Activities calendar

05 June 2016

21:37 - June 5, 2016

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా భారత్‌ వైపు ఆకర్షణ, జిజ్ఞాస పెరుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్‌ పర్యటనలో ఉన్న ఆయన దోహాలో ప్రవాస భారతీయులతో సమావేశమై వారినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో వేగంగా ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తోన్న దేశం భారత్‌ అని అన్నారు. భారత్‌ 7.9 శాతం వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధివైపు పయనిస్తోందని తెలిపారు. పలు దేశాలు ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ ఖతార్‌ ప్రభుత్వంతో ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆరోగ్యం, టూరిజం, వృత్తి నైపుణ్యం అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి. 

21:34 - June 5, 2016

విజయవాడ : నవ నిర్మాణ దీక్ష ఓ యజ్ఞంలా తాను చేస్తుంటే..కొందరు రాక్షసులు దానిని చెడగొట్టాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు పరోక్షంగా జగన్‌పై మండిపడ్డారు. తన అనుభవం అంత వయసు లేని వారు కూడా తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని..దానిని ఎంతమాత్రం సహించేది లేదన్నారు. నవ నిర్మాణ దీక్ష వారాత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నాల్గొవ రోజు చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవసాయంపై రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు..త్వరలో రైతులకు కరెంట్‌ ఆదాచేసే పంపుసెట్లను అందచేస్తామన్నారు. 

21:31 - June 5, 2016

విజయనగరం :ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆర్థిక ఇబ్బందులున్నాయని రాష్ట్ర వైద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలోని ఘోషాస్పత్రిలో కొత్తగా నిర్మించిన డీఈఐపీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగుల జీతాల పెంపు, క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 

21:27 - June 5, 2016

హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాకు నీరిస్తామనడం అవివేక చర్యని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహబూబ్‌నగర్‌లో అన్నారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న పలు ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటూ కేసిఆర్ చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని తమ్మినేని అభిప్రాయపడ్డారు.

 

20:45 - June 5, 2016

మూర్ఖత్వానికి మతం లేదు. మానవత్వంతో పనే లేదు. బంధుప్రీతి మూర్ఖత్వానికి అస్సలు ఉండదు. స్వార్థం అనే పిశాసి రెక్కలపై ఊరేగుతూ.. వీర విహంగం చేస్తూ విధ్వంసాన్ని సృష్టించనున్న ఒక తపన తప్ప స్వార్థం తో శాంతిని పొందలేం, మూర్ఖత్వంతో మనుషుల ప్రాణాలను కాపాడలేం. ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలు ఎన్నో...ఘోరాలు ఎన్నో... వాటి బలైపోతున్న అమాయక ప్రాణాలెన్నో!? డబ్బు... డబ్బు..డబ్బు. డబ్బు మబ్బులో తనా మనా బేధం లేకుండా కర్ఖశంగా ప్రవర్తించి నమ్మిన వారినే మోసం చేస్తూ మరిన్నిటికి కారకులెందరో. మన సమాజంలో మనతో పాటే మనమధ్యనే బ్రతుకుతున్నారు. ఆస్తి కోసం జరిగిన ఒక పోరులో ఓ ఇల్లు యుద్ధ రంగంగా మారింది. ఆ పోరాటంలో ఎవరు చనిపోయారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:01 - June 5, 2016

ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకును అలరించిన నిహారిక ప్రస్తుతం ఒక మనసు అనే చిత్రంలో నటిస్తోంది. మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు చిత్రానికి దర్శకత్వం వహించిన రామ రాజు, నిహారిక చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. మధుర శ్రీధర్, ఓ ప్రముఖ ఛానెల్ సంయుక్తంగా ఒక మనసు చిత్రాన్ని నిర్మించనుండగా ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. స్నేహగీతం సినిమాతో సంగీత దర్శకుడిగా ఆరంగేట్రం చేసి, జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలతో పేరు తెచ్చుకుని, సూపర్ హిట్ ఆల్బమ్స్ తో శ్రోతలను ఆట్టుకుని, ఒక మనసు సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ను అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ తో స్పెషల్ లైవ్ షో..... అనేకానేక ఆసక్తి కరమైన వివరాలు చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

ఖతార్ - భారత్ మధ్య ఏడు ఒప్పందాలు..

ఢిల్లీ : భారత్-ఖతార్ దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక బంధాల బలోపేతంలో భాగంగానే ఇరుదేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. పర్యాటకం, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య రంగంలో సహకారం, జాతీయ పెట్టుబడులు, మౌలిక వసతులకు నిధులు, యువత-క్రీడలు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సమాచార కేంద్రం ఏర్పాటు విషయాలలో ఈ ఒప్పందాలు కుదిరాయి.

అమరావతికి వెళ్లేందుకు సిద్ధం - ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు..

హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా అమరావతికి తరలివచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యాలయాలను తరలించే ప్రక్రియకు ప్రభుత్వ అధికారులు త్వరగా పూనుకోవాలని, ఐదారు రోజుల ముందుగానే ఉద్యోగులను రిలీవ్ చేయాలని కోరారు. ఉన్నతాధికారుల కార్యాలయాల తరలింపు చురుగ్గా సాగడం లేదని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపాలని కోరారు. 

టి. పోలీస్ శాఖ నెంబర్ వన్ - నాయినీ..

మెదక్‌: దేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ నంబర్‌వన్‌ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో మొట్టమొదటి హెరిటేజ్‌ జైలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జైళ్లలో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తున్నామని, ఖైదీల పరివర్తనకు చాలా కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. 

భావి తరాల కోసమే రాజధాని - మంత్రి రావెల..

ప్రకాశం: భావి తరాల కోసం మంచి రాజధాని నిర్మించాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేత జగన్‌ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.

జగన్ ఓ అపరిచితుడు - మంత్రి పల్లె..

అనంతపురం: జగన్‌ ఓ అపరిచితుడని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, రాష్ట్రంలో నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

17:49 - June 5, 2016

కడప : ప్రభుత్వ భూములపై కబ్జా రాయుళ్ల కన్ను పడింది. పరిశ్రమల శాఖ భూములను కాజేసేందుకు సిద్ధపడ్డారు. సర్కారీ భూముల్ని ప్లాట్లుగా మార్చి...కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. పాలకపక్షం నేతల దన్నుతో హద్దులు దాటేస్తున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో కబ్జాల పర్వంపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ....!

ఏపీఐఐసీ భూములనే ఆక్రమించేశారు...

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో.. కబ్జాకోరులు పేట్రేగిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. ఆ భూములు.. ఈ భూములు అన్న తేడా లేకుండా.. కబ్జా చేసి పారేస్తున్నారు. మండలంలోని మైసూరవాండ్లపల్లి పంచాయతీ పరిధిలో.. ఏపీఐఐసీ భూములనే ఆక్రమించేశారు కబ్జాకోరులు. అంతేనా.. వాటిని ప్లాట్లుగా మార్చి.. అమ్మకానికే పెట్టేశారు.

ప్రభుత్వ పెద్దల అండతో ఫ్లాట్లుగా మార్చి రియల్ దందాకు...

పరిశ్రమల శాఖ భూములను... ప్రభుత్వ పెద్దల అండతో ఫ్లాట్లుగా మార్చి రియల్ దందాకు తెరలేపారు కడపజిల్లా రియల్టర్లు. సర్వే నెంబరు 1627లో 35 ఎకరాల భూమిలో గతంలో డిటర్జెంట్ ఇండియా లిమిటెడ్ అనే సబ్బుల తయారీ కంపెనీ ఉండేది. నిర్వహణ లోపం కారణంగా కంపెనీ కొంతకాలం క్రితం మూతపడింది. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సంస్థకు దఖలు చేసిన 17.5 ఎకరాల ఏపీఐఐసీ భూమి, మరో 17.5 ఎకరాల పొరంబోకు భూమి నిరుపయోగంగా మారింది.

సబ్బుల ఫ్యాక్టరీ కోసం కేటాయించిన 35 ఎకరాల భూమిలో..

సబ్బుల ఫ్యాక్టరీ కోసం కేటాయించిన 35 ఎకరాల భూమిలో.. 17.5 ఎకరాల భూమిని.. రైల్వేకోడూరుకు చెందిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య.. ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశారు. నూలు పరిశ్రమ ఏర్పాటు కోసమంటూ తక్కువ ధరకే ఈ భూమి తీసుకున్నారు. అయితే.. ఇక్కడే రియల్టర్లు జూలు విదిల్చారు. మాజీ ఎంపీ రామయ్య నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఈ భూమిని కొన్న రియల్టర్లు.. పరిశ్రమల శాఖ భూమితో పాటు.. పక్కనే ఉన్న మరో ఐదెకరాల ప్రైవేటు భూమినీ కబ్జా చేసేశారు. ప్లాట్లు వేసి విక్రయించేందుకు.. ఆ స్థలాన్ని శరవేగంగా చదును కూడా చేసేస్తున్నారు.

పరిశ్రమల శాఖ అధికారులతో పాటు.. పాలక పక్షం నేతల పాత్రలపై అనుమానాలు...

ఈ మొత్తం వ్యవహారంలో.. పరిశ్రమల శాఖ అధికారులతో పాటు.. పాలక పక్షం నేతల పాత్రలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పరిశ్రమల శాఖకు చెందిన భూమిని ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏదైనా సంస్థ పేరిట దక్కించుకోవాల్సిన భూముల్ని.. మాజీ ఎంపీ వ్యక్తిగతంగానే ఎలా సొంతం చేసుకున్నారు..? ఆయన నుంచి రియల్టర్లు ఎలా స్వాధీనం చేసుకున్నారు అన్న ప్రశ్నలూ స్థానికులను వేధిస్తున్నాయి. 36 కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకోరుల కబందహస్తాల నుంచి కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని, పారిశ్రామిక భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.  

17:45 - June 5, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ విమర్శించారు. బెదిరింపులతో.. కాంట్రాక్ట్,కమీషన్‌ల ఎరతో.. పక్క పార్టీల వ్యక్తులను లొంగదీసుకుంటుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారు పార్టీని వదిలిపెట్టాలని ఆయన సూచించారు. పార్టీ దిక్కరణ వ్యాఖ్యలు చేసిన నల్గొండ జిల్లా శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీచేశామని చెప్పారు.. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న జగన్ పర్యటన.

అనంతపురం : జిల్లాలో జగన్ యాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. టిడిపి - వైసిపి కార్యకర్తలు పరస్పర దాడులకు దిగుతున్నారు. వైసీపీ నేత చంద్రమోహన్ రెడ్డి టిడిపి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. జగన్ దీక్షకు నిరసనగా టిడిపి శ్రేణులు ఆందోళన నిర్వహించారు. దీనితో అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి.

15:45 - June 5, 2016

హైదరాబాద్ : సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా వారం రోజులపాటు కోర్టుల బహిష్కరణకు న్యాయవాదుల జేఏసీ పిలుపునిచ్చింది. ఏపీకి చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళనల చేపట్టనున్నారు. 13న చలో హైకోర్టుకు జేఏసీ పిలుపునిచ్చింది. మూకుమ్మడి సెలవులు పెట్టి నిరసన తెలిపేందుకు తెలంగాణ న్యాయమూర్తులు నిర్ణయించారు. 

షోకాజ్ పై కోమటిరెడ్డి స్పందన..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై స్పందించారు. షోకాజ్ నోటీసు ఇచ్చే సత్తా రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని, పనికి రాని పీసీసీ చీఫ్ కింద పని చేయనని తేల్చిచెప్పారు. సోనియాగాంధీ వద్దే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంగతి తేలుస్తానని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసులను పట్టించుకోనని వివరణ కూడా ఇవ్వనని కుండబద్ధలు కొట్టారు. 

15:43 - June 5, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్ట్‌లకు అడ్డుపడితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమేనని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అక్రమంగా చుక్క నీటిని కూడా వాడుకోమని.. తమకు రావాల్సిన వాటానే తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకం కాదని తుమ్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని తమ ప్రాజెక్టులను అడ్డుకోవడం వల్ల సున్నితమైన అంశాన్ని జఠిలం చేయద్దని కోరారు. ఏపీ ప్రభుత్వం తరచుగా కృష్ణా-గోదావరి బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. సోదరభావంతో ముందుకెళితే రెండు రాష్ట్రాలకు మంచిదని వెల్లడించారు. 

15:41 - June 5, 2016

హైదరాబాద్ : టి పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి నాయకత్వ అసమర్థత వల్లే ఖమ్మం జిల్లాలో వలసలు ఊపందుకున్నాయని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ విమర్శించారు. అవినీతికి మారుపేరైన భట్టికి సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయిలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీకటి వ్యాపారాలతో పబ్బం గడుపుకునే భట్టి..టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

15:34 - June 5, 2016

టాలీవుడ్ లో అగ్రహీరోల్లో ఒకరుగా మహేష్ వెలుగొందుతున్నారు. అలాగే కోలీవుడ్ లో సూర్య కూడా అగ్రహీరోల్లో ఒకరుగా స్థానం సంపాదించుకున్నారు. సూర్య నటించిన తాజా చిత్రం '24' మంచి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం రూపొందుతోందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి 'సుందర్ సి' దర్శకత్వం వహించనున్నారని టాక్. సుమారు రూ.250 కోట్లతో ఈ సినిమాను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. శ్రీ థెనాందల్ ఫిల్మ్ సంస్థలో సుందర్.సి ఓ భారీ సినిమాను చేయనున్నారని ట్విట్టర్ లో ఆయన సతీమణి ఖుష్బూ పేర్కొంది. నటీనటులెవరన్నది ఇంకా ఫైనల్ కాలేదని, త్వరలో పూర్తి వివరాలతో ప్రకటన వెలువడుతుందని తెలిపారు. 'బాహుబలి' చిత్రానికి పనిచేసిన సాబు సిరిల్, కమల్ కన్నన్ ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో పనిచేయనున్నారని వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా ఇళయరాజ, ఏ.ఆర్ రెహ్మాన్ పేర్లను పరిశీలిస్తున్నారంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. 

రేపటి నుండి కోర్టుల బహిష్కరణకు జేఏసీ పిలుపు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి కోర్టుల బహిష్కరణకు న్యాయవాదుల జేఏసీ పిలుపునిచ్చింది. వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ చేయాలని, మూకుమ్మడి సెలవులు పెట్టి నిరసన వ్యక్తం చేయాలని టి న్యాయమూర్తులు నిర్ణయించారు. సిటి సివిల్ కోర్టులో కీలక సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆల్ కోర్ట్స్ అసోసియేషన్ పాల్గొంది. ఏపీకి చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించనుంది. న్యాయవాదులకు మద్దతుగా నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరు కావాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఈనెల 13న చలో హైకోర్టుకు పిలుపునిచ్చింది. 

