Activities calendar

22 May 2016

23:01 - May 22, 2016

అన్నదమ్ముల కథ.. ఊహించని మలుపు.. ఉద్యోగం ఒకరికావాలంటే ఒకరికికావాలని కొట్లాడుకున్నారు. ఆలాఫ్ సడన్ గా శాంతి చనిపోయింది. శాంతిమీద విష ప్రయోగం జరిగిందని డిటెక్టివ్స్ కి తెలిసింది. అసలు కథ ఏంటీ..?  పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

22:51 - May 22, 2016

హీరో అల్లరి నరేష్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ పలు విషయాలు తెలపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. నాది అరెంజ్ మ్యారేజ్..కావాలనే సినిమాల మధ్య గ్యాప్ తీసుకోలేదు. హీరోకు అందం కాదు...ట్యాలెంట్ ఉండాలి. అందంగా ఉన్న అరవింద్ స్వామి.. సూపర్ స్టార్ కాలేదు. రజినీకాంత్ అందంగా లేకున్న సూపర్ స్టార్ అయ్యాడు. నా సినిమా పండుగులా ఉంటుంది. నా బలం మా నాన్నే. నా వీక్ నెస్... నా బ్రదర్ సన్ ను చూడకుండా ఉండలేను. 50 వ సినిమా నాన్నగారితో చేయాలనుకున్న కానీ వీలు కాలేదు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నానని' అన్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:21 - May 22, 2016

హైదరాబాద్‌ : నగరంలో ఆటో సంఘాల సమ్మె ఆగిపోయింది. రవాణాశాఖ అధికారులతో ఆటో సంఘాల జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఖైరతాబాద్‌ కార్యాలయంలో రవాణాశాఖ జేటీసీ రఘునాథ్‌, ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ ఆటో సంఘాల నేతలతో సమావేశమయ్యారు. చర్చలు సఫలమవడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రకటించింది. నెల రోజుల్లో ఆటో డ్రైవర్లు లైసెన్సులు తీసుకోవాలని, ఆటో డ్రైవర్ల లైసెన్సుల కోసం అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని జేటీసీ రఘునాథ్‌ సూచించారు.

 

22:18 - May 22, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అలాగే తెలంగాణలో టెట్‌ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగింది. తెలంగాణలో రెండు పరీక్షలు ఒకేసారి జరగడంతో అభ్యర్థులకు ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో టెట్‌, జేఈఈ పరీక్ష సాఫీగా జరిగింది. 
జేఈఈ అడ్వాన్స్ డ్‌ పరీక్ష ప్రశాంతం 
ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రశ్నాపత్రం కఠినంగా లేకపోవడం విద్యార్థులకు ఊరటనిచ్చింది. గతానికి భిన్నంగా ఈసారి పేపర్‌-1, పేపర్‌-2 మార్కులు సమానంగా 186 మార్కుల చొప్పున కేటాయించడం విశేషం. అంటే మొత్తానికి 372 మార్కులకు ఈసారి పరీక్ష జరిగింది
తెలంగాణలో టెట్ ప్రశాంతం
అలాగే తెలంగాణలో టెట్ ప్రశాంతంగా ముగిసింది. టెట్‌-1 పేపర్‌కు లక్షా 184 మంది దరఖాస్తు చేసుకోగా.. 90 శాతానికి పైగా అభ్యర్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే టెట్‌-2 పేపర్‌కు రెండు లక్షల 73 వేల 310 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 1,175 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఇక మహబూబ్‌నగర్‌లో టెట్‌ రాసేందుకు మోడ్రన్‌ హైస్కూల్‌కు వచ్చిన నిండు గర్భిణి కవితకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె శిశువుకు జన్మనిచ్చిన వెంటనే పరీక్ష కేంద్రానికి వచ్చి ఎగ్జామ్‌ రాసింది. అలాగే.. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ జూనియర్‌ కాలేజిలో నూతన వధువు టెట్‌కు హాజరైంది. ఉదయం 11 గంటలకు పెళ్లి చేసుకున్న అర్చన.. పెళ్లి పందిరి నుంచి నేరుగా పరీక్ష కేంద్రానికి చేరుకుని ఎగ్జామ్‌ రాసింది. 
వరంగల్‌లో గందరగోళం
ఇక వరంగల్‌లో టెట్‌ నిర్వహణలో గందరగోళం తలెత్తింది. సుందరయ్యనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో అభ్యర్థులకు పేపర్‌-1 ఓఎంఆర్‌కు బదులుగా బఫర్‌ షీట్లను పంపిణీ చేశారని అభ్యర్థులు గందరగోళానికి దిగారు. పరీక్ష నిర్వాహకులకు అవగాహన లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని అధికారులంటున్నారు. ఓఎంఆర్‌ షీట్లకు బఫర్‌ షీట్లు కలుపుతామని.. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని డీఈవో రాజీవ్‌ తెలిపారు.
మంగళవారం 'కీ' విడుదల 
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ పరీక్ష, తెలంగాణలో టెట్‌ ప్రశాంతంగా జరిగింది. టెట్‌ ప్రశాంతంగా ముగియడంతో మంగళవారం 'కీ' విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

22:06 - May 22, 2016

నెల్లూరు : సరికొత్త ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుడుతోంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 'పునర్వినియోగ వాహక నౌక'ను ప్రయోగించి.. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో తనదైన ముద్ర వేసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే.. భవిష్యత్‌లో 10 రెట్ల తక్కువ వ్యయంతో అనేక ప్రయోగాలు చేయవచ్చని ఇస్రో భావిస్తోంది. 
మరో ప్రయోగానికి ఇస్రో  శ్రీకారం 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ఉపగ్రహాల ప్రయోగానికి ఎక్కువ సంఖ్యలో రాకెట్లను ఉపయోగించే అవసరం లేకుండా.. పునర్‌ వినియోగ వాహక నౌకను రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. 
స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన
కొన్నేళ్ల క్రితం వరకు అమెరికా ఉపయోగించిన స్పేస్‌ షటిల్‌ తరహా వ్యోమనౌకను.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఒక రాకెట్‌తో ఒక్కసారి మాత్రమే ప్రయోగం చేసేవాళ్లు.  కానీ.. ప్రస్తుతం చేపడుతున్న రీ-యూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ ప్రయోగంతో.. పదేపదే అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించవచ్చు. దీంతో ప్రయోగ వ్యయం 10 రెట్లు తగ్గే అవకాశం ఉందని ఇస్రో అధికారులంటున్నారు. కిలో బరువును కక్ష్యలోకి పంపించేందుకు అయ్యే వ్యయం 2 డాలర్ల కన్నా తక్కువగా ఉంటుందంటున్నారు.  ఉపగ్రహ ప్రయోగాల వ్యయం తగ్గించుకునేందుకు ఇది మెరుగైన ఆలోచన అని భారత ఇంజనీర్లు అంటున్నారు. 
శ్రీహరికోట నుంచి ప్రయోగం 
నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుంది ఇస్రో. ప్రయోగాత్మక పునర్‌ వినియోగ వాహకనౌకను రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ టెక్నాలజీ డిమోనిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవ పరిమాణంతో పోలిస్తే 6 రెట్లు చిన్నగా ఉండే నమూనాను తాజా ప్రయోగంలో పరీక్షిస్తారు. ఈ రియూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌కు త్రికోణ ఆకారంలో సన్నటి రెక్కలు ఉంటాయి. 6.5 మీటర్లు పొడవు,.. 1.75 టన్నుల బరువు ఉండే ఈ వాహక నౌక.. చిన్న సైజు విమానాన్ని పోలిఉంటుంది. ప్రత్యేక రాకెట్‌ బూస్టర్‌ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతారు. ఘన ఇంధనంతో పని చేసే ఈ బూస్టర్‌.. రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ను భూవాతావరణంలో 70 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్తుంది. అనంతరం అక్కడినుంచి వ్యోమనౌక కిందకు దిగడం మొదలుపెడుతుంది. గ్లైడర్‌ తరహాలో దీని ప్రయాణం సాగుతుంది. ఈ వ్యోమనౌకలో ఉండే చిన్నపాటి రాకెట్లు.. దీన్ని నిర్దేశిత ప్రదేశంలోకి చేర్చేందుకు సాయపడతాయి. రియూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్‌ రన్‌వేపై దిగుతుంది. ఇది తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. 
సముద్రంలో దిగగానే విచ్ఛిన్నం కానున్న వెహికల్‌ 
అయితే.. ఈసారి ప్రయోగంలో రియూజబుల్‌ వెహికల్‌ను సురక్షితంగా వెనక్కి తీసుకునే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే... సముద్ర జలాలను తాకగానే అది విచ్చిన్నమవుతుందని ఇస్రో అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రయోగంలో వెహికల్‌ను సురక్షితంగా కిందకు దించడం ప్రస్తుత ఉద్దేశం కాదని.. గాలి, ధ్వని కన్నా ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ఆకాశం నుంచి కిందకు దిగుతూ వర్చువల్‌ రన్‌వేను చేరుకునేలా చూడటమే ప్రధాన లక్ష్యమని అధికారులంటున్నారు. ఇక ఆర్‌ఎల్‌వీ కిందకు దిగడాన్ని నౌకలు, ఉపగ్రహాలు, రాడార్లు పర్యవేక్షిస్తాయి. ఈ ప్రయోగం అనంతర  దశలో ల్యాండింగ్‌ ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే.. తుది డిజైన్‌ ఎలా ఉండాలనేది ఇస్రో నిర్ధారిస్తుంది. పూర్తిస్థాయి వాహక నౌక సిద్ధం అయ్యేందుకు మరో 10 నుంచి 15 ఏళ్లు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇస్రో ఇప్పటివరకు 95 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే.. అనేక రాకెట్లను తక్కువ ఖర్చుతో నింగిలోకి తీసుకెళ్లేందుకు ఇస్రో వేదిక కానుంది. 

 

22:03 - May 22, 2016

హైదరాబాద్ : కూకట్‌ పల్లి శేషాద్రి నగర్‌లో క్రికెట్ ఆడుతూ బాలుడు మృతి చెందాడు. ఇంటికి దగ్గరలో ఉన్న నల్ల చెరువు పక్కన స్థలంలో మిత్రులతో క్రికెట్‌ ఆడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటలో భాగంగా బంతి కోసం వెళ్లిన పదమూడు సంవత్సరాల   రమావత్‌ బాబులునాథ్‌ చెరువు పూడికతీత కోసం తీసిన గుంతలోపడి మృతి చెందాడు.  మెదక్‌ జిల్లా రెగోడ్‌ మండలానికి చెందిన రమావత్‌... ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

21:59 - May 22, 2016

హైదరాబాద్ : నగరంలోని నాచారంలో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : నగరంలోని నాచారంలో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

21:51 - May 22, 2016

 హైదరాబాద్ : నగరంలోని జూపార్కులో సింహాల లాంజ్‌లోకి సందర్శకుడు దూకడం కలకలం రేపింది. వెంటనే క్యూరేటర్లు స్పందించి.. సందర్శకుడికి బయటకు తీసుకురావడంతో... ప్రమాదం తప్పింది. సందర్శకుడు మద్యం మత్తులో ఉన్నాడని జూ అధికారులు తెలిపారు. 

