Activities calendar

29 May 2016

ఐపీఎల్-9 ఛాంపియన్స్ సన్ రైజర్స్

బెంగళూరు : ఐపీఎల్-9 ట్రోపీని సన్ రైజర్స్ హైదరాబాద్ కైవసం చేసుకున్నారు. రసవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

జోర్డాన్ రనౌట్

బెంగళూరు : ఐపీఎల్-9 ఫైనల్  చివరి ఓవర్లో 194 పరుగుల వద్ద బెంగళూరు 7వ వికెట్ కోల్పోయింది. జోర్డాన్ రనౌట్ గా వెనుదిరిగాడు. 3 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది. 

బిన్నీ రనౌట్

బెంగళూరు : ఐపీఎల్-9లో  బెంగళూరు ఆరో వికెట్ కోల్పోయింది. 180 పరుగుల వద్ద రెండో పరుగు కోసం ప్రయత్నించిన బిన్నీ11, హుడా వేసిన అద్భుత త్రో కు ఔటయ్యాడు. దీంతో 11 బంతుల్లో బెంగళూరు 29 రన్స్ చేయాల్సి ఉంది.  

వాట్సన్ ఔట్

బెంగళూరు : ఐపీఎల్-9 ఫైనల్ లో కోహ్లీ సేనకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. హైదరబాద్ తురుపు ముక్క ముస్తిఫిజుర్ కీలక సమయంలో డేంజరస్ వాట్సన్ (11) ను ఔట్ చేశాడు. 164 పరుగుల వద్ద బెంగళూరు 5వ వికెట్ కోల్పోయింది. 

నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు

బెంగళూరు : ఐపీఎల్-9 ఫైనల్స్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 160 వద్ద కెఎల్ రాహుల్ 11ను కట్టింగ్స్ బౌల్డ్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పట్టు బిగిస్తోంది. 

డివిల్లియర్స్ ఔట్

బెంగళూర్ : ఐపీఎల్9 ఫైనల్ లో సన్ రైజర్స్ మరో బ్రేక్ సాధించింది. ప్రమాదకర బ్యాట్స్ మెన్ డివిల్లియర్స్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి బిపుల్ శర్మ బౌలింగ్ లో హెన్రిన్స్ కు పట్టిన క్యాచ్ తో డగౌట్ కు చేరాడు. ఆర్సీబీ 14 ఓవరల్లఓ 149/3 పరుగులతో ఆడుతోంది. 36 బంతుల్లో మరో 60 పరుగులు చేయాల్సి ఉంది. 

కోహ్లీ బౌల్డ్

బెంగళూరు : 140 పరుగుల వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీ వికెట్ కోల్పోయింది. సన్ రైజర్స్ బౌలర్ శ్రాన్ కోహ్లీని బౌల్డ్ చేశాడు. దీంతో 12.5 ఓవర్లలో బెంగళూరు 140/2పరుగులతో ఆడుతోంది. 

గేల్ ఔట్

బెంగళూరు : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ తొలి బ్రేక్ సాధించింది. జోరుమీదున్న గేల్ (76) కట్టింగ్స్ బౌలింగ్ లో బిపుల్ శర్మ అందుకున్న క్యాచ్ తో వెనుదిరిగాడు. దీంతో 114 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 

గేల్ ఆఫ్ సెంచరీ.. లక్ష్యం దిశగా ఆర్సీబీ

బెంగళూరు : ఐపీఎల్-9 ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. హైదరాబాద్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యం దిశగా కోహ్లీ సేన దూసుకెళ్తోంది. ఓపెనర్ గేల్ ధనాధన్ అర్థ సెంచరీతో అదరగొడుతున్నాడు. దీంతో బెంగళూరు కేవలం 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. 

బెంగళూరు టార్గెట్ 209..

బెంగళూరు : ఐపీఎల్ 9 లో భాగంగా బెంగళూరు జట్టుతో ఆడుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జట్టులో వార్నర్ (69) విజృంభించి ఆడాడు. ధావన్ 28 పరుగులకే పెవిలియన్ చేరాడు. యువరాజ్ కూడా కొద్దిసేపు బ్యాట్ జులిపించాడు. 38 పరుగుల వద్ద ఉన్న యువరాజ్ ను జోర్దాన్ పెవిలియన్ పంపించాడు. చివరిలో కటింగ్ మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లో 39 పరుగులు చేయడం విశేషం. బెంగళూరు జట్టు బౌలింగ్ లో జోర్దాన్ 3, అరవింద్ 2, చహాల్ 1 వికెట్ తీశారు. మరి ఈ టార్గెట్ ను బెంగళూరు చేధిస్తుందా లేదా ? అనేది చూడాలి. 

21:29 - May 29, 2016

ఢిల్లీ : రెండేళ్ల మోడీ ప్రభుత్వ పాలనపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సమావేశంలో బేరీజు వేయనున్నామని ఆపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన విమర్శించారు. బెంగాల్ లో సీపీఎం నేతలపై దాడులు జరగడాన్ని రాఘవులు తీవ్రంగా ఖండించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్రకమిటీలో చర్చించనున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రజలకు అన్యాయం చేస్తుందని రాఘవులు విమర్శించారు. ఇంకా ఏమన్నారో వీడియో క్లిక్ చేయండి. 

సన్ రైజర్స్ 174/7..

బెంగళూరు : ఐపీఎల్ 9లో భాగంగా బెంగళూరు జట్టుతో తలపడతున్న హైదరాబాద్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 18.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 

21:27 - May 29, 2016

హైదరాబాద్ : బీజేపీ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు వినమ్రతతో వికాస్‌ పర్వ్‌ పేరిట కలుస్తున్నానని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమితా షా తెలిపారు. పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసేందుకు ఆదివారం ఆయన హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీఆర్ఎస్ తో పొత్తుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్ కాలంలో కుంభకోణాలు తప్ప మరేమి లేవని.. రెండేళ్ల మా పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా మేము ఎదుర్కోలేదన్నారు ఆయన. పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తున్నామన్నారు అమిత్ షా. ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంట్ ఇచ్చింది. రానున్న రోజుల్లోను సమస్యలను పరిష్కరించి ప్రధాని తెలంగాణలో పర్యటిస్తారన్నారు అమిత్ షా .

21:22 - May 29, 2016

హైదరాబాద్ : తనకు కొన ఊపిరున్నంతవరకూ కాపు జాతికోసం పోరాటం చేస్తానని కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. తెలంగాణలోని ఏపీ కాపులు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారని.. ఏపీలో అమలైన తర్వాత ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ను కలుస్తానని ప్రకటించారు.. ఆపు భవనాలకు సీఎం చంద్రబాబు పేర్లుపెట్టి తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.. కమ్మ భవనాలకు కమ్మ కాపు భవనం అని పేరు పెడతారా? అని ముద్రగడ ప్రశ్నించారు.

21:20 - May 29, 2016

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ట్యాంకర్ల యాజమాన్యాల అసోసియేషన్‌ సమ్మెకు సిద్ధమైంది.. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రినుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి..వ్యాట్‌ ఎత్తివేత విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. 14.5 శాతం పన్ను విధింపును ఎత్తివేయాలన్న డిమాండ్‌తో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ట్యాంకర్ ఓనర్ల అసోసియేషన్‌ ఈ సమ్మెకు దిగింది.. అసోసియేషన్‌తో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.. దీంతో ఆదివారం అర్ధరాత్రినుంచి సమ్మె కొనసాగుతుందని అసోసియేషన్ ప్రకటించింది.

14.5 శాతం పన్ను..
ఏ రాష్ట్రాల్లో లేనివిధంగా తెలంగాణలో 14.5శాతం పన్ను విధిస్తున్నారని ట్యాంకర్ల అసోసియేషన్ ఆరోపిస్తోంది.. ఈ పన్నువల్ల తాము సంపాదించిందంతా ట్యాక్సులు కట్టడానికే సరిపోతోందని అసోసియేషన్‌ నేతలు వాపోయారు. మంగళవారం ప్రభుత్వంపై మరోసారి చర్చలు జరుపుతామని.. సర్కారు దిగిరాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అసోసియేషన్‌ నేతలు హెచ్చరించారు. ఈ సమ్మెతో 7డిపోల్లోని 3వేల ట్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి.. సోమవారం నుంచి ఈ సమ్మె ప్రభావం వాహనదారులపై పడే అవకాశముంది.. 

21:18 - May 29, 2016

చిత్తూరు : టీడీపీ మొదటి, 35వ మహానాడు తిరుపతిలోనే జరుగుతోందని...టీడీపీ చరిత్రలో ఈ ఘటన చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుటుంబం కన్నా తనకు తెలుగుదేశం పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు. మహానాడులో అందరూ అద్భుతంగా భాగస్వాములయ్యారని అభినందించారు. తిరుపతి మూడో రోజు మహానాడులో చంద్రబాబు ముగింపు సందేశం ఇచ్చారు. మహానాడు చివరిరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షోపన్యాసం చేశారు. కార్యకర్తల త్యాగాల వల్లే పార్టీ నిలించిందని చంద్రబాబు గుర్తు చేశారు. సాంకేతిక యుగంలో వినూత్నంగా చేస్తే తప్ప అనుకున్నది సాధించలేమని అన్నారు.

851 మంది రక్తదానం..
టీడీపీ కోసం త్యాగాలు చేసిన త్యాగధనులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలే నాకు ప్రాణం.. వారి వల్లే ప్రపంచంలో గుర్తింపు వచ్చిందన్నారు. స్వచ్ఛందంగా 851 మంది కార్యకర్తలు రక్తదానంలో భాగస్వాములయ్యారని స్మార్ట్‌ విలేజ్‌లో 300 మంది కార్యకర్తలు భాగస్వాములవుతామని తెలిపారని చెప్పారు. అమరావతి తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అని బాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులున్నా ఏమాత్రం రాజీపడకుండా ముందుకు దూసుకెళ్తున్నామన్నారు. ఒక్క అమరావతినే కాకుండా ఏపీలోని అన్ని జిల్లాలను అభివృద్ది చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇదిలా ఉంటే నేటితో మహానాడు ముగిసింది. చంద్రబాబు ప్రసంగం అనంతరం ఆయన్ని పలువురు తెలుగు తమ్ముళ్లు పూలమాలలతో సన్మానించారు.

21:16 - May 29, 2016

హైదరాబాద్ : మహానాడు మూడో రోజు మొత్తం 28 తీర్మానాలను పార్టీ ఆమోదించింది. పేదరికం లేని సమాజమే ఆశయమన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకు సాగుతామని.. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకొని.. కరవును రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. టీడీపీ మహానాడు ప్రతినబూనింది. మూడు రోజులుగా తిరుపతిలో జరుగుతోన్న పసుపు వేడుకలో.. టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. మహానాడు చివరిరోజు.. భోజన విరామ సమయానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలవారీ తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సమగ్ర జల విధానం-ప్రాజెక్టుల నిర్మాణంపై తీర్మానాన్ని సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రవేశపెట్టారు. ప్రతిపక్షం అభివృద్ధి నిరోధక చర్యలపై తీర్మానాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదించారు. కృష్ణా పుష్కరాల తీర్మానాన్ని కొనకళ్ల నారాయణ, అభివృద్ది పథంలో వ్యవసాయం, అనుబంధ రంగాల తీర్మానాన్ని నిమ్మల కిష్టప్పలు ప్రవేశపెట్టారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలపెంపు, నదుల అనుసంధానం, బిందు, తుంపర సేద్యం ద్వారా రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేందుకు రచించిన ప్రణాళికలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

11 కోట్ల విరాళాలు..
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా తెలంగాణ తెలుగు దేశం నేతలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, టిఆర్‌య‌స్ హామీలు, వైఫల్యాలు, మైనారిటీ గిరిజన రిజర్వేషన్లు, ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ పథకాలు మితిమీరిన అవినీతి తదితర అంశాలపై తీర్మానాలను నేతలు ప్రతిపాదించి బలపరిచారు. వీటన్నింటినీ మహానాడు ఏకగ్రీవ తీర్మానం తెలిపింది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకుని రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చాలని మహానాడు ప్రతిజ్ఞ చేసింది. జలసంరక్షణతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సియం పిలుపునిచ్చారు. కృష్ణ, గోదావరి నదులు కలిసే పవిత్రసంగమ ప్రదేశంలో కృష్ణా పుష్కరాలను అపూర్వ రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడు సందర్భంగా సుమారు 380 మంది దాతలు 11 కోట్ల 55 లక్షల రూపాయల మేర విరాళాలను పార్టీకి అందజేశారు. 

