Activities calendar

28 May 2016

రాంచీలో 293 అడుగుల జాతీయ జెండా..

జార్ఖండ్ : రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అతి పెద్ద జాతీయ జెండాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే.

 

21:36 - May 28, 2016

అమెరికా : 8 ఎఫ్‌ 16 యుద్ధ విమానాలు కొనుగోలు చేయడంలో పాకిస్థాన్‌ విఫలమైంది. ఇరుదేశాల మధ్య డబ్బు లావాదేవీలకు సంబంధించి అవగాహన కుదరకపోవడమే ఇందుకు కారణమని పాక్‌ పత్రిక డాన్‌ వెల్లడించింది. అమెరికాకు 7 వందల మిలియన్‌ డాలర్లు చెల్లించడంలో పాక్‌ విఫలమైంది. ఇండియన్‌ కరెన్సీలో ఇది 4 వేల 7 వందల కోట్ల డీల్. ఎఫ్‌ 16 విమానాలు కొనుగోలుకు సమ్మతిస్తున్నట్లు నవాజ్‌ షరీఫ్‌ అమెరికాకు లిఖిత పూర్వకంగా తెలపాల్సి ఉంది. మే 24కు డెడ్‌లైన్‌ ముగిసినా పాకిస్తాన్‌ లేఖ రాయకపోవడంతో అమెరికా ఇచ్చిన ఆఫర్‌ ఇక ముగిసినట్లేనని డాన్‌ తెలిపింది. ఎఫ్‌ 16 విమానాల కొనుగోలుకు సంబంధించి తొలుత 270 మిలియన్‌ డాలర్లు చెల్లించడానికి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత డబ్బులు పూర్తిగా చెల్లించాల్సిందేనని అమెరికా చేసిన ప్రతిపాదనను పాకిస్తాన్‌ తిరస్కరించింది.

21:34 - May 28, 2016

అమెరికా : న్యూక్లియర్‌ సప్లయర్స్ గ్రూప్‌లో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం సబబు కాదని అమెరికా పాకిస్తాన్‌కు హితవు పలికింది. ఎన్‌ఎస్‌జి సభ్యత్వం ఇవ్వడమంటే అణ్వాయుధాల పోటీ కాదని అమెరికా పాక్‌కు నచ్చచెప్పింది. పౌర అణుశక్తి కోసమే భారత్‌ దీన్ని ఉపయోగించుకోనుందని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ నమ్ముతుందన్న ఆశాభావాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనర్‌ వ్యక్తం చేశారు. 2015లో ఒబామా భారత పర్యటన సందర్భంగా ఎన్‌ఎస్‌జి సభ్యత్వం చర్చకు వచ్చింది. మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ సిస్టంలోని షరతులను అంగీకరిస్తేనే భారత్‌కు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం లభించనుంది.

21:32 - May 28, 2016

పుదుచ్చేరి : ఎట్టకేలకు పుదుచ్చేరి కొత్తసీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణసామి ఎన్నికయ్యారు. ఆ పార్టీ శాసనసభపక్ష సమావేశం పుదుచ్చేరి కార్యాలయంలో జరిగింది. ఇందులో కాంగ్రెస్ అధిష్టానం దూతగా సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ తరపున ఎన్నికైన శాసన సభ్యులంతా పాల్గొన్నారు. సభ్యలు అభిప్రాయం మేరకు నారాయణసామిని పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్నిక చేస్తున్నట్లు షీలాదీక్షిత్ తెలిపారు.

21:29 - May 28, 2016

హైదరాబాద్ : ఎవరెస్టు అధిరోహించిన ఏఎస్పీ రాధిక మరియు బృంద సభ్యులు హైదరాబాద్‌ చేరుకున్నారు. రాధికకు పోలీసు ఫోర్స్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తన విజయానికి సహకరించిన పోలీసు డిపార్ట్‌మెంట్‌కు రాధిక కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ, భువనగిరి రాక్‌ క్లైంబ్లింగ్‌ స్కూల్‌ ప్రధాన శిక్షకుడు బచినేపల్లి శేఖర్‌బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం గత ఏప్రిల్‌లో ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహణకు వెళ్లి.. ఈనెల 20న ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించారు. 

21:27 - May 28, 2016

హైదరాబాద్ : కాపు ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ. ఇప్పటికే ఉద్యమానికి మద్దతిచ్చిన నాయకులను ప్రత్యక్షంగా కలిసి కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. భవిష్యత్‌ కార్యాచరణను వివరిస్తున్నారు. మరోవైపు ఆగస్టులోగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా జరుగుతున్న కాపు ఉద్యమం తీవ్రరూపం దాల్చబోతోంది. కాపులను బీసీలుగా చేస్తామని చంద్రబాబు చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చాలని .. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన నేతలను హైదరాబాద్‌లో స్వయంగా కలుస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

రఘువీరా..చిరంజీవి..దాసరి..వీహెచ్..
తొలుత ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డిని కలిశారు ముద్రగడ. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, పార్లమెంటులో కూడా అండగా ఉంటుందని రఘువీరారెడ్డి తెలిపారు. అనంతరం ముద్రగడ చిరంజీవిని కలిశారు. ముద్రగడ పద్మనాభంకు తమ మద్దతు ఉంటుందని చిరంజీవి తెలిపారు. ఉద్యమానికి మద్దతిచ్చినందుకు ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు ముద్రగడ. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని దాసరి స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో ముద్రగడ భేటీ అయ్యారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే వరకు తమ మద్దతు ఉంటుందని బొత్స తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావును ముద్రగడ కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. దీనికి కాపులకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వీహెచ్‌ హామీ ఇచ్చారు. కాపు ఉద్యమంపై రోడ్డెక్కే పరిస్థితి కల్పించింది చంద్రబాబేననది ముద్రగడ అన్నారు. ఆ పరిస్థితి మళ్లీ రాకుండా.. ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలన్నారు. మొత్తానికి ఈసారి కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ముద్రగడ యత్నిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి. 

21:23 - May 28, 2016

హైదరాబాద్ : సంఖ్యా బ‌లం లేకున్నా రాజ్యస‌భ‌పై ఆశ‌ప‌డ్డారు. ఛాన్స్ కోసం చివరి వరకు హోప్స్ పెట్టుకున్నారు. అంత‌లోనే డిఫెన్స్ లో ప‌డ్డారు. డ్రాప్‌ అయిపోవాలని డిసైడ్‌ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరమంటూ చేతులెత్తేశారు. సీఎల్పీ సాక్షిగా నిర్ణయాన్ని ప్రకటించేశారు. అసలు ఈ ఎపిసోడ్‌లో టీ కాంగ్రెస్‌ స్ట్రాటజీ ఏమిటి..? ఎందుకు ధైర్యం చేశారు..చివరికి ఎందుకు దూరమయ్యారు.. ? సిట్టింగ్‌ ఎంపీ విహెచ్ నే మ‌ళ్ళీ బ‌రిలోకి దింపాల‌ని టీ-కాంగ్రెస్‌ భావించింది. హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కేసీఆర్‌ మద్దతు కోసం ప్రయత్నాలు చేయాలని డిసైడ్‌ అయ్యింది. అంతలోనే గులాబీ బాస్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో డిఫెన్స్‌లో పడ్డ టీ కాంగ్రెస్‌ నేతలు సీఎల్పీ సమావేశం పెట్టుకుని రెండు గంటలపాటు చర్చించారు. చివరికి రాజ్యసభ పోటీకి దూరమంటూ ప్రకటించారు.

కేసీఆర్ హ్యాండిచ్చారన్న వీహెచ్..
గులాబీ బాస్ ఇచ్చిన షాక్‌పై సీఎల్పీ సమావేశంతో టీ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా చర్చించారు. గ‌తంలో కేకే కు మ‌ద్దతిచ్చినా... ఆ ఆన‌వాయితికి కేసీఆర్ గండికొట్టార‌ని నేత‌లు గ‌రం గ‌రం అయ్యారు. సంఖ్యాబ‌లం లేకుండా బ‌రిలోకి దిగితే మ‌రో ఓట‌మి ని మూట‌క‌ట్టుకోవాల్సి వ‌స్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్నారు. ఐతే రాజ్యసభ ఛాన్స్‌పై ఆశలు పెట్టుకున్న వీహెచ్‌..కేసీఆర్‌ హ్యాండ్‌ ఇచ్చారంటూ ఫైరయ్యారు. మొత్తానికి కేసీఆర్ ఝల‌క్‌తో యూట‌ర్న్ తీసుకున్న కాంగ్రెస్, పైకి మాత్రం కేసీఆర్ నైజం తెలిపోయిందంటూ మేక‌పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. 

21:21 - May 28, 2016

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు ప్రజలు గర్వపడేలా అమరావతిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. భారత దేశమంటే అమరావతే గుర్తుకొచ్చేలా న్యవాంధ్ర రాజధానిని తీర్చిదిద్దుతామని తేల్చిచెప్పారు. మహానాడులో రెండో రోజు పలు అంశాలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలను మహానాడులో ఆమోదించారు. ఎన్టీయార్‌ జయంతి వేడుకలతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమరావతి తీర్మానంపై చర్చను తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రతిపాదించగా దానిని పార్టీ నేతలు శిరీష, శ్రీనివాసురెడ్డి బలపరిచారు. మౌలికసదుపాయాల కల్పన తీర్మానాన్ని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రతిపాదించగా.. రేణుక బలపరిచారు.

బాబు ప్రసంగం..
చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రజా రాజధానిగా విరాజిల్లుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చేపట్టే రాజధాని యజ్ఞానికి ప్రతిపక్ష నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రపంచ పటంలో అమరావతి అనతి కాలంలోనే తగిన గుర్తింపు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే చిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామని... 5జాతీయ అవార్డులు రావటమే దీనికి నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ ఆదాకు చేపట్టిన చర్యలను సీఎం వివరించారు. అమరావతిలో 115.5 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

221 మంది రక్తదానం..
రెండో రోజు మహానాడు వేడుకలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తో పాటు 221 మంది రక్తదానం చేశారు. భోజన విరామ సమయానికి ముందు మొత్తం నాలుగు తీర్మానాలను సభ ఆమోదించింది. ఎన్టీఆర్ కు నివాళితో పాటు తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ, అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయల కల్పన తీర్మాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మహానాడు వేడుకలో ఎన్టీఆర్ జన్మదినం రోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మంత్రి పరిటాల సునీతకు అంతా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభా వేదికపై సునీతతో కేక్ కట్ చేయించారు. పార్టీ నేతలంతా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్రపై కేంద్రమంత్రి అశోక్‌గజపతి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

20:53 - May 28, 2016

ప్రపంచంలో ఉన్న అన్నీ జీవుల్లోకెల్లా మనిషి దే ఉత్తమ స్థానం. మరి అలాంటి మనిషి అత్యాశకు పోయి తన ప్రాణాల మీదకు తీసుకొచ్చుకుంటున్నాడు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నాడు. నేడు సమాజంలో మనిషిని మనిషే మోసం చేసుకుంటున్న ఈ రోజుల్లో కట్టుకథలు అల్లడం తేలికైన పని. ప్రతొక్కరికీ ఈ రోజుల్లో అవసరం కూడా. ఆ అవసరం మితి మీరితే ?. సంభవించే దుష్ర్పఫలితాలు ఆ మనిషినే భస్మం చేస్తాయి. కట్టు కథలు చెప్పడం కొంతమందికి వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనమే కొంతమందిని కాపాడుతుంది. మరికొంతమందిని తెంచుకోలేని చిక్కుల్లో తోసేస్తుంది. గెస్ట్ హౌస్ లో డాక్టర్ వంశీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న డిటెక్టివ్ బృందం రంగంలోకి దిగింది. ఆయన పనిచేస్తున్న హాస్పిటల్ లో ఓ మహిళతో డాక్టర్ వంశీ అక్రమ సంబంధం కొనసాగించాడు. పెళ్లైన విషయం తెలుసుకున్న ఆ మహిళ డాక్టర్ వంశీని నిలదీసింది. భార్యను అడ్డుతొలగించి పెళ్లి చేసుకుంటానని మహిళ పేర్కొంది. అంతలో పోస్టుమార్టం వచ్చింది. ఆత్మహత్య కాదని..హత్యేనని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. మరి వంశీని చంపింది ఎవరు ? భార్య చంపేసిందా ? లేక ఆస్తిపై కన్నేసిన ఆ మహిళ హత్య చేసిందా ? చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

టీఎంసీ విజయోత్సవ ర్యాలీలో బాంబు దాడి..

కోల్ కతా : ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై రాష్ట్రంలో సంబరాలు కొనసాగుతున్నాయి. నార్త్ 24 పరగణాన్ లో టీఎంసీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొందరు దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 9మందికి గాయాలయ్యాయి. 

సైఫాబాద్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌బస్తీలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. మధ్యమండల డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సరైన పత్రాలు లేని 72 బైక్‌లు, 100 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మాజీ ఎంపీ విఠల్ రావు కన్నుమూత..

హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ విఠల్ రావు కన్నుమూశారు. 2004-2009 మధ్య మహబూబ్ నగర్ ఎంపీగా కొనసాగారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విఠల్ రావు తుదిశ్వాస విడిచారు. 

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..

