Activities calendar

30 May 2016

22:02 - May 30, 2016

ఢిల్లీ : బిజెపి రాజ్యసభ సభ్యుల రెండో జాబితాను ప్రకటించింది. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, ఎంజె అక్బర్, వినయ్‌ శస్త్రబుధే, డాక్టర్ వికాస్‌ మహాత్మే, శివప్రతాప్‌ శుక్లా, మహేష్‌ పోద్దార్‌ పేర్లున్నాయి. ఏపి నుంచి సురేష్‌ ప్రభు, ఎంపీ నుంచి ఎంజె అక్బర్‌, మహారాష్ట్ర నుంచి వినయ్, వికాస్‌, యుపి నుంచి శివ్‌ప్రతాప్‌ శుక్లా, జార్ఖండ్‌ నుంచి మహేష్‌ పోద్దార్లు రాజ్యసభకు నామినేషన్‌ వేశారు.

21:59 - May 30, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులను శాంతపరిచే ప్రయత్నాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూనిర్వాసితుల ఆందోళనలు... ప్రజల నిరసనలతో.. సమస్య పరిష్కారం కోసం అధికారులతో మంతనాలు సాగిస్తోంది. పరిహారం పెంపు, యువతకు ఉద్యోగాల కల్పన హామీలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. దీంతోపాటే.. మిగతా ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ పనులపైనా సమీక్షలు జరుపుతోంది.

ప్రాజెక్టుల అడ్డంకులపై దృష్టిపెట్టిన సర్కార్...
ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డంకులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది.. మల్లన్న సాగర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు... ప్రాజెక్టు భూనిర్వాసితుల ఆందోళనపై కాస్త ఆలస్యంగా మేల్కొంది.. ఓవైపు ప్రాజెక్టుల రీడిజైన్‌పై ప్రతిపక్షాల విమర్శలు... మరోవైపు భూనిర్వాసితుల నిరసనల నేపథ్యంలో... సమస్య పరిష్కారానికి సాక్షాత్తు ముఖ్యమంత్రే నడుం బిగించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా పిలిపించి మరీ సీఎం కేసీఆర్‌ ఈ సమస్యపై మాట్లాడినట్లు సమాచారం.

ప్రాజెక్టుల పరిధిలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సూచన...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దేవాదుల, ప్రాణహిత, డిండి, ఉదయసముద్రం, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టులకూ భూసేకరణ సమస్యగా మారిందని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సోమవారం... సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సాగిన సమీక్షాసమావేశంలో కలెక్టర్లు భూసేకరణకు ఎదురవుతున్న అడ్డంకుల గురించి వివరించారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణంతో భూమికోల్పోతున్నవారికి ప్రస్తుతం ప్రతిపాదించిన ఆరు లక్షల పరిహారాన్ని పెంచాలని, దీంతోపాటే.. ప్రాజెక్టుల పరిధిలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశాన్ని అధ్యయనం చేయాలని కలెక్టర్లు సూచించారు.

డిసెంబర్‌లోగా మూడో ఫేజ్‌కు సిద్ధం కావాలని ఆదేశాలు...
ప్రాజెక్టులపై చర్చ అనంతరం.. మిషన్‌ కాకతీయ పనుల పురోగతినీ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. కొన్ని జిల్లాలు మిషన్‌ కాకతీయ పనుల్లో వెనకబడ్డంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల టెండర్లను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, డిసెంబర్‌లోగా మూడో ఫేజ్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.. మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన రాకపోతే... 5లక్షలలోపు పనులను ఆయా గ్రామ పంచాయితీలకే అప్పగించాలని హరీశ్‌ ఆదేశించారు.

21:43 - May 30, 2016

హైదరాబాద్ : మొన్నటికి మొన్న ఏలూరులో కృపామణిని కన్నతల్లే వ్యభిచారం చేయమంటూ వేధించడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది..ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది...ఇది మర్చిపోకముందే నల్లగొండలో మరో అమ్మానుషం బయటపడింది..కన్నతల్లి స్వార్థానికి బీటెక్ స్టూడెంట్‌ బలయింది.. మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయి లేఖ అందడంతో పోలీసులు లోతుగా విచారిస్తే వాస్తవాలు బయటపడుతున్నాయి...కన్నతల్లి,కట్టుకున్నవాడే వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య చేసుకుంది ఝాన్సీ...

వేదనతో తనువు చాలించిన కృపామణి...
కంటిపాపల్లా కూతుళ్లను కాపాడుకోవాల్సిన కన్నతల్లుల్లో కొందరి స్వార్థానికి అమాయకురాళ్లు బలవుతున్నారు...మొన్నటికి మొన్న పశ్చిమగోదావరి జిల్లాలో కృపామణి సెల్ఫీ వీడియో లో తన వేదన విన్పించి తనువు చాలించిన విషయాన్ని మర్చిపోకముందే నల్లగొండలో బీటెక్ స్టూడెంట్‌ పోలీసులకు రాసిన లేఖ ఘోరాన్ని బయటపెట్టింది.

కన్నతల్లి స్వార్థానికి మరో అమాయకురాలు బలి...
మరో కన్నతల్లి స్వార్థానికి బలయింది మరో అమాయకురాలు... బీటెక్‌ రెండో సంవత్సం చదువుతున్న ఝాన్సి జీవితంలో ఎన్నో మలుపులు తిరిగాయి...తనకు తెలియకుండానే జరిగిన పరిణామాలకు చివరకు తనువు చాలించాల్సి వచ్చింది... అందమైన జీవితాన్ని ఊహించుకున్న అమాయకురాల బతుకు బుగ్గిపాలయింది..అందుకు కారణం కన్నతల్లి...కట్టుకున్న భర్త.

నకిరేకల్‌ బలి అయిన ఝాన్సీ ...
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌ మండలం నోముల గ్రామానికి చెందిన బీటెక్‌ స్టూడెంట్‌ ఝాన్సి తల్లి హైదరాబాద్‌కు చెందిన విజయేందర్‌రెడ్డి వద్ద నాలుగు లక్షలు అప్పు చేసింది..ఆ డబ్బుతోనే వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది...ఇక అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తేవడంతో చేసేది లేక ఝాన్సిని ఇచ్చి విజయేందర్‌రెడ్డితో పెళ్లి చేసింది...పెళ్లి సందర్భంగా ఝాన్సీ తల్లి అతని నుంచి మరో 20 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది...ఇక ఝాన్సీ అత్తగారింటికి వెళ్లిన తర్వాత వ్యభిచారం చేయాలని భర్త వేధించడం మొదలుపెట్టాడు..అదే సమయంలో తల్లి వ్యవహారం కూడా బయటపడ్డంతో కూతురు నిలదీసింది..ఇక అల్లుడితో కలిసి తల్లి కూడా వ్యభిచారం చేయాలంటూ ఝాన్సిని బెదిరించడం మొదలుపెట్టారు..దీంతో తట్టుకోలేక పోయిన ఝాన్సి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది...

సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య...
ఝాన్సీ ఈనెల 24న స్థానిక నకిరేకల్‌ సీఐ, పోలీస్‌ ఉన్నతాధికారులకు,జిల్లా జడ్జితో పాటు కలెక్టర్‌, డీజీపీలకు తన పరిస్థితిని వివరిస్తూ లేఖ రాసి రిజిస్టర్‌ పోస్టు చేసింది...అదే రోజు తన సోదరుని రూమ్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. విషయం బయటకు రానీయకుండా కుటుంబీకులు దహనసంస్కారాలు నిర్వహించారు.. అయితే ఝాన్సీ రాసిన లేఖ మూడు రోజుల తర్వాత పోలీసులకు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది...పోలీసులు ఝాన్సీ సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు...పూర్తి వివరాలు ఆరా తీసి కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు.

21:29 - May 30, 2016

హైదరాబాద్ : ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ ఇచ్చిన కీలక వాగ్ధానాలు ఇంకా పట్టాలెక్కలేదు. రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, లక్ష ఉద్యోగాల భర్తీ, ముస్లింలకు ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇవన్నీ వెక్కిరిస్తున్నాయి.

రుణమాఫీ పథకం ఫెయిల్....
టిఆర్ఎస్ మ్యానిఫెస్టోలో అత్యంత ముఖ్యమైన వాగ్ధానం రైతు రుణమాఫీ. ఇది రైతుల కష్టాలు తీర్చలేకపోయింది. ఆత్మహత్యలు ఆపలేకపోయింది. నాలుగు దఫాలుగా 17వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లకు విడుదల చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా, ఆ ఫలాలు రైతులకు సకాలంలో అందలేదు. పాత రుణాలు సకాలంలో మాఫీ కాకపోవడం, బ్యాంక్ లు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకతప్పలేదు. దీంతో రుణమాఫీ పథకం ఫెయిల్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది.

ఉచిత విద్యకు నామమాత్రపు నిధులు...
టిఆర్ ఎస్ మ్యానిఫెస్టోలో చేసిన మరో ముఖ్య వాగ్ధానం కెజి టు పిజి. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నా, మూడు బడ్జెట్ లో ప్రవేశపెట్టినా, ఇది ఇంతవరకు అమలుకాలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం పదుల సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిచేందుకు ఆదేశాలిచ్చినా, ఉచిత విద్యకు బడ్జెట్ లో కేటాయించింది నామ మాత్రపు నిధులే. మూడు బడ్జెట్ లు కలిపినా వెయ్యి కోట్లు దాటలేదు.

మూడెకరాల భూమి ఎక్కడ?....
దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్నది టిఆర్ఎస్ ముఖ్యమైన వాగ్ధానాలలో మరొకటి. ఇదీ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రంలో భూమిలేని దళిత కుటుంబాలు నాలుగు లక్షలుండగా, 2020 మందికే భూమిని పంచారు. వీరికి పంచింది 5313 ఎకరాలు మాత్రమే. ఇందుకు 224 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. గోల్కొండ కోట మీద అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం ఆరంభశూరత్వంగా మిగిలిపోయింది. భూమి అందుబాటులో లేదంటున్నారు. ప్రయివేట్ భూమిని కొంటామంటూ చెబుతున్న మాటలు ఆచరణలోకి రావడం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 80శాతం దారిమళ్లుతున్నాయనది దళిత, గిరిజన సంఘాల ఆరోపణ.

రెండేళ్లయినా కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కే తేలలేదు...
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నది టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కే తేలలేదు. లక్ష మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులున్నట్టు యూనియన్ లు చెబుతుంటే, పది పదిహేనువేలమందినే రెగ్యులరైజ్ చేస్తారంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

గ్రూప్ 2, గ్రూప్ 3 , టీచర్ పోస్టులు భర్తీ ఎప్పుడో?....

తెలంగాణ నిరుద్యోగులను ఎక్కువగా ఆకర్షించిన మరో ముఖ్య వాగ్ధానం లక్ష ఉద్యోగాల భర్తీ. ఏవో కొన్ని డిపార్ట్ మెంట్ లలో ఇంజనీర్ పోస్టులు భర్తీ చేశారు తప్ప, గ్రూప్ 2, గ్రూప్ 3 , టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి, మరిన్ని పోస్టులు యాడ్ చేస్తామంటూ వాయిదా వేశారు. అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో, ఎప్పుడు ఉద్యోగాలిస్తారో ఇప్పటికి అంతా అయోమయం.

ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎన్నడో?...
ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నది మరో ముఖ్య వాగ్ధానం. నాలుగు నెలల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్న ప్రభుత్వం 24 నెలలైనా పని పూర్తి కాలేదు. సుదీర్ కుమార్, చెల్లప్ప కమిటీలు ముస్లింల, ఎస్టీల సామాజిక ఆర్థిక పరిస్థితి తెలుసుకునే పనిలోనే వున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్లు 50శాతం మించకూడదు. ఒకవేళ మించితే పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ అవసరం. ఇది ఇప్పట్లో పూర్తయ్యే వ్యవహారం కాదు. ఇలా టిఆర్ఎస్ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డ వాగ్ధానాలే ఈ రెండేళ్ల లో అటకెక్కడం లబ్ధిదారులకు మింగుడుపడని పరిణామమే.

21:20 - May 30, 2016

గుంటూరు : మంగళగిరిలో ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మినీ స్టేడియాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాగూర్ ప్రారంభించారు. గడిచిన కొన్ని సంవత్సరాలలో ఏసీఏ వేగంగా అభివృద్ది చెందుతుందని.. ఏసీఏ అండర్ 19 టీంకి ఆటగాళ్లనందించిందని ఠాగూర్ అన్నారు. మంగళగిరి స్టేడియంలో అత్యాధునిక సదుపాయాలు కలిగి ఉండడం వలన రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే స్టేడియానికి టెస్ట్ హోదా కల్పిస్తామని ఠాగూర్ హామీఇచ్చారు.

21:09 - May 30, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత వి.నారాయణస్వామి పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడిని కలుసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నారాయణస్వామితో పాటు పాండిచ్చేరి కాంగ్రెస్‌ చీఫ్‌ నమశివాయం , డిఎంకె నేతలు కూడా ఉన్నారు. పుదుచ్చేరి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నారాయణ స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలో మొత్తం 30 సీట్లకు గాను కాంగ్రెస్-డిఎంకెలు 17 సీట్లు గెలుచుకున్నాయి.

20:46 - May 30, 2016

విజయవాడ : టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేశామని తెలిపారు.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుజనా , టీజీ పోరాటం చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సురేష్ ప్రభుకు మద్ధతునిచ్చామని తెలిపారు. నాలుగో అభ్యర్థిని పార్టీలో చేరిన నేతలే నిర్ణయిస్తారన్నారు. ఎంపికయిన అభ్యర్థులు మంగళవారం నామినేషన్ వేస్తారని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు కాదు రాజకీయాల్లో వున్నవారికే అవకాశమిచ్చానని ఆయన పేర్కొన్నారు.

20:19 - May 30, 2016

నేను ఆకాశం నీవు భూమి

నేను లేని నీవు అసంపూర్ణం

నాలో జ్వలిస్తున్న జ్వాలకు

వారసత్వం కోసం అన్వేషణ నాప్రేమ

ప్రేమించడం ప్రేమింపబడటం మిథ్య

అన్ని అనుబంధాలు అబద్దాలు,అవి అవసరాలు...

