Activities calendar

23 May 2016

22:01 - May 23, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ఆర్ ఎల్ వీ-టీడీ (రీయూజబుల్ లాంచ్ వెహికిల్-టెక్నాలజీ డిమోన్ స్ట్రేటర్) విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంత కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం పదిరెట్లు తగ్గనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - షార్ నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ఆర్ ఎల్ వీ-టీడీని విజయవంతంగా ప్రయోగించింది.
ఆర్ఎల్ వీ-టీడీ ప్రయోగం విజయవంతం 
ఉదయం 7 గంటలకు షార్ నుంచి బయలుదేరిన రాకెట్ ... ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా నింగిలోకి 70 కిలోమీటర్ల దూరం వెళ్లి విజయవంతంగా భూమిని చేరింది. బంగాళాఖాతం తీరానికి 5 వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన పర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఈ ప్రక్రియ 10 నిమిషాల్లో ముగిసింది. ఆర్ ఎల్ వీ-టీడీ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఇదే తొలిసారి.. 
ఇస్రో ఈ తరహా రాకెట్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి. ఆర్ఎల్‌వి ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం పదిరెట్లు తగ్గనుంది. ఒకసారి ఉపయోగించిన రాకెట్‌లోని పరికరాలను తిరిగి వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకు రావడానికి కూడా వీలవుతుంది. ఆర్‌ఎల్‌వి-టిడి పూర్తి స్థాయి వెర్ష రావడానికి మరో 10-15 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.
ఆర్‌ఎల్‌వికి 95 కోట్లు ఖర్చు 
విమానంలా కనిపించే ఆర్ ఎల్ వీ-టీడీ రాకెట్‌ పొడవు 6.5 మీటర్లు. దీని బరువు 1.75 టన్నులు. తిరువనంతపురంలోని విక్రం సారాభాయి స్పేస్‌ సెంటర్‌కు చెందిన 6 వందల మంది శాస్త్రవేత్తలు ఐదేళ్ల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. ఆర్‌ఎల్‌వికి 95 కోట్లు ఖర్చు చేసారు. ఇస్రో చేపట్టిన ఆర్ఎల్‌వీ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను ట్విట్టర్‌ ద్వారా అభినందించారు.

మహహబూబ్ నగర్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

మహబూబ్‌నగర్ : జిల్లాలోని కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నడిరోడ్డు మీద ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడు విజయ్ ను కోయిల్‌కొండ మండలం మర్లు ప్రాంతవాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలు : మంత్రి కామినేని

హైదరాబాద్ : వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఏపీ మంత్రి కామినేని సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యుల పదవీ విరమణకాలాన్ని 65ఏళ్లకు పెంచే ప్రతిపాదన ఉందన్నారు. జూన్‌ 8 నుంచి 15 మధ్య వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలు చేస్తామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ వైద్య విద్యార్థులకు జూలై నాటికి ట్యాబ్స్ అందిస్తామని తెలిపారు.

 

21:25 - May 23, 2016

దూపైతుందంటున్న ఆర్మూరు జనం.. వస్తపోత ఎక్కిరిస్తున్న నీళ్ల పథకం పల్కా, దత్తన్న బట్టలమీద మనసువడ్డ నర్సన్న.. దీపాలుముట్టిచ్చెకాడ జర జాగ్రత్తగుండన్నో, కరీంనగర్ పట్నంలో లండన్ లడాయి.. ముఖ్యమంత్రిగారిదేనట అసలు బడాయి, దాంట్ల దమ్ముందా అంటున్న కారు క్యాడర్... ఇడిసిపెడితే చూపెడతముంటున్న పువ్వు లీడరు, ఆరోపారి ఇమానం దిన్న తమిళనాడు అమ్మ.. వంగి వంగీ గూనోలైతున్న భక్తులు, పుట్టినపిలగానికి పరీక్ష పెట్టిన ప్రభుత్వం... తెలంగాణ రాష్ట్రంల టెట్ రాసేటోళ్ల కష్టాలు....ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

21:10 - May 23, 2016

మల్లన్న ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని వక్తలు కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత జయరాజు, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులు పాల్గొని, మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. భూమికి భూమి ఇవ్వాలన్నారు. మూడు ఎకరాల భూమిని జీవనాధారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తి దారులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. 123 జీవో ను రద్దు చేయాలని పేర్కొన్నారు. స్పెషల్ జీవో తేవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మచిలీపట్నంలో విషాదం

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. మంగినపూడి బీచ్‌లో ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి కొట్టుకుపోయాడు. ఇనుకుదురు మసీదు ఉత్సవాలకు వచ్చిన పలువురు విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లారు. వీరిలో ఆలీ అనే విద్యార్థి గల్లంతు అయ్యాడు. కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

20:31 - May 23, 2016

కడప : సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడిచేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ అన్నారు. హింసతో బెదిరించి ప్రతిపక్షాల నోరు మూయించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వాళ్లే ఇలాంటి దాడులకు పాల్పడతారని గఫూర్‌ అన్నారు. 

 

20:28 - May 23, 2016

హైదరాబాద్ : ఒక్క ఫొటో.. ఒకే ఒక్క ఫోటో...  తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు రేపింది. పసుపు చొక్కాల పరువు తీసింది. అధికార పార్టీని అభాసుపాలు చేసింది. ఇంతకీ టీడీపీ పరువును గంగలో కలిపిన ఆ ఫోటో ఏంటి..? దాని వివాదమేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
వివాదాస్పదమైన టిడిపి మహానాడు
ఈ సారి తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్ల దశలోనే వివాదాస్పదమైంది. ముఖ్యంగా మహానాడు జరుగుతున్న తిరుపతిలో తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చను బహిరంగ పరిచింది. అంతేనా..? పరస్పరం తిట్టుకున్నారు.. కర్రలతో కొట్టుకుని తలలు పగుల గొట్టుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందని ఆరా తీస్తే.. ఓ ఫోటోయే దీనంతటికీ కారణమని తేలింది. 
సమావేశంలో దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మహానాడును తిరుపతిలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీన్ని విజయవంతం చేసేందుకు.. పార్టీ నేతలు.. వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం ఓ సమావేశాన్ని నిర్వహించారు. అయితే.. ఆ భేటీకి కీలక నేతలెవ్వరూ హాజరు కాలేదు. దీంతో సమావేశ స్థలిలో దాదాపుగా అన్ని కుర్చీలూ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీన్ని టిడిపి మైనారిటీ సెల్‌ నేత  ఆలీఖాన్‌.. ఫొటో తీసి టిడిపి నేతల వాట్సప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశారు. నాయకులు లేకుండా మహానాడు ఎలా నిర్వహిస్తారు.. ఖాళీ కుర్చీలు ఉన్నాయి.. మరి నాయకులు ఏరి .. అంటూ కామెంట్‌ పెట్టాడు.
టిడిపి మైనార్టీ సెల్‌ అలీఖాన్‌పై మండిపడ్డ నేతలు
వాట్సాప్‌లో ఆలీఖాన్‌ పోస్ట్‌ను చూసిన స్థానిక టిడిపి ఆగ్రహంతో ఊగిపోయారు. మహానాడు కమిటీల ఏర్పాటుకు జరిగిన సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు భాస్కర్‌ యాదవ్‌ ఈ ఫొటో గురించి అలీఖాన్‌ను నిలదీశాడు. అలా పోస్టులు పెట్టి పార్టీ పరువు తీస్తావా అంటూ మండిపడ్డా. అలీఖాన్‌ కూడా దూకుడుగా బదులివ్వడంతో పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడ్డారు. కర్రలతో కొట్టుకున్నారు
మరోసారి తెలుగుతమ్ముళ్లు ఘర్షణ
సీనియర్లు కలగజేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ ఆగింది. అయితే ఓ గంట తర్వాత  మాటామాటా పెరిగి మరోసారి తెలుగుతమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. తర్వాత కొంత సమయానికి గొడవ సద్దుమణిగింది. సొంత జిల్లాలో తమ్ముళ్ల తగవులాటపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఇరు వర్గాలను మందలించారు. ప్రస్తుతానికి ఈ గొడవ చల్లబడ్డట్లు కనిపిస్తున్నా.. మహానాడు తర్వాత మళ్లీ రేగవచ్చని పార్టీలో చర్చ జరుగుతుంది.  

20:24 - May 23, 2016

గుంటూరు : తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు సీఆర్‌డీఏ కార్యాలయానికి తాళం వేశారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. కార్యాలయానికి తాళం వేసిన నలుగురు రైతులను అరెస్ట్‌ చేయడంతో  రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజధాని నిర్మిద్దామంటే.. ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు. భూములు తీసుకునేటప్పుడు ఎన్నో హామీలిచ్చిన ప్రభుత్వం.. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే.. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

20:20 - May 23, 2016

కడప : మున్సిపల్ వ్యవస్థను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 279 విడుదల చేయడం దారుణమని సీఐటీయూ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్‌ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కడప నగరంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఐటీఐ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్థం చేసేందుకు యత్నించగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.. 

20:16 - May 23, 2016

హైదరాబాద్ : కాపు కార్పొరేషన్‌లో రుణాలు ఇవ్వకుండా, కాపులను మభ్యపెడుతున్నారని ముద్రగడ పద్మనాభం  ఆరోపించారు. తాను లేఖ రాసినప్పుడు స్పందిచడం తరువాత కాపులను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని కాపుల నాయకుడు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకుంటున్న ఏపీ సీఎం కాపుల రుణాలకు ఆయనే పేరే పెట్టుకున్నాడని ముద్రగడ మండిపడ్డారు. ఆఖరికి కాపుల పేరు చివర చంద్రబాబు పేరుపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందోమోనని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని ముద్రగడ సూచించారు.

 

రేపు చైనా వెళ్లనున్న రాష్ట్రపతి ప్రణబ్

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన కోసం మంగళవారం చైనాకు బయలుదేరనున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకునే దిశగా ఆ దేశ ప్రభుత్వంతోఆయన చర్చలు జరపనున్నారు. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌పై నిషేధం విధించాలని భారత్‌ ఐక్యరాజ్యసమితిని కోరగా దానికి చైనా మోకాలడ్డిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా రాష్ట్రపతి ఈ పర్యటనలో భాగంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రపతి అక్కడికి చేరుకున్న తర్వాత చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌ని కలిసి చర్చలు జరుపుతారు.

 

కూతుర్ని కడతేర్చిన కన్నతల్లి

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కుర్తియా అనే గ్రామంలో 18ఏళ్ల యువతిని సొంత తల్లి మరో ఇద్దరు బంధువులతో కలిసి హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత యువతి గ్రామంలోని ఓ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడపడంపై కోపంతో ఆమెను తల్లే పరువు హత్య చేసినట్లు అనుమానిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పాటించాల్సిన విషయాలను కలెక్టర్లకు వివరించారు.

సీఎం చంద్రబాబుతో టీడీపీ ముఖ్యనేతలు భేటీ

విజయవాడ : సీఎం చంద్రబాబుతో టీడీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు.  మినీ మహానాడులో జరుగుతున్న గొడవలపై చర్చిస్తున్నారు. 

19:37 - May 23, 2016

మహిళల వస్త్రధారణలో చీరలెప్పుడూ ప్రత్యేకమే. అన్ని వయసుల అతివలకు చక్కగా నప్పే చీరలంటే వారికీ మక్కువే. అలాంటి చీరలలో లేటెస్ట్ కలెక్షన్ ను పరిచయం చేసేందుకు ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

19:33 - May 23, 2016

ప్రకృతిని కాపాడుకుంటూ చేసే ఏ పనైనా, మంచి ఫలితాలనే ఇస్తుంది. ఆ మనిషికి నిలకడైన జీవితాన్ని అందిస్తుంది. అది ప్రకృతి నేర్పిన పాఠం. ఆ పాఠాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ ముందుకు సాగుతోంది ఒక అతివ.

ప్రకృతిని అనుసరించి నడుచుకుంటే అంతా సానుకూలంగానే ఉంటుంది. వేలకు వేల రూపాయలు పెట్టి, పురుగుల మందులు పిచికారి చేసి దిగుబడి రాక అప్పులపాలయ్యే రైతులకు లావణ్య అనే రైతు ఆదర్శంగా నిలుస్తున్నారు. పొయినచోటే సంపాదించుకోవాలనే పట్టుదలతో వ్యవసాయ రంగంలో అప్పుల పాలైనా ఏమాత్రం దిగాలు చెందకుండా, గో ఆధారిత సేద్యం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న పాలమూరు మహిళా రైతులపై మానవి స్ఫూర్తిదాయక కథనం.

కాలుష్య కాసారంగా మారుతున్న ఆహార పదార్థాలకు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారం ప్రత్యామ్నాయం. ఈ దిశగా రైతులందరూ అడుగులేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో లావణ్య సాగు చేస్తున్న విధానం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. పలు అవార్డులు అందుకున్న ఆమె ప్రస్థానం ఇలాగే కొనసాగాలని మానవి ఆశిస్తోంది.