 

21:50 - May 22, 2016

విజయవాడ : ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడులను నిరసిస్తూ విజయవాడలో ఆ పార్టీ నిరసన చేపట్టింది. బీజేపీ దాడులను సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తీవ్రంగా ఖండించారు. దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేరళలో లెఫ్ట్ విజయాన్ని తట్టుకోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతోందని మధు విమర్శించారు. 
విశాఖలో 
ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై బిజెపి దాడిని ఖండిస్తు విశాఖ జగదాంబ కూడలి వద్ద సిపిఎం ర్యాలీ చేపట్టింది. బిజెపి అదికారంలోకి వచ్చిన దగ్గర నుండి అరాచకం రాజ్యమేలుతుందని  సిపిఎం జిల్లా కార్యదర్మి లోకనాథం మండిపడ్డారు. కేరళలో సిపిఎం విజయాన్ని సహించలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. 
కాకినాడలో
అటు... కాకినాడలోనూ సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేరళలో లెఫ్ట్‌ విజయాన్ని సహించలేక, దాడులకు పాల్పడటం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జీ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

 

21:36 - May 22, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు తుది దశకు చేరాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో జంటనగరాల్లోని ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా సభ్యత్వం ఉన్న జర్నలిస్టులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలను తలదన్నేలా పామ్‌ప్లేట్స్, అభ్యర్ధుల ఫోటోలతో కూడిన కార్డులతో జోరుగా ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 962మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది.

21:30 - May 22, 2016

ఆదిలాబాద్ : ఖాళీ స్థలం కనబడితే చాలు.. భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. తప్పుడు ధృవపత్రాలు సృష్టించి మరీ భూముల్ని కబ్జా చేస్తున్నారు. భూముల విలువలు పెరగడంతో అక్రమార్జనే ధ్యేయంగా ఆక్రమణదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో విలువైన భూముల్ని కబ్జా చేస్తున్న భూ బకాసురులపై టెన్‌ టీవీ 
రెచ్చిపోతున్న భూ కబ్జాకోరులు 
ఆదిలాబాద్‌ జిల్లాలో భూ కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. లోకేశ్వరం మండలంలో ఖాళీ స్థలాలను ఆక్రమించి తప్పుడు ధృవీకరణ పత్రాలతో సొమ్ముచేసుకుంటున్నారు. ఎస్సారెస్పీ నిర్మాణంలో భాగంగా ఏర్పడ్డ పునరావాస గ్రామమైన రాయపూర్‌ కాండ్లి లో ప్రాజెక్టు ముంపు బాధితులకు దాదాపు 2300 ఎకరాలను కేటాయించారు. సుర్లి అనే మరో ముంపు గ్రామ బాధితులకు సైతం ఇక్కడే పునరావాసం కల్పించారు. ప్రతి కుటుంబానికి ఐదెకరాల వ్యవసాయ భూమి, రెండు ఫ్లాట్ల చొప్పున లోకేశ్వరం సమీపంలో 140 ఎకరాలు పునరావాస కేంద్రానికి కేటాయించారు. రాయపూర్‌ కాండ్లి, సుర్లి గ్రామస్తులకు కలిపి భూమిని కేటాయించిన అధికారులు... రాయపూర్ కాండ్లి వాసులకు 749 ప్లాట్లు, సుర్లి గ్రామానికి 66 ఫ్లాట్ల చొప్పున మొత్తం 815 ఫ్లాట్లు లే అవుట్‌ చేసి విభజించారు. దీంతో పాటు రెండు గ్రామాల అవసరాల కోసం మరికొంత స్థలాన్ని కేటాయించారు. ఇలా ఖాళీగా వదిలిన స్థలాన్నే కొందరు భూ బకాసురులు కబ్జా చేస్తున్నారు. ఇది కాకుండా దాదాపు 300 ఎకరాల వరకు గల పోరంబోకు భూమిని తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 
ఎస్సారెస్సీ వందల ఎకరాలు కబ్జా 
ఎస్సారెస్సీకి చెందిన వందల ఎకరాల భూమిని కబ్జాకోరులు ఆక్రమిస్తున్నారని, దీనిపై పిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. భూ కబ్జాలపై అధికారులు తక్షణమే స్పందించి విలువైన భూముల్ని కాపాడాలని కోరుతున్నారు. 

21:22 - May 22, 2016

యాంకర్ శ్యామలతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా శ్యామల పలు విషయాలను తెలిపింది. టీవీ షోలు, సినిమాలు, కెరీర్, బాల్యం, స్కూల్, కాలేజీ, వివాహం గురించి వివరించింది. ఆ వివరాలను ఆమె మాటాల్లోనే.... టీచర్ కావాలని యాంకర్ అయ్యాను. సీరియల్ చేస్తున్నపుడే పెళ్లి చేసుకున్నాను. 18 సంవత్సరాలకే వివాహం అయింది. నర్సింహతో నా వివాహం అయింది. నేను ముందు ప్రపోజ్ చేశాను. నాలో ఆయన యాంకర్ ను వెతుకున్నాడు. మొదట సీరియల్ ఆర్టిస్టు అయ్యాను. రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను. స్కూల్ లో బాగానే చదివేదాన్ని. 75 నుంచి 80 శాతం మార్కులు వచ్చేవి. బీకాం చేశాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పూర్తి చేశాను. 50 రూపాయల కోసం మమ్మితో చిన్నపాటి గొడవ పడ్డాను. నాకు అప్పంటే చాలా భయం. పిల్లలతో స్పెండ్ చేయడం ఇష్టం. యాంకరింగ్ అంటే ఇష్టం. ఇందులో ఆడియో లాంచింగ్స్ కార్యక్రమాలంటే చాలా ఇష్టం.
హీరోయిన్ కావాలని లేదు. బాగా సినిమాలు చూస్తాను. నేను తినేది వెజిటేరియన్. కానీ నాన్ వెజ్ బాగా వండుతాను' అని తెలిపారు. హాస్యనటుడు అలీ, యాంకర్ రవి, శ్యామల భర్త నర్సింహ శ్యామలకు ఫ్రాంక్ కాల్ చేసి ఆట పట్టించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:17 - May 22, 2016

నిజామాబాద్ : వర్షాభావ పరిస్థితులు అన్నివిధాలుగా జిల్లాను కుదుపుతున్నాయి. అసలే గత రెండు సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులలో , చెరువులలో నీరు  లేకపోవడంతో .. పంటలు పండడం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోవడంతో ప్రజానీకం అల్లాడుతోంది. వర్షాలు లేకపోవడం దానికి తోడు.. భూగర్భజలాలు ఇంకిపోవడంతో నిజామాబాద్ జిల్లాలో కూరగాయలు పండడం లేదు. పండిన కాస్త పంటలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 
సామాన్యప్రజలు కొనలేని పరిస్థితి
గత సంవత్సరం కంటే... ఈ ఏడాది కూరగాయల ధరలు నింగిని తాకుతున్నాయని .. సామాన్యప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని... అటు రైతులు ఇటు కూరగాయాల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో .. మార్కెట్ లోకి కూరగాయలు రావడం తగ్గిపోయాయి. దీంతో మార్కెట్ లో ధరలు మండిపోతున్నాయి. కిలోమిర్చి ఎన్నడు లేని విధంగా 120 రూపాయలు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిన కూరగాయల సాగు 
టమాట రూ. 40 , బెండకాయ 80, వంకాయ 60, ఆకుకూరలు వంటివి  మూడింతలు పెరిగాయి.  భూగర్భ జల మట్టం గణనీయంగా పడిపోవడంతో.. కూరగాయల సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని 36 మండలాలలో 4500 హెక్టార్ల లలో కూరగాయల సాగు అవుతున్నట్లు అంచనా.. కాని ఈ ఏడాది సాగు బాగా తగ్గడంతో .. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఎండలకు తోడు కూరగాయల ధరలు  మండిపోతుండడంతో ... సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో ఒక కిలో కూరగాయలు సైతం కొనుగోలు  చేయలేక పోతున్నామంటున్నారు సామాన్యప్రజలు.   

21:13 - May 22, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలకు మార్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఈ సవరణలు చేపట్టింది.. మార్చిన చట్టాలను పుస్తక రూపంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్ లోకూడా మార్పులకు సిద్ధమైంది.. 
చట్టాలకు సవరణల దిశగా అధికారులు కసరత్తు
తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతోంది.. అయినా సమైక్యరాష్ట్రంలోని చట్టాలే అమల్లో ఉన్నాయి.. ఈ చట్టాలను రెండేళ్లలోపు సవరించుకునేందుకు 
ఏపీ పునర్విభజన చట్టం వెసులుబాటు కల్పించింది.. దీనిప్రకారం కొన్ని చట్టాలను మార్చుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.. జూన్ 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్చిన చట్టాలను పుస్తకరూపంలో తేవాలని చూస్తున్నారు.. ఈ పుస్తకాన్ని జూన్‌ మొదటివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
60 చట్టాలకు సవరణలు చేసిన టీఎస్‌ ప్రభుత్వం
సాధారణంగా చట్టాలను మార్చాలంటే శాసనసభ ద్వారా మాత్రమే వీలవుతుంది.. పునర్విభజన చట్టంలోని 101 సెక్షన్‌ ప్రకారం మాత్రం జీవో ద్వారానూ చట్టాలను సవరించుకునే అవకాశముంది.. రెండేళ్లు దాటాక కూడా చట్టాల్లో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు.. ఇప్పటివరకూ తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన 60కి పైగా చట్టాలకు సవరణలు చేసింది.. మరో 300 చట్టాలను మార్చుకోవాల్సిన అవసరముందని భావిస్తోంది.. ఈ చట్టాల మార్పులకు సంబంధించిన సూచనల కోసం కమిటీలు ఏర్పాటు చేయబోతోంది.. 
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్ లోనూ మార్పులు
అటు 1956కు ముందు హైద్రాబాద్ రాష్ట్రానికి చెందిన చట్టాలను అధికారులు బయటకుతీశారు.. ఇలా 65 చట్టాలున్నట్లు గుర్తించారు.. వీటినికూడా తెలంగాణ చట్టాలుగా మారుస్తున్నారు. చట్టాల్లో మార్పులతోపాటు... ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌లోకూడా మార్పులు చేయాలని సర్కారు నిర్ణయించింది.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఈ మార్పులు చేయబోతోంది.. 

 

21:08 - May 22, 2016

హైదరాబాద్ : టీడీపీ, బీజేపీ మధ్య బంధం బలహీనమవుతోందా?  రెండు పార్టీల దోస్తీ దూరం అవుతోందా..? సైకిల్‌, కమలం చెలిమి చెదిరిపోతోందా..?  పై స్థాయిలో ఫ్రెండ్‌షిప్‌ ఉన్నా..కింది స్థాయిలో మాత్రం కొట్టుకునే వరకు వెళుతోందా...తాజా పరిణామాలు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇస్తున్నాయి. కమలనాథులు, తెలుగు తమ్ముళ్ల మధ్య మాటల తగవు తారా స్థాయికి  చేరుతోంది. 
టీడీపీ, బీజేపీ కాపురానికి ఏమవుతోంది..
టీడీపీ, బీజేపీ కాపురానికి ఏమవుతోంది..ఒకపక్క కమలనాథుల కామెంట్లు...మరోపక్క టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు. దోస్తీ కాస్తా వైరంగా మారుతోందా? ఈ పరిస్థితికి రెండు పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా....
నేతల మధ్య మాటల యుద్ధం 
ప్రస్తుతం టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విభజన హామీలపై ఈ రెండు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య వార్‌ పీక్‌ స్టేజ్‌లోకి వెళుతోంది. కేంద్ర స్థాయిలో ఫ్రెండ్‌షిప్‌ కంటిన్యూ చేయడానికే చంద్రబాబు ఇంట్రస్ట్ చూపుతున్నా..లోకల్‌ తముళ్లు మాత్రం సై అంటూ సౌండ్‌ గట్టిగా వినిపిస్తున్నారు. దేనికైనా రెడీ అంటూ సవాళ్లు విసురుతున్నారు.
చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్న సోము వీర్రాజు
ఇక టీడీపీని కార్నర్‌ చేస్తున్న కమలనాథుల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మొదటి వరసలో ఉన్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారు. మిత్రపక్షంపైనే మండిపడుతూ టీడీపీ, బీజేపీ కాపురంలో పొగ పెడుతున్నారు. ఇక తెలుగు తమ్ముళ్లు కూడా అదే రేంజ్‌లో రివేంజ్‌ తీర్చుకుంటున్నారు. సోము వీర్రాజుపై మాటల దాడి చేస్తూ చెలరేగిపోతున్నారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంపైనా కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ నేతలు దొంగాట ఆడుతున్నారనంటూ సాక్షాత్తు మంత్రి అయన్నపాత్రుడే కామెంట్లు చేశారు. 
బీజేపీపై గోరంట్ల ఫైర్ 
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆ పార్టీ మిత్ర ధర్మం పాటించడం లేదంటూ లా పాయింట్‌  లాగారు. మొత్తానికి బీజేపీ, టీడీపీల మధ్య బంధం కలహాల కాపురంగా సాగిపోతోంది. ఈ దశలో కమలం, సైకిల్‌ స్నేహం ఎంతకాలం ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి. 

