంచి దోమతోటి వెంకటరమణ భర్త నాగేశ్వరరావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. వాటర్ ట్యాంకు వద్ద మురుగునీటి గుంతలో పడి ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

 

చెన్నైకి నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

తమిళనాడు : చైన్నైకి నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి. తమిళనాడులో రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్తలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి.

కొనసాగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

ఉత్తరాకాశీ అడవిలో మంటలు..

ఉత్తరాఖండ్ : ఉత్తరకాశీలోని అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. సుమారు 159 హెక్టార్లలో ఈ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

బాబా హర్దేవ్ సింగ్ అంతిమయాత్ర..

ఢిల్లీ : అధ్మాత్మిక గురువు, సంత్ నిరంకారి మిషన్ స్వామి బాబా హర్దేవ్ సింగ్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆయన పార్థివ దేహాన్ని ఊరేగిస్తున్నారు. ఆయన అంతిమయాత్రను వీక్షించేందుకు భారీగా ప్రజలు పోటెత్తారు. కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 170 పాయింట్లకు పై నష్టంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

10:07 - May 18, 2016

బలంగా, ఫిట్‌గా తయారవ్వాలంటే వ్యాయామం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఇరవైలలోనే అరవైలా తయారవతున్నారు. ఇలాంటి వారందరూ తగిన శిక్షణ తీసుకొని వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్‌గా ఉండటమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారవుతారు.
మార్పు వస్తుంది: ఆరు నెలల పాటు ప్రతిరోజు వ్యాయామం చేస్తే, కండరాలు బలాన్ని పుంజుకొని వ్యాయామానికి అనుగుణంగా మారతాయి. మూడు నుండి నాలుగువారాల పాటు ఒకే వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి. ఆ తర్వాతే కొత్త వ్యాయామంలోకి వెళ్ళండి. ఇలా చేస్తే శరీర కండరాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
తగిన తీవ్రతతో చేయాలి: వ్యాయామాలు చేయడం ద్వారా శక్తి తగ్గుతుంది. ఎప్పుడూ చేయకుండా ఒకేసారి ఎక్కువ సమయం చేస్తే శరీరంలో శక్తి అంతా పోతుంది. అందుకే మొదటి వారం రోజులు ఒకే సమయం పాటించాలి. ఇలా వారానికి ఒకసారి సమయాన్ని పెంచుకుంటూ వ్యాయామాలు చేస్తుంటే వ్యాయామాలు చేసే తీవ్రత కూడా దానంతట అదే పెరుగుతుంది. అప్పుడు శరీరంలో శక్తి కూడా పుంజుకుంటుంది.
తగిన రీతిలో చేయాలి: వ్యాయామాలు చేసేటప్పుడు సొంతంగా చేయకూడదు. ఎలా చేయాలి? భంగిమలు ఎలా ఉండాలి? శ్వాస ఎలా తీసుకోవాలి? అనే నియమ నిబంధనలు ఉంటాయి. వాటికి అనుగుణంగా చేసినప్పుడే ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. అందుకే శిక్షకుని సమక్షంలో వ్యాయామాలు నేర్చుకొని ఆ తర్వాతనే ఇంటి వద్ద చేయడం ప్రారంభించాలి.
లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి: ప్రణాళికాబద్దంగా వ్యాయా మాలు చేయడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఉదాహరణకు నెలలో ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటే ఎలా తగ్గాలి? వాటికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి? లాంటి చిన్నచిన్న లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చేయడం వల్ల ఫలితాలు చివరి లక్ష్యాన్ని చేరతాయి.
విశ్రాంతి కూడా అవసరం: వ్యాయామాలు ఎంత ముఖ్యమో వాటికి మధ్య మధ్యలో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. కండరాలను ఇబ్బందిపెట్టేలా వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు పట్టేస్తాయి. మరల వారం దాకా వ్యాయామం చేసే అవకాశం ఉండదు. అలాగే వారంలో ఐదు రోజులు మాత్రమే వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు.
ప్రమాదాలు జరగకుండా: టెక్నిక్స్‌ను ఉపయోగించడంలో లోపం జరిగితే ప్రమాదాలు సంభవిస్తాయి. అందుకే సరైన పద్ధతులను తెలుసుకుంటూ చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలు చేరతారు. ఆరోగ్యానికి రక్షణ.
పోషకాహారం ముఖ్యం: వ్యాయామాలు చేసేటప్పుడు శరీరంలో పోషకాలు తగ్గుతాయి. అందుకే వ్యాయామాలు చేసేదానికి అనుగుణంగా పోషకాహారం కూడా తీసుకోవాలి.

10:04 - May 18, 2016

కామన్‌గా కనిపించే కలబందంతో అందం, ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే కలబందను సబ్బులు, మాయిశ్చరైజర్‌ క్రీముల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా! ముడతలను నివారించడమే కాదు... ఎలర్జీలను దరిచేరనివ్వదు. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కలబంద రసాన్ని ముఖానికి అప్లైచేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. కాలిన గాయాలపై కలబంద రసం పూతలా పూస్తే గాయాలు మాయమవుతాయి. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేదా చందనం పౌడర్‌ కలిపి ముఖంపై రాస్తే మృతకణాలు తొలగి చర్మం నిగనిగలాడుతుంది.
కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో ప్యాక్‌లా వేస్తే.. చర్మంపై ఉన్న నల్లని మచ్చలు తగ్గుతాయి.
రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలిపి ముఖానికి మర్దన చేయాలి. పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.

