Activities calendar

27 May 2016

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్ : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరుగనున్నాయి. కాసేపట్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా రావత్, మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా విజయ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా నాగమణి, జేఏడీ పొలిటికల్ ముఖ్యకార్యదర్శిగా జేసీ శర్మలను నియమించారు. 

21:56 - May 27, 2016

చిత్తూరు : తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మహానాడులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రెండు రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. 
చంద్రబాబుకు ఘనస్వాగతం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఘనంగా ప్రారంభమైంది. తిరుపతిలో ఎక్కడ చూసినా టీడీపీ కార్యకర్తల సందడి కనిపిస్తోంది. వేదికపైకి వచ్చిన చంద్రబాబుకు.. తెలంగాణ సంప్రదాయ రీతిలో బతుకమ్మలతో స్వాగతం పలికారు. చంద్రబాబు కూడా బోనమెత్తి.. వేదిక వరకూ సాగారు. వేదికపైకి చేరుకోగానే, చంద్రబాబు.. స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత అకాలమరణం పొందిన కార్యకర్తలకు నివాళులర్పించారు. 
భారీగా బారులు తీరిన కార్యకర్తలు 
సభ్యత్వ నమోదు కేంద్రం వద్ద.. కార్యకర్తలు భారీగా బారులు తీరారు. మహానాడుకు వచ్చిన పార్టీ శ్రేణుల కోసం నిర్వాహకులు తగినన్ని ఏర్పాటు చేశారు. వసతి, ఆహార సదుపాయాలను వేదిక సమీపంలోనే కల్పించారు. వేదిక వద్ద జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వేదిక చెంతనే.. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తెలిపే ఛాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం కార్యకర్తలతో సందడిని సంతరించుకుంది. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో 28 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వివిధ అంశాలపై చర్చనూ చేపడుతున్నారు. 

21:50 - May 27, 2016

హైదరాబాద్ : కృష్ణా బోర్డు సమావేశం వాడి వేడిగా సాగింది. బోర్డు చైర్మన్ నాథన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రతినిథులు హాజరయ్యారు. 11 కీలక అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. రాబోయే సంవత్సరానికి సంబంధించిన నీటి అవసరాలు, లభ్యత, పంపిణీ లాంటి అంశాలను సమావేశం చర్చించింది. 
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం
కృష్ణా నది ప్రాజెక్టులపై మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలు తమ వాదనలను  కృష్ణా రివర్‌ బోర్డు ముందుంచాయి. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బోర్డుకు తెలపగా.. తమ ప్రాజెక్టులు కొత్తవి కాదని, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందినవేనని తెలంగాణ ప్రతినిధులు బోర్డుకు వివరించారు. బోర్డు చైర్మన్ జోక్యం చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణ అంశం కోర్డు పరిధిలో ఉన్నందున దీనిపై కోర్టు తీర్పు అనంతరం చర్చిద్దామని సూచించారు. బోర్డు అధికారాలు, విధులు, పరిధి లాంటి అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. బోర్డుకు కావాల్సిన నిధులు సిబ్బంది కేటాయింపులపై ముసాయిదా విధి విధానాలు తయారు చేయాలని నిర్ణయించారు. 
ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చ
ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నిర్వహణ అంశాలపైనా సమావేశం చర్చించింది. గత సంవత్సరం ఖరీఫ్ లో నాగార్జున సాగర్ ఆనకట్ట వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో నిర్వహణ అంశాలు ఎలా ఉండాలనే విషయాన్ని బోర్డు సీరియస్ గా చర్చించింది. ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి అంశాలపైనా చర్చించారు. ప్రాజెక్టుల భద్రతకు సంబంధించిన వివరాలు అందజేయాలని రెండు రాష్ట్రాలకు బోర్డు చైర్మన్ నాథన్ సూచించారు . మరోవైపు.. జూన్ నాలుగున కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వివాదాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ రానుంది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు స్టాండింగ్ కమిటీకి అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ప్రిన్సిపల్ సెక్రటరీలు గైర్హాజరు 
కీలకమైన అంశాలను చర్చించే ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల తరపున సాగునీటి పారుదల ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరు కాకపోవడంతో అనేక అంశాలు కేవలం చర్చకే పరిమితమయ్యాయి. కొన్ని అంశాలు అసలు చర్చకే రాలేదు. త్వరలో జరిగే సమావేశానికైనా వీరు హాజరైతేనే సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందంటున్నారు సాగునీటి రంగ నిపుణులు.

21:44 - May 27, 2016

హైదరాబాద్ : తనను తాను పొగుడుకోవడానికి, ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే చంద్రబాబునాయుడు.. మహానాడు వేదికను ఉపయోగిస్తున్నారని  కాంగ్రెస్‌ నాయకుడు రామచంద్రయ్య ఆరోపించారు.  మహానాడు వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయని, నిరుద్యోగం కూడా పెరిగిపోతుందని వాటి గురించి మహానాడు కార్యక్రమంలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. 

21:18 - May 27, 2016

ఎండలు సేయంగ పంటలు ఎండినాయ్, బోర్లు ఎండినాయ్, బావులు ఎండినాయ్.. సర్కారు అదుకున్తదని సాకులు సెప్పలే ఆ రైతు .. జెర్ర బుర్ర వెట్టి ఆలోసించి  సూర్యుని  మీద, కరువు మీద గెల్సిండు  రైతు.. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు ఉండే గీ  ముచ్చటేందో మీరే సుడుoడ్రి  

21:08 - May 27, 2016

'అ..ఆ' మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా హీరో నితిన్, హీరోయిన్ సమంత, నటీ నదియాలు సినిమా విశేషాలను తెలిపారు. వారు తమ సినిమా అనుభవాలను వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:52 - May 27, 2016

తిరుపతి గుంట కింద తిష్టేసిన పసుపు దళం.. బాబుగారిని ఎక్కిచ్చుడే ఇక అందలం, సచివాలయం మీదికి మర్రిన ముచ్చట... కూలగొట్టి కట్టేపడేస్తరట అచట, ఎరుగవోయి ఎల్లెలుకలవడ్డ ఎంకట్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీల తగ్గుకుంటొస్తున్న వన్నె, సమగ్ర సర్వే కాయిదాలకు మహర్దశ.. జోకేందుకొస్తున్న లిమ్కా బుక్కోళ్లు, లిఫ్టులో ఇరికిన హీరో, దర్శకుడు.. సల్లచముటలువట్టిచ్చిన అప్పన్న, దొంగను బరవత్తల నిలవెట్టింది... నల్గురు జూస్తుండగానే గొట్టింది, పుట్టెడు కరువులో పుట్ల కొద్ది పంట... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళను లేక్ పోలీసులు కాపాడారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు కౌన్సిలింగ్ నిమిత్తం రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

 

ఎస్‌ఆర్ నగర్ పీఎస్ లో దర్శకుడు పోసాని ఫిర్యాదు

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వలేదని నరేశ్ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు తిడుతున్నాడని పోసాని పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

జాతీయ గీతాన్ని అవమానించిన మాజీ కేంద్రమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా

హైదరాబాద్ : పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన జమ్ముకాశ్మీర్ మాజీ సిఎం ఫరూఖ్ అబ్దుల్లా జాతీయగీతాలాపన సమయంలో చేసిన పని చూస్తే మీరు షాక్ అయిపోతారు. అందరూ లేచి నిల్చొని తమ దేశభక్తిని చాటుకుంటే ఫరూఖ్ అబ్దుల్లా మాత్రం ఫోన్‌లో మాట్లాడుతూ ఉండిపోయారు. కేంద్ర మంత్రులు, దేశ, విదేశీ ప్రముఖులు, పలువురు సిఎంలు హాజరైన ఈ కార్యక్రమంలో ఫరూఖ్ చేసిన పనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఓ రాష్ట్రానికి మాజీ సిఎం అయి ఉండి, కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఫరూఖ్ అబ్దుల్లా జాతీయ గీతం సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగించింది.

20:15 - May 27, 2016

తిరుపతి : ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం విభజన చట్టం తెచ్చి తెలుగు వాళ్లను విడదీసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. నల్ల చట్టాలను తెచ్చి అనేక వివాదాలను మిగిల్చిన పాపం కాంగ్రెస్‌దేనని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలో అనేక లోపాలున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. పలుమార్లు ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను కోరిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని కాల్వ శ్రీనివాసులు అన్నారు.  

 

ఎవరెస్ట్ శిఖరంపై భారత పర్వతారోహకుడి మృతదేహం

హైదరాబాద్ : ఎవరెస్ట్‌ శిఖరంపై భారతీయ పర్వతారోహకుడి మృతదేహం లభ్యమైంది. శిఖరం పై భాగంలో శనివారం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు భారతీయ పర్వతారోహకుల కోసం గాలిస్తుండగా పరేశ్‌ నాథ్‌(58) మృతదేహం లభ్యమైనట్లు అధికారులు ఈరోజు వెల్లడించారు. 7,900 అడుగుల ఎత్తులో మృతదేహాన్ని కనుగొన్నట్లు చెప్పారు. ఈ సీజన్‌లో ఎవరెస్ట్‌ పర్వతారోహణను తిరిగి ప్రారంభించిన వారంలోనే మృతుల సంఖ్య నాలుగుకు చేరడం గమనార్హం. పరేశ్‌నాథ్‌ మృతదేహాన్ని శిఖరంపై నుంచి కిందకు దించుతున్నట్లు తెలిపారు. అలాగే గల్లంతైన మరో భారతీయ పర్వతారోహకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

 

నందిగామలో భారీ వర్షం

విజయవాడ : నందిగామలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు కిందపడిపోయాయి. దీంతో విద్యుత్‌ అంతరాయం కలిగింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరులపాడులో పిడుగుపాటుకు లక్ష్మి అనే మహిళ మృతి చెందినట్లు తెలిపారు.

బీజేపీ దాడిలో గాయపడ్డ సీపీఎం కార్యకర్త మృతి

హైదరాబాద్ : కేరళ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. గత శుక్రవారం ఓ బీజేపీ కార్యకర్త చనిపోయాడు. తాజాగా ఈ శుక్రవారం సీపీఎం కార్యకర్త శశికుమార్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. గత ఆదివారం జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్తలు కత్తితో అతడ్ని నరకడంతో కాలు తెగింది. దీంతో కాలు తొలగించిన డాక్టర్లు శశికుమార్‌ను బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడి మృతిపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార సీపీఎం పార్టీ కార్యకర్తలు త్రిస్సూర్ జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం బంద్ పాటించార

19:52 - May 27, 2016

తూర్పుగోదావరి : కాకినాడ జీజీహెచ్‌లో డాక్టర్ల మధ్య వివాదం కలకలం రేపింది. ఎనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న డాక్టర్‌ అరుణ కుమారిపై మరో డాక్టర్‌ సుధాకర్‌ బాబు దాడిచేశాడు. ఈ ఘటనతో తోటి వైద్యులు ఆందోళనకు దిగి మేయిన్‌ గేట్‌ ముందు ధర్నాకు దిగారు. వైద్యురాలిపై దాడిచేసిన డాక్టర్ సుధాకర్‌, అతని బంధువులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే సోమవారం పూర్తిగా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయితే డాక్టర్ల నిరసనలతో ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

 

19:50 - May 27, 2016

విశాఖ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన డుంబ్రిగూడలో జరిగింది. తొమ్మిదేళ్ల బాకురు సిద్ధార్థ, తాంగుల భవాని, ఎనిమిదేళ్ల స్వాబి హరిత చాపరాయి జలపాతానికి స్నానం కోసం వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు గెడ్డలో మునిగి చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ చిన్నారులు బాకూరు, కండ్రుం, చంపపాటి గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు.

