Activities calendar

09 June 2016

రేపు, ఎల్లుండి కర్నాటకలో తెలంగాణ బృందం పర్యటన

హైదరాబాద్ : రేపు, ఎల్లుండి కర్నాటకలో తెలంగాణ బృందం పర్యటిస్తుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ నాయకత్వంలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై అధ్యయనం చేయనుంది. రేపు నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల పరిశీలించనున్నారు. కృష్ణా జలాల పంపిణీ పై సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో పరిశీలించనున్నారు. 

 

22:03 - June 9, 2016

సిమ్లా : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ను సిబిఐ విచారించింది. వీరభద్రసింగ్‌ కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో ఆదాయం కన్న ఎక్కువ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి. 81 ఏళ్ల వీరభద్రసింగ్‌ 2009-12 మధ్య కాలంలో తన కుటుంబ సభ్యుల పేరిట ఆదాయాని కన్నా ఆరు కోట్లు అధికంగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి.

 

21:54 - June 9, 2016

హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 4వేల కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. ఇవాళ నాబార్డు అధికారులతో పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీసింగ్ సమావేశమయ్యారు. మెదక్‌ జిల్లాలో నాబార్డ్ పనులతో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో విడత కింద ఇస్తామన్న 1976కోట్ల రుణాన్ని త్వరలోనే అందజేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో పాటు 2017, 2018 సంవత్సరాల్లో చేపట్టే పనులపై కూడా ఓ అవగాహనకు వచ్చారు. 

 

21:39 - June 9, 2016

 ఢిల్లీ : అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కామ్, విజయ్ మాల్యా మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తు కోసం సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్- సిట్‌ను నియమించింది. ఇటలీ దర్యాప్తు అధికారులు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల ఆధారంగా మొదట్లో ప్రాథమిక విచారణ చేపట్టిన సీబీఐ.. పూర్తి సాక్ష్యాధారాలు లభించిన తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టనుంది. బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాపై పలు చార్జిషీట్లు వేయడానికి సిబిఐ సిద్ధమవుతున్నది. గుజరాత్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి రాకేశ్‌ అస్థానా నేతృత్వంలో సిట్‌ విచారణ జరపనుంది.

 

21:28 - June 9, 2016

వరంగల్ : ప్రభుత్వం తమకు ఉన్న చోటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. వరంగల్‌లో ఎస్‌.ఆర్‌ నగర్‌ కాలనీవాసులు ఆందోళన చేశారు. కాలనీ యువకులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో వరంగల్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీ, రెవెన్యూ అధికారులు కాలనీ వాసులతో చర్చించి.. ఆందోళన విరమింపజేశారు. వారికి అనుకూలమైన విధంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో కాలనీ యువకులు ట్యాంక్‌పై నుంచి కిందకి దిగారు.

21:22 - June 9, 2016

హైదరాబాద్ : రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ చేయడానికి అన్ని సిద్ధం చేశామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఖరీఫ్‌ సీజన్‌పై ఆయన ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. రైతులకు సహకార సంఘాల ద్వారా విత్తనాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించిన తర్వాతే వ్యవసాయ పనులు ప్రారంభించాలని సూచించారు. కొత్తగా తెలంగాణ సోనా వంగడాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.  

21:15 - June 9, 2016

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసిలో ఒక్క రోజు సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసి కార్మికులకు వేతన సవరణ బకాయిలు, డీఏ, ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 23న ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగాలని జేఏసి నిర్ణయించింది. కార్మికుల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలనే డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసి నేతలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జేఏసి నేతలు ఆరోపించారు. 

 

20:42 - June 9, 2016

పశ్చిమగోదావరి : రాష్ట్రంలో అభివృద్ధిని వదిలేసి నవనిర్మాణ దీక్షల పేరుతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభల ముగింపులో పార్టీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యానికి సరైన ధరలు లేవని, కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మధు ఆరోపించారు ప్రజా సమస్యలపై అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి పోరాటం చేస్తామని మధు అన్నారు. 

 

20:39 - June 9, 2016

ఢిల్లీ : కొవ్వాడలో ఏర్పాటు చేయనున్న అణువిద్యుత్‌ కేంద్రాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. గుజరాత్‌ను సురక్షితంగా ఉంచుతూ అక్కడి ప్రాజెక్టును కొవ్వాడకు ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం గురించి స్థానిక ప్రజలతో చర్చించి.. భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తామని ఏచూరీ స్పష్టం చేశారు.

ఏపీలోకి ప్రవేశించిన నైరుతీ రుతుపవనాలు

హైదరాబాద్ : నైరుతీ రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. నిన్న కేరళను తాకిన రుతుపవనాలు, కర్నాటక, తమిళనాడు మీదుగా... కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. చిత్తూరు, తిరుపతి ప్రాంతాలను పూర్తిగా తాకిన రుతుపవనాల ప్రభావంతో.. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 

20:23 - June 9, 2016

హైదరాబాద్ : నైరుతీ రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. నిన్న కేరళను తాకిన రుతుపవనాలు, కర్నాటక, తమిళనాడు మీదుగా... కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. చిత్తూరు, తిరుపతి ప్రాంతాలను పూర్తిగా తాకిన రుతుపవనాల ప్రభావంతో.. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 

 

20:20 - June 9, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌కు చంద్రబాబు భయపడుతున్నారని... అందుకే... తెలంగాణ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. తుని ఘటనలో కడప జిల్లా ప్రజల హస్తం ఉందన్న చంద్రబాబు... వారిని బుజ్జగించడానికే మహాసంకల్ప సభను అక్కడ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో చంద్రబాబు.. అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా మౌనంగా ఉంటున్నారని చెప్పారు. 

 

20:07 - June 9, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది లక్ష ఐదొందల కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించాయి. విజయవాడలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. బ్యాంకర్ల రుణ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. రుణ ప్రణాళిక గతేడాది కంటే 32శాతం పెరిగినప్పటికి ఆచరణలో కేటాయింపులు జరగడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో బ్యాంకర్ల తీరుపై బాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.83వేల కోట్లు కేటాయించనున్నారు. 

 

ముగిసిన సీపీఎం ఎపి రాష్ట్ర కమిటీ సమావేశాలు

పశ్చిమగోదావరి : భీమవరంలో సీపీఎం ఎపి రాష్ట్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ప్రజా సమస్యలపై కమిటీ చర్చించింది. ధాన్యానికి మద్దతు ధర, కౌలు రైతుల సమస్యలు, చిరు ఉద్యోగుల కనీస వేతనంకై పోరాటం చేయాలని తీర్మానించారు. 

మహబూబ్ నగర్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాజేశ్వర్

మహబూబ్ నగర్ : జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాజేశ్వర్ ఎన్నికయ్యారు. 

19:48 - June 9, 2016

హైదరాబాద్ : పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ ప్రతినిధి మల్లురవి తెలిపారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి పెద్ద కోవర్ట్‌ అంటూ మీడియా మందు పాల్వాయి మాట్లాడడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లే అని ఆయన అన్నారు. పిసిసి చీఫ్‌ రాష్ట్రానికి తిరిగి రాగానే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు మల్లురవి తెలిపారు. 

19:44 - June 9, 2016

రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కిర్లపూడిలోని తన ఇంట్లో దీక్ష చేపట్టిన ముద్రగడను పోలీసులు అరెస్ట్‌ చేసి.. భారీ ఎస్కార్ట్ తో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
ముద్రగడను కలిసేందుకు వచ్చిన వారిని పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి పరిసరాల్లో భద్రత పెంచారు. 

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ముద్రగడకు వైద్యపరీక్షలు

రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కిర్లపూడిలోని తన ఇంట్లో దీక్ష చేపట్టిన ముద్రగడను పోలీసులు అరెస్ట్‌ చేసి.. భారీ ఎస్కార్ట్ తో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
ముద్రగడను కలిసేందుకు వచ్చిన వారిని పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి పరిసరాల్లో భద్రత పెంచారు. 

19:33 - June 9, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన వల్ల భారత్‌కు ఒరిగిందేమీ లేదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మోడీ రెండేళ్ల పాలనపై 'దో సాల్‌ జన్‌తా బేహాల్‌ ' అనే పుస్తకాన్ని సిపిఎం విడుదల చేసింది. ఈ రెండేళ్లలో దేశంలోని ప్రజల జీవన స్థితిగతులపై ఇందులో వివరించడం జరిగిందని ఏచూరి తెలిపారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఆ దేశ సైనిక కార్యకలాపాలకు పరోక్షంగా భారత్‌ మద్దతునివ్వడమేనని ఏచూరి అన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో సత్‌సంబంధాలను కొనసాగించే విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా మోడీ ప్రవర్తిస్తున్నారని... చైనాపై అక్కసుతో అమెరికాకు సన్నిహితంగా మారడం భారత్‌కు ప్రమాదకరమన్నారు. దక్షిణాసియాలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పాకిస్తాన్‌ స్థానంలో భారత్‌ను అమెరికా ప్రమోట్‌ చేస్తోందని ఏచూరి విమర్శించారు. 

 

18:39 - June 9, 2016

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తీరుకు నిరసనగా సీపీఎం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. చేనేత కార్మిక కుటుంబాలకు అండగా సీపీఎం ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆ పార్టీ  అండగా నిలిచింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి, సిరిపురం గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పర్యటించారు. ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడమే కాకుండా వారి కుటుంబాల కోసం బిక్షాటన చేశారు. బిక్షాటన ద్వారా విరాళంగా వచ్చిన 50వేల రూపాయలను బాధిత కుటుంబాలకు తమ్మినేని వీరభద్రం అందచేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే బిక్షాటన చేపట్టినట్లు తెలిపారు. 

 

18:32 - June 9, 2016

హైదరాబాద్ : మంత్రి పరిటాల సునీత ముద్రగడ పద్మనాభంపై మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసమే ముద్రగడ తన భర్త పరిటాల రవీంద్ర హత్య విషయంలో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే పరిటాల రవీంద్రను హత్య చేయించిందన్న విషయం అందరికీ తెలుసునన్నారు. ముద్రగడ రాజకీయ ఉనికి కోసం తన భర్తను రోడ్డుపైకి లాగవద్దని సునీత కోరారు. ప్రజలను రెచ్చగొట్టేలా దీక్షలు చేయడం తగదని హితవుపలికారు. 

 

17:46 - June 9, 2016

తమిళనాడు : చెన్నైలో జుట్టు పెరగడానికి చేసిన హెయిర్‌ ట్రాన్స్ ప్లాంట్‌ ఆపరేషన్ వికటించడంతో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బట్టతల ఉండడంతో మెడికల్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న 22 ఏళ్ల సంతోష్‌  గత నెల హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసుకున్నాడు. ఆపరేషన్ జరిగిన రెండు రోజులకు సంతోష్‌ మృతి చెందినట్లు తల్లి చెప్పింది. 12 వందల వెంట్రుకలు ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడానికి 10 గంటల సమయం పట్టిందని... ట్రాన్స్‌ప్లాంట్‌ అయిపోగానే సంతోష్‌కు తీవ్ర జ్వరం వచ్చిందని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేరెంట్స్ తెలిపారు. ట్రాన్స్‌ప్లాంట్‌ పేరిట లక్షలాది రూపాయలు గడిస్తూ జనాన్ని మోసం చేస్తున్నారని, డాక్టర్లు సర్జన్లు కారని పేరెంట్స్‌ ఆరోపించారు. తమ అబ్బాయి ట్రాన్స్‌ప్లాంట్‌కు 73 వేలు చెల్లించామన్నారు. వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వైద్యులు పరారీలో ఉన్నారు. 

 

17:34 - June 9, 2016

పశ్చిమగోదావరి : ఏపీలో రాష్ట్రప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతులకు రుణమాఫీ, పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భీమవరంలో జరిగిన మహాసభల్లో అనేక విషయాలపై చర్చించామని తెలిపారు. 

 

16:59 - June 9, 2016

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ ఆయన పురుగుల మందు సేవించారు. దీనితో కిర్లంపూడిలోని ఆయన స్వగృహం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆయన్ను తరలిస్తుండగా పురుగుల ముందు సేవించారు. ఆయన చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను పోలీసులు లాక్కొన్నారు. మందు ఆయన గొంతులోకి వెళ్లిందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. వెంటనే ముద్రగడను భారీ ఎస్కార్ట్ మధ్య ఆసుపత్రికి తరలించారు. ఈ హాఠ్పాత్ పరిణామంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడే ఉన్న ముద్రగడ అభిమానులు..ఇతరులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు లాఠీలకు పని చెప్పారు. వారిని చెదరగొట్టారు.

తీవ్ర ఉత్కంఠ..
గత కొన్ని రోజులుగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ముద్రగడ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తునిలో జరిగిన ఆందోళనలో హింసాయుత పరిస్థితులు ఏర్పడ్డాయి. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దగ్ధం చేసిన ఘటనలో పోలీసులు పలు కేసులు నమోదు చేస్తున్నారు. దీనిపై ముద్రగడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమాయకులపై కేసులు నమోదు చేస్తున్నారంటూ..వారిని విడిచిపెట్టి తనను అరెస్టు చేయాలంటూ ముద్రగడ ఆందోళన చేశారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పేర్కొంటూ గురువారం ఆయన స్వగృహంలో నిరహార దీక్షకు పూనుకున్నారు. తన దీక్షను భగ్నం చేయవద్దని..భగ్నం చేస్తే పురుగుల మందు సేవిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి తలుపులు బంద్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యూహాలు రచించారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముద్రగడ ఇంటిపై దాడి చేసి దీక్షను భగ్నం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

పురుగుల మందు తాగిన ముద్రగడ..

హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ చేస్తున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. స్వగృహంలో నిరహార దీక్ష చేస్తున్న ముద్రగడను పీఎస్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తన వద్దనున్న పురుగుల మందు సేవించారు. దీనితో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. భారీ ఎస్కార్ట్ వాహనం మధ్య ముద్రగడను కాకినాడకు తరలిస్తున్నారు.

16:46 - June 9, 2016

భారతదేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్..బీజేపీ నేతలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో కాషాయికరణ పెరిగిపోతోందని...ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాపింప చేస్తున్నారని రాజకీయ, సామాజిక మేధావులు ఆందోళన వెలుబుచ్చుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. గుజరాత్ లోని సూరత్ వాసులు కొలిచే స్వామీనారాయణ్ విగ్రహానికి ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేయడం తీవ్ర వివాదస్పదమైంది. ఆలయంలోని విగ్రహానికి ఖాకీ నిక్కర్..తెలుపు రంగు చొక్కా, తలపై నల్లటి టోపి, నల్లటి బూట్లు..చేతిలో జాతీయ జెండాను ఉంచారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. దేవుడి విగ్రహానికి ఆర్ఎస్ఎస్ దుస్తులు వేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ భక్తులు ఆలయానికి వచ్చి దుస్తులు ఇవ్వడం...వివిధ రూపాల్లో దేవుడిని ఆరాధించడం జరుగుతుందని..అందులో భాగంగానే ఈ దుస్తులు వేసినట్లు ఆలయ నిర్వాహణ అధికారి పేర్కొంటున్నాడు. దీనిపై ఆర్ఎస్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

16:37 - June 9, 2016

జీవితంలోని ప్రతిదశనూ ఆరోగ్యంతో, ఆనందంగా దాటేయాలి. అలా దాటేయడానికి మంచి ఆహారం, జీవన విధానం అవసరం. ముఖ్యంగా మహిళలకు మెనోపాజ్ దశ కీలకమైంది. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ఇలాంటి దశలో, ఎలాంటి డైట్ తీసుకోవాలో, ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

16:30 - June 9, 2016

అమ్మ ప్రేమ, నాన్న కరుణ, ఆత్మీయుల అనురాగాలను గోరుముద్దలుగా తింటూ పెరగడమే కదా బాల్యమంటే? అలసిపోయేదాకా ఆడుకోవడమే కదా? తోబుట్టువులతో గిల్లికజ్జాలు పెట్టుకోవడమే కదా? అందరి బాల్యం అంతే అందంగా ఉందా? అసలు బాల్యం భద్రంగా ఉంటోందా? భావి జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దే పరిస్థితులు ఉంటున్నాయా? 
ముక్కుపచ్చలారని ఆడపిల్లలకు పెళ్ళి 
తల్లిదండ్రుల ముద్దు మురిపాలు తీరకుండానే, ముక్కుపచ్చలారని ఆడపిల్లలను పెళ్ళి పీటలెక్కిస్తున్నారు. చదువు ప్రాధాన్యతను పక్కకు పెట్టి జీవిత పాఠాలు నేర్పకుండానే వివాహ బంధంలోకి నెట్టేస్తున్నారు. 
బాల్యవివాహాలు
చిన్నారుల భవితను చిదిమేస్తున్న బాల్యవివాహాల పట్ల పౌరసమాజం తక్షణమే స్పందించాలి. భద్రమైన బాల్యం ప్రతి చిన్నారికి చేరువ కావాలి. అందుకు కావలసిన స్థితిగతులను ప్రభుత్వం కల్పించాలని మానవి కోరుకుంటోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:22 - June 9, 2016

టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన బాలకృష్ణ 'గౌతమి పుత్ర శాతకర్ణి'ని ఎంతో ప్రతిష్టాత్మకం తీసుకుంటున్నాడు. ఇది ఆయనకు వందో చిత్రం కావడం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శుక్రవారం బాలయ్య జన్మదిన సందర్భంగా బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా చిత్ర‌యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 'హ్యాపీ బ‌ర్త్ డే బ‌స‌వ‌రామ‌తార‌క‌పుత్ర' అంటూ శాత‌క‌ర్ణి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. చారిత్రక నేపథ్యం కలిగిన అంశం కావడంతో ప్రతొక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా 'శ్రియ'ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మొరాకో దేశంలో 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'కి సంబంధించిన ప‌లు యుద్ధ సన్నివేశాల‌ను చిత్రీకరించారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. 257 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 26,763 వద్ద ముగిసింది. 69 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 8,203 వద్ద ముగిసింది.

పాల్వాయికి షోకాజ్ నోటీసివ్వాలని కోరాం - షబ్బీర్ ఆలీ..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరామని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా పాల్వాయిపై షబ్బీర్ పలు విమర్శలు చేశారు.

 

16:06 - June 9, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు...టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇద్దరూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. సభా వేదికపై ఏకంగా నేతలు తిట్టుకోవడాన్ని చూసిన ఆ పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. గురువారం జిల్లాలోని కోస్గి మండలంలో భోగారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించేందుకు మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జూపల్లి ప్రసంగించారు. రంగారెడ్డి - పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీఎం బాబు అడ్డుపడుతున్నారని, బాబు తెలంగాణ ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. అక్కడనే ఉన్న రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి చేతిలో ఉన్న మైక్ ను లాక్కొనేందుకు ప్రయత్నించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వైసీపీ నేతలకు కాంట్రాక్టు ఇచ్చారంటూ విమర్శలు గుప్పించారు. ఇదంతా చూసిన టీఆర్ఎస్, టిడిపి నేతలు బాహాబాహికి దిగారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను శాంతించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే కొద్దిసేపట్లో జరిగే మరో సమావేశం కూడా రచ్చయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అక్కయ్యపాలెంలో దారుణం..

విశాఖ : అక్కయ్యపాలెంలో దారుణం చోటు చేసుకుంది. పనికోసం వెళ్లిన కూలీలపైకి పెంపుడు కుక్క దూసుకెళ్లింది. కుక్కను చూసి భయంతో మూడో అంతస్తుపై నుండి ముగ్గురు కూలీలు దూకారు. ఈఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వేములవాడ ఎరువుల దుకాణాలపై దాడులు..

కరీంనగర్ : వేములవాడలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయిస్తున్న రూ. 80 లక్షల విలువైన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

రెండు రోజుల్లో టీఎస్ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : రెండు రోజుల్లో రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. టీఎస్ ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు..ఆర్టీసీ పురోగతిపై వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

 

బ్యాంకర్ల తీరుపై సీఎం బాబు అసహనం..

విజయవాడ : రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాంకర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక రంగానికి చెందిన నిధులు ఇతర రంగాలకు తరలిపోతున్నాయని మండిపడ్డారు. కేటాయింపులన్నీ శాస్త్రీయంగా జరగాలని ఆదేశాలు జారీ చేశారు. నాబార్డు, స్మార్ట్ విలేజీలకు రూ. 400 నుండి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం రావడం లేదని తెలిపారు. తనకు రూ. 500 కోట్లిస్తే స్మార్ట్ విలేజ్ అంటే ఏమిటో చూపిస్తానని బాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 2016-17 ఆర్థిక సంవత్సరం యాక్షన్ ప్లాన్ ను సీఎం బాబు విడుదల చేశారు. రూ. 1,65,538 కోట్లతో ఋణప్రణాళిక రూపకల్పన చేశారు. రూ.

15:48 - June 9, 2016

హైదరాబాద్ : మాదిగల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోగా అఖిలపక్ష నేతలను ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. నేటి నుంచి కేసీఆర్‌ సొంతగ్రామం చింతమడక నుంచి పాదయాత్ర మొదలవుతుందని.. అలాగే రేపటి నుంచి హెచ్ సీయూ నుంచి సైకిల్‌ యాత్రను ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి మాదిగలను చైతన్యపరుస్తామని చెప్పారు. జూలై 18న హైదరాబాద్‌లో మహాపాదయాత్ర నిర్వహించి సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇస్తామని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్‌ మాదిగల పట్ల చిన్నచూపును విడనాడాలని మందకృష్ణ మాదిగ కోరారు.

 

15:46 - June 9, 2016

విశాఖ : అక్కయ్యపాలెంలో దారుణం జరిగింది. పనికోసం వెళ్లిన కూలీలపైకి పెంపుడు కుక్క దూసుకెళ్లడంతో... కుక్కను చూసి భయపడిన ముగ్గురు కూలీలు మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిన కేజీహెచ్‌కు తరలించారు. 

15:38 - June 9, 2016

ఢిల్లీ : న్యూక్లియర్‌ సప్లయర్స్ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జి)లో భారత సభ్యత్వానికి మెక్సికో మద్దతు తెలిపింది. 48 దేశాలున్న ఈ గ్రూపులో భారత్‌ చేరేందుకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నట్లు మెక్సికో ప్రెసిడెంట్ ఎన్‌రిక్ పేనా నీతో ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఓ రోడ్‌ మ్యాప్‌ రూపొందించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. మెక్సికో రాష్ట్రపతి ఎనరిక్‌ పేనా నీతో భారత ప్రధాని నరేంద్ర మోది సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు మద్దతు ప్రకటించినందుకు మోది మెక్సికోకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపారం, పెట్టుబడులు, పర్యావరణం తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాల నేతలు చర్చించారు. 

 

15:26 - June 9, 2016

హైదరాబాద్‌ : నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిన సోదరులు చేప ప్రసాదం పింపిణీ పూర్తయ్యింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ 24 గంటల పాటు కొనసాగింది. మొత్తం 34 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేశారు. ఉబ్బసం  సమస్యతో బాధపడేవారు చేప ప్రసాదం  తీసుకోవాలనుకుంటే పాత్‌బస్తీలోని  దూద్‌బౌలి వస్తే  పంపిణీ చేస్తామని చెప్పారు. దాదాపు నాలుగు లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామని బత్తిన సోదరులు చెబుతుండగా, మత్స్య శాఖ అధికారులు మాత్రం 66 వేల చేప పిల్లలను  విక్రయించామంటున్నారు. 

 

15:25 - June 9, 2016

ప్రతి ఇంట్లో 'టాయిలెట్' ఉండాలి అంటూ కేంద్రం పేర్కొంటోంది. ఇందుకు స్వచ్చ భారత్ లో భాగంగా టాయిలెట్ లు నిర్మించుకోవాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కొంతమంది వాలంటీర్లను కూడా నియమించింది. బయట బహిర్భూమికి వెళ్లడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి గ్రామస్తులకు తెలియచేస్తున్నారు. రాజస్థాన్ లోని దుంగర్ పూర్ లో నివాసం ఉండే కాంతిలాల్ రోట్ గొర్రెల కాపరీగా జీవనం సాగిస్తున్నాడు. టాయిలెట్ నిర్మాణ విషయం కాంతిలాల్ కు తెలిసింది. దీనితో ఎలాగైనా తాను కూడా ఓ టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నాడు. నిర్మాణం చేసుకుంటానని చెప్పి అక్కడి ప్రభుత్వం చేత రూ. 4000 అందుకున్నాడు. ఇలా రెండు సార్లు అందుకున్నాడు. కానీ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. తన దగ్గరున్న ఏడు గొర్రెల్లో ఒకదానిని అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో నిర్మాణం పున:ప్రారంభించాడు. అయినా టాయిలెట్ పూర్తి కాలేదు. చివరకు భార్య కాలి పట్టాలు అమ్మేశాడు. మళ్లీ నిర్మాణం ప్రారంభించారు. ఈ విషయం అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ కు తెలిసింది. ప్రభుత్వం దగ్గరి నుండి మరో రూ. 4000 ఇప్పించాడు.

 

15:19 - June 9, 2016

హైదరాబాద్ : బోనాల పండుగ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ అధికారులతో చర్చించారు. ఉత్సవాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని.. జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. దేవాలయాల దగ్గర గట్టి భద్రతను కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.

మంత్రి జూపల్లి ప్రసంగానికి రేవంత్ అడ్డు..

మహబూబ్ నగర్ : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగానికి టి.టిడిపి నేత రేవంత్ అడ్డు తగిలారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొస్గి మండలం భోగారం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనుల కార్యక్రమం ప్రారంభానికి మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జూపల్లి ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్నారంటూ మంత్రి జూపల్లి పేర్కొనడాన్ని ఎమ్మెల్యే రేవంత్ తప్పుబట్టారు. దీనితో మంత్రికి వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

 

గిరిజనులకు రిజర్వేషన్ ఎక్కడ – బలరాం నాయక్...

హైదరాబాద్: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, తండాలను పంచాయతీలుగా చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నేటీ అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.

కాపుల అభివృద్ధిని అడ్డుకోవద్దు - గాలి..

హైదరాబాద్ : కాపుల అభివృద్ధిని ముద్రగడ అడ్డుకోవద్దని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ పేర్కొన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత బొత్సకు లేదని, రాష్ట్ర విభజనకు ప్రోత్సహించింది బొత్సానే అని విమర్శించారు.

15:16 - June 9, 2016

తూర్పుగోదావరి : కాపు ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని కాపునాడు నాయకులు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ కాపులకు చేసింది శూన్యమని నరసింహారావు విమర్శించారు. ముద్రగడపైకి కాపు మంత్రులను ఉసికొల్పుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పదవుల ఎరకు కొందరు కాపు నేతలు లొంగిపోయారని ఆరోపించారు. ముద్రగడ దీక్షకు మద్దతు ప్రకటించారు. 

 

కిర్లంపూడికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ చేస్తున్న ఆందోళన తీవ్ర ఉత్కంఠకు తెరలేస్తోంది. కిర్లంపూడిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఆరుగురు జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ...

