Activities calendar

02 June 2016

పోలీసుల కళ్లు కప్పిన రేవంత్ రెడ్డి....

హైదరాబాద్ : ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల కళ్లుకప్పి జనజాతర సభకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా సెమిస్టర్ పరీక్షల సందర్భంగా క్యాంపస్ లోకి రాజకీయ నేతలు ప్రవేశించకూడదని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

ఓయూలో ఉద్రిక్తత...

హైదరాబాద్ : ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జనజాతర సభకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అంబర్ పేట పీఎస్ తరలించారు.

మధురలో ఉద్రిక్తత..పోలీస్ అధికారి మృతి..

ఉత్తరప్రదేశ్ : మధురలో ఓ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆక్రమణల తొలగింపు సందర్బంగా స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణలో ఓ పోలీసు మృతి చెందాడు. ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. 

20:22 - June 2, 2016

సినిమా ఊహల ప్రపంచం కాబట్టి ఎక్కువ మంది దర్శకులు ఫాంటసీ కథలనే ఎంచుకుంటారు. కానీ మన కుటుంబాల్లో...మన మధ్య జరిగే కథల్ని సినిమాగా తెరకెక్కించాలంటే...చాలా ప్రతిభ కావాలి. ఇలాంటి టాలెంట్ పుష్టిగా ఉన్న దర్శకుడు త్రివిక్రమ్....కలమే బలంగా...మరో సకుటుంబ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రచనలో సత్తా ఉంటే పాత కథల్ని కూడా పోపు పెట్టి రుచిగా వడ్డించొచ్చు. అ..ఆ..తో త్రివిక్రమ్ అదే చేశాడు. యుద్ధనపూడి సూలోచనారాణి రాసిన మీనా నవలను అదే పేరుతో విజయనిర్మల సినిమాగా తెరకెక్కించారు. విజయ నిర్మలకు దర్శకురాలిగా తొలి చిత్రమిది. మీనా విడుదలై నలభై ఏళ్లయినా...ఆ కథలో కుటుంబాల తీరుతెన్నులు ఇప్పటికీ పోల్చుకోవచ్చు. ఇదే అంశం త్రివిక్రమ్ కు స్ఫూర్తినిచ్చి ఉంటుంది....అందుకే అప్పటి కథను తన కొత్త సినిమా అ..ఆ...కు మూల కథగా ఎంచుకున్నాడు....సినిమా కథను చూస్తే....అనసూయ రామలింగం నాన్న కూచి...ఇంట్లో అమ్మ మహాలక్ష్మి మాటే వేదం. పెద్ద వ్యాపారవేత్తగా రాణిస్తూనే...కుటుంబాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. కానీ అనసూయకు అమ్మ చెప్పిందేదీ నచ్చదు. చివరకు తను తీసుకొచ్చిన పెళ్లి సంబంధం కూడా. కూతురు హాయిగా జీవితంలో సెటిల్ అవ్వాలని తల్లి కోరిక. పెళ్లి నచ్చక...ఆత్మహత్య ప్రయత్నం చేసిన కూతురుని...తల్లికి తెలీకుండా కొన్నాళ్లు మేనత్త ఇంట్లో ఉండమని పంపిస్తాడు తండ్రి రామలింగం. మేనత్త కుటుంబం ఆ పల్లెటూరిలో ఉన్నతంలో హాయిగా అంతా కలిసి ప్రేమానురాగాలతో ఉండటాన్ని అనసూయ ఇష్టపడుతుంది. పనిలో పనిగా బావ ఆనంద్ నూ ప్రేమిస్తుంది. ఐతే..కష్టాల్లో ఉన్నప్పుడు అప్పిచ్చిన పొరుగు వ్యక్తి పల్లం వెంకన్న ...ఆనంద్ తన కూతురు నాగవల్లిని పెళ్లి చేసుకోవాలని షరతు పెడతాడు. ఇంతకీ మేనత్త ఇంటికి అనసూయ వెళ్లడం తల్లి మహాలక్ష్మి ఎందుకు ఇష్టం లేదన్నది ఓ ఫ్లాష్ బ్యాక్...ఈ చరిత్రేంటి...నాగవల్లిని తప్పించుకుని ఆనంద్ అనసూయను ఎలా దక్కించుకున్నాడన్నది మిగిలిన కథ.......దశాబ్దాల కిందటి కథైనా.....మన ఆర్థిక, కుటుంబ వ్యవస్థ మారని నేపథ్యంలో కథకు కాలదోషం పట్టలేదు. పైగా త్రివిక్రమ్ తన మాటలతో కథకు నూతనత్వం తెచ్చాడు. ఐతే మొదటి అర్థభాగం స్పీడుగా సాగిన స్క్రీన్ ప్లే...సెకండాఫ్ లో నెమ్మదించింది. ఫ్రీ క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి....క్లైమాక్స్ నిలబడింది. అనసూయ, ఆనంద్ పాత్రల్లో సమంత, నితిన్ బాగున్నారు. పల్లం వెంకన్న పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నాడు. రావు రమేష్ కు ఇది మరో మంచి క్యారెక్టర్. అత్త పాత్రలో నదియా...భయపడే భర్తగా నరేష్ సహజంగా నటించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మొదటి పాట తప్ప మిగతా పాటల్లో స్వరాలు కుదరలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి....

ఫ్లస్ పాయింట్స్  : 

 1. సంభాషణలు

 2. ప్రొడక్షన్ వ్యాల్యూస్

 3. రావు రమేష్ పాత్ర
  మైనస్ పాయింట్స్ : 
  1. నెమ్మదించిన కథనం

  2.  స్పష్టతలేని పాత్రలు
  3. సంగీతం
   ఈసినిమాకు 10టీవీ ఇచ్చిన  రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.. 

ఎమ్మెల్యే వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం...

వరంగల్ : ఓవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నామని కేసీఆర్ సర్కారు బీరాలు పలుకుతోంది. మరోవైపు ప్రజాప్రతినిధులు రైతులను బెదిరించి వారి భూమిని లాక్కుంటున్నారని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యా యత్నం చేశాడు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరో భూకబ్జాకు తెరలేపారు. బత్తుల కొమురుమల్లు అనే రైతు శంకర్ నాయక్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమంగా వుంటంతో కొమురుమల్లును మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు.

19:40 - June 2, 2016

విశాఖ : మన్యంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతల ఎన్‌కౌంటర్.. ఆరోగ్య సమస్యలు.. పెరుగుతున్న పోలీసుల నిర్భంధం.. క్యాడర్ మధ్య విభేదాలు...లొంగిపోమ్మంటూ కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులో వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. దీంతో ఏవోబీలో పటిష్టంగా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు తమ ఉనికినే కోల్పోతున్నారు.

విశాఖ మన్యం మావోయిస్టులకు పెట్టని కోట...
ఒకప్పుడు విశాఖ మన్యం మావోయిస్టులకు పెట్టని కోటగా ఉండేది. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో దాడులు చేసి.. అక్కడి నుంచి ఏవోబీలోకి వచ్చి తప్పించుకునేవారు. ఇంతేకాకుండా ఏవోబీలో కోరుకొండ, గాలికొండ దళాలు పోలీసులకు సవాళ్లు విసిరేవి. ఇక ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో తరుచుగా సమావేశాలు, సభలు వారోత్సవాలు నిర్వహించే వారు. అలాంటిది ఇప్పుడు క్యాడర్‌ను కాపాడుకోవడం మావోయిస్టులకు పెద్ద సమస్యగా మారింది. వరుసగా ఘటనలు మావోయిస్టుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి..

వరుసగా దెబ్బ మీద దెబ్బ...
ఇటీవల కాలంలో ఏవోబీలో మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఏవోబీలో మావోయిస్టు కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొనే కుడుముల రవి అనారోగ్యంతో మరణించాడు. ఇతని మరణం నుంచి కోలుకోక మునుపే విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాకల గ్రామం వద్ద మావోయిస్టులు.. పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏవోబీలో కమాండర్ ఆజాద్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఇదే సమయంలో వరుసగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం కూడా కలవరపెడుతోంది.

పోలీసులు అదుపులో కీలక నేతలు..
మావోయిస్టుల కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మన్యం మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న ఈస్ట్ డివిజన్ మెంబర్ అయిన వంతల వసంత అలియాస్ జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంతల వసంతపై 15 హత్య కేసులతో సహా 51 కేసులున్నాయి. ఈమెపై నాలుగు లక్షల రివార్డు కూడా ఉంది. ఇదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో సెంట్రల్ మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న ఏకైక మహిళ మావోయిస్టు కడబాల లక్ష్మి అలియాస్ సరితా, ఏవోబీతో పాటు చత్తీస్ గఢ్ లో పనిచేసిన బోనంగి రాములమ్మ అలియాస్ భారతక్క తో పాటుగా మావొయిస్టు సభ్యురాలు తాంబేలు తుమ్మ అలియాస్ విజయలు పోలీసుల ఎదుట లొంగిపోయీరు. విశాఖ మన్యంలో మావోయిస్టుల తగ్గడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఏవోబీలో తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు చాలా తిప్పలు పడుతున్నారు. 

19:33 - June 2, 2016

కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం బిసిలను విస్మరిస్తుందని కర్నూలు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ అన్నారు. కర్నూలు నగంలోని టిడిపి కార్యాలయం ఎదుట మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ బైఠాయించి ఆందోళన చేపట్టారు. బిసీలకు కేటాయించాల్సిన రాజసభ సీటు ఇతరులకు కేటాయించడం పట్ల బీసి సంఘాలు కర్నూలు టిడిపి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. 

19:29 - June 2, 2016

ఢిల్లీ : తన ఓఎస్డీ అప్పారావు ఫోన్ కాల్స్‌ను తనిఖీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. అన్యాయంగా ఆయనను ఉరేయమని మాత్రం చెప్పబోనని, ఆయన మీద తనకు నమ్మకం ఉన్నంత వరకు ఓఎస్డీగా కొనసాగిస్తానని తెలిపారు. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీని ఓ ఎయిర్‌షోలో కలిశానన్నారు. సంజయ్‌ పై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటి మీద విచారణ జరిగితే తప్ప నిజానిజాలు ఏంటో తెలియవన్నారు అశోక గజపతిరాజు.

19:22 - June 2, 2016

పశ్చిమగోదావరి : భీమవరంలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. మార్కెట్‌లో నివాసం ఉంటున్న సుబ్బారావు, రాణిల నాలుగేళ్ల కుమారుడిని గుర్తుతెలియని మహిళలు కిడ్నాప్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాప్‌నకు పాల్పడింది మహిళలేనని పోలీసులు గుర్తించారు. 

19:19 - June 2, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ధైర్యంగా ముందుకు వెళ్దామని.. విజయం వరించేంతవరకు కసితో కష్టపడి పనిచేద్దామన్నారు. విజయవాడలో జరిగిన నవనిర్మాణదీక్ష సాక్షిగా .. ప్రజలంతా కలిసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

బెంజి సర్కిల్ లో నవ నిర్మాణం...
ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన రోజున ఏపీ ప్రభుత్వం బెంజి సర్కిల్ ప్రాంతాలలో నవనిర్మాణ దీక్ష నిర్వహించింది. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని దీక్షకు హాజరైన వారందరితోను ప్రతిజ్ఞ చేయించారు. రెండేళ్ల క్రితం అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని.. కట్టుబట్టలతో బయటకు పంపించారని అయినా ఆత్మవిశ్వాసంతో అభివృద్దివైపు ప్రభుత్వం సాగుతుందని చంద్రబాబు అన్నారు. విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్‌ అనేక సమస్యల్లో ఉందని చంద్రబాబునాయుడు అన్నారు. అప్పటి గవర్నర్‌, చీఫ్‌ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికలోటును 16 వేల కోట్లుగా అంచనా వేశారని, ఆ డబ్బును ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని అన్నారు. అది కూడా సరిపోదని ప్రత్యేకహోదా కూడా ఇవ్వాలని కోరారని కానీ నేటికీ బిల్లులో పెట్టలేదని అన్నారు.
విభజనానంతరం ఎన్నో కష్టాలు : బాబు
రాష్ట్ర విభజనానంతరం అనేక కష్టాలు ఎదుర్కొనవలసి వస్తోందని సీఎం అన్నారు. విభజన ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కరవు తాండవిస్తోందని చెప్పారు. గతంలో హుదూద్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందన్నారు.

గుజరాత్‌ తర్వాత స్థానం ఏపీదే : చంద్రబాబు
దేశాభివృద్ధి 7 శాతంగా ఉంటే ఏపీ అభివృద్ధి 11 శాతంగా ఉందని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధిలో గుజరాత్‌ తర్వాత స్థానం ఏపీదేనని తెలిపారు. కరెంట్‌కోతలేని ఏకైక రాష్ట్రం ఒక్క ఏపీయేనని అన్నారు. శక్తికి మించి శ్రమిస్తున్నానని 8వ తేదీన ప్రగతి నివేదికల్ని ఇస్తామని అన్నారు. రాష్ట్రం ముందుకు వెళ్లేవరకు కేంద్రసాయం అవసరమని.. కలిసి కట్టుగా ముందుకు వెళ్లి పోరాడదామని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

18:47 - June 2, 2016

అనంతపురం : అవివేకమో.. నిర్లక్ష్యమో..అమాయకత్వమో..మూర్ఖత్వమో తెలీదుగానీ తల్లీ, చిన్నారి మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చంద్రకళ అనే మహిళను పాము కాటేసింది. చంద్రకళ పాముకాటుకు గురైన ఆమె నాటువైద్యం చేయించుకుంది. అనంతరం 18నెలల కుమారుడికి ఆమె పాలివ్వటంతో చిన్నారి కూడా మృతి చెందాడు. దీంతో తల్తి చనిపోయిన కాసేపటికే చిన్నారి కూడా మృతి చెందాడు. తన గృహం నిద్రపోతున్న చంద్రకళను రాత్రి సమయంలో పాము కాటు వేసింది.కొంతసేపటికి అనుమానం వచ్చి చంద్రకళకు కాళ్లపై పాముకాటు వేసినట్లు గమనించింది. అనంతరం కుటుంబ సభ్యులకు తెలపటంతో ఆమెకు నాటువైద్యం చేయించారు. అనంతరం చిన్నారికి పాలు ఇవ్వటంతో తల్లి మృతి చెందిన కొంతసేపటికే చిన్నారి కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 

18:43 - June 2, 2016

నల్లగొండ : కొందరైతే, పోరాటంలో గాయపడి..జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నవారు మరికొందరు. తాము కోరుకున్న స్వరాష్ట్రం సిద్ధించింది. అయినా నాటి పోరాటంలో గాయపడిన వారిని పట్టించుకున్న నాథుడే లేడు.. తెలంగాణ సాధన కోసం ఆత్మహత్యాయత్నం చేసి కాళ్లు, చేతులు కోల్పోయి, జీవచ్ఛవంలా బతుకుతూ, ప్రభుత్వ సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్న నల్లగొండ జిల్లా యువకుడి వేదనపై ప్రత్యేక కథనం...