 

19:46 - May 27, 2016

హైదరాబాద్ : పోలవరంపై నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని... ఆరోపిస్తూ.. పోలవరం రైతు సంక్షేమ సంఘం ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. పర్యావరణ ఉల్లంఘన జరిగితే... ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ రద్దు ఎందుకు కోరలేదని ప్రశ్నించింది. దీనిపై సవరించిన పిటిషన్‌తో రావాలని ఆదేశించింది.

19:43 - May 27, 2016

హైదరాబాద్ : రైతు, డ్వాక్రా రుణ మాఫీలపై మహానాడులో కనీసం సమీక్షించకపోవడం శోచనీయమని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా గురించి రవ్వంతైనా మహానాడులో చర్చ జరగకపోవడం దారుణమని భూమన చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు జగన్ కారణమంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బాబుకు ధైర్యం ఉంటే రాజధాని భూములు, తుని ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై విమర్శలకు టీడీపీ నేతలు మహానాడును వేదికగా మలుచుకున్నారని విమర్శించారు. 

19:30 - May 27, 2016

శ్రీకాకుళం : జిల్లాలో విషాదం నెలకొంది. సంకిలిలోని ప్యారిస్ చక్కెర ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బాయిలర్ లో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అయితే బంధువులకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతులు లక్ష్మీపురంకు చెందిన తవిటయ్య, చందర్, సోంబాబులుగా గుర్తించారు. బాయిలర్ క్లీన్ చేసే సమయంలో ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలి కానీ.. యాజమాన్యం ఆక్సిజన్ ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మృతులు బంధువులు, స్థానికులు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

శ్రీకాకుళం : జిల్లాలో విషాదం నెలకొంది. సంకిలిలోని ప్యారిస్ చక్కెర ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బాయిలర్ లో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. 

19:15 - May 27, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌.. రాణిగంజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బన్సల్‌ ట్రేడింగ్‌ కంపెనీ అండ్‌ హార్డ్‌ వేర్‌ షాపు సెల్లార్లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక బృందం  షాపు  సెల్లార్‌ గోడను పగులగొట్టి మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. 

 

19:13 - May 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పదవీకాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ శర్మ పదవీకాలం పొడిగింపుకు సంబంధించి సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం- డివోపిటి  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు కాపీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో రాజీవ్‌శర్మ కొనసాగనున్నారు. ఈ నెల 31న ఆయన పదవీ కాలం ముగియనుండటంతో మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ మూడు నెలల పొడిగింపు ముగిసే లోపు మరో మూడు నెలల పాటు పొడిగింపునకు ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

18:51 - May 27, 2016

కరీంనగర్ : నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి రప్పిస్తామని.. దేశంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కార్ నిలుపుకోలేకపోయిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి ప్రధాని మోదీ విదేశాలు తిరగడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామిని అమలు చేయలేదని తెలిపారు. అమరవీరుల కుటుంబాలన్నిటికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

18:47 - May 27, 2016

గృహిణులు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ అద్భుత కళాఖండాలను ఆవిష్కరిస్తుంటారు. అలా ఒక అతివ వేస్తున్న ఇంప్రెషన్ పెయింటింగ్స్ ను ఇవాళ్టి సొగసులో చూద్దాం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:45 - May 27, 2016

మహిళలు, యువతులు అనేక రంగాలలో తమ శక్తియుక్తులు నిరూపించుకుంటున్నప్పటికీ వారి పట్ల ఏదో ఒక రకంగా వివక్ష కొనసాగూతూనే ఉంది. ఇదే విషయాన్ని తాజా అధ్యయనం మరోసారి రుజువు చేస్తోంది.

స్త్రీ, పురుష సమానత్వం మిథ్యే అని తేల్చుతోంది తాజా సర్వే. సమాన పనికి సమాన వేతనం కరువే అని తేలుస్తోంది ఈ నివేదిక.

క్రికెట్ చరిత్రలో మహిళలు నూతన బాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  నిర్వహించిన పురుషుల క్రికెట్ టోర్నిలో అంపైరింగ్ బాధ్యతలను తొలిసారిగా  చేపట్టి చరిత్ర సృష్టించారు.

అభివృద్ధి సాధిస్తున్నాం, వృద్ధి రేటు పెంచుతున్నామని పాలకులు గొప్పలు చెప్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలలో అమ్మాయిలు నిర్ణీత వయసు కుంటే ముందు పెళ్లి కూతుళ్లు అయిపోతున్నారంటోంది తాజా సర్వే. 

అనేక రంగాలలో సత్తా చాటుతున్న మహిళలు నావికా దళంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పూర్తిగా మహిళలతో కూడిన నావికా బృందం ప్రత్యేక అధ్యయనం కోసం తమ సాహసయాత్రను మొదలుపెట్టారు.

మహిళలు అరుదుగా రాణించే రంగంలో అమెరికన్ అతివ ప్రత్యేకతను సాధించింది. ప్రస్తుత సంవత్సరానికిగాను మిలీనియం టెక్నాలజీ బహుమతికి ఎంపికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది.

 

18:40 - May 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజెంట్‌ చేసిన ప్రాణహిత-చేవెళ్ల నీటి ప్రాజెక్ట్ డిజైన్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్ట్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో సాగుకు అవసరమయ్యే నీటిని పొందేందుకు ఇంతకన్నా మెరుగైన పద్ధతులున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రగతికి కృషి చేయాలని అన్నారు. 

18:36 - May 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి ఆరోపించారు. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని ఊహించిన ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయన్నారు. మావోయిస్టు ఎజెండానే తమ ఎజెండా అని చెప్పిన సీఎం కేసీఆర్‌....ఇప్పుడు ప్రజా సంఘాల సభలకు అనుమతివ్వడం లేదని ఆయన విమర్శించారు.

 

18:34 - May 27, 2016

కరీంనగర్ : జిల్లాలోని శనిగరం గ్రామంలోని ఉపాధిహామి పనుల తీరుపై పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడివో తీరు సరిగా లేదని, అధికారులు పద్ధతిగా లేకపోతే ప్రజలు నష్టపోతారని అన్నారు. గ్రామంలో వందరోజులు పని కల్పించాలని  మంత్రి జూపల్లి అధికారులకు సూచించారు. శనిగరం చెరువులో జరుగుతున్న ఉపాధిహామి పనులను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి జూపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా భూసమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆర్థికమంత్రి ఈటెల తెలిపారు. 

 

టీడీపీని తిరుగులేని శక్తిగా తయారు చేద్దాం : చంద్రబాబు

తిరుపతి : ప్రస్తుతం రాష్ట్రం 10.99శాతం అభివృద్ధి చెందినా... ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలకు పదేళ్లుగా స్పెషల్ స్టేటస్ ఉన్నా... ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీని తిరుగులేని శక్తిగా తయారుచేద్దామని చెప్పారు. కొన్ని పార్టీలు తమను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 
  

దామాషా పద్ధతి ప్రకారం నదీజాలాల పంపణీ : సీఎం చంద్రబాబు

తిరుపతి : దామాషా పద్ధతి ప్రకారం... నదీజాలాల పంపణీ చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి మహానాడులో ఆయన మాట్లాడారు. ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఎపిలో కలిపారని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ప్రజలు ఓట్లేశారని చెప్పారు. 
వారి నమ్మకాన్ని వమ్ము జేయనని తెలిపారు.

ఎపి అభివృద్ధికి కేంద్రం సహకరించాలి : సీఎం చంద్రబాబు

తిరుపతి : ఎపి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలని ఎపి సీఎం చంద్రబాబు కోరారు. తిరుపతిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. ఎపికి రాజధాని లేదని... రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు. ఇంకా నిధులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

18:26 - May 27, 2016

తిరుపతి : ఎపి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలని ఎపి సీఎం చంద్రబాబు కోరారు. తిరుపతిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. ఎపికి రాజధాని లేదని... రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు. ఇంకా నిధులు ఇచ్చి ఆదుకోవాలని పేర్కొన్నారు. చెన్నై వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి అయిందని.. అలాగే బెంగుళూరు కూడా అభివృద్ధి అయిందన్నారు. దామాషా పద్ధతి ప్రకారం... నదీజాలాల పంపణి చేయాలని తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఎపిలో కలిపారని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ప్రజలు ఓట్లేశారని చెప్పారు. వారి నమ్మకాన్ని వమ్ము జేయనని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం 10.99శాతం అభివృద్ధి చెందినా... ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలకు పదేళ్లుగా స్పెషల్ స్టేటస్ ఉన్నా... ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీని తిరుగులేని శక్తిగా తయారుచేద్దామని చెప్పారు. కొన్ని పార్టీలు తమను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 

 

18:02 - May 27, 2016

మెదక్ : రాబోయే మూడు సంవత్సారాల్లో 25వేల కోట్ల రూపాయలతో రహదారులను దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మెదక్‌ జిల్లా జిన్నారం మండలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 కోట్ల 60 లక్షల రూపాయలతో ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి హరీష్ చెప్పారు. జీవో 58 కింద 25 లక్షల మందికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు హరీష్ తెలిపారు. 

 

17:58 - May 27, 2016

హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 11 అంశాలపై చర్చించారు. కృష్ణా, గోదావరి నదుల పరిధిలో నీటి వినియోగం, అవసరాలు, తదితర అంశాలపై చర్చ జరిగింది. జూన్ 4న హైదరాబాద్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. 

 

17:50 - May 27, 2016

లిబియా : టెర్రరిస్టుల భయంతో యూరోపియన్ దేశాలకు వెళ్తూ మృత్యువాత పడుతున్న శరణార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గల్ఫ్ కంట్రీ లిబియా తీర ప్రాంతంలో మధ్యదరా సముద్రంలో సుమారు 6 వందల మంది శరణార్ధులతో కిక్కిరిసి ఉన్న ఓ బోటు నీట మునిగింది. ప్రాణభయంతో బోటులోని వారంతా ఒక్కసారిగా నీటిలోకి దూకేశారు. వారిలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇటలీ కోస్ట్ గార్డ్స్... 550 మంది ప్రయాణికులను రక్షించారు. గల్లంతైన వారిలో ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. శరణార్థులంతా వివిధ దేశాలకు చెందినవారుగా భావిస్తున్నారు.  