చెన్నై : తమిళనాడుకు చెందిన ఆరుగురు జాలర్లను శ్రీలంక నౌకాధికారులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దును మత్స్యకారులు దాటడం వల్ల శ్రీలంక పోలీసులు వాళ్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

టి.ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ మోగింది. ఈనెల 23నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటన చేశారు. ప్ర‌భుత్వం ముందు ప‌లు డిమాండ్ల‌ను ఉంచామ‌ని, వాటిపై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అందుకే సమ్మెలోకి వెళుతున్నట్లు వెల్లడించాయి.

15:09 - June 9, 2016

కడప : తుని ఘటనలో కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ముద్రగడ దీక్షతో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కడపలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ముద్రగడ వ్యక్తిగత స్వేచ్ఛను హరించబోమని తెలిపారు. ముద్రగడ చేపట్టిన ఆందోళన సమయంలో రైలు దహనం చేశారని పేర్కొన్నారు. అరాచాకాలు సృష్టిస్తే వ్యవస్థను ఎవరు కాపాడాలని ఆయన అడిగారు. తుని ఘటనలో బయటి శక్తులు పాల్గొన్నాయని అన్నారు. పోలీసులపై దాడి చేసిన వారిని వదిలేయమంటారా అని అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అవసరమని అన్నారు. కాపుల డిమాండ్ల విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని చంద్రబాబు చెప్పారు. కాపుల సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. 

కాపుల అంశంపై పవన్ స్పందించాలి - వీహెచ్..

హైదరాబాద్ : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న ముద్రగడకు టి.కాంగ్రెస్ నేత వీహెచ్ మద్దతు తెలిపారు. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం తెలియాచేయాలని డిమాండ్ చేశారు.

ఎక్కడి సమస్యలు అక్కడే - ఎల్.రమణ..

హైదరాబాద్ : టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయని టి.టిడిపి నేత ఎల్.రమణ పేర్కొన్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని, తెలంగాణ‌ స‌చివాల‌యంలో ఎక్క‌డి ఫైళ్లు అక్క‌డే ఉన్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

15:01 - June 9, 2016

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పోలీస్ స్టేషన్ లో హంగామా చేశాడా ? ఎందుకు ? ఏమైంది ? అని ఎక్కువగా ఆలోచించకండి ఆయన హంగామా చేసింది ఓ చిత్ర షూటింగ్ లో.. రామ్‌చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పేరు 'ధృవ'. ఇందులో చెర్రీ పవర్ పుల్ పోలీసు ఆఫీసర్ గా కనబడబోతున్నాడు. చెర్రీ సరసన రకుల్‌ప్రత్‌సింగ్ కథానాయికగా నటిస్తుండగా అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్ సెట్‌లో రామ్‌చరణ్ పోలీస్ గెటప్ వేసి హంగామా చేస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కి రీమేక్ ఇది.

 

 

15:01 - June 9, 2016

తూర్పుగోదావరి : కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారుల బృందం చేరుకుంది. ఈ సందర్భంగా ముద్రగడను అరెస్టు చేసేందుకు  కిటికీ నుంచే సీఐడీ అధికారులు ముద్రగడతో మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ముద్రగడ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ముద్రగడ ను రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించేందుకు అరెస్ట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

 

15:00 - June 9, 2016

టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న హీరోల్లో 'వెంకటేష్' ఒకరు. కథలు..పాత్ర ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకెళుతున్నాడు. వివిధ భాషల్లో వచ్చిన సినిమాలను రీమెక్ చిత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్నన్నలు పొందుతున్నాడు. ఆయన తాజా చిత్రం 'బాబు బంగారం' చిత్ర టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన ఓ చిత్రంలో అతిథి పాత్ర పోషించినట్లు టాక్ వినిపిస్తోంది. తన మేనల్లుడైన నాగచైతన్య కోసం ఆయన ఒక గెస్టు పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నాగచైతన్య కథానాయకుడిగా 'ప్రేమమ్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకటేశ్ .. నాగచైతన్య కాంబినేషన్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందట. మరి వీరు ఎలాంటి సందడి చేశారా ? లేదా ? అనేది తెలియాలంటే చిత్ర విడుదలయ్యే వరకు వేచి ఉండాలి.

14:57 - June 9, 2016

హైదరాబాద్ : రైల్వేలో సమ్మె సైరన్‌ మోగింది. జూలై 11 నుంచి రైల్వే కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు కార్మిక సంఘాలు సమ్మె ఓటీసు ఇచ్చాయి. సమస్యలను పరిష్కరించాలని, 7వ వేతన సంఘం సిఫార్సులను సవరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
రైల్వేలో 436 విభాగాల్లో 13 లక్షల 65 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని నేతలు పేర్కొంటున్నారు. ఎంతో ప్రగతి సాధించిన రైల్వేవ్యవస్థ దేశ ఆర్థికరంగంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇందుకోసం రైల్వే కార్మికులు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని పలువురు తెలిపారు. ఇలాంటి రంగాన్ని బలోపేతం చేయకుండా.. కేంద్రం విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆహ్వానిస్తూ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఏడో పేస్కేల్ కమిషన్ ద్వారా రూ.18 వేలకు కుదించిందని, డిమాండ్లను నేరవేర్చకుంటే కేంద్రం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నేతలు హెచ్చరిస్తున్నారు.

 

14:02 - June 9, 2016

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ సరికొత్త ఆలోచన.. మెరుగైన ఫలితాలనిస్తోంది. ఆస్తిపన్నుపై బహుమతులు ప్రకటించడంతో.. ట్యాక్స్ పేయర్స్ నుంచి స్పందన రోజురోజుకు పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఈ స్కీమ్ ను మరో వారం పొడిగించింది.

పూర్తిస్థాయి పన్నుల వసూళ్లే జీహెచ్‌ఎంసీ ధ్యేయం...
పూర్తిస్థాయి పన్నులు వసూళ్లే ధ్యేయంగా గ్రేటర్‌ కార్పొరేషన్‌ అడుగులు వేస్తుంది. దీనికోసం గ్రేటర్‌ వాసులకు నగదు బహుమతులను ప్రకటించింది. ఇప్పటికే రెండుసార్లు బంపర్ ప్రైజులను ప్రకటించిన GHMCకి.. మరోవారం కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ వారం 42,467 మంది నుంచి 17 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. గత ఏడాది ఇదే సమయంలో వసూలైన మొత్తం ఆరున్నర కోట్లు మాత్రమే.

ఆన్‌లైన్‌ లో ఆస్తిపన్నును చెల్లింపులు ...
ఆస్తిపన్నును చెల్లింపును ఆన్‌లైన్‌ చేయడం వల్ల కూడా పెద్ద సంఖ్యలో పన్నులు చెల్లిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా 43.46 కోట్లు చెల్లించారు. గత ఏడాదితో పోలీస్తే ఇది 56 శాతం అధికం. ట్రేడ్‌ లైసెన్స్‌ల ఫీజుల వసూలు కూడా గణనీయంగా పెరిగాయని.. ఈ ఏడాది రెన్యువల్ ఫీజు కింద 20.44 కోట్లు వసూలయ్యాయని అధికారులు చెబుతున్నారు.

బహుమతులు ప్రకటించి పన్నులు వసూళ్లు...
ఇదిలా వుంటే.. ఈ వారం జీహెచ్‌ఎంసీ ప్రకటించిన బంపర్‌ ప్రైజుల్లో అల్వాల్‌ సర్కిల్‌కు చెందిన బి.వెంకట్‌రెడ్డి లక్ష రూపాయలు గెలుపొందారు. ఎల్బీనగర్‌ సర్కిల్‌కు చెందిన సీతామహాలక్ష్మి 25,000రూపాయలు గెలుచుకున్నారు. 12,500 రూపాయల విలువైన బహుమతులు సమీర్‌ ఫాతిమా, అనంతరామయ్యలు గెలుపొందారు. వీరితో పాటు ఐదు వేల బహుమతులు ఐదుగురికి, వెయ్యి రూపాయలు బహుమతులు వందమందికి ప్రకటించారు. జీవీహెచ్‌ఎంసీ పన్నులు వసూలుకు వేసిన మంత్రం..మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీంతో మరోవారం కూడా దీనిని పొడిగించాలని గ్రేటర్ అధకారులు నిర్ణయించారు. 

13:56 - June 9, 2016

విజయవాడ : వర్షం వస్తే భయం... భయం.. కొండచరియల రూపంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని అయోమయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాలు అరచేతపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దయదీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బెజవాడ కొంత ప్రాంత వాసులు దుస్థితి ఇది. విజయవాడ పాతనగరంలో కొంతప్రాంత వాసుల కష్టాలపై 10 టీవీ ప్రత్యేక కథనం.
ప్రాణ, ఆస్తినష్టం జరుగుతున్నా ..చర్యలు తీసుకోని ప్రభుత్వం...
ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడ రోజురోజుకు విస్తరిస్తోంది. నరంలోని 11 లక్షల జనాభాలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడతూ ప్రాణ, ఆస్తినష్టం జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలేదని బాధితులు విమర్శించారు.

భారీ మెస్ లను ఏర్పాటు చేయాలి: స్థానికులు
విజయవాడలోని కొండవాలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ఉన్నాయి. లక్షలాది మంది నివాసం ఉంటున్నారు. గుణదల, గంగిరెద్దులు దిబ్బ, చిట్టినగర్‌, మిల్క్‌ ప్రాజెక్ట్‌, విద్యాధరపురం, మొగల్రాజపుంలోని కొండవాలు ప్రాంతాల్లో కాలనీలు విస్తరించాయి. వర్షాకాలం వస్తే కొండచరియలు విరిగిపడే పరిస్థితి ఉన్నా.... ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరిగిపడే కొండచరియలు ఇళ్లపై పడకుండా నివారించేందుకు గట్టి ఇనుపకంచెనో లేక భారీ మెష్‌లనో ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదంటున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండచరియల బాధ నుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కళ్ల ముందు కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను చూసి గుండులు బాదుకోవడం మినహా చేయగలిందేమీలేదని ఆవేదన చెందుతున్నారు.

రక్షణ చర్యలు తీసుకోవాలి: ప్రజాసంఘాలు ..
కొండచరియలు విరిగిపడటానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.

ప్రత్యామ్నాయం చూపుకుండా ఇళ్ల తొలగింపుకు వ్యతిరేకం...
కొండ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలని నగరపాలక సంస్థ చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. పత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించే యత్నాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమ నుంచి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యామ్నాయం చూపకపోయినా.. కొండచరియలు విరిగిపడకుండా రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటికే ఒక నిండుప్రాణం బలైపోగా, కొందరు గాయపడ్డారు. భవిష్యత్‌లోనైనా ఇలాంటి ఘటనలను జరగకుండా చర్యలు తీసుకుంటారో... లేదో.. చూడాలి. 

13:50 - June 9, 2016

విజయవాడ : సెంట్రల్ బస్‌స్టేషన్‌, రైల్వే స్టేషన్‌ను భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే మెట్రో రైల్వేకు అనుసంధానించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. మెట్రోరైల్‌, రైల్వే కనెక్టివిటీకి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాల్సిందిగా కేంద్ర రైల్వే మంత్రి సూచించారు. దీంతో త్వరలోనే నాలుగు రవాణా వ్యవస్థల జంక్షన్‌గా విజయవాడ రూపుదిద్దుకోనుంది.

భారీ స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ...
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, దానికి అభిముఖంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేయనున్న మెట్రో రైల్ ప్రధాన స్టేషన్ ను కలుపుతూ భారీ స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాబోయే కాలంలో విజయవాడ.. ఆర్టీసీ బస్‌స్టేషన్‌, మెట్రో, రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలతో ఆధునాతన సిటీగా రూపుదిద్దుకోనుంది. మెట్రో, రైల్వే కనెక్టివిటీకి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాల్సిందిగా రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు అధికారులను ఆదేశించారు. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌కు చేరువలో గల రైల్వేస్టేషన్‌ను అనుసంధానించడం, భవిష్యత్‌లో ఏర్పాటయ్యే మెట్రో రైల్వేస్టేషన్‌కు కలపడానికి రానున్న రైల్వే బడ్జెట్‌లో నిధులు కేటాయించడానికి మంత్రి ప్రతిపాదనలు చేశారు. ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి చర్చించారు. ఇప్పటికే విజయవాడ బస్‌స్టేషన్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు 16వ నెంబర్‌ జాతీయ రహదారి అనుసంధానమై ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల విజయవాడ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  

 

13:29 - June 9, 2016

తూ.గోదావరి : కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఉద్యమ బాట పట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్ట్ తప్పేలా లేదు. తుని విధ్వంసకారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని, కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ తో నేటి ఉదయం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడను అరెస్ట్ చేసేందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులు రాగా వారికి అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ క్రమంలో ఆయన పురుగుల మందు డబ్బా పట్టుకుని తనను అరెస్ట్ చేయటానికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన నివాసంలో తలుపులు మూసుకుని బెదింరిపులకు పాల్పడుతున్నారు. తుని ఘటనలో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తేనే తాను అరెస్ట్ అవుతానన్న విషయం తెలిసిందే. దీంతో పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఏ-1 నిందితుడిగా వుండటంతో అరెస్ట్ వారెంట్లు చేతబట్టుకుని సీఐడీ పోలీసులు కిర్లంపూడి చేరుకున్నారు.

మంత్రి జూపల్లి ని అడ్డుకున్న విద్యార్థులు

మహబూబ్ నగర్ : కొడంగల్ మండలం భోగారంలో మంత్రి జూపల్లిని విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రొ.కోదండరామ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ కు వీణా -వాణీ తల్లిదండ్రులు..

హైదరాబాద్ : వీణా- వాణీ ల తల్లిదండ్రులను నీలోఫర్ వైద్యులు పిలిపించి వారిని ఇంటికి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం భరోసా ఇస్తే తీసుకెళ్తామని వీణా- వాణీ లను పోషించే స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పారు. అంగీకార పత్రం ఇవ్వాలని నీలోఫర్ వైద్యులు కోరగా... 5 రోజుల గుడువు కావాలని వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కాగా, తల్లిదండ్రులతో వెళ్లేందుకు వీణా -వాణిలు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. 

