Activities calendar

04 June 2016

21:25 - June 4, 2016

విజయవాడ : తెలంగాణరాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిహరీష్ రావుపై ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవనేని ఉమా ఫైర్ అయ్యారు. తనపైన, ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని దేవినేని ఉమా హితవు పలికారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు వింటుదని.. హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉన్నారని.. వారి మద్య గిల్లికజ్జాలు పెట్టవద్దంటూ కోరారు. ఎఫెక్ట్ మీటింగ్ లో అనుమతులు లేకుండా ఎన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో తెలిపాలని మంత్రి దేవినేని ఉమ అన్నారు. 

21:22 - June 4, 2016

అనంతపురం : వైసీపీ అధినేత జగన్‌ అనంతపురంలో చేపట్టిన యాత్ర గందరగోళమైంది. కదిరిలో నిర్వహించిన జగన్‌ రోడ్‌షోలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం చెప్పులు విసురుకున్నారు. దీంతో జగన్‌ ప్రచార వాహనం దిగి కాన్వాయిలో ముందుకు వెళ్లిపోయారు. అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద గుమిగూడిన ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

20:49 - June 4, 2016

న్యాయం, ధర్మం, మానవత్వం లాంటి పదాలు పుస్తకాల్లో చదవడానికే బాగుంటాయ్.ఎవరో చెప్తుంటే వినడానికే బాగుంటాయ్.... ఆచరణలోకి వస్తే మాత్రం అంత్యా మిథ్యే. ప్రేమా, అనుబంధం, ఆప్యాయతా లాంటివి మచ్చుకైనా కనపడవు, వినపడవు.ఒక అపురూపమైన ప్రేమికుడు రాసుకున్న కవిత ఇది. శీర్షిక నీవు ప్రేమించలేదు. ప్రేమను మాత్రమే చూసే హృదయం నాది...కపటం తెలియక.. కల్మషం కానరాక ప్రేమను మాత్రమే ప్రేమించే నాకు అణువణునా ప్రేమను మాత్రమే చూసే నాకు తరులు, గిరులు, స్మృతులు, భావాలు, కంచం, మంచం, కుర్చీ, కుండా, బల్లా, మల్లా, మన్ను, మిల్లు, పలానా పాలవాడు, దోబీ, కూరలమ్మీ, వీధి చివర కుక్క, పొరిగింట్లో అక్క, మామిడి పిక్క, పామురాయి రెక్క, స్మశానంలోనక్క, ఉదయం విరిసే పువ్వులు, రాలేటి బిందువులు, వేడిగా వుండే సూరీడు, చల్లదనం తప్ప తెలియని చంద్రుడు, వేల నక్షత్రాలు, అగ్గిపుల్ల, ఆడపిల్ల.. అన్నిట్లోనూ ప్రేమను చూసే నాకు నీవు ఎందుకు భయంకరంగా కనిపిస్తున్నావు. మృత్యువును కూడా ప్రేమించే నేను నీలో ఎందుకు చీకటిని చూస్తున్నాను. భూతాన్ని, భయాన్ని పక్కన పెట్టుకుని ప్రేమ బతక గలదా? ప్రేమించు... ప్రేమను అందించు.. ప్రేమను బతికించు అని గుండె లోతుల్లోంచి వెలువరించే ప్రేమను చూసిఆమె ప్రేమించేస్తుంది. అపురూపంగా ప్రేమించింది. దాని వల్ల ఏమి జరుగుతుందో... ఆమె ఆలోచించలేదు. లోకమంతా ఆమె అతనికి... అతడికి ఆమె. అంతగా ప్రేమించుకున్న రమ్య కథే నేటి క్రైమ్ డిటెక్టివ్. పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోను క్లిక్ చేయండి...

బాలీవుడ్ నటి సులభా దేశ్ పాండే కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి సులభా దేశ్ పాండే కన్నుమూశారు. 79 సంవత్సరాల దేశ్‌పాండే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని తమ నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

స్నేక్‌గ్యాంగ్‌ కేసు ఖైదీ ఎంజీఎం కు తరలింపు...

వరంగల్‌: స్నేక్‌గ్యాంగ్‌ కేసు ఖైదీ ఇబ్రహీంను శనివారం జైలు సిబ్బంది వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కారాగారంలో దురుసుగా ప్రవర్తించిన ఇబ్రహీంపై జైలు సిబ్బంది చేయి చేసుకున్నారు. దీంతో అతను గాయపడినట్లు సమాచారం. దీనిపై వివరణ కోరగా, అనారోగ్య కారణాలతో ఇబ్రహీంను ఆస్పత్రికి తరలించామంటూ జైలు సిబ్బంది పేర్కొన్నారు.

'మధుర'రాంవృక్ష్ యాదవ్ మృతి: యూపీ డీజీ

హైదరాబాద్ : మధుర ఘర్షణల ప్రధాన సూత్రధారి రాంవృక్ష్ యాదవ్ మృతి చెందినట్లు యూపీ డీజీపీ ప్రకటించారు. ఫోటోల ఆధారంగా రాంవృక్ష్ యాదవ్ ను గుర్తించినట్లు వెల్లడించారు.

19:19 - June 4, 2016

హైదరాబాద్ :వైవిధ్యమైన డైలాగ్ మాడ్యులేషన్‌తో, విలక్షణమైన హావభావాలతో సినీ పరిశ్రమలో కమెడియన్‍గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుని, 'జబర్దస్త్' అనే కామెడీ షో తర్వాత 'ధనాదన్ ధన్‌రాజ్‌'గా అందరికీ సుపరిచితులైపోయారు. నెల్లుట్ట ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్‌ పతాకంపై కళ్యాణిరామ్‌ నిర్మిస్తున్న 'కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'బంతిపూల జానకి' చిత్రంలో నటిస్తున్న ధన్‌రాజ్‌, దీక్షాపంత్‌ నటిస్తున్నారు. ఈ సందర్భంగా 'టెన్ టివి' లైవ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు..దీక్షాపంత్ ఫ్రెండ్ శారద, రోలర్ రఘు, యాంకర్ శ్రీముఖి, ధన్ రాజ్ వైఫ్ ఫ్రాంక్ కాల్ చేసి ఫన్నీ ఫన్నీ గా మాట్లాడారు. అంతే కాదు ధన్ రాజ్ తన తల్లి గురించి ఎలాంటి అంశాలు తెలిపారు.... ఆ సమయంలో ధన్ రాజ్ ఎలా భావోద్వేగాకి గురయ్యారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

18:53 - June 4, 2016

గుంటూరు : మొన్నటి వరకు ఆ గ్రామం పేరే పెద్దగా ఎవరికి తెలియదు. ఉన్నపళంగా ఇప్పుడా గ్రామం రూపురేఖలే మారిపోయాయి. నిత్యావసర వస్తువులకు సైతం కిలోమీటర్లు దూరం వెళ్లిన ఆ గ్రామస్తులు.. ఇప్పుడు సకల సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో శరవేగంగా.. మోడ్రన్‌ విలేజ్‌గా మారిపోయిన ఓ గ్రామంపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...!

ఏపీ రాజధానిగా తుళ్లూరును...

ఏపీ రాజధానిగా తుళ్లూరును ప్రకటించినప్పటి నుంచి.. నిన్నమొన్నటి వరకు ఎవరికీ తెలియని గ్రామాలు సైతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడా గ్రామాలు..సకల సౌకర్యాలతో తులతూగుతున్నాయి. బస్సు సౌకర్యం కూడా లేక, వసతుల లేమితో అలమటించిన గ్రామాలు.. ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఓ వెలుగు వెలుగుతున్నాయి. మందడం గ్రామాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

బస్‌ మిస్‌ అయితే.. మళ్లీ మర్నాడే తిరిగి వచ్చేవారు......

మందడం గ్రామస్థులు నిన్నమొన్నటి వరకు వ్యవసాయం చేసుకుంటూ.. సాదాసీదాగా ఉండేవారు. ఏ చిన్న పనికైనా దూరంలోని మంగళగిరి.. గుంటూరు, బెజవాడలకు వెళ్లేవారు. ఊరికొచ్చే ఆఖరు బస్‌ మిస్‌ అయితే.. మళ్లీ మర్నాడే తిరిగి వచ్చేవారు. కొన్నాళ్ల క్రితం వీరిది అంతటి దుస్థితి. కానీ నేడు సీన్‌ రివర్స్‌ అయింది. తాత్కాలిక సచివాలయం ఏర్పాటు మందడం దశనే మార్చేసింది. సచివాలయ నిర్మాణం వల్ల ఊహించని విధంగా మందడం రూపురేఖలే మారిపోయాయి.

తాత్కాలిక సచివాలయాన్ని ...

తాత్కాలిక సచివాలయాన్ని నిజానికి వెలగపూడి పంచాయితీ పరిధిలోని భూముల్లో నిర్మిస్తున్నారు. అయితే.. టెంపరరీ సెక్రెటరీయేట్‌ మందడం గ్రామాన్ని ఆనుకుని ఉండటం, సచివాలయాన్ని చేరేందుకు ప్రధాన మార్గం మందడం కావడంతో.. ఇప్పుడు ఆ గ్రామం జన సందోహాన్ని సంతరించుకుంది. తాత్కాలిక సచివాలయం కారణంగా దాదాపుగా 2000 వేల మంది ఈ గ్రామం, దాని చుట్టు ప్రక్కల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో పనిచేసే కార్మికులే దాదాపు 1200మంది వరకు ఉంటారు. ఇంజినీర్లు, ఎలక్ట్రీషియన్స్, కాంట్రాక్టర్లు.. ఇలా అనేక మందితో ఇప్పుడా గ్రామం కిటకిటలాడుతోంది.

మందడంలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లను తలదన్నేలా అద్దెలు...

మందడంలో చిన్న రేకుల షెడ్డు సైతం 3 వేల నుంచి 5 వేల వరకు అద్దె పలుకుతోంది. ఇక సింగిల్‌ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్ అయితే హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లను తలదన్నేలా అద్దెలున్నాయి. సింగిల్ బెడ్ రూమ్ అయితే 10వేలు, డబుల్ బెడ్ రూమ్ 20 వేలు వరకు అద్దెకు డిమాండ్ ఉంది. చాలామంది అద్దెభారం తగ్గించుకోవడానికి నలుగురు, ఐదుగురు కలిసి గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అటు స్థానికులు సైతం రాబోయే రోజుల్లో అద్దెకిచ్చి బతకొచ్చని కొత్త కొత్త భవనాలు సిద్ధం చేస్తున్నారు.

వ్యాపారాలూ విపరీతంగా పెరిగిపోయాయి. ...

తాత్కాలిక సచివాలయం పుణ్యమా అని మందడంలో వ్యాపారాలూ విపరీతంగా పెరిగిపోయాయి. సాయంత్రం వేళ ప్రధాన సెంటర్‌ జనంతో రద్దీగా మారుతున్నాయి. కిరాణం, కూల్‌డ్రింక్స్‌ వంటి షాపులు రాత్రి 11 గంటల వరకూ తెరుచుకునే ఉంటున్నాయి. గతంలో గంటకోసారి కూడా బస్సులు వచ్చేవి కావు. ఇప్పుడు గుంటూరు, మంగళగిరి, విజయవాడలకు సర్వీసులు విరివిగా పెరిగాయి. మందడం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇప్పుడు బస్సు సర్వీసులు పెరిగిపోయాయి.

జనం పెరగడంతో ట్రాఫిక్‌ సమస్య...

మరోవైపు తాత్కాలిక సచివాలయం నిర్మాణం వల్ల మందడంలో జనం పెరగడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ప్రధాన రహదారుల విస్తరణకు, తాత్కాలిక సచివాలయం నిర్మాణాలకు భారీ వాహనాలు గ్రామం గుండా వెళుతుండటంతో విపరీతంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోతున్నాయి. పెరిగిన ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మందడం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ....

మరోవైపు మందడం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 80 కోట్ల వరకు కేటాయించింది. గత నెలలో తాత్కాలిక సచివాలయ ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబు.. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీ, ఇళ్లు, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించి.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.  

18:48 - June 4, 2016

గుంటూరు : బజరంగ్ జూట్ మిల్లు వద్ద ఆందోళన నిర్వహించారు కార్మికులు. మిల్లులోని సామాగ్రి,ముడి సరుకు తరలించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో కార్మికులు రోడ్డు పై బైటాయించారు. దీంతో మిల్లు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులకు మద్దతుగా జూట్ మిల్ పరిరక్షణ కమిటీ ధర్నా నిర్వహించారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జూట్ మిల్ ను ప్రబుత్వం వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యాజమాన్యం పట్ల మెతక వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు.

18:47 - June 4, 2016

కర్నూలు : నగరంలో టీడీపీ నేత ఆగడాలు తట్టుకోలే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. టీడీపీ నేత రామయ్యనాయుడు దగ్గర రాఘవేంద్ర నగర్‌కుచెందిన లక్ష్మన్నరావు ఇల్లు కొన్నాడు... ఇందుకోసం 30లక్షల రూపాయలు చెల్లించాడు.. డబ్బులుతీసుకున్న రామయ్య నాయుడు ఇల్లుమాత్రం రిజిస్ట్రేషన్ చేయలేదు.. పైగా ఆ ఇంటిని వేరేవారికి అమ్మేశాడు.. ఈ విషయంపై ప్రశ్నించిన లక్ష్మన్నరావుపై ఆయన అనుచరులు దాడులు చేశారు.. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేక మనస్తాపంచెందిన బాధితుడు.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో ఆగ్రహించిన బాధితుని కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.. పోలీసులు నచ్చజెప్పడంతో బంధువులు శాంతించారు.. 

18:45 - June 4, 2016

కర్నూలు : ఆదోనిలో సైకో వీరంగం సృష్టించాడు. పట్టణంలోని వాల్మీకి నగర్‌ లో మతిస్థిమితం లేని వ్యక్తి కత్తి, రాళ్లతో ముగ్గురిని గాయపరిచాడు. దారినపోయే వారిని గాయపరచడంతో కాలనీవాసులు భయపడ్డారు. దీంతో స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. 

18:43 - June 4, 2016

విజయవాడ: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ... టీడీపీ అధికారంలోకివచ్చి రెండేళ్లయినా ప్రజాసమస్యలపై దృష్టిపెట్టలేదని మండిపడ్డారు.. అసెంబ్లీ సమావేశాల్లో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమేపనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు..

18:42 - June 4, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో.. జగన్‌పై తెలుగుదేశం నేతలూ విమర్శల జోరు పెంచారు. చాలాచోట్ల ధర్నాలు, జగన్‌ దిష్టిబొమ్మల దహనాల ద్వారా నిరసనను తెలిపారు.