 

21:01 - May 22, 2016

విజయనగరం : జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. గర్భిణి అయిన భార్యను భర్త రాయితో కొట్టడంతో.. తీవ్రంగా గాయపడింది. షేక్ పాషా, అజ్మీర్ దంపతులు జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. అయితే అజ్మీర్ పండుగకు పుట్టింటికి వెళ్లి వచ్చింది. ఈనేపథ్యంలో భార్యపై అనుమానంతో షేక్ పాషా గొడవపెట్టుకున్నాడు. దీంతో ఆవేశంలో రాయితో గర్భిణీ అయిన భర్యను కొట్టాడు. ఆమె చేయి అడ్డం పెట్టుకుంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని విద్యుత్ స్థంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. 

 

20:54 - May 22, 2016

నిజామాబాద్ : జిల్లాలోని జానకంపేట్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రి పిల్లల పాలిట కాలయముడయ్యాడు. కంటిరెప్పలా కాపాడుకోవాల్సిందిపోయి కడతేర్చాడు. భార్యపై అనుమానంతో... తండ్రే.. తన ఇద్దరు చిన్నారులను గొంతునులిపి చంపి... నిజాంసాగర్ కెనాల్‌లో పడేశాడు. మృతుల్లో ఉమేష్‌కు తొమ్మిదేళ్లు కాగా... మోక్షకు ఐదేళ్లుగా గుర్తించారు. 

విజయనగరంలో దారుణం

విజయనగరం : నగరంలో దారుణం జరిగింది. గర్భిణి అయిన భార్యను భర్త రాయితో కొట్టడంతో.. తీవ్రంగా గాయపడింది. బాధితురాలని ఆసుపత్రికి తరలించిన స్థానికులు.. నిందితుడ్ని... స్థంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. 

 

తిరుపతి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

చిత్తూరు : తిరుపతి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యర్థ పదార్థాల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని అంచనా. 

 

20:36 - May 22, 2016

చిత్తూరు : తిరుపతి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యర్థ పదార్థాల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని అంచనా. 

 

కనుమరుగుకానున్న స్వరాజ్య మైదాన్

కృష్ణా : విజయవాడలో స్వరాజ్య మైదాన్ కనుమరుగుకానుంది. ఈ మైదానంలో... సిటీ స్క్వేర్ నిర్మాణం జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చైనా కంపెనీ  జీఐఐఐసీ డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే చెప్పారు. ప్రస్తుతం స్వరాజ్య మైదాన్‌లో ఉన్న రైతు బజారును. అలంకార్ థియేటర్ కాంప్లెక్స్ సమీపానికి తరలించనున్నారు. 

20:27 - May 22, 2016

వరంగల్ : ప్రైవేటు విద్యాలయాల్లో ఫీజులను నియంత్రిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడమే  లక్ష్యంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అందుకోసం ఒక్కో గురుకుల పాఠశాలకు 20 కోట్ల రూపాయల చొప్పున 240 గురుకుల పాఠశాలలకు 5 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఈ గరుకుల పాఠశాల భవనాలను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. వీటి ద్వారా 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. గురుకులాల్లో ఈ ఏడాది నుంచి విద్య అందించేదుకు చర్యలు తీసుకుంటామని కడియం తెలిపారు. మడికొండలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభించనున్నట్లు కడియం తెలిపారు. జిల్లాల విభజన ప్రజాభిప్రాయం మేరకు ఉంటుందనీ ఏ ప్రశ్నకు సమాధానంగా డిప్యూటీ సీఎం చెప్పారు.

 

20:22 - May 22, 2016

మెదక్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా నర్సాపూర్ దళిత మహిళ అత్యాచార ఘటనను పోలీసులు చేదించారు. ఐదుగురు యువకులు ఆమెను అత్యాచారం చెయ్యలేదనే నిజాన్ని తెలిపారు. అదంతా కట్టుకథని తేల్చారు. ఈనెల 20న సంగారెడ్డి వెళ్లిన ప్రమీల నర్సాపూర్ వచ్చి భాన్‌సింగ్‌ అనే వ్యక్తితో కలిసి పటాన్‌చెరు వెళ్లి లాడ్జిలో ఉన్నారు. రాత్రి ప్రమీలకు రక్తస్రావం అధికం కావడంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయాడు భాన్‌సింగ్‌. తనకు భాన్‌సింగ్‌ తో వివాహేతర సంబంధం ఉందన్న విషయం తెలిస్తుందోమోనని భయపడి ప్రమీల కట్టుకథ అల్లింది. తనను కిడ్నాప్‌చేసి ఐదుగురు కారులో తీసుకెళ్లి రేప్ చేశారని అబద్ధం చెప్పిందని తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

 

గుంటూరులో అదృశ్యమైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం

కాకినాడ : గుంటూరులో అదృశ్యమైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం అయింది. బోటులోని 8 మంది మత్స్యకారుల్లో ఏడుగురు క్షేమంగా ఉన్నారు. మరో మత్స్యకారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

హైదరాబాద్ పై కోల్ కతా విజయం

హైదరాబాద్ : ఐపిఎల్ 9 లో భాగంగా హైదరాబాద్ , కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. 22 పరుగుల తేడాతో హైదరాబాద్ పై కోల్ కతా గెలుపొందింది. కోల్ కతా.. 171/6, హైదరాబాద్... 149/8.

నిజామాబాద్ జిల్లాలో దారుణం

నిజామాబాద్ : జిల్లాలోని జానకంపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో... తండ్రే.. తన ఇద్దరు చిన్నారులను గొంతునులిపి చంపి... నిజాంసాగర్ కెనాల్‌లో పడేశాడు. మృతుల్లో ఉమేష్‌కు తొమ్మిదేళ్లు కాగా... మోక్షకు ఐదేళ్లు. 

19:44 - May 22, 2016

ఢిల్లీ : భారత్ లో అత్యధిక జనాదరణ పొందిన క్రికెట్ క్రీడను మరింత అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఇప్పటి వరకూ బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న శశాంక్ మనోహర్ ఐసీసీ స్వతంత్ర అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టడంతో..ఆ స్థానంలో అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోని కోట్లాదిమంది అభిమానులకు క్రికెట్ ను మరింత చేరువగా తీసుకువెళతానని, టెస్ట్ క్రికెట్ ను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఇప్పటి వరకూ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్ స్థానంలో షిర్కే ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ 2017 వరకూ అధ్యక్షకార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

 

19:41 - May 22, 2016

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెంలో ఓ యువకుడికి.. మహిళలు దేహశుద్ధి చేశారు. గొల్లగూడెం ప్రాంతంలో భార్యభర్తలను రాత్రి వేళల్లో చూస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని చితకబాదారు. విజయ్‌ కుమార్ అనే ఈ యువకుడు సెల్‌ఫోన్‌ను మర్చిపోయి వెళ్లడంతో నెంబర్‌ ఆధారంగా పట్టుకున్నారు. కరెంట్ స్తంభానికి కట్టేసి చెప్పులతో కొట్టి పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

 

19:29 - May 22, 2016

నల్గొండ : ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ తరహాలో మోడీ సర్కారు పనితీరు ఉందని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన శ్రీనివాసరావు..మోడీ సర్కారు విధానాలను ఎండగట్టారు. విద్యావ్యవస్థలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటూ కార్మికులకు మాత్రం కనీస వేతనాలు గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మోడీ ఏదో చేస్తాడని భ్రమపడి గెలిపించిన యువతలోనూ ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.  

 

19:23 - May 22, 2016

కరీంనగర్ : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చీటింగ్‌ కేసు పెట్టారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో సీఎంపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ జిల్లా తొలి పర్యటనలో జిల్లాకు 40 హామీలు  ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదని సీఎంపై చీటింగ్‌ కేసు పెట్టారు. పోలీసులు కేసీఆర్‌పై కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పొన్నం అన్నారు. 

 

19:19 - May 22, 2016

హైదరాబాద్ : బీజేపీపై టీడీపీ నేతలు విమర్శల దాడి పెంచారు కమలనాథులను ఉద్దేశించి తెలుగు తమ్ముళ్లు సీరియస్‌ కామెంట్లు చేస్తున్నారు. ఘాటు వాఖ్యలు చేస్తూ హీట్‌ పుట్టిస్తున్నారు. బీజేపీపై మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి మండిపడ్డారు. హోదాపై బీజేపీ నేతలు దొంగాట ఆడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. విభజన వాదాన్ని తీసుకొచ్చింది బీజేపీయే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీ మిత్ర ధర్మాన్ని పాటించడం లేదంటూ మండిపడ్డారు. రాజధానికి వెయ్యికోట్లు ఇచ్చి రూ.30 వేల కోట్లు ఇచ్చామంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

 

18:49 - May 22, 2016

పుదుచ్చేరి : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు కిరణ్ బేడీ... బీజేపీలో చేరారు. ఆ పార్టీ సీఎంగా అభ్యర్థిలో బరిలో దిగి ఓడిపోయారు. 

 

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ నియామకం

పుదుచ్చేరి : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు కిరణ్ బేడీ... బీజేపీలో చేరారు. ఆ పార్టీ సీఎంగా అభ్యర్థిలో బరిలో దిగి ఓడిపోయారు. 

18:07 - May 22, 2016

వరంగల్ : జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షలో గందరగోళం నెలకొంది. సుందరయ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఓఎంఆర్ షీట్స్ కు బదులు ఇన్విజిలేటర్లు నకిలీ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 

వరంగల్ లో టెట్ పరీక్షలో గందరగోళం

వరంగల్ : జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షలో గందరగోళం నెలకొంది. సుందరయ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఓఎంఆర్ షీట్స్ కు బదులు ఇన్విజిలేటర్లు నకిలీ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 

ఒంగోలు మినీ మహానాడు ఘటనపై చంద్రబాబు మండిపాటు

విజయవాడ : ఒంగోలు మినీ మహానాడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పార్టీ నాయకులతో సీఎం సమావేశం అయ్యారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు ఫోన్ చేశాడు. ముఠాల సంస్కృతిని ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్టతను మంట కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గీత దాటితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని నేతలకు బాబు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నిన్న ఒంగోలు మినీ మహానాడులో రభస జరిగింది. బలరాం, గొట్టిపాటి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. 

18:01 - May 22, 2016

విజయవాడ : ఒంగోలు మినీ మహానాడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పార్టీ నాయకులతో సీఎం సమావేశం అయ్యారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు ఫోన్ చేశాడు. ముఠాల సంస్కృతిని ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్టతను మంట కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గీత దాటితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని నేతలకు బాబు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నిన్న ఒంగోలు మినీ మహానాడులో రభస జరిగింది. బలరాం, గొట్టిపాటి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. 

