Activities calendar

25 May 2016

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి

నల్గొండ : చింతపల్లి మండలం వింజమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రమాదంలో గాయపడ్డవారిని రక్షించేందుకు వచ్చిన వారిపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదలో ఒకరు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. 

 

22:01 - May 25, 2016

నిజామాబాద్ : రాబోయే రోజుల్లో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని డిప్యూటీ సీఎం మహమ్మూద్‌ అలీ అన్నారు. నిజమాబాద్‌ జిల్లాలోని ఆర్మూరు మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాన్ని డిప్యూటీసీఎం, ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ అన్ని శాఖల కంటే రెవెన్యూ డిపార్టుమెంట్‌ చాలా కీలక మైందని చెప్పారు. తరువాత నిజామాబాద్‌ ఎంపీ కవిత మాట్లాడారు. గతంలో పెద్దపెద్ద కాంగ్రెస్ నాయకులు పదవులు చేపట్టినా అభివృద్ధి చేయలేదని ఆమె విమర్శించారు. అందుకే ప్రజలు వారిని పక్కనపెట్టి తమ పార్టీని గెలిపించారని అన్నారు. 

21:58 - May 25, 2016

త్రివేండ్రం : కేరళ 12వ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయన్ క్యాబినెట్‌లో 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమది ప్రజల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ముఖ్యమంత్రి విజయన్‌ అన్నారు.
పినరయి విజయన్‌  ప్రమాణ స్వీకారం 
కేరళ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా 72ఏళ్ల పినరయి విజయన్‌  ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన వేడుకలో  కేరళ గవర్నర్ సదాశివమ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయన్ మళయాళంలో  ప్రమాణ స్వీకారం చేశారు. 
19 మందితో మంత్రివర్గం 
విజయన్ క్యాబినెట్‌లో 19 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిమండలిలో యువతకు ప్రాధాన్యతనిచ్చారు. వారిలో ఇద్దరు మహిళలు, 13 మంది కొత్తవారు. ఐదుగురు గతంలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన వారున్నారు. 19 మందిలో ముఖ్యమంత్రి సహా 12 మంది సీపీఎంకి చెందిన వారు కాగా, నలుగురు సీపీఐ, జనతాదళ్‌(ఎస్‌), కాంగ్రెస్‌(ఎస్‌), ఎన్‌సీపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
కన్నుల పండువగా ప్రమాణ స్వీకారోత్సవం 
కన్నుల పండువగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖ సీపీఎం నేతలతోపాటు మిత్రపక్షాల నేతలూ, వేలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు హాజరయ్యారు. ఇది ప్రజల ప్రభుత్వమని, వారి అంచనాలకు తగ్గట్టుగా విధులు నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా విజయన్ చెప్పారు. కుల, మత భేద భావాలు లేకుండా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఎల్ డిఎఫ్ ఘన విజయం
మే 16న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 140 సీట్లలో ఎల్‌డీఎఫ్‌ 91 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో 2011 నుంచీ అక్కడ అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 47 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది.

21:53 - May 25, 2016

ఢిల్లీ : మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో దేశంలో సామాన్యులపై భారాలు మరింత పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కరువు తాండవిస్తోంది. కనీసం తాగునీటికీ ప్రజలు నోచుకోవడం లేదు. వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఉపాధి లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం ద్వారా గ్రామీణ ప్రజలు వలస బాట పట్టారు. మోది వస్తే మంచి రోజులు వస్తాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అచ్ఛేదిన్‌ వచ్చేదెప్పుడు?
మోడీ పాలనకు రెండేళ్లు 
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. మోది పాలన మేడిపండు మాదిరిగానే కనిపిస్తోంది. జానెడు పని బారెడు ప్రచారం లాగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే విదేశీ బ్యాంకుల్లోని భారతీయ కుబేరుల నల్లధనాన్ని దేశానికి తెప్పిస్తానని, యువతకు ఉపాధి కల్పిస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు.  
తప్పుడు గణాంకాలు విడుదల 
ప్రపంచ దేశాల్లో భారతదేశమే వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ ఢంకా బజాయిస్తున్నారు. మోడీ ప్రభుత్వం విడుదల చేసిన తప్పుడు గణాంకాల వల్ల దేశ ప్రతిష్ట మరింత దిగజారిందే తప్ప అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదు.  ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు, ఆచరణలో ఆర్థిక వ్యవస్థ వాస్తవికచిత్రం మధ్య పొంతన కుదరటం లేదని సాక్షాత్తు రిజర్వు బ్యాంకు గవర్నరు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు బాహాటంగానే విమర్శించారు.
సగానికి సగం పడిపోయిన ఆదాయం 
గత 17 నెలల్లో విదేశీ వాణిజ్యం ద్వారా మనం సంపాదించిన ఆదాయం 2013-14 నాటి విలువతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. 2013-14 నాటికి 46 వేల 590 కోట్లు ఉంటే... ప్రస్తుతం 26 వేల113 కోట్ల డాలర్లు మాత్రమే విదేశీ వాణిజ్యం చేయగలుగుతున్నాము. గత 63 సంవత్సరాల చరిత్రలో విదేశీ వాణిజ్యం ఈ స్థాయికి పడిపోవటం ఇదే ప్రథమం.
అన్ని రంగాల్లో తిరోగమనం
మోడీ రెండేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో తిరోగమిస్తోంది. ప్రధాని చెబుతున్న వృద్ధి రేటు పెరుగుదల వాస్తవానికి విరుద్ధంగా ఉంది. కీలక రంగాలన్నింటిలోనూ సగటున 2.7 శాతం కంటే మించిన వృద్ధి రేటు కనిపించడంలేదు. ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి రేటు ఉండటం దశాబ్ద కాలంలో ఇదే ప్రథమం.
తగ్గిన విదేశి పెట్టుబడులు 
విదేశి పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి. 2013లో 5.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు వస్తే 2014లో నాలుగు లక్షల కోట్లు, 2015లో 3.11 లక్షల కోట్లకు పరిమితమైంది. 2016 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు మాసాల్లో కేవలం 60 లక్షల130 కోట్ల పెట్టుబడులకు మాత్రమే ప్రతిపాదనలు రావడం గమనార్హం.
నిరుద్యోగులు నానా అవస్థలు
ఉద్యోగిత పెరగక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. పారిశ్రామిక రంగం కుదేలవటంతో ఏటా శ్రామికులుగా మారుతున్న కోటీ 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. ఎక్కువ మంది కార్మికులు పని చేసే ఆరు కీలక వస్తూత్త్పత్తి రంగాలనే పరిశీలిస్తే- ఉపాధి కల్పన గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పతనమయ్యింది. 2015లో  లక్షా 35 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరికాయి. ఏటా రెండు కోట్లమందికి ఉపాధి కల్పిస్తామని బిజెపి వాగ్దానం చేసింది.
కార్మికులు, ఉద్యోగులపై అనేక భారాలు
ఈ రెండేళ్ల కాలంలో కార్మికులు, ఉద్యోగులపై ప్రభుత్వం అనేక భారాలు మోపింది. పేదలు ఉపయోగించుకునే వస్తువులు, సేవలపై పరోక్ష పన్నుల ద్వారా 20 వేల కోట్లకు పైగా భారాలు పెరిగాయి. కాగా సంపన్నులపై పన్నుల భారం 1600 కోట్ల మేరకు తగ్గింది. ఆరు లక్షల కోట్లకు పైగా ఉన్న పన్ను బకాయిలను వసూలు చేయటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టక పోగా...గతేడాది ధనికులకు అదనంగా ఆరు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలివ్వడం గమనార్హం.
పేదల జేబులకు చిల్లులు
మరోవైపు నిరంతరం పెరుగుతున్న ధరలు పేదల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 5.4 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ మే నాటికి 6 శాతానికి పెరిగింది. ఆహారోత్పత్తుల ధరల సూచీ మరింత ఎక్కువగా అంటే 6.2 శాతానికి పెరిగింది. పప్పు ధాన్యాల ధరలు ఒక్క నెలలోనే 34 శాతం పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తులు నిరంతరం షాకులిస్తూనే ఉన్నాయి. పేదోళ్లకు కనీసం పప్పన్నం తినే పరిస్థితి కూడా లేదు.
గ్రామీణ పేదల పరిస్థితి దుర్భరం 
గత రెండేళ్లుగా గ్రామీణ పేదల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది.  రైతులకు ఉత్పత్తి వ్యయం పోను అదనంగా 50 శాతం లాభాలు గ్యారంటీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఊదరగొట్టారు. ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా  పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. దివాళా తీసిన గ్రామీణ ప్రజానీకం ఆత్మహత్యలను ఆశ్రయిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత సంవత్సరం 2 వేల 997 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 116 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రేడియోలో మన్‌కిబాత్‌ ప్రసంగాలు తప్ప -రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రధాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
మోడీ అభివృద్ధి నిరోధక విధానాలు  
కరువుకాటకాలు, రుతుపవనాల వైఫల్యం ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ వాటివల్ల వచ్చే నష్టాన్ని నివారించే అవకాశాలు మాత్రం ప్రభుత్వం చేతుల్లో పుష్కలంగా ఉన్నాయి. గ్రామీణ పేదలు కరువుకాటకాల బారినపడి అల్లాడుతుంటే సుప్రీంకోర్టు చేతిలో మొట్టికాయలు తినే వరకూ కేంద్రం గత ఏడాది ఉపాధి హామీ వేతన బకాయిలు సైతం విడుదల చేయలేదు. ప్రచార ఆర్భాటాలకు మాత్రం ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతోంది. మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి నిరోధక విధానాల అమలు ఫలితమే...దేశంలో ప్రజలపై భారాలు పెరగడానికి కారణమని సిపిఎం స్పష్టం చేసింది.

21:32 - May 25, 2016

మోడీ చేసిన హామీలకు రెండేళ్లు, సాధించినవెన్ని ? అటకెక్కినవెన్ని..? అధికారంలోకి వచ్చి రెండేళ్లు, బ్లాక్ మనీ తెచ్చేస్తామన్నారు, మేకిన్ ఇండియా ధరల నియంత్రణ, ఒకటి రెండు కాదు.. ఎన్నో పథకాలు... మరెన్నో హామీలు... నెరవేరినవెన్ని..? అటకెక్కినవెన్ని..? ప్రతి భారతీయుడి ఎకౌంట్లో 15 లక్షలు వేస్తానన్న హామీ... 
భారత్ ను స్వయం సమృద్ధిలో నిలబెడతానన్న హామీ, కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ప్రజలకు మోడీ మాటలు దిల్ కుష్.. మోడీ రెండేళ్ల పాలనపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

వార్నర్‌ ఔట్..

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌,కోల్‌కతాల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. వార్నర్‌ 28 పరుగుల చేసి ఔట్ అయ్యాడు. 

 

హీరో బాలకృష్ణపై రామకృష్ణ ఆరోపణలు

హైదరాబాద్‌ : హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ నిజ జీవితంలో హీరో కాదని అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. సినిమాల్లో అవినీతిని అంతమొందించే పాత్రలు పోషిస్తున్న బాలయ్య తన నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోతున్నప్పటికీ పట్టించుకోవట్లేదని అన్నారు. అనంతపురం జిల్లాకు ఎంతో ముఖ్యమైన హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. హంద్రీనీవా జలసాధన కోసం హిందూపురం నుంచి గుంతకల్లు వరకు బస్సు యాత్ర చేపడతామని జగదీష్ పేర్కొన్నారు.

 

21:00 - May 25, 2016

సర్కార్ ఇజ్జత్ దీస్తున్న పోలీస్ కానిస్టేబుల్....ఆటోవాల తెరువువొయ్యి పరువుదీసుకున్న ఖాకిక్కులు, నోరుదెరిస్తే పేగులు లెక్కవెడ్తుతున్న దొంగలు... ముంబై ఓటళ్లపోంట గల్ల పెట్టెలు లూటి, తుమ్మకంపమీదికిజేరిన భక్తి.. దేవుని కఠాక్షం కోసం కఠోర చేతలు, సదువు సారెడు పనితనం చేతడు.. సోలార్ కారుకు పాణం బోసిన పోరడు, తెలుగు రాష్ట్రాలల దంచికొడుతున్న ఎండలు... పాల్వంచ కాడా పడిచస్తున్న జీకులు, దొంగతనంజేసి దొరికిన బాలీవుడ్ హీరో ... బట్టల దుకాణంల సీసీ కెమెరాల షూటింగ్, ఎన్ టిఆర్ మాల...దీక్ష.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:46 - May 25, 2016

టిడిపి నేత కరణం బలరాంతో టెన్ టివి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్ధానం గురించి వివరించారు. ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 
'1989 లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నాకంటే ముందు ఎమ్మెల్యేలుగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న ఉన్న సభలో ఉన్నాను. నాకు పెద్దగా అంబీషన్లు లేవు. నాకు మంత్రి అవసరం లేదు. నా మైండ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. చంద్రబాబుకు నాకు ఎలాంటి వైరుధ్యాలు లేవు. కొంతమంది పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్న వాస్తవాలను మొహమాటం లేకుండా చెప్తాను. పార్టీకి అంకితమై పని చేస్తాను. టీడీపీలోకి వచ్చే వారు పార్టీ విధానాలకు అనుగుణంగా నడవాలి. టీడీపీని కాపాడాలి' అని బలరాం పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శిఖర్‌ ధావన్‌ ఔట్..

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కతాల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. శిఖర్‌ ధావన్‌ 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

హైదరాబాద్ లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.  మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్ పల్లి, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాంనగర్, బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలుగుతల్లి ఫ్లైవోర్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

క్రికెటర్ ఆశిష్ నెహ్రా కుడి మోకాలి ఆపరేషన్ సక్సెస్..

హైదరాబాద్‌ : టీమిండియా క్రికెటర్ ఆశిష్ నెహ్రా కుడి మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఒక ట్వీట్ చేశారు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు మెంటార్ గా లక్ష్మణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ నెహ్రాకు లండన్ లో గత రాత్రి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని లక్ష్మణ్ పేర్కొన్నాడు. నెహ్రాకు శస్త్రచికిత్స అనంతరం తీసిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.

యూపీలో కూతురు మృతదేహానికి నెల తర్వాత అంత్యక్రియలు

ఉత్తరప్రదేశ్ : ఓ తండ్రి తన కూతురు మృతదేహానికి నెల తర్వాత అంత్యక్రియలు నిర్వహించిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. విశంబర్ సింగ్ కూతురు రీతుయాదవ్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్‌లో తనను కొంతమంది అమ్మాయిలు కొడుతూ వేధిస్తున్నారని రీతుయాదవ్ రాసింది. దీంతో తన కూతురు మృతికి గల కారణాలు తెలుసుకుని తమకు న్యాయం చేయాలని విశంబర్ సింగ్ కన్నాజ్ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. విశంబర్ సింగ్ డిమాండ్ మేరకు రీతుయాదవ్ మృతదేహాన్ని నెల రోజులపాటు రసాయనాలను వినియోగించి పాడవకుండా భద్రపరించారు.

