Activities calendar

11 June 2016

22:10 - June 11, 2016

హరారే : టీమిండియా జింబాబ్వే టూర్‌ను విజయంతో ఆరంభించింది.  హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌ షోతో  ఆతిధ్య జట్టుపై సునాయాస విజయం సాధించింది.  బౌలర్లు డామినేట్‌ చేయడంతో పాటు  రాహుల్‌ సూపర్‌ సెంచరీ సాధించడంతో భారత జట్టుకు పోటీనే లేకుండా పోయింది. 
భారత జట్టు శుభారంభం
జింబాబ్వే టూర్‌లో భారత జట్టు శుభారంభం చేసింది.మూడు వన్డేల సిరీస్‌ను ధోనీ సేన విజయంతో ఆరంభించింది. తొలి వన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో ఆతిధ్య జట్టుకు షాకిచ్చింది.
భారీ స్కోర్‌ నమోదు చేయలేకపోయిన జింబాబ్వే  
హరారే స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌చేసిన జింబాబ్వే జట్టు భారీ స్కోర్‌ నమోదు చేయలేకపోయింది. భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో 49.5 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. సీన్‌ ఇర్విన్ 21, సికిందర్ రాజా 23, చిగుంబరా 41 పరుగులు చేయడంతో ఆతిధ్య జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, ధవళ్ కులకర్ణీ, శ్రణ్, చెరో రెండు వికెట్లు, స్పిన్నర్లు అక్షర్ పటేల్, చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.
169 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత
169 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభ ఓవర్లలోనే ఓపెనర్‌ కరుణ్‌ నాయర్‌ వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్‌ రాహుల్‌,  వన్‌డౌన్‌లో వచ్చిన అంబటి రాయుడుతో కలిసి రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని జోడించి జట్టు విజయానికి పునాది వేశాడు.
రాహుల్‌ తొలి సెంచరీ
57 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన రాహుల్‌ ...వన్డేల్లో భారత్‌ తరఫున అరంగేట్రం వన్డేతోనే సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. రాయుడుతో  కలిసి 150 పరుగుల  భాగస్వామ్యం నమోదు చేసిన రాహుల్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన భారత్‌ వన్డే సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 115 బంతుల్లో  సెంచరీ చేసిన రాహుల్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ధోనీ సేనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

 

22:04 - June 11, 2016

చెన్నై : రాజీవ్‌గాంధీ హత్య కేసులో 25 సంవత్సరాలుగా  జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ చెన్నైలో తమిళ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ కేసులో జైల్లో ఉన్న వారిని మానవాతాదృక్పథంతో విడుదల చేయాలని పలు సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అయితే సచివాలయం వరకు వెళ్తున్న ర్యాలీని పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. పలువురు రాజీవ్‌ హంతకుల విడుదల మెమెరాండంను  సచివాలయంలోని ప్రభుత్వ కార్యదర్శికి అందజేశారు.   

22:00 - June 11, 2016

రాజస్థాన్ : చేయని నేరానికి 23 ఏళ్ల శిక్ష అనుభవించాడో వ్యక్తి. రాజస్థాన్‌కు చెందిన నిస్సారుద్దీన్‌ అహ్మద్‌ బాంబు పేలుళ్ల అభియోగంపై అరెస్టై జైలుకెళ్లాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 23 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై ఇంటికి చేరాడు.  నిస్సార్‌ అహ్మద్‌పై 1993లో పోలీసులు మోపిన నేరంలో ఎలాంటి ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానం తేల్చడంతో.. 23 ఏళ్ల తర్వాత తన తల్లిని చూశానని, ఇలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని నిస్సార్‌ ఆవేదన చెందుతున్నాడు. తనకు నేరంతో ఎలాంటి సంబంధం లేకుండానే.. తనపై పోలీసులు తప్పుడు అభియోగాలు మోపారని నిస్సార్‌ కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. 

 

21:57 - June 11, 2016

ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో  పలువురు ప్రముఖులు విజయం సాధించారు. మొత్తం 57 సీట్లకు గాను 30 సీట్లకు పోటీ లేకుండానే అభ్యర్థులు ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ టంటా గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు గానూ.. రెండింటిలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ నుంచి ఎంజే అక్బర్‌, అనిల్‌ మాధవ్‌ దావే విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్‌ మద్దతుతో వివేక్‌ టంకా గెలుపొందారు. ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, మహేశ్‌ పొద్దార్‌ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించగా.. బీఎస్‌పీ రెండు స్థానాల్లో,  ఒక స్థానంలో కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ గెలుపొందారు. కర్నాటక నుంచి జైరాం రమేష్‌, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, నిర్మలా సీతారామన్‌ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. 

 

21:54 - June 11, 2016

మెదక్ : మల్లన్న సాగర్‌, నిమ్జ్‌ భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్న సందర్భంగా తమ్మినేని వారికి మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్‌ తన మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. 

 

21:47 - June 11, 2016

మనుషుల్లో మంచి చెడుల గురించి ముళ్లపుడి గారు ఒక మంచి డైలాగ్ రాశారు. 'మంచిచెడులనేవి.. రాళులు పోసి.... ఇది మంచి, ఇది చెడు అనేది ఉండదు. మనుషుల్లో కూడా వీడు మంచివాడు.. వీడు.. చెడ్డవాడు అనేది ఉండుదు. మంచిగాకనిపించేవాడు మనుషుల ప్రాణాలు తీసే నరరూపరాక్షసుడై ఉంటాడు... చెడ్డగా కనిపించేవాడు ప్రాణాలిచ్చే మంచి మనిషై ఉంటాడు. ఆయా పరిస్థితుల్లో ఆయా సమయాన్ని బట్టి మంచిచెడులనేవి బయటపడుతుంటాయని చెప్పారాయన'..సెంట్ సర్ సెంట్ కరెక్ట్.. ఎవరిని కూడా వీడు గుడ్, వీడు బ్యాడ్ అని అంచనా వేయలేం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:37 - June 11, 2016

సింగరేణి సంఘంల ఓట్ల పండుగనట.. సాతొళ్లను మళ్ల గెలిపిస్తే దండుగేనట, కాసాయి కస్టమర్లను నమ్మిన బ్యాంకొల్లు.. చిప్పవట్టుకోని అడుక్కొంటున్న సిబ్బంది, నోరుదెరిసిన పాలమూరు జిల్లా సెటర్లు...ఐదు దుకాన్లను ఆగంజేసిన దొంగలు, మఠాలను దర్శించుకుంటున్న చిరుతలు... తిరుమల కొండమీదభక్తుల తిప్పలు, కాస్లీమందు భూమిపాలుజేసిండ్రు.. అమ్ముకున్న పైకమొచ్చంటున్రు, పోలీసోళ్లతోని పోలగాడ్ల కొట్లాట... తాగినంక అవుసరమా తండ్లాట, అవినీతి చేప, మొగొళ్లను ర్యాగింగ్ చేస్తున్న ఆడోళ్లు, బాహుబలి-2.. గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్న తమన్నా.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:21 - June 11, 2016

సింగర్ కృష్ణచైతన్య, యాంకర్ మృదులతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు పలు విషయాలు తెలిపారు. వారు తమ కెరీర్ ల గురించి వివరించారు. కృష్ణ చైతన్య మధర్ ప్రాంక్ కాల్ చేశారు. మృదుల పెదనాన్న రాజగోపాల్ ప్రాంక్ కాల్ చేసి ఆటపట్టించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

జింబాబ్వే పై భారత్ ఘన విజయం

హరారే : తొలి వన్డేలో జింబాబ్వే పై భారత్ ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది. తొలి వన్డేలో లోకేష్ రాహుల్ సెంచరీ చేశాడు. జింబాబ్వే : 168 (ఆలౌట్), భారత్ (173/1). 

20:51 - June 11, 2016

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వక్తలు శివ, స్వాతి, ప్రకాశ్ పాల్గొని, మాట్లాడారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. మరిన్నియ వివరాలను వీడియోలో చూద్దాం..

 

కర్ణాటక నుంచి రాజ్యసభకు నిర్మాలా సీతారామన్ ఎన్నిక

బెంగుళూరు : కర్ణాటక రాజ్యసభ ఫలితాలు విడుదలయ్యాయి. కర్నాటక నుంచి రాజ్యసభకు నిర్మాలా సీతారామన్ ఎన్నికయ్యారు. 

ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ టమ్ టా ఎన్నిక

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ప్రదీప్ టమ్ టా కాంగ్రెస్ ఎన్నికయ్యారు. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఓడిపోయారు. 

ఏడు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్న ఎస్ పీ

యూపీ : ఎస్ పీ ఏడు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది. యూపీ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. 

రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి

రాజస్థాన్ : రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాజస్థాన్ లో బిజెపి నాలుగు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెంకయ్యనాయుడు, ఓం ప్రకాష్ మథూర్, హర్షవర్ధన్ సింగ్, ఆర్కే శర్మ ఎన్నికయ్యారు. 

20:24 - June 11, 2016

విశాఖ : రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా కాపు నేతల అరెస్ట్ లు తప్పవని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో జరిగిన నేషనల్‌ జాతీయ చైల్డ్ చెస్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. కాపులకు ప్రభుత్వం ఓ పక్క కమీషన్ ను వేసి న్యాయం చేయాలని చూస్తుంటే అది కాదని అందోళన చేయడం సరికాదని హితవు పలికారు.. ముద్రగడ ప్రతిపక్షం చేతిలో కీలుబొమ్మగా మరారని ఎద్దేవా చేశారు.. చట్టాలను అతిక్రమించి ప్రవర్తిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. త్వరలో విశాఖను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు.

 

ముద్రగడకు వైద్యం చేసేందుకు వైద్యుల సిద్ధం : చినరాజప్ప

విజయవాడ : తుని ఘటనలో సీబీఐ విచారణ వద్దని ముద్రగడ చెప్పారని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. ముద్రగడకు వైద్యం చేసేందుకు వైద్యులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈమేరకు చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయడం తమ చేతుల్లో లేదన్నారు. ఇప్పటికే ఆ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్ కేబినెట్ లో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ, శైలజానాథ్ కాపులకు సర్వేకు రూ.40 లక్షలు ఇప్పించలేకపోయారని చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్న చిరంజీవి, బొత్స గతంలో కాపులను మోసం చేసినవారేనని చెప్పారు.

20:15 - June 11, 2016

విజయవాడ : తుని ఘటనలో సీబీఐ విచారణ వద్దని ముద్రగడ చెప్పారని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. ముద్రగడకు వైద్యం చేసేందుకు వైద్యులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈమేరకు చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయడం తమ చేతుల్లో లేదన్నారు. ఇప్పటికే ఆ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్ కేబినెట్ లో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ, శైలజానాథ్ కాపులకు సర్వేకు రూ.40 లక్షలు ఇప్పించలేకపోయారని చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్న చిరంజీవి, బొత్స గతంలో కాపులను మోసం చేసినవారేనని చెప్పారు. కాపులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. 

 

19:14 - June 11, 2016

తూర్పుగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమండ్రి వచ్చిన వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులను ఎయిర్‌పోర్ట్ లో పోలీసులు నిర్బంధించారు. దీంతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ రోడ్డు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

 

18:50 - June 11, 2016

హైదరాబాద్ : నగర అభివృద్ధిపై ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ప్రణాళిక లేదని హైదరాబాద్ జిందాబాద్‌ నేతలు విమర్శించారు. హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఎస్వీకే రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భగా నేతలు మాట్లాడుతూ స్కైవేలు, ఫ్లైఓవర్ల పేరుతో పర్యావరణాన్ని ప్రభుత్వం నాశనం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. నగర అభివృద్ధిపై ప్రజాసంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలు, స్వచ్చంధ సంస్థలతో విస్త్రత చర్చ అవసరమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నారని ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌లో చెట్ల నరికివేత సరికాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

18:44 - June 11, 2016

హైదరాబాద్ : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలని ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ సాధన సమితి' ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని విద్యాహక్కు చట్టం ఆదేశించినా ఎక్కడా అమలు కావడంలేదన్నారు. విద్యాహక్కు చట్టం అమలు, ఉద్యోగ నియామకాలు, అధిక ఫీజులు, వేతనాలు అంశంపై సర్వేలు నిర్వహించి ప్రచార యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. 

 

18:39 - June 11, 2016

రంగారెడ్డి : మూడు సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కల పెంపకం చేపట్టి రాష్ట్రాన్ని హరిత తెలంగాణాగా మారుస్తామని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో ...రంగాపూర్, తిమ్మాయిపల్లిలోని నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈయన వెంట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి ఉన్నారు.     

అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి జగదీష్ రెడ్డి

నల్గొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను మంత్రి జగదీష్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణపై అమిత్ షాకు అవగాహన లేదన్నారు. తెలంగాణలో బీజేపీని బతికించుకునేందుకే అమిత్ షా కల్లబొల్లిమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

 

ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది : సూపరింటెండెంట్ రమేష్ కిషోర్

తూర్పుగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందని రాజమండ్రి ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ అన్నారు. ఆయన వైద్యానికి సహకరించడం లేదని తెలిపారు. ఆయన సహకరిస్తేనే చికిత్స చేయగలమని చెప్పారు. ముద్రగడ సతీమణి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. 
ముద్రగడ వైద్య సేవల కోసం ప్రభుత్వం రెండు వైద్య బృందాలను నియమించిందని తెలిపారు.

 

17:34 - June 11, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆరేపల్లి మోహన్ లకు పీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. గాంధీభవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. పార్టీ క్రమశిక్షణా ఉల్లంఘించిన నేతలపై చర్చించారు. పాల్వాయి జానారెడ్డిపై విమర్శలు చేశారు. కరీంనగర్ డీసీసీ చీఫ్ కటుకం మృత్యుంజయంపై ఆరేపల్లి మోహన్ విమర్శలు చేశారు. ఈనేపథ్యంలో పాల్వాయి, ఆరేపల్లి మోహన్ లకు పీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. ఈనెల 17న క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై వివరాణ ఇవ్వాలని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలావుంటే ఇక నుంచి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాలంటే పీసీసీ అనుమతి తప్పనిసరని సంఘం తెలిపింది. సీఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టాలంటే సీఎల్పీ నేత అనుమతి తీసుకోవాలన్నారు. 

 

అమిత్ షా వి కల్లబొల్లి మాటలే : జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : బిజెపి నేత అమిత్ షా కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. చట్టంపరంగా రాష్ట్రానికి ఇవాల్సిన నిధుల కంటే కేంద్రం నయా పైసా ఎక్కువ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి బిజేపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోటీకి అభ్యర్థులే లేని పార్టీ బిజేపి అని ఎద్దేవా చేశారు.