యువరాజ్ అవుట్..

బెంగళూరు : బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాట్ మెన్ యువరాజ్ సింగ్ పెవిలియన్ చేరాడు. ఐదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 38 పరుగులకు అవుట్ అయ్యాడు. వార్నర్ (69), ధావన్ (28), హెన్రిచ్ (4), హూడా (3) పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

హైదరాబాద్ 147/4...

బెంగళూరు : బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ప్రస్తుతం యువరాజ్ సింగ్ 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వార్నర్ (69), ధావన్ (28), హెన్రిచ్ (4), హూడా (3) పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

ధాటిగా ఆడుతున్న యువరాజ్..

బెంగళూరు : ఐపీఎల్ 9 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ధాటిగా ఆడుతోంది. బెంగళూరు జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీకొంటోంది. వార్నర్ అవుట్ అయిన అనంతరం యువరాజ్ సింగ్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ప్రస్తుతం యువరాజ్ సింగ్ 19 బంతుల్లో 32 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మూడు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ 140 పరుగులు చేసింది. 

వార్నర్ అవుట్..

బెంగళూరు : ఐపీఎల్ 9లో ఫైనల్ మ్యాచ్ లో వీరవిహారం చేస్తున్న సన్ రైజర్స్ బ్యాట్ మెన్ వార్నర్ అవుట్ అయ్యాడు. బెంగళూరు జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీకొంటోంది. 38 బంతులను ఎదుర్కొని 68 పరుగులు చేసిన వార్నర్ ను అరవింద్ అవుట్ చేశాడు. ప్రస్తుతం 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 

20:57 - May 29, 2016

ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వంశీ మరణం విషయంలో డిటెక్టివ్ బృందానికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో కూడా హత్య చేసినట్లు నివేదికలో ఉంది. కామ పిశాచి అయిన వంశీని హత్య చేసింది ఎవరు ? తనకు దక్కని వంశీ ఎవరికీ దక్కకూడదని భార్యే హత్య చేసిందా ? పాములు పట్టేవాడు పాము కాటుకు మరణించినట్లుగా వైద్య వృత్తిలో ఉన్న వంశీ ఒక్క ఇంజక్షన్ కే చనిపోయాడు. తన చుట్టూ జరుగుతున్న కుట్రను పసిగట్టలేకపోయాడు. పురుషుడు ఎప్పుడూ స్త్రీ లోలుడే. కానీ బాధ్యతలు విడిచి బంధాలు మరిచి పరాయి స్త్రీ వాంఛలో ఆకర్షితుడైన ఏ మగాడు బాగుపడినట్లు చరిత్ర పుటల్లో లేదు. అందుకు వంశీ హత్య ఉదంతమే నిదర్శనం. 

టిడిపి పొలిట్ బ్యూరో భేటీ..

చిత్తూరు : టిడిపి పొలిట్ బ్యూరో భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు హాజరయ్యారు. రాజ్యసభ సీట్ల కేటాయింపుపై చర్చ జరగనుంది. 

వంద పరుగులు దాటిన హైదరాబాద్..

బెంగళూరు : ఐపీఎల్ 9లో హైదరాబాద్ జట్టు ధాటిగా ఆడుతోంది. 10 ఓవర్లలోనే వంద పరుగుల మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్ బ్యాట్ మెన్ వార్నర్ వీరవిహారం చేస్తున్నాడు. కేవలం 31 బంతులను ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ధావన్ (28), హెన్రిచ్ (4) పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

హెన్రిచ్ అవుట్..

బెంగళూరు : ఐపీఎల్ 9 లో భాగంగా బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ రెండో వికెట్ ను కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెన్రిచ్ పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం 9.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. 

వార్నర్ హాఫ్ సెంచరీ..

బెంగళూరు : ఐపీఎల్ 9లో భాగంగా బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాట్ మె న్ వార్నర్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. కేవలం 24 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 52 పరుగులు సాధించాడు. అందులో 5 ఫోర్లు, 2 సిక్స్ లున్నాయి. ప్రస్తుతం 8.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. 

వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

బెంగళూరు : ఐపీఎల్ 9 లో భాగంగా బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ మొదటి వికెట్ ను కోల్పోయింది. 28 పరుగులు చేసిన ధావన్ పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం 6.6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. 

చాదర్ ఘాట్ లో దారుణం..

హైదరాబాద్ : పదిహేను రోజుల క్రితం అదృశ్యమైన జానకి (26) దారుణ హత్యకు గురైంది. హయత్ నగర్ మండలం గౌరెల్లి సమీపంలో మూసీ నదిలో గోనె సంచిలో మృతదేహం లభ్యమైంది. జానకిని ప్రియుడు యశ్వంత్ హత్య చేశాడు. ఫేస్ బుక్ లో జానకితో యశ్వంత్ కు పరిచయమైంది. 

హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం - ముద్రగడ..

హైదరాబాద్ : కాపు సామాజిక ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం హాజరయ్యారు. కొన ఊపిరితో ఉన్నంత వరకు కాపు జాతి కోసం పోరాటం చేస్తానని, తెలంగాణలోని ఏపీ కాపులు కూడా రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నారని తెలిపారు. ఏపీలో అమలయ్యాక తెలంగాణ సీఎంను కలుస్తానని, కాపు రిజర్వేషన్లకు సహకరించాలని అందర్నీ కలుస్తానన్నారు. కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెట్టి కాపుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. గడవులోగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల ఓనర్ల చర్చలు విఫలం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల ఓనర్ల సంఘం నేతలతో వాణిజ్య, పన్నుల శాఖ కమిషనర్ అనీల్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 

టాస్ గెలిచిన హైదరాబాద్..

ముంబై : ఐపీఎల్‌ -9 లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ - బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

19:22 - May 29, 2016

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టిడిపి నిర్వహించిన మహానాడు ముగిసింది. మూడు రోజుల పాటు ఈ మహానాడు జరిగింది. ఇందులో 28 తీర్మానాలను ఆమోదించారు. మొత్తం 146 ప్రసంగాలు నమోదయ్యాయి. టిడిపి నిర్వహించిన మహానాడుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వేణుగోపాల్ (వైసీపీ), కోటేశ్వరరావు (బీజేపీ), సూర్య ప్రకాష్ (టిడిపి), తులసీ దాస్ (ప్రజాశక్తి ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

లావణ్య మృతి కేసులో అరెస్టులు..

విశాఖపట్టణం : సంచలనం సృష్టించిన కేసులో లావణ్య మృతి కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. హేమ కుమార్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేపట్టారు. 

18:46 - May 29, 2016

విశాఖపట్టణం : బీచ్‌లో గల్లంతైన చిన్నారి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్న అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. అల్లిపురంకుచెందిన శేఖర్‌ తన ముగ్గురు పిల్లలతోకలిసి శనివారం సాయంత్రం బీచ్‌కు వచ్చారు. తల్లి ఫోన్‌ మాట్లాడుతుండగా పిల్లలు సముద్రంలోకి దిగారు. మూడేళ్ల జ్యోత్స్న సముద్రంలోని అలలకు కొట్టుకొని పోయింది. పాపకోసం గజ ఈతగాళ్లు సముద్రంలో గాలించినా ఉపయోగంలేకుండా పోయింది. చివరకు జ్యోత్స్న విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

18:43 - May 29, 2016

విజయవాడ : తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించిన టిడిపి మహానాడు ఆత్మస్తుతి, సోత్కర్ష, పరనిందగా ముగిసిందిన ఏపీ కాంగ్రెస్‌ కమిటీ విమర్శించింది. మహానాడులో చేసిన తీర్మానాలు ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని పార్టీ నాయకత్వం విమర్శించింది. మీడియాతో రఘువీరా రెడ్డి మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలైన తెలుగు ప్రజల ఆత్మగౌరం, సామాజికన్యాయం సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తీర్మానం చేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల కంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువే చేశామని మహానాడు వేదికగా టీడీపీ నాయకులు అబద్దాలు వల్లెవేశారని విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి - అమిత్ షా..

హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. పార్లమెంట్ ఇచ్చిన హామీ మేరకు ముందుకెళుతామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టిడిపితో మైత్రి కొనసాగుతుందని, తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతామన్నారు. త్వరలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటిస్తామని, తెలంగాణలో త్వరలో ప్రధాన మంత్రి మోడీ పర్యటిస్తారని తెలిపారు. 

కాసేపట్లో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం..

చిత్తూరు: కాసేపట్లో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. కొద్దిసేపటి క్రితం టిడిపి మహానాడు ముగిసింది. పొలిట్ బ్యూరో సమావేశంలో రాజ్యసభ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

కేసీఆర్ ను కలిసిన డీఎస్..

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డి. శ్రీనివాస్ కలిశారు. రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎంతో డీఎస్ చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నెల 31న రాజ్యసభకు డీఎస్ నామినేషన్ దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే. 

18:13 - May 29, 2016

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు 12 మంది బీజేపీ అభ్యర్ధులను పార్టీ నాయకత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును రాజస్థాన్‌ నుంచి పోటీ చేస్తారు. వాణిజ్యశాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్‌ కర్నాటక నుంచి పోటీ చేయనున్నారు. వెంకయ్యనాయుడు ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మాలా సీతారామన్‌ను కర్నాటక నుంచి అభ్యర్ధిగా ఎంపిక చేశారు. ఏపీ నుంచి రాజ్యసభకు పంపే విషయంలో టీడీపీ నాయకత్వాన్ని బీజేపీ సంప్రదించలేదని సమాచారం. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ జార్ఖండ్‌ నుంచి పోటీ చేస్తారు. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు అభ్యర్ధిగా నిర్ణయించారు. గోపాల్‌ నారాయణ్‌సింగ్‌ బీహార్‌ నుంచి అభ్యర్ధిగా నిర్ణయించారు. ఓంప్రకాష్‌ మాథుర్‌, హర్షవర్థన్‌సింగ్‌, రాంకుమార్‌ వర్మలను కూడా రాజస్థాన్‌ నుంచి అభ్యర్ధులుగా నిర్ణయించారు. చత్తీస్‌గఢ్‌ నుంచి రామ్‌ విచార్‌ నేతం, గుజరాత్‌ నుంచి పురుషోత్తం రూపాల, మధ్యప్రదేశ్‌ నుంచి అనిల్‌ మాధవ్‌ దవే పోటీ చేస్తారు. 

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు..

ఢిల్లీ : రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 12 మందితో జాబితాను సిద్ధం చేసింది. రాజస్థాన్ నుండి వెంకయ్య నాయుడు, ఓం ప్రకాశ్ మాథూర్, హర్షవర్దన్ సింగ్, రాంకుమార్ వర్మ, కర్నాటక నుండి నిర్మలా సీతరామన్, హర్యాన నుండి చౌదరి బీరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుండి పీయూష్ గోయెల్, జార్ఖండ్ నుండి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుండి పురుషోత్తం రూపాల, మధ్యప్రదేశ్ నుండి అనీల్ మాధవ్ దవే, బీహార్ నుండి గోపాల్ నారాయణ్ సింగ్, ఛత్తీస్ గఢ్ నుండి రాం విచార్ నేతం రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ ఖరారు చేసింది. 