నల్గొండ : దామర్లచర్ల మండలం రాజగట్టులో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

20:27 - May 28, 2016

ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లె పదాలతో కూడిన పాటలు వింటుంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా, ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు వ్రాయాలంటే పల్లెల సంప్రదాయాలు, స్థితిగతులు, వారి సున్నితమైన మనస్సులు, పల్లెల పరిసరాలు వీటన్నింటి పట్ల ఒక నిగూఢమైన నిబద్ధత వుంటేనే ఆ స్వచ్ఛత వారి గళంలోనూ...కలంలోనూ కనపడుతుంది. మరి అటువంటి వాగ్గేయకారులే..బుచ్చన్న, సోమన్న, జయరాజు...వీరంతా 'మల్లన్న'తో ముచ్చట్లు చెప్పిండ్రు..ముచ్చట్లే కాదు ధూం..ధాం పాటలు కూడా పాండినరు. మరి వారు ఎలాంటి ముచ్చట్లు చెప్పిండ్రో..ఎలాంటి పాటలు పాడినరో తెలియాలంటే..వీడియో క్లిక్ చేయండి. 

20:04 - May 28, 2016

పవన్ కళ్యాణ్ తో ఓ సాంగ్..లేదా మల్లెమాల వందో ఎపిసోడ్ లో ఛాన్స్ వస్తే ఏ దానికి ఒప్పుకుంటారని అంటే పవన్ కళ్యాణ్ కే అంటూ నటి, యాంకర్ 'శ్రీముఖి' పేర్కొంది. బుల్లితెరపై యాంకర్ నిర్వహిస్తూ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న 'శ్రీముఖి' టెన్ టివితో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను తెలియచేసింది. పలువురు యాంకర్స్..అభిమానులు ఫోన్ చేసి శ్రీముఖితో మాట్లాడారు. ఈ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం..

నెల్లూరు : చికిత్స కోసం వచ్చిన ఓ రోగి పట్ల ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోగిని రోడ్డుపై వదిలేశారు. దీనితో ఆ రోగి కాల్వలో పడిపోయాడు.

ఇండియా గేట్ వద్ద 'ఒక కొత్త ఉదయం'...

ఢిల్లీ : ఎన్డీయే రెండేళ్ల పాలన సందర్భంగా ఇండియా గేట్ వద్ద 'ఒక కొత్త ఉదయం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మీడియాతో మాట్లాడారు. భేటీ బచావో భేటీ పడావో పథకం ద్వారా మహిళా సాధికారితకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపొద్దని, అవకాశమిస్తే ఆడపిల్లలు అద్భుతాలు చేస్తారని తెలిపారు. 

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం..

నెల్లూరు : చికిత్స కోసం వచ్చిన ఓ రోగి పట్ల ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోగిని రోడ్డుపై వదిలేశారు. దీనితో ఆ రోగి కాల్వలో పడిపోయాడు.

 

షార్ లో అజ్ఞాత వ్యక్తి..

నెల్లూరు : శ్రీహరి కోట షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. సీఐఎస్ఎఫ్ దళాలు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతను తమిళనాడుకు చెందిన వెంకటేషన్ గా గుర్తించారు. ఇతనికి మతిస్థిమితం లేదని పోలీసులు వెల్లడించారు. 

19:19 - May 28, 2016

టాలెంటెడ్ నటిగానే కాకుండా ప్రముఖ టీవీ ఛానల్స్ లో యాంకర్ గా శ్రీముఖి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈమె పలు చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో 'శ్రీముఖి' టెన్ టివితో తో ముచ్చటించింది. ఈ సందర్భంగా గెటప్ శ్రీను కాల్ చేసి 'శ్రీముఖి'ని కొద్దిసేపు ఆటపట్టించాడు. ఎలా ఆటపట్టించాడో ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

టి.సీఎస్ పదవీకాలం పొడిగింపు..

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ శర్మ పదవీకాలాన్ని ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించింది. రాజీవ్‌శర్మ పదవీ కాలాన్ని పెంచడానికి కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే.

గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరి మృతి..

నల్గొండ : త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెదచెరువులో వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మొత్తం నాలుగు పడవల్లో 15 మంది చేపల వేటకు వెళ్లారు. 12 మంది మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. వెంకటయ్య, సోమయ్య, నాగయ్యలు గల్లంతయిన వారిలో ఉన్నారు. ఇందులో వెంకటయ్య మృతదేహం లభ్యమైంది. 

18:47 - May 28, 2016

కృష్ణా : జిల్లాలో బెల్ట్ షాప్‌ నిర్వాహకురాలు.. ఓ బాలికను చిత్రవధ చేసిన ఘటన వెలుగు చూసింది. బాలికను రాత్రంతా నిర్బంధించి పైశాచికానికి పాల్పడింది. వ్యాపారంలో పోటీ కారణంగానే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసు విచారణలో తేలింది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో గేదెల లక్ష్మి బెల్ట్ షాప్‌ నిర్వహిస్తోంది. ఆమె షాపుకు ఎదురుగానే లక్ష్మి అనే మరో మహిళ కూడా ఇదే దందా చేస్తోంది. వీరిద్దరి మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో.. ఈనెల 26 రాత్రి.. లక్ష్మి కుమార్తెను మాయమాటలతో తన ఇంటికి పిలిపించుకుంది.. గేదెల లక్ష్మి! బాలికకు మత్తు మందు ఇచ్చి ఇంట్లో నిర్బంధించి రాత్రంగా హింసించింది. ఆమె పైశాచికానికి మద్యం మత్తులో ఉన్న మరో ఏడుగురు యువకులు తోడయ్యారు. వీరంతా కలిసి బాలికను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి తెగబడ్డారు.
గేదెల లక్ష్మి దాష్టీకంపై బాధితురాలి తల్లిదండ్రులు, స్థానిక మహిళలు భగ్గుమంటున్నారు. బాలికను చిత్రహింసలకు గురిచేసిన నిందితురాలిని అరెస్ట్ చేసి.. పోలీసులు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈలప్రోలులో గేదెల లక్ష్మి నిర్వాకంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంగబలం, అర్థబలంతో రెచ్చిపోతున్న ఆమెకు తగిన బుద్ధి చెప్పాలని, బెల్ట్ షాప్‌ కూడా ఎత్తివేయించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

18:23 - May 28, 2016

హైదరాబాద్ : కాపుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ లో అడుగు పెట్టారు. కాపుల రిజర్వేషన్లకు మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. హైదరాబాద్‌లో ఏపీసీసీ చీఫ్‌ రఘవీరారెడ్డి, ఎంపీ చిరంజీవి, దాసరి నారాయణరావు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణలను కలిశారు. కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవడం లేదని ముద్రగడ ఆరోపించారు. ఆగస్టు వరకు ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనాలని నేతలను ముద్రగడ కోరారు. బీసీల్లోచేర్చాలని కాంగ్రెస్ పార్టీ విధానమని, ఎన్నికల సమయంలో హామీనివ్వడం కూడా జరిగిందని రఘువీరా పేర్కొన్నారు. సపోర్టు చేస్తామని రఘువీరా చెప్పారని ముద్రగడ తెలిపారు. కార్యాచరణ ఎంటనేది ముద్రగడ చెప్పుకొచ్చారని చిరంజీవి పేర్కొన్నారు. ఏ ధ్యేయంతో ముందుకు వెళుతున్నారో దానికి తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ముద్రగడ నిజాయితీ పరుడని, నిజాయితీ గల ఉద్యమమని దాసరి పేర్కొన్నారు. కాపు ఉద్యమానికి సహకరిస్తామని.. రఘువీరా, చిరంజీవి, దాసరి, బొత్సలు ముద్రగడకు హామీ ఇచ్చారు. 

18:05 - May 28, 2016

విశాఖ పోకిరిని కాపాడుతున్నది ఎవరు ? ఎవరి నీడలో హాయిగా ఉన్నాడు ? బాధితుల కన్నీళ్లు తుడవాల్సినవారేం చేస్తున్నారు ? కేసును క్లోజ్ చేసేందుకు ఒత్తిళ్లు ఎందుకు వస్తున్నాయి ?
కారుతో ఢీకొట్టి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న పోకిరిని కాపాడుతున్నది ఎవరు ? ఓ ప్రజాప్రతినిధి ఆశ్రయం కల్పించాడా ? మరో ప్రతినిధి సెటిల్ మెంట్ చేస్తున్నాడా ? బాధితురాలు ఫిర్యాదు చేయకుండా అడ్డుకుంటున్న ఆ మాజీ ఎవరు ? అంగబలం..అర్థబలం ఉంటే ఎలాంటి వారైనా సరే కేసు లేకుండా బయటపడవచ్చా ? అమాయకురాలి ప్రాణాలు పొగొట్టిన వాడిని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ? విశాఖలో లావణ్య కేసులో నిందితుడు హేమంత్ ఎక్కడ ? ఆ కిరాతకుడిని కాపాడుతున్న వారికి కాసుల వర్షం కురిపిస్తుందా ? మరింత విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి..

అమెరికాలో మంత్రి కేటీఆర్..

న్యూయార్క్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. లాస్ ఏంజెల్స్‌లో డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయంలో సీఈవో జెఫ్రీ కాట్జన్ బర్గ్ ను కేటీఆర్ కలిశారు.

వైరా రిజర్వాయర్ లో ముగ్గురు జాలర్ల గల్లంతు..

ఖమ్మం : జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీచడంతో ముగ్గురు జాలర్లు వైరా రిజర్వాయర్‌లో గల్లంతు అయ్యారు. జాలర్ల ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కల్తీ రక్తం ఘటనలో మరో ఆరుగురి అరెస్టు..

హైదరాబాద్ : కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో రోగులకు కల్తీ రక్తం సరఫరా చేసిన కేసులో పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితుడు నరేంద్ర ఇచ్చిన సమాచారం మేరకు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజీనామా చేసిన డీఎస్..

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవికి డి. శ్రీనివాస్ రాజీనామా చేశారు. డీఎస్ రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారుతో సలహాదారు పదవి నుంచి డీఎస్ తప్పుకున్నారు. ఈ నెల 31న రాజ్యసభ అభ్యర్థిగా డీఎస్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

17:44 - May 28, 2016

పండంటి కాపురం చిత్రం చూసి కృష్ణ గారి అభిమాని అయ్యానని, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కృష్ణ గార్ని డైరెక్ట్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నానని డైరెక్టర్ ముప్పలనేని శివ పేర్కొన్నారు. కృష్ణతో పాటు విజయ నిర్మల, సీనియర్ నరేష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 3వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ముప్పలనేని శివతో టెన్ టివి ముచ్చటించింది. ఆయన ఎలాంటి విశేషాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

17:32 - May 28, 2016

హైదరాబాద్ : ఈనెల 31వ తేదీన టోబాకో డే సందర్భంగా ఒమెగా హాస్పిటల్స్ సహకారంతో రెడియో మిర్చి 'ధూమపానం మానండి' అనే ప్రచార కార్యక్రమం చేపట్టింది. సినీ నటి రాశీఖన్నా మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ లో సందడి చేశారు. 'ధూమపానం మానండి' ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాశీఖన్నా ధూమపానానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారానికి తన మద్దతు ప్రకటిస్తూ పోస్టర్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ..ధూమపానాన్ని తాను పూర్తిగా వ్యతిరేకమని, పొగ తాగడం కంటే తమను తాము నాశనం చేసుకోవడమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. 

17:13 - May 28, 2016

మెదక్ : సుదీర్ఘీ విరామం తరువాత సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. మున్సిపల్ లో విలీనం చేసిన ఆరు పంచాయతీలపై చర్చ జరిగింది. అనంతరం పన్నులను పెంచే విషయాన్ని అధికారులు తెలిపారు. దీనిని బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్లకార్డులు ప్రదర్శింస్తూ బైఠాయించారు. అసలు అభివృద్ధి చేయకుండానే పన్నులు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. దీనితో టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్తి పన్నుల పెంపు ఆలోచన ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 

టిడిపి నేతల వ్యాఖ్యలపై ఇంజినీర్ల ఐకాస అభ్యంతరం..

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం నేతల వ్యాఖ్యలపై ఇంజినీర్ల ఐకాస అభ్యంతరం వ్యక్తం చేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో ఇంజినీర్లు కమిషన్ తీసుకుంటున్నారని టిడిపి నేతలు పేర్కొనడంపై ఐకాస ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జమ్మూ కాశ్మీర్ లో పొగాకుపై నిషేధం..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర వ్యాప్తంగా సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తుల విడి అమ్మకాలపై సంపూర్ణ నిరేధం విధించింది. ఈ మేరకు హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

ముద్రగడకే మద్దతు - చిరంజీవి..

హైదరాబాద్ : కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం వెనుక తాము నిలబడుతామని సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి పేర్కొన్నారు. ముద్రగడ చేస్తున్న ఉద్యమం ప్రశంసనీయమన్నారు. 

16:32 - May 28, 2016

ఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. మహారాష్ట్ర నుండి చిదంబరం..కర్ణాటక నుండి ఆస్కార్ ఫెర్నాండెంజ్, జైరాం రమేష్..చత్తీస్ గఢ్ నుండి చాయా వర్మ..ఉత్తర్ ప్రదేశ్ నుండి కపిల్ సిబల్ ల పేర్లను ప్రకటించింది. పంజాబ్ నుండి అంబికా సోని, ఉత్తరాఖండ్ ప్రదీప్ టమ్టా..మధ్యప్రదేశ్ నుండి వివేక్ దర్గాలున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం కావడం వల్ల సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 

16:20 - May 28, 2016

ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళు రాబట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు. నాగార్జున పాత్రలో ఉపేంద్ర హీరోగా నటించబోతున్నారట. అంతేకాదు ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహించాలని ఉపేంద్ర భావిస్తున్నారని సమాచారం. ఇదిలాఉంటే, 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా 'బంగార్రాజు' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్టు నాగార్జున ప్రకటించిన విషయం విదితమే.