15:13 - June 5, 2016

పాలమూరు మట్టిబిడ్డడు..నిరక్షరాస్యుడు..గొర్రెల పెంపకమే వృత్తిగా కలిగిన వాగ్గేయకారుడు..అతడే కొండన్న..ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. చదువు రాకపోయినా పాటలు రాయడం ఎలా వచ్చింది ? కుటుంబ జీవితం ఎలా మొదలయ్యింది ? గొర్లు..మహబూబ్ నగర్ కరవు పరిస్థితులు..అడవుల్లో పక్షుల కిలకిలలు..గువ్వలకు సంబంధించిన..చిలుకల పలుకులు..తెలంగాణ ఉద్యమంపై..ఇలా అంశాలపై కొండన్న పాటలు రాసిండు. మస్త్ మస్త్ గా ఉన్న ఈ పాటలు వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

భారత కార్మికుల క్యాంప్ ను సందర్శించిన మోడీ..

ఖతార్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఖతార్ పర్యటన కొనసాగుతోంది. దోహాలోని భారత కార్మికుల క్యాంపును ఆయన సందర్శించారు. అక్కడ పని చేస్తున్న కార్మికులతో కలిసి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి కూర్చొని అక్కడే భోజనం చేశారు. 

కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు..

హైదరాబాద్ : పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఇది కొనసాగుతోంది. దీని కారణంగా కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి హరీష్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు సూచించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, మిషన్ కాకతీయ ఫలాలు అందాలంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. 

మల్లుపై మంత్రి తుమ్మల సెటైర్లు..

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెటైర్లు వేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ వర్క్ చేసుకుంటే మంచిదని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పెద్దది..భట్టి స్థాయి ఏంటో తెలియదని..కాంగ్రెస్ హయాంలా దళారీ రాజకీయం చేయలేమని..వ్యాఖ్యానించారు. 

మధిరలో కాంగ్రెస్ ను ఏమి చేయలేరు - మల్లు..

హైదరాబాద్ : వంద మంది కేసీఆర్ లు వచ్చినా మధిరలో కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అధికార పార్టీని ప్రశ్నిస్తున్నందుకే తమపై ప్రతి విమర్శలు చేస్తున్నారన్నారు.

 

14:48 - June 5, 2016

విజయవాడ : హైదరాబాద్‌లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులు నిర్ణీత గడువులోగా అమరావతి తరలివాల్సిందేనని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇందుకోసం మూడు రోజుల్లో రోడ్‌ మ్యాప్‌ ప్రకటిస్తామని మున్సిపల్‌ మంత్రి నారాయణ చెప్పారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణాలు పూర్తికానందున అమరావతికి రామని ఉద్యోగులు భీష్మించడం సరికాదన్నారు. వర్షాల కారణంగా భవన నిర్మాణాల్లో కొద్దిగా ఆలస్యం జరుగుతున్నా... ముందుగా ప్రకటించిన విధంగా ఈనెల 27 నుంచి అమరావతి నుంచి పాలన సాగించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగులు కట్టుబడి ఉండాలన్నారు. 

14:46 - June 5, 2016

మెదక్ : సమస్యలతో సతమతం అవుతున్న మెదక్‌జిల్లా రైతులు పోరుబాట పడుతున్నారు. రోజుకో ప్రాంతంలో రోడ్డెక్కుతున్నారు. ఘనపూర్‌ ఆనకట్ట పరిసరప్రాంతాల్లో భూములు కోల్పోతున్న వారు...నిరసనలకు దిగుతున్నారు. తమకు పరిహారం ఎంతిస్తారో చెప్పకుండా ఆనకట్ట ఎత్తును ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్నారు. భూముల కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:44 - June 5, 2016

విశాఖ : కాలుష్య కోరలనుంచి విశాఖను కాపాడాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ముందు ధర్నా చేపట్టారు.. ప్రభుత్వం ఓవైపు కాలుష్యాన్ని నివారించాలంటూ ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహిస్తూనే... మరోవైపు కాలుష్యాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:24 - June 5, 2016

తెలుగు చిత్రసీమలో కొత్త కలయికలు జోరుని ప్రదర్శిస్తున్నాయి. ఇదివరకెప్పుడూ కలిసి పనిచేయని కథానాయకులు, దర్శకులు జట్టు కడుతున్నారు. దీంతో వూహకు కూడా అందని కలయికలతో సినిమాలు సెట్స్‌పైకి వెళుతున్నాయి. అటు దర్శకులు, ఇటు కథానాయకులు 'కొత్త' అనే విషయానికి ప్రాధాన్యమిస్తుండడమే అందుకు ప్రధాన కారణం. విజయవంతమైన కలయికలో వచ్చే సినిమాలపై ఎన్ని అంచనాలుంటాయో, కొత్త కలయికలో వచ్చే సినిమాలపైనా అదేస్థాయి ఆసక్తి పేక్షకుల నుంచి వ్యక్తమవుతుంటుంది. ఒకప్పుడు అగ్ర కథానాయకుడు ఓ కొత్త దర్శకుడిని నమ్మి సినిమా చేస్తున్నాడంటే అదొక పెద్ద సాహసంగా పరిగణించే పరిస్థితి. కానీ ఇప్పుడలా కాదు. కొత్త దర్శకుడితో సినిమా చేస్తే ఓ కొత్త స్టైల్‌ వస్తుందని కథానాయకులు గట్టిగా నమ్ముతున్నారు. దర్శకులు సైతం ఎప్పటికప్పుడు కొత్త తారలతో సినిమా తీయడంలోనే మజా అన్నట్టుగా ఒక్కోసారి ఒక్కో కథానాయకుడితో జట్టుకడుతున్నారు.

చిరు..బాలయ్య..నాగ్..వెంకీ..
చిరంజీవి - వి.వి.వినాయక్‌, ప్రభాస్‌ - ఎస్‌.ఎస్‌.రాజమౌళి, పవన్‌ కల్యాణ్‌- ఎస్‌.జె.సూర్యలాంటి విజయవంతమైన కలయికల్లో సినిమాలు రూపొందుతున్నప్పటికీ, కొత్త జట్లతో రూపొందుతున్న చిత్రాల సంఖ్యే మన చిత్రసీమలో అధికంగా ఉండటం విశేషం. బాలకృష్ణ, క్రిష్‌... కలిసి సినిమా చేస్తారని అసలెవరూ వూహించి ఉండరు. యువ కథానాయకులతో సినిమాలు చేసే క్రిష్‌నీ, మాస్‌ దర్శకులతోనే సినిమాలు చేసే బాలకృష్ణనీ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కథే కలిపింది. ఆసక్తికరమైన ఈ కలయికలో సినిమా వస్తోందని తెలియగానే అంచనాలు వూపందుకున్నాయి. పైగా అది బాలకృష్ణ వందో చిత్రం కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకొంది. అలాగే ‘బాబు బంగారం’ కోసం వెంకటేష్‌, మారుతి కలిశారు. వీళ్లిద్దరి కలయిక కూడా కొత్తదే. యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేసే మారుతి ఇదివరకు వెంకీతో ‘రాధా’ అనే చిత్రం చేయాలనుకొన్నారు. కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయినా పట్టు వదలకుండా మళ్లీ వెంకటేష్‌ కోసం కథని సిద్ధం చేసుకొన్నారు మారుతి. ఆ కథే ఇప్పుడు 'బాబు బంగారం' పేరిట తెరకెక్కుతోంది. కామెడీకి ప్రాధాన్యమిచ్చే ఆ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో ప్రేక్షకులు రెట్టింపు వినోదాల్ని ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే వెంకీని కొత్తగా చూపించారన్న విషయం స్పష్టమవుతోంది.

మురుగుదాస్ తో మహేష్..
'ఒక్కడు'ని చూసినప్పట్నుంచే మహేష్‌తో సినిమా చేయాలనుకొన్నారట మురుగదాస్‌. కానీ ఆ కలయికలో సినిమాని మాత్రం ఎవ్వరూ వూహించలేదు. విదేశీ పర్యటనలో ఉన్న మహేష్‌ తిరిగి రాగానే తెలుగు, తమిళ భాషల్లో ఆ చిత్రం పట్టాలెక్కబోతోంది. ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో ‘జనతా గ్యారేజ్‌’ తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన తొలి ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదివరకు కొరటాల 'మిర్చి', 'శ్రీమంతుడు'తో ఆకట్టుకున్నారు. దీంతో 'జనతా గ్యారేజ్‌ 'పై భారీ అంచనాలే ఉన్నాయి. స్టైలిష్‌ దర్శకుడిగా పేరున్న సురేందర్‌రెడ్డితో రామ్‌చరణ్‌ తొలిసారి సినిమా చేస్తున్నాడు. 'ధ్రువ' పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రం తమిళంలో విజయవంతమైన 'తని ఒరువన్‌ 'కి రీమేక్‌. ఇందులో చరణ్‌ మరింత స్టైలిష్‌గా కనిపించే అవకాశాలున్నాయి. కల్యాణ్‌రామ్‌-పూరి జగన్నాథ్‌ల కలయిక కూడా కొత్తదే. పూరి సినిమాల్లో కథానాయకులు ఎప్పుడూ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అన్నట్టుగా కనిపిస్తుంటారు. ఆ స్టైల్‌ని కల్యాణ్‌రామ్‌లో వూహించుకొంటూనే అభిమానులు ఓ కొత్త రకమైన అనుభూతికి గురవుతున్నారు. ఒక సామాజిక అంశం ఆధారంగా రూపొందుతున్న ఆ చిత్రంపై ప్రేక్షకులతో పాటు, అటు పూరి... ఇటు కల్యాణ్‌రామ్‌ కూడా ఆసక్తిగానే ఉన్నారు.

చాలా ప్రయోజనాలు..
దర్శకుడి ఆలోచనల్లో పక్కాగా ఒదిగిపోయే కథానాయకుడు అల్లు అర్జున్‌, ఇప్పుడు దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌తో కలిసి సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ఈ ఏడాది చివర్లో ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. 'ఇష్క్‌', 'మనం', '24' చిత్రాలతో వరుసగా విజయాలు అందుకొన్న విక్రమ్‌తో అల్లు అర్జున్‌ సినిమా కొత్త సమీకరణలకి తెరలేపుతోంది. కొత్త దర్శకులకి అవకాశాలు ఇవ్వడంలో ముందుండే రవితేజ మరొకసారి అదే ప్రయత్నం చేస్తున్నాడు. చక్రి అనే యువ దర్శకుడితో 'రాబిన్‌హుడ్‌' చేయబోతున్నాడు. 'ప్రేమమ్‌' కోసం నాగచైతన్య, చందు మొండేటి తొలిసారి జట్టు కట్టారు. ఇలా పరిశ్రమలో కొత్త కాంబినేషన్లలో బోలెడన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ''కొత్త కాంబినేషన్లపై కొత్త కథలు తెరకెక్కితే చాలా ప్రయోజనాలుంటాయి. నటీనటులు, దర్శకుల శైలి మారుతుంది. ప్రేక్షకులూ కొత్త వినోదాల్ని ఆస్వాదిస్తారు. ఈ సినిమాలు మంచి ఫలితాల్ని సాధిస్తే పరిశ్రమకి విజయవంతమైన కలయికలు మరిన్ని దొరికినట్టవుతుంద’’ని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.

దళితుల సంక్షేమ పథకాలపై సెమినార్..

హైదరాబాద్ : దళితుల సంక్షేమ పథకాలు అనే అంశంపై నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ హోటల్‌లో సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి చందూలాల్, ఎమ్మెల్సీ రాములు నాయక్, నోమలు నర్సింహయ్య తదితరులు హాజరయ్యారు. 

శుక్రవారం అలీ అంత్యక్రియలు..

లూయిస్ విల్లే: మహ్మద్ అలీ అంత్యక్రియలు వచ్చే శుక్రవారం అతని సొంతూరు కెంటకీలోని లూయిస్‌విల్లేలో జరుగుతాయని అతని కుటుంబ అధికార ప్రతినిధి గన్నెల్ తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, హాలీవుడ్ నటులు అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

 

13:54 - June 5, 2016

ఉత్తరప్రదేశ్‌ : అరాచకముఠా నాయకుడు అంతమయ్యాడు. తాను అంటించిన మంటల్లోనే మాడి మసైయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో హింసకు పాల్పడిన కబ్జాకోరుల నాయకుడు... అదే ఘర్షణలో అంతమయ్యాడు. కబ్జాకోరు... సాయుధ తండాలతో అరాచకం సృష్ఠించిన ముఠానాయకుడు..అంతమయ్యాడు..
ప్రభుత్వాలకు సవాల్‌ గా మారిన రామ్‌వృక్షయాదవ్‌ 
జవహార్‌ పార్క్ లో వందలాది మంది సాయుధులతో తిష్టవేసిన రామ్‌వృక్షయాదవ్‌... ఉత్తరప్రదేశ్‌ మధురా ప్రాంత  స్థానిక ప్రభుత్వాలకు సవాల్‌ గా మారాడు. చట్టాలు, కోర్టులంటే లక్ష్యపెట్టలేదు.'అజాద్‌ భారత్‌ వైదిక్‌ క్రాంతి సత్యాగ్రాహి'  అనే సంస్థను ఏర్పాటు చేసి అరాచకాలను సాగించాడు. దాదాపు 3వేల మంది సాయుధ అనుచరులతో సొంతసేనను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయుధాలు పట్టిన గూండాలు రెండేళ్లుగా జవహార్‌పార్క్‌ లో తిష్టవేశారు. 
సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ముఠాలీడర్‌
రామ్‌వృక్షయాదవ్‌ అరాచకాలు అన్నీఇన్నికావు. తాను ఏర్పాటు చేసుకున్న 'అజాద్‌ భారత్‌ వైదిక్‌ క్రాంతి సత్యాగ్రాహి' సంస్థతో మధురలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.  ఆక్రమించిన ప్రాంతానికి తానే రాజునని...  ప్రజలు తనకే సమస్యలు చెప్పుకోవాలని హుకుం జారీ చేశాడు. అంతేకాదు.. తన రౌడీమూకలతో ప్రజల నుంచి పన్నులు కూడా వసూలు చేశాడు.  అంతటితోనే ఆగలేదు ఏకంగా సొంత కరెన్సీని తయారు చేయడానికి  పూనుకున్నాడు. ఇండియన్‌ కరెన్సీని రద్దుచేసి... తన సొంతకరెన్సీని దేశం మొత్తం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ కూడా చేశాడు.  ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు నోరుమెదపలేక పోయారు. 
మంటల్లోనే రామ్‌వృక్షయాదవ్ మృతి
ఈ నేపథ్యంలో.. జవహార్‌పార్క్‌ స్థలాన్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నించిన పోలీసులపైకి... తుపాకులు, ఇతర ఆయుధాలతో దాడి చేయించాడు రామ్‌వృక్షయాదవ్‌. ఇటు పోలీసులు అటు సాయుధ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో  మంటలు అంటుకుని... గ్యాస్‌సిలిండర్లు పేలాయి. ఆమంటల్లో 11 మంది మృతి చెందారు. అదే మంటల్లో  ముఠానాయకుడు రామ్‌వృక్షయాదవ్ కూడా చనిపోయినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో మథురా ఘర్షణలో మృతుల సంఖ్య 27కి పెరిగింది. గురుదేవ్‌బాబా శిష్యరికంలో విషవృక్షంలా ఎదిగాడు రామ్‌వృక్షయాదవ్‌. గూండాలను కూడగట్టి... రౌడిదర్బార్‌ను నడిపాడు. చివరికి తాను రగిల్చిన చిచ్చులోనే ఆహుతయ్యాడు.

