Activities calendar

19 May 2016

ఇది ప్రజల విజయం : మమతాబెనర్జీ

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఇది ప్రజల విజయమని మమతాబెనర్జీ అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నెలబెట్టుకుంటానని అన్నారు. తనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని వాపోయారు. ప్రతిపక్షాలు తనపై కావాలని తప్పుడు ప్రచారం చేశాయన్నారు. 

22:05 - May 19, 2016

విశాఖ : రోను  తుపాను ముంచుకొస్తోంది. మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు కూలిపోగా.. స్తంభాలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపానుపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 
వణికిస్తున్న 'రోను' తుపాను
తీర ప్రాంత ప్రజలను రోను తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పెను గాలులు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాలాజీ నగర్‌లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇంటి కప్పులు ఎగిరిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బాపట్ల ప్రాంతంలో ఇప్పటివరకు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తెనాలి డివిజన్‌లోని రేపల్లె, వేమూరు, అమృతలూరు, కొల్లూరు, తెనాలి మండలం సగభాగంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రేపల్లె మండలంలో 70 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా గుంటూరు-నంద్యాల మార్గంలో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. 
విజయవాడ విరిగిపడుతున్న కొండ చరియలు 
విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మొఘల్‌రాజ్ పురం చండ్రరాజేశ్వర్ రావునగర్‌లో కొండ ప్రాంతాల్లో ఇళ్లపై కొండ చరియ విరిగిపడింది.  కొండచరియ విద్యుత్ స్తంభంపై పడటంతో విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు ఎక్కడ విరిగి తమపై పడతాయోనని కొండప్రాంతవాసులు భయపడుతున్నారు. 
అధికారులతో సీఎం సమీక్ష
రోను తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం  నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రతి గంటకు ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్‌ ద్వారా వర్షపాతాన్ని బేరీజు వేసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఒక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. తుపాను ప్రభావం కలిగిన కోస్తా జిల్లాల్లోనూ మరికొన్ని కంట్రోల్‌ రూమ్‌లను నెలకొల్పారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు ఏర్పాటుచేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అవసరమైన ప్రాంతాల్లో రేషన్ సరకులను అందుబాటులోకి ఉంచారు. 
ప్రత్యేక బృందాలు....డీఆర్‌ఎఫ్‌ దళాలు
ముందు జాగ్రత్త చర్యగా కృష్ణా జిల్లాలో రెండు, తూర్పుగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాలో సహాయ బృందాలను సిద్ధంగా ఉంచారు. వెంకటగిరి, మంగళగిరి, కాకినాడ, విశాఖ,విజయనగరాల్లో ఎపీ డీఆర్‌ఎఫ్‌ దళాలను రెడీగా ఉంచారు. 

 

21:58 - May 19, 2016

హైదరాబాద్ : కేరళలో సీపీఎం విజయం సాధించడం పట్ల సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విజయ ఉత్సవాలు జరుపుకున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బాణసంచా కాల్చి, కార్యకర్తలు నృత్యాలు చేశారు. సీపీఎం విజయంపై పార్టీ  నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి, సంబరాలు జరుపుకున్నారు. 

21:56 - May 19, 2016

ఖమ్మం : జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికల్లో కారు పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో సగం అంటే.. సుమారు 95వేల ఓట్లు టీఆర్ఎస్‌ అభ్యర్థికి దక్కాయి. 
కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్‌ జైత్రయాత్రను కొనసాగించింది. పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. ప్రత్యర్థి కన్నా.. 45,750 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 వేల ఓట్లకే పరిమితమైన టీఆర్‌ఎస్‌..ఇప్పుడు అంతకుమించి 10 రెట్ల  మెజార్టీతో సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ ఫలితంతో.. వరసగా నాలుగో ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఘన విజయం సాధించినట్లయింది. 
ప్రభావం చూపలేకపోయిన విపక్షాల అభ్యర్థులు  
కౌంటింగ్‌ ఏ రౌండ్‌లోనూ విపక్షాల అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్‌ సానుభూతి అస్త్రం కారు దూకుడుకి  బ్రేక్‌ వేయలేకపోయింది. మొదటి రౌండ్‌ నుంచీ తుమ్మల స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్‌ రౌండ్‌కూ మెజార్టీని పెంచుకుంటూ పోయారు. తుమ్మలకు మొత్తం 94,933 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డికి 49,252 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుకు 15,538 ఓట్లు వచ్చాయి. అలాగే నోటా కింద 2,785 ఓట్లు పోలయ్యాయి. 
తుమ్మల విజయంపై కేసీఆర్‌ హర్షం 
తుమ్మల విజయంపై కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పాలనను సమీక్షించి ప్రజలు ఇచ్చిన తీర్పుగా పాలేరు విజయాన్ని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలనను ప్రజలు మెచ్చారనడానికి ఈ గెలుపే నిదర్శనమే అన్నారు. ఈ గెలుపుతో ప్రభుత్వం, పార్టీపైనా మరింత బాధ్యత పెంచిందని కేసీఆర్‌ అన్నారు. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నమ్మకంతోనే నేను గెలిచా : తుమ్మల 
ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నందునే తాను విజయం సాధించానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే భారీ మెజార్టీని తెచ్చిపెట్టాయని తుమ్మల అన్నారు. 
గులాబీ శ్రేణుల్లో సంబరాలు
పాలేరు గెలుపుతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. టీఆర్ఎస్‌ భవన్‌లో కార్యకర్తలు, నేతలు స్వీట్లు పంచుకున్నారు. టపాసులు పేల్చి విజయాన్ని గ్రాండ్‌గా సెల్‌బ్రేట్‌ చేసుకున్నారు. 

21:51 - May 19, 2016

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మే 27న దీదీ రెండోసారి బెంగాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు.
తృణమూల్‌ విజయం
పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ భారీ విజయం సాధించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దీదీ అదే జోరును ప్రదర్శించారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను టిఎంసి 211 స్థానాలను కైవసం చేసుకుంది.  సిపిఎం 32, కాంగ్రెస్‌ 44, బిజెపి 6, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. 2011లో టిఎంసికి 184 స్థానాలు వచ్చాయి. ఎన్నికల్లో టిఎంసి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి.
సీపీఎం కార్యాలయంపై తృణమూల్ కార్యకర్తల దాడి  
విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తృణమూల్ కార్యకర్తలు రెచ్చిపోయారు. అసన్సోల్‌లో సీపీఎం కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను తగులబెట్టారు. లెఫ్ట్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం గమనార్హం.
రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మమత 
టిఎంసి విజయంతో మమతా బెనర్జీ.. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 27న ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారయింది. తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు జరిగినా, అభివృద్ధే తనకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టిందని ఈ సందర్భంగా మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమని, అయితే అసత్య ప్రచారాలు చెయ్యడం సరికాదని మమత అన్నారు.
ప్రజాతీర్పును గౌరవిస్తాం : సిపిఎం 
పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని సిపిఎం పేర్కొంది. ఎన్నికల ఓటమిపై సమీక్ష జరుపుతామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. నారద స్టింగ్‌ ఆపరేషన్, శారదా స్కాం, కోల్‌కతాలో ఫ్లై ఓవర్ కూలి 27 మంది మృతి చెందిన అంశాలు ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇవేవి పట్టించుకోని ప్రజలు టిఎంసికే పట్టం కట్టారు.

 

21:46 - May 19, 2016

చెన్నై : తమిళ ఓటర్లు చరిత్రను తిరగరాశారు. ఒక్క ఎంజీఆర్‌ పేరిటే ఉన్న రికార్డును జయలలితకూ కట్టబెట్టారు. అన్నాడిఎంకేని వరుసగా రెండోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టారు. ఎగ్జిట్‌ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ జయలలిత అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు..
తమిళనాడులో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. పురచ్చితలైవి జయలలిత.. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. జయలలిత ఇప్పటికే ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే వరుసగా రెండుసార్లు ఆపదవిలో కూర్చోవడం మాత్రం ఇదే తొలిసారి. ఎంజీఆర్‌కు మాత్రమే సాధ్యమైన ఘనతను 30 ఏళ్ల తర్వాత జయలలిత సాధించారు. 
అన్నాడిఎంకె భారీ మెజారిటీ 
కౌంటింగ్‌ ప్రారంభంలో విజయం అన్నాడిఎంకెతో దోబూచులాడింది. తొలి ట్రెండ్స్ డిఎంకెకి అనుకూలంగా కనిపించాయి. కానీ, కొద్దిసేపటికే అన్నాడిఎంకె పుంజుకుంది. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. అన్నాడిఎంకె భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో జయలలిత పార్టీ ఏఐడీఎంకే 133 స్థానాలు దక్కించుకుంది. చారిత్రక విజయం అందించిన తమిళ ప్రజలకు  జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదని ఆమె అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని జయలలిత చెప్పారు. 
డిఎంకే 98 స్థానాలు 
డిఎంకే 98 స్థానాలకే పరిమితమై రెండోస్థానంలో నిలిచింది. భారీ తాయిలాలు ప్రకటించి ఎన్నికల బరిలో దిగినప్పటికీ... కురు వృద్ధుడు కరుణానిధి పట్ల తమిళ ప్రజలు కరుణ చూపలేదు. తిరువారూర్‌ నుంచి పోటీ చేసిన కరుణానిధి భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఆయన వరుసగా 13వ సారి శాసనసభకు ఎన్నిక కావడం విశేషం.  
కెప్టెన్‌ విజయకాంత్‌కు దారుణ పరాభవం 
ఇక ఈ ఎన్నికల్లో కింగ్‌ని అవుతానంటూ చెప్పుకొచ్చిన డిఎండికె అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌కు దారుణ పరాభవం మిగిలింది. కనీసం ఆయన కూడా గెలవలేక పోయారు. పైగా తాను పోటీ చేసిన ఉళుందూర్‌పేట్టైలో.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక్కడ అన్నాడిఎంకె, డిఎంకె అభ్యర్థుల మధ్యే పోటీ సాగింది. కర్నాటక తర్వాత తమిళనాడులో ఓటు బ్యాంకు బాగా ఉందని.. ఇక్కడ బోణీ చేస్తామని భావించిన బీజేపీకీ భంగపాటు తప్పలేదు. జాతీయ పార్టీలకు తాము వ్యతిరేకమని తమిళ ఓటర్లు మరోమారు స్పష్టం చేశారు. అమ్మ పేరుతో ప్రతిపాదించిన పలు సంక్షేమ పథకాలు జయలలితకు మళ్లీ పీఠం కట్టబెట్టేలా చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

21:42 - May 19, 2016

త్రివేండ్రం : కేరళలో ఎర్రజెండా మళ్లీ రెపరెపలాడింది.  కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో  ఎల్డీఎఫ్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు గాను ఎల్‌డిఎఫ్‌ 92 సీట్లలో గెలిచి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. కేరళలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని మాజీ సిఎం అచ్యుతానందన్‌ అన్నారు.
ఎల్‌డీఎఫ్‌ ఘన విజయం
కేరళలో సిపిఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్‌కు ఓటర్లు పట్టం కట్టారు. కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సిపిఎం ఆధ్వర్వంలోని లెఫ్ట్‌ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ అధికార యుడిఎఫ్‌ని  ఓడించింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఎల్‌డిఎఫ్‌ 91 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ 47 స్థానాలకు పరిమితమైంది. ఒక సీటు గెలవడం ద్వారా బిజెపి తొలిసారిగా కేరళలో తన ఖాతా తెరిచింది. మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు.
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సిపిఎం 
కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు సిపిఎం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనేదే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. 93 ఏళ్ల కమ్యూనిస్టు వృద్ధనేత విఎస్ అచ్యుతానందన్, పార్టీ అగ్రనేత పిన్రయి విజయన్‌‌లు సిఎం రేసులో ఉన్నారు. ఇద్దరూ సిఎం పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా ఉండటంతో సిపిఎం కేంద్ర నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 
లెఫ్ట్ పవనాలు బలంగా వీచాయన్న అచ్యుతానందన్‌ 
కేరళలో లెఫ్ట్ పవనాలు బలంగా వీచినట్టు అచ్యుతానందన్‌ తెలిపారు. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న సంఘవ్యతిరేక శక్తులకు ఈ తీర్పు ఒక హెచ్చరికని ఆయన అన్నారు. సిఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, అచ్యుతానందన్ స్పష్టం చేశారు.
ప్రజాతీర్పును గౌరవిస్తాం : సీఎం ఊమెన్ చాందీ 
కేరళ ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని, ప్రజాతీర్పును గౌరవిస్తామని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు. ఫలితాలపై విశ్లేషణ జరుపుతామన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖులు 
ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ, సిపిఎం నేతలు అచ్యుతానందన్, విజయన్, బిజెపి నేత రాజగోపాల్ ఉన్నారు. పాలక్కాడు జిల్లా మలపుజ నియోజకవర్గం నుంచి అచ్యుతానందన్, కన్నూరులోని ధర్మడోమ్ నుంచి పిన్నయి విజయన్‌లు విజయం సాధించారు. బిజెపి తొలిసారి అసెంబ్లీ ఖాతా తెరవడం ద్వారా చరిత్ర సృష్టించింది. నేమం నియోజకవర్గం నుంచి రాజగోపాల్‌ విజయం సాధించారు. బిజెపి నుంచి పోటీ చేసిన క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఓటమి చెందారు. కేరళ చరిత్రలో మొదటి నుంచి ఎల్డీఎఫ్‌, యుడిఎఫ్ కూటమిల మధ్యే అధికార పంపిణీ జరుగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి రాష్ట్రంలో అధికారం మారుతుండడం గమనార్హం. 

 

21:02 - May 19, 2016

ఐదు రాష్ట్రాల ఓట్లు గూడ ఒడ్సిపోయినయ్.. కండ్లళ్ల వత్తులేస్కోని సూశిండ్రు కొంతమందైతె ఎవ్వలు గెలుస్తరో ఎవ్వలు గెలుస్తరో అని.. ఆఖరికి దేలింది ఏందంటే..? సర్వేలు ఓడిపోయినయ్.. ఓట్లేశిన జనం గెల్చిండ్రు గంతే.. మరి ఏఏ రాష్ట్రంల ఎవ్వలి కిస్మత్ ఎట్లొచ్చింది అనేది మొత్తం తర్వాయి వట్టి చెప్పుకొస్త తయ్యారున్నట్టేగదా..? పాండ్రిగ..
పాలేరుల పెద్ద పాలేరుకే పట్టం గట్టిండ్రు జనం.
పాలేరుల పెద్ద పాలేరుకే పట్టం గట్టిండ్రు జనం.. ముందుగాళ్ల సంది అనుకున్నట్టే జనం బంగారు తెలంగాణ మీద మన్సువారేసుకున్నరు.. కేసీఆర్ సారు కుడిభుజానికి ఇంక జర్రంత టానిక్ గల్పి పోశిండ్రు జనం..  తెలంగాణ ముద్దుబిడ్డ.. బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి.. ప్రత్యేకరాష్ట్ర పోరాట యోధుడు తుమ్మల నాగేశ్వర్ రావునును బుజాలకెత్తిండ్రు..
కొత్త జిల్లాల పంచాదికి.. 
కొత్త జిల్లాల పంచాదికి.. కొత్త ఏశం జతగల్సిందుల్లో.. పది జిల్లాలు గాదు పచ్చీస్ జిల్లాలు అని జర్రంత ముచ్చట దెల్వంగనే.. మాకు మాకు మాకు అని ఎగవడ్తున్నరు ఎక్కడెక్కడి ప్రాంతాల జనం.. గద్వాల కాడికెళ్లి సుర్వు జేస్తె భద్రాచలం దాక.. కొత్త జిల్లాల పంచాది గట్టిగనే సుర్వైంది.. కర్వుమంటె కప్పకు కోపం.. ఇడ్వుమంటే పాముకు కోపంలెక్క తయ్యారైంది ఈ ముచ్చట..

సెల్ టవర్ ఎక్కిన

సికింద్రాబాద్ అడ్డగుట్ట సెల్ ఫోన్ టవర్ పంచాది జూస్తిరిగదా మీరు నిన్న.. ఇంక ఒడ్వలే అది జనం జిద్దుమీదికొచ్చి ఇంక జర్రంత లొల్లి లేపిండ్రు.. పోలీసోళ్లతోని సుర్వైన పంచాది.. మంత్రిగారి రాకదాక దీస్కొచ్చింది.. సెల్ ఫోన్ టవర్ మీదికే ఎక్కి దుంకిసస్తమని ఆడోళ్లు ఎక్కనే ఎక్కిండ్రట.. మరి దిగిండ్రా ఏమైంది ఎట్లైంది అనేది ఒక్కపారి జూద్దాం పటుండ్రి.