చంద్రబాబు పూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జగన్...

అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్‌.. శనివారం కూడా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హామీలు నెరవేర్చని చంద్రబాబును చెప్పులతో కొట్టండన్న జగన్‌.. తాజాగా, బాబుకు బుద్ధి జ్ఞానం లేదంటూ విమర్శించారు.

జగన్ వాఖ్యలపై టిడిపి నేతల ఫైర్....

జగన్‌ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. జగన్‌ మానసిక స్థితి బాగోలేదని, అవినీతిపై మాట్లాడే అర్హత, నైతికత జగన్‌కు లేవని అమాత్యులు విరుచుకుపడ్డారు. ఇటీవలే టీడీపీ గూటికి చేరిన నేతలు కూడా.. జగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబును చూసి ఓర్వలేకపోతున్నారని ఒకరంటే.. సంస్కారం లేని వ్యక్తి జగనంటూ మరొకరు విమర్శించారు.

పరస్పర విమర్శలు..

జగన్‌పై టీడీపీ నేతల విమర్శనాస్త్రాలను అటు వైసీపీ నేతలూ అంతే తీవ్రతతో తిప్పికొడుతున్నారు. హామీలను నెరవేర్చని వారిని ప్రశ్నించడం అప్రజాస్వామికం ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పాలక, ప్రతిపక్ష నేతల మధ్య మొదలైన ఈ వాగ్యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో కాకను తారాస్థాయికి చేర్చింది.  

18:39 - June 4, 2016

విజయవాడ : సరుకు రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ హబ్‌గా ఉంటుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. నేడు ఆయన విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో సుమారు మూడు గంటలకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సి వివిధ రైల్వే ప్రాజెక్టులు, పనుల గురించి ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీ నుంచి పార్లమెంట్‌ సభ్యుడు కావడం సంతోషంగా ఉందన్నారు సురేష్‌ ప్రభు. రెండు, మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఆన్ లైన్ లో విద్యార్థుల బస్ పాసులు...

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విధానం అమల్లోకి తెస్తామన్నారు. ఆన్‌లైన్ విధానంతో బోగస్ పాసులను అరికడుతామని పేర్కొన్నారు.

17:56 - June 4, 2016

కరీంనగర్ : ఈదురు గాలులు కరీంనగర్ జిల్లాలో బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు విరిగి పడడం, విద్యుత్ స్థంబాలు నేలకొరిగి విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కోన్నారు. నగునూర్, మానకోండూర్ లో పిడుగు పాటు కు ఇద్దరు మృతి చెందగా రెండు వందలకు పైగా పశువులు మృత్యు వాత పడ్డాయి. కమలాపూర్ మండలం దండెపల్లిలో రైల్వే విద్యుత్ తీగలు తెగి పడడంతో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో గాలి బీభత్సం సంబందించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు.  

17:54 - June 4, 2016

వరంగల్‌ : జిల్లాలోని సీకేయం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. సంగం మండలం గడిపల్లి గ్రామానికి చెందిన మమత ఫిబ్రవరి నెలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంది. అందుకు సంబంధించిన ధృవపత్రం కూడా ఆసుపత్రి జారీ చేసింది. అయితే ఆసుపత్రి వైద్యులు చేసిన ఆపరేషన్‌ విఫలమై మమత మరోసారి గర్భిణి అయ్యింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందని బాధితులు వాపోతున్నారు. 

ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రథమ మహాసభ..

హైదరాబాద్: తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రథమ మహాసభ ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని రావినారాయణరెడ్డి కళాప్రాంగణంలో ప్రజానాట్యమండలి మహాసభ నిర్వహిస్తున్నారు. సభకు ప్రజాగాయకుడు గద్దర్, దర్శకుడు నర్సింహరావు, నటుడు మాదాల రవి, కళాకారులు హాజరయ్యారు.

17:53 - June 4, 2016

హైదరాబాద్ : సినీనటి ప్రగ్యా జైస్వాల్‌ గోషామహల్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో హల్‌చల్‌ చేశారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూపొందించిన మొబైల్‌ యాప్‌పై అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సిగ్నల్‌ జంప్‌, కార్లలో వెళ్లేటప్పుడు సీటు బెల్టుల ధరించకోవడం, బైక్‌లు నడిపేవారు హెల్మెట్లు పెట్టుకోపోవడతో ఎదురయ్యే సమస్యలపై అవగాహకల్పించారు. నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ప్రాణాపాపం పొంచివున్న విషయాన్ని ప్రగ్యా జ్వైస్వాల్‌ ప్రస్తావించారు. వాహనచోదకులందరూ ట్రాఫిక్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డీపీసీ రంగనాథ్‌ సూచించారు. 

తెలంగాణలో రానున్న 72 గంటల్లో వడగళ్ల వాన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 72 గంటల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత రెండు రోజుల నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు.

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు..

హైదరాబాద్ : రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతి రోజు గంట ముందుగానే విధుల నుంచి ఇళ్లకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 లేదా 7న నెలవంక కనిపించినప్పటి నుంచి రంజాన్ పండుగ అయిపోయే వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే తమ ఇళ్లకు వెళ్లొచ్చు.

బాబుపై జగన్ కుట్ర ఆలోచన చేస్తున్నారా? ..

తూ.గోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు భద్రత గురించి వైసీపీ నేత జగన్‌కు ఎందుకని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. జగన్ చంద్రబాబుపై కుట్ర ఆలోచన చేస్తున్నారా? అని బుచ్చయ్య ప్రశ్నించారు. చంద్రబాబుపై బాంబుదాడి కేసు నిందితుడైన గంగిరెడ్డితో జగన్ కు సంబంధాలు ఉన్నాయన్నారు..ఎర్రచందనం స్మగ్లర్లకు జగన్ బెయిల్ ఇప్పిస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

17:22 - June 4, 2016

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం దూలపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రసాయన గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు వచ్చి హడావుడి చేస్తున్నారు తప్ప అనుమతులు లేని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. రసాయనాల ఘాటైన వాసనలతో అనారోగ్యం పాలవుతున్నామని.. పరిశ్రమలను జనావాసాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.   

ఎస్‌బీహెచ్ ఏటీఎంలో మంటలు..

ఖమ్మం : మధిర ఎస్‌బీహెచ్ ఏటీఎంలో మంటలు చెలరేగాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తతో మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు సంభవించడానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని తెలుస్తుంది.

సరకు రవాణాకు హబ్‌గా ఏపీ : సురేష్ ప్రభు

విజయవాడ: సరకు రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ హబ్‌గా ఉంటుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. శనివారం ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో సుమారు మూడు గంటలకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సి వివిధ రైల్వే ప్రాజెక్టులు, పనుల గురించి ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ నుంచి పార్లమెంట్‌ సభ్యుడు కావడం సంతోషంగా ఉందన్నారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో నుంచి వెళ్లే మార్గాల్లో రూ.22వేల కోట్లమేర పనులు నడుస్తున్నట్లు వివరించారు.

అనంత్ నాగ్ లో ఉగ్రదాడులు...

జమ్మూ కశ్మీర్ : అనంత్ నాగ్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గడచిన 15 గంటల్లో రెండోసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జీఎస్ఎఫ్ డీజీ తెలిపారు.

చిన్నారులను చెట్టుకట్టి చితకబాదిన యజమాని...

కరీంనగర్ : జిల్లాలోని జగిత్యాలలో ఇద్దరు బాలురను ఓ దుకాణ యజమాని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. పాత ఇనుప సామాన్లు ఎత్తుకెళ్తున్నారని బాలురను దుకాణ యజమాని చెట్టుకు కట్టేశారు. బాధిత బాలుర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్: జీడిమెట్లలోని ఓ కెమికల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తేవటానికి యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. 

ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహాడ్‌లోని ఓ ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. వెజిటెబుల్ ఆయిల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాద కారణంగా తీవ్ర ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం...

ఆఫ్ఘనిస్థాన్ : మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆఫ్ఘానిస్థాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం 'అమీర్ అమానుల్లాఖాన్' పురస్కారం ఇచ్చి ఆ దేశం గౌరవించింది. ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు ఆష్రఫ్‌ఘనీ ప్రధాని మోదీకి ఈ అవార్డును అందజేశారు. ఇవాళ మోదీ, ఆష్రఫ్‌ఘనీ ఇరువురు కలిసి ఫ్రెండ్‌షిప్ డ్యాంను ప్రారంభించారు. కాగా, మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇవాళ మోదీ ఆఫ్ఘానిస్థాన్‌లో పర్యటిస్తోన్నారు.

కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు...

హైదరాబాద్: హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌కు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిస్తున్నారు. 2013 వరదలు బీభత్సం సృష్టించిన తర్వాత మొదటిసారిగా లక్షా 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య కేదారనాథ్ క్షేత్రం కొలువై వుంది.

'జైపాల్ ని విమర్శించే స్థాయి బాల్క సుమన్ కు లేదు'

హైదరాబాద్ : బాల్క సుమన్ ది జైపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని కాంగ్రెస్ నేత మల్లు రవి పేర్కొన్నారు. తెలంగాణ కోసం సీడబ్ల్యూసీని కలిసి పార్లమెంట్ ను ఒప్పించింది జైపాల్ రెడ్డే కానీ కేసీఆర్ కాదని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడే తీరు మార్చుకోవాలని సూచించారు. నంది ఎల్లయ్యపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. దళిత సామాజిక వర్గాన్ని కోమటిరెడ్డి అవమానించారని ఆయన పేర్కొన్నారు. 

ప్రముఖ జర్నలిస్టు సంతోఖ్‌ సింగ్‌ గ్రేవాల్‌ మృతి...

హైదరాబాద్ : సింగపూర్‌కి చెందిన ప్రముఖ జర్నలిస్టు, అడ్మినిస్ట్రేటర్‌, భారత సంతతికి చెందిన సంతోఖ్‌ సింగ్‌ గ్రేవాల్‌ కన్నుమూశారు. తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తుండగానే సింగ్‌ తుదిశ్వాస విడిచినట్లు ఆయన భార్య సుఖ్‌దేవి తెలిపారు. సింగ్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 56 ఏళ్ల సింగ్‌.. 1995లో పాత్రికేయుడిగా కెరీర్‌ ప్రారంభించారు. స్వతహాగా ఫుట్‌బాల్‌, హాకీ అంటే ఇష్టమున్న సింగ్‌.. స్పోర్ట్స్‌ రిపోర్టింగ్‌లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. సింగపూర్‌ సిఖ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

గులాబీ గూటికి 'గుత్తా'?!...

హైదరాబాద్ : ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచన లేదని, భవిష్యత్‌లో ఏదైనా జరుగొచ్చని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నల్లగొండలోని నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూనే...ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భవిష్యత్‌లో ఏదైనా జరుగొచ్చంటూ మనసులోమాట వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నిందించడం సబబుకాదన్నారు. కాంగ్రెస్ శ్రీకృష్ణ కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ర్టాన్ని ప్రకటించిందని తెలిపారు.

16:08 - June 4, 2016

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి... జగన్‌ మానసిక స్థితి బాగోలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.. తన పార్టీనుంచి చాలామంది ఎమ్మెల్యేలు టిడిపి లో చేరడంతో మతి భ్రమించిందని మండిపడ్డారు.. వైసీపీ పునాదులులేని భవవనంలాంటిదని ఎద్దేవా చేశారు..

16:05 - June 4, 2016

హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నాయకత్వంలో టీ కాంగ్రెస్‌ బతకదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. పొన్నాల కంటే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఎంపిక మరింత దారుణమని విమర్శించారు. తన సోదరుడు రాజ్‌గోపాల్‌ రెడ్డిని ఓడించేందుకు ఉత్తమ్‌ డబ్బులు పంచారని ఆరోపించారు. పార్టీ ఇప్పటికే వెంటిలేటర్‌పై ఉందని, దానికి శస్త్ర చికిత్స అవసరమని లేదంటే పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని కోమటి రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాస్తానని తెలిపారు. పార్టీ కోసం వీలైతే ఎమ్మెల్యే పదవిని వదిలేస్తానని కోమటి రెడ్డి ప్రకటించారు. 

కర్నూలులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య...

కర్నూలు : రాఘవేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మణరావు అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టీడీపీ నేత రామయ్యనాయుడు వద్ద ఓ ఇల్లును లక్ష్మనరావు కొలుగోలు చేశాడు. కాగా రామయ్యనాయుడు ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయకపోవటంతో మనస్థాపంతో ఉరి వేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఫోర్త్ టౌన్ పీఎస్ వద్ద మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయం చేయమని డిమాండ్ చేశారు. 

సముద్రంలో పడవ మునక..300 మందిపైగా గల్లంతు..

హైదరాబాద్ : గ్రీసు దేశపు రాజధాని ఏథెన్స్ లో దారుణం చోటు చేసుకుంది. 700మందితో వస్తున్న వడవ మెడిటెర్రనియన్‌ సముద్రంలో మునిగిపోయిందని, వలసదారుల పడవ నుంచి 302 మందిని రక్షించినట్టు గ్రీక్‌ అధికారులు తెలిపారు.75 నాటికల్‌ మైళ్ల దూరంలో మునిగిపోయిందని కోస్టుగార్డులు తెలిపారు. ఏథెన్స్ నగరానికి దాదాపు నాలుగు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం.

15:46 - June 4, 2016

హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఘర్షణలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపిస్తే సమంజసంగా ఉంటుందని పార్టీ నాయకత్వం సూచించింది. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరిపించిన బాధ్యులని తేలినవారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం కోరింది. మథుర ఘర్షణల్లో 22 పౌరులతోపాటు ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సీపీఎం పొలిట్‌ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. నేతాజీ సుభాస్‌చంద్రబోస్‌ అనుచరులైన స్వాధీన్‌ భారత్‌ సుభాస్‌ సేన ఈ ఘటనలకు బాధ్యులుగా ప్రకటించుకున్న విషయాన్ని సీపీఎం గుర్తు చేసింది. 2014లో మథుర జవహర్‌బాగ్‌లో ఉంటున్న ఎబ్సీఎస్ ఎస్ సాయుధ తీవ్రవాదులు భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, క్రూడ్‌ బాంబులు సమకూర్చుని యుద్ధానికి సన్నద్ధమైనా పసిగట్టడంలో నిఘా వర్షాలు వైఫల్యం చెందాయని సీపీఎం విమర్శించింది. జిల్లా పాలనాయంత్రాంగం ఉండే ప్రాంతానికి అతిసమీపంలోనే ఇదంతా జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలకు సమాచారం లేకపోవడం ఘోర వైఫల్యమని పొలిట్‌ బ్యూరో మండిపడింది. ఈ అన్ని అంశాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, అరాచకశక్తుల ఆటకట్టించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.  