 

17:47 - May 27, 2016

రాజస్థాన్ : కాషాయ మూకల చేష్టలు పెచ్చుమీరిపోతున్నాయి. హిందుత్వశక్తుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. నిత్యం ఏదోవొక వివాదాస్పద ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు. దౌర్జాన్యాలు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమాతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. హిందుత్వవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జైపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో గోమాంసం సప్లయ్‌ చేస్తున్నారన్న కారణంతో స్థానిక బిజెపి కార్యకర్తలు దాడికి దిగారు. హోటల్‌ యాజమాన్యానికి, హిందుత్వ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో దాడి జరిగింది. ఒకరిపైమరొకరు కర్రలతో కొట్టుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్‌ వద్ద ఉన్న కెమెరాకు చిక్కాయి. దాడికి పాల్పడ్డవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు సిక్కుల పగిడీలను తొలగించడంతో మతం రంగు పులుముకుంది.

 

17:37 - May 27, 2016

కృష్ణా : ప్రైవేట్ కాళాశాల్లో విద్యార్థుల మృతులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడ లయోలా కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన కమల్‌జైన్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. రాత్రి సెల్‌ఫోన్‌ గురించి స్నేహితుల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.    

ముగిసిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్  : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 11 అంశాలపై చర్చించారు. కృష్ణా, గోదావరి నదుల పరిధిలో నీటి వినియోగం, అవసరాలు, తదితర అంశాలపై చర్చ జరిగింది. జూన్ 4న హైదరాబాద్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రానుంది. 

17:17 - May 27, 2016

టోక్యో : జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఒబామా... హిరోషిమా స్మారక స్థూపాన్ని సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబు దాడి చేసిన తర్వాత ఓ అమెరికా ప్రెసిడెంట్ ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. జపాన్ ప్రధాని షింజో అబే కూడా ఒబామాతో పాటు పాల్గొన్నారు. బాంబు దాడి జరిగిన నాటి గుర్తులు మనతో ఉండిపోతాయన్నారు ఒబామా. ఆ ఆలోచనలే మనకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. 

 

తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. రాజీవ్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం మూడు నెలలపాటు పొడిగించింది. డీపీవోటీ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 31 నుంచి ఆస్టు 31 వరకు పదవీకాలాన్ని పొడిగించారు. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత వాయిదా

హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని రోడ్ల మూసివేతను వాయిదా వేశారు. మరో 6 నెలల పాటు రక్షణశాఖ వాయిదా వేసింది. 

16:21 - May 27, 2016

హైదరాబాద్‌ : నగరంలో విదేశీ విద్యార్థిపై దాడి జరిగింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధి సింగాడికుంట ప్రాంతంలో నైజీరియన్‌ విద్యార్థి కజీంపై రాత్రి కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కజీంకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్‌ పార్కింగ్‌ విషయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

 

16:18 - May 27, 2016

హైదరాబాద్ : ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరు మారిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే స్టేడియం పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారముందని, ప్రచార సాధనాల కోసం ఉప్పల్ స్టేడియంను ప్త్రైవేట్ సంస్థకు అప్పగించాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

16:10 - May 27, 2016

నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరులో మహిళను వేధిస్తున్న యువకుడికి యువతి, ఆమె తరపు బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన కుమార్ అనే వ్యక్తి మహిళను ఫోన్‌లో తరచూ వేధిస్తున్నాడు. దీంతో విషయాన్ని ఆమె తన బంధువులకు తెలపడంతో పక్కా ప్రణాళిక ప్రకారం యువకుడిని ఆత్మకూరుకి పిలిపించి చితకబాదారు. మహిళ అతనికి చెప్పులతో దేహశుద్ధి చేసింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చే లోపే కుమార్ పరార్ అయ్యాడు. నిందితున్ని ఫోన్ ట్రేస్ చేసైనా.. పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

 

16:01 - May 27, 2016

హైదరాబాద్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ.. ఆ మూవీ పాటల టీజర్లు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా... మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూర్చారు.. జూన్‌ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..

మావోయిస్టుల చేతిలో యువకుడి హతం

ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఓ యువకుడిని మావోయిస్టులు హత్య చేశారు. పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానంతో యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ నెల 24న యువకుడు అదృశ్యమయ్యాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చెన్నై ఎయిరుపోర్టులో 3.6 కిలోల బంగారం స్వాధీనం..

హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో 3.6 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

ఫోన్‌లో వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి

నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూర్‌లో ఆకతాయికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే కర్నూలుకు చెందిన కుమార్‌ అనే యువకుడు ఓ మహిళను ఫోన్‌లో తరుచూ వేధిస్తున్నాడని ఆమె వారి బంధువులకు తెలిపింది. దీంతో ఆమె బంధువులు,ఆమె పక్క ప్రణాళిక ప్రకారం యువకుడిని పట్టుకుని చితకబాదారు.

హైదరాబాద్ లో ఘరానా మోసం

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డ నలుగురు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఏఎంవీఐ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను నలుగురు వ్యక్తులు మోసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు మోసానికి పాల్పడ్డ నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారి నుంచి రూ.15.68 లక్షల నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

15:51 - May 27, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు వికృతచేష్టలకు పాల్పడ్డారు. వాయువ్య ఢిల్లీలోని ఇందర్‌పురి స్లమ్‌ ఏరియాలో ఈ దురాగతం జరిగింది. మద్యం మత్తులో నలుగురు వ్యక్తులు బాలుడి కాళ్లు చేతులు విరిచికట్టి నగ్నంగా చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఆ సంఘటన తాలూకు విజువల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసు బుక్‌ చేసిన ఇందర్‌పురి పోలీసులు... ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాలుడిపై లైంగిక దాడినట్లుగా భావిస్తున్నా అలాంటిదేమీ జరగలేదని మెడికో లీగల్ కౌన్సెలింగ్‌లో వెల్లడైందని డీసీపీ సురేందర్‌ కుమార్‌ చెబుతున్నారు. కాగా అతన్ని కొడుతున్న దృశ్యాలను నిందితుల్లో ఒకడు చిత్రీకరించాడు. బాలుడి నివాస ప్రాంతంలో కొంతదూరం కొట్టుకుంటూ వెళ్లారు. సోమవారం ఈ ఘటన జరగ్గా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ దొంగతనానికి సంబంధించి తనని బాధ్యుణ్ణి చేసి కొట్టినట్లు బాధితుడు తెలిపాడు.  

 

15:49 - May 27, 2016

ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివసిస్తున్నారా? అంటే కచ్చితంగా కాదనే చెప్పగలం. కానీ ఘజియాబాద్ ప్రాంతంలోని ఇందిరాపురానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో రాహుల్ ఉంటూ తమకు హెల్పర్‌గా పనిచేస్తున్నాడని పోలీసుల వెరిఫికేషన్ ఫారమ్‌లో నింపి ఇచ్చాడు. దానిలో రాహుల్ గాంధీ ఫొటో కూడా అతికించి ఇచ్చాడు. అంతేకాదు రాహుల్‌గాంధీ సన్‌ ఆఫ్‌ రాజీవ్‌ గాంధీ, ఇంటినంబర్ 12, తుగ్లక్ లేన్, న్యూఢిల్లీగా ఫారమ్‌లో పేర్కొన్నాడు. వృత్తి అనే కాలమ్ వద్ద రాజకీయాలు అని, పెళ్లి వివరం వద్ద పెళ్లి కాలేదని రాశాడు. విచిత్రమేమంటే ఆ ఫారమ్‌పై యుపి పోలీసులు స్టాంప్ వేసి ఆమోదించడం కూడా జరిగింది. ఇందిరాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ పరిశీలనలో ఈ వ్యవహారం బయటపడడంతో ఉలిక్కపడ్డ పోలీసులు.. దీనిపై వివరణ ఇచ్చారు. ఇది ఎవరో ఆకతాయిగా చేసిన పనిలా ఉందన్నారు. ఆ వ్యక్తి నింపి ఇచ్చిన ఫారమ్ కూడా పాతదన్నారు.    

15:44 - May 27, 2016

ఢిల్లీ : రెండేళ్ల మోడీ ప్రభుత్వం దేశానికి అవినీతి రహిత పాలనను అందించిందని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా అన్నారు. అభివృద్ధే ఎజెండగా బిజెపి సర్కార్‌ పనిచేసిందని తెలిపారు. పేదల కోసం ఎన్నో సామాజిక పథకాలను కేంద్రం ప్రవేశ పెట్టిందన్నారు. కేంద్రంలో తొలిసారిగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల రిపోర్టును 15 రోజుల పాటు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని షా తెలిపారు.

15:41 - May 27, 2016

శ్రీనగర్ : హంద్వారా ఘటనపై జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ అట్టుడికింది. హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పౌరులు మృతి చెందడంపై విపక్షాలు హంగామా చేశాయి. స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లిన విపక్ష సభ్యులు ఈ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఫ్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు పోస్టర్ల ద్వారా నిరసన తెలిపారు. సిఎం మెహబూబా ముఫ్తీకి తొలి సమావేశాల్లోనే ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 

15:37 - May 27, 2016

నల్గొండ : నాగార్జున సాగర్‌ కాలువలకు మహర్దశ పట్టనుంది. సాగర్‌ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరాయి. ఇప్పటికే ఎడమ కాలువ పనులు పూర్తికాగా.. కుడికాలువ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి ఆధునికీకరణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీష్‌రావు పట్టుదలగా ఉన్నారు. 
ఎడ‌మ కాలువ మ‌ర‌మ్మతులు వేగవంతం  
నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ మ‌ర‌మ్మతు ప‌నులు వేగంగా  కొన‌సాగుతున్నాయి. ఎడ‌మ కాలువ‌కు సంబంధించి ఓవ‌రాల్‌గా ఇప్పటికే 85 శాతం ప‌నులు పూర్తయ్యాయి. ఎడ‌మ కాలువ అభివృద్ధి కోసం ప్రభుత్వం 1611 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఇందులో భాగంగా 2014 జూన్ నెలకు ముందు 634 కోట్లు ఖ‌ర్చు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మ‌రో 704 కోట్లు ఖ‌ర్చు చేసి, కాలువ అభివృద్ధి ప‌నుల‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. సాగ‌ర్ ప్రధాన ఎడ‌మ కాలువతో పాటు బ్రాంచ్ కాలువ‌ల్లో ప‌నుల‌ను మొత్తం 10 ప్యాకేజీల కింద విభ‌జించారు. ఇప్పటికే ఆరుప్యాకేజీల పనులు పూర్తికాగా..మిగతావి శరవేగంగా సాగుతున్నాయి.  
అనుబంధంగా మ‌రో 25 డిస్ట్రిబ్యూష‌న్ కాలువ‌లు
సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు అనుబంధంగా మ‌రో 25 డిస్ట్రిబ్యూష‌న్ కాలువ‌ల్లోనూ మ‌ర‌మ్మతు ప‌నులు జ‌రుగుతున్నాయి. డిస్ట్రిబ్యూష‌న్ కాలువ‌ల్లో 70 శాతానికి పైగా ప‌నులు పూర్తి చేశారు. ఇక మొత్తం 42 లిప్టులుంటే అందులో 35 లిఫ్టులు ఇప్పటికే  పూర్తిచేశారు. ఎడ‌మ కాలువ అభివృద్ధి ప‌నుల‌న్నీ  ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో చేప‌ట్టిన‌వే. సాగర్‌ కాల్వల ఆధునికీకరణ వల్ల.. మరో లక్షన్నర ఎకరాల ఆయకట్లు అందుబాటులోకి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. లైనింగ్‌ పనుల వల్ల లీకేజీ సమస్యలకు పూర్తి చెక్‌ పడుతుందని, తద్వారా చివరి ఆయకట్టుకూ నీరందుతుందని నమ్ముతోంది. సాగర్‌ ఆధునికీకరణ పనులన్నీ పూర్తయి.. కృష్ణా ప‌రీవాహ‌కంలో రాష్ట్ర నీటికేటాయింపుల‌ను స‌మ‌ర్థంగా వాడుకుంటే.. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ‌ను చూడ‌వచ్చని మంత్రి హరీష్‌రావు భావిస్తున్నారు. ఈ దిశగా.. సాగర్‌ కాల్వల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

15:25 - May 27, 2016

హైదరాబాద్ : నగరంలోని తిలక్ నగర్ లో రైలు కింద పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిలక్ నగర్ కు చెందిన ప్రమీల నిన్న రాత్రి నుండి కనిపించపొవడంతో కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమీల మృతదేహం తిలక్ నగర్ రైలు పట్టాలపై కనబడింది. రైలు కింద పడంటతో మహిళ మొండెం, కాళ్లు, తల వేరయ్యాయి. ప్రమీల ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది. 

