Activities calendar

06 June 2016

22:12 - June 6, 2016

కోపం మీదకి వచ్చిన కోదండ రామ్ సారూ.. ఆంద్రాల ఉదయించిన కిరణాలూ కిరణం, చెప్పుల గుర్తు యాదికి తెస్తే రణం
సంగారెడ్డి జైలు ను సర్దిపిచ్చిన నాయిని సారు. పైసల కట్టను దొంగతనం చేసిన కోతి.. నిజామాబాద్ ఆసుపత్రికి రోగాలు .. ఈ ముచ్చట్లు ఏంటో  గీ వీడియో ల సుడుండ్రీ

22:09 - June 6, 2016

ఢిల్లీ : వ్యాపారానికి భారత్‌ అనువైన ప్రాంతమని, ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని స్విట్జర్లాండ్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ అధ్యక్షుడు జొహాన్ స్నెడర్ అమ్మాన్‌తో సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు చోటు కోసం మద్దతిస్తున్నందుకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. నల్లధనం, పన్ను ఎగవేత అంశాలు ఇరుదేశాలను భయపెడుతున్నాయని, ఇది ఎంతో కీలకమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

 

22:05 - June 6, 2016

హైదరాబాద్ : కృష్ణా రివర్‌ బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బోర్డు నిర్ణయాలపై జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రి ఉమాభారతిని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని కృష్ణాబోర్డుకు సూచించింది. కృష్ణా రివర్‌ బోర్డు తీరుపై..  తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారు.
ఉమాభారతిని కలిసిన హరీష్ రావు బృందం  
హరీష్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ఎంపీల బృందం సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఉమాభారతిని కలిసింది. బోర్డు ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని, దీనిపై జోక్యం చేసుకోవాల్సిందిగా వారు మంత్రిని కోరారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ నోటిఫికేషన్‌పై మంత్రి హరీష్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
బోర్డు నిర్ణయాలపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి 
మంత్రి హరీష్‌రావు ఫిర్యాదును స్వీకరించిన కేంద్రమంత్రి ఉమాభారతి.. విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని బోర్డు అధికారులను ఆదేశించారు.  మంగళవారం కృష్ణా రివర్‌ బోర్డు అధికారులతో సమావేశం కావాలని తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మకు ఉమాభారతి సూచించారు. 
విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని ఆదేశం 
కృష్ణారివర్‌ బోర్డు విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపంపకాల అధికారం కేవలం బచావత్ ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని..ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదన్నారు. అలాంటిది చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని కృష్ణాబోర్డు నీటి పంపకాలను చేపట్టడం సరైంది కాదని మంత్రి హరీష్‌రావు అన్నారు. 
చట్టానికి తూట్లు పొడుస్తున్న రివర్ బోర్డు 
అంతకుముందు... కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను మంత్రి హరీష్‌రావు బృందం కలిసింది. 1024 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్న గోదాములకు సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. 

 

21:57 - June 6, 2016

సమస్యలు పరిష్కరిస్తే తాత్కాలిక సచివాలయానికి వెళ్లడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సచివాలయ ఉద్యోగులు అన్నారు. అమరావతికి ఉద్యోగుల తరలింపు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎపి ఉద్యోగ సంఘం నేత సుబ్బారెడ్డి,  సెక్రటేరియట్ ఉద్యోగి శ్రీనుబాబు, సెక్రటేరియట్ ఉద్యోగిని పద్మావతి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:52 - June 6, 2016

భూకంపాల జోన్ లో ప్రమాదకర అణువిద్యుత్ కేంద్రం, తమ బతుకుల్నిబలి చేయొద్దంటున్న ప్రజలు, అణుభయంలో వణికిపోతున్న మత్స్యకారులు, వ్యతిరేకిస్తున్న పర్యావరణవేత్తలు, అణుభయంలో బిక్కుబిక్కుమంటున్న రణస్థలం ప్రాంతం. ఈ ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:46 - June 6, 2016

వైసీపీ కాంగ్రెస్ లో కలుస్తుందని ఎపి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభంలో వాస్తవికత లేదని విమర్శించారు. రాజధాని నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద సవాల్ అన్నారు. కాల్వ శ్రీనివాసులుతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే... 'జగన్ పార్ట్ టైం పొలిటిషీయన్. ఓదార్పు యాత్రలు ఓ ప్రసహనం... ఆయన మరో మూడేళ్లు పార్టీని నడపలేరు 
ఎమ్మెల్యేలు టీడీపీ వైపు రావడమే ఇందుకు నిదర్శనం. ముద్రగడ పద్మనాభంలో వాస్తవికత లేదు. పరిష్కరించే ప్రభుత్వంపై ఉద్యమ ఎందుకు. రోజా సభా దృశ్యాలు సీడీలు స్పీకర్ అనుమతి తోనే తీసుకున్నాం.. వాటిని మీడియాకు విడుదల చేయడం పార్టీ నిర్ణయం' అని అన్నారు. 

21:29 - June 6, 2016

విజయవాడ : కేసీఆర్‌కు భయపడే చంద్రబాబు విజయవాడకు పారిపోయారని వైసీపి నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సచివాలయం పనులు పూర్తికాకున్నా ఉద్యోగులంతా రావాల్సిందేనని చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్‌ను బలహీనపరిచేందుకు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ కుట్రను భగ్నం చేసేవరకు జగన్ నిద్రపోరు, నిద్రపోనివ్వరని భూమన అన్నారు. 

 

21:25 - June 6, 2016

కృష్ణా : విజయవాడకు తరలివచ్చేందుకు 80 శాతం మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చోటా మోటా నేతలు చేసే అలజడిని పట్టించుకోవద్దని ఏపీ ఎన్జీవో అధ్యక్షులు అశోక్‌బాబు విజయవాడలో అన్నారు. పలు సమస్యలున్నా ఉద్యోగులు విజయవాడకు వచ్చేందుకు ముందుకొస్తున్నారని ఎవరైనా అభ్యంతరం తెలిపితే అది వ్యక్తిగతమేనని అభిప్రాయపడ్డారు. 

21:14 - June 6, 2016

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కోదండరాం కుబుసం విడిచిన నాగుపాము వంటి వారని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ అన్నారు. ఈమేరకు సుమన్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు.  

 

21:09 - June 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పొలిటికల్‌ జేఏసీ ఉనికిలో లేదని జేఏసీ రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. చైర్మన్‌గా చెప్పుకుంటున్న కోదండరాం.. ఏ జేఏసీకి చైర్మనో.. అది ఎప్పుడు ఏర్పడిందో దాని లక్ష్యాలు ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని కోదండరాం విమర్శలు చేయడం సరికాదన్నారు. 

 

మార్కపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి దాడులు

ప్రకాశం : మార్కపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. అనధికారిక సొమ్ము రూ.2.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఉద్యోగులను విచారిస్తున్నారు. 

కేంద్రమంత్రి ఉమాభారతిని కలిసిన మంత్రి హరీష్ రావు బృందం

ఢిల్లీ : కేంద్రమంత్రి ఉమాభారతిని కలిసిన మంత్రి హరీష్ రావు, టీఆర్ ఎస్ ఎంపీలు, సీఎస్ రాజీవ్ శర్మ కలిశారు. కృష్ణా బోర్డు నోటిఫికేషన్ పై మంత్రి హరీష్ రావు అభ్యంతారాలు తెలిపారు. కృష్ణా ఛైర్మన్ తో కేంద్రమంత్రి ఉమాభారతి మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాలని తెలిపారు. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగొద్దని బోర్డు చైర్మన్ కు స్పష్టం చేశారు. రేపు కృష్ణా బోర్డు ఛైర్మన్ తో సమావేశం కావాలని సీఎస్ కు ఉమాభారతి సూచించింది. 

కేంద్రమంత్రి ఉమాభారతి హరీష్ రావు భేటీ

ఢిల్లీ : కేంద్రమంత్రి ఉమాభారతి హరీష్ రావు భేటీ అయ్యారు. కృష్ణా జలాలు, తెలంగాణ ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. 

19:58 - June 6, 2016

పుదుచ్చేరి : ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వి.నారాయణస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గాంధీ థిడల్‌లో జరిగిన కార్యక్రమంలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, షా జహాన్, కందసామి, కమలాకన్నన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. నలుగురు మంత్రులు తమిళంలో ప్రమాణం చేయగా మల్లాది కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు ముకుల్‌ వాస్నిక్, చిన్నారెడ్డి, డిఎంకె తరపున స్టాలిన్‌ తదితరులు హాజరయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 15 స్థానాల్లో గెలుపొందింది. ఇద్దరు డిఎంకె ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. 

19:55 - June 6, 2016

పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాలనలో తన మార్క్ చూపుతున్నారు. వీఐపీల కార్లకు, వారి ఎస్కార్ట్, పైలట్ వాహనాలకు సైరన్లు వాడకంపై నిషేధం విధించారు. వీఐపీల వాహనాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదంటూ ట్రాఫిక్ పోలీసులకు కిరణ్ బేడీ ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల కోసం ట్రాఫిక్ను ఆపరాదని, ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని మాజీ ఐపిఎస్‌ ఆదేశించారు. అయితే సైరన్లు వాడకం విషయంలో అంబులెన్స్లు, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ  కిరణ్‌ బేటి ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. 

 

19:51 - June 6, 2016

అనంతపురం : విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో జరిగిన వికాస్‌ పర్వ్‌ కార్యక్రమంలో మంత్రి జవదేకర్‌ పాల్గొని, మాట్లాడారు. భారతదేశం ఆర్ధికంగా గణనీయమైన వృద్ధి సాధిస్తుందన్నారు. ప్రధాని మోడీ భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయడంతో పాటు జీడిపి వృద్ధి చేయడానికి శాశ్వత చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

 

19:44 - June 6, 2016

విశాఖ : విశాఖపట్పం జిల్లా పరిశ్రమలు పెట్టడానికి అనుకూలం అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఉన్న ఇబ్బందులను తొలగిస్తామని తెలిపారు. రాష్ర్ట అభివృద్ధికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఇండస్ట్రియల్‌ పరంగానూ..ఇటు పర్యాటక రంగంలోనూ పరంగానూ పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందన్నారు. 

19:31 - June 6, 2016

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..తాగు, సాగునీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈమేరకు ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణ నదుల నుంచి తెలంగాణ నీటి వాటాను సద్వినియోగం చేసుకునే క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేస్తే ఏపీ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శించారు.

 

19:24 - June 6, 2016

హైదరాబాద్ : బత్తిన సోదరులు ఇచ్చే చేపమందులో ఎలాంటి శాస్త్రీయత లేదని ప్రముఖ శాస్త్రవేత్త భార్గవ అన్నారు. ఎలాంటి శాస్త్రీయత లేని చేపమందు పంపిణీకి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అస్తమాను తగ్గించే అవశేషాలు ఏవీ చేపమందులో లేవని పరీక్షల్లో తేలిందన్నారు. చేపమందు పంపిణీకి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం వల్ల లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేయడమేనని ఆయన అన్నారు. ఉబ్బసం రోగుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే.. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో మందులు ఉంచాలని జనవిజ్ఞానవేదిక రమేష్‌ డిమాండ్ చేశారు.  

 

19:20 - June 6, 2016

హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్రంలో ఎలాంటి చర్చా జరగడం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొందని.. తొందరపడి నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరామని బండారు దత్తాత్రేయ తెలిపారు. 

18:18 - June 6, 2016

హైదరాబాద్ : సీఎల్పీనేత జానారెడ్డి పనికిరారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వందసార్లు తిట్టారని, సర్వే సత్యనారాయణ గాంధీభవన్‌లోనే జానారెడ్డిని తీవ్రంగా విమర్శించారని, వారందరికీ లేని షోకాజ్ నోటీసులు తనకు ఎలా ఇస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పనితీరుపై తాను చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మేరకు స్పందించారు. కాంగ్రెస్‌లో ఇవన్నీ కామనేనని చెప్పుకొచ్చారు.
తెలంగాణకు అన్యాయం చేయాలని కుట్ర
కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడితెస్తోందని, సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కృష్ణా బోర్డు నిర్ణయాలు అమలు చేస్తే మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయిని ఆయన చెప్పారు. కేంద్రానికి లేఖలు రాసి చేతులు ముడుచుకుని కూర్చోవడం సరికాదని, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోదీని కలవాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.

