Activities calendar

31 May 2016

22:00 - May 31, 2016

విజాయవాడ : రెండేళ్లు గడుస్తున్నా పరిపక్వతలేని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే జ్యోతులనెహ్రు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధానం జగన్ దని అన్నారు. రూపాయలతో కొలమానం చేసే పరిస్థితి జగన్ దని అన్నారు. ప్రజలను నమ్ముకుని ప్రజాసేవ కోసమే..మేం టీడీపీలో నడుస్తున్నామని.పార్టీ మారిన తమపై నిందారోపణలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబును విమర్శించే నైతికహక్కు జగన్ కు లేదన్నారు. విజయసాయిరెడ్డిని నిలబెట్టడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని.. తమకు ఇష్టం లేదని.. అందుకే నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలని కోరామన్నారు భూమానాగిరెడ్డి. 

21:54 - May 31, 2016

హైదరాబాద్  : తెలంగాణ ఆర్టీసీ వోల్వో ఏసీ బస్సుల కొనుగోలు వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీఎస్ ఆర్టీసీ 97 లక్షల రూపాయలకు కొంటున్న వోల్వో బస్సులకు.. తెలంగాణ ఆర్టీసీ కోటి రెండు లక్షల రూపాయలు కొనుగోలుచేస్తోంది. ఒక్కో బస్సుకు ఐదు లక్షల రూపాయలు అదనంగా చెల్లిస్తోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. 

21:50 - May 31, 2016

హైదరాబాద్ :  తెలంగాణ ఆర్టీసీ వోల్వో ఏసీ బస్సుల కొనుగోలు వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీఎస్ ఆర్టీసీ 97 లక్షల రూపాయలకు కొంటున్న వోల్వో బస్సులకు.. తెలంగాణ ఆర్టీసీ కోటి రెండు లక్షల రూపాయలు కొనుగోలుచేస్తోంది. ఒక్కో బస్సుకు ఐదు లక్షల రూపాయలు అదనంగా చెల్లిస్తోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

వివాదాస్పదాస్పదంగా వోల్వో కొనుగోలు..
తెలంగాణ ఆర్టీసీ వోల్వో బస్సుల కొనుగోలు వ్యవహరం వివాదాస్పదమవుతోంది. గురుడ పేరుతో నడుపుతున్న ఏసీ సర్వీసులను పెంచేందుకు వీలుగా సంస్థ యాజమాన్యం ఎనిమిది వోల్వో బస్సులను కొనుగోలు చేసింది. వీటికి ఏపీఎస్‌ఆర్టీసీ చెల్లించిన రేటు కంటే తెలంగాణ ఆస్టీసీ ఎక్కువ రేటు చెల్లించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రూ. 40 లక్షలు అదనపు చెల్లింపులు ...
తెలంగాణ సర్కార్‌ వోల్వో కంపెనీ నుంచి ఏసీ బస్సులు కొనుగోలు చేసింది. మొత్తం ఎనిమిది బస్సులకు 40 లక్షల రూపాయలు అదనంగా చెల్లించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏపీఎస్‌ఆర్టీసీ వోల్వో, స్కానియా కంపెనీల నుంచి 97 లక్షల రూపాయలకు వీటిని కొనుగోలు చేస్తే.... టీఎస్‌ఆర్టీసీ వోల్వో కంపెనీ బస్సులకు కోటి రెండు లక్షల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. ఒక్కో బస్సుకు 5 లక్షల వంతున మొత్తం 40 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. స్కానియా కంపెనీ 97 లక్షల రూపాయలకే ఒక్కో బస్సు ఇవ్వడానికి ముందుకు వచ్చినా.... టీఎస్‌ ఆర్టీసీ ఈ ప్రతిపాదలను పక్కన పెట్టి, వోల్వో బస్సులనే కొనుగోలు చేసింది. ఇప్పటికే ఎనిమిది బస్సులు కొనుగోలుచేసి లక్షలాది రూపాయల ప్రజాధాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం...కొత్తగా మరో ఎనిమిది బస్సులు కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. తర్వాత మరో 40 లక్షల రూపాయలను వోల్వో కంపెనీకి అప్పనంగా చెల్లించబోతున్నారు. ఈ వ్యవహారం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రభుత్వ వివరణ ఇవ్వాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు ...
సోమారపు సత్యనారాయణ నేతృత్వంలో ఆర్టీసీ కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే స్కానియా కంపెనీ నుంచి కొనుగోలు చేసిన రెండు బస్సులను పక్కన పెట్టడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వోల్వో కంపెనీ ప్రైవేటు యాజమాన్యాలకు 80 నుంచి 85 లక్షల రూపాయలకు బస్సులను విక్రయిస్తున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాలు చర్చలు జరిపితే 80 లక్షలకే అమ్మేఅవకాశం ఉందని అంటున్నారు. తర్వాత ఒక్కో బస్సుకు 25 లక్షలు పొదుపు చేయొచ్చని భావిస్తున్నారు. నష్టాల్లో ఉన్న టీఎస్‌ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చి, కార్మికులు, ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన యాజమాన్యం.... లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయ్యే చర్యలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎలా స్పందిస్తాయో చూడాలి. 

21:42 - May 31, 2016

ఢిల్లీ  :కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. యూపీఏ అధికారంలో ఉండగా అత్త సోనియాగాంధీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాద్రా అడ్డంగా దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా లండన్‌లో బినామీ పేర్లతో ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్తుల కొనుగోలుకు వాద్రాకు సహకరించిన సంజయ్‌ భండారీ?..
సంజయ్‌ భండారీ ఆయుధాల వ్యాపారి. రాజకీయ నాయకుల నల్లధనాన్ని విదేశాలకు తరలించడంతో దళారీ పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఆదాయపన్ను ఎగవేత కేసులున్నాయి. మనీ లాండరింగ్‌ చట్టం కింద నమోదైన కేసుల్లో ఎన్‌ఫోర్ట్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేస్తోంది. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో భారతీయ నేతలకు ముడుపులు అందాయని ఇటలీ కోర్టు తీర్పు తర్వాత...ఈ వ్యవహారం వెనుకు భండారీ పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. భండారీ వ్యాపార లావాదేవీలు వివాదాస్పదం కావడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాబర్ట్‌ వాద్రాకు, ఈయకు మధ్య జరిగిన ఈ మెయిల్స్‌ వ్యవహారం బయటపడింది. భండారీ సహాయకుడు సుమిత్‌ చద్దా లండన్‌లో ఇళ్లు కొనే విషయంలో వాద్రాకు సహకరించిన విషయం బయటపడింది. లండన్‌లోని బ్రియాన్‌స్టన్‌ స్కేర్‌లో 12వ నంబర్‌ ఎల్లర్టన్‌ హౌస్‌ను బినామీ పేరుతో వాద్రా కొనుగోలు చేశారన్న అంశం వెలుగులోకి వచ్చింది. 2009 అక్టోబర్‌లో 19 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ భవనాన్ని 2010 జూన్‌లో అమ్మేసినట్టు ఆదాయనపన్ను సోదాల్లో బయటపడింది. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

బీజీపీకి వరంగా మారిన వాద్రా వ్యవహారం..
లండన్‌లో రాబర్ట్‌ వాద్రా బినామీ ఆస్తుల వ్యవహారం బీజీపీకి వరంగా మారింది. కమలనాథులు ఈ అంశాన్ని అస్త్రంగా మలచుకుని.. కాంగ్రెస్‌ను తూర్పారబడుతున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ షాక్‌ నుంచి పార్టీ నేతలు ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు వాద్రా బినామీ ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయటపడింది. ఇది వచ్చే ఏడాది జరిగే ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. 

21:26 - May 31, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మల్కాజ్‌గరి పార్లమెంట్‌ స్థానం నుంచి గెలుపొందిన మల్లారెడ్డి తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేని కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.

 

గులాబీ గూటికి చేరనున్న మల్లారెడ్డి..

హైదరాబాద్  : తెలంగాణలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మల్కాజ్‌గరి పార్లమెంట్‌ స్థానం నుంచి గెలుపొందిన మల్లారెడ్డి తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేని కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.

 

నగరంలో పోలీసుల నిర్భంధ తనిఖీలు...

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 400 మంది పోలీసుల బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, రసూల్‌పురా, టివోలీ చౌరస్తా, స్వీకార్ ఉప్‌కార్ జంక్షన్, చిలకలగూడ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసింది. పోలీసులు హోటల్స్, లాడ్జీల్లో తనిఖీలు జరపటంతోపాటు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

20:58 - May 31, 2016

ఈ రోజు మల్లన్న మస్తు మస్తు ముచట్లు పట్టుకొచ్చిండు. మన తెలంగాణ సర్కారు కొల్వెక్కి రెండేండ్లైంది అనుకున్నంగదా..? మన మోడీ సారు గూడ రెండేండ్లైంది కొల్వులకెక్కి.. తెలంగాణ ముఖ్యమంత్రి సారు గుత్తకు వట్టినట్టే నర్సన్నపేట, ఎర్రవల్లిని మోడీ సారు గూడ ఒక ఊరును గుత్తకు వట్టిండు అటు వారణాసి దిక్కు.. మరి సారు ఎంత గొప్పగ తీర్చిదిద్దిండో వీడియో లో సూద్దాం పాండ్రి..

అటెంక గీ ముచట గూడా సూడుండ్రి..

ఒక్కొక్క ఊర్లె కోతులు ఎట్లున్నయ్..? పుసుక్కున అవ్విటికి ఓటు హక్కు గూడ ఇస్తే.. ఆ ఊర్లె అవ్వే సర్పంజులు అయితయ్.. అవ్వే ఎంపీటీసీలు గూడ అయితయ్.. అగో అన్నున్నయ్.. కోతులను ఊర్లళ్లకెళ్లి ఎల్లగొట్టెతందుకు జనం ఎంత మొత్తుకుంటరో మీరు చాల మాట్ల జూశిండ్రుగదా..? కోతులే గాదు మైము సైతం అని కదనరంగంలకు దిగినయట పందులు గూడ.. అవ్విటి కథేందో సూడుండ్రి..

గిసొంటివి మస్తు ముచ్చట్లు వీడియో లో ఉంటయ్ సూద్దాం పాండ్రి..

 

 

20:45 - May 31, 2016

సరదాగా మొదలవుతోంది.. ప్రాణాలు తీస్తోంది.. రెండువేళ్ల మధ్య ఇమిడిపోతోంది.. నిండు జీవితాన్ని బలితీసుకుంటోంది. గుప్పుగుప్పుమని పొగవదులుతుంది.. క్షణాల్లో నికోటిన్ నిషాను ఎక్కిస్తుంది.. కానీ, ఊహించనన్ని రోగాలకు కారణంగా మారుతూ, స్లోపాయిజన్ లా ప్రాణాలు తీస్తుంది. వాల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం. మరోపక్క పొగరాయుళ్లు పెట్టె మీద పెట్టె ఊదేస్తూనే ఉంటారు. స్మోగింగ్, ఇతర పొగాకు ఉత్పత్తులు ప్రజారోగ్యానికి చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న ఉన్న దృష్టి ప్రభుత్వాలకు సమాజం బాగోగులపై లేకపోవటంతో దేశమంతా పొగచూరిపోతోంది. ఆ నుసిలోనే బతుకులు తెల్లారిపోతున్నాయి. మూడంగుళాల పొడవుంటుంది.. ముప్ఫై ఏళ్ల ఆయుష్షును గుంజేస్తుంది. రోగాల పాల్జేస్తుంది. కుటుంబాలను అనాధలుగా మారుస్తుంది. అమూల్యమైన సమయాన్ని వృథాగా మారుస్తుంది. స్మోకింగ్ వల్ల నష్టాలు ఒకటా రెండా.. సరదా సరదా సిగరెట్ అని చెప్పుకునేది కాస్తా.. డేంజర్, డేంజర్ సిగరెట్ అని మారుతోంది. ఒకనాడు తప్పుగా భావించే అవాటు ఇప్పుడు ఫ్యాషన్ గా మారుతోందా? స్మోకింగ్.. దీన్ని ఒకప్పుడు తప్పుగా భావించే వారు. ఇప్పుడు ఆమోదించే వరకు వచ్చాం.. ఫ్యాషన్ లాగా కనిపించటం మొదలు పెట్టి చాలా రోజులయింది. కానీ, ఏ రూపంలో అయినా టొబాకో చేసే అనర్థం అంతే డేంజరస్ గా ఉంటోంది. అంతులేని ప్రమాదాలకు కారణంగా మారుతోంది.. నిబంధనలు, చట్టాలు కాగితాలకే పరిమితమౌతున్నాయి. ధూమపానం మాత్రం విజయవంతంగా వర్ధిల్లుతోంది. పొగాకు ఉత్పత్తులను మానేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ శరీరం లోని అన్ని భాగాలకు సాఫీగా జరుగుతుంది. 12 నెలల తర్వాత గుండె జబ్బులు వచ్చే అవకాశాలు సగం కంటే తక్కువ అవుతాయి. పది సంవత్సరాల తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తొలగిపోతాయి. 15సంవత్సరాల తర్వాత సాధారణ వ్యక్తుల మాదిరి మెదడు, గుండె జబ్బులకు దూరంగా ఉంటారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్.. ఈ మాట వినీవినీ బోర్ కొట్టింది. ఈ నగరానికేమయింది.. అంటూ వచ్చే ప్రకటనలు వినోదంగా మారిపోయాయి. తాము పొగతాగి రోగాలు తెచ్చుకోవటమే కాక, బహిరంగ ప్రదేశాల్లో గుప్పున వదులుతూ సాటివారి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. చట్టాలు కాగితాలపై అలంకారంగా కాకుండా సీరియస్ గా అమలు చేయాలి. అప్పుడే ప్రజారోగ్యానికి భద్రత ఉంటుంది.