'ఐఒసి' సభ్యత్వానికి నామినేట్ అయిన నీతా అంబానీ ...

ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకి (ఐఒసి) సభ్యత్వానికి నామినేట్‌ అయ్యారు.. ఆగస్టు 2-4 తేదీల మధ్య జరిగే ఐఒసి సదస్సులో ఆమె ఎన్నికైతే అంతర్జాతీయ ఒలింపిక్‌ సభ్యత్వం పొందిన తొలి భారతీయురాలు అవుతారు.

తెలుగుభాషకు అరుదైన గౌవరం...

అమెరికా: అమెరికాలో ఉన్న ప్రపంచ భాషల్లో ఒకటిగా తెలుగుభాషకు అరుదైన గౌవరం లభించింది. విదేశాల్లోని పాఠశాలలు, విద్యా ప్రమాణాల గుర్తింపు సంస్థ వెస్ట్రన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ అండ్‌ కాలేజెస్‌ (వాస్క్‌) నుంచి కూడ గురించి లభించిందని సిలికానాంధ్ర చైర్మన్‌ కూచిబొట్ల ఆనంద్‌ వెల్లడించారు. కాలిఫోర్నియా కేంద్రంగా అమెరికాలోని 35 రాష్ట్ట్రాల్లోనూ, మరో 13 దేశాల్లోనూ సిలికానాంధ్ర హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ విశ్వవిద్యాలయానికి అనుబంధం పనిచేస్తోందని తెలిపారు. ఇక్కడ నిర్వహిస్తున్న మనబడి మంచి విజయాన్ని సాధించిందన్నారు.

నటుడు బాలు ఆనంద్ మృతి...

తమిళనాడు : తమిళ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్(62) గుండెపోటుతో ఈరోజు హఠాన్మరణం పొందారు. కోయంబత్తూరులోని నివాసంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బాలు ఆనంద్ కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, బాలు ఆనంద్ సుమారు 100 సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. పిస్తా, అన్నా నగర్ ఫస్ట్ స్ట్రీట్, అన్బె శివమ్ తదితర సినిమాల్లో ఆయన నటించారు.

మతిస్థితిమితం లేని వ్యక్తి వీరంగం..

కర్నూలు : ఆదోనిలోని వాల్మీకి నగర్ లో మతిస్థితిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. ముగ్గురు వ్యక్తులను కత్తితో పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

డీఎంఈ కార్యాలయం వద్ద వైద్య సిబ్బంది ఆందోళన..

హైదరాబాద్ : కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమను ఆంధ్రాకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన దిగారు.  

'ఫ్రెండ్ షిప్ డ్యామ్' ను ప్రారంభించిన మోదీ...

ఆఫ్ఘ‌నిస్థాన్: ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కొద్ది సేప‌టి క్రితం భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆఫ్ఘ‌నిస్థాన్ లోని హెరాత్‌కు చేరుకున్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్ అధ్య‌క్షుడు అష్రఫ్‌ ఘనీతో క‌ల‌సి మోదీ అక్క‌డ ఆఫ్ఘ‌న్‌-ఇండియా ప్రెండ్ షిప్ డ్యామ్‌ ను ప్రారంభించారు. అనంత‌రం మోదీ మాట్లాడుతూ.. ఆఫ్ఘ‌న్-భార‌త్ ఫ్రెండ్ షిప్ డ్యామ్‌తో ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు వ‌స్తాయ‌ని అన్నారు. ఆఫ్ఘ‌న్‌లో నిర్మించిన డ్యామ్‌కు ఆఫ్ఘ‌న్‌-ఇండియా 'ఫ్రెండ్ షిప్ డ్యామ్' అని పేరు పెట్టినందుకు మోదీ ఆ దేశాధ్యక్షుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌న్నారు.

నవ్యాంధ్ర 'క్యూ' కడుతున్న బ్యాంకులు...

విజయవాడ : నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ముందు బ్యాంకులు బారులు తీరుతున్నాయి. రాజధాని ప్రకటనకు ముందు తుళ్లూరు చుట్టుపక్కల 29 గ్రామాలకు కలిపి కేవలం రెండు బ్యాంకు శాఖలు మాత్రమే వుండేవి. తుళ్లూరు కేంద్రంగా అమరావతి పేరిట నూతన రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం తుళ్లూరు సహా రాజధాని పరిధిలోని గ్రామాల్లో బ్యాంకు శాఖల సంఖ్య 30కి చేరింది. వీటిలో ఒక్క తుళ్లూరులోనే 15 బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఆయా బ్యాంకులు తమ శాఖలను విస్తరించటంతో పాటు ఏటీఎం కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి.

టిక్కెట్ లేకుండా ప్రయాణం..టీటీఈ అత్యాచారం..

హైదరాబాద్ : రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా వేస్తారు. లేదంటే కేసు నమోదు చేస్తారు. అదీకాకపోతే ఏదోక స్టేషన్లో దింపివేస్తారు. కానీ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే అత్యాచారం చేస్తారా? ఈ ఘటన గురించి వింటే అదే అనిపిస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై ట్రైన్ లో టీటీఈ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 29న ఓ యువతి బరేలీ నుంచి జైపూర్ వెళ్తున్న హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేసింది. ట్రైన్ హపూర్ వద్దకు వచ్చేసరికి రైల్లోకి రవి మీనా అనే టీటీఈ చెకింగ్ కోసం ఎక్కాడు.

నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్ ...

హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీ ముఠాలు ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. దీంతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ విక్రయిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముఠా నుంచి భారీగా టర్కీకి చెందిన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని సభ్యులను విచారిస్తున్నారు.

14:55 - June 4, 2016

కర్నూలు రాత్రి భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పత్తి కొండ మడంలం చిన్నవుల్తి వద్ద హంద్రీ వాగు పొంగిపొర్లుతుంది. వరద ఉధృతికి కర్నాటకకు చెందిన బస్సు వాగు మధ్యలో చిక్కుకోంది... బస్సులో ప్రయాణీస్తున్న 50 మంది ప్రయాణీకులను తాళ్లు వేసి స్థానికులు రక్షించారు. తెల్లవారుజాము 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు బస్సు వాగులోనే ఉండిపోయింది. వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుండటంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  

మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన వాయిదా...

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. అధికారులు అందుబాటులో లేనందున ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి హరీష్ రావుకు ఫోన్ చేసి తెలిపారు. దీంతో ఆయన పర్యటన వాయిదా పడింది. తిరిగి సోమవారం నాడు ఢిల్లీ వెళ్ళనున్నట్లు సమాచారం.

14:54 - June 4, 2016

నల్లగొండ : నాగార్జున సాగర్ పరిధిలోని పలుగ్రామాల్లో ఈదురుగాలుల బీభత్సాన్ని సృష్టించాయి. హాలియాలో విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. బలంగా వీచిన ఈదురుగాలులకు ఇంటి పై కప్పులు ఎగరిపోవడంతో స్థానికులు అర్థరాత్రి బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఈదురుగాలులకు తోడు వర్షం కురవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ వృక్షం ఓ ఇంటిపై పడటంతో ఇల్లు ధ్వంసమయ్యింది.

 

14:53 - June 4, 2016

విజయవాడ : జీవోనెంబర్ 26, 279లను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు ఏపీ ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్ డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ ఏజెన్సీలకు కట్టబెట్టే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలకు త్రిపుర సీఎం మాణిక్‌సర్కార్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని చెప్పారు. 

14:51 - June 4, 2016

తూ.గో :రాజమండ్రిలోని ఎలెక్ట్రికల్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ అతిథి గృహంలో.. మహిళతో రాసలీలలు సాగిస్తున్న విద్యుత్‌ ఉద్యోగి మధుసూదన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్‌రావు చింతూరు మండలంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మహిళతో పాటు.. మధుసూదన్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. తనకేమీ తెలియదని.. తన కింది ఉద్యోగి పట్టుబడితే తీసుకెళ్లేందుకు తాను వచ్చానని మధుసూదన్‌రావు బుకాయిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

లక్ష్మీనగర్ కాలనీ వాసుల రాస్తారోకో..

ఆదిలాబాద్ : వాంఖిడి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ వాసుల రహదారిపై రాస్తారోకోకు దిగారు. కాలనీ ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయలేదని, రోడ్లు వేయలేదని కాలనీవాసులు తెలిపారు.అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు.

14:49 - June 4, 2016

కరీంనగర్ : లాటరీ పేరుతో కరీంనగర్ లో ఓ వ్యక్తి నుంచి 24లక్షలు దోచుకున్న నైజీరియన్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన టెడ్డి మిలాన్, కెల్వాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన మహ్మద్ ఆసిమ్ లు స్పెషల్ టీం అదుపులోకి తీసుకోన్నారు. ఆముఠా నుంచి రెండు ల్యాప్ టాప్ లు, 9 మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు 2 లక్షల 29 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ లో లాటరీ పేరుతో కరీంనగర్ జిల్లాకు చెందిన సాయితేజ నుండి 24 లక్షల రూపాయలు వసూలు చేశారు. మోసపోయిన సాయితేజ ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 

టీ.కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలి: కోమటిరెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకుడు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలంటే తక్షణమే సర్జరీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. టి. కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయకపోతే పార్టీని పోస్ట్ మార్టం చేసే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడు ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆయన ఆరోపించారు.

14:47 - June 4, 2016

హైదరాబాద్ : పొలిటికల్‌ మైలేజ్‌ కోసం తానే నేతాజీనని ప్రచారం చేసుకున్నాడు. భక్తి ముసుగులో బడా వ్యపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. చివరికి తానే దేవుణ్ని అన్నాడు. వేలకోట్ల రూపాయలు కూడబెట్టాడు.. రాజకీయంగానూ రంగప్రవేశం చేశాడు.. ఇంకేముందీ.. ఆయన అనుచరుల దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. తాము చట్టాలకు, కోర్టులకు అతీతులమని కూడా వారు భావించే స్థాయికి చేరుకున్నారు. ఫలితమే.. మధుర విధ్వంసం. ఇంతకీ అక్కడ జరుగుతున్నదేంటి..? విధ్వంసానికి దారితీసిన కారణాలేంటి..? 10tv స్పెషల్‌ స్టోరీ

ఆధ్యాత్మికత ముసుగులో వేలకోట్ల రూపాయల ఆస్తులు

ఆశ్రమాలకు అనుచరగణాల కాపలా,రూ. 4 వేల కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్ వ్యాపారం, రూ. 150కోట్ల విలువైన మెర్సిడెస్, ప్లీమత్‌ లగ్జరీ కార్లు ఉత్తర ప్రదేశ్‌లో కోటల్లాంటి ఆశ్రమాలు,హంగూ ఆర్భాటాలతో జీవించిన బాబా. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మధుర విధ్వంసం..ఎస్పీ సహా పలువురి మరణానికి కారణమైన బాబా అనుచరగణం..ఎందుకిలా..? మధురలో ఏం జరుగుతోంది..? ఇంతకీ ఈ బాబా ఎవరు..?

తనకు తానే దైవాన్నని ప్రకటించుకున్న వ్యక్తి....

జైగురుదేవ్‌ బాబా... ! తనకు తానే దైవాన్నని ప్రకటించుకున్న వ్యక్తి. ఆధ్యాత్మికత ముసుగులో వేలకోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన ఘనుడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా తన ఆధ్యాత్మిక సామ్రాజ్యాలను స్థాపించాడు. ఇక బాబా సంపద తెలుసుకుంటే కళ్లుతిరుగుతాయి.. నాలుగువేల కోట్లరూపాయల విలువైన రియల్‌ ఎస్టేట్ ఉందీయనకు.

అడుగు పెడితే.. అడుగులకు మడుగులే. ...

బయటికి అడుగు పెడితే.. అడుగులకు మడుగులే. పాదాలు కందిపోతాయన్నట్లుగా వ్యవహరించేవాడు. ఈ ఘనుడు దేశవ్యాప్తంగా పర్యటించి భక్తజనులను ఉద్ధరించేందుకు లగ్జరీ కార్లనే వాడేవాడు. సుమారు 150కోట్లకు పైగా విలువైన మెర్సిడెస్, ప్లీమత్‌ లాంటి విదేశీ లగ్జరీ కార్లు ఈయన వద్ద ఉండేవంటే.. ఆయన విలాసవంతమైన జీవితం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వివిధ బ్యాంకుల్లో 100కోట్లరూపాయలకు పైగా డిపాజిట్లను కూడబెట్టేశారు. అంతేనా... ఉత్తరప్రదేశ్‌లో వ్యాప్తంగా పలుప్రాంతాల్లో సకల హంగూ, ఆర్భాటాలతో కోటల్లాంటి ఆశ్రమాలు కూడా కట్టేశాడు జైగురుదేవ్‌ బాబా.

ఆశ్రమాలంటే ఎవరికైనా ప్రవేశం ఉంటుంది. కానీ..

ఆశ్రమాలంటే ఎవరికైనా ప్రవేశం ఉంటుంది. కానీ.. జైగురుదేవ్‌ బాబా ఆశ్రమాలు మాత్రం.. సర్వజనులకు నిషిద్ధ ప్రాంతాలు. గురుదేవ్‌ బాబా తన ఆశ్రమాల వద్ద అనుచరగణం అని చెప్పుకునే కండలు తిరిగిన యోధులను కాపలాగా నియమించాడు. వీరు అన్యులు.. అనుమానాస్పదులు ఎవరు వచ్చినా.. చేతికి పని చెబుతారని స్థానికంగా చెప్పుకుంటారు. మథురా పట్టణంలో జరిగిన అల్లర్లకు...ఈ అనుచర గణమే కారణమని పోలీసుల సమాచారం.

'దూరదర్శి' పేరుతో పొలిటికల్‌ పార్టీ .......

ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ, ఆస్తులు కూడబెట్టడంతోనే ఆగలేదు జైగురుదేవ్‌ బాబా. రాజకీయరంగంలో కూడా ప్రవేశించాడు. దూరదర్శి' పేరుతో ఓ పార్టీని స్థాపించాడు. 1980-90 దశాబ్దాల్లో జనంలోకి ఘోరంగా ఓడిపోయాడు. ఇక లాభం లేదనుకుని భక్తిమార్గమే భుక్తిమార్గమని గట్టిగా భావించాడు. ఆధ్యాత్మిక ముసుగులో అనేక సంస్థలు స్థాపించాడు. పొలిటికల్ మైలేజ్‌ కోసం జైగురుదేవ్‌ బాబా చేయని ప్రయత్నంలేదు. రాజకీయ పార్టీ పెట్టక ముందే... జనంలో మంచిపేరు సంపాదించడానికి ఏకంగా తానే నేతాజీనని చెప్పుకున్నాడు. అంతటితోనే ఆగలేదు.. 1975 జనవరిలో తన అనుచరగణంతో కాన్పూర్‌లో ఓ ర్యాలీ నిర్వహించాడు. ఆర్యాలీలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్వయంగా పాల్గొంటారని బాబా గ్యాంగులు ప్రచారం చేశాయి. దీంతో జనంలో ఆసక్తి పెరిగి ర్యాలీకి జనం భారీగానే వచ్చారు. చివరికి సభాప్రాంగణంలో తానే నేతాజీనని ప్రకటించుకున్నాడు ఈ గురుదేవ్‌ బాబా. దాంతో జనానికి చిర్రెత్తుకొచ్చింది. రాళ్లు, కోడిగుడ్డు, చెప్పులతో సమాధానం చెప్పారు.

2012లో మరణించిన జైగురుదేవ్‌ బాబా......

గరుదేవ్‌బాబా 2012లో మరణించారు. తర్వాత వేలకోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఆయన శిశ్యగణం చేతుల్లోకి పోయింది. కొంతకాలం తర్వాత వారిలో వారికి చీలికలొచ్చాయి. స్వాధీన్‌భారత్ పేరుతో కొందరు వేరు కుంపటి పెట్టుకుని... రియల్‌ఎస్టే వ్యాపారం మొదలు పెట్టారు. బాబావారు భక్తిముసుగులో ఆస్తులు కూడబెడితే.. ఈశిశ్యపరమాణువులు మాత్రం దేశభక్తిపేరుతో... రాజకీయవిప్లవకారులం అంటూ కొత్త అవతారం ఎత్తారు. ఆ క్రమంలోనే మధురాలోని హర్‌బాగ్‌ పార్క్‌లో తిష్టవేశారు. కోర్టు ఆర్డర్ తో పార్క్‌ స్థలాన్ని ఖాళీ చేయిండానికి పోలీసులు వస్తే.. ఆయుధాలతో వీరంగం సృష్టించారు. 

అఫ్ఘనిస్తాన్‌ చేరుకున్న భారత ప్రధాని మోదీ

హైదరాబాద్ : ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ అఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్నారు. మోదీకి దేశాదినేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం కావాలని మోదీ ఆకాంక్షించారు. భారత్-ఆఫ్ఘన్ మధ్య స్నేహానికి సూచికగా సల్మా డ్యాంను.. కాసేపట్లో మోదీ ప్రారంభించనున్నారు. 

సోలార్ సిటీ నిర్వాశితులతో జగన్ ...

అనంతపురం : నంబులపూల కుంటలో సోలార్ సిటీ కోసం భూములు కోల్పోయిన రైతులతో జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాశితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాబు హిట్లర్ పాలన మాని మానవతా దృక్పథంతో వ్యవహారించాలని సూచించారు. 

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రధాని మోదీ పర్యటన..

హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆఫ్ఘాన్-భారత్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ను మోదీ ప్రారంభించారు.

13:48 - June 4, 2016

కామెడీ స్టార్ నవీన్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ పలు విషయాలు తెలిపారు. తన సినిమా అనుభవాలను తెలిపారు. సినీ ప్రస్థానం గురించి వివరించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో మంత్రి తనిఖీలు..

మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో ఇవాళ ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో ల్యాబ్ సిబ్బంది తమ విధులను సరిగా నిర్వహించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సరియైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. విధుల్లో నిర్లక్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

13:47 - June 4, 2016

హైదరాబాద్ : ప్రైవేటు స్కూల్స్ అధికంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ తల్లిదండ్రుల జేఏసి మండిపడుతోంది. అర్థంపర్థం లేని ఫీజులను నిరసిస్తూ.. జూన్ 11న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్నా చౌక్ వద్ద పోస్టర్ ను .. విడుదల చేశారు.  రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తెచ్చేంత వరకు తమ పోరాటాలను ఆపేది లేదంటున్న జేఏసి నేతలు టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం ...

హైదరాబాద్ : పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశమయ్యింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశంలో 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ తరపున ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ కే జోషీ హాజరయ్యారు.

13:41 - June 4, 2016

హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఆయన నివాసంలో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగకుండా జోక్యం చేసుకోని కేంద్రప్రభుత్వంతో మాట్లాడాలని దత్రాత్రేయను హరీష్ కోరారు. దీనిపై కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతితో మాట్లాడతానని దత్తాత్తేయ హమీ ఇచ్చారు.  

13:40 - June 4, 2016

హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ నెరవేర్చడం లేదని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతలను నిలదీయండి అని ప్రశ్నించడం అప్రజాస్వామికమా ? అని ప్రశ్నించారు. జగన్‌పై టీడీపీ నేతలందరూ ఆరోపణలు చేసినా.. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని.. ప్రజాక్షేత్రంలో చంద్రబాబుకు బుద్ది చెబుతారన్నారు. 

యాదాద్రిలో గొంగడి సునీత ఆకస్మిక తనిఖీలు...

నల్లగొండ: జిల్లాలోని యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి అధికారుల పనితీరుపై తాను మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మండిపడ్డారు.

13:38 - June 4, 2016

విజయవాడ : వైసీపీనేత జగన్‌ను, ప్రజలు తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జైలులో ఉన్న జగన్‌కు మతిస్థిమితం లేకపోవడం వల్ల నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

 

ఏడీఈ మధుసూధన్‌ రాసలీలలు...

తూ .గోదావరి : చింతూరు విద్యుత్ ఏడీఈ మధుసూదన్‌ రాసలీలలు బట్టబయలు అయ్యాయి. పవర్ డిప్లొమా ఇంజినీర్స్ గెస్ట్‌హౌస్‌లో ఓ మహిళతో ఏడీఈ మధుసూదన్‌ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. అరెస్టు చేసిన పోలీసులు నిందుతుడిని ప్రకాష్‌నగర్ పీఎస్‌కు తరలించారు.

13:35 - June 4, 2016

మహారాష్ట్ర : పుణెలో భూకొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే పదవికి రాజీనామా చేశారు. సీఎం ఫడ్నవీస్‌ను కలిసి.. ఖడ్సే రాజీనామా లేఖను సమర్పించారు. ఆరోపణల నేపథ్యంలో ఖడ్సే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, ఆప్‌, బీజేపీ మిత్రపక్షమైన శివసేనలు డిమాండ్‌ చేశాయి. ఇప్పటికే ఖడ్సే.. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాలను కలిసి వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిపక్షాల ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఖడ్సే రాజీనామా చేశారు. 

ఏపీకి సాయం అందిస్తాం : సురేష్ ప్రభు

విజయవాడ: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో రైల్వే మంత్రి సురేష్‌ప్రభు భేటీ అయ్యారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి తనవంతు సహకారం తప్పక అందిస్తానని సురేష్‌ప్రభు హమీనిచ్చారు. ఏపీలో ఉన్నటువంటి పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై చంద్రబాబుతో ఆయన చర్చించారు.

13:32 - June 4, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల గుట్టు రట్టు చేసేందుకు తెలంగాణ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో స్కూళ్లల్లోని వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టంని ప్రారంభించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ స్కూల్స్ బండారం బయటపెట్టేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి స్కూల్స్ వివరాలు సేకరిస్తోంది.
ప్రైవేట్ స్కూళ్ల బండారం త్వరలో బట్టబయలు 
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్..పాఠశాలల బండారం త్వరలోనే బట్టబయలు కానుంది. ఇన్నాళ్లూ పైపై మెరుగులతో విద్యార్థుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న స్కూళ్ల మర్మాన్ని బయటపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్ల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు అత్యంత అధునాతన టెక్నాలజీని ప్రభుత్వం వినియోగిస్తోంది. 
విద్యార్థుల నుంచి లక్షలు లక్షలు వసూలు 
పైన పటారం లోన లొటారంగా ఉన్న స్కూళ్ల బండారాన్ని బయటపెట్టేందుకు ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కొత్త యాప్‌ని తయారు చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 40వేల 821 పాఠశాలలున్నాయి. వాటిలో 28వేల 609 ప్రభుత్వ, 11వేల 740 ప్రయివేటు, 742 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. ఈ స్కూళ్లలోని వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొంతమంది అధికారుల నిర్లక్షంతో పూర్తిస్థాయి వివరాలు అందడం లేదు. దీనికి చెక్‌పెట్టేందుకు పాఠశాలల వాస్తవ స్థితిగతులను తెలుసుకునే విధంగా సర్వశిక్షా అభియాన్‌ అధికారులు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. దీనిద్వారా స్కూల్ బిల్డింగ్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, వంటగది, కాంపౌండ్‌ వాల్, టాయిలెట్స్, కంప్యూటర్‌ల్యాబ్‌, డ్రింకింగ్‌ వాటర్‌ వంటి అంశాల వివరాలను ఈ యాప్‌ సేకరిస్తోంది.
మొత్తం 40,821 పాఠశాలలు 
ఈ యాప్‌ను అండ్రాయిడ్‌ టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని పాఠశాలల భౌగోళిక పరిస్థితులను ఫోటోలతో  హెచ్‌ఎం పొందుపరుస్తున్నారు. అందుకు కొన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు వీటి వివరాలు సేకరించేందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా ఎస్‌ఎస్‌ఏ, విద్యాశాఖ అధికారులు వారిని వదిలిపెట్టడంలేదు. ఏప్రిల్‌ 7నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రంలోని 38,595 పాఠశాలలకు సంబంధించిన 3లక్షల 27వేల 142 ఫొటోలను అప్‌లోడ్‌ చేశారు. మరో 2,226 పాఠశాలలు ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపు ప్రభుత్వ పాఠశాలల వివరాలు రాగా,..ప్రయివేటు పాఠశాలలు ఇంకా రావాల్సి ఉంది. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ తదితర జిల్లాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. 
వివరాల సేకరణకు అడ్డొస్తున్న ప్రైవేటు స్కూళ్లు 
అయితే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ సౌకర్యం లేకపోవడంతో వివరాల సేకరణ ఆలస్యమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ సాధ్యంకాని పాఠశాలలు ఆఫ్‌లైన్‌లో సమాచారమిచ్చే విధంగా ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల రిజిస్ట్రేషన్‌ ఒక చోట ఉంటే, నిర్వాహణ మరోచోట ఉంటుంది. దీనిద్వారా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అధికారులూ ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి మహానగరంలో ఈ కష్టాలు మరీ ఎక్కువ. వీటన్నింటికి కళ్లెం వేయాలంటే ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్‌ సౌకర్యం లేకపోవడంతో ఆలస్యం 
అయితే ఈ యాప్‌ద్వారా పాఠశాలలు ఎక్కడున్నాయనేది సులభంగా గుర్తుపట్టే అవకాశముంది. దీనికి తోడు ఆయా స్కూళ్లలో ఉతదన్న సౌకర్యాల గురించి సులభంగా తెలుసుకోవచ్చు. ఇక సర్కారు బడుల్లో సమస్యల పరిష్కారానికి ఈయాప్‌ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే యాజమాన్యాలను భయ పెట్టేందుకు ఈ డాటాను ప్రభుత్వం వాడుకుంటుందా..సర్కారీ బడుల్లో వసతుల కల్పనతో పాటు ప్రయివేటు పాఠశాలల్లోని అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు దీన్ని వినియోగిస్తారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

 

అమెరికా సైనిక శిక్షణలో అపశృతి...

అమెరికా : సైనిక శిక్షణలో అపశృతి చోటుచేసుకుంది. ఫోర్ట్‌హుడ్‌ మిలిటరీ బేస్‌లో సైనికులు శిక్షణలో ఉండగా వరదల్లో వాహనం బోల్తాపడి కొట్టుకుపోయింది. ఈ వాహనంలో 12 మంది సైనికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడగా.. గల్లంతైన తొమ్మిదిమంది మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఫోర్ట్‌ హుడ్‌ డిప్యూటీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ జాన్‌ ఉబెర్టి ఈ విషయం ధ్రువీకరించారు.

ఏకకాలంలో 6వేల మందితో బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ: టెక్నాలజీని వాడుకోవటంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం బాబు సమానులనుకోవచ్చు. మోదీ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలతో తన మనోభావాలను ప్రజలంతో పంచుకుంటుంటారు. బాబు టెక్నాలజీతో వున్నచోటునుండే అధికారులను ఆదేశిస్తుంటారు. ప్రజలకు సూచనలిస్తూంటారు. ఈ క్రమంలో ఇంటికో ఇంకుడు గుంత, పొలానికో పంటకుంట, ప్రతి వూరికి ఓ వనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ఆరోపణల వల్లనే ఖడ్సే రాజీనామా?!....

మహారాష్ట్ర : దావూద్‌ వివాదం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. ఖడ్సేపై ఇటీవల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. రూ. 30కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని ఖడ్సే భార్య, ఆయన అల్లుడికి రూ.

బాబుతో ప్రభు భేటీ...

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికకు మద్దతిచ్చిన చంద్రబాబుకు సురేశ్‌ప్రభు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై సీఎంతో చర్చించారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో సురేశ్‌ ప్రభు భాజపా తరఫున ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే.

కన్నీరు పెట్టుకున్న మహిళా సర్పంచ్ ..

గుంటూరు : జిల్లా టీడీపీ కార్యాలయంలో ఓ గిరిజన మహిళా సర్పంచ్ కన్నీరు పెట్టుకుంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తనను అవమానపరిచారని విలపించింది. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ సర్పంచ్ దేశావత్ గోవింద్ భాయ్ తనకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పుకోడానికి ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ దగ్గరకు వెళ్లారు. ఎమ్మెల్యే తనను పది మందిలో అవమానించారని దేశావత్ గోవింద్ భాయ్ వాపోయింది.

డీఎల్ డీల్ కు అడ్డుపడుతున్న టీడీపీ నేత?