 

18:07 - June 6, 2016

భారత మొట్టమొదటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్‌..హోమ్ ఫైట్ కి ముహూర్తం కుదిరింది. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ నగరాలు వేదికగా జరిగిన ఫైట్లలో పాల్గొంటూ వచ్చిన విజేందర్ సింగ్...న్యూఢిల్లీ వేదికగా జులై 16న జరిగే సమరంలో ఆస్ట్రేలియాకు చెందిన యూరోపియన్ మిడిల్ వెయిట్ మాజీ చాంపియన్ కెర్రీ హోప్ తో తలపడబోతున్నాడు. ఢిల్లీ త్యాగరాజ ఇండోర్ స్టేడియం వేదికగా ఏడు రౌండ్ల ఈ ప్రొఫెషనల్ బౌట్ ను నిర్వహిస్తారు. ఇప్పటి వరకూ పాల్గొన్న ఆరు ప్రో బౌట్లలోనూ విజేందర్ నాకౌట్ విజయాలు సాధించి..డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

18:06 - June 6, 2016

భారత శరీరసౌష్టవ క్రీడకే అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన బాడీ బిల్డింగ్ గ్రేట్, మాజీ మిస్టర్ యూనివర్స్ మనోహర్ ఆయిచ్ తన 104వ ఏట కన్నుమూశారు. 1952లోనే మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకొన్న ఆయిచ్ 4 అడుగుల 11 అంగుళాల ఎత్తుతోనే ప్రపంచాన్ని జయించారు. ఏడు దశాబ్దాలపాటు బాడీబిల్డర్ గా అంతర్జాతీయస్థాయిలో కొనసాగిన ఆయిచ్...వందేళ్ల వయసులోనూ శరీర సౌష్టవాన్ని కాపాడుకొంటూ తనకుతానే సాటిగా నిలిచారు. 1912 మార్చి 17న ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని కోమిల్లా జిల్లాలోని మారుమూల గ్రామం దమాటీలో జన్మించిన ఆయిచ్...ధూమపానానికీ, మద్యపానానికీ దూరంగా ఉంటూ వచ్చారు. ఆహారధాన్యాలు, కూరగాయాలు, పాలు, చేపలు మాత్రమే ఆహారంగా తీసుకొంటూ..నిండునూరేళ్లు తన ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ ఎందరికో స్పూర్తిగా నిలిచారు. తన శరీరసౌష్టవాన్ని కాపాడుకోటానికి.. రోజుకు 12 గంటలపాటు సాధన చేసినట్లు ఆయిచ్ తరచూ చెబుతూ ఉండేవారు. 2003లో చివరిసారిగా ఓ బాడీబిల్డింగ్ ప్రదర్శనలో పాల్గొన్న ఆయిచ్...ఆ తర్వాత తన నివాసానికే పరిమితమవుతూ వచ్చారు. ఆయిచ్ మృతితో భారత బాడీబిల్డింగ్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసినట్లయ్యింది.

18:04 - June 6, 2016

దక్షిణ అమెరికా దేశాల ఫుట్ బాల్ చాంపియన్లకు ఇచ్చే కోపా అమెరికా కప్ గ్రూప్ లీగ్ పోటీలు...అమెరికాలోని పదినగరాలలో హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. మాజీ చాంపియన్ బ్రెజిల్ ఓటమి అంచుల నుంచి బయటపడితే...ఆతిథ్య అమెరికాకు ప్రారంభమ్యాచ్ లోనే కొలంబియా డబుల్ కిక్ తో షాకిచ్చింది. మెక్సికో, వెనిజ్వేలా జట్లు సైతం తొలి విజయాలతో శుభారంభం చేశాయి. చిలీతో అర్జెంటీనా, పనామాతో బొలీవియాజట్లు ఢీ కొంటాయి. శాంతా క్లారా స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ ఏ ప్రారంభ లీగ్ పోటీలో.. ఆతిథ్య అమెరికాకు కొలంబియా షాకిచ్చింది. ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో కొలంబియా 2-0 గోల్స్ తో అమెరికాను కంగుతినిపించింది. గోల్స్ సాధించడానికి వచ్చిన పలు అవకాశాలను అమెరికా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లాస్ ఏంజెలిస్ వేదికగా ముగిసిన గ్రూప్ బీ లీగ్‌ పోటీలో అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో...మాజీ చాంపియన్ బ్రెజిల్ ఓటమి అంచుల నుంచి బయటపడి ఈక్వెడార్ తో జరిగిన పోటీని 0-0తో డ్రాగా ముగించగలిగింది. పవర్ ఫుల్ బ్రెజిల్ ను నిలువరించడంలో ఈక్వెడార్ డిఫెండర్లు సఫలం కాగలిగారు. ఆట 66వ నిముషంలో ఈక్వెడార్ స్ట్రయికర్ బోలనాస్..గోల్ పోస్ట్ లో కొట్టిన బంతిని అడ్డుకోడంలో బ్రెజిల్ గోల్ కీపర్ ఎలిసన్ విఫలమయ్యాడు. అయితే బంతి బైలైన్ దాటిందంటూ రిఫరీ గోల్ ఇవ్వటానికి నిరాకరించడంతో బ్రెజిల్ ఊపరిపీల్చుకొంది. ఇదే గ్రూపులో జరిగిన మరో లీగ్ పోటీలో పెరూ 1- 0 గోల్స్ తో హైటీని అధిగమించింది. రెండుజట్లూ గోల్ కోసం దాడులు ప్రతిదాడులు చేసినా సఫలం కాలేకపోయాయి. అయితే మ్యాచ్ విజయానికి అవసరమైన గోల్ ను పెరూ సాధించడం ద్వారా పూర్తి పాయింట్లు సంపాదించి..గ్రూప్ బీ టాపర్ గా నిలిచింది. గ్రూప్-ఏ లీగ్ లో భాగంగా కోస్టారికా- పెరాగ్వే జట్ల మధ్య జరిగిన మరో తొలిరౌండ్ మ్యాచ్ సైతం ఏ జట్టూ గోల్ చేయలేకపోడంతో డ్రాగా ముగిసింది.

గ్రూప్ సీ..లీగ్..
గ్రూప్- సీ లీగ్ పోటీల్లో మాజీ చాంపియన్ ఉరుగ్వేను 3-1 గోల్స్ తో మెక్సికో చిత్తు చేసింది. ఇదే గ్రూపులో జరిగిన మరో తొలిరౌండ్ పోటీలో వెనిజ్వేలా ఒకే ఒక్క గోల్ తో జమైకా పై విజయం సాధించింది. చికాగో సోల్జర్ ఫీల్డ్ స్టేడియంలో ముగిసిన ఈ హోరాహోరీ సమరం 16వ నిముషంలోనే వెనిజ్వేలా స్ట్రయికర్ యాండ్రీ బ్లేకే గోల్ సాధించి తన జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పలుసార్లు గోల్స్ చేయటానికి అవకాశాలు వచ్చినా...జమైకా ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈక్వలైజర్ కోసం జమైకా ఆట ముగిసే వరకూ పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రూప్- డీ లీగ్ లో భాగంగా జరిగే పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ చిలీతో అర్జెంటీనా, పనామాతో బొలీవియాజట్లు ఢీ కొంటాయి.

ప్రభుత్వంపై ముద్రగడ కక్ష గట్టారు:బోండా ఉమ

విజయవాడ: ఏపీ ప్రభుత్వంపై ముద్రగడ కక్ష గట్టారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ధ్వజమెత్తారు. కాపులను అడ్డుపెట్టుకుని ముద్రగడ రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ముద్రగడ కక్ష గట్టి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని బోండా చెప్పారు. ముద్రగడ మంజునాథ కమిషన్‌ను ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. ముద్రగడ చర్యలతో కాపులకు నష్టమని బోండా ఉమ చెప్పుకొచ్చారు.

18:01 - June 6, 2016

రియో ఒలింపిక్స్ లో పాల్గొని వరుసగా మూడో పతకం సాధించాలన్న భారత ఆల్ టైమ్ గ్రేట్ వస్తాదు సుశీల్ కుమార్ ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పటికే రియో బెర్త్ సాధించిన నర్సింగ్ యాదవ్ తో తనకు ట్రైల్ ఫైట్ నిర్వహించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సుశీల్ కుమార్ కు నిరాశ తప్పలేదు.సుశీల్ కుమార్ గొప్పవస్తాదని తమకు తెలుసునని...అయితే 74 కిలోల విభాగంలో నర్సింగ్ యాదవ్ మెరుగైన వస్తాదని...భారత కుస్తీ సమాఖ్య భావించిందని ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ మన్మోహన్ తమ తీర్పులో తెలిపారు. నర్సింగ్ యాదవ్ తో ట్రైల్ పరీక్ష నిర్వహించమని కోరడంలో అర్ధంలేదని, అనైతికం, అన్యామంటూ న్యాయమూర్తి తేల్చి చెప్పారు. గత రెండు ఒలింపిక్స్ లో సుశీల్ కుమార్ కాంస్య, రజత పతకాలు సాధించినా...గత రెండేళ్లుగా అంతర్జాతీయ కుస్తీ పోటీలకు దూరంగా ఉంటూ రావడంతో భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. 

17:59 - June 6, 2016

విజయవాడ : టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని.. గతంలో అమలవుతున్న హామీలను తుంగలో తొక్కిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.  ఈ నెల 7 నుంచి 9 వరకు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతాయని.. ఆ సమావేశాల్లో టీడీపీ ప్రభుత్వ పాలనా తీరు తెన్నులపై చర్చిస్తామని మధు చెప్పారు. 

 

భద్రాచలంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ..మృతి

హైదరాబాద్: కూకట్ పల్లిలో మే 30న అదృశ్యమైన బాలికప్రియుడితో కలిసి భద్రాచలంలో ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ కు తరలిస్తుండగా ప్రేమ జంట మృతి చెందింది.

 

మథుర అల్లర్లలో రాజకీయ జోక్యం లేదు: యూపీ పోలీసులు

ఢిల్లీ : మథుర ఘటనపై హోంశాఖకు యూపీ పోలీసులు నివేదిక అందించారు. మథుర అల్లర్లలో రాజకీయ జోక్యం లేదని, మథుర ఘటన తీవ్రతను గుర్తించడంలో స్థానిక పోలీసులు వైఫల్యం అయ్యారని యూపీ పోలీసులు స్పష్టం చేశారు.

ఏసీబీ వలలో తాడేపల్లి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

గుంటూరు : రూ. 2వేలు లంచం తీసుకుంటూ తాడేపల్లి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వీరయ్య ఏసీబీకి చిక్కాడు.

17:44 - June 6, 2016

కేరళ : మరో 48 గంటల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. పశ్చిమబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రెండురోజుల పాటు తెలంగాణలో గాలులతో కూడిన వర్షం కురిచే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షం, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడనుంది. 

 

ప్రత్యేక హోదా అంశం విభజన చట్టం లో లేద: ప్రకాశ్ జవదేకర్

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్సష్టం చేశారు. ఏపీకి చట్టంలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చామని ఆయన తెలిపారు.

ముగిసిన టి.ప్రజాపద్దుల కమిటీ పర్యటన

యాదాద్రి : ప్రజాపద్దుల కమిటీ పర్యటన ముగిసింది. యాదాద్రి దేవాలయానికి సంబంధించి అన్నిరికార్డులను పరిశీలించామని పీఏసీ ఛైర్మన్ గీతారెడ్డి తెలిపారు. భక్తులకు తాగునీరు, వసతి గదుల కొరత లేకుండా ఆలయ అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. యాదాద్రి అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తవుతాయని ఆశిస్తున్నామని గీతారెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి ఉమాభారతితో హరీష్ రావు భేటీ

ఢిల్లీ : కేంద్ర మంత్రి ఉమాభారతితో హరీష్ రావు భేటీ అయ్యారు. కృష్ణా జలాలు, తెలంగాణ ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

'ఎవరి ప్రయోజనాల కోసం కోదండరామ్ మాట్లాడుతన్నారు'

హైదరాబాద్ : ఎవరి ప్రయోజనాల కోసం ప్రొ.కోదండరాం మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి ల‌క్ష్మారెడ్డి కోదండ రామ్ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. కేసీఆర్ అమ‌లు ప‌రుస్తోన్న ప్రజా సంక్షేమ ప‌థ‌కాలను కోదండ రామ్ గ‌మ‌నించాల‌ని ఆయ‌న సూచించారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి త‌మ ప్ర‌భుత్వం పేద‌ల అభివృద్ధి కోసం కృషి చేస్తోంద‌ని, అటువంటి త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో ఉద్దేశం ఏంట‌ని ఆయ‌న కోదండ రామ్‌ని ప్ర‌శ్నించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేని ప్ర‌జా ప్ర‌యోజ‌న‌ పథకాలు తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

17:14 - June 6, 2016

హైదరాబాద్ : నిఖిల్ రెడ్డి ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. సర్జరీ అనవసరంగా చేశారని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఇవాళ నిఖిల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న కౌన్సిల్ అధికారులు... ఇందుకు బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

బంగారు తెలంగాణ ఓ భ్రమ: ప్రొ.కోదండరాం

మెదక్ : బంగారు తెలంగాణ ఓ భ్రమ అని జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం 'టెన్ టివి'తో అన్నారు. తెలంగానలో జరుగుతోంది అభివృద్ధి కాదని.. విధ్వంసం అంటూ ఘాటు విమర్శలు చేశారు. గత పాలకులు అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలనే టిఆర్ ఎస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందంని కోదండరాం దుయ్యబట్టారు.

నష్టాలతో ముసిగిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్సే్చంజి సూచీ 65.58 పాయింట్లు నష్టపోయి 26777.45 వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజి నిఫ్టీ 8201 పాయింట్లు నష్టపోయి 19.75 వద్ద ముగిసింది.

ఆగిరిపల్లిలో భారీగా పోలీసుల మోహరింపు..

కృష్ణా: జిల్లాలోని ఆగిరిపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం ఎస్సై, కానిస్టేబుల్‌పై రౌడీషీటర్లు దాడికి యత్నించారు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో పోలీసులు రౌడీషీటర్ల నివాసాలపై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రియో ఒలింపిక్స్ లో నర్సింగ్ యాదవ్ కు ఛాన్స్...

