Activities calendar

21 May 2016

22:05 - May 21, 2016

మూర్ఖత్వానికి మతం లేదు.. మానవత్వంతో పనే లేదు. బంధు ప్రీతి మూర్ఖత్వానికి అస్సలుండదు. స్వార్థమనే పిశాచి రెక్కలపై ఊరేగుతూ విధ్వంసాన్ని సృష్టించాలన్న ఒక్క తపన తప్ప.. స్వార్థంతో శాంతిని పొందలేం. మూర్ఖత్వంతో మనుషుల ప్రాణాలు కాపాడలేం. ప్రపంచంలో రోజురోజుకి పెరిగిపోతున్న నేరాలెన్నో ఘోరాలోన్నో.. వాటికి బలైపోతున్న అమాయిక ప్రాణాలెన్నో.. డబ్బు.. డబ్బు... డబ్బు... డబ్బు మబ్బులో తన మన తేడా లేకుండా కర్కశంగా ప్రవర్తించి నమ్మినవారినే మోసం చేస్తూ వారి కన్నీటికి కారకులవుతున్న నీచులెందరో... మన సమాజంలో మనతో పాటే మనలో బతుకుతున్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:56 - May 21, 2016

ఆదిలాబాద్‌ : జిల్లా సరిహద్దులో చనాఖా కొరాట ప్రాంతంలో నిర్మించబోయే బ్యారేజీకి లైన్‌ క్లీయర్‌ అయింది. బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తూ అటవీ, వన్యమృగ సంరక్షణ, గనులకు సంబంధించి ఎన్‌ఓసీ జారీచేసింది. మొత్తం 51వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే దరఖాస్తు చేసింది. దీనికితోడు మంత్రి హరీష్‌రావు పలుమార్లు మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సాగునీటి పారుదలశాఖ మంత్రితో చర్చలు కూడా జరిపారు. అయితే ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుకు 2018 జూలై కల్లా పూర్తిచేయాలని ప్రభుత్వ భావిస్తోంది. 

21:45 - May 21, 2016

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఇక ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లెపదాలతో కూడిన పాటలు వింటువంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా , ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు  వ్రాయాలంటే పల్లెల సంప్రదాయాలు, స్థితిగతులు, వారి సున్నితమైన మనస్సులు, పల్లెల పరిసరాలు వీటన్నింటి పట్ల ఒక నిగూఢమైన నిబద్ధత వుంటేనే ఆ స్వచ్ఛత వారి గళంలోనూ...కలంలోనూ కనపడుతుంది. మరి అటువంటి వాగ్గేయకారులు ఈనాటి మన మల్లన్నతో ముచ్చట్లాటానికి కాదు కాదు పాటలాడ్డానికి జానపదాల వాగ్గేయకారులు బుచ్చన్న, సోమన్న, జయరాజు మన 10టీవీ స్టూడియోకి వచ్చారు. మరి వారి పాడుతూ ఆటలాడిన ముచ్చట్లను మనమూ విందాం.... చూద్దాం... మనం పల్లెలలో మనం ఆడుకుని పాడుకున్న దృశ్యాలను నెమరువేసుకుందాం....మరి ఇంకెందుకు ఆలస్యం వారితో పాటు పాటలాడ్డానికి ఈ వీడియోను క్లిక్ చేద్దాం..పల్లెల స్వచ్ఛతను ఆస్వాదిద్దాం....

 

రోశయ్యతో జయలలిత భేటీ...

హైదరాబాద్ అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో అన్నాడిఎంకే విజయదుందుభి మోగించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. మూడు దశాబ్దాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాదని మరీ పురచ్చి తలైవి తన పార్టీని గెలిపించుకున్నారు.

కొత్త సంప్రదాయానికి తెర లేపిని పినరయి....

త్రివేండ్రం : కేరళ కొత్త ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నూతన సాంప్రదాయానికి తెర లేపారు. మాజీ ముఖ్యమంత్రులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సిపిఎం సీనియర్‌ నేత, మాజీ సిఎం అచ్యుతానందన్‌తో సమావేశమై ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ చేతిలో ఓడిన యుడిఎఫ్‌ కూటమికి చెందిన నేత, మాజీ సిఎం ఊమెన్‌ చాందీని కూడా విజయన్‌ కలిశారు. మాజీ సిఎంను అధికారంలోకి వచ్చిన సిఎం కలవడమన్నది బహుషా అరుదు. 72 ఏళ్ల విజయన్‌ మే 25న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బీహార్ లో మరో ఘోరం....

హైదరాబాద్ : ఉత్తర బీహార్‌ లోని మధుబని సమీపంలోని ఒక పొదలో తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన స్థితిలో ఓ యువతి స్థానికుడికి కనిపించింది. గమనించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.శుక్రవారం స్పృహలోకి వచ్చిన బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేశారు. తాను 12 తరగతి చదువుతున్నానని, తనపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారని, తరువాత 16 సార్లు కత్తితో పొడిచారని తెలిపింది. సంఘటనాస్థలి వద్ద ఒక ఎటిఎం కార్డు, మొబైల్ ఫోన్, ఒక కత్తి లభించడంతో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మాఫియా డాన్ తో టచ్ లో వున్న మరాఠా మంత్రి?...

హైదరాబాద్ :  మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో నిత్యం టచ్ లో ఉన్న నాలుగు ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. ఈ నెంబర్లలో ఒకటి మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సేది కావడం విశేషం. ఈ విషయం మహారాష్ట్రలో  కలకలం రేపుతోంది. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్‌ చేస్తున్న ఫోన్‌ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలిపింది.

ముగ్గురి మృతికి కారణమైన సింహాలు అరెస్ట్.....

హైదరాబాద్ : ముగ్గురి మృతికి కారణమైన నాలుగు సింహాలను గుజరాత్‌లోని తూర్పు గిర్‌ అడవుల్లో అధికారులు బంధించారు. ఈ ఘటనలు జరిగిన సమీప గ్రామాల వద్ద ఉన్న సింహాల గుంపు మొత్తాన్ని బంధించి వాటి ప్రవర్తనను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు డీసీఎఫ్‌ తెలిపారు. ఇప్పటికే మేము నాలుగు సింహాలను బంధించామని తెలిపారు. ఈ గుంపులో వున్న మిగిలిన సింహాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.

బంగ్లాదేశ్‌తో సరిహద్దులు మూసివేస్తాం: బీజేపీ నేత శర్వానంద్

హైదరాబాద్ : బంగ్లాదేశ్‌తో దేశ సరిహద్దులను రెండేళ్లలో మూసివేస్తామని అసోం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శర్వానంద్ సోనోవాల్ శనివారం తెలిపారు. చొరబాటు ప్రయత్నాలకు చరమగీతం పాడేందుకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. 'సరిహద్దులను శాశ్వతంగా సీల్ చేసేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండేళ్ల వ్యవధి ఇచ్చారన్నారు. అనుకున్న గడువులోగా ఆ పని పూర్తి చేసితీరుతాం' అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనోవాల్ తెలిపారు.

వాణిజ్యపన్నుల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : వాణిజ్యపన్నుల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. పన్నులు కట్టని వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పన్నులు కట్టే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీలను భర్తీ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని తెలిపారు. రూ.3600 కోట్ల బకాయిలు కోర్టు వివాదలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా జరిపే కొనుగోళ్లకు టీడీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. విశ్రాంతి ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. 

 

బీసీసీఐ అధ్యక్ష పదవికి నురాగ్ ఠాకూర్ నామినేషన్....

ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవికి కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్ ఐసీసీ ఇండిపెండెంట్ చైర్మెన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో అధ్యక్ష పదవికి అనురాగ్ ఠాకూర్ నామినేషన్ వేశారు. బీజేపీ ఎంపీ అయిన అనురాగ్ గతంలో బిజెవైఎం జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.

కువైట్ లో ఘనంగా మినీమహానాడు ....

హైదరాబాద్ : కువైట్‌లోని కార్మెల్ స్కూలు పసుపు మయయ్యింది. ప్రవాసాంధ్ర తెలుగుదేశం ఆధ్వర్యంలో ఖైతాన్‌లోని కార్మెల్ స్కూల్‌లో టీడీపీ మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తానా అధ్యక్షుడు వేమన సతీష్, టీడీపీ నేతలు కె. విశ్వనాథ నాయుడు, ఎం.రవిప్రకాశ్ బాబు, డాక్టర్ హరినాథ్ పాల్గొన్నారు. అనివార్య కారణాల తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం హాజరు కాలేకపోయారు.

పంజాబ్ పై పుణె విజయం

హైదరాబాద్ : ఐపిఎల్ -9 లో భాగంగా పంజాబ్, పుణెల మధ్య జరిగిన మ్యాచ్ లో పుణె విజయం సాధించింది. పంజాబ్ పై పుణె గెలుపొందింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ధోని వరసుగా రెండు సిక్సులు కొట్టి జట్టును గెలిపించారు.

 

విద్యుత్ షాక్ తో రైతు మృతి...

నిజామాబాద్‌: మండలం ఎల్లారెడ్డిపల్లిలో విద్యుదాఘాతంతో నర్సయ్య అనే రైతు మృతి చెందాడు. వ్యవసాయ బోరుబావిలో మోటార్‌ను దింపుతుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు పైపులు తగిలి నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ నేత ఎల్.రమణకు అస్వస్థత...

హైదరాబాద్‌: తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా మినీమహానాడులో ప్రసంగిస్తూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళన చెందిన నేతలు, కార్యకర్తలు చికిత్స నిమిత్తం ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించారు.

హౌరా ఎక్స్ ప్రెస్ లోమంటలు....

శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం శ్రీజగన్నాథపురం వద్ద తిరుచునాపల్లి నుంచి హౌరా వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు జనరల్‌ బోగీ నుంచి మంటలు చెలరేగాయి. ప్రయాణీకులు గమనించటంతో రైలును నిలిపివేశారు. అప్పటికే బోగీలో పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు అదుపుచేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో సుమారు రెండుగంటల పాటు రైలును సంఘటనా స్థలంలో నిలిపివేశారు.

కేసీఆర్ ను ఆహ్వానించిన ఆటా ....

హైదరాబాద్‌: అమెరికా తెలుగు సంఘం(ఆటా) ప్రతినిధులు శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆటా వార్షిక సదస్సుకు రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు. చికాగోలో జూన్‌ 1 నుంచి 3 వరకు ఆటా మహాసభలు జరుగుతాయని వారు సీఎంకు వివరించారు.

దీదీ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు...

