Activities calendar

26 May 2016

22:02 - May 26, 2016

విశాఖపట్నం : ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదంటున్న పురందేశ్వరి అప్పట్లో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చుతున్నప్పుడు ఏం చేశారని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీ రెండేళ్ల పాలన సంబరాలు ఎందుకు జరుపుకుంటుందో అర్ధం కావడంలేదన్నారు. నల్లడబ్చు సంగతే బీజేపీ మర్చిపోయిందన్నారు. దేశసమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. 

టీడీపీ మహానాడులో కార్మికుడు మృతి

చిత్తూరు : తిరుపతి మహానాడులో కేటరింగ్‌ కోసం వచ్చిన ఓ కార్మికుడు మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ వాసిగా గుర్తించారు. అమర్నాథ్‌ అనే వ్యక్తి గతకొంతకాలంగా విజయవాడలో కేటరింగ్‌ పనిచేస్తున్నాడు. తిరుపతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో కేటరింగ్‌ చేయడానికి అక్కడి బృందంతో కలిసివచ్చాడు. వంట పనుల్లో ఉండగా ఉన్నట్టుండి అమర్నాథ్‌ కుప్పకూలిపోయాడు. అతన్ని రుయా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతిచెందినట్టు సమాచారం.

21:50 - May 26, 2016

మహారాష్ట్ర : అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన నంబరు నుంచి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సేకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయనే ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణను ఏటీఎస్‌కు అప్పగించారు. పాకిస్థాన్‌లోని కరాచీలో దావూద్‌ ఇంటి నుంచి ఖడ్సేకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని ఇటీవల ఆప్‌ ప్రతినిధి ప్రీతి శర్మ మేనన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఖడ్సేపై ఆరోపణలను కొట్టిపారేసిన సిఎం విచారణకు ఆదేశించారు. తన మొబైల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయిన విషయం నిరూపించే పత్రాలు తన వద్ద ఉన్నాయని, ఈ ఆధారాలను దర్యాప్తు అధికారులకు అందజేస్తానని ఖడ్సే చెప్పారు. తానే స్వయంగా దీనిపై విచారణ జరిపించాలని సిఎం ఫడ్నవిస్‌, కేంద్రమంత్రులు సుష్మా, రాజ్‌నాథ్‌సింగ్‌లకు విజ్ఞప్తి చేసినట్లు ఖడ్సే పేర్కొన్నారు.  

21:45 - May 26, 2016

చంఢీఘర్ : జాట్ల రిజర్వేషన్లకు సంబంధించి హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లలో జాట్లకు 10 శాతం కోటా కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్థానిక హైకోర్టులో చుక్కెదురైంది. జాట్ల కోటాపై స్టే విధిస్తూ ఇవాళ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న అయిదు కులాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. దీనిపై తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు రద్దు చేసిన కేసీ గుప్తా కమిషన్ నివేదిక ఆధారంగా జాట్లకు రిజర్వేషన్ కల్పించారని హైకోర్టులో పిటిషనర్ వాదించారు. బివానీకి చెందిన మురారీ లాల్ గుప్తా ఈ పిటిషన్ వేశారు.

21:44 - May 26, 2016

ఢిల్లీ : ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచుతామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. తన ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే మూడేళ్లలో ఐదుకోట్ల మంది పేదలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. తాను ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడినని, ఇక్కడి నుంచే ఎన్నికయ్యానని చెప్పుకున్నారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అభివృద్ధితోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మోది చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వివిధ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

 

అనకాపల్లి వద్ద మొరాయించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

విశాఖ : అనకాపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మొరాయించింది. బస్సు విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సివుంది. గంట నిలిచిపోయినా ట్రావెల్స్ నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. 
  

21:18 - May 26, 2016

తెలంగాణలో అంతులేని సంక్షోభం...!!, ఎపిలో చుట్టుముడుతున్న సమస్యలు..!!, ప్రత్యేక హోదా రాలేదు.. బీజేపీని నిలయదీయలేరు...!!, జల రాజకీయాలకు ముగింపులేదు..!!, సమస్యల వలయంలో తెలుగుదేశం పార్టీ??.. ఆ వైభవం గతమేనా..? టీడీపీ ప్రస్తుత పరిస్థితిపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:10 - May 26, 2016

రెండేండ్ల బీజేపీ పాలనకు పండుగనట... దేశమంతటదిరిగి ధూం ధాం జేస్తరట, నారాయణఖేడ్ ఆబ్కారోళ్ల ఆటాపాటా...నకిలీ మద్యం ఏరులైపారుతున్న పట్టదట, తాగుబోతు డ్రైవర్లకు అరుదైన గౌరవం... కంప్యూటర్లకెక్కిస్తరట ఆళ్ల చరిత్ర, మూడు పాములు మింగినా నిండలే... సర్కారోల్లు గుర్తించి పించినియ్యాలే.. 
బతుకుమీద ఆశ దుంకకపోతే ఘోస.. ఆడనేవుంటే సచ్చుడు గ్యారంటీ.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ కాలం 65కి పెంపు

డెహ్రడూన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ కాలాన్ని 65కి పెంచుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ప్రకటించారు. మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్ల పూర్తి అయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో మెడికల్‌ కళాశాలలు తక్కువగా ఉన్నాయని.. దీంతో వైద్యుల కొరత చాలా ఎక్కువగా ఉందని రానున్న రెండేళ్లలో వైద్యుల సంఖ్యను పెంచడం కష్టమని అందుకే ప్రత్యామ్నాయంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యవకులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని బంట్వారం మండలం జిన్నారం గ్రామసమీపంలో దర్గా వద్ద వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని సలబత్తార్ గ్రామానికి చెందిన పృద్వీరాజ్(21), గోపాల్(27) అనే ఇద్దరు యువకులు ఓ విందులో పాల్గొని బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

20:36 - May 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. డి. శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంత్‌రావులను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రెండు రోజులుగా సీనియర్‌ నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ అభ్యర్థులను నిర్ణయించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీరుద్దీన్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను ఈటెల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డిలకు అప్పగించారు. 

20:32 - May 26, 2016

మోడీ రెండేళ్ల పాలన నిరాశజనకంగా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్థిక నిపుణులు శశికుమార్,  ఎపి కాంగ్రెస్ నేత తులసీరెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, సీపీఎం నేత బాబురావు, టీడీపీ నేత విజయ్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. మోడీ పాలనలో ప్రజలకు అచ్ఛేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రచార ఆర్భాటాలు తప్ప.. ఫలితం శూన్యమని విమర్శించారు. మోడీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్ధానాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. మతోన్మాద శక్తుల దాడులు పెరిగిపోయాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:13 - May 26, 2016

విజయవాడ : ఒకప్పుడు నిండా నీటితో గలగలలాడిన ప్రకాశం బ్యారేజీ... నీరు అడుగంటి ఎండిపోయే స్థితికొచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల  ప్రజల దాహర్తి తీర్చే బ్యారేజీ నీటి మట్టం అడుగంటడంతో రెండు జిల్లాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడే పరిస్థితి వచ్చింది. మండుతున్న ఎండలతో చెరువులు నెర్రలు వారడంతో తీవ్ర నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలో పాలుపోక అధికారులు సతమతమవుతున్నారు. 
కృష్ణా డెల్టా అలమటిస్తోంది..! 
కృష్ణా డెల్టా అలమటిస్తోంది..! రెండు జిల్లాలకు నీరందించే ప్రకాశం బ్యారేజీ నీరింకి గొల్లుమంటోంది. తీవ్ర నీటి ఎద్దడితో డెల్టా ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కృష్ణా డెల్టాలో నెలకొన్న పరిస్థితి ఇది. కృష్ణా డెల్టాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ప్రజలు అలమటిస్తున్నారు. డెల్టా ప్రాంతంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో తాగునీటి అవసరాల కోసం 4 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా బోర్డు ఆదేశించింది. అయితే తెలంగాణ అభ్యంతరాల మధ్య నాగార్జున సాగర్‌నుంచి కేవలం 1.4 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారు. వృథా నీరు, నీటి ఆవిరి పోనూ చివరికి 0.7 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఆ నీటిని సైతం కాల్వలకు విడుదల చేయకుండా అధికారులు బ్యారేజీలోనే  నిల్వ చేయడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని దాదాపు 360 చెరువులకు నీరందకుండా పోయింది. వేసిన పంటలు కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
గ్రామాల్లో నీటి తీవ్ర ఎద్దడి 
ప్రకాశం బ్యారేజీకి చేరిన నీరు విజయవాడ, గుంటూరు నగరాలకు మాత్రమే సరిపోతాయని, డెల్టా ప్రాంతాల్లోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజులుగా ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రత పెరుగుతోంది.
215 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
గుంటూరు జిల్లాలో 215 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చెరువుల్లో నీరు లేక గ్రామాల్లో బోర్లు కూడా ఎండిపోతున్నాయి. అటు కాల్వాలు ఎండి, ఇటు బోర్లలో నీటి చుక్క రాక జనం తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెల్టా ప్రాంతాల్లో 140 అడుగుల లోతులో కూడా నీరు లభ్యం కావడం లేదని భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. బాపట్ల, రేపల్లె, పొన్నూరు, వేమూరు తదితర నియోజకవర్గాల్లో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 
కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం 
సాగర్‌ నుంచి డెల్టాకు కేటాయించిన నీటి విడుదల విషయంలో ఈనెల 27న ఇరు రాష్ట్రాల ఇంజినీర్లతో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలను ఏపీ ప్రభుత్వం బోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెల్టా ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. 
ఉపాధి పనులు ప్రారంభించాలి..
నీరు లేక.. పంటలు పండక అనేక మంది రైతులు ప్రజలు వలస బాట పడుతున్నారని, వెంటనే ఉపాధి పనులు ప్రారంభించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా డెల్టా ప్రాంత ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు తాగునీటి కష్టాలు తోడు కావడంతో జనం దిక్కుతోచక అల్లాడుతున్నారు. తాగునీటి సమస్యని తీర్చేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. 

 

20:03 - May 26, 2016

విజయవాడ : వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎంపికచేయడం దారుణమని ఎపి మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఈమేరకు విజయవాడలో మంత్రులు మాట్లాడారు. ఆర్థిక నేరాలను బయటపెట్టకుండా ఉండేందుకే విజయసాయిరెడ్డికి వైసీపీ రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చిందని ఆరోపించారు. పెద్దల సభకు విజయసాయిరెడ్డిని ఎంపిక చేసి ప్రజాస్వామ్యాన్ని జగన్‌ పరిహాసం చేశారని మండిపడ్డారు. ఒక ఆర్థిక నిందితుడిని ఎంపిక చేసి.. దాన్నే  జగన్ గొప్పగా చెప్పుకోవడం దారుణమన్నారు. 

 

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపప్రసాదం పంపిణీ : బత్తిని సోదరులు

హైదరాబాద్‌ : నగరంలో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని బత్తిని సోదరులు తెలిపారు. జూన్ 8, 9తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపప్రసాదం పంపిణీ చేస్తామని వారు అన్నారు. అయితే రోగులు ఇబ్బంది పడకుండా తాగునీరు, విద్యుత్‌ కోత లేకుండా చూస్తామని బత్తిని సోదరులకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రోగుల రద్దీ దృష్ట్యా వాలంటీర్లను నియమిస్తామని బత్తిని సోదరులు తెలిపారు.

 

వీఆర్ వో అత్యాచారం చేశాడంటూ హెచ్చార్సీని ఆశ్రయించిన యువతి

 రంగారెడ్డి : శంషాబాద్ మండలం ముంచింతల వీఆర్వో చంద్రమోహన్ అత్యాచారం చేశాడంటూ హెచ్చార్సీని ఓ యువతి ఆశ్రయించింది. తన అనుచరులతో కలిసి ఈ అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి తెలుపుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యువతి ఆరోపిస్తుంది.

హీరో రానాకు గాయాలు...

హైదరాబాద్‌ : 'బాహుబలి-2' చిత్రం షూటింగ్ లో హీరో రానా గాయపడ్డాడు. దీంతో, అతని మణికట్టుకు గాయమైంది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 'గాయపడ్డ నా మణికట్టుకు బ్యాండేజ్ వేశాము. త్వరలోనే కోలుకుని పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటాను' అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రానా పోస్ట్ చేశాడు. కాగా, చలన చిత్ర రంగంలో 'బాహుబలి' చరిత్ర సృష్టించిన విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాహుబలి-2' పై కూడా అభిమానులు అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 2017 వేసవి నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

దుబ్బాక ప్రభుత్వ పాఠశాలకు రూ.10 కోట్లు మంజూరు

మెదక్ : జిల్లాలోని దుబ్బాక ప్రభుత్వ పాఠశాల సముదాయంలో కొత్తగా సమీకృత భవనానికి రూ.10కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఒకే భవన సముదాయంలో పాఠశాల, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూనియర్ కాలేజీ ఏర్పాటుకు రూ.5.19కోట్లు మంజూరు చేస్తూ ఇవాళ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా మొత్తం మంజూరుకు విద్యాశాఖ ఆర్థిక శాఖ అనుమతిని కోరింది. తాను విద్యనభ్యసించిన దుబ్బాక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటాన్ని చూసి చలించిన సీఎం కేసీఆర్ ఆ స్కూల్‌కు బదులు సమీకృత భవనాన్ని ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నారు.

 

నిర్భయ నిధులు ఖర్చు చేయకపోవడంపై 'సుప్రీం' ఆగ్రహం

ఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. నిర్భయ నిధులు ఖర్చు చేయకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల రక్షణ, మర్యాదలను కాపాడే చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్భయ ఫండ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అత్యాచార బాధితులకు నష్టపరిహారం, సాక్షుల రక్షణకు జాతీయస్థాయిలో ప్రణాళిక రూపొందించాలని సూచించింది. నిర్భయ నిధులను ప్రతి ఏటా కేటాయిస్తున్నా వేల కోట్ల రూపాయలు నిరూపయోగంగా ఉంటున్నాయి.

19:36 - May 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన దిగ్విజియంగా సాగుతోంది. మూడో రోజు అయోవా రాష్ట్రంలో వ్యవసాయం, ఇన్సూరెన్స్‌ రంగంలో అక్కడి ప్రగతిపై మంత్రి అధ్యయనం చేశారు. అయోవా గవర్నర్‌తో పాటు పలు సంస్థలు, పరిశ్రమల ప్రముఖులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. 
డ్యూపాంట్‌ సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం 
నూతన విధానాలతో వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోన్న అయోవాలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ టెర్రీ బ్రాన్‌స్టర్డ్‌తో సమావేశమైన కేటీఆర్‌ వ్యవసాయ రంగంలో ఆ రాష్ట్రం చేపట్టిన పలు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. తక్కువ రసాయనాలు ఉపయోగించి యంత్రీకరణతో ఎలా ఎక్కువ దిగుబడులు సాధించవచ్చో అయోవా గవర్నర్‌ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. అనంతరం మంత్రి డ్యూపాంట్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో తాము ఇప్పటికే వ్యవసాయ రంగంలో పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు డ్యూపాంట్‌ ప్రతినిధులు తెలిపారు. 
తెలంగాణ రైతులకు సహకారం కావాలి.. 
అయోవా రాష్ట్రంలో రైతులకి సహకరించినట్లే తెలంగాణ రైతులకు కూడా సహకారం అందించాలని, నూతన వ్యవసాయ విధానాలను పరిచయం చేయాలని డ్యూపాంట్‌ను సంస్థను కేటీఆర్‌ కోరారు. త్వరలోనే ఓ ప్రతినిధి బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. తెలంగాణను సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మంత్రి అన్నారు. 
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ 
అయోవా రాష్ట్రంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ప్రపంచ ఆహార బహుమతి సంస్థ అధ్యక్షుడు కెన్నెత్‌ క్వీన్‌ హాజరైన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయంతో పాటు ఇన్సూరెన్స్‌ రంగానికి కేంద్రంగా ఉన్న అయోవా రాష్ట్రంలోని విధానాలను తెలంగాణలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. 