విజయవాడ : కాంగ్రెస్ లో సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి ఎమైపోయారు? ఇంతకాలం ఎక్కడున్నారు? వంటి అనుమానాలకు తెరపడింది. డీఎల్‌ రవీంద్రారెడ్డి.... ఇంట్రడక్షన్‌ అవసరం లేని రాజకీయనాయకుడు..తెలుగు రాజకీయాలలో డక్కామొక్కీలు తిన్నారు డీఎల్. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సరిసమానమంత సీనియారిటీ ఆయనకుంది. అంత సీనియారిటీ ఉన్నా ఎందుకో డీఎల్‌ రవీంద్రారెడ్డి అత్యున్నత పదవులు వరించలేదు.. కారణం నిత్య అసంతృప్తి వాది కావడమే!

12:53 - June 4, 2016

గుంటూరు : అమరావతిలో కల్తీ మద్యం కలకలం రేపింది. స్థానిక రాయల్ వైన్ షాప్ లో కల్తీ మద్యం సేవించి ఓ వ్యక్తి మృతి చెందారు. దీంతో ఎక్సైజ్ అధికారులు షాపులో తనిఖీలు నిర్వహించారు. గతంలో కూడా కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందారు. కల్తీ మద్యం సేవించి వరుసగా పలువురు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

 

గన్నవరం చేరుకున్న కేంద్రమంత్రి సురేష్ ప్రభు...

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టుకు కేంద్రమంత్రి సురేష్ ప్రభు చేరుకున్నారు. ఎంపీ కేశినేని నాని, ఇతర నేతలు స్వాగతం పలికారు. మధ్యహ్నాం ఒంటిగంటకు సీఎం చంద్రబాబును సురేష్ ప్రభు కలవనున్నారు. శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని..అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ లో తిరుచానూరు క్రాసింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

12:41 - June 4, 2016

విజయవాడ : లోహ విహంగాలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేలా.. తరచూ పక్షులు ఢీ కొడుతుండటంతో... ప్రయాణీకుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో పక్షుల బెడద కారణంగా విమానాలను నిలిపివేసిన సందర్భాలున్నాయి. 
విమానాల రాకపోకలు నిలిపివేత
విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణాలకు పక్షుల బెదడ ఆటంకంగా మారింది. విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో తరచూ పక్షులు అడ్డుతగలడంతో విమానాల రాకపోకలను నిలిపివేసిన సందర్భాలున్నాయి. పక్షులు విమానాలను ఢీకొట్టడంతో పైలట్లు ఎంత చాకచక్యంగా విమానాలను ల్యాండింగ్‌ చేసినప్పటికీ.. ప్రయాణీకుల భద్రతపై భరోసా లేకుండా పోతోంది. 
టేకాఫ్ దశలో నిలిచిపోతున్న విమానాలు 
పక్షులు ఢీకొట్టడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరే  విమానాలు టేకాఫ్ దశలో నిలిచిపోతున్నాయి. రాకపోకలకు ఆటంకాలు ఎదురైన ప్రతిసారీ కలెక్టర్ నేతృత్వంలో రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు.  పక్షులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు, సమావేశాలు జరగుతునే ఉన్నాయి. కానీ కిందిస్థాయి సిబ్బంది ఆ ఆదేశాలను పాటించడం లేదు. దీంతో పక్షుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. 
ప్రయాణీకుల్లో తీవ్ర కలకలం
మే 27న ఎయిరిండియా విమానానికి పక్షి ఢీకొనడంతో ప్రయాణీకుల్లో తీవ్ర కలకలం రేకెత్తింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో ప్రయాణీకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం, జంతు కళేబరాలు, వ్యర్థాల వల్లే పక్షుల సంచారం పెరిగిపోతుందని అధికారులు తేల్చారు.  పక్షులను పారదోలడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణాసంచా కాల్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. 
విమానాశ్రయ వర్గాలు ఆందోళన
ఎయిర్‌పోర్టు పరిసరాల్లోని బుద్ధవరం, కేసరపల్లి, గన్నవరం గ్రామాల పరిధిలో డంపింగ్ సమస్య ఎక్కువగా ఉంది. బుద్ధవరం, రాజీవ్ నగర్ కాలనీ వద్ద జంతు కళేబరాలతో పాటు చెత్తాచెదారం, మాంసం, భోజనం వంటి వ్యర్థాలను మూటలు కట్టి ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పడేస్తున్నారు. చెత్త డంపింగ్ ను నివారించేందుకు ప్రత్యేక బృందాలను నియమించకపోతే పక్షుల సంచారం పెరిగే ప్రమాదం ఉందని విమానాశ్రయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 
పక్షుల బెడద నివారించాలి : ప్రయాణికులు
విమానాలను పక్షులు ఢీకొట్టడంతో తరచూ గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలను నిలిపివేస్తున్న అధికారులు.. కనీసం ప్రయాణీకులకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణీకులు అసహనానికి గురి కావాల్సి వస్తోంది.  ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో పక్షుల బెడద నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

 

12:40 - June 4, 2016

భారతదేశంలో లింగవివక్ష ఏస్థాయిలో వుందో చెప్పుకోనవసరం లేదు. మహిళల పట్ల వివక్ష అనేది భారత్ లో వేళ్లూనుకుపోయింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితమయ్యిందా? అంటే కాదనే చెప్పాలి. ఎన్నో దశాబ్దాల క్రితమే అభివృద్ధివైపు పయనిస్తున్న పాశ్చాత్య దేశాలు కూడా ఇందులో మినహాయింపు కాలేదు అంటే జెండర్ వివక్ష ఎక్కడైనా..ఏదేశంలో అయినా ఒక్కటే అనిపిస్తోంది. మనదేశంలో మగపిల్లలకూ...ఆడపిల్లలకూ అన్ని విషయాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుంది. అది తిని తిండి కావచ్చు..కట్టుకునే బట్టలు, చదువు ఇలా అన్ని విషయాలలోనూ ఈ వివక్ష కనిపిస్తూ వుంటుంది. చదువు విషయంలోనే చూస్తూ ఆడపిల్లలను సర్కారు బడుల్లో చదివిస్తూ వంశాంకురం అనే కారణంతో మగపిల్లలను కార్పొరేట్ స్కూల్స్ లో చదివిస్తుంటారు. పాకెట్ మనీ విషయంలో అత్యంత వివక్ష కనిపిస్తుంది. అసలు ఆడపిల్లలకు పాకెట్ మనీ ఇవ్వటం చాలా తక్కువనే చెప్పవచ్చు...కొన్ని ఇండ్లల్లో అయితే అసలు ఇవ్వనే ఇవ్వరు. అడిగితే నీకేం ఖర్చు వుంటుందే అన్నీ మేమే కొంటున్నాంగా అనే మాటలు కూడా వస్తుంటాయి...ఇది కేవలం భారత్ మాత్రమే అనుకుంటే పొరపాటే..అత్యంత అభివృద్ధి సాధించిన బ్రిటన్ లోకూడా ఇదే వివక్ష కొనసాగుతోంది అంటే ఆశ్చర్యపోక తప్పటంలేదు. ఏ దేశంలో అయినా తల్లిదండ్రులు చిన్న పిల్లల ఖర్చులకు పాకెట్ మనీ ఇవ్వడం మామూలే. అయితే ఆ దేశంలో పాకెట్ మనీ విషయంలోనూ అమ్మాయిల పట్ల వివక్ష కనిపిస్తోందట. బ్రిటిష్ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీపై ఓ బ్యాంకు సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అనూహ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల పాకెట్ మనీ 12 శాతం తక్కువగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.

సర్వేలో వెల్లడయిన విషయాలు...
బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచీ సగటున వారానికి 6.55 పౌండ్లు అంటే సుమారు 640 రూపాయలు పాకెట్ మనీగా పొందుతున్నారట. అయితే అందులో ఆడ పిల్లలు 12 శాతం తక్కువ డబ్బును పొందుతున్నట్లు హాలిఫాక్స్ బ్యాంకు ప్రచురించిన అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యత్యాసం బ్రిటన్ లో గత సంవత్సర కాలంగా కొనసాగుతోన్నట్లు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 8 నుంచి 15 ఏళ్ళ వయస్సు లోపల అబ్బాయిలు వారానికి సుమారు 640 రూపాయల వరకూ పాకెట్ మనీ పొందుతుండగా... అదే వయసులోని బాలికలు మాత్రం 597 రూపాయలు మాత్రమే పొందుతున్నారట. అయితే అమ్మాయిలు కూడ తమకు మరింత అధికంగా పాకెట్ మనీ కావాలని కోరుకుంటున్నట్లు తెలుసుకున్నారు. కాగా 1,202 మంది పిల్లలు, 575 మంది తల్లిదండ్రులపై చేపట్టిన సర్వే ప్రకారం లింగ వివక్ష గతేడాది 1.2 శాతం పెరిగినట్లు అధ్యయనాల్లో తెలుసుకున్నారు.

వేతనాల విషయంలో మహిళలకు వివక్ష...
తొమ్మిదేళ్ళకాలంతో పోలిస్తే గతేడాది బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచి పొందే పాకెట్ మనీ ఆరు శాతం పెరిగి 640 రూపాయలకు చేరిందట. అలాగే బ్రిటన్ మహిళలు కూడ అక్కడి మగవారితో పోలిస్తే 19.2 శాతం తక్కువ వేతనాలను అందుకుంటున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే 22 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు మగవారికంటే సగటున 1.111 పౌండ్లు ఎక్కువ వేతనాన్నే పొందుతున్నారని, 30 ఏళ్ళ వయసు దాటిన తర్వాత మాత్రం వేతనాల విషయంలో వెనుకబడిపోతున్నారని ఇటీవలి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఏది ఏమైనా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిపిస్తోందనేందుకు ఈ తాజా అధ్యయనాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏది ఏమైనా మహిళలు ఎక్కడైనా వివక్షను అనుభవిస్తున్నారనేది మాత్రం సాధారణంగా మారిపోయినట్లే వుంది. అది సంప్రదాయాలకు, సెంటిమెంట్లకు మారుపేరైన భారతదేశమైనా..అభివృద్ధిలో దూసుకుపోతున్న పాశ్చాత్య దేశాలైనా జెండర్ విషయంలో మాత్రం ఒకే పద్ధతిని ఫాలో అవుతున్నట్లు సర్వేల్లో తెలుస్తోంది. సమానపనికి సమాన వేతనం కావాలనే మహిళల డిమాండ్ ఎప్పటికి నెరవేరేనో?! ..ఆడపిల్లల పట్ల సమాన ధోరణి ఏనాటికి మారేనో?! ....

12:32 - June 4, 2016

నెల్లూరు : జిల్లాలో మళ్లీ  భూప్రకంపనలు ప్రజలను వణికించాయి.  వింజమూరు మండలం చాకలికొండ, జనార్థనపురం, దుత్తలూరు మండలం నందిపాడు, బండికిందపల్లి గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది...దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసి బయటకు వచ్చారు. ఈ సంవత్సరం దాదాపు 25 సార్లు భూమి కంపించింది...ఈ ఏడాది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 1.8 నుంచి 3.4 లోపు నమోదయ్యింది. 

 

12:29 - June 4, 2016

కడప : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో 23మందిని అరెస్టు చేశారు. 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల్లో తప్పించుకున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

12:23 - June 4, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేశారు. వేల కోట్ల రూపాయలతో ముడిపడిన పోలవరం, రాజధాని అమరావతికి అరకొర నిధులు ఇస్తూ గేమ్స్‌ ఆడుతున్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ విషయంలో నోరు మెదపట్లేదు. ఇప్పుడు ఆ కోవలోకే మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లు వచ్చి చేరాయి. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌లకు నిధులు ఇవ్వలేమంటూ కేంద్రం తేల్చి చెప్పింది. కావాలంటే ఈక్విటీ చెల్లిస్తామంటోంది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు కేంద్రం మొండిచేయి 
ఏపీ ప్రభుత్వానికి విజయవాడ, విశాఖ ప్రజలకు ఇది మింగుడుపడని విషయమే. ఆ రెండు నగరాల మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు కేంద్రం మొండిచేయి చూపింది. వాటి నిర్మాణానికి వంద శాతం ఆర్థిక సాయం అందించడం సాధ్యపడదంటూ తేల్చి చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నీతి అయోగ్‌ అంగీకరించడం లేదంటూ వంక చెప్పినట్లే మెట్రోలకు నిధుల విషయంలోనూ కేంద్రం మరో సాకు చెప్పింది. 
జనవరి 25న కేంద్రానికి చంద్రబాబు లేఖ
విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌లకు 100 శాతం ఆర్థిక సాయం అందించాలంటూ సీఎం చంద్రబాబు జనవరి 25న కేంద్రానికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం ఖర్చులు, రాష్ట్ర పన్నులు తామే భరిస్తామన్నారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ ఏపీకి ఇప్పటికే చాలా ఇచ్చామని పాతపాట అందుకున్నారు. కేంద్ర ఆదాయంలో రాష్ట్రాల వాటా 32 శాతం నుంచి 42 శాతం పెంచినందున ఆ రెండు మెట్రోలకు 100 శాతం ఆర్థిక సాయం అందించలేమని తేల్చిచెప్పారు. ఇతర రాష్ట్రాలకు అమలు చేస్తున్న తరహాలోనే ప్రాజెక్ట్ విలువలో 20 శాతం ఈక్విటీ మాత్రమే భరిస్తామని స్పష్టం చేశారు. 
రాష్ర్ట ఖజానాపై రూ.1,300 కోట్ల భారం
 సేవా పన్ను లేకుండా విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విలువ 7,362 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. 2016 ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులపై పన్ను విధించలేదు. 2016 మార్చి 1 నుంచి అన్ని మెట్రో ప్రాజెక్టులపైనా సేవా పన్ను విధిస్తున్నారు. దీంతో రాష్ట్రంపై అదనపు భారం పడనుంది. మెట్రో ప్రాజెక్ట్‌లకు భూ సేకరణ వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. భూ సేకరణ కోసం 700 కోట్లు, బడ్జెట్‌లో పెట్టిన 600 కోట్ల రూపాయలు రెండూ కలిపి 1,300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. 
విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ప్రక్రియలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి టెండర్లు కూడా పిలిచారు. అయితే గత రెండు బడ్జెట్లలో మొత్తం 600 కోట్ల రూపాయల నిధులు కేటాయించినా వాటిల్లో ఒక్క రూపాయి ఇంతవరకు విడుదలవలేదు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఏపీ సర్కార్‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేయగలుగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా కేంద్రం మాత్రం ఏదో ఒక వంక చూపి ఎస్కేప్‌ అవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది.

