Activities calendar

12 June 2016

22:11 - June 12, 2016

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. స్వలింగ సంపర్కుల క్లబ్‌లో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా, మరో 53 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటన తర్వాత మియామీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఇది స్వదేశీ ముఠాల పనా ? లేక అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రా? అన్న కోణంలో ఓర్లాండో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఆగంతకులు కాల్పులు 
ఫ్లోరిడాలోని ఓ సంగీత కచేరీపై ఆగంతకులు కాల్పులు జరిపిన ఘటన జరిగి 48 గంటలు  తిరగముందే నైట్‌క్లబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని స్వలింగ సంపర్కుల క్లబ్‌ను రాత్రి మూసివేసే సమయంలో ఒక ఆగంతకుడు ప్రవేశించి, కొంతమందిని బంధీలుగా చేసుకుని  విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ప్రాణభయంతో జనం పరుగులు తీశారు. బాత్‌రూమ్‌లు, టాయిలెట్లలో తలదాచుకున్నారు.  20 నుంచి 50 సార్లు కాల్పుల శబ్ధాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ఈ ఘటన జరిగినప్పుడు క్లబ్‌లో వందమంది వరకు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
ఎదురు కాల్పుల్లో ఆగంతకుడు మృతి 
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. స్థానికులను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. క్లబ్‌లో పోలీసులు ప్రవేశించిన విషయాన్ని గమనించిన ఆగంతకుడు... రక్షకభటులపై కూడా కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆగంతకుడు ప్రాణాలు కోల్పోయాడు.   క్లబ్‌ దగ్గరకు చేరుకున్నఅంబులెన్స్‌ సిబ్బంది ముందుగా క్షతగాత్రులకు  కాలిబాటపై అత్యవసర వైద్యం అందించి,  ఆర్వాత మెరుగైన వైద్యం కోసం  ఆస్పత్రికి తరలించారు.  తీవ్రగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్లర్లు చెబుతున్నారు. 
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల కుట్ర ఉందా ? 
ఎదురు కాల్పుల్లో మరణించిన దుండగుని దేహాన్ని పోలీసు స్వాధీనం చేసుకుని.. అతని వివరాలు సేకరిస్తున్నారు. ఫ్లోరిడా నైట్‌క్లబ్‌ కాల్పుల ఘటన వెనకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల కుట్ర ఉందా ? లేక ఇది స్వదేశీ ముఠాల పనా.. అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

విద్యుత్ షాక్ తో లారీ దగ్ధం.....

నల్గొండ : జిల్లాలోని కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు లో విద్యుత్ షాక్ తో లారీలో మంటలు చెలరేగాయి. లారీ పూర్తిగా కాలిపోయింది. 

 

22:03 - June 12, 2016

హైదరాబాద్ : రైతుల నుండి భూములను లాక్కునేందుకే ప్రభుత్వం 123 జీవో ఇచ్చిందని కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. పలు అంశాలపై కార్యవర్గం చర్చించినట్లు ఆయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి నిర్మాణాత్మకంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు ఆయన చెప్పారు. కొత్త జిల్లాల ముసాయిదా పూర్తయిన తర్వాత అఖిలపక్షం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరికి ఇబ్బంది కల్గిన కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తప్పనిసరిగా ఉంటాయని మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు క్రమశిక్షణతో టీఆర్ఎస్ పై  పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు..

21:59 - June 12, 2016

మెదక్‌ : జిల్లాలోని తోగుట మండలంలో రిలే దీక్షలు చేస్తున్న మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు ప్రజాఫ్రంట్‌ మద్దతు ప్రకటించింది.. బాధితులను ప్రజాఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క పరామర్శించారు.. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. 

21:56 - June 12, 2016

అలహాబాద్ : కొత్త ఆలోచనలు, సరికొత్త కార్యాచరణతో ముందుకు దూసుకుపోవాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలే లక్ష్యంగా అలహాబాద్‌లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరై ప్రసంగించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరనేది కూడా తేల్చనున్నారు. త్వరలో జరగబోయే పంజాబ్‌, గోవా, యూపీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ సమావేశాల్లో వ్యూహరచన చేయనున్నారు.  

21:47 - June 12, 2016

మనుషుల్లో మంచి చెడుల గురించి ముళ్లపుడి గారు ఒక మంచి డైలాగ్ రాశారు. 'మంచిచెడులనేవి.. రాళులు పోసి.... ఇది మంచి, ఇది చెడు అనేది ఉండదు. మనుషుల్లో కూడా వీడు మంచివాడు.. వీడు.. చెడ్డవాడు అనేది ఉండుదు. మంచిగాకనిపించేవాడు మనుషుల ప్రాణాలు తీసే నరరూపరాక్షసుడై ఉంటాడు... చెడ్డగా కనిపించేవాడు ప్రాణాలిచ్చే మంచి మనిషై ఉంటాడు. ఆయా పరిస్థితుల్లో ఆయా సమయాన్ని బట్టి మంచిచెడులనేవి బయటపడుతుంటాయని చెప్పారాయన'..సెంట్ సర్ సెంట్ కరెక్ట్.. ఎవరిని కూడా వీడు గుడ్, వీడు బ్యాడ్ అని అంచనా వేయలేం.. రెండో ఎపి సోడ్ వివరాలను వీడియోలో చూద్దాం...

21:22 - June 12, 2016

కరీంనగర్ : జిల్లాలో మంత్రులు హరిష్ రావు, ఈటెల రాజేందర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నగరంలో టిఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రులు హరిష్, ఈటెల బైక్ ను నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రైతుల, నగర వాసుల సౌకర్యార్థం 5 కోట్లతో నిర్మించిన రైతుబజార్ ను ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించడంతో పాటు వ్యవసాయంపై ఆవగహన కల్పించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. జిల్లాలో కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల ప్రాంతాల్లో రైతుబజార్ లను నిర్మించనున్నట్లు మంత్రి హామి ఇచ్చారు.

21:17 - June 12, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌ చేరనున్నారు. ఈ నెల 15న టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు కరీంనగర్‌కు చెందిన నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

21:13 - June 12, 2016

విజయవాడ : తుని ఘటనపై సీబీఐ విచారణ జరపాలని లింగంసెట్టి ఏపీ కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్‌ సెల్ ఛైర్మన్‌ లింగంసెట్టి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తుని సంఘటనపై సీబీఐ విచారణకు ముద్రగడ అనుమతి అవసరమా అని ప్రశ్నించారు. తుని ఘటనలో చంద్రన్న దళం పాత్ర ఉండొచ్చన్న అనుమానం కలుగుతుందన్నారు. తుని ఘటన వంకతో కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందన్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 

 

20:55 - June 12, 2016

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడా నైట్‌క్లబ్‌లో దారుణం జరిగింది. స్వలింగ సంపర్కుల క్లబ్‌లో ప్రవేశించిన  ఆగంతకుడు, కొంతమందిని బంధీలుగా చేసుకుని   విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో  20 మంది ప్రాణాలు కోల్పోయారు మరో 42 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌ల సిబ్బంది కాల్పుల్లో గాపడ్డవారిని  ముందుంగా కాలిబాటలపైకి తరలించి అత్యవసర చికిత్స అందిచారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో  ఆగంతకుడు మరణించాడు. 

 

20:52 - June 12, 2016

విజయవాడ : భక్తుల ఆధ్యాత్మిక చింతనకు పవిత్ర ఆలయంగా విజయవాడ గుణదల చర్చ్ పేరు ప్రఖ్యాతులు గడించింది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఈ ఆలయానికి ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. ఇప్పుడు ఖండాంతరాలు దాటి ప్రపంచ క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో గుణదల చర్చ్  ప్రత్యేకతను సంతరించుకుంది. 
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న మేరిమాత చర్చ్ 
రాష్ట్ర రాజధానిగా విలసిల్లుతున్న విజయవాడలో మేరిమాత చర్చ్ మరింత ఆధ్యాత్మిక ఒరవడి సంతరించుకుంది. దాదాపు 90 ఏళ్లకుపైగా ఏటా మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తూ ఘనతికెక్కింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతుంటాయి. కుల మతాలకతీతంగా కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే 13 లక్షలకుపైగా భక్తులు వచ్చి దైవ దీవెనలు పొందుతుంటారు. ఈ ప్రదేశానికి పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశీయులు అధికంగా తరలివస్తారు. గుణదల పుణ్యక్షేత్రం పర్యాటక ప్రాంతంగా ప్రాధాన్యత ఏర్పడింది.
భక్తుల రాకపోకలతో కొత్త రూపు రేఖలు 
విజయవాడ రాజధానిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో మేరిమాత పుణ్యక్షేత్రం భక్తుల రాకపోకలతో కొత్త రూపు రేఖలు సంతరించుకోబోతున్నాయి. రాష్ట్ర విభజన కు ముందే ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు, వెల్లువలా భక్తులు తరలివచ్చేవారు. శుక్ర, శని, ఆదివారాల్లో వేలాది నుంచి లక్షలాది మందిగా తరలివచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకులు విజయవాడకు వలసలు పెరగడంతో ఆధ్యాత్మిక చింతన కోసం భక్తులు ఇటుగా మొగ్గుచూపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఈ చర్చ్ దగ్గర మార్గంగా ఉండటంతో ఆధ్యాత్మిక చింతన కోసం ఈ క్షేత్రంలోకి అడుగిడుతుంటారు. 
19వ శతాబ్ధంలో జూబిలీ ఉత్సవాలు
1925లో అప్పటి సెయింట్ జోసెఫ్స్ ఇన్ స్టిట్యూట్ రెక్టార్ అయిన ఫాదర్ టి.అర్లాటి స్వాములవారు గుణదల కొండపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలో మరియమాత స్వరూపాన్ని స్థాపించారు. అనంతరం 19వ శతాబ్దపు జూబిలీ ఉత్సవాల సందర్భంగా 1933లో ఫాదర్ అర్లాటి కొండ శిఖరాగ్రాన ఒక శిలువను ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఫిబ్రవరి నెల 9, 10, 11 తేదీల్లో మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.  ప్రతి ఏటా నవంబర్ లో గుణదలలో ప్రత్యేక ఆరాధానలు ప్రారంభమవుతాయి. 
మేరిమాత చర్చ్ కి తరలివస్తున్న భక్తులు 
ప్రస్తుతం ఫ్రాన్స్ లో లూర్దునగర్ దేవాలయం, తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నంలో వేళంగణిమాత దేవాలయం, సికింద్రాబాద్ లో సెయింట్ మేరి చర్చ్, మెదక్ చర్చ్, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు సమీపంలోని నిర్మలగిరి దేవాలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా కీర్తికెక్కాయి. ఇప్పుడు ఆ స్థాయిని అందుకునే విధంగా మేరిమాత చర్చ్ కి ఇప్పటికే భక్తులు అశేషంగా తరలివస్తున్నారు.

