Activities calendar

20 May 2016

21:57 - May 20, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌లో ఖాకీల కర్కశత్వం మరోసారి బయటపడింది. ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో బిజ్నోర్‌ పోలీసులు ఓ యువకుడిని విచక్షణ రహితంగా కొట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒక పోలీసు ఈవ్‌టీజర్‌ను కొడుతుంటే ఇద్దరు పోలీసులు అతడికి సహకరిస్తున్నారు. పోలీసులు గొడ్డును బాదినట్లు బాదడంతో ఆ యువకుడు విలవిలలాడిపోయాడు.

 

21:54 - May 20, 2016

త్రివేండ్రం : కేరళ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్‌ వీడింది. నూతన ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ ఎంపికయ్యారు. సిఎం పదవికి విజయన్‌ పేరును ఖరారు చేసినట్లు సిపిఎం ప్రకటించింది. 72 ఏళ్ల విజయన్‌- కేరళకు 22వ ముఖ్యమంత్రి కానున్నారు.
విజయన్‌ను ఏకగ్రీవ ఎన్నిక
కేరళ ముఖ్యమంత్రి పీఠాన్ని పినరయి విజయన్‌ అధిష్టించనున్నారు. తిరువనంతపురంలో జరిగిన సిపిఎం పొలిట్‌బ్యూరో సమావేశం సిఎంగా విజయన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర కమిటీలోని మెజారిటీ సభ్యులు సిఎం పదవికి 72 ఏళ్ల విజయన్‌ వైపే మొగ్గు చూపారు. పొలిట్‌ బ్యూరో సమావేశానికి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌  హాజరయ్యారు. 
వయసు దృష్ట్యా అచ్యుతానందన్‌ను ఎంపిక చేయలేదు : ఏచూరి
వయసు దృష్ట్యా అచ్యుతానందన్‌ను సిఎం పదవికి ఎంపిక చేయలేదని సీతారాం ఏచూరి చెప్పారు. అచ్యుతానందన్‌ కేరళకు ఫిడేల్‌ క్యాస్ట్రో లాంటి వారని అభివర్ణించారు. ఆయన మార్గదర్శకత్వంలో కొత్త ప్రభుత్వం నడచుకుంటుందని ఏచూరి తెలిపారు.
2002 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులుగా విజయన్‌ 
కొల్లం ప్రాంతానికి చెందిన పినరయి విజయన్‌ 2002 నుంచి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. గత 52 ఏళ్లుగా ఆయన కమ్యునిస్టు పార్టీకి సేవలందిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే విజయన్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1970 నుంచి పలుమార్లు ఆయన విధానసభకు ఎంపికయ్యారు. రాజకీయాల్లో అట్టడుగు స్థాయి నుంచి ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
ఎల్డీఎఫ్‌ విజయం వెనక అచ్యుతానందన్‌ పాత్ర 
ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సిఎం, సిపిఎం కురువృద్ధ నేత 92 ఏళ్ల అచ్యుతానందన్‌ కూడా పోటీ పడ్డారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వెటరన్‌ లీడర్‌ గురువారం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్‌ విజయం వెనక అచ్యుతానందన్‌ పాత్ర కూడా ఎంతో ఉంది.
ఎల్‌డిఎఫ్‌ ఘన విజయం 
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌పై సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 140 సీట్లకు గాను ఎల్‌డిఎఫ్ 91 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 47 సీట్లకు పరిమితమైంది. కేరళ చరిత్రలో తొలిసారిగా బిజెపి ఖాతా తెరవగా, ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. ఓటమిని అంగీకరించిన ఊమెన్‌ చాందీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

21:47 - May 20, 2016

హైదరాబాద్ : ఫ్రాన్స్ లో ఐదురోజుల పర్యటన విజయవంతమైందని గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్ అన్నారు. ఫ్రాన్స్ చారిత్రక ప్రాధాన్యం గల నగరమైనా హైదరాబాద్‌తో చాలా పోలికలున్నాయని చెప్పారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను స్టడీ చేశామని మేయర్‌ తెలిపారు. బోర్డేసిటీ ప్రతినిధులతో చర్చించామని పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రతినిధి బృందం అక్టోబర్‌, నవంబర్‌లో ఇక్కడ పర్యటిస్తుందని ప్రకటించారు. 

21:40 - May 20, 2016

విశాఖ : ఏపీపై రోన్‌ తుపాను ప్రభావం తగ్గింది. తుపాను ఒడిశా తీరం వైపు కదలడంతో దీని ప్రభావం తగ్గింది. ఇది ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గంటకు 30 కి.మీ వేగంతో గోపాల్‌ పూర్‌కు 50 కి.మీ, పారాదీప్‌కు 300 కి.మీ.. దూరంలో కేంద్రీకృతమయ్యింది. మరోవైపు రోను తుపాను ప్రభావంతో పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. విద్యుత్‌, రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. 
ఎపికి తప్పిన రోన్‌ గండం 
ఆంధ్రప్రదేశ్‌కు రోన్‌ గండం తప్పింది. తీవ్ర తుపాను మారి విధ్వంసం సృష్టిస్తుందనే భయాందోళనలో ఉన్న ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రోన్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ తీరంలోనే తీవ్ర తుపాను మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల తుపాను తీవ్రత భారీగా ఉండే అవకాశముందని భావించారు. ఐతో రోన్‌ తుపాను ఒడిశా దిశగా కదులుతోంది. దీంతో తీవ్ర తుపాను నుంచి ఆంధ్రప్రదేశ్‌ తప్పించుకుంది. తుపాను ఒడిశా తీరంవైపు వెళ్లిపోవడంతో... దక్షిణ కోస్తాకు ప్రమాదం లేదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
రోను తుపాను మూలంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో 193 కిలోమీటర్లు పొడవున సాగర తీరం ఉండడంతో తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కవిటి మండలం ఇద్దివానిపాలెంలో సముద్రం 50 మీటర్ల ముందుకొచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అలాగే గార మండలం కళింగపట్నం వద్ద పదిహేను మీటర్ల మేర సాగరం ముందుకొచ్చింది. 
విజయనగరం జిల్లాలో భారీగా వర్షాలు  
రోను ఎఫెక్ట్ తో విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు  కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. 
ఉప్పు రైతుల్ని రోడ్డున పడేసిన రోను తుఫాన్
రోను తుఫాన్ విశాఖ జిల్లా ఉప్పు రైతుల్ని రోడ్డున పడేసింది.. చేతికొచ్చిన ఉప్పు వర్షం దెబ్బకు నీటిపాలైంది.. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు..పరవాడ మండలం వాడచీపురుపల్లి రైతులకు ఈ వర్షాలు కన్నీటిని మిగిల్చాయి.. ఉప్పు నిల్వలపై ప్లాస్టిక్ కవర్లు కప్పినా ఉపయోగంలేకుండా పోయింది.
కృష్ణా జిల్లాలో తీవ్ర నష్టం  
తుఫాను తీవ్రత కృష్ణాజిల్లాలో తీవ్ర నష్టం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అవనిగడ్డ లాంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తి స్ధాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఓడరేవుల్లో నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

 

21:34 - May 20, 2016

హైదరాబాద్‌ : నగరంలో గాలి దుమారం మరోసారి బీభత్సం సృష్టిచింది. కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో విజృంభించిన గాలి దుమారం నగరం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. జెట్‌స్పీడ్‌తో  వీచిన చంఢ ప్రచండమైన గాలులకు నగరంలోని పెద్ద పెద్ద వృక్షాలు సైతం కుప్పకూలాయి. ఒక్క ఉదుటున వీచిన గాలికి విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు, రేకుల ఇండ్లు, గుడిసెలన్నీ పేకమేడలా కూలిపోయాయి. టన్నుల కొద్ది బరువుండే హోర్డింగులు సైతం గాలిదెబ్బకు నేలకొరిగాయి. ఓ వైపు గాలి బీభత్సం సృష్టిస్తే..ఇక  కుండపోతగా కురిసిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. భారీ వర్షం కారణంగా ఇద్దరు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. 
వణికిన నగరం 
హోరున వీచిన గాలికి నగరం మొత్తం ఒక్కసారిగా చిగురుటాకులా వణికింది. కేవలం ఐదంటే  ఐదే నిమిషాల్లో నగరం మొత్తం గాలి దుమారంతో అల్లకల్లోలంగా, బీతావహంగా తయారైంది. రాకెట్‌ వేగం కంటే  స్పీడ్‌తో వీచిన గాలికి నగరంలోని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు, ఇళ్లపైకప్పులు, రేకులన్నీ ఎగిరిపోయి కుప్పకూలాయి. 
కుప్పకూలిన హోర్డింగులు
ఇక్కడ మీరు చూస్తున్న ఈ హోర్డింగు టన్నుల కొద్ది బరువుంటుంది. ఇంత భారీ సైజు, బరువున్న ఈ హోర్డింగ్‌ సైతం గాలి సృష్టించిన బీభత్సానికి ఇలా కుప్పకూలింది. దీంతో 8 కార్లు ధ్వంసమయ్యాయి. పలు ద్విచక్ర వాహనాలు సైతం నామరూపాల్లేకుండా చితికిపోయాయి. 
బీభత్సానికి నగరం షేక్‌ 
ఐదు నిమిషాలు సృష్టించిన గాలి బీభత్సానికి నగరం మొత్తం ఒక్కసారిగా షేక్‌ అయింది. గాలి దుమారానికి  రోడ్లపై గంటల కొద్ది ట్రాఫిక్‌ స్తంభించడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక తికమకపడ్డారు. 
కుండపోత వర్షం 
భీకరమైన గాలికి తోడు భయంకరమైన ఉరుములు, మెరుపులతో నగరంలోని చాలాచోట్ల కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఏ ప్రాంతంలో చూసినా రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌, కుషాయిగూడ, సికింద్రాబాద్‌, పద్మారావునగర్‌, విద్యానగర్‌లలో భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌, ఈసీఐఎల్‌, మాదాపూర్‌, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్‌, అమీర్‌పేట, అంబర్‌పేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్‌ పరిధిలోని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. 
వందకుపైగా చెట్లు నేలకూలాయి
ఆకస్మాత్తుగా ప్రారంభమైన గాలి దుమారానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో వందకుపైగా చెట్లు నేలకూలాయి. ఎస్వీకే  సెంటర వద్ద 3 చెట్లు విరిగిపడ్డాయి. ఓ భారీ వృక్షం విరిగి వాహనాలపై పడింది. దీంతో ఆటో, పలు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. వర్షం కారణంగా గోడలు కూలి అత్తాపూర్‌లో ఒకరు, బిల్లింగ్‌పై నుండి ట్యాంక్‌ మీదపడి పాతబస్తీలో మరొకరు మృతిచెందారు. ప్రమాదాల కారణంగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 5 విద్యుత్ స్తంభాలు, 64 ట్రాన్స్‌ఫార్మార్లు కాలిపోయినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో వైర్లు తెగిపోయి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. 
రోడ్లన్నీ జలమయం 
ఇక నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆఫీసునుంచి ఇంటికెళ్లేందుకు ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వర్షం, ఈదురుగాలులతో వాతావరణం అనుకూలించక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు బెంగుళూరుకు ఎయిపోర్టుకు మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. 
జీహెచ్‌ఎంసీ అప్రమత్తం
మరోవైపు భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. గ్రేటర్ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి కార్యాలయం నుంచే పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల నోడల్ ఆఫీసర్లు కంట్రోల్‌ రూంకు చేరుకోవాలని కమిషనర్‌ ఆదేశించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎమర్జన్సీ టీంలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కమిషనర్‌ ఆదేశించారు. 

