Activities calendar

24 May 2016

వారి కారుణ్య నియామకాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : తెలంగాణలో అనారోగ్యంతో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల అంశంపై పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశారు. స్పెషల్ సీఎస్ ఎంజీ గోపాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ టీసర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 

22:18 - May 24, 2016

రుతుస్రావం అపవిత్రం కాదు... రుతుస్రావమే మానవమనుగడకు మూలమని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై మావని చేపట్టిన దేదిక చర్చా కార్యక్రమంలో భూమిక హెల్ప్ లైన్ స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శివకుమారి పాల్గొని, మాట్లాడారు. రుతస్రావంలో ఆలయ ప్రవేశం అనాగరికమన్నారు. పితృస్వామ్య భావజాలమే ఈ ఆలోచనలకు కారణమని పేర్కొన్నారు. బహిష్టు సమయంలో శుభ్రత పాటించాలని సూచించారు. అపరిశుభ్రత అనేక ప్రాణాంతక వ్యాధులకు కారణమని చెప్పారు. బహిష్టు సమస్యపై మరింత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:03 - May 24, 2016

సంగారెడ్డి : రైతుల నుంచి ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా భూములు సేకరిస్తే సహించేదిలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. నిమ్జ్‌ భూ బాధితుల పాదయాత్ర ముగింపు సభలో తమ్మినేని పాల్గొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర జరిగిన ఈ సభలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నిమ్జ్‌ ఏర్పాటుకు జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్కర్‌, ఝరాసంగం మండలాల్లో 17 గ్రామాల్లో 12 వేల ఎకరాలకు పైగా సేకరించించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్జ్‌ పేరుతో బలవంత భూ సేకరణ వ్యతిరేకిస్తూ సీపీఎం పాదయాత్ర చేపట్టింది. వారం రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర ఇవాళ్టితో ముగిసింది. 

 

22:00 - May 24, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రారంభించిన తొలి భారీ సాగునీటి ప్రాజెక్ట్‌.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గడువులోగా పూర్తి చేసి రికార్డ్‌ నెలకొల్పాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్‌ పనులపై ఇంజనీర్లు, కాంట్రాక్టరతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అందరూ సమిష్టిగా పని చేస్తే పనులన్నీ విజయవంతమవుతాయన్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు 30 నెలల గడువు పెట్టుకున్నప్పటికీ.. అంతకంటే ముందే పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలని హరీష్‌రావు సూచించారు. 

 

21:57 - May 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో బోగస్‌ విద్యాసంస్థలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.   ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్స్‌ తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయన్నారు. లోటుపాట్లను సవరించుకోవడానికి ప్రైవేటు విద్యా సంస్థలకు అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 
విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు.. 
తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. బోగస్‌ సంస్థ ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేని స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో  సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతాయి
ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్స్‌ తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సోదాల్లో వెలుగులోకి వచ్చిన లోటుపాట్లను సవరించుకునేందుకు విద్యా సంస్థలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దానికి తగిన సమయం ఇస్తామన్న సీఎం.. తమ చర్యలు పరమార్థం ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయడం కాదని అన్నారు. రాష్ట్రంలో అత్యున్నత విద్యను అందించడంలో ప్రైవేటు విద్యా సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి అని కేసీఆర్‌ అన్నారు. 
విద్యార్థులే లేకుండా కాలేజీలను నడపడం దారుణం 
బోగస్‌ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరివేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. విద్యార్థులే లేకుండా కాలేజీలను నడపడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశం లేకున్నా.వేలం వెర్రిగా ఒకే కోర్సు చేయడంతోనే నిరుద్యోగ సమస్య ఏర్పడుతోందని కేసీఆర్ అన్నారు. ఉపాధి కల్పించే కోర్సులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. విద్యా సంస్థలకు ఇచ్చే కరెంట్‌ను కమిర్షియల్‌ నుంచి జనరల్‌ కేటగిరీకి మార్చడం, ఆస్తి పన్ను మినహాయింపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. 
సమ్మె విరమించిన ప్రైవేటు విద్యా సంస్థలు
తెలంగాణలో విద్యా విధానం, కోర్సులు, ప్రైవేటు విద్యా సంస్థల అవసరాలపై  విద్యా సంస్థల ప్రతినిధులు చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు. కోర్సులతో పాటు కాలేజీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ కావాల్సిన అవసరం ఉందని  ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం సమావేశంపై సంతృప్తి వ్యక్త చేసిన  ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.  ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు సహకరిస్తామని తెలిపాయి. 

 

సరూర్‌నగర్‌ లో క్రికెట్‌ బెట్టింగ్‌..... ముగ్గురి అరెస్టు

రంగారెడ్డి : జిల్లాలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.1.72లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.

తిరుపతిలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ట్రేడ్ బంద్

చిత్తూరు : తిరుపతిలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ట్రేడ్ బంద్ కు వ్యాపారవర్గాలు పిలుపు నిచ్చాయి. తిరుపతి సీటీవో-2గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు నాయుడు తమను వేధింపుల పాలు చేస్తున్నాడంటూ వ్యాపార సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యత్వం ఉన్న 27 వ్యాపార సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. రేపటి నుంచి తలపెట్టనున్న బంద్ లో తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి పట్టణాలకు చెందిన సుమారు 10 వేల మంది వ్యాపారులు పాల్గొననున్నాయని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ పేర్కొన్నారు.

 

21:34 - May 24, 2016

తల్లిడిల్లుతున్న మల్లన్న సాగర్ బాధితులు..సర్కారుతోని కొట్లాడకుంటే లీడర్లే నిందితులు, చేతలు చెంబునిండా కోతలు కొట్టం నిండా.... సర్కారు పని తనానికి ముచ్చుతునకలు, యాదాద్రి జిల్లాను ఖాతాలేసుకునే ఉపాయం.. అసలు కొత్తజిల్లానే చేయకపోతే అపాయం, యాడాది మాశ్కానికి హాజిరేసిన కేసీఆర్... పైసలు ఖర్సైన పరువు కోసం పాటుబడే బాస్, మహేష్ బాబు గుత్తవట్న ఊరిజనం గోసలు..
సీన్మల జేసినట్టు చేస్తెనే తీర్తై బాధలు, మే నెలల దసరా పండుగజేసుకున్న గిరిజనం.. రోగాల్లేకుండా సల్లగుండాలే మనమందరం.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

ఫైబర్ గ్రిడ్ పథకాన్ని అభినందించిన కేంద్రం : అజయ్ జైన్

హైదరాబాద్ : ఎపిని రోల్ మోడల్ గా తీసుకుని ఫైబర్ గ్రిడ్ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసిందని ఎపి ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ పథకాన్ని కేంద్రం అభినందించిందన్నారు. జూన్ నెలాఖరుకల్లా ఎపిలో ఫైబర్ గ్రిడ్ పూర్తి చేస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో టెలిఫోన్, కేబుల్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఎపిలో 4 వేల మె.వా.సోలార్ విద్యుత్ అందుబాటులోకి రాన్నుట్లు వివరించారు.  

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగుళూరు

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో బెంగుళూరు, గుజరాత్ తలపడునున్నాయి.  బెంగుళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

 

జులై చివరి కల్లా అన్ని పనులు పూర్తి : దేవినేని

కృష్ణా : పుష్కర యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. జులై చివరి కల్లా అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 

తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో రూ.1కే నల్లా కనెక్షన్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలకు రూ.1 కే నల్లా కనెక్షన్ ఇవ్వనుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది. 

తాటిపూడి రిజర్వాయర్ లో ముగ్గురు గల్లంతు

విజయనగరం : తాటిపూడి రిజర్వాయర్ లో పడి ముగ్గురు గల్లంతయ్యారు. విశాఖ జిల్లా సింహాచలంకు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు తాటిపూడికి విహారయాత్రకు వచ్చారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్ లో పడి గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో యువతి ఉన్నట్లు తెలుస్తోంది. 

యువకుడు దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో ఘోరం జరిగింది. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద యువకుడిని దుండగులు హత్యచేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

 

రోడ్డు ప్రమాదంలో తమిళ సినీ డైరెక్టర్ దేవరాజు దుర్మరణం

కర్నూలు : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమిళ సినిమా డైరెక్టర్ దేవరాజు(60) దుర్మరణం చెందారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి దేవరాజు తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. తొలుత కారులో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా డోన్ హై వే ఓబులాపురం మిట్ట వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో దేవరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. దేవరాజు మృతదేహాన్ని కోయంబత్తూరుకు తరలించారు. కాగా రాంకీ, నిరోషా హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'సింధూర పువ్వు' దర్శకుడు దేవరాజు.

ఈనెల 28న రాహుల్‌ ర్యాలీ

ఢిల్లీ : ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో ర్యాలీని నిర్వహించనున్నారు. ఢిల్లీలో కరెంట్ కోతలు, నీటి కొరతలకు నిరసనగా ఆప్, కేంద్రప్రభుత్వాల తీరును నిరసిస్తూ రాహుల్‌గాంధీ ర్యాలీని చేపట్టనున్నారని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధులు తెలిపారు. ర్యాలీ రాజ్‌ఘాట్ నుండి ఢిల్లీ సెక్రటేరియట్, నగర ప్రభుత్వ కార్యాలయాల మీదుగా కొనసాగనున్నట్టు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అజయ్‌మాకెన్ వెల్లడించారు.

 

19:39 - May 24, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు తన ఓఎస్ డీగా సీనియర్‌ జర్నలిస్ట్‌ తేలప్రోలు శ్రీనివాసరావును నియమించారు. శ్రీనివాసరావు ఢిల్లీలో మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. తేలప్రోలు నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. 

 

19:36 - May 24, 2016

విజయవాడ : అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వం విలువైన భూములు, స్థలాలను విదేశీ సంస్థలకు అప్పగించడం సరికాదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు అన్నారు. స్వరాజ్య మైదానాన్ని సిటీ స్వ్కేర్‌ పేరుతో విదేశీ కంపెనీలకు అప్పగించడాన్ని అడ్డుకుంటామన్నారు. స్వరాజ్య మైదానాన్ని కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని బాబురావు హెచ్చరించారు. 

 

19:30 - May 24, 2016

హైదరాబాద్ : టీడీపీ మినీ మహానాడులు.. మనీ మహానాడులుగా మారాయని వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహానాడు పేరుతో వ్యాపారులు, కాంట్రాక్టర్ల దగ్గర నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రెండేళ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి మినీ మహానాడులో చర్చించకుండా.. జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలకు వైఎస్‌ జగన్‌ను విమర్శించడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏ మాత్రం శ్రద్ధ లేదని అంబటి అన్నారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. 

 

19:22 - May 24, 2016

ఆదిలాబాద్‌ : జిల్లాలోని నిర్మల్‌ నియోజకవర్గంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న పర్యటించారు. సిద్ధిలకుంట గ్రామంలో ఉపాధిహామీ పనులను పరిశీలించారు. కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఉపాధిహామీ పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

19:12 - May 24, 2016

హైదరాబాద్‌ : కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ చెప్పుల గోదాములో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్‌సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

 

19:11 - May 24, 2016

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. పెరిగిన డీఏ ఈ నెల నుంచి అమల్లోకి వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. డీఏ పెంపుపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. 

19:09 - May 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రమోషన్లపై నిషేధం విధించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లకు మార్గం సుగమం అయ్యింది.

 

18:36 - May 24, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్ట్‌ గిరిజన నిర్వాసితుల సమస్యలపై ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ జరిపింది. గిరిజనులకు అందుతున్న నష్టపరిహారంపై కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. త్వరలో ముంపు ప్రాంతంలో పర్యటించి.. వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటామని కమిషన్‌ స్పష్టం చేసింది.  ప్రాజెక్ట్‌ కింద అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఎక్కువ భూమిని తీసుకుని తక్కువ పరిహారం ఇస్తున్నట్లుగా కమిషన్‌ అభిప్రాయపడింది. 

 

18:33 - May 24, 2016

విజయవాడ : ఎట్టి పరిస్థితులోనైనా 2018లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈమేరకు విజయవాడ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్‌ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తమ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ధర్నాలు చేపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ వైఖరి వల్లే రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితులు దాపురించాయని చెప్పారు. 

 

'పోలవరం' నిర్వాసితుల సమస్యలపై జాతీయ ఎస్ టీ కమిషన్ విచారణ

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై జాతీయ ఎస్ టీ కమిషన్ విచారణ జరిపింది. గిరిజనులకు అందుతున్న పరిహారంపై అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేసింది. త్వరలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తామని కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు కింద అనేక గ్రామాలు ముంపుకు గురవుతాయని తెలిపింది. కమిషన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనుంది. 

 

ప్రైవేట్ విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు కొనసాగుతాయి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల భేటీ ముగిసింది. ప్రైవేట్ విద్యా సంస్థలపై విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు లోటుపాట్లు సరిచేసుకునేందుకు కావాల్సినంత గడువు ఇస్తామని చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు లేకుండా కాలేజీలు నడపడం దారుణమన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధిని ఇచ్చే కోర్సులనే ప్రవేశపడతామని చెప్పారు. 

 

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు భేటీ

హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై చర్చ జరుగుతోంది. 

టి.డెమోక్రటిక్ ఫ్రంట్ సమావేశం..

వరంగల్ : విష్ణుప్రియ గార్డెన్ లో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సమావేశానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఉద్యోగుల ప్రమోషన్లకు పచ్చజెండా..

హైదరాబాద్ : ఉద్యోగుల ప్రమోష‌న్ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. ఉద్యోగుల ప్ర‌మోష‌న్ల‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు ఈ రోజు ప్ర‌క‌టించింది. గ‌త ప్ర‌భుత్వం జారీ చేసిన ఉద్యోగుల ప్ర‌మోష‌న్ల రద్దు ఉత్త‌ర్వులను టీఆర్ఎస్ స‌ర్కార్ ర‌ద్దుచేసింది. దీంతో తెలంగాణ ఉద్యోగుల ప్ర‌మోష‌న్ల‌కు లైన్ క్లియ‌ర్ అయింది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 75 పాయింట్లు లాభపడి 25,305 వద్ద..నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 7,749 సూచీ వద్ద ముగిశాయి. 

ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు కరవు భత్యం పెరిగింది. కార్మికులకు 3.4 శాతం డీఏ పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. కార్మికులకు పెరిగిన డీఏ మే 1వ తేదీ నుంచి వర్తిస్తుందని టీఎంయూ నేతలు వెల్లడించారు.