 

20:47 - June 12, 2016

కడప : వారు మారలేదు...నెలనెలా టంచనుగా జీతాలు వస్తున్నా.. పనంటేనే ఎక్కడలేని నిర్లక్ష్యం. ఓవైపు ఈ-గవర్నెన్స్,  స్మార్ట్ గవర్నెన్స్ అని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే... కొందరు ఉద్యోగులు మాత్రం... మేమంతే..మారేదిలేదంటున్నారు. కడప జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల నిర్వాకంపై 10టీవీ ఫోకస్‌..
నిర్లక్ష్యపు ఆఫీసులు
ఇక్కడ హడావుడిగా పరుగెత్తుతున్న ఈమె ఎవరు..? ఆఫీసుకు టైం అయిపోతోందని ఇలా పరుగెత్తు తున్నారేమో అనిపిస్తోందికదూ.. ప్రభుత్వ ఆఫీసులో ఇంత డెడికేట్‌గా పనిచేసే ఉద్యోగులు ఉన్నారా... అనిపిస్తోంది ఈసీన్‌ చూస్తే ఎవరికైనా..! అదేం కాదు.. టెన్‌టీవీ కెమెరా  గమనిస్తోందని తెలిసి.. ఆఫీసుకు ఇలా పరుగులు పెట్టిందీ ఉద్యోగిని. 
నిరుద్యోగుల దరఖాస్తులు
ఇదిగో దీన్ని చూడండి.. కాగితాలు చిందరవందరగా ఉన్నాయ్ కదా...పక్కనే చెత్తబుట్ట కూడా ఉంది.. ఇది ఖచ్చితంగా  చెత్తకుండీనే  అనిపిస్తుందికదూ..! కానీ.. ఇవి చిత్తుకాగితాలు కాదు... ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నోఆశలతో  నిరుద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు. ఇక్కడ ఈ సీన్‌ చూసిన అభ్యర్థులు గుండెపగలడం ఖాయం. టెన్‌టీవీ కెమెరాను చూసిన ఈ ఉద్యోగి అదరాబాదరా కిందపడేసిన అప్లికేషన్లు తీసేసింది.
ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం
అసలు విషయం ఏంటంటే..కడపజిల్లాలో ఎస్సీ ,ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలోభాగంగా  జిల్లా ప్రాంతీయ ఇంటర్‌మీడియెట్‌ బోర్టు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఒక జూనియర్‌అసిస్టెంట్‌ పోస్టు, రెండు టైపిస్ట్‌ పోస్టులకు 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ... దరఖాస్తులు ఆర్జేడీ కార్యాలయానికి వచ్చిన తర్వాతే అసలు కథ మొదలైంది. ఇక్కడే అప్లికేషన్‌లను షార్ట్‌లిస్టు చేయాలి. తప్పొప్పులు అన్నీ సరిచూసి కలెక్టర్‌ ఆఫీసుకు పంపించాలి.  అంతా సాఫీగా సాగితే ఎవరికీ  అభ్యంతరం ఉండదు. కాని... ఆర్జేడీగారు ఈ పనిని ఓ క్లర్క్‌కు అప్పగించారు. క్లర్క్‌ తనపనిని ఇదిగో ఇలా కాగితాలన్నీ చెత్తబుట్ట పాల్జేసి.. విధులు నిర్వర్తిస్తోంది. 30వేల అప్లికేషన్లలో దాదాపు 15వేల దరఖాస్తులు చెత్తబుట్టలో పడేశారు. అదీ... ఎటువంటి పరిశీలన లేకుండానే..! లంచాలు ముట్టచెప్పిన వారి అప్లకేషన్లు మాత్రమే కలెక్టర్‌ ఆఫీసుకు పంపినట్టు విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. 
లంచాలు ఇవ్వలేక నష్టపోతున్నాం : అభ్యర్థులు
అప్లికేషన్లను ఇలా ఎందుకు పడేశారని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సుజన గారిని వివరణ అడిగితే... ఆమె ఫోన్‌లోనే దురుసుగా మాట్లాడినట్టు విద్యార్థి నాయకులు అంటున్నారు. అన్ని అర్హతలున్నా ..లంచాలు ఇవ్వలేని తాము ఇలా నష్టపోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు.  
సిబ్బంది నిర్వాకం 
ఉద్యోగం వస్తుందన్న ఆశతో.. వ్యయప్రయాసలకోర్చి.. అప్లకేషన్‌ పెట్టుకుంటే.. ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది నిర్వాకం ఇలా తయారైందని.. నిరుద్యోగులు  ఆవేదన చెందుతున్నారు. కడప ఆర్జేడీ  లంచావతారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని  నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

 

20:41 - June 12, 2016

విశాఖ : పంచగ్రామాల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పంచగ్రామాల ప్రజలు సింహచలంలో నిర్వహించిన ధర్నాకు ఆయన హజరయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చిందని... ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భూములు కబ్జా చేసిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంవీఎస్ శర్మ ఆరోపించారు. 

 

20:36 - June 12, 2016

విజయనగరం : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 82 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయనగరంలో ధర్నా నిర్వహించారు. వేదిక కన్వీనర్ లగుడు గోవింద ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పలువురు నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. గ్రూప్ 2లో ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 లో కలపాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేయకపోతే జూలై 1 నుంచి నిరవధిక పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. 

20:31 - June 12, 2016

నెల్లూరు : యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు నెల్లూరులో డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధుతో కలిసి ఆంగ్ల దినపత్రిక ది హిందూ.. ఎడిటర్‌ ఎన్.రామ్‌... ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి నారాయణతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైద్యరంగంలో డాక్టర్‌ శేషారెడ్డి చేసిన సేవలను ప్రముఖులను స్మరించుకున్నారు.  

 

20:29 - June 12, 2016

విజయవాడ : విదేశాలకు వెళ్లి చదువుకునే కాపు, ఒంటరి, బలిజ కులాల విద్యార్థుల కోసం కాపు కార్పోరేషన్‌ ద్వారా రెండు పథకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసామని ఏపీ కార్పోరేషన్‌ చైర్మన్‌ఖ చలమల శెట్టి రామానుజయ్య అన్నారు. కాపు కార్పోరేషన్‌ నిధులతో 'విదేశీ విద్య దీవెన పథకం' పేరిట ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని పేరొన్నారు.

 

20:24 - June 12, 2016

విజయవాడ : ముద్రగడ పద్మనాభానికి ఏ హాని జరిగినా సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఏపి కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం ఆధ్వర్యంలో కాపుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష్యత వహించిన ఏపి కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం ఛైర్మెన్ లింగంసెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చేందుకు పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తోందని తెలిపారు.

20:20 - June 12, 2016

హైదరాబాద్ : బ్యాంకుల్లో పనిచేస్తున్న తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టిడిపి ఎంపి  దేవేందర్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. అఖిల భారత ఓబీసీ బ్యాంకు ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్‌ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరణకు కేంద్రంతో చర్చిస్తానని చెప్పారు. కార్పొరేట్లే వేల కోట్ల రూపాయలు ఎగవేస్తున్నా పట్టించుకోని బ్యాంకులు.. కాంట్రాక్‌, తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించకపోవడం దారుణమని సమావేశానికి హాజరైన  హైకోర్టు  రిటైర్డ్‌ న్యాయమూర్తి చంద్రకుమార్‌ విమర్శించారు. 

20:13 - June 12, 2016

వరంగల్‌ : జిల్లాలోని ఇంతేజార్‌గంజ్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమకు పట్టాలు ఇవ్వాలని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీధర్‌రావును నిలదీసిన స్థానికులను పోలీసులు నిర్బంధించారు. ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, పోతరాజు సారయ్య, సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు పోలీసుల అదుపులో ఉన్న స్థానికులను పరామర్శించారు. 

అమెరికాలో కాల్పులు... 50 చేరిన మృతుల సంఖ్య

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. ఓర్లాండ్ లోని గే నైబ్ క్లబ్ లో దుందగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 50 మంది మృతి చెందారు. కాల్పులకు తెగబడిన ఉన్మాదిని పోలీసులు కాల్చి చంపారు. 

20:04 - June 12, 2016

నల్గొండ : జిల్లాలోని భువనగిరిలో దారుణం చోటుచేసుకుంది. గౌస్‌నగర్‌లో కుటుంబ కలహాలతో 5 నెలల చిన్నారిని తల్లి నీటి సంపులో పడేసి అనంతరం కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తాను ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని మృతురాలి బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

20:01 - June 12, 2016

కరీంనగర్ : జిల్లాలోని బోయవాడలో రెండు అంతస్తు భవనం పై నుండి దూకిన ఇంజనీరింగ్ విద్యార్థి గాయలపాలైయ్యాడు. వరంగల్ లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అఖిల్ నాలుగు రోజుల క్రితం బోయవాడలోని స్వగృహానికి రావడం జరిగింది. ఉదయం ఇంటి పక్కనే ఉన్న రెండు అంతస్తుల భవనం పైకి ఎక్కి అక్కడ నుండి దూకడంతో కింద ఉన్న రేకుల షెడ్డు పై పడ్డాడు. అప్పటికే గాయలపాలైన అఖిల్  రేకుల మధ్యలో ఈరుక్కపోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో వారి సాయంతో విద్యార్థిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. 

19:51 - June 12, 2016

హైదరాబాద్ : ఏళ్లతరబడి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బంది పరిస్థితి అయోమయంగా తయారైంది. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లైనా..  తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించక పోవడంపై ఒప్పంద ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే అవకాశం లేదన్న ప్రభుత్వ సంకేతాలతో వారు ఆందోళన బాట పడుతున్నారు. 
క్రమబద్ధీకరించలేమంటూ చేతులెత్తేసిన సర్కారు
కాంట్రాక్ట్ వ్యవస్థ అంటూ ఉండదని, తాము అధికారంలోకి వస్తే ఒప్పంద ఉద్యోగులందరిని క్రమబద్ధీకరిస్తామని చెప్పిన కేసీఆర్‌.. తీరా ఇప్పుడు కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకుండా వారిని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎస్‌ నుంచి సమాచారం అందుకున్న సదరు ఉద్యోగులు ఆయోమయంలో పడ్డారు. మొత్తం 52 కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బందిని...  క్రమబద్ధీకరించలేమంటూ సర్కారు చేతులెత్తేసింది. ఇంతకాలం గంపెడాశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులు సర్కార్‌ నిర్ణయంతో లబోదిబోమంటున్నారు. 
ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు
తెలంగాణ పర్యాటక శాఖలో 222 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో దాదాపు 150 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణం, విత్తనాభివృద్ధి, ఖనిజాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థలతో పాటు మొత్తం 52 కార్పొరేషన్లలోని కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ లేనట్టేనని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. దీంతో సదరు సంస్థల్లో పనిచేస్తోన్న సుమారు 3 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. 
సీఎం ఆదేశాలు బేఖాతరు
క్రమబద్ధీకరణ విషయంలో కొన్ని శాఖల్లో సీఎం ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 25 నాటికి కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను పూర్తిగా సేకరించాలంటూ సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ను ఆదేశించారు. సీఎస్‌ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో వివరాలను అందించకుండా సీఎం ఆదేశాలను సైతం బేఖాతర్‌ చేశారన్న వాదన వినిపిస్తోంది. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నాన్చివేత ధోరణిని అవలంభిస్తున్నదని కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు విమర్శస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

19:46 - June 12, 2016

మహబూబ్ నగర్ : మిషన్‌ కాకతీయ రెండో విడత పనుల్ని వేగంగా పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామని ఎంపి జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని అడ్డాకుల మండలం పొన్నకల్‌, పోల్కంపల్లి గ్రామాల్లో మిషన్‌ కాకతీయ పనుల్ని ఆయన ప్రారంభించారు. రెండు కోట్ల రూపాయల నిధులతో ఈ పనుల్ని చేస్తున్నామని ప్రకటించారు.

19:38 - June 12, 2016

రంగారెడ్డి : తెలంగాణ పోలీసులపై మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ప్రశంసలు కురిపించారు. సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతున్నారని అభినందించారు. అడిగిన వెంటనే భారీగా నిధులు ఇచ్చారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేట్‌బషీర్‌బాగ్‌లో అత్యాధునిక పోలీస్‌ స్టేషన్‌ కొత్త భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్‌ కమిషనర్‌ ఆనంద్‌కూడా హాజరయ్యారు.

టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ లో గందరగోళం

కృష్ణా : ఉయ్యూరు విశ్వశాంతి భవన్ లో టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ లో గందరగోళం ఏర్పడింది. జిల్లాలోని మొత్తం ఖాళీలు చూపించడం లేదని ఆందోళన చేశారు. నిబంధనల మేరకే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీఈవో చెబుతున్నారు. 

కాశ్మీర్ లో పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు

కాశ్మీర్ : అనంత్ నాగ్ లో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. 