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారత్ పౌరులు మృతి

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈశ్యాన్య ఆస్ట్రేలియా ప్రాంతంలో అంజుమోల్ (23), ఆశా మాథ్యూ (18) (అక్కాచెల్లెళ్లు) వెళ్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మృతులిద్దరూ కేరళకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల తల్లిదండ్రులు భారత్ లోనే ఉంటున్నట్టు వెల్లడించారు.

 

ఆరు నూతన ఐఐటీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం..

ఢిల్లీ : ఆరు నూతన ఐఐటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి, పాలక్కాడ్, ధార్వార్, భిలాయ్, గోవా, జమ్మూలో కేంద్రం ఐఐటీలను ఏర్పాటు చేయనుంది. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా

హైదరాబాద్ : ఐపీఎల్ 9 లో భాగంగా కోల్ కతా, హైదరాబాద్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా టాస్ గెలిచి కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. 

 

లోక్‌జన శక్తి పార్టీ నేత దారుణ హత్య

పాట్నా : బిహార్‌లో రాంవిలాస్‌ పాసవాన్‌కు చెందిన లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) నేత దారుణ హత్యకు గురయ్యారు. దుమారియా ప్రాంతంలో ఎల్జేపీ నేత సుదేశ్‌ పాసవాన్‌ పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తుండగా దుండగులు కాల్చి చంపారు. ఆయన హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు.

 

బోటు మునక.. ఏడుగురు శరణార్థులు మృతి

రోమ్ : లిబియా తీరప్రాంతంలో బోటు ముంపునకు గురైన ఘటనలో ఏడుగురు శరణార్థులు మృతి చెందారు. సామర్థ్యానికి మించి జనాలు ఉండటంతో అదుపుతప్పి బోటు మునిగిపోయిందని ఇటాలియన్ నౌకదళ అధికారులు వెల్లడించారు. బోటులో ఉన్న 500 మందిని సురక్షితంగా బయటకు తరలించామని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలిపారు.

 

19:21 - May 25, 2016

మెదక్ : ప్రాజెక్టుల పేరిట తెలంగాణ సర్కార్‌ జన జీవనాన్ని ఆగమాగం చేస్తోంది. కేంద్ర చట్టాలను తుంగలో తొక్కి.. భూసేకరణ సాగిస్తోంది. తనకు అనుకూలంగా జీవోలు జారీ చేస్తూ.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. దీనికి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితుల గోసే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. భూములే కాదు.. జీవనోపాధినీ కోల్పోతామంటూ ఆవేదన చెందుతున్న రైతుల వెతలపై 10 టివి గ్రౌండ్‌ రిపోర్ట్..
మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు.. ప్రజల్లో కలకలం
మెదక్‌ జిల్లాలో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు పరిసరాల్లోని 13 గ్రామాల ప్రజల్లో కలకలం రేపుతోంది. 22వేల ఎకరాల బలవంతపు భూసేకరణకు  ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం.. ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. ప్రేమ, ఆప్యాయతలు పెనవేసుకున్న గ్రామాలను శాశ్వతంగా వదిలి వెళ్లాలన్న భావన వస్తేనే.. గ్రామస్థుల్లో దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. అన్నపానాలూ మానేసి దిగులుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో నెలకొన్న దైన్య స్థితి. 
ల్యాండ్‌ అక్విజిషన్‌ యాక్ట్ - 2013
రైతుల నుంచి సేకరించే భూమికి చెల్లించాల్సిన పరిహారం, కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించిన నిర్దిష్ట విధివిధానాలతో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది. ల్యాండ్‌ అక్విజిషన్‌ యాక్ట్ - 2013 పేరిట ఉన్న ఈ చట్టం ప్రకారం.. భూములు, ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు భారీ మొత్తంలో పరిహారం అందుతుంది. అయితే.. ప్రభుత్వం దీనికి విరుద్ధంగా.. రెండుజీవోలు జారీ చేసి ప్రజల నుంచి భూములు, ఇళ్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్‌ సర్కారు జారీ చేసిన 123, 214 జీవోల కారణంగా.. నిర్వాసితులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇష్టారీతిలో పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం జీవోలు జారీ చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో గ్రామాలు వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. 
భూములు లాక్కునేందుకు సిద్ధమైన సర్కార్ 
తెలంగాణ వచ్చింది.. బతుకులు మారుతాయనుకుంటే.. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు సిద్ధమయిందని, వ్యవసాయాన్నే నమ్ముకున్న తమకు బతుకుదెరువు ఎలా అని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. భూమే కాదు.. బంధాలనూ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
భూ నిర్వాసితులకు పరిహారం
భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. అలా కాకుండా ప్రభుత్వం జీవో నెంబర్‌ 123, 214 తీసుకొచ్చి రైతులకు తక్కువ పరిహారం చెల్లించేందుకు కుట్ర చేస్తోందని ముంపు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.  నిర్వాసితుల చట్టం ఉండగా ఈ జీవోలను ఎలా తెచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 
పుట్టి పెరిగిన గ్రామాల్లోనే ఉంటాం..
ముంపు గ్రామాల పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ఎందుకు ప్రాజెక్టు కట్టడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టి పెరిగిన ఊరిపై ఉన్న మమకారాన్ని ఎలా చంపుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. చావైనా.. రేవైనా.. పుట్టి పెరిగిన గ్రామాల్లోనే అంటున్నారు స్థానికులు.  
బాధితులకు బాసటగా సీపీఎం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు బాధితులకు.. సీపీఎం బాసటగా నిలిచింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో సీపీఎం నాయకులు పర్యటించి.. గ్రామస్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. సాగుభూములను తీసుకోవద్దని చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నప్పటికీ ... ప్రభుత్వం అమానుషంగా పేదల భూములను లాక్కొంటుందని ముంపు గ్రామంలో పర్యటించిన  వామపక్ష, ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని నిలువు దోపిడీ చేస్తోందని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేకుంటే ప్రాణాలడ్డైనా సరే భూముల్ని కాపాడుకుంటామని ముంపు గ్రామాల బాధితులు హెచ్చరిస్తున్నారు. 
ముంపు బాధిత గ్రామస్థులు నరకయాతన 
ముంపు బాధిత గ్రామస్థులు తిండితిప్పలు లేక నరకయాతన పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు కాకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చట్టబద్ధంగా భూసేకరణ చేయకుండా జీవోలతో బాధితులను మోసం చేయాలని చూడటం అన్యాయమని, ప్రభుత్వంతో పోరాడైనా సరే తమ భూములను కాపాడుకుంటామని బాధితులు స్పష్టం చేస్తున్నారు. 

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబుదే తుది నిర్ణయం : లోకేష్‌

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలకు ఏపీ కోటా నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ స్పష్టం చేశారు. రాజ్యసభ సీటుపై బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదనా రాలేదని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబుదే తుది నిర్ణయమని లోకేష్‌ అన్నారు. 

19:10 - May 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలకు ఏపీ కోటా నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ స్పష్టం చేశారు. రాజ్యసభ సీటుపై బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదనా రాలేదని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబుదే తుది నిర్ణయమని లోకేష్‌ అన్నారు. 

 

రాయదుర్గంలో ప్రమాదం...

అనంతపురం : జిల్లాలోని రాయదుర్గంలో ప్రమాదం జరిగింది. మరమ్మతుల కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కిన ప్రైవేటు కార్మికుడు నాగరాజు కరెంట్‌ షాక్‌తో కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

 

19:03 - May 25, 2016

అనంతపురం : జిల్లాలోని రాయదుర్గంలో ప్రమాదం జరిగింది. మరమ్మతుల కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కిన ప్రైవేటు కార్మికుడు నాగరాజు కరెంట్‌ షాక్‌తో కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

18:41 - May 25, 2016

ఇంగ్లాడ్ : లండన్‌లోని చెల్సియాలో పూల ప్రదర్శన అందిరినీ ఆకట్టుకుంటోంది.. రాయల్‌ హార్టికల్చర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రదర్శన మే 28వరకూ కొనసాగనుంది.. 3లక్షల కుట్టుపూలతో ఎర్రతివాచీ సందర్శకులను కట్టిపడేసింది.. ఈ షోకు బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, భర్త ఫిలిప్‌, రాకుమారుడు విలయం, ఆయన భార్య కేట్‌ మిడిల్‌టన్‌, ప్రిన్స్ హ్యారీ హాజరయ్యారు. రాజకుటుంబంనుంచి మొదటిసారి విలియం దంపతులు ఈ ఫ్లవర్‌ షోను చూశారు.. గులాబీ, ఆకుపచ్చ రంగుల్లోఉన్న ఓ చామంతి పువ్వుకు డయానా మనవరాలు, విలియం దంపతుల ముద్దుల కూతురు చార్లొటె పేరు పెట్టారు షో నిర్వాహకులు.. రాణి ఎలిజబెత్‌కోసం 10వేల లేత రంగు పూలతో 21 అడుగుల ఆర్చ్ రూపొందించారు..

హైదరాబాద్ లో వర్షం..

హైదరాబాద్ : నగరంలో ఈదరుగాలులతో కూడిన వర్షం కురిసింది. కూకట్ పల్లి, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలుగుతల్లి ఫ్లైవోర్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. 

 

18:36 - May 25, 2016

కృష్ణా : బెజవాడ కమిషనరేట్‌లో ఆదాయం వచ్చే ఠాణాలు ఏవి..? ఎక్కడెక్క ఎంతొస్తాయి...? ఎక్కడెక్కడ ఏమున్నాయి..? ఆయా స్టేషన్ల పరిధిలో రాజకీయుల అనుచరులు ఎవరు..? వారి యాక్టివిటీస్ ఏంటి..? ఇలా ప్రతీ స్టేషన్‌ పరిధిలోని పుట్టుపూర్వోత్తరాలను సేకరిస్తున్నారు కొందరు... కమిషనరేట్ పరిదిలో కాసుల వర్షం కురిపించే స్టేషన్ల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి..ఇవన్నీ ఎవరు చేస్తున్నారో చూడండి...
ఆదాయం ఉన్న స్టేషన్లపై కన్ను...
బెజవాడ పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆరుగురు సర్కిల్‌ఇన్‌స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలు రావడంతో వారందరినీ బదిలీలు చేస్తూ ఏలూరు రేంజ్ కు అటాచ్ చేశారు...ఇలా బదిలీ చేసిన స్థానాల్లో నియామకాలకు ఏలూరు రేంజ్‌ నుంచి ఆరుగురు సీఐలను రప్పించారు... కొత్తగా వచ్చినవారి దృష్టి ఏ స్టేషన్‌లో ఎక్కువ ఆదాయం ఉంది..? ఎక్కడ ఎలాంటి అవకాశాలున్నాయన్నదానిపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది..అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న సీఐలు తమకు అనుకూలమైన ఠాణాల్లో పోస్టింగ్ లు వేయించుకున్నారు. నిజాయితీగల అధికారులను, ఎటువంటి రికమండేషన్ లేని వారిని ప్రాధాన్యతలేని విభాగాలకు కేటాయించారు. కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సీఐలుగా వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు.
లక్షల్లో దండుకుంటున్న ఖాకీలు..?
మద్యం వ్యాపారం చేసేవారు ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసులకూ నజరానాలు చెల్లించుకుంటున్నారు...ఇక విజయవాడ నగరంలో పోలీస్ స్టేషన్లకు అందుతున్న నెలసరి మామూళ్లు రూరల్ ప్రాంతంలోనైతే నెలకు ఒక్కో మద్యం దుకాణం నుంచి వేలాది రూపాయల మామూళ్ల రూపంలో ముడుతాయన్న ఆరోపణలున్నాయి...ప్రభుత్వం విధించిన నిబంధనలను మద్యం షాపులవారు సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేనందున తమపై దాడులకు దిగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లకు ముడుపులు అందుకుంటున్నారని బహిరంగంగానే వాదనలు వెల్లువెత్తువెతున్నాయి...ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో పరిస్థితి ఇలా ఉంటే.. చర్యలు ఎవరు తీసుకుంటారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
యథేచ్చగా కల్తీ మద్యం వ్యాపారం...
ఇదిలా ఉంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే కొందరు సీఐలు, ఎస్సైలపై సీపీ గౌతం సవాంగ్ తన మార్క్ ను కొనసాగిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిని ఆయన ఏ మాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు స్టేషన్లలో కిందిస్థాయి సిబ్బందిపై కూడా సీపీ గౌతం సవాంగ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. కొందరు సిబ్బంది ఆయా ఠాణాల్లో గుంబనగా కార్యకలాపాలు సాగించేవారిపై కొరడా ఝళిపిస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు సైతం బెజవాడ కమిషనరేట్ పై సీరియస్ గా దృష్టిసారిస్తున్నారు. ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినా, వారికి ఎవరి అండదండలున్నా సరే వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీకి ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. 
ఠాణాల్లోనే సెటిల్‌మెంట్లు...
స్టేషన్లలో కొనసాగుతున్న సెటిల్‌మెంట్లు...లంచాలు..ఇతరత్రా కేసులపై వసూళ్లు చేస్తున్న కాసుల వ్యవహారంలో కమిషనర్ సవాంగ్‌ సీరియస్‌గా ఉన్నారు...ప్రతీ రోజూ ఎప్పటికప్పుడు నివేదికలు సేకరిస్తున్న కమిషనర్ అందుకు సంబంధించిన అధికారులపై వేటు వేస్తున్నారు.

18:33 - May 25, 2016

హైదరాబాద్ : నగరంలోని పలుచోట్ల ఈదరుగాలులతో కూడిని వర్షం కురిసింది. కూకట్ పల్లి, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలుగుతల్లి ఫ్లైవోర్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. 

17:50 - May 25, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో ఎండలు మండిపోతున్నారు. రెండు రోజులుగా  ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఏలూరు ప్రభుత్వాసుత్రికి వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. ఆస్పత్రిలో సరిపడా మంచాలు లేకపోవడంతో నేలమీదే పడుకోబెట్టి  చికిత్స అందిస్తున్నారు. ఐతే వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వైద్యులు తెలిపారు. 