16:17 - May 28, 2016

సినిమాలోని పాత్రలకు అనుగుణంగా కథానాయకులైనా సరే మారిపోవాల్సిందే. ఆయా పాత్రలకు అనుగుణంగా రూపు రేఖల్ని మార్చుకోక తప్పదు. ఇక స్టార్‌ హీరోలైతే పాత్రల కోసమే కాదు అభిమానుల కోసం కూడా మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ తీరులోనే ప్రస్తుతం రామ్‌చరణ్‌ తెగ కష్టపడుతున్నారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్ర కావడంతో దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ అవుతున్నారు. అలాగే స్ట్రిక్ట్‌గా డైట్‌ రూల్స్‌ని ఫాలో అవుతున్నారు. నాన్‌ వెజ్‌ని పూర్తిగా మానేసి పూర్తి శాఖాహారిగా మారిపోయారు. ఇదే విషయాన్ని రామ్‌చరణ్‌ ట్వీట్‌ ద్వారా తెలియజేస్తూ, శాఖాహార ఫుడ్‌ని మాత్రమే తీసుకుంటూ కంప్లీట్‌ వెజ్జీగా మారిపోయానంటూ ఓ ఫొటోని కూడా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన 'ధ్రువ' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. జయం రవి కథానాయకుడిగా తమిళంలో సంచలన విజయం సాధించిన 'తని ఒరువన్‌' చిత్రానికి రీమేక్‌గా 'ధ్రువ' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం విదితమే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజా షెడ్యూల్‌ ఈనెల 22 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

16:16 - May 28, 2016

పక్కా కమర్షియల్‌ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో బోయపాటి శ్రీనుకి మంచి గుర్తింపు ఉంది. 'భద్ర', 'తులసి', 'లెజెండ్‌', 'దమ్ము', 'సరైనోడు' వంటి తదితర చిత్రాల్లో మాస్‌ ఎలిమెంట్స్‌ని బోయ పాటి ఎలివేట్‌ చేసినట్టు ఇక ఏ దర్శకుడూ చేయలేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా అల్లు అర్జున్‌తో రూపొందించిన 'సరైనోడు' చిత్రంలో కూడా మాస్‌ ప్రేక్షకులకు డబుల్‌ కిక్‌ ఇచ్చారు బోయపాటి. 'సరైనోడు' తర్వాత బోయపాటి తదుపరి చిత్రం ప్రభాస్‌తో ఉంటుందని సమాచారం. బోయపాటి చెప్పిన పక్కా మాస్‌ కథ ప్రభాస్‌కి విపరీతంగా నచ్చి, నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారని తెలుస్తోంది. ప్రభాస్‌ ప్రస్తుతం 'బాహుబలి 2' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బెల్లంకొండ సురేష్‌ తనయుడు సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా బోయపాటి ఓ చిత్రాన్ని రూపొందించాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌తో బోయపాటి సినిమా ఉంటుందట.

16:14 - May 28, 2016

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందేందుకు రంగం సిద్ధమవుతోంది. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్ర దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, 'తెలుగు సినిమా చరిత్రలో సావిత్రిగారిది స్వర్ణయుగం. ఇన్నేళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒక్క సావిత్రిగారికి తప్ప ఇంకే నటికి 'మహానటి' అనే బిరుదు రాలేదు. అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ బిరుదు కేవలం సావిత్రిగారికే పరిమితమైంది. అటువంటి మహానటి జీవితం ఆధారంగా సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా చేయడానికి ఒకే కారణం.. సావిత్రిగారి జీవితంలోని విషయాలన్ని భావోద్వేగపూరితంగా ఉంటాయి. ఈ భావోద్వేగాలు తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతాయని భావిస్తున్నాను. గత ఆరు నెలలుగా సావిత్రిగారి జీవితానికి సంబంధించి అన్ని విషయాలపై రీసెర్చ్ చేస్తున్నాను. ఆమెకు సంబంధించిన పుస్తకాలు, ఆర్టికల్స్, సీనియర్‌ నటీనటులు, జర్నలిస్ట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాను' అని చెప్పారు.

16:11 - May 28, 2016

హైదరాబాద్ : అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంగా కేంద్రం పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల పాలనపై విపక్షలు పలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రెండేళ్లలో ఏం సాధించారని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ఏం సాధించకుండానే సంబరాలు జరుపుకుంటోందని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం లేదని, నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలం చెందారని తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడుల్ ధరలు తగ్గుతున్నా దేశీయంగా ఎక్సైజ్ డ్యూటి పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 

హెచ్ సీయూలో మళ్లీ ఆందోళన..

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టారు. వెలివాడ వద్ద అంబేద్కర్, రోహిత్ చిత్ర పట్టాలు..టెంట్లను తొలగించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

16:02 - May 28, 2016

కొందరి ముఖాలు చూస్తే ఎప్పుడూ మూడీగా కనబడతాయి. ఏదో ఆలోచిస్తున్నట్టు.. ఏదో పోగొట్టుకున్నట్టు.. ఉంటారు. కానీ ఇలా మూడీగా ఉండటం కూడా మంచిదే అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు. మూడీగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని వీరి అధ్యయనంలో తేలింది. మూడీగా ఉంటే వచ్చే దుష్పరిణామాల మాటను పక్కనబెట్టేస్తే.. వీరు జీవితానికి సంబంధించిన సానుకూల లేదా ప్రతికూల అంశాలను స్వాగతిస్తారని ఈ తాజా పరిశోధనలో వెల్లడైంది. కనుక, మూడీగా ఉన్న సమయాల్లో నైపుణ్యాలు పెంచుకోవడం, హోదా, హుందాతనం పెంచే లక్ష్యాలు నిర్దేశించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఈ పరిశోధకులు చెప్తున్నారు. ఇంకా, ఇలాంటి వారు వ్యక్తిగతంగా సత్వర మార్పును స్వీకరించేందుకు కూడా ముందుంటారట. కాబట్టి, వెంటనే మూడీగా ఉండే వారి పట్ల మీ దృక్పథాన్ని మార్చేసుకోండి. వారితో సానుకూలంగా వ్యవహరించండి.

16:00 - May 28, 2016

సాధారణంగా ప్యూమిస్‌ స్టోన్‌ ను పాదాల స్క్రబ్బింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ చర్మపు మృత కణాలను తొలగించటంతోపాటు అవాంఛిత రోమాల్ని కూడా ప్యూమిస్‌ స్టోన్‌ తొలగించగలదు. దీంతో ఉన్న ఇతర సౌందర్య ఉపయోగాలేమిటో తెలుసుకుందామా!
స్కిన్‌ టోన్‌ కోసం: స్కిన్‌ టోన్‌ పెరగాలంటే ప్రతి రోజూ ప్యూమిస్‌ స్టోన్‌తో శరీరానికి సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకున్న తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌తో శరీరమంతా వృత్తాకారంలో మసాజ్‌ చేయాలి.
పొడి చర్మానికి మేలు: పొడి చర్మం ఉన్నవాళ్లు సబ్బు నీళ్లలో నానబెట్టిన ప్యూమిస్‌ స్టోన్‌తో ఒళ్లు రుద్దుకంటూ ఉండాలి. ముందుగా ఆయిల్‌ మసాజ్‌ చేసుకుని ఆ తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్దుకుంటూ ఉంటే మృతకణాలు తొలగి పొడిచర్మం తేమగా తయారవుతుంది.
అవాంఛిత రోమాలు తొలగాలంటే: ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించటం కోసం కూడా ప్యూమిస్‌ స్టోన్‌ను ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్న తర్వాత దాన్ని తొలగించటం కోసం ప్యూమిస్‌ స్టోన్‌ వాడాలి. అయితే ఆరిపోయిన ఫేస్‌ప్యాక్‌ను కొద్ది నీళ్లతో తడిపి మెత్తబడిన తర్వాతే ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్దాలి. 

ఎన్డీఏ పాలనపై చిదంబరం విమర్శలు..

న్యూఢిల్లీ: గత రెండేళ్ల ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికంగా చాలా వెనుకబడి పోయిందని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. ఎన్డీఏ తమ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా విలేకరుల సమావేశంలో చిదంబరం ఎన్డీఏ పాలనపై విరుచుకపడ్డారు. 

ఖమ్మంలో భారీ వర్షం..

ఖమ్మం : జిల్లాలో పలు ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఖమ్మం-వైరా మధ్య చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఎన్డీఏ పాలనపై చిదంబరం విమర్శలు..

న్యూఢిల్లీ: గత రెండేళ్ల ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికంగా చాలా వెనుకబడి పోయిందని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. ఎన్డీఏ తమ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా విలేకరుల సమావేశంలో చిదంబరం ఎన్డీఏ పాలనపై విరుచుకపడ్డారు. 

రామగుండంలో 46 డిగ్రీలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ-45, భద్రాచలం-45, నిజామాబాద్-43, హైదరాబాద్-41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అ.ని.శా అదుపులో వెటర్నరీ డాక్టర్..

కరీంనగర్ : జిల్లాలోని ఎల్లారెడ్డిపేట వెటర్నరీ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఓ గొర్రెల కాపరి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నగరంలో వాహనాల దొంగ అరెస్టు..

హైదరాబాద్ : నగర పోలీసులు వాహనాల దొంగను అరెస్టు చేశారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు బీహార్‌కు చెందిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి రూ.50 లక్షల విలువ చేసే మూడు కార్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

15:33 - May 28, 2016

ఆయనంటే సాహసం..ఆయనంటే మొండితనం..ఆయనంటే ప్రయోగం...ఏటికి ఎదురీదే మనస్తత్వం..కొత్తదనం కోసం ఆరాటం..ఈ ఛాలెంజింగ్ నేచరే ఆయన్ను హిస్టరీ లో నిలిచేలా చేసాయి..తెలుగుతెరమీద విశ్వవిఖ్యాత నట సార్వభౌముని చేసాయి..హీరోగా , నిర్మాతగా, దర్శకుడిగా ఇలా.. అన్నిటిలోనూ ముక్కుసూటి ధోరణిలో ఆయన సాగించిన ప్రయాణాలు అనన్య సామాన్యం. కోట్లాది మంది అభిమానులు చేత అన్న అని పిలుచుకొనే ఆ తారక రాముడు నందమూరి తారకరామారావు. ఆయన 94 వ జయంతి సందర్భంగా ఆయన పోషించిన అసాధారణ పాత్రలపై ప్రత్యేక కథనం..

యన్టీఆర్ ప్రయోగ శాల..
యన్టీఆర్ ఒక ప్రయోగశాల. ఆయనకు అసాధ్యం అనదగ్గ పాత్రే లేదు. ఏ పాత్ర పోషించినా అందులో అవలీలగా లీనమయ్యి అసాధారణమైన అభినయంతో ఆ పాత్రకు జీవం పోయడమే తెలుసు. ఒకటా రెండా... ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని తాను మాత్రమే చేయగలనని నిరూపించుకున్న లెజెండ్ యన్టీఆర్. హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న దశలో ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఎలాంటి స్టార్ హీరో ధైర్యం చేయలేడు. కానీ తాను స్టార్ హీరో హోదాలో ఉన్నా సరే హాఫ్ బీట్ పాత్రల్ని, ముసలి, ముతక పాత్రల్ని అద్భుతంగా పోషించి అబ్బుర పరిచారు యన్టీఆర్.  ఏ హీరో అయినా సొంత డబ్బులు పెట్టి ప్రయోగం చేయడానికి ఇష్టపడడు. ఇతర నిర్మాతలతో ఖర్చుపెట్టించి మరీ తన కోరిక తీర్చుకోవాలనే చూస్తాడు. కానీ యన్టీఆర్ అలా చేయలేదు. చేతులు కాలినా, కాసులు రాలకపోయినా పురస్కారాలకు మాత్రమే నోచుకున్న ఓ రెండు సినిమాలు తీసారు. భారతీయ వెండితెరమీద బహుపాత్రలు పోషించిన ఘనత ఒక్క యన్టీఆర్ కు మాత్రమే సొంతం. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు ఒకే సినిమాలో తానొక్కడే రెండు కన్నా ఎక్కువ పాత్రలు పోషించి ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు నెలకొల్పారు.

అరుదైన రికార్డు...
మేలిమి బంగారం ఏ మూసలోనైనా ఒదుగుతుంది. ఏ ఆభరణంగానైనా ముచ్చటగొలుపుతుంది. మూర్తీభవించిన ప్రతిభావంతుడు యన్టీఆర్ విషయంలో ఇది నూటికి నూరు పాళ్ళు నిజమైంది. గ్రీకు శిల్పలోని శాస్త్రీయ లక్షణాలన్నీ యన్టీఆర్ ముఖ కవళికల్లో ఉన్నాయని చరిత్రకారులు అంటారు. అందుకేనేమో ఆయన ఏ పాత్ర చేసినా అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. యన్టీఆర్ కు మారు వేషాలు వేయడం అంటే మహా ఇష్టం. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటినుంచి చివరి చిత్రం వరుకూ దాదాపు ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక మారు వేషం వేసి తన కోరిక తీర్చుకునేవారు.. అంతేకాదు అత్యధిక సంఖ్యలో మారు వేషాలు వేసిన కథానాయకుడిగా యన్టీఆర్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరుకూ ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. దర్శకుడిగా యన్టీఆర్ కు అరుదైన రికార్డు ఉంది. ఆయన ఏ ప్రయోజనం ఆశించి ఒక సినిమాకి దర్శకత్వం వహించేవారో ఆ సినిమాను దానికి అనుగుణంగానే మలిచేవారు. నటనను ఎంత దైవంగా ఆరాధించే వారో , దర్శకత్వాన్ని కూడా అంతే ఇష్టంగా,ఆసక్తిగా నిర్వహించేవారు. మాస్ జనానికి సినిమాని వినోద సాధనంగా మార్చిన ఘనత యన్టీఆర్ దే. యన్టీఆర్ సినిమాల్లోకి రాక పూర్వం తెలుగు చిత్రాల్లో అంతగా కళ ఉండేది కాదు. వినోదం కూడా దాదాపు శూన్యం. ఎక్కువగా పురాణ కథల్ని తెరమీద నాటకం వేసినట్టు చూపించేవారు. అందుకే సినిమా ఆ కాలంలో మాస్ జానానికి అంతగా ఎక్కలేదన్నది వాస్తవం. 44 ఏళ్ళ సినిమా జీవితంలో 15చారిత్రకాలు, 55 జానపదాలు, 44 పౌరాణికాలు, 186 సాంఘిక చిత్రాల్లో నటించి తనకి తిరుగే లేదని నిరూపించుకున్నారు యన్టీఆర్. ఇలాంటి అరుదైన , అపురూప కథానాయకుడు యుగానికి ఒక్కడే ఉంటాడు. అలాంటి అందం, అంతటి అభినయం కలిగిన విశ్వవిఖ్యాత నటుడు తెలుగు తెరకే సొంతం అవడం ఎంతైనా తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఈ సందర్భంగా యన్టీఆర్ కి 10 టివి ఘన నివాళులు అర్పిస్తోంది.