కాలె శ్రీనివాస్ కిడ్నాప్ కేసు ను ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ : సినీ నటుడు కాలె శ్రీనివాస్ కిడ్నాప్ కేసును జూబ్లీ హిల్స్ పోలీసులు ఛేదించారు. స్టూడెయో 9ఛానల్ సీఈవో శివకుమార్ సహా 9 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో సీఐడీ హోంగార్డు జగదీష్ ఉన్నారు.

కిర్లంపూడికి చేరుకున్న సీఐడీ అధికారులు

తూ.గో : కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈనేపథ్యంలో సీఐడీ అధికారులు కిర్లంపూడికి చేరుకుని కిటికీలోంచి ముద్రగడతో చర్చలు జరుపుతున్నారు. సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఏ-1 ముద్దాయి గా ముద్రగడ ఉన్నారు.

ఏసీబీ కి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ భిక్షపతి

నల్గొండ : ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ భిక్షపతి రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇసుక ట్రాక్టర్లకు అనుమతి పత్రాలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. బిక్షపతిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. 

కేంద్ర మంత్రి గెహ్లాట్ తో మంత్రి జోగు రామన్న భేటీ...

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి జోగు రామన్న కేంద్ర మంత్రి అశోక్ గెహ్లాట్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రితో రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతు.. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, సమస్యలను గెహ్లాట్ దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి సహకరించాలని కోరానని తెలిపారు. ఇందుకు గెహ్లాట్ సానుకూలంగా స్పందించారని వివరించారు. 

12:24 - June 9, 2016

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కాసేపట్లో సీబీసీఐడీ పోలీసులు ముద్రగడ నివాసానికి చేరుకోనున్నారు. రహదారుల్లో పోలీసులు అడ్డుకుంకటున్నా కాపునేతలు కిర్లంపూడికి చేరుకుంటున్నారు. దీక్ష చేస్తున్న రూమ్ కు సంబంధించిన ప్రధాన ద్వారాన్ని మూసుకుని లోపలే దీక్షను కొనసాగిస్తున్నారు. బలవంతంగా అరెస్ట్ చేసిన జైలులోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొంటున్నారు. ముద్రగడను అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆందోళన కారులు ఎటువంటి చర్యలకు పాల్పడినా వారిని ఎదుర్కొటానికి పోలీసులు సర్వసన్నద్ధంగా వున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ముద్రగడ  దీక్షతో తమకు ఎటువంటి సంబంధం లేదనీ...ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకం కలిగించబోమనీ ఆయన  పేర్కొన్నారు. తుని సంఘటనలో విధ్వంసం సృష్టించినవారిపై విచారణ కొనసాగుతుందన్నారు.ఈ ఘటనలో బయటి వ్యక్తులే పాల్గొన్నారని తెలిపారు. కాగా జగన్ డైరెక్షన్ లో నడుస్తున్న ముద్రగడ దీక్షలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు పేర్కొన్నారు. కాపుల అభివృద్ధికి ఎటువంటి కృషి చేయని జగన్ తో చేతులు కలిపి పోలీస్ స్టేషన్లను, రైళ్లను తగులబెట్టినవాళ్లపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రములు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.

ఏయూ వీసీ ప్రొ. గొల్లపల్లి నాగేశ్వరరావు..

విశాఖ : ఆంధ్రా వర్సిటీ కొత్త వీసీగా ప్రొ.గొల్లపల్లి నాగేశ్వరరావును నియమించనున్నారు. ఈయన నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.వీసీ నియామకంపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడతాయని అధికారులు చెప్పారు. నాగేశ్వరరరావు ఏయూలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 

ముగిసిన చేప మందు పంపిణీ...

హైదరాబాద్: చేప మందు పంపిణీ ముగిసింది. నిన్న ఉదయం 8 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ఈ చేపమందు పంపిణీ కార్యక్రమం మొదలై ఇవాళ ఉదయం 8 గంటలకు ముగిసింది. అనంతరం బత్తిన సోదరుల ఇంటి వద్ద చేప మందు పంపిణీ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. కాగా, ప్రతీ యేటా మృగశిర నక్షత్రం రోజున బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో ఈ చేపమందు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

12:14 - June 9, 2016

ఏంటీ టీవీ ఉంటే దోమలు ఎలా పోతాయి ? మీరూ బడే చెబుతారండి..అంటారా ? కానీ ఇది నిజం అండి బాబు..శాస్త్ర సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తూనే ఉన్నాం. శాస్త్రవేత్తలు వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ వస్తువులను సృష్టిస్తున్నారు. ఇక వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని...ఇందుకు నూతన పరికరాన్ని అందుబాటులోకి తేవాలని శాస్త్రవేత్తలు అనుకున్నారంట. మస్కిటో కాయిల్స్, ఎలక్ట్రికల్ బ్యాట్స్ తదితర వాటితో దోమల నుండి కాపాడుకోవాల్సినవసరం లేదంటున్నారు. జస్ట్ మీ ఇంట్లో ఓ టీవీ ఉంటె చాలు అంటున్నారు ప్రముఖ టీవీ కంపెనీ ఎల్జీ. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తాజాగా మస్కిటో టీవీ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ద అల్ట్రా సోనిక్ తరంగాల అమర్చడం వల్ల ధ్వని తరంగాల ఆధారంగా దోమలు పారిపోతాయని, ఇందులో ఎటువంటి రసాయనాలు వాడలేదని, మనుషులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావని కంపెనీ ప్రకటించింది.

ప.గో జిల్లా సరిహద్దులో విస్తృత తనిఖీలు..

.గో : జిల్లా సరిహద్దులో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కిర్లంపూడికి వెళ్లకుండా సిద్ధాంతం బ్రిడ్జి, కొవ్వూరు బ్రిడ్జి, నరసాపురం, చించినాడ బ్రిడ్జిల వద్ద పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు.

విద్యాశాఖ పనితీరు పై మంత్రి కడియం సమీక్ష

వరంగల్ : విద్యాశాఖ పనితీరు పై మంత్రి కడియం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో కాలేజీల మరమ్మతులు, నూతన భవనాలకు రూ.9 కోట్లు మంత్రి కడియం మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీల్లో ఉచిత ప్రవేశాలు, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి వంద శాతం ఎన్ రోల్ మెంట్ సాధించాలని మంత్రి కడియం పేర్కొన్నారు.

బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్ : బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. 

11:47 - June 9, 2016

హైదరాబాద్‌ : నగర శివారు ప్రాంతం రాజేంద్రనగర్‌ పరిధిలోని మద్దికుంట చెరువులో లక్షల రూపాయల విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. లక్ష్మీగూడ గ్రామంలోని మత్సకారులు కొన్నేళ్లుగా స్థానిక చెరువులో చేపలు పెంచుతున్నారు. మృగశిరకార్తె సందర్భంగా చేపలు పట్టేందు వెళ్లిన మత్సకారులు షాక్‌కు గురైయ్యారు. చేపలన్నీ చచ్చిపడి ఉండటం చూసి ఆవేదన చెందారు. చేపలు మృతిచెందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గిట్టనివాళ్లెవరో చెరువులో విషం కలిపిఉంటారని గ్రామస్తులు అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

జులై 11 నుంచి రైల్వే కార్మికుల నిరవధిక సమ్మె

హైదరాబాద్ : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ జులై 11 నుంచి రైల్వే కార్మికులు నిరవధిక సమ్మెను చేపట్టనున్నారు. ఈ మేరకు రైల్వే జీఎంకు ద.మ. రైల్వే కార్మిక సంఘం, ఎన్ ఎఫ్ఐఆర్ లు సమ్మె నోటీసు అందజేశారు.

11:41 - June 9, 2016

నల్గొండ : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు సీపీఎం నాయకులు భిక్షాటన చేపట్టారు. రామన్నపేట మండలం వెల్లంకిలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్లంకి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం సాగుతోంది. సీపీఎం నాయకులు జోలెపట్టుకుని భిక్షాటన చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో చేనేత కార్మికలు ఆత్మహత్యలు, ఆకలిచావులు పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

11:37 - June 9, 2016

నల్లగొండ : చేయూతలేని చేనేత..నీరాత ఎన్నడు మారును చేనేత...అని ఓ కవి చిధ్రమవుతున్న చేనేత కార్మికుడి బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు. ప్రభుత్వాలు మారినా... పాలకులు మారినా...చేనేత కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదు. కోటి ఆకాంక్షలతో ఏర్పడిన స్వరాష్ట్రం వారి జీవితాలను మార్చలేకపోయింది. ఇక చేసేదేంలేక పుట్టెడు దుఖంతో ఆత్మహత్యలే శరణ్యంగా మారుతున్న నల్లగొండ జిల్లా చేనేత కార్మికుల దయనీయ పరిస్థితిపై ప్రత్యేక కథనం.

వృత్తిని వదులుకోలేక...అప్పులు తీర్చలేక అల్లాడుతున్న నేతన్నలు..
చేనేత వృత్తిని వదులుకోలేక...అప్పులు తీర్చే మార్గం లేక.. సర్కారు సాయం అందక తీవ్ర వేదనతో కుమిలిపోతున్నాడు చేనేత కార్మికుడు. ముడిసరుకు ధరలు పెరగడం, గిట్టుబాటు ధరలేక పోవడం వారి బతుకులకు శాపంగా మార్చింది. కుటుంబాలను ఎలా గట్టెక్కించాలో తెలియక, తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జరుగుతున్న బలవన్మరణాలను ఆపడంలో శ్రద్ధచూపని పాలకులు...కనీసం వారి కుటుంబాలనైనా ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు పరిహారం చెల్లింపులోనూ జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం చెల్లిస్తామన్న ఒక లక్ష 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేసియా కోసం మృతుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. 2012లోపు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అప్పులు తీర్చే మార్గంలేక బలవన్మరణాలు....
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 72 చేనేత, సిల్క్ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 44 సంఘాలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సహకార సంఘంలో సుమారు 15 వేలమంది, సహకారేతర రంగంలో సుమారు 10వేల మంది కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అనేక వందల కుటుంబాలు పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత రంగంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యాయి. 2001 నుంచి ఇంతవరకూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికులు 92 మంది ఉన్నట్లు చేనేత, జౌళిశాఖ అధికారులు అధికారికంగా గుర్తించారు. తెలంగాణ ఏర్పడిన రెండేళ్ల కాలంలో సుమారు 20 మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

ఇంతవరకూ అందని ఎక్స్‌గ్రేషియా...
ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలలో ఒక్కక్కరిది ఒక్కో దీనగాధ. చౌటుప్పల్‌ మండలంలోని ఎస్‌ లంగోట గ్రామంలో చేనేత అప్పుల బాధతాళలేక గంజి. చంద్రయ్య, రాములమ్మ దంపతులు నైట్రేట్‌ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.తమ పెద్దకుమార్తె వివాహానికి చేసిన అప్పులు తీర్చలేక, మరో కుమార్తె పెళ్లికి సిద్ధంగా ఉండటం వారిని మరింత కృంగదీసింది. దీంతో ఏం చెయ్యలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన 2014 మార్చి 21న జరిగింది. కానీ ఇప్పటికీ ఈ కుటుంబానికి ప్రభుత్వసాయం అందలేదు.

చేనేత కార్మికుల ఆత్మహత్యలపై స్పందించిన సీపీఎం...
జిల్లాలో జరుగుతున్న చేనేత కార్మికుల ఆత్మహత్యలపై సీపీఎం స్పందించింది. చేనేత కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసనకు సిద్ధమైంది. ప్రభుత్వానికి నిరసన తెలపడంతోపాటు, బాధిత కుటుంబాలకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈరోజు జిల్లాకు రానున్నారు. రామన్నపేట మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు దొంత అంజయ్య కుటుంబాన్ని పరామర్శించి, గ్రామంలో భిక్షాటన చేయనున్నారు. అలా వసూలైన మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయనున్నారు.

తమను ఆదుకోవాలని బాధిల కుటుంబాల డిమాండ్ ...
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:చంద్రబాబు

కడప: కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముద్రగడ దీక్ష విరమించి ప్రభుత్వానికి సహకరించాలని, కాపుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటికైనా ముద్రగడ వాస్తవాలను గమనించాలని సూచించారు.

వెల్లంకిలో సీపీఎం నేతల భిక్షాటన

నల్గొండ : అప్పుల బాధతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంక్షేమానికి తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీతారాములతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

11:12 - June 9, 2016

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ తన నివాసంలో ఆమరణ నిరాహరణ దీక్షను  కొనసాగిస్తున్నారు. పోలీసులు తాను చేస్తున్న దీక్షను భగ్నం చేయటానికి యత్నిస్తే పురుగుల మందు త్రాగి చనిపోతానని ఆయన బెదిరిస్తున్నారు. మరోవైపు తుని ఘటనకు మాత్రం తాను అరెస్ట్ అవుతాను తప్ప అమలాపురం ఆందోళన అంశంలో అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ అయ్యే పనిలేదని ఆయన పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష కొనసాగుతుందా...లేదా పోలీసులు అరెస్ట్ చేసి దీక్షను విరమింపచేస్తారోనని విషయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా వైసీపీ పార్టీ నుండి వచ్చిన సంకేతాల నేపథ్యంలో ముద్రగడ ఇటువంటి చర్యలకు పాల్పడతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 160 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 40 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

10:56 - June 9, 2016

కేరళ : దేశం ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఆనవాయితీగా కేరళ తీరాన్ని తాకాయి.. కొద్దిరోజుల క్రితం వరకు మందగతిన సాగిన రుతుపవనాలు ఇప్పుడు కేరళలో చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం రోజుల్లో దేశవ్యాప్తమై విస్తారంగా వర్షాలు కురిపించనున్నాయి.