అంటూ స్త్రీపురుషుల సంబంధాలలోని డొల్లతనాన్ని కవిత్వంలో ఎండగట్టిన ప్రగతిశీల భావాల కవయిత్రి జ్వలిత.సమాజంలోని ప్రతి సంఘటనకు స్పందిస్తూ కవిత్వమై జ్వలించే కవన జ్వాల ఆమె.వస్తువైవిధ్యం శిల్పశోయగంతో ఆమె` కాలాన్ని జయిస్తూ నేను` అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు.ఇందులో 51 కవితలున్నాయి. సబ్బన్న జాతులఆడది,కార్పొరేట్ దాంపత్యం,వడిసెల రాళ్లు,మరణంలో జీవించు, ఆమె ఆకాశం,గాజుల హేళన,మనోరాగం,కాలాన్ని జయిస్తూ నేను మెుదలైన కవితలు భావస్ఫోరకంగాఉంటూ మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

కాలాన్ని జయిస్తూ నేను

ఒక ఉనికిలా విస్తరించాల్సిన నేను

నేను లేని తనం శూన్యమయిన నేను

ఒక సామాజిక సజీవ సమాధిని

నా చుట్టూ నావాళ్లు నా మనుషులు నాకుగోడలు

ఖాళీ గ్లాసులా,ఖాళీ కుర్చీలా నేను

అంటూ అందరూ ఉన్నా మనిషి ఎలా ఒంటరిజీవితంలో ఒక శూన్య పాత్రికలా మిగిలిపోతారో అద్భుతంగా కవిత్వీకరించారు.అంతేకాదు బొన్సాయి మెుక్కను చేయబడిన నేను...వటవృక్షంలా ఊడలతో శాఖలతో విజృంభించాలి అంటూ ఆశావహదృక్పథాన్ని తన కవిత్వంలో అంతర్లీనంగా ధ్వనింపజేస్తారు కవయిత్రి.స్త్రీలకు జరిగిన అన్యాయాలను తలచుకుంటే జ్వలితలో ఒక హహోగ్రకవితావిరాట్ స్వరూపం దర్శనమిస్తుంది.తరతరాల దోపిడీకి గురయిన స్త్రీలు భార్యపాత్రల్లో ఎలా బలిపశువులుగా మిగిలి పోతున్నారో అందమైన అబద్దం కవితలో అద్బుతంగా విష్కరించారు..

 

పతి అన్నా అర్థాంగి అన్నా

సహవాసి అన్నా సహచరి అన్నా

ఏదయినా దోపిడీకి అణచివేతకు

కొలమానం భార్య

అంటూ స్త్రీలోకానికి కనువిప్పు కలిగిస్తారు.అంతేకాదు మానవ మృగాలదాడుల్లో అన్యాయానికి గురయిన అబలలకు చట్టాలు శాసనాలు నేతి బీరకాయలో నెయ్యిలా న్యాయం చేస్తాయని ఘాటుగా స్పందిస్తారు.ఆమె కలంతో గాక హృదయంతో కవిత్వం రాసినట్టనిపిస్తుంది..కొన్ని కవితల్లో భావావేశం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. భాషలో ఆమె హృదయఘోష వినిపిస్తుంది.జ్వలిత కేవలం కవిత్వమే కాదు ఆమె ఎన్నో కథలు రాశరు.వాటిని ఆత్మాన్వేషణ అన్న పేరుతో కథా సంపుటిగా వెలువరించారు.ఇందులో 12 కథలున్నాయి.ఆత్మాన్వేషణ,పడిగాపుల పండుగ,మాయమవుతున్న మనసు,సిబ్బి,మానవ సరోవరం,రాజుగారు కప్పల చెరువు,నాన్నా వాడెవ్వడు,సహస్ర ధార,మెుదలైన కథలు సరికొత్త కథనశైలిలో సాగిపోతాయి ,పాత్రచిత్రణ ,వాతావరణ కల్పన,కథను ఆసక్తిగా నడిపించే శైలీ విన్యాసం జ్వలిత కథల్లో కనిపిస్తాయి.ఇక ఆమె జీవిత విశేషాల్లోకి వెళితే ఆమె 1959 లో ఈశ్వరమ్మ రాఘవయ్య దంపతులకు ఖమ్మం జిల్లా తిరుమలాయపాళెంలో జన్మించారు.నాలుగు పోస్టుగ్రడ్యుయేట్ డిగ్రీలు సంపాదించుకున్నారు.ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.ఆమె ఎన్నో కవితలు కథలు వ్యాసాలు రాశారు.కాలాన్ని జయిస్తూ నేను,సుదీర్ఘ హత్య,ఆత్మాన్వేషణ,మర్డర్ ప్రొలాంగేర్,అగ్నిలిపి, మెుదలైన రచనలు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఖమ్మజిల్లా కథల పేరుతో తనే సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూ 672 పేజీల ఒక బృహత్ గ్రంథాన్ని వెలురించారు.రుంజ,గాయాలే గేయాలై పరివ్యాప్త,మెుదలైన కథా కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.జీవన జ్వలిత చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి సమాజసేవ చేస్తున్నారు.ఆమె సాహితీ సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.రంజని నందివాడ శ్యామల స్మారక పురస్కారం,భూమిక ఉత్తమకథా పురస్కారం, మధర్ థెర్రిస్సా సేవాసంస్థ ఆణిముత్యం పురస్కారం,రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం ,శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం,విశ్వభారతి ఉగాది పురస్కారం..ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.జ్వలిత కేవలం రచయిత్రిగానే కాకుండా అఖిల భారత రచయిత్రుల కమిటీలో మెంబర్ గా ఉంటూ క్రియాశీలక పాత్రపోషిస్తున్నారు.వివిధ రచయితల,ప్రజాసంఘాలలో నాయకురాలిగా ఉంటూ దళిత బహుజన సాహిత్యప్రచారానికి విశేష కృషి చేస్తున్నారు.జ్వలిత అన్నది కలంపేరు. అసలు పేరు విజయ కుమారి దెంచనాల.అయితే కవయిత్రిగా ,కథన శిల్పిగా ఆమె జ్వలిత పేరుతోనే సాహితీ లోకంలో తనదైన ముద్రను వేసింది.ఆమె కలం నుండి భవిష్యత్తులో మరెన్నో రచనలు వెలువడాలని ఆశిద్దాం.

20:13 - May 30, 2016

ఆధునికి తెలుగు కథాసాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది.ఎందరో యువతీ యువకులు అద్భుతమైన కథలు రాస్తున్నారు.వయసుకు మించిన పరిణతి, ప్రతిభ,సామాజిక సమస్యల విశ్లేషణ వీరి కథల్లో కనిపిస్తుంది.అలాంటి వారిలో ఎండ్లూరి మానస ఒకరు.పిన్నవయసులోనే ఆమె అద్భుతమైన కథలు రాసి తెలుగు కథాప్రియులను అబ్బుర పరిచింది.మానస రాసింది కేవలం పది కథలే అయినప్పటికి ఒక్కో కథ ఒక్కో ఆణి ముత్యంలా మెరుస్తూ అందరి దృష్టిని అకర్షించాయి.ప్రముఖ పత్రికలతో పాటు వెబ్ మ్యాగ్జయిన్ లలో ముద్రితమైన మానస కథలు పాఠకుల మానసాలను కదిలించాయి.కంటతడి పెట్టించాయి.సరికొత్త ఆలోచనలు రేకెత్తించాయి..ఆమెరాసిన కథల్లో మైదానంలో నేను, అబద్ధం, బొట్టుకుక్క, దొంగ బొట్టు,కరెక్టివ్ రేప్,మెర్సీ పరిశుద్ధ పరిణయం,అవిటి సెవిటి, అర్థజీవి,అంతిమం, గౌతమి మెుదలైన కథలు వేటికవే వస్తువైవిధ్యంతో పాఠకుల మానసాలను చూరగొన్నాయి.మానస కథల్లో ప్రధానంగా దళితుల సమస్యలు, జండర్ వివక్షత,స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు,పురుషాధిఖ్యసమాజపు పోకడలు, సున్నితమైన మానవసంబంధాల హృదయగత రాగబంధాల మానవీయ పరిమళాలు,నిష్కల్మష ప్రేమలు,స్నేహాలు,మానవమనస్తత్వాల చిత్రణలు ఆర్ద్రంగా కనిపిస్తాయి.మూగగుండెల రోదనలు వినిపిస్తాయి.అగ్రకుల దురహంకారాల దర్పాలు ధ్వనిస్తాయి.వర్ణసమాజపు దాస్యభావాల బానిసత్వాలనుండి ఇంకా ఆధునిక దళితులు బయటపడని వైనాలపై ప్రశ్నల శరపరంపరలు ఎక్కుపెట్టబడ్డాయి. అంతేకాదు సమాజం ఆధునికి మయ్యే కొలది కులం తన వికృతరూపాన్ని ఎన్ని పార్శ్వాల్లో ప్రదర్శిస్తుందో మానస కథలు అందంగా నిరూపిస్తాయి.దొంగ బొట్టు కథలో కథలు చెప్పే మాస్టారు ఒక దళితుడు రాసిన కథలో వాస్తవం లేదని తన సహచరులను కించపరచడాన్ని అద్భుతంగా చిత్రించారు.దళితులు ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ ఇంకా బ్రహ్మణీయ భావజాల మాయాజాలం నుండి బయటపడక పూజలు చేసే విధానాలను రచయిత్రి తన కథల్లో వ్యంగ్యంగా చిత్రించారు.అలాగే బొట్టుకుక్క కథలో తప్పిపోయి కనిపించిన మూడేళ్ళ చిన్నారి తన కులంగురించి చెప్పుకోనే సన్నివేశం ద్వారా.... కులం మనిషిపై ఎంతలా ముద్రవేస్తుందో ఆ కథలో ధ్వనింపజేశారు.అంతేకాదు ఆమె తల్లి అగ్రకుల మనస్తత్వం ఎలా ఉంటుంటుందో ఆమె పాత్రోచిత ప్రవర్తనలో చూపించారు. కింది కులాల వారు ప్రేమతో ప్రవర్తించినా వారి ప్రేమను గుర్తించక పోగా ఈసడించుకునే కురుచ మనస్తత్వాన్ని చక్కని సన్నివేశాల ద్వారా బొట్టుకుక్క కథలో కళ్లకు కట్టినట్టు చిత్రించారు.తరతరాలుగా పురుషాధిఖ్య సమాజంలో లింగ వివక్షత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.... అయితే నేటికీ చాలా కుటుంబాల్లో ఆడపిల్లలు మగపిల్లల మధ్య వివక్షతను చూపడం పరిపాటే..అయితే మానస ఈ అంశాన్నితీసుకుని `అబద్ధం` కథను శిల్పశోభితంగా ,సందేశాత్మకంగా మలిచారు.అబద్ధం కథలో సురేష్ తనకు ఆడపిల్లలే పుడుతున్నారన్న బాధతో తన భార్యకు మగపిల్లాడు పుట్టి చనిపోయాడని ఎలా అందరికీ అబద్ధం చెబుతాడో చిత్రించారు.సురేష్ కు పెళ్లాం పిల్లలపై ప్రేమ ఉన్నప్పటికీ అతనిలో మగపిల్లాడు పుట్టాలన్న కాంక్ష,నపుత్రస్య గతిర్నాస్తి అన్న పురుషాధిఖ్య సమాజపు భావజాలం అంతర్గతంగా మనసులో దాగిన సత్యాన్ని రచయిత్రి ఆ పాత్రద్వారా బహిర్గతం చేసినవైనం అబ్బుర మనిపిస్తుంది.అలాగే మానస రాసిన `మెర్సీ పరిశుద్ధ పరిణయం` కథలో రచయిత్రిలో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది.బైబిల్ కథల ఆధారంగా కథను నడిపిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.బైబిల్ లోని భాషను కథాకథనంలో చొప్పించి శైలీ రమ్యతను సాధించడం అద్భుత మనిపిస్తుంది.ఈ కథలో ఒక దళిత పేద క్రిష్టియన్ అమ్మాయి రేప్ కు గురికావడమనే సంఘటన ఆధారంగా కథచివరలో దళిత స్త్రీలపై జరిగే హత్యాచారాల గురించి రచయిత్రి ప్రస్తావించిన అంశాలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. అలాగే అత్యాచారానికి గురయిన అమ్మాయిని చేరదీసి పెళ్లిచేసుకునే యువకుని పాత్రచిత్రణకూడా హృదయాలను ద్రవింపజేస్తుంది.మానస రాసిన మెుదటి కథ గౌతమిలో రచయిత్రి కాకినాడ హైదరాబాద్ లలో నివసించే కుటుంబాల ప్రేమ బంధాలను చక్కగా చిత్రించారు.అంతేకాదు ఈ కథలో పాత్రోచితంగా తెలంగాణా భాషను ,యాసచెడకుండా ప్రయోగించడం కనిపిస్తుంది.ఈకథలోని భాషాప్రయోగం ఆమె నిశిత పరిశీలనకు ,అనుకరణ శక్తికి నిదర్శనం.ఇలా ప్రతి కథలో ఏదో ఒక సందేశాన్నో,సామాజిక సమస్యనో లేక మానసిక సంఘర్షణనో,కులవ్యవస్థ వికృత రూపాన్నో, స్త్రీల స్వేచ్ఛనో ,వారి మానసిక కాంక్షాప్రపంచాలనో బలంగా చిత్రిస్తూ వచ్చారు.చాలమంది యువ కథకులు కథల్లో సమస్యలను మాత్రమే చిత్రిస్తారు. పరిష్కారాలను పాఠకులకే వదిలేస్తారు.కాని ఈ రచయిత్రి చాలా కథల్లో పరిష్కార మార్గాలను సూచించారు.దళితులు వాస్తవాలను తెలుసుకుని చివరలో తిరుగుబాటు బావుటాలు ఎగరేసిన దృశ్యాలను చిత్రించారు.అలాగే అబద్ధంలాంటి కథల్లో సురేష్ లాంటి పాత్రలు మానసిక పరివర్తన చెందినట్లు కథాగతం చేశారు.ఇలా కథావస్తువు ఎంపికలో నవ్యతను,కథ ఎత్తుగడలో కొత్తదన్నాన్ని,కథాకథనరీతిలో ఉత్కంఠతను,కథను ముగించడంలో ఒక పరిష్కారాన్ని,పాత్రచిత్రణలో ,వాతావరణ కల్పణలో సహజత్వాన్ని తన శైలీవిన్యాసంగా,కల్పనా చాతుర్యంగా మలచుకుని మానస చక్కని కథలు రాశారు. ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ కూతురిగా తండ్రి సాహితీ వారసత్వాన్ని కొనసాగిస్తూ...తెలుగు కథాకేదారంలో ఎండ్లూరి మానస మరెన్నో కథాసుమాలు పూయించాలని ,తెలుగు పాఠకుల మానసాలను పరిమళభరితం చేయాలని ఆశిద్దాం.

19:51 - May 30, 2016

హైదరాబాద్ : టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము రాజ్యసభ అభర్థిని గెలిపించుకుంటామని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. సంఖ్యా బలం లేకుండా టీడీపీ నాలుగో అభ్యర్థిని ప్రకటించదని అనుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యుని గెలుపునకు 36 మంది ఎమ్మెల్యేల బలం అవసరమని.. తమకు 48 మంది మద్దతు ఉందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన విజయసాయిరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. పామ్‌-A, పామ్‌-B పత్రాలను ఎన్నికల ప్రధాన అధికారికి అందించారు. 