రాహుల్, కాంగ్రెస్ పై అమిత్ షా విమర్శలు హాస్యాస్పదం: ఉత్తమ్

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

హైదరాబాద్ : రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పై బిజెపి నేత అమిత్ షా విమర్శలు హాస్యాస్పదం టి. పీసీసీచీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండి పడ్డారు. వివేక్ బ్రదర్స్, ఎంపి గుత్తాలతో చర్చించా అని.. వారు పార్టీలోనే ఉంటారన్న నమ్మకం ఉందని ఉత్తమ్ తెలిపారు. విబజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్, ఖమ్మం ఉక్కు ఫ్యాక్టరీలు ఎక్కిడికిపోయాయో అమిత్ షా చెబితే బాగుండేది అన్నారు.

జగన్ ఏపీ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి రావెల

విజయవాడ : రెండేళ్ల పసిపాప అయిన ఏపీ ని జగన్ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి రావెల కిశోర్ బాబు విమర్శించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నందుకే జగన్ మీడియాను ఆపాల్పి వచ్చిందని అన్నారు. ముద్రగడ జగన్ వలలో పడొద్దు అని రావెల సూచించారు. ప్రభుత్వంతో ముద్రగడ చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. తుని ఘటనపై సీబీఐ విచారణ ఎందుకు అడుగుతున్నారో జగన్ ను ముద్రగడ నిలదీయాలన్నారు. కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య టీడీపీలో చేరేందుకు ఇటీవల ప్రయత్నించారని పేర్కొన్నారు.

చిరంజీవికి మంత్రి నారాయణ ప్రశ్నలు

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు లేఖ రాసిన చిరంజీవికి మంత్రి నారాయణ ప్రశ్నలు సంధించారు. ముద్రగడ పురుగుల మందు తాగితే జరిగే పరిణామాలకు చిరంజీవి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. రైతులను తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం తప్పా? చిరంజీవి ఏనాడైనా కాపుల గురించి పట్టించుకున్నారా? చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నపుడు కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నం చేశారా? అధికారంలో ఉన్నపుడు చిరంజీవికి కాపులు గుర్తుకు రాలేదా మంత్రి నారాయణ చిరంజీవికి ప్రశ్నలు సంధించారు.

16:26 - June 11, 2016

ఆదిలాబాద్ : భక్తిభావం వెల్లివిరియాల్సిన చోట... అవినీతి భూతం రాజ్యంఏలుతోంది. రుచిలేని లడ్డూలు... చప్పని పులిహోర. దేవుణ్ని చూసిన అనుభూతిని... నీరుగారుస్తున్నాయి నాసిరకం ప్రసాదాలు. ఇదేంటని అడిగామా.. ఇక్కడంతే...  ఇష్టమైతేనే తీస్కోండి ...లేకుంటే లేదు. ఇదీ అక్కడి  ఆలయసిబ్బంది సమాధానం. విజిలెన్స్‌ తప్పుబట్టినా లెక్కలేదు వారికి.. బాసర సరస్వతీ ఆలయంలో అక్రమాలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ. 
నాసిరకం లడ్డూలు
ఆదిలాబాద్‌ జిల్లా బాసర జ్ఞానసరస్వతీ ఆలయంలో అవినీతికి అంతేలేకుండా పోయింది. అక్షరజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అమ్మవారి ఆలయానికి వెళితే... అసంతృప్తితో తిరిగివస్తున్నారు భక్తులు. బాసర జ్ఞానసరస్వతీ ఆలయంలో తయారు చేస్తున్న లడ్డూలు నాసిరకంగా, చప్పగా ఉంటున్నాయి. తయారీ సమయంలోనే లడ్డూలను నీటితో తడుపుతున్నారు. వాస్తవానికి  పిండి అంటకుండా చేతికి నూనె లేదా నెయ్యిని  రాసుకోవాలి. ఇక్కడ మాత్రం నీళ్లు వాడుతున్నారు. తూకం రావాలన్న కక్కుర్తితో లడ్డూపిండిపై మొత్తంగా నీళ్లనే కుమ్మరిస్తున్నారు. పైగా లడ్డూ తయారీలో వాడాల్సిన కిస్‌మిస్‌, కాజు,బాదం, యాలుకుల లాంటి దినుసులు అసలే  కనిపించడంలేదు. పైఅధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో...ఆలయ పరిపాలనా అంతా అవినీతిపరుల ఇష్టారాజ్యంగా మారింది. 
రేటు తగ్గకుండా సైజు తగ్గిన లడ్డూలు
లడ్డూల బరువు రోజురోజుకు తగ్గిపోతోంది. బరువును తగ్గించారుగాని.. ధరను మాత్రం తగ్గించలేదు. 100గ్రాములు ఉండాల్సిన చిన్నలడ్డూ 90గ్రాములకు పడిపోయింది. ఇక అభిషేకం లడ్డూ ఏకంగా వందగ్రాములు తగ్గి 400గ్రాములు  మాత్రమే తూగుతోంది. భక్తుల రద్దీనిబట్టి ప్రతిరోజు.. సుమారు ఐదువేల లడ్డూలు విక్రయిస్తున్నారు. చిన్నలడ్డూను 15రూపాయలకు, పెద్దలడ్డూను 50రూపాయలకు అమ్మతున్నారు. దీంతో  రోజుకు సుమారు 10 నుంచి 20వేల  రూపాయలను అవినీతి అధికారులు.. తమ జేబుల్లో వేసుకుంటున్నట్టు 10టీవీ నిఘాలో బయటపడింది. అంటే.. నెలకురూ.4లక్షల 50వేలు,  ఏడాదికి  ఏకంగా 54 లక్షల రూపాయలను అవినీతిపరులు మింగుతున్నట్టు  స్పష్టం  అవుతోంది.
పులిహోరలో నిమ్మ ఉప్పు.. నకిలీ పసుపు 
లడ్డూల సంగతి అలావుంటే... పులిహోర ప్రసాదంలో పులుపే లేకుండా పోయింది.  సరిపడా పదార్థాలు వాడకుండా తయారు చేస్తున్న పులిహోర రుచిని కోల్పోయింది. పెద్దమొత్తంలో తయారు చేస్తున్న పులిహోరలో...  చింతపండుకు బదులుగా నిమ్మఉప్పు వాడుతున్నారు. నకిలీ పసుపును ఉపయోగిస్తున్నారు. దీంతో పులిహోర కంటికి మాత్రమే ఇంపుగా కనిపిస్తోంది.  
టెండర్లు పిలవకుండానే కాంట్రాక్ట్ అప్పగింత
ప్రసాదాల తయారీలోనే కాదు... ఆలయానికి సరుకుల సరఫరాలోనూ అవినీతి మాఫియాలా మారింది. టెండర్లు పిలవకుండానే సరుకుల సరఫరా మొత్తం ఓ ప్రైవేట్‌ ఎజెన్సికి అప్పగించారు. దీంతో కాంట్రక్టర్‌ ఆడిందే ఆటగా  తయారైంది పరిస్థితి. అన్నీ నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారు. పైగా సరుకుల్లోనూ కోతకూడా పెడుతున్నారు. ఇదిలావుంటే..టోకెన్లఅమ్మకాలతో ఆలయసిబ్బంది మరో రకం దోపిడీని సాగిస్తున్నారు. ఒకసారి ఉపయోగించిన   టోకెన్లను ... తిరిగి మరో భక్తునికి అమ్మేస్తున్నారు. ఒకసారి లడ్డూలు అమ్మిన టోకెన్లతోనే మరోసారి అమ్మేసి.. ఆలయ ఆదాయానికి భారీగా గండిపెడుతున్నారు. ఇంతటితోనే ఆగటంలేదు. ప్రసాదాల విక్రయాల్లో  అధికారులు నష్టాలను  చూపిస్తున్నారు. చిన్నా, పెద్దా లడ్డూలపైన 1నుంచి 5రూపాయల వరకు నష్టం వస్తున్నట్టు  లెక్కలు రాస్తున్నారు. గతంలో ఇంచార్జి ఈఓ ఉన్నారని సర్దుకున్నా... ప్రస్తుతం డిప్యుటి కలెక్టర్ స్థాయి అధికారి ఈఓగా వచ్చినా పరిస్థితి  మారలేదు. ఆలయంలో జరుగుతున్న అవకతవకల్లో ఉద్యోగులకు సంబందం ఉందని.. గత ఏడాది జరిగిన విజిలెన్స్‌ తనిఖీలో తేలింది. కాని.. ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికైనా బాసర సరస్వతీ ఆలయంలో  అక్రమాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. 

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

వరంగల్ : కాకతీయ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. కేయూ డిగ్రీ పరీక్షా ఫలితాల్లో 28.40 శాతం ఉత్తీర్ణీలయినట్లు తెలిపారు. కేయూ చరిత్రలో నే డిగ్రీ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్నతా శాతం నమోదు అయ్యింది.

16:12 - June 11, 2016

పశ్చిమగోదావరి : మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బంద్‌కు పిలుపునిచ్చారు. పాలకొల్లులో కాపు నాడు కార్యకర్తలు వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేయిస్తూ నిరసనలు చేపట్టారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  

16:09 - June 11, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం వైద్య సేవలను నిరాకరిస్తున్నారు. ముద్రగడ ఆసుపత్రిలో చికిత్సను నిరాకరిస్తూ ముద్రగడ దీక్షను కొనసాగిస్తున్నారు. తన నివాసంలో చేస్తున్న ముద్రగడ దీక్షను పోలీసులు భగ్నం చేసి.. నిన్న ఆయన్ను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

భారత్ విజయలక్ష్యం 169

హరారే: జింబాబ్వే-భారత్‌ల మధ్య హరారేలో జరుగుతోన్న తొలి వన్డేలో నిర్ణీత 49.5 ఓవర్లలో ఆతిథ్య జట్టు 168 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభం నుంచే జింబాబ్వేను కట్టడి చేసింది. భారత బౌలర్లు కుల్‌కర్ణి, స్రాన్, బుమ్రా, ఏఆర్ పటేల్, చహల్ పొదుపుగా పరుగులిస్తూ త్వరత్వరగా వికెట్లు తీశారు. బుమ్రా 4 వికెట్లు తీశాడు. కుల్‌కర్ణి 2, స్రాన్ రెండు వికెట్లు, ఏఆర్ పటేల్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. జింబాబ్వే బ్యాట్స్‌మన్‌లో మూర్ 3, చిభాభా 13, మసకద్జ 14, ఎర్వీన్ 21, సిబంద 5, సికందర్ రజా 23, చిగుంబరా 41, ముతుంబమి 15, క్రీమర్ 5 పరుగులు చేశారు.

15:56 - June 11, 2016

విజయవాడ : శ్రీశైలం నీటిని రాయలసీమ కరవు ప్రాంతాలకు వినియోగిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో జలవనరుల కార్యాలయంలో సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సంరర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది చాలా ప్రాజెక్టులను పూర్తి చేస్తాన్నారు. పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల ద్వారా గోదావరిలో ఇన్‌ఫ్లో పెరిగితే ఆ నీటిని కృష్ణానదికి తీసుకొస్తామని తెలిపారు. శ్రీశైలంలో నీరు నిల్వ చేసి కరవు ప్రాంతాలకు వినియోగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కృష్ణా, పెన్నాను అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నాం. అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆరేపల్లికి షోకాజ్ నోటీసులు

కరీంనగర్ : డీసీసీ చీఫ్ ఆరేపల్లి విమర్శల చేసినందుకు ఈనెల 17న క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక నుంచి గాంధీ భవన్ ప్రెస్ మీట్ పెట్టాలంటే టి. పీసీసీ చీఫ్ అనుమతి తప్పని సరి అని క్రమశిక్షణ సంఘం తెలిపింది.

జేఎంఎం ఎమ్మెల్యే అరెస్ట్...

హైదరాబాద్ : జార్ఖండ్ అసెంబ్లీ వద్ద 2013లో జరిగిన ఘర్షణ సంఘటనలో ఆరోపణలెదుర్కొంటోన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే ఛమ్రా లిండాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయనపై గతంలో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఇవాళ జార్ఖండ్‌లో రెండు రాజ్యసభ సీట్ల కోసం ఎన్నిక జరుగుతుండగా ఎమ్మెల్యే అరెస్టు అంశం చర్చనీయాంశమైంది.

మంత్రి హరీష్ ను కలవనున్న మల్లన్న సాగర్ బాధితులు

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పోరాట సమితి బాధితులు కాసేపట్లో మంత్రి హరీష్ రావు ఆహ్వానం మేరకు కలవనున్నారు. మంత్రితో చర్చల తర్వాత గ్రామస్తులతో మాట్లాడి తరువాత నిర్ణయం తీసుకోనున్నారు.

పాండిచ్చేరి అసెంబ్లీ స్పీకర్ గా వి.వైతలింగం

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ సీఎం వి.వైతలింగం పాండిచ్చేరి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ వి.పి. శివకొలుందు స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. స్పీకర్‌గా వైతలింగం ఎన్నికైనట్టు వెల్లడించారు.

హైవేపై నెయ్యి ట్యాంకర్ బోల్తా

ఆదిలాబాద్ : ఉత్తరప్రదేశ్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్‌ ప్రమాదవశాత్తు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటా హుటీన ఘటనా స్థలానికి చేరుకుని ఎక్కువ నెయ్యి నష్టం జరగకముందే ట్యాంకర్‌ను క్రేన్‌తో లేపారు.

పాల్వాయి, సర్వే, ఆరేపల్లి మెహన్ లకు కాసేపట్లో షోకాజ్ నోటీసులు

హైదరాబాద్ : గాంధీ భవన్ లో పీసీసీ క్రమణ శిక్షణ కమిటీ భేటీ అయ్యారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న నేతలపై చర్చిస్తున్నట్లు సమాచారం. పీసీసీ క్రమశిక్షణ కమిటీ పాల్వాయి, సర్వే, ఆరేపల్లి మెహన్ లకు కాసేపట్లో షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.

15:28 - June 11, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందిరాపార్కు వద్ద పేరెంట్స్ చేస్తున్న ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. స్కూలు ఫీజుల నియంత్రణ కమిటీ చేస్తున్న ఆందోళనలో తమ పార్టీ ప్రత్యంగా పాల్గొంటుందని ప్రకటించారు. విద్యలో పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని విమర్శించారు. 