18:50 - June 12, 2016

అమెరికా : సెంటినరీ.. కోపా అమెరికా కప్ ఫుట్ బాల్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు ఆతిథ్య అమెరికా చేరుకొంది. గ్రూప్- ఏ ఆఖరిరౌండ్ పోటీల్లో అమెరికా విజేతగా నిలిస్తే...కొలంబియాకు మాత్రం కోస్టారికా షాకిచ్చింది. పరాగ్వే, కోస్టారికా జట్ల పోటీ...గ్రూప్ లీగ్ దశలోనే ముగిసింది.
సత్తా చాచిన అమెరికా 
2016 కోపా అమెరికా కప్ ఫుట్ బాల్ గ్రూప్- ఏ లీగ్ దశ పోటీల్లో ఆతిథ్య అమెరికా సత్తా చాటుకొంది. అమెరికా, పరాగ్వే, కోస్టారికా, కొలంబియా జట్లతో కూడిన గ్రూప్ -ఏ లీగ్ లో...అమెరికా ఆఖరిరౌండ్ విజయంతో..గ్రూప్ టాపర్ గా నిలిచింది. ఫిలడెల్ఫియా వేదికగా ముగిసిన ఆఖరిరౌండ్ పోటీలో అమెరికా ఒకే ఒక్క గోల్ తో పరాగ్వేను అధిగమించడం ద్వారా...క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో చోటు ఖాయ చేసుకొంది. విజయానికి అవసరమైన ఈ గోల్ ను అమెరికా స్టార్ ప్లేయర్ క్లింట్ డింప్సే సాధించాడు. అంతర్జాతీయసాకర్ లో డింప్సేకు ఇది 51వ గోల్ కావడం విశేషం.
కొలంబియాపై కోస్టారికా విజయం
ఇదే గ్రూపులో భాగంగా జరిగిన మరో ఆఖరి రౌండ్ పోటీలో...కోస్టారికా 3-2 గోల్స్ తో కొలంబియాపై సంచలన విజయం సాధించింది. ఆట మొదటిభాగానికే 1-0 ఆధిక్యం సంపాదించిన కోస్టారికా..రెండోభాగంలో మరో రెండుగోల్స్ సాధించి..ఆధిక్యాన్ని మూడు గోల్స్ కు పెంచుకొంది. అయితే...కొలంబియా ఆట రెండోభాగంలో ఎదురుదాడులతో గోల్ వెంట గోల్ సాధించినా...మ్యాచ్ ను డ్రాగా ముగించలేకపోయింది.
కొలంబియాకు ఇదే తొలి ఓటమి
మొత్తం మూడురౌండ్లలో కొలంబియాకు ఇదే తొలిఓటమి. ఈ పరాజయంతో టేబుల్ టాపర్ గా ఉన్న కొలంబియా రెండోస్థానానికి పడిపోయింది. గ్రూప్-ఏ నుంచి అమెరికా, కొలంబియాజట్లు క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోగా....పరాగ్వే, కోస్టారికా జట్లు మాత్రం లీగ్ దశ నుంచే  ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

18:43 - June 12, 2016

గుంటూరు : అందరికీ ఆనందాన్ని పంచుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు..అనుకరణతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.. మిమిక్రీలో తనదైనా ముద్ర వేసుకుని గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నాడు గుంటూరు యువకుడు. మిమిక్రీ కళతో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతని గురించి తెలుసుకుందాం. 
ఎనిమిదో తరగతి నుంచే అనుకరణ
గుంటూరు నగరానికి చెందిన కృష్ణం రాజు  ఎనిమిదో తరగతి నుంచే వివిధ రకాల గొంతులను అనుకరించి సహ విద్యార్థులను ఆనందింప చేసేవాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పూర్తిస్థాయిలో మిమిక్రీ కళాకారునిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించాడు. విశిష్ట పురస్కారాలు, బిరుదులు అందుకుని కృష్ణంరాజు తనకంటూ  ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్‌ గ్లోబల్‌ పీస్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌ను కూడా పొందారు. మిమిక్రి కళలో డాక్టరేట్‌ అందుకున్న వారిలో కాసుల రెండో వ్యక్తి.
ప్రముఖులను అనుకరిస్తూ  ఆకట్టుకుంటున్న కృష్ణంరాజు
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు ఎంఆర్‌ ప్రసాద్‌ శిష్యుడిగా 25 సంవత్సరాలుగా దేశ, విదేశాల్లో 12 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అనేక రివార్డులు, అవార్డులు అందుకున్నారు. ప్రముఖులను అనుకరిస్తూ చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరినీ ఆకట్టుకున్నారు. మిమిక్రీతో సమాజంలో మంచి, చెడుల గురించి అవగాహన కల్పించేవారు. ఈవెంట్‌ మేనేజర్‌గా కూడా ఎదిగారు. అయితే మిమిక్రీ కళ ద్వారా ప్రజలను చైతన్య పరచవచ్చని..ప్రజల్లో  దీనికి ఆదరణ ఎక్కువేనని కృష్ణంరాజు అంటున్నారు. తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆకాంక్షతో కృష్ణంరాజు పది మంది యువకులకు మిమిక్రీ కళలో తర్ఫీదునిచ్చారు. కేకే తరంగిణి పేరుతో ఈవెంట్స్‌ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 

18:39 - June 12, 2016

హైదరాబాద్‌ : నగరాన్ని విశ్వన‌గ‌రంగా తీర్చిదిద్దుతాం......  డ‌ల్లాస్‌లా డెవ‌ల‌ప్ చేస్తాం.....  ఒల్డ్ సిటీని ఇస్తాంబుల్‌గా మారుస్తాం....  ఇవి ప్రభుత్వం తరచుగా చెప్పే మాటలు..  మాటలు కోటలు దాటాయి కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. నగర అభివృద్ధికి దిక్సూచి లాంటి జీహెచ్‌ఎంసీకి కేటాయించాల్సిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోతలు పెడుతోంది.  
హైదరాబాద్‌పై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. నగ‌రాన్ని విశ్వన‌గ‌రంగా చేయడానికి  ప‌లు చర్యలు చేప‌డుతున్నట్లు  ప్రక‌టించింది. హుస్సేన్ సాగ‌ర్ ను శుద్ధి చేయడం ద‌గ్గర్నుంచి, స్కైవేస్, ప్లైఓవ‌ర్ల వ‌ర‌కు అన్ని ర‌కాల అభివృద్ది ప‌నులు చేస్తామంటూ ప్రకటనలపై ప్రకటనలు చేసింది. అయితే వాటి పురోగ‌తిలో మాత్రం మూడు అడుగులు ముందుకు నాలుగ‌డుగులు వెన‌క్కి అన్నచందంగా త‌య‌రైంది.
జీహెచ్‌ఎంసీకి అవసరమైన బడ్జెట్‌ రూ. 2819 కోట్లు
2015 -16  ఆర్థిక సంవ‌త్సరం  జిహెచ్ఎంసి  2819కోట్లు  త‌మ‌కు అవ‌స‌ర‌మంటూ ప్రభుత్వానికి  విన్నవించుకుంటే  అన్ని కేటాయింపులు క‌లిపి కేవలం 628 కోట్లను మాత్రమే విడుదల చేసింది. రివైడ్ బడ్జెట్‌లోనూ భారీగా కోతలు పెట్టంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బల్దియాకి 2011-12 బ‌డ్జెట్‌లో 85కోట్లు, 2012-13లో 87కోట్లు, 2013-14 లో 215కోట్లు.... 2014 - 15లో 254 కోట్ల రూపాయలు రాగా.. 2015 -16 లో మాత్రం  కేవ‌లం 11కోట్ల 84ల‌క్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.  
బల్దియాకు నిధుల్లో కోత దారుణం- సీపీఎం 
గ్రేటర్‌ కార్పొరేష‌న్‌కు  రాష్ట్ర ప్రభుత్వం నుంచి  కోట్ల రూపాయ‌ల నిధులు రావాల్సి ఉంది. ఇలా బల్దియాకి రావాల్సిన ప్రతి కేటాయింపులోనూ ప్రభుత్వం భారీగా నిధుల కోత పెడుతోంది.  ప్రస్తుతం న‌గ‌రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ భ‌వ‌నాల‌పై ఆస్తి ప‌న్ను  100కోట్లకు  పైగా రావాలి. అయితే  ప్రతి ఏటా 20కోట్లు ఇస్తున్న ప్రభుత్వం... ఈ ఏడాది ఒక్కరూపాయి కూడా విడుద‌ల‌ చేయలేదు. ఇక ఇస్తామ‌న్న నిధుల మాట అటుంచితే  జిహెచ్ఎంసి నిధులను ఇత‌ర విభాగాల‌కు మ‌ళ్లించింది. మౌలిక స‌దుపాయ‌ల క‌ల్పన‌కు కోసం  ఖ‌ర్చుచేయాల్సిన లోక‌ల్ బాడి నిధుల‌ను 250కోట్లు  ఆర్టీసీకి ఇవ్వాల‌ని ఆర్డర్‌ జారీ చేసింది.  కేంద్రం ప్రక‌టించిన స్మార్ట్ సిటి త‌మ‌కు వ‌ద్దంటూ అక్కడి నుంచి రావాల్సిన నిధుల‌కు కూడా అడ్డుకట్టవేసింద‌ని మండిప‌డుతున్నారు సిటిలీడ‌ర్స్. ప్రజలపై పన్నుల భారం పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. గ్రేట‌ర్ కార్పొరేషన్ ప‌రిస్థితుల్లో మార్పు రాకుంటే  1995 నాటి ప‌రిస్థితులు పునారావృతం అవుతాయని  ఉద్యోగులు వేత‌నాల‌కోసం వారాల‌త‌ర‌బ‌డి ఎదురు చూడక తప్పని పరిస్థితులు రానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

అమెరికాలో ఉన్మాది వీరంగం...

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. ఓర్లాండ్ లోని గే నైట్ క్లబ్ లో ఉన్మాది కాల్పులు జరిపాడు.  ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. 

 

17:17 - June 12, 2016

హైదరాబాద్ : శ్రమనుబట్టి గౌరవించాలని.. కులాన్ని బట్టి కాదని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అభిప్రాయపడ్డారు. కెవిపిఎస్, టిపిఎస్ కె ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 'శ్రమ గౌరవమా? కుల గౌరవమా?' అన్న అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. 

 

17:02 - June 12, 2016

విజయవాడ : కాపు రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించాలని  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. తుని ఘటనలపై రాజకీయ పార్టీగా తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. వీటికి టీడీపీ నాయకులు ఎంతవరకు బాధ్యులో తేలాలంటే సిబిఐ జరిపించాని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది బాబేనని మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హమీలు నెరవేర్చి ఉంటే  సమస్య ఇంతవరకు వచ్చేదికాదన్నారు. 

 

16:51 - June 12, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని ఆనంద్ హోటల్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు వెళ్తున్న వీహెచ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్ టౌన్ పీఎస్ కు తరలించారు. ముద్రగడను కలవనీయకుండా నిలువరించడంతో వీహెచ్ నిరసన తెలిపారు. 

పోలీసుల అదుపులో వీహెచ్

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని ఆనంద్ హోటల్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు వెళ్తున్న వీహెచ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్ టౌన్ పీఎస్ కు తరలించారు. ముద్రగడను కలవనీయకుండా నిలువరించడంతో వీహెచ్ నిరసన తెలిపారు. 

15:29 - June 12, 2016

ఢిల్లీ : ఆస్ట్రేలియన్ మాస్టర్స్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ ను ..భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ గెలుచుకొంది. సిడ్నీ ఇండోర్ స్టేడియంలో ముగిసిన ఫైనల్లో 12వ ర్యాంక్ చైనా ప్లేయర్  సున్ యూ ను మూడుగేమ్ ల సమరంలో సైనా అధిగమించింది. గంటన్నరపాటు సాగిన ఈ పోరులో తొలిగేమ్ ను 11-21తో చేజార్చుకొన్న సైనా..రెండో గేమ్ లో దూకుడు పెంచింది. 21-14తో గేమ్ నెగ్గి 1-1తో సమఉజ్జీగా నిలిచింది. నిర్ణయాత్మక ఆఖరిగేమ్ లో పోటీ నీకొకపాయింట్, నాకొక పాయింట్ అన్నట్లుగా సాగింది. అయితే సైనా కీలకపాయింట్లు సాధించి..టైటిల్ విజేతగా నిలిచింది.ఇప్పటికే ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ నెగ్గిన సైనా..మాస్టర్స్ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి.అంతేకాదు..2016 సీజన్లో సైనాకు ఇదే తొలి మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం.

 

15:26 - June 12, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో 72లక్షల విలువచేసే 1060 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురితో పాటు తెలంగాణలోని మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముగ్గుర్ని కలిపి మొత్తం 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు రెండు లారీలు, ఒక రిట్జ్ కారు, ఒక మోటార్‌ బైక్‌, 25వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

 

15:22 - June 12, 2016

హైదరాబాద్ : కసబ్‌ కంటే ఘోరంగా ముద్రగడ పద్మనాభంను ప్రభుత్వం ట్రీట్‌ చేస్తోందని.. మనం అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా... లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంస్‌వోలు వెంటనే సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధిరించాలని.. లేదంటే ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్రగడను పరామర్శించడానికి వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.   