పార్కులను కబ్జా వెట్టిన లవర్లు

నిన్నియాళ్ల పోరగాళ్లు ఎట్ల తయ్యారైండ్రు.. కాలేజికి వోతున్నమని.. కంపినికి వోతున్నమని ఇంట్లకెళ్లి ఎల్తున్నరు.. మంచిగ పార్కుల పొంట శీన్మటాకీసుల పొంట దిర్గుతున్నరు ఎంజాయ్ జేస్తున్నరు.. అయితే ఈళ్ల ఎంజాయ్ జెయ్యంగ తొవ్వొంటవొయ్యెటోళ్లకు కష్టమున్నది.. పబ్లీకు సేద దీరె పార్కులను లవర్లు కబ్జావెట్టెవర్కళ్ల హైద్రావాదుల ఏమైందో సూడుండ్రిగ..
గాలిదుమారం 
ఆ ఇప్పుడు గాలిదుమారం ముచ్చట్లు.. గాలిదుమారమంటే.. అదేందో అనుకునేరు వాతావరణం అన్నట్టు.. మరి ఎండలు తక్వైపాయే.. వానలు ఎప్పుడువడ్తున్నయో తెల్వకుంటనే వడ్తున్నయ్.. సలి ఓదిక్కు సప్పుడే జేస్తలేదు ఇందకు ఎట్లున్నది మొగలు ఏం కథ అనేది ఒక్కపారి జూద్దాం పాండ్రి.. 

మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:23 - May 19, 2016

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అసో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు నగేష్ కుమార్, సీపీఎం కేంద్రకార్యదర్శి వర్గసభ్యులు వి.శ్రీనివాసరావు, ఎపిసీసీ అధికార ప్రతినిధి గౌతమ్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ ఎన్నికలు మోడీ పాలనకు ఏమాత్రం రిఫరెండం కాదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం..

 

20:12 - May 19, 2016

నెల్లూరు : ఉన్నతవర్గంలో పుట్టిన సుందరయ్య పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని నెల్లూరు జిల్లా సీపీఎం నేతలు కొనియాడారు. జిల్లాలోని ముత్తుకూరులో సీపీఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మొదట సుందరయ్య చిత్రపటానికి జిల్లా సీఐటీయు అధ్యక్షుడు ఎం.మోహన్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి నక్కారాధయ్య, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి గడ్డం అంకయ్యలు పాల్గొన్నారు.

 

20:06 - May 19, 2016

విజయవాడ : సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. సుందరయ్య చిత్రపటానికి నేతలు, కార్యకర్తలు పూలమాలలువేసి నివాళులు అర్పించారు.. కామ్రేడ్‌ సుందరయ్య బడుగు, బలహీన వర్గాలకోసం కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.. అలాంటి మహానేతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు.

 

టీఆర్ ఎస్ లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ

ఖమ్మం : కూసుమంచి మండలం పోచారంలో టీఆర్ ఎస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీలో టీఆర్ ఎస్ లోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. 

ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని అందించారు : జయలలిత

 చెన్నై : ఎఐఎడిఎంకెకు ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని అందించారని జయలలిత తెలిపారు. ఇక తన జీవితం తమిళ ప్రజలకు అంకితమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. 1984 తర్వాత ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారం చేజిక్కింకున్న దాఖలాలు లేదన్నారు. 

వరుసగా రెండోసారి అధికారంలోకి జయలలిత

చెన్నై : తమిళనాడులో జయలలిత చరిత్ర సృష్టించింది. 32 ఏళ్ల రికార్డును జయ తిరగరాసింది. ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది. 

కాంగ్రెస్ ఓటమిని స్వీకరిస్తున్నాం : రాహుల్

ఢిల్లీ : కాంగ్రెస్ ఓటమిని స్వీకరిస్తున్నామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల నమ్మకాన్ని పొందేందుకు మరింత కృషి చేస్తామని చెప్పారు. 

అసోంలో విజయం మోడీ పాలనకు నిదర్శనం : అమిత్ షా

ఢిల్లీ : అసోంలో విజయం మోడీ రెండేళ్ల పాలనకు నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో తమకు బలం లేకున్నా ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన పునాది పడిందన్నారు. కాంగ్రెస్ తో పొత్తుకు పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెసేతర పక్షాల గెలుపు తమకెప్పుడు ఆనందమే అని తెలిపారు. కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. 

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బెంగాల్ లో మొత్తం 294 స్థానాలకుగానూ టీఎంసీ 211, సీపీఎం 33, కాంగ్రెస్ 44, బీజేపీ 6 స్థానాలను కేవసం చేసుకుంది. తమిళనాడులో మొత్తం 232 స్థానాలకు గానూ ఎఐఎడీఎంకె 132, డీఎంకే 99, పీఎంకే 1 స్థానాల్లో విజయం సాధించాయి. కేరళలో మొత్తం 140 స్థానాలకు గానూ ఎల్ డీఎఫ్ 91, యూడీఎఫ్ 47, బీజేపీ 1, ఇతరులు 1 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అసోంలో మొత్తం 126 స్థానాలకు గానూ బీజేపీ 86, కాంగ్రెస్ 24, ఐయూడీఎఫ్ 14, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.

19:21 - May 19, 2016

హైదరాబాద్ : చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడం కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ముద్రగడ ఆందోళనతోనే కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని అంబటి సూచించారు. 

 

19:16 - May 19, 2016

హైదరాబాద్ : జగన్‌ దొంగ దీక్షలు చేసి ఏం సాధించారని ఏపీ మంత్రి రావెల ప్రశ్నించారు. జగన్‌ కేసీఆర్‌తో కుమ్మక్కై రాజకీయాలు చేస్తూ ఆయనను ఒక్క మాట కూడా అనరని విమర్శించారు. తెలంగాణతో కొన్ని చిక్కు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనన్న రావెల చంద్రబాబు నీటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
  

తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

కృష్ణా : తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. మచిలీపట్నానికి 80కిలోమీటర్ల దూరంలో.. కాకినాడకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అన్ని ఓడరేవుల్లో నాలుగో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

 

18:54 - May 19, 2016

ఆదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతి వేడుకలు జరిగాయి. సుందరయ్య చిత్రపటానికి సీపీఎం నేతలు, కార్యకర్తలు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో రైతులకు పశుగ్రాసం అందజేశారు. జిల్లాలో రైతులు కరవుతో అల్లాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్ విమర్శించారు.

18:48 - May 19, 2016

మెదక్ : జహీరాబాద్‌ నిమ్జ్ భూ బాధితులకు అండగా ఉంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భరోసా ఇచ్చారు. బాధితులకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో భూ పోరాట కమిటీ తలపెట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేల పరిశ్రమలకు తప్పనిసరిగా భూములు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే 
వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా లేని, పంటలకు పనికిరాని భూములను ఎంచుకొని తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఒకే ప్రాంతంలో భూములను సేకరించకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని భూములను తీసుకోవాలన్నారు. అభివృద్ధి కేంద్రీకరణ కాకుండా వికేంద్రీకరణ జరగాలన్నారు. అప్పుడే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రాజెక్టుల డిజైన్లను ఎందుకు మార్చుతుందో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని విమర్శించారు. నిమ్జ్ కు భూసేకరణ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలన్నారు. నిమ్జ్ భూ బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. 

 

ఎల్ డీఎఫ్ ర్యాలీపై ఆర్ ఎస్ ఎస్ బాంబు దాడి...

త్రివేండ్రం : కేరళలో ఎల్ డీఎఫ్ విజయాన్ని ఆర్ ఎస్ ఎస్ శక్తులు జీర్జించుకోలేకపోయాయి. సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారు. ప్రజల తీర్పును స్వీకరించాల్సిందిపోయి... దారుణానికి ఒడిగట్టారు. ఎల్ డీఎఫ్ 91 స్థానాలు కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో కన్నూరులో పినరయ్ విజయన్ నేతృత్వంలో ఎల్ డీఎఫ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీపై ఆర్ ఎస్ ఎస్ వర్గీయులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీపీఎం మద్దతుదారుడు మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. 

 

18:23 - May 19, 2016

త్రివేండ్రం : కేరళలో ఎల్ డీఎఫ్ విజయాన్ని ఆర్ ఎస్ ఎస్ శక్తులు జీర్జించుకోలేకపోయాయి. సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డాయి. ప్రజల తీర్పును స్వీకరించాల్సిందిపోయి... దారుణానికి ఒడిగట్టారు. ఎల్ డీఎఫ్ 91 స్థానాలు కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో కన్నూరులో పినరయ్ విజయ్ నేతృత్వంలో ఎల్ డీఎఫ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీపై ఆర్ ఎస్ ఎస్ వర్గీయులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీపీఎం మద్దతుదారుడు మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
బాంబు దాడిని ఖండిస్తున్నాం : వి.శ్రీనివాసరావు(సీపీఎం) 
'కేరళలో ఎల్ డీఎఫ్ విజయోత్సవర్యాలీపై బాంబు దాడిని త్రీవంగా ఖండిస్తున్నాం. ఇది ఆర్ ఎస్ ఎస్ దాడే. ఓటమిని ఓర్చుకోలేక దాడికి పాల్పడ్డారు. కేరళలో శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఓర్చుకోలేని తనంతో మతోన్మాద శక్తులు దాడికి పాల్పడ్డాయి.  కేరళలో ఎన్నడూ లేనివిధంగా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచి పెట్టారు. కులతత్వం, మతతత్వాన్ని రెచ్చగొట్టారు. ఇలాంటి ఘటనలను కేరళ ప్రజలు సహించరు. బెంగాల్లో సీపీఎం ఆఫీస్, కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఎగ్జిట్ ఫోల్స్ సర్వే సమయంలోనే దాడులకు పాల్పడ్డారు' అని ఆరోపించారు. 

 

17:59 - May 19, 2016

హైదరాబాద్‌ : బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు, కార్యకర్తలు ఆయన సేవల్ని స్మరించుకున్నారు. పేదల, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య నిరంతరం పోరాడారని గుర్తుచేసుకున్నారు. సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. 

 

17:53 - May 19, 2016

ఖమ్మం : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే తనను గెలిపించాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాని హామీ ఇచ్చారు .

 

17:49 - May 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసిని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. ఉప్పల్ లోని ఆర్టీసి జోనల్ వర్క్ షాప్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సంస్థలోని అన్ని విభాగాలను కొనసాగిస్తామన్న ఆయన... ఈ విభాగాన్ని మూసివేసే ప్రసక్తే లేదన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని..ఈ ఏడాది రూ. 700కోట్ల నష్టం వచ్చిందన్నారు. సంస్థ లాభాల్లోకి రావడానికి అధికారులు కృషి చేయాలన్నారు. సంస్థపై 56వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. కార్మికులు సమ్మె నోటీసు వెనక్కి తీసుకోవాలని కోరారు. 

 

కేరళను మరింత అభివృద్ధి చేస్తాం : ఏచూరి

ఢిల్లీ : పశ్చిమబెంగాల్ లో బీజేపీ-టీఎంసీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తామన్నారు. కేరళను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేరళ ప్రజలకు కృతజ్ఞతులు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు. అస్సాంలో బీజేపీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈశాన్య భారతదేశంలో అస్సాం సమస్యాత్మక ప్రాంతమని చెప్పారు.

17:37 - May 19, 2016

ఢిల్లీ : పశ్చిమబెంగాల్ లో బీజేపీ-టీఎంసీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తామన్నారు. కేరళను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేరళ ప్రజలకు కృతజ్ఞతులు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు. అస్సాంలో బీజేపీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈశాన్య భారతదేశంలో అస్సాం సమస్యాత్మక ప్రాంతమని చెప్పారు.

 

17:29 - May 19, 2016

నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పెను గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాలాజీ నగర్‌లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇంటి కప్పులు ఎగిరిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

16:52 - May 19, 2016

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీకి యువ నటులు చాలామంది వున్నారు. కానీ లవర్ బాయ్ ల కొరత మాత్రం వుంది. ఉదయ్ కిరణ్, తరుణ్ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ లుగా ఎవరికీ గుర్తింపు రాలేదు. ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. తరుణ్ ఫామ్ లో లేడు. ఇప్పుడు ఆ కొరత తీరనుంది. ఎవరా అనుకుంటున్నారా నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ అరగ్రేటం చేయబోతున్నాడు. శ్రీకాంత్ తన వారసుడుని ఇండ్రస్ట్రికి పరిచయం చేయబోతున్నాడు. అది కూడా నటసామ్రాట్ కుటుంబంలోని మన్మధుడు నాగార్జున రోషన్ ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. దీంతో టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. నూనూగు మీసాల వయసులోనే రోషన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రోషన్ తండ్రి శ్రీకాంత్ పోలికలో వున్నా...కళ్ళు మాత్రం తల్లి ఊహ పోలికతోనే వుంటాయి. రోషన్ ఇప్పటికే రుద్రమదేవి 3డి చిత్రంలో బాల నటుడిగా నటించాడు. ఈ చిత్రానికి 'నిర్మలా కన్వెంట్' అనే టైటిల్ని నిర్ణయించారు. తారాగణం అంతా కొత్తవారే కావటం మరో విశేషం. జి.నాగ కోటేశ్వరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. రోషన్ ఫస్ట్ లుక్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది.

చైనాలో ఇసుక తుపాను, జనజీవనం అస్తవ్యస్తం....

హైదరాబాద్ : చైనాలోని కస్గర్, టంగ్జంక్, మిన్ ఫెంగ్, కౌంటీ నగర ప్రజలు భయంకర ఇసుక తుపానును ఎదుర్కుంటున్నారు. 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తూ వీస్తోన్న ఇసుక తుపాను ధాటికి అక్కడి ఇళ్లన్నీ ఇసుకతో కప్పేసి కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇసుక కెర‌టాల ధాటికి ఆ ప్రాంతంలో జ‌న‌జీవ‌నం అస్త‌వ్యస్తమైంది. కస్గర్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌ని బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ఆదేశిస్తున్నారు.

16:04 - May 19, 2016

గజని వంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు చేయనున్నాడు. సహజంగా సిగ్గరి అయిన మహేష్ బాబు ఏ ఫంక్షన్ లోనూ ఎక్కువగా మాట్లాడడు. కానీ సోషల్ నెట్ వర్క్ లో అభిమానులతో టచ్ లో వుంటాడు. సినిమాకు సంబంధించినవే కాకుండా పర్సనల్ విషయాలను కూడా మహీ అభిమానులతో షేర్ చేసుకుంటాడని అభిమానులు అంటుంటారు. మురుగదాస్ కూడా ఎక్కువగా మాట్లాడడు. మరి ఈ ఇద్దరి మితభాషుల మధ్య కాంబినేషన్ ఎలా వుంటుందో చూడాలి. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. ఇక ప్రిన్స్ అభిమానులకు వేడుకే. ఈ చిత్రం షూటింగ్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ‘బ్రహ్మోత్సవం’ విడుదల తరువాత 15 రోజుల విరామం తీసుకుని ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు మహేశ్‌ ఇటీవల ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. ‘గజిని’ సినిమా నుండే ఆయనతో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నానీ..‘మురుగదాస్‌ నా అభిమాన దర్శకుడని మహేష్ చెప్పాడు. నేను నటించిన ‘ఒక్కడు’ సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. ‘శ్రీమంతుడు’ ప్రచారంలో భాగంగా ఓ సారి చెన్నై వెళ్ళినప్పుడు మురుగదాస్‌ని కలిశానని తెలిపాడు.ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రాను అనుకుంటున్నట్లు సమాచారం.

16:00 - May 19, 2016

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా ఇంక విడుదలె కాలేదు..అప్పుడే రేటింగ్ ఇవ్వడం ఏంటీ ? గురువారం రిలీజ్ చేశారా ? అని ఆశ్చర్యపోతున్నారా ? కాదండి..ప్రపంచ వ్యాప్తంగా 'బ్రహ్మోత్సవం' విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్స్ లను భారీగా అలంకరించారు. 'శ్రీమంతుడు' సినిమా తరువాత విడుదల అవుతున్న మహేష్ సినిమా కావడంతో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్రాలకు సంబంధించిన రేటింగ్ విషయంలో 'దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్', 'ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్' ఉమా సంధు పేరు మీడియాలో తరచూ వినిపిస్తోంది. టాప్ హీరోల సినిమాలకు రేటింగ్ ఇస్తూ హల్ చల్ చేస్తున్నాడు. 'బాహుబలి’సినిమా విడుదలకు ముందు 2 స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ‘'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ముందుగా ఇతడు చెప్పినా ఆ జోస్యం ఫలించలేదు. అయితే ఇతడు అల్లుఅర్జున్ సినిమా 'సరైనోడు' విషయంలో చెప్పింది నిజం అయినట్లు టాక్. ఇక 'ప్రిన్స్' మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కూడా రేటింగ్ ఇచ్చేశాడు. మూవీకి '5 స్టార్' రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది అంటూ మహేష్ అభిమానులకు మంచి జోష్ ను ఇచ్చే ట్వీట్ ను చేసాడు. అంతేకాదు ఈసినిమాలో మహేష్ నటన అద్భుతం అని ప్రశంసిస్తూ 'బ్రహ్మోత్సవం'ను ఉమర్ సంధు ఆకాశంలోకి ఎత్తేశాడు. మరి ఆయన మాటలు నిజం అవుతాయా ? లేదా ? అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

అస్సోంలో ఫలితాలు తెలంగాణలోనూ వస్తాయి : లక్ష్మణ్

హైదరాబాద్  : అస్సోంలో తొలిసారి బీజేపీ అధికార పీఠాన్ని కైవసరం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ల‌క్ష్మ‌ణ్‌ ఆధ్వ‌ర్యంలో కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. అసోంలో వ‌చ్చిన ఫ‌లితాలే భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లోనూ బీజేపీ రాబ‌డుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లోనూ త‌మ క‌మ‌లం విక‌సిస్తుంద‌ని, మోదీ నాయ‌క‌త్వంలో ఇక్క‌డ కూడా విజ‌ఢంకా మోగుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

15:20 - May 19, 2016

విశాఖ : ఆంధ్రప్రదేశ్ పై రోన్ తుపాను పడగ విప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దక్షిణ ఈశాన్య దిశగా విశాఖకు 350 కిమీ దూరంలో కేంద్రీకృతం అయింది. దీంతో ఎపిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అన్ని ఓడరేవుల్లో అధికారులు నాలుగో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. విశాఖ జిల్లా ఎస్ పీ, కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 'ఎల్లో' మెసేజ్ ను విడుదల చేశారు. 25 వ తేదీ తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ మయన్మార్ వద్ద తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. 