ఏపీలో త్వరలో కొత్త చట్టాలు - చంద్రబాబు..

చిత్తూరు : తన ముందు ఎవరూ తోక తిప్పలేరని..ఎవరైనా తిప్పితే మాత్రం తోక కట్ చేస్తానని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అవినీతి లేకుండా చేయడమే తన లక్ష్యమని, ఒక్క పైసా అవినీతి జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రంలో త్వరలో రెండు చట్టాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. 

15:25 - May 28, 2016

చిత్తూరు : తన ముందు ఎవరూ తోక తిప్పలేరని..ఎవరైనా తిప్పితే మాత్రం తోక కట్ చేస్తానని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టిడిపి రెండో రోజు మహానాడు కొనసాగుతోంది. ఈసందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి లేకుండా చేయడమే తన లక్ష్యమని, ఒక్క పైసా అవినీతి జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రంలో త్వరలో రెండు చట్టాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రెడ్ శాండిల్ వ్యాపారం చేసే వారికి ఒక చట్టం తీసుకొస్తున్నామని, తపప్పు చేస్తే పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని..తాను తప్పు చేయలేదని అతనే రుజువు చేసుకోవాలని పేర్కొన్నారు. అంతేగాకుండా స్పెషల్ కోర్టు పెట్టడం జరుగుతుందని, అవినీతి చేస్తే ప్రభుత్వం ఆ డబ్బును తీసుకోవడం జరుగుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా ఆర్జించిన డబ్బును ప్రజాహితం కోసం ఖర్చు చేస్తామన్నారు. 

15:13 - May 28, 2016

విజయవాడ : బెల్టుషాపులను నిర్మూలిస్తాం..ఎక్కడ లేకుండా చేస్తాం అని చెబుతున్న పెద్దల మాటలు ఉట్టివేనని తెలుస్తోంది. ఇబ్రహింపట్నంలోని ఈలప్రోలులో అరాచకం వెలుగులోకి వచ్చింది. గేదెల లక్ష్మి అనే బెల్టు షాపు నిర్వాహురాలు ఓ బాలికను బంధించి చిత్రహింసలకు గురి చేసింది. ఈ బాలిక పదో తరగతి చదువుతోంది. చివరకు ఆ బాలిక బయటకు రావడంతో ఈ అరాచకత్వం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి విజయవాడ సీపీని కోరింది. దీనిపై సీపీ స్పందించారు. చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

పోలీసుల నిర్లక్ష్యం..
ఈ ఘటనపై బాధితురాలు మీడియాతో మాట్లాడింది. గేదెల లక్ష్మి తనను మాటల్లో చెప్పి తీసుకెళ్లిపోయిందని తెలిపింది. అనంతరం వాటర్ ఇచ్చిందని, తనకు ఏమైందో తెలియదని పేర్కొంది. బయటకు పంపియ్యాలని చెబితే కొట్టిందన్నారు. రమేష్, పార్వతిలు బయటకు నెట్టేశారని ఆసమయంలో ఇంట్లో ఏడుగురు అబ్బాయిలు..ఓ మహిళ ఉందని తెలిపింది. అమ్మపై ఉన్న కక్ష తనపై తీర్చుకోవాలని అనుకొంటోందని, ఈ ఘటనలో నానిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపింది. కానీ ఏడుగురు పేర్లు చెబితే రాయలేదని, ఇద్దరిని పట్టుకొంటే మిగతా వారంతా బయటకొస్తారంటూ పోలీసులు పేర్కొంటున్నారని తెలిపారు. మరి ఈ బాలిక విషయంలో పోలీసులు న్యాయం చేస్తారా ? బెల్టు షాపు నిర్వాహకురాలిని అరెస్టు చేస్తారా ? చూడాలి. 

బాలికపై బెల్టుషాపు నిర్వాహురాలి అరాచకం..

విజయవాడ : ఇబ్రహింపట్నంలోని ఈలప్రోలులో బెల్టు షాపు నిర్వాహకురాలు గేదెల లక్ష్మి ఓ బాలికను నిర్భందించి చిత్ర హింసలకు గురి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రాజకీయ అండదండలు ఉండడంతో పట్టించుకోవడం లేదని బాధితురాలి తల్లి పేర్కొంటోంది. ఈ విషయంలో బాధితురాలి తల్లి సీపీని కలిసింది. తమకు న్యాయం చేయాలని కోరింది. 

ఏఐసీసీ రాజ్యసభ అభ్యర్థులు..

ఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. మహారాష్ట్ర నుండి చిదంబరం..కర్ణాటక నుండి ఆస్కార్ ఫెర్నాండెంజ్, జైరాం రమేష్..చత్తీస్ గఢ్ నుండి చాయా వర్మ..ఉత్తర్ ప్రదేశ్ నుండి కపిల్ సిబల్ ల పేర్లను ప్రకటించింది.

 

ఉపాధి హామీ పనుల అమలుపై మంత్రి జూపల్లి ఆగ్రహం..

మహబూబ్ నగర్ : జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో ఉపాధి హామీ పనులపై మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల అమలు తీరుపై మంత్రి జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని అధికారులకు సూచించారు. 25 శాతం పనులు పూర్తి చేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మాజీ న్యాయమూర్తిపై కాల్పులు..

లక్నో: ఉత్తరప్రదేశ్ లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ సభ్యుడు జస్టిస్ యూకే ధయాన్స్ కారుపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ధయాన్ ఎయిర్ పోర్టు నుంచి తన భార్యతో కలిసి వస్తుండగా ఈ దాడి జరిగింది. దాడి నుంచి న్యాయమూర్తి దంపతులు, డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు.

14:45 - May 28, 2016

బ్రెజిల్‌ : సభ్య సమాజం తలెత్తుకోలేని దారుణం జరిగింది. 16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఒకరు కాదు...ఇద్దరు కాదు...33 మంది ఆ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడడమే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో బ్రెజిల్‌లో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. సావొ పాలొ నగరంలోని మురికివాడలో తన స్నేహితుడి ఇంటికి బాధిత యువతి ఈ నెల 20న వెళ్లింది. ఆ రోజు రాత్రి నుంచి ఆదివారం వరకు బాయ్‌ఫ్రెండ్‌తో పాటు 33 మంది ఆమెపై అత్యాచారం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన దేశాధ్యక్షుడు మిచల్ టీమర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 

14:42 - May 28, 2016

హైదరాబాద్ : జూన్ 2న ఉస్మానియా యూనివర్శిటిలో తలపెట్టిన జనజాతర విద్యార్ధి బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కోరారు. సభను విజయవంతం చేయాలని ఓయూ జేఏసీ తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్రను ప్రొఫెసర్ విశ్వేశర్ రావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కేసీఆర్ సర్కార్ దొరల పాలన సాగిస్తోందని.. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన విద్యార్థి లోకాన్ని మరుస్తోందని మండిపడ్డారు.

 

14:38 - May 28, 2016

హైదరాబాద్ : రెండేళ్ల పాలనలో అవినీతి లేని పాలన అంటూ చెబుతూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డాడు. కమీషన్లకు కక్కుర్తి పడి పొలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి, పట్టిసీమ ప్రారంభించలేదా అని ప్రశ్నించారు. వివిధ స్కీముల పేరుతో బాబు సర్కార్ అవినీతికి పాల్పడుతోందని ధర్మాన ఆరోపించారు.  ఈ రెండేళ్ల పాలన గురించి చెప్పుకోడానికి ఆయనకు ఏమీ లేదని, అందుకే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు. మహానాడులో ప్రజల సమస్యల గురించి ఏమైనా చర్చించారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకరించారని, రాజ్యాంగ విరుద్ధమైన కిరికిరి కమిటీలు వేసి ప్రజలను బాధ పెడుతున్నారని అన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమను పట్టుకున్నారని విమర్శించారు. ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ డబ్బులు అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా లేదని అన్నారు. ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని పట్టించుకోవాల్సింది పోయి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ఆలోచన దుర్మార్గమని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. 

14:32 - May 28, 2016

ఏలూరు : ట్విట్టర్‌లో అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తూ యువతిని వేధించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేతాజీ నగర్‌లో ఉండే వెంకటేశ్వర్లు ఏలూరుకు చెందిన ఓ యువతి పేరుతో ట్విట్టర్‌ అకౌంట్ ఓపెన్‌ చేశాడు. అందులో అసభ్యకరమైన వీడియోల్లోని అమ్మాయిల శరీరాలకు యువతి ముఖాన్ని మార్ఫ్ చేశాడు. ఈ వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

తెలుగు జాతికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవం - బాబు..

తిరుపతి : తెలుగు జాతికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతమే తనకు స్పూర్తి అని, పేదరికం లేని నవసమాజ నిర్మాణం సాధించడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేసినట్లు, ఈ ఏడాది నుండి ఏపీలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

టిడిపి మహానాడుపై బోత్స విమర్శలు..

హైదరాబాద్ : మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం ఆత్మస్తుతి, పరనిందలా సాగిందని వైసీపీ నేత బోత్స పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలిపేందుకు జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చంద్రబాబు మోసాలపై అన్ని పీఎస్ లలో ఫిర్యాదు చేయడం జరుగుతుందని, టిడిపి నేతలు పంచభూతాలను పంచుకతింటున్నారని తెలిపారు. అమరేశ్వరుడు ఆలయ భూములను లోకేష్ బినామీకి ఇచ్చారని, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజేయ కుమారుడికి ఏకరా 6 కోట్లట ప్రభుత్వ భూములను రూ. 25 లక్షలకు ఇచ్చారని ఆరోపించారు. ఆ భూముల విక్రయాన్ని వెంటనే రద్దు చేయాలని బోత్స డిమాండ్ చేశారు. 

దంతెవాడలో కాల్పులు..

ఛత్తీస్ గడ్ : దంతెవాడ జిల్లా రాజ్ బంగ్లా ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు మృతి చెందాడు. 

దాసరిని కలిసిన ముద్రగడ..

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారు. ముద్రగడ చేస్తున్న కాపు ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని దాసరి ప్రకటించారు. ముద్రగడ నిజాయితి గల వ్యక్తి అని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు మళ్లీ రోడ్డపైకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. 

జానా - పాల్వాయి వాగ్వాదం..

హైదరాబాద్ : సీఎల్పీ సమావేశంలో జానారెడ్డి, పాల్వాయి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని జానారెడ్డి సూచించగా తాను ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానని పాల్వాయి సమాధానం చెప్పారు. దానివల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. 

రాజ్యసభ ఎన్నికల్లో టి.కాంగ్రెస్ దూరం..

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయరాదని టి.కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సరిపడా బలం లేని కారణంగా పోటీ చేయరాదని నిర్ణయం తీసుకుంది. 

14:07 - May 28, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రులు జూపల్లి కృష్ణారావు,ఈటెల రాజేందర్ అధికారులను హెచ్చరించారు.. కరీంనగర్ జిల్లాలో రహదారులు,భవనాలు,ఉపాధి పనుల పై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదే అని సూచించారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి హమీ అమలు తీరుపైనా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

14:03 - May 28, 2016

ఢిల్లీ : మీ వాహనం పాతదా? పది సంవత్సరాల నుంచి వాడుతున్నారా? పాత వాహనం ఇవ్వండి కొత్త వాహనం చౌకగా పొందండి.. ఏంటీ ఈ ఆఫర్ అనుకుంటున్నారా? వింటుంటూనే ఆఫర్ కొత్తగా ఉంది కదా.. అయితే ఆఫర్ విశేషాల గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ...

కేంద్ర రోడ్డు రవాణాశాఖ బంపర్ ఆఫర్....
పాత వాహనం ఇవ్వండి కొత్త వాహనం తీసుకోండి ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణాశాఖ తీసుకొస్తోంది. పదకొండేళ్లు దాటిన పాతవాహనాల వాడకాన్ని నిలిపివేస్తే.. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 8 నుంచి 12 శాతం దాకా ప్రోత్సహకాలను ఇచ్చే ఆలోచన చేస్తోంది. దేశ వ్యాప్తంగా 2.8 కోట్ల దాకా ఇలాంటి వాహనాలుంటాయని కేంద్రం అంచనా వేసింది. వీటిని వినియోగం నుంచి తప్పించి పర్యావరణాన్ని రక్షించేందుకు వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడ్రనైజేషన్ ప్లాన్ పేరుతో ఒక పథకాన్ని తీసుకురానుంది. ఈ ప్రతిపాదనలపై పదిహేను రోజుల్లోగా స్పందన తెలపాని ప్రజలను, వాహన తయారీదారులు, డీలర్‌లను ఆహ్వానించింది.