19:43 - May 30, 2016

అనంతపురం : రానున్న రోజుల్లో జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్ది సస్య శ్యామలం చేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని రైతురుణమాఫీని చంద్రబాబు చేపట్టారన్నారు మంత్రి పల్లె రఘునాథరెడ్డి. దక్షిణ భారతదేశంలోనే వెనకబడిన ప్రాంతం అనంతపురం జిల్లా అని ఆయన అన్నారు. ఎన్ఆర్ఐఎస్ ద్వారా అనంతపురం జిల్లాకు రోడ్లు ,డ్రైనేజీ మరమ్మతుల కొరకు వంద కోట్లు ఖర్చుపెట్టామన్నారు. అనంతపురం జిల్లాలోని 8 లక్షల మంది రైతులకు 2 వేల 725 కోట్ల రూపాయల రుణమాఫీ ప్రకటించామన్నారు మంత్రి .  

19:40 - May 30, 2016

తూ. గోదావరి : కాకినాడలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాయమే చేస్తుందని అన్నారు. TDP నేతలు తనపై చేస్తున్న విమర్శలను పాజిటీవ్‌గా తీసుకుంటున్నామన్నారు సోము వీర్రాజు. ఒక మీడియా తనను టార్గెట్‌గా చేసి అపఖ్యాతిపాలు చేయాలని ప్రయత్నిస్తోందని అయినా తానేమి పట్టించుకోనన్నారు. ఏపీలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు సోము వీర్రాజు.

19:38 - May 30, 2016

శ్రీకాకుళం : పచ్చని పొలాలతో కళకళలాడాల్సిన గ్రామాలు శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి... పచ్చని పైరుతో ఉండాల్సిన భూములన్నీ బీళ్లు వారుతున్నాయి.. పండుగ వాతావరణాన్ని తలపించే పల్లెలన్నీ మంచానపడుతున్నాయి.

గాలి, నీరు కలుషితమై ఆ ప్రాంత ప్రజలు నరకం చూస్తున్న గ్రామస్థులు...
శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని గ్రామాల దుస్థితి ఇది. గాలి, నీరు కలుషితమై ఆ ప్రాంత ప్రజలు నరకం చూస్తున్నారు. అంతుబట్టని వ్యాధులతో బాధపడుతున్నారు. లావేరు మండలం, పెదరావు పల్లి గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. బయ్యన్న పేట, పెదరావు పల్లి, నక్కపేట గ్రామాలలో జీవిస్తున్న ప్రజలు కాలుష్యానికి బలైపోతున్నారు. ఎచ్చెర్ల మండల పరిధిలో ఉన్న నాగార్జున అగ్రికేం పరిశ్రమ, శ్యామ్‌ కృష్ణ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలు వారి పాలిట శాపంగా మారాయి. కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు భూగర్భంలో కలవడంతో నీరు, గాలి కలుషితమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు ప్రజలు కిడ్నీ, కీళ్ల వ్యాధులతో బాధపడుతున్నారు.

తొంభై శాతం మంది వ్యాధులతో సతమతం...
ఆయా గ్రామాలలో ఉన్న 29 చేతి పంపుల నుంచి కలుషిత నీరు వస్తుంది. వేరే దారి లేక ఆ ప్రాంత వాసులు ఆ నీటినే తాగుతున్నారు. దీంతో వందలాది మంది ఫ్లోరైడ్‌ సమస్యతో కూడా బాధ పడుతున్నారు. చాలామందికి చేతులు, కాళ్లు వంకరలు పోయాయి. కాళ్ల పాదాలకు బొబ్బలు కూడా వస్తున్నాయి. పంచాయతీ పరిధిలో 1300 కుటుంబాలు ఉంటే తొంభై శాతం మంది అనేక వ్యాధులతో సతమతమవుతున్నారు.

వైద్య సదుపాయం కూడా లేక అవస్థలు...
సరైన వైద్య సదుపాయం కూడా లేక అవస్థలు పడుతున్నారు. నడవ లేక..ఏ పని చేసుకోలేక...మంచానికే పరిమితమవుతున్నారు. మా బాధలను పట్టించుకునే నాధుడే లేడని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై బాధితులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం మాత్రం కనిపించలేదు.

జీవించే హక్కును హరిస్తున్న కర్మాగారాలు...
జీవించే హక్కును హరిస్తున్న కర్మాగారాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

19:33 - May 30, 2016

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశంలేదని తేలిపోవడంతో న్యాయవాదుల మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 3న విధుల బహిష్కరణకు అఖిల భారత న్యాయస్థానాల ఉద్యోగుల సమాఖ్య పిలుపునివ్వగా... 6 నుంచి నిరసనోద్యమం చేపట్టాలని తెలంగాణ న్యాయవాదులు నిర్ణయించారు.

హైకోర్టు విభజన ప్రకంపనలు...
హైదరాబాద్‌లో ఉన్నఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ఓ ప్రహసనంగా మారడంతో న్యాయవాద సంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే అప్పుడే విభజన సాధ్యమని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటన తెలంగాణ న్యాయవాద సంఘాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వేసవి సెలవులకు ముందే విభజన పూర్తవుతుందని ఆశించిన న్యాయవాదులు... మంత్రి ప్రకటనతో తీవ్ర ఆశాభంగానికి గురయ్యారు. దీంతో వచ్చే నెలలో నిరసనోద్యమానికి పిలుపునిచ్చారు. జూన్‌ 3న న్యాయస్థానాల ఉద్యోగులు విధుల బహిష్కరణకు పిలుపునిస్తే... వచ్చే నెల 6 నుంచి తెలంగాణ న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

214 ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రానికో హైకోర్టు....
రాజ్యాంగంలోని 214 ఆర్టికల్‌ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను వాటి పూర్వ రాష్ట్రాలనుంచి విభజించిన వెంటనే వాటికోసం ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేసిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. హైకోర్టును విభజించాలంటే ముందుగా ఏపీలో కొత్త భవనం నిర్మించాలి. లేదా హైదరాబాద్‌లో నైనా ప్రత్యేక భవనం కేటాయించాలి. ఇందుకు సుముఖంగా ఉన్న తెలంగాణ సర్కార్‌ కొన్ని భవనాలను కూడా పరిశీలించింది. కానీ విభజనపై హైకోర్టలో దాఖలైన కేసు విచారణ పూర్తయ్యింది. తీర్పు మాత్రం రిజర్వులో ఉంది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లుపూర్తికావస్తున్నా... ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు మాత్రం ఆటంకాలు ఎదురవడంపై న్యాయవాద సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం చొరవ చూపకపోతే ఎన్నేళ్లైనా ఉమ్మడిగానే కొనసాగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విభజనపై న్యాయవాదులు అసంతృప్తి...
మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల విభజనపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగాల ఖాళీలున్నా... ఆప్షన్‌ పేరుతో తెలంగాణకు కేటాయించడాన్ని తెలంగాణ న్యాయాధికారులు తప్పుపడుతున్నారు. ఏపీలో పుట్టి తెలంగాణలో ఉద్యోగం చేసిన వారిని ఈ రాష్ట్రానికి కేటాయించడం మార్గదర్శక సూత్రాలకు విరుద్ధమంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ న్యాయవాదులు, సిబ్బందికి పదోన్నతులు, కొత్తగా ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించాలన్న యోచనలో ఉన్నారు. 

19:28 - May 30, 2016

ఆదిలాబాద్ : ఖానాపూర్‌ మండలం సుర్జాపూర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.. విగ్రహం చేయి పాక్షికంగా కాలిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.. దీనివెనక అధికారపార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.

 

టీడీపీ నాలుగో అభ్యర్థిగా వేంరెడ్డి ప్రభాకర్?....

విజయవాడ : ఏపీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా సురేష్ ప్రభు రేపు నామినేషన్ వేయనున్నారు. నాలుగో సీటు కోసం స్వతంత్ర్య అభ్యర్థిగా వైసీపీ నుండి బయటకు వచ్చిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీలో పెట్టాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో వైసీపీకి చెక్ పెట్టానికి ఇదొక అవకాశంగా టీడీపీ ఎత్తుగడగా వేసినట్లుగా అనుకోవచ్చు. 

19:22 - May 30, 2016

విజయవాడ : టీడీపీ రాజ్యసభ అభ్యర్థు ఎంపిక ఒక ప్రహసనంగా కొనసాగుతోంది. అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీ.జీ వెంకటేష్, సురేష్ ప్రభు పేర్లు ఖరారయ్యాయి. నాల్గవ అభ్యర్థి పేరుపై ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. ముగ్గురు కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడటానికి ఇంకా కొంతసేపు ఎదురుచూడాల్సిందే.

18:41 - May 30, 2016

తీరిక వేళల్లో అనేక ప్రయోగాలు చేసేందుకు అతివలు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి అతివ అందుబాటులో ఉండే వస్తువులతో అందమైన పెయింటింగ్స్ ను వేస్తోంది. అవేంటో ఇవాళ్టి సొగసులో చూద్దాం.

18:38 - May 30, 2016

ఉన్నత చదువులు, నైన్ టు ఫైవ్ కొలువులు, ఏసీ క్యాంపస్ లు, ఐదంకెల వేతనాలు ప్రస్తుత యువత లక్ష్యాలు. కానీ అలాంటి వారందరికీ భిన్నంగా అందరూ ఏహ్యంగా భావించే పనికి వృత్తిగత నైపుణ్యాలను అద్దుతోంది ఒక యువతి. ఏ వృత్తి అయినా గౌరవప్రదమైనదే అని భావిస్తూ, ఆచరణలో పెడుతూ ప్రత్యేకత చాటుతోంది. సవాళ్లను స్వీకరించటం కొందరికే సాధ్యం. అనుకోకుండా ఎదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించే చొరవ కూడా వారికే సొంతం. అలాంటి వారిలో ఒకరు సింధురెడ్డి. లాండ్రీ సర్వీసులో స్టార్టప్ గా అడుగుపెట్టి విజయవంతంగా తన పయనం కొనసాగిస్తోంది.ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పాకులాడే సమాజానికి లాండ్రీ కూడా గౌరవప్రదమైన వృత్తిగా పరిచయం చేస్తోంది సింధు. వైట్ కాలర్ జాబ్స్ కు ప్రాధాన్యతనిచ్చే సమాజంలో లాండ్రీ సర్వీసును ప్రొఫెషనల్ గా తీసుకున్న సింధు ఆలోచన స్పూర్తిదాయకం.

హైదరాబాద్‌ లో డీజిల్ కార్ల నిషేధం...

హైదరాబాద్ : డీజిల్‌ కార్ల తయారీదారులకు భారత్‌లో మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కాలుష్యం అధికంగా ఉన్న మరో 11 నగరాల్లోనూ డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం విధించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర నగరాల్లో డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

17:41 - May 30, 2016

విజయవాడ : అమరావతి అమరలింగేశ్వర స్వామి సదావర్తి సత్రం భూముల గోల్‌మాల్‌తో తనకు ఎలాంటి సంబంధంలేదని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ స్పష్టం చేశారు.. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు.

17:34 - May 30, 2016

ఢిల్లీ : భారతరత్న లతా మంగేష్కర్, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌లపై చేసిన అనుకరణ వల్ల ఎఐబి కమెడియన్ తన్మయ్‌ భట్ భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. లతా మంగేష్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌లను అవమానించేలా తన్మయ్‌ తీసిన వీడియోపై బాలీవుడ్‌తో పాటు రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు చూపించారు. ఆ వీడియాలో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్ అని లత మాట్లాడినట్లు... మీరు 5 వేల ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారని సచిన్‌ అన్నట్లుగా చూపించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన్మయ్‌భట్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. జాతిరత్నాలను కించపరిస్తే ఊర్కునేది లేదని ఎంఎన్ఎస్ హెచ్చరించింది.

17:26 - May 30, 2016

తిరుపతి : ప్రముఖ పుణ్యక్షేత్రం..పిలిచిన పలికే శ్రీనివాసుడు..భక్తుల కొంగుబంగారం..నిత్యం వేదఘోషతో ప్రతిధ్వనించే ఏడు కొండలు ఇప్పుడు వేదపండితుల నిరసన గళాలతో రెడ్డెక్కారు. వేదభూమి, ఖర్మభూమి అని చెప్పుకునే భారత గడ్డ, అపర శ్రీమంతుడు శ్రీవారి పాద సన్నిధిలో వేదపండితుల నిరసనగళాలు వినిపిస్తున్నాయి. తమను పర్మినెంట్‌ చేయాలంటూ టీటీడీ పరిపాలన భవనం ముందు ధర్నా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38 మందిమే ఉన్నా.. తమను పర్మినెంట్‌ చేయడం లేదని.. జీతాలైనా పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం గడిచిన తమను పర్మినెంట్ చేయటందన్నారు. పురాణ పండితుల ఆందోళనకు సీఐటీయూ మద్దతు పలికింది.

మల్లన్న సాగర్ ప్రాంతంలో ఉద్రిక్తత....

మెదక్ : తొగుట మంలం ఏటిగడ్డ చిట్టాపూర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ భూముల రిజిస్ట్రేషన్ కు వచ్చిన అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతం 6 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే భూసేకరణ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ అంశంలో సీపీఎం పార్టీ నిర్వాశితులకు మద్దతునిచ్చింది. మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ ఆ ప్రాంతంలో పర్యటించి గ్రామస్థులకు న్యాయలసలహాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

17:01 - May 30, 2016

ఖమ్మం : తెలంగాణలో సీఎం కేసీఆర్ జూన్ 2న కొత్త జిల్లాల ఏర్పాటుపై చేయనున్న ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఖమ్మం జిల్లాలో పార్టీ రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలు ఏర్పాటు చేసే ప్రక్రియను మొదట చెప్పిన విధంగా కాకుండా.. వేరే పద్ధతుల్లో చేస్తున్నట్లుగా అనిపిస్తుందని ఆయన అన్నారు. జూన్ 2 వ తేదీన ప్రకటించిన తరవాతే నెలపాటు అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం ప్రకటిస్తామని అనడం సరికాదన్నారు తమ్మినేని. 

16:58 - May 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను ఏకగ్రీవం చేయాలని ప్రతిపక్షాలను మంత్రి ఈటెల రాజేందర్‌ కోరారు. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తమ పార్టీ అభ్యర్థులు డీఎస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నామినేషన్‌ వేస్తారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు తమ మిత్రపక్షం ఎమ్ఐఎమ్ నేతలు కూడా పాల్గొంటారని చెప్పారు. 