పశ్చిమబెంగాల్ : ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఈనెల 27న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుక కోసం అతిరథ మహారధులైన నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీస్టార్స్‌ను అతిథులుగా పిలుస్తున్నారు.ఈ వేడుకలో పాల్గొనే ముఖ్య అతిథుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉన్నారు. వీరితో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న జయలలిత కూడా ఉన్నారు.

తల్లిపేరు చాలు : హైకోర్టు

ఢిల్లీ: పాస్‌పోర్టు పొందటానికి కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో తల్లి పేరు ఉంటే సరిపోతుందని తండ్రిపేరు తెలియజేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇటీవల కాలంలో సింగిల్‌ పేరెంట్‌ కుటుంబాలు బాగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న న్యాయస్థానం ఈ విధంగా పేర్కొంది. పెళ్లికాని తల్లులు, సెక్స్‌ వర్కర్స్‌, సరోగేట్‌ మదర్స్‌, రేప్‌ బాధితులు, ఇతర పద్దతుల్లో జన్మించిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇటువంటి కేసుల్లో తల్లిపేరు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. తల్లి మాత్రమే సహజమైన గార్డియన్‌ అని పేర్కొంది.

కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి ...

జమ్ముకశ్మీర్‌ : కుప్వారా జిల్లా దుర్గముల్లా గ్రామం వద్ద మిలిటెంట్లకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిగిన ప్రదేశం వద్ద ఐదు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కుప్వారా పరిసర అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో భద్రతా దళాలు కూంబింగ్‌ చేపట్టాయి.

19:29 - May 21, 2016

విజయవాడ : ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన బెజవాడ స్వరాజ్యమైదాన్‌.. కనుమరుగై పోనుంది. విదేశీ కార్పొరేట్‌ సంస్థకు ఈ స్థలాన్ని అప్పగించేందుకు.. అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

పుస్తక ప్రదర్శనలకు వేదికగా పీడబ్ల్యూ....
విజయవాడలో సభలు.. సమావేశాలు.. పుస్తక ప్రదర్శనలకు వేదికగా నిలిచింది పీడబ్ల్యూ స్వరాజ్య మైదానం. ఇంతటి విశిష్ట స్థలం ఇక చరిత్రపుటలకే పరిమితం కానుంది. హైదరాబాద్‌లోని కెబిఆర్‌ పార్క్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలాన్ని విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నెలలో చైనాకు చెందిన కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు ఈ మైదానాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ ప్రాతంలో గజం స్థలం విలువ రెండున్నర లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఏడు ఎకరాల్లోని 33,800 గజాల స్థలాన్ని చైనా కంపెనీలకు కట్టబెట్టేందుకు ‌ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

మైదానం చుట్టూ రక్షణ గోడ కట్టేందుకు ఏర్పాట్లు....
స్వరాజ్య మైదానంలో స్క్వేర్‌ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌ అధికారులు స్వరాజ్య మైదానం చుట్టూ రేకులతో రక్షణగోడ కట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రౌండ్‌లోనే ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉన్న రైతుబజార్‌ స్థలం స్వాధీనానికి కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రైతుబజార్‌ను కాలువ ఒడ్డుకు తరలించనున్నారు.

పాలిటెక్నిక్‌ కళాశాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు.....
స్వరాజ్య గ్రౌండ్‌ పక్కనే ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రౌండ్‌లో సీఎం కార్యాలయం వైపు ఉన్న ఇరిగేషన్ కార్యాలయాలు, భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఇరిగేషన్‌ కార్యాలయాన్నే తన క్యాంప్‌ కార్యాలయంగా మార్చుకున్న సీఎం దానికి సమీపంలో ఉన్న నిర్మాణాలను తొలగించే పరిస్థతికి కారణమయ్యారు.

పీడబ్ల్యూడీ ని కార్పొరేట్‌ పరం చేయవద్దని సూచనలు...
చిన్నారుల ఆటపాటలకు, పెద్దల సభలు, సమావేశాలకు అనుకూలంగా ఉన్న ఈ మైదానాన్ని ఆదాయ వనరుగా భావిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రజలు, పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ను కార్పొరేట్‌ శక్తుల పరం చేయవద్దని సూచిస్తున్నారు. ధర్నాలతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

19:20 - May 21, 2016

గుంటూరు : మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోని డాక్టర్ల బృందం కడుపునొప్పి అని వైద్యం కోసం వచ్చిన రోగికి వైద్యం చేసి చివరకు అపస్మారక స్థితికి చేరుకునేలా చేశారు. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు కిషోర్‌ కడుపు నొప్పిగా ఉందని డాక్టర్సును సంప్రదించాడు. లాప్రోస్కోపిక్‌ ద్వారా వైద్యంచేసి, ఇంటికి వెళ్లిపోవచ్చని సూచించారు. మరలా నొప్పిరావడంతో డాక్టర్స్‌ని సంప్రదిస్తే, పొట్టకోసి గుంటూరు నుంచి అప్పటికప్పుడు గ్యాస్ట్రోఎంటాలజీ డాక్టర్స్‌ని పిలిపించి,ఆపరేషన్‌ చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన బంధువుకి ఆపరేషన్‌ సమయంలో చిన్నపొరపాటు జరిగిందని వైద్యులు తెలిపారు. చివరికి రోగి కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పటిల్‌ యాజమాన్యం తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు.

19:05 - May 21, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ కేటాయింపుపై అన్ని విధాలా పరిశీలిస్తున్నామని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు అన్నారు. విభజన బిల్లు ప్రకారం ఏపీకి ప్రత్యేక జోన్‌ రావాల్సి ఉన్నా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

19:00 - May 21, 2016

విజయవాడ : బంధాలు తెగిపోతున్నాయి...అనుబంధాలు మాయమవుతున్నాయి...మానవత్వాన్ని మర్చిపోతున్న మనిషి మృగంగా మారుతున్నాడు...రక్త సంబంధాన్ని తెంచేసుకుంటున్నాడు...డబ్బు కోసం కొందరు..క్షణికావేశంతో ఇంకొందరు...అందరిదీ ఒకే దారి.. కారణాలు చిన్నవే అయినా రక్తం చిందిస్తున్నారు. అహం, ఆవేశం, ఆక్రోశం ఎన్నో కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. మరెన్నో కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఆయా కుటుంబాల్లో జీవితానికి సరిపడా దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. విజయవాడ నున్నలో జరిగిన దారుణం జరిగింది.

టిఫిన్ పెట్టలేదని కోడలిని చంపిన మామ....
విజయవాడ నున్నకు చెందిన శివాజీ, సునీత తోలిచూపులోనే ప్రేమలో పడ్డారు. పెద్దలను ఏదురించి ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే అత్తారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచే సునీతకు కష్టాలు మొదలయ్యాయి. మామ సత్యనారాయణతో చిటికి మాటికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం సమయానికి టిఫిన్‌ పెట్టలేదని మామ కోడలిపై చిందులు తొక్కాడు. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన అతడు కోడలు సునీతను అత్యంత కిరాతకంగా గొంతునులిమి చంపాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు టిఫిన్‌ పెట్టకపోవడమే కారణమా? లేక మరేవైనా కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మద్యానికి బానిసై తండ్రిని చంపిన కుమారుడు....
ఈనెల 16న కడప జిల్లాలో అమానషమైన ఘటన చోటుచేసుకుంది. గుండ్లూరు దళితవాడకు చెందిన గంపాల చెంగయ్యకు ఇద్దరు కొడుకులు. మద్యానికి బానిసైన చిన్న కొడుకు యల్లయ్య..తండ్రిపాలిట కాలయముడ్డయ్యాడు. ఇంట్లో వండుకున్న మటన్‌ కర్రీ తనకు మిగల్చలేదన్న ఆవేశంతో ఊగిపోయిన అతడు కన్నతండ్రిపై రోకలి బండతో మోది కిరాతకంగా హతమార్చాడు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి దుర్మార్గాలకు దారితీస్తాయో తెలుసుకోండి. హాయిగా సాగిపోయే జీవితంలోకి కోరి కష్టాలు కొనితెచ్చుకోకండి. ప్రేమ అభిమానాలతో శత్రువులను కూడా మార్చవచ్చన్న విషయం గ్రహించండి. 

18:50 - May 21, 2016

కరీంనగర్ : ఈ ఏడాది తునికాకు సేకరణ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అడివిలో తునికాకు తగ్గడం, అనుకున్నంత ఆకు దొరక్క పోవడం, దీనికి తోడు తునికాకు యూనిట్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. కూలీలను దయనీయ స్థితిలో పడేస్తున్నాయి.

ఆకు లభ్యత తగ్గిపోవడంతో జీవనోపాధి కోల్పోయిన గరిజనులు ...
తెలంగాణలో తునికాకు సేకరించే గిరిజనులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి కొంత.. కాంట్రాక్టర్ల వ్యవస్థ కొంత భాగం.. వీరి జీవనోపాధికి గండి కొట్టాయి. ఈ ఏడాది ఆకు లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో గిరిజనులు జీవనోపాధిని కోల్పోయారు. అయితే దీనికి ప్రకృతి సహకరించక పోవడం కన్నా... కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిప్పు పెట్టటంతో కాలిపోయిన మొక్కల కాండాలు....
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తునికాకు కొమ్మ కొట్టించాల్సిన కాంట్రాక్టర్లు.. ఆ నిబంధనను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అడివిలో నిప్పు పెట్టారు. దీంతో తునికాకు మొక్కల మొదళ్లు కాలిపోయి.. తునికాకు చిగురించని పరిస్థితి ఏర్పడింది. దీంతో తునికాకు కూలీలకు రోజు కూలీ దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. 50 ఆకులు గల ఒక కట్టకు గత ఏడాది 1.18 పైసలు చెల్లించగా, ఈ సారి 1.25 పైసలు చెల్లిస్తున్నారు. అయితే ఆకులు దొరకని కారణంగా.. తునికాకు సేకరణ తమకు గిట్టుబాటు కావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కూలీల కష్టాలు...
కరీంనగర్‌-వరంగల్‌ జిల్లాల పరిధిలోని మంథని, మహదేవ్‌పూర్‌, చింతకాని, అజాంనగర్‌ రేంజ్‌లోని 40 యూనిట్లలో.. తునికాకు సేకరణపైనే ఆధారపడి.. వేలాది మంది గిరిజనులు జీవిస్తారు. పెట్టుబడిలేని ఈ పని కోసం గిరిజనులు కుటుంబ సమేతంగా వేకువ జామున అడవికి వెళ్లి తునికాకు కోసి, ఇంటికి తెచ్చి కట్టలు కడతారు. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో తునికాకు మీద ఆధారపడే కుటుంబాలకు రోజుకూలీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇంకా రేటు పెంచితే బాగుంటుందని కూలీలు ఆశిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. 