17:25 - May 29, 2016

వరంగల్ : ప్రతిష్టాత్మక సివిల్స్ పరీక్షలో దేశ వ్యాప్తంగా 65వ ర్యాంకు..తెలుగు రాష్ట్రాల్లో 2వ ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉందని వల్లూరి క్రాంతి పేర్కొంది. జిల్లాలోని హన్మకొండలో జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన సదస్సులో వల్లూరి క్రాంతి పాల్గొని సలహాలు..సూచనలు తెలియచేసింది. ఈ సందర్భంగా క్రాంతితో టెన్ టివి ముచ్చటించింది. ఉద్యమాలు..వామపక్ష నేపథ్య కుటుంబంలో నుండి వచ్చిన క్రాంతి సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ర్యాంకును సాధించారు. ర్యాంకు ఎలా సాధించారు ? దానికి ఎలా కృషి చేశారనే దానిపై క్రాంతి మాట్లాడింది. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

17:18 - May 29, 2016

ఖమ్మం : జిల్లాలో వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. చెరుకూరి నర్సింగరావు అనారోగ్యంతో పృథ్వీ ఆసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న కాంపౌడర్ ఇంజక్షన్ ఇచ్చాడు. అరగంట తరువాత నర్సింగరావు కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతుడి బంధువులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో కుటుంబసభ్యులు శాంతించారు. 

17:13 - May 29, 2016

ఖమ్మం : రాముడి దర్శనం కోసం కొంతమంది భక్తులు వివిధ రకాలుగా భద్రాద్రికి చేరుకుంటుంటారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కొంతమంది భక్తులు పాదయాత్ర ద్వారా భద్రాద్రికి పయనమయ్యారు. 41 రోజుల మాల ధరించిన హనుమాన్ భక్తులు 287 కిలోమీటర్ల వరకు నడచుకుంటూ వెళుతున్నారు. ఎండలు దంచికొడుతున్నా భక్తితో చెప్పులు వేసుకోకుండా వీరు కాలినడక చేస్తున్నారు. పాల్వంచ ప్రధాన రహదారిపైనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఈ భక్తులు భద్రాద్రికి పయనమయ్యారు. 

రాజ్ నాథ్ నివాసం ఎదుట జాట్ నేతల ధర్నా..

న్యూఢిల్లీ: హర్యానా, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన జాట్ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. 

దావనగిరికి చేరుకున్న మోడీ..

కర్నాటక : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దావనగిరికి చేరుకున్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉజ్వల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్పతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.

పెట్రోల్, డీజిల్ యాజమాన్యాలతో కమిషనర్ భేటీ..

హైదరాబాద్ : నాంపల్లిలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యాజమాన్యాలతో వాణిజ్య పన్నుల కమిషనర్ అనీల్ భేటీ అయ్యారు. చర్చలు జరుపుతున్నారు. సమ్మె విరమించాలని సూచించారు. 

16:36 - May 29, 2016

చిత్తూరు : ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఏపీ సీఎం, టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో మహానాడులో చివరి రోజున చంద్రబాబు ప్రసంగించారు. టిడిపిని తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారని, ఎన్టీఆర్ దారిలో నడవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తనకు అధికారం..ఇంకో దానిపైన వ్యామోహం లేదన్నారు. 35 సంవత్సరాల పాటు జెండాలు మోసిన కార్యకర్తలు..త్యాగాలు చేసిన కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మూడు రోజుల మహానాడు విజయవంతమైందని, మొత్తం 28 తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు. మహానాడు సందర్భంగా పార్టీకి 380 మంది దాతలు రూ.11 కోట్ల 55 లక్షల విరాళాలు అందాయన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే టిడిపి పుట్టిందని, పార్టీకి దిశ..దశ నిర్ధేశించుకోవడానికే మహానాడు నిర్వహించడం జరిగిందన్నారు. కొత్తగా చాలా పార్టీలు పుట్టుకొచ్చాయని, అప్పుడే అంతమయ్యాయని..టిడిపి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందన్నారు. కార్యకర్తలంటే తనకు ప్రాణమని, పేదరికం లేని సమాజమే ఎన్టీఆర్ ఆశయమన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు రాత్రింబవళ్లు కృషి చేయడం జరుగుతోందని, పేదరికమే నా కులం..మతమన్నారు. 

మహానాడు విజయవంతం - బాబు..

చిత్తూరు : మూడు రోజుల మహానాడు విజయవంతమైందని టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మొత్తం 28 తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు. మహానాడు సందర్భంగా పార్టీకి 380 మంది దాతలు రూ.11 కోట్ల 55 లక్షల విరాళాలు అందాయన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే టిడిపి పుట్టిందని, పార్టీకి దిశ..దశ నిర్ధేశించుకోవడానికే మహానాడు నిర్వహించడం జరిగిందన్నారు. కొత్తగా చాలా పార్టీలు పుట్టుకొచ్చాయని, అప్పుడే అంతమయ్యాయని..టిడిపి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందన్నారు. కార్యకర్తలంటే తనకు ప్రాణమని, పేదరికం లేని సమాజమే ఎన్టీఆర్ ఆశయమన్నారు.

16:27 - May 29, 2016

విశాఖపట్టణం : కాపుల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలో జాతీయ రహదారులు..ట్రాఫిక్ ఇబ్బందులపై మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ హాయాంలో కాపులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాపుల మొత్తానికి ముద్రగడ నేత కారని పేర్కొన్నారు. ఇటీవల ఓ ప్రమాదంలో చనిపోయిన గిరిజన కుటుంబాలకు రూ. 2 లక్షల చెక్కును మంత్రి అందచేశారు. 

16:11 - May 29, 2016

విశాఖపట్టణం : సాగర తీరం..ఆర్కే బీచ్..ఎంతో ఆహ్లాద వాతావరణం ఉంటుంది. సెలవుల రోజుల్లో ఇక్కడకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. సముద్ర స్నానం చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతుంటారు. కానీ ఈ అలలే ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా మూడేళ్ల జోత్స్న అనే చిన్నారి సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం గల్లంతైన జోత్స్న ఆచూకి ఇంకా తెలియడం లేదు. ఈ ఘటన జరిగిన తరువాత కూడా ప్రజలు ఇంకా సముద్ర స్నానాలు చేస్తూనే ఉన్నారు. సముద్ర స్నానాలు చేయవద్దని హెచ్చరిక బోర్డులు పెట్టినా ప్రజలు బేఖాతర్ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన తీసుకరావాలని పలువురు సూచిస్తున్నారు. జోత్స్య ఆచూకి తెలుసుకొనేందుకు పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. చిన్నారి గల్లంతుపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

15:52 - May 29, 2016

సంపూర్ణేష్ బాబు...సంపూ ఒక తెలుగు సినిమా నటుడు. 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. అనంతరం 'కొబ్బరిమట్ట' చిత్రంలో నటించాడు. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఇతను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. కొబ్బరిమట్ట చిత్రం ట్రైలర్ ను చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంపూ నటించిన కొబ్బరిమట్ట చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చూసి పడి పడి నవ్వారంట. చిత్ర ట్రైలర్ ను చిరు వీక్షించి వారి ఆలోచనలను అభినందించారంట. తనను అభినందించడం చాలా ఆనందంగా ఉందని..ఈ చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమని సంపూ పేర్కొన్నారు. రూపక్ రొనాల్డ్స్ దర్శకత్వంలో 'కొబ్బరిమట్ట' చిత్రం తెరకెక్కింది. 

మధుర రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు..

ఉత్తర్ ప్రదేశ్ : మధుర రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆగ్రా కంట్రోల్ రూం కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. వెంటనే బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. ఉత్కల్ ఎక్స్ ప్రెస్, ఫిరోజ్ పూర్ చింద్వారా ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతినిచ్చారు. కాల్ చేసిన ఆగంతకుడు బ్రహ్మదేవ్ గుప్తగా అని అధికారులు నిర్ధారించారు. అతడిని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

15:27 - May 29, 2016

చిత్తూరు : కాంగ్రెస్..వైసీపీ పార్టీలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు సంధించారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో మూడో రోజు యనమల పాల్గొని ప్రసంగించా. రాజకీయాల్లో యువతరం, నూతనత్వం రావాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. ఆనాడు రాజకీయాలతో పరిచయం లేకున్నా యువతరం రాజకీయంలో చేరడం జరిగిందని, పరిపాలన ఎవరు చేస్తున్నా స్వచ్ఛమైన పరిపాలన ఉండాలని టిడిపి పార్టీ కోరుకొంటుందన్నారు. స్మగ్లర్లు..దొచుకొని తినేవారు..అవినీతికి పాల్పడే వారు రాజకీయాల్లో ఉండడం క్షేమం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉందని, బీజేపీ అధికారంలోకి వచ్చిందని, లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవడంలో కాంగ్రెస్ విఫలం చెందిందన్నారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ..దోచుకొనే పార్టీ..కుళ్లు..కుతంత్రాలతో ఉన్న పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ ప్రతిపక్షం కాదని..విచ్చిణ ప్రతిపక్షం అని యనమల ఎద్దేవా చేశారు. 

15:11 - May 29, 2016

గుంటూరు : టిడిపి రెండేళ్ల పాలనలో అంతా దోపిడిమయమేనని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి రెండేళ్ల అవుతున్న సందర్భంగా ప్రతిపక్షం అభిప్రాయాలు తెలుసుకొనేందుకు టెన్ టివి వైసీపీ నేత బోత్స సత్యనారాయణతో మాట్లాడింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. టిడిపి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్లోకి వెళుతామని పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని, పరిపాలన మొత్తం స్తంభించిపోయిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ? అని ఏ గ్రామంలోనైనా అడగాలని సూచించారు. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామన్నారు. దోచుక తినాలనే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. స్టార్ హోటల్ లో ఉండడం కష్టపడడం అంటారా ? అని ప్రశ్నించారు. మంత్రులు..ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరని బోత్స సత్యనారాయణ తెలిపారు. 

బీజేపీ అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోంది - దత్తాత్రేయ..

మహబూబ్ నగర్ : బీజేపీ అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. యూపీఏ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని, మోడీ అధికారంలోకి వచ్చి పారదర్శకత తీసుకొచ్చారని తెలిపారు. నూతన రాజకీయ సంస్కృతిని స్థాపించారని, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు. ముద్ర బ్యాకింగ్ ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామని, రాజకీయాలకతీతంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకుని అభివృద్ధికి సహకరించాలని సూచించారు. బీజేపీ వారసత్వ రాజకీయాలకు దూరమని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.  

బిచ్చగాళ్లు లేకుండా చేస్తాం - మేయర్..

హైదరాబాద్ : నగరంలో బిచ్చగాళ్లు లేకుండా చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర బెగ్గర్ ఫ్రీ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పుదుచ్చేరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా - కిరణ్ బేడీ..

పుదుచ్చేరి : పుదుచ్చేరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేర్కొన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు.

 

14:38 - May 29, 2016

వరంగల్ : బలమైన లక్ష్యంతో దృష్టిపెడితే సివిల్స్ సాధించడం పెద్ద కష్టమేమి కాదన్నారు సివిల్స్ లో 65వ ర్యాంక్ సాధించిన వల్లూరు క్రాంతి. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వరంగల్ లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. గ్రామీణ పేద ప్రజలు, గిరిజన యువత సివిల్స్ వైపు దృష్టిపెట్టేందుకు ఏర్పాటుచేసిన ఈ అవగాహన కార్యక్రమంలో క్రాంతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. లక్ష్య సాధనకు చేయాల్సిన కృషిపై క్రాంతి సదస్సులో వివరించారు. ప్రతి దానిలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కృషి చేయాలని, ఇందుకు గైడెన్స్ చాలా ఇంపార్ట్ మెంట్ అని తెలిపారు. మూడు నెలల్లో మెయిన్స్ ఉందనగా ప్రతి రోజు 10-11 గంటల పాటు చదివేదానని తెలిపారు. ఐఏఎస్ అనుకొన్నానని వల్లూరు క్రాంతి పేర్కొంది. 

పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి మనవడి ఆత్మహత్యాయత్నం..