16:18 - May 24, 2016

గుండె తడి ఆరడం లేదు. మనసు కుదుట పడటం లేదు.. ఆ పిలిపు కోసం వారి హృదయాలు పరితపిస్తున్నాయి... ఏడ్చి ఏడ్చి వారి కనీళ్ళు ఇంకి పోతున్నాయి.. గుండెల నిండా బాధను వెల గాక్కేందుకు కనీళ్ళు కూడా సహకరించడం లేదు. కళ్ళలో వత్తులేసుకొని ఎదిరి చూస్తున్నా అతని సమాచారం తెలియడం లేదు.. ఇది ఉపాధి కోసం వెళ్లి రాజస్తాన్ లొ అదృశ్యమైన  రమేష్ రెడ్డి కోసం కుటుంబ సబ్యులు పడుతున్న తపనా.. ఆవేదన 

33 మున్సిపాల్టీలు అమృత్ నగరాలు - మంత్రి నారాయణ..

విజయవాడ : 33 మున్సిపాల్టీలను అమృత్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రూ.800 కోట్లతో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతామని, కేంద్రం రూ. 400 కోట్లు, రాష్ట్రం రూ. 400 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఎల్ ఈడీ బల్బులు అమర్చిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని, ఇప్పటి వరకు 4.5 లక్షల వీధి దీపాలు అమర్చడం జరిగిందన్నారు. 

ఇందిరాపార్కు వద్ద టిడిపి మినీ మహానాడు..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద టిడిపి మినీ మహానాడును నిర్వహించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్య సేవలు అందడం లేదన్నారు. త్వరలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతామని, ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. 

విద్యుత్ వైర్లు తొలగిస్తుండగా వ్యక్తి మృతి..

నల్గొండ : సూర్యాపేట మండలం రూప్లా తండాలో లైన్ మెన్ తో కలిసి విద్యుత్ వైర్లు తొలగిస్తుండగా ప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్ తో చిన్న మల్లయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. డీఈ కార్యాలయం ఎదుట తండా వాసులు ఆందోళన చేపట్టారు. 

16:04 - May 24, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసి స్పెషల్‌ కౌన్సిల్ సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ కౌన్సిల్‌ సమావేశంలో ఇద్దరు మైనార్టీ కో-ఆప్షన్ సభ్యులతోపాటు మేధావి వర్గం నుంచి మరో ముగ్గురిని ఎంపిక చేశారు. మైనార్టీ కో-ఆప్షన్‌ సభ్యులుగా విద్యాస్రవంతి, హుస్సేన్‌లను ఎంపిక చేశారు. మేధావి వర్గం నుంచి గొట్టిముక్కల జ్యోతి, రాజుగుప్తా, సి.నర్సింహారావులను ఎంపిక చేశారు. సభ్యుల చేత మేయర్ బొంతు రామ్మోహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.  

 

16:01 - May 24, 2016

హైదరాబాద్ : ఏపీఆర్జేసీ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదలచేశారు. 23 గురుకుల పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా గొప్ప విషయమని గంటా అన్నారు.  మొత్తం మీద ఈ ఫలితాలు చాలా ప్రత్యేకమైనవి తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుకున్న వారిలో అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ లు అవ్వడం గర్వకారణమన్నారు. అలాంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. వచ్చే సంవత్సరం అన్ని గురుకుల పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటామని గంటా వెల్లడించారు. 

 

కూలిన ఎయిర్ అంబులెన్స్...

ఢిల్లీ : ఇంజిన్ లో సాంకేతిక లోపంతో నజఫర్ గఢ్ లోని కైర్ గ్రామంలో ఎయిర్ అంబులెన్స్ కూలింది. విమానంలో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

15:37 - May 24, 2016

ఢిల్లీ : నజఫర్ గఢ్ లోని ఎయిర్ అంబులెన్స్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంజిన్ లో సాంకేతిక లోపంతో నజఫర్ గఢ్ లోని కైర్ గ్రామంలో విమానం కూలిపోయింది. విమానంలో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.  

కాటేదాన్ లో భారీ అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెప్పుల దుకాణంలో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కేరళలో డీజిల్ వాహనాలపై నిషేధం..

కేరళ : పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించాలని కొచ్చి కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలోని మొత్తం ఆరు నగరాల్లో ఈ నిషేధాన్ని అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. 

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో సీఎం కేసీఆర్ సమావేశమైయ్యారు. ఇంజినీరింగ్ కాలేజీ ప్రతినిధులను సీఎం ఎంసీహెచ్‌ఆర్డీలో లంచ్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాలల్లో నాణ్యత పెంపుతో పాటు పలు అంశాలపై సమావేశంలో సీఎం చర్చించినట్లుగా సమాచారం.

డీఎంకే శాసనసభాపక్ష నేతగా స్టాలిన్..

చెన్నై : డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. దాంతో ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మారే అవకాశాలున్నాయి. 234 సీట్లు ఉన్న తమిళనాడులో డీఎంకే పార్టీ ఇటీవల ఎన్నికల్లో 89 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

26న తుమ్మల ప్రమాణం..

హైదరాబాద్ : తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఐఎస్ తో ఎలాంటి ముప్పు లేదు - రాజ్ నాథ్..

ఢిల్లీ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని భారత్‌కు తీసుకువస్తామని స్పష్టం చేశారు. 

15:24 - May 24, 2016

బాలీవుడ్ నటుడు 'రిషి కపూర్'..ఈయన ఈ మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని రోడ్లు..భవనాలు..ఎయిర్ పోర్టులకు నెహ్రూ కుటుంబాలకు చెందిన వారి పేర్లే పెడుతున్నారు..ఇవేమన్నా వారి అబ్బ సొత్తా..అవసరమైతే తన తండ్రి రాజ్ కపూర్ లేదా తన పేరు పెట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈ రోజు 'హస్తం' స్పందించింది. ముంబైలోని శివాజీ పార్కు ఎదుట ఉన్న 'సులభ్ కాంప్లెక్సు' కు రిషి కపూర్ పేరు పెట్టి కాంగ్రెస్ నిరసన తెలిపింది. మరోసారి నెహ్రూ కుటుంబంపై విమర్శలు చేస్తే సహించేది లేదని పేర్కొంది. మరి రిషి ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఢిల్లీ సమీపంలో విమాన ప్రమాదం

ఢిల్లీ : నఫర్ గడ్ లోని కైర్ గ్రామంలో విమానం ప్రమాదం జరిగింది. ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఎయిర్ అంబులెన్స్ కూలింది. విమానంలో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానం పాట్నా నుంచి ఢిల్లీకి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  

మోత్కుపల్లి గవర్నర్ అవుతారు - ఎల్ రమణ..

హైదరాబాద్ : తమ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్‌ అవుతారని ఆ పార్టీ తెలంగాణ నేత ఎల్. రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడిన ఘనత టీడీపీదేనని అన్నారు.

పోలీసుల అదుపులో విరసం నేతలు..

హైదరాబాద్ : నగరంలోని ఘట్‌కేసర్‌ దగ్గర విరసం నేతలు వరవరరావు, హరగోపాల్, వనమాల తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లో జరిగే టీడీఎఫ్‌ సభకు హాజరయ్యేందుకు వారు బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఘట్‌కేసర్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. 

రోడ్లు భవనాల శాఖపై మంత్రి తుమ్మల సమీక్ష..

హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష జరిపారు. 1,850 కిలోమీటర్ల జాతీయ రహదారులకు డీపీఆర్‌ తయారుచేస్తున్నామని, డీపీఆర్‌ను 3నెలల్లో కేంద్రానికి పంపుతామని మంత్రి తెలిపారు. 

విడతల వారీగా కాపుల హామీల అమలు - కళా వెంకట్రావు..

విజయవాడ : ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను విడతలవారీగా అమలు చేస్తామని టీడీపీ నేత కళా వెంకట్రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 

14:35 - May 24, 2016

గుంటూరు : టిడిపి - బిజెపి మధ్య విమర్శలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట ఆ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆరోపణలు..విమర్శలు చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా..ఇతర హామీలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరే ఇందుకు కారణం. తాజాగా ఎమ్మెల్యే ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనలో తొలి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు కేంద్రంపై వత్తిడి తెచ్చి విభజనకు సహకరించారని, రాష్ట్ర విభజనకు బీజేపీ సహకరించకుండా ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నిధులు..ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. 

విశాఖ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..

విశాఖపట్టణం : రాంకీ ఫార్మాసిటీలోని శ్రీకర్ కెమికల్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అమ్మోనియం నైట్రేట్ ట్యాంక్ పేలడంతో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి.  

మూడు పులి పిల్లల మృతి..

గుజరాత్ : సూరత్ లోని సర్తనా నేచర్ పార్కు లో గత పదిహేను రోజులుగా పులి పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. మొత్తం మూడు పులి పిల్లలు మృతి చెందాయి. 

14:09 - May 24, 2016

హైదరాబాద్ : క్షణికావేశానికి లోనై పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా కొందరు చిన్నారులు ఇళ్లలో నుండి పారిపోతున్నారు. తల్లిదండ్రులు మందలించారని ముగ్గురు చిన్నారులు ఇంటి నుండి పరారయ్యారు. జిల్లెలగూడలోని వెంకటగిరిలో కొంతమంది కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం ఉదయం శ్రీశైలం (10), రేణుక(8) శివ (7)లు ఆడుకోవడానికి బయటకు వెళ్లి సాయంత్రానికి వచ్చారు. దీనితో వారి తల్లిదండ్రులు కోపడ్డారు. ఇంత వరకు ఆటలేంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వీరు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీనితో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. సమీప బంధువుల ఇళ్లలో వెతికారు. కానీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు చిన్నారుల కోసం గాలింపులు చేపడుతున్నారు. 

14:05 - May 24, 2016

విజయవాడ : ఏపీ ప్రజారోగ్య శాఖ. ఈ పేరు వింటేనే ఠక్కున గుర్తొచ్చేది.. అంతులేని నిర్లక్ష్యం అంతకు మించిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం. పేదల ప్రాణాలు ఎలా పోతే మాకేంటి..? మాకు రావాల్సిన కమిషన్‌ వస్తే చాలు.. ఇదే ప్రజారోగ్యశాఖ సిబ్బంది, అధికారుల తత్త్వం. అస్మదీయులకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టేందుకు.. నిబంధనలను బేఖాతరు చేస్తారు. తమ అవినీతిని ఆక్షేపించిన కోర్టులనూ వీరు డోంట్‌కేర్‌ అంటారు. దీనికి చక్కటి నిదర్శనం.. చంద్రన్న సంచార వైద్యశాల పథకం.

ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవల పథకం....
పేద ప్రజలకు ఉచితంగా వైద్యపరీక్షలు అందించాలనే సదుద్దేశ్యంతో.. ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవల పథకాన్ని ప్రవేశ పెట్టింది రాష్ట్రప్రభుత్వం. రోగికి అయ్యే ఖర్చు మొత్తాన్నీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో.. రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇంతటి బృహత్తరమైన పథకాన్ని కూడా ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. అయితే.. ఇలా కట్టబెట్టే క్రమమూ... కాంట్రాక్టు పొందిన సంస్థ వ్యవహారమూ.. వివాదాస్పదమయ్యాయి.

ఏటా 3 కోట్ల ఎనభై లక్షల ప్రజాధనం.....
ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు.. అనుయాయులకు కట్టబెట్టారన్నది ఆరోపణ. దీనికోసం ఎల్‌-1 సంస్థను పక్కన పెట్టేశారన్న విమర్శా ఉంది. ఈ కాంట్రాక్ట్‌ కోసం సుమారు 8 సంస్థలు పోటీపడితే.. ఏపీకి చెందిన ప్రముఖ సంస్థ ఎల్‌-1గా నిలిచింది. కానీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా.. ఎల్‌-1 సంస్థ కన్నా 94 రూపాయలు అధికంగా కోట్‌ చేసిన మెడాల్‌ సంస్థకు టెండర్‌ను ఖరారు చేశారు. ఈ నిర్ణయం వల్ల.. ఏటా సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల ప్రజాధనం.. కార్పొరేట్‌ సంస్థకు అప్పనంగా చెల్లించాల్సి వస్తోంది. అసలే ఆర్థిక లోటుతో ఉన్న ఏపీలో.. అధికారుల చేతివాటం కారణంగా.. ఇన్ని కోట్లు వృథా అవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.

ఉచిత వైద్య పరీక్షల పథకాన్ని దక్కించుకున్న మెడాల్‌ సంస్థ....
ఇంతకీ ఎన్టీఆర్‌ ఉచిత వైద్య పరీక్షల పథకాన్ని దక్కించుకున్న మెడాల్‌ సంస్థ ఏమైనా పేరెన్నికగన్నదా..? అంటే అదీ లేదు. పైగా ఈ సంస్థకు ఇంత భారీ ప్రాజెక్టు స్వీకరించే అర్హత లేదనీ తెలుస్తోంది. 13 జిల్లాల్లో ఉచిత సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది లేదని, పైగా ఈ సంస్థ గత ట్రాక్‌కూడా సరిగా లేదని, గతంలో తమిళనాడు ప్రభుత్వంతో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుని చేతులెత్తేసిందనీ సమాచారం. గతానుభవం లేకుంటే ఏముంది..? చిత్తశుద్ధితో పని మొదలు పెడితే.. అంతా సవ్యంగానే సాగుతుంది అని భావిద్దామా అంటే.. ఆ అంశంలోనూ మెడాల్‌ సంస్థ ఫెయిలైంది. ఉచిత వైద్య పరీక్షల పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద అనంతపురం జిల్లాలో ప్రారంభించిన మెడాల్‌ సంస్థ, ఆదిలోనే అవకతవకలకు పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షలు చేయకపోయినా చేసినట్లుగా లెక్కలు చూపిందన్న ఆరోపణలు వచ్చాయి. అలాంటి సంస్థకు టెండర్‌ను ఎలా ఖరారు చేస్తారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాను చేయాల్సిన పనిని.. సబ్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. ఈ సంస్థ వందల కోట్ల రూపాయలు వెనకేసుకుందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెడుతున్న పథకాలను, అధికారులు తమ చేతి చమురు కోసం.. ఇలా నీరుగారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అస్మదీయులకు టెండర్లు ఖరారు.....
అడ్మినిస్ట్రేటివ్‌ రీజన్స్‌...! అంటే పరిపాలనా కారణాలు అని అర్థం. ఈ జంట పదాలే.. వైద్యారోగ్య ఉన్నతాధికారుల పంట పండిస్తోంది. ఈ జంట పదాలతో టెండర్లను అడ్డగోలుగా రద్దు చేయడం.. అనుంగులకు వాటిని కట్టబెట్టడం లాంటివి చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో టెండర్ల వ్యవహారం.. ఓ ప్రహసనంగా మారుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ... అస్మదీయులకు టెండర్లు ఖరారు చేయడం... దీనికోసం అవసరమైతే.. టెండర్‌ దక్కించుకున్న వారినుంచి దాన్ని లాక్కోవడం.. ఈ శాఖలో సర్వసాధారణమైపోయింది. టెండర్‌ దక్కించుకున్న అర్హత గల సంస్థలు.. బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించాక కూడా.. దాన్ని రద్దు చేయగల సమర్థులు వైద్యారోగ్య శాఖ అధికారులు. దానికి వారు చూపించే ఏకైక కారణం.. అడ్మినిస్ట్రేటివ్‌ రీజన్స్‌.