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం : రాంమాధవ్

హైదరాబాద్ : తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. రెండేళ్లలో ఎపికి కేంద్రం చాలా సాయం చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఎపి బీజేపీకి త్వరలో నూతన అధ్యక్షుడు ఎన్నుకుంటామని చెప్పారు. బీజేపీపై ఎపి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిస్తామని చెప్పారు. 

టీ.సెక్రటేరియట్ సందర్శకులకు డిజిటల్ పాసుల విధానం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయం సందర్శకులకు డిజిటల్ పాసుల విధానం అమలు చేశారు. డిజిటల్ పాసుల జారీ విధానాన్ని సీఎస్ రాజీవ్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి నుంచి పూర్తిగా డిజిటల్ పాసుల విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తామని తెలిపారు. సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఆధార్ లేదా ఏదైనా ధృవపత్రం తప్పనిసరి అని చెప్పారు.

 

18:33 - May 21, 2016

ఖమ్మం : రైల్ నిలయంలో సీఆర్ పీఎఫ్ , సీఐఎస్ భద్రతా దళాలు ఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేశారు. ఆర్పీఎఫ్ ఏఎస్సై సుబ్బారావుపై పాశవికంగా దాడి చేసి చితకబాదారు. ఆర్పీఎఫ్ , సీఆర్ పీఎఫ్ సిబ్బింది వారించినప్పటికీ జవానులు మూకుమ్మడిగా రెచ్చిపోయారు. రప్తీసాగర్ రైలులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేకపోవడంతో రైలును ఖమ్మం రైల్ నిలయంలో దాదాపు రెండు గంటలపాటు నిలిపివేశారు. దీంతో దూర ప్రాంత ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనకు భద్రతా సిబ్బందే కారణమని కమాండెంట్ ను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన భద్రతా దళాలు ఆర్పీఎఫ్ సిబ్బంది పై దాడులకు దిగారు.

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు అస్వస్థత

రంగారెడ్డి : టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు అస్వస్థతకు గురయ్యారు. మినీ మహానాడులో ప్రసంగిస్తుండగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆయన్ను మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

 

ప్రకాశ్‌ ఆర్ట్స్‌పై కేసు నమోదు...

హైదరాబాద్‌: ప్రముఖ ప్రకటనా సంస్థ ప్రకాశ్‌ ఆర్ట్స్‌పై కేసు నమోదైంది. శుక్రవారం గాలివాన బీభత్సానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో హోర్డింగ్‌ కూలి ఓ ఇన్నోవా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహన యజమాని అమిత్‌జైన్‌ ప్రకాశ్‌ ఆర్ట్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సెక్షన్‌ 336 కింద కేసు నమోదు చేశారు. కాగా నగరంలోని హోర్డింగ్స్ పై మేయర్, కమిషన్ సమావేశమయ్యారు. ఈ విషయంలో 10 కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

బాలికను ఉరి వేసి చంపిన దుండగులు...

కృష్ణా: నూజివీడులో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికను దుండగులు దారుణం చంపారు. రూప అనే ఏడేళ్ల బాలికను నోట్లో మట్టి కుక్కి చెట్టుకు ఉరేసి గుర్తు తెలియని దుండగులు చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.నిందితులను కఠినంగా శిక్షిచాలని స్థానికులు డిమాండ్ చేశారు.

పుణె విజయలక్ష్యం 173 పరుగులు

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా పంజాబ్, పుణె జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. బౌలింగ్ విభాగంలో అశ్విన్‌కు నాలుగు వికెట్లు, జంపా, పెరీరా, దిండా ముగ్గురికి తల ఒక వికెట్‌ దక్కింది.

 

సమస్యలపై 100కు డయల్‌ చేసిన గవర్నర్‌

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ 100కు ఫోన్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరవాసుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 100కు గవర్నర్‌ ఫోన్‌ చేసి పరీక్షించారు. అధికారులు వెంటనే స్పందించారని ప్రశంసించారు. అనంతరం గాలివాన బీభత్సంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితో సమీక్షించారు. కూలిన చెట్లను తొలగించి, విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. 

దేశీయంగా తిరిగే విమాన ప్రయాణీకులకు స్పెషల్‌ ఆఫర్‌

ఢిల్లీ : దేశీయంగా తిరిగే విమాన ప్రయాణీకులకు స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది. డొమెస్టిక్‌లో అన్ని ప్రయాణ అలవెన్సులను కలుపుకొని చార్జీని రూ.1499గా నిర్ణయించింది. ఈ రోజు నుంచి మే 25వరకు బుక్‌ చేసుకోవచ్చు. వీరు జూలై నుంచి సెప్టెంబర్‌ 30 వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. మిగతా విమానయాన సంస్థలు ఇప్పటికే ఆఫర్‌ లను ప్రకటించాయి. విమాన యాన రంగానికి జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు ఆన్‌సీజన్‌ ఉంటుంది. కావున డిస్కౌంట్‌ల పేరుతో భారీగా ఆఫర్‌ చేస్తుంటారు.

సూపర్ మార్కెట్ లో చిన్నారి అపహరణ....

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. శనివారం నాడు ఒక సూపర్ మార్కెట్ నుంచి చిన్నారి అపహరణకు గురయ్యింది. చిన్నారిని తీసుకువెళ్లడం గుర్తించిన ఆమె తల్లి కిడ్నాపర్ వెంట పరుగులు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. మార్కెట్ వుండే తోపుడుబండిలో బాలికను ఓ మహిళ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీఎస్‌ రాజీవ్‌శర్మతో స్వీడన్ రాయబారి సమావేశం

హైదరాబాద్ : సీఎస్‌ రాజీవ్‌శర్మను స్వీడన్ రాయబారి హెరాల్డ్ శాండ్ బర్గ్ కలిశారు. తెలంగాణలో పెట్టుబడులకు చాలా అవకాశాలన్నాయని, ఇప్పటికే స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని హెరాల్డ్ శాండ్ బర్గ్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని స్వీడన్ కంపెనీల ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు.

ఏడుగురు మత్స్యకారులు అదృశ్యం....

గుంటూరు : సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు అదృశ్యమయ్యారు. నిజాంపట్నం హార్బర్ నుంచి ఈనెల 16న బోటులో ఏడుగురు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారు. ఇంతవరకు వారి ఆచూకి తెలియక పోవడంతో వారి బంధువులు అధికారులకు తెలిపారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలించినా వారి ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం... యజమాని మృతి

పాట్నా : పంజాబ్‌లోని మాల్కోవాల్‌ గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక రైతు కుటుంబం సామూహికంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రైతు మరణించగా.. తన భార్య, ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతి చెందిన వ్యక్తి గురుదీప్‌ సింగ్‌. ఇతడు ఒక కమీషన్‌ ఏజెంటు దగ్గర సంవత్సరం కిందట అప్పు చేశాడు. అప్పుకింద రైతు తనఖా పెట్టిన భూమి విషయంలో శుక్రవారం ఏజెంటుతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన రైతు గురుదీప్‌ సింగ్‌ కుటుంబసభ్యులతో కలిసి సామూహికంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

17:43 - May 21, 2016

మెదక్ : నర్సాపూర్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కరవు అయిందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తరువాత మహిళలపై హింస పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రిగారి జిల్లాలోనే దాదాపు 15 కేసులు జరిగాయని తెలిపారు. మహిళలపై పెరుగుతున్న హింసా ఘటనలు వింటుంటే బాధగా వుంటుందన్నారు. బాధిత కుటుంబాలను ప్రజాప్రతినిధులు గానీ,అధికారులుగానీ కలవలేదని ఆమె విమర్శించారు.  హింసకు కారణమైన నిందితులను పట్టుకోవటంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఇప్పటికైనా మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.  కౌడిపల్లి మండలం అద్దెమర్రి గ్రామానికి చెందిన యువతిని ఐదుగురు దుండగులు కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

మిర్యాలగూడలోని ఫార్మసీ షాపుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని ఫార్మసీ షాపుల్లో శనివారం డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరుగురు డీఐలు రెండు బృందాలుగా విడిపోయి పట్టణ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలో సుమారు 180 వరకు ఔషధ దుకాణాలు ఉన్నాయి. కాగా, తమ తనిఖీల్లో భాగంగా కొన్ని షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్టు, ఫార్మాసిస్టులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులకు నివేందిచనున్నట్టు అధికారులు తెలిపారు.

అక్రమ హోర్డింగ్‌లను తొలగించాలి : తలసాని

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ అధికారులు, హోర్డింగ్‌ ఏజెన్సీల నిర్వాహకులు అక్రమ హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాసరావు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీలో హోర్డింగ్‌లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించని యూనిక్‌ హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలన్నారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, అధికారులు హాజరైనారు.

17:01 - May 21, 2016

త్రివేండ్రం : కేరళ కొత్త ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నూతన సాంప్రదాయానికి తెర లేపారు. మాజీ ముఖ్యమంత్రులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సిపిఎం సీనియర్‌ నేత, మాజీ సిఎం అచ్యుతానందన్‌తో సమావేశమై ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ చేతిలో ఓడిన యుడిఎఫ్‌ కూటమికి చెందిన నేత, మాజీ సిఎం ఊమెన్‌ చాందీని కూడా విజయన్‌ కలిశారు. మాజీ సిఎంను అధికారంలోకి వచ్చిన సిఎం కలవడమన్నది బహుషా అరుదు. 72 ఏళ్ల విజయన్‌ మే 25న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

16:52 - May 21, 2016

హైదరాబాద్ : బ్రాహ్మణకులాలను కించపరిచేలా మాట్లాడారని కంచె ఐలయ్యపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'స్వేదం.. వేదం' అనే అంశంపై జరిగిన సమావేశంలో తమ్మినేని పాల్గొని, మాట్లాడారు. ఐలయ్యపై ఆరోపణలను తమ్మినేని ఖండించారు. ఐలయ్యకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉత్పత్తి కులాలపై కొందరు ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. 

16:49 - May 21, 2016

కాకినాడ  : తాను ఎస్టీ జాబితాలోని వాల్మీకి కులానికి చెందిన మహిళనే అంటున్నారు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. ఎంపీ కుల వివాదంలో విచారణ నిమిత్తం ఆమె ఇవాళ కాకినాడ కలెక్టరేట్ లోని స్ర్కూటిని కమిటీ ముందు హాజరయ్యారు. తన తండ్రి వాల్మీకి అయినందున తాను కూడా ఎస్టీ హోదా అర్హురాలినని తెలిపారు. 