 

13:50 - June 5, 2016

గుంటూరు : హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎపి ఉద్యోగులను అమరావతికి తరలించే కార్యక్రమాన్ని మరో మూడు నెలలు వాయిదా వేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ డిమాండ్‌ చేశారు. గఫూర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృంధం తాత్కాలిక సచివాలయ భవనాలను పరిశీలించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి కాకుండా ఉద్యోగులు తరలిరావాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని ఆయన తప్పుపట్టారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఎన్జీవోలు ప్రభుత్వానికి లొంగిపోయారని ఆరోపించారు. నిర్మాణాలు మరో మూడు నెలల వరకు పూర్తయ్యే అవకాశం లేదని నాయకులు అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణాలు పూర్తికాకుండా, ఫర్నిచర్‌ లేకుండా ఉద్యోగులు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడాన్ని నాయకులు తప్పుపడుతున్నారు. 

 

13:41 - June 5, 2016

హైదరాబాద్ : మాజీ మంత్రి కోమటిరెడ్డికి పీసీసీ షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం కోమటిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే  వారంలోగా కోమటిరెడ్డి వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది.  అయితే ఈ నోటీసులపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

 

13:38 - June 5, 2016

హైదరాబాద్ : ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ స్పందించారు. వైసీపీ నేత జగన్ కామెంట్లపై టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని సూచించారు. ప్రజలకు ఎవరెంటో స్పష్టంగా తెలుసుని... రాష్ట్రాభివృద్ధిపై కార్యకర్తలందరూ దృష్టిపెట్టాలని లోకేష్ సూచించారు. 

 

రెచ్చిపోవద్దన్న లోకేష్..

హైదరాబాద్ : టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, ప్రజలకు ఎవరెంటో స్పష్టంగా తెలుసన్నారు. రాష్ట్రాభివృద్ధిపై కార్యకర్తలందరూ దృష్టి పెట్టాలని సూచించారు. 

సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలకు అందించిన సహాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు చెల్లని ఉద్యోగ నియామకపత్రాలను ఇచ్చారని, ఆదిలాబాద్ జిల్లాలో 27 మంది అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలతో వెళ్తే చెల్లవని తిప్పి పంపారన్నారు. ఉద్యమకారులపై కేసులు కొట్టివేస్తామని మాట తప్పారని పేర్కొన్నారు. 

ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో మహిళ..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాతో దుబాయి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను ఇమ్రిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఏజెంట్ మోసం చేశాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

టి.జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సు..

హైదరాబాద్ : తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మంత్రులు పోచారం, జోగు రామన్న, జూపల్లి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ లు హాజరయ్యారు. పర్యావరణ దినోత్సవ స్పూర్తితో ప్రజలందరూ జల రక్షణ కోసం పాటుపడాలని, జల సంరక్షణను బాధ్యతగా భావించాలన్నారు. 

ఓఎన్జీసీ బావి నుండి గ్యాస్ లీక్..

తూర్పుగోదావరి : సఖినేటిపల్లి (మం) అంతర్వేదిలో ఓఎన్జీసీ బావి నెంబర్ 28 దగ్గర పైపులైన్ నుండి గ్యాస్ లీక్ అవుతోంది. దీనితో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

13:32 - June 5, 2016

పారిస్ : ఫ్రాన్స్ ను ముంచెత్తిన భారీ వరదలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. రాజధాని పారిస్‌లో మహోగ్రరూపం దాల్చిన సేన్‌ నదిలో వరద ఎట్టకేలకు తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడే పునరావస, సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగానికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. 
పెను వరదల్లో నలుగురు మృతి   
ఫ్రాన్స్ లో చోటుచేసుకున్న పెను వరదల్లో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పారిస్‌లోని సేన్‌ నదిలో వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. కుండపోత వర్షాలు సైతం శాంతించడంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే జల దిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సేన్‌ నదిలో గత 35 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వరద పెరిగింది. నదీ ప్రవాహం సాధారణ స్థితి వచ్చేందుకు ఇంకా పది రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
17 వేల ఇళ్లల్లో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా 
ఇక దాదాపు 17 వేల ఇళ్లల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వరద తాకిడికి పారిస్‌లోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. పలు రైల్వే, సబ్‌వేలను మూసివేశారు. ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న తాజా మరణాలతో యూరప్‌లో వరదల బారిన మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. 
యూరప్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు..
ఇక యూరప్‌ వ్యాప్తంగా ఫ్రాన్స్ నుంచి ఉక్రెయిన్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య యూరప్‌ దేశాలైన జర్మనీ, పోలాండ్‌, బెల్జియం, రొమేనియా దేశాల్లో సైతం భారీ వానల వల్ల నదులు పొంగి పొర్లుతున్నాయి. 

 

13:27 - June 5, 2016

విశాఖ : వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు అందించింది. నైరుతీ రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని ప్రకటించింది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వెల్లడించింది. ఈనెల 12-15 మధ్య నైరుతీ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
2015లో జూన్‌ 5న కేరళలో రుతుపవనాలు ప్రవేశం 
దేశ ఆర్ధికాభివృద్ధికి కీలకమైన నైరుతీ రుతువపనాలు కేరళలో ప్రవేశించేందుకు సమయం ఆసన్నమయ్యింది. గతేడాది కంటే రెండు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 2015 జూన్‌ 5 న నైరుతీ రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈసారి ఈనెల 7 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది. కేరళలో ప్రవేశించిన  తర్వాత మూడు రోజులకు రాయలసీమకు విస్తరించే అవకాశం ఉందని  ఐఎండీ తెలిపింది. చురుగ్గా కదులుతున్న నైరుతీ రతుపవనవాలు ఈనెల 12 నుంచి 15 మధ్య తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.   జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగే నైరుతీ  రుతు వపన కాలంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అంచనావేసింది. 
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా ఉంది. ఒడిశా తీరంలో మరో అవర్తనం ఆవర్తనం స్థిరంగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ గుర్తించింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 
ఎల్‌ నినో లా నినాగా మారే అవకాశం 
ఎల్‌ నినో ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలుగు రాష్ట్రంల్లో కుంభకృష్టి కురిసే అవకాశం ఉందని శాతావరణ శాస్త్రవేత్తలు ముందస్తుగా అంచనావేస్తున్నారు. ఎల్‌ నినో లానినోగా మారి భారీ వర్షాలకు దారితీస్తుందని చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల వాతావరణ వేడెక్కడం ఎల్‌ నినోగా పిలుస్తారు. ఇది రుతు పవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పసిఫిక్‌ మహాసముద్ర ఉపతల వాతావరణం చల్లబడటాన్ని లానినా గా పిలుస్తారు. ఇది రుతుపవనాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. 
ఎల్‌ నినో ప్రభావంతో గతేడాది వర్షాలు పడలేదు
ఎల్‌ నినో ప్రభావంతో గతేడాది వర్షాలు పడలేదు. 1901-2015 మధ్య 29 సార్లు ఎల్‌ నినో  మన దేశ వాతావరణంపై ప్రభావం చూపింది. ఈ 29 ఏళ్లలో 16 సార్లు తీవ్ర దుర్భిక్షం తాండవించింది. 1997 తర్వాత నాలుగేళ్లు ఎల్‌ నినో ఏర్పడింది. ఈ కాలంలో వర్షాలు పడకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 1906-2015 మధ్య 24 సార్లు లా నినా  ఏర్పడింది. లా నినా సంవత్సరాల్లో అధిక వర్షపాతం నమోదయ్యిందని రికార్డులు చెబుతున్నాయి. లా నినా కారణంగా ఈసారి వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ ప్రభావం మరీ ఎక్కువగా  ఉంటుందని  గత అనుభవాలు రుజువు చేస్తున్నాయి.  లా నినా ప్రభావంతో 1917లో నైరుతీ రుతుపవన కాలంలో 122 శాతం వర్షపాతం  నమోదయ్యింది. సాధారణంకన్నా ఇది 22 శాతం అధికం. ఆ తర్వాత ఈ స్థాయిలో  అధికవర్షపాతం నమోదైన సందర్భాలు లేవని  వాతావణర శాఖ అధికారులు చెబుతున్నారు. 

 

పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం బాబు..

విజయవాడ : కృష్ణా పుష్కర పనులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనిఖీ చేశారు. పున్నమి ఘాట్ ను సందర్శించారు. ఆయనతో పాటు మంత్రి దేవినేని, ఎంపీ కేశినేని నాని, అధికారులున్నారు. 

కోమటిరెడ్డికి నోటీసులు..

హైదరాబాద్ : పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీ పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

13:15 - June 5, 2016

విశాఖ : పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని మంత్రి గంటాశ్రీనివాసరావు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా మాట్టాడుతూ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల కాలుష్యం పెరుగుతోందన్నారు. ఈ ర్యాలీలో పర్యావరణ ప్రేమికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

 

13:08 - June 5, 2016

హైదరాబాద్ : జల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని మంత్రి పోచారం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు పోచారం, జూపల్లి, జోగు రామన్న, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ హాజరయ్యారు. పర్యావరణ దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు జల సంరక్షణను బాధ్యతగా భావించాలని మంత్రి పోచారం పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణలో 33 శాతం అడవులను పెంచడమే తమ లక్ష్యమని ఈ సంర్భంగా మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. 

 

13:03 - June 5, 2016

భారత దేశంలో కుల సమాజం ఉంది. ఆ కులాలలో కూడా ఉపకులాలు ఉన్నాయి. దీంతో కుల వర్గీకరణ సమస్య ఒక సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఉపకులాల సమైఖ్యతను ఆశిస్తూ ఇటీవల ఉప్పోళ్ల రమేష్ సంపాదకత్వంలో 'కువ్వ' అన్న కవితా సంకలనం వెలువడింది. అన్ని వర్గాల కవుల కలాల కదలికలతో వెలువడిన కవితా కదంబమది. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశిస్తూ వెలువరించిన 'కువ్వ' కవితా సంపుటిలోని కవిత్వాన్ని ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:00 - June 5, 2016

హైదరాబాద్ : సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పీర్‌లెస్‌ యూనియన్‌ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి ఎస్ వికె వరకూ యూనియన్‌ సభ్యులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ తర్వాత మాజీ ఎంపీ బాసుదేవా ఆచార్య, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, ఇన్సూరెన్స్ యూనియన్‌ జాతీయ నేత వేణుగోపాల్‌ సంఘం జెండాను ఆవిష్కరించారు.. అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి 350మంది ప్రతినిధులు హాజరయ్యారు.

 

12:58 - June 5, 2016

ఒకనాడు సాహిత్యం కొంతమందికే పరిమితమై ఉండేది. నేడు అన్ని వర్గాల ప్రజలనుండి సృజనకారులు పుట్టుకొచ్చారు. తమ అస్తిత్వ మూలాలను అన్వేషిస్తూ సాహిత్యం సృష్టిస్తున్నారు. సామాజిక న్యాయం కోసం నిలదీస్తున్నారు. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ప్రజాచైతన్య బావుటాలను ఎగరేస్తున్నారు. అలాంటి వారిలో జనం పాటలతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. పాట ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మానవవికాస చారిత్రక పరిణామ క్రమంలో శ్రమనుండి పాట పుట్టిందంటారు. అలాంటి పాటలతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు తెలంగాణా గేయరచయితలు. అలాంటి వారిలో నల్గొండకు చెందిన నీల నరసింహ ఒకరు. ఈయన గురించి పూర్తి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

పీర్ లెస్ ఎంప్లాయిస్ యూనియన్ జాతీయ మహాసభలు..

హైదరాబాద్ : ఎస్వీకేలో సిఐటీయూ ఆధ్వర్యంలో పీర్ లెస్ ఎంప్లాయిస్ యూనియన్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలను మాజీ ఎంపీ బాసుదేవా ఆచార్య ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర్, ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ జాతీయ నేత వేణుగోపాల్ లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుండి 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

నకిలీ పాస్ పోర్టుల తయారీ దారుల అరెస్టు..

కరీంనగర్ : నకిలీ పాస్ట్ పోర్టులు తయారు చేస్తున్న సత్తార్, కమ్రుద్దిన్ లను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పాస్ పోర్టులతో పాటు, కంప్యూటర్, స్కానర్ లను స్వాధీనం చేసుకున్నారు. 

ద్వారకా తిరుమలలో కాపుల సమావేశం..

పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకా తిరుమలలో జిల్లా కాపులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ, ఇతర కాపు నాయకులు పాల్గొన్నారు.

మద్యానికి బానిసలు కావొద్దు - బాబు..

విజయవాడ : మద్యానికి బానిసలు కావొద్దని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆనందం కోసం ఫారెన్ లో పెగ్గు తీసుకుంటే ఇక్కడ ఫుల్ తీసుకుంటారని బాబు చమత్కరించారు.

 

కృష్ణా బోర్డు నిర్ణయాన్ని ఖండించిన మంత్రి తుమ్మల..

హైదరాబాద్ : సోమశిల ప్రాజెక్టును కృష్ణా నది పరిధిలోకి తేవాలన్న కృష్ణా బోర్డు నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. కృష్ణా బోర్డు నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు, అధికారం లేని అంశాల్లో బోర్డు జోక్యం చేసుకొంటోందన్నారు. కృష్ణా బోర్డు ఏకపక్ష నిర్ణయాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలో నదీ జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 

12:38 - June 5, 2016

అనంతపురం : మరోసారి వైసీపీ అధినేత జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'చెప్పులతో కొట్టాలంటే టీడీపీ నేతలు ఫీలవుతున్నారని... ఈసారి చంద్రబాబు వస్తే చీపుర్లు చూపించండి' అని అన్నారు. అనంతపురం జిల్లా ఓడీసీలో జగన్ నిర్వహిస్తున్న రైతు భరోసాయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నలుగురికి గాయాలయ్యాయి. అంతకముందు కదిరిలో రోడ్‌షోగా వెళ్తున్న జగన్‌ కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంటివద్ద ఈ ఘటన జరిగింది. మరోవైపు తమ కార్యకర్తలపై టీడీపీ దాడులకు నిరసనగా.. అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు వైసీపీ సభ్యులు ధర్నాకు సిద్ధమవుతున్నాయి. ఈ ఆందోళనలో జగన్ కూడా పాల్గోనున్నారు. 