 

15:56 - May 22, 2016

మహబూబ్‌నగర్‌ : ఇద్దరూ అమ్మాయిలే పుట్టారంటూ ఓ భర్త తన భార్యను ఇంటినుంచి గెంటేశాడు. కూతురి కాపురం సరిచేద్దామని వెళ్లిన మామపై గొడ్డలితో దాడి చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో ఈ ఘటన జరిగింది. ఆరేళ్లక్రితం అనితకు, మురళితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ఇద్దరూ అమ్మాయిలే పుట్టారంటూ భార్యపై మురళి వేధింపులు పెంచాడు. ఆమెను తీవ్రంగా కొట్టి పుట్టింట్లో వదిలేశాడు. ఎన్నిసార్లు తీసుకువెళ్లాలని పద్మ కోరినా పట్టించుకోలేదు. పంచాయితీలో పెద్దలు బుద్ధి చెప్పినా వినలేదు. ఇలా ఏడాది గడచిపోవడంతో పద్మ తండ్రి కూతురిని అత్తారింట్లో దిగబెట్టాలని వచ్చాడు. అతన్నిచూసి ఆగ్రహించిన మురళి గొడ్డలితో మామ తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటు భర్త తీరుతో విసిగిపోయిన భార్య అతని ఇంటిముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. 

 

15:52 - May 22, 2016

మహబూబ్‌నగర్‌ : గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ బస్సు ప్రతి మండల, పంచాయితీ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది. ఈ యాత్రను గట్టు మండలం బోయలగూడెంలో మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి ప్రారంభించారు. 

 

15:46 - May 22, 2016

హైదరాబాద్ : నిరాడంబరంగా జీవితం గడిపిన పర్సా సత్యనారాయణ నేటి తరానికి ఆదర్శమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు కొనియాడారు. కమ్యూనిస్టు సీనియర్ నేత పర్సా సత్యనారాయణ వర్ధంతి సభ ఎస్వీకే లో జరిగింది.  బీవీ రాఘవులు పర్సా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్మిక ఉద్యమ నిర్మాత పర్సా అని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేశారని రాఘవులు అన్నారు.

 

బీజేపీ మిత్ర ధర్మాన్ని పాటించడం లేదు : గోరంట్ల

గుంటూరు : రాజధానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చి రూ.30 వేల కోట్లు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలిపారు. విభజనవాదాన్ని తెలమీదకు తెచ్చింది బీజేపీనే అని అన్నారు. విభజన బిల్లుకు బీజేపీ అంగీకారం తెలిపిందని చెప్పారు. ఎపికి పదేళ్ల ప్రత్యేక హోదా కావాలంది కూడా బీజేపీనే అని పేర్కొన్నారు. బీజేపీ మిత్ర ధర్మాన్ని పాటించడం లేదని విమర్శించారు. 

15:27 - May 22, 2016

మహబూబ్నగర్ : టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మహిళ పురుటి నొప్పులకు గురై మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌ మండలానికి చెందిన కవిత... టెట్ పరీక్ష రాసేందుకు జిల్లా కేంద్రానికి వచ్చారు. గంట ముందుగా ఎగ్జామ్ సెంటరైన మోడ్రన్‌ హైస్కూల్‌కు చేరుకున్నారు. అంతలోనే నొప్పులు రావడంతో హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ శిశువుకు జన్మనిచ్చిన కవిత వెంటనే పరీక్ష కేంద్రానికి వెళ్లి టెట్ పరీక్ష రాశారు. శిశువు ఆరోగ్యంగా ఉందని కవిత తల్లిదండ్రులు చెప్పారు.

 

15:23 - May 22, 2016

రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం... అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాపుల సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు ఇచ్చిన గడువు ఆగస్టుతో ముగుస్తుందని ముద్రగడ అన్నారు. కాపులు, దళితులు ఇప్పటివరకూ రాజకీయంగా అధికారంలోకి రాలేదని హర్షకుమార్‌ అన్నారు.  

 

15:01 - May 22, 2016

కర్నూలు : జిల్లాలోని రాజోలీబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్కీం వద్ద వంటావార్పు లాంటి నిరసన చర్యలు చేపట్టారు. ఆర్డీఎస్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

 

సీఎం హరీష్‌రావత్‌కు సీబీఐ సమన్లు జారీ

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ సీఎం హరీష్‌రావత్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటుకు కేసులో హరీష్‌రావత్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. మంగళవారం హరీష్‌రావత్‌ను కలిసి ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ ఆరా తీయనుంది. 

14:56 - May 22, 2016

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ సీఎం హరీష్‌రావత్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటుకు కేసులో హరీష్‌రావత్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. మంగళవారం హరీష్‌రావత్‌ను కలిసి ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ ఆరా తీయనుంది. 

 

కర్నూల జిల్లాలో ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం

కర్నూలు : జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా పోలీసులు మోహరించారు. 

 

13:44 - May 22, 2016

ఓటు వేసిన వారందరికీ సినిమాను ఉచితంగా చూపించారు. అవును ఇది తమిళనాడులో చోటు చేసుకంది. ఇటీవలే అక్కడ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో 'కోటు' అనే సినిమా రిలీజైంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన 'ప్రతినిధి'కి రీమెక్. రాజకీయ నేపథ్యంతో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఓటు వేసే వారందరికి ఓ అవకాశం కల్పిస్తున్నామని..ఓటు వేసిన వారు సిరా చుక్కతో గుర్తున్న ఓ సెల్ఫీని తమకు పంపించాలని అన్నారంట. దీనితో కొంతమంది సెల్ఫీలు పంపించి సినిమా చూశారంట. గతంలో ముంబైలో ఇలాంటి రకరకాల ఆఫర్స్ ఇచ్చారు. పిజ్జాలు...పెట్రోల్..ఇతర వాటిపై డిస్కౌంట్లు ప్రకటించారంట. మందు తాగితే డిస్కౌంట్లు ఇచ్చారంట కూడా. ఇదిలా ఉంటే ఇంకు బాటిళ్లకు మాత్రం గిరాకి పెరిగిందనే గుసగుసలు వినిపించాయి. పూర్తి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:43 - May 22, 2016

మీరు నిక్కర్ వేసుకుని పీఎస్ కు వెళుతున్నారా ? అయితే ఆగండి. ప్యాంటు వేసుకుని వెళ్లండి..అప్పుడే అక్కడ ఫిర్యాదు తీసుకుంటారంట. ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ పోయిందని ఓ యువకుడు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు..నిక్కర్ వేసుకుని వస్తావా ? అంటూ అక్కడున్న పోలీసు కోపంగా అరిచాడంట. ఇక్కడేమన్నా డ్రెస్ కోడా ఉంటుందా ? యువకుడు కోపం ప్రదర్శించాడంట. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

 

13:42 - May 22, 2016

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. విభజన అనంతరం అష్టకష్టాలు పడుతున్నామని చెబుతున్న ఏపీలో ఇది చోటు చేసుకుంది. గుంటూరులో గో మూత్రంపై పన్ను కట్టాలని ఆదేశాలు జారీ చేశారంట. కష్టాల నుండి బయటపడాలంటే
దేని మీద పడితే పన్ను వేయాలని అక్కడి సర్కార్ నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ గో మూత్రం ధర ఒక్కో లీటర్ భారీగానే పలుకుతోదంట. ఆవు పాలకంటే ఆవు మూత్రానికి యమ గిరాకీ ఉందని తెలుస్తోంది. పూర్తి విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి..

13:40 - May 22, 2016

యాంకర్ శ్యామల..రూ.50లకు గొడవపడిందా ? అవును గొడవపడింది. ఈ విషయం స్వయంగా శ్యామలే తెలియచేసింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి...తాను మూడు..నాలుగో తరగతి చదువుతున్న సందర్భంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చునని తెలిపారు. అమ్మ పాకెట్ మనీ ఇవ్వడానికి ఇష్టపడేది కాదని, రోజుకు రెండు రూపాయలు అడిగినా ఇచ్చేది కాదన్నారు. స్కూల్ దగ్గరిలో ఉన్న దుకాణంలో డబ్బులు కట్టకుండా చిరుతిండ్లు తినేదానినని పేర్కొన్నారు. రూ. 50 కట్టాలని దుకాణం అతను చెప్పడంతో డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయానని శ్యామల పేర్కొన్నారు. అనంతరం అమ్మ తీసుకొచ్చిందని తెలిపారు. అదండి సంగతి..

13:39 - May 22, 2016

శ్యామల..యాంకర్...బుల్లితెరపై యాంకర్ గా నిర్వహిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ సందర్భంగా టెన్ టివి ముచ్చటించింది. తాను చిన్నప్పటి నుండి స్టేజ్ యాక్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ యాంకర్ కాకపోతే టీచర్ కావాలని అనుకున్నానని..అది కూడా తెలుగు టీచర్ కు ప్రాధాన్యతనిచ్చేదానినన్నారు. బీకాం చదివానని, పిల్లలతో గడపడం తనకు చాలా ఇష్టమన్నారు. 

13:37 - May 22, 2016

ఢిల్లీ : కాషాయ మూకలు మళ్లీ దాడులకు తెగబడుతున్నారు. గోల్ మార్కెట్ లో ఉన్న సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ నేతలు దాడులకు దిగారు. కేరళలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ కేరళలో బీజేపీ నేతల హత్యకు సీపీఎం కారణమని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సీపీఎం కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం పార్టీ బోర్డును ధ్వంసం చేసి నల్లరంగు పూసే ప్రయత్నం చేశారు. దాడికి పాల్పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రజా స్వామ్య బద్ధంగా నిరసనలకు దిగవచ్చు కానీ ఇలాంటి దాడులకు దిగడం సబబు కాదని పలు ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. సమాచారం అందుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాడి జరగడంతో పొలిట్ బ్యూరో సమావేశం రద్దయినట్లు తెలుస్తోంది. గతంలో కూడా సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విజయన్ విజయోత్సవ ర్యాలీపై బీజేపీ బాంబు దాడులకు దిగిందని సీపీఎం పేర్కొంటోంది.

దాడిపై బీజేపీ స్పందించాలి - మధు..
సీపీఎం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిపై బీజేపీ స్పందించాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేరళలో బీజేపీ హత్యలకు సీపీఎం కారణమని ఆరోపిస్తూ ఢిల్లీ సీపీఎం కేంద్ర కమిటీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై ఆయన టెన్ టివితో మాట్లాడారు. వామపక్ష కార్యాకర్తలు ఎలాంటి దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. దేశంలో హత్యా రాజకీయాలు ప్రవేశ పెట్టడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందని, చట్టప్రకారం ప్రభుత్వ యంత్రాగం చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి దాడులు చేయడం సహించారని చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామతంత్ర వాదులు ఈ దాడిని ఖండించాలని, ఇలా చేయడం వల్ల అనేక దౌర్జన్య కార్యక్రమాలకు కారణమౌతుందని వెల్లడించారు. విజయన్ విజయోత్సవ సభ జరుగుతుంటే బాంబు దాడులకు పాల్పడ్డారని, హత్య రాజకీయాలు ప్రవేశ పెడుతున్నది వారేనని మధు తెలిపారు.

ప్రణబ్ ను కలిసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కలిశారు. నీట్ ఆర్డినెన్స్ పై రాష్ట్రపతితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. 

సీపీఎం కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కేరళలో జరిగిన బీజేపీ నేతల హత్యలకు సీపీఎం కారణమని ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మాజీ రంజీ ప్లేయర్ సోదరుడి మృతదేహం లభ్యం..