 

బోపన్నకు జోడీగా లియాండర్ : ఏఐటీఏ

ఢిల్లీ: ఆగస్టులో జరగబోయే రియో ఒలింపిక్స్‌ పురుషుల డబుల్స్‌ టెన్నిస్‌ విభాగంలో రోహన్‌ బోపన్నకు జోడిగా లియాండర్‌ పేస్‌ను ఎంపిక చేసినట్లు ఏఐటీఏ ప్రకటించింది. భాగస్వామి ఎంపిక విషయంలో బోపన్న కోరికను కాదని.. పేస్‌ను ఎంపికచేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జాకు జోడీగా బోపన్నను ఎంపికచేసింది.

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్..

తిరుమల: తిరుమలలో జేఈవో శ్రీనివాసరాజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. వేసవి సెలవుల వల్ల భక్తుల రద్దీ పెరిగిందని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను కోరారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వీఐపీ దర్శనాలను పూర్తిగా కుదించామని శ్రీనివాసరాజు తెలిపారు.

ఫ్లోరిడాలో హాలీవుడ్ సింగర్ క్రిస్డ్ కాల్చివేత

అమెరికా : హాలీవుడ్ సింగర్ క్రిస్డ్ నాగిమీ ఫ్లోరిడాలో కాల్చివేశారు. క్రిస్టి నాగిమీ పై కాల్పులు జరిపి అనంతరం దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మల్లన్న సాగర్ బాధితులను చర్చలకు ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు

మెదక్ :మల్లన్న సాగర్ ముంపు గ్రామస్తుల రిలే నిరాహారదీక్ష ఆరో రోజుకు చేరింది. మంత్రి హరీష్ రావు నుండి చర్చలకు ఆహ్వానం వచ్చింది. చర్చలకు వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్న నిర్వాసితుల పోరాట సమితి మీమాంసలో ఉంది.

14:39 - June 11, 2016

ఢిల్లీ : లియాండర్ పేస్ ఒలింపిక్స్ బెర్త్ పై సస్పెన్స్ వీడింది. రియో ఒలింపిక్స్ కు లియాండర్ పేస్ ఎంపికయ్యారు. భారత సీనియర్ ఒలింపియన్ లియాండర్ పేస్...రియో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి భారత టెన్నిస్ సంఘం ఆమోదం తెలిపింది. రోహన్ బొపన్నతో భాగస్వామిగా..రియో ఒలింపిక్స్ డబుల్స్ లో లియాండర్ పేస్ పాల్గొంటాడని సెలెక్షన్ కమిటీ తేల్చిచెప్పింది. మిక్సిడ్ డబుల్స్ లో సానియా మీర్జా జంటగా రోహన్ బొపన్న పోటీకి దిగుతాడు. ప్రపంచ డబుల్స్ టాప్ టెన్ ర్యాంక్ ఆటగాడు రోహన్ బొపన్న మాత్రం..తన భాగస్వామిగా సాకేత్ మైనేని ఉండాలని కోరాడు. అయితే..వ్యక్తుల కంటే దేశం ముఖ్యమన్న భావనతో...భారత టెన్నిస్ సంఘం 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ వైపు మొగ్గు చూపింది. 1996 అట్లాంటా  ఒలింపిక్స్ సింగిల్స్ లో భారత్ కు కాంస్య పతకం సాధించిపెట్టిన పేస్ కు ఇప్పటికే ఆరు ఒలింపిక్స్ లో పాల్గొన్న అనుభవం,అరుదైన రికార్డు ఉన్నాయి.

కనిగిరి శివారులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం

ప్రకాశం : కనిగిరి శివారులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో అక్కడ కలకల రేగింది. 

13:49 - June 11, 2016

హైదరాబాద్ : అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది జీహెచ్‌ఎంసీ. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఆగడాలు మితిమీరుతున్నాయి. లేని కార్మికులను ఉన్నట్లుగా చూపిస్తూ.. బల్దియా సొమ్మును అప్పనంగా కాజేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. అయితే.. వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నత్తనడకన నడుస్తుండడంతో బల్దియా సొమ్ము పక్కదారి పడుతూనే ఉంది.

హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌లో 18,345 స్వీపర్లు...
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో వేలాదిమంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న పలువురు అక్రమార్కులు.. లేని సిబ్బందిని ఉన్నట్లు చూపించి.. బల్దియా సొమ్మును అప్పనంగా కాజేస్తున్నారు. ముఖ్యంగా హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌లో.. 18,345 మంది స్వీపర్లు, 925 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. మలేరియా విభాగంలో 2,250 మంది కార్మికులుండగా.. 125 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. వీరందరికి ప్రతి నెలా సుమారు 32 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది జీహెచ్‌ఎంసీ. అయితే.. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. క్షేత్రస్థాయిలో 16 వేలకు మించి కార్మికులు పని చేయడం లేదని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 6 వేల మంది విధులకు హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్నారు. వీరికి ఇఎస్‌ఐ, పీఎఫ్‌ కలిపి జీహెచ్‌ఎంసీ ప్రతి నెల సుమారు 9 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. అయితే ఈ సొమ్మంతా.. సూపర్‌వైజర్లే దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

మెడికల్‌ ఆఫీసర్‌ మురళీధర్‌ గుప్తాపై క్రిమినల్‌ కేసు...
ఇటీవల అర్ధరాత్రి నగరంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పర్యటించిన సందర్భంగా అనేక విషయాలు వెలుగుచూశాయి. పనికి వచ్చిన కార్మికులకు అబ్సెంట్‌ వేయడం.. రానివారికి ప్రజెంట్‌ వేయడం లాంటి ఘటనలు జరిగాయి. అంతేకాకుండా.. కూకట్‌పల్లి సర్కిల్‌లో మనుషులు లేకుండానే వారి పేరుతో వేతనాలు కాజేసిన ఘటన బయటకు వచ్చింది. ఈ ఘటనపై విజిలెన్స్‌ విచారణ జరపగా.. అది వాస్తవమని తేలింది. దీంతో మెడికల్‌ ఆఫీసర్‌ మురళీధర్‌ గుప్తాపై క్రిమినల్‌ కేసు నమోదైంది. సర్కిల్‌-9లో ఇలాంటి అక్రమాలే బయటపడడంతో డాక్టర్‌ రామారావును మాతృశాఖకు పంపించింది జీహెచ్‌ఎంసీ.

కార్మికులు లేకుండానే వేతనాలు కాజేస్తున్న వైనం...
ఇటీవల అర్ధరాత్రి నగరంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పర్యటించిన సందర్భంగా అనేక విషయాలు వెలుగుచూశాయి. పనికి వచ్చిన కార్మికులకు అబ్సెంట్‌ వేయడం.. రానివారికి ప్రజెంట్‌ వేయడం లాంటి ఘటనలు జరిగాయి. అంతేకాకుండా.. కూకట్‌పల్లి సర్కిల్‌లో మనుషులు లేకుండానే వారి పేరుతో వేతనాలు కాజేసిన ఘటన బయటకు వచ్చింది. ఈ ఘటనపై విజిలెన్స్‌ విచారణ జరపగా.. అది వాస్తవమని తేలింది. దీంతో మెడికల్‌ ఆఫీసర్‌ మురళీధర్‌ గుప్తాపై క్రిమినల్‌ కేసు నమోదైంది. సర్కిల్‌-9లో ఇలాంటి అక్రమాలే బయటపడడంతో డాక్టర్‌ రామారావును మాతృశాఖకు పంపించింది జీహెచ్‌ఎంసీ.

10టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు...
అసలు శానిటేషన్‌లో అక్రమాలు ఎలా జరుగుతున్నాయి ? కార్మికులపై పని భారం ఎలా పడుతుంది ? అనే అంశాలపై 10టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సర్కిల్‌-9 శానిటరి సూపర్‌వైజర్‌ యాకయ్య ప్రతిరోజు రాత్రి నాలుగు శానిటరీ గ్రూపులను పర్యవేక్షిస్తాడు. మొత్తం 28 మందిలో ప్రతిరోజు నలుగురు వీక్లీఆఫ్‌లో ఉండగా.. మిగిలిన 24 మంది విధులు నిర్వహిస్తారు. కానీ.. వీరిలో ఆరు నుంచి 8 మంది విధులకు రారు. కానీ.. యాకయ్య మాత్రం జీహెచ్‌ఎంసీకి పంపించే బిల్లులో కేవలం ఆరుగురు మాత్రమే అబ్సెంట్‌ అని మార్చి నెల బిల్లులో చూపించడం విశేషం. అయితే.. ప్రతిరోజు విధులకు హాజరు కాని కార్మికుల సంఖ్యను సూపర్‌వైజర్‌ లేదా.. మెడికల్‌ అధికారి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్‌కు సమాచారమివ్వాలి. ఇందులో 131 అబ్సెంట్‌ ఉంటే.. కేవలం ఆరు మాత్రమే ఆబ్సెంట్‌ అని రాసి.. మిగతా 125 ప్రజంట్‌ అని చూపించి.. నలుగురు కార్మికుల జీతాలకు ఎసరుపెడుతున్నారు. అంతేకాకుండా బినామీ పేరుతో మరో వర్కర్‌ వేతనాలు నొక్కేస్తున్నాడు. అంటే మొత్తం ఐదుగురి జీతాలను సుమారు 60 వేల రూపాయలను యాకయ్య తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. విచారించిన అధికారులు యాకయ్యను పక్కనపెట్టారు.

సూపర్‌వైజర్‌కు సహకరిస్తున్న కాంట్రాక్టర్‌ ..
ఇక ఇదే తంతు మలేరియా విభాగంలోనూ కొనసాగుతోంది. ఎల్బీనగర్‌ సర్కిల్‌లో తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న మలేరియా వర్కర్‌ విగ్నేష్‌.. ఫలక్‌నుమా ఆర్టీసీ డిపోలో పర్మనెంట్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎన్నోఏళ్లుగా కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా చేస్తున్న ఆయన.. 2015లో పర్మినెంట్‌ అయ్యాడు. అయినప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు వేతనం నొక్కేస్తున్నారు. దీనికి సంబంధిత సూపర్‌వైజర్‌.. కాంట్రాక్టర్‌కు ఏడాదికిపైగా సహకరిస్తున్నాడు. ఇటీవల ఈ విషయం వెలుగుచూడడంతో... సదరు ఉద్యోగిని తొలగించారు. అయితే ఇంతకాలం కార్పొరేషన్‌ సొమ్మును మింగేసిన వారినుంచి రికవరీ చేయడానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బల్దియాలో కొనసాగుతున్న డమ్మీ కార్మికులు ...
అయితే.. కార్మికుల హాజరు, డమ్మీల నియంత్రణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ తూతూమాంత్రంగానే మిగిలిపోయింది. అక్రమంగా తరలిపోతున్న బల్దియా సొమ్మును కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. 

13:47 - June 11, 2016

భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్...ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. తొలిసెమీఫైనల్లో ఏడోర్యాంకర్ సైనా 21-8, 21-12తో ..చైనా సూపర్ స్టార్, 4వ ర్యాంకర్ వాంగ్ ఈ హాన్ ను చిత్తు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ రచనోక్ ఇంటానెన్ ను 28-26, 21-16తో అధిగమించిన సైనా...సెమీఫైనల్లో సైతం అదేదూకుడు కొనసాగించింది. తొలిగేమ్ ను 21-8తో అలవోకగా నెగ్గిన సైనా కు...రెండోగేమ్ లో గట్టిపోటీనే ఎదురయ్యింది. చివరకు 21-12తో గేమ్ తో పాటు మ్యాచ్ ను సైతం సొంతం చేసుకొని ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. వాగ్ ఈ హాన్ తో ఇప్పటి వరకూ 12 సార్లు తలపడిన సైనాకు ఇది ఐదవ విజయం కావడం విశేషం.

13:42 - June 11, 2016

హైదరాబాద్: తుని రైలు విధ్యంసం పక్కా వ్యూహంతోనే జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు. కాపు గర్జన మీటింగ్ వెళ్లేవారు పెట్రోలు సీసాలు తీసుకెళ్లాల్సిన అవుసరమేముందని ఆయన ప్రశ్నించారు. మధ్యహ్నాం 3.30 గంటలకు సభ ముగిస్తే 3.45 గంటలకు రైలు విధ్యంసం జరగటంపై అనుమానించాల్సిన అవుసరముందన్నారు. రైలు నుండి చంటిబిడ్డలను పట్టుకుని మహిళలు రైలులోంచి దూకేసారనీ...దీనికంతటికీ కారణం ఆందోళకారులు సృష్టించిన విధ్వంస కాదా అని ఆయన ఆగ్రహించారు. పలు వాహనాలను ధ్వంసం చేయటం..దొరికనవారిని దొరికట్లుగా గాయపరచటం వంటి హింసాత్మక ఘటనలకు దారితీసిన నిందితులపై కేసులు ఎత్తివేయటం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశించారు. కాగా కాపులకు రిజర్వేషన్లు కోరుతూ కాపునేత ముద్రగడ కాపుగర్జన పేరుతో తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.

13:41 - June 11, 2016

హైదరాబాద్ : రాష్ట్రాలు కేంద్రం దగ్గర భిక్షమెత్తుకోవని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. 36వేలకోట్లు ఇచ్చి.. 90వేల కోట్లు ఇచ్చినట్టు తప్పడు లెక్కలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. పన్నుల రూపంలో రాష్ట్రాలు చెల్లించిన నిధులనే కేంద్రం తిరిగి పంచుతుందన్నారాయన. బీజేపీ నేతలు తప్పడు లెక్కలుచెప్పి.. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. 

13:39 - June 11, 2016

హైదరాబాద్ : ముద్రగడ పద్మనాభం అరెస్టు ఖండిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తుని ఘటనను సీబీఐ విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పాటు తుని ఘటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. అంతేకాదు తుని ఘటన బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. హింసకు పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై తగినచర్యలు తీసుకోవాలన్నారు. కాగా కాపు రిజర్వేషన్ల విషయంలో మద్ధతును కోరుతూ గతంలో ముద్రగడ పలువురు కాంగ్రెస్ నేతలను కలిసిన విషయం తెలిసిందే. 

13:36 - June 11, 2016

వరంగల్ : రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టిన నామ్‌ పథకం ఆశయం అడుగంటుతోంది. లక్ష్యం నీరు కారుతోంది. నామ్‌ పథకం ద్వారా రైతులకు అందాల్సిన సేవలు అమలుకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ కలల పథకం కల్లలుగా మారుతోంది. అధికారులకు బాధ్యతలు బరువయ్యాయన్న విమర్శలు వినవస్తున్నాయి. చివరికి నామ్‌ పథకం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో అమలుకు నోచుకోని నామ్‌ పథకంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

ఆన్‌లైన్‌లో దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ...
నామ్‌... జాతీయ వ్యవసాయ మార్కెట్‌ పథకం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని తెలంగాణలోని వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ను ఎంపిక చేశారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేందుకు ఉద్దేశించిన పథకం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు. కానీ పథకం ప్రారంభించి 50 రోజులు గడిచిపోయినా నామ్‌ అమలుకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి.