భారత్ లో వేధింపులు ఎదుర్కొన్న 79 శాతం మంది మహిళలు

హైదరాబాద్ : భారతదేశంలో జీవిస్తున్న మహిళల్లో దాదాపు 79 శాతం మంది వేధింపులు ఎదుర్కున్న వారేనని లండన్‌కు చెందిన యాక్షన్‌ఎయిడ్ సర్వే వెల్లడించింది. ప్రపంచంలో మహిళలకు భద్రత కలిగిన సిటీలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఇండియాతో పాటు బ్రెజిల్, యుకె, థాయ్‌లాండ్‌లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో ఇండియాలో 84 శాతం మంది మహిళలు ఏదో ఒక సందర్భంలో వేధింపులను ఎదుర్కున్న వారేనని తేలింది. వీరిలో 25 నుంచి 35 సంవత్సరాల మహిళలే ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఈ వరుసలో బ్రెజిల్ ముందుండటం గమనార్హం. బ్రెజిల్‌లో దాదాపు 89 శాతం మంది మహిళలు హింసను ఎదుర్కొన్న వారేనని సర్వే తెలిపింది.

పిడుగు పడి బాలిక మృతి

మెదక్ : జిల్లాలో పిడుగు పాటుకు ఓ బాలిక మృతి చెందింది. సిద్దిపేట మండలం బక్రిచెట్యాలలో పిడుగుపాటుకు సౌజన్య బాలిక మృతి చెందింది. సాయంత్రం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం భారీ కురిసింది. వర్షానికి పటానుచెరువు, రామచంద్రాపురంలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

హైదరాబాద్ లో గాలివాన...స్తంభించిన జనజీవనం

హైదరాబాద్‌ : నగరంలో ఇవాళ సాయంత్రం గాలి వాన బీభత్సం కారణంగా నగర జీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలను రోడ్లపైకి రావద్దని అధికారులు సూచనలు చేశారు. కాగా, లిబర్టీ, ఖైరతాబాద్, సెక్రటేరియట్ పరిసరాల్లో ట్రాఫిక్ జాం అయింది. సుమారు రెండు గంటలకు పైబడి వాహనచోదకులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

 

అకాల వర్షానికి ఒకరి మృతి...

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఆకాల వర్షానికి ఒకరు మృతి చెందాడు. పాతబస్తీ జహంగీర్‌నగర్‌లో గాలివానకు సింథటిక్‌ వాటర్‌ ట్యాంక్స్ ఎగిరిపడింది. ట్యాంక్ పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

సీఎం చంద్రబాబును కలిసిన ఉద్యోగ జేఏసీ

విజయవాడ : ఉద్యోగ జేఏసీ సీఎం చంద్రబాబును కలిశారు. రాజధానికి ఉద్యోగులు తరలింపు, పీఆర్ సీ తదితర అంశాలపై ఉద్యోగులు చర్చించారు. పీఆర్ సీ ప్రకటించి రెండేళ్లవుతున్న 40 వేల మంది ఉద్యోగులకు ఇంకా అమలు చేయలేదని ఎపి ఎన్ జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు విమర్శించారు.  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ పే-స్కేలు ప్రకారం జీతాలు ఇవ్వాలన్నారు. రాజధానికి జూన్ 10 లోపు ఉద్యోగులను తరలించాలని సీఎంను కోరామని తెలిపారు. 

 

20:46 - May 20, 2016

కమెడియన్ రఘుతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రఘు పలు కామెడీ డైలాగులతో అలరించాడు.  తన సినీ కెరీర్ ను తెలిపారు. సినీ జీవితంలో తన అనుభవాలను వివరించారు. నటులు రాజీవ్ కనకాల, ధన్ రాజ్, హాస్యనటుడు పృథ్వీ రఘుకి ఫోన్ కాల్ చేసి గొంతు మార్చి మాట్లాడి ఆట పట్టించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

కిడ్నాపర్ ని అరెస్టు చేసిన పోలీసులు...

హైదరాబాద్: చిన్నారులను కిడ్నాప్‌ చేసి ఆభరణాలు చోరీ చేసే రవికిరణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రవికిరణ్ 150 కేసుల్లో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారం, 2.7 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటుగా చోరీ బంగారం కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీ,14 మందికి గాయాలు...

వరంగల్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం గట్టమ్మ వద్ద ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మందికి గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గాయపడని వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.

పిడుగు పాటుకు బాలిక మృతి...

మెదక్ : పిడుగు పాటుకు ఓ బాలిక మృతి చెందింది. సిద్దిపేట మండలం బక్రిచెట్యాలలో పిడుగుపాటుకు సౌజన్య బాలిక మృతి చెందింది. సాయంత్రం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

అసిస్టెంట్ మేనేజర్ వేధిస్తోందంటూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన

హైదరాబాద్ : డిపో అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు. హయతనగర్ డిపో-01 అసిస్టెంట్ మేనేజర్ తమను వేధిస్తోందంటూ సిబ్బంది ఇవాళ సాయంత్రం విధులు బహిష్కరించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట ధర్నా చే స్తున్నారు.

 

20:14 - May 20, 2016

హైదరాబాద్ : తెలంగాణలో భార్యాభర్తలైన ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలను ఒకేచోటకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

భారత్ లో 79 శాతం మందికి వేధింపులు ....

హైదరాబాద్ : భారతదేశంలో జీవిస్తున్న మహిళల్లో దాదాపు 79 శాతం మంది వేధింపులు ఎదుర్కున్న వారేనని లండన్‌కు చెందిన యాక్షన్‌ఎయిడ్ సర్వే వెల్లడించింది. ప్రపంచంలో మహిళలకు భద్రత కలిగిన సిటీలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఇండియాతో పాటు బ్రెజిల్, యుకె, థాయ్‌లాండ్‌లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో ఇండియాలో 84 శాతం మంది మహిళలు ఏదో ఒక సందర్భంలో వేధింపులను ఎదుర్కున్న వారేనని తేలింది. వీరిలో 25 నుంచి 35 సంవత్సరాల మహిళలే ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఈ వరుసలో బ్రెజిల్ ముందుండటం గమనార్హం. బ్రెజిల్‌లో దాదాపు 89 శాతం మంది మహిళలు హింసను ఎదుర్కొన్న వారేనని సర్వే తెలిపింది.

ఘర్షణలో బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ తీవ్ర గాయాలు

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలోని ముసోరిలోని సిల్ గుర్ దేవతా ఆలయం బయట జరిగిన ఘర్షణలో బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఎంపీ కారు కూడా ధ్వంసమైంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ ఎంపీ తరుణ్ విజయ్ ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో వ్యక్తి హత్య

ఖమ్మం : జిల్లాలోని అశ్వారావుపేట మండలం అల్లిపురంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని అరటి తోటలో ఒంటినిండా గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. వెంటనే సీఐ రవికుమార్, ఎస్సై శ్రీను సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకుక్కునూరు మండలం సీదర గ్రామానికి చెందిన ప్రేమ్(33)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిన విమానాలు

హైదరాబాద్ : నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల బీభత్సంతో పలుచోట్ల చెట్లు పడిపోవడం, హోర్డింగ్ లు, ట్రాఫిక్ స్తంభించిపోవడం జరిగింది. దీంతో గాలివాన బీభత్సం ప్రభావం శంషాబాద్ ఎయిర్ పోర్టుపై కూడా పడింది. సాయంత్రం 5 గంటల నుంచి పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన విమానాల్లో 'స్పైస్ జెట్' కూడా ఉంది. కాగా, పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

 

జీజీహెచ్ లో తొలిసారి గుండె మార్పిడి ఆపరేషన్

గుంటూరు : జిల్లాలో సాధారణ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో తొలిసారి గుండె మార్పిడి శాస్త్ర చికిత్స జరిగింది. శుక్రవారం జీజీహెచ్ లో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో గుండె మార్పిడి శాస్త్ర చికిత్స జరిగింది. గుంటూరులోని స్వర్ణభారత్ నగర్ నివాసి ఏడుకొండలకు గుండెను అమర్చారు. ఈ శస్త్రచికిత్స చేసేందుకు డాక్టరు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేతోపాటు ఆయన బృందానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు.... గోపాలకృష్ణ గోఖలే బృంధానికి అభినందనలు తెలిపారు.

19:42 - May 20, 2016

విజయవాడ : ఏపీ సచివాలయం తరలింపు ప్రక్రియ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ సచివాలం జే బ్లాక్‌లోని 5వ అంతస్తులో గల ప్రణాళికశాఖ కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్న ప్రక్రియ వేగవంతమైంది. ప్రణాళికశాఖకు సంబంధించిన ఫైళ్లు, ఫర్నీచర్‌ను అమరావతికి తరలిస్తున్నారు. ఫర్నీచర్‌నంతా డీసీఎంలు, లారీల్లోకి ఎక్కిస్తూ వాటిని అమరావతికి తరలిస్తున్నారు అధికారులు.

19:38 - May 20, 2016

గుంటూరు : తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. మంగళగిరి మండలం చిన్నకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. విజయవాడ సింగినగర్‌కు చెందిన ఇమిడిబత్తుని ఏడుకొండలు  44 వ్యక్తి ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించగా..ఏడుకొండలు గుండెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఊపిరిత్తులను హైదరాబాద్‌కు , లివర్‌ను మణిపాల్‌కు, కిడ్నీలు ఎన్‌ఆర్‌ఐ, విజయవాడలోని అరుణ్‌ ఆసుపత్రులకు తరలించారు. కళ్లు వాసన్‌ ఐకేర్‌ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలోని వైద్యులు ఈ అరుదైన ఘనతను సాధించారు. గోఖలే బృంధాన్ని మంత్రులు రావెల కిశోర్‌బాబు, ప్రతిపాటి అభినందించారు.

బీజేపీ ఎంపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ : బీజేపీ ఎంపీ కిరిట్ సోమైయాకు ఢిల్లీ హైకోర్టు నుంచి తాఖీదులందాయి. రూ.10 కోట్లు నష్ట పరిహారం కోరుతూ రాహుల్ గాంధీ సహాయకుడు కనిష్క సింగ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

 

19:35 - May 20, 2016

నేల విడిచి సాము చేసే కథలను ప్రేక్షకులు మెచ్చే రోజులు కావివి. కథా కథనాల్లో సహజత్వమున్న సినిమాలకే ఆదరణ దక్కుతోంది. మూస ధోరణి పాటల, ఫైట్ల కొలతలు బెడిసికొడుతున్నాయి. అందుకే...పేరున్న పెద్ద హీరోలు కూడా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నారు. సూపర్ మ్యాన్ లా ఫీట్లు చేయకుండా....అందిరికీ నచ్చే సకుటుంబ చిత్రాలను చేస్తున్నారు. సేఫ్ జోన్ సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్న మహేష్ బాబు...మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కుటుంబ బంధాలను కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ...బ్రహ్మోత్సవంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
కథ....
బ్రహ్మోత్సవం కథ విషయానికొస్తే...పెయింట్స్ కంపెనీ యజమాని సత్యరాజ్. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి. చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాడు. తనతో పాటు పదిమందీ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వమున్నవాడు. సత్యరాజ్ వారసుడు మహేష్ బాబు. తండ్రిలాగే తన చుట్టున్న వాళ్లను సంతోషంగా ఉంచాలని తాపత్రయ పడతాడు. బంధువులు, వాళ్ల పిల్లల ఆటపాటలతో ప్రతిరోజు ఇళ్లంతా ఉత్సవంలా ఉంటుంది. బంధువైన కాజల్ కూడా సెలవుల్లో వీళ్ల ఇంటికి వస్తుంది. మహేష్ , కాజల్ ఒకరినొకరు ఇష్టపడతారు. ఐతే...కుటుంబ సభ్యులకు మహేష్ అంత సమయం కేటాయించడం ఇష్టం లేని కాజల్...మహేష్ కు దూరమవుతుంది. మేనల్లుడు మహేష్ తో తన కూతురు ప్రణీత పెళ్లి చేయాలనుకున్న రావు రమేష్...వీళ్ల ప్రేమ విషయం తెలిసి ఇంట్లోంచి వెళ్లి పోతాడు. కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకునే ఇంటిపెద్ద సత్యరాజ్...రావు రమేష్ వెళ్లి పోవడంతో కలతపడతాడు. మిగతా వాళ్లు ఇలాగే వెళ్లిపోతారేమోనని వేదనకు గురవుతాడు. ఈ బాధతోనే తుదిశ్వాస విడుస్తాడు. ఇక్కడికి సగం సినిమా కంప్లీట్ అవుతుంది. తండ్రి కోరిక మేరకు తన కుటుంబ సభ్యులను మిగతా తరాల వారిని మహేష్ ఎలా ఒక్కటి చేశాడన్నది మిగిలిన కథ. 
విశ్లేషణ..
కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలన్న విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఊహలకు రూపమే బ్రహ్మోత్సవం. జీవితం వేగమై...మనుషులు కలుసుకోవడమే గగనమైన నేటి పరిస్థితుల్లో కుటుంబం అంతా కలిసే ఉండాలన్నది మంచి ఆలోచన. మనిషికి మనిషి తోడు ఉండటమే అసలైన ఐశ్వర్యమనేది ఒక్కమాటలో బ్రహ్మోత్సవం మూలకథ. ఐతే ..దీన్ని సినిమాగా ఆకట్టుకునేలా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. కొన్నిసార్లు తానేం చెబుతున్నాడో స్పష్టత కోల్పోయాడు. ముఖ్యంగా సినిమా రెండో అర్థభాగంలో తన ముందు తరాలను మహేష్, సమంత వెతికే క్రమంలోని సన్నివేశాలు ప్రేక్షకులు నీరసించేలా చేశాయి. మళ్లీ కథ ముగింపు వచ్చే సరికి తేరుకున్న దర్శకుడు...క్లైమాక్స్ తో మెప్పించాడు.

