Activities calendar

10 June 2016

22:14 - June 10, 2016

ముంబై : సెన్సార్ బోర్డుపై ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు కేవలం సినిమాలకు సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి.. అంతేకాని- సెన్సార్‌ చేసే అధికారం లేదని పేర్కొంది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఉడ్‌తా పంజాబ్‌ పెను దుమారం సృష్టిస్తోంది.
'ఉడ్‌తా పంజాబ్‌'పై విచారణ పూర్తి 

వివాదాస్పదంగా మారిన బాలీవుడ్‌ చిత్రం 'ఉడ్‌తా పంజాబ్‌'పై  బాంబే హైకోర్టులో విచారణ పూర్తయింది. ఈ కేసు విచారణ సందర్భంగా సెన్సార్‌బోర్డ్‌ ఛైర్మన్‌ పహలాజ్‌ నిహ్లానీని కోర్టు తీవ్రంగా మందలించింది. సెన్సార్ బోర్డు కేవలం సినిమాల ప్రామాణికతపైనే సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి కానీ వాటిని సెన్సార్ చేసే అధికారం బోర్డుకు లేదని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో సెన్సార్‌ అనే పదమే లేదని పేర్కొంది. సినిమాను ప్రజలు చూసే కన్నా ముందు దాని ప్రామాణికతను గుర్తించాల్సిన బాధ్యత సెన్సార్‌ బోర్డుదని తెలిపింది.
89 సీన్లు కట్ చేయాలన్న సెన్సార్ బోర్డు  
ఉడ్తా పంజాబ్ మూవీలో సెన్సార్ బోర్డు 89 సీన్లకు కట్ చేయాలని కోరింది. సెన్సార్ బోర్డు సినిమాలో ఇష్టమొచ్చినట్లు సీన్లను కట్‌ చేయడంతో నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ కోర్టు తలుపులు తట్టారు. సినిమాలో మాదకద్రవ్యాల అంశాన్ని అతిగా చూపిస్తున్నారని అనుకున్నప్పుడు, ఆ ఫిల్మ్ ను ఎందుకు పూర్తిగా నిషేధించలేదని సెన్సార్ బోర్డును కోర్టు ప్రశ్నించింది. టీవీ కార్యక్రమాలైనా, సినిమా అయినా ఓ రాష్ట్రాన్ని కించపరిచేవిధంగా చూపిస్తున్నారని అనిపిస్తే, ఆ అంశాన్ని ప్రజలకే వదిలేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సినిమా టైటిల్ మార్చమనడం ద్వారా పంజాబ్ డ్రగ్స్ కు మాత్రమే ప్రసిద్ధిగాంచిందని  చెప్పదలుచుకున్నారా అని సెన్సార్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 
తుది తీర్పు సోమవారానికి వాయిదా 
ఉడ్తా పంజాబ్ చిత్రంలో ఉన్న బూతు పదాలు, సీన్లను తొలిగించాలని సెన్సార్ బోర్డు కోర్టు విచారణ సందర్భంగా కోరింది. ఆ ఫిల్మ్ లో ఓ శునకానికి చాకీ చాన్ పేరు పెట్టారని, ఇది వివాదాస్పదమవుతోందని సెన్సార్ బోర్డు వాదించింది. అందుకే ఆ సీన్ ను కట్ చేసినట్లు బోర్డు కోర్టుకు విన్నవించింది. ఓ సాంగ్ లో హీరో షాహిద్ కపూర్ పబ్లిక్ ముందు మూత్రం పోస్తున్నట్లు ఉన్న సీన్ ను కట్ చేసేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఈ కేసుపై తుది తీర్పును బాంబే హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
భారత్‌ను సౌదీ అరేబియాలా మార్చాలనుకుంటున్నారా : మహేష్ భట్ 
ఉడ్‌తా పంజాబ్‌ విడుదలపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో చిత్ర నిర్మాత అనురాగ్‌ కశ్యప్ -బాలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు పూర్తి మద్దతు ప్రకటించారు. భారత్‌ను సౌదీ అరేబియాలా మార్చాలనుకుంటున్నారా అంటూ నిర్మాత మహేష్‌ భట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉడ్‌తా పంజాబ్‌' యువతకు సందేశమిచ్చే మంచి సినిమా అంటూ హీరో షాహిద్‌ కపూర్‌ పేర్కొన్నారు.
ఉడ్తా పంజాబ్ పై పెద్ద ఎత్తున చర్చ 
ఉడ్తా పంజాబ్ సినిమా వివాదంపై సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమా జూన్‌ 17న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, పంజాబ్‌ సింగర్ దిల్జిత్‌ నటిస్తున్నారు. 

 

ఎపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కార్‌  కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా ఇప్పటికే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిబంధనలు ఖరారయ్యాయి. ఒకేచోట 3 ఏళ్ల లోపు పని చేస్తున్నవారిని బదిలీ చేయొద్దని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. 

 

ముద్రగడ ఒప్పుకుంటే తుని కేసును సీబీఐకి అప్పగిస్తాం : చినరాజప్ప

హైదరాబాద్ : ముద్రగడ పద్మనాభం ఒప్పుకుంటే తుని కేసును సీబీఐకి అప్పగిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈమేరకు ఎపి మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఐడీ నిజాయితీగా దర్యాప్తు చేసిందని తెలిపారు. 

 

22:02 - June 10, 2016

హైదరాబాద్ : నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కార్‌  కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా ఇప్పటికే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిబంధనలు ఖరారయ్యాయి. ఒకేచోట 3 ఏళ్ల లోపు పని చేస్తున్నవారిని బదిలీ చేయొద్దని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. 

22:00 - June 10, 2016

హైదరాబాద్ : ముద్రగడ పద్మనాభం ఒప్పుకుంటే తుని కేసును సీబీఐకి అప్పగిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈమేరకు ఎపి మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఐడీ నిజాయితీగా దర్యాప్తు చేసిందని తెలిపారు. 

 

21:40 - June 10, 2016

ఏడాదికి లక్షా 50 వేల మంది..!!,  గడప దాటితే ఇల్లుచేరే గ్యారంటీ లేదు..!! ఏ మలుపులో ఏ వాహనం దూసుకొస్తుందో..? ఏ క్షణంలో ఏ ప్రమాదం పొంది ఉందో...? రోడ్డు ప్రమాదాలపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:23 - June 10, 2016

తూర్పుగోదావరి : తుని కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని ఇవాళ అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. ఇవాళ అరెస్టైన వారిలో ముద్రగడ ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. 3నెలల క్రితం జరిగిన రైలు దగ్థం కేసులో.. సీఐడీ దాదాపు దర్యాప్తు పూర్తి చేసింది. పక్కా ఆధారాలు సేకరించిన తరువాతనే అరెస్టుల చేపట్టారని అధికారులు తెలిపారు. 

 

21:14 - June 10, 2016

ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన, హైదరాబాద్ లో సరువుకానున్న బోనాల సందడి, దేవుళ్లను ట్యాప్ చేస్తున్న మోత్కుపల్లి, కూలిపనికి పోయిన పరిటాల సునితమ్మ, సీఎం కేసీఆర్ కు గుడ్ న్యూస్, సర్కార్ బడులకు ఊపిరి.... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:55 - June 10, 2016

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ హస్టల్ విద్యార్థినిలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. హస్టల్ లో వడ్డించే ఆహార పదార్థాలు సరిగా ఉండటం లేదని ఆరోపించారు. అన్నంలో పురుగులు వస్తున్నా... అదే విధంగా వడ్డిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఛీప్ వార్డన్ కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 

20:52 - June 10, 2016

హైదరాబాద్ : పార్టీ మారే ఆలోచనలో ఉన్న పలువురు నాయకులతో చర్చలు జరుపుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఇందులో భాగంగా ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్‌, వినోద్‌, ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మాట్లాడారని.. తెలిపారు.  కాంగ్రెస్‌ లో వారికి ఎదురైన ఇబ్బందులు తెలుసుకుని.. వారిని పార్టీలోనే ఉండేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని మల్లు రవి తెలిపారు. 

 

20:49 - June 10, 2016

ఏలూరు : కాపు జాతికి న్యాయం జరగడం ముద్రగడ పద్మనాభంకు ఇష్టం లేదని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ముద్రగడ పద్మనాభం దీక్షలు చేస్తున్నారని, జిల్లాలో ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు.   

 

20:45 - June 10, 2016

విజయవాడ : శాంతి భద్రతల విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తే ఉరుకునేది లేదని ఎపి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారి వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమన్నారు. ఈ కేసులో అన్ని విషయాలు పూర్తయ్యాకే అరెస్టులు జరిగాయన్నారు. వారిని విడుదల చేయటం కుదరదని తెలిపారు.  వారిని విడిచిపెట్టాలని ముద్రగడం కోరడం సరికాదని పేర్కొన్నారు. 

కాపు సంఘాల సమాఖ్య ఆత్మీయ సమ్మేళనం

గుంటూరు : మంగళగిరిలో హ్యాపీ రిసార్ట్స్ లో కాపు సంఘాల సమాఖ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎపి టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రామానుజయ హాజరయ్యారు. కాపు రిజర్వేషన్లకై కిందిస్థాయిలో ప్రజలు అభిప్రాయ సేకరణకు సమావేశం ఏర్పాటు చేశామని కళా వెంకట్రావు తెలిపారు.

కాపు జేఏసీ సమన్వయ వేదిక భేటీ

విజయవాడ : ఐలాపురంలో కాపు జేఏసీ సమన్వయ వేదిక భేటీ అయింది. ముద్రగడ అరెస్టుకు నిరసగా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. ముద్రగడకు ఏదైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలని విజయవాడ కాపు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు.

సారంకిపాలెం గ్రామస్తులపై రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ సోదరుడు దాడి

గుంటూరు : నగరం మండలం సారంకిపాలెంలో గ్రామస్తులపై రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ సోదరుడు దాడికి పాల్పడ్డాడు. రోడ్లు సరిగా లేవని వాట్సాప్ మెసేజ్ లు పెడతారా అని యువకులపై దాడి చేశారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఇంటి ఎదుట సారంకిపాలెం గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్యాక్సీల ఛార్జీ పెంపు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్యాక్సీల ఛార్జీలు పెంచారు. ఉదయం పూట కి.మీ.కు రూ.17, రాత్రి పూట కి.మీ.కు రూ.20లు పెంచారు. సర్వీస్ చార్జీ రూ.30 కి పెంచారు.

ఎసిబికి పట్టుబడ్డ మున్సిపల్ ఏఈ రవి

శ్రీకాకుళం : రూ.10 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏఈ రవి ఎసిబికి పట్టుబడ్డారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉత్తరాఖండ్‌లో తూ.గో జిల్లా వాసుల ఇక్కట్లు

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో తూర్పుగోదావరి జిల్లా పర్యాటకులు ఇక్కట్లు పడుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న రైలు లాల్‌గూడ సమీపంలో నిలిచిపోయింది. ఉదయం నుంచి రైలు నిలిచిపోవడం, వేరే ప్రత్యామ్నాయం లేక టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా తుని వాసులు.

 

19:27 - June 10, 2016

అనంతపురం : జిల్లాలో సాయి భావన చిట్‌ఫండ్‌ సంస్థ ఎదుట ఖాతాదారులు ఆందోళన చేశారు.  చిట్‌ కాలపరిమితి పూర్తైనా తమకు రావాల్సిన డబ్బు అందలేదని.. తమకు ఇచ్చిన బ్యాంకు చెక్కులు కూడా బౌన్స్‌ అయ్యాయని బాధితులు తెలిపారు. అయితే  ఈ మధ్య కాలంలో కలెక్షన్స్‌ లేకపోవడంతోనే కస్టమర్లకు సకాలంలో డబ్బు చెల్లించలేకపోయామని.. 25వ తేదీలోపు బకాయిలన్నీ క్లియర్‌ చేస్తామని సంస్థ మేనేజర్‌ తెలిపారు.  

 

19:24 - June 10, 2016

గుంటూరు : రాజధాని ప్రాంతంలోని భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు నిలిపివేయటాన్నినిరసిస్తూ బాధితులు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాన్నిముట్టడించారు. ఈ సందర్భంగా .. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతులను భయపెట్టి భూములు లాక్కోటానికి వేసిన చంద్రబాబు కుట్ర ఇదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. 

 

19:20 - June 10, 2016

కడప : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం రసాభాసాగా జరిగింది. నీరు-చెట్టు కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ సభ్యులు ఆరోపించగా... దానిని నిరూపించాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే సభలో అధికార పార్టీ తీరుకు నిరసనగా మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి వాకౌట్‌ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా నీరు-చెట్టు కార్యక్రమంలో జరిగిన అవినీతిని నిరూపిస్తానని.. లేకుంటే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే సవాల్ చేశారు. 

 

19:16 - June 10, 2016

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో తూర్పుగోదావరి జిల్లా పర్యాటకులు ఇక్కట్లు పడుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న రైలు లాల్‌గూడ సమీపంలో నిలిచిపోయింది. ఉదయం నుంచి రైలు నిలిచిపోవడం, వేరే ప్రత్యామ్నాయం లేక టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా తుని వాసులు.

 

19:10 - June 10, 2016

విజయవాడ : ముద్రగడ దీక్ష వెనక ప్రతిపక్షనేత జగన్‌ ఉన్నారనీ.. జగన్ రాసే స్క్రిప్ట్ ఆధారంగానే ముద్రగడ కార్యాచారణ రూపొందించుకుంటారని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ముద్రగడ్డ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాపు సామాజిక వర్గం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదముందన్నారు. తుని ఘటన కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

 

ఉన్నతాధికారులతో ఎపి సీఎస్ టక్కర్ సమావేశం

హైదరాబాద్ : ఎపి సచివాలయం తరలింపుపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఎపి సీఎస్ టక్కర్ సమావేశం అయ్యారు. ఉద్యోగుల తరలింపు రోడ్డు మ్యాప్, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. 

