Activities calendar

08 June 2016

అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగిస్తున్న మోడీ

అమెరికా : ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకమే ఇరుదేశాల బంధాన్ని బలోపేతం చేస్తుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు మోడీకి స్వాగతం పలికారు. అనంతరం మోడీ అమెరికా చట్టసభలను ఉద్ధేశించి  ప్రసంగించారు. ఇక్కడ ప్రసంగిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 'ఇక్కడ నేను ప్రసంగించడమంటే ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం' అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో అమెరికా రాజ్యాంగ ప్రభావం ఉందన్నారు. 

22:19 - June 8, 2016

సర్కారుకు ఇప్పటిసంది ఇక కోదండమే... గులాబీ టైరుకు జేఏసీ ముల్లు, నడిసంద్రంలో నల్గొండ కాంగ్రెస్..రెడ్ల కోటలకు ఎడ్లు దోలిన టీఆర్ ఎస్, కేరళ మీదికెళ్లి ఉరుకొస్తున్న వానలు... నాగండ్లు ఇంక అందుకోవాలే రైతన్నలు, పోలీసోలను సుడివెట్టిన పిల్లి.. జీపుల జొర్రి ఎల్లదాయే దీంతల్లి, ఆర్ ఎస్ ఎస్ అవతారంల స్వామినారాయణ... సూరత్ కాడా సువ్వర్ పనిజేసిన కంత్రీలు, సూర్యభగవానుని మీద పోలీసు కేసు... చర్యలు తీసుకోలేమంటున్న పోలీసులు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

22:10 - June 8, 2016

అమెరికా : ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకమే ఇరుదేశాల బంధాన్ని బలోపేతం చేస్తుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు మోడీకి స్వాగతం పలికారు.  అనంతరం మోడీ అమెరికా చట్టసభలను ఉద్ధేశించి  ప్రసంగించారు. ఇక్కడ ప్రసంగిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 'ఇక్కడ నేను ప్రసంగించడమంటే ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం' అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో అమెరికా రాజ్యాంగ ప్రభావం ఉందన్నారు. 

22:06 - June 8, 2016

బతికేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు. పోరాటానికి సిద్ధమంటున్నారు..!! మల్లన్నా.. ఇదేం న్యాయమన్నా..!!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు.. బాధితులు ఆందోళనపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:52 - June 8, 2016

ఢిల్లీ : ఉడ్‌తా పంజాబ్‌ విడుదలపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో చిత్ర నిర్మాత అనురాగ్‌ కశ్యప్ -బాలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెన్సార్‌బోర్డు తీరుపై ధ్వజమెత్తారు. నిజాయితీని నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత రెండేళ్లుగా పహ్లాజ్‌ నిహ్లాని సెన్సార్‌బోర్డ్‌ ఛైర్మన్‌గా అధికారంలోకి వచ్చాక సినిమాల విడుదలకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందని అనురాగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను రిజెక్ట్‌ చేసే అధికారం కేవలం ప్రజలకే ఉంటుందని తెలిపారు. 1973లో కూడా తాను ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నానని...ఆ సినిమా కోసం పోరాడానని ఆ సినిమాకు అవార్డు కూడా వచ్చిందని నిర్మాత మహేష్‌ భట్‌ అన్నారు. భారత్‌ను సౌదీ అరేబియాలా మార్చాలనుకుంటున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఉడ్‌తా పంజాబ్‌' యువతకు సందేశమిచ్చే మంచి సినిమా అంటూ హీరో షాహిద్‌ కపూర్‌ పేర్కొన్నారు.

 

21:49 - June 8, 2016

త్వరలో విడుదల కావాల్సిన బాలీవుడ్‌ చిత్రం 'ఉడ్‌తా పంజాబ్' వివాదాస్పదంగా మారింది. దీనిపై సెన్సార్‌బోర్డు ఛైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లాని, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ల మధ్య వార్‌ నడుస్తోంది. సెన్సార్‌బోర్డు సినిమాలో ఏకంగా 89 సీన్లను కట్‌ చేయడంతో నిర్మాత్ అనురాగ్‌ కశ్యప్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టైటిల్‌పై కూడా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది?
రాజకీయ పార్టీల్లో గుబులు
పంజాబ్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాలీవుడ్‌ చిత్రం 'ఉడతా పంజాబ్‌' రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తీసిన ఈ సినిమా టైటిల్‌పై వివాదాలు నెలకొన్నాయి. పంజాబ్‌ టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌బోర్డు చిత్ర నిర్మాత దర్శకులపై ఒత్తిడి తెస్తోంది. ఈ టైటిల్‌ కారణంగా పంజాబ్‌కు చెడ్డ పేరు వస్తుందని వాదిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విషయంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, రాజ్యవర్థన్‌ రాథోడ్‌ కలుగజేసుకోవడం లేదని నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ వాపోతున్నారు. మరోవైపు సెన్సార్‌ బోర్డు కార్యకలాపాల్లో  జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది.
ఉడతా పంజాబ్‌ టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదు : నిర్మాతలు 
ఉడతా పంజాబ్‌ టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదని నిర్మాత చెబుతున్నారు. తన సినిమా అధికార పార్టీ అకాలిదళ్, బిజెపిలకు వ్యతిరేకం కాదని చెప్పారు. డ్రగ్స్‌ మాఫియాకు వ్యతిరేకంగా ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌ వల్ల యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని తెలిపారు. సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్ పహ్లజ్‌ నిహ్లాని తమ సినిమాను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
సోషల్‌ మీడియాలో చిత్రం ట్రయలర్స్ హల్‌చల్‌ 
మరో 10 రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం ట్రయలర్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ఓ నగరం పేరో, ప్రాంతం పేరు లేదు కదా...చెడ్డ పేరు ఎలా వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో పేదరికంపై తీసిన మదర్‌ ఇండియా ఆస్కార్‌ దాకా వెళ్లిందని గుర్తు చేశారు. అప్పుడు ఇండియా ఇమేజ్‌ దెబ్బ తింటుందని టైటిల్‌ మార్చాలని సెన్సార్‌బోర్డు చెప్పలేదు కదా అంటూ నిలదీస్తున్నారు.
ఉడ్‌తా పంజాబ్‌కు హర్భజన్‌ సింగ్‌ పూర్తి మద్దతు
ఉడ్‌తా పంజాబ్‌కు క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పూర్తి మద్దతు ప్రకటించారు. పంజాబ్‌ను మాఫియా లేని రాష్ట్రంగా మార్చడమే ఈ సినిమా ఉద్దేశమని తెలిపారు. ఇటీవల కాలంలో పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా విస్తరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చిత్రం విడుదల చేయడం అధికారపార్టీకి సంకటంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

21:40 - June 8, 2016

హైదరాబాద్ : వచ్చే దసరా నాటికి తెలంగాణలో కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి కసరత్తును ప్రణాళికాబద్ధంగా చేయాలని సీఎం కేసిఆర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలని సీఎం సూచించారు. 
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ సమావేశం
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బుధవారం హైదరాబాద్‌లో కలెక్టర్లు, రెవిన్యూ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. కొత్త మండలాలు, జిల్లాల ఏర్పాటు అంశంలో పురోగతి గురించి సీఎం ఆరా తీశారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని మండల కేంద్రానికి దూరంగా వున్న గ్రామాలను గుర్తించి దగ్గరగా ఉన్న మండలంలో కలిపే విషయమై పరిశీలన జరపాలని కేసిఆర్ సూచించారు. నియోజకవర్గాలు, భౌగోళిక పరిస్థితులు, భవిష్యత్‌లో జరిగే మార్పులపై సమీక్షించాలన్నారు. 
కలెక్టర్లకు కేసీఆర్‌ ఆదేశాలు  
కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మండలాలు, రెవిన్యూ డివిజన్ల అంశాన్నీ సీఎం ప్రస్తావించారు. సుమారు 50 వేల నుంచి 60 వేల జనాభా వుండేలా మండలాలు, సుమారు 20 మండలాలతో జిల్లాలు ఏర్పాటు చేయాలని, సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్ మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటులో 5 నుంచి 6 మండలాలు వుండే విధంగా కసరత్తు చేయాలని సీఎం సూచించారు. అదే సమయంలో తమను బలవంతంగా ఇతర మండలాల్లో కలిపారన్న భావన ప్రజల్లో రాకూడదని కలెక్టర్లకు కేసీఆర్‌ ఆదేశించారు. 
పెద్ద మండలాలు రెండుగా విభజన 
పెద్ద మండలాలను రెండుగా విభజించే సమయంలో.. రాజకీయ కోణంలో కాకుండా.. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, భిన్న వ్యక్తుల అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నచిన్న దేశాలు, వాటిల్లోని జిల్లాలు, పరిపాలన కేంద్రాలను ఉదహరించారు. అటవీ ప్రాంతంలో ఉండే మండలాల విషయంలో భౌగోళిక విస్తీర్ణతనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 
నిర్దిష్ట ప్రణాళికను నిర్దేశించిన సీఎం 
జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తికి నిర్దిష్ట ప్రణాళికను ముఖ్యమంత్రి నిర్దేశించారు. జూన్‌ 20, జులై 5న రెండు దఫాలుగా జిల్లా కలెక్టర్లతో సమావేశం కావాలని కేసిఆర్ నిర్ణయించారు. జూన్‌ 30లోపు ప్రజా ప్రతినిధులతో సమావేశాలు జరిపి.. అభిప్రాయ సేకరణ జరపాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఆగస్ట్ 4 నుంచి 10 వరకు ముసాయిదా తయారు చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ప్రకటన జారీ అయిన తేదీ నుంచి నియమిత గడువు లోపు వచ్చే అభ్యంతరాలను పరిశీలించి వాటిని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏకు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈలోగా జులై 10 లేదా 11 తేదీల్లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలనీ సీఎం నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అక్టోబర్‌ 11 న విజయదశమి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలని సీఎం పట్టుదలగా ఉన్నారు. 
రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై కేసీఆర్ ప్రస్తావన 
రాష్ట్ర ఆర్థిక వృద్ధి గురించి కూడా ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల కోట్లకు చేరుతుందని కేసిఆర్‌ అన్నారు. మరో ఐదేళ్లకు బడ్జెట్‌ అంచనాలు రెట్టింపు అవుతాయని ఆ క్రమంలోనే మరో లక్ష కోట్లు జమయి 2024కు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ఐదు లక్షల కోట్లకు చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాగు, సాగునీటి అంశాలపై యుద్ధం పూర్తయ్యాక.. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, పలు శాఖల ఉన్నతాధికారులు, సీఎం పేషీ అధికారులు పాల్గొన్నారు.

 

21:29 - June 8, 2016

రాష్ట్రంలోని ప్రజా సంక్షేమం, సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వానికి, మంత్రులకు కోపమెందుకు వస్తుందో తనకు అర్థం కావడం లేదని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటబడతామని స్పష్టం చేశారు. ప్రొ.కోదండరాంతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.... 
'ప్రజా సంఘాల వేదిక జేఏసీ.
తెలంగాణ రాక ముందు తెలంగాణ సాధన కోసం జేఏసీ పని చేసింది.. తెలంగాణ ఆవిర్భావించాకా.. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై జేఏసీ పని చేస్తుంది. ఈ విషయం ముందే చెప్పాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడ్డాక... బలహీన వర్గాల ఉపాధి పెరుగలేకపోయింది. వ్యవసాయం, వృత్తులు, ఉపాధీతోపాటు వివిధ రంగాల అభివృద్ధి కావాలి.. కానీ అందుకు విధానాలు రాలేదు. ప్రజా సంక్షేమం కోసం మాట్లాడితే... ఇందులో అంతగా కోప పడాల్సిన అవసరం ఏముంది. నేను కోరుకునేది ప్రజా సంక్షేమం. ప్రత్యేక తెలంగాణలో కూడా వారిని విస్మరిస్తే ఎలా...? పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. వృత్తులను నమ్ముకుని బతికే వారి కోసం ఒక విధానం రావాలి. పారిశ్రామిక విధానం వచ్చినట్లు మిగతా వాటి కోసం విధానాలను తీసుకురావాలి. సాగునీరు ఒక అంశంగానే ఉంటుంది. చిన్నరైతు వ్యవసాయం చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. బెంగుళూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో కూరగాయలు అమ్ముతున్నారు. కానీ తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చి కూరగాయలు అమ్మె పరిస్థితి లేదు. అన్ని జిల్లాలో డైరి పరిశ్రమలు స్థాపించాలి. ప్రజలకు మేలు చేసే విషయాలపై ప్రభుత్వానికి దృష్టి రావడం లేదు. ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వరాదు. మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులను అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన పనులపై చూడా సమీక్ష చేస్తామన్నారు. ఆదిలాబాద్ ఓసెన్ కాస్టు గనులపై మాట్లాడారు. మనుషులు లేని అభివృద్ధి ఉండదు. పర్యావరణాణినికి నష్టం లేకుండా చేయాలి. అయితే ఓపెన్ కాస్టు వచ్చాక  పక్కనున్న అన్ని నాశనం అతాయి. 
మల్లన్నసాగర్ ప్రాజెక్టు..2013 భూ సేకరణ చట్టాన్ని పాటించాలి..
మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో 2013 భూ సేకరణ చట్టాన్ని పాటించాలి బలవంతంగా ఇంటి మీదికి వచ్చి అధికారులు సంతకాలు చేయస్తున్నారని రైతులు చెబుతున్నారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేంగా జీవోలు తీసుకొచ్చే అధికారం లేదు. సంక్షేమం విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరువు మ్యానువల్ ను అమలు చేయాలని కోరారు. నీటి విషయంలో అధికారులు దృష్టి పెట్టినప్పటికి సమస్యలపై జేఏసీ అధ్యయనం చేస్తుంది. అర్థవంతమైన అంశాలపై చర్చలు, సదస్సులు నిర్వహిస్తాము. రిటైర్టు ఉద్యోగులు, కుల సంఘాలు, కార్మికుల భాగస్వామ్యం కోరుకుంటున్నాం. ప్రజా సంఘాలు వేదిక కాలేవు..
సీఎం కేసీఆర్ తో ఎలాంటి భేదాభిప్రాయలేవు
సీఎం కేసీఆర్ తో వ్యక్తిగతంగా ఎలాంటి భేదాభిప్రాయలేవు. తెలంగాణ వచ్చాక మొదటగా జరిగిన ఎన్నికలప్పుడు పోటీ చేస్తావా అని అన్ను అడిగారు. నేను పోటీ చేయనని చెప్పాను. సంక్షేమంపై చర్చా జరుగుతుంది. ప్రజా సమస్యలపై మాట్లాడితే మంత్రులు విమర్శలు చేస్తే ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను. సమస్యల పరిష్కారం ముఖ్యం.  నేను ముఖ్యం కాదు. ప్రజా సంక్షేమంపై పని చేయాలన్నారు. వ్యవసాయం, వృత్తులు, ఉపాధీ, విద్య, వైద్యంపై ప్రధాన చర్చ జరిగింది. ప్రజా సంక్షేమం ఎజెండా మీదికి వచ్చింది అని వివరించారు. 

 

రేపటి నుండి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్లు...

అమరావతి: ఇంజినీరింగ్ కళాశాలలో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ అప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,79,465 మంది హాజరు కాగా, వీరిలో లక్షా 31 వేల 580 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

యూఎస్ కాంగ్రెస్ లో ప్రసంగించడం ఆనందంగా ఉంది: ప్రధాని

వాషింగ్టన్ : యూఎస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీభారత్‌- అమెరికా సంబంధాలపై అమెరికా ఉభయసభలనుద్దేశించి మోదీ ప్రసంగింస్తున్నారు. ఆయన మాటల్లోనే.. నేను ఇక్కడ ప్రసంగించడం అంటే ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం, ప్రజాస్వామ్యం పై ఉన్న నమ్మకమే ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో అమెరికా రాజ్యాంగ ప్రభావం ఉంది. అని తెలిపారు.