పిడమర్తి నాగరాజు త్యాగం మరచిన సర్కారు...
తెలంగాణ ఉద్యమం వరకూ ముందుండి నడిపించింది. మలిదశ ఉద్యమంలో అమరుడైన తొలి విద్యార్థి శ్రీకాంతాచారి ఈ జిల్లావాసే.. అదేబాటలో గరిడేపల్లి మండలం రాయినిగూడెంకి చెందిన పిడమర్తి నాగరాజు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. జేఏసీ కార్యదర్శిగా పని చేశాడు. రాష్ట్ర సాధన కోసం ఏదైనా చేయాలని పరితపించాడు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ లేఖ రాశాడు. 2011 ఆగస్టు 15న మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మబలిదానానికి యత్నించాడు. నాగరాజు శరీరంపై నుంచి రైలు వెళ్లినా ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో రెండు కాళ్లు, ఎడమ చేయి కోల్పోయాడు నాగరాజు.

నేతల హామీలేమయ్యాయి?...
నాగరాజు విషయం తెలిసిన వెంటనే టీఆర్‌ఎస్ నేతలు ఆగమేఘాలమీద గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈటెలరాజేందర్, నాయిని నర్సింహారెడ్డి సహా ఇతర నేతలు పరామర్శించారు. లక్షలు ఖర్చు పెట్టినా.. విదేశాల నుంచి కృత్రిమ కాళ్లు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి ఐదేళ్లు కావస్తోంది. కృత్రిమ కాళ్లు సంగతి అటుంచితే, కనీసం వీల్‌చైర్ సహాయం కూడా అందలేదు.

చనిపోయుంటే అమరవీరుడునైనా అయ్యుండేవాడినని నాగరాజు అవేదన..
నాగరాజును నేతలు మర్చిపోయారేమో అనుకోవడానికి లేదు. సాధారణ ఎన్నికల సమయంలో హుజూర్‌నగర్‌లో జరిగిన సభలో టీఆర్ఎస్ నేత హరీష్‌రావు సమక్షంలో నాగరాజును వేదిక మీదకు ఆహ్వానించారు. నాగరాజు కుటుంబానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గతేడాది జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లా యంత్రాంగం నాగరాజును శాలువా కప్పి సత్కరించారు. సత్కారాలతో తనకేమి వస్తుందనీ, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకీడుస్తున్నాననీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నాగరాజు. తాను చనిపోయినా బావుండేదని...అప్పుడైనా తనను అమరుడిగా గుర్తించేవారేమోనని కంటతడి పెట్టుకుంటున్నాడు.

తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కుంటుంబ సభ్యుల డిమాండ్ ..
చదువుకొని ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రాష్ట్ర సాధన కోసం వికలాంగుడిగా మారాడని నాగరాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పేద కుటుంబమైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

సదావర్తి సత్రం భూముల్లో భారీగా అక్రమాలు : స్వరూపానంద

చెన్నై : సదావర్తి సత్రం భూముల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని స్వామీ స్వరూపానంద పేర్కొన్నారు.దాదాపు 470 ఎకరాలకు 83 ఎకరాలు మిగిలాయని ఆయన తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయ పరిరక్షణకు పీఠాధిపతులతో కలిసి ఉద్యమం చేపడతానన్నారు. 

18:24 - June 2, 2016

హైదరాబాద్ : ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా తెలంగాణలో పరిపాలన సాగుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర అవతరణోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లైన సందర్భంగా వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్‌ మైదానంలో జరిగిన వేడుకల్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్‌... అనంతరం తమ భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించారు.

కృష్ణా, గోదావరి జలాలతో రూ.4 కోట్ల ఎకరాల్లో వ్యవసాయం...
తెలంగాణ, ఏపీల్లో పారే కృష్ణా గోదావరి జలాలలో నాలుగు కోట్ల ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకులక్లో భాగంగా హెచ్‌ఐసీసీలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింంహన్‌ పాల్గొన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటేనే ప్రయోజనమని కేసీఆర్‌ అన్నారు.

అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు...
తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొదట గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో దేశంలోనే అత్యంత ఎత్తు, పొడవైన జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

భారీ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్...
లుంబిని పార్కు వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్మృతి చిహ్మానికి సీఎం కేసీఆర్‌ శంఖుస్థాపన చేశారు. అనంతరం హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో భారీ జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా 298 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పుగల జాతీయపతాకం ఆవిష్కరణ చేయడం విశేషం. హైదరాబాద్‌ నగరంలో 20 కిలోమీటర్ల దూరం వరకు ఈ జెండా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. 40 మెట్రిక్‌ టన్నుల బరువున్న ఈ పతాకం పోల్‌ని అమర్చడానికి భారీ క్రేన్‌ను ఉపయోగించారు. ఆర్‌ అండ్‌ బీ అధికారులు 25 రోజులపాటు శ్రమించి మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతాకం ఏర్పాటుతో నగరాన్ని మరింత వన్నె తెచ్చినట్లయిందని పలువురు అభిప్రాయపడ్డారు.

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఉద్యమం...
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బాలారిష్టాలు అధిగమించి మ్యానిఫెస్టోలో కూడా పెట్టని ప్రజావసర పథకాలు సైతం అమలు చేస్తున్నామని అన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు మన ప్రభుత్వం అనిపించేలా పాలన సాగుతోందన్నారు. మూస ధోరణులకు స్వస్తి చెప్పి పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళికలతో పురోగమిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ...
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ రేండేళ్లలో ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ పథకాలును చేపట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ నేడు నియామక పత్రాలు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.

అమరులైన కుటుంబాలకు రూ. 10 లక్షలు...
తెలంగాణ కోసం పోరాడి అమరులైన కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా.. అమరవీరులైన కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. 598 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు.

598 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాం...
ప్రజలకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా సుపరిపాలన అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్రవతరణ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మానవీయ దృక్పథంతో బడుగు, బలహీన వర్గాలకు ఆసరా పెన్షన్లను అందిస్తున్నామని, పెరిగిన పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు ఎంతో మంది అభాగ్యులు తమకు భరోసా దొరికిందన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సీఎం అన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను ఆదుకోవడం కోసం..రాష్ట్రవ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తున్నామని సీఎం అన్నారు.

65 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు...
పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంలో భాగంగా గతేడాది 65 వేల ఇళ్లను, ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లను మంజూరు చేశామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జర్నిలిస్టులకు ప్రత్యేక కాలనీ నిర్మించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ చేస్తున్నామని, సంక్షేమ రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

మిషన్‌ భగీరథ పథకం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది : కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్‌ భగీరథ పథకం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిందని, వచ్చే ఎన్నికల నాటికి ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని మంచినీళ్ల కోసం వీధుల్లో వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసేందుకు మిషన్‌ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఎం చెప్పారు.

2018నాటికి కోటి ఎకరాలకు సాగునీరు: కేసీఆర్
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టుల రీడిజైన్‌ చేసినట్లు సీఎం తెలిపారు. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నామని సీఎం అన్నారు. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయని, 2022 నాటికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తవుతాయని సీఎం చెప్పారు.

మిషన్‌ కాకతీయతో ఎనిమిది వేల చెరువులను పునరుద్ధరణ..
మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నట్లు, రైతులు, ప్రజల భాగస్వామ్యంతో మిషన్‌ కాకతీయ తొలిదశలో ఎనిమిది వేల చెరువులను పునరుద్ధరించినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ విద్యను పటిష్ట పరిచేందుకు ఎస్సీలకు 130, ఎస్టీలకు 50, మైనారిటీలకు 70.. ఇలా మొత్తం 250 రెసిడెన్సియల్‌ స్కూళ్లను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేసే దిశంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో నాలుగు పెద్దాసుపత్రులు..
సర్కారీ వైద్యానికి సోకిన రుగ్మతలు తొలగించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాల్లో కొత్త మంచాలు, కొత్త బెడ్లు, బెడ్‌ షీట్లు సమకూర్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌లో నాలుగు పెద్దాసుపత్రులు, రాష్ట్రంలో మారో మూడు చోట్ల కొత్త హాస్పిటళ్లను నిర్మించబోతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాకు నాలుగు చొప్పున డయాలసిస్‌, ఐసీయూలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, మామ్మోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ లాంటి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు.

భాగ్యనగరంలో ఆపిల్ కేంద్రం...
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామికాభివృద్ధికి నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. పరిశ్రమల అనుమతులకు సింగిల్‌విండో విధానం ప్రవేశపెట్టి 15 రోజుల్లో అనుమతులిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే 1798 పరిశ్రమలు, 24,698 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చాయని కేసీఆర్‌ తెలిపారు. విఖ్యాత ఐటీ దిగ్గజం ఆపిల్‌ తన టెక్నాలజీ మాపింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించడం విశేషమని సీఎం అన్నారు.

దసరా నుండి కొత్త జిల్లాల కొలువు...
భౌగోళిక సామీప్యం, ప్రజలకు సౌకర్యం, పరిపాలనలో సౌలభ్యం అనే మూడు అంశాలు గీటురాయిగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు పూనుకున్నామని, వచ్చే దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు కొలువు తీరుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నత స్థాయికి చేర్చి బంగారు తెలంగాణకు అర్థం, పరమార్థాన్ని చాటుతామని సీఎం చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పునరంకితమవుదామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

పాముకాటు..తల్లీతోపాటు చిన్నారి మృతి..

అనంతపురం : అవివేకమో, నిర్లక్ష్యమో, అమాయకత్వమో తెలీదుగానీ తల్లీ, చిన్నారి మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చంద్రకళ అనే మహిళను పాము కాటేసింది. చంద్రకళ పాముకాటుకు నాటువైద్యం చేయించుకుంది. అనంతరం 18నెలల కుమారుడికి ఆమె పాలివ్వటంతో చిన్నారి కూడా మృతి చెందాడు. దీంతో తల్తి చనిపోయిన కాసేపటికే చిన్నారి కూడా మృతి చెందాడు. 

ముంబైలో భారీ అగ్నిప్రమాదం..

ముంబై : కొలబా ప్రాంతంలోని ఓ భవనంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సుమారు 12 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మరో ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు - ఐఎండీ..

హైదరాబాద్ : మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దేశ వ్యాప్తంగా జూలై నెలలో సుమారు 107 శాతం వర్షపాతం నమోదు అవుతుందని, ఆగస్టులో 104 శాతం వర్షం నమోదు అవుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. 

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం...

ముంబై: దేశ రాజధాని ముంబై కొలాబాలోని రీగల్ సినిమా థియేటర్‌కు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చుట్టుపక్కల వారిని ఖాళి చేయించి 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. భవనంలో చిక్కుకున్న ముగ్గురిని రెస్క్యూ టీం కాపాడింది. 

17:17 - June 2, 2016

సమంత..టాలీవుడ్ లో యువ హీరోలు..సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన 'అ..ఆ' సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. కానీ ఈ సమంతపై ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాను ప్రేమలో ఉన్నట్లు..త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమంత ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఆ యువ హీరో ఎవరనే దానిపై కథనాలు వెలువడ్డాయి. తన పెళ్లి గురించి మాట్లాడవద్దని.. ఆ విషయం అడగవద్దని చెప్పింది. కానీ తాజాగా ఈమె ఓ హీరోతో సినిమా చూసిన ఫొటో సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఆమె నటించిన 'అ..ఆ' సినిమా చూసేందుకు హీరో నాగ చైతన్యతో వచ్చింది. దీనితో సమంత పెళ్లి చేసుకోబోయేది ఇతనే అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఈ వార్త నిజమా కాదా ? అనేది సమంత పెదవి విప్పితేనే తెలుస్తుంది. 

రక్షించబోయి ప్రాణం కోల్పోయిన యువకుడు...

విశాఖ: రావికమతం మండలం గుదిపలో విషాదం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతిచెందాడు. గమనించిన ఓ యువకుడు బాలుడిని రక్షించే ప్రయత్నంలో చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

గుడుంబా స్థావరాలపై దాడులు..

ఆదిలాబాద్‌: జిల్లాలోని దండేపల్లి మండలం లింగాపూర్‌లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 400 లీటర్ల బెల్లంపానకంను పోలీసులు ధ్వంసం చేశారు. గడుంబా స్థావరాలను నిర్వహిస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్..

విజయనగరం : రూ లక్ష లంచం తీసుకుంటూ విజయనగరం టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ నారాయణరావు ఏసీబీకి చిక్కాడు. 

ఆరోపణలపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పందన..

ఢిల్లీ : తనపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. బెంగళూరు ఎయిర్ షోలో ఆయుధాల వ్యాపారి భండారీ ఆహ్వానం మేరకు స్టాల్ ను సందర్శించడం జరిగిందన్నారు. అప్పారావు నమ్మకంతోనే ఓఎస్డీగా నియమించుకోవడం జరిగిందని, ఆరోపణలు ఉన్నంత మాత్రానా ఉరితీయలేం కదా అని తెలిపారు. ఆయుధాల వ్యాపారి భండారీతో తన ఓఎస్డీ అప్పారావు ఫోన్ కాల్స్ పై దర్యాప్తు చేసుకోవచ్చని సూచించారు. తానెవరనీ రక్షించనని..నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవడం జరగదని కుండబద్ధలు కొట్టారు. తన కార్యాలయ సిబ్బంది చర్యలకు బాధ్యత వహిస్తానని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. 

vbఈతకు వెళ్లి బాలుడి మృతి..

విశాఖపట్టణం : రావికమతం (మం) గుడ్డిప గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఎనిమిదేళ్ల బాలుడు సతీష్ మృతి చెందాడు. బాలుడిని రక్షించేందుకు వెళ్లిన యువకుడు కూడా మృతి చెందాడు. 

జనజాతర సభ ప్రారంభం..

హైదరాబాద్ : ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జనజాతర సభ ప్రారంభమైంది. ఈ సభలో రాజకీయ నాయకులు పాల్గొనవద్దని, కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఓయూలోకి ప్రవేశిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. 

బావిపూడిక ఘటనలో ఇద్దరు మృతి..

కృష్ణా : నందిగామ (మం) కొండూరులో విషాదం చోటు చేసుకుంది. బావి పూడిక తీస్తుండగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. మృతులు సత్యం, శ్రీనుగా గుర్తించారు.

భరతీయులు వెర్రివాళ్లా : ఓంపురి...

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష స్థానంలోకి త్వరలోనే రాహుల్‌ గాంధీ రాబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పగ్గాలను త్వరలోనే తన కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అప్పగించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయమై బాలీవుడ్‌ నటుడు ఓంపురి ఘాటుగా స్పందించారు. రాహుల్‌ని కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేస్తే ప్రధానిగా అతనికి ఓటేయడానికి భారతీయులు వెర్రివారా.. రాహుల్‌ అధ్యక్షుడైతే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు భాజపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.

16:36 - June 2, 2016

హైదరాబాద్ : గచ్చిబోలిలోని హెచ్ సీసీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరం వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆ యన మాట్లాడుతూ... తెలంగాణలో ఈ రెండేళ్లలో శాంతి భద్రతల సమస్య రాలేదని తెలిపారు. కేసీఆర్ దార్శనికత ఉన్న సీఎం అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కవులను, కళాకారులను, ఉద్యమాకారులను, మరికొంతమంది ప్రముఖులను సత్కరించారు.

16:35 - June 2, 2016

సచిన్ తో చేతులు కలిపిన చిరు..