 

19:30 - May 26, 2016

హైదరాబాద్ : విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పొందాలన్నా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆదాయ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం కేవలం తహసీల్దార్‌లకు మాత్రమే ఉండేది. కానీ ఇక నుంచి ఈ అధికారం డిప్యూటి తహసీల్దార్‌లకు దక్కింది. 
ఆదాయ ధ్రువీకరణ పత్రం చాలా ముఖ్యం...
విద్యార్థులు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హత పొందాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం చాలా ముఖ్యమైనది..ఎందుకంటే కుటుంబ ఆదాయం ఎంత అన్నది తెలుసుకోవాలంటే ఈ పత్రం ద్వారానే తెలిసేది. ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి పైగా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్లను పొందుతుంటారు. అయితే వీటిని జారీ చేసే అధికారం ఇప్పటి దాకా కేవలం ఎమ్మార్వోలకు మాత్రమే ఉండేది. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం డిప్యూటీ తహసీల్దార్‌లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి. ఆర్. మీనా జీవో నెంబర్‌ 233ను జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. 
పత్రాల విడుదలలో జాప్యం 
మండలానికి సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్‌ మాత్రమే జారీ చేయాలి. దీంతో తహసీల్దార్‌పై పని ఒత్తిడి విపరీతంగా ఉండేది. ఈ ఒత్తిడి వల్ల కొన్నిసార్లు సర్టిఫికెట్‌ల జారీ చాలా ఆలస్యమయ్యేది. తహసీల్దార్‌లపై పని భారాన్ని తగ్గించాలని తెలంగాణ తహసీల్దార్‌ల సంఘం, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్‌లు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఇక నుంచి ఈ భారాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ల పైకి బదలాయించనుంది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ అమలు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు తెలంగాణ తహసీల్దార్‌ల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

 

19:22 - May 26, 2016

మెదక్ : భూసేకరణలో గత ప్రభుత్వం కంటే తమప్రభుత్వమే రైతులకు నష్టపరిహారం ఎక్కువుగా ఇస్తుందన్న మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలపై సీపీఎం మెదక్‌ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేష్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన 123జీవోను తీసుకొచ్చి ప్రజల జీవితాలతో టీసర్కార్ చెలగాటం ఆడుకుంటోందని ఆరోపించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి అనడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, గ్రామసభలు నిర్వహించాలే తప్ప  దొంగతనంగా సంతకాలు జరపడాన్ని  సీపీఎం ఖండిస్తుందని తెలిపారు. రైతులకు  సరైన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

ఎన్ డీఎ ప్రభుత్వం పేదలకు అంకితం : మోడీ

ఉత్తరప్రదేశ్ : రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్ డీఏ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా షహరాన్ పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. ఎన్ డీఎ ప్రభుత్వం పేదలకు అంకితమన్నారు. ప్రజల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. 

19:01 - May 26, 2016

ఉత్తరప్రదేశ్ : రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్ డీఏ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా షహరాన్ పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. ఎన్ డీఎ ప్రభుత్వం పేదలకు అంకితమన్నారు. ప్రజల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. 

 

18:42 - May 26, 2016

రుతుస్రావం, బహిష్టు, మైల ఇవన్నీ నేటికీ రహస్యంగా మాట్లాడుకునే పదాలు. సృష్టికి మూలమైన ప్రకృతి ధర్మమిది. అయినా నిశ్శబ్దంగా మాట్లాడుకునే విషయాలు. ఇప్పటికీ ఆడవాళ్లు గుసగుసలుగా చెప్పుకునే వారి వ్యక్తిగత అంశాలు.  ఇంకానా ఇకపై వద్దు.. నిశ్శబ్దాన్ని చేదిద్ధాం. మహిళల శరీర ధర్మాలను గురించి బహిరంగంగా మాట్లాడుకుందాం. మే 28 మెనుస్ట్రవల్ హైజీన్ డే సందర్భంగా మానవి ప్రత్యేక కథనం. 
ఎందుకు అడ్డుగోడలు?
మానవజాతి మనుగడకు మూలాధారమైన స్త్రీ పునరుత్పత్తి ప్రక్రియ చుట్టూ, ఆ ధర్మాన్ని నెరవేర్చే శరీర భాగాల చుట్టూ ఎందుకు అడ్డుగోడలు? ఎన్నాళ్లు రహస్య ఎజెండా చర్చలు? ఎందుకు చీకటిలో మగ్గడాలు? మూఢవిశ్వాసాలను పెంచి పోషించడాలు? రహస్యంగా కాదు, అందరిలో మాట్లాడుకుందాం, అందరమూ మాట్లాడదాం. 
బహిష్టు సమయంలో స్త్రీల పట్ల ఆంక్షలు
బహిష్టు సమయంలో స్త్రీల పట్ల అమలవుతున్న ఆంక్షలు, నిషేధాలు మానవ హక్కుల ఉల్లంఘనే. నిషేధాలు, ఆంక్షలు అమలయ్యేది కొన్ని రోజుల కోసమే అయినా వాటి ప్రభావం మాత్రం ఆడవాళ్లకి ఉండే అవకాశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ మూఢాచారానికి ఇకనైనా ముగింపు పలకాలని మానవి ఆకాంక్షిస్తోంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:31 - May 26, 2016

విశాఖ : నగరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నవదీప్ అనే 11 నెలల బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా అదృశ్యమయ్యాడు. అతని తల్లిదండ్రులు త్రీటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే వెంట్రుకలు అమ్మే సవురాల మహిళ ఒకట్రెండు సార్లు అటుగా వెళ్లిందని.. ఒక వేల ఆ మహిళ బాలున్ని కిడ్నాప్ చేసివుంటుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

విశాఖలో కిడ్నాప్ కలకలం..

విశాఖ : నగరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నవదీప్ అనే 11 నెలల బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా అదృశ్యమయ్యాడు. అతని తల్లిదండ్రులు త్రీటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వెంట్రుకలు అమ్మే సవురాల మహిళ ఒకట్రెండు సార్లు అటుగా వెళ్లిందని.. ఒక వేల ఆ మహిళ బాలున్ని కిడ్నాప్ చేసివుంటుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

షహరాన్ పూర్ సభలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం : రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : షహరాన్ పూర్ సభలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైందని కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అద్భుత విజయాన్నందించారని తెలిపారు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమన్నారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చామని చెప్పారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ పక్షాన ఉన్నారని.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతుల జీవితాల్లో వెలుగు చూడాలనేది తమ లక్ష్యమన్నారు.

పాకిస్తాన్ లో తాలిబన్‌ అనుకూల వ్యక్తుల భారీ ర్యాలీ

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని క్వెట్టాలో తాలిబన్‌ అనుకూల వ్యక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆప్ఘన్‌ తాలిబన్‌ చీఫ్‌ ముల్లా మన్సూర్‌ను అమెరికా సేనలు చంపడాన్ని తప్పుపట్టారు. పాక్‌ భూభాగంలో అమెరికా సేనలు దాడులు చేయమేమిటని వారు ప్రశ్నించారు. మరోవైపు తాలిబన్‌ నాయకులకు పాకిస్తాన్‌ ఆశ్రయమిస్తోందంటూ ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.

తుపాకీతో కాల్చుకుని యువతి ఆత్మహత్య...

ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో తీవ్ర మానసిక ఒత్తిడితో 18ఏళ్ల యువతి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖరాడ్ గ్రామంలో చౌదరి మన్సబ్ అలీ కుటుంబం నివాసం ఉంటోంది. చౌదరి కూతురికి రేష్మ చౌదరి అనే ఓ కూతురు ఉంది. కొంతకాలంగా రేష్మ కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రేష్మ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

17:13 - May 26, 2016

గుంటూరు : అమరావతిలో నిర్మించబోతున్న అతిపెద్ద పుష్కర ఘాట్ వివాదాలకు నిలయంగా మారింది. భూ వివాదాలను పరిష్కరించకుండా ఘాట్ల నిర్మాణానికి పూనుకోవడంపై రైతులు, భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తమ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టొద్దని హెచ్చరిస్తున్నారు. తాజాగా అమరలింగేశ్వర ఆలయం సమీపంలో ఘాట్ల నిర్మాణానికి భూ యజమానులనుంచి వ్యతిరేకత ఎదురైంది. ద్యాన బుద్ద ప్రాజెక్ట్ ఎదురుగాఉన్న 16 ఎకరాలను 30ఏళ్లక్రితం దాదాపు 40 మంది కొన్నారు. వీరి అంగీకారంతో 2009లో కాలచక్ర ఉత్సవాలను ప్రభుత్వం ఇక్కడే నిర్వహించింది. ఈ భూమిని తామే తీసుకుంటామని ఎవ్వరికీ అమ్మొద్దని యజమానులకు సూచించింది. అలాగే ఈ ప్రాంతంలో ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లు లేకుండా సర్కారు లాక్‌ చేసింది.. ఆ తర్వాత అమరావతి రాజధాని ప్రకటనతో ఈ ల్యాండ్ విలువ మరింత పెరిగింది.. విశాలమైన స్థలం కావడంతో ముఖ్యమంత్రి సభలు, సినిమా ఆడియో ఫంక్షలు, ఇతర కార్యక్రమాలను ఇక్కడే జరుపుతున్నారు.

భూముల విలువ పెరిగినా..
భూముల విలువ పెరిగినా నందనవనం యజమానులకు ఆ ఫలితం దక్కడంలేదు.. ప్రభుత్వం కొనుగోలు చేయకుండా వేరేవాళ్లకు అమ్ముకోనివ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ ప్రాంతంలోనే కృష్ణా పుష్కరాలకోసం పుష్కర నగరి నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో ఈ స్థల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.. భూ యజమానుల అనుమతిలేకుండా ఎటువంటి కట్టడాలు చేపట్టొద్దని కోర్టు స్టే విధించింది. అయినా అధికారులు, కాంట్రాక్టర్‌ ఇక్కడ పనులు కొనసాగించేందుకు ప్రయత్నించారు.. వీరిని బాధితులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి భూమి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యజమానులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయకుండా ఇక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టొద్దని కోరుతున్నారు. నష్టపరిహారంగానీ ఇతర ప్రాంతాల్లోగానీ భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నందనవనం భూ యజమానులు సర్కారు తీరుతో అష్టకష్టాలు పడుతున్నారు. తమ సమస్య పరిష్కరించాకే ముందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

17:09 - May 26, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకి వచ్చే నిధుల కంటే ఎక్కువ నిధులు తీసుకొస్తామన్న బీజేపీ.. ఏం చేసిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో ఏ మేరకు నిధులిచ్చారో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. నల్లధనాన్ని తీసుకొస్తాన్న బీజేపీ ఆ సంగతే మర్చిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకొని సభలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆగస్టు 9 నుంచి విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సమాయత్తమయ్యేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. 

17:06 - May 26, 2016

హైదరాబాద్ : అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించింది గుర్తు ఉంటే ఉంటుంది కదా. ఈ సర్వే ఎందుకు ? దీనివల్ల ఏం ఫలితం వచ్చింది అంటూ పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో తెలియదు కానీ...సమగ్ర కుటుంబ సర్వే చరిత్ర పుటల్లోకి ఎక్కింది. లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సమగ్ర కుటుంబ సర్వేను జాతీయ రికార్డుగా పేర్కొన్నది. ఈ మేరకు లిమ్కా బుక్‌ ఎడిటర్ విజయ ఘోష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికేట్ పంపారు. దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు తెలంగాణ రాష్ట్రంలో 4లక్షల మంది ఉద్యోగుల బృందం.. కోటి 9 లక్షల కుటుంబాల వివరాలను సేకరించింది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే తోడ్పడిందని లిమ్క్ బుక్ అధికారులు తెలిపారు. 

17:02 - May 26, 2016

హైదరాబాద్ : రాజ్యసభ అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్‌ మద్దతు కోరతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు వీహెచ్ పేరును టి.పిసిసి పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హై కమాండ్ కు కూడా విషయాన్ని తెలియచేసింది. దీనితో టీఆర్ఎస్ మద్దతు కోరేందుకు వీహెచ్ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన అభ్యర్థిత్వం ఖరారైతే కేసీఆర్‌ని రిక్వెస్ట్ చేస్తానని తెలిపారు. మద్దతు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆయన ఇష్టమని వీహెచ్‌ చెప్పుకొచ్చారు. మరి టీఆర్ఎస్ మద్దతిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

16:59 - May 26, 2016

హైదరాబాద్ : నగరంలో పేరు గాంచిన గాంధీ ఆసుపత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది. లిఫ్ట్ బాయ్ పై ఓ రోగి బంధువు దాడి చేయడంతో ఉద్రిక్తత చెలరేగింది. గురువారం మధ్యాహ్నం ఓ రోగి బంధువులు గాంధీ ఆసుపత్రికి వచ్చాయి. అనంతరం లిఫ్ట్ ఎక్కుదామని ప్రయత్నించారు. లోడ్ ఎక్కువైందని లిఫ్ట్ బాయ్ చెప్పడంతో రోగి సిబ్బంది ఒకరు బాయ్ పై చేసుకున్నాడు. పిడిగుద్దులు గుద్దారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఇతర లిఫ్ట్ బాయ్స్ లిఫ్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. దీనితో ఇతర రోగులు..బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రి పోలీస్ ఔట్‌ పోస్టులో ఫిర్యాదు చేశాడు.

కేసీఆర్ తో బత్తిని సోదరుల భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో బత్తిని సోదరులు భేటీ అయ్యారు. వచ్చే నెల 8వ తేదీన చేప మందు పంపిణీపై చర్చించారు. 

లిమ్కా బుక్ లో సమగ్ర సర్వే..

హైదరాబాద్ : తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ధృవీకరణ పత్రం పంపించింది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సమగ్ర సర్వే ఉపయోగపడిందని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది. 

డ్రైవర్ గొంతులో ఇరికిన చెట్టుకొమ్మ..

నిజామాబాద్ : జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బిచ్కుంద బాన్సువాడ వెళుతున్న లారీ డ్రైవర్ గొంతులోకి చెట్టుకొమ్మ ఇరుక్కపోయింది. దీనితో సదరు డ్రైవర్ లారీ నడుపుకుంటూనే ఆసుపత్రికి వెళ్లాడు. 

కేసీఆర్ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు - తమ్మినేని..

నల్గొండ : మిర్యాలగూడలో ఐదో రోజు సీపీఎం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కేసీఆర్ అమలు చేయలేదని, డబుల్ బెడ్ రూం పథకం మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు. కరవుతో ప్రజలు అల్లాడుతుంటే స్పందించకుండా కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించారని, కేసీఆర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

అందుబాటులో రోబోటిక్ మొబైల్ ఫోన్..

టోక్యో : రోబోటిక్ మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 'రోబోహన్' పేరుతో జపాన్ మార్కెట్లో అమ్మకాలు జరగనున్నాయి. నడకతో పాటు నృత్యం కూడా చేస్తుంది. పాకెట్ సైజులో ఉండే రోబోటిక్ ఫోన్ ధర రూ. 1,98,000 యెన్ లు. 

మాల్యా ఆస్తులు బ్యాంకులు జప్తు చేస్తాయి - జైట్లీ..

ఢిల్లీ : మొండి బకాయిలను రికవరీ చేసే అధికారం బ్యాంకులకిచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మాల్యా ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తాయని పేర్కొన్నారు. 

కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..

ఢిల్లీ : నిర్భయ నిధులు వినియోగించుకోకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిధులు వినియోగించుకోనప్పుడు రూ. 2వేలు ఎందుకు కేటాయించినట్లని సుప్రీం ప్రశ్నించింది. 

వడదెబ్బతో కాంగ్రెస్ అధ్యక్షుడి మృతి..

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కర్నాటి శ్రీనివాస్ వడ దెబ్బతో మృతి చెందాడు. 