21:00 - June 8, 2016

హైదరాబాద్ : ఇంతకాలం ఇన్‌ఛార్జీల పాలనలో మగ్గుతోన్న యూనివర్సిటీలకు మరో రెండు రోజుల్లో మోక్షం లభించనుంది. సెర్చ్‌ కమిటీల నివేదికలు అందుకున్న ప్రభుత్వం..తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను వీసీలుగా నియమించాలన్న ప్రతిపాదనలను పక్కకు పెట్టి, ప్రొఫెసర్లనే వీసీలుగా నియమించేందుకు సర్కార్‌ అన్ని చర్యలు తీసుకుంది. Look. 
వర్సిటీలకు వీసీల నియామకం 
ఇన్‌ఛార్జీల పాలనలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలకు రెండు రోజుల్లో వీసీలను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీసీల నియామకానికి సంబంధించి జాబితా కూడా తయారు చేసింది ప్రభుత్వం. యూనివర్సిటీకి ముగ్గురు చొప్పున ప్రొపెసర్ల పేర్లను సెర్చ్‌ కమిటీ ప్రతిపాదించింది. సెర్చ్‌ కమిటీ ప్రతిపాదించిన వారిలో ఒకరిని ప్రభుత్వం ఫైనల్‌ చేసి వీసీలుగా నియమించేందుకు సిద్ధమవుతోంది. 
ఇన్‌ఛార్జీల పాలనలోనే విశ్వవిద్యాలయాలు  
రాష్ర్టంలోని యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఏ యూనివర్సిటీకి వీసీ లేరు. అన్ని విశ్వవిద్యాలయాలు ఇన్‌ఛార్జీల పాలనలోనే ఉన్నాయి. ఆ ఇన్‌ఛార్జీలు ఐఏఎస్‌లు కావడంతో వాళ్లు యూనివర్సిటీల వైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఓయూకు సంబంధించి అన్ని బాధ్యతలను రిజిస్ట్రారే చూస్తున్నారు. మిగిలిన యూనివర్సిటీల పరిస్థితీ దాదాపుగా ఇలాగే ఉంది. 
యూనివర్శిటీ చట్టాల్లో మార్పులు 
గతంలో తెలంగాణ ప్రభుత్వం యూనివర్శిటీ చట్టాల్లో మార్పులు చేస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. గవర్నర్‌ని ఛాన్స్‌లర్‌గా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరం లేదని, ఆ స్థానంలో రాజకీయ నాయకులు, విద్యారంగంలోని నిష్ణాతులను నియమించేందుకు మార్పులు చేసింది. అంతేకాకుండా ఐపీఎస్‌ అధికారులను వీసీలుగా నియమించాలనే ప్రతిపాదనలపై కూడా సమాలోచనలు చేసింది. దీనిపై విద్యావేత్తలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన రెండేళ్ల తర్వాత వీసీల నియామకానికి మోక్షం రావడంపై విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

 

కిర్లంపూడిలో భారీగా పోలీసుల మోహరింపు..

తూ.గో : కిర్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. రాజమండ్రి నుంచి కిర్లంపూడి వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. రేపుఉదయం కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆమరణ దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీ లు చేపట్టారు.

20:57 - June 8, 2016

ఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో మీ సేవా కేంద్రం పనితీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి, ఆందోళన చేపట్టారు. సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులను మీ సేవా కేంద్రాలలో అందజేయడానికి వెళ్లిన రైతులను చూసి ఆపరేటర్లు తలుపులు మూసేశారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు రాస్తారోకో చేశారు. చివరకు అధికారులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. 

 

యూఎస్ కాంగ్రెస్ లో ప్రసంగించనున్న మోదీ...

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరి కాసేపట్లో యూఎస్‌ కాంగ్రెస్‌లో ప్రసంగించనున్నారు. కాపిటల్‌ హిల్‌ చేరుకున్న ప్రధాని మోదీకి హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ స్పీకర్‌ పాల్‌ ర్యాన్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత్‌- అమెరికా సంబంధాలపై అమెరికా ఉభయసభలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

20:55 - June 8, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించనున్నారు. పే కమిషన్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా సమ్మెనోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. పే కమిషన్ నిర్ణయించిన 18 వేల కనీస వేతనం వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.   జూలై 11 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటామని ప్రకటించారు. 33 లక్షల మంది ఉద్యోగులను సమ్మెలోకి వెళ్లకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అని వివిధ కార్మిక సంఘాల నేతలు అన్నారు.

 

20:53 - June 8, 2016

మెదక్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్‌ కింద వేలాది ఎకరాలను తీసుకుని సరైన నష్టపరిహారం చెల్లించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. మెదక్‌ జిల్లాలో భూసేకరణ చట్ట విరుద్ధంగా జరుగుతోందని మెదక్‌ కలెక్ట్ రేట్‌ ముందు సీపీఎం నిర్వహిస్తోన్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు.
రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వాలి : మల్లారెడ్డి  
ఎవరు అడ్డు వచ్చినా మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను కట్టితీరుతామన్న మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. రిజర్వాయర్‌ వల్ల భూములు కోల్పోయే రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని అఖిల భారత కిసాన్ సంఘం నాయకులు మల్లారెడ్డి డిమాండ్ చేశారు. 

 

20:47 - June 8, 2016

పశ్చిమగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 9గంటలకు దీక్ష చేపడతానని ఆయన ప్రకటించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిపై కేసులు ఎత్తివేయనందుకు నిరసనగా.. ముద్రగడ దీక్షకు దిగుతున్నారు. ఈ విషయంలో రాయబారానికి మంత్రులెవరూ రావద్దని ఆయన సూచించారు. కాపులపై అక్రమకేసులు ఎత్తివేయడంతో పాటు... వారిని బీసీల్లో కలిపేవరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. 

 

ఓయూ విద్యార్థులతో ప్రొ.కోదండరామ్ భేటీ

హైదరాబాద్ : ఓయూ విద్యార్థులతో ప్రొ.కోదండరామ్ భేటీ అయ్యారు. యూనివర్శిటీ సమస్యలపై జులైలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీ.జేఏసీ పై విమర్శలు వచ్చినపుడు మాకు అండగా ఉన్న విద్యార్థులకు, ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు.

20:27 - June 8, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లకు సీఎం కేసిఆర్ దిశా నిర్దేశం చేశారు. జూన్‌ 20న మరోమారు కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈలోపు సమగ్ర నివేదికను తయారు చేసి సీసీఎల్‌ఏకు అందజేయాలని ఆ నివేదికను సీసీఎల్‌ఎ, సీఎస్ ఫైనల్ చేయాలని ఆదేశించారు. జూన్ 30 లోపు ప్రజా ప్రతినిధులు నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని, ఆ క్రమంలోనే రాజకీయ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. సీసీఎల్‌ఎ, సీఎస్ నివేదికను ఫైనల్‌ చేయనున్నాయి. జూన్ 30 లోపు ప్రజా ప్రతినిధులు నుంచి అభిప్రాయ సేకరణ, రాజకీయ ప్రక్రియ పూర్తి చేయనున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల విభజనపై స్పష్టత రాలేదు. రెండు జిల్లాల విభజనపై ఆ జిల్లాల అధికారులతో త్వరలో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. వేములవాడ, సిరిసిల్ల జిల్లాల ప్రతిపాదనలపై ప్రతిష్టంభన  కొనసాగుతోంది. జులై 5న మరోమారు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జులై 10 లేదా 11 తేదీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆగస్టు 4 నుంచి 11వ తేదీలోపు డ్రాఫ్ట్ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక నెల రోజుల్లోపు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 11 విజయదశమి రోజు తెలంగాణ నూతన జిల్లాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

 

పోలీసుల అదుపులో ఒంగోలురిమ్స్ ప్రొఫెసర్

ప్రకాశం : ఒంగోలు పీఎస్ లో రిమ్స్ ప్రొఫెసర్ పై ఫిర్యాదు నమోదు అయ్యింది. ప్రొఫెసర్ రత్నం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వన్ టౌన్ పీఎస్ లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ రత్నం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జగన్ పత్రిక, ఛానెల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది:యనమల

తూ.గో :ఒకటి రెండు రోజుల్లో జగన్ పత్రిక, ఛానెల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మంత్రి యనమల తెలిపారు. తునిలో మహాసంకల్ప సభలో మంత్రి యనమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పత్రిక, ఛానెల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ కు తమ్మినేని లేఖ

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ లేఖ రాశారు. ఆ లేఖలో కొత్త జిల్లాల ఏర్పాటు పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అధికార యంత్రాంగం జిల్లాలను ఏర్పాటు చేయడం తగదు. రాజకీయ లబ్ధి కోసం జిల్లాలను ఏర్పాటు చేయకూడదు. జిల్లాల ఏర్పాటు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని పేర్కొన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో మరో సారి సమావేశం: కేసీఆర్

హైదరాబాద్ : కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఈ సమావేశంలో చర్చించారు. జూన్ 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాం. అప్పటిలోగా జిల్లాల ఏర్పాటు పై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. జూన్ 30 లోపు ప్రజా ప్రతినిధులతో సమావేశాలు జరిపి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.

కరువు రహిత రాష్ట్రంగా ఎపి : సీఎం చంద్రబాబు

కడప : ఎపిని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి పుష్కరాల్లో మొదటి రోజు అపశృతి కల్గిందన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో మరికొన్ని చోట్ల వరదలు వచ్చాయని.... దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. పది సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు తుపాన్ వచ్చిందని.. ఏడు సంవత్సరాలు కరువు వచ్చిందన్నారు. 

ప్రజలు, ఉద్యోగస్తులు సహకరించారు : సీఎం చంద్రబాబు

కడప : విశాఖలో హుదుద్ సైక్లోన్ వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా జీవితం స్తంభించిపోయిందని తెలిపారు. ఎనిమిది రోజుల్లో మామూలు పరిస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. దీనికి ప్రజలు, ఉద్యోగస్తులు సహకరించారని తెలిపారు. దీపావళికి టపాకాయ కాల్చరాదని పిలుపిస్తే... ఒక్క టపాకాయ కూడా కాల్చలేదన్నారు. 

18:32 - June 8, 2016

కడప : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ప్రపంచ ఖ్యాతి గడించేలా అమరావతి నిర్మాణం చేపడతామన్నారు. కడపలో నిర్వహించిన మహా సంకల్ప దీక్ష సభలో సీఎం అందరితో మహా సంకల్ప దీక్ష చేయించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. 'ఈరోజు మనం మహా సంకల్పం చేస్తున్నామని...పవిత్ర మనసుతో ఈ సంకల్పం చేస్తున్నామని చెప్పారు. దీక్షకు నమాజ్ శుభ సూచికమన్నారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఎపి ఒకటిగా ఉంటుందని తెలిపారు. 2029 సంవత్సరం వరకు దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 కి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎపి ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఒక చరిత్ర అన్నారు. 'మనం ఎన్నో కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నామని.. ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి మహా సంకల్పం తీసుకున్నామని చెప్పారు. 
ప్రపంచఖ్యాతి గడించేలా అమరావతి నిర్మాణం 
ప్రపంచఖ్యాతి గడించేలా అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పారు. రాజధానికి భూములు ఇవ్వాలని రైతులుకు పిలుపిచ్చామని... అయితే ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34 వేల ఎకరాలు భూమిని ఇచ్చారని పేర్కొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో తొలిసారి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రమిస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యను చాలా వరకు అధిగమించామని చెప్పారు. కడప దేవుని గడప అని అభివర్ణించారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి.. తనను ఆశ్వీరదించి అధికారంలోకి తెచ్చారని వారి ఆశలను వమ్ము చేయబోనని చెప్పారు. రైతుల సౌకర్యం కోసం మొబైల్ యాప్ లు తీసుకొస్తున్నామని చెప్పారు.
విశాఖలో హుదుద్ సైక్లోన్
విశాఖలో హుదుద్ సైక్లోన్ వచ్చిందన్నారు. ప్రజా జీవితం స్తంభించిపోయిందని తెలిపారు. ఎనిమిది రోజుల్లో మామూలు పరిస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. దీనికి ప్రజలు, ఉద్యోగస్తులు సహకరించారని తెలిపారు. దీపావళికి టపాకాయ కాల్చరాదని పిలుపిస్తే... ఒక్క టపాకాయ కూడా కాల్చలేదన్నారు. 
గోదావరి పుష్కరాల్లో అపశృతి
గోదావరి పుష్కరాల్లో మొదటి రోజు అపశృతి కల్గిందన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో మరికొన్ని చోట్ల వరదలు వచ్చాయని.... దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. పది సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు తుపాన్ వచ్చిందని.. ఏడు సంవత్సరాలు కరువు వచ్చిందన్నారు. ఎపిని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని చెప్పారు. 

 

ప్రపంచఖ్యాతి గడించేలా అమరావతి నిర్మాణం : సీఎం చంద్రబాబు

కడప : ప్రపంచఖ్యాతి గడించేలా అమరావతి నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో తొలిసారి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రమిస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యను చాలా వరకు అధిగమించామని చెప్పారు. కడప దేవుని గడప అని అభివర్ణించారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి.. తనను ఆశ్వీరదించి అధికారంలోకి తెచ్చారని వారి ఆశలను వమ్ము చేయబోనని చెప్పారు. రైతుల సౌకర్యం కోసం మొబైల్ యాప్ లు తీసుకొస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రమిస్తాం : సీఎం చంద్రబాబు

కడప : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ప్రపంచ ఖ్యాతి గడించేలా అమరావతి నిర్మాణం చేపడతామన్నారు. కడపలో నిర్వహించిన మహా సంకల్ప దీక్ష సభలో సీఎం అందరితో మహా సంకల్ప దీక్ష చేయించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. 'ఈరోజు మనం మహా సంకల్పం చేస్తున్నామని...పవిత్ర మనసుతో ఈ సంకల్పం చేస్తున్నామని చెప్పారు. దీక్షకు నమాజ్ శుభ సూచికమన్నారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఎపి ఒకటిగా ఉంటుందని తెలిపారు. 2029 సంవత్సరం వరకు దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 కి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎపి ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఒక చరిత్ర అన్నారు.

17:57 - June 8, 2016

హైదరాబాద్ : మోడీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందుతున్నా... బయటకు మాత్రం దేశం అభివృద్ధి చెందుతోందంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  కోదండరామ్‌పై కేసిఆర్‌ ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ వ్యతిరేకులు మంత్రులుగా ఉండి కోదండరామ్‌పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పులు చేసినప్పుడే ఎదుటివారిపై దాడికి దిగుతారని పేర్కొన్నారు. సొంత మీడియాతో అబద్ధాలను నిజాలు చేసుకుంటున్నారని తెలిపారు. 

 

17:43 - June 8, 2016

హైదరాబాద్ : చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలైందా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అయిందని నిరూపించగలుగుతారా... అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏది పూర్తిగా అమలైందో చెప్పాలన్నారు. 

 

ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తా: చంద్రబాబు

కడప: ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కడపలో మహాసంకల్ప ప్రతిజ్ఞ ను సీఎం చంద్రబాబు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....అన్ని జిల్లాల సమాగ్రాభివృద్ధికి మహాసంకల్పం అని తెలిపారు. ప్రపంచ ఖ్యాతి గడించేలా అమరావతి నిర్మాణం చేపట్టామన్నారు. కష్టాల్లో ఉన్నాం.. ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్తున్నాం అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృధ్ధికి నిరంతరం శ్రమిస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని, విద్యుత్ కొరతను చాలా వరకు అధిగమించామన్నారు. రెండేళ్లలో 5.7 లక్షల గ్రామాలకు కొత్తగా విద్యుత్ ఇచ్చామన్నారు.