 

15:13 - June 12, 2016

విశాఖ : కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూల్‌లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో పాఠశాలల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిటినెస్‌ లేని స్కూల్ బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బస్సుల ఫిటినెస్‌పై ఆర్టీఏ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. కచ్చితంగా  ప్రైవేట్ స్కూళ్లు నియమ, నిబంధనలు పాటించాలన్నారు. అనుమతి లేని పాఠశాలలను వెంటనే మూసివేయాలని హెచ్చరించారు. అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఒకే యూనిఫాం ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నామని గంటా తెలిపారు. 

 

15:04 - June 12, 2016

రాజమండ్రి : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీబావం ప్రకటించేందుకు రాజమండ్రి చేరుకున్న కాంగ్రెస్‌ సీనియర్ నేత వీ.హనుమంతరావును పోలీసులు ఓ హోటల్‌లో నిర్భందించారు. దీనిపై స్పందిస్తూ..తక్షణమే ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని వీహెచ్‌ డిమాండ్ చేసారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమంపై స్పందించాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు ప్రభుత్వం అభద్రతా భావంతోనే ముద్రగడ దీక్షను భగ్నం చేసిందని అన్నారు. 

 

14:59 - June 12, 2016

హైదరాబాద్ : రేపు చలో హైకోర్టుకు తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఏపీ న్యాయమూర్తుల కేటాయింపును నిరసిస్తూ రేపు చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. చలో హైకోర్టుకు అడ్డుకుంటే ఆంధ్రా న్యాయమూర్తులకు ప్రభుత్వం సకహకరిస్తున్నట్లే అవుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్ అసోసియేషన్ అధ్యక్షడు జితేందర్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ న్యాయవాదులు తలపెట్టిన చలో హైకోర్టుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంక్షల నేపథ్యంలో రేపు ఎవరూ హైకోర్టుకు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. చలో హైకోర్టు పిలుపుతో ఖమ్మం, ఇల్లందు, మధిర, సత్తుపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న 30 మంది న్యాయమూర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

14:55 - June 12, 2016

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పులు కలకలం రేపాయి. నైట్ క్లబ్ లో ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 20 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆగంతుకుడి కోసం ఆర్లెండో పోలీసులు గాలిస్తున్నారు. 

 

ఆస్ట్రేలియన్ మాస్టర్స్ విజేత సైనా నెహ్వాల్

ఢిల్లీ : 2016 సీజన్ లో సైనా నెహ్వాల్ కు తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ మాస్టర్స్ విజేత సైనా నెహ్వాల్. ఫైనల్ లో సున్ యూ పై సైనా మూడు గేమ్ ల విజయం సాధించింది. 11-21-14, 21-18తో సైనా నెగ్గింది. 

 

అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పులు కలకలం

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పులు కలకలం రేపాయి. నైట్ క్లబ్ లో దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పలువురు గాయపడ్డారు. 

మధిరలో రైల్లో చోరీ..

ఖమ్మం : జిల్లా మధిర (మం) తొండలగోపవరం వద్ద భగత్ కి కోఠి - మన్నార్ గుడి ఎక్స్ ప్రెస్ రైల్లో చోరీ జరిగింది. మహిళ నుండి బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. 

కార్గొ టెర్మినల్ లో అగ్నిప్రమాదం..

కువైట్ : అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. 

నేడు టీపీసీసీ కార్యవర్గం భేటీ..

హైదరాబాద్ : నేడు టీపీసీసీ కార్యవర్గం సమావేశమవుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు తదితర నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీలోని ఇటీవలి పరిణామాలు, క్రమశిక్షణపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. 

ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం..

ఆదిలాబాద్ : జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారం గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుది. ఈ ప్రమాదంలో ఇద్దరు గుంటూరు జిల్లా వాసులు మృతిచెందారు. 

విశాఖలో 140 గుర్తింపు లేని పాఠశాలలు - మంత్రి గంటా...

విశాఖపట్టణం : జిల్లా వ్యాప్తంగా 140 గుర్తింపులేని పాఠశాలలున్నాయని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేట్‌ స్కూల్స్ యాజమాన్యాలతో మంత్రి గంటా, కలెక్టర్‌ యువరాజ్‌, కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌, విద్యాహక్కు చట్టం అమలుపై చర్చించారు. 

13:29 - June 12, 2016

నెల్లూరు : ప్రేమకు హద్దులు, ఎల్లలు లేవంటూ నిరూపించింది ఓ ప్రేమ జంట. నెల్లూరుకు చెందిన అబ్బాయి..అమెరికాకు చెందిన అమ్మాయి ప్రేమించి పెద్దలను ఒప్పంచి మరీ పెళ్లి చేసుకున్నారు. అమెరికాకు చెందిన శారా ఎలిజబెత్ మేరీ లీజర్, నెల్లూరు బట్వాడిపాలెంకు చెందిన ఎగుదాల శశాంత్ కుమార్‌ల వివాహం నెల్లూరులోని ప్రముఖ చర్చిలో క్రైస్తవ వివాహ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. వారి పెళ్లి విశేషాలు వీడియోలో చూడండి.

13:23 - June 12, 2016

హైదరాబాద్ : ఫ్రూటీని సరైన పద్దతుల్లో నిల్వ చేయకపోవడంవల్లనే ఫ్రూటీలో బ్యాక్టీరియా చేరి ఉంటుందని బాధిత పిల్లల తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఇం జన్ బౌలిలో నివాసం ఉండే ఓ మహ్మద్ అబ్దుల్ అజీం తన ముగ్గురు పిల్లలకు శనివారం రాత్రి ఫ్రూటీ జ్యూస్ తీసుకొచ్చాడు. ఇవి తాగిన ఫర్హా, ఫైజాన్, అర్హాన్ లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టెన్ టివితో అజీం మాట్లాడారు. జ్యూస్ తాగిన వెంటనే 15నిమిషాల తేడా వ్యవధిలో ముగ్గురు పిల్లలు వాంతులు చేసుకున్నారని..ఆ వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చానని తెలిపారు.
కాలాపత్తర్ పోలీసులు వెంటనే స్పందించారు. కాలాపత్తర్‌లో ఫ్రూటీ జ్యూస్‌ శాంపిళ్లను పోలీసులు సేకరిస్తున్నారు. కాలాపత్తర్‌లో ఉన్న అన్ని షాపుల్లో తనిఖీలు చేసి ఫ్రూటీ పౌచ్‌లన్నింటిని స్వాధీనం చేసుకొని వాటిని సీజ్‌ చేశారు. సీజ్ చేసిన శాంపిళ్లను పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. అయితే ఫ్రూటీ జ్యూస్ తాగడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయనేది ఇన్విస్టిగేషన్‌లో తేలుతుందని కాలాపత్తర్‌ పీఎస్‌కు చెందిన పోలీసులు చెప్తున్నారు. 

13:18 - June 12, 2016

హైదరాబాద్: మరోసారి దాసరి నారాయణ రావు వార్తల్లో నిలిచారు. సినీ పరిశ్రమపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్కు..మొహం తెలియని వారికి పద్మ శ్రీ అవార్డులు ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ మా ఆధ్వర్యంలో సినీనటులు జమున, కైకాల సత్యనారాయణలకు సన్మానం చేశారు. ఈ సందర్బంగా దర్శక రత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతూ..అనామకులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎస్వీ రంగారావు, సావిత్రి, జమున, కైకాల వంటి వారు ఏం పాపం చేశారని దాసరి తెలిపారు. జమున మాట్లాడుతూ...మా ఆధ్వర్యంలో తనకు సన్మానం జరగడం జీవితంలో మర్చిపోలేనిదని ఆమె అన్నారు. రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోని మూవీ ఆర్డిస్ట్ అసోసియేషన్‌ బాగా పనిచేస్తోందని ఆమె అన్నారు. ప్రస్తుతం సీనియర్ నటులకు గౌరవం దక్కడంలేదని కైకాల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:10 - June 12, 2016

వరంగల్ : ప్రస్తుతం సమాజంలో ప్రశ్నించే హక్కు కోల్పోతున్నామా ? ప్రశ్నిస్తే దాడులు..నిర్భందం చేస్తారా ? తాజాగా జరిగిన ఓ ఘటన పేదలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు నిరూపితమవుతోంది. జిల్లాలోని ఓ ప్రాంతంలో ఎమ్మెల్యే కొండా సురేఖ..ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావులు పర్యటించారు. 16 సంవత్సరాలుగా ఉంటున్న తమకు పట్టాలివ్వాలని..ఆదుకోవాలని వారిని కోరారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ పది మందిని ఇంతేజార్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పీఎస్ లో నిర్భదించారు. నిర్భందించిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు కోండేటి శ్రీధర్, సారయ్య, లెఫ్ట్ నేతలు వారిని పరామర్శించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. కేవలం కౌన్సెలింగ్ కోసమే ఇక్కడకు తీసుకొచ్చామని పోలీసులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. విమర్శలు మరి ఎక్కువ కాకముందే వారిని విడుదల చేస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి హరీష్..

కరీంనగర్ : రైతులకు, వినియోగదారులకు లాభం చేకూర్చాలన్నదే రైతు బజార్ ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైతుబజార్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయానికి మంత్రి ఈటెలతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు రావాలి, వినియోగదారులకు తాజా కూరగాయలు అందించాలనేదే రైతు బజారు ఉద్దేశ్యమన్నారు. 

ప్రజల ఆశీస్సులతోనే అధికారం - మంత్రి ఈటెల..

కరీంనగర్ : ప్రజల ఆశీస్సులతో తమ టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతుబజార్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయానికి మంత్రి హరీష్‌రావుతో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు.

 

ముద్రగడ అంటే బాబుకు భయం - వీహెచ్..

రాజమండ్రి : కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం అంటే సీఎం చంద్రబాబుకు ఎంతో భయం వేస్తోందని కాంగ్రెస్ నేత వీ హెచ్ వ్యాఖ్యానించారు. ముద్రగడను వేరే ఎవ్వరితోనో తిట్టిపించడం లేదని, వాళ్ల సామాజిక వర్గం వాళ్లతో, కాపులతోనే తిట్టిపిస్తున్నారని తెలిపారు. 

12:51 - June 12, 2016

తెలుగు సాహిత్యంలో అట్టగు వర్గాల గొంతు వినిపిస్తోంది. అస్తిత్వ సాహిత్యమై చారిత్రక విద్రోహాలను ప్రశ్నిస్తోంది. ఒకప్పుడు రాజుల ఆస్థానాలకు పరిమితమైన సాహిత్యం నేడు దళిత బహుజనుల ధిక్కారస్వర భాస్వరమై ప్రకాశిస్తోంది. వెయ్యేళ్ళ తెలుగు సాహితీ చరిత్రను పరిశీలిస్తే అందులో దళిత బహుజనుల సృజనకారులకు చోటు లేదు. అందుకే వారి చరిత్రలు మరుగున పడిపోయాయి. వారి పూర్వీకులు ఎలా జీవించారో వారి సంస్కృతి ఏమిటో తెలియడంలేదు. అయితే ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన పెనుమార్పుల నేపథ్యంలో ఇవాళ అన్ని వర్గాల కవులు రచనలు చేస్తున్నారు. అలాంటి వారిలో వెనుకబడిన వర్గానికి చెందిన వనపట్ల సుబ్బయ్య ఒకరు. ఆయన వొల్లెడ, మశాల్ లాంటి కావ్యాలు రాశాడు. తన ధిక్కార స్వరం వినిపించాడు. ప్రముఖ కవి వనపట్ల సుబ్బమయ్య సాహిత్యాన్ని ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:46 - June 12, 2016

గోదావరి నదీపరీవాహక ప్రాంతంలో అనాదిగా ఆదివాసీలు నివసిస్తున్నారు. వారి కళలు సంస్కృతి, జీవన విధానం అన్నీ నదిపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంపై పరిశోధనలు చేసి 'వెన్ గోదావరీ కమ్స్' అన్న పుస్తకాన్ని వెలువరించారు ఉమామహేశ్వరి. ఆదివాసీల హృదయలయల అలల గలగలలు వినిపించే గోదావరినది చరిత్రకు అక్షరరూపమిచ్చారామె. ప్రముఖ రచయిత్రి పరిశోధకురాలు ఉమామహేశ్వరి ఎంతో శ్రమించి రాసిన వెన్ గోదావరి కమ్స్ పుస్తకం పై ప్రత్యేక కథనం. ఆదివాసీల జీవనవేదం వినిపిస్తోన్న గోదావరినది చరిత్రను గ్రంథస్థం చేసిన ఉమామహేశ్వరి ప్రత్యేక కథనం చూడాలన్నా..వినాలన్నా వీడియో క్లిక్ చేయండి. 