తిరువనంతపురం : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో టాలీవుడ్ ప్రముఖ నటుల బృందం చేతులు కలిపింది. హీరోలు నాగార్జున, చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లతో కూడిన వాణిజ్య సంస్థళ కన్సార్టిజయం సచిన్ తో వ్యాపార బంధానికి శ్రీకారం చుట్టింది.
ఫుట్‌బాల్‌ క్రీడలో రాణించాలనుకునే యువతీ, యువకులలోని ఆసక్తిని ప్రోత్సహిస్తూ, వారిలోని నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో కేరళలో 'రెసిడెన్షియల్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ' ఏర్పాటు కానున్నది. దీనికి సంబంధించి కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్‌ క్లబ్‌, కేరళ ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరింది. కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండూల్కర్‌ సహ యజమానిగా ఉన్నారు. నటులు చిరంజీవి, నాగార్జున ఈ క్లబ్‌లో భాగస్వాములుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడనున్న అకాడమీ నుంచి రానున్న ఐదేళ్ళలో దాదాపు 100 మంది క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికిను రూపొందించే విషయమై ఫుట్‌బాల్‌ క్లబ్‌కు, ప్రభుత్వానికి మధ్య అవగాహన కుదిరింది. ఇదిలా ఉండగా మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టనున్న ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఉండేందుకు సచిన్‌ టెండూల్కర్‌ అంగీకరించారు. ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఉండాలని ప్రభుత్వం టెండూల్కర్‌ను కోరింది. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్‌ ఈ విషయాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో విజయన్‌తో పాటు టెండూల్కర్‌, నటులు చిరంజీవి, నాగార్జున పాల్గొన్నారు. ఈ సమావేశంలో టెండూల్కర్‌ మాట్లాడుతూ కేరళలోని యువ క్రీడాకారులను చక్కగా తీర్చిదిద్ది వారిని ఉన్నత స్ధాయిలో నిలపాలన్న తమ ఆశయానికి ప్రభుత్వం మద్దతిచ్చేందుకు అంగీకరించిందని చెప్పారు. ప్రాథమిక స్థాయి నుంచి దీనిని అమలు చేసేందుకు 40 పాఠశాలలతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర యువత తమ కలలకు ఒక రూపాన్ని ఇచ్చుకునేందుకు ఫుట్‌బాల్‌ అకాడమి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అకాడమీకి సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం మద్దతివ్వనున్నది. ముఖ్యమంత్రి విజయన్‌ మాట్లాడుతూ మద్యం, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం చేసే ప్రచారంలో తన పేరును ఉపయోగించుకోవడానికి టెండూల్కర్‌ అంగీకరించారని తెలిపారు.

16:29 - June 2, 2016

లండన్‌ : ఐసీసీ టోర్నీమెంట్‌ భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ముఖాముఖి పోరుకు వేదికగా మారుతున్నది!. మొన్న వన్డే వరల్డ్ కప్‌, నిన్న టీ20 ప్రపంచకప్‌లలో తలపడిన దాయాదులు తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ సమరానికి సై అంటున్నాయి. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనున్న 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ డ్రా, షెడ్యూల్‌ బుధవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 1న ఆరంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీ...18న జరిగే టైటిల్‌ పోరుతో ముగియనున్నది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జూన్‌ 4న చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ ఢీ కొట్టనున్నాయి. యాషెస్‌ సిరీస్‌ కోసం నువ్వా నేనా అన్నట్టు పోరాడే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు సైతం ఇదే టోర్నీలో క్రికెట్‌ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. లండన్‌ ఓవల్‌, ఎడ్జ్‌బాస్టన్‌, కార్డిఫ్‌ వేదికల్లో చాంపియన్స్‌ ట్రోఫీ జరుగనున్నది.

ఊరించే ఉత్కంఠ డ్రా...
2014 టోర్నీతోనే చాంపియన్స్ ట్రోఫీకి తెరపడగా.. టోర్నీకి వచ్చిన ఆదరణ దృష్ట్యా ఐసీసీ ఈ మినీ వరల్డ్ కప్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. 2014లో ఇంగ్లాండ్‌లోనే జరిగిన టోర్నీలో టీమ్‌ ఇండియా ఆతిథ్య జట్టును ఓడించి చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. తాజా టోర్నీలో డ్రా క్రికెట్‌ ప్రియులను ఎంతో ఊరిస్తోంది. గ్రూప్‌-ఏలో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సహా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఆసీస్‌, ఇంగ్లాండ్‌కు తోడు న్యూజిలాండ్‌ సైతం చేరటంతో కంగారూలకు ఇది కఠిన పరీక్షగా నిలవనున్నది. పసికూన (!) బంగ్లాదేశ్‌ తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడనున్నది. గ్రూప్‌-బిలో దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ సహా శ్రీలంక, దక్షిణాఫ్రికాలు చోటు చేసుకున్నాయి. గ్రూప్‌-ఏతో పోల్చితే గ్రూప్‌-బిలో పోటీ కఠినంగా ఉండనున్నది. అన్ని జట్లూ తమదైన రోజున ప్రత్యర్థిని మట్టికరిపించగలవే. క్లిష్టమైన గ్రూప్‌ నుంచి విజేతగా అవతరించటం డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియాకు అంత సులభం కాబోదు!. 2015 సెప్టెంబర్‌ 30 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్‌-8లో చోటు దక్కించుకోలేకపోయిన వెస్టిండీస్‌ చరిత్రలో తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి దూరమైంది. 2019 వరల్డ్‌కప్‌ అర్హత గడువు ముగిసే సమయంలో జరుగబోతున్న చాంపియన్స్‌ ట్రోఫీ రసవత్తరంగా సమరాలకు వేదిక కానున్నదని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డెవిడ్‌ రిచర్డ్‌సన్‌ అభిప్రాయపడ్డాడు. లండన్‌ ఓవల్‌ మైదానంలో జరిగిన డ్రా కార్యక్రమంలో పాల్గొన్న రిచర్డ్‌సన్‌ ఈ సందర్భంగా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇక ఇంగ్లాండ్‌ వేదికగా రెండుసార్లు చాంపియన్స్‌ ట్రోఫీ జరిగింది. రెండు పర్యాయాలూ ఆతిథ్య జట్టు ఫైనల్లో అడుగుపెట్టగా.. 2004లో వెస్టిండీస్‌, 2014లో భారత్‌లు కప్పును కైవసం చేసుకున్నాయి.

జూన్‌ 4న మహాపోరు...
 గ్రూప్‌-బిలో పాకిస్థాన్‌, భారత్‌లు జూన్‌ 4న ఎడ్జ్‌బాస్టన్‌లో తలపడనున్నాయి. ప్రపంచకప్‌లలో పాక్‌పై ఎదురులేని రికార్డు ఉన్న భారత్‌.. చాంపియన్స్‌ ట్రోఫీ ముఖాముఖిలో 1-2తో వెనుకంజలో కొనసాగుతోంది. జూన్‌ 8న శ్రీలంకను... 11న దక్షిణాఫ్రికాను ఓవల్‌ మైదానంలో ఢీ కొట్టనుంది టీమ్‌ ఇండియా. ఎడ్స్ బాస్టన్‌ వేదికగానే గ్రూప్‌-ఏ చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు జూన్‌ 10న అమీతుమీ తేల్చుకోనున్నాయి.

16:26 - June 2, 2016

ఖమ్మం : రూరల్ పాడు మండలం గూడూరుపాడులో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సీపీఐ,టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. సీపీఐ నేత పుచ్చకాయల వాసయ్య వర్థంతి సందర్భంగా సీపీఐ బాణసంచా పేల్చడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘటనలో ఓ టీఆర్ఎస్ కార్యకర్తకు తల పగిలి అక్కడి కక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో వున్న ఆసుపత్రికి తరలించారు. 

గూడూరుపాడులో ఘర్షణ..ఒకరు మృతి...

ఖమ్మం : రూరల్ పాడు మండలం గూడూరుపాడులో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సీపీఐ,టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. సీపీఐ నేత పుచ్చకాయల వాసయ్య వర్థంతి సందర్భంగా సీపీఐ బాణసంచా పేల్చడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘటనలో  టీఆర్ఎస్ కార్యకర్తకు తల పగిలి అక్కడి కక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో వున్న ఆసుపత్రికి తరలించారు. 

16:02 - June 2, 2016

మెగస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా ? అని వేయి కళ్లతో అభిమానులు ఎదురు చూశారు. ఆ ముచ్చట ఇటీవలే తీరింది. కానీ షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభిస్తారా ? అని మళ్లీ ఎదురు చూపులు. జూన్ 6వ తేదీ నుండి ప్రారంభిస్తారని ఓ టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా కోసం చిరు మరింత బరువు తగ్గనున్నారని. ఈ సినిమా కోసం ఇప్పటికే చిరంజీవి చాలా కసరత్తు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఠాగూర్'లో ఉన్న లుక్ కావాలనీ, కనీసం 5 కేజీలైనా తగ్గితే బాగుంటుందని వివి వినాయక్ అన్నాడని టాలీవుడ్ టాక్. తమిళంలో వచ్చిన 'కత్తి' సినిమాను రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆయన బరువు తగ్గారా ? లేదా ? అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. 

ఉద్యమకారులు, కళాకారులకు అవార్డులు...

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు, కళాకారులు, ప్రముఖులకు కేసీఆర్‌... అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకపత్రాలను అందించారు.

15:48 - June 2, 2016

బంధనాలుగా మారిన నాలుగు గోడల్ని బద్దలు కొట్టుకుని, భూమిని చుట్టేసి, ఆకాశం అంచులు దాటేసి , సముద్రాలను ఈదేసి, అందరితో సమానంగా అడుగులు వడివడిగా ముందుకేస్తోంది మహిళ. అయినా అంతటా వివక్షకే గురవుతోంది. . సమానపనికి సమాన వేతనం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఇది బాధిత మహిళల గోడు కాదు.. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వే తేల్చిన నిజాలు.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. అన్ని విధులు సమానంగా నిర్వర్తిస్తున్నారు. అంతే జాగ్రత్తగా బాధ్యతలు మోస్తున్నారు. అయినా వేతనాల్లో నేటికీ వ్యత్యాసాలను ఎదుర్కుంటున్నారు. ఇది బాధిత మహిళలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కాదు. అనేక కంపెనీల్లో జరిపిన సర్వే నివేదిక వెల్లడిస్తున్న నిజాలు. కుటుంబంలో, సమాజంలో, మొత్తంగా ప్రపంచమంతా వివక్ష కొనసాగుతుంటే, ఆ సమాజంలో భాగమైన ఉద్యోగాల్లో వారికి సమానమైన గౌరవం ఎలా దక్కుతుంది? సమాన స్థాయిలో పదోన్నతులు అందుతాయని, ఆశించడం అత్యాశే అవుతుంది. అందుకే అన్ని చోట్లా, అన్ని వైపుల, అన్ని సందర్భాల్లో మహిళలకు సమున్నతమైన గౌరవం దక్కాలని మానవి భావిస్తోంది. అప్పుడే వేతనాల్లోనూ వ్యత్యాసాలు లేకుండా ఉంటాయని ఆశిస్తోంది. 

15:45 - June 2, 2016

కృష్ణా : ఖరీఫ్ సీజన్..రైతులను అయోమయానికి గురిచేస్తోంది. జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణాజిల్లాలోని 8.68 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సీజన్‌లో ఏ పంట సాగు చేయాలన్నా సాగునీటి విడుదల తప్పనిసరి. అయితే ప్రభుత్వం నీటి విడుదల విషయంలో జాప్యం చేస్తుండడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచక అయోమయానికి గురవుతున్నారు.

పంటలకు సాగునీరు అందేనా?....
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ సీజన్‌లో పంటలకు సాగునీరు ఇబ్బందిగా మారుతోంది. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతవరకు సాధ్యమనేది కాలమే నిర్ణయించాలి. ఓ వైపు ప్రాజెక్టులన్నీ దాదాపు అడుగంటాయి. ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండితేనే ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతుంది.

ఫ్లై ఓవర్ పనులతో విడుదల కాని సాగునీరు...
ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రధాన కాలువలో ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండడతో ఇంతవరకు నీటిని విడుదల చేయలేదు. బ్యారేజీలో పూర్తిస్థాయి నీటిమట్టం పెరగని పరిస్థితి నెలకొంది. సాగునీటి సంగతి దేవుడెరుగు తాగునీటిని ఎప్పటికి విడుదల చేస్తారో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. గతేడాది పట్టిసీమ ద్వారా కేవలం 4 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించగలిగారు.

టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమంటున్న కాంగ్రెస్ నేతలు..

టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. కృష్ణా డెల్టాలోని చివరి ప్రాంతం ఎకరాలకు కూడా నీరు అందిస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు.

వరి 6.25 లక్షల ఎకరాలు, మొక్కజొన్న12,500 ఎకరాలు...
వ్యవసాయ శాఖ 2016 ఖరీఫ్ సీజన్ కు బృహత్తర ప్రణాళికను రూపొందించింది. వరి 6.25 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 12,500 ఎకరాలు, పెసర 12,500 ఎకరాలు, కందులు 5 వేల ఎకరాలు, మినుము 3,700 ఎకరాలు, వేరుశెనగ 3,750 ఎకరాలు, నువ్వులు 625 ఎకరాలు, పత్తి 1.37 లక్షల ఎకరాలు, మిరప 25 వేల ఎకరాలు, చెరకు 37,500 ఎకరాలు, పసుపు 5 వేల ఎకరాలు మొత్తంగా 8.68 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా. వరి 13.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మరో అంచనా. వరి, చెరకు తదితర పంటలు సాగు చేయాలంటే తప్పనిసరిగా కాలువలకు అదనులో నీటిని విడుదల చేయాలి. పత్తి విత్తనాలు 3.25 లక్షల ప్యాకెట్లు ఈ సీజన్ లో అవసరమవుతాయని, వీటిని సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు.

రెండేళ్లలో తక్కువ వర్షపాతం...
గతేడాది జూన్, జులైలో కురిసిన వర్షపాతం రైతులకు అంతగా ఉపయోగపడలేదు. గత రెండేళ్లలో కృష్ణాజిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదైనా ఓ మోస్తారు వర్షపాతం నమోదవుతుందా..? కురిసిన వర్షం పంటలకు ఉపయోగపడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. 