17:37 - June 8, 2016

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న విమర్శలు సరైనవి కావని టీడీపీ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు రావుల మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోదండరాం చేసిన కృషిని ప్రజలు మరిచిపోలేదన్నారు. ఆయన చెప్పిన ఉద్యమ పాఠాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంత దోహదం చేశాయో అందరికీ తెలుసని చెప్పారు.

 

17:35 - June 8, 2016

ఖాకీలకన్నా ముందే సమాచారం..అరెస్టు చేసేందుకు వెళ్తే కనిపించని నిందితులు..చేదు అనుభవాలతో కాప్స్ రూటు మార్చారు.

ఎన్నిసార్లు వెళ్లినా తాళం వేసిన ఇళ్లు కనిపించింది. ఈ ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న నిందితులు పోలీసుల నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఈసారి మాత్రం పోలీసులు వేసిన వ్యూహాత్మకమైన అడుగుతో మోసాగాళ్లు పట్టుబడ్డారు. రూ. 9 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన కళానికేతన్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

17:32 - June 8, 2016

హైదరాబాద్ : జానారెడ్డి లాంటి కోవర్టులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో మూడు గ్రూపులున్నాయన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కేసీఆర్‌తో లాలూచీ పడి కేవలం కాంట్రాక్టులు కోసమే పార్టీని వీడుతున్నారని విమర్శించారు. ఎంత త్వరగా వారు కాంగ్రెస్ పార్టీని వీడితే అంత మంచిదని పాల్వాయి తెలిపారు. తప్పు చేశారు కాబట్టే కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరితే పార్టీకి వచ్చే నష్టమేమి లేదని కూడా స్పష్టం చేశారు. 

 

17:13 - June 8, 2016

నిజామాబాద్ : బాసరకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రలోని ఆదర్శ్ నగర్ కు చెందిన పలువురు బాసర దర్శనం చేసుకుని ఆటోలో తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో నవీపేట్ మండలం ఫకీరాబాద్ వద్ద నిజామాబాద్ నుంచి భైంసా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

 

రేపు ఉదయం నుంచి ఆమరణ దీక్ష : ముద్రగడ

తూ.గో: రేపు ఉదయం9గంటల కు ఆమరణ దీక్ష చేపడ్డానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, కాపులను బీసీలో కలిపే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాయబారానికి మంత్రులెవరూ రావద్దని కూడా సూచించారు.

16:48 - June 8, 2016

నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్ని పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. గత రెండు నెలల నుంచి ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా ప్రజలు వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు. 

రైల్వేలో 'జననీ సేవ' ప్రారంభం

ఢిల్లీ : ‘జననీ సేవ’ ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం ప్రారంభించారు. ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా 25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందుబాటులో ఉంచారు. దీంతో పాటు 5-12 ఏళ్ల వయసున్న చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూ రూపొందించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభు మాట్లాడుతూ... శిశువుకు పాలు దొరకడం లేదని ఓ బాలింత తనకు ట్వీట్‌ చేసిందని... దీంతో తాను స్పందించి శిశువుకు వెంటనే పాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

16:37 - June 8, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ మెంబర్‌షిప్‌ తీసుకోకుండానే ఎంపీ అయిన సుఖేందర్‌ రెడ్డి పార్టీ మారే ఆలోచనని ప్రజలు క్షమించరని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పలువురు కాంగ్రెస్‌ నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు పత్రికల ద్వారా తనకు తెలిసిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు రుణాల నుంచి విముక్తి కలిగించి వారిని ఆదుకోవాలని అన్నారు.

 

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:5గురి మృతి

నిజామాబాద్: నవీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. బాసర దర్శనం చేసుకొని వస్తుండగా ఆర్టీసీ బస్సు ను ఆటో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ప్రదేశంలో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాగా మరో మహిళ పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

16:12 - June 8, 2016

పశ్చిమగోదావరి : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వారిని ఆగమేఘాల మీద విజయవాడకు తరలించడం సరికాదని పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు ఏపీ ప్రభుత్వానికి సూచించారు. భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. రాజధానికి తరలివచ్చే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎంకు అడిగిన వెంటనే ఎవరైనా ఇల్లు ఇస్తారు కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదుకదా అని అన్నారు. ఆగమేఘాల మీద వారిని రప్పించి ఇబ్బందుల పాలు చేయొద్దున్నారు. ఆల్రెడీ విజయవాడలో ఉండేవారికి హెచ్‌ఆర్‌ఏ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. 

23 జిల్లాల ఏర్పాటు పై ప్రతిపాదన లు ఇలా....

హైదరాబాద్ : ఎంసీఆర్ హెచ్ ఆర్టీలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. మొత్తం 23 జిల్లాల ఏర్పాటు పై ప్రతిపాదన నిన్నటి వర్క్ షాప్ లో అధికారులు రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. మొత్తం 23 జిల్లాల ఏర్పాటు పై ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

15:47 - June 8, 2016

సూర్యుడిపై కేసు నమోదా ? అని నోరెళ్ల బెడుతున్నారా ? కానీ ఇది నిజం ఓ వ్యక్తి ఒళ్లు మండిపోయి సూర్యుడిపై కేసు నమోదు చేయాలని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎండకాలంలో మధ్యప్రదేశ్ విలవిలలాడింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
షాజపూర్ గ్రామానికి చెందిన శివ్ పాల్ సింగ్ అనే వ్యక్తి 19వ తేదీన ఫలోడి అనే గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీలుగా నమోదైంది. సూర్యుడి ప్రచండానికి ప్రజలు..జంతువులు నానా ఇబ్బందులు పడ్డారు. శివ్ పాల్ సింగ్ కు ఒళ్లు మండిపోయింది. జాలి..దయ లేకుండా విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కారణమైన సూర్యుడిపై కేసు నమోదు చేయాలని పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అదండి అసలు సంగతి.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో : ముగ్గురి మృతి

నిజామాబాద్ : నవీపేట్ మండలం ఫకీరాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జానారెడ్డి లాంటి కోవర్టులు పార్టీలో చాలా మంది ఉన్నారు:పాల్వాయి

హైదరాబాద్ : ఎంపి పాల్వాయి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి లాంటి కోవర్టులు పార్టీలో చాలా మంది ఉన్నారు. వారందరిపై సోనియా, రాహుల్ కు లేఖ రాశానన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంత తొందరగా పార్టీ వీడితే అంత మంచిదన్నారు. గుత్తా, భాస్కర్ రావు టిఆర్ ఎస్ లో చేరితే కాంగ్రెస్ కొచ్చే నష్టం ఏమీ లేదన్నారు.

టిఆర్ ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది: రావుల

హైదరాబాద్ : టిఆర్ ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. టి.టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. 13న ఎన్టీఆర్ భవన్ వర్క్ షాప్ నిర్వహించి మహానాడు తీర్మానాలపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కోదండరామ్ పై టీఆర్ ఎస్ విమర్శలను ఖండిస్తున్నామన్నారు. కోదండరామ్ సేవలను టిఆర్ ఎస్ మరిచిపోయిందని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కరే సాధించారనే భ్రమ కల్పించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అన్ని పక్షాలను ఉద్యమంలో ఏకం చేసింది జేఏసీనే అని.. టిఆర్ ఎస్ ఒక్కటే ఉద్యమం చేసుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.

15:31 - June 8, 2016

ఎన్ ఆర్ ఐ వివాహాలు, చట్టాలు.. శిక్షలకు సంబంధించిన విషయాలను లాయర్ పార్వతి వివరించారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో ఆమె పొల్గొని, మాట్లాడారు. ఆ వివరానలు ఆమె మాటల్లోనే..
చాలా ఎన్ ఆర్ ఐ వివాహాల్లో 20 పెళ్లిళ్లలో 2 మాత్రమే సక్రమంగా ఉంటాయి. మిగిలినవి ఫ్రాడ్ పెళ్లిళ్లుగా ఉంటాయి. భర్తల నుంచి భార్యలు హింస ఎదుర్కొంటే విదేశాల్లో చట్ట రీత్యా ప్రొటక్షన్ దొరుకుతుంది. ఎన్ ఆర్ ఐ వివాహాలు చేసుకునేముందు అక్కడ చట్టాల గురించి తెలుసుకోవాలి. విదేశాల్లోని చట్టాలపై పట్ల అవగాహనం కల్గివుండాలి ' అని అన్నారు. మరిన్ని వివరాలను డీడియోలో చూద్దాం...

 

15:22 - June 8, 2016

విజయవాడ : కృష్ణలంక సమస్యలను పరిష్కరించాలంటూ సీపీఎం ఆందోళనకు దిగింది. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టింది. రోడ్డుపై బైఠాయించిన నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నిరసన కొనసాగించడంతో నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

15:19 - June 8, 2016

కడప : జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో మహాసంకల్ప దీక్షకు అంతరాయం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. వాన నీటితో సభా ప్రాంగణంలో పందిళ్లన్నీ తడిసిపోయాయి. వర్షం ఇలాగే కొనసాగితే దీక్షకు ఇబ్బంది తప్పదని నేతలు అంటున్నారు. అటు వర్షంతో రోడ్లు చెరువుల్లా మారాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

 

సంకల్ప దీక్ష పేరుతోబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు'

ప.గో : సంకల్ప దీక్ష పేరుతో చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. దీక్ష ఎందుకు పెట్టారో చంద్రబాబుకే తెలియదు అని రాఘవులు మండి పడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా పై సంకల్ప సభలో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు. అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వానిది దొంగ లెక్కలే అని పేర్కొన్నారు.

15:13 - June 8, 2016

కడప : ముద్రగడ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప మహాసంకల్ప దీక్ష ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుని ఘటనలో నిందితుల్ని శిక్షించకూడదా అని ప్రశ్నించారు. అసలు ముద్రగడ డిమాండ్లు ఏమిటో స్పష్టం చేయాలని కోరారు. జగన్ డైరెక్షన్ లో ముద్రగడ నడుస్తాన్నారని ఆరోపించారు. ముద్రగడ వల్ల కాపులకు నష్టం తప్ప లాభం ఉండదని పేర్కొన్నారు. 

 

కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం కేసీఆర్ చర్చ

హైదరాబాద్ : ఎంసీఆర్ హెచ్ ఆర్టీలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. మొత్తం 23 జిల్లాల ఏర్పాటు పై ప్రతిపాదన నిన్నటి వర్క్ షాప్ లో అధికారులు రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఒక్కో జిల్లాకు కావాల్సిన ఉద్యోగులు అడ్మినిస్ట్రేషన్ అవసరాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి: కోమటిరెడ్డి

హైదరాబాద్ : రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బు రైతుల వడ్డీకే సరిపోతుందని, తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతారని అనుకోనని తెలిపారు.

బెనరాస్ హిందూ వర్శిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ తలపెట్టాయి. ఈ ర్యాలీలో జేఎన్‌యూ నేత షీలా రషీద్‌ పాల్గొనడంపై ఏబీవీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశద్రోహులను తమ వర్శిటీలోకి రానివ్వమంటూ దాడికి ప్రయత్నించారు. దీంతో రెండు సంఘాల విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్పైస్ జెట్ విమానంకు ప్రతికూలత...

విజయవాడ : గన్నవరం విమానాశ్రయం నుంచి వైజాగ్ బయల్దేరిన స్పైస్ జెట్ విమానంకు వాతావరణం అనుకూలించక 20 నిమిషాల తరువాత తిరిగి గన్నవరం విమానాశ్రయంకు వచ్చిన స్పెస్జెట్ విమానం. విమానంలో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు.

14:47 - June 8, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై విస్తృత చర్చ జరగాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు హైదరాబాద్  లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు... సీఎంకు సంబంధించిన అంశంకాదని.. కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. ప్రజాస్వామ్యం, పారదర్శకత అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజలు అధికారంలోకి తెచ్చారని ఏం చేసినా వారు భరించాలనే వైఖరి అప్రజాస్వామికమన్నారు. ముఖ్యమంత్రి ఒంటెత్తుపోకడలు విడనాడాలని హితవుపలికారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిపక్షం భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

 

ఎన్ ఎంయూ నేత లక్ష్మన్ సస్పెన్షన్

హైదరాబాద్ : ఆర్టీసీ ఎన్ ఎంయూ నాగేశ్వరరావు వర్గం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై సస్పెన్షన్ వేటు పడింది. మస్టర్ల అవకతవకలకు పాల్పడినందుకులక్ష్మన్ ను ఆర్టీసీ అధికారులు సస్పెండె చేశారు. ప్రస్తుతం లక్ష్మన్ కరీంనగర్ బస్ స్టేషన్ లో కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇల్లెందులో మూడు లారీల రేషన్ బియ్యం పట్టివేత

ఖమ్మం :ఇల్లందు లో అక్రమంగా తరలిస్తున్న మూడు లారీల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతోపాటు లారీలను సీజ్ చేశారు. లారీడ్రైవర్లలను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డోర్నకల్లు నుంచి రెండు లారీలు, నల్గొండ నుంచి ఓ లారీలో సుమారు 550 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మొత్తం బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు తమకు ముందుస్తు సమాచారం అందిందని...ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.

14:24 - June 8, 2016

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారెజ్'. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్ర మార్కెట్ విలువ రికార్డులు సృష్టిస్తుందని టాక్. తాజాగా మరో వార్త పుకారు షికారు చేస్తోంది. ఎన్టీఆర్ సరసన మూడో హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ కు జోడీగా సమంత, నిత్యమీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో భామ చేరిందట. ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన 'అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ', శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'దేవరాయ' తదితర చిత్రాల్లో నటించిన విదిషా 'జనతా గ్యారేజ్'లో కీలక పాత్రలో కనపడనుందని సమాచారం. నటీనటుల ఎంపిక పరంగా కొరటాల రికార్డ్ సృష్టించేలా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, దేవయాని వంటి వారు నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త జిల్లాల ఏర్పాటు పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి : తమ్మినేని

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆయన హైదరాబాద్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 'జిల్లాల ఏర్పాటు ఏకపక్షంగా జరగకూడదు. ఏ ఒక్క ఎన్నికల వాగ్ధానం అమలు చేయలేదు. కోదండరామ్ పై అహంభావం ప్రదర్శిచచడం సరికాదు. ప్రభుత్వ వ్యతిరేక విధానానలు ప్రశ్నించినందుకు కోదండరామ్ పై దాడికి దిగారు. ఈ విషయం పై అన్ని శక్తులు ఏకం కావాలి. ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు పై కోదండరామ్, ఇతర మేధావులతో చర్చిస్తున్నాం' అని తెలిపారు.

దాణా స్కాం ఫైల్స్ గల్లంతు..

బీహార్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం సంబంధించిన కీలక ఫైల్స్‌ గల్లంతయ్యాయి. పాట్నాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. లాలూ సీఎంగా ఉన్న సమయంలో పశువుల దాణా కొనుగోళ్లకు సంబంధించి దాదాపు 9వందల కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

కోర్టుకు వెళ్లిన దర్శకుడు అనురాగ్ కశ్యప్..

ముంబై : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ముంబై కోర్టు మెట్లు ఎక్కారు. 'ఉడ్తా పంజాబ్' పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వికాస్ తో పాటు కశ్యప్ కోర్టుకు వెళ్లారు.