19:27 - May 23, 2016

నల్గొండ : మానవ చరిత్ర మహోన్నతమైనది. మానవ పరిణామ క్రమంలో జరిగిన మార్పులు అపారమైనవి. నాగరిక జీవనానికి పూర్వం ఆదిమానవుని మనుగడ కోసం జరిపిన పోరాటం అసమాన్యమైనది. ఆ వింతలు, విశేషాలు తెలియాలంటే చరిత్ర పుటలు తిరగేయాల్సిందే. ఆ చరిత్రను తవ్వి తీయాలంటే మాత్రం పరిశోధకుల అన్వేషణ తప్పనిసరి. ఆదిమానవుడి సంచారానికి సంబంధించిన అవశేషాలను వెలుగులోకి తెచ్చే పరిశోధనొకటి నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. 
పరిశోధనలు...చారిత్రక అవశేషాలు 
గతమెంత ఘనమైనదైనా అది చరిత్రే. చారిత్రక అవశేషాలను కళ్లకు కట్టినట్లు చూపాలంటే అది కేవలం పరిశోధనలతోనే సాధ్యం. మానవ పరిణామ క్రమానికి సంబంధించి ఎన్నో చారిత్రక సంఘటనలు ఉన్నప్పటికీ.. ఏదో తెలియని విశేషాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూనే ఉన్నారు పరిశోధకులు. అలాంటి చారిత్రక అంశమే ఇటీవల నల్గొండ జిల్లా ఆలేరు ప్రాంతంలో బయల్పడింది. ఆలేరు ప్రాంతంలో ఆదిమానవుడు సంచరించినట్లుగా ఆధారాలను సేకరించారు పరిశోధకులు. ఆదిమానవుడి ఉనికిని చాటేలా పలు ఆసక్తికర అంశాలు ఇక్కుర్తి ప్రాంతంలో బయల్పడటం విశేషం.  
ఇక్కుర్తి, గొలనుకొండ గ్రామాల్లో జీవనాధారాలు     
నవీన శిలాయుగానికి సంబంధించి మానవుడు సాగించిన జీవన ఆధారాలు ఇక్కుర్తి, గొలనుకొండ తదితర గ్రామాల్లో ఉన్నట్లు ఇటీవల తేటతెల్లమయింది. క్రీస్తు పూర్వం వేయి సంవత్సరాల చరిత్రతో పాటు మానవ మనుగడలో సంభవించిన మార్పులు సైతం బయల్పడటం విశేషం. ఇక్కుర్తి, బోడగుట్ట, కోశెగుట్ట పరిసరాల్లో ఆదిమానవుడికి చెందిన రాకాశిగుళ్లు, శిస్థులు, సైరన్‌లుగా పిలువబడే సమాధులు ఉన్నాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.  
రాతి పనిముట్లు
చెట్లు, గుట్టల మధ్య జంతువు బారినుంచి కాపాడుకుంటూ.. మనుగడ కోసం సంచార జీవితం గడిపిన ఆదిమానవుడు ఈ ప్రాంతంలో నివసించాడనేందుకు ఇక్కడ లభించిన రాతి పనిముట్లే నిదర్శనం అంటున్నారు పరిశోధకులు. ఆది మానవుని సంస్కృతి, సాంప్రదాయాలు ఎలా ఉండేవే ఈ ఆధారాల ద్వారా అంచనా వేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 
ఆదిమానవుల సమాధులు..
మెన్‌హర్స్‌గా పిలువబడే ఆదిమానవుల సమాధులను ద్రవిడ సంస్కృతి సంప్రదాయం ప్రకారం నిర్మించారు. ఆదిమానవుడు చనిపోతే ఖననం చేయడం కోసం పెద్ద గొయ్యి తవ్వి అందులో నాలుగు వైపులా దీర్ఘచతురస్రాకారంలో బండలు అమర్చి అందులో పూడ్చేవారు. మెన్‌హర్స్‌ సమాధుల గురించి తెలియక గుప్తనిధుల కోసం తవ్వినప్పుడు అస్తి పంజరాలు, మట్టి పాత్రలు బయటపడ్డాయని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కుర్తి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. పురావస్తుశాఖ అధికారులు దృష్టి పెడితే మరింత సమాచారం లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  

 

రాజస్థాన్‌లో తెలంగాణ యువకుడి కిడ్నాప్‌

హైదరాబాద్ : రాజస్థాన్‌లో తెలంగాణ యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన పిడుగు రమేష్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. రమేష్‌రెడ్డి కిడ్నాప్‌పై అతడు పనిచేస్తున్న కంపెనీ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

18:59 - May 23, 2016

హైదరాబాద్ : సినీనటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సచివాలయంలో తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దత్తత తీసుకున్న సిద్దాపురం గ్రామంలో ఇటీవల పర్యటించిన ఆమె అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా మంత్రితో చర్చించారు. మహేష్‌బాబు చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను ఖర్చు చేయనున్న నిధుల వివరాలను ఆమె మంత్రికి వివరించారు. 

18:58 - May 23, 2016

 హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే తెలంగాణ సెక్రటేరియట్‌కు బదిలీ చెయ్యాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలుగా తెంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని ఆయన మండిపడ్డారు. ఏపీ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను జీవన్ రెడ్డికి వివరించారు. ఈ విషయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు స్పందించి, తెలంగాణ ఉద్యోగులను ఏపీ సచివాలయం నుంచి వెంటనే బదిలీ చేయాలని జీవన్ రెడ్డి కోరారు. 

 

భూవివాదాలన్నీ పరిష్కరించాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఐదెకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి.. పేరు మార్పిడి చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ హెచ్ ఆర్ డీలో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కొనసాగుతోంది. భూముల పేరు మార్పిడి విషయంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. ఇకపై డబ్బులు తీసుకోకుండానే పేరు మార్పిడి జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూముల వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. భూవిక్రయం జరిగిన 15 రోజుల్లోనే పేరు మార్పిడి జరగాలి.. ఇందుకోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.

18:51 - May 23, 2016

హైదరాబాద్ : ఐదెకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి.. పేరు మార్పిడి చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ హెచ్ ఆర్ డీలో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కొనసాగుతోంది. భూముల పేరు మార్పిడి విషయంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. ఇకపై డబ్బులు తీసుకోకుండానే పేరు మార్పిడి జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూముల వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. భూవిక్రయం జరిగిన 15 రోజుల్లోనే పేరు మార్పిడి జరగాలి.. ఇందుకోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రాష్ట్రంలోని భూవివాదాలన్నీ పరిష్కరించి,.. రికార్డులను సరిచేయాలని కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన అసైన్డ్‌ భూములను గుర్తించి.. అసైన్డ్‌దారులకు లేదా ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక తెల్ల కాగితాలపై జరిగిన క్రయ విక్రయాలన్నీ జూన్‌ 2 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. 

18:42 - May 23, 2016

నిజామాబాద్ : పాలక పక్షం అండదండలుంటే చాలు..నిబంధనలు బేఖాతర్‌. కంచె చేను మేసిన చందంగా.. నిబంధనలు పాటించాల్సిన వారే.. వాటిని తుంగలో తొక్కుతున్నారు. అక్రమ ఇసుక దోపిడీకి రాచబాట వేస్తున్నారు. నిజమాబాద్‌ జిల్లా మంజీర నదిలో అడ్డూ ఆపూ లేకుండా రెచ్చిపోతున్న ఇసుక మాఫియాపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...!
పాలకుల అండదండలతో రవాణా 
ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పాలకుల అండదండలతో నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం మంజీర నదిలో ఇసుక దోపిడీకి అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. స్వయంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలతోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. బీర్కూర్‌కు చెందిన కోట్టం నర్సయ్య, శివయ్యల పొలంలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా వారి పొలాల పక్కనున్న ప్రభుత్వ భూముల్లో సైతం ఇసుక అక్రమ రవాణాకు గురవుతోంది. రాత్రిపూట దొడ్డిదారిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. 
ఇసుక అక్రమ రవాణాతో ఇబ్బందులు 
బీర్కూర్‌లోని పోచారం కాలనీ వాసులకు ఇసుక రవాణా వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు పిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లు, ఇళ్లు ఇసుక వాహానాల రాకపోకల వల్ల దెబ్బ తింటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
అడుగంటిపోతున్న భూగర్భ జలాలు
ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని గతంలో కలెక్టర్‌కు పిర్యాదు చేస్తే.. రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం మళ్లీ ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వడం ఏంటని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా ఇసుక క్వారీలను రద్దు చేయాలని, పంటపొలాలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

 

18:36 - May 23, 2016

హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఢిల్లీలో సీపీఎం కార్యాలయంపై దాడికి నిరసనగా హైదరాబాద్‌ సుందరయ్య పార్క్‌ దగ్గర ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దాడి ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. బీజేపీ పాలనలో మతోన్మాదుల ఆగడాలు ఎక్కువయ్యాయని తమ్మినేని విమర్శించారు. 

 

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్త జిల్లాలు, మండలాలపై దిశానిర్దేశం, రెవెన్యూ సంస్కరణలు, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. అనాథ శరణాలయాలు, అంధ పాఠశాలలు, ఆస్పత్రుల్లో స్వీట్లు, పండ్లతో పాటు మాంసాహారం పంపిణీ చేయాలని చెప్పారు.

17:35 - May 23, 2016

గుంటూరు : ఈ ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ  నూతన రాజధాని నుండే పాలన కొనసాగించాలనే కృతనిశ్చయంతో ఉంది ఏపీ సర్కార్‌. జూన్‌ 27లోగా ఉద్యోగులందరినీ అమరావతికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ప్రభుత్వం ప్రకటించిన సమయానికి పూర్తి అవుతుందా ? లేదా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి..? ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయో వంటి పలు విషయాలను వీడియోలో చూద్దాం...

 

16:53 - May 23, 2016

విజయవాడ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై ఏపీ కాంగ్రెస్‌ రాజకీయ అస్త్రం ప్రయోగించింది. ధర్నా, అరెస్టులతో నవ్యాంధ్ర రాజధాని దద్దరిల్లింది. విజయవాడ ఉద్రిక్తంగా మారింది. జిల్లా, మండల స్థాయిలో ఉద్యమాలకు సన్నద్ధం అయింది. వైసీపీకంటే మైలేజీ తెచ్చుకోవాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. లేఖలతో టీడీపీ సరిపుచ్చుతుంది. మొక్కుబడి ప్రకటనలతో మంత్రులు ఉన్నారు. తొలిసారిగా తెలుగు దేశం ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది.

బీహార్ లో రూ. 12 లక్షల లూఠీ..

బీహార్ : ఓ ద్విచక్ర వాహన షోరూంలో దుండగులు దోపిడికి పాల్పడ్డారు. రూ. 12లక్షలు లూఠి చేసి పరారయ్యారు. పరారవుతున్న సందర్భంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఉద్యోగికి గాయాలయ్యాయి. నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. 

16:36 - May 23, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ధూళి తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకే నగరంలో చీకట్లు కమ్ముకున్నాయి. రోడ్లన్ని దుమ్మ, ధూళితో కమ్ముకున్నాయి. వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు గంటలపాటు ధూళి తుపాను కొనసాగుతుందని ఐఎండీ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొన్నారు. రాజస్తాన్ నుంచి వేడిగాలులు వీయడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయిని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

 

కేరళ స్పీకర్ గా పి. శ్రీరామకృష్ణన్ ?

కేరళ : రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా పి. శ్రీరామకృష్ణన్ నియామకం కానున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును నేతలు ప్రతిపాదించారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మొత్తం 12 మంది మంత్రులుండనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

16:26 - May 23, 2016

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డా సమావేశం అయ్యారు. నీట్ ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి వివరణ కోరారు. నీట్ నిర్వహణను ఏడాదిపాటు వాయిదా వేస్తూ కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ పై వివరణ కోరారు. నీట్ పై రాష్ట్రాల అభ్యంతరాలను మంత్రి నడ్డా రాష్ట్రపతికి వివరించారు. సుమారు 45 నిమిషాలపాటు సమావేశం జరిగింది. 

 

నేతలను విడిచిపెట్టాలి - రఘువీరా...

విజయవాడ : అరెస్టు చేసిన నేతలందరినీ విడిచిపెట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ సందర్శనకు వెళుతుంటే విద్రోహ శక్తులను అడ్డుకున్నట్లు పోలీసులు వ్యవహరించారని, టీఎస్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు చేపడుతుంటే మౌనంగా ఉండడంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. 

ముగిసిన ఏపీ పీఏసీ సమావేశం...

హైదరాబాద్ : ఏపీ పీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి ఆడిట్, ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. రెవెన్యూ, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన విషయాలపై చర్చించారు. సకాలంలో కమిటీకి సమాచారం అందివ్వాలని అడిట్, ఆర్థిక శాఖ అధికారులకు పీఏసీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని, కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించాలని పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 

గుండెపోటుతో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి..

శ్రీకాకుళం : భామిని (మం) బత్తిలి పీఎస్ వద్ద ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుల్ హజారుద్దీన్ గుండెపోటుతో మృతి చెందాడు. విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. 

కొత్త జిల్లాలు వద్దనడం మూర్ఖత్వం - కర్నె ప్రభాకర్..

హైదరాబాద్ : కొత్త జిల్లాలో కోసం ఉద్యమాలు జరుగుతుంటే కాంగ్రెస్, టిడిపి నేతలు వద్దనడం మూర్ఖత్వమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రానికి గ్రామాలు దూరంగా ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదనే ఉద్ధేశ్యంతోనే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ప్రతిపాదన తెచ్చారని తెలిపారు. 

15:58 - May 23, 2016

కర్నూలు : జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని కోసిగిలో చెరువులోకి నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లారు. అయితే చిన్నారులకు ఈత రాకపోవడంతో చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

శ్రీనగర్ లో మృతి చెందిన పోలీసులకు నివాళి..

శ్రీనగర్ : ఉదయం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన పోలీసుల మృతదేహాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు.
పోలీసు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. 

15:52 - May 23, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం నెలకొంది. పడవ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ప్రాణహిత నదిలో పడవలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఈదురు గాలులకు కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద పడవ ఎగిరి నీటిలో బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో మహిళ, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. మృతుల కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

 

కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశం..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. కొత్త జిల్లాలు, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లపై నిశితంగా చర్చించనున్నారు. సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. 