 

ప.బెంగాల్ సీపీఎం ఆఫీస్ కి నిప్పు పెట్టిన టీఎంసీ కార్యకర్తలు

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో సీపీఎం కార్యాలయంపై తృణముల్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడి నిప్పంటించారు. ఎన్నికల కౌంటింగ్ లో టీఎంసీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అస్సోన్ సోల్ ప్రాంతంలో వున్న సీపీఎం కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సెల్ టవర్ ఎక్కి యువకుడు...

హైదరాబాద్ : తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్ చేశాడు. అగ్రికల్చర్ పోస్టుల భర్తీలో ఒకేషనల్ విద్యార్థులకు అవకాశమివ్వాలని సదరు యువకుడు డిమాండ్ చేశాడు. 

‘6‘ సెంటిమెంట్ తోనే 'అమ్మ' గెలిచిందా?......

తమిళనాడు : తమిళ తంబిలకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఈ విషయంలో జయలలిత కూడా అతీతం కాదు. నామినేషన్ వేయడానికి, ప్రచారం ప్రారంభించడానికి, మేనిఫెస్టో ప్రకటనకు, ప్రమాణ స్వీకారానికీ.. కార్యక్రమం ఏదయినా సరే.. సెంటిమెంట్ ముఖ్యం. ఆమెకు ‘6‘వ నెంబర్ పై సెంటిమెంట్ ఎక్కువ. ఆమె మేనిఫెస్టో ప్రకటించింది 6వ తారీఖు. వారంలో ఆరో రోజయిన శుక్రవారం నాడే ప్రకటించారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు కూడా ఆరే. ఉచిత మొబైల్స్, స్కూటర్లకు 50శాతం డిస్కౌంట్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సెట్‌టాప్‌బాక్సులు, 100 యూనిట్లలోపు విద్యుత్తుకు బిల్లు లేకుండా ఇవ్వడం..

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా : ఎంపీ తోట నర్శింహం

తూ.గోదావరి : బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ ఎంపీ తోట నరసింహం కంటతడి పెట్టారు. తనపై ఆరోపణలు వచ్చిన రాత్రి ఆత్మహత్య చేసుకుందామనుకున్నానన్నారు. ఓ పనికిమాలిన వ్యక్తి చేసిన ఆరోపణలకు ఆత్మహత్య చేసుకోవడం సరి కాదని విరమించుకున్నట్లు చెప్పారు. సదరు లాయర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓ సైకో లాయర్ ఆరోపణలపై తనను మీడియా కోలుకోలేని దెబ్బతీసిందని ఆరోపించారు. లాయర్ ఫిర్యాదు నిరాధారమని పోలీసులు ఎప్పుడో బాలల హక్కుల కమిషన్‌కు నివేదిక ఇచ్చారని ఎంపీ తోట నర్సింహం చెప్పుకొచ్చారు.

సముద్రంలో కూలిపోయిన ఈజిప్టు విమానం....

హైదరాబాద్ : ఈజిప్టు విమానం సముద్రంలో కూలిపోయింది. గ్రీకు ద్వీపం సమీపంలో విమానం కూలిపోయినట్లు గ్రీక్ విమానయాన శాఖ అధికారులు చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుందని తెలిపారు. విమానంలో 59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రాడార్ సంకేతాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు.

మాజీ వీఆర్‌వో బెహరా సీతారామయ్య ఇంటిపై ఏసీబీ దాడులు...

కృష్ణా : మాజీ వీఆర్‌వో బెహరా సీతారామయ్య ఇంటిపై గురువారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 22 లక్షల రూపాయల నగదు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భారీ ఎత్తున బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీఆవ్వోగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీతారామయ్య ప్రస్తుతం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇబ్రహీంపట్నంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీసీపీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.

విరిగిపడిన కొండచరియ, తప్పిన ప్రమాదం....

విజయవాడ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి మొగల్రాజపురంలో పెద్ద కొండచరియ విరిగిపడింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొండపై నుంచి వేగంగా దొర్లుకుంటూ వచ్చిన రాయి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగడంతో ప్రాణనష్టం తప్పింది. వానదెబ్బకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.

14:43 - May 19, 2016

అల్లు అర్జున్...టాలీవుడ్ లో స్టైలిష్ హీరో. ఆయనపై తాజాగా ఓ వివాదం రగులుతోంది. పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు బన్నీపై తీవ్ర ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా వస్తున్న 'నిహారిక' నటించిన చిత్రం ఆడియో కార్యక్రమానికి 'అల్లు అర్జున్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివాదంపై బన్నీ స్పందిస్తారా ? లేదా ? అనే దానిపై చర్చ జరిగింది. అనుకున్నట్లుగానే 'అల్లు అర్జున్' స్పందించారు. 'ఆడియో ఫంక్షన్లలో, ఇతర కార్యక్రమాల్లో ప్రతీసారి పవర్‌స్టార్, పవర్‌స్టార్ అని మీరు అరిచినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్లిపోతున్నాను. అందుకు కారణం పవన్‌కాదు. అసలు ఆయనకు, ఈ వివాదానికి ఎలాంటి సంబంధమే లేదు' అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఆడియో ఫంక్షన్లకు వచ్చే కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు గ్రూప్‌గా ఏర్పడి అరిచి ఇబ్బందికి గురిచేస్తున్నారని, అందుకే పవర్‌స్టార్ గురించి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడకూడదని నిర్ణయం తీసుకొన్నానన్నారు. ఒక దర్శకుడు వంద రోజులు కష్టపడి సినిమా తీసి ఆడియో ఫంక్షన్ పెట్టుకొని తన సినిమా గురించి మాట్లాడుదామనుకుంటే.. పవర్‌స్టార్ అంటూ ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా చేస్తున్నారన్నారు.

కృష్ణా జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం...

విజయవాడ : వాయుగుండ ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు విరిగిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

14:40 - May 19, 2016

ఢిల్లీ : ప్రపంచ మహిళా టీమ్ బ్యాడ్మింటన్ లో భారత్ సంచలనం సృష్టించింది. ఉబర్ కప్ సెమీఫైనల్ లో భారత్ ప్రవేశించింది. థాయ్ లాండ్ పై 3-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. సింగిల్స్ లో సింధు, శివానీ విజయం సాధించారు. డబుల్స్ లో గుత్తా జ్వాల-అశ్విని జోడీ నెగ్గింది. చైనాలోని కున్ షాన్ లో 2016 థామస్ కప్, ఉబర్ కప్ టోర్నీ జరుగుతోంది. 
 

 

27 ఏడేళ్ళ చరిత్రను అన్నాడీఎంకే తిరగరాసింది.....

తమిళనాడు : రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'జయ'కేతనం ఎగురవేశారు. ఎంజీఆర్ తరువాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. 27 సంవత్సరాల చరిత్రను అన్నాడీఎంకే తిరగరాసింది. ఎగ్జిట్ పోల్స్ మాపై తప్పుడు ప్రచారం చేశాయని ఆమె పేర్కొన్నారు. తమిళనాడును దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెడతానని ఆమె తెలిపారు. ఎన్నికల సందర్బంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన  ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

నా ఆనందం చెప్పటానికి ఏ డిక్షనరీలో పదాలు లేవు : జయలలిత

తమిళనాడు : తమిళ ప్రజలు తనకు అందించిన  విజయం గురించి తన మనసులోని అభిప్రాయాలను చెప్పేందుకు ఏ డిక్షనరీలోనూ మాటలు లేవని అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో అమ్మకు తమిళ ఓటర్లు ఓట్లతో పటాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....తాను చాలా ఆనందంగా వున్నానన్నారు. ఆనందాన్ని వ్యక్తం చేయటానికి ఏ డిక్షనరీలో వున్న ఏ పదాలు సరిపోవనీ ఆనందంతో వ్యక్తం చేశారు. కాగా మానిఫెస్టోలో భాగంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేరుస్తానని స్పష్టం చేశారు.

అస్సాంలో భాజపావిజయం పెద్ద బహుమతి: వెంకయ్య

ఢిల్లీ : అస్సాంలో భాజపా సాధించిన భారీ విజయం తమకు పెద్ద బహుమతని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్‌ దారుణంగా ఓటమిపాలవ్వడం పార్టీ పట్ల ప్రజలకున్న అసహనానికి నిదర్శమన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న కూటముల్ని కూడా ప్రజలు ఈ ఎన్నికల్లో గెలవనీయలేదని పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

14:17 - May 19, 2016

ఎన్నికలు..ఫలానా పార్టీ గెలుస్తుందని..ఫలానా పార్టీ పరాజయం చెందుతుందని..ఆ నేత ఘోరంగా ఓడిపోతారని ఎన్నికల అనంతరం ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తుంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో నిజం కాగా కొన్నిమార్లు తప్పని తేలింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలకు ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలు వెలువడ్డాయి. కానీ ఈ పోల్స్ పరాజయం చెందాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి తప్పుడు అంచనాలను వేసిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సరైన అంచనాలు వేయలేకపోయాయి. సర్వేలు వాస్తవ ఫలితాలకు బోలెడంత దూరంలో నిలిచాయి. అసలు ఫలితాలకు, వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కూ ఏ మాత్రం సంబంధం కనపడటం లేదు. తమిళనాడు విషయంలో సర్వేలు చెప్పిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అక్కడ మరోసారి అధికార మార్పు తప్పదని.. అమ్మకు భంగపాటే అని ఈ సర్వేలు తేల్చి చెప్పాయి. కరుణానిధి పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ ఇవన్నీ తప్పని తేలిపోయాయి. ఫలితాల్లో 'అమ్మ' సత్తా కనిపించింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి ముందుకు దూసుకపోయింది. పూర్తి మెజార్టీ సాధించిన 'అమ్మ' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఇక బెంగాల్ లో మమత ప్రభుత్వం ఏర్పడటం ఖాయమే అని పోస్ట్ పోల్ సర్వేలు చెప్పాయి. అయితే గత ఎన్నికల్లో కన్నా మమతకు ఈ సారి సీట్లు తగ్గుతాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. ఐదేళ్ల కిందట 294 సీట్లలో 180 వరకూ సాధించిన మమత ఈ సారి 170 చిల్లర సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ 210 సీట్లకు పైస్థాయిలో దూసుకుపోతోంది. మమతకు మెజారిటీ తగ్గుతుందని వేసిన అంచనాలు తలకిందలయ్యాయి.

ఇక కేరళలో ఎల్డీఎఫ్ కూటమికి కూడా తక్కువ సీట్లు వస్తాయని సర్వేలు పేర్కొన్నాయి. అంచనాలకు మించిన స్థాయిలో ఈ కూటమికి సీట్లు సంపాదించుకొంటోంది. కాంగ్రెస్ కూటమి ఎగ్జిట్ పోల్స్ ను అందుకోలేకపోయింది. అలాగే అస్సాంలో కాంగ్రెస్ పరువు అంతో ఇంతో నిలబడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అవి తప్పని ఫలితాల అనంతరం వెల్లడైంది. సర్వేలు జనం నాడిని సరిగా పట్టలేకపోయాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తుపాను ప్రభావంతో సముద్రంలో భారీ అలలు ....

విశాఖ : తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా వుంది. దీంతో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. వాయుగుండం కారణంగా సముద్రంలోకి ఎవరూ వెళ్ళవద్దని ఇప్పటికే వాతావారణ శాఖ హెచ్చరికలు  జారీ చేసింది.

రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ నిలుపుతా : జయలలిత

తమిళనాడు : తమిళ ఓటర్లు అమ్మకు మరోసారి పట్టం కట్టారు. తమిళనాడులో జయకేతనం ఎగురవేసిన జయలలిత రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నతంగా నిలబెడతామని తెలిపారు.

13:56 - May 19, 2016

విజయవాడ : జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మొఘల్ రాజ్ పురం చండ్రరాజేశ్వర్ రావు నగర్ లో కొండ ప్రాంతాల్లో ఇండ్లపై కొండ చరియ విరిగిపడింది. కొండ చరియ విద్యుత్ స్తంభంపై పడటంతో విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు ఎక్కడ విరిగి తమపై పడతాయోనని భయాందోళనలో కొండప్రాంత వాసులు ఉన్నారు.

13:54 - May 19, 2016

హైదరాబాద్ : వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దీటుగా ఎదుర్కునేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి ప్రారంభించారు. విపత్తుల సమయంలో ఎదురయ్యే సమస్యలను ప్రజలు ఫిర్యాదు చేయాలన్నారు. కేటీఆర్‌ ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. సమస్యలను ఫొటో తీసి యాప్ ద్వారా పంపించాలని, తద్వారా సమస్య తీవ్రత అర్థం అవుతుందన్నారు. గ్రేటర్ పరిధిలో 105 మాన్‌సూన్ యాక్షన్ టీంలను సిద్ధంగా ఉంచామన్నారు. అయితే వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

13:52 - May 19, 2016

హైదరాబాద్ : నగరంలో ఆపిల్‌ సంస్థ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పలు రకాలుగా సహకరించిందని సీఎం కేసిఆర్ అన్నారు. సిటీలో ఆపిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కలిసారు. ఆపిల్‌ కేంద్రం ఏర్పాటు కోసం ఆ సంస్థ సుమారు 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు సమాచారం. నానక్‌రామ్‌గూడలో ఉన్న వేవ్‌రాక్ భవనంలో ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ కేంద్రంతోపాటు బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ సెంటర్‌గా హైదరాబాద్‌ను ఆపిల్ సంస్థ తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి.

 

13:34 - May 19, 2016

చెన్నై : తమిళనాడులో జయలలిత చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయదుందుభి మోగించింది. మరోసారి 'అమ్మ'కు ప్రజలు పట్టం కట్టారు. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన ఎన్నికలు మొదలుకొని 1967 వరకు తమిళనాట కాంగ్రెస్ హావా కొనసాగింది. అనంతరం అణ్నాదురై నేతృత్వంలోని డీఎంకే దీనికి చెక్ పెట్టింది. కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడి అధికారం చేపట్టింది. అణ్నాదురై మృతి అనంతరం ముఖ్యమంత్రి అయిన కరుణా నిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు. డీఎంకేని వీడి అన్నాడీఎంకే పేరిట ఏంజీఆర్ కొత్త పార్టీని స్థాపించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టి 1980, 1984 సంవత్సరాల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. ఏంజీఆర్ మరణానంతరం జరిగిన ఏ శాసనసభా ఎన్నికల్లో వరసగా రెండో సారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు.
1984 లో డీఎంకే అధికారంకి రాగా 1991లో అన్నాడీఎంకే కు ప్రజలు పట్టం కట్టారు. అనంతరం 1996లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. 2001లో అన్నాడీఎంకే..2006లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అనంతరం 2011లో అన్నాడీఎంకే విజయం సాధించింది. ప్రస్తుతం 2016లో కూడా అన్నాడీఎంకే మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్ తరువాత 2016లో ఆ రికార్డును జయలలిత తిరగరాశారు.

పిడుగు పడి దంపతులు మృతి....

అనంతపురం : వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం పిడుగుపడి దంపతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన కదిరప్ప(65), లక్ష్మీదేవి(55) పూరిగుడిసెలో నిద్రిస్తుండగా పిడుగు పడింది. పిడుగుపాటుకు ఆ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ప్రజా తీర్పును స్వీకరిస్తాం: రాహుల్

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు దూసుకుపోతున్న పార్టీలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 

13:16 - May 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే కేసులు పెడుతామని, ఈ ఆరోపణలను రుజువు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి ఆరోపణలపై సమాధానం చెబుతామన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 1972లో కాంతయ్య 25,452 ఓట్లతో గెలుపొందారని, అనంతరం ఇతరులు మెజార్టీ సాధించలేదన్నారు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు 45,750 ఓట్ల అధిక్యంతో గెలుపొందారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ విజయం బరువు..బాధ్యతలను పెంచిందని, గర్వం పనికి రాదన్నారు. ఈ విజయం వెనుక అందరి కృషి ఉందని, సానుభూతి పవనాలకు వ్యతిరేకంగా చరిత్ర తిరగరాసిందన్నారు.