పంజాబ్ : మాజీ ముఖ్యమంత్రి బీంట్ సింగ్ మనవడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హరిక్రిత్ సింగ్ తనను తాను కాల్చుకున్నాడు. ఇతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

కరుణను కలిసిన నారాయణసామి..

చెన్నై : పుదుచ్చేరి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన కాంగ్రెస్ నేత వి.నారాయణస్వామి చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. పుదుచ్చేరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే నేతృత్వంలోని కూటమి మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే.  

పఠాన్ కోట్ లో ఆర్మీ జవాన్ ఆత్మహత్య..

పంజాబ్‌ : పఠాన్‌కోట్‌లో ఓ ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు విధుల్లో ఉన్నపుడే తనకు తానే కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈమేరకు సైనికాధికారులు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు.

 

13:53 - May 29, 2016

చిత్తూరు : తిరుపతిలో టీడీపీ మహానాడు మూడోరోజు కొనసాగుతోంది. టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు పాలన ఎలా వుందంటే వైద్యుడికే రోగమొచ్చినట్లుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వకపోవటంతో 89 మంది ప్రాతికేయులు చనిపోయారని తెలిపారు. పాత్రికేయులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఆలోచించాల్సిన అవుసరముందన్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఉద్యమంల ఆత్మబలిదానం చేసుకుంటే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించబడింది. కానీ ఇప్పటి వరకూ కేవలం 500 మందిని మాత్రమే టీఆర్ఎస్ సర్కారు గుర్తించిందన్నారు. వారిలో 200 మంది చిరునామాలు దొరకటంలేదంటున్న కేసీఆర్ పాలనలో అమరవీరులకు ఏరకంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు . తెలంగాణలో సమగ్ర సర్వే పేరిట నాలుగు కోట్ల మంది సమాచారం తమ వద్ద వుందన్న కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ సమయంలో అమరులైన వారి కుటుంబాల చిరునామాలు లేవనటం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన విమర్శించారు.

మంత్రి గంటా క్యాంపు కార్యాలయం ముట్టడి..ఉద్రిక్తత..

విశాఖపట్టణం : మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీవీ కార్యకర్తలు ముట్టడించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు భరించలేనంతగా పెంచారని, వీటిని తక్షణం నియంత్రించి తల్లిదండ్రులకు ఊరట కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఫొటోల కోసం చెట్లను నాటితే ఊరుకోను - బాబు..

చిత్తూరు : తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలా మంది ఫోటోలు తీయించుకునేందుకు చెట్లను నాటుతూ, ఆపై వాటిని గురించి పట్టించుకోవడం లేదని తనకు తెలిసిందని ఇకపై అలా జరిగితే చూస్తూ ఊరుకోబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 

వారితో ముద్రగడకు పనేంటి - చిన రాజప్ప..

విజయవాడ : కాపుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ నేతలతో, కాపులను పట్టించుకోని పవన్ కల్యాణ్ తో ముద్రగడ పద్మనాభానికి ఉన్న పనేంటని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. రోజుకో లేఖను రోజుకో రకంగా ముద్రగడ ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదని అన్నారు.

 

కర్నాటకలో ఉబెర్, ఓలాలపై నిషేధం..

కర్నాటక : మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ క్యాబ్ సేవల సంస్థలు ఉబెర్, ఓలాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. తక్షణం సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. 

13:46 - May 29, 2016

నాగోల్ కు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. 60 సెకన్లలో 79 మందిని కౌగిలించుకుని రికార్డు సృష్టించాడు. బ్రిటన్ లో ఓ వ్యక్తి 72 మందిని, ఆస్ట్రేలియాలో ఓ యాంకర్ 77 మందిని కౌగిలించుకున్నారంట. కృష్ణకుమార్ కు మొదటి రికార్డు కాదంట. రెండు గంటల్లో 9 నాటికల్లో వేషాలు..నాలుగున్నర సెకన్లలో ఏ నుండి జడ్ వరకు ఇంగ్లీష్ అక్షరాలన్నీ టైప్ చేయడం..అంతకంటే విచిత్రంగా 16 జతల బూట్లను 16 డబ్బాలలో అత్యంత తక్కువ సమయంలో సర్దాడంట. ఇతర విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి....

13:35 - May 29, 2016

ఆదిలాబాద్ : ఇసుక తరలింపుపై ఆదిలాబాద్‌ జిల్లాలో ఇసుక తరలింపుపైచోటుచేసుకుంది. నిర్మల్‌ మండలం మంజులూపూర్‌ , తాంస గ్రామాలకు మధ్య ఉన్న స్వర్ణ వాగు నుంచి ఓ గ్రామం వారు ఇసుకను తరలిస్తుంటే మరో గ్రామం వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది.

13:33 - May 29, 2016

బిస్కెట్లు తింటే బుర్ర పనిచేయదా? అవుననే అంటున్నాయి కొత్త పరిశోధనలు. అదేపనిగా బిస్కెట్లు, కేకులు తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందట! బిస్కెట్లు, కేకుల ప్రాసెసింగ్‌ సమయంలో బిస్కెట్లు కరకరలాడేందుకు, కేకులకు మంచి ప్లేవర్‌ రావడానికి వాడే ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కొన్నిరకాల కొవ్వు పదార్థాలే. దీంతోపాటు హైడ్రోజెనేటెడ్‌ ఆయిల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడుప్రభావం చూపుతుందని సైంటిస్టులు తేల్చారు. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కెట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మెమొరీ పవర్‌ తగ్గి పోయే ప్రమాదముందంటున్నారు శాస్త్రవేత్తలు. బిస్కెట్లు, కేకుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం గురించి యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాండియాగో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 45 ఏండ్లలోపు వయసున్న వెయ్యి మందిపై పరిశోధనలు చేశారు. ట్రాన్స్ ఫ్యాట్స్ తో కూడిన బిస్కెట్లు, కేకులు అధికంగా తిన్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడాన్ని గమనించారు. మరికొంతమందిలో అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు బయటపడ్డాయి. బ్రిటన్‌లో ఈ ఫ్యాట్స్ వాడకాన్ని దాదాపు నిషేధించినంత పని చేశారు.

13:30 - May 29, 2016

దేవిశ్రీ ప్రసాద్‌ ఓ అద్భుతమైన ఫొటోగ్రాఫర్‌. నన్ను తీసిన ఫొటోలను చూస్తే మెస్మరైజ్‌ అవ్వడం ఖాయం. ఆ ఫొటోల గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు.. అవే మాట్లాడతారు' అని అంటోంది లావణ్య త్రిపాఠి. సంగీత దర్శకుడిగా అందరి హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దేవిశ్రీ ప్రసాద్‌ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్న విషయం విదితమే. ఆయన తాజాగా టాలీవుడ్‌ కథానాయిక లావణ్య త్రిపాఠితో ఓ ఫొటోషూట్‌ చేశారు. అంతేకాదు దీనికి ఫిల్మింగ్‌, ఎడిటింగ్‌, మ్యూజిక్‌ కూడా ఆయనే అందించారు. ఈ ఫొటోషూట్‌ని ఆయన యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. అలాగే లావణ్యత్రిపాఠి కూడా రాక్‌స్టార్‌ తీసిన ఫొటోలను సామాజిక మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఈ ఫొటోషూట్‌కి ఫొజులెందుకు ఇవ్వాల్సి వచ్చిందో లావణ్య మాటల్లోనే..'దేవిశ్రీప్రసాద్‌కి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నన్ను చాలా కాలంగా ఓ ఫొటో షూట్‌ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నారు. ఒక రోజు చెన్నైలోఉన్న డీఎస్పీ స్టూడియోకి వెళ్ళినప్పుడు, నన్ను కొన్ని ఫొటోలు తీశారు. నేను కూడా బోలెడన్ని ఫొజులిచ్చాను' అని చెప్పింది. లావణ్య ప్రస్తుతం అల్లుశిరీష్‌ సరసన నటిస్తున్న 'శ్రీరస్తు శుభమస్తు' విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే శర్వానంద్‌కి జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

చేప ప్రసాదానికి శాస్త్రీయత లేదు : జేవీవీ...

హైదరాబాద్ : మృగశిర కార్తె రోజు పంపిణీ చేసే చేపప్రసాదంలో ఎటువంటి శాస్త్రీయత లేదని, ఇది కేవలం మూఢ నమ్మకం మాత్రమేనని జనవిజ్ఞాన వేదిక పేర్కొంది. ఈమేరకు జనవిజ్ఞాన వేదిక నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఔషధ మొక్కల పెంపకం కోసం బత్తిని సోదరులకు కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చేప ప్రసాదాన్ని ఐఐసీటీ ల్యాబ్‌లో పరీక్షించామని, దీనిలో ఆస్తమా తగ్గించే ఔషధం లేదని తేలిందన్నారు. ఇది కేవలం ఓ మూఢ నమ్మకం మాత్రమేనన్నారు.

తుని ఘటనకు బాధ్యత వహిస్తా : ముద్రగడ....

విజయవాడ: మా జాతికి న్యాయం చేయాలని మాత్రమే నేనే ప్రభుత్వాన్ని కోరుతున్నాని ముద్రగడ అన్నారు. మా పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వం ఇప్పటికైనా కాపులకు రిజర్వేషన్లు అమలుచేయాలని ముద్రగడ కోరారు. తునిలో జరిగిన సంఘటనలకు పూర్తి బాధ్యత నాదేనని ఆయన అంగీకరించారు. ఆ రోజు హింసకు ప్రేరేపించిన వారి వివరాలు త్వరలో బయటపెడతానని ఆయన అన్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడని ఆయన కాపుల ఉద్యమానికి పూర్తి మద్దతు ఇచ్చారని ముద్రగడ తెలిపారు.

13:26 - May 29, 2016

ప్రస్తుతం సామాజిక మీడియాలో మహేష్‌బాబు హాట్‌ టాపిక్‌ అయ్యారు. 'బ్రహ్మోత్సవం' భారీ ఫ్లాప్‌కి తనదే బాధ్యతని అంటూ ఆయనిచ్చిన స్టేట్‌మెంటే ఇందుకు కారణం. 'బ్రహ్మోత్సవం' ఫెయిల్యూర్‌ గురించి మహేష్‌ బాబు స్పందించిన తీరు ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ''బ్రహ్మోత్సవం' చిత్రం ఫెయిల్యూర్‌కి నేనే బాధ్యత వహిస్తున్నాను. కారణాలు ఏవైనా... సినిమా వర్కవుట్‌ అయినా కాకపోయినా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలను బ్లేమ్‌ చేయడం సరైంది కాదు. దర్శకుడి ఎంపిక అనేది నా నిర్ణయమే. నా జడ్జిమెంట్‌ రాంగ్‌ అని తెలుసుకున్నాన'ని అంటున్నారు కథానాయకుడు మహేష్‌బాబు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు, సమంత, కాజల్‌, ప్రణీత నాయకానాయికలుగా పివిపి పతాకంపై ఈ చిత్రం రూపొందింది. అటు ప్రేక్షకులు, ఇటు అభిమానుల భారీ అంచనాల నడుమ ఇటీవల విడుదలైన 'బ్రహ్మోత్సవం' డిజాస్టరైంది. ప్రేక్షకుల్లోను, అభిమానుల్లోను, సినీ పరిశ్రమలోను, మీడియాలో సైతం ఈ సినిమా నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి. వీటి విషయమై మహేష్‌బాబు పై విధంగా స్పందించారు. ప్రస్తుతం మహేష్‌ హ్యాలీడే ట్రిప్‌ సందర్భంగా లండన్‌లో ఉన్నారు. ఈ ట్రిప్‌ తర్వాత ఆయన ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందబోయే తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంపై కాన్‌సన్‌ట్రేట్‌ చేయనున్నారు.