 

12:14 - June 4, 2016

హైదరాబాద్ : సర్కారీ స్కూళ్లలో డ్రాపౌట్స్ లేకుండా చేయటమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించేలా.. 103 ఎస్సీ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు మరో 30 మహిళా డిగ్రీ రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. 
బాలలందరికీ అక్ష్యరాస్యత కలిగేలా సర్కారు యోచన
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న డ్రాపౌట్స్ పై దృష్టిపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నప్పటికీ... కొంతమేర డ్రాప్‌ఔట్స్‌ ఉంటూనే ఉన్నాయి. రెసిడెన్సియల్  విద్యా విధానంతో దీనికి చెక్‌పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విధానమైతే ఎక్కువమంది విద్యార్ధులు చదువుకునేందుకు ఆసక్తి చూపుతారని, దీంతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో రెసిడెన్సియల్ స్కూల్స్ తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 
బాలబాలికలకు వేర్వేరుగా రెసిడెన్సియల్‌ స్కూల్స్
బాలబాలికలకు వేర్వేరుగా రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కూల్స్‌లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్‌కు 2సెక్షన్ల చొప్పున 80 మంది విద్యార్థులుంటారు. స్టేట్ సిలబస్‌తో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరగనుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ, సీఏ, సీపీటీతోపాటు వివిధ ఉన్నత విద్యా కోర్సులకు కోచింగ్‌ను కూడా అందించనున్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా కేజీ టూ పీజీ విద్యలో భాగంగానే, ఈ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

 

కల్తీ మద్యం త్రాగి వ్యక్తి మృతి

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో కల్తీ మద్యం కలకలం రేపింది. స్థానికంగా వున్న ఓ మద్యం షాపులో మద్యం త్రాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో సమాచారం అంతుకున్న ఎక్సైజ్ అధికారులు షాపులో తనిఖీలు చేపట్టారు

12:08 - June 4, 2016

అనంతపురం : జిల్లా కదిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. చంద్రబాబుపై జగన్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జగన్‌ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే జగన్‌ రైతు భరోసా యాత్ర జరగనివ్వబోమని హెచ్చరించారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. తోపులాట జరిగింది. పోలీసులు భారీగా చేరుకుని కార్యకర్తలను అడ్డుకున్నారు. 

గులాబీ గూటిలోకి కోమటిరెడ్డి?....

హైదరాబాద్ : గులాబీ గూటిలోకి  మరో కాంగ్రెస్ నేత వాలనున్నారా? అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి టీఆర్ఎస్ లోకి చేరతారనే వార్తలు కొద్ది రోజులుగా వినపడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మంత్రి హరీష్ రావుని కోమటిరెడ్డి కలిశారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపటానికి మాత్రమే కలిశానని కోమటిరెడ్డి అంటున్నా అసలు కారణాలు వేరేవున్నాయని పలువురు అనుకుంటున్నట్లు సమాచారం.

12:05 - June 4, 2016

విజయవాడ : క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాత్రి నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం హడలెత్తించింది. ఈదురుగాలులకు నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్‌స్థంభాలు నేలకొరిగాయి. 
వాగు మధ్యలో చిక్కుకున్న కర్నాటక బస్సు  
కర్నూలు జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పత్తి కొండ మడంలం చిన్నవుల్తి వద్ద హంద్రీ వాగు పొంగిపొర్లుతుంది. వరద ఉధృతికి వాగు మధ్యలో కర్నాటకకు చెందిన బస్సు వాగు మధ్యలో చిక్కుకోంది... బస్సులో ప్రయాణీస్తున్న 50 మంది ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. 
విజయవాడలో 
విజయవాడలో రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 
విమాన రాకపోకలకు అంతరాయం 
కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని రద్దు చేశారు. హైదరాబాద్‌ నుంచి రావాల్సిన స్పైస్‌ జెట్‌ విమానం ఆలస్యంగా రానుంది. 

 

మంత్రి పదవికి ఏక్ నాథ్ ఖాడ్సే రాజీనామా..

మహారాష్ట్ర : రెవెన్యూ మంత్రి పదవికి ఏక్ నాథ్ ఖాడ్సే తన పదవికి రాజీనామా చేశారు. సీఎం ఫడ్నవీస్ కు  రాజీనామా సమర్పించారు

గవర్నర్ తో హరీష్ రావు భేటీ...

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు శనివారం బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసిన హరీష్ రావు గవర్నర్ నరిసింహన్ తో కూడా భేటీ అయ్యారు. నీటి పారుదల వివాదాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

11:43 - June 4, 2016


హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఈనెల 10వ తేదీ నాటికి రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని జర్మనీకి చెందిన పోట్స్‌డాం వాతావరణ పరిశోధన సంస్థ వెల్లడించింది. 14వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారత ఉపఖండంపై రుతుపవనాల ఆగమనం, నిష్క్రమణపై పరిశోధనలు చేసిన ఈ సంస్థ.. తాము ప్రకటించిన తేదీ నాటికి నాలుగు రోజుల ముందు గానీ.. 13వ తేదీ నాటికి రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. 

11:40 - June 4, 2016

టాలీవుడ్ లో రీమేక్ చిత్రాలకు, పాటలకు కొదవలేదు. అలాగే వారసులకు కూడా కొదవలేదు. ప్రస్తుతం టాలీవుడ్ వారసుల హవాతోనే నడుస్తోంది. పాటలకు రీమిక్సింగ్ చేస్తూ తాము ఫలానావారి వారసులమని సదరు వారసులు ప్రేక్షకులకు 'గుర్తు' చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిట్ ల కోసం మొహం వాచిపోయిన మంచువారి వారసుడు విష్ణు తన తండ్రి హిట్ లిస్ట్ ఒకటైన 'అసెంబ్లీ రౌడీ'ని రీమేక్ చేయటానికి సాహసిస్తున్నాడు. మోహన్ బాబు కెరీర్ లో మైల్ రాయిగా నిలిచిన పోయిన చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. పాతికేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా హీరోగా మోహన్ బాబును తారస్థాయికి తీసుకెళ్లింది. బి. గోపాల్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ అందించిన పదునైన మాటలు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాయి. అందుకే ఇప్పటికీ మంచు ఫ్యామిలీ అభిమానులకు అసెంబ్లీ రౌడీ అంటే ప్రత్యేకత వుంది. ఆ సినిమాను ఇప్పుడు మంచు వారబ్బాయి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో విష్ణు ఖాతాలో హిట్ లిస్ట్ లు తక్కువగా వున్నా కొన్ని చిత్రాలలో కామెడీ, యాక్షన్ చిత్రాలతో ఒ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే బాటలో ఇప్పుడు తన తండ్రి కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిపోయిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేసి తానెంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటి ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేయడానికి విష్ణు సన్నాహాలు చేస్తున్నాడు. మరి పాతికేళ్ల క్రితం మురిపించిన అసెంబ్లీ రౌడీ ఈ కాలంలో వచ్చిన చిత్రాల ట్రెండ్ నుఅందుకుంటుందా?...విష్ణు తండ్రి పేరును నిలబెడతాడా? వేచిచూడాలి.. కాగా తండ్రిని అనుకరించకుండా తనదైన శైలిలో నటించి మంచు అభిమాలను విష్ణు ఆకట్టుకోవాలని ఆశిద్దాం...

11:18 - June 4, 2016

కాకినాడ : ఓఎన్ జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ మళ్లీ లీకైంది. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం గునిశెట్టివారిపుంతలో లీకేజీని స్థానికులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో రెండోసారి గ్యాస్ లీకేజ్ జరగడంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  

 

 

జగన్ క్షమాపణ చెప్పాలి: టీడీపీ....

అనంతపురం : కదిరిలో ఉద్రిక్తత నెలకొంది. శనివారంనాటు జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో జగన్ బస చేసిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. శుక్రవారం సీఎం చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేప్పాలని లేనిపక్షంలో జగన్ యాత్రను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

బైరాపురంలో కోతకు గురైన వంతెన..

మహబూబ్‌నగర్‌ : ఎండలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు కాస్తంత ఊరటనిచ్చాయి. కాకపోతే భారీ వర్షాలతో పలు ప్రాంతాలలో ఎన్నో ఇబ్బందులు ఎదరవుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. ఈక్రమంలో బైరాపురం గ్రామ సమీపంలో ఉన్న తాత్కాలిక వంతెన కోతకు గురైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం జోగులాంబ ఆలయాలనికి వెళ్లే భక్తులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

తూ.గోదావరి జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్...

తూ.గోదావరి : జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. సఖినేటిపల్లి మండలం గునిశెట్టివారిపుంతలో ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యింది. దీంతో గ్యాస్ భారీగా బయటకు వరజిమ్ముతోంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అప్రమత్తమయిన అధికారులు సహాయచర్యల్ని ముమ్మరం చేశారు. కాగా తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే పలుమార్లు గ్యాస్ లీక్ అయిన విషయం తెలిసిందే.

ఆన్‌లైన్ మోసాలు..నైజీరియన్లు అరెస్ట్ ..

కరీంనగర్: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు ఓ స్థానికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 2 లక్షలు, రెండు ల్యాప్‌టాప్‌లు, తొమ్మిది సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

క్రాసింగ్ స్టేషన్ కు శంకుస్థాన చేసిన సురేశ్ ప్రభు..

చిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్ ను కేంద్రమంత్రి సురేష్ ప్రభు సందర్శించారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో తిరుచానూరు క్రాసింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు

10:56 - June 4, 2016

కేరళ : సిపిఎంకు చెందిన యువనేత పి.శ్రీరామకృష్ణన్‌ కేరళ అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. స్పీకర్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో అధికారపార్టీ ఎల్డీఎఫ్‌ అభ్యర్థి శ్రీరామకృష్ణన్‌కు 92 ఓట్లు రాగా, ప్రతిపక్షపార్టీకి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి విపి సజీంద్రన్‌కు 46 ఓట్లు వచ్చాయి. స్పీకర్‌గా శ్రీరామకృష్ణన్‌ గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ ఎస్‌ శర్మ ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్ పిసి జార్జ్‌ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. స్పీకర్‌గా ఎన్నికైన శ్రీరామకృష్ణన్‌కు ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ సజావుగా సాగడానికి సభ్యులు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీరామకృష్ణన్‌ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మల్లాపురం జిల్లా పొన్నయి అసెంబ్లీ స్థానం నుంచి శ్రీరామకృష్ణన్‌ గెలుపొందారు.

దత్తన్నతో భేటీ అయిన మంత్రి హరీష్ ...

హైదరాబాద్: కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ కృష్ణాబోర్డు పనితీరుపై దత్తాత్రేయతో చర్చించారు. రాష్ర్టానికి కృష్ణాబోర్డు ప్రతికూలంగా పనిచేస్తోందని కావునా బోర్డు వ్యవహరాలపై జోక్యం చేసుకోవాలని దత్తాత్రేయకు విన్నవించారు. ఇదే అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రి హరీశ్‌రావు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీల బృందం జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కలవనున్నారు.

కాజానగర్‌లో పిచ్చికుక్కలు స్వైరవిహారం...

నెల్లూరు : బుచ్చిరెడ్డిపాలెంలోని కాజానగర్‌లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు

చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు..

గుంటూరు : దాచేపల్లి మండలం పొందుగల దగ్గర వాణిజ్యపన్నులశాఖ చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు సాగించింది. అనధికారికంగా ఉన్న రూ. 25వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రైలు బోగీలో మంటలు..

జార్ఖండ్ : జార్ఖండ్ లోని హజారీబాగ్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు బోగీలో మంటలు అంటుకున్నాయి. సిబ్బందికి భోజనం తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిప్రమాదానికి గురైన బోగీని రైలు నుంచి తప్పించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది...బోగీలో వ్యాపించిన మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

23మంది ఎర్రచందనం కూలీలు అరెస్టు..

కడప : ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు కూండింగ్ లు, చెక్కింగ్ లు కొనసాగుతూనే వున్నాయి.అయినా వీరి ఆగడాలకు అంతులేకుండాపోతోంది. ఈ క్రమంలో రైల్వే కోడూరు మండలం బాలపల్లె చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బస్సులో వస్తున్న 23 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. బస్సుతో సహా గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. కూలీలంతా ఎర్రచందనం చెట్లు నరికేందుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

10:34 - June 4, 2016

 

వాషింగ్టన్ : ప్రముఖ బాక్సింగ్‌ ఛాంపియన్ మహమ్మద్‌ అలీ (74) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్నారు. అమెరికాలోని ఫోనెక్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అలీ 1942లో అమెరికాలో జన్మించారు. 1960లో బాక్సింగ్‌ లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారు. అప్పటి నుంచి ఆయన విజయయాత్ర కొనసాగింది. కెరీర్‌ లో 61 పోటీల్లో పాల్గొనగా... .. 56 సార్లు విజేతగా నిలిచారు. 

1942 లో జననం..
ది గ్రేటెస్ట్ అని అందరూ పిలిచే మహమ్మద్ అలీ కెంటకీలోని లూయిస్‌విల్లేలో 1942 జనవరి 17 న జన్మించారు. అలీ అసలు పేరు కాసియస్ మెర్కులస్ క్లే జూనియర్. తండ్రి సాధారణ పెయింటర్ కాగా, తలి స్థానిక గృహాల్లో పనిమనిషి. బాల్యంలో అలీ అందరు పిల్లల మాదిరిగానే ఆటలు ఆడుతూ గడిపాడు. జో మార్టిన్. అతను బాక్సింగ్ కోచ్. దీంతో అతనివద్దే బాక్సింగ్ ఓనమాలు దిద్దుకున్నాడు. జిమ్‌లో కష్టపడ్డాడు. అక్కడి నుంచి సాధారణ బాలుడి నుంచి బాక్సింగ్ యోధుడిగా మహమ్మద్ అలీ మారాడు. 18 ఏండ్లకే 1960 రోమ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే కాదు .. ఏకంగా పతకం కూడా అందుకున్నాడు. దీంతో ప్రపంచమంతా అలీ పేరు మార్మోగింది. మార్చి 18, 1971న బాక్సింగ్ దిగ్గజాలు మహమ్మద్ అలీ, జో ఫ్రేజియెర్ హోరాహోరీగా 15 రౌండ్లపాటు తలపడ్డారు. రింగ్‌లో రెండు సింహాల పోరును తలపించిన ఈ బౌట్ ఈ శతాబ్దపు అత్యున్నత పోరాటంగా ఎంపికైంది. జైలు నుంచి విడుదలైన అనంతరం హెవి వెయిట్ బాక్సింగ్ పోరులో అలీ తలపడ్డాడు. అప్పటికి అలీ 31 బౌట్లలో ఒక్క పరాజయం ఎరుగని ధీరుడిగా..26 బౌట్లలో అపజయమే తెలియని వీరుడిగా ఫ్రేజియెర్ నిలిచాడు. అయితే ఈ పోటీలో ఫ్రేజియెర్ గెలిచి ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచినా, అందరినీ ఆకట్టుకున్నది మాత్రం అలీనే.