జింబాబ్వే టూర్ కు టీమిండియా ఎంపిక...

న్యూఢిల్లీ : త్వరలో టీమిండియా జింబాబ్వే టూర్ కు వెళ్లనుంది. 16మందితో కూడిన సభ్యులు ఎంపికయ్యారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లకు విశ్రాంతి కల్పించారు. ధోని (కెప్టెన్), ఫజల్, పాండే, నాయర్, రాయుడు, రిషి, అక్సర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, బుమ్రా, బరిందర్ శ్రాన్, మందీంప్ సింగ్, కేదర్ జాదవ్, జైదేవ్ ఉన్కదత్, యుజ్వేంద్ర చహాల్ లున్నారు. మొత్తం మూడు వన్డే మ్యాచ్ లు, ఒక టీ-20 మ్యాచ్ జింబాబ్వేతో జరగనుంది. 

బాలిక ప్రాణాలు తీసిన గుంత..

బెంగళూరు : ఓ గుంత పదహారేళ్ల బాలిక ప్రాణాలు తీసింది. మైసూరు చెందిన ఓ బాలిక స్కూటర్ పై ప్రయాణిస్తోంది. ప్రమాదవశాత్తు గుంతలో పడిపోవడంతో ఆమెపై నుండి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం అనంతరం రహదారిపై ఉన్న గుంతలను పూడ్చారు. 

15:23 - May 23, 2016

అధికార, విపక్ష నేతలు బహిరంగ సభలు..ప్రెస్ మీట్ లోనే విమర్శలు..ఆరోపణలు చేసుకోవడమే కాదు. సోషల్ మీడియాలో సైతం విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధికారిక మీడియా ప్రతినిధి ప్రియాంక చతుర్వేది..కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీల మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఒకరిపై ఒకరు ట్వీట్లతో ధ్వజమెత్తారు. తనపై నిర్భయ తరహాలో అత్యాచారం చేస్తామని..బెదిరింపులు వచ్చాయని ప్రియాంక ఇటీవల తన బ్లాగులో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై పలు రకాల కామెంట్స్ వచ్చాయి. ఆమె రాసిన వ్యాసం ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రియాంకపై దాడి చేస్తే అది మహిళల గౌరవంపై దాడి, అదే స్మృతి ఇరానీపై దాడి చేస్తే ఆమోదయోగ్యమా? అంటూ షెఫాలి వైద్య ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీంతో ప్రియాంక జోక్యం చేసుకొని తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని, కానీ కేంద్ర మంత్రి స్మృతికి జెడ్‌ కేటగిరీ భద్రత ఉందని అన్నారు. దీనితో స్మృతి ఇరానీ కూడా జోక్యం చేసుకున్నారు. తనకు జడ్ కేటగిరి భద్రత లేదని వివరణనిచ్చారు. తన భద్రత గురించి ఎక్కువగా ఆలోచించడం మాని ఎవరి పనులు వారు చూసుకోవాలంటూ స్మృతి పేర్కొన్నారు. మీకు జెడ్‌ కేటగిరీ భద్రత లేకపోయినా అసలు సెక్యూరిటీ లేకుండా ఉండదు కదా అని ప్రియాంక పేర్కొనగా.. నా భద్రత గురించి ఎందుకు ఆరా తీస్తున్నావు? ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అని స్మృతి వ్యంగ్యంగా ప్రశ్నించారు. వెంటనే ప్రియాంక బదులిచ్చారు.. నాకు అంత తీరిక లేదు. మీరేం భయపడకండి. ఎప్పటిలాగే క్యాంపస్‌లలో రచ్చ చేయడంపై దృష్టి పెట్టండని చురకలంటించారు. అంతే ఘాటుగా స్మృతి కౌంటర్‌ ఇచ్చారు. అది మీ రాహుల్‌గాంధీ విశిష్టత. అసోంలో ఓడిపోవడం కూడా ఆయన ఘనతేనంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రియాంక బదులిస్తూ మీరు ఓడిపోయినప్పటికీ కేబినెట్‌ మంత్రి కాలేదా అని కౌంటర్‌ ఇచ్చారు. ఈ వాగ్వాదం కొద్దిసేపు వేడెక్కించిందనే చెప్పాలి. 

నీట్ పై వివరణ కోరిన రాష్ట్రపతి..

ఢిల్లీ : నీట్ ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివరణ కోరారు. సోమవారం రాష్ట్రపతి నివాసంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రపతిని కలిశారు. నీట్ పై ఆర్డినెన్స్ తీసుకరావాల్సిన అవశ్యకతను రాష్ట్రపతికి వివరించారు. నీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్రాలకు ఈ ఏడాది మినహాయింపు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 

మహారాష్ట్రలో లొంగిపోయిన ముగ్గురు నక్సలైట్లు..

మహారాష్ట్ర : గడ్చిరౌలి పోలీసుల ఎదుట ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ. 12 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళలున్నారు. 

14:37 - May 23, 2016

అవికా గోర్..చిన్నారి పెళ్లి కూతురుతో గుర్తింపు పొందింది. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ సినిమాల్లో నటించింది. యంగ్ హీరో 'రాజ్ తరుణ్' తో రెండు వరుస హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. తాజాగా ఓ యువహీరోతో జత కట్టనున్నట్లు గుసగుసలాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే 'అవికా గోర్' కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ గా ఈ ఫెస్టివల్ లో పాల్గొంది. ఆంకీ బాత్ అనే షార్ట్ ఫిల్మ్ ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు వెళ్లింది. నీలి రంగు గౌనులో కెమెరాకు ఫోజులిచ్చింది. బాలీవుడ్ హీరోలతో కూడా ఫొటోలకు ఫోజులిచ్చిందంట.

14:28 - May 23, 2016

బాలీవుడ్ లో హీరోలు..దర్శకులు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి నటుల్లో 'అక్షయ్ కుమార్' ఒకరు. కానీ ప్రస్తుతం ఈయన చేస్తున్న పాత్రపై చర్చ జరుగుతోందంట. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న 'డిష్యుం' సినిమాలో అయన 'గే' పాత్రలో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అబుదాబీ లో జరుగుతున్న షూటింగ్ లో వరుణ్ ధావన్, జాన్ అబ్రహంతో కలసి నటించనున్నాడని తెలుస్తోంది. 'గే' పాత్రలో స్కట్ ధరించి అక్షయ్ కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ తో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ దక్కించుకున్న ఈ మాస్ హీరో గే పాత్రలో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాల్సిందే. 

రాష్ట్రపతితో కేంద్ర మంత్రి నడ్డా భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రపతి నివాసానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. నీట్‌పై ఆర్డినెన్స్ కు సంబంధించి వివరణ ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ప్రణబ్ న్యాయ సలహా కోరిన సంగతి తెలిసిందే. 

బస్తర్ లో ఒక మావోయిస్టు మృతి..

ఛత్తీస్ గఢ్ : బస్తర్ అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫారెస్టు అధికారులు జరిపిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. 

14:05 - May 23, 2016

కరీంనగర్: ఉన్నత చదువులు  చదివి, ఉన్న ఊరిని, కన్న వారిని వదిలి  ఉపాధి  కోసం  రాజస్తాన్  వెళ్ళిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు.. ఇంటికి  'వస్తున్నాను' అని చెప్పి వారం రోజులు గడిచిన నేటికి   ఇంటికి చేరుకోలేదు.  దీంతో ఈ సంఘటన ఆ గ్రామంలో  కలకలం రేపుతోంది.  వివరాల్లోకి వెళితే.. కుటుంబీకులు తెలిపిన సమాచారం ప్రకారం...  
కరీంనగర్  జిల్లా మెట్ పల్లి మండల జగ్గాసాగర్ కు చెందిన పిడుగు రమేష్ రెడ్డి అనే యువకుడు గత రెండు సంవత్సరాల నుండి రాజస్తాన్ రాజదాని జైపూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాది చేస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం ఇంటికి    వస్తునట్లు కుటుంబీకులకు ఫోన్ ద్వార తెలియ చేసాడు.. కాని నేటికి  రమేష్ ఇంటికి  చేరుకోక పోవడం తో తల్లిదండ్రులు అందోళన కు గురైయ్యారు.. ఫోన్ చేసిన అందుబాటులోకి రాకపోవడం తో ఆ కంపెనీ నిర్వాహకుల ను కుటుంబీకులు ఆరాదీసారు. దీంతో ఆ నిర్వాహకులు,  రమేష్  ఉంటున్న రూం కి వెళ్లి చూడగా అతను  వాడుతున్న ఫోను, లాప్ టాప్ కనిపించినట్లు తెలిపారు. అనంతరం  యువకుని కోసం వెతికినా ఆచూకి తెలియకపోవడం తో ఆ కంపెనీ నిర్వాహకులు అక్కడి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు రమేష్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

14:01 - May 23, 2016

'నాని' వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ వరుస విజయాలతో యమ జోష్ మీద ఉన్నాడు. అష్టా చమ్మా చిత్రంతో హిట్ ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ప్రస్తుతం ఓ వైవిధ్యమైన చిత్రం 'జెంటిల్ మెన్" చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మొదలు టీజర్ వరకు ఈ చిత్రం పై చాలా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేశారు. నాని ఈ చిత్రంలో హీరోగా విలన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పటిలాగే సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తున్న నాని ఈ చిత్రంతో కూడా కొత్తగా ఎదో ట్రై చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నాని ఈ ట్రైలర్ తో సినిమాపై భారీగానే అంచనాలు క్రియేట్ చేశాడు. నాని సరసన ఈ చిత్రంలో మలయాళ భామ థామస్ నివేద, సురభి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోందంట. మరి ఈ చిత్రంలో నాని విలన్ ? హీరోనా ? అనేది తెలియాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాలి. 

13:59 - May 23, 2016

మెదక్ : మల్లన్నసాగర్ సదస్సులు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పాల్గొని బాధిత కుటుంబాలకు న్యాయసలహాలు ఇచ్చారు.  గ్రామస్థులు ఐక్యంగా న్యాయపోరాటం చేస్తే ప్రాజెక్టు వచ్చే ప్రసక్తే ఉండదంటున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్‌ పేర్కొన్నారు. భూమి సేకరణకు ఎక్స్ పర్ట్ కమిటీ వేసి భూములు తీసుకోవాల్సిన అవసరముందా లేదా అనే విషయాన్ని కమిటీ తీర్మానం చేయకుండా నేరుగా భూమిని తీసుకునే హక్కు లేదన్నారు. చట్టప్రకారం తీసుకున్న భూమికి బదులుగా రైతులకు సాగుభూమి ఇవ్వాలని తెలిపారు. గ్రామ పంచాయితీ తీర్మానం ప్రకారం 75 శాతం రైతులు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. చట్టవిరుద్ధమంగా భూసేకరణ జరుపుతున్నారని ముంపు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

13:51 - May 23, 2016

ఎవరికైనా లక్ లేదా కిక్ ఉంటేనే మజా ఉంటుంది. మరి ఈ రెండూ ఉంటే ఆ క్రేజే వేరే. ప్రస్తుతం పరువపు తారలు నయనతార, అనుష్క, త్రిష, కాజల్‌ అగర్వాల్ మొదలగు నలుగురు వృత్తి పరంగా అలాంటి జోష్‌లోనే ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా కథానాయికల పరిధి పరిమితం అంటుంటారు. 18, 20 ఏళ్ల వయసులో నటీమణులు సినీ రంగప్రవేశం చేస్తుంటారు. వాళ్లలో చాలా మందికి నటిగా నిలదొక్కుకోవడానికే చాలా కాలం పడుతుంది. ఆ తరువాత విజయం వరించినా ఓ ఐదారేళ్లు దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అప్పటికి 25 ఏళ్ల వయసు మీద పడుతుంది. ఈలోగా కొత్తవాళ్లు రెడీ అవుతుంటారు. దీంతో సీనియర్లు కొందరు తెరమరుగవడం, మరి కొందరు అక్క, వదిన లాంటి పాత్రకు పరిమితం అవడం జరుగుతుంటుంది. అదీ దాటి 30 ఏళ్ల వరకూ హీరోయిన్లుగా నిలబడగలిగారంటే వారిది పెద్ద సాధనే అవుతుంది. 30 దాటినా కథానాయికలుగా మన్ననలు పొందుతున్నారంటే కచ్చితంగా వారు అదృష్టవంతులే. అలాంటి లక్కే మూడు పదులు దాటినా ముద్దుగుమ్మలు నయనతార,అనుష్క,త్రిష, కాజల్‌అగర్వాల్‌లను ఇప్పటికీ అగ్ర నాయికలుగా నిలబెట్టింది. వీరు వ్యక్తిగత ఒడిదుడుకులకు లోనైనా ఆ ప్రభావాన్ని కెరీర్‌పై చూపలేదంటే అదీ అదృష్టమే.

అనుష్క కోసమే కథలు..
ఇక యోగా టీచర్ అనుష్క గురించి చెప్పాలంటే తన కోసమే కథలు రాసే స్థాయికి చేరుకున్నారు.అరుంధతి చిత్రంలో అభినయంతో ఆడుకున్న అనుష్క ఫెరోషియస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. చారిత్రక కథా చిత్రాల్లో నటించాలంటే అనుష్కనే అన్నంతగా పేరు తెచుచకున్నారు. గత ఏడాది బాహుబలి, రుద్రమదేవి వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటించారు. విశేషం ఏమిటంటే ఈ మూడూ ద్విభాషా చిత్రాలే. బాహుబలి,రుద్రమదేవి చిత్రాలు 100 కోట్ల క్లబ్‌లో చేరడం మరో విశేషం.34 ఏళ్ల ఈ పరువాల గుమ్మ ప్రస్తుతం బాహుబలి-2,ఎస్-3 చిత్రాలలో నటిస్తూ మేటి నటిగా తన స్థానాన్ని పదిల పరుచుకుంటున్నారు.