18:44 - June 10, 2016

వాషింగ్టన్ : అమెరికాలో డెమొక్రాట్లు ఏకమయ్యారు. పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్‌కు అగ్రనేతలంతా మద్దతు పలికారు. ఒబామాతో పాటు.. అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన శాండ్లీర్స్ కూడా హిల్లరీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కోవడానికి కొండంత అండ లభించడంతో హిల్లరీ కదనరంగంలో కత్తులు దూసేందుకు సిద్ధమయ్యారు. హిల్లరీ క్లింటన్‌ ప్రస్థానంపై ప్రత్యేక కథనం...
హిల్లరీకి మద్దతు ప్రకటించిన ఒబామా
అమెరికాలో సరికొత్త చరిత్ర లిఖితమవుతుందా! ప్రజాస్వామ్యం, సమానత్వంవంటి అంశాల విషయంలో ఏమాత్రం రాజీపడని ఆ దేశ ప్రజలు ఈసారి ఓ మహిళను తమ పాలకురాలిగా ఎన్నుకుంటున్నారా! ఈ అంశంపై ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొంది. ఎంతోమంది అగ్రనాయకులున్న అమెరికాలో తొలిసారిగా ఓ మహిళ అయిన హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పీఠం నామినీ స్థానాన్ని దక్కించుకున్నారు.
అధ్యక్ష పీఠంపై కన్నేసిన డెమోక్రటిక్ పార్టీ  
ఇప్పటికే రెండుసార్లు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న డెమొక్రటిక్ పార్టీ మూడోసారి కూడా ఆ పీఠంపై కన్నేసింది. డెమాక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటి చేయడానికి అభ్యర్థిత్వం ఖరారైన హిల్లరీ క్లింటన్‌కు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ప‌ద‌వికి హిల్లరీ వందశాతం అర్హురాల‌ని, ఆమె తరపున ప్రచారం చేస్తానని ఒబామా అన్నారు. డెమాక్రాట్లంతా ఏకమై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఒబామా పిలుపుతో అధ్యక్షపదవి అభ్యర్థి కోసం హిల్లరీతో పోటీ పడ్డ బెర్నీ శాండర్స్ మెత్తబడ్డారు. డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడైతే చాలా ప్రమాదమన్నారు. హిల్లరీ క్లింటన్‌తో కలిసి పని చేస్తానని, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కూడా హిల్లరీకి మద్దతు తెలిపారు.  హిల్లరీతో కలిసి ఒబామా ఈనెల 15 విస్కాన్‌సిన్‌ రాష్ట్రంలోని గ్రీన్‌ బేలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
పెరిగిన హిల్లరీ బలం
ఒబామా చొరవతో డెమాక్రటిక్‌లంతా ఏకతాటిపైకి రావడంతో హిల్లరీ బలం అనూహ్యంగా పెరిగింది. ఒబామా తనను బ‌ల‌ప‌ర‌డంపై హిల్లరీ హర్షం వ్యక్తం చేశారు. ఒబామా మ‌ద్దతు ప్రకటించ‌డ‌మంటే ప్రపంచ‌మే అండ‌గా ఉన్నట్లు హిల్లరీ క్లింట‌న్ వ్యాఖ్యానించారు.
సామాజిక సేవలందిస్తున్న హిల్లరీ
ఎన్నికలతో సంబంధం లేకుండా హిల్లరీ సామాజిక సేవలందిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు, వారి పిల్లల కోసం ఆమె జీవితమంతా పోరాడుతున్నారు. హిల్లరీ ప్రచారం కూడా కోట్లాది మందిని ఆకట్టుకుంటోంది. మహిళలను, ముస్లింలను, శరణార్థులను అవమానించిన డోనాల్డ్‌ట్రంప్‌కు అధ్యక్షుడయ్యే అర్హత లేదని హిల్లరీ దుయ్యబట్టారు. మెక్సికో సంతతకి చెందిన జడ్జీపై ట్రంప్ చేసిన జాత్యహంకార పూరిత విమర్శలను తీవ్రంగా ఖండించారు.  తొలి మహిళా అధ్యక్షురాలిగా గెలిచి రికార్డు సాధించాలనుకుంటున్న హిల్లరీ తన విజయ ప్రస్థానాన్ని గొప్పగొప్ప కలలుకనే అమ్మాయిలకు అంకితమిచ్చారు.

 

18:39 - June 10, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో అన్ని రంగాల్లో సంక్షోభం ఏర్పడిందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. బాబు అధికారంలోకి వచ్చాడు కానీ ఒక్కరికి కూడా జాబు రాలేదని ఎద్దేవా చేశారు. 

 

తుని ఘటన కేసులో మరో ఆరుగురు అరెస్టు

రాజమండ్రి : తుని ఘటన కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టు చేసిన వారి సంఖ్య 13కు చేరింది. అరెస్టైన వారిలో ముద్రగడ పద్మనాభం ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. 

17:38 - June 10, 2016

హైదరాబాద్ : అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదంటూ.. హైదరాబాద్‌లో బ్యాంకు అధికారులు ఆందోళనకు దిగారు. నగరంలోని మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్ యాజమాన్యం.. వివిధ బ్యాంకుల నుంచి 850కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. ఇందులో ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచే 118 కోట్లు అప్పుగా తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదాలు చెల్లంచడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఈరోజు హోటల్ ముందు బ్యాంకు సిబ్బంది ధర్నాకు దిగారు. 

 

17:36 - June 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదని చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చేనేత కార్మికులు ఆదాయం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ జూన్‌ 23 నుంచి జూలై ఒకటో తేదీ వరకు చేనేత చైతన్య బస్సు యాత్ర చేపడుతున్నామని ఆయన తెలిపారు. 

 

16:55 - June 10, 2016

అక్రూట్స్ తినడానికి కాదు, చూసేందుకు కూడా బాగుంటాయి. మరి అలా అందంగా కనిపించే అక్రూట్స్ షెల్స్ ని వృధాగా పారేయడమేనా? అవసరం లేదు.. అందమైన హ్యాంగింగ్స్ తయారుచేసుకోవచ్చు.. అదెలాగో ఇవాళ్టి సొగసులో తెలుసుకుందాం. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:51 - June 10, 2016

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా ఛైర్ పర్సన్ మరో ప్రత్యేకత సాధించారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ కు సారథ్యం వహిస్తున్న ఆమె ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచిన మొదటి మహిళగా హిల్లరీ క్లింటన్ ప్రత్యేకత సాధించారు.

సిరియా పార్లమెంట్ ఒక మహిళ స్పీకర్ గా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన ఆమె స్పీకర్ గా ఎన్నికయిన మొదటి మహిళగా ప్రత్యేకత సాధించారు.

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2016 సంవత్సరానికి గాను జాతీయ మహిళా విధానానికి సంబంధించిన ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాపై విభిన్న వర్గాల నుండి సూచనలు, సలహాలను ఆహ్వానించింది.

రొలాండ్ గారోస్ లో పెను సంచలనం. ప్రపంచ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ కు షాక్. తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన ముగురుజ. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

16:44 - June 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎర్రవెల్లిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఎర్రవెల్లికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. రెండు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తయ్యాక యాగం చేసి ప్రారంభించుకుందామని వెల్లడించారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని రిలయన్స్ సంస్థలను కోరడం జరిగిందని తెలిపారు. రెండేళ్లలో పాములపర్తి వద్దకు గోదావరి నది జలాలు వస్తాయన్నారు. ప్రతి ఇంటికి రెండు బర్రెలను, పది దేశవాళీ కోళ్లను ప్రభుత్వమే కొనిస్తుందని, ఇతరులకు ఈ అవకాశం ఉండదన్నారు. శ్రావణమాసంలో ఎల్ ఈడీ బల్బులతో పండుగ చేసుకుందామని, ఇక్కడే తాను కూడా భోజనం చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెండు గ్రామాల పక్షాన జేసీకి సన్మానం చేయాలని సూచించారు. తన జాతకంలో ఏ పని చేపట్టినా ఓడిపోలేదని, అలాగే ఎర్రవెల్లి, నర్సన్నపేటలో అభివృద్ధి జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం నివాసాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు 48 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. 

 

ఫార్మా సిటీ ఏర్పాటుకు టి.సర్కార్ ఉత్తర్వులు...

హైదరాబాద్ : రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సరిహద్దులో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ఐఐసీ నోడల్ సంస్థగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నారు. 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు కానుంది.

మియాపూర్ లో రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : మియాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వాహనము ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

కర్నాటక పోలీసు వెబ్ సైట్ హ్యాకింగ్..

బెంగ‌ళూరు : క‌ర్నాట‌క పోలీసు శాఖ‌కు చెందిన వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్థాన్‌కు చెందిన హ్యాక‌ర్లు వెబ్‌సైట్‌పై జెండాను పోస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది.

16:31 - June 10, 2016

హైదరాబాద్ : కాపునేత ముద్రగడ పద్మనాభం అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కాపుల ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని పాలించాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. అంబటి ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే వాటిని అమలు చేయించేందుకు ప్రజలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనవరి 31 తునిలో ఒక రైలు, రెండు రైళ్లు దగ్ధం అయ్యాయని తెలిపారు. తుని ఘటన పరిస్థితులను చంద్రబాబే కల్పించారని ఆరోపించారు. 

 

యాగం అయ్యాక ఇళ్లు ప్రారంభం - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎర్రవెల్లిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. రెండు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తయ్యాక యాగం చేసి ప్రారంభించుకుందామని వెల్లడించారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని రిలయన్స్ సంస్థలను కోరడం జరిగిందని తెలిపారు. రెండేళ్లలో పాములపర్తి వద్దకు గోదావరి నది జలాలు వస్తాయన్నారు. ప్రతి ఇంటికి రెండు బర్రెలను, పది దేశవాళీ కోళ్లను ప్రభుత్వమే కొనిస్తుందని, ఇతరులకు ఈ అవకాశం ఉండదన్నారు.

16:00 - June 10, 2016

గుంటూరు : కాదేదీ కబ్జాలకు అనర్హం అంటారు. సర్కారీ భూములు, చెరువులు, కుంటలు... ఇలా అన్నీ కూడా కబ్జాల జాబితాలో చేరుతున్నాయి. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో ఈ నయా దందా నడుస్తోంది. ప్రభుత్వం భూములు, చెరువులు కనిపిస్తే చాలు.. కబ్జారాయుళ్లు గద్దల్లా వాలిపోతున్నారు. ఎకరాలకు ఆక్రమించుకుని అక్రమ లే అవుట్లు వేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో ఉన్న వెలడపూడికి కూతవేటు దూరంలో ఉన్న మందడం గ్రామంలో జరుగుతున్న కబ్జాల పర్వంపై 10 టీవీ ప్రత్యేక కథనం....
కబ్జాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా అమరావతి
ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు కబ్జాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారింది. కబ్జారాయుళ్లు సర్కారీ భూములు, చెరువులను గద్దల్లా తన్నుకుపోతున్నా అటు సీఆర్‌డీఏ, ఇటు రెవిన్యూ అధికారులు పట్టించుకోపోవడం లేదు. రాజధాని ఏర్పాటులో అమరావతి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో 20-30 లక్షల రూపాయలుగా ఉన్న ఎకరం ఇప్పుడు రెండు కోట్లకు చేరింది. దీంతో కబ్జాదారుల కళ్లు ప్రభుత్వ స్థలాలు, చెరువులపై పండింది. తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న వెలగూడికి అతిసమీంలో ఉన్న మందడం గ్రామాల్లో చెరువులో చాలా భాగం కబ్జారాయుళ్ల కోరల్లోకి వెళ్లిపోయింది.
ఆక్రమణలకు గురైన చెరువు భూమి 35 ఎకరాలు
మందడం గ్రామంలోని ఆక్రమణలు, ఇక్కడ వెలుస్తున్న షెడ్లను చూస్తే ఎవరికైనా కబ్జాల పర్వం ఇట్టే అర్ధం అవుతుంది. ఈ చెరువు విస్తీర్ణం 50 ఎకరాలు. కానీ ప్రస్తుతం మిగిలివుంది 15 ఎకరాలే. అంటే 35 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యింది. చెరువును ఆక్రమించుకున్న వారికి గతంలో బీ ఫారం పట్టాలు ఇచ్చారు. అయితే రాజధాని ప్రకటించిన తర్వాతే ఆక్రమణలు ఎక్కువ అయ్యాయి. ఈ పర్వం గురించి గ్రామస్థులు జాయింట్‌ కలెక్టర్‌ నుంచి తహశీల్దార్‌ వరకు ఫిర్యాదులు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దిక్కులేదు. దీంతో ఆక్రమణదారుల వెనుక ఏవో బలమైన శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కబ్జాదారుల ఆగడాలు
తాత్కాలిక సచివాలయం నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఇంటి అద్దెలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఆక్రమిత స్థలాల్లో రాత్రికి రాత్రే రేకుల షెడ్లు, భవనాలు వెలుస్తున్నాయి. సీఆర్‌డీఏ, రెవిన్యూ, పోలీసు అధికారులు ఎవరికివారే చేతులు ముడుచుకుని కూర్చువడంతో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. ఆక్రమణలు మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కబ్జాదారులు దాడులకు పాల్పడే పరిస్థితులు కూడా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పాలకులు జోక్యం చేసుకుని ఆక్రమణదారుల ఆట కట్టించి, కబ్జాలకు తెరదించాలని కోరుతున్నారు. ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.

 

15:57 - June 10, 2016

బెంగళూరు తరహాలో మరో దారుణం..ఏటీఎంలో ఆగంతకుడి వీరంగం..ఓ వ్యక్తిపై అటాక్ చేశాడు..

హాలో మీరు ఏటీఎంలకు వెళుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త...లోపలికి ఎవరూ రానీయకుండా చూసుకోండి. ఎందుకు అంటారా ? మళ్లీ అదే దారుణం చోటు చేసుకుంది. బెంగళూరులో బ్యాంకు ఉద్యోగినిపై ఏటీఎం సెంటర్ లో దాడి ఘటన ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. రాజస్థాన్ లో మరో ఏటీఎంలో ఖాతా దారుడిని దోచుకోవడానికి వచ్చిన దుండగుడు బీభత్సం సృష్టించాడు. కత్తితో కర్కశంగా పొడిచేశాడు. ఏటీఎం సెంటర్ లో ఎన్ని దారుణ సంఘటనలు జరుగుతున్నా బ్యాంకు అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

బాబు ప్రాజెక్టులను అడ్డుకుంటుంటే సమర్థన ఎందుకు- బాల్క సుమన్..

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు అడ్డుకుంటుంటే టి.టిడిపి నేతలు ఎందుకు సమర్థిస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఏఆర్ బీఎమ్ లోకి తెలంగాణ ప్రాజెక్టులు తెస్తే ఊరుకోమని, తెలంగాణకు కేటాయించిన ప్రతి నీటి చుక్కను వాడుకుంటామన్నారు. టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

 

అసెంబ్లీలో బెంచ్ ఎక్కిన బీజేపీ ఎమ్మెల్యే...

ఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీలో ఆప్ - బీజేపీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బెంచ్ పైకి ఎక్కి బీజేపీ ఎమ్మెల్యే విజయేందర్ గుప్తా నిరసన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకర్ల కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విజయేందర్ తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముద్రగడ దీక్ష వెనుక జగన్ - మంత్రి గంటా..

విశాఖ : కాపు ఉద్యమ నేత ముద్రగడ దీక్ష వెనుక జగన్ ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తుని ఘటనలో అమాయకులెవరినీ అరెస్టు చేయలేదని, తీవ్రవాదులకంటే దారుణంగా ప్రవర్తించిన వారిని నెలల తరబడి విచారించాకే అరెస్టు చేశామని చెప్పుకొచ్చారు. చంద్రబాబును విమర్శించడం ముద్రగడకు తగదని, తలుపులు వేసుకుని దీక్ష చేస్తున్నారంటే ప్రజలు నమ్మరని తెలిపారు.

ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్..

మెదక్ : ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా నిరుద్యోగ యువకులకు 48 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు.

 

హైకోర్టుకు వెళ్లిన కాపు జాగృతి నేతలు..

కృష్ణా : కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన దానిపై హైకోర్టులో కాపు జాగృతి నేతలు పిటిషన్ దాఖలు చేశారు.

 

డెన్మార్క్ మహిళ రేప్ కేసులో నిందితులకు జీవిత ఖైదు..

ఢిల్లీ : డెన్మార్క్ కు చెందిన మహిళను రేప్ చేసిన కేసులో అయిదుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు శిక్ష‌ ఖరారు చేసింది. 2014లో ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకంది. డేనిష్ మహిళను ఓ పార్క్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు ఈ కేసులో తీర్పును వెలువరించింది.

బీజేపీ ఎమ్మెల్యే దుర్మరణం..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నేపానగర్‌కు చెందిన బీజేపీ శాసనసభ్యుడు రాజేంద్ర దాడు దుర్మరణం చెందారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ నివాసంలో జరిగే పార్టీ సమావేశానికి ఇండోర్-భోపాల్ రోడ్డులో వెళుతుండగా కార్డు బోల్తాపడింది. ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు.

జగన్ వన్నీ కుట్రలే - మంత్రి ఉమా..

విజయవాడ : వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రజా సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని జగన్, ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

15:35 - June 10, 2016

భార్య ఎదుటే ప్రియురాలితో ఛాటింగ్..ఫోన్ లో గంటల తరబడి ముచ్చట్లు..నిలదీసిన ఇల్లాలిని హతమార్చిన భర్త..

పెళ్లి అయినా ఇతగాడు తన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఎప్పటిలాగానే లవర్ కు ఛాటింగ్ లు..మెసేజ్ లు..ఇదంతా రహస్యంగా కాదు..భార్య ముందే ఇదంతా చేసేవాడు. ప్రేమ మైకంలో మునిగిపోయిన ఇతడు తన లవ్ మేటర్ ను తెలిపేందుకు ఇల్లాలి ఎదుట ఎన్నో వేషాలు వేశాడు. నిలదీసిందని భార్యను ఈ కిరాతకుడు అతి దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన 45 రోజులకే కట్టుకున్న వాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రమాదంగా చిత్రించి నిందితుడు పట్టుబడ్డాడు. ఎలా పట్టుబడ్డాడో ? వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

15:27 - June 10, 2016

సీఐడీ హోం గార్డు..సబ్ ఇన్ పెక్టర్, కారు డ్రైవర్ కానిస్టేబుల్..వ్యభిచారం చేస్తున్న మహిళ రిపోర్టర్...వీరందరినీ తయారు చేసింది ఓ ఛానల్ సీఈవో..

మాములుగా ఎవరినైనా బెదిరించినా..డబ్బు డిమాండ్ చేసినా అంతే..వెంటనే బొక్కలోకి తీసేస్తుంటారు. ఎందుకంటే వారు ఏం తప్పు చేయలేదు కాబట్టి. అదే తప్పుడు పనులు చేసే వారైతే..ఈ ఆలోచల నుండి పుట్టుకొచ్చింది ఓ గ్యాంగ్..ఎవరైతే నేరాలు చేస్తారో తప్పుడు పనులు చేస్తారో వారే లక్ష్యంగా దోపిడిలు మొదలు పెట్టారు. ఆరోపణల్లో సక్సెస్ అయినా ఆ గ్యాంగ్ తరువాత చెలరేగిపోయింది. మహానగరంలో ఎంతోమందిని బెదిరించి హఢల్ గొట్టి వసూలు చేశారు. అయినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. చివరికి ఆ ముఠా పాపం పండింది. ఓ కిడ్నాప్ వ్యవహరంలో పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. సీఐడీ హోం గార్డు..సబ్ ఇన్ పెక్టర్, కారు డ్రైవర్ కానిస్టేబుల్..వ్యభిచారం చేస్తున్న మహిళ రిపోర్టర్...వీరందరినీ తయారు చేసింది ఓ ఛానల్ సీఈవో..వాటాలు పంచుకంటూ దందాలు చేశారు. నేరాలు చేస్తున్న వారి నుండి వీరు వసూళ్లకు పాల్పడ్డారు. మరి ఆ న్యూస్ ఛానెల్ సీఈవో ఎవరు ? ఇతరత్రా విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

15:23 - June 10, 2016

నా ప్రాణాలకు ముప్పు ఉంది..ఏదైనా జరిగినా జంకేది లేదు..చంపేస్తే దెయ్యమై వస్తా..పట్టిపీడిస్తా..వదిలేది లేదు..

కర్నాటక రాష్ట్రంలో డీఎస్పీ ప్రకంపనలు సృష్టించింది. ఫేస్ బుక్ లో ఆమె చేసిన పోస్టు కలకలం రేపుతోంది. ఆమె కోసం పోలీసులే వేట మొదలు పెట్టారు. ప్రస్తుతం డీఎస్పీ అనుపమ ఎక్కడ ? ఈ విషయంలో సర్కార్ ఏం చేయబతోంది ? అన్నది హాట్ టాపికై కూర్చొంది. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసిన మరుక్షణం అక్కడ ఆమె కనిపిస్తుంది. ఎంతటి వారైనా సరే తాట తీస్తుంది. ఆమె అంటే హఢల్..పనిలో సిన్సియార్టీకి పెట్టింది పేరు. నన్ను చంపేస్తే దెయ్యమై వస్తా.. అంటూ డీఎస్పీ అనుపమ ఫేస్ బుక్ లో పోస్టు చేసి సంచలనం సృష్టించింది. అనుపమ రాజీనామాను ఆమోదించేది లేదని సర్కార్ తేల్చిచెప్పడంతో ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

14:53 - June 10, 2016

ఢిల్లీ : రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఈ ఘటనల్లో గంటకు 17 మంది బలవుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నది ఎంతో భవిష్యత్‌ ఉన్న యువత కావడంపై ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు. దాదాపు 80 శాతం ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది. కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్క్‌ గడ్కరీ... 2015లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై విడుదల చేసిన నివేదికలోని అంశాలను పరిశీలిస్తే నివ్వెరపోయే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. 2014తో పోలిస్తే 2015లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. రోజుకు సగటున 1374 ప్రమాదాలు జరుగుతుంటే..400 మంది మరణిస్తున్నారు. ప్రమాదాలు 2.5 శాతం పెరిగితే, మృతుల సంఖ్య 4.6 శాతం ఎక్కువయ్యింది. గంటకు 57 ప్రమాదాలు జరుగుతుంటే.. 17 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోతున్నాయి. గతేడాది మన దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే... 1,46,133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు లక్షల 279 మంది గాయపడ్డారు. రోడ్ యాక్సిడెంట్లో బైక్‌ ప్రమాదాలే ఎక్కువ. 87 శాతం బైక్‌ ప్రమాదాలే. కారు ప్రమాదాలు 23.6 శాతం ఉన్నాయి. ట్రాక్టర్లు, ట్రక్కుల ప్రమాదాలు 19.7 శాతం, బస్పు ప్రమాదాలు 8 శాతం, ఆటో ప్రమాదాలు 6 శాతం ఉన్నట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. తమిళనాడులో ఎక్కుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

యూపీ అగ్రస్థానం..
అయితే రోడ్డు ప్రమాద మృతుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా అగ్రస్థానంలోనే ఉన్నాయి. ఏపీలో 7వ స్థానంలో ఉంటే, తెలంగాణ 10వ స్థానాన్ని ఆక్రమించింది. ఏపీలో 24,258 ప్రమాదాలు జరిగితే, తెలంగాణలో 21,252 యాక్సిడెంట్లు చేటుచేసుకున్నాయి. ఏపీలో 8,297, తెలంగాణలో 7,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 29,439 మంది గాయపడితే. తెలంగాణలో 22,948 మంది క్షతగాత్రులయ్యారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమదాలకు కారణాలుగా గుర్తించారు. 80 శాతం ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయి. మృతుల్లో ఎక్కవ మంది యువతే. 15-34 ఏళ్ల మధ్యన ఉన్న యువత భవిష్యత్‌ భుగ్గిపాలవుతోంది. మృతుల్లో యువత 54.1 శాతం ఉంటున్నట్టు గుర్తించారు. రోడ్‌ టెర్రర్‌ ఆందోళ కలిగిస్తున్న నేపథ్యంలో వీటికి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారులపై స్పీడ్‌గన్స్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిబంధనలను అతిక్రమించే వాహన చోదకులకు భారీగా జరిమానా విధించేలా చట్టాలను సవరించాలని ప్రతిపాదించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ చర్యలు ఎంతవరకు అమల్లోకి వస్తాయో చూడాలి.

14:47 - June 10, 2016

ఢిల్లీ : రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ ప్రవర్తన ఉందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేస్తున్న ముద్రగడ దీక్ష భగ్నంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. ఆయన ప్రభుత్వం పలు ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. దీనితో టిడిపి మంత్రులు..ఇతరులు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి పరిపాలనను అస్తవ్యస్థం చేయాలనే ఉద్దేశ్యంతోనే జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.

14:42 - June 10, 2016

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో మళ్లీ తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత మూడు రోజులుగా వీరు నిరసన వ్యక్తం చేశారు. మూడో రోజైన గురువారం కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. ఆంధ్రాకు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఆంధ్రాకు వెళ్లమని..తెలంగాణలో ఉంటామని నినాదాలు చేశారు. సచివాలయంలో నిజమైన ఉద్యమం నడిపింది తామేనని, తెలంగాణ నేతలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటాయింపులను వ్యతరేకిస్తూ ధర్నా చేసిన నాల్గవ తరగతి ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమస్యను వెంటేనే పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఉడ్తా పంజాబ్ పై వాదనలు పూర్తి..

ముంబై : ఉడ్తా పంజాబ్ పై బాంబే హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సీబీఎఫ్ సిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. సినిమా అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా ప్రేక్షకులకే వదిలేయాలని, సెన్సార్ అనే పదం చట్టంలో లేదని పేర్కొంది.

రాజ్ నాథ్ కు కోపం వచ్చింది..

ఉత్తర్ ప్రదేశ్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కోపం వచ్చింది. చెంపలు పగులుతాయని అల్లరి చేస్తున్న వారిని హెచ్చరించారు. లక్నోలోని మౌ వద్ద నియోన్ ఫెర్టిలైజర్ గురించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొంతమంది దురుసుగా ప్రవర్తించి అల్లరి చేయడంతో మంత్రి పై విధంగా స్పందించారు.

రాజ్ నాథ్ కు కోపం వచ్చింది..

ఉత్తర్ ప్రదేశ్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కోపం వచ్చింది. చెంపలు పగులుతాయని అల్లరి చేస్తున్న వారిని హెచ్చరించారు. లక్నోలోని మౌ వద్ద నియోన్ ఫెర్టిలైజర్ గురించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొంతమంది దురుసుగా ప్రవర్తించి అల్లరి చేయడంతో మంత్రి పై విధంగా స్పందించారు.

ఎస్బీహెచ్ విలీనానికి వ్యతిరేకం- సురవరం..

హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఎస్ బీహెచ్ విలీనానికి తాము వ్యతిరేకమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జులై 28, 29న ఎస్బీహెచ్ ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు తెలిపారు.

ముద్రగడ దీక్షపై సోమిరెడ్డి స్పందన..

హైదరాబాద్ : తుని ఘటనలో ప్రభుత్వం పలువురిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాపునేత ముద్రగడ పద్మనాభం దీక్ష‌కు దిగ‌డం ప‌ట్ల‌ తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందించారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ర‌ఘువీరా రెడ్డి ముద్ర‌గ‌డ వైపు మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

13:54 - June 10, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ్ దర్శకులతో పనిచేయడం కాస్త తక్కువే అయినా, కథ , తన కేరక్టరైజేషన్ బాగుంటే అలాంటివి పట్టించుకోడు. అందుకే త్వరలో కొంత మంది తమిళ్ దర్శకులతో పనిచేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. మురుగదాస్‌ పేరుకి తమిళ దర్శకుడే అయినా తెలుగువాళ్లకు ఈ పేరు సుపరిచితం. ఆయన తీసిన 'గజిని' తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. చిరంజీవితో 'స్టాలిన్‌' తెరకెక్కించారు. ఆ తరవాత మురుగదాస్‌ తీసిన ప్రతి సినిమా తెలుగులోనూ అనువాదమైంది. 7thసెన్స్, తుపాకీ, కత్తి లాంటి సినిమాలు తెలుగులో కూడా బాగా ప్రభావం చూపించాయి. ఇప్పుడు మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయిక కుదిరింది. ఈ కలయిక లో ఓ సెన్సేషనల్ మూవీకి ముహూర్తం సెట్ అయింది. ఓ బర్నింగ్ ప్రాబ్లెమ్ కు మురుగదాస్ తనదైన శైలిలో కమర్షియల్ గా సొల్యూషన్ చూపిస్తునే... థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేయబోతున్నాడు. ఈ సారి న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని పాయింట్ అవుట్ చేస్తూ కథ నడిపిస్తాడట. ఈ కథని మహేష్ బాబులాంటి సూపర్ స్టార్ తో ఎలా వర్కౌట్ చేయబోతున్నాడో చూడాలి. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోంది ? మహేష్ నటన ఎలా ఉంటుంది ? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

13:51 - June 10, 2016

విజయవాడ : కాపు రిజర్వేషన్ల పేరుతో విధ్వంసం సృష్టించిన ముద్రగడ పద్మనాభం ప్రతిపక్ష నేత జగన్‌ మద్దుతు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. కిర్లంపూడిలో దీక్ష చేస్తున్న ముద్రగడను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అరెస్టు చేశామని మున్సిపల్‌ మంత్రి నారారాయణ చెప్పారు. పురుగుమందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే ఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటున్నారు. 

13:48 - June 10, 2016

బాహుబలి క్రేజ్ తో రానా ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ నటిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రానా ఒక క్రేజీ తమిళ్ దర్శకుడితో పనిచేయడానికి ముందుకు రాబోతున్నాడు. ఎవరా దర్శకుడు ? సహజమైన కథల్ని, మరింత సహజంగా తెరపై తీసుకురాగల సమర్థుడు బాల. 'శివపుత్రుడు', 'నేను దేవుడ్ని', 'వాడు వీడు' చూస్తే బాల అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ చిత్రాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకాదరణ పొందాయి. అందుకే బాల అంటే తెలుగు నాట క్రేజ్‌. త్వరలోనే ఆయన రానాతో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో విశాల్‌ కూడా నటిస్తాడట. రానాకి ఆల్రెడీ ఆరంభం, బెంగళూర్ నాట్ కళ్ సినిమాల తో తమిళ దర్శకులతో పనిచేసిన అనుభవం ఉంది. తమిళ్ దర్శకుల తీరు తెన్నులు తెలుసు. అందుకే మరో తమిళ్ దర్శకుడితో ఓ సినిమాచేయడానికి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానా సామాజిక ఇతివృత్తాల్ని తెరమీద వాస్తవికంగా చూపించడంలో ఆరితేరిన దర్శకుడు బాలతో పనిచేయడానికి ముందుకొచ్చాడని టాక్. ఇక బాలా గత చిత్రాల్లాగానే ఆఫ్ బీట్ స్టైల్లో సినిమా ఉంటుందా లేక కమర్షియల్ పంథాలోనే సినిమా ఉంటుందా అనే విషయాలు ఇంకా తెలియవు. ఇది నిజమైతే బాహుబలి 2 తరువాత రానా నటిస్తున్న తమిళ్ మూవీ ఇదే కానుంది.