అగ్రశ్రేణి కంపెనీకి టెండర్ ఖరారు....
రాష్ట్రంలో ఉచితంగా అల్ట్రాసోనోగ్రఫీ టెస్టులు జరిపేందుకు ఐదు సంవత్సరాల కాల వ్యవధికి గాను, ఏపీ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ టెండర్లను ఆహ్వానించింది. పోటీలో ముందున్న ఓఅగ్రశ్రేణి కంపెనీకి టెండర్ ఖరారైంది. దీంతో సదరు సంస్థ.. బ్యాంక్‌ గ్యారెంటీ చూపి.. వర్క్‌ ఆర్డర్‌ కూడా తీసేసుకుంది. కానీ కొన్ని రోజులకే సదరు టెండర్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందుకు వారు చూపిన కారణం.. అడ్మినిస్ట్రేటివ్‌ రీజన్స్‌.

కోర్టు స్టేటస్‌కో విధింపు.....
అల్ట్రాసోనోగ్రఫీ ఉచిత పరీక్షల వ్యవహారంలోనూ అర్హమైన సంస్థ.. వైద్యారోగ్య శాఖ అన్యాయాన్ని కోర్టులో ప్రశ్నించింది. దీనిపై కోర్టు స్టేటస్‌కో విధించింది. అయితే అధికారులు కోర్టు ఉత్తర్వులనూ లెక్కచేయకపోగా... తమకు అనుకూలంగా ఉండే సంస్థకు టెండర్‌ కట్టబెట్టేలా సరికొత్త నిబంధనలను తయారు చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల నిర్వహణ విషయంలోనూ.. టెండర్ల గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం కన్నా.. నాకేంటి..? అన్న పద్ధతిలోనే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

ఇళ్లు వదిలి పారిపోయిన ముగ్గురు చిన్నారులు..

హైదరాబాద్ : తల్లిదండ్రులు మందలించడంతో చిన్నారులు శ్రీశైలం (10), రేణుక(8) శివ (7) ఇళ్లు వదిలి పారిపోయారు. ఈ ఘటన జిల్లెలగూడలోని వెంకటగిరి కాలనీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపులు చేపడుతున్నారు. 

కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు - నాయినీ..

నల్గొండ : కృష్ణా పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వాహనాల రద్దీకి తగ్గట్లుగా రోడ్ల విస్తరణను చేపట్టినట్లు, పుష్కరఘాట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. 

'హోదా'పై ఎమ్మెల్యే ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు..

గుంటూరు : ఎమ్మెల్యే ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనలో తొలి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు కేంద్రంపై వత్తిడి తెచ్చి విభజనకు సహకరించారని, రాష్ట్ర విభజనకు బీజేపీ సహకరించకుండా ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నిధులు..ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. 

టీడీఎఫ్ సభకు హైకోర్టు అనుమతి..

వరంగల్ : టీడీఎఫ్ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. సాయంత్రం 4 నుండి 6గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని షరతులతో కూడిన అనుమతినిచ్చింది.

13:46 - May 24, 2016

విజయవాడ :వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్‌కు విద్యార్థులందరూ ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. నీట్ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో దీనిపై స్పష్టత వచ్చిందని వెల్లడించారు. నీట్ వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేదుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కమిటీ వేశారని.. కమిటీ విధివిధానాల మీద నిపుణులతో చర్చించి ఎలా ముందుకు పోవాలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

13:44 - May 24, 2016

ఢిల్లీ : నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదించారని, సోమవారం సంతకం చేశారని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డా విలేకరులతో మాట్లాడారు. నీట్‌ 1 కు ఆరున్నర లక్షల మంది హాజరయ్యారని, జులై 24న నీట్-2 పరీక్ష ఉంటుందని అన్నారు. నీట్‌ రాయాలనుకునేవారు రాయొచ్చని స్పష్టం చేశారు. నీట్‌ను 7 రాష్ట్రాలు ఆమోదించాయని, ప్రభుత్వ సీట్లకు నీట్‌ నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు.
నీట్‌ నుంచి తమను కనీసం ఒక సంవత్సరంపాటైనా మినహాయించాలంటూ ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 20 వ తేదీన సమావేశమైన కేంద్ర కేబినెట్ నీట్‌ను సంవత్సరం పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రాలే మెడికల్‌ సీట్లకు ఎంట్రన్స్‌ నిర్వహించనున్నాయి. ఇప్పటికే మెడికల్ ఎంసెట్‌ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..ఫలితాలు కూడా విడుదల చేసింది. త్వరలో తెలంగాణలో మెడికల్ ఎంసెట్‌ నిర్వహించనున్నారు. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో నీట్ నుంచి ప్రభుత్వ సీట్లకు మినహాయింపు లభించినట్లైంది.

13:42 - May 24, 2016

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పంథాలతో ప్రజలకు గాలం వేస్తున్నారు. ఏటీఎం కార్డును లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు తెరలేపుతున్నారు. మోసగాళ్లు నోయిడా, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో మకాం వేసి డబ్బులు డ్రా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా నగదు మళ్లింపులు...
తాను బ్యాంకు అధికారిగా ఒక వ్యక్తి ఫోన్‌ చేస్తాడు. ఏటీఎం కార్డును గోల్డెన్‌ కార్డుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామనో, లేదంటే వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి కొత్త నెంబరు తీసుకోవాలనో సూచిస్తాడు. బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఈ మార్పులు జరుగుతాయని నమ్మబలికిస్తాడు. ఏటీఎంలో సాధారణంగా మొదటి ఆరు నెంబర్లు దాదాపుగా లక్షలాది మందికి ఒకేలాగా ఉంటాయి. దీంతో ఈ నెంబర్లు అతను చెప్పి మిగిలిన నెంబర్లు తీసుకుంటాడు. మీ పేరు, బ్యాంకు అకౌంట్‌ నెంబరు అతనే చెప్పడంతో నమ్మకం ఏర్పడి ఏటీఎం కార్డు వెనుక ఉన్న సివివి నెంబరునూ చెప్పేస్తున్నారు. అంతే ఇక మన ఖాతా వివరాలు అతని చేతిలోకి వెళ్లిపోవడంతో దర్జాగా ఆన్‌లైన్‌ ద్వారా నగదు మళ్లింపులకు రంగం సిద్ధం చేసుకుంటారు.

వివిధ రాష్ట్రాలలో సైబర్ ముఠా...

నేరగాళ్లు నోయిడా, న్యూఢిల్లీ, ముంబై, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ మోసాలను చేస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాలు తెరిచి వారి నుంచి ఏటీఎం కార్డులు సేకరిస్తారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన వెంటనే ఏటీఎం కార్డుల ద్వారా ఆ మొత్తాలను డ్రా చేస్తారు. ఇక అంతే అప్పటి వరకు ఉపయోగించిన సిమ్‌ కార్డులను తొలగిస్తారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. అంతే కాకుండా వారు దూర ప్రాంతాల్లో ఉండడంతో పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందులు తలెతుత్తున్నాయి. ఇదే నేరగాళ్లు పాలిట వరంలా,అమాయకులా పాలిట శాపంలా మారింది.

సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దర్యాప్తు....
కొంతకాలంగా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కొన్ని కేసులను దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో డబ్బు ఏ అకౌంట్‌కు బదిలీ అయ్యాయి, ఏయే ఏటీఎంలలో డ్రా చేశారు అన్న వివరాలు సేకరించి నిందితులను గుర్తిస్తున్నారు. దీంతో పాటు ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు చేపడుతూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బ్యాంకులు కూడా ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ తాము ఎవరికీ ఏటీఎం వివరాల కోసం ఫోన్‌ చేయడం లేదని, ఖాతాదారులు ఇది గమనించాలని హెచ్చరికలు చేస్తున్నారు.

ఫేక్ ఫోన్ కాల్స్ తో ప్రజలు అప్రమత్తం....
ప్రజలు చైతన్యవంతులు అయితే సగానికిపైగా మోసాలు తగ్గిపోతాయని పోలీసులు, బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎవరు ఊరికే ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు అడగరని.. ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. 

హిమాచల్ ప్రదేశ్ లో కారు బోల్తా..ముగ్గురి మృతి..

హిమాచల్‌ప్రదేశ్: కొండపై గల రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 

శ్రీనగర్ లో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఉద్యోగుల ఆందోళ..

శ్రీనగర్ : పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. డైలీ కార్మికులను క్రమబద్దీకరించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జీ చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి. 

13:17 - May 24, 2016

అక్కినేని నాగార్జున.. ఈ ఏడాది 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'ఓం నమో వెంకటేశ'కు సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారు. ఇందులో హథీరామ్ బాబాగా కనిపించడానికి నాగ్ సిద్ధమవుతున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
ఇప్పటికే ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం అనుష్క, 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్‌లను ఎంపిక చేసుకున్నారని టాక్. మరో పాత్ర కోసం 'విమలా రామన్‌'ను తీసుకున్నారని మరో టాక్. 'ఎవరైనా ఎప్పుడైనా' సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన విమలా రామన్ ఆ తర్వాత జగపతిబాబు, శ్రీకాంత్, తరుణ్ తదితర హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయం నిజమా కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

13:14 - May 24, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఆయన ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ఆయన నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడం తెలిసిందే. తాజాగా ఆయన ఎస్.జె.సూర్య సినిమాకు రెడీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. గతంలో వీరిరివురి కాంబినేషన్‌లో ఖుషి, కొమరం పులి సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. పవన్ స్థాయికి సరిపడేలా కథను సూర్య ప్లాన్ చేస్తున్నాడని టాక్. నిక్కబొడుచుకొని వైట్ అండ్ బ్రౌన్ హెయిర్‌తో ఉన్న పవన్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, సూర్య సినిమా కోసమే పవన్ ఇలా డిఫరెంట్‌గా కనబడుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రం శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనుందని సమాచారం.

లోయలో పడ్డ కారు..ముగ్గురు మృతి...

హిమాచల్‌ప్రదేశ్: కొండపై గల రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి...

ఖమ్మం : ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంజయ్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యులు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కో ఆప్షన్ సభ్యులు ఎన్నికయ్యారు.సభ్యులుగా విద్య స్రవంతి, హుస్సేన్, గొట్టిముక్కల జ్యోతి, రాజాగుప్త సి.నర్సింహరావులు ఎంపికయ్యారు. 

జులై 24న నీట్ -2 పరీక్ష - జేపీ నడ్డా..

ఢిల్లీ : నీట్ ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి సంతకం పెట్టారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు నీట్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయని తెలిపారు. రాష్ట్రాల వాదనలతో పాటు సిలబస్ మార్పును పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు. జులై 24న నీట్ -2 పరీక్ష జరుగుతుందని, నీట్ నుండి ప్రభుత్వ సీట్లకు మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. నీట్ పరీక్షకు ఇప్పటికే 7 రాష్ట్రాలు అంగీకరించాయని పేర్కొన్నారు. 

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇంజినీర్లు, అధికారులతో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించాలని అధికారులకు సూచించారు. గుత్తేదారులు, అధికారులు కుటుంబంలా కలిసి పనులు పూర్తి చేయాలని మంత్రి చెప్పారు.

ఎవరెస్ట్‌ శిఖరంపై నవ్యాంధ్ర యువపతాక....

విజయవాడ : ఎవరెస్ట్‌ శిఖరంపై నవ్యాంధ్ర యువపతాక ఎగురేసింది. ఎవరెస్ట్‌ శిఖరాన్ని గుంటూరు జిల్లా వాసి నీలిమ అధిరోహించారు. నీలిమను సీఎంచంద్రబాబు అభినందించారు. నీలిమ తన సాహస విన్యాసాలతో ఏపీకి, తద్వారా దేశానికి గర్వకారణంగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు.నీలిమ ప్రముఖ జర్నలిస్టు ఎన్‌ఐ శౌరయ్య కుమార్తె. ఎవరెస్ట్‌ను అధిరోహించిన నవ్యాంధ్ర తొలి మహిళగా నీలిమ రికార్డు సాధించారు. 

విశాఖ శ్రీకర్ కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం....

విశాఖపట్నం: నగరంలోని రాంకీ ఫార్మాసిటీలోని శ్రీకర్ కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అమ్మోనియం నైట్రేట్ ట్యాంక్ పేలి 8మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించారు. 

భానుడి తీవ్రతకు 315 మంది బలి....

హైదరాబాద్: వడగాలులకు ప్రభావానికి గురై తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 315 మంది ప్రాణాలు కోల్పోయారు. వేసవికాలం ప్రారంభం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఈ మరణాలు సంభవించాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అత్యధికంగా నల్లగొండలో 91 మంది మృతిచెందారు. ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో రాగల 48 గంటలు వడగాలుల తీవ్రత కొనసాగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

స్మార్ట్ లో వరంగల్ చోటు దక్కటం సంతోషం : మేయర్ నరేందర్

వరంగల్ : స్మార్ట్ సిటీస్ జాబితాలో వరంగల్‌కు చోటు దక్కడం సంతోషంగా ఉందని వరంగల్ మేయర్ నరేందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుని నగరాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించి అమలు చేస్తామని ప్రకటించారు. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శక పాలన అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

గౌహతికి బయలుదేరిన సీఎం బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు గౌహతి బయల్దేరారు. అసోం సీఎం సోనోవాల్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరుకానున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ లోక్‌సభనేత తోట నర్సింహం, మంత్రి యనమల ఉన్నారు. 

చంపేస్తామని నటికి బెదిరింపులు...