కాజల్ లక్కీనే..
నటి కాజల్‌ అగర్వాల్‌ను అదృష్టం విడనాడలేదు. మధ్యలో కాస్త తడబడినా మళ్లీ గాడిలో పడ్డారు. తెలుగు చిత్రం మగధీర ఈమెను ప్రముఖ నటీమణుల జాబితాలో చేర్చింది. అప్పటి నుంచి తన స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తోంది. కాజల్ వయసు 30 దాటింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలోనూ ఐదు చిత్రాలు ఉన్నాయి. తమిళంలో జీవా సరసన కవలై వేండామ్,విక్రమ్‌తో గరుడ,తదితర చిత్రాలతో పాటు తెలుగులో మహేశ్‌బాబుకు జంటగా బ్రహ్మోత్సవం,పవన్‌కల్యాణ్‌తో సర్ధార్ గబ్బర్‌సింగ్, హిందీలో ఒక చిత్రం అంటూ మయ బిజీగా ఉన్నారు కాజల్‌అగర్వాల్. స్టార్ హీరోలు వర్ధమాన నాయకులతో నటించడానికి ఇష్ట పడకపోవడంతో ఈ సీనియర్ హీరోయిన్లు ఇంకా రాణించడానికి ఒక కారణం అని భావించవచ్చంటున్నారు సినీ పండితులు.

ఎవర్‌గ్రీన్ త్రిష..
నటి త్రిష కూడా మూడు పదుల వయసును మీదేసుకున్న నటే.అయితే నటిగా ప్రారంభ దశలో ఎలా ఉన్నారో అంతే వన్నె తగ్గని అందాలతో నేటికీ విరాజిల్లుతూ ఎవర్‌గ్రీన్ నాయకిగా వెలుగొందుతున్నారు. ఈ చెన్నై చిన్నదాని క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అవకాశాలు వస్తూనే ఉన్నాయి. త్రిష ప్రస్తుతం నాయకి అనే ద్విభాషా చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

అగ్రస్థానం నయనదే..
మూడు పదుల వయసు. రెండు సార్లు ప్రేమలో విఫలం. సినిమాలకు ఏడాదికి పైగా దూరం. హీరోయిన్‌గా రీఎంట్రీ. అయినా అగ్ర స్థానం మలయాళీ భామ నయనతారదే.  చేతినిండా చిత్రాలు. మూడు కోట్ల వరకూ పారితోషికం ఎదగడమే కానీ తరగని క్రేజ్. స్టార్ హీరోల నుంచీ యువ హీరోల వరకూ జత కట్టాలని కోరుకుంటున్నారు. ఇదీ నయన్ హవా. తమిళంతో పాటు తెలుగులోనూ కొనసాగుతుండటం గమనార్హం. ఈ ఏడాది జీవాతో తిరునాళ్, శింబుతో ఇదునమ్మఆళు, కార్తీకి జంటగా కాస్మోరా, విక్రమ్ సరసన ఇరుముగన్ అంటూ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు తెలుగులో వెంకటేశ్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. చిరంజీవి సరసన కూడా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది.

13:49 - May 23, 2016

మొన్నటి వరకు మన తెలుగు హీరోల ఆలోచనలన్నీ లోకల్ గానే ఉండేవి. టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తే చాలు అనుకునేవారు. మనకు తెలుగు పరిశ్రమ ఒక్కటి చాలులే అని సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కేవలం తెలుగులోనే సినిమాను రిలీజ్ చేస్తే లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో కూడా మార్కెట్ పెంచుకుంటేనే హీరోగా ఓ స్థాయిలో నిలబడే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మన స్టార్ హీరోలంతా రూటు మార్చారు. కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా పరాయి రాష్ట్రంలో ఉన్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కూడా కథలు ఎంపిక చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా బేస్ ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.

అందరికంటే ముందున్న బన్నీ..
ఈ దిశగా అల్లు అర్జున్ అందరికంటే ముందున్నాడు. అదృష్టం కొద్దీ బన్నీకి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తమిళనాట కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా షురూ చేశాడు. ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకేసారి విడుదలవుతుంది కూడా. ఈ మూవీతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్వింగ్ లోకి రాలనుకుంటున్నాడు బన్నీ. అటు మహేష్ కూడా పొరుగు రాష్ట్రాలపై కన్నేశాడు. ఇన్నాళ్లు లోకల్, ఓవర్సీస్ ఉంటే చాలనుకున్న ప్రిన్స్… ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాడు. అందుకే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో మహేష్ మార్కెట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు తెలియకుండానే వీళ్లిద్దరికంటే ముందే ప్రభాస్ తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు. బాహుబలి-2తో మరోసారి ఇండియా లెవెల్లో రఫ్ఫాడించబోతున్నాడు. వీళ్లతోపాటు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడిప్పుడే బయట రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నారు. పవన్ తొలిసారిగా తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో కూడా విడుదల చేశాడు. అటు చెర్రీ కూడా ఇకపై తన సినిమాల్ని తమిళ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇలా హీరోలంతా మార్కెట్ పెంచుకోవడంపై సీరియస్ గానే దృష్టిపెట్టారు.

ఈతకెళ్లి నలుగురు చిన్నారుల మృతి..

కర్నూలు : చెరువులో ఈతకెళ్లిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన కోసిగిలో చోటు చేసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

ఎమ్మెల్సీ పదవికి తుమ్మల రాజీనామా..

హైదరాబాద్ : శాసనమండలి సభ్యత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాజీనామా చేశారు. తుమ్మల రాజీనామాను మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆమోదించారు. పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల 45 వేల మెజార్టీతో గెలిచిన విషయం విదితమే. ఈ నెల 26న ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తుమ్మల రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇరాన్ అధ్యక్షుడితో మోడీ భేటీ..

ఇరాన్ : అధ్యక్షుడు హసన్ రౌహానీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతకంటే ముందు టెహ్రాన్‌లో మోడీకి హసన్ రౌహానీ అధికారికంగా స్వాగతం పలికారు. 

13:42 - May 23, 2016

ఢిల్లీ : థాయ్ లాండ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో 17మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు.. పేదలకోసం ఏర్పాటుచేసిన ఓ వసతి గృహంలో మంటలు అంటుకున్నాయి.. ఇవి వేగంగా వ్యాపించడంతో 17మంది విద్యార్థులు కాలిబూడిదయ్యారు.. మరో ఐదుగురు గాయపడ్డారు.. వీరి పరిస్థితి విషమంగా ఉంది.. విద్యార్థులంతా 12 ఏళ్లలోపువారేనని అధికారులు తెలిపారు.. ప్రమాద సమయంలో ఈ హాస్టల్‌లో 38మంది స్టుడెంట్స్ ఉన్నారు.

మన్సూర్ మృతిని ధృవీకరించిన ఒబామా..

అమెరికా : తాలిబన్ అధినేత ముల్లా మన్సూర్ మృతిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం అధికారికంగా ధృవీకరించారు. అప్ఘన్ ప్రజలకు శాంతిభద్రతలు అందించడానికి తాము చేపట్టిన ప్రయత్నాల్లో మన్సూర్ మృతి ఓ మైలురాయి అంటూ అభివర్ణించారు. 

13:38 - May 23, 2016

విజయనగరం : సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. ఆలుబిల్లి సూర్యనారాయణ అనే వ్యక్తి డ్రండ్‌ అండ్‌ డ్రైవ్ కేసులో ఈ నెల 19 న రిమాండ్‌ ఖైదీగా సబ‌్ జైలుకు వచ్చాడు. మరుసటి రోజు అనారోగ్యంతో బాధపడుతుండగా సూర్యనారాయణను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సూర్యనారాయణ చనిపోవడంతో సబ్ జైల్  సూపరింటెండెంట్ గణేష్ పై అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట అప్పారావు తెలిపారు. 

సీఎం జయ ప్రమాణం..కీలక నిర్ణయాలు..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం దుకాణాలు మధ్యాహ్నం 12 నుండి తెరవాలని రాత్రి పది గంటలకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే 500 లిక్కర్ దుకాణాలపై నిషేధం విధించారు. 100 యూనిట్ల వరకు ఉపయోగించే గృహాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రవేశపెట్టారు. 

13:34 - May 23, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య మధ్యాహ్నం 12 గంటలకు జయతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు. జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల్లో పన్నీర్‌ సెల్వం కూడా ప్రమాణం చేశారు. ఆయనకు జయ మళ్లీ ఆర్థికశాఖను అప్పగించారు. మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ గద్దెనెక్కడం ఇది ఆరోసారి.

13:32 - May 23, 2016

జమ్ముకశ్మీర్‌ :  ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. శ్రీనగర్‌లో రెండు గంటల్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. టెంగపూర్‌లో ఓ జవాను మృతి చెందగా, మరో ఇద్దరు జడిబాల్‌లో ఉగ్రదాడికి బలయ్యారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు ఆపరేషన్‌ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

శాసనమండలి మంత్రి తుమ్మల రాజీనామా...

హైదరాబాద్ : శాసనమండలి సభ్యత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాజీనామా చేశారు. రాజీనామాను మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆమోదించారు. ఈ నెల 26న ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల 45 వేల మెజార్టీతో గెలిచిన విషయం విదితమే.

శ్రీనగర్ లో రెండోసారి ఉగ్రదాడి..

శ్రీనగర్ : మరోసారి ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈసారి సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేశారు. తంకిపోర లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం పీఎస్ పై దాడి జరిపిన ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

12:38 - May 23, 2016

విజయవాడ : ఏపీ కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రఘువీరా, కేవీపీ మాట్లాడారు. రాష్ట్రంలో కరవు విలయతాండం చేస్తోందన్నారు. గుక్కెడు నీళ్ళకోసం మైళ్ల తరబడి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విభజన చట్టంలో వున్న అంశాలు అమలు కాకపోతే ఏపీ ప్రజలు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన వస్తుందని నేతల పేర్కొన్నారు. కాగా ర్నాలో పాల్గొనటానికి తెనాలి నుండి విజయవాడ వెళ్తున్న ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

ఆయుష్ ఆస్పత్రులపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష....

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆయుష్ ఆస్పత్రుల బలోపేతంపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్ధంగా ఉన్న 20 పడకల ఆయుష్ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. అలోపతి వైద్యానికి ధీటుగా ఆయుష్ వైద్య సేవలు ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయుష్ ఆస్పత్రులు నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఆయుష్ ఆస్పత్రుల భవనాలకు నమూన రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

'కబాలి' ఖాతాలో మరో రికార్డు....

హైదరాబాద్‌: రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కబాలి’ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి పడింది. ఇటీవల విడుదల చేసిన సినిమా టీజర్‌ ఆన్‌లైన్‌లో రికార్డులు సృష్టించిందో తెలిసిందే . దీంతో ‘కబాలి’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే పలు భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేస్తున్నారు. కాగా మలేషియాలో తమిళ చిత్రాలకు  మంచి ఆదరణ వుంటుంది.  దీనిని దృష్టిలో పెట్టుకుని ‘కబాలి’ని మలయ్‌( మలేషియా బాష)లోకి అనువదిస్తున్నారు. దీంతో మలయ్‌ బాషలోకి డబ్‌ అయిన తొలి తమిళ చిత్రంగా కబాలి రికార్డు సృష్టించింది.

మాజీ స్పీకర్ హౌస్ అరెస్ట్....

గుంటూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఏపీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని... ఆయన నివాసంలో నిర్బంధించారు.

సీఎంగా జయ ప్రమాణం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ హాల్ లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. గవర్నర్ రోశయ్య..జయతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

12:07 - May 23, 2016

ఈ మధ్య కాలంలో 'అల్లరి నరేష్' సినిమాలు కాస్తంత నెమ్మదించాయి. గత నాలుగైదేళ్లుగా ఏడాదికి మినిమం ఏడెనిమిది సినిమాలకు తగ్గకుండా ఇతడి సినిమాలు వచ్చేవి. అయితే ఇతడి సినిమాలు ఈ మధ్య కాలంలో ఒకదాని మీద ఒకటి విడుదల కావడం లేదు. ప్రస్తుతం కథలు రెడీగా ఉన్నాయని, పాత్రల ఎంపిక కోసం ఆలస్యమౌతోందని అల్లరి నరేష్ టెన్ టివితో పేర్కొన్నారు. తాను నటించబోయే చిత్రాల విషయాలను ఆయన వివరించారు. తాను 'సెల్ఫీ' అనే చిత్రంలో నటించడం జరుగుతోందని, సెల్ఫీలు తీసుకుంటే ఇతర కుటుంబాల వారు సమస్యల్లో పడుతుంటారని పేర్కొన్నారు. ఆ పాత్రకు నోటి దురుసుతో పాటు సెల్ఫీల పిచ్చి ఉంటుందని తెలిపారు. ఈసినిమాలో కొత్త నటి కామ్నా, సాక్షి చౌదరిలు నటిస్తున్నారని తెలిపారు. రెండు మూడు స్రిప్ట్ ఉన్నాయని, పాత్రల ఎంపిక జరగాల్సి ఉందన్నారు. హర్రర్ నేపథ్యంలో నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జూన్ రెండో వారంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమౌతుందన్నారు. మొత్తంగా తెలుగులో మూడు ప్రాజెక్టులు, తమిళంలో ఒక సినిమా ఉందని 'అల్లరి నరేష్' పేర్కొన్నారు. 