సినిమాలో ఒకే ఒక్క ఫైట్....నటుడిగా మహేష్ బాబులో ఎంత మార్పు వచ్చిందనేది చూపిస్తుంది. ఇలాంటి సూపర్ స్టార్ సినిమా ..ఫైట్లు లేకుండా దర్శకులు, నిర్మాత చివరికి అభిమానులు కూడా అంగీకరించరు. ఐతే కథను నమ్మిన మహేష్...కంప్లీట్ ఫ్యామిలీ కథను ఫాలో అయ్యాడు. నటనలో మహేష్ కిది మరో ఉత్తమ చిత్రం. తండ్రి సత్యరాజ్ చనిపోయే సీన్ లో మహేష్ అత్యుత్తమ నటన చూపించాడు. పస్టాఫ్ లో కాజల్, సెకండాఫ్ లో సమంత ఆకట్టుకున్నారు. కానీ వాళ్లలో ఏదో ఆకర్షణ తగ్గినట్లు అనిపిస్తుంటుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రావు రమేష్ తో మరోసారి మంచి పాత్ర చేయించాడు. నరేష్, షాయాజీ షిండే, నాజర్, కృష్ణ భగవాన్ పాత్రలన్నీ తేలిపోయాయి. వాళ్లకు నటించేందుకు ఏమీ లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కుదరలేదు.

ఫ్లస్ పాయింట్స్

    మూల కథ
    మహేష్ బాబు నటన
    నిర్మాణ విలువలు
    
మైనస్ పాయింట్స్

    కుదరని కథనం    
    స్పష్టత లోపించిన దర్శకత్వం
    రెండో అర్థభాగం సన్నివేశాలు
    తేలిపోయిన ప్రధాన పాత్రలు
    
టెన్ టివి రేటింగ్.. 1.75/5

19:34 - May 20, 2016

హైదరాబాద్ : అమరావతిని ప్రపంచంలోని 10 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ఆమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. రాజధానిలో భవనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దేశీయ రూపశిల్పులతో ఆకృతులు తయారు చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన వారసత్వ సంపద లండన్‌ మ్యూజియంతో పాటు చెన్నై, హైదరాబాద్‌లోని ప్రదర్శనశాలల్లో ఉందని..దాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతిని దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 

19:30 - May 20, 2016

విశాఖ : బ్రాండిక్స్‌ కార్మికులు కనీస వేతనాల కోసం ఏళ్లతరబడి పోరాడుతున్నా... పాలకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. పైగా చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న కార్మికులపై ఫ్యాక్టరీ యాజమాన్యం, పోలీసులు ఉక్కుపాదం మోపారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. సీఎం  మళ్లీ జిల్లా పర్యటనకు రానున్న సందర్భంలోనైనా కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేస్తారా... లేక హక్కులకు కాలరాస్తున్న యాజమాన్యానికి వత్తాసు పలుకుతారా.. అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

రోజురోజుకు పెరుగుతున్న కార్మికుల సమస్యలు...
విశాఖ జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలో ఉన్న బ్రాండిక్స్‌ కార్మికుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్రాండిక్స్‌తోపాటు, దీని అనుబంధ విభాగాల్లో కలిపి దాదాపు 15 వేల మంది పని చేస్తున్నా... ఈ కంపెనీలో కనీస వేతనాలు కూడా అమలు కావడంలేదు. యాజమాన్యం కార్మిక చట్టాలను కాలరాస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. పదేళ్ల క్రింతం బ్రాండిక్స్‌ను ప్రారంభించినప్పుడు రెండు వేల రూపాయల వేతనంలో సరిపెట్టేవారు. ఎన్నో ఆందోళనలు, ఉద్యమాల తర్వాత పదేళ్లలో మరో రెండు వేల రూపాయాలు పెంచారు. కార్మికల కష్టాన్ని దోపిడీ చేస్తూ వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బ్రాండిక్స్‌ యాజమాన్యం... కనీస వేతనాల అమలు గురించి పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి.

పదేళ్ల పోరాటంలో రూ.2వేలు పెంచిన యాజమాన్యం....
నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్న ఈ రోజుల్లో 4 వేల రూపాయల వేతనంలో బతకడం ఎంత కష్టమో ప్రభుత్వానికి, బ్రాండిక్స్‌ యాజమాన్యానికి తెలియని విషయంకాదు. కానీ కార్మిక శక్తిని పీల్చి పిప్పిచేసి.. కోట్లు దండుకోడానికి అలవాటుపడ్డ యాజమాన్యానికి కష్టజీవుల వేతన సమస్యలు పట్టవు. వేతనాలు పెంచాలంటూ బ్రాండిక్స్‌ కార్మికులు గతనెల 15 నుంచి 30 వరకు సమ్మె చేశారు. కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం మోపిన యాజమాన్యం... పోలీసుల సాయంతో పాచవికంగా లాఠీచార్జ్‌ చేయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉన్న సయమంలోనే ఇదంతా జరిగింది. దమననీతితో నిర్బంధకాండను ప్రదర్శించి సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. బ్రాండిక్స్‌ కార్మికులతోపాటు, సమస్యల పరిస్కారం కోసం ఉద్యమిస్తున్న వీరికి బాసటగా నిలిచిన సీఐటీయూ నేతలను అరెస్టు చేయించింది.

 వేతనాలు పెంచుతామన్న హామీ విస్మరించిన యాజమాన్యం...
సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన యాజమాన్యం... ఆ తర్వాత దీని అమలును విస్మరించింది. బ్రాండిక్స్‌ కార్మికుల ఉద్యమానికి వైసీపీ అధినేత జగన్‌ కూడా మద్దతు ఇచ్చారు. ఇరవై రోజుల్లో బ్రాండిక్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర ప్రతిఘటనోద్యమం తప్పదని అప్పట్లోనే అల్టిమేటం ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు కూడా కార్మికులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇచ్చిన హామీని ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటనకు రాబోతున్నారు. అప్పుడైనా పరిష్కరిస్తే మంచిదేనని కోరుతున్నారు. లేకపోతే మళ్లీ పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు.

యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాలి : కార్మికులు
వేతనాల పెంపు విషయంలో బ్రాండిక్స్‌ యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే జరిగే పరిణామాలకు ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని కార్మిక నేతలు వార్నింగ్‌ ఇస్తున్నారు.

కార్మికుల సమస్యలకు చర్యలు తీసుకుంటాం : గంటా శ్రీనివాసరావు
బ్రాండిక్స్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా తెలిపారు. హెచ్‌ఆర్‌డీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత కూడా వేతనాలు పెంచకపోతే భవిష్యత్‌ కార్యాచారణ రూపొందించాలన్న ఆలోచనలో బ్రాండిక్స్‌ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. 

రోడ్డు ప్రమాదంలో 14 మందికి గాయాలు

వరంగల్ : జిల్లాలోని ములుగు మండలం గట్టమ్మ గ్రామం సమీపంలో సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయాల పాలయ్యారు. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ములుగు వైపు వస్తుండగా ఎదురుగా వేగంతో వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 14 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

18:26 - May 20, 2016

కడప : అన్ని అవయవాలు సహకరిస్తున్నా... చక్కటి ప్రోత్సాహమున్నా కొందరు విద్యార్థులు పరీక్షల్లో డుంకీ కొడుతుంటారు. సరైన లక్ష్యం లేక విఫలమవుతుంటారు. అటువంటివారందరూ ఆమెను చూసి సిగ్గుపడాలి. అవును...ఆమె ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా అవన్నీ ఆమె మనో ధైర్యం ముందు దిగదుడుపయ్యాయి. అందుకే తను ఎవరికీ సాధ్యం కాని అద్భుతాన్ని సృష్టించింది. ఇప్పుడామెకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. చూడ్డానికి అందరు అమ్మాయిల్లానే కనిపిస్తుంది.. ఈ బాలికకు ఏం లోపముందని ప్రశ్నిస్తారు. కానీ ఈమెకు పుట్టుకతోనే కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలు ఉన్నవాళ్లు విద్య తదితర యాక్టివిటీస్‌లో చాలా వెనకబడి ఉంటారు. కానీ ఈ అమ్మాయి అలా కాదు..తనలాంటివారు ఎందరికో సాధ్యం కానిదాన్ని సుసాధ్యం చేసింది..

పుట్టుకతోనే మూగ చెవుడుతో పుట్టిన నాగలక్ష్మి....
కడప జిల్లాలోని బదిరకు చెందిన జి.నాగలక్ష్మి పుట్టుకతోనే మూగ, చెవిటి సమస్యలతో జన్మించింది. దీంతో ఆటపాటలకు దూరంగా ఇంట్లోనే పెరిగింది. తన ఈడు పిల్లలు బడికి వెళుతుంటే విద్యలో రాణించాలని ఉన్నా శారీరక, ఆర్థిక సమస్యలతో చాలాకాలం చదువులకు దూరమైంది. అయితే ఆమె పట్టుదలను గుర్తించిన సర్వశిక్షా అభియాన్‌ అధికారులు ఆమెను బ్రహ్మంగారి మఠం కస్తూరిబా గాంధి వైద్యాలయంలో చేర్చించారు. దీంతో నాగలక్ష్మి ఆశలకు జీవం పోసినట్లైంది. ఇద్దరు సమ్మిళిత ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించడంతో పదో తరగతి పరీక్షలకు హాజరైంది. అంతేకాదు ఈ మధ్యే వెలువడిన టెన్త్ ఫలితాల్లో 10కి పది పాయింట్లు తెచ్చుకుని తనలాంటి వారెందరిలోనో స్ఫూర్తిని నింపింది.

ఉన్నత చదువులు చదవాలనేది నాగలక్ష్మి ఆకాంక్ష....
భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత చదువులు చదవాలనేది నాగలక్ష్మి ఆకాంక్ష.. తానీ స్థాయికి రావడానికి సహకరించిన అధికారులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెబుతోంది. ఇక నాగలక్ష్మి సాధించిన అద్భుత విజయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు... నాగలక్ష్మిని అభినందించారు. ఆమెను స్వీకార్‌ ఉపాకార్‌ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని భవిష్యత్‌లో తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసుకుంటామని సర్వశిక్షా అభియాన్‌ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ రమణమూర్తి తెలిపారు.