 

12:26 - June 5, 2016

ఆకలి వేయడం లేదు..దాహం తీరడం లేదు..ప్రతి క్షణం లాగేస్తున్న నరాలు..పిచ్చి లేస్తోంది..ఎండకు ఎండుతోంది..వానకు తడుస్తోంది..

ఆడుకుంటూ అల్లరి చేయాల్సిన బాలికకు సంకెళ్లు పడ్డాయి. ఇనుప సంకెళ్లతో బంధిని చేశారు. ఇది చేసింది ఎవరో కాదు..కన్నవారే. పైశాచికమా అంటే అది కాదు. వారి పరిస్థితి అది. అలా ఆ చిన్నారిని సంకెళ్లతో బంధించకుండా ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అందుకే అలా చేశారు. పొద్దునే కూలీ పనులు చేసుకుని వస్తే గాని ముద్ద దిగని ఆ కుటుంబంలో ఒక్క ఆడపిల్ల పరిస్థితి ఇది. ఆ అమ్మాయికి వ్యాధి లేదు..మాయరోగం రాలేదు..కానీ బంధించక తప్పదు. పెద్దలు చేసే తప్పులకు ఎలాంటి దారుణాలకు..ఘోరాలకు దారి తీస్తాయో ఈ చిన్నారే ఉదహారణ. అసలు ఇలా ఎందుకు బంధించారు ? వాస్తవం ఏంటీ ? అనేది తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి..

ఖతర్ లో మోడీ..

ఖతర్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఖతర్ లో పర్యటిస్తున్నారు. దోహాలో బిజినెస్ ప్రముఖలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారినుద్ధేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నారు. 

ఎంపీటీసీ సభ్యురాలి భర్త దారుణ హత్య..

నెల్లూరు : కలిగిరి (మం) రాజుపాలెంలో ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి భర్త కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి కత్తితో కృష్ణారెడ్డిని హత్య చేశాడు. అనంతరం నిందితుడు పీఎస్ లో లొంగిపాయాడు. ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. 

11:51 - June 5, 2016

భిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్‌ 'కుమారి 21ఎఫ్‌'చిత్రంతో నిర్మాతగా మారిన విషయం విదితమే. తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా అందరి ప్రశంసలందుకున్న సుకుమార్‌ 'దర్శకుడు' అనే టైటిల్‌తో మరో చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. హర్‌ లవ్‌.. హిజ్‌ ప్యాషన్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా నూతన నటుడు అశోక్‌ని హీరోగా, హరి ప్రసాద్‌ జక్కాని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై సుకుమార్‌ సమర్పణలో బీఎన్‌సీఎస్‌పీ విజరుకుమార్‌, ధామాస్‌ ఆదూరి, సత్తి నదీర్‌ రవిచంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయకలుగా ఇషా, పూజితలు నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'ఇదొక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఈ నెల 9 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. నేటి యువ తరం మెచ్చే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్ర కథ, కథనాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి' అని చెప్పారు. బ్రహ్మాజీ, ధన్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం :సా యికార్తీక్‌, ఫొటోగ్రఫీ : ప్రవీణ్‌ వనమాలి, ఎడిటింగ్‌ : నవీన్‌ మాలి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : రమేష్‌ కోలా, లైన్‌ ప్రొడ్యూసర్‌ : వీఈవీకేడీఎస్‌ ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం : హరిప్రసాద్‌ జక్కా.

 

11:45 - June 5, 2016

ఢిల్లీ : వేందాతాలు వళ్లిస్తామని ఆశ్రమం ముసుగులో బాబాలు చేసే ఆకృత్యాలు ఇన్ని అన్ని కావు. కొందరు ఆధ్మాత్మికత పేరిట ఆస్తులు కూడబెడుతుంటే... మరికొందరు రాసలీలల్లో మునుగుతూ జల్సాలు చేస్తున్నారు. తమ సామ్రాజ్యానికి ఎవరైనా అడ్డొస్తే అడ్డు తొలగించడానికి కూడా వీరు వెనకాడరు. అడ్డగోలుగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. అవి ఆధ్మాత్మిక ఆశ్రమాలా...? లేక ఆయుధాలకు నిలయాలా?
లైంగికదాడి కేసులో ఆశారామ్‌ బాపూజీ అరెస్ట్
ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్న ఆశారామ్‌జీ బాపూ ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతని అనుచరులు సాధారణంగా ఇతనిని "బాపూజీ" అని పిలుస్తారు. భక్తులకు సత్సంగ్, యోగ, వేదాంతం, భక్తి, ముక్తి వంటి విషయాల గురించి బోధించే ఈ వృద్ధ బాపూజీ కామ కోరికలకు అతీతుడు కాదు. ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ఇపుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. 2013లో అరెస్ట్‌ అయిన ఆశారాం ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఆశారాం కామ‌కోరిక‌ల‌కు ఎంతోమంది మహిళలు బ‌లైయ్యార‌న్న ఆరోపణలున్నాయి.
ఆశారాం బెయిలు ప్రయత్నాలు విఫలం 
లైంగికదాడి కేసులో ఆశారాం బాపు బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆశారాంకు వ్యతిరేకంగా చెప్పే సాక్షుల‌ను గుర్తు తెలియ‌ని వ్యక్తులు కాల్పులు జ‌రుపుతూ వ‌స్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలక సాక్షిగా ఉన్న కిపాల్ సింగ్ తో స‌హా స‌మారుగా 9 మంది పై కాల్పులు జ‌రిపారు. ఇందులో ఏడుగురు మ‌ర‌ణించగా మ‌రో ఇద్దరు తీవ్ర గాయ‌ల‌పాల‌య్యారు. 
ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు 
ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లోనూ భూకబ్జా కేసు నమోదైంది. 2008లో గుజరాత్‌లో ఆశారామ్‌కు చెందిన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.
ఆశారం ఆస్తులు.. రూ.10 వేల కోట్లు 
ఆశారం ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. 2014లో పోలీసులు ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా దాదాపు 10 వేల కోట్ల ఆస్తులున్నాయని తేలింది. దేశ వ్యాప్తంగా ఆయనకున్న భూముల విలువను ఇందులో లెక్కించలేదు. ఆశారాం వ్యక్తిగత ఆస్తుల విలువ 350 కోట్లు ఉంటాయని అంచనా. దేశంలోనే ఆధ్యాత్మిక గురువుల్లో ప్రముఖుడిగా పేరున్న ఈ స్వామి.. ఆధ్యాత్మికం ముసుగులో చేసిన అరాచకాలివి.
సామాన్య కుటుంబంలో పుట్టిన ఆశారాం 
హర్యానాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి బాబాగా అవతారమెత్తాడు రాంపాల్‌. తనను తాను కబీర్ ప్రవక్తగా ప్రకటించుకున్న రాంపాల్‌కు హిస్సార్‌లో 12 ఎకరాల్లో సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బాబా కూడా ఆధ్మాత్మిక ముసుగులో ఆశ్రమంలో రాసలీలలు కొనసాగించాడు. లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని తన ప్రైవేట్ సైన్యం చేత అడ్డగించి బీభత్సం సృష్టించాడు. పోలీసులకు, బాబా రాంపాల్ మద్దతుదారులకు జరిగిన పోరులో ఆరుగురు మరణించారు. ప్రజలను మోసగించడం, ప్రైవేటు సైన్యాన్ని నిర్వహించడం లాంటి ఆరోపణలతో రాంపాల్‌ను అరెస్ట్‌ చేసి దేశద్రోహం కేసు నమోదు చేశారు.
ఆశ్రమంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి 
రాంపాల్‌ వలయాన్ని చేధించుకుని కోటలోకి అడుగుపెట్టిన పోలీసులకు స్వామి వారి వైభోగం చూసి కళ్లు బైర్లుకమ్మాయి. ఆశ్రమంలో సిట్ జరిపిన సోదాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడింది. వాటితో పాటు పెట్రోల్ బాంబులు, యాసిడ్ సిరంజీలు, చిల్లీ గ్రెనేడ్‌లు కుప్పలుగా కనిపించాయి. ఆశ్రమంలో మూడు 32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్ గన్లు, 4 రైఫిళ్లు, వివిధ తుపాకులకు వినియోగించే 100కు పైగా క్యాట్రిడ్జ్ లు లభించాయి. 
ఆశ్రమం అంతటా సీసీ కెమెరాలు 
ఆశ్రమం చుట్టూ 50 అడుగుల ఎత్తై ప్రహారీ గోడ, ఆ ప్రహారీ మధ్యలో అక్కడక్కడా వాచ్ టవర్లు, మెటల్ డిటెక్టర్లు, ఆశ్రమం అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆశ్రమంలో భారీ స్విమింగ్‌పూల్, 24 ఏసీ గదులు, అందులో స్వామీజీ కోసం ప్రత్యేకంగా మసాజ్ రూం కూడా ఉంది. 50 వేల మంది కూర్చోగల ప్రార్థనామందిరంలో ప్రవచనాలు ఇచ్చేందుకు స్వామీజీ కోసం ప్రత్యేకంగా హైడ్రాలిక్ కుర్చీ, దాని చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ లాంటివి ఉన్నాయి. బాబా రాంపాల్‌కు వంద కోట్లకు పైగా ఆస్తులున్నట్లు అంచనా.

 

11:38 - June 5, 2016

అంచనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు 'ఆకాష్ తోసర్', 'రింకూ రాజ్గురు' హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా 'సైరత్'. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం 4 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ 'సైరత్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆ సినిమా బడ్జెట్ కేవలం నాలుగు కోట్లు మాత్రమే. చాలా చిన్న సినిమాగా తెరకెక్కింది. కానీ భారీ భారీ సినిమాల్ని కూడా పక్కకు పెట్టేసి రేస్ లో వందకోట్ల క్లబ్ కు పరుగులు తీస్తోంది. ఎప్పుడో గానీ జరగని ఇలాంటి రేర్ ఫీట్ ను సాధించిన ఆ మరాఠీ సినిమా పేరు సైరత్. ఆకాష్ తోనర్, రింకూ రాజ్ గురు అనే కొత్త హీరో హీరోయిన్లను పెట్టి నాగరాజ్ మంజులే దర్శక నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఏదో ఫర్లేదనిపించుకుంటుంది అని అందరూ అనుకుంటే, వారి అంచనాల్ని మించిపోయి సంచలనాత్మక విజయాన్ని సాధించేసింది 'సైరత్'. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నెల రోజుల్లో 75 కోట్లు వసూలు చేసింది. అక్కడ ఇంకా 350కు పైగా థియేటర్లలో ఇంకా రన్ అవుతుండటంతో, వందకోట్ల క్లబ్బులో చేరిపోవడం కన్ఫామ్ అంటున్నారు. సినిమా సరిగ్గా తీస్తే, బడ్జెట్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ అవుతుందన్న విషయాన్ని ప్రూవ్ చేసింది సైరత్ మూవీ. మనోళ్లు కూడా ఓ ఎగబడి బడ్జెట్ పెట్టేయకుండా లిమిట్ లో మంచి కథను నమ్మి సినిమా తీస్తే, ఇండస్ట్రీకి లాభాల బాట పట్టడమే కాక, మంచి సినిమాలు కూడా వస్తాయి..కాదంటారా..?

11:29 - June 5, 2016

దేవాలయాల్లో ఎలాంటి ప్రసాదాలు ఉంటాయి ? అని అడిగితే పులిహోరా..దద్ధోజనం..తదితర ఆహార పదార్థాలుంటాయి అని చెబుతారు కదా. కానీ దోశ..చాకెట్లు..నూడుల్స్ ప్రసాదాలు కూడా ఉంటాయంటే నమ్ముతారా ? కానీ ఇది నిజం. పలు దేవాలయాల్లో ఇలాంటి రకాల ప్రసాదాలు పెడుతున్నారు. ఆ దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే ఆశ్చర్య పోక తప్పదు. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది చదవండి..
రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయంలో ఎలుకలు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు.
తమిళనాడులోని అలగర్ కోవిల్ దేవాలయంలో మహా విష్ణువుని దర్శనం చేసుకున్న అనంతరం 'దోశ'లను ప్రసాదంగా ఇస్తారు.
గౌహతిలోని కమఖాయ దేవాలయంలో అమ్మవారి 'తడిగుడ్డ'ను ప్రసాదంగా అందిస్తారు.
కేరళలో త్రిశూర్ మహదేవ టెంపుల్ లో ఆలయానికి సంబంధించిన సీడీ డీవీడీలు, పుస్తకాలను ప్రసాదంగా ఇస్తారు.
కేరళలో సుబ్రమణ్య దేవాలయంలో దేవుడిని చాక్లెట్లతో పూజిస్తారు. పూజ అనంతరం చాక్లెట్లను ప్రసాదంగా ఇస్తారు.
కోల్ కతా చైనీస్ కాళీ ఆలయంలో నూడుల్స్, ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ప్రసాదంగా ఇస్తారు.
మధ్యప్రదేశ్ భైరవ ఆలయంలో భైరవుడికి మద్యంతో పూజలు చేస్తారు. అనంతరం మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. 