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెజ్లింగ్ లో పోటీ పడే చాన్స్ నర్సింగ్ యాదవ్ కు దక్కింది. ఒలింపిక్స్ కు ఎవరు వెళ్లాలన్న విషయమై ట్రయల్స్ నిర్వహించాలని మరో రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దాన్ని కొట్టివేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం, ఒలింపిక్స్ కు వెళ్లేందుకు నర్సింగ్ యాదవ్ అర్హుడని, ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

16:15 - June 6, 2016

ఢిల్లీ : యమునానది తీరంలో పర్యావరణానికి ముప్పు కలిగించారన్న కారణంతో ఎన్‌జిటి విధించిన 4 కోట్ల 75 లక్షల జరిమానాను రవిశంకర్‌ ఆధ్వర్యంలోని ఆర్ట్ ఆఫ్‌ లీవింగ్‌ చెల్లించింది. ఈ మొత్తానికి సంబంధించిన డిడిని ఎన్‌జిటికి సమర్పించింది. 4 కోట్ల 75 లక్షలను చెల్లించాల్సిందేనని ఎన్‌జిటి మే 31న ఆదేశించింది. ఇందుకోసం వారం రోజుల గడువు నేటితో పూర్తయింది. గత మార్చిలో ఆర్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ ఫౌండేషన్ 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని యమునా నదీ తీరానా ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్మాత్మిక సమ్మేళనం వివాదస్పదమైంది. పర్యావరణ అనుమతులు లేకుండా స్టేజి నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పర్యావరణవేత్తలు ఎన్‌జిటిని ఆశ్రయించారు. తాము పర్యావరణానికి ముప్పు కలిగించలేదని దీనిపై న్యాయపోరాటం చేస్తామని రవిశంకర్‌ ట్వీట్‌ చేశారు.

 

16:07 - June 6, 2016

మనసుకు నచ్చిన వాటిని కొనేయడం..ఎంత ధర ఉన్నా వాటిని కొంతమంది చేజిక్కించుకోవడానికి పోటీ పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. అందులో నెంబర్స్ కూడా ఒకటి. తాము కొన్న కార్లకు ప్రత్యేక నెంబర్లు ఉండాలని వేలు..లక్షలు పోసి తీసుకుంటూ ఉంటుంటారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 11 లక్షలు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. అందర్నీ తలదన్నే విధంగా ఓ వ్యక్తి కోట్లు కుమ్మరించాడు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరిగిన ఫ్యాన్సీ నెంబర్లు వేలం చూస్తుంటే నోట మాట రాదంటే నమ్మండి. '1' నెంబర్ కోసం ఆ దేశానికి చెందిన అరబ్ షేక్ ఏకంగా రూ. '32 కోట్లు' తగలేశాడు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం చూసిన వారు ఆశ్చర్యపోయారంట. ఈ నెంబర్ తో పాటు ఇతర నెంబర్లు కూడా వేలం వేసిన నిర్వాహణ సంస్థ రూ. 91 కోట్ల ఆదాయం పొందిందంట. 

రేపటి నుండి కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వర్క్ షాప్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు, ఎల్లుండి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో అన్ని కలెక్టర్లతో వర్క్‌షాప్‌ జరగనుంది. ఈ వర్క్‌‌షాప్‌‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు అన్ని విషయాలపై నిశితంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కోదండరాం వ్యాఖ్యలపై మంత్రి ఈటల ఫైర్

కరీంనగర్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యలపై మంత్రి ఈటల ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడిన ఈటల.. మేధావులు, రాజకీయవేత్తలు పాలనను మెచ్చుకుంటుంటే..కోదండరాం విమర్శించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని పార్టీలను ఏకం చేశామన్న విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేశారు. జేఏసీ పుట్టక ముందే తెలంగాణ ప్రకటన వచ్చిందని ఈటల చెప్పుకొచ్చారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరని మంత్రి చెప్పారు. రూ.17 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్న విషయాన్ని మంత్రి ఈటల గుర్తు చేశారు.

16:02 - June 6, 2016

ఢిల్లీ : ఢిల్లీలో జంగల్‌రాజ్‌ రాజ్యమేలుతోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఇందుకు ప్రధాని నరేంద్రమోది, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌లే కారణమని ఆయన దుయ్యబట్టారు. శాంతి భద్రతలు కాపాడడంలో ప్రధాని, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పూర్తిగా విఫలమయ్యారని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో బ్రహ్మపురి ప్రాంతంలో 50 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు ఇంట్లోనే హత్యకు గురయ్యారు. మంగోల్‌పురి ప్రాంతంలో 11 ఏళ్ల అబ్బాయి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడడం వంటి దారుణాలు వెలుగుచూశాక మోదీ, జంగ్లను విమర్శిస్తూ కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు.

 

15:52 - June 6, 2016

అనంతపురం : జగన్‌ మతిస్థిమితం తప్పి సైకోలా జగన్‌ వ్యవహరిస్తున్నాడని మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పల్లె రఘునాథరెడ్డి  విమర్శించారు. ఈమేరకు మంత్రులు మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో జగన్‌ విద్వేషాలను పెంచుతున్నారని కామినేని ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ హయాంలో పరిటాల రవిని చంపించింది ఎవరో అందరికీ తెలసని.. ప్రజలే జగన్‌కు బుద్ధి చెబుతారని అన్నారు.   

 

నాకే ఎందుకు నోటీసులు? : కోమటిరెడ్డి

హైదరాబాద్ : మాజీ టీఎస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కన్నా ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతగాని వాడంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, గతంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ వంటి వారెందరో కాంగ్రెస్ లీడర్లను తిట్టారని గుర్తు చేస్తూ, వారికి షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం వంటిదని, ఇటువంటి విషయాలు సర్వసాధారణమని అన్నారు. నోటీసుకు తాను సమాధానం పంపుతానని స్పష్టం చేశారు.

15:45 - June 6, 2016

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు భూముల వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భోగాపురం మండలం చేపలకంచేరు వద్ద.. ఎయిర్ పోర్టు భూముల సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

 

తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణ లో లాసెట్ ఫలితాలను ఉన్న విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. మూడేళ్ల ఎల్ ఎల్ బీ ఫలితాల్లో 85.10 శాతం, ఐదేళ్ల ఎల్ ఎల్ బీ ఫలితాల్లో 98.94 శాతం ఉత్తీర్ణత, పీజీ ఎల్ సెట్ ఫలితాల్లో 99.45 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

15:42 - June 6, 2016

హైదరాబాద్ : సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఉద్యోగులను తరలించాలని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈమేరకు కృష్ణయ్య టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. లోకల్‌ స్టేటస్‌ అంశంతో పాటు వసతులు, విద్యా, ఉద్యోగ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అన్ని వసతులు కల్పిస్తే తప్పకుండా అమరావతికి రావడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. 

 

హోంగార్డు పై టిడిపి కార్పొరేటర్ దాడి

విజయవాడ : టిడిపి కార్పొరేటర్ గుండారపు హరిబాబు దుర్గ గుడి నుండి కుమ్మరిపాలెం వైపు తన కారు వెళ్లనివ్వలేదని హోంగార్డు పై హరిబాబు దాడి చేశారు. దీంతో హోంగార్డు వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.

ఇంకుడు గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

అనంతపురం : కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామ శివారులో ఇంకుడుగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. తూముచెర్ల గ్రామానికి చెందిన మల్లేశ్, నిర్మల దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా ఇద్దరు పిల్లలు తేజ(9), తరుణ్(7)లను తీసుకుని కూలిపనులకు వెళ్లారు. దంపతులిద్దరూ పొలంలో పనిచేసుకుంటుండగా పిల్లలు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఇంకుడుగుంతలో పడిపోయారు. పిల్లల అరుపులు విని వెళ్లేలోగానే వారిద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లలు కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మథుర ఘర్షణపై సుప్రీం విచారణ...

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఘర్షణపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై న్యాయవాది కామిని జైస్వాల్‌ వేసిన పిటిషన్‌పై పీసీ ఘోష్‌, అమితవ రాయ్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ రేపు విచారించనుంది.

15:06 - June 6, 2016

బాహుబలి చిత్రానికి సీక్వెల్ గా బాహుబలి ది కంక్లూజన్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే సమ్మర్ బ్రేక్ తీసుకుంది. అనంతరం జూన్ 13 నుండి చిత్ర తాజా షెడ్యూల్ మొదలు కానున్నట్లు..ఈ షెడ్యూల్ లో చిత్ర తారాగణమంతా పాల్గొననున్నట్టు సమాచారం. ఇందుకోసం రాజమౌళి భారీ కసరత్తే చేసినట్లు టాక్. పది వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అత్యంత సాంకేతిక విలువలు, భారీ గ్రాఫిక్స్ తో బాహుబలి ది కంక్లూజన్ ని రూపొందించాలని 'జక్కన్న' తహతహలాడుతున్నారంట. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో బాహుబలి రెండో పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుక రావడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. 

15:04 - June 6, 2016

ఆదిపినిశెట్టి..'సరైనోడు' సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ద్వారా పలు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా 'అనుష్క' ప్రధాన పాత్రలో నటిస్తున్న 'భాగమతి'లో నటించేందుకు 'ఆది' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దర్శకుడు అశోక్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో అనుష్కతో కలిసి నటించడానికి ఒప్పుకున్నట్లు టాక్. భాగమతిలో మళయాళ యాక్టర్ జయరామ్ విలన్‌గా నటిస్తున్నారు. 

డానిష్ మహిళ అత్యాచారం ఘటనలో తీర్పు..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైల్వేస్టేషన్ సమీపంలో ఓ డానిష్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొంటూ ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు తీర్పు చెప్పింది. 

14:47 - June 6, 2016

హైదరాబాద్ : వాతావరణం చల్లడింది... బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరోవైపు.. గతి తప్పుతున్న రుతుపవానాలను సరిగ్గా అంచనా వేసే పరిజ్ఞానం... ఇక మన శాస్త్రవేత్తలకు అందుబాటులోకి రానుంది. దీనికోసం కేంద్రం ఓ విమానాన్ని కొనుగోలు చేస్తోంది. మే నెల ఎండమంటలను మబ్బుతెరలు అడ్డుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. శని, ఆదివారాల్లో కరీనంగర్‌ జిల్లా సారంగాపూర్‌లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు ఆదిలాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 2నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖా అధికారులు తెలిపారు. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా చాలా చోట్ల సుడిగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. బలమైనగాలుల తాకిడితో పలు చోట్ల చెట్లు విరిగి పడుతున్నాయి. ఇటు రాజధాని హైద్రాబాద్‌లో కూడా వాతావరణం చల్లబడింది. నగరంలో 33నుంచి 22 డిగ్రీల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. ఇదిలా వుంటే... నైరుతి రుతుపవనాలు మరో నాలుగురోజుల్లో దేశంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ చెబుతోంది. ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీనే కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు జూలై 15కల్లా దేశమంతా విస్తరిస్తాయి. గత ఏడాది మే 30న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అంచనా వేయగా వాస్తవంగా ఐదో తేదీ తర్వాతే అడుగు పెట్టాయి.

తప్పుతున్న అంచనాలు..
ఇలా రుతుపవనాల రాకపై ప్రతిఏడాది వేస్తున్న అంచనాలు తప్పుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణాన్ని అంచనా వేసే ఖచ్చితమైన పరిజ్ఞానం లేకపోవడమే. దీనిపై ఇపుడు కేంద్రం దృష్టిపెట్టింది. రుతుపవనాల గమనాన్ని నెల రోజుల ముందే ఖచ్చితంగా అంచనా వేసే టెక్నాలజీ అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీని కోసం 150 కోట్ల రూపాయలతో ఓ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. ఈ విమానం మరో రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం వచ్చేనెలలో టెండర్లు పిలువనున్నట్లు కేంద్ర భూ శాస్త్ర వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ విమానాన్ని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటలర్జీ సంస్థ కొనుగోలు చేయనున్నది. దీంతో వాతావరణాన్ని అంచనా వేసేందుకు విమానం కలిగి ఉన్న అతి కొద్ది దేశాల్లో ఒకటిగా భారత్ నిలవనుంది.  

14:41 - June 6, 2016

పశ్చిమగోదావరి : ఎండల వేడికి విలవిల్లాడిన గోదావరి పశ్చిమడెల్టా ప్రజలకు ఉపశమనం లభించింది. విజ్జేశ్వరం హెడ్‌స్లూయిజ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో తాగునీటి కొరత తీరనుంది. ఏప్రిల్‌ నెలలోనే డెల్టా పరిధిలోని చెరువులను నింపారు.. అయితే... ఎండల వేడికి చెరులన్నీ ఒట్టిపోయాయి. దీంతో గత నెలరోజులుగా పలు గ్రామాల్లో తాగునీటికి కొరత ఏర్పడింది. తాజాగా నీరు వదలడంతో కష్టాలు తీరనున్నాయి. విజ్జేశ్వరం హెడ్‌స్లూయిజ్‌ నుంచి ఈరోజు 5వందల క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. మరోవైపు. రిపేర్లు పూర్తికాని నర్సాపురం, ఏలూరు, అత్తిలి ప్రధాన కాలువలకు నీటి విడుదలపై సందేహం నెలకొంది. 

