Activities calendar

07 June 2016

22:19 - June 7, 2016

తూర్పుగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్షకు సిద్ధమవుతున్నారు. తుని ఘటనలో అరెస్టయిన వారిని రేపు సాయంత్రంలోగా వదలకున్నా.. భవిష్యత్తులో కేసులు పెట్టబోమని హామీ ఇవ్వకున్నా.. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ముద్రగడ హెచ్చరించారు. తుని ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజమండ్రి, అమలాపురం, కిర్లంపూడిలో హైడ్రామా నడిచింది. 

 

22:11 - June 7, 2016

ఢిల్లీ : ఏపీ స్థానికత ఫైలు రాష్ట్రపతి వద్దకు చేరింది. ఈ ఫైలుకు ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు కేంద్రం పంపింది. విభజన చట్టం ఆధారంగా స్థానికత అంశాన్ని త్వరగా తేల్చాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. పది రోజుల్లో ఫైలును రాష్ట్రపతి ఆమోదించే అవకాశం ఉంది. 2017 జూన్‌ 2 లోపు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి స్థానికత వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయనున్నారు. స్థానికతపై గత ఏడాది అక్టోబర్ 9న కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 

 

22:07 - June 7, 2016

విజయవాడ : మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. త్వరలోనే ముద్రగడ రాజకీయ ముసుగు తొలగిపోతుందని చెప్పారు. తుని ఘటన దర్యాప్తులో అన్ని ఆధారాలు సేకరించాకే అరెస్ట్ లు చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఇంకా ఎక్కువ అరెస్ట్ లు ఉంటాయని బోండా చెప్పారు. 

 

22:03 - June 7, 2016

ముందుగాళ్ల ముస్లిం అన్నలకు తమ్ముండ్లకు.. చెల్లెండ్లకు అక్కలకు అందరికి మీ మల్లన్న ముచ్చట్ల తర్పున రంజాన్ పర్వదిన ప్రారంభం శుభాంకాంక్షలు.. ఇగ రంజాన్ మాసమొచ్చిందంటే..? ఎంత జోర్దారుంటది.. నెలరోజులు పండుగ వాసన గుప్పునొస్తది.. నియమ నిష్టలతోని జర్పుకునే ఈ పండుగను ఇంక జర్రంత మంచిగ జర్పుకోవాలని ఒక చిన్నపాట..
పవిత్రమైన రంజానుకు రికార్డింగ్ డ్యాన్సుల కంపు 
ప్రకాశం జిల్లాల తెల్గుతమ్ముండ్లు మైకంల మున్గిపోతున్నరు.. హిందువులు జర్పుకునె జాతర్ల పొంటనే గాదు.. ముస్లిం సోదరుల పవిత్రమైన రంజానుకు గూడ రికార్డింగ్ డ్యాన్సుల కంపు అంటించిండ్రు.. గంధ మహోత్సవం అని కార్యక్రమం బెట్టి గంద గంద పనులు జేశిండ్రు సూడుండ్రిగ మీరే..
ఏటిగడ్డ కిష్టాపురంల జనం గోస
ఏటిగడ్డ కిష్టాపురంల జనం గోస జూస్తుంటే దుఖం ఆగుతలేదు.. రెండు నెలల సంది వాళ్లకు కంటి మీద కున్కులేదు.. కదిలిస్తె ఏడుస్తున్నరు.. ఎవ్వలి నోట్లెకెళ్లి మాటొచ్చినా..? సారూ మమ్ములను కాపాడుండ్రి మీ కాళ్లు మొక్కుతం అంటున్నరు. పాపం అమాయక జనం అంగలార్పు జూస్తుంటే రాయసొంటి గుండెలు గూడ కర్గుతున్నయ్..
శిగ్గులేదా జీడిగింజా అంటే..? 
శిగ్గులేదా జీడిగింజా అంటే..? నల్లగున్న నాకేం శిగ్గు అన్నదట.. అగో అట్లనే ఉన్నది నిన్నియాళ్ల తెలంగాణల అయితున్న ఒక ముచ్చట గూడ.. కోదండరామిరెడ్డి మంచోడు గాదు.. ఆయిన మోసకాడు, కుట్రలు జేస్తున్నడు.. కుతంత్రాలు జేస్తున్నడట.. ఈ మాటలు అన్నది ఎవ్వలో గాదు.. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి గూడ వెనుకాడని తలసాని శీనన్న.. కడియం శ్రీహరన్న.. గా పంచాదిని జర్రంత లోతుకు వొయ్యి సూద్దాం పాండ్రి..
వడిగల గుర్రానికి తిర్గుడు ఎక్కువ 
వడిగల గుర్రానికి తిర్గుడు ఎక్కువ అని మీకు ఎర్కున్నదేగదా..? అగో మన దేశంల వడిగల గుర్రం ఎవ్వలు..? ఆ మోడీ సారే.. ఆసారు ఏమంట ప్రధానమంత్రి అయ్యిండో సల్లగుండ ఒక్కటే తిర్గుడు దేశాలు వట్టి.. పొయ్యి ఏంమల్పుకొచ్చిండనేది తర్వాత ముచ్చట గని.. తిర్గితిర్గి.. మొత్తం మీద ఒక రికార్డు మాత్రం తయ్యారు జేశిండు..
ఈ భూమ్మీద అన్నిటికంటె విల్వైనది ఏందుల్లా..? ప్రాణం అవునా..? 
ఈ భూమ్మీద అన్నిటికంటె విల్వైనది ఏందుల్లా..? ప్రాణం అవునా..? ఇప్పుడు ప్రాణానికి విశ్వాసానికి ఒకతాన పోటి వడ్డది.. విశ్వాసాన్ని ఇడ్సిపెట్టకపోతె పాణం బోతది.. ఇడ్సిపెడ్తె ప్రాణం దక్కుతది మరి ఏమైంది ప్రాణం గెల్చిందా..?  విశ్వాసం ఓడిపోయిందా అనేది లైవుల జూడుండ్రి..

 

21:50 - June 7, 2016

చాలా చిన్న సినిమా...చాలా సాధారణమైన కథ..అతి సాధారణమైన కథనం. స్టార్లు లేరు. వెకిలి కామెడీ లేదు. కానీ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.  భారతీయ సినిమాకు కొత్త దారిని చూపుతోంది. కొందరి కబంధ హస్తాలనుండి సినిమా విముక్తమై దళిత బహుజనీకరణ చెందాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. కుల వ్యవస్థ వికృత రూపాన్ని, అది సృష్టిస్తున్న రక్తచరిత్రను కళ్లకు కట్టిన సైరాట్ ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొడుతోంది. ఈ రోజు ఇదే అంశంపై వైడాంగిల్ కథనం చూద్దాం.. 
కోట్లుకొల్లగొడుతున్న చిన్న సినిమాలు  
చిన్న సినిమాలు కోట్లుకొల్ల గొట్టడం, ఇరగదీస్తాయనుకున్న సినిమాలు మూలన పడిపోవటం మనకు కొత్తేం కాదు. భారీ అంచనాల మధ్య విడుదలైన స్టార్ హీరో మహేష్ బ్రహ్మోత్సవం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిపోతే, అసలు మామూలు వసూళ్ళు సాధిస్తుందనుకున్న తమిళ డబ్బింగ్ సినిమా "బిచ్చగాడు" మాత్రం కాసులు కురిపించింది. ఇదేవిధంగా మహారాష్ట్ర లోనూ ఎవరూ ఊహించని విధంగా  వచ్చిన మరాఠీ సినిమా సైరాత్  సంచలనాలు సృష్టిస్తోంది.
"సైరాట్" మూవీ రూ.80 కోట్ల వసూళ్లు 
కేవలం రూ.4 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన "సైరాట్" మూవీ ఇప్పుడు  ఏకంగా రూ.80 కోట్ల వసూళ్లు రాబట్టి వంద కోట్ల దిశగా పరిగెత్తుతోంది.  ఇంత భారీ విజయం వెనుక, ఇంతటి మహత్తర ఫలితం వెనుక దర్శకుడు నాగరాజ్ మంజులే క్రియేటివిటీ, అకుంఠిత దీక్ష ఉంది. 
సైరాట్ ఏ సంకేతాలిస్తోంది 
ఇక్కడ ఎవరి గొంతుక వారే వినిపించాలి.. ఎవరి అస్థిత్వ ప్రకటన వారే చేయాలి. ఇది సాహిత్యానికే కాదు.. కాస్త ముందూ వెనుకగా అన్ని కళారూపాలకు విస్తరించక తప్పదు.  ఈ క్రమంలో భారత సినిమాలో కొత్త ట్రెండ్ మొదలవుతోందా? దళిత బహుజన సంస్కృతి సెల్యులాయిడ్ పై కనిపించబోతోందా? సైరాట్ ఏ సంకేతాలిస్తోంది. టీజర్ హీరోయిజం చుట్టూ తిరిగే తెలుగు సినిమాకు, సమాజం చుట్టూ తిరిగిన సైరాట్ కు తేడా ఏంటి? 
రికార్డులు క్రియేట్ చేసిన సైరాట్
కళాత్మకత, వాస్తవిక దృక్పథం, సమాజాన్ని ప్రశ్నించే కథ, కథనం.. ఇవన్నీ అవార్డు సినిమాల్లో కనిపించే లక్షణాలు. సైరాట్ కూడా ఇదే కేటగిరీలో ఉన్నా, కమర్షియల్ గా చరిత్ర సృష్టించింది. ఏ మరాఠీ సినిమాకు రాని కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడూ వివిధ భారతీయ భాషల సినిమాల దృష్టి మరాఠీ సినిమాపై పడిందంటే దానికి కారణం సైరాట్ అనే చెప్పాలి. 
ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్న చిత్రం
కథ‌ల్లేవ‌ని ఏడ్చే ఏడుపుగొట్టు టాలీవుడ్ బాబుల‌కు ఇదిగో ఓ చిన్న క‌థ‌. వంద‌ల‌కోట్ల ఖ‌ర్చుచేయించి, ప‌దుల కోట్ల వ‌సూలు చేయ‌ని సినిమాలు తీసే డైరెక్ట‌ర్లూ ఈ మూవీ మ‌రాఠీని చూసి నేర్చుకోండి. కేవ‌లం 4 కోట్ల పెట్టుబ‌డి పెట్టి సినిమా తీశాడు. ఇప్ప‌టికే 75 కోట్లు వ‌సూలు చేసింది. ఇక వంద కోట్ల క్ల‌బ్లోచేరుతోంది. ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. 
సైరాట్ చిత్రంపై తెలుగు వాళ్ల కన్ను 
ఒక సినిమా హిట్ అయ్యిందంటే అది ఏ భాషా చిత్రమైనా పర్వాలేదు .. దానిపైన చాలా మంది హీరోలు, డైరక్టర్లు, నిర్మాతల కన్ను పడుతుంది. అలాగే ఇప్పుడు మన తెలుగు వాళ్ల కన్ను సైరాట్ చిత్రంపై పడింది. ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో సైరాట్ సినిమా దేశ చలన చిత్ర రంగంలో కొత్త ఆలోచనల అవసరాన్ని,  గుర్తుచేసిందనే చెప్పాలి
సినిమాలో విషయం ఉంటే చాలు
సినిమాలో విషయం ఉంటే చాలు. బడ్జెట్  ఎంత? నటులు ఎవరు? ఇవన్నీ సంబంధం లేకుండా హిట్ అవుతుందని ప్రూవ్ చేసింది సైరాట్ మూవీ. మనోళ్లు కూడా ఓ ఎగబడి బడ్జెట్ పెట్టేసి ఆ తర్వాత బాధపడకుండా, లిమిట్ లో మంచి కథను నమ్మి సినిమా తీస్తే, ఇండస్ట్రీ లాభాల బాట పట్టడమే కాక, మంచి సినిమాలు కూడా వస్తాయి.

 

తుని ఘటన పేరుతో మా వాళ్లను జైల్లో పెడుతున్నారు : ముద్రగడ

తూర్పుగోదావరి : తుని ఘటన పేరుతో తమ వాళ్లను జైల్లో పెడుతున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. రేపు సాయంత్రం లోపు కాపులపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎల్లుండి ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని హెచ్చరించారు.  

 

నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలతో ప్రమాదం లేదు...

నెల్లూరు : జిల్లాలో సంభవిస్తున్న భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని కలెక్టర్ జానకి, సీనియర్ శాస్త్రవేత్త నగేష్ అన్నారు. ప్రజలెవరూ భయపడొద్దని, పుకార్లు నమ్మొద్దన్నారు. 7 నెలల వ్యవధిలో 49 సార్లు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి భూకంపాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. 

తుని అల్లర్ల కేసులో లారీ డ్రైవర్ల అరెస్టు

కాకినాడ : తుని అల్లర్ల కేసులో లారీ డ్రైవర్లను అరెస్టు చేశారు. కాపు గర్జనకు జనాలను తరలించిన లారీ డ్రైవర్ పల్లా శ్రీహరిబాబును అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. 

రాష్ట్రపతి వద్దకు చేరిన ఎపి స్థానికత ఫైలు

ఢిల్లీ : ఎపి స్థానికత ఫైలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరింది. స్థానికత ఫైలును కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. 10రోజుల్లో రాష్ట్రపతి ఆమోదించే అవకాశం ఉంది. 2017 జూన్ 2 లోగా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి స్థానికత వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయనున్నారు. స్థానికతపై గతేడాది అక్టోబర్ 9న చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. 

 

20:24 - June 7, 2016

పశ్చిమగోదావరి : ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. 