11:28 - June 5, 2016

హైదరాబాద్ : నగర రాదారులు.. కుర్రాళ్ల బైక్‌ రేసింగ్‌లు.. ర్యాష్‌ డ్రైవింగ్‌లతో రక్తసిక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఆకతాయి బైక్‌ సరదా.. వృద్ధుడి ప్రాణాలు తీసింది.. అతనిపైనే ఆధారపడ్డ కుటుంబంలో చీకట్లు నింపింది. ఓ వైపు బైక్ రేసింగ్‌లు.. మరోవైపు కుర్రాళ్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లు సగటు హైదరాబాదీని హడలెత్తిస్తున్నాయి. కుర్రాళ్లు ఇష్టారాజ్యంగా హైస్పీడు బైకులపై దూసుకు వెళుతున్న తీరు.. నగర వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. రహదారి నిబంధనలు పాటించని యువకుల దూకుడు.. అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. హైదరాబాద్‌ నారాయణగూడలో జరిగిన దారుణం ఇలాంటిదే. 
నారాయణగూడ ఫ్లైఓవర్‌పై దారుణం..
మలక్‌పేట ముసారాంబాగ్‌కు చెందిన మహ్మద్‌ వాజీద్‌ అహ్మద్‌.. గురువారం తన ప్రేయసితో కలిసి బైక్‌పై షికారుకు బయల్దేరాడు. నారాయణగూడ ఫ్లైఓవర్‌ మీద.. దోమల్‌గూడకు చెందిన వినోద్‌కుమార్‌ కేజర్‌వాల్‌ బైక్‌ తనకు అడ్డుగా ఉందని.. వాజిద్‌ ఆ బైకును కాలితో తన్నాడు. దీంతో వినోద్‌ బైక్‌తో సహా కిందపడిపోయాడు. తల డివైడర్‌కు బలంగా తగలడంతో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో వాజిద్‌ బైకూ కిందకు ఒరిగి.. అతడి ప్రేయసి కిందపడిపోయింది. హఠాత్పరిణామంతో హడలెత్తిన వాజిద్‌.. ప్రేయసినీ అక్కడే వదిలేసి పారిపోయాడు. నారాయణగూడ పోలీసులు వృద్ధుడు వినోద్‌తో పాటు.. వాజిద్‌ ప్రేయసినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వినోద్‌ పరిస్థితి విషమించడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడాయన ప్రాణాలు కోల్పోయాడు. 
నిందితుడు వాజీద్‌ అరెస్ట్ 
సీన్‌ ఆఫ్‌ అఫెన్స్ ను బట్టి మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత గాంధీలో చికిత్స పొందుతున్న వాజీద్‌ ప్రియురాలిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. యువతి సమాచారంతో నిందితుడు వాజీద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిపై 304 పార్ట్ 2 ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.  
స్థానికంగా ఆందోళన 
హైదరాబాద్‌లో పెరుగుతున్న కుర్రాళ్ల ర్యాష్‌ డ్రైవింగ్‌పై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. స్పీడ్‌ బైకులపై యువత దూకుడును నియంత్రించి.. ఆకతాయిల పనిపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. 

 

11:25 - June 5, 2016

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాపాలు ఎక్కవై పోతున్నాయని వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో మార్కులు అదనంగా రావాలంటే రక్తదానం చేయాలన్న కాలేజ్...సైబర్ నగరంలో దోశల బండ్లను సర్కార్ నిషేధం విధిస్తుందంట..ఇటీవలే యమునా నది ప్రాంతంలో ఓ కార్యక్రమం నిర్వహించిన శ్రీశ్రీ రవిశంకర్ విధించిన రూ. 5 కోట్ల జరిమాను ఇంకా కట్టలేదంట..ముంబైలో ఓ కమెడియన్ చేసిన నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ అంశాలపై విశ్లేషణ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

11:19 - June 5, 2016

రాజస్తాన్ లోని ఓ కాలేజీ చేసిన ఆలోచనలపై పలు విమర్శలు ఎక్కువవుతున్నాయి. రక్తదానం చేసే వారికి మార్కులు అదనంగా వేస్తామని కాలేజీ నిర్వాహకులు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ లో ఓ కాలేజీ నిర్వాహకుడు సైతం ఇలాగే వ్యవహరించారు. ప్రాక్టిస్ మార్కులు వేయాలంటే రక్త దానం చేయాలని పేర్కొన్నాడంట. ఇలా వచ్చిన రక్తాన్ని ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు అమ్ముకున్నాడంట. ఇలా చేయడం మంచిది కాదని..మార్కులు అధికంగా రావడం కోసం..రక్తదానం ప్రోత్సాహించాలంటే ఇతర మార్గాలను అనుసరించాలని పలువురు సూచిస్తున్నారు. 

11:19 - June 5, 2016

శ్రీకాకుళం : అన్నదాతను ఆదుకుంటాం.. రైతే రాజు, రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న.. టీడీపీ ప్రభుత్వం తీరు.. ఏరు దాటాక తెప్పతగలేసినట్లుంది. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ అంటూ ఎన్నికల ముందు డంకా బజాయించిన టీడీపీ నేతలు.. అధికారం లోకి వచ్చాక మాట మార్చుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇంకా రుణమాఫీ చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు హామీలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. 
చంద్రబాబు పాలనకు రెండేళ్లు 
ఏపీలో చంద్రబాబు పాలనకు రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఎన్నికలకు ముందు రైతుల రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై తటపటాయిస్తున్నారు. రెండైళ్లైనా రుణమాఫీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో... రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీపై చంద్రబాబు  సర్కార్‌ మీనమేషాలు లెక్కిస్తోందని శ్రీకాకుళం జిల్లా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
2 లక్షల 83 వేల మందికే  వర్తించేలా నిబంధనలు 
శ్రీకాకుళం జిల్లాలో రైతు రుణాల కింద 5 లక్షల 60 వేల మంది లబ్ధిదారులుండగా.. రుణమాఫీని కేవలం 2 లక్షల 83 వేల మందికే వర్తించేలా చేశారు. 50 వేల లోపున్న రైతు రుణాల కింద దాదాపు 1500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా..కేవలం 378 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఇక డ్వాక్రా రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాల మాఫీ విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా.. ఇప్పటివరకు  ఆ రుణాలపై క్లారిటీ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. రైతుల అప్పులతో పాటు సంఖ్యను కుదించి పొంతనలేని కారణాలతో ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 
అటకెక్కిన రైతుల రుణమాఫీ అమలు 
శ్రీకాకుళం జిల్లాలో 50 వేల రూపాయల రుణ గ్రహీతలకు తొలి విడతలో 2 లక్షల 46 వేలమందికి 278 కోట్లు, రెండో విడతలో లక్షపై బడిన 37 వేల 633 మంది రైతులకు 99 కోట్లు, తర్వాత విడతల్లో లక్షా 50 వేల రూపాయలు పైబడిన రైతులకు రుణమాఫీ అమలును మాత్రం అటకెక్కించారు. ఉద్యానవన పంటల రుణమాఫీ కింద జిల్లా వ్యాప్తంగా 1500 మంది రైతులకు ఇంతవరకూ అసలు చెల్లింపులే జరగలేదు. తమకు నయాపైసా కూడా రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. పేపర్లు, ప్రకటనలకే రుణమాఫీ పరిమితమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 
నిబంధనల పేరుతో సగానికి సగం కోత
రుణ విముక్తి చేస్తామన్న చంద్రబాబు హామీలు గాల్లో కలిశాయని, వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3లక్షల 54 వేల మంది రైతులకు దాదాపు 840 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. నిబంధనల పేరుతో సగానికి సగం కోత పెట్టిందని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు.  ఇకనైనా రైతు పూర్తి స్థాయిలో రైతు రుణాలను మాఫీ చేసి.. రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా రైతులు కోరుతున్నారు. 

 

కాటేదాన్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

11:08 - June 5, 2016

అనంతపురం : జిల్లాలో వైసీపీ అధినేత జగన్ భరోసాయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇవాళ కదిరిలో రోడ్‌షోగా వెళ్తున్న జగన్‌ కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంటివద్ద ఈ ఘటన జరిగింది. మరోవైపు తమ కార్యకర్తలపై టీడీపీ దాడులకు నిరసనగా.. అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు వైసీపీ సభ్యులు ధర్నాకు సిద్ధమవుతున్నాయి. ఈ ఆందోళనలో జగన్ కూడా పాల్గోనున్నారు. 

 

10:56 - June 5, 2016

హైదరాబాద్ : రుతుపవనాలు, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో కోస్తా, తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగితా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

స్తంభించిన హర్యానా..

హర్యానా : గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, తమ కోటాను పెంచాలని డిమాండ్ చేస్తూ, నేటి నుంచి 15 రోజుల పాటు జాట్ సంఘాలు పిలుపు ఇవ్వడంతో హర్యానా స్తంభించిపోయింది. ముఖ్యంగా జాట్ల సంఖ్య అధికంగా ఉన్న రోహ్ తక్, సోనిపట్, ఖైతాల్ తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జాట్ల అల్లర్ల కారణంగా 30 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.

10:49 - June 5, 2016

అమెరికా : ప్రపంచ బాక్సింగ్ మేరునగధీరుడు, 20వ శతాబ్దపు ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ సూపర్ మ్యాన్ మహ్మద్ అలీ అమెరికాలోని ఆరిజోనా ఆస్పత్రిలో కన్నుమూశారు. కళాత్మక బాక్సర్ గా ఎందరో ప్రముఖ యోధులతో పోరాడిన అలీ..గత మూడు దశాబ్దాలుగా పార్కిన్ సన్స్ వ్యాధితో పోరాడుతూ వచ్చారు. 74 ఏళ్ల వయసులో శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు. బాక్సింగ్ కే కళాత్మకత తీసుకువచ్చిన మహ్మద్ అలీపై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్....
బాక్సింగ్ అభిమానులు పులకించిపోతారు... 
మహ్మద్ అలీ...ఈ పేరు వినగానే బాక్సింగ్ అభిమానులు పులకించిపోతారు. ముష్టిఘాతాలతో రక్తం చిందించే కిరాతక క్రీడగా పేరుపొందిన బాక్సింగ్ కే కళాత్మకత తీసుకొచ్చిన కాషియస్ క్లే జూనియర్ అలియాస్ మహ్మద్ అలీ..శ్వాసకోస సంబంధ సమస్యలతో పోరాడుతూ అమెరికాలోని ఆరిజోనా ఆస్పత్రిలో కన్ను మూశారు.
అమెరికాలో జననం 
అమెరికాలోని కెంటకీలోని లూయి విల్లీ లో 1942 జనవరి 17 జన్మించిన కాషియస్ మార్సెలస్ క్లే జూనియర్..ఆరుఅడుగుల మూడు అంగుళాల అజానుబాహుడు. కేవలం బాక్సింగ్ కోసమే పుట్టిన మొనగాడు. తొలిరోజుల్లో అమెచ్యూర్ బాక్సర్ గా గుర్తింపు తెచ్చుకొన్న నాటి కాషియస్ క్లే, నేటి మహ్మద్ అలీకి..కళాత్మక బాక్సర్ గా గుర్తింపు ఉంది.ఫుట్ వర్క్, పంచ్ లతో కూడిన కళాత్మక శైలికి మరోపేరు అలీ. ప్రత్యర్థి ముక్కూమొకం ఎకమయ్యేలా..పిడిగుద్దులు, ముష్టిఘాతాలతో దాడిచేస్తూ రక్తం చిందించే కిరాతక క్రీడ బాక్సింగ్ సైతం ఓ అందమైన కళ అని..మహ్మద్ అలీ పోరాడే విధానం చూస్తేనే తెలిసిపోతుంది.
అమెచ్యూర్ బాక్సర్ గా బరిలోకి 
1960 రోమ్ ఒలింపిక్స్ లో అమెచ్యూర్ బాక్సర్ గా బరిలోకి దిగిన మహ్మద్ అలీ..తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ బాక్సర్ గా మారి...హెవీవెయిట్ విభాగంలో తనకు తానేసాటిగా నిలిచాడు. 1964లో ఇస్లాం మతం స్వీకరించడంతో..అప్పటి వరకూ కాషియస్ క్లే జూనియర్ గా ఉన్న పేరును మహ్మద్ అలీగా మార్చుకొన్నాడు.
1960 నుంచి 1981 వరకూ మహ్మద్ అలీ హవా
1960 నుంచి 1981 వరకూ మహ్మద్ అలీ హవా కొనసాగింది. జార్జి ఫోర్ మాన్, జో ఫ్రెజర్ లాంటి అలనాటి బాక్సింగ్ గ్రేట్లు...మహ్మద్ అలీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉండేవారు. మూడుదశాబ్దాల తన బాక్సింగ్ కెరియర్ లో మహ్మద్ అలీ మొత్తం 61 ఫైట్లలో పాల్గొంటే..56 విజయాలు, 5 పరాజయాల రికార్డు ఉంది.అంతేకాదు..మహ్మద్ అలీ విజయాలలో 37 నాకౌట్ విజయాలు ఉన్నాయంటే..ఈ సూపర్ బాక్సర్ పంచ్ పవర్ ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు. 1974 లో ప్రధాన ప్రత్యర్థి జార్జి ఫోర్ మాన్ తో మహ్మద్ అలీ పోరాడిన ఫైట్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. అంతేకాదు.. 1971లో మహ్మద్ అలీ, జో ఫ్రేజర్ ల సమరానికి ..ఫైట్ ఆఫ్ ది సెంచరీగా కూడా విశేష ప్రచారం లభించింది. వియత్నాం యుద్ధంలో అమెరికా తరపున పోరాడటానికి నిరాకరించిన మహ్మద్ అలీ..ఆ తర్వాతికాలంలో పౌరహక్కుల కోసం తన గళం విప్పాడు.
అరుదైన పురస్కారాలందుకున్న అలీ
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతో పాటు ఎన్నో అరుదైన పురస్కారాలు అందుకొన్నాడు. అమెరికా ఆతిథ్యంలో జరిగిన 1996 అట్లాంటా ఒలింపిక్స్ జ్యోతిని ప్రజ్వలింప చేసిన ఘనత అలీకే దక్కుతుంది. 1998లో ఐక్యరాజ్యసమితి శాంతిదూత పురస్కారం, 2005లో అమెరికా అత్యున్నత పౌరపురస్కారం అందుకొన్నాడు.
చికిత్స పొందుతూ మృతి 
మూడుదశాబ్దాలపాటు ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్ గా ఒక వెలుగు వెలిగిన మహ్మద్ అలీ...రిటైర్మెంట్ తర్వాత పార్కిన్ సన్స్ వ్యాధిబారిన పడ్డారు. గత మూడుదశాబ్దాలుగా పార్కిన్ సన్స్ వ్యాధితో పోరాడుతూ వచ్చిన మహ్మద్ అలీ..వయసు మీరడంతోనూ పలు రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. 74 ఏళ్ల వయసులో శ్వాసతీసుకోడం కష్టంగా మారడంతో ఆరిజోనాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అలీ బాక్సింగ్ వారసులుగా కుమార్తె లైలీ అలీ
మహ్మద్ అలీ బాక్సింగ్ వారసులుగా ఆయన కుమార్తె లైలీ అలీ కొనసాగుతోంది. మహ్మద్ అలీ మృతితో...ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఓ అపురూప బాక్సర్ అస్తమించినట్లయ్యింది. మహ్మద్ అలీ భౌతికంగా లేకపోయినా...ఆయన వ్యక్తిత్వం, బాక్సర్ గా నైపుణ్యం, రింగ్ లో కింగ్ గా వెలిగిన క్షణాలు..బాక్సింగ్ అభిమానులకు, బాక్సర్లకు నిత్యస్ఫూర్తిగా మిగిలిపోతాయి.

 

తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించిన మంత్రి నారాయణ..