13:24 - May 29, 2016

ఇటీవల 'రాయుడు' చిత్రంతో అటు తమిళనాట, ఇటు తెలుగునాట మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశాల్‌ తాజాగా కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. తమన్నా కథానాయికగా, జగపతిబాబు విలన్‌ పాత్రలో నటించబోతున్న ఈ చిత్రాన్ని సురాజ్‌ దర్శకత్వంలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి నిర్మించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత హరి మాట్లాడుతూ, 'భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో చేస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. నిర్మాతగా నేను చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. విశాల్‌ కెరీర్‌లో హై రేంజ్‌ సినిమాగా నిలుస్తుంది. ఈ చిత్రంలో విశాల్‌తోపాటు తమన్నా, జగపతిబాబు నటిస్తుండడంతో షూటింగ్‌ ప్రారంభానికి ముందే మంచి క్రేజ్‌ వచ్చింది. విశాల్‌తో నేను చేసిన 'రాయుడు' భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా రిలీజైన అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. 'రాయుడు' సూపర్‌హిట్‌ అయిన సందర్భంగా విశాల్‌తో స్ట్రెయిట్‌ సినిమాను ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం విశాల్‌ కూడా చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. విశాల్‌, తమన్నా జంట ఈ సినిమాకి స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఇందులో మెయిన్‌ విలన్‌గా జగపతిబాబుగారు నటిస్తున్నారు. అలాగే తరుణ్‌ అరోరా మరో విలన్‌గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్‌ పూర్తయింది. జూన్‌ 9 నుంచి నెలరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరపనున్నాం. మిగతా షెడ్యూల్స్ చెన్నై, ఫారిన్‌లలో చేస్తాం' అని అన్నారు. 

పెట్రో ట్యాంకర్ల సమ్మె....

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలియం రవాణా ట్యాంకర్లు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై 14.5 శాతం వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ... తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం ట్యాంకు, ట్రక్కు ఓనర్స్‌ అసోసియేషన్‌ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోనుంది.

13:22 - May 29, 2016

స్కూల్లోను, ఇంట్లోను పెట్టే భయం కారణంగా పిల్లల్లో ఎదుగుదల లోపం వచ్చి నిద్రలేమితో బాధపడుతున్నారు. అది వారిలో పెంకితనాన్ని పెంచుతుందని ఓ సర్వేలో తేలింది. పిల్లలు కనీసం 8 నుండి 9 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అలా కాకుండా చదువు.. చదువు.. అంటూ నిద్ర పోనీయకుండా చేస్తే అది పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది.
నిద్ర తక్కువైన పిల్లల్లో త్వరగా కోపం, ఉద్రేకం, దెబ్బలాడే మనస్తత్వం వంటివి ఎక్కువగా కనబడతాయి. అందువల్ల పిల్లల్లో చక్కటి చదువు, శారీరక వ్యాయామం, తగినంత నిద్ర, ఆరోగ్యకర ఆహారం రెగ్యులర్‌గా ఉండేలా చూడాలి. అంతేకాదు, రాత్రులు ఏడు గంటలకే అన్నం తినిపించాలి. ఆ తర్వాతే చదువుకోమని చెప్పాలి. ఎందుకంటే అది నిద్రపోయే సమయానికి జీర్ణమైపోతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చటి పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

13:21 - May 29, 2016

ఉదయం ఎంత ప్రశాంతంగా ప్రారంభమైతే.. ఆ రోజంతా అంత ఆరోగ్యకరంగా సాగిపోతుంది. దాంతో రోజూవారీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. రోజు ప్రశాంతంగా ప్రారంభం కావాలన్నా.. పనిలో చురుకుగా ఉండాలన్నా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. లేవగానే మొబైల్‌ ఫోన్‌కో, ల్యాప్‌టాప్‌కో అతుక్కుపోకుండా రోజూవారి కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. బ్రేక్‌ఫాస్ట్ చేసేంతవరకు మొబైల్‌ జోలికి వెళ్లకుండా ఉండం మంచిది.
ఉదయమే వ్యాయామం, మెడిటేషన్‌ వంటివి చేయండి. లేదంటే కాఫీనో, టీనో తాగుతూ కిటికీలోంచి ప్రకృతిని ఒక్కసారి పరికించండి. లేవగానే పనిలో పడిపోయేవారికంటే... వర్కింగ్‌డేస్‌లో ఎక్సర్‌సైజ్‌, మెడిటేషన్‌లాంటివి చేసేవారు ఆ రోజంతా చలాకీగా, పాజిటివ్‌గా కనిపిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. పొద్దునే ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల మీ భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
లేచిన తరువాత నిమ్మరసం నీళ్లు తాగడం శారీరక శక్తితోపాటు మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. నిమ్మరసం మిమ్మల్ని స్థిరంగా ఉంచడమే కాదు.. మీలో సహజ శక్తిని పెంచుతుంది. ఆ నిమ్మరసం తాగిన అరగంట తరువాతనే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్‌ చేశాం... అంటే చేశాం అని కాకుండా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం మంచిది. అయితే అది మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. ఉదయమే ఎక్కువ తినడం వల్ల రోజంతా తక్కువ ఆకలి ఉంటుంది. కాబట్టి మంచి అల్పాహారం మీకు శక్తినివ్వడంతోపాటు తాత్కాలిక జ్ఞాపకశక్తిని మెరుగుపరస్తుంది.
ఆరోజు చేయాల్సిన పనులన్నింటినీ ఓ లిస్ట్ రాసుకోండి. వాటిలో ప్రాధాన్యతను బట్టి సమయాన్ని కేటాయించండి. ఈలోపు ఈ పనిని పూర్తి చేయాలి అని గోల్‌ పెట్టుకోండి. చిన్న చిన్న గోల్స్ పెద్ద పెద్ద విజయాలకు కారణమవుతాయి. 

చైనాలో భారీ వర్షాలు...

చైనా : దేశంలోని పలుప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జాంగ్‌మెన్ నగరంపై వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. కాగా, వరదల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గైల్లెంతన వారి కోసం గాలింపు చేపట్టారు. బాధితులను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇవాళ ఉదయం జాండే నగరంలో కొండ చరియలు విరిగిపడటంతో శిథిలాల కింద ఆరుగురు చిక్కుకుపోయారు.

12:59 - May 29, 2016

తిరుపతి : మహానాడు 3వ రోజు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతి కార్యకర్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పంట పొలాల్లో ఇంకుడు గుంతలు తవ్వాల్సిన అవసరముందన్నారు. వాన రూపంలో పడిన ప్రతి చినుకును ఒడిసిపట్టుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కరవురహితంగా తీర్చుదిద్దుతామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా మహానాడులో కార్యకర్తలతో చంద్రబాబు నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. 

12:52 - May 29, 2016

గుంటూరు : కోట్ల రూపాయల్లో ధర పలుకుతున్న దేవదాయశాఖ భూములను అధికారపార్టీకి చెందిన వ్యక్తులకు లక్షల్లోనే ప్రభుత్వం రాసిస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గుంటూరు సోమేశ్వర దేవాలయానికి చెందిన భూములు చెన్నైలో ఉన్నాయని, అవి అధిక ధర పలుకుతున్నాయని అన్నారు. అయితే టీడీపీ సర్కారు అండతో ఆపార్టీ ఎమ్మెల్యే శ్రీధర్, కార్పొరేషన్ చైర్మన్‌ రామానుజనాయుడు చవకగా కొనుక్కున్నారని ఆరోపించారు. అధికార పార్టీ దోపిడీని ప్రజలు ఖండించాలని బొత్స అన్నారు.

12:49 - May 29, 2016

హైదరాబాద్:  రవీంద్రభారతిలో ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి జిలానీ బోనోకు అందించారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడం తనకు లభించిన గొప్ప గౌరవమని రచయిత్రి జిలానీ బానో అన్నారు. తనకు అవార్డు ఇచ్చిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

12:46 - May 29, 2016

చైనా : కలపతో తయారు చేసిన భారీ డ్రాగన్ బోట్ అందరిని ఆకట్టుకుంటోంది. 77.8 మీటర్ల పొడవున్న ఈ బోటును.. షిబింగ్ నదిలోకి చేర్చేందుకు 1600మంది కష్టపడాల్సి వచ్చింది. వచ్చే నెల జూన్ 9 న నిర్వహించే డ్రాగన్ బోట్ ఫెస్టివల్ లో ఈ పడవ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. కలపతో రూపొందించిన అతిపెద్ద డ్రాగన్ బోట్ ఇదే కావడంతో.. త్వరలోనే గిన్నీస్ బుక్‌ రికార్డ్‌లోకి కూడా చేరనుంది.

12:23 - May 29, 2016

ఢిల్లీ : సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశాలు రెండురోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, మాణిక్ సర్కార్, ప్రకాశ్ కరత్, బృందా కరత్, హస్నన్న మొల్లా,సుభాషిణీ అలీ, బీ.వీ. రాఘువులు, ఏకే పద్మనాభన్, తపన్ సేన్ ఇంకా ఇతర సభ్యులు హాజరయ్యారు. ,మోడీ రెండేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. కేరళలో ఎల్.డి.ఎఫ్ విజయం, ఎన్నికలనుప్రభావితం చేసిన అంశాలను ఈ సమావేశంలో నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణపై కూడా నేతలు చర్చించాలని నిర్ణయించారు.

భద్రాచలంలో భక్తుల రద్దీ....

ఖమ్మం: శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం భక్తులతో కలకలలాడుతోంది. ఇవాళ సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భద్రాద్రిపైకి చేరుకున్నారు. భక్తుల రామనామ స్మరణలతో పుణ్యక్షేత్రం హోరెత్తుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు మూడు గంటల సమయం పడుతోంది.

ప్రారంభమయిన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం ...

ఢిల్లీ : సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశాలు రెండురోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, మాణిక్ సర్కార్, ప్రకాశ్ కరత్, బృందా కరత్, హస్నన్న మొల్లా,సుభాషిణీ అలీ, ఏపీ నుండి బీ.వీ. రాఘువులు, ఏకే పద్మనాభన్, తపన్ సేన్ ఇంకా ఇతర సభ్యులు హాజరయ్యారు. ,మోడీ రెండేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. కేరళలో ఎల్.డి.ఎఫ్ విజయం, ఎన్నికలనుప్రభావితం చేసిన అంశాలను ఈ సమావేశంలో నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణపై కూడా నేతలు చర్చించాలని నిర్ణయించారు.

కల్పనాదేవి మృతిపట్ల కేసీఆర్ సంతాపం...

హైదరాబాద్: వరంగల్ మాజీ ఎంపీ కల్పనాదేవి మృతిపట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కల్పనాదేవి పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.

గోపాల్‌నగర్‌లో భారీ చోరీ...

ఆదిలాబాద్: భైంసా పట్టణంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గోపాల్‌నగర్‌లో మూడిళ్లలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఐదు తులాల బంగారం, పది తులాల వెండిని అపహరించుకుపోయారు. రూ.50 వేల నగదు కూడా అపహరణకు గురైంది.

దాసరి, చిరంజీవి కాపులకు ఏం చేసారు? : నారాయణ

హైదరాబాద్‌: కేంద్రమంత్రులుగా పనిచేసిన కాలంలో దాసరి నారాయణరావు, చిరంజీవి కాపుల కోసం చేసిందేమిటని ఏపీ పురపాలక శాఖామంత్రి నారాయణ ప్రశ్నించారు. వారు ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఏరోజైనా కాపుల గురించి మాట్లాడారా? అని నిలదీశారు. దాసరిని జగన్‌, ముద్రగడ ఒకరి తర్వాత ఒకరు కలవడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ వెనుక ఎవరు ఉన్నారో స్పష్టంగా తెలుస్తోందని నారాయణ అన్నారు. తుని ఘటనలో వాస్తవాలు తెలుస్తున్న తరుణంలో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. మంజునాథ కమిషన్‌ పనిచేస్తుండగా ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం డెడ్‌లైన్‌ విధించడం అర్థరహితమన్నారు. 

మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సతీమణి అరెస్ట్....