ఆన్‌లైన్‌ వ్యాపారంతో మధ్య దళారీల బెదడ...
రైతులు పండించిన నాణ్యమైన ఉత్పత్తులను వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తారన్న ఉద్దేశంతో నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా రైతులకు అధిక ధరలు లభిస్తాయని ఆశించారు. ఆన్‌లైన్‌ వ్యాపారంతో మధ్య దళారీల బెదడ దగ్గుతుందని, అన్నదాతల ఆదాయం పెరుగుతుందని ఆశించారు. కానీ పాత విధానాలే కొనసాగుతుండటంతో నామ్‌ లక్ష్యాలు నీరు కారిపోతున్నాయన్న విమర్శలున్నాయి.

ఆన్‌లైన్‌లోనే ప్లాట్‌ఫారం కేటాయించాలి ..
ముందుగా ఎనుమాముల మార్కెట్‌లోని మొక్కజొన్న యార్డులో నామ్‌ను ప్రవేశపెట్టారు. రైతులు తీసుకొచ్చే సరకు, అతని పేరు, ఫోన్‌ నంబర్‌ సహా వివరాన్నీ గేటుదగ్గరే కంప్యూటర్‌లో నమోదు చేసి, ఆన్‌లైన్‌లో అమ్ముకునేందుకు వీలుగా ప్లాట్‌ఫారం కేటాయిస్తూ రైతులకు రసీదులు ఇస్తారు. సరకు అమ్ముకునేందుకు కేటాయించిన ప్లాట్‌ఫారంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌కు ఈ సమాచారాన్ని అనుసంధానం చేయాలి. రేట్ల వివరాల సందేశాన్ని అన్నదాత ఫోన్‌కు చేరవేయాలి. కానీ మార్కెట్‌లో ఈ విధానాన్ని అమలు చేయడంలేదు. రైతులు తెచ్చిన మొక్కజొన్నను నేరుగా ప్లాట్‌ఫారంకు తరలిస్తున్నారు. గుమాస్తాలు సరకు నమానాలను తీసుకుని వ్యాపారులకు చూపిస్తున్నారు. వీరు నిర్ణయించిన ధరను రైతుకు చెబుతున్నారు. వ్యాపారులు ఎంత రేటు నిర్ణయిస్తే.. ఆ ధరకే అన్నదాతలు అమ్ముకోవాల్సిన వారడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. తూకం విధానంలో కూడా లోపాలు ఉండటంతో నష్టపోతున్నారు. ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలకు బదులు సంప్రదాయ కాంటాలు ఉపయోగిస్తుండటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు కుమ్మక్కై జాతీయ వవ్యసాయ మార్కెట్‌ విధానానికి తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

13:33 - June 11, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధిగా హిల్లరీ క్లింటన్‌ను ఒబామా బలపచడంపై రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. నేర విచారణ ఎదుర్కొంటున్న మహిళకు ఒబామా మద్దతు ఇవ్వడాన్ని ట్రంప్‌ తప్పుపట్టారు. ఈ-మెయిల్‌ సర్వర్‌ కుంభకోణంలో హిల్లరీ చిక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అమెరికా ప్రజలు కోరుకుంటున్న మార్గం ఇదేనా... అంటూ ప్రశ్నించారు. ఒబామా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ట్రంప్‌ ఆరోపించారు. క్లింటన్‌ ఫౌండేషన్‌కు భారీగా విరాళాలు ఇచ్చినందుకే ఇండో-అమెరికన్‌ రాజీవ్‌ ఫెర్నాండోను కీలకమైన అంతర్జాతీయ భ్రదతా సలహాదారుల బోర్డులో నియమించారని ఆరోపించారు. అయినా వచ్చే నవంబర్‌ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ చెప్పారు.

13:23 - June 11, 2016

ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు పనస. దీనిని ఆంగ్లలో jackfruit అని అంటారు. నస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. పనసపండులో శరీరారోగ్యాన్ని పెంపొందింపచేసే పలు పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి.

ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్....

పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండులో ‘ఏ',‘సి' విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండా ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. అవి దేహానికి పుష్టినిస్తాయి. నాడిశక్తిని పెంచుతాయి.

హైపర్ టెన్షన్ తగ్గించడంలో...

దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ నుంచేకాక హైపర్ టెన్షన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. అలాగే పనస వేరు చర్మ వ్యాధులలోనూ చక్కగా పని చేస్తుంది.

జ్వరం, డయారియా రుగ్మతలకు...

పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు... చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్లే లక్షణాలు తగ్గించే గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి పనస ఎంతో మేలు చేస్తుంది.

అధికబరువును తగ్గించడంలో ....

అధిక బరువును, టెన్షన్‌ను త‌గ్గించ‌డంలో ప‌న‌స బాగా ప‌నిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ప‌న‌స పండ్ల‌లో ఉన్నాయి. వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ఛాయ‌ల‌ను ఇవి తగ్గిస్తాయి. పనస పండు తినడం వలన థైరాయిడ్ సమస్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే నాడీ శక్తి కూడా పెంపొందుతుంది. 

13:01 - June 11, 2016

అమెరికా : కోపా అమెరికాకప్ గ్రూప్ - సీ లీగ్ లో మెక్సికో, వెనిజ్వేలాజట్లు వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ కు మరింత చేరువయ్యాయి. రెండురౌండ్లలో రెండు విజయాలతో ..గ్రూపు మొదటి రెండుస్థానాల్లో నిలిచాయి. అయితే..15సార్లు కోపా అమెరికాకప్ విజేత ఉరుగ్వే వరుసగా రెండో ఓటమితో...గ్రూప్ లీగ్ దశ నుంచే ఇంటిదారిపట్టే ప్రమాదంలో చిక్కుకొంది....

పరాజయాలతో నిష్క్రమించేలా ఉరుగ్వే, జమైకా..
2016 కోపా అమెరికాకప్ ఫుట్ బాల్ టోర్నీ గ్రూప్ - సీ లీగ్ లో మెక్సికో, వెనిజ్వేలాజట్లు వరుస విజయాలతో ...క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు మరింత చేరువైతే...15 సార్లు చాంపియన్ ఉరుగ్వే, జమైకా వరుస పరాజయాలతో లీగ్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో ఉన్నాయి.

జమైకాను చిత్తు చేసిన మెక్సికో...
మాజీ చాంపియన్ ఉరుగ్వే, మెక్సికో, వెనిజ్వేలా, జమైకాజట్లతో కూడిన గ్రూప్- సీ లీగ్...రెండోరౌండ్ పోటీల్లో జమైకాపై మెక్సికో, ఉరుగ్వేపై వెనిజ్వేలా విజయాలు సాధించాయి. ఫిలడెల్ఫియా వేదికగా ముగిసిన గ్రూప్ - సీ రెండోరౌండ్ పోటీలో మెక్సికో 2-0 గోల్స్ తో జమైకాను చిత్తు చేసింది. ఇదే గ్రూపులో జరిగిన మరో రెండోరౌండ్ పోటీలో మాజీ చాంపియన్ ఉరుగ్వేకి..చిచ్చరపిడుగు వెనిజ్వేలా 1-0 విజయంతో షాకిచ్చింది.

తొమ్మిదవ ప్రయత్నంలో వెనిజ్వేలా..
కోపా అమెరికాకప్ చరిత్రలో ఇంతకుముందు వరకూ ఉరుగ్వేతో ఎనిమిదిసార్లు తలపడి పరాజయాలు పొందిన వెనిజ్వేలా..తొమ్మిదవ ప్రయత్నంలో సఫలంకాగలిగింది.

'తుని' నిందితులను విడిచి పెట్టాలనడ సమంజసం కాదు: గంటా..

విశాఖ: తుని విధ్వంస ఘటనలో నిందితులను విడిచిపెట్టమనడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. తుని ఘటనలో నాలుగు నెలలుగా దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారన్నారు. అలాంటిది నిందితులను విడిచి పెట్టాలనడం ఎంతవరకు సమంజసం? అని గంటా ప్రశ్నించారు.

12:53 - June 11, 2016

శ్రీకాకుళం : ఆసక్తి చిత్తశుద్ధిఉంటే.. రికార్డులు సాధించడం కష్టం కాదని నమ్మాడు సిక్కోలు కుర్రాడు ప్రసాద్.. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ప్రసాద్‌... రెండు దశాబ్దాలుగా నాణేలు, స్టాంపుల సేకరణను హాబీగా పెట్టుకున్నాడు. త్వరలో వరల్డ్‌ రికార్డు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

వేలాది ఏళ్లనాటి నాణేల సేకరణ...
ఇప్పటికే వేలాది సంవత్సరాల నాటి నాణేలను వందల సంఖ్యలో సేకరించాడు ప్రసాద్‌. ప్రప్రంచం లోనే అతి చిన్నదైన నాగా సామ్రాజ్యంపు నాణెం దగ్గర నుండి... ఇటీవల విడుదలైన వాటి వరకూ పలురకాల నాణేలు ఈ కలెక్షన్స్‌లో ఉన్నాయి. విలువైన శ్రీరామపట్టాభిషేకం, రామటంకాలు ప్రసాద్‌ గ్యాలరీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాచీన భారతదేశపు నాణేలతోపాటు... విదేశీ కరెన్సీ, స్టాంపులు ప్రసాద్‌వద్ద ఉన్నాయి. ఎక్కడైనా పురాతన నాణేలు, స్టాంపులు ఉన్నాయని తెలిస్తే చాలు.. అక్కడకు వెళ్లి తన ఆసక్తిని వారికి వివరించి నాణేలను సేకరిస్తాడు. నిరంతర అన్వేషణ తో ఇవన్నీ సేకరించగలిగానని, మరో ఏడాదిలో తన టార్గెట్ పూర్తి చేసుకుని వరల్డ్ రికార్డు సాధిస్తానని పట్టుదలతో చెబుతున్నాడు.. ఈ యువకుడు.

తూర్పు ఆఫ్రికా, విక్టోరియారాణి నాణేలు సేకరించిన ప్రసాద్‌...
దేవతా మూర్తుల చిత్రపటాలతో ముద్రించిన అరుదైన నాణేలు.. అరుదైన వెయ్యి నూట ఏభై రూపాయల విలువైన నాణేలు ప్రసాద్ ఖజానా లో ఉన్నాయి. ఈస్టిండియా కంపెనీ, తూర్పు ఆఫ్రికా, విక్టోరియా మహారాణి యొక్క బంగారు నాణెం తోపాటు.. కనిష్కుడు, చోళులు, అక్బర్, మొఘల్ రాజుల కాలం నాటి ఎన్నెన్నో వెరైటీ నాణేలను ప్రసాద్‌ సేకరించాడు. నాణేల సేకరణతో పురాతన చరిత్రను కళ్లముందు నిలుపుతున్నాడని ప్రసాద్‌ను అభినందిస్తున్నారు స్థానికులు. ప్రసాద్ పట్టుదల, ఓపికతో అరుదైన అంశాలతో గుర్తింపు తెచ్చుకున్నాడని కుటుంబసభ్యులు కూడా సంతోషపడుతున్నారు. ఆసక్తిని అలవాటుగా మార్చుకున్న సిక్కోలు కుర్రాడు... ఇంకా మరిన్ని చారిత్రక నాణేలు సేకరించి... గిన్నిస్‌ బుక్‌లో పేరు సంపాదించాలని కోరుకుందాం.

నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో తొలి అరెస్ట్

ముంబై: ఎట్టకేలకు అంధశ్రద్ధ నిర్మూలన సమితి సంస్థాపక కార్యాధ్యక్షులు డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసుకు సంబంధించి నిన్న తొలి అరెస్టు చేశారు. ఈఎన్‌టీ డాక్టర్, సనాతన్ సంస్థ సభ్యుడు, హిందూ జనజాగృతి సమితి సభ్యుడు డాక్టర్ వీరేంద్ర తవాడే (48)ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆయనను శివాజినగర్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈమేరకు నేరపూరిత కుట్ర, హత్య అభియోగాలపై తవాడేను అరెస్టు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. తవాడేకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సంపాదించామని వెల్లడించారు.

12:48 - June 11, 2016

తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు.

వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా....

వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. ఇది 90 శాతం మందిలో కనిపించే సాధారణ సమస్య. దాదాపుగా ప్రతి మనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్ వలన వస్తుంది. వైరస్, బ్యాక్టీరియా వలన కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్‌ఫ్లుయోన్‌జా వలన వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నివారించడమే కాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నివారించవచ్చు.

సైనసైటిస్‌ చికిత్సకు కొన్ని నివారణ మార్గాలు...

వెల్లుల్లి: సైనస్‌కు ఉపయోగించే చికిత్సలో ఇది ఒక పురాతన హౌం రెమెడీ. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలు సైనస్‌ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. వెల్లుల్లిలో ఉండే ఔషధగుణాలు సైనస్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీన్ని పచ్చిగాగానీ, ఉడికించి లేదా పేస్ట్‌ చేసి అందులో తేనె కలిపి తీసుకోవాలి.

కేయాన్‌ పెప్పర్‌: కొద్దిగా కేయాన్‌ పెప్పర్‌ను ఉపయోగించడం వల్ల సైనస్‌ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కేయాన్‌ పెప్పర్‌లో ఉండే క్యాప్ససిన్‌ సైనస్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు నివారించడంలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ముక్కుదిబ్బడను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. వేడినీటిలో కొద్దిగా కేయాన్‌ పెప్పర్‌ వేసి తాగాలి.

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌: ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం ప్రపంచం మొత్తం తెలుసు. ఇది వ్యాధి నిరోధకశక్తిని పెంచడం మొదలు, బరువు తగ్గించే వరకూ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది. సైనస్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలను నివారించడంలో బాగా సహాయపడుతుంది, గ్లాసు వాటర్‌లో టేబుల్‌ స్పూన్‌ ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలపడం వల్ల సైనస్‌ ఇన్ఫెక్షన్‌ను సమర్ధవంతంగా నివారించవచ్చు. ఈ హోమ్‌రెమిడీల్లో మీకు అందుబాటులో ఉన్న ఏదో ఒకటి ఉపయోగించి, ఉపశమనం పొందండి.

12:43 - June 11, 2016

నెల్లూరు : అదొక చదువుల దేవాలయం. రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పిస్తున్న నిలయం. పేరుకు మున్సిపల్ పాఠశాలే అయినా.. ఇక్కడ అడ్మిషన్ దొరకాలంటే.. అదొక పరీక్షే. అదే నెల్లూరులోని కెఎన్ ఆర్ పాఠశాల. ప్రస్తుతం ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషనేంటి అనుకుంటున్నారా... అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరి చూడాల్సిందే..