16:44 - May 21, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ లోని మహేంద్రహిల్స్‌లో ఉన్న ఆర్‌సీఐ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి 9 కోట్ల 85లక్షల డబ్బును నొక్కేశారు. శుక్రవారం సాయంత్రం సర్వీస్‌ సెంటర్‌కు సంబంధించిన 9.85 కోట్ల డబ్బు కనిపించడంలేదని సంస్థ మేనేజర్‌ నాగరాజు తుకారాంగేట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సర్వీస్‌ సెంటర్‌లో పనిచేస్తున్న అనంతపురంకు చెందిన లోకేష్‌రెడ్డి, పాతబస్తీకి చెందిన ప్రవీణ్‌ల హస్తం ఉందని తేల్చారు. ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహేంద్రహిల్స్‌లో ఉన్న సర్వీస్‌ సెంటర్‌కు నగరంలో 52 ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. ప్రతి రోజు సర్వీస్‌ సెంటర్‌ ఉద్యోగులు ఏటీఎం సెంటర్లలో డబ్బు నింపాల్సి ఉంటుంది. సిబ్బంది చేతివాటంతో ఈ పని జరిగిందని త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

16:39 - May 21, 2016

ప్రకాశం : ఒంగోలులో జరుగుతున్న మినీమహానాడులో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సమావేశంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాలు బాహాబాహికి దిగారు. రెండు వర్గాల నేతలు కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ సందర్భంలో బలరాం, బుచ్చయ్య చౌదరిపై ఫైర్ అయ్యారు. గొట్టిపాటి, కరణం వర్గీయులు స్టేజిపైకి రావడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రావెల కిషోర్‌బాబు ,కొంతమంది సీనియర్ నాయకులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

16:35 - May 21, 2016

హైదరాబాద్ : యాడ్‌ ఏజెన్సీలతో హైదరాబాద్ మేయర్, కమిషనర్ సమావేశం ముగిసింది నగరంలో హోర్డింగ్స్‌పై ఉన్న ప్లెక్సీలను వెంటనే తొలగించాలని సమావేశంలో మేయర్ ఆదేశించారు. ప్రస్తుతమున్న హోర్డింగ్‌ల సామర్థ్యం అనుమతి తీసుకున్న ప్రకారం ఉన్నాయో.. లేదో పరిశీలించేందుకు 10 కమిటీలు ఏర్పాటు చేశారు.గత కొద్దిరోజులు గా కురుస్తున్న వర్షానికి హోర్డింగ్స్ కూలి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా వున్నాయని మేయర్ గుర్తు చేశారు. నగరంలో అనుమతుల ప్రకారం ఇప్పటికే 2,684 గుర్తింపు పొందిన హోర్డింగ్స్ వున్నాయి. వ్యాపారస్తులు కమర్షియల్ యాంగిల్ లో కాకుండా వారుకూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని హోర్డింగ్స్ నిర్మించాలని సూచించారు. హోర్డింగ్స్ సామర్థ్యం 40 అడుగులు దాటకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.

కలుషిత నీరు తాగి 47 మందికి అస్వస్థత

ఆదిలాబాద్ : కలుషిత నీరు తాగి 47 మంది కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్  మండలం తరోడాలో చోటుచేసుకుంది. జీఎంఆర్ దారం మిల్లులో కలుషిత నీరు తాగిన 47 మంది కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. సమాచారం అందుకున్న రిమ్స్ వైద్యులు మిల్లులోనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కార్మికులకు చికిత్స అందిస్తున్నారు.

ఎంసెట్‌ మెడికల్‌ తొలి ర్యాంకర్ హేమలతకు చంద్రబాబు అభినందనలు

విజయవాడ : ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన కర్నూలు జిల్లాకు చెందిన హేమలత విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు విద్యార్థిని హేమలతను అభినందించారు. ఇవాళ వెలువడిన ఎంసెట్‌ ఫలితాల్లో 156 మార్కులతో హేమలత ఫస్ట్ ర్యాంక్‌ సాధించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో హోర్డింగ్స్ లపై ఉన్న ఫ్లెక్సీల తొలగింపుకు ఆదేశాలు

హైదరాబాద్ : యాడ్ ఏజెన్సీలతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ మేయర్, కమిషనర్ సమావేశం ముగిసింది. హోర్డింగ్స్ లపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. హోర్డింగ్ లు సామర్థ్యం అనుమతి తీసుకున్న ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించేందుకు మేయర్ 10 కమిటీలు ఏర్పాటు చేశారు.

 

నేడు పుణె, పంజాబ్‌ ఢీ

విశాఖ : ఐపీఎల్ -9 లో భాగంగా నేడు పుణే జట్టు వర్సెస్‌ పంజాబ్‌ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన పంజాబ్‌ జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ విశాఖలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతుంది.

బంగ్లాదేశ్‌ లో రోను తుపాను విధ్వంసం

ఢాకా : బంగ్లాదేశ్‌ తీరం చేరిన రోను తుఫాన్‌ తీవ్ర విధ్వంసం సృష్టించింది. భారత తూర్పు తీరం దాటి బంగ్లాదేశ్‌ లోకి ప్రవేశించిన రోను వడగాలులకు తోడు కుండపోత వర్షంతో బంగ్లా తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. దీని ప్రభావంతో ఐదుగురు మరణించారు. అధికారులు 5,00,000 మందిని 3500 సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. అధికారులు విమానాశ్రయాలను, నౌకల ప్రయాణాలను నిలిపివేశారు. నాలుగైదు గంటల్లో తుపాన్‌ చిట్టగాంగ్‌ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగం చేసే దంపతులు ఒకేచోటుకి బదిలీ

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం చేసే దంపతులు ఒకేచోట పని చేసే విధంగా బదిలీలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ, ఎచ్ ఎండీఏ పరిధిలో ఉంటే బదిలీ అయ్యే అవకాశం లేదని పేర్కొంది. 

ఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల దాడి....

ఖమ్మం: ఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు దాడి చేశారు. రఫ్తీసాగర్‌ రైలులో నీళ్లు లేవని 2 గంటల పాటు రైలును సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది నిలిపివేశారు. ఈ నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది యత్నించారు. దీంతో ఆగ్రహించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేశారు.

టీడీపీ మినీ మహానాడులో గందరగోళం

ప్రకాశం : టీడీపీ మినీ మహానాడులో గందరగోళం నెలకొంది. గొట్టిపాటి మాట్లాడుతుండగా కరణం అనుచరుల నినాదాలు చేశారు. గొట్టిపాటి రవి, కరణం బలరాం వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. 

తెదేపా మినీ మహానాడులో గందరగోళం....

ప్రకాశం : ఒంగోలు తెదేపా మినీ మహానాడులో గందరగోళం నెలకొంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, సీనియర్‌నేత కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

వరుసహత్యల కేసును ఛేదించిన పోలీసులు....

ఆదిలాబాద్ : జిల్లాలోని భైంసాలో వరుసహత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 9మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆయుధాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ డీఎస్పీ ఆఫీసులో నిందితులను ఎస్పీ తరుణ్ జోషి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పాతకక్షలతో హత్యలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

మాల్యా అప్పులకు మన్మోహన్ సింగ్ హామీ ?...

ఢిల్లీ : విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి మన్మోహన్‌సింగ్‌ అనే రైతు గ్యారంటర్‌గా ఉన్నట్లు గుర్తించిన బరోడా బ్యాంకు అతడి ఖాతాను సీజ్‌ చేసింది. మన్మోహన్‌ సింగ్‌కు 8 ఎకరాల భూమి ఉంది. అతడికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు ఖాతాలున్నాయి. ఒక ఖాతాలో 12 వేలు, మరో ఖాతాలో 4 వేలున్నాయి. ఆ రెండింటినీ ఫ్రీజ్ చేయాలని ముంబై హెడ్ ఆఫీసు నుంచి స్థానిక బ్రాంచికి ఆదేశాలు వచ్చాయి. బ్యాంకుల చర్యతో ఆ రైతు అవాక్కయ్యాడు. మాల్యా ఎవరో తనకు తెలియదని, ఇంతవరకు ఆయనను తాను కలవలేదన్నారు. తన జీవితంలో ముంబై ముఖమే తెలియదన్నారు.

హన్మకొండలో టీటీడీపీ మినీ మహానాడు రసాభాసా

వరంగల్ : హన్మకొండలో టీటీడీపీ మినీ మహానాడు రసాభాసాగా మారింది. రేవంత్ రెడ్డి, రేవూరు హాజరయ్యారు. మజ్జిగ, పులిహోర ప్యాకెట్ల కోసం తెలుగు తమ్ముళ్ల బాహబాహీకి దిగారు. నేతలు సముదాయించినా కార్యకర్తలు శాంతించలేదు. టీడీపీ నేతల ప్రసంగాలను కార్యకర్తలు పట్టించుకోలేదు. 

అమరావతిలో ‘అందాల' పోటీలు...

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిలో ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఏపీ పోటీలు జరుగనున్నాయి. ఫ్యాషన్‌ రంగంలో యువతీ యువకులను ఉత్తేజ పరచడానికి ట్విలైట్‌ మీడియా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఆంధ్రప్రదేశ్‌ పోటీలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మీడియా సమావేశంలో తెలిపారు. జూన్‌ 1 నుంచి 25 వరకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆడిషన్స్‌లో ఎంపికైన వారితో జూలై 2న విజయవాడలో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి టైటిల్‌ సహా బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. సినీ నటులు కోనే హవీష్‌, దిలీప్‌ పోటీలకు సంబంధించిన వాల్ పేపర్ ను ఆవిష్కరించారు.

తొమ్మిది కోట్లు మాయం....

హైదరాబాద్ : నగరంలో బడా మోసం వెలుగు చూసింది. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని ఆర్సీ క్యాష్ ఏటీఎం సప్లయ్ ఏజెన్సీలో రూ.9కోట్లు మాయం అయ్యాయి. దీన్ని గుర్తించిన యాజమాన్యం తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్సీ క్యాష్ ఏటీఎం సప్లయ ఏజెన్సీ 52 బ్యాంకుల నుంచి డబ్బును సేకరించి ఆయా బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో లోడ్ చేస్తుంది. ఈ క్రమంలో నిన్న రూ.9కోట్ల98 లక్షల నగదుతో బయలుదేరిన ఓ వాహనం ఆయా ఏటీఎంలలో నగదును లోడ్ చేయలేదు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

టాప్ ర్యాంకర్ హేమలతను అభినందించిన బాబు...

విజయవాడ: ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన కర్నూలు జిల్లాకు చెందిన హేమలత విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు విద్యార్థిని హేమలతను అభినందించారు. శనివారం వెలువడిన ఎంసెట్‌ ఫలితాల్లో 156 మార్కులతో హేమలత ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన విషయం తెలిసిందే.

ఐదేళ్ళ బాలికపై వృద్ధుడు అత్యాచారం...