13:37 - June 10, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. ముద్రగడ దీక్షపై జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మండిపడ్డారు. మీడియాపై చంద్రబాబు దాడి చేస్తున్నారని జనగ్ చేసారని జగన్ గొంతు చించుకుంటున్నారు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్నప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి కక్ష పూరితంగా వ్యవహరించిన విషయం ...రామోజీ ఫిలిం సిటీపై ఆయన అవలంభించిన తీరును, ఆంధ్రజ్యోతిపై దాడులు చేయటం జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. తునిలో రైలు తగులబెట్టిన కేసును సీబీఐకి అప్పగించమని... నిందితుడిగా వున్న జగన్ డిమాండ్ చేయటం విడ్డూరంగా వుందన్నారు. 

అమరేశ్వరుడి భూముల కొనుగోలులో వైసీపీ నిజనిర్ధారణ కమిటీ..

హైదరాబాద్ : అమరేశ్వరుడి ఆలయ భూముల కొనుగోలు అంశంపై వైసీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. మాజీ మంత్రి ధర్మాన నేతృత్వంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేసింది.

 

 

ఏపీ సచివాలయంలో టి. ఉద్యోగుల ఆందోళన..

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుఉల ఆందోళన చేపట్టారు. ఆంధ్రాకు కేటాయించడంపై వారు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాకు వెళ్లమని..తెలంగాణలో ఉంటామని నినాదాలు చేశారు. సచివాలయంలో నిజమైన ఉద్యమం నడిపింది తామేనని, తెలంగాణ నేతలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్కర ఘాట్ తొక్కిసలాటపై విచారణ ప్రారంభం..

పశ్చిమగోదావరి : గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై సోమయాజుల కమిటీ విచారణ ప్రారంభించింది. రాజమండ్రిలోని పుష్కర ఘాట్ లో తొక్కిసిలాట సంభవించి 27 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.

టి.ప్రైవేటు స్కూళ్లకు సర్కార్ మార్గదర్శకాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. స్కూల్ పేర్ల పక్కన ఆకర్షించేలా ఉన్న పబ్లిక్..టాలెంట్..కాన్సెప్ట్..టెక్నోస్పేస్..గ్రామర్..ప్లే..తదితర పదాలను తొలగించాలని పేర్కొంది. పుస్తకాలు..నోట్ బుక్ లు..స్కూళ్లలో విక్రయించరాదని, ఉపాధ్యాయల అర్హత..వేతనాల వివరాలు తెలపాలని సూచించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు కేటాయించాలని తెలిపింది.

ముద్రగడ..జగన్ లపై మంత్రి నారాయణ ఫైర్..

విజయవాడ : ముద్రగడ, జగన్ లపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ దీక్షకు జగన్ మద్దతు పలకడం సరికాదని, పురుగుల మందు బాటిల్ పక్కన పెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముద్రగడను కాపాడేందుకు అరెస్టు చేయడం జరిగిందని, కాపు కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. జూన్ 20 కల్లా తాత్కాలి సచివాలయ భవనాలు సిద్ధం చేస్తామని, జూన్ 27 కల్లా ఉద్యోగులను అమరావతికి తరలిస్తామన్నారు.

కుప్పంలో అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు..

చిత్తూరు : కుప్పంలో ఐదుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 47 లక్షల విలువైన పది బొలేరో వాహనాలు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.

బాబు పాలన అంతా విఫలం - సీపీఐ..

విజయవాడ : రెండేళ్ల చంద్రబాబు పాలన అన్ని రంగాల్లో విఫలం చెందిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ కాలేదని, కార్మికులకు, ప్రజలకు చేసేందేమి లేదని విమర్శించారు. ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయలేదన్నారు. అవినీతి పెరిగిందని, పాలనపై పట్టు సాధించలేదని, చంద్రబాబు రెండేళ్ల పాటు వైఫల్యాలపై వామపక్షాల ఆధ్వర్యంలో త్వరలో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

13:08 - June 10, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌కు ఆ దేశాధ్యక్షుడు ఒబామా మద్దతు ప్రకటించారు. హిల్లరీని తన వారసురాలుగా ప్రకటించారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. డెమాక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధిగా హిల్లరీకి మించిన అభ్యర్ధిలేరని ప్రకటించారు. డెమాక్రాటిక్‌ పార్టీ విలువకు కట్టుబడి పనిచేస్తున్న నాయకురాలు అంటూ ప్రశంసించారు. డెమాక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధిగా హిల్లరీకి మద్దతు ప్రకటించడేకాదు... క్లింటన్‌ తరుపున ఎన్నికల ప్రచారం చేయాలని కూడా ఒబామా నిర్ణయించారు. ఇద్దరూ కలిసి ఈనెల 15 విస్కాన్‌సిన్‌ రాష్ట్రంలోని గ్రీన్‌ బేలో సంయుక్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

13:00 - June 10, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ శుభవార్త అందించారు. ఏపీ స్థానికత అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన నోట్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఏపీ స్ధానికతపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్ని విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌ 9న స్థానికత అంశంపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే సీఎం పంపిన లేఖలపై ఇన్నాళ్లూ కేంద్రహోంశాఖ , న్యాయశాఖ, ప్రధాని కార్యాలయం కసరత్తు చేసింది. ఎట్టకేలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫైలు రాష్ట్రపతి వద్దకు చేరింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి సంతకం చేశారు. ఆర్డికల్‌ 371 (డి)ని సవరిస్తూ..రాష్ట్రపతి సంతకం చేయడంతో జూన్‌2, 2017లోపు ఏపీకి తిరిగొచ్చే వారికి ఏపీ స్థానికత వర్తింస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగొచ్చే ఉద్యోగులకు మాత్రమే ఏపీ స్థానికత వర్తిస్తుంది. ఏపీ స్ధానికత అంశం ఫైలుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఈ అంశం కొలిక్కి వస్తుందని ఊహించలేదని..కానీ కేంద్రం దీనిపై స్పందించడం సంతోషకర విషయమన్నారు. ఏపీ స్థానికత అంశంపై రాష్ట్రపతి ఆమోదముద్ర తెలపడం ఏపీ ఉద్యోగులకు ఓ వరంలాంటిదని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ అన్నారు. పిల్లల చదువు, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో ఈ పరిణామం పెద్ద ఊరటనిస్తుందన్నారు. జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 2, 2017 లోపల ఏపీకి తరలివెళ్లే ఉద్యోగులకు స్థానికత వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

12:57 - June 10, 2016

విజయవాడ : ఈనెల 26 నుంచి 29 వరకు విజయవాడలో సీఐటీయూ 14 రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహింస్తున్నారు. దీనిలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు CITU కార్యర్తలు కవాతు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి టెన్ టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రైతులతోపాటు కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని విమర్శించారు. 14వ రాష్ట్ర మహాసభలో ప్రధానంగా కార్మికుల వేతనాలు, కార్మిక చట్టాలు , కార్మికుల సమస్యలపై ఈ మహాసభలో సభ్యులు చర్చించనున్నామని తెలిపారు.కార్మికులతో ప్రభుత్వం వెట్టి చేయించుకుంటోదని విమర్శించారు. పనిప్రదేశాలలో కార్మికులకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించటంలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు..కానీ ఉన్న పరిశ్రమలు మూసివేస్తుంటే .. ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆమె ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబరు 12న దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని తెలిపారు. 

12:49 - June 10, 2016

మీరు సన్నగా లేరా ? అయితే ఉద్యోగానికి రావద్దు..సన్నగా ఉంటనే ఉద్యోగం చేయాలని ఎయిర్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ హోస్టెస్ ల విషయంలో ఎయిర్ లైన్స్ సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులకు ఆకర్షణీయంగా కనిపించేలా, అందం, చక్కటి శరీరాకృతి, మంచి ఎత్త, సరైన పళ్ల వరస వీరికి సొంతమై వుండాలి. విధుల్లో చేరే సమయంలో వీరు అందంగానే వుంటారు. ఆపై వీరు మారిపోతున్నారన్నది ఎయిర్ లైన్స్ యాజమాన్యాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనితో ఎయిర్ ఇండియా దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. వంద మంది అధికమైన బరువున్నట్లు గుర్తించింది. వీరికి కఠిన నిబంధనలు అమలు చేసింది. ఆర్నేళ్లలో బరువు తగ్గితేనే ఉద్యోగం ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) మహిళల్లో 27, పురుషుల్లో 30 కంటే ఎక్కువ ఉన్నవారు తగ్గకపోతే విమానాల్లోకి అనుమతించమని తేల్చిచెప్పింది. గతంలో కూడా 130 మంది సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే. కానీ సిబ్బంది కొరత కారణంగా తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆదేశాలు అందుకున్న వారు బరువు తగ్గుతారా ? లేదా ? అన్నది వేచి చూడాలి.

స్థానికత అంశంపై ఉద్యోగుల హర్షం..

హైదరాబాద్ : స్థానికత అంశం తేలడంపై ఏపీ సచివాలయ ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రత్మాక నిర్ణయమని ఏపి సచివాలయం ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇది సాధ్యమైందని, తమకున్న సమస్యలను ప్రభుత్వం తొలగించిందన్నారు. చిన్నచిన్న సమస్యలున్నా వాటిని లెక్క చేయకుండా సంతోషంగా అమరావతికి వెళుతామని తెలిపారు.

పేస్ ఒలింపిక్ ఆశలపై నీళ్లు..

ఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఒలింపిక్ ఆశలపై టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న నీళ్లు చల్లాడు. త్వరలో జరగనున్న ఒలింపిక్స్ లో పేస్ తో కలిసి ఆడేందుకు నిరాకరించాడు. విశాఖ కుర్రాడు సాకేత్ సాయి మైనేనితో కలిసి ఒలింపిక్ బరిలో దిగాలని బోపన్న నిశ్చయించుకున్నాడు.

12:32 - June 10, 2016

ఏంటీ సుల్తాన్ గా బన్నీ..ఆయన సతీమణి సుల్తానాగా నటించనున్నారా ? ఏ సినిమాలో ? అనే ప్రశ్నలు వేయకండి. ఇది సినిమా కాదు. అల్లు అర్జున్...స్నేహారెడ్డి దంపతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే వీరు విహారయాత్రలో భాగంగా టర్కీకి వెళ్లారు. అక్కడి పర్యాటక ప్రదేశాలను చూస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఇస్తాంబుల్ లోని సుల్తాన్ అహ్మద్ కమీ (బ్లూ మసీదు)లో వీరు ఓ ఫోటో తీసుకున్నారు. ఈ ఫొటోను అల్లు అర్జున్న ట్విట్టర్..ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. టర్కీ సుల్తాన్ కాలం నాటి వస్త్రాలు ధరించి వీరు ఫొటో దిగారు. బ్లూ మసీదు ఇంత అద్భుతంగా ఉంటుందని తెలియదని బన్నీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

పుష్కర ఘాట్ పనులను పరిశీలించిన ఏపీ మంత్రులు..

విజయవాడ : సీతమ్మవారిపాదాలు వద్ద పుష్కరఘాట్ పనులను మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బోండా ఉమ, మేయర్ కోనేరు శ్రీధర్ లు పరిశీలించారు. ఫుష్కరఘాట్ ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

హిందూపురంలో బాలయ్య జన్మదిన వేడుకలు..

అనంతపురం : హిందూపురంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చంద్ర దండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌నాయుడు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు సహర్‌ విందు ఇచ్చారు.

సీబీఐ కార్యాలయంలో హిమాచల్ సీఎం..

హిమాచల్ ప్రదేశ్ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీఎం వీరభద్ర సింగ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. వరుసగా రెండో రోజు ఈ విచారణ కొనసాగుతోంది.

కాబూల్ లో భారత మహిళ కిడ్నాప్...

కాబూల్ : అఫ్ఘన్ రాజధాని కాబూల్ లో భారత సంతతికి చెందిన ఓ మహిళను ఉగ్రవాదులు అపహరించారు. స్వచ్ఛంద సంస్థ అగా ఖాన్ ఫౌండేషన్ లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు చెందిన జుదిత్ డిసౌజా అనే మహిళ కాబూల్ కు తరలివెళ్లారు. గురువారం సహోద్యోగులతో కలిసి ఫౌండేషన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళుతున్న క్రమంలో డిసౌజాను అపహరించారు. దీనిపై భారత రాయబార కార్యాలయం స్పందించినట్లు తెలుస్తోంది.

రెండో రోజు సిబీఐ విచారణ సీఎం...

హిమాచల్ ప్రదేశ్ : ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వీరభద్ర సింగ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో గురువారం, శుక్రవారాల్లో విచారణకు రావాలన్న సీబీఐ అధికారుల ఆదేశాలతో నేటి ఉదయం ఆయన వరుసగా రెండో రోజు సిబీఐ విచారణకు హాజరయ్యారు.

దీక్షలు చేయడం వల్ల అభివృద్ధి జరగదు - మంత్రి పీతల..

విజయవాడ : ముద్రగడ దీక్షలు చేయడం వల్ల కాపుజాతి అభివృద్ధి జరగదని మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. ముద్రగడ దీక్షల్లో అరాచక శక్తులు బయటకు వస్తున్నారని, జగన్ ప్యాకేజీలను ఆశించే ముద్రగడ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ తీరుకు తిరగబడుతారో ? ప్రశ్నిస్తారో కాపులే తేల్చుకోవాలని సూచించారు.

ఏపీ ఉద్యోగులకు శుభవార్తే - కంభంపాటి..

ఢిల్లీ : స్థానికత అంశం ఏపీ ఉద్యోగులకు శుభవార్తేనని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఉద్యోగులందరూ అమరావతికి తరలిరావాలని, విభజన చట్టంలోలని హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని, అలాగే కాపు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు.

 

ఏపీ రాజధానిలో నిలిచిన భూముల కొనుగోళ్లు..