గుంటూరు : అమరావతి రాజధానిలోని తాత్కాలిక సచివాలయాన్ని మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ..వర్షాలతో పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఎట్టిపరిస్థితుల్లో నెలాఖరు కల్లా భవనాలను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు నిర్మాణాలు పూర్తి కాలేదని అనడం సరైంది కాదని, ఉద్యోగులకు సంబంధించి రూట్ మ్యాప్ ను రెండు, మూడు రోజుల్లో తెలియచేస్తామన్నారు. అమరావతి నుండి పాలన సాగితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.

మాంఝీని నిలిపివేసిన పోలీసులు..

బీహార్ : మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీని డుమరియా ప్రాంతంలో నిలిపివేశారు. భద్రతా కారణాల రీత్యా ఆపివేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హత్యకు గురైన ఎల్జీపీ నేత సుదేశ్ పాశ్వాన్ కుటుంబసభ్యులను మాంఝీ పరామర్శించనున్నారు. 

10:38 - June 5, 2016

ఈ వార్త వినగానే ఆశ్చర్యపోతున్నారు కదా..కానీ ఇది నిజం. కెన్యాలోని ఓ నగర పాలక వర్గం గాడిదలకు ఈ ఆదేశాలు జారీ చేసిందండి. అసలు విషయం తెలియాలంటే ఇది చదండి. కెన్యా...వాజిర్ నగరం..ఇక్కడి ప్రజలు ఎక్కువగా రవాణా, వ్యాపారం కోసంం గాడిదలను ఉపయోగిస్తుంటారు. ఇటీవలే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తళతళ మెరిసే రోడ్లు వేశారు. ప్రస్తుతం ఈ గాడిదలతో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయంట. ఎక్కడ పడితే అక్కడ మల..మూత్ర విసర్జన చేస్తుండడంతో ఆ రోడ్లన్నీ దరిద్రంగా మారిపోతున్నాయంట. నడవానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని...ఈ విషయం అక్కడి నగర పాలక సంస్థకి చేరింది. ఈ సమస్యను నిరోధించడానికి 'డైపర్స్' ఒక్కటే పరిష్కారమని ఆ సంస్థ ఆలోచించింది. తప్పనిసరిగా 'డైపర్స్' వేయాలని వాటి యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే మాత్రం ఎంట్రీ ఇవ్వడానికి అనుమతినిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అది సంగతి...

10:31 - June 5, 2016

కృష్ణా : విజయవాడలో ఇళ్ల అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో అద్దెలు 50 శాతం దాకా పెరిగాయి. ఇప్పుడు రాజధాని పరిపాలన కేంద్రంగా కూడా విజయవాడ మారడంతో.. అద్దెలు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాయి. విజయవాడలో ఇళ్ల అద్దెలు ఆకాశానికి అంటుతున్నాయి. పరిపాలనకు విజయవాడ కేంద్రంగా మారడంతో.. అత్యధికులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. తాత్కాలిక సచివాలయానికి తరలిరాక తప్పదని ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులూ బెజవాడకే వస్తున్నారు. చిరు వ్యాపారాల ద్వారా బతుకుతెరువు వెతుక్కునేందుకూ చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఒకేసారి వేల సంఖ్యలో ప్రజలు బెజవాడ తరలి వస్తుండడంతో.. అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఇళ్ల యజమానులు.. అద్దెలను భారీగా పెంచేశారు. 
వాణిజ్య భవనాల అద్దెలూ పెరిగాయి... 
విజయవాడలో గృహాలే కాదు..  వాణిజ్య భవనాల అద్దెలూ చుక్కల్ని తాకుతున్నాయి. ప్రభుత్వం అద్దెలను పెంచవద్దంటూ పిలుపునిస్తున్నా.. ఇళ్ల యజమానులు మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుంటే.. రెంట్‌ కంట్రోల్‌ యాక్ట్‌ ప్రయోగిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రే పదేపదే హెచ్చరిస్తున్నా.. పరిస్థితిలో ఏ మార్పూ రావడం లేదు. 
వందల సంఖ్యలో కనిపిస్తున్న టూలెడ్ బోర్డులు
యజమానులు కొన్ని నెలలపాటు ఇళ్లు ఖాళీగా ఉంచుకోవడానికైనా ఇష్టపడుతున్నారు గానీ అద్దెలు మాత్రం తగ్గించడంలేదు. నగరంలో టూ లెట్  బోర్డులు వేలాడుతున్న ఇళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. నగరంలో డబుల్ బెడ్ రూం అద్దెకు కావాలంటే 8 వేల నుంచి 12 వేల రూపాయల వరకు చెల్లించాల్సిందే. కొన్ని ఇళ్లైతే 16 వేల వరకు చెబుతున్నారు. పటమట, టీచర్స్ కాలనీ, పీ అండ్ టీ కాలనీ, కరెన్సీ నగర్, భారతీనగర్, గాయత్రీనగర్, వెటర్నరీ కాలనీ వంటివి ఖరీదైన ప్రాంతాలు కావడంతో  2 బిహెచ్ కె పోర్షన్లు 10 నుంచి 12 వేలకు తక్కువ పలకడం లేదు.  త్రిబుల్ బెడ్ రూం  ఇళ్లయితే 16 నుంచి 25 వేల వరకు చెబుతున్నారు. సాధారణ ప్రాంతాల్లోనూ 5 వేలకు తక్కువ అద్దెలున్న ఇళ్లేవీ లేవు.
నగరంపై దృష్ట సారించిన వాణిజ్య సంస్థలు 
రాష్ట్ర విభజనతో అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు విజయవాడ నగరంపై దృష్టిపెట్టాయి. రెండేళ్లలో ప్రఖ్యాత బ్రాండ్ల దుస్తుల షాపులు, రెస్టారెంట్లు వంటివి పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఫలితంగా వాణిజ్య స్థలాలకూ గిరాకీ పెరిగింది. బందరు రోడ్ లో చదరపు అడుగుకి రూ.100 అద్దె వసూలు చేస్తున్నారు. పై అంతస్తులకు వెళ్లేసరికి రూ.70-80 వరకు అద్దె ఉంటోంది. ఏలూరు రోడ్, మొగ్రలాజపురం, గురునానక్ కాలనీ వంటిచోట్ల కూడా చదరపు అడుగుకి రూ.70-80 వరకు అద్దె డిమాండ్ చేస్తున్నారు.  
విభాగాధిపతుల కార్యాలయాలు విజయవాడ, గుంటూరుల్లోనే 
విభాగాధిపతుల కార్యాలయాలు విజయవాడ, గుంటూరుల్లోనే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం, మార్కెటింగ్, పురపాలక శాఖ వంటి కొన్ని విభాగాలు తప్ప మిగతావన్నీ విజయవాడ వైపే మొగ్గు చూపుతున్నాయి. విజయవాడ నగరం, శివారు ప్రాంతాల్లో సుమారు 8 లక్షల చదరపు అడుగుల భవనాల్ని జిల్లా యంత్రాంగం గుర్తించింది. చదరపు అడుగుకి 18-50 రూపాయల వరకు అద్దె డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. 
నగరవాసులు అసంతృప్తి 
ఇళ్ల అద్దెల కోసం భారీ మొత్తాలు చెల్లించేందుకు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తుండడంతో.. అప్పటికే అద్దెకున్న వారిని విడిపించే పనిలో పడ్డారు.. ఇళ్ల యజమానులు. వీరి తీరుపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అద్దెలను నియంత్రించకపోతే మనుగడ కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 

10:24 - June 5, 2016

న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో బెర్త్‌ ఖాయమైంది. జూడోలో భారత క్రీడాకారుడు అవతార్‌ సింగ్‌ (90 కిలోలు) అర్హత సాధించినట్లు భారత జూడో ఫెడరేషన్‌ సంఘం వెల్లడించింది. శనివారం భారత జూడో అధ్యక్షుడు ముఖేష్‌ కుమార్‌ మాట్లాడు తూ... అంతర్జాతీయ జూడో ఫెడరేషన్‌ అవతార్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్టు ప్రకటించిందని పేర్కొన్నాడు. అవతార్‌ సింగ్‌, షిల్లాంగ్‌లో నిర్వహించిన దక్షిణ ఆసియా గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించాడు. అంతే కాకుండా 2013-14 జాతీయ సీనియర్‌ జూడో పోటీల్లో చాంపియన్‌గా నిలిచాడు. అవతార్‌ ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌లో ఆర్మీ జవాన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

10:20 - June 5, 2016

హైదరాబాద్ : పొడవు పెరగాలన్న ఆలోచన ఎవరికైనా వస్తే.. వెంటనే తనను గుర్తు చేసుకోవాలని నిఖిల్‌రెడ్డి కోరుతున్నాడు. తాను చేసిన పొరపాటును మరెవ్వరూ చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. వైద్యులు.. సర్జరీకి ముందో మాట.. తర్వాత మరో మాట చెబుతారని.. తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన గ్లోబల్‌ ఆసుపత్రి యాజమాన్యంపై లీగల్‌గా ప్రొసీడ్‌ అవుతానని చెప్పాడు. 
ముఖం చాటేసిన వైద్యులు
హైట్  పెరగాలనే కోరికే ముంచింది. అన్ని విధాలా చికిత్స చేస్తామన్న వైద్యులు ముఖం చాటేశారు. ఉద్యోగం పోయింది...హైట్ పెరగలేదు.. బాధిస్తున్న విపరీత నొప్పులు..  ఇదీ   హైట్ పెరగాలనే కోరికతో గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్ మనోవేదన. రెండు నెలల్లో నిఖిల్ పూర్తిగా కోలుకునేలా చేస్తామని.. భరోసా ఇచ్చిన డాక్టర్లు.. ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు నిఖిల్ .  2 నెలలు గడుస్తున్నా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అతడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజు నొప్పితో బాధపడుతున్న నిఖిల్ 
శస్త్రచికిత్స చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతీరోజు విపరీతమైన నొప్పితో బాధపడుతున్నానని బాధితుడు నికిల్ చెబుతున్నాడు. ఎన్ని పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకున్నా నొప్పి ఏమాత్రం తగ్గడం లేదని అంటున్నాడు. ప్రతీ మూడు రోజులకు ఒక సారి ఎముక పెరగుతుందని చెప్పిన డాక్టర్ల మాటలు అవాస్తవాలేనని తేలిపోయాయని అంటున్నాడు నిఖిల్ . తనలాంటి ప్రయత్నం మరెవరు చేయకూడదని నిఖిల్‌ వేడుకుంటున్నాడు. 3 రోజులకు ఒక సారి వచ్చి చెక్‌ అప్ చేస్తామన్న డాక్టర్లు వారానికి ఒక్కసారి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. 
డాక్టర్ల స్పందన లేదన్న గోవర్థన్ రెడ్డి
డాక్టర్లు నిఖిల్ రెడ్డి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం స్పందించడం లేదని నికిల్ రెడ్డి తండ్రి గోవర్ఢన్ రెడ్డి మండిపడుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా చికిత్స చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రతీరోజు నొప్పులతో తన కొడుకు పడుతున్న బాధను చూడలేకపోతున్నామని కన్నీరుమున్నీరు అవుతున్నారు. డాక్టర్లపై చట్టపరంగా కేసులు పెడుతామని గోవర్ధన్ రెడ్డి చెబుతున్నారు.
ఆపరేషన్ సఫలమైందంటూ డాక్టర్లు నోట్ విడుదల
మరోవైపు.. నిఖిల్‌రెడ్డికి తాము చేసిన శస్త్రచికిత్స సఫలమైందని గ్లోబల్‌ ఆసుపత్రి ఓ నోట్‌ విడుదల చేసింది. అతడి ఎముకలు రమారమి ఓ అడుగు మేర పెరిగిందని వివరించింది. అయితే.. దీన్ని నిఖిల్‌రెడ్డి కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయకుండా  డాక్లర్ల పైన  గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంపైన లీగల్‌గా ప్రొసీడ్‌ అవుతామని వారంటున్నారు. 

 

పీపుల్స్ ప్లాజా వద్ద పర్యావరణ వాక్..

హైదరాబాద్ : పర్యావరణం దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద వాక్ ను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ..పర్యావరణాన్ని ప్రతొక్కరూ కాపాడాలని, వర్షాలు సమృద్ధిగా పడిన వెంటనే హరితహారం చేపడుతామన్నారు. 107 రకాల మొక్కలను అందుబాటులో ఉంచుతామని, ప్రజలు కోరిన మొక్కలను అందించడం జరుగుతుందన్నారు. 

రైల్వే కోడూరులో ఎర్రచందనం దుంగల స్వాధీనం..

కడప : రైల్వే కోడూరు మండలం బాలేపిల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

10:15 - June 5, 2016

దర్శకుడు ఏ.ఆర్‌.మురుగదాస్‌ సినిమాలు, సినిమాల్లోని పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఆయన చిత్రాల్లో నటించేందుకు అటు తమిళ హీరోలు, ఇటు తెలుగు హీరోలు అమితాసక్తి చూపిస్తుంటారు. 'గజిని', 'స్టాలిన్‌', 'తుపాకి', 'కత్తి' వంటి తదితర చిత్రాలు మురుగదాస్‌ ప్రతిభను చాటే చిత్రాలు. తాజాగా ఆయన దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో మహేష్‌బాబుని ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా మురుగదాస్‌ ప్రజెంట్‌ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా మహేష్‌బాబు బాడీ లాంగ్వేజ్‌, లుక్‌ పరంగా కూడా డిఫరెంట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా నటించనుందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యింది. వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభించుకునే ఈచిత్రాన్ని ఠాగూర్‌మధు, ఎన్‌.వి.ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించనున్నారట. మురుగదాస్‌ ప్రస్తుతం సోనాక్షి సిన్హా కథానాయికగా 'అకిరా' చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

 

కదిరిలో ఉద్రిక్తత..

అనంతపురం : జిల్లా కదిరిలో జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఉదయం ఆయన కదిరిలో పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత వెంకటప్రసాద్ అనుచరులు, ర్యాలీపై చెప్పుల వర్షం కురిపించారు. జగన్ కాన్వాయ్ ని వారు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తగా, పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

09:38 - June 5, 2016

ముంబయి : బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌ జాతీయ క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. నోటిఫికేషన్‌ జారీ చేసిన బీసీసీఐకి సందీప్‌ తన దరఖాస్తును పంపారు. ఇంతకు ముందు కెన్యా, ఓమన్‌ దేశాలకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 2003 ప్రపంచకప్‌లో కెన్యా సెమీస్‌ చేరడంలో సందీప్‌ కీలకపాత్ర పోషించారు. దీంతో 2004లో భారత్‌ కోచ్‌ ఎంపిక షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నాడు. చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్‌ పదవి కాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనున్నది. కోచ్‌ ఎంపికపై బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ నెల 25న ధర్మశాలలో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఒకవైపు 'మాజీ కోచింగ్‌ టీమ్‌' రవిశాస్త్రి బృందం, మరో వైపు చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పోటీ పడుతుండడంతో ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 1980-86 వరకూ ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన సందీప్‌ 1983 ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులో సభ్యుడు.