కృష్ణా : ఐదేళ్ళ బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చింతగుంటపాలెంకు చెందిన ఐదేళ్ళ బాలికపై ఈ నెల 4న వృద్దుడు అత్యాచారం చేశాడు. పాప అనారోగ్యంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. చిన్నారిని పరీక్షించిన వైద్యురాలు బాలికపై అత్యాచారం జరిగినట్టు తెలిపారు. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయనట్లు సమాచారం.

గింగిరాలు తిరిగిన విమానం వణికిన అమాత్యులు...

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో హైదారాబాద్ నుంచి విజయవాడ వెళ్లే స్పైస్ జెట్ విమానం గాల్లో చివురుటాకులా వణికిపోయింది. సీట్‌బెల్ట్ పెట్టుకోని ప్రయాణీకులు చెల్లాచెదురుగా పడిపోయారు. పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీకుల్లో ఏపీ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏపీ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కూడా ఉన్నారు. విమానం నుంచి దిగిన కొద్ది నిమిషాలపాటు వారి నోట మాట రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు.

15:03 - May 21, 2016

తమిళనాడు : అసలే ఓటమితో కుంగిపోయిన తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డీఎండీకే పార్టీ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే ఆరుశాతం ఓట్లు సంపాదించాలి. కాగా తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో కెప్టెన్ పార్టీ కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. దీంతో పార్టీ గుర్తింపు రద్దయింది. మే 16న జరిగిన ఎన్నికల్లో డీఎండీకే పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థులందరూ ఓడిపోయారు. పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు.

14:59 - May 21, 2016

ఢిల్లీ : విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ కంపెనీకి గ్యారెంటర్‌ ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఓ సాధారణ రైతంటే నమ్మలేము కానీ ఇది నిజం. విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి మన్మోహన్‌సింగ్‌ అనే రైతు గ్యారంటర్‌గా ఉన్నట్లు గుర్తించిన బరోడా బ్యాంకు అతడి ఖాతాను సీజ్‌ చేసింది. మన్మోహన్‌ సింగ్‌కు 8 ఎకరాల భూమి ఉంది. అతడికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు ఖాతాలున్నాయి. ఒక ఖాతాలో 12 వేలు, మరో ఖాతాలో 4 వేలున్నాయి. ఆ రెండింటినీ ఫ్రీజ్ చేయాలని ముంబై హెడ్ ఆఫీసు నుంచి స్థానిక బ్రాంచికి ఆదేశాలు వచ్చాయి. బ్యాంకుల చర్యతో ఆ రైతు అవాక్కయ్యాడు. మాల్యా ఎవరో తనకు తెలియదని, ఇంతవరకు ఆయనను తాను కలవలేదన్నారు. తన జీవితంలో ముంబై ముఖమే తనకు తెలీదన్నారు.  

14:56 - May 21, 2016

కర్నూలు : ఎంసెట్ మెడికల్‌ ఎంట్రన్స్‌పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన హేమలత టాప్ ర్యాంకు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. అధ్యాపకులు, తల్లి దండ్రుల సహకారంతోనే కష్టపడి చదివి మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధ్యం అయ్యిందని హేమలత తెలిపారు.

14:49 - May 21, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పడుతున్న బాధలు దేశంలో మరే రాష్ట్ర ప్రజలు పడలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రత్యేక హోదా ఉన్న పది రాష్ట్రాల కన్నా ఏపీ ముందు స్థానంలో ఉందని, కేంద్రం ఏపీకి చేయూతనివ్వాలని డిమాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోలేదన్నారు. తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర కమిషన్‌దేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్రం చొరవ తీసుకొని రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించాలని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల హక్కులని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. 

14:23 - May 21, 2016

తూగోదావరి : రాజమండ్రి కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో అధికారపక్షం 18 అంశాలకు సంబంధించిన ఎజెండాగా ప్రవేశపెట్టారు. డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని వైసీపీ సభ్యులు పట్టపట్టటంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రె శ్రీనివాస్ ఎంజెండాలో లేని అంశాలను చర్చించాలను పట్టుపట్టంతో విపక్ష సభ్యులను బయటకు వెళ్ళిపోవాలన్నారు. దీంతో వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు. మేయర సర్దిచెప్పినా విపక్షాలు వినకపోవటంతో 15రోజులపాటు విపక్ష సభ్యులను మేయర్ సస్పెండ్ చేశారు.

13:31 - May 21, 2016

విశాఖ : గ్రామాల్లో పెదరాయుళ్ల ఆగడాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. విందు భోజనం పెట్టనందుకు ఓ కుటుంబాన్నే కుల బహిష్కరణ చేశారు కుల పెద్దలు.

స్మార్ట్‌సిటీకి కూతవేటు దూరంలో అమానుషం......

స్మార్ట్‌సిటీగా పేరొందిన విశాఖ నగరానికి కూతవేటు దూరంలో ఈ అమానుషం జరిగింది. తగరపువలసలోని బాలాజీనగర్‌లో ఉంటున్న గొర్లే అప్పారావు.. ఇటీవలే రెండో కుమార్తె వివాహం చేశాడు. ఇంట్లో శుభకార్యం జరిగి అంతా హ్యాపీగా ఉన్నారు. ఇంతలోనే అప్పారావు ఇంటికి కులపెద్దలు వచ్చారు. గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేయాలని ఆర్డర్‌ వేశారు. పెళ్లి చేసి ఆర్ధికంగా చితికిపోవడంతో విందు ఇవ్వలేనన్నాడు అప్పారావు. అంతే.. కుల పెద్దలకు ఆగ్రహం వచ్చింది. తమ మాటనే ఎదిరిస్తావా.. అంటూ అప్పారావుపై ఫైర్‌ అయ్యారు. విందు ఇవ్వనందుకు 10 వేల రూపాయలు జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు. అయితే డబ్బు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు అప్పారావు కుటుంబ సభ్యులు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు అప్పారావు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు.

ఆ కుటుంబంతో ఎవరూ లావేదేవీలు పెట్టుకోవద్దని...

అప్పారావు కుటుంబంతో ఎవరూ లావాదేవీలు పెట్టుకోవద్దని.. ఎలాంటి కార్యాలకు ఆ కుటుంబాన్ని పిలవవద్దని ఆదేశించారు. దీంతో కుమిలిపోయిన అప్పారావు కుటుంబ సభ్యులు భీమిలి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రపంచమంతా విజ్ఞానపరంగా ముందుకు దూసుకుపోతుంటే..

ప్రపంచమంతా విజ్ఞానపరంగా ముందుకు దూసుకుపోతుంటే.. ఇంకా ఇలాంటి ఘటనలు జరగడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే తోటివానికి సాయం చేయలేని మనుషులు.. కుల పెద్దల ముసుగులో అడ్డమైన ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు చేతకాదని చెప్పినా సామాన్యుడిపై కుల పెద్దలు పంజా విసరడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. 

మోదీని కలిసిన టీమ్ కుక్

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలుసుకున్నారు. ఇద్దరూ కొంత సేపు ముచ్చటించారు. ప్రధానమంత్రి మొబైల్ యాప్ వర్షెన్‌ను టిమ్ కుక్ అప్‌డేట్ చేశారు.

కెప్టెన్ విజయ్‌కాంత్‌ పార్టీ గుర్తింపు రద్దు...

చెన్నై: తమిళనాడు సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డీఎండీకే పార్టీ గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించింది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే ఆరుశాతం ఓట్లు సంపాదించాలి. కాగా తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో కెప్టెన్ పార్టీ 2.4 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. దీంతో పార్టీ గుర్తింపు రద్దు అయింది. 

12:49 - May 21, 2016

కరీంనగర్: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జరిగింది. పెద్దలు పెళ్లికి నిరాకరించటంతో మనస్థాపానికి గురైన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన మౌనిక, కృష్ణమూర్తి గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 

12:48 - May 21, 2016

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. వైద్య పరిభాషలో జెజునవ్ గాంగ్లియోటిక్ పరిగగ్లియాన్ అని పిలిచే వింత కంతి... రాములు అనే రోగి కడుపులో నుంచి శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. కాంటినెంటల్ గ్యాస్ర్టా ఎంటరాలజిస్ట్ డాక్టర్ విజయ్ రాం నేతృత్వంలో వైద్య బృందం అత్యాధునికి పరిజ్ఞానంతో పొత్తి కడుపులో 25 సెంటిమీటర్ల పొడవున్నకంతిని గుర్తించి, శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సతో అరుదైన ఘనతను కాంటినెంటల్‌ ఆస్పత్రి సొంతం చేసుకుంది. 

12:46 - May 21, 2016

ఢిల్లీ :ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక ప్రజాందోళనగా చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భూగర్భ జలాల నిల్వ ఆవశ్యకతను తెలియచెప్పేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తన నివాసంలో ఇంకుడుగుంతను నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఈ నెల 26న యూపీలోని షహరాన్‌పూర్‌లో మోడీ సర్కారు రెండో వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. 

12:44 - May 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల తేనెతుట్టె కదిలింది. మొన్న మహబూబాబాద్‌... నిన్న గద్వాల... ఇవాళ రామగుండం.. వేములవాడ.... ఇలా రోజుకో జిల్లాలో ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. కొత్త జిల్లాల కోసం అనేకమంది ఆందోళన బాటపడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం, వేములవాడలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలన్న డిమాండ్‌తో ప్రజలు కథం తొక్కతున్నారు.

కొత్త జిల్లాల కోసం ప్రజలు పోరుబాట....

పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ప్రస్తుతం ఉన్న జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కొత్త జిల్లాల కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మరింత ఉధృతమయ్యాయి. వచ్చే నెల 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త జిల్లాలను ప్రకటించాలని నిర్ణయించుకున్న తరుణంలో...కొత్త జిల్లాల కోసం ప్రజలు పోరుబాట పట్టారు.

కొత్తజిల్లా ఏర్పాటులో కొన్ని అసెంబ్లీ నియోజవకర్గాల విలీనం తప్పదు....

కొత్తజిల్లా ఏర్పాటులో కొన్ని అసెంబ్లీ నియోజవకర్గాల విలీనం తప్పదు. కొన్ని సంఘాలు, కొందరు నేతలు దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. వేములవాడను కొత్తగా ప్రతిపాదిస్తున్న జగిత్యాల జిల్లాలో కలిపే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్న సమాచారంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. జగిత్యాలలో కలపకుండా... రాజరాజేశ్వరస్వామి కొలువుతీరిన వేములవాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు.

యాదాద్రిని జిల్లా కేంద్రంగా...

నల్గొండ జిల్లాలోని యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో వేములవాడను కూడా ఇదే విధంగా చేయాలన్న డిమాండ్‌ ఉంది.