వెయ్యి కిలోల గంజాయి..

తూర్పుగోదావరి : జిల్లా మారేడుమిల్లి శివారు వేటుకూరు జంక్షన్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 1,060 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

ప్రైవేటు పాఠశాలలను ప్రక్షాళిస్తాం - మంత్రి గంటా..

విశాఖపట్టణం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలను ప్రక్షాళిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. విద్యా హక్కు చట్టం అమలు..విద్యాబోధనలో నాణ్యత..పాఠశాలల బస్సు సామర్థ్యం వంటి అంశాలపై చర్చించారు. 

దక్షిణాఫ్రికాలో ఘోర అగ్నిప్రమాదం..

దక్షిణాఫ్రికా : కేప్ టౌన్ నగరంలోని మిషెల్స్ ప్లీన్ టౌన్ షిప్ లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది సజీవదహనమయ్యారు. 

12:28 - June 12, 2016

చిత్తూరు : నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకం కానుందని విశ్వ విద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య అభిప్రాయపడింది. ఏపీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న టైం స్కేల్‌, డైలీవేజ్‌, కన్సాలిడేట్‌ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని యూనివర్సిటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మహాసభ డిమాండ్‌ చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన యూనియన్‌ 4వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పదవ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు డిమాండ్‌ చేశారు. ప్రైవేటు, విదేశీ వర్సిటీల వల్ల విద్యార్థి లోకానికి తీవ్ర నష్టమని, వాటిని అనుమతించేది లేదని పలువురు వక్తలు స్పష్టం చేశారు. అత్యధిక కళాశాలలున్న రాష్ట్రాలలో ఏపీ రెండో స్థానంలో ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 

12:24 - June 12, 2016

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంకా దీక్ష చేస్తూనే ఉన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆయన గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన మరోసారి దీక్షకు కూర్చొన్నారు. పోలీసులు దీక్షను భగ్నం చేసిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ నాలుగు రోజుల నుండి ముద్రగడ దీక్షలోనే కొనసాగుతున్నారు. ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష ప్రారంభించి నాలుగో రోజు కావడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. నాలుగు రోజులుగా మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో ముద్రగడ బీపీ, షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. ముద్రగడతో పాటు దీక్ష చేస్తున్న ఆయన భార్య, కోడలు ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు బలవంతంగా సెలైన్లు ఎక్కిస్తున్నారు. మరోవైపు ముద్రగడను పరామర్శించేందుకు వీహెచ్‌ రాజమండ్రికి వచ్చారు. అయితే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటిలాగనే పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారని, బాగానే ఉన్నానని ముద్రగడ తెలియచేస్తున్నారని వైద్యులు మీడియాకు తెలిపారు. ముద్రగడ సతీమణి, కోడలు క్షీణించారని, వీరి పరిస్థితి తెలియచేయడం జరిగిందన్నారు. అనంతరం వారికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 

12:21 - June 12, 2016

హైదరాబాద్ : పాతబస్తీ కాలాపత్తర్‌లో ఫ్రూటీ జ్యూస్‌ శాంపిళ్లను పోలీసులు సేకరిస్తున్నారు. కాలాపత్తర్‌లో ఉన్న అన్ని షాపుల్లో తనిఖీలు చేసి ఫ్రూటీ పౌచ్‌లన్నింటిని స్వాధీనం చేసుకొని వాటిని సీజ్‌ చేశారు. సీజ్ చేసిన శాంపిళ్లను పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. అయితే ఫ్రూటీ జ్యూస్ తాగడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయనేది ఇన్విస్టిగేషన్‌లో తేలుతుందని కాలాపత్తర్‌ పీఎస్‌కు చెందిన పోలీసులు చెప్తున్నారు. మహ్మద్ అజీం అనే వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఫ్రూటీ జ్యూస్ తాగడంతోనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నాడని సబ్ ఇన్స్ పెక్టర్ శ్రావణ్ టెన్ టివితో తెలిపారు. అనంతరం వెంటనే తాము రంగంలోకి దిగి ఫ్రూట్ షాప్ విక్రయించిన యజమానిని విచారించడం జరిగిందన్నారు. ఫ్రూట్ జ్యూస్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని శాంపిల్స్ లను లేబరేటరీకి పంపించినట్లు తెలిపారు. రిపోర్టు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఫ్రూట్ జ్యూస్ తాగి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారా ? లేక ఇతర కారణం ఉందా ? అనేది తెలాల్సి ఉంది. 

12:19 - June 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రిటైల్ పాలసీ ముసాయిదా రెడీ అయ్యింది. రిటైల్ దుకాణాలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు. ఇందుకోసం నోడల్ అధికారిని సైతం నియమించనున్నారు. రిటైల్ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు అధికారులు నిబంధనలను సరళతరం చేశారు. ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. రిటైల్ వర్తకులు అర్ధరాత్రి కూడా సరుకులను దిగుమతి చేసుకోవడంతో పాటు.. గోదాములను సైతం నిర్వహించుకునే వెసులుబాటును కల్పించారు. ఈ రంగంలో పనిచేసే మహిళలకూ సైతం నిబంధనలను సరళతరం చేశారు. సేవారంగంలో మాదిరిగా మహిళలు అర్థరాత్రులు పనిచేసేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. బడా పరిశ్రమల మాదిరిగానే సెల్ఫ్ సర్టిఫికేషన్ తో రిటైల్ అనుమతులు పొందే అవకాశం కల్పించారు.

ఆమోదం తెలపగానే ప్రయోగత్మకంగా అమలు..
రిటైల్ మార్కెట్ జోన్లు, కిడ్స్ ఎంటర్ టైన్‌మెంట్ జోన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గోదాముల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలు కొత్త రిటైల్ విధానంలో పొందు పరిచారు. ఆహారం, కూరగాయలు, పండ్లు వంటి వాటిని అత్యవసర వస్తువుల కేటగిరి కిందకు తెచ్చి... వాటి నిల్వలపై ఉన్న ఆంక్షలను ఎత్తేయనున్నారు. ఈ సరికొత్త రిటైల్ విధానాన్ని మంత్రి వర్గం ముందుంచేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మంత్రివర్గం ఆమోదం తెలపగానే ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయనున్నారు. ఈ నయా రిటైల్ పాలసీ, క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఎంతమేర ఉపయోగకరంగా ఉంటుందో వేచి చూడాలి.

12:17 - June 12, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ పేరు వినగానే చార్మినార్‌...ఇరానీ చాయ్‌... బిర్యానీ ఎలా గుర్తుకు వస్తాయో..అదే స్థాయిలో గుర్తుకువచ్చే అద్భుత వంటకం హలీం.... ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ప్రారంభం అవుతుండటంతో.. నగరంలో హలీం సెంటర్లు గుబాళిస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా.. హలీమ్‌ తయారీ కేంద్రాలు ప్రత్యేకంగా వెలిసి.. రుచికరంగా... సంతృప్తినిచ్చేలా హలీంను అందిస్తున్నాయి. కోరుకున్న వారికి కోరుకున్న రుచుల్లో హలీమ్‌ని అందిస్తున్నాయి... సిటీలోని ఫేమస్ హలీం తయారీ సంస్థలు.. హలీం తయారీలో వివిధ రకాల ఫ్లేవర్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. నాన్ వేజ్ లో మరిన్ని రకాలతో పాటు శాకాహరుల కోసం వెజ్ హలీంను కూడా అందిస్తున్నారు.

రుచికర దినుసుల సమ్మేళనం హలీం..
శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఈ హలీంలో లభించడంతో దీనిని ఆరగించేందుకు యువత సైతం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఖర్జూరం, ఎండు ద్రాక్ష, కిస్ మిస్ , జీడిపప్పు, బాదంపప్పువంటి దినుసులతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చేలా ఉండటంతో హలీమ్‌ అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మరీ ముఖ్యంగా డైటింగ్ ల పేరుతో నోరుకట్టేసుకునే యువత సైతం హలీం రుచులను ఎంచక్కా ఆస్వాదిస్తున్నారు.

సమైక్యతకు మారుపేరు హలీం..
హలీం ఇప్పుడు సమైక్యతకు మారుపేరుగా నిలుస్తుంది. ఉపవాసమాచరించే ముస్లింలే కాదు హిందువులు సైతం హలీం రుచులను కమ్మగా ఆరగిస్తున్నారు. అటు హలీం తయారీలో హిందువులు సైతం చేయి తిప్పుతున్నారు. ఇక ఆరగింపులో కూడా మొత్తం సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే లభించే ఈ హలీం ను హ్యాపీగా ఆస్వాదిస్తున్నారు.. చల్లగా వర్షం పడే సమయంలో వేడివేడి హలీం అస్వాదిస్తే ఆ టేస్ట్ ను మరువగలమా అంటున్నారు కొందరు.

హలీంకు అంతర్జాతీయఖ్యాతి..

ఇక ఒక్క హైదరాబాద్ లోనే కాక యావత్‌ ప్రపంచానికి రుచికరమైన హలీంను అందించేందుకు హలీం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ బ్రాండ్ హలీంను విదేశీయులకు రుచి చూపించేందుకు కొరియర్ సర్వీస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సింగపూర్... గల్ఫ్ కంట్రీస్‌లలో ఔట్ లెట్ ను కూడా ఏర్పాటు చేసింది హైదరాబాద్ పిస్తా హౌస్. ఇందుకు విమానయాన సంస్ధలు పోస్టల్ శాఖలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తం మీద.... ఎన్నో రుచులను రంగరించుకుని... రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉండే హలీమ్‌ రుచులను మీరు కూడా ఆరగించండి.

11:53 - June 12, 2016

రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ టీజర్ రికార్డులను సృష్టించింది. రజనీ నటనకు..ఆయన డైలాగ్స్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా ఆడియో ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూశారు. వారు ఎదురుచూసినట్లుగానే 'కబాలి' ఆడియో విడుదలైంది. అట్టహాసంగా కాకుండా సింపుల్ గా ఆడియో విడుదలైంది. దీనితో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని టాక్. రజనీకాంత్ అమెరికాలో ఉండడంతో ఆయన కుమార్తె సౌందర్యకు డిస్క్ ఇచ్చి ఆడియోను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శక..నిర్మాలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

అనామకులకు పద్మశ్రీ అవార్డులు - దాసరి..

హైదరాబాద్ : అనామకులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తోందని దర్శకుడు దాసరి నారాయణ రావు పేర్కొన్నారు. సినీ నటులు జమున, కైకాల సత్యనారాయణలకు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోని 'మా' అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా దర్శకుడు దాసరి నారాయణ రావు ప్రసంగించారు. అల్లు రామలింగయ్య..కైకాల సత్యనారాయణ లాంటి వారు ఏం పాపం చేశారని తెలిపారు. మా అసోసియేషన్ చక్కగా పనిచేస్తోందని జమున కితాబిచ్చారు. ప్రస్తుత సినీ పరిశ్రమలో సీనియర్ నటీనటులకు గౌరవం దక్కడం లేదని కైకాల వ్యాఖ్యానించారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం..

అలహాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. 