బాక్సింగ్ ప్రస్థానం..

సెప్టెంబర్ 5, 1960 : రోమ్ ఒలింపిక్స్ లో లైట్ హెవీ వెయిట్ కేటగిరి ఫైనల్లో పోలెండ్ బాక్సర్ బిగ్నీ పీట్రెకోవిస్కీపై విజయం. స్వర్ణం కైవసం.
అక్టోబర్ 29, 1960 : ప్రొఫెషనల్ బాక్సర్ గా అరంగ్రేటం. లూయిస్ విల్లెలోని కెంటకీలో టన్నీ హన్ స్కార్ తో జరిగిన ఆరు రౌండ్ల బౌట్ లో విజయం.
ఫిబ్రవరి 25, 1964 : మియామీ బీచ్ లో జరిగిన ఆరు రౌండ్ల బౌట్ లో సోనీ లిస్టన్ ను చిత్తు చేసి హెవీ వెయిట్ ఛాంపియన్ గా అవతరణ.
మార్చి 22, 1967 : న్యూయార్క్ లో జోరా ఫోలెరో బౌట్ లో ఏడు రౌండ్లలో విజయం.
అక్టోబర్ 26, 1970 : మూడున్నరేండ్ల తరువాత మళ్లీ రింగ్ లోకి అలీ ప్రవేశించాడు. అట్లాంటాలో జెర్రీ కారీ, టోకోవోలతో జరిగిన పోటీలో విజయం.
మార్చి 8, 1971 : ఫైట్ ఆఫ్ ది సెంచరీ గా ఖ్యాతినెక్కిన ఈ బౌట్ లో జో ఫ్రేజియర్ చేతిలో ఓటమి చెందాడు. 15 రౌండ్ల పాటు జరిగిన ఈ బౌట్ లో అలికి తొలి పరాజయం.
మార్చి 31, 1973 : కెన్ నార్టన్ తో బౌట్ లో ఓటమి. అలీ కెరీర్ లో రెండో పరాజయం.
జనవరి 28, 1974 : ఫైట్ ఆఫ్ ది సెంచరీ బౌట్ లో ఫ్రేజియర్ పై గెలుపు.
అక్టోబర్ 1, 1975 : ఫ్రేజియర్ తో రీ మ్యాచ్ లో అలీ విజయం.
ఫిబ్రవరి 15, 1978 : తనకంటే వయస్సు లో చిన్నవాడైన లియోన్ స్పింక్స్ తో బౌట్ లో ఓడిపోయాడు. 


అలీ ఫ్రోఫెల్..

అసలు పేరు : కాసియస్ మెర్కులస్ క్లే జూనియర్
పుట్టిన తేదీ : జనవరి 17, 1942
దేశం : అమెరికా
తలపడిన బౌట్ లు : 61
విజయాలు : 56 (అందులో నాకౌట్ ద్వారా నెగ్గినవి 37)
ఓటములు : 5
రికార్డు : 1960లో రోమ్ ఒలింపిక్స్ లో స్వర్ణం.
పురస్కారాలు : అమెరికా ఫ్రెసిడెన్షియల్ సిటిజన్, మెడల్, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.

హంద్రినీవా వాగులో చిక్కుకున్న బస్సు...

కర్నూలు : జిల్లా వ్యాప్తంగా పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తికొండ మండలం చిన్నవుల్తి వద్ద హంద్రినీవా వాగు పొంగిపొర్లుతోంది. ఈ వాగులో కర్నాటకకు చెందిన బస్సు చిక్కుకుపోయింది. బస్సులో50 మంది ప్రయాణీకులున్నారు. స్థానికులు ప్రయాణీకులనురక్షించటానికి సహాయక చర్యల్ని చేపట్టారు. ఆళ్లూరు మండలంలో కల్లెవంక వాగు పొంగిపొర్లుతోంది. ఈ వాగులో లారీ కొట్టుకుపోయింది. కాగా లారీలో వున్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.

బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ మృతి..

అమెరికా : బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ (74)మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. 

శ్రీవారి సేవలో సురేశ్ ప్రభు...

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్రమంత్రి సురేశ్‌ప్రభుతో పాటు, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ తదితరులు స్వామివారిని దర్శంచుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కాసేపట్లో భూనిర్వాసితుల పోరాట సమితి సమావేశం..

మెదక్ : మల్లన్న సాగర్ కాసేపట్లో ముంపు గ్రామాల బాధితులతో పోరాట సమితి సమావేశం కానుంది. శుక్రవారం కలెక్టర్ తో గ్రామస్థులు చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భైనిర్వాశితుల పోరాట సమితి భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశం జరుగనుంది.

హైవేపై విరిగిపడిన చెట్టు రాకపోకలకు అంతరాయం..

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కంకిపాడు- ఉయ్యూరు మధ్య హైవేపై చెట్టు విరిగిపడింది. పలు ప్రాంతాలలో విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది.

వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం..

కృష్ణా : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విమాన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. గన్నవరం నుండి ఢిల్లీ వెళ్లవలసిన ఎయిరిండియా విమానం రద్దయ్యింది. హైదరాబాద్ నుండి గన్నవరానికి రావాల్సిన స్సైస్ జెట్ విమానం ఆలస్యం అయ్యింది. ఈ వర్షాలు కారణంగా పలు విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భూప్రకంపనలు..

నెల్లూరు : ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు, ప్రకాశం జిల్లాలను భూ ప్రకంపనల భయం వీడటం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆ జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా నిన్న రాత్రి 9.35 గంటల సమయంలో ఆ రెండు జిల్లాల్లోని పలు మండలాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, కొండాపురం, దుత్తలూరు, వరికుంటపాటు, సీతారామపురం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాలతో పటు ప్రకాశం జిల్లాలోని పామూరు, లింగసముద్రం, సీఎస్ పురం మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ నిరసన..

అనంతపురం : జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో కదిరిలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదుట టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిరసనగా ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు.

09:48 - June 4, 2016

ప్యారిస్ : ఫ్రాన్స్, జర్మనీలను వరదలు అతలాకుతలం చేశాయి. వరదల బీభత్సానికి 11 మంది మృతి చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పారిస్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మ్యూజియం నీట చిక్కింది. వందేళ్ల తర్వాత  భారీ వర్షాలు కురియడంతో ఫ్రాన్స్‌ నీట మునిగింది. ఉత్తర యూరోప్‌లోని జెర్మనీ, ఫ్రాన్స్ లలో కుండపోత వానలు కురుస్తుండడంతో జనజీవనం అతలా కుతలమైంది. 
ప్రమాదంలో చారిత్రాత్మక కట్టడాలు 
వర్షాల వల్ల ఫ్రాన్స్ లో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో పారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత లౌరీ, ఆర్సే మ్యూజియంలను మూసివేస్తున్నట్టు ఫ్రెంచ్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. మ్యూజియాల్లో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేదుకు వీలుగా  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  దక్షిణ పారిస్‌లో అధికారులు ఇప్పటికే  హైఅలర్ట్ ప్రకటించారు.
11 మంది మృతి
ఫ్రాన్స్, జర్మనీలో వరదల కారణంగా ఇప్పటికే 11 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక సిబ్బంది పడవల ద్వారా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్రాన్స్‌లో ఇప్పటికే 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు పంపించారు. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ గుండా ప్రవహించే సీన్‌ నది ప్రమాద స్థాయిని మించి ఆరు మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. 
దెబ్బతిన్న రోడ్డు మార్గాలు
పారిస్, సెంట్రల్ ఫ్రాన్స్ లో వర్షాలకు రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. పలు వీధులు జలమయమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో  పాఠశాలలను మూసివేశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి కొందరు ఇళ్ల పైకప్పులు ఎక్కారు. పారిస్‌ సెంట్రల్‌ ఫ్రాన్స్ లో 25 వేల మంది విద్యుత్ లేకుండానే గడుపుతున్నారు. ప్రఖ్యాతి గాంచిన ఒర్సే రైల్వే స్టేషన్‌ను మూసి వేశారు.
మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు 
జర్మనీ, ఫ్రాన్స్ ల్లో మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో యూరోప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆరువారాల పాటు నమోదయ్యే వర్షం కేవలం మూడు రోజుల్లోనే కురిసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

 

09:47 - June 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. నిన్న కేబినెట్ భేటీలో నిర్ణయించిన విధంగా... నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు, అధికారుల బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. హస్తినలో ఆయన కేంద్ర మంత్రి ఉమా భారతిని కలువనున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్నవాదనల్లోని వాస్తవాలను కేంద్రంతో పాటు, కృష్ణాబోర్డు దృష్టికి తీసుకెళ్లేలా ఈ పర్యటన సాగనుంది. 

కడప జిల్లాలో అటవీశాఖ అధికారుల కూంబింగ్

కడప : రైల్వే కోడూరు మండలం బిల్లుబాటుపల్లిలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. 30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పరారయ్యారు. 

09:35 - June 4, 2016

వైవిధ్యమైన చిత్రాల్లోని పాత్రలతో, ఆయా చిత్రాల పాటల్లోని డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించి స్టయిలీష్‌ స్టార్‌గా అల్లు అర్జున్‌ (బన్నీ) తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయనకు తెలుగునాటే కాకుండా కోలీవుడ్‌, మాలీవుడ్‌, సాండల్‌వుడ్‌లో కూడా అత్యధికంగా అభిమానులున్నారు. బన్నీ నటించిన చాలా చిత్రాలు అనువాద చిత్రాలుగా అక్కడ విడుదలై విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించి, భారీ కలెక్షన్లు రాబట్టాయి. ముఖ్యంగా మాలీవుడ్‌లో బన్నీకి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ నటించిన 'సరైనోడు' చిత్రం మాలీవుడ్‌లో ఇటీవల 'యోధావు' పేరుతో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. దీంతో డైరెక్ట్ మాలీవుడ్‌ చిత్రంలో నటించేందుకు బన్నీ రంగం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈచిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

09:28 - June 4, 2016

ఈ మధ్యకాలంలో తెలుగునాట రీమేక్‌లతోపాటు తమిళ దర్శకుల హవా కూడా ఎక్కువగా ఉంది. మన కథలు, దర్శకులపై నమ్మకం లేకపోవడం, ఒకవేళ ఉన్నా సదరు దర్శకులకు సక్సెస్‌ లేకపోవడంతో చిన్న హీరోల దగ్గర్నుంచి బడా హీరోల వరకు తమిళ దర్శకులపై ఆధారపడుతున్నారని చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌ పవన్‌కళ్యాణ్‌. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. ఓ ఫ్యాక్షనిస్ట్‌ లీడర్‌ ప్రేమకథతో రూపొందుతున్న ఈచిత్రాన్ని నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాతోపాటు మరో కొత్త సినిమాలో నటించేందుకు పవన్‌కళ్యాణ్‌ పచ్చజెండా ఊపారు. అది కూడా మరో తమిళ దర్శకుడితో కావడం, రీమేక్‌ సినిమా అవ్వడమనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. విజరుతో 'జిల్లా' చిత్రాన్ని రూపొందించి దర్శకుడు నేసన్‌ పెద్ద హిట్‌ కొట్టారు. ఆయన దర్శకత్వంలో 'వేదాళం' అనే తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారని సమాచారం. 'వేదాళం' చిత్రం అజిత్‌ కథానాయకుడిగా తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎ.ఎం.రత్నం నిర్మించనున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా ఓ అగ్ర హీరో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాలను తమిళ దర్శకులతో చేయడమనేది మన కథలు, దర్శకులపై సమర్థతను ప్రశ్నిస్తోంది.

 

09:26 - June 4, 2016

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్‌ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. దాదాపు వందకి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వం వహించిన 'అన్నానగర్‌ ముధల్‌ థెరు', 'నానే రాజా నానే మంత్రి' చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. బాలు మృతి పట్ల తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రగాఢ సంతాపాన్ని సామాజిక మీడియా ద్వారా తెలిపారు. బాలుకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. నేడు కొయంబత్తూర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

విజయవాడ : కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కంకిపాడు, ఉయ్యూరు మధ్య జాతీయ రహదారిపై చెట్టు విరిగిపడింది. 

హైదరాబాద్ లో ఈదురుగాలుతో కూడిన వర్షం...

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

08:52 - June 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్టాల్లో పలు జిల్లాలో భారీ వర్షాలు కరుస్తున్నాయి. కృష్ణా, అనంతపురం, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కంకిపాడు, ఉయ్యూరు మధ్య జాతీయ రహదారిపై చెట్టు విరిగిపడింది. కర్నూలు జిల్లాలో హంద్రీవాగు పొంగిపొర్లుతోంది. కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగామోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

 

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం

గుంటూరు : జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. రోడ్లు జలమయం అయ్యాయి. 

కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం

కర్నూలు : జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. పత్తికొండ మండలం చిన్పవుల్తి వద్ద హంద్రీవాగు పొంగిపొర్లుతుంది. వాగులో కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 

08:39 - June 4, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్యపై ఏసీబీ నమోదు చేసిన కేసును శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మత్తయ్య జెరూసలెం వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతినిచ్చింది.11 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో ఏసిబి వాదనలో పసలేదని ఉన్నత న్యాయస్థానం తెల్చేసింది. అయితే ఏసిబి చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే మత్తయ్యకు ఊరట లభించిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు ఏసిబి దాఖలు చేసిన చార్జీషీట్‌ను ఏసిబి కోర్టు విచారణకు స్వీకరించలేదు. సీసీ నెంబర్ ఇవ్వలేదు. ఇదే అంశాన్ని హైకోర్టు ముందు మత్తయ్య తరుపు న్యాయవాది వాదనలు వినిపించినట్లు సమాచారం. 

08:24 - June 4, 2016

ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి రామకృష్ణప్రసాద్, ఎపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొని, మాట్లాడారు. నీళ్ల విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకోవాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:16 - June 4, 2016

నల్గొండ : కాంగ్రెస్‌కు మరో ఝలక్‌ తగలనున్నట్లు సమాచారం అందుతోంది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరి చేరికకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానున్నట్లు సమాచారం. వీరు ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డికి మాత్రం సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని సమాచారం. అటు జానారెడ్డి కుమారుడు కూడా గులాబీ గూటికే చేరుతాడనే ప్రచారం జరుగుతోంది. 