 

చరిత్రలో శాశ్వతంగా మిగిలిన ఏకైక పార్టీ టీడీపీ : సీఎం చంద్రబాబు

తిరుపతి : చరిత్రలో శాశ్వతంగా మిగిలిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. త్యాగాలకు మారుపేరు టీడీపీ కార్యకర్తలని కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. 

సికింద్రాబాద్ రాణిగంజిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : సికింద్రాబాద్ రాణిగంజిలో అగ్నిప్రమాదం జరిగింది. బన్సల్ ట్రేడింగ్ కంపెని హార్డువేర్ షాపు సెల్లార్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది గోడను పగులగొట్టి మంటలార్పుతున్నారు. 

 

అంబర్ పేట బతుకమ్మకుంటలో దొంగలు హల్ చల్

హైదరాబాద్ : అంబర్ పేట బతుకమ్మకుంటలో దొంగలు హల్ చల్ చేశారు. నగలు మెరుగుపెడతామని ఓ మహిళ నుంచి 11 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

మహానాడులో నేనూ ఓ కార్యకర్తనే : సీఎం చంద్రబాబు

తిరుపతి : 'మహానాడులో నేనూ ఓ కార్యకర్తనే' అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కార్యకర్తల ఏకైక పండుగ మహానాడు అని చెప్పారు. చరిత్ర ఉన్నంత వరకు నిలిచి వుండే ఏకైక వ్యక్తి ఎన్ టిఆర్ అని అభివర్ణించారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. హన్మకొండ, భద్రాచలం, ఆదిలాబాద్ లో 45 డిగ్రీలు, ఖమ్మం 44, నల్గొండ, నిజమాబాద్ 43 డిగ్రీలు, హైదరాబాద్, మెదక్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కాకినాడ, బాపట్ల, తుని, మచిలీపట్నంలో 45 డిగ్రీలు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, నర్సాపూర్, నందిగామ, కావలిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 

పోలీసుల అదుపులో కల్తీ రక్తం నిందితుడు నరేందర్

హైదరాబాద్ : కల్తీ రక్తం వ్యవహారంలో నిందితుడు నరేందర్ ను సుల్తాన్ బజార్ పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. 

14:06 - May 27, 2016

విజయవాడ : ప్రసిద్ధిగాంచిన స్వరాజ్య మైదానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దయెత్తున ధర్నా నిర్వహించారు. స్వరాజ్య మైదానంలో సిటీ స్క్వేర్ పేరుతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకుని నేతలను అరెస్ట్‌ చేశారు. స్వరాజ్య మైదానంతో ప్రజలకు విడదీయరాని అనుబంధముందని సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. స్వరాజ్య మైదానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని సహించమన్నారు. దీని ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.

13:59 - May 27, 2016

తూర్పు గోదావరి : కృష్ణా గోదావరి బేసిన్ లోని అల్లవరం ఓడ రేవు కేంద్రంగా సాగుతున్న వశిష్ట, ఎస్-1 ప్రాజెక్టు అభివృద్థి పనులపై అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో లెవిలింగ్ పనుల కోసం వినియోగిస్తున్న ఇసుకను గ్రామంలోని సముద్ర ఇసుక తిన్నెలు తొలగించి వినియోగించడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఓ దశలో స్థానిక తహశీల్దార్ పాము సుబ్బారావు, ఎస్సై ప్రశాంత్ కుమారులను ఇసుక తవ్వకాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓడరేవు నుంచి ONGC ప్లాంట్ కు సరఫరా చేస్తున్న ఇసుక వ్యవహారంపై వాస్తవాలు వెలుగుచూసేందుకు విచారణ కోసం కేంద్రానికి నివేదిస్తానని ఎంపీ స్పష్టం చేశారు. 

13:53 - May 27, 2016

కరీంనగర్ : మంచిర్యాల  చౌరస్తాలో సైకో ఫయజోద్ధిన్ 3గంటల పాటు వీరంగం సృష్టించాడు. స్థానిక సాహితి నగర్‌లో నివాసం ఉంటున్న ఫయజోద్ధిన్ వింత చేష్టలతో అందరిని భయబ్రంతులకు గురిచేశాడు. దగ్గరలో ఉన్న మసీద్‌లోకి ప్రవేశించి కిటికీల అద్దాలను ధ్వసం చేసి కూడి చేయిని కోసుకొని రోడ్డు పై పరుగులు తీశాడు. అనంతరం గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

13:45 - May 27, 2016

ఢిల్లీ : నీట్ ఆర్డినెన్స్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ ఆర్డినెన్స్‌పై స్టే ఇస్తే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్‌కు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల క్రితం సంతకం చేసిన విషయం తెలిసిందే. నీట్ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆయా రాష్ర్టాలు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది.

రైల్వేట్రాక్‌పై మహిళ మృతదేహం లభ్యం...

హైదరాబాద్ : రైల్వేట్రాక్‌పై ఓ మహిళ మృతి చెందింది. తిలక్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. తిలక్‌నగర్‌లో నివాసముండే ప్రమీల అనే మహిళ నిన్న రాత్రి నుంచి కనిపించడం పోయింది. కాగా రైలు పట్టాలపై మృతిచెంది అగుపించింది. సదరు మహిళకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుందని ఆమె కుమారుడు తెలిపాడు. కాగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందిందా లేక ఆత్మహత్య చేసుకుందా అనేది తేలాల్సి ఉంది. కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత...

నెల్లూరు : కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం నాటు కాలేజీకి చెందిన హాస్టల్లో విద్యార్థి శివకుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తమ కుమారుడి మృతికి యాజమాన్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో దాడికి యత్నించినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విమానంలో మంటలు..ప్రయాణీకులు సురక్షితం...

జపాన్‌ : రాజధాని టోక్యో నుంచి దక్షిణకొరియా బయలుదేరుతున్న ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మరికొద్దిసేపట్లో విమానం బయలుదేరుతుందనగా.. ఇంజిన్‌లో మంటలు రావడంతో అధికారులు గుర్తించి ప్రయాణికులను దింపేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఒకటో ఇంజిన్‌ నుంచి పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి. గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను, సిబ్బందిని దింపివేశారు. అనంతరం మంటలను అదుపుచేశారు. కాగా విమానంలో 302 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

14 మంది నక్సలైట్లు అరెస్ట్‌....

చత్తీస్‌గడ్‌: 14 మంది నక్సలైట్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు గడిరాస్‌ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించారు. స్థానిక పారియా అటవీ ప్రాంతాన్ని కట్టుదిట్టం చేసి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా 14 మంది నక్సల్స్‌ పట్టుబడ్డారు. వీరంతా మే 19న అర్ధరాత్రి ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించి నీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేసిన కేసులో నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు.

దీదీ ప్రమాణ స్వీకారం....

పశ్చిమబెంగాల్ : ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కేఎన్ త్రిపాఠీ మమతతో ప్రమాణస్వీకారం చేయించారు. 41 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గంలో 17 మందికి కొత్తగా అవకాశం కల్పించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జరిగింది.

పంటపొలాలలో అగ్నిప్రమాదం....

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలోని రాయపూడి పంటపొలాలలో అగ్నిప్రమాదం సంభవించింది. 15 ఎకరాల అరటి, నిమ్మ, జామ తోటలు దగ్థమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అందుకున్న అగ్నిమాపక దళాలు రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తేవటానికి యత్నిస్తున్నారు. పోలీసుల సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు వ్యాపించి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

12:50 - May 27, 2016

చిత్తూరు : తిరుపతిలో టీడీపీ మహానాడు అంగరంగ వైభంగా ప్రారంభమయ్యింది. అతిరథ మహారథులతో ప్రాంగణం నిండిపోయింది. సర్వాంగ సుందరంగా మహానాడు చామంతులు పూసినట్లుగా పసుపుమయమయ్యింది. తెలుగువారికి ఎక్కడ అన్యాయం జరిగినా టీడీపీ పోరాడుతుందన్నారు. ఈ ఏడాది 20వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 'ఈజ్ ద ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీ రెండవ స్థానంలో వున్నామన్నారు. భారత్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ లో ముందు భాగాన నిలిచిందనీ..దానిలో ఏపీ మూడవ రాష్ట్రంగా ఏపీ వున్నామని తెలిపారు . దీనికోసం మనం అంతా కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులకు భీమా సౌకర్యం కల్పించటానికి రై1 కోటి 50 లక్షలు కేటాయించటానకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదానికి గురయి చనిపోయిన, శాశ్వతంగా వికలాంగులైనా బాధితులకు రూ.5లక్షల భీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామనీ ఇది దేశంలోనే ఒక చరిత్ర అన్నారు. ఇది ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. 

12:28 - May 27, 2016

తిరుపతి : తిరుపతిలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. ఈ సభలో సీఎం చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేశారు.టీడీపీకి మహానాడు అంటే ఒక పండగవంటిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రంలో ఒక మహానాయకుడు జన్మించిన రోజున మహానాడు వేడుకను జరుపుకుంటున్నామని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టటానికి పార్టీ పుట్టిందనీ...కార్మికుల స్వేదం నుండి పుట్టిందని మహానాయకుడు ఎన్టీఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. గత 35 సంవత్సరాల నుండి టీడీపీని తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఎంతోమంది కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి పార్టీకి అండగా నిలిచారన్నారు. పార్టీకోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. తిరుపతికి పార్టీకీ అవినావభావ సంబంధముందని తెలిపారు. విభజన తరువాత కేంద్ర సహాయం అవుసరముంటుదనే ఉద్ధేశ్యంతోనే ఎన్డీయే ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్ని ఇబ్బందులున్నా సరే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 

ఉగ్రవాదుల ఇంటిని పేల్చివేసిన భద్రతాదళాలు....