24 గంటల్లోగా కేరళకు రుతుపవనాలు ..
దేశంలో ఇక వానలే వానలు...! కరువు తీరా వర్షాలు కురిపించేందుకు రుతుపవనాలు వచ్చేశాయి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అక్కడ భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. మాన్‌సూన్‌ రాకతో దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రకు ...
తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాలకు అటుపిమ్మట మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్రలోకీ రుతుపవనాలు వ్యాపించే అవకాశముంది. మొత్తంగా మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి...
మరోవైపు మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు.. అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడులోనూ గత 48 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి.

సాధారణం కన్నా అధికంగా వర్షాలు-వాతావరణశాఖ
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి దేశ వ్యాప్తంగా సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురుస్తాయి. ఆ శాఖ లెక్కల ప్రకారం 106 శాతం, స్కైమెట్‌ అనే ప్రైవేట్‌ సంస్థ అంచనా ప్రకారం 109 శాతందాకా వర్షాలు కురుస్తాయి. మొత్తంగా ఈసారి రుతుపవనాలు దేశంలో కరువును పారదోలడం ఖాయమనే అభిప్రాయం రైతులోకంలో ఆనందాన్ని కలిగిస్తోంది.

రౌడీలే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు : చంద్రబాబు

కపడ : రౌడీలే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బయటి వ్యక్తులే తునిలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముద్రగడ వ్యక్తిగత స్వేచ్ఛను హరించమని స్పష్టం చేశారు. ముద్రగడ దీక్షతో మాకెలాంటి అభ్యంతరం లేదని, టెక్నాలజీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని బాబు తెలిపారు. ఉగ్రవాద నియంత్రణకు మోదీ ప్రపంచమంతా తిరుగుతున్నారని పేర్కొన్నారు.

సుంకేశుల నుంచి కేసీకెనాల్ కు నీటి విడుదల

కర్నూలు : సుంకేశుల నుంచి కేసీకెనాల్ కు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి నీటిని విడుదల చేశారు. కర్నూలు, నంద్యాల తాగునీటి అవసరాల కోసం సుంకేశుల నుంచి 500 క్యూసెక్కుల నీటినిడి విడుదల చేశామన్నారు. ప్రాజెక్టుల్లో వర్షపు నీటిని నిల్వ చేసి కరువును నివారిస్తామన్నారు.

 

4 గంటలుగా నిలిచిన ఎయిరిండియా విమానం...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైదరాబాద్‌- విశాఖ ఎయిరిండియా విమానం 4 గంటలుగా నిలిచిపోయింది. అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

10:40 - June 9, 2016

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ తన నివాసంలో దీక్షను కొనసాగిస్తున్నారు. దీనిపై దీక్షపై హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. మంజునాథ కమిషన్ గడువు ఆగష్టు వరకూ వుందనీ...ఈ సమయంలో ఆయన దీక్షకు దిగటం విడ్డూరంగా వుందన్నారు. ఇప్పటికే కాపు సంక్షేమం కోసం రూ. 1300కోట్లు కేటాయించామని చినరాజప్ప తెలిపారు. కాపులకు ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వ నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు.కాగా నిందితులపై కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా తెలియజేశారు. ఎంపీగా పనిచేసిన ముద్రగడ అరాచక శక్తులపై వున్న కేసులను ఎత్తివేయమని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా ముద్రగడ చేస్తున్న కుట్రలో భాగమని ఆయన మండిపడ్డారు. అటు ప్రభుత్వం..ఇటు ముద్రగడ మొండి వైఖరితో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇది ఎంతవరకూ దారితీస్తుందోనని పోలీసులు అప్రమత్తంగా వున్నారు. ఈ క్రమంలో ముద్రగడ నివాసం వద్ద పోలీసు దళాలుభారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో పోలీసలకు కాపునేతలకూ మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.

10:38 - June 9, 2016

ఇంట్లో కోడిని కాటేసిన పాము...పామును చంపి కోడితో సహా పూడ్చివేత..గ్రామస్తుల్లో అనుమానాలు పెరిగాయి...

మంత్రాలు..క్షుద్ర పూజల పేరిట గ్రామాల్లో ఘోరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజ నిజాలు తెలుసుకోకుండానే అమాయకులను అంతం చేయడానికి వెనుకాడడం లేదు. కంప్యూటర్ యుగంలోనూ గ్రామాల్లో మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి. క్షుద్ర పూజలు చేశారన్న నెపంతో ఏకంగా ఓ కుటుంబంపై దాష్టీకం ప్రదర్శించారు. ఓ వ్యక్తిని కిరాతకంగా కొట్టి చంపేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము, కోడి ఖననంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. కర్రలు..రాళ్లతో కొట్టి చంపేశారు. సభ్య సమాజం తలదించుకొనేలా జరిగిన ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

10:37 - June 9, 2016

పగటిపూట రెక్కీ..రాత్రి పూట పంజా..చీకట్లో వస్తారు..చిటికెలో పని పూర్తి చేస్తారు...


అనంత పోలీసులను పరేషన్ చేస్తున్న షికారీ గ్యాంగ్..జనజీవన స్రవంతిలో కలవాలంటూ విన్నపాలు..పగటిపూట రెక్కీ..రాత్రి పూట పంజా..చీకట్లో వస్తారు..చిటికెలో పని పూర్తి చేస్తారు. ఇల్లు గుల్ల చేస్తారు. ఉన్నదంతా ఊడ్చికెళుతారు. అనంతపురం జిల్లాలో షికారీ గ్యాంగ్ చెలరేగిపోతోంది. దోపిడీలు..చోరీలతో బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ షికారీ గ్యాంగ్ పై నిఘా పెంచిన కాప్స్ ఎట్టకేలకు పట్టుకున్నారు. షికారీ గ్యాంగ్ సభ్యుడిని పట్టుకున్న పోలీసులు పలు బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కిర్లంపూడిలో ఉద్రిక్తత

తూ.గో: కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తన నివాసం నుంచి వెళ్లకపోతే పురుగు మందు తాగుతానని ముద్రగడ హెచ్చరించారు. 69 కేసుల్లో ముద్రగడ ఏ-1 గా ఉన్నందున అరెస్టు చేయడానికి వచ్చామని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

నిజామాబాద్‌ : నగరంలోని కాలూరు ప్రధాన కూడలిలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-ఆటో ఢీ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ముద్రగడ అరెస్టుకు రంగం సిద్ధం

తూ.గో : ముద్రగడ ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసుల యత్నించారు. 69 కేసులో ముద్రగడ ఏ-1గా ఉన్నందున అరెస్టు చేయడానికి వచ్చామని పోలీసులు చెప్తున్నారు. ముద్రగడ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అప్రమత్తమైన కాపు నేతలు పోలీసులను అడ్డుకుంటున్నారు.

10:15 - June 9, 2016

ముంబై : భారత చీఫ్ కోచ్ పదవికి అనూహ్య స్పందన వస్తోంది. రవిశాస్త్రి, సందీప్ పాటిల్ లు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బల్వీందర్ సింగ్..వెంకటేష్ ప్రసాద్ లు కూడా ఆ జాబితాలో చేరారు. తొలిసారి విదేశీ ఆటగాళ్లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. గిలెస్పీ, స్టువర్ట్ లాలు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పంపారు. బీసీసీఐకి అప్లికేషన్ పంపినట్లు వెంకటేష్ తెలిపారు. ఆయన జాతీయ జట్టు బౌలింగ్ కోచ్ గా పనిచేసిన అనుభవం ఉంది. కోచ్ పదవి రేసులో రవిశాస్త్రి ముందంజలో ఉన్నారనే విషయం తనకు తెలుసని, 15 సంవత్సరాలు ముంబై, మధ్యప్రదేశ్, బరోడా రంజీ జట్టుకు కోచింగ్ ఇచ్చానని తెలిపారు. ఇక బల్వీందర్ సింగ్ 8 టెస్టులు..22 వన్డేలో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.

10:13 - June 9, 2016

లండన్ : ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్, రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవాపై వేటు పడింది. రెండేండ్ల సస్పెన్షన్ విధిస్తూ ఐటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం మెల్డోనియం ఉత్ర్పేరకాన్ని వినియోగించినందుకు షరపోవాపై వేటు వేస్తున్నట్లు ఐటీఎఫ్ పేర్కొంది. నిషేధంతో షరపోవా డోపింగ్ ఉద్ధేశ్యంతో మోసపూరితంగా వ్యవహరించినట్లు కాదని...తను చేసిన పొరపాటుకు వ్యక్తిగత బాధ్యత బాధ్యతగానే చూడాలని ఐటీఎఫ్ పేర్కొంది. షరపోవాకు గుండె సంబంధిత వ్యాధి ఉండడంతో 2006 నుండి మెల్డోనియంను ఉపయోగిస్తోంది. కానీ జనవరి 1, 2016 నుండి వాడా మెల్డోనియంను నిషేధించింది. వ్యాయామ సామర్థ్యం, రక్త ప్రసరణ పెంచడంతో పాటు కండరాలకు అధిక ఆక్సిజన్ సరఫరా చేస్తుందని వాడా పేర్కొంటోంది. ఇప్పటికే 200 మంది అథ్లెట్లు మెల్డోనియం వాడకంతో నిషేధం బారిన పడిన విషయం తెలిసిందే.

మావోయిస్టుల మెరుపు దాడి :పలువురికి గాయాలు...

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. కొండగౌన్‌లోని రణపాల్‌ ప్రాంతంలో ఉన్న 41వ ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌) క్యాంపును దాదాపు 100 మంది మావోయిస్టులు మూడు వైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య 600 రౌండ్ల ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు రాకెట్‌ లాంచర్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.

10:10 - June 9, 2016

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నటీనటుల ఎంపిక, మేకింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడా రాజీపడడం లేదంట. కానీ బాలయ్య కు జోడిగా ఎవరిని నటింపచేయాలనే దానిపై తర్జనభర్జనలు పడ్డారని టాక్. పలువురు హీరోయిన్లకు కూడా సంప్రదించారని గుసగుసలు వినిపించాయి. చివరకు బాలయ్యకు జోడిగా 'శ్రియ' అయితే కరెక్టని భావించి ఆమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత వీళ్లిద్దరూ కలిసి నటించడం ఆనందంగా ఉందని, వీళ్లిద్దరి కాంబినేషన్ మళ్లీ సిల్వర్ స్ర్కీన్ మీద మ్యాజిక్ చేస్తుందనే నమ్మకం ఉందని చిత్రం యూనిట్ పేర్కొంటోదంట. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవల మొరాకోలో పూర్తయ్యిన విషయం తెలిసిందే. తొలి షెడ్యూల్ అద్భుతంగా వచ్చిందని, ప్రస్తుతం హైదరాబాద్ లో ఏకధాటిగా షూటింగ్ జరుగుతోంది.

10:08 - June 9, 2016

గ్లిజరిన్ ఎందులో వాడుతారు. కేవలం అందం కోసం వాడుతారు అనుకుంటే పొరపాటే. ఇంట్లో అనేక అవసరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చు. అవేంటో ఓ సారి చూడండి.
కిటికీల మూలల్లో దుమ్ము పేరుకపోతే పొడి వస్త్రంపై కాస్త గ్లిజరిన్ వేసి శుభ్రం చేయాలి.
డోర్ నాట్స్ పనిచేయకపోతే నూనె వేయకుండా గ్లిజరిన్ వేసి చూడండి.
తాళాలు సరిగ్గా పనిచేయకపోతే కూడా రెండు చుక్కల గ్లిజరిన్ వేసి చూడండి.
ఫ్లవర్ వాజ్ లోని పూలు ఎక్కువ కాలం తాజాగా..సువాసనతో ఉండాలంటే ఆ నీటిలో ఒక చుక్క గ్లిజరిన్ కలపాలి.

10:07 - June 9, 2016

చక్కెర..కేవలం తీపిదనానికి మాత్రమే కాదు. దీనివల్ల ఇతరవాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. మీ కోసం కొన్ని చిట్కాలు..

వస్తువులు..గిన్నెలు..బట్టలు..దేని మీదనైనా సరే తప్పు మరకలు ఉంటే నిమ్మరసంలో చక్కెర వేసి కరగనివ్వాలి. అనంతరం ఓ స్పాంజిని తీసుకుని ముంచి తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల తుప్పు మరకలు పోతాయి. వంట గదిలో బండలు తుడిస్తే కూడా మురికిపోయి శుభ్రమవుతాయి.
దుస్తుల మీద మొండి మరకలు ఉంటే టమాట రసంలో చక్కెర కలిపి మరకపై రాసి కాసేపు నాననివ్వాలి. ఆ తరువాత రుద్దితే మరకలు వదిలిపోతాయి.
వెండి వస్తువులు తళతళలాడాలంటే..రోజ్ వాటర్ లో చక్కెర వేసి కరిగిన తరువాత వెండి వస్తువులను తుడిచేయాలి.
గిన్నెలు జిడ్డు..మసి ఉంటే...బేకింగ్ సోడా, చక్కెర కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. దానిని నీటిలో కలిపి చిక్కని ద్రావకంలా చేసుకుని గిన్నెలు కడగాలి.
చేతికి నూనె..గ్రీజు అంటితే...చక్కెరను కొన్ని చుక్కల నీటిని చేతిలో వేసుకుని బాగా రుద్దుకోవాలి. తరువాత నీటిని కడిగేసుకుంటే జిడ్డు మాయమౌతుంది.