వైసీపీకి మరో గట్టి 'షాక్'....

ప్రకాశం: అధికార పార్టీ తెలుగుదేశంలోకి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోంచి వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి బుధవారం తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. అదే విధంగా జూన్‌ 2న కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా తెదేపాలో చేరే అవకాశం ఉంది. ఈ మేరకు తెదేపా వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

20:03 - May 31, 2016

హైదరాబాద్ : సమైక్య రాష్ట్రం నుండి స్వయం పాలన దిశగా రెండు సంవత్సరాల పరిపాలన కాలం పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఎలావుంది? రెండేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో సాధించిన అభివృద్ధిపై రాష్ట్రంలో కీలక నాయకుడు మంత్రి హరీష్ రావుతో టెన్ టీవీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించింది. 14 ఏళ్ల తెలంగాణ టీఆర్ ఎస్ ఉద్యమం , 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటం , రెండు సంవత్సరాల స్వయం పరిపాలన ఈ అంశాలపై మంత్రి హరీష్ రావు ఎటువంటి విశేషాలు చెప్పారో తెలుసుకుందాం...రాష్ట్ర పరిపాలన..రాష్ట్ర పరిపాలన..మనుష్యులకు అన్నింటికంటే గొప్పది ఆత్మగౌరవం. ఈరోజున తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, సంతోషంగా బ్రతుకుతున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో వుండే దాదాపు 46వేల చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద ఐదు సంవత్సరాల్లో పునరుద్ధరించే కార్యక్రమంగా భాగంగా మొదటి రెండు సంత్సరాలు 18వేల చెరువులను ఇప్పటి వరకూ పునరుద్ధరించామని తెలిపారు. కోటి ఎకరాల మాగాణిగా మార్చే దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈ విషయంలో ఏపీ ఎస్కేప్ ధోరణిని ప్రదర్శిస్తోందన్నారు. ఏపీ మొండి వైఖరితోనే సామరస్య వాతావరణం లేకుండాపోయిందన్నారు.కాంగ్రెస్ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. మల్లన్న ప్రాజెక్టు నిర్మాణం విషయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేయవచ్చన్నారు. రాష్ట్రంలో వుండే రాజకీయ పార్టీలు ప్రాజెక్టు నిర్వాశితుల నష్టపరిహారం విషయంలో తలో రకంగా నష్టపరిహారం ఇవ్వమని ధర్నాలు చేస్తున్నాయన్నారు. మంత్రి హరీష్ రావు చెప్పిన మరిన్ని సంగతులు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్ర సమాచారం తెలుసుకోండి.

అత్యాచారం చేస్తామంటూ ఎంపీకీ బెదిరింపులు...

హైదరాబాద్ : అత్యాచారం చేస్తామంటూ ఒకే రాత్రి 600కు పైగా బెదిరింపులు వచ్చాయి. బాధితురాలు సాధారణ మహిళేమీ కాదు. బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీ జెస్సీ ఫిలిప్స్. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తనకు ట్విట్టర్ లో బెదిరింపులు వచ్చాయని, ట్విట్టర్ ఈజ్ డెడ్ అంటూ జెస్సీ ఫిలిప్స్ ట్వీట్ చేసింది. ఆన్ లైన్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జెస్సీ ఫిలిప్స్ ఉద్యమం ప్రారంభించడంతో నెటిజెన్ల నుంచి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.

భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం...

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌లో ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంజాగుట్ట వద్ద వాహన రాకపోకలు స్తంభించాయి.

ఆడ పురుగు కూడా రాకూడదు?!....

హైదరాబాద్ : మన దేశంలో కొన్ని దేవాలయాల్లోకి మహిళలను అనుమతించని విషయం తెలిసిందే. అయితే గ్రీస్‌లోని ఓ ప్రాంతంలోకి ఆడవారినే కాదు.. ఆడ జంతువులనూ రానివ్వరట. ఎప్పుడో పురాతన కాలం అంటే 1046వ సంవత్సరంలో విధించిన కట్టుబాట్లను అక్కడ ఇప్పటికీ పాటిస్తున్నారు. ఉత్తర గ్రీస్‌ ప్రాంతంలో ఉన్న ‘మౌంట్‌ ఎథోస్‌’ పర్వతంపై ఉన్న శిఖరంపైకి మహిళలకూ, స్త్రీ లింగ జంతువులకూ ప్రవేశం లేదు. ఆ ప్రాంతంలో సన్యాసులు నివాసం ఉండడమే దానికి కారణమట.

జిల్లా కోర్టు సంచలన తీర్పు...

నెల్లూరు: గ్యాంగ్‌రేప్‌ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సామూహిక అత్యాచారం కేసులో 13 మందికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానాను కోర్టు విధించింది. ఈ అత్యాచార కేసులో నిందితులతోపాటు సహకరించిన వారికి కూడా జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

పర్ణశాల వద్ద రోడ్డు ప్రమాదం...

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ద్విచక్ర వాహనం, టాటా మ్యాజిక్‌ ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంగంలో రైతుల ఆందోళన...

నెల్లూరు: ఆత్మకూరు-నెల్లూరు రహదారి నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో సంగం మండలం రాంపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిహారం చెల్లించకుండా రహదారి నిర్మాణం చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఓ రైతు హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభం ఎక్కి నిరసన తెలపడంతో వాతావరణం మరింత వేడెక్కింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రాంపు గ్రామంలో భారీగా మోహరించారు.

18:50 - May 31, 2016

తూ.గోదావరి : పార్కుల్లో విహారం కూడా వ్యాపారంగా మారింది. బోటు షికారు ప్రాణాలు తీస్తోంది. నిర్వాహకులు లక్షలు ఆర్జిస్తున్నా... షికారు చేసే వారికి కల్పిస్తున్న భద్రతా చర్యలు మాత్రం శూన్యం. నిబంధనలకు నీళ్లొదిలి... కాలం చెల్లిన బోట్లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా... అధికారగణం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోటు షికారు మాటున కాకినాడ కుళాయి చెరవులో సాగుతున్న అక్రమాల దందాపై 10 టీవీ ప్రత్యేక కథనం.

బోటింగ్‌ పేరిట అక్రమ దందా ...
కాకినాడ... పేరుకు స్మార్ట్‌ సిటీ.. నగరంలో కనీస వసతులు కూడా కరువే. సాయంత్రం వేళ సరదాగా గడపేందుకు నగరంలో ఉన్న ఒక్కగానొక్క పార్క్‌కు జనం పోటెత్తుతారు. కానీ పార్క్‌ నిర్వహణ అధ్వానంగా మారింది. ఇక్కడ బోటింగ్‌ పేరిట అక్రమ దందా సాగుతున్నా... పట్టించుకునే దిక్కూమొక్కూలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బోట్ల నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండ...
కుళాయి చెరువులో బోటింగ్‌కు అనుమతిలేదు. కానీ కొందరు రాజకీయ పెద్దల జోక్యంతో వారి అనుయాయులు అనధికారికంగా బోట్లు నడుపుతున్నారు. ఎక్కడో వినియోగించి, పక్కన పెట్టిన బోట్లను ఇక్కడకు తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో నగరపాలక సంస్థ అధికారులు కూడా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి సరస్సులో పడిపోతే ప్రాణాలు కాపాడుకునేందుకు అవసమైన లైఫ్‌ జాకెట్లను కూడా ఈ బోట్లలో అందుబాటులో ఉంచలేదు. గజ ఈతగాళ్లు మచ్చుకైనా కనిపించరు. కేవలం నలుగురు మాత్రమే షికారు చేసే సామర్ధ్యం ఉన్న ఈ బోట్లలో ఐదుగుర్ని ఎక్కిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు ఇవి సమతుల్యం కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఒక్కొక్కరి వంద నుంచి రెండొందలు..
బోటు షికారు చేసే వారిని నిర్వాహకులు నిలువు దోపీడీ చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. డిమాండ్‌ను బట్టి ఒక్కొక్కరి నుంచి వంద నుంచి రెండొందల రూపాయలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. చాలా కాలం నుంచి ఈ అనధికార బోటింగ్‌ బాగోతం సాగుతున్నా.. ఇటీవలే పర్మిషన్‌ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించని విషయాన్ని మాత్రం అంగీకరించడంలేదు.

బోటింగ్‌ మాటున చేతులు మారుతున్న సొమ్ము..
కుళాయి పార్క్‌లో సాగుతున్న అక్రమ బోటింగ్‌ మాటున పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ దందాకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. 

18:40 - May 31, 2016

విజయవాడ : అభివృద్ధిలో వెనకంజలో ఉన్న ఏపీ రాజధాని అమరావతి.. క్రైమ్‌ రేట్‌లో మాత్రం దూసుకుపోతోంది. ఇతర జిల్లాలను వెనక్కి నెట్టి గుంటూరు జిల్లా టాప్‌ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. నేరాలను నియంత్రించడంలో పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెజవాడ, గుంటూరులో రోజు రోజుకు నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్న దారుణాలు కన్నవారి గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

నేర చరిత్రలో అగ్రగామిగా నిలుస్తున్న ఏపీ రాజధాని...
నవ్యాంధ్రప్రదేశ్‌ నేర చరిత్రలో అగ్రగామిగా నిలుస్తోంది. నేరాల నియంత్రణకు పోలీసులు చర్యలు చేపడుతున్నా వాటిని అదుపుచేయటంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల కిడ్నాప్‌, మర్డర్స్‌, మిస్సింగ్‌ కేసులు కన్నవారిలో కలవరం రేపుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 3,594 మంది బాలబాలికలు అదృశ్యమైనట్లు పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతోంది. యువతుల అదృశ్యాలు మిస్టరీగా మిగులుతున్నాయి. కాసుల కోసం కిడ్నాప్‌ చేస్తున్న దుర్మార్గులు వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు.

కిడ్నాప్ గురవుతున్న వారిలో బాల బాలికలే ఎక్కువ...
బాలికలను బయటకు పంపించాలంటే రక్షణ లేకుండా పోతుందని తల్లితండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 2014లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 210 కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయి. ఇక 2015లో ఆ సంఖ్య 235కు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 54 కిడ్నాప్‌ కేసులు రికార్డయ్యాయి. వరుసగా మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే కిడ్నాప్‌ కేసుల్లో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది.