జమ్మూకశ్మీర్‌ : బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తంగ్‌మార్గ్ ప్రాంతంలోని కొంచిపురా గ్రామంలో భద్రతా దళాలు ఓ ఇంటిని చుట్టుముట్టాయి. గురువారం రాత్రి నుంచే మిలిటెంట్లు ఫైరింగ్ చేశారు. అయితే ఇవాళ ఉదయం మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య భీకరంగా ఫైరింగ్ జరిగింది. ఇంట్లో దాగిఉన్న ఇద్దరు మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులను బలగాలు తిప్పికొట్టాయి. టెర్రరిస్టులు దాగి ఉన్న ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. 

గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు దగ్థం...

గుంటూరు: దుగ్గిరాల మండలం పెరికలపూడిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదు పూరిళ్ళు దగ్దం అయ్యాయి. 

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం...

హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తి గోపన్నపల్లి కల్లు దుకాణం సమీపంలో మృతిచెంది పడిఉన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

11:52 - May 27, 2016

విశాఖ : ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌, దర్శకుడు బోయపాటి శ్రీనుకు సింహగిరిపై చేదు అనుభవం ఎదురైంది. సింహాచల అప్పన్ననుదర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలి గోపురం నుంచి కిందికి వచ్చేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. ఆ సమయంలో లిఫ్ట్‌ కొంతదూరం వెళ్లి ఆకస్మాతుగా మధ్యలో ఆగిపోయింది. ఆలయ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి లిఫ్ట్‌ తలుపులు బద్దలుకొట్టి వారిని బయటకు తీశారు.

ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా....

హైదరాబాద్: ఇసుకతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నగరం కుషాయిగూడ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు గాయాలైయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

లిఫ్ట్ లో ఇరుక్కున్న బన్నీ ..

విశాఖ : ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌, దర్శకుడు బోయపాటి శ్రీనుకు సింహగిరిపై చేదు అనుభవం ఎదురైంది. సింహాచల అప్పన్ననుదర్శించుకున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలి గోపురం నుంచి కిందికి వచ్చేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. ఆ సమయంలో లిఫ్ట్‌ కొంతదూరం వెళ్లి ఆకస్మాతుగా మధ్యలో ఆగిపోయింది. ఆలయ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి లిఫ్ట్‌ తలుపులు బద్దలుకొట్టి వారిని బయటకు తీశారు.

11:42 - May 27, 2016

గుంటూరు : గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడి చనిపోయిన బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. ఓ భవనం నిర్మాణం జరగుతుండగా సెల్లార్ విరిగిపడి 7గురు కార్మికులు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందుతుడుగా వున్న చుక్కపల్లి రమేష్ ను అధికారుల ఒత్తిడి వల్లనే ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని బాధితులు పేర్కొంటున్నారు. కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా అధికార పార్టీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణం జరగటంలో రాజకీయ ప్రమేయముందని ఆయన పేర్కొన్నారు. 

11:22 - May 27, 2016

విజయాడ : యువజన విధానాన్ని తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా దీనిని రూపొందిస్తారు. అన్ని రంగాల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

లెక్టర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ....
విజయవాడలో రెండు రోజులుపాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకురానున్న యువజన విధానంపై చంద్రబాబు సమీక్షించారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు వీలుగా ప్రతిగ్రామంలో ఫిజికల్‌ లిటరసీ ఇన్‌చార్జ్‌లను నియమించాలని నిర్ణయించారు. రక్షణరంగంలో పెట్టుబుడులు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్న విషయాన్ని చంద్రబాబు జిల్లా కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రక్షణరంగ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈఏడాది 7,900 మందికి శిక్షణ ఇప్పించాలని చెప్పారు.

27 నుంచి అమరావతి నుంచి పూర్తిస్థాయి పాలన....
వచ్చేనెల 27 నుంచి అమరావతి నుంచి పూర్తిస్థాయి పాలన సాగించాలన్సి అంశంపై కూడా చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. సచివాలయం సిబ్బందితో పాటు, కమిషనరేట్లు, డైరెక్టరేట్ల ఉద్యోగులు, శాఖాధిపతులందరూ అమరావతి, విజయవాడ, గుంటూరుకు తలివచ్చే విధంగా ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాజధానిలో పెరిగిన ఇంటి అద్దెల విషయం ప్రస్తావనకు వచ్చింది. విజయవాడ, గుంటూరుల్లో ఇష్టారాజ్యంగా అద్దెలు పెంచితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్దె నియంత్రణ చట్టాన్ని ప్రయోగించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఎక్కవ అద్దెభారం పడకుండా చూడాలని సూచించారు.

కృష్ణా పుష్కర ఏర్పాటపై బాబు సమీక్ష....
ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి జరిగే కృష్ణా పుష్కర ఏర్పాటపై కూడా చంద్రబాబునాయుడు సమీక్షించారు. పుష్కరాల భద్రతకు 33 వేల మంది పోలీసులు అవసరమవుతారని అంచనావేశారు. 2016-17 వ్యవసాయ ప్రణాళికను విడుదల చేసారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ప్రత్యేక పోలీసు స్టేషన్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ప్రజలకు అవినీతి రహిత, పారద్శక పాలన అందించాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఉపయోగించుని అభివృద్ధిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

శాంతిభద్రత సీఎం సమీక్ష...
రెండో రోజు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కలిసి నిర్వహించిన సమావేశంలో శాంతిభద్రత పరిస్థితిన సమీక్షించారు. అరాచకశక్తులను అణచివేయాలని చంద్రబాబు ఆదేశించారు. పారదర్శక పాలనకు వీలుగా అధికార యంత్రాంగాన్ని ప్రోత్సహించేందుకు రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశం బాగా ఉపయోగపడిందని ప్రభుత్వం భావిస్తోంది. 

11:16 - May 27, 2016

 చిత్తూరు : తిరుమలలో టీడీపీ మహానాడు ప్రారంభమయ్యింది. 18 ఏళ్ళ తరువాత తిరుపతిలో మహానాడు నిర్వహిస్తున్నారు. సర్వాంగ సుందరంగా మహానాడు ప్రాంగనం ముస్తాబయింది. మహానాడుమహానాడు ప్రాగంణానికి టీడీపీ అగ్రనాయకులు చేరుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలి మహానాడు వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో 18 అంశాలపై తీర్మానాలు నాయకులు చేయనున్నారు. ఆర్థికలోటు, కేంద్రం సాయం తీరుపై భవిష్యత్ కార్యాచరణ వంటి పలు అంశాలపై నేతలు చర్చలు జరుపనున్నారు. 15 ఏ మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకోనున్నారు. 

ఎలుగుబంటి దాడి..వ్యక్తికి గాయాలు...

నిజామాబాద్‌ : డిచ్‌పల్లి మండలం చాంద్రాయన్‌పల్లి సమీపంలో త్రియంబక్‌పేట తండాలో దేవీసింగ్‌ అనే వ్యక్తి పై ఓ ఎలుగు దాడి చేసింది. అడవిలో నుంచి తప్పిపోయిన ఎలుగుబంటి దేవీసింగ్ తల, కాళ్లు, చేతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో దేవీసింగ్‌కు రక్తస్రావం అధికంగా అయినట్లు వైద్యులు తెలిపారు.

10:42 - May 27, 2016

అమెరికా  : సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి స్వస్తి పలికింది. ప్రత్యర్థుల పోటీ.. లూమియా, విండోస్‌ ఫోన్ల వ్యూహాలు బెడిసికొట్టడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

'సాఫ్ట్‌వేర్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తాం'
స్మార్ట్ ఫోన్‌ల తయారీని నిలిపివేస్తున్నట్టు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. స్మార్ట్‌ ఫోన్ల డిజైన్‌, తయారీకి దూరంగా ఉంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి.. మైక్రోసాఫ్ట్‌కు ఫిన్లాండ్‌ యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకనుంచి సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల కూడా తెలిపారు. విండోస్‌-10 మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి, క్లౌడ్‌ సేవలకు ఇక ప్రాధాన్యమివ్వనున్నట్టు ప్రకటించారు.

1850 మంది సిబ్బంది తొలగింపు...
రెండేళ్ల క్రితం 7.2 బిలియన్‌ డాలర్లకు మైక్రోసాఫ్ట్.. నోకియాను కొనుగోలు చేసింది. అనంతరం మైక్రోసాఫ్ట్ పేరుతో స్మార్ట్ ఫోన్ల తయారీ చేపట్టింది. ఇక నుంచి ఆ ప్రోడక్ట్ మార్కెట్లో కనిపించదు. అంటే నోకియా ఉద్యోగుల్లో చాలా వరకూ ఇక మైక్రోసాఫ్ట్‌లో పనిచేయరు. నోకియాను కొనుగోలు చేసినపుడు దాని 25 వేల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్‌ తీసుకుంది. ప్రస్తుతం సంస్థ 1850మందిని తొలగిస్తోంది. ఇందులో...1350 మంది ఫిన్‌లాండ్‌కి చెందిన వారైతే.. మిగిలినవారు వివిధ దేశాల్లో పనిచేస్తున్న వారని అంచనా.

ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌కు 35 కోట్ల డాలర్లకు విక్రయం...
మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే నోకియా ఫీచర్‌ఫోన్ల హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌ అనుబంధ సంస్థ అయిన ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. దీంతో హెచ్‌ఎండీ గ్లోబల్‌, ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌ సంస్థలు నోకియా బ్రాండ్‌ మొబైళ్లను, ట్యాబ్లెట్లను సంయుక్తంగా తయారుచేసి విక్రయిస్తాయి. అంతర్జాతీయంగా గత త్రైమాసికంలో 24 లక్షల విండోస్‌ ఫోన్ల అమ్మకం జరిగిందని రీసెర్స్‌ సంస్థ గార్టనర్‌ తెలిపింది.

స్మార్ట్ ఫోన్ రంగంలో పెరుగుతున్న పోటీ...
స్మార్ట్ ఫోన్ రంగంలో పెరుగుతున్న పోటీ...యాపిల్, శాంసంగ్ నుంచి వస్తున్న కొత్త వెర్షన్లను ఎదుర్కొనేలా... మైక్రోసాప్ట్ తమ ఉత్పత్తులను తయారు చేయలేక పోతోంది. అందుకే ఈ రంగం నుంచి తప్పుకోవడమే ఉత్తమమైన మార్గంగా మైక్రోసాఫ్ట్ నిర్ణయించిందని... టెక్నాలజీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

10:32 - May 27, 2016

హైదరాబాద్ : సంచలనం కలిగించిన కల్తీ రక్త నిందుతుడు నరేందర్ ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. కోఠి మెటర్నటీ ఆసుపత్రిలో జౌట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న నరేందర్ గత కొంతకాలంగా రక్తంలో సెలైన్ వాటర్ కలుపుతూ కల్తీ పాల్పడేవాడు. విషయం బయటకు పొక్కటంతో పరారయ్యాడు. నిందితుడు నరేందర్ కోసం మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. కాగా గురువారం నాడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో నరేందర్ ను అరెస్ట్ చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా మదనపల్లి కోర్టులో హాజరుపరచి శుక్రవారం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ కేసులో నిందితులుగా వున్న నిందితులుగా వున్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.నిందితుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. దీనిపై సుల్తాన్ బజార్ పోలీసులు మరింతగా విచారణ కొనసాగిస్తున్నారు.