15:38 - June 2, 2016

ఓ కన్నతల్లిలో ఆవేదన..ఓ ఇల్లాలిలో ఉబికివస్తున్న రోదన..ఓ చిన్నారి నాన్న కోసం పడుతున్న తపన..ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీటి జలపాతాలే..
మొన్నటికి మొన్న స్నేక్ గ్యాంగ్ పై ఇచ్చిన తీర్పు మృగాళ్లో భయం పుట్టించింది. ఆడదంటే ఆట వస్తువుగా కామాంధుల అహాన్ని అణిచివేసేలా ఇచ్చిన న్యాయస్థానం తీర్పు మహిళా లోకాన్ని హర్షించేలా చేసింది. అదే సమయంలో ఆ ఉన్మాదుల కుటుంబాలు రోదిస్తూనే ఉన్నాయి. తప్పు చేసినందుకు ఆ దుర్మార్గులు కటకటాలపాలైతే ఏ తప్పు చేయని ఆ కుటుంబాలు శిక్షను అనుభవిస్తున్నాయి. 2009 జూన్ 13 రాత్రి 11గంటలకు..ఆత్మకూరు బస్టాండ్ లో భార్య భర్తలను దుండగులు ఆటోలో లాక్కెళ్లారు. భర్తపై దౌర్జన్యం చేయగా ఇల్లాలిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దాదాపు ఏడేళ్ల తరువాత తీర్పు వెలువడింది. 13 మంది రేపిస్టులకు పదేళ్ల తరువాత శిక్ష పడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:37 - June 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు బోనాలతో సందడి చేశారు. పోతురాజు, దుర్గామాత వేషాలతో కళాకారులు నృత్యం చేసి అలరించారు. అసెంబ్లీ వద్ద అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్ లకు కళాకారులు బోనాలతో స్వాగతం పలికారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. 

15:32 - June 2, 2016

ఆదిలాబాద్ : వాహనదారులు హెల్మెట్‌ వాడాలంటూ ఎన్ని సూచనలు చేసినా చాలామంది పట్టించుకోరు. జుట్టు రాలిపోతుందనో గ్లామర్‌ దెబ్బతింటుందనో ఏదో ఒక సాకు చూపి రూల్స్ బ్రేక్‌ చేస్తుంటారు. తీరా జరగరానిది జరిగిపోయాక లబోదిబోమంటారు. ఇలాంటి సమయంలో తెలంగాణ సర్కార్ మరో కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఆ రూల్‌ను తొలిసారి ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేయబోతోంది. ఇంతకు ఏంటా కొత్త రూల్? హెల్మెట్ వాడని వారిని ఆ నిబంధన దారిలోకి తెస్తుందా.?
హెల్మెట్‌ వాడకపోవడంతో మరణాలు...
రోడ్డు ప్రమాదాల నివారణకు ముఖ్యంగా ద్విచక్రవాహనదారుల సేఫ్టీకి ప్రభుత్వం ఎన్నో సూచనలు చేస్తుంటుంది. వాటిల్లో ముఖ్యమైంది హెల్మెట్‌ వాడకం. ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్‌ లేకపోవడం మూలంగా వాహనదారులు మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శిరస్త్రాణాన్ని తప్పకుండా వాడేలా ప్రభుత్వం మరో నిబంధనను తీసుకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు దాన్ని అమల్లోకి తెస్తున్నారు.

జూన్‌ 2 నుండి అమల్లోకి...
వాహనదారులు హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్ పోస్తారు. ఈ రూల్‌ జూన్‌ 2 నుండి అమల్లోకి వస్తుంది. హెల్మెట్ లేని వారు ఎవరైనా వారికి పెట్రోల్ పోయొద్దని అన్ని బంకులకూ ప్రభుత్వాదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోని 254 పెట్రోల్ బంకులకు రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

పెట్రోల్ బంకుల దగ్గర హెల్మెట్ అమ్మకాలు ..
అయితే కొత్త నిబంధనలతో పెట్రోల్ బంక్‌ల నిర్వాహకులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు దీనిపై ఎలా స్పందిస్తారోనని ఆలోచనల్లో పడుతున్నారు. ఇదిలా వుంటే అప్పుడే పెట్రోల్ బంకుల దగ్గర హెల్మెట్ అమ్మకాల సందడి మొదలైంది. మరోవైపు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు..

రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి ...
ప్రస్తుతం నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం ఉత్తరప్రదేశ్‌లో విజయవంతంగా అమలవుతోంది. ఇదే నిబంధనను తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు. మొదటగా ఆదిలాబాద్‌ జిల్లాలో విజయవంతమైతే మిగిలిన జిల్లాల్లోనూ ఈ రూల్‌ను అమలుచేస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జిల్లాలో హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్నవారి సంఖ్య కేవలం పది శాతమే.

మోడీతో కేసీఆర్ రహస్య ఒప్పందం - జైపాల్ రెడ్డి..

హైదరాబాద్ : ప్రధాన మంత్రి మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఓ పచ్చి అవకాశవాది అని, 2019లో టీఆర్‌ఎస్‌ నేతలు గ్రామాల్లో తిరగలేరని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు.

15:24 - June 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రెండో ఆవిర్భావ వేడుకలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి రేటు జాతీయ సగటు కంటే మెండుగా వుందని తెలిపారు.2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ. 2లక్షల కోట్లు దాటనుందన్నారు. అలాగే 2024 నాటికి బడ్జెట్ రూ.5లక్షల కోట్లు దాటే అవకాశాలు తెలంగాణకు వుందని తెలిపారు. 2022నాటికి కేంద్రాన్ని ఒప్పించి ట్రిబ్యునల్ వద్ద వాదించి ఒప్పించి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జీఆర్.రెడ్డి ముందుచూపుతోనే తెలంగాణ ఆర్థికశాఖ గాడిలోపండిందన్నారు. కొన్ని వాస్తవాలను ప్రజలతో పంచుకోవటానికి ఈ సంబురాలను జరుపుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వస్తే ప్రజలకు మంచి జరుగతుందని ఆశించాం...దానికి అవసరమైన ఆర్థిక పురోగతిని సాధించటానికి కావాల్సిన అన్ని వనరులు తెలంగాణలో వున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా అనేక సమస్యలు వచ్చాయి. కానీ పరిమితంగా వున్న సిబ్బందితో చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మగారి సహకారంతో తెలంగాణ పాలనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

15:23 - June 2, 2016

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ సభలకు బ్రేక్‌ పడింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని హైకోర్టు సూచించింది. ఓయూలో సభలకు అనుమతి ఇవ్వొద్దని రాహుల్‌ అనే విద్యార్థి కోర్టును ఆశ్రయించాడు. సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నందున అనుమతి ఇవ్వవద్దని రిజిస్ట్రార్‌, పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.

సీపీఐ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..

ఖమ్మం : రూరల్ మండలం గూడూరుపాడులో సీపీఐ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒకరు మృతి చెందగా మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. సీపీఐ నేత పుచ్చకాయల వాసయ్య వర్ధంతి సందర్భంగా బాణాసంచా పేల్చడాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

గతంలో గందరగోళ పరిస్థితులు - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హెచ్ ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ముందుకు దూసుకపోవడానికి మహత్తరమైన అవకాశాలున్నాయని, గతంలో గందరగోళ పరిస్థితులున్నాయన్నారు. జి.ఆర్.రెడ్డి ముందుచూపుతోనే ఆర్థిక శాఖ గాడిలో పడిందని, 2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లు దాటనుందన్నారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ. 5లక్షల కోట్లు దాటే అవకాశం ఉందన్నారు. కొన్ని వాస్తవాలు ప్రజలతో పంచుకోవాలనే ఉద్ధేశ్యంతో సంబరాలు చేయడం జరుగుతోందన్నారు. 

ప్రముఖులకు అవార్డులను అందచేసిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు ప్రకటించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ అవార్డులను ప్రధానం చేశారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్షా 116 నగదు పురస్కారంతోపాటు శాలువా, సర్టిఫికెట్, మొమెంటోతో సత్కరించారు. 

కొత్త పార్టీ పెట్టనున్న అజీత్ జోగి..

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అజీత్ జోగి వేరు కుంపటి పెట్టనున్నట్టు ప్రకటించారు. ఈనెల 6న కొత్త పార్టీ పెడుతానని తెలిపారు. ఈమేరకు తాను ఆరోజు తన నియోజకవర్గ ప్రజలతో సమావేశం కానున్నట్టు వెల్లడించారు. 

హెచ్ సీసీలో టి.రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

హైదరాబాద్ : హెచ్‌ఐసీసీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది.

14:58 - June 2, 2016

వరంగల్ : తెలంగాణ సాధనలో తామూ పోరాటం చేసామన్నారు హిజ్రాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిచారు. తెలంగాణ సాధనకు కోసం మేమూ పోరాటం చేశామన్నారు .సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని వారు ఈ సందర్భంగా కోరారు. 

ఉస్మానియాలో రాజకీయ సభలు బంద్ :

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో రాజకీయ సభలకు బ్రేక్ పడింది. వర్శిటీలో సభలకు, సమవేశాలకు అనుమతి లేదని హైకోర్టు ఆదేశించింది. వర్శిటీలో సెమిష్టర్ పరీక్షలు జరుగుతన్నందున అనుమతి ఇవ్వవద్దని రిజిస్ట్రార్ కు, పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

14:07 - June 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని తాకాయి. తెలంగాణ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.  స్వరాష్ట్ర అవతరణ సంరంభాలను ఊరువాడా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాల వెలుగులు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, వాడవాడలా కనిపిస్తున్నాయి. గన్‌పార్క్ నుంచి నేరుగా లుంబినీ పార్‌కు చేరుకున్న కేసీఆర్‌ అక్కడ అమరవీరుల స్మృతి భవనానికి పూజ చేశారు. సంజీవయ్య పార్క్ లో దేశంలోనే అత్యంత ఎత్తైన జాతీయ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. 298 అడుగుల ఎత్తున్న పోల్‌కు.. 108 అడుగుల పొడవు,.. 92 అడుగులు వెడల్పుతో ఉన్న జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు హాజరయ్యారు. సంజీవయ్య పార్క్‌ నుంచి పరేడ్ గ్రౌండ్ చేరుకున్న కేసీఆర్‌ అక్కడ సైనిక వందనం స్వీకరించారు. ప్రతిభను కనబర్చిన పోలీసు అధికారులకు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా సైనిక, అశ్వదళాలు నిర్వహించిన పరేడ్ అలరించింది.
ఢిల్లీలో 
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పలువురు నేతలు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన ఫోటోఎగ్జిబిషన్ ను మహమూద్ అలీ ప్రారంభించారు. 

14:02 - June 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో ఎంపీ మల్లారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయగా.. అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అక్కడే ఉన్న చిన్న అబ్బాయిని పైకి ఎక్కించి జెండా ఎగిరేలా చేశారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా మల్లారెడ్డితో పాటు నేతలు స్టెప్పులేశారు. 

13:59 - June 2, 2016

కరీంనగర్ : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో ఎమ్మెల్యేలు, అధికారులు చేసిన డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుట్ట మధు, గంగుల కమాలకర్, కలెక్టర్ నీతూప్రసాద్, జడ్పీఛైర్ పర్సన్ తుల ఉమ నృత్యాలు చేశారు.  గంగుల కమలాకర్ డప్పు కొడుతూ చిందులు వేశారు. అక్కడే ఉన్న మంత్రి ఈటెల రాజేందర్ ను భుజంపై ఎత్తుకొని గంగుల, పుట్టమధులు డ్యాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంది. 

 

టిడిపి కార్యాలయం ఎదుట కేఈ ఆందోళన..

కర్నూలు : జిల్లా టిడిపి కార్యాలయం ఎదుట మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆందోళనకు దిగారు. బీసీలకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా టీజీ వెంకటేష్ కు ఇచ్చారని పేర్కొంటూ ఆయన ఆందోళన నిర్వహించారు. 

13:56 - June 2, 2016

కోల్ కతాలో మరో కీచకపర్వం..నిర్భయ తరహాలో దారుణం..కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్..కత్తులతో కోసి హింసించారు..
ఢిల్లీ నిర్భయ తరహాలో కోల్ కతాలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. అర్ధరాత్రి విధులు ముగించుకుని వెళుతున్న బార్ సింగర్ పై దుర్మార్గులు పంజా విసిరారు. చిరునామా చూపిస్తామని చెప్పి మాన..ప్రాణాలతో ఆటలాడుకున్నారు. రాత్రంతా కదులుతున్న కారులో సామూహిక లైంగిక దాడి చేశారు. అంతటితో ఆగకుండా కత్తులతో కోసి..కోసి..పైశాచిక ఆనందం పొందారు. దీని గురించి మరింతగా తెలుసుకోవాలంటే వీడియోలో చూడండి. 

కాలిఫోర్నియాలో మంత్రి కేటీఆర్..

కాలిఫోర్నియా : అమెరికా పర్యటనలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రి బ్రౌన్‌ను కలిశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో సాంప్రదాయేతర ఇంధన రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచంలోని 13 ప్రావిన్స్‌ల నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. 

తూర్పు రాష్ట్రాలపై దృష్టి - మోడీ..

బాలసోర్ : దేశంలోని తూర్పు రాష్ర్టాలను అభివృద్ధి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బాలసోర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తూర్పు రాష్ర్టాలై బీహార్, పశ్చిమ బెంగాల్, అసొం, ఒడిశా రాష్ర్టాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయని, ఆ రాష్ర్టాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలని అభివృద్ధి ప్రణాళికలను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

13:42 - June 2, 2016

పుదుచ్చేరి : 'రౌడీయిజం చేస్తే తాట తీస్తా.. అవినీతి అంతు చూస్తా.. అశాంతికి చోటివ్వను .. రాజకీయ జోక్యం అస్సలే ఒప్పుకోను... అన్నింటికి వన్‌ జీరో త్రీ వన్‌ ఒక్కటే పరిష్కారం'. ఇవి పుదుచ్చేరి కొత్త లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హెచ్చరికలు. పదవి చేపట్టిన ఒక్కరోజులోనే కిరణ్ బేడీ తనదైన స్టైల్‌లో హల్ చల్ చేశారు. 
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా కిరణ్‌బేడి
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ.. పదవిని చేపట్టిన తొలిరోజే.. హడలెత్తించారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సీనియర్ అధికారి అయినా.. రాజకీయ నేతలైనా.. ఆఖరికి మంత్రులైనా సరే.. అవినీతికి, అరాచకాలకూ పాల్పడితే.. తాటతీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.  అంతటితో ఆగకుండా.. క్రైం కంట్రోల్ కోసం (వన్‌ జీరో త్రీ వన్‌) 1031 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఎక్కడ తప్పు కనిపించినా.. ఎక్కడ అన్యాయం జరిగినా.. ఒక్క కాల్ చేయండి దుమ్ముదులుపుతానని వార్నింగ్‌ ఇచ్చారు.. కిరణ్ బేడి.
ఎర్రలైట్ ఒకే ఒక్క వాహనంపై ఉండాలి
ఎర్రలైట్  ఒకే ఒక్క వాహనంపై ఉండాలని... రాజకీయ నేతలు ఎవ్వరు ఎర్రలైట్ ఉపయోగించవద్దని...  ఇక మీదట ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. ట్రాఫిక్ రూల్స్‌లో ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండవంటూ తేల్చి చెప్పారు కిరణ్‌బేడి. ప్రమాణస్వీకారానంతరం... ఆమె పుదుచ్చేరి ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తన శైలి ఎలా ఉండబోతోందో విస్పష్టంగానే వెల్లడించారు. ప్రజా సమస్యలపై రోజూ ప్రజలతో సమావేశమవుతాననీ చెప్పారామె. ఫుట్ పాత్ లపై దుకాణాలను వారంలోగా తొలగించాలని హుకుం జారీ చేశారు.  ఆదేశాలను బేఖాతరు చేస్తే.. తక్షణ చర్యలు .. జరిమానాలు తప్పవని హెచ్చరించారు. కిరణ్‌బేడీ ప్రసంగం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపితే.. అక్కడి పాలకులను హడలెత్తించాయి. స్థానిక కాంగ్రెస్‌ ఏలికలను ఇప్పుడు కిరణ్‌బేడి ఫీవర్‌ వేధిస్తోంది. బీజేపీకి చెందిన కిరణ్‌బేడికి.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

ఫోన్ ట్యాప్ చేశారు. - రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: తాను అమరుల కుటుంబాలను సన్మానించేందుకు వెళ్లాలనుకున్నానని, ఫోన్‌ను ట్యాప్ చేసి విద్యార్థులతో మాట్లాడిన మాటలు విన్నారని టి.టిడిపి నేత రేవంత్ ఆరోపించారు. అమరుల కుటుంబాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండుతో ఓయూలో కార్యక్రమం తలపెట్టారని ఆయన పేర్కొన్నారు.