16:35 - May 26, 2016

ఢిల్లీ : మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతోన్మాదం జడలు విప్పింది. చర్చిలపై దాడులు పెరిగాయి. లవ్‌ జిహాద్‌, ఘర్‌ వాప్‌సీ పేరిట బలవంతపు మత మార్పిడులు జరిగాయి. బీఫ్‌ బ్యాన్‌ పేరిట మతతత్వ శక్తులు బీభత్సం సృష్టించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతోనే మోది పాలన కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. మోది రెండేళ్ల పాలన- ప్రజాతంత్ర హక్కులు కాలరాస్తూ... పార్లమెంటరీ ప్రజాస్వామిక సంస్థలను కుదేలు చేస్తూ నిరంకుశ ధోరణులకు తెర లేపింది. 
ఎంపీలు, మంత్రుల వివాదస్పద ప్రకటనలు
నరేంద్ర మోది ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే మతతత్వ శక్తులు రెచ్చిపోయాయి. బాధ్యతలు మరచిన కేంద్రమంత్రులు, ఎంపీలు విద్వేషపూరిత ఉపన్యాసాలు, ప్రకటనల ద్వారా ఓ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించారు. సాధ్వి ప్రాచి, సాక్షి మహరాజ్, గిరిరాజ్‌సింగ్‌ తదితరుల వివాదస్పద ప్రకటనలపై విపక్షాలు పార్లమెంట్‌లో నిలదీశాయి. వారిపై చర్యలు తీసుకోవడం పక్కనబెడితే.. కనీసం పార్లమెంటుకు కూడా హామీ ఇవ్వటానికి మోది తిరస్కరించారు.
మతోన్మాద విషాన్ని చిమ్ముతోన్న ఆర్ ఎస్ ఎస్
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి బాహాటంగా అందుతున్న మద్దతుతో సంఘ్‌ పరివార్ దేశవ్యాప్తంగా మతోన్మాద విషాన్ని చిమ్ముతోంది. సామాజిక వేత్తలు నరేంద్ర దభోల్కర్‌, గోవింద్‌ పన్సారే, డాక్టర్‌ కల్బుర్గి బహిరంగ హత్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మేధావులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు కేంద్ర ప్రభుత్వమిచ్చిన అవార్డులను సైతం వెనక్కి ఇచ్చినా మోది సర్కార్‌ పట్టించుకోలేదు. 
ముస్లింలలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్న హిందుత్వ సంస్థలు  
లవ్‌ జిహాద్‌, ఘర్‌ వాపసి, బీఫ్‌ బ్యాన్‌ లాంటి చర్యల ద్వారా హిందుత్వ సంస్థలు ముస్లింలలో విద్వేషాన్ని రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించారు. గోమాంసం కలిగి ఉన్నాడనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో అక్లాఖ్‌ను హత్య చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌లోని లతేహర్‌లో గోవుల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు యువకులను బహిరంగంగా ఉరితీయడం వంటివి వాతావరణాన్ని మరింత దిగజార్చాయి. 
వివాదస్పదమైన పోలీసులు దాడి 
ఢిల్లీలోని కేరళ హౌజ్‌లో గోమాంసం సర్వ్‌ చేస్తున్నారన్న కారణంతో పోలీసులు దాడి చేయడం వివాదస్పదమైంది. అమ్మాయిలు జీన్స్‌ వేసుకోవద్దని హర్యానా సిఎం ఖట్టర్ సూచించారు. దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యలు చేసినందుకు బాలీవుడ్‌ నటులు షారుక్‌ఖాన్‌, అమీర్‌ ఖాన్‌లకు హిందుత్వ సంస్థల నిరసనలు తప్పలేదు.
విద్యావ్యవస్థలో మతోన్మాదం 
మోడీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థలో కూడా మతోన్మాదం పులుముకుంటోంది. పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాలను తిరిగి రాసే ప్రక్రియ ఊపందుకుంది. విద్యాసంస్థల్లో ఆరెస్సెస్‌ ప్రచారకుల నియామకాలు జరిగిపోయాయి. విద్యార్థులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినా ఎఫ్‌టిఐఐ ఛైర్మన్‌గా  గజేంద్ర చౌహాన్‌ను కేంద్రం బలవంతంగా నియమించింది.
విద్యా కేంద్రాలపై ప్రభుత్వం దాడి 
దేశం గర్వించదగ్గ జెఎన్‌యు, ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఐఐటిలు, ఇతర ముఖ్యమైన విద్యా కేంద్రాలపై ప్రభుత్వం దాడికి దిగింది. విద్యార్థులు, అధ్యాపకులపై హిందూత్వ సిద్ధాంతాలను అంగీకరించేలా ఒత్తిడి చేయటమే ఈ దాడి వెనక ముఖ్య ఉద్దేశం. కేంద్ర మంత్రుల జోక్యం వల్లే హెచ్‌సియులో రిసెర్చ్‌ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు దారితీసిందన్న ఆరోపణలు వచ్చాయి. దేశవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ జెఎన్‌యు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. నిరాధారమైన సాక్ష్యాల ఆధారంగా జెఎన్‌యు విద్యార్థి సంఘం నేతలపై దేశద్రోహం కేసులు బనాయించింది. కన్హయ్య కుమార్‌పై కోర్టులో పోలీసుల సమక్షంలోనే బహిరంగ దాడి జరిగడం గమనార్హం.

 

16:28 - May 26, 2016

విశాఖ : పెందుర్తిలోని రాజు చెరువులో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు పెంటకోట శ్రీను, రాంబాబు, సూర్యనారాయణగా గుర్తించారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

 

16:24 - May 26, 2016

హైదరాబాద్ : అధికార పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభ స్థానానికి ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలనన్న ధైర్యం ఉందన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పెద్దల సభలో పోరాటం చేస్తానన్నారు. టీడీపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు.

 

16:13 - May 26, 2016

నిజామాబాద్ : ఓ ఆర్టీసీ డ్రైవర్ సాహసాన్ని ప్రదర్శించాడు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా  నిబ్బరం కోల్పోలేదు. ధైర్య సాహసాలను ప్రదర్శించారు. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఇతరు ప్రాణాలు కాపాడడం కోసం ప్రయత్నించాడు. తన గొంతులోకి చెట్టుకొమ్మ దూసుకెళ్లినా.. ఆ ధైర్యపడకుండా బస్సును నడుపుకుంటూ వెళ్లి.. ప్రయాణీకులను కాపాడాడు. నిజామాబాద్ జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలి బీభత్సానికి విరిగిన చెట్టుకొమ్మ... ఆర్టీసీ బస్సు డ్రైవర్ గొంతులోకి చొచ్చుకెళ్లింది. బిచ్కుంద నుంచి బాన్సువాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయినా కూడా.. డ్రైవర్.. బస్సు నడుపుకుంటూ బాన్సువాడ ఆస్పత్రికి వెళ్లాడు. ప్రస్తుతం అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

 

రేపు మమత బెనర్జీ ప్రమాణ స్వీకారం..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరు కానున్నారు.

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభకు పోటీ చేసేది ఎవరో తేలిపోయింది. కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు పేర్లను ప్రకటించింది. తుమ్మల స్థానంలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ను ఎంపిక చేశారు. 

15:39 - May 26, 2016

ఢిల్లీ : ఇద్దరు కేరళ జాలర్ల హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇటాలియన్‌ నావికుల్లో ఒకరైన సాల్వటోర్‌ గిరోన్‌కు ఇంటికెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. మానవతా దృక్పథంతో బెయిల్‌ నిబంధనల్లో తనకు సడలింపు ఇవ్వాలని గిరోన్‌ పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది.  కేంద్ర ప్రభుత్వం కూడా మానవతాదృక్పథంతో గిరోన్‌కు మద్దతు తెలపడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. 2012లో ఇటలీకి చెందిన ఇద్దరు నావికులు కేరళ తీరంలో ఇద్దరు భారత మత్స్యకారులను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపేశారు. దీంతో భారత ప్రభుత్వం వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. ఇద్దరు నావికులు చమురు ట్యాంకర్‌కు కాపలా కాస్తుండగా  మత్స్యకారులను దొంగలుగా భావించి పొరపాటున కాల్చి చంపారని  ఇటలీ  వెల్లడించింది. మరో ఇటాలియన్‌ నావికుడు లటోరేకు గుండెపోటు రావడంతో 2014లో చికిత్స కోసం స్వదేశానికి వెళ్లడానికి సుప్రీం అంగీకరించింది.

 

15:35 - May 26, 2016

రోమ్ : ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో ఆర్నో నది పక్కనున్న రోడ్డు హఠాత్తుగా కుంగిపోయింది. దీంతో రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసిన పలు వాహనాలు భూమిలోకి కూరుకుపోయాయి. రోడ్డు పగుళ్లివ్వగా అందులోంచి నీరు ఉబికి వస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురిసాయి. ఈ క్రమంలోనే భూ పొరల్లో మార్పులొచ్చి రోడ్డు కుంగిపోయినట్లుగా భావిస్తున్నారు. 

15:33 - May 26, 2016

మహబూబ్ నగర్ : ప్రభుత్వాసుత్రుల్లో చికిత్స కోసం వెళితే ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. పేద ప్రజలకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వాసుపత్రులు సర్కార్ నిర్లక్ష్యానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులకు వైద్యం కోసం వెళ్లే రోగులు డాక్టర్లు లేక తీవ్ర అవస్ధలు పడుతున్నారు. సాక్షాత్తు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లోని వనపర్తి ఏరియా ఆసుపత్రిలో రోగుల అవస్ధలపై టెన్ టీవీ ప్రత్యేక కథనం..
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆసుపత్రి మహబూనగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆసుపత్రి. పేద ప్రజలకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 100 పడకల హస్పటల్ ను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వనపర్తిలో వందపడకల ఆసుపత్రికి వచ్చే రోగులు వంద రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించే డాక్టర్స్ లేకపోవడంతో మహబూబ్ నగర్ ,కర్నూల్ లాంటి ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు అక్కడి సిబ్బంది. 
ఆసుపత్రిలో తిష్టవేసిన పలు సమస్యలు
స్థానిక ప్రజలకు వైద్యం అందించలేనప్పుడు వనపర్తిలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి ఎందుకని స్ధానికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ హాస్పటల్ లో పలు సమస్యలు తిష్ట వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు స్కానింగ్ చేయాలన్నా ప్రైవేటు సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అందించేందుకు డాక్టర్ల కొరత ఉండటంతో రోగులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు.  
లక్ష్మారెడ్డి సొంత జిల్లాలో సమస్యలపై విమర్శలు 
ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై స్థానిక టీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి సందర్శించారు. రోగులకు వైద్యం ఎలా అందుతుందో స్వయంగా పరిశీలించారు. హాస్పిటల్‌లో నెలకొన్న డాక్టర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి తీసుకొని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించటం కోసం సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. 
హాస్పిటల్స్‌ పై ప్రభుత్వ నిర్లక్ష్యం 
పేద ప్రజలకు సరైన వైద్యం అందించే హాస్పిటల్స్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురికావడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పేద ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. మహబూబ్ నగర్ కు చెందిన లక్ష్మారెడ్డి  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతూ కూడా వనపర్తి ఏరియా ఆసుపత్రి సమస్యలు తీర్చడంలో మీనమేషాలు లెక్కిస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

15:27 - May 26, 2016

విశాఖ : ఒక వైపు ప్రజల గొంతెండుతోంది.. మరో వైపు నీరందక పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఎదురవుతోంది.. తాగునీరు కావాలా.. సాగునీరు కావాలా అని ప్రజల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోంది.. సమస్యను పరిష్కారించాల్సిన నేతలు రాజకీయాలకు పాల్పడుతూ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నారు.. విశాఖ జిల్లాలో ఉన్న నీటి వనరులు, ప్రత్యామ్నాయ నీటి నిలువ కేంద్రాలు వంటి వాటిపై టెన్ టీవీ అందిస్తున్న విశ్లేష్ణాత్మక కథనం..
తీవ్రమైన నీటి సంక్షోభం
ఎన్నడూ లేని విధంగా విశాఖలోని వివిధ పరిశ్రమలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. నగరంలోని ప్రజల నీటి అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు  120 ఎంజీడీల నీరు అవసరమవుతాయి.. ఏలేరు నుంచి 80, తాటిపూడి నుంచి 10, రైవాడ నుంచి 16, మేఘాద్రిగడ్డ నుంచి 10, ఇతర వనరుల నుంచి 4 ఎంజీడీల  నీరు నగరానికి సరఫరా అవుతున్నాయి..  ప్రస్తుతం విశాఖలో నీటి డిమాండ్ 170 ఎంజీడీలగా ఉంది.. అయితే పరిశ్రమలు ఎక్కువగా విశాఖకు వస్తుండడంతో రానున్న రోజులలో 400 ఎంజీడీలకు చేరుకుంటుందనీ అంచనా.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయలేదు.. పైగా తప్పంతా  అధికారులదే అని విమర్శిస్తోంది.
పేరుకే విశాఖ నగరం స్మార్ట్ సిటీ 
పేరుకే విశాఖ నగరం స్మార్ట్ సిటీ అని ఊదర గోడుతున్నారు.. ప్రచారాలపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు కల్పించడంలో మాత్రం ఉండటం లేదు. మరో వైపు స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలకు కూడా నీటి లభ్యత సరిగ్గా లేక ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నగరరానికి తాగునీటి ప్రాజెక్టులపై తొలినుంచి ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం నగర నీటి అవసరాల కోసం ఉపయోగించిన మార్గాలనే ఇప్పటికి ఉపయోగిస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేదు. 
లేరు పాత ఆయకట్టు నుంచి 70వేల ఎకరాలకు నీరు
లేరు పాత ఆయకట్టు నుంచి సుమారు 70వేల ఎకరాలకు నీరు అందించగా.. మిగిలిన నీటిని ఏలేరు జలాశయం నుంచి విశాఖ నగరానికి పంపించడం జరుగుతోంది. అయితే రైతులు రెండు,మూడు పంటలకు నీరు వాడుకోవడంతో నగరానికి నీరు రావడం కష్టమైంది.. ఏలేరు ఆయకట్టుకు పుష్కర కెనాల్ ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని తరలించడం ఒక్కటే తాత్కాలిక పరిష్కారమని మాజీ రాష్ట్ర ప్రభుత్వ తాగునీటి సలహాదారు సత్యనారాయణ చెబుతున్నారు. 
ప్రభుత్వ తీరుపై ప్రజాసంఘాల అనుమానాలు 
ప్రభుత్వ తీరుపై ప్రజా సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి..ఎందుకంటే గతంలో పోలవరం ఎడమ కాలువ పనులను జూన్ 2018 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.. పట్టిసీమను పూర్తి చేసినంత త్వరగా ప్రభుత్వం కనీసం పోలవరం ఎడమ కాలువ వైపు చూడటం లేదు... దీంతో తాగు నీటి కోసం విశాఖ నగర వాసులతో పాటుగా తమ పంటలు ఎండిపోతున్నాయని రైవాడ పరిదిలోని రైతులు ఆందోళన చేస్తున్నారు..  పోలవరం ఎడమ కాలువను 125 కిలోమీటర్ల మేర పెంచితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం  జిల్లాల్లోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంత్రి ప్రాజెక్టును 2008 లో శంకుస్థాపన చెసినా ఇంత వరకూ ప్రాజెక్టును ప్రారంభించలేదని సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు. 
ప్రత్యామ్నాయాలు ఉన్న ప్రభుత్వానికి పట్టవు
ప్రత్యామ్నాయాలు ఉన్న ప్రభుత్వానికి అవి పట్టవు.. ఎంత వరకూ తమ పరపతి కోసం పాకుతాడుతున్నాయి తప్ప ప్రజల అవసరాల గురించి పట్టించుకోవడం లేదు. పట్టిసీమను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిను ఎందుకు పూర్తి చేయడం లేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

15:17 - May 26, 2016

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ మాట మీద నిలబడే వ్యక్తి  కాదని.. ఇందుకు నిదర్శనం ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాట తప్పడమేనని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు నుంచి మోడీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికే  సీఎం చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ఎందుకివ్వాలని ఏపీ బీజేపీ నాయకులు బుకాయించడం సమంజసం కాదన్నారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన బిల్లులోని అన్ని హామీలను మోడీ సర్కార్ మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. 2018 కల్లా పోలవరం నిర్మాణం పూర్తిచేస్తామంటున్న కేంద్రం ఇప్పటివరకు కేవలం 300 కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేస్తున్న కుట్రలో చంద్రబాబుకి  భాగ్యస్వామ్యం ఉందని శైలజానాథ్ వెల్లడించారు.

 

15:00 - May 26, 2016

హైదరాబాద్ : రోడ్లు, భవనాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఆయన స్పీకర్ ఛాంభర్ లో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలో తుమ్మల భారీ మెజార్టీతో గెలుపోందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేసిన ఆయన నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యధిక మోజారిటీతో గెలిపించిన పాలేరు ప్రజలకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.  