 

20:15 - June 7, 2016

పశ్చిమగోదావరి : రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన రాజధాని నిర్మాణానికి 50 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. 1500 ఎకరాల్లో అన్ని కార్యాలయాలు వస్తాయని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారని చెప్పారు. రైతుల నుంచి సేకరించిన భూమిని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. పేద ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జీతాలను భారీగా పెంచుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ తోడుదొంగలుగా ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని రాఘవులు విమర్శించారు. 

 

19:58 - June 7, 2016

హైదరాబాద్ : అధికారాన్ని ప్రశ్నిస్తే ఎందుకు అంత ఉలికిపాటని తెలంగాణ ఉద్యమ వేదిక నేతలు టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేక రాచరిక పాలన కొనసాగుతుందా అని మండిపడ్డారు. కోదండరామ్‌ను తెలంగాణ ఉద్యమ ద్రోహులు విమర్శించే అర్హత లేదని యెన్నం శ్రీనివాసరెడ్డి, చెరకు సుధాకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కోదండరామ్‌, ఉద్యమకారులది కీలక పాత్ర అని గుర్తుచేశారు.   

 

19:55 - June 7, 2016

హైదరాబాద్ : చదువుకోవడం విద్యార్ధుల హక్కు.... చదివించడం తల్లిదండ్రుల బాధ్యత అంటూ విద్యార్థులు కథం తొక్కారు. సికింద్రాబాద్ సితాఫల్ మండి డివిజన్‌లో బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్ధానిక కార్పొరేటర్లు సామల హేమ, భార్గవిలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సీతాఫల్ మండి డివిజన్ లోని బస్తిలలో 'బడికి రండి బలపం పట్టండి' అంటూ నినాదాలు చేస్తూ స్ధానికులకు విద్యపై అవగాహన కల్పించారు.

 

19:51 - June 7, 2016

నల్గొండ : రాష్ట్రంలో దొరల, నిరంకుశ పాలన కొనసాగుతోందని తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతలు విమర్శించారు. టీ.జేఏసీ చైర్మన్ కోదండరాంపై మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్ లో తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సామాన్య ప్రజలకు రెండేళ్లలో ఏం ఒరగబట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి కోదండరాం అని చెప్పారు. ఉద్యమంలో పాల్గొనని నేతలు కోదండరామ్‌ను విమర్శించడం దారుణమన్నారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొనని నేతలందరూ ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. 

 

19:38 - June 7, 2016

జపాన్ : మూడు శతాబ్దాల నాడే వెయ్యేళ్లు దాటేసిన సౌధం అది. చరిత్రకు వర్తమానానికి సజీవ సాక్షిగా నిలిచింది. నాటి రాజుల జీవనశైలిని కళ్లముందు నిలుపుతోంది. జపాన్‌లో పదమూడు శతాబ్దాలనాటి హోటల్‌... ఇప్పటికీ పర్యాటకులను అలరిస్తోంది. 
పురాతన హోటల్‌
అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట... అని.. అప్పటి చరిత్రను చెప్పుకోవడం  గొప్పగా అనిపిస్తుంది మనకు. ఆనాటి కట్టడాలు శిథిలాలుగా మారినా ఎంతో ఆసక్తిగా చూస్తాం. వందల ఏళ్లనాటి వస్తువులను  మ్యూజియంలో చూసి మురిసి పోతాం. కాని.. జపాన్‌లోని ఈ హోటల్‌ను చూడండి. దీని పేరు 'యాన్సెస్‌ కియు న్కన్‌'. ఇది వందా రెండొందల సంవత్సరాలది కాదు.. ఏకంగా వెయ్యేళ్ల ను ఎపుడో దాటేసింది. 
క్రి.శ.705లో ప్రారంభమైన హోటల్‌
ఈ  హోటల్‌ వయస్సు అక్షరాల..13వందల 11ఏళ్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం.  క్రీ.శ.705లో ఇది ప్రారంభమైంది. అప్పటి జపాన్‌ రాకుమారుడు 'ఫుజివరా మహితో' దీన్ని ప్రారంభించారు.  హోటల్‌ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటికి 52తరాలు  మారాయి.  అయినా.. ఇప్పటికీ చెక్కుచెదరలేదు. నేటీకీ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తూ..గిన్నిస్‌రికార్టుల్లో నిలిచింది. పదమూడు వందల ఏళ్ల చరిత్రలో ఎందరో రాజులు, సైన్యాధిపతులు ఈ హోటల్లో బస చేశారట. మొత్తం 37 గదులతో... పాటు సహజంగా ఏర్పడిన స్విమ్మింగ్‌ పూల్‌  ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంది. గత 20ఏళ్ల క్రితం కొద్దిపాటి మార్పులతో మరింత విలాసవంతంగా మార్చారు.  అతిపురాతన హోటల్‌గానే కాకుండా... సౌకర్యాల విషయంలో కూడా  పర్యాటకులను అలరిస్తోందీ పురాతన కట్టడం.  

 

కిర్లంపూడిలో కొనసాగుతోన్న ఉద్రిక్తత....

పశ్చిమగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముద్రగడ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతోంది. తుని ఘటనలో అరెస్టు చేసిన ఆరుగురిని సిబిసిఐడి అధికారులు కోర్టులో హాజరు పరిచారు. 

 

పిడుగుపాటుకు 10 మందికి తీవ్రగాయాలు

కడప : రైల్వే కోడూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఎస్.కొత్తపల్లిలో పిడుగుపాటుకు 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

 

19:24 - June 7, 2016

హైదరాబాద్ : ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ గా ఎంపికయ్యారు. తనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసినందుకు అవార్డు కమిటీకి రకుల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాల్గొన్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

19:18 - June 7, 2016

ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి మ్యాట్రిమోని అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో జెమిని మ్యారేజ్ బ్యూరో వెంకట్ రెడ్డి, వివాహ వ్యవస్థపై పరిశోధకురాలు డా.లక్ష్మీదేవి పాల్గొని, మాట్లాడారు. నేటికాలంలో పెళ్లిళ్లు సెట్ చేయడంలో మ్యాట్రిమోని పాత్ర కీలకంగా మారిందన్నారు. చాలా మంది మ్యాట్రిమోనిని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:39 - June 7, 2016

పశ్చిమగోదావరి : నవనిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. జిల్లాలోని భీమవరంలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతోంది. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశాల్లో వ్యవసాయమే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. విదేశాల నుంచి కొత్త పరిశ్రమలు ఏవీ రావడం లేదని.. చిన్న ఉద్యోగుల వేతనాలనైనా నాలుగు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. 

 

18:33 - June 7, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని భీమవరంలో కుంభవృష్టి కురిసింది. గంటన్నరపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణం మొత్తం నీటమునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని వర్షంనీరు చేరింది. డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పట్టణం ట్రాఫిక్‌తో అస్తవ్యస్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:50 - June 7, 2016

నెల్లూరు : రుణాలు మాఫీ చేస్తామంటూ డ్వాక్రా మహిళలకిచ్చిన వాగ్ధానాన్ని చంద్రన్న నెరవేర్చలేదు. రుణాలు మాఫీ కాకపోగా, అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన స్థితిలో డ్వాక్రా మహిళలు చిక్కుకున్నారు. మూడు వేల రూపాయల కార్పస్ ఫండ్ వీరి మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ఈ రెండేళ్ల కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బదులుగా అప్పుల ఊబిలో  కూరుకుపోయారు డ్వాక్రా మహిళలు. 
టిడిపి ఎన్నికల వాగ్ధానాలు.. మహిళల రుణాల మాఫీ 
డ్వాక్రా గ్రూపు మహిళల రుణాల మాఫీ టిడిపి ఎన్నికల వాగ్ధానాల్లో అత్యంత ముఖ్యమైంది. ఎన్నికల సమయంలో డ్వాక్రా అప్పులు కట్టొద్దు అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామంటూ చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు ప్రచారం చేశాయి. ఈ రెండేళ్లలో సీన్ మరోలా వుంది.
డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు
ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. అప్పు రద్దవుతుందన్న ఆశతో, టిడిపి నేతల మాటలు నమ్మి బకాయిలు చెల్లించనివారి మీద  అపరాధ వడ్డీ భారం పెరిగింది.  ఇప్పుడేమో బకాయిలు కట్టాలంటూ బ్యాంక్ లు పీకలమీద కూర్చున్నాయి. 
నెల్లూరు జిల్లాలో 46వేల డ్వాక్రా గ్రూపులు
నెల్లూరు జిల్లాలో 46వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. నాలుగు లక్షల ఏడు వేల మంది సభ్యులున్నారు. ఈ గ్రూపులన్నింటికీ 90 కోట్ల రూపాయల రుణాలున్నాయి. టిడిపి ఎన్నికల వాగ్ధానం ప్రకారం వీటన్నింటినీ రద్దు చేయాలి కానీ చేయలేదు.  ఇప్పుడు ముక్కుపిండి వీటిని వసూలు చేస్తున్నాయి. డ్వాక్రా రుణాలతో చాలామంది టీ అంగడి, టిఫిన్ సెంటర్, ఫ్యాన్సీ షాప్ లు పెట్టుకున్నారు. వీరిమీద వడ్డీ భారం పెరగడంతో అప్పుల వలయంలో చిక్కుకున్నారు. డ్వాక్రా రుణాల రద్దు హామీని పక్కన పెట్టిన ప్రభుత్వం ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున కార్పస్ ఫండ్ వారి ఖాతాల్లో జమ చేస్తామంది. తొలి విడతగా 3వేల రూపాయలు జమ చేసింది. రెండో విడత జమ చేయలేదు.
కార్పస్ ఫండ్... డ్వాక్రా మహిళలకు తక్షణ ప్రయోజనం 
అయితే, కార్పస్ ఫండ్ వల్ల డ్వాక్రా మహిళలకు తక్షణం కలిగే ప్రయోజనం కానీ, ఉపశమనం కానీ ఏమీ లేదు. ఆ మూడు వేలు కూడా అందరికీ జమ చేయకుండా కొందరికే జమ చేయడంతో డ్వాక్రా గ్రూపుల్లో మనస్పర్ధలు, గొడవలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల గ్రూపులే విచ్ఛిన్నమయ్యాయి. ఇప్పుడు కొత్తగా అప్పు ఇవ్వాలంటే పాత బకాయి తీర్చాల్సిందేనంటూ బ్యాంక్ లు ఖరాఖండిగా చెబుతున్నాయి. బకాయిదార్లకు నోటీసులు పంపిస్తున్నాయి.  వడ్డీలు షాకిస్తున్నాయి. దీంతో డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు.

17:40 - June 7, 2016

హైదరాబాద్ : బద్మాష్ లతో బంగారు తెలంగాణ సాధ్యం కాదని టీకాంగ్రెస్ నేతలు అన్నారు. కోదండరామ్‌పై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలకు నిరసనగా హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్‌ను విమర్శించడం తెలంగాణ సమాజాన్ని విమర్శించడమే అని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజైనా పాల్గొనని నేతలు...ఇవాళ కోదండరామ్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. 

 

17:34 - June 7, 2016

విజయవాడ : కాపు నేత ముద్రగడ పద్మనాభం స్వచ్ఛందంగా అరెస్ట్ కావడం వెనుక కుట్ర దాగి ఉందని ఏపీ మంత్రి నారాయణ ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం వ్యవహారంపై వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద నారాయణ మాట్లాడారు. తునిలో విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయొద్దంటూ ముద్రగడ హల్‌చల్‌ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని నారాయణ ప్రశ్నించారు. 

17:26 - June 7, 2016

పశ్చిమగోదావరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు విమర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ.. ఎన్నికల ముందు టీడీపీ చేసిన వాగ్ధానాలు ఏవీ నెరవేరడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదా విషయాల్లో కేంద్రం మోసం చేసిందని చెప్పారు. కనీస వసతులు లేకుండా ఉద్యోగుల తరలింపు సరికాదని పేర్కొన్నారు. 

 

17:16 - June 7, 2016

హైదరాబాద్ : టీ.జేఏసీ చైర్మన్ కోదండారామ్‌పై తెలంగాణ హోంశాఖమంత్రి నాయిని నరస్సింహారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏకవచనంతో సంభోదిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉన్నందువల్లే.. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. 