ఢిల్లీ : మాజీ ఇండియన్ రంజీ ప్లేయర్ అజయ్ శర్మ సోదరుడు మృతదేహం లభ్యమైంది. ఢిల్లీలోని సాక్షినగర్ లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. 

యూపీ సీఎం నివాసం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ఉత్తర్ ప్రదేశ్ : యూపీ సీఎం నివాసం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సీఎం కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆ వ్యక్తి విషం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

నీళ్లు దేవుడు ఇచ్చిన ప్రసాదం - మోడీ..

ఢిల్లీ : నీళ్లు దేవుడు ఇచ్చిన ప్రసాదమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేడు మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. చుక్క చుక్క నీటిని కాపాడుకోవాలని, నీటి సంరక్షణ, నీటిని కాపాడు కోవాల్సినవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వర్షపు నీటిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలని సూచించారు. నీటి సంరక్షణ, అడవుల రక్షణ కోసం మీడియా కూడా పాటుపడాలన్నారు. 

10:38 - May 22, 2016

రాం గోపాల్ వర్మ...వివాదస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈయన తాజాగా చేస్తున్న చిత్రం 'వీరప్పన్'. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. దీనితో వర్మ చిత్ర ప్రమోట్ ను సరికొత్తగా చేస్తున్నారు. థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీరప్పన్‌ పూర్తి జీవిత గాధను చూపించనున్నట్టు తెలుస్తోంది. మే 27న ఈ చిత్రం విడుదల కానుంది. ముంబయి నగరంలోని కొన్ని బస్సులను అద్దెకు తీసుకొన్న వర్మ, వాటికి బ్లాక్ పెయింట్‌ వేయించి, దాని మీద వీరప్పన్ సినిమా 27 రిలీజ్ అని ప్రింట్ చేయించాడు. దీనితో పాటు అతను 97 మంది పోలీసులని చంపాడని అని కూడా రాయించాడు. కానీ జనాల కళ్లు ఈ బస్సులపై పడుతుందా ? కొత్త ప్రయత్నాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో ?. 

10:34 - May 22, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఈనెల 23న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు చెన్నైలోని మద్రాస్‌ యూనివర్సిటీ సెంటినరీ హాలును సిద్ధం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే హాలులో జయ ప్రమాణం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 23న చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ హాలులో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య జయతో ప్రమాణం చేయిస్తారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత్రి జయలలిత మినహా... ఎన్నికైన అభ్యర్ధులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. జయలలితను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు లేఖను రాజ్‌భవన్‌కు పంపారు. రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య కూడా ప్రభుత్వం ఏర్పాటుకు జయలలితను ఆహ్వానించారు. దీంతో మద్రాస్‌ యూనివర్సిటీలోని సెంటినరీ హాలులో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ హాలు అన్ని విధాల కలిసొచ్చిందని జయ భావిస్తున్నారు. అందుకే గతంలో ప్రమాణస్వీకారం చేసిన ఈ హాలునే ఎంచుకున్నారు.

బిజీబిజీగా జయ..
జయలలిత తన నివాసం పోయెస్‌ గార్డెన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణలను బేరీజు వేస్తున్నారు. ఈసారి అసెంబ్లీని నిర్వహించడం జయలలితకు అంత తేలికకాదు. కొత్త అసెంబ్లీలో 98 సీట్లతో డీఎంకే బలమైన ప్రతిపక్షంగా మారింది. 2011 ఎన్నికల్లో డీఎంకేకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని 41 సీట్లు సాధించిన కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ ఆ తర్వాత జయలతో విభేదించి... అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. డీఎంకే తరపున హేమాహేమీలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. స్టాలిన్‌, దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, కేకేఎస్‌, ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ వంటి తలపండిన రాజకీయ మేధావులకు జయలలిత ప్రభుత్వానికి ఉక్కిరిబిక్కిరి చేయగల సత్తా ఉంది. జయకు గతంలో ఇది అనుభవమే. అందరూ వాక్చాతుర్యం ఉన్నవారే కావడంతో వీరిని ఎదుర్కోవడం జయలలితకు అంత తేలికకాదు. అందుకే ఈసారి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమర్ధులను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. తనకు అంత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటూ, ప్రతిపక్షాల విమర్శలను ఇంట, బయట సమర్ధవంతంగా తిప్పికొట్టే సత్తా ఉన్నవారినే మంత్రి వర్గంలోని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.

మట్టికరిచిన సమర్థులు..
ఇంతకు ముందు జయమంత్రి వర్గంలో పని చేసిన సమర్థులు ఈసారి ఎన్నికల్లో మట్టికరిచారు. దీంతో తనకు అన్ని విధాల అండగా ఉండేవారినే మంత్రులుగా ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. మంత్రివర్గంలోని 32 మందిని తీసుకునే వెసులుబాటు ఉంది. ముందుగా 23 మందిని తీసుకుని, ఆ తర్వాత విస్తరణలో మరికొందరికి స్థానం కల్పించవచ్చని భావిస్తున్నారు. జయకు అత్యంత సన్నిహితులైన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, వీరమణి, మోహన్‌, సీవీ షణ్ముగం, పళణిస్వామి, సెంగోట్టయ్యన్‌, జయకుమార్‌, జయరామన్‌, విజయ్‌ భాస్కర్‌, రాజేంద్ర బాలాజీ వంటి ప్రముఖులకు మంత్రివర్గంలో బెర్తులు ఖాయమని భావిస్తున్నారు. ఏఐఏడీఎంకేని వరసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి పెడతారు.

టెట్ పరీక్ష ప్రారంభం...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 10-12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 – 5.00 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. 

బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్..

ముంబై : బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎంపికయ్యారు. బోర్డు కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్ బాధ్యతలు నిర్వరిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఠాకూర్ ను పలువురు అభినందించారు. 

చినముల్కనూరును సందర్శించిన బీజేపీ నేతలు..

కరీంనగర్ : సీఎం దత్తత గ్రామం చినముల్కనూరులో బీజేపీ నేతలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. డబుల్ బెడ్ రూం స్కీంతో పాటు అన్ని సౌకర్యాలు సీఎం కల్పిస్తున్నారని బీజేపీ నేతలతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 

అమృత్ సర్ లో ఘోర ప్రమాదం..

పంజాబ్‌ : అమృత్‌సర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

10:08 - May 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 10-12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 – 5.00 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష కోసం మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ముషిరాబాద్ లోని ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పలు ఇబ్బందులకు గురయ్యారు. రెండు ఫొటోలు తీసుకరాకపోవడంతో పలు సమస్యలు ఎదుర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4లక్షలమంది ఈ పరీక్ష రాయబోతున్నారు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనిక అనుమతించేదిలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలా రెండు పరీక్షలు ఒకేరోజు ఉండడంతో అధికారులు మందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

బీసీసీఐ సర్వసభ్య సమావేశం..

ముంబై : బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి పాల్గొనేందుకు మాజీ కెప్టెన్ గంగూలి, అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనురాగ్ ఠాకూర్ కే బీసీసీఐ అధ్యక్ష స్థానం ఖరారైంది. ఈ మేరకు శశాంక్ మనోహర్ వారసునిగా 41 ఏండ్ల ఠాకూర్ ను ఆదివారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. 

సిక్కోలులో పంటలకు నష్టం..

శ్రీకాకుళం : శనివారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులకు కవిటి, కంచిలి మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది కొబ్బరి చెట్లు నేలకొరగడంతో పాటు మామిడది, జీడి తోటలకు భారీ నష్టం కలిగింది. 

వ్యక్తిని హత్య చేసిన నక్సలైట్లు..

మహారాష్ట్ర : గడ్చిరౌలీ ప్రాంతంలో ఓ వ్యక్తిని నక్సలైట్లు హత్య చేశారు. పోలీసు ఇన్ ఫార్మర్ అనె నెపంతో నక్సలైట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 

ప్రారంభమైన జేఈఈ పరీక్ష..

హైదరాబాద్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం ఆదివారం జాయింట్ ఎంట్రైన్స్ ఎగ్జామినేషన్స్ (జేఈఈ-అడ్వాన్స్‌డ్స్) పరీక్ష జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్షలకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 21వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, ఏపీలో నెల్లూరు, తిరుపతి, విజయవాడలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 

తాలిబన్ కమాండర్ మృతి ?

ఢిల్లీ : తాలిబన్ కమాండర్ ముల్లా మన్సోర్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ లో యూఎస్ జరిపిన విమానదాడుల్లో ఆయన మృతి చెందినట్లు యూఎస్ మీడియా పేర్కొంటోంది. 

08:49 - May 22, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాలను రాత్రికి రాత్రే ప్రకటించి, ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దని సీఎల్పీనేత జనారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి శాస్త్రీయంగా, రాజ్యాంగబద్దంగా, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జిల్లాల ఏర్పాటు జరగాలని ఆయన అన్నారు. రాజకీయపార్టీలు, ఉద్యోగ - ప్రజాసంఘాలు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని భువనగిరి, యాదాద్రి ఉన్న ఆలేరు నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లో కలపడం సరికాదన్నారు జానా. 

వికారాబాద్ లో నేడు మంత్రుల పర్యటన..

రంగారెడ్డి : వికారాబాద్‌ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన జరగబోతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పి.మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బి.సంజీవరావు ఆదివారం ఉదయం 11గంటలకు ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

08:38 - May 22, 2016

అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. అవి సంప్రదాయబద్ధమైనా మోడరన్‌ అయినా ఆకర్షణీయంగా ఉండాలనుకుంటారు. అయితే.. ఎక్కువ మంది అమ్మాయిలు పింక్‌ కలర్‌ డ్రెస్సులనే ఇష్టపడతారట. ఓ ఆన్‌లైన్‌ క్లాత్‌ సెల్లింగ్‌ వెబ్‌సైట్‌ చేసిన పరిశీలనలో ఇది వెల్లడైంది. తమ సైట్‌లో దుస్తులు ఆర్డర్‌ చేసిన అమ్మాయిల్లో సుమారు 28.5 శాతం మంది పింక్‌ కలర్‌నే ఎంచుకున్నారని ఆ సంస్థ పేర్కొంది. పింక్‌ కలర్‌ డ్రెస్‌ వేసుకున్న అమ్మాయిలను అబ్బాయిలు కూడా ఎక్కుగా ఇష్టపడతారట. అందువల్లే ఎక్కువ మంది అమ్మాయిలు ఈ రంగు దుస్తులు ధరించడానికి మొగ్గుచూపుతారట. పింక్‌ తర్వాత ఎల్లో, రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ కలర్స్‌ డ్రెస్సులు ధరించేందుకు అమ్మాయిలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. అబ్బాయిల్లో ఎక్కువగా బ్లూ, బ్లాక్‌ రంగుల దుస్తులను కోరుకుంటారట. అయితే.. ఈ కలర్‌ అమ్మాయిలు మాత్రం చాలా తక్కువగా లైక్‌ చేస్తారట.