హైదరాబాద్  : పలు సినిమాల్లో సహాయ నటిగా నటించిన అపూర్వ ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది అపూర్వ. పలు సినిమాలు, టీవి సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న అపూర్వ తాజాగా ఫిలిం సిటీలో షూటింగ్ ముగించుకొని వస్తుండగా, తన కారు మరో కారుని ఢీకొట్టినట్టు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు టాక్. అయితే ఆ తర్వాత కొందరు వ్యక్తులు సిద్ధార్ధ్‌నగర్‌లోని తన ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించారని, తనకు ప్రాణ హాని ఉందంటూ ఫిర్యాదులో తెలిపింది.

ములుగులో మంత్రి పోచారం..

మెదక్‌: ములుగు మండలంలో హార్టికల్చర్‌ యూనివర్సిటీ స్థలాన్ని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులు హార్టికల్చర్‌ యూనివర్సిటీ బిల్డింగ్‌ నమూనాను పోచారంకు చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 1300కోట్లతో డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.

నీట్ ఆర్డినెన్స్ పై మంత్రి గంటా హర్షం..

విజయవాడ : నీట్‌ ఆర్డినెన్స్ పై మంత్రి గంటా హర్షం వ్యక్తం చేశారు. మోడీ, వెంకయ్యల జోక్యం వల్లే ఆర్డినెన్స్ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నీట్‌కు అందరినీ సిద్ధం చేస్తామని మంత్రి గంటా చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ఈనెల 28న అధ్యయనం చేస్తున్నామని, కొత్తగా టీచర్లను నియమిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

మాదాపూర్ లో మహిళ దారుణ హత్య....

హైదరాబాద్ : మాదాపూర్‌లోని నవభారత్ నగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని ఆధారాల కోసం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

తెలంగాణలో మండుతున్న ఎండలు..

హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రామగుండంలో 46, భద్రాచలం, ఆదిలాబాద్ లో 45 డిగ్రీలు, ఖమ్మం, నిజామాబాద్, హన్మకొండలలో 44 డిగ్రీలు, హైదరాబాద్, మెదక్ లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

గ్రీసులో శరణార్థుల తరలింపు..

గ్రీసు : శరణార్థులను స్థానిక పోలీసులు తరలిస్తున్నారు. మెసిడోనియా బోర్డర్ దగ్గర్లో ఇడోమీ శిబిరంలో తలదాచుకుంటున్న వేలాది మంది అక్రమ వలసదారులను మరో చోటుకు పంపిస్తున్నారు. 

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్..

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. మే 31 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగును. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 13న ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

11:52 - May 24, 2016

హైదరాబాద్: హైదరాబాద్‌ నకలీ రక్తం దందాలో ఎంతమంది ఉన్నారు..ఒక్క నరేంద్ర వల్ల జరిగే దందా కాదు..అయితే రక్త పిశాచికి సహకరించిందెవరు..? ఎవరెవరికి ఎంత ముట్టాయి..ఇందులో ఆస్పత్రికి చెందినవారి పాత్ర ఏంటి..? ఇలా ఎన్నో అనుమానాలతో రెండు బృందాలు తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర కోసం గాలింపు ముమ్మరం చేశాయి..ఇంతకీ నరేంద్రను దాచిందెవరు..??

నకిలీ రక్తం మాఫియా....
సంచలనం రేపిన నకిలీ రక్తం మాఫియా గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు..ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోఠి ఆస్పత్రిలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నరేంద్ర కోసం గాలింపు ముమ్మరం చేశారు...అయితే నరేంద్ర ఒక్కడే కాదని పలువురు సిబ్బంది, అధికారుల పాత్ర ఉండి ఉండొచ్చన్న అనుమానాలతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు...నిందితుడు పట్టుబడితే కానీ అసలు విషయాలు బయట పడేలా కనిపించడం లేదు...మరో పక్కన అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారించి వివరాలు ఆరా తీస్తున్నారు...ఇప్పటికే కింద స్థాయి నుండి, పై స్థాయి అధికారి వరకు నోటీసులు జారీ చేసిన పోలీస్ లు వారు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకుండా ఉన్నాయని తెలుస్తోంది..దీంతో నరేంద్ర పట్టుపడితే గాని అసలు వాస్తవాలు గుట్టు రట్టేయ్యే అవకాశం లేదని తెలుస్తుంది...

ఏడాదిగా నరేంద్ర ఇదే దందా చేస్తున్నాడా..?
ఈ కేస్ లో రంగంలోకి దిగిన రెండు టీమ్స్ లలో ఒకటి గుంటూరు, ఖదిరి, ఖమ్మం ప్రాంతాల్లో నరేంద్ర కోసం గలిస్తున్నాయి. వారి బంధువులు, స్నేహితులు, సన్నిహితులపై నిఘా పెట్టాయి. మరో టీం నిందితుడి సెల్ ఫోన్ నంబర్స్ డాటాను విశ్లేషిస్తున్నాయి. గత సంవత్సర కాలంగా నకిలీ రక్తం బాగోతం నడుస్తున్నట్లు అనుమానిస్తున్నారు..కేవలం ఒకే వ్యక్తితో ఇంత పెద్ద దందా జరగడం కూడా సాధ్యం కాదని పోలీసులకు స్పష్టత వచ్చింది. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంలో పంపకల్లో తేడా రావడంతో విషయం బయటపడినట్లు తెలుస్తోంది. నకిలీ రక్తం విషయంలో గతంలో వారం రోజులుగా ఆస్పత్రిలో గొడవ జరిగినట్లు పోలీస్ ల దర్యాప్తులో తేలింది. ఈ విషయం అప్పుడే చెప్పకుండా వారం తరువాత తమ దృష్టికి తీసుకు రావడంపై అధికారులను విచారిస్తున్నారు.

ఎంతమందికి ముడుపులు అందాయి..?
ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు లకు సంబందించిన లేబుల్స్ ఎవరు తయారు చేశారు.. విషయం పొక్కడంతో నరేంద్ర ఇంటికి వెళ్లి సమాచారం చెప్పిన వ్యక్తులు ఎవరు అన్నదానిపై ఫోకస్ పెట్టారు. నకిలీ బ్లడ్ మాఫియా కేసును చేధించేందుకు పోలీస్ లు 24 గంటలపాటు శ్రమిస్తున్నారు. కేసు నమోదు కాగానే సెలవుల పై వెళ్ళిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. ఏఏ ఉద్యోగికి ఎంత ముడుపులు చెల్లించారనేది ప్రధాన నిందితుడు పట్టుబడితేనే స్పష్టం అవుతుంది. 

11:46 - May 24, 2016

ప్రేమించుకున్నారు...పెద్దలు కాదన్నారు...గ్రామస్తుల సహకారంతో ఒక్కటైన జంట...
ప్రేమించి వివాహం చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట..మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రుచిత..నరేష్ లు ప్రేమించుకున్నారు. గ్రామస్తుల సహకారంతో వీరు ఒక్కటయ్యారు. నెల రోజుల క్రితం రుచిత అత్తారింట్లో అడుగు పెట్టింది. కానీ అప్పటికే ధనదాహంతో ఉన్న ఆ కుటుంబం చేతికి రుచిత చిక్కింది. ఎన్నో హింసలకు గురైంది. చివరకు తనకు తాను ఈ లోకం నుండి వెళ్లిపోయింది..

11:43 - May 24, 2016

నల్గొండ : మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముకుందాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

11:40 - May 24, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసి స్పెషల్‌ కౌన్సిల్ సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. కాసేపటి క్రితం ప్రత్యేక స్పెషల్ కౌన్సిల్ సమావేశమైంది. ఈ కౌన్సిల్‌ సమావేశంలో ఇద్దరు మైనార్టీ కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. విద్యాస్రవంతి, హుస్సేన్‌లను ఎన్నుకోగా వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. పట్టణ పాలనలో అనుభవం మరో ముగ్గురిని కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. 

11:36 - May 24, 2016

ఢిల్లీ  : రెండో విడత స్మార్ట్ సిటీల జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. రెండో విడతలో 13 స్మార్ట్ సిటీలను ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి వరంగల్‌కు ఈజాబితాలో స్థానం దక్కింది. స్మార్ట్‌ సిటీలుగా ధర్మశాల, చండీగడ్, రాయ్పూర్, కలకత్తా, భాగల్‌పూర్, పనాజీ, రాంచీ, పోర్టుబెయిల్‌, ఇంఫాల్‌, అగర్తల, ఫరీదాబాద్‌ నగరాలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. తొలి విడతలో 20 ఆకర్షణీయ నగరాలను, 497 అమృత్ పట్టణాలను ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే 84 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. పట్టణాలు,నగరాల్లో వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతులు పెంపొందిస్తామని వెంకయ్య వెల్లడించారు. మోడీ రెండేళ్ల పాలన పూర్తి అవుతున్న సందర్భంగా రూపొందించిన కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు నినాదాలు ఉండేవని.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోందని వెంకయ్య చెప్పారు. 

సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న హరీష్ రావత్..

ఉత్తరాఖండ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ ఆయన్ను ప్రశ్నించనుంది.

ఏపీ రెసిడెన్షియల్ ప్రవేశ ఫలితాల విడుదల..

విజయవాడ : ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. 

ఐదేళ్లలో మౌలిక వసతులు - వెంకయ్య...

ఢిల్లీ : తొలి విడత 20 స్మార్ట్ సిటీలు..497 అమృత్ పట్టణాలను ఎంపిక చేయడం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం రెండో విడత స్మార్ట్ నగరాలను ప్రకటించారు. 13 నగరాలతో కూడిన జాబితాను ఆయన విడుదల చేశారు. పట్టణాలు, నగరాల్లో ఐదేళ్లలో మౌలిక వసతులను పెంపొందిస్తామని, ఇప్పటికే 84 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. నగరాల్లో సాంస్కృతిక పునర్జీవనం కోసం ప్రయత్నిస్తున్నట్లు, స్వచ్ఛ భారత్ ఉద్యమంలా సాగుతోందని తెలిపారు.

 

కిరణ్ కాటన్ మిల్లులో ఫైర్ ఆక్సిడెంట్..

ప్రకాశం : ఇంకోల్లు కిరణ్ కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రూ. 30 లక్షల విలువైన పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. 

తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులపై బాబు అసంతృప్తి..

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిర్మాణ పనులపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున పనులు వేగవంతం చేయాలని ఎల్ అండ్ టి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ భవనం ఆలస్యమైనా ఫర్వాలేదని, ముందుగా ఐదు బ్లాక్ ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. 

సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న హరీష్ రావత్..

ఉత్తరాఖండ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ ఆయన్ను ప్రశ్నించనుంది.

రెండో విడత స్మార్ట్ నగరాలు..

ఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు 13 నగరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ కు స్థానం లభించింది. లక్నో, ధర్మశాల, చండీగఢ్, రాయపూర్, కోల్ కతా, భాగల్ పూర్, పనాజీ, పోర్టు బ్లెయిర్, రాంచీ, ఇంఫాల్, అగర్తలా, ఫరీదాబాద్ నగరాలను రెండో విడత స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. 

10:53 - May 24, 2016

గుంటూరు : జపాన్‌కు చెందిన బృందం ఈరోజు అమరావతిలో పర్యటిస్తోంది. వెలగపూడికి చేరుకున్న జపాన్‌ బృందానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక రంగానికి ఉన్న అనుకూలతలపై ఈ బృందం అధ్యయం చేయనుంది. కాగా మంగళవారం అస్సోం పర్యటనకు వెళ్ళనున్న సీఎం చంద్రబాబు కూడా జపాన్ బృందంతోపాటు సచివాలయ పనులను పరిశీలించారు.

10:44 - May 24, 2016

అసోం :  మంగళవారం  బీజేపీ ప్రభుత్వం కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర గవర్నర్‌ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య..... సోనోవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అసోం అసెంబ్లీకి గతనెల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. ఈనెల 19న చేపట్టిన ఓట్ట లెక్కింపులో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీలోని 126 సీట్లకుగాను.... బీజేపీ కూటమికి 86 స్థానాలు దక్కాయి. కలమదళం సొంతగా 60 సీట్లు దక్కించుకుంది. దీంతో సర్బానంద సోనోవాల్‌ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో అప్పటి వరకు కొనసాగిన కేంద్ర మంత్రి పదివికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన అసోం గణపరిషత్‌, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ సభ్యులు కూడా సోనోవాల్‌ మంత్రివర్గంలో చేరనున్నారు. అయితే కేబినెట్‌ బెర్త్‌ల విషయంలో మూడు పార్టీల మధ్య ఏకాభ్రియం కుదరలేదు. AGP ఐదు మంత్రి పదవులు కావాలని కోరుతంటే... డీపీఎఫ్ నాలుగు బెర్త్‌ల కోసం డిమాండ్‌ చేస్తోంది. సర్బానంద సోనోవాల్‌ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గుజరాత్‌ సీఎం ఆనందీ బెన్‌ పటేల్‌, యోగా గురు రాందేవ్‌ బాబాతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 

10:41 - May 24, 2016

నల్లగొండ  : సెల్ చార్జర్ ప్రాణాలు తీస్తోంది. చార్జర్ పెట్టుకుంటూ పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ చిన్నారి బలైంది. ఈ ఘటన పెద్దవూర మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తుంగతుర్తి గ్రామానికి చెందిన చిన్నారి ప్రవళిక ఆడుకుంటూ సెల్‌చార్జర్‌ వైర్‌ నోట్లో పెట్టుకోవడం..అదే సమయంలో ఫ్లగ్‌లో చార్జర్‌ ఉండడంతో విద్యుదాఘాతానికి గురైంది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

ప్రారంభమైన లాసెట్ పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణలో లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఇవాళ లాసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షకు భగీరథ ఎస్-1, ఐదేళ్ల ఎల్ఎల్ బీ ప్రవేశ పరీక్షకు రామప్ప ఎస్-1 ప్రశ్నాపత్రాన్ని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ చిరంజీవులు ఎంపిక చేశారు. 

10:33 - May 24, 2016

ఢిల్లీ : నీట్ ఆర్డినెన్స్ పై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు. చైనా పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది నీట్ లేనట్లే. దేశ వ్యాప్తంగా మెడికల్ కోర్సుల ప్రవేశం కోసం ఒకే పరీక్ష పేరిట కేంద్రం ప్రతిపాదించిన నీట్ ను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు మెజారిటీ రాష్ట్రాలు నీట్ ను ఈ ఏడాది వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నీట్ ను ఈ ఏడాది వాయిదా వేస్తూ మొన్నటి కేబినెట్ సమావేశంలో కేంద్రం తీర్మానాన్ని చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి న్యాయ సలహా కోరారు. నీట్ పై ఆర్డినెన్స్ తీసుకరావాల్సిన అవశ్యకతను సోమవారం రాష్ట్రపతికి కేంద్ర మంత్రి నడ్డా వివరించారు. 