17:02 - June 7, 2016

ప్యారిస్ : విమాన పరిశోధనా రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌ బస్‌ కంపెనీ పైలెట్‌ రహిత  త్రీడీ ప్రింటెడ్‌ విమానాన్ని తయారు చేసింది. జర్మనీలోని బెర్లిన్‌లో  జరుగుతున్న అంతర్జాతీయ  వైమానిక ప్రదర్శనలో ఈ త్రీడీ విమానం ప్రధాన ఆకర్షంగా నిలుస్తోంది. 
త్రీడీ విమానం పేరు థోర్‌ 
ఫ్రాన్స్ లోని హ్యాంబర్గ్‌ కేంద్రంగా ఉన్న యూరోపిరయన్‌ ఎయిరో స్పేస్‌  ఇండస్ట్రీ-- ఎయిర్‌ బస్ కంపెనీ లోహవిహంగం త్రీడీ విమానాన్ని తయారు చేసింది. దీనికి థోర్‌ అని పేరు పెట్టారు. టెస్ట్ ఆఫ్ హైటెక్‌ ఆబ్జెక్టివ్స్ ఇన్‌ రియాలీటీయే.. థోర్‌. త్రీడీ సాకేంతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వెయ్యి భాగాలతో ఈ విమానాన్ని తయారు చేశారు. 
త్రీడీ విమానం డ్రోన్‌ కంటే కొద్దిగా పెద్దది 
ఎయిర్‌ బస్‌ కంపెనీ తయారు చేసిన ఈ త్రీడీ విమానం త్రీడీ టెక్నాలజీపై మేధావుల అంచనాలను పెంచుతోంది. పదమూడు అడుగుల పొడవు ఉండే డ్రోన్‌ కంటే ఇది కొద్దిగా పెద్దది.  నాలుగుమీటర్ల పొడవు ఉన్నఈ విమానం బరువు కేవలం 21 కిలోలు. పైలెట్‌ రహిత ఈ త్రీడీ విమానానికి కిటికీలు లేవు. భవిష్యత్‌లో విమానానరంగంలో విప్లవాత్మక మార్పులకు దీనిని నాందిగా భావిస్తున్నారు.  దీనిని మరింతగా అభివృద్ధిచేసి ప్రయాణికుల చేరవేత స్థాయికి చేరినప్పుడు సమయంతోపాటు, ఇంధనం, డబ్బు ఆదా అవుతాయని అంచనావేస్తున్నారు.  ఎయిర్‌ బస్‌ కంపెనీ గత నవంబర్‌లోనే దీనిని పరీక్షించినప్పటికీ... వైమానిక ప్రదర్శనలో ఉంచడం ఇదే మొదటిసారి. థోర్‌ పేటెంట్‌ హక్కు కోసం ఎయిర్‌ బస్‌ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. 
అల్కోవ కంపెనీతో ఒప్పందం 
థోర్‌ త్రీడీ విమానంలోని విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మినహా, మిగిలిన అన్ని భాగాలను త్రీడీ ప్రింటెడ్‌ టెక్నాలజీతో తయారు  చేశారు.  దీనిని మరింత అభివృద్ధి చేయాలని ఎయిర్‌ బస్‌ కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.    త్రీడీ విమాన భాగాల తయారీ కోసం అల్కోవ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఎయిర్‌ బస్‌ కంపెనీ ప్రతిపాదించింది. అయితే ఈ విమానాన్ని ప్రయాణికుల చేరవేత స్థాయికి అభివృద్ధి చేయడం అంత లేలికైన పనికాదని భావిస్తున్నారు.  ఇంది వేగంగా జరిగే ప్రక్రియ కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. త్రీడీ ప్రింటెడ్‌ టెక్నాలజీలో మరెన్నో అద్భుతాలు చోటుచేసుకున్నప్పుడే ప్రయాణికుల చేరవేత స్థాయికి ఈ  విమానాన్ని అభివృద్ధి చొయొచ్చని విశ్లేషిస్తున్నారు. 

 

భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప.గో: భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం పాతబస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు.

16:57 - June 7, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌ మథుర ఘర్షణలపై సుప్రీంకోర్టులో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. మథురలో జరిగిన హింసాత్మక ఘటనపై సిబిఐ విచారణ జరపాలంటూ బిజెపి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఘటనకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని న్యాయమూర్తులు పి.జి.ఘోష్, అమితవ రాయ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పిటిషనర్‌కు సూచించింది. మథుర ఘటనలో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలు  ఉన్నందున  సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, తక్షణమే విచారణ జరపాలని బిజెపి నేత అశ్విని ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ వేశారు. ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని,  సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రం ఆదేశం ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మథుర ఘర్షణలపై అశ్విని ఉపాధ్యాయ్‌ హైకోర్టును ఆశ్రయించనున్నారు.

 

16:49 - June 7, 2016

ముంబై : ఆర్ బీఐ త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. ఈఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన విదానాన్నే కొనసాగిస్తోంది. కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులేదు. రెపోరేటును 6.5 శాతంగానే ఉంచారు. వివర్స్ రెపోరేటును 6 శాతగా  కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్వోల్బణంపై ఆర్ బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో డాలర్ల సరఫరా తగ్గిందని జరుగుతున్న ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. ఆస్తులు, అప్పుల విషయంలో బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్‌ సూచించారు. 

16:44 - June 7, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నుంచి రాచరికపాలనవైపు సాగుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లోటుపాట్లపై మాట్లాడిన కోదండరాంను విమర్శించడం సరికాదన్నారు. కోదండరాంను విమర్శించడం అంటే పౌరహక్కులను కాలరాయడమేనని జీవన్‌రెడ్డి అన్నారు. 

 

16:39 - June 7, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని అధికార టీడీపీ కుట్ర పన్నుతోందని వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఈమేరకు హైదరాబాద్‌ లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చంద్రబాబు తన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

 

తుని ఘటనలో అరెస్టులు కొనసాగుతాయి:చినరాజప్ప

గుంటూరు : తుని ఘటనలో అరెస్టులు కొనసాగుతాయని ఏపీ హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరొసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రౌడీ షీటర్లు వైసీపీతో దగ్గర సంబంధాలు ఉన్నవారే విద్వాంసానికి పాల్పడినట్లు గుర్తించామని హోంమంత్రి చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని సీరియస్‌గా తీసుకోకపోతే వేరే విధంగా మారే పరిస్థితి ఉందని..అందుకే చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అరెస్టు చేసినవారందరికి నేర చరిత్ర ఉందని చినరాజప్ప చెప్పారు.

16:30 - June 7, 2016

తూర్పుగోదావరి : ముద్రగడను పోలీసులు ఆయన స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. అయితే కిర్లంపూడిలో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. అరెస్ట్ చేసిన ఆరుగురు కాపు నాయకులను విడుదల చేసే వరకు... ఇంట్లోకి వెళ్లేది లేదని పోలీస్‌ జీపులోనే ఆయన నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. 

 

గన్ పార్క్ వద్ద టి.కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్ : ప్రొ. కోదండరామ్ పై టీఆర్ ఎస్ నేతల విర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు.

కోదండరామ్ కు మతిభ్రమించినట్లుంది: నాయిని

హైదరాబాద్ : జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరామ్ కు మతిభ్రమించినట్లుందని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి మండి పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని పార్టీలు, సంఘాలు జేఏసీ నుంచి బయటికి వచాయని.. బంగారు తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యం అని నాయిని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. కోదండరామ్ 28 రాష్ట్రాలు తిరిగి తెలుసుకోవాలన్నారు.

16:26 - June 7, 2016

ఛండీఘర్ : హర్యానా హిస్సార్‌ సమీపంలో ఫతేబాద్ వద్ద ఓ ప్రయివేట్‌ బస్సులో బాంబు పేలడం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన బాంబు కావడంతో పెను ముప్పు తప్పింది. బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. బాంబు పేలినపుడు భారీ శబ్దం చేయడంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్‌ టీం విచారణ ప్రారంభించింది. ఓ అనుమానిత యువకుడు బస్సు ఎక్కిన కొద్ది సేపటికే బాంబు పేలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనుమానిత వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కురుక్షేత్రలో కూడా బస్సులో బాంబు పేలి 12 మంది గాయపడ్డారు. 

 

గేట్లు బద్దలు కొడితే దీక్షకు దిగుతా: ముద్రగడ

కిర్లంపూడి : ముద్రగడ ఇంటి గేట్లను బద్దలు కొట్టేందుకు పోలీసులు యత్నించారు. గేట్లు బద్దలు కొడితే దీక్షకు దిగుతానని ముద్రగడ హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. తుని ఘటనలో నిందితులుగా అనుమానిస్తూ అరెస్టు చేసిన ఆరుగురు కాపు నేతలను విడుదల చేసే వరకు ఇంట్లోకి వెళ్లేది లేదని పోలీసు జీపులో నే ముద్రగడ కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

16:15 - June 7, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకు టీఆర్ ఎస్ నాయకులు, మంత్రులు  ప్రయత్నిస్తున్నారని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీ.జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌పై టీఆర్ ఎస్ నాయకులు నోరు పారేసుకోడాన్ని తప్పుపట్టారు. కోదండరామ్‌ను దూషించిన టీఆర్ఎస్ నేతలపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కోదండరామ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కోరారు. 

 

15:49 - June 7, 2016

విజయవాడ : రాష్ట్ర విభజనను తాము కోరుకోలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నీటి కేటాయిపుంలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తమపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. తమకు కేటాయించిన నీటిని ఇవ్వకుండా ఆపేసి కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేయడమేంటని దేవినేని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి భారీ కాంట్రాక్టులున్నాయని ఆరోపించారు. 

 

15:31 - June 7, 2016

తూర్పుగోదావరి : అమలాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుని ఘటన కేసులో అరెస్టులను నిరసిస్తూ అమలాపురం పీఎస్‌లో ఆందోళనకు దిగిన కాపు నేత ముద్రగడను సీబీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి  ముద్రగడను తుని పీఎస్‌కు తరలించారు. ముద్రగడతో సహా పలువురు కాపు సంఘం నేతలను తరలించారు. ముద్రగడను తరలించే సమయంలో అక్కడ కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో వైపు ముద్రగడ ఆందోళనపై మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ విద్రోహ శక్తుల్ని అరెస్ట్ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు.

 

త్రిపుర లో కాంగ్రెస్ కు 6గురు ఎమ్మెల్యేల రాజీనామా..

అగర్తాలా: త్రిపురలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాము కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వెల్లడించారు. ఈమేరకు ఒక లేఖను స్పీకర్ రామేంద్ర కే నాథ్‌కు అందజేశారు. దీంతో త్రిపుర అసెంబ్లీలో తృణమూల్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది.

కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని న్యాయాధికారుల విభజన జరిగిన తీరుపై అభ్యంతరం చేస్తూ తెలంగాణ న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. ఆంధ్రా న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించారు. కోర్టుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నారు. స్థానికత ఆధారంగానే న్యాయాధికారుల విభజన జరగాలని డిమాండ్ చేస్తున్నారు. 13న ఛలో హైకోర్టు ఆందోళన కొనసాగనుంది.

కోదండరాంపై టీఆర్ఎస్ విమర్శలు సరికావు: జీవన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక వ్యక్తి కోదండరాం పై టీఆర్ ఎస్ విమర్శలు సరికావని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని కోదండరాం చెప్పారన్నారు. ఉద్యమంలో పనిచేసిన వారిపై ఆంక్షలు విధిస్తారా అని ప్రశ్నించారు? రాష్ట్రంలో పౌర హక్కులు ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు. కోదండరాంపై చేస్తున్న దాడి రాజరిక పాలనను తలపిస్తోందన్నారు.

ముద్రగడకు మూడు ప్రశ్నలు : గంటా

విశాఖ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి మంత్రి గంటా శ్రీనివాసరావు మూడు ప్రశ్నలు సంధించారు. తుని ఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవద్దనేది మీ డిమాండా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని గంటా స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి గంటా తేల్చిచెప్పారు.

ముద్రగడ నివాసం వద్ద హైడ్రామా

తూ.గో : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను రాజమండ్రి నుండి కిర్లంపూడి తరలించారు. అయితే ముద్రగడ నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. తుని ఘటనలో నిందితులుగా అనుమానిస్తూ అరెస్టు చేసిన ఆరుగురు కాపు నేతలను విడుదల చేసే వరకు ఇంట్లోకి వెళ్లేది లేదని పోలీసు జీపులో నే ముద్రగడ కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

టీడీపీ పాలన అద్వానం : రోజా

హైదరాబాద్ : టీడీపీ పాలన అద్వానంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ఎపి కేబినెట్ సమావేశానికి లోకేష్ బాబు హాజరు కావడంలో దేశంలో కెల్లా ఎపిలో ఉందన్నారు. 

 

అమెరికా యుద్ధ వీరులకు మోదీ నివాళి..

అమెరికా : పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్‌లోని ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో పుష్ప నివాళి అర్పించారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా 19 రౌండ్ల గన్ సెల్యూట్ ఇచ్చారు. ఆర్లింగ్టన్ శ్మశానవాటికలో అమెరికా యుద్ధ వీరులను సమాధి చేశారు. అక్కడికి వెళ్లిన మోదీ పుష్పగుచ్ఛం సమర్పించి కొంత సేపు కళ్లు మూసుకున్నారు.

13:32 - June 7, 2016

హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల తరలింపుపై సందిగ్ధత తొలిగిపోనున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులు అమరావతికి తరలిరావాలని సీఎం గట్టి నిర్ణయంతో వున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్ఆర్ఏ, స్థానికత, వర్క్ ప్లేస్ లో సౌకర్యాలు ఇటువంటి విషయాలలను సాకుగా చూపిస్తూ ఉద్యోగులు పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఏపీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అమరావతి తరలివెళ్లే ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్టంగా రూ.20వేలు హెచ్ఆర్ఏను ప్రకటించింది. ఇప్పటి వరకూ హెచ్ఆర్ఏ ప్రకటించటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికత విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇస్తే మరింత సంతోషంగా వుంటామని వారు పేర్కొంటున్నారు. మరింతగా వున్న చిన్న చిన్న సమస్యలను కూడా త్వరలో తొలగిపోతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కొమటి బద్రర్స్ తో జానా భేటీ...

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌‌ పార్టీ మారుతున్నారన్న వార్త మీడియాలో గతకొన్నిరోజులుగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీ మార్పు విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం జానారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

13:19 - June 7, 2016

తూ.గోదావరి: నాలుగు నెలలుగా స్థబ్దతగా వున్న కాపు రిజర్వేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మద్ధతు కూడగట్టుకోవటానికి ఆయన కొన్ని రోజుల క్రితం పలువురు నేతలను ఆయన కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయంగా ఇప్పటికే ముద్రగడ సీఎం చంద్రబాబు పలు లేఖాస్త్రాలను కూడా సంధించారు. కాగా మంజునాథ కమిటీకి ఇచ్చిన సమయం దగ్గరకు రావటంతో ముద్రగడ ఈ ఎత్తుగడను ఎంచుకున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. ఉద్యమం చేపట్టిన నేత హింసాత్మక చర్యలకు పోత్సహిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముద్రగడ అరెస్ట్ పై చెలరేగుతున్న ఆందోళన విషయంలో మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటే తప్పేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మంగళవారం అమలాపురం పీఎస్ ముందు ఆయన ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని విషయాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మరిన్ని వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారం తెలసుకోండి.