విజయవాడ : రాజధాని 29 గ్రామాల్లో భూముల అమ్మకాలు..కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీఆర్డీఏ కార్యాలయం నుండి ఎన్ ఓసీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని మంగళగిరి, తాడికొండ కార్యాలయాల్లో అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీనివల్ల అమ్మకం దారులు..రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

12:01 - June 10, 2016

నేపాల్ : పాపం..ఈ బాలుడిని చూశారా ? ఎలా మారిపోతున్నాడో ? పుట్టిన పదిహేను రోజుల నుండి తరువాత ఈ బాలుడి శరీరం నల్లగా మారిపోతూ వస్తోంది. నాటి నుండి క్రమ క్రమంగా శరీరం విగ్రహంలా మారిపోతోంది. నేపాల్ కు చెందిన నార్ కుమారి, నంద దంపతులకు రమేష్ కొడుకున్నాడు. పుట్టుకతోనే హార్లీక్వీన్ ఇచ్చియోసిస్ అనే చర్మ వ్యాధి వచ్చింది. ముఖంపై నల్లని పొలుసులు ఏర్పడ్డాయి. చర్మం గట్టిగా మారిపోతూ వస్తోంది. దీనితో రమేష్ బయటకు వెళ్లలేక..నలుగురితో మాట్లాడలేకపోతున్నాడు. ప్రస్తుతం పదకొండేళ్లు ఉన్న ఈ బాలుడు ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యాడు. రోజు రోజుకు చర్మం గట్టిగా మారుతుండడం..పొలుసులు ఏర్పడుతుండడంతో వైద్యులను సంప్రదించారు. జన్యుపరమైన లోపం వల్ల చర్మ సంబంధిత వ్యాధి వచ్చిందని..ఫంగల్ ఇన్ ఫెక్షన్ అని వైద్యులు పేర్కొంటున్నారంట. ప్రస్తుతం ఖాట్మండు మెడికల్ కళాశాల వైద్యులు రమేష్ కు శస్త్ర చికిత్స చేస్తున్నారు. బాలుడి శరీరంపై ఉన్న నల్లటి పొలుసులను తీసేస్తున్నారు. బాలుడు కోలుకోవడానికి రెండు వారాల కొకసారి యాంటీ బయోటిక్స్ ఇవ్వడం జరుగుతోందని, నల్లటి చర్మం తొలగించేందుకు మాయిశ్చరైజర్ చేస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. తమ కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కుములిపోతున్నారంట.

కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్ ...

ఢిల్లీ : కలలకం రేపిన కిడ్నీ రాకెట్ కు సంబంధించి దేశయ ప్రైవేట్ వైద్య రంగంలో అగ్రగామిగా వున్న హాస్పిటల్స్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన 12 మందిలో ఇద్దరు ఆపోలో ఆసుపత్రికి చెందిన సిబ్బంది ఉన్నారు. తాజాగా ఆపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడి పీఏను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారిలో ఆపోలో సిబ్బంది సంఖ్య మూడుకు చేరుకుంది. ఇక అపోలో ఆసుపత్రిపై వెల్లువెత్తిన ఆరోపణలతో ఆ సంస్థకు చెందిన ఐదు ఆసుపత్రుల్లో పోలీసులు ముమ్మర సోదాలు చేశారు.

అపోలో వైద్యుడి పీఏ అరెస్టు..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కు సంబంధించి దేశీయ ప్రైవేట్ వైద్య రంగంలో అగ్రగామిగా ఎదిగిన అపోలో హాస్పిటల్స్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడి పీఏను తాజాగా అరెస్టు చేశారు. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన 12 మందిలో ఇద్దరు ఆపోలో ఆసుపత్రికి చెందిన సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే.

స్పీకర్ పదవి సంతృప్తినిచ్చింది - మధుసూధనాచారి..

వరంగల్ : శాసనసభ స్పీకర్ పదవి సంతృప్తినిచ్చిందని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. మధుసూదనాచారి శాసనసభ స్పీకర్‌గా పదవి చేపట్టి గురువారానికి రెండేండ్లు అవుతుంది. రెండేళ్ల కాలంలో సభలో అర్థవంతమైన చర్చలు జరిగాయని, సభా గౌరవం పెరిగిందన్నారు.

11:38 - June 10, 2016

ఢిల్లీ : తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ శుభవార్త అందించారు. ఏపీ స్థానికత అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన నోట్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఏపీ స్ధానికతపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్ని విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌ 9న స్థానికత అంశంపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే సీఎం పంపిన లేఖలపై ఇన్నాళ్లూ కేంద్రహోంశాఖ , న్యాయశాఖ, ప్రధాని కార్యాలయం కసరత్తు చేసింది. ఎట్టకేలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫైలు రాష్ట్రపతి వద్దకు చేరింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి సంతకం చేశారు. ఆర్డికల్‌ 371 (డి)ని సవరిస్తూ..రాష్ట్రపతి సంతకం చేయడంతో జూన్‌2, 2017లోపు ఏపీకి తిరిగొచ్చే వారికి ఏపీ స్థానికత వర్తింస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగొచ్చే ఉద్యోగులకు మాత్రమే ఏపీ స్థానికత వర్తిస్తుంది.

11:33 - June 10, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో డెమోక్రసీ లేకుండా పోయిందని ఆరోపించారు. ముద్రగడ దీక్ష భగ్నంపై జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులతో ప్రజలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన మాటను ప్రభుత్వం తప్పిందన్నారు. దీక్షకు దిగిన ముద్రగడను, మద్దతునిచ్చినవారిని అరెస్ట్ చేసి ప్రజలను భయపెడుతున్నారని, ఈ విషయంలో ముద్రగడ కుటుంబ సభ్యులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాసమస్యలు లేవనెత్తినవారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నారు. సాక్షి పత్రిక విషయంలోనూ, ముద్రగడ విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే తుని కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐడీని చేతిలో పెట్టుకుని బాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

తేలికపాటి విమానం కూలి ముగ్గురి మృతి..

అమెరికా : హూస్టన్ ప్రాంతంలో ఉన్న హాబీ విమానాశ్రయంలో తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందారు.

కోల్ కతాలో గుంటూరు జిల్లా యువకుడి మృతి..

గుంటూరు: జిల్లాకు చెందిన యువకుడు కోల్ కతాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు ఆ యువకుడు వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముద్రగడ దీక్ష..సర్కార్ పై జగన్ ఫైర్..

హైదరాబాద్ : కాపులకు రిజర్వేషన్ అంశంపై ముద్రగడ చేస్తున్న దీక్ష భగ్నంపై వైసీపీ నేత జగన్ స్పందించారు. ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే ముద్రగడ దీక్ష చేపట్టారని, సామాజిక సమస్యలను రాజకీయం చేశారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం సీఎం చంద్రబాబు ఏమైనా చేస్తారని, దీక్షను శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పోలీసు రాజ్యంతో భయం సృష్టిస్తున్నారని, ముద్రగడ కుటుంసభ్యులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు లేవనెత్తే వారిపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు.

11:01 - June 10, 2016

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏమైంది ? అనారోగ్యానికి గురయ్యారా ? అమెరికాలో చికిత్స పొందుతున్నారా ? ఆయన అభిమానులనే కాకుండా ఇతరులను కూడా ఉత్కంఠకు గురి చేస్తోంది. ఎందుకంటే రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని..అమెరికాలో చికిత్స పొందుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కుటుంబసభ్యులతో రజనీ అమెరికాకు విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరిపించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'కబాలి' టీజర్ ఇటీవలే విడుదలై రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో వేడుకలు నిర్వహించేందుకు నిర్మాత కలైపులి ఎస్.థాను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఈ ఆడియో వేడుకను కేవలం ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజనీ అనారోగ్యం కారణంగానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆన్ లైన్ లో నిర్వహిస్తునారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కానీ రజనీ ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదని..బాగానే ఉన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీని గురించి రజనీ నోరు విప్పితే కాని తెలియదు.

11:01 - June 10, 2016

నల్లగొండ : సూర్యాపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా మీటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 50 వేల జనసమీకరణే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 'వికాస్‌పర్వ్‌' పేరుతో దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేపడుతోంది. రెండేళ్లలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను ఈ సమావేశంలో వివరించనున్నారు.

10:57 - June 10, 2016

ఢిల్లీ : ధోనీ నాయకత్వంలోని భారత జట్టు...జింబాబ్వే సిరీస్‌కు సన్నద్ధమైంది. అందరూ కుర్రాళ్లతో కూడిన భారత జట్టు మూడు వన్డేలు,మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌ సందర్భంగా....వన్డేలు, టీ 20 ఫార్మాట్‌లో భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌ ఓ సారి చూద్దాం...

విదేశీ గడ్డపై మరో సిరీస్‌కు రెడీ అవుతున్న ధోనీ సేన..
ధోనీ నాయకత్వంలోని టీమిండియా....విదేశీ గడ్డపై మరో సిరీస్‌కు రెడీ అయింది.జింబాబ్వేతో మూడు వన్డేలతో పాటు,మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ధోనీసేన సన్నద్ధమైంది.

ర్యాంకింగ్స్‌లో భారత్‌ నాలుగో స్థానం...
వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా ...జింబాబ్వే జట్టు 11వ స్థానంలో ఉంది. ఇక టీ 20 ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా సెకండ్‌ ప్లేస్‌లో ఉండగా...జింబాబ్వే జట్టు 12వ స్థానంలో ఉంది.

ధోనీ సేనలో యువకెరటాలు...
ఈ సిరీస్‌కు సీనియర్లు విరాట్‌ కొహ్లీ, రోహిత్‌ శర్మ, అజింక్య రహానే, రవీందర్‌ జడేజా, శిఖర్‌ ధావన్‌, అశ్విన్‌, మహమ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌లకు భారత సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఈ మినీ టూర్‌ కోసం టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మినహా అందరూ కుర్రాళ్లనే ఎంపిక చేశారు. జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేసిన వన్డే, టీ 20 జట్టులో మహేంద్ర సింగ్‌ ధోనీ, కె ఎల్‌ రాహుల్‌, ఫయాజ్‌ ఫైసల్‌,మనీష్‌ పాండే,కరుణ్‌ నాయర్‌,అంబటి రాయుడు,రిషి ధావన్‌ ,అక్షర్‌ పటేల్‌,జయంత్‌ యాదవ్ ,ధవళ్‌ కులకర్ణి,జస్ప్రీత్‌ బుమ్రా,బరీందర్‌ సింగ్‌ శ్రణ్, మన్‌దీప్‌ సింగ్‌,కేదార్‌ జాదవ్‌,జయదేవ్‌ ఉనద్కత్‌,యజ్వేంద్ర చహాల్‌ ఉన్నారు.

రాయుడు మినహా అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవంలేదు..
అంబటి రాయుడు మినహా మిగతా ఎవ్వరికీ కనీసం 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా లేకపోవడం విశేషం. వన్డే, టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ స్టేడియంలోనే జరుగనున్నాయి. వన్డేలు, టీ 20 ఫార్మాట్లలోనూ ట్రాక్‌ రికార్డ్‌ చూస్తే....జింబాబ్వే జట్టుపై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 60 వన్డేల్లో పోటీపడ్డాయి. 48 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించగా....10 మ్యాచ్‌ల్లో మాత్రమే జింబాబ్వే నెగ్గింది.

జింబాబ్వేపై భారత జట్టుదే అప్పర్‌ హ్యాండ్‌..
ఇక టీ 20 ఫార్మాట్‌లోనూ జింబాబ్వేపై భారత జట్టుదే అప్పర్‌ హ్యాండ్‌. ఇప్పటివరకూ ఇరు జట్లు 4 టీ 20 మ్యాచ్‌ల్లో పోటీపడగా...టీమిండియా 3 మ్యాచ్‌ల్లో నెగ్గగా, జింబాబ్వే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగలిగింది.

ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ధోనీ సేన ..
రెండు ఫార్మాట్లలో జింబాబ్వే జట్టుపై మెరుగైన ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న భారత జట్టు....ఈ మినీ టూర్‌లోనూ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. వన్డే, టీ 20 సిరీస్‌లను క్లీన్‌ స్వీప్‌ చేయాలని ధోనీ సేన ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఇన్‌స్టంట్‌ ఫార్మాట్లలో తిరుగులేని టీమిండియాకు జింబాబ్వే జట్టు అసలు కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

10:46 - June 10, 2016

ఢిల్లీ : మాఫియా డాన్‌ చోటా రాజన్‌ను హత్య చేసేందుకు జరిగిన కుట్ర కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇండోనేషియాలోని బాలిలో రాజన్‌ను అరెస్టు చేసిన పోలీసులు... ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంచారు. కారాగారంలో రాజన్‌ హత్యకు అజ్ఞాత మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరులు కుట్రపన్నారని అరోపలు వచ్చాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రోజర్‌ రాబిన్‌సన్, జునాయిద్‌, యూనస్‌, మనీష్‌లను పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు సిటికోర్టులో హాజరు పరిచగా, రిమాండ్‌ విధించారు. అరెస్టైన వారిలో రాబిన్‌సన్‌ది రోహిణి ప్రాంతం కాగా... జునాయిద్‌ది సీమాపూర్‌. యూనస్‌ ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికాగా, మనీష్‌ది నోయిడా ప్రాంతం. 

ఏపీ లాసెట్ 2016 ఫలితాల విడుదల..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాసెట్ 2016 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎస్కేయూలో మంత్రి పల్లె ఫలితాలను విడుదల చేశారు.

 

ఏపీ స్థానికతపై గెజిట్ నోటిఫికేషన్..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికతపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. స్థానికతకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. హైదరాబాద్ నుండి ఏపీకి 2014 జూన్ 2 నుండి మూడేళ్ల పాటు తరలివెళ్లే ఉద్యోగులకు స్థానికత వర్తించనుంది.

 

10:44 - June 10, 2016

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ దీక్ష పలు మలుపులు తిరుగుతోంది. గురువారం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తరుణంలో ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాపునేతలు కాకినాడలో బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలూ జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విస్తృంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో కాకినాడ నగర వ్యాప్తంగా బస్ లు నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా వుండే కాకినాడ నగరం నిర్మానుష్యంగా మారిపోయింది. 

10:36 - June 10, 2016

హైదరాబాద్ : అవగాహనా రాహిత్యంతోనో...చిన్నపాటి అహంతోనో, అర్థం లేని అనుమానాలతోనో.. పచ్చటి కుటుంబాల్లో విషాదాలు కమ్ముకుంటున్నాయి. మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే చిన్న సమస్యలకు కూడా పచ్చని సంసారంలో నిప్పులు కురుస్తున్నాయి. చిన్న వివాదాలకే నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. చిన్న పిల్లలను సైతం చంపేసి వారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజగా ఓ తల్లి నవమాసాలు మోసి కన్న బిడ్డను కూడా అత్యంత పాశవికంగా కర్చీఫ్ తో గొంతు నులిమి చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ గణేష్ హౌసింగ్ కాలనీలో చోటు చేసుకుంది. భర్త, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించి ఆమె మూడు పేజీల సూసైడ్ నోటు రాసింది. ఈ సూసైడ్ నోటు గుజరాతీ భాషలో వుండటంలో అనువాదం చేసిన తరువాతనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆరు సంవత్సరాల క్రితం వివాహం...
గుజరాత్ కు చెందిన హర్ష దంపతులు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు వున్నాడు. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య కలహాలు వస్తున్నట్లుగా సమాచారం. ఈ కలహాలతోనే మనస్థాపానికి గురైయి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. హర్ష భర్త గ్రనేట్ బిజినెస్ చేస్తుంటారు. వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్యా, కుమారుడు ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ గురయి స్థానికుల సహాయంతో పోలీసులకు సమచారం అందించారు. కాగా పోలీసులు అనుమానాస్పదంగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లేడీ స్మగ్లర్ సంగీతా అరెస్టుకు రంగం సిద్ధం..