17:47 - May 25, 2016

నిజామాబాద్‌ : ఆర్మూర్‌ పట్టణానికి తాగునీరందించేందుకు స్వయంగా తానే నల్లాలు తిప్పుతానని సీఎం కేసీఆర్‌ గతేడాది హామీ ఇచ్చారు. కానీ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. వెరసి సీఎం ఇచ్చిన హామీకే విలువ లేకుండా చేశాయి. పథకం పనులు ముందుకు సాగకపోవడంతో  పనులు పూర్తయ్యేదెప్పుడు.. సీఎం నల్లాలు తిప్పేదెప్పుడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 
పనులు నత్తనడక 
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు పట్టణానికి తాగు నీరందించేందుకు ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్‌ జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరో రెండేళ్లైనా ఈ పథకం పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ఈ పథకం.. ఇంతవరకు  ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.  ఇది చాలామంచి పథకమని, అధికారులు, కలెక్టర్‌ డెడ్‌లైన్‌ పెట్టుకుని దీన్ని పూర్తి చేయాలని ఆర్మూర్‌ సభలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. స్వయంగా తానే వచ్చి నల్లాలను ప్రారంభిస్తానని కూడా చెప్పారు. కానీ ఎక్కడి పనులు అక్కడే ఉండటంతో.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే విలువ లేకుండా పోయింది. 
మెగా కంపెనీ కాంట్రాక్ట్
ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన ఈ తాగునీటి పథకాన్ని మెగా కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుంది. ప్రాజెక్టు నుంచి ఆర్మూర్‌కు 19 కిలోమీటర్ల మెయిన్ పైపులైన్ వేయాల్సి ఉండగా కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే వేశారు. మొత్తం 106 కిలోమీటర్లలో కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే పైపులైన్‌ వేశారు. ఆ పనులను కూడా సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చారు. సబ్‌కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కాకపోవడంతో  మధ్యలోనే వదిలేశారు. ఆర్మూర్‌ టీచర్స్ కాలనీలో   ట్యాంకులు,  బాల్కొండ గుట్టమీద నీటి శుద్ధి ట్యాంక్‌ నిర్మించాల్సి ఉన్నా ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ప్రాజెక్టు ఇన్ టెక్ వెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.  అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం 
అధికార పార్టీ నేతకు సంబంధించిన ఓ కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకోవడంతో అధికారులు పనులు పర్యవేక్షించడానికి కూడా జంకుతున్నారు. ఈ పథకం విషయంలో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి పథకం పనులు పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.  

 

17:43 - May 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ పట్టణ పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ రాబోతోంది.. మిషన్‌ భగీరథలోభాగంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీచేసింది.. ఆసరా పెన్షన్ అర్హత నిబంధనల్ని నల్లా కనెక్షన్‌కు వర్తింపచేస్తోంది.. 
పట్టణ పేదలకు ప్రభుత్వం శుభవార్త 
తెలంగాణ పట్టణ పేదలకు ప్రభుత్వం శుభవార్త అందించింది.. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ పొందే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.. ఈ సదుపాయాన్ని తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాల్లోని పేదలకు వర్తింపచేస్తారు.. ఈ స్కీం కింద 5 నుంచి తొమ్మిదిన్నరలక్షలవరకూ కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.. మంత్రివర్గ ఉపసంఘం సూచన ప్రకారం సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
నల్లా కనెక్షన్‌కు ఆసరా పెన్షన్ల అర్హత నిబంధనలు వర్తింపు
ఒక్క రూపాయి నల్లా కనెక్షన్‌కు ఆసరా పెన్షన్ల అర్హత నిబంధనల్ని వర్తింపజేస్తున్నారు.. ఆసరా పెన్షన్ పొందాలంటే కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షా యాభై వేలు, పట్టణాల్లో రెండు లక్షల రూపాయలుండాలి.. ఇప్పుడు ఇవే రూల్స్ ను నల్లా కనెక్షన్‌కు అమలు చేయబోతున్నారు.. 
పలు మున్సిపాలిటీలు ఇష్టారాజ్యంగా తీర్మానాలు
గతంలో మున్సిపాలిటీనుంచి నల్లా కనెక్షన్ కావాలంటే చాలా పెద్ద తతంగం ఉండేది.. డబ్బుకూడా పెద్దమొత్తంలో కట్టాల్సివచ్చేది.. పలు మున్సిపాలిటీలు ఇష్టారాజ్యంగా తీర్మానాలు చేసి నల్లా కనెక్షన్ల రుసుములు పెంచాయి.. పదేళ్లక్రితం కొన్ని మున్సిపాలిటీల్లో నల్లా కనెక్షన్‌కు పదివేల రూపాయలు చెల్లించాలని రూల్‌ పెట్టారు.. ఈ భారం మోయలేని పేదలు వీధి నల్లాలనుంచి నీరు తెచ్చుకునేవారు.. ఆ తర్వాత నల్లా కనెక్షన్ల రుసుమును రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధంగా 12వందల రూపాయలు చేశారు.. ఇంత డబ్బు కట్టడం వీలుకాకపోతే నెలకు వంద రూపాయలచొప్పున వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించారు.. 2008లో ఆ ఉత్తర్వులు సవరించి... 1200కు బదులు 200 చెల్లిస్తే చాలన్నారు. ఇప్పుడు ఆ ఉత్తర్వులన్నింటినీ మార్చేసి ఒక్క రూపాయికే కనెక్షన్‌ ఇచ్చేలా కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సురక్షితమైన తాగునీరు 
తెలంగాణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా ఈ లక్ష్య సాధనదిశగా వేగంగా అడుగులు వేస్తోంది.. ఇక గ్రామాలకు ఆర్ డబ్ల్యుఎస్ శాఖ ద్వారా నీటిని సరఫరా చేయబోతున్నారు.

 

17:39 - May 25, 2016

ముంబై : బాలీవుడ్‌ మూవీ సుల్తాన్‌ ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదల చేసిన పదకొండు గంటల్లోనే ఈ ట్రైలర్‌ను చూసినవారిసంఖ్య పదిలక్షలు దాటింది. హర్యానా రెజ్లర్‌ సుల్తాన్‌ అలీఖాన్‌ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్, అనుష్క శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్‌లో వీరిద్దరి రెజ్లింగ్ పట్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ మూవీకి అలీ అబ్బాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

 

17:36 - May 25, 2016

విశాఖ : సినీ నటి ముమైత్ ఖాన్ విశాఖ జిల్లాలో సందడి చేశారు. భీమిలి మండలం చిప్పాడ గ్రామదేవత శ్రీ సత్తమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో స్టెప్పులేసి  కుర్రకారును ఉర్రూతలూగించారు. ఆమెను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. ముమైత్ ఖాన్‌తో పాటు ఆట ఫేం కొరియోగ్రాఫర్ మల్లేష్ కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ మాట్లాడుతూ ఇంతమంది అభిమానులను చూడటం తనకు సంతోషంగా ఉందన్నారు.

17:33 - May 25, 2016

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హమీలన్ని కేంద్రం నేరవేర్చాలని గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రేండేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఈ రేండేళ్ల కాలంలో విభజన హమీలను ఏ మేరకు నేరవేర్చేందుకు కృషిచేసాడో తెలిపాలని వక్తలు కోరారు. 

17:28 - May 25, 2016

ఢిల్లీ : తెలంగాణలోని కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీల జాబితాలో చేర్చాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఎంపీ వినోద్ విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంకయ్య సానుకూలంగా స్పందించారు. ఎంపీ వినోద్,తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి వెంకయ్యనాయుడును ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. కరీంనగర్‌ను ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చేందుకు విధివిధానాల్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో వరంగల్ తర్వాత కరీంనగర్ ముఖ్యమైన నగరమన్నారు. మొదటి విడత జాబితాలో కరీంనగర్‌ స్థానం సంపాదించకపోవడం వల్ల కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కరీంనగర్ మేయర్‌కు సూచించామని తెలిపారు. 

17:26 - May 25, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌లో భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు అత్యుత్సాహానికి పోయి చేసిన విన్యాసాలు వివాదాస్పదమవుతున్నాయి. టెర్రరిస్టులు దాడులకు పాల్పడితే వారిని ఎలా ఎదుర్కోవాలో చూపిస్తూ యూపీ స్కూల్స్ లో భజరంగ్‌ దళ్ కార్యకర్తలు మాక్‌ డ్రిల్స్ చేశారు. అయితే ఆ మాక్‌ డ్రిల్స్ లో ఒక మతానికి చెందిన వ్యక్తులను టెర్రరిస్ట్ లుగా చూపుతూ విన్యాసాలు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కొందరు అభ్యంతరం తెలుపుతూ పోలీసులను ఆశ్రయించడంతో భజరంగ్‌దళ్ కార్యకర్తలపై సెక్షన్‌ 153 ఏ కింద కేసు నమోదైంది. త్వరలో భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు సుల్తాన్‌పూర్‌, గోరఖ్‌పూర్, పిల్‌భిత్‌, నోయిడా, ఫతేపూర్‌ నగరాల్లో మరికొన్ని క్యాంపులు నిర్వహించనున్నారు. మాక్‌ డ్రిల్స్ వివాదాస్పదం కావడం పట్ల ఆర్గనైజర్‌ మనోజ్‌ వర్మ స్పందిస్తూ ఆత్మరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూపించడంలో తప్పేముందని ప్రశ్నించారు. 

 

17:18 - May 25, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుకు కాపుల నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు.. చంద్రబాబుతీరును లేఖలో తీవ్రంగా ఖండించారు.. బాబు దుష్ట ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.. తాను ప్రతిపక్షం చేతిలో పావునని నిరూపిస్తే ఉద్యమం నిలిపేస్తానని సవాల్‌ విసిరారు.. 

 

16:50 - May 25, 2016

ఈ చిత్రంలో ఎవరో గుర్తు పట్టారా ? ఈ కన్నడ భామ టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలు పోషించింది. ప్రభాస్ చిత్రంలో నటించింది..అంతేగాకుండా పవర్ స్టార్ చిత్రంలో ఓ స్పెషల్ పాత్రలో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించింది. ఈమెనే 'సంజన' అయ్యే అలా అయ్యిందేమిటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? 'దండుపాళ్యం' సినిమా గుర్తుంది కదా. విపరీతమైన హింసను చూపించిన ఈ సినిమా అంతేస్థాయిలో వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో 'సంజన' ప్రధాన పాత్ర పోషిస్తోంది. మర్డర్లు చేసే కిరాతకమైన లేడీ నటించనున్నట్లు తెలుస్తోంది. 

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడిగా..

గుంటూరు : ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడిగా చలసాని శ్రీనివాస్ మళ్లీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేకహోదా కోసం ఆగస్టు 9న సామూహిక నిరసన దినోత్సవం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : లాభాలతో కొనసాగిన స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిశాయి. 576 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 25,881 దగ్గర ముగిసింది. 186 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ 7,935 వద్ద ముగిసింది. 

16:27 - May 25, 2016

తిరువనంతపురం : కేరళ నూతన సీఎంగా పినరాయి విజయన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విజయన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. 19 మంది సభ్యులతో మంత్రివర్గం ఏర్పాటు అయింది. పినరాయి విజయన్ ఆయనతోపాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులతో కూడా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రులు చంద్రశేఖర్, మాథ్యూస్ ఈ.థామస్, ఏకె.శశీంద్రన్, రామచంద్రన్ కడునప్పలీ, ఎకె.బాలన్, డా.కేట్టిజలీల్, ఇపి జయరాజన్, కడగంబల్లి సురేంద్రన్ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం కొనసాగుతోంది. 

 

16:21 - May 25, 2016

ముంబై అకాడమీ ఆఫ్‌ ది మూవింగ్‌ ఇమేజెస్‌ (మామి) ఉత్సవాలు నేటి నుంచి నాలుగు రోజుల పాటు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 'మామి' ఫిల్మ్‌ క్లబ్‌ను బాలీవుడ్‌ తారలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బ్రిటీష్‌ నటుడు మెక్‌ కెల్లన్‌ ప్రత్యేక అతిథిగా హాజరై విలియమ్‌ షేక్‌స్పియర్‌ రచనలపై చర్చించారు. ఈ ఫిల్మ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగరంలోని మూడు ప్రాంతాల్లో నేటి నుంచి 29 వరకు నిర్వహించే ఈ చిత్రోత్సవంలో 53 దేశాలకు చెందిన 182 సినిమాలను ప్రదర్శిస్తారు. అమీర్‌ ఖాన్‌, ఆయన భార్య కిరణ్‌రావ్‌, సోనమ్‌ కపూర్‌, కంగనా రనౌత్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, దర్శకుడు విధు వినోద్‌ చోప్రా, అనుపమ్‌ చోప్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

16:19 - May 25, 2016

సోఫియా హయత్.. ఎవరో అందరికీ తెలిసిందే కదా. బ్రిటీష్ మోడల్ అయినా సోఫియా సంచలన నిర్ణయం తీసుకుంది.
బిగ్ బాస్ 7 లో ఆర్మాన్ కోహ్లీతో గొడవపెట్టుకుని షో మధ్యలోనే వెళ్లిపోయింది. అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైంది. 2012లో మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు..అతనికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి సంచలనం సృష్టించింది. అప్పుడలా చేసిన సోఫియా నన్ గా మారుతున్నట్లు తన ఇన్ స్టాన్ గ్రామ్ ద్వారా తెలియచేసింది. తనను మదర్ అంటూ సంభోదించాలని మెసేజ్ పెట్టింది. 'మేకప్ లేకుండా మనం ఎంత అందంగా ఉండగలం..జుట్టుకు రంగేయకుండా..ఫ్యాషన్ ని ఫాలో అవ్వకుండా మనం ఉండగలం..నన్ను క్షమించండి..నేను మారుతున్నా' అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది. 

రాజ్యసభ సీటు కావాలని బీజేపీ కోరలేదు - లోకేష్..

హైదరాబాద్ : రాజ్యసభ సీటు తమకు కావాలని బీజేపీ ఇంతవరకు టిడిపిని కోరలేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ లో లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేతలకు ఏపీ కోటాలో రాజ్యసభ కేటాయించే అవకాశం లేదని, పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలున్నారని తెలిపారు. వారికే రాజ్యసభ ఇవ్వాలని, పొలిట్ బ్యూరో సమావేశమై రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలిపారు. పార్టీ నేతలను తాను కలవడం లేదన్నది అవాస్తవమని, ఇప్పటి వరకు 1,019మంది నేతలను కలవడం జరిగిందని చెప్పారు.

ప్రాజెక్టులపై మంత్రి హీరీష్ సమీక్ష..

హైదరాబాద్ : జల సౌధాలో ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. జూన్ తొలి వారంలో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు, రోళ్లపాడు లిఫ్ట్ కు కూడా జూన్ మొదటి వారంలో టెండర్లు పిలవాలని హరీష్ రావు నిర్ణయం తీసుకున్నారు. 

బీజేపీని విమర్శించే హక్కు ఎవరికీ లేదు - విష్ణుకుమార్..

విజయవాడ : బీజేపీని విమర్శించే హక్కు ఎవరికీ లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనంత మాత్రానా బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ నేతలు తీరుమార్చకోకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

కేరళ సీఎంగా విజయన్..

కేరళ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సెంట్రల్‌ స్టేడియంలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

15:57 - May 25, 2016

బలవంతపు గర్భస్రావాలు కల్గిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో లాయర్ పార్వతి తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన మైరైట్ చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే...కుటుంబ సభ్యులు గర్భిణీని బలవంతపు గర్భస్రావాలు కల్గిస్తే  ఐపీసీ 312 నుంచి 315 సెక్షన్ ప్రకారం.. పలు రకాల శిక్షలు ఉన్నాయి. అధిక సంతానానికి భయపడి గర్భస్రావం కల్గిస్తున్నారు. బలవంతంగా గర్భస్రావం కల్గిస్తే ఐపీసీ 312 సెక్షన్ ప్రకారం మూడు సంవత్సరాల కారాగార శిక్ష పడుతుంది. నిండు గర్భిణికి గర్భస్రావం కలిగిస్తే 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. గర్భిణీగా ఉన్నప్పుడు గర్భస్రావం కల్గించినప్పుడు తల్లి చనిపోతే... ఐపీసీ 314 సెక్షన్ ప్రకారం.. యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. 1994 లో లింగ నిర్ధారణ నిషేధిత చట్టం వచ్చింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే శిక్షార్హులు అవుతారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా నేరమే అవుతుంది' అని పార్వతి వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఓయూ విద్యార్థులపై టి.సర్కార్ నిర్లక్ష్యం - రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం త్యాగాల‌కు సిద్ధ‌ప‌డ్డ ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థుల గురించి కేసీఆర్ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల ప‌రిహారం, ఐదెక‌రాల భూమి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

మహిళా ప్రయాణీకుల కోసం రక్షణ చర్యలు - గడ్కరి..