12:02 - May 23, 2016

సినిమాలు తొందర తొందరగా చేయడంలో ఆసక్తి లేదని అల్లరి నరేష్ పేర్కొన్నారు. తాను గతంలో కొన్ని ప్రయోగాలు చేసినా ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. తాను పోషించిన 'లడ్డూ బాబు' పాత్రను మరోసారి చేయాలని ఉందని, ఏదైనా చిత్రంలో చిన్న పాత్రగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. వివాహం అనంతరం కొద్దిగా గ్యాప్ తీసుకోవడం జరిగిందని, ఇంట్రెస్ట్ కథలపై దృష్టిపై సారించడం జరిగిందన్నారు. ఆయన ఇప్పటి వరకు 50 సినిమాలు పూర్తి చేశారు. ఈసందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. 2008 సంవత్సరంలో 8 సినిమాలు విడుదలయ్యాయని దీనికి ఒక కారణం ఉందని తెలిపారు. కొన్ని కారణాల వల్ల 2007లో రిలీజ్ కావాల్సిన సినిమాలు 2008లో విడుదలయ్యాయని తెలిపారు. 

12:01 - May 23, 2016

హైదరాబాద్ : ఆదివాసులు, దళితులు,మైనార్టీల కోసం తాను ఇకనుంచి మరింతగా పోరాటం చేస్తానని ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న తనను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో తాను జైల్లో ఉండటం బాధకలిగించిందని చెప్పారు. సీమాంధ్రలో పుట్టినా, తెలంగాణ బిడ్డగా ఉండటానికే ఇష్టపడతానని తెలిపారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీలను అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

12:00 - May 23, 2016

అల్లరి నరేష్..కామెడీ పండించడంలో దిట్ట. 'అల్లరి' అనే చిత్రంతో చలన చిత్ర రంగ ప్రవేశం చేయడం వల్ల తెలుగు ప్రజలకు 'అల్లరి నరేష్'గా సుపరిచితుడు. ఆయన వివాహం చేసుకుని ఒక సంవత్సరం పూర్తయ్యింది. తాను కామెడీ పాత్రలే కాక సీరియస్ పాత్రలు కూడా చేయాలని తన సతీమణి పేర్కొంటూ ఉంటుందని 'అల్లరి నరేష్' టెన్ టివికి తెలిపారు. గమ్యం, నేను, శంభో శివ శంభో తరహా పాత్రలు చేయాలని అభిప్రాయం వెల్లడిస్తుందని తెలిపారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

11:55 - May 23, 2016

విజయవాడ : విజయవాడలో ఉద్యానవన ప్రదర్శనలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సరంద్భంగా మాట్లాడుతూ...రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడిఉందని స్పష్టం చేశారు. త్వరలో రైతులకు ఉచితంగా 15లక్షల పంపుసెట్లను అందజేస్తామని ప్రకటించారు. ఈ పంపుసెట్లవల్ల 33శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని తెలిపారు.. సెల్‌ఫోన్‌ ద్వారా ఈ మోటార్లను ఇంటిదగ్గరుండే ఆపరేట్‌ చేసుకోవచ్చని సూచించారు.

11:48 - May 23, 2016

హైదరాబాద్ : సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ తెలంగాణ సచివాలయానికి వచ్చారు. అక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దత్తత తీసుకున్న సిద్దాపురం గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రితో చర్చించారు. మహేష్‌బాబు చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను..ఖర్చు చేయనున్న నిధుల వివరాలను ఆమె మంత్రికి వివరించారు. 

11:44 - May 23, 2016

హైదరాబాద్ :  'రోను' వాయుగుండం ప్రభావంంతో ఆంధ్రాతో పాటు తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురిసాయి. మార్తాండుడి మంటల నుండి కాస్తంత సేదదీరిన తెలంగాణా ప్రజలకు భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. భానుడి భగభగలతో రాష్ట్రమంతా ఉడికిపోతోంది.. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఆదివారం అత్యధికంగా రామగుండంలో 46.2 డిగ్రీలు, భద్రాచలం, ఆదిలాబాద్‌లో 45, ఖమ్మంలో 44, హైదరాబాద్‌లో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో మరో రెండు డిగ్రీలవరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు అంచనావేస్తున్నారు... తెలంగాణ మీదుగా విదర్భ వైపు పొడిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ బాగా తగ్గి వడగాలులుగా మారుతున్నాయి.

ముగ్గురు ప్రాణాలు తీసిన ప్రాణహిత....

ఆదిలాబాద్: జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నదిలో పడవ బోల్తాపడింది. ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు.

జూరాలలో కృష్ణమ్మ గలగలలు....

మహబూబ్‌నగర్ : జూరాలలో కృష్ణమ్మ గలగల ప్రవహిస్తోంది. కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు 0.5 టీఎంసీల కృష్ణా జలాలు చేరాయి. నీటిని విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జలాలను జిల్లా తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటక ఇరిగేషన్ మంత్రికి తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని హరీష్‌రావు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.

11:29 - May 23, 2016

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమం చేస్తున్న ముద్రగడ మరోసారి సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు..పలు విమర్శలు గుప్పించారు. కాపులను బీసీలో చేర్చే చర్యలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేద కాపులకు రుణాల మంజూరు గురించి ఆలోచించారా ? అని ప్రశ్నించారు. చంద్రన్న కానుకలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఆస్తి వివరాలు ఇచ్చినట్లుగా పేర్లు ఏంటనీ ప్రశ్నించారు. మరి ముద్రగడ లేఖపై ప్రభుత్వం..టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

బాబుకు ముద్రగడ మరో లేఖ..

విజయవాడ : సీఎం చంద్రబాబుకు ముద్రగడ మరో లేఖ సంధించారు. కాపులను బీసీలో చేర్చే చర్యలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేద కాపులకు రుణాల మంజూరు గురించి ఆలోచించారా ?అని ప్రశ్నించారు. చంద్రన్న కానుకలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఆస్తి వివరాలు ఇచ్చినట్లుగా పేర్లు ఏంటనీ ప్రశ్నించారు. 

11:19 - May 23, 2016

కర్నూలు : కోసిగి మండలం బొమ్మనాపూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీఎస్ ఎత్తు పెంపును నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేపట్టింది. సోమవారం ఉదయం ఆ పార్టీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి రైతులతో ఆర్డీఎస్ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ నిర్మాణం ఆధునీకరణ పనులను చేపట్టాలని ఇటీవలే కర్నాటకను తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాణం వద్ద పనులు జరుగుతున్నాయి. దీంతో ఆర్డీఎస్ ఎత్తు పెంచితే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆదివారం టీడీపీ నేత తిక్కారెడ్డి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కాగా సోమవారం వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏపీలో విపక్షాలు చేపడుతున్న ఆందోళనపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

శ్రీనగర్ లో ఉగ్రదాడి..ఇద్దరు పోలీసుల మృతి..

శ్రీనగర్ : జదిబాల్ పీఎస్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఎస్ఐ నజీర్ అహ్మద్, కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ లు వీరమరణం పొందారు. 

బాబు అధ్యక్షతన పార్టీ తీర్మానాల కమిటీ సమావేశం..

గుంటూరు : విజయవాడలో సాయంత్రం 5.30గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ తీర్మానాల కమిటీ సమావేశం జరగనుంది. మహానాడులో చేయాల్సిన తీర్మానాలపై చర్చించనున్నారు. ఏపీకి సంబంధించి 11, తెలంగాణకు సంబంధించి 11 అంశాలపై ముసాయిదాలపై తీర్మానాలను సిద్ధం చేయనున్నారు. 

మంత్రి జూపల్లిని కలిసిన ప్రిన్స్ సతీమణి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో సినీ నటుడు మహేష్ సతీమణి నమ్రత భేటీ అయ్యారు. దత్తత తీసుకున్న గ్రామం సిద్ధాపురంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. 

అణువిద్యుత్ ప్రాజెక్టు సర్వే..అడ్డుకున్న గ్రామస్తులు..

శ్రీకాకుళం : రణస్థలం (మం) కోటపాలెంలో అణువిద్యుత్ ప్రాజెక్టు కోసం అధికారులు సర్వే చేపట్టారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. 

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా..

ఆదిలాబాద్ : కౌటాల (మం) తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిలో నాటుపడవ బోల్తా పడింది. ఈఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. వీరు మంచిర్యాల వాసులని తెలుస్తోంది. 

ఆర్డీఎస్ పెంపుపై వైసీపీ ధర్నా..

కర్నూలు : జిల్లా కోసిగి మండలం బొమ్మనాపూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీఎస్ ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్ ఆర్సీపీ ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రైతులతో కలసి వచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. 

టి.ప్రాజెక్టులపై ఏపీ కాంగ్రెస్ ధర్నా...

విజయవాడ : తెలంగాణ ప్రాజెక్టులకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కృష్టా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేవీపీ, కిల్లి, కోట్ల, దేవినేని నెహ్రూ పాల్గొన్నారు.

టిప్పర్ ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి....

హైదరాబాద్ : సోమవారం నేరేడ్ మెంట్ క్రాస్ రోడ్డులో టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్ అయిన తోరం రామకృష్ణ (65) గా గుర్తించారు. కాప్రా నుంచి తన బైక్‌పై సికింద్రాబాద్ వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన జీహెచ్‌ఎంసీ టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఏడు పాయల్లో భక్తుల రద్దీ...

మెదక్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులు ఏడుపాయల్లోని వివిధ మడుగుల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో నిల్చొని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ సిబ్బంది సేవలందించగా వేద బ్రాహ్మణులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, తలనీలా లు, సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మద్యం మత్తులో భర్తను హత్య చేసిన భార్య...

హైదరాబాద్ : మద్యం మత్తుకు నిండు ప్రాణాలు బలి అయిపోతున్నాయి. రక్త సంబంధాలను, పవిత్రమైన వివాహబంధాన్ని కూడా మద్యం మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. నగరంలోని చింతల్ బస్తీలో భర్త వెంకటేష్ ను భార్య సుగుణ భర్తను హత్య చేసింది. ఇరువురి కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆవేశంలో భర్త హత్య చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మహబూబ్ నగర్ ఫస్ట్..వరంగల్ లాస్ట్....

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ పన్నుల వసూళ్లలో మహబూబ్‌నగర్‌ జిల్లా 94 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం రూ.306 కోట్లు పంచాయతీ పన్నులు వసూలయ్యాయి. అది 71 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో 3766 గ్రామ పంచాయతీలు వంద శాతం పన్నులు చెల్లించాయి. వరంగల్‌జిల్లా 47 శాతం వసూళ్లతో అట్టడుగున నిలిచింది. అక్కడ 50 పంచాయతీల్లో 100 శాతం పన్నులను వసూలు చేయగలిగారు. రంగారెడ్డి జిల్లాలో 33 పంచాయతీలలో 100శాతం పన్నులు వసూలయ్యాయి.

10:19 - May 23, 2016

సమంత...టాలీవుడ్, ఇతర వుడ్ లలో రాణిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకబోతుందనే సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే పెళ్లిపై సమంత పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. తన మనస్సు పెళ్లిపై మళ్లుతోందని..త్వరలో పెళ్లి చేసుకబోతున్నట్లు వెల్లడించింది. ఓ యూత్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు, ఇందుకు పెద్దలు కూడా సుముఖం వ్యక్తం చేశారని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఇప్పుడు ఆ హీరో ఎవరు అనే దానిపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అతను తనకు ఎప్పటి నుండో పరిచయం అట. గతంలో తనతో నటించి కూడానట. మరి ఇంతకీ సమంతను పెళ్లి చేసుకబోయేది ఎవరు ? 
రానా, శ్రీను, నాగ చైత్య, నితిన్ వీరిలో సమంత లవర్ ఉన్నాడా ? 

చంద్రబాబు అస్సోం వెళ్ళనున్నారు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 24న అస్సోం వెళ్ళనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా శర్బానంద సోనోవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొంటారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని చంద్రబాబుకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, శర్బానంద సోనోవాల్‌ ఆహ్వానం పలికారు.

ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా...

విజయవాడ : ఈ నెల 26న నిర్వహించాల్సిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. దీన్ని వచ్చేనెల 1వతేదీ నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 24, 25 తేదీల్లో నిర్వహించాల్సిన కలెక్టర్ల సమావేశాన్ని కూడా 25, 26 తేదీల్లో చేపట్టాలని ఆదివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

రూపా గంగూలీపై తృణముల్ దాడి.....

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా సమీపంలో నిన్న బీజేపీ మహిళా నేత, నటి రూపా గంగూలీపై దాడి జరిగింది. విజయ గర్వంతో రెచ్చిపోయిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి దిగారని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. దాడి సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా, తమను పట్టించుకోలేదని ఆమె వాపోయారు . దాడి అనంతరం పోలీసులు ఆమెతో పాటు ఆమె అనుచరులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి నారాయణ అభినందనలు..

విజయవాడ : పునర్ వినియోగ రాకెట్ ఆర్ఎల్వీడీ - టీడీ పరీక్ష విజయంపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందలు తెలిపారు. అంతరిక్ష ప్రయోగంలో ఇది ఒక మైలురాయని, శ్రీహరికోట దేశానికే తలమానికమని అభివర్ణించారు. 

కర్ణాటక సర్కార్ కు మంత్రి హరీష్ కృతజ్ఞతలు..

హైదరాబాద్ : నారాయణపూర్ నుండి జూరాలకు 0.5 టీఎంసీ నీళ్లు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. 