ప్రజాసంక్షేమమే జేఏసీ లక్ష్యం : కోదండరాం

హైదరాబాద్ :తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం మాట్లాతూ.. 'ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకెళ్తాం అని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తాం. ప్రజలే మాకు ముఖ్యం, ఏ రకమైన ప్రయోజనాలు లేవు. నిజాం షుగర్ పునరుద్దరణ కోసం కృషి చేస్తాం. కరువు మాన్యువల్ కు చట్టబద్ధత కల్పించాలి. యూనివర్శిటీల సమస్యలపై ఓయూలో త్వరలో సదస్సు నిర్వహిస్తాం. విద్యారంగంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలపై పోలీసులతో దాడి చేయడం సరికాదు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.

రాజస్థాన్ లో తగ్గని ఉష్ణోగ్రతలు - ఐఎండీ..

ఢిల్లీ : కేరళను రుతుపవనాలు తాకాయని ఐఎండీ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. రాజస్థాన్ లో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గలేదని, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ బీపీ యాదవ్ పేర్కొన్నారు.

13:55 - June 8, 2016

హైదరాబాద్: టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగింసింది.జేఏసీ ప్రజల కోసమే పనిచేస్తుందని ప్రొ.కోదండరాం స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా జేఏసీ ప్రజల కోసం పోరాడతుందని ఆయన స్ఫష్టం చేశారు. జేఏసీ ప్రజాసంఘానే వుంటుంది.... ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.విద్యారంగంలో పలు సమస్యలున్నాయన్నారు. ఉస్మానియా వర్శిటీకి 100 సంవత్సరాలు నిండుతున్న తరుణంలో వర్శిటీలలో నెలకొన్న సమస్యలపై ఓ సదస్సును ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే నిజాం షుగర్స్ పునరుద్ధరణతో పాటు మూసివేసని కంపెనీల పునరుద్ధరణ కోసం పోరాడుతామని తెలిపారు. గ్రామస్థాయిలో జేఏసీని బలోపేతం చేస్తామమని పేర్కొన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలను నియంత్రించాల్సిన అవరముందన్నారు. యూనివర్శిటీలే కాక ఇతర విద్యా సంస్థలలో నెలకొన్న సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించంటానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూసేకరణ జరగాలని కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతంలో 2013 భూసేకరణ చట్టంపై అవగాహన కల్పించటానికి ఓ సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. న్యాయవాదుల పోరాటానికి జేఏసీ మద్ధతు వుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాహితం కోరి ఒక వ్యాఖ్య చేసిన సందర్భంగా వివాదం చెలరేగిందనీ...ఈ విషయాన్ని మీడియా మిత్రులు సహకరిస్తే తెలంగాణ ప్రజలకు లబ్ది చేకూరుతుందని ఆయన సూచించారు. ఏది ఏమైనా జేఏసీ ప్రజాసంక్షేమ కోసమేనని ప్రొ.కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం జేఏసీ చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ యాజమాన్యంతో జర్మనీ ఐటీ నిపుణుల సమావేశం

హైదరాబాద్ : ఆర్టీసీ యాజామన్యంతో జర్మనీ ఐటీ నిపుణులు సమావేశం అయ్యారు. ఆర్టీసీకి సాంకేతిక సహకారం అందించే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ సత్యనారాయణ, జేఎండీ రమణారావు పాల్గొన్నారు.

సమ్మె బాటలో రైల్వే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు

హైదరాబాద్ : రేపు రైల్వే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. 

13:45 - June 8, 2016

ఎత్తు పెరగాలని ఏకంగా కాళ్లను ఆపరేషన్ చేయించుకుని మంచానికి పరిమితమైన ఓ యువకుడి కథనం అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. జుత్తు కోసం ఆపరేషన్ చేయించుకుంటే ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. మద్రాసు మెడికల్ కాలేజీలో ఓ కుర్రాడు నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నూగమ్ బక్కంలో ఉన్న అడ్వాన్స్ డ్ రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ కు వెళ్లాడు. బట్టతలపై వెంట్రుకలు వచ్చే విధంగా చేయాలని అక్కడి వైద్యులను కోరాడు. దీనితో ఆ వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అనంతరం ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం వల్లే చనిపోయాడని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

13:43 - June 8, 2016

బీమాతో ధీమా అంది..ఇరుగుపొరుగును కూడబెట్టింది..పొదుపు సూత్రాలు వల్లించింది..వసూలు చేసిన డబ్బుతో హస్తలాఘవం.

నమ్మకం..వారి పెట్టుబడి అమాయకులే. స్వయంగా ఇందులో మహిళలే రంగంలోకి దిగతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ లేడీ కిలాడీ శఠగోపం పెట్టింది. ఎల్ఐసీ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించింది. మాటలతో రజిత, హరిబాబు దంపతులు ఆకట్టుకొనే వారు. సంస్థలో చెల్లించకుండా డబ్బులను సొంత ఖర్చులకు వాడుకునే వారు. హైదరాబాద్ సంస్థలో ఆరా తీయడంతో ఈ గుట్టు రట్టైంది. రూ.26 లక్షలు వసూలు చేసిన ఈ కిలాడీ దంపతుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.

యూపీలో బోల్తా పడిన బస్సు..

ఉత్తర్ ప్రదేశ్ : సితాపూర్ ప్రాంతంలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 24 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రికి వీరిని తరలించి చికిత్స అందిస్తున్నారు.

హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ..

హర్యానా : ఏఐసీసీ ఆఫీసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూన్ 10వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలపై వీరు చర్చిస్తున్నారు.

 

ముగిసిన టీజేఏసీ సమావేశం..

హైదరాబాద్ : కాసేపటి క్రితం టీజేఏసీ సమావేశం ముగింది. సమావేశం అనంతరం ప్రొ.కోదండరాం మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తామని, మల్లనన్న సాగర్ నిర్వాసితులతో సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. న్యాయవాదుల పోరాటానికి మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. విమర్శలు ఎన్ని వచ్చినా తమ పని కొనసాగుతూనే ఉంటుందని, నిజాం షుగర్స్ పునరుద్ధరణకు పోరాటం చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో జేఏసీని బలోపేతం చేస్తామన్నారు.

13:14 - June 8, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. బుధవారం ఉదయం సచివాలయంలో కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ నిర్వహించిన వర్క్ షాప్ సమావేశం ముగిసింది. జిల్లా కేంద్రాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు చర్చించారు. ఈ సమావేశ నివేదికను సీఎం కేసీఆర్ కు సీఎస్ అందజేయనున్నారు. మధ్యాహ్నం కలెక్టర్లతో కేసీఆర్ భేటీ కానున్నారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉగాది పండగలోగా జరిగి తీరాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. 

కలెక్టర్లతో ముగిసిన సీఎస్ సమావేశం..

హైదరాబాద్ : కలెక్టర్లతో సమావేశమైన సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నివేదికపై చర్చించారు. సీఎం కేసీఆర్ కు సీఎస్ నివేదికను అందచేయనున్నారు. కాసేపట్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

 

12:59 - June 8, 2016

మెదక్ : మండలాన్ని అభివృద్ధి చేయాల్సిన అధికారే.. అవినీతికి ఆద్యుడు అయ్యాడు. ఇంకేముంది అభివృద్ధి నిధులన్నీ స్వాహా అయిపోతున్నాయి. పెన్నుతో సంతకం పెడితే చాలు చేయి తడపాల్సిందే. పేద నిరుద్యోగ యువతకు ఇచ్చే సంక్షేమ రుణాల్లో అయితే ఈ అధికారి కమీషన్‌ సగానికి పై మాటే.. ఎవరైనా నిలదీస్తే బెదిరింపుల పర్వం షురూ.. మెదక్‌ జిల్లాలోని ఓ ఎంపీడీవో లంచావతారంపై ప్రత్యేక కథనం..

మారుమూలు గ్రామం..ఎంపీడీవో ఆటలు...
మెదక్‌    జిల్లాలోని కంగ్టి మండలం మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఈ మండలం మారుమూలు ప్రాంతం కావడంతో ఇక్కడి ఎంపీడీవో మధుసూధన్‌ ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిపోయింది. ఇతని లంచావతారం ఇప్పటికే మండలంలో కలకలం సృష్టిస్తోంది.

పక్కదారిపడుతున్న బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పోరేషన్‌ రుణాలు..
మండలంలో ఇటీవల బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పోరేషన్‌ రుణాల యూనిట్లు పంపిణీ చేశారు. కాగా అందులో రుణాలన్నీ అనర్హులకు ఇచ్చి వారినుంచి అందులో లక్ష రుణానికి 40 వేల చొప్పున కమీషన్‌ వసూలు చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది గమనించిన కొందరు ఎంపీడీవోను నిలదీయగా ఏం చేసుకుంటారో చేసుకోండని ఎదురుతిరుగడం అతని వంతయ్యింది. అంతేకాదు కార్యాలయంలో సీసీ కెమెరాలు పెట్టాను అని బెదిరింపులు సైతం మొదలయ్యాయి. మండలానికి వస్తున్న అభివృద్ధి నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంపీడీవోను లంచావతారంపై పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేస్తున్నారు.

ఎంపీడీవో నిర్వాకంతో మూలనపడ్డ ఉపాధి హామీ పనులు..
ఎంపీడీవో నిర్వాకంతో ఉపాధి హామీ పనులు జరగక స్థానిక గిరిజనులు వలసపోతున్నారు. వారికి పనులు కల్పించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇతర మండల అధికారులతో సమన్వయం లేకుండా సాగిస్తున్న దోపిడీ పర్వంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

12:47 - June 8, 2016

గుంటూరు : కార్ల లోడ్ తో వెళ్తున్న కంటైనర్ పై విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. దాదాపు రూ.కోటి నష్టం వాటిల్లినట్లు సమాచారం. కార్ల లోడ్ తో ఓ కంటెనర్ బుధవారం ఉదయం ఢిల్లీ నుండి చెన్నై వెళుతోంది.
చిత్తూరు జిల్లా ఇరువారం వద్దకు రాగానే విద్యుత్ వైర్లు కంటెనర్ పై పడిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ వైర్లు కిందికి ఒరగటం...భారీ ఎత్తులో కంటైనర్ ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. కంటెనర్ పూర్తిగా దగ్ధం కావడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. 

ఇరిగేషన్ శాఖాధికారులతో మంత్రి జూపల్లి సమావేశం..

హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు.

 

తుని కుట్రలో ముద్రగడదే బాధ్యతనన్న సీఐడీ..

తూర్పు గోదావరి : తుని కుట్రకు పూర్తి బాధ్యత ముద్రగడదే అని సీఐడీ పేర్కొంది. కాపులకు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్ల పోరాటంలో ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఆధ్వ‌ర్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన సభలో ఆందోళ‌న‌కారులు రెచ్చిపోయి రైలుని, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే.

12:38 - June 8, 2016

ప్రమాదానికి గురయ్యాడా ? మరేదైనా జరిగిందా ? స్టూడెంట్ రాజేష్ ఎక్కడ ? మిస్టరీగా మారిన రాజేష్ అదృశ్యం..

ఊరు వెళ్లడానికి స్టూడెంట్ రాజేష్ తన తాతను బస్టాండులో దించాడు. కానీ ఇంటికి తిరిగి చేరుకోలేదు. మరుసటి రోజు ఈ కుర్రాడి వాహనం ప్రమాదానికి గురైందని పోలీసుల నుండి సమాచారం వచ్చింది. మరి ఈ కుర్రాడు ఎమయ్యాడు ? ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడా ? మూడు రోజులుగా ఇతని ఆచూకి దొరకడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:37 - June 8, 2016

తూ.గోదావరి : తుని ఘటనలో కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. జగన్ తయారు చేసిన ప్రణాళికలు ముద్రగడ అమలు చేస్తున్నారన్నారు. కాపు యువత ముద్రగడ ట్రాప్ లో పడవద్దని, రిమాండ్ లో వున్న వారిపై వున్న కేసుల్ని ఎలా ఎత్తివేస్తారనీ... ఎంపీగా పనిచేసిన ఆయనకు ఈ విషయం తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకుంటే ముద్రగడ తనను కూడా అరెస్ట్ చేయమని రెచ్చగొట్టేలా ఆందోళన చేయటమేంటని ఆయన మండిపడ్డారు.
తునిలో జరిగిన కాపు గర్జన సభలో కాపునేత ముద్రగడ ప్రసంగానికి ప్రభావితులైన పలువురు అరాచకవాదులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో విచారణ కొనసాగుతోంది. మంగళవారం అమలాపురం పీఎస్ వద్ద ముద్రగడ ఆందోళన చేపట్టారు. ఆందోళనలకు ఎటువంటి అనుమతీ లేదని అధికారులు చెప్పినా ఆయన వినకపోవటంతో తప్పని పరిస్థితుల్లో ముద్రగడను అరెస్ట్ చేశారు.

12:35 - June 8, 2016

విజయవాడ: రుణాలు మాఫీ చేస్తామంటూ డ్వాక్రా మహిళలకిచ్చిన వాగ్ధానాన్ని చంద్రన్న నెరవేర్చలేదు. రుణాలు మాఫీ కాకపోగా, అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన స్థితిలో డ్వాక్రా మహిళలు చిక్కుకున్నారు. మూడు వేల రూపాయల కార్పస్ ఫండ్ వీరి మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ఈ రెండేళ్ల కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బదులుగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు డ్వాక్రా మహిళలు. డ్వాక్రా గ్రూపు మహిళల రుణాల మాఫీ టిడిపి ఎన్నికల వాగ్థానాల్లో అత్యంత ముఖ్యమైంది. ఎన్నికల సమయంలో డ్వాక్రా అప్పులు కట్టొద్దు అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామంటూ చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు ప్రచారం చేశాయి. ఈ రెండేళ్లలో సీన్ మరోలా వుంది.

బకాయిలు కట్టాలంటూ బ్యాంక్ల ఒత్తిడి...
ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. అప్పు రద్దవుతుందన్న ఆశతో, టిడిపి నేతల మాటలు నమ్మి బకాయిలు చెల్లించనివారి మీద అపరాధ వడ్డీ భారం పెరిగింది. ఇప్పుడేమో బకాయిలు కట్టాలంటూ బ్యాంక్ లు పీకలమీద కూర్చున్నాయి.
రుణాలు కట్టటానికి ఇబ్బందులు పడుతున్న మహిళలు...
నెల్లూరు జిల్లాలో 46వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. నాలుగు లక్షల ఏడు వేల మంది సభ్యులున్నారు. ఈ గ్రూపులన్నింటికీ 90 కోట్ల రూపాయల రుణాలున్నాయి. టిడిపి ఎన్నికల వాగ్ధానం ప్రకారం వీటన్నింటినీ రద్దు చేయాలి కానీ చేయలేదు. ఇప్పుడు ముక్కుపిండి వీటిని వసూలు చేస్తున్నాయి. డ్వాక్రా రుణాలతో చాలామంది టీ అంగడి, టిఫిన్ సెంటర్, ఫ్యాన్సీ షాప్ లు పెట్టుకున్నారు. వీరిమీద వడ్డీ భారం పెరిగడంతో అప్పుల వలయంలో చిక్కుకున్నారు. డ్వాక్రా రుణాల రద్దు హామీని పక్కన పెట్టిన ప్రభుత్వం ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున కార్పస్ ఫండ్ వారి ఖాతాల్లో జమ చేస్తామంది. తొలి విడతగా 3వేల రూపాయలు జమ చేసింది. రెండో విడత జమ చేయలేదు.

గ్రూపుల్లో మనస్పర్ధలు...
అయితే, కార్పస్ ఫండ్ వల్ల డ్వాక్రా మహిళలకు తక్షణం కలిగే ప్రయోజనం కానీ, ఉపశమనం కానీ ఏమీ లేదు. ఆ మూడు వేలు కూడా అందరికీ జమ చేయకుండా కొందరికే జమ చేయడంతో డ్వాక్రా గ్రూపుల్లో మనస్పర్ధలు, గొడవలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల గ్రూపులే విచ్ఛిన్నమయ్యాయి.