10:03 - May 18, 2016

బజారులో దొరికే ముల్లంగి... ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కూరల్లో, సాంబారులో, సలాడ్లలో... ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో అందుతాయి.
చాలామంది మహిళలకు కాలంతో సంబంధం లేకుండా తరచూ మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి వారు ముల్లంగిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మూత్ర సమస్యలూ, మంటా, వాపూ వంటి వాటిని ఇది అదుపులో ఉంచుతుంది. మూత్ర పిండాల్లో ఇనెఫెక్షన్‌ ఉంటే దూరం చేస్తుంది. వ్యర్థాలుంటే మూత్రం ద్వారా వెళ్లిపోయేలా చూస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికీ ఇదెంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో పీచు అధికం. క్యాలరీలు తక్కువ. అదీకాక తక్కువ మొత్తంలో తీసుకున్నా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అలానే ముల్లంగిలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. ఇది మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. జీవక్రియల రేటును వృద్ధి చేస్తుంది. దీనిలో విటమిన్‌ సి, ఫోలిక్‌ ఆమ్లం అధికం. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ దుంపలో అధికం. ఇవి శరీరం లో క్యాన్సర్లకు కారణమయ్యే కారకాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. మేలు చేసే కొత్త కణాల ఉత్పత్తికి ముల్లంగి తోడ్పడుతుంది. తరచూ తినడం వల్ల అల్సర్‌ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా ఉంటుంది.
చర్మ సంబంధ ఇబ్బందుల నుంచి ఇది కాపాడుతుంది. ఇందులో విటమిన్‌ బి, జింక్‌, ఫాస్పరస్‌, అలానే నీటిశాతం ఎక్కువ. ఇవి చర్మం నిర్జీవంగా మారకుండా కాపాడతాయి. డీహైడ్రేషన్‌ సమస్య కూడా ఉండదు. ఈ పోషకాలన్నీ తగినంత మోతాదులో శరీరానికి అందడం వల్ల దద్దుర్లూ, దురదలూ బాధించవు. చర్మం మీద మురికిని తొలగించుకోవాలంటే... ముల్లంగిని గుజ్జులా చేసి పూతలా వేసుకుంటే ఫలితం ఉంటుది.

10:01 - May 18, 2016

రామ్‌ చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, 'గతేడాది తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రామ్‌ చరణ్‌ కొత్తలుక్‌లో కనిపించబోతున్నారు. అందుకోసం తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టన్నింగ్‌ లుక్‌తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. విభిన్నమైన కథాంశంతో మా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో చరణ్‌, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతుండడంతో ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను భారీగా నిర్మిస్తున్నాం. అరవింద్‌ స్వామి క్యారెక్టరైజేషన్‌ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో చేసే షెడ్యూల్‌లో ముఖ్యమైన సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్‌ని చాలా గ్రాండియర్‌గా చిత్రీకరించనున్నాం. వచ్చే నెల 20 నుంచి కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో కీలకమైన సన్నివేశాలను షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

 

10:00 - May 18, 2016

అల్లు శిరీష్‌ హీరోగా ఎం.వి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్రప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్‌ మెహరీన్‌ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఇందులో మా పాత్రలు చాలా భిన్నంగా వినోదాత్మకంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంజయ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్‌ సంగీత సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం పూర్తయిన తర్వాత, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది' అని అన్నారు. 'లవ్‌తోపాటు మంచి కాన్సెప్ట్‌, సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. అల్లు శిరీష్‌, మెహరీస్‌ జోడీ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి' అని దర్శకుడు ఎం.వి.ఎన్‌.రెడ్డి తెలిపారు. నిర్మాత శైలేంద్రబాబు మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో వస్తున్న రెండో తెలుగు చిత్రమిది. మంచి కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోతోపాటు హీరోయిన్‌కి కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది' అని అన్నారు.

09:58 - May 18, 2016

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా బాగా కొనసాగుతోంది. తాజాగా మరో బయోపిక్‌ తెరకెక్కేందుకు రెడీ అవుతోంది. భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ బయోపిక్‌లో ఇర్ఫాన్‌ఖాన్‌ నటించనున్నట్టు సమాచారం. జీవితంలో కలాం ఎదుర్కొన్న ఒడి దుడుకులు, సాధించిన విజయాల నేపథ్యంలో ఈచిత్రం ఉంటుందని, సినిమా చిత్రీకరణకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్టు మరాఠీ చిత్ర నిర్మాత ప్రమోద్‌ గోరె తెలిపారు. జూలైలో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

సుబ్రమణ్యస్వామి అసలు టార్గెట్ ఆయన..

ఢిల్లీ : బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అసలు టార్గెట్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అని కాంగ్రెస్ అభిప్రాయపడింది. గత కొన్ని రోజులుగా ఆర్బీఐ గవర్నర్ రాజన్ పై ఎంపీ సుబ్రమణ్యస్వామి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

09:44 - May 18, 2016

తిరుమల : చెన్నైకు సమీపంగా 90 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాలో 3వ, ఉత్తర కోస్తాలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం మూలంగా శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. ప్రధాన ఆలయంలో కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వెంటనే స్పందించిన ఆలయ అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నీటిని తోడి బయటకు పంపుతున్నారు.