జగన్ కు అధికార కాంక్ష – మంత్రి ప్రత్తిపాటి..

విజయవాడ : జగన్‌కు అధికార కాంక్ష తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్టదని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. నవ నిర్మాణ దీక్షపై కూడా విమర్శలు చేయడం దారుణమని, జగన్ వ్యవహార శైలి మార్చుకోకపోతే భవిష్యత్‌లో పులివెందులలో కూడా డిపాజిట్లు దక్కవని ఆయన వ్యాఖ్యానించారు.

 

గన్ పార్కు వద్ద బీజేపీ నేతల నివాళులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్కు అమరవీరుల వద్ద బీజేపీ నేతలు నివాళులర్పించారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పలువురు నేతలున్నారు. 

13:00 - June 2, 2016

రోజులు మారుతున్నాయి..వారాలు దొర్లిపోతున్నాయి..కానీ పసిబిడ్డ ఆచూకీ మాత్రం తెలియడం లేదు...ఎక్కడున్నాడో..ఏమయ్యాడో..

నిన్నటికి నిన్న ఆడుకుంటున్న చిన్నారి అదృశ్యమయ్యాడు. పోలీసులు శోధించి..శోధించి పసివాడిని ఎత్తుకెళ్లిన లేడి కిలాడీని పట్టుకున్నారు. ఆ కథ సుఖాంతమైంది. కానీ నగరంలోనే మరో బాలుడు మిస్సయ్యాడు. రెండు వారాలు గడుస్తున్నా ఎలాంటి క్లూ దొరకడం లేదు. సీసీ టీవీ ఫుటేజ్ లో బాలుడు ఆడుకుంటున్న దృశ్యాలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ ఎలా మాయమయ్యాడో తెలియడం లేదు. మలక్ పేటలో ఈనెల 17వ తేదీన చిన్నారి తేజ అదృశ్యమయ్యాడు. చిన్నారి కిడ్నాప్ అయ్యాడా ? లేక సంచరిస్తున్న లేడి కిలాడీలు ఎతుకెళ్లారా ? ఎందరో చిన్నారులు క్షణాల్లో మాయమవుతున్నారు. కంటిపాపలను కనురెప్పపాటులో ఎత్తుకెళుతున్నారు. రెండు వారాలు దాటినా చిన్నారి తేజ ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనుమానితులను విచారిస్తున్నా ఎలాంటి క్లూ దొరకడం లేదు. చిన్నారి తేజ ఆచూకి తొందరలోనే తెలుస్తుందని ఆశిద్దాం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:41 - June 2, 2016

గుజరాత్ : అహ్మదాబాద్ లోని గుల్బర్గ్ సొసైటీ ఊచకోత కేసులో శిక్ష ఖరారు అయింది. 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా అహ్మదాబాద్ కోర్టు నిర్దారించింది. బీజేపీ మాజీ కార్పొరేటర్ బిపిన్ పటేల్ ను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనం తర్వాతి రోజున కాలనీపై దాడి జరిగింది. గుల్బర్గ్ సొసైటీ గృహసముదాయంలో 20 వేలమంది మైనారిటీలు నివసిస్తున్నారు. మైనారిటీలు నివసించే సొసైటీ కాలనీలో పెట్రోల్ క్యాన్లతో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో 39 మృతదేహాలను గుర్తించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. 2009 సంవత్సంలో కేసు ట్రయల్ ప్రారంభం అయింది. 2015 సెప్టెంబర్ లో కేసు విచారణ ముగిసింది. 

 

ఓయూలో సభలు..సమావేశాలకు అనుమతినివ్వవద్దన్న హైకోర్టు..

హైదరాబాద్ : ఓయూలో ఎలాంటి రాజకీయపరమైన సభలు..సమావేశాలకు అనుమతి ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నందున జన జాతరకు రాజకీయ నేతల సమావేశం..సభలకు అనుమతినివ్వవద్దని ఓయూ రిజిస్ట్రార్, పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓయూలో ఎలాంటి సభలకు అనుమతినివ్వవద్దంటూ రాహుల్ అనే విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

గుల్ బర్గా సొసైటీ ఊచకోతలో తీర్పు...

ఢిల్లీ : అహ్మదాబాద్ గుల్ బర్గా సొసైటీ ఊచకోత కేసులో కోర్టు శిక్ష ఖరారు చేసింది. 24 మందిని దోషులుగా ప్రత్యేక కోర్టు తేల్చింది. బీజేపీ మాజీ కార్పొరేటర్ బిపిన్ పటేల్ ను న్యాయస్థానం నిర్ధోషిగా ప్రకటించింది. 39 మృతదేహాలను గుర్తించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. 2002 అహ్మదాబాద్ లో 69 మందిని ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనం తరువాతి రోజున కాలనీపై దాడి జరిగింది. మైనార్టీలు నివాసం ఉండే కాలనీలో పెట్రోల్ క్యాన్లతో దుండగులు దాడి చేశారు. 2009లో కేసు ట్రయల్ ప్రారంభమైంది. 2015 సెప్టెంబర్ లో కేసు విచారణ ముగిసింది. 14 ఏళ్ల తరువాత తీర్పును కోర్టు వెల్లడించింది.

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..

నెల్లూరు : వెంకటగిరి ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. ఓ కాంట్రాక్టర్ నుండి రూ. 7,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పంచాయతీ కార్యదర్శి పెంటయ్య పట్టుబడ్డాడు. 

అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు..

ఆదిలాబాద్ : జిల్లాలోని పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను మంత్రి జోగు రామన్న ఎగురవేశారు. అనంతరం 27 మంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి జోగురామన్న అందజేశారు.

ఉద్యమకారులను సన్మానించిన మంత్రి పద్మారావు..

హైదరాబాద్ : సీతాఫల్‌మండి టీఆర్‌ఎస్‌ ఆఫీసులో జాతీయజెండాను మంత్రి పద్మారావు ఎగురవేశారు. అనంతరం మంత్రి పద్మారావు ఉద్యమకారులను సన్మానించారు. 

మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి..

హైదరాబాద్ : మేడ్చల్‌ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్‌-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

 

12:13 - June 2, 2016

హైదరాబాద్ : బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. 'ఎన్నో ఏళ్ల మన సాకారమైందని' అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు దోపిడీకి గురయ్యాయని తెలిపారు. బంగారు తెలంగాణకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తాన్నామని చెప్పారు. పేదలకు రేషన్ బియ్యం కోటా పెంచామని తెలిపారు. సంక్షేమ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇంట్లో ప్రతీ ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి కాలేజీల్లో కూడా సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం సరఫరా చేస్తామని చెప్పారు. 598 మంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు.  
జర్నలిస్టుల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పెంపు కోసం కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 
వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. నీటి వాటాలను వదులుకునే ప్రసక్తే లేదన్నారు.  నీటి కేటాయింపులకు ఎపి సర్కార్ మోకాలడ్డుతోందన్నారు. 2022 వరకు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యతకు ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు.  

​వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. నీటి వాటాలను వదులుకునే ప్రసక్తే లేదన్నారు.  నీటి కేటాయింపులకు ఎపి సర్కార్ మోకాలడ్డుతోందన్నారు. 2022 వరకు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యతకు ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు.  

కాలేజీల్లోనూ సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఈ ఏడాది నుంచి కాలేజీల్లో కూడా సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. 598 మంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. జర్నలిస్టుల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పెంపు కోసం కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 

 

మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి..

హైదరాబాద్ : మేడ్చల్‌ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్‌-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 

బంగారు తెలంగాణకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : బంగారు తెలంగాణకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. పేదలకు రేషన్ బియ్యం కోటా పెంచామని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సంక్షేమ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇంట్లో ప్రతీ ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామని చెప్పారు. 

ఎన్నో ఏళ్ల మన సాకారమైంది : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. 'ఎన్నో ఏళ్ల మన సాకారమైందని' అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు దోపిడీకి గురయ్యాయని తెలిపారు. 

అన్యాయంగా రాష్ట్ర విభజన : సీఎం చంద్రబాబు

విజయవాడ : రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని సీఎం చంద్రబాబు తెలిపారు. విభజన హేతుబద్దత లేకుండా జరిగిందన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విభజన ఆపలేకపోయామని చెప్పారు. కట్టుబట్టలతో బయటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో ఎపికి అన్యాయం జరిగిందన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వారం రోజులు నిరవధిక దీక్ష చేశానని గుర్తు చేశారు. ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశానని తెలిపారు. అప్పులు జనాభా ప్రకారం.. ఉద్యోగాలు, జీతాలు ఆదాయం ప్రకారం పంచారని చెప్పారు. ఎక్కడైన రాష్ట్రం ఏర్పడితే సంబరాలు చేసుకుంటారు.. కానీ మనకు మాత్రం దుర్దినంగా మారిందన్నారు.

మన పొట్టగొట్టిన దినం : సీఎం చంద్రబాబు

విజయవాడ : 'జూన్ 2.. మన పొట్టగొట్టిన దినం' అని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన నవ నిర్మానణ దీక్ష సంరద్భంగా ఆయన మాట్లాడారు. నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. నవ నిర్మాణ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 2న ఇటలీ స్వాతంత్త్ర్య దినోత్సవం.... ఆ రోజునే రాష్ట్ర విభజన చేశారని పేర్కొన్నారు. 'మన పొట్టగొట్టిన దినం, అన్యాయం చేసిన దినం' అని మండిపడ్డారు. 

11:57 - June 2, 2016

విజయవాడ : 'జూన్ 2.. మన పొట్టగొట్టిన దినం' అని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన నవ నిర్మానణ దీక్ష సంరద్భంగా ఆయన మాట్లాడారు. నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. నవ నిర్మాణ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 2న ఇటలీ స్వాతంత్త్ర్య దినోత్సవం.... ఆ రోజునే రాష్ట్ర విభజన చేశారని పేర్కొన్నారు. 'మన పొట్టగొట్టిన దినం, అన్యాయం చేసిన దినం' అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని తెలిపారు. విభజన హేతుబద్దత లేకుండా జరిగిందన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విభజన ఆపలేకపోయామని చెప్పారు. కట్టుబట్టలతో బయటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో ఎపికి అన్యాయం జరిగిందన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వారం రోజులు నిరవధిక దీక్ష చేశానని గుర్తు చేశారు. ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశానని తెలిపారు. అప్పులు జనాభా ప్రకారం..ఉద్యోగాలు, జీతాలు ఆదాయం ప్రకారం పంచారని చెప్పారు. ఎక్కడైన రాష్ట్రం ఏర్పడితే సంబరాలు చేసుకుంటారు.. కానీ మనకు మాత్రం సంబరాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. 
 

 

11:55 - June 2, 2016

తిరువనంతపురం : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు. కేరళ బ్లాస్టర్స్ పేరుతో ఫుట్‌బాల్ జట్టును కొనుగోలు చేశారు. సచిన్ టెండూల్కర్ దంపతులతో పాటు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ముందుగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా తిరువనంతపురం చేరుకున్నారు. అక్కడ కేరళ సీఎం పినరాయి విజయన్‌ను సచిన్‌ బృందం కలుసుకుంది. 
ఎట్టకేలకు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పూర్తి
హైదరాబాద్ : అనేక అవాంతరాలను అధిగమించి, ఎట్టకేలకు హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ పూర్తిస్థాయిలో  వాహనదారులకు అందుబాటులోకి  రానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడంలో నాలుగేళ్లు జాప్యమైంది. ఓఆర్ ఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఆ పరిసరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని, గ్రోత్‌ కారిడార్లు విస్తరిస్తాయని పాలకులు ఆశిస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి 
హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ... హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవుటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్ట్.. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వందరోజుల్లోపు దీన్ని ప్రయాణికుల వినియోగానికి సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ కొత్త పాలక మండలి నిర్ణయించింది. దీనికి తగ్గట్లే పనులను వేగవంతం చేశారు. మేడ్చల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 
అందుబాటులోకి 158 కి.మీ. మార్గం 
ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి..  కండ్లకోయ ప్రాంతంలో భూవివాదం కొంత జాప్యం కలిగించింది. అక్కడ ఒకటిన్నర కిలోమీటర్ల మేర పనులైతే ప్రస్తుతానికి వేగంగా సాగుతున్నాయి. ఈ మార్గంలో సర్వీస్‌ రోడ్డు ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా సిటీ చుట్టూ 158 కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చినట్లయింది. నిజానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన దీన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనలో ఉండడంతో.. ఓఆర్ఆర్ ప్రారంభోత్సవాన్ని అనివార్యంగా వాయిదా వేశారు. 
158 కి.మీ. మార్గం 2012 నాటికి పూర్తికావాలి 
ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణ పనులు.. ప్రారంభం నుంచి ఎన్నో వివాదాలతో సాగాయి. పెద్దల భూములను కాపాడేందుకు పేదల భూములను పణంగా పెట్టి ఓఆర్‌ఆర్‌ను అష్టవంకర్లు తిప్పారన్న ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. 158 కి.మీ. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ను 2012 నాటికి పూర్తి చేసి, వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ తరచు అలైన్‌మెంట్లను మార్చడంతో నాలుగేళ్ల ఆస్యంగా ఇప్పటికి  పూర్తయ్యింది. 
వివిధ దశల్లో మరో 16 రేడియల్‌ రోడ్లు
అవుటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 6,696 కోట్ల  రూపాయలు ఖర్చు చేశారు. దీనిలో 60 శాతం నిధులను జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ  రుణంగా అందజేసింది. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ను నగరానికి అనుసంధానిస్తూ... 33 రేడియల్‌ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇంతవరకు 17 మార్గాలను పూర్తి చేశారు. మిగిలిన 16 రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని రేడియల్‌ రోడ్లకు నగరం పరిధిలో భూసేకరణ సమస్యగా మారింది. 
290 కి.మీ. మేర రీజనల్‌ రింగ్‌ రోడ్లు 
అవుటర్‌ రింగ్‌రోడ్డు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుండడంతో.. ఇప్పుడు.. రీజనల్‌ రింగ్‌ రోడ్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ వెలుపల ఉన్న ఐదు జిల్లాలను కలుపుతూ ఈ రీజనల్‌ రింగ్‌ రోడ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. చౌటుప్పల్‌-భువనగిరి, భువనగిరి-తూప్రాన్‌, తూప్రాన్‌-సంగారెడ్డి, సంగారెడ్డి-చేవెళ్ల, చేవెళ్ల-షాద్‌నగర్‌, షాద్‌నగర్‌-చౌటుప్పల్‌ ప్రాంతాలను కలుపుతూ 290 కి.మీ. మేర  రీజనల్‌ రింగ్‌ రోడ్లను నిర్మించాలని తలపెట్టారు. వీటి మధ్యలో ఉపగ్రహ పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం కాగితాల దశలోనే ఉన్న ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

11:08 - June 2, 2016

విజయవాడ : కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రజల చేత నవ నిర్మాణ దీక్ష చేయించారు. బెంజి సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెలతో పాటు మంత్రులు..ఎమ్మెల్యేలు..ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాబు ప్రతిజ్ఞ ఇలా కొనసాగింది..
''అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్నీ ఓ అవకాశంగా మలచుకుందాం. దేశ భక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2020 నాటికి మన రాష్ట్రాన్ని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికి ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం'' అంటూ జనంతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. 

నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు బెంజి సర్కిల్ వద్ద ప్రజలతో నవ నిర్మాణ దీక్ష చేయించారు. విజయవాడలో ప్రారంభమయ్యే దీక్షలు ఈ నెల 8న ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరగనున్న 'మహా సంకల్ప సభ'తో ముగుస్తాయి. ఈ ఏడు రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల్లో ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. 

10:57 - June 2, 2016

తిరువనంతపురం : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు. కేరళ బ్లాస్టర్స్ పేరుతో ఫుట్‌బాల్ జట్టును కొనుగోలు చేశారు. సచిన్ టెండూల్కర్ దంపతులతో పాటు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ముందుగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా తిరువనంతపురం చేరుకున్నారు. అక్కడ కేరళ సీఎం పినరాయి విజయన్‌ను సచిన్‌ బృందం కలుసుకుంది. 

 

10:53 - June 2, 2016

విజయవాడ : ఏపీలో నవ నిర్మాణ దీక్షల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బందర్ రోడ్డు నుండి బెంజి సర్కిల్ వరకు సీఎం బాబు పాదయాత్ర చేశారు. అనంతరం బెంజి సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బాబుతో పాటు స్పీకర్ కోడెల..మంత్రులు..ఎమ్మెల్యేలు..ఇతర అధికారులున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నివ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు.

వివిధ అంశాలపై సదస్సులు..
నవ నిర్మాణ్‌ సందర్భంగా జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు నవ నిర్మాణ్‌ పేరుతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ లక్ష్యాలను నిర్దేశించనున్నారు. జూన్‌ 3న అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రజలు, ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయాలు అనే అంశంపై జూన్‌ 4న సదస్సు నిర్వహిస్తారు. రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్‌, సీఐఐ భాగస్వామ్య సదస్సు ఇలా అనేక విషయాలపై సదస్సులో చర్చిస్తారు.

సోము వీర్రాజుతో ముద్రగడ భేటీ..

రాజమండ్రి : కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ సాధించే వరకూ తాను చేపట్టిన ఉద్యమం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు.  

పరేడ్ గ్రౌండ్ లో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు.

విజయవాడలో నవ నిర్మాణ దీక్ష..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించనున్నారు. 

10:32 - June 2, 2016

స్వామిరారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య' వంటి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న నిఖిల్‌ తాజాగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే టైటిల్‌ ఖరారు చేశారు. హేబా పటేల్‌, నందిత శ్వేత హీరోయిన్లు. బుధవారం నిఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు 80శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. నేటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఎంటర్‌టైన్‌ చేయడంలో నిఖిల్‌, ఆనంద్‌ సిద్ధ హస్తులు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో క్రేజ్‌ పెరిగింది. ఇటీవల విడుదల చేసిన ప్రీ టీజర్‌ పోస్టర్‌కి సోషల్‌ మీడియాలో మంచి స్పందన వచ్చింది. నిఖిల్‌ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేస్తున్నాం. వైవిధ్యమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం. త్వరలో ఆడియోను, ఆగస్టులో సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.

10:31 - June 2, 2016

ప్రముఖ బాలీవుడ్‌ కమెడీయన్‌ రజాక్‌ ఖాన్‌ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ముంబై బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించిన్నట్టు ఆయన స్నేహితుడు షాజద్‌ ఖాన్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. రజాక్‌ ఖాన్‌ వంటి మంచి హాస్యనటుడిని, సహనటుడిని కోల్పోవడం బాలీవుడ్‌కు తీరని లోటని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 'కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌' టీవీ షో ద్వారా బాగా పాపులర్‌ అయిన రజాక్‌ ఖాన్‌ 'హాలో బ్రదర్‌', 'హెరా పెరీ', 'బాద్‌షా', 'రూప్‌ కీ రాణి చోరాన్‌ కా రాజా', 'రాజా హిందుస్తానీ', 'హసీనా మాన్‌ జాయేగీ' వంటి 90కిపైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ అగ్రహీరోలు నటించిన చాలా చిత్రాల్లో రజాక్‌ తనదైన హాస్యాన్ని పండించారు. ఆయన నటించిన చివరి చిత్రం 'క్యా కూల్‌ హై హమ్‌ 3'. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రజాక్‌ ఖాన్‌ అంత్యక్రియలు నేడు(గురువారం) సాయంత్రం జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు అసాద్‌ ఖాన్‌ కుమారుడున్నారు.

10:29 - June 2, 2016

ఎంతో మంది ప్రాణ త్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇకపై బంగారు తెలంగాణ అవుతుందని అందరితోపాటు సినీ కళాకారులు కూడా కలల కన్నారు. అందుకు సమర్థుడని సీఎంగా కేసీఆర్‌ను ఎనుకున్నారు. గిర్రున రెండేండ్లు గడిచాయి. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత.. ఏ విషయంలోనూ ఎటువంటి మార్పు లేదు. ముఖ్యంగా సినిమా విషయానికొస్తే కేసీఆర్‌ మాటలు పేపర్లకే పరిమితమైపోయాయే గానీ ఆచరణలో అమలు కాలేదనే విమర్శలున్నాయి. దీంతో బంగారు తెలంగాణ అవుతుందని కలలు కన్న ప్రతి ఒక్కరి కల కలగానే మిగిలిపోయింది. తెలంగాణ సినిమా అభివృద్ధి విషయానికొస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. మాటల గారడీ తప్ప రెండేండ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సినిమాభివృద్ధి శూన్యమనే చెప్పాలి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా ఈ రెండేండ్ల కాలంలో సినిమా అభివృద్ధి కోసం ఏఏ అంశాలపై పాలకులు వాగ్థానాలు చేశారు?, అమలులో వాటి తీరు తెన్నులు ఎలా ఉన్నాయో దానిపై కథనం..

పేపర్లకే పరిమితమైన రాచకొండ ఫిల్మ్‌ సిటీ..
సీఎంగా కేసీఆర్‌ పదవిలోకి వచ్చాక తెలంగాణ సినీ కళాకారులకు రాచకొండలో ఫిల్మ్‌ సిటీ అంటూ ఓ పెద్ద వరాన్ని ఇచ్చారు. రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని ఏర్పాటు చేసి అత్యాధునిక స్టూడియోల నిర్మాణంతో తెలంగాణలో సినిమా అభివృద్ధిని, తద్వారా దీన్ని నమ్ముకున్న కళాకారులను, సాంకేతిక నిపుణులను మరింత ప్రోత్సహించవచ్చని క్రింది స్థాయి రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సీఎం కేసీఆర్‌ వరకు ఊదరగొట్టారు. రాచకొండకి వెళ్ళి స్థల పరీక్ష కూడా చేశారు. రెండు మూడు రోజులు మీడియాలో హల్‌చల్‌ చేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు సినిమాకి సంబంధించి జరిగిన ప్రతి ఫంక్షన్‌లో అధికార పార్టీ నాయకులు, సీఎం కేసీఆర్‌ సహా అందరూ అరచేతిలో వైకుంఠం మాదిరిగా ఫిల్మ్‌ సిటీ గురించి అందంగా చెప్తూ వస్తున్నారే తప్ప ఆచరణలో ఇసుమంత ప్రోగ్రెస్‌ కూడా లేదు. దీనికి తోడు సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలు కూడా వారి సొంత పనులును చక్కబెట్టుకోవడం కోసం అధికార పార్టీకి భజన చేస్తున్నారు. వీరు సైతం ఫిల్మ్‌సిటీ గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఈ రెండేండ్లలో కోకొల్లలున్నాయి.

ఎఫ్ డీసీ లేకపోవడం విడ్డూరం..
ఈ రెండేండ్ల కాలంలో మీడియాలో వచ్చిన కథనాల్ని ఓసారి పరిశీలిస్తే, చాలా సినిమాలు వాటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుని థియేటర్లు దొరకని కారణంగా విడుదలకు నోచుకోలేక పోతున్నాయని, వీటి వల్ల చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారని అర్థం అవుతుంది. కొంతమంది థియేటర్ల గుత్తాధిపత్యంతో చిన్న నిర్మాతలు దారుణంగా నష్టపోతున్నప్పటికీ వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగనీ థియేటర్ల సమస్యనూ పరిష్కరించలేదు. ఇదిలా ఉంటే, ప్రతి థియేటర్లలో రోజుకి ఐదు షోలను ప్రదర్శించాలని, అందులో ఒక షో మాత్రం చిన్న సినిమాను ప్రదర్శించాలని ఇటీవల ఓ సరికొత్త ప్రతిపాదనను తెలంగాణ సినిమా అభివృద్ధి కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే, వెంటనే అంగీకరించిందే తప్ప ఆచరణలో మాత్రం పెట్టలేదు. ఈ ప్రతిపాదన కేవలం చర్చలకే పరిమితమై పోయింది. దీంతోపాటు చిన్న సినిమాలకు పన్ను మినహాయించడం, సబ్సిడీలు ఇస్తూ తెలంగాణ సినిమాను ప్రోత్సహించడం, అంతర్జాతీయ స్థాయిలో ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయటం, తెలంగాణ కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే దిశగా ఎటువంటి అభివృద్ధికర అంశాలను పట్టించుకోలేదు. అలాగే థియేటర్ల ఆన్‌లైన్‌, మినీ థియేటర్ల నిర్మాణంతోపాటు పైన పేర్కొన్న అంశాలన్ని జరగాలంటే ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డిసి) ప్రత్యేకంగా ఉండాలి. అసలు దీన్ని పట్టించుకున్నోళ్ళే లేరు. ఎఫ్‌డిసి ఉండటం వల్ల సింగిల్‌ విండో మాదిరి ఓ సినిమాకి సంబంధించి షూటింగ్‌ పర్మిషన్‌ దగ్గర్నుంచి సెన్సార్‌ వరకు అన్ని విషయాలు వేగవంతంగా జరిగి, నిర్మాతకు వెన్నుదన్నుగా ఉంటుంది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఇంకా ఎఫ్‌డిసి రాకపోవడం విడ్డూరం.

దయనీయ స్థితిలో సినీ కళాకారులు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు చాలా సంతోషంగా ఫీలయ్యారు. ఇకనైనా తమకు మరిన్ని అవకాశాలొస్తాయని, మరింతగా ప్రోత్సాహం లభిస్తుందని ఆశపడ్డారు. అయితే వారి ఆశలన్ని వమ్ము అయ్యాయి. 'ఇటీవల అవకాశాల విషయంలో చాలా తేడా కనిపిస్తోంది. గతంతో పోల్చితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రచయితలను చిన్న చూపు చూస్తున్నారని ఇటీవల మాకు వస్తున్న అవకాశాలను బట్టి అర్థమవుతోంద'ని జాతీయ అవార్డు గీత రచయిత ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు.

ప్రతి సెక్టార్ కు అసోసియేషన్...
తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ దర్శకుల సంఘం, తెలంగాణ సినీ ఆర్టిస్టుల అసోసియేషన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెక్టార్‌కి ఓ అసోసియేషన్‌ని ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. సినిమా ఇండిస్టీలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు సినీ పెద్దలతో సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమక్షంలో చర్చించారు. అలాగే గత మార్చిలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లతో ఏర్పాటైన తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. దాసరి నారాయణరావు, మురళీమోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొని సమస్యలపై చర్చించారు. దీంతోపాటు సెన్సార్‌ రీజినల్‌ అధికారి విజయ్ కుమార్‌ రెడ్డి సమక్షంలో సురేష్‌బాబు, జీవిత తదితరులు సమావేశమై సెన్సార్‌ విషయంలో ఉన్న ఇబ్బందులు, త్వరగా సెన్సార్‌ చేయడం వంటి దానిపై చర్చించారు. సెన్సార్‌ వేగవంతం కోసం డిజిటలైజేషన్‌ చేయాలని నిర్ణయించింది, అయినప్పటికీ ఆచరణలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదని పలువురు సినీ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొలిక్కి రాని అవార్డులు..
హైదరాబాద్‌ని సినీ హబ్‌గా మారుస్తామని మాటలతో గారడీ చేశారు. ఆ ఊసస్సులు ఇప్పుడు లేనే లేదు. కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గౌరవించడం, ప్రోత్సహించడమే లక్ష్యంగా అవార్డులను అందిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు అవతరించిన నేపథ్యంలో గత కొంత కాలంగా అధికారిక సినిమా అవార్డుల కార్యక్రమం జరగలేదు. నంది అవార్డుల స్థానంలో కొత్తగా ఏ పేరుతో సినీ అవార్డులు ఇవ్వాలి? దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉండాలనేదాన్ని నిర్ణయించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏప్రిల్‌ 20న జీవోని కూడా విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రమణాచారి ఛైర్మన్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష కార్యదర్శులు పి. రామ్మోహన్‌, కె.మురళీ మోహన్‌రావుతో పాటు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత దిల్‌రాజు, ఎం.శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఎన్‌.శంకర్‌, సురేష్‌ కొండేటి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నవీన్‌ మిట్టల్‌ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అలాగే సింగిల్‌ విండో పథకం అమలుకు తీసుకోవాల్సిన విధివిధానాల రూపకల్పనకు మరో కమిటీని నియమించింది. రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఛైర్మన్‌గా, హోం డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ, టూరిజం అండ్‌ కల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ, ఐ అండ్‌ పీ.ఆర్‌ సెక్రెటరీ సభ్యులుగా ఓ కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. నెల రోజులలోగా ఈ కమిటీ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కోరింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సింగిల్‌ విండో పథకానికి ఈ కమిటీ ద్వారా పరిష్కారం దొరుకుతుందని సినీ పెద్దలు ఆశపడ్డారు. కాని ఇప్పటివరకు ఈ విషయంలో అణుమాత్రం పురోగతి లేదు.

ఆచరణ ఎక్కడ ?
సినిమా రంగానికి సంబంధించి ప్రతి విషయంలోనూ హడావుడే జరిగిందే తప్ప ఆచరణలో ఒక్క అంశం కూడా పరిష్కారం కాలేదు కదా, ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. దీంతో ఈ రెండేండ్ల పాలన తెలంగాణ సినిమా కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగానైనా సీఎం కేసీఆర్‌ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే తీరు తెన్నుల గురించి చెబుతారేమోనని పరిశ్రమని నమ్ముకున్న వారంతా వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.