11:43 - June 12, 2016

ఐసీస్ ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు బ్రిటీష్ సైనికుల కొత్త ఎత్తుగడ...పోస్టులో గంగా జలం...క్రికెట్ లో ప్రాణాలు పోతున్నాయి..మోడీ మీద తెగ జోకులు పడుతున్నాయంట. సర్వీస్ టాక్స్ ఎక్కువైందని ఓ జోక్ వేశాడు..మథురలో గొడవలు జరుగుతుంటే ఎంపీ హేమమాలిని కొన్ని ట్వీట్స్ చేసింది.. టాలీవుడ్ లో నితిన్..సమంత జంటా నటించిన 'అ..ఆ' సినిమా విడుదలైంది. దీనిపై కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి..ఇలాంటి అంశాలు 'క్రేజీ న్యూస్' లో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

11:42 - June 12, 2016

తివిక్రమ్ సినిమా అనగానే ఎన్నో అంచనాలు ఏర్పడడం సహజం. కానీ ఇటీవల విడుదలైన 'అ..ఆ' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. నితిన్..సమంత జంటగా నటించారు. కానీ ఈ సినిమాపై కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ సినిమా గతంలో వచ్చిన 'మీనా' సినిమా అని పుకార్లు షికార్లు చేశాయి. అంతేగాకుండా యద్ధనపూడి రచనలో 'మీనా' అనే నవల కూడా వచ్చిందని వార్తలు వచ్చాయి. 'మీనా' ప్రభావంతో 'అ..ఈ' సినిమా తీశారని గాసిప్స్ వినిపించాయి. చివరకు తివిక్రమ్ దీనిపై స్పందించారు. థాంక్స్ కార్డులు వేయడం జరిగిందని..కానీ టెక్నికల్ వల్ల ప్రాబ్లమ్ తో ఇది రాలేదని ఇటీవల సక్సెస్ మీట్ లో తివిక్రమ్ పేర్కొన్నారు. అదండి సంగతి..

11:16 - June 12, 2016

అవునుండి క్రికెట్ ప్రాణాలు తీస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ పాండవ్ నగర్ లో సమీపంలో నివాసం ఉండే కొంతమంది క్రికెట్ ఆడుకుంటున్నారు. మధ్యలో వారి మధ్య చిన్న గొడవ చెలరేగింది. అనంతరం పెద్దవారు వచ్చి సర్దిచెప్పారు. కానీ రాత్రి మా పిల్లలను మీ పిల్లలను కొడుతారా అంటూ కొంతమంది దాడి చేశారు. ఓ వ్యక్తిని పొడిచి చంపేశారు. గల్లీ క్రికెట్ కు అంత సీన్ ఉందా ? అందుకే ఈ గల్లీ క్రికెట్ లో కూడా అంపైర్ పెట్టాలనే సెటైర్స్ వినిపిస్తున్నాయి. అలాగే యూపీలో అలీఘడ్ లో జేపీ ఎల్ చిన్న లీగ్ టోర్న మెంట్ నడిచింది. ఇందులో ఓ వ్యక్తి నో బాల్ వేశాడు. యంపైర్ నో బాల్ అని చెప్పడంతో అంపైర్ తో ఆ బౌలర్ గొడవకు దిగాడు. ఇది మనస్సులో పెట్టుకున్న ఆ బౌలర్ అంపైర్ కు ఉన్న నలుగురు చెళ్లెళ్లకు పురుగుల మందు ఇచ్చాడు. ఇది సేవించిన వారిలో ఒకరు మృతి చెందింది. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంట. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:11 - June 12, 2016

లిబియాలో బాలీవుడ్ పాటలు మారుమోగుతున్నాయి. అరే అక్కడివారికి హిందీ సాంగ్స్ పై మోజు పెరిగిందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ అది కాదు. ఐఎస్ ఉగ్రవాదులపై హిందీ పాటల తూటాలు పేల్చుతున్నారు. వీరిపై దాడి చేస్తున్న బ్రిటీస్ స్పెషల్ ఫోర్సెస్..పాక్ సంతతికి చెందిన ఓ ఇంటలిజెన్స్ ఆఫీసర్ సలహా మేరకు ఈ ఎత్తుగడ తీసుకున్నారంట. వారి ఉండే స్థావరాల వరకు రిమోట్ కారును పంపిస్తున్నారని, అనంతరం ఆ కారులో బాలీవుడ్ పాటలు వినిపిస్తున్నారంట. ఈ పాటలతో ఉగ్రవాదులు కంగారు పడి..కోపం..ఆక్రోషం వెళ్లగక్కుతున్నారంట. అనంతరం బయటకు వచ్చిన వారిపై బ్రిటీష్ వారు దాడులకు తెగపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగం అద్భుత ఫలితాన్ని తెలియచేస్తోందని టాక్. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు..

హైదరాబాద్ : కాసేపటి క్రితం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో తెలుగు విద్యార్థినికి నాలుగో ర్యాంకు వచ్చింది. మొదటి వంద ర్యాంకుల్లో 30 శాతం తెలుగు విద్యార్థులే కావడం విశేషం. 

10:49 - June 12, 2016

ఈ ఫొటో చూశారా ? ఇతను పవన్ కళ్యాణ్ నేనా అని ఆశ్చర్యపోతున్నారు.. ఇంత బొద్దుగా మారిపోయాడేంటీ ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' పరాజయం కావడంతో పవన్ ఆచితూచి అడుగేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం పవన్ పూర్తిగా లుక్ మార్చేశాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సింగపూర్ నుండి పవన్ ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోలు ప్రస్తుతం షికారు చేస్తున్నాయి. ఇందులో పవన్ లావుగా ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమాలో పాత్ర కోసమా ? అది ఏ చిత్రం కోసం అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సస్పెన్ష్ కు తెర పడాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు. 

10:43 - June 12, 2016

బాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ లో హావా కొనసాగుతోంది. ఇదే స్పూర్తిని ఇక్కడా కూడా కొనసాగించాలని కన్నడ నిర్మాణ ఇంద్రజిత్ లంకేష్ అనుకున్నారో ఏమో..కన్నడలోనూ ఓ బయోపికన్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ నటి 'షకీల' జీవితాన్ని తెరకెక్కించనున్నారు. షకీలాగా ఈ చిత్రంలో హుమా ఖురేషీ నటించనున్నట్లు ఇంద్రజిత్ తెలిపారు. షకీలా నిజజీవితంలో జరిగిన సంఘటనతో పాటు..సినిమా జీవితంలో అన్ని సంఘటనలను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మాలీవుడ్ లో షకీలా సినిమాలు విడుదల కాకుండా అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేశారని, అంతేగాకుండా దక్షిణాది సినిమాలపై షకీలా సినిమాలు విపరీతమైన ప్రభావాన్ని చూపాయన్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో డబ్బింగ్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మరి ఈ చిత్రం ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. 

యాదాద్రిలో భక్తుల రద్దీ..

నల్గొండ : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లలో భక్తులు భారీగా వేచి ఉన్నారు. దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 

భవనం నుండి దూకిన ఇంజనీరింగ్ విద్యార్థి..

కరీంనగర్: ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న అఖిల్ అనే ఓ విద్యార్థి భవనం పైనుంచి దూకాడు. ఈ ఘటన కరీంనగర్‌లో గల బోయవాడలో చోటు చేసుకుంది. భవనానికి ఆనుకుని ఉన్న రేకులపై పడటంతో అతనికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. 

సీబీఐకి కళాభవన్ మృతి కేసు..

కేరళ : అనుమానాస్పద స్థితిలో మరణించిన మళయాల నటుడు కళాభవన్ మణి కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేసు విచారణకు సీబీఐకి ఇవ్వాలని సిఫార్సు చేస్తూ, సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. 

ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల..

తూర్పుగోదావరి : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ముద్రగడ దీక్షను కొనసాగిస్తున్నారు. కాసేపటి క్రితం ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ముద్రగడ భార్య, కోడలు ఆరోగ్యం క్షీణించడంతో వారికి సైలెన్లు ఎక్కించినట్లు వైద్యులు వెల్లడించారు.

 

పోలీసుల అదుపులో వీహెచ్..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడను పరామర్శించేందుకు టి.కాంగ్రెస్ నేత వీహెచ్ రాజమండ్రికి వచ్చారు. దీనితో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో ముద్రగడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. 

బీఎస్ఎఫ్ అదుపులో పంజాబ్ లో పాక్ దేశస్తుడు..

పంజాబ్ : ఓ పాకిస్తాన్ దేశస్తుడిని బీఎస్ఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. భారత్ - పాక్ సరిహద్దులోని గురుదాస్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బీఎస్ఎఫ్ అదుపులో పంజాబ్ లో పాక్ దేశస్తుడు..

పంజాబ్ : ఓ పాకిస్తాన్ దేశస్తుడిని బీఎస్ఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. భారత్ - పాక్ సరిహద్దులోని గురుదాస్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:16 - June 12, 2016

నల్గొండ : చిన్న చిన్న ఘటనలు..అనుమానాలు..ఆవేశాలు..నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో అభం..శుభం తెలియని చిన్నారుల జీవితాలను కూడా మధ్యలోనే తుంచేస్తున్నారు. తాజాగా నల్గొండలో ఓ తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది. నల్గొండ జిల్లా భువనగిరి మండలం గౌస్ నగర్ లో శోభారాణి అనే వివాహిత నివాసం ఉంటోంది. శనివారం ఐదేళ్ల చిన్నారిని సంప్ లో పడేసి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఈమె ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐదు నెలల చిన్నారిని హత్య చేసే కసాయి తనం తల్లికి ఉండకపోవచ్చని..ఆత్మహత్యగా నిర్ధారించలేమని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శోభారాణికి ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ సమయంలో ఏడు లక్షల కట్నంలో రూ.50వేలు బకాయి ఉనట్లు వినికిడి. కాగా ఉమ్మడి కుటుంబంలో మమత ఉంటున్నట్లు..భర్త ఉద్యోగం మానేసి జులాయిగా తిరగడంతో పాటు మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. మరి ఆమె ఆత్మహత్య చేసుకుందా ? లేక ఎవరైనా చంపారా ? అనేది పోలీసుల విచారణ తేలనుంది. 

10:10 - June 12, 2016

చిత్తూరు : జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి పై కప్పు కూలడంతో అన్నా, చెల్లె మృతి చెందారు. ఈ ఘటన బైరెడ్డి మండలం నాసుకుప్పంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శోభారాణి, ఆమె సోదరుడు శనివారం రాత్రి నిద్రించారు. ఒక్కసారిగా వారు నిద్రిస్తున్న వరండా పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు. పాత ఇళ్లు కావడం..వరండా భాగంలో ఉన్న పై కప్పు ధృడంగా లేకపోవడంతో కూలిపోయిందని తెలుస్తోంది. కుటుంబసభ్యులు మీడియాను దగ్గరకు రానివ్వడం లేదు. దీనితో ఘటనకు స్పష్టమైన కారణాలు తెలియరావడం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కాసేపట్లో ముద్రగడ హెల్త్ బులిటెన్ విడుదల..

తూర్పుగోదావరి : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ దీక్ష కొనసాగుతోంది. కాసేపట్లో ముద్రగడ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేయనున్నారు.

 

కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలతో మంత్రి గంటా సమీక్ష..

విశాఖపట్టణం : కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహిస్తున్నారు. స్కూల్ ఫీజులు, బస్సుల సామర్థ్యం, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. 

09:26 - June 12, 2016

మెగాస్టార్ తనయుడు రాం చరణ్ తేజ 'ధృవ' కోసం బాగానే కష్టపడుతున్నాడు. తమిళలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' రీమెక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కొత్తగా కనిపించడం కోసం చెర్రీ కసరత్తులు చేస్తున్నాడంట. పూర్తిగా శాకాహారిగా మారిపోయాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్తి చేసుక్ను ఈ చిత్రం రెండో షెడ్యూల్ కోసం కాశ్మీర్ కు వెళుతుందంట. ఈ విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. పవర్ పుల్ పోలీసు ఆఫీసర్ గా రాంచరణ్ కనిపించబోతున్నారు. జంజీర్ తరువాత పోలీసు ఆఫీసర్ గా కనిపిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. బ్రూస్ లీ తరువాత రకూల్ ప్రీత్ సింగ్ మరోసారి చరణ్ సరసన నటిస్తోంది.

 

09:25 - June 12, 2016

సమంత..నాగ చైతన్యతో మళ్లీ జోడి కొట్టేందుకు సిద్ధమౌతోంది. 'పోలీసు'..'24'..'బ్రహ్మోత్సవం'..'అ..ఆ' వరుస సినిమాలతో సమంత హల్ చల్ చేసింది. తాజాగా మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'సొగ్గాడే చిన్ని నాయన' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. గతంలో సమంత...'ఏం మాయ చేశావో'..'ఆటోనగర్ సూర్య'..'మనం' వంటి చిత్రాల్లో నాగ చైతన్యతో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతూ 'సాహసం శ్వాసగా సాగిపో', 'ప్రేమమ్' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన 'జనతా గ్యారేజ్' చిత్రంలో సమంత నటిస్తోంది.