పాత బకాయి తీర్చాల్సిందేనంటూ బ్యాంక్ లు...
ఇప్పుడు కొత్తగా అప్పు ఇవ్వాలంటే పాత బకాయి తీర్చాల్సిందేనంటూ బ్యాంక్ లు ఖరాఖండిగా చెబుతున్నాయి. బకాయిదార్లకు నోటీసులు పంపిస్తున్నాయి. వడ్డీలు షాకిస్తున్నాయి. దీంతో డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు.

న్యాయవాదుల ఆందోళన..

వరంగల్ : జిల్లా కేంద్రంలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

నిందితులపై కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదు : చినరాజప్ప

తూ.గోదావరి : తుని ఘటనలో నిందితులపై కేసులు  ఎత్తివేసే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. ముద్రగడ జగన్ తయారు చేసిన ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. కాపు యువత ముద్రగడ ట్రాప్ లో పడవద్దని ఆయన సూచించారు. రిమాండ్ లో వున్న వారిపై వున్న కేసుల్ని ఎలా ఎత్తివేస్తారనీ... ఎంపీగా పనిచేసిన ఆయనకు ఈ విషయం తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు.ఆరాచక శక్తులపై చర్యలు తీసుకుంటే ముద్రగడ తనను కూడా అరెస్ట్ చేయమని రెచ్చగొట్టేలా ఆందోళన చేయటమేంటని ఆయన మండిపడ్డారు.

డ్రైవర్ సజీవ దహనం..

చిత్తూరు : ఇరువారం వద్ద కార్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీనితో కంటైనర్ దగ్ధమైంది. కంటెనర్ లో ఉన్న డ్రైవర్ సజీవ దహనం కాగా రూ. కోటికిపైగా ఆస్తి నష్టం సంభవించింది.

కేరళను తాకిన రుతు పవనాలు..

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వేగంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

సోనియాకు నోటీసులు..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఓ భవంతిలో బకాయిలు చెల్లించలేకపోవడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది.

12:00 - June 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇటీవల ప్రభుత్వంపై ప్రొ.కోదండరాం పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం టీజేఏసీ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. విమర్శలు..ఇతరత్రా వాటిని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వాచ్ డాగ్ లా పనిచేస్తామని గతంలో కోదండరాం పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకొనేందుకు ఇటీవలే కోదండరాం పర్యటన జరిపారు. కోదండరాం చేసిన విమర్శలపై గులాబీ నేతలు ప్రతిదాడి చేశారు. అసలు టీజాక్ ఉనికే లేదని మాటల దాడి చేశారు. తెలంగాణ ప్రజల తరపున టీజేఏసీ ఎప్పుడూ పోరాడుతుందనే సంకేతాలు పంపనున్నట్లు తెలుస్తోంది.

 

అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించాలి - వీహెచ్..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సభ్యుడు వీహెచ్ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించి బాధితులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ముకాస్తోందని, 16న పదివేల మందితో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేయనున్నట్లు వెల్లడించారు.

పశ్చిమలో రెండు రోజు సీపీఎం సమావేశాలు..

పశ్చిమగోదావరి : సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.

రాజ్యసభకు ఎంపికైన వైసీపీ సభ్యుడు..

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి నుండి వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ధృవీకరణపత్రం అందుకున్నారు.

11:54 - June 8, 2016

హైదరాబాద్: నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. 32 కేంద్రాల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8.30గంటల వరకు ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. భారీ సంఖ్యలో వస్తున్న జనాల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు భోజనం, నీటి వసతిని ఏర్పాటు చేశాయి. ఎగ్జిబిషన్‌ గ్రౌండ దగ్గర ఇవాళ, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. 

11:50 - June 8, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఖాళీ స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. వీటిలో మోడల్‌ మార్కెట్లు, బస్‌వేలు, ప్రభుత్వ టాయిలెట్లు, నిర్మించే యోచనలో తెలంగాణ సర్కార్‌ ఉంది. కాగా ఇలా ఖాళీ స్థలాల వెతుకులాటలో భాగంగా ఉస్మానియా వర్సిటీ, నిజాం కళాశాలల స్థలాలను ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. కాగా ఈ ఖాళీ స్థలాలను ఉపయోగించుకునేందుకు మంత్రి కేటీఆర్‌ డిప్యూటీ సీఎం కడియంకు లేఖను సైతం రాశారు. కాగా ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాగా దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. స్కూల్స్ లో అసలే అంతంత మాత్రంగా ఆటస్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిలో నిర్మాణాలు చేపట్టం సరైంది కాదని పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా విద్యా వ్యతిరేకమైందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే డ్రాప్ ఔట్స్ తో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోతుంటే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలను తీసుకోవటంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీరు మారకపోతే ఉద్యమం చేయటానికి విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నరసరావు పేట ఎంపీ రాయపాటి, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, టిటిడి బోర్డు సభ్యుడు అరికెల నర్సిరెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.

11:48 - June 8, 2016

రకూల్ ప్రీత్ సింగ్..ప్రమాదానికి గురైందా ? విమానాశ్రయంలో అదుపుతప్పి కిందపడిపోవడంతో గాయాలయ్యాయని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై రకూల్ ప్రీత్ సింగ్ స్పందించారు. తాను గాయపడింది నిజమేనని ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేసింది. కానీ భుజానికి..కాలికి గాయాలయ్యాయని వస్తున్న వార్తలు మాత్రం నిజం కాదని ట్వీట్ చేసింది. కేవలం మెడకు చిన్న గాయం మాత్రమే అయ్యిందని, తాను క్షేమంగానే ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రకూల్ ప్రీత్ సింగ్ 'ధృవ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్నారు. తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా రకూల్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.

ముద్రగడపై మంత్రి గంటా ఫైర్..

కడప : తునిలో విధ్వంసానికి దిగి క్రిమినల్స్ గా పోలీసు రికార్డులకెక్కిన వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడను కూడా క్రిమినల్ గా భావించాల్సి వస్తుందని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. కడపలో మీడియాతో మంత్రి గంటా మాట్లాడారు. అరెస్ట్ చేసిన కాపు యువకులపై కేసులు ఎత్తివేయాలన్న ముద్రగడ డిమాండ్ పై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రారంభమయిన టీజాక్ స్టీరింగ్ సమావేశం..

హైదరాబాద్ : టీజాక్ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రాంరంభమయ్యింది. ప్రొ.కోదండరాం, పలువురు జేఏసీ సభ్యులు హాజరాయ్యరు. ఈ సమావేశంలో ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాబేయే రోజుల్లో జేఏసీని బలపరటానికి తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

హిల్లరీ క్లింటన్ రికార్డు..

లాస్ ఏంజిల్స్ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడడానికి అభ్యర్థిత్వం సాధించిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ రికార్డు సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీ నుండి అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు కావాల్సినంత మంది డెలిగేట్స్ మద్దతు లభించడంతో హిల్లరీ క్లింటన్ తానే అధ్యక్ష అభ్యర్థినని ప్రకటించుకున్నారు.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..

చిత్తూరు : తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద శ్రీవారి భక్తులు ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపు తప్పి గొడను ఢీకొంది. కర్ణాటకకు చెందిన నలుగురు చిన్నారులతో సహా పది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

 

10:51 - June 8, 2016

విజయవాడ : ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన అత్యంత ప్రధానమైన వాగ్ధానాన్ని టిడిపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. రుణ మాఫీ పథకం వల్ల రైతులు లాభపడినదానికంటే నష్టపోయిందే ఎక్కువ.

ఎన్నికల వాగ్ధానంతో బ్యాంకులకు బాకీలు కట్టని రైతులు...
రైతుల పంట రుణాలన్నీ మాఫీ చేస్తామన్నది టిడిపి ఎన్నికల వాగ్ధానం. టిడిపి అధికారంలోకి వస్తే తమ అప్పులు రద్దవుతాయన్న నమ్మకంతో రైతులు బ్యాంక్ బాకీలు కట్టలేదు. కట్టొద్దంటూ చంద్రబాబునాయుడే ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనస్సు మారింది. లోటు బడ్జెట్ కారణంగా మొత్తం మాఫీ చేయలేమన్న చంద్రబాబు ప్రభుత్వం కుటుంబానికి లక్షన్నర రూపాయల రుణం మాఫీ చేసేందుకు ఒప్పుకుంది. కోటయ్య కమిటీ నియామకం, విధివిధానాలు ఖరారు చేయడం ఈలోగా రైతుల మీద అపరాధ వడ్డీల భారం పెరిగింది.

విడతలవారీగా మాఫీ హామీ...
లక్షన్నర రుణాన్ని అయిదు విడతలగా మాఫీ చేస్తామన్నారు. 50వేల రూపాయల అప్పున ఒకేసారి మాఫీ చేస్తామన్నారు. కానీ, ఆచరణలో పది నుంచి 20 వేల రూపాయల అప్పు మాత్రమే మాఫీ చేశారు. ఇదీ ఒక ప్రహసనంగా సాగింది. రుణమాఫీ జాబితాలో కొంతమంది అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. ఆధార్, రేషన్ కార్డుల్లో పేర్లు తేడాలున్నాయంటూ మరికొందరికి అన్యాయం చేశారు. 14 కాలాల ప్రొఫార్మాతో మరికొందరిని వడపోశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనతో పాతికశాతం మందిని అనర్హులుగా మార్చేశారు.

రైతుల మీద పెరిగిన వడ్డీల భారం...
అన్నదాత ఆశించినట్టుగా అప్పు మాఫీ కాలేదు. అపరాధ వడ్డీ పెరిగింది. అప్పు తీర్చాలంటూ బ్యాంక్ లు ఒత్తిడి తెచ్చాయి. కొత్త అప్పులివ్వలేదు. దీంతో బంగారం తాకట్టు పెట్టి కొంతమంది అప్పు తీర్చారు. చివరకు గ్యాస్ సబ్సిడీ కింద వచ్చిన స్వల్ప మొత్తాన్ని కూడా బ్యాంక్ లు బకాయిల కింద జమ చేసుకున్నాయి. ప్రభుత్వం స్రుష్టించిన గందరగోళం కారణంగా కొంతమంది రైతులకు డిఫాల్టర్ల బ్యాడ్ ఇమేజ్ వచ్చింది.

రుణమాఫీతో ప్రభుత్వంతో రూ. 24వేల కోట్లు భారం..
రుణమాఫీ వల్ల 24వేల కోట్ల రూపాయల భారం పడ్డట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ, తామే ఎక్కువగా నష్టపోయామంటున్నారు రైతులు. గత సంవత్సరం రుణ ప్రణాళిక ప్రకారం వ్యవసాయ రుణాల కింద 56019 కోట్లు అందజేస్తామన్నారు. కానీ బ్యాంక్ లు వాస్తవంగా ఇచ్చింది 7267 కోట్లు మాత్రమే. రుణమాఫీ సక్రమంగా అమలుకాకపోవడం వల్ల బ్యాంక్ ల్లో అప్పుపుట్టని పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రయివేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. 

కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు..

ఢిల్లీ : కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి రాజ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలో ఇతడిని అరెస్టు చేశారు. రాజ్ కుమార్ ను 24 ఉత్తర పరగణాల జిల్లా కోర్టులో ఢిల్లీ పోలీసులు హాజరపర్చనున్నారు.

10:40 - June 8, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో సచివాలయంలో కలెక్టర్ల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశం చర్చల ముగిసిన తరువాత నివేదికను రాజీవ్ శర్మ సీఎం కేసీఆర్ కు అందజేయనున్నారు.అనంతరం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. వచ్చే ఉగాదినాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ జిల్లాల్లో వర్షాలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. వరంగల్, కరీంనగర్‌, నిజామాబాద్, ఆదిలాబాద్‌ ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

బాబుపై వైసీపీ నేతల ఫిర్యాదు..

కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలపై పులివెందులలో వైఎస్ఆర్ సీపీ నేతలు భారీ ర్యాలీ చేస్తున్నారు. పులివెందుల పీఎస్ లో చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు.

కొత్త జిల్లాలకు కలెక్టర్ల కసరత్తు....

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో సచివాలయంలో కలెక్టర్ల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశం చర్చల ముగిసిన తరువాత నివేదికను రాజీవ్ శర్మ సీఎం కేసీఆర్ కు అందజేయనున్నారు.అనంతరం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. వచ్చే ఉగాదినాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

10:25 - June 8, 2016

ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే 'సైమా' సినీ వేడుకలు ఈసారి కూడా ఘనంగా జరగనున్నాయి. సింగపూర్ లో నిర్వహించే ఈ వేడుకల్లో మెగస్టార్ 'చిరంజీవి' పాల్గొనున్నారు. ఈ నెల 30న – వచ్చే నెల 1న రెండు రోజులపాటు జరగనున్న సైమా వేడుకలో దక్షిణాది పరిశ్రమలన్నీ పాల్గొంటున్నాయి. ప్రతీ యేటా భారీ స్థాయిలో జరిగే ఈ వేడుకకి ఈసారి చిరు హాజరవుతండటంతో మరింత క్రేజ్ మొదలైంది. అంతేగాక ఈ వేడుకల్లో 'చిరంజీవి' డ్యాన్స్ కూడా చేస్తారని టాలీవుడ్ టాక్.
మెగా కుటుంబం నుంచి చిరుతో పాటు – అల్లు అర్జున్ – అల్లు శిరీష్ లు కూడా సైమాలో పాల్గొనే అవకాశాలున్నాయి. చరణ్ – సాయి ధరమ్ తేజ్ – వరుణ్ తేజ్ లు షూటింగ్ లతో బిజీ ఉండడంతో వారు పాల్గొనరని తెలుస్తోంది. మరి చిరంజీవి డ్యాన్స్ చేస్తారా ? లేదా అనేది తెలియాలంటే 30వ తేదీన వరకు వేచి ఉండాల్సిందే.

10:22 - June 8, 2016

కరీంనగర్ : ఓ పిల్లి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.. కలెక్టర్ కార్యాలయంలో సమావేశానికి వస్తున్న మంత్రుల ఎస్కార్ట్ వాహనంలో పిల్లి దూరింది. సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ వాహనంలోకి వెళ్లగా సిబ్బంది నానా తంటాలు పడి దానిని బయటకు పంపించారు. తర్వాత అది నేరుగా ఎస్కార్ట్ వెహికల్‌లోకి ప్రవేశించింది. దాదాపు 3గంటల పాటు పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది.. చివరకు నానా తంటాలుపడ్డ పోలీసులు పిల్లిని బయటకు పంపారు.

ఖాకీలను ఖంగుతినింపించిన మార్జాలం..

కరీంనగర్ : ఓ పిల్లి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.. కలెక్టర్ కార్యాలయంలో సమావేశానికి వస్తున్న మంత్రుల ఎస్కార్ట్ వాహనంలో పిల్లి దూరింది. సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ వాహనంలోకి వెళ్లగా సిబ్బంది నానా తంటాలు పడి దానిని బయటకు పంపించారు. తర్వాత అది నేరుగా ఎస్కార్ట్ వెహికల్‌లోకి ప్రవేశించింది. దాదాపు 3గంటల పాటు పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది.. చివరకు నానా తంటాలుపడ్డ పోలీసులు పిల్లిని బయటకు పంపారు. 

కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదు - చినరాజప్ప..

తూర్పు గోదావరి: తునిలో జరిగిన రైలు విధ్వంస ఘటనలో కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. అమాయకులపై కేసులు ఉండవని మాత్రమే చెప్పామని మంత్రి తెలిపారు.