16:54 - May 30, 2016

కర్నూలు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో దారుణం చోటు చేసుకుంది. యాగంటి ఆలయ ఈవోపై జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి పెట్రోలు పోసి హత్య చేయటానికి యత్నించాడు. గమనించిన సిబ్బంది అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది. రామకృష్ణారెడ్డి సరిగా విధులకు హాజరుకాకపోవటంతో ఈవో వేతనం నిలిపివేశారు. దీంతో ఆగ్రహానికి గురయిన రామకృష్ణ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. బనగానపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

16:51 - May 30, 2016

తూర్పుగోదావరి : పిఠాపురం జగ్గయ్య చెరువులో ఇళ్ల తొలగింపు వివాదాస్పదంగా మారింది... విపక్షాల జోక్యంతో రాజకీయ రంగు పులుముకుంది.. ఇళ్లు తొలగిస్తున్న అధికారుల్ని స్థానికులు అడ్డుకున్నారు.. అయినా అధికారులు వినకపోవడంతో ఓ మహిళ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన ఆమె భర్తకూడా గాయపడ్డాడు.. వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.. 80శాతానికిపైగా కాలిన గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది.. దీంతో ఆగ్రహించిన స్థానికులు కాకినాడ కలెక్టరేట్‌ముందు ఆందోళను దిగారు.వైసీపీ  నేతలు ఈ నిరసనకు మద్దతుగా నిలిచారు.

ఈవోపై అసిస్టెంట్ హత్యాయత్నం...

కర్నూలు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో దారుణం చోటు చేసుకుంది. యాగంటి ఆలయ ఈవోపై జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి పెట్రోలు పోసి హత్య చేయటానికి యత్నించాడు. గమనించిన సిబ్బంది అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది. రామకృష్ణారెడ్డి సరిగా విధులకు హాజరుకాకపోవటంతో ఈవో వేతనం నిలిపివేశారు. దీంతో ఆగ్రహానికి గురయిన రామకృష్ణ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. బనగానపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

వైసీపీలోకి వైఎస్ఆర్ ఆత్మ?....

విజయవాడ : కేవీపీ రామచంద్రరావు జగన్ పార్టీలో చేరనున్నారా ? రేపోమాపో వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తన మేనల్లుడని.... అతను లేకుండా తానెలా ఉంటానని ఆయన వ్యాఖ్యానించటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

పిచ్చికుక్కల దాడి.. 20మందికి గాయాలు

గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజన్నపాలెం, సుబ్బయ్యపాలెం గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో 20 మందికి తీవ్ర గాయలయ్యాయి. బాధితుల్లో 15 మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ చిన్నారుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ట్యాక్సీ డ్రైవర్‌పై ఆఫ్రికన్స్ దాడి....

ఢిల్లీ : ఓ ట్యాక్సీ డ్రైవర్‌పై ఆఫ్రికన్ జాతీయులు దాడి చేశారు. తన ట్యాక్సీలో నలుగురి కంటే ఎక్కువ తీసుకెళ్లలేని డ్రైవర్ ఆఫ్రికన్లకు తెలిపాడు. ఆఫ్రికన్లు నలుగురి కంటే ఎక్కవగా ఉండటంతో డ్రైవర్ తిరస్కరించారు. దీంతో డ్రైవర్‌కు, ఆఫ్రికన్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌పై ఆఫ్రికన్లు దాడి చేసి గాయపరిచారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సెల్‌ఫోన్ చోరీ దొంగలు అరెస్ట్ ...

హైదరాబాద్ : నగరంలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 45 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు. దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాగ్దాద్ లో బాంబుపేలుడు..8మంది మృతి...

ఇరాక్ : దేశ రాజధాని బాగ్దాద్ నగరం మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఇవాళ రాజధానిలో ఓ ఆర్మీ చెక్‌పోస్టుపై కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు దాడికి పాల్పడి తనను తాను పేల్చివేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

15:40 - May 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలు మొదలయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్యోగులతో కలిసి శాసనసభ స్పీకర్‌ మధుసూదనా చారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పలువురు నేతలు కబడ్డీ ఆడి సందడి చేశారు. జూన్‌ 2వ తేదీన అసెంబ్లీ ప్రాంగణంలో పెద్దఎత్తున రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామని స్పీకర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అన్నిరాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కోరారు. 

15:37 - May 30, 2016

ఢిల్లీ : పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు రాజశేఖర్ రెడ్డేనని.. టీడీపీ రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని నిలపడమంటే..రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహించడమేనన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గుణపాఠం నేర్చుకోలేదని.. నల్లదనాన్ని తెల్లగా మార్చుకునేందుకే టీడీపీ మహానాడు నిర్వహించిందన్నారు. ప్రత్యేకహోదా వెంకయ్యకు శనిలా పట్టుకుందని.. ఈ విషయంలో వెంకయ్యను వదిలే ప్రసక్తే లేదని నారాయణ అన్నారు. 

15:34 - May 30, 2016

కరీంనగర్ : రిజర్వేషన్ల విషయంలో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీతో ఎన్నికల్లో ఓట్లు పొందిన టీఆర్ఎస్ .. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోపోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. కరీంనగర్‌లో జరిగిన ముస్లిం గర్జన సభకు తమ్మినేని ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు కొత్త బట్టలు ఇవ్వడం, షాదీ ముబారక్‌ పథకాలతో ఈ వర్గాలకు మేలు జరగదన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచినప్పుడే ముస్లింలు పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. 

15:26 - May 30, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో తమను అడ్డంగా బుక్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వంపై.. ఏపీ సర్కారూ కేసులు పెట్టింది. తమ ఫోన్‌లు ట్యాప్‌ చేశారంటూ తెలంగాణ ప్రభుత్వంపై కేసు నమోదు చేసింది. తెలంగాణ అధికారులు నారా లోకేశ్‌ను.. ఏపీ అధికారులు కేటీఆర్‌ను టార్గెట్‌ చేసుకుని నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. అసలు ఈ కేసుల లొల్లి కారణంగానే.. చంద్రబాబు.. హైదరాబాద్‌ను వదిలి అమరావతికి మకాం మార్చారన్నది విశ్లేషకుల అంచనా.

ఓటుకు నోటు కేసుతో మసకబారిన ప్రతిష్ట....

తెలంగాణలో ఓటుకు నోటు కేసుతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠ మసకబారింది. పార్టీ ఫైర్‌బ్రాండ్‌ నేత రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కయి పోవడంతో.. టీడీపీ శ్రేణులు విస్తుపోయాయి. దీన్ని కవర్‌ చేసుకునేందుకా అన్నట్లు.. ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కారుపై కేసుల దాడిని ప్రారంభించింది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు, విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విజయవాడలో ప్రత్యక్షమైన ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య.. ఈ కేసులో ఏపీ సీఎంకు సంబంధం ఉందని చెప్పాల్సిందిగా కేటీఆర్‌ తనను బెదిరించారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో బెజవాడ సత్యనారాయణపురం పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.

నారా లోకేష్‌ను కేసులో ఇరికించే ప్రయత్నం....
కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ ఏసీబీ అధికారులు నారా లోకేష్‌ గన్‌మెన్లు, డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు. నారా లోకేష్‌ను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అప్పట్లో టీడీపీ నేతలు మండిపడ్డారు. అదే సమయంలో ఏపీ సీఐడీ అధికారులు విజయవాడలో కేటీఆర్‌పై నమోదైన కేసుకు సంబంధించి కేటీఆర్‌ గన్‌మెన్లకు నోటీసులిచ్చేందుకు తెలంగాణ భవన్‌కు వెళ్లడం సంచలనం రేపింది.

39 మంది సాక్షులను విచారణ...
ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు 2015 జూలై 28న 316 పేజీల చార్జీషీటును ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. 39 మంది సాక్షులను విచారించినట్లు చార్జీషీటులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు జెరూసలేం మత్తయ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందులో పొందుపరిచిన అధికారులు 5వ నిందితుడిగా ఉన్న సండ్రవెంకట వీరయ్యకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్‌షీట్ ను దాఖలు చేశారు. ఈ చార్జీషీటులో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌ కాల్‌ సంభాషణను, డీల్‌కు సంబంధించి సండ్రతో జరిపిన చర్చల వివరాలను పొందుపరిచి కోర్టుకు సమర్పించింది ఏసీబీ.

తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టకు మరక....
అయితే ఓటుకు నోటు కేసులో ఏసీబీ దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను.. సాంకేతిక కారణాల కారణంగా.. కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కూడా దాదాపుగా వీగిపోయింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ చర్యనే సమర్థించింది. చట్ట ప్రకారమే ట్యాపింగ్‌ జరిగిందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. మొత్తానికి ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం వాటిల్లిందనే చెప్పాలి.

ఏమీ తెలియనట్లుగా ఇరు రాష్ట్రాల సీఎంల తీరు....
ఓటుకు నోటు కేసుకు ముందున్న రాజకీయ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లేవు. ఈ కేసుతో పార్టీ ప్రతిష్ట మసకబారడంతో.. ఏపీ సీఎం చంద్రబాబు.. పూర్తిగా అమరావతి ప్రాంతానికే పరిమితమై పోయారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన హైదరాబాద్‌కు ఎంతో అవసరమైతే తప్ప రావడం లేదు. పైగా.. కేసు తర్వాత, ఇద్దరు చంద్రుళ్లూ ఆత్మీయ కలయికలతో పరిస్థితిని కాస్తంత తేలిక పరిచారు. పైగా ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల గురించి ఏమీ తెలియనట్లుగానే పరస్పరం పలుకరించుకుంటున్నారు. మరి ఈ కేసులు ఇక్కడికే పరిసమాప్తమవుతాయా..? లేక భవిష్యత్తులో ఏదైనా సందర్భంలో మళ్లీ కలుగులోంచి బయటికి వస్తాయా..? వేచి చూడాలి. 

15:18 - May 30, 2016

నల్లగొండ్ : నకిరేకల్ మండలం నోములలో దారుణం చోటు చేసుకుంది. వ్యభిచారం చేయాలంటూ కట్టుకున్న భర్త, కన్నతల్లి తల్లి ఓ వివాహితను వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేక ఈ నెల 24న ఝాన్సీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆత్మహత్యకు ముందే జిల్లా ఎస్సీకి, స్థానిక సీఐ, డీజీపీలకు ఝాన్సీ లేఖలు రాసినట్లుగా సమాచారం. ఝాన్నీ వ్రాసిన లేఖ ఆదివారం నాడు సీఐకి అందటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

14:50 - May 30, 2016

హైదరాబాద్ : స్టీఫెన్‌సన్‌.. ఈ పేరు వినగానే ఓటుకు నోటు కేసే గుర్తుకొస్తుంది. శాసనమండలి ఎన్నికల్లో గెలుపు కోసం నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రలోభ పెట్టిందన్నది అభియోగం. ఐదు కోట్ల రూపాయల ఈ డీల్‌కు.. తెరవెనుక డైరెక్షన్‌ ఎవరిదైనా.. ఉచ్చు బిగించి అమలు చేసింది మాత్రం ఏసీబీ నే. పాత్రదారులను కటకటాల పాల్జేసిన.. ఓటుకు నోటు కేసు ఉదంతానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కేసు పూర్వాపరాలపై ఓ అవలోకనం.

పకడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగిన టీ.ఎస్ ఏసీబీ...
సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణలో ఓటుకు నోటు కేసు పెను సంచలనాన్నే సృష్టించింది. శాసనమండలి ఎన్నికల్లో గెలుపు కోసం నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనేందుకు తెలుగుదేశం నాయకత్వం ప్రయత్నిస్తోందన్న సమాచారంతో.. తెలంగాణ ఏసీబీ పకడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగింది. నిర్దిష్టమైన పథకం ప్రకారం ఏసీబీ అధికారులు స్టీఫెన్‌సన్‌ ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చారు. ఆడియో రికార్డింగ్‌ సెట్‌తో పాటు అన్ని గదుల్లో వీడియో రికార్డింగ్‌ స్పష్టంగా ఉండేలా స్పై కెమెరాలు ఏర్పాటు చేశారు.

స్టీఫెన్‌సన్‌ ఇంట్లో రహస్య కెమెరాలు ...
ఏసీబీ అధికారుల వ్యూహాన్ని పసిగట్టని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌లు నిరుడు మే 31న డబ్బుల బ్యాగుతో స్టీఫెన్‌సన్‌ ఇంటికి వచ్చారు. దాదాపు అరగంటపాటు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, చర్చి ఫాస్టర్‌ సెబాస్టియన్‌లు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడారు. వారి సంభాషణ మొత్తాన్నీ ఆ పక్క గదిలో మాటు వేసిన ఏసీబీ అధికారులు హై క్వాలిటీ పరికరాలతో అత్యంత స్పష్టంగా రికార్డు చేశారు. ఐదు కోట్ల రూపాయల డీల్‌లో భాగంగా 50 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తెచ్చానని.. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే.. తానే భవిష్యత్‌ సీఎం అనీ,, తనకు అన్ని పార్టీల్లోని రెడ్డి కులస్థుల అండ ఉందనీ రేవంత్‌రెడ్డి మాట్లాడినట్లు.. ఆ టేప్‌లో స్పష్టంగా రికార్డైంది. సంభాషణ పూర్తవుతున్న తరుణంలో.. తాము తెచ్చిన బ్యాగ్‌లోంచి రేవంత్‌రెడ్డి బృందం డబ్బు తీస్తుండగా.. ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు. రేవంత్‌రెడ్డి, ఫాస్టర్‌ సెబాస్టియన్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికి వీడియో రికార్డుల సంగతి తెలియని.. రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి తీసుకెళుతున్న సమయంలో కూడా తొడగొట్టి, మీసం మెలేసి సవాల్‌ విసరడం విశేషం.

నిందితులకూ 14రోజుల రిమాండ్...
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, పాస్టర్‌ సెబాస్టియన్‌లను ఆ రాత్రంతా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మే 31న రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు జూన్‌ 1న కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు ఇద్దరు నిందితులకూ 14రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, పాస్టర్‌సె బాస్టియన్‌ను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మరోమారు ప్రశ్నించి అదనపు సమాచారాన్ని రాబట్టారు. కస్టడీ పూర్తైన తరువాత ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి.

కుమార్తె నిశ్చితార్థం కోసం మధ్యంతర బెయిల్‌....
ఓటుకు నోటు కేసులో ఏ1గా రేవంత్‌రెడ్డి, ఏ2 గా సెబాస్టియన్‌, ఏ3గా ఉదయసింహ, ఏ 4గా మత్తయ్య పేర్లు చేర్చిన ఏసీబీ.. కేసుతో సంబంధం ఉందనుకున్న అందిరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఒక్కొక్కరికీ నోటీసులు జారీ చేసి ఏసీబీ కార్యాలయంలో విచారించింది. ఏ1గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూతురు నిశ్చితార్థం కోసం.. కోర్టు మధ్యంతర బెయిల్‌తో అనుమతితో కేవలం 12 గంటల పాటు బయటికొచ్చారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఇచ్చిన వాంగ్మూలం, ఫోన్‌ ఆడియో టేపుల ఆధారంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అనారోగ్యంతో ఉన్నానంటూ వెంకటవీరయ్య ఏసీబీని గడువు కోరారు. 2015 జులై 6న ఏసీబీ ఎదుట హాజరైన సండ్రను ఏసీబీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించింది. ఫోరెన్సిక్‌ నివేదిక, కాల్‌ డేటా ఆధారంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి, అతని కుమారుడు, స్నేహితులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం....
ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్ర అంతరాన్ని సృష్టించింది. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ మాటల యుద్ధానికి దిగారు. ఓ దశలో ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ఏసీబీ విచారణకు పిలుస్తుందన్న వార్తలూ వచ్చాయి. ఈ దశలో.. ఏపీ ప్రభుత్వం.. సెక్షన్‌ 8 అంశాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా హైదరాబాద్‌లో పోలీసింగ్‌ను కేంద్ర అజమాయిషీ కిందకు తీసుకోవాలని ఏపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కూ పాత్ర ఉందన్న వార్తలూ అప్పట్లో వినిపించాయి. 