10:22 - June 2, 2016

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సంరద్భంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేంద్రగౌడ్, సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్  పాల్గొని, మాట్లాడారు. విద్యారంగం అత్యంతకీలమైందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

10:19 - June 2, 2016

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని సుమిత్రానగర్ లో దారుణం జరిగింది. కొంతమంది యువకులు ఓ వ్యక్తిని హత్య చేశారు. కొంతమంది యువకులు మద్యం మత్తులో అర్ధరాత్రి హెచ్ పీ పెట్రోల్ బంక్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. పెట్రోల్ పోయలేదని క్యాషియర్ సంగమేశ్వర్ పై కర్రలతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన మేనేజర్ రాజుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

10:03 - June 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంబరాలు అంబరాన్నుంటుతున్నాయి. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ నివాళులర్పించారు. ఉదయం 9.45 గంటలకు లుంబినీ పార్కు సమీపంలోని అమరుల స్మారక స్థలి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.10 గంటలకు సంజీవయ్యపార్కులో జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఉదయం 10.30 గంటకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. 

ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దేశంలో ఎత్తైన జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సంజీవయ్య పార్కులో ఈ జెండాను ఏర్పాటు చేశారు. 

09:49 - June 2, 2016

జూన్‌ వచ్చేసింది. ఇంకొద్ది రోజుల్లో స్కూల్స్‌ ప్రారంభమవుతాయి. ఈ విషయం గుర్తుకొస్తేనే తల్లిదండ్రులకు టెన్షన్‌. సెలవులు ముగిసిన తర్వాత మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలంటే పిల్లలు మారాం చేస్తారు. ఇక మొదటిసారి స్కూల్‌కి వెళ్ళే పిల్లల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అసలు పిల్లల్లో స్కూల్‌ఫోబియా ఎందుకు వస్తుందో తెలుసుకుందాం..
ప్రస్తుతం తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో పిల్లలు బడికి వెళ్ళమని మారాం చేయడం ప్రధానమైనది. మన దేశంలో 40 శాతం మంది తల్లిదండ్రులు ఈ సమస్యతో బాధ పడుతున్నారని వివిధ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రొఫెసర్‌ క్రిస్ట్‌ఫర్‌ కెర్నీ అభిప్రాయం ప్రకారం బడికి వెళ్ళమని మారాం చేసే పిల్లలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. మానసిక, పాఠశాల, ఇంటివాతావరణం, ఆర్థికలేమి కారణాలు ప్రధానంగా పేర్కొన్నారు.
మారాం చేస్తారు..
ఉదయాన్నే లేచిన వెంటనే పిల్లలు బడికి వెళ్ళమని ఏడవడం ప్రారంభిస్తారు.
బస్సు లేదా ఆటో వచ్చే సమయానికి కడుపునొప్పి, తలనొప్పి అంటూ ఇబ్బంది పెడతారు.
హోమ్‌వర్క్‌ చెయ్యకుండా స్కూల్‌కు వెళితే ఉపాధ్యాయులు కొడతారని స్కూల్‌కు ఎగనామం పెడతారు.
పాఠశాలలో తోటి విద్యార్థులు తమని కొడుతున్నారని, ఆటపట్టిస్తున్నారని వంకలు పెడతారు. ఉపాధ్యాయులు అనవసరంగా తమని బెత్తంతో కొడుతున్నారని తల్లిదండ్రులను నమ్మిస్తారు. ఇలా పలు కారణాలు చెబుతూ పిల్లలు పాఠశాలకు ఎగనామం పెట్టడానికి ప్రయత్నిస్తారు.
వేరు చేయబడుతున్నామనే భయం..
సాధారణంగా పాఠశాలకు వెళ్ళడానికి 25 శాతం మంది పిల్లలు అయిష్టత చూపుతుంటారు. అయితే వీరిలో అధిక శాతం ఒక సంవత్సరం లోపుగానే గాడిలో పడతారు. మిగిలిన వారిలో 'తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడుతున్నాం' అనే ఆందోళన, నిస్పృహ అలముకుంటాయి. అటువంటి పిల్లల్లో విద్యాపరమైన సమస్యలు ఉంటాయి. తరగతి గదిలో చెప్పిన పాఠాలు అర్థం కాక పోవడం, సహచర విద్యార్థుల నుంచి చిన్న చూపు, వయసుకు మించి పై తరగతిలో వేయడం లేదా పెద్ద వయసు పిల్లలను తక్కువ తరగతిలో వేయడం, పిల్లలు ఒంటరిగా ఉంటున్నాం అనే భావన, ఇంట్లో తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉండకపోవడం తదితర కారణాలు స్కూల్‌ ఫోబియాకు దారితీస్తాయి.
సాధారణంగా పిల్లలకు పాఠశాలపై విముఖత 5 నుండి 14 సంవత్సరాలలోపు వయసులో ఏర్పడే అవకాశాలున్నాయి. పాఠశాల ప్రాథమిక దశలో, ఉన్నత పాఠశాలకు వెళ్ళే సమయంలో, మరికొందరిలో కౌమారదశ ప్రారంభంలో కూడా ఈ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. గ్రామీణ వాతావరణంలో డ్రాపౌట్స్‌ను పరిశీలిస్తే ప్రాథమిక స్థాయి విద్యతోనే సరిపెట్టేవారి సంఖ్య అధికంగా ఉంది. బడి ఈడు పిల్లలు ఏదోఒక సాకుచెప్పి పాఠశాలకు వెళ్ళనని మారాం చేస్తుంటారు. కొందరు తమలో ఏ విధమైన సమస్య లేనప్పటికి ఎంతో ఆందోళన కనబరుస్తూ తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తారు.

సమస్య ఏంటో తెలుసుకోవాలి..
మానసిక సమస్యలకు కాగేటివ్‌ బిహేవియర్‌ థెరపీ, ఎక్స్‌ఫోజర్‌ థెరపీ, ప్రవర్తనా నియమావళికి సంబంధించిన టెక్నిక్స్‌ ద్వారా చికిత్స చేసే అవకాశాలున్నాయి. ఈ పదాలలో సంక్లిష్టత ఉన్నప్పటికీ పద్ధతి మాత్రం తేలిక. తల్లిదండ్రులు ముందుగా తమ పిల్లలు బడిపై విముఖత ఎందుకు చూపుతున్నారో తెలుసుకోవాలి. పిల్లలకు అర్థమయ్యే రీతిలో నచ్చచెప్పాలి. మానసిక ధైర్యాన్ని అందించాలి. పిల్లలవెంట తల్లిదండ్రులు కొన్ని రోజులు పాఠశాల వరకు వెళ్ళి స్కూల్‌ టీచర్‌తో నేరుగా మాట్లాడి ఉపాధ్యాయులంటే తమ పిల్లలకు ఉన్న భయాన్ని పోగొట్టాలి. పిల్లలకు మానసిక ప్రశాంతత అందించాలి. ఎంతసేపు చదువే కాకుండా ఈడు పిల్లలతో ఆటలాడించడం, క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం చేయాలి. పిల్లల్లో ఉద్వేగాలుంటే వాటిని తగ్గించడానికి తల్లిదండ్రులు కృషి చెయ్యాలి. తోటి పిల్లలతో పోట్లాటకు దిగకుండా స్నేహపూర్వక వాతావరణం కలిగించాలి. ఒంటరితనం అనే భావన నుంచి పిల్లలను బయటకు తీసుకురావాలి.

ఉపాధ్యాయుల పాత్ర..
పిల్లల మనస్తత్వం తెలుసుకుని వారిపట్ల ప్రేమ, ఆలంబనం కలిగి ఉండాలి. బడి ఈడు పిల్లలు రకరకాల మనస్తత్వాలు కలిగివుంటారు. కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయులను సైతం పిల్లలు ఏకవచనంలో మాట్లాడడం, గౌరవం లేకుండా ప్రవర్తించడం చేస్తుంటారు.
పిల్లల మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు గుర్తించి తమ సొంత పిల్లలు అలా ప్రవర్తిస్తే ఏలా స్పందిస్తారో అదే విధంగా పాఠశాలలోని పిల్లల పట్ల స్పందిస్తే పిల్లలకు బడి అంటే భయం పోతుంది.
కఠినంగా దండిస్తే పిల్లలు డిప్రెషన్‌కు గురవుతారు. అందుకే పిల్లల్లో పాఠశాల పట్ల ఇష్టత ఏర్పడే విధంగా తీర్చిదిద్దాలి.
పిల్లల్లో నైపుణ్యాన్ని గుర్తించి నలుగురిలో వారిని అభినందించాలి. తరగతి గదిలో ఎవరైనా ఒక విద్యార్థి ఎక్కువగా అల్లరి చేస్తుంటే వారిని సాటి విద్యార్థుల మధ్య దండించకుండా తరగతి అనంతరం ఒంటరిగా పిలిచి అర్థమయ్యేరీతిలో కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.
ఒక్కొక్క విద్యార్థి చదువుకంటే క్రీడలలో ఎక్కువ ప్రతిభ కనబరుస్తారు. అటువంటి వారిని గుర్తించి ప్రోత్సహించాలి.
పిల్లల సామర్థ్యానికి తగిన విధంగా హోమ్‌వర్క్‌ ఇవ్వడం, చెయ్యలేని విద్యార్థులను దండించకుండా వారిని ప్రోత్సహించి తరగతి గదిలోనే హోమ్‌వర్క్‌ పూర్తిచేసే విధంగా చూడాలి. పిల్లలను తరచూ విమర్శించకుండా వారి అభిరుచులను గుర్తిస్తూ ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించాలి. 

09:47 - June 2, 2016

ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడ భాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.
రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మీల్‌ను గ్రైండ్‌ చేసి అందులోకి కొన్ని చుక్కల బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి.
మొదట బీట్‌రూట్‌ ముక్కలను గ్రైండ్‌ చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. అందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున గట్టి పెరుగు, ఆల్మండ్‌ ఆయిల్‌ను కలిపి పేస్ట్‌గా వాడొచ్చు.
తరచూ బీట్‌రూట్‌ రసాన్ని ముఖానికి అప్లై చేస్తుంటే ముఖచర్మం రంగులో కాస్త మార్పు వస్తుంది. 

09:43 - June 2, 2016

వేన్నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే.. ఎప్పటిలా చల్లటినీళ్లు కాకుండా.. అప్పుడప్పుడూ వేణ్నీళ్లు తాగి చూడండి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉదయం పూట వేణ్నీళ్లు తాగడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. కొవ్వు నిల్వల్ని కూడా ఇవి కరిగించేస్తాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు తప్పనిసరిగా వేణ్నీళ్లు తాగడానికి ప్రాధాన్యమివ్వాలి.
పరగడుపున తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆకలి కూడా అంతగా వేయదు. ఆకలి బాగా వేస్తున్నవారు వేణ్నీళ్లలో నిమ్మ, అల్లం రసం చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనె చేర్చినా మంచిదే.
తరచూ జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లతో ఇబ్బంది పడేవారు వేణ్నీళ్లకి ప్రాధాన్యమివ్వాలి. వాటితో పుక్కిలించాలి. నాలుగు తులసి ఆకులను చేర్చుకుని తాగడం కూడా అలవాటు చేసుకుంటే గొంతులో ఇన్‌ఫెక్షన్లు బాధించవు.
నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు వేణ్నీళ్లు తాగడం వల్ల పొట్ట కండరాలు ఉత్తేజితమవుతాయి. నొప్పి కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
ఇలా చేయడం వల్ల జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. వేణ్నీళ్లు తాగడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి. రాలిపోవడం, తెగిపోవడం తగ్గుతుంది.
అరుగుదల సరిగా లేనివారు ప్రతిరోజూ పరగడుపున వేణ్నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటివి బాధించవు. జీర్ణాశయంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. 

09:33 - June 2, 2016

భుత్వ విద్యాలయాలను కాపాడుకోవాలని యుటిఎఫ్ నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లయ్యింది. మూడో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఇవాళ రాష్ట్రమంతా ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి. సరికొత్త తెలంగాణను ఆవిష్కరించుకోవాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి?  తెలంగాణలో ఉపాధ్యాయుల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటి..? అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ వివరాను వీడియోలో చూద్దాం...

ఓయూలో విద్యార్థి జేఏసీ బైక్ ర్యాలీ అడ్డగింత..

హైదరాబాద్ : ఓయూలో విద్యార్థి జేఏసీ నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గన్ పార్కుకు బయలుదేరిన ఈ ర్యాలీని ఎన్ సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉస్మానియా వర్సిటీలో సంబరాలకు చెక్ పెట్టిన ప్రభుత్వం నిషేధాజ్ఞలను విధించిన సంగతి తెలిసిందే. 

గన్ పార్కు వద్ద సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్, డిప్యూటి స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. లుంబినీపార్క్ లో అమరవీరుల స్మృతి వనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 

చెట్టును ఢీకొన్న మెదక్ ఆర్టీసీ బస్సు...

మెదక్ : చౌడుపల్లి (మం) రాయలాపూర్ వద్ద మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. 

కూకట్ పల్లిలో యువకుడి హత్య..

హైదరాబాద్ : కూకట్ పల్లి సుమిత్రానగర్ లోని హెచ్ పీ పెట్రోల్ బంక్ సిబ్బందిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో మూసాపేట జింకలవాడకు చెందిన క్యాషియర్ సంగమేశ్వర్ (27) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

09:13 - June 2, 2016

హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందగా మారింది తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసి పరిస్థితి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆసరాగా నిలవకపోవడంతో ఆర్టీసీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దానికితోడు తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రగతి రథ చక్రాలకు ప్రతిబంధకంగా మారింది. ఇంతకీ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆర్టీసీలకు వచ్చే నష్టమేంటి? వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
అశనిపాతంలా కేంద్ర నిర్ణయం
అసలే అప్పుల ఊబీలోకూరుకుపోయిన ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం అశనిపాతంలా మారింది. ఫైనాన్స్ చట్టం-2016 పేరిట  ఆర్టీసీ బస్సులపై సర్వీస్‌ టాక్స్‌ విధించాలని కేంద్రం నిర్ణయించింది. అసలే అప్పుల ఊబిలో ఉన్న ఆర్టీసీని... సేవల పన్ను మరింతగా కుంగదీస్తుందని సంబంధిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్రం నిర్ణయం వల్ల టికెట్‌ ధర ఆరు శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజలపై నేరుగా భారం మోపే ఈ సర్వీస్‌ టాక్స్‌ను కేంద్రం వెంటనే విరమించుకోవాలని ఆర్టీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. 
ఏసీ బస్సు ప్రయాణికులు.. ఆరు శాతం పన్ను 
ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులు ఇకపై ఆరు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల ప్రజలపై నేరుగా ఆర్థిక భారం పడనుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సర్వీస్‌ టాక్స్‌ రూపంలో ప్రతిఏటా 24 కోట్ల రూపాయల వరకు కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని ప్రయాణీకుల టికెట్‌ నుంచే కట్‌ చేస్తారు. దీంతో ఆర్టీసీ ప్రయాణీకులు మరింత దూరమయ్యే ప్రమాదముంది. 
ప్రజారవాణ పటిష్టతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు  
రాష్ట్రాల్లో ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు 1950 ఆర్టీసీ చట్టం ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉంది.  కొంతకాలం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచిన ఆర్టీసీలు...  కాలక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందక.. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాజాగా స్టేజీ క్యారేజీలన్నింటినీ సర్వీస్‌ టాక్స్‌ పరిధిలోకి తేవడంతో ఆర్టీసీపై మరింత భారం పడే అవకాశం ఉంది. 
ప్రైవేటు బస్సులకు సెస్ నుంచి మినహాయింపు
ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేసి.. ప్రజా రవాణాను కాపాడాల్సిన కేంద్రం ప్రయాణీకులను అడ్డంగా దోచుకునేందుకు సిద్ధమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ వేలాది కోట్ల రూపాయలు దండుకుంటున్న ప్రైవేటు బస్సులను సెస్ నుంచి మినహాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