చిత్తూరు : లేడీ స్మగ్లర్ సంగీతా ఛటర్జీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. సంగీతను అరెస్టు చేసేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు కోల్ కతాకు బయలుదేరారు. సంగీతకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను పోలీసులు తెరిచారు. రూ. కోట్లాది విలువైన ఆస్తిపత్రాలు, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు కోర్టుకు రాకుండా సంగీత తప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. సంగీతపై యాదమర్రి, గుడిపాలు, నగరి పీఎస్ లలో కేసులు నమోదయ్యాయి.

10:35 - June 10, 2016

ఫ్రాన్స్ : ప్రపంచ ఫుట్ బాల్ లో రెండో అతిపెద్ద సంబరం.. 2016 యూరోపియన్ సాకర్ సమరానికి ఫ్రాన్స్ లో రంగం సిద్ధమయ్యింది. జూన్ 10 నుంచి జులై 11 వరకూ జరిగే ఈ ఫుట్ బాల్ యుద్ధంలో 24 యూరోపియన్ జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్, మాజీ చాంపియన్ జర్మనీ, పోర్చుగల్ హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు దిగుతున్నాయి. 51 మ్యాచ్ ల గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ తొలిపోటీలో ఆతిథ్య ఫ్రాన్స్ తో రుమేనియా ఢీకొనబోతోంది.
రెండో అతిపెద్ద సాకర్ సంబరం ...
జనసంమోహక క్రీడ, ప్రపంచ నెంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో రెండో అతిపెద్ద సాకర్ సంబరం యూరోపియన్ ఫుట్ బాల్ సమరానికి..ఫ్రాన్స్ లోని పదివేదికల్లో రంగం సిద్ధమయ్యింది. జూన్ 10 నుంచి జులై 11 వరకూ నెలరోజులపాటు జరిగే ఈ టోర్నీలో 24 దేశాలజట్లు తలపడబోతున్నాయి. మొత్తం 24 దేశాలజట్లను ఆరుగ్రూపులుగా విభజించి గ్రూప్ లీగ్ కమ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ గా పోటీలు నిర్వహిస్తారు.

బరిలోకి దిగనున్న హేమాహేమీ దేశాలు....
దక్షిణ అమెరికా దేశాల మధ్య..అమెరికా వేదికగా జరుగుతున్న కోపా అమెరికాకప్ పోటీలు.. కళాత్మక సాకర్ కు ప్రతీకగా నిలిస్తే... డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఇటలీ, రష్యా, చెక్ రిపబ్లిక్ జట్లు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.

సాకర్ అభిమానులకు సందడే సందడి...
భారత కాలమానప్రకారం..రాత్రి 12 గంటల 30 నిముషాల నుంచి ఒకమ్యాచ్, సాయంత్రం 6 గంటల 30 నిముషాల నుంచి మరోమ్యాచ్ జరుగుతాయి. ఈ మ్యాచ్ లను సోనీ సిక్స్, సోనీ-ఈఎస్ పిఎన్ చానెళ్లలో ప్రత్యక్షప్రసారాల ద్వారా వీక్షించవచ్చు. జూన్ 10 రాత్రి 12 గంటల 30 నిముషాలకు జరిగే ప్రారంభమ్యాచ్ లో...ఆతిథ్య ఫ్రాన్స్ తో రుమేనియా పోటీపడుతుంది. నెలరోజులు...51 మ్యాచ్ లుగా జరిగే యూరోకప్ తో ప్రపంచ సాకర్ అభిమానులకు సందడే సందడి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

10:33 - June 10, 2016

అమీర్ ఖాన్..బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్...వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఓ గుర్తింపును పొందిన నటుడు. పలు చిత్రాల్లో ఇమేజ్ కు భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే అమీర్ మరోసారి కొత్త ప్రయోగం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. వ్యోమగామి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత గాథ ఆధారంగా రూపొందించే చిత్రంలో అమీర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న మరో చిత్రం 'దంగల్' ఈ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

10:22 - June 10, 2016

నటనలో లెజెండ్..యాక్షన్ లో లయన్..డైలాగ్స్ చెప్పడం లో సింహం..డిసిప్లైన్ లో డిక్టేటర్..నాలుగు దశాబ్దాల కాలం పాటు తెలుగుతెరమీద చెలరేగుతున్న ఆ సమరసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన నేడు పుట్టిన రోజు.

తెలుగు తెరపై బాలయ్యది ఓ ప్రత్యేక మైన ముద్ర. ముఖ్యంగా మాస్ లో ఆయన ఫాలోయింగ్ అమోఘం. ఎలాంటి పాత్రనైనా అవలీలగా ఒడిసిపట్టుకొని పరకాయ ప్రవేశం చేయడం ఆయన స్టైల్. తండ్రి యన్టీఆర్ లాగానే బాలయ్యకు ప్రయోగాలంటే మహాసరదా. ఎలాంటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా, తన సమకాలిక హీరోల్లో ఎక్కువ ప్రయోగాలు చేసిన హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోతారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలన్నిటిలోనూ బాలయ్య నటించి తన సత్తా చాటుకున్నారు. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య. ఒకానొక దశలో వరస విజయాలతో బాలయ్య టాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ లో వరస సక్సెస్ లు ఇచ్చారు. బాలయ్యను మాస్ హీరోగా నిలబెట్టినవి ఫ్యాక్షన్ చిత్రాలే. వాటిల్లో ఆయన చెప్పిన డైలాగ్స్ మాస్ జనానికి పిచ్చపిచ్చగా నచ్చేసేవి. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య యాక్షన్ హీరో కంటే ఫ్యాక్షన్ హీరోగానే బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. హిట్స్, ఫెయిల్యూర్స్ ఎలాంటి హీరోకైనా సహజం. నరసింహనాయుడు లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న బాలయ్యకు ఆ తరువాత ఒక్క హిట్టూ దక్కలేదు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని సింహతో మళ్లీ రీచార్జ్ అయ్యారు బాలయ్య...ఇక అక్కడనుంచి బాలయ్య దూసుకుపోతునే ఉన్నారు.

వందో సినిమా కోసం..
ఇప్పటికీ కూడా అదే ఎనర్జీతో లెజెండ్, లయన్, డిక్టేటర్ సినిమాలతో బాలయ్య మాస్ లో అదే ఫాలోయింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య 100 వ సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రిష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ వయసులో కూడా బాలయ్య వందో సినిమా కోసం ప్రత్యేకించి, గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాల్లో శిక్షణ తీసుకుంటూ ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి ఆయన కష్టాన్ని తగిన ప్రతిఫలం దక్కాలని ఆశిస్తూ...బాలయ్యకు మరోసారి జన్మదిన శుభకాంక్షలు తెలియచేస్తోంది 10 టివి.

నాలుగేళ్ల కుమారిడితో తల్లి సూసైడ్..

హైదరాబాద్ : షేట్ బషీరాబాద్ శ్రీ గణేష్ హౌసింగ్ కాలనీలో కుటుంబ కలహాలతో నాలుగేళ్ల కుమారుడితో తల్లి ఆత్మహత్య చేసుకుంది.

 

కర్నాటకకు బయలుదేరిన టి.ప్రభుత్వ బృందం..

హైదరాబాద్ : కృష్ణా బేసిన్ ను అధ్యయనం చేసేందుకు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధుల బృందం కర్నాటకు బయలుదేరింది. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.

10:09 - June 10, 2016

యాపిల్ లో ఎన్నో పోషకాలు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందులోని ఔషధగుణాల వల్ల చాలా రకాల వ్యాధులని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. యాపిల్స్ గురించి...కొన్ని..
యాపిల్ ను కొంతమంది తొక్క తీసి తింటుంటారు. యాపిల్ ను శుభ్రంగా కడిగి తొక్కతో కలిపి తినాలి.
యాపిల్ జ్యూస్ కి అల్జీమర్స్ ని నిరోధించే శక్తి కూడా ఉంటుంది. మెదడులోని ఎసిటైల్ కోలిన్ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్ మీటర్ల పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

 

10:09 - June 10, 2016

అందం..పళ్లు..కూరగాయాలు..ఇతరత్రా వాటితోనే కాదు..కొబ్బరినూనెతో కూడా కోమలంగా తయారు కావచ్చు. ఇందుకు సంబంధించిన చిట్కాలు మీ కోసం..
బట్టలు ఉతికి..గిన్నెలు తోమి చేతులు డ్రైగా అయిపోయినప్పుడు కొబ్బరి నూనెను కొంచెం చేతులకు రాసి, కాసేపు గ్లోవ్స్ ధరిస్తే సరి.
కొబ్బరి నూనెకు కొంచెం చక్కెను జోడించి..బాడీ స్ర్కబ్ గా ఉపయోగించుకోవచ్చు.
నూనె కొంచెం వేడి అయిన తరువాత వృత్తాకారంలో ముఖంపై ఒక నిమిషం పాటు మర్ధన చేసుకోండి. అనంతరం గోరువెచ్చని నీటిలో ముంచిన బట్టతో తుడిచేయాలి. అర నిమిషం పాటు ఆ బట్టని అలాగే ముఖంపై ఉంచి తరువాత నూనె పోయేంత వరకు అదే బట్టతో ముఖంపై అద్దండి.

09:54 - June 10, 2016

కర్నాటక : బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షెనాయ్‌ తన ఉద్యోగానికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆరు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనుపమ..గత రాత్రి క్యాంపు కార్యాలయానికి తిరిగివచ్చారు. రాజీనామా ఆమోదం తర్వాత సొంతూరు భట్కల్‌ వెళ్లిపోయారు. నిజాయితీ కలిగిన అధికారిణిగా అనుపమ పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు ప్రకటించిన అనుపమ... కార్మిక మంత్రి పరమేశ్వర్‌నాయక్‌పై పలు ఆరోపణలు చేశారు. మంత్రి పరమేశ్వరన్‌ తనను వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి రాసలీలకు సబంధించిన తన దగ్గర ఉన్న వీడియోలను త్వరలో బయటపెడతానని హెచ్చరించారు.

నేడే హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం..

ఢిల్లీ : నేటి నుండి హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. గోల్ కీపర్ శ్రీజేష్ సారథ్యంలోని టీమ్ ఇండియా తొలి మ్యాచ్ లో ఒలింపిక్ విజేత జర్మనీతో తలపడనుంది.

నేడు కృష్ణా బేసిన్ లో టి.ప్రతినిధుల బృందం పర్యటన..

హైదరాబాద్ : శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు కృష్ణా బేసిన్ లో తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధుల బృందం పర్యటించనున్నారు.

గుల్బర్ కేసులో నిందితులకు శిక్షలు ఖరారు..

గుజరాత్ : గుల్బర్గ్ కేసులో నిందితులకు నేడు శిక్షలు ఖరారు. 24 మందిని దోషులుగా ట్రయల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి శిక్షలు ఖరారవుతాయనే ఉత్కంఠ నెలకొంది.

లారీ- వ్యాన్ ఢీ..ఒకరు మృతి...

రంగారెడ్డి : శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నేడు ఎర్రవెల్లికి సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఎర్రవల్లికి చేరుకుని ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం గ్రామచావిడి వద్ద గ్రామసభలో పాల్గొని ఇటీవల రెండు గ్రామాలకు మంజూరైన 42 ట్రాక్టర్లు అందజేస్తారు.

09:44 - June 10, 2016

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. అందుకనే తాను ఆమరణ దీక్షకు దిగానని కాపునేత ముద్రగడ పద్మనాభం , ఆయనకు మద్ధతునిస్తున్న కాపునేతలు పేర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్), అద్దేపల్లి శ్రీధర్ ( బీజేపీ నేత),బోండా ఉమ (టీడీపీ ఎమ్మెల్యే) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...సమగ్ర సమాచారం తెలుసుకోండి...

సాయంత్రం 3గంటలకు కాపు సభ..

గుంటూరు : జిల్లా మంగళగిరి పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్ లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు కాపు సభను నిర్వహించేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు నిర్ణయించారు. సామాజిక వర్గానికి చెందిన ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తదితర కీలక నేతలు పాల్గొననున్నారు.

 

ఛోటా రాజన్ హత్యకు కుట్ర...

ఢిల్లీ : తీహార్ జైల్లో చోట రాజన్ హత్యకు కుట్ర బయటపడింది. నలుగురు కాంట్రాక్టు కిల్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలులురు నిందితులు ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఛోటా షకీల్ తో వీరికి సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజమండ్రి సర్కారీ ఆసుపత్రి వద్ద రహదారులు మూసివేత..

తూర్పుగోదావరి : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రధాన రహదారులు మూసివేశారు. ఆసుపత్రిలో రోగులకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో వారంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సీఎం కేసీఆర్ ను కలిసిన టి.కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. కేసీఆర్ ను కలిసిన వారిలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితరులున్నారు. త్వరలోనే వీరందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద భారీ బందోబస్తు...

తూర్పుగోదావరి : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ చికిత్స పొందుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ముద్రగడను కోర్టులో హాజరు పర్చాలా లేదా అనే దానిపై పోలీసులు సమాలోచనలు చేస్తున్నారు.

 

09:17 - June 10, 2016

వరంగల్ : కొమరవెల్లి కోట్లకు పడగెత్తుతోంది.. కోరమీసాల స్వామి కోటీశ్వరుడవుతున్నాడు...మల్లన్న భూములకు పట్టా పాసు బుక్కులోస్తున్నాయి. ఈవో స్థాయి నుంచి ఆర్జేడీ స్థాయి వరకు దినదన ప్రవర్థమానంగా ఎదుగుతున్నాడు..గొల్లకుర్మల ఆరాధ్యుడు.

స్వామికి పెరుగుతున్న భక్తులరద్దీ...
వరంగల్ జిల్లా కొమురవెల్లిలోని గుట్టగుహాలో కొలువుదీరిన శ్రీ మల్లికార్జునుడు రూ. కోట్లకు పడగెడుతున్నాడు.. పెరుగుతున్న భక్తులరద్దీ కారణంగా కొమరెల్లి మల్లన్న ఆదాయం గణనీయంగా పెరుగుతోంది.