అదొక చదువుల దేవాలయం...
పారిశ్రామికంగా పరుగులు తీస్తున్న నెల్లూరు జిల్లా ఒక కార్పొరేషన్ 5 మున్సిపాలిటీలు.. 29 లక్షల జనాభా ఉన్న జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా జవాబిస్తూ...ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలకు చేర్చిన ఘనత కెఎన్ ఆర్ పాఠశాలకు చెందుతుంది. ఇంతటి ఘనత కలిగిన మున్సిపల్ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు. ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది అక్షరాల నిజం.

లిమిట్‌ స్టూడెంట్స్‌.. లార్జ్‌ స్టడీ సర్కిల్‌ కెఎన్‌ఆర్‌ ప్రత్యేకత...

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన విద్యార్థులందరికీ అడ్మిషన్లు ఇచ్చేస్తుంటారు. కానీ.. కెఎన్‌ఆర్‌ పాఠశాల తీరు వేరు. లిమిట్‌ స్టూడెంట్స్‌.. లార్జ్‌ స్టడీ సర్కిల్‌ దీని ప్రత్యేకత. అందుకే ఈ స్కూళ్లో సీటు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని.

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ...

లక్షల్లో ఫీజులు కట్టే శక్తి ఉన్నా... ఎందరో తల్లిదండ్రులు... కెఎన్ ఆర్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ఇష్టపడుతుంటారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యనందిస్తుండడంతో.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు బారులు తీరారు. దీంతో అడ్మిషన్లు లేవంటూ బోర్డు పెట్టిన పరిస్థితి తలెత్తింది.

10 మంది విద్యావాలంటీర్ల టీచింగ్ ...
1984లో ఓ చిన్న పూరిపాకలో ఏర్పాటైన ఈ కురిగంటి నాగిరెడ్డి.. అదేనండి కెఎన్ ఆర్ పాఠశాల నేడు దినదినాభివృద్ది చెందింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో విద్యానందిస్తూ.. పలువురి మన్ననలు పొందుతోంది. ఈ పాఠశాలలో 10 మంది విద్యావాలంటీర్లు విద్యను బోధిస్తున్నారు.

ఎన్నో మెడల్స్ సాధించిన ఘనత కెఎన్ ఆర్ ...
చదువుతోపాటు ఆటపాటల్లోను విద్యార్థులను ఉత్సాహపరుస్తూ.. ఎన్నో మెడల్స్ సాధించిన ఘనత కెఎన్ ఆర్ ది. 2015 విద్యా సంవత్సరంలో ఇదే స్కూల్ లో చదివి వెళ్లిన మౌనిక శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో 1000 కి 982 మార్కులు సాధించింది. ఎందరో విద్యార్థులు డాక్టర్లుగా సేవలందిస్తున్నారు.

కార్పొరేట్ కు తీసిపోకుండా.. స్మార్ట్ క్లాస్ లు...
కార్పొరేట్ కు తీసిపోకుండా.. స్మార్ట్ క్లాస్ లు .. చదువుపై ఆసక్తి పెంచేందుకు స్టడీ అవర్స్ ఏర్పాటు చేశారు. ఇందుకేనేమో బహుశా విద్యార్థులు ఈ మున్సిపల్ పాఠశాలలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లోనే నో అడ్మిషన్ బోర్డు పెట్టేశామంటున్నారు ప్రధానోపాధ్యాయులు. అయినా కొందరు తల్లిదండ్రులు.. పాఠశాల హెడ్ మాస్టర్ కు, మేయర్ , మున్సిపల్ కమిషనర్ పై ఒత్తిడి పెంచుతూ.. తమవారికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి ఏడాది పెరుగుతూన్న విద్యార్థుల సంఖ్య...
ఒక ప్రక్క ప్రభుత్వం విద్యార్థులు లేరనే సాకుతో...మూసివేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కెఎన్ ఆర్ మున్సిపల్ పాఠశాలలో.. విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మున్సిపల్ పాఠశాలే అయినా.. కార్పొరేట్ కు ధీటుగా విద్యనందిస్తున్న పాఠశాలను ఆర్థికంగా ఆదుకుంటే.. మరింతమంది విద్యార్థులకు చేయూతనిస్తుందంటున్నారు స్థానికులు.                            

మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదు : ఈటెల

హైదరాబాద్ : మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి ఈటెల కుండ బద్దలు కొట్టారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లలో ట్యాక్స్ చెల్లిస్తోందని, రాష్ట్రాలు కేంద్రం వద్ద బిచ్చ ఎత్తుకోవని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రూ.90వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు రూ. 36వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కేంద్రం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అమిత్ షా రెండు నాల్కల ధోరణితో మాట్లాడున్నారని, బిజెపికి తెలంగాణ లో ప్రజామోదం తేలదని పేర్కొన్నారు.

ఎస్టీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు

కడప : ఎస్టీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగా లభర్తీలో అక్రమాలు వెలుగు చూశాయి. తమకు కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసి మిగతా అభ్యర్థుల దరఖాస్తులను ఆర్ జేడీ కార్యాలయ సిబ్బంది చెత్తబుట్ట లో పడేశారు. 

చురుగ్గా రుతుపవనాలు..

హైదరాబాద్: రుతుపవనాలు రాష్ట్రం వైపు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

రైతులకు న్యాయం చేయాలి : తమ్మినేని

మెదక్ : సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మల్లన్న సాగర్, నిమ్స్ భూ బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆ శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు ఆహ్వానించాలని, రైతులకు న్యాయం చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

12:27 - June 11, 2016

అనంతపురం : చిట్‌ఫండ్స్‌ చీటింగ్‌ ఫండ్స్‌గా మారుతున్నాయి. ఎందరో కిలాడీలు జనాలకు శఠగోపాలు పెడుతున్నారు. లక్షలు, కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేస్తున్నారు. రోజుకో చోట బోర్డు తిప్పేస్తున్న వార్తలు ఆయా సంస్థ ఖాతాదారుల గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. అనంతపురంలో డబ్బులు చెల్లించకుండా ఊగిసలాడుతున్న సంస్థ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది.

సాయిభావన చిట్‌ ఫండ్‌ బాధితుల ఆవేదన...
ఇది అనంతపురంలోని సాయిభావన చిట్‌ ఫండ్‌ బాధితుల ఆవేదన, ఆక్రోశం. చిటీల కాలపరిమితీ తీరినా చెల్లింపులు చేయకుండా వేధిస్తున్న యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కార్యాలయం చుటూ చెప్పులరిగేలా తిరిగి విసిగిపోయిన వారు ఆందోళన బాట బాట్టారు.

కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన...
అనంతపురంలో సాయిభావన చిట్‌ఫండ్‌ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 400 మంది కస్టమర్లతో 8 రకాల చిట్టీలు నిర్వహిస్తున్న సంస్థ... ఏ విషయంలోనూ స్పష్టత లేకపోవడం బాధితుల్లో అనుమానాలను పెంచుతోంది. కాలపరిమితి దాటినా చెల్లింపులు చేయకపోవడంతో వారి అనుమానాలు బలపడుతున్నాయి. ఇన్నాళ్లు కష్టపడి పోగు చేసుకున్న చిట్టీ డబ్బులు చెల్లిస్తారో లేదోనన్న సందేహాలతో ఆందోళన చెందుతున్నారు. చెక్కులు బౌన్స్‌ అవ్వడంతో పాటు డబ్బులు చెల్లించేందుకు పలుమార్లు వాయిదాలు పెడుతుండటంతో బిచాణా ఎత్తేస్తారన్న భయం బాధితులను వెంటాడుతోంది. దీంతో సాయిభావన ఛిట్ ఫండ్ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.

యాజమాన్యం కుట్ర భగ్నానికి పోలీసుల వ్యూహం..
మరో వైపు కలెక్షన్స్ రాకపోవడం వల్లే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని యాజమాన్యం చెప్పుకొస్తోంది. ఏదీఏమైనా 25న బకాయిలన్నీ చెల్లిస్తామంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..యాజమాన్యం గుడుపుఠాణి బయటపెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. 

బౌలింగ్ ఎంచుకున్న భారత్

హరారే: జింబాబ్వే, భారత్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ఈ మ్యాచ్ ఆరంభంకానుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

12:22 - June 11, 2016

మనందరం కోడిగుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచుతాము అవునా! ఎందుకు అని ఎపుడైనా ఆలోచించారా? మనం వాడే ఫ్రిజ్‌లలో కూడా గుడ్లను ఉంచటానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. కానీ, గుడ్లను అందులో ఉంచటానికి రెండు, మూడుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఫ్రిజ్‌ లో నిల్వ చేసిన గుడ్లను తినటం వలన అనారోగ్యాలకు గురవుతామని వైద్యులు చెబుతున్నారు. ఎందుకు ఉంచకూడదనే కారణాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. వీటికి ముందుగా, ఫ్రిజ్‌ లో ఎందుకు ఉంచుతున్నామో కారణాల గురించి తెలుసుకుందాము.

కుళ్లిపోవటం: గది ఉష్ణోగ్రతలో ఉంచిన గుడ్లతో పోలిస్తే, ఫ్రిజ్‌ లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్లిపోతాయి. ఫ్రిజ్‌ లో ఉంచిన గుడ్లను బయటకు తీసిన తరువాత పుల్లటి రుచి అనిపిస్తుంది కావునా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచటమే మంచిది.

పెంకుపై బ్యాక్టీరియా: గది ఉష్ణోగ్రతలో ఉంచిన గుడ్లు మరియు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన గుడ్లను గమనిస్తే, ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు, ఘనీభవనానికి గురై, పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని తినటం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలానే ఉంది. గుడ్లు క్యుటికల్స్‌లను కలిగి ఉంటాయి తాజా గుడ్లను ఫ్రిజ్‌ లో ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే, వీటిలో ఉండే క్యుటికల్స్‌లు చెక్కుచెదరకుండా ఉంటుంది.

సాల్మొనెల్లా సంక్రమణ: గది ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా సోకిన గుడ్డు పక్కనున్న గుడ్డు కూడా వైరస్‌కు గురవుతుంది. కానీ, ఫ్రిజ్‌ లో ఉంచటం వలన ఇలాంటి సంక్రమణకు గురవకుండా చూసుకోవచ్చు. నిజానికి తాజా గుడ్లను రెండురోజుల లోపే తినటం చాలా ఆరోగ్యకరం.

12:18 - June 11, 2016

విజయవాడ నూతన రాష్ట్రాభివృద్ధికి మానవ వనరులే కీలకం. ముఖ్యంగా విభజనతో కుదేలైన నవ్యాంధ్రలో యువశక్తి అధికం. వారిలో నైపుణ్యం అపారం. విభజనతో వారిలో కల్గిన నైరాశ్యాన్ని పోగొట్టి నైపుణ్యాన్ని పెంపొందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా రంగాన్ని సంస్కరించడంతోపాటు పరిశోధనలకు పెద్దపీట వేయాలని సంకల్పించింది.

రాష్ట్రానికి నూతన యూనివర్సిటీలు...
విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన జాతీయస్థాయి విద్యా సంస్థలు, వర్సిటీలపై ప్రభుత్వం దృష్టిసారించింది. చట్టం ప్రకారం రాష్ట్రంలో 7 జాతీయ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి ఏర్పాటుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి త్వరితగతిన అనుమతులను రికార్డు సమయంలో పొందింది. దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా ఏడాది తిరగకముందే 5 జాతీయ సంస్థలను మంజూరు చేయించుకుంది సర్కార్ .

2015 ఆగస్టు నుంచి ఐఐటీ-తిరుపతి తరగతులు...
తిరుపతిలోని చదలవాడ వెంకటసుబ్బయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 2015 ఆగస్టు 5 నుంచి ఐఐటీ-తిరుపతి తరగతులు ప్రారంభమయ్యాయి. ఐఐఎస్ఇఆర్-తిరుపతి తరగతులు.. తిరుపతిలోని శ్రీరామా ఇంజనీరింగ్ కాలేజ్ లో 2015 ఆగస్టు 10 నుంచి ప్రారంభమయ్యాయి. విశాఖలోని ఆంధ్రావర్సిటీ ప్రాంగణంలో ఐఐఎం తరగుతులు 2015 సెప్టెంబర్ 10 నుంచి ఎన్ఐటీ తరగతులు ప్రారంభమయ్యాయి. అయినా ప్రభుత్వ రెండేళ్లకాలంలో ఐటీవస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.

జులై 7 ప్రారంభం కానున్న తరగతులు ..
వీటితో పాటు ఐఐఐటీ కాంచీపురంలో ఐఐఐటీ-కర్నూలు తరగతులు 2015 జులై 7న ప్రారంభమయ్యాయి. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ , విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీలకు మాత్రమే కేటాయింపులు పూర్తయినప్పటికీ సాంకేతిక కారణాలతో తరగతులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ రెండు వర్సిటీలను కూడా 2016-17 విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రభుత్వ చొరవతో జాతీయ స్థాయిలో విద్యాసంస్థలు...
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో భారీస్థాయిలో ఏర్పాటవుతున్న జాతీయ విద్యాసంస్థలు, వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు, ట్రిపుల్ ఐటీలు, ఉర్దూ వర్సిటీ తదితర సంస్థల కారణంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటి ఏర్పాటుతో భవిష్యత్తులో భారీగా ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్ మెంట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని.. కాని నేటికి అవి అమలుకు నోచుకోవాలంటే నిధుల లేమి వేధిస్తోందన్న విమర్శలు ఉన్నాయి .