14:58 - May 26, 2016


హైదరాబాద్‌ : ఇందిరాపార్క్‌ బోటింగ్‌లో పూడికతీత పనుల్ని జీహెచ్ ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు.. పూడికతోపాటు పార్క్‌లో రెలింగ్‌ను కూడా రిన్నోవేట్‌ చేయనున్నారు. వీటితోపాటు టూరిజం డెవలప్‌మెంట్‌కు చర్యలు చేపడతామని మేయర్‌ తెలిపారు.

14:56 - May 26, 2016

చిత్తూరు : టీడీపీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మహానాడు ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలో రేపటి నుంచి మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో సభా వేదికను, భోజనశాలలు, ఫొటో ప్రదర్శన శాల, రక్తదాన శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక నిర్మాణంపై లోకేష్‌.. అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదిక బలహీనంగా, కొందరు నేతలు ఎక్కగానే కూలిపోయేలా ఉందని... దాన్ని మరింత పటిష్ఠంగా నిర్మించాలని సూచించారు. లోకేష్‌తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

 

14:52 - May 26, 2016

మహారాష్ట్ర : ముంబై సమీపంలో దోంబివిల్లిలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్‌ పేలడంతో భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. పేలుడుకు భవనం పూర్తిగా ధ్వంసమైంది.

 

'డిఫెన్స్ ప్రొడక్షన్' బుక్ విడుదల చేసిన పారికర్..

ఢిల్లీ : అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంగా కేంద్రం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా రక్షణ మంత్రి పారికర్ 'డిఫెన్స్ ప్రోడక్షన్' పేరిట బుక్ ను విడుదల చేశారు. 

14:29 - May 26, 2016

దర్శకుడు ఆనంద్‌.ఎల్‌.రాయ్ కి బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. ఆయన చిత్రాలు సహజత్వానికి చాలా దగ్గరగా నవ్యతతో ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'తను వెడ్స్ మను', 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన పలు చిత్రాలను 'కలర్‌ ఎల్లో' బ్యానర్‌పై నిర్మించారు. ఆయన నిర్మాతగా తాజాగా 'హ్యాపీ భాగ్‌ జాయేగీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే షారూఖ్‌ఖాన్‌ నటించబోయే ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. మరుగుజ్జుగా నటిస్తున్న షారూఖ్‌ సరసన కత్రినాకైఫ్‌, అలియాభట్‌ నటిస్తున్నారు. అయితే అలియాభట్‌ బదులుగా సోనమ్‌కపూర్‌ని తీసుకోవాలనే యోచనలో ఆనంద్‌రాయ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, 'హీరోయిన్ల విషయంలో వినిపిస్తున్న వార్తల్లో వాస్తవం ఉంది. ఈ చిత్రంలో షారూఖ్‌ సరసన ఇద్దరు భామలు నటిస్తున్నారు. కత్రినాకైఫ్‌, అలియాభట్‌లను ఇప్పటికే ఎంపిక చేశాం. కొన్ని కారణాల వల్ల సోనమ్‌కపూర్‌ గురించి చర్చించుకోవాల్సి వచ్చింది. ఫైనల్‌గా అలియా ఉంటుందా.. లేక సోనమ్‌ ఉంటుందా అనే విషయాన్ని మాత్రం ప్రస్తుతం చెప్పలేను. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పక్కాగా పూర్తయ్యింది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది' అని చెప్పారు.

14:26 - May 26, 2016

బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ లవ్‌స్టోరీగా 'ఆషికీ' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే. దీనికి సీక్వెల్‌గా రూపొందిన 'ఆషికీ2' కూడా అదే స్థాయిలో ఘనవిజయం సాధించింది. తాజాగా దీనికి సీక్వెల్‌గా 'ఆషికీ3' చిత్రాన్ని నిర్మించేందుకు దర్శక, నిర్మాతలు మోహిత్‌ సూరి, ముఖేష్‌భట్‌, భూషణ్‌కుమార్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాయకానాయికలుగా సిద్ధార్థ్‌ మల్హోత్రా, అలియాభట్‌ ఎంపికయ్యారు. ఈ విషయంపై కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా స్పందిస్తూ, 'బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ఆషికీ' సిరీస్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా అలియాతో ఈ చిత్రంలోనూ నటించడం మరింత సంతోషంగా ఉంది' అని చెప్పారు. సిద్ధార్థ్‌, అలియా నటించిన 'కపూర్‌ అండ్‌ సన్స్‌' ఇటీవల విడుదలైన విషయం విదితమే.

ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి - హరీష్..

మెదక్ :మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు భూ సేకరణ చేపట్టి ఇచ్చి పరిహారం కంటే తమ ప్రభుత్వం ఎక్కువగానే ఇస్తోందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం మండలానికి రూ. 100 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. 

'డబుల్ బెడ్ రూంపై శ్వేతపత్రం విడుదల చేయాలి'..

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండేళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ఐడీహెచ్ లో ఇళ్లను డబుల్ బెడ్ రూం టూరిజంగా మారుస్తున్నారని, ఐడీహెచ్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి ఇళ్లు కేటాయించారని విమర్శించారు. 

నేటి నుండి ఏపీసీసీ ప్రచార కార్యక్రమాలు - శైలజానాథ్..

హైదరాబాద్ : మోడీ అభివృద్ధి వ్యతిరేక విధానాలపై నేటి నుండే ఏపీసీసీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత శైలజానాథ్ పేర్కొన్నారు. 

అన్ని రంగాల్లో మోడీ విఫలం - పళ్లం రాజు..

హైదరాబాద్ : రేండెళ్లలో వ్యవసాయం, ఆర్థిక, విద్యారంగాల్లో మోడీ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో రాయితీలు తగ్గించారని, 2,3 నెలలైనా ఉపాధి హామీ డబ్బులు చెల్లించలేదన్నారు. విద్యారంగాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబుకు చీమకుట్టినట్లైనా లేదని పేర్కొన్నారు.  

'ఐఈఎస్ ను ఏర్పాటు చేయాలి'..

ఢిల్లీ : పాఠశాల విద్యను గాడినపెట్టేందుకు ఐఈఎస్ ను ఏర్పాటు చేయాలని హెచ్ ఆర్సీకి బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ ప్రతిపాదించింది. రాష్ట్రాల విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని, విద్యాసభ హక్కు చట్టంలో 15-18 ఏళ్లలోపు వారికి సెకండరీ విద్య అందించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రతిపాదనలు చేసింది. 

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం - తుమ్మల..

హైదరాబాద్ : పాలేరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. 

వడదెబ్బతో ముగ్గురు మృతి..

విశాఖపట్టణం : జిల్లాలోని పెందుర్తి (మం) రాజు చెరువులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వడదెబ్బతో మృత్యువాతపడ్డారు. 

14:04 - May 26, 2016

హైదరాబాద్ : స్వర్గీయ ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించడం ఏంటీ ? రేపు ఆయన జయంతి కదా ? అని అంటే కరెక్టే. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు వీలు లేదంట..అందుకే ఈ రోజే నివాళి అర్పించాడంట.జూనియర్ ఎన్టీఆర్ నేటి ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. అక్కడక ఎన్టీఆర్ సమాధికి ఘనంగా నివాళులర్పించారు. ఈనెల 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. కానీ అదే రోజు 'జనతా గ్యారేజ్' చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు చెన్నైకు వెళ్లనున్నాడు. అందుకనే ఒక రోజు ముందుగా ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. సంచలన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ షెడ్యూల్ ముగిసింది. తాతకు ఘనంగా నివాళి అర్పించిన జూనియర్ ఆ తర్వాత ఇంటికెళ్లిపోయాడు. 

అమెరికాలో మంత్రి కేటీఆర్..

అమెరికా : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయోవా రాష్ట్రంలో పర్యటించి రాష్ట్ర గవర్నర్ బెర్రీ బ్రాన్ స్టర్డ్, ప్రపంచ ఆహార బహుమతి సంస్థ అధ్యక్షుడు కెన్నెత్ క్వీన్ తదితరులతో సమావేశమయ్యారు.

ఎయిమ్స్ లో కేజ్రీ..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎయిమ్స్ కు వెళ్లారు. అక్కడ అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలికను పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ప‌లువురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బాలిక‌ను అత్యాచారం చేసి రైల్వే ట్రాక్ ప్రాంతంలో ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నేరాలు అదుపులోకి రావాలంటే ప్ర‌జ‌లు, న్యాయాధికార సంస్థ‌లు క‌లిసి ప‌నిచేసేలా కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.

13:47 - May 26, 2016

ఢిల్లీ : జూన్ 2 వ తేదీన ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉదయం రోగులకు పండ్ల పంపిణీ చేసి అనంతరం బతుకమ్మ ఆటపాటలు నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ యాస, భాషను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉంటాయని వేణుగోపాల చారి తెలిపారు. 

13:44 - May 26, 2016

విశాఖపట్నం  : స్వరాజ్ మైదాన్ స్థలాన్ని ప్రభుత్వం ప్రైవేటు సంస్ధకు కేటాయించడం సరికాదనీ మాజీ ఐఏఎస్ అధికారి శర్మ అన్నారు. చట్టప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇలాంటి కేటాంపులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఖాళీ స్థలాలు, ప్రైవేటు సంస్థలకు కేటాయించడం పట్ల పలు కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు ఈ చర్య పూర్తి విరుద్ధమని శర్మ తెలిపారు. స్వరాజ్ మైదాన్ స్థలాన్ని చైనా కంపెనీకి కేటాయించడం సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:39 - May 26, 2016

విజయవాడ : అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం సాధించారని మోడీ సర్కార్ సంబరాలు చేసుకుంటుందని మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వ్యవసాయం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతులను ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఇంతవరకు కరవుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఎండగట్టిందని గుర్తుచేశారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయం దిగుబడి ఎంత శాతం తగ్గిందో లెక్కలతో సహా వివరించారు. ప్రధాని మోడీ విదేశాల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారనే తప్ప విదేశీ పెట్టుబడులు భారత్‌కు తెచ్చింది శూన్యమని తెలిపారు. 

13:36 - May 26, 2016

కరీంనగర్ : కోనరావుపేట మండలం నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పురుగుమందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు పాల్పడినవారిలో మహీపాల్ మృతి చెందగా మిగిలిన ఇద్దరి పరిస్థితి విషయంగా వుంది. కుటుంబ కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం. కాగా మృతి చెందినవారిలో కుమారుడు మహీపాల్ పై ఇటీవల ఎస్టీ ఎస్టీ కేసు పెట్టినందుకు మనస్తాపంలో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..

ముంబై : వాణిజ్య ప్రాంతమైన ముంబైలోని ఓ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. 

13:01 - May 26, 2016

లిబియ : టెర్రరిస్ట్‌ల భయంతో యూరోపియన్ దేశాలకు వెళ్తూ మృత్యువాత పడుతున్న శరణార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గల్ఫ్‌ కంట్రీ లిబియా తీర ప్రాంతంలో మధ్యదరా సముద్రంలో సుమారు 6 వందల మంది శరణార్ధులతో కిక్కిరిసి ఉన్న ఓ బోటు నీట మునిగింది. ప్రాణభయంతో బోటులోని వారంతా ఒక్కసారిగా నీటిలోకి దూకేశారు. వారిలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇటలీ కోస్ట్‌ గార్డ్స్‌... 550 మంది ప్రయాణికులను రక్షించారు. గల్లంతైన వారిలో ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. శరణార్థులంతా వివిధ దేశాలకు చెందినవారుగా భావిస్తున్నారు. 

12:58 - May 26, 2016

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖను మరింత బలోపేతం చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యలతో పాటు రానున్న మూడేళ్లలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి తుమ్మల చర్చించారు. రాష్ట్రంలో 35,700 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల 5.79 లక్షల మందికి పౌష్టికాహరాన్ని అందిస్తున్నామన్నారు. పౌష్టికాహరం అందించటం ద్వారా రాష్ట్రంలో మరణాలు రేటు ప్రతి వెయ్యి మందికి 40 నుంచి తాజాగా 28 కి తగ్గడం హర్షనీయమని మంత్రి అన్నారు.

12:50 - May 26, 2016

గుంటూరు : తెనాలి మండలంలో విషాదం నెలకొంది. తెనాలి మండలం ఐతానగర్ సమీపంలోని తేలప్రోలు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని బయటకు తీసారు. అప్పటికే వారు మృతి చెందారు. దీంతో వారి కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముగ్గురు చిన్నారులలో చందూ (6) ప్రథమ సంతానంగా కాగా లావణ్య(5)సుశీల్(5) కవలపిల్లలుగా స్థానికులు తెలిపారు.

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తుమ్మల..

హైదరాబాద్ : తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఖమ్మం జిల్లా పాలెరు ఉప ఎన్నికలో తుమ్మల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన లోకేష్..

చిత్తూరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతిలో నిర్వహించే మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. నారావారిపల్లెలో బస చేసిన లోకేశ్ మహానాడు ప్రాంగణానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. 

12:39 - May 26, 2016

విశాఖపట్నం: ఎన్నారై పేరిట మోసాలు కొనసాగుతున్నాయి. విదేశాలలో కొలువులు చేసుకుంటూ అధికంగా కట్నాలు వసూలు చేస్తూంటడం ఈ మధ్య సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖలో మరో ఎన్నారై వరుడు ఓ మహిళను మోసం చేశారు. సదరు మహిళను వదిలించుకోవటానికి వివాహేతర సంబంధాన్ని ఆరోపించాడు. గత ఆరు సంవత్సరాల క్రితం విజయానంద్ అనే వ్యక్తి విశాఖకు చెందిన మహిళతో వివాహమయ్యింది. వివాహం నిమిత్తం రూ.20లక్షలు కట్నంగా ఇచ్చారు.  కొంతకాలం ఆమెతో కలిసి వున్న భర్త లండన్ కు తిరిగి వెళ్లిపోయాడు. తాజాగా తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వుందని ఆరోపిస్తూ విడాకులు ఇవ్వాలని నోటీసులు పంపించాడు. తనకు ఎవరి తోనూ ఎటువంటి సంబంధాలు లేవని కావాలంటే ఆధారాలు చూంపించాలనీ...లండన్ వున్న భర్త విజయానంద్ ని ఇండియాకు రప్పించి డీఎన్ఏ పరీక్ష చేసి నిరూపించాలని డిమాండ్ చేస్తోంది. అనంతరం తన కుమారుడి న్యాయం చేయాలని కోరుతోంది

కపలేశ్వర్ దేవాలయంలో తృప్తి..

నాసిక్ : భూ మాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కపలేశ్వర్ దేవాలయానికి చేరుకున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. గర్భగుడిలోకి మహిళల ప్రవేశం కోసం ఆమె పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 

12:37 - May 26, 2016

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మరింత ఊపందుకుంది. ఇప్పటికే ఇరవైకి పైగా బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, మరో బయెపిక్‌ తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రముఖ పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతమ్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ సన్నాహాలు చేస్తున్నారు. అమృతా ప్రీతమ్‌ జీవితంలో రెండు ప్రేమకథలున్నాయి. 'రశీదీ టిక్కెట్‌' (రెవిన్యూ స్టాంప్‌), 'అమృతా ఇమ్రోజ్‌ : ఏ లవ్‌ స్టోరీ' పేరుతో ఆ రెండు ప్రేమకథలు పుస్తకాల రూపంలో వచ్చాయి. వాటినే కథా వస్తువుగా తీసుకుని ఈ చిత్రాన్ని భన్సాలీ రూపొందించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో అమృతా ప్రీతమ్‌గా పరిణీతి చోప్రాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం తొలుత సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రాలను సెలెక్ట్‌ చేసేందుకు భన్సాలీ ప్రయత్నాలు చేశారు. కొన్ని కారణాల రీత్యా చివరికి పరిణీతిని సెలెక్ట్ చేశారని చిత్రయూనిట్‌ తెలిపింది. అమృతా ప్రీతమ్‌ తొలి ప్రియుడు సాహిర్‌ లూధియాన్వీగా ఇర్ఫాన్‌ఖాన్‌ నటిస్తున్నారట. పరిణీతి ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో నటిస్తోంది.