యూనివర్శిటీల్లో రాజకీయాలుతగదు :స్మృతీ ఇరానీ..

విజయవాడ : ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులతో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, విభజన హామీలలో భాగంగా ఏపీకి 11 వర్శిటీలకు గాను... 9 వర్శిటీలు ఇచ్చామన్నారు. యూనివర్శిటీల్లో విద్యాపరమైన అభివృద్ధి పై మాట్లాడాలి.. తప్ప , రాజకీయాలు తగదు అని పేర్కొన్నారు. 

రేపు చంద్రబాబు పై ఫిర్యాదు చేస్తాం: పార్థసారధి

హైదరాబాద్ : చంద్రబాబు రెండేళ్ల పాలనపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా పీఎస్ లలో ఫిర్యాదు చేస్తామని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. 13న విజయవాడలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. జులై 8న గడప గడపకి వైసీపీ కార్యక్రమం చేపడతామన్నారు.

12:59 - June 7, 2016

విజయవాడ : సోమవారం సచివాలయ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల తరలింపు విషయంలో సందిగ్థత కొనసాగుతున్నాయి. సౌకర్యాలు లేకుండా అమరావతికి తరలిరావటానికి ఉద్యోగులు నిరాకరించటంతో నిర్మాణ పనుల విషయంలో వాస్తవాలను ఆయన పరిశీలించారు. వర్షాలు, కార్మికుల కొరతతో పనులలో జాప్యం జరుగుతున్నట్లు తెలుసుకున్న అనంతరం స్థానికంగా వున్న కార్మికులను కూడా నిర్మాణ పనులలో భాగస్వామ్యం చేస్తే పనులు వేగవంతంగా అవుతాయని ఆయన సూచించారు. దీంతో స్థానికి కార్మికులు కూడా పనులలో పాల్గొనటంతో ఏపీ సెక్రటేరియట్ నిర్మాణపనులు మరింత వేగంగా సాగుతున్నాయి.. కార్మికుల సంఖ్యను పెంచి పనుల్ని వేగవంతం చేశారు.. నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలనుంచి తాపీ మేస్త్రీలు, కూలీలను సచివాలయం పనులకోసం తీసుకువస్తున్నారు.. దాదాపు నాలుగు వందలమంది కార్మికులు... అమరావతిలో గదుల నిర్మాణం, ప్లాస్టరింగ్‌లాంటి పనులు చేస్తున్నారు.. కార్మికుల సంఖ్యను పెంచి నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.

అమరావతికి వెళ్లే ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఏ పెంపు

విజయవాడ: హైదరాబాద్‌ నుంచి అమరావతికి వెళ్లే ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. దీనికి సంబంధిచిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. హెచ్ఆర్ఏ పై ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అమరావతికి తరలివెళ్లాలని నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

 

12:50 - June 7, 2016

అనంతపురం : వ్యాపారులకు డబ్బు ఎగవేత కేసులో కళానికేతన్‌ ఎండీ లక్ష్మీ శారదకు అనంతపురం కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది.. కోర్టు ఆదేశాలప్రకారం పోలీసులు ఆమెను అనంతపురం రెడ్డిపల్లి జైలుకు తరలించారు.. ఈ జనవరిలో చేనేత వ్యాపారులు కళానికేతన్‌కు 9కోట్ల రూపాయల విలువైన చీరలు పంపారు.. ఎన్నిరోజలుతిరిగినా డబ్బు చెల్లించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ విషయం తెలుసుకున్న సంస్థ ఎండీ పరారయ్యారు.. దీంతో పోలీసులు కళానికేతన్‌ డైరెక్టర్‌ను అరెస్టు చేసి కోర్టుముందు ప్రవేశపెట్టారు.

12:47 - June 7, 2016

వరంగల్ : లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన ఓ లాయర్ దారుణానికి పాల్పడ్డాడు. ఖాజీపేట పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన వద్ద పనిచేస్తున్న జూనియర్ అడ్వకేట్ ను ఓ సీనియర్ అడ్వకేట్ చితకబాదాడు. అడ్వకేట్ చదువు పూర్తి చేసుకున్న సుజనా అనే యువతి దయానంద్ సీనియర్ లాయర్ వద్ద ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో పనివుంది రమ్మని తన ఆఫీసుకు తీసుకువెళ్లి సుజనను దయానంద్ తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి కేకలతో స్పందించిన స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం సుజన బంధువులకు సమాచారం అందించారు. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. గతంలో సుజనకు వచ్చిన వివాహ సంబంధాలను కూడా దయానంద్ చెడగొట్టినట్లు సమాచారం. దయానంద్ కు వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా వుండటం గమనించదగిన విషయం.

12:43 - June 7, 2016

తూ.గోదావరి : కాపు నేత ముద్రగడ మరో డ్రామాకు తెరతీశారు. తుని ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొందరు నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ మంగళవారం అమలాపురం పీఎస్ వద్ద ముద్రగడ ఆందోళన చేపట్టారు. ఆయనకు మద్దనిస్తూ పలు ప్రాంతాల నుండి కాపునేతలు అమలాపురానికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అమాయకులను వదిలి తనను అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ ఆయన పీఎస్ ముందే బైఠాయించారు. దీనితో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి ఆయన్ను తరలించినట్లు సమాచారం. ముద్రగడతో పాటు మరి కొంతమంది కాపు నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదు...
అమలాపురంలో ఎటువంటి ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని ... ఎవరైనా నిరసనలకు దిగితే సంహించమని ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. భీమవరం, ఏలూరు నుండి అమలాపురం నుండి కాపు నేతలు తరలి వస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల నుండి కాపునేతల అమలాపురం చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అ క్రమంలో పోలీసులు వాహనాలన్నింటినీ తనిఖీలు చేపట్టారు. ఉద్రికత్త వాతావరణం నెలకొనటంతో ముందస్తు చర్యలో భాగంగా ముద్రగడను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ముద్రగడ అరెస్టు వార్త దావానంలా వ్యాపించడంతో ఆయన స్వగ్రామమైన కిర్లంపూడిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సు

హైదరాబాద్ : ఎంసిఆర్ హెచ్ ఆర్టీలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రత్యేక జిల్లాల ఏర్పాటు పై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

డివైడర్ ను ఢీకొట్టిన కారు : ఒకరి మృతి

నల్గొండ: చిట్యాల మండలం వెలిమినేడు వద్ద వేగంగా వస్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నార్కట్‌పల్లికి చెందిన సద్దురు వీవీసీ పైపుల కంపెనీ ఎండీ హరినాథ్‌రెడ్డి మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలవగా..వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అమలాపురంలో ఉద్రిక్తత

తూ.గో : అమలాపురం లో ఉద్రిక్తత నెలకొంది. కాపు ఉద్యమ నేత ముద్రగడను, కాపు నేతలను రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తలిస్తుండగా కాపు నేతలు అడ్డుకున్నారు. దీంతో కాపు నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.

రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి ముద్రగడ తరలింపు

తూ.గో : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను అమలాపురం నుండి రాజమండ్రి సిఐడీ కార్యాలయానికి తరలించారు. అతని తో పాటు కాపు ఉద్యమ నేతలను కూడా తరలించారు. తుని ఘటనలో అమాయకులను అరెస్టు చేస్తున్నారని అమలాపురం పీఎస్ ఎదుట ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే..

మీ ఇంటికి - మీ భూమి విజయవంతం: డిప్యూటీ సీఎం కేఈ

కర్నూలు : మీ ఇంటికి - మీ భూమి విజయవంతం అయ్యిందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రేపు మహాసంకల్ప దీక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అభివృధ్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 

జగన్ ఆర్థిక ఉన్మాది : మంత్రి అచ్చెన్నాయుడు

కర్నూలు : జగన్ ఆర్థిక ఉన్మాది అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకుడిగా మారారని, ప్రజల దృష్టి మరల్చేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని, తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ములాఖత్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 15 నుంచి చంద్రన్న బీమా పథకం అమల్లోకి తీసుకొస్తామన్నారు.

హైదరాబాద్ లో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

హైదరాబాద్ : ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

11:47 - June 7, 2016

అమెరికా : సామాజిక మాధ్యమ ఖాతాలతో ప్రపంచాన్ని అనుసంధానం చేసిన ఫేస్‌బుక్‌ దిగ్గజం జుకర్‌బర్గ్‌కే ఆన్‌లైన్‌లో రక్షణ కరువయ్యింది. జుకర్‌బర్గ్‌ సామాజిక మాధ్యమ ఖాతాలు హ్యకింగ్‌కు గురయ్యాయి. సౌదీ అరేబియాకు చెందిన అవర్‌మైన్‌ బృందం జుకర్‌బర్గ్‌ ఖాతాల పాస్‌వర్డ్‌ను గుర్తించినట్టు ప్రకటించుకుంది. పింటరెస్ట్‌, ట్విట్టర్‌ ఖాతాల హ్యాకింగ్‌కు తామే బాధ్యలమని చెప్పింది. జుకర్‌ బర్గ్‌ సొంత ఖాతా ద్వారానే అవర్‌మైన్‌ ఒక సందేశాన్ని పోస్టు చేసి ఖాతా పరీక్షించినట్టు తెలిపింది. ఈ పరిణామాంతో అవర్‌మైన్‌ అధికార ట్విట్టర్‌ ఖాతాను మూసివేశారు. ఇటీవల లీకైన లింక్డ్‌ పాస్‌వర్డ్స్ డంప్‌లో జుకర్‌ బర్గ్‌ పాస్‌వర్డ్‌ను గుర్తించినట్టు సమాచారం. 

విజయవాడలో పర్యటిస్తోన్న స్మృతీ ఇరానీ

విజయవాడ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజ‌య‌వాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని పాతబ‌స్తీలో నిర్వహిస్తోన్న గుజ‌రాతీ స‌మాజ్ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొంటున్నారు. గుజ‌రాతీ స్కూల్‌లో నూత‌న ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. విద్యార్థుల‌తో ఆమె ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నట్లు స‌మాచారం. ఆమెతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత‌లు కామినేని, ఎంపీ కంభంపాటి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈరోజు మ‌ధ్యాహ్నం సీఎం చంద్ర‌బాబుతో ఆమె భేటీ అవుతారు.

11:44 - June 7, 2016

విజయవాడ : స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు ఊపిరిలూదిన ఆ మైదానం కనుమరుగు కాబోతోంది. బ్రిటీష్‌ వలస పాలకులను తరిమేందుకు ఎన్నో వ్యూహరచనలకు వేదికైన ఆ మైదానం తన ఉనికికే కోల్పోయే ప్రమాదంలో పడింది. ఎంతో మంది మహనీయుల పాద స్పర్శతో పునీతమైన విజయవాడ స్వరాజ్య మైదానాన్ని విజయవాడ సిటీ స్క్వేర్‌ పేరుతో రూపురేఖలు లేకుండా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయవాడ సిటీ స్క్వేర్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు...
విజయవాడ బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానం తన ఉనికి కోల్పోనుంది. విజయవాడ సిటీ స్క్వేర్‌ పేరుతో పీడబ్ల్యూడీ మైదానాన్ని నాశనం చేసేందుకు రంగం సిద్ధం అయింది. 21 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న స్వరాజ్య మైదానం రోడ్ల విస్తరణ, ఉన్నతాధికారుల ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం 17 ఎకరాలకు చేరింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ మైదానాన్ని విజయవాడ సిటీ స్క్వేర్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు చేస్తోంది ప్రభుత్వం.

మైదానాన్ని పరిరక్షించాలని కోరుతున్న ప్రజా సంఘాలు...

నగరవాసులకు సేద తీరేందుకు, పలు కార్యక్రమాలకు, స్వాతంత్రోద్యమ సంఘటనలకు వేదికగా ఉన్న స్వరాజ్య మైదానంలో నిర్మాణాలు చేపట్టాలనుకోవడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో చారిత్రక నేపథ్యం గల స్వరాజ్య మైదానాన్ని ప్రభుత్వం విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని చూడటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన స్వరాజ్య మైదానం...
స్వరాజ్య మైదానానికి గల చరిత్ర ఈ నాటిది కాదు. 1944లో లక్ష మంది పాల్గొన్న అఖిల భారత కిసాన్ మహాసభ ఇక్కడే జరిగింది. 1951 డిసెంబర్ 27న ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ ఈ మైదానంలో జరిగిన సభలో మాట్లాడారు. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి మహామహులు ఈ మైదానంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. వామపక్షాల అగ్రనాయకులు ఈఎంఎస్ నంభూద్రి ప్రసాద్, హరికిషన్ సింగ్ సుర్జీత్‌, పుచ్చలపల్లి సుందరయ్య తదితరలు ఈ మైదానంలో అడుగుపెట్టినవారే.

పీడబ్ల్యూడీ గ్రౌండ్ వేదికగా పలు ఉద్యమాలకు ఊపిరి ...
నందమూరి తారక రామారావు అధికారంలోకి వచ్చాక, నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసిన సమయంలోనూ ఎన్టీఆర్‌ ఈ మైదానం నుంచే ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఎందరో మహామహులు పీడబ్ల్యూడీ గ్రౌండ్ వేదికగా ఉద్యమాలకు ఊపిరిలూదారు. స్వాతంత్ర్య సంగ్రామంలో సైతం స్వరాజ్యమైదానం కీలక భూమికను పోషించింది. కాలనీల్లోని పార్కులు, కామన్ సైట్లలో ఏ విధమైన కట్టడాలు ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు నిచ్చింది. కానీ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ను రూపురేఖలు కోల్పోయేలా ప్రభుత్వం వ్యవహరించడంపై స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కామన్‌ సైట్లకు హానీ కల్గించకూడదంటున్న యూఎన్ ప్రచారం...
ఇలాంటి కామన్‌ సైట్లకు ఎలాంటి హానీ కల్గించకూడదని ఐక్యరాజ్య సమితి యూఎన్‌ హాబిటెడ్‌ పేరుతో ప్రచారం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా స్వరాజ్య మైదానాన్ని ఉద్యానవనం పేరుతో ప్రైవేటు పరం చేసే కుట్ర చేయడంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఇప్పటికైనా స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటుపరం కాకుండా చూడాలని ప్రజలు, స్థానికులు కోరుతున్నారు. 