08:36 - May 22, 2016

సాధారణంగా చాలా మంది మగవారి చర్మం జిడ్డుగా ఉంటుంది. ముఖంలో ఓపెన్‌ రంధ్రాలు కలిగి ఉంటారు. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్మూదూళి ముఖ రంధ్రాల్లో చేరి మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి కెమికల్‌ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మంచిది. రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్లతో శుభ్ర పర్చుకుని క్ల్లీన్సింగ్‌ అప్లై చేయడం మేలు.
రోజుకు కనీసం మూడు సార్లైన ఫేస్‌ వాష్‌ క్రీమ్‌ను ఉపయోగించాలి.
అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్‌ వాష్‌ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి.
సోపు లేదా డియోడరెంట్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడకూడదు.
షేవింగ్‌ చేసిన తర్వాత అలోవెరా ఫేష్‌ వాష్‌ చేసుకోవాలి. షేవింగ్‌ సమయంలో చిన్న గాట్లు ఏర్పడ్డా ఇది ఎలాంటి మార్క్స్ లేకుండా చేస్తుంది.
సాధారణంగా పురుషుల చర్మం రఫ్‌గా ఉంటుంది. కాబట్టి విటమిన్‌ -ఈ ప్రోడక్ట్స్ లేదా ఆలోవరా(కలబంద)తో తయారైన ఫేష్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి.
పెదవులకు తరచూ వ్యాజ్‌లైన్‌ రాస్తుండాలి.
ముఖం మరీ గరుకుగా ఉంటే తప్పని సరిగా పార్లర్‌కు వెళ్లి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ ఇచ్చే సూచనలు పాటించాలి.
చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముఖంలో మొటిమలు, ముడతలు, రంద్రాలను పోగొట్టుకోవచ్చు. ముఖాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు.

గయా ప్రాంతంలో కేన్ బాంబు..

బీహార్ : గయా ప్రాంతంలో ఓ ప్రాంతంలో పంచాయత్ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద కేన్ బాంబు కలకలం సృష్టించింది. సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడకు చేరుకుని బాంబు నిర్వీర్యం చేశారు. 

కాసేపట్లో టెట్..పరీక్ష ప్రశ్నపత్రం ఎంపిక..

హైదరాబాద్ : మరికాసేపట్లో టెట్ పేపర్-1 పరీక్ష ప్రారంభం కానుంది. పేపర్ -1కు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఎంపిక చేశారు. టెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగును. రాష్ట్ర వ్యాప్తంగా పేపర్-1కు 1,00,184 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

ఢిల్లీలో మహిళా కమిషన్ చీఫ్ అకస్మిక తనిఖీలు..

ఢిల్లీ : రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ శనివారం రాత్రి నైట్ షెల్టర్ లలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక్కడున్న వారి పరిస్థితి అనిశ్చితిలో ఉందని, వారి భద్రత ప్రమాదంలో ఉందని జాతీయ ఛానెల్ తో వ్యాఖ్యానించారు. 

నేడు అసోం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్..

గౌహతి : బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఈ రోజు జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్థానానికి సోనోవాల్ ను ఎంపిక చేయనున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

08:04 - May 22, 2016

హృతిక్‌తో నటించటం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. ఆయనతో నటించమనే నా కల నెరివేరింద'ని అంటోంది యామి గౌతమ్‌. అటు మోడల్‌ గాను, ఇటు హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న యామి ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ సరసన 'కాబిల్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో హృతిక్‌ గురించి మీడియాతో మాట్లాడుతూ, 'బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో హృతిక్‌ చాలా మంచి నటుడు. అన్నింటికిమించి మంచి హ్యూమన్‌ బీయింగ్‌ కూడా. వృత్తి పట్ల నిబద్ధత, సినిమా కోసం ఎంత ఒత్తిడినైనా తట్టుకునే సామర్థ్యం ఈ రెండూ హృతిక్‌ సొంతం. హృతిక్‌ సరసన నటించాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది. ఇటీవల విడుదలైన 'కాబిల్‌' టీజర్‌కి మంచి స్పందన లభించింది' అని చెప్పింది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం యామి అంధురాలిగా నటిస్తోంది. యామి ఈ చిత్రంతోపాటు 'జునూనియత్‌' చిత్రంలోను, 'తమిళ్‌సెల్వనుమ్‌ తనియర్‌ అంజలుమ్‌' తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. 'నువ్విలా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యామి ఆ తర్వాత అల్లు శిరీష్‌తో 'గౌరవం', నితిన్‌తో 'కొరియర్‌ బాయ్ కళ్యాణ్‌' వంటి చిత్రాల్లోనూ నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో యామికి తెలుగునాట ఛాన్స్ లు రాలేదు.

07:41 - May 22, 2016

వేటూరి సుందరరామ్మూర్తి ... అత్యద్భుత సాహిత్య విలువలతో తెలుగు పాటకు స్వర్ణయుగం తీసుకొచ్చిన ఘనుడు. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు పాటకు సరికొత్త సొగసులద్ది, శ్రోతల మదిలో చిరస్థాయిగా నిలిచిన వేటూరి వర్థంతి నేడు. మంచి పలుకుబడిని కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచి పెట్టగలిగినా, పంచి పెట్టే వేదిక ఎక్కడా లేక తెలుగు భాష నిరుపేదగా మారినప్పుడు సంస్కృతిపరంగా, గాంభీరత్వంలోనూ, విస్తృతి లోనూ, సౌందర్యంలోనూ ఏ ఇతర భాషకు అందనంత ఎత్తులో తన పాటల ద్వారా తెలుగు భాషను నిలబెట్టిన ఘనుడు వేటూరి. సినిమా పాటని చిన్నచూపు చూస్తూ వెలివేస్తున్న తరుణంలో తెలుగు పాటను ఉన్నత స్థాయిలో నిలబెట్టారాయన. గొప్ప భావాలను సైతం సరళమైన పదాలతో చెప్పొచ్చని నిరూపించారు. 'శంకరాభరణం', 'సప్తపది', 'సీతారామయ్య గారి మనవరాలు', 'భక్తకన్నప్ప', రాజేశ్వరీ కళ్యాణం' వంటి చిత్రాల్లో పరిపూర్ణమైన తెలుగును వినియోగిస్తూ తెలుగు నుడికారం, తెలుగుజాతి వారసత్వం ప్రపంచంలో తలెత్తుకు తిరిగేలా ఆవిష్కరించారు. ఉన్నత రీతిలో పాటకు సాహితీ విలువల్ని జోడించి పాటకు ఒక కావ్య గౌరవాన్ని తీసుకొచ్చారు. శ్రీ శ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత వేటూరికే దక్కుతుంది. సినిమా పాటల్లో ఎన్నో విధాలుగా, ఎంతో వైవిధ్యంగా ప్రయోగాలు చేసి తెలుగు పాట విలువని పెంచారు. తనకు పూర్వం ఉన్న గీత రచయితలందరి శైలిని ఆకలింపు చేసుకుని ఏ పరిధికి పరిమితం కాక అందర్నీ మించి అన్ని రకాల పాటలు రాసి పండిత పామరుల ప్రశంసలు సైతం పొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెండితెరను నల్లబల్లగా మార్చి దానిపై తెలుగు ఓనమాలు దిద్దారు.

1936లో జననం..
స్త్రీని గౌరవించే చోట తలపెట్టిన పనులన్నీ సక్సెస్‌ అవుతాయని, మహిళని అవమానించే చోట కార్యాలన్నీ ఫెయిల్‌ అవుతాయని, సమాజంలో స్త్రీకి ఉండాల్సిన స్థానాన్ని తన పాటల ద్వారా వివరించారు. అందుకు విజయశాంతి నటించిన 'ప్రతిఘటన' చిత్రమే ఒక ఉదాహరణ. ఎంతో మంది కీచకులు స్త్రీలపై దాడులకు తెగబడుతున్న సంఘటనలను ప్రతిబింబించేలా ఈ చిత్రంలో 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో' అనే పాటను రాశారు. ఈ పాట ఎంతగా ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. తెలుగునాట తిరుగులేని గీత రచయితగా వెలుగొందిన వేటూరి 1936లో కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో జన్మించారు. డిగ్రీ వరకు చదువుకున్న వేటూరి తొలుత జర్నలిస్టుగా ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సినీ హెరాల్డ్‌ పత్రికల్లో దాదాపు పదహారేళ్ళపాటు పనిచేశారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన 'ఓ సీత కథ' ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 42 చిత్రాలకు రచనా సహకారమందించారు. 'శంకరాభరణం' ఎవర్‌గ్రీన్‌ క్లాసికల్‌ చిత్రంగా నిలిచిందంటే అందుకు వేటూరి పాట మహత్యమే. ఎప్పటి కప్పుడు సమాజంలో వస్తున్న మార్పుల్ని గ్రహిస్తూ తన పాటల ద్వారా ఆ మార్పును శ్రోతలకు తెలియజెప్పారు. అంతే కాకుండా ప్రతి పాటలో మానవ సంబంధాలు, భావో ద్వేగాలకు పెద్ద పీట వేశారు. పూర్తి స్థాయి పాటల రచయితగా 1970లో ప్రారంభమైన ఆయన సినీ గీత ప్రస్థానం 2010 వరకు నిర్విరామంగా సాగింది. రెండు వేలకు పైగా చిత్రాల్లో ఐదువేలకు పైగా పాటలను రాసి ఎందరో నూతన రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు. వేటూరి పాటలే కాదు పుస్తకాలు కూడా రాశారు. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింబించే విధంగా 'సిరికా కొలను చిన్నది', సినీ మహనీయుల గొప్పతనాన్ని ప్రస్తుతిస్తూ 'కొమ్మ కొమ్మకో సన్నాయీ' వంటి పుస్తకాలు రాశారు. 1977లో 'పంతులమ్మ'లో 'మానస వీణ మధురగీతం' పాటకు తొలిసారి నంది అవార్డునందుకున్నారు. ఆ తర్వాత మరో ఏడు నందులు ఆయన్ని వరించాయి. 'మాతృదేవోభవ'లోని 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు.

07:33 - May 22, 2016

జుట్టు ఒత్తుగా పెరిగితే ఎంత అందంగా ఉంటుందో... అవాంఛిత రోమాలుంటే అంతే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే జుట్టు పెరిగేందుకు మహిళలు ఎన్ని సలహాలు పాటిస్తారో... అనవసరమైన హెయిర్‌ వస్తే తీసేయడానికి కూడా అంతే సూచనలు ఫాలో అయిపోతారు. అలాంటివారికోసమే ఈ టిప్స్ !పార్లర్లకు వెళ్లి వాక్సింగ్‌ చేయించుకోవడం అందరికీ తెలిసిందే. కానీ ఇంట్లోనే దొరికే పదార్థాలతో సహజమైన పద్ధతిలో కూడా ఈ హెయిర్‌ను రిమూవ్‌ చేయొచ్చు. దానికోసం ఏవేవో వాడిల్సిన అవసరం లేదు... పసుపు, శనగపిండి, కోడిగుడ్డులాంటి కొన్ని సాధారణ పదార్థాలను తరచూ వాడి పోగొట్టుకోవచ్చు. అయితే వర్కింగ్‌ ఉమెన్‌ అయితే తరచూ ఇలా చేయడానికి కుదరదు. వారు ఇన్‌స్టంట్‌గా ఇలా కూడా చేయొచ్చు!