విశాఖపట్నం : ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు వసూలు చేసి మోసగించిన కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత గండి బాబ్జీ సతీమణి రిటైర్డ్ డీఎస్పీ కొండపల్లి విజయను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. 2013లో విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసమున్న సమయంలో కొండపల్లి విజయ విజయవాడకు చెందిన ఎం.గిరీశం రెడ్డి, జి.గోపిరెడ్డి, ఎన్.అప్పనాయుడు, బి.జగన్నాథరావు అనే కూరగాయల వ్యాపారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. అందుకుగాను వారి వద్ద నుంచి రూ.4.08 లక్షలు తీసుకున్నారు. 

ఢిల్లీ రోడ్డుప్రమాదంపై మంత్రి శిద్దా దిగ్భ్రాంతి...

విజయవాడ: ఢిల్లీ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. యాత్రికులను ఏపీ భవన్‌కు తరలించి... ప్రమాదం నుంచి కోలుకున్న వారిని స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన పలువురు కాశీ యాత్రకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును శనివారం అర్ధరాత్రి ట్యాంకర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా... 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

11:31 - May 29, 2016

తిరుపతి : మూడో రోజు టీడీపీ మహానాడు కొనసాగుతోంది. లారీ లోకేష్ మాట్లాడారు. కాపు సోదరుల ముసుగులో వైసీపీ నేతలు ఘర్షణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీడీపీకి తిరుపతితో ఎంతో అనుబంధముందని పేర్కొన్నారు. హేతబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్నారు. టీడీపీని ఓడించాలనే ఉద్ధేశ్యంతోనే రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ప్రతిపక్ష నేత అనంతపురంలో ఒకమాట గోదావరి జిల్లాలో మరోమాట మాట్లాడుతున్నారనీ.. తుని ఘటనపై విచారణ కొనసాగుతోందనీ..త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తారన్నారు. జగన్ తనపై చేసే విమర్శలకు సరైన ఆధారలను చూపెట్టాలని సవాలు చేశారు. 

చిన్నారితో కలసి తల్లి ఆత్మాహుతి....

మెదక్ : చేగుంట మండలం కసాన్‌పల్లిలో మూడేళ్ల చిన్నారితో కలసి తల్లి ఆత్మాహుతి చేసుకుంది. ఎల్లమ్మ (23) అనే మహిళ తన మూడేళ్ల కుమార్తెతో కలసి శనివారం మధ్యాహ్నం పొలానికి వెళ్లింది. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు 11 గంటల సమయంలో పొలానికి వెళ్లి చూడగా అక్కడ ఇద్దరి మృతదేహాలు కాలిపోయి కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త, అత్త కలసి తమ కుమార్తెను హత్య చేశారని ఎల్లమ్మ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గల్లంతయిన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలు లభ్యం...

నల్లగొండ : త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ లో శనివారం ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతయినవారిలో ఇద్దరు మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. మృతులు సోమయ్య, నాగయ్యలుగా గుర్తించారు. మరొకరి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఘటనాస్థలిని కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు.

నెల్లూరు జిల్లాల్లో మరోసారి భూప్రకంపనలు..

నెల్లూరు : నెల్లూరు జిల్లాల్లో ఆదివారం ఉదయం కూడా మరోసారి స్వల్పంగా భూమి కంపించింది. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో భూప్రకంపనలు రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లల్లోని వస్తువులు కింద పడిపోయాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో 4 సార్లు భూమి కంపించింది. శనివారం ఉదయం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

40 మంది నక్సల్స్ లొంగుబాటు....

ఛత్తీస్ ఘడ్ : మావోయిస్టు ఉద్యమంలో ఒక పెద్ద షాక్ తగిలింది . ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ కు చెందిన 40 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. వీరిలో రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కూడా ఉన్నాడు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. దర్భా డివిజన్ కు చెందిన 19 మంది, కాంగెర్ వాలీ కమిటీకి చెందిన ఇద్దరు, దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన 19 మంది ఉన్నారు.

పశ్చిమలో గన్ కల్చర్....

పశ్చిమ గోదావరి : పచ్చని పంటపొలాలు, నిండుగా కళకళలాడుతున్న పండ్ల తోటలు, ఎటుచూసిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించే పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మధ్యకాలంలో రాజకీయ కక్షలు , భూవివాదాలు, తుపాకీ కల్చర్ పెరుగుతున్నాయి.ఈనేపథ్యంలో జిల్లా పాలకోడేరు మండల పరిధిలోని గొల్లల కోడేరులో ఓ సర్పంచ్ పై కాల్పులు జరిగాయి. గొల్లల కోడేరు సర్పంచ్ సూర్యనారాయణ రాజుపై రామకృష్ణరాజు అనే వ్యక్తి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. గ్రామంలోని 25 సెంట్ల భూమిపై నెలకొన్న వివాదం నేపథ్యంలో వీరిరువురి మధ్యా గొడవలు జరుగుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

10:41 - May 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ అగ్రికల్చర్‌ కౌన్సిలింగ్ ఇప్పట్లో జరిగేలా లేదు. ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తయ్యే దాకా అగ్రి కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండో ఎంసెట్‌ కారణంగా.. ఎంసెట్-1 అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ పూర్తయ్యాకే అగ్రి కౌన్సిలింగ్...
రాష్ట్రంలో మెడికల్‌, డెంటల్‌ సీట్లను భర్తీ చేసిన తర్వాతే ఆయుష్‌, వ్యవసాయ తదితర కోర్సుల సీట్లను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయుష్‌, వెటర్నరీ, వ్యవసాయ తదితర కోర్సులకు ఇప్పటికే ఎంసెట్‌ను నిర్వహించి, ఫలితాలను కూడా ప్రకటించారు. వైద్య సీట్లకు సంబంధించి ప్రవేశ పరీక్షను నిర్వహించలేదు. నీట్‌పై సుప్రీం ఆదేశాల మేరకు.. మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను మినహాయించిన తెలంగాణ సర్కారు... ఈ ఏడాదికి నీట్‌ను మినహాయిస్తూ కేంద్రమిచ్చిన ఆర్డెనెన్స్‌తో ఎంసెట్‌-2 నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఆయుష్‌, వెటర్నరీ, వ్యవసాయ కోర్సుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడానికి విద్యాశాఖకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

రాష్ట్రంలో రెండు ఎంసెట్‌లు నిర్వహించాల్సిన పరిస్థితి...
ఎంసెట్‌-1లో మంచి ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులు జూలైలో జరిగే ఎంసెట్‌-2లో కూడా మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. మొదట ఆయుష్‌, వెటర్నరీ, వ్యవసాయ కోర్సుల సీట్లను భర్తీ చేస్తే, ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులే మళ్లీ ఎంబీబీఎస్‌, డెంటల్‌ సీట్లను దక్కించుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. ఈ సీట్లలో చేరిన విద్యార్థులు తర్వాత ఎంబీబీఎస్‌ సీట్లలోకి మారిపోతారు. అప్పుడు ఆయుష్‌, వెటర్నరీ, వ్యవసాయ కోర్సుల్లో చాలా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకు తొలుత ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను భర్తీ చేసిన తర్వాతే ఆయుష్‌ వంటి సీట్లను భర్తీ చేయాలనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

 

10:22 - May 29, 2016

ఉత్తరప్రదేశ్ : ద్వారపయుగంలో కౌరవులకు పాండవులకు జరిగిన పాచికల పందెంలో పాండవులలో జేష్టుడు అయిన ధర్మరాజు తన భార్య ద్రౌపతిని పందెంలో పెట్టి ఓడిపోయాడని పురాణాలలో చదువుకున్నాం. కానీ ఈ కలియుగంలో ఓ అభినవ అ 'ధర్మరాజు' వెలుగులోకి వచ్చాడు. అతను ఎవరా అనుకుంటున్నారా? అయితే ఆయన్ని చూసే భాగ్యం మనకు లేకపోయానా తెలుసుకునే పనిచేద్దాం. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రబుద్ధుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో భార్యను 'బెట్టింగ్' లో పెట్టి ఓడిపోయాడు. పందెంలో ఆమెను గెలిచిన సదరు 'దుర్యోధను'లు ఆమెను తమతో రావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. జూదరుల ఆగడాలు భరించలేక ఆ యువతి సామాజిక కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నిందితుడు షేర్ మార్కెట్లో తన ఆస్తినంతా పోగొట్టుకున్న ఈ ప్రబుద్ధుడు భార్యను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి 7 లక్షల రూపాయలు తీసుకురావాల్సిందిగా భార్యను సతాయించేవాడు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలపై అతను పందేలు కాసేవాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో భార్యను పెట్టి పందెం కాశాడు. అతను ఎంచుకున్న జట్టు ఓడిపోవడంతో భార్యను పందెంలో కోల్పోయాడు. పందెం గెలిచిన జూదరులు ఇంటికి రావడం, ఫోన్ చేసి అతని భార్యను వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా ఈ క్రికెట్ బెట్టింగ్ లతో వీధిన పడిన కుటుంబాలు కోకొల్లలు. మహిళను అంగడి వస్తువుగా భావించే ఈ సమాజంలో మార్పుకోసం ఎన్నో స్వచ్ఛంధ సంస్థలు,మహిళా సంఘాలు పోరాడుతూనే వున్నాయి. మహిళ కూడా ఓ మనిషే ఆమెకూ ఓ మనస్సుంటుందని ఇటువంటి ప్రబుద్ధలు ఎప్పటికి గ్రహించేనో కదా...ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిని శిక్షించేందుకు చట్టంలో ఎటువంటి వినూత్న చట్టాలు రావాలో...

లారీ-ఎడ్లబండి ఢీ..ఇద్దరు మృతి...

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మాంజ్రి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడ్లబండిని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ దుర్ఘటనలో బాలుడు సహా మరో నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. బాధితులను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అలంపూర్‌లో భారీ వర్షం...

మహబూబ్‌నగర్ : జిల్లాలోని అలంపూర్‌లో ఆదివారం భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలన్నీ నిండిపోయాయి. కాగా... బైరాపురం దగ్గర ఉన్న వాగు పొంగిపొర్లుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి....

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ మండలం హైదర్‌షా కోట్‌లో ఓ బిల్డింగ్‌పై నుంచి పడి యువకుడు మృతిచెందాడు. యువకుడు మృతి చెందిన పరిస్థితి ఒకింత అనుమానాలకు దారితీస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతుడు బాలానగర్‌కు చెందిన సంతోష్‌గా గుర్తించారు.

పోలీసులకు చుక్కలు చూపిన మహిళ....

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. బంజారాహిల్స్‌లో రాత్రివేళ అతిగా మద్యం తాగి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షకు సహకరించకుండా ఓ మహిళ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నిర్వహించి ఆమె మద్యం అతిగా మద్యం తాగినట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని కారు స్వాధీన పరుచుకున్నారు. ఈ తనిఖీల్లో 7 ద్విచక్రవాహనాలు, 4 కార్లు, ఓ బస్సును స్వాధీనం జప్తు చేశారు. వీరికి సోమవారం కౌన్సిలింగ్‌ నిర్వహించి మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ....

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో బ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మల్లన్న దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసి... అలంకార దర్శనం అమలు చేస్తున్నారు.

09:34 - May 29, 2016

హైదరాబాద్ : మెదక్ జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో నిర్మించ తలపెట్టిన కొమరవెల్లి మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆందోళన హైదరాబాద్‌కు చేరింది. నిర్వాసితులకు సంఘీభావంగా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. పరిహారం విషయంలో స్పష్టత వచ్చే వరకు తమ భూములు ఇచ్చేది లేదని నిర్వాసితులు తేల్చి చెప్పారు.

బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఆవేదన...
తమ గ్రామాలు రిజర్వాయర్‌లో మునుగుతాయని అధికారులు ఏకపక్షంగా నోటీసులిచ్చి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ కోసం గ్రామానికి వచ్చిన అధికారులు కూడా తమ గోడు వినడం లేదన్నారు. మంత్రి, ముఖ్యమంత్రి తమ భూములను కాపాడుకునేందుకు తమ గ్రామాలను ముంచుతున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి, ఇంటికి ఇళ్లు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీల మద్దతు...
మల్లన్న సాగర్ నిర్మాణం సాంకేతికంగా క్లిష్టమైందని పలు ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ముంపు గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కోసం భూమిని ఇళ్లను గ్రామాలను త్యాగం చేస్తున్న వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబించడం తగదన్నారు.