బంజారాహిల్స్ లో పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన ఈ డ్రైవ్ లో మందుబాబులు దొరికిపోయారు. తనిఖీల్లో 5 ద్విచక్ర వాహనాలు, పది కార్లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

09:09 - June 12, 2016

వాతావరణం మారిపోయింది. వానలు కురుస్తున్నాయి. అంతలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ప్రస్తుత పరిణామంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అనారోగ్యానికి గురవుతాం.
ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
బాదం, జీడిపప్పు, సోయా ఉత్పత్తులను ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
శరీర ఉష్ణోగ్రత తగ్గితే వైరస్ లు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించండి.
పచ్చి పండ్లు..కూరగాయాల్లో క్రీములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఉడకబెట్టని ఆహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచింది.
చెప్పులు లేకుండా, లేదా తడి చెప్పులతో నడవడం మంచిది కాదు.
తాజా ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రిజ్ నుండి తీసుకున్న వెంటనే తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

09:07 - June 12, 2016

సాధారణంగా మహిళలు అందరూ అందమైన మెరిసే జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే జుట్టును శుభ్రం చేసుకోవటం, ఆరబెట్టటం మరియు జుట్టు స్టైలింగ్ లో సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే సాధ్యం అవుతుంది. ఆరోగ్యకరమైన మెత్తటి జుట్టు కోసం కొన్ని చిట్కాలు..
గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. పడుకొనే సమయంలో మెత్తటి తలగడ వాడడం మంచిది.
గుడ్డు సహజ కండీషనర్ గా పనిచేస్తుంది. రెండు గుడ్ల సొన తీసుకుని జుట్టు, మాడుకు పట్టించి షవర్ క్యాప్ చుట్టేయాలి. అరగంట అనంతరం నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే అవిసెగింజల్ని ప్రతి రోజు రెండు చెంచాల చొప్పున తీసుకోవాలి. 

వేర్పాటు వాదుల హౌస్ అరెస్టు..

జమ్మూ కాశ్మీర్ : వేర్పాటు వాదుల నాయకులు గిలానీ, ఉమర్ ఫరూఖ్ లను పోలీసులు గృహ నిర్భందం చేశారు. నేడు వీరు సైనిక్ కాలనీ అంశంలో పర్యటించనున్న సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

08:40 - June 12, 2016

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించిన రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రవేశించలేదు. దీని ఫలితంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. ఈనెల 15వ తేదీ కల్లా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. మహబూబ్ నగర్, నవాబుపేట, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉపరితలద్రోణి కారణంగా రానున్న 48గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

08:36 - June 12, 2016

అలహాబాద్ : నేటి నుండి బీజేపీ కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ కార్యకర్తలు పూర్తి చేశారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కానున్నారు. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

08:31 - June 12, 2016

హైదరాబాద్ : పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. నగరంలోని ఫుట్ పాత్ లు..పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారం చేసుకుంటుంటారు. లంచం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు వేధింపులకు పాల్పడుతుంటారే వార్తలు వింటూనే ఉంటాం. తాజాగా ఓ వైన్స్ షాప్ ఎదుట ఇద్దరు కానిస్టేబుళ్లు హల్ చల్ చేశారు. చిరు వ్యాపారం నిర్వహిస్తున్న ఓ మహిళపై దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాకు చిక్కాయి. పీఎస్ లో బాధిత బంధువులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గోపి, సుధాకర్ లని తెలుస్తోంది. 

అలహాబాద్ లో వెలిసిన బీజేపీ పోస్టర్లు..

అలాహాబాద్ : కాసేపట్లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల్లో భారీ ఎత్తున్న పోస్టర్లు వెలిశాయి. 

08:17 - June 12, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ రైతులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడించారు. విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్షాలకు ఓ విజన్ అంటూ ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రైతులను తప్పుదోవ పట్టించి రాజకీయాలు చేస్తున్నాయని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు ఉన్న ధరకంటే మూడు రెట్ల పరిహారం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఇప్పటికే కొంతమంది రైతులు ఒప్పుకున్నారు. మరికొంత మంది రైతుల పరిహారానికి ఒప్పుకోలేదని, వీరిని విపక్షాలు రెచ్చకొడుతున్నాయని తెలిపారు. 

భువనగిరిలో విషాదం..

నల్గొండ : భువనగిరి మండలం గౌన్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో ఐదు నెలల చిన్నారిని నీటి సంపులో పడేసి తల్లి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

08:08 - June 12, 2016

హైదరాబాద్ : తండ్రి తీసుకొచ్చిన ఫ్రూటీ తాగి ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. ఇంజన్ బౌలిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు శనివారం రాత్రి ఫ్రూటీ జ్యూస్ తీసుకొచ్చాడు. ఇవి తాగిన ఫర్హా, ఫైజాన్, అర్హాన్ లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆబిడ్స్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు రంగంలోకి దిగి ఫ్రూటీని విక్రయించిన దుకాణంలో విచారించారు. అనంతరం ఫ్రూటీ గౌడౌన్ ను సీజ్ చేశారు. ఫ్రూటీ కంపెనీ నుండి ఇవి వచ్చాయా ? లేక కల్తీ చేశారా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. 

యూరో ఫుట్ బాల్ లో మ్యాచ్ లు...

ఢిల్లీ : నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు టర్కీ - క్రొయేషియా, రాత్రి 9.30 పోలాండ్ - నార్తర్నర్ ఐర్లాండ్..రాత్రి 12.30 గంటలకు జర్మనీ - ఉక్రెయిన్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. 

కొనసాగుతున్న ముద్రగడ దీక్ష..

విజయవాడ : కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగుతోంది. రాజమండ్రి ఆస్పత్రిలో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కారించేంత వరకు దీక్ష విరమించేది లేదంటూ వైద్యానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలో ముద్రగడ, ఆయన భార్య, కోడలు దీక్ష కొనసాగిస్తున్నారు.

 

అలహాబాద్ లో నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ..

ఢిల్లీ : నేటి నుండి అలహాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు.

 

ఇంటి పై కప్పు కూలి అన్నా చెళ్లెలు మృతి..

చిత్తూరు : బైరెడ్డిపల్లి మండలం నాసుకుప్పంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పై కప్పు కూలి అన్నా, చెల్లెలు మృతి చెందారు. 

ఫ్రూటీ తాగి చిన్నారులకు అస్వస్థత..

హైదరాబాద్ : పాతబస్తీలో ఫ్రూటీ తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్రూటీ సప్లై చేసిన గోడౌన్ ను సీజ్ చేశారు.  

పాక్ స్మగ్లర్ల హతం..

పంజాబ్ : రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ స్మగ్లర్లు హతమయ్యారు. వీరివద్ద 15 ప్యాకెట్ల హెరాయిన్..ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

 

నేడు ట్యాంక్ బండ్ పై కాపుల నిరసన..

హైదరాబాద్ : కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆలిండియా కాపు జేఏసీ నేతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ట్యాంక్‌‌బండ్‌పై శ్రీకృష్ణదేవ రాయ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వివ రించారు. 

నెమ్మదించిన రుతువనాలు..

హైదరాబాద్ : రుతుపవనాలు కొద్దిగా నెమ్మదించాయి. సోమవారంకల్లా తెలంగాణ జిల్లాలను తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. కేరళ, తమిళనాడులో ఇప్పటికే రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా ఆంధ్రలో ఒంగోలు వరకు, రాయలసీమలో నంద్యాల వరకు విస్తరించిన రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదిగా కదులుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

06:56 - June 12, 2016

హైదరాబాద్ : న్యాయవాదుల చలో హైకోర్టు పిలుపు.. రాజధాని పోలీసుల్లో ఆందోళనను కలిగిస్తోంది. న్యాయవాదులను అరెస్టు చేస్తే జరిగే పరిణామాలపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. సోమవారం నాటి చలో హైకోర్టులో.. ఎన్ని సంఘాలు పాల్గొంటాయి..? వారి ఉద్యమ కార్యాచరణ ఏంటన్న అంశాలు పోలీసుల్లో కలవరాన్ని కలిగిస్తున్నాయి. చలో హైకోర్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు, రాష్ట్రం నలుమూలల నుంచీ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హైదరాబాద్‌ తరలి రానున్నారు. వీరిని హైకోర్టు వరకూ అనుమతించాలా..? లేక ఎక్కడికక్కడ అడ్డుకోవాలా అన్న మీమాంసలో పోలీసులు కొట్టుమిట్టాడుతున్నారు. న్యాయవాదులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని అడిషనల్‌ చీఫ్‌ జస్టిస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లాయర్లను అడ్డుకుంటే టీ.ఆర్.ఎస్. సర్కార్‌కు చెడ్డ పేరు వచ్చే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వారిని స్వేచ్ఛగా వదిలేస్తే.. ఏసీజే ఎలా స్పందిస్తారోనన్న ఆందోళనా పోలీసులను వెంటాడుతోంది.

వారం రోజులుగా ఆందోళనలు..
న్యాయాధికారుల కేటాయింపులకు వ్యతిరేకంగా.. లాయర్లు వారం రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీంతో కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కిరించి నిరసన తెలిపారు. అసలు లాయర్ల ఆందోళనకు దారితీసిన పరిస్థితులు ఏంటీ? ఉద్యమబాట పట్టడానికి కారణాలు ఏంటీ? ఉమ్మడి రాష్ట్రంలో 234 మంది జడ్జిలుండగా.. 40:60 నిష్పత్తిలో విభజిస్తే తెలంగాణకు 94, ఆంధ్రకు 140 మందిని కేటాయించాలి. కానీ విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణకు 102, ఏపీకి 84 మంది సర్దుబాటు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో 46 ఖాళీలు ఏర్పడ్డాయి. తెలంగాణ విషయంలో 102 మంది న్యాయమూర్తుల్లో 72 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. 30 మంది మాత్రమే స్థానిక న్యాయమూర్తులున్నారు. స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపి.. ఖాళీల భర్తీ చేయాలని, ఆ తర్వాతే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ విన్నపాలను పరిగణలోకి తీసుకోవడం లేదని లాయర్లు ఆరోపిస్తున్నారు.

06:49 - June 12, 2016

హైదరాబాద్ : అంతా అస్తవ్యస్తం.. దశదిశ లేని నిర్మాణాలు.. ఇష్టానుసారంగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు.. ఒకవైపు న్యాయస్ధానాల మొట్టికాయలు, మరో వైపు ప్రభుత్వ హెచ్చరికలు.. అయినా పట్టించుకోని అక్రమార్కులు.. వాటిని నిలువరించాల్సిన టౌన్ ప్లానింగ్ మొద్దు నిద్ర.. వెరసీ గ్రేటర్ ప్రజలు ప్రాణాల మీదకు వస్తోంది... హైదరాబాద్ ఓల్డ్ సిటిలో నిర్మాణంలో స్లాబ్ కూలిపోవడంతో బల్దియాలో అక్రమ నిర్మాణాల వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్టోబర్ 28 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చి వేస్తామని హెచ్చరించింది. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది... అలాంటి నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని గ్రేటర్ అధికారులకు హుకుం జారీ చేసింది. అయినా గ్రేటర్‌లో అక్రమ నిర్మాణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. తాజాగా పాతబస్తీలో అక్రమంగా నిర్మిస్తున్న భవనం స్లాబ్ కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

నిలువరించని బల్దియా..
ఇంత భారీ భవనం నిర్మాణం చేపట్టినా అధికారులు నిలువరించలేదు... అయితే తాము భవనం నిర్మించరాదంటూ అడ్డుకున్నామని.. ఆ సమయంలో భవన యాజమానులు అధికారులపై దురుసుగా ప్రవర్తించారని...ఈ విషయం కోర్టులో ఉందంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే కోర్టులో ఉన్నా కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు... అలాంటిదేమైనా జరిగితే బల్దియా అధికారులు అడ్డుకోవాలి... కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు కార్మికులు తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది.. అయితే ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు భవన యజమానిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక సిటీలో అక్రమ నిర్మాణాలు శివారు ప్రాంతాల్లోనో... ఏ మురికి వాడల్లోనో కాదు వివిఐపీ జోన్ లలో కూడా వెలుస్తున్నాయి.. అక్టోబర్ 28 తరువాత వచ్చిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కూడా బల్దియాలో ఇప్పటి వరకు 350 అక్రమ కట్టడాలు వెలిశాయి...ఇందులో జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, శ్రీనగర్ కాలనీ, పంజా గుట్టా, సోమాజీగూడా లాంటి ప్రాంతాల్లోనే స్వయానా అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 69 అక్రమ నిర్మాణాలు వెలిశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...అయితే వీరిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే హుస్సేనీ ఆలం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అక్రమమ నిర్మాణాలకు బల్దియా చెక్ పెడుతుందా ...లేక షరా మాములే అన్నట్లు వ్యవహరిస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.