బ్లీచింగ్‌ : మార్కెట్‌లో దొరికే మంచి బ్లీచింగ్‌ క్రీమ్‌ కొని... దాన్ని ముఖం, చేతులు, కాళ్లపై పది నుంచి పదిహేను నిమిషాలపాటు అప్లై చేసి తొలగిస్తే సరి... ఇది ఎలాంటి నొప్పి లేకుండా ఉండే సులభమైన ప్రాజెస్‌. తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా. దీనివల్ల కొన్నివారాల పాటు హెయిర్‌ కనిపించకుండా ఉంటుంది. అయితే బ్లీచింగ్‌ తరువాత గంటవరకు ఎండకు వెళ్లకుండా ఉండాలి. లేకపోతే దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
వాక్సింగ్‌ : జుట్టుకు బ్లీచింగ్‌తో డై వేసుకోవడం ఇష్టంలేని వాళ్లు వాక్సింగ్‌ చేయించుకోవచ్చు. దీంతో రూట్స్‌ నుంచి వెంట్రుకలను తొలగించుకోవచ్చు. రకరకాల వాక్సింగ్‌లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. చాక్లెట్‌, మిల్క్‌, మ్యాంగో వంటి ఫ్లేవర్స్‌ చర్మాన్ని మెత్తగా, మృదువుగా చేస్తాయి. అయితే ముఖానికి వాక్స్ వేసుకోకపోవడమే మంచిది.
లేజర్‌ : జుట్టును శాశ్వతంగా రిమూవ్‌ చేసే పద్ధతి లేజర్‌ ట్రీట్‌మెంట్‌. అయితే ఇది కొంచె ఖరీదయినది. ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్‌ లేని, మచ్చలు పడని పద్ధతి. ఫలితం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది.
హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్స్ : మార్కెట్లో అనేక రకాల హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి బ్రాండ్‌ను ఎంచుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. దాంతోపాటు వచ్చే కరపత్రాన్ని పూర్తిగా చదవాలి. దీనిద్వారా నిపుణుల సహాయం లేకుండానే సులభంగా అవాంఛిత రోమాలను తీసేయొచ్చు. అయితే రసాయనాలు కలిసిన క్రీమ్స్‌ వాడితే చర్మంపై దద్దుర్లు, దురద, కమిలిపోవడం, అలర్జీలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
థ్రెడ్డింగ్‌ : ఫేషియల్‌ హెయిర్‌ను తొలగించడానికి తక్కువ ఖర్చు మార్గం థ్రెడ్డింగ్‌. అయితే దీనివల్ల నొప్పి కూడా ఉంటుంది. ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఓపిక కూడా కావాలి. మీది సున్నితమైన చర్మం అయితే ఇంకా ఎక్కువ నొప్పి కలుగుతుంది. పదేపదే రిమూవ్‌ చేయాల్సి వస్తుంది. 

07:31 - May 22, 2016

'రేపసలే చాలా పనులున్నాయి. అలారం పెట్టుకుని మరీ పొద్దున్నే లేవాలి' చాలా మంది పడుకునే ముందు అనుకునే మాట. పొద్దున్నే నిద్రలేపడానికి అలారం పెట్టుకోవాల్సిందేనా? మన శరీరంలోనే పెద్ద బయాలజికల్‌ క్లాక్‌ ఉండగా మనకో క్లాక్‌ అవసరమా? అంటే అవసరమే లేదు. మీ మెదడే ఓ అలారం క్లాక్‌లా మోగి మిమ్మల్ని నిద్రలేపాలంటే డైలీ లైఫ్‌లో కొన్ని సూత్రాలు పాటించాలి.
మీ రోజువారి షెడ్యూల్‌ను మార్చుకోవాలనుకునే ముందు అసలు రోజూ 24 గంటల్లో మీరేమేం చేస్తున్నారో పరీక్షించుకోండి. ఎందుకంటే అది మీ హార్మోన్స్‌ మీద ప్రభావం చూపి శరీర ఉష్ణోగ్రతలను సరిగ్గా ఉండేలా చేస్తుంది. రాత్రిపూట గంటల పాటు టీవీ చూస్తే రోజువారీ శారీరక వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాదు మొబైల్‌ఫోన్‌ అధిక వాడకమూ ఈ అనర్థానికి దారి తీస్తుంది.
ఒక డైరీలో మీరు రోజూ పడుకుంటున్న, నిద్రలేస్తున్న టైమ్‌ను రాసుకోండి. జనరల్‌గా మీరు ఏ టైమ్‌కి నిద్రపోతున్నారు? ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నారు? రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతున్నారా? వంటివి. అవి కరెక్ట్‌గా లేకపోతే సరిచేసుకోండి. రోజూ ఒకే టైమ్‌కు పడుకోవడం, నిద్రలేవడం చేయండి. ఉదాహరణకు మీరు పొద్దున్నే ఐదు గంటలకు నిద్రలేవాలనుకుంటే రాత్రి తొమ్మిదిన్నరకు నిద్రపోవాలి. దానివల్ల మీరు కనీసం ఏడుగంటలు నిద్రపోయిన వారవుతారు. ఒకేసారి కాకపోయినా... నెమ్మదిగా ప్రయత్నించండి.
అలారం లేకుండా లేవాలని ఒకేసారి అలారం పెట్టుకోకుండా పడుకుంటే ఏ పది గంటలకో లేచే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఈ ప్రాక్టీస్‌ను వీకెండ్స్‌, లేదా హాలీడేస్‌ నుంచి మొదలుపెట్టడం మంచిది. మీ షెడ్యూల్‌కి అనుగుణంగా మీ బెడ్రూమ్‌ను కూడా తయారు చేసుకోండి. కర్టెన్స్‌ని కొద్దిగా తెరిచిపెట్టుకోండి. ఉదయమే పడే సూర్యరశ్మి వల్ల కూడా మీరు నిద్రలేవొచ్చు.
అన్నింటికి మించి... కచ్చితంగా ఈ టైమ్‌కల్లా లేవాలని మీ మెదడును ఒప్పించండి. అందుకే పడుకునే ముందే రోజూ ఆఫీస్‌కు కరెక్టు టైమ్‌కు వెళ్లాలంటే ఏ టైమ్‌కి లేవాలి? ఏమేం పనులు పూర్తి చేయాలి? వంటివన్నీ ఒక్కసారి మెదడుకు గుర్తు చేయండి. అంతేకాదు.. ఆఫీస్‌కు టైమ్‌కు వెళ్లాలి, లేదంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని పెట్టుకోండి. ఎందుకంటే మెదడుకు కచ్చితంగా ఏదో ఒక కారణం చెప్పాలి. లేదంటే అది రిలాక్సవుతుంది.
దీన్ని రెండు నుంచి మూడు వారాలపాటు రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేయండి. మీ సబ్‌కాన్షియస్‌ మైండ్‌ గుర్తు పెట్టుకునేదా ప్రయత్నించండి. కొన్నివారాలపాటు ఇలా చేయడం వల్ల మీ మెదడు ఆ పద్ధతికి అలవాటు పడిపోతుంది. అప్పుడు ఏదో పని ఉందని మీ మెదడును కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైమ్‌కి, దానంతట అదే మిమ్మల్ని నిద్రలేపుతుంది. 

మోడీ 'మన్ కీ బాత్'..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్ లో ప్రసంగించనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన దేశ ప్రజలనుద్ధేశించి మన్ కీ బాత్ లో ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే. 

నేటి నుండి సీపీఎం శిక్షణా తరగతులు..

నల్గొండ : నేటి నుండి ఐదు రోజుల పాటు మిర్యాలగూడలో సీపీఎం శిక్షణా తరగతులు జరగనున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హాజరు కానున్నారు.

06:45 - May 22, 2016

విజయవాడ : ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ఆలస్యంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండెళ్లైనా.. పదవులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. అసలు నామినేటెడ్‌ పదవుల భర్తీపై సర్కార్‌ ఏం ఆలోచిస్తోంది ? ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా.. ఇంకా నామినేటెడ్‌ పదవులు ఇవ్వకపోవడంపై నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో టీడీపీ అధికారం దక్కించుకోవడంతో నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని పార్టీలో తొలినాళ్ల నుంచి పని చేసిన నేతలు భావించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాకపోయినా... నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు.. చాలామంది సీనియర్లకు కార్పొరేట్‌ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఎన్నికల సమయంలో అధిష్టానం హామీ కూడా ఇచ్చింది. కానీ.. రెండేళ్లైనా పదవులు దక్కకపోవడంతో సీనియర్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

50కి పైగా కార్పొరేషన్ పదవులు..
50కి పైగా ప్రధానమైన కార్పొరేషన్‌ పదవులు ఉన్నా.. పట్టుమని 15 కార్పొరేషన్‌ పదవులు కూడా భర్తీ చేయలేదని సీనియర్‌ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల కమిటీలు కూడా భర్తీ చేయలేదని ఆరోపిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవాలయానికి పాలక మండలిని నియమించకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇక 13 జిల్లాల్లో గ్రంధాలయ కమిటీలను కూడా ప్రభుత్వం నియమించకపోవడం శోచనీయమంటున్నారు. ఒకటి, రెండు కమిటీలను నియమించి మిగతావాటిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తెలుగు తమ్ముళ్ల వాదన ఇలా వుంటే.. ప్రభుత్వ వాదన మరోలా ఉంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌ ప్రకారం కొన్ని కార్పొరేషన్‌ శాఖల్లో పూర్తిగా కేటాయింపులు జరగలేదని.. అందుకే నియామకాలు ఆలస్యమవుతుందంటోంది. కీలక విభాగాల్లో విభజన ప్రక్రియ పూర్తి అయిన వెంటనే నామినేటెడ్‌ పదవుల భర్తీ చేపడతామంటోంది టీడీపీ. మొత్తానికి నామినెటెడ్‌ పదవుల ప్రక్రియ అందని ద్రాక్షలాగే ఉంచడమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని పలువురంటున్నారు. నామినేటెడ్‌ పదవుల కోసం ఆశావాహులను ఊరిస్తూ ఉంచాలే కానీ.. పదవులు భర్తీ చేస్తే థ్రిల్‌ ఏముంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. 

06:41 - May 22, 2016

విజయవాడ : ఏపీ ఎంసెట్-2016 అగ్రికల్చరల్‌ అండ్‌ మెడికల్‌ ఫలితాలను విజయవాడలో సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఎంసెట్ టాప్-10 ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా, కామినేని, ప్రత్తిపాటి, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ప్రయత్నం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌కు ప్రిపేర్‌ కావాల్సిందేనని, ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఎంసెట్‌ 2016 మెడికల్‌ ఫలితాల్లో టాప్‌ 10 ర్యాంకులు సాధించిన వారిలో ఆరుగురు అమ్మాయిలు ఉండగా, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. వీరిలో ఆరుగురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులుండగా, నలుగురు ఏపీకి చెందిన విద్యార్థులున్నారు.

మాచాని హేమలత మొదటి ర్యాంకు...
కర్నూలు జిల్లాకు చెందిన మాచాని హేమలత 160 మార్కులకు గాను 156 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన యర్ల సాత్విక్‌రెడ్డి 155 మార్కులతో రెండో ర్యాంక్ సాధించగా..హైదరాబాద్‌కు చెందిన అమ్మకోల యజ్ఞప్రియ 153 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. అధ్యాపకులు, తల్లి దండ్రుల సహకారంతోనే కష్టపడి చదివి మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధ్యం అయిందని హేమలత తెలిపారు. ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షను ఏపీ, తెలంగాణలో గత నెల 24న నిర్వహించారు. ఫలితాల్లో ఏపీ నుంచి 85.24 శాతంతో 64,925 మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 21,569 మంది అర్హత సాధించారు. ఇంటర్మీడియట్ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన 6669 మంది విద్యార్థులకు వారి ఇంటర్ మార్కులు వెల్లడి కాకపోవడంతో ర్యాంకులు కేటాయించలేదు.  నీట్ వాయిదాతో విద్యార్ధులను వచ్చే ఏడాదికి ఎలా సన్నద్దం చేయాలో చర్చించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. మొత్తానికి నీట్‌ వాయిదాతో ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. త్వరలో కౌన్సెలింగ్ తేదీలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 

06:39 - May 22, 2016

హైదరాబాద్ : ఉద్యమకాలంలో చురుకుగా ఉన్న తెలంగాణ ఉద్యోగ సంఘాలలో చీలిక వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాక్ లో కలిసి పనిచేసిన ఉద్యోగ సంఘాలన్నీ క్రమంగా జాక్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఘాల్లో కీలకంగా ఉన్న టీఎన్జీవో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడంతో ఉద్యోగ సంఘాలన్నీ క్రమంగా ఒక్కొక్కటిగా ఉమ్మడి వేదిక నుంచి దూరం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా మారిన సంఘాల నేతలను కొంతమంది ఉద్యోగ సంఘాల నేతల వైఖరిని.. కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలుగా గుర్తింపబడి.. రాజకీయాల్లో క్రియాశీలంగా మారిన నేతలపై కొందరు ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగారం దేవిప్రసాద్ పై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే మరో జిల్లాలో అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

పోలీసుల అదుపులో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు..
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా టీఎన్జీవోల అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం టీఎన్జీవోల్లో మరింత చిచ్చురేపుతోంది. మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అండతోనే టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిని పోలీసులకు వేధిస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న ఉద్యోగ సంఘంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజేందర్ రెడ్డి వ్యవహారంతో ఇక తాము ప్రభుత్వంపై పోరాటం చేయక తప్పదనే హెచ్చరికలు పాలమూరు ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్ రెడ్డి వ్యవహారాన్ని తెలంగాణ జేఏసీ ఖండించింది. ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వమే అక్రమంగా కేసుల్లో ఇరికిస్తే సహించేది లేదని హెచ్చరించింది. అయితే టీఎన్జీవోల్లో గ్రూపు విబేధాలు ఉండడం పరిస్థితి ఎంత వరకు దారితీస్తోందో అన్న ఆందోళన ఉద్యోగ సంఘాల నేతల్లో కనిపిస్తోంది. 