భూపాలపల్లిని కొత్త జిల్లాగా ప్రకటించే అవకాశం .....

కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, రామగుండం పట్టణాలను కూడా జిల్లా కేంద్రాలు ప్రకటించాలన్న డిమాండ్‌తో ఈ ప్రాంతాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లిని కొత్త జిల్లాగా ప్రకటించే అవకాశం ఉంది. కరీనంగర్‌ జిల్లాలోని మంథని ప్రాంతాన్ని ఈ జిల్లాలో కలిపే ప్రతిపాదనలు ఉన్నాయన్న సమాచారంతో మథని ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో మంథని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్‌ ఉపందుకుంది. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ నుంచి నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి వెళ్లింది. కొత్త జిల్లాల కోసం సాగుతున్న ఉద్యమాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.

------------------------------------------

12:15 - May 21, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ -2016 మెడికల్‌ ఫలితాలు శనివారం ఉదయం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను సీఎం వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్సు ఇవ్వడంతో ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలకు మార్గం సుగమమైంది. గత కొన్ని రోజులుగా నీట్ వివాదంపై తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతుండగా ప్రస్తుతం ఈ ఏడాదికి మినహాయింపు ఇస్తూ ఆర్డినెన్స్ రావడం వారికి శుభసూచకంగా మారింది. వచ్చే సంవత్సరం నుండి తప్పని సరిగా నీట్ వెళ్లాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ర్యాంకు పేరు మార్కులు హాల్ టికెట్ నెం:

 1. మాచాని హేమలత (కర్నూలు) 156 966490185
  2. యర్ల సాత్విక్ రెడ్డి (రంగారెడ్డి) 155 975460062
  3. అమ్మకుల యజ్ఞప్రియ (హైదరాబాద్‌) 153 974440097
  4 . చిట్లూరి నేహ (కృష్ణా) 152 960590122
  5 . విక్రమ్ ఖాన్ (హైదరాబాద్‌) 152 974420323

  6. సావిత్రి (హైదరాబాద్‌) 152

  7. పెద్దిరెడ్ల శైల (విశాఖపట్నం) 150

 1. గ్రీష్మ భావన (వరంగల్‌) 150

 2. శివకుమార్ (నల్గొండ) 150

 3. సాయిప్రదీప్ రెడ్డి (ప్రకాశం) 150

మరిన్ని వివరాల కోసం [email protected]$2016 చూడవచ్చు.

తెలంగాణ లో ఇద్దరు ఐఏఎస్ ల బదిలీ

హైదరాబాద్ : తెలంగాణ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జలమండలి ఎండీగా దానకిశోర్, పురపాలక సంచాలకులుగా దానకిశోర్ కు అదనపు బాధ్యతులు, ఖమ్మం కలెక్టర్ గా లో లోకేష్ కుమార్ బదిలీ అయ్యారు.

 

ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల

విజయవాడ : ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఎంసెట్ మెడికల్ అగ్రికల్చర్ టాపర్స్ పేర్లను సీఎం ప్రకటించారు. 1.మాచాని హేమలత, 2. కేరల సాత్విక్ రెడ్డి, 3.అమ్మకోల యజ్ఞ్ ప్రియ, 4.చిట్లూరు నేహ, విక్రంఖాన్, 5.శొంటి సాహితి, 6.పెద్దిరెడ్ల శైలజ, 7. బలభద్ర గ్రీష్మ మీనన్, 8.దారం శివకుమార్, 9.కొండా సాయి ప్రతాపరెడ్డి టాప్ టెన్ ర్యాంకులను ప్రకటించారు. ఉన్నారు.

ఆరేపల్లిలో తాగు నీటి కోసం ఆందోళన

కరీంనగర్ : సుల్తానాబాద్ మండలం ఆరేపల్లిలో తాగు నీటి కోసం మాజీ ఎమ్మెల్యే విజయరమణ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీటిని తరలిస్తున్న పైప్ లైన్ ను పగులగొట్టి ఊర చెరువుకు నీళ్లు మళ్లించారు. దీంతో అక్క పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు.

సీఎం కేసీఆర్ పై పిసీసీ చీఫ్ ఉతమ్ ఫైర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నియంతాల వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని మండి పడ్డారు. 

అమరావతిని ఫ్రీజోన్‌గా చేయాలి: రామకృష్ణ

విశాఖ: అమరావతిని ఫ్రీజోన్‌గా చేయాలని, అన్ని ప్రాంతాల వారికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ చెప్పారు.ఈ నెల 25న గుంటూరులో సీపీఐ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.ఈ సదస్సుకు జాతీయ నేతలు హాజరవుతారని రామకృష్ణ వివరించారు. 

నెల్లూరు టీడీపీ, వైసీపీ కార్యకర్త మధ్య ఘర్షణ

నెల్లూరు : స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్ పేపర్ లో తప్పులు ఉన్నాయని వైసీపీ ఆందోళన బాట పట్టింది. సీసీ కెమెరాలు పెట్టి ఓటింగ్ జరుపుతున్నారని స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్త మధ్య ఘర్షణ జరిగింది.

రాజీవ్ కు ప్రముఖల నివాళి

ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 25వ వర్థంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాజీవ్‌ సమాధి వీరభూమి వద్ద పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ సమాధి వద్ద నివాళులర్పించారు.

 

10:39 - May 21, 2016

మెదక్ :నర్సాపూర్‌లో సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కౌడిపల్లి మండలం అద్దెమర్రి గ్రామానికి చెందిన యువతిని ఐదుగురు దుండగులు కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి వద్ద ఆందోళన

గుంటూరు : మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి వైద్యుల నిర్వాకం బయటపడింది. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన రోగికి పసరితిత్తిలో రాళ్లు ఉన్నాయని లేపరోస్కోపీ చేసి తొలిగిస్తామని చెప్పిన వైద్యులు ఆపరేషన్ చేసిన జీర్ణాశంయ పేగును తొలగించారు. రోగి పరిస్థితి విషయమంగా మారడంతో ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుడు కృష్ణా జిల్లా మోపిదేవికి చెందిన కిషోర్.

ఉదయం 11 గంటలకుఏపీ ఎంసెట్ ఫలితాలు

విజయవాడ : ఉదయం 11 గంటలకుఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వెయ్యి లోపు ర్యాంకులు వచ్చిన వారికి ప్రభుత్వ ఇస్తామని తెలిపారు. నీట్ పై సీఎం సమక్షంలో నిపుణులతో చర్చిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె మార్పిడి ఆపరేషన్లు జరగడం సంతోషకరం అని కామినేని హర్షం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాలేజీలను బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. 

విధుల్లో ఉన్న రైల్వే ఉద్యోగి ని చితకబాదిన ఎస్సై

నల్గొండ : చిట్యాల రైల్వే స్టేషన్ లో అర్థరాత్రి ఎస్సై శివకుమార్ వీరంగం సృష్టించారు. విధుల్లో ఉన్న రైల్వే ఉద్యోగి కుమారస్వామిని ఎస్సై చితకబాదాడు. దీంతో బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారిస్తున్నారు.

ఒడిశా తీరం వెంబడి కదులుతున్న రోను తుపాను

హైదరాబాద్ : రోను తుపాన్ ఒడిశా తీరం వెంబడి కదులుతోంది. బంగ్లాదేశ్ కు 435 కి.మీ దూరంలో రోను తుపాను కదులుతోంది. సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా ఉత్తరకోస్తాలో చెదురుముదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి గంటలకు 40 నుండి 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అన్ని ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతోంది.

08:34 - May 21, 2016

హైదరాబాద్ : రేపు(ఆదివారం) టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది.. దాదాపు 3లక్షల 73వేలమంది ఈ పరీక్ష రాయబోతున్నారు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని.. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ కిషన్ తెలిపారు.. గంటముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు.. 

08:30 - May 21, 2016

ఛత్తీస్‌గఢ్‌ : రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలో పోలీసులు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలిలో రెండు రైఫిల్స్‌, ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

08:29 - May 21, 2016

కర్నూలు : ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 గుడిసెలు దగ్ధమవగా, నాలుగు సిలిండర్లు పేలాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. 

08:27 - May 21, 2016

విశాఖ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి మండలం కొత్తూరు రాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆగివున్న లారీని కారు ఢీకొనగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు ఏలూరు వాసులుగా గుర్తించారు. ఏలూరు నుంచి విశాఖకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

పెద్దపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య...

కరీంనగర్‌: పెద్దపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఓదెల మండలం కొలనూరు వాసులని పోలీసులు చెప్పారు. ప్రేమజంట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం..

అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే... నాలుగంచెల భద్రత ఉండే వైట్ హౌస్ సమీపంలోకి తుపాకి ధరించిన వ్యక్తి రాగా, అతన్ని లొంగిపోవాలని ఎంతగా చెప్పినా వినకపోవడంతో, అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా వైట్ హౌస్ ను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని వివరించారు. భారత కాలమానం ప్రకారం గత అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వైట్ హౌస్ దక్షిణ భాగంలోని ఈ స్ట్రీట్ వద్దకు తుపాకితో రాగా, దాన్ని కిందపడేసి లొంగిపోవాలని సెక్యూరిటీ సిబ్బంది కోరారు.

07:59 - May 21, 2016

మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమీర్‌ ఖాన్‌ ఓ చిత్రంలో సంగీత దర్శకుడిగా నటించబోతున్నారని సినీ వర్గాల సమాచారం. గతంలో ఆమీర్‌ వద్ద పనిచేసిన మేనేజర్‌ చందన్‌ ఓ కథ తయారు చేసి ఆయనకు వినిపించారు. అది ఆమీర్‌కు బాగా నచ్చిందట. ‘‘ఓ సాధారణమైన అమ్మాయి గాయనిగా ఎదిగే వరకు జరిగిన ప్రయాణమే ఈ కథ. ఈ చిత్రంలో ఆమీర్‌ సంగీత దర్శకుడిగా నటిస్తారు’’ అని చిత్ర వర్గాల సమాచారం. మిగిలిన పాత్రలకు నటీనటుల ఎంపిక పూర్తికాలేదు. ఆమీర్‌ ఈ చిత్రంలో నటించడమే కాదు ఆయన నిర్మాణ సంస్థ ఆమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌లోనే నిర్మించనున్నట్టు తెలిసింది.