వాడకం ఆపేస్తే కొత్త వాహనాలపై 8-12% రాయితీ....
2005 మార్చి 31 కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలను వీ-వీఎంపీ ద్వారా వదులుకోవడానికి ప్రభుత్వ రీసైక్లింగ్ సెంటర్‌లో వాహన పత్రాలను సమర్పిస్తే ఆ పత్రాలను ధ్రువకరీంచుకుని వాహన యజమానికి వీవీఎంపీ సర్టిఫికేట్ ఇస్తుంది. వాహనాన్ని తుక్కు కింద విలువ లెక్కకడతారు. అనంతరం కొత్త వాహనాన్ని కొనేటప్పుడు వీవీఎంపీ పత్రాన్ని డీలర్‌కు చూపిస్తే కొనుగోలులో దాదాపు 8 నుంచి 12 శాతం దాకా రాయితీ లభిస్తుంది. అయితే ఇలా కొనుగోలు చేసే వాహనాలు తప్పనిసరిగా బీఎస్-4 ప్రమాణాలకు లోబడి ఉండాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. 2017 ఏప్రిల్ నుంచి ఈ ప్రమాణాలనే పాటించనున్నారు. దీంతో వాహన విక్రయాలు పెరుగుతాయని, ఆటో మొబైల్ పరిశ్రమ టర్నోవర్ వచ్చే ఐదేళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

13:55 - May 28, 2016

విశాఖ : రెండేళ్ల పాలనతో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని సీపీఎం విశాఖ నగర కార్యదర్శి గంగారామ్ ఆరోపించారు. మోడీ పాలనలోకి రాగానే ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఉత్తరాంధ్రను మరిచారన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు.. పాలనలకు నిరసనగా జూన్ 1 వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ ల వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సీపీఎం నేతలు విడుదల చేశారు.

13:51 - May 28, 2016

ఖమ్మం : సీపీఎం రాజకీయ శిక్షణా తరగతుల్ని ఖమ్మం మంచికంటి భవన్‌లో ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు వీరయ్య ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంభిస్తున్నాయని వీరయ్య మండిపడ్డారు. కరువుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.

13:49 - May 28, 2016

చిత్తూరు : మహానేత ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకువెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.. అమరావతిలో ఎన్టీఆర్‌ది 115.5 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకువెళితే సాధించలేనిదేమీలేదని చెప్పుకొచ్చారు.. తిరుపతి మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు.

13:28 - May 28, 2016

విశాఖ : ఓ బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. చుట్టుప్రక్కల ప్రాంతాలను గాలించినా ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపహరణకు గురయిన నవదీప్ అనే 11 నెలల బాలుడు కోసం పోలీసులు 5 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సవరాలు అమ్ముకునే మహిళ బాలుడిని అపహరించినట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఇండ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని బ్యాంకుల వద్ద వున్న సీసీ కెమోరాల పుటేజీ పోలీసులు పరీక్షించారు. ఓ కెమోరాలో వున్న పుటేజ్ ఆధారంగా ఓ మహిళపై పోలీసులు అనుమానపడ్డారు. ఈ దిశగా గాలింపుని ముమ్మరం చేశారు. 

13:27 - May 28, 2016

హైదరాబాద్ :హైదరాబాద్ : టీ.అసెంబ్లీలోని జానారెడ్డి చాంబర్ లో టీ. కాంగ్రెస్ నేత సమావేశం ముగిసింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని సమావేశం నిర్ణయించినట్లు జానారెడ్డి తెలిపారు. సరిపడా బలంలేని కారణంగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు నిర్ణయించుకున్నట్లుగా ఆయన తెలిపారు. రాజకీయాలను కలుషితం చేయకూడదనే ఉద్ధేశ్యంతోనే పోటీ నుండి విరమించుకున్నట్లుగా ఆయన తెలిపారు. టీఆర్ ఎస్ మద్ధతు తీసుకుని రాజ్యసభ సీటును గెలుచుకుందామనుకున్న కాంగ్రెస్ ఆశలకు టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి గండి కొట్టిన విషయం తెలిసిందే.

విశాఖలో బాలుడి కిడ్నాప్ కలకలం..

విశాఖ : ఓ బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అపహరణకు గురయిన 11 నెలల బాలుడు కోసం పోలీసులు 5 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సవరాలు అమ్ముకునే మహిళ బాలుడిని అపహరించినట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఇండ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

రాజ్యసభ ఎన్నికలకు టీ.కాంగ్రెస్ దూరం...

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలోని జానారెడ్డి చాంబర్ లో టీ. కాంగ్రెస్ నేత సమావేశం ముగిసింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని సమావేశం నిర్ణయించినట్లు జానారెడ్డి తెలిపారు. సరిపడా బలంలేని కారణంగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు నిర్ణయించుకున్నట్లుగా ఆయన తెలిపారు.

13:01 - May 28, 2016

గుంటూరు : మంగళగిరిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగాలుల దాటికి నిడమర్రు గ్రామంలో దాదాపు 30 కరెంట్ స్థంబాలు విరిగిపోగా.. ఓ ట్రాన్స్‌ఫార్మర్ పడిపోయింది. దీంతో రాత్రంతా కరెంట్ లేక గ్రామస్థులు నానా కష్టాలు పడ్డారు. విరిగిపోయిన స్థంబాలకు మరమ్మతులు చేయాలంటే మరో మూడు రోజులు పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు.

12:59 - May 28, 2016

మహబూబ్ నగర్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు బాలికలు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మడంలం లట్టుపల్లికి చెందిన శ్యామల, అఖిల అనే ఇద్దరు అక్కాచెల్లెలు బట్టలు ఉతకడానికి స్ధానికంగా ఉన్న బావి వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుకుతూ అఖిల ప్రమాదవశాత్తు బావిలో జారిపడిపొయింది. చెల్లెలు నీటిలో మునిగిపోతుండగా అక్క శ్యామల రక్షించే ప్రయత్నంలో ఆమె కూడా నీటిలో పడిపొయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. 

బావిలో పడి ఇద్దరు బాలికలు మృతి...

మహబూబ్ నగర్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు బాలికలు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మడంలం లట్టుపల్లికి చెందిన శ్యామల, అఖిల అనే ఇద్దరు అక్కాచెల్లెలు బట్టలు ఉతకడానికి స్ధానికంగా ఉన్న బావి వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుకుతూ అఖిల ప్రమాదవశాత్తు బావిలో జారిపడిపొయింది. చెల్లెలు నీటిలో మునిగిపోతుండగా అక్క శ్యామల రక్షించే ప్రయత్నంలో ఆమె కూడా నీటిలో పడిపొయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. 

ఈదురుగాలులు బీభత్సం....

గుంటూరు : మంగళగిరిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగాలుల దాటికి నిడమర్రు గ్రామంలో దాదాపు 30 కరెంట్ స్థంబాలు విరిగిపోగా.. ఓ ట్రాన్స్‌ఫార్మర్ పడిపోయింది. దీంతో రాత్రంతా కరెంట్ లేక గ్రామస్థులు నానా కష్టాలు పడ్డారు. విరిగిపోయిన స్థంబాలకు మరమ్మతులు చేయాలంటే మరో మూడు రోజులు పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు.

12:34 - May 28, 2016

హైదరాబాద్ : అకున్‌ సబర్వాల్‌ బదిలీ.. రొటీన్‌గా జరిగిందేనా..? దీనికి కాదన్న సమాధానమే వస్తోంది. డ్రగ్‌, లిక్కర్‌ మాఫియా ఒత్తిళ్లే ఈయన బదిలీకి కారణమన్న ప్రచారం జరుగుతోంది.

2001 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌...
అకున్‌ సబర్వాల్..! ఈ ఐపీఎస్‌ అధికారి.. అడ్డదారిలో సాగే వారికి కొరకరాని కొయ్య. 2001లో ఐపీఎస్‌కు ఎంపికైన అకున్‌.. 2004లో రాష్ట్రానికి వచ్చారు. అప్పటి నుంచీ పని చేసిన ప్రతి చోటా తనకంటూ ప్రత్యేకత గుర్తింపును తెచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదాలతో తొక్కిపెట్టారు. ఏసీబీలో ఉన్నప్పుడు అవినీతి అధికారుల భరతం పట్టారు. విశాఖ జిల్లా ఏజెన్సీలో తీవ్ర వాద కార్యకలాపాలను నిరోధించారు. హైదరాబాద్‌లో డీసీపీ హోదాలో.. పోలీసు శాఖలో సంస్కరణలకు పెద్దపీట వేశారు.

2004లో రాష్ట్రానికి వచ్చిన అకున్‌ సబర్వాల్‌...
అకున్‌ సబర్వాల్..! ఈ ఐపీఎస్‌ అధికారి.. అడ్డదారిలో సాగే వారికి కొరకరాని కొయ్య. 2001లో ఐపీఎస్‌కు ఎంపికైన అకున్‌.. 2004లో రాష్ట్రానికి వచ్చారు. అప్పటి నుంచీ పని చేసిన ప్రతి చోటా తనకంటూ ప్రత్యేకత గుర్తింపును తెచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదాలతో తొక్కిపెట్టారు. ఏసీబీలో ఉన్నప్పుడు అవినీతి అధికారుల భరతం పట్టారు. విశాఖ జిల్లా ఏజెన్సీలో తీవ్ర వాద కార్యకలాపాలను నిరోధించారు. హైదరాబాద్‌లో డీసీపీ హోదాలో.. పోలీసు శాఖలో సంస్కరణలకు పెద్దపీట వేశారు.

డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం డైరెక్టర్‌గా.....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. అకున్‌ సబర్వాల్‌ను డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం డైరెక్టర్‌గా నియమించారు. నోబిల్‌.. నోపిల్‌ నినాదంతో.. విచ్చలవిడిగా మందుల అమ్మకాలు జరగకుండా నిరోధించారు. ఫార్మాసిస్టులు లేని మెడికల్‌ షాపులపై కొరడా ఝళిపించారు. వెయ్యికి పైగా షాపులకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న మెడికల్‌ షాపులనూ సీజ్‌ చేశారు. అతి పెద్ద ఫార్మాకంపెనీల్లో సోదాలు చేసి కోట్లాది రూపాయల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం అక్రమ అమ్మకాలకు కళ్లెం వేసిన అకున్‌...
ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గాను, తెలంగాణ ఫార్మసీ ట్రైబ్యునల్‌ రిజిస్టార్‌గాను అకున్‌ సబర్వాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తనకు లభించిన ఏ బాధ్యతనూ ఆయన విస్మరించింది లేదు. మద్యం అక్రమ అమ్మకాలకు కళ్లెం వేయడం, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా చూడడం లాంటి చర్యలను తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. అధిక ధరలు వసూలు చేసే వైన్‌షాపులు, బార్లకు తాళాలు వేశారు. ఒకపక్క మెడికల్‌ డ్రగ్‌ మాఫియా, మరో పక్క లిక్కర్‌ మాఫియాలను ఏకకాలంలో హడలెత్తించారు.

మెడికల్‌ డ్రగ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియాలకు హడల్‌....
దూకుడు మీదున్న అకున్‌ సబర్వాల్‌ను లొంగదీసుకోవడం కుదరక.. డ్రగ్స్‌ అండ్‌ లిక్కర్‌ మాఫియా.. ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెంచినట్లు సమాచారం. దీనికి తలొగ్గిన ప్రభుత్వం.. రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఆయనను హైదరాబాద్‌ డిఐజిగా బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి స్ట్రిక్ట్‌గా పనిచేస్తే బదిలీయే నజరానాగా లభిస్తుందన్న మాటలు.. అకున్‌ సబర్వాల్‌ విషయంలోనూ నిరూపితమయ్యాయని డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది. 

12:31 - May 28, 2016

విశాఖ : ఎండలు.. వేడిగాలులతో సతమతమవుతున్న తెలుగుప్రజలకు రెండు మూడు రోజుల్లో కాస్త ఊరట లభిస్తుందని విశాఖ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు తెలంగాణాలో పలుచోట్ల క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు. దీంతో వేసవి వేడి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ...
నైరుతి రుతు పవనాలు జూన్‌ 6 లేదా 7వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవనాలు ప్రవేశ సమయంలోనే రాష్ట్రమంతటా జల్లులు కురిసే అవకాశం ఉంది. జూన్‌ 10 వరకు ఎండల ప్రభావం ...
జూన్‌ 10 వరకు ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం క్యుములో నింబస్‌ మేఘాల వల్ల వర్షాలు కురిసినచోట వేడి తగ్గుముఖం పట్టింది. పశ్చిమ దిశలో ఉన్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ నుంచి గాలులు వస్తున్నంత కాలం వేడి కొనసాగే వీలుంది. ఇక శని, ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెబుతున్నారు.