శ్రీవారి సేవలో ప్రముఖులు...

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తితిదే బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు, ఏపీ డీజీపీ జేవీ రాముడు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి... తీర్థ ప్రసాదాలు అందజేశారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : ఈ వారం దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి.

09:55 - May 23, 2016

కండల వీరుడు సల్మాన్‌, లియో వంటుర్‌ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు బాలీవుడ్‌లో తెగ ప్రచారమవుతున్నాయి. సల్మాన్‌ ఎక్కడైనా కన్పిస్తే చాలు విలేకరులు అదే ప్రశ్న వేస్తున్నారు. ఇటీవల ఆయన సోదరుడిని ఇదే ప్రశ్న వేశారు. ఆయన ఏం సమాధానం చెప్పకుండా దాటవేశాడు. లులియా వంటుర్, సల్మాన్‌ కలసి ఫంక్షన్లకు హాజరుకావడం, కండల వీరుడి కుటుంబంతో కలసి డిన్నర్‌ చేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీతిజంటా వివాహ రిసెప్షన్‌ ఫంక్షన్‌కు ఈమెతో కలసి ఒకే కారులో రావడం దగ్గర నుంచి ఈ ప్రచారం మరింతగా పెరిగింది. ఇటీవల ఎయిర్‌పోర్టులో సల్మాన్‌ కుటుంబంతో కలసి లులియా వంటుర్ రావడం కూడా మరో కారణం. సల్మాన్‌ దీనిపై శనివారం స్పందించారు. అది తన వ్యక్తిగతమని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానని చెప్పాడు. ఆదివారం లులియా స్పందించింది. ఈ రూమర్స్‌పై తొలిసారిగా మాట్లాడింది. తాను ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు తొందరపడడం లేదని ఈ ఏడాది ఆగి తర్వాతే దాని గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది. '' నాపై వస్తున్న రూమర్స్‌పై ఏవిధంగానూ స్పందించ దలుచుకోలేదు. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా చెబుతున్నా. పెళ్లి దుస్తులు ధరించడానికి నేనేం తొందర పడడం లేదు'' అని చెప్పింది.

09:49 - May 23, 2016

'అఖిల్‌ అక్కినేని' ఒకేసారి రెండు చిత్రాల్లో చేయనున్నట్టు తెలిసింది. తన మొదట చిత్రం 'అఖిల్‌' అంతగా ఆకట్టులేకపోయేసరికి తర్వాత చిత్రంపై దృష్టి సారించాడు. ఇటీవల వంశీ పైడిపల్లి తనతో సినిమా తీయడం లేదని మీడియాలో ప్రచారమైంది. దీనిపై అఖిల్‌ స్పందించాడు కూడా. వంశీ పైడిపల్లితో తాను సినిమా చేస్తున్నానని ఆ వివరాలు ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతానని ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. తనను సంప్రదించకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని సూచించాడు. ఈ సారి వంశీపైడిపల్లితో ఓ సినిమా, హను రాఘవపూడితో మరో చిత్రంలో అఖిల్‌ చేయనున్నట్టు సమాచారం. బాలీవుడ్‌ చిత్రం 'యే జవాని హైన్‌ దీవాని'ని రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

09:42 - May 23, 2016

సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్ గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్‌ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలను పాటిస్తే మచ్చలు పోవడమే కాదు.. చర్మం కొత్త మెరుపును సంతరించు కుంటుంది.
అర స్పూన్‌ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్‌ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ వదిలిపోతుంది.
చిటికెడు పసుపును రెండు మూడు గోరింటాకులతో కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.
కొంచెం పసుపు, కరివేపాకును కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై రాయాలి.
ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా కలుపుకోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్లలో చపాతీని నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని పేస్ట్‌లాగా చేసి ముఖానికి పట్టించండి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి.
కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తొందరగా మాయమవుతాయి.
మచ్చలను తొలగించడంలో సిట్రస్‌ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్‌ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్‌-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.
కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.
మచ్చలున్న ప్రదేశంలో తేనెను రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనెలో ఎన్నో చక్కటి ఔషధ గుణాలున్నాయి. అవి నల్లమచ్చలను తొలగించడంలో తోడ్పడతాయి.
విటమిన్‌-ఇ ఆయిల్‌ను రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసుకుని తెల్లారి లేచిన తర్వాత కడుక్కోండి.
వీటితోపాటు నిత్యం సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ముఖానికి రాసుకోవడం మర్చిపోవద్దు.

09:40 - May 23, 2016

బరువు తగ్గాలని, సన్న పడాలని చాలా మందికి ఉంటుంది. కానీ దానికి తగ్గ చిట్కాలు పాటించడంలో వస్తుంది చిక్కంతా! అసలు, బరువు తగ్గడానికి ఏ సమయం అనుకూలం? ఎలాంటి నియమాలు పాటించాలి?
బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేయడానికి 'తెల్లవారు జామునే' సరైన సమయం అంటున్నారు నిపుణులు. పొద్దున పూట రెగ్యులర్‌ గా నడక, వ్యాయామం, జాగింగ్‌ చేయడం వల్ల తప్పనిసరిగా బరువు తగ్గుతారు. అంతేకాదు, చాలామంది సన్నబడాలని నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. ఉదయం పూట నీళ్లెక్కువ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు, క్యాలరీలు ఎక్కువగా కరిగిపోతాయి. గ్రీన్‌ టీ కూడా పరగడుపున తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి. అందులో పంచదారకు బదులు తేనె వేసి తీసుకోవాలి. ఉదయం అల్పాహారం కింద టోస్ట్‌ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటప్పుడు దాని మీద యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేయాలి. యాలకుల్ని ఉదయాన్నే తినడం వల్ల వాటిలోని పోషకాలు అదనపు క్యాలరీలను కరిగించేందుకు దోహదపడతాయి. సూర్యకిరణాలు శరీరానికి విటమిన్‌ డి అందేలా చేస్తాయి. ఆ విటమిన్‌ కూడా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఆలస్యంగా లేవడం, ఎనిమిది గంటలకు మించి నిద్రపోవడం వంటివి సరికాదు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల జీవక్రియలు రేటు సక్రమంగా ఉంటుంది. ఉదయం పూట జాగింగ్‌ చేయడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. సన్నబడాలని అనుకునేవారు శారీరక శ్రమ చేస్తూనే, మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఎన్ని వ్యాయామాలు చేసినా ఉదయం అల్పాహారాన్ని పొట్ట నిండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు, గోధుమతో చేసిన పదార్థాలకి ప్రాధాన్యమివ్వాలి.

09:38 - May 23, 2016

ఢిల్లీ : రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌ రాజధాని టెహరాన్‌ చేరుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇవాళ ఇరాన్‌ అధ్యక్షడు హసన్‌ రౌహనీతో చర్చలు జరుపుతారు. ఆదేశ అగ్రనేత ఆయతుల్లా ఖొమైనీని కూడా మోదీ కలుస్తారు.

ఇరాన్‌ చేరుకున్న ప్రధాని.....
రెండు రోజుల పర్యటన కోసం ఇరాన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి టెహరాన్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత ఆయన గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. భారత సంతతి ప్రజలను, పాఠశాలల బాలలను కలుసుకున్నారు.

ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీతో మోదీ భేటీ.....
మోదీ ఇవాళ ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. చాబర్‌ ఓడరేవు అభివృద్ధి ఒప్పందంపై మోదీ సంతకం చేసే అవకాశం ఉంది. ఈ రేవు ద్వారా భారత్‌-ఇరాన్‌ల మధ్య మరింత అనుసంధానత పెరుగుతుంది. పాకిస్థాన్‌తో సంబంధంలేకుండా అఫ్గనిస్థాన్‌ ఈ ఓడరేవు ద్వారా అనుసంధానత సాధించవచ్చు. ప్రభుత్వరంగ సంస్థ నాల్కో ద్వారా ఇరాన్‌లో ఏటా 5 లక్షల టన్నుల సామర్ధ్యంతో అల్యూమినియం కర్మాగారం నెలకొల్పడానికి ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి.

భారత్‌-ఇరాన్‌ మధ్య ఆర్ధిక సంబంధాలు....
భారత్‌-ఇరాన్‌ దేశాలు పరస్పరం ఆర్ధిక సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. మోదీ పర్యటన ఇందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, మౌలికసదుపాయాల అభివృద్ధి, ఇంధన భద్రత రంగాల్లో ఇరాన్‌తో సహకారాన్ని విస్తరించుకోవడంపై మన దేశం ఆశక్తి కనపరుస్తోంది. ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేయడం రెండు దేశాల మధ్య అపారమైన అవకాశాలను తెరతీసిందని మోదీ చెబుతున్నారు.

ఇరాన్‌లో పెట్టుబుడులు పెట్టేందుకు ఆసక్తి ....
భారత్‌లోని ప్రభుత్వరంగ సంస్థలు ఇరాన్‌లో పెట్టుబుడులు పెట్టేందుకు ఆకస్తి చూపుతున్న అంశంపై రెండు దేశాల నేతలు చర్చిస్తారు. ఇరాన్‌ నుంచి మరింత ఎక్కువగా చమురు దిగుమతి చేసుకునేందుకు మోదీ పర్యటన దోహనం చేస్తుందని భావిస్తున్నారు. భారత్‌లో ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో... సహజవాయువు నిల్వల పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న ఇరాన్‌తో చెలిమి మనకు ఎంతో మంచిదని భావిస్తున్నారు. పదిహేనేళ్ల తర్వాత భారత్‌ ప్రధాని ఇరాన్‌ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.

 

09:30 - May 23, 2016

బీజేపీ కాషాయ మూకలు ఆదివారం నాడు సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేష్  (ప్రముఖ విశ్లేషకులు ),కొండా రాఘవరెడ్డి (వైసీపీ అధికార ప్రతినిధి),వకుళాభరణ కృష్ణ మోహన్ (టీఆర్ఎస్ నేత), మాల్యాద్రి (టీడీపీ రాష్ట్ర కార్యదర్శి),అల్లాపూర్ శ్రీనివాస్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తల అభిప్రాయాలు తెలసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి. మరింత సమాచారం తెలుసుకోండి.

సుకుమా డీఎఫ్ ఓ పై చర్యలు తీసుకోవాలి - కాంగ్రెస్..

ఛత్తీస్ గఢ్ : సుకుమా డీఎఫ్ఓ పై వివాదం చెలరేగుతోంది. సుకుమా జిల్లాలో తీవ్రమైన కరవు నెలకొన్న విషయం తెలిసిందే. కానీ డీఎఫ్ఓ నివాసంలో స్విమ్మింగ్ ఫూల్ లో నీళ్లు ఉండడంపై వివాదం చెలరేగింది. ఈ స్విమ్మింగ్ పూల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని దీనిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విచారణ చేపట్టాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది. 

జవాన్ పాండురంగ మహదేవ్ భౌతికకాయానికి నివాళులు...

శ్రీనగర్ : వీరమరణం పొందిన జవాన్ పాండురంగ మహదేవ్ భౌతికకాయానికి పలువురు అధికారులు నివాళులర్పించారు. కుప్వార జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో పాండురంగ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

 

రాష్ట్రపతిని కలువనున్న కేంద్ర మంత్రి నడ్డా..

ఢిల్లీ : నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా కలవనున్నారు. నీట్‌పై ఆర్డినెన్స్ కు సంబంధించి వివరణ ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ప్రణబ్ న్యాయ సలహా కోరిన సంగతి తెలిసిందే. 

కాసేపట్లో సీఎంగా జయ ప్రమాణం..

చెన్నై : నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితతో పాటు 29 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ రోశయ్య వారి చేత ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటికే మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియం ముస్తాబైంది.

నేడు కలెక్టర్లలతో సీంఎ కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. కొత్త జిల్లాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రెవెన్యూ సంస్కరణలు, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలపైనా చర్చ జరగనుంది. 

నేడు పులివెందులలో జగన్ పర్యటన..

కడప : వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు పులివెందులలో పర్యటించనున్నారు. సోమవారం తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం అచ్చెంవెల్లి ప్లాంట్ ను సందర్శించనున్నారు. 

రేపటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 24 నుండి ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తాయి. 799 పరీక్షా కేంద్రాలలో 4,73,450 (ప్రథమ 3,13,647, ద్వితీయ 1,59,803) మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 

యాదరిగుట్టలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..

నల్గొండ : యాదరిగుట్టలో ఓ లాడ్జిలో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. లాడ్జి సిబ్బంది హుటాహుటిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

09:06 - May 23, 2016

ప్రకాశం : నాలుగొందల శతాబ్ధాల చరిత్రకలిగిన హైదరాబాద్‌ ఆర్ధిక వివర్తన, అమరావతిలో ఆచరణసాధ్యం కాదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఒంగోలులో జరిగిన అఖిల భారత అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడెందుకు ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ కేటగిరి అవసరంలేదనే వాదన అర్థంలేనిదని అన్నారు.

08:58 - May 23, 2016

నల్లగొండ : యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగులమందుతాగిన ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన లాడ్జి సిబ్బంది వీరిద్దరినీ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.. బాధితులు మెదక్‌ జిల్లా సంగారెడ్డికిచెందిన శ్రీమాన్‌, శివానిగా పోలీసులు గుర్తించారు.. ప్రేమికుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీలసు విచారణ చేపట్టారు.