లేనిపోని ఆరోపణలు...
అధికారంలోకి వచ్చిన మొదటి నుండి టీఆర్ఎస్ పై విపక్షాలు అర్థసత్యాలతో..పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ అని విమర్శలు గుప్పిస్తున్నారని, ఈవీఎంలపై ఆరోపణలు చేశారని, అధికారులను కూడా శంకించారని తెలిపారు. అతిగా మాట్లాడి భంగపాటు పడ్డారని, ప్రభుత్వంపై పోరు అని కాంగ్రెస్ పేర్కొంటోందని, ప్రజాసమస్యలపై పోరాడుతారు కానీ ప్రభుత్వంపై పోరు అంటారా ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఖర్చు పెట్టడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారని, కరవు తాత్కాలిక సహాయాన్ని పెంచాలని ప్రధాని మోడీకి తాను విన్నవించడం జరిగిందన్నారు. బీజేపీ నేతలకు సోయి ఉంటే నేషనల్ ప్రాజెక్టు సాధించి తీసుకరావాలని సూచించారు. ప్రత్యామ్నాయం ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. తాము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతోందని తెలిపారు. 60వేల కోట్ల ఆదాయం ఉన్న హైదరాబాద్ ను వదిలిపెట్టుకోవడం జరిగిందని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిందన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, నిజంగా పనిచేసే వారుంటే మళ్లీ గెలిపిస్తారని, ఇందుకు తాజా ఎన్నికలే ఉదాహరణ అని తెలిపారు. అసెంబ్లీ రికార్డులో ఉండాలనే ఉద్ధేశ్యంతో తాను పవర్ పాయింట్ ప్రజేంటెషన్ ఇవ్వడం జరిగిందని, ఈ ప్రజెంటేషన్ ను కాంగ్రెస్ ఎందుకు బాయ్ కాట్ చేసిందో అర్థం కాలేదన్నారు.

ఏం జరుగుతలే అంటరా ?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు..ప్రాజెక్టులు వస్తున్నా విపక్షాలు ఏం జరగడం లేదని విమర్శించడం కరెక్టు కాదన్నారు. దేశంలో జరగనటువంటి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి విషయంలో నెంబర్ వన్ అని, ప్రపంచంలోనే పెద్ద సంస్థల్లో ఒకటైన యాపిల్ సంస్థ ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఇది అసాధారణమైన విజయమని, ఇంత జరుగుతున్నా ఏం జరగడం లేదని పేర్కొనడం సబబు కాదన్నారు.

కృష్ణా ఎక్స్ ప్రెస్ మంటలు...

గుంటూరు : కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.దీంతో బాపట్ల స్టేషన్ లో అధికారులు రైలును నిలిపివేశారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ కు బయలుదేరిన కృష్ణా ఎక్స్ ప్రెస్ డీ-5 బోగి బ్రేకులు ఫెయిల్ కావడంతో మంటలు రేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం మేరకు బాపట్ల చేరుకున్న రైల్వే సాంకేతిక శాఖకు చెందిన అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.

13:05 - May 19, 2016

ఖమ్మం : పాలేరులో కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 45,750 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తుమ్మల విజయంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్ లో సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణా సంచా కాల్చి నృత్యాలు చేశారు. ఒకరికికరు స్వీట్లు తినిపించుకున్నారు.

ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తుమ్మల..
భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రజలకు మంత్రి తమ్మల నాగేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రభుత్వంపై, తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే భారీ మెజార్టీని తెచ్చిపెట్టాయని, పాలేరుకు సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పాలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.

పాలేరు విజయం మా బాధ్యతను పెంచింది: సీఎం కేసీఆర్

హైదరాబాద్ : మంత్రి తుమ్మలను భారీ మెజార్టీతో గెలిపించిన పాలేరు ప్రజలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పాలేరు నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్జీ సాధించిన తుమ్మలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల విజయం టిఆర్ ఎస్ రెండేళ్ల పాలనకు నిదర్శనమన్నారు. ఏ ఎన్నికైనా ప్రజలు టిఆర్ ఎస్ ను ఆదరిస్తున్నారని... పాలేరు విజయం మా బాధ్యతను పెంచిందని తెలిపారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతి రహితమైందని దేశం మొత్తం మెచ్చుకుంటున్నా కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

13:00 - May 19, 2016

ఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయబావుటా ఎగరేసింది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న యుడిఎఫ్‌ కూటమి పరాజయం పాలైంది. మొత్తం 140 స్థానాలకుగాను 95 స్థానాల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమి లీడ్‌లో ఉంది. ఇక యుడిఎఫ్‌ కూటమికి 44 స్థానాలకే పరిమితమైంది.
తమిళనాడులో జయలలిత చరిత్ర సృష్టించారు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాస్తూ జయలలిత వరుసగా రెండో సారి విజయం సాధించారు. తద్వారా ఎంజీఆర్‌ తర్వాత వరుసగా రెండోసారి విజయం సాధించిన వ్యక్తిగా జయ రికార్డు సొంతం చేసుకున్నట్లైంది. మొత్తం 232 స్థానాలకు గాను 130కు పైగా స్థానాల్లో అన్నా డిఎంకే లీడ్‌లో ఉంది. డిఎంకే వందలోపు స్థానాలకే పరిమితమైంది. ఇక కింగ్‌ మేకర్‌ అవుతారనుకున్న విజయ్‌కాంత్‌ పార్టీ డిఎండీకే ఘోర పరాజయం చవిచూసింది. ఇక సేలం జిల్లాలో డిఎంకే గల్లంతైంది. విల్లుపురం జిల్లాలో మాత్రం తన ప్రభావాన్ని చూపింది.
వెస్ట్‌ బెంగాల్లో మళ్లీ విజయం తృణమూల్‌ కాంగ్రెస్‌నే వరించింది. 294 స్థానాలకుగాను 200పైగా నియోజకవర్గాల్లో టిఎంసీ జెండా రెపరెపలాడింది. లెఫ్ట్ పార్టీల కూటమి 30 లోపు స్థానాల్లోనూ కాంగ్రెస్ 50 లోపు స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ 6 స్థానాలు, ఇతరులు 5 లోపు స్థానాలకు పరిమితమయ్యారు.
ఈశాన్య భారతంలో తొలిసారి బీజేపి జెండా ఎగరేసింది. అస్సాం ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. 126 స్థానాలకుగాను బీజేపీ 80 పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా కాంగ్రెస్ 30 లోపు స్థానాలకే పరిమితమవుతోంది. ఏఐయుడిఎఫ్‌ 11 స్థానాలు.. మిగిలిన స్థానాల్లో ఇతరులు లీడ్‌లో ఉన్నారు.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి....

కరీంనగర్‌: మంథని మండలం గంగపురిలో ఇటుకబట్టి వద్ద విద్యుత్‌షాక్‌తో శంకర్‌ అనే యువకుడు మృతి చెందారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

12:45 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తాము ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని బీరాలు పలికిన నేతలందరూ ఇంటికే పరిమితమయ్యారు. పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం, తమిళనాడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం చేపట్టారు. ఐదు రాష్ట్రాల్లో నాలుగింట ఊహించిన ఫలితాలే వస్తున్నా కానీ ఒక్క తమిళనాడులో మాత్రం పరిస్థితి తిరగబడింది. తమిళనాట మరోసారి అమ్మకు అధికారం కట్టబెడుతున్నారు. ముందు నుండి తన పార్టీ ఏకంగా అధికారాన్ని పొందుతుంది అని అనుకున్న విజయ్ కాంత్ పార్టీ పోటీ మొదలు కాక ముందే చేతులెత్తేసింది. పొత్తులు పెట్టుకొనేందుకు పెద్ద పార్టీలు రావడంతో తమిళనాట ట్రెండ్ సెట్టర్ గా మారిన విజయ్ కాంత్ కు ఘోర పరాజయం వరించింది. కేరళలోని తిరువనంతపురంలో బీజేపీ పార్టీ తరపున పోటీకి దిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ గాలికి కొట్టుకపోయారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా తిరువనంతపురం వాళ్లు మాత్రం శ్రీశాంత్ కు అవకాశం ఇవ్వలేదు. బీజేపీ పక్షాన పోటీ చేసిన మరో ప్రముఖ నేత బీజేపీ నేత రాజశేఖరన్ ఓటమి పాలయ్యారు. కేరళలో యూడీఎఫ్ పార్టీ అభ్యర్థి మణి పరాజయం చవి చూశారు. తమిళనాడు నుండి పోటీ చేసిన మరో ప్రముఖ నటుడు శరత్ కుమార్ సైతం ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పక్షాన హౌరా నార్త్ నుండి పోటీ చేసిన మరో ప్రముఖురాలు రూపా గంగూలి సైతం మమత ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్ లో ప్రముఖ నేతలు సూర్యకాంత్ మిశ్రా, దీపా మున్షిలు సైతం ఓడిపోయారు.

కదిరిలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి....

అనంతపురం : కదిరి మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు- కారు ఢీకొంది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కారు అతివేగంతో రావటం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

మచిలీపట్నానికి తుపాను ముప్పు లేదు : కలెక్టర్ బాబు

విజయవాడ: మచిలీపట్నానికి తుపాను ముప్పులేదని కలెక్టరు బాబు చెప్పారు. ఒడిశా వైపు తుపాను పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో సహాయకచర్యలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌- 1077ను ఏర్పాటు చేశామని కలెక్టరు వివరించారు.

భార్యను చంపి చెరువులో పడేసిన భర్త...

తూర్పుగోదావరి: తొండంగి మండలం చిన్నాయిపాలెంలో భర్త భార్యను చంపి చెరువులో పడేశాడు. అదనపు కట్నం కోసం భర్త భార్యను హత్య చేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపించారు.

గెలుపు మరింత బాధ్యతను పెంచింది: తుమ్మల

ఖమ్మం : పాలేరు ఎన్నికల్లో గెలుపు తనపై మరింత బాధ్యతను పెంచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేసీఆర్‌ సమర్ధత, సంక్షేమ పథకాల వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానన్న తుమ్మల పాలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.

సినీ నటుడు రవితేజకు జరిమానా....

హైదరాబాద్ : తెలుగు సినిమా మాస్ మహారాజ్ రవితేజకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సినీ నటుడు రవితేజ కారుకి బ్లాక్ ఫిల్మ్ వుండటంతో రూ.800 జరిమానా విధించారు. అనంతరం బ్లాక్ ఫిల్మ్ ను తొలగింంచారు. కారులకు బ్లాక్ ఫిల్మ్ ని హైదరాబాద్ లో నిషేధించిన విషయం తెలిసిందే.

ఫేస్ బుక్ లోనూ దీదీ 'టాప్ ' పిక్ ....

కోల్ కతా : మమతా బెనర్జీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఆమె గురించే చర్చ ఎక్కువగా జరిగిందని అసెంబ్లీ ఎన్నికల గురించి నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. పశ్చిమ్‌బంగ, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన సంగతి తెలసిందే. ఓట్ల లెక్కింపు జరుగుతన్న నేపథ్యంలో సోషల్‌మీడియాలో ఫిబ్రవరి 12 నుంచి మే 10వ తేదీ వరకు 2.2 కోట్ల మంది ఎన్నికల గురించి చర్చించుకున్నారని సర్వేలో వెల్లడయింది.

12:22 - May 19, 2016

తమిళనాడు : రాష్ట్రంలో 'అమ్మ' వచ్చేసింది...రొంబ సంతోషం...అనే పదాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐడీఎంకే నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. చెన్నైలో జయలలిత రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. 137 స్థానాల్లో అధిక్యంలో దూసుకెళుతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళుతుండడంతో నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నాయి. జయ నివాసానికి చేరుకున్న అభిమానులు టపాసులు కాలుస్తూ డ్యాన్స్ లు చేస్తున్నారు. కానీ 'అమ్మ' మాత్రం బయటకు రాలేదు. 16వ తేదీన ఓటు వేసిన అనంతరం అభిమానులకు, కార్యకర్తలకు..అన్నాడీఎంకే మంత్రులకు సైతం దర్శనమివ్వలేదన్న సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్ జయకు వ్యతిరేకంగా వెల్లడయ్యాయి. దీనితో 'అమ్మ' ఇంటికే పరిమితమయ్యారు. కానీ కౌంటింగ్ లో జయ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఆరోసారి తనకు సీఎంగా అధికారం దగ్గరవుతున్నదని తెలుసుకున్నా జయ మాత్రం బయటకు రాలేదు. తనను చూసేందుకు, అభినందనలు తెలిపేందుకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పోయిస్ గార్డెన్ ముందుకు చేరుకుని సందడి చేస్తున్నారు.

12:12 - May 19, 2016

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో పార్టీ పరిస్థితిపై సమీక్షించడం జరుగుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన టెన్ టివితో మాట్లాడారు. బెంగాల్ లో అధికారంలోకి వస్తామని చెప్పలేదని, అక్కడ చేస్తున్న దాడులపై ప్రజలు ప్రతిఘటిస్తున్నారని తెలిపారు. పరిస్థితి మెరుగుపడకపోగా లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ పోటాపోటీగా వస్తున్నాయని తెలిపారు. లోతుగా అధ్యయనం చేసి పరిస్థితిని సమీక్ష చేస్తామన్నారు. తృణముల్ అవినీతి, అరాచకం మధ్యతరగతి ఓటర్లపై ప్రభావం చూపెట్టిందని, రూరల్ ప్రాంతాల్లో ప్రజలతో సత్ససంబంధాలు పెట్టుకొనే పరిస్థితి లేదన్నారు. గ్రామాలకు, పార్టీకి డిస్కక్షన్ అయ్యిందని అనిపిస్తోందని, ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయామని, అధికార పార్టీ ప్రకటించిన వెల్ఫేర్ స్కీంలపై ప్రజలు ఆకర్షితులయ్యారా అనే దానిని ఆలోచించాల్సి ఉంటుందన్నారు. కేరళలో ఊహించినదానికన్నా ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని, యూడీఎఫ్ కు ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందన్నారు. యూడీఎఫ్ పరిపాలనపై, లెఫ్ట్ ఫ్రంట్ లో నిర్మాణపరంగా ఐక్యంగా ఉందన్నారు. లక్షలాది మందిని సమీకరించి పోరాటాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అసొంలో కాంగ్రెస్ మూడుసార్లు అధికారంలో ఉండడం ఆశ్చర్యకరమని, తెగల మధ్య ఉన్న తగాదాలను బీజేపీ ఉపయోగించుకుందన్నారు.

ఇది ప్రజల విజయం : మమతా బెనర్జీ

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో రెండో సారి అధికారం చేపట్టనున్న సీఎం మమతా బెనర్జీ ఇది ప్రజల విజయం అని తెలిపారు. ఆమె శుక్రవారం ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే ''ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని, వారు నాపై చేసిన విమర్శలను ప్రజలు తిప్పి కొట్టారు. ప్రజలు మనస్ఫూర్తిగా టీఎంసీకి ఓటు వేశారని, ఒంటరిగా పోరాడి విజయం సాధించానని' తెలిపారు.

41,473 ఓట్ల ఆధిక్యంతో తుమ్మల విజయకేతనం...

ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయదుందుభి మోగించారు. 15వ రౌండ్‌ పూర్తయ్యేసరికి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిని సుచరితారెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 41,473 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. 

ఆపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగాలు: కేసీఆర్

హైదరాబాద్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ మ్యాప్స్ కేంద్రం హైదరాబాద్ ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు. వేవ్‌రాక్ భవనంలో ఆపిల్ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపిల్ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభంతో పాటు ఐటీ అంశాలపై చర్చించారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు, ఆపిల్ వాచ్‌ల మ్యాప్‌ల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రం కానుంది.

జయ,మమతలకు మోదీ అభినందనలు

 ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి జయలలిత, మమతా దీదికి ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేసినట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

 

మళ్లీ అధికారం చేపట్టనున్న ఇద్దరు మహిళా సీఎంలు

హైదరాబాద్ : బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇద్దరు మహిళా సీఎంలు మళ్లీ అధికారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇద్దరు కాంగ్రెస్ సీఎం లను కూడా ఓటర్లు ఇంటికి పంపించారు. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీకి భారీ మెజార్టీ అందించగా....తమిళనాడులో మళ్లీ జయలలితకే అధికారం అందించారు. 

11:37 - May 19, 2016

పశ్చిమ బెంగాల్ : ఎంతో గుర్తింపు పొందిన మహాభారత్ లో ద్రౌపది పాత్ర ఎవరు పోషించారో తెలుసు కదా..ఆమెనే 'రూపా గంగూలి'. ఈ రూపా గంగూలిని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల బరిలో ఆమె నిలిచారు. బీజేపీ పార్టీ తరపున హౌరా నార్త్ నుండి ఆమె ఎన్నికల్లో పోటీ చేశారు. హౌరాలోని ఓ పోలింగ్ బూత్ వెలుపల టీఎంసీ కార్యకర్తపై ఇటీవల గంగూలి చేయి చేసుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ ను గురువారం నిర్వహించారు. ఇక్కడ మమత బెనర్జీ పార్టీ అధిక్యంలో కొనసాగింది. ఈ ప్రభంజనంలో 'రూపా గంగూలి' కొట్టుకపోయారు. గంగూలిపై టీఎంసీ అభ్యర్థి, బెంగాల్ మాజీ క్రికెటర్ కెప్టెన్ లక్ష్మీరతన్ శుక్లా గెలుపొందారు. ఈ పరాజయంపై గంగూలి ఎలా స్పందిస్తారో చూడాలి.

తుపాను గా మారిన తీవ్ర వాయుగుండం

విశాఖ : తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రాగల 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 'రౌను'గా నామకరణం చేశారు. దక్షిణ ఈశాన్య దిశగా విశాఖకు 350 కి. మీ దూరంలో, దక్షిణ ఆగ్నేయ దిశగా మచిలీపట్నం కు 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటలకు 90 నుంచి 100 కి. మీ వేగంతో గాలులవీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.