06:44 - June 12, 2016

హైదరాబాద్ : సీఎం సహాయనిధి.. పేదలకు వరం. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రజలకు వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత ఆర్ధిక సహాయం చేస్తోంది ప్రభుత్వం.. దీని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసులతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు ప్రజలు. ఈ దరఖాస్తులపై సీఎం సంతకం చేయాల్సి ఉంటుంది.. రెండు మూడు లక్షల రూపాయలు ఆసుపత్రి ఖర్చులు అయితే .. సీఎంఆర్ఎఫ్ నుంచి 50 నుంచి 60 శాతము వరకు దరఖాస్తు దారుడికి ఆర్ధిక సహాయం అందే అవకాశం ఉంటుంది. అయితే మంజూరైన చెక్ లబ్దిదారుడికి చేరాలంటే కనీసం నెలకు పైగా పడుతోంది..ఇక దరఖాస్తు పరిశీలన, ఎంక్వైరీల కలుపుకుంటే మొత్తం రెండు నెలలకు పైగా సమయం పడుతుంది..దీంతో అప్పులు తెచ్చి వైద్యం తెచ్చుకున్న వారికి ఇబ్బందిగా ఉంటుంది. వీరి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వీలైనంత త్వరగా లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్ లను అందించాలని నిర్ణయం తీసుకుంది.. దీనికోసం కొత్త పద్దతిని ప్రారంభించారు అధికారులు. దీనిలో భాగంగానే చెక్ లను కంప్యూటర్ ప్రింటింగ్ ద్వారా జారీ చేస్తున్నారు.

చెక్ తో పాటు సీఎం సందేశం..
ఇక ఇప్పటివరకు మాన్యువల్‌గా జారీ చేసే చెక్‌ ప్రక్రియకు స్వస్తిపలికి.. ప్రిటింగ్‌తోనే చెక్‌లను జారీ చేయబోతున్నారు. గతంలో ఉద్యోగులు రోజుకు 100 నుంచి 150 చెక్ లు మాత్రమే స్వదస్తూరితో రాసేవారు. దీని కారణంగానే లబ్దిదారులకు అందాల్సిన సీఎం సహాయనిధి డబ్బులు ఆలస్యమయ్యేవి. కంప్యూటర్ ప్రింట్ తో అరగంటలో 1000 చెక్ లను జారీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు గతంలో చెక్ ను లబ్దిదారుడికి పంపించి... ఆ తర్వాత సీఎం సందేశాన్ని పంపేవారు... కానీ.. ఇప్పుడు ఆ సందేశాన్ని చెక్‌తో పాటే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొత్తానికి సీఎంఆర్ ఎఫ్ అవినీతికి చెక్ పెట్టిన ప్రభుత్వం తాజాగా లబ్దిదారులకు వీలైనంత త్వరగా సహాయనిధి చెక్ లను ఇంటికి పంపే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

06:40 - June 12, 2016

హైదరాబాద్ : గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై సమావేశంలో చర్చించారు. జానారెడ్డిపై విమర్శలు చేసినందుకు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డికి..అలాగే కరీంనగర్ డీసీసీ చీఫ్‌పై విమర్శలు చేసిన ఆరేపల్లి మోహన్‌కు పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసుల్ని జారీచేసింది. ఈనెల 17న క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇకనుంచి గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టాలంటే టి పిసిసి అనుమతి తప్పనిసరిని క్రమశిక్షణ సంఘం స్పష్టం చేసింది. అలాగే సీఎల్పీలో ప్రెస్‌మీట్‌ పెట్టాలంటే సీఎల్పీ నేత అనుమతి తీసుకోవాలని క్రమశిక్షణ సంఘం స్పష్టం చేసింది.

సహించమన్న ఉత్తమ్..
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని టి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కట్టుదాటిన కొంతమందికి షోకాజ్ నోటీసులు వెళ్లాయని వాటికి వారు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇతర పార్టీల్లోకి ఎవరూ వెళ్లడంలేదని వివేక్‌ బ్రదర్స్‌, ఎంపీ గుత్తాలతో చర్చించామన్నారు. విభజన చట్టంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఖమ్మం ఉక్కు ఫ్యాక్టరీలు ఏమయ్యాయో అమిత్‌షా చెప్తే బాగుంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

06:37 - June 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ విషయంలో వ్యూహాత్మక తప్పిదం చేసినట్లు పాలక టీఆర్ఎస్‌ భావిస్తోంది. పాలనా పగ్గాలు చేపట్టింది మొదలు.. విపక్షాలను ఇరుకున పెడుతూ వచ్చిన తాము.. కోదండరామ్‌ విషయంలో తప్పటడుగు వేసినట్లుగా టీఆర్ఎస్‌ భావిస్తోంది. ప్రజాక్షేత్రంలోనైనా.. పరిపాలనలోనైనా.. విపక్షాలు నోరు తెరిచే పరిస్థితి లేకుండా.. ప్రధాన పార్టీలన్నీ ఆచితూచి వ్యవహరించే పరిస్థితిని గులాబీ బాస్‌ కల్పించారు. కానీ కోదండరామ్‌ విషయంలో అంచనాలు తప్పాయి.

ఆలంబనగా కోదండరాం..
అధికార పార్టీ నేతల విమర్శల దాడితో.. తెలంగాణ జేఏసీ వెనక్కు తగ్గరాదని నిర్ణయించుకుంది. అందుకే.. అత్యవసరంగా సమావేశమై ప్రజల పక్షాన పోరాటానికి కార్యాచరణను ఫిక్స్‌ చేసుకుంది. అసలే గులాబీ బాస్‌ వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న విపక్షాలకు.. కోదండరామ్‌ ఓ ఆలంబనగా మారారు. అందుకే.. కోదండరామ్‌పై పాలకపక్షం నేతల విమర్శలకు ప్రధాన పార్టీల వారంతా ధాటిగా ప్రతిస్పందించారు. విపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు.. కోదండరాంకు సంపూర్ణ మద్దతు తెలుపడంతో అధికార పార్టీలో కూడా పునరాలోచన మొదలైంది. టీజాక్ పై అంత ఘాటుగా స్పందించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం చాలామంది నేతల్లో వ్యక్తం అయింది. ప్రజల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దీంతో.. తమ వ్యాఖ్యలతో హీటెక్కిన తెలంగాణా రాజకీయాలను మళ్లీ కూల్‌ చేసే దిశగా అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని పార్టీ వర్గాల కథనం.

06:34 - June 12, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. హైదరాబాద్‌కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్ధితులను గవర్నర్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. ముద్రగడ దీక్ష నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఏపీ తాత్కాలిక సచివాలయం పనులు, ఉద్యోగుల తరలింపు వంటి అంశాలతో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

 

06:32 - June 12, 2016

విజయవాడ : ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో నీటి కొరత లేకుండా చేయడమే తమ ధ్యేయమన్నారు. చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారికి దేవాలయాల్లో ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి చోటా నీటి లభ్యత ఆధారంగా అధికంగా ఉన్న జలాలను ఇతర ప్రాంతాల చెరువులు, కాల్వలలకు మళ్లించే బాధ్యత తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాల్లో స్మార్ట్ వాటర్ గ్రిడ్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేసి పవర్‌కట్ లేకుండా చేస్తామని బాబు తెలిపారు.
ఏడు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది చాలా ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల ద్వారా గోదావరిలో ఇన్‌ఫ్లో పెరిగితే ఆ నీటిని కృష్ణానదికి తీసుకొస్తామని తెలిపారు. శ్రీశైలంలో నీరు నిల్వ చేసి కరవు ప్రాంతాలకు వినియోగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కృష్ణా, పెన్నాను అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారికి దేవాలయాల్లో ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా తయారుచేయడానికి టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని... ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రోత్సహకాలనూ అందిస్తామని చంద్రబాబు తెలిపారు. అంతకుముందు.. విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన రైతు శిక్షణా కేంద్రానికీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

06:30 - June 12, 2016

విజయవాడ : తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోనే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా నిరాహార దీక్షలో ఉండడంతో ముద్రగడ ఆరోగ్యం స్పల్పంగా క్షీణించినట్లు ఆసుపత్రి వైద్యులు మెడికల్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. మరోవైపు ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ఈనెల 9న ఉదయం దీక్షకు దిగిన ముద్రగడ.. అదే రోజు సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడన్న కారణంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటినుంచీ ముద్రగడ వైద్యపరీక్షలకు నిరాకరిస్తూ ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం స్పల్పంగా క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ముద్రగడతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు అందరూ నిరాహార దీక్షలోనే ఉన్నారని..వాళ్లలో ముద్రగడ తప్ప మిగిలిన వారు కొద్దిగా మంచినీళ్లు తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

హైకోర్టులో ముద్రగడ కుమారుడి పిటిషన్..
ఇదిలా ఉంటే ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న ముద్రగడను కలిసేందుకు వైసిపికి చెందిన కాపు నేతల బృందం ప్రయత్నించింది. బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తదితర నేతలు ఈ బృందంలో ఉన్నారు. అయితే రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన వెంటనే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్ట్‌ చేసిన వైసిపి నేతలను వెంటనే విడుదల చేయాలంటూ పీఎస్‌ ముందు వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసు ఆంక్షలపై ఆయన కుమారుడు బాలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం..విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ముద్రగడను అరెస్టు చేసినట్లు చెబుతున్నా, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని..కేవలం 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు మాత్రమే చెబుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఇంటిపై పోలీసులు దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారని బాలు పిటీషన్‌లో తెలిపారు. అయితే కిర్లంపూడిలో ముద్రగడ ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రికి తీసుకువచ్చామని ఎస్పీ రవిప్రకాష్ వివరించారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 50 మందిని గృహనిర్బంధం చేశామన్నారు ఎస్పీ.

ఖండించిన చిరంజీవి..
మరోవైపు ముద్రగడ అరెస్టును చిరంజీవి ఖండించారు. తుని కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. తునిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని, బాధ్యులను గుర్తించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనంటూ... చిరంజీవి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇంకోవైపు.. ముద్రగడ తీరును ఏపీ మంత్రులు ఆక్షేపించారు. ముద్రగడ దీక్ష వెనకాల జగన్‌ హస్తం ఉందన్న హోంమంత్రి చినరాజప్ప, ముద్రగడ అంగీకరిస్తే తుని కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ముద్రగడ పద్మనాభం పురుగుల మందు తాగితే.. జరిగే పరిణామాలకు కాంగ్రెస్‌‌‌‌‌ నేత చిరంజీవి బాధ్యత వహిస్తారా అని మంత్రి నారాయణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఏనాడైనా కాపుల గురించి పట్టించుకున్నారా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత జగన్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. కాపుల సమస్యలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌, వైసీపీకి లేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు ముద్రగడ దీక్ష నేపథ్యంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తుని ఘటనలో అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలంటూ కాపు నేతలు ఆందోళనలు చేస్తున్నారు.

ఎల్ బీనగర్ లో కానిస్టేబుల్స్ హల్ చల్..

హైదరాబాద్ : ఎల్ బీనగర్ లోని ఓ వైన్స్ దుకాణంలో ఇద్దరు కానిస్టేబుళ్స్ హల్ చల్ చేశారు. తినుబండారాలు అమ్ముకొనే మహిళపై దాడి చేశారు. పీఎస్ లో బాధిత బంధువులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన కానిస్టేబుళ్లు గోపి, సుధాకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

నగరానికి చేరుకున్న మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. 20 రోజుల పాటు మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించారు. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామిక వేత్తలతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో మేయర్ బొంతు రామ్మోహన్ మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.

 

నేడు జేఈఈ అడ్వాన్డ్ పరీక్షల ఫలితాలు..

హైదరాబాద్ : నేడు జేఈఈ అడ్వాన్డ్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండది 20 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Don't Miss