14:38 - June 6, 2016

విశాఖపట్టణం : పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 15 రోజుల వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని మంత్రి చెప్పారు. ఈనెల 9వ తేదీ నుంచి 20వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. అటు ఆంధ్రా యూనివర్సిటీ కూడా కౌన్సిలింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. 

14:37 - June 6, 2016

హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగులను అమరావతికి తరలించే విషయంలో నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడంతో గందరగోళం నెలకొందని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అన్నారు. ఈనెల 27 నుంచి అమరావతిలో పరిపాలన కొనసాగుతుందని సీఎం చెప్పారని... ఉద్యోగుల తరలింపుపై ఈ రోజు ప్రణాళిక ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తమపై ఆరోపణలు చేయడం తగదని ఈ సందర్భంగా మురళీకృష్ణ అన్నారు. ఆయన ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో వీడియో చూడండి. 

14:34 - June 6, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ కోర్టు కాంప్లెక్స్ ఎదుట తెలంగాణ న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయాధికారుల కేటాయింపు నిలిపివేయాలని న్యాయవాదులు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:33 - June 6, 2016

విజయవాడ : తుని కాపు గర్జన ఘటనలో అరెస్టులు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 10 మందిని సీబీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టులు చేస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమ నేత ముద్రగడ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాయుతంగా మారిపోయింది. రత్నాచల్‌ ఎక్స్ ప్రెస్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. రెచ్చిపోయిన ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. ఒక బోగీ తర్వాత మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. మంటల తీవ్రతతో 14 రైలు బోగీలతో సహా రైలు మొత్తం దగ్ధమైంది. డ్రైవర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్‌ నిలిపివేయించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. అలాగే మీడియా సిబ్బందిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. ఈ దాడిలో కెమెరాలు సైతం ధ్వంసమయ్యాయి.

రాజధానికి వెళ్లడానికి అభ్యంతరం లేదు - ఏపీ గెజిటెడ్..

హైదరాబాద్ : రాజధానికి వెళ్లడానికి అభ్యంతరం లేదని ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని, స్థానికత అంశాన్ని తేల్చకుండా వెళ్లమంటే ఎలా అని ప్రశ్నించారు. స్థానికత అనేది చిన్న సమస్య కాదని, తాము గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నామనడం సరికాదన్నారు. 

'మత సామరస్యం..దేశ సమగ్రతకు ముప్పు'...

హైదరాబాద్ : దేశంలో ఎన్నడూ లేనంతగా మత సామరస్యానికి, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లిందని సీపీఐ, కాంగ్రెస్ నేతలు నారాయణ, జైపాల్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. సీపీఐ నేత చండ్ర రాజేశ్వరరావు 102వ జయంతి సభ జరిగింది. ప్రస్తుత రాజకీయాలు - ప్రధాన సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నారాయణ, జైపాల్ రెడ్డిలు ప్రసంగించారు. అభ్యుదయ శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు చండ్రరాజేశ్వరరావు స్పూర్తితో ఉద్యమించాలని తెలిపారు. 

పుష్పరాజ్ కు మద్దతుగా సమావేశం..

గుంటూరు : టిడిపి అసంతృప్తి నేత పుష్పరాజ్ కు మద్దతుగా 13 జిల్లాల ప్రజా సంఘాలు, దళిత నాయకులు సమావేశమయ్యారు. ఆర్థిక నేరస్థులకు టిడిపిలో పదవులు ఇస్తున్నారని, పుష్పరాజ్ కు రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పి టీజీ వెంకటేష్ కు దానిని అమ్ముకున్నారని ఆరోపించారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై 13 జిల్లాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.

ఈతకు వెళ్లి అన్నాదమ్ముళ్లు మృతి..

అనంతపురం : కనగాపల్లి మండలం తూముచర్లలో విషాదం చోటు చేసుకుంది. ఫారం పౌండ్ లో ఈతకెళ్లి అన్నాదమ్ముళ్లు తేజ, అరుణ్ మృతి చెందారు. 

వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ పై ఆరోపణల్లో వాస్తవం లేదు - ఉమా భారతి..

న్యూఢిల్లీ: వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ కోసం చెట్లను నరుకుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమా భారతి పేర్కొన్నారు. ప్రపంచ సంస్కృతి పండుగ జరుగనున్న స్థలాన్ని ఆమె సందర్శించారు.

 

పుల్వామా జిల్లాలో పేలుడు..

జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు గాయపడ్డారు.

జాట్ రిజర్వేషన్ ల స్టేపై హైకోర్టు తీర్పు..

హర్యానా : జాట్‌ల రిజర్వేషన్లపై విధించిన స్టేను ఎత్తివేసేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు నిరాకరించింది. స్టేను ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పు చెప్పింది. తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది.

 

13:41 - June 6, 2016

విజయవాడ : నేటినుంచి ఏపీలో ఎంసెట్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 15 వరకు ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. 9వ తేదీ నుంచి 18 వరకు వెబ్‌ ఆఫ్షన్ల నమోదుతో పాటు.. 22న సీట్లను కేటాయించనున్నారు. కౌన్సెలింగ్‌కు విజయవాడలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

13:36 - June 6, 2016

హైదరాబాద్ : అమరావతికి సచివాలయ ఉద్యోగుల తరలింపుపై గందరగోళం కొనసాగుతోంది. రోడ్ మ్యాప్ ఇవ్వకుండా ఉద్యోగుల తరలింపు ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలని వారు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 27నాటికి అమరావతి నుండే పాలన కొనసాగాలనేది సర్కారు పేర్కొంది. ఈ క్రమంలో దశలవారీగా ఉద్యోగులను తరలిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తరలింపు విషయంలో సందిగ్ధత రోజురోజుకీ పెరుగుతోంది. జూన్ 27కే 15కు రమ్మన్నా వస్తాం కానీ.. లోకల్ స్టేటస్ విషయంలో స్పష్టనివ్వాలని ఉద్యోగులు అంటున్నారు. లోకల్ స్టాటస్ అనేది చిన్న విషయంకాదనీ..దీనిపై స్పష్టం చేయమనటం గొంతెమ్మ కోరి ఎలా అవతుందని వారు ప్రశ్నించారు. మూడు శాతం హెచ్ఆర్ఏ పై జీవో విడుదల చేయాలని కోరారు. తరలింపుకు సంబంధించిన అలవెన్స్ పై కూడా స్పష్టతనివ్వానివ్వాల్సిన అవసరముందున్నారు.

తుని ఘటనలో ప్రారంభమైన అరెస్టులు..

విజయవాడ : కాపు ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన రైలు దహనం, ఆపై జరిగిన విధ్వంసంలో సీఐడీ పోలీసులు అరెస్టులను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ టివి పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. 

నాంపల్లి కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన..

హైదరాబాద్ : న్యాయాధికారుల నియామకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. 

ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం..

విశాఖపట్టణం : ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు సోమవారం వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కౌన్సెలింగ్ ను ఆరంభించారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది. 22న సీట్లు కేటాయింపు, 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

జెనివాలో ప్రధాని మోడీ..

జెనీవా: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్‌ల్యాండ్‌కు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జోహన్ షియయిడర్ అమ్మన్‌తో భేటీ అయ్యారు. 

పుదుచ్చేరి సీఎంగా నారాయణ స్వామి ప్రమాణ స్వీకారం..

పుదుచ్చేరి : పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత నారాయణస్వామి ప్రమాణస్వీకారం చేశారు. నారాయణస్వామి చేత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రమాణస్వీకారం చేయించారు. నారాయణస్వామితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

లఖ్ న పూర్ లో బీజేపీ నేతల ఆందోళన..

ఉత్తరప్రదేశ్: లఖ్‌నపూర్‌లో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అఖిలేష్ ప్రభుత్వం కిరాయి రౌడీలతో భూకబ్జాలను చేయిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. మధుర ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీకి చేరుకున్న మంత్రి హరీష్ రావు బృందం..

న్యూఢిల్లీ : మంత్రి హరీష్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ బృందం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలువనుంది. సోమశిల ప్రాజెక్టు విషయమై కృష్ణా బోర్డు వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు.

'పంజాబ్‌ రాష్ట్రపతి పాలన విధించాలి '

పంజాబ్‌ : శాంతి భద్రతలు అదుపు తప్పాయని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రజింత్‌సింగ్‌ ధాద్రియన్‌వాలెలో దాడులు, మతాచంద్‌ కౌర్‌ను హతమార్చడం వంటి హింసాత్మక ఘటనలను గుర్తు చేసిన ఆయన .. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరాచకత్వం రాజ్య మేలుతోందని, రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రజలకు తిరిగి విశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు.

'అమరావతి ఫ్లైట్ ఆన్ రోడ్ బస్సు' ను ప్రారంభించిన బాబు..

విజయవాడ : నగరంలోని పడింట్ నెహ్రూ బస్ స్టేషన్ లో అమరావతి ఫ్లైట్ ఆన్ రోడ్ బస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు.సీటీ బస్ టెర్మినల్, ఆర్టీసీ పరిపాలన భవన్..వై స్క్రీన్స్ మల్టీ ఫెక్స్ థియేటర్ ను ఆయన ప్రారంభించారు.

ట్విట్టర్‌ వేదికగా మాటల తూటాలు...

విజయవాడ : సాంకేతికత అనేది తిట్ల పురాణాలకు వేదిగా మారిపోయింది. ప్రతిపక్ష..అధికారపక్ష  నేతలు ట్విట్టర్ లో టీట్లాడుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యతిరేకి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా వైకాపాపై పలు విమర్శలు గుప్పించారు. వైకాపా రాష్ట్ర వ్యతిరేకి అని చెప్పేందుకు అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటనే ఉదాహరణ అని అన్నారు. తెదేపా శ్రేణులను వైకాపా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, ఎవరూ ఆవేశానికి లోనుకావద్దని సూచించారు.

జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు: కామినేని

అనంతపురం : జగన్ అరాచకవాదిగా... సైకోగా ప్రవర్తిస్తున్నారని మంత్రి కామినేని అన్నారు. యాత్ర పేరుతో అనంతపురం జిల్లాను జగన్ కలుషితం చేస్తన్నారని ఆయన పేర్కొన్నారు.

కారు బోల్తా ..5గురికి గాయాలు...

రంగారెడ్డి: రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్టీవో ఆఫీసు ఎదుట కారు బోల్తా పడటంతో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పటాన్ చెరువు నుంచి హైదరాబాద్ వస్తుండగా అతివేగంతో వాహనం కంట్రోల్ తప్పి రిల్లింగ్ ను ఢీకొని బోల్తాపడింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులు హైదరాబాద్ జనుమాకు చెందిన వారిగా గుర్తించారు.

వ్యభిచారం చేస్తున్న ముఠా అరెస్ట్...

హైదరాబాద్ : రకరకాల కారణాలను చెప్పి ఇళ్లను అద్దెలకు తీసుకుని వ్యభిచారం చేయటం నగరంలో పలు ప్రదేశాలలో జరుగతోంది. ఈ క్రమంలో అనుమాతని ప్రదేశాలలో  పోలీసలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే నగరంలోని సైదాబాద్ కాలనీలో గుట్టు చప్పుడుగా వ్యభిచారం చేస్తున్న ముఠా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.9 మందిని అరెస్ట్ చేసిన సైదాబాద్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి యజమానులు పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే కిరాయికి ఇవ్వాలని పోలీసులు సూచించారు.

అమృత్‌సర్‌లో హై అలర్ట్‌ ....

పంజాబ్‌ : ఆపరేషన్‌ బ్లూస్టార్‌ జరిగి నేటికి 32ఏళ్లు అయిన సందర్భంగా భద్రత ఏజెన్సీలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరంలో అలర్ట్‌ ప్రకటించాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ఘటనను పురస్కరించుకుని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఈరోజు ప్రార్థనలు జరిగాయి. పారామిలిటరీ సిబ్బంది నగరమంతా మోహరించి పహరా కాస్తున్నారు. స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలను అడ్డుకుంటామని కొందరు హెచ్చరించడంతో అధికారులు భద్రతను పెంచారు.

సాకులు చెప్పటం సరికాదు : చంద్రబాబు

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను సీఎం చంద్రబాబు సందర్శించారు. భవన నిర్మాణాలు పూర్తికాలేదు కాబట్టి వెలగపూడికి రాలేమని ఉద్యోగులు సాకులు చెప్పటం సరికాదని ఆయన పేర్కొన్నారు. మరో 10,15 రోజుల్లో పూర్తయిన భవనాల్లోకి ఉద్యోగులను తరలిరావాలన్నారు. ముందుగా ఎవరెవరు రావాలో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. ఈనెల 27లోగా ఎన్ని భవనాలు పూర్తయితే అన్ని భవనాల్లో ఉద్యోగులు తరలింపు వుంటుందని ఆయన తెలిపారు.

జగన్ అరాచకవాది, సైకో : మంత్రి కామినేని

అనంతపురం : వైసీపీ నేత జగన్ ఓ అరాచకవాది, సైకోలా ప్రవర్తిస్తున్నాడని మంత్రి కామినేని విమర్శించారు. యాత్ర పేరుతో అనంతపురం జిల్లాను జగన్ కలుషితం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు సహనం ఎక్కువని, జగన్ ఏ పదవి చేపట్టడానికి అర్హుడు కాదన్నారు. 