11:22 - May 19, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఇక అన్నీ ఫ్రీయేనా ? ఎందుకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జయలలిత ఉచిత హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం జయలలిత ఉచిత ఎన్నిక వరాలను ఇబ్బడి ముబ్బడిగా కురిపించేసింది. అమ్మ మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత హామీల వర్షంలో తమిళ జనాలు తడిసి ముద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. అన్ని పార్టీల కంటే కాస్త లేటుగా మేనిఫెస్టో ప్రకటించినా లేటెస్ట్ గా ఉచితాలతో జనాలను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఒకటి, రెండు కాదు...అన్నీ ఫ్రీ.. ఈ ఫ్రీలు అత్యంత ఖరీదువి కావడం విశేషం.
తమిళనాడు సీఎం, అన్నాడీయంకే అధినేత జయలలిత ఉచిత వరాల లిస్టు చూద్దాం..
ఉచిత మొబైల్ ఫోన్లు : తమిళనాడులో రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు అందించే పథకం.
స్కూటర్లపై 50% రాయితీ : రేషన్ కార్డు ఉన్న మహిళలు స్కూటర్లు కొంటే 50% రాయతీని ప్రభుత్వం భరించే పథకం.
ఉచిత విద్యుత్తు : 78 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం.
నేతలకు : నేత కార్మికులకు వివిధ కేటగిరీల వారీగా 200 నుంచి 750 యూనిట్లు ఉచిత విద్యుత్తు పథకం.
చేనేత వస్త్రాల కొనుగోలు కూపన్ : చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఉచితంగా రూ.500 విలువ గల కూపన్ అందించే పథకం.
మంగళసూత్రాల్లో పసిడి పెంపు : పెళ్లి చేసుకునే జంటలకు ఇస్తున్న మంగళసూత్రాల్లో బంగారం 4 గ్రా. నుండి 8 గ్రాముల పెంపు.
ప్రసూతి సెలవులు : ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు, ప్రసూతి సహాయం రూ.12 వేల నుండి రూ. 18 వేలకు పెంపు.
ఉచిత సెట్ అప్ బాక్స్ : ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేబుల్ టీవీ సంస్థల కనెక్షన్లు తీసుకునే వారికి ఉచిత సెట్ టాప్ బాక్సులు.
ఉచిత ల్యాప్ ట్యాప్ : 10+2 తరగతుల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే పథకం కొనసాగింపు.
ఉచిత ఇంటర్నెట్ : విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే పథకం. ఉచిత వైఫై : బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించే ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం : వృత్తి విద్యా శిక్షణనిచ్చి ప్రతి ఇంటి నుంచి ఒకరికి ఉద్యోగ కల్పన.
ఉద్యోగులకు ఇంటికి ఋణం : ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు రూ. 40 లక్షల వరకు రుణ సహాయం.
మద్యనిషేధం : రాష్ట్రంలో దశల వారీగా మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయం.
మరీ..ఇప్పుడు అధికారంలోకి వస్తున్న జయలలిత ప్రభుత్వం ఈ హామీలన్నీ నెరవేరుస్తారా ? లేదా ? అన్నది చూడాలి.

35,209 ఓట్ల ఆధిక్యంలో మంత్రి తుమ్మల

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక కౌంటిగ్ కొనసాగుతోంది. 12వ రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి మంత్రి తుమ్మల 35, 209 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అసోం లో శర్వానంద్ సోనే వాల్ బిజెపి సీఎం అభ్యర్థి

అసోం: అసోంలో బిజెపి స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతుంది. బిజెపికి అధికారం కట్టబెట్టిన అసోం ప్రజలకు ఆ పార్టీ నేత రాం మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా శర్వానంద్ సోనే వాల్ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు.

11:18 - May 19, 2016

సురేందర్ రెడ్డి యువ ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు. కిక్, రేసుగుర్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన డైరక్టర్ ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో ఓ సినిమా తీస్తున్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.... 'గతేడాది తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొదిస్తున్నామని తెలిపారు. దీంట్లో రామ్‌ చరణ్‌ కొత్తలుక్‌లో కనిపించబోతున్నారు. సినిమా సినిమాకీ కొత్త లుక్ కోసం ఈతరం నటులు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టన్నింగ్‌ లుక్‌తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతుండడంతో ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఆకర్షణగా అరవింద్‌ స్వామి క్యారెక్టరైజేషన్‌ నిలుస్తుంది. ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో ముఖ్యమైన సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్‌ని చిత్రీకరించనున్నారు. జూన్ 20 నుండి కాశ్మీర్‌లో కీలకమైన సన్నివేశాలను షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.

కాంగ్రెస్ ఓటమికి రాహుల్ ది బాధ్యత కాదు : చాకో

హైదరాబాద్ : 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పరాభవం ఎదురయ్యింది. ఓటమికి గల కారణాలపై చర్చిస్తామని పీసీ చాకో తెలిపారు. అయితే కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీది బాధ్యత కాదని చాకో స్పష్టం చేశారు.

11:09 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలు నిజమౌతున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతున్నాయి. ఇక్కడ జయలలిత స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. తమిళనాడులో జాతీయ పార్టీలు చతికిలపడ్డాయి. విజయ్ కాంత్ ఆధ్వర్యంలోని డీఎండీకే కేవలం ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అధినేత విజయ్ కాంత్ వెనుకంజలో కొనసాగుతుండడం విశేషం. 232 స్థానాల్లో 134 స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో తృణముల్ 211 స్థానాల్లో ముందంజలో ఉంది. కేరళలో అధికారంలో యూడీఎఫ్ పరాజయం దిశగా వెళుతోంది. ఎల్డీఎఫ్ 83 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతండగా ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 9 స్థానాల్లో గెలుపొందారు. యూడీఎఫ్ 43 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఒక స్థానంలో అధిక్యంలో కొనసాగుతోంది. అస్సాంలో 126 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 26 స్థానాల్లో, బీజేపీ 81 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. పాండిచ్చేరిలో సంకీర్ణ దిశగా ముందుకెళుతోంది. 30 స్థానాల్లో అన్నాడీఎంకే ఏడు స్థానాలు, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో విజయం సాధించే దిశగా ముందుకెళుతున్నాయి.

11:00 - May 19, 2016

ఇప్పుడు సమాజంలో 'ట్రెండ్' అనే పదం 'ట్రెండ్'గా మారిపోయింది. డ్రస్ కోడ్,హెయిర్ స్టైల్, స్మార్డ్ ఫోన్స్ ఇలా ఏదైనా ట్రెండ్ తోనే ముడిపడిపోతున్నాయి. ఇప్పుడు సినీ పరిశ్రమ కూడా ఆ హవాలోనే పరుగులు పెడుతోంది. సినిమా అంటే గ్లామర్. ఈ ప్రపంచంలో క్రియేటివిటీ వుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి ప్రేక్షకుల నాడి పట్టుకోవాలంటే వారి ట్రెండ్ నే అనుకరించాలికదా మరి! ఆ బాటలోనే దర్శక, నిర్మాతలు నడుస్తున్నారు. సినిమా తీసయటమేకాదు దాన్ని మార్కెట్ చేసుకోవటంలో కూడా ఈ ట్రెండ్ అనే పదం ప్రధాన పాత్ర పోషిస్తోంది. పబ్లిసిటీతో ఎంత హైప్‌ క్రియేట్‌ చేస్తే సినిమాకి అంత ఉపయోగమనే విషయం తెలుసుకున్న దర్శక, నిర్మాతలు క్రియేటీవ్‌గా ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో హాలీవుడ్‌ కూడా అతీతం కాదు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాని వేదికగా వినియోగించుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ హాలీవుడ్ 'యాంగ్రీ బర్డ్స్' అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ గేమ్స్లో ‘యాంగ్రీ బర్డ్స్' గేమ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఈ గేమ్ లోని బర్డ్స్ క్యారెక్టర్లతోనే హాలీవుడ్ సినిమా రాబోతోంది. ఈ నేపథ్యంలో భాగంగా 'ద యాంగ్రీ బర్డ్స్‌' బృందం పబ్లిసిటీ విషయంలో వినూత్నంగా ఆలోచించింది. తమ సినిమా టైటిల్‌కి అనుగుణంగా ప్రవర్తించిన సెలబ్రిటీకి 'ద యాంగ్రీస్‌' పేరుతో అవార్డు ఇవ్వాలనుకున్నారు. ఇటీవల కాలంలో సైబర్‌ వేధింపులపై ఆగ్రహంతో సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేసిన సోనాక్షికి 'ద యాంగ్రీస్‌' అవార్డుని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన సోనాక్షి 'ఊహించని అవార్డ్‌..' అంటూ ట్వీిట్‌ ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

11 గంట ల వరకు వచ్చిన ఫలితాలు ఇలా...

హైదరాబాద్ : 5 రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 11 గంట ల వరకు వెలువడిన ఫలితాల వివరాలు ఇలా వున్నాయి.

.బెంగాల్ : 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వాటిలో టీఎంసీ 210, సీపీఎం 32, కాంగ్రెస్ 40, బిజెపి 7, అదర్స్ 4 స్ధానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు.

కేరళ : 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ 45, ఎల్ డీఎఫ్ 92, బిజెపి 1, అదర్స్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కేరళ లో ప్రభుత్వ ఏర్పాటు ఎల్ డీఎఫ్ సమాయత్తం

కేరళ : ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్ డీఎఫ్ సమాయత్తం అవుతోంది. ధర్మడంలో 18వేల ఆధిక్యంలో పినరయి విజయన్ (సీపీఎం), మలక్ పూజలో 10 వేల ఓట్ల ఆధిక్యంలో అచ్యుతానందన్ (సీపీఎం),నెమమ్ లో బిజెపి అభ్యర్థి ఓ రాజగోపాల్ హరిపాడ్ లో కాంగ్రెస్ అబ్యర్థి రమేష్ చనితాల ఆధిక్యంలో ఉన్నారు.

10:41 - May 19, 2016

తమిళనాడు : రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఏఐడీఎంకే భారీ అధిక్యత దిశగా దూసుకెళుతోంది. జయలలితకు ప్రజలు పట్టం కట్టారు. దీనితో అభిమానులు పోయిస్ గార్డెన్ కి పోటెత్తారు. పటాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. చెన్నై వరదలు నిలువెత్తు ముంచుతాయని వాదనలు వట్టివేనని తేలిపోయింది. సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇది పేదల విజయమని, తమిళనాడు రాష్ట్రంలో అమ్మను ఓడించాలని ప్రయత్నాలు చేశారని టెన్ టివితో జయ అభిమానులు తెలిపారు.

ఆర్టీసీ బస్సు- కారు ఢీ : నలుగురు మృతి

అనంతపురం : కదిరి మండలం పట్నం దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. హైవేపై ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

తమిళనాడులో చరిత్ర సృష్టించనున్న ఏఐఏడీఎంకే !

చెన్నై : 1989 తర్వాత తమిళనాడులో జయలలిత వరుసగా రెండో సారి ఆధిక్యం సాధించిన పార్టీగా ఏఐఏడీఎంకే చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం ఏఐఏడీఎంకే 130, డీఎంకే 97, పీఎంకే 4, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. జయలలిత అధికారిక నివాసం పోయస్‌ గార్డెన్‌కు భారీగా చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జయలలిత ఐదు సార్లు, కరుణానిధి ఐదు సార్లు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తం ఏఐఏడీఎంకే విజయం సాధిస్తే ఆరోసారి జయలలిత సీఎం పీఠాన్ని అధిష్టించనునున్నారు. 

10:32 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం అసెంబ్లీలకు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ పడిన ప్రముఖుల్లో కొందరు దూసుకెళుతున్నారు. మరికొందరు వెనుకంజలో ఉన్నారు. వారెవరో..
వెనుకంజలో...
కేరళ..
శ్రీశాంత్ (బీజేపీ), మణి (యూడీఎఫ్), రాజశేఖరన్ (బీజేపీ) వట్టియూర్ కవు.
పశ్చిమ బెంగాల్..
రూపా గంగూలి (బీజేపీ), సూర్యకాంత్ మిశ్రా (నారాయణ్ గడ్), దీపా మున్షి (కాంగ్రెస్),
తమిళనాడు..
విజయ్ కాంత్ (డీఎండీకే), అన్బుమణి రాందాస్ (పీఎంకే)

ముందంజలో..
అసోం
శర్మానంద సోనోవాల్ (బీజేపీ), హిమంత బిశ్వశర్మ (బీజేపీ), ప్రపుల్లకుమార్ మహంత (ఏజీపీ)
కేరళ..
వీఎస్ అచ్యుతానందన్ (ఎల్డీఎఫ్), పినరాయి విజయన్ (ఎల్డీఎఫ్), వూమెన్ చాందీ (యూడీఎఫ్)
తమిళనాడు..
జయలలిత (అన్నాడీఎంకే), కరుణానిధి (డీఎంకే), స్టాలిన్ (డీఎంకే)
పశ్చిమ బెంగాల్..
మమతా బెనర్జీ (తృణముల్ కాంగ్రెస్)

10:31 - May 19, 2016

అన్న బాటలో కాకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు కార్తీ. తాజాగా అన్న నటించిన 'సింగం 3' సినిమాలో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య కుటుంబంతో కలిసి హాలాడే ట్రిప్ కి అమెరికా వెళ్ళారు. ట్రిప్ పూర్తయిన వెంటనే 'సింగం 3' సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఈ సారి ఓ ప్రత్యేకత చోటుచేసుకుంది. సూర్య తమ్ముడు కార్తి ఇందులో అతిథి పాత్ర చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఊపిరి చిత్రంలో మల్టీ స్టారర్ గా హిట్ కొట్టిన కార్తి అన్న సింగం కూడా ప్లస్ అవుతాడన్న  టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తమిళనాడులో తారుమారవుతున్న ఎగ్జిట్ పోల్స్

చెన్నై :తమిళనాడులో తారుమారుఅవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. తమిళనాట అన్నాడీఎంకే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ముందు వెనుకబడిన అన్నాడీఎంకే తరువాత పుంజుకుంది.

10:24 - May 19, 2016

తమిళనాడు : విజయ్ కాంత్...ఈయన తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుదామని అనుకున్నారు. కింగ్ మేకర్ అవుదామని అనుకున్నారు. కానీ ఆయన ఆశలన్నీ అడియాశలయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోసారి జయలలిత అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతానని ప్రకటించుకున్న విజయ్ కాంత్ వెనుకంజలో ఉన్నారు. ఉలుందూర్ పెట్టై నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసిన సంగతి తెలిసిందే. తొలి రౌండ్ నుండి ఆయన వెనుకంజలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థి వసంత వేల్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య కూటమిని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌లా పిరికివాడిని కానని ఒక వ్యాఖ్యానించడంతో రజనీ అభిమానులు కెప్టెన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తన పార్టీ అభ్యర్థులలో ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయిన విజయకాంత్.. చివరకు తాను కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఆయన విజయం సాధిస్తారా ? లేదా ? అన్నది కొద్దిసేపట్లో తేలనుంది.

 

10:18 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతున్నాయి. తమిళనాడులో మాత్రం ఉత్కంఠ నెలకొంది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. కానీ ఇక్కడ జయలలితకే ప్రజలు పట్టం కడుతారని స్పష్టమవుతోంది. అన్నాడీఎంకే 132 స్థానాల్లో, డీఎంకే 94 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. మొదట్లో డీఎంకే అధిక్యంలో కొనసాగినా అన్నాడీఎంకే తరువాత పుంజుకుంది. కింగ్ మేకర్ అవుదామని అనుకున్న విజయ్ కాంత్ ఆశలు అడియాశలయ్యాయి. 234 స్థానాలకు 118 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. ఈ మార్క్ ను అన్నాడీఎంకే ఎప్పుడో దాటివేసినట్లు తెలుస్తోంది.
జయలలిత, కరుణానిధి, స్టాలిన్ లు ముందంజలో ఉన్నారు. విజయ్ కాంత్, శరత్ కుమార్ లు వెనుకంజలో ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ జైతయాత్ర కొనసాగుతోంది. 210టీఎంసీ, 33 స్థానాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ 33 స్థానాల్లో దూసుకెళుతున్నాయి. అస్సాంలో 79 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, 20 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ 126 స్థానాల్లో 66 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. కేరళలో వామపక్ష కూటమి గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఎల్డీఎఫ్ 88 స్థానాల్లో, యూడీఎఫ్ 50 స్థానాల్లో విజయం సాధించే దిశగా వెళుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 71గా ఉంది. పాండిచ్చేరి 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకెళుతున్నాయి.

వెనుకంజలో కెప్టెన్ విజయ్ కాంత్!

చెన్నై : సీఎం పీఠాన్ని అధిరోహిస్తానని గంటా పథంగా చెప్పిన రిషివందీయం నియోజకవర్గం నుంచి కెప్టెన్ విజయ్ కాంత్ వెనుకంజలో వున్నారు.

జయలలిత చరిత్ర సృష్టించనుందా?....

తమిళనాడు : ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా అమ్మ తల్లక్రిందులు చేసింది. తమిళ ఓటర్లు సంప్రదాయాన్ని తిరగరాశారు. అన్నాడీఎంకే జోరుగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అధినేత్రి తమిళనాడులో చరిత్ర సృష్టించారు. కింగ్ అవుతానన్న సినీ నటుడు విజయ్ కాంత్ ఆశలు అడియాశలయ్యాయి.