08:53 - May 23, 2016

నెల్లూరు : ఇస్రో మరో ఘనత సాధించింది.. రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్ ప్రయోగంలో విజయం సాధించింది.. 70 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీహరికోట సమీపంలో బంగాళఖాతంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక రన్‌వేపై సురక్షితంగా దిగింది.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ లాంచింగ్ వెహికల్‌ను రూపొందించారు. ఈ ప్రయోగం సక్సెస్‌తో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.. ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ అభినందించారు.. ఈ విజయంతో అంతరిక్ష ప్రయోగాలను అతి తక్కువ ఖర్చుతో చేపట్టే అవకాశం ఉంటుంది.. కిలో బరువును కక్ష్యలోకి పంపేందుకు 2 డాలర్లకన్నా తక్కువగా వ్యయం అవుతుంది.. అలాగే పదే పదే ప్రయోగాలు కూడా జరుపుకోవచ్చు.. శ్రీహరికోటలో అర్ధరాత్రి ఒంటిగంటనుంచి కౌంట్‌డౌన్‌ మొదలుకాగా 7గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

08:47 - May 23, 2016

హైదరాబాద్ : నగరంలో ఆటోల సమ్మె వాయిదా వేశారు. ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, టీఆర్‌ఎస్‌టీవీ, టీఏడీయూ లాంటి సంఘాలతో రవాణా శాఖ, పోలీస్ అధికారులతో ఆటో సంఘాల ప్రతినిధులతో చర్చలు సఫలమయ్యాయి. స్పెషల్ డ్రైవ్ నిలిపివేసేందుకు అధికారులు అంగీకరించడంతో ..సమ్మెవాయిదా వేశారు. హైదరాబాద్ లో ఆటో యూనియన్ల జెఏసి సమ్మెకు పిలుపునివ్వడానికి కారణం ఏమిటి? ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఆటో యూనియన్ల జెఏసి ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ సర్వీస్ ల రాక ఆటో డ్రైవర్ల జీవనోపాధిని ఎలా ప్రభావితం చేస్తోంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ కె. ఈశ్వరరావుగారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి ....

08:38 - May 23, 2016

మణిపూర్‌ :  ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. సైనికులపై మెరుపు దాడికి తెగబడ్డారు. మణిపూర్‌లోని చందేల్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు, సైనికులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అస్సాం రైఫల్స్‌కు చెందిన ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అంబ్రిల్లా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చందేల్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించి వస్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. సైనికుల నుంచి ఆరు ఏకే-47 రైఫిల్స్‌, మందుగుండు సమాగ్రి, ఒక లైట్‌ మెషీన్‌గన్‌ను ఉగ్రవాదులు తీసుకెళ్లారు. పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌... ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని ఆదేశించారు. గతేడాది కూడా మణిపూర్‌లో నాగా ఉగ్రవాదుల దాడిలో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

08:28 - May 23, 2016

విజయవాడ : ఏపీలో రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో కాస్మొపాలిటన్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలను తలదన్నేలా ఫుడ్‌ కోర్టులు వెలుస్తున్నాయి. వీకెండ్స్‌లో జనం మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

రాష్ట్ర విభజనతో పెరిగిన ప్రాధాన్యత....
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ప్రాధాన్యత పెగిరింది. ఏడాది క్రితం వరకు వాణిజ్య కేంద్రంగా ఉన్న బెజవాడ ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా కూడా మారింది. దీనికి తగ్గట్టుగానే నగరం విస్తరిస్తోంది. దీనికి కొత్త హంగులు తోడవుతున్నాయి. ఒకప్పుడు రాత్రి పది గంటలు దాటితే విజయవాడలో ఫుడ్‌ దొరకడం కష్టమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. రైల్వేలు, రోడ్‌ మార్గాలపరంగా విజయవాడ పెద్ద కూడలి. వివిధ పనులపై నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడుగా ఫుడ్‌కోర్టులు కూడా విస్తరిస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రాత్రివేళల్లో కూడా జనం మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒకప్పుడు రాత్రి 10 గంటలు దాటితే నగరం నిర్మానుష్యంగా కనిపించేది. ఇప్పుడు అర్ధరాత్రి కూడా రోడ్లపై జనం బిజీబిజీగా కనిపిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్‌ కోర్టులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ లభించే వివిధ రకాల వంటకాలను రచి చూస్తూ ఆనందించే వారి సంఖ్య పెరుగుతోంది.

ఫుడ్‌ కోర్టులతో ఎంజాయ్‌ ప్రజలు....
నగరం విస్తరించే కొద్దీ ఇలాంటి ఫుడ్‌ కోర్టులు మరిన్ని వెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పగలంతా బిజీ బిజీగా గడిపేవారు రాత్రి వేళల్లో ఫ్యామిలీతో కలిసి ఫుడ్‌ కోర్టులకు వస్తూ సేదతీరుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

మరో ఘనత సాధించిన ఇస్రో.....

నెల్లూరు : ఇస్రో మరో ఘనత సాధించింది. ఇప్పటికే పలు క్షిపణి ప్రయోగాల్లో ఇస్రో విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. ఇప్పుడు తాజాగా శ్రీహరికోట మరో విజయానికి వేదికగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పునర్వినియోగ వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకుపోయింది. ధ్వనికంటే 5 రెట్లు వేగంతో ఈ రాకెట్ 70 కిమీ ప్రయాణించి సురక్షితంగా మళ్లీ భూమిపైకి ఈ రాకెట్ తిరిగి వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రయోగించిన 11 నిమిషాల్లోనే రాకెట్ ప్రత్యేక రన్ వే పైకి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

యాదాద్రిలో ప్రేమజంట ఆత్మహత్య...

నల్లగొండ : యాదగిరి గుట్టలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పురుగులు మందు త్రాగి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిస్థితి విషయంగా వుండటంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వీరు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శ్రీమాన్, శివానిగా పోలీసులు గుర్తింపు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

08:05 - May 23, 2016

విజయవాడ  : విమానాశ్రయం విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. దశాబ్ధకాలంగా భూసేకరణకు నిరాకరించిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీతో సానుకూలంగా స్పందిస్తున్నారు.

వినాశ్రయానికి పెరిగిన ప్రాధాన్యత......
రాష్ట్ర విభజన, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం తర్వాత విజయవాడ వినాశ్రయం ప్రాధాన్యత పెరిగింది. ఎయిర్‌ ఇండియాతో పాటు ప్రైవేటు విమానయాన సంస్థలు ఇక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు నడుపుతున్నాయి. అయితే పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విమానాశ్రయ రన్‌ వే లేదు. వినాశ్రయం అభివృద్ధి, రన్‌ వే విస్తరణకు దశాబ్ధకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు ఒప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. దీంతో విస్తరణకు మార్గం సుగమం అవుతోంది.

సమీకరించాల్సిన పట్టాభూమి 1084 ఎకరాలు....
ఇంతకాలం విమానాశ్రయ విస్తరణకు అవరోధంగా ఉన్న భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చింది. సేకరణకు బదులు సమీకరణ విధానాన్ని ప్రకటించడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. మొత్తం 1084 పట్టాభూమి, మరో 140 ఎకరాల ఇతర కేటగిరీ భూములను సమీకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఇంతవరకు 619 ఎకరాల పట్టాభూమి ఇచ్చేందుకు రైతులు ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకున్నారు. మరో 470 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీనిప్రకారం 61 శాతం భూములకు సంబంధించి స్పష్టత వచ్చింది. అజ్జంపూడిలో 109 ఎకరాలు సమీకరించాల్సి ఉంటే 103 ఎకరాలకు, అల్లాపురంలో 105 ఎకరాలను గాను 42 ఎకరాలు, బుద్ధవరంలో 351 ఎకరాలకుగాను 255 ఎకరాలు, కేసరపల్లిలో 172 ఎకరాలకుగాను 98 ఎకరాల భూమి ప్రభుత్వం చేతికి వచ్చింది. చినఅవుట్‌పల్లిలో 154 ఎకరాలు, ఆత్కూరులో 20 ఎకరాలు, గన్నవరంలో 112 ఎకరాలు, పురుషోత్తపట్నంలో 26 ఎకరాలు, వీఎన్‌పురంలో 63 ఎకరాలు సమీకరించాల్సి ఉంది. ఈ గ్రామాల నుంచి ఇంతవరకు 10 శాతం భూములకు కూడా అంగీకార పత్రాలు రాలేదు. పెద అవుట్‌ పల్లిలో మాత్రం 58 ఎకరాలకుగాను 54 ఎకరాలకు అంగీకారం లభించింది.

ఏలూరు కాల్వ మళ్లింపు సమస్య....
ఇంతవరకు బాగానే ఉన్నా... సమస్య అంతా ఏలూరు కాల్వ మళ్లింపు కోసం భూములు ఇవ్వాల్సిన రైతులతోనే. ఇక్కడ కొంతమంది నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలున్నాయి. సమీకరణ కింద భూములు ఇవ్వొద్దని, భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తే మంచిధర లభిస్తుందని చెబుతున్నారు. దీంతో ఏ విధానాన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాల్వ మళ్లింపు కోసం భూములిచ్చిన రైతులకు అమరావతిలో స్థలాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జరీబు భూములకు ఎకరానికి వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తామని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకటించిన తర్వాతే భూములు ఇవ్వడం వేగం పుంజుకుంది. సేకరణలో మార్కెట్‌ విలువకు కొంత అదనంగా ధర నిర్ణయిస్తారు.

గన్నవరం ప్రాంతంలో మార్కెట్‌ విలువ రూ.42.90 లక్షలు...

ప్రాంతాన్నిబట్టి మార్కెట్‌ విలువ మారుతుంది. గన్నవరం ప్రాంతంలో మార్కెట్‌ విలువ ఎకరానికి 42.90 లక్షల రూపాయలు ఉంది. భూసేకర చట్ట ప్రకారం చెల్లించాల్సి వస్తే 96.52 లక్షల రూపాయలు ఇస్తారు. ఆయా గ్రామాలను బట్టి ఈ విలువ మారుతుంది. చినఅవుట్‌పల్లిలో ఎకరా భూమి మార్కెట్‌ విలువ 52 లక్షల రూపాయలుగా ఉంది. సమీకరణకు ముందుకు రాకపోతే సేకరణ కింద ఎకరానికి 1.17 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. సమీకరణ కింది భూములిస్తున్న గ్రామాల్లో ఇప్పటి వరకు ఎకరానికి 1.20 కోట్ల రూపాయల నుంచి 1.35 కోట్ల ధర పలుకుతోంది. ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ తర్వాత సినీప్రముఖులు కృష్ణంరాజు, అశ్వినీదత్‌ వంటివారు సైతం ప్రభుత్వానికి భూములిచ్చారు. అమరావతిలో రైతులకు ఇస్తున్న కౌలు ప్యాకేజీ, వ్యవసాయ కూలీలకు పెన్షన్‌, ఉచిత వైద్యం వంటి సౌకర్యాలను విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులకు కూడా వర్తింప చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏలూరు కాల్వ మళ్లింపు కోసం భూములిచ్చేందుకు సందేహిస్తున్న రైతులు కూడా ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారు.

భూమి అప్పగిస్తే నిర్మాణం చేపడతాం : అశోక్ గజపతిరాజు
రాష్ట్ర ప్రభుత్వం భూమి అప్పగిస్తే విమానాశ్రయం విస్తరణ చేపడతామని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు చెబుతున్నారు.

వినాశ్రాయాన్ని విస్తరణకు  చర్యలు : చంద్రబాబు
మానాశ్రయ విస్తరణకు యూపీఏ హయాంలోనే నిధులు ఇచ్చినా... పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. అయితే అన్ని సమస్యలను అధిగమించి వినాశ్రాయాన్ని విస్తరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారు. విమాశ్రయాన్ని విస్తరిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ దిశగా చర్యలను వేగిరపరచాలని కోరుతున్నారు.

07:53 - May 23, 2016

హైదరాబాద్ : నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో ఆఫ్రికన్ సింహాలు రాధిక, కిషన్ ఉన్న ఎన్ క్లోజర్ లోకి దూకాడు. వెంటనే స్పందించిన జూ క్యూరేటర్ హనీఫ్, సిబ్బంది.. సింహాలను కంట్రోల్ చేసి అతన్ని రక్షించారు. ఇక ఆ మందుబాబును.. రాజస్థాన్ కు చెందిన ముఖేష్ కుమార్ గా అధికారులు గుర్తించారు. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ముఖేష్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో సింహాల బోనులోనికి దూకేశాడు.వెంటనే గమనించిన జూలాజికల్ పార్క్ అధికారులు సమయస్ఫూర్తితో సింహాలను కంట్రోల్ చేసి అతన్ని కాపాడారు.ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో జూకు వచ్చిన సందర్శకులు ఈ పరిమాణంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. జూ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముఖేష్ రాజస్థాన్ కు చెందిన వ్యక్తిని ఎల్ అండ్ టీ చెపట్టిన మెట్రో కంస్ట్రక్షన్ లో నాగోల్ ప్రాంతంలో హెల్పర్ గా పనిచేస్తున్నాడని బహుదూర్ పూర ఇన్స్ పెక్టర్ హరిష్ కౌషిక్ తెలిపారు. జూపార్క్ లో తరుచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని... సెక్యూరిటి లోపం కనిపిస్తుందని జూ నిర్లక్ష్యంపై కూడ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

07:48 - May 23, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ఏటా మార్చిలోనే ఇస్తామన్న కౌలును ఈ ఏడాది ఇంతవరకు చెల్లించకపోవడంతో అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మొదటి ఏడాది కౌలుకు సకాలంలో బ్యాంకు చెక్‌లు ఇచ్చిన మురిపించిన సీఆర్డీఏ అధికారులు... ఈసారి ఇంతవరకు ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే నెల ముగుస్తున్నా.... కౌలు చెల్లించే విషయంలో ఇదిగో ... అదిగో.. అంటూ కాలక్షేపం చేస్తున్నారని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంత కౌలు రైతుల దీనగాథలపై 10 టీవీ ప్రత్యేక కథనం.