12:13 - June 6, 2016

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను సీఎం చంద్రబాబు సందర్శించారు. భవన నిర్మాణాలు పూర్తికాలేదు కాబట్టి వెలగపూడికి రాలేమని ఉద్యోగులు సాకులు చెప్పటం సరికాదని ఆయన పేర్కొన్నారు. మరో 10,15 రోజుల్లో పూర్తయిన భవనాల్లోకి ఉద్యోగులను తరలిరావాలన్నారు. ముందుగా ఎవరెవరు రావాలో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. ఈనెల 27లోగా ఎన్ని భవనాలు పూర్తయితే అన్ని భవనాల్లో ఉద్యోగులు తరలింపు వుంటుందని ఆయన తెలిపారు.

5వ అంతస్థు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య....

హైదరాబాద్ : అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఉప్పల్‌లో సోమవారం వెలుగుచూసింది. ఉప్పల్ ఆదర్శనగర్‌లోని జయధీర్ అపార్ట్‌మెంట్ 5వ అంతస్థులో ఉండే తన అన్న నివాసానికి వచ్చిన ప్రభాకర్‌రెడ్డి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

పుష్కర పనులపై చీఫ్ ఇంజనీర్ ఆగ్రహం...

నల్లగొండ : కృష్ణాపుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై ఎన్‌ఎస్‌పీ చీఫ్ ఇంజనీర్ సునిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల కృష్ణానది పుష్కర స్నానఘట్ట పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాలు జరగనుండటంతో.. జూలై నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.

12:01 - June 6, 2016

పుదుచ్చేరి : ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యహ్నం 12.10 గంటలకు బీచ్‌ రోడ్‌లో జరిగే కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ప్రమాణం చేయిస్తారు. నారాయణస్వామితోపాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నమశివాయం, కండస్వామి, షాజహాన్‌, రామకృష్ణన్‌, యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావులకు చాన్స్‌ లభిస్తుందని భావిస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీకి గత నెల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, డీఎంకే కూటమి విజయం సాధించింది. డీఎంకే అధినేత కరుణానిధి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. 

కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు సమస్యలు సహజం: సీఎం చంద్రబాబు

అమరావతి : కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు సమస్యలు సహజమని సీఎం చంద్రబాబు వివరించారు. ఏపీ రాజధాని ప్రాంతం వెలగపూడిలో నిర్మిస్తున్నా తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ... వీలైనంత త్వరగా సచివాలయ పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. స్వరాష్ట్రం నుంచి పాలన చేస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని సీఎం అన్నారు. ఈనెల 27లోగా ఎన్ని భవనాలు పూర్తయితే అన్ని భవనాలకు సరిపడా ఉద్యోగులను తరలిస్తామని సీఎం తెలిపారు. ముందు ఎవరెవరు రావాలో 2 రోజుల్లో స్పష్టత ఇస్తామని, భవనాలు పూర్తి కాలేదని సాకులు చెప్పడం సరికాదన్నారు.

11:57 - June 6, 2016

గుజరాత్ : 2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత జరిగిన గుల్మార్గ్‌ సొసైటీ నరమేధం కేసులో దోషులుగా తేలిన 24 మందికి అహ్మదాబాద్‌ ప్రత్యేక న్యాయస్థాని ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. గుల్మార్గ్‌ అల్లర్లలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఈషన్‌ జాఫ్రీతో సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 66 మంది నిందితులపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం... 24 మందిని దోషులుగా ప్రకటిస్తూ ఈనెల 2న తీర్పు చెప్పింది. కేసు విచారణలో ఉండగా నిందితుల్లో ఆరుగురు మరణించారు. వీరిలో 11 మందికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ కోరే అవకాశం ఉంది. అయితే నిందితుల తరపున కేసు వాదించిన న్యాయవాది జీవిత ఖైదుకు విజ్ఞప్తి చేయొచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో నేరపూరిత కుట్రకు సాక్ష్యాధారాలు లేవని తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం...ఐపీసీ లోని 120-బి సెక్షన్‌ కింది చార్జ్‌షీటులో ప్రస్తావించిన నేరాభియోగాలను పక్కన పెట్టింది.  

11:51 - June 6, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో కిడ్నాప్‌ డ్రామా సుఖాతం అ‌య్యింది. భీమవరం మార్కెట్ ప్రాంతంలో ఉండే సుబ్బారావు-రాణి దంపతులు... తమ కుమారుడు కనబడటం లేదని ఈనెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు రోజులపాటు బాలుడిని కనబడకుండా ఉంచిన కిడ్నాపర్లు 5వతేదీన వదిలిపెట్టారు. మార్కెట్‌ ప్రాంతంలో బాలుడిని వదిలేసి వెళ్తున్న ఇద్దరు మహిళలను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషించారు.

11:49 - June 6, 2016

పశ్చిమ గోదావరి : గాలివాన తెలుసు.. వడగళ్లవాన తెలుసు.. కానీ చేపల వర్షాన్ని ఎప్పుడైనా చూశారా? అలస్కా, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో సర్వసాధారణంగా కనిపించే చేపల వర్షం.. ఇప్పుడు ఏపీలోనూ కురుస్తోంది. ఆ మధ్యలో కృష్ణా జిల్లా గొల్లమూడిలోనూ, గుంటూరు ఉయ్యూరివారి పాలెంలోనూ చేపల వాన కురిసింది. తాజాగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోనూ చేపల వాన పడింది. అసలీ చేపల వర్షం ఎలా కురుస్తుంది. దీనికి రీజనేంటి. ఆకాశం నుండి చేపలు కిందపడటం వింతగా ఉంది కదూ.. అప్పుడప్పుడు ఇలా వర్షంతో పాటు చేపలు, కప్పలు, తేలికపాటి పాములు కింద పడుతుంటాయి.

మొదటిసారిగా 1794లో ఫ్రెంచ్‌లో గుర్తింపు...
చేపల వర్షాన్ని మొదటగా 1794లో ఫ్రెంచ్‌లో గుర్తించారు. తర్వాత 1857లో కాలిఫోర్నియాలో కనుగొన్నారు. తర్వాతి కాలంలో శ్రీలంక, సింగపూర్‌, థాయిలాండ్‌, అలస్కాతో పాటు మనదేశంలోనూ చేపల వర్షం పడినట్లుగా దాఖలాలున్నాయి. గుజరాత్‌, వారణాసిలోనూ చేపల వర్షాలు కురిశాయి.

చేపల వర్షానికి కారణం టోర్నెడోలేనంటున్న శాస్త్రవేత్తలు...
చేపలు ఇలా గాల్లోనుంచి పడడానికి టోర్నెడోలే కారణమన్నది శాస్త్రవేత్తల నిర్ధారణ. వీటి ధాటికి కుంటలు, చెరువుల్లోని నీటితో పాటు చేపలు, కప్పలు, తేలికైన పాములు పైకి లేచి మేఘాల్లో కలిసిపోతాయి. మేఘాలు కొంత దూరం ప్రయాణించి ద్రవీభవించి వర్షంగా కురుస్తాయి. ఈ సమయంలో మేఘాల్లో ఉండే చేపలు, కప్పలు, పాములు కిందపడతాయి. ఇవి మేఘాల్లో ఉండగా అక్కడ నీటిలో ఉండే ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని జీవిస్తాయి. ఎక్కడో అమెరికా లాంటి దేశాల్లో టోర్నెడోలు తరచూ వస్తాయి కాబట్టి.. చేపల వాన కురవొచ్చు.. మరి మనదేశంలో టోర్నెడోలు లేకుండానే ఈ చేపలవర్షం ఏంటి..?

ఇండియాలో కనిపించని టోర్నడోలు...
మనదేశంలో టోర్నడోలు కనిపించవు.. అయితే గాలిదుమారాలు.. సుడిగాలి వంటి వాటికి కుంటలు, చెరువుల్లోని చేపలు పైకి లేచి మేఘాల్లో కలిసిపోతాయి. అలా వర్షంతో పాటు కింద పడతాయి. చేపలు సహజంగా నీటికి ఎదురు ఈదుతుంటాయి. ఈ కారణంతోనే మేఘాల్లోకి తేలికగా కలిసిపోతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం...

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది కోస్తా తీరానికి ఆనుకుని పయనిస్తున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి రుతపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... మరో 2-3 రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

తెలంగాణ లో కొత్తగా 60 ఏసీ బస్సులు...

హైదరాబాద్ : తెలంగాణాలో త్వరలో 60 ఏసీ బస్సులు, 280 ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. ఆర్టీసీ ప్రస్తుతం అప్పుల్లో ఉందని, పల్లెపల్లెకు ఆర్టీసీ బస్సులు నడపడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతన్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. 

11:32 - June 6, 2016

హైదరాబాద్: దశాబ్దం క్రితం వరకూ హీరోయిన్‌గా మురిపించిన సంఘవి మళ్లీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ఆమె దక్షిణాది భాషలన్ని కలిపి దాదాపు 80 చిత్రాల్లో నటించారు. 2005 వరకు హీరోయిన్ పాత్రల్లో రాణించినా... ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో పరిశ్రమకు దూరమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరుకి చెందిన పారిశ్రామికవేత్త వెంకటేష్‌ని పెళ్లి చేసుకొని వివాహబంధంలో అడుగుపెట్టారు. అయితే భర్త అనుమతించడంతో పెళ్లి తరువాత కూడా నటించేందుకు సిద్ధమని సంఘవి వెల్లడించడంతో తమిళంలో ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్‌గా కాకపోయినా, కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్ని ఎంచుకుంటున్నారు సంఘవి. ఈ కోవలోనే ‘మూడార్‌ కూడమ్‌’, ‘కొళంజి’ చిత్రాల్లో నటిస్తున్నారు. తన రెండో ఇన్సింగ్స్‌కు ఈ రెండు చిత్రాలు ఎంతో కీలకమైనవని ఓ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నటనకు ప్రాధాన్యమున్న ఏ పాత్రల్లో అయినా నటించేందుకు తాను సిద్ధమని సంఘవి తెలిపారు.

11:26 - June 6, 2016

ముంబై: బయోపిక్‌లకు పెట్టింది పేరు ఒమంగ్‌కుమార్‌. మేరీకోమ్‌, సరబ్‌జీత్‌ చిత్రాలతో సక్సెస్‌ అందుకున్న ఒమంగ్‌ ఇప్పుడు సైకలాజికల్‌ థ్రిల్లర్‌తో అలరించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని ఒమంగ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకుముందు ఈసినిమాలో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఒమంగ్‌ మాత్రం అక్షయ్‌నే ఎంచుకోనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ సినిమా కోసం ఒమంగ్‌ అక్షయ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ అనకున్నట్లు జరిగితే 2017లో ఈ చిత్రంసెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

11:20 - June 6, 2016

హైదరాబాద్ :మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌‍ నటిస్తున్న క్రేజీ చిత్రం 'బాబు బంగారం'. ఈ చిత్రం టీజర్‌ను నేడు విడుదల చేశారు. వెంకీ పోలీస్‌ గెటప్‌లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లాగా ఈ చిత్రం టీజర్‌ కనిపిస్తుంది. వెంకీ సరసన నయనతార హీరోయిన్‍గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నారు.

భీమవరంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు: మధు

.గో : రేపటి నుండి 9వ తేదీ వరకు భీమవరంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేస్తే అభివృద్ధి నిరోధకులనడం చేతగాని తనమే ని అని అన్నారు. ఏపీలో 10 జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. 

నాంపల్లి కోర్టు ముందు టి.న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్: నాంపల్లి కోర్టు ముందు తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని, న్యాయాధికారుల కేటాయింపు నిలిపివేయాలని న్యాయవాదులు ధర్నా చేస్తున్నారు. 

వెలగపూడికి సీఎం చంద్రబాబు

గుంటూరు : తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదంటూ ఉద్యోగుల ఆరోపణల నేపథ్యంలో నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

10:59 - June 6, 2016

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించున్నారు. జూన్ 17 నాటికే ఈ నిర్మాణం పూర్తవుతుందని కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకూ పూర్తికాని అసంపూర్తి పనులతో నూతన రాజధానికి రామని ఉద్యోగులు ప్రకటించటంతో సర్కారు గందరగోళంలో పడింది. జూన్ నెలాఖరుకల్లా ఉద్యోగులను ఎట్టిపరి స్థితులలోనూ ఏపీ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎటువంటి వసతులు లేకుండా నూతన రాజధానికి వచ్చేది లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల చేసిన ఆరోపణలో ఎంతవరకూ వాస్తవం వుంది అనే విషయాన్ని తెలుసుకోవాటానికి సీఎం వెలగపూడి ప్రాంతాలన్ని పరిశీలించటానికి రానున్నారు. శంకుస్థాపన అనంతరం మూడోసారి బాబు ఈ ప్రాంతాన్ని సందర్శంచనున్నారు. 

కారు బోల్తా: నలుగురికి గాయాలు..

హైదరాబాద్: నార్సింగిలో వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లనే కారు బోల్తా పడిందని పోలీసులు భావిస్తున్నారు. 

10:55 - June 6, 2016

వరంగల్‌ : డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఏటీఎం సెంటర్లు వెలిశాయి.. ఇప్పుడు మంచినీటి కోసం అవస్థలు పడకుండా.. ఏటీడబ్ల్యూ సెంటర్లు విస్తరిస్తున్నాయి. ట్యాప్‌ తిప్పితే కాదు...కార్డు పెడితే నీరు వస్తోంది... అవును.. వరంగల్‌ జిల్లాలో ఇప్పుడు ఏనీ టైం వాటర్‌ సదుపాయం ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది.