ఢిల్లీ : 'నిర్భయ' ఘటన జరిగిన అనంతరం బస్సుల్లో సీసీటీవీ, పానిక్ బటన్, వెహికల్ ట్రాకింగ్ డివైస్ లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలతో జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేయనున్నామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడగింపు..

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. విద్యాసాగర్ రావు, ఏకే గోయల్, రామ్‌లక్ష్మణ్, పాపారావు, కేవీ రమణాచారి, వీఆర్ రెడ్డిల పదవీకాలం పెరిగింది.

15:23 - May 25, 2016

విజయవాడ : ఉద్యోగుల తరలింపుపై ఏపీ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. హెచ్ వోడీలు గుంటూరు, కృష్ణా జిల్లాలో కార్యాలయాలు చూసుకోవాలని సూచించింది. జూన్ 27వ తేదీలోగా తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కేపిటల్ రీజియన్ పరిధిలో భవనాలు చూసుకోవాలని సూచనలు ఆదేశించింది. 
 

అంగన్ వాడీ కేంద్రాలను మూసివేయమన్న మంత్రి తుమ్మల..

హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ట్రాకింగ్ విధానం అమలు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు వేల భవనాలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. 

15:21 - May 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్-2 షెడ్యూల్ ఖరారు అయింది. మంత్రి లక్ష్మారెడ్డి షెడ్యూల్ ను విడుదల చేశారు. జులై 9న తెలంగాణ ఎంసెట్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 1 నుండి 7వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ. 500 ఫైన్ తో జూన్ 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జులై 2 నుండి జులై 7 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జులై 14న ర్యాంకులను ప్రకటించనున్నారు. 

 

15:15 - May 25, 2016

'అవకాశం వస్తే కచ్చితంగా బాండ్‌గర్ల్‌గా ప్రేక్షకులకు కనిపిస్తా' అని అంటోంది బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా. 'క్వాంటికో' టెలివిజన్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ప్రస్తుతం 'బేవాచ్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ఇందులో విలన్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉంటే, జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో భాగంగా రూపొందబోయే తదుపరి చిత్రంలో బాండ్‌ గర్ల్‌గా ప్రియాంకకు నటించే అవకాశం వచ్చిందని సామాజిక మీడియా కోడై కూస్తోంది. ఈనేపథ్యంలో దీనిపై ప్రియాంక స్పందిస్తూ, 'నేను బాండ్‌ గర్ల్‌గా కనిపించాలని అభిమానులతోపాటు ఇతర ప్రేక్షకులు సైతం అభిలషిస్తున్నారు. ఛాన్స్‌ వస్తే బాండ్‌గర్ల్‌గా నాకూ నటించాలని ఉంది. బాండ్‌గర్ల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కోసం నేనూ ఎదురు చూస్తున్నా' అంటూ చెప్పింది. గత పదినెలలుగా 'బేవాచ్‌' హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లో నటించిన ప్రియాంక గత రెండు రోజుల క్రితం ఇండియాకొచ్చారు. బాలీవుడ్‌లో 'జై గంగాజల్‌' తర్వాత మరే ఇతర ప్రాజెక్ట్‌లోనూ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇవ్వలేదు. 

ఉద్యోగుల తరలింపుపై సర్క్యూలర్ జారీ..

విజయవాడ : ఉద్యోగుల తరలింపుపై ఏపీ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. హెచ్ వోడీలు గుంటూరు, కృష్ణా, జిల్లాలో కార్యాలయాలు చూసుకోవాలని సూచించింది. జూన్ 27వ తేదీలోగా తాత్కాలిక సచివాలయానికి వెళ్లాలని, కేపిటల్ రీజియన్ పరిధిలో పరిధిలో భవనాలు చూసుకోవాలని సూచనలు చేసింది. 

ఏం సాధించారని సంబరాలు తమ్మినేని ప్రశ్న..

హైదరాబాద్ : రెండేళ్ల పాలనలో టీఆర్ఎస్ ఏం సాధించిందని తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చలేదని, కేటీ టూ పీజీపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతామని ప్రకటించారు. మండలానికి రూ. 10 కోట్లు కరవు సహాయక నిధి కేటాయించాలని, వ్యవసాయ, కార్మిక, గిరిజన మహిళా సమస్యలపై ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా భూ ఉద్యమాలు చేపడుతామని స్పష్టం చేశారు. 

వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నా - జ్ఞాన్ దేవ్..

రాజస్థాన్ : తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ వ్యాఖ్యానించారు. జేఎన్ యూలో ప్రతి రోజు అత్యాచారాలు జరుగుతాయని, అంతేగాకుండా క్రిమినల్ చర్యలు జరగుతాయని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, వేధింపు కేసులకు జేఎన్యూ విద్యార్థులే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. అది మరువక ముందే ఈసారి నెహ్రూ, గాంధీ కుటుంబాలపై జ్ఞాన్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదాన్ని సృష్టించారు.

రెండు సంవత్సరాల పాలనపై నితీష్ విమర్శలు..

బీహార్ : అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్న సందర్భంగా మోడీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రెండు సంవత్సరాలు ఏమి చేయలేదని, రానున్న కాలంలోనైనా చేయాలని నితీష్ సూచించారు. 

14:08 - May 25, 2016

పలు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార ఇకపై నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయం కానుంది. మహిళా ప్రధానంగా సాగే ఓ కథను అగ్రదర్శకుడు ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు జగన్‌ ఇటీవల నయనతారకు వినిపించారు. కథ బాగా నచ్చడంతో ఈచిత్రాన్ని తానే సొంత బ్యానర్‌ని పెట్టి, నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నయనతార తెలిపింది. ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్ గా రూపొందే ఈచిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్‌గా నటించనుంది. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. నయనతార ప్రస్తుతం కార్తీతో 'కాష్మోరా', విక్రమ్‌తో 'ఇరుముగన్‌' వంటి తమిళ చిత్రాలతోపాటు తెలుగులో వెంకటేష్‌కి జోడీగా 'బాబు బంగారం' చిత్రంలోనూ నటిస్తోంది.

14:05 - May 25, 2016

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా 'కబాలి' చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. జూలై 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సూర్య హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు పా రంజిత్‌ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి రంజిత్‌ ఇప్పటికే సూర్యకి కథ కూడా వినిపించారట. రంజిత్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు సూర్య సైతం గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 'కబాలి' విడుదల తర్వాత ఈ చిత్రానికి సంబంధించి ప్రీ- ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం కానున్నాయి. ఇటీవల విడుదల చేసిన 'కబాలి' టీజర్‌కి అనూహ్య స్పందన లభించింది. డిఫరెంట్‌ వేరియేషన్‌తో రజనీకాంత్‌ని రంజిత్‌ చూపించిన తీరుకు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు.
కార్తీతో గతంలో 'మద్రాస్‌' చిత్రాన్ని తెరకెక్కించిన రంజిత్‌ ప్రస్తుతం కార్తీ సోదరుడు సూర్యతో సినిమా చేయడం విశేషం. ఇటీవల '24' చిత్రం సాధించిన సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న సూర్య ప్రస్తుతం 'సింగం 3' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోయే బైలింగ్విల్‌ ప్రాజెక్ట్‌లోనూ సూర్య నటిస్తున్నారు.

బాబుకు కేవీపీ లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ మూడు పేజీల లేఖ రాశారు. వర్షాకాల సమావేశాల్లో తాను ప్రవేశ పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఓటింగ్ కు వస్తుందని ఆశిస్తున్నట్లు, ఆలోగా ఏపీలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తేవాలని కోరారు. సిద్ధాంతపరంగా విబేధాలున్నా ఏపీ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సినవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైతే హక్కుల సాధనకోసం అన్ని పార్టీలూ రాజీపడుతాయని యావద్భారతానికి తెలియచేయాలని కోరారు.

13:54 - May 25, 2016

నిజామాబాద్‌ : జిల్లాలోని బాన్సువాడను నూతన జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నేతలు పట్టణంలో బంద్ నిర్వహించారు. వ్యాపార సంస్థలన్ని స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. బాన్సువాడ 9 మండలాలకు కేంద్రంగా ఉంది కాబట్టి బాన్సువాడను ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.

లేబర్ సెస్ స్కాం ఫైళ్ల మాయం..

గుంటూరు : కార్పొరేషన్ లేబర్ సెస్ స్కాంకు సంబంధించిన కీలక ఫైళ్లు మాయం కావడం కలకలం సృష్టించింది. విజిలెన్స్ దర్యాప్తులో ఫైళ్ల మాయం వెలుగు చూసింది. ఈ ఘటనపై టౌన్ ప్లానింగ్ అధికారులను ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. 

28న టి.ఎంసెట్ -2 నోటిఫికేషన్ ..

హైదరాబాద్ : జులై 9న తెలంగాణ ఎంసెట్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. ఈనెల 28న ఎంసెట్ -2 నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 1 నుండి 7వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ. 500 ఫైన్ తో జూన్ 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జులై 2 నుండి జులై 7 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జులై 14న ర్యాంకులను ప్రకటించనున్నారు. 

పుష్కర పనులను అడ్డుకున్న రైతులు..

గుంటూరు : అమరావతిలోని జ్ఞానబుద్ధ ప్రాజెక్టు వద్ద పుష్కర పనులను రైతులు, భూ యజమానులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా పుష్కర ఘాట్లను ఎలా కడుతారని నిలదీశారు. పరిహారంగా వేరే ప్రాంతంలో భూమిని కేటాయించిన తరువాతే పుష్కర పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

నీట్ పై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష..

హైదరాబాద్ : నీట్ పై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. నీట్ పై కేంద్రం ఆర్దినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావులు హాజరయ్యారు. 

బాబుకు ముద్రగడ ఘాటు లేఖ..

విజయవాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న ముద్రగడ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు దుష్ట ఆలోచన మానుకోవాలని, ప్రతిపక్షం చేతిలో పావు అని నిరూపిస్తే కాపు ఉద్యమం నిలిపివేస్తానని వెల్లడించారు. కాపు జాతిని చీల్చాలని కుట్ర పన్నుతున్నారని బాబునుద్ధేశించి పేర్కొన్నారు. మంత్రులతో ఇష్టానుసారంగా ప్రకటనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు.

 

టి.మంత్రుల సమీక్షలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల..పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధిపై మంత్రి తలసాని..ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులు, వ్యాప్కోస్ నివేదికపై మంత్రి హరీష్ రావులు సమీక్షలు నిర్వహించారు. 

13:47 - May 25, 2016

హైదరాబాద్ : విజయ్ మల్యా చెక్ బౌన్స్ కేసుపై ఎర్రమంజిల్ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఇచ్చిన అడ్రస్ లో విజయ్ మాల్యా లేరని మహరాష్ట్ర పోలీసులు కోర్టు వారెంట్లను ఎర్రమంజిల్ కోర్టుకు తిరిగి పంపారు. దీంతో ఎర్రమంజిల్ కోర్టు విజయ్ మాల్యా కొత్త అడ్రస్ ఉంటే కోర్టుకు తెలపాలని పిటిషనర్లకు సూచించింది. ఏ3 నిందితుడు రఘనందన్ ముంబైలో తలదాచుకున్నాడని అతని అడ్రస్ కోర్టుకు అందజేస్తామని పిటిషనర్లు తెలిపారు. నిందితుడు కోర్టులో లేనందును శిక్షించలేమని మరోసారి ఎర్రమంజిల్ కోర్టు స్పష్టం చేసింది.

13:44 - May 25, 2016

హైదరాబాద్ : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇది మధ్యతరగతి వారు వీరి భారీన పడి అప్పుల పాలవుతున్నారంటే అతిశయోక్తి కాదు. సర్కారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. దీనిపై ప్రైవేటు పాఠశాలల్లో అడ్డగోలుగా పెంచుతున్న స్కూల్‌ ఫీజులను నియంత్రించాలంటూ ప్రైవేట్ స్కూల్స్ పేరంట్స్ అసోసియేషన్‌ సభ్యులు రోడ్డెక్కారు.. తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్ స్కూల్‌ ఎడ్యుకేషన్ కార్యాలయంముందు ఆందోళనకు దిగారు.. ఇంజీనీరింగ్‌ కాలేజీలతోపాటు.... ప్రైవేటు స్కూళ్లలోనూ తనిఖీలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

13:42 - May 25, 2016

హైదరాబాద్‌ :  గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న రెండు నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడను నూతన జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నేతలు పట్టణంలో బంద్ నిర్వహించారు. వ్యాపార సంస్థలన్ని స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. బాన్సువాడ 9 మండలాలకు కేంద్రంగా ఉంది కాబట్టి బాన్సువాడను ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. చేశారు. బెట్టింగ్ స్థావరాల నిర్వాహకులను తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, వివిధ పరికరాలు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ వసంతనగర్‌లో క్రికెట్‌ బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల దాడులు చేపట్టారు. ఈ దాడిలో నలుగురి అరెస్ట్‌, పరారీలో ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకుల వద్ద నుండి సుమారు రూ.4.27 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నగరంలోని మరో ప్రాంతం నిజాంపేటలో ఐదుగురు క్రికెట్‌ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్‌ చేశారు. అనంతరం వారి వద్ద నుండి రూ.3 లక్షల నగదు, 3 లాప్‌టాప్‌లు, 41 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

13:41 - May 25, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు...ఎప్పుడు..అనే ఉత్కంఠకు కొద్ది రోజుల క్రితం తెరపడింది. మళ్లీ ఈ చిత్రం షూటింగ్..ఎప్పుడు..ఎప్పుడు అనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. దీనికి కూడా త్వరలో ఫుల్ స్టాప్ పడనుందట. వి.వి.వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్‌ కథానాయకుడిగా మురగదాస్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కత్తి' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో మార్పులు, చేర్పులు చేసినట్టు సమాచారం.
సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్‌ పూర్తిస్థాయి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ ఆ రోజున ప్రారంభం కాన్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సరసన కథానాయికగా అనుష్క నటిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. కానీ, దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ రోజు షూటింగ్ ప్రారంభమౌతుందా ? లేదా ? అనేది తెలియాలంటే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. 