09:42 - May 18, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో చేపడుతున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ కోసం రెవిన్యూ అధికారులు బలవంతపు భూసేకరణ చేపట్టడం వివాదాస్పదంగా మారింది. ప్రాజెక్ట్‌ కోసం ఉన్నపళంగా ఊరొదిలి వెళ్లాలని రెవిన్యూ, పోలీసులు అధికారులు బెదిరింపులకు దిగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2013 భూసేకరణ చట్ట నిబంధలను తూట్లు పొడుస్తూ...తక్కువ పరిహారం చెల్లించేందుకు వీలుగా కేసీఆర్ సర్కార్‌ 123, 214 GOలు తెచ్చింది. ఇచ్చింది తీసుకుని ఊరొదిలి వెళ్లకపోయినా, భూములు ఇవ్వకపోయినా మెడపట్టి బయటకు గెంటేస్తామని అధికారులు బెదిరిస్తుండటం... మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాల ప్రజలకు గుండెకోతగా మారుతోంది. నిబంధనలను తోసిరాజని... మల్లన్నసాగర్‌ కోసం మెదక్‌ జిల్లాలో చేపట్టిన బలవంతపు భూసేకరణపై 10 టీవీ ప్రత్యేక కథనం.... LOOK...

మల్లన్నసాగర్‌తో ముంపుకు గురయ్యే గ్రామాలు 14

మల్లన్నసాగర్‌ కోసం ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ముంపునకు గురయ్యే 14 గ్రామాలను ప్రజలను పూర్తిగా తరలించాల్సి ఉంది. ఎర్రవల్లి, పల్లెపాడు, వేములగట్టు, బంజర్‌పల్లి, ఏటిగడ్డకిస్టాపూర్‌, లక్ష్మిపూర్‌, తిరుమలగిరి, బ్రహ్మణ బంజర్‌పల్లి, తుర్కాపూర్‌, తొగుట, బంజర్‌పల్లి, గిలాయిపల్లి, సిరసనగండ్ల, సింగారం, మంగోలు గ్రామాలు ముంపునకు గురువుతాయని తేల్చారు. వేలాది మంది ప్రజలు నిర్వాసితులవుతారు. 3112 ఇళ్లను కోల్పోతాయని లెక్క తేల్చారు. మెదక్‌ జిల్లాలోని తొగుట, ప్రజ్ఞాపూర్‌ ప్రాంతాల్లో 2.15 లక్షల ఎకరాలను సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మొతం 50 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో చేపట్టారు. మల్లన్నసాగర్‌ కోసం 21,441 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. నిర్వాసితులకు పూర్తిగా పరిహారం చెల్లించిన తర్వాతే పని ప్రారంభిస్తామని చెప్పిన నీటిపారదల శాఖ మంత్రి హరీశ్‌రావు... ఎంత ఇస్తారు ? ఏ ప్రాతిపదికన చెల్లిస్తారో స్పష్టత ఇవ్వకపోవడంత విమర్శలకు తావిస్తోంది.

ముందుగా భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయాలి .....

మల్లన్నసాగర్‌ కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సిన సర్కార్‌... దీనికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోంది. చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం... దీనికి బదులు పక్కదారిని ఎంచుకుంది. భూసేకరణకు ముందు నోటిఫికేషన్‌ జారీ చేయాలి... సామాజిక సర్వే నిర్వహించాలి... భూములు కోల్పోయే రైతులతో ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండానే రెవిన్యూ, పోలీసులు అధికారులు గ్రామాలమీద పడి ప్రజలను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పరిహారం విషయంలో మడతపేచీ పెడుతున్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువకు 4 రెట్లు అదనంగా పరిహారం చెల్లించాలి. కానీ దీనిని నుంచి తప్పించుకునేందుకు పక్కదారి ఎంచుకున్న తెలంగాణ సర్కార్‌... 123, 214 జీవోలు జారీ చేసింది. వీటి ప్రకారం రిజిస్ట్రేషన్‌ విలువ మాత్రమే చెల్లించే ఏర్పాటు ఉంది. మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. దీంతో రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

జీవోల ప్రకారమే ఎక్కువ పరిహారంటూ తప్పుదోవ పట్టించే యత్నం.

ప్రభుత్వ ఒత్తిడికి లొంగి గ్రామాలపై పడుతున్న రెవిన్యూ అధికారులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2013 భూసేకరణ చట్టం కంటే ప్రభుత్వం జారీ చేసిన జీవోలతోనే ఎక్కువ మొత్తంలో పరిహారం వస్తుందటూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారమే భూములు ఇచ్చేందుకు ఒప్పంద ప్రత్రాలపై సంతకాలు చేయాలని బెదిరింపులకు దిగడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంటికి ఇల్లు, భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పరిహారం దేనికీ సరిపోదంటున్న నిర్వాసిత గ్రామాల ప్రజలు...

ప్రభుత్వం ఇవ్వచూపుతున్న పరిహారం దేనికీ సరిపోదని నిర్వాసిత గ్రామాల ప్రజలంటున్నారు. బంగారు తెలంగాణ సృష్టించే క్రమంలో భాగంగా సర్కార్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌ల కోసం ప్రజలు త్యాగాలకు సిద్ధంగా ఉన్నా... పాలకులు మాత్రం చట్టానికి వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేస్తుండటాన్ని తప్పుపడుతున్నారు. పుట్టిపెరిగిన ఊరిని ఉన్నపళంగా వదిలి వెళ్లమంటే ఎవరికైనా కష్టమేనని ఓ అంధుడు ఆవేదన వ్యక్తం భూసేకరణ కోసం అధికారులు చేస్తున్న హడావుడిని చూసి తట్టుకోలేక దుబ్బాకలో రామయ్య అనే రైతు గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబాన్ని దుఖఃసాగరంలో ముంచింది.