పాపులర్‌ అవుతున్న ఏటీడబ్ల్యూ ...
వరంగల్‌ జిల్లాలో ఎటీఎంలతో పాటే.. ఇప్పుడు ఏటీడబ్ల్యూ లూ పాపులర్‌ అవుతున్నాయి. నీటి వృథాను అరికట్టాలనే ఉద్దేశంతో బాలవికాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎనీటైం వాటర్‌ స్కీమ్‌ని ప్రవేశ పెట్టింది. ఈ సంస్థ తాను పనిచేస్తున్న గ్రామాల పరిధిలో రూపాయికే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఈ ఏటీడబ్ల్యూ  కేంద్రాలను ఏర్పాటు చేసింది.

283 కుటుంబాలకు ఏటీడబ్ల్యూ కార్డులు అందజేత...
జిల్లాలోని గంగాదేవి పల్లిలోని 283 కుటుంబాలకు ఏటీడబ్ల్యూ కార్డులను అందజేసింది బాలవికాస్‌ సంస్థ. ప్లాంటు వద్ద అమర్చిన మిషన్‌కు ఏటీడబ్ల్యూ కార్డును తాకిస్తే చాలు.. అందులోంచి నీరొస్తుంది.

ఆల్ఫా ఎలక్ట్రానిక్ సిస్టమ్ సహాయంతో ఏటీడబ్ల్యూ విధానం..
జీపీఆర్ఎస్ , ఆర్ఎఫ్ఐడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏటీడబ్ల్యూ సెంటర్లు నడుస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆల్ఫా ఎలక్ట్రానిక్ సిస్టమ్ సహాయంతో ఏటీడబ్ల్యూ విధానాన్ని బాల వికాస సంస్థ అమలు చేస్తోంది. ఏటీడబ్ల్యూ కార్డు కోసం ఏడాదికి రూ.360 చెల్లించాలి. అదనంగా అవసరమైతే నాలుగు రూపాయలకు 20 లీటర్ల చొప్పున తీసుకునే వెసులుబాటూ ఉంది. ఈ కార్డులను ఏడాదికోసారి రీచార్జ్ చేస్తారు.

ఏటీడబ్ల్యూ కేంద్రాలకు శ్రీకారం చుట్టిన వెంకటాపురం...
2012లో వరంగల్ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్ మండలం వెంకటాపురంలో మొదలైన ఈ సరికొత్త సౌకర్యం... ఇప్పుడు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లోని 351 గ్రామాలకు విస్తరించింది. అదే విధంగా బాటసారుల దాహార్తిని తీర్చడానికి కూడా హన్మకొండ, కలెక్టరేట్‌, కాలోజీ జంక్షన్‌, పబ్లిక్‌గార్డెన్‌ ఎదుట ఏటీడబ్ల్యూ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను మరింత విస్తరిస్తామని, బాలవికాస్‌ ప్లాంట్లు ఉన్న ప్రతిచోట ఏటీడబ్ల్యూ కార్డులను ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

విజయవంతంగా ఏటీడబ్ల్యూ ...
ఏది ఏమైనా ..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవసరాలు అతి సులభంగా తీరుతున్నాయి. ఈ ఏటీడబ్ల్యూతో దాహం తీరడమే కాదు.. సౌకర్యవంతంగా కూడా ఉందని వినియోగదారులు అంటున్నారు. అందుకే ఈ ఏటీడబ్ల్యూ లు ఏర్పాటు చేసిన అన్ని గ్రామాల్లోనూ విజయవంతంగా నడుస్తున్నాయి.

 

10:44 - June 6, 2016

నిజామాబాద్ : అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది నిజామాబాద్ జనరల్‌ ఆసుపత్రి తీరు. రెండు శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం ఇక్కడ పనిచేసే సిబ్బందికి శాపంగా మారింది.. దీంతో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి విధులు నిర్వహిస్తున్నారు. తమది పైచేయి అంటే తమదే పై చేయి అంటూ ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. దీంతో ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పరిస్థితి సమయానికి వైద్యం అందక నిత్య నరకంగా మారింది ...

వైద్యం అందక రోగుల బాధలు ...
అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది నిజామాబాద్ జనరల్‌ ఆసుపత్రి తీరు. రెండు శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం ఇక్కడ పనిచేసే సిబ్బందికి శాపంగా మారింది.. దీంతో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి విధులు నిర్వహిస్తున్నారు. తమది పైచేయి అంటే తమదే పై చేయి అంటూ ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. దీంతో ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పరిస్థితి సమయానికి వైద్యం అందక నిత్య నరకంగా మారింది ...

వైద్య సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు ...
అయితే అందుకనుగుణంగా వైద్య విధాన పరిషత్ వైద్యులు, సిబ్బంది సేవలను కాకుండా డీఎంఈ పరిధిలోని వైద్యులు, సిబ్బంది నియమాకాలు వివిధ సాంకేతిక కారణాలతో చేపట్టలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య విద్య పరిధిలో పనిచేసే వారికోసం డిసెంబర్ లో వైద్య విధాన పరిషత్ వైద్యులు, సిబ్బంది కోసం కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 175 మందికి గాను 160 మంది వైద్య విద్య పరిధిలో పనిచేసేందుకు విల్లింగ్ ఇచ్చారు. కానీ విధానాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వ లేదు. వైద్యులు డీఎంఈ పరిధిలోని సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా పారామెడికల్ సిబ్బంది వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ పరిధిలో పనిచేస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

వైద్యం అందక రోగులు అవస్థలు ...
అసలే సిబ్బంది, వైద్యుల కొరతతో రోగులకు సమయానికి వైద్యం అందక రోగులు చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి...జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 30 మంది మినిస్టీరియల్ సిబ్బందికి గానూ ఆరుగురు, 168 మంది నర్సింగ్ సిబ్బందికి గానూ 70 మంది, 65 మంది పారామెడికల్ సిబ్బందికి గానూ కేవలం 25 మంది, 97 మంది నాల్గవ తరగతి ఉద్యోగులకు గానూ 25 మంది మాత్రమే పనిచేస్తున్నారు... వైద్యుల విషయానికి వస్తే 107 మందికి బదులు 51 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది కూడా మొక్కుబడిగా విధులు నిర్వహించడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు సమయానికి వైద్యం అందక అవస్థలు పడుతున్నారు.

వైద్య సేవలు అందటం లేదని పలువురు విమర్శలు..
ఈ ఆసుపత్రికి నిత్యం 500 నుంచి 700 మంది ఔట్ పెషంట్లు, 100 నుంచి 150 వరకు ఇన్ పేషంట్లుగా వస్తుంటారు. కానీ సిబ్బంది కోరత కారణంగా ఇక్కడ వైద్య సేవలు అందటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సీరియస్ కేసులు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇక్కడి సిబ్బంది హైదరాబాద్ తీసుకెళ్లండంటు సలహాలు ఇస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు వైద్యులు కొరత, మరోవైపు ఉన్న వైద్యులు సమయపాలన పాటించకపోవడం.. దీనికి తోడు వైద్యుల ఆధిపత్య పోరు వెరసీ వైద్యం కోసం వచ్చే రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

10:35 - June 6, 2016

ఆడపిల్ల అనగానే పురిట్లోనే చంపే రోజులు పోవాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదేంటీ ? ఇలా అంటున్నారేంటీ ? అనుకుంటున్నారా ? కేంద్ర ప్రభుత్వం 'బేటీ బచావో.. బేటీ పడావో' పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం మరింతగా జనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశ్యంతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే స్లిప్స్ పై యాడ్ ను తెలుగులో అనువదిస్తూ..ప్రచురించింది. అది ఎలా ఉందంటే “గర్వంగా నిర్ణయం తీసుకోండి-కన్యా భ్రూణ హత్యలు చేయమని” రాసుంది. దీనిని చూసిన జనాలు షాక్ అయ్యారు..ఓ పక్క ఆడ పిల్లలను బ్రతికించండి అంటూ మరో పక్క చంపండి అని ప్రచారం చేయడంతో షాక్ అవుతున్నారు. అసలు కారణమేంటీ ? అంటే యాడ్ ఆడపిల్లలను బతకనివ్వండి అనే అర్ధం వచ్చేలా డిజైన్ చేయాల్సి పోయి ట్రాన్స్ లెటర్స్ బహుశా ఈ యాడ్ ను తెలుగులోకి అనువదించి ఇప్పుడు ఆడపిల్లని తెలిస్తే.. భ్రూణ హత్య చేయమని అర్ధం వచ్చేలా ముద్రించారు. దాంతో ఈ తప్పు జరిగింది. మొత్తానికి ఈ యాడ్ చూసిన జనాలు మాత్రం.. వెర్రెక్కిపోతున్నారు. తెలుగుకు ఇంత తెగులు పట్టిందా అని అనుమానం వస్తుంది. ఇప్పటికైనా సరిచేస్తే ఒకే..లేకుంటే వెంటనే సరి చేయాలని జనాలు కోరుతున్నారు. 

10:34 - June 6, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో ప్రాజెక్టు నిర్మాణం రోజురోజుకీ వివాదంగా మారుతోంది. ఈ నిర్మాణం నిర్వాశితుల ప్రాణాల కూడా హరిస్తోంది. యూనిటీకి మారుపేరుగా గిరిజనుల సంబంధాలను ఈ ప్రాజెక్టు దెబ్బతీస్తోంది. మల్లన్న ప్రాజెక్ట్ మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేయనుందా? అంటే నిజమనే అనుకోవాల్సి వస్తోంది. సోమవారం నాడు మల్లన్న సాగర్ ముంపు ఏటికిష్ణాపూర్ తండిచెందిన భానోత్ చావలికి గుండెపోటు సంభవించింది. దీంతో ఆమెను సిద్ధిపేట ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు ప్రాజెక్ట్ నిర్మాణంతో భూమిని కోల్పోతామనేదిగులుతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా వారంరోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన కరుణాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. భూసేకరణ నష్టపరిహారం డబ్బు ఎవరికి చెందుతుంది అనే విషయంలో కుటుంబంలో కలహాలు తలెత్తటంతో కరుణాకర్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో బాధితుల సదరు కుటుంబంలో ఆర్థిక వివాదాలు తలెత్తుతున్నాయి. 

10:16 - June 6, 2016

లూయిస్‌విల్లే : బాక్సింగ్‌ దిగ్గజం మహ్మద్‌ అలీకి యావత్‌ ప్రపంచం అశ్రు నివాళి అర్పించింది. బాక్సింగ్‌ రింగ్‌ ఓ గొప్ప యోధుడిని కోల్పోయిందని క్రీడా లోకం రోదిస్తోంది. 74 ఏండ్ల మహ్మద్‌ అలీ.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అలీ భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం లూయిస్‌విల్లేకు తరలించారు. ఆయన ఇంటి వద్ద అభిమానులు విశేష సంఖ్యలో ఫోటోలు, పూలు, బాక్సింగ్‌ గ్లోవ్స్ ఉంచి నివాళి అర్పించారు. 'ది గ్రేటెస్ట్' మహ్మద్‌ అలీ అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి. అంతిమయాత్ర సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అలీ స్మారకోపన్యాసం చేయనున్నారు. ప్రముఖ హాస్య నటుడు బిల్లీ క్రిస్టల్‌, జర్నలిస్ట్ గంబెల్‌లు సైతం అంతిమయాత్రలో ఉపన్యసించనున్నారు.

10:14 - June 6, 2016

చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి రోజుకొక వార్త సామాజిక మీడియాలోనే కాదు ఫిల్మ్ నగర్‌ వర్గాల్లోనూ హల్‌చల్‌ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు మెగాస్టార్‌ సరసన నయనతార, అనుష్క, కాజల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్‌లోని అగ్రహీరోయిన్ల జాబితా మొత్తం వినిపించినప్పటికీ తాజాగా చిరు సరసన బాలీవుడ్‌ అందాల భామ దీపికా పదుకొనె నటించనుందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఈ చిత్రం కోసం చిత్ర బృందం ఇటీవల దీపికని సంప్రదించిందట. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కత్తి' రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలుసుకున్న దీపిక కూడా ఈ చిత్రంలో నటించేందుకు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. దీంతో మెగాస్టార్‌ సరసన దీపిక వాట్‌ ఏ కాంబినేషన్‌.. సూపర్‌ అంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో రకరకాల కామెంట్స్‌తో అదర గొట్టేస్తున్నారు.

10:10 - June 6, 2016

సమయం సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్‌ సమస్య పెరిగి, శరీరపటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా.. అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనుషులను శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి తన సాధారణ శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుంది. ఓ క్రమపద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం మహిళలో రుతుక్రమానికి (పీరియడ్స్) సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
బలీమియా, బింగీ వ్యాధులకు చాలా సారూప్యత ఉంది. కానీ ఈ రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాధి సోకడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి.
ఇకపోతే బింగీ వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి ఫలితాలనే చూపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాదు.
కొందరు యువతీయువకులు తమ శరీరాలను నాజూగ్గా ఉంచుకోవడానికి కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధులు సోకే ఆస్కారం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాబట్టి ఎన్ని పనులున్నా సమయానికి కడుపు నిండా భోంచేసి ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు. 