13:18 - May 25, 2016

'విశ్వరూపం', 'ఉత్తమ విలన్‌', 'చీకటిరాజ్యం' వంటి యాక్షన్‌ చిత్రాలలో నటించిన 'కమల్ హసన్' తాజాగా 'శభాష్‌నాయుడు' పేరు మీద ఓ చక్కటి హాస్యభరిత చిత్రాన్ని చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థతో కలసి రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ ఈ చిత్రాన్ని సొంతగా నిర్మిస్తుండగా, టీకే రాజీవ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో తెరకెక్కుతోదంట. తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకుని వచ్చేందుకు చిత్రబృందం పక్కా స్క్రిప్ట్‌తో సన్నద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి షెడ్యూల్‌ను అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తనదైన రీతిలో ఓ కీలక హాస్య పాత్రను పోషిస్తున్నట్లు టాక్. నిజజీవితంలో తండ్రీకూతుళ్ళు అయిన కమల్‌, శ్రుతిహాసన్‌లు చిత్రంలో కూడా ఆ పాత్రలనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్న లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోందట.

 

వడగాల్పులు..10మందికి అస్వస్థత..

పశ్చిమగోదావరి : ఏలూరులో భారీగా వడగాల్పులు వీచాయి. వడదెబ్బతో పది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కొండగట్టు అధికారులతో మంత్రి ఈటెల సమీక్ష..

హైదరాబాద్ : జిల్లాలోని కొండగట్టు ఆలయం వద్ద సంబంధిత అధికారులతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 31న జరిగే పెద్ద హనుమాన్ జయంతి వేడుకలపై సమీక్ష నిర్వహించారు. 

గవర్నర్ ను కలిసిన విజయన్..

తిరువనంతపురం : ఎల్‌డీఎఫ్ నేత పినరయి విజయన్ ఇవాళ కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సెంట్రల్ స్టేడియంలో ఆ వేడుకను నిర్వహించనున్నారు. కేరళ క్యాబినెట్‌లో మొత్తం 19 మంత్రులు ఉండనున్నారు. కాబోయే సీఎం విజయన్ ఇవాళ తమ మంత్రుల జాబితా లేఖను గవర్నర్ సదాశివమ్‌కు సమర్పించారు. 

12:27 - May 25, 2016

విజయనగరం : గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో నిన్న ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారికోసం నిన్నటి నుండి గాలింపు చర్యల్ని చేపట్టారు. ఈరోజు ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతులు 20 నుండి 24 సంవత్సరాల వయస్సు వుండవచ్చని సమాచారం.

బీఎస్పీ ఎమ్మెల్యే బహిష్కరణ..

ఉత్తర్ ప్రదేశ్ : మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్దుల్ మన్నన్ ను బీఎస్పీ పార్టీ బహిష్కరించింది. ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హన్నన్ ను కూడా బహిష్కరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ : బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల సమావేశంలో పురంధేశ్వరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని బీజేపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఇకపై ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కూడా హోదాను తొలగించబోతున్నట్లు వెల్లడించారు. ఏపీరి ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్రానికి తగిన నిధులు అందచేస్తామన్నారు. ఇప్పటికే ఆరు వేల కోట్లకు పైగా ఆర్థిక లోటును భర్తీ చేశామన్నారు. 

12:15 - May 25, 2016

విజయవాడ : కేంద్రం నుంచి ఆశించినంత స్థాయిలో నిధులు రావడం లేదని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని కొన్ని పార్టీలు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం వారి అనుభవరహిత్యానికి నిదర్శనమని చెప్పారు. మీ సేవా కేంద్రాల్లో అధిక రుసుములు వసూలు వెనక వీఆర్వోలు ఉన్నారని ప్రజల్లో భావన ఉందని.. రెవెన్యూ శాఖలో ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో జలసంరక్షణ పథకంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

మాల్యా వారెంటు తిరిగి వచ్చాయి..

హైదరాబాద్ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసులో జారీ చేసిన వారెంట్లు తిరిగి ఎర్రమంజిల్ కోర్టుకు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్వాహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జీఎంఆర్ సంస్థకు మాల్యా విమానయాన సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బకాయి పడిన సంగతి తెలిసిందే. ఈ బకాయిలను క్లియర్ చేసేందుకు మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీనితో జీఎంఆర్ కోర్టు మెట్లు ఎక్కింది. నిందితుడు హాజరు కాకుండా శిక్ష విధించలేమని చెప్పిన కోర్టు మాల్యాకు వారెంట్లు జారీ చేసింది. కానీ ఈ వారెంట్లు తిరిగి కోర్టుకు వచ్చాయి. 

12:12 - May 25, 2016

విజయనగరం : జిల్లాలో విషాదం జరిగింది. గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో సరదాగా ఈతకోసమని దిగి ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురు మృతదేహలు ఇంతవరకు బయటపడలేదు. విశాఖ జిల్లా సింహాచలం గోశాలకు చెందిన కవికొండల మల్లిఖార్జునరావు కుటుంబం నిన్న మధ్యాహ్నం తాటిపూడి రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అయితే పెద్ద కుమార్తె ధరణి, కుమారుడు అశోక్ కుమార్, చిన్నకూతురు మనీషా గాయత్రిలు చూస్తుండగానే రిజర్వాయర్ లో మునిగి చనిపోయారు. మృతుల వయస్సు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గజఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

సీఎం బాబు వివాదాస్పద వ్యాఖ్యలు..

విజయవాడ : కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో పాపాలు పెరిగిపోతున్నాయని అందుకే దేవాలయాల ఆదాయం పెరిగిపోతోందన్నారు. ప్రార్థనా మందిరాలు లేకపోతే ప్రజలు పిచ్చివాళ్లై పోతారని, తప్పులు చేయడం వాటిని కప్పిపుచ్చుకొనేందుకు 40 రోజులు అయ్యప్ప దీక్షలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. 

పోటీ పడి పనిచేయాలి - బాబు..

విజయవాడ : ఇతర రాష్ట్రాలతో పోటీ పడి పనిచేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రెండేళ్ల పాలనపై సమీక్షించారు. విభజన తరువాత రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉందని, సమష్టి కృషితో గతంకంటే ఆర్థిక ఆదాయం 3.1 శాతం పెంచుకోగలిగామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 1,07,532 ఉందని, రూ. 1,40,648 తో విశాఖ ప్రథమ స్థానంలో...రూ. 1,40,539 తో కృష్ణా జిల్లా రెండో స్థానంలో..రూ. 1,21,724తో పశ్చిమగోదావరి మూడో స్థానంలో ఉండగా..రూ. 74,638 తో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉందన్నారు.

12:01 - May 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలో బోగస్‌ విద్యాసంస్థలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్స్‌ తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయన్నారు. లోటుపాట్లను సవరించుకోవడానికి ప్రైవేటు విద్యా సంస్థలకు అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో కేసీఆర్‌ సమావేశం...
తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. బోగస్‌ సంస్థ ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేని స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణలో బోగస్‌ విద్యా సంస్థలు ఉండటానికి వీల్లేదు -కేసీఆర్‌
బోగస్‌ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరివేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. విద్యార్థులే లేకుండా కాలేజీలను నడపడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశం లేకున్నా.వేలం వెర్రిగా ఒకే కోర్సు చేయడంతోనే నిరుద్యోగ సమస్య ఏర్పడుతోందని కేసీఆర్ అన్నారు. ఉపాధి కల్పించే కోర్సులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. విద్యా సంస్థలకు ఇచ్చే కరెంట్‌ను కమిర్షియల్‌ నుంచి జనరల్‌ కేటగిరీకి మార్చడం, ఆస్తి పన్ను మినహాయింపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

సమ్మె విరమించిన ప్రైవేటు విద్యా సంస్థలు....
తెలంగాణలో విద్యా విధానం, కోర్సులు, ప్రైవేటు విద్యా సంస్థల అవసరాలపై విద్యా సంస్థల ప్రతినిధులు చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు. కోర్సులతో పాటు కాలేజీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం సమావేశంపై సంతృప్తి వ్యక్త చేసిన ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు సహకరిస్తామని తెలిపాయి.

ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్స్‌ తనిఖీలు : కేసీఆర్
ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్స్‌ తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సోదాల్లో వెలుగులోకి వచ్చిన లోటుపాట్లను సవరించుకునేందుకు విద్యా సంస్థలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దానికి తగిన సమయం ఇస్తామన్న సీఎం.. తమ చర్యలు పరమార్థం ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయడం కాదని అన్నారు. రాష్ట్రంలో అత్యున్నత విద్యను అందించడంలో ప్రైవేటు విద్యా సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి అని కేసీఆర్‌ అన్నారు. 

11:51 - May 25, 2016

హైదరాబాద్ : చికాగోలో మంత్రి కేటీఆర్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. స్థానిక సంస్థల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్న అమెరికాలోని పలు నగరాల మేయర్లతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీర్ సమావేశం అయ్యారు. ఇండియాన రాష్ట్రంలోని కార్మేల్ నగర మేయర్ బ్రయనార్డ్ తో సమావేశమై కార్మేల్ పట్టణంలో పౌరసేవలను నిర్వహిస్తున్న తీరుపై మంత్రి పలు అంశాలను చర్చించారు. తాగునీటి సరఫరా, విద్యుత్ పంపిణీ, ప్రజారవాణా, మురికినీటి నిర్వహణ వంటి అంశాలను మంత్రి పరిశీలించారు. నగరంలోని మౌళిక వసతుల కల్పనతో ప్రభుత్వ ప్రైవేటు రంగాల భాగస్వామ్యంపై చర్చించారు. మౌళిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు సమకూర్చుకునే విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇండియాన పోలీస్ నగర మేయర్ జోహగ్ సెట్ తో సమావేశమైన మంత్రి కేటీఆర్ అక్కడి నగర్ ప్లానింగ్, పురపాలనపై ప్రధానంగా చర్చించారు. 

11:47 - May 25, 2016

విజయవాడ  : రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, సాధించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీ కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. రాష్ట్రాభివృద్ధి గణాంకాలు, రెండెంకెల వృద్ధి, సంక్షేమ పథకాల పైన సుధీర్ఘంగా అధికారులతో సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సదస్సులో మొత్తం ఏడు సమావేశాలుంటాయి. ఈ సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, 13 జిల్లాల కలెక్టర్లు, సీఎస్ టక్కర్, ప్రిన్సిపాల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మనం చేసే బెస్ట్ వర్క్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో పేర్కొన్నారననీ..ప్రధాని కూడా ఏపీ పనితీరుపట్ల అభినందించారని తెలిపారు. 24 ఇంటూ 7 పవర్ లో ఆరు అవార్డులు ఏపీకే వచ్చాయని తెలిపారు. పంచాయితీ రాజ్ లో మేజర్ అవార్డ్స్ మనకే వచ్చాయన్నారు. యూనివర్సల్ గా ఏపీకి అభినందించటమే కాకుండా డిఫరెంట్ ఏజెన్సీలు మనల్ని రికగ్నజ్ చేస్తున్నాయన్నారు. 2020 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. తలసరి ఆదాయంలో విశాఖ మొదటిస్థానంల వుంటే శ్రీకాకుళం చివరి స్థానంల వుందని తెలిపారు. అధికారుల్లో పోటీ తత్వం పెరగాలని సూచించారు.

11:46 - May 25, 2016

ఏమాయ చేసావె' చిత్రం తర్వాత నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన 'చకోరి..' అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కోన వెంకట్‌ మాట్లాడుతూ, 'ఆస్కార్‌ గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే...' పాటను, 'షోకిల్లా' సాంగ్‌ మేకింగ్‌ వీడియోను ఇటీవల విడుదల చేశాం. ఈ రెండు పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 26న 'చకోరి' అనే మరో సాంగ్‌ను సోషల్‌ మీడియాలో డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ విడుదల చేయబోతున్నారు. ట్విట్టర్‌లో నేను, నాగచైతన్య రిలీజ్‌ చేయనున్నాం. చిత్రంలో ఒక ట్రావెల్‌ సాంగ్‌గా ఈ పాట ఉంటుంది. వైజాగ్‌ నుంచి కన్యాకుమారి వరకు హీరో, హీరోయిన్‌ బైక్‌పై ట్రావెల్‌ చేస్తున్నప్పుడు వచ్చే ఈ పాట సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావె' మ్యూజికల్‌గా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం కూడా మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. నాగచైతన్య కెరీర్‌లో మరో మెమరబుల్‌ మూవీ అవుతుంది' అని అన్నారు. 'ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తన క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు. 'ఏమాయ చేసావె' తర్వాత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటల్ని కంపోజ్‌ చేశారు'. అని తెలిపారు. 

11:37 - May 25, 2016

నిజామాబాద్ : కామారెడ్డి మండలం టేక్రియల్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు కారు వెళుతోంది. 44వ జాతీయ రహదారి వద్దకు చేరుకోగానే అతివేగంతో వచ్చిన లారీ, కారును ఢీకొట్టింది. కొద్దిదూరం వరకు తీసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు పక్కన నిలిపి వున్న లారీ తప్పించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన వారుగా గుర్తించారు. కారు నుజ్జునుజ్జు కావడంతో క్షతగాత్రులను బయటకు తీయటానికి పోలీసులు తీవ్రంగా శ్రమపడ్డారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి హాజరయి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోస్టు మార్టం అయిన అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

11:31 - May 25, 2016

దాదాపు పదేండ్ల తర్వాత ప్రభుదేవా 'అభినేత్రి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన వేసే డాన్సులు అందరినీ ఊర్రూతలూగిస్తాయి' అని అంటున్నారు రైటర్‌ కోన వెంకట్‌. ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సిలో పాట చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కోన వెంకట్‌ మాట్లాడుతూ, 'తన డాన్స్ తో అందర్నీ మెస్మరైజ్‌ చేసిన కింగ్‌ ఆఫ్‌ డాన్స్ ప్రభుదేవా 'కింగ్‌ ఆఫ్‌ డాన్స్ ఈజ్‌ బ్యాక్‌' అనిపించేలా ప్రభుదేవా వేసిన స్టెప్స్ అందర్నీ ఉర్రూతలూగిస్తాయి. భారీ లెవల్‌లో చిత్రీకరించిన ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ పల్లవి వీడియోను జూన్‌ 3న విడుదల చేయబోతున్నాం. అదేరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్‌ చేస్తాం. ఈ వేడుకకు సర్‌ప్రైజింగ్‌ గెస్టులు హాజరు కాబోతున్నారు'అని అన్నారు. 'తొలిసారి తమన్నా ఈ చిత్రంలో టైటిల్‌ పాత్ర పోషిస్తుంది. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం' అని నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ తెలిపారు. 