09:22 - May 29, 2016

ఢిల్లీ : ఆగ్రా యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదానికి గురయ్యింది. ఆగివున్న ట్యాంకర్ ను టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు,పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషయంగా వున్నట్లు సమాచారం. మృతులంతా ప్రకాశం జిల్లా గుడిపల్లి వాసులుగా గుర్తించారు. ఉదయం 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో టూరిస్ట్ బస్ కాంట్రాక్టర్ ఆంజనేయులు, మరొకరు శ్రీధర్ గా గుర్తించారు. ప్రకాశం జిల్లా నుండి దాదాపు 40 మంది ప్రయాణీకులు 15 రోజుల క్రితం ఉత్తరాది పుణ్యక్షేత్రాలకు బయలుదేరారు. ఏపీ భవన్ అధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీకి 80 కిమీటర్లతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాంకర్ ను ఢీకొన్న టూరిస్ట్ బస్..ఇద్దరు మృతి...

ఢిల్లీ : ఆగ్రా యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదానికి గురయ్యింది. ఆగివున్న ట్యాంకర్ ను టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు,పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులరు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

08:57 - May 29, 2016

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నేతలతో చర్చిస్తారు. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ సమాయత్తం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు. ప్రధాని మోదీ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహిస్తనున్న వికాస్‌ పర్వ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

ముఖ్య నాయకులతో అమిత్ సమావేశం...
హైదరాబాద్‌ వస్తున్న అమిత్‌ షా ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు... పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నేతలను కలుస్తారు. ఆతర్వాత పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

పార్టీని పటిష్ఠతకు అమిత్‌ షా దిశా నిర్దేశం...
2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమిత్‌ షా దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి దారితీసిన కారణాలను తెలుసుకుంటారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ఆరా తీస్తారు. నగరంలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నాలుగు డివిజన్లకే పరిమితమయ్యింది. దీనికి కారణాలను తెలుసుకుంటారు. బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ ఒక డివిజన్‌లోనే విజయం సాధించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో నగరంలో సికింద్రాబాద్‌ పార్లమెంటును బీజేపీ, మిత్రపమైన టీడీపీ మల్కాజిగిరి పార్లమెంటు సీటును దక్కించుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో టీడీపీ కొన్ని సీట్లు గెలుచుకున్నా, ఎల్‌బీ నగర్‌ నుంచి ఎన్నికైన ఆర్‌ కృష్ణయ్య మినహా మిగిలినవారంతా పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ వలసల ప్రభావంపై కూడా అమిత్‌ షా ఆరాతీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

2019 ఎన్నికలపై సమీక్ష ...
వచ్చే ఎన్నికల్లో పొత్తుపై కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు రోడ్‌ మ్యాప్‌ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతోపాటు, బీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని రాష్ట్ర బీజేపీ నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పైగా తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. ఈ పరిస్థితుల్లో ఆపార్టీతో పొత్తు కొనసాగించడం వలన పార్టీని నష్టమేకానీ లాభంలేదని రాష్ట్ర నేతలు అమిత్‌ షా దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఒంటిరిగా పోటీ చేయాలా? లేక మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవాలా ? అన్న అంశంపై సమీక్షించి, లాభనాష్టాలను ముందుగానే బేరీజువేసుకుని భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రొపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేని బీజేపీ నాయకులు చెబుతున్నా... రాష్ట్రంలో కమలనాథుల సత్తా ప్రజలకు తెలియని విషయం కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.... రోజురోజుకు బలపడుతున్నగులాబీదళాన్ని చూసి లోలోపల మదనపడుతూనే ఉన్నారని విశ్లేషిస్తున్నారు. 

08:51 - May 29, 2016

తిరుమల : కౌస్తుభం అతిథి గృహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ చెట్టును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషయంగా వున్నట్లు సమాచారం. తిరుపతి నుండి తిరుమలకు వచ్చే వాహనాలను తిరువెంకటా పథం వైపు వున్న రోడ్డు మళ్లిస్తున్నారు. కాగా ఆమార్గం ప్రమాదకరంగా వుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని భక్తులు విమర్శిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవటానికి వస్తూ అనంతలోకాలకు పయనమవుతున్న భక్తులు తిరుమల ఘాట్ రోడ్లపై తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. 

08:50 - May 29, 2016

విశాఖ : అరుదైన మే పుష్పం అందరిని అలరిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రమే లభ్యమయ్యే ఈ పుష్పం ఈ నెలలో మాత్రమే వికసిస్తుంది. అందుకే దీనికి మే పుష్పం అని పేరు. భీమిలిలో నివాసముంటే ప్రభుత్వ ఉద్యోగి ప్రభాకర్ ఇంటిలోని తోటలో ఈ పుష్పం పూసింది. ప్రభాకర్ చెందిన తోటలో యాపిల్, స్టాబెర్రీ, ద్రాక్షా లాంటి వివిధ వినూత్నమైన మొక్కలు దర్శనిస్తాయి. 

08:48 - May 29, 2016

ఖమ్మం : వైరా, కోణిజర్ల మండలాల్లో అకాల వర్షం, ఈదురుగాలులతో బీభత్సం సృష్టించింది. హోరుగాలి ధాటికి చెట్లు హైవే రోడ్డుపై విరిగిపడ్డాయి . దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యి , ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ పడిపోవడంతో, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న వైరా సీఐ, సంఘటన స్థాలానికి చేరుకొని ప్రొక్లెయిన్‌లతో చెట్లను తొలగించారు.

08:46 - May 29, 2016

విశాఖ : నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పతాగి తాము ఏం చేస్తున్నామో తెలియనంతగా ముగ్గురు నేవీ అధికారులు ఓ అమాయకుడిని బలి తీసుకున్నారు. ఆశీల్ మెట్ట ప్లై ఓవర్ పై ఏపీ 5బీఎన్ 266 నంబర్ గల కారు డివైడర్ పై పడుకున్న వ్యక్తిని ఢీ కొట్టి అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈఘటనలో రోడ్డుపై నిద్రిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ముగ్గురు నేవీ అధికారులు క్షేమంగా బయటపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేవీ అధికారులను స్ధానికులు చితకబాదారు. కేజీహెచ్ మార్చురీకి మృత దేహాలను తరలించారు. నేవీ అధికారులు నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

08:27 - May 29, 2016

విశాఖ : బీచ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి జ్యోత్స్న బీచ్ లోని అలలకు సముద్రంలోకి కొట్టుకుపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లిపురంకు చెందిన శేఖర్ సత్య తన ముగ్గురు పిల్లలతో కలిసి సాయంత్రం బీచ్ కు వచ్చారు. ముగ్గురు పిల్లలను సముద్రపు ఒడ్డున ఉంచి తల్లి ఫోన్ మాట్లాడుకుంటోంది. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు సముద్రం దగ్గరకు వెళ్లటంతో అలల తాకిడికి మూడేళ్ల జ్యోత్స్న కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో సముద్రంలో గాలిస్తున్నారు. ఘటనాస్థలంలో  ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక ప్రకటనలు వున్న విషయం తెలిసిందే. కాని విహారానికి వచ్చిన వారు నిబంధనలు పాటించకపోవటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.

తిరుమలలో రోడ్డు ప్రమాదం....

తిరుమల : కౌస్తుభం అతిథి గృహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ చెట్టును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషయంగా వున్నట్లు సమాచారం.

07:53 - May 29, 2016

హైదారబాద్ : పాలకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు మాటలతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. డ్రైవరే ఓనరంటూ ఊదరగొట్టి వారు... ఇప్పుడు ఈ ఊసే ఎత్తడంలేదు. నెలకు వేలల్లో సంపాదనంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. ప్రభుత్వం మాటలు నమ్మి వాహనాలు కొనుగోలు చేసిన యువత నేడు కనీసం వేతనం కూడా లభించక పొట్టికూటి కోసం అల్లాడే పరిస్థితి వచ్చింది. జీహెచ్‌ఎంసీఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

అధికారుల మాటలు నీటి మూటలంటున్న యువత...
జీహెచ్‌ఎంసీ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకం ఓ ప్రహసనంగా మారింది. అధికారులు, పాలకుల మాటలు నమ్మి ఈ స్కీము కింది కార్లు కొనుగోలు చేసి గ్రేటర్‌ కోసం తిప్పుతున్నడ్రైవర్ల... ఇప్పుడు తాము నట్టేట్లో మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్లు తిప్పినందుకు ఇస్తున్న పాతికవేల రూపాయల ప్యాకేజీ నిర్వహణ ఖర్చులకు కూడా చాలడంలేదంటున్నారు. ఏళ్ల క్రితం నిర్ణయించిన దీనిని పెంచుతామని పాలకుటు, అధికారులు ఇస్తున్న హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకం నిరుద్యోగ యువతకు వరమన్నారు. ఈ సంగతి ఏమోకానీ, ఇప్పుడు తింటానికి తిండి కూడా లేని దుస్థతి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు రణం 12,300 ..
జీహెచ్‌ఎంసీ ఇస్తున్న పాతికవేల రూపాయల ప్యాకేజీలో బ్యాంకు రణం తీర్చేందుకు ప్రతినెలా 12,300 చెల్లించాల్సి వస్తోంది. డీజిల్‌కు 6,200 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. సర్వీసింగ్‌కు 3,300 రూపాయాలు అవుతోంది. బీమాకు రెండు వేల రూపాయలు, ఆదాయపన్నుకింది 500 రూపాయలు చెల్లిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఇస్తున్న ప్యాకేజీలో ఈ మొత్తంపోతే మిగిలే 500 రూపాయలతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడేళ్లనాడు నిర్ణయించిన ప్యాకేజీనే ఇప్పటికీ అమలు...
ఏడేళ్లనాడు నిర్ణయించిన ప్యాకేజీనే ఇప్పటికీ ఇస్తున్నారు. అప్పట్లో 37 రూపాయలుగా ఉన్న డీజిల్‌ రేటు ఇప్పుడు 57 రూపాయలు అయ్యింది. ఇచ్చే ప్యాకేజీని కూడా సకాలంలో చెల్లించడంలేదు. దీంతో బ్యాంకు లోన్లు తిరిగి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆవేద వ్యక్తం చేస్తున్నారు. ఇది చివర్లో భారీ అపరాధ రుసుము చెల్లించే పరిస్థితి దారితీయొచ్చన్న ఆందోళన వీరిలో కనిపిస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ప్యాకేజీ పెంచడంతోపాటు, సకాలంలో చెల్లింపులు చేయాలని కోరుతున్నారు. 

07:47 - May 29, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ మీటింగ్ నాటకీయ పరిణామాల మద్య వాయిదా పడింది. కోరం సభ్యులు హాజరుకానందున కౌన్సిల్ ను వాయిదా వేశారు మేయర్ . అయితే వార్డు కమిటీ సభ్యుల ఎంపికపై ప్రజా ప్రతినిధుల మద్య గందరగోళం నెలకొనడం వల్ల సమావేశం వాయిదాపడినట్లు సమాచారం.

హాజరుకాని సభ్యులు....
గ్రేటర్ పరిధిలో వార్డు కమిటీ సభ్యులను ఎన్నుకోవడానికి కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్ . ఈ సమావేశానికి సభ్యులందరికి వారంరోజుల ముందుగానే సమాచారం ఇచ్చినా సభ్యులు హాజరుకాకపోవడంతో వాయిదా పడింది. సమావేశం జరగడానికి 108 మంది సభ్యుల హాజరు తప్పని అయినా.. కేవలం 15 మంది కౌన్సిల్ సభ్యులు మాత్రమే హాజరుకావడంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు.