08:12 - June 4, 2016

మెదక్ : తమకు న్యాయం జరిగేదాకా ఆందోళనలు విరమించేది లేదని మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. బాధితుల నుంచి ఎలాగైనా భూములు తీసుకోవాలని అధికారులు వ్యూహాలు పన్నుతున్నారు. గ్రామస్తులతో జిల్లా కలెక్టర్‌ డైరెక్ట్‌గా చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా తమను బెదిరించి భూములు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముందు మల్లన్నసాగర్‌ కోసం కేసిఆర్‌ తన ఫామ్‌ హౌజ్‌ భూములు ఇచ్చి ఆ తర్వాత తమ దగ్గరకు రావాలని అంటున్నారు.
ముంపు గ్రామాల్లో బాధితుల ఆందోళనలు
మెదక్‌ జిల్లా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ జీవనాధారమైన భూములను వదిలి ఎలా బతకాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ నీతిమాటలు చెప్పే సీఎం కేసిఆర్ అన్యాయంగా తమ భూములను ఎలా లాక్కుంటారంటూ వారు కొశ్చన్‌ చేస్తున్నారు. 
ముంపు గ్రామాల ప్రజలతో కలెక్టర్‌ చర్చలు
ముంపు గ్రామాల ప్రజలతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. అయితే ఆ చర్చల్లో ఏమాత్రం కొత్తదనం లేదని పూర్తిగా అసంతృప్తికరంగా ముగిసాయని బాధితులు అంటున్నారు. 123 జీవో ద్వారా మాత్రమే భూములకు పరిహారం తీసుకోవాలని కలెక్టర్‌ తమతో అన్నారని 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తే మీకే నష్టమంటూ కలెక్టర్‌ నచ్చజెప్పబోయారని బాధితులు చెబుతున్నారు. తమకు మాత్రం 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని గ్రామాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కలెక్టర్‌కు బాధితులు తేల్చి చెప్పారు. 
ర్యాపిడ్ యాక్షన్‌ ఫోర్స్ లు
ఇక మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ర్యాపిడ్ యాక్షన్‌ ఫోర్స్ లను దింపబోతున్నారు. ప్రజలను భయపెట్టడం, విభజించు పాలించు విధానం ద్వారా అధికారులు గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తున్నారని బాధితులు అంటున్నారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే భవిష్యత్‌లో మీకే నష్టం కలుగుతుందంటూ బెదిరిస్తున్నారని కొందరిని భయపెట్టి తమలో తమకు గొడవలు వచ్చేలా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కొన్ని గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న అధికారులు
ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అధికారులు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలకు న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వకుండా పోలీసులతో భయపెట్టి భూములు తీసుకోవడం ఎంతవరకు సబబని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న సీఎం కేసిఆర్‌ తన ఫాం హౌజ్‌ భూములను ఎందుకు ఇవ్వట్లేదని సీపీఎం నేత వెంకట్‌ ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ తన జేబులోంచి డబ్బులు తీసి పరిహారం ఇస్తున్నారా అంటూ ముంపు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం న్యాయబద్దంగా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 

08:02 - June 4, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీలోని నాలుగు స్థానాల్లో టీడీపీ నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌, టీడీపీ మద్దతుతో బీజేపీ నేత సురేష్‌ ప్రభు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, అలాగే తెలంగాణ నుంచి డీఎస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి, శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. ఈ మేరకు వారికి ధ్రువపత్రాలు అందజేశారు.
ముగిసిన రాజ్యసభసభ్యుల ఎన్నిక 
ఏపీ, తెలంగాణ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. సంఖ్యా బలం ప్రకారం పోటీ లేకుండానే ఇరు రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. 
తెలంగాణ నుంచి డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు 
తెలంగాణ నుంచి రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ నేతలు డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నికవగా, ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో డీఎస్, కెప్టెన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాసదారాం ప్రకటించారు. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎన్నికతో రాజ్యసభలో టీఆర్‌ఎస్ బలం మూడుకు చేరింది. 
ఎపి నుంచి సుజనా, టీజీ, సురేష్ ప్రభు, విజయసాయిరెడ్డి 
ఇక ఏపీ నుంచి టీడీపీ తరపున కేంద్ర మంత్రి సుజనా, టీజీ వెంకటేష్‌, కేంద్రమంత్రి బీజేపీ నేత సురేష్‌ప్రభు, వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర అభివృద్ధికి కృషి : సురేష్ ప్రభు
ఈ సందర్భంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్రమంత్రి సుజనా, టీజీ స్పష్టం చేశారు. సభ్యుల సంఖ్య రిత్యా పోటీకి మరే ఇతర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో రాజ్యసభ అభ్యర్థులంతా ఏకగ్రీవమయ్యారు. 

 

07:56 - June 4, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఐదు దేశాల విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, స్విట్జర్లాండ్, ఖతార్, అమెరికా, మెక్సికోల్లో ఆయన పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, విద్యుత్‌, రక్షణ రంగంలో సహకారం వంటి పలు అంశాల్లో ఆయా దేశాలతో మోడీ చర్చలు జరపనున్నారు. తొలుత ఆఫ్ఘనిస్తాన్‌తో తన పర్యటన ప్రారంభించనున్న మోడీ... అక్కడ ఇరుదేశాల మధ్య స్నేహానికి సూచికగా నిర్మించిన సల్మా డ్యాంను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇంధన వనరులు ఎక్కువగా ఉండే ఖతార్‌లో పర్యటిస్తారు. ఆ వెంటనే రెండు రోజుల టూర్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్తారు. అణు పరికరాలు సరఫరా చేసే 48 దేశాల గ్రూప్‌ ఎన్ ఎస్ జిలో సభ్యత్వం కోసం స్విట్జర్లాండ్‌, మెక్సికోల సహకారాన్ని మోడీ కోరనున్నారు.  

 

07:50 - June 4, 2016

హైదరాబాద్ : జూన్‌ నెలాఖరులోగా ఉద్యోగులంతా అమరావతికి తరలిరావాలని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎస్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో తాము ఎదుర్కోబోయే సమస్యలను ఏకరువు పెట్టారు. హెచ్‌ఆర్‌ఏ, స్థానికత, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వాలని సీఎస్‌ను ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ఈ నెల 27లోగా హెచ్‌వోడీ స్థాయి ఉద్యోగులంతా అమరావతి రావాలని సీఎస్‌ స్పష్టం చేసినట్లు ఉద్యోగులు తెలిపారు.  

 

07:45 - June 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు నేడు పార్లమెంటరీ స్థాయీ సంఘం హైదరాబాద్‌కు రానుంది. మాదాపూర్ నోవాటెల్‌లో పార్లమెంటరీ బృందంతో ఇరిగేషన్ అధికారులు సమావేశం నిర్వహిస్తారు. సత్వర సాగునీటి పారుదల ప్రయోజనాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్ట్‌ల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. 
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష 
నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు, జల వనరుల విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టిన తెలంగాణకు మిషన్‌ కాకతీయ విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఇలాంటి సమయంలోనే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘం హైదరాబాద్‌కు వస్తోంది..
ఎంపీ హుకుంసింగ్ అధ్యక్షతన బృందం రాక
ఎంపీ హుకుంసింగ్ అధ్యక్షతన ఏర్పడిన 17 మందితో కూడిన లోక్‌సభ సభ్యులు రాష్ట్రానికి వస్తున్నారు. మాదాపూర్‌ నోవాటెల్‌లో తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పార్లమెంట్ సభ్యుల బృందం వివిధ అంశాలపై సమావేశం నిర్వహిస్తుంది. సత్వర సాగునీటి పారుదల ప్రయోజనాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్ట్‌ల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. ఏఐబీపీ కింద 1995-97లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులలో 16 తెలంగాణలో ఉన్నాయి. ఇందులో 5 ప్రాజెక్ట్ లు పూర్తవగా 11 వివిధ దశల్లో ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ తోపాటు ఎస్‌ఆర్ఎస్‌పీ వరద కాలువ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ, కొమరం భీమ్‌ తదితర ప్రాజెక్ట్ లున్నాయి. 
పలు అంశాలపై చర్చ
ఆన్‌ గోయింగ్ సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, అవి పూర్తికావడానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులు వంటి అంశాలపై ఎంపీల బృందం చర్చించనుంది. కరీంనగర్ ఎంపీ వినోద్‌ కుమార్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. ఏఐబీపీ పథకాలపై చర్చ అనంతరం మధ్యాహ్నం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య సంస్థల అధికారులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహిస్తుంది. రిపేరు, రెనవేషన్‌, రెస్టారేషన్‌ పథకం కింద రంగారెడ్డి జిల్లా సర్పన్‌పల్లి చెరువు పనులు గతంలో జరిగాయి. ఈ పనులపై కూడా పార్లమెంటరీ బృందం సమీక్షించనుంది.  

 

నేడు ఎపి ఉద్యోగులతో సీఎస్ టక్కర్ సమావేశం

హైదరాబాద్ : నేడు ఎపి ఉద్యోగులతో సీఎస్ టక్కర్ సమావేశం కానున్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చ జరుగనుంది. 

నేడు కదిరిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన

అనంతపురం : వైసీపీ అధినేత జగన్ నేడు కదిరిలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

ఫ్రెంచ్ ఓపెన్ లో నేడు మహిళ సింగిల్స్ ఫైనల్

పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ లో నేడు మహిళ సింగిల్స్ ఫైనల్ జరుగనుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి సురేష్ ప్రభు భేటీ

విజయవాడ : నేడు సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి సురేష్ ప్రభు సమావేశం కానున్నారు. సాయంత్రం రాష్ట్ర బీజేపీ నేతలతో సురేష్ ప్రభు సమావేశం అవుతారు. పలు అంశాలపై వారు చర్చించనున్నారు. 

07:22 - June 4, 2016

అనంతపురం : వైసీపీ అధినేత జగన్‌ రైతు భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అనంతపురం జిల్లా యాడికిలో మొదలైన భరోసా యాత్ర భారీ బందోబస్తు నడుమ కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 
అనంతపురం జిల్లాలో టీడీపీ నిరసన 
వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. సీఎం చంద్రబాబుపై జగన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యాడికిలో ఎంపీపీ రంగయ్య ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. 
జగన్‌ యాత్రను అడ్డుకునేయత్నం
చంద్రన్న దండు ఆధ్వర్యంలో సైతం ప్లే కార్డులు ప్రదర్శిస్తూ జగన్‌ యాత్రను అడ్డుకునే యత్నం చేశారు. అలాగే జగన్‌పై టీడీపీ నేతలు పుట్టపర్తి పీఎస్‌లో కేసు నమోదు చేశారు.  మరోవైపు ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్‌ రెడ్డి జగన్‌ యాత్రను అడ్డుకునేందుకు అనుచరులతో బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.    
యాడికిలో రెండోరోజు యాత్ర ప్రారంభం
ఇదిలా ఉంటే రెండో రోజు యాత్రలో వైఎస్ జగన్ యాడికిలో రామిరెడ్డి నివాసం నుంచి బయలుదేరి కమ్మవారిపల్లి, పసలూరు, గార్లదిన్నె, చిన్నపప్పూరు మీదుగా రామకోటి చేరుకున్నారు. ఆ తర్వాత పెద్దపప్పూరు, షేక్‌పల్లి, నామనాంకంపల్లి, వరదాయపల్లి మీదుగా ముచ్చుకోటకు చేరుకున్నారు. 
చంద్రబాబుపై జగన్‌ ఫైర్
ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు. అంతే కాదు సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రామకోటి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని జగన్‌ పరామర్శించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న రైతులు దాసరి కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను జగన్‌ పరామర్శించారు. అనంతరం జగన్‌ స్థానిక వైసీపీ నేత నివాసంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్‌ శనివారం నగురూరు, వేములపాడులో పర్యటించనున్నారు.

 

07:15 - June 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి కారణంగా ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. క్యుములో నింబస్‌ మేఘాలతో తెలంగాణలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్‌లో... 
హైదరాబాద్‌లో... పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్‌, కూకట్‌పల్లి, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, ఆర్డీసీ క్రాస్‌ రోడ్స్‌లో  పెనుగాలులతో కూడిన వర్షం పడింది.  తోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  రోడ్లు జలమయం కావడంతో వాహనచోదకులు అవస్తలు పడ్డారు. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే 72 గంట్లలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
కరీంనగర్‌లో 
కరీంనగర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో కూడిన వర్షానికి  భారీ వృక్షాలు కూకటివేళ్లతో పెకలించుకుని నేలకూలాయి. రోడ్లకు అడ్డంగా అస్తవ్యస్తంగా పడిపోవడంతో ప్రజలు, వాహదారులు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు.  కలెక్టరేట్‌తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 
నల్గొండలో
నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. చౌటుప్పల్‌ మండలంలోని ఎస్‌ లంగోటం, నేలపట్ల గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.  విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
ఆదిలాబాద్‌లో
ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. పెనుగాలులతో కూడిన భారీ వర్షం భైంసాలో బీభత్సం సృష్టించింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. 
ఉత్తరాంధ్రలో 
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా వెంబడి ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తాతోపాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి చెబుతున్నారు. ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్ప వర్షపాతం నమోదుయ్యింది. ఈ ప్రభావం మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...

విజయవాడ : క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాత్రి నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం హడలెత్తించింది. ఈదురుగాలులకు నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు,విద్యుత్‌స్థంభాలు నేలకొరిగాయి. 

07:05 - June 4, 2016

విజయవాడ : క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాత్రి నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం హడలెత్తించింది. ఈదురుగాలులకు నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు,విద్యుత్‌స్థంభాలు నేలకొరిగాయి. 

 

నేడు తూగో జిల్లాలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పర్యటన

తూర్పుగోదావరి : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. 

తెలంగాణలో నేటి నుంచి సాదాబైనామా రిజస్ట్రేషన్

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి సాదాబైనామా రిజస్ట్రేషన్ ప్రారంభంకానుంది. ఈనెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వ్యవసాయ భూములకే రిజస్ట్రేషన్ వర్తిస్తుంది.  

నేడు హైదరాబాద్ కు రానున్న పార్లమెంటరీ స్థాయి సంఘం

హైదరాబాద్ : పార్లమెంటరీ స్థాయి సంఘం నేడు హైదరాబాద్ కు రానుంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని కమిటీ పరిశీలించనుంది. 

నేడు ఢిల్లీలో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి హరీష్ రావు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

Don't Miss