సంచలనం రేపిన నాగవైష్ణవి కేసు...
బెజవాడ నాగవైష్ణవి ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. రాబంధువులైన బంధువులు ఆర్థిక సంబంధాలతోనే పసిపాపను ఎత్తుకెళ్లి కాల్చి చంపారు. ఈ ఘటనతో బెజవాడలో భద్రతలోని డొల్లతనం బయటపడింది. విజయవాడలో నేరాలు చేస్తున్న దుర్మార్గులు.. 5 నిమిషాల్లోనే గుంటూరు జిల్లా సరిహద్దుల్లోకి వెళ్లిపోతున్నారు. నాగవైష్ణవి కిడ్నాప్‌ సమయంలోనూ నిమిషాల వ్యవధిలో దుండగులు కారుతో నగరం దాటేసి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించారు. పోలీసులు అప్పటికే అప్రమత్తమైనా వారిని పట్టుకోలేకపోయారు. ఇక ఇళ్లముందు సంచరిస్తున్న యాచకులు, సవరాలు, ఇతర సామగ్రి అమ్మేవాళ్లు పసివాళ్లపై కన్నేస్తున్నారు. వారికి మత్తు చాక్లెట్లు ఇచ్చి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి రాష్ట్రంలో రెచ్చిపోతున్న కిడ్నాప్‌ ముఠాల కోరలు పీకేయాలి. ఆధునిక సాంకేతికతతో వారి కదలికలను ముందే పసిగట్టి ఆట కట్టించాలి.

18:33 - May 31, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో టీడీపీ పరిపాలనా తీరుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. సంతలో పశువులనుకొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలకు రేటు కట్టి టీడీపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై అన్ని మండలాల పీఎస్ లలో ఫిర్యాదు చేయాలనినిర్ణయించామని తెలిపారు. రాజ్యసభకు రేటుకట్టి అభ్యర్థులను ప్రకటించారని టీడీపీ నేత పుష్పరాజ్ తెలిపారని..ఇంత కంటే దారుణం మరోటి ఉండదని అన్నారు బొత్స.  

18:26 - May 31, 2016

హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ ద్వారా వెటర్నరీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి తలసాని తెలిపారు. మంత్రి తలసాని విజయ డెయిరీ ఉత్పత్తుల గిఫ్ట్‌ ప్యాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహిచిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమకు పెద్దపీట వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ డెయిరీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ఔట్‌లెట్స్‌ పెట్టి అమ్మకాలు జరిపిస్తామని వెల్లడించారు.

మోడీ 'షెహన్‌షా' కాదు : సోనియా

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మాటలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ షెహన్‌షా కాదని సోనియా విమర్శించారు. మోదీ చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి అంతేకాని చక్రవర్తి కాదని ఆమె ఎద్దేవా చేశారు. తన అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు లండన్‌లో బినామీ ఆస్తులున్నాయని వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడ్డారు. ఆధారాలుంటే దర్యాప్తు చేయండి..

దోభి ఘాట్‌ వద్ద శిశువు లభ్యం...

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రి సమీపంలోని దోభి ఘాట్‌ వద్ద రెండురోజుల ఆడపసిపిల్లను ఎవరో వదిలివెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది పాప కేకలు విని పోలీసు అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పాపను ఎంజీఎం పిల్లల వార్డులో చికిత్స నిమిత్తం చేర్పించారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎంజీఎం పిల్లల విభాగ అధిపతి డా.బలరాం తెలిపారు. 

18:09 - May 31, 2016

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రి సమీపంలోని దోభి ఘాట్‌ వద్ద రెండురోజుల ఆడపసిపిల్లను ఎవరో వదిలివెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది పాప కేకలు విని పోలీసు అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పాపను ఎంజీఎం పిల్లల వార్డులో చికిత్స నిమిత్తం చేర్పించారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎంజీఎం పిల్లల విభాగ అధిపతి డా.బలరాం తెలిపారు.

18:04 - May 31, 2016

నల్లగొండ : దామర చర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, జేసీ సత్యనారాయణతో పాటు ఎంపీ. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌ రావులతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, గిరిజనుల కష్టాలను ఏకరువు పెట్టారు. ఎకరానికి 15 లక్షల పరిహారంతో పాటు, ఇంటికి ఒక ఉద్యోగం, మౌలిక సదుపాయాల కల్పన చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

17:59 - May 31, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మాటలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ షెహన్‌షా కాదని సోనియా విమర్శించారు. మోదీ చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి అంతేకాని చక్రవర్తి కాదని ఆమె ఎద్దేవా చేశారు. తన అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు లండన్‌లో బినామీ ఆస్తులున్నాయని వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడ్డారు. ఆధారాలుంటే దర్యాప్తు చేయండి.. అప్పుడే నిజానిజాలు బయటపడుతాయని సోనియాగాంధీ అన్నారు. ఇలాంటి ఆరోపణలు రోజుకొకటి చేస్తుంటారని విమర్శించారు. 

17:39 - May 31, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని ఏఎన్‌ఎమ్‌లను రెగ్యులరైజ్‌ చేయాలంటూ హైదరాబాద్‌ కుటుంబసంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏఎన్‌ఎంలకు కనీస వేతనం చెల్లించాలని, రెగ్యులరైజ్‌ చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకు వివిధ జిల్లాల నుంచి ఏఎన్‌ఎమ్‌లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము రెండు పీఆర్సీలు సాధించుకున్న తమకు పదవ పీఆర్సీ వర్తించదనటం అన్యాయమన్నారు. మాతా శిశు సంరక్షణ పథకంలో పనిచేస్తున్న తమకు మెటర్నటీ లీవ్ లు కూడా ఇవ్వటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000ల మంది వున్నామనీ తమ సమస్యలను మంత్రులందరి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా తమకు ఎటువంటి న్యాయం జరగలేదని వారు వాపోయారు. 

17:15 - May 31, 2016

ఢిల్లీ : ఢీల్లీలోని ఏపీ భవన్ క్యాంటీన్ లో భారీ చోరీ జరిగింది. పర్యాటకుల నుండి ఓ మహిళ రూ.60 వేలు కాజేసింది. సీసీ టీవీ పుటేజ్ ద్వారా మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దక్షిణాది వంటకాలకు పేరొందిన ఏపీ భవన్ క్యాంటీన్ కు తరచూ యాత్రీకులు భోజనం కోసం వస్తుంటారు. ఈ క్రమంలో భోజనం చేయటానికి వచ్చిన యాత్రీకుల వద్ద నుండి ఓ మహిళ నగదు చోరీ చేసింది. సీసీ పుటేజ్ ద్వారా విషయం తెలుసుకున్న క్యాంటీన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సదరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. చోరీ పాల్పడిన మహిళ కూడా యాత్రకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడీ ప్రయాణీకుల వద్ద చోరీలు చెదురు మదురుగా జరుగుతున్నట్లు సమాచారం. 

ఏపీ భవన్ క్యాంటీన్ లో భారీ చోరీ...

ఢిల్లీ : ఢీల్లీలోని ఏపీ భవన్ క్యాంటీన్ లో భారీ చోరీ జరిగింది. పర్యాటకుల నుండి ఓ మహిళ రూ.60 వేలు కాజేసింది. సీసీ టీవీ పుటేజ్ ద్వారా మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

16:59 - May 31, 2016

హైదరాబాద్: కేసీఆర్‌ పాలన మిషన్‌ కరప్షన్‌గా మారిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. అన్ని పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ కేంద్రంగా అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎందుకు టెండర్లు కట్టబెడుతున్నారని శ్రవణ్‌ ప్రశ్నించారు. 

కేసీఆర్‌ పాలన మిషన్‌ కరప్షన్‌ : శ్రవణ్

హైదరాబాద్: కేసీఆర్‌ పాలన మిషన్‌ కరప్షన్‌గా మారిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. అన్ని పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ కేంద్రంగా అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎందుకు టెండర్లు కట్టబెడుతున్నారని శ్రవణ్‌ ప్రశ్నించారు. 

16:56 - May 31, 2016

హైదరాబాద్ : దేశంలోనే అతి పెద్ద జెండా హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపుగా 300 అడుగుల ఎత్తులో నగరంలోని సంజీవయ్య పార్కులో ఈ నిర్మాణం చేపట్టారు. అత్యంత ఎత్తులో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ లో మరో గొప్ప నిర్మాణంగా నిలవనుంది. భారీ జాతీయ జెండా ఆచరణల భాగంగా కన్సెంట్ ఏజెన్సీతో జెండాను డిజైన్స్ ను రూపొందించామని అధికారులు పేర్కొన్నారు. ఈ జాతీయ జెండాను బాంబేలో తయారు చేయించామన్నారు.  ఒక కిలోమీటర్ దూరం వరకూ ఈ జాతీయ జెండా కనిపించి సందర్శకులను  కనివిందు చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన సుమారు రూ. 2.50కోట్లు ఖర్చు అవుతుందన్నారు. సుమారు కిలోమీటరు దూరానికి కనిపించి కనువిందు చేస్తుందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం వీడియో లో చూడండి.

ఏసీబీకి చిక్కిన పంచాయితీ సెక్రటరీ...

మెదక్ : పంచాయితీ సెక్రటరీ బాలరాజు ఏసీబీకి చిక్కారు. సిద్ధిపేట మండలం తడకపల్లి గ్రామ పంచాయితీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న బాలరాజు రూ.4వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. 

ఎక్కే గడప..దిగే గడపగా ముద్రగడ...

హైదరాబాద్ : శంషాబాద్‌ మండలం జల్‌పల్లిలోని ఫాంహౌస్‌లో హీరో మోహన్‌బాబును మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కలిశారు. ముద్రగడ వరుస భేటీలతో హైదరాబాద్‌‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా నిన్న, మొన్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశారు. ఇదివరకే పవన్‌‌తో మాజీ మంత్రి పల్లంరాజు ఫోన్‌‌లో ముద్రగడతో మాట్లాడించారు.

సిరియాపై రష్యా దళం దాడి....

హైదరాబాద్ : సిరియాలోని ఆల్ ఖైదా ఉగ్రవాదుల స్థావరంగా భావిస్తోన్న ఇద్లిబ్ పట్టణంపై రష్యా వైమానిక దళం విరుచుకు పడింది. ఈ దాడుల్లో 23 పౌరులు మృతిచెందారు. భారీసంఖ్యలో పౌరులు గాయపడ్డారు. 

అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి...

ఢిల్లీ మహారాష్ట్రలోని పల్గాన్‌ ఆయుధగారం పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందగా మరో 19 మందికి తీవ్రగాయలయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదంలో జవాన్లను కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నిర్మాత వికాస్ మోహన్ మృతి...

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, వాణిజ్య విశ్లేషకులు వికాస్ మోహన్ కన్ను మూశారు. సోమవారం ఆయనకు గుండెపోటుతో క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందారు. 1999లో మాధురి దీక్షిత్, అక్షయ్ కుమార్ నటించిన ఆర్జూ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 1988లో తీసిన లిబాస్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. పలు చిత్రాల్లో ఆయన అతిథి పాత్రల్లో నటించారు. వికాస్ మోహన్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రిషికపూర్, జెనీలియా, అనుపమ్‌ఖేర్, అభిషేక్ బచ్చన్ తదితరులు సంతాపం ప్రకటించారు.

పెషావర్ లో ఆత్మాహుతి దాడి...

పాకిస్థాన్ : పెషావర్ లో పోలీసులు ఓ ఆత్మాహుతి దళ సభ్యుడిని కాల్చి చంపారు. ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని మర్దాన్ జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి తనను పేల్చుకునే ప్రయత్నం చేస్తుండగా గమనించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాగా అప్పటికే ఆత్మాహుతి దళ సభ్యుడు తన తొడుగుకున్న జాకెట్‌లో అమర్చుకున్న పేలుడు పదార్థాలను పేల్చివేశాడు. దీంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరో ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో కూడా నిలిపి ఉంచిన బైకు నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

నదిలో పడిన లారీ ఇద్దరు గల్లంతు ...

గుజరాత్ : సూరత్లో ఓ లారీ తప్పి నదిలో పడిపోయింది. అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి నదిలో పడిపోయింది. లారీని మంగళవారం ఉదయం బయటకు తీశారు. అయితే డ్రైవర్‌, క్లీనర్‌ల ఆచూకి లభించలేదు. నదిలో గల్లంతయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రభుత్వాస్పత్రిలో ఏసీబీ అధికారులు సోదాలు...