12:23 - May 28, 2016

చిత్తూరు : స్వర్గీయ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. భావితరాలకు ఆదర్శంగా నిలిచారని నివాళులు అర్పించారు. . సమాజాన్ని దేవాలయంగా భావించిన ఎన్టీఆర్ ప్రజలనే దేవుళ్లుగా కొలిచారనీ...వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగువారి చరిత్ర వున్నంత వరకూ ఆయన నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన పాత్రల్లో జీవించేవారన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో విభిన్నరీతుల్లో ఆయన కొనసాగారన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో మనమంతా ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆయన సిద్దాల గురించి తెలిజేయటానికి అంతు వుండదన్నారు. తెలుగు జాతికి అవమానాలు జరుగుతున్న తరుణంలో ఆయన సుఖసంతోషాలను త్యాగం చేసిన త్యాగశీలి ఎన్టీఆర్ అన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధికి తెలుగుగంగ, హంద్రినీవా, గాలేరు నగరి, ఎస్ఎల్ బీసీ వంటి వాటికి శ్రీకారం చుట్టిన అపర భగీరధుడని కీర్తించారు. టీడీపీకి ఎన్టీఆర్ ఆశయాలతోనే పార్టీ కొనసాగాలన్నారు. కట్టు, బొట్టు, ఉచ్ఛారణ అన్నీ తెలుగుదన్నాన్ని ప్రతిబింభించేలా ఆయన వుండేవారన్నారు.  

12:05 - May 28, 2016

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో మృతిచెందిన రమ్యకృష్ణ మృతదేహానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.. మృతురాలిని ఆమె భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.. రెండున్నర కోట్ల రూపాయల ఇన్సూరెన్స్‌ డబ్బుకోసం భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెబుతున్నారు.. ఆస్ట్రేలియాలో ఉంటున్న మహంత్‌తో రమ్యకృష్ణకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం... రమ్యకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.... రమ్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన బంధువుల్ని మహంత్ ముప్పుతిప్పలు పెట్టాడు.. మృతదేహాన్ని హైదరాబాద్‌ శంషాబాద్‌లో దించాక పాస్‌పోర్ట్‌తో అదే ఫ్లైట్‌లో ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. పాస్‌పోర్ట్‌ ఉంటేనే ఇన్సూరెన్స్‌ డబ్బు వస్తుందని ఇలా చేశాడని బంధువులు మండిపడుతున్నారు.

11:59 - May 28, 2016

తిరుపతి : మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం తీర్మానాన్ని టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ బలపర్చాడు. తెలుగుజాతి గౌరవం లేని సమయంలో బాధపడి స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. పార్టీ స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టిన పార్టీ తెలుగుదేశం అని ఎల్ రమణ గుర్తుచేశారు. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించిన సత్తా ఆయనదని కొనియాడారు.

11:20 - May 28, 2016

తిరుపతి : రాష్ట్రాభివృద్ధికై కేంద్రం సహకారం అవసరమని ఇందుకు నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తేవాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్‌కు బాలయ్య నివాళులర్పించారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్ల పంపిణీ చేయడంలో భారీ అవకతవకలు జరిగాయని అలాంటి వాటిని గుర్తించి అర్హులైన టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని చంద్రబాబును కోరారు.

పిడుగుపాటుకు యువకుడు మృతి...

విశాఖ: ఉరుములతో కూడిని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరంలో పిడుగుపాటుకు యువకుడు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు అయ్యాయి. 

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సీఎం....

మహారాష్ట్ర : మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్ తో పాటు మరో 11 మందిపై అవినీతి నిరోధక శాఖ తాజా కేసు నమోదుచేసింది. ఆయన ఆదాయానికి మించి రూ. 203 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలడంతో భుజ్‌బల్, ఆయన కుటుంబ సభ్యులపై ఏసీబీ అధికారులు కేసులు పెట్టారు. చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజ్‌బల్‌పై నమోదయ్యాయి. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కాం, మహారాష్ట్ర సదన్ స్కాంలతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. ముంబై, పుణె, లోనావాలా, నాసిక్ ప్రాంతాల్లో ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం...

తిరుమల: తిరుమలలోని శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్, అటవీ అధికారులు కూంబింగ్  నిర్వహించారు. ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్, అటవీ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం కూంబింగ్ చేస్తున్న దళాలకు గంజిబండ అటవీ ప్రాంతంలో 26 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

మోదీ మెడలో డోలు .....

మేఘాలయ : ప్రధాని నరేంద్ర మోదీ డోలు వాయించారు. మేఘాలయా సాంప్రదాయ వాయిద్యాలను ఆయన తనదైన బాణీలో వినిపించారు. ఈశాన్య రాష్ర్టాల మండలి సదస్సులో పాల్గొనేందుకు మేఘాలయా వెళ్లిన మోదీ అక్కడ ఇవాళ ఉదయం సరదగా గడిపారు. సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ కళారూపాలను ప్రదర్శిస్తున్న వారితో కలిసి ఎంజాయ్ చేశారు. కాసేపు డోలుతో పాటు ఇతర సంగీత వాయిద్యాలను వాయించారు. కళా బృందాలతో ఫోటోలు కూడా దిగారు. 

10:49 - May 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పండించాలన్న టీసర్కార్ ప్రచారం.. కొందరికి కాసులు పండిస్తోంది. ప్రభుత్వ ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని.. నిధుల స్వాహాకు కుట్ర జరుగుతోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే.. అటు రైతులపై, ప్రభుత్వంపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌....
తెలంగాణలో పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులతో సోయాబీన్‌ను సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం రైతులకు సరిపడే విధంగా... సోయాబీన్‌ విత్తనాలను సేకరించే బాధ్యతను ప్రభుత్వం వివిధ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. ప్రభుత్వం క్వింటాల్ సోయాబీన్ విత్తన ధరను 6వేల 6వందల రూపాయలుగా ఖరారు చేసింది. అందులో 33.33 శాతం సబ్సిడీని భరించి రైతులకు 4వేల 4వందల రూపాయలకు అందజేస్తామని ఇటీవల ఉత్తర్వులిచ్చింది. కానీ ఈ ఏడాది సోయాబీన్ ధర మార్కెట్లో గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు 3 వేలకు మించి ధర పలకడం లేదు .ఈ నేపథ్యంలో కంపెనీల కోసం ఏకంగా రెండింతల ధరను ఖరారు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

క్వింటాలుకు 800 రూపాయల భారం....
మార్కెట్లో ధర ప్రకారమే రైతులు సోయాబీన్ ను కొనుగోలు చేస్తే వారికి మూడు వేలకే దొరుకుతుంది. ఒకవేళ దాన్ని ప్రాసెస్ చేసినా 3,600కు మించి ధర ఉండదు . అలాంటిది రైతులకు క్వింటాలుకు 800 రూపాయల భారంతో 4,400 రూపాయలకు కట్టబెట్టబోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలా కంపెనీల నుంచి అధికంగా కొనుగోలు చేయడం వల్ల రైతులపై 32 కోట్లు, ప్రభుత్వంపై 88 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. దీని వల్ల కంపెనీలకు 120 కోట్లు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది రైతుల ఆరోపణ.

విత్తన కంపెనీలకు కోట్ల రూపాయల లబ్ధి....
పత్తికి బదులుగా సోయాపంటను వేసుకొనేలా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖదే. అయితే కరువులో ఉన్న రైతాంగానికి ఉచితంగా విత్తనాలు చేయాల్సింది పోయి, వారిపైనే భారం వేసే ఆలోచన చేస్తోంది. వ్యవసాయ శాఖ నిర్ణయింతో ఇటు రైతులకు, అటు సర్కారుకు కాకుండా మధ్యలో ఉన్న విత్తన కంపెనీలకు కోట్ల రూపాయల లబ్ధిచేకూరుతోంది.

సర్కారు తీరుపై రైతుల విమర్శ....
తమను, వ్యవసాయశాఖను నష్టపరిచే ఇలాంటి విధానాన్ని మానుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

10:33 - May 28, 2016

హైదరాబాద్ : ఐపీఎల్‌ సిరీస్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఫైనల్స్‌కు చేరింది. కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో గుజరాత్‌పై... రెండు విజయాలు నమోదు చేసుకున్న హైదరాబాద్ అదే రికార్డును కొనసాగిస్తూ కీలకమైన క్వాలిఫయర్-2లోనూ చిత్తుచేసింది. తొలుత గుజరాత్ 163 పరుగులు చేయగా... వార్నర్ విధ్వంసంతో.. 4 వికెట్లు మిగిలి ఉండగానే... సన్ రైజర్స్ లక్ష్యం సాధించింది. వార్నర్‌ 58 బంతుల్లో 93 పరుగులతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈనెల 29న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో సన్ రైజర్స్.. బెంగళూరుతో తలపడనుంది. 

10:28 - May 28, 2016

నెల్లూరు  :  ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భూమి మళ్లీ కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు, సీఎస్‌పురం మండలాల్లో, నెల్లూరు జిల్లాలోని వింజమూరు, దుక్కలూరు మండలాల్లో 2 సెకన్ల పాటు కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

10:24 - May 28, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులకు కొందరు కేటుగాళ్లు ఎరవేశారు. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టారు. ఓ నిరుద్యోగికి గాలం వేసి లక్షలకు లక్షలు దండుకున్నారు. బాధితుడిలో అనుమానాలు పెరగడంతో రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. కానీ కథ అడ్డం తిరగడంతో అడ్డంగా బుక్కయ్యారు.

నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా.....
ఉపాధి లభించక ఇబ్బందులుపడే నిరుద్యోగులను కేటుగాళ్లు నిండాముంచుతున్నారు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని నయా మోసాలకు తెగబడుతున్నారు. కోట్లకు కోట్లు దండుకుని పుట్టి ముంచుతున్నారు. రోజుకో రకమైన ఎత్తుతో మోసగాళ్లు వేసే పాచికకు ఎంతో మంది బలైపోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ముఠా కూడా నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది.

ఈజీమనీ వేటలో తిరుపతయ్య....
బెజవాడకు చెందిన మెంద్యాల తిరుపతయ్య హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీమనీ వేటలో పడ్డ ఇతగాడికి.. హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన మీర్ కరార్ అలీ, యాకుబ్ అలీ అలియాస్ కోటేశ్వర్ రావు, మహమ్మద్ అలీలు తోడయ్యారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్ వీరి వలలో పడ్డాడు. అప్పటికే రెండు సార్లు అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి అర్హత పరీక్ష రాసాడు. కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్లలేదు. ఓసారి ఎస్సై పరీక్షలో అర్హత సాధించినా.. ఎంవీఐ ఉద్యోగం మీదున్న మోజుతో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. అయితే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న కసితో ఉన్న ఇతగాడికి తిరుపతయ్య బ్యాచ్‌ పరిచయమైంది. టిఎస్‌పీఎస్సీలో తనకున్న పరిచయాలతో ఈజీగా ఉద్యోగం ఇప్పిస్తానని..అందుకు 40 లక్షల ఖర్చు అవుతుందని కోతలు కోశాడు.

10 లక్షలు నష్టపోయిన శ్రీనివాస్....
తమ ముఠా సభ్యుడు యాకుబ్ అలీనే..కోటేశ్వర్ రావుగా పేరు మార్చి టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్నాడని శ్రీనివాస్‌కు పరిచయం చేశారు. వీరి మాయలో పడ్డ శ్రీనివాస్ తొలివిడతగా 10 లక్షలు, ఆ తర్వాత మరికొంత మెత్తాన్ని సమర్పించుకున్నాడు. అప్పులు చేసి మరీ వీరికి డబ్బులు కట్టాడు. ఎంవీఐ పరీక్ష ఫలితాలు చూసిన శ్రీనివాస్‌.. తన నెంబర్‌ కనిపంచకపోవడంతో కంగుతిన్నాడు. వెంటనే తిరుపతయ్యను సంప్రదించగా..రెండో లిస్ట్‌లో నీ నెంబర్‌ వస్తుందని నమ్మించారు. ఎంతకీ వారి నుంచి స్పందన రాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన వారు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 16లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కేటుగాళ్ళతో జాగ్రత్త....
నిరుద్యోగులకు పంగనామాలు పెట్టేందుకు కేటుగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. డబ్బులు కడితే ఈజీగా ఉద్యోగం వస్తుందని వీరి మాయలో పడ్డారో ఇక అంతే సగంతులని గుర్తుంచుకోండి. తస్మాత్ జాగ్రత్త.

10:05 - May 28, 2016

నిజామాబాద్ : బాన్స్‌వాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ బాలింత మృతి చెందింది. దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కందర్‌పల్లికి చెందిన శ్రీనివాస్ భార్య కవిత ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. మగబిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. వైద్యులు సరైన వైద్యం చేయలేదని.. డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

10:00 - May 28, 2016

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్నలతో పాటు కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు నివాళులర్పించారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ సజీవంగా నిలిచి ఉంటారని హరికృష్ణ అన్నారు. తెలుగు జాతి గుర్తింపుకు, మనుగడకు స్వర్గీయ ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే స్వర్గీయ ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని హరికృష్ణ అన్నారు. ఆయన భార్య లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు.. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలను చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని కొనియాడారు.. ఆ మహానటుడు ప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిఉంటారన్నారు.

09:54 - May 28, 2016

పశ్చిమగోదావరి :  జిల్లా కేంద్రమైన  ఏలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు ఆశ్రమ్ ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ కుటుంబం విహారయాత్రలో భాగంగా విశాఖపట్నంకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

09:31 - May 28, 2016

హైదరాబాద్ : వివాహ బంధంతో ఆనందోత్సాహాలతో భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన హైదరాబాదు యువతి నెలలు తిరగకముందే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భార్య మృతదేహాన్ని హైదరాబాదుకు తీసుకొచ్చిన భర్త శంషాబాదు ఎయిర్ పోర్టులోనే మాయమైపోయాడు. భార్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి అతడు తిరిగి ఆస్ట్రేలియా విమానమెక్కినట్లు సమాచారం. హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన రమ్యకృష్ణకు కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మహంత్ తో పెళ్లైంది. వివాహానంతరం భర్తతో కలిసి ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్లింది. అ నేపథ్యంలో ఆమె ఆస్ట్రేలియాలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. రమ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనీ.. మృతదేహాన్ని తీసుకుని హైదరాబాద్ వస్తున్నట్లుగా రమ్య తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అన్నట్లుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మహంత్ భార్య మృతదేహాన్ని శంషాబాదు విమానాశ్రయానికి తీసుకువచ్చాడు. అనంతరం ఎయిర్ పోర్టులోనే ఆమె డెడ్ బాడీని వదిలేసి అతడు అదృశ్యమయ్యాడు. ఎయిర్ పోర్టు చేరుకున్న రమ్య తండ్రి పూర్ణ చంద్రరాబు బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. బిడ్డ మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. రమ్యను అల్లుడే చంపాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీని పై న్యాయపోరాటం చేస్తామంటున్నారు.