10:12 - May 27, 2016

హైదరాబాద్: పరిపాలనకు కీలకమైన ఆ భవనాల్లో భద్రతా అంతా డొల్లే. ఎవరైనా రావొచ్చు. ఆందోళనలకు దిగొచ్చు. ఇన్నాళ్లు సాగిన ఈ తంతుకు చెక్ పెట్టేలా పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణ సచివాలయంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా అత్యాధునికమైన వ్యవస్థ సిద్ధమవుతోంది.

అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు...
తెలంగాణ సెక్రటేరియెట్ శత్రు దుర్భేద్యంగా మారనుంది. విజిటర్స్‌ కదలికలను కనిపెట్టే విధంగా... భద్రతాలోపాలకు తావు లేకుండా.. పకద్బంధీ ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం పరిసరాల్లో ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసే విధంగా అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే రెండు కోట్లు నిధులు కూడా మంజూరు చేసింది. మంత్రులు, విఐపీలు, విజిటర్స్‌తో నిత్యం రద్దీగా ఉండే సచివాలయానికి ఉండాల్సినంత భద్రత లేదనే విమర్శ ఉంది. విజిటర్స్‌ సెక్రటేరియట్‌లోకి వచ్చి గొడవలు పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఆందోళనలు, ధర్నాలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు ఆత్మహత్యకు సైతం ప్రయత్నించారు. దీంతో నిరంతరం నిఘా నీడలో సెక్రటెరియట్‌ ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది.

కీలకమైన బ్లాక్స్ లో కెమోరాలు...
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత సెక్రటెరియన్‌ను ఇరు రాష్ట్రాలకు కేటాయించింది. ఇందులో తెలంగాణకు నాలుగు బ్లాక్‌లు కేటాయించింది. వాటిని ఎ.బి.సి.డిలుగా విభజించారు. ఇందులో సి,డి బ్లాక్‌లు ముఖ్యమైనవి. సి బ్లాక్‌లో ముఖ్యమంత్రి పేషీ, దానికి సంబంధించిన అధికారులు ఉంటున్నారు. ఇంత కీలకమైన బ్లాక్‌లో కేవలం నాలుగు కెమెరాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ నాలుగు అత్యాధునిక జూమ్‌ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

17 పీటీజెడ్ కెమెరాలు....
డి బ్లాక్‌లో తెలంగాణ మంత్రుల చాంబర్స్‌, హె.వో.డీలు, ప్రిన్స్‌పుల్‌ సెక్రటెరీలు ఆఫీస్‌లు ఉంటాయి. అయితే ఈ బ్లాక్‌లో ఒక్క కెమెరా కూడా లేదు. ప్రస్తుతం ఈ బ్లాక్‌లో 2 పీటీజెడ్ కెమెరాలతో పాటు 36 ఐ.ఆర్‌ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీటితో పాటు సెక్రటెరియట్‌ నాలుగు బ్లాక్‌ల ప్రధాన రహదారుల్లో 17 పీటీజెడ్ కెమెరాలు మరో 14 ఐ.ఆర్‌ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

రెండు కిలోమీటర్ల సామర్థ్యంతో పీటీజెడ్....
ఒక్క పీటీజెడ్ కెమెరా దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కదలికలను సైతం నిక్షిప్తం చేయగలదు. ఇక ఐఆర్‌ కెమెరాలు అమర్చిన దిశలో ఏక కాలంలో ఫోటోలు, వీడియోలను నిక్షిప్తం చేస్తుంది. 

09:56 - May 27, 2016

 ప్రధాని నరేంద్ర మోడీ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ జరిగింది . నిజంగా ప్రలజలు మోదీ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక సంపాదకులు) ,శ్రీనివాస్ యాదవ్,(తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి)ప్రేమేందర్ రెడ్డి (టీ.బీజేపీ జన్ రల్ సెక్రటరీ ) పాల్గొన్నారు. ఈ చర్చలో వక్తలు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి. సమగ్ర సమాచారం తెలుసుకోండి.

09:38 - May 27, 2016

నెల్లూరు : నరేంద్రమోదీ పాలనలో ఉద్యోగ అవకాశాలు పడిపోయాయని, యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసులు ఆరోపించారు. నెల్లూరు జెట్టి శేషారెడ్డి భవన్‌లో జరిగిన SFI విద్యా వైజ్ఞానిక సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అన్ని రంగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా పడిపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పెట్టుబడులను కేవలం అమరావతి చుట్టే తిప్పుతున్నారని, సమగ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు.

09:34 - May 27, 2016

ఢిల్లీ : మోది రెండేళ్ల పాలనను కాంగ్రెస్‌ తూర్పారబట్టింది. మోదివి ఊకదంపుడు మాటలే తప్ప...చేతల్లో చేసిందేమి లేదని ధ్వజమెత్తింది. మోది అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆర్ధికాభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, ఉద్యోగాల కల్పన, మొదలైన విషయాలలో మోదీ సాధించిందేమీ లేదని మండిపడింది.

మోది పాలనపై పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌...
ప్రధాని నరేంద్ర మోది రెండేళ్ల పాలను కాంగ్రెస్‌ ఎండగట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు అగ్రనేతలు ఆజాద్‌, కపిల్‌ సిబాల్, మల్లికార్జున ఖర్గే, రణదీప్‌ సూర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోది పాలనపై పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. ఆర్ధికాభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, ఉద్యోగాల కల్పన, మొదలైన విషయాలలో మోదీ సాధించినదేమీ లేదని వ్యాఖ్యానించారు.

మోది బ్యాండ్‌ కు కోట్లు ఖర్చు ....
మోది బ్యాండ్‌ బాజా కోసం కేంద్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ప్రధానిని స్తుతించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మోదిని దేవుడితో పోలుస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. గత రెండేళ్లుగా రైతులు కరువు కాటకాలతో, ఆకలి దప్పులతో అలమటించి ఆత్మహత్యలకు పాల్పడ్డా కేంద్రం చర్యలు చేపట్టలేదని, చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చిందని సూర్జేవాలా అన్నారు.

ప్రకటనలతోనే కాలం వెల్లబుచ్చుతోంది : ఆజాద్‌
కేంద్రం ప్రకటనలతోనే కాలం వెల్లబుచ్చుతోంది తప్ప ప్రజలకు చేసిందేమి లేదని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. బిజెపి నేతల వివాదస్పద ప్రకటనలతో సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోందని, రూపాయి తరుగుతోంది... ధరలు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, విదేశాంగ విధానాన్ని ఎవరు నడిపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.

ఏం చేశారని సంబరాలు : కపిల్ సిబాల్
ఈ రెండేళ్ల కాలంలో ఏం చేశారని బిజెపి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారని కపిల్‌ సిబాల్‌ ప్రశ్నించారు. నదుల్లో పాలు ప్రవహిస్తున్నాయా... వారణాసి స్వచ్ఛంగా మారిందా...ఢిల్లీతో పాటు దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగిపోయాయా.. రైతులకు అసలు ధర కన్నా 50 శాతం అధిక లాభం వచ్చిందనా...ఎవరు సంతోషంగా ఉన్నారని నిలదీశారు. రూపాయి విలువ పతనమవుతున్న తీరును ప్రస్తావిస్తూ- 56 ఇంచ్‌ల ఛాతి, డాలర్‌తో పోలిస్తే 58 రూపాయలు ఎక్కడికెళ్లాయని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. మన్మోహన్ మాటలు చెప్పే రకం కాదు.. కేవలం చేతల మనిషని... మోదీ మాత్రం మాటలకోరు.. చేతల్లో శూన్యమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

09:29 - May 27, 2016

ముంబై : దోంబివిల్లిలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్‌ పేలడంతో భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 45మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో చాలామంది కార్మికులు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. ఫైర్‌ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నాయి. పేలుడుకు భవనం పూర్తిగా ధ్వంసమైంది.

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం....

ముంబై : దోంబివిల్లిలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్‌ పేలడంతో భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 45మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో చాలామంది కార్మికులు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. ఫైర్‌ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నాయి. పేలుడుకు భవనం పూర్తిగా ధ్వంసమైంది.

09:21 - May 27, 2016

అమెరికా : డోనాల్డ్‌ ట్రంప్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ను సాధించారు. ఇందుకోసం 1237 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు 16 మంది రిపబ్లికన్‌ అభ్యర్ధులను ఓడించి 1239 మంది మద్దతు కూడగట్టారు. క్లీవ్‌లాండ్‌ ప్రైమరీ ఎన్నికల్లో విజయంతో ఈ మైలురాయిని అధిగమించారు. వచ్చే నెల 7న మరో ఐదు రాష్ట్రా పాథమిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ట్రంప్‌ మద్దతదార్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల నుంచి మరో 303 మంది ప్రతినిధులను ఎనుకోవాల్సి ఉంది. జూన్‌ 16 జరిగే రిపబ్లికన్‌ పార్టీ జాతీయ మహాసభల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈయన డెమాక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌తో ఢీ కోనడం ఒక్కటే మిగిలివుంది. న్యూయార్క్‌ రియల్టరైన డోనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కారు. ముస్లింలను అమెరికా రానీయకుండా చేస్తానంటూ చేసిన ప్రకటక తీవ్ర విమర్శలకు దారితీయడంతో కొద్దిగా వెనక్కితగ్గారు. భారతీయుపైనా నోరు పారేసుకున్నారు. అమెరికన్లకు ఉపాధి కల్పించేందుకు యూఎస్‌లో భారీతీయులకు ఉద్యోగాలు లేకుండా చేస్తానని హెచ్చరించి విమర్శలు కొని తెచ్చుకున్నారు. బరాక్ ఒబామా ద్వారా డెమాక్రట్ల పాలనకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన అమెరికన్లు ఈసారి రిపబ్లికన్లకు చాన్స్‌ ఇస్తారని భావిస్తున్నారు. దీంతో ట్రంప్‌ను అడ్డుకునే నాథుడే లేడని పరిశీలకులు చెబుతున్నారు.