భక్తులు రద్దీ పెరగడంతో భారీగా పెరిగిన ఆదాయం...
రాష్ట్రంలో ప్రమఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లికి రోజురోజుకూ భక్తులరద్దీ పెరుగుతోంది. జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి భక్తులు తలివచ్చి మల్లన్నను దర్శించుకుని తరిస్తుంటారు. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే వచ్చే భక్తులు ఇప్పుడు ఏడాది పొడవునా ఆలయానికి వస్తున్నారు. ఫలితంగా స్వామి ఆదాయం గణనీయంగా పెరుగుతూ వస్తోంది..నగదుతో పాటు బంగారం, వెండితో తయారు చేసే కోరమీసాలు, కిరీటం, శూలాలు, స్వామివారి విగ్రహాలు, రూ. లక్షల విలువ చేసే అభరణాలు హుండీలో వేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.

రూ. 1500 గా ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ. 7.80 కోట్లు ...
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వార్షిక ఆదాయం రూ. కోట్లలో ఉంటోంది. భక్తులు సమర్పించే కానుకలతో పాటు, వేలం పాటలు, బుకింగ్ ల ద్వారా ఏటా ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తోంది. మూడు నెలల పాటు జరిగే జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. గతంలో 1500 రూపాయల వార్షిక ఆదాయం ఉండగా, ప్రస్తుతం 7కోట్ల 80 లక్షల రూపాయలకు చేరింది. వరంగల్ జిల్లాలో అత్యధిక వార్షిక ఆదాయం కలిగి ఉన్న ఏకైక డిప్యూటీ కమిషనర్ స్థాయి దేవాలయం ఇదే కావడం విశేషం.

వివిధ బ్యాంకుల్లో స్వామివారి ఆస్తులు...
ప్రస్తుతం శ్రీ మల్లికార్జున స్వామికి సంబంధించిన నగదు, నగలు చేర్యాలలోని ఎస్ బీహెచ్, ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంకు, మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎస్ బీఐ, కొమురవెల్లిలోని గ్రామీణ వికాస బ్యాంకుల్లో భద్రంగా ఉన్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల్లో దాచిన నగదు, బంగారు, వెండి ఆభరణాలే కాకుండా 50 ఎకరాలకు పైగా భూమి ఉంది.. ఇప్పటి వరకు స్వామివారి పేరున 19.25 ఎకరాల భూమి మాత్రమే పట్టా అయ్యింది. మల్లన్న కొలువై ఉన్న 25.26 ఎకరాల కొండ, రాజీవ్ రహదారి పక్కన స్వాగత తోరణం వద్ద ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వామివారి పేరున రికార్డుల్లో మార్పుకావాల్సి ఉంది...

సీఎం కేసీఆర్ రాకతో మార్పులు...
అంతేకాకుండా స్వామివారి కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత మండలంలోని పలు గ్రామాల్లా ప్రభుత్వ భూములను స్వామివారి పేరున పట్టా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి..ఇందులో భాగంగా 131 ఎకరాల భూమిని ఆలయానికి ఇవ్వడానికి రెవెన్యూశాఖ అంగీకరించింది. మరో 30 ఎకరాలు కూడా అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

09:14 - June 10, 2016

విజయవాడ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై ఏ విధమైన చర్యలు తీసుకోమని అంటూనే ఏపీ సర్కారు పాఠశాలలపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండడంతో, ప్రజలు ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇటు ప్రభుత్వ పాఠశాలలు సరిగా లేకపోవడం, అటు ప్రైవేట్‌ స్కూల్స్‌ను కొనసాగించనివ్వకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ప్రైవేట్‌ స్కూల్స్ యజమానుల గుండెల్లో రైళ్లు..
గుర్తింపులేని స్కూళ్లు విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న తరుణంలో వాటిని మూసివేయాలని సర్కారు నిర్ణయించింది. ఇటువంటి స్కూల్స్‌పై క్రిమినల్‌ కేసులతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే గుర్తింపులేని వాటిలో కొన్ని ప్రముఖ స్కూల్స్ కూడా ఉండటంతో అటు పాఠశాలల యజమానులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెయ్యాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు.

గుర్తింపులేని పాఠశాలల విషయంలో ప్రభుత్వం సూచనలు..
ప్రతి ఏడాది అక్టోబర్‌లో గుర్తింపు పొందే ప్రక్రియను ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు పూర్తి చేస్తారు. చాలావరకు పాఠశాలలు ఇప్పటివరకూ గుర్తింపు పొందకపోవడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ గుర్తింపు పొందాలంటే పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. అందుకుగాను తరగతులను బట్టి రుసుము చెల్లించాలి. ఇవన్నీ చెల్లిస్తే సదరు పాఠశాలలకు పదేళ్ల గుర్తింపు మంజూరు చేస్తారు. అలా చేయని పక్షంలో పాఠశాల మూసియాల్సిందేనని నిబంధనల్లో ఉన్నా..వాటిని పట్టించుకోవడం లేదు ప్రైవేట్ పాఠశాలలు. అందుకే ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

400 పాఠశాలలపై మూసివేసే అవకాశం...
మరోవైపు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి రంగం సిద్ధమైంది. కృష్ణా జిల్లాలో మొత్తం 1,707 పాఠశాలలుండగా.. వాటిలో 19 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల సంఖ్య 399 గా తేలింది. ప్రస్తుతం ఈ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థాయి పెంపు, తగ్గింపు పాఠశాలలను మినహాయిస్తే జిల్లాలో దాదాపు 400 పాఠశాలలపై మూసివేత ప్రభావం పడే అవకాశాలున్నాయి.
తల్లిదండ్రులు డిమాండ్‌...
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, సర్కారు స్కూల్స్‌ను ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా తీర్చదిద్దాలని.. విద్యార్థుల తల్లిదండ్రలు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడు మాత్రమే తమ పిల్లల చదువుకు విఘాతం కలగకుండా ఉంటుందని అంటున్నారు.

09:12 - June 10, 2016

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం ఒకవైపు ... అక్కడే పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిని సైతం వదలకుండా వారి జీతభత్యాల్లో కమీషన్లు నోక్కేస్తూ మరోవైపు అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా హోంగార్డుల జీతాల్లో సైతం వాటాలు పంచుకున్న ఓ అవినితి అధికారి గుట్టురట్టయింది.

దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సరస్వతిదేవి ఆలయం..
బాసర సరస్వతి క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా మహారష్ట్ర ,కర్ణాటక లాంటి పోరుగు రాష్ట్రాలనుండి సైతం అమ్మవారి భక్తులు తరలివస్తుంటారు..దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సరస్వతిదేవి ఆలయాల్లో ఇదోకటి.. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు అక్కడ ఎందెందు వెతికినా అవినితి అందందే కలదు అన్నట్లుగా తయారైంది. బాసర అమ్మవారి ఆలయంలో అవినీతి అధికారులు ఎన్నో సంవత్సరాలనుండి తిష్టవేయడంతో సంపాదనమార్గాలపై మంచిపట్టు ఏర్పర్చుకున్నారు. కొందరు అధికారులు కింది స్థాయి ఉద్యోగులు నుండి కమిషన్లు నొక్కేస్తున్నారు.

కక్కుర్తికి కేరాఫ్ గా అధికారులు...
ఏ ప్రభుత్వ అధికారి అయిన తాను పనిచేస్తున్న స్థానంలో మూడు సంవత్సరాలకు మించి పనిచేయకూడదు కిందిస్థాయి అధికారులు అయితే కనీసం ఆరు సంవత్సరాలకు మించకూడదు. డిప్యుటేషన్ లేదా ఇతర కారణాలతో పైరవీలతో 2,3 సంవత్సరాలు పెంచుకోని అక్కడే ఉంటున్నారు. బాసరలోని ఆలయంలో ఉద్యోగం చేస్తున్న శంకర్ ఏకంగా 16 సంవత్సరాల నుండి అక్కడే అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఈయనగారు అసలు ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం హైదరాబాద్ లోని నల్లకుంట రామాలయం... కాని బాసరలో తిష్టవేసి 16 సంవత్సరాలైంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన గారి పై ఆరోపణలు భారీగానే ఉన్నాయి. అకౌంటెంట్ కావడంతో అడ్వాన్స్ ల రూపంగా డబ్బులిచ్చేది ఈ సారే కాబట్టి భారీగా కమీషన్లు నోక్కేస్తాడని ప్రచారం ఉంది.

సెక్యురిటికి 30 మంది హోమ్ గార్డులు...
బాసరలో ఆలయ సెక్యురిటి చూసుకోవడానికి 30 మంది హోమ్ గార్డులను జిల్లా పోలిస్ డిపార్ట్ మెంట్ ఆలయానికి అప్పగించింది... వీరికి జీతాలను ఆలయఆదాయం నుండే చెల్లిస్తారు... వీరికిరోజు 8 గంటల డ్యూటీకి గాను నెలకు 12,000 రూపాయల జీతం ఇస్తున్నారు...ఈ ముప్పైమందిలో ఓ హోమ్ గార్డ్ మరణించగా ప్రస్థుతం 29 మంది పనిచేస్తున్నారు... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీరి భృతిని పెంచింది ....జీవో విడుదలైనప్పటి నుండి పెంచిన జీతాన్ని ఆలయం అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది... నెల నెల జీతం ఇచ్చారు కాని పెరిగిన జీతం ఇవ్వలేదు... ఏరియర్స్ మూడులక్షలు హోమ్ గార్డులకిచ్చేందుకు కమిషన్ కోసం డిమాండ్ చేశారని హోమ్ గార్డ్ లు అంటున్నారు .. అకౌంటెంట్ శంకర్ కు మూడు లక్షలకుగాను యాభై వేలు ముట్టచెప్పనిదే ఇవ్వనని మొండికేయడంతో తమకు న్యాయంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రావాల్సిన డబ్బును సైతం యాభైవేల రూపాయలు ముందుగానే శంకర్ కు ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని టెన్ టీవికి తెలిపారు.

రోజూవారీ కూలీల బిల్లుల్లో కూడా కమీషన్ ...
హోంగార్డుల విషయంలోనే కాకుండా ఈ అధికారి ఆలయంలో పనిచేయడానికి వచ్చే స్వీపర్లు ఇతర రోజూవారీ కూలీల బిల్లుల విషయంలో సైతం కమీషన్ లు తీసుంటాడనే ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని 10 టివి అకౌంటెంట్ శంకర్ ను ప్రశ్నించింది. కాని బుకాయించే ప్రయత్నం చేశాడు శంకర్ .

అక్షరాభాస్యం నుండి అన్నదానం వరకు అక్రమాల ...
ఇలా అధికారులు అక్రమార్జనకు అలవాటు పడడంతో అక్షరాభాస్యం మొదలుకొని అన్నదానం వరకు అడుగడుగునా అక్రమాల జాతర నడుస్తున్నది. ఈ క్రమంలోనే భక్తులు అందజేసే విరాళాలు, విలువైన కానుకలు మాయమవుతున్నట్లు ఆరోపణలున్నాయి.. ఇప్పటికైనా ఉన్నతాదికారులు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ...

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మోడీకి బీజేపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. విదేశీ పర్యటనలో భాగంగా మోడీ ఆఫ్ఘనిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, మెక్సికోలో పర్యటించారు. జూన్ 4న విదేశీ పర్యటనకు వెళ్లిన మోడీ శుక్రవారం  భారత్‌కు చేరుకున్నారు.

08:52 - June 10, 2016

ఖరీఫ్ సీజన్ మొదలవుతోంది. కేంద్రం కొద్ది రోజుల క్రితమే వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించింది. వరికి 60 రూపాయలు, పెసరకు 375, కందికి 425 రూపాయల చొప్పున ధరలు పెంచింది. ఇలా మొత్తం 14 రకాల ఆహార, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధరలు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎలా వున్నాయి? ఇవి రైతులను అప్పుల కష్టాల నుంచి గట్టెక్కిస్తాయా? అసలు పంటలకు కనీస మద్దతు ధరలు ఎందుకు ప్రకటించాలి? కనీస మద్దతు ధరల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి ఏమిటి? కనీస మద్దతు ధరలు ప్రకటించేటప్పుడు కేంద్రం పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు రైతు సంఘం నేత సాగర్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశాలపై సాగర్ ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవటానికి ఈ విజువల్ ని చూడండి..

08:44 - June 10, 2016

వరంగల్ : వర్షాభావంతో పంటలు పండగ రాష్ట్రం కరవుతో కొట్టుమిట్టాడుతోంది. వ్యవసాయం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో... వరంగల్‌ జిల్లాలో రైతులు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేశారు. గ్రీన్‌షెడ్స్, పౌలీహౌస్‌ల సదుపాయం లేకుండానే కూరగాయలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు.

పంటలు పండక రైతుల ఆవేదన...
కరవుతో పంటలు పండక, వ్యవసాయరంగం కుదేలైన సమయంలో కూరగాయల సాగుతో ఉపాధి పొందుతున్నారు వరంగల్‌ జిల్లా రైతులు. కూరగాయలు పండించేందుకు నీటిసౌకర్యం ఎక్కువగా లేకపోవడంతో ఉన్న భూమిలోనే కూరగాయలు పండిచాల్సి వస్తోందంటున్నారు రైతులు.

క్రిమిసంహారక మందులతో అధిక ఖర్చు ....
పండించిన పంటలో సరైన దిగుబడి సాధించేందుకు ఎక్కువ మొత్తంలో క్రిమిసంహారక మందుల కోసం డబ్బును ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని ఓర్చుకొని, మార్కెట్‌కు తీసుకెళ్తే సగం ధరనే ఇచ్చి దళారులు సొమ్ము చేసుకుంటున్నారని వాపోయారు.

కరువు కాలంలో ఆదుకోవాలని కోరుతున్న రైతులు...
పట్టణానికి దగ్గరగా ఉండటం వల్ల మార్కెట్‌ సమస్యలేకుంగా ఉందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందితే మరింత ఎక్కువ మొత్తంలో కూరగాయలు సాగుచేయగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్‌హౌస్, పౌలీ హౌసులు నిర్మించేందుకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తే మరింత కొత్తగా సాగుచేయడానికి ప్రయత్నిస్తామని యువరైతులు చెబుతున్నారు. కరువు కాలంలో ప్రభుత్వ ఆదుకోవలని కోరుతున్నారు. 

సూర్యాపేటలో బీజేపీ 'వికాస్ పర్వ్ 'సభ...

నల్లగొండ : బీజేపీ రెండేళ్ళ పాలన సందర్బంగా దేశవ్యాప్తంగా 'వికాస్ పర్వ్ ' పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యపేటలో శుక్రవారం వికాస్ పర్వ్ సభను చేపట్టారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. ఈసభకు పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.

కాకినాడ బంద్ కు కాపునేతల పిలుపు...