కమిటీ సభ్యుల ఎంపికలో భిన్నాభిప్రాయాలు....
వార్డు కమిటీ సభ్యుల ఎంపికలో పార్టీ నేతలు కార్పోరేటర్లు ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రానుందున ఇలాంటి పరిస్థితి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ తమ అనుచరులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో నేతల మద్య పోటీ కారణంగానే కౌన్సిల్ లో ప్రతిపాదనలపై క్లారిటీ రాలేదు. దీంతో చాలా మంది కార్పోరేటర్లు హాజరు కాలేదు. ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లోకి చేరిన వారి అనుచరుల్లో ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై క్లారిటీ రాకపోవడంతోనే కార్పొరేషన్ వాయిదాకు కారణమైందని తెలుస్తోంది.

పదవీ కాలాన్ని తగ్గించాలని విజ్ఞప్తి....
ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఒక్కరు కూడా కౌన్సిల్ హాల్ లోకి రాలేదు. ప్రతి వార్డుకు జనాభాను బట్టి 6 నుండి 10 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే సిటీలో మొత్తం 4500 మందిని అర్హులైన వారిగా గుర్తించారు అధికారులు. ఒకసారి ఎన్నికైన వారు 5 సంవత్సరాల పాటు వార్డు కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలాన్ని రెండేళ్లకు తగ్గించాలని కొందరు మేయర్ కు విజ్ఞప్తి చేశారు. వివిధ పనుల్లో బిజీ గా ఉండడం వల్లే కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేకపోయారని మేయర్ తెలిపారు.

07:41 - May 29, 2016

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కల్తీ రక్తం ముఠా ఆటకు తెరపడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తాన్ని కల్తీ చేసి విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలోని ఆరుగురు సభ్యులను సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా కటకటాల పాలయ్యింది.

కోఠిలోని ప్రసూతి ఆస్పత్రి కేంద్రంగా...
హైదరాబాద్‌ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రి కేంద్రంగా కొంతకాలంగా సాగుతున్న కల్తీరక్తం దందాకు పోలీసులు ముగింపు పలికారు. ఈ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్న నరేంద్ర ప్రసాద్‌ ఈ ముఠాకు నాయకుడు. అడ్డుగోలుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రోగుల బంధువులు ఇచ్చే రక్తంలో కొంత మొత్తాన్ని మిగిల్చుకుని .. ప్యాకెట్లలో నింపి సెలైన్‌ వాటర్‌తో కల్తీ చేసేవాడు. రక్తం అవసరమైన రోగులకు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. రక్తం ప్యాకెట్‌ను 1200 రూపాయలకు, బ్లడ్‌లోని ప్లేట్‌లెట్లను 12 వేల రూపాయలకు అమ్మేవారు. వీరి వ్యాపారం చాలా కాలం వరకు అడ్డూ అదుపు లేకుండా సాగింది. ఈ ముఠా సభ్యులు ఇచ్చిన రక్తంతో ఇటీవల ఒక మహిళ మరణించడంతో కల్తీరక్తం విక్రయ దందా వెలుగులోకి వచ్చింది. నరేంద్ర ప్రసాద్‌తోపాటు నాగరాజు, రాకేష్‌, రాఘవేంద్ర, పసుపులేటి నరేష్‌, సౌమ్యారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల్లో బ్లడ్‌ బ్యాంకు యజమాని....
కల్తీరక్తం అమ్ముతున్న నరేంద్ర ప్రసాద్‌ ముఠాలోని సభ్యులు నగరంలోని వివిధ రక్తనిధి కేంద్రాల్లో పనిచేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వీరిని కూడా అరెస్టు చేశారు. వీరిలో ఒక బ్లడ్‌ బ్యాంకు యజమాని కూడా ఉన్నాడు. అరెస్టు చేసిన నిందితులపై ఐపీసీలోని 420, 471, 468, 270, 109, 120 బి సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. నగరంలో ఇంకా ఇలాంటి దందాలు కొనసాగుతున్నాయేమోనన్న అనుమానంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మాజీ ఎంపీ డాక్టర్ టి.కల్పనాదేవి మృతి....

హైదరాబాద్ : వరంగల్ మాజీ ఎంపీ డాక్టర్ టి.కల్పనాదేవి మృతి చెందారు. గుండెపోటుతో కల్పనాదేవి గత కొద్దిరోజులుగా హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మృతి చెందారు. కల్పనాదేవి మృతికి డిప్యూటీ సీఎం కడియం సంతాపాన్ని తెలియజేశారు.

07:21 - May 29, 2016

విజయవాడ : నగరంలో సరికొత్త ట్రాఫిక్ ప్లాన్ ను అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. బెంగళూరు తరహాలో నగరం అంతా సర్క్యూట్ లైన్ లతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. సర్క్యూట్ లైన్ల డిజైన్లు సిద్ధం చేసి కృష్ణా పుష్కరాల్లో అమలు చేయాలని నగర పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది. దీనితో పాటు రహదారుల మధ్య గ్రీనరీ డెవలప్ మెంట్ కు ప్రాధాన్యత కల్పించనున్నారు అధికారులు.

ట్రాఫిక్ లో కొత్త నిబంధనలు....
బెంగళూరు తరహాలో వన్ వేలు ఉంటే విజయవాడలోనూ ట్రాఫిక్ సమస్య తలెత్తవని ట్రాఫిక్ పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు ఆగస్టు 12 వ తేదీని ఎంచుకున్నారు అధికారులు. అదే రోజు కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండడంతో.. ట్రాఫిక్ లో కొత్త నిబంధనలను పాటించాలని యోచిస్తున్నారు అధికారులు.

ట్రాఫిక్ సమస్యకు చెక్ ...
గత పుష్కరాలకు కోటి 30 లక్షల మంది యాత్రికులు నగరానికి వచ్చారని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. విజయవాడ రాష్ట్ర రాజధాని కావడం, దేశంలోని పలు ప్రాంతాల నుంచి విమాన, రైల్ సర్వీసులు నిత్యం అందుబాటులో ఉండటంతో ఈసారి పుష్కరాలకు రెండు కోట్ల మందికిపైగా వస్తారని అంచనా వేస్తోంది సర్కార్. ఈ క్రమంలో విజయవాడలో రహదారులు అన్నీ ఇరుకుగా ఉండటం, కొన్ని రోడ్లలో అభివృద్ధి పనులు జరుగుతుండటం, అడుగడుగునా ట్రాఫిక్ డైవర్టర్లు ఉండటంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం.

కృష్ణలంక రోడ్ల విస్తరణ....
పుష్కరాల నేపథ్యంలో నగరంలోని 55 రహదారుల విస్తరణకు రూ.99 కోట్లు కేటాయించారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కృష్ణలంక రోడ్డును నాలుగులైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. ఈ పనులన్నీ పుష్కరాలకు ముందే పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏవైనా మార్పులు సంభవిస్తే, ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం ముందస్తుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, అమలు చేయనున్నారు.

ఆర్టీసీ, ఆర్ అండ్ బీ,నగర కమిషనరేట్ సంయుక్తంగా పర్యవేక్షణ...
విస్తరణ పనులతో నిమిత్తం లేకుండా వన్ వే అమలు చేయాలని కమిషనరేట్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే జాతీయ రహదారి ట్రాఫిక్ డైవర్షన్లు, నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు అన్నింటిని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఖరారు చేశారు. ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే రహదారుల ఎంట్రన్స్, ఎగ్జిట్స్ నమోదు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, నగర కమిషనరేట్ పోలీసులు, ఆర్ అండ్ బీ అధికారులు సంయుక్తంగా ఖరారు చేసి వన్ వేలో పర్యటించనున్నారు.

కనకదుర్గ ఫ్లై ఓవర్ తో ట్రాఫిక్ డైవర్షన్ ...
కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ తో ఎర్రకట్టపై నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీనిని వన్ వే నుంచి పూర్తిగా మినహాయిచి నేరుగా నగర శివారు నుంచి బీఆర్టీఎస్ కు వచ్చేలా డిజైన్ చేశారు. పుష్కరాల అనంతరం కూడా పరిస్థితి, పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతాల్లో వన్ వేలు కొనసాగించనున్నారు పోలీసులు. 

సముద్రంలోకి కొట్టుకుపోయిన చిన్నారి...

విశాఖ : విశాఖలో విషాదం చోటుచేసుకుంది. సముద్రం అలలకు సముద్రంలోకి మూడేళ్ళ చిన్నారి కొట్టుకుపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో సముద్రంలో గాలింపుచర్యల్ని ముమ్మరం చేశారు.

07:00 - May 29, 2016

ఢిల్లీ : ప్రభుత్వంపై ప్రజల ఆశలు పెరిగాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇండియా గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన తెలిపారు. గతంలో ఏం జరిగిందీ.. ప్రస్తుతం ఏం జరుగుతోందన్న అంశాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని మోదీ అన్నారు. మనం చేసిన పనులను మూల్యాంకనం చేసుకోవాలని సూచించారు.

06:55 - May 29, 2016

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ అగ్గి రాజుకుంది. వర్సిటీలో వెలివాడ వద్ద ఏర్పాటు చేసుకున్న ఉద్యమకారుల టెంట్లు రాత్రికి రాత్రి మాయమవడంపై నిరసన పెల్లుబికింది. టెంట్లకున్న అంబేడ్కర్ నినాదాల పోస్టర్లు, రోహిత్ ఫొటోలనూ తొలగించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. వర్సిటీ గేటు వద్ద బైఠాయించారు. దళిత విద్యార్థులను అణచివేసేందుకు వీసీ అప్పారావు పన్నుతున్న కుయుక్తులే ఇవని ఆరోపించారు. సెక్యూరిటీ సిబ్బంది టెంట్లు తొలగిస్తుండగా కొందరు విద్యార్థులు చూశారని విద్యార్థి జేఏసీ తెలిపింది.

06:51 - May 29, 2016

విశాఖ : 11నెలల చిన్నారి నవదీప్‌ కిడ్నాప్ సుఖాంతం అయ్యింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని స్టేట్‌బ్యాంక్‌ అపార్ట్‌మెంట్‌లో అదృశ్యమైన నవదీప్‌ను దుండగులు తిరిగి వారి నివాసం సమీపంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వద్ద వదిలేశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం మధ్యాహ్నం 11 నెలల చిన్నారి నవదీప్ అదృశ్యమయ్యాడు. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న బొంగ పైడిరాజు మనుమడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే.

చుక్కల్లో పప్పులు....

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రెండు మూడేండ్ల నుంచి పప్పుల ధరలు ఆకాశాన్నంటినా పట్టించుకున్న నాథుడు లేదు. ఢిల్లీ గద్దె నెక్కిన పెద్దలు ఈ విషయమై నిమ్మకు నీరెత్తినట్లున్నారు తప్ప ధరల తగ్గింపుకు తీసుకున్నచర్యలు శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. అపరాల సాగు గణనీయంగా పడిపోయింది. అటు ఆంధ్రలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని అధికారవర్గాలు తెలిపాయి. సామాన్యమానవుడు ఏం తినాలో? ఎలా బ్రతకాలో  తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నాడు.  మార్కెట్ లో ఇప్పుడు గ్రేడ్-1 రకం కందిపప్పు కిలో రూ.

పీజీ ఎంసెట్ రేపే.....

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీఈసెట్‌ను ఈ ఏడాది ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. తొలుత ఆన్‌లైన్ విధానం అనుకున్నప్పటికీ పలు కారణాల రీత్యా ఆఫ్‌లైన్‌లోనే పూర్తిచేయాలని పీజీఈసెట్ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ అధ్యక్షతన శనివారం ఈ కమిటీ సమావేశమైంది.

నవదీప్ కిడ్నాప్ కథ సుఖాంతం...

విశాఖ : చిన్నారి నవదీప్ కథ సుఖాంతమయ్యింది. కిడ్నాపర్లు బాధితుల నివాసం వద్దనే వదిలి వెళ్ళిపోయారు. దీంతో బాబు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం చిన్నారి నవదీప్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకువెళ్లిన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా చొరవతో బాబు తమకుదక్కాడని ..సహకరించినవారందరికీ వారు ధన్యవాదాలు తెలియజేశారు.

Don't Miss