త్వరలో రాష్ట్రానికి రానున్న13 నూతన యూనివర్సిటీలు ...
ప్రభుత్వం ఆహ్వానం మేరకు దేశంలోని ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి నగరాల్లో తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రానికి త్వరలోనే 13 ప్రైవేట్ వర్సిటీలు రాబోతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. కాని ఇందుకు అనుగుణంగా విద్యావ్యవస్థ అమలుకు నోచుకోకపోవడం దారుణమని పలువురు విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పలు యూనివర్సిటీల ఏర్పాటు పై ఉన్న శ్రద్ద ఐటీ ని తీసుకురాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 

12:12 - June 11, 2016

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా పరుశురామ్‌(బుజ్జి) దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. కాశ్మీర్‌లో చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'హీరోకి కుటుంబమంటే చాలా ఇష్టం. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాడు. ఫ్యామిలీ అంతా కలిసి తీసుకునే నిర్ణయాలు నిలబడతాయని నమ్మే వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రమే ఇది. ఇటీవల ఫ్యామిలీ ఎమోషన్స్‌కి యువత విలువలు ఇవ్వడం మానేశారు. కుటుంబం మనది అనుకుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళి. పెళ్ళి తర్వాత అబ్బాయి, అమ్మాయి ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలో ఫ్యామిలీతో ఉంటేనే తెలుస్తుంది. కూతుర్ని అత్తారింటికి పంపించిన తండ్రి ఆవేదన, పెళ్లైన కొడుకు బాధ్యతగా ఉంటున్నాడో లేదో అనుకునే తల్లి ఆలోచన.. ఇలా ఓ మంచి ఫ్యామిలీలోని భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం ఉంటుంది. శిరీష్‌ ఎనర్జీ సూపర్‌. లావణ్య వచ్చే సన్నివేశాలు యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. కాశ్మీర్‌లో చేసే షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది. ఓ వైపు నిర్మాణాంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. దర్శకుడు బుజ్జి ఈ చిత్రాన్ని చాలా బాగా తీస్తున్నాడు. ఇప్పటికే సినిమాపై పాజిటివ్‌ టాక్‌ పెరిగింది. థమన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అవుతుంది' అని అల్లు అరవింద్‌ తెలిపారు. అల్లు శిరీష్‌ చెబుతూ, 'కమర్షియల్‌ ఫార్ములాని మిక్స్‌ చేసి, ఓ మంచి ఫ్యామిలీ కథని దర్శకుడు బుజ్జి చెప్పారు. వినోదాన్ని అందిస్తూనే ఆలోచించే విధంగా ఉంటుందీ చిత్రం. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్‌ మరో పాత్రకి రిలేటెడ్‌గా ఉంటుంది. చిన్న క్యారెక్టర్‌కి కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. లావణ్యతో నేనుండే సీన్స్‌ చాలా సహజంగా వచ్చాయి. కచ్చితంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం' అని చెప్పారు.

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో సైనా నెహ్వాల్

హైదరాబాద్ : ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ సైనా నెహ్వాల్ సెమీస్ లో వాంగ్ ఈ హ్యాన్ పై విజయం సాధించింది.

12:04 - June 11, 2016

హైదరాబాద్: పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె.. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న క్రేజీ హీరోయిన్‌. హాలీవుడ్‌లో 'త్రిఫుల్‌ ఎక్స్‌' చిత్రంలోనూ నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. 'బాజీరావు మస్తానీ' చిత్రం తర్వాత దీపికా బాలీవుడ్‌లో ఏ ఇతర ప్రాజెక్ట్‌లో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే, తమిళ కథానాయకుడు సూర్య సరసన ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించేందుకు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం చేయనున్నట్టు తెలుస్తోంది. సి.సుందర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 'అరణ్మనై', 'అరణ్మనై2' వంటి హర్రర్‌ చిత్రాలతో సక్సెస్‌ సాధించిన సి.సుందర్‌ తాజాగా చారిత్రాత్మక నేపథ్యంలో ఓ స్క్రిప్ట్‌ని ప్రిపేర్‌ చేశారు. కథ, కథనంతోపాటు ఇందులో ఉపయోగించే గ్రాఫిక్‌ విజువల్స్‌ వంటి తదితర అంశాలన్ని కథానాయకుడు సూర్యకి తెగ నచ్చాయట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. సూర్య ప్రస్తుతం హరి దర్శకత్వంలో 'ఎస్‌3' (సింగం3) చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన 'సింగం', 'సింగం2'చిత్రాలకు సీక్వెల్‌గా 'ఎస్‌3' తెరకెక్కుతోంది. ఈచిత్రంలో సూర్య సరసన అనుష్క నటిస్తున్న విషయం విదితమే. ఏకధాటిగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

రాజమండ్రి ఎయిర్ పోర్టులో బొత్స, అంబటిల నిర్బంధం

తూ.గో : ముద్రగడను పరామర్శించేందుకు రాజమండ్రికి వచ్చిన వైసీపీ నేతలు బొత్స, అంబటిలను ఎయిర్ పోర్టులో పోలీసులు నిర్భంధించారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు రోడ్డు వద్ద పోలీసులు మోహరించారు. 

ముద్రగడ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా : చిరంజీవి

హైదరాబాద్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి తెలిపారు. ముద్రగడ కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు తీరు అమనుషం అని మండిపడ్డారు. తునిలో హింసాత్మక ఘటనను ఎవరూ సమర్థించరు కానీ... ప్రభుత్వం ఏకపక్షంగా అరెస్టు చేయడం తగదన్నారు. బాధ్యుల్ని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎదురుదాడి చేయించడం మాని.. సీఎం చంద్రబాబు విజ్ఞతతో సమస్యను పరిష్కరించాలని సూచించారు.

11:58 - June 11, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన సంఘటనపై స్థానిక సీఐ స్పందించారు. బాధితుల నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపడతామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. 

11:55 - June 11, 2016

హైదరాబాద్ :జంటనగరాల్లోని ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలన్న డిమాండ్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు ఇందిరాపార్క్‌ దగ్గర మహాధర్నా చేపట్టారు. పాఠశాల ఫీజులు నియంత్ర సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. సూళ్లలో లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నా నియంత్రకు చర్యలు తీసుకోవాని సర్కార్‌ చర్యను తప్పుపట్టారు. ఫీజుల పేరుతో స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్ధులు తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. 

కూలిన బ్రతుకులు ..విలపిస్తున్న బాధితులు ..ఫోన్ లైన్లో చార్మినార్ డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు

రాజమండ్రిలో కాపు నేతలను ముందస్తు అరెస్ట్

తూ.గో: రాజమండ్రిలో కాపు నేతలను ముందస్టు అరెస్టు చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు కాపు నేతలను గృహ నిర్భంధం చేస్తున్నారు. రాజోలు పీఎస్ ను కాపు నేతలు ముట్టడించారు. కాకినాడ కూడళ్లలో పోలీసు బలగాలు కవాత్ నిర్వహిస్తున్నాయి.

రైతు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విజయవాడ: ఏపీ సమగ్ర జలవనరుల నిర్వహణ రైతు శిక్షణా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

చింరజీవితో భేటీ అయిన సీ.రామచంద్రయ్య

హైదరాబాద్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష, అరెస్టు నేపథ్యంలో రాజ్యసభ్యుడు, సినీ నటుడు చిరంజీవితో ఏపీ శాసనసమండలి ప్రతిపక్ష సభ్యుడు సీ. రామచంద్రయ్య భేటీ అయ్యారు. ముద్రగడ అరెస్టు అయి ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇందిరా పార్క్ వద్ద ఫీజుల నియంత్రణ జేఏసీ ధర్నా

హైదరాబాద్ : ఇందిరా పార్క్ వద్ద ఫీజుల నియంత్రణ జేఏసీ ధర్నా చేపట్టింది. ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. స్కూల్ ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.

10:46 - June 11, 2016

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం .. లాంటి విభిన్న కథా చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకులు క్రిష్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఇప్పటికే డాక్టర్ రమ్యతో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందట. ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీ వుడ్ టాక్. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాక.. తమ ఇష్టాన్ని ఇరువైపులా తల్లిదండ్రులకు కూడా చేరవేయడంతో.. పెళ్లికి ముహూర్తం రెడీ అవుతోంది. గమ్యం - వేదం చిత్రాలకు గాను ఈ దర్శకుడికి పేరు వచ్చినా.. అవార్డులు మాత్రం పొందలేకపోయాడు. కానీ గతేడాది తీసిన కంచె చిత్రంతో జాతీయ అవార్డు కూడా సాధించడంతో.. పెళ్లికి తన సుముఖతను అమ్మకు చెప్పాడు క్రిష్. మళ్లీ కొడుకు మనసు మార్చుకోకుండానే పెళ్లి చేసేయాలనే ఉద్దేశ్యంతో ఆమె వెంటనే సంబంధాలు వెతకడం మొదలెట్టారట. క్రిష - రమ్యలు ఒకరినొకరు ఇష్టపడ్డంతో పెళ్లి ముహూర్తానికి అంతా సిద్ధమవుతోంది. రీసెంట్ గా క్రిష్ అమ్మగారికి క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరగ్గా.. వీరి కుటుంబంలో ఇతనే పెద్ద కొడుకు. క్రిష్ తమ్ముడు ఇప్పటికే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు. నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తీయడం ద్వారా.. తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్.


 

10:36 - June 11, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీ చూపు ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై పడింది. తెలుగుదేశం,వైసీపీ లను ఖాళీ చేసిన గులాబి దళం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. సిట్టింగ్ అయినా ఓకే.. మాజీలయినా బే ఫర్వా అంటూ గులాబి దళపతి వలసలను ప్రోత్సహిస్తున్నారు.

టీఆర్ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు...
తెలంగాణాలో బలమైన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందేందుకు గులాబీ దళపతి వ్యూహాత్మకంగా సాగుతున్నారు. అన్ని పార్టీల నేతలను కారెక్కించుకుంటూ.... ఆ పార్టీలను మానసికంగా బలహీన పరుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అప్రతిహత విజయమే లక్ష్యంగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణాలో రాజకీయ పునరేకీకరణ అంటూ.. గులాబీ బాస్ ఇతర పార్టీలను నేతలను పెద్ద ఎత్తున కారెక్కించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఎందరో శాసనసభ్యులు కారెక్కేశారు. త్వరలోనే మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు.. పార్టీ సీనియర్లకూ గులాబీ తీర్థం ఇచ్చేందుకు టీఆర్ఎస్‌ అధినేత సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యం..
తెలంగాణలో టీడీపీ, వైసీపీలను దాదాపుగా ఖాళీ చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని ఆకర్షాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ కు పట్టున్న జిల్లాలతో పాటు నామమాత్రపు బలం ఉన్న జిల్లాల్లోని కాంగ్రెస్‌ నేతలను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారు.

కేసీఆర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందిన వివేక్‌ బ్రదర్స్‌?...
తెలంగాణా సాధన కోసమంటూ.. హస్తం పార్టీని వీడి కారెక్కి, ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరిన వివేక్ బ్రదర్స్‌ను మళ్లీ గులాబీ గూటికి రప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు ఈమధ్యనే కేసీఆర్‌ను కలిసి కారెక్కేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ పొందినట్లు సమాచారం. మరో సీనియర్ నేత మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటే వీరంతా గులాబీ గూటికి చేరతారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

కీలక నేతలతో టీఆర్ఎస్ టచ్‌లో ఉన్నట్లు సమాచారం..
కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలో పాటు.. మరికొంత మంది సిట్టింగ్ శాసనసభ్యులు కూడా టీఆర్ఎస్ కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావ్‌కు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబి దళంలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా........ వారి డిమాండ్లపై అధికార పార్టీ అంతగా సానుకూలంగా లేదని సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఎప్పుడైనా అధికార పార్టీ గూటికి చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుండి భారీగా వలసలు...
పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కాంగ్రెస్ నేతల దరఖాస్తులను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని ఓ మంత్రే వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. త్వరలోనే కాంగ్రెస్‌ నుంచి భారీ వలసలు ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది.

 

'హుస్సేనీ ఆలం' ఘటనా స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ ఎంసీ అధికారులు..

హైదరాబాద్: హుస్సేనీఆలంలో ప్రమాద ఘటనా స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన స్థలంపై వివాదం కొనసాగుతోందని తెలిపారు. గతంలో నిర్మాణం నిలపడానికి ప్రయత్నించిన జీహెచ్‌ఎంసీ అధికారులపై దాడి చేశారని, దానిపై కేసు నమోదైందని చెప్పారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని జీహెచ్‌ఎంసీ సౌత్‌జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

 

ప్రారంభమైన 27 రాజ్యసభ సీట్ల కోసం పోలింగ్

హైదరాబాద్: ఏడు రాష్ట్రాల్లో 27 రాజ్య‌స‌భ సీట్ల కోసం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 57 సీట్లకుగాను మిగితా 30 మంది ఇటీవ‌లే ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఈ ఉద‌య‌మే పోలింగ్ స్టార్ట్ అయ్యింది. రాజ్య‌స‌భ‌లో త‌మ బ‌లాన్ని పెంచుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ త‌మ స్వంత అభ్య‌ర్థుల‌నే పోటీలోకి దింపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాజ్య‌స‌భ పోరు ఆస‌క్తిక‌రంగా మార‌నుంది.

10:16 - June 11, 2016

దేశంలో అత్య‌ధికంగా మాంసాహారం భుజించే వారి సంఖ్య హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా ఉన్నారంటే నమ్ముతారా...? అవునండి బాబూ నీ తాజాగా నిర్వహించిన సర్వేలో ఢిల్లీ కంటే నాన్‌వెజ్ లాగించ‌డంలో ... హైద‌రాబాదీ వాసులే ముందున్న‌ట్లు తేలింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. దేశంలోనే టాప్ నాన్ వెజ్ స్టేట్ గా గుర్తింపు పొందింది. తాము ఇంట్లో వండుకునే వంటల్లో... వేడుకల్లోను మాంసాహారానికి అధిక ప్రాధాన్యమిచ్చే తెలంగాణ ప్రజలు నాన్ వెజ్ ప్రియులుగా దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు వెనక్కి నెట్టేశారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ ఆర్ ఎస్) చేసిన అధ్యయనంలో ఈ విషయం తాజాగా వెల్లడైంది. తెలంగాణలో మాంసాహారాన్ని తీసుకుంటోన్న వారి శాతం ఏకంగా 98.7 శాతమని తేలింది. దీంతో శాతం పరంగా తెలంగాణ నాన్ వెజ్ రాష్ట్రంగా అన్నిటి కంటే ముందుందని తేల్చింది.

రెండో స్థానంలో బెంగాల్...

ఇక మాంసాహారం విషయంలో తెలంగాణ తరువాత పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 98.55 శాతం మంది మాంసాహారం తీసుకుంటారని తాజా అధ్యయనం తెలిపింది. తెలంగాణ - బెంగాల్ తరువాత ఒడిశా - కేరళ రాష్ట్రాల్లో వరసగా 97.35 - 97 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని తీసుకుంటూ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.

నాన్ వెజ్ ప్రియులకు షాకింగే...