10:24 - May 24, 2016

ఒడిశా : రాజధాని భువనేశ్వర్ వద్ద ప్రయివేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తులసమ్మ అనే మహిళ మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. నరసరావుపేట ప్రాంతానికి చెందిన 40 మంది ఈ బస్సులో ఒరిస్సా టూర్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సనందించాలని ఆదేశించారు. మృతులంతా గుంటూరు జిల్లాకు చెందినవారు. తులసమ్మ మృతి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాత్రి సంయంలో అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగటంతో స్థానికంగా వున్న కొందరూ బాధితుల నుండి నగలు, నగదు దోచోకెళ్లారు. డ్రైవరు నిర్లక్ష్యంతో బస్సు కల్వర్టు ఢీకొనటంతో ఈ ఘటన జరిగిందని సమాచారం.

10:23 - May 24, 2016

సమంతా..టాలీవుడ్ లో ప్రస్తుతం ఈమెపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఓ యువహీరోతో ప్రేమలో ఉన్నానని..అతనితో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని..అయితే అతని పేరు చెప్పడానికి సమంతా నిరాకరించింది. పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు అతని పేరును తెలియజేస్తానని చెప్పింది. దీనితో ఆ యువహీరో ఎవరనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ చెన్నై ముద్దుగుమ్మ లవ్ ఎఫైర్‌పై మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సమంతా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. తాను చెప్పేంతవరకు ఎవరూ తన పెళ్లి గురించి మాట్లాడవద్దని, అన్ని విషయాల్ని స్వయంగా తానే వెల్లడిస్తానని సమంతా ట్విట్టర్ ద్వారా కోరింది. మరి సమంత ట్వీట్స్ తో కథనాలకు ఫుల్ స్టాప్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

కాసేపట్లో జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశం కాసేపట్లో జరగనుంది. ఐదుగురు కో - ఆప్షన్ సభ్యులను కౌన్సిల్ ఎన్నుకోనుంది. ఇద్దరు మైనార్టీ, ముగ్గురు పట్టణ పాలనలో అనుభవం ఉన్న వారిని కౌన్సిల్ ఎన్నుకోనుంది.

 

వెలగపూడిలో బాబు..

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు వెలగపూడికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న తాత్కాలిక రాజధాని పనులను పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, దేవినేనిలున్నారు. 

10:11 - May 24, 2016

కోయంబత్తూర్‌: ఆటోలో ఎక్కడికెళ్లినా, ఎంత దూరం ప్రయాణం చేసినా చార్జి కేవలం రూ.1 మాత్రమే. వినడానికి వింతగా ఉంది కదా. కాని ఇది నిజం. తమిళనాడులో ప్రయాణికులకు ఓ ఆటోడ్రైవర్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే కోయంబత్తూర్‌ నగరానికి చెందిన మతివనన్‌ అనే ఆటో డ్రైవర్‌ 25 ఏండ్లుగా ఆటో నడుపుతున్నాడు. ఆయనకు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్‌ అంటే ఎనలేని అభిమానం. ఏఐఏడీఎంకే పార్టీని స్థాపించింది రామచంద్రనే. ఆయన మరణం తర్వాత జయలలితకు ఆరాధ్య అభిమాని అయ్యాడు. ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా తన తరఫున ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సోమవారం రోజంతా తన ఆటోలో ప్రయాణించే వారికి చార్జీ కేవలం ఒక్క రూపాయే అని ప్రకటించాడు. ఎంత దూరం ప్రయాణించినా గానీ ఒక్క రూపాయి ఇస్తే సరిపోతుందని ఆటోపై ప్రకటన చార్టు అంటించాడు. తమిళనాడులో నాయక ఆరాధన ఎక్కువగా ఉందనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం.

10:07 - May 24, 2016

కుర్రకారుకు కొత్త జోష్‌!. జింబాబ్వే టూర్‌కు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలక్షన్‌ కమిటీ.. కుర్రాళ్లకు జై కొట్టింది. దేశవాళీ, ఐపీఎల్‌లో మెరిసిన ఆణిముత్యాలకు జాతీయ జట్టులో చోటు దక్కింది. ఫయజ్‌ ఫజల్‌, యుజ్వేందర్‌ చాహల్‌, జయంత్‌ యాదవ్‌, కరుణ్‌ నాయర్‌, మన్‌దీప్‌ సింగ్‌లు తొలిసారి టీమ్‌ ఇండియా తలుపు తట్టారు. సీనియర్లతో కూడిన టెస్టు బృందంలో యువ షర్దుల్‌ ఠాకూర్‌కు పిలుపు వచ్చింది.

ఐదు కొత్త ముఖాలు..
ఊహించినట్టే సీనియర్లకు విశ్రాంతి దక్కినా.. జట్టు ఎంపిక మాత్రం అనూహ్యమే!. జింబాబ్వేలో పర్యటించనున్న వన్డే జట్టులో ఏకంగా ఐదు కొత్త ముఖాలు చోటుచేసుకున్నాయి. దేశవాళీలో సత్తా చాటిన విదర్బ బ్యాట్స్‌మెన్‌ (శశాంక్‌ మనోహర్‌ సారథ్యంలోని అసోసియేషన్‌) ఫయజ్‌ ఫజల్‌, మన్‌దీప్‌ సింగ్‌ సహా ఐపీఎల్‌లో మెరిసిన యుజ్వెందర్‌ చాహల్‌, జయంత్‌ యాదవ్‌, కరుణ్‌ నాయర్‌లు జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్నారు. మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని 16 మందితో కూడిన టీమ్‌ ఇండియా.. జింబాబ్వే పర్యటనలో మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది. వెస్టిండీస్‌లో పర్యటించనున్న టెస్టు జట్టుకు విరాట్‌ కోహ్లి నేతృత్వం వహించనుండగా.. అజింక్య రహానెకు ఉపసారథి హోదా దక్కింది. ముంబయి సీమర్‌ షర్దుల్‌ ఠాకూర్‌ టెస్టు జట్టులోకి రాగా.. గాయం నుంచి కోలుకున్న మహ్మద్‌ షమికి మళ్లీ పిలుపొచ్చింది. జూలై- ఆగష్టులో కోహ్లిసేన విండీస్‌తో నాల్గు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. జింబాబ్వే పర్యటన జూన్‌ 11న తొలి వన్డేతో ఆరంభం కానుంది. సోమవారం ముంబయి లోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో పాల్గొన్న సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. వన్డే, టీ20, టెస్టు జట్లను ఎంపిక చేసింది.

సీనియర్లకు నో..
వన్డే, టీ20 జట్టు ఎంపిక కాస్త ఆశ్చర్యకరమే. ఆస్ట్రేలియా, ఆసియా కప్‌, టీ20 వరల్డ్ కప్‌లలో పాల్గొన్న జట్టు సభ్యులకు ప్రస్తుత పర్యటనలో చోటు దక్కలేదు. అశ్విన్‌, ధావన్‌, గుర్‌కీరత్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, విరాట్‌ కోహ్లి, భువనేశ్వర్‌ కుమార్‌, అజింక్య రహానె, ఇషాంత్‌ శర్మ, రోహిత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, హర్భజన్‌ సింగ్‌, పవన్‌ నేగీ, ఆశీష్‌ నెహ్రా, హార్థిక్‌ పాండ్య, సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌లు జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాలేదు!. వీరిలో కోహ్లి, ధావన్‌, రోహిత్‌, రహానెలకు మాత్రమే విశ్రాంతి దక్కినట్టు చెప్పవచ్చు.

టెస్టు జట్టు : విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మురళీ విజరు, శిఖర్‌ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌, ఛతేశ్వర్‌ పుజార, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, వృద్దిమాన్‌ సాహా, అశ్విన్‌, అమిత్‌ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, షర్దుల్‌ ఠాకూర్‌, స్టువర్ట్ బిన్ని.

వన్డే జట్టు : మహేంద్రసింగ్‌ ధోని (కెప్టెన్‌), లోకేశ్‌ రాహుల్‌, ఫయజ్‌ ఫజల్‌, మనీశ్‌ పాండే, కరుణ్‌ నాయర్‌, అంబటి రాయుడు, రిషీ ధావన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ధవళ్‌ కులకర్ణి, జశ్‌ప్రీత్‌ బుమ్రా, బరిందర్‌ శ్రన్‌, కేదార్‌ జాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, యుజ్వెందర్‌ చాహాల్‌.

10:04 - May 24, 2016

ఇంతకాలం మనం బర్గర్లు, పిజ్జాలు వంటివి ఆరోగ్యానికి మంచివి కావని వింటూ వచ్చాం. కానీ వాటితో పాటు బ్రెడ్డులు, బన్నులు కూడా మన ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నిర్వహించిన అధ్యయనంలో బ్రెడ్డులు, బన్నులు, బర్గర్లు, పిజ్జాల తయారీలో పొటాషియం బ్రోమేట్‌, అయోడేట్‌ అనే విష రసాయనాలను వాడుతున్నట్టు వెల్లడైంది. సీఎస్‌ఈ ఢిల్లీలోని 38 ప్రముఖ బ్రాండ్లపై పరిశోధన నిర్వహించగా 84 శాతం కంపెనీలలో వీటిని వాడుతున్నట్టు తేలింది. ఈ రెండు రసాయనాల్లో మొదటిది 2బీ కార్సినోజెన్‌ కేటగిరీకి చెందినది. ఇది క్యాన్సర్‌ కారకం. ఇక అయోడేట్‌ థైరాయిడ్‌ వ్యాధికి దారితీస్తుంది. మన దేశంలో ఉత్పత్తిదారులు బ్రెడ్డును తయారీలో ఉపయోగించే పిండిలో పొటాషియం బ్రోమేట్‌, అయోడేట్‌లను కలుపుతున్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 'బ్రెడ్‌ తయారీలో ఈ రెండు రసాయనాల వాడకాన్ని చాలా దేశాల్లో నిషేధించారు. ఎందుకంటే ఇవి ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. కానీ భారత్‌లో వీటిపై నిషేధం లేదు' అని సీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు సిఫార్సు..
బ్రెడ్డు తయారీలో పొటాషియం బ్రోమేట్‌ వాడకాన్ని తక్షణం నిషేధించాలని సీఎస్‌ఈ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కు సిఫార్సు చేసింది. భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) కూడా నిర్ధారిత ప్రమాణాలలో తగిన సవరణలు చేయాలని సీఎస్‌ఈ కోరింది. 'మేం 84 శాతం నమూనాలలో పొటాషియం బ్రోమేట్‌, అయోడేట్‌లను కనుగొన్నాం. వీటిలో కొన్నింటిని బైటి ప్రయోగశాలలకు పంపించి వాటిలో పొటాషియం బ్రోమేట్‌, అయోడేట్‌లు ఉన్నట్టుగా రూఢ చేసుకున్నాం. మేం లేబుళ్లను చెక్‌ చేసి ఆయా పరిశ్రమల వారితో, శాస్త్రజ్ఞులతో మాట్లాడాం' అని సీఎస్‌ఈ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌, లాబ్‌ హెడ్‌ చంద్రభూషణ్‌ అన్నారు. ఈ రెండు విష రసాయనాల వాడకం విస్తృతంగా కొనసాగుతున్నట్టుగా మా అధ్యయనంలో తిరుగులేని విధంగా రుజువైందని ఆయన చెప్పారు. సీఎస్‌ఈకి చెందిన కాలుష్య పర్యవేక్షణ ప్రయోగశాల ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. నిరుడు నెస్లేకు చెందిన మ్యాగీ ప్యాకెట్లలో మోతాదుకు మించి సీసం ఉందని ప్రయోగశాలల్లో బైటపడ్డ తర్వాత, ఇది దేశంలో మరో పెద్ద ఆహార కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. ఆహార నియంత్రణా సంస్థ మ్యాగీని నిషేధించగా, గత సంవత్సరం నవంబర్‌లో బాంబే హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తేసింది.

09:58 - May 24, 2016

గోల్డెన్‌ పామ్‌: ఐ డానియల్‌ బ్లేక్‌ (కెన్‌ లోచ్‌)
గ్రాండ్‌ ప్రిక్స్: ఇట్స్‌ ఓన్లీ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్ (క్సావియర్‌ డోలన్‌)
ఉత్తమ దర్శకుడు: ఒలివర్‌ అస్సాయాస్‌ (పర్సనల్‌ షాపర్‌)
క్రిస్టియన్‌ ముంగియు (గ్రాడ్యూయేషన్‌)
ఉత్తమ నటుడు: షాహబ్‌ హోస్సేని( ది సేల్స్‌మన్‌)
ఉత్తమ నటి: జాక్లిన్‌ జోస్‌(మా రోసా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : అస్ఘర్‌ ఫర్హాది(ది సేల్స్‌మన్‌)
ప్రత్యేక జ్యూరీ: ఆండ్రియా ఆర్నాల్డ్ (అమెరికన్‌ హానీ)
పాల్మే డి హోనర్‌: జీన్‌ పియరీ లీయుడ్‌
కెమెరా డి ఓర్‌: 'డివైన్స్'(హౌడా బెనైమినా)


పాల్మే డి ఓర్‌ (లఘు చిత్రం): టైమ్‌కోడ్‌(జాంజో జిమెనెజ్‌)
స్పెషల్‌ మెన్షన్‌(లఘు చిత్రం): 'ద గర్ల్ హూ డాన్స్‌డ్‌ విత్‌ ది డెవిల్‌'(జావో పాలో మిరాండా మారియా)
ఎకుమెనికల్‌ జ్యూరీ : 'ఇట్స్ ఓన్లీ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్ (క్సావియర్‌ డోలన్‌)
అన్‌ సర్టెన్‌ రిగార్డ్‌ ప్రైజ్‌: ద హ్యాపీయెస్‌ డే ఇన్‌ ది లైఫ్‌ ఆఫ్‌ ఒల్లీ మాకీ (జుహో కౌస్మానెన్‌), జ్యూరీ ప్రైజ్‌: హార్మోనియం (కోజి ఫుకాడా), ఉత్తమ దర్శకుడు: మాట్‌ రోస్‌(కెప్టెన్‌ ఫాంటాస్టిక్‌), స్క్రీన్‌ప్లే: డెల్ఫిన్‌, మురియెల్‌ కౌలిన్‌(ది స్టాపోవర్‌), ప్రత్యేక జ్యూరీ: మైఖేల్‌ డుడోక్‌ ది విట్‌(ది రెడ్‌ టుర్టిల్‌)
డైరెక్టర్స్‌ ఫోర్ట్‌నైట్‌..: ఆర్ట్‌ సినిమా అవార్డు: ఊల్ఫ్‌, షీప్‌ (షాహర్బానూ సాదత్‌)
సొసైటీ ఆఫ్‌ డ్రామటిక్‌ ఆథర్స్‌ అండ్‌ కంపోజర్స్‌ ప్రైజ్‌: ది టుగెదర్‌ ప్రాజెక్టు (సోల్వేజ్‌ అన్‌స్పాచ్‌)
యూరోపా సినిమాస్‌ లేబుల్‌: 'మెర్కార్నారీ'(సచా వోల్ఫో)
క్రిటిక్స్ వీక్‌.. : గ్రాండ్‌ ప్రైజ్‌: మిమోసాస్‌(ఆలివర్‌ సాక్సే),విజనరీ ప్రైజ్‌: ఆల్బమ్‌(మెహ్మెట్‌ కాన్‌ మెట్రోగ్లు)
సొసైటీ ఆఫ్‌ డ్రామటిక్‌ ఆథర్స్‌ అండ్‌ కంపోజర్స్‌ ప్రైజ్‌: డైమాండ్‌ ఐస్లాండ్‌.