ఎన్నారై చేతిలో మోసపోయిన వివాహిత..

విశాఖపట్టణం : ఎన్నారై విజయనాంద్ చేతిలో మహిళ మోసపోయింది. తనను మోసం చేసి భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంటోంది. అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత న్యాయపోరాటం చేస్తోంది. భర్తను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది. 

12:25 - May 26, 2016

బీహార్ : మాజీ సీఎం కారుపై దాడి జరిగింది. మాజీ సీఎం జీనత్ రామ్ మాంజీ కారుపై దాడి చేశారు. జీనత్ రామ్ కాన్వాయ్ లో పైలెట్ వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు. గయకు సమీపంలో దుమరియా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఎల్ జేపీ నేత సుదేశ్ పాశ్వాన్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలో పాల్గొంనేందుకు మాంజీ వెళుతుండగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

అమరావతిలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు..

విజయవాడ : ఏపీ నవ్యాంధ్ర అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అడుగు పెట్టారు. తుళ్లూరు లో సీఆర్డీఏ అధికారులతో వారు భేటీ అయ్యారు. 

గయాలో ఆందోళనలు..ఉద్రిక్తత..

గయా : ఎల్జీపీ నేత హత్యకు నిరసనగా ఆందోళన చెలరేగుతోంది. మాజీ సీఎం జితన్ రాం మాంజీ కాన్వాయ్ పై ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. పోలీసు పైలట్ వాహనానికి నిప్పు పెట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపి గాల్లోకి కాల్పులు జరిపారు. 

నామినేషన్ వేసిన విజయసాయిరెడ్డి..

హైదరాబాద్ : వైసీపీ పార్టీ నుండి రాజ్యసభ్య అభ్యర్థిత్వానికి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

నిధులున్నా పనులు జరగడం లేదు - సోము వీర్రాజు..

విజయవాడ : సీఎస్‌గా ఐవైఆర్‌ కృష్ణారావు ఉన్న సమయంలో కేంద్రం ఇంకుడు గుంతల కోసం రూ.900 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఒక్క గుంటూరు కార్పొరేషన్‌లో ఇంకుడు గుంతల కోసం రూ. 7 కోట్ల నిధులున్నా పనులు సరిగ్గా జరగడం లేదని ఆయన ఆరోపించారు. 

12:01 - May 26, 2016

ఇండోనేషియా : సుమత్రా దీవుల్లో బద్దలైన సినబంగ్‌ అగ్నిపర్వతం ఇంకా విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. గత నాలుగు రోజులుగా అగ్నిపర్వతం నుంచి లావా ఉబికివస్తూనే ఉంది. దీనికితోడు పెద్దయెత్తున బూడిద గాలిలోకి వెదజల్లుతోంది. అగ్నిపర్వతం పేలుడు మూలంగా వస్తున్న గ్యాస్‌, బూడిద మూలంగా ఊపిరాడక ఏడుగురు మృతిచెందారు. ఇండోనేషియన్‌ ప్రభుత్వం హుటాహుటిన అగ్నిపర్వతం చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సుమత్రా దీవుల్లోని సినబంగ్‌ అగ్నిపర్వతం నాలుగు వందల ఏళ్ల క్రితం క్రియాత్మకమైంది. ఇప్పటికి పలుమార్లు ఈ వాల్కనో పేలుడు సంభవించి పెద్దయెత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఇదొక్కటేగాక ఇండోనేషియాలో మొత్తం 120దాకా అగ్ని పర్వతాలు క్రియాత్మకంగా ఉన్నాయి.

వైసీపీకి మరోషాక్ తగలనుందా?

ప్రకాశం : వైసీపీకి మరోషాక్ తగలనుందా? అంటే నిజమనే వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. మహానాడు లేదా విజయవాడ వేదికగా టీడీపీలో చేరాలా అనే విషయంపై మంతనాలు జరుగుతున్నట్లు వినికిడి. వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోతుల జంపింగ్  పట్ల వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. పోతుల రాకతో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వారి సంఖ్య 17కు చేరనుంది. మరి రాజ్యసభ సీటుకు 48 మంది మద్దతు కావాలనే విషయం తెలిసిందే. మరి టీడీపీ మినీమహానాడు సందర్భంగా ఈ సంఖ్య పెరగనుందా?

జూన్ 6 నుండి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ - గంటా..

విజయవాడ: జూన్ 6వ తేదీ నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 6తేదీ నుంచి 15 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన, 9వ తేదీ నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్ల ఎంపిక, 22 నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.

ఇటలీ మెరైన్ లకు ఊరట..

న్యూఢిల్లీ : భారతీయ జాలర్లను హత్య చేసిన కేసులో అరెస్టు అయిన ఇటలీ మెరైన్‌ను విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. మానవీయ కోణంలో ఇటలీ మెరైన్ సాల్వటోర్ గిరోనీని విడుదల చేయాలని నిర్ణయించారు. 2012లో జరిగిన ఘటనలో ఇద్దరు కేరళ జాలర్లలు హత్యకు గురయ్యారు. 

11:37 - May 26, 2016

విజయనగరం : ఏపీలో రైతుల భూముల్ని ప్రభుత్వం మిగిల్చేలా లేదు. వారిని భూ నిర్వాసితులుగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టంటూ రైతుల భూములకు ఎసరు పెడుతూనే ఉంది. విజయనగరంలో తాజాగా నావల్‌ ఆర్మ్‌డ్‌ డిపో పేరిట పచ్చని పంట పొలాలను లాక్కొనేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

విజయనగరంలో జిల్లాలో నావిల్‌ ఆర్మ్‌డ్‌ డిపో ....
రైతుల పచ్చని పంట పొలాలపై ప్రభుత్వానికి యావ చావడం లేదు. ఎన్ని వేల ఎకరాలు లాగేసుకున్నా.. భూదాహం తీరడమే లేదు. ఆ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు అంటూ ఎక్కడికక్కడ రైతుల భూములను లాక్కొంటూనే ఉంది. తాజాగా విజయనగరంలో జిల్లాలో నావిల్‌ ఆర్మ్‌డ్‌ డిపో ఏర్పాటు కోసం ఎనిమిది గ్రామాలకు చెందిన వేల ఎకరాల భూముల స్వాధీనానికి ప్రభుత్వం ఎసరు పెట్టింది. సర్కారు నిర్ణయంతో భూములపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దత్తేదారులో సర్కారు భూదాహం....
దత్తిరాజేరు మండలంలో 8 గ్రామాలకు చెందిన వేల ఎకరాల్లో నావిల్‌ ఆర్మ్‌డ్‌ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. పాచలవలస, మరడాం, వి.కృష్ణాపురం, కోమటిపల్లి, వింధ్యవాసి, గచ్చిమి, బోజరాజపురం, ఎస్‌.చింతలవలస తదితర గ్రామాల పరిధిలోని దాదాపు 2500 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్‌ఏడీ వల్ల భూములు పోతున్నాయని తెలిసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పచ్చని పంటలు పండే భూములు కోల్పోయి ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

ఎన్‌ఏడీ కోసం భూముల్ని వదులుకోం : స్థానికులు
వరి, కూరగాయలు పండించే సారవంతమైన భూముల్ని ఎన్‌ఏడీ కోసం వదులుకోలేమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లిస్తామన్నా.. తమ భవిష్యత్‌ను అంధకారం చేసుకోలేమని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎన్‌ఏడీ మాకొద్దు.. మా ఊరే మాకు ముద్దంటూ వారు నినదిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత గ్రామాల ప్రజలు తాహసీల్దార్‌కు తమ నిరసనను వినతి పత్రం ద్వారా తెలియజేశారు. నావికాదళానికి చెందిన ఆయుధాలు నిలువ చేసే గిడ్డంగి కట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నా.. రైతుల భూముల్ని లాక్కొవడం ద్వారా వాళ్ల జీవితాలను నాశనం చేసినట్లే అవుతోందని రైతులకు సంఘీభావం ప్రకటించిన సీపీఎం విమర్శించింది.

ఉద్యమిస్తామని రైతుల హెచ్చరిక....
జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వాటిల్లో ఎన్ని గిడ్డంగులైనా కట్టుకోవచ్చు. కానీ ప్రతిదానికీ ప్రభుత్వానికి పచ్చని చేలే ఎందుకు అవసరమవుతాయో అర్థం కాని పరిస్థితి. డిపో కోసం తమ పొలాలు లాక్కోవాలన్న నిర్ణయాన్ని మానుకోవాలని.. లేకుంటే.. ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

11:25 - May 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత 77.88 శాతంగా ఉందన్నారు. 28 నుండి 4 జూన్ వరకు ఆన్సర్ షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ర్యాంకు కార్డులు 6 జూన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ రెండు కోర్సులకు ఎంట్రెన్స్ జులై 9 పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించడం లేదని తెలిపారు. ఇన్ స్ట్రక్షన్ రిపోర్టు రాగానే, సుప్రీం నిర్ధేశం ప్రకారం ఆగస్టు 1నుండి తరగతులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇంజినీరింగ్..
 

హా.నెంబర్  పేరు  మార్కులు  జిల్లా
1502167  తాళ్లూరి సాయితేజ  160/160  
1511806   దిగుమర్తి చేతన్ సాయి 159/160  
1509145  గుండా నిఖిల్ సామ్రాట్ 158/160  
1512323  కొండా విఘ్ణేశ్ రెడ్డి 158/160  
3215237 చుండూరు రాహుల్ 158/160 గుంటూరు
3212028 బండారు వెంకటసాయి గణేష్  157/160  గుంటూరు
1202873 కొండేటి తన్మయి 157/160 విజయనగరం
3218094 గంటా గౌతమ్  157/160  ఏలూరు
3207324 నంబూరు జయకృష్ణ సాయి వినయ్  157/160 గుంటూరు
3405299  సత్తివంశి కృష్ణారెడ్డి  157/160 విశాఖపట్టణం

అగ్రికల్చర్...
 

హా.నెంబర్ పేరు మార్కులు జిల్లా
6216195  బొజ్జా ప్రదీప్ రెడ్డి 160/160 కడప
420188 తోమాల ప్రత్యూష  160/160 నల్గొండ
6216061  మహ్మద్ అర్బన్  160/160 కృష్ణా
4705416 బి.ప్రణతి  160/160  రంగారెడ్డి
4606146  అమ్మకోల యజ్ఞప్రియ  160/160 రంగారెడ్డి
4303467 అహ్మద్ జలీల్ 159/160  రంగారెడ్డి
4201705  రాజుపాలెం ఉద్వెల్  159/160 రంగారెడ్డి
660143 తంగెడ కౌశిక్  159/160 వరంగల్
6402351 పెదరెడ్ల శైలజ  159/160 విశాఖపట్టణం
4607485 అప్పల శ్రీనిధి  159/160 మిర్యాలగూడ

అగ్రికల్చర్ లో ఏడుగురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉండగా ముగ్గురు ఏపీకి చెందిన వారున్నారు. 

11:22 - May 26, 2016

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు కావడంతో.. జిల్లా కేంద్రాల్లో కొట్లాట జోరందుకుంది. నూతనంగా 15 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో.. తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు కాస్తా... ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారయింది.

దసరా నుంచి కొత్త జిల్లాల పాలన అమలు : కేసీఆర్
వచ్చే దసరా నుంచి కొత్త జిల్లాల పాలన అమలు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పుడున్న పది జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామని సీఎం ప్రకటించారు. దీంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కొత్త జిల్లాల డిమాండ్లు ఊపందుకున్నాయి. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే పలుచోట్ల ప్రజలు రోడ్లెక్కుతున్నారు.

హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా మార్చాలనే యోచనలో ప్రభుత్వం ....
నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్‌, కొత్తగూడెం భూపాలపల్లి కేంద్రంగా జయశంకర్‌ జిల్లా, సూర్యాపేట, కామారెడ్డి, మంచిర్యాల లేదా కోమురం భీం జిల్లాలుగా మారుస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. దాంతో పాటు హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. గోల్కొండ, లష్కర్‌ పేర్లతో పాతబస్తీ, సికింద్రాబాద్‌లను జిల్లాలుగా చేయాలని సీఎం భావిస్తున్నారు.

పలు జిల్లాల్లో ఆందోళనలు....
తమ ప్రాంతాలను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ములుగు, వనపర్తి, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో ములుగును జిల్లా చేయాలని స్వయంగా గిరిజనసంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. ఇదే జిల్లాలో మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. స్థానిక ఎంపీ సీతారాం నాయక్‌ పార్లమెంటు నియాజకవర్గాలనే జిల్లాలుగా మార్చాలని ప్రతిపాదించారు. మహబూబాబాద్‌ను జనగామలో కలుపుతారనే ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు స్థానికులు.

గద్వాలను జిల్లా ప్రకటించాలి : డీకే అరుణ
జనగామను జిల్లా చేయాలని ఏడాదిపాటు ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేశారు. గద్వాలను జిల్లా చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో ఉద్యమం సాగింది. కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌ ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. మరోవైపు ఇదే జిల్లాలోని వనపర్తిని కూడా జిల్లా చేయాలన్న డిమాండ్‌ ఉంది. ఇక ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతమైన భద్రాచలాన్ని జిల్లా చేయాలనే డిమాండ్‌ ఉండనే ఉంది. ఆదిలాబాద్‌లో నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాలో మెట్‌పల్లి లేదా కోరుట్ల, నల్గొండ జిల్లాలో యాదాద్రిని జిల్లా చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్‌, ఇబ్రహీంపట్నంను జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోంది.

శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను ఏర్పాటు : కేసీఆర్
ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం రాజీవ్‌ శర్మకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కొత్త జిల్లాల జాబితా సిద్ధమైనట్లు సంకేతాలు అందుతున్నాయి. వాటిలో సికింద్రాబాద్, వికారాబాద్‌, రంగారెడ్డి ఈస్ట్‌, ఆదిలాబాద్‌, కోమురం భీం, నిజామాబాద్‌, సిద్ధిపేట కేంద్రంగా మెదక్‌, సంగారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, ఖమ్మం, భద్రాచలం, వరంగల్‌, భూపాలపల్లి కేంద్రంగా జయశంకర్‌ జిల్లా, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట పేర్లతో తెలంగాణ జిల్లాలు ఉండనున్నట్లు సమాచారం. 

11:17 - May 26, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత వీహెచ్ ను టీ.పీసీపీ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన సీనియర్ నేతలు కేకే, శ్రీనివాస్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళింది. అధిష్టానం తటస్థంగా వున్నట్లు వినికిడి. పార్లమెంట్ ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తగినంత మద్ధతు లేని పార్టీ విషయం ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా తయారయ్యింది. ఈ విషయంలో టీ. కాంగ్రెస్ ఒకమెట్లు దిగి టీఆర్ ఎస్ ను మద్ధతు కోరాలనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రధాన కారణం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సీటుకు తమకు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ ను కాంగ్రెస్ కోరనుంది. మరి ఈ విషయంలో అధికార పార్టీ ఎలా స్పందించనుందో వేచిచూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి నిజం కానుందా? వేచి చూద్దాం...

టి. ఎంసెట్ ఫలితాల విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత 77.88 శాతంగా ఉంది. 

రాజ్యసభకు మళ్లీ వీహెచ్..

హైదరాబాద్ : వీహెచ్ ను రంగంలోకి దించాలని టి.పిసిసి నిర్ణయించింది. ఈ మేరకు హై కమాండ్ కు విషయం తెలియచేసింది. టీఆర్ఎస్ మద్దతు కోరాలని టి.పిసిసి నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కుప్వారలో మిలిటెంట్లను అడ్డుకున్న భారత బలగాలు..?

కుప్వార : భారత సరిహద్దులోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

టిడిపిలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..?