నిర్వాసితులకు సీపీఎం అండగా....

నిర్వాసితులకు సీపీఎం అండగా నిలిచింది. చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతోంది. మల్లన్నసాగర్‌ భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా ఇవ్వచూపుతున్న ధరకే కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌ భూములను ఇస్తారా ? అన్ని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రాజెక్ట్‌ నిర్వాసితుల్లో రైతులే కాదు..

ప్రాజెక్ట్‌ నిర్వాసితుల్లో రైతులే కాదు.. ఆయా గ్రామాల్లో చేతివృత్తులవారు, వ్యవసాయ కూలీలు కూడా ఉంటారు. వీరికి 60 వేల నుంచి లక్ష రూపాయల వరకు పరిహారం చెల్లించాలి. కానీ ఈ విషయంలో కూడా ప్రభుత్వం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. మల్లన్నసాగర్‌ భూసేకర వివాదాస్పదంగా మారడంతో మెదక్‌ జిల్లా అధికార యంత్రాంగం దిగొచ్చింది. ప్రాజెక్ట్‌ సర్వేను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ ప్రకటించారు.

చట్టసభల్లో చేసిన చట్టానికే పాలకులు తూట్లు....

చట్టసభల్లో చేసిన చట్టానికే పాలకులు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారనడానికి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణ కోసం తెలంగాణ సర్కార్‌ జారీ చేసిన 123, 214 జీవోలనే నిదర్శమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాగ్రహానికి దిగొచ్చిన జిల్లా యంత్రంగా ప్రాజెక్ట్‌ సర్వేని నిలిపివేసినా... వివాదాస్పద జీవోల విషయంలో పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

గుంటూరులో లేబర్ సెస్ స్కాం..

గుంటూరు : కార్పొరేషన్ లో లేబర్ సెస్ స్కాం బయటపడింది. ఒక శాతం లేబర్ సెస్ డబ్బులు చెల్లించకుండానే నకిలీ రసీదులతో భవనాలకు బిల్డర్లు అనుమతులు పొందారు. నాలుగేళ్లుగా రూ. 4 కోట్ల స్కాం జరిగిందని అంచనా వేస్తున్నారు. మట్టిపెళ్లలు కూలి కార్మికులు మృతి చెందిన ఘటనలో విజిలెన్స్ అధికారుల చేస్తున్న దర్యాప్తులో నిజాలు బట్టబయలయ్యాయి.

సాధన సమితి రైల్ రోకో..

వరంగల్ : మానుకోటలో జిల్లా సాధన సమితి రైల్ రోకో నిర్వహించింది. మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ శాతవాహన ఎక్స్ ప్రెస్ ను సాధన సమితి నేతలు అడ్డుకున్నారు.

 

శ్రీవారి ఆలయంలోకి వరదనీరు..

చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లోకి వరదనీరు చేరింది. ఆలయంలోకి వరద నీరు చేరడంతో ఫైరిజంన్లతో నీటిని వెలుపలకు పంపుతున్నారు.

సీఎం చంద్రబాబు తూ.గో జిల్లాలో పర్యటన

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి, గోకవరం, పెద్దాపురం, సామర్లకోటలో చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో సీఎం పాల్గొననున్నారు.

 

08:57 - May 18, 2016

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి, గోకవరం, పెద్దాపురం, సామర్లకోటలో చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో సీఎం పాల్గొననున్నారు.

 

08:56 - May 18, 2016

హైదరాబాద్‌ : నగరంలో యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రారంభంకానుంది. యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌ ఈ సెంటర్‌ను ప్రారంభిస్తారని... తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంటారని సమాచారం... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం మీకో పెద్ద వార్త చెబుతా అని ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత పదును ఎక్కింది. ఇప్పటికే నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్ టవర్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌కు అవసరమైన స్థలాన్ని యాపిల్ లీజుకు తీసుకుంది. 

08:53 - May 18, 2016

హైదరాబాద్ : చెన్నైకు సమీపంలో బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ఏర్పడుతోంది. మరికొన్ని గంటల్లో తుఫానుగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడులో పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు రావోనుగా నామకరణం చేశారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

తిరుమలలో కుండపోతగా వర్షం

తిరుమల: తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అర్థరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలకు వచ్చే యాత్రీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్సు వెలుపల క్యూలైన్లలో ఉన్న భక్తులు భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు.

07:34 - May 18, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీ ప్రజలను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మోసం చేశారని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ద్వారా ఏమి సాధించారు. కేంద్రం ధోరణి సీఎం సమర్థిస్తున్నారా? విభజ చట్టంలో ఉన్న హామీలనైనా అమలు చేస్తారా?హోదా వచ్చినా ఉపయోగం లేదని సీఎం చంద్రబాబు అనడం అర్థం ఏమిటి? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ నేత రామశర్మ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా వర్షాలు...

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు ఆత్మకూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలో వర్షం కురిసింది. తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు వాయుగుండం ప్రభావం ఉండటంతో నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోని పలుప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.

 

మంత్రి హరీశ్‌రావుపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ ఫైర్

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి హరీశ్‌రావుపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు.. దిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాల సర్వేలను అడ్డుపెట్టుకొని అనుమతులున్నాయంటూ అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు.. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ అధినేత జగన్... సీఎం కేసీఆర్‌ ఇంటి దగ్గర దీక్ష చేయాలని సూచించారు. 

యువ హీరో తనీష్‌ తండ్రి మృతి...