వెలగపూడికి వెళ్లనున్న సీఎం బాబు..

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదంటూ ఉద్యోగులు పేర్కొన్న విషయం తెలిసిందే. 

09:59 - June 6, 2016

కొందరు పిల్లలు పాలు తాగరు, పండ్లు తినరు. ఆకుకూరలు, కూరగాయల భోజనాన్ని అస్సలు ఇష్టపడరు. అలాంటి వారితో పాలు తాగించడానికి, పండ్లు తినిపించడానికి కొన్ని చిట్కాలు..
పిల్లలు ఇష్టంగా పండ్లు తినకపోతే వాటిని ఫ్రూట్‌ సలాడ్స్‌గా, కస్టర్డ్‌తో కలిపి పెట్టాలి. లేదా జ్యూస్‌ రూపంలో ఇవ్వాలి. మిల్క్‌షేక్‌గా ఇవ్వొచ్చు. పాలతో తయారైన స్వీట్స్‌ తినిపించండి.
కూరగాయలు తినని పిల్లలకు.. వెజిటబుల్‌ ఆమ్లెట్‌, గ్రిల్డ్ వెజిటబుల్‌ శాండ్‌విచ్‌.. ఇలా రకరకాలుగా ఇవ్వాలి.
న్యూడిల్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి.. గోధుమలతో తయారైన న్యూడిల్స్ మాత్రమే ఇవ్వాలి. వాటిలో రకరకాల కూరగాయల ముక్కలను కూడా వేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా కూడా తింటారు.
మాంసాహారం తినేవారైతే చేపలు, తినని వారికి రెగ్యులర్‌ డైట్‌లో పప్పులుండేలా చూసుకోవాలి.
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌ వంటివి పిల్లలు ఇష్టంగా తింటారు. అవి క్రమం తప్పకుండా చేయడం ద్వారా పిల్లల్లో తినే అలవాటు పెంచవచ్చు.

ఢిల్లీకి బయలుదేరిన మంత్రి హరీష్ రావు...

హైదరాబాద్: మంత్రి హరీష్ రావు బృందం ఢిల్లీ బయలుదేరింది. సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో హరీశ్‌రావు, ఎంపీలు సమావేశం కానున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై కేంద్రంతో రాష్ట్ర బృందం చర్చించనుంది.

మల్లన్న సాగర్ నిర్వాశితురాలికి గుండెపోటు...

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంత గ్రామంలో విషాదం అలుముకుంది. ఏటిగడ్డ, కిష్ణాపూర్ తండాలో ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సిద్ధిపేట ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామం ముంపుకు గురవుతోందని సదరు మహిళ ఆవేదనకు గురయ్యింది. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లుగా గ్రామస్థులు భావిస్తున్నారు.

చెరువుకు గండి..పట్టించుకోని యాంత్రంగం..

కర్నూలు: జూపాడుబంగ్లా మండలం మండ్లెం చెరువుకు భారీ గండి పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులో వరద నీరు చేరి గండి పడింది. దీంతో నీరు వృథాగా పోతుంది. అయినా సాగునీటిపారుదల అధికారులు పట్టించుకోవడం లేదు.

మండ్లెం చెరువుకు భారీ గండి..

కర్నూలు: జూపాడుబంగ్లా మండలం మండ్లెం చెరువుకు భారీ గండి పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులో వరద నీరు చేరి గండి పడింది. 

బైక్ ను ఢీకొన్న కారు..ఒకరు మృతి..

తూర్పుగోదావరి : గొల్లప్రోలు మండలం చెందుర్తి జంక్షన్‌ దగ్గర జాతీయరహదారిపై వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. 

09:18 - June 6, 2016

సర్కారు నిర్వాకంతో 'కరిగి'పోతున్న కలలు..శ్రీకాకుళం : ఆ ప్రాంతంలో విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి.. ఈడొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లూ కావడం లేదు. ఎవరికైనా రోగమో రొచ్చో వస్తే.. వైద్యం చేయించుకునే పరిస్థితీ లేదు. దీనంతటికీ ప్రభుత్వ నిర్వాకమే కారణమంటే ఆశ్చర్యం కలగొచ్చు కానీ ఇది అక్షర సత్యం. ఇంతటి దుస్థితి ఎక్కడ..? అన్నదేగా మీ సందేహం. వాచ్‌ దిస్‌ స్టోరీ..

భావనసాడు పోర్టు నిర్మాణ ప్రాంతీయుల దుస్థితి...
ఇదీ శ్రీకాకుళం జిల్లా భావనసాడు పోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంత ప్రజల దుస్థితి..! ఈ ప్రాజెక్టు వల్ల తమ బతుకులు బాగు పడతాయని స్థానికులు కలలు కన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా.. వారి కలలు కల్లలే అవుతున్నాయి.

పోర్టు కోసం 2200 ఎకరాల భూమి...

సిక్కోలు జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ పంచాయితీ పరిధిలో సూర్యమణిపురం, చీపురుపల్లి, దేవునల్తాడ గ్రామాలకు చెందిన 2200 ఎకరాల జిరాయితీ భూమిని భావనపాడు పోర్టు కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమిని సంత బొమ్మాళి మండల పరిధిలో సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పోర్టు అవసరాలకన్నా ఎక్కువ భూమిని సేకరిస్తుండడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

భావనపాడులో నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు ...
భావనపాడు పోర్టు నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూమిని అడ్డగోలుగా సేకరించి... సర్కారే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న విమర్శలున్నాయి. వీటిని బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వం భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పనిలోపనిగా అధికారులు ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలను నిలిపేశారు. దీంతో ప్రజలు భూములను అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.
భూసేకరణతో నిలిచిపోతున్న వివాహాలు, చదువులు...
భావనపాడు పోర్టు కోసం భూమిని సేకరిస్తున్న ప్రాంతంలో.. సుమారు 12 వందల కుటుంబాలు ఉన్నాయి. వీటిల్లో చాలా కుటుంబాల్లో ఈడొచ్చిన పిల్లలున్నారు. పొలం అమ్మి పిల్లల పెళ్లిళ్లు చేద్దామనుకున్న వారు.. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో.. పెళ్లిళ్లు ఆపేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌లపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్థానికులు డిమాండ్...
అధికారుల నిర్వాకం వల్ల.. భూములు అమ్ముకునే పరిస్థితి లేక.. పిల్లల చదువులు, తమ వైద్యం కోసం డబ్బులు సమకూర్చుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గోడు చెప్పుకుందామని ప్రజలు అధికారులను ఆశ్రయిస్తే.. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొమ్మని ఉచిత సలహా ఇస్తున్నారు. మొత్తానికి భావనపాడు పోర్టు వచ్చే సంగతేమో కానీ.. సర్కారు నిర్ణయం వల్ల.. ఇక్కడి ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కనీస కుటుంబ పోషణకూ డబ్బులు పుట్టని దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్‌లపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్థానికులు కోరుతున్నారు. 

09:01 - June 6, 2016

ప్రకాశం : కాదేది కబ్జాకు అనర్హం..! ఇదీ రియల్టర్లుగా అవతారమెత్తిన అధికార పార్టీ పెద్దల సూత్రం. ఇంతకాలం.. ప్రభుత్వం.. ప్రైవేటు అంటూ తేడా లేకుండా భూముల్ని కబ్జా చేసిన వ్యక్తులు.. ఇప్పుడు ప్రకృతి వనరులపైనా పడ్డారు. కనిపించిన ప్రతి చెరువునూ కబ్జా చేసి పారేస్తున్నారు. క్రమంగా ఓ వైపు నుంచి చెరువును కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ దందా యమజోరుగా సాగుతోంది.

దర్శి నియోజక వర్గంలో యథేచ్ఛగా సాగుతున్న కబ్జాలు....
ప్రకాశం జిల్లాలో కబ్జాకోరుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ముఖ్యంగా.. దర్శి నియోజక వర్గంలో కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇన్నాళ్లూ భూముల్ని ఆక్రమించిన కబ్జాకోరులు.. ఇప్పుడు చెరువుల్నీ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ముండ్లమూరి మండలంలో ఈ రకం దందా ఎక్కువగా సాగుతోంది. మండలంలో 22 చెరువులుంటే.. 50శాతం వరకూ.. అన్యాక్రాంతమయ్యాయి. కబ్జాకోరులకు అధికార పార్టీ పెద్దల అండదండలున్నాయన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అందుకే చెరువుల కబ్జా గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆరోపిస్తున్నారు.

ముండ్లమూరు మండలంలో దర్జాగా చెరువుల కబ్జా...
ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో కుంచించుకు పోయిన చెరువు.. కబ్జాకోరుల దూకుడుకు నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం 278 ఎకరాల్లో విస్తరించిన చెరువు ప్రస్తుతం 150 ఎకరాలకే కుంచించుకు పోయింది. అంటే దాదాపు 120 ఎకరాల చెరువు కబ్జాకు గురైంది. ఇక్కడ ఎకరం స్థలం ఎనిమిది లక్షల రూపాయలు పలుకుతోంది. అంటే.. దాదాపు 12 కోట్ల విలువైన చెరువు భూమి అన్యాక్రాంతమైందన్నమాట. దీని పక్కనే ఉన్న 31 ఎకరాల దాదాబాయి చెరువు కూడా ఇప్పుడు 20 ఎకరాలకే కుంచించుకు పోయింది. ఈ చెరువుకు సంబంధించిన పది ఎకరాలు కబ్జాకోరుల పాలైంది. వీటితో పాటు అక్కడికి మరికొంత దూరంలో 120 ఎకరాలలో ఉన్న పెద్ద చెరువు కూడా ఆక్రమణకు గురైంది.

పట్టించుకోని అధికారులు.. స్థానికుల ఆవేదన..
ఈ ప్రాంతంలో చెరువుల కబ్జా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికీ వెళ్లింది. ఇటీవల ఆయన జిల్లాలో పర్యటించినప్పుడు.. చెరువులు కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ మేరకు ఉన్నతాధికారులు కూడా రెవిన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇప్పటివరకూ సర్వే 40 శాతం కూడా పూర్తి కాలేదు. దీన్ని బట్టి అధికారులు ఎంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. వివాదాలు అధికంగా ఉన్న ముండ్లమూరి మండలంలో అధికారులు సర్వే చేసినట్లు చెబుతున్నారు. మరో 15 రోజుల్లో సమగ్ర సర్వే పూర్తవుతుందంటున్నారు.

చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ ...
రెవిన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి.. జోరుగా సాగుతున్న చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే.. రైతులకు జీవనాధారమైన ప్రకృతి వనరులు పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రెవిన్యూ యంత్రాంగం కబ్జాకోరులపై ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. 

గోదారమ్మకు నిత్యహారతి....

తూ.గోదావరి : నిత్యహారతితో పుష్కరఘాట్‌ ఆధ్యాత్మిక ధామంగా మారిపోయింది. ఇక్కడి రోడ్డు రైలు వంతెనకు ఇటీవల రంగురంగుల విద్యుత్తు దీపాలు అమర్చటంతో నది అందాలు మరింత ఇనుమడించాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలోని పర్యాటక ప్రాంతాలకు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా మరిన్ని మెరుగులుదిద్ది శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.

భాగ్యనగరంలో వరుస చోరీలు...

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. దొంగలు మూడు దుకాణాలను లూటీ చేశారు. సెట్టర్లు విరగొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

కాసేపట్లో ఢిల్లీ వెళ్ళనున్న మంత్రి హరీష్ ...

హైదరాబాద్: ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో హరీశ్‌రావు, ఎంపీలు సమావేశం కానున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై కేంద్రంతో రాష్ట్ర బృందం చర్చించనుంది.

జర్నలిస్టులకు కల నెరవేరనుందా?...

హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులకు సొంత ఇంటి కల త్వరలో నేరవేరనుందన్నారు. కార్మిక శాఖ తరపున జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు హోం మంత్రి నాయిని. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి సినీయర్ జర్నలిస్టు సిరిమల్లె వెంకట్‌నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వంటకాలతో ప్రెస్‌క్లబ్‌లో పుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు.

08:42 - June 6, 2016

హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులకు సొంత ఇంటి కల త్వరలో నేరవేరనుందన్నారు. కార్మిక శాఖ తరపున జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు హోం మంత్రి నాయిని. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి సినీయర్ జర్నలిస్టు సిరిమల్లె వెంకట్‌నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వంటకాలతో ప్రెస్‌క్లబ్‌లో పుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు.

ఆర్టీసీ బస్సు బోల్తా...

వరంగల్‌ : థర్మసాగర్‌ మండలం సోమదేవర పల్లి శివారులో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోవడంతో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.పెనుప్రమాదం తప్పడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు.

08:28 - June 6, 2016

గుంటూరు : భజరంగ జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిల్లు వద్దకు కార్మికులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. గత రెండు మూడు రోజుల నుండి మిల్లులోని సరుకును యాజమాన్యం బయటకు తరలించటంతో కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఏడాది క్రితం భజరంగ్ జూట్ మిల్లును మూసివేశారు. మిల్లును తిరిగి తెరిపిస్తామంటూ టీడీపీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీని ఇచ్చారు. ఇచ్చిన హామీ చంద్రబాబు నిలబెట్టుకోవాలని కార్మికులు కోరుతున్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా కార్మికులు ఆందోళన చేపట్టారు.