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ దీక్ష పలు మలుపులు తిరుగుతోంది. గురువారం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తరుణంలో ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాపునేతలు కాకినాడలో బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలూ జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విస్తృంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో కాకినాడ నగర వ్యాప్తంగా బస్ లు నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా వుండే కాకినాడ నగరం నిర్మానుష్యంగా మారిపోయింది.

08:19 - June 10, 2016

తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శుక్రవారం తెల్లవారుఝామున అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయం వెలుపల వున్న బూందీ తయారీ పోటులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రదేశంలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.దట్టమైన పొగలు కారణంగా మంటలు ఆర్పటానికి అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. దట్టమైన పొగలు కారణంగా మంటలు ఆర్పటానికి అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. టీటీడీ సిబ్బంది అప్రమతతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఘనటలో సుమారు 2వేల 500 లడ్డూలకు తయారీ బూందీ దగ్థం అయింది. బూందీ తయారీ పదేశంలో ఉపయోగించే నెయ్యి గోడలకు పేరుకుపోవటంతో పొయ్యిలో నుండి వెలువడిన మంటలు గోడలకు అంటుకుని అగ్ని ప్రమదం జరిగినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుండి భక్తుల రద్దీ పెరగటంతో బూందీ తయారీ ప్రదేశంలో క్లీనింగ్ సరిగా చేయకపోవటంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం.

08:04 - June 10, 2016

నిజామాబాద్ : రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా మారింది బోధన్ మున్సిపల్ అధికారుల తీరు. ప్రభుత్వ ఆదాయానికి అద్దెల పేరుతో భారీగా గండి కొడుతున్నారు. ఆర్థిక వనరులు పెంచుకోవాల్సిన అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం అక్రమార్కుల పాలవుతోంది.

మామూళ్లకు కక్కుర్తిపడున్న అధికారులు ....
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం పరిధిలోని మూడు ప్రాంతాల్లో మున్సిపల్ వ్యాపార సముదాయాలు ఉన్నాయి.. వీటిని పలువురు వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. ఆర్థిక వనరులను పెంచుకోవాల్సిన అధికారులు కొందరు మామూళ్లకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా అద్దెను మార్కెట్ రేటు కన్నా తక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో భారీగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

ఏళ్ల తరబడి తిష్టవేసిన వ్యాపారులు...
కొందరు వ్యాపారులు సంత్సరాల తరబడి మున్సిపల్ కాంప్లెక్స్ లోనే తిష్టవేశారు. అధికారులను మచ్చిక చేసుకున్న వ్యాపారులు అద్దె పెరగకుండా చూసుకుంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో సమానంగా అద్దె పెరగలేదు... బయట షాపులకు అద్దె ఎనిమిది వేల నుంచి పదివేలు ఉంటే మున్సిపాలటీలో షాపులకు కేవలం మూడు వేలు మాత్రమే.. వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ కాంప్లెక్స్ ల అద్దె ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు... కేవలం మూడు సంవత్సరాల వరకే దుకాణ సముదాయాలు అద్దె ఇవ్వడానికి మున్సిపల్ అధికారులకు అధికారం ఉందని..కాని కొందరు మున్సిపాలిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి తమ వారికే సముదాయాలను అద్దెకు ఇచ్చారు. మరికొందరు సిబ్బంది బినామీ పేరు మీద ఈ తతంగాన్ని వెనుకుండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

భారీ ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ...
అయితే మూడు సంవత్సరాలు దాటినా అంతకుమించి సమయం లీజు ఇవ్వాలంటే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి..25 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో పోడిగించకూడదనే నిబంధన ఉంది. కానీ అధికారులు, సిబ్బంది ఒక్కో షాపుకు నెలకు పదివేల చొప్పున వసూలు చేస్తూ.. 30 సముదాయాలకు నెలకు మూడు లక్షల ఆదాయం చేకూరుతోంది.. కానీ రెండు నుంచి నాలుగు వేలు మాత్రమే వసూలు చేస్తున్నారు. దీంతో బోధన్ మున్సిపాలిటీ భారీగా ఆదాయం కోల్పోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు వెలిశాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు నామమాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

నిబంధనల ప్రకారం మూడేళ్లకే లీజు...
నిబంధనల ప్రకారం మూడేళ్ల గడువు ముగియగానే బహిరంగ వేలంలో షాపుల లీజు వ్యవహారం జరగాలి. కానీ అలాంటిదేమి జరగలేదు. లోలొపల రెన్యూవల్ చేశారు. మున్సిపాలిటీలకు రావాల్సిన బకాయిలను చిన్న చితక వ్యాపారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే అధికారులు తమ పరిధిలోని వ్యాపార సముదాయాలపై ఎందుకంత కపటప్రేమను చూపిస్తున్నారో అర్థం కావటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 

07:57 - June 10, 2016

హైదరాబాద్ : ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళు పూర్తైనా ఇంకా ఆర్టీసీ విభజన కాకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాక సంస్ధ పూర్తిగా నష్టాలతో నడుస్తుండటంతో.. గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత స్ధాయిలో చర్చించేందుకు డిపో మేనేజర్ల స్ధాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ...
అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధను గాడిలో పడేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే 600 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న సంస్ధను ఎలా గట్టెక్కించాలని అధికారులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఉన్నతాధికారులతో మాత్రమే నామామాత్రపు చర్చలు జరిపితే సరిపోదని భావించిన సీఎం కింది స్ధాయి సిబ్బందితోనూ చర్చించాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో డిపో మేనేజర్ల స్ధాయి అధికారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోవాని సీఎం యోచిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని రవాణామంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణను సీఎం ఆదేశించారు.

ఆర్టీసీకి అన్ని జిల్లాల్లోనూ నష్టాలే...
ఒక్క హైద్రాబాద్‌లో మినహాయిస్తే ఇతర జిల్లాలోని సంస్ధలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. మొత్తం ఆక్యూపెన్సీ తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇక హైద్రాబాద్‌లో మాత్రం బస్సులకు మెయింటెనెన్స్ కోసం జిహెచ్‌ఎంసీ నుంచి ఏడాదికి కొంత ఆర్థిక సాయం అందించేలా గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరంలో నష్టాల్లో ఉన్న డిపోలకు ఏడాదికి 50 కోట్ల వరకు జీహెచ్ఎంసీ ఆర్థిక సాయం అందిస్తోంది. దీనికి బదులుగా జీహెచ్ఎంసీకి చెందిన వాహనాలకు ఆర్టీసీ సర్వీసు సెంటర్లలో రిపేర్ చేస్తున్నారు.

షీలా బేడి కమిటీ పరిధిలో విభజన అంశం...
ఆర్టీసీ పూర్తి స్థాయిలో విభజన కాకపోవడం కూడా అనేక సమస్యలకు దారి తీస్తోంది. సంస్ధకు చెందిన ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు. ఈ విభజన అంశం షీలా బేడి కమిటీ పరిధిలో ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. అయితే ఈ రెండేళ్ళ కాలంలో కేవలం ఉద్యోగుల విభజన, బస్సుల పంపకం వంటివి మాత్రమే జరిగాయి. బస్ భవన్, ఆర్టీసీ హస్పటల్, విలువైన భూములు, భవనాల పంపకం పెండింగ్‌లో ఉంది. ఇలా చాలా అంశాలు పెండింగ్ ఉన్నందున వాటిని తానే స్వయంగా రంగంలోకి దిగి పరిష్కరించాలని సీఎం నిర్ణయించకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఏపీలో లాభాలు, టీ.ఎస్ లో నష్టాలు...
అయితే విభజన అయిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంటే తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లోకి ఎందుకు వెళ్తుందో చర్చించి.. లాభాల్లోకి వచ్చేందుకు క్షేత్ర స్ధాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. దీంతో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

జూపల్లి.. రేవంత్ బాహాబాహీ...

మహాబూబ్‌నగర్‌ : మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మహాబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం బోగారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే రేవంత్‌ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ద్రోహి చంద్రబాబు అంటూ జూపల్లి విమర్శించడంతో.. రేవంత్‌ ఫైరయ్యారు. జూపల్లి చేతిలోంచి మైక్‌ను లాక్కున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అటు టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైతం బాహాబాహీకి దిగారు.

07:50 - June 10, 2016

మహాబూబ్‌నగర్‌ : మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మహాబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం బోగారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే రేవంత్‌ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ద్రోహి చంద్రబాబు అంటూ జూపల్లి విమర్శించడంతో.. రేవంత్‌ ఫైరయ్యారు. జూపల్లి చేతిలోంచి మైక్‌ను లాక్కున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అటు టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైతం బాహాబాహీకి దిగారు.

07:27 - June 10, 2016

హైదరాబాద్ : ఎల్బీనగర్, ఆరాంఘర్ లో ప్రైవేటు బస్సులను తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సుల అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ 20 బస్సులను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. ధర్నాతో భారీగా వాహానాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఏఐటీయూసీ నేతబోస్, ఈయూ అధ్యక్షుడు బాబు సహా పలువురిని పోలీసులు ఆరెస్ట్ చేసి సరూర్ నగర్ పోలీస్టేషన్ తరలించారు.

07:01 - June 10, 2016

హైదరాబాద్ : ఈ ఏడాది బోనాల పండుగ నిర్వహణకు కసరత్తు ముమ్మరం చేసింది తెలంగాణ సర్కార్. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. సీసీటీవీలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. పారిశుద్ద్యంతో పాటు.. ఆలయాల్లో పరిసరాల్లో పరిశుభ్రత వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించింది సర్కార్.

ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, తలసాని సమీక్ష...
భాగ్యనగరంలో నిర్వహించే బోనాలపండగపై ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జులై 17 నుంచి హైద్రాబాద్ లో బోనాల పండగ ప్రారంభమవుతుందన్నారు మంత్రితలసాని. జులై 24, 25 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష...
ఇక బోనాల పండగ నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. గతేడాది కంటే ఘనంగా బోనాల పండగ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం విజయవత కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రులు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనులను గుర్తించి పూర్తిచేయాలని ఆదేశించింది ప్రభుత్వం. అవసరమైన దగ్గర మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు...
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జులై 5 న నిర్వహించే కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.

06:56 - June 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపుల లొల్లిపై ఢిల్లీ హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది. ఇప్పటికే తెలంగాణ ఇచ్చి , అధికారానికి దూరం కావడంతో ఆగ్రహంతో ఉన్న హైకమాండ్‌కు టీ కాంగ్రెస్ నేతల వ్యవహారం మరింత చిరాకు తెప్పిస్తోంది. దీంతో తమ పార్టీనేతల గొడవలకు బ్రేకులు వెయ్యాలని డిసైడ్‌ అయ్యింది.

ఒకరిపై ఒకరు మండిపడుతున్న నేతలు..
నాలుగురోజులుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సీఎల్పీ వేధికగా పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డిలను టార్గెట్‌ చేసి ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సెగ రాజేశాయి. దీంతో సీరియస్ అయిన హైకమాండ్, నోటికి పనిచెప్పిన కోమటిరెడ్డికి షోకాజ్‌తో జవాబిచ్చింది. షోకాజ్‌కు రిప్లై ఇవ్వకపోతే, వేటు పడుతుందన్న సంకేతాలను పంపించింది.

జానారెడ్డి కోవర్ట్‌ అన్న పాల్వాయి వ్యాఖ్యల దుమారం..
ఇదిలా ఉండగా సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్ట్‌ అని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. ఈ కామెంట్స్‌తో నల్లగొండ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి చేసిన ఆరోపణల వ్యవహారం ఉత్తమ్‌ వర్సెస్ సీఎల్పీనేత జానారెడ్డిల మధ్య వివాదంగా మారింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి క్లోజ్‌గా ఉండే పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి కోవర్టు అంటూ విమర్శలు చెయ్యడం పై పార్టీలోని సీనియర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డికి షోకాజ్ ఇచ్చిన పార్టీ..పాల్వాయికి షోకాజ్ ఇవ్వాల్సిందేనని కొంతమంది నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

నేతల లొల్లిపై హైకమాండ్‌ సీరియస్‌..
ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన హైకమాండ్‌ సీరియస్‌గా రియాక్ట్ అయింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, పాల్వాయికి ఫోన్‌చేసి క్లాస్‌ పీకారు. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ అడిగారు. దీంతో పాల్వాయిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తాను జానారెడ్డిని కోవర్ట్‌ అనలేదని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ స్పష్టం చేశారు పాల్వాయి. 

06:48 - June 10, 2016

హైదరాబాద్ : నేడు, రేపు కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం పర్యటించనుంది. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్ట్‌లపై బృందం అధ్యయనం చేయనుంది. ఈ బృందంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాధన్‌ తో పాటు అంతర్‌ రాష్ట్ర జలవనరుల సీఈ నర్సింగరావు, రాష్ట్ర మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ ఆధ్యక్షతన బృందం ...
ఇటీవల పొరుగు రాష్ట్రాల జలవివాదాలను పరిష్కరించుకుంటూ... వస్తున్న తెలంగాణ సర్కార్. తాజాగా కర్ణాటకలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం పర్యటించనుంది. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్ట్‌లపై బృందం అధ్యయనం చేయనుంది. మహారాష్ట్రతో గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నీటి లభ్యత గురించి చర్చించి సక్సెస్ అయింది తెలంగాణ సర్కార్. తాజాగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ ఆధ్యక్షతన బృందం కర్ణాటకలో పర్యటించనుంది తెలంగాణ బృందం.

రెండో రోజు తుంగభద్ర డ్యాంలను బృందం సందర్శన...
కృష్ణా జలాల పంపిణీ పై కర్ణాటక రాష్ట్రంలో సందర్శించనున్న బృందం.. మొదటి రోజు నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంలను పరిశీలించనుంది. వాటి ఎత్తు, నీటి లభ్యతపై సుదీర్ఘంగా పరిశీలించనుంది. రెండో రోజు తుంగభద్ర డ్యాంలను బృందం సందర్శించనుంది. ఈ బృందంలో మంత్రి హరీష్‌రావుతో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, అంతరాష్ట్ర జలవనరుల చీఫ్ ఇంజనీర్, డిప్యూటీ డైరెక్టర్‌లు పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు, సీనియర్‌ న్యాయవాదులు విద్యాసాగర్‌, రవీందర్‌రావు, అంతర్‌ రాష్ట్ర జలవనరుల సీఈ నర్సింగరావులతో కూడిన బృందం పలుప్రాజెక్టులను, డ్యాంలను పరిశీలించనుంది.

తిరుమలలో అగ్నిప్రమాదం...

తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శుక్రవారం తెల్లవారుఝామున అగ్నిప్రమాదం సంభవించింది. బూందీ తయారీ పోటులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రదేశంలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. దట్టమైన పొగలు కారణంగా మంటలు ఆర్పటానికి అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. కాగా రానున్న కాలంలో బూందీపోటు తయారీ కేంద్రాన్ని ఆధునీకరిస్తామని టీటీడీ ఈవో తెలిపారు.

Don't Miss