సంకల్ప బలంతో సాగుతున్న నాగలక్ష్మి....
శారీరక ప్రతికూలతలు ఉన్నా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా నాగలక్ష్మి మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతోంది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తోంది. 

కేరళ కొత్త సీఎంగా పినరాయి విజయన్

కేరళ : కాబోయే సీఎంగా పినరాయి విజయన్ పేరు ఖరారైంది. కేరళ సీపీఎం కార్యదర్శి వర్గం... పినరాయి విజయన్ పేరును ఖరారు చేసింది. తిరువనంతపురంలో ఉదయం సమావేశమైన సీపీఎం కార్యదర్శి వర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. సెక్రటేరియట్ రాష్ట్రకమిటీ సమావేశం లో సినరాయి విజయన్ ని సీఎంగా ఎన్నుకుంటూ సభ్యులు ఏకీభవించారు. అనంతరం ఆయన పేరును ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారికంగా ప్రకటించారు. అచ్యుతానందన్ పార్టీకి చేసిన సేవలను ఏచూరి ఈ సందర్భంగా కొనయాడారు. ఆయన కేరళ ఫిడెల్ కాస్ట్రోగా అభివర్ణించారు.

18:11 - May 20, 2016

హైదరాబాద్‌ : మరోసారి గాలి దుమారం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు, మెరుపులకు తోటు భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో చాలాచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్ లు  నేలకూలాయి. నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌, కుషాయిగూడ, సికింద్రాబాద్‌, విద్యానగర్‌లలో భారీ వర్షం కురుస్తోంది. 

18:08 - May 20, 2016

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని వేధిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని సిద్ధు అనే వ్యక్తి గత కొంతకాలంగా ఫోన్‌లో వేధిస్తున్నాడు. అసభ్య దృశ్యాలు పంపుతూ మానసికంగా హింసిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

18:05 - May 20, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది ప్రభుత్వం. జూన్‌ 2న కొత్త జిల్లాలను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై డిమాండ్లూ ఊపందుకున్నాయి.. కొన్ని చోట్ల ఉద్యమరూపాన్నీ సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుపై సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు సర్కారు కసరత్తు....
కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా
పర్యవేక్షిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సీఎస్‌ రాజీవ్‌ శర్మ అధ్యక్షతన ఒక కమిటీ ఇప్పటికే పనులు ప్రారంభించింది. సీఎస్‌ నేతృత్వంలోని కమిటీకి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాలను సూచించారు.

జిల్లాకు తొమ్మిది కమిటీలు....
జిల్లాకు ఇద్దరు చొప్పున 9 కమిటీలను సీఎం నియమించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి అదనంగా మరో ఇద్దరు అధికారులకు జిల్లాల పునర్విభజన బాధ్యతలను అప్పగించారు. ఈ మొత్తం కమీటిలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

కొత్త జిల్లాల సరిహద్దులు....
కొత్త జిల్లాల సరిహద్దులు, రాష్ట్ర రాజధానికి జిల్లా కేంద్రం ఎంత దూరంలో ఉండాలనే దాని పై కూడా మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. అలాగే జిల్లా కేంద్రం అన్ని గ్రామాలు 60 కిలోమీటర్ల పరిధిలో ఉండాలని సీఎస్ కమీటికి సూచించారు. భౌగోళిక సరిహద్దులపై శాటిలైట్‌ ద్వారా 17 నుంచి 18 జిల్లాల సరిహద్దుల ముసాయిదా నమూనాలను అధికారులు సిద్ధం చేసారు. ఇదిలాఉంటే కొత్త జిల్లాల కేంద్రాలు తమ ప్రాంతానికే దక్కాలంటూ వివిధ ప్రాంతాల నేతల నుంచి డిమాండ్‌లు బలంగా వినిపిస్తున్నాయి. మహబూబాబాద్, భద్రాచలం, యాదగిరి, గద్వాల, నారాయణపేట్‌ ఇలా ప్రతీ ప్రాంతంలోనూ నూతన జిల్లాల డిమాండ్‌ ఊపందుకుంది. ఈ ప్రాంతాల నేతలు ఇప్పటికే పలు విజ్ఞప్తులు సమర్పించడమే కాదు.. తమ ఆకాంక్షను బలంగా చాటేందుకు ఆందోళలకూ దిగుతున్నారు.

జిల్లాల పునర్విభజనపై సీఎం సీరియస్....
వీటన్నింటి నేపథ్యంలో... జిల్లాల పునర్విభజనపై సీఎం కాస్తా సీరియస్‌గానే దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ రోజున కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం.. అధికారులను పరుగులు పెట్టిస్తోంది.

17:39 - May 20, 2016

గుంటూరు : కార్పొరేషన్‌ లేబర్‌సెస్‌ స్కాంపై టెన్‌టీవీ కథనాలకు అధికారులు స్పందించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు పరిధిలో లేబర్‌సెస్‌ చెల్లించకుండానే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సెల్లార్‌ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో లేబర్‌సెస్‌ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. లేబర్‌సెస్ స్కాంపై 10 టీవీ వరస కథనాలను ప్రసారం చేసింది.

మహబూబ్ నగర్ జిల్లా భూంపురంలో దారుణం

మహబూబ్ నగర్ : జిల్లాలోని ఐజా మండలం భూంపురంలో దారుణం జరిగింది. మేకల కాపరి లలితమ్మపై కుక్కలు దాడి చేశాయి. ఒకేసారి 10 కుక్కలు దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా లలితమ్మ మృతి చెందింది. 

17:34 - May 20, 2016

మహబూబ్‌నగర్‌ : ఐజా మండలం భూంపురంలో దారుణం జరిగింది. పిచ్చికుక్కల గుంపు స్వైరవిహారం చేయడంతో ఓ మహిళకు తీవ్రగాయాలై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. మేకల కాపరి లలితమ్మపై 10 కుక్కలు దాడి చేయడంతో ఆమెకు ఒంటినిండా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా...లలితమ్మ మృతి చెందింది. 

అదృశ్యమైన ఈజిప్టు విమానం శకలాల గుర్తింపు

కైరో : అదృశ్యమైన ఈజిప్టు విమానం శకలాలను గుర్తించారు. మధ్యదరా సముద్రంలో ఈజిప్టు విమానం శకలాలను గుర్తించారు. నిన్న ఫ్రాన్స్ నుంచి కైరో వెళ్తుండగా విమానం అదృశ్యమైంది.  

17:31 - May 20, 2016

మహబూబ్ నగర్ : అయిజలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఒకరిప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కథనం ప్రకారం... అయిజలో గత కొంతకాలంగా తిరుమలేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తిరుమలేష్ భార్యకు గొపీ అనే వ్యక్తితో పరిచయమైంది. అయితే తను లేని సమయంలో ఇంటికి వచ్చిన గోపితో భార్య ఉండటాన్ని తిరుమలేష్‌ గమనించాడు. దీంతో ఆవేశానికి గురైన తిరుమలేష్‌... గొడ్డలితో గోపి తలపై నరికాడు. తీవ్రగాయాలపాలైన గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.

17:28 - May 20, 2016

హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో చేపలవర్షం కురిసింది.. వరకుల రకంగా పిలిచే ఈ చేపలు ఆకాశం నుంచి కిందపడటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.. పొలాలతోపాటు.. వీధుల్లో పడ్డ చేపలను పట్టుకునేందుకు చిన్నారులు పోటీపడ్డారు. సముద్రంలోని టోర్నడోల వల్ల చేపలు మేఘాలకు చేరుకొని వర్షంతో పాటు కింద పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

17:26 - May 20, 2016

హైదరాబాద్ : విమర్శలు చేస్తే ప్రతిపక్షాలపై కేసులు పెడతామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు.. కేసులకు బెదిరేదిలేదని స్పష్టం చేశారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు ఐక్యం కావాల్సిన అవసరముందని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటమిపై సమీక్షిస్తామని తెలిపారు.

17:24 - May 20, 2016

హైదరాబాద్ : కాపు కార్పొరేషన్ నిధుల ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. కాపుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. అహంకారంతో చంద్రబాబు కాపు నేతలను అవమానపర్చేలా వ్యవహరిస్తున్నారని బొత్స ఆరోపించారు. కాపు నిధులపై శ్వేతపత్రానికి వైసీపీ డిమాండ్ చేశారు.

17:21 - May 20, 2016

కేరళ : కాబోయే సీఎంగా పినరాయి విజయన్ పేరు ఖరారైంది. కేరళ సీపీఎం కార్యదర్శి వర్గం... పినరాయి విజయన్ పేరును ఖరారు చేసింది. తిరువనంతపురంలో ఉదయం సమావేశమైన సీపీఎం కార్యదర్శి వర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. సెక్రటేరియట్ రాష్ట్రకమిటీ సమావేశం లో సినరాయి విజయన్ ని సీఎంగా ఎన్నుకుంటూ సభ్యులు ఏకీభవించారు. అనంతరం ఆయన పేరును ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారికంగా ప్రకటించారు. అచ్యుతానందన్ పార్టీకి చేసిన సేవలను ఏచూరి ఈ సందర్భంగా కొనయాడారు. ఆయన కేరళ ఫిడెల్ కాస్ట్రోగా అభివర్ణించారు. కేరళ ఎన్నికలలో పనిచేసిన కార్యవర్గానికి, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అచ్యుతానందన్ ప్రస్తుతం 92 సంవత్సరాలు.. కాబట్టి విసృత్తంగా తిరగలేడని, భౌతికంగా ఆయన శరీరం సహకరించకపోవచ్చనే కారణంతో విజయన్ ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ వర్షం...

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. విద్యానగర్, బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ వర్షం కురుస్తోంది. 
మల్కాజ్ గిరి, ఈసీఐఎల్, నేరెడ్ మెట్, కుశాయిగూడ, మాదాపూర్, ఆర్కేపురం, బీహెచ్ ఈఎల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బషీర్ బాగ్, నాంపల్లి, ఆబిడ్స్, ఖైరతాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. 

కల్తీ రక్తం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ : సరూర్ నగర్ లో నివసిస్తున్న రక్తం కల్తీకి పాల్పడుతున్న రక్తనిధి ల్యాబ్ టెక్నీషియన్ నరేందర్ నివాసంలో సుల్తాన్ బజార్ పోలీసులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని నివాసం నుంచి పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోఠి ప్రసూతి ఆసుపత్రిలో నరేందర్ కల్తీ రక్తం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. బ్లడ్ ప్యాకెట్లలో సెలైన్ బాటిళ్లు కలుపుతున్నట్లు వైద్యులు గురువారం గుర్తించారు. దీంతో నరేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

దిశను మార్చుకున్న రోను తుపాన్‌

విశాఖ : రోను తుపాన్‌ తన దిశను మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు పయనిస్తోంది. ఇది కళింగపట్నం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఈ తుపాన్‌ శుక్రవారం మధ్యాహ్నానికి విశాఖతీరం నుంచి 146 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తుపాన్‌ గంటకు 25కిలోమిటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ఆ రోజు రాత్రికి గానీ లేదా శనివారం ఉదయానికి బంగ్లాదేశ్‌ తీరం చేరుతుందని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ రామచందర్‌ రావు తెలిపారు.

 

15:36 - May 20, 2016

విజయనగరం : రోను తుపాను ప్రభావంతో విజయనగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.గత మూడు రోజుల నుండి భారీ వర్షాలతో అతలాకుతం అయితమయ్యింది. నాలుగు రోజుల క్రితం వరకూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలు ఈ వర్షాలకు ఉపశమనం పొందారు. కాగా రోను తుపానుతో భారీ నుండి అతిభారీ వర్షాలు పడతాయనీ..గంటకు 110 నుండి 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. 2014లో వచ్చిన హుదూద్ తుఫాను ప్రభావం నుండి ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇప్పుడు ఈ రోను తుపాను కారణంగా ఎటువంటి ప్రమాదాలు ఏర్పడతాయోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అసోం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న శర్వానంద్‌ సోనోవాల్‌

దేస్ పూర్ : అసోం అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో తొలి సారి ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేసిన బీజేపీ మరో నాలుగు రోజుల్లో ప్రభుత్నాన్ని ఏర్పాటు చేయనుంది. అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిగా శర్వానంద్‌ సోనోవాల్‌ మే24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు శర్వానంద్‌ తెలిపారు. గువాహటిలోని ఖాన్పరా ప్రాంతంలో ఈ ప్రమాణ్వీకార కార్యక్రమం జరుగునుంది.