 

ప్రశాంతంగా చేప మందు...

హైదరాబాద్: ఉబ్బసం వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం చేపట్టిన చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న ఈ చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం రేపు ఉదయం 8.30 గంటల వరకు కొనసాగనుంది.

10:16 - June 8, 2016

అమెరికా : అమెరికా శ్వేతసౌధం కోసం హోరాహోరీగా జరుగుతున్నపోటీలో హిల్లరీ క్లింటన్ డెమొక్రాటిక్ నామినేషన్‌కు అర్హత సంపాదించిన తొలిమహిళగా చరిత్ర సృష్టించారు. గతంలో ప్రథమ మహిళగా శ్వేతసౌధంలో అడుగుపెట్టిన హిల్లరీ ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా ఓవల్ ఆఫీసు పీఠమెక్కితే.. 240 ఏండ్ల అమెరికా చరిత్రలోనే అరుదైన ఘట్టమవుతుంది. ఆ దిశగా తొలి అడుగు వేసిన హిల్లరీ మలి అడుగు కోసం రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో సుదీర్ఘ యుద్ధానికి సమాయత్తమవుతున్నారు.

అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న హిల్లరీ....
డెమొక్రటిక్‌ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌ చరిత్ర సృష్టించారు. ఇవాళ జరిగిన ఆరు రాష్ట్రాల ప్రైమరీస్‌లో హిల్లరీకి అవసరమైన డెలిగేట్ల మద్దతు లభించింది. అయితే ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు జరుగుతున్న ప్రైమరీస్‌లో హిల్లరీ ముందుంజలో ఉన్నారు. హిల్లరీ అభ్యర్ధిత్వం ఖరారయ్యేందుకు అవసరమైన 2,383 మంది డెలిగేట్ల మద్దతు లభించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. డెమాక్రాటిక్‌ అభ్యర్ధిత్వం కోసం హిల్లరీతో హిల్లరీతో పోటీ పడుతున్న బెర్న్‌ శాండర్స్‌కు చాలా వెనుకబడి ఉన్నారు. హిల్లరీకి 2,383 మంది ప్రతినిధులు మద్దతు లభించనుందని సర్వేలు చెబుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ఎంపికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌, హిల్లరీ పోటీ దాదాపు ఖాయమైనట్టేనని విశ్లేషిన్తున్నారు. డెమాక్రాటిక్‌ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మొదటి మహిళగా చరిత్రలో నిలిచిపోనున్నారు.

కేరళను తాకనున్న రుతుపవనాలు..

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వేగంగా విస్తరించనున్నట్లు తెలిపారు.

10:11 - June 8, 2016

చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి చాలా మంది రకరకాల షాంపులు..ఇతరత్రా వాడుతుంటారు. కానీ ఈ మొండి చుండ్రును వదిలించుకోవడానికి కొన్ని టిప్స్...
కొబ్బరి, ఆలివ్, రోజ్ మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన ఓ నూనె తీసుకని వేడి చేయాలి. అనంతరం దీనిని మాడుకు పట్టించాలి. కొద్దిసేపు మర్దన చేసినంతరం నీళ్లలో ముంచిన టవల్ ను చుట్టుకుని అరగంట అనంతరం స్నానం చేయాలి.
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. దీనిని జుట్టుకు పట్టించండి.
రాత్రి పూట పెరుగులో పెసరపిండి కలిపి ఉంచాలి. తరువాతి రోజు తలకు పట్టించాలి. గంట తరువాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.
తలస్నానం చేసిన ప్రతిసారీ దువ్వెనను శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చుండ్రు, మురికి వంటివి తిరిగి జుట్టులోకి రాకుండా ఉంటుంది.

10:09 - June 8, 2016

మాటల మాంత్రికుడు 'తివిక్రమ్ శ్రీనివాస్'తో తాను ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు 'దిల్ రాజు' వెల్లడించారు. ఇందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలిపారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వర్ హీరో హీరోయిన్లుగా 'తివిక్రమ్' దర్శకత్వంలో రూపొందిన 'అ..ఆ' చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన 'దిల్' రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని, సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే 12 కోట్లు వసూలు చేసిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే 60 కోట్ల క్లబ్ లో చేరే చిత్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన బ్యానర్ పై నుండి విడుదలైన 'ఎక్స్ ప్రెస్ రాజా, 'సుప్రీం', 'రాయుడు', 'అ..ఆ' సినిమాలు వరసగా విజయం సాధించాయని తెలిపారు. తివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు.

10:09 - June 8, 2016

విజయవాడ : చంద్రబాబు ప్రతిష్టకు అమరావతి నిర్మాణం ఓ అగ్నిపరీక్ష. ల్యాండ్ పూలింగ్ పేరుతో 34 వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం, 29 గ్రామాలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోతోంది.

రాజధాని ప్రకటనతో విభిన్న స్పందన....
2014 డిసెంబర్ 8. ఇదే తేదీనాడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లోని 29 గ్రామాలను రాజధాని నిర్మాణం కోసం ఎంపికచేశారు. దేశంలోనే అత్యంత సారవంతమైన, మూడేసి పంటలు పండే భూములున్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం ఓ సంచలనమైంది. కొందరిని విస్మయపరిచింది. తుళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాలు మినహా మిగిలిన గ్రామాల వారంతా తొలుత వ్యతిరేకించారు. అయితే, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొచ్చి అనేక హామీలివ్వడంతో 34వేల ఎకరాల భూమిని సమీకరించగలిగింది.

హామీలివ్వడంతో 34వేల ఎకరాల సేకరణ...
తుళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాలు మినహా మిగిలిన గ్రామాల వారంతా తొలుత వ్యతిరేకించారు. అయితే, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొచ్చి అనేక హామీలివ్వడంతో 34వేల ఎకరాల భూమిని సమీకరించగలిగింది.

జూన్ వచ్చినా కౌలు చెల్లించని ప్రభుత్వం...
హామీ ప్రకారం మొదటి ఏడాది ఏప్రిల్ లోనే రైతులకు కౌలు చెల్లించిన ప్రభుత్వం రెండో ఏడాది జూన్ వచ్చినా ఆ ఊసెత్తడం లేదు. ఏడాదిలోగా ప్లాట్లు అభివ్రుద్ది చేసి ఇస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే , ఇచ్చిన భూముల్లో తిరిగి వ్యవసాయం చేస్తామంటూ రైతులు హెచ్చరిస్తున్నారు.

కౌలు కోసం రైతులు ఎదురుచూపులు.. .
వ్యవసాయ కూలీలకు పెన్షన్ అందడం లేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దుర్భరంగా మారింది. ఇటు రైతులు కారు అటు కూలీలు కారు అన్నట్టుగా తయారైంది వీరి పరిస్థితి. అసైన్డ్ , లంక భూములు అప్పగించిన రైతులు కౌలు కోసం ఎదురుచూస్తున్నారు.

అమలు కాని హామీలు...
భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉచిత విద్య, కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అమలుకావడం లేదు. నిరుద్యోగులకు శిక్షణ ఓ ప్రహసనంగా మారింది. ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. అన్నా క్యాంటీన్ల జాడ లేదు. మరోవైపు సీడ్ క్యాపిటల్ కు అడ్డువచ్చిన గ్రామాలను, ఎక్స్ ప్రెస్ హైవేలకు అడ్డువచ్చిన ఇళ్లను తొలగిస్తామంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు రైతులకు కోపం తెప్పిస్తున్నాయి.

భూముల విలువ పెరగటంతో కొంతమందికి లబ్ది...
అయితే, కొంతమంది పెద్ద రైతుల, వ్యాపారుల జీవితాల్లో అనూహ్య మార్పులొచ్చాయి. కొంత భూమి అమ్ముకున్నవారు హ్యాపీగా సెటిలైపోయారు. మొదట్లో తుళ్లూరు ప్రాంతంలో రాజధాని వుంటుందన్న ప్రచారంతో ఎకరం ఖరీదు 15 లక్షల నుంచి కోటి రూపాయలకు పెరిగింది. ఆ టైమ్ లో అమ్ముకున్నవారు ఖుషీగా వున్నారు. మందడం, తాళ్లాయపాలెంలో భూమిపూజ అనడంతో అక్కడ ధరలు పడిపోయి, ఇక్కడ భూమ్ పెరిగింది. శంకుస్థాపనతో వెలగపూడి, ఉద్దండ్రాయిని పాలెంలో భూముల విలువ మరింత పెరిగింది. 

10:09 - June 8, 2016

వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో 'కమల్ హాసన్' దిట్ట. తాజాగా ఆయన 'శభాష్ నాయుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మంగళవారం లాస్ ఏంజిల్స్ లో ప్రారంభించారు. ఈ విషయాన్ని కమల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. క్లాప్ కొడుతున్న ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్ తో దిగిన ఓ సెల్ఫీని కమల్ కూతురు శృతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోస్టు చేశారు. టి.కె.రాజీవ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది.

10:08 - June 8, 2016

ముంబై : యువ జట్టుకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించారు. జింబాబ్వేకు పయనమయ్యే ముందు ధోని మీడియాతో మాట్లాడారు. చాలా మందితో తొలిసారి ఆడబోతున్నానని, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉందన్నారు. జింబాబ్వే మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని, బుమ్రా, చాహాల్, అక్షర్, శరణ్ వంటి ప్రతిభావంతమైన బౌలర్లతో జట్టు బౌలింగ్ విభాగం బలోపేతంగా ఉందన్నారు. దేశం తరపున ఆడే సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని ధోని పేర్కొన్నారు.

10:07 - June 8, 2016

అమెరికా : సెరెనా విలియమ్స్..టెన్నిస్ లో మహిళల సింగిల్స్ నెంబర్ వన్ లో నెంబర్ వన్. తొలి స్థానంలో ఉన్న సెరెనా విలియమ్స్ ఆదాయ ఆర్జనలోనూ మొదటి స్థానాన్ని ఆక్రమించేసింది. సెరెనా గడిచిన 12 నెలల్లో 28.9 మిలియన్ డాలర్ల ఆదాయంతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం ఫోర్బ్ మ్యాగజైన్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఒక ఏడాదిలో టైటిల్ తో నెగ్గిన ప్రైజ్ మనీతో పాటు అంబాసిడర్ వంటి ఇతరత్రా ఆదాయాలతో మొత్తం 28.9 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. షరపోవా పేరిట అత్యధిక 21.9 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ రికార్డును సెరెనా తిరగరాసింది.

10:06 - June 8, 2016

కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి..అధిక వత్తిడికి లోనవుతుంటారు. దీనితో నొప్పిని నివారించడానికి మందులు వాడుతుంటారు. కానీ ఇలా వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసినా మందులు వేసుకుంటూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికి కొన్ని టిప్స్...

  • అల్లం ముక్కను తీసుకుని దానిని మెత్తగా చేసి నీళ్లలో వేయాలి. ఇలా ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాల్సి ఉంటుంది. తరువాత ఈ నీళ్లను వడగొట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరం కలిపి తాగేయాలి.
  • దాల్చిన చెక్క తో చేసిన టీ సేవించడం వల్ల బాగుంటుంది. నెలసరి మొదలవడానికి రెండు రోజుల ముందర నుండి దాల్చిన చెక్క టీని రెండు లేదా మూడు కప్పులు తప్పనిసరిగా తాగాలి.
  • వేడీ టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. అల్లం, పిప్పర్ మెంట్, లావెండర్, గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ వంటి హెర్బల్ టీలు తాగితే చాలా మంచిది.
  • నీరు కూడా ముఖ్యం. ఎంత నీరు తాగితే అంత మంచిది. కనీసం ఆరు నుండి ఏడు గ్లాసుల నీరు తాగాలి.
  • ఈ సమయంలో కాఫీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక వారం ముందు నుండి కాఫీ తాగడం మానేస్తే చాలా మంచిది.
09:54 - June 8, 2016

హైదరాబాద్‌ : మానవ సంబంధాలను మద్యం మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. ఈ మహ్మమ్మారికి ఓ ఆటో డ్రైయివర్ బలయిపోయాడు. అదీ ప్రజల్ని రక్షించాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో దారుణంగా చంపబడ్డాడు. ఈ ఘటన సైదాబాద్‌లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్‌ ఆటోడ్రైవర్‌ను చితకబాది చంపేశాడు. ఆదిలాబాద్‌ కు చెందిన కానిస్టేబుల్‌ వినోద్‌ మద్యం మత్తులో ఆటోడ్రైవర్‌ నాయక్‌పై విచక్షణా రహితంగా దాడిచేశాడు. అంతేకాదు ఆటో డ్రైవర్‌ నాయక్‌ ప్రాణాలు పోయేదాకా చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆటోడ్రైవర్‌ నాయక్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆగ్రహోద్రిక్తులైన స్థానికులు కానిస్టేబుల్‌ వినోద్‌ను బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సైదాబాద్‌ గ్రీన్‌ పార్క్‌ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

ఆటోడ్రైవర్‌ను చంపిన కానిస్టేబుల్..

హైదరాబాద్‌ : మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్‌ ఆటోడ్రైవర్‌ను చితకబాది చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ కు చెందిన కానిస్టేబుల్‌ వినోద్‌ మద్యం మత్తులో ఆటోడ్రైవర్‌ నాయక్‌పై విచక్షణా రహితంగా దాడిచేశాడు. అంతేకాదు ఆటో డ్రైవర్‌ నాయక్‌ ప్రాణాలు పోయేదాకా చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆటోడ్రైవర్‌ నాయక్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆగ్రహోద్రిక్తులైన స్థానికులు కానిస్టేబుల్‌ వినోద్‌ను బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సైదాబాద్‌ గ్రీన్‌ పార్క్‌ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

09:45 - June 8, 2016

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలపై సర్కార్ కన్ను పడింది. ఉస్మానియా క్యాంపస్, నిజాం కళాశాల ఖాళీ స్థలాలను ఉపయోగించుకోవాలని సర్కారు యోచనలో సర్కార్ పయనిస్తున్నట్లు సమాచారం. ఖాళీ స్థలాలను అప్పగించాలంటూ మంత్రి కేటీఆర్ కు డిప్యూటీ సీఎం కడియం లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల ఖాళీ స్థలాల్లో మోడల్ మార్కెట్లు , బస్ వేలు, ప్రభుత్వ టాయ్ లెట్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. కాగా దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. స్కూల్స్ లో అసలే అంతంత మాత్రంగా ఆటస్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిలో నిర్మాణాలు చేపట్టం సరైంది కాదని పేర్కొంటున్నారు. 

తెలుగు విద్యార్థులకు ఝలక్ ఇచ్చిన వెస్టర్న్ కెంటరీ వర్సిటీ...

హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇటీవలే ఆ దేశంలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన పదుల సంఖ్యలో తెలుగు విద్యార్థులను ఆ దేశ అధికారులు ఎయిర్ పోర్టుల్లోనే అడ్డుకున్నారు. అన్ని అర్హతలతో అక్కడి వర్సిటీలో చేరి ఓ సెమిస్టర్ కూడా పూర్తి చేసుకున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంటర్నేషనల్ రిక్రూటర్లతో కంప్యూటర్ సైన్స్ లో విద్యనభ్యసించేందుకు వెస్టర్న్ కెంటరీ వర్సిటీ 60 మంది తెలుగు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది. ఇప్పటికే ఓ సెమిస్టర్ కూడా పూర్తైంది.

నల్గొండ, నిజామాబాద్ లో భారీ వర్షం..

నల్గొండ : జిల్లా మిర్యాలగూడ, హుజూర్ నగర్ పరిధిలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. అటు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

 

కడపలో ముందస్తు అరెస్టులు..