14:37 - May 30, 2016

విజయవాడ : ముద్రగడ పోరాటం కాపు రిజర్వేషన్ల కోసం కాదని, రాజకీయ మనుగడ కోసమేనని మంత్రి నారాయణ విమర్శించారు. కాపులకు ముద్రగడ ఒక్కడే నాయకుడు కాదని..జిల్లాకో నేత ఉన్నాడని ఆయన అన్నారు. కాపులకు వ్యతిరేకంగా చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లాడని ఆరోపిస్తున్న ముద్రగడ, అప్పుడెందుకు టీడీపీలో చేరాడని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం కాపురిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.

14:36 - May 30, 2016

హైదరాబాద్‌ : నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోడుప్పల్‌ స్ర్కాప్‌ దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. జనావాసాల మధ్య అగ్ని ప్రమాదం జరిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

14:34 - May 30, 2016

హైదరాబాద్‌ : పహాడిషరీప్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ యువతిని నగ్నంగా చిత్రీకరించి లైంగికంగా వేధించారు. యువతిని బెదిరించి ఆమె దగ్గర నుంచి.. రూ.30 లక్షలు, బంగారం తీసుకున్నారు. ఈ కేసులో అహ్మద్‌, లతీఫ్‌ఖాన్‌, సయ్యద్‌, ఇమ్రాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 

కాపు రిజర్వేషన్ల కోసం కాదు : నారాయణ

విజయవాడ : ముద్రగడ పోరాటం కాపు రిజర్వేషన్ల కోసం కాదని, రాజకీయ మనుగడ కోసమేనని మంత్రి నారాయణ విమర్శించారు. కాపులకు ముద్రగడ ఒక్కడే నాయకుడు కాదని..జిల్లాకో నేత ఉన్నాడని ఆయన అన్నారు. కాపులకు వ్యతిరేకంగా చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లాడని ఆరోపిస్తున్న ముద్రగడ, అప్పుడెందుకు టీడీపీలో చేరాడని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం కాపురిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.

స్ర్కాప్‌ దుకాణంలో అగ్నిప్రమాదం...

హైదరాబాద్‌  :  నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోడుప్పల్‌ స్ర్కాప్‌ దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. జనావాసాల మధ్య అగ్ని ప్రమాదం జరిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.

యువతిని నగ్నంగా చిత్రీకరించి వేధింపులు...

హైదరాబాద్‌ : పహాడిషరీప్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ యువతిని నగ్నంగా చిత్రీకరించి లైంగికంగా వేధించారు. యువతిని బెదిరించి ఆమె దగ్గర నుంచి.. రూ.30 లక్షలు, బంగారం తీసుకున్నారు. ఈ కేసులో అహ్మద్‌, లతీఫ్‌ఖాన్‌, సయ్యద్‌, ఇమ్రాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 

13:36 - May 30, 2016

అనుష్క..వైవిధ్యమైన చిత్రాలు చేసుకుంటూ ముందుకెళుతోంది. ఈమె నటిస్తున్న తాజా చిత్రం 'భాగమతి'. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వం లో సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా మళయాలం నటుడు జయరామ్ నటించనున్నారు. ఆయన స్వయంగా తెలియచేయడమేకాకుండా సినిమాలో తన గెటప్ కి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
హైదరాబాద్ నిర్మాణానికి కారణమైన చారిత్రక పాత్ర భాగమతి జీవిత కథ అన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే జానపద, చారిత్రక పాత్రల్లో నటించిన అనుష్క లీడ్ రోల్ లో నటిస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చారిత్రక కథాంశం కాదంటూ అశోక్ వెల్లడించారు. ఇది థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ అని తెలిపాడు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. 

13:34 - May 30, 2016

రజనీకాంత్ 'కబాలి' రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్ మరో రికార్డు సృష్టించింది. 'కబాలి' సినిమా ఫస్ట్ టీజర్‌ను మే ఒకటి న నిర్మాత కలై పులి ధాను విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్ విడుదల అయిన 22 గంటల్లో రికార్డు స్థాయిలో 50 లక్షల మంది ఈ ట్రైలర్ ని చూశారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో రెండు కోట్లమంది పైగా ఈ టీజర్ ని చూశారంట. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు టీజర్ ని ఇప్పటివరకూ మూడు లక్షలమందికి పైగా చూశారు. ఈ సినిమా రజనీ మాఫియా డాన్ గా నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కి పా రంజిత్ దర్శకత్వం వహించారు. 

మిషన్ కాకతీయల పనులపై ముగిసిన హరీష్ భేటీ..

హైదరాబాద్ : మిషన్ కాకతీయల పనులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఆన్ లైన్ లో మొత్తం టెండర్ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మూడో దశ పనులకు సంబంధించిన టెండర్లు డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జనవరి నుండి పనులు ప్రారంభించాలని, మూడో దశ టెండర్లలో మరింత పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత కోసం టెండర్ల ప్రక్రియలో సంస్కరణలు ప్రవేశ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.

అధికారులు..ప్రభుత్వ యంత్రాంగంతో బాబు టెలికాన్పరెన్స్...

విజయవాడ : అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట కుంటలు, ఇంకుడు గుంతల తవ్వకం మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిపై జిల్లాల కలెక్టర్లు అధికారులతో రోజు విడిచి రోజు వీడియో, టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందించాలని సూచించారు. 

13:22 - May 30, 2016

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రవర్థమానమై వెలుగొందిన గ్రానైట్ పరిశ్రమలు నేడు మూతపడుతున్నాయి. 15 దేశాలకు పైగా గ్రానైట్ ఎగుమతి చేసిన వందలాది పరిశ్రమలు కష్టాల ఊబిలో కొట్టు మిట్టాడుతున్నాయి. అంతర్జాతీయంగా నిర్మాణరంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో.. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల భవితవ్యం అనుమానంగా మారింది. ప్రపంచ దేశాలకు గ్రానైట్ ను ఎగుమతి చేసిన కంపెనీలు నేడు ఢీలా పడ్డాయి. మార్కెట్ లేకపోవడంతో.. గ్రానైట్ పరిశ్రమలను మూసేందుకే యజమానులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఈ పరిశ్రమలను నమ్ముకున్న కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి.

రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారం..
తెలంగాణలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 500 లకు పైగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి.అందులో 300 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిలో 100 కు పైగా మూతపడగా మరో 150 మూసివేత దశలో ఉన్నాయి. నలుపు, తెలుపు, ఎరుపు, గోధుమ రంగు, గులాబీ రంగు రాళ్లకు ఖమ్మంజిల్లా ప్రసిద్ది. పరిశ్రమలు జోరుగా సాగిన రోజుల్లో శ్రీలంక, మలేషియా, బ్రిటన్, టర్కీ, కొరియా, సౌదీ, చైనా వంటి 15 దేశాలకు ఎగుమతి చేసేవారు. రూ.1000 కోట్ల వ్యాపారం జరిగేది. కాని నేడు ఆ పరిస్థితి లేదు. ఈ గ్రానైట్ పరిశ్రమలను నమ్ముకుని దాదాపు ప్రత్యక్షంగా 20 వేల మంది, పరోక్షంగా 80 వేల మంది పనిచేసేవారు. పారిశ్రామికవేత్తలంతా గ్రానైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే లాభాలు గడించారు.

ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కడ ?
లక్షలాదిమంది కార్మికులకు కూడు పెట్టినపరిశ్రమలు చిన్నాభిన్నమవడానికి పెరిగిన విద్యుత్ చార్జీలు.. డీజిల్ రేట్లు, రవాణా చార్జీలు ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహకం లేకపోవడం వంటి వివిధ కారణాల దృష్ట్యా పరిశ్రమలను నడపలేమని యజమానులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి క్యూబిక్ మీటరుకు 1952 రూపాయల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. మినరల్ ఫౌండేషన్ ఫండ్ పేరుతో .. మరో 32 శాతం అదనంగా వసూలు చేస్తోంది కేంద్రం. దీంతో మా వల్లకాదంటున్నారు గ్రానైట్ వ్యాపారులు. గ్రానైట్ పరిశ్రమల స్థాపనతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒకప్పుడు పంటల సాగుకే పరిమితమైన వ్యవసాయ భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఎకరం 2 కోట్లకు పైగా పలికాయి. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు ప్రస్తుతం మూతపడడంతో కార్మికుల జీవితాలు సైతం దుర్భరంగా మారాయి. గుజరాత్ , రాజస్థాన్, మహారాష్ట్ర పంజాబ్ ,కేరళ పాండిచ్చేరి ,గోవా వంటి రాష్ట్రాల నుండి వచ్చి వ్యాపారాలు చేసుకునే వారు. మారిన కాలంతో పాటే వారు స్వంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో చిన్నాచితక పరిశ్రమలు ఊనికినే కోల్పోయాయి. ఇలా ఒక ప్రక్క కార్మికులు , మరో ప్రక్క గ్రానైట్ వ్యాపారులు ఉపాధిని కోల్పోయారు. దీంతో జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ పరిశ్రమలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పరిశ్రమలు పూర్వ వైభవం సంతరించుకోవంటున్నారు పలువురు గ్రానైట్ వ్యాపారులు. 

13:19 - May 30, 2016

విశాఖపట్టణం : లావణ్య మృతి కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దాడి హేమ కుమార్‌తో పాటు..మరో వ్యక్తి గొడ్డెటి హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ సీపీ మాట్లాడుతూ 23న సాలాపవానిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లావణ్య మృతి చెందిందని, తన బంధువులతో ఆమె అనకాపల్లి నూకాలమ్మ దేవస్థానానికి వెళ్లి తిరిగి బండిపై వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే దాడి హేమకుమార్‌ మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదవశాత్తు లావణ్య వాహనాన్ని ఢీకొట్టాడని తెలిపారు. ఉద్దేశ్య పూర్వకంగా చేసినది కాదు అని స్పష్టం చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశామని, ఆలయంలోనూ ఆమెను వేధించినట్టుగా ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదని అన్నారు. హేమ కుమార్ మనీ రికవరీ చేయడానికి ఇక్కడకు రావడం జరిగిందని ఫ్రెండ్ వారించినా వెళ్లాడని, మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడాడని తెలిపారు. ఇన్ కమింగ్...అవుట్ గోయింగ్ కాల్స్ పై విచారించడం జరిగిందని, యాక్సిడెంట్ జరిగిన అనంతరం హేమ కుమార్ ఫోన్ కట్ చేశాడని, అనంతరం అవతలి వ్యక్తి ఫోన్ చేశాడని పేర్కొన్నారు. రోడ్డుపై సడెన్ బ్రేక్ లు వేసినట్లు గుర్తులున్నాయన్నారు. 

13:16 - May 30, 2016

హైదరాబాద్ : జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా మహానాడు నిర్వహించారని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చర్చించకుండా.. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేతపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. నిబద్ధత, పోరాట పటిమ ఉన్న జగన్‌ అని భూమన అన్నారు. ఒక పార్టీ మహాసభలు జరుపుకుంటున్న సమయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలని, అభివృద్దికి బాటలు పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించాల్సింది పోయి జగన్ పై విమర్శలు చేశారని విమర్శించారు. వంగవీటి హత్యకు బాబే కారకుడని హరిరామయ్య జోగయ్య చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తుని ఘటనపై విచారణకు ఆదేశించే దమ్ముందా అని సవాల్ విసిరారు. 

విద్యార్థినిపై టీచర్ అత్యాచారయత్నం..

హైదరాబాద్ : పాతబస్తీ రెయిన్ బజారు పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిదా మోడన్ స్కూల్ లో 7వ తరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

పేదలకు రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు - పోచారం..

నిజామాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేదలకు రెండు లక్షల రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం భైరాపూర్‌లో రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రరత్నభవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఆరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విభజన చట్టంలోని హామీల అమలు, టీడీపీ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

కలెక్టర్లు..అధికారులతో మంత్రి హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, మిషన్ కాకతీయ పనులపై చర్చించారు. పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లకు, అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

కిరణ్ బేడీని కలిసిన వి.నారాయణస్వామి..

పుదుచ్చేరి : కాంగ్రెస్ సీనియర్ నేత వి.నారాయణ స్వామి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా నిన్న కిరణ్‌బేడీ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

టాక్సీ డ్రైవర్ పై ఆఫ్రికన్ జాతీయుల దాడి..

ఢిల్లీ : ఓ ట్యాక్సీ డ్రైవర్‌పై ఆఫ్రికన్ జాతీయులు దాడి చేశారు. నలుగురి కంటే ఎక్కువ మంది ఉండడంతో డ్రైవర్ నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన ఆఫ్రికన్లు దాడి చేసి గాయపరిచారు. 

12:23 - May 30, 2016

ఢిల్లీ : ఉత్తరాఖంఢ్ లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తెహ్రీ, ఉత్తర కాశీ తదితర ప్రాంతాలో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల్లో ఆరుగురు కొట్టుకపోయి మృత్యువాత పడ్డారు. ఛార్ ధామ్ యాత్రికులకు ఈ వరదలు తీవ్ర ఆటంకాన్ని కలుగ చేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని రహదారులపై చెట్లు..కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీనితో యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కర్ణప్రయాగ వద్ద వరదల్లో 60 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. వీరిలో పశ్చిమగోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాకు చెందిన వారున్నారు. ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లిన ఏలూరుకు చెందిన 25 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా నేపాల్ సరిహద్దులో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు.
యూపీలో భారీ వర్షాల కారణంగా 12 మంది మృతి చెందారు. మరో 24 గంటల పాటు భారీగా వర్షాలు పడే అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, గైడ్ లు ఇందుకు కృషి చేయాలని సూచించింది. వరదల్లో చిక్కుక్కున్న వారిని సురక్షితంగా తరలించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

12:14 - May 30, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో బీజేపీ నేతలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం ముట్టడించేందుకు ప్రయత్నించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  బాట్లా ఎన్ కౌంటర్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్..సోనియాకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అక్కడున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. 

ముద్రగడే ఒక్కడే కాపులకు నాయకుడా - మంత్రి నారాయణ..