09:16 - May 27, 2016

నెల్లూరు : కావలిలో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న శివకుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో హాస్టల్లో విషాదం నెలకొంది. మూడో అంతస్థు నుండి క్రిందికి దూకి చనిపోయినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న శివకుమార్ తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. శివకుమార్ మృత దేహాన్ని చూసిన తండ్రి శ్రీనివాస్ కుప్పకూలిపోయారు. అదే ఆసుపత్రిలో అతనికి కూడా చికిత్సనందిస్తున్నారు. శివకుమార్ మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించకముందే దేహాన్ని యాజమాన్యం సంఘటనాస్థలం నుండి తరలించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శివకుమార్ కు చెవి దగ్గర చిన్నగాయం మినహా శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవటంతో అనుమానాలు బలపడుతున్నాయి.గతంలో కూడా ఇదే కాలేజీలో యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఉదయభారతి అనే విద్యార్థిని కూడా వాస్మాల్ 33 తీసుకుని చనిపోయింది. ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగినట్లుగా సమాచారం.

09:09 - May 27, 2016

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు. బారాముల్లాలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి...

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు. బారాముల్లాలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

08:58 - May 27, 2016

కడప : 18 నెలలుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా తమ సమస్యలకు పరిష్కారమార్గాన్ని మాత్రం చూపలేదని అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కడప కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధిత ఐక్యసాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమల జిల్లాల అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులు పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. అగ్రిగోల్డ్ నిందితుల బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని... బాధితులు డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏమయ్యాయని, సీఐడి వారిని ఎందుకు ప్రశ్నించలేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై జూన్ 14వతేది లోగా స్పదించకపోతే జూన్ 15న ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

గాంధీలో అరుదైన శస్త్రచికిత్స...

హైదరాబాద్  :సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సచేశారు. మహిళ కడుపులో ఉన్న 8 కిలోల కణితిని తొలగించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఫాతిమాకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో కణితి ఉందని నిర్దారించారు. గాంధీ వైద్యబృదం ఫాతిమాకు ఆపరేషన్‌ చేసి కణితిని తొలగించారు.

08:55 - May 27, 2016

హైదరాబాద్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సచేశారు. మహిళ కడుపులో ఉన్న 8 కిలోల కణితిని తొలగించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఫాతిమాకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో కణితి ఉందని నిర్దారించారు. గాంధీ వైద్యబృదం ఫాతిమాకు ఆపరేషన్‌ చేసి కణితిని తొలగించారు. 

08:53 - May 27, 2016

హైదరాబాద్ : ఇద్దరూ జాతీయ నాయకులు , ఒక‌రూ రాజ‌కీయ నాయ‌కుడు. వారి విగ్రహాల ఏర్పాటులో రాజ‌కీయ ర‌గ‌డ‌. వెర‌సి ఐదేళ్లుగా విగ్రహాలపై తొలగని ముసుగులు. జీహెచ్‌ఎంసీ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఆ మూడు విగ్రహాలు నేటికి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. తాజాగా ఏర్పడ్డ పాల‌క‌మండ‌లి ఏం చేయబోతుంది .

ఐదేళ్లుగా ముసుగుతో వున్న మూడు విగ్రహాలు ...
బ‌ల్దియా ప్రధాన కార్యాల‌య ప్రాంగ‌ణం ముందు గ‌డిచిన ఐదేళ్లుగా మూడు విగ్రహాలు ముసుగుతో ఉన్నాయి. ఇందులో మ‌హాత్మ గాంధీ, అంబేద్కర్, తో పాటు ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ఉన్నాయి. అప్పటి మేయర్‌ బండా కార్తీకా రెడ్డి దివంగత నేత వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ప్రతిష్టించాలని నిర్ణయించింది ఇప్పటికైనా విగ్రహాల తెర‌తొలుగుతుందా.

మేయర్‌ నిర్ణయానికి వ్యతిరేకత....
అయితే ప్రతిప‌క్షాలు మేయర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘ‌టించాయి. వైఎస్‌ విగ్రహం పక్కన రాత్రికి రాత్రి అంబేద్కర్‌, మహాత్మ గాంధీ విగ్రహాలు నిలబెట్టారు. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదం అవ్వడంతో విగ్రహాలకు ముసుగులు వేశారు. ఐదేళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.

దృష్టి సారించిన పాల‌క‌మండ‌లి....
అయితే కొత్తగా ఏర్పాటైన పాల‌క‌మండ‌లి వీటిపై దృష్టి సారించింది. ఈ విగ్రహాల ఏర్పాటుకు ఎంచుకున్న స్థలం అనాలోచితంగా ఉంద‌నే అభిప్రాయానికి వ‌చ్చింది. ప్రధాన గేటు రోడ్డుపై అడ్డంగా ఉండ‌టంతో రాక‌పోక‌ల‌కు కూడా అంత‌రాయంగా మారిందంటున్నాయి బ‌ల్దియా వ‌ర్గాలు. దాంతో ఆ విగ్రహాల‌ను ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుండి మార్చి మ‌రో చోటా ఎర్పాటు చేయ్యాడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యవ‌హారంతో బ‌ల్దియాలో విగ్రహాల రాజ‌కీయానికి తెర ప‌డుతుందా, లేక మరింత రాజ‌కీయ రంగు పులుముకుంటుందా అనేది కార్పొరేష‌న్ లో హాట్ టాపిక్ గా మారింది.

08:48 - May 27, 2016

హైదరాబాద్: వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే రంజాన్‌ మాసానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రంజాన్‌ ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జంటనగరాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. మజీదులు, ఈద్గాల దగ్గర రంజాన్‌ ఏర్పాట్లకు ప్రతి జిల్లాలకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయంతీసుకున్నారు. రంజాన్‌ మాసంలో కరెంట్‌ కోతలు లేకుండా చూడాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. 

08:46 - May 27, 2016

హైదరాబాద్: రాజ్యస‌భపై ఆశ‌ప‌డ్డ కాంగ్రెస్ ఆశ‌ల‌పై నీళ్ళుజ‌ల్లారు గులాబి బాస్. సంఖ్యాబ‌లం లేకున్నా బ‌రిలోకి దిగాల‌ని డిసైడ్ అయిన కాంగ్రెస్.. వీహెచ్‌ను పోటిలోకి దింపాల‌ని నిర్ణయించింది. ఐతే కాంగ్రెస్ ఇంకా తర్జన భర్జనల్లో ఉండ‌గానే .. టిఆర్ఎస్ అభ్యర్థుల‌ను ప్రక‌టించేసింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలా..అని అయోమయంలో ప‌డ్డారు హ‌స్తం నేత‌లు.

కాంగ్రెస్ ఝల‌క్ ఇచ్చిన టీఆర్ఎస్ ....
తెలంగాణ‌లో ఖాళీ అయిన రాజ్యస‌భ సీటును మ‌ళ్ళీ ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ త‌లిస్తే... వారి ఆశ‌ల‌పై టిఆర్ఎస్ నీళ్ళు జ‌ల్లింది. సంఖ్యా బ‌లం లేక‌పోవ‌డంతో.. మొద‌ట దూరంగా ఉందామ‌నుకున్న కాంగ్రెస్..ఉన్నట్టుండి పోటీకి సిద్ధమైంది. తాజాగా రిటైర్ అయిన వీహెచ్‌నే బ‌రిలోకి దింపాల‌ని నిర్ణయించింది. అంతేకాదు వీహెచ్ పేరును అధిష్టానానికి పంపించింది పీసీసీ. ఐతే ఇంత‌లోనే టిఆర్ఎస్ ఝల‌క్ ఇచ్చింది.

కాంగ్రెస్ బ‌లం 15 మంది మాత్రమే....
ప్రస్తుతం కాంగ్రెస్ బ‌లం 15 మంది. గెలవాలంటే.. కావ‌ల్సింది 40 మంది ఎమ్మెల్యేలు. అయినప్పటికీ వీహెచ్ ను రంగంలోకి దింపాల‌ని నిర్ణయించింది. అంతే స్పీడ్ గా సోనియాను క‌లిసిన విహెచ్ త‌న కోర్కెను చెప్పుకున్నారు. తాను ఎలాగైనా కేసీఆర్ ను ఒప్పించుకుంటాన‌ని విహెచ్ సోనియాకు వివ‌రించారు. ఇంత‌లోనే.. కేసీఆర్ టీఆర్‌ఎస్‌ తరపున రాజ్యస‌భ అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. డి శ్రీనివాస్, కెప్టెన్ ల‌క్ష్మికాంత్‌రావుల పేర్లను ప్రక‌టించేశారు. గతంలో తమ మద్దతు తీసుకున్న కేసీఆర్ ఇలా ఝల‌క్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు హ‌స్తం నేత‌లు. ఐతే ఈమొత్తం వ్యవ‌హారంపై పార్టీలో కొంద‌రు పీసీసీ ఛీప్ పై ఆగ్రహంగా ఉన్నారు. బ‌లం లేకున్నా ..బ‌రిలోకి దిగాల‌ని నిర్ణయించ‌డం.. ఉత్తమ్‌ అనాలోచిత చ‌ర్యగా వారు అభిప్రాయప‌డుతున్నారు.

రాజ్యసభ సీటు పాకులాటపై పార్టీలో చర్చ...
ఇప్పటికే కేసీఆర్ పాల‌న‌పై నిత్యం ఆరోప‌ణ‌లు చేస్తున్న కాంగ్రెస్.. మ‌ళ్ళీ రాజ్యస‌భ సీటు కోసం .. టిఆర్ఎస్‌తో దోస్తికి పాకులాడ‌టం ఇప్పుడు పార్టీలో చ‌ర్చకు తెర‌లేపింది. మ‌రి దీన్ని పీసీసీ ఛీఫ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

08:41 - May 27, 2016

హైదరాబాద్ : సకాలంలో టార్గెట్లు పూర్తి చేయని అధికారుల పైచర్యలు తప్పవని ఇరిగేషన్ శాఖ మంత్రి హారిష్ రావు స్పష్టం చేశారు. శాఖ పరమైన విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన వరంగల్ ఎస్ ఈ, అండ్ నల్గోండ సిఈ ల పై చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల ప్రాజక్టులను గుడువులోపల పూర్తి చేయడానికి వీలుగా ఈ శాఖలో 108 అదనపు పోస్టులను కూడా మంజూరు చేయించారు.

హారిష్ రావు తన మార్క్ .....
నీటి పారుదల శాఖలో మంత్రి హారిష్ రావు తన మార్క్ పాలన కొనసాగి స్తున్నారు. ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయని అధికారుల పై వేటు వేస్తున్నారు. పనితీరును మెరుగుపరచుకోవడంలో విఫలమవుతున్న ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పై 'వేటు' అస్త్రం ఉపయోగిస్తున్నారు మంత్రి హరీష్‌. ఇప్పటికే నల్లగొండ చీఫ్ ఇంజనీర్ పురుషోత్తమరాజును బదిలీ చేశారు. వరంగల్ ఎస్ఇ . విజయభాస్కర్ ను సెలవుపై వెళ్ళాలని మంత్రి ఆదేశించారు. తమ వైఖరిని మార్చుకోని వారిని ఉపేక్షించేది లేదని మంత్రి అంటున్నారు.