ప్రకాశం : జిల్లాలో వైసీపీ షాక్ తగలనున్నట్ల తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన కందుకూరి ఎమ్మెల్యే పోతుల రామారావు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు కార్యకర్తలతో సమావేశం జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

10:45 - May 26, 2016

హైదరాబాద్ : భారత్ లో లైంగిక దాడులకు పాల్పడిన వారు దర్జాగా తిరుగుతుంటారు . కేసు నమోదయి అరెస్ట్ అయినవారు చట్టంలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుని  స్వల్పకాలంలో బెయిల్ పై బయటకు వచ్చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు రాజుకున్న కొన్ని భయంకరమైన కేసుల్లో కూడా నిందుతులు ఎటువంటి భయమూ లేకుండా యదేచ్ఛగా తిరుగుతున్నారు. కొన్ని కేసుల్లో నిందితులు మైనార్జీ తీరలేదు అనే కారణంతో విడుదలవ్వటం కూడా జరుగుతోంది. బాధితులు మాత్రం జీవితం ఖైదీలు మానసిక వేదన అనుభవిస్తూనే వున్నారు. భారత్ లో పుట్టినందుకు ఈ వేదన అనుభవించాల్సిందేనా? అదే థాయ్ లాండ్ లోఈ పరిస్థితి వుండదా? అంటే థాయ్ లాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వింటే నిజమేననిపిస్తోంది. థాయిలాండ్ ప్రభుత్వం రేపిస్టులకు కఠిన శిక్షలు అమలు చేయనుంది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు మరణశిక్ష విధించాలని కూడా అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు రసాయనిక పద్ధతుల్లో రేపిస్టుల వృషణాలను నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు. ఇటువంటి శిక్షలపై భారత్ లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. కానీ మరణశిక్షే మనిషి మార్పుకి కారణమవదు అనే కారణంతో మానవతావాదలు వ్యతిరేకించారు. కాగా లైంగిక దాడిలో జరిగిన హింసను తట్టుకోలేక భారత్ ప్రజలు ఆవేదనతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు తప్పా వారిపై ఎటువంటి ద్వేషంతో మాత్రం కాదనే విషయం గమనించాలి. ఇటీవల థాయ్ లాండ్ దేశంలో అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో ఆ దేశంలో అందోళనలు మిన్నంటుతున్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని, ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం వచ్చిందని దేశాధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు. గతంలో కోర్టులు అత్యాచారం చేసిన నిందితులకు 14 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేసేవి. కొత్త రూల్స్ ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడి జైలు జీవితం అనుభవిస్తున్న నిందితులు ఎలక్ట్రానిక్ పరికరాలను ధరించాల్సి వుంటుంది. ఆ పరికరాల ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ల కదలికలను సమీక్షిస్తుంటారు. చట్టాల అమలుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవుసరం ఎంతైనా వుంది. ఇది భారత్ లో మరింతగా అమలు చేయాలి. అప్పుడైనా నేరాల సంఖ్య తగ్గుతుందని ఆశిద్దాం..

10:37 - May 26, 2016

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో ముఖ్య నేతలో జగన్ సమావేశం ముగిసింది. రాజ్యసభ అభ్యర్ధుల ఎన్నికలకు కేంద్రం నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఈ సమావేశంలో ప్రకటించారు. కాగా వైసీపీ నేత జగన్ నేతలకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వున్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జగన్ నియంతగా వ్యవహరిస్తున్నాకరనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. 

9మందిని ఢీకొన్న ట్రక్కు..

బెంగళూరు : రాష్ట్రంలో చిక్కా బెల్వంగల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పది టైర్ల ట్రక్కు 9మందిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

కపలేశ్వర్ మందిర్ కు వెళ్తాం - తృప్తి..

ఢిల్లీ : నాసిక్ లోని కపలేశ్వర్ మందిర్ లో గర్భగుడిలోకి మహిళలను అనుమతించడం లేదని భూమాత రణరాగిణి బ్రిగేడ్ చీఫ్ ఓ జాతీయ ఛానెల్ తో తెలిపారు. అక్కడ కులతత్వం రాజ్యం ఏలుతోందని, తాము అక్కడ ప్రవేశించడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 

రాజ్యసభకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి..

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధిలతో పార్టీ అధ్యక్షుడు జగన్ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును జగన్ ప్రకటించారు. నామినేషన్ వేసేందుకు విజయసాయిరెడ్డి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. 

కోనారావుపేట లో విషాదం....

కరీంనగర్: జిల్లాలోని కోనారావుపేట మండలం నిజామాబాద్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ముగ్గురిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తండ్రి రాజిరెడ్డి, కుమార్తె పద్మ, మనమడు మహిపాల్‌రెడ్డిలుగా గుర్తించారు.

'మహానాడు' కు అన్ని ఏర్పాట్లలో అపశృతి.....

తిరుపతి : తిరుమలలో వెంకన్న పాదాల చెంత టీడీపీ ఏటా నిర్వహించే వేడుక 'మహానాడు' కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడకలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సమయంలో ప్రధాన వేదిక పైకప్పుపై మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు చూస్తుండగానే మరింత విస్తరించాయి. అయితే ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఆ మంటలు వాటంతట అవే ఆరిపోయాయి. దీంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ ఏర్పట్లను సీనియర్ నేతలు పర్యవేక్షిస్తున్నారు.

తన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది - బాబు..

విజయవాడ : దేవుడు, నమ్మకాలపై తన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ప్రజలకు వేధింపులు లేని, అవినీతి రహిత, పారదర్శక పాలన అందివ్వాలని సూచించారు. 

భాగ్యనగరంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు....

హైదరాబాద్ : హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలంగాణ ఆలయాల చైర్మన్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, టీటీడీ ప్రత్యేక అధికారి రమేష్‌బాబు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

10:08 - May 26, 2016

'అ..ఆ..' చిత్రం ఆనందానుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. పక్కన పక్కనే ఉండే రెండు ఆక్షరాలు పరిచయం కావడానికి పాతికేండ్లు పట్టింది. ఇంత టైమ్‌ ఎందుకు పట్టిందనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా మా చిత్రాన్ని చూడాల్సిందేన'ని అంటున్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు). నితిన్‌, సమంత, అనుపమా పరమేశ్వరన్‌ నాయకానాయికలుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'అ..ఆ' (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి). సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'క్లీన్‌ యు' సర్టిఫికెట్‌ సొంతం చేసుకున్న ఈచిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్ర విశేషాల గురించి తెలియజేస్తూ,'ఇదొక అందమైన దృశ్యకావ్యం. భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కిన వెండితెర అద్భుతం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనందానుబంధాలకు నిలువుటద్దం. బంధాలు, విలువల గొప్పతనం తెలియజేసే చిత్రమిది. మా బ్యానర్‌ ద్వారా మళ్లీ ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈచిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆహ్లాదకరంగా సాగుతూనే మనస్ఫూర్తిగా నవ్వుకునే సన్నివేశాలు ఈచిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. త్రివిక్రమ్‌ రాసుకున్న కథకు నాయకానాయికలు నితిన్‌, సమంత, అనుపమా పరమేశ్వరన్‌ నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. వారి నటన, హావభావాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. కథ, కథనం ప్రేక్షకుల మనసుల్ని సున్నితం స్పృశించేలా సంగీత దర్శకుడు మిక్కీ.జే.మేయర్‌ అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు అమితంగా నచ్చే అంశాలున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 2వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం' అని అన్నారు.  

10:01 - May 26, 2016

మనోరమ... వెండితెర అమ్మగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రని వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటించిన మహిళా నటిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సొంతం చేసుకున్న ఘనత కూడా ఈమెదే. 'ఆచ్చి' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మనోరమ జయంతి నేడు. మద్రాస్‌లోని తంజావూరు జిల్లా మన్నార్గుడిలో 1937లో జన్మించిన మనోరమ అసలు పేరు గోపీశాంత. అభిమానులు ముద్దుగా 'ఆచ్చి' అని పిలుస్తుంటారు. చిన్న వయసులోనే తండ్రి వదిలేయడంతో చెట్టినాడుకు వెళ్ళారు. బతుకుదెరువు కోసం మనోరమ తల్లి పడరాని పాట్లు, కష్టాలు పడ్డారు. కష్టాలను మర్చిపోవడానికి తల్లి పాటలు పాడేది. మనోరమ కూడా పాటలు పాడేవారు. ఆ పాటలే తన జీవిత గమనాన్ని మార్చేస్తాయని మనోరమ అప్పట్లో ఊహించి ఉండరు. ఓ రోజు ఓ నాటకంలో ప్లే బ్యాక్‌ పాడడానికి మనోరమ వెళ్ళారు. ఆ నాటకంలో నటించాల్సిన కథానాయికకు, త్యాగరాజన్‌కు గొడవ జరగడంతో పాట పాడడానికి వచ్చిన మనోరమనే కథానాయికగా తీసుకున్నారు. కథానాయిక పేరు మనోరమ కావడంతో ఇక అక్కడ్నుంచి గోపీశాంత కాస్త మనోరమగా మారిపోయారు. అప్పుడు మనోరమ వయసు 12 ఏండ్లు. అలా నాటకాల్లో ఎంట్రీ ఇచ్చి కరుణానిధి రాసిన 'మణి మకుటం', 'ఉదయ సూర్యన్‌' వంటి తదితర నాటకాల్లో నటించారు. నాటకాల్లో బాగా రాణించడంతో దాదాపు 1000కి పైగా నాటకాల్లో నటించి తిరుగులేని స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగారు.

1958లో సినీ రంగ ప్రవేశం..
నాటకాల్లో కథానాయికగా నటించిన మనోరమ సినిమాల్లో మాత్రం హాస్యనటిగా ఎంట్రీ ఇచ్చారు. 'మాలైట్టా మంగళ్‌' (1958) చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అందులో ఆమెది హాస్యనటి వేషం. ఆ తర్వాత టీఆర్‌ సుందరం సినిమా 'కొంజెం కుమరి'తో హీరోయిన్‌గా మారారు. ఇలా ఓ వైపు కథానాయికగా, మరోవైపు హాస్యనటిగా నటిస్తూ వచ్చారు. 'అబలే అంజుగం' మోడ్రన్‌ అమ్మాయిలా కనిపించిన ఆమె, 'జ్ఞానవళి'లో శివాజీ గణేషన్‌తో, 'ప్రేమలు పెళ్ళిళ్లు'లో ఏఎన్నార్‌తో, 'లవకుశ'లో ఎన్టీఆర్‌తో 'రిక్షావోడు'లో చిరంజీవితో కలిసి నటించారు. తెలుగులో ఎన్టీఆర్‌, తమిళంలో ఎంజీఆర్‌, అన్నాదురై, కరుణానిధి, జయలలితతో కలిసి నటించిన ఘనత కూడా మనోరమకే దక్కింది. ఈ ఐదుగురు ముఖ్యమంత్రులు కావడం మరో విశేషం. నగేష్‌, మనోరమల కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉండేది. వీరిద్దరు కలిసి నటిస్తే ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు అన్నంతగా పాపులర్‌ అయ్యారు. 1958లో సినిమాల్లోకి వచ్చిన మనోరమ దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 1500లకు పైగా చిత్రాల్లో నటించి అత్యధిక చిత్రాల్లో నటించిన మహిళా నటిగా 1985లోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్నారు. రంగస్థలం, సినిమా తర్వాత మనోరమ బుల్లితెరపై కూడా లెక్కలేనని సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

తెలుగు సినిమాల్లో..
హాస్యనటిగా ఎంతగా కడుపుబ్బ నవ్వించగలదో, అమ్మగా అదే స్థాయిలో ఏడిపించనూగలదని మనోరమ నిరూపించుకున్న సందర్భాలు కోకొల్లలు. 'మా అమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. ఆ రోజుల్లో డాక్టర్‌ చదవడమంటే మాటలు కాదు. గత్యంతరం లేక నటిగా మారా. నటిగానే ప్రేక్షకుల్ని అలరిస్తూ అహర్శిశలు శ్రమించి మంచి గుర్తింపు తెచ్చుకున్నా. అయినప్పటికీ అమ్మ ఆశని మాత్రం నెరవేర్చలేకపోయా. భగవంతుడి అనుగ్రహం వల్ల ఇప్పుడు నా మనవడు డాక్టర్‌ అయ్యాడు. నాకెంతో గర్వంగా ఉంది' అని మనోరమ ఎన్నో సార్లు మీడియాకి తెలిపారు.  'భద్రకాళి', 'శుభోదయం', 'విచిత్ర సోదరులు', 'మైఖేల్‌ మదన కామరాజు', 'అల్లరి ప్రియుడు', 'కుంతీ పుత్రుడు', 'జంటిల్‌మేన్‌', 'రిక్షావోడు', 'బావనచ్చాడు', 'కృష్ణార్జున', 'అరుంధతి', 'యముడు', 'అరుణాచలం' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. మనోరమకు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, శివాజీ గణేషన్‌ కుటుంబాలతో మంచి అనుబంధముంది. కమల్‌ హాసన్‌ తన అమ్మ లేని లోటును మనోరమ తీరుస్తుందని చెబుతుండేవారు.

పలు అవార్డులు..
1989లో 'పుధియ పధై' చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డునందుకున్నారు. అలాగే ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును దక్కించుకున్నారు. ఆరు దశబ్దాలపాటు భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకుగానూ కేంద్రప్రభుత్వం 2002లో పద్మశ్రీ పురస్కారంతో సముచితంగా గౌరవించింది. నాటకాల్లో తనతోపాటు నటించిన రామనాథన్‌ని మనోరమ పెళ్ళి చేసుకున్నారు. వారికి కుమారుడు భూపతి ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2015 అక్టోబర్‌ 10న తుదిశ్వాస విడిచారు. భౌతికంగా మనోరమ దూరమైనప్పటికీ వెండితెర అమ్మగా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగానే ఉంటుంది.

10:01 - May 26, 2016

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు తెలంగాణ టీడీపీ సన్నద్దమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికి ప్రజాప్రతినిధులు, నాయకులే తప్పా క్యాడర్ వెళ్లలేదని నిరూపించేందుకు మినీ మహానాడుల ద్వారా తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఈ పార్టీ తెలంగాణ శాఖ భారీగానే కసరత్తు చేసింది. జిల్లాల వారీగా మినీ మహానాడులు నిర్వహించడం ద్వారా పార్టీ ప్రాభవం తెలంగాణ వ్యాప్తంగా ఏమాత్రం తగ్గలేదని నిరూపణ చేసే ప్రయత్నం చేసింది .

27, 28, 29 తిరుపతిలో మహానాడు....
ఈనెల 27, 28, 29న తిరుపతిలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహనాడుకు తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే ఖమ్మం వరకు క్రియాశీలక కార్యకర్తలను తిరుపతికి భారీగా తరలించాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు మినీ మహానాడులలో పిలుపునిచ్చారు. జిల్లాలో జరిగే మినీ మహానాడులకు కచ్చితంగా హాజరై జిల్లా కమిటీలను ఉత్సాహాపరిచే ప్రయత్నాలు చేశారు. బుధవారం నల్లగొండ మినీ మహనాడులో పాల్గొన్న నేతలు పార్టీ పూర్వవైభవానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీంతో చాలా కాలం తరువాత తెలంగాణ టీడీపీలో హడావిడి నడుస్తోంది. ఇదీలా ఉంటే ఈ సారి మహానాడుకు తెలంగాణ నుండి మహిళా కార్యకర్తలను సైతం భారీగా తిరుపతికి తీసుకెళ్లేందుకు సన్నాహలు చేస్తున్నారు.

లస వెళ్లిన ఎమ్మెల్యేలను టార్గెట్ ...
తెలంగాణలో పార్టీకి జరిగిన నష్టాన్ని మహానాడులో చర్చించి నివారణ చర్యలకు ఉపక్రమించాలని తెలంగాణ టీడీపీ భావిస్తోంది. మహనాడు వేదికగా వలస వెళ్లిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేయనున్నారు. ముఖ్యంగా కోవర్టుగా పనిచేసి వెళ్లారనే ఆరోపణలు ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుపై తిరుపతి మహనాడులో తీవ్ర విమర్శలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. పార్టీ సీనియర్ నేతలు, పోలిట్ బ్యూరో సభ్యులైన యనుమల రామకృష్ణుడు కన్వీనర్ గా, రావుల చంద్రశేఖర్ రెడ్డి కోకన్వీనర్ గా ఇప్పటికే తీర్మాణాలను సైతం సిద్ధం చేశారు.

కొత్త ఊపు తెచ్చే ప్రయత్నంలో టీ.టీడీపీ...
గత వారం పది రోజులుగా తెలంగాణ జిల్లాల్లో మినీమహానాడులు నిర్వహించి పార్టీకి తిరిగి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. 

నేటి నుండి బీసీ చైతన్య బాట..