ముద్రగడ స్వచ్ఛంద అరెస్టు

తూ.గో : అమలాపురంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వచ్ఛంద అరెస్టు అయ్యారు. సీబీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురంలో ఆందోళనలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఎవరైనా నిరసనలకు దిగితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ముద్రగడకు మద్దతుగా భీమవరం నుండి...

.గో : ముద్రగడ ఆందోళనకు మద్దతు తెలిపేందుకు భీమవరం నుంచి అమలాపురం కు జిల్లా కాసు నేతలు బయల్దేరారు. దీంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.

11:31 - June 7, 2016

తూ.గోదావరి : అమలాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ ఆయన ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ముద్రగడకు మద్దతుగా కాపు యువత భారీగా అమలాపురం పీఎస్ కు చేరుకుంటున్నారు. ముఖ్యమైన ప్రాంతంతో పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలూ జరుగకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.గతంలో కూడా కాపు గర్జనకు పిలుపునిచ్చి ముద్రగడ అనూహ్యంగా చెలరేగిన ఆందోళనకు కారణమయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పరిస్థితి వుంటంతో పోలీసులు అప్రమత్తంగా వున్నారు. ఈ క్రమంలో అదనపు పోలీసులు బలగాలను రంగంలోకి దిగుతున్నాయి.

కాపు గర్జన పేరుతో గతంలో ఆందోళన...
కాగా గతంలో కాపునేత ముద్రగడ కాపు గర్జన పేరుతో పలు ఆందోళనలకు కారణమయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆందోళన కారులు తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏపీ సర్కార్ కొంతమంది అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అను నిరసిస్తూ ముద్రగడ అమలాపురం పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. అమాయకులను వదిలి తమను అరెస్ట్ చేయమని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను జైలుకు వెళ్లటానికి కూడా సిద్ధంగా వున్నానని ఆయన పేర్కొన్నారు. ఆయనకు మద్దతుగా పలువురు కాపునేతలు పీఎస్ లోనే బైఠాయించారు. తనను అరెస్ట్ చేసేవరకూ ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళనంటున్నట్లుగా సమాచారం. 

ఆర్ బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష

ఢిల్లీ : ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక వడ్డీరేట్లు యధాతథంగా, రెపోరేటు 6.5, రివర్స్ రేటు 6శాతం, సిఆర్ ఆర్ 4% యథాతథగా నిర్ణయించినట్లు సమాచారం.

ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్ : ఇద్దరి మృతి

నల్లగొండ : జిల్లాలోని ఆలేరు సమీపంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయాపడ్డారు. మంగళవారం చోటుచేసుకుంది. వరంగల్‌కు చెందిన ఎల్లయ్య, మహేష్ ద్విచక్రవాహనం పై ఆలేరు వెళ్తున్నసమయంలో పెంబర్తి దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాల య్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

14 రోజుల రిమాండ్ కు లక్ష్మీ శారద

అనంతపురం : కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీశారదకు ధర్మవరం మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం లక్ష్మీ శారతను ధర్మవరం సబ్ జైలుకు తరలించారు. లక్ష్మీ శారద చేనేత కార్మికులకు రూ.9కోట్లు బకాయిపడిన విషయం తెలిసిందే.

10:58 - June 7, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి జరిగే పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్కర ఘాట్లతోపాటు, నగరంలో అన్ని ప్రాంతాలకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు.

యుద్ధ ప్రాతిపదికన పుష్కర ఏర్పాట్లు చేసున్నఅధికారులు ....
ప్రకాశం బ్యారేజ్‌ ఎగువున దుర్గా ఘాట్‌, దిగువన పద్మావతి ఘాట్‌, ఇబ్రహీంపట్నంలో సంగం ఘాట్లకు విద్యుత్‌ సరఫరా కోసం భూగర్భ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు లైన్ల ద్వారా విద్యుత్‌ సరఫరా కోసం రింగ్‌ మెయిల్స్‌ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 132 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేన్‌ నిర్మాణం చేపట్టారు. నగరంలో ఇరుకైన రోడ్లు ఉన్న కృష్ణలంక, వన్‌టౌన్‌, గురునానక్‌ కాలనీ, కరెన్సీ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ట్రాన్స్‌మిషన్‌ లైన్లకు కండక్టర్‌ కవర్‌ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల విస్తరణకు వీలుగా విద్యుత్‌ స్తంభాలను మార్చుతున్నారు.

దేదీప్యమానంగా వెలిగిపోనున్న పుష్కర ఘాట్లు...
విద్యుత్‌ ధగధగలతో దేదీప్యమానంగా వెలిగిపోయే విధంగా పుష్కర ఘాట్లను తీర్చిదిద్దుతున్నారు. విజయవాడతోపాటు ప్రకాశం బ్యారేజీకి అవతలివైపు గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే తాడేపల్లి, సీతానగరంలో కూడా ఇదే విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు హడావుడిగా కాకుండా విద్యుతాఘాతానికి అవకాశం లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సౌకర్యాలకు ప్రాదాన్యతనివ్వాలని కోరుతున్న వివిధ వర్గాలు...
పుష్కర పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. మరోవైపు పుష్కరాల పనుల్లో ఎక్కడా కూడా రాజీపడకుండా అన్ని పనులను ప్రాణికంగా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం పరిశీలన...
పుష్కరాల తర్వాత కూడా ప్రజలు ఘాట్లను సందర్శించేందుకు వీలుగా.. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. వీలునుబట్టి వీటి దగ్గర షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, హోటల్స్‌, రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇందుకు అనుగుణంగానే విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 

10:51 - June 7, 2016

విజయవాడ : ఏపీలో చంద్రబాబు రెండేళ్ల పాలనపై పోరుబాటకు సిద్ధమైంది విపక్ష వైసీపీ. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని వైసీపీ మండిపడుతోంది. అందుకే చంద్రబాబుపై రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో 420 కేసులు నమోదు చేయించాలని యోచిస్తోంది. దీంతోపాటే.. పోరుబాట పేరిట ప్రజల్లోకి వెళ్లాలనీ నిర్ణయించింది.

టీడీపీపై ఫోర్‌ ట్వంటీ కేసులు నమోదుకు వైసీపీ యోచన...
ఏపీలో చంద్రబాబు పాలనను ప్రజల్లో ఎండగట్టాలని విపక్ష వైసీపీ యోచిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన దాదాపు ఆరువందల హమీల్లో టీడీపీ సర్కారు... ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేదని మండిపడుతోన్న వైసీపీ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలు రచిస్తోంది. ఈనెల 8న.. చంద్రబాబు రెండేళ్ల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా.. అన్ని మండలాల పోలీసు స్టేషన్‌లలో ఫోర్‌ ట్వంటీ కేసులు నమోదు చేయించాలని నిర్ణయించింది.

లోటు బడ్జెట్‌ను సాకుగా చూపుతున్నారని విమర్శ...
ఓట్ల కోసం హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అన్నింటినీ గాలికి వదిలేశారని వైసీపీ మండిపడుతోంది. ఏదడిగినా రాష్ట్ర లోటు బడ్జెట్‌ను సాకుగా చూపుతున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా, రైతు, డ్వాక్రా రుణమాఫీ, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, పెన్షన్ల వంటి ప్రధాన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న చంద్రబాబు... ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని... ఈ అంశాలన్నింటిపైనా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. 

10:40 - June 7, 2016

లాటరీ పేరుతో ఎస్సెమ్మెస్ లు..కోటి రూపాయల గిఫ్ట్ వచ్చిందంటూ మెయిల్స్..అడ్డంగా దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు...
హలో..మీకు కోటి రూపాయల లాటరీ తగిలిందంటూ ఎస్సెమ్మెస్..ఫోన్ కాల్స్ వచ్చాయా ? ఖరీదైన బహుమతి గెలుచుకున్నారంటూ పదే పదే ఫోన్స్ చేస్తూ విసిగిస్తున్నారా ? విదేశాల్లో ఉద్యోగం అంటూ ఊదరగొడుతున్నారా ? అయితే వీరి మాయలో ఏ మాత్రం పడకండి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిండా దోచేయడానికి ఈ కేటుగాళ్లు సిద్ధంగా ఉంటారు. డబ్బులు వస్తున్నాయని పరుగులు తీస్తే మొదటికే మొసం వస్తుందని గ్రహించండి..ఇలాగే ఓ కరీంనగర్ వాసికి శఠగోపం పెట్టారు.
కోటి రూపాయలు లాటరీ తగిలిందని ఫోన్ చేశారు. ఇలా పలు కారణాలతో రూ. 24 లక్షలను వసూళ్లు చేశారు. డబ్బు రాకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టైంది. ఈ ఘటనలో నైజీరియన్ల మోసాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

10:28 - June 7, 2016

తూ.గోదావరి : అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. అమలాపురం సీఎస్ ముందు కాపునేత ముద్రగడ పద్మనాభం ఆందోళన చేపట్టారు. తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఆందోళన చేపట్టారు. ముద్రగడకు మద్ధతుగా కాపునేతలు కూడా ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. అమాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టవద్దనీ ఉద్యమ నాయకుడిగా వున్న తనను అరెస్ట్ చేయమని..తాను సెంట్రల్ జైలు వెళ్లటానికి కూడా సిద్ధంగా వున్నానని  ఆయన ఆయన డిమాండ్ చేశారు. తుని రైలు ఘటనలో అనుమానితులుగా వున్న ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. మరో 40 మందిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ దీక్ష..
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమ నేత ముద్రగడ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాయుతంగా మారిపోయింది. రత్నాచల్‌ ఎక్స్ ప్రెస్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. రెచ్చిపోయిన ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. ఒక బోగీ తర్వాత మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. మంటల తీవ్రతతో 14 రైలు బోగీలతో సహా రైలు మొత్తం దగ్ధమైంది. డ్రైవర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్‌ నిలిపివేయించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. అలాగే మీడియా సిబ్బందిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. ఈ దాడిలో కెమెరాలు సైతం ధ్వంసమయ్యాయి.

అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన నన్నపనేని

గుంటూరు: టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. హోంమంత్రి చినరాజప్ప మంగళవారం ఆమెను పరామర్శించారు. ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నన్నపనేని త్వరగా కోలుకోవాలని చినరాజప్ప ఆకాంక్షించారు. కాగా శ్వాసకు సంబంధించిన సమస్యతో నన్నపనేని బాధపడుతున్నట్లు సమాచారం.

అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య

కరీంనగర్: హుస్నాబాద్‌ మండలం గోవర్దనగిరిలో అప్పులబాధతో పురుగుమందు తాగి రైతు నాగిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

10:23 - June 7, 2016

అనాథ బాలికలు.. విధి వంచిత మహిళలు.. మతిస్థిమితం కోల్పోయిన అబలలు..వారి కంటికి కనిపిస్తే అంతే..ఆ అర్థరాత్రి పంజా విసరాల్సిందే.. నెల్లూరు జిల్లా సింహపురిలో చీకటి పడితే మృగాళ్లు ముఠాలు సంచరిస్తున్నాయా ? కనిపించిన అమాయకురాల్లపై పంజా విసురుతున్నాయా ? వీరి లక్ష్యం పైశాచిక దాడులే. ఇలా ఎందరో అబలలు ముఠాల బారిన పడినట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఓ ఉదంతం యావత్తు పోలీసు డిపార్ట్ మెంట్ నే ప్రశ్నిస్తోంది. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి పైశాచికానికి బాధితురాలు గర్భం దాల్చింది. వైద్య పరీక్షలు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా చేస్తున్న ఆకృత్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి పోలీసులు ఏం చేస్తారో ?

ధర్మవరం జడ్జి ఎదుట కళానికేతన్ డైరెక్టర్

అనంతపురం : కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీశారదను ధర్మవరం జడ్జి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. విచారణ అనంతరం రిమాండ్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమాయకులను కాదు.. నన్ను అరెస్టు చేయండి: ముద్రగడ

తూ.గో : తుని ఘటనలోఅ మాయకులను అరెస్టు చేస్తున్నారని.. అమాయకులను కాదు.. నన్ను అరెస్టు చేయండి అంటూ అమలాపురం పీఎస్ ఎదుట కాపు ఉద్యమ నేత ముద్రగడ, అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అని ముద్రగడ పేర్కొన్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

10:14 - June 7, 2016

పరువు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు..చిన్న చిన్న కారణాలతో గొడవలు..ఉద్రేకంతో పోలీసు కేసుల్లో కార్పొరేటర్లు..ఆదర్శంగా ఉండాల్సిన వారే దారి తప్పుతున్నారా ?

మొన్నటి మొన్న విమానంలో మహిళను వేధించడాన్న అభియోగాలపై బెజవాడ కార్పొరేటర్ పై హైదరాబాద్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోక ముందే మరో కార్పొరేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వెళ్లడమే కాకుండా అడ్డుకున్న హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు. ప్రజాప్రతినిధులు ఇలాగేనా ఉండాల్సింది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆ కార్పొరేటర్ చేసిన నిర్వాకం ఏంటో తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి.