క్రికెటర్, బిజెపి అభ్యర్థి శ్రీశాంత్ వెనుకంజ

కేరళ : తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి వీఎస్‌ శివకుమార్‌ ఆధిక్యంలో ఉన్నారు. 

విజయం దిశగా అమ్మ

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో జయలలిత విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే 119, డీఎంకే 73, పీఎంకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 

పాలేరులో తుమ్మల ఆధిక్యంలో కొనసాగుతున్నారు...

ఖమ్మం : పాలేరు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. ఐదు రౌండ్లు ముగిసేసరికి 18,584 ఓట్ల ఆధిక్యంతో తుమ్మల ముందంజలో వున్నారు.

విజయం దిశగా తుమ్మల

ఖమ్మం: పాలేరులో మంత్రి తుమ్మల విజయం దిశగా దూసుకెళుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మూడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తియ్యేసరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల 13,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డి పోటీ చేసినా రెండో స్థానంలో నిలిచారు. 

09:59 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతాయనే అంచనాలు ఏర్పడుతున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం ఫలితాలు తారుమారవుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి టెన్ టివితో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు మాట్లాడారు. కేరళలో స్పష్టంగా వామపక్ష కూటమికి పట్టం కట్టారని తెలుస్తోందన్నారు. యూడీఎఫ్ పరిపాలన, ఎల్డీఎఫ్ పరిపాలన తేడాను ప్రజలు గుర్తించారని, 80 సీట్లకు పైగా ఎల్డీఎఫ్ అధిక్యంలో కొనసాగుతోందన్నారు. ఈ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బెంగాల్ లో గెలుస్తామనే భ్రమల్లో తాము లేమన్నారు. అరాచక పాలనలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని తాము పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. బలమైన ప్రతిపక్షమా ? బలహీన ప్రతిపక్షమా అనేది చూడాల్సి ఉందన్నారు. తృణముల్ అధికారంలోకి వచ్చిన తరువాత అరాచక పాలన కొనసాగిందన్నారు. ఎంతో మందిని హత్య చేశారని, లెఫ్ట్ ఫ్రంట్ నిర్మాణం కుప్పకూలిందన్నారు. రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలు బయటకొచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపించే విధంగా ఎన్నికల అధికారులు కృషి చేశారని తెలిపారు. తమిళనాడులో ప్రత్యామ్నాయం చూపెట్టలేకపోయాయని, ప్రజలు చీలిపోయి ఉన్నారని తెలిపారు. బీజేపీ డబ్బు కుమ్మరించిదని, ఓట్లు రాబట్టడానికి ప్రయత్నించిందన్నారు. కుల, మతాలను ఒకటి..రెండు సీట్లు గెలవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకి సంబంధించిన తీర్పు కాదని, వామపక్షాలకు ప్రోత్సాహకరంగానే ఫలితాలు ఉన్నాయన్నారు.

తమిళనాడులో అన్నాడీఎంకే దూసుకుపోతోంది....

తమిళనాడు : రాష్ట్రంలో పోటీ చేసిన స్థాలు 234 కాగా 185 స్థానాలలో ఫలితాలు వెలువడ్డాయి. ఏఐడీఎంకే -112, డీఎంకే-71,కాంగ్రెస్ , పీడబ్ల్యూఎఫ్ ,బీజేపీ ఇంకా బోణీ చేయలేదు.ఇతరులు-2 లుగా ఫలితాలు వెలువడ్డాయి. కౌంటింగ్ కొనసాగుతోంది.

కేరళలో ఎల్డీఎఫ్ హవా కొనసాగుతోంది...

కేరళ : ఎర్రజెండా హవా కొనసాగుతోంది. ఎల్డీఎఫ్-88, యూడీఎఫ్-49, బీజేపీ-2, ఇతరులు-1గా ఫలితాలు వెలువడ్డాయి. కౌంటింగ్ కొనసాగుతోంది.

09:47 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ఎన్నికల కౌంటింగ్ చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. అనంతరం ఈవీఎంలు లెక్కిస్తున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

 • వెస్ట్ బెంగాల్ ఫలితాలు.. 294 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ 212 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 44, వామపక్ష పార్టీలు 31 స్థానాల్లో విజయబావుటా ఎగరవేశారు.
 • తమిళనాడులో ఓట్ల శాతం..
 • తమిళనాడులో ఏఐడీఎంకే 42.3 శాతం, డీఎంకే 39.5 శాతం, పీటీడబ్ల్యూఎఫ్ 5.9 శాతం. పీఎంకే 5.5, బీజేపీ 2.1, ఇతరులు 4.8 ఓట్ల శాతంగా నమోదయ్యాయి..
 • రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కాంగ్రెస్ నేత తరుణ్ గోగోయ్‌ వైపు అసోం ప్రజలు మొగ్గు చూపలేదు. అసోం సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సర్బానంద సోనోవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఓట్ల శాతం..పశ్చిమ బెంగాల్ లో..

 • టీఎంసీ 47.5 శాతం, లెఫ్ట్ 27.6, కాంగ్రెస్ 11.6 శాతం, బీజేపీ 10.4 శాతంగా నమోదయ్యాయి. (03.31)
 • కాంగ్రెస్ కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది. ఏఐఎన్ఆర్సీ 8 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 4 చోట్ల విజయం సాధించగా, ఇతరులకు ఒక్క స్థానం దక్కింది. (03.24)
 • కేరళలో బీజేపీ తరఫున పోటీ చేసిన క్రికెటర్ శ్రీశాంత్ ఓటమి
 • కేరళలో ప్రముఖ బీజేపీ నేత రాజశేఖరన్ ఎటమి కేరళలో యూడీఎఫ్ పార్టీ అభ్యర్థి మణి ఓటమి.
 • తమిళనాడులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయకాంత్ ఓటమి.
 • పీఎంకే అభ్యర్థి అన్‌బమణి రాందాస్ ఓటమి.
 • తమిళనాడులో శరత్ కుమార్ ఓటమి .
 • బెంగాల్లో బీజేపీ హౌరా నార్త్ నుంచి పోటీ చేసిన నటి రూపా గంగూలీ ఓటమి.
 • బెంగాల్లో ప్రముఖ నేతలు సూర్యకాంత్ మిశ్రా, దీపా మున్షీలు ఓటమి. (02.37)
 • కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ 91 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. యూడీఎఫ్ 46 చోట్ల విజయం సాధించింది. (02.22)
 • ప్రజలు తిరిగి ఎన్నుకోవడం బాధ్యత పెంచిందని ముఖ్యమంత్రి జయలలిత వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయ దుందుభి మోగించింది. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని హామీలు నెరవేరుస్తానని స్పష్టం చేశారు.  (02.21)
 • ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు దూసుకుపోతున్న పార్టీలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 1:34PM
 • మే 27వ తేదీన సీఎంగా మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం.. 1:20 PM
 • టీఎంసీ 74 స్థానాల్లో విజయం సాధించగా 139 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్ ఫ్రంట్ 4 స్థానాల్లో విజయం సాధించగా 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 1:18PM
 • పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యం సాధించింది. రెండోసారి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలకు తెలియచేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, తృణముల్ కు ఇది అపూర్వ విజయమని వ్యాఖ్యానించారు. (12.25)
 • జయ లలితా ఇంటి వద్ద అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. (12:10)
 • పశ్చిమ బెంగాల్ లో తృణముల్ దూకుడు కొనసాగుతోంది. మొత్తం 294 స్థానాలు ఉండగా టీఎంసీ ఏడు స్థానాల్లో విజయం సాధించగా 208 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్ ఫ్రంట్ 28, కాంగ్రెస్ 41, బీజేపీ 6, ఇతరులు 4 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. (12:01)
 • తమిళనాడులో చరిత్ర సృష్టించిన జయలలిత. ఎంజీఆర్ తరువాత వరసగా రెండోసారి జయలలిత అధికారంలోకి రాబోతున్నారు. 27 ఏళ్ల రికార్డును ఏఐడీఎంకే తిరగరాసింది. (11:55AM)
 • ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి జయలలిత, మమతా దీదికి ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేసినట్లు మోదీ ట్వీట్‌ చేశారు. (11.48AM)
 • పుదుచ్చేరి కాంగ్రెస్ 12, ఏఎన్ఆర్ సి 13, ఏఐడీఎంకే 2
 • పశ్చిమ బెంగాల్ (294) టీఎంసీ 211, సీపీఎం 31, కాంగ్రెస్ 43, బీజేపీ 7
 • తమిళనాడు (234) డీఎంకే 94, ఏఐడీఎంకే 133, పీడబ్ల్యూఎఫ్ 1
 • అస్సాం (126) బీజేపీ 80, కాంగ్రెస్ 28, ఏయూడీఎఫ్ 12.    (11.48AM)
 • బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇద్దరు మహిళా సీఎంలు మళ్లీ అధికారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇద్దరు కాంగ్రెస్ సీఎం లను కూడా ఓటర్లు ఇంటికి పంపించారు. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీకి భారీ మెజార్టీ అందించగా....తమిళనాడులో మళ్లీ జయలలితకే అధికారం అందించారు. (11.37AM )

  -అసోం లో బిజెపి వ్యూహం ఫలించింది. ఏజీపీ, బీపీఎఫ్ ల పొత్తులతో బిజెపి లాభపడింది. (11.35AM)

 • పుదుచ్చేరి కాంగ్రెస్ 13, డీఎంకే 0, ఏఐడీఎంకే 2, ఎన్ఆర్ సి 12
 • అస్సాం : కాంగ్రెస్ 27, బీజేపీ 80
 • పశ్చిమ బెంగాల్ : టీఎంసీ 208, సీపీఎం + 28, కాంగ్రెస్ 43, బీజేపీ 06
 • కేరళ : యూడీఎఫ్ 42, ఎల్డీఎఫ్ 95, బీజేపీ 1 ఇతరులు 02  (11.31)
 • ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక కౌంటిగ్ కొనసాగుతోంది. 12వ రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి మంత్రి తుమ్మల 35, 209 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. (11.25 AM)

 • అసోం: బిజెపి స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతుంది. బిజెపికి అధికారం కట్టబెట్టిన అసోం ప్రజలకు ఆ పార్టీ నేత రాం మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా శర్వానంద్ సోనే వాల్ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. (11.22AM)

   
 • కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి 5 స్థానాల్లో విజయం సాధించగా రెండు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గెలుపొందారు. (11.20AM)
 • కేరళ : తిరువనంతపురంలో క్రికెటర్ శ్రీశాంత్ (బిజెపి) ఓటమి (11:13AM)

 • 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పరాభవం ఎదురయ్యింది. ఓటమికి గల కారణాలపై చర్చిస్తామని పీసీ చాకో తెలిపారు. అయితే కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీది బాధ్యత కాదని చాకో స్పష్టం చేశారు. (11:11AM)

 • కేరళ అసెంబ్లీలో 80 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 11 స్థానాల్లో విజయం సాధించాయి. 80 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. యూడీఎఫ్ రెండు స్థానాల్లో విజయం సాధించగా 44 స్థానాల్లో అధిక్యంలో ఉంది.(10:55 AM)

 • కేరళ లో ప్రభుత్వ ఏర్పాటు ఎల్ డీఎఫ్ సమాయత్తం (10.43AM)

  చెన్నై : 1989 తర్వాత తమిళనాడులో జయలలిత వరుసగా రెండో సారి ఆధిక్యం సాధించిన పార్టీగా ఏఐఏడీఎంకే చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం ఏఐఏడీఎంకే 130, డీఎంకే 97, పీఎంకే 4, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. జయలలిత అధికారిక నివాసం పోయస్‌ గార్డెన్‌కు భారీగా చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జయలలిత ఐదు సార్లు, కరుణానిధి ఐదు సార్లు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తతం ఏఐఏడీఎంకే విజయం సాధిస్తే ఆరోసారి జయలలిత సీఎం పీఠాన్ని అధిష్టించనునున్నారు.  10.39 AM
 • ఉలుందూర్‌పేట్ నుంచి పోటీ చేసిన డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్‌కాంత్ వెనుకంజలో ఉన్నారు. ఏఐఏడీఎంకే లీడింగ్‌లో ఉండగా, డీఎంకే రెండో స్థానంలో కొనసాగుతుంది. (10.34AM)
 • తమిళనాడు : తిరు చెందూరులో శరత్ కుమార్ వెనుకంజలో ఉన్నారు. (10.32AM)

 • అసాం: బలంపురలో ఏజీపీ అభ్యర్థి ప్రఫుల్ కుమార్ మహంత ఆధిక్యంలో ఉన్నారు. సల్యారాలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థి బబ్రూర్తిన్ అజ్మల్ వెనుకంజలో ఉన్నారు. (10.31AM)

 • అసోం లో బిజెపి సీఎం అభ్యర్థి శర్వానంద్ సోనోవాల్ ముందజలో ఉన్నారు. (10.30AM)

 • చెన్నై :తమిళనాడులో తారుమారుఅవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. తమిళనాట అన్నాడీఎంకే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ముందు వెనుకబడిన అన్నాడీఎంకే తరువాత పుంజుకుంది. (10.27AM)

 • యానాం : పుదుచ్చేరిలో తొలి ఫలితం విడుదల ఆయ్యింది. యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కృష్ణారావు కు 8,749 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. (10:20AM)

 • చెన్నై : సీఎం పీఠాన్ని అధిరోహిస్తానని గంటా పథంగా చెప్పిన రిషివందీయం నియోజకవర్గం నుంచి కెప్టెన్ విజయ్ కాంత్ వెనుకంజలో వున్నారు. (10:18AM)

 • తమిళ ప్రజలు జయకు పట్టం కడుతున్నారు. అన్నాడీఎంకే 132 స్థానాల్లో, డీఎంకే 94 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. (10:11 AM)
 • చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో జయలలిత విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే 119, డీఎంకే 73, పీఎంకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. - (10:10AM)

 • కేరళ : తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి వీఎస్‌ శివకుమార్‌ ఆధిక్యంలో ఉన్నారు. (10:05AM)
 • అస్సాంలో కాంగ్రెస్ 21 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 79 అధిక్యంలో దూసుకెళుతోంది. (10:01AM)
 • కేరళలో 88 ఎల్డీఎఫ్, 47 యూడీఎఫ్ ముందంజలో ఉన్నాయి. (9:50AM)
 • తమిళనాడులో ఏఐడీఎంకే, డీఎంకే చెరో స్థానంలో ముందజలో ఉన్నాయి. (9:40AM)
 • పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ 29 స్థానాలు, లెఫ్ట్ ఫ్రంట్ 2, కాంగ్రెస్ 2, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. (9:54AM)
 • అసోం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ 12 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. (9:30AM)
 • పశ్చిమ బెంగాల్ లో ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగినట్లుగానే వెలువడుతున్నాయి. టీఎంసీ స్పష్టమైన అధిక్యంలో ఉంది. 294 స్థానాల్లో 178 స్థానాల్లో అధిక్యతలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది. అధికార టీఎంసీ 122 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా లెఫ్ట్ ఫ్రంట్ 27, కాంగ్రెస్ 26, బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. (9:15AM)
 • కేరళలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతున్నాయి. ఎల్డీఎఫ్ అధిక్యంలో కొనసాగుతోంది. 140 స్థానాల్లో 126 స్థానాల్లో అధిక్యతలు కొనసాగుతున్నాయి. ఎల్డీఎఫ్ 66 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా యూడీఎఫ్ 51, బీజేపీ 3, ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. (9:00AM)
 • 5 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్స్ లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. వాటి వివరాలు ఈ విధంగా...

  - వెస్ట్ బెంగాల్ : టీఎంసీ56 స్థానాలు, సీపీఎం 11, బిజెపి 2, కాంగ్రెస్ 9 స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

  - తమిళనాడు : ఎఐఏడీఎం కే 2, డిఎంకే 5 ఆధిక్యంలో ఉన్నాయి.

  - పుద్దిచ్చేరి: కాంగ్రెస్ 3, ఎఐఏడీఎంకే 3, ఎన్ ఆర్ సి 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

  - కేరళ : యూడీఎప్ 25, ఎల్ డీఎఫ్ 36, బిజెపి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. (8.30AM)

 •  కేరళ లో 140 అసెంబ్లీ స్థానాలకు జరిగన ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల మేరకు ఎల్ డిఎఫ్ 20, యూడిఎఫ్ 9, బిజెపి 1 స్థానంలో ముందజ లో ఉన్నట్లు తెలుస్తోంది. (8.20AM)

 • ప.బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. టిఎంసీ 19, సీపీఎం4, బిజెపి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. (8.10AM)

 • తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. డీఎంకే 3, ఎఐఏడీఎంకే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. (8.05AM)

 • ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పోస్ట్ బ్యాలెట్ ను మొదట లెక్కిస్తున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఓటరు ఎవరిని కరుణిస్తాడు... ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలో నిజమెంత అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. (8.00AM)

16,446 ఓట్ల మెజార్టీతో తుమ్మల

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్‌ఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 16,446 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. మరో 10 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 

తమిళనాడులో అన్నాడీఎంకే హవా.....