కడప : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. దీనితో పోలీసులు అంగన్ వాడీ, ఐకేపీ, సీఐటీయూ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. వీరందరినీ జమ్మలమడుగు పీఎస్ కు తరలించారు.

 

అమెరికాలో ప్రధాని మోడీ..

అమెరికా: ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్ కొత్త చోదక శక్తిగా అవతరించబోతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఐదు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ అమెరికా - భారత్ వాణిజ్య మండలి 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

 

జీహెచ్ఎసంసీ స్థలాలపై సర్కారు కన్ను...

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలపై సర్కార్ కన్ను పడింది. ఉస్మానియా క్యాంపస్, నిజాం కళాశాలల్లోని  ఖాళీ స్థలాలను ఉపయోగించుకోవాలని సర్కార్ పయనిస్తున్నట్లు సమాచారం. ఖాళీ స్థలాలను అప్పగించాలంటూ మంత్రి కేటీఆర్ కు డిప్యూటీ సీఎం కడియం లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల ఖాళీ స్థలాల్లో మోడల్ మార్కెట్లు , బస్ వేలు, ప్రభుత్వ టాయ్ లెట్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. కాగా దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. స్కూల్స్ లో అసలే అంతంత మాత్రంగా ఆటస్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిలో నిర్మాణాలు చేపట్టం సరైంది కాదని పేర్కొంటున్నారు. 

ప్రారంభమయిన చేప ప్రసాదం పంపిణీ ...

హైదరాబాద్‌: నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8.30గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తొలుత ప్రకటించినప్పుటికీ అర్థగంట ముందే పంపిణీ ప్రారంభించారు. 32 కేంద్రాల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మధ్యాహ్నం తర్వాత రావాలని పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది. చేప ప్రసాదం పంపిణీలో 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8.30గంటల వరకు ఎగ్జిబిషన్‌ మైదానంలో చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు.

'ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్ కొత్త చోదక శక్తి'

అమెరికా: ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్ కొత్త చోదక శక్తిగా అవతరించబోతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐదు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అమెరికా-భారత్ వాణిజ్య మండలి 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్‌లోని అపార అవకాశాలను వివరించారు. 

నేడు బెయిన్ ట్యూమర్...

హైదరాబాద్: మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మనిషిని నియంత్రించేది..కదిలించేది ఇదే. అంతటి ముఖ్యమైన బ్రెయిన్‌లో కణతులు (బెయిన్ ట్యూమర్) చేరి బయపెట్టిస్తున్నాయి. ఈ వ్యాధిపై చాలా మందికి అవగాహన లేదు. సరైన చికిత్స విధానం ఉన్నా..ఈ వ్యాధికి గురైనట్లు తెలియగానే భయపడిపోయి మానసికంగా కృంగిపోయి మృత్యుఒడిలోకి చేరుతున్నారు. మొదటి దశలోనే మెదడులో కణతిని గుర్తిస్తే చికిత్సకు వీలువుతుందని, చివరి దశలో రోగికి ప్రాణాంతకం కావచ్చంటున్నారు వైద్యులు. తలకు సంబంధించిన ఏ చిన్న సమస్య కన్పించినా వెంటనే డాక్టర్లను కలువాలని సూచిస్తున్నారు.

08:42 - June 8, 2016

తెలంగాణ అభివృద్ధి గురించి ప్రొ.కోదండరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల ఎదురుదాడి చేయటం ఎంతవరకూ సమంజసం అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో శ్రీనివాస యాదవ్ (టీపీసీసీ అధికార ప్రతినిధి),సుధాకర్ రెడ్డి (శాసనమండలి సభ్యులు),జూలకంటి రంగారెడ్డి(సీపీఎం నేత) పాల్గొన్నారు. చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..సమగ్ర సమచారాన్ని తెలుసుకోండి...

08:36 - June 8, 2016

అది దొరికితే జీవితం దారినపడుతుంది. సంసారం ఏర్పడుతుంది. కానీ, 30 ఏళ్లు నిండినా ఉద్యోగం దొరకకపోతే అంతకు మించిన నరకం మరొకటి వుంటుందా? కానీ, కొన్ని లక్షల మంది యువతది ఇదే పరిస్థితి.

యువతకు జీవనభ్రుతి కల్పిస్తామంటూ టిడిపి వాగ్ధానం...
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు జీవనభ్రుతి కల్పిస్తామంటూ టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్ధానం చేసింది. బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఎంతమందికి జీవన భ్రుతి కల్పించారు? జవాబు సున్నా.

ఆంధ్రప్రదేశ్ లో లక్షా 42వేల పోస్టులు ఖాళీ...
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ శాఖలు, మల్టీ జోన్ లు, జోన్ లలో లక్షా 42 వేల పోస్టులు ఖాళీగా వున్నట్టు కమల్ నాథన్ కమిటీ తేల్చింది. అవి భర్తీకి నోచుకోవడం లేదు. చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య భారీగానే వుంది. ఏటా మూడు లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ సర్టిఫికెట్లతో బయటకు వస్తున్నారు. బిటెక్, ఎంటెక్, పిజి, డబుల్ పిజి చేసినా ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారింది. ప్రయివేట్ స్కూల్ టీచర్లుగా, మెడికల్ రిప్రజెంటేటివ్ లుగా పనిచేయాల్సి వస్తోంది. కానిస్టేబుల్, హోంగార్డు, సెక్యూరిటీ గార్డు లాంటి పోస్టులకు పరుగెత్తాల్సి వస్తోంది. ఓ వైపు ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మరోవైపు ప్రయివేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. లాకౌట్లు విధిస్తున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే 35 ఫెర్రో అల్లాయిస్ కంపెనీలుంటే అందులో 25 మూతపడ్డాయి. జ్యూట్ మిల్లులు లాకౌట్లు ప్రకటించాయి. జీడిపప్పు పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చక్కెర పరిశ్రమల్లోనూ ఆశాజనకవాతావరణం లేదు. ఈ పరిణామాలన్నీ నిరుద్యోగ సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఉద్యోగాల భర్తీ మీద ఆసక్తి చూపని ప్రభుత్వం నిరుద్యోగ భ్రుతి విషయంలోనూ నిర్లప్తంగానే వ్యవహరిస్తోంది. గత బడ్జెట్ లో ఈ అంశాన్నీ ప్రస్తావించలేదు. పోనీ స్వయం ఉపాధినైనా ప్రోత్సాహిస్తున్నారా? అంటే అదీ లేదు. ఇలాగైతే యువత ఎలా బతకాలి? ఉపాధో, ఉద్యోగమో సంపాదించుకునేదెలా?

08:28 - June 8, 2016

బాబు వస్తే జాబు వస్తుంది. ఇది ఎన్నికల్లో టిడిపి చేసిన ప్రచారం. నిరుద్యోగులకు జీవన భ్రుతి కల్పిస్తామంటూ టిడిపి మ్యానిఫెస్టో లో హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండేళ్లయ్యింది. యువతకిచ్చిన హామీలు ఎంత వరకు నెరవేరాయి? టిడిపి హామీలు, వాటి అమలుతీరు విషయంలో యువత గుండెచప్పుడేమిటి? ఆంధ్రప్రదేశ్ యువత ఎదుర్కొంటున్న చాలెంజెస్ ఏమిటి? స్వయం ఉపాధి పథకాలు అమలవుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం చేయాల్సిందేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డి విజయవాడ 10టీవీ స్టూడియోకి పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి ...

08:19 - June 8, 2016

అమెరికా : అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో విజయం చేకూరింది. అణు పదార్ధాలు సరఫరా చేసే దేశాల బృందంలో భారత్‌ చోటు సంపాదించుకుంది. ఎంటీసీఆర్‌లో భారత్‌ను సభ్యదేశంగా చేర్చుకునేందుకు సభ్యదేశాలన్నీ అంగీకరించాయి. 34 సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశమూ భారత్‌ చేరికకు అభ్యంతరం చెప్పలేదు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. ఒబామాతో భేటీకి ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.

పూర్తి మద్దతు ప్రకటించిన ఒబామా ...
ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతు ప్రకటించారు. అమెరికాలో పర్యటిస్తున్న మోదీ.. వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఒబామాతో భేటీ అయ్యారు.
ద్వైపాక్షిక సంబంధలను కొత్త బాటలు..
గంటపాటు సాగిన సమావేశంలో.. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం, క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థలో భారత్‌ ప్రవేశం, వాతావరణ మార్పు,ద్వైపాక్షిక పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మార్గాలపై మంతనాలు జరిపారు.

ఎన్‌ఎస్‌జీలో భారత్‌ కు భాగస్వామ్య: ఒబామా
ఎన్‌ఎస్‌జీలో భారత్‌ భాగస్వామ్యానికి మద్దతిచ్చినట్లు ఒబామా తెలిపారు. భారత్‌ తన ప్రగతికి, సుసంపన్నత సాధించేందుకు సాంకేతిక పరిజ్ఞానం కీలకమన్నారు. కిష్లమైన అంశాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒబామా తెలిపారు.

సహాయం పట్ల మోదీ కృతజ్ఞతలు...
ఎంటీసీఆర్‌, ఎన్‌ఎస్‌జీల్లో ఒబామా చేసిన సాయానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ మార్పు, అణుభద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు.

ఇకపై భారత్‌లో అణు రియాక్టర్ల పనులు వేగవంతం...
ఇక ఎంటీసీఆర్‌ సభ్యదేశంగా భారత్‌కు అవకాశం రావడంతో.. ఉన్నతస్థాయి ఆధునిక క్షిపణి సాంకేతికను కొనుగోలు చేయడమే కాకుండా.. ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా.. అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం గల క్షిపణులను సైతం భారత్‌ ఎగుమతి చేయగలదు. 

చేపమందుకు సర్వం సిద్ధం...

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పలు రాష్ట్రాల నుండి జనం భారీగా చేరుకున్నారు. చేపమందు పంపిణీకి 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు.మహిళలకు, పిల్లలకు, పురుషులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రసాదం పంపిణీ బుధ, గురువారాల రోజులలో కొనసాగనుంది. తెలంగాణ జిల్లాల నుండి వచ్చిన వారికి మాత్రం మధ్యహ్నాం నుండి ప్రసాదం పంపిణీ కానుంది.

08:02 - June 8, 2016

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ చార్మినార్, ఘుమఘుమలాడే బిర్యానీ లాంటివి గుర్తుకొస్తాయి. అదే నగరంలో... మృగశిర కార్తె అనగానే.. బత్తిని బ్రదర్స్‌ చేప ప్రసాదం గుర్తొస్తుంది. ఆస్తమా రోగులకు చేరువైన బత్తిని ఫ్యామిలి చేప ప్రసాదంపై టెన్‌టీవీ స్పెషల్‌..

చేప ప్రసాదంతో ఫేమస్ అయిన బత్తిన ఫ్యామిలీ ...
బత్తిని కుటుంబం అందించే చేప ప్రసాదం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఫేమస్‌ అయిన ఈ చేప ప్రసాదాన్ని బత్తిని ఫ్యామిలీ ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున అందిస్తోంది. ఈఏడాది కూడా జూన్‌ 8న.. ఉదయం ఎనిమిదిన్నర నుంచి చేప ప్రసాద పంపిణీని రంభించనున్నారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించేందుకు దేశ నలుమూలల నుంచే గాక విదేశాల నుంచీ ఆస్తమా రోగులు హైదరాబాద్‌కు పెద్దయెత్తున తరలివస్తారు. మృగశిర కార్తెకు రెండు రోజుల ముందు నుంచే వారు నగరానికి చేరుకుంటారు. చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతి వయసు వారూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు.

ప్రసాదం పంపిణీకి విస్తృతంగా ఏర్పాట్లు...
చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పోలీస్ కంట్రోల్ రూం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ దీపాలు, 32 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రోగులందరికీ సరిపడా చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. ఒక్కో చేప పిల్లను 15 రూపాయలకు విక్రయించనున్నారు. అగర్వాల్ సేవా సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు రోగులకు ఆహారాన్ని మంచినీటిని అందిస్తున్నాయి. ఈ కార్యక్రమం జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానించారు. 1500 మంది పోలీసులు పహారా కాస్తుంటారు. 1600 మంది వాలంటీర్లతో సహాయకార్యక్రాలు నిర్వహిస్తున్నారు.

చేప ప్రసాదానికి 171 సంవత్సరాల చరిత్ర...
ప్రతియేటా ఆస్తమా రోగులకు అందించే ఈ చేప ప్రసాదానికి 171 సంవత్సరాల చరిత్ర ఉంది. 1845లో ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలిలో కొద్దిమంది ఆస్తమా రోగులకు ఈ ప్రసాదాన్ని అందించడం ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కొరమీను చేపపిల్ల నోటిలో ఆ ప్రసాదాన్ని ఉంచి రోగి చేత ఆ చేప పిల్లను మింగిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో ప్రసాదాన్ని అందిస్తారు. వీటితో పాటు ఇంటి వద్దకు తీసుకెళ్లి స్వీకరించేందుకు కార్తి ప్రసాదం అందిస్తారు. ఇక ప్రసాదం స్వీకరించే వారు గంట ముందు నుంచి ఏమీ తినకూడదు. అలాగే ప్రసాదం స్వీకరించాక గంట సమయం పాటు ఏదీ తినకూడదు. మూడు సంవత్సరాల పాటు ప్రతి ఏటా ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆస్తమా తగ్గుతుందనే నమ్మకం ప్రబలంగా ఉంది.

అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచనలు...
చేప ప్రసాదాన్ని పొందలేని వారి కోసం.. కవాడిగూడ, దూద్ బౌలి, కూకట్‌పల్లిలోని బత్తిని కుటుంబ సభ్యుల ఇళ్ల వద్దా అందుబాటులో ఉంచుతున్నారు. చేప ప్రసాదం జరిగే రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ అంక్షలు విధించారు. అధికారులు సూచించిన పార్కింగ్ ఏరియాల్లో వాహనాలను నిలపాలని పోలీసులు తెలిపారు. ప్రసాదానికి వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

07:53 - June 8, 2016

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం రాష్ట్ర సర్కారు చేపట్టే బడిబాట కార్యక్రమానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. రెండేళ్లుగా వాయిదావేస్తూ వస్తున్న బడిబాటకు ఈ ఏడాది నిధులు మంజూరు కాలేదు. డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ జరపాల్సిన టీచర్లు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉండటంతో.... బడిబాటకి ఈసారైనా మోక్షం కలుగుతుందా....

బడిబాటకు ప్రొ.జయశంకర్‌ నామకరణం ...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేది. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఒక్క బడిబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. అయితే ఈ ఏడాది బడిబాటకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని నామకరణం చేసింది టీ సర్కార్.

బడిబాటకు కేటాయింపులేవి? ...
అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణా సర్కార్ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధులు లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలీక అధికారులు సతమతమవుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బడిబాట నిర్వహించినప్పుడు జిల్లాకు 10లక్షల రూపాయలను కేటాయించేది. వీటితో పాటు బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లనూ విద్యాశాఖే ముద్రించేది. ఈ కార్యక్రమం ప్రారంభానికి మంత్రులు కూడా పాల్గొనే వారు. పాఠశాల విద్యకు ఇది చేస్తాం..అది చేస్తాం..అని చెప్పడమే తప్ప బడిబాటకు టీసర్కారు చేసింది మాత్రం శూన్యమే.