హైదరాబాద్ : రాష్ర్టంలో బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం పల్లెల నుంచి పట్నం వరకు గురువారం నుంచి చైతన్య బాటను చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ చైతన్య బాటలో భాగంగా పది జిల్లాల పర్యటనలుంటాయని ఒక ప్రకటనలో తెలిపారు .

09:57 - May 26, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సీట్ల సస్పెన్స్‌ నెలకొంది. పోటీలో హేమాహేమీలుగా పేరుపొందిన ముగ్గురు మొనగాళ్లపైనే చర్చ జరుగుతోంది. ఎవరా ముగ్గురు మొనగాళ్లనే అంశం నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ సీట్లు భర్తీ చేయాల్సిన నేపథ్యంలో ఎవరా ముగ్గురు నేతలు అన్న దానిపై రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో అధికార పార్టీ నేతల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణకు చెందిన వీహెచ్ , గుండు సుధారాణిల రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణలో ఇతర పార్టీలు కనీసం పోటీపడే అవకాశం కూడా లేదు. పూర్తిస్థాయిలో అధికార పార్టీకి మెజార్టీ ఉండడంతో.. రెండు స్థానాలు కూడా గులాబి దళపతి నిర్ణయించిన నేతలకే దక్కనున్నాయి.

రాజ్యసభ అభ్యర్థిపై గులాబీ దళంలో చర్చ.....
గులాబి దళంలో రాజ్యసభకు వెళ్లే ముగ్గురిపై చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉంటూ.. ముఖ్యమంత్రి KCR కు సన్నిహితుడిగా ముద్రపడిన దామోదర్‌ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కెప్టన్ లక్ష్మికాంత్ రావు, నాయిని నర్సింహారెడ్డి, సీఎల్ .రాజం,డీఎస్‌ ల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే కెప్టెన్ కు రాజ్యసభ కంటే రాష్ట్ర స్థాయిలో కేబినెట్ హోదాతో సమానమైన పదవి ఇస్తామన్న సంకేతాలను గులాబి దళపతి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో చేరడంతో రాజం రాజ్యసభ సీటుపై అనుమానాలు....
సీఎల్ .రాజం ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్నా బీజేపీ లో ఆయన చేరడం మైనస్ అయ్యింది. హోంమంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డిని ఆ పదవి నుంచి తప్పించి రాజ్యసభకు ఎంపిక చేయడంపై గులాబి నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డీఎస్‌, దామోదర్ రావ్ లకే రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన మండలి స్థానం....
ఇక తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన మండలి స్థానంపై కూడా గులాబి పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత నిరంజన్ రెడ్డికి మండలి సభ్యుడిగా అవకాశం దక్కడంతో పాటు కేబినెట్ లో చోటు కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

ఫైనల్ చేయనున్న కింగ్ మేకర్ కేసీఆర్....
అయితే పలువురు పార్టీ సీనియర్లు తమకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఏది ఏమైనా రాజ్యసభకు వెళ్లేవారిని కేసీఆర్ ఫైనల్ చేస్తేనే నేతల్లో ఉత్కంఠకు తెరపడనుంది.

09:56 - May 26, 2016

ఒక చిన్న గిన్నెలో నాలుగు టేబుల్‌ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంట తర్వాత దూది ఉండను ఆ చల్లటి టీ డికాషన్‌లో ముంచి, ఆ ఉండను కనురెప్పల మీద పెట్టి, ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలసిన కళ్లకు మంచి సాంత్వన లభిస్తుంది. ఇలా రోజూ చేస్తుంటే కళ్ల కింద వలయాలు తగ్గుతాయి.
టీ స్పూన్‌ దోస రసం, టీ స్పూను నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే మోచేతుల నలుపుదనం తగ్గుతుంది.
పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొడకు, వీపుకి పట్టించి, స్క్రబ్‌ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది.
నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. నికి నువ్వుల నూను ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్, మృదువుగా అవుతుంది.
రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరుచుకోవాలి.
టమాటా రసం లేదా దానిమ్మ రసం, తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుకోవాలి. నలుపు సులువుగా తగ్గుతుంది.
రెండు టీ స్పూన్ల అలివ్‌ ఆయిల్‌, టీ స్పూన్‌ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడవుతోంది.

09:49 - May 26, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు సొసైటీ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 14 సంవత్సరాలకు పైబడి చదువును మధ్యలో మానేసిన వారందరూ ఓపెన్‌ స్కూలుకు అర్హులని మంత్రి అన్నారు. 2015-16 సంవత్సరానికి గాను ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణతాశాతం 50శాతానికి పైగా ఉందన్నారు. 

మహిళ అనుమానాస్పద మృతి...

రంగారెడ్డి: మేడ్చల్‌ మండలం డబీల్‌పురాలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ బంధువులు భర్తే చంపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

09:35 - May 26, 2016

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో ముఖ్య నేతలో జగన్ సమావేశమయ్యారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎన్నికలకు కేంద్రం నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుల ఎన్నికకు జగన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ని ఈ సమావేశంలో ప్రకటించినున్నారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పథకాలతో వైసీపీ నుండి ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుండి పలాయించిన సంగతి తెలిసిందే. కాగా వైసీపీకి పెద్దసభ సీటుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ రాజ్యసభ దక్కించుకుని తీరుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. 

విజయవాడ సర్కారీ ఆసుపత్రిలో కొత్త బ్లాక్..

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ ను మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడారు. త్వరలోనే రూ. 150 కోట్లతో సీఎం చేతుల మీదుగా కొత్త భవనానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 

ప్రేమ పేరిట వీఆర్వో మోసం..

కడప : ప్రేమ పేరిట యువతిని ప్రొద్దుటూరు మండలం రామేశ్వరం వీఆర్వో రమేష్ మోసం చేసిన చేశాడు. పెళ్లికి రెండు రోజులు ఉందనగా వీఆర్వో రమేష్ యూపీకి పారిపోయాడు. 

09:27 - May 26, 2016

గుంటూరు : ఓ మహిళ కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమినించిన స్థానికులు మహిళను రక్షించారు. తీవ్ర గాయాలయపాలయిన సదరు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మహిళ ఎఫ్ సీ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కోటీశ్వరిగా పోలీసులు గుర్తించారు. ఇటీవలే భర్తను పోగొట్టుకున్న మహిళ మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

ఎల్కతుర్తిలో రోడ్డు ప్రమాదం..

కరీంనగర్ : జిల్లాలోని ఎల్కతుర్తిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు అనీల్, సుకుమార్ గా గుర్తించారు

లోటస్ పాండ్ లో జగన్ సమావేశం..

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ సమావేశం కానున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును జగన్ ప్రకటించనున్నారు. 

రెండో రోజు కలెక్టర్ల సదస్సు..

విజయవాడ : ఏపీ కలెక్టర్ల రెండో రోజు సదస్సు జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

 

ఏపీలో బీజేపీ వినూత్న ప్రచారం..

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ విజయాలపై నేటి నుంచి ఏపీ బీజేపీ నేతలు వినూత్న ప్రచారానికి చేపట్టనున్నారు. వికాస్ పర్వ్ పేరుతో వచ్చే నెల 15 వరకు ఈ ప్రచారం కొనసాగించనున్నారు. 

నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం..

హైదరాబాద్ : సాయంత్రం 4 గంటలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలపై బ్యాంకర్ల సమావేశంలో చర్చించనున్నారు.

నేటి నుండి నీట్ -2 దరఖాస్తుల ప్రక్రియ..

ఢిల్లీ : నీట్‌-2 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. సీబీఎస్ ఈ బుధవారం ఈ విషయం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌-2ను జూలై 24న నిర్వహిస్తారు. అభ్యర్థులు www.aipmt.nic.in.. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా తమ అప్లికేషన్‌ను పంపాల్సి ఉంటుంది. 

మోడీ పాలనకు రెండేళ్లు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రిగా బీజేపీ నరేంద్ర మోడీ నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలో భారీ వేడుకలు జరగనున్నాయి. 

తిరుమలలో భక్తుల రద్దీ.....

తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతుంది.

ఎల్కతుర్తిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి...

కరీంనగర్: జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేడు బ్యాంకర్ల రాష్ట్రస్థాయి సమావేశం....

హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలపై బ్యాంకర్ల సమావేశంలో చర్చించనున్నారు.

08:41 - May 26, 2016

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో కొన్ని వివాదస్పదమయ్యాయి. మరికొన్ని ప్రచార ఆర్భాటాలుగా మిగిలిపోయాయి. మోడీ ప్రభుత్వం తమకు ఎలాంటి మేలు చేసిందన్న ప్రశ్నను విభిన్నవర్గాలు వేసుకోవడం సహజం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల విక్రయాలూ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ప్రస్తావిస్తున్న కార్మిక సంస్కరణల సారాంశం ఏమిటి? ఈ సంస్కరణల వల్ల కార్మికుల జీవితాల్లో, వర్కింగ్ కండిషన్ లలో వస్తున్న మార్పులేమిటి? దేశాభివ్రుద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రభుత్వరంగ సంస్థల విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఎలా వుంది? కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు నాయకుడు నరసింగరావుగారు విశాఖపట్టణం 10టీవీ స్టూడియోకి వచ్చారు. అ అంశాలపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..మరిన్ని వివరాలు తెలుసుకోంది...

08:34 - May 26, 2016

హైదరాబాద్ : జిల్లా సీతారామ ఎత్తిపోతల పథకం పనులు జోరందుకోనున్నాయి. జూన్ మొదటి వారంలో టెండర్లు పిలవాలని నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. జల సౌధలో మంత్రి హరీష్ రావు సమీక్ష సందర్భంగా రోళ్లపాడు లిఫ్ట్‌కు కూడా జూన్ మొదటివారంలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించారు.

ఖమ్మం సాగునీటి ప్రాజెక్టులపై టీ.సర్కార్ దృష్టి...
ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది ప్రభుత్వం. జలసౌధలో 'వ్యాప్కోస్' సంస్థ ప్రతినిధులు, చీఫ్ ఇంజనీర్లతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా అన్ని సర్వేల నివేదికలు సమర్పించాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పై మరో ఇరవై రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని 'వ్యాప్కో స్'ను కోరారు. ఇందుకు వ్యాప్ కోస్‌ ప్రతినిధులు అంగీకరించారు.

ప్రాజెక్టు వ్యయం రూ.7969 కోట్లు...
ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా సస్యశ్యామలంచేసే సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఈ జూన్‌ మొదటివారంలో టెండర్లు పిలవాలని మంత్రి హరీష్‌ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. దీనిపై వ్యాప్కోస్ నుంచి అంచనాలు అందిన తర్వాత టెండర్లు పిలవడానికి ఏర్పాట్లుచేస్తున్నారు. సర్వేచేసిన వ్యాప్కోస్.. ఈ ప్రాజెక్ట్ పూర్తికి రూ.7969 కోట్లు వ్యయం అవుతుందని ఇచ్చిన తుది అంచనా నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది.

'వ్యాప్కోస్సర్వేకు మంత్రి హరీష్ ఆదేశం...
ఇదిలా ఉంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలోని సాగునీటి ప్రాజక్టుల ను మంత్రి హరీష్‌ సమీక్షించారు. ఆదిలాబాద్ లో తుమ్మిడి హెట్టి ప్రాజక్టు పరిధిలో రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టు పై త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని ' వ్యాప్కోస్' ను హరీష్ రావు ఆదేశించారు. వ్యాప్కోస్ సంస్థ నిర్వహిస్తున్న సర్వే నివేదికలను డాటాబేస్ ను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే లైడార్‌ సర్వే వివరాలను విశ్లేషించడానికి ఇంజనీర్లకు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.  

08:24 - May 26, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో  రోడ్లు  రక్త దారులుగా  మారాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. డ్రైవర్ల నిర్లక్ష్యం ఒకరకంగా కారణమవుతుంటే...నిరంతంగా విధులు నిర్వహిస్తుండటం మరో కారణంగా మారుతోంది. ఏది ఏమైనా .. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈరోజు కడప జిల్లా తొండూరు మండలం మల్యాల ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. బోగోలు మండలం కప్పరాళ్ళతిప్పలో విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న సాయికృష్ణ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొంది. ఈ ఘటనలో గాయాలయిన వారిని స్థానికులు, మినీ మహానాడుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణహానీ జరుగకపోవటంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా కంభం వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘనటలో అన్నా, చెల్లెలు దుర్మరణం పాలయ్యారు. 

ఏపీలో రక్తమోడిన రోడ్లు......

విజయవాడ : ఏపీలో రోడ్డు రక్త దారులుగా మారాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. డ్రైవర్ల నిర్లక్ష్యం ఒకరకంగా కారణమవుతుంటే...నిరంతంగా విధులు నిర్వహిస్తుండటం మరో కారణంగా మారుతోంది. ఏది ఏమైనా .. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈరోజు కడప జిల్లా తొండూరు మండలం మల్యాల ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది.

08:05 - May 26, 2016

విశాఖ : ఆంధ్రా వర్సిటీ భూములపై సర్కార్ కన్ను పడింది. అభివృద్ధి పేరుతో ఈ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఐటీ పరిశ్రమల పేరుతో 1500 కోట్లు విలువచేసే భూములను చట్టబద్దంగా లూటీ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్. దీనిని అడ్డుకొని తీరతామంటూ సీపీఎం ఆందోళన చేపట్టింది. ఏయూ భూములపై గద్దల్లా వాలుతున్న ప్రభుత్వ నేతలను తరిమికొట్టాలని పిలుపునిస్తోంది సీపీఎం.

కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం .....
ఎందరో విద్యార్థులకు భవిష్యత్ ను కల్పిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీకి సుమారు 450 ఎకరాల భూములున్నాయి.90 ఏళ్ల చరిత్ర గల యూనివర్సిటీకి ఈ భూములే విలువైన సంపదగా నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏయూ భూములకు విలువ పెరగడంతో ప్రభుత్వ కన్ను పడింది. అనుకున్నదే తడవుగా బీచ్ రోడ్డులో ఉన్న 60 ఎకరాల30 ఎకరాలను ఐటీ పరిశ్రమల ఏర్పాటుకి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

వర్శిటీ భూముల జోలికొస్తే ఊరుకోం : సీపీఎం,విద్యార్థి సంఘాలు
ఆంధ్రా యూనివర్సిటీ అవుట్ గేట్ ఎదురుగా యోగా కేంద్రానికి అనుకుని ఉన్న వందల కోట్లు విలువచేసే భూములను ఇన్నోవేటీవ్ టెక్నాలజీ పార్కు పేరుతో ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. యూనివర్సిటీ భూములను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని.. విద్యార్థిసంఘాలు హెచ్చరిస్తున్నాయి. విద్యార్థులను , మేధావులను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం హెచ్చరించింది.

నివర్సిటీ భూములు కాపాడ్డంలో అధికారులు విఫలం : సీపీఎం
ఏయూ భూములను యూనివర్సిటీ అధికారులు కాపాడటంలో విఫలమయ్యారని.. ఇప్పటికే భూములను ప్రజాప్రతినిధులు ఐటీ టవర్స్ పేరుతో అక్రమించారని మండిపడ్డారు సీపీఎం నేతలు. కాపుల్పడలో 1800 ఎకరాలు ఐటీ హిల్స్ అంటూ రిషికొండలో మూడు కొండలు.. టీబీ హాస్పిటల్ స్థలాలను ఐటీ కోసం కేటాయించారు. వీసీ పదవీ కాలం ముగిసి నెలలు దాటింది. మరోవైపు ప్రభుత్వ ఆలోచనలను చక్కదిద్దే వ్యక్తిని వీసీగా నియమించుకోవాలని సీఎం యోచిస్తున్నట్లు యూనివర్సిటీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నా.. యూనివర్సిటీ భూములనే లాక్కోవడంపై.. విద్యార్థి సంఘాలు.. సీపీఎం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఎం నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్ అవసరాలకై ఉన్న భూములను యూనివర్సిటీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. 