11:22 - May 25, 2016

కాఫీయే కదా ఎన్నిసార్లు తాగితే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం మీకు ఊబకాయం తప్పదని వైద్యులు అంటున్నారు. కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నా కూడా, అతి కాఫీ శరీర బరువు పెరగడానికి కారణం అవుతుందని తాజా అధ్యయనం తేల్చింది. తరచూ కాఫీ తీసుకోవడం వల్ల కేవలం ఊబకాయమే కాకుండా కొన్ని రకాలైన మొండి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని వెస్టరన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కాఫీని పరిమితంగా తీసుకోవాలని, అపరిమితంగా తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొందరు తాము కెఫీన్‌ రహితమైన కాఫీ తాగుతున్నాం కదా అని కొందరు అనుకుంటారని. అలా అనుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రోజుకు ఐదారు కప్పుల కాఫీని తాగేవారి ఉదరభాగంలో కొవ్వు పేరుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని వారు తెలిపారు. కాఫీలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ (సీజీఏ) కి మధుమేహాన్ని నివారించే లక్షణాలున్నాయని, అయితే దీని మోతాదు మితిమీరితే మాత్రం కొవ్వు పేరుకునే సమస్య ఉత్పన్నమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కాఫీ వల్ల మేలున్నా... అతిగా సేవించడం మాత్రం ప్రమాదమే

11:20 - May 25, 2016

పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగిన శరీరం... ఇంటికి రాగానే అలసట తీర్చుకుంటుంది. అలాగే ఎక్కడెక్కడో తిరిగి అలసిన చర్మం అలసట తీరాలంటే.. దానిపై చేరిన జిడ్డు పోవాలంటే రాత్రి పడుకునే ముందు కడగాల్సిందే అంటున్నారు డెర్మటాలజిస్టులు!
అస్సలు దుమ్ముధూళి లేని ఎంత మంచి వాతావరణంలో సాయంత్రాలు స్పెండ్‌ చేసినా.. కచ్చితంగా ముఖంపై జిడ్డు చేరుతుంది. ఇంకా రోజంతా మేకప్‌ వేసుకునో, లేదంటే ఏదైనా క్రీమ్‌ వేసుకునో.. ముఖం ఉన్న చర్మ రంధ్రాలన్నీ మూసుకునిపోయి ఉంటాయి ఇవన్నీ పోవాలంటే కచ్చితంగా ముఖం కడగాల్సిందే!
మన దేశంలోని ఏ నగరంలో అయినా దుమ్ము, ధూళి, పొల్యూషన్‌ ఎక్కువే. అందుకే మీ చర్మం కచ్చితంగా పాడైపోతుంది. కాబట్టి మంచి ఎక్స్‌ఫోలియేషన్‌ అవసరం. మంచి ఫేస్‌వాష్‌తో ముఖం కడుగుకుంటే మృతకణాలు తొలగిపోయి ముఖం మంచి కాంతిని సంతరించుకుంటుంది.
రోజంతా అలసిపోయి... సాయంత్రానికి ఏ జిమ్‌లోనో, స్విమ్మింగ్‌ పూల్‌లోనో సేదతీరి వస్తూ ఉంటారు. ఆ స్విమ్మింగ్‌పూల్‌లో, జిమ్‌లో గంటలపాటు ఉండటం వల్ల కూడా మీ ముఖంపై బ్యాక్టీరియా చేరుతుంది. సో ఇంటికి వచ్చిన తరువాత ముఖం కడుక్కోకపోతే బ్యాక్టీరియా మీ ముఖాన్ని పాడుచేస్తుంది. ఆ బ్యాక్టీరియాను చంపాలంటే ముఖం కడగాల్సిందే!
సాయంత్రం ముఖం కడుగుతుంటే ముఖాన్ని అలా కాసేపు రుద్దాలనిపిస్తుంది. ఆ తరువాత మాయిశ్చరైజ్‌ అప్లై చేస్తాం. ఇలా ప్రతి రోజూ సాయంత్రం ఓ పదినిమిషాలు ముఖానికి కేటాయిస్తే గంటలు గంటలు పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు!

కలెక్టర్ల సమావేశంలో బాబు ప్రసంగం..

విజయవాడ : కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పథకాల అమలుపై సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేస్తున్నారు. 2014-15 రెవెన్యూ అనుకున్నదానికంటే 3.2 శాతం పెంచుకోగలిగామని, 2050 నాటికి ప్రపంచ అత్యుత్తమ గమ్యస్థానంగా ఏపీని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు ఇంక్లూజీవ్ గ్రోత్, పెర్ఫామెన్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతోందన్నారు. 

టీఎస్ టెట్ ప్రాథమిక కీ విడుదల..

హైదరాబాద్ : ఈ నెల 22న నిర్వహించిన టీఎస్ టెట్ అర్హత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని అధికారులు మంగళవారం విడుదల చేశారు. TSTET.CGG.GOV.INవెబ్‌సైట్‌లో ‘కీ’ని పొందుపరిచినట్లు టెట్ కన్వీనర్ జగన్నాథ్‌రెడ్డి తెలిపారు.

అన్ని జిల్లాల్లో 11 శాతం వృద్ధి రేటు - యనమల..

విజయవాడ : అన్ని జిల్లాల్లో దాదాపు 11 శాతం వృద్ధి రేటు సాధించినట్లు ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి విషయంలో కలెక్టర్లు పోటీతత్వంతో పనిచేయాలని, అభివృద్ధిలో మండలాలు ఎక్కడ బలంగా ఉన్నాయి..ఎక్కడ బలహీనంగా ఉన్నాయో కలెక్టర్లు గుర్తించాలని సూచించారు. 

10:54 - May 25, 2016

ఓటుకు నోటు కేసు అటకెక్కిందా? ఈ విషయంగా రాజకీయంగా కొన్ని ఒడంబడికలు జరిగాయనే అంశంపై ఈనాటి టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది. ఈ చర్చలో కరణం ధర్మశ్రీ (వైసీపీ అధికార ప్రతినిధి), రాకేష్ (టీఆర్ఎస్ నేత), పాల్గొన్నారు. చర్చపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి. 

కలెక్టర్ల సమావేశంలో కేఈ ప్రారంభోపన్యాసం..

విజయవాడ : కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటి సీఎం కేఈ ప్రారంభోపన్యాసం చేశారు. రెండేళ్లలో రెవెన్యూ సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చామని, భవిష్యత్ లో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రజా సమస్యలపైన అవగాహన లేని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. 

తాలిబన్ కు కొత్త అధ్యక్షుడి ఎంపిక..

అప్ఘనిస్తాన్ : తాలిబన్ అధ్యక్షుడు ముల్లాహ్ మన్సౌర్ మృతి చెందినట్లు అప్ఘన్ తాలిబన్లు ప్రకటించాయి. అప్ఘన్ తాలిబన్ కొత్త అధ్యక్షుడిగా ముల్హాహ్ హై బతుల్లాహ్ హక్ హుద్ ఎన్నికయ్యాడు. 

ప్రజలను తప్పుదోవ పటిస్తున్న ప్రభుత్వం - సీపీఎం..

విశాఖపట్టణం : మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తుంటే ప్రభుత్వం ఇంకుడుగుంతలంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభులు సీ.హెచ్.నర్సింగరావు పేర్కొన్నారు. ఓ వైపు స్టీల్ ప్లాంట్ కు నీరు లేక మూతపడే పరిస్థితి ఉంటే ఇక కొత్త ప్రాజెక్టులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇరిగేషన్ నిపుణులతో పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ వేయాలని సూచించారు.

విజయవాడలో కలెక్టర్ల సమావేశం ప్రారంభం..

విజయవాడ : కొద్దిసేపటి క్రితం కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో జరుగుతున్న ఈసమావేశంలో మంత్రులు..అధికారులు పాల్గొన్నారు. 

10:31 - May 25, 2016

విజయవాడ : ఈరోజునుండి రెండు రోజులపాటు విజయవాడలో కలెక్టర్ సమావేశం జరుగుతోంది. టీడీపీ రెండేళ్ళ పరిపాలన, రానున్న మూడేళ్ళ తీసుకోవాల్సిన కార్యాచరణపై అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రాష్ట్రాభివృద్ధి గణాంకాలు, సాధించాల్సిన రెండంకెల వృద్ధిపై కలెక్టర్లకు సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం, సాధించిన ప్రగతి, సాధించాల్సిన లక్ష్యాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. 

టీఆర్ఎస్ నేత హత్య కుట్ర భగ్నం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత ఆనంద్ కుమార్ గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అప్ఝల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లు..నిఫ్టీ 100పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి.

 

10:28 - May 25, 2016

హైదరాబాద్ : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హష్మి దారుణ హత్యపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విచారం వ్యక్తం చేశారు. అదృశ్యమైన హష్మిని తోటి స్నేహితుడే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మధు టెన్ టివితో మాట్లాడారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. నేరాలపై తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

తోటి స్నేహితుడే కాలాంతకుడు..
టీసీఎస్ కంపెనీలో రెండు నెలల కిత్రమే హష్మి విధుల్లో చేరాడు. ఇతనికి నరేష్ కుమార్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ కలిసే తిరిగేవారు. ఎక్కువసార్లు హష్మి ఖర్చు పెట్టేవాడు. అతని పర్సులు..బంగారు గొలుసు చూసిన నరేష్ కుమార్ కు చెడు ఆలోచన కలిగింది. హష్మి దగ్గర ఎక్కువ డబ్బులుంటాయని భావించాడు. ఎలాగైనా డబ్బును లాక్కొవాలని కుట్ర పన్నాడు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం టీసీఎస్ కంపెనీ నుండి బయటకు వచ్చిన హష్మిని నరేష్ కలిశాడు. వీరిద్దరూ బైక్ పై లింగంపల్లి రైల్వేస్టేషన్ దగ్గరకు వచ్చాడు. మాట్లాడాలని హష్మికి చెప్పాడు. అనంతరం రైల్వే బ్రిడ్జి కిందకు తీసుకపోయి ఒక్కసారిగా రాయితో దాడి చేశాడు. అనంతరం హష్మి తలపై మోది దారుణంగా హత్య చేశాడు. వీరి మధ్య పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పడిపోయిన గోల్డ్ ఛైన్ కోసం నరేష్ వెతికినట్లు సమాచారం. అనంతరం అతని జేబులో ఉన్న 15వేల నగదు, ఫోన్, ఉంగరం తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంటికి రాకపోయేసరికి హష్టి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. సెల్ టవర్ల ద్వారా ప్రయత్నించినా జాడ తెలియలేదు. లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. అంతేగాక స్నేహితుడు నరేష్ రెడ్డి ప్రవర్తనపై అనుమానించిన పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. అనంతరం నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ఘోరం బయటపడింది. హష్మి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగాల విలపిస్తున్నారు. 

లోయలో పడిన బస్సు 12 మంది మృతి..

ఉత్తరాఖండ్ : ఓ బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది మృతి చెందగా 8మందికి గాయాలయ్యాయి. మాసి నుండి రామ్ నగర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

10:15 - May 25, 2016

ఢిల్లీ : రోడ్‌సైడ్ ఉస్తాద్‌గా మారిన బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌ తనకు 12 రూపాయలు దానం చేసిన వ్యక్తిని కలుసుకున్నాడు.. అతన్ని తన తన ఇంటికి ఆహ్వానించి కొద్దిసేపు మాట్లాడాడు.. అభిమాని ఇచ్చిన 12 రూపాయల ఫొటో ఫ్రేమ్‌ను చూపించాడు.. ఈ విషయాన్ని సోషల్‌మీడియాద్వారా పంచుకున్నాడు.. ఈ ఫ్రేమ్‌ తనకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు.. గత వారం ముంబైలో సోనూ బెగ్గర్ అవతారమెత్తాడు.. రోడ్డుపై పాటలు పాడాడు.. అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టకపోగా చాలామంది చిల్లరవేసి వెళ్లిపోయారు.. ఈ సింగర్‌ సాంగ్‌ నచ్చిన ఓ అభిమాని మాత్రం ఆ పాటను రికార్డు చేసుకున్నాడు.. టిఫిన్ చేశారా? అని అడిగి 12 రూపాయలు దానంగా ఇచ్చాడు.. అతన్ని వెతికిపట్టుకున్న సోనూ ఈ అభిమాని తనకు ఎంతో ప్రత్యేకమైనవాడని చెప్పుకొచ్చాడు.. 

10:13 - May 25, 2016

చెన్నై : ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే ఓ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తిరుపరన్ కుంద్రం నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే పార్టీ తరపున సీనివేల్ పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక రోజు ముందు సీనివేల్ కు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిపించారు. ఎన్నికల ఫలితాల్లో సమీప డీఎంకే అభ్యర్థిపై 22,992 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మెరుగైన చికిత్స కోసం పలు ఆసుపత్రులు తిప్పారు. బుధవారం ఉదయం సీనివెల్ కన్నుమూశారు. దీనితో ఆ నియోజవకర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనివేల్ గతంలోనూ తిరుపరన్ కుంద్రం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. 

కుప్వారాలో కాల్పులు..ఒకరి మృతి..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారా జిల్లాలోని గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హంద్వారా వాదర్ బాలాలో చోటు చేసుకుంది. 

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి..

తిరుమల : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో తిరుమల చేరుకున్న ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

09:35 - May 25, 2016

హైదరాబాద్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఓ తత్వవేత్త చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా నిరూపితమవుతోంది. రక్త సంబంధాలు, పవిత్రమైన వివాహ వ్యవస్థ ఆర్థిక సంబంధాలతోనే ముడిపడిపోతున్నాయి. స్నేహానికి ప్రాణం ఇచ్చే స్నేహితులున్న ఈ సమాజంలోనే కేవలం డబ్బు కోసం హత్యలు చేసే నకిలీ స్నేహితులు కూడా వున్నారు. హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో జరిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్యే ఉదహారణ..
గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న హష్మీ అనే ఉద్యోగి చందానగర్ లో దారుణ హత్యకు గురయ్యాడు. తోటి ఉద్యోగే ఈ దారుణానికి పాల్పడ్డాడు. విజయవాడకుచెందిన హష్మీ గచ్చిబౌలీలో సాఫ్ట్ వేర్ కంపెనీలో మూడు నెలల క్రితం జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో స్నేహితుడిగా పరిచయం అయిన ఓ వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి 9.00గంటల సమయంలో బయటకు వెళ్లాడు. అప్పటినుండి హష్మీ కనిపించకుండా పోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులకు చందానగర్ వద్ద శవంగా కనిపించాడు. దీంతో హష్మీ బంధువులకు సమాచారం అందించారు. కాగా హష్మీ స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. హష్మీ వద్ద వున్న మొబైల్ , కొంచెం నగదు కోసమే హష్మీని చంపినట్లుగా స్నేహితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం హష్మీ బైక్ తీసుకుని స్నేహితుడు రూమ్ వెళ్ళిపోయాడు. అనుమానించిన పోలీసులు అతడిని విచారించగా తానే హత్య చేసినట్లు సదరు ఉద్యోగి ఒప్పుకున్నాడు. హష్మీ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన తరువాత బంధువులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఉద్యోగంలో చేరిన అతి కొద్ది రోజులకే కుమారుడు చనిపోవటం పట్ల తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.

ప్రమాణం చేయకుండానే కన్నుమూసిన ఎమ్మెల్యే..

చెన్నై : తిరుపరకుండ్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శ్రీనివాసన్ గుండెపోటుతో మృతి చెందారు. ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే శ్రీనివాసన్ కన్నుమూశారు. 

విజయవాడలో లారీ బీభత్సం..

విజయవాడ : జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ వైపు వెళుతున్న ఓ కంటెనర్ నిర్మల కాన్వెంట్ జంక్షన్ వద్ద అదుపు తప్పింది. ముందు వెళుతున్న ట్రాక్టర్, బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

భజరంగ్ దళ్ పై కేసు నమోదు..