 

కీసరలో కీచక వైద్యుడు

రంగారెడ్డి : జిల్లాలోని కీసరలో కీచక వైద్యుడు భాగోతం వెలుగులోకి వచ్చింది. మణికంఠ ఆస్పత్రిలో వైద్యానికి వచ్చిన ఓ బాలికతో వైద్యుడు కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో వైద్యుడు పరారయ్యాడు. అంతటితో ఆగకుండా మధ్యవర్తుల ద్వారా బాలిక తల్లిదండ్రులను బెదిరించాడు. ఈ రెండు అంశాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

ఉబెర్‌కప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి

ఢిల్లీ : ఉబెర్‌కప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి చెందింది. ప్రత్యర్థి చైనా చేతిలో 0-3 తేడాతో భారత్‌ పరాజయం పాలైంది. దీంతో ఉబెర్‌కప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది.

 

15:20 - May 20, 2016

శ్రీకాకుళం : రోను తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు అర్థరాత్రికి పెను తుపానుగా మారి బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ జిల్లా కళింగపట్నానికి 40 కిమీ దూరంలో రోను తుపాను కేంద్రీకృతమైవుంది. ఈ ప్రభావంతో మరో 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయనీ..గంటలు 150 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయనీ వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలకు సముద్ర తీర ప్రాంతంలోని ఉప్పు కయ్యల్లోకి నీరుప్రవేశించింది. దీంతో రైతులు భారీ స్థాయిలో నష్టపోయారు. కళింగపట్నం, తదితర తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

సికింద్రాబాద్ లోని నాలాలో యువకుడి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద నాలాలో యువకుడి మృతదేహం లభ్యమైంది. నాలా శుభ్రం చేస్తుండగా మృతదేహాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బంది గుర్తించింది. రాంగోపాల్‌పేట పోలీసులకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

'రోను' ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు

విశాఖ : 'రోను' తుపాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని తిద్దిమి గ్రామంలో చేపల వర్షం కురిసింది. పంట పొలాలకు వెళ్లిన రైతులు పొలాల్లో ఉన్న చేపలను పట్టుకునేందుకు పోటీపడ్డారు. వర్షంతో పాటు చేపలు కూడా పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

పాక్‌ లో పోలీసుల కాల్పులు.. 14 మంది తీవ్రవాదుల హతం

కరాచీ : పాక్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో 14మంది అల్‌ఖైదా సభ్యులు, మిలిటెంట్లు చనిపోయారని అధికారులు తెలిపారు. వేర్వేరుగా జరిగిన ఘటనల్లో త్రీవ వాదులు మృతి చెందారు. ముల్తాన్‌ నగరానికి సమీపంలో ఎనిమిది మంది, మిగిలిన వారు పంజాబ్‌ ప్రావిన్స్ లో మరణించారని కౌంటర్‌ టెర్రరిజం శాఖ వివరాలను వెల్లడించింది. ముగ్గురు సూసైడ్‌ బాంబర్స్ అఫ్ఘనిస్తాన్‌ నుంచి వాయువ్య పెషావర్‌ కి చేరుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు సూసైడ్‌ జాకెట్‌ పేలడంతో మరణిచారని షకీరా ఉల్లా అనే పోలీసు అధికారి తెలిపారు.

ఉబెర్‌కప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి...

హైదరాబాద్ : ఉబెర్‌కప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి చెందింది. ప్రత్యర్థి చైనా చేతిలో 0-3 తేడాతో భారత్‌ పరాజయం పాలైంది. దీంతో ఉబెర్‌కప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది.

కీసరలో కీచక వైద్యుడు భాగోతం...

రంగారెడ్డి : కీసరలో కీచక వైద్యుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. మణికంఠ ఆస్పత్రిలో వైద్యానికి వచ్చిన ఓ బాలికతో వైద్యుడు కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వైద్యుడు పరారయ్యాడు. అంతటితో ఆగకుండా మధ్యవర్తుల ద్వారా బాలిక తల్లిదండ్రులను బెదిరించాడు. ఈ రెండు అంశాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఆకస్మిక తనిఖీలు...

చిత్తూరు : తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో జేఈవో శ్రీనివాసరాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆయన పరిశీలించారు. సెలవుల నేపథ్యంలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందన్నారు.  భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జేఈవో తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూలైన్ల దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు ఆయన అన్నారు.

నర్మెటలో ఉపాధి కూలీలు ఆందోళన

వరంగల్: వరంగల్ జిల్లా నర్మెట మండలకేంద్రంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా కూలీ ఇవ్వటం లేదంటూ మండలకేంద్రంలోని రహదారిపై ఈరోజు అంటే శుక్రవారం రాస్తారోకోకు చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

కోర్టులో లొంగిపోయిన మాజీ ఎంపీ నీలేశ్ రాణె....

హైదరాబాద్ : ఓ వ్యక్తిని కిడ్నాప్‌, దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే కుమారుడు నీలేశ్‌ రాణె లొంగిపోయారు. నీలేశ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ.. గత ఏప్రిల్‌లో నీలేశ్‌ నిర్వహించిన ర్యాలీకి హాజరు కాలేదన్న కోపంతో తనను కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదు దారుడు సందీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ..

ముగిసిన పీఎసీ భేటీ

హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్ లో పీఎసీ భేటీ ముగిసింది. పీసీసీ చైర్మన్ గీతారెడ్డి, సభ్యులు స్పీకర్ మధుసూదనాచారిని కలిశారు. లోకల్ బాడీలను పీఏసీ పరిధిలోకి తేవాలని కమిటీ కోరింది. దీనికి స్పీకర్ సానుకూలంగా స్పందించారు. జూన్ 6న యాదాద్రి పనులపై పీఏసీ సమీక్షా సమావేశం జరుగనుంది.

నేపాల్‌లో భారత్ పర్వతారోహకుడు మృతి...

హైదరాబాద్ : నేపాల్‌లో భారత్ చెందిన పర్వతారోహకుడు ఒకరు మృతిచెందారు. పశ్చిమ్‌ బంగాలోని హౌరా జిల్లాకి చెందిన రజిబ్‌ భట్టాచార్య(43) ప్రపంచంలోనే ఏడో ఎత్తైన పర్వతమైన ధవళగిరి(8,167మీ.)ని అధిరోహించేందుకు తన బృందంతో కలిసి వెళ్లాడు. విజయవంతంగా పర్వతారోహణ చేసిన రజిబ్‌ తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం మంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృత్యువాత పడినట్లు సమాచారం.

కేరళ కాబోయే సీఎం గా పినరాయి విజయన్

హైదరాబాద్ : కేరళ సీఎం అభ్యర్థిగా పినరాయి విజయన్ ఎంపిక అయ్యారు. ఈ రోజు జరిగిన కేరళ సీపీఎం కాదర్శివర్గ సమావేశం విజయన్ పేరును ఖరారు చేసింది. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పాల్గొన్నారు. సీనియర్ నేత అచ్యుతానందన్ కూడా సీఎం రేసు లో ఉన్న సంగతి తెలిసిందే.

13:43 - May 20, 2016

హైదరాబాద్ : కేరళ సీఎం అభ్యర్థిగా పినరాయి విజయన్ ఎంపిక అయ్యారు. ఈ రోజు జరిగిన కేరళ సీపీఎం కాదర్శివర్గ సమావేశం విజయన్ పేరును ఖరారు చేసింది. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పాల్గొన్నారు. సీనియర్ నేత అచ్యుతానందన్ కూడా సీఎం రేసు లో ఉన్న సంగతి తెలిసిందే.

13:40 - May 20, 2016

శ్రీకాకుళం : రోను తుఫాను శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. ఈదురు గాలులకు తోడు కెరటాల తాకిడి ఉధృతమవుతోంది. జిల్లాలో 193 కిలోమీటర్లు పొడవున సాగర తీరం ఉండడంతో తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కవిటి మండలం ఇద్దివానిపాలెంలో సముద్రం 50 మీటర్ల ముందుకొచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అలాగే గార మండలం కళింగపట్నం వద్ద పదిహేను మీటర్ల మేర సాగరం ముందుకొచ్చింది. గడచిన రెండు రోజులుగా సిక్కోలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

13:39 - May 20, 2016

విజయవాడ : ఏపీ మెడికల్ ఎంసెట్ ఫలితాలను రేపు సిఎం చంద్రబాబు సమక్షంలో విడుదల చేయాలనుకుంటున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నీట్‌ను ఒక సంవత్సరం పాటు వాయిదా వేస్తూ కేంద్ర కేబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

నకిరేకల్ ఎమ్మెల్యే విరేశం భార్యపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే విరేశం భార్య పుష్పలతపై బాధితుడు రాజశేఖర్ హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేశారు. తన భార్యపై పెట్టిన కేసు విషయంలో పుష్పలత చంపుతానని బెదిరస్తున్నారని రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని హెచ్ ఆర్సీని రాజశేఖర్ కోరారు.

ఎంబీబీఎస్, బీడీఎస్ పరీక్ష నిర్వహిస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : నీట్ పై కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ దృష్ట్యా తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ పరీక్ష నిర్వహిస్తామని, త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

హోదాను చంద్రబాబే నీరుగారుస్తున్నారు : బొత్స

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబే నీరు గారుస్తున్నారని వైసీపీ నేత బొత్స ఆరోపించారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడం కాపు ఉద్యమ నేతలను అవమానపర్చడమే అని మండి పడ్డారు. కార్పొరేషన్ నిధుల ఖర్చు పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుపాను చర్యలపై కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబుతో భేటీ కానున్న మంత్రి కామినేని

విజయవాడ : ఏపీలో మెడికల్ ఎంసెట్ ఫలితాల విడుదలపై సీఎం చంద్రబాబు తో మంత్రి కామినేని భేటీ కానున్నారు.

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ

ఢిల్లీ : ఆదిలాబాద్ ఏఎస్పీ జీఆర్ రాధిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు రాధిక ఎవరెస్టు అధిరోహించింది. దక్షిణ భారత్ నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి పోలీసు అధికారిణిగా రాధిక రికార్డుకెక్కింది.

కోఠీ మెటర్నటీ ఆసుపత్రికి నోటీసులు...

హైదరాబాద్ : కోఠీ మెటర్నటీ ఆసుపత్రికి 91/160(1) సిఆర్పీసీ కింద సుల్తాన్ బజార్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కల్తీ రక్తం వ్యవహారంపై వివరాలు అందజేయాలని నోటీసులు జారీ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి శస్త్రచికిత్స జరగాల్సిందే - దిగ్విజయ్‌

ఢిల్లీ : ఇక చర్చలు, అంతర్మథనాలు అవసరంలేదని కాంగ్రెస్ పార్టీకి శస్త్ర చికిత్స జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. 2014 నుంచి ఏఐసీసీ సెక్రటరీల మార్పు జరగలేదని ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దిగ్విజయ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

శ్రీకాకుళం జిల్లాలో 'రోను'మూలంగా విస్తారంగా వర్షాలు

శ్రీకాకుళం : రోను తుఫాను శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. ఈదురు గాలులకు తోడు కెరటాల తాకిడి ఉధృతమవుతోంది. జిల్లాలో 193 కిలోమీటర్లు పొడవున సాగర తీరం ఉండడంతో తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కవిటి మండలం ఇద్దివానిపాలెంలో సముద్రం 50 మీటర్ల ముందుకొచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అలాగే గార మండలం కళింగపట్నం వద్ద పదిహేను మీటర్ల మేర సాగరం ముందుకొచ్చింది. గడచిన రెండు రోజులుగా సిక్కోలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

12:45 - May 20, 2016

కృష్ణా : విజయవాడలో దారుణం జరిగింది. రాయనపాడు వద్దనున్న రైల్వే వ్యాగన్ వర్క్‌ షాపు సమీపంలో ట్రెయిన్‌ కిందపడి ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. తండ్రి చనిపోవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయానికి పాల్పడినట్లు సమాచారం. 