ఆర్టీఏ తనిఖీలు.. 4ప్రైవేటు బస్సుల సీజ్

రంగారెడ్డి : పెద్ద అంబర్‌పేట వద్ద గల జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు ఈ ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ చెందిన నాలుగు బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా మరో 22 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు.

కుక్కల దాడిలో 20గొర్రెలు మృతి

మెదక్ : మిరుదొడ్డి మండలం భూంపల్లిలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గొర్రెల యజమానులు ఆందోళన చెందుతున్నారు. 

09:59 - June 7, 2016

మీకు 'గజిని' సినిమా గుర్తుండే ఉంటుంది. కదా. అందులో 'సూర్య' గతం మరిచిపోతుంటాడు. గుర్తు పట్టడానికి కొన్ని ఆధారాలు పెట్టుకుని ఉంటుంటాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నాడు. కానీ 'గజిని'లో పావుగంటకు ఒక మారు గతాన్ని మరిచిపోతే ఇతను మాత్రం ఐదు నిమిషాలకే గతం మరిచిపోతుంటాడు. తైవాన్ లో చెన్ హొంగోజీ ఉంటున్నాడు. ఓ 8 సంవత్సరాల క్రితం ప్రమాదంలో చెన్ తలకు తీవ్రగాయమైంది. దీనివల్ల షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చిందంట. దీనితో ఏ విషయమైనా ఐదు నిమిషాల తరువాత గుర్తుండదంట. రోజు లేవగానే కొత్త కొత్తగా ఉంటుందని..దీనితో తల్లి జరిగినందంతా చెబుతుంది. గుర్తు పెట్టుకోవడం కోసం..గుర్తించడం కోసం ఓ నోట్ బుక్ లో రాసుకుంటూ ఉంటుంటాడు. ఈ బుక్ చెన్ వద్దనే ఉంటుంది. అర్థమయ్యే రీతిలో ఓ లిపిని కూడా రూపొందించుకున్నాడంట. మతి మరుపు ఉందని ఖాళీగా మాత్రం కూర్చొలేదు. ప్టాస్టిక్ బాటిళ్లను సేకరించే వ్యాపారం చేస్తున్నాడంట.!

'కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాలను టి.సర్కార్ ఉల్లంఘిస్తోంది:'

విజయవాడ: కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాలను తెలంగాణ పాటించలేదని ఒప్పందాలను తెలంగాణే ఉల్లంఘిస్తోందని ఏపీ మంత్రి దేవినేని పేర్కొన్నారు. తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లి రాద్ధాంతం చేయడం సరికాదు..నీటి కేటయింపులపై కేంద్రంతో చర్చించేందుకు సిద్ధమని మంత్రి చెప్పారు. బచావత్‌ ట్రిబ్యునల్‌కు అనుగుణంగా రాష్ట్రాలకు 512 టీఎంసీల కేటాయింపులు జరిగాయన్నారు. తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. కానీ కృష్ణా బోర్డు ఆదేశాలను మంచినీటి విడుదలకు అమలుచేశారా అంటూ ఆయన టీ.సర్కార్ ను ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి హరీశ్‌ దీనికి సమాధానం చెప్పాలంటూ మంత్రి డిమాండ్ చేశారు.

09:57 - June 7, 2016

బాలీవుడ్ లో వయస్సు ముదిరిపోతుంటే వివాహం ఎప్పుడంటూ మీడియా ప్రశ్నిస్తూ ఉంటుంది. కొంతమంది మాత్రం తొందరగానే వివాహం చేసుకుంటుంటారు. ఈ అమ్మడు మాత్రం తనకు వివాహం ముఖ్యం కాదని పేర్కొంటోంది. ఆమె ఎవరో కాదు.. మహేష్ భట్ కూతురు 'అలియా భట్'.. షాహిద్‌కపూర్‌, కరీనాకపూర్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'ఉడ్తా పంజాబ్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా 'అలియా భట్' మీడియాతో ముచ్చటించింది. 'కొంతమంది అమ్మాయిలకు జీవితంలో అత్యంత ముఖ్యమైనది పెళ్ళి.. నాకు మాత్రం ఆస్కార్‌ చాలా ముఖ్యమైనది' అంటూ పేర్కొంది. తాను ఈ చిత్రంలో బీహారీ అమ్మాయిగా నటించడం జరిగిందని, ఇందులోని పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలిపింది. అన్నింటికి మించి సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని, చాలా మెచ్యూర్డ్‌గా నటించానని యూనిట్‌ అభినందించడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఇందులో డ్రగ్స్ కి బానిసైన వాడిగా 'షాహిద్ నటించాడని, డాక్టర్ గా 'కరీనా' నటించిందని తెలిపింది. తన కెరీర్‌కి బాగా ఉపయోగపడే చిత్రమిదని తెలిపింది. మరి అలియా ముందు వివాహం చేసుకుంటుందా ? లేక అస్కార్ అవార్డు తీసుకుంటుందా అనేది చూడాలి.

09:55 - June 7, 2016

తమన్నా..టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం ఆమె ఓ చిత్రంలో నటిస్తోంది. ఇదొక ఛాలెజింగ్ క్యారెక్టర్ అని అంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్‌ , అమీజాక్సన్‌ ముఖ్య పాత్రధారులుగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'అభినేత్రి'. 'ఇప్పటివరకు పోషించిన పాత్రలతో కంపేర్‌ చేస్తే ఇదొక వైవిధ్యమైన పాత్ర' అంటూ ఈ అమ్మడు ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా తమన్నా ఒ ఫొటో కూడా అభిమానులతో పంచుకున్నారు. మొదటిసారిగా లీడ్ రోల్ లో నటించడం జరిగిందని, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని పేర్కొంది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేయడం జరిగిందని తెలిపింది.'అభినేత్రి'గా ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తారనే నమ్మకం నాకుందని పేర్కొంది. మరి తమన్నా నటన..అభినయం..ఎలా ఉందో తెలియాలంటే చిత్ర విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

09:54 - June 7, 2016

మెగస్టార్ తనయుడు 'రాంచరణ్ తేజ' ఓ భారీ హిట్ కోసం తహతహలాడుతున్నాడంట. ప్రస్తుతం ఆయన దూకుడు పెంచేశాడు. 'బ్రూస్ లీ' సినిమా అంతగా ఆడకపోయేసరికి చెర్రీ ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఓ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట. దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి..
తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రాన్ని 'ధృవ' పేరుతో రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'రామ్ చరణ్' స్టైలిష్ గా కనబడుతాడంట. ఇందులో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో మెరిపించనున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగానే సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు 'రామ్ చరణ్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే అవకాశాలున్నట్లు టాక్. ఇక ఈచిత్రంలో డాక్టర్ పాత్రలో 'రామ్ చరణ్' పోషించనున్నాడని తెలుస్తోంది. ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాంటే చిత్ర యూనిట్ పెదవి విప్పుతునే తెలుస్తుంది.

09:54 - June 7, 2016

ముఖ సౌందర్యం కోసం దాదాపు అందరూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మహిళలు మరింత శ్రద్ధ తీసుకుంటారు. ముఖం ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి ? అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
గ్రీన్ టీ.. ఇది మొటిమలకు చెక్ పెడుతుంది. చర్మాన్ని బిగుతుగా మార్చేస్తుంది. ఇందుకోసం చెంచా గ్రీన్ టీ..నాలుగు బొప్పాయి ముక్కలు..మూడు అనాస ముక్కలు..హాఫ్ తేనె తీసుకుని మెత్తగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి..మెడకు పట్టించండి..పావుగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
గుడ్డులోని తెల్లసొనకు రెండు చెంచాల అనాస రసం..చెంచా తేనె తీసుకుని ముఖానికి రాసుకోవాలి. పావుగంట తరువాత ముఖం కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా చర్మం మృదువుగా, బిగుతుగా మారుతుంది.
రెండు చెంచాల అనాస రసం..చెంచా ద్రాక్ష నూనె, రెండు చెంచాల తేనె కలుపుకోవాలి. దీనిని ముఖానికి పట్టించాలి. ఓ 20 నిమిషా అనంతరం చన్నీళ్లతో కడిగేయాలి. అంతే..ఓ సారి మీరు పాటించి చూడండి..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3గంటలు, కాలినడక భక్తులకు 2గంటల సమయం పడుతోంది.

09:53 - June 7, 2016

అతివలు..అందం మెరుగుపరచడానికి ఎన్నోవాటిని ఉపయోగిస్తుంటారు. డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్లకు వెళుతుంటారు. సీజన్ లో వచ్చే పండ్ల తో కూడా అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాంటి పండ్లలో 'అనాస' ఒకటి. ఈ అనాస పండ్లలో విటమిన్ ఏ, సి గుణాలు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. దీనిని వాడడం వల్ల చర్మాన్ని సున్నితంగా ఉంచడంతో పాటు మృతకణాలని తొలగిస్తుంది. ఈ అనాస పండుతో పాటు తేనె కూడా కలిపి ముఖానికి రాసుకుంటే మాయిశ్చరైజర్ గుణాలు అందుతాయి. ఇందుకు నాలుగు చెంచాల అనాస రసం, చెంచా తేనె, రెండు చెంచాల ఆలివ్‌ నూనె కలిపాలి. అనంతరం ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి.
మరో టిప్..మూడు అనాస ముక్కలకు తోడు నాలుగు బొప్పాయి ముక్కలు తీసుకుని దీనికి చెంచా తేనె కలపాలి. ఓ గిన్నెలో వేసి మెత్తగా కలిపేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే చర్మానికి మెరుపు వస్తుంది. ఇలా చేసి చూడండి. మార్పు గమనించండి.....

కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిష్కరణ..

త్రిపుర : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిశ్వబంధు సేన్ ను పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆరు సంవత్సరాల పాటు బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు.

09:40 - June 7, 2016

మెదక్‌ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న సదస్సులో పాల్గొనేందుకు ఏటిగడ్డ కృష్టాపూర్‌ కోదండరాం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్నది అభివృద్ధి కాదు.. విధ్వంసం అని ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. గత పాలకులు అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని విమర్శించారు. గత పాలకులు అనుసరించిన సరళీకరణ వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందనిఆయన పేర్కొన్నారు. సరళీకరణ నుండి ఉత్పన్నమైన విధ్వంసాన్ని ప్రభుత్వం పునర్మాణం చేయాల్సిన అవుసరముందన్నారు. ఈ విషయంలో జరిగిన నష్టాలు, విధ్వంసం నుంచి బయటపడటానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. 2013 చట్టప్రకారమే భూసేకరణ చేయాలన్నారు. అనివార్యంగా భూసేకరణ చేయాల్సివస్తే ప్రజలతో చర్చలు జరిపి వారి కష్టనష్టాలను తెలుసుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తెలంగాణ వేరు...ప్రభుత్వం వేరు రెండింటినీ కలిపి చూడవద్దన్నారు. 

కాచిగూడ – గుంటూరు, తిరుపతి డబుల్ డెక్కర్ రైళ్ల రద్దు..

హైదరాబాద్ : నిర్వహణ కారణాల వల్ల ఈనెల 12 నుంచి 30 వరకు డబుల్‌ డెక్కర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. కాచిగూడ-గుంటూరు డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22118), గుంటూరు కాచిగూడ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22117), కాచిగూడ తిరుపతి డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22120), తిరుపతి-కాచిగూడ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22119) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కామత్..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సోమవారం ముంబైలో కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన గురుదాస్... ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం బాబు..

విజయవాడ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రోడ్డు రవాణా రహదారులు షిప్పింగ్‌ శాఖల సహాయ మంత్రి రాధాకృష్ణన్‌లతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం భేటీ కానున్నారు. విజయవాడ నగరంలో బీజేపీ నిర్వహిస్తున్న 'వికాస్‌ పర్వ్‌' సభల్లో వీరు పాల్గొననున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో కేంద్రమంత్రులతో సీఎం సమావేశమవుతారు. కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన పెండింగ్‌ అంశాలు నిధుల విషయంపై స్మృతి ఇరానీతోనూ, రహదారి ప్రాజెక్టుల పురోగతిపై రాధాకృష్ణన్‌తోనూ చర్చించనున్నారు.

బుధవారం కేరళను తాకనున్న రుతుపవనాలు..

హైదరాబాద్ : బుధవారం సాయంత్రానికల్లా నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చేరే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రాల్లో దట్టమైన మేఘాలు ఆవరిస్తున్నాయి. కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

నేడు కేంద్ర మంత్రి స్మృతి రాక..

విజయవాడ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మొదలైన రంజాన్ దీక్షలు..

హైదరాబాద్ : ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో రుయత్ హిలాల్ కమిటీ సదర్ మజ్లీస్ ఉలేమా ఈ దక్కన్‌తో పాటు పలు హిలాల్ కమిటీలు ఈ మేరకు ప్రకటించాయి. రంజాన్ మాసపు మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున సహార్‌తో మొదలైంది.

ప్రకాశం జిల్లాలో దోపిడి దొంగల స్వైర విహారం..

ప్రకాశం : జిల్లాలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. ఓ కారులో దర్జాగా వచ్చిన దోపిడీ దొంగలు రోడ్డుపై వెళుతున్న లారీలే లక్ష్యంగా దోపిడీకి పాల్పడ్డారు. జిల్లాలోని సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. దొంగల కోసం గాలింపులు చేపట్టారు.

పెద్ద అంబర్ పేటలో ఆర్టీఏ తనిఖీలు..

రంగారెడ్డి : పెద్ద అంబర్‌పేట వద్ద గల జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ చెందిన నాలుగు బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా మరో 22 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

బుధవారం చేప ప్రసాదం..