ఉత్తర్ ప్రదేశ్ : ఇటీవల అయోధ్యలో భజరంగ్ దళ్ ఆత్మరక్షణ అంటూ తుపాకులతో శిక్షణ ఇప్పించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భజరంగ్ దళ్ పై కేసు నమోదైంది. వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఫజియాబాద్ ఎస్పీ ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు. 

09:20 - May 25, 2016

ముంబై : బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ఓ దుకాణంలో దుస్తులు చోరీ చేస్తూ సీసీ టీవీ కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఫుటేజ్ ఆన్ లైన్ లో తెగ వైరల్ అవుతోంది. రితేశ్ నిజంగానే దొంగతనం చేస్తున్నాడా ? అని ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ నిర్ఘాంతపోయింది. నటి జెనీలియాను రితేశ్ వివాహమాడిన సంగతి తెలిసిందే. 
ముంబైలో ఉన్న ఓ వస్త్రదుకాణంలోకి వెళ్లిన రితేశ్ కొన్ని దుస్తులను ట్రై చేసి మరికొన్ని టీ షర్టులు తాను వేసుకున్న చొక్కాలో దోపేసుకుని వెళ్లిపోతున్నట్లు ఉంది. ఇది చూసిన అభిమానులతో పాటు ఇతర దర్శక, నిర్మాతలు నిర్భాంతపోయారంట. రితేశ్ నిజంగానే దొంగతనం చేస్తున్నాడా ? అని పలువురు నోరెళ్లబెట్టుకుని చూస్తుండిపోతున్నారు. కానీ హౌస్ పుల్ 3 చిత్ర ప్రచారం కోసమా ? లేక ట్రూ బ్లూ బ్రాండ్ ప్రచార కోసమా అనేది తెలియ రావడం లేదు. దీని గురించి హీరో రితేష్ వెల్లడిస్తే కానీ నిజం బయటకు రాదు. అంత వరకు వెయిట్ అండ్ సీ...

నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం..నలుగురి మృతి..

నిజామాబాద్ : కామారెడ్డి (మం) టేక్రియాల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. 

తిరుపతిలో మూడు రోజుల పాటు ట్రేడ్ బంద్..

చిత్తూరు : తిరుపతిలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ట్రేడ్ బంద్ కు వ్యాపారవర్గాలు పిలుపు నిచ్చాయి. తిరుపతి సీటీవో-2గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు నాయుడు తమను వేధింపుల పాలు చేస్తున్నాడంటూ వ్యాపార సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యత్వం ఉన్న 27 వ్యాపార సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. బుధవారం తలపెట్టనున్న బంద్ లో తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి పట్టణాలకు చెందిన సుమారు 10 వేల మంది వ్యాపారులు పాల్గొననున్నాయని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ పేర్కొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ.

చిత్తూరు : తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 30 కంపార్ట మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 9 గంటల సమయం పడుతోంది. 

ఉప్పల్ స్టేడియం వద్ద రెడీ మిక్స్ లారీ బోల్తా..

హైదరాబాద్‌ :  ఉప్పల్ స్టేడియం వద్ద రెడీ మిక్స్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఏర్పడిన ట్రాఫిక్ జాం కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి సహాయక చర్యలు చేపట్టారు.

అదృశ్యమైన ఇంజినీర్ దారుణ హత్య..

హైదరాబాద్: అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హష్మీ దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్‌లో హష్మీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

పడవబోల్తా..ఒకరి గల్లంతు..

పశ్చిమగోదావరి : భీమిలి మండలం అన్నవరం దగ్గర సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో మత్స్యకారుడు నారాయణ (47) గల్లంతు అయ్యారు. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు గల్లంతైన నారాయణ కోసం గాలిస్తున్నారు. 

08:57 - May 25, 2016

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మే 31వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 3 వరకు గడవు విధించారు. జూన్ 11న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు కౌంటింగ్‌ కూడా జరగనుంది. మొత్తం 15 రాష్ర్టాల నుంచి 57 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్‌ అవుతున్నారు. రిటైర్‌ అవుతున్నవారిలో ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది, అత్యల్పంగా ఉత్తరాఖండ్‌ నుంచి ఒక సభ్యుడు రిటైర్‌ అవుతున్నారు. రిటైర్‌ అయిన వారిలో బీజేపీకి చెందిన ఏడుగురు కేంద్రమంత్రులున్నారు. 

రేపే టి.ఎంసెట్ ఫలితాలు..

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారన్నారు. జూన తొలివారంలో కౌన్సెలింగ్‌ మొదలుపెట్టి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 

08:53 - May 25, 2016

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటికి రెండేళ్లు పూర్తవుతాయి. 2014 మే 26న ప్రధాని నరేంద్రమోడీ నేత్రుత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనదేశంలో కొన్ని ముఖ్యమైన పథకాలు అమలవుతున్నాయి. వీటిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ లాంటివి అత్యంత ముఖ్యమైనవి. కొన్ని కోట్ల మంది నిరుపేదలు వీటి ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఉపాధిహామీ, మిడ్ డే మీల్స్, ఐసీడిఎస్ లాంటి స్కీమ్ లను వివిధ అంతర్జాతీయ అధ్యయనాలు సైతం ప్రశంసించాయి. వీటిని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలంటూ కోర్టులూ ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ స్కీమ్ ల విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఎలా వుంది? ఈ రెండేళ్లలో ఈ స్కీమ్ ల పరిపుష్టికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులుంటున్నాయా? స్కీమ్ లలో పాల్గొంటున్న వర్కర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలేమిటి? ఈ స్కీమ్ లు మరింత ప్రయోజనకరంగా మారాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు నేత ఏవి నాగేశ్వరరావుగారు 10టీవీ స్టూడియోకి వచ్చారు.ఈ అంశాలపై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ విజువల్ ని వాచ్ చేయండి.

08:46 - May 25, 2016

పశ్చిమ బెంగాల్‌  : ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఈనెల 27న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మమత ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. ఏప్రిల్‌, మేల్లో ఆరు విడతలుగా జరిగిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీలోని 294 స్థానాలకుగాను టీఎం 211 టీఎంసీ సీట్లు కైవసం చేసుకుంది. దీంతో టీఎంసీ శాసనసభా పక్ష నేతగా మమతను ఎన్నుకున్నారు. 2011లో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేసిన మమత... ఈసారి రెడ్‌ రోడ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఎక్కువ మంది వీక్షించేందుకు వీలుగా రెడ్‌లో ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, భూటాన్‌ ప్రధాన మంత్రి షేరింగ్‌ టోబ్గేలను కార్య్రమానికి ఆహ్వానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్...మమత ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఎంసీ నేతల దాడులతో హింస పెచ్చరిల్లింది. దీంతో మమత ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈనెల 27న మమత ప్రమాణస్వీకారం చేసే రెడ్‌రోడ్‌లో కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసింది.

08:41 - May 25, 2016

ముంబై : పది మంది పోలీసులు చేయలేని పనిని ఓ సీసీటీవీ కెమెరా చేస్తుంది. నవీ ముంబైలోని ఓ రెస్టారంట్‌లో జరిగిన దొంగతనమే ఇందుకు నిదర్శనం. దుప్పట్టు కప్పుకుని రెస్టారంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురు మహిళలు ఓనర్‌ను మాట్లల్లో పెట్టారు. వీరి వెంట వచ్చిన మరో బాలిక క్యాష్‌ కౌంటర్‌ డ్రాయర్‌ తెరిచి డబ్బులు దొంగిలించిన వైనం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ దృశ్యాలను చూసిన పోలీసులతోపాటు రెస్టారంట్‌ ఓనర్‌ను ఆశ్చర్యానికి గురయ్యారు. క్యాష్‌ కౌంటర్‌ నుంచి బాలిక డబ్బులు దొంగిలిస్తున్న విషయం తెలియకుండా దుప్పట్టా కప్పుకుని మహిళలు కవర్‌ చేశారు. మరో నాలుగు షాపుల్లో వీరు దొంగతనం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిని అరెస్టు చేశారు.

08:37 - May 25, 2016

తమిళనాడు  : తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే రోజులు వచ్చాయి. ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత కొలువులో ఇద్దరు తెలుగు మంత్రులు చేశారు. దీంతో తమిళనాడులోని తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
కండబూర్‌ రాజు, బాలకృష్ణారెడ్డి...
తమిళనాడులో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. ముఖ్యమంత్రి జయలలిత తన మంత్రివర్గంలో ఇద్దరు తెలుగువారికి స్థానం కల్పించారు. కండబూర్‌ రాజు, బాలకృష్ణారెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాపు వర్గానికి చెందిన కండబూర్‌ రాజు...
కాపు సామాజిక వర్గానికి చెందన కండబూర్‌ రాజు ఏఐఏడీఎంకేలో కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి కోవిల్‌పట్టి స్థానం నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011లోనే రాజుకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని అనుకున్నా... అప్పట్లో అవకాశం రాలేదు. కండబూర్‌ రాజుకు ఇసారి అవకాశం కల్పించిన జయలలిత... ఆయనకు సమాచార పౌరసంబంధాల శాఖను అప్పగించారు.
బాలకృష్ణారెడ్డికి పశుసంవర్ధక శాఖ....
కృష్ణగిరి జిల్లాకు చెందిన బాలకృష్ణారెడ్డిని కూడా జయలలిత తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. హోసూరులో అన్నాడిఎంకే కార్యకర్తగా పార్టీలో చేరిన బాలకృష్ణారెడ్డి ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. హోసూరు మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేశారు. కాంగ్రెస్‌, డీఎంకేలకు కంచుకోటగా భావించే హోసూరు నుంచి ఎన్నిక కావడంతో బాలకృష్ణారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. హోసూరు నుంచి కాంగ్రెస్‌ తరుపున మూడుసార్లు ఎన్నికైన తెలుగు వ్యక్తి గోపీనాథ్‌ను ఓడించి... బాలకృష్ణారెడ్డి చరిత్ర సృష్టించారు. ఈయనకు పశుసంవర్థక శాఖను అప్పగించారు.
తెలుగు ప్రజల సమస్యల పరిష్కారమయ్యేనా? ...
జయలలిత మంత్రివర్గంలో గతంలో తెలుగువారు లేకపోవడంతో... భాషాపరంగా మైనారిటీలుగా ఉన్న మన వారి సమస్యలు పరిష్కారం కాలేదు. గతేడాది తమిళనాడు సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలల్లో తెలుగు మీడియంను తీసివేసి బలవంతంగా తమిళ మీడియంను అంటగట్టినా అమ్మ దృష్టికి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. ఈసారి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు. 

08:26 - May 25, 2016

హైదరాబాద్ : దెబ్బ మీద దెబ్బ తింటున్న కాంగ్రెస్‌ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ప్రాంతీయ పార్టీలను తట్టుకునేందుకు భారీ సంస్కరణలు చేపట్టబోతోంది. సాంప్రదాయాలకు భిన్నంగా మూడేళ్లకు ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. అయితే.. చివరి నిమిషం కూడా బీ-ఫామ్‌పై అభ్యర్థుల పేర్లను మార్చే కాంగ్రెస్‌లో ఇది సాధ్యమేనా అనే చర్చ అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఉప ఎన్నికల్లో వెక్కిరిస్తున్న ఓటమి....
తెలంగాణ ఇస్తే అధికారం తమదే అనుకున్న కాంగ్రెస్‌ అధిష్టానానికి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. దీంతో షాక్‌ తిన్న అధిష్టానం పెద్దలు.. సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యను తప్పించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలకు సారధ్య బాధ్యతలు అప్పగించారు. అయినా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నిక మొదలుకొని... నిన్నటి పాలేరు ఉప ఎన్నిక వరకు ఓటమి వెక్కిరిస్తూనే ఉంది. దీంతో అలసిపోయిన హస్తం పార్టీ ఇప్పుడు పూర్తిస్థాయిలో చికిత్సకు నడుం బిగించింది.

సంప్రదాయానికి భిన్నంగా సంస్కరణలు...
రాష్ట్రంలో రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితిని మార్చాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తోంది. అందుకే సాంప్రదాయాలకు భిన్నంగా అనేక సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికలకు మూడేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. త్వరలోనే 50 మంది సీనియర్ల పేర్లను ప్రకటించబోతుంది. ఇదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.

అధిష్టానం తీరుపై పార్టీలో చర్చ ...
అయితే.. గ్రూప్‌లకు అడ్రస్‌గా ఉన్న కాంగ్రెస్‌లో ఇది సాధ్యమేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో కష్టపడే వారికి కాకుండా.. లాబీయింగ్‌ చేసినవారికి.. అదీ చివరి నిమిషంలో బీ-ఫామ్‌ ఇచ్చే సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌లో మూడేళ్లకు ముందే అభ్యర్థులను ప్రకటించడం సాధ్యమవుతుందా అనే చర్చ కొనసాగుతోంది. మొత్తానికి హస్తం పార్టీ నిర్ణయం వెనక భారీ కసరత్తు చేసిందని సమాచారం. ప్రస్తుతం పార్టీకి నేతలు కరవవుతున్న తరుణంలో.. అభ్యర్థులను ప్రకటిస్తే బీ-ఫామ్‌పై భరోసాతో పార్టీకి పని చేస్తారని అధిష్టానం భావిస్తోంది. అంతేకాకుండా.. పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నియోజకవర్గాల్లో లీడర్‌షిప్‌ పెంచేందుకు అవకాశం ఉంటుందనే యోచనలో హైకమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది కాంగ్రెస్‌ అధిష్టానం. అయితే.. ఇప్పటికే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు.. ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు ప్లస్‌ అవుతుందో వేచి చూడాలి. 

08:20 - May 25, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో మామిడి మేళా, హార్టికల్చర్ షోను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో 13 జిల్లాల రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఈ మేళాలో 200 రకాలకుపైగా మామిడి పండ్లను ప్రదర్శిస్తున్నారు. మామిడి మేళాకు నగరవాసుల నుంచి విశేష స్పందన వస్తోంది.
విజయవాడలో కాలేజ్ లో మామిడి మేళా...
విజయవాడలోని లయోలా కాలేజ్ లో ఏర్పాటు చేసిన మామిడి ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ప్రదర్శనను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 23 న ప్రారంభించారు. ఈ ప్రదర్శన 25 వరకు కొనసాగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే బిందు సేద్యం, ఉద్యానవనానికి సంబంధించిన పలు రకాల పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. వీటితోపాటు వ్యవసాయ ఉపకరణాలు, పంపు సెట్లు, పంట సంజీవని, ఎరువుల వాడకం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

కార్బైడ్ రహిత మామిడి పండ్ల సాగుపై అవగాహన...