కళింగ పట్నానికి 40 కి.మీ దూరంలో రోను తుపాన్

విశాఖ : కళింగ పట్నానికి 40 కి.మీ దూరంలో దక్షిణ ఆగ్నేయంగా రోను తుపాను కదులుతోందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు అర్థరాత్రికి పెనుతుపానుగా మారి ఒడిశా తీరం వైపు పయనించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

12:21 - May 20, 2016

విజయవాడ : నీట్ ను ఏడాది పాటు వాయిదా వేయడం పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన టెన్ టివి తో మాట్లాడుతూ.. .. నీట్‌ను వాయిదా వేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని మంత్రి కామినేని తెలిపారు. నీట్‌ అవసరం కానీ.. ప్రస్తుతం సిద్ధంగా లేమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు తెలిపామని చెప్పారు. కేంద్రం నీట్ పై ఆర్డినెన్స్ తెచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకుందన్నారు. నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం నేడు ప్రధాని కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రా విద్యార్థులు ఊరట లభించినట్లయ్యింది. దీంతో ఏపీ మెడికల్ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

12:18 - May 20, 2016

ఢిల్లీ : నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం నేడు ప్రధాని కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రా విద్యార్థులు ఊరట లభించినట్లయ్యింది. దీంతో ఏపీ మెడికల్ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

నీట్ వాయిదా .. మంత్రి గంటా హర్షం..

విజయవాడ : నీట్ ను ఏడాది పాటు వాయిదా వేయడం పై మంత్రి గంటా శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం నేడు ప్రధాని కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ జారీ

ఢిల్లీ : నీట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం కేబినెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్ర విద్యార్థులకు ఊరట లభించినట్లు అయ్యింది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : ఈ రోజు ఉదయం ప్రారంభంలో లాభాలతో ప్రారంభం అయిన స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ప్రస్తుతం 12 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 6 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

ఢిల్లీ లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్

ఢిల్లీ :ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదిని ఢిల్లీ లోని అంతర్రాష్ట్రీయ రహదారిపై అబ్దుల్ వహీద్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

గోనె సంచిలో శిశువు మృతదేహం

నల్గొండ : అప్పుడే పుట్టిన ఓ శివువుని గోనె సంచిలో పెట్టి రోడ్డుప‌క్క‌న పడేశారు. ఈ ఘటన ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లాలోని పెన్‌పహాడ్ చిన్నారెడ్డిపాళెం గ్రామ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సీ కాల‌నీలో గోనెసంచిలో ఏదో ఉండ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు విష‌యాన్ని పోలీసుల‌కి తెలిపారు. అనంత‌రం ఆ సంచి విప్పిచూడ‌డంతో దానిలో ఓ శిశువు మృత‌దేహం క‌నిపించింది. శిశువును బ‌తికుండ‌గానే గోనె సంచిలో ఉంచి అక్క‌డ వ‌దిలేసి వెళ్లినట్లు పోలీసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

11:41 - May 20, 2016

విశాఖ : రోను తుపాను ఈ రాత్రికి పెను తుపానుగా మారే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.తీవ్ర వాయుగుండం మూలంగా కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖకు దక్షిణ, పశ్చిమ దిశగా 60 కిలో మీటర్ల దూరంలో రోను తుపాను కదులుతోంది. కాకినాడకు తూర్పు, ఈశాన్య దిశగా 120 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో కాకినాడ, విశాఖ తీరం మధ్య ఇది పెను తుపానుగా మారే అవకాశముంది.

 

11:36 - May 20, 2016

ఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. నీట్‌ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రమంత్రి వర్గం చర్చించినట్లు సమాచారం.. ఈ సందర్భంగా నీట్‌ నిర్వహణపై ఆర్డినెన్స్‌ ఇచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఈ ఏడాది వరకూ నీట్‌ను మినహాయించే దిశగా కేంద్రం ఆలోచించే అవకాశం ఉంది. నీట్‌పై ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇటీవల కేంద్రమంత్రి జేపీనడ్డా నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో సమావేశం జరిగింది. ఈ ఏడాదికి నీట్‌ను అన్ని రాష్ట్రాలను మినహాయిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

'అగస్టా' కేసులో సీబీఐ విచారణకు ఎస్ పీ త్యాగీ సోదరులు

ఢిల్లీ : అగస్టా స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ పీ త్యాగి సోదరులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.

సిద్ధిపేటలో చెత్తబుట్టలు పంపిణీ..

మెదక్ : సిద్ధిపేట ప్రశాంత్ నగర్ లో ఇంటింటికి చెత్తబుట్టలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణంలో సిద్ధి పేట నియోజకవర్గానికి 3 అవార్డులు వచ్చాయని తెలిపారు. సిద్ధిపేట మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు ఇంటింటికి నీరందించే పథకానికి రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు బజార్ల నిర్మాణం కోసం రూ.3 కోట్లు, మహిళా రెసిడెన్షియల్ పీజీ కాళాశాల కోసం రూ.33 కోట్లు మంజూరు చేసినట్లు హరీశ్ పేర్కొన్నారు.

ముగ్గురు యువతులు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం..

విజయవాడ : నగరంలోని రైల్వే వ్యాగన్ వర్క్ షాపు సమీపంలో రైలు కింద పడి ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు మృతి చెందగా మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. వీరు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. తండ్రి చనిపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

విశాఖలో అండమాన్ నౌక నిలిపివేత

విశాఖ : అండయాన్ వెళ్లాల్సిన ఓ నౌకను విశాఖలో నిలిచిపోయింది. తుఫాన్ మూలంగా ఈ నౌకను పోర్టులోనే నిర్వహకులు నిలిపివేశారు. సుమారు పన్నెండు వందల మంది ప్రయానికులు నౌకలో ఉన్నారు. కనీస అవసరాలు భోజనం లేక త్రీవ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తమ ఇబ్బందులకు అధికారులకు విన్నవించిన స్పందించడం లేదని ప్రయానికులు వాపోతున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి ఉందని వారు తెలపుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు వారు పేర్కొన్నారు. అధికారులు ప్పందించి వెంటనే చర్యలు తీసుకుకోవాని ప్రయాణికులు కోరుతున్నారు.

పోలీసులకు లొంగిపోయిన టీడీపీ కార్పోరేటర్

హైదరాబాద్ : ఏర్ ఇండియా విమానంలో ఓ మహిళను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు టీడీపీ కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు ఈ రోజు ఉదయం శంషాబాద్ పోలీసులకు లొంగిపోయారు. విజయవాడలో ఈయన టీడీపీ పార్టీ నుండి కార్పోరేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్న విజయవాడలో ఆయనకు శంషాబాద్ పోలీసు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పోలీసులు లిఖిత పూర్వక వివరణ తీసుకుని, విచారిస్తున్నారు. కాగా తాను ఏ తప్పు చేయలేదని, విమానంలో ప్రయాణించే సమయంలో కాలు తగిలిందని, కావాలని తాను చేయలేదని, ఆ మహిళా ఉద్దేశ్యపూర్వకంగానే కేసు పెట్టించిందని కార్పోరేటర్ పేర్కొంటున్నాడు.

కేరళ సీఎం ఉమెన్ చాందీ రాజీనామా..

తిరువనంతపురం : కేరళ సీఎం ఒమెన్ చాందీ తన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పార్టీ ఓటమి పాలైంది. దాంతో కాంగ్రెస్ సీఎం ఒమెన్ చాందీ తన రాజీనామాను ఇవాళ ఉదయం 10.30 గంటలకు గవర్నర్ పీ.సదాశివంకు అందజేశారు. 

11:09 - May 20, 2016

హైదరాబాద్: చందానగర్ లో నలుగురు బాలికలు ఐదు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. నేటి కీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. వీళ్లు పన్నెండేళ్ల నుండి ఎనిమిదేళ్ల వయసున్న బాలికలు. నాలుగు రోజుల క్రితం ఆడుకుంటామని భయకటకు వెళ్లిన వీరు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. వీరికోసం గాలించిన తల్లిదండ్రులు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బంధువుల ఇంటికి కూడా వెళ్లలేదు అని తెలిసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మూడున్న కేజీల బంగారం పట్టివేత..

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు రెవెన్యూ నిఘా విభాగపు అధికారులు నేడు తనిఖీలు చేపట్టారు. సోదాల సందర్భంగా అధికారులు మూడున్నర కేజీల అక్రమ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ గోల్డ్ ఏజెంట్ దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులతో అక్రమంగా బంగారాన్ని తెప్పిస్తున్నట్లు గుర్తింపు. ఈ స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న విమానాశ్రయంలోని మెంజిస్ కాంట్రాక్ట్ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. 

11:04 - May 20, 2016

హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. పది రోజులపాటు యూస్ లో పర్యటించే కేటీఆర్ వివిధ ప్రఖ్యాత సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. ఉన్నతాధికార ప్రతినిధి బృందం కూడా కేటీఆర్‌తోపాటు అమెరికా వెళ్లింది.

గతేడాది కూడా అమెరికాలో పర్యటించిన కేటీఆర్‌

రాష్ట్రాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన చేపట్టారు. గతేడాది కూడా యూఎస్‌లో పర్యటించిన కేటీఆర్‌... హైదరాబాద్‌కు పెట్టుబడులు ఆకర్షించడంలో కొంతవరకు మెరుగైన ఫలితాలు సాధించారు. కేటీఆర్‌ ప్రస్తుత యూఎస్‌ పర్యటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మెరుగైన పారిశ్రామిక, ఐటీ విధానాలు.....

అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక, ఐటీ విధానాలను వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టబుడులకు ఉన్న అనుకూల పరిస్థితులు, వనరులు గురించి తెలిజేస్తారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అంశాన్ని విదేశీ పెట్టుబడిదారుల దృష్టికి తీసుకెళతారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలకు ఇస్తున్న రాయితీలు వివరిస్తారు. సర్కార్‌ అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలియజేస్తారు. పరిశ్రమల అనుమతులుకు ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టిన అంశాన్ని పెట్టుబడిదారులకు వివరిస్తారు. 

11:01 - May 20, 2016

విజయవాడ : ఢిల్లీ-హైదరాబాద్‌ విమానంలో యువతిని వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ కార్పోరేట్‌ ఉమ్మడి వెంకటేశ్వర్లు శంషాబాద్‌ పీఎస్‌లో లొంగిపోయారు. ఈ మేరకు పోలీసులు ఉమ్మడి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. విజయవాడ నుంచి టీడీపీ తరపున కార్పోరేటర్‌ గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వెంకటేశ్వర్లు యువతిని వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

11:00 - May 20, 2016

విశాఖ : తీవ్ర వాయుగుండం కారణంగా అండమాన్ వెళ్లాల్సిన నౌకను విశాఖ పోర్టులోనే నిలిపివేశారు. దానిలోని 15 వందల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆహారం, నీరు తదితర సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆహారం, నీరు లాంటి కనీస అవసరాలు తీర్చాలని అధికారులకు విజ్ఙప్తి చేస్తున్నారు.

 

10:56 - May 20, 2016

హైదరాబాద్ : తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను విక్రయించాలని సర్కార్ భావించింది. అనుకున్నదే తడవుగా ఈ మేరకు టీఎస్ ఐసీసీ ద్వారా విక్రయానికి పూనుకుంది.ఈ మేరకు ఖానామెట్ లోని ప్రభుత్వ స్థలాలను ఎకరానికి 29 లక్షలకు కున్ మోటార్ సంస్థకు అమ్మేసింది.