09:53 - May 24, 2016

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందవ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'. క్రిష్‌ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్‌ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్‌పై వై.రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ, 'నందమూరి బాలకృష్ణ వందవ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మొరాకోలో ఇటీవల ప్రారంభించిన తొలి షెడ్యూల్‌ పూర్తయ్యింది. మొరాకోలోని అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని షూట్‌ చేయడం జరిగింది. ఎన్నో హాలీవుడ్‌ చిత్రాలు షూటింగ్‌ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లొకేషన్లలో ఇంత పెద్ద షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకున్న మొదటి తెలుగు సినిమాయే కాదు, మొదటి ఇండియన్‌ చిత్రం కావడం విశేషం. మొరాకోలోని అట్లాస్‌ స్టూడియోస్‌, వరు జార్జియస్‌లో సినిమాను చిత్రీకరించాం. ఒకటవ శతాబ్దానికి చెందిన సన్నివేశాలతోపాటు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో హాలీవుడ్‌ ఫైటర్స్‌తో బాలకృష్ణ, కబీర్‌ బేడికి మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. దాదాపు వెయ్యిమంది ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే రెండు వందల గుర్రాలు, ఒంటెలను ఉపయోగించాం. విజయవంతంగా తొలి షెడ్యూల్‌ పూర్తి కావడం చాలా ఆనందంగా ఉంది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ షూటింగ్‌లో నందమూరి బాలకృష్ణ ప్రతి రోజు పద్నాలుగు గంటల పాటు వర్క్ చేశారు. షూటింగ్‌ ప్రారంభంలో ఎంత ఎనర్జీగా ఉన్నారో, ఇప్పుడు కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఆయన ఎనర్జీ ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని అన్నారు.

09:51 - May 24, 2016

ఉత్తరాఖండ్  : సీఎం హరీష్‌రావత్‌ నేడు సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఓటుకు నోటుకు కేసులో హరీష్‌రావత్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ముడుపులిచ్చి తనకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ప్రయత్నించారని హరీష్‌రావత్‌పై ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన హరీష్‌రావత్‌ను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల్లో అసెంబ్లీలో బలనిరూపణకు ప్రయత్నించిన హరీష్‌రావత్... ఎమ్మెల్యేలకు ముడుపులిచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి బయటపడింది. ఈ నేపథ్యంలో సీబీఐ హరీష్‌రావత్‌ను ప్రశ్నించనుంది.  

09:48 - May 24, 2016

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మంగళవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలోని రెండు స్థానాలూ అధికార పార్టీకే దక్కే అవకాశం ఉండడంతో...అభ్యర్థులను ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.

పరిశీలనలో సీఎల్‌ రాజం పేరు....
టీఆర్‌ఎస్‌లో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. పలువురు సీనియర్లు రాజ్యసభ స్థానంపై కన్నేశారు. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఐదారుగురు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన పార్టీ కోశాధికారి దామోదర్ రావు, కెప్టెన్‌ లక్ష్మీకాంత్ రావు ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు పార్టీకి అండగా ఉన్న మరో నేత సీఎల్ రాజం పేరు కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మరో నేత డి.శ్రీనివాస్ కూడ రాజ్యసభ స్థానం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న నాయిని నర్సింహారెడ్డిని రాజ్యసభకు పంపించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. సామాజిక సమీకరణల నేపథ్యంలో రెండు స్థానాలు అగ్రవర్ణాలకు చెందిన వారికే దక్కుతాయా...బలహీన వర్గాలకు ఓ స్థానాన్ని కేటాయిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

రెండో ఛాన్స్ కోసం గుండు యత్నాలు.....
బలహీన వర్గాలకు ప్రాధాన్యం కల్పించినట్లయితే D. శ్రీనివాస్ ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న గుండు సుధారాణి కూడా గులాబి గూటికి చేరుకోవడంతో.... మరో సారి తనకు అవకాశం కల్పించాలని ఆమె ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీఆర్ఎస్ కు రాజ్యసభలో ఒకే స్థానం ఉంది. ఈ ఎన్నికల అనంతరం రాజ్యసభలో గులాబి పార్టీ బలం మూడుకు పెరుగనుంది.

అమరావతిలో జపాన్ బృందం పర్యటన..

గుంటూరు : నూతన రాజధాని అమరావతిలో జపాన్ బృందం పర్యటిస్తోంది. వెలగపూడికి చేరుకున్న ఈ బృందానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారులు ఘన స్వాగతం పలికారు. 

ఒడిషాలో రోడ్డు ప్రమాదం..

కటక్ : ఒడిశాలోని జుజుపూర్ ప్రాంతంలో యాత్రికుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా 40 మందికి గాయాలయ్యాయి. గుంటూరు నుండి వీరు కాశీకి వెళుతున్నారు. 

09:39 - May 24, 2016

హైదరాబాద్ :  ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహం గులాబి పార్టీలో కూడా చర్చనీయంశంగా మారుతోంది. ఓ ఎన్నికను ఎదుర్కొనేందుకు పదవిలో ఉన్న మరో నేతను రంగంలోకి దించుతూ గులాబి దళపతి అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉప ఫలితాలు పార్టీకి కలిసి వస్తున్నా.. ఖాళీ అవుతున్న పదవుల భర్తీపై నేతల్లో ఉత్కంఠ

దయాకర్‌ ఎంపికకు అనేక పరిణామాలు....
తెలంగాణా కేబినెట్‌లో అనూహ్యంగా చోటు సంపాదించుకున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పార్లమెంట్ సభ్యుత్వానికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానం భర్తీ చేయడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. కడియం లాంటి నేతను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటూ పార్లమెంట్ ఉప ఎన్నికలను ఎదుర్కొన్న గులాబి పార్టీ అభ్యర్థి ఎంపికపై కూడా ఉత్కంఠ రేపింది. పార్టీలో సీనియర్‌కు అవకాశం దక్కినా.. దయాకర్ ఎంపికకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఖమ్మం నుంచి తుమ్మలకు మంత్రి పదవి...
తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికకు మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావును అభ్యర్థిగా రంగంలోకి దించింది అధికార పార్టీ. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తుమ్మల ఓటమి చెందినా.. పార్టీ అవసరాల దృష్ట్యా ఖమ్మం జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం కల్పించేందుకు ఆయనను మంత్రివర్గంలో చేర్చుకున్నారు కేసీఆర్‌. అనంతరం ఆయనను శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.

ఎమ్మెల్సీ పదవికి తుమ్మల రాజీనామా ...
ఉపఎన్నికలో తుమ్మల శాసనసభ్యుడిగా విజయం సాధించడంతో.. మండలి స్థానానికి ఆయన రాజీనామా చేశారు. అయితే ఖాళీ అయిన శాసనమండలి స్థానం ఎవరికి కట్టబెడతారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. సాధారణ ఎన్నికలకు ముందు దాదాపు 20 మంది నేతలకుపైగా ఎమ్మెల్సీ అవకాశమిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం తుమ్మల స్థానం ఖాళీ కావడంతో దానిపై అనేకమంది భారీ ఆశలు పెట్టుకున్నారు.
సీటు ఎవరికి దక్కుతుందోనని నేతల్లో టెన్షన్‌ ....
ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతున్న నేపథ్యంలో.. తమ జిల్లాకు చెందిన నేతకే అవకాశం ఇవ్వాలని నేతలు తమ అభిప్రాయాన్ని కేసీఆర్‌కు తెలిపినట్లు సమాచారం. అలాగే గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఓ సీనియర్‌ నేత.. తనకే మండలి స్థానం ఫైనల్‌ చేశారని.. దీంతోపాటు.. హోంమంత్రి పదవి కూడా తనకే దక్కుతుందంటూ సన్నిహితులతో చెబుతున్నట్లు ప్రచారం జరగడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది.

మూడు మండలి స్థానాల భర్తీకి కానున్నాయి....
అయితే.... తుమ్మల రాజీనామా చేస్తున్న స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో మొత్తం మూడు మండలి స్థానాలను గులాబి పార్టీ త్వరలో భర్తీ చేయనుంది. అయితే చాలామంది సీనియర్ నేతలు తుమ్మల స్థానంపై ఆశలు పెంచుకున్నారు. 

మాదాపూర్ లో మహిళ హత్య..

హైదరాబాద్ : మాదాపూర్‌లోని నవభారత్ నగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

09:27 - May 24, 2016

నల్గగొండ  : యాదాద్రిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని యాదాద్రి నరసింహుని పాదాల చెంత టీడీపీ నేత మోత్కుపల్లి నరస్సింహులు రాత్రి నిద్ర దీక్ష చేశారు. ఇప్పటికే జిల్లా కోసం ఆయన అనేక ఉద్యమాలు చేపట్టారు. భువనగిరి జిల్లా కేంద్రంగా యాదాద్రి జిల్లాను సీఎం కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా సాధన కోసం అందరు కలిసిరావాలని కోరారు.

కేరళలో ముందుగానే రుతు పవనాలు..!

ఢిల్లీ : కేరళలో ఒక వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రారంభం కావొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఈ స్థితిలో పశ్చిమ కనుమలలో బలమైన గాలులు వీస్తున్నందున ఒక వారం ముందుగానే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారుల అంచనా.

వెలగపూడికి సీఎం బాబు..

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడిలో పర్యటించనున్నారు. వచ్చే నెల 27 నాటికి సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సీఎం బాబు పరిశీలించనున్నారు. 

చికాగోలో మంత్రి కేటీఆర్ కు ఘన స్యాగతం..

చికాగో : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు తెలంగాణ ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఇల్లినాయిస్ రాష్ట్ర డిప్యూటతి గవర్నర్ ట్రే చిల్ర్డెస్..కామర్స్ అండ్ ఎకనామిక్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెడ్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. 

ఆర్టీసిలో వికలాంగులకు రాయితీలు....

హైదరాబాద్ : ఆర్టీసి బస్సులో ప్రయాణించే వికలాంగులకు రాయితీపై బస్‌పాసులు జారీ చేస్తున్నట్లు పికెట్ డిపో మేనేజర్ వెంకటస్వామి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బస్‌పాస్‌లు జారీ చేసేందుకు జూబ్లీబస్‌స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పా టు చేశామన్నారు. బస్‌పాస్‌లు పొందాల్సిన వారు అంగవైకల్య ధ్రువీకరణ పత్రంతో పాటు, పాస్‌పోర్టు ఫొటో అదే విధంగా అంగవైకల్యం గల ఫొటో జత చేసి అందజే యాలని సూచించారు. కౌంటర్ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ములుగు, మెదక్ లో పర్యటించనున్న మంత్రి పోచారం..

మెదక్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం ములుగు, జగ్ దేవ్ పూర్ లో పర్యటించనున్నారు. ఉద్యానవన ప్రాంగణాన్ని, నర్సన్నపేటలో బిందు సేద్యాన్ని మంత్రి పోచారం పరిశీలించనున్నారు. 

అక్టోబర్ లో బాహుబలి -2 ?....

హైదరాబాద్ : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి తెలిపిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. బాహుబలి-2 కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మంచి రసవత్తరమైన ఘట్టంలో వుండగా మొదటి భాగాన్ని దర్శకుడు పూర్తి చేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేదానిపై ఎంతటి చర్చ జరిగిందో తెలిసిందే.ఈ అంశంపై సోషల్ నెట్ వర్క్ లో ఎన్నో కమెంట్స్ చూశాం. నవ్వుకున్నాం. మరి ఆ ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ నెల వరకు షూటింగ్ జరుపుకొని, ఆ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంది.

పాలమూరు ప్రాజెక్టుపై మంత్రి హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : పాలమూరు ప్రాజెక్టు భూసేకరణపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. 

నేడు సీబీఐ ఎదుట సీఎం హరీష్ రావత్..

ఉత్తరాఖండ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్‌రావత్ మంగళవారం సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ ఆయన్ను ప్రశ్నించనుంది.

నేటి నుండి రాష్ట్రపతి చైనా పర్యటన..

ఢిల్లీ : నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రణబ్ చర్చిస్తారు.

నేటి నుండి రూపాయికి నల్లా కనెక్షన్...

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగిలిన 73 నగర, పురపాలక సంస్థల పరిధిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి.

లా కోర్సు ప్రవేశ పరీక్ష..ప్రశ్నపత్రం ఎంపిక..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రాలను కాకతీయ యూనివర్సిటీ వీసీ చిరంజీవులు ఎంపిక చేశారు. లాసెట్ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు భగీరథ ఎస్-1 ప్రశ్నాపత్రం, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు రామప్ప ఎస్-1, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు గోల్కొండ ఎస్-2 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. 

నేడు టీఎస్ టెట్ కీ విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్ టెట్) 'కీ'ని మంగళవారం విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షలోని ప్రశ్నలపై అభ్యంతరాలుంటే ఈ నెల 26 వరకు ఫిర్యాదు చేయవచ్చు. 

నేడు సీఎంగా సోనోవాల్ ప్రమాణ స్వీకారం...