వారంలో 5 రోజులు ఉద్యోగాలతో బిజీబిజీగా ఉండటం వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం నగరవాసులకు అలవాటే. వీకెండ్ వస్తే చాలు నాన్ వెజ్ (చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ)కు అలవాటయిపోయిన జీవితాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. వీకెండ్‌లో, పుట్టిన రోజు వేడుకలయినా, పెళ్లి రిసెప్షన్ అయినా చికెన్ బిర్యానీ (నాన్ వెజ్) ముద్ద లేనిదే నోటితోపాటు మనసు సంతృప్తి పడదనుకునే వారికి ఓ షాకింగ్ న్యూసే. తమకు మద్యం తాగే అలవాటు లేదు.. కేవలం బిర్యానీ మాత్రమే ఇష్టంగా లాగించేస్తాం అంతే కదా అనుకునే వారికి కూడా ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మద్యం అలవాటు కన్నా… నాన్ వెజ్ తినడం వల్ల వచ్చే అనర్దాలే ఎక్కువగా ఉంటున్నాయట.

ఆరోగ్యానికి హానికరమే....

ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. మాంసాహారంలో వినియోగించే ఆయిల్, మసాలాల వల్ల ఎక్కువ అనారోగ్య సంభవిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ అలవాటును అదుపులో ఉంచకపోతే కాలేయ సమస్యలతో ఇబ్బందిపడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని పరిశోధకులు అంటున్నారు. ఆల్కహాల్ తీసుకునే వారిలో మాత్రమే కాలేయ సమస్యలు వస్తాయనుకోవడం పొరపాటు అని అన్నారు. అదేపనిగా చికెన్, మటన్ బిర్యానీలు తినేవారిలో కూడా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎటువంటి మద్యం అలవాట్లు లేకున్నా కాలేయ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ప్రతి ఏడాది 30 నుంచి 35 శాతం వరకు పెరుగుతోందట. ముఖ్యంగా నగరాల్లో ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.

నాణ్యతలేని వంట సామాగ్రి....

బిర్యానీ తయారీకి వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వినియోగించడం, నాణ్యత లేని మాంసాహారాన్ని వాడటం కారణంగా కాలేయ సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా, ముఖ్యంగా రెస్టారెంట్లలో బిర్యానీ తినే సమయంలో దానితో పాటు కూల్ డ్రింక్ కూడా తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని... ఈ అలవాటు కారణంగా కాలేయసమస్యలు మరింత ఎక్కువవుతాయనే విషయం పరిశోధన ద్వారా తెలిసింది.

10:07 - June 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టెట్‌ ఫలితాల విడుదల ఆలస్యమయ్యేలా కనిపిస్పోంది. పరీక్ష నిర్వహించి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ రిజల్ట్స్ ప్రకటించలేదు. టెట్‌ అభ్యర్థులంతా ఎంతో ఆసక్తితో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పరీక్ష నిర్వహణకు పలుమార్లు వాయిదాలు...
గతనెల 22న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ను నిర్వహించింది తెలంగాణా ప్రభుత్వం. పరీక్ష నిర్వహించేటప్పుడు కూడా అనేక సార్లు వాయిదాలు వేస్తూ ఎట్టకేలకు మే 22న నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు డైట్ విద్యార్ధులు 88వేల 158 మంది , మధ్యాహ్నం పరీక్షకు బిఈడి విద్యార్ధులు 2లక్షల 51వేల 924 మంది హాజరయ్యారు. అయితే ముందునుంచి కూడా టెట్ ఫలితాలను జూన్ 2వ తేదిన విడుదల చేస్తామంటూ ప్రచారం చేసిన అధికారులు ఇప్పటివరకు కూడా ఫలితాల జోలికి పోలేదు.

విద్యాశాఖ మంత్రికి సమయం లేకపోవడమే కారణమా?
అయితే అధికారులు ఫలితాలు సిద్ధం చేసినప్పటికీ విడుదల చేసేందుకు విద్యాశాఖమంత్రి సమయం ఇవ్వకపోవడమే కారణమని అంటున్నారు.. తాను చెప్పేంత వరకు ఫలితాల తేదిని ప్రకటించకూడదని అధికారులకు డిప్యూటి సిఎం, విద్యామంత్రి కడియం ఆదేశాలు జారి చేసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం జిల్లాల్లో విద్యా సమీక్షల నిర్వాహణలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆయన సమయం ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నదని కొందరు అధికారులు చెబుతున్నారు.

పోస్టులను భర్తీ చేయాలని విద్యావేత్తలు డిమాండ్ ...
మరోవైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తయితేనే టీచర్‌ పోస్టుల ఖాళీలు తేలే అవకాశముంది. ఈనెల చివరి వారం లేదా జూలై మొదటివారంలో ఈప్రక్రియ చేపట్టే అవకాశమున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సమయంలో టెట్‌ ఫలితాలు విడుదల చేస్తే, ఉపాధ్యాయ పోస్టులను వెంటనే పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్ధుల నుంచి డిమాండ్‌ వస్తుందనే భయంతోనే ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం వెంటనే టెట్‌ ఫలితాలు విడుదల చేసి టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

09:57 - June 11, 2016

ఢిల్లీ : శనివారం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 57 సీట్లకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌, పియూష్ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, చౌదరీ బీరేందర్‌సింగ్‌ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 11 సీట్లకు ఎన్నికలు జపురుతున్నారు. ఎక్కువ స్థానాలు అధికార సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. యూపీ కాంగ్రెస్‌ తరుపున కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబాల్‌ పోటీ చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు గెలిపించుకునే బలం లేకపోవడంతో బీఎస్పీ , ఆర్ఎల్డీ మద్దతు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు రాజస్థాన్‌ నుంచి నిర్మాల సీతారామన్‌ కర్నాటక నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ కూడా కర్నాటక నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ జార్ఖండ్‌ నుంచి, పియూష్‌ గోయల్‌ మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తున్నారు. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి ఏపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో బలంలేక అవస్థలు పడుతున్న బీజేపీకి ఈ ఎన్నికల కొంతవరకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు జరుగుతున్నస్థానాల్లో ఎక్కువ సీట్లు బీజేపీకే దక్కే అవకాశాలున్నాయి. 

బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్ : బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగి విమానం ల్యాండయ్యింది.

09:38 - June 11, 2016

హైదరాబాద్ : పాతబస్తీ హుస్సీనీ ఆలంలోని కబూతర్ కాన వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో వున్న మహేశ్వరి సేవా ట్రస్ట్ భవనం పైకప్పుకుప్పకూలటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిధిలాల కింద చిక్కుకున్న వారిని పోలీసులు బయటకు తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి జీహెచ్ ఎంసీ అనుమతి లేకపోయినా నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అమీనుద్దీన్ అనే బిల్డర్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. టెక్నికల్ టీమ మరికాసేపట్లో సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించనున్నారు. జీహెచ్ ఎంసీ సౌత్ జోన్ కమీషనర్ తో పాటు స్థానిక డిప్యూటీ కమిషనర్ కూడా సంఘటనాస్థలికి చేరుకుంటున్నారు. అనుమతి లేకుండా భవనం నిర్మించిన కారణంగా బిల్డర్ పై చర్యలు తీసుకుంటారని పోలీసు అధికారులు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపడుతున్నారని ప్రశ్నించటానికి వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై బిల్డర్ బెదిరింపులకు పాల్పడ్డాడని సమాచారం.

లారీ- ట్రాలీ ఢీ: ఒకరి మృతి...

తూ.గో: వేగంగా వస్తున్న లారీ ఓ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని గొల్లప్రోలు మండలం వన్నెపూడి జంక్షన్ వద్ద జాతీయరహదారిపై లారీ- ట్రాలీ ఢీ కొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. 

ముద్రగడకు ప్రత్యేక వైద్యసేవలు.. రంగం సిద్ధం..

తూ.గో: కాపునేత ముద్రగడ పద్మనాభంకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు రంగం సిద్ధమయ్యింది. మంత్రి కామినేని ఆదేశాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ముద్రగడకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు సమాయాత్తం అయ్యారు. దీనికోసం కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రికి చెందిన నలుగురు సీనియర్ వైద్యులతో కూడిన రిస్క్ ఎసెస్మెంట్ బృందం రాజమండ్రికి బయలుదేరింది. 

09:31 - June 11, 2016

విజయవాడ : తూ.గోదావరి జిల్లాలోని కాపుకాక శనివారం విజయవాడకు సోకింది. శనివారం నాడు కృష్ణా జిల్లాకు బంద్ కు కాపునాడు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడలో కాపునాడు నేతలు షాపులు బంద్ చేయిస్తున్నారు. కాగా అప్రమత్తంగా వున్న పోలీసులు కాపునేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో విజయవాడ నంగరంలో ఎటువంటి బంద్ వాతావరణం కనిపించటంలేదని సమాచారం. తుని ఘటనలో పెట్టిన కేసులను ఉపసంమరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాపునేతలు కృష్ణా జిల్లా బంద్ కు పిలుపినిచ్చారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాపునేత ముద్రగడ చేపట్టిన గర్జన సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు అందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురిపై కేసులు నమోదు చేసి...నిందితులుగా వున్న కొంతమందిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో ప్రభుత్వం అమాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతోందంటూ ముద్రగడ అమలాపురం పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. తుని నిందితులపై కేసులు ఎత్తివేయాలంటూ ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షను తన నివాసంలో దీక్షను చేయటం ..దీక్ష విరమింపచేయటానికి ఆయన్ని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.

కృష్ణా జిల్లాకు తగిలిన కాపు కాక...

విజయవాడ : తూ.గోదావరి జిల్లాలోని కాపుకాక శనివారం విజయవాడకు సోకింది. శనివారం నాడు కృష్ణా జిల్లాకు బంద్ కు కాపునాడు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడలో కాపునాడు నేతలు షాపులు బంద్ చేయిస్తున్నారు. కాగా అప్రమత్తంగా వున్న పోలీసులు కాపునేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో విజయవాడ నంగరంలో ఎటువంటి బంద్ వాతావరణం కనిపించటంలేదని సమాచారం. తుని ఘటనలో పెట్టిన కేసులను ఉపసంమరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాపునేతలు కృష్ణా జిల్లా బంద్ కు పిలుపినిచ్చారు. 

08:35 - June 11, 2016

తెలంగాణలో స్థిరపడిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ కు తరలింపు స్థానికతపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 1974/75 నాటి ఉత్తర్వులు సవరిస్తూ .. కొత్తగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అంశాన్ని కేంద్రం గెజిట్ లో పొందుపరిచింది. దీనిపై భిన్నమైన వాదనలు వస్తున్నాయి...ఏపీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటుంటే..తెలంగాణ ఉద్యోగులు మాత్రం ఈ ఉత్తర్వులతో రెండు ప్రాంతాల్లోనూ స్థానికత వచ్చేలా వుంటుందని ...ఇది తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బంది అంటూ విమర్శలు వస్తున్నాయి..ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మర్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో వినయ్ కుమార్ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), ఇందిరా శోభన్ (టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిధి),చిలకమర్తి నరసింహం (టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారాన్ని తెలుసుకోండి..

ముద్రగడను వైకాపా పరామర్శించనుందా?..

హైదరాబాద్‌: వైకాపాకు చెందిన కాపు నేతల బృందం శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనుంది. బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తదితర నేతలు ఈ బృందంలో ఉన్నారు. రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభంను పరామర్శించనున్నట్లు సమాచారం.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు, కాలినడక భక్తులకు 4గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,625 మంది భక్తులు దర్శించుకున్నారు.

07:58 - June 11, 2016

ఢిల్లీ: భారత ఆల్ టైమ్ గ్రేట్ ఒలింపియన్ లియాండర్ పేస్...ఏడోసారి ఒలింపిక్స్ లో పాల్గొనడం అనుమానంగా మారింది. పేస్ పార్ట్నర్ గా ..రియో ఒలింపిక్స్ మిక్సిడ్ డబుల్స్ లో సానియా , పురుషుల డబుల్స్ లో రోహన్ బొపన్న పాల్గొనటానికి ఆసక్తి చూపలేదు. రోహన్ బొపన్నతో కలసి పాల్గొనటానికే సానియా మొగ్గు చూపింది. మరోవైపు...పురుషుల డబుల్స్ లో లియాండర్ పేస్ కు బదులుగా సాకేత్ మైనేనితో కలసి పాల్గొనటమే తనకు ఇష్టమని రోహన్ బొపన్న తన నిర్ణయాన్ని భారత టెన్నిస్ సంఘానికి తెలిపాడు. మహిళల డబుల్స్ లో సానియా మీర్జా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ గా, పురుషుల డబుల్స్ లో రోహన్ బొపన్న 10వ ర్యాంకర్ గా నిలవడంతో...ఒలింపిక్స్ లో తమకు ఇష్టమైన భాగస్వామిని ఎంచుకొనే హక్కు ఉంది. దీంతో 43వ ర్యాంకులో ఉన్న లియాండర్ పేస్ కు నేరుగా ఒలింపిక్స్ బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది. 42 ఏళ్ల లియాండర్ పేస్ భవితవ్యం...భారత టెన్నిస్ సంఘం పెద్దల దయాదాక్షిణ్యాల పైనే ఇక ఆధారపడిఉంది. పేస్ భాగస్వామిగా ఒలింపిక్స్ లో పాల్గొనాలని భారత టెన్నిస్ సంఘం ఆదేశిస్తే...సానియా, రోహన్ బొపన్నలు చేయగలిగిందేమీలేదు.

07:53 - June 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని 166 ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఎఫ్‌ఆర్సీ నోటీసులు జారీచేసింది. కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు లేరని.. అధ్యాపకులకు తగిన విద్యార్హతలు లేవని తనిఖీల్లో తేలిందని లేఖలో తెలిపింది. ఈ నెల 16 నుంచి 20 మధ్య కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులకు స్పందించకపోతే కళాశాలల ఫీజు తగ్గిస్తామని హెచ్చరించింది. 

07:48 - June 11, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు.. అనంతరం పుష్కరాల లోగోను ఆవిష్కరించారు.

కృష్ణా నది పుష్కరాలపై చంద్రబాబు రివ్యూ...
కృష్ణా నది పుష్కరాలపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. పుష్కరాలు ప్రారంభమయ్యే ఆగస్టు 12 నుంచి కృష్ణానదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. జులై 19న అషాడ పౌర్ణమి సందర్భంగా ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొని హారతినిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే కళ్లు చెదిరే లేజర్ షోకు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలు పుష్కరాలకే పరిమితం కాకుండా పర్యాటకుల్ని ఆకర్షించేందుకు శాశ్వతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోనున్న ప్రకాశం బ్యారేజ్ ...
పుష్కర ఘాట్లలోనూ, భవానీ ఐల్యాండ్ ప్రాంతంలోనూ వెంటనే డ్రెడ్జింగ్ చెపట్టి మరింత ఎక్కువ నీరు నదిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ కు ఇరువైపులా విద్యుత్ దీప కాంతులతో అలంకరించేందుకు పనులు చేపట్టాలన్నారు. విజయవాడ నగరంలో రైల్వే ట్రాక్ రెండు పక్కలా రెయిలింగ్ ఏర్పాటు చేసి, ప్లాంటేషన్ చేయించాలని రైల్వే, మున్సిపల్ అధికారులకు సీఎం సూచించారు.