తమిళనాడు : తమిళనాడులో అమ్మ హవా కొనసాగుతోంది. చరిత్ర సృష్టించే దిశగా జయలలిత దూసుకుపోతున్నారు. అన్నాడీఎంకే వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాతావరణం తమిళ ఎన్నికల ఫలితాలలోకనిపిస్తోంది. ఆర్ కే నగర్ లో ఆధిక్యంలో అన్కాడిఎంకే అధినేత్రి జయలలిత కొనసాగుతున్నారు.

09:36 - May 19, 2016

తిరువంతపురం : ఎల్డీఎఫ్..చారిత్రాత్మక విజయం దిశగా దూసుకెళుతోంది. 140 సీట్లున్న కేరళలో 88 స్థానాల్లో ఎల్డీఎఫ్ అధిక్యంలో కొనసాగుతుండగా యూడీఎఫ్ 50 సీట్లకు పరిమితమైంది. 2006లో ఎల్డీఎఫ్ 75-80 సీట్లతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం భారీ అధిక్యంతో అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. 71 బెంచ్ మార్క్ ను ఎప్పుడో దాటివేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వూమెన్ చాందీ మినహా ఇతర నేతలందరూ పరాజయం దిశగా వెళుతున్నట్లు తెలుస్తోంది. ఓ. రాజగోపాల్ కొంత అధిక్యంలో కొనసాగుతున్నారు. ఎల్డీఎఫ్ 68 స్థానాల్లో, అధికార యూడీఎఫ్ 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో బీజేపీ తొలిసారి బోణీ చేసే అవకాశముంది. ప్రస్తుతం బీజేపీ రెండు చోట్ల ముందంజలో ఉంది.

 

కేరళలో ఎర్రజెండా ఎగరనుంది.....

కేరళ : కేరళలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజంగాకానున్నాయి.  ఎన్నికల ఫలితాలలో ఎల్ డీఎఫ్ హవా కొనసాగుతోంది. స్పష్టమైన ఆధిక్యంతో ఎల్ డీఎఫ్ దూసుకుపోతోంది. కేరళలో ఎల్ డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

09:32 - May 19, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డీఎంకే, ఏఐడీఎంకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే 58, డీఎంకే 51 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. డీఎండీకే ఒక స్థానంలో ముందంజలో ఉంది. మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలోని మొత్తం 16 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మూడు కేంద్రాల్లో జరుగనుంది. స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాల, గిండిలోని అన్నా విశ్వవిద్యాలయం, మైలాపూర్‌లోని క్వీన మేరీస్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు జరుగనుంది. తిరువళ్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల ఓట్లను పెరుమాళ్‌పట్టిలో వున్న శ్రీరాం విద్యాసంస్థలో లెక్కిస్తారు. అదేవిధంగా కాంచీపురం జిల్లాలోని 11 నియోజకవర్గాల ఓట్లను 6 కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కిస్తారు.
ఆర్కే నగర్ లో జయలలిత, తిరువారూర్ లో కరుణానిధి, కొళత్తూరులో స్టాలిన్ ముందంజలో ఉన్నారు. తిరుచెందూరులో శరత్ కుమార్ వెనుకంజలో కొనసాగుతున్నారు.

లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత..
లయోలా కళాశాల వద్ద డీఎంకే, ఏఐడీఎంకే వర్గాలు మోహరించాయి. అమ్మాదే విజయం..అయ్యాకే పట్టాభిషేకం అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించాయి. రెండు వర్గాలను సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

పాలేరులో ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం...

ఖమ్మం: పాలేరు ఎన్నికల్లో తుమ్మల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 13,810 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్తి తుమ్మల కొనసాగుతున్నారు. 

క్షణ క్షణానికీ మారిపో తున్న తమిళ ఎన్నికల ఫలితాలు...

తమిళనాడు : తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరా హోరీగా కౌంటింగ్ ఫలితాలు కొనసాగుతున్నాయి.క్షణక్షణానికీ తమిళనాడు ఫలితాల ట్రెండ్ మారుతోంది. సినీ నటుడు విజయకాంత్ రెండు వెనుకంజలో వున్నారు.

09:18 - May 19, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం దిశగా దూసుకెళుతున్నారు. లెక్కింపులో భాగంగా అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు. మొత్తం 14 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలవగా వాటిలో ఏడు ఓట్లను తుమ్మల కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి 14 ఓట్లలో ఆమె కూడా 6 ఓట్లను దక్కించుకున్నట్లు సమాచారం. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో తుమ్మల భారీ ఆధిక్యం సాధించారు. సుచరితారెడ్డి కంటే ఆయనకు 4,180 మేర అధికంగా ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో తుమ్మలకు 5,978 ఓట్లు రాగా, సుచరితారెడ్డికి కేవలం 1,798 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఈనెల 16న పాలేరు నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించగా... 89.73శాతం పోలింగ్‌ నమోదైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి సుచరితారెడ్డి... సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌తో పాటు... 13మంది స్వతంత్ర్య అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో ఇక్కడ బైపోల్ జరిగింది.

09:15 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్ లో అధికార తృణమాల్ కాంగ్రెస్, కేరళలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. 140 స్థానాల్లో 132 ఫలితాలు వెలువడుతున్నాయి. 73 స్థానాల్లో ఎల్డీఎఫ్ అధిక్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది. 51 స్థానాల్లో యూడీఎఫ్ ఉన్నట్లు అంచనా. తమిళనాడులో మాత్రం హోరాహోరీ పోరు కొనసాగుతుందని అంచనా.
అన్నాడీఎంకే 46 స్థానాల్లో, 37 స్థానాల్లో డీఎంకే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కరుణానిధి, స్టాలిన్ లు అధిక్యంలో కొనసాగుతున్నారు. అస్సాంలో బీజేపీ 27 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో ముందంజలో దూసుకెళుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ 125 స్థానాల్లో, 29 స్థానాల్లో వామపక్ష కూటమి దూసుకెళుతోంది. ఇక్కడ 26 స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది.

సాంకేతిక లోపంతో నిలిచిన మాచర్ల - భీమవరం రైలు

గుంటూరు: సాంకేతిక లోపంతో మాచర్ల - భీమవరం  రైలు వెళ్లే నడికుడి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. 

09:09 - May 19, 2016

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ దూసుకపోతోంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ లో నువ్వా..నేనా అన్నట్లు కొనసాగింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ హోరాహోరీ పోరు కొనసాగుతుందని తెలుస్తోంది. మొదటి రౌండ్ ముగిసే సరికి 75 నుండి 78 స్థానాల్లో ఎల్డీఎఫ్ అధిక్యంలో కొనసాగుతున్నట్లు అంచనా. 45 స్థానాల్లో యూడీఎఫ్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. వీఎస్ అచ్యుతానందన్ 10 వేల మెజార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆధిక్యం దిశగా తుమ్మల...

ఖమ్మం :పాలేరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల 5400 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయపథంలో పయనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఎన్నికల బరిలోకి దిగిన రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి వెనుకంజలో ఉన్నారు.

పాలేరు ఎన్నికల్లో తుమ్మల ఆధిక్యం...

ఖమ్మం : పాలేరులో ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోలైన 14 బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ -7,కాంగ్రెస్ -6, రెండో రౌండ్ లో తుమ్మలకు 9,606 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

బెంగాల్ లో టీఎంసీ, కేరళలో ఎల్ డిఎఫ్, అస్సాంలో బిజెపి...

హైదరాబాద్ : 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. వాటి వివరాలు ఈ విధంగా...

వెస్ట్ బెంగాల్ : టీఎంసీ 126 స్థానాలు, సీపీఎం29, కాంగ్రెస్ 27, బిజెపి 3, అదర్స్ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు : ఎఐఏడీఎం కే 45, డిఎంకే 37, అదర్స్ 1 ఆధిక్యంలో ఉన్నాయి.

వాయుగుండం బంగ్లాదేశ్, మయన్మార్ వైపు వెళ్లే అవకాశం

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తన దిశను మార్చుకుంటూ పయనిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్-మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరొకొన్ని గంటల్లో వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకశం ఉందని తెలపింది. ఇప్పటికే 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

09:00 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ హావా కొనసాగుతోంది. 107 స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు అంచనా. వామపక్ష కూటమి 21 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం.
తమిళనాడులో హోరాహోరీ పొరు కొనసాగుతోంది. అన్నాడీఎంకే, ఏఐడీఎంకే మధ్య నువ్వా..నేనా అన్నట్లు జరుగుతోంది. అన్నాడీఎంకే 26 స్థానాల్లో, డీఎంకే 20 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నట్లు అంచనా. కేరళలో కూడా హోరాహోరీ జరుగుతుందని అంచనా. ఎల్డీఎఫ్ 49 స్థానాల్లో, యూడీఎఫ్ 38 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఇక్కడ ఖాతా తెరవబోతోందని అంచనా. అసోంలో బీజేపీ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఆరు, అన్నాడీఎంకే నాలుగు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పాలేరులో ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పాలేరు మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 5400 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

5 రాష్ట్రాల్లో ఫలితాలు ఇలా..

హైదరాబాద్ : 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. వాటి వివరాలు ఈ విధంగా...

వెస్ట్ బెంగాల్ : టీఎంసీ71 స్థానాలు, సీపీఎం, కాంగ్రెస్ 24, బిజెపి 1, అదర్స్ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు : ఎఐఏడీఎం కే 32, డిఎంకే 25 ఆధిక్యంలో ఉన్నాయి.

08:51 - May 19, 2016

ముందుగా చిట్లిన చివరలను కత్తిరించాలి. తర్వాత రెండు చుక్కల వెజిటెబుల్‌ నూనెను(పొద్దు తిరుగుడు పువ్వు నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌) అరచేతిలోకి తీసుకొని బాగా చేతులకు రుద్దుకొని జుట్టు చివరల రుద్దాలి.
హెయిర్‌ క్రీమ్‌ను తీసుకొని దానిని వాటర్‌లో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి మెదలు నుండి చివరి వరకు జుట్టుకు స్ప్రే చేయాలి. తర్వాత దువ్వుకోవాలి. దీని వలన స్ప్రే చేసిన ఆయిల్‌ జుట్టుకు పడుతుంది. ఇట్లా వారానికి ఒకసారి తలస్నానం చేసే ముందర చేస్తే జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
ఒక గుడ్డు, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆముదం నూనె, నిమ్మ రసం, ఒక టీ స్పూన్‌ గ్లిజరిన్‌ లేదా తేనె తీసుకుని వీటన్నింటిని కలిపి జుట్టుకు పట్టించాలి. తర్వాత తలకు షవర్‌క్యాప్‌ను చుట్టుకోవాలి. ఒకగంట తర్వాత తలస్నానం చేయండి. అంతే నిగనిగలాడే జుట్టు మీ ముందుంటుంది.

08:49 - May 19, 2016

చాలా మంది అవసరమైనవి తినకుండా నోటికి రుచిగా ఉండే నూడుల్స్‌, చాక్లెట్స్‌ పెడుతుంటారు పిల్లలకు. అయితే ముఖ్యంగా ఆడ పిల్లలకు కాల్షియం చాలా ఎక్కువగా లభిస్తేనే శక్తి అందుతుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకోసం. మన దేశంలో 40శాతానికి పైగా పిల్లలు క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. తగినంత క్యాల్షియం ఉంటేనే ఎముకల పటిష్టత బాగుంటుంది. ఇవి సప్లిమెంటరీగా మందుల ద్వారా కాకుండా వారు తినే ఆహారపదార్థాల నుండే సమకూర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. ఎముకలను రక్షించే క్యాల్షియం, జింక్‌పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మీ పిల్లలు ఎదిగే సమయంలో బుడి.. బుడి.. అడుగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వారి చేయి పట్టుకొని నడిపిచండి ఎందుకంటే వారి ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. 18 నెలల నుంచి ఎముకలు పటిష్టంగా, బలమైనవిగా ఏర్పడే దశ. కాబట్టి మెల్లగా నడిపించడానికి ప్రయత్నిచండి. శారీరకంగా పెద్దవాళ్ళ కంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఎముకలు బలంగా తయారై ముందుకు నడవటానికి ఇదే ప్రారంభ దశ అనీ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా చిన్న పిల్లల కదలికలు, వారి అలవాట్లు గంతులేయటం, పరుగెత్తటం, నడవటం ఇవన్నీ 18 నెలల నుంచి మొదలవుతాయి ఈ దశను శిశుదశ అంటారు. పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. వ్యాధి నిరోధక శక్తిని పెంచటానికి, బలమైన కండరాల కోసం, ఎక్కువ ఉత్సాహంగా ఉండటానికి తల్లిపాలు చాలా అవసరం. భవిష్యత్‌లో ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతాయి. వయస్సు పైబడినా అన్ని పనులు ఉత్సాహంగా చేసుకోవడానికి, పరుగెత్తటం, ఎగరటానికి కండరాల, ఎముకల పాత్ర ప్రధానమైనది. శారీరకంగా అరోగ్యంగా ఉన్న వారిలో ఆలోచనా విధానం ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటుంది. మానసికంగా ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సామరస్యంగా ఎదుర్కొనే ధోరణి అలవడుతుంది. అలాంటి లక్షణాలన్నీ చిన్న వయస్సు నుంచే అలవడతాయి. పదిహేడేండ్ల నుంచి ఎముకలు, కండరాల పెరుగుదలలో, పరిమాణంలో చాలా మార్పులు వస్తాయి. వయస్సు పైబడిన తర్వాత ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగిపోతే అవి అతుక్కోవటం చాలా కష్టం.

విద్యుత్ షాక్... యువకుడి మృతి

కరీంనగర్ : మంథని మండలం గంగపురిలో ఇటుకబట్టి వద్ద విద్యుత్‌షాక్‌తో శంకర్‌ అనే యువకుడు మృతి చెందారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 

08:44 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ను చేపట్టారు. అరగంట అనంతరం ఈవీఎంలు తెరుస్తారు. ఐదు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ నిజమౌతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ హవా కొనసాగుతోంది. 56 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. వామపక్షాల కూటమి 11 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుందని అంచనా. ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యంలో ఉందని తెలుస్తోంది. తృణముల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా. తమిళనాడులో ఓట్ల లెక్కింపు స్లోగా కొనసాగుతోంది. అన్నాడీఎంకే వెనుకంజలో ఉందని తెలుస్తోంది. డీఎంకే 5 స్థానాల్లో ముందజంలో ఉందని తెలుస్తోంది. ఈ అంచనా ఎంత నిజం అవుతుందో వేచి చూడాలి. డీఎంకేకు అధికారాన్ని కట్టబెడుతారా ? లేదా ? అనే ఉత్కంఠ కొద్దిసేపట్లో తేలనుంది. ఇక కేరళలో ఎల్డీఎఫ్ లో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. 35 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. యూడీఎఫ్ 15 స్థానాల్లో ముందజలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసోంలో బీజేపీ రెండు స్థానాల్లో ముందజలో కొనసాగుతుందని అంచనా. పాండిచ్చేరిలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కొద్దిసేపట్లో తేలనుంది.

5 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు పూర్తి...

హైదరాబాద్ : 5 రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్స్ లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. వాటి వివరాలు ఈ విధంగా...

వెస్ట్ బెంగాల్ : టీఎంసీ56 స్థానాలు, సీపీఎం 11, బిజెపి 2, కాంగ్రెస్ 9 స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు : ఎఐఏడీఎం కే 2, డిఎంకే 5 ఆధిక్యంలో ఉన్నాయి.

పాలేరులో ఆధిక్యతలో టీఆర్‌ఎస్‌

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. 11 గంటలలోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. 150 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. పాలేరులో ఆధిక్యతలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతుంది.

5 రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌటింగ్...

హైదరాబాద్ : కేరళ లో 140 అసెంబ్లీ స్థానాలకు జరిగన ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల మేరకు ఎల్ డిఎఫ్ 20, యూడిఎఫ్ 9, బిజెపి 1 స్థానంలో ముందజ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప.బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. టిఎంసీ 19, సీపీఎం4, బిజెపి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. డీఎంకే 3, ఎఐఏడీఎంకే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.

08:28 - May 19, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ జయలలిత అధికారం నిలబెట్టుకుంటుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. నాలుగింటిలోల మూడు డీఎంకే గెలుస్తుందని అంచనా వేశాయి. 2011లో కావెరి డెల్టాలో 54 సీట్లకు 44, పశ్చిమ ప్రాంతంలో 48 సీట్లలో 34 స్థానాలు గెలిచి మంచి ఫలితాలను పొందిన అన్నాడీఎంకే నష్టపోతేనే డీఎంకేకు లబ్ధి చేకూరుతుందనే విశ్లేషకులు పేర్కొంటున్నారు. లయోలా కాలేజీలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కపెడుతున్నారు. చెన్నై నగరంలో మూడు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16 నియోజకవర్గాలకు సంబంధించి 233 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. డీఎంకే అధికారంలోకి వస్తుందా ? అమ్మ కొత్త చరిత్ర సృష్టిస్తుందా అని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డీఎంకే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ బుధవారం రెండు సర్వేలు వెలువడ్డాయి. అనూహ్యంగా ఏఐడీఎంకే విజయం సాధిస్తుందని, 130 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని
ఆ రెండు సర్వేలు పేర్కొన్నాయి. విజయకాంత్ ఏర్పాటు చేసిన పార్టీ ఎవరికి గండి కొడుతుందో కొద్దిసేపట్లో తేలనుంది.