06:36 - May 22, 2016

ఆదిలాబాద్ : జిల్లా సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించే చనాఖా కొరాట బ్యారేజీకి లైన్‌ క్లీయర్‌ అయింది. బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఎన్‌వోసీపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2018 జూలై కల్లా ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న చనాఖా కొరాట బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇన్నాళ్లూ వన్యప్రాణి సంరక్షణ, అటవీ, గనులు ఉన్నందున ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలా వద్దా అన్న దానిపై రెండు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు సాగాయి. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేసింది. మంత్రి హరీష్‌రావు కూడా పలుమార్లు మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బ్యారేజీ నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేస్తూ నిరభ్యంతరకర పత్రం-ఎన్ ఓసీ..జారీ చేసింది. దీనిపై మంత్రి హరీష్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

770 ఎకరాల భూమి సేకరణ..
చనాఖా కొరాటకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ బ్యారేజి పనులను 2018 జూలై కల్లా పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ బ్యారేజీ నిర్మాణానికి 560 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. చనాఖా కొరాట బ్యారేజి, పెనుగంగ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 51వేల ఎకరాలకు సాగునీరందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజి గేట్లు, పంపు హౌస్‌, కెనాల్ పనులన్నీ షెడ్యూల్‌లోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు.  సాగునీటి పథకాలను విజయవంతం చేస్తే ఆదిలాబాద్‌, రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా మారుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. చనాఖా కొరాట బ్యారేజీ కోసం మొత్తం 770 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇకా 290 ఎకరాలు భూసేకరణ పెండింగ్‌లో ఉంది. దీనిని కూడా త్వరలోనే పరిష్కరించి బ్యారేజి పూర్తిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

06:30 - May 22, 2016

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ జేఈఈ, తెలంగాణలో టెట్‌ ఒకేరోజు జరగబోతున్నాయి. ఇవాళ నిర్వహించబోయే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.. జేఈఈకి తెలుగు రాష్ట్రాల నుంచి 22వేలమంది.. టెట్‌కు 4లక్షలమంది హాజరుకాబోతున్నారు. ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్‌కు సర్వం సిద్ధమైంది.. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2లక్షలమంది హాజరుకాబోతున్నారు.. జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై అయినవారుమాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.. తెలుగు రాష్ట్రాలనుంచి 22వేలమంది ఇందులో క్వాలిఫై అయ్యారు.. మహారాష్ట్ర, గుజరాత్‌ తర్వాత ఇక్కడినుంచే ఎక్కువ మంది పరీక్ష రాయబోతున్నారు.. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌లో అధికారులు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. ఏపీలో విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో పరీక్ష నిర్వహణకు అన్నీ రెడీ చేశారు.. గతసారికంటే ఈసారి మహబూబ్‌నగర్‌, తిరుపతి సెంటర్లను అదనంగా కేటాయించారు. అటు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ కూడా ఆదివారమే జరగబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4లక్షలమంది ఈ పరీక్ష రాయబోతున్నారు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనిక అనుమతించేదిలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలా రెండు పరీక్షలు ఒకేరోజు ఉండడంతో అధికారులు మందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

06:28 - May 22, 2016

హైదరాబాద్ : రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తప్పించి వాణిజ్య పన్నుల శాఖ ను సీఎం కేసీఆర్ ఇటీవలే తన వద్ద ఉంచుకున్నారు. తాజాగా ఈ శాఖ పనితీరుపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూలు శాస్త్రీయంగా బేరీజు వేసుకుని పని చేయాలని సూచించారు సీఎం. శాఖను పునర్ వ్యవస్థీకరించాలని సీఎం యోచిస్తున్నారు. వాణిజ్య పన్నుల వసూళ్లు, శాఖలో ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల కల్పించడంపై సీఎం అధికారులతో చర్చించారు. చిత్తశుద్దితో పన్నులు వసూలు చేసే అధికారులను, సక్రమంగా పన్నులు చెల్లించే యజమానులను ప్రొత్సహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న 3600 కోట్ల రూపాయలు వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నందున పన్నుల వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉండాలన్నారు సీఎం. మొండి బకాయిదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. రాష్ట్ర ఖజానాను పెంచే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా.. ఆదాయాన్ని పెంచి రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ టార్గెట్లను చేరడమే కాకుండా.. ప్రతి సంవత్సరం ఈ టార్గెట్ ను పెంచుకుంటూ.. ఆదాయం పెరిగే మార్గాలను చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పన్నుల వసూళ్లకు సంబంధిత అధికారులు సన్నద్దమవుతున్నారు.  

06:24 - May 22, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా వల్ల మాత్రమే రాష్ట్రానికి ఏదో ఒరుగుతుందనుకోవడం భావ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాలు ఏమేరకు అభివృద్ధి సాధించాయో గమనించాలన్నారు. హోదాతో పాటు కేంద్ర నిధులూ వస్తేనే ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదాను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారంటూ.. విపక్షం చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. హోదా ఒక్కదాని వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పుకొచ్చారు. విజయవాడలో ఎంసెట్‌ మెడిసిన్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం.. ఆయన మీడియాతో సుదీర్ఘంగా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాల కన్నా.. ఆంధ్రప్రదేశే మెరుగ్గా ఉందని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపైనా చంద్రబాబు స్పందించారు. ఉభయ రాష్ట్రాల జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర కమిషన్‌దేనని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల హక్కులని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉందన్నారు చంద్రబాబు.

కేంద్రంపై నిప్పులు..
ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరుపై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. రాజధాని సహా, నీటి పంపకాలు, ఆర్థికలోటు, ప్రత్యేక హోదా వంటి సమస్యలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పడుతున్న బాధలు దేశంలో మరే రాష్ట్ర ప్రజలు పడలేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు జూన్‌ నాటికి అమరావతికి రావాల్సిందేనన్న చంద్రబాబు.. తాను కూడా కొన్ని నెలలుగా కుటుంబానికి దూరంగా గడుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా..ఏపీలో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడంలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్‌ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష ఉంటుందన్నారు. దీక్షా ప్రాంతాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విభజన సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర వైఖరిపైనా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీని ఆదుకోవాలని కోరారు. 

06:22 - May 22, 2016

విజయవాడ : అమరావతికి ఉద్యోగుల తరలింపు అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 27 వరకు ఉద్యోగులను తరలించేందుకు డెడ్‌లైన్‌ విధించింది. వెలగపూడిలో నిర్మాణాలు పూర్తయ్యే లోగా అద్దెకు భవనాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత సమయానికే కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగులందరినీ ఒకే దఫాలో తరలించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అదే విధంగా ఉద్యోగులందరూ జూన్ లోనే విజయవాడ , గుంటూరు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

06:19 - May 22, 2016

హైదరాబాద్ : వెస్ట్ జోన్‌ పరిధిలోని పంజాగుట్ట, ఎల్లారెడ్డిగూడలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. అనుమతులు లేని 24 ప్రైవేట్‌ హాస్టళ్లపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్స్‌ లేని 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న 16 హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. 2 పబ్బులపై కేసులు నమోదు చేశారు. కేబీఆర్‌ పార్క్‌ దగ్గర బైక్‌ రేస్‌ నిర్వహిస్తున్న యువతను అదుపులోకి తీసుకుని.. ఐదు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 400 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 24 హాస్టల్ లో తనిఖీలు నిర్వహించగా 33 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీసు అధికారి పేర్కొన్నారు. అలాగే బంజారాహిల్స్ పరిధిలోని 16 హుక్కా సెంటర్లు, 3 ప్లబ్బులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని 15 వెహికల్స్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 

వెస్ట్ జోన్ పరిధిలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : వెస్ట్ జోన్ పరిధిలోని పంజాగుట్ట, ఎల్లారెడ్డి గూడ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రైవేటు హాస్టళ్లు, క్లబ్బులపై దాడులు నిర్వహించారు. జూబ్లిహిల్స్ లో 16 హుక్కా సెంటర్లపై దాడులు చేశారు. రెండు పబ్బులపై కేసు నమోదు చేయగా బైక్ రేస్ ను నిర్వహిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు..

హైదరాబాద్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం ఆదివారం జాయింట్ ఎంట్రైన్స్ ఎగ్జామినేషన్స్ (జేఈఈ-అడ్వాన్స్‌డ్స్) పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 21వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, ఏపీలో నెల్లూరు, తిరుపతి, విజయవాడలలో పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 

నేడు టీఎస్ టెట్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10-12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 – 5.00 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

 

రేపు జయ ప్రమాణం..

చెన్నై : అన్నాడీఎంకే అధినేత జయలలిత సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆమెతో పాటు మరో 28 మంది క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. 

ఐపీఎల్ లో నేడు..

ఢిల్లీ : ఐపీఎల్ 9 లో భాగంగా నేడు కోల్ కతా - హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్ కతా వేదికగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్ లో ఢిల్లీ - బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రాయ్ పూర్ వేదికగా సాయంత్రం 4 గంటల నుండి ఈ మ్యాచ్ జరగనుంది. 

ఠాకూర్ దే బీసీసీఐ పీఠం..

ముంబై : బీసీసీఐ అధ్యక్ష స్థానం ఎంపికకు రంగం సిద్ధమైంది. బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనురాగ్ ఠాకూర్ కే అధ్యక్ష స్థానం ఖరారైంది. ఈ మేరకు శశాంక్ మనోహర్ వారసునిగా 41 ఏండ్ల ఠాకూర్ ను ఆదివారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. 

నేటి నుండి ఫ్రెంచ్ ఓపెన్..

పారిస్ : సీజన్ రెండో గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ ఆదివారం ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు సాగే ఈ క్లే కోర్టు సమరంలో పురుషులు, మహిళల సింగిల్స్ లో టాప్ సీడ్లు నోవాక్ జకోవిచ్, సెరెనా విలియమ్స్ హాట్ ఫెవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. 

మరో మూడు రోజులు వడగాలులు..

హైదరాబాద్ : కొన్ని రోజులుగా చల్లబడిన వాతావరణం వేడెక్కుతోంది. మరో మూడు రోజుల పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 

Don't Miss