నెల్లూరు : ముద్రగడ పద్మనాభం ఒక్కరే కాపులకు నాయకుడు కాదని, ఎంతో మంది కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్న నేతలు ఉన్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

పోలీసుల అదుపులో మందకృష్ణ మాదిగ..

కృష్ణా : ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో జరగనున్న విలేకరుల సమావేశానికి వెళుతుండగా, నగర శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 

ముఖ్యనేతలతో కొనసాగుతున్న బాబు భేటీ..

విజయవాడ : ముఖ్యనేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరుపుతున్న సమావేశం కొనసాగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, నాల్గో స్థానంపై చర్చిస్తున్నారు. బీజేపీకి ఒక సీటు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థి పేరు చెప్పాల్సిందిగా బీజేపీ కేంద్ర కమిటీకి సమాచారం అందించారు. 

లావణ్య మృతి కేసులో సీపీ వివరాలు..

విశాఖపట్టణం : లావణ్య మృతి కేసులో సీపీ యోగానంద్ వివరాలు వెల్లడించారు. లావణ్య మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు, ఊహాగానాలపై ఆధారపడలేమని సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. 

ఢిల్లీలో బీజేపీ ఆందోళన..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. సోనియా ఇల్లు ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బాట్లా ఎన్ కౌంటర్ పై దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఈ ఆందోళన చేపట్టింది.

జగ్గయ్య చెరువులో ఆక్రమణల తొలగింపు..ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : పిఠాపురం జగ్గయ్య చెరువులో ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళ ఆత్మహతాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వరదల్లో చిక్కుకున్న 60 మంది తెలుగు యాత్రికులు..

ఉత్తరాఖండ్ : కర్ణప్రయాగ వద్ద వరదల్లో 60 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. బాధితుల్లో ప.గో, విశాఖ, కృష్ణా జిల్లాల వాసులున్నారు. ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లిన ఏలూరుకు చెందిన 25 మంది యాత్రికులు క్షేమంగానే ఉన్నారు. వీరు నేపాల్ సరిహద్దులో ఉన్నట్లు సమాచారం. 

11:55 - May 30, 2016

విజయవాడ : రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ నాటికి.. తమ ఎమ్మెల్యేలు వలస వెళ్లకుండా.. వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లోపు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో.. ఎమ్మెల్యేలందరినీ కుటుంబ సమేతంగా విహార యాత్రకు పంపింది. పార్టీకి దక్కాల్సిన ఒకే ఒక్క రాజ్యసభ సీటునూ కోల్పోకూడదని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఒక సీటు గెలుచుకునేంత సంఖ్యాబలం ఉంది. దీనిని కాపాడుకునేందుకు పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుంటోంది. ఈక్రమంలోనే దాదాపు 35 మంది శాసనసభ్యులను రెండు గ్రూపులుగా విభజించి విహారయాత్రలకు పంపించింది. ఒక బృందం కేరళ వెళితే, మరో గ్రూపు గోవాలో విహరిస్తోంది. వీరిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఆర్థికంగా బలహీనంగా ఉన్న శాసనసభ్యులతోపాటు, గిరిజన మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. విహారయాత్రకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే నెల 5కు తిరిగి రానున్నారు. జూన్‌ 11న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. పోలింగ్‌ ముందు ఇవి చిన్నపాటి క్యాంపు రాజకీయాలుగా భావిస్తున్నారు.

ఆర్థిక ప్యాకేజీ..
విహారయాత్రలతోనే వైసీపీ నాయకత్వం పరిపెట్టుకోవడం లేదు. ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని వారికి సహకారం అందించాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోతున్నారని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే పార్టీలో ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్న ఎమ్మెల్యేలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులను బట్టి ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవకాశం ఉన్న ఒక రాజ్యసభ సీటు కూడా దక్కకపోతే పార్టీ పరువు పోతుందని ఆందోళన చెందుతున్న వైసీపీ నాయకత్వం.. ఆ విధంగా జరక్కుండా.. ఎమ్మెల్యేలకు ఆర్థిక దన్ను అందించేందుకు ముందుకొచ్చినట్టు సమాచారం.

నాల్గో స్థానానికి టిడిపి పోటీ..
రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకునే బలం టీడీపీకి ఉంది. కానీ తెలుగుదేశం నాయకత్వం నాల్గవ స్థానానికి కూడా తమ అభ్యర్ధిని నిలిపే యోచనలో ఉంది. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాల్గవ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. మరికొంత మంది ఫిరాయించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే విహార యాత్రలు, ఆర్థిక దన్నుతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వైసీపీ ఆపసోపాలు పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

11:52 - May 30, 2016

విజయనగరం : తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాలకు ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించకపోవడంపై సీపీఎం నేత పుణ్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో రిజర్వాయర్‌ కారణంగా ముంపునకు గురవుతున్న సారిపల్లి గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఇప్పటికే భూములు పోగొట్టుకున్న గ్రామస్థులు రిజర్వాయర్‌తో ముంపుకు గురవుతారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆమె వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, గ్రామస్థులు, తదితరులున్నారు. సారిపల్లి గ్రామానికి ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 

11:51 - May 30, 2016

తమిళనాడు : థేనీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సుపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. మధురై జిల్లా అచంపాతు గ్రామానికి చెందిన 62 మంది విద్యార్థులను ఓ సంస్థ పలు పర్యాటక ప్రాంతాలు చూపించేందుకు తీసుకెళ్లింది. అయితే విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును మార్గ మధ్యంలో ఓ టీ షాపు వద్ద ఆపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మామిడి చెట్టును విద్యార్థులు లాగడంతో దానిపై ఉన్న విద్యుత్‌ తీగలు బస్సుపై పడ్డాయి. దీంతో పదాహారేళ్ల కార్తీక్‌ సెల్వం.. పదిహేనేళ్ల ముఖేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

11:31 - May 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 14.5 శాతం వ్యాట్ ను తీసివేయాలని ప్రైవేటు ట్యాంకర్ల యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నుండి సమ్మె చేపట్టారు. దీనితో ఏడు డిపోల పరిధిలో మూడు వేల ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఈసందర్భంగా టెన్ టివితో నేతలు మాట్లాడారు. తాము ఎలాంటి ధర్నాలు..నిరసన ప్రదర్శనలు చేయమని, లారీలు ఆపివేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఒక బండి మీద నడిపిస్తే రూ. 15 వేలు మాత్రమే మిగుతుందని, ఇందులో 14.5 శాతం వ్యాట్ తీసుకోవడం దారుణమని ఆరీఫ్ పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం వ్యాట్ శాతాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. 

11:10 - May 30, 2016

హైదరాబాద్ : ఫేస్ బుక్ పరిచయం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ప్రేమించిన యువతి వివాహం చేసుకోవాలంటూ వేధిస్తోందనే కారణంతో ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. యశ్వంత్ గౌడ్ తో మలక్ పేట ప్రాంతానికి చెందిన జానకిలు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం ప్రేమిస్తున్నాంటూ నమ్మించాడు. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని జానకి వత్తిడి తెచ్చింది. దీనితో యశ్వంత్ దూరంగా ఉంటూ వచ్చాడు. తనను మోసం చేస్తాడని జానకి గ్రహించింది. ఎలాగైనా జానకిని వదిలించుకోవాలని యశ్వంత్ భావించాడు. అందులో భాగంగా తన రూంకు రావాలని జానకికి చెప్పాడు. రూంకు వచ్చిన అనంతరం జానకి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి మూసి నదిలో పడేశాడు. అప్పటికే ఫిర్యాదు అందుకున్న పోలీసులు యశ్వంత్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 

గయాలో రెండు కేన్ బాంబులు..

బీహార్ : గయాలోని చక్రబంద ప్రాంతంలో రెండు కేన్ బాంబులను ఉన్నట్లు సీఆర్పీఎఫ్ గుర్తించింది. ఒక్కోటి 10 కేజీల బరువున్న ఈ బాంబులను స్వాధీనం చేసుకుంది. ఘటనా ప్రదేశాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు పరిశీలించారు. 

10:32 - May 30, 2016

అనంతపురం : జిల్లాలో ఓ చేనేత వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ధర్మవరంలో ఉన్న చేనేత వ్యాపారి రామాంజనేయులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వడిచిపెట్టాలంటూ మూడు లక్షలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ముడిసరుకు తీసుకొస్తానని వెళ్లిన రామాంజనేయులు ఇంటికి చేరుకోలేదు. దీనితో కుటుంసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం కనబడలేదు. ఈ నేపథ్యంలో రామాంజనేయులు సోదరికి వాట్సప్ లో ఓ వీడియో వచ్చింది. అందులో రామాంజనేయులు బంధించి ఉన్నాడు. వెంటనే ఆ నంబర్ కు కుటుంసభ్యులు ఫోన్ చేశారు. తమకు మూడు లక్షలు కావాలని, అప్పుడే రామాంజనేయులను విడిచి పెడుతామని బెదిరించారు. దీనితో వారు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. వాట్సప్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. 

ధర్మవరంలో చేనేత వ్యాపారి కిడ్నాప్..

అనంతపురం : ధర్మవరంలో గుర్తు తెలియని వ్యక్తులు చేనేత వ్యాపారి రామాంజనేయులును కిడ్నాప్ చేశారు. మూడు లక్షలు ఇస్తేనే వదిలిపెడుతామని దుండగులు హెచ్చరించారు. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు..నిఫ్టీ 30 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. 

10:13 - May 30, 2016

విజయవాడ : రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టిడిపి నాలుగో అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరగనున్న సీట్లలో ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో మూడు సీట్లు టీడీపీకి, ఓ సీటు వైసీపీకి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం టిడిపి ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. తిరుపతిలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో అంపూర్తిగా ముగిసింది. దీనితో సోమవారం మరోసారి భేటీ కావాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది..ఎలా అనుసరించాలనే దానిపై తిరుపతిలో చర్చించినట్లు తెలుస్తోంది. బీసీల నుండి బీటీ నాయుడు, బీద మస్తాన్ రావు, ఎస్సీల నుండి ఏఆర్ పుష్పరాజ్, మాజీ ఎమ్మెల్యే హేమలతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

టెన్షన్ లో సుజనా..
ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలిచే అవకాశమున్న 15 స్థానాలకు గాను 12 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఆదివారం ప్రకటించింది. మూడు స్థానాలకు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రెండు టిడిపికి, ఒకటి బీజేపీకి ఇవ్వాలని టిడిపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి పదవీ కాలం వచ్చే నెల చివరకు ముగియనుంది. కేంద్ర మంత్రిగా ఉన్న ఈయనకు సీటు ఇచ్చేందుకు టిడిపి నిర్ణయించినట్లు సమాచారం. కానీ సుజనాకు మరోసారి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు బాబు విముఖత చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నామినేషన్ల గడవు సమీపిస్తున్న కొద్ది నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ఆ అభ్యర్థి ఎవరో కొద్దిసేపట్లో తెలిసిపోనుంది. 

ఎయిమ్స్ లో శుభ్రం చేసిన జేపీ నడ్డా..

ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. శుభ్రత కార్యక్రమంలో భాగంగా ఆయన చీపురు పట్టి శుభ్రం చేశారు. 

09:23 - May 30, 2016

కృష్ణా : దక్షిణాదిలో మరో సంరంబానికి సమయం దగ్గరపడుతోంది. అదే కృష్ణా పుష్కరాలు. గత గోదావరి పుష్కరాలవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈసారి కృష్ణా పుష్కరాల్లో అలాంటి పొరబాట్లు జరగకుండా ఉండేందుకు ఏపీ సర్కార్‌ ప్రీ ప్లాన్డ్‌గా వ్యవహరిస్తోంది. నిఘా పర్యవేక్షణ దగ్గరనుంచి ఏర్పాట్ల దాకా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 2015 గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్‌ వ్యూహరచన చేస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రులు అధికారులపైనే ఆ భారం మోపుతున్నారు. పుష్కర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా మంత్రులను పురమాయిస్తున్నారు.

ప్రతి చోటా నిఘా కెమెరాలు...
ప్రతి కూడలీ, పుష్కర ఘాట్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, తాత్కాలిక బస్టాండ్లు ఇలా ప్రతిచోటా నిఘా కెమేరాలు ఏర్పాటు చేసే దిశగా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. విజయవాడ వ్యాప్తంగా మొత్తం 1200 సీసీ కెమేరాలు ఆగస్టు మొదటి వారానికి సెట్‌ చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. వాటిని పుష్కరాల తర్వాత కూడా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. ఆగస్టు 12 నుంచి 12 రోజులపాటు పుష్కరాలు ఉంటాయి. గత గోదావరి పుష్కరాలకు సుమారు 1.30 కోట్ల మంది ప్రజలు హాజరయ్యారు. కృష్ణా పుష్కరాలకు అంతకు మించి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నగరంలో సర్వే నిర్వహించి 300 ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని గుర్తించారు.  గొల్లపూడి నుంచి వైవీరావు ఎస్టేట్ వరకు ప్రతి ప్రధాన సెంటర్లలోనూ దుర్గాఘాట్, పవిత్ర సంగమం ఘాట్..ఇలా అన్ని ప్రధాన ఘాట్‌లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాలకు ఏర్పాటు చేసే కెమేరాలన్నీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు.

మెడికల్ క్యాంపులు..
పుష్కరాల వేళ పెద్ద సంఖ్యలో ఫైరింజన్లు, అంబులెన్సులు, మెడికల్ క్యాంపులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా పండిట్ నెహ్రూ బస్‌ స్టేషన్, రైల్వేస్టేషన్‌ను పరిగణనలోకి తీసుకుని పోలీస్ సిబ్బందిని ఎక్కువగా నియమించాలని నిర్ణయించారు. భక్తులు గుంపులుగా పోగవకుండా ఎప్పటికప్పుడు క్రౌడ్‌ తొలగిపోయేలా ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తమ్మీద పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం చేస్తున్న పనులు టెన్షన్ వాతావరణం సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. 

వెదురు లారీ బోల్తా...ముగ్గురు మృతి..

తూర్పుగోదావరి : అడ్డతీగల మండలం వేటమామిడి దగ్గర వెదురు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సామలపాలెం నుంచి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

కోదాడ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా..

నల్గొండ : కోదాడ బైపాస్‌ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.బస్సు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

09:10 - May 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ లో పెట్రోల్..డీజిల్ ట్యాంకర్ల ఓనర్లు సమ్మె చేపట్టారు. ఏడు డిపోల పరిధిలో సంపూర్ణంగా సమ్మె కొనసాగుతోంది. సుమారు మూడు వేల ట్యాంకర్లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రవాణా ఛార్జీలపై 14.5 శాతం వ్యాట్ ను విధిస్తోందని ఓనర్లు పేర్కొంటున్నారు. రవాణా ఛార్జీపై వ్యాట్ ను విధిస్తూ గత నెలలో జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెట్రోలియం, గ్యాస్ ట్యాంకర్ల ఓనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా ఛార్జీలతో పాటు ఇతరత్రా ఖర్చులుంటాయని, ప్రస్తుతం ఈ వ్యాట్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. లక్ష రూపాయలు వస్తే సుమారు పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. మానవతా హృదయంతో ఆలోచించాలని కోరుతున్నారు.