 

ముద్రగడ దీక్ష విడ్డూరం : చినరాజప్ప

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ తన నివాసంలో దీక్షను చేట్టారు. ఈ దీక్షపై హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. మంజునాథ కమషన్ గడువు ఆగష్టు వరకూ వుందనీ...ఈ సమయంలో ఆయన దీక్షకు దిగటం విడ్డూరంగా వుందన్నారు. కాపులకు ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వ నెరవేరుస్తుందని ఆయన తెలిపారు.

మెక్సికోలో మోదీకి ఘన స్వాగతం...

ఉత్తర అమెరికా : ప్రధాని నరేంద్ర మోదీ మెక్సికో చేరుకున్నారు. ఆ దేశ రాజధాని మెక్సికో సిటీలో మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీతో కరాచలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. మెక్సికో సిటీలో మోదీ బస చేసిన హోటల్ దగ్గర భారీ సంఖ్యలో భారతీయ సంతతి ప్రజలు చేరుకున్నారు. ఆయన్ను కలుసుకునేందుకు మద్దతుదారులను ఉత్సాహాం ప్రదర్శించారు. ఆయనకు కొందరు పుష్పాగుచ్ఛాలను సమర్పించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అంతకముందు మెక్సికో విదేశాంగ మంత్రి క్లాడియా రుజ్ మసియూ సలినాస్ విమానాశ్రయంలో భారత ప్రధానికి ఘన స్వాగతం పలికారు. 

సరోనా మార్కెట్ వద్ద కాల్పులు..4గురు మృతి..

ఇజ్రాయిల్‌ : ఇద్దరు సాయుధులు నలుగురు వ్యక్తుల్ని కాల్చి చంపారు. ఆ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. టెల్ అవివ్‌లోని ఓ రెస్టారెంట్ ఈ కాల్పుల ఘటన జరిగింది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న సరోనా మార్కెట్ వద్ద కాల్పులు జరిగాయి. సాయుధులు పాలస్తీనాకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దర్నీ కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల మళ్లీ ఇజ్రాయిలీలపై పాలస్తీనియన్లు దాడులు కొనసాగిస్తున్నారు. కాల్పులు, కత్తి పోట్లు, కార్లతో ఢీకొట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. సాయుధులు జరిపిన దాడులను ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ ఖండించారు.

కంచం, గరిట పట్టండి..నిరసన తెలపండి : ముద్రగడ

తూ .గోదావరి : కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయడంతో పాటు తుని విధ్వంసకారులుగా పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం... తూర్ప గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో కొద్దిసేపటి క్రితం ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు ఓ పిలుపునిచ్చారు. తన దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరు కూడా కిర్లంపూడి రావద్దని పిలుపునిచ్చిన ముద్రగడ.. ఆయా ప్రాంతాల్లో మునుపటిలాగే కంచం, గరిట పట్టి శబ్ధం చేస్తూ నిరసన తెలపాలని కోరారు.

ముద్రగడ మరోమారు సంచలన వ్యాఖ్యలు...

తూ.గోదావరి : ప్రాణత్యాగం తప్ప వేరే దారి లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆయన గత కొంతకాలంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని పేర్కొంటూ ఆయన మరోసారి దీక్షకు దిగారు. గురువారం ఉదయం ఆయన నివాసంలో ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిర్లంపూడిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. దీక్ష చేపట్టిన సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు...

తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ హెచ్‌.ఎల్‌.దత్తు, సినీ నటుడు నారా రోహిత్‌ దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

మెక్సికోలో మోడీకి ఘన స్వాగతం..

మెక్సికో : భారత ప్రధాని నరేంద్ర మోడీ మెక్సికో చేరుకున్నారు. ఆ దేశ రాజధాని మెక్సికో సిటీలో మోడీకి ఘన స్వాగతం లభించింది. మెక్సికో విదేశాంగ మంత్రి క్లాడియా రుజ్ మసియూ సలినాస్ విమానాశ్రయంలో భారత ప్రధానికి ఘన స్వాగతం పలికారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

చిత్తూరు : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు కుటుంబసభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని వారు దర్శించుకున్నారు.

షరపోవాపై నిషేధం..

ఢిల్లీ : డోపింగ్ టెస్టులో దొరికిపోయిన టెన్సిస్ స్టార్ మారియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య రెండేళ్ల నిషేధం విధించింది. ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన షరపోవా ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్టులో విఫలమైంది.

రేపటికి నెల్లూరుకు రుతుపవనాలు..

విశాఖపట్టణం : కేరళలో బుధవారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 48 గంటల్లో దక్షిణ కోస్తా వరకు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం నాటికి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రవేశించి క్రమంగా రాయలసీమ జిల్లాల్లో విస్తారిస్తాయని పేర్కొంది.

 

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..

విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం బలంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కోస్తా నుండి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

 

09:23 - June 9, 2016

తూ.గోదావరి : ప్రాణత్యాగం తప్ప వేరే దారి లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆయన గత కొంతకాలంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని పేర్కొంటూ ఆయన మరోసారి దీక్షకు దిగారు. గురువారం ఉదయం ఆయన నివాసంలో ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిర్లంపూడిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. దీక్ష చేపట్టిన సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే అక్రమ అరెస్ట్ లకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఈ అరెస్ట్ లను ఆపాలంటే ప్రాణ త్యాగం ఒకటే పరిష్కారంగా కనిపిస్తోందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా...జీవితాంతం జైల్లో పెట్టినా.. దీక్షను కొనసాగిస్తానని కుండబద్ధలు కొట్టారు. ఇదే నా ఆఖరి ప్రెస్ మీట్ అని ఆయన పేర్కొన్నారు. మొదటిసారి తాను చేపట్టిన దీక్ష సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పిందని, తనకు సంఘీభావం తెలుపటానికి వచ్చినవారికి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత తనమీద వుందన్నారు. ప్రభుత్వం కాపులను మోసం చేస్తోందని, తనపై రౌడీ షీట్ ముద్ర వేయటమే కాక 69 కేసులు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని ఘాటుగా విమర్శించారు. అక్రమ అరెస్ట్ లు బాధాకరమని, అరెస్ట్ ల పర్వం ప్రమాదకరంగా మారే ప్రమాదముందని అభివర్ణించారు. అరెస్ట్ లకు భయపడి ముందస్తుగా బెయిల్ తెచ్చుకోనని, ఇక ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు కొనసాగించనని ముద్రగడ ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

ముద్రగడ..ఆమరణ దీక్ష ప్రారంభం..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరోసారి ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించారు. గురువారం ఉదయం ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రౌడీషీటర్లుగా ముద్ర వేయడం బాధాకరమని, అరెస్టు పర్వం ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రాణ త్యాగం తప్ప మరో దిక్కులేదని, తనపై 69 కేసులు పెట్టించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. హామీలు ఇచ్చి మాట తప్పారని, ప్రభుత్వం కాపులను మోసం చేస్తోందన్నారు. తనను జైల్లో పెట్టినా దీక్ష ఆపనని, అరెస్టు చేసినా బెయిల్ తెచ్చుకోనని స్పష్టం చేశారు.

నిప్పు లాంటి మనిషిని : చంద్రబాబు

కడప : మహా సంకల్ప సభ వేదికపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెంందుకు భయపడతానని ఆయన ప్రశ్నించారు. తాను నిప్పులాంటి మనిషినన్న చంద్రబాబు... ఏ ఒక్కరికి భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినా అవినీతి కేసులున్న జగన్ భయపడాలి గాని తానెందుకు భయపడతానని వ్యాఖ్యానించారు. 43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డ జగన్... తనను ప్రజలతో చెప్పులతో కొట్టిస్తాడా? అని కూడా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు, కాలినడక భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,906 మంది భక్తులు దర్శించుకున్నారు.

కొనసాగుతున్న చేపమందు పంపిణీ...

హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిన్న ప్రారంభమైన చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. నేటి ఉదయం తొమ్మిది గంటలకు పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం బత్తిని సోదరుల ఇంటి వద్ద చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

08:41 - June 9, 2016

మనదేశ ఎగుమతుల్లో మత్స్యసంపద అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. దేశ ప్రజలకు పోషకాహారాన్ని, భారత ఖజానాకు విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న మత్స్యకారులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదు. విదేశీ కార్పొరేట్ పెద్దలకు ఎర్రతివాచీలు పరిచి, వారి సరకులకు చక్కటి మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వాలు స్వదేశీ మత్స్యకారులకు కనీస మార్కెట్ సదుపాయాలు కల్పించడం లేదు.

కోటిన్నర మంది చేపల మీద జీవిస్తున్నారు...
చేపలు మంచి పోషకాహారం. గుండె జబ్బుల భయం లేదు. కొలెస్ట్రాల్ భయం లేదు. ఆహారభద్రత, పోషకాహార భద్రత కల్పించడంలో చేపల కీలకపాత్ర పోషిస్తాయి. చేపల పరిశ్రమ మనదేశంలో వేగంగా విస్తరిస్తున్న రంగం. దాదాపు కోటిన్నర మంది చేపల మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 29 కులాలవారికి చేపలు జీవనోపాధి చూపిస్తున్నాయి. వీరిలో కొందరు సంచార జీవులు. కొందరికి ఫుల్ టైమ్ జీవితమైతే, మరికొందరికి పార్ట్ టైమ్ వ్యాపకం. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, బీహార్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు చేపల ఉత్పత్తిలో మంచి ట్రాక్ రికార్డున్న రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ లో 10, 10, 830 మెట్రిక్ టన్నులు.

గుజరాత్ లో 7, 21, 910 మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి...
గుజరాత్ లో 7, 21, 910 మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. కేరళ లో 6,67,330, తమిళనాడు లో 5,59, 360, మహారాష్ట్ర లో 5 56, 450 మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. పశ్చిమబెంగాల్ లో 3, 49, 480 , ఉత్తర ప్రదేశ్ లో 3 25, 950, బీహార్ లో 3, 19, 100, కర్నాటక లో 2, 97, 690 చేపలు ఉత్పత్తి అవుతున్నాయి.

విదేశీ మారకద్రవ్యంలో మత్స్య సంపద కీలకపాత్ర...
విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలో మత్స్య సంపద కీలకపాత్ర పోషిస్తోంది. మన దేశంలో నుంచి 75 దేశాలకు చేపలు ఎగుమతి అవుతున్నాయి. ఏటా పదిన్నర లక్షల టన్నుల చేపలను ఎగుమతి చేస్తున్న భారత్ దాదాపు 34 వేల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. మన దేశ జిడిపిలో మత్స్య సంపద వాటా 1.1శాతం. ప్రపంచ మత్స్యసంపద ఉత్పత్తిలో మన వాటా 6.3శాతం.

రవాణా ఖర్చుల పెరగడంతో మత్స్యకారులకు కష్టాలు...
మన దేశంలో మత్స్యకారులను ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు అవసరమైన పోషకాహారాన్ని సమ్రుద్ధిగా అందించడమే కాకుండా, విదేశీ మారకద్రవ్యాన్ని కూడా భారీగా ఆర్జించే అవకాశం పుష్కలంగా వుంది. ఈ రంగంలో సాధించే అభివ్రుద్ధి మరికొన్ని లక్షల మందికి ఉపాధి చూపిస్తుందనడంలో సందేహం లేదు. అయితే, మనదేశంలో మత్స్యకారులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. చైనాలో ఒక్కొక్క మత్స్యకారుడు ఏడాదికి సగటున 6 టన్నుల మత్స్యసంపదను ఉత్పత్తి చేస్తుంటే, మన దేశంలో 2 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. మత్స్యకారులకు నాణ్యమైన సీడ్ ను అందించడంలోనూ, వారికి అవసరమైన వలలు, పడవలు, బోట్లు లాంటివి సమకూర్చిపెట్టడంలోనూ మరింత శ్రద్ద పెడితే, మరింత మత్స్య సంపదను స్రుష్టించగలరు. మనదేశంలో మత్స్యసంపద పరిరక్షణకు అవసరమైన కోల్డ్ స్టోరేజీలు లేవు. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో సైతం చక్కటి మార్కెట్ లేదు. రోడ్ల వెంటనే అమ్ముకోవాల్సిన దుస్థితి. మార్కెటింగ్ సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా మత్స్యసంపద పాడైపోయి, మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, రవాణా ఖర్చుల పెరగడమూ మత్స్యకారులకు మరిన్ని కష్టాలు మిగులుస్తోంది. 

ఖాకీల దిగ్భందంలో కిర్లంపూడి...

తూ.గోదావరి :  కాపు ఉద్యమ సెగతో తూర్పుగోదావరి జిల్లా వాతావరణం వేడెక్కింది. స్వగ్రామమైన కిర్లంపూడిలో గురువారం ఉదయం కాపునేత ముద్రగడ గురువారం నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాల నుండి కాపునేతలు కిర్లంపూడికి చేరుకుంటున్నారు. దీంతో అవాంఛనీయం ఘటనలు జరుగకుండా ఎర్రవరం- కిర్లంపూడి, ప్రత్తిపాడు రహదారుల్లో పోలీసులు ఔట్ పోస్టులను నిర్మించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడికి వచ్చే రహదారులను పోలీసులు మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో వాతావరణం హాట్ హాట్ గా మారింది. మూడువేలమంది పోలీసులు పహారా కాస్తున్నారు.