07:49 - May 21, 2016

సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి మంచులక్ష్మి. ..ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లక్ష్మీబాంబ్‌’. ఫ్రమ్‌ శివకాశీ అనేది ఉపశీర్షిక. ఈ ఫిల్మ్ ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం జరిగింది. మంచు విష్ణు క్లాప్‌ కొట్టగా, మనోజ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. కార్తికేయ గోపాలకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో లక్ష్మి జడ్జి రోల్‌లో కనిపించనుడగా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జీవా, హేమంత, పృథ్వి, జ్యోతి తదితరులు చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘శక్తిమంతమైన కథ ఇది. అందుకే ‘లక్ష్మీబాంబ్‌’ అనే పేరు నిర్ణయించాం. ఇందులో లక్ష్మీప్రసన్న న్యాయమూర్తిగా కనిపిస్తారు. ఆమె పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. సరికొత్త కథాంశంతో ఓ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది’’ అన్నారు. మంచు లక్ష్మీప్రసన్న చెబుతూ ‘‘కథ చాలా బాగుంది. నేను గతంలో చేసిన అన్ని సినిమాల్లోకంటే ఇందులో పాత్ర చాలా నచ్చింది. అందుకే ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళదామా అన్న ఉత్సుకత కలుగుతోందని తెలిపారు.

07:42 - May 21, 2016

హైదరాబాద్ : తన అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా గ్రీటింగ్స్ చెప్పేందుకు వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేదు అనుభవం ఎదురయ్యింది. దీంతో ఎన్టిఆర్ బయటకొచ్చి అభిమానులకు చేతులూపి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కొందరు హంగామా సృష్టించడంతో పోలీసులు వారిని లాఠీలకు పనికల్పించి చెదరగొట్టారు. 

07:32 - May 21, 2016

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి ఎదురు దెబ్బ తగులుతోంది. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి రాహుల్ గాంధీ కారణమా? స్పందించాల్సిన అంశాలపై కాంగ్రెస్ స్పందించడం లేదా? ఎన్టీయే ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయడం లేదా? ఎన్డీయే వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ ఘోర పరాజయం అవుతోందా? ఎన్నికల ఫలితాలు ఎన్డీయే పాలనకు నిదర్శనమా? మోడీ కి ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లభించడం లేదా? ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మార్పు వస్తుందా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత జన్నాథ నాయర్, బిజెపి నేత సాంబమూర్తి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

నేడు సీబీఎస్ ఈ 12వ తరగతి ఫలితాలు..

ఢిల్లీ : సీబీఎస్‌ఈ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) 12వ తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను www.results.nic.in, www.cbseresults.nic.in, www.cbse.nic.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి 12వ తర గతి విద్యార్థుల మార్కుల డిజిటల్‌ షీట్లను కూడా సీబీఎస్‌ఈ అందించనుంది. 10,67,900మంది విద్యార్థులు ఈఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రాశారు.

 

నర్సాపూర్ మహిళపై సామూహిక అత్యాచారం

మెదక్ : నర్సాపూర్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు:నలుగురు మృతి

విశాఖ : అనకాపల్లి మండలం కొత్తూరు రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులు ఏలూరు వాసులుగా గుర్తించారు. ఏలూరు నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

07:01 - May 21, 2016

హైదరాబాద్: ప్లేఆఫ్‌ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. కరుణ్‌ నాయర్‌ అద్భుత పోరాట పటిమతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. అద్భుతమైన బౌలింగ్‌ లైనప్‌ ఉన్న హైదరాబాద్‌ ఫీల్డింగ్‌ వైఫల్యంతో చేజేతులా ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేయగా.. చివరి బంతి వరకు పోరాడి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 

బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు: ఇద్దరు మావోల మృతి

ఛత్తీస్ గఢ్ :బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, 2 రైఫిల్స్, ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

06:54 - May 21, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ విదేశాల బాట పట్టనున్నారు. ఈనెల, వచ్చే నెలలో మూడు దేశాల్లో పర్యటించనున్నారు. మే 22,23 తేదీల్లో ఇరాన్‌లో పర్యటిస్తారు. ద్వైపాక్షిక అంశాలపై ఆదేశ పాలకులతో చర్చలు జరుపుతారు. జూన్‌ 4 నుంచి రెండు రోజులపాటు ఖతార్‌లో టూర్‌ చేస్తారు. ఆ తర్వాత వచ్చే నెల 6 నుంచి రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. గల్ఫ్‌ దేశమైన ఖతార్‌తో సత్సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఆ దేశ పర్యటనకు వెళతారు. ఖతార్‌ అమీర్‌ షేక్‌ తామిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీతో మోడీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఇద్దరు నేతలు పలు ఒప్పందాలపై సంతాకాలు చేస్తారు. అమెరికా పర్యటనలోభాగంగా జూన్‌ 7 యూఎస్‌ అధ్యక్షుడు ఒబామాతో భేటీ అవుతారు. అమెరికా పార్లమెంట్‌ .... కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, రాజీవ్‌గాంధీల తర్వాత అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ఉద్దేశించి ప్రసంగిచే ఐదో ప్రధాని మోదీయే. అమెరికాను చెందిన పలు కంపెనీల సీఈవోలతో కూడా మోదీ సమావేశమవుతారు. 

06:51 - May 21, 2016

హైదరాబాద్ : ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే .. కేసులు పెడతారా అంటూ.. విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రజల కోసం తాము జైలు కెళ్లడానికి రెడీ అంటూ.. చేతనైతే కేసులు పెట్టాలని సవాల్ విసురుతున్నాయి. దీంతో ఇప్పుడు కేసీఆర్ .. విపక్షాల మధ్య మాటల యుద్ధం సెగ పుట్టిస్తోంది.

ప్రతిప‌క్షాలు, అధికార‌ప‌క్షం మ‌ధ్య పొలిటిక‌ల్ హీట్‌...

అధికార, ప్రతిప‌క్షాల మ‌ధ్య డైలాగ్ వార్‌కు తెర‌లేచింది. నిన్నటి దాకా పాలేరు గ‌ట్టుమీద సాగిన ..ఈమాట‌ల యుద్దం.. కేసీఆర్ డైలాగ్‌తో కంటిన్యూ అవుతోంది. పాలేరు ఎన్నిక‌ల ఫ‌లితాల విడుదలలో విప‌క్షాల‌ను టార్గెట్ చేశారు కేసీఆర్. ప్రతిప‌క్షాల‌పై డైన‌మెట్ పేల్చారు.ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోప‌ణ‌లు చేస్తే.. ప్రతిప‌క్షాల‌పై కేసులు పెడ‌తామని హెచ్చరిక‌లు చేయడం ప్రతిప‌క్షాలు, అధికార‌ప‌క్షం మ‌ధ్య పొలిటిక‌ల్ హీట్‌ను రాజేసింది.

కాంగ్రెస్ ఫైర్...

గులాబి బాస్ టార్గెట్‌గా కాంగ్రెస్ ఫైర్ అయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షాలను లేకుండా చేసేందుకు కుట్ర చేస్తుంద‌ని ఇప్పటికే ఆరోపిస్తున్నకాంగ్రెస్ నేతలు.. తాజాగా కేసీఆర్ కామెంట్స్ తో నిప్పులు కక్కారు. పాలేరులో గెలిచామని కేసీఆర్ విర్రవీగుతున్నారని నేతలు మండిప‌డ్డారు. పాలేరులో కేసీఆర్ పై ప్రేమతో గెలిపించ‌లేదంటున్నా కాంగ్రెస్..ఏదో చేస్తార‌న్నభ్రమ‌ల‌తో ప్రజ‌లు టిఆర్ఎస్ ఓటు వేశార‌ని అన్నారు. ఎవ‌రైనా చ‌ట్టానికి లోబ‌డి వ్యవ‌హ‌రించాల‌న్న సంగ‌తి కేసీఆర్ గుర్తుంచుకోవాల‌న్నారు సీఎల్పీనేత జానారెడ్డి. .

కేసీఆర్ పై విరుచుకుపడ్డ బిజెపి...

మరో వైపు బీజేపీ కూడా కేసిఆర్ వ్యాఖ్యల పై విరుచుకుపడుతుంది. సీఎం తన స్థాయికి దిగజారి విపక్షాలపై విమర్శలు చేస్తున్నారంటూ మండిప‌డింది. ప్రజా సమస్యల‌పై విపక్షాలు నిలదీస్తున్నందు కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు బిజెపి నేతలు. కేసులు, జైలు కొత్త కావని.. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే కేసులు పెట్టుకోవాలని సవాల్ విసిరారు.

మండి పడ్డ సీపీఐ నారాయణ...

విమర్శలు చేస్తే ప్రతిపక్షాలపై కేసులు పెడతామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు.. కేసులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. మొత్తానికి నిన్నటి దాకా పాలేరు కేంద్రంగా అధికార, ప్రతిపక్షల మధ్య జరిగిన డైలాగ్ వార్ ..ఫలితాల తర్వాత కూడా కొనసాగుతోంది. స‌ర్కార్ కేసులు పెడితే తాము కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమంటున్నారు విపక్ష నేతలు. మరి అధికార, విపక్ష నేతల మధ్య మాటల వార్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. 

06:47 - May 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వేర్వేరు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు పలువురు భార్యాభర్తలు. వీరిని విడదీసి పని చేయించడం సరైంది కాదనే ఉద్దేశంతో.. ఆ పద్ధతికి స్వస్తి పలకాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అంతేకాకుండా భార్యాభర్తలయిన ఉద్యోగులు తాము నివాసం ఉంటున్న 15 కిలో మీటర్ల దూరంలోనే పని ప్రదేశం ఉండాలనే ఉద్దేశంపై సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు.

ఉద్యోగులకు సంబంధించిన వివిధ మార్గదర్శకాలు.....

అయితే... ఈ నిర్ణయంపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించిన వివిధ మార్గదర్శకాల్లో ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న భార్య లేదా భర్త హైద్రాబాద్ హెచ్ఎండీఏ పరిధిలో పనిచేస్తే అందులో మరొకరికి అవకాశం కల్పించవద్దని ఆ రూల్స్ లో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే హెచ్ ఎండీ ఏ పరిధిలోని ఐదు జిల్లాల్లో వారికి అవకాశముండదు. దీంతో మిగతా జిల్లాల్లోనే ఈ బదిలీలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

సచివాలయంలో హెచ్ ఓడీ స్థానాల్లో ఉన్నవారికి లేని అవకాశాలు......