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఫిషరీష్ శాఖ ఆధ్వర్యంలో అస్తమా వ్యాధి గ్రస్తులకు ఇప్పటికి సుమారు 40వేల కొర్రమీన్లను అందుబాటులో ఉంచారు. నేటి సాయంత్రం వరకు లక్ష కొర్రమ్లీను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. కొర్రమీన్ల కొనుగోలుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కొర్రమీన్‌ను రూ.15కు విక్రయించనున్నారు. తొక్కిసలాట జరగకుండ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.

09:01 - June 7, 2016

అమెరికా : అందాల రాణిగా ఆ దేశానికి చెందిన ఆర్మీ రిజర్వ్‌ అధికారిని ఎంపికయ్యారు. లాస్‌వెగాస్‌లోని టీ-మొబైల్‌ ఎరీనాలో జరిగిన మిస్‌ అమెరికా అందాల పోటీల్లో 26ఏళ్ల జెషానా బార్బర్‌ విజేతగా నిలిచారు. కొలంబియా జిల్లా తరుపున పోటీ చేసిన బార్బర్‌ మిస్‌ అమెరికా టైటిల్‌ దక్కించుకున్నారు. మహిళా సైనికులు గురించి అడిగిన ప్రశ్నకు... పురుషులతో సమానంగా తాము కూడా బలమైన సైనికులమేనంటూ సమాధానం చెప్పారు. హవాయ్‌కి చెందిన చెల్సీ హార్డిన్‌ ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది చివర్లో జరిగే విశ్వసుందరి పోటీలకు బార్బర్‌ అమెరికా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. 

08:56 - June 7, 2016

హైదరాబాద్ : అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు స్కూల్స్‌పై మరో పోరాటానికి సిద్దమయ్యారు పేరెంట్స్ జేఏసీ. ఫీజు నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేదాకా ఉద్యమం చేస్తామంటున్నారు ...ఈనెల 11 వ తేదీన మహధర్నాను చేపట్టి ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు సమాయత్తమవుతున్నారు.

పోరాటాన్ని ఉధృతం చేసిన పేరెంట్స్ అసోసియేషన్ ...
హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. వారి పోరాటం ఫలితంగా ప్రభుత్వం జీవో 91 తీసుకొచ్చింది...అందులో ప్రధానంగా ఐదు వేలకు మించి ఆడ్మిషన్ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాల యాజమాన్యాలకు సర్కూలర్ జారీ చేసింది...అన్ని ప్రైవేటు పాఠశాలలు తమ ఫీజు వివరాలను విధిగా ప్రభుత్వ పోర్టల్ లో పొందుపర్చాలని ఆదేశించింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇతర పద్దతుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.. ఢిపెరెన్సియల్ ఫీజు పేర...ఫీజుల భారాన్ని మోపుతున్నాయి..

ఈ నెల 11 న మహధర్నాకు పిలుపు...
దీంతో మరో ఉద్యమానికి పేరెంట్స్ జేఏసీ శ్రీకారం చుట్టింది. మే 30 న సమావేశం నిర్వహించిన జేఏసీ ఈ నెల 11 న మహధర్నాకు పిలుపునిచ్చింది...ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ వద్దకు పేరెంట్స్ చేరుకోని ఉద్యమంలో భాగం పంచుకోవాలని కోరింది...పేరెంట్స్ అధిక సంఖ్యలో ధర్నాకు హాజరై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించింది..ఆడ్మిషన్ల ఫీజులు తగ్గించిన విధంగానే ట్యూషన్ ఫీజులను సైతం తగ్గించుకోవచ్చని తెలిపింది. అడ్డదారుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ ప్రకటించింది...

ప్రయివేటు స్కూళ్లపై కొరడా ఝళిపించాలని డిమాండ్ ...
ప్రభుత్వం సర్కూలర్‌తో సరిపెట్టకుండా... ఫీజు భారాలు మోపుతున్న స్కూళ్లపై కొరడా ఝళిపించాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్ జేఏసీ ప్రతినిధులు.. లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. 

08:48 - June 7, 2016

హైదరాబాద్ : ముస్లింల పవిత్ర మాసం మొదలైంది. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు ఈరోజు ఉదయం సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. తొలిరోజు ఉదయం 4 గంటల 9 నిమిషాలకు ఉపవాసదీక్ష ప్రారంభించిన ముస్లింలు.. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు దీక్ష ముగించి.. ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. నెల రోజుల పాటు జరగనున్న ఉపవాస దీక్షలకు మసీదులన్నీ ముస్తాబయ్యాయి. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో నేటినుంచి రంజాన్‌ ఉపవాసాలు మొదలయ్యాయి.

రంజాన్ రోజునే ఖురాన్ గ్రంథం భువిపైకి వచ్చిందని ముస్లింల నమ్మకం...
ఆధ్యాత్మిక చింతన వైపు మరల్చే పవిత్ర మాసంగా రంజాన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇదే మాసంలో దైవ ప్రసాదితమైన దివ్య ఖురాన్ గ్రంథం భువిపైకి వచ్చిందని ముస్లింల నమ్మకం. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సమానత్వం, సహనం, భక్తిని, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన మాసం రంజాన్. ఈ నెలరోజుల పాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు.

వేడుకలకు సిద్ధమయిన మసీదులు...
రంజాన్ వేడుకలకు మసీదులు సిద్ధమయ్యాయి. రంగు రంగుల విద్యుత్‌ దీపాల అలంకరణతో మసీదులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.

ఈ మాసం మొత్తం.. పాతబస్తీలోని వీధులన్నీ షాపింగ్‌ సందడితో కిటకిటలాడుతాయి. ఉపవాస దీక్షలో తీసుకునే పండ్లకు యమగిరాకీ ఏర్పడనుంది. ఎక్కడ చూసినా పండ్ల దుకాణాలే దర్శనమిస్తుంటాయి. మరోవైపు హలీం రుచులను అందించడానికి బట్టీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే హలీం అమ్మకాలు హైదరాబాద్‌ నగరంలో జోరుగా సాగుతున్నాయి.

దీక్షలతో ఆత్మప్రక్షాళన అవుతుందని ముస్లింల నమ్మకం...
పవిత్ర మాసం రంజాన్‌లో రంజు అనగా అరబిక్‌ భాషలో కాలడం లేదా శుష్కించడం అని అర్థం. రంజాన్ మాసంలో కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మప్రక్షాళన అవుతుందని ముస్లింల నమ్మకం. దీని ద్వారా కామం, క్రోదం,లోభం, మదం వంటి వాటితో పాటు మోహం కూడా అదుపులో ఉండి మనుషులు శాంతి స్వరూపులుగా మారతారనేది వారి విశ్వాసం. ఇక రోజా పేరుతో చేపట్టే ఉపవాస దీక్షను సూర్యోదయం కంటే ముందు ప్రారంభించి, సూర్యాస్తమయం తరువాత ముగిస్తారు. ఈ మధ్య కాలవ్యవధిలో మంచినీళ్లు కాదుకదా నోట్లో వచ్చే లాలాజలాన్ని సైతం మింగకుండా ఉపవాసం ఉంటారు. అందుకే ఈ దీక్షలను అత్యంత పవిత్రంగా భావిస్తారు.

ఇఫ్తార్ కోసం ప్రత్యేక హోటళ్లు ...
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఇఫ్తార్ కోసం ప్రత్యేకంగా హోటళ్లు ముస్తాబయ్యాయి. రంజాన్‌ సందర్బంగా...ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో రాష్ట్ర పోలీసులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 

వంటమాస్టర్‌ దారుణ హత్య..

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని హైవే దాబాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దాబాలోని వంటమాస్టర్‌ ఇస్మాయిల్‌ను చెంగల్‌రాయుడు అనే వ్యక్తి సుత్తితో కొట్టి చంపాడు.

మొబైల్‌ దుకాణంలో భారీ చోరి...

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ మొబైల్‌ దుకాణంలో భారీ చోరి జరిగింది. 25 లక్షల రూపాయల విలువైన ఫోన్లను దొంగలు అపహరించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

08:11 - June 7, 2016

తెలంగాణ ఉద్యమ సంఘానికి... తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య పోరు తీవ్రమైంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను ముప్పు తిప్పలు పెట్టిన గులాబి దళం.. ఇప్పుడు ఉద్యమ సంఘంపై విరుచుకు పడుతోంది. తెలంగాణ జేఏసీ ఎత్తేసిన దుకాణమంటూ టీఆర్ఎస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. టీజేఏసీ/టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేశ్ కుమార్ (సీనియర్ జర్నలిస్ట్),రాకేశ్ (టీఆర్ఎస్ నేత),శ్రీరామ్(టీడీపీ నేత) పాల్గొన్నారు. ఈ చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి ..మరింత సమాచారాన్ని తెలుసుకోండి...

08:03 - June 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సంఘానికి... తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య పోరు తీవ్రమైంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను ముప్పు తిప్పలు పెట్టిన గులాబి దళం.. ఇప్పుడు ఉద్యమ సంఘంపై విరుచుకు పడుతోంది. తెలంగాణ జేఏసీ ఎత్తేసిన దుకాణమంటూ టీఆర్ఎస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ టీ జాక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శలు చేస్తున్నారు. ఆమధ్య రైతుల ఆత్మహత్యలపై జిల్లాల పర్యటనలు చేసిన కోదండరాం.. ఇటీవల ఇదే అంశంపై హైకోర్టులో స్క్వాష్‌ పిటిషన్‌ వేసి సర్కారు తీరును తప్పుబట్టారు. తాజాగా ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజాహితంగా లేదని.. చేతకాకపోతే దిగిపొమ్మని వ్యాఖ్యానించడం ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టింది.

టీజాక్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీ.సర్కార్...
ఇప్పటి వరకు విపక్ష పార్టీల విమర్శలను లైట్ గా తీసుకున్న గులాబీ దళం... టీజాక్ వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటోంది. తెలంగాణ సాధన కోసం అంతా కలిసి పనిచేసినా..... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీజాక్ అస్థిత్వం ఎక్కడుందని గులాబి దళం ప్రశ్నిస్తోంది. లక్ష్యం పూర్తి కావడంతోనే అందులో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరి దారి వారు చూసుకున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

కోదండరాంపై విరుచుకు పడుతున్న గులాబీ దళం...
ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత వ్యతిరేకత కారణంగానే విమర్శలు తీవ్రం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు ఎవరి స్థాయిలో వారు కోదండరాంపై విరుచుకు పడుతున్నారు.

ప్రాధాన్యం సంతరించుకున్న కోదండరాం విమర్శలు...
ఉద్యమ సమయం నుంచే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కోదండరామ్‌కు విబేధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ ప్రభుత్వంపైనే కోదండరాం విమర్శనాస్త్రాలు సంధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లుగా జాక్ ను పట్టించుకోని టీఆర్ఎస్.... ఇప్పుడు కోదండరామ్‌పై విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయంశమైంది.
టీఆరెస్ లీడర్లు చేసిన కామెంట్స్ వీడియోలో చూడండి..

07:51 - June 7, 2016

చెన్నై : ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ ప్రీమియర్‌ నిర్వాహక సంస్థ ఫుట్‌ సాల్‌ చెన్నైలో ప్రారంభమైంది. ఇక్కడి ఓ స్టార్‌ హోటల్లో ఫుట్‌ సాల్‌ను క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రారంభించారు. ఈ లీగ్‌కు విరాట్‌కోహ్లి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ అతిథిగా పాల్గొన్నారు. ఈ ఫుట్‌ సాల్‌ బృందానికి థీమ్‌ మ్యూజిక్‌ను రెహమాన్‌ అందించారు. 

07:47 - June 7, 2016

ఉత్తరప్రదేశ్‌ : మథురా హింసాకాండ సుప్రీంకోర్టుకు చేరింది. మాథుర ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. మథుర ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు 29 మంది మృతి చెందారు. యూపీ సర్కార్‌ ఇంటిలిజెన్స్‌ నివేదికలను పెడచెవిన పెట్టడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు...

ఉత్తరప్రదేశ్‌లోని మథుర అల్లర్ల ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం మంగళవారంనాడు విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు పి.జి.ఘోష్, అమితవ రాయ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నందున హింసాకాండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ తరఫు లాయర్ కామిని జైశ్వాల్ సుప్రీంకోర్టును కోరారు.

నిఘా వర్గాల హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన సర్కార్ ...
మథురా జవహర్ బాగ్‌లో భూకబ్జాకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. పార్కులో భారీ ఎత్తున ఆయుధాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ అఖిలేష్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంటిలిజెన్స్‌ విభాగం ప్రభుత్వానికి దాదాపు 40 నివేదికలు పంపడం గమనార్హం.

నిమ్మకు నీరెత్తినట్లుగా అఖిలేష్ ప్రభుత్వం....
పార్కులో ఆయుధాల తయారీ, శిక్షణ కొనసాగుతున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించినా అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పార్క్‌లో ఆక్రమణకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించేందుకు సైన్యం సహకారం తీసుకోవాలని జిల్లా అధికారులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. భూకబ్జాకు పాల్పడ్డ ఆజాద్‌ భారత్ విధిక్‌ వైచారిక్‌ క్రాంతి సత్యాగ్రహీ కార్యకర్తల వద్ద ఆయుధాలున్నట్లు...వారు ఆయుధ శిక్షణ తీసుకున్నట్లు ఆధారాలున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ యుపి సర్కార్‌ ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. మథురా జిల్లా మెజిస్ట్రేట్‌ రాజేష్‌ మీనా, సీనియర్‌ ఎస్పీ రాకేశ్‌సింగ్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేసి చేతులు దులుపుకుంది.