16 నియోజకవర్గాలు..
చెన్నైలోని మొత్తం 16 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మూడు కేంద్రాల్లో జరుగనుంది. స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాల, గిండిలోని అన్నా విశ్వవిద్యాలయం, మైలాపూర్‌లోని క్వీన మేరీస్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు జరుగనుంది. తిరువళ్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల ఓట్లను పెరుమాళ్‌పట్టిలో వున్న శ్రీరాం విద్యాసంస్థలో లెక్కిస్తారు. అదేవిధంగా కాంచీపురం జిల్లాలోని 11 నియోజకవర్గాల ఓట్లను 6 కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కిస్తారు.

పాలేరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. 14 టేబుళ్లు ఏర్పాటు, 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. 11 గంటల లోపు ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఒరిస్సా వైపు దిశ మారిన వాయుగుండం....

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్రా తీరానికి సమాంతరంగా,.. మచిలీపట్నానికి అత్యంత సమీపంగా పయనిస్తోంది. దీంతో ఏపీలోని తీరప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుండడంతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌ అయింది. కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  

08:17 - May 19, 2016

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఓటరు ఎవరిని కరుణిస్తాడు.. ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలో నిజమెంత అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. అరగంట తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అసోంలో తరుణ్ గొగోయ్, బీజేపీ తరపన సీఎం అభ్యర్థిగా సర్బానంద సోనోవాల్, తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అగ్రనేత కరుణానిధి, కేరళలో సీఎం వూమెన్ చాందీ, సీపీఎం నేతలు వీఎస్ అచ్యుతానందన్, పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత సూర్యకాంత మిశ్ర, పుదుచ్చేరిలో సీఎం ఎం. రంగస్వామిల భవతవ్యం తేలనుంది.

తిరువనంతపురంలో..
తిరువనంతపురంలో కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ ప్రారంభమైంది. పుదుచ్చేరి రంగసామికి ఇబ్బందులు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొదటి అరగంట వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. అరగంట వరకు ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసి ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ బీజేపీ డీల పడినట్లు తెలుస్తోంది. మొత్తం 140 నియోజకవర్గాలున్నాయి. అధికారంలోకి రావాలంటే కనీసం 71 సీట్లు చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. వామపక్ష కూటమికి 85-90 సీట్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ క్రికెటర్ శ్రీశాంత్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఓటర్ ఈ పార్టీని కరుణించలేదు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ఇక్కడ ప్రచారం నిర్వహించారు. కానీ ఆయా సభలు పూర్తిగా వెలవెలబోయాయి. మరి ఎవరు గెలుస్తారో ? ఎవరు పరాజయం చెందుతారో చూడాలి.

పలు రైళ్లు రద్దు...మరికొన్ని వేళల్లో మార్పులు...

గుంటూరు: భారీ వర్షాల కారణంగా గుంటూరు-నంద్యాల మార్గంలో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు చేసినట్టు పేర్కొంది. రేపు ఉదయం 6 గంటలకు కర్నూల్‌ డోన్‌ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ను రద్దు చేశారు. అదే రోజు రాత్రి 7.45 గంటలకు వెళ్లాల్సిన విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10.30 గంటలకు బయలుదేరనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

తెలంగాణ ఐసెట్‌ ప్రశ్నాపత్రం సెట్‌ కోడ్‌ బి ఎంపిక

హైదరాబాద్: నేడు తెలంగాణ ఐసెట్‌ జరగనుంది. ఐసెట్‌ ప్రశ్నాపత్రం సెట్‌ కోడ్‌ బి ఎంపిక చేశారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 127 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు చెప్పారు.

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ కాలేజీ ప్రవేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో (2016-17) ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు సమర్పించాలని సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల నిబంధన పాటిస్తూ, మెరిట్ ఆధారంగానే సీట్ల బర్తీ ఉంటుందని దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి కౌన్సిలింగ్ ఉండదని ఆయన తెలిపారు. ఆన్లైన్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ నే స్వీకరిస్తామని, విడిగా వస్తే స్వీకరించబోమని స్పష్టం చేశారు. అప్లై చేయడంకోసం http://tswreis.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

08:09 - May 19, 2016

విజయవాడ : నీరు-ప్రగతి ఉద్యమంలా సాగాలని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాపాడే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరముందని తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు జూన్‌ 2న నవ నిర్మాణ దీక్ష చేపడతామన్నారు.

తూ.గో జిల్లాలో చంద్రబాబు పర్యటన....

ఏపీ సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని బొమ్మూరులో చంద్రబాబు గిరిజన యువత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో పుస్తకాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళా పాఠశాలను ప్రారంభించారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం చేయూత ఎంతైనా అవసరం...

రాజమండ్రి అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో మున్సిపల్‌ స్టేడియం అభివృద్ధి పనులతో పాటు.. నాగులచెరువు మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడిపై రైతులతో చర్చించారు. సాగు, తాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యతిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు.. నదులన్నింటిని అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం చేయూత ఎంతైనా అవసరమన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు జూన్‌ 2న నవ నిర్మాణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు చంద్రబాబు. అనంతరం జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించిన బాబు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిన ఉన్నప్పటికీ వర్షం కారణంగా రద్దు చేసుకున్నారు. ఇక ఈ పర్యటనలో జిల్లాకు బాబు వరాల జల్లు కురిపిస్తారని ఆశపడ్డ ప్రజలకు నిరాశే ఎదురైంది. 

08:07 - May 19, 2016

హైదరాబాద్ : విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. పేపర్ల మీదే కాలేజీలు నడుపుతూ ప్రభుత్వం నుంచి భారీగా రాయితీలు పొందుతున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. కాలేజీల యాజమాన్యాల కక్కుర్తికి చెక్‌ పెట్టేందుకు ప్రవేశాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపట్టాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

విద్యాసంస్థల రాశి పెరుగుతున్నా బోధనలో వాసి పెరగడం లేదు...

విద్యాసంస్థల రాశి పెరుగుతున్నా బోధనలో వాసి పెరగడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా సందర్భాల్లో ఆవేదన వెలిబుచ్చారు. కొన్నిసాఫ్ట్‌వేర్‌ సదస్సులకు హాజరైన కేసీఆర్‌కు.. సాంకేతిక నిపుణులు, మేధావులు... రాష్ట్రంలోని విద్యా ప్రమాణాల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయాలను కొన్ని సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించిన సీఎం... విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిని ఇప్పుడు ఆచరణలో పెట్టేందుకు కార్యాచరణకు దిగుతున్నారు.

ఉద్యోగ, ఉపాధికి అనుగుణంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన.....

విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్‌... చదివిన చదువుకు సార్ధకత ఉండేలా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అన్ని స్థాయిల్లో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరారు. కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా కాలేజీలను తీర్చిదిద్దేందుకు సమయం ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటికి కూడా మార్పురాకపోతే ఆ తర్వాత జరిగే పరిణమాలను ఆయా కాలేజీల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

బోధనా పద్ధతులు ప్రామాణికంగా ఉండాలి .....

విద్య వ్యాపారంగా మారడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్‌.... ఇలాంటి యాజమాన్యాలపై కన్నెర్ర చేశారు. బోధనా పద్ధతులు ప్రామాణికంగా ఉండాలని సూచించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, జవాబుదారీతనం లేని కాలేజీలు విద్యావ్యవస్థ నుంచి తప్పుకోవాలని కేసీఆర్‌ కోరారు. విద్యార్థులు, అధ్యాపకులు లేకుండా.... తనిఖీలు జరగుతున్న సమయంలో వేరే కాలేజీల నుంచి బోధనా సిబ్బంది తీసుకొచ్చి చూపించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది.

అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలకు నిర్ణయం.....

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్‌ చాన్సలర్ల పోస్టులు, అనుబంధ కాలేజీలో ఉన్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని... కేసీఆర్‌ ఆదేశించారు. ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఆన్‌లైన్‌ అడ్మిషన్లను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. డిగ్రీల కాలేజీల్లో ఫీజుల విధానాన్ని త్వరలో ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడమే కాకుండా... నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది సర్కార్‌ లక్ష్యం. కాలేజీల్లో పోలీసు తనిఖీలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ పాటిస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు.... ప్రభుత్వం నిర్ణయంపై ఎలా స్పందిస్తాయో చూడాలి. 

పాలేరు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

ఖమ్మం : పాలేరు ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పోస్ట్ బ్యాలెట్ ను మొదట లెక్కిస్తున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఓటరు ఎవరిని కరుణిస్తాడు... ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలో నిజమెంత అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

08:03 - May 19, 2016

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్రా తీరానికి సమాంతరంగా,.. మచిలీపట్నానికి అత్యంత సమీపంగా పయనిస్తోంది. దీంతో ఏపీలోని తీరప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుండడంతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌ అయింది. కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

దిశను మార్చిన వాయుగుండం...

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి దిశను మార్చుకోవడంతో ఏపీలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఒడిశా, పశ్చిమబంగ వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయి. భారత భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం జూన్ తొలినాటికే శ్రీలంక మీదుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో అనుకున్న సమయాని కంటే ముందే భారత్‌లో రుతుపవనాలు విస్తరించనున్నాయి.

తీరప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ...

తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండడంతో తీరప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టు, విశాఖపట్నం పోర్టుల్లో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంట గంటకు 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న సమాచారంతో జిల్లాలన్నీ అప్రమత్తమయ్యాయి. తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ వర్షాలు ...

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగం, చేజర్ల, ఎఎస్‌పేట, అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి నెల్లూరు పట్టణంలోని రోడ్లన్ని జలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో నగరంలోని పిండిమిల్లు సెంటర్‌లో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. గాలి ఉధృతికి ఇంటిపైకప్పులు, ఎగిరిపోయాయి. వాయుగుండం ప్రభావంతో జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో...

వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతి పరిసరాల్లో కుండపోత వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ప్రధాన ఆలయంలో కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వెంటనే స్పందించిన ఆలయ అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నీటిని తోడి బయటకు పంపుతున్నారు. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఒంగోలులో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం...

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే చీరాల, కనిగిరి, పర్చూరు, ఒంగోలులో వర్షం కురుస్తుండడంతో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నెంబర్లను ప్రకటించారు. కలెక్టరేట్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077కాగా...పోలీస్‌ కార్యాలయం టోల్‌ఫ్రీ నెంబర్‌ 9440627389, 08592231220 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. చీరాల ఓడరేవులో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. వాయుగుండం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. శిబిరాలలో తాగునీరు, నిత్యావసర సరుకులు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. తీర ప్రాంతగ్రామాల వీఆర్వోలు, వీఆర్‌ఏలు గ్రామాల్లోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో బందరు పోర్టులో 3వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అటు వాయుగుండం ప్రభావంతో గుంటూరు జిల్లాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్‌లో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, రాజమండ్రి, కోరుకొండలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ లోనూ చెదురు మదురు వర్షాలు...

ఇటు తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు చెదురుముదురు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో పిడుగుపడడంతో ప్రధాన గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయి. 

నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులు..

నెల్లూరు : రోను తుపాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు గూడురు, కావలి, ఆత్మకూరు, నాయుడు పేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

ఇంగ్లండ్ - శ్రీలంక తొలి టెస్టు..

ఢిల్లీ : మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ - శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న లంక జట్టు మొత్తం మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఒక టీ 20 మ్యాచ్ ఆడనుంది.

07:59 - May 19, 2016

ఢిల్లీ : ఐదుగురు సీఎంలు మళ్లీ పీఠమెక్కుతారా ? నేటితో వారి సీఎం గిరి ముగుస్తుందా ? అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపట్లో జరగనుంది. దేశంలోనే కీలక రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ రాష్ట్రాల సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ (పశ్చిమ బెంగాల్), జయలలిత (తమిళనాడు), ఉమెన్ చాందీ (కేరళ), తరుణ్ గోగోయ్ (అసోం), రంగసామి (పుదుచ్చేరి) భవితవ్యం తేలిపోనుంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం పలు పార్టీలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో ? ఎవరు పరాజయం చెందుతారో కొద్దిసేపట్లో తేలిపోనుంది.

 

07:59 - May 19, 2016

ఖమ్మం : ఉత్కంఠ రేపిన పాలేరు ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో విజేత ఎవరో తేలిపోనుంది.... ఫలితాలకోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, అన్ని పార్టీల కార్యకర్తలు, అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం

పాలేరు ఉప ఎన్నిక లెక్కింపు గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ పత్తి గోదాంలోని స్ట్రాంగ్‌రూం దగ్గర 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండుకు 14 ఈవీఎంల లెక్కింపు పూర్తికానుంది. పోలింగ్ జరిగింది 243 పోలింగ్‌ కేంద్రాలు కావడంతో...

89.73శాతం పోలింగ్‌ నమోదు.....

ఈనెల 16న పాలేరు నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించగా... 89.73శాతం పోలింగ్‌ నమోదైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి సుచరితారెడ్డి... సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌తో పాటు... 13మంది స్వతంత్ర్య అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో ఇక్కడ బైపోల్ జరిగింది..

స్ట్రాంగ్‌ రూం దగ్గర భారీ బందోబస్తు ...

మరోవైపు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో కేంద్రం 6 ప్రత్యేక బలగాలను ఇక్కడకు పంపింది. వీరితో పాటు.. రాష్ట్ర పోలీసులు కూడా కాపలా కాస్తున్నారు. రేపు ఉదయం 11గంటల వరకు వచ్చే ఈ ఫలితం కోసం అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

కొద్దిసేపట్లో పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్..

ఖమ్మం : పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఖమ్మంలోని పత్తి మార్కెట్ యార్డు ప్రాంగణంలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

నేడు ఐసెట్..

వరంగల్: నేడు ఐసెట్ పరీక్ష జరుగనుంది. కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్ ప్రశ్నపత్రం సెట్-బి ఎంపిక చేశారు. సెట్-బిని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఎంపిక చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 72,448 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

07:56 - May 19, 2016

హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి రెండు నెలల పాటు సాగిన హోరా హోరీ పోరుకు సోమవారంతో తెరపడింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమై... మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకు కావలసిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తిం చేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు రాష్ట్రాల్లో ఫలితాలపై దాదాపు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ...

మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఈవీఎం కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజెట్‌ రూపంలో విడుదల చేస్తారు.

ఓట్ల లెక్కింపుకు వర్షాలు ఆటంకంగా మారుతాయోమోనన్న సందేహాలు...

మరోవైపు ఓట్ల లెక్కింపుకు వర్షాలు ఆటంకంగా మారుతాయోమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కౌంటింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. గత రెండు రోజులుగా కేరళలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అస్సాంలో వర్షాల కారణంగా హైలకండి, కరీంగంజ్‌ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గౌహతిలో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

మే 16తో ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికలు...

మే 16తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీల భవితవ్యం ఎలా ఉండనుందో ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. కేరళ, తమిళనాడు, అసోంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో డిఎంకె, కేరళలో సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలోకి రానున్నాయని సర్వేలు అంచనా వేశాయి. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిసారిగా బిజెపి అధికారంలోకి రానుందని చెప్పాయి. పశ్చిమబెంగాల్‌లో మమత మళ్లీ అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపాయి. కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో డీఎంకే కూటమితో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే కనిపిస్తోంది.

ఎగ్జిట్‌పోల్స్‌పై ఆయా పార్టీలు స్పందనలు...

ఎగ్జిట్‌పోల్స్‌పై ఆయా పార్టీలు స్పందించాయి. అస్సాంలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి తరుణ్‌గోగోయ్‌ విశ్వాసంతో ఉన్నారు. అస్సాం ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెబుతున్నారు. అన్నాడిఎంకే నేతలు ఎక్జిట్‌పోల్స్‌ను నమ్మలేమని చెప్పారు. కాగా టిఎంసి, డిఎంకెలు మాత్రం ఎగ్జిట్‌పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశాయి. పశ్చిమబెంగాల్‌లో సిపిఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకాన్ని ఆ పార్టీల నేతలు వ్యక్తం చేశారు. ప్రజలు సంకీర్ణానికే ఓటేశారన్న ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ నిజమౌతాయా? బీహార్‌ మాదిరి తలకిందులౌతాయా? అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

తుపాన్ గా బలపడిన వాయుగుండం..

హైదరాబాద్ : వాయుగుండం మచిలీపట్నం తీరంగా తుపానుగా బలపడింది. మచిలీపట్నం తీరం నుంచి తుపాను ఉత్తర దిశగా కదులుతోంది. శుక్రవారానికి ఆంధ్రా-ఒడిశా తీరంలో తుపాను మరింత బలపడుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, ఒడిశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేడు నల్గొండలో మంత్రుల పర్యటన

నల్గొండ : నేడు జిల్లాలో మంత్రులు హరీష్ రావు, చందులాల్, జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. నాగార్జున సాగర్ లోని పైలాన్ కాలనీలో కృష్ణా పుష్కర పనులకు హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. 

నేడు టిడిపిలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు..

పశ్చిమగోదావరి : వైసీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు నేడు సొంత పార్టీ టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్ : మినీ భారత సంగ్రామంలా సాగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఓటరు ఎవరిని కరుణిస్తాడు... ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలో నిజమెంత అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 

Don't Miss