09:32 - June 5, 2016

నేటి పోటీ ప్రపంచంలో చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కాలంతో పోటీ పడుతున్నారు. ఈ వేగంలో అనునిత్యం మానసిక ఆందోళనలు, ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా జ్ఞాపకశక్తి మందగించడం జరుగుతుంది. విద్యార్థులు అయితే సబ్జెక్టుల మోతతో సతమతమైపోతున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే జ్ఞాపకశక్తి చాలా అవసరం. జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు బాదంపాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
అంతేకాదండోయ్ బాదం పాలలో సోడియం తక్కువగా ఉండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల గుండె నొప్పి, బీపీ అవకాశాలను తగ్గిస్తుంది. మలబద్దకంతో బాధపడేవారు బాదంపాలు తాగితే ఉపశమనం లభిస్తుంది. బాదంలో ఉండే కాల్షియం ఎముకల పటుత్వంకు సహకరిస్తుంది. బాదంపప్పులో ఐరన్‌ ఇతర పోషకాలు ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అంతేకాదు, బాదం పొడి ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతుంది. దాన్ని డైరెక్ట్‌గా పాలలో కలుపుకోవడమే. ఇంతటి మేలు చేసే బాదం పాలను ప్రతిరోజూ సేవించడం ఎంతో శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. 

09:30 - June 5, 2016

పర్యావరణాన్ని కాపాడటానికి అల్టిమేట్‌ మార్గం అంటే చెట్లను పెంచడమే! అయితే దీని కోసం కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినవారవుతారు. అందులోని ఐదు అంశాలు!
బ్రష్‌ చేసుకుందామని ట్యాప్‌ దగ్గరికి వెళుతారు కదా. బ్రష్‌ కడిగి దానికి పేస్ట్‌ పెట్టి... బ్రష్‌ నోట్లో పెట్టుకునేంతవరకు నీళ్ల నల్లా బంద్‌ చేయడం మర్చిపోతాం. ఇలా చేయడం వల్ల నిమిషానికి కొన్ని లీటర్ల నీరు వృదా అవుతుంది. అంతేకాదు నల్లా నుంచి చుక్కలుగా నీళ్లు పడుతుంటే డ్రాప్సే కదా అని వదిలేస్తాం. కానీ... సాయంత్రానికల్లా అలా పడిన నీళ్లు కొన్ని లీటర్లవుతాయి. నీటిని వృధా చేయకండి.
రోడ్డుమీదకు వెళ్తే వాహనాల రద్దీ ఇప్పుడొక సమస్య అయిపోయింది. దీని కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. కాబట్టి... మీరు మార్కెట్‌కు వెళ్లాలను కున్నా... రెండు మూడు కిలోమీటర్లలోపు ఇంకెక్కడికైనా వెళ్లాలనుకున్నా మీ మోటార్‌ వెహికిల్‌ను తీయకండి. నడక మొదటి ఆప్షన్‌. సైకిల్‌ ఉంటే ఇంకా మంచిది. మీకు మంచి వ్యాయామం అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణం బాగుంటుంది!
ఫ్లోరోసెంట్‌ లైట్లు ఖరీదు ఎక్కువ కావచ్చు. కానీ... ఒక్కసారి తీసుకుంటే ఎక్కువ కాలం వస్తాయి. అలాగే విద్యుత్‌ కూడా ఆదా అవుతుంది. దీనివల్ల మీ కరెంటు బిల్లు తగ్గుతుంది.
ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఫ్యాన్స్‌, లైట్స్‌ ఆఫ్‌ చేస్తారు. కానీ చార్జింగ్‌ పెట్టిన ప్లగ్‌, టీవీ ప్లగ్‌, సిస్టమ్‌ ప్లగ్‌... ఈ ప్లగ్స్‌ మాత్రం తీసేయరు. దీనివల్ల కూడా విద్యుత్‌ వృధా అవుతుంది. కాబట్టి బయటికి వెళ్లేముందు, వాడనప్పుడు అన్నింటినీ ఆఫ్‌ చేసేయండి. దీనివల్ల కరెంట్‌ బిల్లు తగ్గుతుంది.
మీ ఇంటికి పోస్ట్‌లో కుప్పలు తెప్పలుగా బిల్లులు వస్తుంటాయి. బిల్లు చూడగానే వెంటనే పక్కన పడేస్తారు. కానీ... ఆ పేపర్‌ ఎంతో విలువైనది. అందుకే బిల్లులు అలా రాకుండా, రిసిప్ట్‌ పేపర్‌ వేస్ట్‌ కాకుండా ఉండాలంటే ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించండి. హార్డ్‌ కాపీస్‌ ఇంటికి పంపొద్దని వారికి లెటర్‌ పెట్టండి. దీనివల్ల కొన్ని చెట్లను బతికించినవారవుతారు... తద్వారా భూమిని కాపాడినవారవుతారు. 

09:30 - June 5, 2016

ముంబై : మహారాష్ట్రలో తెల్లవారు జామున విషాదం నెలకొంది.  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 17 మంది మృతి చెందారు. ముంబై-పుణె రహదారిపై తెల్లవారుజాము 5.30గంటల సమయంలో ఓ బస్సు రెండు కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సు, రెండు కార్లు పక్కనే ఉన్న 20 అడుగుల లోయలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పన్వెల్ లోని ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. 
 

09:22 - June 5, 2016

'మన బతుకు బండిని నడపడంలో కళ్ళదే కీలకమైన పాత్ర. అటువంటి కళ్ళు లేకపోతే జీవితమే అంధకారమవుతుంది. ఆ అంధకారంలోంచి ఒక్కరినైనా మనం వెలుగులోకి తీసుకొస్తే చాలు. మన జీవితానికి ఒక సార్థకత చేకూరుతుంది. అందుకే నా కళ్ళని దానం ఇవ్వాలనుకుంటున్నాన'ని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. 'దో లఫ్జోమ్‌కి కహానీ' చిత్రంలో కాజల్‌ విజువల్లీ ఛాలెంజ్డ్‌ గర్ల్‌గా నటించింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో కాజల్‌ మాట్లాడుతూ,'అంధురాలి పాత్రకు న్యాయం చేసేందుకు కొన్ని రోజుల పాటు అంధ విద్యార్థుల స్కూలు కెళ్ళి, వారెలా బిహేవ్‌ చేస్తారు?, వారి మానసిక స్థితి ఎలా ఉంటుందనే తదితర విషయాల గురించి కూలంకషంగా తెలుసుకున్నాను. అంధ విద్యార్థులిచ్చిన స్ఫూర్తితోనే నా పాత్రను బాగా చేయగలిగా. అయితే వారిచ్చిన ప్రేరణతోనే నేను నా కళ్ళను దానం ఇవ్వాలనుకున్నాను. నేనే కాదు నా సహనటుడు రణదీప్‌ హూడా కూడా తన కళ్ళను డొనేట్‌ చేసేందుకు అంగీకరించాడు. సహృదయతతో తను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అవయవ దానంపై అందరిలోనూ అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేస్తే బాగుంటుంది. అవయవ దానం చేయడం వల్ల మరో వ్యక్తికి నూతన జీవితాన్ని అందించినవాళ్ళం అవుతాం' అని చెప్పింది. రణ్‌దీప్‌ హూడా, కాజల్‌ జంటగా పెన్‌ ఇండియా లిమిటెడ్‌ పతాకంపై దీపక్‌ తిజోరి దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రాన్ని ఈనెల 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో రానా సరసన తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోను, 'కవలై వెందమ్‌', 'గరుడా' వంటి తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది.

09:06 - June 5, 2016

రంగారెడ్డి : శంషాబాద్‌లో కేంద్ర జలవనరుల పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరును పార్లమెంటు సభ్యుల బృందం సమీక్షించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. కృష్ణాబోర్డు ఏకపక్ష వైఖరిని పార్లమెంటరీ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ వివరించింది. సత్వర సాగునీటి ప్రయోజనా పథకం కింద రూ.2155కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నాబార్డు నుంచి రూ.4,280కోట్లు విడుదల చేయించాలని రాష్ట్ర అధికారులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర నీటిపారదల శాఖ విజ్ఞప్తి మేరకు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హుకుంసింగ్ సానుకూలత వ్యక్తం చేశారు.

 

మహారాష్ట్ర-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

ముంబై : మహారాష్ట్ర-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లను ఢీకొని ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

ఆర్డీఎస్ కు జలకళ..

కర్నూలు : కర్ణాటకలో కురిసిన వర్షాలకు తుంగభద్రా నదికి వరదనీరు పోటెత్తుతోంది. దీనితో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) జలకళ సంతరించుకుంది. తుంగభద్రకు వస్తున్న నీరు కృష్ణా నదిలోకి చేరుతూ, శ్రీశైలం వైపు పరుగులు తీస్తుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముంబై - పుణె ఎక్స్ ప్రెస్ హైవైనే ఘోర ప్రమాదం..

ముంబై : ముంబై - పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ లగ్జరీ బస్సు, మరో కారు ఢీకొనడంతో బస్సు 20 అడుగుల లోతైన కాలువలోకి పడిపోగా, 17 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని పాన్వెల్ లోని పనాసియా ఆసుపత్రికి తరలించారు.

 

నేడు, రేపు ఖతార్ లో మోడీ పర్యటన..

ఖతర్ : విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు, రేపు ఖతార్‌లో పర్యటిస్తారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలకాంశాలపై ఆ దేశాధినేతలతో మోదీ చర్చిస్తారు.

నేడు అనంతలో వైసీపీ ధర్నా..

అనంతపురం : ఏపీలో టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ నేడు అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగనుంది. ఈ ధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటారు.

 

మరో ఐదు రోజులు వర్షాలు..

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మరో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయని వెల్లడించింది. 

08:55 - June 5, 2016

హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ పరీక్షలో మార్పులు చేర్పుల దిశగా టీఎస్ పీఎస్ సీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు సైతం తెప్పించుకుంది. ఉపాధ్యాయపోస్టుల భర్తీని టీఎస్ పీఎస్ సీకీ అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ సిలబస్‌లో మార్పలు చేపట్టేందుకు ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేసింది. 
330 మార్కులతో పరీక్ష 
టీచర్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీకి ఇప్పుడు టీఎస్ పీఎస్ సీ నిర్వహింబోయే పరీక్షలో చాలా మార్పులు రానున్నాయి. tspsc కొత్తగా ఈ పరీక్షా విధానంలో సమూల మార్పులు చేర్పులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 330 మార్కులతో పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అది కూడా మూడు అంశాలుగా పరీక్షా నిర్వహించే విధంగా కసరత్తులు చేస్తోంది. అంటే ప్రతి అంశానికి 100మార్కులు వుండే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే మిగిలిన 30 మార్కులు టీచింగ్ డెమోకి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.
డెమో పరీక్షకు అభ్యర్థుల ఎంపిక
మొదటి పేపర్‌లో జనరల్‌సైన్స్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్, సెకెండ్ పేపర్‌లో లాంగ్వేజ్ కి సంబంధించిన అంశాలు, థర్డ్ పేపర్‌లో ఇంగ్లీష్ , కమ్యూనికేషన్ స్కిల్స్ పై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు రాత పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను 1:2 చొప్పున డెమో పరీక్షకు  ఎంపికచేస్తారు. ఈ పరీక్ష విధానంపై సర్కారు త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు tspc వర్గాలు చెబుతున్నాయి. 
అభ్యర్ధుల్లో ఆందోళన 
మరోవైపు టీచర్ పోస్టులకు గత ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ పరీక్ష కేవలం 100మార్కులకు వుండేది.. ఇప్పుడు ఏకంగా 330 మార్కులకు పరీక్షా నిర్వహిస్తున్నారనే సరికి అభ్యర్ధుల్లో ఆందోళన మొదలయ్యింది. మరి ఈ పరీక్షా అభ్యర్ధులను గట్టెక్కిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది. 

 

08:48 - June 5, 2016

హైదరాబాద్ : బల్దియా సర్కిళ్ల పెంపుకు రంగం సిద్ధం అయింది. 24గా ఉన్నా స‌ర్కిళ్లను 30కి పెంచ‌నున్నారు. పౌరుల‌కు సేవ‌ల‌ను మ‌రింత వేగంగా అందించాలన్న లక్ష్యంతోనే ఈ మార్పులు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ స్పష్టం చేశారు. అయితే సర్కిళ్ల పెంపుతో ఇప్పటికే ప్రమోషన్‌ పొందిన ఉద్యోగులు త‌మ‌కు కీల‌క పోస్టింగ్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.  
జీహెచ్‌ఎంసీ సేవలను మరింత విస్త్రతం 
హైదరాబాద్ నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ సేవలను మరింత విస్త్రతం చేసేందుకు బల్దియా కీలక నిర్ణయం తీసుకుంది. బల్దియా సర్కిళ్లను పెంచి ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కమిషనర్‌ నిర్ణయించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసిలో 5 జోన్లు 24 స‌ర్కిళ్లు ఉన్నాయి. గ‌తంలో 18గా ఉన్న స‌ర్కిళ్లను గతేడాది 24 స‌ర్కిళ్లుగా మ‌ర్చారు అప్పటి కమిషనర్‌ సోమేష్ కుమార్. అయితే ప్రస్తుతమున్న 24 సర్కిళ్లను 30కి  పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌. వంద రోజుల ప్రణాళికలో భాగంగానే దీన్ని కూడా పూర్తిచేస్తామ‌ని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దాంట్లో భాగంగానే ఏఏ సర్కిళ్లు ఎంత పరిధిలో ఉండాలి అనే దానిపై టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఇప్పటికే ప్లాన్‌ను సిద్దం చేశారు. మంత్రి కేటీఆర్‌ అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి రాగానే సర్కిళ్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది.  
ప్రసిద్ధిగాంచిన ప్రాంతం పేరును సర్కిల్‌ పేరుగా 
అయితే సర్కిళ్ల పెంపు కోసం ఏఏ స‌ర్కిళ్లను విభ‌జిస్తారు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌తంలో విభజన కాని సర్కిళ్లను రెండుగా చేయాల‌ని అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. ఎల్బీన‌గ‌ర్ స‌ర్కిల్‌ను ఇప్పటికే  రెండుగా విభ‌జించ‌గా దానిని మూడుగా విభ‌జించాల‌ని ఆలోచిస్తున్నారు. వీటితో పాటు వెస్ట్ జోన్‌లో మ‌రో స‌ర్కిల్ పెరిగే అవ‌కాశం ఉంది. దీంతో ఇప్పటి వ‌ర‌కు ఒక‌టిగా ఉన్న స‌ర్కిళ్లన్నీ రెండుగా విభజన కానున్నాయి. వీటికి నెంబ‌ర్లు కాకుండా స‌ర్కిళ్ల ప‌రిధిలో ఉన్న ప్రసిద్ధి గాంచిన ప్రాంతం పేరును స‌ర్కిల్ పేరుగా నిర్ణయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సూచించారు.  
జీహెచ్‌ఎంసీని వెంటాడుతోన్న సిబ్బంది కొరత 
మరోవైపు సర్కిళ్ల పెంపు విష‌యం తెర మీద‌కు రావడంతో ప్రమోష‌న్ వ‌చ్చిన వారిలో మరిన్ని ఆశ‌లు చిగురించాయి. ఎడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న త‌మ‌కు వెంట‌నే పోస్టింగ్‌ ఇవ్వాల‌ని కోరుతున్నారు ఉద్యోగులు. వివిధ విభాగాల్లో 332 మంది పోస్టింగ్‌ల‌ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే స‌ర్కిళ్ల విభ‌జ‌న‌తో కార్యాల‌యంతో పాటు క్షేత్రస్థాయిలో అవ‌స‌ర‌మైన సిబ్బంది కొరత జీహెచ్‌ఎంసీని వెంటాడుతోంది. మరోవైపు స‌ర్కిళ్ల విభ‌జ‌న‌ను కొందరు సీనియర్ డిప్యూటి క‌మిష‌న‌ర్లు వ్యతిరేకిస్తున్నారు. స‌ర్కిళ్ల పెంపును వెంటనే ఉప‌సంహ‌రించుకోవాలంటూ ఉన్నతాధికారులతో లాబీయింగ్ చేస్తున్నారు. అయితే స‌ర్కిళ్ల సంఖ్యను పెంచి ప్రజలకు పౌర‌సేవ‌ల‌ను మెరుగు ప‌రుస్తారా లేక సీనియర్ అధికారుల ఒత్తిడికి త‌లోగ్గుతారా అన్నది మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన తర్వాత తేలిపోనుంది. 