08:31 - June 9, 2016

తూ.గోదావరి : కాపు ఉద్యమ సెగతో తూర్పుగోదావరి  జిల్లా వాతావరణం వేడెక్కింది. స్వగ్రామమైన  కిర్లంపూడిలో గురువారం ఉదయం కాపునేత ముద్రగడ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాల నుండి  కాపునేతలు కిర్లంపూడికి చేరుకుంటున్నారు. దీంతో అవాంఛనీయం ఘటనలు జరుగకుండా  ఎర్రవరం- కిర్లంపూడి, ప్రత్తిపాడు రహదారుల్లో పోలీసులు ఔట్ పోస్టులను నిర్మించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడికి వచ్చే రహదారులను పోలీసులు మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో వాతావరణం హాట్ హాట్ గా మారింది. మూడువేలమంది పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్ 30ని పోలీసులు అమలు చేస్తున్నారు. కాగా కాపులకు రిజర్వేషన్లను కోరుతూ గత కొంతకాలం నుండి ముద్రగడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం, ఒకసారి దీక్ష చేపట్టటం..ప్రభుత్వం హామీ ఇవ్వటంతోదీక్ష విరమించిన విషయం తెలిసిందే. కాపు గర్జన సందర్భంగా తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆందోళన కారులు నిప్పు పెట్టటం..ఆ సందర్భంగా పలుహింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అనుమానితులుగా వున్న ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ బుధవారం ముద్రగడ అమలాపురం పీఎస్ వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకపోతే మరోసారి దీక్ష చేస్తానని ఆయన ప్రకటించిన విధంగానే గురువారం ఉదయం 9 గంటలకు దీక్షను చేపట్టనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

08:00 - June 9, 2016

చేపల పెంపకానికి మనది అత్యంత అనువైన దేశం. సముద్ర తీర ప్రాంతంలోనే కాకుండా మెట్ట ప్రాంతాల్లో సైతం మత్స్యసంపదకు అపార అవకాశాలున్నాయి. మెట్టప్రాంతాల్లో చేపల పెంపకానికి ఎలాంటి అవకాశాలున్నాయి? మెట్ట ప్రాంతాల్లోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? సమస్యలేమిటి? మెట్ట ప్రాంతాల్లో మత్స్యసంపద అభివ్రుద్దికీ, మత్స్యకారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం నేత కె.శ్రీనివాస్ విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. మత్స్యకారుల సమస్యలపై శ్రీనివాస్ చేసిన సూచనలు తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:55 - June 9, 2016

అమెరికా : అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ అక్కడి చట్టసభలనుద్దేశించి ప్రసంగించారు. అబ్రహాంలింకన్‌ సూక్తులను ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అమెరికా.. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిదని కొనియాడారు. మోడీ ప్రసంగానికి ఆహుతులు చప్పట్లతో అభినందనలు తెలిపారు.

మోడీకి అమెరికా పార్లమెంట్‌లో ఘన స్వాగతం...
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి అక్కడి పార్లమెంట్‌లో ఘన స్వాగతం లభించింది. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన ఆరవ ప్రధానిగా ఖ్యాతి గడించారు. అమెరికాలో తాను ప్రసంగించడమంటే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవమని మోడీ అన్నారు.

కాంగ్రెస్ లో ప్రసంగించిన ఆరవ ప్రధానిగా నిలిచిన మోడీ..
ఇప్పటివరకు ప్రధానిహోదాలో నెహ్రు, ఇందిరాగాంధీ, పీవీ, వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ ల తర్వాత అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించిన భారతీయ ప్రధానిగా మోడీ నిలిచారు. ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసం ఇరు దేశాల మైత్రిని బలోపేతం చేస్తుందని. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ రెండూ అతిపెద్ద ప్రజాస్వామ్యాలను ఏకతాటిపై నడిపిస్తాయన్నారు మోడీ.

భారత ప్రజలు సంపూర్ణ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నారు :మోదీ

125 కోట్ల భారత ప్రజలు ప్రతిక్షణం సంపూర్ణ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నారని.. తోరోస్‌ ప్రతిపాదించిన సహాయ నిరాకరణ మా రాజకీయతత్వాన్ని మార్చి వేసిందన్నారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగం భారతీయ సంస్కృతి, ఉన్నతిని ప్రపంచానికి చాటింది. అంబేడ్కర్‌ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది కొలంబియా వర్సిటీలో చదువుకున్న రోజులేనని. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం.. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ను ప్రభావితం చేసిందని అన్నారు. భారత్‌, అమెరికాలు సహజమిత్రులని వాజ్‌పేయీ అన్నమాట నిత్యసత్యమన్నారు. భారత్‌ కష్టాల్లో ఉన్నప్పుడు అమెరికా అందించిన సాయం ఎన్నటికీ మర్చిపోదన్నారు.

ప్రపంచానికి యోగాను భారత్‌ అందించినందుకు గర్విస్తున్నా: మోదీ

ప్రపంచానికి భారత్‌ యోగాను అందించినందుకు గర్వపడుతున్నానని. భారతీయ యోగా సంప్రదాయాన్ని అమెరికాలో 30 మిలియన్ల మంది అభ్యసిస్తున్నారన్నారు. భారతదేశం యోగా మీద మేథోహక్కులను కోరుకోవడంలేదని.. అమెరికాలో ఉన్న గొప్ప శాస్త్రజ్ఞలు, సీఈవోలు, వ్యోమగాముల్లో ఎంతోమంది భారతీయులు ఉన్నారన్నారు. 21వ శతాబ్దపు నవనిర్మాణాలను నిర్దిష్ట సమయంలో చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఉగ్రవాద మూలాలను పెకలించాలన్న మోడీ ...
ఆఫ్రికా నుంచి హిందూ మహాసముద్రం మీదుగా పసిఫిక్‌ వరకు శాంతి పరిరక్షణలో భారత్‌ ముందుకు నడుస్తుందని. హిందూ మహాసముద్ర ప్రాంతీయ సమతుల్యం కాపాడటంతో భారత్‌ కీలక భూమిని నిర్వహిస్తోందన్నారు. ఉగ్రవాద మూలాలను పెకిలించాలన్న ఉమ్మడి ఆశయం నెరవేరే సమయం ఆసన్నమైందని పరోక్షంగా పాకిస్తాన్ కు చురకలు అంటించారు.

భారత్‌, అమెరికాల స్నేహం కొత్త అవకాశాలకు నాంది..
భారత్‌, అమెరికాల స్నేహబంధం కొత్త అవకాశాలకు నాందిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ముందు భారత్ ఎదుగుదలలో అమెరికా తన సహకారాన్ని అందించాలని మోడీ కోరారు.  

07:39 - June 9, 2016

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో వ‌ర్గ విభేదాలు తెలంగాణ కాంగ్రెస్ కు శాపంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయి క‌ష్టాల్లో ఉన్న పార్టీ.. నేత‌ల దూకుడు కారణంగా.. బజారునపడుతోంది. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటూ.. పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీనికి ఏకంగా గాంధీభ‌వ‌న్ సీఎల్పీల‌నే వేదికగా చేసుకుంటుండ‌టం..ఇప్పుడు పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.
పార్టీకి శాపంగా మారిన నల్గొండ‌ పాలిటిక్స్..
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇప్పటికే ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌మైన హ‌స్తం పార్టీని.. స‌మ‌స్యలు ఒక్కొక్కటిగా చుట్టేస్తున్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో స‌గం నేత‌లు జారిపోయారు. ఇదే బాట‌లో ఇంకా చాలామందే క‌నిపిస్తున్నారు. మ‌రోవైపు వ‌రుస ఓట‌మిల‌తో పార్టీ ఓక్కసారిగా డీలాప‌డిపోయింది. ఇది చాల‌ద‌న్నట్లు... ఇప్పుడు ఇంటిపోరు దీనికి మించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

వ‌ర్గపోరుతో పార్టీలో విభేదాలు...

పార్టీ బ‌లంగా ఉన్న జిల్ల్లా నల్గొండ‌ జిల్లాలో మొన్నటి ఎన్నిక‌ల్లో కేసీఆర్ గాలివీచినా.. అక్కడి నుండి ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ నుండి గెలిచారు. సీఎల్పీనేత‌ నేత జానారెడ్డి, పీసీసీ ఛీఫ్ ఉత్తం కుమార్ రెడ్డితోపాటు ఆయ‌న భార్య ప‌ద్మావ‌తి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి,భాస్కర్ రావులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరితో పాటు ఎంపీ సుఖేంద‌ర్ రెడ్డితోపాటు.. మ‌రో రాజ్యస‌భ స‌భ్యుడు పాల్వాయి గోవ‌ర్ధన్ రెడ్డిలు ప్రస్తుతం ప‌ద‌వుల్లో ఉన్నారు. తాజాగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే ప‌ద‌వులు ఎన్ని ఉన్నాయో.. వీరి మ‌ధ్య వ‌ర్గపోరు అంతే ఉంది. వీరిలో ఒక‌రు ఎడ్డం అంటే మ‌రొక‌రు తెడ్డెం అంటున్నారు. స‌రిగ్గా ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కు స‌వాల్ గా మారింది.

జానారెడ్డి కోవ‌ర్ట్ : పాల్వాయి
పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి .. కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్ కి మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్ గా గుర్తించ‌డంలేద‌ని ప్రక‌టించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. గాంధీభ‌వ‌న్ కు వెళ్లడమే మానేశారు. తాజాగా ఉత్తమ్ పై శివాలెత్తిపోయారు కోమ‌టిరెడ్డి. పీసీసీ ఛీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డంతో.. ఆయ‌న‌కు పార్టీ షోకాజ్ నోటిసులు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గానే మ‌రోనేత పాల్వాయి గోవ‌ర్ధన్ రెడ్డి రెచ్చిపోయారు. గాంధీభ‌వ‌న్ వేదిక‌గా.. జానారెడ్డి, కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్ ను టార్గెట్ చేశారు పాల్వాయి. జానారెడ్డిని కోవ‌ర్ట్ అంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

రెడ్డి వర్గాల్లో ఆధిపత్య పోరు...
ఇక సీఎల్పీ నేత జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి ల‌ మ‌ధ్య ఆధిప‌త్యపోరు నివురుగ‌ప్పిన నిప్పులా వుంది. ఒక‌రు అవునంటే.. మ‌రొక‌రు కాదంటున్నారు. ఇలా పార్టీ బ‌లంగా ఉన్న జిల్లాలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న నాయ‌కులు మ‌ధ్య కొన‌సాగుతున్న ఆధిప‌త్య పోరు... ఇప్పుడు మొత్తం పార్టీనే ఉక్కిబిక్కిరి చేస్తోంది. ఆధిప‌త్యం కోసం నేత‌లు కుమ్ములాడుకోవ‌డంతో.. వీరిని క‌ట్టడి చేయ‌లేక‌... చ‌ర్యలు తీసుకోలేక త‌ల‌ప‌ట్టుకుంటుంది హైక‌మాండ్.

07:32 - June 9, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్‌ వివాదంపై దిద్దుబాటు చర్యలకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. వివాదాస్పదమైన జీవో 123ను రద్దుచేసి, 2013 భూసేకరణ చట్ట ప్రకారమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని భావిస్తోంది. తద్వారా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చాలని యోచిస్తోంది.

రాజకీయంగా వేడెక్కుతుండటంతో సర్కారు దిద్దుబాటు చర్యలు...
మెదక్‌ జిల్లాలో నిర్మించబోయే మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్.. రైతుల పరిహారం రాజకీయంగా వేడెక్కుతుండటంతో సర్కారు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇన్నాళ్లు నిశ్శబ్ధంగా ఉన్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మల్లన్నసాగర్ అంశంలో ఏకమై ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు 123 జీవోను కోర్టులో సవాలు చేసేందుకు జేఏసీ ఏర్పాట్లు చేస్తుండటంతో..ఈ వివాదానికి చెక్‌పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రైతుల డిమాండ్ మేరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమని ప్రకటించేందుకు రెడీ అయింది. అయితే 50 టీఎంసీల నుంచి కొంతమేర రిజర్వాయర్ కెపాసిటీ తగ్గించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందలేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంటే , తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

రైతుల డిమాండ్‌ తో భూసేకరణ చట్టం అమలుకు ఆలోచన..
2013 చట్టప్రకారం పరిహారం కన్నా, 123 జీవో ప్రకారమే రైతులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం అంటోంది. దీనివల్ల రైతలు ఏళ్లతరబడి తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొంటోంది. అయినా రైతులు ఒప్పుకోకుంటే, భూసేకరణ చట్ట ప్రకారమే నష్టపరిహారం చెల్లించేందుకు సంసిద్థతను వ్యక్తం చేస్తోంది. రైతుల నుంచి వ్యక్తమయ్యే స్పందనను బట్టి ముందుకెళ్లాలని రెవెన్యూ, జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ఇప్పటివరకు రెండు దశల్లో గ్రామస్థులతో చర్చలు జరిపిన అధికారులు, దేని ప్రకారం పరిహారం కావాలో తేల్చుకోవాలని గ్రామస్థులకే వదిలేశారు.

ప్రభుత్వం వెనక్కితగ్గడం పట్ల ప్రజలు హర్షం...
ఇన్నాళ్లు కొత్త జీవో ప్రకారం పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం ...తమ ఆందోళనతో వెనక్కితగ్గడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు, ఇళ్లు కోల్పోయినా..మల్లన్న సాగర్ రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగకరంగా ఉండాలని కోరుతున్నారు. 

07:23 - June 9, 2016

జేఏసీ అనేది ఎప్పుడో కనుమరుగు అయిపోయిందని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మరి లేని జేఏసీ కోసం టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రొ.కోదండ రాం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసమే తాను పోరాడుతున్నాను తప్ప తాను ఎప్పుడూ ఏ పదవులూ ఆశించలేదన్న  కోదండరాం వ్యాఖ్యలపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ...వెంకట్ (సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు) తాడూరి రాజేశ్ (టీఆర్ఎస్ నేత),సతీష్ మాదిగ(టీ.టీడీపీ అధికార ప్రతినిధి) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి మారింత సమాచారాన్ని తెలుసుకోండి...