కార్బైడ్ రహిత మామిడి పండ్లను ఎలా పండించాలనే దానిపై సమగ్ర అవగాహన కల్పిస్తూ నూతన ఆవిష్కరణగా రైఫనింగ్ చాంబర్ ను ఏర్పాటు చేశారు. కార్బైడ్ రహిత మామిడి పండ్లను మామిడి మేళాలో అమ్మకానికి ఉంచారు. మామిడిఅత్యంత మధురమైన రకంగా గుర్తింపు పొందిన ఆల్ఫోన్సా మామిడి పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అల్ఫోన్సా పండ్లను ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండించి జ్యూస్ కంపెనీల ఎగుమతి చేస్తుంటారు . రైతులు ఈ ప్రదర్శనను తిలకిస్తున్నారని.. వారికి తమవంతుగా అవగాహన కల్పిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఉద్యానవన పద్ధతిలో కొత్త రకాలు...
ఆయా జిల్లాల రైతుల నుంచి సేకరించిన ప్రత్యేక మామిడి పండ్లను ప్రదర్శనకు ఉంచారు. ఉద్యానవన పద్ధతిలో కొత్త రకాలను సృష్టించారు. కొత్త రకాలలో మామిడి పండు నిల్వ ఉండేలా తయారు చేశారు. ఐస్ ఫ్రూట్ మ్యాంగో ను దాదాపు రెండేళ్లపాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈ ఫలం ఎంతో రుచికరంగా, మధురంగా ఉంటుందని అంటున్నారు అమ్మకందారులు. పండు బరువు ఒక్కొటి 70 గ్రాముల నుంచి 90 గ్రాముల వరకు ఉండగా, దీని ధర ఒక్కొటి రూ.100 ధర పలుకుతోంది.

ప్రధాన ఆకర్షణగా ఎనుగు దంతం కల్గిన మామిడి పండ్లు...
ఎర్రటి మామిడి పండు, ఎనుగు దంతం కల్గిన మామిడి పండ్లు ఈ ప్రదర్శనలో ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఏడాది చివర్లో అక్టోబర్, నవంబర్ లో ఏర్పాటు చేసినట్లైతే రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పంటను సేద్యం చేయాలనే దానిపై అవగాహన ఉంటుందని రైతులు అంటున్నారు.

ప్రతి జిల్లాలోనూ ప్రదర్శన ఏర్పాటు చేయాలి: రైతులు
ప్రతి జిల్లాలో ఈ తరహా ప్రదర్శనను ఏర్పాటు చేస్తే మంచిదని రైతులు కోరుతున్నారు. మామిడి దిగుబడి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేకపోయినా.. మామిడి దిగుబడిని పెంచేందుకు ఈ రకమైన ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయంటున్నారు రైతులు.  

07:56 - May 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు ఆయన రెండు రాష్ట్రాల గవర్నర్లతో భేటీ అయ్యారు. పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. 
ప్రభుత్వ విధానాలపై ఇల్లినాయిస్‌ డిప్యూటీ గవర్నర్‌ ప్రశంసలు...
కేటీఆర్‌ అమెరికా పర్యటన బిజీబిజీగా సాగుతోంది. చికాగో నగరానికి చేరుకున్న కేటీఆర్‌కు తెలంగాణ ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌ భారత కాన్సులేట్‌ జనరల్‌ అసఫ్‌ సయిద్‌తో సమావేశమయ్యారు. కాన్సులేట్‌ జనరల్‌తో కలిసి ఇల్లినాయిస్‌ డిప్యూటీ గవర్నర్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఇల్లినాయిస్‌, తెలంగాణల మధ్య భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను ఇల్లినాయిస్‌ డిప్యూటీ గవర్నర్‌కు వివరించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ

వ్యాపారవేత్తలు, సంస్థలతో కేటీఆర్‌ సమావేశం...
పర్యటనలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలు, సంస్థలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. రెడ్‌ బెర్రీ కార్పొరేషన్‌ సంస్థ ఛైర్మన్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలతో రెండు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. చికాగో పర్యటన ముగించుకున్న కేటీఆర్‌ ఇండియానా పోలీస్‌కు వెళ్లారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ మైక్‌పెన్స్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం జరిగిన సమావేశంలో తెలంగాణ ఎన్‌ఆర్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో సుమారు 500 మంది తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. 

07:50 - May 25, 2016

వరంగల్ :   టీడీఎఫ్‌ బహిరంగ సభకు ఎవరూ వెళ్లొద్దంటూ భయబ్రాంతులకు గురిచేసినా...అసాంఘిక శక్తులు నగరంలో ప్రవేశించాయనే సమాచారంతో రాత్రి నుంచే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినా.. సభ సక్సెస్ అయిందన్నారు టీడీఎఫ్ నేతలు. పోలీసు పహారాలో భారీ బందోబస్తు మధ్య జరిగిన సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేశారన్నారు వరవరరావు.

ఉత్కంఠ మధ్య సభ....
తెలంగాణ ప్రజాస్వామిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో చేపట్టిన సభ ఎంతో ఉత్కంఠ మధ్య సక్సెస్ అయింది. సభ మొత్తం పోలీసు పహారాలో భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. మొదట పర్మిషన్ ఇచ్చాం.. తర్వాత పర్మిషన్ లేదు అంటూ పోలీసులు సభను అడ్డుకునే ప్రయత్నం చేసినా కోర్టు తీర్పుతో షరతులతో కూడిన సభను నిర్వహించారు టీడీఎఫ్ నేతలు.

నిర్బంధం పోలీసు నిఘా మధ్య సభ : హరగోపాల్
ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వ్యక్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిర్బంధం పోలీసు నిఘా మధ్య సభను నడుపుతున్నామన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. రాష్ర్టంలో ప్రజాస్వామ్యం కొరవడిందిన్నారు. వరవరరావు లాంటి వాళ్లని మాట్లాడొద్దు అనడం భావస్వేచ్ఛను హరించడం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మావోయిస్టు ఏజెండానే తమ ఏజెండా అన్న కేసీఆర్ అదే మావోయిస్టుల నేపంతో ఆదివాసులపై దమనకాండను ప్రయోగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు హరగోపాల్.

గ్రీన్ హంట్ పేరుతో హత్యాకాండ : వరవరరావు
బహుళ జాతి కంపెనీలకు లాభాలను దోచిపెట్టేందుకు అమాయకులైన ఆదివాసీలను గ్రీన్ హంట్ పేరుతో హత్యాకాండను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విరసం నేత వరవరరావు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కుట్ర పూరితంగానే ఆదివాసీలపై దాడులపై పాల్పడుతున్నాయన్నారు. శ్రుతి,కమల లాంటి వాళ్లను ఎంతో మందిని తెలంగాణ ప్రభుత్వం ఎన్ కౌంటర్ పేరుతో బుటకపు హత్యలు చేసిందన్నారు. రోహిత్ చావుకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని, గిరిజన గూడాల్లో గ్రీన్ హంట్ ను నిలిపివేయాలని కోరారు వరవరరావు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ కౌంటర్ పేరుతో బూటకపు హత్యలు చేయడం ఆపాలని టీడీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు.మావోయిస్టు ఎజెండానే ప్రభుత్వ ఎజెండాఅన్న కేసీఆర్ మాట తప్పారన్నారు వక్తలు.

07:41 - May 25, 2016

విజయవాడ : రాజ్యసభ ఎన్నికలపై వైసీపీ దృష్టి పెట్టింది. పార్టీకి ఒక సీటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజ్యసభ సీటు కోసం పార్టీలో ఆశావహులు లేకపోవడంతో విజయసాయిరెడ్డిని అభ్యర్ధిగా ఎంపిక చేస్తూ వైసీపీ అధినేత జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికార టీడీపీ నాల్గవ అభ్యర్ధిని నిలబెడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీలో చర్చసాగుతోంది. టీడీపీ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన ప్రతివ్యూహంపై పార్టీ నాయకులతో జగన్‌ సమాలోచనలు జరుపుతున్నారు.

పెద్దల సభ వైసీపీ హడావిడి....
ఏపీలో ప్రతిపక్ష వైసీపీలో రాజ్యసభ ఎన్నికల వేడి ప్రారంభమయ్యింది. వచ్చే నెల 11న జరిగే ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడటంతో పార్టీలో హడావుడి పెరిగింది. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. వైసీపీకి ఒక సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో విజయసాయిరెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేశారు.

వైసీపీ అభ్యర్ధిగా విజయసాయిరెడ్డి ....
రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ అభ్యర్ధిగా ఖరారైన విజయసాయిరెడ్డి నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఈనెల 26న నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. జగన్‌ సంస్థలకు ఆడిటర్‌గా పని చేశారు. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న పార్టీ బలాబలాలను దృష్టిలో పెట్టుకుంటే టీడీపీ 3, వైసీసీకి ఒక సీటు దక్కే అవకాశం ఉంది. టీడీపీ ముగ్గురు అభ్యర్ధులను బరిలో దింపితే ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. తెలుగుదేశం నలుగురు అభ్యర్ధులను పోటీకి పెడతే ఎన్నిక అనివార్యమవుతుంది. ఇప్పుడు వైసీపీలో ఇదే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నాల్గవ అభ్యర్ధిని పోటీకి పెట్టాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తమ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. టీడీపీ తెరతీసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ బలం 50కి పడపోయింది. రాజ్యసభ ఎన్నికల తరుణంలో మరికొందరు శాసనసభ్యులు కూడా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుతుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ నాల్గవ అభ్యర్ధిని పోటీకి పెడితే పరిణామాలు ఎలా మారతాయోనన్న అంశంపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

07:32 - May 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. వారంలో కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చురుకుగా పనిచేయలేకపోతున్న పలువురు సీనియర్‌ మంత్రులపై వేటు పడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు....
త్వరలోనే తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేబినెట్‌ పునర్వవస్థీకరణకు సీఎం కేసీఆర్‌ ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. వారంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మహిళలు, ఎస్సీ సామాజిక వర్గానికి చోటు లేకపోవడంతో.. మంత్రివర్గంలో మార్పులు చేయాలని సీఎం భావిస్తున్నారు. ఉప ఎన్నికలు, బడ్జెట్‌ సమావేశాలు తదితర కారణాలతో అది కాస్తా వాయిదా పడుతూ వస్తోంది. రాజ్యసభ ఎన్నికల సమయంలో కేబినెట్‌ రీషఫిల్‌ ఉండేలా సీఎం ప్లాన్‌ చేస్తున్నారు.

సీనియర్లకు ప్రాధాన్యతకు కేసీఆర్ మొగ్గు....
మరోవైపు పెద్దల సభలో సీనియర్లకు ప్రాధాన్యత కల్పించాలని సీఎం భావిస్తున్నారు. మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుతో పాటు ఆడిటర్‌ దామోదర్‌రావుకు బెర్త్‌లు ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది. అటు నమస్తే తెలంగాణ మాజీ సీఎండీ లక్ష్మీరాజం కూడా పోటీలో ఉన్నారు. బీసీలకు అవకాశం కల్పించే పక్షంలో చివరి నిమిషంలో డీఎస్‌ను ఢిల్లీకి పంపినా ఆశ్చర్యపోనక్కర లేదంటున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం తర్వాత ఎప్పుడైనా కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఉండొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణపై పలు ఊహాగానాలు .....
మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హోంమంత్రి నాయినిని తప్పించి ఆయనను రాజ్యసభకు పంపాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. నాయినిని ఢిల్లీకి పంపకుండా తన సలహాదారుడిగా నియమించుకునే యోచనలో కూడా సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ మంత్రి పద్మారావుపై వేటు పడటం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. పద్మారావు స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. స్వామిగౌడ్‌కు కీలకమైన కార్మిక సంక్షేమ శాఖను అప్పగించనున్నట్లు సమాచారం. ఇక ఉప ముఖ్యమంత్రి కడియంను మండలి ఛైర్‌లో కూర్చోబెట్టి, ఆయన స్థానంలో చీఫ్‌ విప్‌గా ఉన్న కొప్పులకు అవకాశం కల్పించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

అమాత్య పదవి ఆశిస్తున్న ఎర్రబెల్లి....
ఇక టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి కూడా పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో... ఆయనకు చీఫ్‌ విప్‌గా నియమించే అవకాశం ఉంది. మరోవైపు వయోభారం, అనారోగ్యం కారణంతో గిరిజనశాఖ మంత్రి చందూలాల్‌ను తప్పించడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసి.. ఆయన కుటుంబ సభ్యులు చక్రం తిప్పడాన్ని సీఎం సీరియస్‌ తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో కోవా లక్ష్మీకి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అటవీశాఖ మంత్రి జోగురామన్నపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనపై వేటు తప్పదని తెలుస్తోంది. వ్యవసాయమంత్రి పోచారం పనితీరుపై కూడా సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని హోంమంత్రి పదవిని కట్టబెడ్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత వారికి రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టులు దక్కనున్నాయి. మొత్తంగా చూస్తే వారంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనివార్యంగా కనిపిస్తోంది.

07:24 - May 25, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుల ఎంపికలో రాజకీయ సమీకరణాలు రోజుకోరకంగా తెరపైకి వస్తున్నాయి. నేతలు ఎవరికి వారే తమకు అనుకూలంగా సమీకరణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి తోడు తాజాగా మైనార్టీ నేతలు కూడా తమకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గులాబి పార్టీలో అదే స్థాయిలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రెండు స్థానాలు దక్కించుకోనున్న పార్టీకి అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రం అవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి గులాబి దళంలో కొనసాగుతున్న నేతలతో పాటు... పార్టీలో కొత్తగా చేరిన ఇతర పార్టీల సీనియర్లు సైతం భారీగా ఆశలు పెట్టుకున్నారు.

రాజ్యసభ సభ్యుల ఎంపికలో మారుతున్న సమీకరణాలు.... 
టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుల ఎంపికలో రాజకీయ సమీకరణాలు రోజుకోరకంగా తెరపైకి వస్తున్నాయి. నేతలు ఎవరికి వారే తమకు అనుకూలంగా సమీకరణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి తోడు తాజాగా మైనార్టీ నేతలు కూడా తమకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. రెండు స్థానాలు దక్కించుకోనున్న పార్టీకి అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రం అవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి గులాబి దళంలో కొనసాగుతున్న నేతలతో పాటు... పార్టీలో కొత్తగా చేరిన ఇతర పార్టీల సీనియర్లు సైతం భారీగా ఆశలు పెట్టుకున్నారు.
2 స్థానాలపై సీనియర్లు ఆశలు...
రెండు స్థానాలకు పార్టీ సీనియర్లు కెప్టెన్ లక్ష్మి కాంత్ రావ్, దామోదర్ రావ్ ,డి . శ్రీనివాస్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధినేతతో సత్సంబంధాలున్న మరో పారిశ్రామికవేత్త సీఎం. రాజం కూడా రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాజం హడావుడిగా బీజేపీలో చేరినా అనంతరం గులాబి పార్టీతో కూడా సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి తన మనసులోని మాటను రాజం ముఖ్యమంత్రికి తెలియచేసినట్లు సమాచారం.
ఫరీదుద్దీన్ పేరు మైనార్టీ కోటా పరిశీలన....
ఓ స్థానం అగ్రవర్ణాలకు, మరో స్థానాన్ని వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలకు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మైనార్టీ నేతలు కూడా తమకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఫరీదుద్దీన్ పేరు మైనార్టీ కోటా పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో... రెండు,మూడు రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Don't Miss