అసోం : సీఎంగా సర్బానంద సోనోవాల్ మంగళవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. సోనోవాల్‌తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

08:49 - May 24, 2016

ఢిల్లీ : రెండు రోజుల ఇరాన్‌ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశం తిరిగొచ్చారు. మోదీ టూర్‌లో భారత్‌-ఇరాన్‌ల మధ్య దైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని భావిస్తున్నారు. పరస్పర అభివృద్ధిపై రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చాబహార్‌ ఓడరేవును అభివృద్ధి చేయడంతోపాటు... మౌలిక వసతుల కోసం ఇరాన్‌కు 500 మిలియన్‌ డాలర్ల సాయం అందచేయాలని మన దేశం నిర్ణయించింది.
ప్రధానికి ఘనస్వాగతం పలికిన ఇరాన్ అధ్యక్ష భవనం...
రెండు రోజుల ఇరాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. టెహ్రాన్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నప్పుడు ఘనస్వాగం లభించింది. ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ మోదీకి స్వాగతం పలికారు. అధ్యక్షభవనంలో సైనిక వందనం స్వీకరించారు.

చాబహార్‌ పోర్టు అభివృద్ధికి ఒప్పంద సంతకాలు....

ఆతర్వాత మన ప్రధాని మోదీ...ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. చాబహార్‌ పోర్టు అభివృద్ధి ఒప్పందంపై భారత్‌-ఇరాన్‌లు సంతకాలు చేశాయి. ఇది చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు. మన దేశం ఇరాన్‌ నుంచి భారీగా చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకుంటోంది. భారత్‌ ఇంధన అవసరాల దృష్ట్యా ఇది కీలకమైన ఒప్పందంగా పరిగణిస్తున్నారు. పాక్‌లోని గ్వదర్‌ నౌకాశ్రమాన్ని చైనా అభివృద్ధి చేస్తున్న తరుణంలో... చాబహార్‌ ఓడరేవు అభివృద్ధికి మనదేశం సహాయం చేయడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఒమన్‌ సింధుశాఖలో చైనా నుంచి మన దేశానికి ఎదురువుతున్న సవాళ్లను అధిగమించేందుకు చాబహార్‌ పోర్టు దోహదపడుతుందని భావిస్తున్నారు.
హజవాయువు పైపులైన్‌ నిర్మాణానికి ప్రతిపాదన..
ఇరాన్‌ నుంచి పాకిస్థాన్‌ మీదుగా భారత్‌కు సహజవాయువు పైపులైన్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ పాక్‌ ఇందుకు సహకరించడంలేదు. దీంతో చాబహార్‌ నౌకాశ్రయాన్ని నిర్మిస్తే ఇరాన్‌ నుంచి సముద్రమార్గం ద్వారా నేరుగా మనదేశానికి సహజవాయువు సరఫరాకు మార్గం సుగమం అవుతుంది. పాకిస్థాన్‌లోని గ్వదర్‌కు చాబహార్‌ కేవలం 72 కి.మీ. దూరంలోనే ఉంది. మనదేశం నుంచి అఫ్గనిస్థాన్‌కు సరకు ఎగుమతి చేయాలంటే మధ్యలో ఉన్న పాకిస్థాన్‌ నుంచి పలు సమస్యలు ఎదురువుతున్నాయి. ఇరాన్‌-అఫ్గనిస్థాన్‌ ఇరుగుపొరుగు దేశాలు. చాబహార్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆఫ్గన్‌ వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇరాన్‌-పాకిస్థాన్‌ల మధ్య సత్సంబంధాలు అంతగాలేవు. చాబహార్‌ పోర్టు నిర్మాణంతో మధ్యప్రాచ్యంలో భారత్‌ పట్టు పెరిగే అవకాశం ఉంటుంది.

వాణిజ్య విస్తరణకు కొత్త మార్గాలు....
చాబహార్‌ పోర్టు ఇరాన్‌, అఫ్గన్‌లతోపాటు మధ్య ఆసియా దేశాలైన తుర్కమెనిస్థాన్‌, ఉజ్జెకిస్థాన్‌, తజికిస్థాన్‌... తదితర దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించేందుకు మనకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. చాబహార్‌ పోర్టు ప్రాజెక్ట్‌లో ఇరాన్‌, అఫ్గనిస్థాన్‌లు భాగస్వాములుగా చేరడం వలన పాక్‌-చైనాలకు ఓ ముందస్తు హెచ్చరికలాగా పని చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే అఫ్గనిస్థాన్‌లోని డెలారం నుంచి ఇరాన్‌లోని జరంజ్‌ వరకు భారత్‌ పెద్ద రహదారిని నిర్మించింది. దీనిని చాబహార్‌ వరకు పొడింగించే ప్రతిపాదలను కూడా పరిశీలనలో ఉంది. ఇది కార్యరూపం దాల్చితే మనదేశానికి ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు. భారత్‌-ఇరాన్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగేందుకు చాబహార్‌ ఓడరేవు దోహదం చేస్తుంది. ఇరాన్‌ పర్యటను మన ప్రధాని మోదీ గర్వకారణంగా భావిస్తున్నారు

నేడే ఇంటర్ సప్లిమెంటరీ....

హైదరాబాద్ : ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారం భంకానున్నాయి. ఈనెల 31 వరకు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి.

08:22 - May 24, 2016

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం  కట్టే సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఏపీలో సోమవారం కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే ఏపీ ఎడారవుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు ఎటువంటి చర్యలూ తీసుకోవటంలేదని నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో తాడూరి శ్రీనివాస్ (టీఆర్ ఎస్), విజయ్ కుమార్ (టీడీపీ నేత),శివాజీ( కాంగ్రెస్ అధికార ప్రతినిధి) పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ విజువల్ ని క్లిక్ చేయండి ..మరింత సమాచారం తెలుసుకోండి.

08:12 - May 24, 2016

తమిళనాడు : తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు పథకాల హామీలపై జయలలిత తొలి సంతకం చేశారు. వ్యవసాయ రుణమాఫి, ఉచిత విద్యుత్‌, విద్యార్థులు ఉచిత అల్పాహారం తదితర పథకాలను జూన్‌ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 5 వందల మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.

07:59 - May 24, 2016

సముద్రంలో చేపల వేట నిషేధం కొనసాగుతోంది. నెల రోజుల క్రితం అమలులోకి వచ్చిన చేపల వేట నిషేధం జూన్ 12వరకు వుంటుంది. ప్రతి ఏటా ఈ సీజన్ లో 45 రోజుల పాటు చేపల వేటపై నిషేధం విధించడం వాటి పునరుత్పత్తి కోసం తప్పనిసరి అవసరం. అయితే ఈ 45 రోజులు ఉపాధి లేక మత్స్యకారులతో పాటు అనుబంధ వ్రుత్తులవారు అవస్థపడుతుంటారు. చేపలవేట నిషేధకాలంలో ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. చేపల వేట నిషేధం కారణంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి? ప్రభుత్వం ముందు మత్స్యకారుల సంఘాలు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? మన దేశంలో మత్స్య సంపద పెంపుదలకు ఉన్న అవకాశాలేమిటి? అవరోధారాలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం నేత శ్రీనివాస్ చెప్పే మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:45 - May 24, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అఖిలపక్షం వేసిన తర్వాతే జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. ఇక టీఆర్‌ఎస్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌ చేస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ మండిపాటు ....
టిఆర్ఎస్ ప్రభుత్వం తెర‌పైకి తెచ్చిన కొత్త జిల్లాల అంశం సెగ‌పుట్టిస్తోంది. ఇప్పటికే జిల్ల్లాల‌కోసం ఆందోళనలు షురూ అయ్యాయి. తమ ప్రాంతాన్ని జిల్లాలుగా చేయాలంటూ నేతలు పోటాపోటీగా రోడ్ల మీదకు వస్తున్నారు. ఆదిలాబాద్ నుండి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ వ‌ర‌కు ఇదే పరిస్థితి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపిస్తోంది. ప్రజల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందంటూ విమర్శల వర్షం కురిపిస్తోంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా కలెక్టర్ల నివేదికలతో జిల్లాలను ఎలా విభజిస్తారంటూ ప్రశ్నిస్తోంది.

కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ ఎటాక్....
ఇక కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య ఉప ఎన్నికల వేదికగా డైలార్‌ వార్‌ కొనసాగింది. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు మీద మాటల యుద్ధం సెగ పుట్టిస్తోంది.

07:39 - May 24, 2016

హైదరాబాద్ : పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల ఏర్పాటు ఉండే విధంగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జూన్‌ 2 తర్వాత వర్క్‌షాపు నిర్వహించి.. కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయన్న కేసీఆర్‌ .. జిల్లాలోని ఏ ప్రాంతంనుంచైనా 70 కిలోమీటర్లలోపు జిల్లా కేంద్రం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
దాదాపు ఆరు గంటలపాటు సమావేశం...
హైదరాబాద్‌ ఎంసీహెచ్‌ఆర్డీలో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన సమావేశంలో.. జిల్లాల ఏర్పాటు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, భూసమస్యలపై చర్చించారు.

పరిపాలన సౌలభ్యానికి నూతన జిల్లాలు....
పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉండాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 153 అసెంబ్లీ నియోజకవర్గాలు కానున్నాయని.. 24 లేదా 25 జిల్లాలు చేసే ప్రతిపాదన ఉన్నట్లు సీఎం తెలిపారు. జిల్లాల ఏర్పాటుపై అనేక అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను కేసీఆర్‌ ఆదేశించారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి చూసినా జిల్లా కేంద్రం 70 కిలోమీటర్లలోపు ఉండేలా చూడాలన్నారు. ఒక్కో జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలు,.. సగటున 20 మండలాలు ఉండేవిధంగా చూడాలన్నారు. జూన్‌ 2 తర్వాత హైదరాబాద్‌లో వర్క్‌షాపు పెట్టుకుని జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు చేద్దామని సూచించారు. మండలాలను కూడా పునర్వ్యవస్థీకరించాలని.. మండల కేంద్రానికి దగ్గరున్న గ్రామాలను అదే మండలంలో చేర్చాలన్నారు. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని సూచించారు. ఇక నాయకులు, పార్టీల డిమాండ్‌ ప్రకారం కాకుండా.. ప్రజల సౌలభ్యం మేరకు జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు....
ఇక ఈ సమావేశంలో జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లకు కేసీఆర్‌ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పతాకావిష్కరణ చేయాలని.. అన్ని కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. అనాధ శరణాలయాలు, అంధ పాఠశాలలు, ఆస్పత్రులలో స్వీట్లు పంచాలన్నారు. వేడుకల కోసం ప్రతి జిల్లాకు 30 లక్షల రూపాయలు నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం నియామకపత్రాలను అందించాలని ఆదేశించారు.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు : కేసీఆర్
ఇక రాష్ట్రంలో భూవివాదాల్ని పరిష్కరించి, భూమి రికార్డులను సరిచేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని.. వాటిని అసైన్డ్‌దారులకు అప్పగించాలి లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా తెల్లకాగితాలపై జరిగిన భూక్రయవిక్రయాలన్నీ.. జూన్‌ 2 నుంచి 10 వరకు భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. ఐదెకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి.. పేరు మార్పిడి చేయాలని ఆదేశించారు. 8 రోజుల తర్వాత వివరాలన్నీ కంప్యూటర్‌లో అప్‌గ్రేడ్‌ చేయాలని ఆదేశించారు. అలాగే వారసత్వంగా సంక్రమించిన భూముల పేరు మార్పిడి వ్యవహారంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. డబ్బులివ్వనిదే పని జరగడం లేదన్నారు. దరఖాస్తు వచ్చిన 10 రోజుల్లోనే పేరు మార్పిడి చేసి.. 11వ రోజు కలెక్టర్‌కు వివరాలు పంపాలని అధికారులను ఆదేశించారు. అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం....
వాతావరణం కొంత చల్లబడినా ఎండాకాలం అయిపోలేదని..ప్రజలకు మంచినీరు సరఫరాతోపాటు ఇతర అన్ని కార్యక్రమాలను కొనసాగించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ కోసం ఇప్పటినుంచే సిద్దం కావాలని అధికారులకు సూచించారు. ప్రత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం నిర్దేశించారు. అదేవిధంగా రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాదాపు ఆరు గంటల పాటు కొనసాగిన సమావేశంలో కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. 

07:30 - May 24, 2016

గుంటూరు : నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్‌ కూలిపోయి ఏడుగుర్ని బలిగొన్న కేసు దర్యాప్తు నత్తనడక నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కేసును నీరుకార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన చోటుచేసుకుని వారం రోజులు గడుస్తున్నా... బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు సెల్లార్‌ దుర్ఘటన కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నం...
గుంటూరులో సెల్లార్‌ కూలిపోయిన కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. బిల్డర్‌ రాజకీయంగా పులుకుబడి కలిగిన వ్యక్తికావడంతో... అన్ని స్థాయిల్లో, అందర్నీ మేనేజ్‌ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఘటన జరిగిన రోజు నిందితులను అరెస్టు చేస్తామని హడావుడి చేసిన పోలీసు అధికారులు... అరెస్టు చేయిస్తామని ప్రగల్బాలు పలికిన రాజకీయ నాయకులు ఇప్పుడే ఈ ఊసే ఎత్తకపోవడం పలు అనుమానాలను తావిస్తోంది.
నిందితుల అరెస్ట్‌ కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు...
ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏడుగుర్ని బలిగొన్న ఈ కేసులో నిందితులు అరెస్టు కోసం బాధితుల కుటుంబ సభ్యులు భారమైన హృదయాలతో ఎదురు చూస్తున్నా అధికారుల్లో చలనం కనిపించడంలేదు. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో జాప్యానికి కారణం ఏంటి ? నిర్లక్ష్యం ఎరిదన్న విషయాన్ని తేల్చే అంశంలో పోలీసులే ఆలస్యం చేస్తున్నారా ? దీని వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా ? సెల్లార్‌ కూలిన ఘటనతో తమకు సంబంధింలేదని ఎవరికి వారు తప్పించుకుతిరిగే ప్రయత్నాలు చేస్తుంటే..... పోలీసులు, జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేసు మాఫీకి చేతులు మారిన లక్షల రూపాయలు....
ఈ ఘటన జరిగిన తర్వాత భవన యజమాని చుక్కపల్లి రమేష్‌తోపాటు సైట్‌ ఇంజినీర్‌, ఇద్దరు మేస్త్రిపై కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. నగరపాలక సంస్థ అధికారులు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల వంతున పరిహారం చెల్లించామంటూ సామాజిక కోణం మాటున నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలున్నాయి. పరిహారం చెల్లించిన తర్వాత ఇంకా కేసులెందుకంటూ... అధికారులందరూ కూడా బిల్డర్‌ చుక్కపల్లి రమేష్‌కు వంతపాడే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మనుషుల ప్రాణాల విలువను డబ్బుతో వెలకటుతూ కేసును కోల్డ్‌స్టోరేజ్‌లో పెట్టే చర్యలు ప్రారంభమయ్యాయని బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కోట్లు కుమ్మరించి కేసు నుంచి బయటపడే యత్నం....
నిర్లక్ష్యం కారణంగానే నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్‌ కూలిందని ఈ రంగానికి చెందిన నిపుణులు నిర్ధారిస్తున్నా... యాధృచ్చికంగా జరిగిన సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. కేసు మాఫీ కోసం ఇప్పటికే లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. కోట్లు కుమ్మరించైనా కేసు నుంచి బయటపడేందుకు బిల్డర్‌ చుక్కపల్లి రమేష్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. బిల్డర్‌ తానే అయినప్పటికీ... భవన నిర్మాణ బాధ్యతలను కాంట్రాక్టర్‌కు అప్పగించినట్టు సరికొత్త డ్రామాకు తెరతీసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం అన్ని కోణాలో కేసు దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. దర్యాప్తు కొలిక్కి వచ్చిన తర్వాతే చర్యలు ఉంటాయంటున్నారు. డబ్బుకు లోకం దాసోహం.. అన్న తీరులో కేసులను నీరు కారుస్తారా ? లేక నిందితులను అరెస్టు చేసి నిజాయితీని నిరూపించుకుంటారో.. చూడాలి.