భూమిని ఖాళీ చేయించాలని అలహాబాద్‌ కోర్టు ఆదేశాలు...
రెండేళ్లుగా కబ్జాకు గురైన మథురాలోని జవహర్‌ బాగ్‌లో 260 ఎకరాల భూమిని ఖాళీ చేయించాలని అలహాబాద్‌ కోర్టు ఆదేశించింది. దీంతో గురువారం మథురాలోని జవహర్‌ బాగ్‌ ఆక్రమిత స్థలం నుంచి కబ్జాదారులను ఖాళీ చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వ పార్క్‌ను స్వాధీనం చేసుకున్న అరాచన శక్తులు పోలీసులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. రామ్‌వృక్ష్‌యాదవ్‌ నేతృత్వంలో జరిగిన అల్లర్లలో ఎస్పీ, ఎస్‌ఐతో సహా 29 మంది మృతి చెందారు.

అవకాశాన్ని ఉపయోగించుకునే యోచనలో బీజేపీ...
త్వరలో యుపిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది.ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది.

07:40 - June 7, 2016

హైదరాబాద్ : నిత్యం నిఘా పహారాలో ఉండే భాగ్య నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలే చైన్ స్నాచింగ్ లతో ఒక వైపు దడ పుట్టిస్తూ.. మరో వైపు ఏటీఎంలు, తాళం వేసిన ఇళ్లు, మూసివేసిన షాపులను సైతం వదలడం లేదు. తాజాగా సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ మొబైల్‌ దుకాణంలో భారీ చోరికి తెగబడ్డారు. రాత్రి సమయంలో దొంగలు చాకచక్యంగా ఒక బిస్తర్ అడ్డం పెట్టుకుని ఓ మొబైల్ షాపు తాలం బద్దలుగొట్టారు. ఆ షాపులో 25 లక్షల రూపాయల విలువైన ఫోన్లను దొంగలు అపహరించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపు యజమానుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు, ధర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా సీసీటీవీకి చిక్కిన దొంగలు.. పోలీసులకు కూడా దొరికితే తమకు న్యాయం జరుగుతుందని షాపు యజమానులు ఆశిస్తున్నారు. 

07:38 - June 7, 2016

హైదరాబాద్ : శాఖాపరమైన అభివృద్ది కార్యాక్రమాల విషయంలో అలసత్వం కూడదంటూ అధికారులకు కర్తవ్య బోధ చేస్తున్నారు మంత్రి తుమ్మల. పెండింగ్ రహదారులపై చర్చించేందుకు త్వరలో కేంద్ర మంత్రి గడ్కరిని తుమ్మల కలవనున్నారు. దీని కోసం రహదారుల డిపీఆర్‌ను సిద్దం చేయాలని అధికారులు సూచించారు.

అలసత్వంపై మంత్రి అసంతృప్తి ...
శాఖా పరమైన కార్యక్రమాల నిర్వహణలో అలసత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. దీని కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖపై ఉన్నతాధికారులతో తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక రహదారుల నిర్మాణంలో తలెత్తే భూ వివాదాలను సైతం పరిష్కరించేందుకు రెవిన్యూ, విద్యుత్, అటవీ అధికారులు సమన్వయ పర్చుకోవాలని సూచించారు. ఇతర ప్రణాళిక ద్వారా మొత్తం 191 పనులకు 1456 కిలో మీటర్ల రోడ్లను రూ. 2195 కోట్లతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు.

కబ్జాకు గురైన ఆర్ అండ్ బీ స్థలాలపై తుమ్మల ఆదేశాలు...
ఇక కబ్జాకు గురైన ఆర్ అండ్ బీ స్థలాలను వెంటనే గుర్తించాలని మంత్రి తుమ్మల అధికారులను అదేశించారు. రైట్ ఆఫ్‌ పే చట్టం ప్రకారం వాటి సరిహద్దులు గుర్తించాలని సూచించారు. భవిష్యత్తులో ఈ స్థలాలకు శాశ్వత ప్రతిపాదికగా చర్యలు తీసుకోవాలన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్న టార్గెట్ ప్రకారం మంజూరైన వాటిని పూర్తి చేయాలన్నారు. వీటితో పాటు అనుమతులిచ్చిన బ్రిడ్జిలను కూడా పూర్తి చేయాలని పేర్కోన్నారు. ఎర్రమంజిల్ లో కొత్తగా నిర్మించిన ఆర్ అండ్ బీ ఈఎన్ సి కార్యాలయానికి సీఎం చేత ప్రారంభించేందుకు అన్ని సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ రోడ్లు, బ్రిడ్జిల విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలువనున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందే రహదారులకు సంబంధించిన డిపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే క్యార్టర్స్ పై మంత్రి సమీక్ష...
ఇక నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు నిర్మించాల్సిన క్యాంపు కార్యాలయాలతో పాటు....ఎమ్మెల్యే క్యార్టర్స్ పై కూడా తుమ్మల సమీక్షించారు..డిసెంబర్ నాటికి టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాలన్నారు. 

07:30 - June 7, 2016

విజయవాడ : అదే అయోమయం.. అదే వివాదం...! ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతి వెళతారా..? లేదా..? ఓ సంఘమేమో.. ఏపీకి తరలి వెళతామంటుంది. మరో సంఘమేమో.. భవిష్యత్‌ సమస్యలపై క్లారిటీ ఇవ్వాలంటుంది. కనీసం రూట్ మ్యాప్‌ అయినా లేదు ఎలా వెళ్ళాలంటూ కొర్రీ పెడుతుంది. ఓపక్క జూన్ 27 దగ్గరపడుతోంది. మరోపక్క రచ్చ కొనసాగుతోంది. అసలీ గందరగోళం ఎప్పటికి ముగిసిపోతుంది.? అసలు సమస్యలు సృష్టిస్తోంది ఎవరు.?

తరలింపుపై రచ్చకెక్కిన ఉద్యోగ సంఘాలు...

ఏపీకి తరలివెళ్లే విషయంలో ఉద్యోగ సంఘాలు రచ్చకెక్కాయి. నిజానికి రెండు సంఘాలూ ఏపీకి వెళ్లడంపై ఒకే వాదనను వినిపిస్తున్నా.. పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటుండడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. తమకు పలు సమస్యల విషయంలో క్లారిటీ లేదని ఒక సంఘం అంటే.... కొంతవరకు క్లారిటీ ఉంది తమకు నో అబ్జెక్షన్‌ అని మరో సంఘం అంటోంది. జూన్‌ 27 దగ్గరపడుతున్న సమయంలో ఈ కన్‌ఫ్యూజన్‌ ఎందుకు పీక్స్‌కు పోతోందో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు.

మురళీకృష్ణ / కృష్ణయ్య మధ్య వాగ్యుద్ధం ...
ఉద్యోగుల తరలింపు సమస్యలపై.. ప్రభుత్వానికి నివేదించి పరిష్కారం పొందేందుకు.. సహకార కమిటీ ఒకటి పనిచేస్తోంది. దీనికి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదే సెక్రెటరియేట్‌లో ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ నేత కృష్ణయ్య.. అడపాదడపా తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. జూన్‌ 27 సమీపిస్తున్న తరుణంలో మురళీకృష్ణ, కృష్ణయ్యల మధ్య వాగ్యుద్ధం హాట్‌టాపిక్‌గా మారింది. గడచిన శుక్రవారం.. కృష్ణయ్య, ఏపీ సెక్రెటరియేట్‌ హౌజింగ్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నేతృత్వంలో.. ఉద్యోగులు చీఫ్‌ సెక్రెటరీని కలిశారు. ఉద్యోగుల తరలింపు వాయిదా వేయాలని, లేదా రోడ్‌ మ్యాప్‌ను విడుదల చేయాలని కోరారు. ఇది మురళీకృష్ణ వర్గంలో అయోమయానికీ.. ఉద్యోగుల్లో చర్చకూ కారణమైంది.

ఉద్యోగుల తరలింపు వాయిదాపడ్డట్లుగా కూడా ప్రచారం...
ఒకానొక సమయంలో ఉద్యోగుల తరలింపు వాయిదాపడ్డట్లుగా కూడా ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన మురళీకృష్ణ వర్గం.. ఏపీకి రావడం ఇష్టం లేనివారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని.. ఉద్యోగుల తరలింపు ప్రక్రియలో తామే అసలైన ప్రతినిధులమని ప్రకటించింది. జూన్‌ 27 నుంచే అమరావతిలో ప్రభుత్వ పాలన ప్రారంభమవుతుందని.. ఇందులో తామంతా భాగస్వాములవుతామని మురళీకృష్ణ ప్రకటించారు.

స్వరం పెంచిన కృష్ణయ్య వర్గం...
మురళీకృష్ణ ప్రకటనతో కృష్ణయ్య వర్గం స్వరం పెంచింది. ఉద్యోగుల హక్కులను కాపాడడంలో ఏప్సా విఫలమైందని, తమ ఇబ్బందులను తొలగించమనడం అన్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించింది. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని కనీసం రోడ్‌ మ్యాప్‌నైనా ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతల తప్పుడు సమాచారం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ మురళీకృష్ణపై మండిపడ్డారు.

80శాతం మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు: అశోక్ బాబు
30 శాతం హెచ్‌ఆర్, 5 రోజుల పనిదినాలు తదితర అంశాల్లో ఉద్యోగ సంఘ నేతల్లో స్పష్టత ఉందని, అయితే కామన్ ఉద్యోగుల్లో మాత్రమే గందరగోళం నెలకొందని ఏప్సా నేతలు చెబుతున్నారు. మరోవైపు, ఇప్పటికే 30 శాతం డైరెక్టరేట్స్‌కు భవనాలు దొరికాయని మిగిలినవాటికి భవనాలు దొరకాల్సిన అవసరం ఉందని ఏపీ ఎన్జీవో నేతలు అంటున్నారు. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చేందుకు 80శాతం మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారంటూ.. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. చోటామోటా నాయకుల అలజడిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

రాజధానికి తరలిరావాల్సిందేనంటున్న చంద్రబాబు ...
సీఎం చంద్రబాబు వద్ద ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టి సమావేశం నిర్వహిస్తామని ఆ భేటీలో స్పష్టత వస్తుందని గత నెల 24న మంత్రి నారాయణ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి, సీఎం బిజీ బిజీగా ఉండడంతో ఆ సమావేశం జరగలేదు. అయితే.. సీఎం చంద్రబాబు ఈ వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగులు అనవసరంగా గందరగోళం సృష్టించడం సరికాదని.. ప్రతి ఒక్కరూ రాజధానికి తరలిరావాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాను రెండు నెలలు బస్సులోనే ఉంటూ పాలన చేశానని ఇప్పుడు ఉద్యోగులు వసతులు లేవంటూ మెలికలు పెట్టడం సరికాదన్నారు. మొత్తం భవనాలను జులై తొలివారం లోపు ముగిస్తామన్నారు. వసతులు లేవన్న ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో సీఎం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. 

07:09 - June 7, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. నేటి నుంచి రెండు రోజుల పాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల వివరాలు బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

శాస్త్రీయమైన అధ్యయనం చేయాలన్న సీఎం ...
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్పీడును పెంచింది. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం కేసీఆర్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. జిల్లాల ఏర్పాటుపై శాస్త్రీయమైన అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గత నెలలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండలం యూనిట్‌గా తీసుకొని మ్యాప్‌లను రూపొందిస్తున్నారు జిల్లాల కలెక్టర్లు. మరోవైపు ప్రజల నుంచి వస్తున్న వినతులను కూడా ప్రభుత్వం స్వీకరిస్తోంది.

జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు...
ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంగా తమ ప్రాంతాన్నే ప్రకటించాలంటూ అన్ని జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కొన్నిచోట్ల తమ గ్రామాన్ని మండలం చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కసరత్తు చేస్తోంది. ఒక్కో జిల్లాకు సగటున 20నుంచి 25మండలాలు, 4నుండి 5 నియోజకవర్గాలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇక మండల కేంద్రానికి దగ్గర్లో ఉన్న గ్రామాలను అవసరమైతే రూరల్ మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కొత్తగా రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రెండు నియోజకవర్గాలకు కలిపి ఓ ఆర్డివో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

జిల్లాల ఏర్పాటును గోప్యంగా వుంచేలా సర్కారు జాగ్రత్తలు...
ఏఏ ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనేదానిపై ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే వర్క్ షాప్‌లో జిల్లాల కలెక్టర్లు, రెవిన్యూ అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించాకే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ అంచనాకు వస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రజలకు సౌలభ్యంగా ఉండేవిధంగానే మండలాలు, రెవెన్యూ డివిజన్‌లు ఉంటాయన్నారు అధికారులు. అయితే కొత్త జిల్లాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్‌...మండల, రెవెన్యూ కేంద్రాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. మంగళవారం నుంచి నిర్వహించే వర్క్ షాప్‌తో ఏఏ మండలాలను కలిపి జిల్లాలు చేస్తున్నారో ఓ క్లారిటి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం సమావేశం వివరాలను అత్యంత గోప్యంగా ఉంచేలా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. 

19 మంది మహిళలు సజీవ దహనం...

ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రదళాల అరాచకాలకు మహిళలు బలయిపోతూనే వున్నారు. తమకు సహకరించని యాజిది మహిళలపై ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల అణచివేత కొనసాగుతూనే ఉన్నది. ఇరాక్‌లోని మొసుల్ నగరంలో ఐఎస్ ఉగ్రవాదులు 19 మంది యాజిది మహిళలను బోన్లలో బంధించి వందల మంది చూస్తుండగా సజీవ దహనంచేశారు. మిలిటెంట్ల లైంగిక కోరికలు తీర్చేందుకు నిరాకరించడమే వారుచేసిన నేరమని ‘ఏఆర్‌ఏ’ వార్తాసంస్థ తెలిపింది.

Don't Miss