కౌలు చెల్లింపులో జాప్యం...
ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు మరచిపోలేనివంటూ పాలకులు వేయినోళ్ల పొగిడారు. అన్నదాతల రుణం తీర్చుకోలేనిదంటూ ఆకాశానికి ఎత్తారు. భూముల్చిన రైతులకు ఒప్పందం ప్రకారం కౌలును సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఏడాది మాట నిలుపుకున్నారు. దీంతో రెండో సంవత్సరం కూడా సకాలంలో ఇస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కౌలు చెల్లించే విషయంలో పాలకులు మాట తప్పారని అమరావతి అన్నదాతలు విమర్శిస్తున్నారు.

మేనెల ముగుస్తున్న అందని కౌలు పరిహారం...
సీఆర్‌డీఏ అధికారులు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏటా 10 శాతం కౌలు పెంచాలి. జరీబు భూమికి ఎకరానికి 50 వేల రూపాయలు కౌలుగా నిర్ణయించారు. మెట్టకు 30 వేలు ఇస్తామన్నారు. గతేడాది మార్చి నెలలోనే కౌలు మొత్తానికి బ్యాంకు చెక్‌లు ఇచ్చిన సీఆర్‌డీఏ అధికారులు.... ఈసారి మాత్రం ఇంతవరకు ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన భూములు కోల్పోయిన రైతు కుటుంబాలు... ప్రభుత్వం ఇచ్చే కౌలు డబ్బులతోనే భుక్తి గడుపుకోవాలి. ఇది తెలిసి కూడా సీఆర్‌డీఏ అధికారులు జాప్యం చేస్తుండటాన్ని తప్పుపడుతున్నారు.

అన్నదాతలు ఆవేదన ....
రాజధాని ప్రాంత రైతు కుటుంబాల్లో పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన పిల్లలు ఉన్నారు. ఉన్నత చదవులకు వెళ్లే సమయం ఆసన్నమైన తరుణంలో సీఆర్‌డీఏ అధికారులు కౌలు చెల్లింపులో జాప్యం చేస్తుండటంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక రాజధాని కోసం అసైన్డ్‌ భూములిచ్చిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరికి ఇంతవరకు కౌలు మొత్తం చెల్లించలేదు. సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నా... ఎవరూ పట్టించుకోవడంలేదని అసైన్డ్‌ భూముల రైతులు ఆరోపిస్తున్నారు.

రాజధాని నిర్మాణానికి రూ. 900 కోట్ల ఖర్చు ....
అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.... రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు 150 కోట్ల రూపాయల కౌలు చెల్లింపులో జాప్యం చేస్తున్న తీరును స్థానికులు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో పాలకులతోపాటు, సీఆర్‌డీఏ అధికారుల వైఖరిలో మార్పు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందనలేకపోతే ఆందోళన బాట పట్టక తప్పదని రాజధాని ప్రాంత రైతులు హెచ్చరిస్తున్నారు. 

07:34 - May 23, 2016

విజయవాడ : ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోవడం ద్వారా నీటికొరతను అధిగమించి కరవు కోరల నుంచి రక్షించడం కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతపురం జిల్లాను కరవు కోరల నుంచి రక్షించేందుకు ఎడారి ప్రాంతమైన దర్గాహొస్నూరు గ్రామం వరకు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులతో కలిసి వాటర్ మెన్ రాజేంద్రసింగ్ పర్యటించారు. ఎడారిగా మారుతున్న గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. రాజస్థాన్ లో తాను చేపట్టిన చర్యల కారణంగా అక్కడి రైతులు ఏ విధంగా లబ్దిపొందారో తెలిపారు. అనంతపురం జిల్లాలో ఎడారిగా మారుతున్న ప్రాంతాన్ని సందర్శించడం నిజంగా దురదృష్టం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఛీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుతో కలిసి ఇక్కడి నదులను జలాలతో నింపుతామన్నారు.

వీలైనంత తొందరగా చేపడతా : వాటర్ మెన్ రాజేంద్రసింగ్
ఎడారి నివారిణీకరణ పనులను వీలైనంత తొందరగా చేపడతామన్నారు రాజేంద్రసింగ్ హగిరి నదిలో కలుస్తున్న అనేక వాగులు వంకలపై విరవిగా అడ్డుకట్టలు వేసి నీటిని ఒడిసిపడతానన్నారు. దీని ద్వారా నదులలో నీటి శాతం పెరుగుతుందని.. ఆయన తెలిపారు.

నిర్దిష్ట కార్యాచరణతో చర్యలు : ఛీఫ్ విప్ కాల్వ
దక్షిణ భారత దేశంలోనే ఎడారిగా మారుతున్న ప్రాంతం హగిరి నదీ ప్రాంతమని ఛీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతంలో ఏడు నదుల్లో తిరిగి నీటిని తెప్పించిన వ్యక్తి రాజేంద్ర సింగ్ అని అన్నారు. ఉపరితల చెక్ డ్యాంలు నిర్మించేందుకు నిర్దిష్ట కార్యాచరణతో స్థానిక ప్రజలతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు కాల్వ శ్రీనివాసులు. ఒకప్పుడు జీవనదిలా ఉన్న వేదవతినదికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో కరవు ప్రాంతాలను జలకళ ఉట్టిపడేలా చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు ఛీఫ్ విప్, రాజేంద్రసింగ్ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. 

07:01 - May 23, 2016

మెదక్ : జిల్లా ఏటిగడ్డ కిష్టాపురంలో .. మలన్న సాగర్ ముంపు బాధితుల సదస్సు జరిగింది. గత కొన్ని నెలలుగా భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా గ్రామస్తులు పోరాడుతున్నారు. పదిహేడు గ్రామాల ప్రజలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టాలని తీర్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. కొన్ని నెలలుగా చట్టాలను కాపాడాల్సిన అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తూ.. భూసేకరణ చేపట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆ ముంపు గ్రామాల బాధితుల సదస్సు జరిగింది.

సదస్సులో మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్....
సీఎం సొంత జిల్లాలో మల్లన్నసాగర్ సదస్సులు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పాల్గొని బాధిత కుటుంబాలకు న్యాయసలహాలు ఇచ్చారు. ముంపు బాధిత గ్రామాల ప్రజలు కలిసి కట్టుగా పోరాడితే.. విజయం సాధించవచ్చని భరోసా ఇచ్చారు.

మల్లన్నసాగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం : తమ్మినేని
సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. భూమిని కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం మార్కెట్ రేట్ కంటే అధికంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మల్లన్నసాగర్ బాధితుల పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. బాధితులు కూడా న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదంటూ... ముందుకు సాగుతున్నారు. 

06:54 - May 23, 2016

కర్నూలు : ఆర్‌డీఎస్‌ వివాదం రాజుకుంది. అటు తెలంగాణ, ఇటు ఏపీ రైతులు పోటాపోటీగా మళ్లీ రాజోలి బండ సాక్షిగా జలజగడానికి తెరలేపుతున్నారు. తాజాగా కర్నూలు రైతులు ఆర్‌డీఎస్‌ ఎత్తు పెంపుపై నిరసన వ్యక్తం చేసారు. దీంతో అటు రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు నిప్పు రాజేస్తున్నాయి.

కర్నూలు జిల్లా రైతుల నిరసన......
రాజోలిబండ డైవర్షన్‌ స్కీం ఆనకట్ట ఎత్తు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ.. కర్నూలు జిల్లా రైతులు టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం వంటావార్పు నిర్వహించారు. మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి, తుంగభద్ర దిగువ కాల్వ సాగునీటి సంఘం అధ్యక్షులు కుమార్‌గౌడ్‌లు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

ఆర్‌డిఎస్‌ ఎత్తు పెంపు పనులు అన్యాయం : టీడీపీ నేత

ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ ఆర్‌డిఎస్‌ ఎత్తు పెంపు పనులు అన్యాయమని అన్నారు. ఎత్తు పెంచితే కర్నూలు జిల్లాకు సాగు, తాగునీరు కూడా దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర పరిధిలో మన అధికారుల ప్రమేయం లేకుండా తెలంగాణ అధికారులు ఎలా పనులను చేపడతారని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్ర అధికారులతో చర్చించి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు రెచ్చగొట్టే ధోరణిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శించారు. ఆర్‌డిఎస్‌ ఎత్తు పెంచితే కర్నూలు జిల్లా ఆయకట్టు పూర్తిగా దెబ్బతింటుందని. రైతుల ఆందోళనతో కర్ణాటక ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.

భారీగా పోలీసులు మొహరింపు ....
ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును పెంచే విషయంలో మూడు రాష్ట్రాలలో వివాదం నెలకొంది. గత మూడు రోజులుగా ఏపీ అధికారులకు తెలపకుండా ఆనకట్ట ఎత్తును పెంచడానికి పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా అధికారులు కర్నాటక, తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరిపి పనులు నిలిపేశారు. ఐతే ఏపీ అధికారులకు తెలియకుండా పనులు చేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం అందడంతో ఏపీ అధికారులు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మొహరించారు.

తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించిన టీడీపీ నేతలు....
రాయలసీమ రైతులు నష్టపోతారని.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనకట్ట హైట్ పెంచేందుకు ఒప్పుకోబోమని కర్నూలు జిల్లా నేతలు స్పష్టం చేస్తున్నారు. మొండిగా ముందుకెళితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. 

06:46 - May 23, 2016

విజయవాడ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడిని ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేరళలో లెఫ్ట్ పార్టీల విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సీపీఎం కార్యాలయంపై దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించారు.

విజయవాడలో సీపీఎం ధర్నా...
ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడులను నిరసిస్తూ విజయవాడలో ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. బీజేపీ దాడులను సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తీవ్రంగా ఖండించారు. దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేరళలో లెఫ్ట్ విజయాన్ని తట్టుకోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతోందని మధు విమర్శించారు.

నెల్లూరు సీపీఎం ఆందోళన....
నెల్లూరులో సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నగరంలోని డైకాస్ రోడ్డు సెంటర్ లో రాస్తారోకో చేశారు. బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి దిగడం అమానుషమని సీపీఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు అన్నారు.

విశాఖ జగదాంబ కూడలి వద్ద సిపిఎం ర్యాలీ....
బిజెపి దాడిని ఖండిస్తు విశాఖ జగదాంబ కూడలి వద్ద సిపిఎం ర్యాలీ చేపట్టింది. బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అరాచకం రాజ్యమేలుతుందని సిపిఎం జిల్లా కార్యదర్మి లోకనాథం మండిపడ్డారు.

తూ.గోదావరిలో సీపీఎం ఆందోళన....
కాకినాడలోనూ సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేరళలో లెఫ్ట్‌ విజయాన్ని సహించలేక, దాడులకు పాల్పడటం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జీ అన్నారు. భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు ఆధ్వధర్యంలో రాజమండ్రిలో ధర్నా చేపట్టారు. బీజేపీ వైఖరిలో మార్పు రాకపోతే పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో సీపీఎం కార్యకర్తలు బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

06:38 - May 23, 2016

ఢిల్లీ : కాషాయ మూకలు మళ్లీ రెచ్చిపోయాయి. వామపక్ష వ్యతిరేకతను మరోసారి బయటపెట్టాయి. కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న అహంకారాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రదర్శించాయి. ఏకంగా సీపీఎం కేంద్ర కార్యాలయంపైనే దాడికి తెగబడి.. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశాయి.

వామపక్ష విజయాన్ని తట్టుకోలేని ఆర్‌ఎస్‌ఎస్‌ ....
కాషాయ మూకలు పేట్రేగిపోతున్నాయి. వామపక్ష విజయాన్ని తట్టుకోలేని ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు..దాడులకు తెగబడుతున్నాయి. హేతుబద్ధం కాని కారణాలు చూపుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. వామపక్షాలపై లేనిపోని అభాండాలు వేస్తూ చెలరేగుతున్నాయి. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి. తద్వారా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు మరోసారి తమ పైత్యాన్ని బయటపెట్టాయి.

సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపి దాడి...
ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపి కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ కార్యాలయం బోర్డుపై రాళ్లు విసిరారు. కేరళలో బీజేపి కార్యకర్తల హత్యలకు సీపీఎం పార్టీనే కారణమంటూ బీజేపి కార్యకర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీపీఎం కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

దాడిని ఖండించిన సీతారాం ఏచూరి....
రంగంలోకి దిగిన పోలీసులు బీజేపి కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. సీపీఎం కేంద్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడి అమానుషమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ దాడిని ఖండిస్తున్నామని, ఇలాంటి చేష్టలను ఏ ఒక్కరూ హర్షించరని అన్నారు.

దాడిని ఖండిచింన వామపక్ష పార్టీలు...
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ కార్యకర్తల దాడిని వామపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఈ దాడులపై దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయంపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

టీ.ఎస్ ఎంసెట్2 ఆలస్యం....

హైదరాబాద్ : రాష్ట్రంలోని వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎంసెట్‌-2 షెడ్యూల్‌ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. నీట్‌ ఆర్డినెన్సను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతే ఎంసెట్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

అక్రమ ఆయుధాలు కలిగివున్న వ్యక్తి అరెస్ట్...

కరీంనగర్‌: మంథని మండలం కేతనపల్లిలో అక్రమంగా ఆయుధం కలిగిఉన్న తోట రాములు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి తుపాకితో పాటు ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Don't Miss