హైదరాబాద్‌ : మణికొండలో యువ హీరో తనీష్‌ తండ్రి వర్ధన్‌.. అర్ధరాత్రి ఆరంతస్తుల భవనంపై నుంచి కిందపడిపోయాడు. తీవ్రగాయాలైన వర్ధన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై కేసు నమోదు .

తూర్పు గోదావరి : జిల్లా కాకినాడ టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై కాకినాడ టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తోట నర్సింహంపై సూరవరపు రవికుమార్‌ అనే వ్యక్తి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థకు ఫిర్యాదు చేశాడు. మైనర్లు అయిన తమ కూతుర్ల ఫోటోలను అభ్యంతరకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎంపీ తోట నర్సింహతో పాటు మరో అయిదుగురిపైనా చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌లో కోరాడు.

నీట్‌పై ఎటూ తేల్చుకోలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్ : నీట్ పై సందిగ్ధత కొనసాగుతునే ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ నిర్వహించాలా? లేదా? అన్న అంశం పై కేంద్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మెడికల్ అడ్మిషన్లకు నీట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశించినా, దీని పై కేంద్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో పరీక్ష ఉంటుందా? లేదా? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట

మెదక్ :మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. 

తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం...

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తీవ్ర వాయుగుండం మారింది. చెన్నైకి నైరుతి దిశగా కేంద్రీకృతమైన వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడుతో పాటు.. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

07:13 - May 18, 2016

కృష్ణా : బందర్‌ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తోంది. అందుకు సంబంధించి అనుమతులకు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డీప్ వాటర్ పోర్టు నిర్మాణంలో భాగంగా మచిలీపట్నంలో 26 బెర్తులను నిర్మించనున్నారు. మొదటి విడతలో 15 బెర్తులను నిర్మించి 2022 నాటికి 47 మిలియన్‌ టన్నుల ఎగుమతులు, దిగుమతులు లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రైతులకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు...

బందరు మండలంలోని మంగినపూడి, గోపువానిపాలెం, పోతేపల్లి, చిలకలపూడి, కర్రగ్రహారం గ్రామాల్లో మొత్తం 4,500 ఎకరాల భూమిని పోర్టుకోసం సేకరించాల్సి ఉంది. దీనిలో 2,200 ఎకరాల భూమి ప్రైవేట్ ల్యాండ్ కావడంతో .. భూమి కోల్పోయే రైతులకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే భూములు కోల్పోయిన వారికి సరైన న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ....

2015 ఆగస్టులో పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ భూములిచ్చేది లేదని రైతులు అభ్యంతరం చెప్పారు. అయితే ప్రభుత్వం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి.. జాయింట్‌ కలెక్టర్‌ను ఈ అథారిటీకి వైస్‌ ఛైర్మన్‌గా నియమించింది. మరో 15 మంది డిప్యూటీ కలెక్టర్లను ఎంఏడీఏలో పని చేసేందుకు కేటాయించింది. డిప్యూటీ కలెక్టర్లు విధుల్లో చేరిన తర్వాత వారికి ఆయా గ్రామాలు కేటాయించే బాధ్యతను జిల్లా కలెక్టర్, మచిలీపట్నం ఆర్డీవోకు అప్పగించారు. ఇటీవల మచిలీపట్నంలో కొంత మంది సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరిని ఎంఏడీఏలో భూసమీకరణకు ఉపయోగించుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించిన గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్‌ గ్రామ కంఠాలకు సంబంధించి ఎంత భూమి ఉంది తదితర వివరాలను సేకరిస్తారని సమాచారం. గ్రామ సభలు నిర్వహించి రైతుల సూచనలు, అభిప్రాయాల మేరకు భూమి తీసుకోవటం ఖాయమనేది విశ్వసనీయ సమాచారం.

మచిలీపట్నం పోర్టు ఎంఏడీఏ పరిధిలో ఉంటుందా..? లేదా..?

పోర్టు అనుబంధ పరిశ్రమల పేరుతో తొలుత 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం ఎంఏడీఏ పరిధిలో 28 గ్రామాల్లోని 1.06 లక్షల ఎకరాలను చేర్చారు. ఇందులో తొలి విడతగా 36 వేల ఎకరాలను సమీకరించే యత్నాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్టు ఎంఏడీఏ పరిధిలో ఉంటుందా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోర్టు నిర్మాణానికి భూములు ఇస్తామని గతంలో చెప్పినా, అనుబంధ పరిశ్రమల పేరుతో తమ భూములను పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తే సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు.

ప్రాజెక్టు ప్రాంతంలో మళ్లీ టెన్షన్ వాతావరణం....

రైతుల నుంచి సారవంతమైన భూములు తీసుకుంటున్న ప్రభుత్వం వారికి సరైన న్యాయం చేయాలి. ప్యాకేజీ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే అసలు భూములిచ్చేదే లేదంటున్నారు కృష్ణా జిల్లా రైతులు. ఏదేమైనా ప్రభుత్వం ప్యాకేజీలో అన్యాయం చేస్తే సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టు ప్రాంతంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

07:08 - May 18, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తీవ్ర వాయుగుండం మారింది. చెన్నైకి నైరుతి దిశగా కేంద్రీకృతమైన వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడుతో పాటు.. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తుపానుగా మారే అవకాశం ...

బంగాళాఖాతం మన్నార్‌ పరిసర తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. వేగంగా కదులుతూ వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి.. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశగా నైరుతి బంగాళాఖాతంలో అది కేంద్రీకృతం కానున్నట్లు వెల్లడించింది. ఉత్తర వాయవ్య దిశగా పయనించి.. అనంతరం దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనున్నట్లు తెలిపారు.

తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు .....

వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తమిళనాడు, కేరళతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కౌంటింగ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం......

ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం అస్తవ్యస్తంగా మారింది. రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది. మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రేపు జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌కు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 2010 తర్వాత ఒక్కరోజు అత్యధిక వర్షపాతం చెన్నై నగరంలో చోటు చేసుకుంది.

ఓడరేవుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు ...

ఇక వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

07:05 - May 18, 2016

మెదక్ :మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు..

2,15,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం......

మెదక్‌ జిల్లా తోగుట మండలంలో మల్లన్న ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల 15వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.... ప్రాజెక్టుకు భూసేకరణకోసం సర్కారు 123, 214 జీవోలను విడుదల చేసింది.. అయితే ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయి... దీంతో ఈ గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.. భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు..

14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన....

తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.. సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.. వీరి పోరాటం ఉధృతం కావడంతో స్వయంగా కలెక్టరే దిగివచ్చారు.. ముంపు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు.. స్థానికులంతా తమ సమస్యల్ని కలెక్టర్‌కు చెప్పుకున్నారు.. సర్వే నిలిపివేయాలని కోరారు..

వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు...

గ్రామస్తుల విజ్ఞప్తితో వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు న్యాయం జరగదని వారికి నచ్చజెప్పారు..

కలెక్టర్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన లాయర్ల యూనియన్....

కలెక్టర్‌ వ్యాఖ్యలను ఆలిండియా లాయర్ల యూనియన్‌ తప్పుబట్టింది.... ప్రజలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది.. ముంపు గ్రామాల్లో ఈ యూనియన్‌ సభ్యుల బృందం పర్యటించింది.. ప్రభుత్వ జీవోలతోనే ముంపు ప్రజలకు మేలు జరుగుతుందంటూ కలెక్టర్‌ చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. ముంపు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్‌ ప్రజలకు ఏం చేశారని బృందం ప్రశ్నించింది.. ఇలా అధికారులే రైతుల్ని మోసం చేయడానికి ప్రయత్నించడం మంచిదికాదని అభిప్రాయపడింది. సర్వే నిలిపివేత ఎలా ఉన్నా... తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాడతామని నిర్వాసితులు చెబుతున్నారు.. అప్పటివరకూ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.. 

07:02 - May 18, 2016

శ్రీకాకుళం :  రణస్థలం మండలంలోని అణువిద్యుత్‌ కేంద్రం ప్రతిపాదిత గ్రామమైన కొవ్వాడలో నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్తతకు దారితీసింది. కొంతకాలంగా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన నిర్వహిస్తోన్న నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలు పెట్టారు. శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి, అణు విద్యుత్‌ భూ సేకరణ విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సీతారామారావు ఇతర అధికారులతో గ్రామంలో సదస్సు నిర్వహించారు. అభ్యంతరాలుంటే తమ దృష్టికి తేవాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలను కోరారు.

రికార్డుల సక్రమ నిర్వహణకు సమగ్ర భూ సర్వే ...

రికార్డుల సక్రమ నిర్వహణకు సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని, అందుకు గ్రామస్తులు సహకరించాలని అధికారులు స్పష్టం చేశారు. సామాజిక సర్వే ద్వారా అణు విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం వంటివి చేపడతామని చెప్పారు. గ్రామస్తులు సహకరిస్తే తక్షణమే భూ సర్వే చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ప్రజాసంఘాలు, వామపక్షాల నేతల వ్యతిరేకత...

ప్రజాసంఘాలు, వామపక్షాల నేతలు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. భూకంపాల జోన్‌లో అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ప్రమాదకరమని, తక్షణమే విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ ఎమ్వీఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు.

ప్రజల మనుగడకే ప్రమాదకరమైన ప్లాంటును...

ప్రజల మనుగడకే ప్రమాదకరమైన ప్లాంటును వ్యతిరేకిస్తున్నామని అధికారులతో ప్రజాసంఘాలు, వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. అధికారులు సర్వేకు సిద్దమైతే.. మరో పోరాటం తప్పదని గ్రామస్తులు, వామపక్ష నేతలు హెచ్చరించారు. 

06:59 - May 18, 2016

హైదరాబాద్ : నీట్ పై సందిగ్ధత కొనసాగుతునే ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ నిర్వహించాలా? లేదా? అన్న అంశం పై కేంద్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మెడికల్ అడ్మిషన్లకు నీట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశించినా, దీని పై కేంద్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో పరీక్ష ఉంటుందా? లేదా? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

నీట్‌పై తీవ్ర ఆందోళనలో రాష్ట్రాలు...

మెడికల్ అడ్మిషన్లకు సుప్రీంకోర్ట్ నీట్ పరీక్షను తప్పనిసరి చేయడంతో రాష్ట్రాలన్నీ తీవ్ర ఆందోళనలో వున్నాయి. సుప్రీం తీర్పుని శిరసావహించాల్సి ఉన్నప్పటికీ.... రాష్ట్రాల అభ్యర్ధన మేరకు కేంద్రం నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీట్‌తో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఈ ఏడాదికి నీట్ నుండి మినహాయింపు ఇవ్వాలని 20 కి పైగా రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్ధించాయి. సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా నీట్‌ నిర్వహించాల్సి ఉంది. రాష్ట్ర సిలబస్ తో ఇంటర్ చదివిన విద్యార్థులకు ఈ పరీక్ష రాయడం కష్టమవుతుందని కేంద్రం పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో నీట్ పై ఏమిచేయాలా అని.. తర్జన భర్జన పడుతున్న కేంద్రం... ఈ పరీక్ష విషయంలో మరోసారి సుప్రీంను ఆశ్రయించే ఆలోచనలో ఉందని సమాచారం.