భజరంగ జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత..

గుంటూరు : భజరంగ జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిల్లు వద్దకు కార్మికులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. గత రెండు మూడు రోజుల నుండి మిల్లులోని సరుకును యాజమాన్యం బయటకు తరలించటంతో కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఏడాది క్రితం భజరంగ్ జూట్ మిల్లును మూసివేశారు. మిల్లును తిరిగి తెరిపిస్తామంటూ టీడీపీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీని ఇచ్చారు. ఇచ్చిన హామీ చంద్రబాబు నిలబెట్టుకోవాలని కార్మికులు కోరుతున్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా కార్మికులు ఆందోళన చేపట్టారు.

08:02 - June 6, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయ్యింది. 2014 జూన్ 8న టిడిపి ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్లుండి ముచ్చటగా మూడవ ఏట అడుగుపెడుతోంది. గత ఎన్నికల్లో టిడిపి విభిన్న వర్గాలకు విభిన్న హామీలిచ్చింది. మహిళలకూ కొన్ని ప్రత్యేక వాగ్దానాలు చేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైనవి రెండు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ, బెల్ట్ షాపుల ఎత్తివేత అత్యంత ముఖ్యమైనవి. మహిళల సామాజిక, ఆర్థికాభివ్రుద్ధిలో అత్యంత కీలకపాత్ర పోషించే ఈ రెండు హామీల విషయంలో ప్రభుత్వ వ్యవవహార శైలి ఎలా వుంది? ప్రతి 5 వేల మంది జనాభాకు ఒక మద్యం షాపు వుండేలా లిక్కర్ పాలసీ ప్రకటించిన నేపథ్యంలో మహిళల జీవితాల మీద ఎలాంటి ప్రభావం పడుతోంది? డ్వాక్రా రుణ మాఫీ అమలుఎలా వుంది? ఆచరణలో డ్వాక్రా మహిళలకు ఎలాంటి మేలు కలిగింది? ఈ రెండేళ్ల కాలంలో మహిళలపై జరిగే వివిధ రకాల నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఏమేరకు సక్సెస్ అయ్యింది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవిగారు తెలిపే విషయాలను తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి...

07:54 - June 6, 2016

హైదరాబాద్ : ఈ ఖరీఫ్ సీజన్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు నీరందించాలనే లక్ష్యంతో హరీష్‌రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకోసం నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. దీని కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగిస్తున్నారు. వాట్స్ ఏప్ గ్రూపుల ద్వారా క్షేత్రస్ధాయి పనితీరును ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

జూలై నాటికి ఒకటిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు..
జూలై నాటికి కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి ఒకటిన్నర లక్షల ఎకరాలు, నెట్టంపాడు ప్రాజెక్టు నుంచి లక్షన్నర ఎకరాలు, భీమా ద్వారా ఒక లక్ష నలభై వేల ఎకరాలకు, కోయిల్ సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరందించాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కృషి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు జాప్యం లేకుండా చేస్తామన్నారు. ఇప్పటికే పెండింగ్ బిల్లులు మంజూరైనందున.. పనులు ఊపందుకున్నాయన్నారు. ప్రాజెక్టులను యుధ్దప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషి చేయాలని అధికారులకు హరీష్‌రావు దిశా నిర్దేశం చేశారు.

మహబూబ్ నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి ...
సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని హరీష్‌రావు అధికారులకు గుర్తు చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఖరీఫ్ నాటికి లక్ష్యాన్ని సాధించాలన్నారు హరీష్‌రావు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్ లను తనిఖీలు చేస్తున్నామని.. అన్ని పనులను యుద్దప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. పనులు మరింత వేగం పెంచి.. ఖరీఫ్‌లో ఆయకట్టు టార్గెట్ పూర్తి చేయాలని అధికారులను హరీష్‌రావు సూచించారు.

 

07:41 - June 6, 2016

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ఇప్పటినుంచే పావులు కదుపుతోందా... ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్‌ పేరుతో వివిధ పార్టీ నేతలను చేర్చుకుంటోందా..రాష్ట్రవ్యాప్తంగా పూర్తి పట్టు సాధించడం కోసం గులాబీ దళపతి ప్రణాళికలు రచిస్తున్నాడా... అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్ ముందుచూపు...
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరిస్తుండటం ప్రతిపక్షపార్టీలను అయోమయంలో పడేస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా ప్రజల మద్దతుపొందిన టీఆర్ఎస్ ... అధికారంలోకి వచ్చి, ఆయా ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది.

నాటికి జిల్లాల సంఖ్య 25కు పెరిగే అవకాశం..
ఉమ్మడిరాష్ట్ర విభజనతో 10జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడింది. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అందుకనుగుణంగానే జిల్లాల రూపకల్పనకు చర్యలు చేపడుతోంది. 2019 నాటికి జిల్లాల సంఖ్య 25కు పెరిగే అవకాశముంది. దీనికితోడు నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తయ్యే అవకాశముంది. అందుకే అన్ని జిల్లాల్లో బలమైన నేతలను సిద్ధం చేసుకునేందుకు అధికారపార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నల్లగొండ...నగర్ టీడీపీ నేతలపై టీఆర్ఎస్ దృష్టి...
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాయకత్వ సమస్యలేకపోయినా ...రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో ఆయా జిల్లాలపై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా టీడీపీ, వైసీపీ పార్టీలను ఖాళీ చెయ్యించడంలో అధికారపార్టీ విజయవంతమైంది. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ వ్యూహం ఫలించి అనూహ్య విజయం సాధించడంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ నాయకత్వ సమస్యను అధిగమించినట్లు భావిస్తోంది. ఇక నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలు బలంగా ఉండటంతో వారిని కారెక్కించుకునే పనిలో పడింది.

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను పక్కాప్లాన్‌తో టీఆర్ఎస్...
జిల్లాల విభజనతో కొత్త నేతలు పార్టీలోకి వచ్చినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా గులాబీదళపతి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తగా ఆవిర్భవించే జిల్లాలతోపాటు, నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్‌ ఆకర్ష్‌ను పక్కాప్లాన్‌తో అమలుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను పూర్తి ఆధిపత్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఆధిపత్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

07:29 - June 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. దళిత ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తమ సామాజిక వర్గానికి ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత.. గతాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. 

ఐఏఎస్‌ఐపీఎస్‌లు తమ వర్గాన్ని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు..
ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కాగానే చాలామంది ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారన్నారు. అసలు వాళ్లు ఎందుకు సిగ్గుపడుతున్నారో అర్ధం కావడం లేదని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థానానికి చేరినవాళ్లు గతాన్ని మర్చిపోకుండా తమ సామాజిక వర్గానికి ఎంతో కొంత సేవ చేసి.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అవసరముందన్నారు. ఏ స్థాయిలో ఉన్న చదువు చాలా ముఖ్యమని కడియం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాను చైల్డ్‌ లేబర్‌నని.. పొలం పనులకు వెళ్లి చదువుకున్నానని.. అలా చదువుకోవడం వల్లే ఈస్థాయిలో ఉన్నానని కడియం తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ దళిత జాతికి మార్గదర్శకుడని.. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్‌-3ని పొందుపర్చకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు కడియం. మరి.. మంత్రి కడియం వ్యాఖ్యలను అట్టడుగు నుంచి ఉన్నత స్థానానికి చేరుకున్న దళిత ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఎంత వరకు ఆదర్శంగా తీసుకుంటారో చూడాలి. 

'ఫేస్‌బుక్‌..వాట్సాప్‌లకు దూరంగా ఉంటే సివిల్స్ సాధ్యమే'
సికింద్రాబాద్‌ హరిహర కళాభవన్‌లో సివిల్స్‌ టాపర్‌ టీనా డబీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సివిల్స్‌ సాధించాలనుకునే ప్రతి రోజు పేపర్లు చదువుతూ.. కొన్ని రోజులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు దూరంగా ఉంటే.. గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చని సలహా ఇచ్చారు టీనా డబీ. సమాజానికి సేవ చేయాలనే తపన ఉంటే సివిల్స్‌ సాధించడం చాలా సులభమన్నారు టీనా డబీ. ఏదైనా సాధించాలంటే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ చాలా ముఖ్యమన్నారు.

 

07:24 - June 6, 2016

విజయవాడ : ఏపీలో నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఉద్యోగాల భర్తీపై వివిధ శాఖల నుండి గతంలోనే సమాచారం సేకరించిన ఆర్ధికశాఖ... వ‌చ్చే వారంలో నోటిఫికేష‌న్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్తను అందించేందుకు సిద్దమవుతోంది. గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా వచ్చే వారంలో 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్దమైంది.

హోంశాఖలో 9 వేల ఉద్యోగాల భర్తీకి ప్లాన్....
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో భ‌ర్తీ చేయాల్సిన ఉద్యోగాల‌పై లెక్కలు సిద్దం చేసింది ఏపీసర్కార్. ఆర్ధిక లోటు కారణంగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతున్నామని గతంలో ప్రకటించినా.. 9 వేల పోస్టులను తాజాగా భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 20 వేల 250 ఉద్యోగాలు ప్రత్యక్ష నియమాకాలు చేపట్టాలని డిసైడ‌యింది. వాటిలో అత్యధికంగా హోం శాఖలో 9 వేలకు పైగా పోస్టులు భర్తీ కానున్నాయి. వాటిలో గ్రూప్-1 లో 94 పోస్టులు, గ్రూప్ -2లో 1100 పోస్టులు గ్రూప్ -3 ద్వారా 1,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పంచాయితీరాజ్, ఆర్అండ్‌బి శాఖలలో 1600 పోస్టులు...
ఇవే కాకుండా.. ప్రణాళిక పంచాయితీరాజ్,ఆర్ అండ్ బి ఇతర శాఖలలో కలిపి మెత్తం 16 వందల ఇంజనీర్ పోస్టులు.. వైద్యారోగ్యశాఖలో 450 పోస్టులు, అటవీశాఖలో 2 వేల పోస్టులు ,ఉన్నత విద్యాశాఖలో 550 లెక్చరర్ పోస్టులు , సంక్షేమ శాఖలో 500 వార్డెన్ పోస్టులు ,పశు సంవర్దక శాఖలో 750 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వ్యవసాయ శాఖలో 150 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, 400 అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు, 150 అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ అధికారుల పోస్టులు, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో 800 టీచర్ పోస్టులు, మత్స్యశాఖలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల భర్తీకి క్లియ‌రెన్స్ ఇచ్చిన అర్ధికశాఖ...
అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి...ఇప్పటికే అర్ధికశాఖ క్లియ‌రెన్స్ ఇచ్చింది. గ‌త క్యాబినెట్ స‌మావేశంలొ ఉద్యోగుల భ‌ర్తీపై కీల‌క చ‌ర్చ జ‌రిగింది. వీలైనంత త్వర‌గా పోస్టుల భ‌ర్తీ చేయాల‌ని భావించింది స‌ర్కార్. కాగా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో... తొలివిడ‌త‌గా 10వేల ఉద్యోగాలు ప్రత్యక్షనియమాకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ జూన్ 10 నుండి 20 తేదీ లోగా విడుదల చేయనున్నారు.

వ‌చ్చే వారంలో నొటిఫికేష‌న్ విడుద‌ల... 
వ‌చ్చే వారంలో నొటిఫికేష‌న్ విడుద‌ల అంశం సంతోషించేదైన‌ప్పటికీ... లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా.. కేవలం 10 వేల పోస్టుల భర్తీ చేపట్టడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎంతో కాలంగా ప్రభుత్వ కోలువు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు ప్రభుత్వ నిర్ణయం కాస్తా ఉర‌ట క‌లిగించే విష‌య‌మే.

నేటి నుండి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ..

విజయవాడ : నేటినుంచి ఏపీలో ఎంసెట్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 15 వరకు ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. 9వ తేదీ నుంచి 18 వరకు వెబ్‌ ఆఫ్షన్ల నమోదుతో పాటు.. 22న సీట్లను కేటాయించనున్నారు. కౌన్సెలింగ్‌కు విజయవాడలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

కడియం సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ : ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కాగానే చాలామంది ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారన్నారు. అసలు వాళ్లు ఎందుకు సిగ్గుపడుతున్నారో అర్ధం కావడం లేదని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థానానికి చేరినవాళ్లు గతాన్ని మర్చిపోకుండా తమ సామాజిక వర్గానికి ఎంతో కొంత సేవ చేసి.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అవసరముందన్నారు. 

న్యాయవాదుల ఆందోళన బాట...

హైదరాబాద్ : తెలంగాణలో న్యాయాధికారులు ఆందోళన బాటకు సిద్ధమయ్యారు. విభజనలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా.. నేటి నుంచి వారం రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా కోర్టుల్ని బహిష్కరించాలని న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. అంతేకాకుండా ఈనెల 13న చలో హైకోర్టుకు కూడా పిలుపునిచ్చింది జేఏసీ. 

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త...

విజయవాడ : ఏపీలో నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఉద్యోగాల భర్తీపై వివిధ శాఖల నుండి గతంలోనే సమాచారం సేకరించిన ఆర్ధికశాఖ... వ‌చ్చే వారంలో నోటిఫికేష‌న్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

Don't Miss