రెండు ఎకరాలను ఈ కున్ సంస్థ కొనుగోలు...

ఈ కున్ సంస్థ రెండు ఎకరాలను వేలంలో కొనుగోలు చేసింది. ఇదే ప్రాంతంలోని వేరే స్థలానికి ఎకరాకు 18 కోట్లు ధర పలికింది. దీంతో పాటు షేక్ పేట్ లోని ఆల్ హామ్రా కాలనీలో గజం 76 వేల 200 రూపాయలకు విక్రయించారు. ఈ కాలనీలో 920 గజాలను 7 కోట్లకు ఆల్ హామ్రా సంస్థ కొనుగోలు చేసింది. టీఎస్ఐసీసీ ద్వారా ప్రభుత్వ భూములు విక్రయించడం ఇది రెండో సారి. గతంలో నిర్వహించిన వేలంలో కూడా ఎకరానికి 29 కోట్లు ధర పలికింది. దశల వారీగా మరికొన్ని ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించింది సర్కార్ . ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

కళింగపట్నంలో 15 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

శ్రీకాకుళం : కళింగపట్నంలో సముద్రం 15 మీటర్లు ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరుడంతో కలెక్టర్ అధికారులకు శెలవులు రద్దు చేశారు.

ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు

తూ.గో : ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో తీరం కోతకు గురవుతుండడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చందానగర్ లో 4గురు బాలికల అదృశ్యం

హైదరాబాద్ : చందానగర్ లో 4గురు బాలికలు అదృశ్యం అయ్యారు. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ....

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తులు బయట క్యూలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోండగా, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

08:52 - May 20, 2016

హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోను తుపాను మూలంగా తీర ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువులు, పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చి భయానక పరిస్థితులను సృష్టిస్తోంది. కృష్ణా జిల్లాలో 300 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. రోను తుపాను క్రమంగా మరింత బలపడుతోంది. శుక్రవారం ఉదయానికి ఇది తీవ్ర పెను తుపానుగా మారుతుందని భారత వాతావరణశాఖ గురువారం రాత్రి వెల్లడించింది. తొలుత అల్పపీడనంగా ఏర్పడి.. ఆంధ్రప్రదేశ్‌ తీరంలో గురువారం ఉదయానికి తుపానుగా మారింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. రోను తుపాను విశాఖపట్నానికి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఈశాన్య దిశగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి ముందుకు కదిలి తీవ్ర పెనుతుపానుగా మారి శనివారం ఒడిశాలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మళ్లీ ముందుకు కదిలి ఆదివారం ఉదయం దక్షిణ బంగ్లాదేశ్‌లో ఖెపుపుర-కాక్స్‌ బజార్‌ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

08:44 - May 20, 2016

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో భూసేరకణ వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటాలు పెరుగుతున్నాయి. 2013 భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవోల ద్వారా భూసేకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. పరిశ్రమలకు వ్యతిరేకం కాకపోయినా... సేకరించే భూమికి చెల్లించే పరిహారాన్ని ఎంచుకున్న విధానాన్ని రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. జహీరాబాద్‌లో నిమ్జ్‌ కోసం చట్ట విరుద్ధంగా చేపడుతున్న భూసేకరణపై 10 టీవీ ప్రత్యేక కథనం.

అన్నదాతల ఆవేదన....

మెదక్‌ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌.. నిమ్జ్‌ మంజూరు చేసింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి మండలి వస్తే తమ జీవితాలు మెరుగుపడతాయని ప్రజలు ఆశించారు. కానీ నిమ్జ్‌ కోసం ప్రభుత్వం ప్రకటించిన భూసేకరణ విధానాన్ని పరిశీలించిన తర్వాత తమ ఆశలు ఆవిరై పోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిమ్జ్‌ కోసం 17 గ్రామాల్లో 12,636 ఎకరాల సేకరణ.....

మెదక్‌ జిల్లాలోని న్యాల్‌కల్‌, జరాసంగం మండలాల పరిధిలో నిమ్జ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 17 గ్రామాల్లో 12,636 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని లెక్కలు తేల్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూసేకరణకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు అదనంగా చెల్లించాలి. కానీ ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించేందుకు వీలుగా 123, 214 జీవోలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి రేటు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉందని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టా భూమికి 5.65 లక్షల రూపాయలు, అసైన్డ్‌ భూమికి 3.25 లక్షల రూపాయాలు ఇవ్వజూపుతోంది. దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిమ్జ్‌ భూసేరకణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరాలోచన చేయాలని రైతులు కోరుతున్నారు.

సర్వే పనులను నిలిపివేయాలంటున్న రైతులు...

కొత్త భూసేకరణ చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూములను పరిశ్రమలు, ప్రాజెక్ట్‌లు, అభివృద్ధి పథకాల కోసం సేకరించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వీటన్నింటిని తోసిరాజంటోందన్న విమర్శలున్నాయి. నిమ్జ్‌ భూసేకరణ కోసం జరుగుతున్న సర్వే పనులను నిలిపివేయాల రైతులు కోరుతున్నారు. బీడు భూములను మాత్రమే తీసుకోవాలని కోరుతున్నారు. 

తమ్ముడు, మరదలి గొంతు కోసి హత్య చేసిన అన్న...

మహబూబ్ నగర్ : మక్తల్ మండలం రుద్రసముద్రంలో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడు, మరదలిని అన్న గొంతు కోసి హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

తాత్కాలికంగా దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేత

విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నేపథ్యంలో ఏపీలోని ప్రధాన నగరం విజయవాడలో నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఫలితంగా నగర శివారులోని కనకదుర్గ ఆలయానికి దారి తీసే ఘాట్ రోడ్డును అధికారులు తాత్కలికంగా మూసేశారు. వర్షం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదన్న భావనతోనే ఈ రోడ్డును అధికారులు మూసేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దుర్గ గుడికి వెళ్లేందుకు భక్తులకు ప్రత్యామ్నాయ కాలి బాటను అధికారులు సిద్ధం చేశారు.

ఫుట్ వేర్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం...

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గల ఓ ఫుట్‌వేర్ తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 20 అగ్నిమాపక యంత్రాల సయహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సొంత బొమ్మాళి మండలంలో పొలాల్లోకి వరదనీరు...

శ్రీకాకుళం : సొంత బొమ్మాళి మండలం ఉమ్మిలాడ శ్రీజగన్నాథం గ్రామాల్లో వరద నీరు చేరింది. దీంతో వేలాది ఎకరాల్లో రొయ్యలు, చెరువులు, ఉప్పు గల్లీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 

కొనసాగుతున్న రోను తుపాను

హైదరాబాద్ : విశాఖకు 160 కి.మీ. కాకినాడకు 70 కి.మీ దూరలో రోను తుపాను కొనసాగుతోంది. కొన్ని గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తీరం వెంబడి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తూ ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉనట్లు తెలిపింది. మరో వైపు అన్ని పోర్టుల్లో నాలుగు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

కోడూరు సాగర్ తీరంలో ఎగిసి పడుతున్న అలలు

కృష్ణా : కోడూరు సాగర్ తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు 300 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

నాలుగేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

నెల్లూరు : సూళ్లూరు పేటలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. నాలుగేళ్ల చిన్నారి పై కుక్కలు దాడి చేసి.. మెడ పట్టుకుని కొంత దూరం లాక్కెళ్లాయి. కుక్కల దాడితో ఆ చిన్నారికి శరీరమంతా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు లో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

రాజీనామా చేయనున్న కేరళ సీఎం ఉమెన్ చాందీ

కేరళ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం 47 స్థానాలు పొంది యూడీఎఫ్ కూటమి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఈ రోజు తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేరళ గవర్నర్ పి.సదాశివంను కలిసి తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేయనున్నట్లు సమాచారం.

07:34 - May 20, 2016

హైదరాబాద్ : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఈ ఎన్నికల ఫలితాల పై న్యూస్ మార్నింగ్ చర్చలో చర్చించారు. ప్రతి ఎన్నికల్లో బిజెపికి ఓటు బ్యాంక్ పెరుగుతోందా? కాంగ్రెస్ పని అయిపోయిందా? లెఫ్ట్ పార్టీలు పునరాలోచనలో పడ్డాయా? ప్రజల సమస్యలు తీర్చే ఆల్టర్ నేటివ్ చూపే కొత్త శక్తులు ఏర్పాటు అయ్యేఅవకాశాలు ఉన్నాయా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ నేత పి. శ్రీనివాస్ యాదవ్, బిజెపి నేత కుమార్ పాల్గొన్నారు. వారు ఎలాంటి అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

కాకినాడ - విశాఖ మధ్య రోను కేంద్రీకృతం...

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తుపాను క్రమంగా మరింత బలపడుతోంది. శుక్రవారం ఉదయానికి ఇది తీవ్ర పెను తుపానుగా మారుతుందని భారత వాతావరణశాఖ గురువారం రాత్రి వెల్లడించింది. తొలుత అల్పపీడనంగా ఏర్పడి.. ఆంధ్రప్రదేశ్‌ తీరంలో గురువారం ఉదయానికి తుపానుగా మారింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. రోను తుపాను విశాఖపట్నానికి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఈశాన్య దిశగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

07:14 - May 20, 2016

నెల్లూరు : సూళ్లూరు పేటలో నాలుగేళ్ల చిన్నారి పై కుక్కలు దాడి చేసి.. మెడ పట్టుకుని కొంత దూరం లాక్కెళ్లాయి. కుక్కల దాడితో ఆ చిన్నారికి శరీరమంతా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు లో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

07:08 - May 20, 2016

విజయవాడ : రోను తుపాను ముంచుకొస్తోంది. కాకినాడ విశాఖపట్నం మధ్య కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు కూలిపోగా.. స్తంభాలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపానుపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

వణికిస్తున్న రోను తుపాను....

తీర ప్రాంత ప్రజలను రోను తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పెను గాలులు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాలాజీ నగర్‌లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇంటి కప్పులు ఎగిరిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బాపట్ల ప్రాంతంలో ఇప్పటివరకు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తెనాలి డివిజన్‌లోని రేపల్లె, వేమూరు, అమృతలూరు, కొల్లూరు, తెనాలి మండలం సగభాగంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రేపల్లె మండలంలో 70 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా గుంటూరు-నంద్యాల మార్గంలో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.

విజయవాడలో విరిగిపడుతున్న కొండ చరియలు...

విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మొఘల్‌రాజ్ పురం చండ్రరాజేశ్వర్ రావునగర్‌లో కొండ ప్రాంతాల్లో ఇళ్లపై కొండ చరియ విరిగిపడింది. కొండచరియ విద్యుత్ స్తంభంపై పడటంతో విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు ఎక్కడ విరిగి తమపై పడతాయోనని కొండప్రాంతవాసులు భయపడుతున్నారు.

అధికారులతో సీఎం సమీక్ష....

రోను తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రతి గంటకు ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్‌ ద్వారా వర్షపాతాన్ని బేరీజు వేసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఒక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. తుపాను ప్రభావం కలిగిన కోస్తా జిల్లాల్లోనూ మరికొన్ని కంట్రోల్‌ రూమ్‌లను నెలకొల్పారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు ఏర్పాటుచేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అవసరమైన ప్రాంతాల్లో రేషన్ సరకులను అందుబాటులోకి ఉంచారు.

కృష్ణా, తూర్పు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ప్రత్యేక బృందాలు

ముందు జాగ్రత్త చర్యగా కృష్ణా జిల్లాలో రెండు, తూర్పుగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాలో సహాయ బృందాలను సిద్ధంగా ఉంచారు. వెంకటగిరి, మంగళగిరి, కాకినాడ, విశాఖ,విజయనగరాల్లో ఎపీ డీఆర్‌ఎఫ్‌ దళాలను రెడీగా ఉంచారు. 