ఆదివారం చర్చలు విఫలం..
ఆదివారం అర్ధరాత్రినుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు ఓనర్ల అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాట్‌ ఎత్తివేత విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. 14.5 శాతం పన్ను విధింపును ఎత్తివేయాలన్న డిమాండ్‌తో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ట్యాంకర్ ఓనర్ల అసోసియేషన్‌ ఈ సమ్మెకు దిగింది.. అసోసియేషన్‌తో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం ప్రభుత్వంపై మరోసారి చర్చలు జరుపుతామని.. సర్కారు దిగిరాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అసోసియేషన్‌ నేతలు హెచ్చరించారు. ఈ సమ్మెతో 7డిపోల్లోని 3వేల ట్యాంకుల సేవలు నిలిచిపోయాయి.

డీజీపీ కార్యాలయంలో స్వచ్ఛ భారత్..

హైదరాబాద్ : డీజీపీ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొని ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచేందుకు అన్ని పోలీస్ స్టేషన్ లలో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేస్తామని డీజీపీ వెల్లడించారు. 

40 విమానాల దారి మళ్లింపు..

ఢిల్లీ : దేశ రాజధానిలో వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల 40 డెమోస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఈ పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. 

ఫిర్యాదుదారుడితో బూట్ల పాలిష్..

ఉత్తర్ ప్రదేశ్ : ముజఫర్ నగర్ లోని పోలీస్ స్టేషన్ లో ఓ ఫిర్యాదుదారుడి బూట్లను పాలిష్ చేస్తున్న వీడియో హల్ చల్ చేస్తోంది. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిప ఎస్పీ స్పందించారు. ఘటన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. 

డివైడర్ ను ఢీకొట్టిన కొర్పొరేటర్ కారు..

గుంటూరు : పెదకాకాని (మం) కొప్పురావూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ కార్పొరేటర్ మల్లిఖార్జున కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో మల్లిఖార్జున రావుకు గాయాలయ్యాయి. వెంటనే ఈయనను ఆసుపత్రికి తరలించారు. మహానాడు నుండి తిరిగి వస్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. 

08:31 - May 30, 2016

ఉత్తరాఖండ్‌ : భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెహ్రీ, ఉత్తర కాశీ తదితర ప్రాంతాల్లో వరదలు హడలెత్తిస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. చార్‌ ధామ్‌ యాత్రికులకు భారీ వర్షాలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దారితీసే ఘాట్‌ రోడ్లపై రాళ్లు, చెట్లు కూలుతుండడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

బస్సుపై పడిన విద్యుత్ తీగ..

తమిళనాడు : రాష్ట్రంలో ఓ ప్రాంతంలో విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సుపై విద్యుత్ తీగ తెగిపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

నాలుగో అభ్యర్థి దించే యోచనలో టిడిపి..

విజయవాడ : రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పోటీకి దించే యోచనలో టిడిపి ఉంది. వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను విజయవాడకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ అంశంపై టిడిపి పొలిట్ బ్యూరో మరోసారి భేటీ కానుంది. ఏపీ టీడీపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును ఖరారు చేశారు. మరో అభ్యర్థిగా పుష్పరాజ్ ను ఖరారు చేశారు. 

మీడియా..పోలీసులపై లిక్కర్ మాఫియా దాడి..

మధ్యప్రదేశ్ : సాత్నా ప్రాంతంలో మీడియా..పోలీసులపై లిక్కర్ మాఫియా దాడి చేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆరుగురి కోసం గాలింపులు చేపడుతున్నారు. దీనిపై ప్రజా సంబంధాల మంత్రి రాజేంద్ర శుక్లా స్పందించారు. పోలీసులు గాలింపులు చేపడుతున్నారని, జర్నలిస్టులకు స్వేచ్చ ఉందని తెలిపారు. 

07:52 - May 30, 2016

లండన్ : కోట్లు వస్తే ఏం చేస్తారు ? ఏం చేస్తాం..పని మానేసుకుని ఇంట్లోనే ఉంటాం..బ్యాంకులో డబ్బు జమ చేసుకుంటాం..కొంత ఖర్చు చేస్తాం..అంటారు కదా. కానీ ఓ వ్యక్తికి కోట్లు వచ్చాయి కానీ కూలీ పని మాత్రం మాననని చెబుతున్నాడు. లండన్ లోని మాంచెస్టర్ నగరానికి చెందిన కార్ల్ క్రూక్ అనే వ్యక్తి నిర్మాణ పనుల్లో కూలీగా పని చేసుకుంటున్నాడు. ఓ రోజు కార్ల్ స్థానిక దుకాణానికి వెళ్లి ఓ కూల్ డ్రింక్ కొనుక్కున్నాడు. దీనికి ఓ స్ర్కాచ్ కార్డు వచ్చింది. దీనిద్వారా అతనికి మిలియన్ పౌండ్ల (మన కరెన్సీలో రూ. 9 కోట్ల పైబడి) వచ్చింది. దీనిని చూసిన క్లార్క్ సంతోషంలో మునిగిపోయాడు. ఇంత డబ్బు వచ్చినా పని మాత్రం మానేయనని, తనకు ఉద్యోగం, ఉద్యోగం ఇచ్చిన సంస్థ తనకు నచ్చాయని పేర్కొన్నాడు. లాటరీ తగిలిన మర్నాడే పనికి కార్ల్ వెళ్లాడు. ఈ పని కొనసాగిస్తానని యజమానితో చెప్పేసినట్లు పేర్కొన్నాడు. ఓవర్ టైమ్ పనిచేయడం మాత్రమే చేస్తానని అంటున్నాడంట. మంచి కారు..కొత్త ఇళ్లు..పెళ్లి..ఇలా కార్ల్ ప్రణాళికలు వేసుకుంటున్నాడంట..

07:40 - May 30, 2016

పసుపు పండ‌గ‌ మ‌హానాడు మూడు రోజుల పాటు తిరుపతిలో అట్టహాసంగా జ‌రిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన రాజ‌కీయ ప‌రిస్ధితుల‌ మధ్య సమతూకం పాటిస్తూ..., పార్టీ శ్రేణుల‌కు భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై దిశానిర్ధేశం చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. పలు తీర్మానాలపై నేతలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. మొత్తం 146మంది నాయకులు ప్రసంగించారు. మరోవైపు రాజ్యసభ ఎన్నిక సందర్భంగా నాలుగో స్థానానికి టిడిపి పోటీ చేస్తోంది. ఈ అంశంపై టెన్ టివి చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), శ్రీరాములు (టిడిపి), తులసీరెడ్డి (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన విమర్శలపై టిడిపి నేత ఘాటు విమర్శలు చేశారు. అలా మాట్లాడడం పొరపాటే అని చెప్పారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

ఐజీఐ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు నిరీక్షణ..

ఢిల్లీ : దేశ రాజధానిలోని ఐజీఐ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. ఢిల్లీలో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో పలు విమానాల దారిని మళ్లించారు. 

07:30 - May 30, 2016

బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ చెల్లెలు రియా కపూర్‌ దర్శకత్వం వహించబోతున్న మహిళా ప్రధాన చిత్రంలో నటించే అవకాశాన్ని స్వరభాస్కర్‌ అందిపుచ్చుకుంది. సోనమ్‌కపూర్‌, కత్రినాకైఫ్‌ తొలుత ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరించినప్పటికీ కొన్ని కారణాల వల్ల కత్రినా ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఆమె ప్లేస్‌లో స్వరభాస్కర్‌ను ఎంపిక చేసినట్లు దర్శకురాలు రియాకపూర్‌ తెలిపారు. ఈ సందర్భంగా రియా మాట్లాడుతూ,'మహిళా ప్రధాన చిత్రంగా సాగే ఈ చిత్రంలో ఢిల్లీకి చెందిన అమ్మాయి పాత్రలో కత్రినా నటించాల్సి ఉంది. అయితే ఢిల్లీలో మాట్లాడే భాష యాస కత్రినాకు సరిగా పలకడం రాదు. నటీనటులు సరైన భావంతోనే పాత్రకు ప్రాణం పోయగలరు. దీంతో కత్రినాకు బదులు స్వరభాస్కర్‌ను సెలెక్ట్‌ చేశాం. కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు స్వరభాస్కర్‌ సైతం ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అలాగే ఇందులో మరికొన్ని ముఖ్యపాత్రలున్నాయి. ప్రాధాన్యత దృష్ట్యా వాటిల్లో కూడా బాలీవుడ్‌కి చెందిన నోటెడ్‌ హీరోయిన్లు నటించే అవకాశముంది' అని చెప్పారు.

07:29 - May 30, 2016

సత్యరాజ్‌ ప్రధాన పాత్రధారుడిగా, శిబిరాజ్‌, బిందుమాధవి జంటగా ధరణీధరన్‌ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన 'జాక్సన్‌ దురై' చిత్రాన్ని రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్‌ బాబు 'దొర' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత జక్కం జవహర్‌ బాబు మాట్లాడుతూ, 'తమిళంలో రూపొందిన ఈ పిరియాడి కల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్‌ కీలక పాత్రలో నటించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ విపిన్‌ వినసొంపైన బాణీలు అందించారు. వెన్నెలకంటి, చంద్రబోస్‌ల సాహిత్యం, శశాంక్‌ వెన్నెలకంటి మాటలు ఆకట్టుకుంటాయి. అనువాద పనులు జరుగుతున్నాయి. జూన్‌ మొదటి వారంలో పాటలను, మూడో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇటీవల వైవిధ్యమైన హర్రర్‌ చిత్రాలను తెలుగు ప్రేక్ష కులు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అన్నారు.

07:26 - May 30, 2016

ప్రతిరోజు అలంకరించుకునే వాటిలో శిరోజాలు కూడా ముఖ్యమైనవి. శిరోజాలను బట్టి మన ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు చిన్నతనంలో జట్టు తెల్లబడుతుంది. అందుకే మనం తీసుకునే ఆహారంతో పాటు కొన్ని సహజ ఉత్పత్తులతో చిట్కాలను కూడా పాటిస్తే పట్టులాంటి కురులు సొంతమవుతాయి.
ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్లల్లో వేసి చిటికెడు పంచదార కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం ఒక కప్పు మోతాదుకు వచ్చిన తర్వాత ఇందులో రెండు కప్పులహెన్నాపొడి, గుడ్డుసొన, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.
సరిపడా హెన్నా, గుడ్డుసొన, అర చెక్క నిమ్మరసం, ఒక టేబుల్‌ స్పూను ఇన్‌స్టంట్‌ కాఫీపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45నిమిషాల తర్వాత కడిగేయాలి. 

07:25 - May 30, 2016

ప్రతి ఆహార పదార్థంలోనూ పోషకాలుంటాయి. కానీ ప్రతి దాంట్లోనూ అన్ని రకాల పోషకాలు ఉండవు. అందుకే పండ్లు, కూరగాయల్ని రోజుకో రకం తీసుకోవడం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా రోజూ ఒక రకమైన ఆహార పదార్ధాలు తీసుకుంటే శరీరం వాటిలోని పోషకాలను గ్రహించడం పట్ల ఆసక్తి చూపదు.
కేవలం విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలకే పరిమితం కాకుండా, వ్యాధులతో పోరాడేందుకు తోడ్పడే ఫైటో కెమికల్స్ ఉన్న పదార్ధాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. లవణాలు ప్రత్యేకించి జింకు, ఐరన్‌, కాపర్‌ ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముడి ధాన్యాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.
రోజుకు కనీసం 40గ్రాముల పీచుపదార్థాలు అందే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పీచు పదార్థాలు లోపిస్తే మలినాలు శరీరంలోనే నిలిచిపోయి జీవక్రియలు కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వ్యాధినిరోధకశక్తిని దెబ్బ తీస్తుంది.
నాడీ వ్యవస్థ పోషణకు కొవ్వు పదార్థాలు కూడా అవసరమే. కాకపోతే అవి ఆహారంలో 20శాతం మించకూడదు. తీపి పదార్థాల్లో మెదడును చైతన్యపరిచే గుణం ఉంది. అయితే అతిగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంది. అందుకే పరిమితంగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అన్ని రకాల పోషకాలు అందుతాయి. 

ఢిల్లీలో తగ్గిన ఉష్ణోగ్రత..

ఢిల్లీ : దేశ రాజధానిలో ఆదివారం రాత్రి చిరు జల్లులు కురిశాయి. దీనితో ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతున్నాయి. 24 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయింది. 

కరీంనగర్ లో నిలిచిపోయిన 300 చమురు ట్యాంకర్లు..

కరీంనగర్ : పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల ఓనర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా రామగుండం (మం) కుందనపల్లి ఇంధన నిల్వల కేంద్రంలో 300 ట్యాంకర్లు నిలిచిపోయాయి. హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్ కేంద్రాల నుండి నాలుగు జిల్లాలకు ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. 

నేడు ఏపీ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ భేటీ..

విజయవాడ : ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు కో ఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. భవిష్యత్ లో చేయాల్సిన ఉద్యమాలపై చర్చించనున్నారు. 

టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో నేడు బాబు భేటీ..

విజయవాడ : వైసీపీ నుండి టిడిపిలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. 

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం..

ఖమ్మం : జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు తల్లాడ బస్టాండ్ సమీపంలోని రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సంఘటనలో ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తె లుస్తోంది. పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడటంతో ఖమ్మం-హైదరాబాద్ పై వాహనాలు నిలిచిపోయాయి. 

32గంటల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో రానున్న 32 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ పట్టణం వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో సూచించింది. 