నీట్‌ కోచింగ్‌ కోసం ప్రైవేటు కాలేజీ ఒత్తిడి

:నీట్ పై కేంద్రం రోజుకో విధంగా స్పందిస్తుడంటంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు ప్రైవేటు కళాశాలలు నీట్ కోచింగ్ తీసుకోవాలంటూ ఒత్తిడిచేస్తూ.. విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నవిమర్శలున్నాయి. కేంద్రం దీని పై స్పష్టత ఇస్తే విద్యార్థులు నష్టపోకుండా ఉంటారని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

బడాబాబుల కోసం పేదల పొట్ట కొట్టొద్దు .....

నీట్‌కు గడువు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం త్వరగా తేల్చాలని విద్యార్థులు కోరుతున్నారు. లేకపోతే కళాశాలల దోపిడికి విద్యార్థులు బలికా వాల్సి వస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. బడాబాబుల కడుపులు నింపేందుకు... పేదల పొట్ట కొట్టొద్దంటూ వేడుకుంటున్నారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

06:56 - May 18, 2016

హైదరాబాద్‌ : మణికొండలో యువ హీరో తనీష్‌ తండ్రి వర్ధన్‌.. అర్ధరాత్రి ఆరంతస్తుల భవనంపై నుంచి కిందపడిపోయాడు. తీవ్రగాయాలైన వర్ధన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

06:54 - May 18, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి.. టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌తో వలసలు ఓవైపు... కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక వరుస ఓటములు మరోవైపు కోలుకోలేకుండా చేస్తున్నాయి.. పార్టీ నాయకత్వాన్ని మార్చినా... ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితి మాత్రం అలాగే ఉంది.. దీంతో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధిష్ఠానం సిద్ధమైంది.. పటిష్ట కార్యాచరణతో రంగంలోకి దిగింది..

సమన్వయ కమిటీకి దిగ్విజయ్‌ సింగ్ దిశానిర్దేశం ......

పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం టీ పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని వేదికగా చేసుకుంది.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఏర్పాటైన సమన్వయ కమిటీకి పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్‌ సింగ్ దిశానిర్దేశం చేశారు.. పార్టీలో నెలకొన్ని నైరాశ్యాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేయాలని... పార్టీకి ద్రోహం చేసినవారిని మళ్లీ చేర్చుకోవద్దని సమావేశంలో నిర్ణయించారు.. మండల స్థాయినుంచి ప్రత్యేక సదస్సుల ద్వారా క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు ప్లాన్ చేస్తున్నారు..

పార్టీ ముఖ్య నేతలు గ్రామాల బాట పట్టాలని ఆదేశం......

ఇక టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు దూకుడుగా వ్యవహరించడంలేదని అధిష్ఠానం భావిస్తోంది.. ఈ సమస్య పరిష్కారంకోసం ఢిల్లీ పీసీసీ స్పెషల్ ప్లాన్ వేసింది.. పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా... గ్రామాల బాట పట్టాలని ఆదేశించింది.. నేతలు వలస వెళ్లిన నియోజకవర్గాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని హై కమాండ్ నిర్ణయించింది.. అలాగే టీఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం ప్రజలతోకలిసి క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని దిగ్విజయ్‌ పార్టీ నేతలను ఆదేశించారు. అటు పార్టీకి స‌వాల్‌గా మారిన నేతల మధ్య అంతర్గత పోరుకు స్వస్తి పలకాలని డిగ్గీరాజా సూచించారు.. మరి దిగ్విజయ్ పాఠాలు ఎంతవరకూ పనిచేస్తాయో వేచి చూడాలి.. 

06:51 - May 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు టీఎస్ సర్కారు చర్యలు చేపట్టింది. ఆరోజున పరేడ్‌ మైదానంలో ఉత్సవాలు, సాయంత్రం ఉద్యమ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక వేడుకలు జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ఉత్సవాలు హోరెత్తిపోయేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది..

జూన్‌ 2 వచ్చిందంటే చాలు..

జూన్‌ 2 వచ్చిందంటే చాలు.. తెలంగాణలో ఎక్కడచూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది.. రాష్ట్ర అవతరణ వేడుకలతో హోరెత్తిపోతుంది.. ఈసారికూడా ఆ స్థాయిలోనే ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది... ఈ ఏర్పాట్లలోభాగంగా ఉత్సవాల నిర్వహణ కేబినెట్‌ సబ్‌ కమిటీ ఛైర్మన్‌ నాయిని నర్సింహ్మరెడ్డి, మంత్రి ఈటెల రాజేందర్‌, సీఎస్‌ రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.. ఉత్సవాలను ఎక్కడ ఎలా జరపాలన్న అంశంపై మంత్రులకు పలు సూచనలు చేశారు..

అందరూ పాల్గొనాలని సీఎం ఆదేశం....

జూన్‌ 2 వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అందరూ పాల్గొనాలని సీఎం ఆదేశించారు.. అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రాల్లో సన్మానించాలని సూచించారు.. జీవిత సాఫల్య పురస్కారంతోపాటు... వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 50మందికి రాష్ట్ర స్థాయిలో... 25మందికి జిల్లా స్థాయిలో అవార్డులు అందించాలని ఆదేశించారు.. ట్యాంక్‌ బండ్‌పై బాణ సంచా పేల్చి సంబరాలు జరపాలని సీఎం ఆదేశించారు..