07:42 - May 26, 2016

 మోడీ రెండే పాలన ఎలా వుంది? సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏమిటి? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఇందిర (టీ. పీసీసీ అధికార ప్రతనిధి), రాకేష్ రెడ్డి (బీజేపీ పీసీసీ అధికార ప్రతనిధి), లక్ష్మణరావు ( మాజీ ఎమ్మెల్సీ, విశ్లేషకులు) పాల్గొన్నారు. ప్రముఖ విశ్లేషకులు లక్ష్మణరావు మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం వ్యవసాయ, ఆర్థిక రంగాలలో పూర్తి విఫలమయ్యిందని లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో వున్న సమస్యలను పరిష్కరించటానికి గానీ, రైతుల ఆత్మహత్యను నియంత్రించటానికి మోదీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.  చర్చలో పాల్గొన్న వక్తలు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  అభిప్రాయాలు తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి...సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి.

07:37 - May 26, 2016

హైదారాబాద్ : తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు ధూం ధాం గా చేసేందుకు గులాబి స‌ర్కార్ రెఢీ అవుతుంటే...దానికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమ‌వుతోంది. కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలు చేసిన ఫ‌థ‌కాలు.. రెండేళ్ళ పాల‌న‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ఇవ్వాలని నిర్ణయించింది. టిఆర్ఎస్ పై అస‌లు సిస‌లు దాడిని జూన్ రెండు నుంచే షురూ చేసేందుకు ప‌క్క స్కెచ్ వేసుకుంది హ‌స్తం పార్టీ.

ప‌క్కా స్క్రిప్ట్ తో రెడీ అయిన కాంగ్రెస్ .....
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 న సంబరాలకు ఒకవైపు ప్రభుత్వం సనద్దమవుతుంటే... మరోవైపు దీన్నిటార్గెట్ గా కేసీఆర్‌ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టాల‌ని నిర్ణయించింది కాంగ్రెస్. రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల వేదిక‌గా స‌ర్కార్ పై దూకుడు పెంచేందుకు ప‌క్కా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంది కాంగ్రెస్.

ప‌క్కా స్క్రిఫ్ట్ ను సిద్ధం చేసుకున్న కాంగ్రెస్...

రాష్ట్రంలో ప్రజలంతా కరవుతో బాధపడుతుంటే ఉత్సవాల పేరుతో టిఆర్ఎస్ సంబ‌రాలు చేయ‌డం ఏంట‌ని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్. జూన్ రెండును వేదికగా చేసుకునేందుకు ప్లాన్ రూపొందించింది. 2014 సార్వత్రిక ఎన్నికల కేసీఆర్ ఇచ్చిన హామిలేంటీ.. అధికారంలోకి వ‌చ్చిక కేసీఆర్ అమ‌లు చేయ‌డంలో వైఫల్యాల‌ను .. ప్రజ‌ల‌కు వివ‌రించాల‌ని భావిస్తోంది. ప్రజ‌ల‌కు వివ‌రించేందుకు ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు హ‌స్తం నేత‌లు.

కేసీఆర్ వైప‌ల్యాల‌ను అస్త్రంగా...
డ‌బుల్ బెడ్ రూం పథ‌కాన్ని తూతూ మంత్రంగా చూపి.. అంతా చేసిన‌ట్లు టిఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుందని ఆరోపిస్తుంది కాంగ్రెస్. ముఖ్యంగా.. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, దళితులకు మూడెకరాల భూమి, పీజీ టూ కేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు మొత్తం 100కు పైగా హామీలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేద‌ని క్షేత్ర స్థాయిలో అమ‌లుకు నోచుకోలేద‌ని అంటుంది కాంగ్రెస్. వీట‌న్నింటిని ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ లో వివ‌రిస్తామ‌ని అంటున్నారు. అంతేకాకుండా.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో టిఆర్ఎస్ కోట్ల రూపాయ‌ల అవినీతికి పాల్పడుతుంద‌ని ఆరోపిస్తోంది. ప్రతీ జిల్లా కేంద్రంలో ప‌వ‌ర్ పాయింట్ ద్వారా వివ‌రించనుంది కాంగ్రెస్. 

07:32 - May 26, 2016

విజయవాడ : ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివెళ్లే సమయం ఆసన్నమైంది. వచ్చే నెలాఖరు నుంచి అమరావతి నుంచే పూర్తిస్థాయి పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అమరావతికి కార్యాలయాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు శాఖాధిపతుల భవనాల కోసం రాజధాని ప్రాంతం విస్తరించిఉన్న జిల్లాల్లో భవనాలను వెతికే పనిలో పడింది ప్రభుత్వం.

అమరావతిలో పాలనకు సర్కారు షురూ....
అమరావతి ఏపీ పూర్తిస్థాయి పరిపాలనా కేంద్రంగా అవతరించబోతోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మాణం శరవేగంగా కొసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి కొనసాగుతున్న సచివాలయ పాలన వచ్చే నెల 27 నుంచి వెలగపూడి కేంద్రంగా సాగనుంది. శాఖాధిపతులు కార్యాలయాలు విజయవాడ, గుంటూరుకు తరలిపోనున్నాయి. దీనికి కూడా జూన్‌ 27నే ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకోసం భవనాలను అద్దెకు తీసుకుంటున్నారు.

మూడేళ్ల ఒప్పందంపై అద్దె భవనాలు ....
ప్రస్తుతం నీటిపారుదల, విద్యా శాఖల కార్యకాలపాలు విజయవాడ నుంచి సాగుతుండగా, వ్యవసాయ శాఖ గుంటూరు నుంచి పని చేస్తోంది. మిగిలిన శాఖాధిపతుల కార్యాలయాల కోసం ఈ రెండు నగరాల్లోనే భవనాలు చూస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను ఉపయోగించుకుంటారు. లేకపోతే మూడేళ్ల ఒప్పందంపై భవనాలు అద్దెకు తీసుకుంటారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాధిపతులు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను సంప్రదించి భవనాలను సమీకరించుకోవాలని సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సంఖ్యను బట్టి ఎంత వైశాల్యం ఉన్న భవనం కావాలో ఈ రెండు జిల్లాల కలెక్టర్లకు వివరాలు పంపాలని కోరారు.

వెలగపూడిలో జీ ప్లన్‌ వన్‌ భవనాలు...
తొలుత నిర్ణయించిన కార్యచరణ ప్రణాళిక ప్రకారం శాఖాధిపతులు కార్యాలయాలు వచ్చే ఆగస్టు నాటికి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికే తరలించాలని ప్రతిపాదించారు. తాత్కాలిక సచివాలయం కోసం జీ ప్లస్‌ వన్‌ విధానంలో భవనాలు నిర్మిస్తున్నారు. శాఖాధిపతుల కార్యాలయాల కోసం వీటిపై అదనపు అంతస్తులు నిర్మించాలని నిర్ణయించి టెండర్లు కూడా పిలిచారు. కానీ పలు కారణాల వలన ఈ టెండర్లను రద్దు చేశారు. శాఖాధిపతులు కార్యాలయాలు కూడా జూన్‌ ఆఖరు నాటికే తరలివెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 85 భవనాలు అందుబాటులో ఉన్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్‌ నివేదించారు. వీటిలో 2.34 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం ఉంది. గుంటూరులో శాఖాధిపతుల కార్యాలయాల ఏర్పాటుకు నాలుగు భవనాలు అనువుగా ఉన్నట్టు గుర్తించారు. వీటిలో లక్షన్నర అడుగుల స్థలం ఉన్నట్టు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని శాఖాధిపతులు వీటిని పరిశీలించాలని సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు.

అందుబాటులో అధికార యంత్రాంగం ....
అయితే రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థలకు తరలింపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచు అటు విజయవాడ వెళ్లి, ఇటు హైదరాబాద్‌ తిరిగి రావాల్సి వస్తోంది. ఇది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారంగా మారింది. పరిపాలన పూర్తిగా అమరావతికి తరలిపోతే ఈ ప్రయాస తగ్గుతుంది. పరిపాలన కూడా రాష్ట్ర ప్రజలకు చేరువ అవుతుంది. అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. అంతా అనుకున్నట్టే జరిగితే పరిపాలనాపరంగా ఏపీ ప్రజలు పడుతున్న కష్టనష్టాలు కూడా తొలగిపోతాయి. ఇది కార్యరూపం దాల్చాలని అందరూ ఆశిస్తున్నారు.

07:02 - May 26, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో సీఆర్డీఏ అధికారులు ఒకటి అనుకుంటే... కేంద్ర ప్రభుత్వం మరొకటి తలపెడుతోంది. రాజధాని కోసం అటవీ భూములను డీ నోటిఫై చేయించేందుకు సీఆర్డీఏ అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. డీ నోటిఫికేషన్‌ ప్రక్రియకు కేంద్ర పర్యావరణ శాఖ కొర్రీలు పెట్టడంతో ఇప్పుడు ల్యాండ్‌ డైవర్షన్‌ కోసం తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి అటవీ భూముల డీ నోటిఫికేషన్‌ వ్యవహారంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

అటవీ భూముల సేకరణలో సీఆర్‌డీఏకు ఇబ్బందులు...
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించతలపెట్టిన అటవీ భూముల వ్యవహారం సీఆర్‌డీఏ అధికారులకు తలనొప్పిగా మారింది. డీనోటిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా ఈ భూములను తీసుకోవాలని నిర్ణయించి కేంద్రానికి ఫైలు పంపారు. మొత్తం 13వేల 253 ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేయాలంటూ కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదించారు. అయితే ఈ ప్రక్రియకు కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం.

కొండలు, కోనలు, వాగులు, వంకల పరిరక్షణ చర్యలేవి? -కేంద్రం
డీనోటిఫికేషన్‌ కోసం ఉద్దేశించిన అటవీ భూముల్లో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఉన్నాయి. వీటిని ఎలా సంరక్షిస్తారో చెప్పాలంటూ సీఆర్‌డీఏ అధికారులను కేంద్రం ప్రశ్నించింది. దీనికి ఏ సమాధానం చెప్పాలో పాలుపోని సీఆర్‌డీఏ అధికారులు... మరో ప్రత్నామ్నాయాన్ని ప్రతిపాదించారు. అటవీ భూముల డీనోటిఫికేషన్‌ బదులు... ల్యాండ్‌ డైవర్షన్‌ విధానాన్నిముందుకు తెచ్చారు.

ల్యాండ్‌ డైవర్షన్‌ను ప్రతిపాదించిన సీఆర్‌డీఏ ...

అటవీ భూముల డీనోటిఫికేషన్‌కు, ల్యాండ్‌ డైవర్షన్‌కు మధ్య పెద్ద తేడా ఉందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. సేకరించ తలపెట్టిన అడవులకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో భూములు ఇస్తామంటూ సీఆర్‌డీఏ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించడంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, కడప జిల్లాలోని పొద్దటూరు, కడప ప్రాంతాల్లో భూములు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ పంపిన ఫైలును కేంద్ర పర్యావరణ మంత్రి శాఖ పరిశీలించే అవకాశం ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం... డీజీపీఎస్‌ ద్వారా సర్వే కూడా నిర్వహించారు.
వామపక్షాల నేతల విమర్శలు....
మరోవైపు అమరావతి కోసం అటవీ భూములను సేకరించేందుకు సీఆర్‌డీఏ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను వామపక్షాల నేతలు తప్పుపడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకే అడవులను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి దూరదృష్టి లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి కోసం అటవీ భూములు సేకరించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

06:54 - May 26, 2016

విజయవాడ : ఆలయాల ఆదాయాలు పెరగడానికి కారణమేంటి..? ఎవరి సమాధానం ఏంటో కానీ.. చంద్రబాబు మాత్రం.. పాపాలు పెరిగిపోవడమే కారణమని అంటున్నారు. తప్పులు చేసిన వాళ్లే గుళ్లకు వెళ్లి హుండీల్లో డబ్బులు వేస్తున్నారని, ఎక్కువ తప్పులు చేసిన వారు ఎక్కువ కానుకలు వేస్తున్నారనీ చెప్పుకొచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు కష్టపడకున్నా.. ఆదాయం పెరగడానికి ఇదే కారణమనీ చంద్రబాబు చమత్కరించారు. విజయవాడలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండేళ్ల పాలనపై చర్చించారు. భవిష్యత్‌ ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం మార్గనిర్దేశం చేశారు.

పాపాలతోనే దేవాలయ ఆదాయాలు : బాబు
సమావేశంలో దేవాదాయ శాఖపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాఖ ఆదాయం పెరగడానికి, పాపాలు పెరిగిపోవడమే కారణమని అన్నారు. అధికారులు కష్టపడకపోయినా.. ప్రజలకు ఉన్న విశ్వాసం వల్లే దేవాదాయ శాఖ ఆదాయం పెరిగిందన్నారు. తప్పులు చేసినవారు గుళ్లకు తరచూ వెళ్తున్నారని.. ఎక్కువ తప్పులు చేసినవారు హుండీలో ఎక్కువ కానుకలు వేస్తున్నారన్నారని చంద్రబాబు అన్నారు. అయ్యప్పదీక్ష సమయంలో మద్యం విక్రయాలు బాగా తగ్గుతుండడాన్నీ ఆయన ప్రస్తావించారు.

సమష్టి కృషితో ఆర్థిక పరిపుష్టి : బాబు
విభజన తర్వాత నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని.. సమష్టి కృషితో ఆర్థిక పరిపుష్టి దిశగా తీసుకు వెళ్లగలుగుతున్నామని చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనికోసం అధికారులందరూ పోటీ పడి పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తామని.. నదులను అనుసంధానం చేసిన ఘనత తమదే అని చంద్రబాబు అన్నారు. గడచిన రెండేళ్లలో పని తీరు బాగుందని కలెక్టర్లను ప్రశంసించారు. భవిష్యత్‌లో కూడా మరింత కష్టపడి పని చేయాలని సూచించారు.

మూడు నెలలకోసారి కలెక్టర్ల సమావేశం : సీఎం
ఇక ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారులు పని చేయరని ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చే విధంగా కలెక్టర్లు కృషి చేయాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించారు. తొలిరోజు కలెక్టర్ల సమావేశానికి అధికారులతో పాటు.. మంత్రులు కూడా హాజరయ్యారు. గురువారం కూడా ఈ సమావేశం కొనసాగనుంది.

నీట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం...

ఢిల్లీ : నీట్‌-2 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభమవుతుందని సీబీఎ్‌సఈ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌-2ను జూలై 24న నిర్వహిస్తారు. అభ్యర్థులు www.aipmt.nic.in.. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా తమ అప్లికేషన్‌ను పంపుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీట్‌-1లో మిగిలిపోయిన అభ్యర్థులంతా నీట్‌-2 రాయొచ్చు.

4, 5న పీఎన్ఎమ్ మహాసభలు..

హైదరాబాద్ : తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రథమ మహాసభలు వచ్చే నెల 4, 5న హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షుడు, సినీనటుడు, నిర్మాత మాదాల రవి తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుంభవన్‌లో ప్రజానాట్య మండలి ప్రథమ మహాసభల పోస్టర్‌ను విడుదల చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీలో 88 శాతం ఉత్తీర్ణత..

ఆదిలాబాద్ : బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో 2010 బ్యాచ్ ఫలితాలను వీసీ సత్యనారాయణ విడుదల చేశారు. ఆరు గ్రూప్‌లను కలుపుకొని 843 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో 319 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. 423 మంది విద్యార్థులు ఫస్ట్ గ్రేడ్‌లో, ముగ్గురు విద్యార్థులు సెకండ్ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు.

మూఢ నమ్మకం..వ్యక్తి హత్య...

నిజామాబాద్ : మూఢనమ్మకం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్ మండలం ఖానాపూర్‌లో మంత్రాలు చేస్తున్నాడని గోవిందపూర్ నర్సయ్య(65)అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో అతను మృతి చెందాడు. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో నర్సయ్య చేతులు కట్టేసి కొట్టారు. స్పృహ తప్పి పడి వున్న నర్సయ్యను కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు...

హైదరాబాద్ : ఎంసెట్‌ ఫలితాలను గురువారం ఉదయం 11గంట లకు విద్యాశాఖ మంత్రి కడి యం శ్రీహరి విడుదల చేయ నున్నారు. జూన 9న కౌన్సెలిం గ్‌ను ప్రారంభించి, జూలై 1 నుంచి తరగతులు నిర్వహిం చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆలోపు అనుబంధ కాలేజీలకు జేఎన్టీయూ అఫిలియేషన పూర్తికానుంది.

Don't Miss