108 అదనపు పోస్టులను కూడా మంజూరు...
ప్రాజెక్టుల రీ డిజైన్‌, మిషన్ కాకతీయ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది పై భారం పడకుండా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రాజక్టులను గడువు లోపల పూర్తి చేయడానికి వీలుగా ఈ శాఖలో 108 అదనపు పోస్టులను కూడా మంజూరు చేయించారు. 8 సి.ఇ , 7ఎస్.ఇ , 21 ఇ. ఇ , 55 డిప్యూటీ ఇ.ఇ, 15 డివిజనల్ అకాట్ ఆఫీసర్లను నియమించారు. ఇప్పటికే దాదాపు నాలుగు వందల మంది అసిస్టెంట్ ఇఇలు, ఎఇలను టిఎస్పిఎస్సి ద్వారా నియమించారు.

ఇంజనీర్స్ పనితీరుపై మంత్రి దృష్టి....
ఇక జిల్లాల వారీగా, డివిజన్ వారీగా సిఇ, ఎస్ఇ, డిఇఇ , ఎఇఇ తదితర ఇంజనీర్లందరి పనితీరు పై మంత్రి దృష్టి సారించారు మంత్రి. శాఖలోని వివిధ స్ధాయిల్లోని అధికారుల పని తీరు , వారి వ్యవహార శైలీ పై ఇంటలిజెన్స్, నీటిపారుదల శాఖ నుంచి , ఇతర మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకొని హరీష్‌రావు పరిశీలిస్తున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్ లలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు , మిషన్ కాకతీయ పనులలో ఇంజనీరింగ్ అధికారులు నిర్లిప్త వైఖరిని, అలసత్వాన్ని విడనాడకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

08:37 - May 27, 2016

హైదరాబాద్ : నేడు జరిగే ఎడ్‌సెట్‌ కు తెలంగాణ ఉన్నత విద్యామండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 110 కేంద్రాల్లో 45 వేల 500 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్షకు గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు సూచిస్తున్నారు.

ఉదయం 11 గంటల నుంచి పరీక్ష...
నేడు జరిగే తెలంగాణ ఎడ్‌సెట్‌కు ఉన్నత విద్యామండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎగ్జామ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 110 కేంద్రాల్లో నిర్వహిస్తున్న బీఎడ్‌ పరీక్షకు ఈసారి 45 వేల 500 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. అందుకే ఈ సారి గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు సూచిస్తున్నారు.

జూన్‌ 2న ప్రాథమిక కీ విడుదల ....
జూన్‌ రెండున ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్‌ 8 వరకు అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. ఆ తర్వాత జూన్‌ 12న ఫైనల్‌ ఫలితాలను విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు. ఈసారి బీఎడ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం డిఎస్సీని టీఎస్‌పీఎస్సీకి అప్పగించడంతో ఈసారి బీఎడ్‌ క్రేజ్‌ తగ్గింది. గతేడాది కంటే కూడా ఈసారి ఎడ్‌సెట్‌ దరఖాస్తులు తక్కువ రావడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు అధికారులు. అసలే ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఎదురు చూడటం, డిఎస్సీని టీఎస్‌పీఎస్సీకి అప్పగించడం తదితర కారణాల వల్లే ఈసారి బిఎడ్‌ క్రెజీ తగ్గిందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.

08:19 - May 27, 2016

హైదరాబాద్ : ఆదివాసీలు, దళితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణిచివేతను తీవ్రతరం చేశాయని ప్రొఫెసర్‌ సాయిబాబా అభిప్రాయపడ్డారు. రాజ్య యంత్రాంగం ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరిట ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకం చేసేందుకు సిద్ధపడుతోందని అన్నారు. దేశంలోని 11 కోట్ల మంది ఆదివాసీల్లో సగం మందిని ఊచకోత కోసేలా గ్రీన్‌ హంట్‌ తీవ్రంగా కొనసాగుతోందని సాయిబాబా అన్నారు. హైదరాబాద్‌లోని లామకాన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్‌ సాయిబాబా నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు జీవితంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

08:16 - May 27, 2016

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో.. నేడు జరిగే కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. జలవివాద పరిష్కారం దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

వాదనలు వినిపించనున్న ఇరు రాష్ట్రాలు....
కృష్టానది జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం కృష్ణా బోర్డు సమావేశం కీలకంగా మారింది. కృష్ణా జలాల కోసం రెండు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు దీక్షలు, సవాళ్లకు దిగాయి. కేంద్రానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి బోర్డు మీటింగ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి.

సమావేశంలో 11 అంశాలు చర్చ అవకాశం....
బోర్డు సమావేశంలో 11 అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధి, వాటర్‌ ఇయర్‌ లాంటి అంశాలు సమావేశం ఎజెండాలో భాగం కానున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన నాగర్జునసాగర్, శ్రీశైలం నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం దిశగా బోర్డు సమావేశం చర్చించనుంది. ఉద్యోగులు, నిధుల కేటాయింపులు కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. రాబోయే సీజన్‌లో నీటి వినియోగం, విద్యుత్‌ ఉత్పత్తి పంపిణీ తదితర అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులైన పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి. ప్రాజెక్టుల వారిగా నీటి పంపిణీ అంశం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఈ సమావేశంతో సమస్య పరిష్కారం కానుందా?....
గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదాలను కృష్ణా బోర్డు సమావేశం పరిష్కరిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. భవిష్యత్‌లోనైనా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఈ సమావేశం ఓ పరిష్కారం చూపాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 

08:02 - May 27, 2016

తిరుపతి : టీడీపీ మహానాడుకు రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ముస్తాబయ్యింది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జరిగే పుసుపు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం పది గంటలకు TDP జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అధ్యక్షోపన్యాసం చేయనున్నారు.

మహానాడుకు వేదికగా నెహ్రూ పాఠశాల...
తిరుపతిలోని చారిత్రక నెహ్రూ ఉన్నత పాఠశాల మైదానం వేదికగా మహానాడు నిర్వహిస్తున్నారు. పార్టీతోపాటు ప్రభుత్వ విధానాలను సమీక్షించుకుని భవిష్యత్‌కు బంగారు బాట వేసుకునేందుకు వీలుగా మహానాడులో చర్చలు సాగుతాయి. టీడీపీ రెండేళ్ల పాలనపై ఆత్మావలోకనం చేసుకుంటారు. టీడీపీ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఈ పసుపు పండుగకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ పై లోకేష్ అసహనం...
మహానాడు వేదికను కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఏపీ రాజధాని అమరావతిని ఇతివృత్తంగా తీసుకుని ధ్యానబుద్ధుడి ప్రతిమ కనిపంచేలా వేదిక ఏర్పాటు చేసారు. వేదిక పైభాగంలో టీడీపీ చిహ్నం నాగలి, చక్రం, గుడిసె స్పష్టంగా కనిపించేలా వేదికను తీర్చిదిద్దారు. బెంగళూరుకు చెందిన ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించారు. మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌... వేదిక బలహీనంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పదిమంది కూర్చుంటే కూలిపోయేలా ఉందని వ్యాఖ్యానించారు. వేదికను పటిష్టపరచాలని ఆదేశించారు. వేదికకు వేసిన రంగులు సరిగాలేవని అసహసనం ప్రదర్శించారు. దీంతో నిర్వాహకులు హుటాహుటిన మార్పులు, చేర్పులు చేశారు.

8 కమిటీలుతో మహానాడు ఏర్పాట్లు....
తిరుపతిలో టీడీపీ మహానాడును నిర్వహిచండం ఇది మూడోసారి. గతంలో పార్టీ అధికారంలో ఉండగా 2003, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2007లో ఇక్కడే పార్టీ పండుగను జరిపారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఇప్పుడు తిరుపతి కేంద్రంగా మహానాడు నిర్వహిస్తున్నారు. నగరం మొత్తాన్ని పార్టీ జెండాలతో పసుపు మయం చేశారు. మొత్తం 8 కమిటీలు మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఈ పండుగకు హాజరయ్యే పార్టీ నేతలు, కార్యకర్తల వాహనాలను నిలిపేందుకు 13 పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మహానాడు భద్రత కోసం రాయలసీమ జిల్లాల నుంచి 3500 మంది పోలీసు సిబ్బందిని రప్పించారు. తిరుపతి ఎస్పీ జయలక్ష్మి, చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌, అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌, కడప ఎస్పీ రామకృష్ణ, మరో ఐపీఎస్‌ అధికారి క్రాంతి రాణా టాటా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

30 వేల మంది ప్రతినిధులు.....
టీడీపీకి ఇది 35వ మహానాడు. ఈ పండుగలకు 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనావేసి, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, అండమాన్‌ నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అలాగే అమెరికా, బ్రిటన్‌, కువైట్‌, దుబాయ్‌ తదితర దేశాల నుంచి ప్రవాస భారతీయ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం తిరుపతిలోని అన్ని హోటళ్లలో వెయ్యికిపైగా గుదులను బుక్‌ చేశారు. వీటితోపాటు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం అతిథిగృహాలు, తిరుమలలోని కొన్ని గదులను కూడా బ్లాక్‌ చేసి ఉంచారు.

28 తీర్మానాలను ఆమోదించే అవకాశం...
మహానాడులో 28 తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధికలోటు భర్తీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్ధిక సహాయం తదితర తీర్మానాలు ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తారు. ఆర్ధికలోటు భర్తీ, అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులపై వివరణపై చంద్రబాబునాయుడు వివరణ ఇస్తారు.

30 రకాల వంటకాలు ....
ఇక మహానాడుకు వచ్చే ప్రతినిధుల కోసం రాయలసీమ రుచులతో ఘుమఘుమలాడే వంటకాలను వడ్డించనున్నారు. మూడు రోజులు శాఖాహారాన్నే అందిస్తారు. ప్రతిరోజూ 30 రకాల వంటకాలు రుచిచూపిస్తారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పసుపు పండుగను నిర్వహించేందుకు మహానాడు కమిటీలు చర్యలు తీసుకున్నాయి.

కావలిలో విద్యార్థి అనుమానాస్పద మృతి...

నెల్లూరు : ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ విద్యార్థి శివకుమార్ అనుమానాస్పదంగా మృతి చెందటం హాస్టల్ లో విషాదం నెలకొంది. శివకుమార్ అనంతసాగరం మండలం మొనుపల్లి వాసిగా గుర్తించారు.

సైకాలజిస్ట్‌ జాతీయ మహాసభలు...

విజయవాడ : హోటల్‌ ఐలాపురంలో జూన్‌ 4, 5 తేదీల్లో ప్రొగ్రెసివ్‌ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ప్రత్యూష సుబ్బారావు గురువారం తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 300 మందికి పైగా సైకాలజిస్టులు ఈ మహాసభలకు హాజరవనున్నట్లు వివరించారు.

కల్తీ 'రక్త పిశాచి' అరెస్ట్ ....

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీరక్తం కేసులో ప్రధాన నిందితుడు కంచం నరేంద్రప్రసాద్‌ను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో వారంక్రితం కల్తీరక్తాన్ని రోగులకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేయగా వివిధ బ్లడ్‌బ్యాంక్‌ల నకిలీ లేబుల్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఈ నెల 24న చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.

Don't Miss