వ్యక్తి దారుణహత్య....

మెదక్‌: తూప్రాన్‌ మండలం జీడిపల్లిలో పొలం వద్ద నిద్రిస్తున్న వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. పోలీసులకు హతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ హత్యకు కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు ...

నెల్లూరు : నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. నెల్లూరులోని వింజమూరు, దుక్కలూరు మండలాల్లోనూ, ప్రకాశం జిల్లా పామూరు, సీఎస్‌పురం మండలాల్లో,  భూప్రకంపనలు సంభవించాయి. స్థానికులు భయాందోళనలతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్కర్ స్కేలుపై 1.8.2.1 లోపుగా వున్నట్లు సమాచారం. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగనందుకు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

ఎన్టీఆర్ కు వారసుల ఘన నివాళి...

హైదరాబాద్: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఘాట్‌లో నందమూరి హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌, తారకరత్న, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని హరికృష్ణ అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఓ కార్యకర్త ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారు, తెస్తామన్నవారు ఇప్పుడేమయ్యారని హరికృష్ణ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ జయంతి కంటే ముఖ్యమైన కార్యక్రమం తనకు ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను మహానాడుకు వెళ్లలేదని నందమూరి హరికృష్ణ వివరించారు. 

బంజారాహిల్స్ లో నిర్భంధ తనిఖీలు...

హైదరాబాద్: బంజారాహిల్స్, హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులు మీరజ్ కాలనీ, నబీ కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 35 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు సరైన పత్రాలు లేని 50 వాహనాలు సీజ్ చేశారు.

బాలికపై 33 మంది లైంగికదాడి....

బ్రెజిల్ : దేశ రాజధానిలో నిర్భయ ఘటనను మించేలా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 33 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బ్రెజిల్ మహిళా సంఘాలు, సమాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. బాలికకు డ్రగ్స్ ఇచ్చిన దుండగులు 36 గంటల పాటు నిర్భందించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్ లైన్ లో పోస్ట్ చేయడంతో గతవారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు బాలిక బాయ్ ఫ్రెండ్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

ఆస్ట్రేలియాలో నవ వధువు అనుమానాస్పద మృతి....

హైదరాబాద్ : వివాహ బంధంతో ఆనందోత్సాహాలతో భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన హైదరాబాదు యువతి నెలలు తిరగకముందే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భార్య మృతదేహాన్ని హైదరాబాదుకు తీసుకొచ్చిన భర్త శంషాబాదు ఎయిర్ పోర్టులోనే మాయమైపోయాడు. భార్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి అతడు తిరిగి ఆస్ట్రేలియా విమానమెక్కినట్లు సమాచారం. హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన రమ్యకృష్ణకు నాలుగు నెలల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మహంత్ తో పెళ్లైంది. వివాహానంతరం భర్తతో కలిసి ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్లింది. రెండు రోజుల క్రితం ఆమె ఆస్ట్రేలియాలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

08:42 - May 28, 2016

ఢిల్లీ : కేంద్ర కాబినెట్‌లో త్వరలోనే మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ విషయాన్ని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా చెప్పారు. అయితే ముహూర్తం ఎప్పుడన్నది చెప్పలేదు. మోది రెండేళ్ల పాలనపై బిజెపి దేశవ్యాప్తంగా15 రోజుల పాటు సంబరాలు జరుపుకోనుంది. మోది ప్రభుత్వం దేశానికి అవినీతి రహిత పాలనను అందించిందని అమిత్‌ షా అన్నారు.

కేంద్ర కాబినెట్‌లో త్వరలోనే మార్పులు చేర్పులు : అమిత్ షా
కేంద్రమంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయన్న ఊహాగానాలకు తెరపడింది. ప్రధాని మోది మంత్రివర్గ విస్తరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు బిజెపి అధ్యక్షులు అమిత్‌ షా వెల్లడించారు. కేంద్ర కాబినెట్‌లో త్వరలోనే మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇంకా ముహూర్తం ఖరారు కాలేదన్నారు.

రెండేళ్ల మోదీ పాలనకు బిజెపి సంబరాలు ....
కేంద్రంలో మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి సంబరాలు జరుపుకుంటోంది. గత రెండేళ్లుగా కేంద్రం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిజెపి కార్యకర్తలు15 రోజుల పాటు దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తారని అమిత్‌షా చెప్పారు. కేంద్రంలో బిజెపి, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనూ అవినీతి ఆరోపణలు రాలేదని ఆయన పేర్కొన్నారు. మోది ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కూడా ఒక్క అవినీతి ఆరోపణ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అభివృద్ధే ఎజెండగా బిజెపి సర్కార్‌ పనిచేసిందని తెలిపారు. పేదల కోసం ఎన్నో సామాజిక పథకాలను కేంద్రం ప్రవేశ పెట్టిందన్నారు. కేంద్రంలో తొలిసారిగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

వాగ్దానాలు నెరవేరుస్తాం. అమిత్ షా
21 వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా అభివర్ణించారు. వచ్చే మూడేళ్లలో 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని అమిత్‌ షా స్పష్టం చేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ....

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు అన్ని కంపార్ట్ మెంట్లలోనూ నిండిపోయారు. దీంతో భక్తులను శ్రీవారి మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి తరలించారు. నడకదారిన వచ్చిన భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. సాధారణ భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.

విశాఖలో భారీ వర్షం....

విశాఖ: విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. గాజువాక, భృమిలిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. భానుడి ప్రతాపంతో ఇబ్బందులు పడిన విశాఖ వాసులను వరుణుడు కాస్త చల్లబడిచాడు. కాగా హుదూద్ తుపానుతో హడలిపోయిన వారు భారీ వస్తే చాలు భయాందోళనలకు గురవుతున్నారు.

బొలెరో - లారీ ఢీ..ముగ్గురు మృతి...

శ్రీకాకుళం : సోంపేట మండలం లక్కవరం వద్ద బొలెరో ఓ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు చీపురుపల్లి వాసులుగా గుర్తించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి....

ఆదిలాబాద్: కాగజ్ నగర్ మండలం పెద్దవాగు దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని మున్సిపల్ కార్మికుడు కొడారి ప్రసాద్ మృతి చెందారు. ఈ సంఘటన కార్మికులను విషాదంలో నింపింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అనుమానంతో హత్య....

అనంతపురం: ధర్మవరం చైతన్యకాలనీలో బాబావలి అనే వ్యక్తిని హత్య చేశారు. హసన్‌ అనే వ్యక్తి బాబావలిని వేటకొడవళ్లతో నరికిచంపాడు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉద్యోగాల పేరిట మోసం..4గురు అరెస్ట్...

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడిన నలుగురిని టాస్క్‌పోర్స్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15.88 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

08:05 - May 28, 2016

న్యూస్ మార్నింగ్ : తిరుపతిలో టీడీపీ 35వ మహానాడు చాలా అత్యంత వైభవంగా ప్రారంభమైయింది. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వినయ్ కుమార్ (రాజకీయ విశ్లేషకులు),విద్యాసాగర్ (టీడీపీ నేత) కరుణం ధర్మశ్రీ (వైసీపీ నేత) పాల్గొన్నారు. ప్రత్యేక హోదా గురించి మహానాడు సీఎం చంద్రబాబు మాట్లాడతారని అందరూ ఎదురు చూసాం కానీ వాటన్నింటికీ భిన్నంగా బాబు ప్రసంగం వుందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి. 

08:02 - May 28, 2016

అమెరికా : 26/11 ముంబై దాడుల కేసు విచారణలో భారత్‌కు సహకరించాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరక్కుండా చర్యలు చేపట్టాలని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్‌కు విజ్ఞప్తి చేసింది. ముంబైలో జరిగిన ఉగ్రదాడి ఓ భయంకరమైన విపత్తని, బాధితులకు న్యాయంము జరిగేందుకు భారత అధికారులకు సహకరించాలని అమెరికా పాక్‌ను కోరింది. ఈ విషయంలో పాక్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా పేర్కొంది. తాలిబన్లతో పాటు పాక్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్ర వాద సంస్థలను నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించింది.

07:57 - May 28, 2016

హైదరాబాద్ : వనస్థలిపురంలో ఫిక్సడ్ డిపాజిట్ల పేరుతో జరిగిన మోసం బయటపడింది. స్థానిక అవని కోఆపరేటివ్‌ సొసైటీలో వెలుగు చూసిన ఈ మోసానికి సంబంధించి పోలీసులు... జనరల్‌ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంక్ ఎండీ పరారీలో ఉన్నాడు. వనస్థలిపురంలో 2015లో ఈ బ్యాంకును ప్రారంభించారు. 32 మంది ఖాతాలను తెరవగా.. అందులో 18 మంది ఫిక్సడ్‌ డిపాజిట్లు చేశారు. కొద్దిరోజుల క్రితం శ్రీనివాస్‌రెడ్డి అనే కస్టమర్ తన డబ్బులు ఇవ్వమని కోరగా బ్యాంకు మేనేజర్‌ లేవని చెప్పాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు జనరల్‌ మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. 

07:52 - May 28, 2016

ఖమ్మం : మూడు పదులు కూడా దాటని వయస్సులోనే ఓ మహిళ మంచానికి పరిమితమైంది. మాయరోగం వల్ల కాళ్లు, చేతులు చచ్చుపడిపోయి మూడేళ్ల నుంచి నరకయాతన పడుతూ అపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన సిరికొండ పద్మజ దీనగాథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. పేదరికం వారిని నిస్సహాయులను చేసింది. కళ్లముందే భార్య నరకయాతన అనుభవిస్తున్నా ఏమి చేయలని దైన్యం వారిని కుంగదీస్తోంది. పాల్వంచ పట్టణంలోని మంచికంటినగర్‌కు చెందిన సిరికొండ పద్మజకు మూడేళ్ల కిందట తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. భర్త వెంకటేశ్వర్లు వెంటనే కొత్తగూడెం, ఆ తర్వాత ఖమ్మం అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు ఆమెను తరలించాడు.

వెన్నుపూస డిస్కులో రక్తం గడ్డకట్టి రక్తం....
నిమ్స్‌ వైద్యులు పరీక్షలు చేసి నడుము వెన్నుపూస డిస్కులో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అప్పటికే ఆమె రెండు కాళ్ల, చేతులు పనిచేయకుండాపోయాయి. ఒక్కొక్క ఇంజక్షన్ 80వేల రూపాయలతో రెండు చేశారు. ఆ తర్వాత వారి వద్ద డబ్బులు లేకపోవడంతో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ను ఆశ్రయించారు. ఆయన స్పందించి సీఎం సహాయనిధి నుంచి లక్షన్నర మంజూరు చేయించారు.

ఆరు లక్షలకు పైగా ఖర్చు ...
ఆ డబ్బులతో నిమ్స్‌లో నెలరోజుల పాటు చికిత్స చేశారు. ఇంకా ఆరు లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో చికిత్స పూర్తి కాకుండానే ఇంటికి తీసుకువచ్చారు. మంచానికై పరిమితం అయిన పద్మజకు, భర్త వెంకటేశ్వర్లు, ఆమె ఇద్దరు కూతుళ్లు చదువు మానేసి తల్లికి సేవలు చేసుకుంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. దాతలు సహాయం చేస్తే తప్ప వారికి మరో మార్గంలేదు.

సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు....
దాతలు కరుణించి తమకు తోచిన సహాయం అందించి తమ తల్లిని బతికంచాలని వేడుకుంటున్నారు ఆ చిన్నారులు. సహాయం చేయదలచుకున్న వారు 9849772974, 8106344883 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరుతున్నారు

07:44 - May 28, 2016

హైదరాబాద్ : గ్రేటర్ లో మరో ఎలక్షన్ ఫైట్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అభ్యర్థులు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎవరికి అధిష్టానం ఆశీస్సులు అందుతాయి... ఎవరు ఈ ఎలక్షన్ ఫైట్ లో విజయం సాధిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

కీలకమైన స్టాండింగ్ కమిటీ ఎన్నిక....
జీహెచ్ఎంసీ పాలనలో కీలకమైన స్టాండింగ్ కమిటీ ఎన్నికలను నామినేషన్ల ప్రక్రియ మగిసింది. మొత్తం 46 స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు 40 మంది నామినేషన్లు వేయగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆరుగురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. కో ఆప్షన్ ఎన్నికల సందర్భంలో ఎంఐఎం , టీఆర్ఎస్ మద్య సఖ్యత కుదరక ఒకసారి సమావేశం వాయిదా పడింది. మైనారిటీ సభ్యులను చెరొకటి పంచుకోవడంతో ఎన్నిక పూర్తయింది.

బల్దియాలో కీలక నిర్ణయాలు చేసేది స్టాండింగ్ కమిటీ...
ఇక బల్దియాలో కీలక నిర్ణయాలు చేయడంలో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో మంత్రిమండలి ఎలాగో.. బల్దియాలో స్టాండింగ్ కమిటీకి అదే స్థానం ఉంది. ఈ కమిటీ ఏడాది పాటు పాలన నిర్వహించనుంది. ప్రతివారం అభివృద్ది పనులను పరీక్షిస్తుంది. 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు చేపట్టే పనులను ఈ కమిటీ అనుమతులు ఇస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కమిటీకి ఆశావహులైన కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ కి క్యూ కడుతున్నారు.