సచివాలయంలో హెచ్ ఓడీ స్థానాల్లో ఉన్నవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు లేవు. కాని హెచ్ఎండీఏ పరిధి 5 జిల్లాలో ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటుందా అన్నది గందరగోళంగా ఉంది. ఇలా చెయ్యడం వల్ల అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అర్థమే లేదని అంటున్నారు కొందరు ఉద్యోగులు. ఏది ఏమైనా ప్రభుత్వం భార్యా భర్తలను బదిలీపై ఒకే చోట పనిచేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశం కేవలం కేసులు వేసిన భార్యా భర్తలకేనా .. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికి వర్తిస్తుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

06:44 - May 21, 2016

చిత్తూరు : చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని ఇంతకాలం చెలరేగిపోతున్న ఎర్రచందనం దొంగల ఆటలు ఇకసాగవు. ఎర్రచందనం దుంగలను విదేశాలకు అక్రమ రవాణ చేస్తున్న స్మగ్లర్లకు ఇక చెక్‌ పడినట్టే. ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం-1967లో సమూల మార్పులు తీసుకొస్తూ చేసిన సవరణలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో... ఎర్రచందనం దొంగలపై ఇక ఉక్కుపాదం మోపబోతున్నారు. కఠిన శిక్షలు, భారీ జరిమానా అంశాలను ఈ చట్టంలో చేర్చారు.

ఏపీ ఫారెస్ట్‌ యాక్ట్‌-1967లో సవరణలు ......

చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణకు ఇకపై తెరపడే అవకాశాలు ఉన్నాయి. అక్రమార్కులకు శిక్షలు, జరిమానాలు పెంచుతూ ఏపీ ఫారెస్ట్‌ యాక్ట్‌-1967లో సవరణలు తీసుకొచ్చారు. ఇకపై ఎర్రచందనం చెట్లను నరికి, తొలగించి, రవాణ చేసి, అక్రమంగా నిల్వ చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. దొంగలకు సహకరించిన వారికి కూడా కఠిన శిక్షలు తప్పవు. ఎర్రచందనం రవాణకు వాహనాలను సమకూర్చిన వారికీ ఇబ్బందులే. ఈ నేరాలలో పట్టుపడితే పదేళ్ల జైలు శిక్షతోపాటు, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి బెయిల్‌ పొందే అవకాశం లేకుండా నిబంధనలను కఠినతరం చేశారు.

మొదటిసారి పట్టుపడితే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా.....

సవరించిన ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం కింద ఎర్రచందనం దొంగలు మొదటిసారి పట్టుపడితే ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష విధించే సెక్షన్లను చేర్చారు. మూడు లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే ఏడేళ్ల జైలుశిక్ష, 5 లక్షల రూపాయల ఫైన్‌ విధిస్తారు. స్మగ్లింగ్‌కు ఉపయోగించిన వాహనాల యజమానులకు కూడా శిక్ష పడుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణదారుల ఆస్తులు జప్తు చేసేలా చట్టంలో నిబంధలను చేర్చారు. స్మగ్లర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితుల పేరుమీద ఆస్తులు కూడబెట్టినా జప్తు చేసే అధికారం ఉంటుంది.

20 కేజీలు నిల్వ ఉన్నా డీఎఫ్‌వోకు సమాచారం ఇవ్వాలి .....

ఇరవై కేజీలకు మించి ఎర్రచందనం నిల్వ చేసేవారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సవరించిన ఏపీ ఫారెస్ట్‌ యాక్ట్‌లో వీలు కల్పించారు. దీనిప్రకారం ఈ పరిమాణం మేరకు ఎర్రచందనాన్ని నిల్వ ఉంచివారు డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌కు సమాచారం అందించాల్సి ఉంది. ఎర్రచందనం కేసులపై డీఎస్‌పీ, అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి స్థాయి అధికారులు విచారణ జరుపుతారు. ఇంతకాలం సివిల్‌ కేసులుగా పరిగణించిన ఎర్రచందనం కేసులను ఇకపై క్రిమినల్‌ కేసులుగా పరిగణిస్తారు. ఈ చట్టం ద్వారా అటవీశాఖ అధికారులు, పోలీసులకు విస్తృతాధికారాలు లభిస్తాయి. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడును ఆదేశించారు. సవరించిన ఏపీ ఫారెస్ట్‌ యాక్ట్‌ అమలు ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. 

06:41 - May 21, 2016

హైదరాబాద్ : మొన్న పైలిన్, నిన్న హుదూద్, నేడు రోను.. ఇలా వరుస విపత్తులు ఉత్తరాంధ్ర జిల్లాలను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్నటివరకు ఎడారిలా ఉన్న ప్రాంతాలన్నీ అకస్మాతుగా వచ్చిన ఉప్పెనతో చిన్నాభిన్నమయ్యాయి. వేలాది ఎకరాలు ముంపునకు గురై.. తీవ్ర నష్టం సంభవించడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

250 ఎకరాల్లో చేరిన వర్షపు నీరు .....

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లి శివారు దలాయిపాలెంలో ఉప్పు పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. 250 ఎకరాల్లో వర్షపు నీరు చేరి ఎందుకు పనికి రాకుండాపోయాయి. మార్చి నుంచి మే వరకు ఎండలు తీవ్రంగా ఉండి.. ఉప్పు పంట ఎక్కువగా వస్తుందని రైతులు భావించారు. కానీ.. పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో రైతులకు 'రోను' తుపాను కన్నీళ్లు మిగిల్చింది. అకాల వర్షానికి ఉప్పు పంట నీటి పాలైంది. ఉప్పు నిల్వపై ప్లాస్టిక్‌ షీట్లు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దాదాపు 30 లక్షల రూపాయలు నష్టం సంభవించిందని రైతులు వాపోతున్నారు.

నిన్నటివరకు ఎడారిని తలపించిన వైనం.....

ఇక రోను తుపాను శ్రీకాకుళం జిల్లాను వదిలిపెట్టలేదు. నిన్నటి వరకు వర్షాభావంతో ఎడారిలా మారిన పరిస్థితులుంటే.. తాజాగా పెను తుపాను రైతుల నెత్తిన అపార నష్టాన్ని మోపింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఉమ్మిలాడ, నౌపాడ, శ్రీజగన్నాథపురం గ్రామాల్లో కురిసిన వర్షానికి ఉప్పు పంట,.. రొయ్యల చెరువుల రైతులకు కోట్లలో నష్టం జరిగింది. తుపాను ప్రభావంతో వేలాది ఎకరాలు ముంపునకు గురి కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలతో తీవ్ర నష్టం సంభవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా తమ పరిస్థితి ఉందని రైతులంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

06:35 - May 21, 2016

హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీన కురిసిన వర్షంతో భాగ్యనగరమంతా ఉలిక్కిపడింది. 14వ తేదీ రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి అల్లకల్లోమైంది. శుక్రవారం భారీ గాలులతో కురిసిన వర్షానికి వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి... హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో నగరమంతా అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో జరిగిన అనేక ప్రమాదాలకు ముగ్గురు మృతి చెందారు.

ఉరుములు మెరుపులతో భారీ వర్షం...

నగరంలో శుక్రవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. హోరున వీచిన గాలికి నగరమంతా ఉలిక్కిపడింది. కేవలం ఐదంటే ఐదే నిమిషాల్లో నగరమంతా గాలి దుమారంతో అల్లకల్లోలమైంది. రాకెట్‌ వేగం కంటే స్పీడ్‌గా గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు, ఇళ్ల పైకప్పులు, రేకులన్నీ ఎగిరిపోయాయి.

బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు సమీపంలో

బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు సమీపంలో భారీ సైజు, బరువున్న హోర్డింగ్‌ సైతం గాలి సృష్టించిన బీభత్సానికి కుప్పకూలింది. దీంతో 8 కార్లు ధ్వంసమయ్యాయి. పలు ద్విచక్ర వాహనాలు సైతం నామరూపాల్లేకుండా చితికిపోయాయి.

గాలి దుమారానికి గంటల కొద్ది స్థంభించిన ట్రాఫిక్

ఐదు నిమిషాలు సృష్టించిన గాలి బీభత్సానికి నగరం మొత్తం ఒక్కసారిగా షేక్‌ అయ్యింది. గాలి దుమారానికి రోడ్లపై గంటల కొద్ది ట్రాఫిక్‌ స్తంభించడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక తికమకపడ్డారు.

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌.....

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌, కుషాయిగూడ, సికింద్రాబాద్‌, పద్మారావునగర్‌, విద్యానగర్‌లలో భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌, ఈసీఐఎల్‌, మాదాపూర్‌, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్‌, అమీర్‌పేట, అంబర్‌పేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

విద్యుత్ వైర్లమీద పడ్డ 107 చెట్లు...

నగర వ్యాప్తంగా 107 చెట్లు విద్యుత్ వైర్లమీద పడ్డాయి. దాంతో 33 కేవీ ఫీడర్లు 13 బ్రేక్ డౌన్ అయ్యాయి. 11 కేవీ ఫీడర్లు,171 బ్రేక్ డౌన్ అయ్యాయి. 194 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

అత్తాపూర్‌లో బిల్డింగ్‌పై పడిన ట్యాంక్ ఎల్లయ్య మృతి ...

గాలులతో కూడిన వర్షం కారణంగా గోడలు కూలి అత్తాపూర్‌లో భవన నిర్మాణ కార్మికుడు ఎల్లయ్య, బిల్డింగ్‌ పైనుండి ట్యాంక్‌ మీద పడి పాతబస్తీలో అహ్మద్‌ బిన్‌ ఇ్రబహీం మృతిచెందారు. టోలీచౌక్‌లో బిల్డింగ్‌ పైన వెల్డింగ్‌ పనులు చేస్తుండగా గాలి దుమారానికి కిందపడి కమల్‌ అనే వెల్డర్‌ మృతిచెందాడు. ప్రమాదాల కారణంగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 64 ట్రాన్స్‌ఫార్మార్లు కాలిపోయినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో వైర్లు తెగిపోయి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 

నేలకూలిన చెట్లు...

నగరంలో కురిసిన ఉరుములతో కూడిన వర్షం ధాటికి వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. దీంతో ఎక్కకక్కడి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో పలు చోట్ల విద్యుత్ స్థంభాలు, హోర్డింగ్ లు నేల కూలడంతో .. అత్యవసర బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దు....

గాలి దుమారం సంభవించే సమయాల్లో అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకి రావద్దని నగరవాసులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం అత్యవసర బృందాలు సహాయ చర్యలు చేపట్టాయన్నారు. ప్రమాదాలు జరిగితే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. ఇక ప్రజలకు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

విద్యుత్ సమస్యలు....

భారీ వర్షం కారణంగా నగరంలో తలెత్తిన విద్యుత్‌ సమస్యను.. ఇప్పటికే 70శాతం పరిష్కరించామన్నారు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి. ఇప్పటికే తమ సిబ్బంది అంతా విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరిస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడైనా విద్యుత్ స్తంభం విరిగిపడితే దాన్ని చేతులతో తాకొద్దని..ఆ సమాచారాన్ని 100 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాలన్నారు సీఎండీ .

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్య ప్రజలు...

నగరంలో కురిసిన వర్షాలకు సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితులలో టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని సూచిస్తున్నారు

Don't Miss