07:11 - June 9, 2016

విజయవాడ : చంద్రబాబు రెండేళ్ల పాలనపై.. విపక్ష వైసీపీ విరుచు పడింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ వైసీపీ నేతలు, సీఎం చంద్రబాబుపై ఫోర్ ట్వంటీ కేసులు పెట్టారు. దీంతోపాటే.. టీడీపీ రెండేళ్ల పాల‌న తీరుపై సమాధానాలు కోరుతూ.. ప‌ది ప్రశ్నల‌తో బహిరంగ‌లేఖ రాసింది. ఎన్నికల వాగ్దానాలపైనా ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

రెండేళ్ల పాలనపై వైసీపీ ఫోర్‌ట్వంటీ కేసులు ...
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ‌స్వీకారం చేసి నేటికి రెండు సంవ‌త్సరాలు పూర్తయ్యింది. దీంతో రెండేళ్ల పాల‌న‌ను ప్రజ‌ల‌కు వివ‌రించేందుకు ప్రభుత్వం మహా సంక‌ల్పం దీక్ష పేరుతో ప్రతిపక్ష నేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో భారీ బ‌హిరంగ స‌భను ఏర్పాటు చేసింది. అదే సమయంలో.. టీడీపీ రెండేళ్ల పాలనపై ముందుగా ప్రకటించినట్లుగానే.. వైసీపీ ఫోర్‌ట్వంటీ కేసులు నమోదు చేయించింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని పోలీసు స్టేషన్‌లలో వైసీపీ నేతలు కేసులు పెట్టారు.
హామీల అమలుపై వైసీపీ డిమాండ్...
మరోవైపు.. రెండేళ్ల పాలనలో చంద్రబాబు ఏం సాధించారో తెలపాలంటూ.. వైసీపీ నాయకులు.. ప్రశ్నాస్త్రాలను సంధించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా ఎన్ని వ్యవసాయ రుణాలు మాఫీ చేశారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చేనాటికి 87వేల 612 కోట్ల వ్యవ‌సాయ రుణాలు ఉంటే ఇప్పటి వ‌ర‌కు క‌నీసం 9 వేల కోట్లు కూడా బ‌డ్జెట్‌లో కేటాయించ‌లేద‌ని వైసీపీ నాయకులు విమర్శించారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఒక్క రూపాయి రుణమైనా మాఫీ చేశారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా అంశాలు ఏమయ్యాయని నిలదీశారు.

పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారు?: బొత్స
టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్లలోనే పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌న్న చంద్రబాబు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాల‌న్నారు. పోల‌వ‌రం నిర్మాణ బాధ్యత కేంద్రానిదా..? రాష్ట్ర ప్రభుత్వానిదా స్పష్టం చేయాల‌న్నారు. తెలంగాణ‌లో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ దొరికిన ఆడియోల్లో వాయిస్ చంద్రబాబుది కాదా అని బొత్స ప్రశ్నించారు.

07:04 - June 9, 2016

తూ.గోదావరి : తూర్పుతీరానికి మరోమారు కాపు ఉద్యమసెగ తగలనుంది. తుని ఘటనలో అరెస్ట్‌ చేసిన వారిని బుధవారం సాయంత్రంలో భేషరతుగా విడిచిపెట్టాలని ముద్రగడ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. ముద్రగడపై కూడా కేసులు నమోదు చేశారు. దీంతో ఈరోజు ఉదయం 9 గంటలకు ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు.

మరో దీక్ష ముద్రగడ ...
కాపులను బీసీల్లో చేర్చాలంటూ.. ఉద్యమిస్తున్న కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం.. మరో మారుదీక్ష చేసేందుకు సిద్దమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా.. తమపై ఆక్రమకేసులు బనాయించిందంటూ..అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ.. లేనిపక్షంలో దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు ముద్రగడ.

అరెస్ట్‌ చేస్తే జైల్లో కూడా దీక్ష చేస్తా : ముద్రగడ
కాపు నేతలను ఆగస్ట్ చివరివారం వరకు అరెస్ట్ చేయబోమని.. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్థానాలు నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు ముద్రగడ. ప్రభుత్వ తీరుకు నిరసనగా దీక్షకు పూనుకున్నానని తెలిపారు. తనను అరెస్ట్‌ చేస్తే జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తానని.. కాపుఉద్యమనేత ముద్రగడ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనకు మూలకారకుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేసేవరకు తాను దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పారు.

ముద్రగడ మాటలకు మోసపోవద్దు : చినరాజప్ప
బీసీల జాబితాలో చేర్చే అంశంపై అధ్యయనానికి కమిషన్ ను ఏర్పాటు చేసినా ముద్రగడ తీరులో మార్పు రావడం లేదంటూ.. పలువురు మంత్రులు ఘాటుగా స్పందించారు. దేనికోసం ముద్రగడ దీక్ష చేపడుతున్నారో తెలపాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ. దాంతో పాటు కాపుయువత ముద్రగడ మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునివ్వడంతో తూర్పులో ఒక్కసారిగా కాపురాజకీయ సమీకరణలు వేడెక్కాయి.

వినూత్న నిరసన తెలపాలని పిలుపు...
ముద్రగడ దీక్షకు పూనుకున్నానని ప్రకటించడంతో... అటు అమలాపురంలో ఆయనకు మద్దతుగా ఆందోళనలు చేసేందుకు కాపు నేతలు సిద్దమయ్యారు. కోనసీమ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేయాలని నిర్ణయించారు. ఖాళీ కంచంపై గరిటెతో కొడుతూ.. వినూత్న నిరసన తెలపాలని పిలుపునిస్తున్నారు నేతలు.

కిర్లంపూడిలో హైటెన్షన్ ...
ముద్రగడదీక్షకు దిగడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది... ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు... కిర్లంపూడికి చేరుకునే అన్ని మార్గాల్లోనిఘాను పెంచారు...చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసారు. దీంతో ముద్రగడ మలివిడత ఆమరణ దీక్ష ఏ ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. 

06:56 - June 9, 2016

హైదరాబాద్ : వచ్చే దసరా నాటికి తెలంగాణలో కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి కసరత్తును ప్రణాళికాబద్ధంగా చేయాలని సీఎం కేసిఆర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలని సీఎం సూచించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు కార్యాచరణ..
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. సుమారు 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం ప్రధాన లక్ష్యంగా జిల్లాల, మండలాల పునర్విభజన ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.

50 నుంచి 60 వేల జనాభాతో మండలాల ఏర్పాటు...
ఇక 50 నుంచి 60 వేల జనాభాతో మండలాల ఏర్పాటు జరగాలన్నారు కేసీఆర్‌. సుమారు 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలన్నారు. బలవంతంగా తమను ఇతర మండలాల్లో కలిపారన్న భావన ప్రజలకు రాకుండా చూడాలని ఆదేశించారు. పెద్ద మండలాలను రెండుగా చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేలా కసరత్తు చేయాలని సూచించారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు నుంచి ఆరు మండలాలు ఉండేలా కసరత్తు చేయాలన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకే జిల్లాలు, మండలాల పునర్విభజన చేస్తున్నామని తెలిపారు.
శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు : కేసీఆర్
ప్రజల అవసరాలను, సెంటిమెంట్లను సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు జరగాలని కేసీఆర్‌ సూచించారు. వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజా క్షేమమే ధ్యేయంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను గుర్తించి దగ్గర్లో ఉన్న మండల కేంద్రానికి కలిపే విషయంలో ప్రజాభిప్రాయం తీసుకోవాలన్నారు. ప్రస్తుత జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయం పరిశీలించాలని ఆదేశించారు. నియోజకవర్గంతో పాటు భౌగోళిక పరిస్థితులపై సమీక్షించాలి, తర్వాతనే పూర్తి స్థాయి మండలాల సంఖ్య అంచనా వేయడానికి సాధ్యమవుతుందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కసరత్తు అనంతరం మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించాలని ఆదేశించారు.

విడతలవారీగా కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం...
ఇక ఈనెల 20న, జులై 5న రెండు దఫాలు కలెక్టర్లతో సమావేశం కావాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈనెల 20లోగా జిల్లాలపై ప్రక్రియ అంతా పూర్తి చేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమగ్ర నివేదికలకు సీసీఎల్‌ఏ, సీఎస్‌ తుదిరూపు ఇవ్వాలన్నారు. ఆగస్టు 4 నుంచి 10లోపు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. ఈ నోటిఫికేషన్‌ జారీ అనంతరం.. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు గడువు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. అభ్యంతరాలను కలెక్టర్లు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏకు ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా జులై 10న లేదా 11వ తేదీలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్‌ 11న విజయదశమి నుంచి కొత్త జిల్లాల ఆవిర్భావం జరగనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు.

కలెక్టర్ల ప్రతిపాదనల మేరకు 23 జిల్లాలు ఏర్పాటు...
కలెక్టర్ల ప్రతిపాదనల మేరకు తెలంగాణలో మొత్తం 23 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఆచార్య జయశంకర్‌, కొమరం భీమ్‌ పేర్ల మీద జిల్లాలు ఏర్పడనున్నాయి. జంటనగరాల్లోని రెండు జిల్లాలు మూడుగా ఏర్పడే అవకాశముంది. కొత్తగా సికింద్రాబాద్‌ పేరుతో జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలైన యాదాద్రి, భద్రాద్రి పేర్లతోనూ కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణలో మొత్తం మూడు కోట్ల 50 లక్షల 50 వేల 137 మందికి 23 జిల్లాలు ఉండాలని కలెక్టర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త జిల్లాలతో పాటు మండలాల పునర్విభజన నేపథ్యంలో 459 మండలాలకు మరో 74 మండలాలు ఏర్పడబోతున్నాయి. అలాగే ఇప్పటివరకు ఉన్న 44 రెవెన్యూ డివిజన్లకు మరో 9 రెవెన్యూ డివిజన్లు కలవనున్నాయి.

కొత్త జిల్లాలకు ఆచార్య జయశంకర్‌, కొమరం భీమ్‌ పేర్లు..
ఇక కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ఆచార్య జయశంకర్‌, కొమరం భీమ్‌ పేరున.. తెలంగాణలోని పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, భద్రాద్రి పేరున కొత్త జిల్లాలు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాలో రెండో జిల్లా ఏర్పాటు ఖాయమే అయినప్పటికి.. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెమా, భద్రాచలమా అనే దానిపై చర్చ కొనసాగుతోంది.

ప్రతి కలెక్టరేట్‌లో హెలీప్యాడ్‌...
ఇక ఇప్పటివరకు హైదరాబాద్‌, రంగారెడ్డిగా ఉన్న జిల్లాలను మూడుగా చేయాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు.. సికింద్రాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. వికారాబాద్‌ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా మారబోతుంది. ఇక ఇప్పటివరకు జాయింట్ కలెక్టర్లు ఉన్న రంగారెడ్డి జిల్లాకు.. ఆ అవసరం లేదనే అభిప్రాయాన్ని కేసీఆర్‌ వెల్లడించారు. అలాగే కొత్త జిల్లాలకు జాయింట్‌ కలెక్టర్లు అవసరం లేదని సీఎం తెలిపారు. ఇక మెహిదీపట్నంను మండలంగా ఏర్పాటు చేయాలని.. అదేవిధంగా రామచంద్రాపురం హైదరాబాద్‌ జిల్లాలో కలపాలని కేసీఆర్‌ కలెక్టర్లకు సూచించారు. ఇక జిల్లా కేంద్రం 20 నుంచి 25 ఎకరాల్లో ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు. ప్రతి కలెక్టరేట్‌లో హెలీప్యాడ్‌ ఉండాలన్నారు.

2019-20 వరకు బడ్జెట్ అంచనా రూ. 2 లక్షల కోట్లు : కేసీఆర్...
ఇక కలెక్టర్ల సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధి చక్రవడ్డీ మాదిరి రెట్టింపు అవుతూ.. అభివృద్ధి వేగం ఆక్సిలరేట్ అవుతుందని వ్యాఖ్యానించారు. కాలం ఇదే విధంగా ప్రజలకు కలిసివస్తే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-20 వరకు బడ్జెట్ అంచనా రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. పరిపాలనా ప్రజలకు మరింత చేరువగా వచ్చినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతాయన్నారు కేసీఆర్‌.

వర్షాలతో ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
ఇక రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. విషజ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్‌తో పాటు.. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు. ఇకపై ఆదిలాబాద్‌ జిల్లాలో అంటురోగాలతో మరణాలు ఉండకూడదన్నారు. ఆరోగ్యంపై గిరిజనులకు అవగాహన పెంచాలన్నారు. అవసరమైతే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏరియా ఆస్పత్రులు, మండల కేంద్రాలకు కేటాయించిన నిధులను పారదర్శకతతో ఖర్చు చేయాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

కిర్లంపూడిలో హైటెన్షన్....

తూర్పు గోదావరి : జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తుని విధ్వంసకారులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయడంతో పాటు వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.  గురువారం ఉదయం 9 గంటల నుంచి ముద్రగడ దీక్షకు దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాపు నేతలు, యువకులు కిర్లంపూడికి వచ్చే అవకాశాలున్నాయని కిర్లంపూడికి వచ్చే దారులన్నిటినీ పోలీసులు మూసివేశారు.

లోయలో పడిన బస్సు..4గురు ఆర్మీ జవాన్లు మృతి...

జమ్ముకాశ్మీర్‌ : సాంబా జిల్లాలో ఉన్న జత్వాల్ వద్ద ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. దీంతో ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. 9 మంది జవాన్లు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

నేటి నుండి ముద్రగడ నిరాహార దీక్ష ..

తూ.గోదావరి : కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఈ ఏడాది జనవరి 31న తుని కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం ఘటనలో అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడిచిపెట్టాలని ముద్రగడ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు బుధవారం సాయంత్రంతో ముగియడంతో గురువారం ఉదయం 9 గంటలకు దీక్ష చేపట్టాలని ముద్రగడ నిర్ణయించారు.

Don't Miss