ఎన్నిక తప్పదంటున్న అదనపు కమిషనర్ ...
రాజకీయాలు ఎలా ఉన్న కార్పొరేషన్ ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెల 30 న నామినేషన్లు స్క్రూటినీ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ రెండు వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే.. ఎన్నిక తప్పనిసరవుతుందని తెలిపారు అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్.

పార్టీల మధ్య సఖ్యత కుదిరేనా?...
ఈ కీలకమైన ఎన్నికలో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరి సభ్యులను పంచుకుంటారా లేక ఎన్నికలు అనివార్యం అవుతాయా అన్నది జూన్ 2న తేలనుంది.

07:34 - May 28, 2016

హైదరాబాద్ : మ‌న వార్డు మ‌న ప్రణాళిక‌, మ‌న కార్పొరేషన్‌ మ‌న ప్రణాళిక‌ ల‌క్ష్యం నెర‌వేరాలంటే స్థానిక సంస్థల్లో వార్డు క‌మీటిలు ఎంతో ముఖ్యం. బల్దియాలో వార్డు క‌మిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నేడు జ‌రుగ‌నున్న జిహెచ్ఎంసి స్పెష‌ల్ కౌన్సిల్ స‌మావేశం సిటిలోని 150 వార్డుల‌కు క‌మిటీల‌ను ఎన్నుకోనుంది.

బ‌ల్దియా లో మొత్తం 5,600 ద‌ర‌ఖాస్తులు...
జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో ఉన్న 150 డివిజ‌న్లలలో వార్డు క‌మిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జనాభాను బ‌ట్టి ప్రతి 5వేల మందికి ఒక స‌భ్యుడు చొప్పున ప్రతీ వార్డుకు 8 నుండి 12 మంది వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్ ప‌రిధిలో 1500మంది వార్డు స‌భ్యులు ఉండే అవ‌కాశం ఉంది. బ‌ల్దియా లో మొత్తం 5,600 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. వీటిని స్క్రూటినీ చేసిన అధికారులు 4,600మందిని అర్హులుగా ప్రక‌టించారు. ప్రతి వార్డు వారీగా అవ‌స‌రం అయినంత మంది స‌భ్యుల‌ను కౌన్సిల్ వార్డు క‌మిటీకి ఎంపిక చేస్తారు. వార్డు క‌మీటికి ఎంపిక‌య్యేందుకు స్థానికంగా నివాస‌ముంటూ, వివిధ రంగాల్లో గుర్తింపుపొందిన ముఖ్యమైన వ్యక్తులంద‌రూ వార్డు క‌మీటి స‌భ్యత్వానికి అర్హులు.

వార్డు క‌మిటీ ఎన్నిక‌పై విమర్శలు....
గ‌త పాల‌కమండలి స‌మయంలో వార్డు క‌మిటీ స‌భ్యుల ఎన్నిక‌ల్లో పార‌ద‌ర్శకంగా వ్యవ‌హ‌రించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. అర్హత ఆధారంగా కాకుండా వార్డు క‌మిటీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ జోక్యం ఎక్కువైంద‌న్న విమ‌ర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాంటి పొర‌పాట్లు జ‌రుగ‌కుండా చ‌ర్యలు తీసుకుంటామంటున్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్.వార్డు క‌మీటిల్లో రాజ‌కీయ నాయ‌కుల జోక్యం తగ్గుతుందా, లేక కార్పొరేట‌ర్లు, ఎమ్మెల్యేలు చెప్పిన లిస్ట్‌ల‌నే అధికారులు ఫైన‌ల్ చేస్తారా అనేది నేడు తేలిపోతుంది.

07:27 - May 28, 2016

విజయవాడ : రాజ్యసభ ఎన్నికల వేళ.. ఎమ్మెల్యేల వలసలు జోరందుకోవడం.. వైసీపీని కలవర పెడుతోంది. విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తుంటే.. పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరుగా అధికార పార్టీలోకి జారుకుంటున్నారు. దీంతో విదేశీ క్యాంపులకు తెరలేపాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది.

సైకిలెక్కేసిన 17 మంది ఎమ్మెల్యేలు....
వైసీపీ ఎమ్మెల్యేల వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అధికారికంగా 17 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు. రాజ్యసభ ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైసీపీ నేతలే భావిస్తున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం.. వైసీపీ తరఫున ఒక సభ్యుడు రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో ఆపార్టీ విజయసాయిరెడ్డిని బరిలోకి దించింది. పోయిన వాళ్లు పోగా.. మిగిలిన వారినైనా కాపాడుకునేందుకు అధిష్ఠానం ఓ వంక ప్రయత్నిస్తుంటే.. ఎమ్మెల్యేలేమో.. తమ దారి తాము చూసుకుంటున్నారు.

బరిలోకి విజయసాయిరెడ్డి ....
రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు విజయసాయిరెడ్డికి 36 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఆయన నామినేషన్‌ దాఖలు చేసిన రోజే.. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఎన్నికల నాటికి ఎంతమంది తమ వెంట ఉంటారోనన్న దిగులు పార్టీ అధిష్ఠానానికి పట్టుకుంది. రాజ్యసభ సీటు చేజారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. అధికార టీడీపీ నాలుగో అభ్యర్థిని బరిలోకి దించితే తమ ఎమ్మెల్యేలు అటు వెళ్లకుండా విదేశాల్లో క్యాంపులు నిర్వహించాలని యోచిస్తోంది.

సింగపూర్‌, దుబాయి లాంటి చోట్ల ఎమ్మెల్యేల క్యాంపులు...
తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలను సింగపూర్, దుబాయి లాంటి దేశాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు వైసీపీ వర్గాల కథనం. మ‌రోవైపు వలస వచ్చే ఎమ్మెల్యేల‌కు అధికార తెలుగుదేశం పార్టీ, భారీగా ఆఫ‌ర్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసుకొని ఆకర్షాస్త్రం ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల నాటికి మరికొంత మందిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్‌ ఆపసోపాలు పడుతున్నారు. తమ అభ్యర్థి విజయసాయి రెడ్డికి ఓటేసే ఎమ్మెల్యేలను ఆర్థికంగా ఆదుకుంటామని కూడా జగన్‌ హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

07:12 - May 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను టీఆర్ఎస్ పార్టీ మరోసారి నిజం చేసింది. ప్రభుత్వ పరంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందన్న విపక్షాల ఆరోపణలకు బలం కలిగేలా పదవుల భర్తీ కూడా వారితోనే జరిగింది. దీంతో దక్షిణ తెలంగాణ గులాబి నేతల్లో అసంతృప్తి మొదలైంది.

ఉత్తర తెలంగాణ జిల్లాల నేతలకే ప్రాధాన్యం....
గులాబి పార్టీ తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టకముందు నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో సెంటిమెంట్ తో బలపడింది. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో కూడా ఆ జిల్లాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తోందన్న విమర్శలను ముందు నుంచి అధికార పార్టీ ఎదుర్కొంటోంది. ప్రాజెక్టుల విషయంలోనూ, అభివృద్ధి విషయంలోనూ ఉత్తర తెలంగాణా జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నాడన్న ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. తాజాగా పార్టీ పరంగా కూడా దక్షిణ తెలంగాణా జిల్లాలకన్నా ఉత్తర తెలంగాణా జిల్లాలకే ప్రాధాన్యత నిస్తున్నట్లు సంకేతాలను ముఖ్యమంత్రి ఇచ్చారు. పార్టీ పరంగా ఇద్దరు రాజ్యసభ సభ్యులతో పాటు ఓ శాసనమండలి స్థానాన్ని కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకే కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం పార్టీ నేతల్లో చర్చనీయంశంగా మారింది.

డీ.ఎస్ కారెక్కడంతో పాటే క్యాబినెట్ ర్యాంక్...    
కొద్దిరోజుల క్రితమే డీ.ఎస్ కారెక్కడంతో పాటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవి కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ కూడా ఆయనకే దక్కడం పార్టీ నేతలకు రుచించడం లేదు. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గులాబి పార్టీ పూర్తి మెజారిటీ లేకపోవడంతో కేకేను పార్టీ రంగంలోకి దించి వ్యూహత్మకంగా స్థానం దక్కించుకుంది. ఇప్పుడు పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నా.డీఎస్కు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

రుచించని ప్రభుత్వ తీరు...
ఎంఎల్ సీ సభ్యుడిగా ప్రకటించిన ఫరీదుద్దీన్ అభ్యర్థిత్వాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మెదక్ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చినా, ఇతర జిల్లాల నేతలకు అవకాశం కల్పించినా ఉద్యమ సమయంలో పార్టీతో కలిసి వచ్చిన నేతలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదన్న ఆందోళన నేతల్లో వ్యక్తం అవుతోంది.

07:05 - May 28, 2016

తిరుపతి : ఎన్ని అవాంతరాలు వచ్చినా.. ఏపీని నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు నిద్రపోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పేదల అభివృద్ధే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తిరుపతిలో జరగుతున్న పార్టీ సమావేశం మహానాడులో ఆయన ప్రసంగించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన టీడీపీ.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి అండగా ఉంటుందని చెప్పారు.

అధ్యక్షోపన్యాసం చేసిన సీఎం ....
తెలుగుదేశం పార్టీ మహానాడు తిరుపతిలో కోలాహలంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉదయం అధ్యక్ష ఉపన్యాసమిచ్చారు. రాష్ట్ర విభజన వల్ల భారీగా ఆదాయం కోల్పోయామని, క్లిష్ట పరిస్థితుల్లో రాజధానిని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో సాయం అందించి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని, విభజన చట్టంలోని హామీలను పూర్తిగా అమలు చేయాలని ఆయన కోరారు.

నీరు-ప్రగతి పథకంతో కరవు నివారణ చర్యలు :చంద్రబాబు
తెలుగుదేశం ప్రభుత్వం.. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రులను ఆధునీకరించామని చంద్రబాబు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేశామని, నీరు-ప్రగతి పథకంతో రాష్ట్రంలో కరవు నివారణ చర్యలు చేపట్టామన్నారు. రాయలసీమను కాంగ్రెస్‌ ఎడారి చేసిందని, జగన్‌ కుటుంబం హింసాయుత రాజకీయాలకు పాల్పడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ కు కట్టడికి ప్రత్యేక చట్టాలు :చంద్రబాబు
ఎర్రచందనం స్మగ్లర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చామని, ఎర్రచందనం ధనాన్ని పేదల కోసం ఖర్చు పెడతామని చంద్రబాబు చెప్పారు. జైల్లో ఉన్న వ్యక్తిని బయటకు తెచ్చి.. కాంగ్రెస్‌ పార్టీ.. కుట్రతో రాష్ట్ర విభజన చేసిందని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్‌, వైసీపీ రెండూ ఒక్కతాను ముక్కలేనని అన్నారు.

కోటీ యాభై లక్షలతో బీమా పథకం : బాబు
వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం, నదుల అనుసంధానం, పంట సంజీవని కింద కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా సంవత్సరంలో పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. అసంఘటిత కార్మికులు, వ్వవసాయ కూలీలకు, తోపుడు బండ్ల వాళ్లకు కోటీ యాభై లక్షలతో బీమా పథకాన్ని తేనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

తెలంగాణలో సామాజిక చైతన్యం తెచ్చింది టీడీపీయే : బాబు
హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతికి సంపద, ఉద్యోగాలు రావాలని, ఇరిగేషన్‌, మానవవనరులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రజలతో మమేకమైన వారికే పార్టీలో పెద్దపీట వేసినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రజల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో సామాజిక చైతన్యం తెచ్చింది టీడీపీయేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..

హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులను గౌరవించటానికి టీ.సర్కార్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఐదుగురు అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 50 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.. నడుస్తున్న రైలు నుంచి జై తెలంగాణ అంటూ రైలు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన అమరవీరుడు పాదరాజు భానుప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం విడుదల చేసింది.

గంగలో పడవ మునక..8మంది గల్లంతు....

బీహార్‌ : కతిహర్ జిల్లా మనిహరి ప్రాంతంలో గంగానదిలో గురువారం బోటు మునిగిపోవడంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. మరో 20 మంది ఈదుకుంటూ ఒడ్డుకు సురక్షితంగా చేరారు. గల్లంతైన వారి కోసం రక్షణ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పర్వతారోహకుడు పరేశ్‌నాథ్ మృతదేహం లభ్యం...

ఖంట్మడు : ఎవరెస్ట్ పర్వతంపై ఇటీవల గల్లంతైన భారత పర్వతారోహకుడు పరేశ్‌నాథ్ మృతదేహాన్ని పర్వత ఎగువ భాగంలో గుర్తించారు. దీంతో ఇటీవల ఎవరెస్ట్‌పై మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్టును జమ్ము కశ్మీర్‌లోని ఎన్‌సీసీ చెందిన ముగ్గురు బాలికలు తొలిసారి అధిరోహించారు.

కత్తితో దాడి..ముగ్గురికి గాయాలు...

నెల్లూరు: కొడవలూరు మండలం తలమంచిలో ఓ వ్యక్తి ఐదుగురిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా వాహనాల పార్కింగ్‌ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని పల్లా బ్రహ్మయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

ఏలూరులో రోడ్డు ప్రమాదం....

పశ్చిమగోదావరి : ఏలూరు ఆశ్రమ్ ఆస్పత్రి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాను లారీను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Don't Miss