06:41 - May 30, 2016

వానాకాలం దగ్గరకొచ్చింది. రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్న జనం వర్షించే మేఘాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వానాకాలంతో అనుసంధానమై వున్న వివిధ వ్రుత్తులవారు తమకు కావాల్సిన సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఇలాంటివారిలో మత్స్యకారులూ వున్నారు. తెలంగాణలో చేపల పెంపకం ఎక్కువగా భాగం చెరువులు, కుంటల్లో సాగుతుంది. వర్షాకాలం ఆరంభంకాగానే చేప పిల్ల విత్తనాలు తెచ్చుకుని, చెరువుల్లో, కుంటల్లో చల్లుతుంటారు. తెలంగాణలో మత్స్యకారుల అవసరాలకు తగ్గట్టుగా చేప పిల్ల విత్తనాలు దొరుకుతున్నాయా ? తెలంగాణలో సీడ్ సెంటర్స్ ఎక్కడెక్కడున్నాయి? వీటి పంపిణీలో వున్న నియమనిబంధనలేమిటి? సీడ్ సెంటర్స్ అభివ్రుద్ధిలో ప్రభుత్వం పాత్ర ఏమిటి? తెలంగాణలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మార్కెటింగ్ సౌకర్యాలు ఎలా వున్నాయి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ మత్స్యకారుల సంఘం నేత బాలక్రిష్ణ విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

06:35 - May 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని కేంద్రం ప్రశంసల్లో ముంచెత్తుతోంది. త్వరలోనే తాను తీసుకురానున్న నీటి నిర్వహణ చట్టానికి స్ఫూర్తి... మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలాంటి చట్టాన్ని కేంద్రం తీసుకురావాలనే ఆలోచన వెనక మిషన్ కాకతీయ ఉండడం పట్ల తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్రం సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది. మిషన్ కాకతీయ స్ఫూర్తితో 'జాతీయ వాటర్ ఫ్రేమ్ వర్క్- 2016' పేరిట కేంద్ర జలవనరుల శాఖ ముసాయిదాను విడుదల చేసింది. దీన్ని అన్ని రాష్ట్రాలకు పంపింది. జూన్ 25లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. నీటి వినియోగానికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, జీవనోపాధికి ప్రాధాన్యమని ముసాయిదాలో చేర్చింది. దీని పట్ల జాతీయ జలవనరుల సమన్వయ కమిటీలో సభ్యుడిగా ఉన్న హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ లాగా అన్ని రాష్ట్రాలు నీటి నిల్వలను పెంచుకోవాలని జల వనరుల శాఖ సూచించింది.

అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు..
ఇక నీతి అయోగ్ కూడా మిష‌న్ కాక‌తీయ అద్భుత‌ పథకమని కొనియాడింది.. అంద‌రూ మిష‌న్ కాక‌తీయ బాట‌లో న‌డ‌వాల‌ని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ‌లు రాసింది. కేంద్రం మ‌రో అడుగు ముందుకేసి దేశ‌వ్యాప్తంగా 5 ల‌క్షల నీటి కుంట‌లు నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది. ఓవైపు దేశంలో క‌రువు తాండవిస్తోంది. మ‌రోవైపు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ఇప్పుడు కేంద్రం ముందున్న ప్రధాన ల‌క్ష్యం నీటిని ఒడిసిప‌ట్టుకోవ‌డం ఒక్కటే. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క స‌హా ప‌లు ద‌క్షిణాది రాష్ట్రాలు క‌రువు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఉత్తరాదిలోనూ నీటికి క‌ట‌క‌ట ఏర్పడుతోంది. ప్రతి వ‌ర్షపు నీటి బొట్టునూ ఒడిసిప‌ట్టుకోవ‌డం మిష‌న్ కాక‌తీయ‌లాంటి పథకంతోనే సాధ్యమ‌ని కేంద్రం భావిస్తోంది. ఇదే విష‌యాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చింది. అంద‌రినీ భాగ‌స్వాములు చేసేలా.. నీటి నిల్వల ఏర్పాటును నిర్భందం చేసేలా బిల్లు తయారుచేసింది.

ముసాయిదా బిల్లు..
రిజ‌ర్వాయ‌ర్లు క‌ట్టడం, న‌దుల అనుసంధానం స‌హా అనేక ప్రత్యామ్నాయాల‌న్నీ ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నులు. పైగా స‌మ‌యం కూడా ఎక్కువ‌ప‌డుతుంది. కానీ మిష‌న్ కాక‌తీయ‌ ద్వారా అతి త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన బ‌హుళ ప్రయోజ‌నాలు క‌నిపిస్తున్నాయి. అంతేగాక నీటి నిల్వలను పెంచుకోవ‌డం కూడా తేలికే. గ్రామ స్థాయిలోనే చెరువుల‌లో నీరు అందుబాటులో ఉంటుంది. భూగ‌ర్బ జ‌లాలు పెరుగుతాయి. అందుకే కేంద్రం మోడ‌ల్ బిల్లులో ఈ అంశాల‌ను చేర్చింది. గ‌తంలో ఉన్న బిల్లు కేవ‌లం నీటి స‌ర‌ఫ‌రాకు, జ‌లాశ‌యాల‌ నిర్మాణాల‌కు సంబంధించిందే కావ‌డంతో... ఈసారి సామాజిక బాధ్యత‌ను పెంచుతూ ముసాయిదా బిల్లును కేంద్రం రూపొందించింది.
తెలంగాణ నీటి పారుద‌లశాఖ మంత్రి మంత్రి హ‌రీష్ రావు.. కేంద్ర జ‌ల స‌మ‌న్వయ సంఘం క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యాక‌.. మిష‌న్ కాక‌తీయ‌కు మ‌రింత గుర్తింపు వ‌చ్చింది. ప్రభుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాలు ఢిల్లీ స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గ‌డానికి ఇది దోహదం చేసిందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు.

06:32 - May 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంటోంది. శాసనసభ సభ్యుల బలాబలాల ఆధారంగా జరిగే ఎన్నికలు కావడంతో తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కనీసం పోటీ చేసే పరిస్థితులు కూడా లేవు. దీంతో గులాబి పార్టీకి రాజ్యసభ సభ్యుల ఎన్నిక లాంఛనంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని వీహెచ్ భావించినా అది సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత వ్యక్తం కావడంతో పోటీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజున అధికారపార్టీ అభ్యర్థులుగా ఇద్దరు సీనియర్ నేతలు మాజీ మంత్రులు కెప్టెన్ లక్ష్మికాంతరావు, డి. శ్రీనివాస్ లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. శాసనసభలో జూన్ 1 న ఉదయం 11.35 గంటలకు నామినేషన్లు దాఖలు చేయాలని పార్టీ నిర్ణయించింది.

కేసీఆర్ కు సన్నిహితులు..
ఇద్దరికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి కెప్టెన్ కేసీఆర్ కు ప్రధాన అనుచరుడిగానే వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి కేసీఆర్ ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించారు. డీఎస్ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు బీసీ నేతగా ఆయనకు ఛాన్స్ వచ్చిందని పార్టీ నేతలు అంటున్నారు. నామినేషన్ల దాఖలకు ముహూర్తం ఖరారు కావడంతో సీనియర్ నేతల అనుచరులతో పాటు.... కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల కీలకనేతలంతా నామినేషన్ల దాఖలుకు హాజరుకానున్నారు.

06:30 - May 30, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా అన్నారు. బీజేపీ పాలన రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమిత్‌... వికాస్‌ పర్వ్ పేరిట పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో పర్యటించిన అమిత్‌... పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎక్కడా అవినీతి ఆరోపణలు రాలేదని గత యూపీఏ సర్కార్‌ ఇందుకు పూర్తి విరుద్ధమంటూ అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల దాడి చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

నేతలకు దిశా నిర్ధేశం..
మండల నాయకుల రాష్ట్ర స్థాయి సదస్సులో అమిత్‌షా పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ టీఆర్ఎస్‌తో పొత్తు విషయమై తమకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదని వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, పేదల సమస్యలు తీర్చేందుకు బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసిందని అమిత్‌షా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో టీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతామని స్పష్టం చేశారు. 2019నాటికి తెలంగాణలో బీజేపీ గొప్ప రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీకి పార్టీ అధ్యక్షుడి నియామకంపై మరో వారంలో ప్రకటన చేస్తామని అమిత్‌ షా వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కరమైతే స్పెషల్‌ స్టేటస్ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. 

06:28 - May 30, 2016

చిత్తూరు : ప‌సుపు పండ‌గ‌ మ‌హానాడు మూడు రోజుల పాటు తిరుపతిలో అట్టహాసంగా జ‌రిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన రాజ‌కీయ ప‌రిస్ధితుల‌ మధ్య సమతూకం పాటిస్తూ..., పార్టీ శ్రేణుల‌కు భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై దిశానిర్ధేశం చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. పలు తీర్మానాలపై నేతలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. మొత్తం 146మంది నాయకులు ప్రసంగించారు. గతం కంటే భిన్నంగా ఈ సారి ఎక్కువ మంది కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పించారు. మూడురోజుల్లో 29గంటల పాటు మహానాడు నిర్వహించారు.  ఈ సారి మహానాడు నిర్వహణలో చంద్రబాబుకు వెన్ను దన్నుగా ఉంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ కీలక పాత్ర పోషించారు. గత మహానాడు తో పోల్చుకుంటే ఈసారి మహానాడు కు జనం తగ్గారు. స్వయంగా చంద్రబాబే ఈ విషయాన్ని ప్రస్తావించారు. రోజుకు 20వేల మందికి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంత రుచులు అందించారు. ఎన్టీఆర్‌ ఫోటో ప్రదర్శన అందరిని అలరించింది.

115 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం..
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన పనులు, తెలంగాణలో విపక్షంగా నేరవేర్చాల్సిన కార్యాచరణను ఖరారు చేసుకుంది. మండుటెండల్లో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మహానాడుకు హాజరైన దాదాపు 30వేల మంది ప్రతినిధులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వగలిగామని పార్టీ భావిస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమరావతిలో 115 అడుగుల విగ్రహం ఏర్పాటు, అన్న క్యాంటీన్ల ఏర్పాటును చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణలో 2019ఎన్నికలకు తెలంగాణలోను పార్టీ బలోపేతం చేయవచ్చనే భరోసా ఇచ్చే ప్రయత్నం మహానాడు వేదిక ద్వారా చేశారు. మహానాడులో రోజుకూ ఉత్సాహం పెరుగుతూ కనిపించింది. తొలిరోజు సమస్యలు మరుసటి రోజు పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డారు. 

నేడు వెంకయ్య నామినేషన్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం రాజస్థాన్ నుండి రాజ్యసభ కు నామినేషన్ దాఖలు చేయనన్నారు. ఉదయం 9.30కు ఢిల్లీ బయలుదేరి 10.30కు జైపూర్ చేరుకుని స్థానిక నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజస్థాన్ శాసనసభలో నామినేషన్ దాఖలు చేస్తారు. 

నేటి నుండి టీఎస్ పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీ ఈసెట్ పరీక్షలు సోమవారం నుండి జరగనున్నాయి. మొత్తం 18 విభాగాలకు 44,061 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్ష ఆన్ లైన్ లోనే నిర్వహిస్తారు. 

పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల సమ్మె..

హైదరాబాద్ : అర్ధరాత్రి నుండి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. 14.5 శాతం వ్యాట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 7 డిపోల పరిధిలో 3వేల ట్యాంకర్లు నిలిచిపోయాయి. 

ఎల్లుండి నుండి ఇంటర్ తరగతులు..

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ 2016-17 విద్యా సంవత్సర వార్షిక ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ శాఖ ఆదివారం విడుదల చేసింది. ఒకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సులను అందించే కళాశాలలు ఆ ప్రణాళిక పరిధిలోకి వస్తాయి. తరగతులు జూన్ 1న ప్రారంభమౌతాయని, మార్చి 28, 2017 విద్యా సంవత్సరం చివరి పనిదినమని అధికారులు పేర్కొన్నారు.

టి.విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్ష..

హైదరాబాద్ : ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం నుంచి విద్యుత్‌సౌధలో ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పేర్కొంది. 

నేడు మరోసారి పొలిట్ బ్యూరో సమావేశం..

విజయవాడ : నేడు టిడిపి పొలిట్ బ్యూరో మరోసారి సమావేశం కానుంది. ఆదివారం పొలిట్ బ్యూరో భేటీ జరిగిన సంగతి తెలిసిందే. నాలుగో అభ్యర్థి పోటీపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. 

టీఆర్ఎస్ లోకి అశ్వాపురం టిడిపి జడ్పీటీసీ..

ఖమ్మం : అశ్వాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు తోకల లత టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. 

మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి నివాసంలో శత చండీయాగం..

ఆదిలాబాద్ : జిల్లా నిర్మల్‌లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగృహంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ హృదయ సహిత శతచండీయాగం నిర్వహిస్తున్నారు. 

00:45 - May 30, 2016


బెంగళూరు : ఐపీఎల్-9 ట్రోపీని సన్ రైజర్స్ హైదరాబాద్  కైవసం చేసుకున్నారు. రసవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో   హైదరాబాద్  8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో సారి స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 3 సిక్సర్లు, 8 బౌండరీలతో 69 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ధావన్ (28), యువరాజ్ 38 పరుగులు చేశారు. చివర్లో కట్టింగ్స్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలైట్.  కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లు 3 బౌండరీలతో 39 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కట్టింగ్స్ చేసిన 24 పరుగులు మ్యాచ్ గెలుపుకు కీలకంగా మారాయి. 
లక్ష్యం చిన్నది కాకున్నా కోహ్లీ సేన 14 ఓవర్ల వరకూ ఆధి పత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఓపెనర్ గేల్ విజృంభించాడు. 38 బంతుల్లో 8 సిక్సర్లు 4 బౌండరీలతో 76 పరుగులు చేశాడు. మరో వైపు కెప్టెన్ కోహ్లీ  54 పరుగులతో రెచ్చిపోయాడు. 10 ఓవర్లలో 100 పరుగులు దాటేసి వికెట్ కోల్పోకుండా విజయం వైపు దూసుకెళ్తున్న కోహ్లీ సేనకు 114 పరుగుల వద్ద తొలి దెబ్బ పడింది. జోరుమీదున్న గేల్ కట్టింగ్స్ బౌలింగ్ లో బిపుల్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గేల్ ఔటయ్యాక గేర్ మార్చి సిక్సర్లతో విరుచుకు పడి హైదరబాద్ శిభిరంలో టెన్షన్ పెంచాడు కోహ్లీ. 13వ ఓవర్ ఐదవ బంతికి శ్రాన్ కోహ్లీని బౌల్డ్ చేసి హైదరాబాద్ ను రేసులో నిలిపాడు. మరో మెరుపు వీరుడు డివీల్లియర్స్ క్రీజులో ఉన్నాడన్న బెంగళూరు ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కేవలం ఐదు పరుగులుచేసిన డివీల్లియర్స్ స్పిన్నర్ బిపుల్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి మిడాఫ్ లో హెన్రిక్స్ చేతికి చిక్కాడు. అప్పటికి కోహ్లీ సేన రేసులోనే ఉంది. కానీ 16, 17 వరుస ఓవర్లలో హిట్టర్లు రాహుల్(11), వాట్సన్ (11)  డగౌట్ కు చేరారు. చివరి నాలుగు ఓవర్లు భువనేశ్వర్, ముస్తిఫిజుర్ కట్టుదిట్టంగా వేశారు. సిక్సర్ తో భయపెట్టిన బిన్నీ 9 కూడా రనౌట్ గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా భువి కట్టుదిట్టమైన యార్కర్లతో  9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో సన్ రైజర్స్ మొదటి సారి ఛాంపియన్స్ గా అవతరించారు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించి, బౌలింగ్ లో కీలక వికెట్లు తీసిన బెన్ కట్టింగ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Don't Miss