07:01 - May 20, 2016

హైదరాబాద్‌ : టోలిచౌకీలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ముంబైకి చెందినవారు. వెస్ట్‌జోన్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్త దాడిలో ఈ వ్యవహారం బయటపడింది. గుల్షన్‌ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 

06:58 - May 20, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ విద్య, వైద్య రంగాలను గాలికొదిలేశారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రజల మౌలిక సమస్యలు అలానే ఉంటున్నాయన్నారు.పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య రంగం-ప్రస్తుత పరిస్థితి-పరిస్కార మార్గాలపై ప్రముఖ వైద్యులు శ్రీనాథ్‌రెడ్డి స్మారక ఉపన్యాసం చేశారు.

06:55 - May 20, 2016

హైదరాబాద్ : నగరంలో నిత్యం నిఘా... ఎప్పటికప్పుడు గస్తీ...పోలీసులు అందుబాటులో ఉంటారు... నీడలా మీ వెంటే ఉంటూ రక్షణ కల్పిస్తారు..ఇవన్నీ పోలీసులు చెబుతున్నవే...కాని జరుగుతున్నది మాత్రం వేరు... సికింద్రాబాద్‌లో వృద్ద దంపతులు నడుస్తూ వెళ్తుండగా పట్టపగలు పంజా విసిరిన స్నాచర్ దొరికిన గొలుసులు తెంచేశాడు..నడవలేని స్థితిలో ఉన్నా ఆ వృద్దుడు మాత్రం పట్టుకునే ప్రయత్నంలో పడిపోయిన దృశ్యం సీసీఫుటేజీలో చూసిన పోలీసులే చలించిపోయారు..

పద్మారావు నగర్ లో ...

సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో రమణారావు,రమాదేవిలు వృద్దు దంపతులు స్ధానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగించుకుని తిరిగి ఇంటికి నడుచుకుంటు వెళ్తున్న సమయంలో వెనుకనుండి వచ్చిన యువకుడు వృద్దురాలి మెడలోని బంగారు గోలుసును లాక్కేళ్లాడు...ఆ సమయంలో ప్రతిఘటించిన వృద్దురాలు ప్రతిఘటించే ప్రయత్నం చేసినా చిక్కలేదు.. నడవడమే కష్టంగా ఉన్న వృద్దుడు పరుగు పెట్టే ప్రయత్నంలో పడిపోయాడు.. వృద్దులు అప్పటికే దొంగా దోంగా అని అరిచినా పట్టించుకున్నవారు లేరు...ఇలా వచ్చి అలా చైన్‌తో పారిపోయిన దొంగ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు...

06:50 - May 20, 2016

కృష్ణా : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పనులు ఎక్కడ వేసిన గొంగడి... అక్కడే.. అన్న విధంగా తయారయ్యాయి. 2019 మార్చి నాటికి పట్టాలెక్కించి.... వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి నమూగా చూపించాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి.. ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడంలేదు. నిధుల కొరతతో ప్రాజెక్ట్‌ అమలు అతీగతీ లేకుండా పోయింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ అమల్లో జరుగుతున్న జాప్యంపై 10 టీవీ ప్రత్యేక కథనం..

గత నెలలో ప్రారంభం కావాల్సి ఉన్న పనులు

విజయవాడ ప్రజలను ట్రాఫిక్‌ కష్టాల నుంచి గట్టెక్కిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్‌ అమలు ముందుకు సాగడంలేదు. గతనెలలోనే పనులు ప్రారంభించాల్సివున్నా ఇంతవరకు భూసేకరణ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. 2019 నాటికి 26.3 కి.మీ. మార్గాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏలూరు రోడ్‌ మెట్రో కారిడార్‌-2కు పిలిచిన టెండర్ల సాంకేతిక బిడ్లను ఖరారు చేశారు. ఫైనాన్సియల్‌ బిడ్లను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. విజయవాడ రైల్వే స్టేషన్‌-గుణదల, గుణదల-నిడమానూరు 11.8 కి.మీ. మార్గానికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్‌ అమలుకు భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది.

మెట్రో కోచ్‌ డిపో కోసం 62 ఎకారాలు

మెట్రో ప్రాజెక్ట్‌ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. మొదటిదశలో కోచ్‌ డిపో కోసం 62 ఎకరాలు, 11 స్టేషన్లకు 2.50 ఎకరాలు అవసరమని గుర్తించారు. సేకరించాల్సిన భూమిని కూడా గుర్తించారు. ఇందుకు 500 కోట్ల రూపాయలు అవరసరం అవుతాయని లెక్క తేల్చారు. భూసేకరణకు ముందే నిర్మాణాలకు అవరోధంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, పైప్‌లైన్లు, కేబుల్‌వైర్లు, హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు తొలగించాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు 3 నుంచ 4 నెలల సమయం పడుతుందని అంచనావేస్తున్నారు.

ప్రాజెక్ట్‌ వ్యయం రూ. 6,718 కోట్లు......

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు భారీ వ్యవయం అవుతుంది. మొత్తం 6,718 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కకట్టారు. కానీ 2016-17 కేంద్ర బడ్జెట్‌లో కేవలం 100 కోట్ల రూపాయాలను మాత్రమే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్‌లో 300 కోట్లు కేటాయించినా... ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రాజెక్ట్‌ అమలును పర్యవేక్షిస్తున్న అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు... నిధుల విడుదల కోసం ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ముందుగా 150 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినా.. ఇంతవరకు ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్న విమర్శలున్నాయి. ప్రాజెక్ట్‌ వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం వంతున వాటా భరించేందుకు ముందుకొచ్చాయి. ఈ మొత్తం 2,420 కోట్లు. మిగిలిన దానికి రుణం సమకూర్చుకోవాల్సి ఉంది.

జైకా నుంచి రూ. 4,200 కోట్ల రుణం .....

విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ నుంచి రుణం పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు జైకా అంగీకరించింది. దీనిలో 30 శాతం మేరకు కోచ్‌లు, కార్లు సమకూరుస్తారు. రుణం మంజురుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ, రాతకోతలు వంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. దీంతో రుణం ఇప్పట్లో మంజూరయ్యే అవకాశం కనిపించడంలేదంటున్నారు. దాదాపు 15 నెలలు పట్టొచ్చని భావిస్తున్నారు. రుణం మంజూరులో జరుగుతున్న జాప్యం పనుల ప్రారంభంపై ప్రభావం చూపుతోంది. ఈ లెక్కన చూస్తే మరో ఏడాదిన్నర వరకు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభయ్యే అవకాశాలు కనిపించడంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.

ప్రాజెక్ట్‌ వ్యయం 15 శాతం పెరిగే అవకాశం .....

ముందుగా నిర్ణయించిన షెడ్యూలుకు అనుగుణంగా పనులు చేపట్టకపోతే నిర్మాణ వ్యయం 15 శాతం అదనంగా పెరుగుతుందని డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలో ప్రస్తావించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ వ్యయం తడిసిమోపెడయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

06:41 - May 20, 2016

హైదరాబాద్ : నగరంలోని కోటి మెటర్నిటీ అస్పత్రిలో ఈ సంఘటన సంచలనం రేపింది. నిత్యం వివాదాల్లో ఉండే ఈ అస్పత్రి కల్తీరక్తం వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన ఆసుపత్రి అధికారులు పూర్తి విషయం తెలుసుకొని షాక్ గురయ్యారు. కోటి మెటర్నిటీ ఔట్ సోర్సింగ్ విభాగంలో ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న నరేంద్ర ప్రసాద్ ఈ కల్తీ రక్తాన్ని సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న నరేంద్రప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అవసరమైన బ్లడ్ ను సరఫరా చేస్తామని...

బ్లడ్ కావాల్సిన వారి వివరాలను సేకరించి అవసరమైన బ్లడ్ ను సరఫరా చేస్తానని... రోగుల బందవులకు హామీ ఇస్తూ దందాకు తెరలేపాడు. రక్తానికి ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకున్నఔట్ సోర్సింగ్ ఉద్యోగి నరేంద్ర ప్రసాద్. రక్తాన్ని కల్తీ చేయడం మొదలుపెట్టాడు. మొదట, ఇతర బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి..హయత్ నగర్ లో ఉన్న తన ఇంట్లో ఒక రక్తం బాటిళ్లను రెండుగా విభజించి వాటి కొలతలో తేడా రాకుండా ఉండేందుకు వాటిలో సెలైన్ ను కలుపుతూ రక్తాన్ని కల్తీ చేస్తున్నాడు.

ముఠాగా ఏర్పడి ఏడాది కాలంగా మాఫియా....

ముఠాగా ఏర్పడ్డ ఇతను గత ఎడాది కాలంగా ఈ మాఫియా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అస్పత్రి వర్గాలు, తెలంగాణ, వాలంటీర్ బ్లెడ్ బ్యాంక్ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు పరారీలో ఉన్న నరేంద్ర ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. అతని ఇంట్లో లభించిన 30 రక్తం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోటి మెటర్నిటి ఆస్పత్రిలో భద్రపరిచిన రక్తం నమునాలను పరిశీలించారు. భాద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం....

మరో వైపు కోటి మెటర్నిటి ఆస్పత్రి వర్గాలు మాత్రం అన్ని విధాలుగా తనిఖీలు చేశాకే రక్తాన్ని రోగులు ఎక్కిస్తామని... నకిలీ రక్తం ఆస్పత్రిలో సరఫరా అయిందన్న ఆరోపణలపై భాద్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని సూపరిండెండెంట్ డా. రత్న కూమారి తెలిపారు. రాను రాను ఏది కల్తీ అవుతుందో.. ఏది స్వచ్ఛమైందో గుర్తుపట్టడం ఇబ్బందిగా మారుతోంది. ఈ కల్తీ మాఫియా ఒక్కరితో ప్రారంభమైంది కాదని... వీరి వెనక పెద్ద ముఠానే ఉందనే అనుమానాలు ప్రజల నుండి వ్యక్త మవుతున్నాయి.

06:38 - May 20, 2016

హైదరాబాద్ : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది పాత సామెత.. సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే సెల్ఫీలకు కొదవా అనేది కొత్త నానుడిలా మారింది. టచ్‌ స్క్రీన్‌ ఫోన్‌ ఉంటే చాలు చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్లదాకా.. చివరకు మంత్రులు సైతం సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతారు. హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. యాపిల్‌ సీఈవో.. టిమ్‌ కుక్‌, సీఎం కేసీఆర్‌తో కేటీఆర్‌ సెల్ఫీలు దిగారు. ఇందుకు యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ సైతం సహకరించారు. తర్వాత జనంతోనూ కేటీఆర్‌ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. 

06:31 - May 20, 2016

హైదరాబాద్‌: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. జనతా గ్యారేజ్ ఇచట అన్ని రిపేర్లు చేయబడును..అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయిన పోస్టర్ ట్రెండీ కలర్స్ తో అట్రాక్టివ్ గా ఉంది. అటు జూనియర్ కూల్ గా హెల్దీ లుక్, బియర్డ్, కలర్ ఫుల్ కాస్ట్యూమ్ తో హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. గ్యారంటీగా జూనియర్ , కొరటాల కాంబినేషన్ స్మాష్ హిట్ కొడుతుందనే జోష్ లో ఉన్నారు. ఎన్టీఆర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ బైక్‌పై అలా వస్తూ... చాలా అందంగా కనిపించారు. అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. సమంత, నిత్యామేనన్‌ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. 

పారామెడికల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో 2016-17 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ పారామెడికల్ సీట్లలో ప్రవేశాలకు పారామెడికల్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈనెల 20 (శుక్రవారం) నుంచి డీఎంఈ వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులు జూన్ 13లోగా సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 20 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ మొదలువుతుందని పారామెడికల్ బోర్డు కార్యదర్శి డా.వేణుగోపాల్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

Don't Miss