07:08 - May 24, 2016

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఇంటర్ బోర్డు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పేపర్‌ లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌ను నివారించేందుకు తొలిసారిగా దాదాపుగా అన్నీ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఫస్టియర్‌ పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్‌ పరీక్షలను మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు.

సప్లిమెంటరీకి ఇంటర్  బోర్డు సర్వం సిద్ధం...
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు బోర్డు సర్వం సిద్దం చేసింది. ఈ నెల 24వ తేది నుంచి 31వ తేది వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా మాస్ కాపీయింగ్ వంటి సంఘటనలు అరికట్టేందుకు 90 శాతం సెంటర్లలో సిసి కెమెరా నడుమ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంటముందే చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను లోపలికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

జూన్‌ 1 వ తేదీన సప్లిమెంటరీ ప్రారంభం....

జూన్‌ 1 వ తేదీన మూల్యాంకనం ప్రారంభించి జూన్ 25 లోపు ఫలితాలను వెల్లడిస్తామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. వాటిపై ప్రిన్సిపల్‌ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 799 పరీక్ష కేంద్రాల్లో 4 లక్షల 73 వేల 450 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 3లక్షల 13 వేల 647 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వుండగా.. ఒక లక్షా 59 వేల 803 మంది సెకెండియర్ స్టూడెంట్స్ పరీక్ష రాయబోతున్నారు.

రీ కౌంటింగ్ కు 26 వేల మంది విద్యార్థులు...
అయితే రీ వెరిఫికేషన్ , రీ కౌంటింగ్‌కు 26 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 2,400 మంది దాకా విద్యార్థులకు అదనంగా మార్కులు కలిసినట్లు బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. కాగా ఇంటర్మీడియట్‌ సెకెండియర్ లో విద్యార్థుల మార్కుల జాబితాను నాలుగురోజుల క్రితమే ఎంసెట్‌ కన్వీనర్‌కు అందజేసినట్లు తెలిపారు.

జూనియర్‌ కాలేజీల గుర్తింపుకు ప్రత్యేక యాప్...
మరోవైపు రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలను సులువుగా గుర్తించే విధంగా త్వరలోనే ప్రత్యేక యాప్‌ను రూపొందించే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అనుమతి లేకుండా కాలేజీల తరలింపును కొంత కట్టడి చేయొచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

07:04 - May 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మెడికల్ సీట్ల భర్తీ కోసం నిర్వహించాల్సిన ఎంసెట్‌- 2 షెడ్యూల్‌ ప్రకటన ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. నీట్‌ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతే ఎంసెట్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలని టి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రపతి ప్రణబ్ ఆర్డినెన్స్ పై సంతకం చేయకపోవడం, న్యాయ సలహా కోరిన నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే ఎంసెట్ 2 ఆలస్యం కానుంది.

న్యాయసలహా కోరిన రాష్ట్రపతి ప్రణబ్....
తెలంగాణ మెడికల్ సీట్లకు మరోసారి నిర్వహించే ఎంసెట్ ఎగ్జామ్ ఆలస్యం కానుంది. షెడ్యూల్ విడుదల అవుతుందనుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ఆర్డినెన్స్ పై న్యాయ సలహా కోరడం జరిగింది. రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది నుంచి అన్ని రాష్ర్టాలు నీట్‌ ద్వారానే మెడికల్‌ సీట్లను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మినహాయించి మిగిలిన సీట్ల కోసం ఎంసెట్‌ను మే 15వ తేదిన నిర్వహించారు. అయితే నీట్‌ను ఈ ఏడాదికి మినహాయిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్రంలో మరోసారి ఎంసెట్‌ను నిర్వహించాల్సి వచ్చింది.

మినహాయింపు కోరిన 20 రాష్ట్రాలు ....
దాదాపుగా 20 రాష్ట్రాలు నీట్ కి మినహాయింపు ఇవ్వాలని కోరడంతో కేంద్రం మరోసారి పునరాలోచించి నీట్ కి ఈ ఏడాది మినహాయిస్తూ ఆర్డినెన్స్ ని జారీచేసింది. అయితే ఈ ఆర్డినెన్స్ ని శనివారం రాష్ట్రపతి పంపడంతో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పలుసందేహాలు వ్యక్తం చేస్తూ న్యాయ సలహాకోరారు. ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన కారణాలపై ఆరా తీయడంతో వాటిపై కేంద్రం రాష్ట్రపతికి వివరణ ఇవ్వనుంది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి దేశంలో అందరికీ నీట్‌ వర్తించనుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే నీట్‌ మొదటి పరీక్ష మే 1వ తేదీన జరిగింది. రెండో పరీక్ష జూలై 24 న యథాతధంగా జరుగునుందని కేంద్ర మంత్రి వివరించారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేడు చైనా పర్యటనకు వెళుతున్నారు కాబట్టి ఆర్డినెన్స్ ని రాష్ట్రపతి ఆమోదం తెలపగానే తెలంగాణలో ఈ నెలాఖరులోగా పరీక్ష నిర్వహించే అవకాశాలు వున్నాయి. 

06:56 - May 24, 2016

మహబూబ్ నగర్ : శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్ బాబు గ్రామాలను దత్తత తీసుకు న్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న చాలాకాలం తర్వాత.. ప్రిన్స్ తరపున ఆయన సతీమణి హెల్త్ క్యాంపు నిర్వహించారు. త్వరలో మహేశ్‌బాబు గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించడంతో గ్రామస్థులు ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కొత్తూర్ మండలంలోని సిద్ధాపూర్‌లో సమస్యలపై 10టీవీ ప్రత్యేక కథనం.

శ్రీమంతుడి దత్తత గ్రామం సిద్ధాపూర్...
శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు తన స్వగ్రామానికి వెళ్లి అభివృద్ధి చేస్తాడు. గ్రామస్థులందరిలో స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలుస్తాడు. కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ వెనుకబడ్డ గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ లోని తన స్వగ్రామం బుర్రిపాలెంతో పాటు... తెలంగాణలో పాలమూరు జిల్లాలోని కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను ఎంపిక చేసుకున్నారు.

నమ్రత హెల్త్ క్యాంపు....
నిత్యం సినిమా షూటింగ్ లో బిజీగా ఉండే మహేశ్ కు గ్రామాన్ని సందర్శించడానికి వీలు కాలేదు. ఇటీవలే పదిరోజుల క్రితం మహేశ్ బాబు సతీమణి నమ్రతాశిరోద్కర్ సిద్ధాపూర్ గ్రామానికి చేరుకొని అక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించారు.

గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం : నమ్రత
గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించిన నమ్రత త్వరలో మహేశ్ బాబు పర్యటిస్తారని తెలిపారు. దీంతో గ్రామస్థుల్లో సంతోషం నెలకొంది. మహేష్‌బాబు దత్తత తీసుకున్న గ్రామం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తూరు మండలం సిద్దాపూర్‌ గ్రామపంచాయతీని ఆయన ఎంచుకున్నారు. సిద్దాపూర్ లో పంచాయతీ పరిధిలో 720 కుటుంబా లున్నాయి. గ్రామ జనాభా 3400 కాగా.. పంచాయతీ పరిధిలో ఏన్గులమడుగుతండా, చింతగట్టుతండా, పులిచర్లకుంట తండాలున్నాయి.

మహేష్‌ బాబు దత్తత గ్రామంలో కుంటుపడిన అభివృద్ధి....
ఈ తండాల్లో సీసీ రోడ్లు లేవు. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఒకేచోట ఉన్నా శిథిలావస్థకు చేరాయి. 280 మంది విద్యార్థులకు సరిపోను గదులు లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం సరిగ్గాలేవు. అండర్ గ్రౌండ్ డ్రయినేజ్ లేదు, గ్రామంలో కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం, పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. ముఖ్యంగా సిద్దాపూర్ గ్రామంలో పశుపోషణ ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి పాలను హైదరాబాద్, షాద్ నగర్ తీసుకువెళు తుంటారు. అందుకే పశువైద్యశాల ఉంటే బాగుంటుందని గ్రామస్థులు అంటున్నారు. 

06:47 - May 24, 2016

విశాఖ : ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, అసంఘటితరంగ కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలను ఉధృతం చేయాలని విశాఖలో జరిగిన సీఐటీయూ నగర 10 మహాసభల్లో తీర్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ... కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు.

కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న మోదీ సర్కార్‌...
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ సహజవనరులు, సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతూ కార్మికుల కడుపు కొడుతోందని సమావేశాల్లో ప్రసంగించిన నేతలు విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టడంతో ఎన్డీయే సర్కార్‌ విఫలమైన వైనంపై సీఐటీయూ మహాసభల్లో చర్చించారు. కార్మిక హక్కులను కాలరాచే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని నేతలు పిలుపు ఇచ్చారు.

కార్మిక వ్యతిరేక విధనాల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం... మోదీ సర్కార్‌కు ఏమీ తీసిపోలేదని సీఐటీయూ నాయకులు విమర్శించారు.

బ్రాండిక్స్‌ కార్మికుల సమస్యలపై చర్చ...
విశాఖలో బ్రాండిక్స్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ చేస్తున్న పోరాటాలపై ఈ మహాసభల్లో చర్చించారు. అసంఘటితరంగంలో పని చేస్తున్నకార్మికులకు నెలకు 18 వేల రూపాయల కనీస వేతనం ఉండాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మహాసభల్లోనే సీఐటీయూ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు...
సీఐటీయూ మహాసభల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాలి. బాలబాలికలు, సీఐటీయూ కార్యకర్తలు అరుణోదయ గీతాలను ఆలపించారు. 

06:37 - May 24, 2016

విజయవాడ : ప్రతి ఏడాది టీడీపీ మహానాడుకు ముందు 3 తీర్మానాలు ఆరు నిర్ణయాలతో ఎంతో ప్రశాంతంగా జరిగేవి. కాని ఈ ఏడాది రణరంగంగా మారాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వచ్చిన నేతలకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఎంతో ఆడంబరంగా ప్రారంభించినా.. ఎదురవుతున్న అవమానాలను మింగలేక , కక్కలేకపోతున్నారు ఫిరాయింపుదారులు.

ఆడంబరంగా మినీ మహానాడు...
టీడీపీ ప్రభుత్వం ఎంతో ఆడంబరంగాప్రారంభించిన మినీ మహానాడు వలస వచ్చిన నేతలను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. అధికార పార్టీ నేతల తీరుతో వలస నేతలకు అవమానాలు స్వాగతం పలుకుతున్నాయి.

కళ్యాణదుర్గంలో పయ్యావుల కేశవ్ సెటైర్లు...
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడుకు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి పలువురు మాజీమంత్రులు ఎంఎల్ ఏలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలోకి జంప్ చేస్తున్న నేతలు పొద్దుతిరుగుడు పువ్వులాంటి వారని సూర్యుడు ఎటు తిరిగితే అటు పార్టీలోకి వెళతారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనడంతో పలువురు పార్టీఫిరాయింపుదారులు అసహనం వ్యక్తం చేశారు.

విశాఖ......అటు విశాఖ జిల్లాలోను టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను అనకాపల్లిలో నిర్వహించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించినా..పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేయకుండానే ప్రారంభించారు. కొంత మంది కార్యకర్తలు దీనిని గుర్తు చేయడంతో... తప్పు తెలుసుకున్న నేతలు తిరిగి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఇదే సభలో ఎమ్మెల్యే పీలా గోవింద్ శ్రీనివాస్ రావును స్టేజి పైకి పిలవలేదు. దీనిని అనుచరులు వాగ్వాదానికి దిగడంతో...స్టేజిపైకి పిలిచారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో... ఆయన ఆవేదనగా స్టేజి దిగి వెళ్లిపోయారు.

పశ్చిమగోదావరి....
ఇక పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు , జిల్లా ఇన్ చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ,రాష్ట్ర శిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత , విప్ లు , ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ లు పాల్గొన్నారు. అయినా జనాభా మాత్రం అంతంత మాత్రంగానే రావడంతో సభ చిన్నబోయింది. నరసాపురంలో కొత్తపల్లి సుబ్బరాయుడు ఎమ్మెల్యే మాధవనాయుడు వర్గీయులు బాహా బాహీకి దిగారు. తొలుత కొత్తపల్లికి అనుకూలంగా నినాదాలు చేయడంతో.. సహించలేని మాదవనాయుడు వర్గీయులు ఈయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మద్య గందరగోళం నెలకొంది.

కడప ....
ఇటు కడప జిల్లాలోను టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు హజరయ్యారు. జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని.. విమర్శించారు. త్వరలోనే జిల్లాకు మంచిరోజులు రానున్నాయని ఆయన అన్నారు .

ప్రకాశం ....
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన మిని మహానాడు కార్యక్రమంలో టీడీపీ నేత కరణం బలరాం వైసీపీ నుంచి అధికార పార్టీలో చేరిన గొట్టిపాటి రవి వర్గీయులు బాహాటంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

ఫిరాయింపుదారులే టార్గెట్‌ మినీ మహానాడు...
మొత్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీమహానాడు కార్యక్రమం పార్టీఫిరాయింపుదారులే టార్గెట్‌గా సాగింది. అధికార పార్టీ నేతల తీరుపై పలువురు పార్టీలో ఫిరాయించిన నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

Don't Miss