33 ఎకరాల విస్తీర్ణంలో భారీ పుష్కరనగర్....
విజయవాడలో 24 , గుంటూరు జిల్లాలో 10 పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎం తెలిపారు. గుంటూరు నగరం అమరావతి రోడ్డులో లాంఫామ్ దగ్గరలోని 33 ఎకరాల విస్తీర్ణంలో భారీ పుష్కరనగర్ ఏర్పాటు చేస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టరు కాంతిలాల్ దండే చెప్పారు. ఈ పుష్కర నగర్లలో యాత్రికులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ ముఖ్య కార్యదర్శి కరికాల వల్లవన్ తెలిపారు. ఒక్కొక్క పుష్కర నగర్ కు 24 లక్షల నుంచి కోటి మంది వరకు జనం వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడే బస్ స్టేషన్, వసతి, టాయిలెట్స్ వగైరా ఏర్పాట్లు వుంటాయని తెలిపారు. జులై 15 వరకు మొత్తం పనులు పూర్తవుతాయన్నారు. సీఎం సూచనల మేరకు శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పనులను, విజయవాడ దుర్గ గుడి అభివృద్ధి పనులను, పుష్కర పనుల్లలో భాగంగా చేస్తున్నామని దేవాదాయశాఖ అధికారులు వివరించారు.

ఏర్పాట్లపై సీఎం ఆదేశాలు..
గోదావరి పుష్కరాల్లో ఏవిధంగా పనిచేసారో అదే విధంగా అధికారులు, మంత్రులు పనిచేసి కృష్ణానది పుష్కరాలను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

07:40 - June 11, 2016

గుంటూరు : ఏపీ రాజధానిలో భూముల క్రయ, విక్రయాలకు సీఆర్డీఏ అధికారులు మెలికలు పెడుతున్నారు...తాజాగా సీఆర్డీఏ పరిధిలోని లే అవుట్లకు అనుమతులు రద్దు చేయడంతో పాటు క్రయవిక్రయాలపై సరికొత్త పద్దతులు ప్రవేశపెట్టారు.. దీంతో రైతుల నుంచి భూములు కొనాలన్నా, అమ్మాలన్నా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి అయ్యింది..

భూముల రిజిస్ట్రేషన్స్‌పై అధికారుల కొత్త నిబంధనలు...
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపులకు శ్రీకారం చుట్టబోతున్న సమయంలో అధికారులు భూముల రిజిస్ట్రేషన్స్‌పై సరికొత్త నిబంధనలు పెడుతున్నారు. రాజధాని ఏర్పడిన తర్వాత 29 గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి..అనేక మంది రైతులు తమ భూములు అమ్ముకొని లాభపడ్డారు. ప్రస్తుతం రైతులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి తుది కసరత్తులు జరుగుతున్నాయి..

గజాల్లోకి మారనున్న భూమి ...
ఇప్పటి వరకు ఎకరాల్లో, సెంట్ల లెక్కన ఉన్న భూమి ఇక నుండి గజాల్లోకి మారబోతుంది..రాజధానికి భూములిచ్చిన రైతులకు వారికి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం ఎకరానికి 1000 గజాల నివాసం, 450 గజాల కమర్షియల్ భూమి తిరిగి ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ప్లాట్లకు సంబంధించి, రైతులు భూములు అమ్మితే ప్లాట్ల కేటాయింపుల్లో కష్టం అవుతుందనే ఉద్దేశంతో సీఆర్డీఏ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి నిబంధనలు జారీచేసింది... ఒకవేళ రైతు తన భూమిలో కొంత అమ్ముకోవాలంటే వాటి పూర్తి వివరాలు డిప్యూటీ కలెక్టరుకు చెబితే ఆ భూమి వివరాలు నోట్ చేసుకోని, దానిని ప్లాట్ల పంపిణీకి సంబంధించిన డేటాకు అనుసంధానం చేస్తారు. ఇలా అనుసంధానం చేసిన తర్వాత రైతులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు.

నూతన విధానంతో రైతులకు ఇబ్బందులు ...
అయితే గత ఏడాదిన్నరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మకాలు, కొనుగోలు చేసుకున్న వారికి, సీఆర్డీఏ అధికారులు తీసుకున్న నూతన విధానాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 29 గ్రామాల్లో ఆనుకుని ఉన్న మంగళగిరి, తాడికొండ రిజస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ, విక్రయాలు జరపాలంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలంటూ నిబంధన పెట్టడంతో రిజిస్ట్రేషన్స్ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని రైతులు మండిపడుతున్నారు.

ముందస్తు ప్రచారానికి డిమాండ్‌ ...
అలాంటి ముందస్తు సమచారం ఇవ్వకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నిబంధన తప్పనిసరి చేయడం సరైంది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీలో డిప్యూటీ కలెక్టర్లు ఇబ్బందులకు గురిచేస్తే తాము ఊరుకొబోమని రైతులు అంటున్నారు. 

07:05 - June 11, 2016

హైదరాబాద్ : పాతబస్తీ హుస్సీనీ ఆలంలోని కబూతర్ కాన వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో వున్న మహేశ్వరి సేవా ట్రస్ట్ భవనం పైకప్పుకుప్పకూలటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిధిలాల కింద చిక్కుకున్న వారిని పోలీసులు బయటకు తీసుకున్నారు. కూలీలంతా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతులు నంద (32), వెంకటయ్య (40)లుగా గుర్తించారు.క్షతగాత్రులను సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 

07:03 - June 11, 2016

విజయవాడ : ఏపీ సెక్రెటేరియట్‌ ఉద్యోగుల స్థానిక‌త అంశం పరిష్కారమైంది. తెలంగాణ నుంచి ఏపికి తరలివ‌చ్చే వారికి లోక‌ల్ స్టేట‌స్ క‌ల్పించాల‌న్న ఏపి విజ్ఞప్తికి రాష్ట్రప‌తి ఆమోదముద్ర వేసారు. ఆ వెంట‌నే కేంద్రం గెజిట్‌ విడుద‌ల చేసింది.

పరిష్కారమైన స్థానిక‌త వివాదం...
రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా.. తెలంగాణ నుంచి ఏపికి తరలి వెళ్లే ఉద్యోగులకు తలెత్తిన స్థానికత సమస్య తీరిపోయింది. ఇలా తరలివచ్చిన ఉద్యోగులను ఏపీలో స్థానికులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీక‌రించింది. ఈమేరకు కేంద్రం పంపిన సిఫారసును రాష్ట్రపతి ఆమోదించారు.

తెలంగాణ నుంచి వ‌చ్చే వారికి మాత్రమే స్థానికత వ‌ర్తింపు ....
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ‌లో స్థిరప‌డిన వారు.. ఇప్పుడు తిరిగి ఏపికి వెళ్లాలంటే స్థానిక‌త అంశం సమస్యగా మారింది. విభజన అనంతరం ఏపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తికి త‌ర‌లి రావాలంటే .. త‌మ పిల్లల స్థానిక‌త తేల్చాలంటూ ఉద్యోగులు మెలిక పెట్టారు. స్థానిక‌త ఉత్తర్వుల స‌వ‌ర‌ణ కోసం తెలంగాణలో ప‌ని చేస్తున్న ఏపి ఉద్యోగులు ఏపీ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచారు. దీంతో సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.

స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి- నోటిఫికేష‌న్ విడుద‌ల‌...
ఏపీ ప్రభుత్వం స్థానికత అంశంపై ప‌లుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అనుగుణంగా రాష్ట్రప‌తి ఉత్తర్వుల్లో 371డీ కి స‌వ‌ర‌ణ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సుకు రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేసారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర విభజ‌న జ‌రిగిన నాటి నుంచి జూన్ 2, 2017లోగా ఏపిలోని 13 జిల్లాల‌కు చెందిన వారు తిరిగి స్వస్థలాల‌కు తిరిగి వ‌స్తే.. వారికి ఏపి స్థానిక‌త వ‌ర్తించేలా ఈ స‌వ‌ర‌ణ జ‌రిగింది.

ఏపికి తిరిగి వ‌చ్చే వారికి మాత్రమే వ‌ర్తింపు...
అయితే, రాష్ట్రపతి ఉత్తర్వులు కేవ‌లం తెలంగాణ లోని ప‌ది జిల్లాల నుంచి ఏపికి తిరిగి వ‌చ్చే వారికి మాత్రమే వ‌ర్తిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగువారికి ఈ ఉత్తర్వుల వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. రాష్ట్రపతి ఆమోదం లభించిన నేపథ్యంలో.. స్థానికతకు సంబంధించి, తెలంగాణ నుంచి ఏపికి తిరిగి వ‌చ్చే వారిని గుర్తించ‌టం.. వారికి లోక‌ల్ స్టేట‌స్ వర్తింపచేయడానికి అవసరమైన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వర‌లో మార్గద‌ర్శకాలు జారీ చేయ‌నుంది.

రాష్ట్రప‌తి ఆమోదంతో ఉద్యోగుల్లో ఆనందం...
స్థానిక‌త అంశం పై రాష్ట్రప‌తి ఆమోదంతో స‌చివాల‌య ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అయింది. దీంతో ఏపీ ఉద్యోగుల త‌ర‌లింపు ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం అవుతుందన్న భావనా వ్యక్తమవుతోంది. 

06:49 - June 11, 2016

విజయవాడ : ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల 20 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. ఒకేచోట మూడేళ్లలోపు విధుల నిర్వహిస్తున్న వారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

బదిలీలకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ...
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. తాము ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు సర్కార్‌ పచ్చజెండా ఊపడమే కాకుండా.. విధి విధానాలు కూడా ఖరారుచేసింది. దీంతో ఉద్యోగులు బదిలీలకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టే పనిలో పడ్డారు.

ఈనెల 20 వరకే బదిలీలు పరిమితం...
బదిలీల ప్రక్రియను ఈనెల 20వరకు చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈనెల ఒకటో తేదీకి ఒకేచోట మూడేళ్లలోపు పని చేస్తున్న వారిని బదిలీ చేయరు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి సర్కార్‌ తొలి ప్రాధాన్యత కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో 50 ఏళ్ల వయస్సులోపు వారినే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. అన్ని బదిలీల్లోనూ వారి పనితీరుకు అదనపు ప్రాధాన్యత కల్పించనున్నారు. ఏ శాఖలోనైనా 20 శాతానికి మించకుండా బదిలీలు చేయనున్నారు. వికలాంగులు, ఉద్యోగుల పిల్లల్లో మానసికంగా ఎదగనివారికి వైద్య సదుపాయాల నిమిత్తం మినహాయింపు ఇవ్వనున్నారు. 40 శాతం అంతకంటే మించి వైకల్యం ఉన్న వాళ్ల విజ్ఞప్తులను అనుమతించనున్నారు. భార్యాభర్తల కేసులను నిబంధనల మేరకు బదిలీ చేస్తారు. అలాగే వితంతువులు, వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నవారి దరఖాస్తులను కూడా పరిశీలించనున్నారు. అయితే.. వీటిని ఐదు శాతానికే పరిమితం చేశారు.

2017 జూన్‌ 30కి ముందు రిటైర్‌ అయ్యే వారికి మినహాయింపు...
బదిలీలపై సడలింపు ఈనెల 20 వరకే పరిమితమని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2017 జూన్‌ 30కి ముందు రిటైర్‌ అయ్యే ఉద్యోగులను బదిలీ చేయకూడదని నిర్ణయించారు. బదిలీల నుండి ఏసీబీ, విజిలెన్స్‌ కేసులున్న వారిని మినహాయించారు. ఇక బదిలీలన్నీ కౌన్సెలింగ్‌ ద్వారా చేపట్టనున్నారు. 15వ తేదీన కౌన్సెలింగ్‌ ప్రారంభించి.. 17లోపు పూర్తి చేయనున్నారు. బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు టెక్నాలజీని ప్రభుత్వం ఉపయోగించుకోనుంది.

పేకప్ కు రెడీ అవుతున్న ఉద్యోగులు...
మొత్తానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఉద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు.

అత్యాచారం కేసులో దోషులకు జీవితఖైదు..

ఢిల్లీ : డెన్మార్క్‌కు చెందిన మహిళపై అత్యాచారం కేసులో దిల్లీ కోర్టు దోషులకు జీవితఖైదు విధించింది. 2014లో దిల్లీలో 52ఏళ్ల డానిష్‌ మహిళను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు అయిదుగురు వ్యక్తులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది. సోమవారం కోర్టు గంజా(27), మోహద్‌ రాజా(23), రాజు(24), అర్జున్‌(22), రాజు చక్కా(23) అనే ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో ముగ్గురిని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు విచారిస్తోంది. కేసులో నిందితుడైన మరో వ్యక్తి ఇప్పటికే మరణించాడు.

మాజీ ఉపాధ్యక్షుడికి 15ఏళ్ల జైలుశిక్ష..

మాల్దీవులు : గత ఏడాది స్పీడ్‌బోట్‌లో బాంబుపెట్టి దేశ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్‌ను చంపేందుకు కుట్రపన్నిన కేసులో దోషిగా తేలిన మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్‌కు క్రిమినల్ కోర్టు 15 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. అక్రమ ఆయుధాల కేసులో ఈ వారమే పదేండ్ల శిక్ష పడిన అదీబ్‌కు తాజా శిక్షతో ఆయన 25ఏండ్లపాటు జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఈ హత్యాయత్నంలో పాలుపంచుకున్న అదీబ్ ఇద్దరు సైనిక అంగరక్షకులకు కూడా కోర్టు పదేండ్ల జైలుశిక్ష విధించింది.

పాతబస్తీలో కూలిన భవనం..ఇద్దరు మృతి...

హైదరాబాద్ : పాతబస్తీ హుస్సీనీ ఆలంలోని కబూతర్ కాన వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో వున్న మహేశ్వరి సేవా ట్రస్్ట భవనం పైకప్పుకుప్పకూలటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిధిలాల కింద చిక్కుకున్న వారిని పోలీసులు బయటకు తీసుకున్నారు. కూలీలంతా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

కన్హయ్యకుమార్ అరెస్ట్ ...

ఢిల్లీ : జూన్ 10: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌తోసహా మరో 42 మందిని విద్యార్థులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పాట్నాలోని ఆర్ట్ అండ్ క్రాప్ట్ కళాశాలలో నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులపై దాడికి వ్యతిరేకంగా ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బీహార్‌భవన్ ఎదుట నిరసనకు దిగిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Don't Miss