విజయవాడ : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా జూ. అసిస్టెంట్ బేగ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

15:01 - May 31, 2016

మానవి : వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా డొబాకో వల్ల జరిగే నష్టమేంటి? దీని వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే విషంపై ఈనాటి వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో డా.రాజేందర్ రెడ్డి (కమీషనర్ ఆయుష్) శ్రీదేవి (సామాజిక కార్యకర్త) పాల్గొన్నారు. ధూమపానం వల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తుతాయని, బహిరంగ ప్రదేశాలలో పొగత్రాగటం పట్ల అవగాహ కల్పించాల్సిన అవసరముందని,పొగాకు వాడకంతో ఏటా 6 మిలియన్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారని వక్తలు పేర్కొన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి.

14:57 - May 31, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రాజ్యసభ స్థానానికి డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి భారీ ఎత్తున మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉండడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా డీఎస్ నామినేషన్ వేశారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ఆలోచనతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని డీఎస్ తెలిపారు. రాజ్యసభ సీటు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంచి విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని డీఎస్ కొనియాడారు.

14:53 - May 31, 2016

హైదరాబాద్ : ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ప్రభులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు భారీగా అసెంబ్లీకి తరలివచ్చారు. దీంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. అయితే.. నాలుగో సీటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఏపీ నుంచి నామినేషన్‌ వేయడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సురేష్‌ప్రభు తెలిపారు. తనకు రాజ్యసభ అభ్యర్ధిగా రెండోసారి అవకాశమిచ్చినందుకు చంద్రబాబుకు సుజనాచౌదరి అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సుజనాచౌదరి తెలిపారు. బీజేపీతో మిత్ర బంధం కొనసాగుతుందని.. ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటామన్నారు సుజనాచౌదరి. చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని టీజీ వెంకటేష్‌ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని టీజీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో పోరాడేవారికే అవకాశమిచ్చామని నారా లోకేష్‌ తెలిపారు. టీడీపీ, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని.. అందులో భాగంగా సురేష్‌ప్రభును రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సుజనాచౌదరి ఎంతో కష్టించి పని చేశారన్నారు. తొలిసారి కర్నూలు నుంచి రాజ్యసభకు టీజీ వెంకటేష్‌ను పంపించామన్నారు లోకేష్‌.

14:47 - May 31, 2016

హైదరాబాద్ : సనత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో డీడీలు ఎత్తుకెల్లి మోసం చేసిన కేసులో మాజీ మంత్రితోపాటు నలుగురికి జైలు శిక్ష ఖరారు చేసింది సిబిఐ కోర్టు. 2002 లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 93 డీడీలను ఎత్తుకెళ్లి.. ముంబాయిలోని కీర్తీ, ఉమేద్ జ్యూవెలర్స్ లో 83 కిలోల బంగారాన్ని కోనుగోలు చేశారు. చెల్లని డీడీలు నకీలీవని తెలడంతో బంగారం షాపులు సిబిఐని ఆశ్రయించాయి. కేసు దర్యాప్తు చేసిన సి.బి.ఐ అప్పటి బ్యాంకు మేనేజర్ చెన్నారెడ్డితో పాటు 8 మంది పాత్ర ఉందని చార్జీషీట్ దాఖలు చేశారు.. చెన్నారెడ్డి, కదిరి టీడీపీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే కందికుంట్ల వెంకటప్రసాద్, బ్యాంకు ఉద్యోగి ఉదయ్ కుమార్ లకు 7 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆటవిశాఖ మంత్రిగా పని చేసిన ఎం.డీ. షకీర్ కు 5 సంవత్సరాల జైలు తో పాటు 50 వేల ఫైన్ విధించారు. మరో ముగ్గురు నిందుతులు దినేష్ కుమార్, సునీల్ కుమార్, జగన్నాదంలు చనిపోయారు. ఏ7 నిందుతుడు భూపాల్ పాత్ర లేదని కోర్టు నిర్దోషిగా తెల్చింది. 

నకిలీ చెక్కుల నిందితులకు జైలుశిక్ష...

హైదరాబాద్ : నకిలీ చెక్కులతో మోసం చేసిన కేసులో నలుగురికి న్యాయస్థానం నేడు శిక్షను ఖరారు చేసింది. సనత్ నగర్ సంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2003లో రూ.8.30 కోట్ల నకిలీ చెక్కు ఇచ్చిన నిందుతులకు సీబీఐ కోర్టు శిక్షను విధించింది. ఈకేసులో ప్రధాన నిందితుడు కదిరి టీడీపీ ఇన్ చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ కు ఏడేళ్లు, మాజీ మంత్రి ఎండీ షాకీర్ మూడేళ్లు, నిందితులకు సహకరించిన బ్యాంక్ ఉద్యోగులు సునీల్ కుమార్, దినేష్, మాలిక్ లకే ఐదేళ్ల జైలుశిక్షను సీబీఐ కోర్టు విధించింది.

ఆటో బోల్తా..9 మందికి తీవ్రగాయాలు

కరీంనగర్‌ : జిల్లాలోని జగిత్యాల మండలం అనంతారం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని వరంగల్ జిల్లా ముల్కలగూడెంకు చెందిన హనుమాన్ భక్తులుగా పోలీసులు గుర్తించారు. కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రయత్నం కొనసాగుతుంది : సుజనా

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు. మంగళవారం టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించాలని కోరారు. మిత్రపక్షం బీజేపీతో కలిసి పనిచేస్తామని సుజనాచౌదరి తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా : డీఎస్

హైదరాబాద్ : ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ టీఆర్‌ఎస్ అభ్యర్థి డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు బ్రహ్మాండమైన విజన్ ఉందని కొనియాడారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణకు తాను సైతం కేసీఆర్ సారథ్యంలో పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎంకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ

నల్గొండ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై వీర్లపాలెంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం అయింది. కలెక్టర్, జెపి, ఆర్డివో,  పీసీబీ, జెన్ కో అధికారులు హాజరయ్యారు. 

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తుంది : కావూరి

హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం తప్పనిసరిగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తుందననే నమ్మకం తనకుందని  బీజేపీ నేత కావూరి సాంబశివరావు అన్నారు. అప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామన్నారో, ప్రస్తుతం అవే పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. కాకపోతే ఇతర రాష్ట్రల నుంచి ఒత్తిడి వస్తుందనే కారణంతోనే ప్రత్యేక హోదా ప్రకటన ఆలస్యమవుతుందని అన్నారు. 

రంగారెడ్డి జిల్లా గండిపేటలో కాల్పులు

రంగారెడ్డి : గండిపేటలోని ఓ ఫాంహౌస్‌లో కాల్పులు  కలకలం సృష్టించాయి. గండిపేట సర్పంచ్ ప్రశాంత్‌తో పాటు కొందరు పార్టీ చేసుకుంటుండగా వరంగల్‌కు చెందిన ప్రభాకర్‌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపి పారిపోతున్న ప్రభాకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. భూతగాదాలే కాల్పులకు కారణమని పోలీసులంటున్నారు. గాల్లోకి కాల్పులు జరపడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మూడు రౌండ్ల బుల్లెట్లు బయటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 

13:29 - May 31, 2016

రంగారెడ్డి : గండిపేటలోని ఓ ఫాంహౌస్‌లో కాల్పులు  కలకలం సృష్టించాయి. గండిపేట సర్పంచ్ ప్రశాంత్‌తో పాటు కొందరు పార్టీ చేసుకుంటుండగా వరంగల్‌కు చెందిన ప్రభాకర్‌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపి పారిపోతున్న ప్రభాకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. భూతగాదాలే కాల్పులకు కారణమని పోలీసులంటున్నారు. గాల్లోకి కాల్పులు జరపడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మూడు రౌండ్ల బుల్లెట్లు బయటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 
 

పుప్పాలగూడలో నలుగురు బాలికలు అదృశ్యం

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సమీనా (13), హుస్సేన్ బీ(16), షాహిన్ (10), హసీనా(19)లు నిన్న పనికి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో బాలికల తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

12:58 - May 31, 2016

హైదరాబాద్ : రాజ్యసభ సీటు వ్యవహారం టీడీపీలో చిచ్చురేపుతోంది. తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో జేఆర్‌ పుష్పరాజు మనస్తాపానికి గురయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీటు ఇచ్చారని పుష్పరాజు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలిగిన పుష్పరాజును బుజ్జగించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. 

 

 

12:55 - May 31, 2016

ఆదిలాబాద్ : అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన జింకలు, దుప్పులు, ఇతర వన్యప్రాణులు తాగడానికి నీళ్లు దొరక్క బిక్కుబిక్కుమంటున్నాయి. తమ దాహార్తిని తీర్చుకునేందుకు అడవిని వదిలి గ్రామాల వైపు పరుగులు తీస్తున్నాయి. దీంతో కుక్కులు, వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో అడవులలో అంతరించిపోతున్న మూగ జీవాలు, పశుపక్షాదులపై 10టీవీ ప్రత్యేక కథనం..
వన్యప్రాణుల మనుగడకు ముప్పు
ఆదిలాబాద్‌ అంటేనే అడవులు, వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన జిల్లా.. ఇలాంటి జిల్లాలో వన్యప్రాణులు తీవ్రమైన ఎండలకు తాగునీరు దొరక్క చనిపోతున్నాయి. వీటికోసం అడవిలో నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని అటవీ అధికారులు చెబుతున్నా అది అంతగా అమలు కావడంలేదు.  గడిచిన నెలరోజుల్లోనే 50కిపైగా వన్యప్రాణులు నీటికోసం అడవి బయటకువచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. అధికారులు తూతూమంత్రంగానే వసతులు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గతంలో వేల సంఖ్యలో ఉన్న వన్యప్రాణులు ఇప్పుడు వందల సంఖ్యకు వచ్చాయి. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మున్ముందు ఈ సంఖ్యకూడా కనుమరుగవుతందనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్వయంగా జిల్లాకు చెందిన మంత్రి జోగురామన్న ఈ శాఖకు నేతృత్వం వహిస్తున్న వణ్యప్రాణుల రక్షణకు చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. 
బఫర్‌, కోర్‌ ప్రాంతాలపై దృష్టి
అడవిలోనే నీరు, ఆహారం వన్యప్రాణుల రక్షణ కేంద్రాల పరిధిలోని బఫర్‌, కోర్‌ ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ముఖ్యంగా వన్యప్రాణులు బయటకు రాకుండా కోర్‌ ప్రాంతం మొత్తం కంచెతో కట్టడి చేయాలి. చిన్న ప్రాణులైన కోతులు, జింకలు ఇతర జంతువులకోసం అడవిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే పదార్ధాలను అందుబాటులో ఉంచాలి. అంటే, అటవీప్రాంతంలోని కొంత భాగంలో గడ్డి, ఇతర పశుగ్రాసాన్ని పెంచడం, కోతులకోసం పండ్ల మొక్కలను పెంచడంతోపాటు, ప్రతి అర కిలోమీటర్‌కు ఒకచోట నాలుగైదుచోట్ల నీటివసతి ఏర్పాటు చేయాలి. దీంతో చిన్న జంతువుల ప్రత్యుత్పత్తి సక్రమంగా జరిగి వాటి సంఖ్య పెరుగుతుంది. వీటి సంఖ్య పెరిగినప్పుడు పెద్ద జంతువులైన పులులు, సింహాలకు ఆహారం దొరుకుతుంది.  
నాలుగేళ్ల క్రితం ఐదు వేలకుపైగా కుందేళ్లు... 
అడవిలో సరిపడా ఆహారం దొరక్కపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో వన్యప్రాణుల సంఖ్య దినదినం తగ్గిపోతోంది. నాలుగేళ్ల క్రితం ఐదు వేలకుపైగా కుందేళ్లు, మూడువేలకుపైగా అడవిపందులు, వెయ్యికిపైగా కృష్ణ జింకలు, మేకలు, మనుబోతులు, దుప్పులు ఉండేవి. ప్రస్తుతం వీటిలో కొన్ని ప్రాణుల ఆచూకీ లేదు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అటవీ ప్రాంతాల్లో ఎండాకాలంలో చిన్నచిన్న పక్షులు, జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మట్టితో చేసిన చిన్న తొట్టిల్లో నీటిని నింపి చెట్లకు వేలాడదీయడం, కొన్నింటిని భూమిపైనే ఉంచడంలాంటివి చేయాలని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. 
వన్యప్రాణుల రక్షణలో తీవ్రంగా విఫలమైన అధికారులు
కోతులు ఇతర చిన్న జంతువుల ఆకలి తీర్చేందుకే అడవుల్లో పండ్ల చెట్లు, ఇతర ప్రత్యామ్నాయ ఆహారానికి పనికొచ్చే చెట్లను పెంచనున్నామని అటవీ అధికారులు చెబుతున్నారు. హరితహారంలో భాగంగా కోటికిపైగా పండ్లమొక్కలను దట్టమైన అటవీ ప్రాంతంలోనే పెంచేందుకు నిర్ణయించామన్నారు. నీటికి సంబంధించి ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వసతులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, మున్ముందు ఆ సమస్య లేకుండా చూస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు ఇప్పటికైనా వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు సరైన చర్యలు చేపట్టి వాటి మనుగడను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. 

 

12:48 - May 31, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రాజ్యసభ స్థానానికి డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి భారీ ఎత్తున మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉండడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. 

12:37 - May 31, 2016

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులుగా సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ప్రభులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు భారీగా అసెంబ్లీకి తరలివచ్చారు. దీంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. అయితే.. నాలుగో సీటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

ప.గో : భీమవరం శివరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు.  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడి డబ్బులు చెల్లించలేదని వర్మ అనే వ్యక్తిని క్రికెట్ బెట్టింగ్ ముఠా కిడ్నాప్ చేసింది. వర్మ తండ్రికి ఫోన్ చేసి రూ.12 లక్షలు డిమాండ్ చేశారు. రూ.4.25 లక్షలు ఇచ్చి వర్మనను తండ్రి విడిపించుకున్నాడు. డబ్బులు తీసుకుని పారిపోతూ వాహనాల తనిఖీల్లో భాగంగా క్రికెట్ బెట్టింగ్ ముఠా పోలీసులకు చిక్కింది. 

 

12:06 - May 31, 2016

గుంటూరు : కంచే చేను మేసింది. పాలక పక్షం నేతలే టేబుల్‌ కింది ఆదాయం కోసం పక్కదారులు తొక్కారు. అక్రమార్కులతో జతకట్టి.. సుమారు వెయ్యి  కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని 2 శాతం మొత్తానికే అమ్మేశారు. ఇటీవలి కాలంలో వెలుగు చూసిన భూమాయాజాలాల్లో.. ఇదే అతి పెద్ద కుంబకోణంగా భావిస్తున్నారు. ఇంతకీ ఇంత భారీ విలువ చేసే భూమి ఏ దేవుడిది..? అమ్మినదెవరు..? లబ్ధి పొందింది ఎవరు..? వాచ్‌ 10 టివి ఎక్స్ క్లూజివ్‌ స్టోరీ.. 
అమర రామలింగేశ్వరుడు...
పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధమైన అమరావతి వేలుపు.. అమర రామలింగేశ్వరుడు...ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వేల కోట్ల విలువ చేసే మాన్యం భూములు.. వెయ్యి కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని.. 22 కోట్ల రూపాయలకే అమ్మేసిన ప్రబుద్ధులు.. 
భారీ భూదందా
ఏపీలో భక్తుడన్న ప్రతివాడినీ... ముఖ్యంగా అమర రామలింగేశ్వరుడి భక్తులందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఉదంతమిది. స్వామి మాన్యం భూముల్ని పరిరక్షించాల్సిన అధికారులు, పాలకులే కుమ్మక్కై.. దేవుడికే శఠగోపం పెట్టారు. తమిళనాడులోని ఆలయ మాన్యపు భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్న వంకతో ఈ భారీ భూదందాకు తెరలేపారు. 
ఆలయానికి విరివిగా భూములు దానం 
అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశస్థులు.. అమరలింగేశ్వరుడి ఆలయానికి విరివిగా భూములు దానం చేశారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారిపాలెంలో 72 ఎకరాలు,  తమిళనాడులోని తాలంబూరులో 471.76 ఎకరాల భూమిని వారు దానంగా ఇచ్చారు.  తమిళనాట.. తాలంబూరులోని భూముల్లో కొంతమేర అన్యాక్రాంతమైంది. మిగిలిన భూమిలో కొంత భాగాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలిచ్చింది. పోయింది పోగా.. అక్కడిప్పుడు 83.11 ఎకరాల భూమి మాత్రమే అమరలింగేశ్వరుడికి మిగిలింది. 
తాలంబూరులో 83.11 ఎకరాల భూమి 
తాలంబూరులో మిగిలిన 83.11 ఎకరాల భూమినైనా పరిరక్షించాలని.. అలా కానప్పుడు ఆ పొలాన్ని అమ్మేసి ఆలయాభివృద్ధికి వెచ్చించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌.. 2014 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఎకరా సుమారు ఆరు నుంచి 13 కోట్ల మేర పలుకుతుండడంతో.. ఈ భూములను అమ్మితే.. ఖజానాకు కాసులు తెచ్చిపెడుతుందన్న ఆశతో.. సీఎం పేషీ భూముల అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిగో... ఇక్కడే అక్రమాలకు తెరలేచింది. 
అతి తక్కువ రేటుకే సొంతం చేసుకునేందుకు వ్యూహరచన 
అమరలింగేశ్వరుని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న 83.11 ఎకరాల భూమిని అతి తక్కువ రేటుకే సొంతం చేసుకునేందుకు పాలకపక్షం నేతల అండతో.. అధికారులు వ్యూహరచన చేశారు. భూముల విక్రయానికి నిర్వహించిన వేలంలో ఎవరూ పాల్గొనకుండా జాగ్రత్త వహించారు. అప్పటి వరకూ ఉన్న ఈ-టెండర్‌ విధానాన్ని కూడా  పక్కన పెట్టేశారు. ఆరు నుంచి 13 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా భూమిని.. కేవలం 27 లక్షల రూపాయలకే దక్కించుకున్నారు. 
ఆలయ భూముల విక్రయాల్లో గోల్‌ మాల్‌ 
అమరలింగేశ్వరుడి ఆలయ భూముల విక్రయాల్లో గోల్‌ మాల్‌ జరిగినట్లు బహిర్గతం కావడంతో.. దేవాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబ.. ఏప్రిల్‌ 18న కమిషనర్‌కు లేఖ రాశారు. అయినా ఆయన పట్టించుకోలేదు. పైగా అదేమంత పెద్ద అభ్యంతరం కాదన్న రీతిలో.. వేలందారులకు భూములు స్వాధీనం చేసేందుకు ఆదేశాలూ జారీ చేశారు. పై స్థాయిలో జరిగిన మతలబు కారణంగానే.. కమిషనర్‌ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారు. వేలాన్ని తక్షణమే రద్దు చేసి.. సదావర్తి సత్రం భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు 
ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందుకే దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అమరలింగేశ్వరుని సదావర్తి భూముల విక్రయ కుంబకోణంలో...  పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహరంతో తనకు సంబంధంలేదని... అమ్మకంలో కుంబకోణం జరిగి ఉంటే విచారణ జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతానని ఆయన చెబుతున్నారు. 
భూముల అమ్మకం గోల్‌మాల్‌పై ప్రకంపనలు 
సదావర్తి భూముల అమ్మకం గోల్‌మాల్‌పై ప్రకంపనలు సృష్టిస్తున్నా అటు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కానీ, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ స్పందించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తే వాస్తవాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

 

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన రాజ్యసభ నామినేషన్ల పర్వం

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో  రాజ్యసభ నామినేషన్ల పర్వం ముగిసింది. రాజ్యసభ సభ్యత్వానికి ఏపీ టీడీపీ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌ నామినేషన్ వేశారు. బిజెపి నుంచి సురేష్ ప్రభు నామినేషన్ వేశారు. రాజ్యసభ సభ్యత్వానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు డీఎస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉండడంతో ఈ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నేతలు మజ్లిస్‌ నేతలను కలిశారు. 

 

11:47 - May 31, 2016

ఢిల్లీ : భారతీయ డెవలపర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అన్నారు. వీళ్లందరికీ సరైన వేదిక కల్పించడంలో మైక్రోసాఫ్ట్ ముందుంటుందని తెలిపారు. 'టెక్‌ఫర్‌గుడ్‌', 'ఐడియాస్ ఫర్ ఇండియా' పేరుతో మైక్రోసాఫ్ట్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తన ఒక్కరోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసారు. కాగా మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత  సత్యనాదెళ్ల మనదేశానికి రావడం ఇది మూడోసారి.

 

టీడీపీ నేత జేఆర్ పుష్పరాజ్ మనస్థాపం

హైదరాబాద్ : టీడీపీ నేత జేఆర్ పుష్పరాజ్ మనస్థాపం చెందారు. రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో పుష్పరాజ్ అలిగారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీటు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో టీడీపీ నేతలు పుష్పరాజ్ ను బుజ్జగిస్తున్నారు. 

 

కాసేపట్లో టీఆర్ ఎస్ అభ్యర్థులు రాజ్యసభ స్థానాలకు నామినేషన్

హైదరాబాద్ : కాసేపట్లో టీఆర్ ఎస్ అభ్యర్థులు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేయనున్నారు. టీఆర్ ఎస్ తరపున పార్టీ అభ్యర్థులు డీఎస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నామినేషన్‌ వేయనున్నారు.

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు

హైదరాబాద్ : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

కాసేపట్లో నామినేషన్ వేయనున్న సుజనా, టీజీ

హైదరాబాద్ : టీడీపీ నేతలు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ లు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో వారు నామినేషన్ వేయనున్నారు. 

 

ఆ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి : చంద్రబాబు

హైదరాబాద్ : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. నాలుగో అభ్యర్థిని పోటీకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారు. అయితే పోటీ వద్దని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. నాలుగో అభ్యర్థిని పోటీకి పెట్టాల్సి వస్తే 
ఇండిపెండెంట్ గా బరిలోకి దించాలని ఆలోచిస్తున్నారు. 

10:32 - May 31, 2016

పెదబాబు జోకుడు సభ వొడిసిపోయింది... చినబాబును లైన్లకుదెచ్చుడే మిగిలింది, సువార్త సభలకు సిద్ధమవుతున్న ఎన్ డిఎ.. ఏం బొడిసిండ్రని తిడుతున్న యుపిఎ, నాలుగో సింహాల భరతంపడుతున్న డీజీపీ... ఇప్పడ్సంది పోలీసొళ్లు పెంచుకోవద్దు బీపీ, మైనర్ కొడుకు బండి నడిపితే అయ్యకు శిక్ష, ఆవిరైపోయిన రాయల్ ఛాలెంజ్... సన్ రైజింగ్ తోని కూసిన పుంజు, కొబ్బరిమట్టమీద కూసున్న సంపు.. సోషల్ నెట్ వర్కంతంట ఇదే కంపు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

10:14 - May 31, 2016

మహారాష్ట్ర : పుల్ గాంలోని సైనిక ఆయుధాల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, 18 మంది బీఎస్ ఎఫ్ జవాన్లు ఉన్నారు. ప్రమాద సమయంలో ఆయుధ కర్మాగారంలో 70 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో, సమీపంలోని  నాలుగు గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. అర్ధరాత్రి 2 గంటలకు మందుగుండు నిల్వలు ఉన్న డిపార్టుమెంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ను ప్రధాని ఆదేశించారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని మోడీ ట్వీట్‌ చేశారు. ఇక ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. 

09:52 - May 31, 2016

రాజీవ్‌ సాలూరి, యామిని భాస్కర్‌ జంటగా జి.రాజవంశీ దర్శకత్వంలో చందర్‌ రావ్‌ సమర్పణలో కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'టైటానిక్‌'. 'అంతర్వేది టు అమలాపురం' అనేది ట్యాగ్‌లైన్‌. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి సహ నిర్మాత అల్లూరి సురేష్‌బాబు మాట్లాడుతూ, 'ఇదొక పూర్తి స్థాయి హాస్యభరిత వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. అంతర్వేది నుంచి అమలాపురం వరకు గోదావరి నదిలో టైటానిక్‌ లాంచీలో జరిగే కథే ఈ చిత్రం. పెళ్ళి బృందం కామెడీతో సినిమా సరదాగా సాగుతుంది. 30ఇయర్స్‌ ఇండిస్టీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా నటిస్తుంటే రఘుబాబు విలన్‌గా నటిస్తున్నారు. జబర్దస్త్‌ టీమ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, జూనియర్‌ ఏఎన్నార్‌, జూనియర్‌ కృష్ణ, జూనియర్‌ పవన్‌ కళ్యాణ్‌లా చేసే కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. యాజమాన్య సంగీతం అందించిన పాటలు ఇటీవల విడుదలై శ్రోతల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. సెన్సార్‌ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్‌ పొందింది. సినిమాను చూసిన సెన్సార్‌ సభ్యులు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని అభినందించడం ఆనందంగా ఉంది. దర్శకుడు రాజవంశీ సినిమాను ఆద్యంతం ఆకట్టుకునేలా వినోదాత్మకంగా తెరకెక్కించారు' అని అన్నారు.

 

09:48 - May 31, 2016

'వైశాఖం' చిత్రంలోని పాటలను కొత్త లొకేషన్లలో షూట్‌ చేయాలని భావించి కజక్‌స్థాన్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించడం జరిగింది. ఆ లొకేషన్లలో షూట్‌ చేసిన తొలి భారతీయ చిత్రం మాదే కావడం ఆనందంగా ఉంద'ని అంటున్నారు నిర్మాత బి.ఏ.రాజు. హరీష్‌, అవంతిక హీరోహీరోయిన్లుగా బి.జయ దర్శకత్వంలో ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై 'సూపర్‌ హిట్‌' అధినేత బి.ఏ.రాజు నిర్మిస్తున్న చిత్రం 'వైశాఖం'. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో 60శాతం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ, 'ప్రేమ, ఫ్యామిలీ అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఒక అపార్ట్ మెంట్‌లో ఉన్న వాళ్ళంతా ఓ ఫ్యామిలీలా ఉంటే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రం. అనుబంధాల్లో ఉన్నతిని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. చిత్ర కథకి ఈ టైటిల్‌ యాప్ట్ అని పెట్టడం జరిగింది. అలాగే స్టోరీకి నూతన నటీనటులైతే బాగా సెట్‌ అవుతారు. సినిమా ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. మూడు పాటలను కజక్‌స్థాన్‌లో షూటింగ్‌ చేయడం జరిగింది. కొలంబస్‌ అమెరికాను కనుగొన్నట్లు, మేం కజక్‌స్థాన్‌ వంటి బ్యూటిఫుల్‌ దేశాన్ని కనిపెట్టి, అక్కడ మైనస్‌ డిగ్రీల చలిలో షూట్‌ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ పడ్డ కష్టానికి మంచి ఫలితం దక్కింది. పాటలు అద్భుతంగా వచ్చాయి. సినిమాను తక్కువ బడ్జెట్‌లో చాలా రిలాక్డ్స్‌గా చేయాలనుకున్నాం. కానీ నా రాజీ పడని తత్వం కారణంగా ఇది భారీ బడ్జెట్‌ చిత్రమైంది. వసంత్‌ అద్భుతమైన బాణీలను అందించారు. కెమెరామెన్‌ సుబ్బారావు రోబోటిక్‌తో సాంగ్స్‌ను షూట్‌ చేశారు. సినిమా చాలా బాగా వస్తోంది' అని అన్నారు. 
'లవ్లీ' చిత్రం తర్వాత ఆ స్థాయిలో చేస్తున్న చిత్రమిది. హై టెక్నికల్‌ వాల్యూస్‌తో చిత్రీకరిస్తున్నాం. రొమాన్స్‌, కామెడీ, లవ్‌, ఫ్యామిలీ అనుబంధాల మేళవింపుతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. కచ్చితంగా ఇదొక బ్లాక్‌ బస్టర్‌ చిత్రమవుతుంది' అని నిర్మాత బి.ఏ.రాజు తెలిపారు. కెమెరామెన్‌ సుబ్బారావు మాట్లాడుతూ, 'డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ డైరెక్టర్‌ జయతో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. రోబోటిక్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని షూట్‌ చేయడం జరుగుతోంది' అని చెప్పారు. 
సంగీత దర్శకుడు వసంత్‌ మాట్లాడుతూ, 'సాంగ్స్‌ అన్నీ చాలా బాగా వచ్చాయి. దర్శకురాలు కొత్తలొకేషన్లలో అద్భుతంగా చిత్రీకరించారు. సుబ్బారావు కెమెరా వర్క్‌ హైలైట్‌గా నిలుస్తుంది' అని అన్నారు. 'జయ మేడమ్‌తో చాలా రోజులుగా ట్రావెల్‌ అవుతున్నాను. ఆమె టాలెంటెడ్‌ దర్శకురాలు. ఏదైనా కొత్తగా చేయాలని తపిస్తారు. ఈ చిత్రం ద్వారా సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మంగా ఉంటుంది' అని ఆర్ట్‌ డైరెక్టర్‌ మురళి తెలిపారు.

 

09:45 - May 31, 2016

'వీరం', 'వేదాలం' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు శివతో కలిసి అజిత్‌ మరో చిత్రం చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో అజిత్‌ సరసన ఇద్దరు కథానాయికలు ఆడిపాడనున్నారు. అందులో ఒకరిగా అనుష్కను ఇప్పటికే ఎంపిక చేసుకోగా, మరో కథానాయికగా కాజల్‌ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం హిందీలో 'దో లఫ్జోంకి కహానీ' చిత్రంలో కాజల్‌ నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న కాజల్‌, తన తదుపరి చిత్రం అజిత్‌తో ఉంటుందని వెల్లడించింది. 'ప్రస్తుతం విక్రమ్‌తో 'గరుడ' చిత్రంలో నటిస్తున్నాను. త్వరలోనే అజిత్‌ సరసన నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాను. ఇది మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది' అని తెలిపింది. దీంతోపాటు కాజల్‌ ప్రస్తుతం తమిళంలో జీవా నటిస్తున్న 'కావలై వేండమ్‌', తెలుగులో తేజ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది.

 

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి

మహారాష్ట్ర : పుల్ గాంలోని సైనిక ఆయుధాలు తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.19 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, 17 మంతి బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారు. మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో 4 గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. అర్ధరాత్రి 2 గంటలకు మందుగుండు నిల్వలు ఉన్న డిపార్టుమెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

 

09:32 - May 31, 2016

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, సీపీఎం నేత జూకలంటి రంగారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిర పాల్గొని, మాట్లాడారు.  బెంగాల్ లో బిజెపిని అధికారానికి దూరంగా ఉంచడంలో వామపక్షాలు సఫలమయ్యాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్ : బైక్‌ అదుపు తప్పి పోలీసు స్టాపర్‌కు క్యాబిన్‌ను ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి తరలించే లోపే ఓ సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధి లో జరిగింది. దంపతులు ఇద్దరు నానక్‌ రాంగూడ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే బైక్‌పై బయలుదేరిన భార్యాభర్తలు జగదీశ్‌బాబు, సాయి బిందులు మాదాపూర్‌లోని రహేజ మైండ్‌స్పేస్‌ నుంచి గచ్చిబౌలిలోని బ యోడైవర్సిటీ పైలాన్‌వైపునకు వస్తుండగా వీరి బైక్‌ అదుపు తప్పి పోలీస్‌ స్టాపర్‌ క్యాబిన్‌ను బలంగా ఢీకొట్టింది.

హైదరాబాద్ లో బాలుడి అదృశ్యం...అనుమానాస్పదం

హైదరాబాద్ : ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుని అదృశ్యం అనుమానాస్పదంగా మారింది. ఈ నెల 17న తప్పిపోయిన బాలుని ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో అతని కుటుంబీకులు, కేసు దర్యాప్తు చేస్తున్న మలక్‌పేట పోలీసులు ఆం దోళన చెందుతున్నారు. బాలుడు తప్పిపోయా డా? లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చే పట్టారు. గడ్డిఅన్నారం నివాసి బి.తేజ(5) ఈనెల 17వ తేదీ మంగళవారం రాత్రి ఇంటి ముం దున్న ఇసుకలో ఆడుకోవడానికి వెళ్లి కనిపించకుండా పోవడంతో తండ్రి పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

09:11 - May 31, 2016

ఢిల్లీ : పసిడి, వెండి ధరలు రోజు రోజుకు పతనమవుతున్నాయి. దీంతో 24 క్యారెట్ 10గ్రాముల ధర 28,665కు చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్లు, దేశీయంగా డిమాండు లేకపోవడంతో.. ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర.. ఫిబ్రవరి కంటే కనిష్ఠానికి చేరింది. వెండి కిలో ధర 500 రూపాయలు తగ్గి.. 38వేల 500కు చేరింది. 

 

09:08 - May 31, 2016

ఢిల్లీ : వాహనాల రద్దీతో మసిబారుతున్న నగరాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ దృష్టి పెట్టింది. రెండు వేల సీసీ దాటిన డీజిల్‌ వాహనాలను రద్దుతో పొల్యూషన్‌ చెక్‌ పెట్టాలని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటికే ఢిల్లీలో రెండువేల సీసీలు దాటిని డిజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఇదే విధానాన్ని మరికొన్ని మెట్రో నగరాల్లో అమలు చేసేలా చూడాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆలోచిస్తోంది. 
పొగతో మసకబారిపోతున్న నగరాలు 
దుమ్ము, దూళి కణాలతో పాటు వాహనాల నుంచి వెలువడే పొగతో నగరాలు మసకబారి పోతున్నాయి. దాంతో పర్యావరణ కాలుష్యం తీవ్రమవుతోంది. పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన జాతీయ హరిత న్యాయస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో డీజిల్‌ వాహనాలపై నియంత్రణ అమల్లో ఉంది. 2000 సీసీలు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిలిపి వేసింది. ఇదే విధానాన్ని మరో పదకొండు మెట్రో నగరాల్లో అమలు చేసే విషయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆలోచిస్తోంది. 
ఐదు వేల ఉద్యోగాలపై వేటు..?
డీజిల్‌ వాహనాలపై నియంత్రణ వల్ల దాదాపు ఐదు వేల ఉద్యోగాలపై వేటు పడే ప్రమాదం ఉంది. దాంతో పాటు దాదాపు 11 వేల ఆటోమొబైల్‌ ఉత్పత్తులపై కూడా ఇది ప్రభావం చూపనుంది. అయితే ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో డీజిల్‌ వాహనాలపై నియంత్రణ విధించడంలో ఎలాంటి శాస్త్రీయత లేదని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
కేరళలో 2000 సీసీలు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు 
కేరళలో కూడా 2000 సీసీలు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. ప్రతి ఏటా రెండు వేల సీసీలు దాటిన దాదాపు 4 లక్షల డీజిల్‌ కార్లు క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు  నివేదిక వెల్లడించింది. డీజిల్‌ కార్ల నియంత్రణ వల్ల దాదాపు 47 వేల మంది నిరుద్యోగులయ్యే ప్రమాదం ఉందని ఆ నివేదిక వెల్లడించింది. అయితే నగరాల్లో పెరిగిపోతున్న పొల్యూషన్‌ శాతాన్ని తగ్గించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, పర్యావరణ కాలుష్య పరిరక్షణకు అందరూ తమ వంతు పాత్ర పోషించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. 

 

09:03 - May 31, 2016

చండీఘర్ : రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్ వర్గం మళ్లీ ఉద్యమానికి సిద్ధమైంది. జూన్‌ 5 నుంచి ఆందోళన చేపట్టాలని జాట్లు నిర్ణయించడంతో ఖట్టర్ ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను మోహరించింది. మూడు కంపెనీల బెటాలియన్లతో శాంతి భద్రతలు చేపడుతోంది. ఒక్కో కంపెనీలో 120 మంది జవాన్లు ఉంటారు. పరిస్థితి విషమిస్తే ర్యాపిడ్‌ యాక్షన్‌కు చెందిన నాలుగు కంపెనీలు అలర్ట్‌గా ఉంటాయి. వీరికి తోడు బిఎస్‌ఎఫ్‌ జవాన్లను కూడా నియమించారు. రెండు రోజుల క్రితం జాట్ల రిజర్వేషన్లపై పంజాబ్‌ హర్యానా కోర్టు స్టే ఇవ్వడంతో జాట్లు మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యారు.

 

09:01 - May 31, 2016

పాట్నా : బీహార్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జేడీయూ నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ కూతురు  మిసా భారతి, సిఎం నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ నామినేషన్లు దాఖలు వేశారు. లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి  సీటు ఇచ్చారు.  అవినీతి కేసుల్లో తన తరపున వాదించిన జెఠ్మలానీకి లాలూ మరొ స్థానం కేటాయించారు. రాంజెఠ్మలాని ఆదివారం ఆర్జేడీలో చేరారు.  బీజేపీ తరపున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. 

 

08:57 - May 31, 2016

విజయనగరం : మహాకవి గురజాడ స్వగృహాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్దేవరకు తాము పోరాటం సాగిస్తామని సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో యార్లగడ్డతోపాటు రచయిత గొల్లపూడి మారుతీరావు తదితర సాహితీవేత్తలు సమావేశం నిర్వహించారు. సాహిత్యపర అంశాల్లో ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరిస్తోందని యార్లగడ్డ విమర్శించారు.
గురజాడ స్వగృహంలో సాహివేత్తల సమావేశం 
మహాకవి గురజాడ అప్పారావు నివాసాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్దాలంటూ ప్రముఖ సాహితీవేత్తలు డిమాండ్ చేశారు. విజయనగరంలోని గురజాడ ఇంటిని సాహితీవేత్తలైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సినీ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు, చాగంటి తులసి తదితరులు సందర్శించారు. గురజాడ స్వగృహంలో సమావేశం నిర్వహించారు. గురజాడ వారసులకు ఇంటి స్థలం కల్పించాలన్న ప్రతిపాదనను పురపాలక సంఘం తిరస్కరించడాన్ని వారు తప్పుబట్టారు. 
ఇతర రాష్ట్రాల్లో సాహితీవేత్తలకు ఆదరణ..
సాహితీవేత్తల పోరాటంతో వేరొకచోట స్థలాన్ని కేటాయించారని మహాకవి వారసులను ఇబ్బందిపెట్టడం సమంజసం కాదని యార్లగడ్డ బృందం అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో సాహితీవేత్తలకు కళాకారులకు ఎంతో విలువ ఉందన్నారు. తమిళనాడులోని తిరువాయూర్‌లో సంగీత త్రిమూర్తుల ఇళ్లను పరిరక్షిస్తున్న విషయాన్ని వారు ప్రస్తావించారు. ఇంగ్లాండ్‌లో షేక్స్ పియర్‌ ఇంటినీ స్మారక కేంద్రంగా అక్కడి ప్రభుత్వం తీర్చిదిద్దిందని గొల్లపూడి మారుతీరావు గుర్తుచేశారు. అంతటా సాహితీవేత్తలు, కళాకారుల జ్ఙాపకాలను పదిలపరుస్తుంటే రాష్ట్రంలో మాత్రం అలాంటి ప్రయత్నాలు జరగడం లేదని విమర్శించారు. 
అమలుకు నోచుకోని హామీలు 
సీఎం చంద్రబాబు హామీలు ఇస్తున్నారేగానీ అవి అమలుకావడం లేదని యార్లగడ్డ విమర్శించారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిపాదన ఇందుకు ఉదాహరణగా చెప్పారు. గురజాడ వారసుడైన ప్రసాద్‌కు జీతం సరిగా ఇవ్వడం లేదని అడిగితే నిధులు లేవంటూ దాటేయడం సరికాదని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు.
గురజాడకు నివాళి
సాహితీవేత్తలంతా గురజాడ ఇంటినుంచి ఆయన విగ్రహం ఉన్న సెంటర్‌ వరకు పాదయాత్రగా వెళ్లి నివాళులర్పించారు. అనంతరం పురపాలక సంఘానికి అక్కడి నుంచి కలెక్టరేట్‌ గ్రీవెన్స్ లో కలెక్టర్‌ ఎంఎం నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  

సీఎం శౌర్య పథకానికి రాజేంద్రనగర్ ఎస్సై డి.వెంకటేశ్ ఎంపిక

రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించే డి.వెంకటేశ్ ముఖ్యమంత్రి శౌర్య పథకానికి ఎంపికయ్యారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో ఈ పథకాన్ని ఆయన అందుకోనున్నారు.

సిద్దేశ్వరంలో 144సెక్షన్..

కర్నూలు : జిల్లాలోని సిద్దేశ్వరంలో పోలీసులు 144సెక్షన్ విధించారు. సిద్దేశ్వరం దగ్గర కృష్ణానదిపై అలుగు నిర్మాణానికి రైతులు, ప్రజాసంఘాల నేతలు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు మాత్రం అలుగు నిర్మాణానికి అనుమతులు లేవంటున్నారు.

ముంబైలో పట్టాలు తప్పిన రైలు

ముంబై : ఖాళీ కోచ్‌లతో ప్రయాణిస్తున్న ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్, లోయర్ పరేల్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముంబై సబర్భన్ రైల్వేలో జనసమర్థం ఎక్కువగా గల రైల్వేస్టేషన్లలో లోయర్ పరేల్ రైల్వేస్టేషన్ ఒకటి. రైల్వే అధికారులు సహాయక చర్యలను చేపట్టారు.

 

08:34 - May 31, 2016

ఖమ్మం : కలలు కనండి...వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటలను ఆ విద్యార్థిని అక్షరాలా నిజం చేసింది. జీవితంలో ఒక్కసారైనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖగోళ పరిశోదన కేంద్రం నాసాకు వెళ్లాలి... అక్కడి ఇంజనీర్లతో మాట్లాడాలి... గ్రహాలపై అధ్యాయనం చేయాలని కలలుకంది. ఇష్టపడి చదివి కఠోర పరీక్షలను సైతం ఎదుర్కొని తన స్వప్నాన్ని సాకారం చేసుకున్న తెలుగు విద్యార్థి వేముల శ్రావ్యపై ప్రత్యేక కథనం.
శ్రావ్యకు నాసా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించే అవకాశం 
ఖమ్మం నగరానికి చెందిన వేముల శ్రావ్య ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాసా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించే అవకాశాన్ని దక్కించుకుంది. తన చిన్నప్పటి కలకు కష్టాన్ని జోడించింది. అనేక కఠోర పరిక్షలను ఎదుర్కొంది.  చివరకు దక్షిణభారత దేశంలోనే  నెంబర్ వన్ గా నిలిచింది. ఎనిమిది రోజుల పాటు నాసాలో శాస్త్రవేత్తలతో తన భావాలను పంచుకోబోతోంది. ఈక్రమంలో ఒబామాతో ముచ్చటించి ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని దక్కించుకుంది.
ఖగోళ పరిశోదనల మీద శ్రావ్యకు మక్కువ 
ఖమ్మం నగరంలోని బస్టాండ్ సెంటర్లో చిన్న ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్న వేముల శ్యామ్, కళ్యాణి దంపతులకు సాత్విక, శ్రావ్య అనే ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె శ్రావ్య నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.  శ్రావ్యకు చిన్నతనం నుంచే ఖగోళ పరిశోదనల మీద మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే ఎప్పుడు ఇంటర్ నెట్ లో ఖగోళం గురించిన అంశాలను తెలుసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఆరెంజ్ ప్లానెట్ ఎడ్యుకేషన్,నాసా కెనడి స్పేస్ సెంటర్ వారు సంయుక్తంగా నిర్వహించే నేషనల్ ఆస్ట్రానమి ఒలంపియాడ్ పరీక్ష రాసే అవకాశాన్ని దక్కించుకుంది.  ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఈ సంస్థ నిర్వహించే పరీక్షకు అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది విద్యార్థులు పాల్గొంటారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 5లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండు దశలలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పోటీలో ఒకటి, రెండు ర్యాంకులు సాధించిన వారిని అమెరికాలో ఉన్న ఖగోళ పరిశోధన సంస్థ నాసాకు పంపుతారు. రెండో ర్యాంకును శ్రావ్య దక్కించుకుని నాసాకు వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది.
శ్రావ్యకు శుభాకాంక్షలు 
నాసాలో వారం రోజుల పాటు శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలను పరిశీలించే అవకాశం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్లానెట్ నుంచి వచ్చే సంకేతాలను డీకోడ్ చేయడం దగ్గర నుంచి పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఙానంపై అక్కడి శాస్తవేత్తలతో చర్చించే అవకాశం కల్పిస్తారు. ఇలాంటి విజయాలను మరెన్నో సాధించాలని శ్రావ్యకు టెన్ టీవీ శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

08:20 - May 31, 2016

విజయవాడ : పేరుకేమో అభివృద్ధి మంత్రం... వెనకాలమాత్రం విదేశీ జపం.. ఫారిన్ కంపెనీలకు విలువైన స్థలం అప్పగించే ప్రయత్నంలో భాగంగా... చారిత్రక ప్రాధాన్యమున్న విజయవాడ స్వరాజ్య మైదానం చేతులు మారేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటున్న విపక్షాలు... పోరుకు సిద్ధమవుతున్నాయి. 
అభివృద్ధి పేరుతో ప్రైవేట్ జపం
ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రైవేట్ జపం చేస్తోంది.. విజయవాడలోని స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది.. మైదానంలో ఎవ్వరూ అడుగుపెట్టకుండా చేస్తోంది.. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు స్క్వేర్‌ సిటీ పేరుతో అందమైన ఊహా చిత్రాలతో మభ్యపెడుతోంది. 
స్వరాజ్య మైదానానికి చాలా ప్రాముఖ్యత
విజయవాడలోని స్వరాజ్య మైదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది.. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, పుచ్చలపల్లి సుందరయ్యలాంటి ఎందరో ప్రముఖులు ఇక్కడ ప్రసంగించారు..  సభల నిర్వహణతో పాటు.. క్రీడలు, ఉదయం, సాయంత్రం వాకర్లకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది.. ప్రతి ఏడాది ఇక్కడ ఏర్పాటయ్యే పుస్తక ప్రదర్శనకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉంది.. చేతి వృత్తుల వారి హస్తకళా ప్రదర్శనలు, సర్కస్, ఎగ్జిబిషన్‌ లాంటి కార్యక్రమాలు ఈ మైదానంలోనే ఏర్పాటవుతున్నాయి.. ఇక్కడే కారు, స్కూటర్ డ్రైవింగ్ నేర్పుతూ చాలామంది ఉపాధి పొందుతున్నారు.. ఇక చిరువ్యాపారులు తమ వస్తువుల్ని అమ్ముతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.. ఈ గ్రౌండ్‌లోని రైతుబజార్ కృష్ణలంక, రాణిగారితోట, ఏలూరు రోడ్, బందరు రోడ్ ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగంగా ఉంది. ఇప్పుడీ స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే... వీరంతా రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది.. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే ఇక్కడున్న రైతు బజార్‌ను అలంకార్ సెంటర్‌కు తరలిస్తామని అధికారులు ప్రకటించారు.
ప్రభుత్వ నిర్ణయంపై వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపాటు 
ప్రభుత్వ నిర్ణయంపై వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఈ మైదాన ప్రాంతం విలువ 15వందల కోట్లు ఉంటుందని ఓ అంచనా.. కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసేందుకే ఈ భూమిని కారు చౌకగా ఓ కంపెనీకి ఇవ్వాలని చూస్తోందని వామపక్షాలు మండిపడుతున్నాయి. ఇలా ఎన్నో చారిత్రక జ్ఞాపకాలతోపాటు... ప్రజలకు ఉపాధి, ఉల్లాసాన్ని ఇస్తున్న స్వరాజ్య మైదానాన్ని ఇలాగే ఉంచాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. లేకపోతే ఉద్యమం తప్పదని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.
 

08:13 - May 31, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెను విరమించారు. ఆయిల్ ట్యాంకర్ల రవాణా చార్జీలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి వారు సమ్మెబాట పట్టారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఆయిల్‌ కంపెనీలు... ఆయిల్ ట్యాంకర్స్ యజమానుల సంఘంతో చర్చలు జరిపాయి. కంపెనీలు ఇచ్చిన హామీతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
ఆయిల్ ట్యాంకర్ల రవాణా చార్జీలపై 14.5 శాతం వ్యాట్‌
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయిల్ ట్యాంకర్ల రవాణా చార్జీలపై తెలంగాణ ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్‌ విధిస్తోంది. ఈ పన్నులు కట్టడం తమ వల్లకాదంటూ లారీ ట్యాంకర్స్‌ యజమానులు ఆదివారం ఆర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు డిపోల పరిధిలోని మూడు వేల రెండు వందల డీజిల్, పెట్రోల్, ఎల్పీజి ట్యాంకర్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పరిస్థితి చేయిదాటక ముందే ప్రభుత్వ సూచన మేరకు రంగంలోకి దిగిన ఆయిల్ కంపెనీలు... ట్యాంకర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపాయి. సంఘం నేతల డిమాండ్లకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. ట్యాక్స్‌ను ఎత్తేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కంపెనీలు...అసోసియేషన్‌కు తెలిపాయి.
గత బకాయిలను వ్యాట్ లేకుండా చెల్లిస్తాం : ఆయిల్ కంపెనీలు
గతంలో ఉన్న బకాయిలను వ్యాట్ లేకుండా వెంటనే చెల్లిస్తామని ఆయిల్ కంపెనీలు హామీ ఇచ్చాయి. భవిష్యత్‌లో ప్రభుత్వం విధించే వ్యాట్‌ను కూడా తామే భరిస్తామని ఆయిల్ కంపెనీలు హామీ ఇచ్చాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు ట్యాంకర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 
ఐదు శాతం వ్యాట్‌ అమలు 
ఏపీలో విధించినట్టుగా ఐదు శాతం వ్యాట్‌ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ చీఫ్ సెక్రటరీతో సమావేశం అవుతామని నేతలు ప్రకటించారు. వ్యాట్ విధింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

 

07:47 - May 31, 2016

ఢిల్లీ : కృషి కళ్యాణ్‌ సెస్‌ అంటూ మీ సెల్‌ ఫోన్లకు ఏదైనా మెసేజ్‌ వచ్చిందా.? రోజుకు రకరకాల మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని చూసే తీరికెక్కడుందని అంటారా? చూసే తీరికున్నా లేకపోయినా జేబులకు చిల్లు పెట్టే మరో ప్రోగ్రాం నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఇదే ఆ మెసేజ్ సారాంశం. సెల్ ఫోన్‌కు బ్యాలెన్స్ వేయించుకున్నా హోటల్‌కు వెళ్లినా మరే ఇతర పని చేసినా ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కరూ సెస్‌ కట్టాలి.. మోడీ ప్రవేశపెట్టిన ఈ సెస్‌ షాక్ నేటి నుంచే షురూ అవుతోంది. 
అచ్చేదిన్ అంటూ ఊదరగొడుతున్నారు
అచ్చేదిన్ అంటూ ఊదరగొడుతున్నారు. రాబోయే రోజులన్నీ అద్భుతమంటూ రంగుల ప్రపంచం చూపిస్తున్నారు.  గత ప్రభుత్వానికన్నా మిన్నగా పరిపాలన అందిస్తున్నామంటున్నారు. అయితే వీటిల్లో ఎంతనిజముందోగానీ గత ప్రభుత్వానికన్నా గొప్పగా మోడీ సర్కార్‌ రకరకాల సెస్‌లు తెరపైకి తెస్తోంది. ఆయా సెస్‌ల పేరుతో ప్రతి ఒక్కరిదగ్గరినుంచీ వాళ్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అదనపు వసూళ్లకు పాల్పడున్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ఆల్రెడీ సెస్‌ వసూలు చేస్తున్న ప్రభుత్వం కృషి కళ్యాణ్‌ పేరుతో మరో పన్నుకు రంగం సిద్ధం చేసింది. నేటి నుంచే ఆ బాదుడు మొదలవుతుంది. మనం కట్టే రకరకాల పన్నులకు ఇది అదనం..
0.50 శాతం మేర సెస్‌ చెల్లింపు
జూన్ ఒకటి నుంచి కృషి కళ్యాణ్‌ సెస్‌ వసూలు చేస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న బడ్జెట్‌లో చెప్పింది. అన్నట్లుగానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఫోను బిల్లులు, ఇంటర్నెట్‌ వాడకం, ప్రయాణాలు, హోటల్ భోజనాలు ఇలా ప్రతి సందర్భంలోనూ సేవా పన్ను రూపంలో అదనంగా ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించాల్సుంటుంది. 0.50 శాతం మేర ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం సెస్‌ వసూలు చేస్తుంది. ఇక పది లక్షలు, అంతకుమించి విలువచేసే కార్ల కొనుగోలు చేసేట్లయితే మరో ఒక శాతం అదనపు సెస్‌ చెల్లించాల్సుంటుంది.
మరింత పెరగనున్న హోటల్‌ బిల్లులు, ప్రయాణ ఛార్జీలు
ప్రస్తుత సెస్‌తో హోటళ్లలో భోజనం, ప్రయాణ చార్జీల్లాంటివేగాక బీమా, ఆస్తుల కొనుగోలు తదితర అంశాల్లోనూ అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. గతేడాది 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ మోడీ పాలనలో 14 శాతానికి ఆ తర్వాత స్వచ్ఛ భారత్ సెస్‌తో 14.5 శాతానికి తాజా సెస్‌తో 15 శాతానికి చేరింది. మంచి రోజులు వస్తున్నాయి అంటే ఇలా అడ్డదిడ్డంగా తమ ఇష్టాయిష్టాలతో సంబంధంలేకుండా డబ్బు వసూలు చేయడమేనేమో.? అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.  

 

07:42 - May 31, 2016

గుంటూరు : ఉద్యోగులకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్థానం మేరకు జూన్ 27 నుంచి ఏపీ రాజధాని అమరావతి నుంచే ప్రభుత్వ పాలన ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. వెలగపూడిలో నిర్మాణం జరుగుతున్న తాత్కాలిక సచివాలయ పనులను నారాయణ పరిశీలించారు.. షాపుర్ జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలు నిర్మిస్తున్న బ్లాకుల్లో తిరిగి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 2,3 తేదీల్లో గదుల నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను మంత్రి ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో అద్దెలపై దృష్టి పెడుతున్నామని, అద్దెలు నియంత్రించకుంటే అద్దె నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు..

 

07:38 - May 31, 2016

ఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలవైపు ఎందుకు చూడటం లేదు? వరుస ప్రెస్‌మీట్లతో హడావుడి చేసే ఈ లీడర్‌ ఎందుకు సైలెంట్ అయ్యారు? సొంత రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటిస్తామన్నా ఎందుకు రాజస్థాన్ వెళ్లారు? 
కేంద్రమంత్రుల్లో వెంకయ్యనాయుడు చాలా స్పెషల్..
కేంద్రమంత్రుల్లో వెంకయ్య నాయుడు చాలా స్పెషల్.. తన వాగ్దాటితో ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయడంలో ఆయనకు ఆయనే సాటి.. కేంద్రమంత్రి అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉండేవారు.. శనివారం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌.. సాయంత్రానికి ఏ విజయవాడో... వైజాగ్‌లోనో వేరే కార్యక్రమం.. ఇలా రెండు రాష్ట్రాల్లో హడావుడిచేసే వెంకయ్య... ఈ మధ్య ఇటువైపు కన్నెత్తికూడా చూడటంలేదు..
రాజస్థాన్‌ నుంచి పెద్దలసభకు వెంకయ్య
తాజాగా రాజ్యసభకు రిటైర్‌ అయిన ఈ కేంద్రమంత్రి.. ఈసారి ఏపీనుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్న చర్చ జరిగింది.. వెంకయ్య వస్తానంటే మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమని టీడీపీకూడా ప్రకటించింది.. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈసారి రాజస్థాన్‌నుంచి పెద్దలసభకు నాయుడుగారు రెడీ అయ్యారు.... ఏపీనుంచి సీటు ఇస్తామన్నా వెంకయ్య వద్దని చెప్పినట్లు తెలుస్తోంది..
ప్రత్యేక హోదాపై వరుస ప్రశ్నలు
ఏపీనుంచి టికెట్‌కు వెంకయ్య నో చెప్పడంపై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం తేల్చడం మంత్రిగారికి తలనొప్పిగా మారింది.. విభజన సమయంలో ఐదేళ్లుకాదు... పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వెంకయ్య తన ప్రసంగాలతో హోరెత్తించారు.. అప్పటి యాక్షన్‌ ఇప్పుడు రియాక్షన్‌ తెచ్చిపెట్టింది.. ఎక్కడికివెళ్లినా ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పాల్సివస్తోంది.. ఈ విషయంపై నోరు జారితే కొత్త సమస్యలు రావడం ఖాయం.. అలాగని మౌనంగా ఉంటానంటే కుదరదు.. ఇలా హోదాపై ఏం చెప్పాలో తెలియకనే వెంకయ్య రాజస్థాన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం.. మరో కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్‌కూడా ఈ సమస్యవల్లే కర్ణాటకకు వెళ్లారని తెలుస్తోంది.. ఈ ఇద్దరూ ఒప్పుకోనందువల్లే సురేశ్‌ ప్రభును ఇక్కడినుంచి సభకు పంపుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది..
రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు  
విభజన టైంలో హోదా స్పీచ్‌ ఇలా వెంకయ్యను ఊపిరాడకుండా చేస్తోంది.. ఎక్కడికివెళ్లినా నీడలా వెంటాడుతోంది.. ఇందులోనుంచి ఎలా బయటపడాలో తెలియక ఈ లీడర్‌ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.. అందుకే రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. 

 

నేడు యదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ

నల్గొండ : నేడు దామరచర్ల మండలం వీర్లపాలెంలో యదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. 

ప్రకాశం జిల్లాలోని చింతలపాలెంలో విషాదం

ప్రకాశం : కనిగిరి మండలం చింతలపాలెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో విషం తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పిల్లలు, భార్య మృతి చెందారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. 

నేడు, రేపు సంజీవయ్యపార్కులో సందర్శకులకు, వాకర్స్ కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్ : నేడు, రేపు సంజీవయ్య పార్కులో సందర్శకులకు, వాకర్స్ కు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పార్కులో భారీ జాతీయజెండా నిర్మాణం పనులు ప్రభుత్వం చేస్తోంది.

07:18 - May 31, 2016

హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌, బీజేపీ నేత సురేష్‌ ప్రభు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. సుధీర్ఘ మంతనాల అనంతరం.. నాలుగో అభ్యర్థినీ బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే దీనిపై ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. మరోవైపు టీడీపీ ఎన్ని ఎత్తులు వేసినా ఒక రాజ్యసభ స్థానాన్ని గెలిచి తీరతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 
అభ్యర్థుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు 
రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాయలసీమ నుంచి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌కు, ఆంధ్రా నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అవకాశం ఇచ్చారు. బీజేపీ నేత, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభుకు కూడా ఏపీ కోటాలో అవకాశం కల్పించారు. తగినంత సంఖ్యాబలం లేకున్నా నాలుగో అభ్యర్థిని నిలిపే అంశంపై పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు సుధీర్ఘంగా చర్చించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే.. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 
నాలుగో అభ్యర్థికి మద్దతిచ్చేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం.? 
తెలుగుదేశం పార్టీ నాలుగో అభ్యర్థికి మద్దతిచ్చేందుకు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు రాకుండా నిర్బంధించారని, వారంతా విజయసాయి రెడ్డికి ఓటు వేయలేమని స్పష్టంగా చెబుతున్నారని.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారాయన.
టీడీపీ నేతల నిర్ణయాన్ని ఆక్షేపించిన వైసీపీ  
టీడీపీ నేతల నిర్ణయాన్ని వైసీపీ ఆక్షేపించింది. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించుకుంటామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సంఖ్యా బలం లేకుండా టీడీపీ నాలుగో అభ్యర్థిని ఎలా నిలుపుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యుని గెలుపునకు 36 మంది ఎమ్మెల్యేల బలం అవసరమని.. అయితే తమకు ప్రస్తుతం 48 మంది మద్దతు ఉందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నుంచి ఖరారైన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

 

నేడు టీడీపీ అభ్యర్థులు నామినేషన్

హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేయనున్నారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ నామినేషన్ వేయనున్నారు. 

 

 

నేడు టీఆర్ ఎస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్

హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు నామినేషన్ వేయనున్నారు. 

Don't Miss