09:10 - June 2, 2016

తూర్పుగోదావరి : అన్నదాత సుఖీభవ అంటారు. కానీ అక్కడ అన్నదాతకు సుఖం లేకపోగా కష్టాలు మొదలయ్యాయి. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని నానా ఇబ్బందులు పెడుతోంది. తమ పొలాల్లో జరుగుతున్న సర్వేను అడ్డుకోవడానికి వెళ్లిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి ఎర్రటి ఎండలో ఐదు కిలోమీటర్లు నడిపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ హృదయవిదారకర సంఘటన పోలీసుల దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. 
రైతు వ్యతిరేక చర్యలు
మాది రైతుల ప్రభుత్వం అని చంద్రబాబు సర్కార్ పైకి గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఆచరణలో మాత్రం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని కేంపాడు గ్రామంలో అధికారులు తాడిపూడి ఎత్తిపోతల పథకం సర్వే  చేపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ఈ సర్వేను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు,రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు అధికారులకు మద్దతుగా రైతుల మీద విరుచుకుపడడంతో పోలీసులకు,రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరు రైతులు అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. 
పోలీసుల ఆరాచకం 
పోలీసులు రైతులను అరెస్ట్ చేసి మండుంటెండలో ఐదు కిలోమీటర్ల వరకు రైతులను నడిపించారు. ఎర్రటి ఎండలో నడిచేసరికి కొందరు అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. దీంతో పోలీసుల ఆరాచకం నశించాలని రైతులు నినాదాలు చేశారు. తమకు ఇప్పటి రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు అసలు తాడిపూడి ఎత్తిపోతల పథకం అవసరం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ఈ పథకం చేపట్టారని వాపోయారు. రైతులకు అండగా ఉంటామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం తమ నోటి కాడా తిండిని లాక్కుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు సరైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

08:58 - June 2, 2016

మహబూబ్‌నగర్‌ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేళ తెలంగాణకు కేంద్రం అరుదైన కానుక ఇచ్చింది. రాష్ట్రంలో మ‌రో మెడిక‌ల్ కాలేజి ఏర్పాటుకు అనుమ‌తిస్తూ.. వైద్య ఆరోగ్య శాఖ‌కి లేఖ రాసింది. తెలంగాణ ఆవిర్భావ సంబరాల వేళ ఇదో స్పెషల్‌ గిఫ్ట్‌ అంటూ హెల్త్ మినిస్టర్‌ హ‌ర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచే అడ్మిష‌న్లు స‌హా, అద‌నపు సీట్లు అందుబాటులోకి వస్తాయి.
మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు
తెలంగాణలో మరో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సక్సెస్‌ అయ్యాయి. వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలంటూ చాలా కాలం క్రితమే కేసీఆర్‌ సర్కార్‌ కేంద్రానికి లేఖ రాసింది. ఏడాది కాలంగా ఈ విషయాన్ని గుర్తుచేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కాలేజీ ఏర్పాటుకు అనుమతులిస్తూ మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. 
150 ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో వైద్య క‌ళాశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ ప‌ర్మిష‌న్‌తోపాటు 150 ఎంబీబీఎస్ సీట్లను ఎంసీఐ ఎలాట్ చేసింది. ఈ అకడ‌మిక్ ఇయర్‌ నుంచే క్లాసెస్‌ను ప్రారంభించొచ్చంటూ లేఖలో పేర్కొంది.  
తెలంగాణ వ్యాప్తంగా ఐదు మెడికల్ కాలేజీలు
ప్రస్తుతం తెలంగాణ‌లో ఐదు గవర్నమెంట్ మెడిక‌ల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 850 సీట్లున్నాయి. హైద‌రాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ మెడిక‌ల్ కాలేజీలు, వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ వైద్య కళాశాల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ల‌లో ఒక‌టి చొప్పున వైద్య విద్య కళాశాలలున్నాయి. కొత్తగా మంజూరైన దానితో కలిపి మెడిక‌ల్ కాలేజీల సంఖ్య ఆరుకు చేరింది. అద‌నంగా వచ్చిన 150 సీట్లతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడిక‌ల్ సీట్ల సంఖ్య వెయ్యికి చేరింది. 
వందలాది మందికి ఉపాధి అవకాశాలు
నూతన వైద్యకళాశాలతో కొత్త ఉద్యోగాలు వస్తాయి. మెడిక‌ల్‌, పారా మెడిక‌ల్‌, టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌, స‌బార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేయాల్సుంటుంది. ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా వంద‌లాది కుటుంబాల‌కు ఉపాధి ల‌భిస్తుంది. అలాగే మెడిక‌ల్ కాలేజీకి అనుబంధంగా సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ కూడా అందుబాటులోకి వ‌స్తుంది. ఈ కార‌ణంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ చుట్టుపక్కల ప్రాంతాలవారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 
మ‌రో మెడిక‌ల్ కాలేజీ రావ‌డంపై మంత్రి లక్ష్మారెడ్డి హర్షం
రాష్ట్రానికి అద‌నంగా మ‌రో మెడిక‌ల్ కాలేజీ రావ‌డం ప‌ట్ల తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్‌ అవిశ్రాంత కృషివల్లే మహబూబ్‌నగర్ జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందని త్వర‌లోనే సీఎం ఆదేశానుసారం కళాశాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు  తీసుకుంటామ‌ని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. 

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నేడు జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపడుతూ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

ఇండోనేషియాలో భూకంపం..

ఇండోనేషియా : సుమత్రా దీవిలో ఈ తెల్లవారుజామున 5.56 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లను విడిచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదని తెలుస్తోంది. 

తెలుగు రాష్ట్రాలకు మోడీ శుభాకాంక్షలు..

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. 'రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. రానున్న సంవత్సరాల్లో రాష్ర్టాభివృద్ధి సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నా' అని అన్నారు. 'ఆంధ్రప్రదేశ్ సోదరి, సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ర్టాభివృద్ధి ఇలాగే కొనసాగుతూ శరవేగంగా దూసుకెళ్లాలని కోరుకుంటున్నా' అని మోడీ ట్వీట్ చేశారు. 

నేడు తెలంగాణ అవరణ దినోత్సవం

హైదరాబాద్ : నేడు తెలంగాణ అవరణ దినోత్సవంగా ఉదయం 9.30 గంటలకు గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఉదయం 9.45 గంటలకు లుంబినీ పార్కు సమీపంలోని అమరుల స్మారక స్థలి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.10 గంటలకు సంజీవయ్యపార్కులో జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఉదయం 10.30 గంటకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. 

08:23 - June 2, 2016

హైదరాబాద్ : గుర్తింపు పొందిన లే అవుట్లలో ఒక్కరోజులోనే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్ ఎండీఏ ప్రకటించింది. పురపాలక శాఖ టార్గెట్ పెట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా హెచ్ ఎండీఏ ప్రగతి నివేదికను అధికారులు విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప‌యోగించ‌డం ద్వారా రానున్న రోజుల్లో మరింత పారదర్శక పాలన అందిచనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
9 పనులకుగాను 8 పూర్తి
హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో..... మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రకటించింది. వందరోజల ప్రణాళికలో భాగంగా సాధించిన విజయాలను హెచ్ఎండిఎ క‌మిష‌న‌ర్ చిరంజీవులు ప్రకటించారు. ముందుగా నిర్దేశించుకున్న వందరోజుల ప్రణాళికలో భాగంగా తొమ్మిది పనులకు గాను 8 పనులను పూర్తి చేశామన్నారు. 
ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల స్వీకరణ
ఘట్‌కేసర్ నుంచి షామీర్ పేట్ వరకు మిగిలిపోయిన 21కిలో మీట‌ర్ల ఔటర్ రింగ్ రోడ్డు ప‌నులను పూర్తి చేశామ‌ని కమిషనర్‌ తెలిపారు. కండ్లకోయ వద్ద కొద్ది స్ట్రెచ్ మాత్రమే మిగిలింద‌న్నారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించిన హెచ్ఎండీఏ..... ఐసీటీ పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది.  మొత్తం లక్షా 31 వేల 990 ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తులు, 37వేల 117 బీఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చెప్పారు. ఎల్ఆర్‌ఎస్ ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న వేగంగా జ‌రుగుతోంద‌ని ఇప్పటికే 12వేల ద‌ర‌ఖాస్తులు క్లియ‌ర్ చేశామ‌న్నారు. 2017 మార్చి నాటికి అన్నిటినీ క్లియర్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుదారుడు త‌న అప్లికేషన్ స్టేట‌స్‌ను ఆన్‌లైన్‌లో చూసుకోవ‌చ్చన్నారు. 
డీపీఎంఎస్‌ ద్వారా లే అవుట్లు...
లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులను డీపీఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఇచ్చే ప్రక్రియను ప్రారంభించినట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఇప్పటికే గుర్తింపు పొందిన లే అవుట్లలో భవన నిర్మాణ అనుమతులను ఒక్క రోజులోనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. వేగంగా అనుమ‌తులు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంద‌ని అభిప్రాయపడింది. తెలంగాణ హరిత హారంలో భాగంగా మూడు కోట్ల మొక్కలు నాటే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జులై 11వ తేదీన ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్లు  హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. ఇక హుస్సేన్ సాగ‌ర్ పూడిక డంపింగ్ ప్రాంతాల్లోనూ గ్రీన‌రీ డెవ‌ల‌ప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 

07:44 - June 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉస్మానియా యూనివర్శటీ మరోసారి విద్యార్థుల నినాదాలతో మార్మోగిపోతుంది. విముక్తి గర్జన పేరుతో ఓయూ నిరుద్యోగ జేఏసీ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాయి. సీఎం కేసీఆర్ నియంతపాలన కొనసాగిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని... యూనివర్శటీలకు వీసీలను వెంటనే నియమించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. 
సర్కార్ పై విద్యార్థి జేఏసీ ఆగ్రహం  
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఓయూలో విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న జన జాతర సభను ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకోవాలని చూస్తోందని విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభను నిర్వహించకుండా విద్యార్థులను ప్రభుత్వం నిర్భందిస్తోందని.. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా సభను నిర్వహించి తీరుతామని జేఏసీ నాయకులు తెలిపారు. సభను అడ్డుకోవాలని చూస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. 
రాజకీయ సభలకు అనుమతి లేదు : ఓయూ రిజిస్ట్రార్  
మరోవైపు ఓయూలో రాజకీయ పరమైన ఎలాంటి సభలకు అనుమతి లేదని ఓయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. యూనివర్శిటీల్లో విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే జరగాలని.. ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఓయూలో జన జాతర సభను రద్దుచేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హెచ్‌ఆర్సీనీ ఆశ్రయించారు. ఈ సభకు టీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్‌ రెడ్డి వస్తే విద్యార్థుల మధ్య శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతోందని ఫిర్యాదుచేశారు.       
ఉద్రిక్త వాతావరణం 
ఓయూలో తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్క్ వరకు విద్యార్థులు చేపట్టిన బైక్ ర్యాలినీ ఓయూ ప్రధానద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

 

07:18 - June 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సంరంభం మొదలైంది. ధూంధాంగా వేడుకలను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం వేడుకలను అధికారికంగా ప్రారంభించనున్నారు సీఎం. గతాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు వేడుకలు వేదిక కానున్నాయి.
వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఏళ్ల నాటి కలసాకారమైన వేళ అమరవీరులు నడయాడిన నేలపై నెత్తురు పారిన నేలను పూల వనాలుగా మార్చిన తరుణాన్ని స్మరించుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది తెలంగాణ గడ్డ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సర్వం సిద్దమైంది.రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణలో వేడుకలను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ తో పాటు అన్ని నగరాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు , హోటళ్లు మాల్స్ థియేటర్లు ఎటు చూసినా విద్యుద్దీపాలంకరణతో ధగధగలాడుతున్నాయి. అవతరణ దినోత్సవం నాడు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులు 
గురువారం ఉదయం 9.30 నిమిషాలకు సీఎం కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత 9 .45 నిమిషాలకు లుంబినీ పార్కులో భారీ అమరవీరుల మొమెరియల్ కు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం 10.10  నిమిషాలకు సంజీవయ్యపార్కులో ఏర్పాటు చేసిన 298 అడుగుల ఎత్తు ఉన్న పోల్‌ వద్దకు చేరుకుంటారు. 108 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 
జాతీయ పతాకావిష్కరణ
జాతీయ పతాకావిష్కరణ అనంతరం.. సీఎం కేసీఆర్‌ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతి, పథకాలు .. భవిష్యత్ ప్రణాళికలపై ప్రధానోపన్యాసంచేస్తారు. త్వరలో సీఎం చేపట్టనున్న ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్  వేదికగా సమాచారం శాఖ ఆధ్వర్యంలో శకటాలను  ప్రదర్శిస్తారు.
అమరవీరుల కుటుంబసభ్యులకు వీఐపీ హోదా
ఈ వేడుకల్లో అమరవీరుల కుటుంబ సభ్యులకు వీఐపీ హోదా సీట్లు కేటాయించడం విశేషం. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మండల స్థాయి నుండిజిల్లా స్థాయిలో ఉన్న ప్రతిభామూర్తులను ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఉత్తమ పురస్కారాలు అందుకున్న 61 మందికి ప్రశంసాపత్రం ఇవ్వనుంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమప్రతిభ కనబరిచిన వారికి లక్షా నూట పదహార్లు నగదు ప్రోత్సాహం ఇవ్వనుంది సర్కార్. 
ప్రతిభామూర్తులకు 10 వేల నగదు పురస్కారం 
జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. మండల స్థాయిలో ప్రతిభామూర్తులకు 10 వేల నగదు పురస్కారం ఇవ్వనుంది సర్కార్. ఆసుపత్రులు, శరణాలయాలు, పాఠశాలల్లో మిఠాయిలు పంచాలని ఆదేశించింది ప్రభుత్వం. ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతారు. పీపుల్స్ ప్లాజాలో సంస్కృతిక కళా సారథి బృందం ఆనాటి  తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రజల కళ్ల ముందుంచనుంది. 

నేడు టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే రామారావు

ప్రకాశం: వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రామారావు నేడు టీడీపీలో చేరనున్నారు. 

విజయవాడలో నేడు నవ నిర్మాణ దీక్ష

కృష్ణా : విజయవాడలో నేడు నవ నిర్మాణదీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బెంజ్ సర్కిల్ లో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయనున్నారు. 

నేడు ఓయూలో జన జాతర కార్యక్రమం

హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు ఉస్మానియా వర్సిటీలో జన జాతర కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్నారు. 

Don't Miss