ఈనెల 13 నుంచే పాఠశాలలు ప్రారంభం..
ఈనెల 13నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రయివేటు స్కూల్స్ టెన్త్ రిజల్ట్స్ ముందుపెట్టుకుని పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. బ్యానర్లు, హోర్డింగ్స్, కరపత్రాలు పంచుతూ దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏరియాకి ఒక ప్రత్యేక పిఆర్ఓలను కేటాయించి మరీ ప్రచారం చేయిస్తున్నాయి. సర్కారు బడులు మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ప్రైవేటు అడ్మిషన్లు పూర్తయ్యాక బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.

డ్రాప్‌ఔట్‌ కృషి చేయాలంటున్న విద్యావేత్తలు...
తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించలేదు. దీంతో గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వపాఠశాలల్లో డ్రాప్‌ఔట్‌ను తగ్గించేందుకు కృషి చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

 

07:44 - June 8, 2016

హైదరాబాద్ : రెండో విడత హరితహారం కార్యక్రమానికి ముహూర్తం ఖరారయ్యింది...గ్రేటర్ హైదరాబాద్‌లో జులై 11 న ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలని డిసైడయ్యింది... దీని కోసం అన్ని శాఖల సమన్వయంతో హరిత హారాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.

సెకండ్ ఫేస్ కింద 25 లక్షల మొక్కలు...
ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా హైదరాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమంపై సచివాలయంలో మేయర్, నగర మంత్రులు సమీక్ష నిర్వహించారు. జులై 11న హైదరాబాద్‌లో హరిత హారం సెకండ్ ఫేస్ కింద 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. గతేడాది వర్షాలు లేకపోవడంతో అనేక మొక్కలు ఎండిపోయాయని... కానీ ఈ ఏడాది వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండటంతో ఎక్కువ మొక్కలు నాటాలని నిర్ణయించారు.

గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యం : తలసాని
హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చడమే తమ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నగర ప్రజలకు 27 కేంద్రాల నుంచి ఉచితంగా మొక్కలు అందిస్తామన్నారు...గాలికి కూలిపోయే చెట్లు కాకుండా ప్రజలకు ఏ చెట్లు ఉయోగపడితే అవి అందిస్తామంటున్నారు.

నాలుగేళ్లలో 10 కోట్ల మొక్కల లక్ష్యం:బొంతు
హైదరాబాద్‌లోని 40 ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ , స్వచ్చంద సంస్థలతో కలిపి 84 విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు...గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టే హరిత హారం కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో నాలుగేళ్లలో 10 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్షమన్నారు బొంతు.

07:38 - June 8, 2016

హైదరాబాద్ : పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. అందివచ్చిన అవకాశాన్ని దక్కించుకోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీతో తెలంగాణలో ప్రతిప‌క్షాలు ముందుకెళ్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌తో వార్‌ను వ‌న్ సైడ్ చేసుకున్న కేసీఆర్‌ను.. ఇప్పుడదే సెంటిమెంట్‌తో ఢీకొట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. అధికార పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కోదండ‌రాంను తమ అస్త్రంగా మార్చుకునే పనిలో ప‌డ్డాయి విప‌క్షాలు.

వార్ ను వన్ సైడ్ చేసిన గులాబీ  బాస్ ...
లక్షలాది మంది పోరాటాల ఫలితం తెలంగాణ... ఇది రాష్ట్రంగా ఏర్పడుతూనే రాజ‌కీయ ముఖచిత్రం కూడా మారిపోయింది. కేసీఆర్ పొలిటికల్‌ ఎత్తుగడలకు విప‌క్షాలు విల‌విల్లాడుతున్నాయి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో కాంగ్రెస్, టీడీపీలు హడలెత్తిపోతున్నాయి. మరోపక్క ప్రతి ఎన్నికలోనూ సత్తాచాటుతూ కేసిఆర్‌ వార్‌ను వ‌న్ సైడ్ చేశారు. ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయడాన్ని టార్గెట్‌గా పెట్టుకున్న గులాబీ అధినేత ఆ పనిలో చాలావరకు సక్సెస్‌ అయ్యారు.

ఎన్నికలలో విఫలమవుతున్న విపక్షాలు...
ప్రతి ఎన్నిక టైంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. స‌ర్కార్‌ అవినీతికి పాల్పడుతోందంటూ ప్రజలకు ఎంత చెప్పినా ఓట్లు సాధించుకోలేకపోతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య జేఏసీ నేత కోదండరాం రూపంలో వచ్చిన అవకాశం విప‌క్షాల్లో ఆశ‌లు రేపుతున్నాయి.ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షల‌ను నెర‌వేర్చడం లేదని చేతకాక‌పోతే దిగిపోండని కోదండ‌రామ్‌ పేల్చిన బాంబ్‌తో ఒక్కసారిగా అధికార పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. కోదండరామ్‌పై మాటల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోదండ‌రాంపై పెల్లుబుకిన సానుభూతితో విప‌క్షాలు ఒక్కట‌య్యాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోదండ‌రాంకు బాస‌ట‌గా నిలుస్తూ టీడీపీ గులాబీ పార్టీని ఏకిపారేసింది.

గ‌న్ పార్క్ ద‌గ్గర కాంగ్ నేతలు దీక్షలు...
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా టిఆర్ఎస్‌పై విరుచుకుపడింది. నిఖార్సైన తెలంగాణ వాది కోదండ‌రాంను కేసీఆర్ కూర‌లో క‌రివేపాకులా తీసిపారేస్తున్నారంటూ విమర్శించింది. తెలంగాణ‌ స‌మాజాన్నే టీఆర్‌ఎస్‌ అవ‌మానించిందంటూ గ‌న్ పార్క్ ద‌గ్గర కాంగ్ నేతలు దీక్ష చేశారు.

బీజేపీ, వామ‌ప‌క్షాలు టిఆర్ఎస్ తీరుపై మండిపాటు...
మ‌రోవైపు బీజేపీ, వామ‌ప‌క్షాలు సైతం టిఆర్ఎస్ తీరుపై మండిప‌డ్డాయి. తెలంగాణ రావ‌డంలో అలుపెర‌గ‌ని పోరాటం చేసిన‌ కోదండ‌రాంను టీఆర్ఎస్ అవ‌మాన‌ప‌రిచిందంటూ ఫైర్ అయ్యాయి. ప్రజ‌ల ప‌క్షాన నిలిచి ప్రశ్నించడమే తప్పా అంటూ విమర్శించాయి..

కోదండరామ్‌పై కోటి ఆశలు పెట్టుకున్న విపక్షాలు...
మొత్తానికి తెలంగాణ సెంటిమెంట్‌ను కవచంగా వాడుకుంటున్న కేసీఆర్‌ను కోదండరామ్‌తో ఎదుర్కోవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. జెండాల‌ను ప‌క్కన‌బెట్టి ప్రొఫెస‌ర్‌కు అండ‌గా నిలుస్తున్నాయి. మ‌రి ఈ ప‌రిణామాలు ఎంతకాలం కొనసాగుతాయో చూడాలి.

07:27 - June 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ బుధవారం హైదరాబాద్‌లో జరగనుంది. కేసీఆర్‌ రెండేళ్ల పాలనపై కోదండరామ్‌ అసంతృప్తి వ్యక్తం చేయడం..ప్రతిగా మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీకి ప్రాధాన్యత చేకూరింది.

టీఆర్ఎస్/టీజాక్ మాటల యుద్ధం...
రెండేళ్ల పాలనలో తెలంగాణ బంగారమయమైందన్న కేసీఆర్‌ బృందానికి.. ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీలను పరుగులు పెట్టించిన జేఏసీకి.. వాగ్యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణలో ఆసక్తికర పోరుకు తెరలేపిన ఈ పరిణామం.. గులాబీ దళానికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రెండేళ్ల కేసీఆర్‌ పాలన అంత సంతృప్తికరంగా ఏమీ లేదన్న కోదండరామ్‌ వ్యాఖ్యలను ఖండించేందుకు ఏకంగా మంత్రివర్గంలోని సీనియర్లందరూ క్యూ కట్టారు.

ఉద్యమంలో గులాబీ బాస్‌ పెద్దన్న పాత్ర...
ఉద్యమ సమయంలో గులాబీ బాస్‌ పెద్దన్న పాత్ర పోషించాడన్నది సుస్పష్టం. అదే సమయంలో రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను ఏకతాటిపైకి తెచ్చి.. సకలజనుల సమ్మె, రోడ్లపైనే వంటావార్పు లాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఉద్యమానికి ఊపు తెచ్చింది మాత్రం టీ-జేఏసీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. దాదాపు ఏడాదిన్నర తర్వాత.. జేఏసీలోని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బయటికి వెళ్లాయి. కలిసొచ్చే ప్రజాసంఘాలతోనే టీ-జేఏసీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. ప్రజాసమస్యలపై.. ప్రజల గళమై నినదించాలని టీ-జేఏసీ నిర్ణయించింది.

రైతు ఆత్మహత్యలపై టీజాక్ పర్యటన...
జేఏసీ నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రకారం.. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలోని బృందం.. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై గ్రామాల్లో పర్యటించింది. ఇదే అంశంపై.. హైకోర్టులో స్క్వాష్‌ పిటిషన్‌ వేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించింది. కోదండరామ్‌ చర్యలపై గుర్రుగా ఉన్నా.. టీఆర్ఎస్‌ నాయకత్వం మౌనాన్నే ఆశ్రయించింది. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితుల గోడుపై.. కోదండరామ్‌ గళమెత్తారు. ప్రజల గోస పట్టించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని.. చట్టానికి, జీవోకు తేడా ఉందంటూ.. ఆచార్య కోదండరామ్‌ ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు.

జేఏసీ అస్థిత్వమే లేదంటున్న టీఆర్ఎస్...
కోదండరామ్‌కు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసిత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంతకాలం మౌనాన్ని పాటిస్తూ వచ్చిన టీఆర్ఎస్‌ నాయకులు.. బరస్ట్‌ అయి.. జేఏసీ నేతపై విరుచుకుపడ్డారు. దాదాపు మంత్రివర్గం మొత్తం కోదండరామ్‌పై ఒంటికాలితో లేచారు. జేఏసీ అస్థిత్వమే లేదని.. కోదండరామ్‌ రాజకీయ పార్టీ ప్రజల మధ్యకు వస్తే తమకు అభ్యంతరం లేదంటూ సవాళ్లు విసిరారు.

భ‌విష్యత్‌ వ్యూహాలపై చర్చించనున్న టీ జాక్‌ ...
తమపై మంత్రిమండలి మొత్తం విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. జేఏసీ నాయకత్వం బుధవారం స్టీరింగ్‌ కమిటీ భేటీ నిర్వహిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న విమ‌ర్శలను తిప్పికొట్టేందుకు అనుస‌రించాల్సిన వ్యూహంపై ఈ స‌మావేశంలో ప్రధానంగా చ‌ర్చించ‌నున్నారు.

విమర్శలు..ప్రతి విమర్శలతో వేడెక్కిన వాతావరణం...
నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా... పాలకపక్షం వాటిని దిగ్విజయంగా తిప్పికొట్టి పైచేయి సాధించింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక భూమిక పోషించిన జేఏసీయే ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే.. రాబోయే రోజుల్లోనూ.. టీ-జేఏసీ ప్రభుత్వ చర్యలను ఎండగట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొత్తానికి టీ-జాక్‌ వ్యాఖ్యలు.. టీఆర్ఎస్‌ విమర్శలతో.. తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 

07:07 - June 8, 2016

విజయవాడ : కాలం గిర్రున తిరుగుతోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండేళ్లు పూర్తి చేసుకుని.. మూడో వసంతంలోకి అడుగిడుతున్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆశించిన చంద్రబాబుకు కేంద్రం నిరాశే మిగిల్చింది. దీంతో మరిన్ని నిధులు రాబట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సీఎం.

బాబు పాలనకు రెండేళ్లు...
నవ్యాంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన పగ్గాలు చేపట్టి నేటితో రెండేళ్లు పూర్తయింది. విభజనతో రాష్ట్రానికి అనేక కష్టాలు వచ్చాయని.. అయినా ఆత్మస్థైర్యంతో అభివృద్ధి వైపు దూసుకెళ్దామని ప్రజలకు నిత్యం చెబుతూనే ఉన్నారు చంద్రబాబు.

ప్రత్యేక హోదా అంశంలో టీడీపీపై విమర్శలు ...
అయితే.. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి.. నిత్యం ఏదో కొత్త సమస్య వెంటాడుతూనే ఉంది. నవ్యాంధ్ర రాజధానికి భూసేకరణ మొదలు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం వరకు టీడీపీపై విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. అంతేకాకుండా.. అమరావతిని ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా తీర్చుదిద్దుతానన్న చంద్రబాబు వ్యాఖ్యలను పలువురు విమర్శిస్తున్నారు. అసలే కష్టాలు ఉన్న సమయంలో రాజధాని నిర్మాణానికి అన్ని నిధులు ఎలా సమకూరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక అధికారులపై ఎమ్మెల్యేల దాడులు, కాల్‌మనీతో పాటు ఓటుకు నోటు వ్యవహారంలో అనేక ఆరోపణలు రావడంతో టీడీపీకి కొత్త సమస్యలు ఎదురయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బాబు.. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత రుణమాఫీలో చేసిన జిమ్మిక్కులతో తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో పలు చోట్ల కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం భూములు సేకరించడం అనేక వివాదాలకు దారితీస్తోంది. ప్రతి ప్రాంతంలోనూ భూనిర్వాసితులు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు.

కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారంటూ విమర్శలు...
ఇక ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆశించిన టీడీపీకి భంగపాటే ఎదురైంది. కేంద్రంలో తమ మిత్రపక్షం బీజేపీ ఉండడం.. పునర్విభజన చట్టంలోనూ ఆ అంశం పొందుపర్చడంతో ప్రత్యేక హోదా వస్తుందని ఆశించారు. కానీ.. అనేక కారణాలరీత్యా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పడంతో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోదా రాకున్నా.. అంతకంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి తీసుకువస్తామంటూ ప్లేట్‌ ఫిరాయించారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారంటూ విపక్షాలు దుయ్యబట్టాయి.

తలనొప్పిగా మారిన ఉద్యోగుల తరలింపు...
తాజాగా ఉద్యోగుల తరలింపు వ్యవహారం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఎలాగైనా ఈనెల 27లోగా అమరావతికి ఉద్యోగులు తరలి రావాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరిస్తుండగా.. మౌలిక వసతులు లేకుండా అక్కడికి వచ్చేది లేదని ఉద్యోగులంటున్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదంటూ ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టబోతున్నారు. అయితే.. కమిషన్‌ మధ్యంతర నివేదిక వచ్చిన తర్వాత.. బీసీలకు నష్టం కలగకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే తాజాగా.. తుని ఘటన కేసులో పలువురిని అరెస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.

అభివృద్ధి కంటే.. సమస్యల లిస్టే ఎక్కువ...
ఇలా చెప్పుకుంటూ పోతే.. చంద్రబాబు ఈ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కంటే.. సమస్యల లిస్టే చాలా పెద్దదిగా ఉంది. మరి ఈ అంశాలను బేరీజు వేసుకుని మరో మూడేళ్లు ఎలా పాలన కొనసాగిస్తారో చూడాలి. 

నేడు టీజేఏసీ స్టీరింగ్ సమావేశం...

హైదరాబాద్ : బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాదులో జేఏసీ కీలక భేటీ జగరనుంది. టీ.సర్కార్ కు టీజాక్ కు మధ్య మాటలు యుద్ధం జరుగుతున్న ఈ తరుణంలో ఈ సమావేశం ప్రాధ్యాన్యతను సంతరించుకుంది. 

నగరంలో 25లక్షల మొక్కలు..

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో జూలై 11న 25 లక్షల మొక్క లు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. హరితహారం కార్యక్రమంపై మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలసి మంత్రి తలసాని అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Don't Miss