ప్రతి జిల్లాకు 30లక్షల రూపాయలు...

అటు ఉత్సవాల నిర్వహణకోసం ప్రతి జిల్లాకు 30లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.. అవతరణ దినోత్సవం రోజున సాంస్కృతిక శాఖ కార్యక్రమాలపై మంత్రి చందూలాల్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.. అవతరణ దినోత్సవంరోజు 14 కేటగిరిల్లో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అర్హుల ఎంపికకోసం మంత్రి చందులాల్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.. మరోవైపు అవతరణ వేడుకలపై బుదవారం కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం కాబోతోంది.. 

06:48 - May 18, 2016

హైదరాబాద్ : రాజోలి బండ అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల వివాదానికి నాంది పలకే అవకాశం కనిపిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి మరింత అందోళనకరంగా మారింది. రాజోలి బండ అధునీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్ లో ఏర్పడే పరిణామాలకు ఏపీసీఎం చంద్రబాబు, దేవినేని ఉమాలే భాద్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న ఆర్డీఎస్ అంశంపై ప్రత్యేక కథనం....

మంత్రి దేవినేని ఉమాను ఫోన్‌లో మంత్రి హరీష్‌రావు....

రాజోలి బండ ఆధునీకరణ పనులపై రెండు రాష్ట్రాలు పట్టుదలకు పోతున్నాయి. తమకు కేటాయించిన నీటిని వినియోగించుకునేందుకు ఆర్డీఎస్ పెండింగ్‌ పనుల్లో సహకరించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి పనులు ప్రారంభించింది టీసర్కార్. పనులు ప్రారంభం కాగానే కర్నూలు జిల్లా ఆర్డీవో రాయచూర్ కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ విషయంలో తమకు సహకరించాలని మంత్రి హరీష్‌రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమాను ఫోన్‌లో సంప్రదించారు. దేవినేని నుంచి సరైన స్పందన రాకపోవడంతో హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాము సహకరించమని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ వ్యవహారంపై కృష్ణా ట్రిబ్యునల్‌కు మంత్రి ఫిర్యాదు చేశారు.

ఆర్డీఎస్‌లోని నీటివినియోగంపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం.

రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఆర్డీఎస్ పై ఉమ్మడి రాష్ట్రంలోనే ఎవరెంత వాటా వినియోగించుకోవాలనే దానిపై నిర్ణయం జరిగింది. ఆర్డీఎస్‌లోని నీటిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్టు ఎత్తును పెంచాలని అప్పట్లో భావించారు. మొత్తం 12 ఇంచ్‌లు పెంచాలని కమిటీ సూచించినా కేవలం 6ఇంచ్‌లు మాత్రమే పెంచారని మంత్రి హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఎత్తును పెంచడానికి సంబంధించిన పనుల ఖర్చుకు 72కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 15.9 టీఎంసీల నీటిని 87,500 ఎకరాలను సాగుచేసేందుకు తీసుకున్న నిర్ణయానికే తెలంగాణ కట్టుబడి ఉందని హరీష్ రావు తెలిపారు.

బ్రిజేష్ ట్రిబ్యునల్ తెలంగాణకు అనుకూలంగా సూచనలు చేసింది-హరీష్....

ఇరు రాష్ట్రాల ప్రజల సమస్యలను పక్కనపెట్టి ఏపీలో టీడీపీ, వైసీపీ నేతలు తెలంగాణ ప్రాజెక్టులను రాజకీయం చేయడం సరైన పద్దతి కాదని హరీష్‌రావు అన్నారు. పోలవరం నుంచి పట్టిసీమకు తరలించే నీటిలో తెలంగాణకు 80టీఎంసీల నీరు వస్తుందని బ్రిజేష్ ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి తెలిపారని హరీష్‌రావు అన్నారు.

రాజకీయ కుట్రతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదు....

తెలంగాణ ప్రాజెక్టులను రాజకీయ కుట్రతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. ఎగువ రాష్ట్రంలో ఉన్న తమతో ఏపీ విభేదిస్తే నష్టపోయేది ఏపీయేనని అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వంతో ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.

06:43 - May 18, 2016

హైదరాబాద్ : మరో మూడు వారాల్లో రుతుపవనాలు రాబోతున్నాయి. తొలకరి చినుకులు పకలరించిన వెంటనే వ్యవసాయ సీజన్ ఆరంభమవుతుంది. వరుసగా రెండేళ్లుగా కరవు భారిన పడి, ఆర్థికంగా దెబ్బతిన్న అన్నదాతలు ఈ ఏడాది చాలా ఆశలు పెట్టుకున్నారు. వాతావరణ శాఖ రిపోర్ట్స్ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. దీంతో రుణాలు, ఎరువులు, విత్తనాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాబోయే రెండు మూడు వారాల్లో వీటికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం వుంది. పత్తి వేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రైతులకు సూచించారు. ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ సీజన్ లో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? విత్తనాలు, ఎరువులు పంపిణీలో ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి? పత్తి వేయొద్దంటూ రైతులకు సూచిస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందా? తెలంగాణలో పత్తికి ప్రత్యామ్నాయం ఏమిటి? వరుసగా రెండేళ్ల కరవు కారణంగా జలాశయాలు ఎండిపోయాయి. గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవడం శ్రేయస్కరం ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ రైతు సంఘం నేత చంద్రారెడ్డి వచ్చారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss