Activities calendar

01 June 2016

21:36 - June 1, 2016

విజయవాడ : రాష్ట్రంలో పదివేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. అంతేకాదు.. ఉద్యోగుల బదిలీ ప్రక్రియనూ చేపట్టాలని తీర్మానించింది. కృష్ణా పుష్కరాలు, నవనిర్మాణ దీక్ష తదితర అంశాలనూ కేబినెట్‌ చర్చించింది.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త...
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈదఫా రాష్ట్ర ప్రభుత్వం పదివేలకు పైగా ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. బుధవారం విజయవాడలో.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఏపీలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీపై కేబీనేట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం పదివేల ఉద్యోగాల భర్తీకి గాను, త్వరలోనే గ్రూప్‌ వన్‌, గ్రూప్ టూ, గ్రూప్‌ త్రీ నోటిఫికేషన్లు జారీ చేయాలని తీర్మానించింది.

తిరుపతిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ ...
తిరుపతిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ ఏర్పాటు, విశాఖ జిల్లా కృష్ణపాలెంలో హిందుస్తాన్‌ కోకోకోలాకు 100 ఎకరాల భూమి కేటాయింపు, అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం లాంటి కీలక నిర్ణయాలనూ కేబినెట్‌ తీసుకుంది.

జూన్2న నిర్వహించనున్న నవనిర్మాణ దీక్ష...
జూన్2న నిర్వహించనున్న నవనిర్మాణ దీక్ష, కృష్ణా పుష్కరాల ఏర్పాట్లనూ ఏపీ కేబినెట్‌ చర్చించింది. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు, కొత్త పథకాల రూపకల్పనపై కేబినెట్ చర్చించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 9వ తరగతి బాలికలకు ఉచిత సైకిళ్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలో పల్స్‌ సర్వేకు ఆమోదం తెలిపారు.

10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ...
గురువారం నిర్వహించే నవనిర్మాణ దీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. జూన్‌ 27 నాటికి ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి అమరావతికి రావాల్సిందేనని, వారిని రప్పించే బాధ్యత సీఆర్డీయే తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 

21:29 - June 1, 2016

హైదరాబాద్ : కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ముసాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్‌ విభజన చట్టానికి లోబడి లేదని వివరిస్తూ సీఎం కేసీఆర్‌ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి లేఖ వ్రాశారు. కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేలకుండా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవద్దని కోరారు. రాష్ట్రవాటా కోసం ఇప్పటికే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించామని వివరించారు. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్నారు. 

దుర్గాపురం వద్ద రోడ్డుప్రమాదం...

నల్గొండ: కోదాడ మండలం దుర్గాపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈదురు గాలుల బీభత్సం...

కరీంనగర్‌: సారంగపూర్‌ మండలం పెంబట్లలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడిపోయాయి. గ్రామంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు జలమయమైయ్యాయి.

20:47 - June 1, 2016

పెట్రోల్ , డీజిల్, గ్యాస్ అన్నీ మండిపోతున్నాయి. ఓ పక్క అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటంలేదు. కానీ, మన దగ్గర మాత్రం డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతూనే ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ పరిణామాలకు కారణం ఏమిటి? సర్కారు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఏ సంకేతాలిస్తున్నాయి? ఇదే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ పోతే సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ కథనం చూద్దాం.. ఉత్పత్తి ఖర్చు తగ్గితే ఓ వస్తువు ధర తగ్గాలి. ఇది సాధారణ వ్యాపార సూత్రం. కానీ, పెట్రోల్, డీజిల్ లకు ఇది ఎందుకు వర్తించటం లేదు. అంతర్జాతీయంగా చాలా నెలలకుగా తక్కువ ధరలే నడుస్తున్నాయి. కానీ, మన దగ్గర మాత్రం బాదుడు పెరుగుతోంది. తగ్గిన ధరలతో సామాన్యుడికి అందాల్సిన వెసులుబాటుని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు మింగేస్తున్నాయా? పన్నుల బాదుడే పరమార్ధంగా భావిస్తున్నాయా? పెట్రోల్ పన్నులతోనే సర్కారు నడుస్తోందా? పెట్రోల్ పై వచ్చే ఆదాయమే సర్కారును బతికిస్తోందా? పన్నుల మీద పన్నులు విధిస్తూ, పెట్రోల్ రేటును అమాంతం ఆకాశంలో నిలిపిన కేంద్ర రాష్ట్రాలు ప్రజలపై భారాన్ని పోటీపడి వేస్తున్నాయి.. కారణాలేవైతేనేం... అంతర్జాతీయ మార్కెట్ లో చమురుధరలు చాలా కాలంగా తగ్గువగా ఉన్నాయి. మరి ఇన్నాళ్లూ అధిక ధరలమోతను భరించిన ప్రజలకు ఆ తగ్గుదల ఎందుకు అందివ్వరు.. సామాన్యుడి నుండి వస్తున్న ప్రశ్న ఇది. కార్పొరేట్ శక్తులను ముద్దు చేస్తారు.. సామాన్యుల ముక్కుపిండి వసూలు చేస్తారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ లపై వచ్చే పన్నులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫలితంగా ఎలాంటి అవకాశం దొరికినా వదలటం లేదు.. తగ్గించాల్సిన సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటూ కస్టమర్ ని నిలువుదోపిడీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థతి మరీ దారుణంగా ఉంది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.67రూపాయలు. ఇప్పుడు రూ.70కు చేరింది. 40కే దొరకాల్సిన దానికి 70 ఎందుకు చెల్లించాలి? సర్కారీ దోపిడీకి అడ్డూ అదుపు ఉండదా? రేపు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగితే మళ్లీ ఇదే తంతు కదా.. అవకాశం దొరికినప్పుడలా... వాయిస్తున్న సర్కారీ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రజలున్నది ప్రభుత్వాల అంతులేని పన్నుల బాదుడుని భరించటానికి కాదు.. సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలిచ్చే సబ్సిడీలను, వెసులుబాట్లను అనుభవించాల్సిన హక్కుదారులు కూడా. కార్పొరేట్లను దగ్గరకు తీసి సకల సౌకర్యాలు కల్పించే ప్రభుత్వం, సామాన్యులను మాత్రం గాలికొదిలేయటంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

టీ.ఎస్ వేడుకలు..వ్యక్తి మృతి...

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తనవంతు సహాయం చేద్దామనుకున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం జెండా కర్ర పాతుతుండగా విద్యుత్‌ వైర్లు తగిలి టీఆర్‌ఎస్‌ కార్యకర్త మృతి చెందారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తరపున న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు.

20:09 - June 1, 2016

కేసీఆర్ రెండేళ్ల పాలన లో ఇచ్చిన హామీలను ఎంతవకూ నెరవేర్చారు? ఎటువంటి విజయాలను సాధించింది? వచ్చే మూడేళ్లలో ఎటువంటి దిశా నిర్ధేశాన్ని చేపడుతుంది. ఉమ్మడి రాష్ట్ర పాలనకూ, స్వరాష్ట్ర పాలనకు తేడా ఏంటి..మన తెలంగాన మన పాలన అంటూ కేసీఆర్ ప్రాంరంభించిన బంగారు తెలంగాణ పాలనలో వచ్చిన మార్పులేంటి..వచ్చే మూడేళ్ళలో అనే అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ అధికార ప్రతినిధి), బెల్లయ్య నాయక్ (టీ.కాంగ్రెస్ నేత), మల్లారెడ్డి (సీపీఎం నేత),కృష్ణ సాగర్(బీజేపీ నేత) పాల్గొన్నారు? కేసీఆర్ రెండేళ్ళ పాలనపై చేపట్టిన ఈ స్పెషల్ డిబేట్ లో వక్తలు పేర్కొన్న అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఆటో - బొలేరో ఢీ..ఇద్దరు మృతి...

ఆదిలాబాద్: జిల్లాలోని రెబ్బన వద్ద ఆటోను బొలేరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'తలాక్‌'ను వ్యతిరేకిస్తూ 50వేల సంతకాలు..

ఢిల్లీ: ముస్లిం మతంలో మూడు సార్లు తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చే పద్ధతిని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పద్ధతిని నిషేధించాలని దాఖలు చేయనున్న పిటిషన్‌పై సుమారు 50వేల మంది ముస్లిం మహిళలు, పురుషులు సంతకాలు చేశారు. భారతీయ ముస్లిం మహిళ ఆందోళన(బీఎంఎంఏ) అనే సంఘం తలాక్‌ పద్ధతిని నిషేధించాలని పోరాడుతోంది. దేశవ్యాప్తంగా పిటిషన్‌కు మద్దతివ్వాలని కోరుతోంది. మూడు సార్లు తలాక్‌ పద్ధతిని నిషేధించడానికి జాతీయ మహిళా కమిషన్‌ సహాయం చేయాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బీఎంఎంఏ కోరింది. కాగా దీనికి కొందరు పురుషులు కూడా మద్దతిస్తున్నట్లు చెప్పారు.

అసభ్య ప్రవర్తన..దేహశుద్ధి..

హైదరాబాద్‌: శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌ దగ్గర మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఐబీఎం ఉద్యోగికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

పిడుగు పడి 10మందికి గాయాలు...

కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు మండల కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. చెరువు కట్టపై పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

'అనిశా' కు చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి..

వరంగల్: వరంగల్ టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కాడు. కాజీపేట సర్కిల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రమణయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్డింగ్ క్రమబద్ధీకరణ కోసం రూ. 20 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న తమను సంప్రదించాలని సూచించారు.

18:57 - June 1, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ వచ్చేసినట్టేనా.. ఆ తీపి కబురు అందుకోవడానికి ఎంతో సమయం పట్టదా.. రైల్వే మంత్రి సురేష్ ప్రభు.. ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక కావడం శుభసూచకమేనా....

విభజన సమయంలో ఎన్నో హామీలు...
ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్.. ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ... రైల్వే జోనే కాకుండా ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు ఇలా ఎన్నో హామీలు విభజన సమయంలో కేంద్రం ప్రకటించింది.. ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ కూడా వీటిని నెరవేరుస్తామంటూనే టీడీపీతో జతకట్టి మరీ ప్రజలకు హామీ ఇచ్చింది.. వీటిని నెరవేర్చే విషయంలో మోడీ సర్కార్ కుప్పిగెంతులు చూస్తున్నాం.. ప్రత్యేక హోదా రాదని తేల్చిచెప్పేశారు. మిగతా హామీలపై కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు.. కానీ తాజాగా సురేష్ ప్రభు మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక కావడంతో రైల్వే జోన్ హామీ నేరవేరుతుందా అన్న ఆశ ప్రజల్లో కనిపిస్తోంది..

ప్రభు ఏపీ కల నెరవేరుస్తారా?...
గతంలో జైరాం రమేష్ ఏపీనుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.. అలాగే జాతీయ సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా చాలా మంది రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేవారు.. కానీ వీరెవ్వరూ రాష్ట్ర ప్రయోజనాలపై అంతగా పోరాడిన సందర్బాలూ లేవు... కొందరు మనం పెట్టిన రాజ్యసభ సీటు భిక్షతో కేంద్ర క్యాబినెట్ లో చోటు సంపాందించినా.. రాష్ట్ర సమస్యలను తీర్చే దిశగా గట్టిగా ప్రయత్నించిన సందర్బాలు లేవు... తాజాగా ఏపీనుంచి ఎన్నికైన సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నారు కాబట్టి కీలక డిమాండైన రైల్వే జోన్ కల నేరవేరుతుందని టీడీపీ ఎంపీలంటున్నారు.. కానీ ప్రభు దయ చూపుతారా..

ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ వచ్చేసినట్టేనా?..
ఇప్పటికే ఈ డిమాండ్ రైల్వే బోర్డు నియమించిన కమిటీ పరిశీలనలో ఉందని సురేష్ ప్రభు పలు సందర్బాల్లో చెప్పారు.. మరో వైపు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే కు విశాఖ డివిజన్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.. కొత్త వలస - కిరండోల్ లైన్ ద్వారా ఇనుపరజను రవాణాతో ఏటా 4 వేల కోట్లు ఈ డివిజన్ ద్వారానే వస్తున్నాయి... దీంతో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ కు ఒడిస్సా నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.. .. అయితే ఏపీలో ఉన్న మిగతా రైల్వే డివిజన్లయిన గుంతకల్, విజయవాడ, గుంటూరులతో కలిపి కొత్త జోన్ ఏర్పాటవుతోందనే ప్రచారం బలంగా ఉంది.. అయితే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ తర్వాత అత్యంత ఆదాయవనరుగా ఉన్న విజయవాడ, గుంతకల్ డివిజన్లను వదులుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సుముఖంగా లేదని చర్చ కూడా ఉంది.. కారణాలు ఏమైనా హామీ ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.. అందుకే సురేష్ ప్రభు ఎంపికపై విమర్శలోచ్చినా.. రైల్వో జోన్ సాధన దిశగా ఇది మంచి అడుగని అనే వాళ్లు ఉన్నారు.. మొత్తానికి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు నిర్ణయం .. రైల్వే జోన్ ఏర్పాటు లైన్ క్లియర్ చేసేలా ఉంటుందని ఆశిద్దాం... 

10వేల ఉద్యోగాల భర్తీకి ఏపీ కేబినేట్‌ ఆమోదం...

విజయవాడ : ఏపీ కేబినేట్‌ సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన వివరాలను మంత్రి పల్లె మీడియాకు వివరించారు. కేబినేట్‌ భేటీలో ప్రధానంగా ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించారు. సుమారు 10వేల ఉద్యోగాల భర్తీకి కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 8న ఒంగోలులో మహా సంకల్ప దీక్షకు కేబినెట్ ఆమోదం తేలిపింది. అంతేకాదు త్వరలో గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ టూ, గ్రూప్‌ త్రీ నోటిఫికేషన్లను జారీచేయనున్నట్లు మంత్రి తెలిపారు.

చైనాలో బాహుబలి టీమ్ సందడి...

హైదరాబాద్ : తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి చేర్చిన చిత్రం బాహుబలి. ఈ దేశం.. ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ బాహుబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రాజన్న చెక్కిన బాహుబలి త్వరలోనే చైనాలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రాజమౌళి, నిర్మాత శోభ యార్లగడ్డ, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి చైనాలోని తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గడప గడపకు సీపీఐ....

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నిధుల సమీకరణ చేపట్టింది. గడప గడపకు సీపీఐ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కార్పొరేట్ల నుంచి కాకుండా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్‌లో చేపట్టే పోరాటాల కోసం నిధుల సమీకరణ చేపట్టారు. 

పెట్రోల్‌ ..డీజిల్‌ పెంపుపై సిపిఎం పొలిట్‌బ్యూరో మండిపాటు..

ఢిల్లీ  :  కేంద్రం మరోసారి పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంచడంపై సిపిఎం పొలిట్‌బ్యూరో మండిపడింది. మోది సర్కార్‌ అధికారంలోకి వచ్చాక డీజిల్‌ ధరలు 19 సార్లు, పెట్రోల్‌ ధరలు 16 సార్లు పెంచినట్లు సిపిఎం తెలిపింది. బిజెపి అధికారంలోకి వచ్చాక సామాన్యులపై మరింత భారం పడిందని పేర్కొంది. ఓవైపు ప్రజలు భారం మోయలేక సతమతమవుతుంటే...రెండేళ్ల పాలనపై బిజెపి సంబరాలు జరుపుకోవడాన్ని సిపిఎం ఎద్దేవా చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ పెంచుతూ ఆదాయం పెంచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించింది.

సైకిలెక్కనున్న కందుకూరు ఎమ్మెల్యే...

విజయవాడ :  వైసీపీకి షాక్ ల మీద షాక్ తగులుతున్నాయి. అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుండి వలసల పరంపర కొనసాగుతోంది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు రేపు సైకిలెక్కనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో చేరారు. ఈ వలసలతో వైసీపీకి పెద్దల సీటు దక్కేట్లు లేదని సమాచారం. కాగా వలసల నివారణకు జగన్ తమ ఎమ్మెల్యేలందరినీ విదేశీ టూర్లు  పంపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి పెద్దల సీటు దక్కేనా?. విజయసాయిరెడ్డికి విజయం దక్కేనా? వేచి వేచిచూడాల్సిందే.

రియో ఒలింపిక్స్ లో ప్రొఫెషనల్ బాక్సర్ల సందడి...

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ లో ఇక ప్రొఫెషనల్ బాక్సర్లకు పోటీ చేసే అవకాశం వచ్చింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య నిబంధనలు సవరణతో ఇది సాధ్యమైనట్లుగా సమాచారం. ప్రో-బాక్సర్లకు అనుకూలంగా 84 దేశాలు దీనికి తమ సమ్మతిని తెలియజేసింది. దీంతో విజేందర్ కుమార్ కూ రియో ఒలింపిక్స్ కు వెళ్లే అవకాశముంది. జులై నెలలో ఇలింపిక్స్ అర్హత పోటీలు జరుగనున్నాయి. ప్రో బాక్సర్లకు అనుమతి రావటంతో అమెచ్యూర్ బాక్సర్లు నిరాశపడుతున్నారు.బాక్సర్ల చరిత్రలో ఇదొక విప్లవాత్మకమైన అంశంగా చెప్పుకోవచ్చు.

17:29 - June 1, 2016

నిజామాబాద్  :  ఓ అపార్ట్‌మెంట్‌లోకి నెమ్మదిగా జొరబడ్డారు.. ఓ ఫ్లాట్‌ తాళం బద్దలుకొట్టి పని కానిచ్చుకునే సమయంలో పక్క ఫ్లాట్‌ యజమాని రావడంతో కథ అడ్డం తిరిగింది. చేసేది లేక అక్కడ నుంచి జారుకున్నారు. ఎవరికీ దొరకలేదు కాని.. సీసీ కెమెరా కన్నుకు మాత్రం చిక్కిపోయారు. నిజామాబాద్‌ జిల్లాలో రెండ్రోజులుగా దొంగల ముఠా అలజడి సృష్టిస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. కానీ నగరంలో నాలుగు షాపుల్లో దొంగతనం చేసినట్టు తెలుస్తోంది.

వైష్ణవి అపార్ట్‌మెంట్‌ చోరీకి యత్నం...
అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో నగరంలోని వైష్ణవి అపార్ట్‌మెంట్‌లోనికి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు. ఒక ప్లాట్‌ తాళం ధ్వంసం చేసి దొంగతనం చేసే సమయానికి మరోప్లాట్‌ యజమాని వచ్చాడు. దొంగలను గమనించి ఆయన వారి వెంట పడడంతో అక్కడ నుంచి పారిపోయారు.

సీసీ కెమెరాల పరిశీలించిన పోలీసులు...
స్థానికుల సమాచారంతో పోలీసులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లి పరిశీలించగా.. తాళం ధ్వంసం చేసి ఉంది. అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. మరాఠా ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేశారు.

నాలుగు షాపుల్లో నగదు అపహరణ...
అయితే అపార్ట్‌మెంట్‌లో చోరీకి విఫలయత్నం చేసిన ముఠానే మరుసటి రోజున దేవీరోడ్డులో నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడినట్టు సమాచారం. నాలుగు షాపులలో దాదాపు రూ.55 వేల నగదును చోరీ చేశారు. సంధ్య, రామ్‌దేవ్‌, జైసంతోషి, వీరభద్ర దుకాణాల్లో చోరీ జరిగిందని ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో రవీందర్‌ వెల్లడించారు. దీంతో పోలీసులు ఈ ముఠాను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు.

17:21 - June 1, 2016

వరంగల్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ నిరుద్యోగ యువతీయువకులకు జీడబ్ల్యూ ఎంసీ కొలువుల కానుక అందిస్తోంది. రాష్ట్రంలో వినూత్నంగా మొదటిసారిగా వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఉద్యోగాలను కానుకగా ఇవ్వాలని సంకల్పించింది. మేయర్ నన్నపనేని నరేందర్, ప్రత్యేకంగా కంపెనీల యజమానులతో మాట్లాడి కొలువుల జాతరను ఏర్పాటు చేశారు. హన్మకొండ లోని నందనా గార్డెన్ లో ఏర్పాటుచేసిన జాబ్ మేళా ఆవిర్భవ ఉత్సవాలలో భాగంగాప్రభుత్వ కార్యాలన్నీ ఉద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగతున్నాయి.

17:12 - June 1, 2016

హైదరాబాద్‌ : వనస్థలిపురం పోలీసు స్టేషన్‌ ముందు ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన గోపీ డిగ్రీ చదువుతూ వనస్థలిపురంలో ఉంటున్నాడు. తన స్నేహితుడు ఫేస్‌బుక్‌లో అసభ్య సందేశాలు ఇస్తున్నాడంటూ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. SI సైదులు ఫిర్యాదు తీసుకోకపోగా, చితకబాదడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో పోలీసు స్టేషన్‌ ముందు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గోపీని అదుపులోకి తీసుకున్నారు.

17:10 - June 1, 2016

ఢిల్లీ : కేంద్రం మరోసారి పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంచడంపై సిపిఎం పొలిట్‌బ్యూరో మండిపడింది. మోది సర్కార్‌ అధికారంలోకి వచ్చాక డీజిల్‌ ధరలు 19 సార్లు, పెట్రోల్‌ ధరలు 16 సార్లు పెంచినట్లు సిపిఎం తెలిపింది. బిజెపి అధికారంలోకి వచ్చాక సామాన్యులపై మరింత భారం పడిందని పేర్కొంది. ఓవైపు ప్రజలు భారం మోయలేక సతమతమవుతుంటే...రెండేళ్ల పాలనపై బిజెపి సంబరాలు జరుపుకోవడాన్ని సిపిఎం ఎద్దేవా చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ పెంచుతూ ఆదాయం పెంచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించింది. తాజాగా పెట్రోల్‌ ధర లీటర్‌పై రెండున్నర, లీటర్‌ డీజిల్‌పై 2 రూపాయల 26 పైసలు పెరిగింది.

17:06 - June 1, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నిధుల సమీకరణ చేపట్టింది. గడప గడపకు సీపీఐ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కార్పొరేట్ల నుంచి కాకుండా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్‌లో చేపట్టే పోరాటాల కోసం నిధుల సమీకరణ చేపట్టారు. 

17:04 - June 1, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి పత్తిపాటికి రైల్వే కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2014 సమైక్య ఉద్యమ సమయంలో జరిపిన రైల్‌ రోకో కేసులో వారెంట్‌ జారీ అయ్యింది. కోర్టుకు హాజరు కానందున ప్రత్తిపాటితో పాటు ఎమ్మెల్యే ఆలపాటి, మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్‌, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిలకు రైల్వే కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 7కు వాయిదా వేశారు.

16:49 - June 1, 2016

విజయవాడ : ఏపీ కేబినేట్‌ సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన వివరాలను మంత్రి పల్లె మీడియాకు వివరించారు. కేబినేట్‌ భేటీలో ప్రధానంగా ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించారు. సుమారు 10వేల ఉద్యోగాల భర్తీకి కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 8న ఒంగోలులో మహా సంకల్ప దీక్షకు కేబినెట్ ఆమోదం తేలిపింది. అంతేకాదు త్వరలో గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ టూ, గ్రూప్‌ త్రీ నోటిఫికేషన్లను జారీచేయనున్నట్లు మంత్రి తెలిపారు.

16:49 - June 1, 2016

విజయవాడ : ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే టీడీపీ ప్రభుత్వం ఈనెల 2న నవనిర్మాణ దీక్ష తలపెట్టిందని సీపీఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. కరవు, రైతుల ఆత్మహత్యలు, మంచినీటి ఎద్దడి వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే నవనిర్మాణ దీక్ష చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని పార్టీ కార్యదర్శి మధు వ్యాఖ్యానించారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎమెల్యేలను కొంటున్నారని మధు మండిపడ్డారు.

16:28 - June 1, 2016

నల్లగొండ  :  భర్త రాష్ట్రం కోసం పోరాడితే.. బతుకు పోరాటం భార్యది. తెలంగాణ రాష్ట్రమైతే వచ్చింది.. ఆమె మాత్రం భర్తను.. బతుకును కోల్పోయింది. దిక్కు కోల్పొయిన ఆమె.. ఏళ్ల తరబడి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తూనే ఉంది.

ప్రాణాలర్పించిన అమరుల సంగతి మరచిన సర్కార్ ...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ ముస్తాబవుతోంది. సంబరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల సంగతిని మాత్రం గాలికి వదిలేశారు. దయనీయ స్థితిలో ఉన్న వారి కుటుంబాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీనికి నిదర్శనమే.. నల్గొండ జిల్లా కేసారం గ్రామానికి చెందిన అంజమ్మ జీవితం.

కాల్పుల్లో నర్సింహ పొట్ట, చేతుల్లోకి బుల్లెట్లు ...
ఈ క్రమంలో 1969 జూన్‌ నాలుగో తేదీన హైదరాబాద్‌ నగరంలోని గౌలిపురాలో జరిగిన ఆందోళనలో విద్యార్థులతో పాటు నర్సింహ పాల్గొన్నారు. పోలీస్‌లు వారిపై కాల్పులు జరిపి ఆందోళనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ కాల్పుల్లో నర్సింహ పొట్ట, చేతుల్లోకి బుల్లెట్లు దూసుపోయాయి. తీవ్రగాయాలైన నర్సింహ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజూ మృతి చెందారు. అయితే నర్సింహ మృతితో వారి కుటుంబం దిక్కు లేనిదయ్యింది. ఇద్దరు కూతుళ్లతో భార్య అంజమ్మ రోడ్డున పడ్డారు.

అగమ్యగోచరంగా మారిన అంజమ్మ పరిస్థితి...
అప్పటి నుంచి అంజమ్మ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో అంజమ్మ అమరవీరుల ఆర్థిక సాయం కోసం అప్పటి తహసీల్దార్‌ ను కోరగా అప్పటి ముఖ్య మంత్రి వెంగళరావుకు దరఖాస్తు చేశారు. అయినా ఎలాంటి సహకారం అందలేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో దరఖాస్తు చేయగా.. భర్త పోస్ట్‌మార్టం నివేదిక, ఎఫ్‌ఐఆర్ నకలు కోరారు. దీంతో అంజమ్మ గౌలిపురా పోలీస్‌స్టేషన్‌లో, ఉస్మానియా ఆస్పత్రిలో అప్పటి నివేదికలు కోసం వెళ్లింది. అప్పటి రికార్డులు లేవని వారు తెలిపారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక అంజమ్మ దిక్కుతోచని స్థితిలో ఉంది.

ఇప్పటికైనా ఆదుకోవాలని ఉద్యమకారుల డిమాండ్...
ఈ వయసులో అంజమ్మను అధికారులు చాలా కష్టపెడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్న కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేసిఆర్‌ ప్రభుత్వం అంజమ్మను ఆదుకోవాలని తెలంగాణా ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

16:17 - June 1, 2016

చైనా : తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి చేర్చిన చిత్రం బాహుబలి. ఈ దేశం.. ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ బాహుబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రాజన్న చెక్కిన బాహుబలి త్వరలోనే చైనాలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రాజమౌళి, నిర్మాత శోభ యార్లగడ్డ, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి చైనాలోని తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

మంత్రి ప్రత్తిపాటికి నాన్ బెయిలబుల్ వారెంట్...

హైదరాబాద్ : ఏపీ మంత్రి ప్రత్తిపాటికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2014 సమైక్య ఉద్యమ సమయంలో రైల్ రోకో చేపట్టిన కార్యక్రమం సందర్భంగా కేసు నమోదు అయింది. కోర్టు విచారణకు హాజరుకానందున మంత్రి ప్రత్తిపాటితో పాటు మరో ఎమ్మెల్యే ఆలపాటి, మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిలకు రైల్వే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 7కు వాయిదా వేసింది.

16:07 - June 1, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణియాలను సభ ఆమోదించింది. ఈనెల 8న ఒంగోలులో మహాసంకల్ప సభకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో గ్రూప్-1,గ్రూప్-2,గ్రూప్ -3 నోటిషికేషన్లు, చంద్రన్న పథకం, 10వేల ఉగ్యోగాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలు, 9వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ, పోలీస్ మినహా అన్ని ఉద్యోగాలు ఏపీ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కేబినెట్ సమావేశం నిర్ణియించింది.

16:03 - June 1, 2016

బిహార్ : రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా గోపాల్‌ నారాయణ్‌ సింగ్‌ ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు. గోపాల్‌ నారాయణ్‌సింగ్‌పై 28 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈయన ఎంపికపై జేడీయూ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ప్రధాని మోది, బిజెపి చీఫ్‌ అమిత్‌షా ఓ క్రిమినల్‌ని రాజ్యసభకు ఎలా ఎంపిక చేస్తారని నిలదీసింది. క్రిమినల్‌ కేసులే కాకుండా గోపాల్‌ నారాయణ్‌ ఎనిమిది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన కేవలం 1977 ఎన్నికల్లో ఒకే ఒక్కసారి గెలుపొందారు. ఆరెస్సెస్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. తాను సంఘ్‌ కార్యకర్తనని, తాను చేసిన సేవలను గుర్తించి పార్టీ తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని గోపాల్‌ నారాయణ్‌ నామినేషన్‌ వేసిన అనంతరం వెల్లడించారు. సీనియర్‌ నేత సుశీల్‌ మోదీని పక్కకు నెట్టి గోపాల్‌ నారాయణ్‌ను బిజెపి రాజ్యసభకు ఎంపిక చేసింది.

16:00 - June 1, 2016

అనంతపురం : రైతులు రుణభారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్టు కూడా లేదని వైసీపీ నేత జగన్‌ విమర్శించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జగన్‌ ప్రసంగించారు. శాసనసభలో చర్చకు కూడా సీఎం చంద్రబాబు ఆటంకాలు సృష్టిస్తున్నారని జగన్‌ విమర్శించారు. 

15:58 - June 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని ఏ ఊరు చూసినా.. ఏ పల్లె చూసినా తెలంగాణ జెండా రెపరెపలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగే రెండో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలంకరణలతో దగదగలాడుతున్నాయి. మరోవైపు దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండాను ఎగరేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.

వాడ వాడలా పండుగ....
అందుకే ఆ రోజును వాడ వాడలా ఓ పండుగలా జరుపుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అంతేకాదు..తెలంగాణ సిద్ధించి రెండేళ్లవుతున్న సందర్బంగా ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరపడానికి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఆవతరణ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.

రంగులమయమైన భాగ్యనగరం...
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతాలన్ని విద్యుత్ దీపాలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సంజీవయ్య పార్కులో దేశంలోనే అతి పెద్ద జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు ముమ్ముంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు,అధికారులు ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 298 అడుగుల ఎత్తు ఉన్న పోల్‌ను పార్క్‌లో ఏర్పాటు చేయనున్నారు. జాతీయ జెండా 108 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. జెండా బరువు 92 కేజీలున్నట్లు సమాచారం. జూన్‌ 2న జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా వేడుకలు...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే రిహార్సల్స్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ రిహార్సల్స్‌ను డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి,హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్టా తదితరులు పరిశీలించారు. నగరంలోని పలు కాలేజీల విద్యార్థులు తమ ప్రదర్శనలను అధికారుల ముందు ప్రదర్శించారు. అవతరణ దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుంకు కట్టుదిట్టమైన పకడ్భంది ఏర్పాట్లు చేశామని మూడు వేల మంది పోలీసులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు.

15:41 - June 1, 2016

న్యాయసలహాలను అందించే మైరైట్ కార్యక్రమం ఈరోజు మనముందుకు వచ్చేసింది. ఈ కార్యక్రమంలో  అడ్వకేట్ పార్వతి ఈ చట్టం గురించి ఎటువంటి విశేషాలను అందించనున్నారో తెలుసుకుందాం.  వరకట్నం అంటే ఏమిటి? ఎటువంటి సందర్భాలలో వరకట్నం వేధింపుల కింద కేసు పెట్టే అవకాశం ఉంటుంది? ఈ చట్టం వలన ఉపయోగాలేమిటి? తెలుసుకోవాలంటే ఇవాళ్లి మైరైట్ కార్యక్రమాన్ని వాచ్ చేయండి? మరి సందేహాలు తీరాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి ..మీ సందేహాలను నివృత్తి చేసుకోండి...

15:27 - June 1, 2016

తూర్పుగోదావరి : కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కంటికి ఏది కన్పిస్తే దాన్ని కబ్జా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. జిల్లాలోని కాకినాడను స్మార్ట్‌సిటీగా ప్రకటించినప్పటి నుంచి కబ్జారాయుళ్ల కన్ను భూములపై పడింది. కాకినాడకు అతిసమీపంలో ఉన్న ఓ చెరువును మింగేందుకు రియల్టర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం చెరువు భూమిని వదులుకోబోమని తెగేసి చెప్తున్నారు.

స్మార్ట్‌సిటీగా ప్రకటనతో భూములకు రెక్కలు...
ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరానికి అతిసమీపంలో ఉన్న పెనుమర్తి గ్రామం. ఇటీవల కేంద్రప్రభుత్వం కాకినాడను స్మార్ట్‌సిటీగా ప్రకటించడంతో ఇక్కడి భూమి విలువ అమాంతం పెరిగింది. దాంతో కబ్జాకోరుల కన్ను నగర పరిసరాల్లోని విలువైన స్థలాలపై పడింది. ఊరి మొత్తానికి ప్రాణాధారమైన చెరువునే కాజేసేందుకు ఓ పెద్ద మనిషి పావులు కదుపుతున్నాడు. అధికారుల అండదండలు ఉండడంతో..ఆ పెద్దమనిషి చెప్పినట్లుగానే అధికారులు తలూపుతున్నారు. దీంతో కోర్టుల్లో ఉత్తర్వులు సానుకూలంగా వస్తున్నాయి. ఇదే అదనుగా కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు.

అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు....
పెనుమర్తి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 31లో రెండెకరాల విస్తీర్ణంలో ఊరకుంట చెరువు ఉంది. అయితే ప్రభుత్వ రికార్డలు ప్రకారం గ్రామకంఠ పరిధిలో ఉంది. అయితే ఈ భూమిని రక్షించాల్సిన అధికారులు..కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై కోర్టు ద్వారా సానుకూల ఉత్తర్వులు తెప్పించుకుంటున్నారు. ఏకంగా హైకోర్టు వరకు వెళ్లి చెరువును కప్పెట్టి తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేతస్తున్నారు.అయితే దీన్ని గ్రామస్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 

15:08 - June 1, 2016

కరీంనగర్ : కరవు రక్కసి బారిన పడ్డ కరీంనగర్‌ జిల్లాలో మూగజీవాల రోదన, వేదన వినేవారే కరవయ్యారు. జిల్లాలో వ్యవసాయం దుర్భరమైంది. దాని ప్రభావం ప్రత్యామ్నాయ పాడి పరిశ్రమ పైనా పడుతోంది. పశుగ్రాసం, నీటికొరతలతో పశువులు బక్కచిక్కి పోతున్నాయి. వాటికి మేత వేయలేక.. వాటి ప్రాణాలు హరించుకుపోతుంటే చూడలేక.. రైతులు తీవ్ర క్షోభకు గురవుతున్నారు. మరోవైపు.. కరవు తీవ్రత వల్ల.. పాడి పరిశ్రమ కూడా దారుణంగా దెబ్బతింది. కరీంనగర్‌ జిల్లాలో రోజురోజుకు క్షీణిస్తోన్న క్షీరధార పరిశ్రమపై టెన్‌ టీవీ స్పెషల్ ఫోకస్‌...

కరవుతో తల్లడిల్లుతోన్న పాడి పరిశ్రమ...
కరీంనగర్‌ జిల్లాలో కరవు బారిన పడి తల్లడిల్లుతోన్న పాడి పరిశ్రమ దీనస్థితికి నిలువెత్తు నిదర్శనాలు. తెలంగాణ ధాన్యాగారంగా .. పాడి, పశు సంపదలకు నెలవుగా పేరున్న కరీంనగర్‌ జిల్లా కరవు కాటుకు బలై కుదేలవుతోంది. కరవు కోరలు విసిరిన పంజాకు వ్యవసాయం మూలన పడి, అన్నదాత బతుకు చిత్రమే ఛిద్రమై పోయింది. ఒకప్పుడు పదిమందికి పని కల్పించిన అన్నదాతలు..ఉపాధి కూలీలుగా మారి వలస బాట పట్టారు. వర్షాభావం, భూగర్భజలాలు అడుగంటడంతో మనుషులే కాదు మూగ జీవాలు సైతం దీనావస్థలో కూరుకుపోయాయి.

వర్ణనాతీతంగా మారిన పశువుల మూగరోదన...
తాగడానికి నీళ్లు లేక, తినడానికి పశుగ్రాసం లేక పశువులు పడే మూగరోదన వర్ణనాతీతంగా మారింది. వాటికి తిండి పెట్టలేక చాలా మంది మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నారు. ఈ ప్రభావం పాడి పరిశ్రమపై పడింది. పశువులకు మేత లేకపోవడంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీంతో పాల డెయిరీలకు రోజురోజుకు పాల సరఫరా పడిపోయింది. లక్షల లీటర్ల పాల ఉత్పత్తి తగ్గడంతో పాడి పరిశ్రమపై ఆధారపడ్డ వారంతా ఆర్థికంగా నష్టపోతున్నారు.

పాడి ,పశు సంపదతో సిరులు కురిపించిన కరీంనగరం...
జిల్లాలో 4 లక్షల గేదెలు, 4.20 లక్షల ఆవులతో పాటు 21 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటిలో పశువుల నుంచి రోజూ 4 లక్షల పాల సేకరణ జరుగుతోంది. 19 పాలసేకరణ కేంద్రాలుండగా.. వాటిలో కాల్వశ్రీరాంపూర్‌, నారాయణపూర్‌, ఎల్లారెడ్డిపేట, నుస్తులాపూర్‌, పెద్దపల్లి, వెల్గటూర్‌, ఇల్లంతకుంట, రాయికల్‌ శీతలీకరణ కేంద్రాలతో పాటు.. అతిపెద్ద పాల శీతలీకరణ కేంద్రాలైన హుస్నాబాద్‌, జమ్మికుంట, జగిత్యాల, ఆగ్రహారం కేంద్రాల నుంచి పాల సేకరణ జరుగుతోంది. సేకరించిన పాలను శీతలీకరణ కేంద్రాలలో నిలువ చేస్తారు. ఈ క్రమంలోనే పాలలో ఉన్న కొవ్వు శాతం ఆధారంగా ధర నిర్ణయిస్తారు.

కరవు ఎఫెక్ట్‌తో తగ్గిపోతున్న పాల ఉత్పత్తి ...
అయితే కరవు ఎఫెక్ట్‌తో పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాడి ఆధార రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. పాల ఉత్పత్తి తగ్గడంతో డెయిరీలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క కరీంనగర్‌ డెయిరీకి 1.92 లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతుండగా.. కరవు పుణ్యమా అని అది కాస్తా.. 1.47 లక్షల లీటర్లకు పడిపోయింది. ప్రియా, జెర్సీ, నాగార్జున, ముల్కనూర్‌ డెయిరీలకు సైతం పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
పశుగ్రాసం దొరక్క పశువుల విక్రయం...
కరవుతో పశుగ్రాసం దొరక్క చాలామంది రైతులు సంతలో పశువులను అమ్మేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాల్లో చాలావరకు పంటలు ఎండిపోయాయి. దీంతో పచ్చిగడ్డి, ఎండుగడ్డికి కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలో పశువులకు పశుగ్రాసం, దాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు కనీసం పశుగ్రాసం కూడా అందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు పశువులను విక్రయిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో కనీసం పశు వైద్యశిబిరాలు కూడా నిర్వహించడం లేదని పాడి రైతులు వాపోతున్నారు.

రైతాంగాన్ని ఆదుకోకుంటే భవిష్యత్‌లో దుర్భర పరిస్థితులు ...
రైతాంగాన్ని ఆదుకుని పాడి పరిశ్రమను కాపాడుకోలేకపోతే భవిష్యత్‌లో దుర్భర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే పశుగ్రాసం, దాణాను సరఫరా చేయాలని, రాయితీ ఇచ్చి ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

14:48 - June 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో భాగంగా టీజీవీపీఎన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ క్యాంపస్‌ నుంచి గన్‌పార్క్‌ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. భారీ సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్ట్‌ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ చేపడుతుంటే ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

మోదీకి లేఖ వ్రాసిన 'అమ్మ'..

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. ఇటీవల పెంచిన డీజిల్‌, పెట్రోలు ధరలు తగ్గించాలని జయలలిత లేఖలో పేర్కొన్నారు.

టీఆర్ ఎస్ గూటికి ఎంపీ మల్లారెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో షాక్‌ తగలింది. టీ-టీడీపీ ఏకైక ఎంపీ మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లారెడ్డికి కండువా కప్పి.. కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు మల్లారెడ్డి తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా నవ నిర్మాణ ఆంక్షలు...

విజయవాడ : నవ నిర్మాణ దీక్ష సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభా వేదిక ఏర్పాటు చేసిన విజయవాడలోని బెంజ్‌సర్కిల్ నుంచి నాలుగు వైపులా కిలోమీటర్ మేర నో వెహికల్ జోన్‌గా నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను జిల్లా శివారు నుంచి మళ్లించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామని ట్రాఫిక్ అడిషినల్ డీసీపీ నాగరాజ్ తెలిపారు.

చదువుకుంటామంటే వద్దంటున్నారు...

కృష్ణా :  చదువుకుంటామంటే తల్లిదండ్రులు మందలించారని చిన్నారులు సిద్ధు(13), రేష్మి(8) వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాపులపాడు మండలం వీరవల్లిలో ఇద్దరు చిన్నారులు తమ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మద్యం మత్తు...ఒకరు బలి...

ఆదిలాబాద్‌ : మద్యం పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. రక్త సంబంధాలు, స్నేహబంధాలు ఈ మహమ్మారి ముందు బానిసలైపోతున్నాయి. తాజాగా మద్యంతో మత్తులో కన్నతండ్రిని ఓ కొడుకు పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన నెన్నెల మండలం కొత్తూరులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు కుమారుడు లక్ష్మణ్‌. అనంతరం లక్ష్మణ్‌ కూడా నిప్పంటించుకుని ఆత్మహత్మాయత్నానికి పాల్పడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

13:50 - June 1, 2016

నల్గొండ : అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల మధ్య సంచారం చేస్తున్నాయి. అడవులను నరికివేయడం వల్ల ఆకలి కేకలతో గ్రామాల బాట పడుతున్నాయి. కొన్నిసార్లు జనాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని సార్లు జనాలను భయపెడుతున్నాయి. ఇలాగే ఆకలితో అడవి నుంచి వచ్చిన ఓ జింక పశువులతో స్నేహంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందరీ లాగే  మీరు కూడా ఆశ్చర్యపోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
పశువులతో జింక దోస్తీ...
నల్గొండ జిల్లా ఆలేరు మండలం రాఘవపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి ఓ జింక గ్రామంలోకి వచ్చింది. సంవత్సరం నుంచి పశువులతో మేత మేస్తూ వాటితో స్నేహం చేస్తోంది. పశువులతో పాటు కలియ తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది.
జంతువులకు రక్షణ కరువు 
అడవుల నరికివేతతో రోజురోజుకు జంతువులకు రక్షణ లేకుండా పోతోంది. తినటానికి తిండి లేక..తాగడానికి నీళ్లు దొరక్క..దగ్గర ప్రాంతాల్లోని గ్రామాలకు చేరుకుంటున్నాయి. అయితే ఇలా వస్తున్న జంతువులు కుక్కలు, మనుషుల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం తరుచూ చూస్తునే ఉన్నాం. నల్గొండ జిల్లాలో మాత్రం వింత సంఘటన చోటుచేసుకుంది. పశువులతో ఆడుకుంటూ స్నేహంగా ఉంటూ జింక గ్రామస్తులను ఆకట్టుకుంటోంది. అడవుల నరికివేతను అరికట్టి జంతువులకు రక్షణ కల్పించాలని... అటవీ ప్రాంతాల్లో జంతువులకు ఆహారం,నీటి తొట్లను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

13:45 - June 1, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వలసల పర్వం కొనసాగుతోంది. తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ మల్కాజ్ గిరి నియోజకవర్గ ఎంపీ మల్లారెడ్డి టీఆర్ ఎస్ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మల్లారెడ్డి టీఆర్ ఎస్ చేరారు. కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ ఎస్ చేరినట్లు మల్లారెడ్డి తెలిపారు. 

13:42 - June 1, 2016

అనంతపురం : తరతరాల కరవుకు కేరాఫ్‌గా మారిన  ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా... రాళ్లు, రప్పలే. తినేందుకు తిండిలేక.. చేసేందుకు పనిలేక అక్కడి ప్రజలు.. ఉపాధి వేటలో వలస బాట పడుతున్నారు. ఇంతకాలం కన్న బిడ్డల్లా సాకిన పశువులను కబేళాలకు పంపుతూ.. కరవు కోరల్లో చిక్కి పల్లెలన్నీ గొల్లుమంటున్నాయి. పశువులను అమ్మగా వచ్చిన డబ్బులతోనే విత్తనాలను కొనుగోలు చేసి.. సాగుపై ఆశ చావక రైతులు అష్టకష్టాలు  పడుతున్నారు.  అనంతపురం జిల్లాలో విలయ తాండవం చేస్తోన్న కరవుపై టెన్‌ టీవీ స్పెషల్‌ ఫోకస్‌.... 
ఆనాడు రాయలేలిన సీమ.. నేడది రాళ్ల సీమ..
ఆనాడు రాయలేలిన సీమ.. నేడది రాళ్ల సీమ..! ఎక్కడ చూసినా...ఎండిన చెరువులు.. బీళ్లు వారిన భూములు.. 
కన్నబిడ్డల్లా సాకిన పశువులను కబేళాలకు తరలిస్తున్న దుస్థితి. తినడానికి తిండిలేక.. చేతిలో పనిలేక.. ఉపాధి వేటలో ప్రజల వలస బాట...!
తలరాతలు మారడం లేదు
తరాలు మారినా అనంతపురం జిల్లా ప్రజల.. తలరాతలు మారడం లేదు. ఒకప్పుడు రాయలేలిన రాయలసీమ.. కరవు తాకిడికి రాళ్లసీమగా మారింది. అనంతపురం ప్రజల కష్టాలకు అంతులేకుండా పోయింది. చేతిలో పనిలేక.. తినడానికి తిండిలేక.. ఉన్న భూమిలో సాగు చేసేందుకు నీళ్లు లేక.. అనంత రైతాంగం అల్లాడుతోంది. వరుస కరవు వెక్కిరిస్తోన్నా... ఆశ చావని రైతన్నలు.. ఉన్న కాడెద్దులను అమ్మేసి సబ్సిడీ విత్తనాలను కొంటున్నారు. తాగేందుకు నీరు లేక, పశువులకు దాణా, పశుగ్రాసం కూడా లభించక... కన్నబిడ్డల్లా సాకిన పశువులను కబేళాలలకు తరలించి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని బతుకులు వెల్లదీయడం నిజంగా దయానీయం. 
పరిస్థితి దయనీయం
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకసిర, కదిరి నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ప్రాంతాల్లో కరవు ప్రభావం తీవ్రంగా ఉండటంతో జనం వలస పక్షుల మాదిరిగా ఉపాధి వేటలో పడి బెంగళూరు తదితర ప్రాంతాలకు వలసలు పోవడం చూపరులను సైతం కన్నీటి పర్యాంతమయ్యేలా చేస్తోంది. వలసలతో రైల్వే స్టేషన్లు కిక్కిరిస్తున్నాయి. ఎక్కడ చూసినా కాందీశీకులను తలపించేలా బంధాలు, బంధుత్వాలను వీడి వెళుతున్న దృశ్యాలు గుండెలవిసేలా చేస్తున్నాయి. 
అప్పుల ఊబిలో రైతులు
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనంత జిల్లా రైతులు చాలామంది.. మూటాముల్లె సర్దుకుని వలసల బాట పడుతున్నారు. ప్రతిఏటా లక్షల మంది ప్రజలు బెంగళూరు, చెన్నై, కేరళ, ముంబై ప్రాంతాలకు వలస పోతుండటంతో పలెల్లో వృద్ధులూ, పిల్లలూ తప్ప.. వేరే వాళ్లు కనిపించడం లేదు. ఉపాధి పనుల్లో కూడా పని దొరక్క అనేక మంది ప్రజలు వలస  బాట పట్టారు. 
దిక్కుతోచని స్థితిలో జనం 
వానలు కురవక, పంటలు పండక, ఉపాధి పనులు కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో జనం ఉపాధి వేటలో పడ్డారు. కనీసం ప్రభుత్వం  రుణమాఫీ కూడా చేయకపోవడంతో రైతుల వెతలకు అంతేలేకుండా పోయింది. ఇక్కడ ఉంటే పొట్ట గడవడమే కష్టంగా ఉందని, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూలీ చేసినా రోజుకు 500 వరకు సంపాదించవచ్చని అనంతపురం జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
హామీ నెరవేర్చని సీఎం చంద్రబాబు
అనంతపురం జిల్లా కరవును తరిమికొడతామన్న ఏపీ సీఎం చంద్రబాబు.. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చక పోవడం దారుణమంటున్నారు స్థానికులు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చంద్రబాబు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు జిల్లాలో కరవు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నది స్థానికుల విమర్శ. తక్షణమే జిల్లా రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టాలని అనంతవాసులు కోరుతున్నారు. 

ఝాన్సీది హత్యే..

నల్గొండ : జిల్లాలో బిటెక్ విద్యార్థిని ఝాన్సీ మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.  తల్లి, భర్త, స్నేహితులను పోలీసులు విచారించారు. తల్లి, భర్త ఝాన్సీకి పురుగుల మందు తాగించి చంపినట్లు పోలీసులు నిర్దారించారు. 

13:30 - June 1, 2016

నల్గొండ : జిల్లాలో బిటెక్ విద్యార్థిని ఝాన్సీ మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల్లి, భర్త, స్నేహితులను పోలీసులు విచారించారు. తల్లి, భర్త ఝాన్సీకి పురుగుల మందు తాగించి చంపినట్లు పోలీసులు నిర్దారించారు. ఝాన్సీ స్వగ్రామం ననకిరేకల్ మండలం నోములలో మే 24న దారుణంగా హత్య చేశారు. ఆమె స్నేహితులను మృతదేహం దగ్గరకు వెళ్లనీయలేదు. మృతదేహాన్ని భర్త విజయేందర్ రెడ్డి స్వగ్రామం దీపగుంటకు తరలించి దహన సంస్కారాలు చేశారు. అయితే మొదట ఝాన్సీని హత్య చేసినట్లు ఒప్పుకోని తల్లి, భర్త.. విచారణ తర్వాత చివరకు తామే ఆమె చంపినట్లు ఒప్పుకున్నారు. చిత్ర హింసలు పెట్టి హత మార్చినట్లు తెలిపారు. పరుగుల మందు తాగించి.. చిత్ర హింసలు పెట్టి.. ఆ తర్వాత గొంతు కోసి చంపేసినట్లు చెప్పారు. ఇదిలావుంటే విజయేందర్ రెడ్డితో వివాహానికి ఝాన్సీకి ఇష్టం లేదు. భర్తకు, స్వంత తల్లికి వివాహేతర సంబంధం ఉందని, ఇరువురి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఝాన్సీ లేఖలో పేర్కొంది. వారు చిత్ర హింసలు పెడతారనే సెలవుల్లో కూడా ఇంటికి వెళ్లకుండా హాస్టల్ లోనే ఉండేందని తెలిపింది. అన్ని వివరాలను లేఖలో రాసి స్నేహితులకు ఇచ్చింది. లేఖల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. ఝాన్సీ చెప్పిన ఆడియో టేపులను కూడా సేకరించారు. తల్లి, భర్త విజయేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

13:28 - June 1, 2016

హైదరాబాద్ : కెసిఆర్ ప్రతిష్టకు మూడు పథకాలు సవాలుగా మారాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ పథకాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి చెరువులు కీలకం. ఉనికి కోల్పోయిన చెరువులను కూడా పునరుద్ధరించడం, చెరువులకు కొత్త జలకళ తీసుకురావడం మిషన్ కాకతీయ లక్ష్యాలు. ఈ పథకానికి జరుగుతున్న ప్రచారం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. తొలి సంవత్సరం చెరువుల పూడికతీత పనులు జోరుగా సాగాయి. అయితే, వర్షాలు పడకపోవడంతో లాభనష్టాలు బయటపడలేదు. రెండో ఏడాది మిషన్ కాకతీయ పనుల్లో తొలి సంవత్సరపు హుషారు కనిపించడం లేదు. చివరకు నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు కూడా పనుల తీరుపై అసంత్రుప్తి చెందడం విశేషం. 
ప్రాజెక్ట్ ల రీ డిజైన్ కు ప్రాధాన్యత
కోటి ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యమంటున్న కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్ట్ ల రీ డిజైన్ కు ప్రాధాన్యత ఇస్తోంది. కమీషన్ల కోసమే రీ డిజైన్ అన్న విమర్శలు వెల్లువెత్తడంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ప్రతిపక్షాలను చిత్తు చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి, కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి దగ్గర భారీ బ్యారేజీలు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం విశేషం. ఈ ఒప్పందంలో పారదర్శకత లేదంటున్న ప్రతిపక్షాలు అఖిలపక్షం సమావేశం పట్టుబడుతుండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ ఊళ్లు, బీళ్లు మునుగుతాయంటూ మల్లన్న సాగర్ నిర్వాసితులు పోరాడుతున్నా, పనులు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. ఇరిగేషన్ పనుల్లో జాప్యం చేసే అధికారులపై కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే నల్లగొండ, వరంగల్ ఎస్ ఈ లపై బదిలీవేటు పడింది. 
మిషన్ భగీరధకు అత్యంత ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మరో పథకం మిషన్ భగీరధ. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో లేదు. అయిన్నప్పటికీ శరవేగంగా పనులు పూర్తి చేయించాలన్న పట్టుదల కెసిఆర్ ది. ఇంటింటికీ నల్లా నీళ్లు రాకపోతే, ఓట్లు అడగనని చెబుతున్నారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్ట్ ల రీ డిజైన్, మిషన్ భగీరథ పథకాలను  అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కెసిఆర్  ప్రభుత్వం  నిధుల కొరతలేకుండా జాగ్రత్త పడుతోంది. మిషన్ భగీరధకు నాబార్డ్, హడ్కో వంటి ప్రభుత్వరంగ సంస్థల నుంచి నిధులు సమకూర్చుకుంటోంది. 
కరెంట్ కోతలు లేకపోవడం
ఈ రెండేళ్ల లో కెసిఆర్ ప్రభుత్వానికి బాగా మంచిపేరు తెచ్చి పెట్టిన అంశం కరెంట్ కోతలు లేకపోవడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందంటూ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలను పటాపంచలు చేశారు. చత్తీస్ గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ, కరెంట్ కోతలు నివారిస్తున్నారు. చత్తీస్ గడ్ తో చేసుకున్న ఒప్పందం తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారుతుందంటూ విద్యుత్ రంగ నిపుణులు చేస్తున్న వాదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మిగులు విద్యుత్ సాధించాలన్న పట్టుదలతో వున్న ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన చేయడం విశేషం. కోర్టు కేసులు  కారణంగా పనులు ప్రాథమిక స్థాయిలో నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏకంగా లిమ్కా బుక్ రికార్డులకెక్కింది. నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతులు, కొత్త ఐటీ పాలసీ లతో పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు  ఎంతోకొంత ఫలితాన్నిస్తున్నాయి. 

 

13:05 - June 1, 2016

విజయవాడ : వైఎస్ జగన్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఏపీ మంత్రి పల్లె రఘనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే 'ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యల ప్రదేశ్‌'గా మారిందని ఆరోపించారు. వైఎస్ పాలనలో రాష్ట్రంలో 14 వేల 160 రైతులు, కూలీలు చనిపోయారని పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు.
 

 

12:46 - June 1, 2016

హైదరాబాద్ : టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది కెజి టు పిజి. ఈ నినాదం ఎందరినో ఆకర్షించింది. విద్యావ్యవస్థ లో పెనుమార్పు తథ్యమని చాలామంది భావించారు. చివరకు ఏమైంది? ఈ రెండేళ్ల కాలంలో కెజి టు పిజి ఎక్కడి దాకా వచ్చింది?
విద్యారంగం ప్రక్షాళన
కెసిఆర్ అధికారంలోకి వచ్చిన కొత్త రోజుల్లో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తారన్న అభిప్రాయం కలిగించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే రోజులు వస్తాయంటూ ఆశ కల్పించారు. అద్భుత కలలను మన కళ్ల ముందు ఆవిష్కరింపచేయడంలో కెసిఆర్ సిద్ధహస్తుడు. ఈ రెండేళ్ల కాలంలో కెజి టు పిజి ప్రారంభించి వుంటే విద్యారంగంలో కొత్త ఒరవడికి బాటలుపడేవి.
కెజి టు పిజి కి వెయ్యి కోట్లు కేటాయింపు 
ఉచిత నిర్బంధ విద్యను అందించే లక్ష్యంతో కెజి టు పిజి కి బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించారు. ఒక్కో క్యాంపస్ కి 15 ఎకరాల చొప్పున భూమిని సేకరించాలన్నది లక్ష్యం. ఇంత సువిశాల ప్రదేశంలో విద్యాలయం ఎంత చూడముచ్చటగా వుండేదో. ఇప్పటికే రెండేళ్ల కాలం కరిగిపోయింది. బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. కనీసం ఒక్క చోటైనా 15 ఎకరాల స్థలం సేకరించలేదు. ఇప్పటి దాకా ప్రయత్నమే మొదలుకాకపోతే, రాబోయే రెండేళ్లలో కెజి టు పిజి కల సాకారమవుతుందా? అనుమానమే. కెజి టు పిజి కోసం కొన్ని సమావేశాలు నిర్వహించారు. కానీ క్లారిటీ రాలేదు. నిధుల్లేవు. ఉచిత విద్యపై స్పష్టత లేదు. ఇప్పటికైతే గురుకులాల మీద కాన్సన్ ట్రేషన్ చేస్తున్నారు. కెజి టు పిజికి గురుకులాలే తొలి అడుగులంటున్నారు.
తెలంగాణలో 61 లక్షల మంది విద్యార్థులు  
కెజి టు పిజి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. తెలంగాణలో దాదాపు 61 లక్షల మంది విద్యార్థులున్నారు. ఒక్కొక్క క్యాంపస్ లో వెయ్యి మంది విద్యార్థుల చొప్పున అడ్మిషన్ ఇచ్చినా ఆరు వేలకు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లు అవసరం. ఒక్కో స్కూల్ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించాలంటే సుమారు ఆరు కోట్లు ఖర్చవుతుంది. ఆరు వేల భవనాలకు 36వేల కోట్ల రూపాయలన్నమాట.  ఇప్పుడు తెలంగాణలో లక్ష మంది టీచర్లున్నారు. కెజి టు పిజి విద్యను సమర్ధమంతంగా అమలు చేయాలంటే మూడు లక్షల మంది టీచర్లను రిక్రూట్ చేయాల్సి వుంటుంది.  వీరికి ఏడాదికి కనీసం 8వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 30శాతం  పైగా నిధులు విద్యారంగానికి కేటాయిస్తే తప్ప కెజి టు పిజి సాధ్యం కాదు.  కెసిఆర్ ప్రభుత్వం తొలి బడ్జెట్ లో విద్యారంగానికి 10.89 శాతం నిధులు కేటాయించగా, రెండో బడ్జెట్ లో అది 9.69 శాతానికి పడిపోయింది. కలలకీ, వాస్తవాలకీ మధ్య ఎంత తేడా? 

 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశం

కృష్ణా : విజయవాడలో ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నవ నిర్మాణ దీక్ష, వారం రోజులు చేపట్టే కార్యక్రమాలు, రెండేళ్ల పాలనతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. 

 

11:57 - June 1, 2016

నల్గొండ : పరీక్షలు పూర్తి కాగానే క్షణం కూడా ఉండనీయకుండా భర్త తీసుకువెళ్లాడు..వెళ్లిన మర్నాడే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందన్నారు..ఆ మర్నాడే అంత్యక్రియలు పూర్తి చేశారు...కాని ...ఝాన్సీ రాసిన లేఖ మాత్రం హైదరాబాద్‌ నుంచి పోస్టయింది..దీన్ని బట్టి ఆ లేఖ ఎవరు పోస్టు చేశారు..? ఝాన్సీ ఇంటి వద్ద ఉంటే..లేఖ పోలీసులకు ఎలా చేరింది..దీని వెనక అసలు కథేంటి..? ఝాన్సీది హత్యా...? ఆత్మహత్యా..??
కన్నతల్లి కిరాతకమా..? కట్టుకున్నవాడి పైశాచికమా..?
వ్యభిచారం చేయాలంటూ తన తల్లి, భర్త బలవంతం చేస్తున్నందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసిన బీటెక్ విద్యార్థిని ఝాన్సీ సూసైడ్ నోట్ అనుమానాలకు దారి తీస్తోంది...ఝాన్సీ ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంటే అదే రోజు సరూర్‌నగర్ నుంచి పోస్టు వచ్చినట్లు తెలుస్తోంది.. పోలీసులకు అందేసమయానికి మూడు రోజుల ముందే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని..అంత్యక్రియలు అయిపోయాయని తేలింది.. ఇదిలా ఉంటే ఝాన్సీ హైదరాబాద్ నుంచి ఈనెల 23న ఇంటికి వచ్చిందని ఆమె తల్లి చెబుతుండగా 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఆమె వెల్లడించింది...సరిగ్గా అదేరోజు ఆమె గ్రామంలో ఉంటే సరూర్‌నగర్ నుంచి పోస్టు ఎలా చేయగలిగింది...? దీన్ని బట్టి ఝాన్సీ కేసులో అనుమానాలు ఉన్నాయి. 
మరి స్పీడ్‌పోస్ట్ ఎవరు చేశారు..?
ఈనెల 24న ఆమె ఆత్మహత్య చేసుకుంటే, మరి స్పీడ్‌పోస్ట్ ఎవరు చేశారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..తల్లికి, భర్తకు సంబంధం ఉందని లేఖలో తెలిపిన ఝాన్సీ తనను కూడా వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని లేఖలో పేర్కొంది..దీన్ని బట్టి తల్లి బాకీ తీర్చేందుకు కూతురిని రొంపిలోకి దించాలనుకుందా..? లేక భర్తనే డబ్బును వసూలు చేసుకునేందుకు భార్యను ఫణంగా పెట్టాడా..? ఎన్నో రోజులుగా నలిగిన ఝాన్సీ చివరకు కఠిన నిర్ణయం తీసుకుందా..? ఇదే అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే హైదరాబాద్‌ నుంచి పోస్టు ఎవరు చేశారన్నది అనుమానాస్పదంగా మారింది..దీన్ని బట్టి కన్నతల్లి, భర్తనే తమ మాట వినడం లేదని కిరాతకానికి పాల్పడ్డారాన్నది కూడా అనుమానంగానే ఉంది..దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...
ఆమె ఆత్మహత్య అనుమానమే..
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని ఐస్‌సదన్‌ సంతోషన్‌నగర్‌లోని శ్రీసాయి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్న ఝాన్సీ చదువులో ముందుండేదని...చలాకీగా ఉంటుండేదని నిర్వాహకులు చెబుతున్నారు.. అందరితో నవ్వుతూ ..నవ్విస్తూ ఉండే ఝాన్సీ ఇంతటి ఘోరానికి పాల్పడుతుందాన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ నెల 23న బీటెక్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ పూర్తి కాగానే భర్త విజయేందర్‌రెడ్డి వచ్చి ఆమెను తీసుకెళ్లాడని చెబతున్నారు..
రంగంలోకి పోలీసులు ప్రత్యేక బృందాలు
ఝాన్సీ మరణంలో ఏర్పడుతున్న అనుమానాలపై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆమె లేఖ ద్వారా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా లోతుగా శోధిస్తున్నారు.

 

11:47 - June 1, 2016

నల్లగొండ : జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యాదగిరిగుట్టలో నిన్న జరిగిన శోభాయాత్రలో భార్గవ్ రాజు అనే వ్యక్తికి, మరో యువకుడికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత హనుమాన్ వీధిలో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న భార్గవ్‌ను గుర్తు తెలియని యువకులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే భార్గవ్ రాజు మరణించాడు. 

 

11:44 - June 1, 2016

హైదరాబాద్ : డబల్ బెడ్ రూం. ఒకప్పుడు పేదలెవ్వరూ ఆ ఊహనే తమ మనస్సులోకి రానిచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడు కొన్ని లక్షల కుటుంబాలకు అదొక సుందర స్వప్నంగా మారింది. ఇందుకు కారకుడు కెసిఆర్. మరి ఆ స్వప్నం నెరవేరుతుందా?
2016 ఏప్రిల్ 27న జీవో
డబుల్ బెడ్ రూమ్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిది పాపులర్ పథకం. టిఆర్ఎస్ కి ఓట్ల వర్షం కురిపిస్తున్న పథకం. కొన్ని లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ మీద ఆశ పెట్టుకున్నారు. కానీ, ఈ పథకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. డబుల్ బెడ్ రూమ్ కలను కళ్లెదుట నిలిపిన కెసిఆర్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికీ, బిల్లుల చెల్లింపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. హైదరాబాద్ ఐడిహెచ్ కాలనీలో 7 లక్షల రూపాయలతో డబుల్  బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లు నిర్మించిన తెలంగాణ ప్రభుత్వం ఇదే తరహాలో రాష్ట్రమంతా నిర్మిస్తామంటోంది. గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇలా ఎందరెందరో ఐడిహెచ్ కాలనీని సందర్శించి, మెచ్చుకున్నారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కమిటీలు వేశారు. సంక్షేమ పథకాల్లో రాజకీయ జోక్యం తగదంటూ హైకోర్టు తీర్పు చెప్పడంతో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు వేశారు. 
గత ఏప్రిల్ 27న  ఉత్తర్వులు జారీ
మార్గదర్శకాల జారీలో జాప్యం చేసిన ప్రభుత్వం గత ఏప్రిల్ 27న  ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల 4 వేల రూపాయలతో పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల 30 వేలతో, జిహెచ్ఎంసిలో 7 లక్షల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆశయం. వీటితో పాటు మౌలిక వసతుల కల్పన కోసం గ్రామాల్లో లక్షా పాతికవేలు, పట్టణాల్లో 75వేల చొప్పున వెచ్చిస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి గత సంవత్సరం 4వేల కోట్లు మంజూరు చేసింది. నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున 66వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. కానీ, ఎక్కడా ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదు. 
బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు...
ఈ ఏడాది మరో రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామంటూ అసెంబ్లీలోనే ప్రకటించారు. హైదరాబాద్ కి లక్ష, గ్రామాలకు 60 వేలు, పట్టణాలకు 40 వేల ఇళ్లు కేటాయించారు. వీటికి 17 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నది అంచనా. అయితే, బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. అదేమంటే, అప్పులు తెచ్చి కడతామంటున్నారు. నిధుల సేకరణ పెద్ద సమస్యగా మారింది.
బాలారిష్టాల మధ్య డబుల్ బెడ్ రూమ్ పథకం
హడ్కో, నాబార్డ్, సెంట్రల్ రూరల్ హౌసింగ్ కార్పొరేషన్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి అప్పులు తెచ్చే ప్రయత్నాలు ఇంకా వర్కవుట్ కాలేదు. డిజైన్ , నిర్మాణదారుల వివరాలతో కంప్లీట్ రిపోర్ట్ ఇస్తే పరిశీలిస్తామంటున్నాయి ఆయా సంస్థలు. దీంతో ప్రయివేట్ పార్టీలు, హౌసింగ్ శాఖ అధికారులతో వర్క్ షాపులు  నిర్వహిస్తోంది. లాభం లేకుండా ఇల్లు కట్టేందుకు బిల్డర్లు, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఖాళీ స్థలాలు గుర్తించడం కలెక్టర్లకు సమస్యగా మారింది. పట్టణాలకు, నివాస ప్రాంతాలకు అందుబాటులో ప్రభుత్వ ఖాళీ స్థలాలు లేకపోవడం, కోర్టు కేసులుండడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. కొత్త ప్రాంతాల్లో కొత్త కాలనీలు ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. మౌలిక వసతుల కల్పనకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో డబుల్ బెడ్ రూమ్ పథకం బాలారిష్టాల మధ్యనే కొట్టుమిట్టాడుతోంది.
సీఎం దత్తత గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల సందడి
ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్ల సందడి కనిపిస్తోంది. ఈ రెండు గ్రామాలకు 200 గజాల చొప్పున 500 ఇళ్లు మంజూరు చేశారు. సిఎం నియోజకవర్గం కావడంతో మీనాక్షి ఇన్ ఫ్రా కంపెనీ నిర్మాణం చేపట్టింది. మే నెలలోనే వీటిని పూర్తి చేయాలనుకున్నా, స్వయంగా కెసిఆరే పర్యటించి వచ్చినా అనుకున్న ప్రకారం నిర్మాణం పూర్తికాలేదు. 

 

11:40 - June 1, 2016

హైదరాబాద్ : టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానాల్లోఅత్యంత ముఖ్యమైంది దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ. కానీ, ఈ రెండేళ్లలో కనీసం అర శాతం మందికి కూడా భూ పంపిణీ చేయలేదు. 2014 జులై 26. సరిగ్గా ఇదే తేదీన దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసే జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2014 ఆగస్టు 15స్వాతంత్ర్య దినోత్సవవేడుకల సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజది. 
దళితులకు పంచిన భూమి ఎంతో తెలుసా? 
కానీ ఈ రెండేళ్లలో దళితులకు పంచిన భూమి ఎంతో తెలుసా? అక్షరాల 5311 ఎకరాలు.  తెలంగాణలో దాదాపు మూడున్నర లక్షల మంది భూమిలేని దళితులుంటే, ఇప్పటి దాకా ప్రభుత్వం భూమిని పంచింది కేవలం 2020 మందికే.  ఇప్పటి దాకా అర శాతం మందికే భూ పంపిణీ కార్యక్రమం వల్ల మేలు జరిగింది. ఇది ఎస్సీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ చెబుతున్న లెక్క. 
మరో వంద సంవత్సరాలకైనా భూ పంపిణీ పూర్తవుతుందా?
అధికారంలోకి వచ్చిన తొలి ఆర్థిక సంవత్సరంలో పంచింది కేవలం 1731 ఎకరాలు. లబ్ధిదారులు 646 మంది. ఇక రెండో సంవత్సరంలోనూ పంచిన భూమి 3528 ఎకరాలు. లబ్ధిదారుల సంఖ్య  1355 మంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19 మందికి కేవలం 52 ఎకరాల భూమిని మాత్రమే పంచారు.  ఈ లెక్కన పంచుకుంటే పోతే మరో వంద సంవత్సరాలకైనా భూ పంపిణీ పూర్తవుతుందా?
మెదక్ లో అధిక భూ పంపణీ 
జిల్లాల వారీగా చూస్తే ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ లో ఎక్కువ భూమి పంచడం విశేషం. మెదక్ జిల్లాలో ఇప్పటి దాకా పంచింది 1081 ఎకరాలు. లబ్దిదారులు 478. ఖమ్మం జిల్లాలో అతి తక్కువ భూమిని పంచారు. 40 మందికి 34 ఎకరాలు పంచారు. కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఎస్సీ జనాభా 18 శాతం మంది వుంటారు. కానీ ఈ రెండు జిల్లాల్లో పంచింది కేవలం 300 మందికే. కరీంనగర్ జిల్లాలో 183 మందికి 514 ఎకరాలు పంచితే, నల్లగొండ జిల్లాలో 131 మంది 317 ఎకరాలు మాత్రమే పంచారు. ఎస్సీ సంక్షేమ మంత్రి నల్లగొండ జిల్లావారే కావడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో కేవలం పాతిక కుటుంబాలకు 75 ఎకరాల భూమిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో 303 కుటుంబాలకు 889 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. నిజామాబాద్  లో 252 మందికి 646 ఎకరాలు పంచిపెట్టారు. వరంగల్ లో 325 మందికి 932 ఎకరాల భూమిని పంచిపెట్టారు.  ఆదిలాబాద్ జిల్లాలో 283 మంది 821 ఎకరాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క ఎకరానికి సగటున 5 లక్షల రూపాయల చొప్పున 224 కోట్లతో భూ పంపిణీ కార్యక్రమం కోసం వెచ్చించారు.   ఈ లెక్కలు చూసిన్నప్పుడు దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం చిత్తశుద్ధే ప్రశ్నార్ధకంగా మారుతోంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం స్థాపిస్తున్న ప్రభుత్వం దళితుల సామాజిక, ఆర్థిక స్థితిని పెంచే భూ పంపిణీ విషయంలో జాప్యం చేస్తోంది. 

 

10:57 - June 1, 2016

కరీంనగర్ : జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జ్యోతినగర్ లో నివాసముంటున్న ఏడుగురు విద్యార్థులు లోయర్ మానేరు డ్యామ్ లో ఈతకు వెళ్లారు. ఈతకెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో వరుణ్, సునంద్ అనే ఇద్దరు విద్యార్థులు లోతుగా ఉన్నవైపు వెళ్లారు. వీరికి పూర్తిస్థాయిలో ఈత రాదు. దీంతో లోతుగా ఉన్న వైపు వెళ్లడంతో వారు నీటిలో మునిగి మృతి చెందారు. వీరు ఇంటర్ చదువుతున్నారు. మరో ఐదుగురు విద్యార్థులు మరోవైపు వెళ్లారు. గల్లంతైన వారిని వెతికారు. కానీ వారి ఆచూకీ లభించలేదు. స్థానికులు సమాచారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘనా స్థలికి  చేరుకున్నారు. గజ ఈతగాళ్లు మూడు గంటలపాటు శ్రమించి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను వెలికితీశారు. పోలీసులు విచారణ చేపట్టారు. 

 

నేడు టీడీపీలో చేరనున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

విజయవాడ : నేటి సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీలో చేరనున్నారు. 

 

09:24 - June 1, 2016

నల్గొండ : నిత్యం తాగి వేధిస్తున్నాడని కన్నకొడుకునే తండ్రి కొట్టి చంపాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. సుర్యాపేట భగత్‌సింగ్‌నగర్‌లో మద్యం సేవించి వచ్చిన కొడుకు రాజు.. డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని తల్లిదండ్రులను బెదిరించడమే కాకుండా.. వారిపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన తండ్రి శ్రీనివాస్‌.. రోకలిబండతో రాజు తలపై కొట్టాడు. రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శ్రీనివాస్‌ సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. 

 

నేటి నుంచి ఆన్ లైన్ లో టీఎస్ ఎంసెట్-2 దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి అన్ లైన్ లో ఎంసెట్-2 దరఖాస్తులను స్వీకరించనున్నారు.  

నేడు టీఆర్ ఎస్ లో చేరనున్న ఎంపీ మల్లారెడ్డి

హైదరాబాద్ : టీటీడీపీలో మరో వికెట్ పడింది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి నేడు టీఆర్ ఎస్ లో చేరనున్నారు.  

దేవరకొండలో నేడు ఎల్ ఈడీ బల్బుల పంపిణీ

నల్గొండ : దేవరకొండలో నేడు ఎల్ ఈడీ బల్బులను పంపిణీ జరుగనుంది. మంత్రి జగదీష్ రెడ్డి బల్బులను పంపిణీ చేయనున్నారు. 

లోయర్ మానేరు డ్యామ్ లో ఇద్దరు గల్లంతు

కరీంనగర్ : లోయర్ మానేరు డ్యామ్ లో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈతకెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. 

పోలీసుల అదుపులో మావోయిస్టు దళ సభ్యులతోపాటు మిలీషియా సభ్యుడు

విశాఖ : ముగ్గురు మావోయిస్టు దళ సభ్యులతోపాటు మిలీషియా సభ్యున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని పోలీసులు నేడు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు : మదనపల్లి బైపాస్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న వారిపైకి టాటా ఏస్ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 

08:51 - June 1, 2016

ఎపి, తెలంగాణలో రాజ్యసభ సీట్ల కేటాయింపులపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ఎపి సీసీ లీగల్ సెల్ చైర్మన్ సుందర్ రాం శర్మ, టీఆర్ ఎస్ నేత రాకేష్, టీటీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:45 - June 1, 2016

తిరుమల తిరుపతి దేవస్థానంలో పురాణ పండితుల వేతనాలు పెంచాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో శ్రీ బాలాజి పురాణ పండితుల యూనియన్ నాయకులు జ్యోతి, సాయిబాబా పాల్గొని, మాట్లాడారు. 'పురాణ ప్రవచనం ఇప్పుడొక ఆయుధమైంది. తిరుపతిలో అదొక వెరైటీ ఉద్యమంగా మారింది. అవును. 38 మంది పురాణ పండితులు ఒక్క వేదిక మీదకు వచ్చారు. విష్ణుపురాణం, శివ పురాణం, రామాయణం, మహాభారతం, భాగవతం, వెంకటాచల మహత్యం, దేవీ భాగవతం ఇలా 18 రకాల పురాణాలు చెప్పే పండితులు ధర్మపోరాటానికి శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదుట వీరు సాగిస్తున్న పురాణ ప్రవచనం ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. ఇంతమంది పురాణ పండితులు ఒక చోట చేరి ప్రవచనాలు చెప్పడానికి కారణం ఏమిటి? పురాణ పండితులతో టిటిడి ఎలా వ్యవహరిస్తోంది? వారికిస్తున్న మర్యాదలేమిటి? అసలు ఈ పురాణ పండితుల విధులేమిటి? బాధ్యతలేమిటి? వీరి దక్కే వేతనాలు ఎంత? పురాణ పండితులు టిటిడి నుంచి ఆశిస్తున్నదేమిటి? అందుకు టిటిడి చెబుతున్న సమాధానం ఏమిటి? ఇలాంటి అంశాలపై వక్తలు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:31 - June 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రెండేళ్లపాటు పోలీస్ శాఖలో ఎన్నోసంస్కరణలు తీసుకొచ్చామన్నారు డీజీపి అనురాగ్ శర్మ. అత్యాధునిక టెక్నాలజీతో అప్ డేట్ అవుతున్నామని అందుకే పోలీసు శాఖకు దేశంలోనే పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. 
పోలీసుల నడవడిపై అనురాగ్ శర్మ వివరణ 
రెండేళ్ల తెలంగాణలో పోలీసుల నడవడిపై ఆ శాఖ చీఫ్ అనురాగ్ శర్మ వివరణ ఇచ్చారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ వాడుకుంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు.   
ఫ్రెండ్లీ పోలీసింగ్ 
రెండేళ్లలో పండుగలను, జాతరలను విజయవంతంగా నిర్వహించామని..  ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రతకు షీ టీంలు, భరోసాకు కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రారంభించామన్నారు. సిబ్బందిలో మహిళలకు  33 శాతం రిజర్వేషన్ కల్పించామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లక్ష సీ.సీ. కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
360 డిగ్రీల డేటా బేస్ 
పోలీస్ డిపార్ట్ మెంట్‌లో ఒక ఉద్యోగి జీవిత చరిత్ర మొత్తం తెలుసుకునేందుకు 360 డిగ్రీల డేటా బేస్ ను సిద్ధం చేశారు. 8 వేల మంది చైల్డ్ లేబర్లకు విముక్తి కలిగించి మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. మావోయిస్టుల పై గతంలో ఎలా వ్యవహారించామో ఇప్పుడు అదే విధంగా ఉంటుందని తెల్చారు. 
అగ్రదేశాలలో అమలు చేసే టెక్నాలజీపై నివేదిక 
యాప్‌ల ద్వారానే అగ్రరాజ్యాలు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్స్, ఈవెంట్స్ విజయవంతంగా చేస్తున్నారని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అగ్రదేశాలలో అమలు చేసే టెక్నాలజీని ఇక్కడ ఎంతవరకు అమలు చేయవచ్చన్నదానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నామని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.
నేరాల సంఖ్య తగ్గించేందుకు కృషి 
లండన్, న్యూయార్క్, వాషింగ్టన్‌లలో అత్యవసర సమయాల్లో స్పందించే వ్యవస్థలను పరిశీలిస్తున్నామన్నారు. ఆర్ధిక నేరాల అకాడమీలు, కమాండ్ కంట్రోల్ రూం.. ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వ్యవస్థలు, ఎమర్జెన్సీ పెట్రోలింగ్ వ్యవస్థలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నేరాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. 

 

08:22 - June 1, 2016

ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు హర్రర్‌ చిత్రాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ జోనర్‌ సినిమాల్లో నటించేందుకు స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం అమితాసక్తి చూపిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వందల్లో హర్రర్‌ చిత్రాల నిర్మాణం జరుగుతోంది. టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే కోలీవుడ్‌లోనూ బోల్డెన్ని హర్రర్‌ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న మొన్నటివరకు గ్లామర్‌ పాత్రలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న త్రిష ఈసారి భయపెట్టేందుకు రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'నాయకి' ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటే, మాదేష్‌ దర్శకత్వంలో 'మోహిని' అనే మరో హర్రర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈనెలలోనే షూటింగ్‌ ప్రారంభించుకునే ఈచిత్రానికి 'హారీ పొట్టర్‌' విఎఫెక్స్ టీమ్‌ పనిచేయనుంది. సూపర్‌ నేచురల్‌ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కే ఈ హర్రర్‌ చిత్రాన్ని యుకె, థారులాండ్‌, మెక్సికో దేశాల్లో చిత్రీకరించనున్నారు.

08:19 - June 1, 2016

తెలుగులో 'ఖుషి' చిత్రంతో పాపులరైన భూమిక చాలా గ్యాప్‌ తర్వాత 'లవ్‌ యు అలియా' అనే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌ జంటగా సమీస్‌ మ్యాజిక్‌ సినిమా పతాకంపై ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఇలాంటి క్యారెక్టర్‌ చేయలేదు. డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ లంకేష్‌ నా పాత్రని అద్భుతంగా డిజైన్‌ చేశారు. పాత్ర శక్తివంతంగా ఉంటూనే ఎన్నో లేయర్స్‌ కలిగి ఉండడం విశేషం. సందేశంతోపాటు చక్కటి వినోదం ఉన్న ఈ సినిమా డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నఈ చిత్ర ఆడియోను ఈ నెలాఖరులో రిలీజ్‌ చేసి, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి' అని అన్నారు.

 

08:14 - June 1, 2016

'గోపాల గోపాల' తర్వాత వెంకటేష్‌ 'బాబు బంగారం' చిత్రంలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి. ప్రసాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'వెంకటేష్‌, నయనతార 'లక్ష్మి', 'తులసి' చిత్రాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి నటులకి మారుతి లాంటి దర్శకుడు తోడైతే ప్రేక్షకులకు నవ్వుల పంటే. ఆసక్తికరమైన కథాంశంతో ఆరోగ్యకరమైన వినోదంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మారుతి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటేష్‌ కామెడీ టైమింగ్‌ని దృష్టిలో పెట్టుకుని మారుతి ఆకట్టుకునే డైలాగులు రాశారు. జిబ్రాన్‌ సంగీతం ఈ చిత్రానికి మరో అసెట్‌ అవుతుంది. ఆయన అద్భుతమైన పాటలను అందిస్తున్నారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది. ఇటీవలే యూరప్‌లో అందమైన లొకేషన్లలో రెండు పాటలని చిత్రీకరించాం. ఓ సాంగ్‌, ఓ ఫైట్‌ మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 6న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. జులైలో సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

 

08:06 - June 1, 2016

ఆదిలాబాద్ : తెలంగాణలో రైతు నిలువు దోపిడికి గురవుతున్నాడు. అసలే రాష్ట్రంలో కరవు తీవ్రస్థాయిలో ఉంటే..మరోవైపు కష్టాల్లో ఉన్న రైతులను కరెంట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు నిలువుదోపిడి చేస్తున్నారు. మోటార్‌ కనెక్షన్‌ రుసుమును అధికంగా వసూలు చేస్తూ రైతులను కష్టాల్లోకి నెడుతున్నారు.  
విద్యుత్‌ డిపార్ట్ మెంట్‌ లో వసూళ్లు..
ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగాన్ని విద్యుత్‌ డిపార్ట్ మెంట్‌ అధికారులు నిలువు దోపిడి చేస్తున్నారు. జన్నారం మండలంలోని కవ్వాల్ ఉప విద్యుత్ కేంద్ర పరిదిలోని సుమారు 170 మంది రైతులు 3 హెచ్ పి  మోటార్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 3,800 రూపాయల డీడీ తియాల్సి ఉన్నా..సుమారు 6వేల రూపాయల్ని కరెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వసూలు చేశారు. అదేవిదంగా 5హెచ్‌పీ మోటార్ కనెక్షన్ కోసం 6,500 డీడీ తీయాల్సి ఉన్నా 9వేలను వసూలు చేశారు. ఇదేంటని రైతులు అడిగితే..అధికారులు సమాధానం చెప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 
లంచ గొండి అధికారులు 
మూలుగుతున్న నక్కమిద తాటికాయ పడ్డట్టు..అసలే కష్టాల్లో ఉన్న రైతుల నుండి వసూలు చేయల్సిన దాని కన్నా ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారని రైతులు ప్రశ్నిస్తే..మామూళ్లు ఇవ్వందే పనిజరగదంటూ అధికారులు సమాధానం చెప్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త స్తంభం వేయాలన్నా..భావి మీద వేలాడుతున్న కరెంటు వైర్లను సరిచేయాలన్నా లంచం అడుగుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ ఏఈ వివరణ కోరగా..రైతుల ఆరోపణలు నిజమైతే..సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 
లంచాలు తీసుకోవడంపై రైతుల ఆగ్రహం 
అసలే కరవు కాలంలో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి...ఇలా లంచాలు తీసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి లంచగొండి అధికారులపై చర్యలు ను డిస్మిస్ చేయాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

ఈనెల 3న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

హైదరాబాద్ : జూన్ 3వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో 3న మధ్యాహ్నం 2గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

తండ్రి చేతిలో కొడుకు హతం..

నల్గొండ : కన్నకొడుకునే ఓ తండ్రి కడతేర్చాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని భగత్‌సింగ్‌నగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబకలహాల కారణంగా తండ్రి రోకలిబండతో కొడుకు తలపై మోదీ హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

హనుమాన్ శోభాయాత్రలో ఇరువర్గాలు ఘర్షణ..ఒకరి మృతి

నల్గొండ  : యాదగిరిగుట్టలో హనుమాన్ శోభాయాత్రలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. బర్త్ డే పార్టీలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. దీంతో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్ట వాసి గుండు భాస్కర్ రాజ్ అని పోలీసులు చెప్పారు. వ్యక్తిగత తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

07:53 - June 1, 2016

హైదరాబాద్ : టాక్స్ లు పెంచ‌కుండా ఖ‌జానా నింపేందుకు బల్దియా ప్లాన్ చేస్తుందా..... బ‌డాబాబులే టార్గెట్ గా ముందుకెళ్తుందా...... అంటే అవున‌నే అంటున్నాయి బ‌ల్దియా వ‌ర్గాలు. తన అమ్ములపొదలో ఉన్న వ‌న‌రుల‌పై దృష్టి  పెట్టింది.  ఆదాయం పెంచుకోవడమే ల‌క్ష్యంగా కసరత్తు చేస్తోంది. ప‌న్ను ఎగ‌వేతదారుల‌పై బాణం ఎక్కు పెడుతోంది...   అసలు ఏం చేయబోతోంది..  అందుకోసం రూపొందించిన ఆప‌రేష‌న్ సునామీ ఫ‌లితాలేంటి.... వాచ్ దిస్ స్టోరి. 
కొత్త కొత్త ప్రాజెక్టుల‌కు ప్లాన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త కొత్త ప్రాజెక్టుల‌కు ప్లాన్ చేస్తోంది బల్దియా. ఇందుకు ప్రభుత్వం స‌హ‌కారం శూన్యం. అదికాక బ‌ల్దియాకు వచ్చే ఆదాయం అంతంత‌ మాత్రమే . ప్రస్తుతం వ‌స్తున్న ఆదాయం ఉద్యోగుల జీతాలు, మెయింటెన్స్‌కు మాత్రమే స‌రిపోతోంది.  దీంతో త‌న కాళ్లమీద తాను నిల‌బ‌డేందుకు అభివృద్ది ప‌నుల‌ను వేగ‌వంతం చేసేందుకు వ‌స్తున్న ఆదాయాన్ని పెంచే ప‌నిలో ప‌డ్డారు జీహెచ్‌ఎంసీ అధికారులు.  ఎలాంటి ప‌న్నులు పెంచ‌కుండా, కొత్త ప‌న్నులు వేయకుండా ముందుకెళ్తున్నారు. 
ఆదాయం పెంచేందుకు తీవ్ర కసరత్తులు 
బ‌ల్దియా ఆదాయం  పెంచేందుకు అధికారులు తీవ్రక‌స‌ర‌త్తు చేస్తున్నారు. పాత‌ప‌ద్దతికి పాత‌ర‌వేసి స‌రికొత్త ఆలోచ‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. అదే ఆప‌రేష‌న్ సునామీ. కార్పొరేష‌న్ కు వ‌స్తున్నా ఆదాయంలో కీల‌క‌మైంది ఆస్తిప‌న్ను. సిటిలో 14ల‌క్షల 20వేల ప్రాప‌ర్టీస్ ఉన్నాయి. ఇందులో 5ల‌క్షల 44వేల ఆస్తులకు ఎన్నిక‌ల హామీలో భాగంగా పన్నును 101 రూపాయ‌ల‌కు త‌గ్గించారు. దీంతో భారీగా ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారిపై దృష్టి పెట్టారు అధికారులు. అస‌లు వారి ఆస్తి స‌క్రమంగా అసెస్ చేయబడిందా.. వారు ఆస్తిప‌న్ను పూర్తి స్థాయిలో చెల్లిస్తున్నారా.. లేదా అన్న దానిపై క్షేత్రస్థాయి స‌ర్వే కోసం రంగంలోకి దిగారు .
200 కోట్లకు చేరిన పన్నుల వాటా
గ్రేట‌ర్ ప‌రిధిలో ల‌క్షకు పైగా ఆస్తిప‌న్ను చెల్లిస్తున్న వారు 13,372 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొద‌ట వీరిపై దృష్టి సారించారు అధికారులు . ఆప‌రేష‌న్ సునామీలో  ఈస్ట్ జోన్ ప‌రిధిలో 82టీంలు, సౌత్ జోన్ లో 23, సెంట్రల్ జోన్ లో 11 టీంలు, వెస్ట్ జోన్ లో 26, నార్త్ జోన్ లో 19టీంలు రంగంలోకి దిగాయి.  ఇప్పటి వ‌ర‌కు 6607 ఆస్తుల‌ను రి ఆసెస్ చేశాయి.  అయితే పాత డిమాండ్ 185కోట్లు ఉండ‌గా కొత్త లెక్కల ప్రకారం అది 200 కోట్లకు చేరింది.  కాప్రా  స‌ర్కిల్లో  ఎవ‌రేజ్ గా ఒక్కో ప్రాప‌ర్టీకి  2 ల‌క్షల 56 వేలు పన్ను పెరిగింది.  జోన్‌ల వారిగా చూస్తే  ఈస్ట్ జోన్ ప‌రిదిలో ల‌క్షా80వేలు, సౌత్ జోన్ లో 69వేలు, సెంట్రల్ జోన్ లో ల‌క్ష రూపాయ‌లు, వెస్ట్ జోన్ లో ల‌క్షా 32వేలు ,నార్త్ జోన్ లో ల‌క్షా 39వేల రూపాయ‌లు పెరిగాయి. 
న‌గ‌రంలోని అన్ని ఆస్తుల‌పై దృష్టి 
ఇక ఈ ఆప‌రేష‌న్ సక్సెస్ అయితే న‌గ‌రంలోని అన్ని ఆస్తుల‌పై దృష్టి సారించ‌నున్నారు అధికారులు. ముఖ్యంగా అండ‌ర్ ఎసెస్డ్  ఆస్తుల్లో బిల్డింగ్ ప్లాన్ ప్రకారం టాక్స్ వ‌సూలు చేసేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు . అవ‌స‌రం అయితే ప్రతి ఆస్తికి లాడ‌ర్ స‌ర్వే చేయ్యాల‌ని భావిస్తోంది బ‌ల్దియా.  బ‌ల్దియా ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా ఆదాయం పెరుగుతుందా.. కార్పొరేష‌న్ సొంత కాళ్ల మీద నిలబడుతుందా...అనేది మ‌రికోద్ది రోజుల్లో తెలిపోనుంది.

 

07:48 - June 1, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల టార్గెట్‌ను 100 శాతం అందుకున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి ప్రకటించారు. ఈ 100 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో ఏయే పనులను ఎంత వరకు పూర్తి చేశారో సవివరంగా వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి రాజధానిగా చేయాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు తూ.చ తప్పకుండా పాటించామని తెలిపారు.  
జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 రోజుల ప్రణాళిక
కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 రోజుల ప్రణాళికను రూపొందించారు. దీని ముఖ్య ఉద్దేశం 100 రోజుల్లో అనుకున్న పనులను అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేయడం.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేటితో ముగయనుండడంతో జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ జనార్దన్ రెడ్డి ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలను తెలిపారు.  
బిల్డింగ్ పర్మిషన్ల కోసం ఆన్ లైన్ సౌకర్యం 
100 రోజుల ప్రణాళిక అమలులో మంచి పురోభివృద్ధి సాధించామని  జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ జనార్థన్ రెడ్డి అన్నారు. దీని కోసం రాత్రింబవళ్లు కష్ట పడిపనిచేశామ‌న్నారు.  కొన్ని విషయాల్లో పూర్తి పనులు చేశామని..  మరి కొన్నింటిని టార్గెట్ బట్టి పూర్తి చేయడానికి  కృషి చేస్తున్నామ‌న్నారు. దేశంలో మొదటిసారిగా బిల్డింగ్ పర్మిషన్ల కోసం ఆన్ లైన్ సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.  ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిని ప్రజలకు అందుబాటులోనికి తెస్తామ‌న్నారు.
284 నాలాల పనుల పూడికతీత
ఇక జీహెచ్ఎంసీ టార్గెట్ గా నిర్ణయించుకున్నా 26 అంశాల్లో 16 అంశాల్లో 100% టార్గెట్ సాధించామ‌న్నారు క‌మిష‌న‌ర్. మిగతావాటిలో 72-నుంచి 90% వరకు అచీవ్ అయ్యామన్నారు.  నగరంలో ఓపెన్ గార్బేజ్ పాయింట్లు  1116 ఉండ‌గా వాటిలో 1089 పాయింట్స్ ను పూర్తిగా తొల‌గించామ‌న్నారు.  నగరంలో 200 కోట్లతో 569 బీటీ రోడ్లు వేయించాలని టార్గెట్ పెట్టుకోగా 526 కంప్లీట్ చేసామ‌న్నార‌కు.  ఇక  నాలాల్లో పూడికతీత కార్యక్రమం చురుకుగా సాగుతుంద‌న్నా క‌మిష‌న‌ర్  317 నాలాల్లో  284 నాలాల్లో పూడిక తీయించామ‌న్నారు.   బల్దియా స్థలాల కోసం 222 కాపౌండ్ వాల్స్ పూర్తి అయ్యాయని..  మరో 169 జూన్లో పూర్తవుతాయ‌న్నారు. మొత్తం 40 మోడల్ మార్కెట్ల నిర్మాణం పూర్తికావచ్చాయని తెలిపారు..  జూన్ 7 వ‌ర‌కు మొత్తం పనులు పూర్తవుతాయ‌ని హ‌మీ ఇచ్చారు.
గ్రేటర్ లో చకచకా జరుగుతున్న పనులు  
మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో పనులు చకచకా జరుగుతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకుని  హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. 

 

07:41 - June 1, 2016

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెద్దగా పెరగకపోయినా ఎన్డీయే సర్కార్ పెట్రో, డీజిల్ ధరలను పెంచేసింది. పెట్రోల్‌పై 2 రూపాయలా 58 పైసల మేర, డీజిల్‌పై 2 రూపాయల 26 పైసల మేర పెంచారు. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్‌ ధర 69 రూపాయల 75 పైసలుకు, డీజిల్‌ 58 రూపాయలా 52 పైసలుకు చేరింది. 

 

07:38 - June 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన వారికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. సాహిత్యం, జర్నలిజం, సంగీతం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డుల్ని ప్రభుత్వం అందచేయనుంది. సీఎం కేసీఆర్‌ హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఇప్పటికే  అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.  
సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం 
తెలంగాణ రాష్ట్ర ద్వితీయ అవతరణ ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జీవోనెంబర్‌ 336ను విడుదల చేసింది. సాహిత్యం, సంగీతం, జానపదం, నృత్యం, ఉద్యమగీతం, పేయింటింగ్‌, జర్నలిజం..తదితర 29 విభాగాల్లో  విశేష కృషి చేసిన 62 మంది ప్రముఖులను ప్రభుత్వం ఎంపిక చేసింది. గతేడాదిలాగే ఈసారి కూడా సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.
అవార్డులకు పలువురు ఎంపిక
సాహిత్యంలో వరంగల్‌కు చెందిన కోవెల సుప్రసన్నాచార్య, కపిలవాయి లింగమూర్తి, ముదిగొండ సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, కేవీ నరెందర్‌, అబ్దుల్‌రహమాన్‌ఖాన్‌, అబ్దుల్‌ ఇబ్రహీం, హమీ అవార్డులకు ఎంపికయ్యారు. నృత్యంలో దీపికారెడ్డి, పేరిణి నృత్యకారుడు ప్రకాశ్‌ అవార్డులకు ఎంపికయ్యారు. జానపద నృత్యంలో అంతడ్పుల నాగరాజు ఎంపిక కాగా,.సంగీతంలో మిట్టా జనార్ధన్‌, రామాచారి, ప్రభాకర్‌, జంగిరెడ్డి, ధర్మానాయక్‌, రవి, గంగ ఎంపికయ్యారు. ఉద్యమగీతం కేటగిరిలో యష్పాల్‌, పద్మావతి, తేలు విజయ, పెయింటింగ్‌లో వై బాలయ్య ఎంపికయ్యారు. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌రావు, అంకటి రాజు ఉత్తమ సైంటిస్ట్‌ కేటగిరిలో అవార్డులకు ఎంపికయ్యారు. జర్నిలిజంలో గౌరీశంకర్‌, నూర శ్రీనివాస్‌, ఆకారపు మల్లేశం, ఎంఏ మాజిద్‌, కవిత, కార్టూనిస్టు శంకర్‌లు ఎంపికయ్యారు. ఉత్తమ లాయర్‌గా గుడిమల్ల రవికుమార్‌ ఎంపిక కాగా, ఇటీవల ఎవరెస్ట్‌ అధిరోహించిన ఏఎస్సీ రాధికను కూడా ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేసింది.  
పలు సంస్థలకు అవార్డులు 
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పలు సంస్థలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. హ్యాండీక్రాప్ట్ కేటగిరిలో నిర్మల్‌ కొయ్య బొమ్మలకు అవార్డు దక్కింది. ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం, ఉత్తమ పంచాయతీలుగా మెదక్‌ జిల్లా ముల్కనూర్‌, కరీంనగర్‌ జిల్లా బెజ్జంకి మండలం మాదాపూర్‌లు ఎంపికయ్యాయి. ఉత్తమ మండలంగా మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ టీచర్‌గా కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీమతి బలబీర్‌సింగ్‌ కౌర్‌ ఎంపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రతిభను గుర్తించి అవార్డులను ప్రకటించడంపై అవార్డు గ్రహీతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

 

07:34 - June 1, 2016

విజయవాడ : జూన్‌ 3 నుంచి ఏపీలో నవ నిర్మాణ్‌ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్‌ మూడు నుంచి 7 వరకు నిర్వహించనున్న ఈ స్పెషల్‌ ప్రోగ్రామ్‌లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించనున్నారు.
వివిధ అంశాలపై సదస్సులు 
నవ నిర్మాణ్‌.. జూన్ మూడు నుంచి 7వ తేదీ వరకు నవ నిర్మాణ్‌ పేరుతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ లక్ష్యాలను నిర్దేశించనున్నారు. జూన్‌ 3న అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రజలు, ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయాలు అనే అంశంపై జూన్‌ 4న సదస్సు నిర్వహిస్తారు. రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్‌, సీఐఐ భాగస్వామ్య సదస్సు ఇలా అనేక విషయాలపై సదస్సులో చర్చిస్తారు.
నీరు-చెట్టు, వాటర్ గ్రిడ్‌ అనే అంశాలపై చర్చలు
జూన్‌ 5న వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో అగ్రికల్చర్‌ దాని అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్‌ కార్యాచరణ అనే అంశంపై సదస్సు ఉంటుంది. జల వనరులే జాతి సంపద అనే స్ఫూర్తితో ప్రాథమిక రంగ మిషన్, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, వాటర్ గ్రిడ్‌ వంటి వినూత్న కార్యక్రమాల గురించి చర్చిస్తారు.  జూన్ 6న పరిశ్రమలు, సేవా రంగం, రెగ్యులేటరీ సెక్టార్‌లో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై సదస్సులు నిర్వహిస్తారు. పారిశ్రామిక రంగ మిషన్, మౌలిక సదుపాయాల మిషన్‌, సేవా రంగాల మిషన్‌ వంటి అంశాలపై చర్చిస్తారు. 
గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు
గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు, రానున్న కాలానికి ప్రణాళిక వ్యూహాలు అనే అంశంపై జూన్‌ 7న సదస్సులు నిర్వహిస్తారు. సామాజిక సాధికారత మిషన్, పరిజ్ఙాన నైపుణ్యాభివృద్ధి మిషన్, పట్టణాభివృద్ధి మిషన్‌ల గురించి చర్చిస్తారు. బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, తదితర అంశాలపై ప్రధానంగా చర్చలు నిర్వహిస్తారు. రోడ్ల మీదే నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఙలు జరపాలని ప్రజల్లో కసి రగిలించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు. 
ప్రజల్లో స్ఫూర్తి రగిలించేలా కార్యక్రమాలు 
ప్రజల్లో స్ఫూర్తి రగిలించేలా నవ నిర్మాణ కార్యమాన్ని నిర్వహించాలని 175 నియోజకవర్గాల్లో అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో రాష్ట్ర పరిస్థితులను వివరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సదస్సుల్లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 

 

07:26 - June 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని ఏ ఊరు చూసినా.. ఏ పల్లె చూసినా తెలంగాణ జెండా రెపరెపలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగే రెండో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలంకరణలతో దగదగలాడుతున్నాయి. మరోవైపు దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండాను ఎగరేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. 
60ఏళ్ల కలను సాకారం చేసుకున్న రోజు.. 
జూన్ రెండు తెలంగాణ స్వయం పరిపాలన గల రాష్ట్రంగా ఏర్పడిన రోజు..60ఏళ్ల కలను సాకారం చేసుకున్న రోజు.. అందుకే ఆ రోజును వాడ వాడలా ఓ పండుగలా జరుపుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అంతేకాదు..తెలంగాణ సిద్ధించి రెండేళ్లవుతున్న సందర్బంగా ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరపడానికి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఆవతరణ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.  
దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ 
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతాలన్ని విద్యుత్ దీపాలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సంజీవయ్య పార్కులో దేశంలోనే అతి పెద్ద జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు ముమ్ముంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు,అధికారులు ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 298 అడుగుల ఎత్తు ఉన్న పోల్‌ను పార్క్ లో ఏర్పాటు చేయనున్నారు. జాతీయ జెండా 108 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. జెండా బరువు 92 కేజీలున్నట్లు సమాచారం. జూన్‌ 2న  జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా రిహార్సల్స్  
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే రిహార్సల్స్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ రిహార్సల్స్‌ను డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి,హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్టా తదితరులు పరిశీలించారు. నగరంలోని పలు కాలేజీల విద్యార్థులు తమ ప్రదర్శనలను అధికారుల ముందు ప్రదర్శించారు. అవతరణ దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుంకు కట్టుదిట్టమైన పకడ్భంది ఏర్పాట్లు చేశామని మూడు వేల మంది పోలీసులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు..
ఢిల్లీలో రాష్ట్ర అవతరణ దినోత్సవం  
తెలంగాణ రాష్ట్రఅవతరణ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నామని..తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఆవిర్భావ వేడుకలకు వివిధ దేశాల అంబాసిడర్లు, కేంద్రమంత్రులను, ఢిల్లీలోని తెలంగాణవాసులను ఆహ్వానించామని ఆయన తెలిపారు. 
ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్ధులు,యువకులు,పోలీసులు పాల్గొన్నారు. అలాగే ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం ఆవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యింది. వేడుకల్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయజెండా ఎగురవేయాలని ఆదేశాలు జారీచేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లన్ని విద్యుత్ దగలతో మెరిసిపోతున్నాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని కన్నుల పండవగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ సన్నద్ధమయ్యారు. 

నేడు అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన

అనంతపురం : వైసీపీ అధినేత జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో జగన్ రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు.  

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

నిజామాబాద్ : మంత్రి హరీష్ రావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

నేటి నుంచి లూయిస్ ఫిలిప్ కప్ ప్రొ గోల్ఫ్ లీగ్

బెంగళూరు : నేటి నుంచి లూయిస్ ఫిలిప్ కప్ ప్రొ గోల్ఫ్ లీగ్ జరుగనుంది. పలు జట్లు పాల్గొననున్నాయి. 

Don't Miss