 

నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్

హైదరాబాద్ : నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. జకోవిచ్ తో ముర్రే తలపడనున్నారు. 

నేడు హైదరాబాద్ లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన

హైదరాబాద్ : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 

నేడు ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జ్యూట్ సదస్సు

విజయనగరం : నేడు జిల్లాలో ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జ్యూట్ సదస్సు జరుగనుంది. 

 

07:33 - June 5, 2016

హైదరాబాద్ : వాతావరణంలో వచ్చిన మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వెంబడి ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడుతున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా తెలంగాణలోనూ వానలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేస్తోంది.
జనజీవనం అతలాకుతలం 
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడుతోంది. ఇది ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వెంబడి క్రేంద్రీకృతమై ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
రాయలసీమలో వర్షాలు బీభత్సం
కరవునేల.. రాయలసీమలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానల దెబ్బతో చాలా చోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో చాలా ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. కర్నూలు జిల్లాలోని ఆలూరు, నందికొట్కూరు, పత్తికొండ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కలికిరి వాగు ఉధృతికి ఆలూరు సమీపంలో ఒక లారీ కొట్టుకుపోయింది. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామం దగ్గర హంద్రీనదిలో కర్ణాటక ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. 
పత్తికొండ-ఆదోని మధ్య నిలిచిన రాకపోకలు 
కర్నూలు జిల్లాలోనే హంద్రీనది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పత్తికొండ-ఆదోని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పత్తికొండ సమీపంలో చందేలి చెరువుకు భారీ గండి పడింది. ఎమ్మిగనూరులో భారీ వర్షానికి వాగులు, చెక్‌డామ్‌లు పొంగిప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలో టమాట, ఉల్లి, మిరప నారుమళ్లు నాశనమయ్యాయి. 
విజయవాడలో భారీ వర్షపాతం నమోదు
ఆవర్తన ద్రోణి ఫలితంగా.. విజయవాడలో భారీ వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటమునిగాయి. దీంతో జనజీవనం స్తంభించింది. వన్‌టౌన్‌లోని పలు ప్రాంతాలతోపాటు లోబ్రిడ్జి, పోరంకి, మొగల్‌రాజపురం, మధుచౌక్‌,  జమ్మిచెట్టు సెంటర్‌ ప్రాంతంలోని రోడ్లపైకి భారీగా వర్షం  నీరు చేరింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
గుంటూరు జిల్లాలో భారీగా వానలు
గుంటూరు జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురిశాయి. గుంటూరులో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రైల్వే అండర్‌ బ్రిడ్జిలో నీరు చేరడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగు కాల్వలన్నీ పొంగిప్రవహించాయి. మంగళగిరి నియోజకవర్గంలో కుంభవృష్టి కురిసింది. దుగ్గిరాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీవృక్షాలు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. 
తెలంగాణలో భారీ వర్షాలు
ఇక తెలంగాణ అంతటా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు  సైతం కూకటివేళ్లతో పెకలించుకుని పడిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలా ప్రాంతాల్లో గాడాంధకారం నెలకొంది. కమలాపూర్‌ మండలం దండేపల్లిలో విద్యుత్‌ తీగులు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నగునూరు, మానకొండూర్‌లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, వందకుపైగా పశువులు మృత్యువాత పడ్డాయి. 
నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు
నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలుకు ఇళ్ల  పైకప్పులు ఎగిపోయాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో పెనుగాలులకు చెట్లుకూలి జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షంతో దెబ్బతిన్న గ్రామాల్లో మనుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పర్యటించి, బాధితులను పరామర్శించారు. కూలిపోయిన ఇళ్లను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 
వచ్చే 24 గంటల్లోనూ భారీ వర్షాలు 
మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలోని భైంసా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి.  వచ్చే 24 గంటల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

 

07:23 - June 5, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సురేష్‌ ప్రభు చంద్రబాబుతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో రైల్వే జోన్‌, ఇతర రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులు వారిద్దరి భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.  
ఏపీలో రూ.22 వేల కోట్ల పనులు నడుస్తున్నాయి - సురేష్‌ ప్రభు
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం తర్వాత సురేశ్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. ఏపీ నుంచి పార్లమెంట్‌ సభ్యుడు కావడం సంతోషంగా ఉందన్నారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఏపీ మీదుగా వెళ్లే మార్గాల్లో రూ.22వేల కోట్లమేర పనులు నడుస్తున్నట్లు సురేశ్‌ప్రభు వివరించారు.
విశాఖలో రైల్వే వాగన్‌ కేంద్రం ఏర్పాటు
ఏపీకి రెండు హైస్పీడ్‌ రైల్‌ లైన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సురేశ్‌ప్రభు వెల్లడించారు. దీనికి సంబంధించి, ఇప్పటికే ఫ్రెంచ్ అధికారులతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయన్నారు. వెయ్యికోట్ల రూపాయలతో కర్నూల్, తిరుపతిలో రెండు కొత్త రైల్వే వర్క్ షాపుల ఏర్పాటు చేస్తున్నామని,  వాగన్ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని ప్రభు అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక జోన్‌ కావాలన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్‌ అంశంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుతో చర్చించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.  రైల్వేల పరంగా వ్యాపారం దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక జోన్‌ కావాల్సిందేనని స్పష్టం చేశారు. వివిధ ప్రాజెక్టులను త్వరలో పూర్తయ్యేలా కార్యాచరణ చేపడతామని, ప్రతి 3నెలలకు రైల్వే అధికారులతో సమావేశమై చర్చిస్తామన్నారు. తూర్పు కోస్తా మొత్తం సరకు రవాణా హబ్‌గా మారాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు చెప్పారు. 

 

07:14 - June 5, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో గులాబీ దళపతి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పెద్ద ఎత్తున కారెక్కారు. తాజాగా  కాంగ్రెస్ నేతలు గులాబి గూటికి చేరుకునేందుకు లైన్ క్లీయర్ చేసుకుంటున్నారు. మరోవైపు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటి వరకు పార్టీ దారికి రాని విపక్ష నేతలు..ఇప్పుడిప్పుడే  గులాబి దళానికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 
దక్షిణ తెలంగాణా జిల్లాలపై దృష్టి
తెలంగాణ సెంటిమెంట్‌తో ఉత్తర తెలంగాణా జిల్లాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన గులాబి దళం..ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్‌తో దక్షిణ తెలంగాణా జిల్లాలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఎక్కువ స్థానాలు తెచ్చిపెట్టిన జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం గులాబి దళపతి పావులు కదుపుతున్నారు. రెండేళ్లుగా ఇదే పంథాను గులాబీ బాస్‌ కేసీఆర్‌ అనుసరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న నేతలు ఇప్పుడిప్పుడే గులాబి పార్టీకి దగరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి రాజకీయ వలసలు జోరుందుకున్నాయి.  
దక్షిణ తెలంగాణ జిల్లాలపై కేసీఆర్‌ గురి 
నల్గొండ జిల్లాల్లో బలమైన నేతలుగా  గుర్తింపు పొందిన జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతలంతా అధికార పార్టీ నేతలతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంపీగా ఉన్న గుత్తా  కారెక్కేందుకు ఇప్పటికే  గులాబి బాస్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జానారెడ్డిని మరింత ఆలస్యంగా కారెక్కించుకుంటారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో జానారెడ్డి తనయుడిని టీఆర్‌ఎస్‌ తరపున రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ రాకను మాత్రం జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు వ్యతిరేకిస్తుండడంతో ఆ వ్యవహారం తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌ చేరిక విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలతో మంతనాలు జరిపిన తర్వాతే..వీరిద్దరి చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. 
టీఆర్‌ఎస్‌ నేతలతో నల్గొండ జిల్లా నేతలు మంతనాలు 
ఇక పాలమూరు జిల్లా విషయానికి వస్తే జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలను నడిపిస్తున్న మాజీ మంత్రి డీకే అరుణతో గులాబి పార్టీ నేతలు జరిపిన చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని సమాచారం. డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి  అధికార పార్టీ గూటికి చేరారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా గులాబీ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారు. అయితే జిల్లాలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణ మాత్రం అధికార పార్టీపై ఇంకా ఘటైన విమర్శలు చేస్తూ గులాబి గూటికి దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇటీవలే ఓ ఎంపీ కారెక్కగా మరో ఎమ్మెల్యే కూడా  TRSతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం.
డీకే అరుణతో చర్చలు విఫలం 
మొత్తానికి అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌..టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో దడ పుట్టిస్తోంది. అయితే వరద ప్రవాహంలా వచ్చి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్న విపక్ష నేతల చేరికపై..టీఆర్‌ఎస్‌ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇతర పార్టీల నాయకుల చేరికతో తమ భవిష్యత్తు ఏమౌతుందో ఆందోళన వారిని వెంటాడుతోంది. 

 

07:09 - June 5, 2016

విజయవాడ : హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని..రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దిష్ణ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేత మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయని ఇలాంటి మాటలు పట్టించుకోనని అన్నారు. ఏపీ నవనిర్మాణదీక్ష వారోత్సవాలు మూడో రోజు విజయవాడలో ఘనంగా జరిగాయి. 
మూడో రోజు నవనిర్మాణ దీక్ష.. 
విజయవాడలో మూడో రోజు జరిగిన ఏపీ నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వం అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిందని సీఎం విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దిష్ణ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. 2022 నాటికి అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటుందన్నారు. అలాగే 2029 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉండాలని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నానన్నారు బాబు. 
జగన్ మాటలు చాలా బాధ కలిగిస్తున్నయన్న బాబు.. 
ప్రతిపక్ష నేత జగన్ మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయని ప్రజల కోసమే ఇలాంటి మాటలు భరిస్తున్నానన్నారు. నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతూ ప్రతి పనికి అడ్డు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని జగన్‌ను ప్రశ్నించారు. ఓ ప్రభుత్వం పరిటాల రవిని నిరాయుధుడిని చేసి చంపేసిందని ఘాటు విమర్శలు చేశారు. పరిటాలను చంపుతారని తెలిసి అందరి దగ్గర ప్రాధేయపడ్డాను తెలిపారు. తుని సభలో కావాలని అల్లర్లు రేపారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్,వైసీపీలు టీడీపీని కాలరాయాలని చూశారు కానీ ప్రజలు తమ వైపు ఉన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చామని చంద్రబాబు తెలిపారు. 

జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసుల దాడులు

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లపై పోలీసులు దాడులు చేశారు. బైక్‌ రేసింగ్‌లు చేస్తున్న పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ రేసింగ్‌లు నిర్వహించకుండా వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. యువకుల తల్లిదండ్రులకు సమాచారం అందించి మరోసారి ఇలా బైక్‌రేసింగ్‌లకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

 

06:59 - June 5, 2016

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లపై పోలీసులు దాడులు చేశారు. బైక్‌ రేసింగ్‌లు చేస్తున్న పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ రేసింగ్‌లు నిర్వహించకుండా వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. యువకుల తల్లిదండ్రులకు సమాచారం అందించి మరోసారి ఇలా బైక్‌రేసింగ్‌లకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

 

హైదరాబాద్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్‌ : నగరంలోని పలు చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ను నిర్వహించారు. నార్త్ జోన్‌లో పది చోట్ల, సౌత్ జోన్‌లో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సినీ నటుడు సాయి రోహిత్ పట్టుబడ్డాడు. అతని కారుతో పాటు పట్టుబడిన సుమారు 300 మంది వాహనాలను పోలీసులు సీజ్ చేశారు

 

06:56 - June 5, 2016

హైదరాబాద్‌ : నగరంలోని పలు చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ను నిర్వహించారు. నార్త్ జోన్‌లో పది చోట్ల, సౌత్ జోన్‌లో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సినీ నటుడు సాయి రోహిత్ పట్టుబడ్డాడు. అతని కారుతో పాటు పట్టుబడిన సుమారు 300 మంది వాహనాలను పోలీసులు సీజ్ చేశారు

 

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైదరాబాద్‌ : నరగరంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న పలు హుక్కా సెంటర్లలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. హుక్కాలో తగినంత మోతాదులో హుక్కా ఉందా లేక ఆల్కాహాల్‌ ఉందా అనే దానిపై పోలీసులు తనిఖీలు చేశారు. 

 

06:52 - June 5, 2016

హైదరాబాద్‌ : నరగరంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న పలు హుక్కా సెంటర్లలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. హుక్కాలో తగినంత మోతాదులో హుక్కా ఉందా లేక ఆల్కాహాల్‌ ఉందా అనే దానిపై పోలీసులు తనిఖీలు చేశారు. 

 

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

హైదరాబాద్  : నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించనున్రాను. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నేడు ఖతార్ లో భారత ప్రధాని మోడీ పర్యటన

ఢిల్లీ : నేడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఖతార్ లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

Don't Miss